[[@YHRK]] [[@Spiritual]]
Gollakalāpam, Kuchipudi Dance Drama, Philosophical Interpretation by YHRK
[Chapters 1 to 12 out of total 48]
విషయ సూచిక :
అధ్యాయము–1.) అగ్రహారం
|
కూచిపూడి అగ్రహారము! హేమంత ఋతువు. ఒకానొక శుభోదయం!
ఒక గొల్లభామ రోజూలాగానే శిరస్సుపై పాలు పెరుగు-వెన్న పాత్రలను
ధరించి,
“పాలోయమ్మ పాలో! వెన్నోయమ్మ వెన్న”
అని సుమధురంగా పలుకుతూ
……9
మధ్యమధ్యలో
……….
- అమ్మా! “బాలత్రిపుర సుందరీ! మము పాలన చేయవమ్మా!
మాయమ్మ!
తండ్రీ! “సర్వ భూతములును తానై, సర్వసాక్షి అనగా వేరై, సర్వ
బ్రహ్మాండములకు తానే సూత్రధారియై..! హే రామలింగేశ్వర
స్వామీ!”
అని కూనిరాగాలు పాడుతూ
వేదయజ్ఞ - యాగవిధి కోవిదులైన విప్రవర్యులు, యోగులు, ఉపాసకులు
మొదలైనవారు నివశించే ఇళ్ళు ఉన్నట్టి వీధులలో సంచరిస్తూ ఉన్నది.
హెూయలుగా - చురుకుగా అడుగులు వేస్తోంది.
19
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
పొడవుగా రుద్రాక్షలు వ్రేలాడుచున్నాయి.
ఆ బ్రాహ్మణుడు యాదృచ్ఛికంగా గొల్లభామవైపు చూచారు. వాత్సల్యము
చిరునవ్వులతో కూడిన ఆ గొల్లభామ ముఖంలో ఏదో అలౌకికానందం
వెల్లివిరుస్తున్నట్లు ఆయనకు అనిపించింది. కాసేపు పలకరింపుగా
సంభాషించాలనే ఉత్సుకత ఆయనకు కలిగింది. కొంచము దూరంగా
రచ్చబండపై తానుకూడా ఆశీనులయ్యారు.
అధ్యాయము–2.) ఉభయ కుశలోపరి
|
బ్రాహ్మణుడు : ఓ తరుణీమణీ! నీ ముఖారవిందమున ఏదో
అనిర్వచనీయము - అలౌకికము అగు ఆనందంతో కూడిన ప్రశాంతత
నాకు కనబడుతోంది. నీ ఆకారం-చిరునవ్వు చూస్తుంటే మాకు, ఈ
సభాసదులకు ఏదో చెప్పలేని సంతోషం కలుగుతోందమ్మా!
ఎవరమ్మా నీవు? ఏం చేస్తూ ఉంటావ్?
గొల్లభామ : హే మహాత్మా! పాదాభివందనములు. నేనా? మేము ఊరూరా
తిరిగి పాలు-పెరుగు-వెన్న- చల్ల అమ్ముకొనే వాళ్ళం. చూస్తూనే ఉన్నారు
కదా! మేము గొల్లవారము.
బ్రాహ్మణుడు : శతమానం భవతు! సుఖీభవ! (కించిత్ వినోదంగా నవ్వుతూ)
గొల్లవారమా? మేము ఆదివారము విన్నాము. సోమవారము అనగా విన్నాము.
మరి ఈ ‘గొల్లవారము’ అంటే?
గొల్లభామ : మీరు వేదవేత్తలు! బ్రహ్మజ్ఞులు! ఏదో చమత్కారంగా అంటూ
ఉంటారు. మీకు అన్నీ తెలుసు. అది సరీలేండి గాని, రుద్రాక్షలు, విభూతి,
గంధము, పట్టుపంచ, శాలువ ధరించి మీరు అపర బ్రహ్మవలె నాకు
కనబడుచున్నారు. మీ వాక్కు మధురంగాను, గంభీరంగానూ ఉన్నది.
మీరూపు-రేఖలు మాకు మీ పట్ల ఎంతో గౌరవం కలిగిస్తున్నాయి.
గొప్ప తేజస్సుతో ప్రకాశించే మీరెవ్వరో చెప్పితే నేను - ఈ
సభకు వేంచేసిన మహాశయులు సంతోషిస్తాము స్వామీ! దయచేసి
21
అధ్యాయము–3.) షట్కర్మలు - షోడశకర్మలు
|
బ్రాహ్మణుడు : ఓ ! తప్పకుండా! నీకు ఏఏ సందేహాలుంటే….. అవన్నీ
అడుగు. వేద - ఉపాంగ విహితంగా, శృతి-సృ్మతి పూర్వకంగా నీ సందేహాలకు
సమాధానం ఇచ్చి అవన్నీ తొలగిస్తాము. సమాధానాలు చెప్పటానికి మేము
సిద్ధం.
గొల్లభామ : ’మేము ఉత్తమ కులజులము’ అని అన్నారు కదా! అనగా…..?
బ్రాహ్మణుడు : అదా! ‘బ్రాహ్మణులము’ - అని చెప్పాను కదా! జన్మతః
బ్రాహ్మణ్యం మా వృత్తి - ప్రవృత్తి కూడా! మేము షట్కర్మ నిష్ఠులమై
ఉంటాము.
గొల్లభామ : షట్కర్మలా! అనగా?
బ్రాహ్మణుడు : ఉత్తమమైన బ్రాహ్మణ కులంలో జన్మించటం చేత మేము
షట్-ఆరు విధాలైన కర్మలు (Functions) దైనందికంగా (Every Day)
నిర్వర్తిస్తూ ఉంటాము.
గొల్లభామ : అవి ఏమేమిటి? చెప్పరూ!
బ్రాహ్మణుడు : చెపుతాను, విను.
1. యజనము యజ్ఞాలు, యాగాలు నిర్వర్తించటం
2. యాజనము యజ్ఞయాగ, పూజావిధులు నిర్వర్తింపచేయడం. చేయించటము.
22
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
అని అన్నారు కదా! ‘బ్రాహ్మణ’ శబ్దము యొక్క అర్థాన్ని దృష్టిలో పెట్టుకొని
ఒక్క విషయం మనవి చేయవచ్చునా స్వామీ!
బ్రాహ్మణుడు : ఊ! అట్లాగే!
అధ్యాయము–4.) నాఽహమ్ దేహమ్! సోఽహమ్!
|
గొల్లభామ : ప్రతి జీవుడు పుట్టినప్పటి నుండీ ఏదో ఒక కర్మ
నిర్వర్తించవలసినదే కదా! ఎవ్వరు ఏవిధమైన కర్మలు నిర్వహించినప్పటికీ
“- నేను వేరు, ఈ దేహము వేరు.
- నేను బ్రహ్మమే స్వరూపముగా కలవాడను.
ఈ దేహమో, ‘దేహి’నైన నాకు ఒకానొక ఉపకరణము
మాత్రమే!ఇక కర్మలో, ప్రకృతికి సంబంధించినవి! మనోబుద్ధి - చిత్త -
అహంకారాలు కూడా ఉపకరణములే!”
అను ‘ఎరుక’ నిశ్చలంగా కలిగి ఉన్నప్పుడు కదా, ఒకానొక జీవుడు
‘బ్రహ్మభూతుడు’ అని అనిపించుకోగలిగేది! సర్వ దేహములలో సర్వదా
సమంగా ప్రకాశించే బ్రహ్మమును ఎరిగి బ్రహ్మమే తానై బ్రాహ్మణుడు -
అయ్యేది! అవునా?
బ్రాహ్మణుడు : అవును. అది నిజమే! అందుచేతనే మేము చిన్నప్పటినుండీ
కూడా
……
“న్కా హమ్ దేహమ్!
అహమ్ బ్రహ్మాస్మి"
అనే వేదమహావాక్యాలు, వాటి-వాటి అర్థాలు నేర్చుకుంటున్నాము.
వేదాధ్యయనము చేస్తున్నాము. వేదములలో చెప్పబడిన కర్మలను అందుకు
సానుకూలంగా నిర్వర్తిస్తున్నాము. వేదవిహితంగా పంచయజ్ఞములు
ఆచరిస్తూ, దేహభ్రమను విడచి “బోధరూపమగు పరబ్రహ్మమే నేను!
25
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
సో2_హమ్“ అని గ్రహించి వర్తించువారము. అది దృష్టిలో ఉంచుకునే,
“బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనది” అని శాస్త్ర-పురాణ-ఇతిహాసములు
వినలేదా?
వర్ణిస్తున్నాయి. ఇది నీవెప్పుడూ గొల్లభామ : హే మహానుభావా! మీరు పంచయజ్ఞములు నిర్వర్తిస్తూ
చేత ఉండవచ్చుగాక! అంతమాత్రం …..”
“మేమే ఈశ్వరుని తెలుసుకున్నాం. యజ్ఞములు చేయనివారికి ఈశ్వరుని
గురించి తెలియరాదు. జన్మచేత బ్రాహ్మణులమగు మేమే బ్రహ్మజ్ఞులము,
బ్రహ్మము గురించి ఎరిగినవారము” ”
-అనే అభిప్రాయం కలిగి ఉండటం ఉచితమంటారా? అటువంటి అభిప్రా
యం వలన - సర్వాత్మకుడగు శ్రీరామలింగేశ్వరస్వామిని తెలసుకోవటం
అనవచ్చునంటారా ?
బ్రాహ్మణుడు : మేము వంశాచారంగా, వ్యవస్థాపూర్వకంగా పంచయజ్ఞములు
నిర్వర్తిస్తున్నాము. వాటిచే ఈశ్వరుని మెప్పిస్తున్నాము. పరబ్రహ్మమగు ఈశ్వ
రుని ముఖంల నుంచి పుట్టుచున్నామని ’బ్రాహ్మణో 2 స్యముఖమాసీత్
అను వాక్యము పురుషసూక్తములో చెప్పటం నీవెప్పుడూ వినలేదా? ఆ కారణం
చేతనే, ఓ చంచలాక్షీ! మమ్ములను “బుధులు - బ్రాహ్మణులు” అని జనులు
శ్లాఘిస్తూ వుంటారు కదా!
గొల్లభామ : మీరు చెప్పేది సాంసారికమైన అహంకారము సూచించు
చున్నదేమో మహనీయా?
-మేము పంచయజ్ఞాలు నిర్వర్తించే బ్రాహ్మణ వంశంలో జన్మించాము.
- బ్రహ్మ యొక్క ముఖంలోంచి వచ్చాము!
- బ్రాహ్మణులమయ్యాము!
. అందుచేత ఇతరులకంటే అధికులముఅనే ! అహంకారం అనుచితమేమో? శాస్త్ర ఉద్దేశ్యము అదేనా? చెప్పేది మీరు శాస్త్ర సమ్మతమేనంటారా?
26.
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
బ్రాహ్మణుడు : ఎందుకు కాదూ! వేదవిహితమైన కర్మలు, అనుష్ఠానము
వంశపారంపర్యంగా అనుసరించే బ్రాహ్మణకులంలో పుట్టి
బ్రాహ్మణులమయ్యాము. నీకు శాస్త్రవచనాప్రవచనాలపై గురిగాని, పట్టుగాని
లేనట్లున్నదే? శాస్త్రములు వినకుండా ఏదో కొంచెం కొంటెతనంగా
మాట్లాడుచున్నావేమమ్మా?
గొల్లభామ : మహాశయా! పుట్టుకచేతనే ఒకడు బ్రాహ్మణుడు అవుతాడా?
వాస్తవానికి అందరి పుట్టుక ఒక్కతీరైనదే కదా! "జన్మనా జాయతే శూద్రః
కర్మనా జాయతే ద్విజ:|| - జన్మచేత ప్రతి ఒక్కడు శూద్రుడే! కర్మచేతనే
ద్విజుడు అవుతాడు” అనే శ్రుతి వాక్యాలు ప్రమాణవాక్యాలు కావా?
బ్రాహ్మణుడు : ఓహెూ! ధర్మ శాస్త్రవాక్యాలు బాగానే చెప్పుచున్నావే! నాకు
సంతోషమే! అయితే ఒక వాక్యం పూర్వపక్షమా? సిద్ధాంతమా? నీవు
చెప్పిన ధర్మ శాస్త్రవాక్యము విషయంలో అది వివేచనయా (Is it an Analysis)? సూచనయా (Isit an Indication)? దశల వర్ణనమా (Is it a Stage by
Stage discription)? గమనించి, అప్పుడు మాట్లాడాలి సుమా!
సరే! అది అట్లా కాసేపుంచు.
అధ్యాయము–5.) భౌతిక దేహము
|
బ్రాహ్మణుడు :“దేహములన్నీ ఒక్క తీరైనవే!” అని బహు సాహసంగా
పలుకుచున్నావే!
ఈ వర్తమాన భౌతికదేహము జీవుని పట్ల ఎట్లా రూపుదిద్దుకుంటోందో
నీకు తెలుసా? తెలిస్తే, తెలిసిఉన్నంత వరకు చెపుతావా?
గొల్లభామ : స్వామీ ! గురుతుల్యులగు మీవంటి పెద్దలు కొందరి దగ్గర
విన్న విషయములు - విశ్లేషణను గుర్తుకు తెచ్చుకుంటూ పంచభూత
సమ్మేళణము అయినట్టి భౌతికదేహము ఏ విధంగా రూపుదిద్దుకొంటోందో,
నాకు తెలిసినది చెపుతున్నాను. వినండి.
పూర్వదేహస్థితి :- ఈ జీవుడు భౌతిక దేహంతో "నేను దీనికి చెందిన
వాడను ఇది నాకు చెందింది. దేహమునకు నాకు అవినాభావ
27
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
సంబంధము“ …. అని జీవితాంతం రోజులు గడుపుచున్నాడు. అనగా,
అజ్ఞానవశంగా మరణ సమయం ఆసన్నమయ్యే క్షణం వరకు దేహభావమును
కొనసాగిస్తూనే ఉండటం జరుగుతోంది.
-“నేను దేహమాత్రుడను. దేహముచే పరిమితుడను.
ఈ దేహమే నా రూపము। వీరంతా నా బంధువులు!
- వీరు నావారు ! వారు కాదు!
- ఇంతెందుకు! ఈ భౌతిక దేహమే నేను!
అంతేకాదు. నేను కర్మబద్ధుడను కూడా!”
ఇటువంటి బలవత్తరమైన-సాంసారికమైన (దృశ్య సంబంధమైన) అజ్ఞాన
భావనా తరంగాల మధ్యలో మసలుతూ ఉండగా, ఇంతలో ఒకానొక
క్షణంలో ఈ భౌతిక దేహం చమత్కారంగా నిరుపయోగమవటం
జరుగుతోంది. ‘మరణము’ అనే విరామం సంప్రాప్తిస్తోంది.
ఆజన్మాంతరము ‘దేహమే వా హమ్’ భావనల కారణంగా
దృశ్యము పట్ల ఆతడు ఘనమైన మోహమునకు వశమై ఉండటం జరుగు
తోంది. “నా తల్లిదండ్రులు-నా భార్య - నా భర్త - నా పిల్లలు - నా మనుమలు
- నా పేరు - నా ఇల్లు - నా సంపద- నేను సంపాదించిన ఆస్తి - నా నా ప్రతిష్ఠ
- నా ఊరు నాజాతి”-……. ఇత్యాది మనోభావాలే ఆతడు పరిపోషించు
కుంటున్నాడు. అంతేకాని, స్వాత్ముడు, సర్వాత్మకుడు, సకల రూపములు తానైనవాడూ, సర్వసాక్షిగా వేరైనవాడు, అప్రమేయుడై ఉన్నవాడు - అగు
ఈ రామలింగేశ్వర స్వామి యొక్క ”శివతత్వజ్ఞానము”కొరకై
ప్రయత్నించకున్నాడు. “చిదానంద రూపం- శివో 2 హమ్-శివో 2 హమ్’
అనే ఆత్మతత్త్య జ్ఞానానికి ఉద్యుక్తుడు కావటం లేదు. మృత్యువు
వచ్చిపడుచున్నప్పుడు కూడా “నా వారు ఏమౌతారో? పరాయి వాళ్ళు
సొమ్ములు మ్రింగుతారేమో! నా వారి కొరకు నేను ఏమి చేయాలో.
వీరు - వారు నా సొమ్ములు సొంతం చేసుకుంటారేమో? వీళ్ల పెళ్ళిల్లు
| వాల్ల ఉపనయనాలు, నా పేరు - ప్రతిష్ఠ - గౌరవాలు"…. అని అనుకుంటూ దు:ఖాలు భయాలు వేదనలు తెలిసీ
- రోదనలు కొనసాగిస్తూ
28
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
తెలియకుండా భౌతిక దేహం త్యజిస్తున్నాడు. ఫలితం? పునరపి జననం.
పునరపి మరణం. పునరపి జననీ జఠరే శయనం.
పూర్వదేహానంతరము ఆ విధంగా అటువంటి అజ్ఞాన జీవుడు ఇత:
పూర్వపు - సత్కర్మపు - దుష్కర్మపు ప్రభావములు, తత్సంబంధమైన
భావావేశాలను అనుసరించి స్వర్గమో (సాత్విక సుఖ ప్రేమాదులతో కూడిన
భావనాస్రవంతి), నరకమో (దు:ఖము-ఆదుర్దా-భయము ఇత్యాదులతో
కూడిన భావనాస్రవంతియో) మనో అనుభూతం చేసుకుంటున్నాడు.
అయితే
"జన్మించినవాడు మరణించకమానడు. మరణించినవాడు తిరిగి జన్మించక
మానడు - జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ 99 అని
కదా గీతా వాక్యం!
బ్రాహ్మణుడు : మరణించినవాడు తిరిగి ఎట్లా జన్మిస్తున్నాడు? అది కూడా
చెప్పు! నీ వాక్చాతుర్యంతో అమృతవాణి వినిపించవమ్మా! మేమందరమూ
విని సంతోషిస్తాము.
అధ్యాయము–6.) పునరపి జననం
|
గొల్లభామ : మరణించినవాడు భౌతికమైన ఇంద్రియములు కోల్పోవు
చున్నప్పటికీ అతని యొక్క (1) భావనా చైతన్య సత్త (2) ఆత్మ
చైతన్య సత్త కొనసాగుతూనే ఉంటాయి.
అజ్ఞానపూర్వకమైన భావనావేశముల చేత మరొక దేహము కొరకై
తాపత్రయపడుచున్నాడు. అట్టి భావనా దేహంతో ఆ దేహి
ఆకాశంలో నక్షత్రాకారంగా కొంతకాలం గడుపుచున్నాడు.
ఆ తరువాత సూర్య కిరణాలలో ప్రవేశించి మరి కొంతకాలము.
అటు తరువాత ఎప్పుడో మంచుకణ రూపంలో నేలపై
వ్రాలుచున్నాడు.
ఆ మంచుకణం నేలపై ఇంకుట చేత భూమిలో ఓషధ రూపుడై
29
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
రెండింటి యొక్క సమాన - ప్రభావం కారణంగా - నపుంసక శిశు
….. గా అవటం జరుగుతోంది.
ఇక్కడ, ఒక ముఖ్య విషయం.
జీవుడు తన యొక్క పూర్వ కర్మ సంస్కారముల ప్రభావం
చేత-దృశ్యములో ఏదో పొందవలసింది ఉన్నది అనే ఆవేశం చేత శిశు
దేహధారణకు ఉపక్రమించటం జరుగుతోందని కూడా అనవచ్చు.
ఆ విధంగా స్త్రీ యొక్క నాభికమలములో బీజము ప్రవృద్ధమగుచూ,
క్రమంగా శిశు దేహము రూపం పొందటం జరుగుతోంది.
బ్రాహ్మణుడు : బాగు బాగు! కానీ కొందరు దంపతులకు అతి దీర్ఘకాలం
(లేదా) ఒకొక్కసారి జీవిత పర్యంతము శిశువులు కలగకపోవటం
జరుగుతోంది కదా…!
గొల్లభామ : ఇదంతా ఈశ్వరమాయా చమత్కారం. భిన్నత్వంలో ఏకత్వం.
కొందరి విషయంలో ఆ దంపతులు రమించే సమయంలో వారిలో ఒక్కరి
(లేదా) వారిద్దరి బుద్ధి-మనస్సులు చాంచల్యానికి లోను కావటం
జరుగుతోంది. ఆ కారణంగా కొందరు దంపతులకు అపుత్రత్వం
సంభవిస్తోంది.
మనోచాంచల్యము = ఇత: పూర్వపు దోషకర్మల - వ్యతిరిక్త కర్మల తీవ్ర
ప్రభావం. ‘దోషము’ రూపమైన తీవ్ర భావన!
అందుకే ….సంతానం కావాలనుకునే దంపతులు ‘ఋతుకాలము’
,
యొక్క గుర్తును కలిగి ఉండటం, “సత్సంతాన ప్రాప్తి కలుగుగాక” అను
భగవదనుగ్రహ ప్రార్థనా పూర్వకమైన భావం కలిగి ఉండటం ఉపాసనతో
సమానంగా పెద్దలు పరిగణిస్తారు.
అయితే కూడా ఒక్క విషయం. ఇదంతా మాయా చమత్కారం.
ఏకత్వములో అనేకత్వ నాటకీయం - అని గుర్తెరుగుదము గాక!
శుక్ర-శోణితముల సమ్మేళనమైన బీజరూపం నాభికమలంలో
ప్రవేశించిన మొదటి రాత్రి చింతపడు పెరుగుల సమ్మేళనము వలె
31
పుష్పము
- వ్యాఖ్యాన :: అధ్యయన - గొల్లకలాపము ఆత్మయజ్ఞము ఉంటోంది. పొందుతోంది. రూపం ’నురుగు’లాగా 5వ రోజుకు . |క్రమంగా - (బురద) వలె అవుతోందిఅడుసు 15వ రోజుకు రూపంగా (ముద్ద) పిండము అది గట్టిపడి క్రమక్రమంగా .
రూపుదిద్దుకుంటోందితల యొక్క ఆకారం
ఒక నెల రోజులకు ఆ పిండమునకు వేరువేరు తల భాగంలో - . క్రమక్రమంగా ఏర్పడటం జరుగుతోంది. విభాగాలు ప్రవృద్ధమౌతున్నాయిబయల్వెడుచున్నాయి.
2 నెలలకు రెండు చేతుల ఆకారాలు -
3 నెలలకు పొట్ట, చేతివ్రేళ్లు, కాళ్లు - ఆకారాలు రూపం
పొందుచున్నాయి.
4 నెలలకు నవరంధ్రాలు ఏర్పడి, ఇక ఆ రూపము తల్లి గర్భంలో
కదలటం ప్రారంభిస్తోంది.
5 నెలలకు ఆ దేహాకారంలో రక్త-మాంసములు, వాటి యొక్క
సంచలనములు ప్రారంభమౌతున్నాయి.
6 నెలలకు కాళ్లు-చేతులు-గోళ్ళు-దవడలు ఏర్పడినవై
చైతన్యవంతము అగుచున్నాయి.
7 నెలలకు ఆ దేహము సంపూర్ణజీవత్వం పొందటం జరుగుతోంది.
ప్రేగుల పదార్థంతో తయారైన ఒకానొక తిత్తిలో ఆ దేహము
ఉండిఉండటం జరుగుతోంది. దానినే ‘మావి’ అని పిలుస్తున్నారు.
7వ నెల ప్రారంభంలో ఆ దేహాకారంలో ‘ఎఱుక -’ అనే జ్ఞానాం
(లేక ప్రజ్ఞాంశ) ప్రత్యక్షమౌతోంది.
ఆ శిశుదేహము మావి అనబడే మాంసపు తిత్తిలో కదలు చూ
క్రమంగా తల్లి ఆరగించిన ఆహారములోని పొందుతూ కొంత విభాగమును
ఆస్వాదించటం ఆరంభిస్తోంది.
EN
32
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
క్రమంగా సుఖదు:ఖ అనుభూతులు ప్రారంభమౌతున్నాయి. తల్లి
ఆరగించే
సాత్వికాహారం చేత సుఖమును,
రాజసిక ఆహారమైతే సుఖ-దుఃఖ సమ్మిళితమును,
తామసికమైన ఆహారం కారణంగా వేసట-వ్యసనములను
పొందటం జరుగుతోంది.
బ్రాహ్మణుడు : చాలా బాగా వివరిస్తున్నావు. అయితే ఆహారపు లక్షణాల
గురించి కూడా చెప్పుతావామరి?
అధ్యాయము–7.) ఆహారము
|
గొల్లభామ :
(1) సాత్వికాహారం : రుచిగా-తియ్యగా మధురమైన రసంతో కూడి ఉన్న
ఆహారం.
(2) రాజసికాహారం : కమ్మగా-చప్పగా- కొంచము కొంచము కారము
ఉప్పు రుచులతో కూడిన ఆహారం.
(3) తామసిక ఆహారం : అధికమైన కారము-ఉప్పు-చేదు-వగరు మొ|| వి
కలిగియుండే ఆహారం. మత్తు పదార్థముల వలన ఏర్పడే మొద్దుతనము.
బ్రాహ్మణుడు : తల్లి తింటున్న ఆహారము యొక్క రసవిభాగము శిశువు
దేహానికి ఎట్లా చేరుతోంది?
గొల్లభామ : కొన్ని నాళములు తల్లి దేహములోని ప్రేగుల నుండి - ’మావి’
అనే తిత్తిలోని శిశువు యొక్క బొడ్డులోనికి చొచ్చుకొన్నవై ఉండటం
జరుగుతోంది. తల్లి తినుచున్న ఆహారములోని కొంత రసవిభాగం ఆ
నాళములలోని సూక్ష్మరంధ్రముల ద్వారా శిశువు యొక్క దేహములోనికి
ప్రవేశించటం జరుగుతోంది, ఆహా! ఎంతటి సృష్టి చమత్కారం !
అయితే అట్టి ప్రక్రియ నెరవేరటానికి ఒక కారణం శిశువు యొక్క
పూర్వ కర్మల ప్రభావమేనని కూడా విజ్ఞులు అంటూ ఉంటారు.
33
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
ఆశిశువు తల్లి తినే ఆహారరసమును నాళముల ద్వారా పొందుతూ
కించిత్ ఉత్సాహంతో కదలటం ప్రారంభిస్తోంది. ఆ కదలిక మరికొంచెంగా
అధికం అగుచున్నప్పుడు అట్టి కదలికలకు వెసులుబాటు కాక, క్రమంగా
ఇరుకుగదిలో బంధించబడిన ఏనుగు వలె ఆ శిశువుకు అప్పటి స్థితి
అనుభవమౌతోంది.
అంతే కాకుండా మరో విషయం.
…..
తల్లి యొక్క పొట్టలో ఆహారం జీర్ణింపజేయడానికి ఉత్పత్తి అయ్యే
’జఠరాగ్ని’ యొక్క ఉష్ణస్పర్శ చేత ఆ శిశువు ఎంతో వేసట పొంద
నారంభిస్తోంది.
ఆ వేసటను తప్పించుకోవడానికి చేసే ప్రయత్నములో ఆ శిశువు గర్భసంచిలో
క్రిందవైపుగా కదలటానికి ప్రయత్నిస్తోంది. అక్కడేమో పురీషనాళము అడ్డం!
పురీషనాళము నుంచి బయల్వెడలే మల-మూత్రముల దుర్వాసనచే
‘అసహ్యత’ పొంది, భరించలేక ఆ శిశువు మరల పైకి కదలుతూ వుంటోంది.
ఈ లోగా, శిశువు యొక్క దేహాకారం రోజురోజుకు పెరుగుతూ
ఉంటుంది. ఒక విధంగా ఆ శిశువు బహుదీనదశను అనుభవిస్తూ ఉంటోంది.
అధ్యాయము–8.) గర్భనరకము - శిశువేదన
|
బ్రాహ్మణుడు : అవును కదా! ఆహా! ఏమి ఆ శిశువు యొక్క దుస్థితి!
మావిలో చిక్కుకొని యున్న దేహము రోజురోజుకూ వృద్ధి పొందుతూ
ఉండటమా! మరొకవైపు మలమూత్రముల దుర్వాసన -జఠరాగ్ని యొక్క
ఉష్ణముల మధ్య అల్పస్థలంలో అగుచాట్లు పడుతూ ఉండటమా! దానినే
‘గర్భ నరకం’ అంటారు కదా!
గొల్లభామ : అవును. ఇంకొక వైపు నుండి అప్పుడప్పుడే చైతన్యం పొందే కాళ్ళు- చేతులు కదల్చటానికి అవకాశము, స్థలము లేక బిగబెట్టుకొని ఉండవలసి వస్తోంది. అదంతా ఆ శిశువుకు దుఃఖప్రదమేనని గర్భశాస్త్రం ఎరిగిన పెద్దలంటారు. “ఆ శిశువుకు గర్భనరకం ఎందుకు ప్రాప్తిస్తోంది?"
…. అనునది శాస్త్రీయంగా పరిశీలిస్తే, “ఇతఃపూర్వపు భౌతిక జన్మలలో - జడమగు దేహమే నేను” - అనే రూపమైన దేహాభిమానం చేసుకుంటూ ప్రవృద్ధం 34
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
ఆత్మతత్వజ్ఞానాన్ని తగినంతగా పరిశీలించకపోవటం చేతనూ, ఒకవేళ
పరిశీలించినా కూడా తగినంతగా హృదయస్థం చేసుకోకపోవటం చేతనూ!
యోగాభ్యాసము - భక్తియోగము - ఆత్మజ్ఞానము - ఇత్యాదులు పూర్వజన్మ
లలో అభ్యసించి ఉంటే.., ఆ శిశువు ఆ గర్భనరక వేదన తాను పొందక
అతీతంగా ఉండగలిగేదే!
ఇక ఇప్పుడు, ఆ శిశువు ఆలోచనలలో పడుతోంది.
- "అయ్యయ్యో! ఎక్కడి నుండో కాని ఏవేవో వేడి వాయువులు,
మరొకవైపు నుండి భరించరాని దుర్వాసనలు వచ్చిపడి నన్ను
బాధిస్తున్నాయే? ఏమిటి నా ఈ గతి?
- హే జగన్మాతా! జగజ్జననీ!
- ఓ దైవమా!
- పరమహంసల హృదయాలలో వేంచేసి ఉండే ఓ రామలింగేశ్వ
రస్వామీ! హే సర్వాత్మకా! ఓ సర్వేశ్వరా! ఎక్కడున్నావయ్యా?
- నేను ఇతఃపూర్వపు అనేక జన్మలలో దర్శించియున్న జగత్తులకన్నిటికీ
ఆధారభూతుడా!
ఆయా పూర్వ జన్మలలో నీ పాదములు ఆశ్రయించకుండా జగదృశ్య
పరవశంతో ఏవేవో దుష్టకర్మలను ఆశ్రయించి, తత్ఫలితంగా ఈ
గర్భవాస దుఃఖాలన్నీ తెచ్చిపెట్టుకొన్నానే?
- ఓ పరమాత్మా! నీవు సర్వరక్షకుడివని పురాణ ద్రష్టలు వర్ణిస్తున్నారు
కదా! ఈ గర్భవాసం నుండి నన్ను రక్షించండి!
ఈ రీతిగా గర్భవాసదు:ఖాలు అనుభవిస్తూ ఆ జీవుడు క్రమంగా
యోచించటం ప్రారంభిస్తున్నాడు.
అబ్బబ్బబ్బా! ఈ గర్భవాస నరకవేదన నేను భరించేదెట్లా?
ఈ గర్భస్థానం నుండి బయటపడే మార్గమేమీ లేదా? ఉపాయం
ఏమిటి?
35
వ్యాఖ్యాన పుష్పము
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన -
రక్షించే ? , ఉపాయము చెప్పి నన్ను ఇక్కడినుండి వారెవరు- మార్గముఎక్కడున్నారు?
? వేదనను అనుభవించాలిఎంతకాలం ఈ -
ఆహా! ఇత: పూర్వపు దేహాలు, దేహసంబంధ సందర్భములైనటువంటి
తల్లి-తండ్రి-భార్య- పుత్రులు- పుత్రికలు - మనుమలు- ఇష్టమైనవారు -
అయిష్టమైనవారు - అయినవారు - కానివారు - ఇవన్నీ ఇప్పుడేవీ? ఎక్కడికి
పోయాయి? అవన్నీ ప్రతి ఒక్కసారి ‘నిజమే’ అని అనుకొని రాత్రింబవ
ళ్ళు సంపద ఇత్యాది అల్పకాలపు మెరుపులాగా మెరిసే విషయాలను
నమ్ముకొని కాలం వృధా చేసుకున్నానే! ఓ పరమాత్మా!
ఓ రామలింగేశ్వరా ! ఎక్కడయ్యా నీవు?
ఈ జఠరాగ్ని జ్వాలలు నేను భరించలేకపోతున్నాను. ఇది తప్పేదెలా?
ఏదీ త్రోవ?
- అలసిపోతున్నాను. బాధ భరించలేక మూర్ఛపోతున్నాను.
ఇత: పూర్వపు సంపదలు- సంతానము - బంధువులు - సేవకులు
మొదలైనవారు ఏరీ? ఇక్కడికి వచ్చి నన్ను రక్షిస్తారా? లేదు.
- ప్రారబ్దవశంగా ఇక్కడికి వచ్చి చిక్కుకున్నానే! దారి తెలియకున్నదే?
- ఓ శ్రీహరీ!
నేను దేహ దృశ్య తాదాత్మ్యము చెందుతూ అనేక ఉపాధి పరంపరలు
వృధా చేసుకొన్నట్లు| , ఇంద్రియ వశంగా అనుభూతులు పెంపొందించుకున్నట్లు నాకు ఇప్పుడు . జ్ఞప్తికి వస్తున్నాయినేరం క్రమంగా ఎంచకు స్వామీ!
- ఇతః పూర్వ జన్మలలో అనేక సార్లు మాయలో పడి సర్వాత్మకుడవు
- సర్వతత్వ స్వరూపుడవు అగు నిన్ను స్మరించనే లేదు కదా! పెద్దలు
- శాస్త్రములు శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః అని మొత్తుకుంటూ ’
చెప్పినా వినలేదు కదా!
36
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము
- ఎట్లాగైనా ఈ గర్భచెర నుండి బయల్వెడలే త్రోవ చూపించు.
బయల్వెడలానా, ఇక అశ్రద్ధ చేయను. పరమాత్మనే స్మరిస్తాను.
పునర్జన్మ హేతువులైన కార్యక్రమములకు ఉపక్రమించను. దృశ్య
వ్యవహారములతో తదాత్మ్యము చెందను!
అని ఆ శిశువు మనస్సులో వేదనలు చెందుతూ గావు కేకలు పెట్టుచూ ………
ఉంటాడు.
బ్రాహ్మణుడు : ఓ లలనామణీ! ఆ గర్భస్థశిశువు యొక్క గర్భయాతనా
పరంపరలు నీవు వర్ణించి చెప్పుతూ ఉంటే, ఒళ్ళు గగుర్పొడుస్తోంది.
“పరమాత్మ తత్వాన్ని ఆశ్రయించి పునః పునః జన్మల జాడ్యం ఎంత త్వరగా
వదిలించుకోవాలి!” అనే విషయం మాకందరికీ గుర్తుచేస్తున్నావు.
……. సంతోషం. ఓ గొల్లభామా ! ఇంకా చెప్పు! ఆ శిశువు అట్టి గర్భచెరసాలను
అనుభవిస్తూ ఎట్లా ఏరీతిగా బయల్వెడలుచున్నాడు? ……..
అధ్యాయము–9.) భూమిపై పడటం
|
గొల్లభామ : స్వామీ! వినండి! చెపుతాను.
ఆ గర్భస్థ శిశువు తన మనస్సులో “సర్వచరాచరాత్మకుడుమునీశ్వర హృదయ విహారి - జగత్ విభుడు - ఆద్యంత శూన్యుడు - సర్వ
స్వరూపుడు - ప్రభువు” అగు పరమాత్మను గర్భ చెరసాల నుండి విముక్తికై
త్రోవ చూపించమని వేడుకుంటూ ఉన్నాడు కదా! తనకు తానుగా త్రోవ
దొరకక అల్లల్లాడిపోతూ ఉంటున్నాడు. కొంతసేపేమో రోదన-వేదన-వేసట
అనుభవిస్తున్నాడు. మరి కొంతసేపేమో అవాక్-మానస గోచరమైన పరబ్రహ్మ
ము యొక్క అనుభవమును పుణికి పుచ్చుకున్న బ్రహ్మజ్ఞాని వలె ఏదో
ధ్యానిస్తూ మౌనంగా ఉంటున్నాడు.
ఈ విధంగా క్షణాలు-నిమిషాలు-గంటలు-రోజులు లెక్కపెట్టుచూ
కాలం గడుపటం జరుగుతోంది. “భూమిపై ఎప్పుడు పడతానా?" అని
ఎదురుచూస్తూ - ఉబలాటపడుతూ ఉంటాడు. అధ్యాత్మ సంబంధమైన
సాధనల గురించి ప్రణాళికలు యోచిస్తూ ఉంటాడు. క్రమంగా 10 మాసాలు
గడుస్తున్నాయి.
37
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
ఒకానొక సమయంలో
…..9
సర్వాత్మకుడగు శ్రీరామలింగేశ్వరస్వామి యొక్క కరుణా
సముద్ర
తరంగాల రూపంగా తల్లి గర్భంలో ఎక్కడి నుండో ’ప్రసూతి వాయువులు
| బయల్వెడలుచున్నాయి. ఆ శిశుదేహాన్ని అధోముఖం చేస్తున్నాయి. క్రమంగా నెట్టుచున్నాయి. ఊపిరి సరిగ్గా ఆడక ఆ శిశువు ప్రసూతి వాయు శక్తిచే
నెట్టబడుచూ తల్లి యొక్క రహస్య ద్వారం గుండా బహిర్గతుడై భూమిపై
పడుచున్నాడు.
భూమి పై పడిన మరుక్షణం వర్తమానానుభవములచే స్పృశించబడి
’మాయ’చే కప్పబడుచున్నాడు.
అధ్యాయము–10.) ఏమరపు
|
బ్రాహ్మణుడు : భూమిపై పడిన ఆ శిశువు ఇతఃపూర్వం గుర్తు తల్లి చేసుకొన్న గర్భంలో పూర్వజన్మల అనుభవ- అనుభూతులనుసంబంధించిన , వాటికి జ్ఞాపకాలను, ప్రణాళికలను పూర్తిగా మరచిపోతున్నాడాకించిత్ ఏమరుస్తున్నాడా? లేక ? కాక, జ్ఞప్తి పథములో కలిగియే అంతా మొదలంట్లా ఉంటున్నాడామరచి ? ఎదురుగా ఇప్పుడు ఇంద్రియాలకు దృశ్యప్రపంచంపట్ల తారసబడే ఆసక్తి పొందినవాడై ఉంటున్నాడాచున్నదేమిటి? ఇక్కడ ? చెప్పవమ్మాజరుగు
!
గొల్లభామ : తల్లి గర్భం నుండి భూమిపైకి (లేకపతనమైన ) జీవుడు, “(అమ్మయ్యాచేరిన ఆ ! శిశువు ఇప్పుడు అని గొప్ప అనుకుంటూ ఆపద తొలగిందిరా సంతోషం బాబూపొందుతూ !”
ఉంటాడు. | కొద్ది *** క్రమక్రమంగా క్షణాలలో అనేక ఇతఃపూర్వపు " వ్యవహార నారీజన- సంబంధమైన బంధు- కళత్ర విశేషాలన్నీ - మిత్ర - విషయ
| రూపంలో ఏమరుస్తున్నాడుజీవుని . అవన్నీ సంస్కారములు స్వభావము నందు దాగినవై ఉంటున్నాయి. స్పర్శ - మరికొద్ది క్షణాలలో మనోగతమైన ఇంద్రియార్థముల (శబ్ద ద్వారా | యొక్క ఇంద్రియములకు గోచరమగుచున్న విశేషములలో నిమగ్న
38
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము -
మగుచున్నాడు. అనగా ఇప్పుడు వినబడేవి, (అమ్మ యొక్క తీయటి
పిలుపులు), స్పర్శ (అమ్మ యొక్క చేతులు బుగ్గలను, నడుమును
తాకుచున్న అనుభూతులు), ప్రియంగా పలకరిస్తూ కళ్ళకు కనబడే
అమ్మ-నాన్న-అన్న-అక్కల రూపాలు, (అమ్మ పాలచే అనుభవమయ్యే
మధురమైన) రుచి, (పుట్టిన గదిలోని) పరిమళాలు….. ఇవన్నీ అనుభవిస్తూ,
అవి లభించనప్పుడు అవి ‘పొందాలి-పొందాలి’ అనే అభిలాషలు కలిగి ఉ
ండటం ప్రారంభిస్తున్నాడు. వాటిని గురించి ధ్యానించటం మొదలు
పెట్టుచున్నాడు.
విశేష వివరణం : దృష్టాంతాలు
1. ఒకడు ‘కల’ కంటూ కంటూ మెళుకువ రాగానే స్వల్ప విషయాలు క్షణంలో
త్యజించి జాగృత్తులో ఎదురుగా కనిపించే విశేషాలలో నిమగ్నమగుచున్నట్లు.
అట్లాగే,
జాగృతదృశ్యాన్ని ఆస్వాదిస్తూ - ఆస్వాదిస్తూ ఒకానొక క్షణంలో
స్వప్నానుభవంలో ప్రవేశించి జాగృతదృశ్యాన్ని త్యజిస్తున్నట్లు
గర్భంలో ఉన్నప్పుడు గుర్తొచ్చిన జ్ఞాపకాలను భూమిపై పడగానే
ఏమరుస్తున్నాడు.
2) గీతాచార్యులవారు
- ధ్యాయతే విషయాన్ పుంస:
- సంగస్తే ఘాపజాయతే |
- సంగాత్ సంజాయతే కామ: |
- కామ: క్రోధో అభిజాయతే |
- క్రోధాత్ భవతి సమ్మోహ: |
- సమ్మోహాత్ సృ్మతి విభ్రమ : |
- సృ్మతిభ్రంసాత్ బుద్ధి నాశ: |
- బుద్ధినాశాత్ ప్రనస్యతి I
అని చెప్పిన వాక్యాలు సందర్భోచితమౌతుందని అనుకుంటాను.
39
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
కలిగించే పదార్థాలు సేవించినవానివలె
ఆ విధంగా మత్తు మరుగున - అడుగున సంస్కారాలు | పూర్వజన్మల జ్ఞాపకాలు - పడిపోయి, వర్తమాన అనుభవాలు, అనుభూతులు సందర్భాలు, జ్ఞాపకపరంపరలు
భావించటం ఆరంభిస్తున్నాడు.
మొట్టమొదటగా ఆకలితో తల్లిస్తన్యం నుండి ప్రసాదించబడే తల్లి
పాల ‘రుచి’ని ఆస్వాదించటం తద్వారా ఆకలి-దప్పికలు తీర్చుకోవటం
ప్రారంభిస్తున్నాడు. ఇక, ఆపై ఆయా జీవితదశలకు ‘నాంది’ పలుకుచున్నాడు.
ఇంకేమున్నది? ఈ దృశ్యపరంపరలను బాల్య-యౌవన-కౌమార
వార్ధక్యాలలో వేరువేరు విధాలుగా, ఒకటి తరువాత మరొకటిగా పొందటం
జరుగుతోంది. ఒకేసారి అనేక పరస్పరానుకూలమైన - ప్రతికూలమైన విషయములలో చిక్కుకుంటున్నాడు. సుఖ-దు:ఖ, ప్రియ-అప్రియ, ఇష్ట-అయిష్ట భావ సమూహములను మనస్సులో కల్పించుకొని
అనుభవరూపంగా (లేక) జగత్ రూపంగా పొందుచున్నాడు.
కామ-క్రోధ-లోభ-మోహ-మద మాత్సర్యములనబడే అరిషట్ వర్గములకు లోనవుచున్నాడు. తాను పెంపొందించుకున్న ఆసక్తికి తానే “సంసారబద్ధుడు” అగుచున్నాడు. అట్టి ఆసక్తి రూప సంసారమే జీవునిపట్ల ఏర్పడే సర్వ అనర్థములకు కారణం స్వామీ! అందుచేత సంసారమును
త్యజించటమే ఉచితం కదా!
అధ్యాయము–11.) సంసార బంధము - అనగా?
|
బ్రాహ్మణుడు : ఓ పూబోణీ! నీ మాటకు జీవునికి అడ్డువస్తున్నాను సంసారము - అని బంధమాఅనుకోవద్దు ? భార్య-పిల్లలు మొదలైనవి నీ ఉద్దేశ్యమాత్యజించాలం
! ఆశ్రయాలు కదా(! అవి లేక) ఆశ్రమాలు క్లుప్తంగా 4 విధాలుగా చెప్పుకుందామావేదజ్ఞులు చెప్పారు
? గొల్లభామ : తప్పక ప్రజ్ఞాదురంధరులని చెప్పండి మహాశయా! మీరు మీ వేద-యజ్ఞ-యార్
వాక్ బ్రాహ్మణుడు మాధుర్యమే : బ్రాహ్మణులకుచెప్పుచున్నది సుమా!
, తదితరులకు కూడా శాస్త్రాలు నాలుగు ఆశ్రమాలు బ్రహ్మయజ్ఞ విధానంగా సూచన చేస్తున్నాయి.
40
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
1) బ్రహ్మచర్యాశ్రమం : కొందరు విద్యార్థి దశ తరువాత లౌకిక సంబంధమైన
“వివాహము - పిల్లలు- సంపదలు….. ఇటువంటివి ఆశ్రయించకుండా,
“గురు సేవ- వేదాధ్యయనము- బ్రహ్మము గురించిన సమాచార సేకరణబ్రహ్మము నందు రమించుటకై కావలసిన సాధనలు- ప్రయత్నములలో
దైనందిక జీవితమును విధివిధానంగా నియమించుకోవటం.
2) గృహస్థాశ్రమం : మరికొందరేమో విద్యార్థి దశతరువాత బ్రాహ్మణ
తదితర కులాచారాలను అనుసరించి ఆ వంశాభివృద్ధి కొరకై వైవాహిక
జీవితాన్ని ఎన్నుకుంటున్నారు. వైవాహిక జీవితంలో శాస్త్రాచితంగా
కొనసాగిస్తున్నారు. పెద్దల వద్ద విద్యార్థిగా నేర్చిన వేదాధ్యయనము, పఠనము,
బోధనము అన్ని వర్ణాలలోని జనులచే యజ్ఞ-యాగ-వ్రత - పూజాదులు,
స్మార్తకర్మలు నిర్వర్తింపజేయ టానికి, మంత్ర-తంత్ర పూర్వకమైనదంతా
వృత్తి ధర్మంగా స్వీకరిస్తున్నారు. సంతానము- సంపద ఆస్వాదిస్తూ లోక-వేద
విధాన పూర్వకంగా సాంఘి కమైన, సర్వజనానుకూలమైన గృహస్థ జీవితం
శాస్త్రప్రవచితమైన మార్గంగా అనుసరిస్తున్నారు.
మరి కొందరు లోకావసరాలైన ఆర్థిక - గృహ - సామాజిక - ఆహార
ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ వేదోపాసన- నాదోపాసన - వేదాంత
శాస్త్రాధ్యయనం నిర్వర్తించుతూ ఉండటం జరుగుతోంది. వీరంతా
గృహస్థాశ్రమవాసులుగా చెప్పబడుచున్నారు.
ఇక అజ్ఞులైన ఇంకొందరి గురించి చెప్పాలంటే, వారు గృహస్థా
శ్రమాన్ని అరిషట్ వర్గములచే వమ్ము చేసుకుంటున్నారు.
3) వానప్రస్థాశ్రమం (వనజీవితం) : విజ్ఞులలో కొందరు గృహస్థాశ్రమం
కొన్ని సంవత్సరాలు గడుపుతూ సంతానము - సంపద - గృహస్థ ధర్మాలైన
లోకకళ్యాణ పూర్వక యజ్ఞయాగాదులు మొ||నవి నిర్వహిస్తూ ఒకానొక
సమయంలో ఆ గృహస్థాశ్రమం త్యజిస్తున్నారు. ఏకాంత జీవితం
ఆశ్రయిస్తున్నారు. ధర్మపత్నీసమేతంగా ఆ ఏకాంత ప్రదేశంలో తపస్సు -
ధ్యానము కొనసాగిస్తున్నారు. శాస్త్రాధ్యయనం చేస్తూ ఆత్మతత్యానుభూతిని
సుస్థిర పరచుకుంటున్నారు. వీరిని “వానప్రస్థులు” అని అంటారు.
4) సన్యాసాశ్రమం : విద్యార్థి - బ్రహ్మచర్య- గృహస్థాశ్రమములలోని స్థితి
41
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము -
ఇక నీవు చెప్పేమాటల విషయానికి వద్దాం.
ఓ భామా! నీవు అంటున్నదేమిటి? "సంసారమే అన్ని అనర్థాలకు
మూలం!” అని సిద్ధాంతీకరిస్తున్నావేమిటి? ఓహెూ! నాకు అర్థం అయ్యిందిలే!
“ఈ జీవుడు సంసారంలో చిక్కుకుంటున్నాడు” అని అనేటప్పుడు, “ఈతడు
తెలియక- సరియైన అవగాహన - విశ్లేషన చేయనట్టి సందర్భాలలో కొన్ని
కొరగాని మార్గములు - ఉద్దేశ్యములు - అవగాహనలు - అభిప్రాయములు
కలిగి ఉండటం చేత”…… అని నీ అభిప్రాయము అయిఉంటుందేమో
కదా!
గొల్లభామ : అవును! నా అభిప్రాయము అదేలే స్వామీ!
బ్రాహ్మణుడు : అయితే ఓ గొల్లభామామణీ! అటువంటి ‘కొరగాని పనులు’
అనగా ఏమేమో నీ ఉద్దేశ్యము మాకు, విజ్ఞులగు ఈ సభకు వేంచేసిన
ప్రేక్షకమహాశయులకు సవివరంగా చెప్పవూ!
గొల్లభామ : ఓ బ్రాహ్మణ మహాశయా! వినండి. తెలివైనవాడు ఈ
సంసారములో జీవన యాత్ర సాగిస్తూనే రాగ-ద్వేష-లోభ-మోహ-మదమాత్సర్య - మమకారాదులు తన మనస్సును మకిలం చేయకుండా
చూచుకుంటూ ఉంటాడు. అది దృష్టిలో పెట్టుకునే ధర్మశాస్త్రాలు
గృహస్థాశ్రమ ధర్మాలు జీవులకు సూచిస్తున్నాయి.
ఒక తామరాకుపై కొంచం నీళ్ళు పోసామనుకోండీ!
? ఉంటాయి. కొంతనీరు - ఆ తామరాకుపై నీళ్ళు ఉంటాయాబిందువుల రూపంగా ఉంటాయి.
అయితే, ఆ తామరాకు తనపై గల జలబిందువులను తాను
పీలుస్తున్నదా? లేదు. పీల్చనే పీల్చదు.
అట్లాగే, ఇక్కడి సంగతి సందర్భాలు, సంపద-ఆపదలు,
సంబంధ-బాంధవ్యాలు, సానుకూల-ప్రతికూల వ్యవహారాలు, శతృ-మిత్రులు
ఇత్యాదులన్నీ ‘మనస్సు’ అనే తామరాకుపై పడితే పడవచ్చు గాక! ఆ
●
మనోనళినీదళం ఆయా ప్రాపంచిక వ్యవహార జలబిందువులు తనలోకి
43
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
వాసి పీల్చనట్టి సామర్థ్యమును ఈ గృహస్థాశ్రమ సర్వదా అలవరచుకుంటూ
ఉండాలి.
బాహ్య విషయాలు బాహ్యానే ఉంచాలి. స్పర్శాత్ కృత్వా బహి: బాహ్యాన్ అంతేగాని, వాటిని విషయముల రూపంగా - మనస్సులో
ప్రవేశించనీయరాదు.
ఈ మాత్రం నిత్యసాధనలో కష్టం ఏముంటుంది చెప్పండి?
అట్లాగే, ఇంకొక దృష్టాంతం చెపుతాను. మీరు, ఈ ‘గొల్లకలాపం’ అనే ఆత్మయజ్ఞము వీక్షించి ఆనందించటానికి వచ్చిన సభికమహాశయులు
నాపై వాత్సల్యంతో వినండి !
ఎర్రపురుగును మనమందరమూ చూచియే ఉంటాము ఎర్రపురుగు కదా! ఆ బురదలోను - నీటిలోనూ కూడా తిరుగాడుతూ ఉంటుందిఅయితే . ఏం? అది బురదనూ అంటించుకోదు. నీటినీ అంటించుకోదు(తడినీ) . మరి ఈ మానవుడో? ఈతనికి శ్రీరామలింగ్ఫేరస్వామి సర్వాంతర్యామి ఉత్తమ అయిన బుద్ధిని ప్రసాదించారే! సమన్వయించుకోగల సమాలోచన చేసి
మనో-బుద్ధులు ఈతనికున్నాయి పురుగుమాత్రం కదా! ఆ ఎర్ర తెలివి లేకపోతే ఎట్లా?
మరి?
దృశ్య విషయాలలో మనస్సు దుష్టములైన పాల్గొనుచున్నంత రాగ-ద్వేష, మానావమాన మాత్రం చేత
పెంపొందించుకోవలసిన భావపరంపరలను మనస్సులో
అగత్యమేమిటో పడవ చెప్పండినీటిలోనే ఉంటుంది?
ఒకవేళ . కానీ ఏ పడవ కారణం తనలోకి చేతనో నీరు ప్రవేశిస్తేప్రవేశించనీయదు? పడవ . మునిగిపోతుంది ఈ దృశ్యము కదా! అట్లాగే
యొక్క | జగద్విషయములలో స్వభావము తెలిసియున్నవాడు తన మనస్సు ఉన్నప్పటికీప్రవేశించకుండా , జగద్విషయములను జాగరూకుడై మనస్సులో
ఉండటం అనగాఅభ్యసిస్తూ , ఉంటాడు.
44
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము
ఇక్కడి దృశ్యములోని, సంఘటనలు - సందర్భాలు - సంబంధములు
- వ్యవహారములు - సుఖదు:ఖములు - లాభనష్టముల మధ్య జీవనయాగం
కొనసాగిస్తూనే … వాటిచే స్పృశించకపోవటం అభ్యసిస్తూ ఉంటాడు. వాటికి
తాను సంబంధించక, అవి తనకు సంబంధించనీక…., ఒకానొక
అతీతత్వము, అప్రమేయత్వము హృదయాంతరంగంలో అభ్యసిస్తూ ఉ
ంటాడు. ఇదే శాస్త్రాలు చెప్పే అస్పృశ్యత!
మహాత్మా! ఈ దేహి ఆయా లౌకిక- వ్యవహారిక విశేషములచే
అస్పస్యుడై ఉంటూ, ఆత్మజ్ఞానాశయంతో లీలగా-క్రీడగా ఈ జగత్తులో
చరిస్తూ ఉండటమే ఉచితం కదా!
అంతేగాని……,
“ఇవన్నీ నావే! నాకు సంబంధించినవే!” అనే భావాలను ఆ ఆశ్రయిస్తూ
వాటిచే బద్ధుడై ఉండటం అవసరమా? సముచితమా? కానేకాదు!
పట్టుపురుగు తెలివితక్కువగా తన లాలాజల ధారములలో తానే
చిక్కుకుంటోంది. ఆ రీతిగా అజ్ఞాని తన ఆశ-నిరాశ సంబంధ బాంధవ్యప్రియ-అప్రియ భావావేశములలో తానే బద్ధుడౌతున్నాడని వేదాంత శాస్త్రం
గుర్తుచేస్తూనే ఉన్నది కదా స్వామీ! స్వతహాగా ఆత్మస్వరూపుడే అయి ఉన్న
జీవునకు అట్టి బంధము ఉచితం కాదు కదా!
కాదు. కాకూడదు.
అధ్యాయము–12.) సంసార బంధ విశేషాలు
|
ఓ విప్రవర్యా! ‘సంసార బంధము’ గురించి - గృహస్థాశ్రమము
గురించి మరికొన్ని వివరాలు మరికొంతగా చెప్పుకోవాలంటే
నా పేరు ప్రతిష్టలు - నా కళత్రం “నాఇల్లు - నావాకిలి
- - నా
3 పిల్లలు - నా సంపద కానివారు నా నా సంపద - నావాళ్ళు నావాళ్ళు - - కానివారు - గొప్పతనం
అధికారం - నాకు ఇష్టమైనవారు - నాకు గిట్టనివారు…” ఇత్యాది విశేషాలు
మననం చేస్తూ దృశ్యముతో ‘స్వకీయకల్పన’ అనదగిన ’బంధము’ను
మనస్సుచే పొందటమునే ‘సంసారము’ అని అంటున్నారు. అంతేగాని
45
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన - వ్యాఖ్యాన పుష్పము
.
’ అయి ఉండలేదుఅనగా ‘గృహస్థాశ్రమంసంసారము సంసారము. అట్టి సంసార దీర్ఘరోగము ఏమరచటమే నుండి
ఆత్మత్వము విడివడటమే నుండి వర్తమాన “జన్మ” అనబడు దాని |C
సంసారసృంఖలముల సద్వినియోగమని శాస్త్రహృదయమును ఎరిగినవారు హెచ్చరిస్తున్నారు కదా!
మహనీయా! వింటున్నారు కదా! ఓ విప్రవర్యా!
దృశ్యముతో పెట్టుకొనబడే మానసిక సంబంధము అనునది మ
సంసారము. ఆహా! ‘సంసారము’ అనే దీర్ఘమానసిక బంధముచే ఈ జీవుడు
వివశుడౌతున్నాడు కదా! ఇదంతా స్వకీయమైన అభ్యాసంచే తనే
ఏర్పడుతోంది. తనకు తానే స్వకీయ కల్పనలు అయినట్టి “దుర్మదముదుర్మతి” అనేవి కళ్ళను కప్పి వేయచుండగా ఈతడు గ్రుడ్డివాడగుచున్నాడు. ఒక
“ఆర్జిత కర్మలు” అనే దేవతకు తనకుతానే బానిసగా అగుచున్నాడు - మ
చేసుకుంటున్నాడు. ఇంద్రియములకు - ఇంద్రియ విషయములకు దాసుడై వన
రోజులు వృధా చేసుకుంటూ ఉండగా, …. ఈ లోగా బాల్య-యౌవన-కౌమార | య
వార్ధక్యాలు గడచిపోతున్నాయి.
ఏ’ఎప్పుడో మృత్యువు వచ్చి ఈ భౌతిక దేహమును కబళించివేస్తోంది. ’
నిస్తేజము - నిరుపయోగము అయిన జీర్ణదేహాన్ని త్యజించి, బౌ
ఇతఃపూర్వం చెప్పుకున్నట్లుగా, ఈ జీవుడు సంస్కారానుసారంగా మరొక fie
| భౌతిక దేహమును ఆశ్రయించి గర్భనరకములన్నిటికీ ప్రాత్రుడుగా (qualified) అగుచున్నాడే!
| ఈ విధంగా ఉపాధిపరంపరలు : అసంఖ్యాకంగా పట్ల జవస్తున్నాయిఅజ్ఞాన జీవుని బ్లౌ
. పోతున్నాయి. as
ఓ విప్రపుంగవుడా! G
Ayఇప్పుడు చెప్పండి! -G
కాలానుగతంగా rooth
దేహాలలో వచ్చికొన్ని -పోతున్న, ఉత్పత్తి ఈ భౌతిక
గొప్పవి అయి నశిస్తున్న - మరికొన్ని అల్పమైనవి - అనేది ఎక్కడ? వాస్తవానికి
46
ఆత్మయజ్ఞము - గొల్లకలాపము :: అధ్యయన వ్యాఖ్యాన పుష్పము
అటువంటి భేదము ఎక్కడున్నది? ఈ అన్ని దేహాల యొక్క పుట్టుక-చావు
ఒక్క తీరైనవే కదా! మరి “మా బ్రాహ్మణ దేహములు ప్రత్యేకమైనవి”…
అని ఎట్లా అంటున్నారో చెప్పండి! నేను, ఈ సభకు వేంచేసిన ప్రేక్షకులు ……
వింటాము.