యేలేశ్వరపు శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బహ్మసూత్ర భాష్యే
శ్రీకృష్ణ - శ్రీ ఉద్ధవ సంవాదము
హనుమ రామకృష్ణ అధ్యయన పుష్పము (వచన కావ్యము)
(ఉద్ధవ గీత)
శ్రీకృష్ణ శ్లోదోషబుద్ధోభయాతీతో నిషేథాత్ న వివర్తతే
గుణబుద్ధ్యా చ విహితం న కరోతి యథా అర్భకః అధ్యా 7 శ్లో.11
- తా. దోషము - నిషేధముః ఇవన్నీ ఆత్మజ్ఞాని శ్రీ సమక్షములో బాలా లీలా వినోదములే ! ఉద్ధవ శ్లో॥మల్లక్షణమిమం కాయం లబ్ద్వామదర్మ ఆస్తితః సంవాదము
ఆనందం పరమాత్మానం ఆత్మస్ధం సముపైతి మామ్ || అధ్యా 26 శ్లో.1
తా. పరమాత్మనగు నా తత్త్వమును గ్రహించి - ఆశ్రయించి -
ప్రవేశించటమే మానవ జన్మ యొక్క సాఫల్యము
శ్లో విసృజ్య స్మయమానాన్ స్వాన్ దృశం వ్రీడాం చ దైహికీమ్
ప్రణమేద్దండవత్ భూమావ అశ్వచాండాలగోఖరమ్ | అధ్యా 29 శ్లో. 16 CON
తా. ఇతరుల పరిహాసాలను లెక్క చేయక ఒక గుఱ్ఱము - చండాలుడు అధ్యయనపుష్పము
- ఆవు - గాడిదకు కూడా పరమాత్మ భావనతో నమస్కరిస్తూ ఉండు.
మూలము : శ్రీ వ్యాసమహర్షి అధ్యయన విద్యార్ధి
యేలేశ్వరపు హనుమ రామకృష్ణ రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ

శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే
శ్రీకృష్ణ - శ్రీ ఉద్దవ సంవాదము
అధ్యయన పుష్పము (వచన కావ్యము)
(ఉద్ధవ గీత)
COS
మూలము : శ్రీ వ్యాస మహర్షి
అనుశ్రుత : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ
(i)

ఉద్ధవగీత - శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదము - వచన కావ్యము
బ్రహ్మసూత్ర భాష్యము
శ్రీమత్ భాగవత ఏకాదశస్కంధాంతర్గతము
1. దేవతల రాక
శ్రీ శుకదేవుడు : ఓ పరీక్షన్మహారాజా! భగవంతుడగు శ్రీ కృష్ణపరమాత్మ భక్తుడు
మిత్రుడు అగు ఉద్ధవునికి బోధించిన "పరమహంస విశేషము - బ్రహ్మసూత్ర భాష్యము"
అని ప్రశంసించబడుచున్న విశేషములతో కూడిన "పరతత్వ విచారణ - గురునిర్వచన"
ఇత్యాది విషయముల గురించి చెప్పుచున్నాను.
మనం మననం చేసుకోబోయే ఈ విశేషాలు జీవుని సంసార సాగరము నుండి
తరింపజేయగలవు. అందుచేత ఓ మహారాజా! ఓ సర్వ సభికులారా! అందరు దయచేసి
శ్రద్ధగా వినండి.
ఒకానొక రోజు సర్వలోక శుభంకరము-మరమానందప్రదము అగు శ్రీకృష్ణ భగవానుని
దివ్య రూప సందర్శనము కొరకై బ్రహ్మ దేవుడు, రుద్రభగవానుడు ద్వారకకు వేంచేశారు.
వారిని అనుసరించి ఇంద్రుడు, మరుత్తులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, అశ్వనీ
దేవతలు, ఏకాదశరుద్రులు, సిద్ధులు, అనేకమంది పితృదేవతలు మొదలైన దేవతా
శ్రేష్ఠులంతా కూడా శ్రీకృష్ణ సందర్శనానందమునకై వచ్చారు.
స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సందర్శించి పరమానందము పొందారు.
మధుర సుగంధమును వెదజల్లు నందనవన పుష్పములను, పుష్పమాలలను శ్రీకృష్ణ
భగవానునికి సమర్పించారు.
ఆ వేంచేసిన దేవతా శ్రేష్ఠులు శ్రీకృష్ణుడు ప్రేమాస్పదంగా చూపిన ఆసనములపై
సుఖాసీనులై శ్రీకృష్ణ దేవుని స్తుతించసాగారు.
2. శ్రీకృష్ణ స్తుతి
శ్రీ బ్రహ్మ రుద్రాది దేవతలు : హే భగవన్! ఏ మహత్తరమైన సంపదను తమ హృదయ
పద్మమునందు నిలుపుకొని మార్గాణ్వేషకులగు ముముక్షువులంతా అనుక్షణం ఉపాసిస్తూ
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
1

సర్వకర్మ పాశములనుండి విముక్తిని సముపార్జించుకుంటున్నారో, అట్టి తమ పాదార
విందములకు మా బుద్ధి-ఇంద్రియ-ప్రాణ-మనో-వాక్ పూర్వకంగా నమస్కరిస్తున్నాము.
మీ పాద పద్మములకు సాష్టాంగదండ ప్రణామాలు!
స్వామీ! మీరు మీయొక్క మాయావిశేషంచేత మీ యందు మీరే చెప్పుటకు ఊహించుటకు
అలవికానిది, వ్యక్తరూపము, త్రిగుణసమన్వితము అయినట్టి ఈ ప్రపంచమును
సృష్టించుకుంటున్నారు. పరిపాలిస్తున్నారు. లయింపజేసుకుంటున్నారు. ఇంతటి చమత్కారం
నిర్వహిస్తూ కూడా మీరు సర్వదా అప్రమేయులు. త్రిగుణ మాయాతీతులు. రాగ ద్వేషములచే
స్పృంశించబడనివారు. మీ చిదానంద పరతత్త్వము ఆవరణ రహితము (Sans Borders). అఖండము (indivisible). సర్వరూప ఆవిష్కరణము (All forms are always
yours). పరమానందము (Pleasant Form Beyond all else).
అందుచేత మీచే నిర్వర్తించబడుచున్న లీలా విశేషములచేత, కర్మలచేత మీరు బద్ధులు
కానేకారు.
మీ యొక్క అవతార విశేషసంబంధమైన జన్మ-కర్మలను విని, మిమ్ము ప్రస్తుతిస్తూ
సత్పురుషులు విశుద్ధత్వమును సముపార్జించుకుంటున్నారు.
అంతటి విశుద్ధత్వమును జీవులెవ్వరూ వేదాధ్యయనము చేతగాని, వేదార్థశ్రవణము
చేతగాని, తపస్సు మొదలైన ఆయా క్రియా విశేషముల చేతగాని పొందవీలుకాదు.
ముక్షువులగు వారు పరమశుభములు పొందటానికై ప్రేమార హృదయంతో మిమ్ము
స్మరిస్తూ తరిస్తున్నారు. జితేంద్రియులగు మరికొందరు స్వర్గమును అధిగమించి
పునరావృత్తి దోషం లేనట్టి విష్ణులోకం జేరటానికై మీ పాద పద్మములను త్రికాలాలలోను
ఆశ్రయించినవారై వుంటున్నారు. ఆశ్రితులగు అనేక మంది భక్త జనులు మీ వాసుదేవ
(Al-present) సంకర్షణ (Al-Attracting) ప్రద్యుమ్న (సృష్టిగా రూపొందుచున్న) అనిరుద్ధ
(అప్రతిహతమైన) చతుర్విధరూపములను ఆరాధిస్తున్నారు.
అట్టి మీ ఈ పాదపద్మములు మాపట్ల మా విషయవాసనలను మొదలంటా
పెకలించివేయు ఝంఝామారుతమగుగాక!
యజ్ఞములు నిర్వర్తించే యాజ్ఞకులు ఋక్-యజుర్-సామవేద పూర్వకంగా
మంత్రోచ్ఛారణ చేస్తూ యజ్ఞగుండమునకు ఆహూతులు సమర్పిస్తూ స్మరిస్తున్నది మీ
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
2

స్వరూపమునే! యోగులు అణిమ-గరిమ-లఘిమ-మహిమ-ఈశిత్వ-వశిత్వప్రాకామ్య-ఇచ్ఛా ఇత్యాదిసిద్ధులు సంపాదించుటకై ధ్యానిస్తున్నది కూడా మీ స్వరూపమునే!
పరమ భాగవతులు మోక్షాకాంక్షను కూడా త్యజించి తమ భక్తి పారవశ్యంతో
ఆత్మానందానుభూతిని అనుభవిస్తూ ఇంకేమి అఖర్లేదు అని ఆస్వాదిస్తున్నది మీ తత్త్వమే!
ఓ దేవాదిదేవా! మేము తమ సందర్శనానందాభిలాషులమై వస్తూ, నందనవనముహిమాలయము మొదలైన ఆయా ప్రదేశములలో లభించిన సౌగంధిక పుష్పములు
మొ॥వాటితో కూడిన పూలమాలలను తెచ్చి ఒక్కొక్కరము మిమ్ములను అలంకరించి
ఆనందిస్తున్నాం. అయితే మీ హృదయ ప్రదేశమున నివసిస్తున్న లక్ష్మీదేవి-"ఇదేమిటి?
- ఈ బ్రహ్మాది దేవతలు అల్పములైనట్టి భౌతిక రూప పుష్పమాలలను నేనున్న స్థానంలో
అలంకరిస్తున్నారు?" అని కించిత్ అవేశముతో మిమ్ములను ప్రశ్నిస్తోంది. మరి మీరో?
అది పట్టించుకోకుండా మేము తెచ్చి సమర్పించిన మాలలను నిరాఘాతంగా ధరిస్తున్నారు.
ఎందుకని? ఎందుచేత నంటే మీరు భక్తవత్సలులు కదా!
అట్టి పరమప్రేమాస్పదులగు మీ దివ్యచరణ కమలములు మా యొక్క 14 లోకముల
సంబంధములైన సర్వ విషయవాసనలను తొలగించి మమ్ములను రక్షించునుగాక!
హే భగవన్! వామనావతారంలో బలిచక్రవర్తి యొక్క దానమును స్వీకరిస్తూ మీ యొక్క
ఒక పాదము త్రిలోకములను ఆక్రమించి వేసింది. మీ పాద పద్మములనుండి జన్మించిన
గంగానది లోకపావని అయి తన్ను సమీపించిన జీవులందరి పాపములను కడిగివేసి
పవిత్రులుగా తీర్చిదిద్దుతోంది. అటువంటిదైన ఈ మీ చరణయుగళం మాయీ సాష్టాంగ
దండ ప్రణామములు స్వీకరించి మాయొక్క -అల్ప- సంకుచిత-పరిమిత దృష్టుల
నుండి మమ్ము సదా కాపాడును గాక!
మాయందు తత్త్వదృష్టిని జనింపచేసి, పరిపోషించి, పరివేష్టించి పరిరక్షించును గాక!
"ఈ ఎదురుగా కనిపించేవారంతా శ్రీకృష్ణ రూపులే"-అని మా మనస్సు పొందునుగాక!
"ఇదంతా చైతన్యానంద ప్రదర్శనమే!" అనే ఎఱుక మా బుద్ధియందు ప్రవృద్ధమగుగాక!
హే స్వస్వరూప చైతన్యమూర్తీ! మా బ్రహ్మ రుద్రాది దేహములతో సహా ఈ సర్వజగత్తులు
పరస్పరం కలహపీడితములై కాలమునకు వశములై వుంటున్నాయి. ప్రకృతిపురుషాతీతుడవగు కాలపురుషుడు మీరు! ఓ కాలః కాలా! కాలనియామకా! శంసస్తనోతు
చరణః! పురుషోత్తమస్య! పురుషోత్తములగు మీ చరణములు మాకు సుఖశాంతులను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
3

ప్రసాదిస్తాయని గ్రహించి మీ చరణ సన్నిధిని చేరుకున్నాం.
ఓ పురుషోత్తమా! ప్రతి ఒక్క జీవునిలో అనుభూతమగుచున్న ఉత్తమ పురుష (The
First Person. The " I" in every body) గా ప్రదర్శిమగుచున్నది మీరే! కనుకనే మీరు
పురుషోత్తములు! వేదములు ఇక్కడి ప్రకృతి-పురుష మహత్తత్త్వములకు నియామకుడుఆధారభూతుడు మీరే అని నిర్ణయించి ఎలుగెత్తి గానం చేస్తున్నాయి. ఈ చరాచరజగత్తు
యొక్క సృష్టికర్త-పరిపోషకుడు-లయకర్త మీరే! అందుచేత కూడా, మిమ్ము వేదోపనిషత్తులు
పురుషోత్తముడని లయ-విన్యాసంగా పలుకుచున్నాయి.
"కారణం కారణానిచ" అనబడు కారణ కారణ స్వరూప సంజ్ఞయగు క్షీరసాగరమున
శయనించువారు, అమోఘవీరుడు అగు మహావిష్ణువు కూడా సర్వతత్త్వస్వరూపుడగు
మీ వలననే శక్తిని పొందుతున్నారు. అట్టి శక్తి చేత మాయతోగూడి ఈ జగత్తుకు బీజ
స్వరూపమైన మహత్తత్త్వమును సృష్టిస్తున్నారు. అటు తరువాత ఆ మహత్తత్త్వమే త్రిగుణ
రూపమాయను అనుసరించి సప్తవ్యాహృతులు అని చెప్పబడే ఓం భూః ఓంభువః ఓం
సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓ గుం సత్యం అను 7 ఆవరణములు తో
కూడిన ఈ సువర్ణమయ బ్రహ్మాండమును (The universe with multi coverages)
సృష్టించుచున్నది.
ఈవిధంగా ఈ ఎదురుగా దేహ-మనో-బుద్ధి-చిత్త-అహంకార-జీవ ఈశ్వర
అహంభావాలకు తారసబడే 7 ఆవరణములతో కూడిన బ్రహ్మాండము మీయందు
కనిపించే నిర్విషయరూప విషయచమత్కారమే సుమా!
ఇక్కడి సృష్టి, ఈ సృష్టిని ఆస్వాదించే దృష్టి, ఆ దృష్టికి ఆధారమైన ద్రష్ట ఆ ద్రష్టను
గమనిస్తున్న దృక్ స్వరూపముకూడా మీరే! మీరే జీవుడు! మీరే ఈశ్వరుడు! మీరే
సర్వేశ్వరుడు! ప్రతి జీవుని యందు కనిపించే మనో బుద్ధి చిత్త అహంకారాలు మీ
సంప్రదర్శనమే!
ఈ రీతిగా త్రిగుణ సమన్వితమైన మాయచే జనిస్తున్న ఇంద్రియ సమూహముకు,
ఇంద్రియవిషయజగత్తుకు ఆధారము, ఇంద్రియములతో దృశ్యవిశేషాలను ఆస్వాదిస్తున్న
ఇంద్రుడు కూడా మీరే! ఇంద్రియ విశేషాలన్నీ సర్వత్రా సర్వజీవుల రూపంగా నేను -
-
నీవులతో సంభవింపజేస్తున్నది అనుభవిస్తున్నది మీరే! మీరే అయివుండి కూడా మీరు
ఆయా ఇంద్రియ భూతరూప దృశ్య విశేషములచే బద్ధులు కానే కాదు. వాటివాటియందు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
4

ఆసక్తుడు కూడా కాదు! అనగా సర్వ జగద్విశేషాలు అనుభవిస్తున్న జీవుడు అనబడువాడు
మీరే అయి వుండి కూడా, ఈ జీవుడు - ఇంద్రియములు-దేహములు-దృశ్యములువగైరా మిమ్ము స్పృశించవు. వీటినన్నింటిని ఆస్వాదిస్తూనే వీటికి అప్రమేయులై
స్వయంతేజోరూపంగా సర్వదా వెలుగొందుచున్నారు.
అందుచేతనే, అన్యయోగులు- వారు త్యజించ యత్నిస్తున్న విషయభోగములను వారే
చూచుకొని, "ఎట్లాగురా త్యజించటం?" అని భయం పొందటం జరుగుతూవుంటే,
యోగీశ్వరుడగు మీకు ఈ ఇంద్రియ విషయములతో కూడిన ఏడు ఆవరణల చమత్కారం
కేవలం ఏడువారాల ఆభరణమువంటివి అగుచున్నాయి.
హే యోగ యోగీశ్వరా! శ్రీకృష్ణా! రుక్మిణి మొదలైన 16008 మంది భార్యలు సదా
మిమ్ములను వెంటనంటి ఉంటున్నారు! తమ తమ చిరుమందహాసములతో, చిలిపి
వీక్షణములతో ఆకర్షణ సంతరించుకున్న కనుబొమ్మలతో, రాసానుభూతిని ప్రేరేపించే
కదలికలతో కూడిన సంజ్ఞలతో శృంగార చేష్టలను ప్రోత్సహించే ప్రణయ వాక్యార్ధముల
రూపంతో అత్యంత సమ్మోహకములైన మన్మథ బాణాలు మీపై వదలుచున్నారు. మిమ్ము
ఎట్లాగైనాసరే, తమతమ వైపుగా ఆకర్షించి ఎవరికివారే తమకు పరిమితం చేసుకోవాలని
సర్వవిధాలా యత్నపరులై వుంటున్నారు. కాని ఏం లాభం? ఈ చరాచరసృష్టికి ఆతీతము -
అన్నింటికీ ఆధారము అయిన మీ మనస్సును ఏ మాత్రం దోచుకోలేక పోతున్నారే!
మీరు మహామనోస్వరూపులు కదా! అందుచే ఓ దేవాదిదేవా! శ్రీకృష్ణప్రభూ! ఈ
త్రిలోకములందలి సర్వజీవుల పాపరాసులను క్షాళనం చేయడానికై మీరు రెండు
స్రవంతులను ఈ జగత్తులలో ప్రవహింపజేస్తున్నారు.
1. అమృతమయమగు మీ లీలా విశేషాలు - ఆధ్యాత్మిక విశేషార్ధాలతో కూడిన శ్రీకృష్ణ
లీలావినోద చమత్కారాల స్రవంతి.
మీ పాదముల నుండి జనించి మీ పాద యుగళములకు 2. ప్రదక్షణ చేసి ప్రవహిస్తూ
సర్వలోకుల దోషములను కడిగివేస్తున్న గంగానదీ స్రవంతి.
అందుచేత ఈ లోకంలోని వివేకవంతులగు జీవులు మనోచక్షవులతో మీ లీలా విశేషాలను
స్మరిస్తూ, ఈ భౌతిక శరీరంతో గంగానదిలో మునకలు వేసి వారివారి అధిభౌతిక -
అథిదైవిక-ఆథ్యాత్మిక త్రివిధ తాపములను ప్రక్షాళనం చేసుకుంటూ ధన్యులగుచున్నారు.
హే శ్రీకృష్ణ చైతన్యానందమూర్తీ! సర్వాంతర్యామీ!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
5

మా మనో-వాక్-కాయములచే త్రికరణశుద్ధిగా సమర్పిస్తున్న ఈ మా సాష్టాంగదండ
ప్రణామములు మరొక్కసారి స్వీకరించండి. మా మనో-బుద్ధి-చిత్త-అహంకారాలను
ఆత్మానంద లహరిలో పరిశుద్ధం అయి మీ పాదపద్మములను అలంకరించి ఉండును గాక!
ఈవిధంగా దేవతలంతా బృందగానంగా స్వామికి స్తోత్రాలు సమర్పించారు. క్రమంగా
శబ్దజాలము ఉపశమించగా అక్కడికి వేంచేసిన వారంతా శ్రీకృష్ణ భగవానుని
అవతారరూపం చూస్తూ, అలౌకికమైన ఆత్మానందంలో ఓలలాడసాగారు. అప్పుడు
బ్రహ్మదేవుడు స్వామితో ఇట్లు చెప్పనారంభించినారు.
బ్రహ్మదేవుడు: హే ప్రభు! శ్రీహరీ! ఒకానొకప్పుడు మేమంతా సామవేదాంతర్గతమైన
విష్ణుస్థవంతో ప్రార్థనచేయగా మాకు మీరు ప్రత్యక్షమైనారు. భూభారాన్ని హరించడానికి
అవతరించవలసినదిగా మేము మిమ్ములను అభ్యర్థించాము. ఆహ్వానించాము! మా
ప్రార్థనను మన్నించి ఈ కృష్ణావతారం మా అందరికి, అట్లాగే ఈ సర్వలోకాలకు
ప్రసాదించారు. తగువిధంగా దుష్టశిక్షణ శిష్టరక్షణ నిర్వర్తించారు. సత్యాన్వేషకులగు
భక్తమానసుల క్షేమము కొరకై ధర్మమును పునః స్థాపింపజేశారు. సర్వలోకములలోని
పాపదృష్టులను శమింపజేయగల మీ అవతార కీర్తిని వ్యాపింపజేశారు. సర్వోత్తమమైన
ఈ శ్రీకృష్ణ సుందర రూపంతో యాదవ కులంలో అవతరించి జగత్తమునకై అనేక
కార్యక్రమములను నిర్వర్తించారు.
ఏ జనులైతే కలియుగంలో మీ ఈ లీలలను ఆధ్యాత్మార్ధ పూర్వకంగా గానం - శ్రవణం
చేస్తారో, వారంతా స్వభావసిద్దంగా సాధుస్వభావులై సులువుగా అజ్ఞానాంధకారాన్ని
పటాపంచలు చేసివేసుకోగలుగుతారు.
హే మహాత్మా! ఈ యదువంశములో మీరు జనించి పంచవిశాధిక (125) సంవత్సరాలు
గడిచిపోయాయి. ప్రభూ! మీరు నిర్వర్తించసంకల్పించిన దైవకార్యమంతా సంపూర్ణమైనది.
ఇక కొద్ది కాలంలో కాలనియమానుసారం బ్రాహ్మణశాపమును అనుసరించి యదువంశం
వినాశనం కానున్నది! కాల చక్రానుసారం కలియుగం ప్రారంభంకానున్నది. అందుచేత..!
మీరు మాయొక్క ఈ విన్నపము ఉచితమేనని భావిస్తే, పరమధామమగు విష్ణులోకానికి
తిరిగి విచ్చేయండి. మీ సేవకులము మీచే కల్పించబడి వివిధ లోకములను
పాలించువారము అగు మమ్ములను ఇతఃపూర్వంలాగానే పరిపాలించండి! మీ రాకకై
విష్ణులోకాది ఊర్ధ్వలోక జనులంతా ఎంతగానో ఎదురు చూస్తూఉన్నారు. మీపట్ల
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
6

విరహంతో తపిస్తున్నారు. అందుచేత ఇంద్ర బ్రహ్మ రుద్ర లోకముల ద్వారా వేంచేసి
వైకుంఠధామం అలంకరించండి.
శ్రీకృష్ణుడు : ఓ విబుధేశ్వరా! సృష్టికర్తా! బ్రహ్మదేవా! మీరు చెప్పినట్లుగా ఈ కృష్ణావతారము
నిర్వర్తించవలసిన కార్యక్రమములన్నీ సంపూర్తి అయినట్లుగా నేనుకూడా భావిస్తున్నాను.
దేవతలు కోరుకున్నట్లు భూ భారమంతా అవసరమైనంత వరకు తొలగినది కదా!
అయితే మరొక్క చిన్న కార్యక్రమం మాత్రం ఇంకా మిగిలి ఉన్నది. ఇక్కడి ఈ
యాదవకులమంతా అప్రతిహతమగు వీర్య - శౌర్య జనులతో నిండివున్నది. వీరు తమ
ప్రతాపములచే గర్వించి భూమినంతా ఆక్రమించే అవేశ కావేశములు కలిగినవారై
ఉన్నారు. ఇన్నాళ్ళు వీరిని ఒక చెలియవికట్ట వలె ఆపి వుంచాను. ఈ యాదవవీరులను
సంహరించకుండా నేను విష్ణులోకం జేరటం జరిగితే, ఇక్కడి యదువీరులంతా హద్దులను
అతిక్రమించి బలగర్వంతో లోకములకు అశాంతిని కలిగించగలరు. అందుచేత
బ్రాహ్మణులు ఇచ్చిన శాపమును అనుసరిస్తూ దుష్టశిక్షణవిభాగమైనట్టి ఇక్కడి
యాదవవీరుల వినాశనమును ముగించుకొని బ్రహ్మ రుద్రలోకాలగుండా వైకుంఠధామం
చేరగలవాడను.
శ్రీకృష్ణుని చిరునవ్వుతో కూడిన పెదముల నుండి జారువారిన ఈ వాక్యములు ప్రశాంత
చిత్తముతో వినినవారై బ్రహ్మాది దేవతలు స్వామికి మరల ప్రణామములు సమర్పించి
తమ తమ లోకములకు మరలారు.
3. శ్రీ ఉద్ధవ - శ్రీకృష్ణ సమాగమం
-
ఆ తరువాత ద్వారకా నగరంలో అనేక అపశకునాలు, మహోత్పాతాలు కనిపించసాగాయి.
అది గమనించిన కొందరు ద్వారకానగర శ్రేష్ఠులు శ్రీకృష్ణుని సమీపించారు.
శ్రీకృష్ణుడు : ఓ యాదవకుల శ్రేష్ఠులారా! ద్వారకలో అనేక మహోత్పాతాలు జరుగుతూ
ఉండడం నేనూ గమనిస్తున్నాను. ఇదంతా బ్రాహ్మణశాపప్రభావం కాబోలు. మనలో
ఎవ్వరైనా తమ ప్రాణాలు రక్షించుకోదలచుకుంటే మాత్రం ఇక్కడ ఇంకా వుండటం
ఉచితం కాదని నాకు అనిపిస్తోంది.
ఇక ఆలస్యం చేయకూడదు. మీరంతా కూడా ప్రభాసక్షేత్రమునకు ఇప్పటికిప్పుడే
బయలుదేరి వెళ్ళటం మంచిది. ఆ క్షేత్రం పరమపవిత్రమైనదనే విషయం మీకు తెలుసు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
7

ఒకానొకప్పుడు దక్షప్రజాపతి శాపంచేత క్షయరోగమునకు గురి అయిన చంద్రుడు
ప్రభాసక్షేత్రం సందర్శించి, అక్కడి నదిలో స్నానం ఆచరించి రోగవిముక్తుడైనాడని,
కళాభివృద్ధిని పొందాడని మనమంతా వినియే వున్నాము కదా! మన యాదవకుల
జనులంతా ఆ ప్రభాసక్షేత్రం వెళ్ళి స్నానాదులు నిర్వర్తించెదరుగాక! దేవతలకు నివేదనలు,
పితృదేవతలకు తర్పణములు సమర్పించండి. అక్కడి ఉత్తమ బ్రాహ్మణులను పండితులను
ఆహ్వానించి సంతర్పణలు చేయండి. దక్షిణలు ఇచ్చి వారి ఆశీర్వాదం పొందండి. వారి
దయచేత, ఆశీర్వాద బలంచేత ఈ బ్రాహ్మణ శాప విపత్తు నుండి మిమ్ములను మీరు
రక్షించుకోవటానికి ఒకప్రయత్నం చేయటం ఉచితం!
శ్రీకృష్ణుని అభిప్రాయం విని అక్కడి పెద్దలంతా "అందరము పిల్ల-పాలతో సహా శ్రీకృష్ణుడు
చెప్పినట్లే ప్రభాసక్షేత్రం సందర్శిద్దాం!" అని నిర్ణయించుకొన్నారు. అప్పటికప్పుడే యాదవ
జనమంతా ప్రయాణానికి సన్నిద్ధులు కాసాగారు.
శ్రీ ఉద్ధవుడు శ్రీకృష్ణ నిత్య సేవా వ్రతుడు. ప్రకృతి వైపరీత్యాల గురించి శ్రీకృష్ణ సందేశము
విన్నాడు. యాదవ జనులంతా ప్రభాస తీర్ధానికి బయల్వెడలే ప్రయత్నంలో వుండటం
గమనించాడు. అప్పటికప్పుడు మందిరంలో ఏకాంతంగా శ్రీకృష్ణుని సమీపించి - శ్రీ
కృష్ణస్వామియొక్క చరణములకు నమస్కారములు సమర్పించాడు. చేతులు జోడించి
నిలుచుని ప్రార్థనా పూర్వకంగా మనస్సులోని మాటలను చెప్పసాగాడు.
4. పరతత్త్వాశ్రయం
ఉద్ధవుడు : హేకృష్ణా! దేవదేవేశా! పుణ్యశ్రవణ కీర్తనా! నీ లీలలు శ్రవణం చేయటంచేత
నిన్ను కీర్తించటంచేత జీవుడు పవిత్రత సంతరించుకోగలడు. నీవు పరమేశ్వరుడవే!
భగవన్ స్వయమ్! సర్వ శక్తిమంతుడవే! అట్టి నీవు మన యాదవులకు పెద్దలను
అవమానించడంచేత ప్రాప్తించిన బ్రాహ్మణ శాపము తొలగించలేవా? తప్పక తొలగించ
గలవు. అయినాకూడా ఎందుకో నీవు అట్లా చేయటం లేదు. సృష్టి-స్థితి-లయ లీలా
వినోదివగు నీవు ఈ యదు వంశనాశనం ఉద్దేశ్యించి ఉంటావని నేను అనుకుంటున్నాను.
ఈ కనబడేదంతా కూడా నీ యొక్క మాయా విశేష చమత్కారమే కదా! అయితే నాదొక
విన్నపం! మీరు త్వరలో విష్ణుధామం చేరనున్నారని నేను దేవతలు వచ్చినప్పుడు
గమనించాను.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
8

శ్లో॥ నాహం తవాంఘ్ర కమలం క్షణార్ధమపి, కేశవ!
త్యక్తుం సముత్సహే, నాథ! స్వధామనయ మామ పి॥ (అధ్యా 6 శ్లో 43)
నేనైతే నీ పాదపద్మములను వదలి అరక్షణం కూడా ఎక్కడా వుండలేను. నిలువలేను.
అందుచేత నాథా! నన్ను కూడా మీవెంట విష్ణుధామం అనుసరించనివ్వండి.
హే యదుభాషణా! పరమమంగళ ప్రదము-చెవులకు అమృతప్రాయము అగు నీ లీలలు,
వాటి అంతరార్థాలు పానము చేసినవాడు ఇక ఈ లౌకిక విషయాలు-వాటిని
సంబంధించిన విషయ వాసనలు అంటిపెట్టుకొని వుంటాడా? లేనే లేదు. మా
ఆత్మేశ్వరుడువు, మా ఆత్మ స్వరూపుడవు, మాకు అధికాధిక అత్యంత ప్రియుడవు అగు
నిన్ను నీ భక్తులమగు మేము పరుండినపుడు గాని, కూర్చున్నప్పుడుగాని, నడుస్తున్నపుడు
గానీ, స్నానం-భోజన-క్రీడాదులప్పుడుగాని - విడిచి వుండగలమా! లేనేలేదే!
ఓ శృంగార రత్నాకరా! బాల్యం నుండి ఇంతకాలమూ నిన్ను ఆశ్రయించాను. వెంటనంటి
వున్నాను. ఎందరెందరో భక్తులు నీకు పుష్పమాలలను సమర్పిస్తూ వుంటే... వాటిని
కొద్దిక్షణాలు నీవు ధరించి, ఇంతలోనే నా చేతులకు ఇస్తూ వుండేవాడివి. నేను వాటిని
ధరించి ఆనందిచే వాడిని. నీవు ధరించి త్యజించిన వస్త్రములను నేను మహాప్రసాద
పూర్వకంగా ధరిస్తూ వస్తున్నాను.
స్వామీ! మేము నీకు సంబంధించినవారము. నీకు చెందినవారము. నీవారము. నీవు
తినగా మిగిలిన తినుబండారాలను ఆప్యాయముగా తిని ఆనందించే మీ సేవకులం.
అందుచేత మీ మాయ మమ్ము బంధించదు. కొందరు మునులు, ఋషులు, తపోబల
సంపన్నులు, సన్యాసులు మొదలగువారు కఠోర నియమాలతో సాధనలు నిర్వర్తించి
బ్రహ్మలోకం చేరుచున్నారు.
ఇక మోమో? ఇక్కడు కర్మమార్గమున పడి ప్రపంచంలో తెలిసీ తెలియకుండా వెట్టిగా
పచార్లు చేస్తున్నాం.
అయితే ఏం? మీ భక్తజనంలో కలిసిపోయి, వారిలో ఒకరిమై నీకథలను గానం చేస్తూ
నిన్ను కీర్తిస్తూ వున్నాము. లీలామానుష విగ్రహుడవగు నీ స్వరూపమును,
సంచారములను, నీ అవతార క్రియా పరంపరలను, హాస్యభరిత సంభాషణలను,
పరిహాసములను, ఉపదేశములను, మర్మగర్భబోధలను స్మరించుకుంటూ వుంటున్నాం.
మిమ్ములనే కీర్తిస్తూ కాలం గడుపుచున్నాం. అందుచేత ఈ సంసార దుఃఖమంటే మేము
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
9

ఏమాత్రం భయపడటం లేదు. మీ అవతార విశేషములను చెప్పుకుంటూ సులభంగా
సంసారసముద్రాన్ని దాటివేయగలం. అందుచేత మద్గురువగు నిన్ను అనుసరిస్తాను.
కాల దేవతకు ఇక ఈ భౌతిక దేహమును సమర్పిస్తాను. ఏ కాల చమత్కారంచేత
జలంలో బుడగవలె ఇది బయల్వెడలిందో ఆ కాలదేవత ఇచ్ఛానుసారం ఏది ఎట్లో
అట్లే అగుగాక!
శ్రీకృష్ణుడు : ప్రియ మిత్రమా! మహాభాగా! ఉద్ధవా! నీవు చెప్పినట్లు నేను అనుకుంటున్న
మాట వాస్తవమే! బ్రహ్మదేవుడు, రుద్రభగవానుడు మొదలైన లోకపాలకులు నాయొక్క
విష్ణులోక పునరాగమనాన్ని వాంఛిస్తున్నారు. దేవతలు ఇతఃపూర్వం నన్ను కోరినట్లుగా
దైవకార్యమంతా పూర్తి అయింది. వారు కోరుటచేతనే నేను, అన్న బలరామునితో
కూడి భూమిపై అవతరించటం జరిగింది.
ఇక ఇప్పటి విషయానికివస్తే.... మన ఈ యదుకులం బ్రాహ్మణశాపాగ్నికి దగ్ధంకావడం
ఇప్పటికే జరిగిపోయింది. ఇక తదనుసారంగా దృశ్యపరంగా పరస్పర వివాదములు
మిషచే వినష్టం కానున్నది. నేటి నుండి 7వరోజుకు ఈ ద్వారకను సముద్రజలం
ముంచివేయబోతోంది. నేను అవతారమును చాలించిన మరుక్షణం కొన్ని మంగళ
ప్రదమగు విశిష్టవిశేషాలు కాలనియమానుసారం భూలోకమును వీడనున్నాయి.
తదనుగతంగా కొద్దిరోజులలో కలియుగం ప్రవేశించబోతోంది. కలియుగంలో
అధికమంది జనులు అధర్మవిషయాలపట్ల అధికమైన అభిరుచికలిగినవారై వుంటారు.
అందుచేత నా అవతార పరిసమాప్తి తరువాత అనేక ప్రదేశాలు నీవంటి పుణ్యస్వభావ
కోమల-సహృదయుల నివాసమునకు యోగ్యమై వుండవు.
ఉద్ధవుడు : స్వామీ! రాబోయే కలియుగం గురించి, జనుల అధర్మ ప్రవృత్తుల గురించి
పురాణ ద్రష్టల వద్ద నేను చూచాయగా విన్నాను. అందుకే మీ అవతారమును స్మరిస్తూ
మీతో వైకుంఠానికి అనుసరించటానికి అనుజ్ఞను వేడుకుంటున్నాను.
శ్రీకృష్ణుడు :వృద్ధవా! నీవు నేను కూడా కాలనియమానుసారమే వర్తించవలసియున్నది
సుమా! అందుచేత నీవు నీకు ప్రసాదితమైన ఆయుఃపరిమాణంతో ఈభూమిపై మరికొంత
కాలం కొనసాగించ వలసియున్నది.
ఉద్ధవుడు: అట్లాగా? అయితే ఇప్పుడు నాకు కర్తవ్య - అకర్తవ్యలేమిటో విశదపరచప్రార్థన!
నావారైన యాదవులు అదిగో, వెళ్ళిపోతున్నారు కదా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
10

శ్రీకృష్ణుడు : ఇక ఇప్పుడు, నా వారు నా బంధువులు నాకు స్వజనులు నా స్నేహితులు
-నాకు ఆత్మీయులైనవారు - ఇత్యాది పరిమిత దృష్టులను అధిగమించిన వాడవై వుండు.
శ్లో త్వం తు సర్వం పరిత్యజ్య స్నేహం స్వజన-బంధుషు
మయ్యావేశ్య మనః సమ్యక్ సమదృక్ విచరస్వగామ్ || (అధ్యా 7, శ్లో 6)
సర్వే సర్వత్రా సమదృష్టిని పెంపొందించుకొని సర్వతత్త్వస్వరూపుడనగు నాపై నీ
మనస్సంతా నిలుపుకొని ఉండు. సమ్యక్ (ఒకే పరమాత్మయొక్క వివిధ రూపములుగా)
భావనను ఆశ్రయించుకొని ఉండు.
శ్లో॥ యత్ ఇదం మనసా వాచా - చక్షుర్భ్యాం - శ్రవణాదిభిః
నశ్వరం గృహ్యమాణం చ విద్ది మాయామనోమయమ్ || (అధ్యా 7, శ్లో 7)
నీయొక్క మనస్సుకు, వాక్కుకు, కళ్ళకు, చెవులకు విషయములై తారసపడేదంతా కూడా...
1. నశ్వరము (Not Permanent)
2. మాయామనోకల్పితము (Created by own illusionary thought)
గా గ్రహించినవాడవై వాటన్నిటిపట్ల చిరునవ్వుతో కూడిన మౌనము వహించి ఉండు.
ఎవరి మనో చిత్తములైతే (Thought and Interests) చంచలంగాను, అశాంతముగాను,
అయుక్తము (Unbalanced) గాను వుంటాయో అట్టివారికి మాత్రమే ఈ దృశ్యజగత్తులో
నానావస్తు విభ్రమమంతా (వారు వీరు వారి వారు నా వారు నీ వారు-ప్రియముఅప్రియము-శుభము-అశుభము, ఇత్యాది భ్రమానుభవములన్నీ) సత్యము
నిత్యమువలె అనుభవమౌతూ ఉంటాయి. అట్టి చంచలమైన అనుభూతమంతా గుణ
దోషములచేతనే ఏర్పడుతోంది. తద్వారా
1. కర్మ (నేను నిర్వర్తించగలుగుచున్న క్రియలు) (Dos)
2. అకర్మ (నేను నిర్వర్తించలేకపోతున్న క్రియలు) (Dont's)
3. వికర్మ (నేను నిర్వర్తించకూడని క్రియలు) (Wrong doings)
అనే భ్రమలు మనోవృత్తుల రూపంగా ఉదయిస్తున్నాయి.
అందుచేత ఓ ఉద్ధవా!
1. మొట్టమొదట నీవు నీ ఈ ఇంద్రియములను శాస్త్రాలు సూచిస్తున్న సాధన
రూపములైన ఉపాయములలో నియమించు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
11

2. క్రమంగా దృష్టులను పవిత్రం చేసుకుంటూ ఇంద్రియములను వశం చేసుకో...
3. క్రమక్రమంగా నీ దృశ్యసంబంధమైన (శబ్ద స్పర్శ - రూప - రస -గంధ
సంబంధమైనవి) చిత్త వృత్తులను క్రమబద్ధం చేసుకుంటూ వాటిని నిరోధించటం
అలవరచుకో.
4. నాకు ఎదురుగా కనబడుతూ అనుభూతమగుచున్న ఈ జగదనుభవమంతా ఆత్మయందేఆత్మకు అభిన్నమై ఉన్నది అను ఉత్తమ దృష్టిని పరిపుష్టం చేసుకుంటూ ఉండు.
5. అటుపై ఆత్మ పరమాత్మయందే అభిన్నరూపంగా ఉన్నది కదా - అనే అవగాహనను,
తద్భావనను పెంపొందించుకో!
6. నీవు నన్ను పరమాత్మ తత్త్వంగా గ్రహించి ఉపాసించు.
ఈవిధంగా నీ పరిమిత దృష్టులపై యుద్ధం ప్రకటించి జయించు. "కనబడేదంతా
ఆత్మయందు శ్రీకృష్ణ పరమాత్మయందు అభిన్నరూపమై ఉన్నాయి". - అని గ్రహించిన
తరువాత ఇక నీవు కోల్పోయిన దెక్కడుంటుంది? ఏమున్నది? క్రమంగా నీ యొక్క
1. నిశ్చయజ్ఞానము, 2. విజ్ఞానము - అనుభవజ్ఞానము పవిత్రమై నిశ్చలత్వము -
పరమ పవిత్రత్వము సంతరించుకొనునుగాక!
భౌతిక దేహిత్వమును అధిగమించి నేను ఆత్మస్వరూపడను కదా! ఈ జగత్తు
నాయందున్నది. అంతేగాని, నేను జగత్తులో వుండటమేమిటి?... అనే అవగాహనతో
జీవాత్మత్వమునకు ఆవల వున్న పరమాత్మత్వమును సంతరించుకో! అప్పుడు జగత్తుతత్ జనితమైన విఘ్నములు నీపట్ల వుండవు. కనిపించవు. (లేక) స్వభావ సిద్ధంగా
అధిగమించబడతాయి. అప్పుడు ఆత్మానుభవతుష్టాత్ముడవే నీవు. అనగా, ఆత్మాను
భవముచే సంతుష్టుడువై వుంటావు. సంసారమును జయించటం అంటే - దృశ్య-ద్రష్ట
రూపములగు జగత్-జీవాత్మలు నా పరమాత్మతత్వమునందలి అంతర్విభాగ కల్పిత
(అభిన్న) చమత్కారములే కదా అను అవగాహనతో ఒకానొక సంతృప్తిని, సమగ్రత్వమును
సంపూర్ణత్వమును సంతరించుకోవటమే సుమా!
ఉద్ధవుడు : హే జగద్గురూ! అట్టి పరమాత్మావగాహన సంతరించుకొన్నవాడు ఇక
విహిత అవిహిత కర్మలను నిర్వర్తిస్తాడా? త్యజిస్తాడా?
శ్రీకృష్ణ పరమాత్మ :
శ్లో దోషబుద్ధోభయాతీతో నిషేథాత్ న నివర్తతే
గుణబుద్ధ్యా చ విహితం న కరోతి యథా అర్భకః॥ (అధ్యా 7, శ్లో 11)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
12

శ్రీకృష్ణుడు : చిన్న పిల్లవాడికి ఇది పాపం! చేయకూడదు. ఇది పుణ్యం! చేయాలి
ఇటువంటివి ఏమైనా ఉంటాయా? అటువంటివేమీ లేకుండానే ఒక క్రీడలాగా
ఆడుకోవడం మొదలైన ఆయా బాలాలీలా వినోదాలు ప్రదర్శిస్తాడు కదా! అట్లాగే
ఆత్మానుభవతుష్టాత్ముడు కూడా...! అతనిపట్ల విహితములు-నిషేధములు అనే
ప్రతిపాదనలు అపాదించబడజాలవు.
గుణబుద్ధితో విహితములను అనువర్తించటం వుండదు. దోషబుద్ధి - భయములతో
నిషేధములనుండి విరమించటము వుండదు. లౌకిక విశేషములైన శాస్త్ర నిర్దేశములైన
విహిత-అవిహిత, విధి-నిషేధములు ఆతని ఆత్మదృష్టికి విఘాతం కలిగించలేవు. ఆతని
ఆత్మదృష్టి ఆ రెండింటినీ అధిగమించినదై వుంటుంది. ఆత్మదృష్టికి ఇదంతా వినోదమేగాని
విషాదం కాదు.
మిత్రమా! ఉద్ధవా! పరమాత్మను ఆశ్రయించువాడు ఈ విశ్వమంతా నా స్వరూపంగా
గమనిస్తాడు. సర్వసహజీవులను పరమాత్మస్వరూపంగా సందర్శిస్తూ జ్ఞాన విజ్ఞాన
పూర్వకంగా సునిశ్చయుడై వుంటాడు. ఎక్కడెక్కడ ఏంచేస్తున్నా - చేయకున్నా.. నా
చుట్టూ తనతో సహా పరమాత్మ ప్రదర్శనాచమత్కారమే కదా! - అని నన్ను అర్థం
చేసుకొన్నవాడై వుంటాడు. సర్వ జీవుల పట్ల స్వభావసిద్ధంగా సుహృత్ స్వభావుడై
మెలగుతాడు. మరల అట్టివాడు భౌతిక దృష్టికి - ద్వితీయత్వానికి దిగిరాడు. సర్వదా
అద్వితీయత్వం ఆస్వాదిస్తూ వుంటాడు.
5. ఆత్మైవహి సద్గురుః
ఉద్ధవుడు:
శ్లో యోగేశ! యోగవిన్యాస ! యోగాత్మన్! యోగసంభవ!
నిశ్రేయసాయ మే ప్రోక్తః త్యాగః - సన్యాసలక్షణః || (అధ్యా 7, శ్లో 14)
హే యోగీశ్వరా! యోగాధారా! మిమ్ములను ఆశ్రయించినట్టి మా వంటి ఆశ్రితుల
క్షేమము కొరకై సన్యాసరూప త్యాగము గురించి ఉపదేశించండి. ఎందుకంటారా?
సర్వాత్మకుడవగు నీ పట్ల పూర్ణభక్తిని మా బుద్ధి సంతరించుకోనంతవరకూ మేము
మా దృశ్య విషయాభిలాషకు బద్ధులమై మా ఈ బ్రతుకులను కొనసాగిస్తూనే
వుంటున్నాము. విషయాభిలాష ఉన్నంతవరకు దృశ్య విషయములపట్ల కోరికలను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
13

త్యజించలేము. కోరికలు కొనసాగుచున్నంత వరకు భగవత్-విముఖత్వం వదలదు.
సో హమ్ మమాహమ్ ఇతి మూఢ మతిః విగాఢః
త్వన్మాయయా విరచితాత్మని సానుబంధే
తత్త్వంజసా నిగదితం భగతా యథా హమ్
సంసాధయామి భగవన్! అనుశాధి భృత్యమ్ || (అధ్యా 7, శ్లో 16)
స్వామీ! నీ మాయచే రచించబడిన పుత్ర-మిత్ర - కళత్ర - ఇత్యాది విషయములపట్ల
నేను నాది అనే గాఢమైన విమూఢత్వముచే మేము ఆవరించబడి, ఇరుక్కొని ఉన్నాము.
అందుచేత నీవు ఇప్పుడు ఉపదేశించిన "జగత్తును జయించటం జీవాత్మను
అధిగమించటం పరమాత్మత్వము సంతరించుకోవటం" అనే మార్గంలో మేము
ప్రయాణించలేక పోతున్నాం. నేను దృశ్యములో మగ్నుడనై - మూఢుడనైన ఇక నాకు
త్రోవ తెలియటం లేదు. ఈ ప్రాపంచక విషయాలు నేను ఎప్పుడు పట్టుకొన్ననో నాకే
తెలియదు గాని, ఇప్పుడు మాత్రం వదలలేక పోతున్నాను. ఇదంతా - ఆత్మయందు
ఆత్మగా దర్శించటం - ఎట్లాగో అర్థం కావటం లేదు. అందుచేత నీకు భృత్యుడనై నిన్నే
ఆశ్రయిస్తున్నాను.
ఈ జగత్తును జగత్తుగా త్యజించి ఆత్మ స్వరూపముగా సందర్శించటమెట్లా?
హే శ్రీ కృష్ణప్రభూ!
నీవు భూత - భవిష్యత్ - వర్తమాన విభాగములతో కూడిన కాలముచే స్పృశించబడని
నిత్యసత్యస్వరూపుడవు! సర్వప్రకాశకుడవు ! స్వయంప్రకాశకుడవు ! జన్మజన్మల
సుకృతంచేత మీ సామిప్యత లభించింది. నాకు ఆత్మతత్త్వము తెలియజేయగలవారు
నీకన్నా మరెవ్వరు సమర్ధులు? ఎందుకంటే, మీరు మాయకు యాజమానులు! బ్రహ్మాది
దేవతాశ్రేష్ఠులుకూడా మీ మాయకు వశులై దేహము పుత్రులు మొదలైన విషయములు
పరమార్ధములుగా భావిస్తున్నారు. ఇక నేనెంతటి వాడిని చెప్పండి? ఇదంతా గమనిస్తున్న
నా ధైర్యమంతా నిర్వీర్యం (Mild and stoic) అవటం జరుగుతోంది. దుఃఖము
విరాగము నన్ను కమ్మివేస్తున్నాయి. అందుచేత సర్వజ్ఞుడవు, సర్వ శక్తి మంతుడవు,
వైకుంఠవాసివి, దేశ-కాలములచే పరిమితము కానివాడవు, సర్వజీవులకు హితుడవు,
నరసఖుడవు అగు నిన్ను శరణువేడుచున్నాము.
శ్రీకృష్ణుడు: ఓ ఉద్ధవా! ఈ జీవుడు బద్ధుడు అవటానికి విషయవాసలేకారణం సుమా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
14

అట్టి విషయవాసనలు చిత్తము యొక్క అంతరమున దట్టముగా వ్యాపించి ఉపాధి
పరంపరలు అనే భ్రమలకు కారణమగుచున్నాయి. అందుచేత వివేకిఅయినవాడు
తత్త్వవిచారణచేతను, వివేకముతో కూడినబుద్ధిచేతను తనను తాను విషయవాసనల
నుండి సముద్ధరించుకోవాలి. మానవుడైనవాడు తన బుద్ధిచే విచారణకు ఉపక్రమించాలి.
ఈ జీవుడు ప్రత్యక్ష - అనుమానముల ద్వారా తనకు ఏది హితమో, ఏది అహితమో
నిర్ణయించుకోవటానికి సముర్ధుడే! అయితే, వివేకముతో కూడి బుద్ధితో వివేచన చేసి
ఆత్మదృష్టిని అభ్యసించి అలవరచుకొంటేనే ఆత్మవిద్య లభిస్తుంది.
శ్లో॥ ఆత్మనో గురుః ఆత్మైవ పురుషస్య విశేషతః
యత్ ప్రత్యక్ష-అనుమానాభ్యాం శ్రేయో సావను విన్దతే (అధ్యా 7, శ్లో 20)
II
ఈ జీవునకు వాస్తవమైన గురువు ఆతని ఆత్మయే! నేను సర్వ జీవుల ఆత్మస్వరూపుడను.
అది గ్రహించిన సాంఖ్యయోగ విశారదులగు ధీరులు నిర్మలము - సుతీక్షణము
విశాలము అగు బుద్ధిని పెంపొందించుకొని వర్తమాన జన్మయందే నన్ను సంపూర్ణసమగ్ర ప్రకటనపూర్వకంగా సందర్శిస్తున్నారు. సర్వాత్మత్వానందమును పుణికి
పుచ్చుకుంటున్నారు.
ఓ ఉద్దవా! నేను ఒకటి - రెండు - నాలుగు అనేక పాదములతో కూడిన అనేక
జీవజాతునెన్నిటినో సృష్టించాను. వాటిన్నింటిలో మానవ జన్మ ఉత్కృష్టమైనది. ఇది
ఎంతగానో పురుషార్ధ సాధకమైనది సుమా!.
వాస్తవానికి నా స్వరూపము ప్రత్యక్షము కాదు - పరోక్షము కాదు. అట్టి నా అపరోక్ష
ఆత్మతత్త్వ స్వరూపం ఈ మానవ దేహులు తమ బుద్ధి కౌశలంతో అనుమానము అనే
అన్వేషణ సహాయంతో తప్పక గ్రహించగలుగుతారు.
కాబట్టి నన్ను నీ ఆత్మ స్వరూపంగా గ్రహించు. అట్టి ఆత్మతత్త్వమునందే విద్య
మానమైయుంటున్న జాగృత్ - స్వప్న - సుషుప్త జగత్తులు - కవియొక్క యోచనలోని
కల్పిత కధా సంఘటనలవలె - భావనామాత్రమై కన్పిస్తున్నాయి. వాస్తవానికి జన్మ -
మరణముల మధ్య స్ఫురించేదంతా జ్ఞానాన్వేషకునకు జ్ఞాన సాధనా రూపమే! గురువు
వంటిదే స్వస్వరూపము. స్వస్వరూపమే సర్వమునకు ఆధారము, సర్వ స్వరూపము
కూడా! స్వస్వరూపమే సద్గురువ, సత్ శాస్త్రము కూడా!
అట్లాగే ఈ దృశ్యజగత్తు కూడా పాఠ్యాంశమే! గురువే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
15

ఈ విషయం నిరూపిస్తూ యాదవుల వంశ ఆది పురుషుడు, వివేకి, భయరహితుడు
యయాతినందనుడు అగు యదుమహారాజుకు - ఒకానొక అవధూతకు మధ్య జరిగిన
సంవాదమును చెప్పుతాను. విను!.
6. అవధూత యదు సంవాదము
శ్రీ కృష్ణుడు: ఓ ఉద్ధవా! బాల్యంలో పెద్దల దగ్గర మనం విన్న యదుమహారాజుకు అవధూతకు
జరిగిన సంభాషణను పునశ్చరణ చేసుకుంటున్నాం. సావధానంగా శ్రద్ధగా విను.
ధర్మజ్ఞుడగు యదుమహారాజు ఒకానొకరోజు యువకుడగు ఒకానొక అవధూతను ఇంటికి
ఆహ్వానించి, ఉచిత మర్యాదలను సమర్పించి ఇట్లా ప్రశ్నించారు.
యదుమహారాజు: ఓ యువకుడా! మేము యజ్ఞ యాగాది కార్యక్రమములను,
అనుష్ఠానపూర్వకమై ఏవేవో సత్కర్మలను సుదీర్ఘకాలంగా నిర్వర్తిస్తున్నాము. ఇక మీరో?
ఎటువంటి సుదీర్ఘకాల అనుష్ఠానములను, ఆయా శాస్త్రములు చెప్పు యజ్ఞ యాగాలను,
సాధనములను నిర్వర్తిస్తున్నట్లు మాకు కనిపించటంలేదు. ఆయినప్పటికీ ఆత్మజ్ఞాన
పాండిత్యము సముపార్జించినట్లు గుర్తుగా తృప్తి - సంతోషములతో కనిపిస్తున్నారు. మీ
బుద్ధిబలముతో సర్వ ఇంద్రియ విషయములను అధిగమించివేసినట్లుగా మీ
చంద్రహాసముఖకవళికలు చూస్తుంటే నాకు అనిపిస్తోంది.
లోకంలో జనులనేకులు ధర్మ - అర్ధ - కామముల కొరకై ఆయుష్షును - యశస్సును
- ఐశ్వర్యమును కోరి ప్రవర్తిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే ఆత్మతత్త్వ జిజ్ఞాసువులై
వర్తిస్తున్నారు. మీరు చూస్తే యువకులు. దక్షత గలవారు. సుందరమైన రూపంతో
వెలుగొందుచున్నారు. అమృత ప్రాయమైన సంభాషణాచాతుర్యం మీలో కనిపిస్తోంది
అయితే ఏసాధనా పరంపరల సంబంధమైన కర్మలూ మీరు చేస్తున్నట్లు కనిపించటం
లేదేం? ఒక జడునివలె, ఒక మత్తుని వలె సర్వలౌకిక - శాస్త్ర విహిత కార్యక్రమములు
నిరిసించి లౌకిక పారలౌకిక మైనవేవీ కోరకుండా పిశాచంవలె ఊరికే లోక సంచారాలు
చేసున్నట్లున్నారు. అయినాకూడా ఆత్మతృప్తి సంపన్నులై కనిపిస్తున్నారే! ఎందుచేత?
అది అట్లా ఉంచండి!
లోకంలో అనేక మంది జీవులు కామము - లోభము అనే రెండు భయంకరమైన అగ్ని
శిఖలచే నిరంతరము దహించబడుచు అధైర్యము - నిరుత్సాహము - ఆవేదన - ఏదో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
16

చెప్పరాని భయము - రేపటి గురించి దిగులు ఏదో అసంతృప్తి - ని స్పృహలతో
జీవితాలు గడపుచున్నారు. ఇక మీరో... ఆనందైశ్వర్యంతో లక్ష్మీదేవి తాండవిస్తున్న
ప్రశాంత-పూర్ణత్వములతో కూడిన ముఖకవళికలతో ఈ భూమిపై నిశ్చింతగా
సంచరిస్తున్నారే! గంగలో స్నానం చేస్తున్న తెల్ల ఏనుగులాగా సంతాపరహితులై
కనిపిస్తున్నారే! మీ వద్ద సంపద లేదు. భార్య పుత్రులు - ఆప్తులు ఇటువంటివేవీ (నా
వారు అనునది) మీ వద్ద కనిపించటం లేదు. అయితేకూడా ఏం? ఏ లోటు
ఏమాత్రము లేనివారై వేదాంతసిద్ధాంత భూషితులైనట్లుగా పరమానందంగా
విహరిస్తున్నారే? ఇట్టి అనిర్వచనీయ ఆనందం మీరు ఎట్లా అనుభవించగలుగుచున్నారు?
ఇది నాకు తెలుసుకోవాలని ఉన్నది.
గురువు లేకుంటే గురి లభించదని, తత్త్వజ్ఞానానికి అర్హత సంపాదించుకోలేమని లోక
ప్రతీతి - లోక నానుడి కదా! మీరు ఏ గురువును ఆశ్రయించి లోక వ్యవహారమున్నింటికీ
అప్రమేయత్వమును, అతీతత్వమును సముపార్జించుకొని ఈ భూమిపై క్రీడా
మైదానమువలె లీలగా, ఆనందంగా విహరించగలుగుచున్నారు? అట్టి మీ ఆధ్యాత్మిక
అవగాహన యొక్క రహస్య మేమిటో విశదపరచవలసినదిగా ప్రార్ధిస్తున్నాను.
7. 24 మంది గురువులు
అవధూత ద్విజుడు: ఓ యదుమహారాజా!
శ్లో సంతి మే గురవో రాజన్! బహవో బుద్ధ్యుపాశ్రితాః
యతో బుద్ధిమ్ ఉపాదాయ ముక్తో9 టామి ఇహ - తాన్ శృణు|| (అధ్యా 7, శ్లో 32)
-
నేను తెలియవలసినది తెలుసుకోవాలి - అని నా బుద్ధిని ప్రేరేపించాను. అట్టి వివేచనతో
కూడిన విద్యార్ధిబుద్ధితో దశదిశల అనేక విశేషములను ప్రకృతిలో గమనిస్తూ శిష్యత్వాన్ని
ధారణ చేశాను. (I took the stance of wondering student). నాయొక్క
లోకసంచారంలో నాకు 24 మంది మార్గదర్శకులై ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్త్వము, తత్త్వజ్ఞానార్ధ
దర్శనము అనే సుమధుర సుగంధపుష్పాలు వెల్లివిరిసే పూతోట వైపుగా నడిపిస్తున్నారు.
అట్టి నాకు మార్గం చూపే గురువులు ఎవ్వరో వినండి.
1. భూమి, 2. గాలి, 3. ఆకాశము, 4. జలము, 5. అగ్ని, 6. చంద్రుడు, 7.
సూర్యుడు, 8.పావురము, 9. అజగరము (కొండశిలువ), 10. సముద్రము, 11.పతంగము
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
17

(మిడుత), 12.తేనెటీగ, 13. ఏనుగు, 14. తేనెతుట్టెను పిండి తేనెను గ్రహిస్తున్న బోయవాడు,
15. హరితము (జింక), 16. చేప, 17. పింగళ అనే పేరు గల ఒక వేశ్య, 18.
లకుముకిపిట్ట(కురరపక్షి), 19. బాలుడు, 20. కుమారి (కన్య), 21. బాణమును
తయారుచేయువాడు 22. పాము, 23. సాలెపురుగు 24. భ్రమరకీటకము.
ఈ 24 మంది తమ తమ నడవడికలను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క ముఖ్యవిశేషాన్ని
నేను నేర్చుకోవటానికి తెలుసుకోవటానికి కారణ భూతులైనారు. అందుచేత ఈ
24 మందిని గురువులుగా భావించి జ్ఞానమును సముపార్జించి ఈ లోకంలో లీలగా
క్రీడగా సంచరించటం కొనసాగిస్తున్నాను.
యదుమహారాజు: ఓ మహానుభావా! మీరు చెప్పేది ఆశ్చర్యంగా వున్నది. లోకంలో
గురువు అంటే వేదమో - మంత్రమో - వేదాంతార్థమో - శాస్త్రమో బోధించేవాడని
అందరమూ అనుకుంటూ వుంటాము. మీరు చెప్పిన 24 విశేషాలను అందరము అన్ని
చోట్లనో, ఆయాచోట్లనో చూస్తూనే వుంటాము. వాటి వాటి నుండి నేర్చుకోవలసినది -
తెలుసుకోవలసినది ఏమి ఉన్నదో మేము ఎప్పుడూ గమనించటం లేదు. మాకు అట్లా
తోచటమూలేదు. మాపై కనికరించి, మీరు వారి దగ్గర ఏమేమి గమనించి మీ
మోక్షానందానికి - జ్ఞానానందానికి అధ్యాత్మిక మార్గసుగమనానికి ఉపకరణాలుగా
తీర్చి దిద్దుకున్నారో ... నాకు వినాలని ఉన్నది.
ఆశ - నిరాశల మధ్య కొట్టు మిట్టాడే మాకు ప్రకృతి నుండి నేరువవలసిన పాఠ్యాంశాలు
-
విశదపరచవలసినదిగా ప్రార్ధిస్తున్నాను.
అవధూత: ఓ యయాతి నందనా! యదు మహారాజా! ఆ 24 రిలో ఎవరెవరి నుండి
ఏఏ జ్ఞాన విశేషాలు నేర్చుకొని హృదయస్థం ఏ తీరుగా చేసుకున్నానో విశదీకరిస్తాను.
శ్రద్ధగా వినండి.
1వ గురువు: భూమి
ఏదైనా ఒక ధర్మ మార్గమో - సాధనయో ప్రారంభించామనుకో, ఎవ్వరో ఏదో అన్నారు
కదా? నేను ఈ కర్తవ్యాన్ని (లేక) ధర్మాన్ని (లేక) సాధనను విరమిస్తాను. వారు ఆ
మాటలు అనుకుంటూ (లేక) అంటూ వుంటే నేనెందుకు కొనసాగించటం?... అని
పట్టుదలను సడలించటం, కార్యక్రమం నుండి వెనుతిరగటం సామాన్యంగా లోకంలో
జరుగుతోంది. అయితే, ఫలితం? సహిష్టత (లేక) తితిక్ష (Forbearence
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
18

Tolerence) తరగటంచేత తత్త్వజ్ఞాన - విజ్ఞాన మార్గం నుండి మనం వెనుకడుగు
వేస్తున్నాము. వెనుకకు తిరుగుచున్నాము. కానీ ఈ భూమియో? ప్రాణుల పాదములచే
త్రొక్క బడుతోంది. త్రవ్వబడుతోంది. కాల్చబడుతోంది. అయినా సరే! సూర్యుని నుండి
సంపాదించుకుని తనలో ప్రక్షిప్తం చేసుకున్న ఓజోశక్తిని ప్రాణుల ఆహారం కొరకై
సమర్పిస్తూ తన స్వధర్మాన్ని - జీవుల పట్ల అవ్యాజమైన ప్రేమను, ప్రతి ఫలాపేక్షా,
రహితమైన వాత్సల్యమును కొనసాగిస్తోంది! తనలోని జలమును జీవులకు ప్రేమతో
ప్రసాదిస్తోంది.
అట్లాగే నేను కూడా దుఃఖ సంఘటనలను సహించటం, దైవాధీనంగా ఏర్పడే పరుల
పీడనం చూస్తూ కూడా... అప్రతిహతమైన - అవ్యాజమైన - అఫలాపేక్షతో కూడిన
వాత్సల్యం స్వభావంగా పెంపొందించుకోవటం ప్రారంభించాను. భూమాత వలె తదితర
సర్వజీవుల పట్ల నేను వీరికి ఏమి ఇవ్వగలను? ఏమి మంచి చేయగలను? ... అను
ఒకానొక సహజమైన త్యాగనిరతితో కూడిన బుద్ధిని అంతరంగంలో కలిగియుండి,
పరిపోషించుకోసాగాను.
పర్వతము భూమిలో పాతుకొని ఉంటుంది. వృక్షములో, నేల గర్భంలో వ్రేళ్ళు కలిగి
వుంటాయి. అందుచేతనే కాబోలు.. పర్వతములకు వృక్షములకు అంతటి పరోపకారబుద్ధి!
పర్వతములోని పరోపకారవృత్తిని, వృక్షములోని పరులకు నీడ - ఆహారము నివాసము
సమర్పించే వృత్తిని చూసి, ఆహా! భూదేవత ప్రసాదంగా మానవదేహంతో పుట్టి ప్రకృతిచే
బుద్ధి ప్రసాదించబడి.. నేను భూమాతవలె తోటి జీవులను సంతోష పెట్టడం శ్రేయో
దాయకం కదా! ఈ శరీరము తదితర జీవుల సమర్పణచే పరిపోషించబడుచుండగా,
పరులకు శుభప్రదంగా జీవించటం కనీసధర్మం కదా!... అని నేర్చుకోసాగాను.(ఉత్తమే
శిఖరే జాతే భూమ్యాం, పర్వతమూర్ధనీ! నమో నమః)
2వ గురువు: వాయువు ప్రాణవాయువులు
ప్రాణశక్తి శరీరమంతా సంచరిస్తూ అన్నరసాన్ని ఇంద్రియములకు అందిస్తూ, తాను ఆ
ఇంద్రియముల విషయానుభవముల పట్ల ఎట్టి అపేక్ష కలిగి వుండదు. పుష్పములపై
ప్రసరిస్తూ వాయువు గంధమును జీవులకు అందజేస్తూ గంధమును మోస్తూ, తాను
ఏమీ స్వీకరించకుండా జీవరాసులు ముక్కు పుటములకు అందిస్తూ వుంటుంది. ఆనందం
కలుగజేస్తూ ఉంటుంది. తానుమాత్రం సుగంధమును గాని దుర్గంధమునుగాని పొందక
సర్వదా వేరుగా వుంటుంది. అప్రమేయమై-పరమై ఉంటోంది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
19

అట్లాగే...
నేను కూడా వాక్ - మనస్సుల ప్రాపంచక ధర్మములచే స్పృశించబడకుండెదను
గాక! నా జ్ఞానము అతీతత్వమును - సహజ అప్రమేయత్వములను ధారణ చేయును
గాక!... అని వాయువునుంచి నేర్చుకొనసాగాను. ఇంద్రియ విషయముల యొక్క ప్రియ -
అప్రియుత్వములచే నా జ్ఞానము - భావన-అనుభవావేశ రూపంగా స్పృశించబడకుండా,
దోషము పొందకుండా జాగరూకుడనై వుండటం అభ్యసించసాగాను.
వింజామరలచే (విసనికర్రలచే) తాడనం పొందుతూ, వాయువు వారికి వీరికి తన
కదలికలచే ఆహ్లాదం కలుగజేస్తోందే!
వాయువు దేహంతో ప్రవేశించి ఆయా దేహ విభాగములలో సంచరిస్తూ కూడా ఆసక్తి
(Attachment) పొందదు! గదిలో ప్రవేశించిన గాలి వస్తువుల రూపంగా మారుతుందా?
ఈ పార్ధివ దేహం (Material Body) బాల్య-యౌవన-వార్ధక్య- మరణాలు
పొందుచున్నప్పటికీ, దేహంలో ప్రవేశించినట్టి నేను అట్లాగే (వాయుదేవునిలాగానే)
దేహ ధర్మములను పొందనివాడనై వుండటం అలవరచుకోసాగాను. బ్రహ్మ స్వరూపాత్మ
భావనను వాయువు నుండి నేర్చుకొని క్రమంగా ఈ దేహ మంతా ఆత్మ స్వరూపముతో
నింపివేస్తున్నాను. అట్లా ఈ దృశ్యమంతటినీ, దృశ్యాంతర్గతులగు సర్వ జీవరాసుల
దేహములను ఆత్మస్వరూప భావనలో ముంచి ఆత్మతో ఏకము చేసి వేయసాగాను.
(నమస్తే వాయుః! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మా సి!)
3వ గురువు: ఆకాశము
ఆకాశము అంతటా ఏర్పడినదై వుండి వుంటోంది. స్థావర - జంగమములలో (On
the moving and Non moving aspects) వ్యాపించి వుంటూనే ఆసంగము (NonAttached, Non Partitioned, Non Divisible) గా వుంటోంది. ఒక ప్రదేశంలో
(in a space) ఇల్లు కట్టబడవచ్చు. ఆ ప్రదేశము ఇల్లుగా మారుతోందా? ఆ ఇల్లు
కూలినప్పుడు ఆ ప్రదేశము యధాతథమే కదా! అక్కడ ఏ దేవాలయమో నిర్మించినప్పుడు
కూడా అక్కడి ఆకాశము (Space) మార్పు చేర్పులు పొందదు కదా! వాయువుయొక్క
ప్రేరణ చేత ఆకాశంలో మేఘాలు పరుగులు తీస్తూ వుండవచ్చుగాక! ఆకాశం ఎల్లప్పుడు
నిశ్చలం - సుస్థిరం - ప్రశాంతము - అతీతము - అప్రమేయముకదా!. ఈ దేహంలో
ప్రవేశించి వున్నప్పటికీ సర్వ దేహాంతర్గత - దృశ్యవిషయముల పట్ల నిశ్చల మౌనత్వం
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
20

వహించివుండటం ఆకాశము నుండి అభ్యసిస్తున్నాను. ఆకాశంలాగా ఆత్మాకాశ స్వరూపుడనై
అన్నిటా వేరువేరుగా (కానీ) అఖండుడనై దృశ్యమంతా ఆస్వాదించటం
అలవరచుకుంటున్నాను. అన్నింటికీ పరమైవున్న పరమాత్మతత్త్వము నేనే అయి, క్రీడగా
ఈ అనేకత్వముతో కూడిన జగత్ రూపంగా ప్రదర్శించుకుంటూ క్రీడిస్తున్నాను.
ఆకాశంలాగా అపరిచ్ఛిన్నుడనై, అసంగుడనై లీలగా స్వయంకల్పిత భావనారూప జగత్తుగా
వ్యక్తీకరించుకొని వ్యవహరిస్తున్నట్లు నన్ను నేను సందర్శించుకోనారంభించాను.
మేఘముల రాక- పోకలతో ఆకాశం దోషం పొందుతోందా? లేదే! తేజస్సుచేత
జలముచే - వాయువుచే, వాటి వాటి మేలు కలయికలచే ఆకాశము స్పృశించబడదు
కదా! అట్లాగే...,
కాలగతిచే వచ్చి - పోయే దేహదశలుగాని, దేహదేహంతరములుగాని, భావా
భావములుగాని, సత్త్వ-రజో-తమోగుణముల రాక పోకలు గాని లోక
సంబంధమైన, స్నేహ బాంధవ్యము మొదలైనవి గాని ఆత్మను స్పృశించవు.
ఆత్మకు దోషములు అంటవు. ఆత్మయొక్క అఖండత్వము - అప్రమేయత్వము
- కాలముచే స్పృశించబడని నిత్యత్వము - సర్వమునకు అతీతత్వము మొదలైన
విశిష్టలక్షణములు చెక్కు చెదరవు. నేను ఆత్మ స్వరూపుడను. అంతేగాని
పాంచభౌతి దేహ- గుణ భావ ఇత్యాది స్వరూప పరిమితుడను గాను!
అని నా గురించి నేను నిర్వచనం కొనసాగించుకో సాగాను. (ఆత్మాత్ ఆకాశం! ఆకాశాత్
సర్వమ్! ఆకాశ సద్గురవే నమః). ఆకాశదేహినై అంతటా ఏర్పడి ఉన్న వాడనై సర్వమును
ఆస్వాదించటం అభ్యసిస్తున్నాను.
4వ గురువు : జలము
జలము ప్రకృతిరీత్యా (సహజంగా - స్వభావ సిద్ధంగా) స్వచ్ఛంగా వుంటుంది. తనయందు
రుచి అనే మాధుర్యం కలిగి వుండి జీవుల నాలుకకు మృదుమాధుర్యమును అనుభూతిగా
ప్రసాదిస్తూ వుంటుంది. సహజ స్నేహశీలి అయి సర్వ జీవుల దాహతాపాన్ని
ఉపశమింపజేసి ఆనంద సుఖాన్ని ప్రసాదిస్తూ వుంటుంది. జీవుల దేహములను
వస్త్రములను పరిశుభ్రపరస్తూ దుమ్ము - ధూళిని తొలగిస్తూ వుంటుంది. "దాహమును -
తీరుస్తూ బ్రతుకునే ప్రసాదిస్తున్న నేను మురికిని శుభ్రంచేయటానికి వినియోగించ
బడటమా?" అని ప్రశ్నించదు. తప్పుపట్టుకోదు. తదితర జీవులకు పరిశుభ్రతను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
21

ప్రసాదించటానికై వారి దేహ ధూళి - మురికి మొ॥న దోషములు స్వఛ్ఛమగు తనయందు
ప్రవేశించుచున్నప్పటికీ తాను తన పరోపకార నిరతినుండి ఏ మాత్రం వెనుకంజవేయదు.
అట్లాగే నేను కూడా..., సర్వ సహజీవుల పట్ల ఏమీ కోరకుండానే ప్రేమాస్పదుడనై
వుండెదనుగాక! స్నేహ మాధుర్యాన్ని అందించెదనుగాక! - అని అనుకోసాగాను. మధుర
సంభాషణ - గౌరవము -కీర్తించటం- బోధనలచే వారి దోషములను వారు తొలగించు
కోవటానికి సహకరించటం - వాక్కుచే వారి మనోవేదనలను ఉపశమింపజేయటం -
ఇటువంటివన్నీ జలము యొక్క పరోపకార నిరతినుండి నేర్చుకుంటూ స్వభావసిద్ధం
చేసుకొనే ప్రయత్నం నిర్వర్తిస్తూ వున్నాను. "నా సహాయం పొంది కూడా కొందరు
నన్ను అల్పముగా చూస్తున్నారే?- అని ఎప్పుడైనా అనిపిస్తే "జలముకన్నా నేను
ఏమిగొప్ప?" అని ప్రశ్నించుకుంటున్నాను. (ఓం నమో వరుణదేవ సద్గురవేనమః!
రసానందతత్వాయ నమో నమః!)
5వ గురువు: అగ్ని
అగ్ని తన తేజస్సుచే చీకట్లను పారత్రోలి జీవులకు ఎల్లప్పుడూ ఎంతటి సహకారం
అందజేస్తోంది! వెలుతురు లేకపోతే జీవుల గతి ఏమిటి? అగ్ని సదా-సర్వత్రా సదా
ప్రభావసంపన్నము. సర్వదా యుక్త స్వరూపము. అనగా దేని చేతా బంధింపబడదు.
దేని నుండి ఏదీ స్వీకరించదు. అన్నీ భక్షిస్తూ ఏదోషములు ఏ మాత్రం తనయందు
ప్రవేశింపనీయదు. అగ్నిలేని చోటేలేదు కానీ, కొన్నిచోట్ల అగ్ని గూఢంగా - అప్రదర్శితంగా
వుంటుంది. ఉన్నట్లనిపించదు. మరికొన్ని చోట్ల ధగధగ ప్రకాశమానంగా ప్రదర్శితం
అగుచూ దిక్కులన్నీ తన తేజస్సుచే నింపివేస్తోంది. కారు చీకట్లను పటా పంచలు
చేస్తోంది. లోక కళ్యాణకారకులగు మహానీయుల యగ్నకార్యములలో ప్రజ్వలించి
ఆహూతులకు వాహకమై దేవతలను రంజింపజేస్తూ లోక జనులకు సర్వశుభములు
ప్రసాదించబడటానికి కారణమగుచున్నది. యజ్ఞకర్తల పాపరాసులను - దోషములను
పటాపంచలు చేస్తోంది. తేజోమయుడై ఉండటం, వస్తువులను స్పృశిస్తూ స్వీకరించక
పోవటం, సర్వమును భక్షిస్తూ దోషమును పొందకపోవటం, ఇవన్నీ గమనించాను.
కొన్ని చోట్ల నా అవగాహనలను అభిప్రాయములను ఆధ్యాత్మిక భావములను
ప్రదర్శించకుండా గూఢంగా వుండటం, మరికొన్ని చోట్ల నా జ్ఞాన తపో తేజస్సులను
సహజీవుల అజ్ఞాకాంథకారమును తొలగించటానికై ఎలుగెత్తి ప్రదర్శించటము, నాకు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
22

ఎవ్వరైనా ఏదైనా దానం చేస్తే వారి దాన-ధర్మ సౌహార్ద్రతను దేవతలకు నివేదించి వారి
యొక్క దోషములను నివారించటము- ఇవన్నీ కూడా అగ్ని నుండి నేర్చుకొని లోకంలో
ప్రదర్శిస్తూవున్నాను. ఈ దేహ - ఇంద్రియములతో జీవిస్తూ కూడా, అగ్నివలె వీటి వీటి
దోషములు నాయందు ప్రవేశించకుండా జాగరూకుడనై వుండటం అభ్యసిస్తున్నాను.
అగ్నిదేవ గురవే నమః!
పరమాత్మచే సృష్టించబడిన సర్వ దేహములలోను అగ్ని ప్రవేశించి కట్టెలలో కాష్ఠమౌనము
- దేహములలో వెచ్చదన ప్రదర్శనమును నిర్వర్తిస్తున్నది కదా! నేను కూడా ఆత్మతేజస్సుతో
దృశ్యమంతా నింపివేసి నా జ్ఞానానందాకాశమును తగిన చోట్ల ప్రదర్శిస్తూ - మరికొన్ని
చోట్ల మౌన భూమికను అవధరిస్తూ దృశ్య జగత్తులో సంచరించటం అభ్యసిస్తున్నాను.
ఒకప్పుడు అనివార్యంగా అగ్ని శిఖలు ఉత్పన్నమగుచు - వినాశనము పొందుచున్నాయి
కదా! వాటి యొక్క ఉత్పత్తి-వినాశనములు ఏరీతిగా జరుగుచున్నదో అర్థం కావటం లేదు.
నదిలో కెరటములు ఆకారణంగా స్వభావంగా లేస్తున్నాయి. లయిస్తున్నాయి. అట్లాగే కాల
ప్రవాహం చేత ఈ దేహములు ప్రతిక్షణం స్వభావసిద్ధంగా ఉత్పన్న మౌతున్నాయి.
నశిస్తున్నాయి. నేను నా దేహమును చూసి "అగ్నిశిఖలవలె - నదీ జలానికీ తరంగలులాగా
ఆత్మకు దేహాలు వస్తూ వుంటాయి. పోతూ వుంటాయి. ఇందులో సుఖమేమిటి? దుఃఖమేమిటి?
వీటికి నేను వేరై ఆత్మజ్యోతి స్వరూపముతో వెలుగొందుచున్నాను కదా!" ... అని
గమనిస్తూవున్నాను. ( వైశ్వానరాయ విద్మహే! లాలీయ ధీమహి! తన్నో అగ్నిః ప్రచోదయాత్!)
6వ గురువు: చంద్రుడు
కష్టముల ఉష్ణత్వమును నేను స్వీకరించి - లోకులకు చిరునవ్వుతో శుభదృష్టులు
అందించటం చంద్రునివద్ద అభ్యసించి - నిర్వహిస్తున్నాను. చంద్రుని యొక్క చంద్రకళలు
పాడ్యమి నుండి పౌర్ణమి రాత్రివరకు ప్రవృద్ధమౌతున్నాయి. మరల బహుళ పక్షంలో
పాడ్యమి నుండి కళలు తరుగుచు అమావాస్య వచ్చేసరికి పూర్తిగా ఉపశమిస్తున్నాయి.
అదంతా చంద్రుడు చంద్రమండల దేహంతో అనుభవిస్తూ తాను ఆ కళల పెరుగుదల
- తరుగుదలలకు అతీతుడైవుంటున్నారు. భూమికి ఔషధరసమును తన మృదుమధుర
ప్రశాంత అమృత కిరణముల ద్వారా ప్రసరింపజేస్తూ తనయొక్క లోక కళ్యాణ
మూర్తిత్వమును అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. చంద్ర దేహమునకు సంబంధించిన
వికారము లేవీ దేహిగా తాను పొందటం లేదు. అత్యంతతీక్షణమైన సూర్యకిరణములు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
23

తనయందు ప్రవేసిస్తూ ఉంటే తాను వేడిమిని సహిస్తూ చల్లటి చంద్రకిరణములను
లోకములకు ప్రసాదిస్తున్నారు.
సంపద ఆపదలకు, సమృద్ధి - అసమృద్దిలకు అతీతత్వమును చంద్రుని నుండి
గమనించి, నేర్చుకొని, ఆచరిస్తున్నాను. జననము నుండి మరణము వరుకు (from
Birth to Death) వచ్చి పోతున్న వికారాలన్నీ ఈ దేహమునకు సంబంధించివే గాని,
నాకు సంబంధించినవి కానే కావు కదా! గౌరవించబడటం, అవమానించబడటం,
సుఖము దుఃఖము మొదలైనవన్నీ ఈ దేహముతో జనించి - ఈ దేహంతో వుంటూ
-
ఈ దేహంతోనే పోతాయి. నేను దేహిని కదా! నాకు వాటితో సంబంధమే లేదు - అనే
సునిశ్చితమైన నిర్ణయమును పరిపోషించు కుంటున్నాను. ఆత్మ స్వరూపడనై దేహముతో
ప్రమేయము లేనివాడనై వుండటం చంద్రుని చూసి నేర్చు కుంటున్నాను. చంద్రభగవన్
సద్గురవే నమోనమః !
7వ గురువు: సూర్యుడు
సూర్యుడు తన సహస్రాధిక కిరణజాలంతో సముద్రజలముపై ప్రసరించి జలమును
ఆవిరి రూపంగా స్వీకరిస్తున్నారు. మరొకప్పుడు మరొక చోట వర్షింపజేసి లోకములకు
మహోపకారం చేస్తున్నారు. అంతేకాదు. సూర్యుడు యథాతథంగా ఆకాశంలో వుంటూనే
తటాక జలం, కుండలోని జలం మొదలైన అనేక చోట్ల భిన్న రూపములుగా కనిపిస్తూ
ఉంటున్నారు. ఎన్నిచోట్ల ఎన్ని రూపములుగా ప్రతిబింబించినప్పటికీ సూర్యుడు తనయొక్క
యధాతథత్వమును కించిత్కూడా కోల్పోవటం లేదు.
నేను ఈ ఇంద్రియములకు కనబడేవి-వినబడేవి- స్పృశించబడేవి- రుచిచూడబడేవి
- వాసగా పొందబడేవి- మొదలైన విషయాలన్నీ స్వీకరిస్తూనే - సూర్యుడు జలమును
వర్షరూపంగా త్యజించునట్లు .... పరుల శ్రేయస్సు ఆనందములను దృష్టిలో పెట్టుకొని
ఈ దృశ్యప్రపంచమునకే సమర్పించివుంటున్నాను. ఓ పరమాత్మా! నాది అనబడేదంతా
వాస్తవానికి ఎల్లపుడు నీదేనయ్యా! అని సంబోధించి వుండటం సూర్యుని దగ్గర
నేర్చుకుంటున్నాను. సర్వ పదార్ధముల పట్ల - విషయముల పట్ల - విశేషముల పట్ల
ఆసక్తి (Attatchment, Inquisitiveness, Involvement)ని తొలగించుకొని ఒకానొక
పవిత్రమైన అతీతత్వమును పెంపొందించుకుంటూవున్నాను. అనేక నాటకాలలో నటించే
నటుడు ఏనాటకానికీ పరిమితుడు కాదుకదా! అట్లాగే, ఇటువంటి అనేక దేహములలో
జీవుడుగా ప్రతిబింబిస్తూ ఆకాశంలో సూర్యునివలె యదాతథ ఆత్మత్వమును
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
24

స్వభావసిద్ధంగా ధారణ చేస్తూ వుండటం కొనసాగిస్తున్నాను. తటాకంలో ప్రతిబింబించే
సూర్యుడు ఆకాశంవదలి తటాకంలో ప్రవేశిస్తున్నాడా! లేదు కదా! నేను ఆత్మ స్వరూపుడను.
జీవాత్మగా అనేక జగత్తులలో ప్రతిబింబింబించవచ్చు గాకా! ఆయా జగత్తులలో
బద్ధుడవటం లేదనునది సూర్యుని చూస్తూ గమనిస్తున్నాను. పరమాత్మయే (పరమ్ఆవల) నా వాస్తవ స్వరూపం కదా! - అని మననం చేస్తూ ఆస్వాదిస్తున్నాను. (భాస్కరాయ
విద్మహే! మహద్యుతి కరాయ దీమహి! తన్నో ఆదిత్యః ప్రచోదయాత్!)
8వ గురువు - పావురము
ప్రకృతిలో ఆయా జీవుల పట్ల సందర్భపడుచున్న ఆయా సంఘటనల నుంచి
నేర్చుకోవలసినది నేర్చుకుంటూ దేహం వచ్చినందుకు (లేక) పొందినందుకు
ప్రయోజనంగా ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాను.
ఓ రాజా! ఈ సందర్భంగా ఒక పావురము యొక్క చేష్టనుండి విద్యార్ధినై ఏ విశేషము
నేర్చుకున్నానో చెపుతాను. ఈ జీవుల సంబంధ - బాంధవ్యములు ఏ తీరుగా జీవుని
నిబద్దుని చేసి జన్మించిన అసలు కారణమైనట్టి స్వస్వరూప ఔన్నత్యావగాహనలకు
సంబంధించిన పాఠ్యాంశములనుండి దారి తప్పిస్తూ వుంటాయో.... వినండి.
ఒకానొక వనంలో ఒక పావురముల జంట వున్నది. ఆ రెండు పావురములు ఒక
దానితో మరొకటి మానసికమైన అత్యంతానుబంధం కలిగివుండేవి. మనోబుద్ధులతో
పరస్పరత్వం ఏర్పరచుకొని గృహస్థధర్మం నిర్వర్తిస్తూ రోజులు - నెలలు - సంవత్సరాలు
గడుపుతూ వున్నాయి. ఒకటి రెండవదానికి కనబడకపోతే స్నేహబంధం (లేక)
దాంపత్యబంధంతో విలవిల్లాడిపోతూ వుండేవి. "ఆహాఁ! మా పరస్పరానుబంధం! ఎంత
బాగు!" అని చెప్పుకుంటూ మురిసిపోయేవి!
ఆ పావురాలు రెండూ ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకోవటం, కలసిసంచరించటం
సరస-విరసాలు, ఆడుకోవటం, ఆహారాన్ని కలసి భుజించడం, ఒకే గూటిలో
వానాకాలంలో - శీతాకాలంలో - యండాకాలంలో రోజుల తరబడి కలసి - మెలసి
వుండటం చేస్తూ వుండేవి.
ఓ యదురాజన్ ! ఆడ పావురం గోముగా ఏది కోరితే అది మగ పావురం ఎంతో
కష్టపడి సంపాదించి తెచ్చి ఇస్తూ వుండేది. ఇంద్రియనిగ్రహంలేని ఆ మగ పావురం
ఆడపావురము యొక్క ముక్కు - కళ్ళు - రెక్కలు చూసి ఆకర్షించబడి, ఆ ఆకర్షణలో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
25

అదీ ఇదీ చేస్తూ రోజులు గడపుతూ వుండేది. ఆడ పావురము తన క్రీగంటి చూపులతో,
సరస విరస సంభాషణాచాతుర్యంతో మగ పావురాన్ని ఆకట్టుకుంటూ ఇంతటి
కులుకుబెలుకులు గల నేను ఎంత గొప్పదాన్ని! ఈ మగపావురం నన్ను విడచి వుండలేదు
కదా! ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి? .... అని తలుస్తూ చిక చిక ధ్వనులతో
గంభీరంగా గూటిలోను, ఆడవిలోను సంచరిస్తూ వుండేది.
ఈ విధంగా అనేక రోజులు గడచిపోసాగాయి. కాలము యొక్క చమత్కృతులు
వర్ణనాతీతం కదా!
కొంతకాలానికి ఆడపావురం ఆ మగ పావురం సమక్షంలో గ్రుడ్లుపెట్టింది. ఆ శ్రీహరి
యొక్క కాలస్వరూపపాశవైచిత్రం చేత ఆ పావురపుగుడ్లు పొదగబడి, సున్నితమైన
కాళ్లు ముక్కు-మెడ-చిట్టి చిట్టి కళ్ళు గల పావురపు పిల్లలు బయల్వెడలాయి. ఆ
పావురపు పిల్లల కిచిధ్వనులు చేస్తూ మెడలుసారించసాగాయి. రెక్కలాడించడం
నేర్చుకోవటాలు ప్రారంభించాయి. ఇక ఆ పావురపు జంట ఆపిల్లలను ముక్కుతో
రెక్కలతో స్పృశిస్తూ "ఆహా! ఏమి మన భాగ్యం! మన పిల్లలు ఎంత ముద్దోస్తున్నారు!" -
అని అనుకుంటూ మురిసి పోయేవి. క్రమంగా ఆ ఆ పావురపు జంట విష్ణుమాయా
మోహితులై ఒకరిపట్ల ఒకరు, -పిల్ల పావురములతోను పరస్పరాసక్త చిత్తులై వుండేవారు.
ఆహారం సముపార్జించుకోవటంలోను, పిల్లలను పరిపోషించు కోవటంతోను పగలంతా
ఏకానేక శ్రమలతోకూడిన సంచారాలతోను, గూటికి రాక పోకలతోను గడచిపోయేవి.
ఇక రాత్రి అయిందా,.. ఏదైనా పిల్లి ఎటువైపునుంచో వచ్చిపడదు కదా! అని అనుకుంటూ
చిన్న చప్పుడుకు కుహ్ కుహ్ శబ్దములతో లేస్తూ బహు వ్యగ్రతను పొందుతూ వుండేవి.
ఒకరోజు..., ఆ పావురముల జంట తెలతెల్లవారగానే పిల్లలకు ఆహారం సమకూర్చాలనే
తాపత్రయంతో గూటినుండి బయల్వెడలాయి. నలువైపులా ఆకాశంలో ఎగురుతూ
ఆహారం కోసం వెతుకసాగాయి. ఇంతలో... ఒక ఆటవికుడు ఆయా పనిముట్లతో
త్రాళ్ళతో, వలలతో పక్షుల మెడలు క్రూరంగా విరచి భుజములకు తగిలించుకొనే
కఱ్ఱలతో కూర్చిన తాటియాకు బుట్టలతో ఆపావురముల జంట నివసించే మహా
వృక్షమువైపు సమీపించాడు. అతని క్రూరమైన ఎఱ్ఱటి కళ్ళనుండి బయల్వెడలిన చూపులు
దట్టమైన కొమ్మల మధ్యగల ఆపావురపు జంట నిర్మించుకొన్న విశాలమైన గూడుపై
పడనే పడ్డాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
26

ఇంకేమున్నది? ఆ ఆటవికుడు ఆ మహావృక్షాన్ని ఎక్కి పావురపు పిల్లల దేహములను
తన తరచేతి మధ్యగా వ్రేళ్ళతో బంధించి బుట్టలో వేసుకొని చెట్టు దిగాడు.
అప్పుడే ఆ పావురముల జంట ధాన్యపు గింజలను నోట ధరించి ఆ మహావృక్షమును ఆ
సమీపించాయి. ముందుగా చూసిన ఆడపావురము బుట్టలో చిక్ చిక్ కూతలు వేస్తున్న
పావురపు పిల్లలను గమనించింది. తన సంతానానికి పట్టిన దుర్గతిని చూసి
ఆక్రోశించింది. అలవికానంత దుఃఖం పొందింది. ఆ పరమాత్మ యొక్క మాయారచనా
విశేషం చేత యుక్తాయుక్తాలు ఆలోచించుకోకుండా స్మృతి పోగోట్టుకొని పరుగులు
తీసి నేలపై పరచబడిన వలపై వ్రాలింది. ఆ ఆడ పావురము యొక్క కాళ్ళు వలత్రాళ్ళచే
బంధించబడ్డాయి. పిల్లలమాట దేవుడికెరుక! తానే వలలో చిక్కుకున్నదాయె! ఇక చేసేది
లేక రెక్కలాడిస్తూ వలలో చిక్కి దిక్కు తోచక ఏడవసాగింది. మగపావురం ఇదంతా
అల్లంత దూరం నుండి గమనించింది. తన ప్రియమై ఆడపావురమునకు ముద్దుల
మూటలోలికే పిల్ల పావురములకు పట్టిన గతిని చూసి అత్యంత దుఃఖంతో ఏడువసాగింది.
మగ పావురము:
అహో! మే పశ్యత అపాయమ్! అల్పపుణ్యస్య దుర్మతేః
అతృప్తస్య! అకృతార్ధస్య ! గృహస్తః త్రైవర్గికో హతః! (అధ్యా 7, శ్లో 68)
ఓ సహజీవులారా! ఓ దైవమా! ఇప్పుడు నాకు పట్టిన ఈ దౌర్భాగ్య స్థితిని చూస్తున్నారా?
గమనిస్తున్నారా? నేను ఐహిక సుఖముల కొరకై అఱ్ఱులు చాస్తూ సుదీర్ఘకాలం ఆయుష్షును
వెచ్చిస్తూ వచ్చాను. దేహం పొందినందినందుకు ఏ విధంగా కాలాన్ని సద్వినియోగ
పరచుకోవాలో, ... అట్టి పారమార్ధిక సుఖముకొరకు (నేను దేహ-మనో-బుద్ధి-చిత్తఅహంకారలకు అతీతమై వున్న పరమాత్మ స్వరూపడను కదా! ... అనే అవగాహనను
పెంపొందింపజేసుకునే ప్రయత్నముల కొరకు) సిద్ధపడకుండా కాలాన్ని వ్యర్ధం
చేసుకున్నాను. అకృతార్ధుడనై పోయాను. దుర్మతిని. అల్పపుణ్యుడను. గృహస్థుడనై
త్రివర్గములకై (ధర్మార్ధకామముల కొరకై) శక్తి-యుక్తులను వృధా చేసుకున్నాను.
ఇప్పుడు జరిగిందేమిటో... చూడండి! పతివ్రత - అనుకూలవతి - సౌందర్యవతి -
నాకు తోడు - నీడ అయినట్టి నా భార్య పావురము, సాధువులు - మృదు స్వభావులు
నా ముద్దుల మూటలు అయిన సంతానముతో సహా నా గృహాన్ని ఖాళీచేసి నన్ను
వదిలి స్వర్గలోకానికి బయలు దేరి వెళ్ళుచున్నారు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
27

సో 2 హం శూన్యేగృహే శ్లో దీనో మృతదారో మృతప్రజః
జిజీవిషే కిమర్ధంవా? విధురో దుఃఖజీవితః! (అధ్యా 7, శ్లో 70)
ఇప్పుడిక నాకు ఖాళీ గూడు మిగిలింది. భార్య పిల్లలు పొగొట్టుకొని అతిదీనుడైనాను
విరహవేదనాగ్రస్తుడనైనాను. నా శేష జీవితమంతా దుఃఖమయం అయిపోయింది?
ఇక నేను ఎవరికోసం బ్రతకాలి? బ్రతికి ఏం సాధించాలని, ఏమి అనుభవించాలని?
ఈ విధంగా ఆ మగ పావురం విలపిస్తూ తన భార్య బిడ్డలు చిక్కివున్న చోట చుట్టూ
ఎగురుతూ ఎగురుతూ వుండసాగింది. ఒకానొక క్షణంలో దానికి దుఃఖముతో పిచ్చిపట్టిన
దాని వలె అయి, ఎగురుతూ యాధాలాభంగా వెళ్ళి తాను కూడా వలపై వ్రాలి వల
త్రాళ్ళలో చిక్కుకున్నది. పోయి పోయి తనంతట తానుగా మృత్యువును నెత్తిపైకి తెచ్చుకొని,
"అయ్యో! చచ్చానురా బాబూ! పోయేవాడిని పోక వచ్చివచ్చి నేనే ఈ వలలో వాలానేంటిరా
నాయనా?" అంటూ ఆక్రందనలు చేయసాగింది.
ఇక ఆ బోయివాడు, "ఆహా! ఏమి అదృష్టం! ఈనాడు సుదినం! నేను పెద్దగా
ప్రయత్నించకుండానే ఈ ఆడ పావురం - ఆ మగపావరం తమకు తామే నావలలో
చిక్కుకున్నాయే ! ఈ రోజంతా ఇక పండగే! ... ఇవి తెలివితక్కువ పావురాలు! హాఁ!
హాఁ!" అని చాలా సంతోషించసాగాడు. అటు తరువాత ఆ పావురములన్నింటినీ బుట్టలో
బంధించి ఇంటికి పోసాగాడు.
ఓ యదుమహారాజా! ఇంద్రియములకు దాసుడై, కుటుంబసంబంధములు శాశ్వతమని
- సత్యమని నమ్ముకొని కాలం గడుపుతూ తదనంతర స్వీయస్థితి - గతులపై జ్ఞానదృష్టిని
సారించని వాడి గతి ఏమిటి? అనేక సంబంధ బాంధవ్యములలో, వ్యవహార పరంపరలలో
మనసంతా నిలుపుకొని ముందు వెనుకలను పరిశీలించనివాడుఅయి, ఏ జీవుడైనా
జీవితమనే అవకాశమును సద్వినియోగ పరచుకోకపోతే? ఆ పావురమువలె
ఇంద్రియములకు దాసుడై దృశ్య విషయముల పట్ల ఆసక్తులతో కాలమును గడపివేస్తుంటే?
ఏ మౌతుంది? దుర్గతిపాలు కాక తప్పదు! - అనే విషయం ఆ పావురము యొక్క
అనుభవమును గమనించి నేర్చుకున్నాను.
ఆరూఢచ్యుతుడు
శాస్త్రములు, మహనీయులు మనకు ఒకానొక ముఖ్యవిషయం చర్విత చర్వణంగా గుర్తు
చేస్తున్నట్లు నేను గుర్తెరిగాను!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
28

శ్లో యః ప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారం అపావృతం,
గృహేషు ఖగవత్ సక్తస్తమ్ ఆరూఢచ్యుతం” విదుః (అధ్యా 7, శ్లో 74)
ఈ మానవజన్మ అతిదుర్లభమైన ఒకానొక మహత్తరమైన అవకాశం వంటిది! (It is a
great, but unknown time-bound opportunity). ఎందుకంటారా? ఇది తెరువబడిన
ముక్తిద్వారము. ఆత్మజ్ఞులు ఈవిషయం ఎలుగెత్తి గానం చేస్తున్నారే! మరి అటువంటప్పుడు
ఆ మగ పావురం వలె ఇల్లు-వాకిలి -సంబంధాలు-అనుంబంధాలు -బాంధవ్యాలు
భావావేశాలు - భావనా సంసర్గములు మొ॥న విషయాలపట్ల అత్యంతాసక్తి కలిగి
ఉంటే.. ఫలితమేమిటి? బుద్ధి మాంద్యము! ఉత్తరోత్తరా అధమగతులు! - "ఈతడు
శ్రేయోమార్గం పొంది కూడా పతితుడైనాడురా" - అని అనిపించుకుంటాడు. పండితులు
అట్టివానిని "ఆరూఢచ్యుతుడు" అని పిలుస్తున్నారు. అందుచేత ఈ మహత్తరమై మానవ
జన్మ అనే అవకాశముపట్ల నేను ఆ మగ పావురము వలె వ్యర్ధం చేసుకోదలచుకోలేదు.
ఆరూఢచ్యుతుడను కాకూడదు! అని ఆ పావురం యొక్క అనుభవం నుండి నేను
నేర్చుకోసాగాను.
శ్రేయోమార్గము నుండి పునః అధను గతులకు వెళ్ళకూడదని మననం చేయసాగాను.
ఈ ఇంద్రియ-ప్రపంచంలో నాది అని అనిపించేది నాది కాదు. ఇదంతా పరమాత్మ
యొక్క కల్పనా చమత్కారమే! అనే ఆరూఢతను అంటి పెట్టుకొని ఉండటం
అభ్యసిస్తున్నాను.
9వ గురువు: కొండచిలువ
ఓ రాజా! ఈ జీవుడు ఎక్కడో ఏదో సుఖం పొందాలని ఆశించి వర్తమానాన్ని
నిష్ప్రయోజనం చేసుకుంటున్నాడు. ధనం సంపాదించాలి! సుఖమయమగు స్వర్గలోకం
నాకు లభించాలి!... అని అనుకుంటూ, ఇంద్రియ సుఖములకై వెంపర్లాడుచున్నాడు.
ధ్యాసంతా - ఏమి సంపాదించుకోవాలి? ఎట్లా సంపాదించుకోవాలి? అనే రంధిలో
వర్తమానమును పీకలదాకా ముంచిఉంచుతున్నాడు. ఆత్మజ్ఞానమునకు సంబంధించి
ప్రయత్నములను ఏమరుస్తున్నాడు. ఒక్కసారి "సుఖదుఃఖాలకు సంబంధించి వాస్తవం
ఏమిటి?" - అని గమనిస్తే "అవి వచ్చి పోయేవే!" అని తెలుస్తోంది. స్వర్గలోకంలో
వున్నా - నరకలోకంలో వున్నా ప్రాణులకు సుఖ-దుఃఖాలు అనివార్యం. అవి రాకతప్పదు.
పోక తప్పదు. దుఃఖాలు మనం పిలిస్తే వస్తున్నాయా? లేదు కదా! అట్లాగే సుఖాలు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
29

కూడా వాటంతట అవే వస్తూ వుంటాయి. ఇంతలోనే పోతాయి. ఇది గ్రహించిన వివేకి
ఇక్కడి పదార్ధముల పట్ల ఆసక్తి కలిగి వుండడు. వాటి కొరకై వ్యధ చెందడం వృధా
ప్రయాసయే!. అందుచేత, యథా లభ్యమైనదానితో ప్రతిరోజు పరమాత్మకు కృతజ్ఞతలు
తెలుపుకుంటూ వుండటం ఒక అలవాటుగా చేసుకోసాగాను.
సుఖ-దుఃఖాలకై ఉదాసీనతయే ఉచితం!
ఈ విషయం నేను ఒక కొండచిలువను చూస్తూ గ్రహించాను. ఎట్లాగా?... వినండి.
అనేకమంది జీవులు "నాకు ఇట్టి ఆహారమేకావాలి"- అని నియమించుకొని ఇక అద్దాని
కొరకై అనేక ప్రయత్నపరంపరలలో మునిగి తేలుచున్నారు. మరి కొండచిలువయో?
తాను ఉన్నచోటనే ఆహారం కొరకు వేచి వుండి, లభించిన దానిని రుచిని గురించి
ఆలోచించకుండా స్వీకరిస్తోంది. యాదృచ్ఛికంగా లభించినదానితో తృప్తి పడుతోంది
లభించనప్పుడు మౌనంగా వేచి వుంటోంది. నేను కూడా ప్రాప్తాప్రాప్తముల
విషయములలో కొండచిలువను అనుసరించసాగాను. ఏ సమయంలో ఏ ఆహారం
లభిస్తే, ఏఏ సాంఘిక గౌరవాగౌరవాలు, వస్తు సముదాయాలు ఎంతవరకు లభిస్తే
అంతవరకు వాటిని దైవేచ్ఛగా స్వీకరిస్తున్నాను. "లభించినది రుచికరమైనదేనా?
ఇంకేదో లభిస్తే బాగుండునే! ఇట్లా అయితే గొప్పకదా!"... ఇటువంటి ఆశ-నిరాశలను
దరిరానీకుండా ప్రాప్తించిన దానిని స్వీకరిస్తున్నాను. ఎప్పుడైనా ఏదైనా అనుకున్న
ఆహారము లభించకపోతే ఇది కూడా దైవేచ్ఛయే - అని భావించి ఉపవాసదీక్షాభావం
వహిస్తున్నాను. ధైర్యమును సడలకుండా చూసుకుంటున్నాను.
నాకు ఈ శరీరంలో మనోబలము, ఇంద్రియబలము, భౌతిక బలము ఉన్నప్పటికీ,
వాటిని అధిగమించిన దృష్టితో వాటి పట్ల మౌనత్వమును అలవరచుకొని ఉంటున్నాను.
పడుకుని-నిద్రరానప్పుడు కూడా మౌనంగా తపస్సు చేస్తూ వుండటం అభ్యసిస్తున్నాను.
కర్మేంద్రియముకు - ఏదో చేయాలి! ఎక్కడో తిరిగిరావాలి ! ఏదో చూడాలి! ఇంకేదో
ఆఘ్రాణించాలి! మరేదో తినాలి - ఇత్యాది భావావేశములను దరి జేరనీయటంలేదు.
మౌనంగా రోజులు గడుపుచూ యాదృచ్ఛికంగా లభించినదానిని సంతోషంగా స్వీకరిస్తూ
జీవించటమును కొండచిలువ దగ్గరే నేర్చుకున్నాను. ఆశించటం మొదలై ఆశ
దురాశగాను, నిరాశగాను పరిణమించకుండా జాగరూకత - వహిస్తున్నాను.
ప్రాపంచక సంబంధమైన సర్వ విషయాలపట్ల - సందర్భముల పట్ల - సంఘటనల
పట్ల మౌనం వహించిన వాడనై వుండటం అభ్యిసిస్తూ మునినై వుంటున్నాను. ప్రసన్నంగా,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
30

గంభీరంగా వుండటం అలవరచుకుంటున్నాను. నేను ఇంతటివాడను. అంతటి వాడను
-అని ఇతరులతో చెప్పుకునే బలహీనతను త్యజించసాగాను. అంతరంగంలో దోష
వృత్తులను-బలహీనమైన భావాలను దరి జేర నీయకుండా ఇతరులకు దుర్రాహ్యుడుగా
ఇతరుల నిందాస్తుతులకు అతీతుడుగా వుంటున్నాను. ఇతరులు అభిప్రాయములకై
ఆశించుకుండా దురత్యయుడనై వుంటున్నాను. దేశ-కాలముల ప్రభావానికి లోను
కాకుండా నా నిశ్చలత్వాన్ని సంతోషాన్ని పరిపోషించుకుంటున్నాను.
10వ గురువు - సముద్రము
ఒక తటాకమైతే వసంత గ్రీష్మ ఋతువులలో (వేసవిలో) ఎండిపోతోంది.
(వర్షాకాలంలో) నిండుగా కనిపిస్తుంది. అదే, సముద్రమో? వర్షరుతువులో వృద్ధిపొందదు.
యండాకాలంలో ఎండిపోదు. ఎప్పుడూ యథాతదంగా వుంటుంది. ఇది గమనించి
నేను సంపదలకు పొంగిపోరాదు, ఆపదలకు కృంగిపోరాదు - అని నేర్చుకున్నాను.
ఎప్పుడూ నిండుగా, ప్రసన్నంగా, గంభీరంగా, ఇతరులకు దురవగాహ్యుడుగా
వుంటున్నాను. "ఇదిగో! ఈ ఈ కష్టాలతో చచ్చి పోతున్నాననుకో!" అంటూ ఇతరులకు
బాధలు చెప్పుకొని వారి మెప్పు - ఓదార్పులపై ఆధారపడటం లేదు.
కష్ట సుఖాలు ఎవరికుండవు?
అతి విస్తారము సమగ్రము, తనయొక్క అంతరమున అనేక జీవరాసుల జీవన
అనుభూతి - అనుభవములకు చోటును ప్రసాదించునది, సూర్యుకిరణములకు అనుక్షణం
తనజలమును అందించి లోక కళ్యానమునకు కారకము - అగు సముద్రమును గమనించి -
ఆశ్చర్యం పొందాను. సముద్రమును మనస్సులో తలచుకొని గురువర్యా! సముద్ర
దేవా! మీ ఆయా మహత్తర లక్షణములను విద్యార్థినై నేను నేర్చుకొనెదను గాక! అని
వారికి మానసికంగా విన్నవించుకున్నాను. సర్వఋతువులందు సముద్రం ఒకే రీతిగా
వుండటం లేదా? అట్లాగే సర్వసమృద్ధులను పొందిన సమయంలోను, దరిద్ర
నారాయణునిగా వీధులలో సంచరించవలసి వచ్చినప్పటికీ యోగి (లేక) ముని
సంతోషముగాని దుఃఖముగాని పొందడు. - అని యోగశాస్త్రం యోగుల గురించి
చెప్పుతోందికదా! నేను ఆయా ఉభయ సందర్భములలో సుఖ దుఃఖ భావాలకు
అతీతత్వము వహించి ప్రశాంతంగా గంభీరంగా చిరునవ్వుతో కాలం గడపటం
అభ్యసించసాగాను. (సంయోగ వియోగాతీతో యోగః)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
31

11వ గురువు - పతంగము (మిడత)
మిడత ఎక్కడో ఏదో ఒక మూల ఆహారం భక్షిస్తూ హాయిగా కాలం గడుపుతూ వుండగా,
ఇంతలో, మరెక్కడో దూరదూరంగా అగ్నిశిఖల మెరుపులు చూసి ఆకర్షణ పొందుతోంది.
వెనువెంటనే ముందు వెనుకలు ఆలోచించకుండా ఝమ్... మని గాలిలోకి లేచి ఆ
అగ్ని శిఖలవైపు దబదబ రెక్కలాడించుకుంటూ బయల్వెడలుతోంది. అగ్నిని
సమీపిస్తున్నప్పుడైనా ఆ అగ్ని శిఖలు తన దేహమును బాధించి భస్మం చేస్తాయని
గమనించి, ఆగి, వెనుకకు మరల వచ్చును కదా? లేదు. తను కదలుచున్న వేగమును
ఉపసంహరించుకోలేక, అందరు చూస్తూ వుండగానే పోయి - పోయి అగ్నిలోకి దూకి
భస్మం అవనే అవుతోంది. ఆవేశంలో అనుకున్నది నిర్వర్తించటమేగాని, విచక్షణతో
ముందు వెనుకలను పరిశీలించటానికి ప్రయత్నించటం లేదు.
ఈ జీవుని విషయానికి వద్దాం! దుర్గుణములు - దుష్ట సంభాషణములు దురభ్యాసములు
కలిగియున్నవారు ఆ పతంగమువంటి వారే కదా!
ఎంతో కష్టపడి అనేక శ్రమ - త్యాగముల అనంతరం పంచేంద్రియములతో కూడిన
మానవ దేహమును సంముపార్జించు కుంటున్నాడు. ఇది ఎంతో గొప్పవిశేషం! ఎందుకంటే
మానవ దేహంతో మోక్షమును కూడా పొందవచ్చును కదా! అటువంటి ఆత్మ విద్యా
సముపార్జన సందర్భంలో పంచేంద్రియములతో ఇంద్రియవిషయములగు భౌతిక
రూపముల దర్శనం మొదలైన వాటిని పరికించి చూస్తున్నాడు. అంతటితో ఆగటంలేదు.
వాటి చేత ఆకర్షించబడి, లభించిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకొని మిడతలాగా
అనేక లోపములు - అజ్ఞాన జన్మలకు దారి తీయగల మార్గములోనికి తనను తానే
ఆవేశంగా - వెను తిరగలేనంత వేగంగా త్రోసివేసుకుంటున్నాడు. ఇంద్రియదృశ్యాకర్షణలు అనే అగ్నిలోకి వెనక-ముందు చూడకుండా దూకుచున్నాడే!
మానవ జన్మ వచ్చింది ఇంద్రివిషయానందము కొరకా? కానే కాదు. అందుకే అయితే...
ఇక జంతుజన్మయే అధికమైనది కాదా ఏమి? ఆహార-నిద్రా-మైధునాలు జంతువులకూ
ఉంటాయికదా!
ఎవ్వడైతే ఈ ఇంద్రియ విషయముల ఆకర్షణపై, దురభ్యాసములపై యుద్ధము ప్రకటించి
జయించటానికి అవకాశములను సద్వినియోగ పరచుకుంటాడో అట్టివాడే నిజమైన
వీరుడు.. ఇంద్రియములకు లోబడనట్టి జితేంద్రియుని మనస్సు మాత్రమే దైవమాయచే
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
32

నిర్మితమైన జడ-మెడ-భుజములు - ముక్కు ఇత్యాది స్త్రీ - పురుష రక్తమాంస నిర్మిత
దేహములకు ధన-జన సంపదలకు ఆకర్షితావేశమును పొందకుండా ఉంటోంది.
అజితేంద్రియుని మనస్సో ప్రలోభము పొందుతోంది. ఫలితమేమిటి? అగ్నివైపు
పరుగులు తీసే మిడుతవలె నరక స్థితి గతులలోపడి అనేక విధాలైన కష్టములను
నెత్తికి తెచ్చుకొని మరీ అనుభవిస్తోంది.
ఇది మిడుతలో గమనించిన నేను, ఓ మిత్రమా! మిడుతా! నీవలె నేను ధనము
-
దేహము ఇత్యాది ఇంద్రియ విషయల పరంపరలచే జనించే ప్రలోభాగ్ని వైపుగా
పరుగుపరుగున పోయి వినాశనము తెచ్చి పెట్టుకోను. ఈ విషయం నాకు గుర్తుచేసి
మార్గదర్శివగుచున్నావు కదా! అందుచేత నీవు నాకు గురువువే!... అని సంబోధించి
ప్రలోభముల నుండి నన్ను నేను రక్షించుకోవటం ప్రారంభించాను. మిత్రమా!
యయాతిపుత్రా! యదుమహారాజా! మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, విను
శ్లో॥ యోషిత్ హిరణ్య ఆభరణాంబరాది ద్రవ్యేషు మాయారచితేషు మూఢః
ప్రలోభితాత్మా హి ఉపభోగ బుద్దా పతంగవత్ నశ్యతి నష్ట దృష్టిః11 (అధ్యా 8, శ్లో 8)
స్త్రీ పురుష దేహముల పరస్పరాకర్షణ, ధన-వస్తుసంపద, ఆభరణములు ఇత్యాది
మాయారచితమైన వస్తు- విషయజాలములను అనుభవించాలనే ప్రలోభములో పడుచున్న
జీవుడి దృష్టి - ఆ జీవునికి నష్టము, ఆపదలు కలిగించటానికే! ఇంద్రియాకర్షణలన్నీ
పై పైకి ప్రమోదంగానో, యండమావులలోని జలం వలె భవిష్యత్కాలంలో లభించబోయే
సుఖాశాసిద్ధివలెనో, వినోదంగానో కనిపించవచ్చుగాక! అంతిమ ఫలితం మాత్రం
మిడుతవలె అశాంతియే, వినాశనమే! ఇది మును ముందుగానే గమనించటం ఉచితం
అని- నేను మిడత నుండి నేర్చుకున్నాను.
12వ గురువు - తేనె టీగ
తేనె టీగలో మరొక విషయం గమనించాను.
శ్లో స్తోకం స్తోకం గ్రసేత్ గ్రాసం దేహో వర్తేత యావతా
గృహాన్ న హింసత్ న తిష్ఠత్ వృత్తిం మాధుకరీం మునిః|| (అధ్యా 8, శ్లో 9)
తేనెటీగ పుష్పముపై వ్రాలుతుంది. తేనెను కొంచం కొంచం గ్రోలుతుంది. అయితే, ఆ
పుష్పానికి ఎటువంటి చేటు కలిగించదు. పుష్పపు రెక్కలకు హాని కలుగనీయదు. అట్లాగే
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
33

రాజా! మనం సహజీవులకు ఎటువంటి హాని గాని, బాధగాని కలుగనీయకుండా, వారి
వద్ద అత్యంతసుకుమారంగా ఆహారము సహకారము మొదలైనవి స్వీకరించాలి.
అంతేగాని ఎదుటివారి అభిమానమునో, మన అధికారములో అడ్డం పెట్టుకొని - ఏనుగు
తటాకజలంతో ప్రవేశించి కలువపూతీగలను పీకి నేలపైకి విసరునట్లు - సహజీవులకు
-
కష్టం కలిగించరాదు.
ఎందుకంటే... సహజీవులంతా ఈశ్వర స్వరూపులే కదా! మమాత్మస్వరూపులే కదా!.
సన్యాసాశ్రమవాసినైన నేను ఒకే గృహస్థుని వద్ద బహుకాలం తిష్టవేసుకొని వుండరాదని,
తద్వారా మనో సంబంధ - అనుబంధం - బాంధవ్యాల వైపుగా నాకు తెలియకుండానే
నా మనస్సు ప్రసరిస్తుందని గమనించాను. పైగా, ఆ గృహస్తునికి కొంత అసౌకర్యమే
కదా! తేనెటీగ ఒకే పుష్పంపై బహుకాలం వ్రాలి ఉంటుందా? ఉండదుకదా!.
అనివార్యమైతేనే తదితరులు సహకారము- వారికి అసౌకర్యం కలిగించకుండా పొందాలి!
తేనేటీగ నుంచి మరొక విశేషం గమనించి, నేర్చుకున్నాను.
అనేక చిన్న పెద్ద పుష్పాలపై వ్రాలి తుమ్మెద తేనెను స్వీకరిస్తోంది. "ఇది చిన్న పుష్పం
కదా! నేను లెఖ చేయను గాక!" అని ఆ షత్పదము (ఆరు కాళ్ళుగల తుమ్మెద) తలచదు.
అట్లాగే బుద్ధి మంతుడు చిన్నవి- పెద్దవి అగు అనేక శాస్త్రాలు వింటూ, పరిశీలిస్తూ...
ఆ శాస్త్రముల సారాన్ని గ్రహిస్తూ వుంటాడు. ఈ శాస్త్రం వారి గురువు చెప్పింది కదా!
ఆ పుస్తకము ఆ మతము వారి దేమో? - ఇత్యాది అల్పావగాహనలు కలిగి ఉండడు.
నేను కూడా అనేక శాస్త్రములు- అనేక మంది మహనీయుల వాక్యాలు వింటూ, వాటి
సారమును గ్రహించటం అభ్యసించసాగాను. ఇది తేనెటీగ నుండి నేర్చుకొని అద్దానిని
గురుతుల్యంగా భావించసాగాను. "వారి గురువులకంటే వీరి గురువులు గొప్పవారు.
వీరికంటే మాగురువులు గొప్ప. మా శాస్త్రములు వారి శాస్త్రములకంటె అధికమైనవి"
ఇట్లా ఆలోచించటమే మానివేశాను.
తేనెటీగ గురించి ఇంకొక విషయం కూడా గమనించి ఒకానొక జాగరూకతను
ఆశ్రయించసాగాను.
తేనెటీగ అనేక పుష్పములపై వ్రాలుచు గంటగంటకు శ్రమించి తేనె తెచ్చి తేనెతుట్టెలో
గల అనేక తుట్టి విభాగములలో నింపుతూ జీవితమంతా గడపుతోంది. ఒకానొక రోజు
ఏ బోయవాడో వచ్చి ఆ తేనెతుట్టెలోని తేనెటీగలను పాల త్రోలి (లేదా) పొగతో తేనెటీగల
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
34

శరీరములను నేలకూల్చి తేనెతుట్టెను పిండి, తేనెను తన వెంట కొని పోవుచున్నాడు
కదా!.
సంసార రహస్యమును, తదనంతర పర్యవసానములను ఎఱిగిన యోగి భవిష్యత్తుకై
ఏవేవో సంపదలను పెంపొందించుకోవాలి కదా? అనే ధ్యాసకు తావియ్యడు.
జ్ఞానియగు భిక్షువు అరచేతిని తెరచి గృహిణులు సమర్పించిన ఆహారమును స్వీకరించి
వూరుకుంటాడు. రాత్రి - రేపు - మరి కొన్ని రోజులకు గ్రాసం.. అనే ఆవేశకావేశములను
పొందడు.
నేను అధికముగా సామాగ్రి సంపదలను సంపాదించి దాచుకొవటం తేనెటీగవలె
-
ఒకానొకరోజు అంతా పోగొట్టుకోవటానికే! మృత్యుపు సమీపించినవాడెవ్వడూ తన
వెంట భోజనపు మూటలను, భవనములను, బంగారు ఆభరణములను వెంటబెట్టుకొని
వెళ్లటం లేదు కదా!. ఎంతో కూడబెట్టాలి అని భావించి జీవితమంతా శ్రమించటందృశ్యము అనే స్వయంకల్పిత భావావేశముచే మోసపోవటమే కదా! - ఈ విషయం
తేనెటీగ నుండి నేర్చుకున్నాను.
13వ గురువు - మగ ఏనుగు
సుదృఢము - మహాకాయము - అత్యుత్సాహముతోకూడినది అగు ఒకానొక గొప్పతెలివైన
మగ ఏనుగు వున్నది. అది గంభీరంగా, హుందాగా సంతోషంగా కొండప్రాంతాలలోను
అరణ్యాలలోను సంచరిస్తూ వుండేది. ఆ ఏనుగు యొక్క ప్రశాంతతతో కూడిన
గంభీర్యరూపం చూసి ఆ అరణ్యంలో సంచరించే సింహము - పెద్దపులి మొదలైన
జంతువులు కూడా సగౌరవంగా చూస్తూ వుండేవి. సహ జంతు జాలములను ఎంతో
వాత్సల్యమైన-ప్రేమాస్పదమైన చూపులతో ఆ ఏనుగు ఆకట్టుకుంటూ ఉండేది!
అంతటి ఏనుగకు ఒక దుర్గుణం ఉండేది. ఆడ ఏనుగును చూడగా పరవశించి పోయి
శృంగార చేష్టలకు ఉపక్రమించి, తన యొక్క గాంభీర్యత్వమును ఒక్క క్షణంలో
సమూలంగా కోల్పోయేది.
ఒకానొక ఆటవికునికి ఆ మేఘగంభీర స్వభావియగు కొండ ఏనుగును బంధించి ఆ
దేశపు రాజుకు అప్పజెప్పి ధనం సంపాదించాలనే పేరాశ కలిగింది. ఆ ఏనుగును
బంధించాలని కందకము త్రవ్వటం మొదలైన అనేక ఉపాయాలకు ఉపక్రమించాడు.
అవన్నీ - ఆ తెలివైన ఏనుగు ముందుగానే గమనించి తగు జాగరూకతతో ఉండేది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
35

అయితే, ఆ ఆటవికుడు ఏంచేస్తే ఈ ఏనుగును బంధించవచ్చురా? అని
ఆలోచించసాగాడు. కొంతకాలము తరువాత ఆ ఏనుగు యొక్క స్త్రీచాపల్యమును
గమనించాడు. ఒక రోజు ఒక గొప్ప కందకము త్రవ్వి, ఆడ ఏనుగువలె ఘీవూ-ఘీవూ
అంటూ ఆకర్షణ ఘీంకార శబ్దములు చేయసాగాడు. ఆ అడవి ఏనుగు ఆ శబ్దాలు
విన్నది. శృంగార చాపల్యంచేత ముందు వెనుకలు చూచుకోకుండా పోయిపోయి ఆ
ఆటవికుడు త్రవ్విన కందకంలో జారి పడి బంధము తెచ్చి పెట్టుకున్నది.
ఈ సంఘటనను విన్న నేను ఆ అడవి ఏనుగు యొక్క దౌర్భాగ్యమైన పతనకారణాల
నుండి కొన్ని ముఖ్య విశేషాలు గమనించాను.
సాధకుడైనవాడు ఈ స్త్రీ-పురుష భౌతికాకర్షణలు మొ||నవాటి పట్ల అతి జాగరూకుడై
వుండాలి. పరాయి స్త్రీ మూర్తిని చేతి వ్రేళ్ళచే గాని - కాలి వ్రేళ్ళచే కూడా స్పృశించరాదు.
చేతి కఱ్ఱతో కూడా స్పృశించకూడదు. లేదా,... ఆ మగ ఏనుగవలె వ్యామోహితుడై
ఇంద్రియ విషయపరంపరలలో కూలిపోవలసివస్తుంది. ఆడ ఏనుగు క్రీగంటి చూపులకు
బలమైన గజము ఓడి నేల కూలునట్లు - సాధకునికి భౌతికాకర్షణలు మృత్యు
సదృశములు. అతని మహాశయములు కూడా అల్పాకర్షణలచే కూల్చివేయబడతాయి.
కాబట్టి ఓ మహారాజా! మృత్యువుతో పోల్చతగిన నామ రూపాత్మకమైన భౌతికాకర్షణలపట్ల
అత్యంత జాగరూకుడనై వుండటం ఆ అడవి ఏనుగు యొక్క దుస్థితి నుండి
నేర్చుకుంటున్నాను. ఓ ఇంద్రియాకర్షణములారా! మీరు దూర దూరంగా ఉండి!....
అను అభ్యాసము కలిగి ఉంటున్నాను.
14 వ గురువు - తేనెతుట్టెల నుండి తేనె గ్రహించేవాడు
న దేయం నో ఉపభోగ్యం చ లుభైః యత్ దుఃఖసంచితమ్
భుంక్తి తదపి తచ్ఛ అన్యో మధుహేవ అర్ధవిత్ మధుః|| (అధ్యా 8, శ్లో 15)
ఓ రాజా! తేనెతుట్టి నుండి తేనెను గ్రహించువాడిని గమనిస్తూ... లోభగుణం యొక్క
పర్యవసానమేమిటో పాఠ్యాంశంగా నేర్చుకున్నాను. తేనెటీగ ఎంతో కష్టపడి సంపాదించిన
తేనె తాను అనుభవించక ఇతరులకు దానమివ్వక జీవిస్తోంది. ఈ లోగా ఏ బోయవాడో
ఒకానొక రోజు వచ్చి తేనెను ప్రరిగ్రహించి తేనెటీగలను బయటకు వెడలత్రోయుచున్నాను.
ఈ ప్రపంచంలో ఎన్నో శ్రమలకు ఓర్చి సంపాదించిన ధనం లోభి నాది -నాది అని
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
36

అనుకుంటూ చూసుకుంటూవుంటున్నాడు. తాను తినడు, అనుభవించడు. ఇతరులకు
పెట్టడు. ఒకానొకరోజు మృత్యువు వచ్చి ఈ జీవుని కాళ్ళకు చేతులకు బేడీలు వేసి తన
వెంట గొనిపోతోంది. ఆలోభి దాచిన డబ్బు దొంగలపాలో, దొరలపాలోకావటం
అనివార్యం కదా! అందుచేత తన సంపదలను నలుగురిని ఆనందింపజేయటానికి
వినియోగించేవాడు తెలివికలవాడు. దాచి-దాచి, అవి అట్లా అట్లా చూచుకుంటూ,
చివరికి దేహము వదలి పోతూ... లోభ గుణం చేత సంపదల సముపార్జనశ్రమనుండి
పొందవలసిన దాన పుణ్య ప్రయోజనం పొందనివాడు తెలివి తక్కువవాడుకాక,
మరింకేమిటి? లోభగుణం మనస్సును అనేక దుఃస్థితులకు-అల్పజన్మలకు గొనిపోతూ
వుంటుంది.
ఇది గమనించి నేను, లోభగుణాన్ని దాన గుణంతో నిత్యము జయిస్తూ వుండాలి అనే
పాఠ్యాంశాన్ని మననం చేయసాగాను. దానం చేయటం చేతగాని ఇంటిలోకి లోభగుణం
వచ్చి పెత్తనం చెలాయిస్తుంది. ఆ యజమానిని తన సేవకుడిగా చేసుకుంటుంది
అని గమనించాను.
15వ గురువు - వేటగాని సంగీత శబ్దాలు - జింక
ఒక వేటగాడు అడవిలో సంచరించే లేడిని బంధించటానికి ఇంపైన సుందర సంగీత
శబ్దములను వినిపించి ఆ లేడిని ఆకర్షిస్తాడు. ఆరీతిగా, జన్మ అనే అవకాశాన్ని
సద్వినియోగ పరచుకోవలని అనుకునే సాధకుడు (ముముక్షువు) విషయ సంబంధములైన
గీతములను (The songs pertaining to wordly attractions) వింటూ వింటూ
వుండటం ఉచితం కాదు. లేడివలె ఆకర్షించబడకూడదు.
స్త్రీల నృత్యం - గానం - శృంగార మొదలైన గీతములందు ఆసక్తి కలవాని మనస్సు
వాటివాటియందు ఆకర్షణ పెంపొందించుకొనుచు ఇక వాటికి బందీ అయిపోతుంది.
ఋషి గర్భమునుండి జన్మ పొందిన ఋష్యశృంగుడు అనే మహాముని
విషయసంబంధమైన గీత నృత్యాలయందు ఆసక్తుడై తపోమార్గం నుండి చ్యుతి పొందటం
జరిగిందని మనం (శ్రీమద్రామాయణంలో) విన్నాము కదా!.
అందుచేత నృత్య-గీతములందు, సంసార (దృశ్య) సంబంధమైన సమాచారములందు
ఆసక్తిని కలిగివుండటం ప్రమాదకరమైనది. అవి నాయొక్క ధ్యానము - తపస్సు ఇత్యాది
ప్రయత్నములకు అవరోధము - చ్యుతి కలిగిస్తాయి. అందుచేత లేడివలె శబ్దాకర్షణకులోనై
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
37

ప్రమాదములను ఆహ్వానించరాదు - అనే విషయం నేర్చుకున్నాను. ఆధ్యాత్మిక పురోగతికి
అవసరంలేని లౌకిక సమాచారములకు సంఘటనలకు దూరంగా వుండటం
అలవరచుకున్నాను.
16వ గురువు - ఎరకు ఆకర్షితమై గాలమునకు చిక్కుకుంటున్న చేప
చేప గాలమునకు తగిలించిన ఎరకు ఆకర్షితమై పోయి గాలములో చిక్కుకుంటోంది.
ఈ జిహ్వ (నాలుక) దేహానికి ముఖ్యద్వారం వంటిది కదా! తదితర ఇంద్రియాలన్నీ
నిరాహారం (Non using) చేస్తూ వుంటే క్రమంగా అవి జీవునిపై ప్రభావం చూపటం
సన్నగిలుతుందేమో! కానీ ఈ నాలుకయో? దీనిని నిరాహారం చేస్తూ వున్నకొలది రెచ్చి
పోతూ వుంటుంది. ఆహారం తిననివాడు కోపంగా వుంటాడు కదా! జిహ్వచాపల్యం
మరింత అధికమౌతుంది!.
శ్లో॥ తావత్ జిత ఇంద్రియో న స్యాత్ విజిత అన్య ఇంద్రియః పుమాన్,
న జయేత్ రసనం యావత్ జితం సర్వం... జితే రసే (అధ్యా 8, శ్లో 21)
ఈ రసేంద్రియం జయించటం అతి ముఖ్యమైన పని. అన్ని ఇతర ఇంద్రియములను
జయించినప్పటికీ.. రసేంద్రియాన్ని జయించనంతవరకు ఇంద్రియములపై విజయం
లభించనట్లే! రసేంద్రియాన్ని వశం చేసుకున్నామా... అన్ని ఇంద్రియాలను జయించినట్లే!
అందుచేత చేప వలె కాకూడదు నేను. ఈ రసేంద్రియాన్ని (నాలుకను) జయించి
వుండాలి. ఎప్పుడు ఏది ఆహారంగా లభిస్తే అద్దానిని ప్రసాదంగా భావించాలి. అంతేగాని
నాకు ఆ రుచి ఇష్టం! ఈ పదార్ధాన్ని మాత్రమే తింటాను. అని తిష్టవేసుకొని కూర్చోను.
అట్టి మార్గంలో రసేంద్రియాన్ని జయించే ప్రయత్నాలు చేయసాగాను!.
అంతేకాకుండా, సాత్వికమైన ప్రేమ పూరితమైన సంభాషణలతో రసేంద్రియ దేవతను
ఉపాసించ నిశ్చయించుకున్నాను. వాక్కు సత్యం శివం సుందరంగా వుండటమే వాక్తపస్సు కదా!
17వ గురువు - పింగళి అనే పేరు గల ఒక వేశ్య
ఓ యదుమహారాజా! ఇక నా 17వ గురువు గురించి చెప్పుతాను. విను.
ఒకానొకప్పుడు పెద్దలచే చెప్పబడిన ఒక ఉదాహరణ నాకు గురువై, నేను నేర్చుకోవలసినది
గుర్తు చేయసాగింది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
38

ప్రాచీన కాలంలో...., విదేహనగరంలో (మిథిలానగరంలో) పింగళ అనే ఒక వేశ్య
వుండేవారు. ఆమె ఒక రోజు సాయంకాలం సుందరంగా అలంకరించుకొని వాకిట
నిలుచుని ధనము ఇవ్వగల విటులను ఆకర్షించే ప్రయత్నం ప్రారంభించింది.
ఎవరో ఒకరు ఆత్రోవన రాగానే "ఈతడు నేననుకున్నంత ధనం ఇవ్వడేమో! ఈతనిని
పోనిద్దాం. ఇంకో పెద్ద ధనికునికోసం మరికొంత వేచి ఉందాం!" అని భావిస్తూ వేచి
వుండసాగింది. ఆమె మనస్సులో దురాశ కొండంతగా ఎదగసాగింది. చాలా సేపు
ఎదురుచూచింది.
ఇంతలో ఆమెకు నిద్రముంచుకురాసాగింది. అయినా సరే, ఎట్లాగో అట్లా నిద్రను త్యజించి
తన ప్రయత్నాలు కొనసాగించింది. ఇంట్లోకి పోవటం, కొంచం నడుం వాల్చడం,
మరల ప్రవేశద్వారం వద్దకు వచ్చి కులుకు - బెలుకులు చూపుతూ నిలుచోవటం,
చాలా సేపు అటువైపుగా ఎవ్వరూ రాకపోవటం, వచ్చినవారు ధనికులు కాకపోవటం..
ఇట్లా తెల్లవార్లూ... వేచి వేచి వుండసాగింది. ఆమెలో ధనాశ-పేరాశ దురాశ అధికమై
ఇక, ఆమెనిరుత్సాహపడుతూ ఊసురోమనసాగింది. అనుకున్నట్లుగా ధనం ఇవ్వగలిగిన
విటుడెవ్వడూ తారసపడక పోవటంచేత ఆమెలో కసి కోపం ఆవేశం
నీరసంతోకూడిన ఆక్రోశము అధికాధికం కాసాగాయి.
ఈ విధంగా నిమిషాలు గంటలు గడచిపోయాయి. ఒకానొక సమయంలో ఆమెకు
విటులపై - వారిచ్చే ధనంపై గల అనురక్తి కాస్తా విరక్తిరూపం దాల్చసాగింది. వైరాగ్య
భావాలు ఆమెలో ఉదయించసాగాయి.
ఓ రాజా! ఏవేవో ఆశించటం నిరాశ పొందటం అనే దురభ్యాసమే సంసారము
అనబడుదాని మూల పదార్థం (Raw-material)కదా! అందుకు ఔషధం? వైరాగ్యమే
సుమా!
ఉత్తములు "నిరాశా" సందర్భములను "వైరాగ్యం" గా మలచుకుంటారు. అంతేగాని
ఊసూరుమంటూ ఊరుకొని వుండరు.
శ్లో నహి అంగాజాత నిర్వేదో దేహబద్ధం జిహాసతి,
యథా విజ్ఞానరహితో మనుజో మమతాం! నృప! (అధ్యా 8, శ్లో 29)
ఓ యదు మహారాజా! విజ్ఞాన రహితుడైన మనుజుడు మమకారమును (నాది, నాకు
సంబంధించినదే... అనే భ్రమావేశమును) వదలుకో గలడా? లేదు. ఉత్తమమైన
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
39

వైరాగ్యం పొందనంతవరకు ఈ జీవుడు దేహముతో అనుబంధరూపమైన బంధమును
వదలటానికి ఇష్టపడడు.
విరక్తి-వైరాగ్యము పొందిన ఆ పింగళమాత్రం ఏవిధంగా వైరాగ్య మార్గము గురించి
గానం చేసిందో, .చెపుతాను, వినండి.
పింగళ : ఓ సహజనులరా!
శ్లో అహో! మే మోహవితతిం పశ్యతా విజితాత్మనః
యా కాన్తాత్ అసతః కామం కామయే యేన బాలిశా (అధ్యా 8, శ్లో 30)
అహో! ఈ ఇంద్రియములకు ఆధీనంఅయి వాటిచే జయింపబడి వుండటం చేత, నేను
ఎంతటి మోహంలో పడిపోయానో గమనిస్తున్నారా? నా వివేకమంతా నశించటం
చేతనే స్వప్నసదృశులగు (వాస్తవానికి లేక పోయినప్పటికీ కలలో కనిపించి మాయమయ్యే
వారితో సమానమగు) దుష్టపురుషులకు తుచ్ఛ విషయసుఖముల కొరకై దాసో హం
అయిపోతున్నాను. ఇదంతా ఎంతటి దుఃఖ విషయం!
నాకు నిజంగానే బుద్ధి నశించింది. ఎందుకిట్లా అంటున్నావని అడుగుచున్నారా! అయితే
వినండి!
సర్వతత్త్వస్వరూపుడగు పరమాత్మ ఈ జగద్రూపుడై, సర్వజీవులకు సుఖప్రదాతయై,
సర్వులకు సంపదలను ప్రసాదించువాడై, నిత్యుడై, ప్రతి ఒక్కరికి ఆత్మసముడై కళ్ళకు
ఎదురుగా వేంచేసియే ఉన్నారు. అట్టి పరతత్త్వ స్వరూపుడగు ఆత్మారాముని
ఆశ్రయించటం ఏమరచాను. ఆజ్ఞానం చేత సమర్థత లేనివారు, కోరుకున్న నిత్యసుఖాన్ని
ఇవ్వలేని వారు, పైగా దుఃఖము - భయము - శోకము- మోహములను ప్రసాదించేవారు
అగు భౌతిక దేహాలని- దేహులను ఆశ్రయించానే! ఇంతకన్నా తెలివితక్కువదనం
ఇంకెక్కడన్నా వుంటుందా?
అహాఁ! ఎదో బ్రతుకుతెరువు కోసం ఈ వేశ్యవృత్తిని ఆశ్రయించాను. ఈ శరీరాన్ని
పోషించుకోవటానికి దీనికి అలంకారాలు షోకులు చేసి ఈ దేహాన్ని విటులకు
సమర్పిస్తూ వచ్చాను. ఎవ్వరైనా పిల్లలను పోషించుకోవటానికి ఆ పిల్లలనే అమ్ముకోవటం
ఎంత అర్థంలేని విషయమో.. నా విషయం అంతే కదా...! శరీరమును పొందింది
మనస్సును నిర్మలము - శక్తి యుతము చేసుకోవటానికే అయివుండగా.. ఇప్పుడు ఈ
శరీరమును మనస్సును కూడా వేశ్యవృత్తిద్వారా మరింత కలుషితం చేసుకుంటున్నానే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
40

ఈ పవిత్రమైన శరీరాన్ని నేను లోభులకు - మూర్ఖులకు, ఇంద్రియలోలులకు, లంపటులకు
వ్యర్థవాక్యకలాలాపులకు, అధర్మ నిరతులకు ధనాశచే అప్పగించి ఎంత ఆత్మ ద్రోహం
చేసుకుంటున్నాను! మోక్ష సాధనమగు ఈ శరీరమును ధనము కోసము-రతి కోసము
మూర్ఖురాలనై ఇంతకాలం దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నానే!.
ఈ నాశరీరము ఎటువంటి దంటే.. ఇది ఒక చూరిల్లు వంటిది. దీనిలో వెదురు
బొంగుల స్థంభములవలె బొమికలు అమర్చబడి వున్నాయి. బొమికలు-చర్మముచే,
వెంట్రుకలచే, గోళ్ళచే కప్పబడివున్నది. ఈ దేహ గృహానికి 9 ద్వారాలు వున్నాయి.
(రెండు కళ్లు, రెండు చెవులు, రెండు ముక్కుపుటాలు, నోరు, గుదము, గుహ్యము).
ఈ 9 ద్వారాలనుండి ధూళి దుర్వాసనలతో - కూడిన జలము - కళ్ళె -మలము
మూత్రము ఇత్యాది దుర్గంధభూయిష్టమైన పదార్థాలు ఎల్లప్పుడూ బయల్వెడలుచూ
వుంటాయి. దీనిలో దాగివున్న సంపదలు మలము-మూత్రము మొదలైన దుర్వానదుమ్ము - దుష్ట పదార్ధములతో కూడిన పదార్ధములు, రక్త - మాంస -బొమికలే కదా!
ఇటువంటి ఈ శరీరములో ఒకరు అభిమానించటానికి గాని, మరొకరు, ద్వేషించటానికి
గాని విలువైన - పనికి వచ్చే పదార్ధ మేమున్నది? ఈ నా వెంట్రుకలు - మలము
దుష్టరసములు - మూత్రము - రక్త మాంస బొమికల శరీరంలో విటులకు కనిపిస్తున్న
ఆనంద వస్తువేమిటి? ఇక వారిచ్చే ధన సంపదచే ఈ నా దేహము క్రొత్తగా పొందుచున్న
దేమిటి? ఇదంతా పరస్పరం మోసగించుకొని ఒకరికొకరం లంపటంలోకి (బురదలోకి)
త్రోసుకోవటమే అవుతోంది. శబ్ద స్పర్శరూప రస గంధ శక్తులతో కూడిన ఈ శరీర
గృహంలో ప్రవేశించినది ఎందుకు? అజ్ఞాన ప్రవృత్తులను మరింత దట్టంగా ప్రవృద్ధి
పరచుకోవటానికా? కాదు. కాకూడదు!
నాయందు ఆత్మానంద స్వరూపుడై సర్వదా వేంచేసియున్న నాప్రియమైన శ్రీహరిని
ఏమరుస్తున్నానే? తుచ్ఛము - దుఃఖ ప్రదము అగు భోగ వస్తువుల కోసం అన్యజనులగు
విటులు మొదలైన వారిని ఆశ్రయిస్తున్నానే? ఇంతటి మూఢత్వం ఇంకెక్కడన్నా
వుంటుందా? ఈ విదేహనగరంలో నా కన్నా తెలివి తక్కువవారు మరెవ్వరూ వుండరేమో?
ఇంటిలో గల మధుర పదార్థాలను తినటానికై వంటగది తలుపులు తెరవటానికి
బద్ధగించి,.... ఒకామె ఒకబొచ్చె తీసుకొని ప్రక్కింటివారిని మాధవకోళం కొరకై
బిచ్చమెత్తటం-వంటిదే కదా, నాయొక్క విటులనుండి ధనాశ!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
41

ప్రతి ఒక్క జీవునికి అత్యంత ప్రియమైన వస్తువు - ఆతని అంతరంగమునకు సాక్షిగా
వేంచేసియున్న శ్రీహరియే! ఆయనయే అందరికన్నా ప్రియతమము, స్నేహితుడు,
శ్రేయోభిలాషి, ప్రభువు, అంతర్యామి, ఓదార్చేవాడు, తోడైననాడు కూడా! ఆ లక్ష్మీ
సమేత శ్రీమన్నారాయణుని "ఆత్మ నివేదన" అనే ఉపాయంతో "ఆత్మార్పణ" అనే ధనంతో
కొనుక్కొని శాశ్వతసుఖం సంపాదించుకోవాలి. ఆయనతో కూడి విహరించాలి. ఈ
విటులతో కాదు.!. పాంచభౌతికము - భ్రమాత్మకము - దుఃఖపర్యవసానము అగు
ఇంద్రియ విషయములతో కానేకాదు!
ఇక జగత్తు విషయమంటారా! ఇందులో కనిపించేదంతా కాలముచే వచ్చి - పోతూ
వుంటుంది. ఒకరికి మరొకరు కలిగించగల సుఖమెంతటిది? ఆయా కామప్రదులగు
జీవులతో సంబంధముచే అజ్ఞాన జనితమైన కోరికలు పెంపొందించుకోవటమే
అవుతుంది. కోరికలు కలిగి వుండటమే సర్వ దఃఖాలకు మూలకారణం. కోరికలు,
తీరాలని మానవులను ఆశ్రయించి ఏం ప్రయోజనం? దేవతలంతటివారు వారి భార్యలకు
ఏం సుఖం కటబెట్ట గలిగారు?
అమ్మయ్య! ఏ జన్మలో ఏం గురుసేవ చేశానో ఏమో? ఏ సత్కర్మల ప్రభావం చేతనో
సర్వాంతర్యామి యగు విష్ణు భగవానుడు నాకు ఈరోజు స్ఫురిస్తున్నారు. ఆయన నాపట్ల
ప్రసన్నుడు అవటం చేతనే నా లోని దృశ్యతాపత్రయం నీర్వేదమౌతోంది. ఆయన కృపచేత
నాకు వైరాగ్య సంపద ఉద్భవించి క్షణక్షణం ప్రవృద్ధమౌతోంది. ఈ వర్తమాన వైరాగ్యము
నాకు శాశ్వత సుఖమును ప్రసాదించటానికే అయివున్నది.
అహా! ఇంతకాలం నేను పొందిన కష్టాలే నాకు బాధగురువులు. కష్టాలే వుండి వుండకపోతే
వైరాగ్యము అనే సౌభాగ్యం నా బుద్ధికి ప్రాప్తించేది కాదుకదా! క్లేశాలే ఇంద్రియ
విషయముల పట్ల వైరాగ్యము ప్రసాదించి, బంధమును త్రెంచి శాంతికి మార్గమును
ప్రసాదిస్తాయి. అన్నీ ప్రసాదించేది పరమాత్మయేకదా! కష్టాలు ప్రసాదించిననట్టి ఆ
పరమాత్మకు నేనిప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శిరస్సు వంచి
నమస్కరిస్తున్నాను. ఆయన కరుణచే ఈ రోజునేను దురాశను వదలి ఆ జగదీశ్వరుని
శరణువేడుచున్నాను. ఇప్పుడు... ఇక నేను ఏం చేయాలి? అప్రయత్నంగా
భగవదనుగ్రహంచేత లభించిన శేష జీవితము అనే అవకాశాన్ని సంతోషంగా
శ్రద్ధగా సద్వినియోగ పరచుకొంటాను. సర్వాత్ముడు - మమాత్మస్వరూపుడు అగు ఆ
సర్వేశ్వరునితోనే ఇకనుంచి విహరిస్తాను.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
42

అవును! ఈ జగత్తంతా కాలము అనే సర్పముచే మ్రింగి వేయబడియే వున్నదని
వర్తమానంలో అందరము గమనించియే వుండటం ఉచితం. వివేకి అయినవాడు సర్వ
విషయముల పట్ల అనురక్తిని దరిచేరనీయడు. ఎవ్వడు ఎల్లప్పుడు సర్వ విషయముల
పట్ల విరక్తుడై వుంటాడో, అట్టివాడుమాత్రమే మాయనుండి తనను తాను
రక్షించుకున్నవాడగుచున్నాడు. నేను శేషజీవితాన్ని వైరాగ్యసమన్వితంగా, సర్వాత్మకుడగు
మహావిష్ణు సమర్పితంగా, భగవతమహిమాగానపూర్వకంగా, మహానీయుల
ఆప్తవాక్యముల మననముతో గడిపెదనుగాక!.
ఓ యదు మహారాజా! ఆ పింగళ ఈ విధంగా ఆలోచన కొనసాగించింది. విటులతో
సమాగమం, దేహమును అమ్ముకొని ధనం సంపాదించటం మొదలైన ఆలోచనలను
అప్పటికప్పుడు పరిత్యజించింది.
క్రమంగా - సర్వరూపములు తానై, సర్వసాక్షి అనగవేరై- సర్వ బ్రహ్మాండములకు
తానె సూత్రధారియై సర్వ జీవ బుద్ధులందు సంకల్ప వికల్పములను సర్వత చేయుచు
నిర్వికల్పుడగు– అటువంటి విష్ణుతత్త్వాన్ని మననం చేస్తూ ప్రశాంతంగా నడుం వాల్చింది.
అప్పడు ఆమె హాయిగా నిదుర ఆస్వాదించసాగింది.
ఓ రాజా! ఇంద్రియ సుఖాలు త్యజించి ఆత్మేశ్వరుని శరణువేడటం అనేది ఆ పింగళ
అనే వేశ్య దగ్గర నేర్చుకున్నాను. కష్టాలు- కష్టపెట్టేవారు కూడా నాకు గురువులే!
వైరాగ్యమును నేర్చుకోవటానికి సహకరిస్తున్నారు కదా!
18వ గురువు కురర పక్షి (లకుముకి పిట్ట)
ఒకానొక చోట ఒక లకుముకి పిట్ట ఒక సుందరవనంలో హాయిగా ప్రశాంతంగా
ఆనందిస్తూ రోజులు గడపుతూ వుండేది. ఒక రోజు ఆ పిట్టకు మధురమైన మాంసాహారం
ఒక గుట్టగా దొరికింది. ఆహా! సాధ్యమైనంత అధికంగా నోట కరచుకొని గూటికి చేరి
సంతానంతో బంధు మిత్రులతో ఈ మాంసాహారాన్ని ఆస్వాదించెదను గాక! - అని
అనుకున్నది. పొడవైన ముక్కు నంతా కప్పివేయగల మాంసపు ముక్కలను నోటకరచుకొని
బయల్వెడలింది. కొన్ని వేరైన పెద్ద పిట్టలు ఆ లకుముకి పిట్టను చూసి- ఈ ఆహారం
దీని నుండి బలవంతంగానైనా లాగివేసి భుజిద్దాం అని అనుకున్నాయి. వెంట బడి
తమ ముక్కులతో ఆ పిట్టనుహింసించసాగాయి. ఇక ఆ లకుముకి పిట్ట ఆ తదితర
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
43

పిట్టల హింసలకు తుట్టుకోలేక పోయింది. ఏం చేయాలి? దానికి ఓ ఉపాయం తోచింది.
వెంటనే ఒక బండరాయి పై వ్రాలింది. నోటనున్న మాంసపు ముక్కలను అక్కడ
బండరాయిపై వదలి తుఱ్ఱున గాలిలోకి ఎగిరింది. అప్పుడు పిట్టను వెంటబడి బాధిస్తున్న
తదితర పక్షులు ఆ పిట్టను హింసించటం ఆపాయి. వదలిన మాంసపు ముక్కలకై
బండరాయివైపుగా పరుగులు తీశాయి.
చూసావా, యదు మహారాజా! ఆ లకుముకి పిట్ట యొక్క అనుభవానికి శిష్యుడనై
ఒకానొక ముఖ్యమైన విశేషం నేర్చుకొని పాటించసాగాను.
పరిగ్రహో హి దుఃఖాయ యద్వత్ ప్రియతమం నృణామ్
అనంతం సుఖమాప్నోతి తద్విద్వాన్ యస్తు అకించనః (అధ్యా 9, శ్లో 1)
స్వయమానంద స్వరూపుడగు ఈ జీవుడు దుఃఖం పొందటానికి అసలు కారణం ఏమిటి?
ఆసక్తియే సుమా! ఈ ఈ వస్తువులు నాకు ప్రియాతి ప్రియములు అని మననం చేస్తూ
క్రమంగా –తనకు తెలియకుండానే-సుఖ-దుఃఖ భావ పారవశ్యానికి లోను అవటం
చేతనే! ఇది ప్రియం ఇది అప్రియం అనే పరిమిత భావావేశములను, అల్ప ఆశయములను
పరిత్యజించిన మరుక్షణం సర్వ దుఃఖాలు తమకు తామే తొలగిపోతాయి.
ఆ లకుమిక పిట్ట మాంసపు ముక్కను త్యజించినట్లు - వీరు మాత్రమే నాకు చెందినవారు.
నేను వీరికి మాత్రమే చెందిన వాడిని అనే హ్రస్వదృష్టులను త్యజించసాగాను.
క్రమక్రమంగా మానావమానములకు సంబంధించిన, బంధువుల-సంబంధీకుల, భార్య
పుత్ర సంబంధమైన సర్వ చింతలను త్యజించసాగాను. నాది-నాకుండాలి నాకే వుండాలి
నాకు చెందినవి సంరక్షించుకోవాలి.... ఇటువంటి లోభ-మోహాలు దూరంగా ఉండేటట్లు
జాగ్రత్తపడుచున్నాను.
19వ గురువు బాలుడు
ఒక బాలుడు అన్నీ మరచి ఆటలలో లీనమై కేరింతలు కొడతాడు చూచారా? అట్లాగే
నేను ఆత్మసందర్శానందము అనే క్రీడా స్థలంలో బాలునివలె క్రీడోత్సాహంతో క్రీడించటం
ప్రారంభించాను. ఈ జగత్తులో ఇద్దరు మాత్రమే చింతా రహితులై ఇదంతా ఆట
స్థలంలాగా ఆస్వాదిస్తూ విహరిస్తున్నారు. పరమానందాన్ని అనుభవిస్తున్నారు.
1. చిన్నపిల్లవాడు. ఈతనికి సంపద ఆపదల గురించి ఏమీ తెలియదు కనుక, ఆశ
భయం లేకుండా హాయిగా ఆటలలో లీనమై ఆనందిస్తున్నాడు, అయితే ఇది అజ్ఞానంతో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
44

కూడిన నిశ్చేష్టత చేత! విషయాలేమీ ఇంకా తెలుసుకొని వుండకపోవడం చేత - లభిస్తున్న
బాలానందమేగానీ అఖండానందం కాదు.
2. గుణాతీతత్వం ఆశ్రయించిన జ్ఞాని. ఈతనికి కనబడేదంతా ఆత్మయే! సత్య-నిత్య
నిర్మల స్వస్వరూపాత్మయే జగత్తు రూపంగా ఇంద్రియములచే పొందబడుతోంది
అని గమనించి, ఆత్మసాక్షాత్కారం ఆస్వాదిస్తున్నాడు. కష్ట-సుఖాలు ఇత్యాదులన్నీ ఆతనికి
జగత్ క్రీడా విశేషాలుగా అయి ఉంటాయి.
నేను గుణాతీతుడనై ఈ దృశ్యమును క్రీడగా ఆస్వాదిస్తూ బాలునిలా కేరింతలు కొట్టడం
- లీనం కాకుండానే క్రీడగా వీక్షించడం అభ్యసించసాగాను.
20వ గురువు : కన్యక గాజుల గల గల త్యజించి ధాన్యం దంచటం
ఓ యదుమహారాజా! "నాకు ఈ బాధలు ఆ బాధలు ఉన్నాయి సుమా! నేనే ఎంతో
కష్టపడుచున్నాను! నేను అంతటి వాడిని. వారేమో మంచివారు కాదు! వారందరూ
లోపాలు గలవారే!" - ఇటువంటి మాటలు పరస్పరం రోజుల తరబడి చెప్పుకోవటం
రజో తమో గుణాధిక్యత చేతనే!
ఇతరులతో ఏదో మన కష్టాలు చెప్పి, ఇతరుల తప్పుల గురించి మరొకరితో మాట్లాడి
స్వాంతన పొందాలనుకోవటం ఆధ్యాత్మమార్గంలో ముందుకు అడుగు వేయలేక
పోవటానికి స్వయంకృత దోషంగా కల్పించుకుంటున్న అవరోధాలు! నిరోధాలు!
తమోగుణంచేతనే - "నాకు వారి వలన వీరి వలన కష్టాలు వస్తున్నాయి. వారు ఇటువంటి
వారు. వీరు అటువంటివారు" - అనే మాటలు మనస్సులోంచి వుబుకుతున్నాయి.
రజోగుణం చేతనో ఇదంతా నా కర్మ! పూర్వకర్మల దోషం! - అని అనిపిస్తూ వుంటుంది.
సత్వగుణంచేత, ఈ కష్టసుఖాలు పరమాత్మ నన్ను బాగు పరచటానికి ప్రసాదిస్తున్న
పరీక్షావిధానాలు! –అని భావించబడుచున్నాయి. (These are all teachings but not teasing)
గుణాతీతునకో, "ఇదంతా నాటకం! లీల! క్రీడ! స్వప్నం వంటిది! కథా శ్రవణం
వంటిది!" - అనే అవగాహన పరిపుష్టిపొందుతూ వుంటుంది.
ఇదంతా ఒక సందర్భములో ఒక కన్యక వడ్లుదంచుతూ ఆశ్రయించిన ఒక ఉపాయం
నుండి నేర్చుకున్నాను. ఆ కథా విశేషం చెప్పు చున్నాను. వినండి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
45

కనకావతి అనే పురంలో పుణ్య కార్యములు - దాన గుణములు పరోపకారము
మొ||న ఉత్తమ గుణములచే లోక ప్రసిద్ధి - ప్రశంసలు పొందుచున్న ఒకానొక
రైతుకుటుంబం వుండేది. వారి ఇంటిలో సుగుణాల రాసి, సౌందర్య రాసి అయిన ఒక
కన్యక వుండేది. "ఒకసారి ఏమి జరిగిందంటే ..., ఆహాఁ! ఈమె మాయింటికి కోడలుగా
వస్తే ఎంత బాగు! లక్ష్మీదేవి వేంచేసినట్లే!" అని అపరిసరాలలోని చాలా ధనికుడైన
ఒకానొక ఉత్తమ కుటుంబీకుడు తలచాడు.
ఒకానొక రోజు.. కాబోయే వరుడు, అతని తల్లిదండ్రులు, తదితర బంధువులు ఆ
కన్యను చూడటానికి పెళ్ళిచూపులకు వచ్చారు.
ఆ సమయానికి ఇంటి పెద్దలు వేరే పని మీద బయటకు వెళ్ళివున్నారు. వారంతా
తిరిగి రావటానికి కొంచం సమయం పట్టేట్లుగా వున్నది. ఇంటిలో ఆ కన్యక మాత్రమే
వున్నది. అభ్యాగతిః స్వయం విష్ణుంః అని పెద్దల భాష్యంకదా! వచ్చినవారికిక అతిథి
మర్యాదలు చేయటం గృహస్థధర్మం. పైగా మగ పెళ్ళివారాయె! ఆమె సిగ్గుతో చిరునవ్వుతో
వారందరిని అహ్వానించి అసనాలు సమకూర్చింది. అటు తరువాత వారికి ఆహార
పానీయాలు సమకూర్చే ప్రయత్నాలు ప్రారంభించింది.
ఆ రైతు కుటుంబం సద్గుణములచే లోక ప్రసిద్ధమే అయినప్పటికీ ధన ధాన్య సంపదలతో
తులతూగే కుటుంబమేమీ కాదు. ఇంటిలో అప్పుడు చూసుకుంటే అతిథులందరికీ
భోజనము పెట్టగల బియ్యము ఉన్నట్లుగా లేదు. అందుచేత ఆకన్య కొట్టంలోంచి వడ్లు
తెచ్చి అప్పటికప్పుడు వంట ఇంటిలో రోకలితో దంచటానికి ఉపక్రమించింది.
వడ్లు దంచటం ప్రారంభించగానే ఆమె రెండు చేతులకు నిండుగా గల గాజులు బహు
సుందరంగా గల గల శబ్దం చేయసాగాయి. వెంటనే ఆమె దంచటం ఒక్క క్షణం ఆపింది.
"అరెరే! ఈ నా గాజుల శబ్దం ఈ వచ్చిన మగపెళ్లివారికి వారి బంధువులకు
వినబడుతుందేమో? వినబడితే ఇప్పటికిప్పుడు నేను వడ్లు దంచుచున్నానని వారికి
తెలిసిపోతుంది. అనగా, ఈ ఇంటిలో బియ్యం సమృద్ధిగా వుండవని, మేము పేద
వారిమని, పనివారు ఎవ్వరూ లేరని, నేనే వడ్లు దంచుచున్నానని వారు అభిప్రాయ
పడతారు. కుటుంబంలోని కష్టసుఖాలు ఇతరులకు తెలియటం ఉచితం కాదు కదా!
అది ఇంటి పరువుకు శోభకాదు. అట్లా అని, బియ్యం దంచకపోతే, మా ఇంటి పెద్దలు
వచ్చిన తరువాత బియ్యము కొరకై బయటకు వెళ్ళటంకూడా మర్యాదకానే కాదు. అతిథుల
ముందు ఆహార సామాగ్రి తేవటం గౌరవప్రదం కాదు. మరిప్పుడు ఏమి చేయాలి?..
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
46

ఇట్లా యోచిస్తూ చేతి గాజులను చూచుకుంటూ ఉన్నది. ఇంతలో తెలివిగలది సౌభాగ్యవతి
అగు ఆ కన్యకు ఒక ఉపాయం తళుక్కున తోచింది. వెంటనే ఈ చేతికి ఆ చేతికి రెండు
రెండు గాజులు మాత్రమే వుంచి, మిగతాగాజులన్నీ తీసి ప్రక్కన పెట్టి ఇక నెమ్మదిగా
వడ్లు దంచసాగింది. ఈ ఇంటి కన్యకయే వడ్లు దంచుతోంది- అనే విషయం చావడిలో
ఆసీనులైన పెళ్ళికొడుకు వైపు బంధువులకు తెలిసే అవకాశం లేకుండా చేసింది. అయితే...
అప్పుడు ఆమె ధాన్యం దంచుతూ వుంటే రెండు రెండు గాజుల శబ్దం మాత్రమే
వెలువడసాగింది. ఈ మాత్రం గాజుల శబ్దం కూడా ఉచితం కాదు. ఇంటి గుట్టు రచ్చకు
ఎందుకు ఎక్కాలి? అని తలచి ఆ కన్యక ఒక్కొక్క గాజును కూడా తీసి వేసింది. అప్పుడు
ఈ చేతికి ఆ చేతికి ఒక్కొక్క గాజు మాత్రమే మిగిలివున్నది. అసలు గాజుల శబ్దమే
కావటంలేదు.
ఓ యదుమహారాజా! జనుల ఆచార వ్యవహారాలు పరిశీలించే నిమిత్తం అనేక ప్రదేశాలు
సంచారం చేస్తూ దైవికంగా ఆ పురం వెళ్ళిన నేను ఈ సంఘటనను స్వయంగా గమనించాను.
అనేక మంది జనులు వున్నచోట అసంగతమైన సంభాషణ - అనుచితమైన అభిప్రాయాలు
దోష నిర్ణయాలు, ఆవేశకావేశాలు, కలహాలు, తప్పొప్పుల మననములు జరుగుతూనే
వుంటుందిగాని, శాశ్వత శ్రేయష్షు గురించి తగినంత యోచన జరగటం చాలాసార్లు
జరుగదు. ఇద్దరు ఉన్నచోట కూడా ఎక్కువగా లోక విషయాలు, లౌకిక సంఘటనలే
చర్చకు వస్తూ వుంటాయి.
అందుచేత కన్యకచేతి ఒకగాజువలె ఒంటరిగా అవకాశమున్నంతకాలం సంచరించటం,
ఏకాంతంగా ఆధ్యాత్మికమైన యోచనలు చేయటం జీవునకు శుభప్రదం!. - అనే పాఠము
నేనుర్చుకున్నాను.
ఆ కన్యక ఒకే గాజుతో ధాన్యాన్ని దంచినట్లుగా ఏకాంతంగా ఈ జగత్తును పాఠ్యాంశాలవలె
దర్శిస్తూ - నేర్చుకోవలసినది నేర్చుకోవాలి. విడువవలసిన లౌకిక భావావేశాలు,
అభిలాషలు త్యజించి వుండాలి. అతీతుడనై వుండాలి - అని మరల మరల గుర్తు
చేసుకోసాగాను!.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
47

21వ గురువు: బాణము తయారు చేసేవాడు
మనస్సును ఏకాగ్రం చేయాలి. అందుకుగాను మనస్సును ఒకే లక్ష్యం వైపుగా అధికాధిక
కాలం నియమించాలి. అప్పుడుగాని, ఈ మనస్సు దృశ్యస్వభావమును అధిగమించి
సర్వాతీతమగు నిర్మలద్రష్ట (ఆత్మ) యొక్క దర్శనమునకు సిద్ధపడజాలదు. అట్టి ఏకాగ్రత
ఈ మనస్సుకు లభ్యపడేది ఎట్లా? అందుకు ఉపాయాలుగా మహనీయులగు జ్ఞాన
కోవిదులు శాస్త్రముల ద్వారా ప్రాణాయాయము, ఆసనము, ధ్యానము, తపస్సు, పూజ,
ఇష్టదైవస్తోత్రం ఇత్యాది ఉపాయాలు అందిస్తున్నారు. జాగరూకతతో తదితర లోక
సంబంధమైన ఆలోచనలు కట్టిబెట్టి ప్రాణాయామాది సాధనలు నిర్వర్తించాలి. అనేకాగ్రత
(Multy priority)వలననే జీవుడు దృశ్యమునకు ద్రష్టకు పరము అగు ఆత్మభావనను
ఆశ్రయించలేక పోవుచున్నాడు.
ఈ విషయంలో నాకు గొప్ప సూచనగా లభించటానికి కారణమైన ఒక సంఘటనను
నీకు చెప్పుచున్నాను. విను.
అతి నిపుణుడైన, ఇనుముతో పరికరములు తయారు చేయగల ఒకానొక కంసాలి
వుండేవాడు. ఆ దేశపురాజు ఆతని పనితనం గురించి విని అతనిని పదునైన బాణములు
తయారుజేసే ఉద్యోగంలో నియమించాడు. ఒకానొకరోజు... మహారాజు గారు సేనా
సమేతంగా వ్యాహ్యాళికై వెళ్ళుచూ, ఆ కంసాలి ఇంటి ముంగిట ఆగి, ఆ పరిసరాలను
ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఆ రాజు నిలబడినచోటికి అతి సమీపంలో కంసాలి పదునైన
నిడుపైన బాణమును తయారు చేస్తూ ఏకాగ్రతతో బాణపు కొనకు పదును పెట్టుచున్నాడు.
మహారాజు ఆతనిని గమనిస్తూ చూస్తు అతి సమీపంగా నిలబడ్డాఞు. పేరుపెట్టి పిలిచారు.
కానీ, ఆ కంసాలి మాత్రం ఎటూ చూడక, పదునుపెట్టే పనిలో లీనమై యున్నాడు.
ప్రక్కనే వచ్చి మహారాజు నిలబడినప్పటికీ ఏ మాత్రం గమనించకుండా, పరిసరాలను
మరచి బాణపుకొసకు పదును పెట్టటం ఏకాగ్రతతో కొనసాగించసాగాడు.
అదంతా ఆ బాటన వెళ్లుచూ నేను గమనించాను. అప్పుడు అనుకున్నాను.
ఆహా! ఏమి ఈ కంసాలి యొక్క ఏకాగ్రత! పరిసరాలన్నీమరచి బాణముకొసకు పదును
పెట్టే ప్రయత్నంలో మనసంతా సంపూర్ణంగా నియమించటం చేత అతడు తన మహారాజు
యొక్క రాకను కూడా గమనించటం లేదే! నేను కూడా బాహ్య - అభ్యంతరములను
మరచి, సర్వాత్మకుడు సర్వతత్త్వ స్వరూపుడు అగు ఈశ్వరునియందు దృష్టినంతా ఏకాగ్ర
పరచటము అభ్యసించెదనుగాక! - అనే నిర్ణయం చేసుకొనసాగాను!.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
48

22వ గురువు పాము
పాము ఒంటరిగా సంచరిస్తూ రోజులు గడుపుతూ వుంటుంది. ఒక ఇల్లు కట్టుకొని
ఇక్కడే వుంటాను- అనే నియమం దానికిలేదు. పరిసరముల పట్ల మమకారం కలిగి
వుండదు. ఎప్పుడు ఏ ఆహారం పొందితో అదే ప్రేమగా ఆస్వాదిస్తుంది. ఎక్కడ చోటు
దొరికే అక్కడ చుట్టలు చుట్టుకొని ఏ కాంతంగా రోజులు రోజులు గడిపివేస్తుంది.
ఎక్కడికో వెళ్ళాలి. అప్పుడుగాని సాధనకుదరదు. అప్పుడుగాని హాయి లేదు. ఇదికాదు
మరొక ఆశ్రమం. ఇక్కడ ఇక ఎక్కువ కాలం నాకు ఇష్టంలేదు - అని భావిస్తూ ఈ
మానవుడు వర్తమానంలో ఆత్మతత్త్వ జ్ఞాన సముపార్జనకు యోచించకుండా కాలమంతా
బుగ్గిపాలు చేసుకుంటున్నాడు.
పాము తన కొరకు తానుగా ఇల్లు కట్టుకోదు. పరుల ఇళ్ళలో (అనగా) చీమలు నిర్మించిన
పుట్టలలో జీవితకాలం గడిపివేస్తుంది.
శ్లో గృహారంభో హి దుఃఖాయ, విఫలశ్చ అధ్రువాత్మనః
సర్పః పరకృతం వేశ్మ ప్రవిశ్య సుఖమేధ తే॥ (అధ్యా 9, శ్లో 15)
అనిత్యము అల్పఫల ప్రదాతయగు ఈ శరీరమును ఏదో దీర్ఘకాలం కాపాడుకోవాలనే
ఉద్దేశ్యంతో గొప్ప ప్రదేశంలో గొప్ప గొప్ప గృహాలు కావాలని అభిలషించటం
అల్పప్రయోజన విషయమే! ఈ విశేషం చీమలు నిర్మించిన పుట్టలో తలదాచుకొని
తనకంటూ ఏ గృహము కలిగి వుండని పామును గమనించి నేను నేర్చుకున్నాను.
ఈ కనబడేదంతా మాయాజాగత్తు. కేవలం దైవ కల్పితం. ఇందులో నాకు ఇళ్ళు లేవు.
సంపదలు లేవు - అని అనుకుంటూ ఉసూరుమనటం అర్ధంలేని వ్యర్థమైనపని!.
ఈ జగత్తుకు ఈశ్వరుడు, సర్వజన అంతర్యామి సర్వతత్త్వ స్వరూపుడు, అందరికి
ఆరాధ్యుడు అగు నారాయణుడొక్కడే! ఆయన తన మాయా చమత్కారంతో ఈ జగత్తును
ఒకానొకప్పుడు సంకల్ప చమత్కారంగా నిర్మిస్తున్నాడు. మరొకప్పుడు కాల స్వరూపుడై
హరిస్తున్నాడు. తన అంశరూపంతో జీవుడు అనునది కల్పించుకుంటున్నాడు. ద్రష్ట
అయి ఆస్వాదిస్తూ, ఎప్పుడో తనయందు ఇదంతా లయింపజేసుకుంటున్నాడు. ఆ
నారాయణుడే సర్వజీవాత్మలకు ఆధారుడు! ఈ సర్వమునకు మూలకారణుడు!
అందరియొక్క అంతరాత్మ!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
49

సర్వము తానే అయి, దృశ్య రూపంగా ఆవిర్భవించి తానే ఆస్వాదిస్తున్న శ్రీమన్నా
రాయణునికి తన-మన - తనవారు - కాని వారు - ఏకము-ద్విత్వముల అనేకము
అనబడే భేదమంతా ఎక్కడున్నది? లేనే లేదు. ఆతడే జన్మలకు కర్మలకు మునుముందే
వెలుగొందుచున్న సనాతన పురుషుడు.
ఆత్మయే ఆ నారాయణుని స్వరూపం! నేను నీవు వారు వీరు... అంతా -
నారాయణ స్వరూపమే!
ఆత్మానుభవ స్వరూపమగు కాలముచే సత్వ రజ-తమో గుణ సంపద ఒకానొకప్పుడు
సామ్యం పొందినపుడు పురుషుడు (Experiencer) ప్రకృతి (Experiences)
లను పరమపురుషుడు తనయందు లయం చేసుకొంటున్నాడు. ఆ పరమ పురుషుడే
నారాయణుడు! సనాతన పురుషుడు! నిరుపాధికుడు! తానే సర్వమునకు ఆధారమై
తనకు "ఉపాధి-ఆధారము" యొక్క ఆవస్యకతయే లేనట్టి సత్ స్వరూపుడు! కేవలానుభవ
ఆనందస్వరూపుడు! కైవల్యము అనే సంజ్ఞచే చెప్పుబడువాడు. నారాయణుడే ఈ
సర్వమునకు బాహ్య-అభ్యంతర స్వరూపము.
ఆ సనాతనపురుషుడొక్కడే సర్వ జగత్ సంజ్ఞారూపంగా విరాజిల్లుచున్నాడు! అతడే
సదా ఆవరణుడు! నిరావరణుడు! పరము! పరమాత్మ! ఈ జగత్ అనే అనుభవమునకు
ఆవల ఉన్న - జీవులందరియొక్క స్వస్వరూపమే - నారాయణుడు! పరాత్ పరుడు -
అని విజ్ఞులచే దర్శింబడుచున్నాడు! కీర్తించబడుచున్నాడు. నేను నారాయణ స్వరూపుడను
ఆయనయే నా గృహం. ఇక ఈ భౌతిక దేహమంటారా, ఇది ఎక్కడో అక్కడ కొన్నాళ్ళు
భూమిపై గడుపునుగాక! మరెప్పుడో - తనదారి తాను చూచుకొనును గాక!
23వ గురువు - సాలెపురుగు
ఓ శత్రుమర్ధనా! యదుమహారాజా!
కేవలం ఆత్మానంద స్వరూపుడు - నిర్గుణుడు - నిరాలంబుడు మనందరి వాస్తవ
స్వస్వరూపుడు అగు ఆ నారాయణుడు అనుభవము (Experiencing) అనే ఒకానొక
చమత్కార సంజ్ఞను అకారణంగానే స్వీకరిస్తున్నారు.
అట్టి ఆత్మానుభవ విశేషం చేత స్వమాయచే త్రిగుణాత్మకంగా (సత్త్వ - రజః - తమోగుణ
రూపంగా) ఈ కనబడే సర్వముగా ప్రదర్శించుచున్నారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
50

తనయొక్క త్రిగుణాత్మకమగు మాయను సంక్షోభింపజేసి మహతత్త్వమును ఒక లీలగా
(As a play) క్రీడగా (As a sport) వినోదంగా సృజించుచున్నారు. అట్టి త్రిగుణ
స్వరూపమగు మహత్ తత్త్వము నుండి ఈ విశ్వములను ప్రకటించుచున్నారు. (Manifesting the Universe)
ఒకడు వినోదం కోసం ఒక కథ చదువుచూ (లేక) వింటూ, ఆ కథలోని సంఘటనలతో,
పాత్రలతో కల్పిత గుణ విశేషములతో తన్మయం పొంది సుఖము దుఃఖము
ఆశ్చర్యము - ఆనందము - భయము - ఆవేదన - జిజ్ఞాస (Comfort - Discomfort
- surprise - Pleasure - Fear - Lamentation - Inquistiveness) ఇత్యాది పొందుతాడు
చూచావా! అట్లాగే... ఈ దృశ్యము కూడా!
ఈ దృశ్య వ్యవహారమంతా ఎక్కడి నుండి వచ్చింది? దృశ్యాతీతుడు - జీవజగత్ అతీతుడు
అగు నారాయణుడే సృష్టికాలంలో జీవుడు అనే ద్రష్టరూప - అంశను కల్పించుకొని -
దృశ్యము అనే చమత్కారమును కూడా రచించుకొని రసాస్వాదనను నిర్వర్తిస్తున్నారు.
మరొకప్పుడు కాలము అనే మరొక అంశచే ఈ దృశ్యమును తనయందు
ఉపశమింపజేసుకుంటున్నారు. ప్రతి జీవుని యొక్క వాస్తవస్వరూపము ఆ నారాయణుడే!
ఆయనయే జీవాత్మలకు ఆధారుడు, ఆశ్రయుడు! ఆయన ఒక్కటిగానే ఉన్నారు! రెండు
గాను, అనేకంగాను, అసంఖ్యాకంగాను కనిపిస్తున్నది కూడా ఆయనే! అంతటా
అన్నింటా - అన్నీగా కనిపిస్తున్నది ఆయనయే! ఇక ఆయనకు తన పర భేదం
ఎక్కడుంటుంది? ఆయనకు సజాతీయ - విజాతీయ భేదం లేనేలేదు!. కల కనేవానికి
తన కలలో కనిపించినవారిలో అయివారెవ్వరు? కానివారెవ్వరు? కలంతాకూడా
స్వప్నదర్శియొక్క స్వయంకృత కల్పనా విశేషమేగా? కల కనేవానికి తన కలలో కనిపించే
ప్రియమైనవారు-ప్రియం కానివారు ఇరువురు స్వకీయ కల్పనా వినోద విశేషాలే
కదా!
కాలము అనునది కూడా నారాయణుని యొక్క ఆత్మానుభవ స్వరూప చమత్కారమే!
అట్టి కాలముచే ఒకానొకప్పుడు సత్త్వము మొదలైన శక్తులన్నీ సామ్యత్వం సంతరించు
కుంటున్నాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
51

అప్పుడు సనాతన పురుపురుడగు నారాయణుడు ఒక్కడే శేషించుచు విరాజిల్లుచున్నాడు.
ఆతని నుండి బయల్వెడలిన బ్రహ్మదేవుడు (సృష్టికర్త) - జీవుడు (సృష్టించబడినవాడు)
మొదలైనవన్నీ ఆయన యందు లయిస్తున్నాయి. ఆయనయే సర్వ జీవులకు
ఆశ్రయయోగ్యుడు! ఆయన ఉపాధి రహితుడు! పరమానందరూపుడు! ఆయన యొక్క
స్వానుభవమే కైవల్యము!. నేను "ఓం" సంజ్ఞాస్వరూపుడనగు నారాయణడనే... అనునదే
నిత్య సత్యము.
యదుమహారాజు: ఓ సాధూ! ఆవధూతా! ఈ కనబడే దృశ్యమంతా ఏరీతిగా ఎవరిచే
ఏర్పడుతోంది? మరింతగా వివరించండి!
అవధూత: ఈ జగత్తుగా కనిపించేదంతా ప్రతి జీవుని స్వస్వరూపమగు
శ్రీమన్నారాయణుడే! ఆయనయే అకారణంగా కల్పనామాత్రంగా, పిల్లలకు కల్పించిచెప్పే
కథలాగా, ఒక వినోదంగా తనయందు తానే తనకు అద్వితీయంగా సృష్టి అనే
చమత్కారమునకు ఉపక్రమిస్తున్నారు. అట్టి సృష్టి అనే కారణంగా మొట్ట మొదట కాలము
అనే కార్యము జనిస్తోంది. అట్టి కాలము అనే అనిర్దేశ్యము అభౌతికము (Non
Definable, Non-material) నుండి (కాలచమత్కారంచేత) ఆత్మయొక్క స్వకీయ ప్రభావ
రూపములగు సత్వము - రజము - తమము అనే త్రిగుణాలు బయల్వెడలుచున్నాయి.
ఆ త్రిగుణములనుండి ప్రదర్శన రూపమగు కార్య- కారణ - కర్తృత్వ భేదరూపంతో
కూడుకొనిన క్రియాశక్తి వెలువడుతోంది. అట్టి క్రియా శక్తి యొక్క చమత్కారంగా
మహత్తత్వము (Multiplicity) ప్రదర్శితమౌతోంది. అట్టి మహత్తత్వము త్రిగుణములచే
జనింప బడుచున్నది!... అని చెప్పబడుతోంది.
ఆ మహత్తత్వము చేతనే జీవుడు -ఆ జీవుని ఊహానుభవజనితమగు జగత్తు (Experiencer
and Visualization of Experiences) బయల్వెడలుచున్నాయి. జీవుడు - అనుభూతి
అనే జంటకవులగానమే ఈ అనేక విశ్వముల చమత్కారం! ఇదంతా ఒక వ్యక్తి యొక్క
అనేక వేరు - వేరు స్వప్నపరంపరా సందర్శనముల వంటిదే!. ఈ విధంగా ఆత్మనుండే
ఈ విశ్వములు (Flock of Universe from one's own self) బయల్వెడలుచున్నాయి.
అనే శాస్త్ర పాఠ్యాంశాన్ని నేను సాలెపురుగును చూసి ఆరూఢ పరచుకున్నాను.
సాలెపురుగు తన హృదయము నుండి ముఖము ద్వారా దారమును వ్యాపింపజేస్తోంది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
52

ఆ దారములో తానే విహారాలు చేస్తోంది. అట్లాగే పరమాత్మ స్వకీయ కల్పనచే జీవాత్మలు
అనే దారములను విస్తరింపజేసుకొని వాటియందు విహరిస్తున్నారు. ఈ విశ్వము
పరమాత్మచే సృష్టించబడి, పరమాత్మ యొక్క స్వప్నాంతర్గత ద్రష్ట వంటి జీవాత్మచే
అనుభవించబడుతోంది.
మరొకప్పుడు పరమాత్మ యొక్క అంశమగు ఈ జీవాత్మ (Expriencer) తాను అనుభవ
రూపంగా పొందుచున్న విశ్వముతో సహా పరమాత్మ యందు లయస్తున్నాడు - తరంగం
జలంలో లయిస్తున్నట్లుగా! అయితే తరంగము జలము కానిదెప్పుడు? ఈ జీవుడు
పరమాత్మస్వరూపుడు కానిదెప్పుడు? ఎప్పుడూ లేదు!
జీవాత్మయే ఈ దేహము యొక్క ధారణచే దేహి అయివుంటున్నాడు.
24వ గురువు - భ్రమర కీటకము
శ్లో॥ యత్రయత్ర మనో దేహీ ధారయేత్ సకలం ధియా
స్నేహాత్ - ద్వేషాత్ - భయాత్ ్వపి యాతి తతత్ స్వరూపతామ్|| (అధ్యా 9, శ్లో 22)
ఈ దేహి మనన రూపమగు మనస్సుచే దేని దేని పట్ల ఎక్కడెక్కడ స్నేహము - ద్వేషము
-భయము - రూపంగా ఏకాగ్రతను లగ్నం చేస్తాడో (where ever the Holder /User
of body applies concentration by virtue of friendship, envy or fear ....) అక్కడక్కడ
ఆయా సంబంధమైన వస్తు విషయ రూపంగా పరిణమిస్తూ, ప్రదర్శితమగుచూ వుంటాడు.
ఈ విషయం నేను భ్రమర కీటక న్యాయం అనే సంఘటన నుండి నేర్చుకున్నాను.
ఒక గండు తుమ్మెద ఒక కీటకమును తెచ్చి తనున్న ప్రదేశంలో వుంచుతుంది. ఆపై ఆ
తుమ్మెద ఝుమ్ - ఝుమ్ అంటూ పెద్ద శబ్దములు చేస్తూ ఆ కీటకము చుట్టూ
తిరగటం ప్రారంభించుతుంది.
ఆ కీటకం (చిన్నపురుగు) ఆ శబ్దం వింటూ ఈ తుమ్మెద నన్ను మ్రింగుతుందేమో?
చాచికొడుతుందేమో?అని భయపడుతూ వణకసాగుతుంది. దృష్టినంతా తుమ్మెద యొక్క
కదలికల వైపు లగ్నం చేయసాగుతుంది. అనుక్షణం ఆ తుమ్మెద గురించే భయముతో
అతి తీవ్రంగా యోచిస్తూ నవనాడులను ఏకాగ్రం చేసి దృష్టంతా తుమ్మెదపై నిలుపుతుంది.
శ్లో॥ కీటః పేశస్కృతం ధ్యాయన్ కుడ్యాం తేన ప్రవేశితః
యాతి తతాత్మతాం, రాజన్! పూర్వ రూపం అసంత్యజన్॥ (అధ్యా 9, శ్లో 23)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
53

ఆ చిన్న పురుగు ఈ తుమ్మెద ఎప్పుడు నన్ను మ్రింగుతుందో, ఏమో? - అని క్షణ క్షణం
గండు తుమ్మెద పై ఏకాగ్రంగా దృష్టి నిలుపుతుంది కదా!. క్రమక్రమంగా ఒకానొక
చమత్కారం జరుగుతోంది. ఆ చిన్న కీటకం తన పూర్వ శరీరం త్యజించకుండానే
క్రమక్రమంగా అద్దాని శరీరం వ్యాకోచం పొంది ఆ చిన్న పురుగు కాస్తా గండు
తుమ్మెదగా మారిపోతోంది. ఇది ఒక ప్రకృతి చమత్కారం!.
ఆ కీటకం గండు తుమ్మెదపై భయంతో దృష్టిని - శ్రద్ధను కేంద్రీకరించినట్లుగా నేను
మహానీయులగు గురువుల వద్ద శ్రద్ధ - భయ - భక్తులతో ధ్యాసను బుద్ధిని ఏకాగ్ర
పరచటం కొనసాగించసాగాను. వారిచే సుశిక్షితుడనై ఆ మహనీయులవలెనే
సంస్కరించబడిన నిర్మల సునిశిత బుధ్ధిని పొందసాగాను. అంతేగాని అల్పదృష్టి -
ధ్యాసల గురించి, అట్టివారి గురించి మననమే చేయటం లేదు. తద్వారా అల్పత్వం
వచ్చిపడుతుందని గమనించాను కనుక!
ఓ యదు మహారాజా! ఈ విధంగా 24 మంది గురువుల దగ్గర కొన్ని తాత్త్వికమైన
సూక్ష్మరహస్యాలను గ్రహించాను. అందుచేతనే ఈ దృశ్యప్రపంచాన్ని, ఈ దృశ్య
ప్రపంచంలో కదలించబడుతూ కనిపించే ఈ భౌతికదేహాన్ని, ఇక్కడి ప్రకృతి యొక్క
సంపదలగు మనో- బుద్ధి-చిత్త- అహంకారాలను నాకు వేరుగా చూస్తూ స్వా
త్మాణి పరమేశ్వరః అను ఆత్మజ్ఞానానందాన్ని పెంపొందించుకుంటూ పరిపుష్టిచేసు
కొంటున్నాను.
యదుమహారాజు : ఓ యతీశ్వరా! ఈ దేహమే దేహికి ఐహిక మోహం కదా! దేహ
బద్ధునికి సంసారం (illusionary perecptual blocade) తొలగదు కదా?
అవదూత: ఓ యదు మహారాజా! ఈ దేహము ముఖ్య వేదాంత శాస్త్ర సిద్ధాంతాలను
అవగతం చేసే దృష్టాంతగరువు సుమా! ఇది కూడా నాకు గురువే!
శ్లో దేహో గురుః మమ, విరక్తి - వివేక హేతుః
బిభ్రత్ స్మ సత్త్వ నిధనం సతతార్యుదర్కమ్!
తత్త్వ - అన్యనేన విమృశామి యథా తథాపి
పారక్యమిత్యవసితో విచరామ్యసంగః|| (అధ్యా 9, శ్లో 25)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
54

ఈ దేహమే గురువుగా భావించి కొన్ని విశేషాలు నేర్చుకుంటున్నాను! ఇది ఎటువంటిది?
దీనికి ఉత్పతి పరిణామము ఉన్నట్లే వినాశనము కూడా వున్నది. ఇది సుఖంగా పైకి
కాసేపు అనిపించినా దీనిలో ఎన్నో దుఃఖ పరిణామాలు - బాధలు అనుక్షణికంగా కట్ట
కట్టుకొని వేచివున్నాయి. ఎప్పుడో - ఏ క్షణంలోనో నేలకూలి చెప్పాపెట్టకుండా వచ్చినట్లే
- చెప్పాపెట్టకుండా నేలకూలనున్నది. ఎప్పుడు నక్కలకు - కుక్కలకు ఆహారం అవుతానా!
- అని ఎగిరెగిరి పడుతోంది. అయితేఏం? ఇదినాకు వైరాగ్యమును వివేకమును
ప్రసాదించగల గురువు సుమా! నాశన శీలమగుటచే దీనిపై ఆసక్తి వదలి, గురువుగా
భావించి తత్త్వానుసంధానము కలిగే వరకు అవసరమైనంత మాత్రమే సంబంధం
పెట్టుకొనుచున్నాను. తత్త్వ విచారణకై ఈ శరీరం గొప్ప ఉపకరణం కదా!.
ఆహా! ఈ జీవుడు ఈ భౌతికదైహాన్ని సంతోషపెట్టాలనే ఉద్దేశ్యంతో చాలా చాలా కష్టపడి
ధనమును కూడబెట్టుచున్నాడే! భార్య - పుత్రులు - మిత్రులు పశువులు - సేవకులు
- ఇళ్ళు - ఆత్మీయులు ఇటువంటి సంపదలను పెంపొందించుకుంటూ నానా హైరానా
-
పడుచున్నాడే! సరే! ఇంత శ్రమపడి ప్రోగు చేసినందంతా ఏమి కానున్నది? ఈ శరీరానికి
ఆయుర్దాయం అనేది ఒకటి వున్నది కదా! ఆయర్దాయం పూర్తికాగానే ఈ శరీరం
నశించి గుప్పెడు బూడిదగా మిగిలిపోబోతోందే!
చెట్టు కొన్ని బీజములను జనింపచేసి భవిష్యత్తులో మరికొన్ని వృక్షములకు బీజభూతమై
తాను నశిస్తోంది చూచావా? అట్లాగే ఈ దేహం కూడా మరికొన్ని దేహోత్పత్తులకు
కారణమై తాను ఎప్పుడో నామరూపాలు లేకుండా నశించిపోతోంది!
ఇది ఇట్లా వుండగా.....,
ఒక గృహస్తు వున్నాడు. ఆయనకు అనేక మంది భార్యలు. వాళ్ళంతా ఆ గృహస్తుని
ఎవరికివారే తమ వైపుగా తీవ్రంగా లాక్కుంటూ వుంటే... ఆ ఇంటాయనయొక్క బాధలు
వర్ణనాతీతం కదా!
అట్లాగే, ఈ దేహమును ధరించిన దేహిని నాలుక ఒక వైపుకు లాగుతూ వుంటుంది.
(రుచికై). మరొకవైపుకు చర్మము స్పర్శకై, పొట్ట ఆకలి వైపుగా.., చెవులేమో ... శబ్దము
దిక్కుగా, ముక్కు...... సువాసనల కొరకు, కళ్ళు .... రూపముల మార్గంలో, ఈ
విధంగా దేహముపై అభిమానము పెంచుకొన్న జీవుని ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
55

వైపుగా బలవంతంగా లాగుతూ వుంటోంది. ఈ జీవుడు (లేక దేహి) ఆపై అసంఖ్యాక
విషయములలోపడి దారి తెన్ను లేక అవిశిపోతున్నాడు.
అదంతా ఒకవైపు! ఇక మరొకవైపు!
ఆహా! వాస్తవానికి ఈ మనుజ దేహం ఎంతటి అవకాశం! మానవదేహం చిన్న సందర్భం
కాదు! గొప్ప అవకాశం పొందిన ఈ జీవుడు ఈ మానవదేహాన్ని గొప్ప ఉపకరణంగా
ఉపయోగించుకోవాలిసింది పోయి, వీటిలోని ఒక్కొక్క ఇంద్రియానికి దాసానుదాసుడై
విషయములచే బుద్ధుడు అవటమా? ఎంతటి హాస్యం! చదువుకునేందుకు బడికి వెళ్ళి
అల్లరి-చిల్లరి పనులు మాత్రమే నేర్చుకొని రావటంవంటిదే గదా అది!
శ్లో సృష్ట్వా పురాణి వివిధాని అజయా 2 త్మశక్త్యా
వృక్షాన్ - సరీసృపపశూన్ ఖగదందశూకాన్
తైసైరతుష్ట హృదయః పురుషం విధాయ
బ్రహ్మవలోకధిషణం ముదమాప దేవః!
(అధ్యా 9, శ్లో 28)
ఆ పరమాత్మ యగు బ్రహ్మదేవుడు తన యొక్క అజేయమగు ఆత్మశక్తిచే
మాయారచనాచమత్కారంగా వృక్షాలను, నదీ-తటాకాలను, జంతువులను పక్షులను
సృష్టించారు. అయితే "నా సృష్టిలో ఏదో అసంపూర్ణత్వం ఇంకా కొనసాగుతూనే
ఉన్నది!". - అని అనుకున్నారు. తృప్తి కలుగలేదు. అప్పుడు బ్రహ్మసాక్షాత్కారము
సముపార్జించే యోగ్యత గల బుద్ధితో కూడుకొనియున్న మానవులను సృష్టించారు.
అప్పటికి గాని ఆయనకు సృష్టి అనే చమత్కారము యొక్క ఆనందం కలుగలేదు!.
అనేక జన్మల తరువాత మహత్తరమైన మానవ జన్మ ఈ జీవునికి గొప్ప అవకాశంగా
లభిస్తోంది. ఇది అనిర్దేశ్యకాలబద్ధమైన అవకాశం (It is an unknown time bound
opportunity). ఇక ఈ దృశ్యము పట్ల గల అవేశము అను రూపమగు సంసారము
విషయమందామా? ఇక్కడి అర్థ - నారీ బంధు - పేరు ప్రతిష్ఠ ఇత్యాది సంపదలు
అనిత్యం. ఎల్లవేళలా మృత్యువు అనే సంఘటన ఈ దేహమును వెంటనంటియే
ఉంటోంది. బుద్ధి గల వాడెవ్వడూ ఇక్కడి అర్ధ సంపదను నమ్ముకొని కాలం వ్యర్ధం
చేసుకోడు. మృత్యువు వచ్చి తలుపు తట్టకముందే నిఃశ్రేయమగు ఆత్మజ్ఞానానందమును
పరిపుష్టపరచుకొని ఉంటాడు. ఈ జీవాత్మలక్షణములకంటే విలక్షణము, జీవాత్మకు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
56

కేవల సాక్షి యగు పరమాత్మయే నా వాస్తవ స్వరూపము - స్వభావము కూడా!. అనే
అవగాహనతో కూడిన బుద్ధిని నిర్దుష్టపరచుకొంటాడు. బుద్ధిని నిర్మలం చేయగల
సాధనలను పరిపూర్తిచేసుకొని వుంటాడు.
ఇక శబ్దము - స్పర్శ రూపము రసము గంధము ఇటుంవంటి విషయ -
సుఖముల గురించి చెప్పుకోవలసి వస్తే...
నిః శ్రేయసాయ విషయః ఖలు సర్వతః స్యాత్ (అధ్యా 9, శ్లో 29)
విషయ సుఖాలు కుక్కలు - నక్కలు - మేకలు - పక్షులు - కీటకములు మొదలైనవి
కూడా అనుభవిస్తూనే వున్నాయి. అందుకొరకై అతిదుర్లభమైన మానవ జన్మను ఖర్చు
చేసుకోవలసిన అవసరం వున్నదా? ఏ మున్నది?
.
ఓ యదుమహారాజా! ఈ విధంగా అనేక మందిని - సందర్భములను సంఘటనలను
శిష్య భావంతో గురోపాసన చేశాను. గురియే గురువు - గురుతే గురువు కదా! నాలో -
జనించిన వైరాగ్యాన్ని ఆయా పాఠ్యాంశాలతో పరిపోషించుకొంటున్నాను. విజ్ఞాన దృష్టితో
ఆత్మావలోకనం చేస్తూ సంగరహితుడనై వ్యష్టి అహంకారాన్ని త్యజిస్తూ ఈ భూమిపై
వ్యాహ్యాళిగా సంచరించే ప్రయత్నం చేస్తున్నాను.. బుద్ధిని ఆత్మయందు నిలిపి ద్రష్ట -
దృశ్యములు నా యొక్క చమత్కారమైన అంశలే అనే అవగాహనను సుస్థిరం చేసుకుంటూ
వున్నాను. (మమైవాంశో జీవలోకే జీవభూతస్సనాతనః)
నేను బ్రహ్మమే! బ్రహ్మమే జగత్తుగా ప్రదర్శితమౌతోంది!. అని అనేక మంది మహర్షిత్వము
అవధరించిన గురువులు ఎలుగెత్తి గానం చేస్తున్నారు. వివిధ వర్ణనలతో - పాఠ్యాంశాలతో
మనందరికీ బోధిస్తున్నారు. అయితే నా ఉద్దేశ్యంలో ఒక్క వ్యక్తి మాత్రమే గురువు -
అనేది పరిమితమైన అవగాహన ! సుస్థిరమైన నిశ్చలమైన బ్రహ్మీదృష్టికి జీవితమే గురువు!
జీవితంలో సందర్భాలన్నీ గురువులే! అనేక సంఘటనలు గురువులతో సమానమే!.
గురువు-సద్గురువుల ఉద్దేశ్యముకూడా అదేనని నేను గమనిస్తూ ఉన్నాను.
.
శ్రీకృష్ణ భగవానుడు: మిత్రమా! ఉద్ధవా! ఆ అవధూత ఈ విధంగా యదుమహారాజుకు
గురువు అనే విశేషానికి నిర్వచనం చెప్పి, మహారాజు యొక్క నమస్కారమును ప్రసన్నమైన
హృదయంతో స్వీకరించినవాడై యథేచ్ఛానుసారంగా అక్కడి నుండి బయల్వెడలారు!.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
57

మా పూర్వీకులకు పూర్వీకుడైన మా వంశకర్త శ్రీ యదుమహారాజు ఆ అవధూత యొక్క
వచనములు విన్నవారై మరలమరల మననం చేసుకున్నారు. ఆయా సందర్భములనుండి
ఆయా దృశ్య సంఘటనలనుండి గ్రాహ్యములు త్యాజ్యములు - నేర్వవలసినవి
గమనించినారు. క్రమంగా దృశ్య సంగమ - ఆసక్తుల నుండి విడివడినవాడయ్యారు.
సమ చిత్తులై దేదీప్యమానంగా ఆత్మా హం ధ్యానంతో ప్రకాశించారు.
8. స్వధర్మనిరతి పుష్ప సమర్పణ (10వ అధ్యాయము)
శ్రీకృష్ణ భగవానుడు:ఉద్దవా! జీవులందరికి వారు తరించటానికి సులభమైన ఒక
ఉపాయం ఇప్పుడిక గుర్తు చేస్తున్నాను. విను.
దేహధారి దేహమున్నంతవరకు కర్మలు నిర్వర్తించక తప్పేది కాదు కదా! కనుక, స్వధర్మము
తప్పక నిర్వర్తించవలసిందే!
కర్మ ధర్మానుకూలంగా ఉండటమే జీవునికి వాస్తవమైన సంపద.
అయితే అట్టి స్వధర్మమును సర్వంతర్యామియగు నన్ను ఉపాసించుటలో విభాగంగా
నిర్వర్తించాలి సుమా! (Let alotted work be done as a worship to me)
విషయముల పట్ల నమ్మకముగల దేహి ఈ ఎదురుగా గల జగత్తు సత్యమే అని నమ్మి
చేసే ప్రయత్నాలన్నీ విపరీత పరిణామప్రదములే అని జ్ఞానులు గమనిస్తున్నారు. అందుచేత
అట్టి తత్త్వవేత్తలు - ఇక్కడ నాకు ఏదో లభించును గాక! - అనే కామమును త్యజించి
-
పరమాత్మను పూజించే సాధనయొక్క అంతర్విభాగంగా నిష్కామభావంతో విశుద్ధచిత్తంతో
స్వకర్మలు - స్వధర్మములు నిర్వర్తిస్తున్నారు!.
ఉదాహరణకు..., అనేక విషయచింతలతో రాత్రి నిద్రపోయిన వ్యక్తికి స్వప్నంలో
భోగ్యవస్తువులు, సుఖ దుఃఖ సంఘటనలు కనిపిస్తాయి. అవన్నీ నిజమా? కాదు కదా!
అట్లాగే ఈ జాగ్రత్లో కూడా ఇంద్రియములకు తారసపడుచున్న - మనస్సుకు
అనుభూతిగా కలుగుచున్న - భేదబుద్ధికి ప్రాప్తిస్తున్న వివిధములైన దృశ్యసంబంధమైన
అనుభవములన్నీ స్వప్నసదృశమే సుమా! ఇంద్రియములకు విషయములైన సుఖదుఃఖ మిశ్రమ విశేషాలన్నీ కూడా అస్థిరం! పైగా, అర్థరహితం! ఇంద్రియముల
ద్వారా కలిగే భేదబుద్ధిఅంతా వ్యర్థమే!,
అందుచేత..., కామ్యకర్మము (Acts to satisfy one's own expectations and
cravings) వదలి, నిత్య నైమిత్తిక కర్మలు (Acts that are to be discharged on a
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
58

daily basis or on occasional basis) మాత్రం నిర్వర్తిస్తూ సర్వ తత్త్వ స్వరూపుడనైన
నన్ను ఆశ్రయించి ఉండటమే సముచితం!
క్రమ - క్రమంగా ఆ నిత్య - నైమిత్తిక ప్రవృత్తి ధర్మాలుకూడా త్యజించునుగాక! కర్మ
చోదనములను (Prompting factors for discharging various duties) కూడా వదలి
నన్నే ఆశ్రయంగా కలిగి ఉండటం (అనగా నివృత్తి మార్గం ఆశ్రయించటం) ఉచితం!
ఆత్మవిచారణ యందు సంప్రవృత్తుడగుచు, దృశ్యప్రపంచమునుండి నివృత్తుడగుచూ
ఉండును గాక!. జగత్తును ఆత్మ కళావిన్యాసముగా, ఆత్మ చైతన్యమునకు అభిన్నముగా
సందర్శించును గాక!
క్రమంగా ఈ మానవుడు నాపట్ల సంపూర్ణ చిత్తమును ప్రవృద్ధ పరచుకునే నిమిత్తం
యమము - నియమము - అహింస - శౌచము ఇటువంటి సాధనములను ఆత్మజ్ఞాన
లక్ష్యముతో పాటించుగాక!
జిజ్ఞాసువు అయి నన్ను ఎరుగుటకై శాంతభూషితుడగు విజ్ఞులైనవారిని కూడా
గురుభావంతో ఆశ్రయించాలి. సేవించాలి..
9. గురు-శిష్య లక్షణాలు
గురులక్షణాలు: శాంతుడు, శిష్యుని యొక్క సందర్భ (ఇహ) సహజ (పర)
స్వరూపములను ఎరిగినవాడు అవతారమూర్తి యొక్క శబ్ద - అర్ధములను శిష్యుని
స్వస్వరూపానుభవరూపంగా విశ్లేషించి ప్రవచించువాడు అయివుండుగాక!. "నీవు-జన్మకర్మ రహితమగు ఆత్మవే అయిఉండి సృష్టిగాకూడా అవతరించుచున్నావు" అని నిరూపించి
చూపువాడు, "సాక్షాత్తు తత్త్వమసి" అని సుస్పష్టపరచువాడు అయి ఉండాలి!
శిష్యలక్షణములు : శిష్యుడు... ఎట్లా ఉండాలి మరి?
గురువు పట్ల సేవానిరతిని ప్రదర్శించువాడు.
శరణాగతిని ప్రకటించువాడు.
స్వాభిమానము అనే జాడ్యమును జయించినవాడు.
అహంకారమును అధిగమించినవాడు.
మత్సరమును మొదలంట్లో వదలినవాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
59

"వినటము - అవగాహన - సమన్వయములలో" దక్షత (Efficiency of assimilating
and interpreting) గలవాడు.
నాది - నేను అనే మమకారములను త్యజించినవాడుఅల్ప .
దృఢమైన పట్టుదల పెంపొందించుకొనుచుండువాడు.
దిగులు - వ్యగ్రత మొదలైన బలహీనతలను దూరం చేసుకున్నవాడు.
తత్త్వజ్ఞానము పట్ల జిజ్ఞాసతో ఉన్నవాడు.
అసూయ - ద్వేషములు లేనివాడు.
"ఇది ఇంతేకదా! అది అంతేకదా" అను రూపమైన అల్పభావములను వ్యర్థ
సంభాషణలను వదలివేసినవాడు.
అయివుండాలి!
అతడు అందరిపట్ల - ఆయా అన్ని సందర్భముల పట్ల సమదర్శి అయువుండుగాక!
భార్య - పుత్రులు - బంధువులు - గృహము - భూ సంపద ధన వ్యవహారము
మొదలైన ప్రాపంచక విషయముల పట్ల ఉదాశీనత్వము కలిగిఉండును గాక!. అవన్నీ
ఆగమాపాయనో అనిత్యః ... అను ఎరుక ఏమరచకుండునుగాక!
.
ఉద్ధవుడు : హే జగద్గురూ! మహాత్మా! ఆత్మ యొక్క విలక్షణ లక్షణము అభౌతికము అని
అంటారుకదా! అట్టి అభౌతికత్వం గురించి చెప్పండి! భౌతిక దృష్టులనుండి నివృత్తిగురించి
కూడా చెప్పండి.
శ్రీకృష్ణుడు : ఒక కట్టెను అగ్ని కాలుస్తోందనుకో!
కాలుస్తూ, కాంతిని వెదజల్లే అగ్ని - కట్టె ఒక్కటా? కాదు. వేరు వేరే కదా! అట్లాగే
స్థూల దేహానికి ((పాంచ పాంచ భౌతిక భౌతిక దేహానికిదేహానికి) ) - (ఆలోచన, ఇష్టఅయిష్టములు,
అవేశకావేములు మొదలైనవన్నీ సమావేశమగుచున్న) సూక్ష్మ దేహానికి (Both physical body and thought body containing feeling, expectation, fears. opinions
etc.) కూడా ఆత్మ (మండే కట్టెకు వేరైన అగ్నివలె) సర్వదా వేరై వున్నది. విలక్షణమై
యున్నది. భిన్నమైయున్నది.
అగ్ని కట్టెలో దాగి వుంటుంది. ఆ అగ్ని కట్టెల ఆకారంగా కనిపించే అణువులఆవరణలో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
60

దాగి ఉంటుంది. ఇసుక రేణువులతో చేసిన ఏనుగువలె ఆ అణువుల ఆకారాదులచే,
రంగుచే, రసాయిన స్వభావములచే అగ్ని కప్పబడి ఉంటోంది.
అట్లాగే ఆత్మ దేహాంతర్గతంగా ప్రవేశించి దేహము యొక్క రక్తము-బొమిక-మాంసముచర్మము ఇత్యాదులచే కప్పబడి వుంటోంది. అంతే కాకుండా కోపము ఆవేశము
ఆశ - నిరాశ ఇత్యాది గుణసమన్వితమగు భావనా దేహంచేకూడా (సూక్ష్మ దేహంచే
కూడా) కప్పబడి వుంటోంది.
ఆత్మ యొక్క చమత్కారమైనట్టి స్వకీయమైన ఈశ్వరాధీన మాయచేత ఈ వస్తు గుణ
సమన్వితమగు - స్థూల దేహము - సూక్ష్మదేహము రచించబడుచున్నాయి.
జీవుడు ఇంద్రియ విషయములగు దృశ్యము అనే సంసారములో స్వయం కల్పితమైన
ప్రియాప్రియ అహంకార మమకార విశేషములచే నిబద్ధుడగుచున్నాడు.
సంగము (Attachment) సంసార బంధమునకు కారణం. నిస్సంగముతో కూడిన
ఆత్మవిద్యచే సర్వాతీతత్వమును సంతరించుకొని చిదాత్మస్వరూపుడై వెలుగొందుచున్నాడు.
అందుచేత, వస్తు బుద్ధిచే ఏర్పడుచున్న సంగము (Attachment) ను ఈ జీవుడు
నిరసించివేయాలి!
అట్టి జ్ఞానమును మహానీయులనుండి సాధకుడు శ్రద్ధగా వినాలి! జిజ్ఞాసతో పరస్వరూపము
(That which is beyond all else) అగు స్వస్వరూపాత్మ వస్తువు గురించి తెలుసుకొని,
ఆస్వాదించటమే ఉపాయం!. అహమ్ సర్వస్య ప్రభవో- నాచేత ఏదేది ఎట్లు
చూడబడుచున్నదో అనుభూతపరచుకోబడుచున్నదో... అదంతా నేనేకదా! అని
గమనించి-తెలుసుకొని బ్రహ్మమే తానై ఉండటం-అనుననది ఆస్వాదించనారంభించాలి.
ఆచార్యులవారు క్రిందవున్న అరణి (Lower stone)
శిష్యుడు పైనున్న అరణి (Upper Stone)
ఉపదేశ వాక్యములు ఆ ఉభయ అరణుల ఒరిపిడి. జనించేది జ్ఞానాగ్ని. కాల్చబడునది
"అజ్ఞానము" అనే కొయ్యి చెక్క
ఆచార్య - శిష్యుల సంయోగముచే ఉత్పన్నమయ్యేదే అగ్నితుల్యమగు ఆత్మ తత్త్వ జ్ఞానము!
ఆ జ్ఞానాగ్నిచే అజ్ఞానము దగ్ధమై ఈ జగత్తును స్వకీయ ఆత్మ స్వరూపంగా సందర్శించగల
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
61

ఆత్మసుఖం అనుభవమౌతుంది!
నిపుణుడైన గురువుచే ప్రవచితమైన సాక్షాత్ తత్ త్వమ్ అసి అను విశుద్ధజ్ఞానముచే
గుణపూర్వకంగా ఆవరించిన మాయ తనంతటతానే స్వభావసిద్ధంగా అంతర్హితమౌతుంది.
ఈ విశ్వము తన కార్య-కారణ-గుణ పరిథిని అధిగమించి స్వస్వరూపాత్మ చమత్కారంగా,
ఇంధన రహితమగు అగ్నివలె స్వయమాత్మతేజో విలాసమై అనుభవం కాగలదు.
అదియే విషయ-అభావస్వరూపమగు నివృత్తి రూపముతో కూడిన సమగ్రావగాహన!
10. భిన్నంగా కనిపిస్తున్న ఏకత్వం
ఉద్ధవుడు: హే భగవన్! ఈ జగత్తులో వేరు వేరు గుణ సంయోగములచే జీవులు,
జన్మలు, పునర్జన్మలు, జ్ఞానులు, అజ్ఞానులు, విజ్ఞులు, మూర్ఖులు, మునులు, మహర్షులు,
భక్తులు, యోగులు, ఇంద్రియలోలులు ఇత్యాది వేరువేరైన - రకరకముల స్వభావములుగా
కనిపిస్తున్నారు కదా! వీరంతా ఎవరి సంకల్పము చేత వివిధ రీతులుగా
ఉత్పన్నమౌతున్నారు? పరమాత్మచేతనేనా? మరొకరి చేతనా? జీవుని స్వభావానికి
సంబంధించిన కర్తృత్వము జీవునిదా? ఈశ్వరునిదా? పరమాత్మదా? మరింకె
వరిదన్నానా?
శ్రీకృష్ణుడు: ఇక్కడ ఏకము - అక్షరము అగు పరమాత్మయే ఉన్నారు. ఏకైక పరమాత్మయే
వివిధ రూపములుగా మనస్సుచే పొందబడుతోంది. ఏకోసత్! ఏకమే అయివుండి
భావావేశరూపమగు మనస్సుచే అనేకముగా భావించబడుతోంది!
ఒక వేళ.., నీకు - కర్మ-కర్తృత్వము, భోక్తృత్వము, సుఖము దుఃఖముల దృష్ట్యా
వేరువేరుగా కనిపించేదంతా నిత్యమని, సత్యమని అనిపిస్తోందా? సర్వ భోగ ప్రతి
పాదితములైన శాస్త్రముల దృష్ట్యా సుఖ-దుఃఖములు, స్వర్గ నరకాది వివిథలోకములు,
జీవుల రాక-పోకలు వాస్తవమేనని భావిస్తున్నావా? ఆయా వస్తు ప్రభావం చేత అజ్ఞానం
- జ్ఞానం ఉత్పన్నమై, కాలాంతరంగా మారుతూ వుంటుందని అనుకోదలచావా?
అట్లా అయితే.....
అప్పుడు ఈ జీవుల దేహములు, సంవత్సరముల రూపంగా కనిపించే కాలము, ఆ
కాలముచే ఏర్పడే జనన బాల్య - యౌవన - వార్ధక్యాది అవస్థలు కూడాస్వతఃగానే
సత్యమని నిత్యమని అనుకోవలసివస్తుంది..
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
62

అప్పుడు.., ఈ జీవుడు ఏదో శక్తిచేత నియమితుడై పరతంత్రుడై సుఖదుఃఖాలు అనివార్యంగా
అనుభవిస్తున్నాడు - అని సమీక్షించవలసి వస్తుంది.
(If he is under strict control of some out-side Force) ఇక పరతంత్రుడైనవాడు
తానుగా మోక్షం పొందలేడని, ఎవ్వరో ఎక్కడినుండో ఆతనికి మోక్షం ప్రసాదించవలసి
యున్నదని చెప్పవలసి వస్తుంది.
అనగా..., శాస్త్రములు తాము చెప్పే సాధనలు నిర్వర్తించాటానికి కూడా జీవుడు
స్వతంత్రుడు కాదని, సాధనలు కూడా దైవము అనబడే మరొకరి ఆధీనంలో వున్నాయని
అనవలసివస్తుంది.
శాస్త్రములు అట్లా చెప్పటంలేదుకదా! "సాథన చేయవయ్యా! పొందుతావు" - అనిగదా,
అనిచెప్పుచున్నది!
ఉద్ధవుడు : అవునయ్యా! సాధనచే మోక్షం లభిస్తుందని సూచిస్తున్నాయి కృష్ణయ్యా!
నాకొక అనుమానం. ఈ జీవుడు పారతంత్రుడా? స్వాతంత్రుడా?
శ్రీకృష్ణుడు : ఒక వేళ జీవుడు పారతంత్రుడై (Under control of some remote
force) సాధనములు గాని, జన్మ - మృత్యు - పునర్జన్మలుగాని పొందుచున్నాడని
సిద్ధాంతీకరించ వలసివస్తే... అప్పుడు శాస్త్రములు జీవునితో నాయనా! నీవు బ్రాహ్మీ
ముహూర్తంలో నిదురలే! సాధనలకు ఉపక్రమించు!..., అని సంబోధించి ప్రయోజనం
ఏమిటి? అందుచేత అనేకత్వము - పారతంత్ర్యము (Multiplicity and forced bondage) అనివార్యమని చెప్పవలసి వస్తే శాస్త్రములు తాము చెప్పే సాధనల
ప్రయోజనములను తామే ఖండింపవలసివస్తుంది.
పరాధీనము (Remotely controled by some body) అయినట్టివానికి ఎట్టి పురుషార్ధము
సిద్ధించదు కదా! తానుగా ఏమీ చేయలేనప్పుడు శ్రద్ధ-సాధనాలగురించి శాస్త్రాలు నొక్కి
వక్కాణించటమెందుకు?
ఉద్ధవుడు: హే సద్గురూ! వేదములచే విధి - విధానపూర్వకంగా చెప్పబడే దేవతోపాసన
యజ్ఞయాగాది క్రతువులు ఎరిగిన పండితులు జీవుడు ఇహంలో సుఖం పరంలో
స్వర్గలోకాది సుఖ శాంతులు పొందాలంటే దేవతోపాసన, యజ్ఞ యాగాలు
నిర్వర్తించాలి. వేద విభాగాలైన యజ్ఞ యాగ విధానం తెలిపే సంహిత బ్రాహ్మణముల
పాండిత్యము లేకపోతే ఈ జీవునికి ఉద్ధరణ లేదు అంటూవుంటారు కదా!
అట్టి కర్మవిదుషుల ప్రతిపాదన గురించి తమ అభిప్రాయం చెప్పండి!.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
63

శ్రీకృష్ణుడు : నీవు చెప్పిన కర్మకుశలురకు (దేవతోపాసకులకు) (Experts in yagna /
yaga/ vedavignana) ఎల్లప్పుడు సుఖమే లభిస్తోందని మనం చెప్పలేం. అట్లాగే అట్టి
విషయాలలో నిష్ణాతులు కాని మూఢులకు దుఃఖములే వస్తున్నాయని కూడా
సిద్ధాంతీకరించలేము.
ఒకవేళ, వేద ప్రవచిత కర్మల రహస్యం తెలిసినవారికి సుఖ దుఃఖ విఘాతాల గురించి
తెలియవస్తోంది... అని అందామా? అయితే వారివద్ద కూడా అనివార్యమగు మృత్యువు
సంభవించకుండా ఉపాయాలు లేవుకదా! మృత్యు భయం కొనసాగుచునే ఉండగా,
కర్మల వలన కోరికలు తీరుతాయి... అనే ప్రయోజనం నిష్ఫలమేకదా? ఉరితీయటానికి
తీసుకుపోబడుచున్న మానవుడికి సుగంధద్రవ్యాలు ఇస్తే అవి ఆతనికి ఏంసుఖం?
అట్లాగే మృత్యువును ఎదురుగా పెట్టుకొని, మీరు ఈ ఆ కర్మలు చేయండి! అప్పుడు ఈ
ఆ సుఖాలు పొందుతారు.. అని శాస్త్రీకరించటం అటువంటిదే కదా!
పోనీ! యజ్ఞ యాగ కర్మలు నిర్వర్తించటానికి ఇప్పుడు శ్రమిస్తే ఉత్తరోత్తరా స్వర్గలోకంలో
స్థానం, స్వర్గ సుఖాలు లభిస్తాయి - అని కర్మ వాదులు అంటారంటావా? స్వర్గలోకంలో
లభించే సుఖాలకు కూడా స్పర్ధ - అశూయ - క్షయము నాశనము (Conflict -
mutual Hatred - Decrease - End all) అనేవి ఉండియే తీరుతాయి. అనగా
స్వర్గసుఖాలు కూడా ఇక్కడి ధనము - గృహములు మొదలైన ఐహిక భౌతిక సంపదలవలెనే
అనేక దుఃఖములతో కూడుకొని ఉన్నవేకదా! (They are also accompanying many
worries). పైగా..., యజ్ఞ యాగరూపములైన కృషికర్మలు నిర్వర్తించేడప్పుడే అవన్నీకూడా
అనేక శ్రమలు విఘ్నములతో కూడుకొని ఉంటున్నాయి.
సరే! ఆ విఘ్నములన్నీ అధిగమించి అవి నిర్వర్తించినా కూడా, వాటి ఫలితంగా దేహ
పతనానంతరం లభించే స్వర్గలోక సుఖాలు మాత్రం శాశ్వతమా? కాదే!
ఎట్లా అంటావా?
యజ్ఞములు చేసే పురుషుడు ఈ లోకంలో ఆ యజ్ఞములు ద్వారా దేవతలను ఆరాధించి
స్వర్గమును పొందుచున్నాడు. తాను చేసిన పుణ్యకర్మలకు ప్రయోజనంగా స్వర్గలోకంలో
దేవతాలోకాలలో దివ్య భోగాలు అనుభవిస్తున్నాడు. మనోహరమైన ఆభరణాదులు ధరించి
దేవతావిమానాలలో దేవతాస్త్రీల మధ్య విహరిస్తున్నాడు. గంధర్వ గణముచే
కీర్తించబడుచున్నాడు. అయితే! అవన్నీ ఇంద్రియ-విషయ సంబంధమైన భోగశ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
64

విలాసములే కదా! దేవతా స్త్రీలతో కలసి నందనవనాలలో విహరిస్తున్నంతవరకు - ఈ
భోగమంతా కొంతకాలానికి ముగిసిపోయి, "నాకు పతనం అనివార్యం" - అని
గమనించకుండానే కాలం గడిపివేస్తూ వుండవచ్చుగాక! పుణ్యమున్నంతవరకే స్వర్గలోకం!
పుణ్యము క్షీణించగానే కాలముచే త్రోయబడి తిరిగి క్రిందకు రావలసిందే!
ఉద్ధవుడు : అలా యజ్ఞ యాగ దేవతోపాసనాది కర్మలు కాకుండా..., ఇంద్రియలోలుడై
దుష్టసంగముతో అధర్మరతుడై ఇంద్రియ వాంఛలకు వశుడై జీవితమును గడపివేస్తేనో...?
లోభ బుద్ధితో దానము ధర్మము వంటి సత్కార్యాలు నిర్వర్తించకుండా ఇతరులను
మోసగించటం, బాధించటం మొదలైన దుష్టకర్మల లంపటంలో ఆయుష్షును వెచ్చిస్తూ
వుంటేనో...?
ప్రాణి హింస చేస్తూ అమాయక జంతువులను హింసిస్తూ భూత ప్రేత-పిశాచాదులను
ఉపాసించి, ప్రకృతి శక్తులతో ఇతరులకు భయము - హాని కలుగజేస్తూ వుంటేనో...?
శ్రీకృష్ణుడు : అప్పుడాజీవుడు పశువుల కంటే కూడా హీనమైన నరకయాతనలు గల
లోకాలలోకి కాలముచే నెట్టివేయబడుచున్నాడు. స్వార్ధ - పరమార్థ శ్రేయస్సు లభించక
అజ్ఞానముతో కూడి అనేక అల్ప ఉపాధులలో రాక పోకలు నిర్వర్తిస్తున్నాడు.
అందుచేత, ఓ ఉద్ధవా!
శ్లో కర్మాణి దుఃఖోదర్కాణి కుర్వన్ దేహేన తైః పునః
దేహమాభజతే తత్ర! కిం సుఖం మర్త్య ధర్మిణః? (అధ్యా 10, శ్లో 29)
ఈ దేహముచే చేయబడే కర్మలు వాస్తవానికి ఒక రకంగా దుఃఖ జనకములే! ఎందుకంటే
అవన్నీ జన్మ - మృత్యు పరంపరలు కొనసాగటాన్ని ఆపలేకపోతున్నాయి. మరి?
మరణము అనివార్యమై ఉండగా, ఈ జీవునికి లభించగల వాస్తవ సుఖం ఈ జగత్తులో
ఏమున్నది? (లేక) ఏలోకంలోనైనా ఏ మున్నది చెప్పు?.
అనంతకాలము యొక్క సుదీర్ఘ ప్రదర్శనలో లోకాలు లోక పాలకుల జీవితాలే
అల్పకాలానికి పరిమితమైవుంటున్నాయి. లోకాలు మహా అయితే, ఒక కల్పము వరకు
కొనగాసుగుతాయి. బ్రహ్మదేవుడు కూడా కాలపరిమితుడేకాబట్టి, కాలస్వరూపుడనగు
నన్ను చూసి భయమును పొందటం జరుగుతుంది. ఇక మానవుని ఆయుఃపరిమాణం
గురించి వేరే చెప్పేదేమున్నది? స్వర్గము మొ||న లోకములలో నివాసం కోరుకొని మాత్రం
శాశ్విత ప్రయోజనమేమున్నది?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
65

ప్రకృతిలోని సత్త్వ-రజో-తమో గుణాలు కర్మలను (Individual Roles and functions)
కల్పిస్తూ వుంటాయి.
ఆ కర్మల నుండి గుణాలు, మరల గుణముల నుండి కర్మలు!
గుణములతో తాదాప్యము చెంది ప్రవర్తించే జీవుడు ఆ కర్మల ఫలములను అనుభవిస్తూ
ఆ అనుభవం నుండి గుణ కర్మలను అంతులేని ప్రవాహంలాగా కొనసాగిస్తూనే
వుంటాడు. ఎంతెంతవరకైతే త్రిగుణములనబడే వైషమ్యం దృష్టియందు కొనసాగుచూ
వుంటుందో.. అంతంత వరకు ఈ జీవునిపట్ల - "నేను వేరు - వారు వేరు - దేవతలు
-
వేరు - మంచివారు వేరు - చెడువారు వేరు - పాపములు - పుణ్యములు - సుఖములు
దుఃఖములు స్వర్గము నరకము" .. ఇటువంటి నానాత్వమంతా ఉండియే
ఉంటుంది. ఈ జీవుడు నిజం-నిజం అనుకుంటూ నానా రూపములు పొందుచూనే
ఉంటాడు. బుద్ధియందు కల్పితమగు నానా రూపములు కొనసాగునంతవరకు జీవునికి
కర్మలకు అధీనత్వము – పారతంత్ర్యము ఉండియే తీరుతోంది! అట్టి కర్మాధీనం ఉన్నంత -
వరకు కర్మ ఫల ప్రదాత నుండి సాంసారిక భయం ఏర్పడుతూనే వుంటోంది. గుణ
వైషమ్యము, అద్దానిచే భోగానుభవము-బంధము ఉంటూనే ఉంటాయి. బంధకారణంగా
కర్మల అనివార్యంగా బలవంతంగా నిర్వర్తించటం - కర్మవలన సుఖ దుఃఖాలు....
ఇవన్నీ చేయి చేయి కలుపుకుని కొనసాగుచున్నాయి.
కర్మ - కర్మ ఫలముల పట్ల ఆశ-అభినివేశము నమ్మకము కొనసాగుచున్నంత
వరకు ఈ జీవునికి శోక మోహములు తప్పేవి కావు. త్రిగుణమాయకు లోను
అయిన జీవులు పరమాత్మయగు నన్ను లోకము కాలము - స్వభావము
ధర్మము ఇటువంటి రూపములుగా దర్శిస్తాడే గాని, "పరమాత్మ నా స్వస్వరూపమే!" -
అనే విషయం గమనించలేకపోతున్నాడు.
శ్రీ ఉద్ధవుడు: స్వామీ! శ్రీ కృష్ణా! నాది మరొక్క సందేహం.
ఈ జీవునికి త్రిగుణముల ప్రభావం చేతనే దేహ పరంపరలు వచ్చి పోతున్నాయి కదా!
అనగా దేహం ఉన్నంతవరకు గుణములు పరిఢవిల్లుతూనే వుంటాయి కదా! మరప్పుడు
దేహము ఏర్పడి ఉండికూడా, ఈ త్రిగుణములకు అతీతుడై వుండగలడా? దేహం
ఉండికూడా గుణాతీతుడై వుండటం ఎవ్వరికైనా సాధ్యమా? సాధ్యమైతే అట్టి
గుణాతీతుడగు జీవుడు (దేహి) ఎట్లా ఉంటాడు? గుణాతీతుడైనవాడు దేహం ఉంది
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
66

కాబట్టి, బద్ధుడా? లేక ముక్తుడా? అతని విహారం ఎక్కడ? గుణాతీతుణ్ణి ఏ లక్షణములచే
మనం గుర్తించగలం? ఆయన స్వీకార విసర్జనలు ఎట్లా వుంటాయి? ఎక్కడ ఎట్లా
నివసిస్తాడు, ఎక్కడ శయనిస్తాడు? ఓ అచ్యుతా! గుణములు ప్రదర్శిస్తున్నప్పటికీ
గుణాతీతుడై వుండేవాడిని గురించి మీరు మాత్రమే విశదీకరించగలరు.
ఒకే ఆత్మ నిత్య బద్ధమై వుంటోందా? నిత్య ముక్తమై కూడా వుంటోందా!
ఆత్మ సర్వదా ఏకమే అయి ఉండికూడా, బద్ధులు - అజ్ఞులు-విజ్ఞులు-ముక్తుల రూపాలు
ఎందుకు దాల్చుతున్నది? - అన్నటువంటి ఈ విషయంలో నాకు ఎన్నో అనుమానాలు
ఉంటున్నాయి. మీ సమాధానంతో నా అనుమానాలను తొలగించ ప్రార్ధన!.
"నిత్య బద్ధాత్మ - జీవాత్మ :: నిత్యముక్తాత్మ-పరమాత్మ" అనునది అధ్యాత్మశాస్త్ర
సమీక్షయేనా? శాస్త్రీయదృష్టిచే యుక్తియుక్తమేనా?
శ్రీకృష్ణ భగవానుడు : ఆధ్యాత్మశాస్త్రము బంధముక్తుల గురించి నిర్వచిస్తోంది. అయితే,
ఓ ఉద్ధవా! త్రిగుణములను దృష్టిలో పెట్టుకొని మాత్రమే "ఈతడు బద్ధాత్ముడు- ఈతడు
ముక్తాత్ముడు" అని శాస్త్రములు వ్యాఖ్యానించటం జరుగుతోంది. త్రిగుణములు
మాయ చే కల్పించబడినవి మాత్రమే కదా!. అందుచేత,..., ఆత్మకు వాస్తవానికి బంధము
లేదు. బంధమనునదే లేదు కాబట్టి, ముక్తి అనబడునదేదీ కూడా లేదు!. స్వప్నంలోని
కొన్ని సంఘటనలకు స్వప్న ద్రష్టబద్ధుడౌతున్నాడా? మరికొన్ని సంఘటనలచేత
ముక్తుడౌతున్నాడా? లేదే! స్వప్నము తనదైనవాడు స్వప్నంలో ఏదేది కనిపించినాకూడా
మెళుకవ వచ్చినతరువాత యథాతథుడే కదా!
ఇక్కడి సుఖ దుఃఖాలు స్వప్నంలోని సంఘటనల వంటివే! నేను జీవాత్మను - బద్ధుడను,
అనునది కూడా స్వస్వరూపాత్మ దృష్ట్యా ఒకరాత్రి ఒకడికి వచ్చిన ఒక కలవంటిదే!
కలగనేవాడికి కలలో బంధము ఉన్నట్లా? లేనట్లా?
ఒకడు స్వప్నంలో ఒక గొప్ప 3 అంతస్తుల మేడ కట్టుచున్నానడనుకో! రెండవ అంతస్తు
కట్టుచుండగా మేస్త్రీ - పనివారితో ఏవేవో ఇబ్బందులు వస్తున్నాయి. ఇంతలో... మెళుకువ
వచ్చింది. నిద్ర లేవగానే, ఆ మేడ ఎక్కడ? ఆ పనివారు ఇంకా రారేం? .. అంటూ ఆ
స్వప్న అప్పటి దర్శి ఇప్పటి జాగ్రత్లో - ఇంటి నుండి బయలు దేరుతాడా? లేదు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
67

కదా! అదంతా స్వప్నమే కదా!.. అని అంతా క్షణంలో త్యజించి, ఇక వర్తమాన జాగ్రత్లో
తన దిన చర్యలకు ఉపక్రమిస్తాడు కదా!. దేహ దేహాంతరాలు ఈతీరైనవే!
స్వప్న బుద్ధి స్వప్నంలో అనేక సుఖ - దుఃఖాలుగా వివర్త మగుచున్నది కదా! అట్లాగే...
జాగృత్ బుద్ధి దృశ్యమును పొందుచూ- ఇదంతా వాస్తవం - శాశ్వతం... అనే భ్రమకు
( వర్తమానము పట్ల) లోను అగుచున్నది. ఏది ఎట్లైనా ఉండవచ్చుగాక! ఇక్కడ జాగ్రత్లో
అనుభవమగుచున్న శోకము మోహము సుఖము దుఃఖము - సామాన్యము - -
ఆశ్చర్యము - జననము - మరణము ఇవన్నీకూడా దేహమునకు సంబంధించిన మాయా
విశేషాలు అని గ్రహించు. మాయ అనగా? ఒకడు ఒక కథ వింటున్నాడు (లేక) ఒక
నాటకం చూస్తున్నాడు. అందులోని సుఖ-దుఃఖ హాస్య - సంగతి సందర్భసంబంధ బాంధవ్యాలన్నీ నిజమే అని భావించి తాను అక్కడి పాత్రలకు సంబంధించిన
రసానుభూతిని తన హృదయంలో పొందుచున్నాడు. నిజానికి అతడు ఆమెతో అన్నన్ని
బాధించే మాటలు అంటూవుంటే.. నాకు బాధ వేస్తోంది - అని అని నాటక నాటక పాత్రలను
చూసి అనుకోవటం వంటిదే, ఈ దృశ్యము నుండి జీవుడు అనుభవించే సుఖ దుఃఖాలు
కూడా! కనుక "ఇక్కడి సుఖ దుఃఖాలకు వాస్తవమైన ఉనికి లేదు. ఇది కాల బద్ధము
స్వప్న సదృశమేగా ఇదంతా!" - అనునది మరచి ఈ జీవుడు ఆ - యా విషయాలతో
తదాత్మ్యము పొంది వాటితో అవినాభావపూర్వకమైన అనుభవమును పునికిపుచ్చుకుంటూ
కొనసాగించటమే జగత్తు (లేక) సంసారము అనబడుదాని నిర్వచనం.
ఓ ఉద్ధవా! "ఈ మాయా రచనకు రచయితను సర్వాంతర్యామినైన నేనే" - అని గ్రహించు!
విద్య-అవిద్య.. ఈ రెండూ కూడా నా యొక్క మాయా రచనయే! ఈ శరీరి నా
మాయా రచన యందు నిమగ్నుడగుచున్నాడు. జీవుల యొక్క బంధము మోక్షము అనే
రెండింటికీ కారణం సర్వ తత్త్వస్వరూపుడగు నా మాయా చమత్కారమే!. మాయా
రచయితను నేనే! దేహిని నేనే! దృశ్యము నేనే!
ఇక ఈ బద్ధ-ముక్తులగు జీవులు (దృష్టిలో) ఎవ్వరంటావా? ఇక్కడి ద్రష్టలంతా కూడా
అద్వితీయ స్వరూపుడనగు నా అంశయే! అట్టినా అంశభూతులగు జీవులకు అవిద్య
చేత బంధము, విద్య చేత బంధరాహిత్యము కలుగుతోంది.
"నేను జీవుడను" అను భావనయే బంధము. "ఇక్కడి ద్రష్టత్వమంతా ఏ పరమాత్మ
యొక్క అంశయో అట్టి పరమాత్మనాకు అద్వితీయుడు" అని గమనించటంచేత
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
68

మోక్షము. ఇంతకు మించి వేరే బంధము లేదు. మోక్షము లేదు.
ఇప్పుడు నీకు బద్ధుని లక్షణములు, ముక్తుని లక్షణములు వివరిస్తాను. విరుద్ధమైన
బంధ మోక్షములు ఆత్మకు ఏవిధంగా ఆపాదితములో (Attributed features)
చెప్పుచున్నాను. విను!.
11. జీవ-ఈశ్వర న్యాయం
ఒకానొక చోట ఒక మహావృక్షం వున్నది. దాని వ్రేళ్ళు నేలలో విస్తారంగా లోతుగా
విస్తరించి వున్నాయి. ఆ వృక్షము యొక్క కొమ్మలు, ఆ కొమ్మల ఉపకొమ్మలు అతి
వైశాల్యంగా ఆచోటును ఆక్రమించుకొని వున్నాయి. ఆ కొమ్మలకు ఆకులు ఫలములు
పిందెలు అసంఖ్యాకంగా వ్రేలాడు చున్నాయి.
ఎక్కడి నుండో రెండు పక్షులు వచ్చి ఆ మహా వృక్షముపై వ్రాలాయి. ఒకటి పెద్దది.
ఒకటి చిన్నది. కొద్దిసేపైన తరువాత చిన్న పక్షి అక్కడి కొమ్మల పై వ్రాలింది.
ఫలాలు తింటోంది. అటుఇటు చూస్తోంది. గంతులేస్తోంది. కిచకిచ శబ్దాలు చేస్తూ
ఆకొమ్మ - ఈకొమ్మవైపుగా వ్రాలి అక్కడి ఆకులలో పూలలో తన దేహమును
దాచుకుంటోంది. మరల ఎగురుతోంది. మరల మరల ఆ వృక్షముపై అనేక చోట్ల
వ్రాలుతోంది. అవిశ్రాంతంగా కదులుతోంది. ఎన్నో ధ్యాసలు! ఎన్నో రుచులు! ఎన్నో
వేదనలు, రోదనలు ! ఆశిస్తోంది! నిరాశపడుతోంది! ఆవేశపడుతోంది! నవ్వుతోంది!
దుఃఖిస్తోంది! పుల్లపళ్లు తింటోంది! బాధగా కూతలు పెడుతుంది. ఇంతలోనే తీయ
పళ్ళు కొరకు వెతకుతోంది. గర్విస్తోంది! భంగపడుతోంది! అద్దాని అన్వేషణా-ఆవేదనాఆలోచనా-ఆకాంక్షా-ఆలింగనా వ్యవహారములకు అంతు ఉండుటలేదు. ఏది ఏమైతేనేం?
అది పెద్ద పక్షిని ఒక వైపు చూసుకుంటూనే వున్నది. పెద్ద పక్షిని ఏమరచటమూలేదు,
వదలటమూ లేదు. కొమ్మలపై చంగ్ చంగ్ గంతులు ఆపటమూ లేదు!
ఇక పెద్ద పక్షియో!
ఆ మహావృక్షానికి పైన గల ఒక ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా ఆనందంగా
సమగ్రమైన విజ్ఞతతో తనను తానే సంపూర్ణమైన అవగాహనతో ఆస్వాదిస్తూ చిద్విలాసంగా
చూస్తోంది.
ఒక తండ్రి పిల్లవాడితో తమ ఇంటికి దూరంగా గల ఒకానొక ఉద్యానవనంలోకి
వచ్చాడు. ఆ పిల్లవాడు ఉద్యానవనంలో ఆటలు ఆడుకుంటూవుంటే, తండ్రి ఒకానొక
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
69

వాత్సల్యతతో గమనిస్తూ తన అనుభూతితో తాను ఉంటాడు చూచావా? పిల్లవాడు నాన్నను
చూచుకుంటూనే ఆటలలో మునిగి గంతులు వేస్తూ వుంటాడు కదా!
అట్లా ఆ పెద్ద పక్షి చిన్న పక్షియొక్క వైనమంతా వాత్సల్యంగా గమనిస్తూనే తాను
ప్రశాంత ముద్ర వహించివుంటోంది!. అప్రమేయమై మౌన-ఆనందముల ఆస్వాదన
కొనసాగిస్తోంది.
ఆటలాడుకునే పిల్లవాడి వైనం- తన వైనం తండ్రికి తెలుసుకదా! అట్లాగే పెద్ద పక్షికూడా
చిన్న పక్షి తన ఆనంద కల్పిత భావనా రూపము - అని ఎరిగి తానుమాత్రం చిత్స్వరూప
చమత్కారంగా వెలయుచున్నది.
ఈ దృష్టాంతం పరమాత్మ (పెద్ద పక్షి) జీవాత్మ (చిన్న పక్షి) పరంగా గమనించు.
జీవాత్మ తనను తాను దృశ్యాంతర్గతమైన దేహిగా దర్శిస్తోంది. దేహము అనే పంజరంలో
చిక్కుకున్న పక్షివలె ఎరుగుచున్నది. సంగతి సందర్భము - సంఘటనల మధ్య
పరిమిత విశేషంగా తనను ఎరుగుచున్నది! కర్మలకు సంబంధించిన సత్ఫల
దుష్ఫలభోక్తగా స్వకీయంగా భావిస్తోంది. అనగా, సత్ఫల దుష్ఫలబోక్తగా తనను తాను
ఎరుగుచున్నది. ఈ దేహమునకు ఇక్కడి జన్మ - జరా - మృత్యు సంఘటనలకు
వేరుగా తనను తాను ఎరుగుట లేదు. తనేమిటో ఎట్టిదో ఎందుచేతనో తానే ఏమరుస్తోంది!
ఇక పరమాత్మయో?
నిత్య జ్ఞానాశ్రయుడు. జీవుడు అనబడు దానికి కేవల ఆనందస్వరూప సాక్షి! జన్మలు
కర్మలు - గుణములు - దృశ్యములు - సందర్భము - సంబంధములు మొ॥ వాటిచే
స్పృశించబడనివాడు.
జీవుడు అవిద్యచే జనించుటచేత నిత్యబద్ధుడు!
పరమాత్మ విద్యామయుడై వుండటంచేత నిత్యముక్తుడు!
ప్రతి ఒక్క వ్యక్తి పరమాత్మ (నిత్యముక్తుడు) జీవాత్మ (నిత్య బద్ధుడు)- ఈ ఇరువురి ఏక
స్థానవాస చమత్కారమే!. (Everybody is a combination of mere silent al-powerful witness (+) worldly participant). ఈ పాంచభౌతిక దేహమే ఆ మహావృక్షము.
జీవాత్మ పరమాత్మల ఏకస్థాన - ఏకత్వపు చమత్కారం గమనించి సునిశ్చితుడైనవానిని
వివేకి అని, విద్వాంసుడు అని, జ్ఞాతజ్ఞేయుడు అని శాస్త్రములు పిలుస్తున్నాయి.
"పరమాత్మ మరెక్కడో! జీవాత్మనగు నేనిక్కడ!" - అని పరిమితావగహనకు అనుబంధుడైన
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
70

వానిని అవిద్వాంసుడు అని చెప్పుతారు. అనగా ప్రతి ఒక్కడు జీవాత్మగా నిత్యబద్ధుడు.
పరమాత్మగా నిత్యముక్తుడు.
ఉద్ధవుడు : హేపరంజ్యోతి స్వరూపా! పరమాత్మా! జీవ బ్రహ్మైక్యానుభవుడడగు
విద్వాంసుడు దేహమును ధరించవలసిన అవసరం కలిగి వుంటాడా? పాంచభౌతిక
దేహం త్యజించినవాడై వుంటాడా?.
శ్రీ కృష్ణపరమాత్మ :
శ్లోదేహస్థోపిదేహస్థా విద్వాన్ స్వప్నాత్ యథోస్థితః
అదేహస్థోపి దేహస్థః కుమతిః స్వప్నదృక్ యథా! (అధ్యా 11, శ్లో 8)
మిత్రమా!
నటించువాడు-నాటకములోని పాత్రల వలె పరమాత్మ జీవాత్మ ప్రతి దేహంలోను
యదాతథంగా ప్రదర్శితులైవున్నారు. ఇది గమనించి ఆస్వాదించు. విద్వాంసుడు సదా
ముక్తపురుషుడైవుంటాడు. " నేను దేహ బద్ధుడను! .." అనే భ్రమ - బంధ భావాలచే
పరిమితుడై వుండడు.
నిద్ర లేచినవాడు, " నేను నిద్ర సమయంలో (కలలో కనిపించిన సంపద ఆపదలకు
చెందినవాడను!" అని భ్రమిస్తాడా? లేదు కదా! స్వప్నంలో కనిపించిన సంపదకు
యజమాని ఎవరు? స్వప్నాంతర్గతుడైన ద్రష్టయా? స్వప్న సాక్షియా? మరొకరెవరన్నానా?
ఊహచే జనించి ఊహచే లయించేదానికి యజమాని అనునదేమున్నది?
నిద్ర లేచినవాడు స్వప్న దృశ్యాన్ని తన జ్ఞప్తిలో ఏ విధంగా చూస్తాడో.. విద్వాంసుడు
(లేక) నిత్యవివేకి ఈ జాగృత్ దృశ్యాన్ని ఆ విధంగా వర్తమానంలోనే చూస్తూ ఆస్వాదిస్తాడు.
దేహంలో ఉంటూనే దేహము నాది. అంతేగాని నేను దేహమునుగాను... అనునది
గమనిస్తున్నాడు.
"ఈ వాహనము నాది" అని చెప్పుచున్నాడు - "ఈ వాహనము నేను" - నేను అనడు
కదా! దేహము విషయం కూడా అంతే!
అవివేకియో? నిద్రలో అడవిలో చిక్కుకున్నట్లు కలవచ్చిందనుకో? ఆ స్వప్నద్రష్టతన
ఇంట్లో పరుపుపై బంధువుల మధ్య వుండి నిద్రుస్తున్నప్పటికీ, - నేను అడవిలో
చిక్కుకున్నానే! నా గతి ఏమిటి? ఏ మృగమైనా వచ్చి నా వెనక పడదు కదా! .. అనే
భయం పొందుతాడు చూచావా? ఆ విధంగా కుమతి అయినట్టి అవివేకి దృశ్యము
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
71

ఉన్నప్పుడు - లేనప్పుడు కూడా దృశ్యజాడ్యమును అనుభూతిగా పొందుచూనే ఉంటాడు.
అనగా...
అవివేకి దేహం ఉన్నప్పుడు, దేహం లేనప్పుడు కూడా దృశ్యతదాత్మ్యరూపమైన సంసారము
అనబడేదానిని అనుభవిస్తూనే వుంటాడు.
వివేకికి, దేహం ఉన్నప్పటికీ ఆతని పట్ల సంసారము స్వప్న మాత్రమువలె మొదలే
లేనిదై వుంటుంది. అందుచేత...
వివేకికి దేహము యొక్క రాకతో వచ్చేదేదీ లేదు. పోయేదేదీలేదు. అతని సందర్శనము
(perception / interpretation) సుఖ దుఃఖాలకు అతీతమై వుంటుంది.
అవివేకికి దేహము యొక్క పోకతో బంధము పోయేదీకాదు. అన్ని సంబంధ - బాంధవ్యాల
బీజములు అంతరమున కొనసాగిస్తూనే ఉంటాడు.
సుఖ దుఃఖాలు స్వమనోకల్పితాలు!. సంసారము అనునది ఉన్నది మనస్సులోనే!
దేహములో కాదు. దృశ్యములో కాదు. జగత్తులో కాదు. ఆత్మయందు కాదు.
స్వస్వరూపాత్మతత్త్వము గురించి వేదాంగములు - విజ్ఞులు చెప్పుచున్న వాక్యములను
వివేకముతో గ్రహించాలి సుమా! అట్టి వివేకి - ఇంద్రియములను (అనగా ఈ భౌతిక
శరీరమును) ఇంద్రియార్ధములను (శబ్ద-స్పర్శ- రూప రస గంధములను)
గుణములను (సత్వ - - రజో - తమో త్రిగుణములను) గ్రహిస్తూ - ఉపయోగిస్తూ -
పాల్గొనుచూ కూడా ఇదంతా జగన్నాటకంలోని పాత్రకు సంబంధించినవే గాని, నాకు
సంబంధించినవి కావు!... అని గమనిస్తూనే వుంటాడు. నేను జీవుడుగా మారి
పోయాను! గుణములు నన్ను ఆవరిస్తున్నాయి! ఈ శరీరం నాకు బంధము. ఇంద్రియ
విషయాలు నన్ను పట్టుకొని పీడిస్తున్నాయి. " ఇటువంటి ఆయా అల్ప భావనలకు
చోటివ్వడు. "నేను వీటికి కర్తను! భోక్తను! ఇవి నాకు సంబంధించినవి! నేను వీటికి
సంబంధించనవాడను ..." అనే పరిమిత దృష్టులను స్వస్వరూపముపై ఆపాదించుకోడు.
నటుడు నవరసాలు ప్రదర్శిస్తూ - ఈ కోపం, ఈ ప్రేమ, ఈ ఇష్టం, ఈ అయిష్టం, ఈ
ఆవేశం నేను ప్రదర్శిస్తున్నప్పటికీ, ఇవన్నీ నేను నటిస్తున్న పాత్ర సంబంధమైనది!
పాత్ర నాటకంలోనిది. నేను సర్వదా వీటితో ప్రమేయం లేని స్వరూపం కలవాడినే!
అని తెలిసియే వుంటాడు కదా! అందుచేత వివేకి (లేక విజ్ఞుడు) ఇంద్రియార్ధరూపమగు
జగత్తు చేతగాని, ప్రకృతి రూపమగు గుణముల చేతగాని, సహ జీవులతో
సందర్భానుచితంగా ఏర్పడే సంబంధ అనుబంధ - బాంధవ్యముల చేతగాని
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
72

ప్రమేయము పొందడు! వాటిని స్వీకరిస్తూనే, స్వీకరించనివాడై ఉంటాడు. ఆతనికి ఏదీ
బంధముకాదు. ఇక క్రొత్తగా పొందవలసిన మోక్షమేమున్నది? "నేను పాత్రధారినై
వుంటూనే...త్రిగుణములకు సూత్రధారినికదా!" అని ఎరిగి వుంటాడు.
ఇక అవివేకి విషయానికివస్తే...!
దైవాధీనంగా జగత్ కల్పనలోని ఒకానొక అంతర్భాగంగా వచ్చిపోయే ఈ శరీరములను
చూస్తున్నప్పుడు గాని, ఇక్కడి త్రిగుణ విన్యాసం చేత ఏర్పడుచున్న ఇష్ట అయిష్ట,
సానుకూల్య ప్రాతికూల్య, ప్రియ - అప్రియములను గమనిస్తున్నపుడుగాని, దీనికి నేను
కర్తను! దానికి వారు కర్త!... అనే భ్రమాహంకారానికి చోటిస్తున్నాడు!. ఎప్పుడైతే
కర్తృత్వము వహించటం ఆపాదించటం ప్రారంభిస్తున్నాడో.. అప్పుడు
జగదనుభవములచే నిబద్ధుడు అగుచున్నాడు" కర్తాం స్మి!.. అని భావించి బంధంకొని
తెచ్చుకుంటున్నాడు. నా హమ్ కర్తా! మమ మాయా కర్తా!" అనే విజ్ఞతను
ఏమరుస్తున్నాడు.
విద్వాంసుడు నిత్యానిత్య వివేకి, వైరాగ్యయుక్తుడు అయినవాడు...,
పడుకున్నప్పుడు, కూర్చున్నపుడు, వ్యవహారాలలో ప్రవేశిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు,
స్పర్శిస్తున్నపుడు, వాసన చూస్తున్నప్పుడు, భుజిస్తున్నపుడు - వింటున్నప్పుడు- ఇటువంటి
సర్వ సందర్భములలోనూ ఈ ఈ త్రిగుణ ప్రదర్శన సందర్భాలలోను నేను బద్ధుడిని
అని భ్రమించడు. వాటిచే అతడు నిబద్ధుడు కాడు.
"ఈ శరీరములోని ఇంద్రియాలు ఇంద్రియార్దాలచే ప్రేరేపించబడి ప్రవర్తిస్తున్నాయి. వీటిచే
నేను నిబద్ధుడును కాదు! పరిమితుడనుగాను!"- అని గమనించుచున్నవాడై ఉంటున్నాడు.
సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. అట్టి సూర్య బింబం ఒక తటాక జలంలో
ప్రతిబింబిస్తోంది. సూర్య బింబము తటాక జలంలో ప్రతిబింబిస్తోంది కాబట్టి... అది
తటాకజలంచే బంధింపబడింది - అని అంటామా? ప్రతి బింబించినంత మాత్రం చేత -
సూర్యబింబం జలానికి సంబంధించినదని గాని, జలంలో సూర్యబింబం చిక్కుకున్నదని
గాని ఎవ్వరూ అర్ధం చేసుకోరు కదా!. గాలి అంతటా వీస్తూ వుంటుంది! అటువంటి
గాలి దేహాలలోను, వస్తువులలోను, పాత్రలలోను (Eg. In four wheeler Tyres, Foot
Balls ect.,) చిక్కుకున్నదని ఎవ్వరమూ అనం కదా!. స్వప్నం గురించి ఎరుకగలవాడు
స్వప్నంలో నేను చిక్కుకున్నాను.. ఇప్పుడేమో, బయటకు వచ్చాను అని అనుకోడు కదా!.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
73

అట్లాగే విద్వాంసుడు కూడా - నేను ఈ దేహముచే నిబద్ధుడును. ఈ ఇంద్రియార్ధములు
ఈ పరిస్థితులు ఈ సంబంధ బాంధవ్యములు నన్ను నిబంద్ధిస్తున్నాయి - అనే
భ్రమను పొందడు.
నేను జీవుడుగా జగద్విషయాలలో ప్రతిబింబిస్తున్నాను. అయితేఏం? ఆకాశంలో
సూర్యునివలె ఆత్మస్వరూపుడనై, అప్రమేయుడనై ఈ ఈ భావాభావములను
వెలిగిస్తున్నాను. - అని గమనించినవాడై వుంటాడు. (లేక) ఆత్మ సూర్యుడనగు నేను
ఈ మనో - దేహ - జగత్ తటాకాలలో ప్రతిబింబిస్తున్నాను. ఇంత మాత్రమే!... అని
గ్రహించి వుంటున్నాడు.
ఒకడు అద్దంలో ముఖం చూచుకుంటూ, ఈ అద్దంలో నా ముఖం చిక్కుకున్నది - అని
-
వాపోతాడా? పసిపిల్లవాడు అద్దం గురించి తెలియక అట్లా (Having no knowledge
about a mirror) అనుకుంటాడేమో మరి!
ఒకడు నిదురలేచిన తరువాత స్వప్నదృశ్యం గురించి ఎట్లా అనుకుంటూ వుంటాడు?
వివేకి వర్తమానంలోనే తన ఎదురుగా వున్న ఇంద్రియార్ధ సమ్మేళనము - సంగతి,
సందర్భముల మేళావంటి ఈ జగత్తును ఆ రీతిగా చూస్తు ఉంటాడు. జగత్తు నుండి,
దేహమునుండి, తదితదిత దేహ సంబంధములనుండి సదా సర్వదా నివృత్తుడై,
అతీతుడై, దర్పణ స్వబింబదర్శనదృష్టి కలవాడై వుంటాడు. విజ్ఞానియగు వివేకి
ఇంద్రియములను విషయములతో ప్రవర్తింపజేస్తూ.. తాను సర్వదా అతీతమైన
అప్రమేయత్వమును వహించియే ఉంటాడు. ఎవని సంకల్పమైతే ప్రాణ - ఇంద్రియ -
మనో దేహాదుల క్రియలతో తాదాత్మ్యము చెందకుండా వుంటుందో.. అట్టివాడు
దేహస్తుడై వుండి కూడా, గుణములకు అతీతుడు, వినిర్ముక్తుడు (Ever - beyond and
Ever- relieved) అయివుంటాడు.
ఎవ్వరైతే ఈ శరీరము ఒకరిచే అర్చించబడుచున్నప్పుడు, మరొకరిచే అవమానించ
బడుచున్నప్పుడు ఉభయ సందర్భములలో కూడా సంతోష దుఃఖములచే
స్పర్శించబడకుండా ఇదంతా "యాదృచ్ఛికం (No body as cause)" అని గమనిస్తూసమదృష్టితో చూస్తూ వుంటాడో అతడే బుధుడు! ముక్త పురుషుడు! అట్టివాడు
సాధువులను చూసి స్తుతించడు! అసాధువులను దూషించడు (లేక) నిందించడు. గుణ
దోషములకు వ్యధచెందడు! సద్గుణములను చూసి మురిసిపోడు! దేనినీ ఎవ్వరినీ
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
74

దూషించడు, ఆశ్చర్యపడిపోడు. ఆతడు జగత్తుకు ఆవల ఆత్మారాముడై జగత్ వృత్తులకు
పట్టుబడనివాడై వుంటాడు! ఒక జడునివలె ప్రాపంచిక సత్ అసత్ విషయ పరంపరలలో
చిక్కుకోడు, మాట్లాడడు, ధ్యానించడు. అన్నింటా ఆత్మనే ధ్యానిస్తూ వుంటాడు. జగత్
నాటకంలో నటిస్తూనే ప్రేక్షకుడిలాగా చూస్తూ ఉంటాడు.
ఉద్ధవుడు: స్వామీ! అంతటి అతీతత్త్వము ఆత్మారామత్వము ఒనగూడాలంటే వేద
వేదాంగ పాండిత్యం అవసరమంటారా? (లేక) వాటి ఆవస్యకత అనివార్యం కాదంటారా?
శ్రీకృష్ణుడు: ఓ ఉద్ధవా! ఆత్మ యొక్క జగత్ ప్రదర్శనా చమత్కారము - జగత్తు ఆత్మకు
అద్వితీయము ... అను విశేషం ఎరుగక, నా ఆత్మయే జగత్ దృష్టిచే జగత్ రూపంగా
కనిపిస్తోంది... అని గమనించక... రోజులు గడుపుచున్నవానికి ఏ పాండిత్యమువలన
ఏం లాభం? శబ్ద బ్రహ్మము (వేద మంత్రోచ్ఛారణము) నందు నిష్ణాతుడైకూడా
ఆత్మతత్త్వము యొక్క అవగాహన యందు నిష్ణాతుడవకపోతే,... అట్టి శాస్త్ర పాండిత్యము
నిష్ఫలమైన శ్రమయే సుమా!. పాలు ఈయని ఆవు, పతి పట్ల శ్రద్ధలేని భార్య, పరాధీనమైన
దేహం, దుష్టగుణములు గల కొడుకు, దానం చేయని లోభియొక్క ధనము, అర్ధంలేని
వాక్ శబ్దాలు ఏ విధంగా వ్యర్థమో, అనేక దుఃఖములకు కారణమో... అట్లాగే ఆత్మ
జ్ఞానమును, ఆత్మతత్త్వానుభూతిని పెంపొందించుకొనే ఉద్దేశ్యము లేని వేద శబ్దాచ్ఛారణ
నిష్ఫలము, దుఃఖభారము కూడా! ఈ దృశ్య జగత్ యొక్క ఉత్పత్తి - స్థితి లయములు
ఎందులో చమత్కారంగా దృష్టికి అగుపిస్తున్నాయో - అట్టిదంతా ఆత్మతత్త్వ స్వరూపుడనగు
నా లీలావినోదావతారముగా గమనిస్తూ - ఈ జగత్తు నాయొక్క లీలగా, క్రీడగా
స్థుతించే వాక్కే ప్రయోజనకరము. ఈ దృశ్యమంతా పరమాత్మయొక్క లీలా వినోదమే!
అని గమనించక, ఇక్కడి ప్రాప్తాప్రాప్తములకు సుఖదుఃఖములకు సంబంధించిన
మాటలనే చెప్పుకుంటూ పోతుంటే ఏమి లాభము? బుద్ధిమంతుడైనవాడు అటువంటి
వాక్యాలు ఉచ్ఛరించడు! ఇంకొకరు మాట్లాడుతుంటే వినడు!. ఆహాఁ! ఈ బంగారము
ఎంత విలువైనది!.... అని గమనించేవానికి ఆభరణముయొక్క వంపుసొంపులు విషయమే
కాదు కదా!
సర్వము బ్రహ్మమే!
ఓ ఉద్ధవా! ఇక్కడ నీకు కనిపించే నానాత్వము (Multiplicity) అనే భ్రమను విడచిపెట్టు.
ఇక్కడి భిన్నత్వంలోని ఏకత్వస్వరూపుడను - సర్వగతుడను అగు నన్నే ఆశ్రయించు. నీ
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
75

మనోబుద్ధులను పరస్వరూపుడనగు నాకు సమర్పించు. నిర్మలమైన మనస్సుతో అంతా
పరమాత్మ యొక్క ప్రదర్శనమే అని గమనించటం ద్వారా మనస్సును నాకు సమర్పించు.
"నా యొక్క దేహమనోబుద్ధి చిత్తాహంకారాలతోసహా ఈ సర్వము ఈ సర్వ జీవులు
పరమాత్మ స్వరూపమే" - అని గ్రహించి వర్తించు. సర్వకాల - సర్వావస్థల యందు
జిజ్ఞాసాపూర్వకంగా ఆత్మ ధ్యానం చేయి. నానాత్వ దర్శనం మొదలంట్ల విడనాడు..
12. దైవకార్యంగా స్వధర్మ నిర్వహణ:
ఒక వేళ జీవాత్మ-పరమాత్మ అంతా బ్రహ్మమే! ... అనే మనోనిశ్చయం నీకు కుదరటం
లేదా? సరే! అయితే, సర్వ కర్మలు ఎటువంటి లోక సంబంధమైన అపేక్ష లేకుండా
కేవలం నాకు సమర్పిస్తూ సమాచరించు. చక్కగా నిర్వర్తించు.. లోక పావనము
క్షేమకారకము (శుభద్రము) అగు నా అవతార విశేషముల కధాశ్రవణం చేయి! సర్వ
తత్త్వస్వరూపుడనగు నన్నే స్మరించు. గానం చేయి. దివ్యమైన నా జన్మ - కర్మ
విశేషములను (చిన్ని కృష్ణుని లీలలు అవతార విశేషాలు) ఇత్యాది మననం చేయి.
ఓ ఉద్ధవా! నన్నే ఆశ్రయించినవాడవై నీ యొక్క ధర్మ - అర్ధ - కామములను నన్ను
-
ఉద్దేశ్యించి ఆచరిస్తూవుండు. అప్పుడు సనాతనపురుషుడనైన నా పట్ల నీకు క్రమంగా
నిశ్చలమైన - ఏకాగ్రమైన - అచంచలమైన భక్తి రూపు దిద్దుకుంటూ వుంటాయి.
సత్సంగమును ఆశ్రయిస్తూ వుండు. ధ్యానిస్తూ వుండు. నన్ను దర్శిస్తున్నావాడనై
స్వరూపమును పొందగలవు.
ఉద్ధవుడు: ఓ దేవదేవా! ఎందరో సాధువులు సత్పురుషులు వివిధ రీతులుగా నిన్ను
కీర్తిస్తూ వుంటారు! నీ గురించి ఆర్తులై - జిజ్ఞాసువులై - అర్ధార్ధులై - మోక్షార్ధులై
గానం చేస్తూ వుంటారుకదా! వారిలో ఎవ్వరు ఉత్తములు? ఎట్టివారి మార్గము మాకు
మరింత అనుసరణీయం? ఎట్టి సాధువుల మార్గం అనుసరిస్తే మేము సత్పురుషులకు
ఆదరణీయులం అవుతాం? ఓ పరుమపురుషా! పురషోత్తమా! ఓ లోకాధ్యక్షా! జగత్ప్రభూ!
నీకు ప్రణామం చేస్తూ నీపట్ల అనురక్తుడనై అడుగుచున్నాను? శరణాగతుడనై
వేడుకొనుచున్నాను. ఎవరియొక్క ఏఏరీతి అయిన - మార్గము మాకు శిరోధార్యమో,
అనుసరణీయమో... చెప్పండి!.
హే శ్రీ కృష్ణా! మీరు ప్రకృతికి అతీతులు! పరబ్రహ్మ స్వరూపులు! ఆకాశమువలె అంతటా
మౌనంగా వేంచేసి ఉన్నవారు! నిర్వికారులు! నిరాకారులు! అట్లు అయివుండి కూడా,...
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
76

మీ భక్తుల సౌలభ్యం కొరకై బిన్నభిన్న రూపములతో అవతరిస్తున్నారు! అట్టి మీ
అవతారమును శ్రవణ-మననం చేస్తున్న భక్తులు మాకు అనుసరణయులు కదా! అట్టి
భక్తుల గుణగణములు కూడా చెప్పండి! వారిని గుర్తించటమెట్లా? వారిని మేము శరణువేడి
మనస్సును జయించటం, తమకు సమర్పించటం నేర్చుకుంటాం!.
శ్రీకృష్ణుడు: ఓ ఉద్ధవా! ఎవ్వరు ఏకారణంగా నన్ను ఆశ్రయించినాసరే వారు నాకు
ఇష్టులేనయ్యా! ఎవ్వరు ఏకారణముగా దీపమును సమీపించినా కూడా, వారిపై కాంతి
ప్రసరితమౌతుంది కదా!
మహనీయులగు మార్గదర్శకుల విలక్షణ లక్షణములను వివరిస్తాను. ఏ ఏ మార్గములలో
నీవు ఆదిపురుషుడనగు నన్ను జేరవచ్చునో... కొన్ని మార్గాలను ఇక్కడ ఉదహరిస్తున్నాను.
విను... ఇవి ప్రవృద్ధం చేసుకోవటమే మీకు శ్రేయోదాయకం!
13. భక్తిలక్షణములు
శ్లో కృపాలు: అకృతద్రోహః తితిక్షుః సర్వదేహినామ్
సత్యసారో అనవద్యాత్మా సమః సర్వోపకారకః ॥
కామైరహతధీః దాంతో మృదుః శుచిః అకించనః
అనీహో మితభుక్ శాంతః స్థిరో మచ్ఛరణో మునిః
అప్రమత్తో గభీరాత్మా ధృతిమాన్ జితషడ్గుణః
అమానీ మానదః కల్యో మైత్రః కారుణికః కవిః ॥ (అధ్యా 11, శ్లో 29–31)
1. కృపాలుడు : ఆతడు సర్వ జీవుల పట్ల అపారమైన - అకారణమైన కృపారసం
కురిపిస్తూ వుంటాడు. ఈ కనబడే వారంతా కృష్ణ చైతన్యవిన్యాసమే కదా! ...
అనే ఎరుకచే అతని ప్రేమ, కృప సర్వజీవులపట్ల స్వభావసిద్ధమై వుంటుంది.
(Their love for all is natural and unconditonal by habit).
2. అకృతద్రోహుడు: ఆతని బుద్ధియందు ఎవ్వరిపట్ల ద్రోహచింతన ఈషన్మాత్రం
కూడా వుండదు. తాను ప్రేమించే పరమాత్మకు వేరైనది ఏదైనా వుంటే కదా...
ద్వేషించటానికి? (Non-violent, Non-revengeful to anybody)
3. సర్వ దేహినామ్ తితిక్షః.. సర్వ దేహుల పట్ల మాతృ వాత్సల్యం కురిపిస్తూ
ఓర్పు వహించినవాడై వుంటాడు (Maintaing utmost forbearance)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
77

4. సత్యసారుడు: ఆతడు సర్వదా అనిత్యమైన దానికి ఆధారమైన నిత్యమగు సత్ పట్ల
దృష్టి, ధ్యాస కలిగి ఉంటాడు. (cogitation towards Final Truth)
5. అనవద్యాత్మా: దృశ్యముచే జయింపబడక, తానే దృశ్యమును జయించినవాడై,
అతీతుడై ఆత్మాభిషిక్తుడై వుంటాడు. (Sensing unity inspite of Diversity)
6. సమః : సర్వదా సర్వత్రా సమభావము కలిగి ఉంటాడు. గుణములకావల
గుణాతీత దృష్టిచే సర్వ సమభావంగా సర్వస్థితి గతులను చిరునవ్వుతో దర్శిస్తూ
వుంటాడు. (Maintaining beyondness smilingly).
సర్వోపకారకః: సర్వజీవుల పట్ల సమరస పూర్వక స్నేహ - సేవాభావనతో 7.
వీరికి నేనేమి సేవలు అందించగలను... (What is that I can do for these)
అనే భావనచే సర్వులకు ఉపకారి అయివుంటాడు.
8. అహతకాముడు : కోరికలు ఆతనని జయించలేవు. ఆతడు ప్రాపంచిక కోరికలకు
దాసుడైవుండడు. ఆతని బుద్ది కోరికలను దాటి వేసినదై వుంటుంది. సంయమి
అయివుంటాడు. ఇంద్రియములను తన ఆధీనంలో ఉంచుకున్నవాడై వుంటాడు.
(Wordly expectations or possessions do not influence his stance)
9. మృదుః : మృదు మధుర స్వభావుడై వుంటాడు. (Soft and positive expressions)
10. శుచిః : ఇతరుల పట్ల - ఆయా సంగతి, సందర్భముల పట్ల అశుచి అయిన -
అపవిత్రమైన అభిప్రాయాలు దరిజేరనీయడు. శుచి అయిన పవిత్రమైన భావాలు
పెంపొందించుకొని వుంటాడు. (Healthy, optimistic and pure ideas, views
and opinions)
11. ఆకించనుడు: వాళ్ళు అజ్ఞానులు - వీరు కారు. వారు మంచివారు వీరు
-
కాదు.... ఇట్టి కించత్వము తదితరులపైగాని, తనపై గాని ఆపాదించుకోడు.
(Belittling neither others nor self since one's own self is pervading in
and as all others)
12. అలోకుడు: ఈ లోకంలో ఉంటూనే లోక రహితుడై లోకాతీతుడై వుంటాడు.
పడవ నీళ్లల్లో ఉంటుంది. నీళ్లు పడవలోకి ప్రవేశించనీయం కదా! అట్లాగే
విజ్ఞుడు జగత్తులో వుంటూ కూడా, హృదయంలో ఆత్మ స్వరూపమునే మననం
చేస్తూ వుంటావు. బాహ్య రూప - గుణాలు కాదు!. (Beyond the world but
not belonging of the world)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
78

13. మితభుక్తుడు: ఏది ఎంతవరకు స్వీకరించాలో, తత్సమయంలోనే ఎంతవరకు
త్యజించినవాడై వుండాలో... ఎరిగినవాడై వుంటాడు. మితంగా ఆహార (దృశ్య)
స్వీకారం అనే సమర్ధమైన కళను ఎరిగినవాడై వుంటాడు!. (Wel-controled
while receiving the world)
14. శాంతః : ఈ ప్రాపంచక విషయాలు ఆతనిని సమీపించినపుడు అవన్నీ తమతమ
ఉద్వేగాలన్నీ త్యజించి సశాంతించినవై వుంటాయి. ఆయన పరమశాంతుడై
జగద్విషయాలు చిద్విలాసంగా వీక్షిస్తూ వుంటాడు. (Peaceful and pleasant)
15. స్థిరుడు: ఇదంతా పరమానందమగు పరమాత్మ స్వరూపమే! శ్రీ కృష్ణ చైతన్యాందమే
అనే ఎరుక విషయంలో అచ్యుతుడై వుంటాడు!. ఈ కనబడేవారంతా
నారాయణము అను పరతత్త్వముయొక్క ప్రత్యక్షరూపమే... అని గమనిస్తూ
ఉంటాడు. (All this is manifestation of Divinity)
16. మచ్ఛరణో : సర్వదా పరమాత్మ యొక్క మహిమను మననం చేస్తున్నవాడై,
శరణాగతుడై వుంటాడు. మత్-పాదాశ్రయుడై, మత్-శరణాగతుడై వుంటాడు.
17. మునిః : సర్వ ప్రాపంచక సందోహాల పట్ల - ఇది ఇట్లా ఉన్నా ఒక్కటే! మరొక
రీతిగా ఉన్నా ఒక్కటే - అను రూపంగా మౌనం వహించినవాడై వుంటాడు!
జగద్విషయముల పట్ల చిరుమందహాసముతో కూడిన మౌనము వహించినవాడై
వుంటాడు!.(మౌనేన కలహం నాస్తి).
18. అప్రమత్తుడు: సర్వము మమాత్మయే! అను భావనలో నిత్యోదితుడై వుంటాడు!
ప్రమత్తత (Drowsyness/Dullness / sleepy// Mildness) లేనివాడై వుంటాడు.
సర్వదా మామాత్మా సర్వభూతాత్మా భావనలో మెళుకువ కలిగి వుంటాడు.
19. గభీరాత్మా : పిరికితనం వదలి వుంటాడు! మేఘగంభీర స్వభావుడై వుంటాడు!.
హృదయంలో సర్వేశ్వరుడే కర్త-భోక్తగా వేంచేసి ఉండగా, ఇక లోటేమిటి?
20. ధృతిమాన్: ఆత్మ సర్వదా స్వస్వరూపంగా ఉండగా... ఇక భయం దేనికి?
ఆతడు సర్వదా ఆయా సర్వ పరిస్థితులందు ధైర్యము కలిగిన వాడై వుంటాడు!.
21. జితషడ్గుణుడు: శోకము మోహము జననము మరణము ఆకలి -
దప్పిక ... అనే ఆరు గుణములచే నిబద్ధుడు- ఆకర్షితుడు కానివాడై వుంటాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
79

తినటం కోసం జీవించడు. జీవించటం కోసం తింటాడు. ఆ ఆరింటికి అందక
వేరైన స్వభావము పెంపొందించుకొనినవాడై వుంటాడు.
22. అమాని : నన్ను ఇతరులు గౌరవించెదరు గాక! గుర్తించెదరుగాక! నా
గొప్పతనములను గమనించెదరుగాక! అను రూపమైన సాంసారిక
మానత్వజాడ్యం ఆతనికి ఉండదు.
23. మానదః ఇతరుల గొప్పతనము, ఆధ్యాత్మికత, ఔన్నత్యములను గుర్తించి,
గమనిస్తూ... సంభాషించువాడై వుంటాడు. ఇతరులకు గౌరవమును
తెలియజేయువాడై వుంటాడు. (Respectful towards other Learned)
24. కల్యో : (Outspoken) బ్రహ్మ జ్ఞానమును ఇతరులకు తెలియజేయుటలో వివరణ
పూర్వకమైన వాక్ సంపత్తి, నిపుణత్వము కలిగినవాడై వుంటాడు. సంశయ
రహితంగా భాగవతత్వమును ప్రకటించువాడై ఉంటాడు.
25. మైత్రః : ఇతరులపట్ల స్నేహభావము, సౌహార్ద్రత కలిగి వుంటాడు. (Friendly)
26. కారుణికః ఆతని హృదయం ప్రేమతో, కరుణతో సర్వదా నిండివుంటుంది.
(Love, Kindness and Empathy)
27. కవిః : తత్త్వజ్ఞానము దృష్టాంత పూర్వకంగా గ్రహించువాడై, ఉపదేశించగల
వాడై వుంటాడు. (Expertise in understanding and interpreting Celestial messages and Ideas)
28. ససత్తముడు: గురువులు బోధిస్తున్న చెప్పుచున్న గుణదోషములను తనయందు
గమనించి, వాటిని తన దరిజేరనీయనివాడై వుంటాడు. తను విన్న గుణ
దోషవాక్యములను తనపట్ల అన్వయించుకుంటూ, తన గుణదోషములను
సరిదిద్దుకునే ప్రయత్నంలో వుంటాడు.
సర్వ ధర్మములను (దేహ-మనో- చిత్త - బుద్ధి - అహంకార ధర్మాలను) (The
functional ) పరిత్యజించి, సర్వదా సర్వాత్మకుడనగు నన్నే భజిస్తూ వుంటాడు!.
29. భజంతి అనన్య భావేన!
అన్నీ వదలి పరమాత్మపై దృష్టిపెట్టి భజిస్తూనే ఉంటాడు.
పరమాత్మ ఈ సర్వ జీవుల ప్రత్యక్షత్వమునకు అన్యము కాదు! - అని గ్రహించి
ఈ విశ్వమును ఉపాసిస్తూ ఉంటాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
80

స్వామికి వేరుగా నేను లేను. నేను ఆయన యొక్క అనేక యోచనలలోని ఒక యోచనను
నావి అనిపించేవన్నీ మనో బుద్ధి - చిత్త - అహంకారాలలతో సహా ఆయనవే...! అని
నిర్ద్వంద్వుడై ఉంటాడు.
పై లక్షణములు గల వారు ప్రవృద్ధ పరచుకొనుచున్నవారు... భక్తులుగా
కీర్తించబడుచున్నారు!.
తెలిసికొనియో, తెలియకయో.. ఎవ్వరైతే అనన్యభావం అనే ఉపకరణంతో సచ్చిదా
నందుడను-అనంతుడను సర్వాంతర్యామినియగు నన్ను- నా సత్ స్వరూపమును వినిగమనించి-గ్రహించి ఏకాంతభావంతో కీర్తిస్తున్నారో.., అట్టివారు భక్తులు అని
చెప్పబడుచున్నారు!.
ఉద్దవా!
నా మూర్తిని దర్శించు!
నా భక్తులను సందర్శించు. వారి పాదపద్మములను స్మృశించు. వారిని సేవించు.
స్తుతించు. నమస్కరించు.
భగవత్ గుణములను - కర్మలను మననం చేయి.
భక్తుల గుణ గణాలను గానం చేయి.
శ్రద్ధాసక్తులతో నా కథలను విను.
నిరంతరం నన్ను ధ్యానించు.
"నేను పరమాత్మకు దాసుడనుకదా!" అను దాస్య భావనతో, "నాది అనునదేమీ
లేదు! అంతా పరమాత్మదే! పరమాత్మయే!" - అని ఆత్మనివేదన చేయి!.
నా జన్మ - కర్మ - కథనములను మననం చేయి.
నాకు సంబంధించిన పర్వదినములను (Festival Occasions / Days relating
to Divine Activities) ఆనందంతో, ప్రత్యేక శ్రద్ధలతో నిర్వర్తించి వినియోగించుకో!.
గానము - నృత్యము - గోష్ఠి (ఉపన్యాసములు) - మందిరములలో ఉత్సవములు
జరుపుకోవటం .... మొదలైనవన్నీ నిర్వహిస్తూ - నిర్వర్తిస్తూ వుండు!. -
పవిత్ర స్థలములను సందర్శిస్తూ తీర్ధయాత్రలు సేవిస్తూ వుండు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
81

ఉత్సవములలో పాల్గొనుము
వైదికమైన (ఉపవాసము వేదగానము మొదలైన) తాంత్రికమైన
(రుద్రాభిషేకము - వ్రతములు మొదలైన) దీక్షలను స్వీకరిస్తూ వుండు.
ఆలయములలో శ్రద్ధాభక్తులతో దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ వుండు! ఒంటరిగా
చేయి. అట్లాగే నలుగురిని కలుపుకొని కూడా అట్టి కార్యములను నిర్వర్తించు.
పరమాత్మ కొరకై పుష్పగుచ్చాలను, పూదండలను, ఉద్యానవనాలను,
పూజామందిరాలను, తీర్ధ ప్రదేశాలను, ఆలయములను నిర్మించటంలో
పాల్గొనుము. నీవంతు సేవ నీవు నిర్వర్తించు.
సేవకాభావం కాలవాడవై శ్రద్ధాసక్తులతో, నిష్కపట భావనలతో భగవత్ మందిరాన్ని
శుభ్రం చేయటం, అలకటం, నీళ్ళు జల్లటం, ముగ్గులు వేయటం... ఇటువంటి
పనుల ఆలయసేవలు చేయి. ద్వారా అమానిత్వము (Not-Deeming himself as some thing greater than others), అదంభిత్వము (Not Trying to pose as better than others) త్యజించు.
నీవు చేసే మంచి పనులను ధంభముతో చెప్పుకోవద్దు,
పరమాత్మ సమక్షంలో దీపము వెలిగిస్తున్నాను... అని భావించి దీపం వెలిగించు.
ఆ దీపపు కాంతిలో పరమాత్మ సమక్షంలో కార్యములు నెరవేరుస్తున్నాను కదా!
అనే భావనను ఆశ్రయించివుండు!.
నీకు ఎప్పుడు ఏ వస్తువు ప్రియంగా వుంటుందో... ఆ పదార్థాన్ని నాకు
సమర్పించు! ప్రియమైన వస్తువును పరమాత్మకు సమర్పించినప్పుడు అట్టి సమర్పణ
స్వతఃసిద్ధంగానే అమోఘఫలం ప్రసాదించగలదు.
14. ఉపాసన పూజావిభూతులు -
ఉద్ధవుడు: స్వామీ! మీ పూజా స్థానములు ఏవేవి?
శ్రీకృష్ణుడు: సూర్యుడు - అగ్ని - బ్రహ్మజ్ఞులు - ఆవు - విష్ణుభక్తులు - ఆకాశము -
వాయువు - జలము - ఈ భూమి - ఆత్మ - సమస్త ప్రాణులు ... ఇవన్నీ కూడా నా
పూజా స్థానములే!. ఉపాసనకొరకై విభూతులే! ఎక్కడ నీకు పవిత్రమైన భగవత్ భావన
ఏర్పడి ఉపాశించాలని ఉంటుందో.... అక్కడ అట్లే నేను వేంచేయుటకు సంసిద్ధుడనై
ఉంటాను.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
82

వేద మంత్రములతో సూర్యుని రూపంగా ఉన్న నన్ను పూజించు.
నేయి - హవము చే నాయొక్క అగ్ని రూపాన్ని పూజించు.
సన్యాసుల - బ్రాహ్మణుల రూపంలో ఉన్న నన్ను ఆతిథ్యముచే పూజించు.
గోవు - కుక్క మొదలైన రూపములలో ఉన్న నన్ను పచ్చగడ్డి ఆహారము
సమర్పిస్తూ పూజించు.
పేదవారి రూపములలో ఉన్న నన్ను దానము, ప్రియవాక్యములు, కుశల ప్రశ్నలు
మొదలైనవాటిచే పూజించు.
భక్తుల రూపంగా ఉన్న నన్ను ఆత్మబంధు భావంతో - జ్ఞానుల రూపములో ఉన్న
నన్ను సత్కారముల ద్వారా పూజించు.
నిరంతరం ధ్యానం ద్వారా నీ హృదయాకాశంలో ముఖ్యప్రాణ రూపంగా ఉన్న
నన్ను పూజించు. పంచప్రాణములను ప్రాణేశ్వరరూపంగా భావించి పూజించు!
అర్ఘ్యప్రదానము - పుష్పములతో జల స్వరూపుడనై ఉన్న నా రూపమును పూజించు!.
షోడశ ఉపచారములతో, మంత్రోచ్ఛారణతో నా శిల మృత్తికా
పఠరూపములను పూజించు.
సహజీవుల రూపములో ఉన్న నన్ను సాత్వికవచనములు - సహకారము - సేవా
భావము - శబ్దము - ఆహార సమర్పణ... ఇత్యాదులతో పూజించు!.
-
సమదర్శివై, సర్వ జీవరాసులలో సర్వదా అంతర్యామిగా వేంచేసియున్నన్న నన్ను
"పరమాత్మయే ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నారు" - అను మననముచే
సమదర్శనముతో అద్వితీయ కృష్ణచైతన్యానంద దర్శనంగా పూజించు.
సమహితత్వముతో సహ జీవులను ప్రేమాస్పదంగా - వాత్సల్య దృక్కులతో
దర్శించటం ద్వారా సర్వాంతర్యామియగు నన్ను ఆరాధించుచున్నట్లే అవుతుంది.
ఈ సర్వ ప్రదేశములలోను శంఖు - చక్ర - గద - పద్మముల ధరించిన నా
చతుర్భుజ సమన్వితమైన శాంతరూపమును ఏకాగ్రచిత్తంతో మనస్సులో
మనోపూర్వకంగా, మనస్సు అనే కుంచతో చిత్రించుకొని ధ్యానించు! పూజించు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
-
83

ఇష్టా-పూర్తములతో నన్ను అనుష్టించు.
ఇష్టములు :
"ఇష్ట" అనబడే కర్మలయినట్టి యజ్ఞ - యాగ - సవాస్రనామార్చనాదులతో ఏకాగ్ర
చిత్తంతో నన్ను మనన పూర్వకంగా ఆరాధించు! పూజించు!.
పూర్తములు :
పూర్తములు అనబడే సహజీవుల సౌకర్యకర్మలు అయినట్టి....
బావులు త్రవ్వించటం, చెఱువులు శుభ్రం చేయించటం, రహదారులు నిర్మించటం.
త్రాగునీటి వసతి కల్పించటం.
గ్రామాలలో వైద్య వసతి కల్పించటం, ఇటువంటి కర్మల ద్వారా... సర్వ
రూపములునావైన నన్ను పూజించు! ఆరాధించు! ప్రవృత్తిని పవిత్రం చేసుకొని
ప్రదర్శించు!.
15. సత్సంగము
శ్రీకృష్ణభగవానుడు :ఉద్ధవా! ఈ సందర్భంలో మరొక ముఖ్యమైన విషయం కూడా
నీకు సూచిస్తున్నాను. నేను సత్పురుషులచే సదా సమాకర్షుడును! వారున్న చోట నేను
శంఖ - చక్ర - గదా - పద్మధారుడనై చతుర్భుజాలంకారుడనై ప్రియభావంతో వేంచేసి
ఉంటాను. అందుచేత, సత్పురుషులు శాశ్వతానందప్రదమగు ఆత్మతత్త్వమును
సంభాషించుకునే చోట నేను శాంత ఆనంద - జగద్రక్షక విశేషరూపంతో నాకు
నేనే (నన్ను వేరుగా / ప్రత్యేకంగా ఆహ్వానించకుండానే) వచ్చి వుంటాను!.
అట్టి మహానీయుల అమృత వాక్కులు ప్రవచనమగుచున్నచోటు అతి పవిత్రమైనది.
సంత్సంగము అని చెప్పబడే వారి ఆత్మజ్ఞాన - ఆప్త వాక్యములు పరస్పర సంవాదములు,
గురు-శిష్య బోధలు అమోఘమైన ప్రభావం కలిగిఉంటాయి.
నా మహిమ శ్రేయోదాయకమై అక్కడివారి వెంటనంటి వుంటుంది. సత్సంగం చేత
భక్తి - జ్ఞానములు ప్రవృద్ధమైనట్లుగా మరొక ఉపాయం చేత ప్రవృద్ధం కాదని అందరికీ
మనవిచేస్తున్నాను.
ఓ యదునందనా! ఉద్ధవా! నీవు నాకు భృత్యభావంతో సేవిస్తున్నవాడివి! స్నేహితుడివు!
భక్తి-ప్రపత్తులు కలవాడివి! అందుచేత నీపై నాకు ఉన్న అవ్యాజమైన ప్రేమచే... ఇప్పుడు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
84

సాధుసాంగత్య మహిమ గురించి విను!
ప్రాపంచికమైన సాధారణ మమకారములను పరమాత్మ వైపుగా నడిపించటం వలన
ప్రాప్తించగల సర్వోత్కృష్టమైన ఫలితాలు గురించి కూడా కొన్ని గూఢమైన రహస్యాలు
చెప్పుబోవుచున్నాను! శ్రద్ధగా విను....
సత్సంగ మహిమ
ఓ ఉద్ధవా! నాయొక్క పరతత్వం నీ వశం చేసుకోవటానికి అనేక ఉపాయాలు ఉన్నాయి.
మార్గాలు ఉన్నాయి.
విచారణా మార్గం (లేక సాంఖ్య మార్గము)
"ఇది దేహము - ఇది ఆలోచనారూపమైన మనస్సు - ఇది విమర్శన విచక్షణ-విచారణవివేచనా రూపమైన బుద్ధి - ఇది ఇష్టము అనురూపమంగా ప్రదర్శితమగుచున్న చిత్తము
- ఇది అహంకారము- ఇది జీవుడు ఇది తత్సాక్షి అయిన ఆత్మ... ఇది సర్వ
జీవులలోని సాక్షి - అట్టి కేవల సాక్షి- సర్వుల రూపము!" నేనే ఇట్టి విభాగ పాండిత్య
అంతర్యామి, - పరిశీలనా-పరిచింతనా-పరియోచనా యోగం!
ధర్మ మార్గం : పరమాత్మకు అనుకూలమైన ప్రార్ధన - ఆలాపన - సహజీవుల పట్ల
దయ... మొదలైనవి. నియమిత కర్మలు - ధర్మములు (The Duties and functions
expected of you by the Society) ఉపాసనా పూర్వకంగా నిర్వర్తించటం.
స్వాధ్యాయ యోగం (లేక మార్గము): భగవంతునికి సంబంధించిన పాఠ్యాంశాలు
వేద వాక్కులు మరలమరల పఠించటం. (Chanting and singing individually or
in a group)
ఇష్టాయోగం (లేక మార్గము): భగవంతునికి ఉపాసించే విధంగా వ్రతాలు - యాగాలు
యజ్ఞాలు పూజలు మొదలైనవి నిర్వర్తించి పరమాత్మకు ప్రియం కావటం!. (The
acts of Adoration)
పూర్తయోగం (లేక మార్గము): లోక ప్రయోజన కారకములైన నూతులు త్రవ్వించటం,
దేవాలయాలు కట్టించటం, బాటలు నిర్మించటం మొదలైన నలుగురికి పనికివచ్చే ఆయా
శోభప్రదమైన కార్యక్రమములు నిర్వర్తించటం. (Acts that ccarry good to others)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
85

వ్రతనియమ యోగం (లేక మార్గము) : ఇంద్రియనిగ్రహం కొరకై వ్రతములు
ఉపోషముల వంటి ఇంద్రియ నియమములు నిర్వర్తించటం.
దక్షిణవ్రత యోగం : తనకున్న సంపద పరులకు సమర్పించటం. ఇతరులతో
పంచుకోవటం. పేదవారిని దాన - దక్షిణలతో తృప్తిపరచటం!. (అంగసంబంధమైన
శాస్త్రీయ ఉపాసనములు కూడా ఇందులోకి వస్తాయి)
ఛందోవ్రత యోగం (లేక మార్గము) : భాషాయుక్తమైన భగవత్ స్తోత్రాలు పురాణాలు,
వేదమంత్రాలు చదవటం, వ్రాయటం, వ్యాఖ్యానగ్రంధాలు రచించటం మొదలైనవి.
తీర్ధయోగం: తీర్థ ప్రదేశాలు సందర్శించి ఆయా భగవత్ స్థానములను నమస్కార -
ప్రదక్షణల పూర్వకంగా ఉపాసించటం.
యమ నియమ యోగం: ఇంద్రియములను అదుపులో పెట్టి వైదిక - ధ్యాన యోగాది
మార్గాలలో నియమించటం.
ఇక సత్సంగము గురించి
ఇవన్నీ గొప్ప మార్గాలే! అయితే, సంత్సంగము (Association and Sharing of
Spirituology and Godly Idealogies) అన్నిటికన్నా సులభము - మహత్తరము అయిన
మార్గము సుమా! సత్సంగముతో మరేవీ సాటిరావు అని నా అభిప్రాయం!
సత్సంగము అనే సాధనా యోగం కేవలం మానవులకే పరిమితమనుకోకు. అది దేవతలు
- రాక్షసులు - పక్షులు - మృగములు -నాగులు - మొదలైన వారంతా ఆచరణలో
పెట్టుచున్నదే!.
ప్రతి యుగంలోను సత్సంగ ప్రభావం చేత అనేకులు పరమాత్మనగు మత్-పదమును
జేరుచున్నారు.! సాత్వికులైన దేవతలే కాదు! రజోతమోగుణ సంపన్నులైన మానవులు,
దైత్యులు, మృగములు, పక్షులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు,
గుహ్యకులు, విద్యాధరులు, సిద్ధులు, సాధ్యులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీస్వభావులు,
అంత్యజులు ఇతర రజోగుణ స్వభావులు, తమోగుణ, స్వభావులు... వీరంతా కూడా
యుగయుగాలుగా అనేకానేకులు సత్సంగ ప్రభావంచేత జీవాత్మ పరిమితత్వమును
అధిగమించి పరమాత్మత్వమును సముపార్జించుకుంటున్నారు.. అసుర - దానవ
జాతులలో వృత్రాసురుడు, ప్రహ్లాదుడు, వృషపర్వుడు, బలి, విభీషణుడు, బాణుడు,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
86

మయుడు...., అట్లాగే జంతుజాతులలో సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు,
గజేంద్రుడు, జటాయువు, తులాదారుడు, వణిజుడు..., ఇదే విధంగా ధర్మవ్యాధుడు,
కుబ్జ, వ్రజగోపికలు, యజ్ఞానుష్టానపరులగు కొందరి భార్యలగు యజ్ఞపత్నులు... వీరంతా
కూడా శ్రవణంచేత వింటున్న ఆత్మవిద్య యొక్క మననం చేత సత్సంగ ప్రయోజనంగా
అస్మత్పదమును సులభంగా పొందటం జరిగిందయ్యా! వారిలో అనేకులు శ్రుతుల
(వేదముల)ను నేర్వలేదు! మహనీయులగు వారికి శిష్యత్వము - ఉపాసనత్వము
నిర్వర్తించనూ లేదు! వారంతా కేవలం సత్సంగ ప్రభావంచేత నన్ను అతి తేలికగా
పొందటం జరిగింది! జరుగుతోంది! జరుగగలదు!
పరమాత్మతో అనన్యత్వం సంపాదించటానికి సత్సంగము కేవలం మానవులే కాదు!
వృక్షములు - జంతువులు - కొండలు కూడా మహత్తత్వము సముపార్జించుకోగలవు
సుమా! సత్సంగమువలన కలిగిన అనన్య భావం త్రత్త్వ శాస్త్ర శ్రవణం (త్వమ్ తత్
అసి అని నిరూపించే శాస్త్రీయ ప్రవచన శ్రవణం) చేత ప్రజగోపికలు, ప్రజములోని
ఆవులు, అనేక వృక్షములు, నాగులు, ఇతర మూఢ గతిని అనుభవిస్తున్న కీటకము
వంటి జీవులు సముద్ధరించబడ్డారు. వీరంతా కూడా - నేను కృష్ణ చైతన్యమే! నేనే ఈ
సర్వ జగత్ రూపంగా విస్తరించి నాకు అగుపిస్తున్నాను. ఈ జగత్తులు నాలో
ఉన్నాయికాని, నేను ఈ జగత్తులలో లేను... అనురూపమైన కేవలీ ద్రష్టత్వ పరతత్వాన్ని
ఆస్వాదించారు!.
ఓ ఉద్ధవా! సంత్సంగమును ఆశ్రయించకుండా, యోగ - సాంఖ్య - దాన - వ్రత -
తపో - వ్యాఖ్యాన పాండిత్యము - స్వాధ్యాయనము - సన్యాసము మొదలైన అనేక
రీతులగా కూడా నన్ను అంత సులభంగా పొందలేరని మరొక్కసారి గుర్తుచేస్తున్నాను!.
నా అభిప్రాయము చేతులెత్తి ప్రకటిస్తున్నాను. (ఊర్ధ్వ బాహుర్విరేమ్యేష!)
16. పరాభక్తి : పరాప్రేమ : ప్రజ గోపికలు
ఓ ఉద్ధవా! పరమాత్మ యగు నా పట్ల అకుంఠితమైన - అనన్యరూపమైన ఆసక్తి ఏ ఏ
రూపంగా ఏ కారణంగా కలిగి ఉన్నా సరే, వారికి సర్వాంతర్యామినగు నేను వశం
అవుతాను. ఆసక్తి నా పట్ల అనురక్తిగా రూపుదిద్దుకొని తదితరమైనదంతా
అనాకర్షితమైనపుడు నేను తప్పక పట్టుబడతాను. ఇందుకు దృష్టాంతం మన ప్రజగోపికలే!.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
87

నేను చిన్ని కృష్ణునిగా మన గోపబాలురతో కూడి గోపికల ఇళ్ళలో దొంగగా ప్రవేశించి
అనేక బాలాలీలా వినోదరూపమైన అల్లరి పనులు చేశావాడిని కదా!
అప్పుడు గోపికాస్త్రీలంతా అమ్మ యశోదతో, "ఓ యమ్మ! నీకుమారుడు మా ఇళ్ళను
పాలుపెరుగు మననీడమ్మా! పోయదమెక్కడికైనను!" - అంటూ మా అల్లరి పనులను
ఏకరువుపెట్టేవారు! అమ్మఏమో, "కృష్ణయ్యా! ఎందుకురా ఈ అల్లరి పనులు? వాళ్ళ
ఇళ్ళలోని పాలు - పెరుగు - వెన్నలతో నీకేమి కర్మ? మన ఇంట్లో పాడి తక్కువనా?"
అని నన్ను నిలబెట్టి ప్రశ్నించేది. అది విని నేను "అమ్మా! ఎప్పుడూ నీ
చీరకొంగుపట్టుకునే ఉన్నాను కదా! వీళ్ళవన్నీ లేనిపోని చాడీలు!" అని చెప్పితే, "ఆహా!
మా బాబే! నిజమే నాయనా!" అని ముద్దు పెట్టుకునేది.
క్రమంగా కొన్ని గంటలు నేను అల్లరి చిల్లరి పనులు చేస్తూ ఆ గోపికల ఇళ్ళలో
కనబడకపోతే
"అయ్యో! కృష్ణయ్య ఏడీ! మా ఇంటికొచ్చి నాలుగు గంటలయింది? ఒక్కసారి వచ్చి
కనబడితే బాగుగదా!"
అంటూ వారు నారాకకోసం, నన్ను చూడటానికి విరహం పెంచుకోసాగారు. ఒక్కొక్కరోజు
నేను వారి ఇళ్ళకు వెళ్ళకపోతే "ఓ యమ్మా! ఆక్కా! వదినా! చిన్ని కృష్ణుడిని చూడక ఈ
రోజంతా గడచింది. మీ ఇంటికేమన్నా వచ్చాడా? యశోద వదినగారింటికి వెళ్ళితే
ఆమె, "మా పిల్లవాడితో మీ కేమి పని? అని విసుగుకోదు కదా?"... ఈ విధంగా
చిన్ని కృష్ణుని చూడటానికి బెంగపడసాగారు! ఎక్కడైనా చిన్నికృష్ణుడు కనబడగానే ఒళ్ళు
ఇల్లు - పరిసరాలు మరచి ముద్దు చేస్తూ ఆనందంగా అడుగులు వేయసాగేవారు.
చుట్టూ నిలబడి పరవశంతో నృత్యం చేసేవారు.
ఆ గోపికలు బృందావనంలో మేమున్న చోటికి వచ్చి మాకు క్రొత్త క్రొత్త తినుబండారాలు
పెట్టేవారు. ఇంతలో నేను కాస్త మరుగు అవగానే " మీ పొదలమాటున లేడుకదమ్మ
చెప్పరే?" .. అంటూ ఉత్సుక - ఆవేదన - నివేదనాభావాలతో వెతికేవారు. నా వేణుగానం
వినగానే పరవశంతో నా చుట్టూ చేరి నృత్యం చేయసాగేవారు. వారి తన్మయత్వాన్ని
చూసి నేను కూడా నా విష్ణుత్వము - అవతార మూర్తిత్వము ఏమరచి వారితో నృత్యం
చేసేవాడను!.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
88

వారు "నేను జీవుడను కదా!" అనునది అధిగమించి, ఈ చరాచర సృష్టి అంతా ఎందులో
అయితే కల్పితచమత్కారంగా కనిపించేస్తోందో అట్టి శ్రీకృష్ణచైతన్య స్వరూపులము...
అని తన్మయముతో విన్యాసం చేయసాగేవారు! ఇట్లా అనేక రోజులు నెలలు
సంవత్సరాలు గడిచాయి.
ఒకానొక రోజు కాల చమత్కారంగా అక్రూరులవారు మా మేనమామ కంసుని పనుపుపై
నన్ను, అన్న బలరాముడిని మధురానగరం తీసుకెళ్ళటానికి వేంచాశారు.
అప్పటి పరిస్థితి ఏమిటంటే...?
గోపికలు నన్ను చూడటానికి నాతో గడపటానికి అత్యంత అనురక్త చిత్తులై వుండేవారు.
తెల్లవారుజాము లేచి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకొని గబగబా మేముండే బృందావనానికి
దగ్గిరగా గల అడవి ప్రదేశాలకు వచ్చేవారు. " ఇంకా తెల్లవారటానికి రెండు ఘడియల
కాలం వున్నదా? నిన్న సాయంకాలం కృష్ణుని చూసాం! ఎప్పుడు తెల్లవారాలి? ఎప్పుడు
కృష్ణుడు కనిపిస్తాడు?...." అని విరహవేదనతో వాత్సల్యావేశంతో క్షణక్షణం గడిపేవారు!.
విః అహమ్ అవిహితాహంకారత్యాజ్యం - విరహం
విహితాహంకార సమాశ్రమం
అప్పుడు...,
నన్ను - అన్న బలరాములవారిని మధురా నగరానికి అక్రూరుని వెంట పంపటానికి
మా నాన్న నందులవారు, అమ్మ యశోద అతి కష్టంమీద అంగీకరించారనే విషయం
గోపికలకు తెలిసింది. నాపై గాఢమైన ప్రేమతో అత్యాసాసక్తులైయున్న గోపికల విరహ
పూర్వక మనస్తాపాన్ని చూసి అక్రూరులవారు ఆశ్చర్యం పొందారు!.
" అహా ! ఈ గోపికలు గృహము పుత్ర పౌత్రుల పట్ల గల విరహవేదన - ప్రేమావేశం
చిన్ని కృష్ణునిపై అచంచలంగా నిలిపారు. వీరు శ్రీ కృష్ణునితో ప్రియసమాగం తప్ప
మరింకేమీ ఏమాత్రం కోరటంలేదే! శ్రీ కృష్ణునిపై కొంచము ప్రేమ సంపాదించుకోవటానికి
నేను ఎన్నో వ్రత - జప తపో - ధ్యాన - నియమాలు నిర్వర్తించవలసి వచ్చిందే! ఈ
గోపికలు ఎంత ధన్యులు!..." అని మురిసిపోయారు!.
ఓ ఉద్ధవా! ఆ గోపికలకు వారికి ప్రియతముడనగు నాసాంగత్యంలో సంవత్సరాలు
క్షణాలుగా గడచిపోయాయి. నాతో ఎడబాటులో వారికి ఒక్కొక్క రాత్రి ఒక్కొక్క యుగంగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
89

సుదీర్ఘంగా గడవసాగింది! నదులు సముద్రంలో కలసిన తరువాత ఇక ఇది
గంగానదీజలం, ఇది గోదావరి నదీజలం, ఇది కృష్ణా నదీ జలం, ఇది కావేరీ నదీ
జలం... అనే తేడా వుండదు కదా!.
సమాధిలో ప్రవేశించిన మునీశ్వరులు నామ రూపములను అధిగమించినవారై, వాటిని
గమనించరు కదా!. అట్లాగే,
ప్రజగోపికలు నాయందు పరమ ప్రేమ చిత్తులై క్రమంగా సర్వమును మరచారు!.
ఓ ఉద్ధవా! వాస్తవానికి నిర్వికారము - నిరామయము, ఓంకార సంజ్ఞార్ధము అగునా
పరస్వరూపతత్త్వము గురించి వారికి ఏమాత్రం తెలియదు! వారికి నన్ను తమ
ప్రియాతిప్రియ గొల్లవానిగా, తమవానిగా మాత్రమే తెలుసు!.
నాయందు అద్వితీయము, అమోఘము అగు ప్రేమతత్పరత మాత్రం వారు చూపుతూ
ఎల్లప్పుడు నన్ను ఆశ్రయించినవారై వున్నారు. వారికి ఇంకే సాధనలు తెలియదు!
అటువంటి ప్రేమోత్కంఠత చేత - తల్లి బిడ్డను తనకే సొంతమని భావించినట్లుగా
కృష్ణుడు తమవాడేనని భావించసాగారు.
తమకు మాత్రమే చెందినవాడని కామోత్కంఠత పొందసాగారు.
కృష్ణుడు ఎదురుగా ఉంటేచాలు! మరింకేమీ కించిత్ కూడా అవసరంలేదు అనే అనన్య
చింతన ఆస్వాదించనారంభించారు.
అమ్మ కొద్దిసేపు కనబడకపోతే బిడ్డ బెంగ పడునట్లు, వారు కృష్ణ సాన్నిధ్యం కొరకై
అనుక్షణికంగా బెంగ పడుచున్నారు.
ఒక ప్రియురాలు తన ప్రియుడితో ఏకాంతము కొరకై తదితర బంధువుల నందరినీ
త్యజించి ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా బయల్వెడలుతుంది చూచావా? ఆ గోపికలు
నాసాన్నిధ్యం కొరకై బంధువులు - ఐనవాళ్ళు మొదలైన వన్నీ త్యజించి జారభావంతో
నేనున్న చోటుకు పరుగులు పెట్టుకొని వచ్చేవారు! నన్ను చూడగానే లోకమును దేహమును
ఉపేక్షించి తన్మయులై వుండేవారు. మేము దేహులము కదా! స్త్రీ దేహులము కదా!
ఇల్లు-వాకిలి-భర్త-పిల్లలు కలవారము కదా!.... అనే స్పృహ-అహంకారాలు
వారికుండేవి కావు!
నేను బృందావనం వదలి వెళ్ళిన తరువాత కూడా, వారు నేను సంచరించిన ప్రదేశాలను
మరల మరల ప్రవేశించి నాతో గడిపిన జ్ఞాపకములతో అనుక్షణం మనోసంయోగం
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
90

పొందుతూ వుండేవారు!.
వారిది తపస్సు కాదు! భక్తి కాదు! వేదా ధ్యయనం కాదు! యజ్ఞయాగాది క్రతునిర్వహణం
కాదు! వ్రతాలు కాదు! సేవ కాదు!
మరి?
బిడ్డకు తల్లి కనబడకపోతే ఏర్పడే బెంగ. విరహము. దర్శనాకాంక్ష. తదితరమైనదంతా
అవిషయమై పోవటం. ఇంకేదీ రుచించకపోవటం. అన్నింటినీ వదలి అమ్మను
చూడటానికి పరుగులు తీసే బాలభావావేశము. ఈ మొదలైన విశేషములతో కూడిన
అనుక్షణిక మననము!.
ఏ సాధనము చేయని ఆ అబలలు - కృష్ణుడిని చూడాలి! కృష్ణుని నామ రూపములతో
సంగము కలిగి ఉండాలి! కృష్ణ మననముచే ఏర్పడే ప్రియభావము కొరకై
తదితరమైనదంతా ఉపేక్షార్హమే! ధర్మార్థ కామమోక్షములు కృష్ణునిపై అపేక్షారూపమగు
మొదలైన విరహం ముందు కొరగానివి! కామోత్కంఠావేశముచే పరబ్రహ్మరూపుడగు
నన్ను ఆశ్రయించారు. వారికి క్రమంగా సర్వము కృష్ణతత్త్వంగా అనుభూతం కాసాగింది!
క్రమంగా పరబ్రహ్మమే తామై ఆనందించసాగారు!. కనుక మిత్రమా! ఓ ఉద్ధవా!
శ్లో తస్మాత్ త్వమ్, ఉద్ధవ! ఉత్సృజ్య చోదనామ్ - ప్రతి చోదనామ్,
ప్రవృత్తించ - నివృత్తించ శ్రోతవ్యం - శ్రుతమేవచ!
-
శ్లో॥ మామేకమేవ శరణమ్ ఆత్మానం సర్వ దేహినామ్
యాహి సర్వాత్మభావేన మయాస్యా హి అకుతోభయః! (అధ్యా 12, శ్లో 14, 15)
నీవు చోదనములు (Driving Tools) ప్రతి చోదనములు (Tools for withdrawing)
ప్రవృత్తి ధర్మాలు - నివృత్తి ధర్మాలు, వినవలసినవి - వింటున్నవి... అన్నీ ప్రక్కకు
పెట్టు! అధిగమించు! సర్వదేహులలో ఆత్మగా ప్రదర్శితమగుచున్న నన్ను మాత్రమే
వాత్సల్య భక్తితో ఆశ్రయించు! శరుణువేడు! పరమాత్మయే ఈ కనబడే అన్ని రూపాలుగా
కనిపిస్తున్నారు కదా! అను పరతత్త్వమును అనుక్షణికంగా మహాభావన చేయి!
తల్లికి బిడ్డపై, ప్రియురాలికి ప్రియునికి పై, తండ్రికి కొడుకుపై ఉండే ప్రేమంతా రంగరించి
ఆత్మబంధువగు నాకు సమర్పించు. నేను నాదిగా కనిపించేది కూడా పరమాత్మయే...
అని క్రమంగా స్వభావ సిద్ధంగా నీవప్పుడు సంతరించుకుంటావు.
పరబ్రహ్మమే నీవై ప్రకాశిస్తావు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
91

అప్పుడు నీవు ఎక్కడ ఎట్లా వున్నా సర్వ కాంక్షలను కుతిని అధిగమించి
అభయస్వరూపుడవై, కేవలం దృశ్య సాక్షివై, దృశ్యాంతర్యామివై తదితరమైనదానికంతటికీ
అంతర్గతాంతుడవై ఆనందిస్తావు! అప్పుడు.... ఈ జగత్తులు నీలో వుంటాయి! నీవు
జగత్తులలో కాదు!
శ్రీ ఉద్ధవుడు: హే యోగ యోగీశ్వరేశ్వరా! మీరు చెప్పిన దంతా శ్రద్ధగా వింటున్నాను.
సంతోషం! అయితే కూడా, ఎందుకో నీకు కొన్ని సందేహాలు తీరటం లేదు. నాకు
భ్రాంతి కొనగాసుగుచున్నట్లే వున్నదని అనిపిస్తోంది!. అంతేకాదు. నాలో ఏవేవో క్రొత్తక్రొత్త అనుమానాలు చిగురిస్తున్నాయి.
మీరు చెప్పుచున్నదేమిటి? విధి - నిషేధాలు (Do's and Donts) వేదాలు - శాస్త్రాలు
చెప్పుచున్నాయి కదా! అవన్నీ వదలి వేయమంటారా!
శాస్త్రాలచే చెప్పబడే సాధనలు (చేయవలసినవి) - ప్రతి సాధనలు (వదల వలసినవి)
ఆశ్రయించటం వదలటం చేయనవసరం లేదా?
శ్రోతవ్యం - శ్రుతం (to be listened to and already listened to) అయినట్టి పురాణ
ఇతి హాస ప్రవచిత ధర్మాలు పట్టించు కోనఖర్లేదా?
మీరు చెప్పినదంతా విన్న తరువాత నా మనస్సు భ్రాంతిని వీడటం లేదు ఎందుకోమరీ,
నివృత్తి పొందటంలేదు! ఆత్మయందు నిలవటం లేదు!.
అల్పజ్ఞుడగు ఈ జీవుడు గోపికలవలె దర్శనోత్కంఠట స్వర్శనాకాంక్ష మొదలై మార్గముల
సహాయంతో (లేక) తదితర ఆట-పాటల రూపమైనట్టి ప్రజ గోపికల బాల చేష్టల
సహాయంతో పరమాత్మతో మమేకమౌతాడా! సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడుగా
రూపు చెందుతాడా? మీపట్ల చూపే లోకసంబంధమైన విరహం - తపస్సు, వేదపఠనము
ప్రాణాయామాది విధానములకంటే గొప్పవంటారా? మీరు అంటున్నదేమిటో, విడమరచి
చెప్పండి!
శ్రీ కృష్ణుడు (పక పక నవ్వుతూ)
ఓహో! అల్పజ్ఞుడు - కించజ్ఞుడు అగు ఈ జీవుడు విరహోత్కరతతో పరమాత్మత్వమును
ఎట్లా సంతరినిచు కుంటాడనియా, నీ ప్రశ్న? సర్వ ధర్మాలు, విధి నిషేధాలు వదలితే
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
92

పరతత్త్వంతో ఐక్యత లభించేదేట్లా? - అనిగదా నీ సంశయం?
అసలు ఒక్క ముఖ్యమైన ప్రశ్న?
ఈ జీవాత్మగా కనిపిస్తున్నదెవ్వరు? పరమాత్మయే కదా!
సర్వ విషయమతీతుడు - సర్వ తత్త్వాతీతుడు అగు పరమాత్మ ఒక లీలగా - ఒక క్రీడగా
నాద స్వరూపమగు ప్రాణశక్తిని ధరించి సూక్ష్మ దేహంలోను (Into Body of Feeling
and thought), అటుతరువాత శబ్ద - స్పర్శాది ఇంద్రియములతోను కూడిన స్థూల
దేహాలలోను ప్రవేశించి స్వయంకల్పిత దృశ్యరూపమనతగు ఈ జగత్తును ఆస్వాదిస్తున్నాడు.
దేహమంతా తన ప్రాణ శక్తితో నింపుతున్నాడు. (మూలాధారాది) చక్రములలో వేంచేసి,
పంచతన్మాత్రలు (శబ్ద - స్పర్శ - రూప - రస - గంధములు) స్వరము, వర్ణము (గుణ
సముదాయము) మొదలైన వాటిని వస్త్రము వలె ధరించుచున్నాడు!. అనగా,
పంచతన్మాత్రలు-స్వరము వర్ణములతో కూడిన ఈ పాంచ భౌతిక దేహం ధారణ చేసి,
తెలియబడేది అనబడే - వేదశబ్దార్ధ దృశ్యముగా వెల్లడి అగుచున్నాడు! కనుక, ఇక్కడ
జీవుడుగా పదర్శితమగు చున్నది... ఆ జీవుడికి దృశ్యము (వేదము-తెలియబడేది)గా
వెల్లడిఅగుచున్నది కూడా యథాతథంగా పరబ్రహ్మమే సుమా!.
అగ్ని ఆకాశంలో సూక్ష్మరూపంగా వుంటుంది. ఒకడు రెండు కొయ్యముక్కలను ఒక
చోటికి జెర్చి ఒరిపిడి కలిగించినప్పుడు నిప్పురవ్వలు బయల్వెడలుతాయి.
ఆ అగ్నియే ఆహుతి ఇచ్చినప్పుడు (నేయిపోసినపుడు) జ్వాజ్వల్వమానంగా అగ్ని శిఖలతో
వెలుగొందుతుంది. అనగా..., అగ్ని ఆకాశంలో అప్రకటిత రూపంగాను, కట్టెల ఒరిపిడికి
నిప్పురవ్వలుగాను, వెలుగుచున్న కట్టెలపై నేయి పోసినప్పుడు అత్యంత కాంతి వంతంగాను
వెలుగుచున్నది. అట్లాగే, పరమాత్మతత్త్వమే సర్వాతీతనిర్విషయంగాను, సూక్ష్మ దేహంతోను
(Body of feeling and throught), స్థూల దేహం (physical body that is solidly
being experienced) గాను ప్రదర్శితమౌతోంది! ఈ విధంగా..... అంతా పరమాత్మ
యొక్క అభివ్యక్త రూపమేనయ్యా! ఈ జీవుడు, వాక్కు, కర్మ, గతి (మార్గము), స్వీకారము,
విసర్జనము, ఘ్రాణము (smelling), రస గ్రహణం (Tasting), దర్శనము (seeing),
స్పర్శ (touching), శ్రవణము (hearing), సంకల్పము (ideation), విజ్ఞానము (knowing), అభిమానము (deeming / treating / assuming), ప్రకృతివ్యాపారము (playing roles in the drama of the world), సత్త్వ - రజ - తమో గుణములు, వాటి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
93

వికారములుచే కలిగే సుఖ దుఃఖానుభూతులు (అధిదైవికము) పంచభూత సమ్మేళన
రూపమైన ఈ ప్రపంచము... ఇవన్నీ కూడా, ఇదంతా కూడా పరమాత్మయొక్క
...
ప్రదర్శనా విన్యాసమే! దృష్టాంతానికి స్వప్నములో ఉన్నది-కనిపించేదీ.... ఆ సర్వములో
స్వప్నద్రష్ట యొక్క స్వప్నచిత్కాళా విన్యాసము కానిదేది?
అంతేకాదు! పరమాత్మ సర్వదా యథాతథము! స్వప్నంలో ఏమున్నా, ఏమి జరిగినా -
జరగకున్నా... స్వప్నద్రష్ట సర్వదా యథాతథము కదా!
ఇంకొక దృష్టాంతం. ఒక చిన్న మట్టి బీజంలో మహత్తరమైన అంకుర శక్తి వేంచేసి
ఉన్నది. అది అప్రదర్శితంగా వున్నది!. ఆ బీజమును నేలలో నాటామనుకో!
అప్పుడేమౌతుంది?
ఉద్ధవుడు: అది మహావృక్షమై కొమ్మలు ఆకులు, వేళ్ళు, కాయలు ఇత్యాధికంగా విస్తరించి
కనబడుతుంది.
శ్రీకృష్ణుడు : అట్లాగే సనాతనుడు, ఆదిపురుషుడు అగు పరమాత్మ మొట్టమొదట (బీజంలో
భవిష్యత్ అంకుర చమత్కారంగా) అవ్యక్తుడై వుంటాడు. ఆయన త్రిగుణములు ఆశ్రయించి
లోక కారకుడగుచున్నాడు. ఏక స్వరూపుడైవుండి, ఒకానొక కాలంలో కళ్ళు- చూపు -
నోరు-వాక్కు: చెవులు-వినికిడి ఇటువంటి వికారక్రమంగా బహురూపములుగా వ్యక్తుడగు
చున్నాడు. దృష్టాంతానికి-గొప్ప నటునియొక్క నటనాచాతుర్యము.... ఆతడు స్నేహితులతో
ఉన్నప్పుడు అవ్యక్తంగాను, నాటకంలో నటిస్తున్నప్పుడు వ్యక్తంగాను ఉంటుంది.
వస్త్రము అంటే ఏమిటి? ధారముల అల్లికయే కదా! జగత్తు అనబడే దృశ్యము పరమాత్మ
అనే దూది నుండి తీయబడిన దారముచే ప్రదర్శితమగుచున్న వస్త్రము వంటిది!.
దృశ్యమునకు సంబంధించిన అనుభూతి - అనుబంధ భావనయే సంసారము!. ప్రవృత్తిచే
-
సంసారము ఏర్పడుతోంది! ఈ సంసార వృక్షము భోగరూప పుష్ప ఫలములను
ఆత్మరూపుడగు జీవునకు అందిస్తోంది.
ఈ సంసార వృక్షము పాప పుణ్యములు అనే రెండు విభాగములు గల బీజం నుండి
పుట్టింది. దృష్టులచే పరిపోషించబడుతోంది.
అపరిమిత వాసనల రాసి (Limitless Bundle of Tendencies) దీని మూల విభాగం.
సత్త్వ - రజ - తమో గుణములచే ఈ సంసారవృక్షము యొక్క కాండము రూపుదిద్దుకుని
ఉన్నది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
-
94

పంచ భూతములు ఈ వృక్షముయొక్క కొమ్మల ప్రారంభప్రదేశం.
11 ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు ఈ సంసార వృక్షములోని రసము.
రక్తము - శ్లేష్మము ఇందులోని అంతరంగ ద్రావణములు.
సుఖ - దుఃఖములనబడే రెండు వేరైన తియ్యని - పుల్లని పళ్లు దీనికి కాస్తున్నాయి.
ఈ విశాల సంసార వృక్షము భూమండలము నుండి అటు ఆకాశమంతా ఇటు -
పాతాళంలోకి విస్తరించి ఉన్నది!
జీవుడు - ఈశ్వరుడు అనే జంట పక్షులు ఈ వృక్షమును అంటిపెట్టుకొని ఉన్నాయి!
ఈ సంసార వృక్షమును కాముకులైన జీవులు అనే గబ్బిలాయిలు అంటి పెట్టుకొని
ఉన్నాయి. వివేకులు త్యాగ నిరతిగలవారు అగు హంసలు కూడా ఇదే వృక్షమును
ఆశ్రయించి జీవిస్తున్నాయి! వాళ్ళు ఈ వృక్షము యొక్క ఆత్మ సుఖము అనే రూపముగల
ఫలములను సదా రక్షిస్తున్నారు. తాము ఆస్వాదిస్తున్నారు!
ఓ ఉద్ధవా! వాస్తవానికి ఉన్నది సత్ స్వరూపుడనగు నేనొక్కడినే!
మాయా శక్తి ప్రభావము చే నేనే ఇన్ని రూపములుగా, నామములుగా వ్యవహారములుగా
చూడబడుచున్నాను!ఇదియే తత్త్వార్థజ్ఞానం! తత్త్వరహస్యం! అద్వైతం!
ఎవ్వరైతే గురువులను ఆశ్రయించి (ఏకోసత్! విప్రా బహుధా వదంతి) అనే జ్ఞానవాక్యము
యొక్క వేద-వేదాంగములచే గానము చేయబడుచున్న యథార్థతత్త్వము తెలుసు
కుంటాడో, .. అట్టివాడు విదితవేద్యుడు, తత్త్వజ్ఞాని అవుతాడు. "నాకు నేనే ఇన్ని రూప
నామాలుగా స్వయం (జలమున తరంగాలవలె) అనుభూతమగుచున్నాను!" - అని
ఆతడు గ్రహిస్తున్నాడు!.
మిత్రమా! నేను చెప్పుచున్న భిన్నత్వంలోని అంతర్లీన ఏకత్వం (The inner unity in the
outward diversity) గ్రహించి సర్వదా గమనిస్తూ ఆస్వాదిస్తున్న గురువులు ఉన్నారు.
వారిని సమీపించి సేవించు! ఏకాంత భక్తి కొరకై ప్రశ్నించి నీ సంశయములను
నివర్తించుకో!.
అట్టి ఏకాంత భక్తితో క్రమంగా నేను విశ్వరూపమగు పరబ్రహ్మమును అను
పరతత్త్వమును ఆశ్రయించు! అట్టి నీ ప్రయత్నముచే నీ ఈ త్రిగుణాత్మకమగు కారణ
శరీరము (లేక) త్రిగుణ శరీరము (లేక) త్రిలింగశరీరమును ఖండించివేయి!. ఆత్మయందు
ఆత్మకు అభిన్నంగా ఆత్మస్వరూపుడవై ఉండు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
95

పరమాత్మ తత్త్వము విను. మననం చేయి. భక్తితో ఉపాసించు! క్రమంగా పరమాత్మ
స్వరూపుడవై నీయందే కల్పితమైన ఆత్మ స్వరూపజగత్తును ఆత్మగా ఆస్వాదించగలవు!.
ఆ తరువాత జ్ఞానమును అందుకొరకై సాధనలు మొదలైన వ్యవహారాలను కూడా
పరిత్యజించు!.
పరమాత్మవై పరిపూర్ణుడవై... నీ యొక్క జీవాత్మత్వమునకు కర్తవు - కల్పించుకొన్నవాడివి,
(One who visualized individual self) సాక్షివి... అయి ఉండు! ఆపై ఈ ఆత్మా
భిన్న జగత్తులో నీ ఇష్టానుసారం ఉండు!. జగత్ రూపుడవై జగత్తును ఆస్వాదించు!
జగత్ అతీతుడవై నిర్లిప్త పరమానంద స్థితి నుండి చ్యుతి పొందకు! అచ్యుతుడవై వుండు.
17. గుణత్రయ త్యాగ ఉపాయాలు
శ్రీ ఉద్ధవుడు: ఓ అనంతా! అద్వితీయా! శ్రీ కృష్ణా! నిర్మలుడు - నిత్యుడు - స్వయమానంద
స్వరూపుడు అగు పరమాత్మ దేహధారియై దేహ బంధమును పొంది జీవాత్మగా
కనిపిస్తున్నాడు కదా! మరి ఈ దేహ బంధము ఏ రూపంగా ఏర్పడుతోంది.
శ్రీ కృష్ణుడు : పరమ్ ఆత్మ - ఆ ఆవల ఉన్న ఆత్మ - అనికదా, శబ్దార్ధము! మరి దేనికి
ఆవల? జగత్-దేహాదులకు ఆవలవున్న ఆత్మ స్వరూపం. తెలియబడేదంతా తెలుసు
కుంటూ వున్నట్టిది " ఆత్మ.". తెలుసుకుంటున్న వానిని కూడా తెలుసుకొనుచున్నట్టిది"
ఆత్మ సదా నిర్మలము - అప్రమేయము - సర్వాతీతము అయినదే!
అట్టి ఆత్మ స్వస్వరూపమును కించిత్ ఏమరచి గుణములను ఆశ్రయిస్తోంది. అట్టి సత్వ
రజ తమోగుణ సంబంధంచేత (అనగా నేను గుణ సంబంధితుడను అనే భావన
యొక్క పరిపుష్టిచేత) స్థూల దేహ భ్రమ రూపుదిద్దుకొన్నదై, ఈ శబ్ద స్పర్శ రూప రస
గంధముల సమ్మేళన రూపమగు దృశ్యములో దేహముగా బంధింపబడినట్లుగా
కనిపిస్తోంది! అనగా, స్థూల దేహ స్వరూపానుభూతి ఏర్పడుతుంది.
ఇక ఆత్మ తన పరతత్వాన్ని ఏ మరచి ఇహత్వమును అభ్యసిస్తూ (having ignored the
Beyondness to what is here and practising whatever here) దేహ పరంపరలు
పొందటం కొనసాగిస్తోంది. దృశ్యముపట్ల గల పరిమిత దృష్టిచే ఏర్పడిన ఒకానొక
బంధనపూర్వక అవినాభావ సంబంధమునే సంసారము అని పిలుస్తున్నారు!
ఉద్దవుడు: స్వామీ! ఈ జీవుడు వాస్తవానికి సర్వదా ఆత్మస్వరూపుడే కదా! ఆత్మ అఖండము
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
96

అప్రమేయము అని వేద ఉపనిషత్ ప్రవచిత ఆత్మ శాస్త్రములచే, ఆత్మజ్ఞులగు
మహనీయులచే సిద్ధాంతీకరించబడుతోంది. మరి, ... ఆత్మకు సత్త్వ - రజ - తమో
గుణములు ఎక్కడి నుండి వచ్చి బంధం కలిగిస్తున్నాయి? ఈ దృశ్యము ఆత్మరూపమే
అయివుండగా, ఆత్మయందు గుణ రూప లింగ దేహ బంధం, ఆ లింగ దేహంచే స్థూల
దేహ బంధం, "ఈ దృశ్యములో దృశ్య తదాత్మ్యముచే జీవాత్మగా దేహ బద్ధుడనై ఈ ఈ
సంగతి సందర్భము ఇత్యాది వ్యవహారములలో చిక్కుకున్నానే!"... అనే అనుబంధభావం,
ఇవన్నీ ఎట్లా ఎవరి కారణగా ఏర్పడుతున్నాయి?
శ్రీకృష్ణుడు: ఓ ఉద్ధవా! నీవుచెప్పినట్లు ఆత్మ ఎల్లపుడూ అతీతము నిర్మలము అఖండము
-నిత్యోదితము - ఆనందస్వరూపమే!.
మరి త్రిగుణ రూపమగు ఈ లింగ శరీరము (సూక్ష్మ శరీరము అని కూడా అంటారు)
గురించి అడుగుతావా?
శ్లో సత్త్వం రజస్తమ ఇతి గుణా బుద్ధేః! న చ ఆత్మనః!
సత్త్వేన అన్యతమౌ హన్యాత్ సత్త్వం సత్వేనచైవ హి॥ (అధ్యా 13, శ్లో 1)
సత్త్వము - రజము - తమము అను త్రిగుణములు ఆత్మకు సంబంధించినవి కానేకావు.
మరి? అవి బుద్ధికి సంబంధించినవి మాత్రమే!
అజ్ఞానము - నిద్ర - బద్ధకము - భయము మొదలైన అంతర్గత విశేషములతో
కూడిన తమోగుణమును, నేను ఇది చేస్తున్నాను - అది చేయాలి - ఏదో చేయలేక
పోతున్నాను - అక్కడికి వెళ్ళాను - ఇక్కడి వెళ్ళాలి - ఈ లోకంలోకి వస్తున్నాను - ఆ -
లోకంలోకి ఇక వెళ్ళాలి- ఇటువంటి రూపమగు రజోగుణమును మునుముందుగా
జయించాలి, అది ఎట్లా?
శాంతి - ప్రేమ - ఓర్పు - దాక్షిణ్యము ఇటువంటి విశేషములతో కూడిన సత్త్వగుణ
సంపదతో రజ తమోగుణములను జయించు. ఆవిధంగా (సత్య-దయా- శాంతి
ప్రేమ - ఓర్పు - దాక్షిణ్యము ఇటువంటి విశేషములతో కూడిన సత్త్వగుణ సంపదతో
రజ తమోగుణములను) జయిస్తూ అటు తరువాత, గుణాతీత వృత్తిచే సత్య -
దయా - శాంతి - ప్రేమ రూప వృత్తులకు కూడా క్రమంగా అతీతుడవు-సాక్షివిగుణాతీతుడవు అగుము.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
97

ఎప్పుడెప్పుడైతే సత్త్వగుణము వృద్ధి పొందుతూ వుంటుందో, అట్టి సందర్భాలలో
క్రమక్రమంగా సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడనగు నాపట్ల భక్తి - ప్రపత్తి
స్వభావసిద్ధంగా ఉత్పన్నమౌతూ వుంటుంది.
అట్టి భక్తి లక్షణములు కించిత్ సాధనచే కొంచెముకొంచము ప్రవృద్ధం అగుచుండగా,
సత్త్వగుణం మరింతగా తనంతటతానే వృద్ధి అగుచూ వుంటుంది. సత్త్వగుణం నుండి
ధర్మము అనే రుచికరమైన సాత్విక గుణఫలం ఫలదీకరిస్తూ వస్తుంది. అధర్మము క్రమంగా
బలహీనమౌతూ వుంటుంది.
ఈ సత్త్వ - ధర్మ గుణాలు పరస్పరం అభివృద్ధి పరచుకుంటూ వుంటాయి. ధర్మమును
మరికొంత - మరికొంతగా ఆశ్రయిస్తూ వుండగా, రజోతమో గుణాలు బలహీనమగుచూ,
క్రమక్రమంగా మొదలంటా జయించివేయబడుతూ వస్తాయి, రజ-తమో గుణాలు
బలహీనమగుచూ వుండగాఆ రెండింటికీ , మూలమైన అధర్మము కూడా
(అధర్మభావాలైన కామము - రాగము - క్రోధము - లోభము మొదలైన ఆత్మానుభవానికి
వ్యతిరిక్త భావాలు) శీఘ్రంగా బలహీనపడుచూ వస్తాయి..
ఉద్ధవుడు : త్రిగుణములు ఎందులోంచి జనిస్తున్నాయి? ఎందులో ఏర్పడి ఉంటున్నాయి?
వాటిని జయించినప్పుడు ఎటువైపుగా పోతున్నాయి?
శ్రీకృష్ణుడు: త్రిగుణములు బుద్ధిలోనే ఏర్పడి, బుద్ధిలోనే దాగి ఉంటున్నాయి. అయితే,
ఈ త్రిగుణములు ప్రదర్శనమవటానికి స్థానం ఏమిటంటావా?
ఆగమము : తెలియబడే 1 దృశ్యజగత్తు
2. ఆపః : జలము. ఆపోమయప్రాణః శక్తి: ప్రకృతి
ప్రజా : జనులతో 3. సంసర్గము
దేశః : దేశము 4. (Place factor)
5. కాలము : (time factor)
6. కర్మ : (The acts / actions)
7. జన్మ : నేను జన్మించినవాడను అను రూపమైన స్వస్వరూపమునకు
సంబంధించిన ఏ మరుపు
8. ధ్యానము : (The sense of Avocation)
9. మంత్రము : (The act of Chanting)
10. సంస్కారము : (Tedency)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
98