ఈ పది వస్తువులు ఆయా వివిధ గుణ ప్రదర్శనమునకు కారణమవుతూ వుంటాయి.
మోక్ష శాస్త్రము ఎఱిగిన మహానీయుల బోధ విను :
1. తామసగుణమును తిరస్కరించటానికి శాస్త్రప్రవచితమైన సాధనలకు సిద్ధపడండి.
ఉత్సాహ - సాహసాలు పెంపొందించుకోండి!
2. తామసగుణాన్ని జయించే ప్రయత్నంలో జనించే రజోగుణాన్ని ఉపేక్ష (just
ignoring) అనే సమరసపూర్వక బుద్ధిబలంతో జయించండి.
తామస రాజసగుణములు 3. బలహీనబడుచుండగా స్వాతిక గుణం బలపడుచున్నది
(లేక) సత్త్వ గుణం బలం పుంజుకుంటూ వుండగా రజోతమోగుణాలు వాటికవే
బలం కోల్పోతూ వస్తాయి.
ఏఏ అభ్యాసాలు సత్త్వగుణమును పెంపొందించుతాయో, అట్టి అభ్యాసములు
ఆశ్రయించటం ఉచితం! అవసరం! అత్యావస్యకం కూడా! - అని బోధిస్తున్నారు!.
ఓ ఉద్ధవా! జగత్ సంబంధమైన స్మృతి- అపోహ కొనసాగునంతవరకు, ఈ దృశ్యము
స్వస్వరూపాత్మ యొక్క ప్రత్యక్షరూపంగా అనుభూతంకానంతవరకు, స్థూల
సూక్ష్మదేహభావాలు తొలగనంతవరకు,.... ఎంతెంత వరకైతే అవి కొనసాగుతూ
వుంటాయో..., అంతతవరకు సత్త్వ గుణాభివృద్ధికై సాత్విక గుణాలు సేవిస్తూనే ఉండాలి..
ఉత్తమగుణాలు, దైవీసంపత్తి పెంపొందించుకొనే ప్రయత్నాలకు ఉపక్రమించకుండా "కృష్ణా!
రక్షించు!" అని మాత్రమే పలుకుతూ ఉంటే, ఈ సంసారపయోధి నుండి నేను రక్షించేదెట్లా?
అయితే నాపట్ల భక్తి స్వభావసిద్ధంగా సాత్వికగుణములను ఉత్తేజపరచగలదు.
సాత్విక గుణాలు సేవిస్తూ వుండగా ధర్మము అనే ఉత్తమ బుద్ధి ప్రేరేపించబడుతూ
వుంటుంది. ధర్మముచే తత్త్వజ్ఞానం (త్వమ్ తత్ సత్ ఇతి జ్ఞానః - నీవుగా కనిపిస్తున్నది
ఆత్మయొక్క ప్రత్యక్షానుభవరూపమే... అనే జ్ఞానం) వృద్ధి చెందుతూ వుంటుంది. కనుక
బద్ధకం వదలు. ప్రేమ- కరుణ త్యాగము ఇత్యాది గుణాలను వృద్ధి చేసుకో!
ఉద్ధవుడు: ఓ శ్రీకృష్ణ ప్రభూ! మా జీవుల కధ - కమామీషు చూస్తూ వుంటే, .. నాకు
ఆశ్చర్యం! ఈ జగత్ విషయాలు, ఇక్కడి ఆయా సంబంధ - బాంధవ్య లౌకికాశయాలన్నీ
అనేక దుఃఖపరంపరలకు కారణములగుచున్నాయని మేము అనేక సందర్భాలలో
గమనిస్తూనే ఉన్నాము. అల్పజ్ఞాన జంతువులగు కుక్క - గాడిద మేకవలె అనేక
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
99

దుఃఖాలు సహిస్తూ కూడా... మేము విషయానుభవములు కొనసాగించటానికే
సిద్ధపడుచున్నామే! ఎందుచేత? దీనికి కారణం ఏమిటి? అట్టి విషయానుభవములపట్ల
భావావేశము - అనే రజోగుణసంబంధమైన వృధాయాసమునుండి విరమించటం ఎట్లా?
శ్రీకృష్ణుడు: అవివేకం చేతనే ఈ దేహరూపమే నా రూపం! దీనితోనే నా ఉనికి!
ఇద్దాని స్థితిగతులే నా యొక్క స్థితి గతులు... అనే రూపముతో కూడిన దోషబుద్ధి
ప్రమత్తతచేత (because of lazyness of intelligence), అవివేకంచేత రూపుదిద్దు
కుంటోంది!. దేహాత్మబుద్ధి యొక్క కొనసాగింపువలన దుఃఖాత్మకమైనట్టి ఘోర (స్థూల)
రజోగుణం వచ్చి మనస్సు (thought) ను కప్పివేస్తోంది.
రజోగుణప్రభావంచేత సత్త్వగుణం కప్పబడినదై... సంకల్ప - వికల్పాలు అనుక్షణికంగా,
అవిశ్రాంతంగా బయల్వెడలుచున్నాయి.. అట్టి తరుణంలో అల్పబుద్దితో కూడిన ఈ
జీవుడు విషయములను ప్రవాహపతితంగా ఆలోచించనారంభిస్తున్నాడు.
ఇకప్పటినుండి పరంపరంగా విషయవాసనలు పుట్టుకొస్తున్నాయి.
విషయకామవశుడైన ఈ జీవుడు మరికొన్ని కర్మలు! కర్మపరంపరల వలన ప్రయోజనం
దుఃఖమే!.. అని తెలిసికూడా, ఇచ్ఛలేకున్నప్పటికీ అభ్యాసము యొక్క బల వేగ
ఉద్విగ్నతలకు లోను అయి, చేసిన కర్మలనే మరల మరల నిర్వర్తిస్తున్నాడు. చర్విత
చర్వణుడౌతున్నాడు! జన్మ తరువాత మరణం, మరణం తరువాత జన్మ - ఇట్లా జన్మ
పరంపరా వ్యవహారములను కొనసాగిస్తూనే పోతున్నాడు.
ఉద్ధవుడు : స్వామీ! మరి, ఉపాయం?
శ్రీ కృష్ణుడు: విద్వాంసుడు వివేకి అయినవాడు రజోగుణం - తమోగుణములచే విక్షిప్తుడు
(sorrounded) అయినప్పటికీ, మనస్సుచే - ఇంద్రియములకు - ఇంద్రియార్ధముల
చమత్కారములగు జగత్ విషయములకు అతీతత్వము అభ్యసిస్తున్నాడు. చిత్తమును
నిగ్రహించి, విషయములకు అతీతత్వము సంపాదించినవాడై వుంటున్నాడు. "కర్మల
యందు, కర్మ ఫలముల యందు దోషం ఉంటూనే ఉంటుంది - అని గ్రహించినవారై...
సర్వదా కర్మల యందు, వాటికి సంబంధితమై యుండే తదితర వ్యవహార పరంపరల
యందు వారు అనాసక్తులై (Mentally unattached) వుంటున్నారు.
కనుక మిత్రమా! ఈ జీవుడు సర్వదా అప్రమత్తుడై క్రమక్రమంగా మనస్సును సర్వతత్త్వ
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
100

స్వరూపుడనైన నాయందు నిలిపి ఉంచుగాక! "ఇదంతా మమాత్మ చైతన్య ప్రభావ
వీచికా చమత్కారమేగదా!" అని ఆస్వాదించునుగాక!
అందుకుగాను అభ్యాసపూర్వకంగా శ్వాసను ప్రాణాయాయాదుల సహాయంతో
నిశ్చలంచేస్తూ శిరస్సుకు ఊర్ధ్వంగా నిలుపుచూ ఆసనజయం సముపార్జించునుగాక!
క్రమంగా విషయాలకు అతీతమైన ఏకాగ్రతను అనుసంధానం చేయునుగాక!.
18. హంసబోధ - సాంఖ్యయోగము
శ్రీకృష్ణుడు :
యోగము : సాధకుడు సర్వ జగద్విషయాల నుండి ధ్యాసను ఉపశమింపజేసి, ఈ
దృశ్య జగత్తు ఏ ఆత్మయందు స్వయం కల్పనా చమత్కృతిగా కల్పితమై కనిపిస్తోందో,...
అట్టి నా పరమాత్మ వైభవమునందు అతని ధ్యాసను నిశ్చలం చేసి వుంచటం!
(లేక) గుణమయమగు జగత్తులో కనిపించే సహజీవులందరినీ పరమాత్మ యొక్క
ప్రదర్శనాచమత్కార విన్యాసంగా సందర్శించటాన్ని సర్వదా అభ్యసించటం! ఇదియే
సనకుడు మొదలైన యోగశాస్త్ర ప్రావీణ్యులగు శిష్యులకు నేను ఒకానొక సందర్భంలో
సిద్ధాంతీకరించి చెప్పటం జరిగింది!
ఉద్ధవుడు : ఓ కృష్ణా! మీరు ఎప్పుడు ఏ సందర్భంలో సనకుడు మొదలైన యోగ
పండితవరేణ్యులకు గురువులై యోగశాస్త్రం బోధించారో... నాకు తెలుసుకోవలెనని
కుతూహలంగా ఉన్నదయ్యా!
శ్రీ కృష్ణుడు : విను! చెప్పుతాను!
హంస ప్రవచనం
ఒకానొకప్పుడు ఒక సందర్భంలో బ్రహ్మమానస పుత్రులైనట్టి సనకుడు, సనందుడు
మొదలైనవారు తమ తండ్రియగు బ్రహ్మదేవుని సమీపించి ప్రణామములు సమర్పించి...
ఈ విధంగా ప్రశ్నించారు.
సనత్కురుడు మొదలైన బ్రహ్మమానసపుత్రులు : సృష్టికర్తా! పితృదేవా! మా దొక సందేహం.
యోగం అనే సాధననలో పరాకాష్ట ఏమిటి? సుసూక్ష్మము -ఉత్తమము అయినట్టి
యోగసాధనము యొక్క అంతిమ ప్రయోజనస్థితి ఏమిటో అభివర్ణించి చెప్పవలసినదిగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
101

ప్రార్ధిస్తున్నాం. (What is the final state for the practices of yoga?)
బ్రహ్మదేవుడు ఆప్రశ్నను ప్రశాంతంగా విన్నారు. తాను స్వయంగా అకారణ స్వరూపులు,
కారణాలన్నింటికీ కారణకారణుడు! అఖిల భూతకారణుడు! అయితే నిరంతరం సృష్టి
అనే నిత్య కర్మనిష్టుడు అయివుండటం చేత, అనేక రీతులుగా ఆలోచించి - ఆలోచించి,
ప్రయత్నించి యోగ సాధనానంతర పరాకాష్టస్థితి ఏమిటో ఆతని పుత్రులకు అభివర్ణించి
చెప్పినాకూడా వారు తృప్తిపడినట్లు కనబడలేదు. ఆ బ్రహ్మమానసపుత్రులు యోగ
పరాకాష్ఠను బుద్ధితో గ్రహించి నిస్సందేహులు కాలేదు! అప్పుడు ఆయన తనమానస
పుత్రులకు మరింత సమాధానము అందించటానికై నన్ను స్మరించటం జరిగింది. ఆయన
యొక్క సంకల్పమును సిద్ధింపజేసే ఉద్దేశ్యముతో నేను హంస రూపంతో ఆయనముందు
ప్రత్యక్షమైనాను.
అప్పుడు సనక-సనందాదులే కాకుండా, బ్రహ్మలోకములోని మునీశ్వరులు, బ్రహ్మదేవునితో
సహా వచ్చి నా ఎదురుగా నిలబడి "మీరు ఎవ్వరు?" అని ప్రశ్నించారు!
అక్కడి మునులు యోగతత్త్వాన్ని తెలుసు కోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నారని గమనించినట్టి
నేను ఇట్లా సమాధానం చెప్పాను.
హంసరూప నారాయణ స్వామి: ఓ మునీశ్వరులారా? పరమార్ధవస్తువగు పరమాత్మ
యందు నానాత్వమే లేదు. అన్ని నామరూపములకు వేరై - అన్నీ నేనై ఉన్నప్పుడు
నేను దేవతనా? జీవుడనా? జీవుడను నేనే! జీవాత్మనూ నేనే! పరమాత్మనూ నేనే! ఇట్లా
ఏమైనా చెప్పువచ్చు! అంతా- అన్నీ నేనే అయివుండగా, ఇక నేను ఎవ్వరినని
చెప్పమంటారు? ఒక బొమ్మల కొలువులో రాజు-మంత్రి-సైనికులు... అన్నీ ఒకేమట్టి
అయి ఉండగా, "ఓ మట్టీ! వీటిలో ఎవరు నీవు? రాజువా? మంత్రివా? సైనికునివా?"
అని అంటే ఆ మట్టి ఏమి చెప్పుతుంది?
ఒక వేళ - నేను ఇది! ఈ నామరూపములు కలవాడను! - అని చెప్పాలంటే కూడా
ఎట్లా చెప్పను? ఎవ్వరైనా, "నేను ఇది! ఇది కాదు!" అని - చెప్పవలసివస్తే వారు కొన్ని
గుణ - క్రియా సంబంధాలను ఆశ్రయించి జాతి మాత్రమే చెప్పటం సాధ్యంకదా!
ఇప్పుడు నేనెవ్వరో మీరు కోరినట్లు వివరించి చెప్పటానికి నేను ఇప్పడు ఏ జాతి
గుణ - క్రియలను ఆశ్రయించి చెప్పాలో,... అదికూడా మీరే ముందుగా చెప్పండి?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
102

అప్పుడు నేను సమాధానం చెప్పుతాను.
లేక... మరొక విధంగా మనం చెప్పుకోవాలంటే...,
జీవులందరు నారాయణ స్వరూపమే కదా! నారాయణుడు అనగా ఒక జీవుడా? కాదు
కదా! సర్వజీవులు తానైనవాడు నారాయణుడు కదా! అందుచేత "నీవెవ్వరు?" అనే
ప్రశ్నే సరికాదు, సమాధానం ఇవ్వదగ్గ ప్రశ్న కాదు!
పంచ మహాభూత నిర్మిత భౌతిక దేహం దృష్ట్యా :
ఈ దేవ - మనుష్య - జంతు దేహాలన్నీ వస్తుతః పంచమహా భూతాలతో తయారైనవే
కదా? అందుచేత ఒక దేహధారిని పిలచి, "నీవెవరు?" అని ప్రశ్నించటం ఏమి ఉచితం?
అన్ని ఆభరణాలు బంగారంతో తయ్యారు అయివుండగా ఒక ఆభరణాన్ని పిలచి
నీవెవ్వరు? అనే ప్రశ్నకు సమాధానం ఏమి చెప్పగలదు? - ప్రశ్నించేవాడు -
సమాధానం చెప్పేవాడు కూడా ఒకే పంచ భూత సమన్వయమే అయి వుండగా!
అందుచేత ఈ దేహం దృష్ట్యా "నీవెవ్వడవు?" అనే ప్రశ్న అర్థరహితం! కేవలం
వాచారంభమే! పంచభూతములు అనే 5 వస్తువుల కలగలపుగా ఒక బొమ్మను
తయారుచేసి, ఓ బొమ్మా! నీవవరు? - అని అడిగితే? మట్టిని అంటుందా? జలమును
అంటుందా?
"గాలికి గాలి అనే పేరు ఎందుకు పెట్టారు?" - అనే ప్రశ్నవలె మొదలే అర్ధరహితం
కదా!. ఒక మట్టి బొమ్మకు ఎక్కడో మట్టి కనబడతే "ఓ మట్టీ? నీవెవరు?" అని
ప్రశ్నించనట్లున్నది మీ ప్రశ్న- అని మరల గుర్తు చేస్తున్నాను.
అందుచేత ఓ బ్రాహ్మణోత్తములారా! : ఈ నామ రూపాలు నేను కాదు.
అయితే కూడా...,
ఈ మనస్సు చేత, వాక్కు దృష్ట్యా పొందబడేది, చెప్పబడేది.. తదితర ఇంద్రియములచేత
పొందబడేదంతా నా స్వరూపమే! నాకు వేరైనది, నేను కానట్టిది ఎక్కడా ఏదీ లేదు!
ఉండజాలదు!.. ఈ నగ్న సత్యాన్ని తత్త్వచారణచే ముందుగా జాగరూకులై ఏకాగ్రతతో
గ్రహించండి.
సనకాదులు: ఓ పరమహంసోత్తమా! తత్త్వ విచారణ చేసినప్పుడు కదా, మీరు చెప్పినట్లు
అనిపించేది! జీవులమగు మాకు ఈ కనబడేదంతా నా ఆత్మ స్వరూపమే - అని
అనిపించటంలేదే! మేము ఆవిధంగా గ్రహించటమూ లేదు. గమనించటల్లేదు. ఎందుచేత?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
103

హంస : మమాత్మ స్వరూపులగు ఓ బిడ్డలారా! ఈ మానవుల చిత్తము ఇంద్రియ
విషయములలో ప్రతిబింబిస్తోంది. అప్పుడు ఇంద్రియ విషయాలు తాము పోయి
చిత్తములో ప్రతి బింబించటం జరుగుతోంది. అయితే ఈ మానవుని (జీవుని) వాస్తవ
రూపం ఏమిటి?
భౌతిక శరీరమా? కాదు!
భౌతిక శరీరం జీవునిచేత కదలించబడుచున్నట్టిది. జీవుడు పాంచభౌతిక దేహముకంటే
విశిష్టుడు! అతడు కదిల్చేవాడు గాని, కదిలేవాడు కాదు! ఆలోచనలు చేయు వాడే
గాని, ఆలోచనలలోని వాడు కాదు. ఆలోచనాపరిమితుడు కాదు! ఆలోచనలు ఆతని
రూపము కాదు!
చిత్తము - విషయములు కూడా ఆతని స్వరూపం కాదు. అవి రెండు ఆతడు ధరించిన
ఉపాధి రూపములు మాత్రమే! రంగు చొక్కా ధరించినవాడు ఆ రంగు చొక్కాగా
మారుతాడా? లేదు కదా! అట్లాగే జీవుడు చిత్త - విషయములు ధారణ చేస్తున్నప్పటికీ
. చిత్త విషయములుగా రూపం దిద్దుకోవటం లేదు! ఆ రెండింటికీ అప్రమేయుడైవున్నాడు.
జీవుడు బ్రహ్మమే మూలస్వరూపంగా కలిగి ఉన్నాడు. ఈ జీవుని వాస్తవ రూపం బ్రహ్మమే!
దేహ-మనో - బుద్ధి - చిత్త - అహంకారాదులన్నీ అతడు ధరించే ఉపాధిరూపాలేగాని
స్వరూపస్వభావాలు కాదు. అవి స్వస్వరూపమునకు సంబంధించినవీ కాదు. అనగా,
బ్రహ్మతత్త్వ స్వరూపుడు మనో-బుద్ధి-చిత్త-అహంకారములతోను, దృశ్య
సమన్వితుడుగాను కనిపించవచ్చుగాక! అవిగా ఆతడు అవటమే లేదుగా!
జీవాత్మ బ్రహ్మము కాని క్షణమే లేదు. కనుక, మీరు మీగురించి జీవాత్మలం అని
చెప్పుకుంటున్నప్పటికీ, సాక్షాత్ బ్రహ్మమే - అయివున్నారయ్యా!
ఈ దేహ మనో - బుద్ధి బుద్ధి - చిత్త - అహంకారాది ఉపాధులు (వస్త్రములవలె)
ధరించినప్పటికీ అవి జీవునికి స్వస్వరూపములు కావు. నాటకంలో నటించేవాడు ఆ
పాత్రగా మారిపోతాడా? లేక, ఆ పాత్రయొక్క స్వరూప - స్వభావాలు ఆతని స్వస్వరూపం
అవుతాయా? లేదు కదా! ఇదీ అంతే!.
సనకాదులు : ఓ హంస గురువర్యా! మరైతే, నిర్మలాత్మస్వరూపులమగు మేము
జీవాత్మలుగా కనిపిస్తూ, ఎందుచేత విషయాసక్తులమై వున్నాము?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
104

హంస : బిడ్డలారా! వినండి! ఆత్మ సర్వదా మీరు చెప్పినట్లు నిర్మలము, నిత్యోదితము,
సర్వమునకు అప్రమేయమే!. అయితే, నిరాకారమగు బంగారమునకు అకారణంగా -
స్వభావంగా ఆకారము ఉంటోంది కదా! అట్లాగే ఆత్మ అకారణంగా, స్వభావసిద్ధంగా
తనయందు తానే ద్వితీయానుభవమును ఆస్వాదించటానికి చిత్తమును
కల్పించుకుంటోంది. అనగా చిత్తము యొక్క వాస్తవ స్వరూపము చితే!. చిత్కల్పనయే
చిత్తముయొక్క రూపము! చిత్ + ఆ చిత్యొక్క ఊహ = చిత్తము
లేక, చిత్తో చిత్తముగా అగుపిస్తోంది! ఆ చిత్తము త్రిగుణరూపంగా చెన్నొందుతోంది.
అట్టి చిత్తము తనయొక్క త్రిగుణత్వము నుండి బయల్వెడలే విషయములను తానే
సేవించటం జరుగుతోంది! కనుక విషయములు చిత్తము నుండి జనించినవే! చిత్తము
ఆత్మనుండి జనించినదే!. ఆత్మ అద్వితీయం సుమా! ఆత్మకు భిన్నమైనది - ద్వితీయమైనది
ఎక్కడా, ఏదీలేదు!
సనకాదులు : సరే! అయితే, ఇప్పుడు బంధము అనుభవమౌతోందికదా?
హంస : "ఇప్పుడు నేను విషయములచే బద్ధుడనే అగుచున్నానే!" - అని బంధము
అనుభవిస్తున్న జీవుడు సర్వతత్త్వ స్వరూపుడనగు నన్ను ఆశ్రయించి క్రమంగా
విషయాసక్తిని త్యజించుగాక! అప్పుడు పరతత్త్వమే శేషిస్తోంది!
విషయాసక్తిని జయించటానికి "ఆత్మయందు ఆసక్తి" యే ఉపాయం!
ఏ వివేకము యొక్క విభాగము చిత్తము రూపమును సంతరించుకొని విషయములను
ఆసక్తితో ఆస్వాదిస్తోందో.. అదియే బుద్ధి యొక్క విషయవృత్తులు (Avocation) లేక,
బుద్ది వృత్తులు అయివున్నాయి.
1. జాగ్రత్ 2. స్వప్నము 3. సుషుప్తి...
ఈ మూడు కూడా త్రిగుణములచే కలిగిన బుద్ధివృత్తులే సుమా! ఈ జీవుడో? ఆ
బుద్ధివృత్తులకు ఆవల కేవల సాక్షిస్వరూపుడై తురీయస్వరూపంగా వెలుగొందుచున్నాడు!
అందుచేత జీవుడు సర్వదా చిత్తమునకు బుద్ధి వృత్తులకు విషయములకు సర్వదా
విలక్షణుడు... అని వేదాంత శాస్త్రం అనేక దృష్టాంతాల ద్వారా నిర్ద్వంద్వంగా
నిరూపిస్తోంది! ఆత్మజ్ఞులు సుస్పష్టంగా ఈ విషయం ప్రకటిస్తున్నారు!
ఓ వత్సలారా! స్వకీయమైన బుద్ధి వృత్తుల ద్వారా ఈ జీవునకు సంసార బంధం
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
105

ఏర్పడుతోంది. అంతేగాని, సంసారబంధం - మరెవ్వరి చేతనో బయట నుండి ఈజీవునకు
కల్పించబడుచున్నది కానే కాదు! అందుచేత, మీరు సర్వ జీవులలో సర్వదా ప్రకాశిస్తున్న
నాయందు మీ బుద్ధి వృత్తులను ప్రసరింపజేయండి! తద్వారా బుద్ధి వృత్తుల
చాంచల్యమును ఉపశమింపజేయండి. అప్పుడు చిత్తము విషయములచే బంధింపబడదు.
విషయములు లేనప్పుడు చిత్తము లేదు!
ఈ జీవుడు ఆనంద స్వరూపుడే! అయితే తాను కల్పించుకొన్న చిత్తముద్వారా బుద్ధి
వృత్తులచే సేవిస్తున్న విషయముల ప్రభావం చేత ఆహంకారం (Relative sense of
individually confined 'I') జనిస్తోంది. అట్టి అహంకారము స్వభావసిద్ధమగు
ఆనందమును కప్పివుంచి బంధనభావములను కల్పిస్తోంది! ఆ బంధభావమే జీవుని
పట్ల అనర్థమై సర్వ దుఃఖములకు కారణమౌతుంది! మరి ఉపాయం? క్రమంగా ఈ
జీవుడు విషయముల పట్ల విరక్తుడై జగదతీతస్వస్వరూపమగు తురీయమును
ఆశ్రయించటమే! తురీయమును ఆశ్రయిస్తూ క్రమంగా అభిమానము - భోగ చింతన...
ఈ రెండింటినీ విడచివేయును గాక!
ఓ ప్రియ బాలకులారా! ఆత్మానంద - ఆత్మాకాశ స్వరూపుడనగు నేనే ఇన్ని రూపాలుగా
మీ యొక్క భేదజ్ఞానముచే మీ ఆలోచనలకు ఆహారరూపమై లభిస్తున్నాను. ఇప్పుడు మీరు
యుక్తితో కూడిన ఆలోచనలచే భేద జ్ఞానమును నివృత్తింపజేసుకోండి. భేదజ్ఞానం నివృత్తి
కానంతవరకు అసత్యము-స్వప్నతుల్యము అగు దృశ్యము వాస్తము-నిత్యమువలె
అనుభవమౌతూనే వుంటుంది. మీరు ఎంత సావధానుడవైవున్నప్పటికీ, నిత్యకర్మలను ఎంతగా
నిర్వర్తిస్తున్నప్పటికీ, ఎంతగా జాగృతులైనప్పటికీ,... భేద జ్ఞానం జయించ బడనంతవరకూ
మీకు అనుభవమయ్యేదంతా స్వప్న - సదృశము, కల్పితము, అసత్యము కూడా! అమ్మ
కల్పించిచెప్పే కథలోని పాత్రలను సంఘటనలను పిల్లవాడు ఊహతో ఆస్వాదిస్తూ -
అవన్నీ ఎక్కడో ఉన్నాయని అనుకుంటూ, అనుభూతి పొందటం వంటిదే, ఇదంతా!
స్వప్నంలో కనిపించిన స్వప్నదృశ్యమునకు, స్వప్నములోని ప్రియ - అప్రియరూపములకు
-
ఆస్తిత్వము ఉన్నదా? లేదు! అట్లాగే పరమాత్మకు భిన్నంగా కనిపించే ఈ దేహముల
సంబంధంగా అట్టి ఈ దేహములకు కల్పించబడే వర్ణాశ్రమ భేద ధర్మములకు, వాటికి
ప్రయోజనంగా చెప్పబడే స్వర్గలోకము మొదలైన కర్మఫలములకు, ఆ కర్మ ఫలములకు
కారణమగుచున్న పూర్వ - తదనంతర కర్మలకు అస్తిత్వమే లేదు! స్వప్న దర్శి స్వప్నంలో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
106

నిర్వర్తించిన కర్మలకు స్వప్నఫలములు లభించటం ఎటువంటిదో..., ఇక్కడి కర్మలు
వాటి ఫలములు, స్వర్గాది లోకములు అటువంటివే సుమా! అందుచేత పరమాత్మయే
ఇన్ని రూపములుగా కనిపిస్తున్నారు. ఇటువంటి అభేదభావనతో కూడిన జగదోపాసన
అభ్యాసములను ఆశ్రయించి మీరు "స్వప్నదర్శనము" అనురూప మనతగిన జగద్దర్శనము
నుండి సత్యమగు సమదర్శనమును అభ్యసించండి. అదియే తురీయోపాసన!
1. ఈ జాగృత్లో అనుభమయ్యే....
ఇంద్రియముల ద్వారా వెల్లడి అగుచుండే క్షణికములైన బాల్య - యౌవ్వన - వార్ధక్య
అవస్థలు, స్థూల దేహముల రాక పోకలు, మనస్సుకు-ఇంద్రియములకు
అనుభవమయ్యే రూప నామ - స్పర్శాది అనుభవములు -
2. స్వప్నాస్థలో అనుభవమయ్యే....
స్వప్న జాగ్రత్లో వాసనల ప్రభావంచేత కనిపించే విషయములు-స్వప్నదృశ్య పరంపరలు
3. ఆ స్వప్న విషయములను అనుభవించే స్వప్న ద్రష్ట (లేక) స్వప్నదర్శి (మరియు
జాగ్రత్ దర్శి
ఈ మూడింటినీ అధిగమించండి. ప్రతి - అనుసంధానం (Counter Practices) ద్వారా -
వాటిని దాటివేయండి. ప్రక్కన పెట్టి వుంచటం అలవాటు చేసుకోండి!.
జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు అనబడే అవస్థాత్రయమును నేను వేరుగా ఉండి
చూచువాడను! సాక్షిని! ఈ ఇంద్రియములకు అధిష్టాన స్వరూపుడనై, అతీతుడనై ఉన్నాను
అని గమనించటం అభ్యసించండి! క్రమంగా ఇంద్రియ "విషయములతో తాదాత్య్మము"ను
సాక్షి స్వరూపముతో తాదాత్మ్యము,... యొక్క ప్రభావంతో జయించివేయండి. ఒక
సందర్భంలో వుంటూకూడా, ఈ సందర్భమునకు నేను వేరై వున్నాను అని గమనించటం
ఏమి కష్టమున్నది చెప్పండి?
క్రమంగా ఇట్లా యోచిస్తూ, అభ్యసిస్తూ... సత్త్వ - రజ - తమో - త్రిగుణ రూపములగు
జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు నామనస్సు యొక్క అవస్థలు మాత్రమే! అవి నా యొక్క
అవిద్యా ప్రభావపూర్వకంగా నాచేతనే నాయందు కల్పించబడుచున్నాయి కదా!.. అనే
సత్యబుద్ధిని పరిపుష్టి చేసుకుంటూ వుండండి!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
107

1 ప్రత్యక్షమును పరిశీలించి సత్యమును ఆశ్రయించటం.
2 అనుమానమును ఆశ్రయించి శాస్త్రపరిశీలన చేయటం
గురూపదేశము గురువు 3 ఏ తత్వమ్ అసి అనే సిద్ధాంతాన్ని సోదాహరణ
దృష్టాంతపూర్వకంగా తన సదుపదేశములతో మీ ముందు ఉంచుచున్నారో... అద్దానిని
(తత్-త్వమన్ను) బుద్ధి పూర్వకంగా అవగాహన చేసుకోవటం...
ఇటువంటి ప్రయత్నముల ద్వారా మీ జ్ఞానఖడ్గానికి పదునుపెట్టుకోండి! సంశయము
లన్నింటికీ ఆధారం అహంకారమే!
అట్టి అహంకారము అనే దట్టమైన మబ్బును జ్ఞానఖడ్గంతో ఛేదించండి! మీ హృదయంలో
వేంచేసియున్న సర్వాంతర్యామినగు నన్ను సమీపించి సేవించండి!.
నాయనలారా! ఈ కనబడేదంతా మనో విలాసం! చిత్త భ్రమాకల్పితం! త్రాడును గాలిలో
త్రిప్పుతూఉండగా కనిపించే చక్రముల (ఆలాతచక్రముల) వంటిది! కాలముచే
నశించబోయేది! మరొకవిధంగా ఇదంతా చిద్విలాసమే!
శుద్ధ విజ్ఞానస్వరూపము ఏకము అగు బ్రహ్మమే ఈ తదితర జీవులరూపంగాను,
గుణముల భేదం గాను, మనోబుద్ధి చిత్త అహంకారాలుగాను, జాగ్రత్ - స్వప్న -
సుషుప్తులుగాను, ఈ జన్మ - వచ్చే జన్మ ఇత్యాదులుగాను అగుపిస్తోంది! అవన్నీ స్వప్నంలో
చూసిన భవనముల అనుభవం వంటివే! వాస్తవానికి ఇక్కడ నానాత్వం లేదు!
(న ఇహ నానాస్తి కించన)!
స్వస్వరూప బ్రహ్మమే ఈ సర్వ వివిధ రూపములుగా స్వకీయమాయాదృష్టికి అగుపిస్తోంది!.
* భిన్నత్వంలో సర్వదా వేంచేసియున్న ఏకత్వం దర్శించండి!
అనేకంగా కనిపిస్తున్నప్పటికీ ఒకటిగా కనిపించే పవిత్ర దృష్టిని ఆశ్రయించండి.
* దృష్టిని ఆయా ఉపాయాలద్వారా - అభ్యాసముల సహాయంతో దృశ్య రము
నుండి, అనేకత్వ సందర్శనం నుండి మరలించండి!.
ఏదో పొందాలి! దొరకాలి! లభించాలి! ఇంకేదో తొలగాలి! - ఇటువంటి రూపముగా
ఏర్పడి ఉన్న విషయ తృష్ణను క్రమంగా రహితం చేసుకోండి! తృష్ణను తౄష్టీకరించండి!
* ధ్యానము - భక్తి - యోగము మొదలైన ప్రయత్నములతో అంతరమున (Inner
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
108

zone) ను, బహిర్జగత్తును ఆత్మస్వరూపంగాను ఆస్వాదించి ఆనందించటం
అభ్యసించండి! నిజాత్మసుఖశీలురై ఉండటం అలవాటుగా చేసుకుంటూ వుండండి!
మరొక్కసారిచెప్పుచున్నాను! వినండి!
ఈ దేహ - ఇంద్రియ - విషయ జగత్తు ఎదురుగా ఆయా ఆహార - విహారాది
సందర్భములలో అనివార్యంగా అగుపిస్తున్నప్పటికీ,... ఇదంతా స్వప్న సదృశమే!
ఆత్మయే ఇదంతా! పరమాత్మయే ఇట్లా అగుపిస్తోంది... అనే మననమును సర్వకాల
సర్వావస్థలలోను అభ్యసించండి! వస్తు దృష్టిని వదలుతూ, ఆత్మీదృష్టిని
పెంపొందించుకోండి!. దేహం ఉన్నంత వరకే ఇక్కడి సంబంధాలు! దేహికి దేహమే
భ్రమ! ఇక ఇవన్నీ భ్రమకాక మరేమిటి? ఇది దృష్టిలో ఉంచుకొని మరల మరల
ధ్యానం చేయండి! సర్వ స్మృతులను (జ్ఞాపకాలను) ఆత్మగా దర్శించే సాధనలో
లయింపజేయండి. అప్పుడు మోహము దానంతట అదే తొలగిపోతుంది!.
ఓ సనక-సనందనాదులారా! దేహం ఉన్నంత వరకు సంబంధములు - అనుబంధములు
బాంధవ్యములు .. ఇత్యాది రూపములతో కూడిన వర్తమాన దృశ్య సంబంధం
కొనసాగుతూనే వుంటుంది. దేహ సంబంధమైనవి దేహంతోనే పోతాయి. కాని
సంస్కారములో? తదనంతర దేహముల రాక పోకలకు కారణమగుచు ఉన్నది!
అనగా, మరల ఆ సంసారము క్రొత్త క్రొత్త పిందెలతో కొనసాగుతోంది. అయితే,...
దేహము ఈ దేహికి ఐహికమోహము లేక ఐహిక భ్రాంతి! ఏ ఆత్మసత్యమును
సిద్ధింపజేసుకోవలనే ప్రయత్నించుచున్నారో.. అటి సిద్ధయోగాభ్యాసకులు "ఈ దేహము
నశ్వరము. నాశన శీలము. కనుక వర్తమాన సంబంధ బాంధవ్యములు నశించబోవు
చున్నాయి!" అని మునుముందుగానే గమనిస్తున్నారు. దానిని సాధన వస్తువుగా మాత్రమే
చూస్తున్నారు. మమకార - అహంకారాదులతో కాదు!
అజ్ఞానియో...?
దైవవశాత్ వచ్చిపోతున్న ఈ దేహము, ఈ సహజీవుల సంబంధమైన మమకారములు,
అనుబంధ బాంధవ్యములు, ఈ దేహముతో పెంపొందించుకున్న
అవినాభావతాదాప్యము.. ఇవన్నీ చూసుకొని మురిసి పోతున్నాడు! ఆహా! ఇవన్నీ ఎంత
సత్యం! ఎంత ప్రియమైనవి! ఇవన్నీ కదా, నాకు సుఖం కలిగించేవి! అయ్యబాబోయ్!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
109

వీరితో ఈ సంబంధం దూరం అయిందా,.. ఇక నా పని ఖాళీయే కదా! వీరిని చూడకుండా
ఉండలేను! వారంటే నాకు అయిష్టం! ఎట్లా వదులుతారో, ఏమో? .. ఇత్యాది భ్రమలన్నీ
పొందుతూ జీవితము అనే గొప్ప అవకాశమును బూడిద చేసుకుంటున్నాడు. దృష్టిని
దృశ్య పరిమితం (What is being seen with physical eyes) చేసినవానికి ఇది
నిజమా? నిత్యమా? శాశ్వతమైన సుఖం ప్రసాదించేదా? ఈ దేహాలు ఎందుకు వస్తున్నాయి?
దీనిని ఏ దృష్టితో చూస్తే జీవితావకాశం సద్వినియోగం అవుతుంది? ఇటువంటి
మార్గములలో పరిశీలించబుద్ధియే కావటం లేదు!
సిద్ధయోగియో....?
మత్తుపానీయం సేవించినవానికి తన ఒంటికి వస్త్రాలు ఉన్నాయో-లేవో కూడా
తెలియకుండా తిరుగుతూ ఉంటాడు చుసావా? అట్లాగే... సిద్ధపురుషుడు ఈ దేహం
ఉన్నదా? ఊడిందా?.. అనే పరిమితభౌతికానుభూతిని అధిగమిస్తున్నాడు! నశ్వరమగు
ఈ దేహం ఉన్నపుడు - లేనప్పుడు కూడా నిశ్చలంగా నిశ్చింతుడై వుంటాడు! దైవవశంగా
ఈ శరీరం వచ్చినప్పుడు, మరొకప్పుడు తొలగుచున్నప్పుడు, జీవిస్తూవున్నపుడు కూడా,
తన దృష్టిని ఇంద్రియవిషయములవైపు సారించడు. సహజీవులను
ఇంద్రియవిషయములుగా కాకుండా, సహజాత్మ స్వరూపులుగా సందర్శిస్తూ
ఆత్మావలోకనం చేస్తూ వుంటాడు. ఎట్టి సందర్భములలోను, స్థితి గతులలోను
ఆత్మావనులోకనము నుండి చ్యుతి పొందడు!. (బ్రహ్మావలోకధిషణం న జహాతి యోగీ)
ఇక ఈ దేహముయొక్క గతి గురించి ఏమిటంటారా?
ఈ దేహం కర్మానుసారంగా దైవవశాత్ ప్రాణములతో కూడి జీవిస్తూ వుంటుంది! ఈ
ఇంద్రియములు ప్రవర్తిస్తూ వుంటాయి! "సర్వసమ దర్శనము (లేక) ఆత్మౌపమ్యేవ సర్వత్రా
సమం పస్యతి - అనురూపంగా నాకు నేనే నన్ను నేనే ఈ సర్వరూపాలుగా భావన
చేసుకొని ఆస్వాదిస్తున్నాను" - ఇటువంటి అనుభూతిని నిశ్చలంచేసుకొన్న తరువాతనో?
ఆతడు తత్త్వజ్ఞుడు అనిచెప్పబడుచున్నాడు. సిద్ధసమాధియోగి అని పిలువబడుచున్నాడు!
ఓ ప్రియ బిడ్డలారా! పరమార్ధ తత్త్వజ్ఞులు అవండి! సమాధియోగులుగా మిమ్ములను
మీరు తీర్చిదిద్దుకోండి!
ఈ భౌతిక దేహంతో ఆసక్తి విడచినవారై ఉండండి!.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
110

- నాకు కనబడేవారు"నేను .. అంతాకూడా అఖండమగు ఆత్మయొక్క చమత్కార ప్రదర్శనమే!
ఆత్మ సర్వదా, యథాతథం! అనేకత్వం ఎక్కడా లేదు! ఏకము - నిత్యము అగు ఆత్మయే
నేను - నీవు కూడా!" అను దృష్టిని సిద్ధించుకున్నవారై... ఆపై ఇక యథేచ్ఛగా మీ ఇచ్చ
వచ్చినచోట సంచరించండి!
సిద్ధయోగి సర్వత్ర ఆత్మనే దర్శిస్తున్నాడు! ఇక ఆపై స్వప్న తుల్యమగు ఈ దేహ
ఇంద్రియవిషయ పరంపరలను స్వప్న దృశ్యంగా దర్శిస్తున్నాడు! అనగా,... భౌతిక
దేహము - విషయముల పట్ల అనాసక్తి (ఆసక్తిరహితుడై) ఉంటున్నాడు!. (లేక) తాను
చదువుచున్న కథలో కల్పించబడిన పాత్రలవలె సందర్శిస్తున్నాడు.
ఓ విప్రవర్యులారా! హంసరూపుడనై ఇప్పుడు మీకు సాంఖ్య యోగ రహస్యాన్ని దేహమును
- దృశ్యమును దర్శించవలసిన విధానాన్ని, దర్శించకూడని విధానాన్ని వివరించాను!.
సనకాదులు : ఓ హంస మహాశయా! పరమహంసా? ఎవరు మీరు? దేహతదాత్మ్యముతో
కూడిన చిత్త విభ్రమముల మధ్య చిక్కియున్న మాకు సిద్ధపురుషయోగాన్ని
ప్రభోదించినమీరు మా యందు దయతో పరమసత్యాన్ని బోధించి నిద్రలేపారు!
ఆత్మసాక్షాత్కారం అభ్యసింపజేసినట్టి తమరెవ్వరు?
హంస: నాయనలారా! నేను స్వయంగా విష్ణు భగవానుడను! మీకు సాంఖ్యయోగ
రహస్యం వివరించటానికి మీ ముందు ఈ హంసరూపంగా ప్రత్యక్షం అయ్యాను! నా
స్వరూపం సాఖ్యం - యోగం - సత్యం - ఋతము (ఆప్తవాక్యాలు) తేజస్సు - శ్రీ -
కీర్తి - దమము ... ఇత్యాతులన్నింటికీ సమాశ్రయమగు సర్వముగా ప్రదర్శితమగుచున్న
విష్ణుతత్త్వమే! సర్వ జీవరాసులలోను సర్వదా స్వస్వరూపంగా ప్రత్యక్షమైయున్న విష్ణుత్వమే
నా వాస్తవరూపం!.
నిత్యుడను! నిత్య సత్యమును!
అప్రాకృతుడను! నిర్గుణుడను! నిరాకారుడను!
సంగరహితుడను!
అపేక్షారహితుడను!
సర్వ జీవులకు హితుడను! దయామయుడను!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
111

సర్వుల స్వస్వరూపుడనై వుండటం చేత, సర్వ ప్రేమాస్పదుడను! అందరిచే
ప్రేమించబడుచున్నది నేనే! సర్వులు నా ప్రేమాస్పద స్వరూపాలే!
సర్వాంతర్యామిని!
నిర్గుణుడగు నన్ను సర్వగుణములు సేవిస్తూ వున్నాయి! నేను మీ యొక్క స్వస్వరూరుడనే
సుమా!
ఓ మిత్రమా! ఉద్ధవా! ఆవిధంగా నా సిద్ధపురుషవాక్యములు విన్న తరువాత సనకుడు
మొదలైన మునులంతా సంశయ నివృత్తులు అయ్యారు! ప్రేమాస్పదంగా నన్ను
పూజించారు! దివ్యస్తోత్రములతో....
భావమును నీవయ్యా...,
రాగమును నీవయ్యా....,
యోగమును నీవయ్యా.....,
సకలమును నీవే!
నేనే నీవు! మేమే నీవు! నీవే మేము!
నీ యొక్క అంశయే మేము!
మేము మీకు అద్వితీయులం! ఇక్కడ, ఈ దృశ్యములోని దేహ-బుద్ధి -చిత్త -
అహంకారాలు ఆత్మను సేవించటానికై ఆత్మచే కల్పించబడి - కదలింపబడుచున్నాయి!
మేము ఆత్మ స్వరూపులం
త్వమేవా హమ్ ! త్వమేవా హమ్!....,
అని గానం చేశారు! తమ ఆత్మేశ్వరుడనగు నన్ను కీర్తించారు!
అప్పుడు నేను అలవోకగా చిరునవ్వు చిందిస్తూ అక్కడి వారంతా చూస్తూ వుండగా....
వాయుతరంగం వాయువులో ఐక్యం అయినట్లు జలతరంగం జలంతో ఐక్యత
పొందినట్లు - ఆహంస రూపం ఉపశమింపజేసి నిజధామమునకు వెడలాను..
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
112

19. భక్తియోగము - ధ్యాన విధానము
ఉద్ధవుడు: హే శ్రీకృష్ణా! భగవానుడగు బ్రహ్మదేవుడు వివిధ ఋషులు-మానవుల
శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సాంఖ్యమార్గం, యోగ మార్గం, ధ్యాన మార్గం, త్యాగ
మార్గం ఈ విధములైన వివిధ సాధన మార్గాలు బోధిస్తున్నారు కదా! ఆయా మార్గాలలో
అన్నింటికన్నా శ్రేష్టమైన మార్గంఏదో... అది చెప్పండి! మా అందరికి సులభము
ఉత్తమమైనది - శ్రేయస్సు కలుగజేయగల అతిముఖ్యమైనదేదో.. చెప్పండి!
మీరు భక్తి యోగం బోధిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. మీ పట్ల నిష్కామమైన భక్తి
యోగం సర్వగురువుల సమ్మతమా! లేక, యోగ ధ్యాన - కర్మ - యాగాదులు
ప్రదిపాదిస్తున్న వేరు వేరు గురువులయొక్క వారు బోధిస్తున్న ఆయా మార్గాలే అధికంగా
సమ్మతమా!
జీవుడుగా నాకు ఏ మార్గం సులభము? సర్వజనామోదం? నన్ను త్వరితగతిని ఉద్ధరించ
గల మార్గమేదో... అదీ చెప్పండి!
శ్రీ కృష్ణభగవానుడు : ఓ ఉద్దవా! పూర్వాపర వివరణలతో ఇక్కడ నీ ప్రశ్నకు సమాధానంగా
కొన్ని విశేషాలు చెప్పుతాను! విను!
ఈ కనబడేదంతా నా ఆత్మ యొక్క విన్యాసమే! ఆత్మ సర్వదా అఖండమైవుండి, ఈ
తదితరంగా అనిపిస్తోంది!... అను జ్ఞానమే ఆత్మజ్ఞానం! వేదములు అట్టి ఆత్మ ధర్మమును
ఎలుగెత్తి గానం చేస్తున్నాయి అట్టి ఆత్మ ధర్మము (The characterisitc feature of
self) ను మొట్టమొదట నేను సృష్టికర్త యగు బ్రహ్మ దేవునికి బోధించటం జరిగింది.
అట్టి ఆత్మధర్మము అను పరమసత్యము సృష్టికి ముందు - సృష్టికి తరువాత - సృష్టి
సందర్భంలో కూడా సర్వదా అనునిత్య సత్యమై యున్నది.
అట్టి ఆత్మధర్మము యొక్క అవగాహన ప్రళయకాలంలో ఏమరచబడటంచేత సృష్ట్యాదిలో
బ్రహ్మ దేవునికి వేదవాణి రూపంగా బోధించాను. బ్రహ్మదేవుడు తన కుమారుడుస్వయంభువు అగు మనువుకు బోధించారు. భృగువు, అంగీరసుడు, మరీచి, పులహుడు,
అత్రి, పులస్త్యుడు, క్రతువు... అను సప్త బ్రహ్మమహర్షులకు బోధించటం జరిగింది!
భృగువు మొదలైన ఆ సప్త బ్రహ్మమహర్షులు తమ తమ సంతానమగు దేవతలు
దానవులు, గుహ్యకులు, మనుష్యులు, సిద్ధ - గంధర్వ-విద్యాధర చారణులు,
కింపురుషులు, కిన్నెరులు - నాగులు - రాక్షసులు - కింపురుషులు మొ॥వారికి బోధించగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్దవ సంవాదం - అధ్యయన పుష్పము
113

వారిలో అనేకులు అది గ్రహించారు. అయితే...., ఆయా జీవులంతా భిన్న భిన్నములైన
సత్వ - రజో తమోగుణ సంపన్నులై ఉండటంచేత భిన్న భిన్నములైన దృష్టి -
అవగాహనలు కలిగి ఉండసాగారు! వాసనలను (tendencies) అనుసరించే దేవతలు
- అసురులు - మనుష్యులు - భూతములు - భూతపతులు భిన్న-భిన్నంగా ఉంటారు
కదా! ఆయా జీవులంతా వారి వారి చిత్ర - విచిత్రమైన వాసనలను అనుసరించి ఆత్మ
తత్త్వ జ్ఞానము (త్వమ్ స్వరూపతః మమాత్మ యేవ అను పాఠ్యాంశాము) విషయమై
అన్వయించుకోసాగారు. ఆవిధంగా చిత్ర విచిత్రములైన వర్ణనలు వేదవ్యాఖ్యానరూపంగా
వెలువడసాగాయి. వెలువడుతున్నాయి. అనేక శబ్దాలు వాటికి వేరు వేరైన అర్ధ
ప్రయోగాలు బయల్వెడలుచున్నాయి. అంతేకాదు! ఈ మానవుల స్వభావాన్ని అనుసరించి
బుద్ధిభేదం ఏర్పడుతోంది. ఇంకా కొందరు వేదముల అధ్యయనం చేయనివారై ఒకానొక
గురువు యొక్క కొన్ని వాక్యములను (లేక) అభిప్రాయములను మాత్రమే ప్రమాణంగా
తీసుకొని పారంపర్యంగా ఆవాక్యాలకు మరికొన్ని అర్ధాలను కల్పించుకొని "ఇంతే!
ఇంతవరకే ! మరింకెవరు ఏది చెప్పినా ఆలోచించవద్దు! విచక్షించవద్దు! అసలు ఇంకేమీ
వినవద్దు!" - అనే పరిమితమైన అవగాహనకు కట్టుబడినవారై వుంటున్నారు. ఇందులో
కొందరు పాషండమతస్తులై "పరమాత్మలేదు! దేహమే వున్నది ! మరణానంతరం ఈ
జీవుడు నశిస్తాడు! ఇక ఆపై మరేమీ లేదు! ఉన్నంత వరకు తినండి! త్రాగండి! అంతే!
ఇంతకుమించి ఏదీ విచారణ చేయకండి! ఇదే వేదసారం!".. అని కొన్ని దేహసంబంధమైన
సంకుచిత భావాలకు - అభిప్రాయాలకు కట్టుబడినవారై వుంటున్నారు.
ఇక, మరికొందరు, "మనమంతా ఒక జాతివారం! ఇతర జాతివారిని హింసించటం,
బాధించటమే మన గురువుయొక్క సేవ!"-అనికూడా భావన చేస్తున్నారు. హింసాత్మకమైన
ప్రవర్తనకు సిద్ధమగువారు! అందుకు చావుకైనా సిద్ధపడేవారు కూడా ఉంటున్నారు!.
ఓఉద్ధవా! పురుషశ్రేష్ఠా! నా మాయచే మోహితులైన మరికొందరు వారివారికి రుచించే
క్రియలు-కర్మలను అనుసరించి నానా విధములైన సాధనలను, సాధనాక్రమమును
నమ్మి... అదే తదితరులకు బోధించే వారుకూడా వున్నారు!. ఉండబోవుచున్నారు కూడా!
"ధనమే అన్నింటికీ మూలం! దైవభక్తి వలన ధనం లభిస్తుంది" - అనే భావం ఆశ్రయించి
దైవభక్తిని సాధనముగాను, ధన-సంపదలను సాధ్యముగాను భావించటం కూడా కొందరి
విషయంలో జరుగుతోంది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
114

మరికొందరు ధర్మమే శ్రేయోసాధనం. పరోపకారులమై వుంటే చాలు. ఆత్మవిచారణతో
పనిలేదు - అను భావన కలిగి ఉంటున్నారు.
యశస్సు - కామము - దమము శమము - ఐశ్వర్యము - భోగములు - యజ్ఞము
తపస్సు వ్రతనియమము ఇత్యాదులు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా
శ్రేయోసాధనములుగా కలిగి వుంటున్నారు?.
ఈ విధమైన భావనలచే ఆశ్రయిస్తున్న అనేక కర్మపరంపరలను ఆశ్రయించటంచేత,...
కాలక్రమేణా వాటిలో కొన్నిటి యొక్క అంతిమ ప్రయోజనములన్నీ దుఃఖ పరిణామములు
గాను, మోహజనకములుగాను, అల్పఫలప్రదాతలు గాను, శోకయుక్తములు గాను
అయి వుండటంకూడా జరుగనారంభించాయి.
ఓ ఉద్దవా! ఎవ్వరైతే తమ మనస్సును సర్వాత్మకుడనగు నాయందు నిలుపుతూ
క్రమక్రమంగా మనస్సును విషయశూన్యం చేసుకుంటూ వుంటారో.. అట్టివారు నా
పరతత్త్వమును తెలుసుకుంటారు. పరతత్త్వాన్ని ఎఱిగి ఆస్వాదించున్ను వారి ఆత్మ
సుఖమును స్వప్నతుల్యమగు ఇంద్రియ సుఖంతో ఏ మాత్రం పోల్చ వీలుండదు సుమా!
మనో - బుద్ధులలో కించత్వము లేనివారు (వారు తక్కువవారు - ఇది గొప్పది ఇత్యాది
అభిప్రాయములను ఆశ్రయించనివారు), శమ దమాది గుణాలంకారులు, శాంత
మనస్కులు, తమలోని పరస్వరూపుడనగు నన్ను చూసి ఆనందించువారు - ఇట్టివారు
మాత్రమే ఈ సర్వజగత్తును సుఖమయంగా దర్శించగలుగుచున్నారయ్యా!
ఇంద్రియ విషయాభిలాషికి ఈ జగత్తంతా దుఃఖమయంగానే అనుభవమౌతూ
వుంటుంది!.
సర్వాంతర్యామిని సర్వతత్త్వ స్వరూపుడను - ద్రష్టయొక్క స్వస్వరూపుడను అగునాపై
మనస్సు నిలిపినవాడు ఇక ఆపై బ్రహ్మ - ఇంద్ర ఇంద్ర - మహేంద్ర - సార్వ భౌమాది
పదవులను గాని, పాతాళలోకాధిపత్యమును గాని, అణిమ-గరిమ మొదలైన సిద్ధులను
గాని కోరుకోడు!.
స చ మే భక్తి మాం ప్రియః !
ఓ ఉద్ధవా! నా భక్తుడు నాకు ఇష్టమైనంతగా - నాపుత్రుడగు బ్రహ్మదేవుడు గాని,
హృదయేశ్వరియగు లక్ష్మీదేవిగాని, స్వరూపభూతుడగు శంకరుడుగాని, నా సోదరుడుగు
బలరాముడుగాని, నా ఆత్మగాని ఇష్టం కాదు సుమా! నేను భక్త సులభుడను! ఇష్టంగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
115

భక్తులను సర్వదా ఆశ్రయించి ఉంటాను. అంతేకాదు! భక్తుల పాదధూళితో
బ్రహ్మండములన్నీ పవిత్రం చేయటానికై నేను వారి వెంటనంటియే ఉంటాను. నిస్మృహుడు
(One who does cross the relatedness of wordly matters), సదా పరతత్త్వజ్ఞాన
మననశీలుడు, పరానందస్వరూపముచే పరమానందుడు, శాంతుడు, వైరభావరహితుడు,
సమదర్శియు అగు నాభక్తుని నేను సర్వదా అనుసరించియే ఉంటాను! ఆతడు
అల్పభావములను త్యజించినవాడై (నిష్కించనుడై) నాకు సమర్పించిన అనురక్త
బుద్ధికలవాడై, శాంతుడై, మహాశయుడై వుంటాడు! సర్వజీవరాసులను వాత్సల్యదృష్టితో
చూస్తూ ఉంటాడు.
అట్టివారు బాహ్య దృశ్యములపట్ల సర్వ అపేక్షలకు అతీతమైన అనిర్వచనీయమైన
ఆత్మసుఖం ఆస్వాదిస్తూ వుంటారు.
ఆపేక్ష (Inquisitiveness towards what is being outwardly seen) కొనసాగించేవారు
ఆత్మ సుఖమును పొందలకేపోతున్నారని గుర్తుచేస్తున్నాను! ఉపేక్షచే
ఆత్మసుఖానుభవులగుచున్నారు.
భక్తి - ప్రపత్తి
ఉద్ధవుడు: స్వామీ! మీపై భక్తి ప్రవత్తులు ఉండికూడా.. పూర్వాభ్యాసవశంచేత
ఇంద్రియములను ఇంకను జయించని నా వంటి ప్రాకృత భక్తుల స్థితి - గతుల మాట
ఏమిటి?
శ్రీకృష్ణుడు : నా యందు భక్తి ప్రవత్తులు పవృద్ధమౌతూ ఉంటే... క్రమంగా సామాన్య
విషయాలకు - ప్రలోభాలకు లొంగని బుద్ధి దానంతట అదే బలం పుంజుకుంటూ
ఉంటుంది. దృశ్యాకర్షణ క్రమంగా తొలగనారంభిస్తుంది!.
అంతేకాదు...!
భక్తియోగమే కాకుండా, అనేకమైన అధ్యాత్మ మార్గాలు ఉన్నాయి, సాంఖ్య (విచారణా
మార్గం) - స్వధర్మ నిర్వహరణ, సమర్పణ - స్వాధ్యాయం (వేదమంత్రాల పఠణం).
తపస్సు మొదలైనవి! అయితే అవన్నీ భక్తియోగానికి సాటిరావని, పరమాత్మనగు నన్ను
వశం చేసుకోవటానికి భక్తితో సమానంగా సులభంకాదని రెండు చేతులు ఎత్తి
ప్రకటిస్తున్నాను.. అవన్నీ భక్తిలో అంతర్విభాగాలవటమే నాకు ఇష్టం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
116

భక్తి శ్రద్ధచే ప్రవృద్ధమౌతుంది. భక్తి క్రమంగా అనునిత్యసాధనాక్రమంగా అనన్య భక్తిగా
రూపుదిద్దుకుంటుంది. అప్పడు ఈ జగత్తంతాకూడా కృష్ణచైతన్యానందంగా
అనుభవమౌతుంది! సాధువులు పరమాత్మను - సర్వప్రియ స్వస్వ రూపుడను అగునన్ను
భక్తితో లాభింపజేసుకుంటున్నారు! ఏకాగ్రతచే, సర్వ జీవులుగా ఉన్నది పరమాత్మయే....
అనే భావనను ఆశ్రయిస్తూ ఉంటే భక్తి రూపుదిద్దుకుంటోంది.
అట్టి అనన్య భక్తిచే చండాలురుకూడా పరమపవిత్రులౌతారు!.
పరమాత్మ స్వరూపుడనగు నాయందు భక్తి ప్రపత్తి లేని వానిలో గల దయ-ధర్మము
సత్యము - తపస్సు - జ్ఞానము ఇవన్నీకూడా పరాకాష్ఠయగు పవిత్రతను సంతరించు
కోలేవు సుమా!
శరీరము పులకితం కానంతవరకు, చిత్తము ద్రవించనంతవరకు, ఆనందాశ్రువులు
కళ్ళ నుండి ప్రవహించనంతవరకు భక్త్యావిర్భావము యొక్క ఔన్నత్యము గాని, భక్తివలన
కలిగే చిత్తశుద్ధిగాని, భక్తియొక్క ప్రభావమైన అనిర్వచనీయ ఆత్మానందముయొక్క
అనుభూతి గాని పూర్తిగా అర్దంకావు!.
భక్తిచే కంఠం గద్గదమౌతుంది! చిత్తము వెన్నవలె ద్రవీభూతమౌతుంది! అట్టివాడు
ఒక్కొక్కసారి ఆనందంగా నవ్వుతాడు! సిగ్గువిడిచి పెద్దగా గానం చేస్తూ వుంటాడు!
తన్మయత్వంతో నృత్యం చేస్తూ వుంటాడు..
అట్టి భక్తుడు తనయొక్క పరాప్రేమచే మూడులోకాలను పరమపావనం చేస్తూ వుంటాడు!.
అగ్నిచే సంతప్తమై బంగారు ఖనిజం తనలోని మలినములను తొలగి పోగా దగ
దగాయానంగా ప్రకాశిస్తుంది చూచావా! ఆ విధంగా, స్వభావంగా దృశ్య సంబంధం
గల చిత్తముకూడా భక్తి యోగం చేత తప్తమై తనయందలి దోషములను తొలగించుకొని
ప్రకాశిస్తుంది! చిత్స్వరూపుడనగు నన్ను స్వభావసిద్ధంగా సేవిస్తుంది! ఆస్వాదిస్తుంది!
తన్మయమౌతుంది. అంతా తానే అయి, అంతటికీ వేరై... అనిర్వచనీయ చిదానందముగా
అగుచున్నది.
ధూళిచే ఆవరించబడిన కనులు గలవారికి అంజన ఔషధంచేత (కాటుకమందుచేత)
కంటిదోషం తొలగించితే వస్తువులు చూడగలుగుతారు చూచావా? అట్లాగే, నాయొక్క
అవతార లీలలు, మహిమలు కీర్తించటంచేత చిత్తములోని దోషములు తొలగిపోతాయి.
విషయములను సదా ఆలోచించే చిత్తము ఆ విషయములందే చిక్కుకుంటోంది! అదే
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
117

చిత్తము సర్వతత్త్వస్వరూపుడనగు-సత్యరూపమగు నా గురించి ఆలోచన చేస్తూ వుంటే,
నాయందు లీనమౌతుంది!.
స్వప్నంలో కనిపించిన ఇల్లు మెళువవచ్చేటప్పటికి కనబడదేం?.. అని ఎవ్వరైనా
దుఃఖిస్తున్నారా? లేదు కదా! ఇక్కడి ఆశ - నిరాశ - దురాశల రూపమైన మనోరధాలు
స్వప్నసదృశాలే సుమా! "ఇక్కడ నాకు ఇంకా ఏదో ఏదేదో లభించలేదు.." అనే
వేదనలను మొదలంట్ల వదలి,... పరమాత్మనగు నన్నే ఏకాగ్రతతో అనుస్మరించటం
ఉచితమని గుర్తుచేస్తున్నాను! వివేకవంతుడైనవాడవు కనుక, నీవు భౌతిక దేహ
సంబంధమైన సాంగత్యములకు అతీతత్వమును సముపార్జించుకుంటూ, సంగమును
త్యజిస్తూ ఏకాంతంగా, సావధానంగా ధ్యానం అభ్యసిస్తూ చిత్తమును నా వైపుగా
నడిపెదవుగాక!
ఓ ఉద్ధవా! దృశ్య సంగముచేతనే ఈ జీవునికి క్లేశములన్నీ వచ్చి పడుచున్నాయయ్యా!
బంధమునకు కారణం దృశ్య ధ్యానం చేత ఏర్పడే సంగమేగాని, (Attchment -సంగాత్
సంజాయతే కామః), మరొకదెవరూ జీవునికి బంధం కల్పించటం లేదు.
ధ్యానయోగము
ఉద్ధవుడు: ఓ అరవిందాక్షా! శ్రీ కృష్ణా! ముముక్షువులు నీ యొక్క ఏ రూపమును ఏ
భావనతో ఏ విధంగా ధ్యానం చేస్తూ ఉన్నారో, అది నా సాధన కొరకై నాకు
తెలియజేయప్రార్ధన. ధ్యానయోగ విధానం తెలుపండి!
శ్రీకృష్ణుడు :
సమ ఆసన అసీనః సమకాయో యథా సుఖమ్
హస్తావుత్సంగ ఆధాయ స్వ నాసాగ్రకృతేక్షణః (అధ్యా 14, శ్లో 32)
శ్లో ప్రాణస్య శోథయేత్ మార్గం పూర - కుంభక - రేచకైః
విపర్యయేణా అపి శనైః అభ్యసేత్ నిర్జితేంద్రియః (అధ్యా 14, శ్లో 33)
ధ్యానయోగ ప్రావీణ్యులు ఎత్తుగాని పల్లంగాని కానటువంటి సమ ప్రదేశంలో
సమమగు సుఖాసనం ఆశ్రయించి చేతులు ఒడిలో పెట్టుకొని దృష్టిని నాసాగ్రంపై
సారించి ధ్యానం అభ్యసిస్తున్నారు. ప్రాణాయామం-ఇంద్రియ జయయోగం కొరకై
ఉద్దేశ్యించ బడింది! ఇంద్రియములను జయించాలి (లేక) ఇంద్రియవిషయములన్నీంటినీ
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
118

దాటి వేసి మనోబుద్ధులను సమస్థితికి తేవాలి.
పూరక కుంభక - రేచక - వరుసలోగాని, రేచక కుంభక పూరక
వరుసలోగాని నెమ్మదినెమ్మదిగా.. కాలం పెంచుకుంటూ అభ్యాసం చేయాలి! అప్పుడు
క్రమక్రమంగా మనో - బుద్ధులు తమయొక్క దృశ్య సంబంధమైన సంస్కారాలను
అధిగమించి క్రమక్రమంగా ఏకాగ్రత - మౌనము సంతరించుకోగలవు.
కుండలినీ శక్తిని అవిచ్ఛిన్నంగా కంఠ స్థానంలో లయింపజేయటం :
శ్లో॥ హృత్ అవిచ్ఛిన్నమ్ "ఓం" కారం ఘంటానాదమ్ బిసోర్ణవత్
ప్రాణేన ఉదీర్య తత్ర అథ పునః సంవేశయేత్ స్వరమ్. (అధ్యా 14, శ్లో 34)
తామరతూడు లోని దారం బీజాంకుర స్థానం నుండి - పుష్పము యొక్క అడుగుభాగం
వరకు విస్తరించి యున్న తామరతూడు చివరస్థానం వరకు అవిచ్ఛిన్నంగా విస్తరించినదై
ఉంటోంది కదా! ఆ విధంగా మూలాధార స్థానం నుండి హృదయస్థానం వరకు
ప్రసరిస్తున్న (ఘంటానాదంతో పోల్చతగిన నాదస్వరూప -ఓంకారమును మూలాధార
స్థానము నుండి ప్రాణవాయువుతోసహా 12 అంగుళముల వరకు అవిఛిన్నముగా
విస్తరింపజేస్తూ స్వరస్థానం (కంఠబిందువు, పంచదశ బిందువు) వరకూ విస్తరించి
అక్కడ లయింపజేస్తూ వున్నారు-విజ్ఞులగు కుండలినీ ఉపాససకులు!
శ్లో ఏవం ప్రణవ సంయుక్తం ప్రాణమేవ సమభ్యసేత్
దశకృత్వస్తీషవణం మాసాదర్వార్జితానిలః (అధ్యా 14, శ్లో 35)
ఆసన 1. జయం - నాసాగ్ర స్థాన ధ్యానం
2. పూరక - కుంభక - రేచకముల అభ్యాసం, రేచక - కుంభక - పూరకముల
అభ్యాసం
3. ఓంకార రూపమగు ప్రాణముల కదలికకు కారణమయ్యే శక్తిని మూలాధారం
నుండి - హృదయస్థానం ద్వారా కంఠస్థానం వరకు నడిపించి, ఆ స్వరస్థానంలో
ప్రతిక్షేపించటం. లయింపజేయటం.
విధానముల ద్వారా ప్రతిరోజు కనీసం 3 వేళల ఓంకారముతో కూడిన
ప్రాణాయామమును అభ్యసిస్తూ వుండగా ఒక నెల కాలంలో ప్రాణవాయువు-ప్రాణశక్తి
స్వాధీనం అవుతాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
119

హృత్ పుండరీక ధ్యానం-పరతత్త్వ ధ్యానము
హృదయంలో ఇష్టదైవ రూపాన్ని ప్రతిక్షేపించుకొని-పరమాత్మత్వంతో మమైకమయ్యే ఒకానొక
మార్గమును ఉదహరిస్తున్నాను. విను.
శ్లో ॥ హృత్పుండరీకమ్ అన్తఃస్థమ్-ఊర్ధ్వనాలమ్-అథోముఖమ్
||
ధ్యాత్యోర్దముఖమున్నిద్రమ్ అష్టపత్రం సకర్ణికమ్
కర్ణికాయాం న్యసేత్ సూర్య-సోమ-అగ్నీన్ ఉత్తరోత్తరమ్
వహ్నిమధ్యే స్మరేత్ రూపం మమ ఏతత్ ధ్యానమంగళమ్ (అధ్యా 14, శ్లో 36,37)
దేహమునకు అంతర్గతమై, ఊర్ధ్వనాళములు కలదై, ముకిళితమై, కర్ణికములతో కూడినదై
8 దళములు గల హృదయ పుండరీకమును ధ్యానం చేస్తూ వుండాలి. అట్టి హృదయము
యొక్క కర్ణికలలో సూర్య చంద్రులను, అగ్నియొక్క తేజస్సును భావన చేస్తూ వుండాలి.
అట్టి తేజస్సులో మంగళప్రదమగు నా రూపమును ధ్యానం చేస్తూ ఉండాలి!
సమము, ప్రశాంతము, సుముఖము,
చతుర్భుజములు గలది, |
చారుసుందరమైనది,
అందమైన నుదురుగలది,
|
చిరునవ్వు చిందించేది,
రెండు చెవులు ||||||| - కుండలములు ధరించినది,
బంగారు ఛాయగల పంచ ధరించినది,
నీల మేఘ ఛాయ దేహము గలది,
శ్రీవత్సమణి ధరించిన హృదయస్థానము కలది,
శంఖ-చక్ర-గద-పద్మములను ధరించినది,
విస్థారమైన - ఎత్తైన పాదములు గలది,
కౌస్తుభమణి ధరించిన కంఠము గలది,
కిరీటము మొదలైన ఆభరణములతో శోభిల్లునది,
సర్వాంగ సుందరమైనది, |
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
120

మనోహరమైనది,
|
చల్లటి చూపులు ప్రసరిస్తున్న కళ్ళుగలది, |
అతి కోమలము
|
అయినట్టి నాయొక్క భగవదవతారరూపమును హృదయంలో మననం చేస్తూ వుండు.
బుద్ధిమంతుడైనవాడు మనస్సును ఇంద్రియవిషయ ధ్యాసలనుండి ఉపసంహరించి, బుద్ధి
అనే సారధి సహాయంతో చిత్తమును నాయొక్క వివిధాంగముల దర్శనాభ్యాసంలో
నియమించుచున్నాడు! క్రమంగా అనేకచోట్ల ఉబుసుపోకగా విహరించే చిత్తమును
నాయొక్క ఒక్కొక్క అవయవంపై ఏకాగ్రం చేస్తూ వస్తున్నాడు! అన్నిటికంటే చిరునవ్వులు
చిందించే ముఖమండలముపై ధ్యాస నిలపటం సౌలభ్యముతో కూడిన అభ్యాసం
అని నా అభిప్రాయము.
క్రమంగా "అన్ని రూపములుగా - భావములుగా - స్వభావములుగా - గుణములుగా
కనిపిస్తున్నది సర్వతత్త్వ తత్త్వానంద స్వరూపుడగు పరమాత్మయే" అనే
నిశ్చయమును బుద్ధిచే ధ్యానం - ఆరాధనం - సందర్శనం ఒకేసారి అభ్యసిస్తూ ఉండాలి!
గుర్తు చేసుకుంటూ మరల మరల మననం చేసుకుంటూ ఉండాలి!
అనగా....
1. మొట్ట మొదట... "అనేక విషయములు ధ్యానించటము" అనే మనోరుగ్మతను
"ఇష్టదైవము - అవతారమూర్తియొక్క ఒక్కొక్క అవయవ మననము" అనే ఔషధం
సేవిస్తూ ... బుద్ధిని లౌకికమైన విషయములనుండి మరల్చాలి.
2. క్రమంగా అనేక అవయవముల ధ్యానం నుండి దృష్టిని మరల్చి అవతారమూర్తియొక్క
చిరునవ్వుతో కూడిన ముఖమండలమును మాత్రమే ధ్యానించటం - అను అభ్యాసమును
ఆశ్రయించాలి.
3. ఆ తరువాత ముఖమండలమునుండి కూడా చిత్తమును ప్రత్యాకర్షింపజేస్తూ భూమిజలము-అగ్ని-వాయువులకు ఉనికిస్థానమైన ఆకాశమునందు ప్రతి క్షేపిస్తూ అభ్యాసం
కొనసాగించాలి. పరమాత్మయొక్క ఆకాశతత్త్వాన్ని ఉపాసిస్తూ ఉండాలి.
4. ఆ తరువాత ఆకాశమునుండి కూడా చిత్తమును వెనుకకు మరలుస్తూ శుద్ధ
బ్రహ్మస్వరూపమును సర్వదా సర్వముగా - సర్వాతీతంగా దర్శించే అభ్యాసమునకు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
121

ఉపక్రమించాలి. అనన్యధ్యానంతో సర్వ అన్యమైన ధ్యాసలను జయించి చిత్తమును
లోకాతీతంగా-దృశ్యాతీతంగా- సమగ్రంగా, పూర్ణభావసమేతంగా తీర్చిదిద్దాలి.
నీవు-నేను-అది-ఇది గుణములు. అంతఃకరణము అంతా పరమాత్మయే. చిత్తము
చిత్ స్వరూపమై సర్వమును తనయందు దర్శించునట్లుగా "కృష్ణా! నీవు కానిదేదీ లేదయ్యా!"
అను భావామృతమునుండి - కృష్ణ చైతన్యమునకు వేరైనదంటూ ఏదీలేదు. నేను
కృష్ణచైతన్యమునే! నేను కానిదేది లేదు కదా! అను గానామృతమును ఆస్వాదించుగాక!
సందర్శించునుగాక! తత్వమ్-సోహమ్ ఏకత్వము పొందిపరిఢవిల్లును గాక!
అట్టి సందర్శనముచే ఆతడు "సమాహిత చిత్తుడు" అని చెప్పబడుచున్నాడు!
అట్టి సమాహితచిత్తుడు .
ఒక జ్యోతియందు మరొకజ్యోతివలె తనయందు సర్వసహజీవులను, ఈ జగత్తును....
పరమాత్మయందు జీవాత్మను, పరమాత్మయే జీవాత్మగాను సమదర్శనమును సర్వదా
ఆస్వాదిస్తున్నాడు!
పరమాత్మలో జీవాత్మను,
జీవత్మ పరమాత్మగాను,
జీవబ్రహైక్యముగాను,
స్వస్వరూపమే సర్వస్వరూపంగాను,
జీవాత్మకు కేవల సాక్షిగాను,
తనను తాను - తనలో తాను తానైన తనను దర్శిస్తాడు. ఆస్వాదిస్తాడు! "ఇదంతా
నాలోని నేనైన నేనే!" అను అనుభూతితో పరవసిస్తాడు.
ఓ ఉద్ధవా! ఈవిధంగా ధ్యానయోగం అను దైనందికమైన అభ్యాసం చేత
పరమాత్మయగు నాయందే మనస్సును లగ్నం చేయి! క్రమంగా ద్రవ్య (Material) -
జ్ఞాన (Knowledge and thought related )- క్రియ (దేహ-మనో-బుద్ధిచర్యలు
కదలికలు) అనే భ్రమలను త్యజించు! ఆధిభౌతిక - ఆధిదైవిక -ఆధ్యాత్మిక భ్రమలను
నీ మనస్సు అధిగమించివేయును గాక! కర్మ-భక్తి-యోగ మార్గాలు "అఖండాత్మత్వాహమ్"
స్ధానమునకే దారితీస్తున్నాయని గమనించు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
122

త్రివిధ భ్రమలను త్యజించిన చిత్తము స్వయంగా - స్వభావసిద్ధంగా పరమాత్మయగు
నాయందు మమేకం కాగలదు! పరమాత్మవే అయి మత్తః పరతరం నాన్యత్ కంచిదస్తి
అని సర్వము నీవై, సర్వసాక్షిగా అయి ప్రకాసించగలవు. నా స్థానమును చేరగలవు.
23. అష్టాదశ సిద్ధులు - నిత్యసిద్ధ పరమాత్మ
శ్రీకృష్ణ భగవానుడు : ఓ ఉద్ధవా! జగదంతర్-బహిర్స్వరూపడనగు నేను సర్వదా సిద్ధ
స్వరూపుడను! ఏ యోగి అయితే ఇంద్రియములను, వాటి విషయములను జయించిన
వాడై (అధిగమించిన దృష్టి కలవాడై) శ్వాసను జయించినవాడై (కదలే శ్వాసకు ఆవల
శ్వాసను కదలించే ప్రాణశక్తితో మమేకత్వము పొందినవాడై) స్థిరచిత్తుడై క్రమంగా
సర్వతత్త్వ స్వరూపము-సర్వతత్త్వ విదూరకము అగు నా తత్త్వమునందు చిత్తమును
నిలుపుతూ వస్తాడో... అట్టి వానిని కొన్ని సిద్ధులు తమంతట తామే ఒక మిత్రుని
సమీపించినట్లుగా ఆశ్రయిస్తూవుంటాయి. అనునది-ఒకానొక జగత్ చమత్కార విశేషము!
ఉద్ధవుడు : హే అచ్యుతా! ఏఏధారణలచేత ఏఏ సిద్ధులు యోగికి సిద్ధిస్తూ వుంటాయో,
అది మీ నుంచి కించిత్ వినాలని ఇప్పుడు అనిపిస్తోంది. యోగులకు సిద్దులను
ప్రసాదించే సిద్ధపురుషడవు నీవే కదా! అందుచేత నీ నుండి యోగ సిద్ధులు - అవి
సిద్ధించటానికి కారణమయ్యే సాధనలు వాటివాటి ప్రయోజనములు చిత్తము
మీయొక్క పరతత్త్వంలో లయించటానికి ఆయా సిద్ధులు ఎంతవరకు అవసరం
ఎంతవరకు ఉపకరిస్తాయి... ఇత్యాది విశేషాలు తెలియజేయవలసినదిగా నా విన్నపం!
శ్రీకృష్ణభగవానుడు : (చిరునవ్వు చిందిస్తూ) ప్రియ ఉద్దవా! మనం ఇంతదాకా
చెప్పుకుంటున్నట్టి చిత్తమును పరతత్త్వ ధ్యానం ద్వారా సర్వభూతాత్మానుభూతియందు
లయింపజేయటానికి నీవు తెలుసుకోవాలనుకుంటున్న సిద్ధులతో పనేమీలేదు.
ఎందుచేతనంటావా! సిద్ధులు దృశ్య సంబంధమైనవి! ఆత్మానందమో... దృక్ స్వరూపధ్యాన
సంబంధమైనది. దృశ్య వాసనా సంబంధమైన సిద్ధులు అనేక సందర్భాలలో
బ్రహ్మజ్ఞానానుభవానికి అడ్డంకులవవచ్చు కూడా!
పై విషయాలను దృష్టిలో పెట్టుకొని, నీవు అడిగావుకాబట్టి చెప్పుతాను. మహదాశయమగు
పరతత్త్వానందమును ఏమరువకుండా ఇప్పుడు సిద్ధులగురించి విను.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
123

యోగశాస్త్ర పారంగతులగు మహనీయులు సిద్ధులను 18 విశేషములుగా విభజించి
శాస్త్రీకరిస్తూ వున్నారు. అందులో 8 సిద్దులు భగవత్ సంబంధమైనవి. స్వాభావికమైనవి!
10 సిద్ధులు సత్త్వగుణమును పెంపొందించుకోవటానికి ఉపకరించేవి! (లేక) గుణ
సంబంధమైనవి.
స్వాభావికమైన అష్ట సిద్ధులు (8)
శ్లో అణిమా మహిమా మూర్తేః లఘిమా ప్రాప్తిరిన్షియైః
ప్రాకామ్యం శ్రుత - దృష్టేషు శక్తి ప్రేరణమీశితా ॥ (అధ్యా 15, శ్లో 4)
I. దేహసంభందమైన సిద్ధులు : 1. అణిమ
(మూర్తి సంబంధమైనవి) 2. మహిమ,
3. లఘిమ,
II. ఇంద్రియముల సబంధమైన సిద్ధులు 4. ప్రాప్తి,
(ఇంద్రియ అధిష్ఠాతృ దేవతలకు సంబంధించినవి)
III. అనుభవ సంబంధమైన సిద్ధులు 5. ప్రాకామ్య
(లౌకిక-పార లౌకిక పదార్థాలు - కోరుకొన్నవి
ఇష్టానుసారం అనుభవంగా పొందటం)
IV తదితరులకు ప్రేరేపణ కలిగించగల సిద్ధి : 6. ఈశ్వితసిద్ధి
V విషయములందు ఉండికూడా వాటియందు ఆసక్తి
లేకపోవటం, గుణములతో అసంగత్వము సిద్ధింపచేసే సిద్ధి 7. వశిత్వసిద్ధి
VI కోరుకున్న సుఖములను సిద్ధింపజేసే సిద్ధి 8. కామావసాయిత సిద్ధి
ఈ 8 సిద్ధులు స్వాభావికములు. నిరతిశయములు.
సత్త్వగుణజాత సిద్ధులు - (ప్రత్యేక సిద్ధులు 10)
అనూర్మిమత్త్వ సిద్ధి ఆకలి - దప్పికల వేగమును జయింప 1.
జేయగల సిద్ధి
దూరశ్రవణ దూరంగా సిద్ధి ఎక్కడో 2. వున్న దృశ్యమును
దూరదర్శన సిద్ధి చూడగల 3. - వినగల సిద్ధులు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
124

మనోజవ మనోవేగంతో 4. సిద్ధి ఇష్టం వచ్చిన :
ప్రదేశమునకు శరీరంతో
వెళ్ళగలిగినట్టి సిద్ధి
5. కామరూప సిద్ధి తాను కోరుకొన్న రూపం ధరించగల సిద్ది
పరకాయప్రవేశన 6. సిద్ది మరొక దేహంలో ప్రవేశించి :
ప్రవర్తించగల సిద్ధి
తానుకోరుకొన్నంత 7. స్వచ్ఛందమృత్యు సిద్ది కాలం వర్తమాన
దేహమును జీవింపజేగలిగినట్టి సిద్ధి
దేవానాం సహక్రీడానుదర్శన సిద్ధి : అప్సరసలతో కూడిన దేవతల 8.
సంచారములను సందర్శించగల సిద్ధి
9. యథా సంకల్ప సిద్ధి ఎట్లా భావనచేస్తే ఆవిధంగానే
సిద్ధించునట్టి సిద్ధి
ఆజ్ఞా అప్రతిహతాఆదేశ సిద్ది: 10. ఇతరులను అప్రతిహతంగా
ఆజ్ఞాపించగల సిద్ధి
ఈ 10 సత్త్వగుణ జాత సిద్ధులు.
ఇవి కాక మరికొన్ని సిద్దులు :
రజో - తమోగుణ సంబంధ సిద్ధులు (5)
జీవుల భూత1. త్రికాలజ్ఞత్వము -భవిష్యత్ వర్తమానములను
:
తెలుసుకోగల సిద్ది
శీత-ఉష్ణాది ద్వంద్వములను భరించగల 2. అద్వంద్వము
సహించగల సిద్ధి
ఇతరుల చిత్తములను ఆలోచనలను 3. పరచిత్తాది అభిజ్ఞతా : క్షుణ్ణంగా
తెలుసుకొని ఉండగల సిద్ధి
4. ప్రతిష్ఠంభ సిద్ధి అగ్ని - సూర్య కిరణములు - విషము మొదలైన
వాటిని నిరోధించగల సిద్ధి
5. అపరాజయ సిద్ధి : ఎదుటివారి బలమును హీనపరచి
తనదయ్యేటట్లుగా పరివర్తింపగల సిద్ధి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
125

ఈ ఐదు రాజసిక తామసిక సిద్ధులు. ఇవి ఇతరులపై కొంతవరకు పెత్తనమునకు
సంబంధించినవి అవటం చేత క్షుద్ర సిద్ధులు అని కూడా చెప్పబడటం జరుగుతోంది!
21. చిత్తముయొక్క ధారణచే సిద్ధులు
యోగధారణచే సిద్ధించగల నామరూప లక్షణములు విన్నావు కదా! చిత్తమును (లేక
మనస్సును) ఆయా విశేషములందు బహుకాలం నిలిపి ఉంచటంచేత ఆ సాధనయోగికి
కాలక్రమంగా ఆయా సిద్ధులు సిద్ధిస్తూ వుంటాయి. ఇప్పుడు ఏ ధారణచే ఏవిధంగా
ఎటువంటి సిద్ధులు కలుగగలవో... ఆ ధారణలగురించి కొన్ని విశేషాలు వివరిస్తున్నాను.
సిద్ధి 15 అధ్యా అణిమ భూత సూక్ష్మాత్మని మయి తన్మాత్రం ధారయేన్మనః
ఆణిమానమవాప్నోతి తన్మాత్రోపాసకో మమ ॥ ( శ్లో 10)
మహిమ మహత్తత్త్వాత్మని మయి యథా సంస్థం మనో దధత్
మహిమానమవాప్నోతి భూతానాం చ పృథక్ పృథక్ ॥ (శ్లో 11)
లఘిమానః పరమాణుమయే చిత్తం భూతానాం మయి రంజయన్
కాల సూక్ష్మార్ధతాం యోగీ లఘిమానమవాప్నుయాత్ (శ్లో 12)
ప్రాప్తిః ధారయన్ మయ్యహంతత్త్వే మనో వైకారికే ఖిలమ్
సర్వేంద్రియాణామాత్మత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మన్మనాః (శ్లో 13)
ప్రాకామ్య మహత్యాత్మని యః సూత్రే ధారయేన్మయి మానసమ్
ప్రాకామ్యం పారమేష్యం మే విన్దతే వ్యక్త జన్మనః (శ్లో 14)
ఈశిత్వ విష్ణా త్ర్యధీశ్వరే చిత్తం ధారయేత్ కాలవిగ్రహే
స ఈశిత్వమవాప్నోతి క్షేత్ర-క్షేత్రజ్ఞ చోదనామ్ (శ్లో 15)
నారాయణే తురీయాఖ్యే భగవచ్ఛబ్ద వశిత్వ శబ్దితే
మనో మయ్యాదధద్యోగీ మద్ధర్మా వశితామియాత్ (శ్లో 16)
నిర్గుణే బ్రహ్మణి మయి ధారయన్ విశదం మనః అకామః
పరమానందమవాప్నోతి యత్ర కామో వసీయతే (శ్లో 17)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
126

అనూర్మిత్వ శ్వేత దీప పతౌ చిత్తం శుద్ధే ధర్మమయేమయి
ధారయన్ శ్వేతతాం యాతి షడూర్మిరహితో నరః (శ్లో 18)
దూరశ్రవణ మయ్యాకాశాత్మని ప్రాణే మనసా ఘోషముద్వహన్
తత్రోపలబ్ధా భూతానాం హంసోవాచః శృణోత్యసౌ (శ్లో 19)
దూరదర్శన చక్షుస్త్వష్టరి సంయోజ్య త్వష్టారమపి చక్షుసి
మాం తత్ర మనసా ధ్యాయన్ విశ్వం పస్యతి దూరతః(శ్లో 20)
మనోజవ మనో మయి సుసంయోజ్య దేహం తదనువాయునా
మధ్ధారణానుభావేన తత్రాత్మా యత్ర వై మనః (శ్లో 21)
కామరూప యదా మన ఉపాదాయ యద్యద్రూపం బుభూషతి
తత్తద్భవేత్ మనోరూపం మద్యోగబలమాశ్రయః (శ్లో 22)
పరకాయప్రవేశ పరకాయం విశన్ సిద్ధ ఆత్మానం తత్రభావయేత్
పిండం హిత్వా విశేత్ ప్రాణో వాయుభూతః షడంఘివత్(శ్లో 23)
బ్రహ్మరంధ్ర పార్హ్యాపీడ్య గుదం ప్రాణం హృదురః కంఠమూర్ధసు
ద్వార ప్రవేశ ఆరోప్య బ్రహ్మరంద్రేణ బ్రహ్మనీత్వోత్ సృజేత్ తనుమ్ (శ్లో 24)
సాత్విక దేవతా విహరిష్యన్ సురాక్రీడే మతం సత్త్వం విభావయేత్
విమానే నోపతిష్ఠంతి సత్త్వ వృత్తిః సురస్త్రియః సందర్శన (శ్లో 25)
సత్యసంకల్ప యుథా సంకల్పయేత్ బుద్ధ్యా యదా వా మత్పరః పుమాన్
మయి సత్యే మనో యుంజం స్తథా తత్సముపాశ్నుతే (శ్లో 26)
అప్రతిహతాజ్ఞ యో వై మద్భావమాపన్న ఈశితుర్వశితుః పుమాన్
సర్వనియామక కుతశ్చిన్న విహన్యేత తస్యచాజ్ఞా యథా మమ (శ్లో 27)
త్రికాలజ్ఞ మద్భక్త్యా శుద్ధసత్త్వస్య యోగినో ధారణా విదః
తస్య త్రైకాలికీ బుద్ధిః జన్మమృత్యుపబృంహితా ॥ (శ్లో 28)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
127

అప్రతిహత అగ్న్యాదిభిః న హన్యేత మునేః యోగమయం వపుః
యథా వజ్ర దేహ మద్యోగశ్రాన్త చిత్తస్య యదసాముదకం (శ్లో 29)
అజేయ మద్విభూతీః అభిధ్యాయన్ శ్రీవత్సాస్త్ర విభూషితాః
అపరాజితః ధ్వజాత పత్ర వ్యజనైః స భవేత్ అపరాజితః (శ్లో 30)
1. అణిమాసిద్ధి : సహజీవుల స్థూలరూపమును మనోదృష్టి పరంగా అధిగమించి,
వారిలోని - మనస్సును (చిత్తమును) మనోతత్త్వమును (లేక) సూక్ష్మరూపమును ఉపాధిగా
ధారణ చేస్తున్న స్వస్వరూప అంతర్యామియగు నన్ను ఉపాసిస్తూ రాగా ఇతరుల కంటికి
కనబడనంత సూక్ష్మరూపమును సిద్దించుకోగల అణిమ సిద్ధిలభిస్తుంది.
అనగా, ఇతరులను భౌతికదేహంగా కాకుండా...., శబ్ద-స్పర్శ –రూప రస-గంధములను
అలంకారప్రాయంగా ఆభరణములవలె ధరిస్తున్న సూక్ష్మదేహధారులుగా సందర్శిస్తూ
రాగా, అణిమాసిద్ధి (అణువంతరూపంగా) భౌతికదేహమును కుదించగల సిద్ధిలభిస్తుంది.
2. మహిమాసిద్ధి : పరమాత్మయొక్క మహదాకృతియే ఈ సమగ్రదృశ్యము... అనురీతిగా
మహదాకృతియందు చిత్తమును అభ్యసింపజేసే యోగాభ్యాసంచేత మహిమ అనే సిద్ది
లభిస్తుంది. సిద్ధి అనగా, అట్టివాడు "దేహాత్ముడను" అను సంకుచిత దేహాత్మ భావనుండి,
"ఈ దృశ్యమంతా నా దేహమే! ఈ సర్వలోకాలు లోకవాసులు... ఇదంతా కూడా
నాయొక్క ఆత్మ మహిమయే..." అనే అనుభవానంద స్థితిని సుస్తిరీకరించుకవడం.
అట్లు అనుకుంటూ ఉండగా.... మహిమాసిద్ధి సిద్ధిస్తోంది. అంతేకాకుండా అద్దానిని
ఆశ్రయించినవారికి అనేకమైనట్టి అవతారపురుషుల మహిమలు కూడా అనుభూతమౌతూ
ఉంటాయి.
3. లఘిమాసిద్ధి : పంచభూతములుగా... వాటి వాటి ధర్మములుగా విరాజిల్లుచున్నట్టి
పరమాణువుల అంతర్యామిగా నన్ను తమ చిత్తమునందు ధ్యానిస్తూ లగ్నంచేసే యోగులకు
స్థూలదేహస్వరూపమును పరమాణునులతో ధారణ చేయగలసిద్ధి లభిస్తోంది. అనగా,
సూక్ష్మపరమాణురూపం ధరించగల సిద్ధిని పొందుచున్నారు. "నేను (లేక నా ఆరాధ్య
దైవం) పంచభూతములయొక్క అణువణువు విస్తరించియున్న - ప్రసరించియున్న
అంతర్యామిని కదా!" అణువులను ఉత్తేజపరరచి దేహానిర్మాణమును ఇంద్రియ
చమత్కారమును ఉత్తేజపరచే పరతత్త్వమే కదా!"... అను ఉపాసనచే ఎక్కడినుండి
ఎక్కడికైనా ప్రయాణించగలడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
128

4. ప్రాప్తిసిద్ధి : సర్వజీవుల అహమ్ స్వరూపంగా పరమాత్మయే ప్రదర్శితమౌతున్నారు...
అను సందర్శనమునందు చిత్తమును నిలుపుచున్న యోగ సాధకులకు క్రమంగా
సర్వేంద్రియములకు అధిష్టానత్వం లభిస్తుంది. సర్వేంద్రియములు, వాటివాటి సర్వ
అనుభవాంతర్గతములు నేను ధరిస్తున్న ఆభరణములువంటివి... అను భావనాక్రమంగా
సర్వదృశ్యమునకు అధిష్ఠానత్వంగా చెప్పబడే ప్రాప్తిసిద్ధి లభిస్తోంది. "మట్టిబొమ్మలన్నిటికీ
మట్టియే అధిష్ఠానమైనట్లు నేనే సర్వదృశ్యములకు అధిష్ఠానమును" ...అను భావనచే
ఏది ప్రాప్తించాలనుకుంటే అది ప్రాప్తించే సిద్ధి లభిస్తోంది. ఆశయమును సిద్ధింపచేసుకొనే
సిద్ది లభించగలదు.
5. ప్రాకామ్యసిద్ధి : పరమాత్మయే అహమన్ను వ్యక్తీకరించే అవ్యక్త - మహదత్వ స్వరూపమై
ఉన్నారు... అను భావనయందు చిత్తమును ఏ యోగులైతే ఏకాగ్రం చేస్తూ సాధన
చేస్తున్నారో.... అట్టివారు నాయొక్క సర్వమును వ్యక్తీరిస్తూ తాను అవ్యక్తంగా
ఉంటూ ఉండే ప్రాకామ్య సిద్ధిని పొందుచున్నారు. ఇదంతా నాయొక్క ఇష్టమును
అనుసరించే సంప్రదర్శితమౌతోంది..... అను సిద్ధిని ప్రాకామ్యసిద్ధిగా చెప్పబడుతోంది.
అతడు ఏది ఇష్టపడతారో, అవన్నీ పొందగలుగుతారు. సహజీవులకు ఆత్మీయులౌతారు.
"ఆత్మయే పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యక్తీకరిస్తోంది"... అను ధారణచే ప్రాకామ్యసిద్ధి
సిద్ధిస్తోంది.
6. ఈశిత్వ సిద్ధి : త్రిగుణమాయ ఎవ్వరియొక్క ఆధీనంలో ఉన్నదో, ఎవ్వరైతే
కాలస్వరూపుడై లీలగా క్రీడిస్తున్నాడో... అట్టి నాయొక్క విష్ణుతత్త్వముపై మనస్సును
లగ్నంచేస్తూ ఉపాసించే యోగి క్రమంగా సర్వజీవులలో ప్రేరణాశక్తి కలిగించే ఈశిత్వము
అనే సిద్ధిని పొందుచున్నాడు. తదితరులను తన వాక్-ఆలోచనలచే ప్రోత్సాహపరచగలఆకర్షించగల- ఉజ్జీవింపజేయగల సిద్ధిని పొందుచున్నాడు. ((Ability to inspire others). ఎవ్వరు ప్రేమతో సమీపిస్తే వారిని కర్మ - భక్తి-జ్ఞాన-యోగ మార్గాలలో ప్రేరణ -
రక్షణ-ఉపశాంతి సంతోషము కలిగించగల సిద్ధి సిద్ధిస్తోంది.
7. వశిత్వసిద్ధి : జాగ్రత్ - స్వప్న- సుషుప్తులకు ఆధారము, తత్ప్రదర్శకుడు, వాటికి
కేవలసాక్షి తురీయము కదా! అట్టి తురీయుడే నారాయణుడు అని పౌరాణికంగా
చెప్పబడుచున్నాడు. ఏ యోగి అయితే తన మనస్సును నారాయణుడు-భగవంతుడు
మొదలైన శబ్దములచే ఉద్దేశ్యించబడేతురీయస్వరూపుడనగు నాయందు లగ్నం చేసి
ఉపాసిస్తూ ఉంటాడో,... అట్టివాడు త్రిగుణాతీత స్వరూపమగు వశిత్వ సిద్ధిని
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
129

పొందుచున్నాడు. గుణములచేత వశుడు కానివాడై ఆసక్తులను జయించినవాడై
వుంటున్నాడు. త్రిగుణములకు, మనో-బుద్ధి-చిత్త-అహంకారాలకు సాక్షిత్వము
వహించటం అభ్యసించుచుండగా వశిత్వము సిద్ధిస్తోంది. త్రిగుణాదులు
ఇంద్రియములు మొదలైనవి వశములో వుండటంచేత మాయను జయించటానికి
సుమార్గమగుచున్నది.
8. అకామసిద్ధి : నాయొక్క నిర్గుణ పరబ్రహ్మతత్త్వము నందు మనస్సును నిలిపి ధారణను
అభ్యసించువాడు సర్వ కామములు నశింపజేసుకొని స్వాభావికమైన అనునిత్య
పరమానంద స్థితిని సిద్ధింప చేసుకుంటున్నాడు. లభించిన లభించని వస్తు
విషయములకు అతీతుడై అకామసిద్ధిని సిద్ధింపజేసుకుంటున్నాడు.
9. సాత్విక సిద్ధి : సత్త్వాత్మ స్వరూపుడునుగా శ్వేతదీప్తునిగా, (శ్వేత ద్వీప పతిగా)
సాత్వికధర్మస్వరూపుడనుగా నన్ను ఉపాసిస్తూ మనస్సును ఏకాగ్రము - లగ్నము చేయు
అభ్యాసం కొనసాగించేవాడు ఆకలి - దప్పికలు షడూర్ములను జయిస్తాడు. శుద్ధ
రూపమును పొందుతాడు. రజో-తమో గుణముల ప్రభావమును జయించివేస్తున్నాడు!
సాత్విక భావాలు - సాత్విక గుణం త్వరత్వరగా స్వభావసిద్ధమగుచున్నది.
10. దూరశ్రవణ సిద్ధి : ఆకాశరూపుడును - శుద్ధ ప్రాణ (శక్తి) స్వరూపుడను అగు
నాయందు బుద్ధిని నిలుపుతూ ఉపాసనకు ఉపక్రమించేవాడు... క్రమంగా అట్టి ఆకాశంలో
అభివ్యక్తమయ్యే ప్రాణుల శబ్దాలను అత్యంత దూరంనుండి కూడా వినగల దూరశ్రవణ
సిద్ధిని పొందుచున్నాడు.
11. దూరదర్శన సిద్ధి : రెండు కళ్ళలో సూర్యమండలమును-సూర్యమండలములో
రెండుకళ్ళను సంయుక్తం చేస్తూ నాపట్ల ధ్యానం కొనసాగించే యోగులు.... దూరంనుంచే
సర్వవస్తువులను - దృశ్యములను సందర్శించగల సిద్ధిని పొందుచున్నారు.
12. మనోజవ సిద్ధి : "నాయొక్క - తదితర సర్వ జీవులయొక్క మనోదేహములు
ప్రాణవాయువులతో సహా పరమాత్మసంప్రదర్శనమే".... అని ధ్యానించువాడు "అనుకున్న
ప్రదేశమునకు క్షణంలో పోవటం".... అను మనోజవ సిద్ధిని పొందుచున్నాడు.
13. కామరూప సిద్ధి : మనస్సును ఒక ఉపకరణంగా పరమాత్మ యందు లగ్నం
చేయువాడు ఆ మనస్సు సహాయంతో తాను కోరుకొన్న భౌతిక రూపమును ధరించగల
కామరూప సిద్ధిని సిద్ధింపజేసుకుంటున్నాడు. అచింత్య శక్తియుతుడనగు నాయందు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
130

(చేతులతో ఒక వస్తువును పట్టుకున్నట్లుగా) తన మనస్సును ఉపాసనారూపంగా లగ్నం
చేయువాడు అట్టి కామరూపసిద్ధి పొందుచున్నాడు. అతడు అనుకున్న రూపముగల
దేహమును ధరించి తదితరులకు దర్శనమీయగలడు.
14. పరకాయ ప్రవేశసిద్ధి : యోగాభ్యాసంచే సర్వదేహములలో వేంచేసియున్న నన్ను
ఏకాగ్రతతో ఉపాసించువాడు తాను అనుకున్నప్పుడు మరొక దేహంలో ప్రవేశించి "ఈ
శరీరములో నేను ఉన్నాను"... అను పరకాయ ప్రవేశసిద్ధిని పొందుచున్నాడు. అట్టివాడు
ప్రాణమును ఒక ఉపకరణమువలె ధారణచేసి వాయు మార్గములో ప్రాణశక్తిని
ప్రయాణింపజేసి మరొక శరీరములో ప్రవేశించి "ఇది నా శరీరమైయుండు గాక! ఈ
దేహమును నేను ఉపకరణంగా ఉపయోగించెదనుగాక!" అను ప్రక్రియను
సిద్ధింపజేసుకోగలడు. ఒక పుష్పమును వదలి మరొక పుష్పముపై వ్రాలు తేనెటీగవలె
ఆతడు ఒక శరీరమును వదలి మరొకరి శరీరమును ధారణ చేయగలడు. ఈవిధంగా
పరకాయప్రవేశ సిద్ధి లభిస్తోంది.
15. బ్రహ్మరంధ్ర ద్వార ఆత్మసంయోగ సిద్ధి : కాలియొక్క మడమచే గుదద్వారమును
నిరోధించి ప్రాణశక్తిని ఊర్ధ్వముఖం చేసే యోగులు క్రమంగా ఆ ప్రాణ శక్తిని
హృదయంలోకి ప్రయాణింపచేస్తున్నారు. మరల ఆ హృదయ స్థానం నుండి శిరోభాగానికి,
శిరస్సుయొక్క ఊర్ధ్వభాగానికి తరలింపజేస్తూ యోగ సాధన చేస్తున్నారు. అటుతరువాత
బ్రహ్మరంధ్రము ద్వారా బ్రహ్మవస్తువునందు ప్రాణశక్తిని విలీనంచేసి దేహమునకు
విషయ ప్రపంచమునకు అతీతులై కేవలం సాక్షిస్వరూపులై సర్వము చిరునవ్వుతో
ఆస్వాదిస్తున్నారు. బ్రహ్మకపాల మోక్ష స్వరూపులై విరాజిల్లుచున్నారు!
16. సత్త్వగుణ దేవతాసందర్శన సిద్ధి : శుద్ధ సాత్విక స్వరూపులు - ఆనంద స్వరూపులు
అగు దేవతల సందర్శనేచ్ఛగల యోగి శుద్ధ సత్వభావన యొక్క అభ్యాసముచే క్రమంగా
శుద్ధ సాత్విక స్వరూపమును సిద్ధించుకుంటున్నాడు. అట్టి యోగసాధన కొనసాగిస్తూ
ఉండగా క్రమంగా సత్వగుణాంశ స్వరూపులగు దేవతా స్త్రీలను ఎదురుగా సందర్శించగల
సిద్ధిని పొందుచున్నాడు. "సర్వులు నా ప్రేమ-స్నేహములకు మాతాశిశు వాత్సల్యములకు
సర్వసందర్భములలోను అర్హులే!" -అను అభ్యాసముచే సత్త్వగుణ దేవతార్హత లభిస్తోంది.
17. సత్యసంకల్ప సిద్ధి : సత్యసంకల్పమయుడనగునాయందు శ్రద్ధతో తన మనస్సును
నిలపటం సర్వమును పరమాత్మ సంకల్పంగా దర్శించటం- అభ్యసించువాడు క్రమంగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
131

సత్యసంకల్పికాగలడు. తాను ఏది సంకల్పిస్తే అది లోకంలో సత్యమై సిద్ధింపజేయగల
సిద్ధిని పొందగలడు.
18. ఆప్రతిహత ఆజ్ఞా సిద్ధి : పరమాత్మనగు నాయొక్క సర్వ నియామకత్వము -
సర్వవశీకరణత్వములతో కూడిన యోగీశ్వరత్వమును ఉపాసించు యోగి క్రమంగా
సర్వమును తన నిర్ణయములకధీనంగా సిద్ధింపజేసుకోగలడు. జంతువులు - మనుష్యులు
తన ఆజ్ఞానువర్తులై ఉండటం అనే ఆజ్ఞాసిద్ధిని పొందగలడు.
19. త్రికాలజ్ఞత్వ సిద్ధి : యోగాభ్యాసంచే నాయొక్క జాగ్రత్-స్వప్న-సుషుప్త సాక్షియగు
స్వరూపమునందు ఎల్లప్పుడు తన మనస్సును నిలిపి ఉంచే యోగసాధకుడు నాపట్ల
భక్తిని పెంపొందించుకోగలడు. తద్వారా నాయొక్క ప్రభావముచే శుద్ధుడు కాగలడు.
అట్టి శుద్ధ బుద్ధిచే ఈ దేహము ముందు- దేహ సమయం-దేహానంతరం... ఏర్పడి
ఉన్న స్థితి గతులను, అందు అంతర్లీనమై నిశ్చలమైయున్న అప్రమేయత్వమును
ఎరుగగలడు. లౌకికమైన భూత-భవిష్యత్-వర్తమానములను, జీవుల తత్త్వమును కూడా
ఎరుగగలడు.
20. అప్రతిహత వజ్రదేహసిద్ధి : పరమాత్మయొక్క పాంచభౌతిక-అతీత్వమును ఉపాసించు
యోగి క్రమంగా భక్తి యోగ సంపన్నుడు - శాంతచిత్తుడు అవుతాడు! వజ్ర దేహసిద్దిని
కూడా పొందుచున్నాడు. అట్టివాని మనో సంకల్పిత భౌతికదేహమును అగ్ని కాల్చలేదు.
నీరు తడుపజాలదు. అగ్నిలోని జీవులను అగ్నికాల్చదు కదా! నీటిలో నివశించే జీవుల
శరీరములను నీరు హానికలిగింపలేదు కదా! అట్లాగే పరతత్త్వ స్వరూపుడనగు నాయందు
భక్తి-ప్రపత్తులు నిలిపి ధ్యానం చేసే యోగి యొక్క శాంత చిత్తమును భక్తి పారవస్యమును
పంచభూతములుగాని, సంగతి-సందర్భములు గాని హాని కలిగించజాలవు. "పరమాత్మ
అనే మహాసముద్రజాలంలో నేను ఒక తరంగమును".... అను రూపంగా ఉపాసించువాడు
పంచభూతములచే హానికలుగని దేహమును పొందటానికి సమర్ధుడౌచున్నాడు.
21. అజేయ సిద్ధి : ఏ యోగి అయితే నాయొక్క ధ్వజము-శంఖము-చక్రము-గదపద్మము, మొదలైన విభూతులతోకూడిన నారాయణ - శ్రీకృష్ణ ఇత్యాది రూపమును ధ్యానం
చేస్తూ వుంటాడో, నాయొక్క త్రిమూర్త్యాది అవతారములలో తనకు ఇష్టమైన రూపమును
ఉపాసనాస్వరూపంగా భావించి ఆరాధిస్తూ వుంటాడో.... ఆతడు సర్వదా తదితరులచే
అజేయత్వము అగు ఆనందస్థితిని ఆస్వాదిస్తూ వుంటాడు. ఆతని ఆనందస్థితిని ఛేదించేది
ఏదీ వర్తమానంలోగానీ, జన్మ జన్మాంతరాలలోగాని ఉండజాలదు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్దవ సంవాదం - అధ్యయన పుష్పము
132

ఓ ఉద్ధవా! ఇప్పుడు నీకు కొన్ని కొన్ని యోగ ధారణల స్థితిగతులేమిటో... అవి సిద్ధింప
జేయగల సిద్ధులు ఏరీతిగా ఉంటాయో విశదీకరిస్తూ వచ్చానుకదా! ఒక్కమాటలో
చెప్పాలంటే ఎవ్వడైతే ఇంద్రియములను జయించి, వాటి వాటి విషయపరంపరలకు
అతీతత్వము సముపార్జించి, ఇంద్రియ-మనో నిగ్రహము కలవాడై శ్వాసనుప్రాణమును-చిత్తమును పరతత్త్వమవైపుగా నియమించి నాయొక్క పరతత్త్వ ధ్యానమును
అభ్యసిస్తాడో - అట్టి వానికి ఈ 14 లోకాలలో అసాధ్యమైనదేదీ ఉండదయ్యా!
మనం ఇప్పుడు చెప్పుకున్న సిద్ధులు - వాటివాటి ప్రయోజనములు ఆత్మానందానుభవము
యొక్క సమక్షంలో చిన్న చిన్న విశేషములే సుమా! ఎవ్వడైతే నాయందు భక్తితో నా
స్వరూపనందమును సముపార్జించుకునే ప్రయత్నంలో ఉంటాడో.... అట్టివాడు ఆయా
సిద్ధులన్నిటినీ "ఇవన్నీ నా పరతత్త్వ చింతనకు, పరమేశ్వర విభూతియందు లయం
పొందటానికి మధ్యేమార్గంలో కలిగే విఘ్నములేకదా!" అను దృష్టితో చూస్తూ వుంటాడు.
పరతత్త్వ ధ్యానం అభ్యసించే వానికి ఇహలోకంలో ఔషధము-తపస్సు-మంత్రము
మొదలైన వాటివలన కలిగే సిద్ధులు తమంతటతామే సమీపిస్తాయి. అయితే-"భక్తిప్రత్తులచే లభించే నా పరతత్త్వ సారూప్యస్థితి సిద్ధులచే లభించేది కాదు" అని గమనించు.
శ్లో॥ సర్వాసామపి సిద్ధీనాం హేతుః పతిః అహం ప్రభుః
అహం యోగస్య సాంఖ్యస్య ధర్మస్య బ్రహ్మవాదినామ్ || (అధ్యా 15, శ్లో 35)
సర్వ యోగములకు, యోగసిద్ధులకు...
సాంఖ్యుల - నిష్కామకర్ముల - బ్రహ్మావాదుల ఆశయములకు...,
ఆశయసిద్ధిని నేనే సుమా! సర్వ జగత్ చమత్కారములకు అంతర్గతుడను, నేనే!
అవన్నీ ఉన్నది నాయందే!
సర్వధర్మములకు చరమస్థానం నేనే!
సర్వజీవులయొక్క ఆత్మ నేనే!
నాయందే సర్వజీవులు సర్వదా స్థానము పొందినవారై ఉన్నారు!
సర్వజీవుల బాహ్య-అభ్యంతరములలో-బాహ్యభ్యంతరములుగా సర్వదా విరాజిల్లుచున్నది
నేనే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
133

సర్వజీవులు నాయొక్క విభూతులే!
అట్టి నాయొక్క స్వస్వరూప విభూతి యోగాన్ని ఆశ్రయించు యోగి నన్నే పొందుచున్నాడు!
ఇక ఆతనికి వేరే సిద్ధులతో పనిఏమున్నది? ప్రయోజనమేమున్నది? అవసరమేమున్నది?
22. భగవత్ విభూతులు - అనాసక్త యోగం
శ్రీఉద్ధవుడు : ఓ దేవదేవా! మీరు ఆద్యంతరహితులు! సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు!
సర్వపదార్థములయొక్క సృష్టి-స్థితి లయములకు కారణస్వరూపులు. సర్వమునకు
ఆస్థానం మీరే! స్వామీ! వేదార్ధములు తెలిసి ఆనందించే మహనీయులలోను, కర్మరహస్యం
తెలిసి ఆచరించు ఉత్తమ కర్మయోగులలోను, దృశ్యతాదాత్మ్యముచే పారవస్యం పొంది
ఉపాధి పరంపరలను పొందుచున్న అజ్ఞానులలోను సమానంగా వేంచేసి ప్రత్యక్షమై
యున్నారు! సర్వజీవుల అనుభవరూపమైన బాహ్య-అభ్యంతరములు మీయొక్క
చమత్కారమే! మీరే!
మహనీయులెందరో మిమ్ములను ఉపాసించి మీ పాదాలు చేరుచున్నారు. హే
మహదాశయ సిద్ధి స్వరూపా! ఇప్పుడు మరొక వివరణకొరకై విన్నవించుకుంటాను.
యోగ-ఉపాసన మార్గంలో అడుగులు వేస్తూ వుండే ఆయా మహానుభావులు మీయొక్క
ఏఏ విభూతులను సాధనగా స్వీకరించి మిమ్ము ఉపాసిస్తున్నారో, అట్టి మీ విభూతి
విశేషములను ప్రవచించవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను.
సర్వజీవులలో వేంచేసి ఉండి, సర్వజీవులకు రక్షకుడవగు ఓ పరంధామా! మీరు
సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నారు. అయితే ఏం? మేము సర్వతత్త్వ స్వరూపుడుగా
ఆస్వాదించలేకపోతున్నాం! మీ మాయకు విమోహితులమై "వీరు అయినవాళ్ళు - వాళ్ళు
కానివారు" ... అని భ్రమిస్తూ సంసారంలో చిక్కుకుంటున్నాం! ఈ రీతిగా సంసారంలో
చిక్కుకున్న మాకు దివ్యౌషధం మీ విభూతులే కదా!
అచింత్యమైన యోగేశ్వరులగు ఓ ఆదిదేవా! ఇక్కడి స్వర్గ - మర్త్య - పాతాళాలలో మీ
చమత్కారముగా అమర్చబడియున్న మీ విభూతులను నాకు సవివరంగా చెప్పండి!
ఏఏ విభూతిని సాధనకొరకై ఆశ్రయించటంచేత మేము సర్వాత్మ స్వరూపమగు మీ
పాదాలు చేరి క్షేమంగా ఉండగలమో... ఆయా విభూతులను గురించి విశదీకరించండి!
శ్రీకృష్ణభగవానుడు : ప్రశ్నించుటలో అత్యంత ప్రావీణ్యంగల ఓ మిత్రమా! ఉద్దవా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
134

కౌరవ- పాండవ సంగ్రామ ప్రారంభంలో నీలాగానే అర్జునుడు నన్ను నాయొక్క త్రిలోక
విభూతులను ఉపాసనకొరకై వివరించవలసినదిగా కోరటం జరిగింది. ఆ యుద్ధ
ప్రారంభంలో, "అయ్యో! నాకు ఈ నా బంధువులను చంపుచున్నానే! బంధుజనులను
చంపిన పాపం నన్ను చుట్టుకోబోతోందే!"... అనే ప్రాకృతిబుద్ధి, భౌతిక దేహ దృష్టి
ఆతని బుద్ధిని ఆవరించటం జరిగింది! "నా బంధువులను చంపి నేను దుఃఖం
పొందనున్నానే!" ... అని భావించి, నేను యుద్ధం చేయలేను! నిన్ను శరణు వేడుచున్నాను!
ఇప్పుడు నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏమిటి?... అని శరణాగతుడై ప్రశ్నించడం
జరిగింది. అప్పుడు నేను యుక్తియుక్తంగా సాంఖ్యయోగం, భక్తియోగం, జ్ఞానయోగం,
శరణాగతి యోగం, ఇత్యాది విశేషాలన్నీ నిర్వచనపూర్వకంగా చెప్పటం జరిగింది. ఆ
సందర్భంలోనే - మూడులోకములలోని నా విభూతులగురించి చెప్పిన విశేషాలు నీ
ప్రశ్నకు సమాధానంగా - కొంత వేరైన వివరణగా - చెప్పుచున్నాను. ఏ ఏ రీతులుగా
నన్ను ఉపాసించటం సానుకూల్యమో విను!
సర్వజీవుల ఆత్మస్వరూపుడను నేను!
సర్వప్రాణులకు హితం చేస్తున్నవాడను!
సర్వ ప్రాణుల బాహ్య-అభ్యంతరములు నాయొక్క విభూతి చమత్కారమే!
సర్వజీవులు జనించింది నాయందే! ఉన్నది నాలోనే! లయిస్తున్నది నాయందే!
ఈ సర్వమునకు సృష్టి-స్థితి-లయమును నేనే!
గతిశీలములైనవాటి కన్నిటికీ గతిని నేనే! (I am the feature of movement in
all moving objects),
ఈ కనపబడే సర్వము కాలముచే జనించి కాలముచే నశించేదేకదా! అట్టి
ఉత్పతి వినాశనములకు కర్తయగు "కాలము" నా స్వరూపమే!
కాలఃకాలుడను, కాల నియామకుడను! |
సర్వ జీవులలో నేనుగా ఉన్నది నేనే! నేను - నీవు - అది - ఇది ఆతడు - |
ఇతడు ఇవన్నీ నేనే!
గుణయుక్తములైన సర్వవస్తువులు పుష్పములుగా గమనిస్తే... ఆ గుణముల
పుష్పమాలకు అంతర్యామిని. సూత్రాత్మను, పూలదండలోని దారమువంటివాడను!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
135

సూక్ష్మ పదార్థములలో సూక్ష్మాత్మను, మహత్ పదార్థములలోని మహదత్వము నేనే!
|
దుర్జయములుగా కనిపించే సర్వవిశేషములకు మనఃస్వరూపుడను నేనే! సర్వుల
మనోరూపము నాయొక్క విభూతియే! నేనే సర్వులలోని మనోరూపుడను!
తెలియబడేదంతా నాస్వరూపమే! తెలుసుకుంటున్నది కూడా నేనే! నేను వేద
స్వరూపుడను. వేదాంత స్వరూపుడను! (I am that what all being known. I
am the knower. I am the witness to the knower)
శాస్త్రరూపములగు వేదములు నా స్వరూపమే! వేదములు అంతిమసారంగా గానం
చేస్తున్నది నా తత్త్వమే! నన్నే! ఆ గానము - గానము చేస్తున్నది కూడా నేనే!
వేదమంత్రములు ప్రతిపాదిస్తున్న ఓం కారస్వరూపము నేనే!
అ ఉ మ { అ self (ఆత్మ) ఉమ ప్రకృతి (Self related) }
-
అక్షరాలలో అ కారము నేనే!
ఛందస్సులలో భర్గో దేవస్య ధీమహి అని అభ్యర్ధనాగాన స్వరూపమగు
త్రిపదాగాయత్రి నాస్వరూపమే!
దేవతలలో ఇంద్రుడను.
అష్టవసువులలో అగ్నిని!
ఆదిత్యులలో విష్ణువును!
ఏకాదశరుద్రులలో నీల లోహితుడను నేనే!
రాజర్షులలో మనువును!
దేవర్షులలో నారదుడను!
ధేనువులలో కామధేనువును!
సిద్ధేశ్వరులలో కపిలమునిని!
పక్షులలో గరుడుడను!
ప్రజాపతులలో దక్షప్రజాపతిని!
పిత్రుగణంలో అర్యముడను!
దైత్యులలో ప్రహ్లాదుడను.
-
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
136

ఆకాశదీపికలలో, నక్షత్రాలలో ఔషధప్రదాతయగు చంద్రుడు నా విభూతియే!
యక్ష - రాక్షసులలో కుబేరుడను!
ఏనుగులలో ఐరావతము నా చిత్కళయే!
జలదేవతాస్వరూపులలో జలచరముల ప్రభువగు వరుణుడను!
తపింపజేస్తూ దీప్తితో వెలుగొందు వస్తువులలో సూర్య గోళమును!
మానవులలో రాజు నా ప్రదర్శనమే! వ్యక్తీకరణమే!
|
అశ్వములలో ఉఛైశ్రవము (దేవతా లోకంలోని అశ్వము) నేనే!
|
ధాతువులలో బంగారమును!
జీవుల దుష్టకర్మల శిక్షకులలో యమధర్మరాజును!
సర్పములలో వాసుకిని!
నాగులలో అనంత నామధేయ ఆదిశేషుడను!
నాలుగు కాళ్ళ - కొమ్ములు కోఱలు మొ॥నవి గల జంతువులలో సింహమును!
ఆశ్రమములలో తుర్యము అనబడే సన్యాసాశ్రమమును!
వర్ణములలో బ్రాహ్మణ వర్ణమును!
|
తీర్థము - నదులలో గంగను!
జలాశయములలో సముద్రమును!
|
ఆయుధములలో ధనుస్సును!
ధనుర్ధాదులలో త్రిపురసంహారియగు ఆదిశంకరుడను నేను!
స్థానములలో మేరు పర్వతమును!
పర్వతములలో హిమాలయ పర్వతమును!
వృక్షములలో రావివృక్షమును!
ఓషధములలో ధాన్యమును!
పురోహితులలో వసిష్ఠ మహర్షిని! |
బ్రహ్మజ్ఞానులలో బృహస్పతిని!
|
సేనాపతులలో కార్తికేయుడను!
|
అగ్రగణ్యులలో భగవంతుడగు బ్రహ్మదేవుడను! సృష్టిభావ కవిని!
|
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
137

యజ్ఞములలో "సర్వము బ్రహ్మమే" అను సాధనా ద్రవ్యముతో కూడిన
బ్రహ్మయజ్ఞమును!
వ్రతములలో అహింసావ్రతమును!
పరిశుద్ధము చేయు సాధనములలో వాయువు - అగ్ని - జలము - వాక్కు నేనే! -
అష్టాంగయోగములలో ఆత్మ సంయమయోగమును!
మంత్రద్రష్టలలోని మంత్ర మననము నేనే!
కౌశలములలో "దృశ్యమును ఆత్మగా దర్శించు అన్వీక్షికీ కౌశలము" ను!
ఖ్యాతి వేదులలో వికల్పస్వరూపము నేనే!
(ఖ్యాతి - ఆత్మ జగత్తుగా కనిపించటం అనే చమత్కారము ఎరిగినవారు)
స్త్రీలలో శతరూపను. పురుషులలో స్వాయంభువన మనువును!
మునులలో నారాయణుడను!
బ్రహ్మచారులలో సనత్కుమారుడను!
ధర్మములలో ఇంద్రియ - మనో - బుద్ధి - చిత్త- జీవ సాక్షి ధర్మమును
విశదీకరించు కర్మసన్యాస యోగమును! అభయప్రదాన ధర్మస్వరూపుడను నేనే!
క్షేమములలో అంతరంగ సంస్థాపనా క్షేమమును! అంతర హృదయములో ప్రత్యక్షమై
యుండే ఆత్మానుభవమును! అబహిరనుభవమును! (I am the inner devine
sense).
రహస్యములలో పరమసత్యమును నేనే! సూనృతం అహమేవ! ప్రియవచన
స్వరూపుడను. (I am the sweet and enjoyable words and verses)
రూపములలో మౌనరూపమును!
మిధునములలో ప్రజాపతిని! అజుడను!
మార్పు-చేర్పులకు అతీతమైన - అప్రమత్త పదార్ధములలో సంవత్సరము అనునది నేనే!
ఋతువులలో వసంత ఋతువును.
మాసములలో మార్గశీర్షమును
నక్షత్రములలో అభిజిత్ నక్షత్రమును!
యుగములలో కృతయుగమును!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
138

ధీరులలో దేవలుడను, అసితుడను!
|
వేదవిభాగులలో ద్వైపాయనుడను. (వ్యాసమహర్షిని)
కవులలో కావ్య స్వరూపుడను!
పండితులలో, వివేకవంతులలో శుక్రాచార్యుడను!
భగవత్ ప్రదర్శనములలో వాసుదేవుడను!
భాగవత శ్రేష్ఠులలో ఉద్దవుడను! (నీవే నేను)!
కింపురుషులలో హనుమంతుడను!
విద్యాధరులలో సుదర్శనుడను నేనే!
రత్నములలో పద్మరాగమును.
సౌందర్యముతో కూడిన పదార్థములలో పద్మకోశమును!
దర్భజాతులలో కుశమును!
హవ్యములలో ఆవునెయ్యిని!
పరిశ్రమించు వారిలో శ్రమశక్తి స్వరూపిణియగు లక్ష్మిని నేనే!
కపట విశేషములలో ద్యూతమును!
కష్టములు అనుభవించువారిలో సహనమును, తితీక్షను నేనే!
సాత్వికులలోని సత్త్వగుణమును. ||||
బలవంతులలోని ఉత్సాహం, పరాక్రమం, సాహసం నేనే!
సాత్వికులలోని సాత్విక ప్రదర్శనం నేనే!
నవ విధ సాత్వతమూర్తులలో ఆదిమూర్తియగు వాసుదేవుడను నేనే.
(నవమూర్తులు వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు,
నారాయణుడు, హయగ్రీవుడు, వరాహుడు, నృశింహుడు, బ్రహ్మ)
గంధ్వరులలో విశ్వావసుడను!
అప్సరసలలో పూర్వచిత్తిని!
భూతత్వంలో స్థైర్యమును.
పృధివిలోని గంధతన్మాత్రను!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
139

జలములో రుచి దాహక స్వాంతనము - జీవపోషకము నేనే!
తోజోమయ వస్తువులలో సూర్యగోళమును!
సూర్యచంద్ర - నక్షత్రములలో తేజస్సు - ప్రభ నేనే!
ఆకాశంలోని శబ్దతత్వము నేనే!
బ్రాహ్మణ భక్తులలో విరోచనపుత్రుడగు వైరోచనుడను (బలిచక్రవర్తిని).
వీరాధివీరులలో అర్జునుడను. |
ప్రతిప్రాణియొక్క ఉత్పత్తి - ఉనికి - వినాశనము నా యొక్క చమత్కారమే!
పాదాలలో దాగి ఉండి ప్రదర్శితమగుచున్న గమనశక్తి నేనే!
నోటియొక్క మాట్లాడేశక్తి, విసర్జనేంద్రియములలో విసర్జనశక్తి, చేతులలోని
|
గ్రహణశక్తి, జననేంద్రియములోని ఆనందభోగ శక్తి, చర్మముయొక్క స్పర్శశక్తి,
కళ్ళలోని చూపుశక్తి, ముక్కుయొక్క ఆఘ్రాణశక్తి నేనే! నా విన్యాసమే! అస్మత్
కళా సంప్రదర్శనమే!
పంచభూతములగు పృథివి - వాయువు ఆకాశము జలము అగ్నిగా
కనిపించే పంచభూతములు నేనే! పంచ మహాభూతములు నా ప్రదర్శనమే!
అహంకారము, మహత్తత్త్వము, ప్రకృతి, పురుషుడు, సత్త్వరజస్తమోగుణములు,
మనోబుద్ధి చిత్రాలు, సర్వపదార్థాల పరిగణము, జ్ఞానము, వాటి ఫలస్వరూపమైన
తత్త్వనిర్ణయమును, పరబ్రహ్మము కూడా నేనే!
ఈ సర్వ నామరూపములుగా విస్తరించి యుండి, సర్వజీవుల అంతర్భహి
స్వరూపంగా సర్వజీవులకు అనుభవమగుచున్నట్టి ఈశ్వరుడను - సర్వేశ్వరుడను
కూడా నేనే! సర్వాంతర్యామిని, సర్వప్రదర్శన విన్యాసమును నేనేనయ్యా!
నేనే జీవుడను! నేనే గుణములు! నేనే గుణిని! క్షేత్రజ్ఞుడను - సర్వాత్మకుడను
కూడా నేనే! నేను కానిదంటూ మరెక్కడా ఏదీ లేనే లేదు!
పరమాణు సంఖ్యాస్వరూపుడను, అసంఖ్యా స్వరూపుడను స్వరూపుడను -
కాల-క్రియా తత్త్వమును నేనే!
అయినప్పటికీ అసంఖ్యములగు బ్రహ్మాండములను సృష్టించు నా విభూతులను
నేనే లెక్కించి చెప్పజాలను!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్దవ సంవాదం - అధ్యయన పుష్పము
140

సర్వవస్తువులలోని - జీవులలోని తేజస్సు - శ్రీ - కీర్తి - పరాక్రమము - ఓర్పు
| | -
- నేర్పు - విజ్ఞానము... మొదలైనవన్నీ నా అంశలే!
నీవు - నీ సందర్శనము-ఉభయము నేనే సుమా!
ఓ ఉద్ధవా! నాయొక్క విభూతులను ఈవిధంగా సంక్షిప్తంగా వర్ణించి చెప్పాను!
అయితే ఒక్క విషయం గుర్తుంచుకో!
ఈ దృశ్యములో కనిపించే అజ్ఞాన-సాంసారిక సంగతులు - సందర్భములు - సంఘటనలు
మొదలైనవన్నీ పరమార్ధవస్తువులు కావు! అవన్నీ మనస్సుయొక్క వికార చమత్కారములే!
వాక్కుకు మాత్రమే విషయములు - కల్పితములు సుమా! ఆకాశంలో సరస్సువలె ఊహా
చమత్కారములు! కాబట్టి ఈ దృశ్యపదార్ధములపట్ల అభినివేశము కలిగి ఉండటం
అనుచితం!
నాటకంలో నటించేవాడు తన పాత్రయొక్క సుఖ - దుఃఖాలు, ప్రేమ-ద్వేషాలు తనవేనని
అనుకోడుగా! తనవిగా ప్రేక్షకులకు భ్రమింపజేయటం మాత్రమేచేస్తాడు కదా!
జగత్తులో సందర్భానుచితంగా (సందర్భములను అనుసరించి) వుంటూనే
సందర్భములకు అతీతుడవై వుండటం అభ్యసించు.
అందుచేత ఓ ఉద్ధవా! నీవు మొట్టమొదటే వాక్కును - మనస్సును - ప్రాణములను
ఇంద్రియములను సంయమనం చేసే ప్రయత్నంలో ఉండు! అనగా, ఆమూడింటిని
శాస్త్రములు, పెద్దలు సూచిస్తున్న సాధనా విధానములందు నియమించి బుద్ధిని సత్త్వ
సంపన్నం చేసి తద్వారా బుద్ధి సంయమనం సముపార్జించు. సర్వము నాస్వరూపంగా
సందర్శించు. అప్పుడిక సంసారమార్గంలో పడవలసిన అవసరం నీకుండదు! నీవు
పడవు!
సంయమనముతో సాత్వికమై కూడిన బుద్ధితో వాక్-మనస్సులను పరిశుద్ధ
పరచుకుంటూ సర్వమునకు కేవలసాక్షిత్వము అవధరించి ఉచితానుచితానుసారంగా
కర్మ-ధర్మములను నిర్వర్తించుచూ ఉండటం అలవరచుకో! క్రమంగా వ్రతములు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
141

తపస్సు మొదలైన సాధనలన్నీ-భక్తిని ప్రవృద్ధపరుస్తూ - ఎప్పుడో పచ్చికుండలో పోసి
ఉంచిన నీరువలె తమంతట తామే ఇగిరిపోగలవు!
సర్వకాల - సర్వావస్థలలో పరాప్రేమతో కూడినవాడవై నాకు భక్తుడవైవుండు.
భక్తియోగంచే బుద్ధి-వాక్కు-మనస్సు సంయమింపజేయటం సులభమే! సాధ్యమే!
అందుచేత నిరుత్సాహం వదలిపెట్టు.
సంయమముచే (చంచలత్వాన్ని అధిగమిస్తూ వుండగా) కృతకృత్యుడవు కాగలవు! నీ
త్రోవలో - మార్గములో సర్వ సందర్భములలో తోడుగా నేను సర్వదా ఉండియే ఉన్నాను!
ఉండియే ఉంటాను! ఉండి తీరుతాను. కాస్త యోచన-శ్రద్ధలతో-సాధనలకు
ఉపక్రమించు. భక్తి-యోగ-సాధన మార్గములలో తోడుగా వుండటమే ఈ నా
అవతారము యొక్క ముఖ్యోద్దేశ్యం.
23. మార్గములు : స్వకర్మ - ధర్మము - జ్ఞానము
శ్రీ ఉద్ధవుడు : స్వామీ! శ్రీకృష్ణా! సర్వాంతర్యామివి, సర్వప్రదర్శన స్వరూపడవు అగు
నీపట్ల ఏకాగ్రమైన ధ్యాస ధ్యానం నిర్వర్తించటం గురించి చెప్పుతూ వస్తున్నారు! ఏకాగ్రత
లభించాలంటే భక్తిని పెంపొందించుకోవాలని మీ వాక్యానుసారం గ్రహించాను! వర్ణాశ్ర
ధర్మములు పాటించేవారికి పాటించనివారికి కూడా భక్తి శ్రేయోమార్గమైయున్నదని
మీ మాటలననుసరించి గ్రహించాను!
భక్తిచే నీపట్ల ధ్యాస లభిస్తుంది. అయితే, భక్తి ప్రవృద్ధం కావాలంటే ధర్మాచరణ (లేక)
కర్మాచరణ ఉపాయం కదా!
ధర్మాచరణ పూర్వకమై కర్మచేత భక్తి - భక్తిచేత దృఢమైన భగవత్ ధ్యాస - అట్టి భాగవత
ధ్యాసచే పరమాత్మ లభిస్తాయని నేను మీ ప్రవచనం ద్వారా గమనిస్తూ వస్తున్నాను.
ఇప్పుడు కర్మవిషయకమైన ధర్మాచరణ ఎట్లూ వివరించబడిందో, నిర్దేశించబడిందో...
మీనుంచి వినాలని ఉన్నది. ఓ మాధవా! ఒకప్పుడు మీరు హంసరూపంలో బ్రహ్మదేవుని
ముందు ప్రత్యక్షమై జీవుల శ్రేయస్సు కోరి వర్ణాశ్రమాలు - ఆశ్రమ ధర్మాలు - సర్వమానవ
ధర్మాలు.... వివరించి చెప్పటం జరిగిందని నేను పెద్దల ద్వారా విని ఉన్నాను.
పరమధర్మము గురించి కూడా చెప్పడం జరిగిందట! మీరు చెప్పిన ఆశ్రమధర్మాలు
కర్మను అనుష్ఠాన పూర్వకంగా నిర్వర్తించటం మొదలైన విశేషాలు చాలాకాలం గడచుటచే
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
142

జనులు ఏమరచి కర్మలకు బద్ధులగుచున్నారని, ఆ కారణంగా ఈభూలోకం
నష్టప్రాయమైనదని అనుకోగా కూడా వింటూ ఉంటాము. పునరుద్ధరించటమే మీ
అవతరాముయొక్క ముఖ్యోద్దేశ్యమని వసుదేవుడు -మొదలైన పెద్దలు చెప్పగా విన్నాను.
ఓ అచ్యుతా! కర్మ-ధర్మము అను శబ్దములకు గల సశాస్త్రీయమైన నిగూడార్ధం
వివరించగలిగినవారు మీతో సమానమైనవారు ఎవ్వరు? ఎవ్వరూ లేరు!
మీరు ధర్మస్వరూపులు! ధర్మమునకు ప్రవర్తకులు! ధర్మరక్షకులు! ధర్మనిర్దేశకులు! మీరు
అవతారం చాలించిన తరువాత మాకు ధర్మవిశేషాలు ఎవరు బోధించగలరు చెప్పండి!
అందుచేత ఓ సర్వధర్మజ్ఞా! ఈ సందర్భంలో మాకు ధర్మాలు - ధర్మ రక్షణ - ధర్మనిరతి
- మీ పాదలకు త్రోవతీయగల భక్తి యోగం మొదలైనవాటి గురించి మరొక్కసారి ఇప్పుడు
వివరించండి!
శ్రీ శుక మహర్షి : ఓ పరీక్షన్మహారాజా! ఆవిధంగా ధర్మవిషయం గురించి ఉద్ధవుడు
ప్రశ్నించగా,... సర్వ జీవులను మోహింపజేసే చిరునవ్వు చిందిస్తూ..... శ్రీకృష్ణభగవానుడు
ఇట్లా సమాధానం ప్రసాదించ సాగారు.
శ్రీకృష్ణభగవానుడు : ఓ మిత్రమా! ధర్మవిశేషము గురించి నీవు అడిగిన ప్రశ్న సముచితము.
మానవుడు స్వధర్మగురించి, వర్ణాశ్రమ ధర్మాల ప్రాముఖ్యత గురించి, ధర్మనిరతిని
ఏమరచటంచేత వచ్చే దుష్ప్రయోజనముల గురించి చక్కగా వివరణ పూర్వకంగా ఎరిగి
ఉండటం అత్యంతావస్యకం! ధర్మనిరతిచేత భక్తి సుదృఢమౌతుంది సుమా!
కృతయుగం :మొట్టమొదటిదైన కృతయుగారంభంలో "హంస" అను (సర్వము
పరతత్త్వమే... అను శబ్దార్ధంతోకూడిన) వర్ణము ఒక్కటే ఉండేది! అప్పుడు అట్టి
సమయంలో జనులు జన్మతః అనన్యభక్తి పారాయణులై వుండేవారు! జగత్తును
ఈశ్వరభావంతో ఉపాసిస్తూ - అనన్యభక్తిచే సాధకులు అతిత్వరగా కృతకృత్యులయ్యేవారు.
హంసయోగపారాయణం లోకప్రసిద్ధమై ఉండేది.
హంసయోగం - సోహమ్ ఈ చరాచర సృష్టి ఆత్మయొక్క ప్రతిబింబ
రూపమే!ఇహ స్వరూపానుభవమంతా
స్వస్వరూపాత్మయొక్క క్రీడావినోద
లీలా చమత్కారమే... అనే దృష్టి ఎఱుక -జ్ఞప్తి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
143

జనులు హంసయోగంచే కృతకృత్యులయ్యేవారు కాబట్టి "కృతయుగము" అని కాలశాస్త్ర
వేదులచే పేరుపెట్టబడింది! కృతయుగంలో వేదము ప్రణవాత్మకంగా అనుభవమయ్యేది.
అనగా....,
తెలియబడేదంతా (వేదము).... ఆత్మౌపమ్యేవ సర్వత్రా - ఆత్మైవమిదగ్ం సర్వమ్
అను అనుభూతిగా ఆస్వాదించబడేది.
అట్టి కృతయుగంలో ధర్మస్వరూపుడనైన నేను నాలుగు పాదములతో ఆనందంగా గోవునై
సృష్టియందు సంచారాలు చేస్తూ వుండేవాడను!
నా ధర్మధేను స్వరూపం యొక్క నాలుగు పాదములు....,
1. సత్యము
2. దయ
3. శౌచము
4. తపస్సు
ఈ నాలుగు పాదములతో జీవులకు ముక్తిని ప్రసాదిస్తూ వుండేవాడను! తపోనిష్ఠులై
మహనీయులు ఈ జగత్తును నాయొక్క విశుద్ధ హంసరూపముగా ధ్యానిస్తూ ఉండేవారు.
తరువాత త్రేతాయుగం!
త్రేతాయుగంలో నా ప్రాణశక్తి - హృదయములనుండి ఋక్వేదం (మంత్రం), యజుర్వేదం
(తంత్రం) సామవేదం (గానం) అనే 3 వేదములు ఆవిర్భవించటం జరిగింది. అదే
త్రయీవిద్య అట్టి త్రయీవిద్యగా
ఋక్ నుండి హౌత్ర (మంత్రములు, మంత్రపూర్వక దేవతాహ్వానములు)
యజుర్ నుండి అధ్వర్యవ (యజ్ఞవిధానాలు)
సామ నుండి ఔద్దాత్రము (గానము / స్తోత్రములు)
అను మూడు విధములైన యజ్ఞరూపములను నేను ధరించటం జరుగుతోంది. ప్రతి
యజ్ఞములోను, కార్యక్రమములోను ఈ మూడు ఉంటూనే ఉంటాయి.
నాయొక్క విరాట్ రూపధారణ నుండి స్వధర్మము అనే ఒకానొక ధర్మతత్త్వము సృష్టి
చమత్కారము కొరకై బయల్వెడలింది! అట్టి స్వధర్మ లక్షణయుక్తములకై సృష్టియొక్క
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
144

లీలా వినోదము కొరకై చతుర్విధ (4 రకములైన) స్వధర్మ నిరతులు బయల్వెడటం
జరిగింది!
నా విరాట్ పురుష - ధర్మదేవతా చమత్కారము యొక్క....
ముఖమునుండి విప్రజన స్వధర్ములు (శాస్త్ర పారంగతులు శాస్త్రార్ధ నిరతులు)
....
బాహువుల నుండి ....... క్షత్రియజన స్వధర్ములు (శౌర్య - ధైర్య - పరాక్రమ నిరతులు)
ఊరువులు (తొడలనుండి)....వైశ్యజన స్వధర్ములు (కృషి-గో రక్షణ నిరతులు)
పాదముల నుండి .... శూద్ర స్వధర్మ నిరతులు (సేవానిరతి గల స్వధర్మ నిరతులు)
బయల్వెడలుచున్నారు. నాలుగువిధములైన స్వధర్మోపాసనలు చాతుర్వర్ణ్యములుగా
గణుతికెక్కాయి.
ఈ నలుగురు స్వధర్మనిరతులు. సృష్టికి నాలు స్థంభాలవంటివారు!
ఆపై...,
నా విరాట్ రూపం నుండి 4 ఆశ్రమాలు బయల్వెడలాయి.
మోకాళ్ళ (జఘన) ప్రదేశం నుండి చాతుర్వర్ణ్య ప్రియులకు గృహస్థాశ్రమం
హృదయం నుండి బ్రహ్మతత్త్వోపాసకులగు నైష్ఠిక బ్రహ్మచర్యాశ్రమం
వక్షస్థలం నుండి .... వనవాసప్రియులగు వానప్రస్థాశ్రమం
నుదురు (మస్తకము) నుండి .. సన్యాసాశ్రమం
వివిధములైన గుణసంపన్నులగు ముముక్షువులగు సాధక జనుల సానుకూల్యత కొరకై
పైన చెప్పిన నాలుగు ఆశ్రమములు సంకల్పించబడ్డాయి.
ఈ నాలుగు ఆశ్రమాలలో కూడా ఆయా మానవుల స్వభావమును అనుసరించి ఉత్తములు
- మధ్యములు - అధములు అగువారు (నాలుగు ఆశ్రమాలలో) వుంటూ వుండటం
జరుగుతోంది. (బాగా చదువుపట్ల శ్రద్ధగలవారు ఒక మాదిరైన శ్రద్ధగలవారు - -
శ్రద్ధ ఇంకా ఏర్పడనివారు ఉన్నట్లే అదికూడా!) అదంతా కూడా నానుండి బయల్వెడలినట్టి
ప్రకృతియొక్క దివ్య ప్రదర్శనా చమత్కారమే! జగన్నాటక కథారచనా కళా విన్యాసమే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
145

1. బ్రాహ్మణ స్వధర్ముల స్వాభావిక లక్షణాలు :
శమము (మనోనిగ్రహం)
దమము (ఇంద్రియ నిగ్రహం)
తపస్సు భగవత్ విశేషముల పట్ల - సాధనలపట్ల తపనతో
కూడిన యత్నము చేయు స్వభావము
శౌచము శుచి అయిన భావాలు - అంతా భగవత్ ప్రసాదము -
భగవత్ సంకల్పము అను అభిప్రాయముతో కూడిన భావన
సంతోషము పొందుచున్న దానిని గమనిస్తూ సంతోషము - తృప్తితో
కూడిన అవగాహన పెంపొందించుకోవటం
క్షాంతి "కష్ట సుఖములు సాధనలో విభాగాలు"... అను
ఉత్తమ అవగాహనతో (బ్రాహ్మీ) దృష్టిని
పెంపొందించుకొంటూ ఓర్పు వహించి ఉండటం!
ఆర్జవమ్ మనస్సు - వాక్కు - కాయము వివిధంగా కాకుండా
|
ఏకత్వం కలిగినవై ఉంచుకోవటం. వంకర - టింకర
దృష్టులను దరిజేరకుండా చూచుకొంటూ ఉండటం.
త్రికరణశుద్ధిని అభ్యసిస్తూ వుండటం.
పరాప్రేమను పెంపొందించుకుంటూ వుండటం.
దయ తాను ఇష్ట దైవం నుండి ఏ దయ కోరుకుంటాడో అట్టి
దయ సహజీవులపట్ల కలిగి ఉండటం
ఇతరుల కష్టములు తనవైనట్లుగా భావించి తాను
చేయగలిగినదేదో .... అది యోచనచేస్తూ వుండటం!
సత్ప్రయత్నశీలుడవటం!
సత్యం సర్వ జీవులలోని నిత్యమైన సత్యమును ఆశ్రయిస్తూ
సందర్శిస్తూ అవలంబిస్తూ - ఆరాధిస్తూ ఉండటం
బ్రాహ్మణ వర్ణ ధర్మములు బ్రాహ్మణ స్వధర్మ నిరతులకు స్వభావసిద్ధంగా సాధనములు
అగుచున్నాయి. అవి పెంపొందింపబడుచూ వారిచే అభ్యసించబడుతూ ఉంటాయి!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
146

2. క్షత్రియ స్వధర్ముల స్వాభావిక లక్షణాలు :
తేజస్సు విషయములను సత్యదృష్టితో - పవిత్రదృష్టితో ఆకళింపు
చేసుకొనే వివేకకాంతి పుంజములతో వెలుగొందుతూ
వుండటం! తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటారు.
దేహబలము -మనో-బుద్ధి బల సంపన్నతను
పెంపొందించుకుంటూ ఉంటారు!
ధృతిః ధైర్య - స్థైర్య సంపన్నులై వుంటారు.
|
శౌర్యం శౌర్యము కలవారై సమస్యలను సమర్థతతో ఎదుర్కొనే
|
ఉత్సాహము-సాహసము వృద్ధి చేసుకుంటూ వుంటారు.
తితిక్ష సహనము, ఓర్పు అలవరచుకొంటున్న వారై వుంటారు.
ఔదార్యము తదితరులపట్ల త్యాగనిరతి కలవారై వుంటారు! ఉదారులై
వుంటారు! "నేను తదితరుల సుఖ - శాంతి - సంతోషముల
కొరకై ఏమి చేయగలనా?" -అనియోచన చేస్తూ వుంటారు.
ఉద్యమః ఏదైనా కార్యక్రమం ప్రారంభించటానికి, నిర్వహించటానికి,
నిర్వర్తించటానికి ఉత్సాహముతో సంసిద్ధులై వుంటారు. సదా
ఉద్యమించే శక్తి సంపన్నులై ఉంటారు!
బ్రహ్మణ్యం బ్రహ్మజ్ఞానులను సేవించి తద్వారా లోకహితైషిత్వము
కలిగియున్నవారై ఉంటారు!
3. వైశ్య స్వధర్ముల స్వాభావిక లక్షణాలు :
ఆస్తిక్యము పరమాత్మయొక్క సర్వతత్త్వస్వరూపము పట్ల బుద్ధి -
చిత్తములను పెంపొందించుకుంటూ వుంటారు.
దాన - ధర్మములు దానము నిర్వర్తించే శ్రద్ధ - అభ్యాసము -
పెంపొందించుకుంటూ వుంటారు.
శాస్త్రములచే చెప్పబడే నిష్ఠ కార్యక్రమములపట్ల "నిర్వర్తించాలి"
అనే నియమము - నిష్ఠ కలిగియున్నవారై ఉంటారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
147

అదంభము గర్వము - దర్పము - దంభములను త్యజిస్తూ అణకువప్రతిపత్తి శరణాగతితో కూడిన భావములు కలవారై
ఉంటారు.
బ్రహ్మసేవనం బ్రహ్మజ్ఞులు - వేదజ్ఞులపట్ల సేవాభావం కలిగినవారై
ఉంటారు.
అతుష్ఠిరర్ధో ఉపచయేత్ సంపదలను పెంపొందించే ఉత్సాహముతోకూడి ఉంటారు.
4. శూద్ర స్వధర్మ స్వభావులు
శుశ్రూషణం అమాయయా - దేవ - గురు - బ్రాహ్మణునులు మొదలైనవారిపట్ల
- నిష్కపట సేవానిరతి కలిగి ఉంటారు. నిస్వార్థ తత్ర-లబ్దే సంతోషః - సేవించి, తద్వారా లభించిన దానితో సంతృప్తులై జీవిస్తూ
ఉంటారు.
అంత్యజ స్వధర్మ స్వభావులు (Negative Features)
ఓ ఉద్ధవా! వీరు బ్రాహ్మణ - క్షత్రియ-వైస్య - శూద్ర స్వధర్మ నిరతిని ఏమరిచినవారు
సుమా!
శ్లో అశౌచమ్ అనృతం స్తేయం నాస్తిక్యం శుష్క విగ్రహః
కామ క్రోధశ్చ తర్షశ్చ స్వభావోఅనేవ సాయినామ్ (అధ్యా 17, శ్లో 20)
అశౌచము దోషములను ఆపాదించి - అశుభమైన భావములతో
జగద్దర్శనం చేస్తూ ఉంటారు.
అనృతము అసత్యమును సత్యమైనవాటి వలె ఆశ్రయించి రోజులు
గడుపుతారు!
స్తేయం ఇతరుల సంపదలను దొంగిలించాలని, పొందాలని |
ఆవేశము పెంపొందించుకొంటూ ఉంటారు. దొంగిలిస్తే
తప్పేమున్నది? దొంగలెంతమంది లేరు?... ఇటువంటి
దుష్ట వివేకము పెంపొందించుకొని వుంటాడు.
నాస్తిక్యం సమస్తము ప్రసాదిస్తూ - పరిరక్షిస్తున్న పరమాత్మయొక్క
ఉనికినే ప్రశ్నిస్తూ ఉంటారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
148

శుషవిగ్రహులు వృథాగా సరిఅయిన కారణంలేకయే కలహము
శతృత్వము ప్రదర్శించువారు
కామము "ఇంకా ఇంకా ఏదో కావాలి! ఇంకేదో పొందాలి!"... అనే
తపనతో కాలం గడుపుతూ వుంటారు. అసంతృప్తితో
అనుక్షణం అలమటిస్తూ ఉంటారు.
క్రోథము ఇతరుల తప్పులను మననము చేస్తూ.... ఇతరులపై కోపము
|
- క్రోధము వదలనివారై ఉంటారు!
తర్షము ఇంద్రియ విషయములపట్ల సదా మననము
పెంపొందించుకుంటూ ఉంటారు.
ఇవి లక్షణములుగా గలవారు మానవులలో కింద తరగతివారు. అధములుగా
చెప్పబడువారు.. మానవ జన్మను వారు సద్వినియోగ పరచుకోకపోగా దుర్వినియోగ
పరచుకుంటున్నారు.
చాతుర్వర్ణ్యములు అనుసరణీయమైన ధర్మములు.
పంచమ స్వభావము త్యజించవలసిన మార్గం.
మిత్రమా! ఇప్పుడు సర్వమానవులకు అనుసరణీయము - సుసాధ్యము - ఆవస్యకము
అయిన సమానధర్మాలు కొన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాను విను. ఇది 4 రకాల (common features) స్వధర్ములు తప్పక ఆచరించాలి.
అహింస ఇతరులను శారీరకంగాగాని, మానసికంగా గానీ బాధించక
పోవటం
సత్యము సత్యమును-ఆశయంగా కలిగివుండటం, దర్శించటం, |
ఆశ్రయించటం, పలకటం "యమ్ సత్ - ఏదైతే
పరమసత్యమో" అను అన్వేషణ కలిగి ఉండటం
అస్తేయం ఇతరుల సంపదలను దొంగిలించాలనే చొరబుద్ధి
లేకుండటం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
149

అక్రోధం ఎవ్వరిపట్లా కూడా క్రోధము, తత్సంబంధమైన ఆవేశము
త్యజించటం రహితం చేసుకోవటం
అలోభం నాది నాకే వుండాలి! మరెవ్వరితోనూ పంచుకోను.... అనే
లోభబుద్ధిని త్యజించి ఉండటం!
భూతప్రీతి సహజీవులకు ప్రీతి - సంతోషము కలుగజేయు
ఉద్దేశ్యములు కలిగి ఉండటం!
భూతహితము ఇతరుల హితము - శ్రేయస్సు కోరుకోవటం. అందుకు
ప్రయత్నించటం. సహజీవులగు జంతువులను పక్షులను
వృక్షములనుఆహార-పానీయములతో సంతోషింపజేయటం!
ఇవి మానవ ధర్మాలు! సర్వులు, సర్వవర్ణులు పాటించవలసిన ధర్మాలు.
24. ఆశ్రమ ధర్మాలు
ఓ ఉద్ధవా! మానవుడు దేనిని ఆశ్రయించి అభ్యాసం కొనసాగించాలో... అట్టి
సాధనాక్రమములను ఉదహరిస్తూ శాస్త్రకారులు చతుర్విధమైన ఆశ్రమములు - ఆశ్రమ
ధర్మములు ప్రవచిస్తున్నారు!
అట్టి ఆశ్రమ ధర్మాల గురించి కూడా ఇక్కడ ఉదహరిస్తున్నాను. విను!
1. బ్రహ్మచర్యాశ్రమం 2. గృహస్థాశ్రమం
3. వాసప్రస్థాశ్రమం 4. సన్యాసాశ్రమం
1. బ్రహ్మచర్యాశ్రమం
దేహభావం ఆశ్రయించటంచేత జన్మ వస్తోంది. దేహంతో సంబంధం ప్రారంభమౌతోంది.
అటు తరువాత శాస్త్ర ప్రతిపాదితమైన ఉపనయనము అను ప్రక్రియచే ద్విజత్వము
ప్రారంభమౌతోంది. పరమాత్మ తత్త్వము యొక్క సామీప్యము - సందర్శనారంభమే
ఉపనయన శబ్దార్థం!
ఉపనయన ప్రక్రియచే ఈ జీవుడు విద్యకు అర్హుడై విద్యార్ధి అవుతాడు. అట్టి ద్విజత్వ
నియమముచే ఆతడు గురుకులం జేరి బ్రహ్మవిద్యను అభ్యసించటానికి గురువును
ఆశ్రయించాలి. ఇంద్రియ ధ్యాసలను ప్రక్కకు పెట్టి వేదాధ్యయనమునకు ఉపక్రమించాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
150

అట్టివాడు వస్త్రధారణ అలంకారముల విషయములలో కూడా కొన్ని విధి
విధానములను నియమములను శాస్త్రములు నిర్వచిస్తున్నాయి. అట్టి బ్రహ్మచారి
జడధారిఅయి, చేతిలో దండము అక్షమాలను ధరించి, యజ్ఞోపవీతధారణ చేసి,
దర్భలను చేబూనినవాడై వుండాలి! దంభము - దర్పము - అభిమానము ప్రదర్శించే
వస్త్రధారణ ముఖాలంకారం దంతాలంకారం పీఠాసనం ఇటువంటి
కృత్రిమమైన విషయాలకు దూరంగా ఉండాలి.
మౌనంగా ఉండటానికి ప్రయత్నశీలుడై ఉండాలి! అననపరమై సంభాషణ - ఇతరులపై
నిందారోపణ... ఇత్యాదులు దగ్గరకి రానివ్వకూడదు. ముఖ్యంగా స్నానంచేసేటప్పుడు,
పఠించేటప్పుడు, భుజించేటప్పుడు, జపించేటప్పుడు లౌకిక - ప్రాపంచ విషయాలు
మననం చేయరాదు! భగవత్ విషయాలే మననం చేయాలి! రోమములకు - గోళ్ళకు
అలంకారములను ఆశ్రయించరాదు! అసంకల్పితంగా వీర్యపతనమైనప్పుడు స్నానము
· ప్రాణాయామము నిర్వర్తించాలి. గాయత్రీ జపం చేయాలి. సంకల్పితంగా
బుద్ధిపూర్వకంగా వీర్యపతనము చేయరాదు.
పవిత్రుడై వుండాలి!
ఏకాగ్రచిత్తమును అలవరచుకోవాలి! అనేకములో దాగియున్న ఏకమును
చింతించుచూ ఉండటమే ఏకాగ్రచిత్తము!
తదితర సర్వజగద్విషయాలపట్ల మౌనము వహించి ఉండాలి! మౌనిత్వము
అభ్యసిస్తూ ఉండాలి!
ప్రాతః - మధ్యాహ్న - సాయం సమయములలో త్రిసంధ్యోపాసకుడై గాయత్రిని
జపిస్తూ వుండాలి.
అగ్నిని, సూర్యుడిని, ఆచార్యుని, గోవుని, బ్రాహ్మణుని, గురువును, వృద్ధులను,
దేవతలను పూజిస్తూ - సేవిస్తూ వుండాలి!
శ్లో ఆచార్యం మాం విజానీయాత్
నావమ్ అన్యేత కర్హిచిత్|
న మర్త్యబుద్ధ్యా అసూయేత
సర్వదేవమయో గురుః II (అధ్యా 17, శ్లో 27)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
151

ఆచార్యుని (Teacher) ప్రత్యక్ష భగవత్ స్వరూపంగా భావించాలి. ఆయనను సాధారణ
మనుష్యునితో పోలుస్తూ దోషదృష్టితో చూడకూడదు! జన్మజన్మలుగా అభ్యసించిన దోష
దృష్టియే మహనీయులలో దోషాలు ఎన్నుతూ వుండటానికి కనబడటానికి కారణం!
పరమాత్మయే ఆచార్యుల రూపంగా నాకు ఎదురుగా కనిపిస్తున్నారు - అను ఆచార్యస్య
భగవన్ స్వయం దృష్టిని అలవరచుకోవాలి! గురి చేత సర్వము లభిస్తాయి. గురి
లేనిచోటకాదు. గురియే గురువు! గురి లేకుంటే గురుతు లభించదు.
ఉదయం - సాయంకాలం భిక్షాటణలో లభించే దానిని గురువుకు మునుముందుగా
సమర్పించాలి. ఆతరువాత, ఆయన అనుజ్ఞను అనుసరించి ఆయా ఫలములు,
పదార్ధములు సేవించాలి.
ఆచార్యుడు ముందు నడుస్తూవుంటే, ఆయన వెనుక సేవా భావంతో "నేను స్వల్పుడను..."
అను అభిప్రాయంలో అడుగులు వేస్తూ వుండాలి. వినమ్రతగా నడవాలి.
నిద్రాసమయంలో గురుసేవపట్ల అప్రమత్త భావనతో నిదురించాలి. విశ్రాంతి సమయంలో
ఆచార్యులకు పాదములు ఒత్తుతూ ఉండాలి! ఆచార్యులు కూర్చుని ఉన్నప్పుడు చేతులు
జోడించి కృతాంజలుడై వుండాలి. వారు కూర్చున్న ప్రదేశానికి కొద్ది దూరంలో ఉండి
వారి ఆజ్ఞలు నిర్వర్తించటానికి సంసిద్ధత తెలుపుచూ ఉండాలి. ఆయనను ఉపాసించాలి.
వేదాధ్యయనం పూర్తి అయ్యేవరకు భోగములను విడచి, ఇప్పుడు మనం చెప్పుకొన్న
విధి-నియమములు పాటిస్తూ గురుకులంలో అఖండ బ్రహ్మచర్యవ్రతం పాటిస్తూ
వుండాలి.
అట్టి శ్రద్ధతో కూడిన అఖండబ్రహ్మచర్య వ్రతం నిర్వర్తిస్తూ తన జీవిత సర్వస్వమును
ఆచార్యునకు సమర్పించు నైష్ఠిక బ్రహ్మచర్యవ్రతుడు సులభంగా మహర్లోకము -
బ్రహ్మలోకమును ఎరుగగలడు! బ్రహ్మమై ప్రకాశించగలడు! శిష్యత్వమునకు అంతటి
ప్రభావమున్నది! ఓ ఉద్ధవా! బ్రహ్మచర్యవ్రతుడు క్రమంగా బ్రహ్మ తేజోసంపన్నుడై
అగ్నియందు, గురువునందు, సర్వ సహజీవులయందు, తనయందు అబేధబుద్ధి యుతుడై
నిర్మలము - అప్రమేయము -అఖండము అగు ఆత్మను సందర్శించగలుగుతాడు! సర్వత్రా
ఆత్మనే ఆస్వాదించగలుగుతాడు!
బ్రహ్మచర్య - వానప్రస్త - సన్యాసాశ్రమం సేవించేవారు స్త్రీలతో సరససంభాషణము
- పరిహాసము మొదలైనవాటికి దూరంగా ఉండాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
152

బ్రహ్మచర్యాశ్రమమే కాకుండా అన్ని ఆశ్రమముల వారికి సంబంధించి కొన్ని నియమ
అభ్యాసములు ఇక్కడ ఉదహరిస్తున్నాను.
1. శౌచము ( శుచి అయిన భావాలు పెంపొందించుకోవడం) 2. ఆచమనము 3.
స్నానము 4. సంధ్యోపాసన 5. జపము 6. జగత్ భావావేశములపట్ల అస్పృశ్యత
7. మత్తు - బద్ధకము - ఆవేశము పెంపొందించే పదార్థములు స్వీకరించకపోవడం
సాత్వికాహారం 8. లౌకిక విషయాలు సంభాషించకపోవటం 9. సర్వజీవులలో
-
వేంచేసియున్న అంతర్యామినగు నన్నే సర్వదా సందర్శిస్తూ - ఉపాసిస్తూ ఉండటం.
10. మనస్సును, వాక్కును కాయమును అదుపులో ఉంచుకొని ఉండటం.
నైష్ఠిక బ్రహ్మచారిగాని, తదితరులుగాని... పై గుణములను అభ్యసిస్తూ ఉండటంచేత
బ్రహ్మతోజోసంపన్నులై అగ్నివలె ప్రకాసిస్తున్నారు.
గురుసేవ - అధ్యయనం - తపస్సుల ప్రభావంచేత కర్మవాసనలన్నీ క్రమంగా తమంతట
తామే నాశనమగుచున్నాయి. తద్వారా ఆతడు నిష్కామభక్తిని సంపాదించుకో
గలుగుచున్నాడు. ముక్తుడగుచున్నాడు!
2. గృహస్థాశ్రమము
బ్రహ్మచర్యవ్రతం నిర్వర్తించిన తరువాత గృహస్థాశ్రమం ప్రవేశించదలచుకొన్నవాడు
వేదాధ్యయనం పూర్తి అయిన తరువాత గురుదక్షిణ సమర్పించుచున్నాడు. గురు ఆజ్ఞతో
సకాముడైతే .... బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమం స్వీకరించుచున్నాడు.
అకాముడు - నిష్కాముడు-అయితే బ్రహ్మచర్యాశ్రమం నుండి
వానప్రస్థాశ్రమం స్వీకరించుచున్నాడు.
నిష్కాముడు - బ్రహ్మజ్ఞాన సన్యాసాశ్రమం స్వీకరించుచున్నాడు. --}
శ్రేష్ఠుడు అయితే
లేదా....
ఒక ఆశ్రమం నుండి మరొక ఆశ్రమాన్ని స్వీకరించవచ్చు. భక్తజనులు తమయొక్క
ఆశ్రమ విధానములను, నియమములను సగౌరవిస్తూ వుంటారు!
వివాహం : "గృహస్థాశ్రమం స్వీకరించాలి" అని అనుకొనువాడు విద్యానంతరం తన
భావాలకు అనుకూలమైనది, సంఘముయొక్క కట్టుబాట్లకు సానుకూలమైనది, తనవలె
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
153

ఆశయములు - దృక్పధములు కలది, పెద్దలు సదుద్దేశ్యములకు అనుకూలమైనది,
తన వర్ణము (లేక) అవరోహణవర్ణమునకు చెందిన కన్యను వివాహమాడవచ్చును!
అధ్యయనము దానము - యజ్ఞయాగాలు ఇవన్నీ బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య
వర్ణులకు సరిసమానమైన ధర్మములు.
ప్రతిగ్రహణము - అధ్యయనము - యజ్ఞములు నిర్వర్తింపజేయటం... ఇవి బ్రాహ్మణ
కుల జాతులకు ముఖ్య స్వధర్మరూపములై వున్నాయి.
దానము స్వీకరించటం... అనేది తపస్సుకు, తేజస్సుకు, యశస్సుకు దోషము
కలిగిస్తాయేమో కదా!... అని ఎవరికైనా అనిపిస్తూ వుంటే ... అప్పుడు అట్టివాడు
జీవనోపాధికై న్యాయబద్ధమైన - లోకసమ్మతమైన ఏదైనా ఆదాయంవచ్చే వృత్తిని నిర్వరిస్తు
ఇక ఆపై కులధర్మ - యజ్ఞ - దానాదులు నిర్వర్తిస్తూ ఉండవచ్చు.
ఓ ఉద్ధవా! ఈ పవిత్రమైన మానవ దేహమును క్షుద్రమైన కామ భోగములకు మాత్రమే
వెచ్చిస్తూ ఆయుష్షును నష్టపరచుకోవటం ఏమాత్రం ఉచితం కాదయ్యా! ఈ దేహము
ముఖ్యముగా పరతత్త్వజ్ఞానము యొక్క సముపార్జనకై ఉద్దేశ్యించబడిందని గమనించబడు
గాక! బుద్ధికి భాగవత ధర్మములు అభ్యాసం కావటానికై మానవజన్మ గొప్ప అవకాశం!
జీవించటం కోసం మాత్రమే ఆహారం! ధర్మమునకు ప్రతికూలంగాని లౌకిక వృత్తిచే
లభించిన దానితో సంతృప్తుడై, కష్ట - సుఖములు పరమాత్మయొక్క ప్రసాదిత విశేషాలుగా
దర్శిస్తూ, స్వధర్మ నిరతుడై వుంటూ, సర్వము పరమాత్మయొక్క ప్రత్యక్షరూపంగా వీక్షిస్తూ
భోగపారాయణం త్యజిస్తూ గృహస్థాశ్రమము దివ్యభావాలతో స్వీకరించేవాడు అతి
సులభంగా మోక్షార్హుడు కాగలడు!
ఎవ్వరైతే నా భక్తుల కష్టములను - దారిద్ర్యమును తొలగిస్తూ, రక్షణ ఇస్తూ సేవిస్తూ
వుంటాడో అట్టివానిని సంసార సముద్రం నుండి నావవలె నేను ప్రయత్న పూర్వకంగా
కాపాడుతాను.
ఇది నా ప్రతిజ్ఞ!
క్షత్రియ ధర్మం
శ్లో॥ సర్వాః సముద్ధరేత్ రాజా, పితేవ వ్యసనాత్ ప్రజాః
ఆత్మానమాత్మనా ధీరో యథా గజపతిః గజాన్ (అధ్యా 17, శ్లో. 45)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
154

ఒక గజరాజు తదితర గజములను రక్షిస్తూ వున్నట్లు ధీరుడగు నరపతి ప్రజలను
కన్నబిడ్డలనువలె రక్షించాలి! పరిపాలించాలి! క్షత్రియధర్మము ఆశ్రయించేవాడు తనను
తదితరులను రక్షించే ధర్మమును ఆశ్రయించినవాడై వుంటాడు.
ఏరాజైతే ప్రజలను సేవాభావంతో ధర్మనిరతితో, ప్రేమాస్పదంగా పరిపాలిస్తూ వుంటాడో...
అట్టి క్షత్రియుడు ఇహపరలోకములలోని సర్వదోషములనుండి విముక్తుడౌతాడు.
సూర్యునివలె ప్రకాశిస్తాడు ఇంద్ర లోకంజేరి స్వర్గసుఖాలకు సర్వానందములకు
అర్హుడౌతాడు. ఇంద్రసమానుడౌతాడు.
వైశ్య ధర్మం
జీవనోపాధికై క్రయ విక్రయములను నిర్వర్తించువాడు వైశ్యుడు. ఇతడు తదితరములైన
యోగాభ్యాసం - యజ్ఞం - దానం - తపస్సు నిర్వర్తిస్తూ స్వధర్మం - లౌకిక ధర్మంగా
వైశ్య వృత్తులను నిర్వర్తించువాడు- అట్టి ధర్మనిరతిచే మోక్షార్హుడు అగుచున్నాడు!
విప్రుడు అత్యవసమైనప్పుడు జీవనోపాధికై క్షత్రియ - వైశ్య ధర్మములు నిర్వర్తించవచ్చు.
క్షత్రియుడు ఆపదల సమయంలో వైశ్య వృత్తిని - బ్రాహ్మణవృత్తులను ఆపద్ధర్మంగా
అవలంబించి తద్వారా జీవితము గడుపవచ్చు.
వైశ్యవృత్తివాడు ఆపదల సమయాలలో చాపలు అల్లటం మొదలైన కారుజాతి వృత్తులను
అవలంబించవచ్చు!
దూష్యవృత్తిః మాత్రము నిషిద్ధం
బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్రులలో ఎవ్వరూ నీచ వృత్తులైన దొంగతనం,
హింస... ఇటువంటి దూష్యవృత్తులకు (దుష్ట-తదితరులను బాధించే వృత్తులకు)
సంసిద్ధుడు కారాదు సుమా!
గృహస్థుడు చేయవలసియున్న దినచర్యలు
వేదాధ్యయనం చేస్తూ... తద్వారా ఋషులకు పూజా పుష్పాలు సమర్పించటం.
స్వథా మంత్రముచే పిత్రుదేవతలను పూజిస్తూ ఉండటం.
స్వాహా మంత్రముచే దేవతలను పూజించటం
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
155

ఉపాహార వస్తువులను సమర్పిస్తూ భూతజాలములను పూజించటం.
అన్న - ఉదకాలతో సహజీవులను పూజించటం.
ధన - సంపదల సమర్పణతో ఆశ్రిత - సేవక జీవులను పూజించటం.
యథాశక్తిగా యజ్ఞ - యాగ - పూజాదులు నిర్వర్తించటం.
గృహస్థుడు ధనికుడైనను, పేదవాడైనను - కుటుంబవిషయాలలో తన్మయుడై అత్యాసక్తుడై,
వేదనాపరుడై (As mentally worried) వుండరాదు. ఇక్కడి సందర్భాలు - సంబంధాలు
- సుఖ - దుఃఖాలు, సంపద ఆపదల నశ్వరం కదా! "ఇవన్నీ అశాశ్వతం - కాలబద్ధము -
కూడా!" అను అవగాహన అంతరంగమున సజీవమై ఉండుగాక! భగవత్ తత్త్వమునందు
సర్వదా సావధానుడై ఉండుగాక! అప్రమత్తుడై ఉండుగాక! స్వర్గాది సుఖలోకాలు కూడా
ఇట్టివే! కాలబద్ధమే! భ్రమాత్మకమైనవే..... అని గమనిస్తూ వుండుగాక!
శ్లో పుత్ర దార - ఆప్తబంధూనాం సంగమః పాంథ సంగమః
అనుదేహం వియన్యేతే స్వప్నో నిద్రానుగోయథా | (అధ్యా 17, శ్లో 53)
కలలో కనిపించే స్వప్నదృశ్యాంతర్గత జీవులు, సంపదలు, సందర్భములు, బాంధవ్యములు
మెళుకువరాగానే ఏమౌతున్నాయి? మటుమాయమైపోతున్నాయి కదా!
అట్లాగే...
గృహస్థుడు కూడా- "ఇక్కడి పుత్రులు - భార్య - భర్త - ఆప్తులు బంధువులు -
మొదలైనవన్నీ చలివేంద్రంలో బాటసారుల కొద్దిసేపు సమావేశం చేత ఏర్పడినవై, ఆ
బాటసారులు ప్రయాణం కొనసాగిస్తున్న మరుక్షణం మటుమాయమైయ్యే విశేషాలవంటివే
కదా!"... అని జ్ఞానదృష్టితో అవగాహన కలిగి ఉండాలి. ఒకరికొకరం సంబంధించిన
వారమే కాదు. ఎవరి ప్రయాణం, ఎవరి గొడవ వారిదే! ఈ కాసేపు "ఒకొరికొకరం
సర్వస్వమైనట్లు కలిసి వుంటాం. కానీ, విడిపోవటం అనివార్యం" అని జ్ఞాపకం
పెట్టుకొనే వుండాలి.
ఒక అతిథి తాను ప్రవేశించిన ఒక గృహస్థుని ఇంట్లో మమత్వరహితుడై అనాసక్తుడై
వుంటాడు కదా! అట్లాగే గృహస్థుడు కూడా తన గృహంలోను, ఈ జగత్తులోను అనాసక్తుడై,
మమత్వరహితుడై బహుదూరపు బాటసారి ఒక గృహ ప్రాంగణంలో కొద్దిసేపు
సేదదీర్చుకొను రీతిగా ఉండటం అలవరచుకోవాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
156

భక్తుడు :
భక్తుడగువాడు మమత్వ - ఆసక్తరహితుడై స్వకర్మలను నిర్వహిస్తూ వుంటాడు. గృహస్థుడై
వుంటే తాను నిర్వర్తిస్తున్న కర్మలద్వారా... నన్ను ఆరాధిస్తూ వుంటున్నాడు.
లేక, సర్వసాంఘిక విషయములు త్యజించి అరణ్యంలో ఏకాంతంగా ప్రవేశించవచ్చు!
కాదా, సన్యాసము స్వీకరించి ఆశ్రమవాసియై వుండవచ్చు.
భక్తి మనోవికాసానికి సంబంధించినది. అంతేగాని, దృశ్య సంబంధమైనది కాదు.
ఆశ్రమములకు - లోకసంబంధమైనది కాదు! వస్త్రధారణలకుగాని, చారుర్వర్ణ్యములకు
గాని సంబంధితమైనది కానేకాదు. ప్రతి ఒక్కడు భక్తికి అర్హుడే!
గృహస్థాశ్రమం - మోక్షప్రదాత / బంధప్రదాత
గృహస్థాశ్రమం మోక్ష ప్రదాత తప్పక కాగలదు సుమా! ఏ ఆశ్రమవాసి అయినాసరే,
మోక్షానికి అర్హుడే కూడా!
అయితే...,
గృహస్థాశ్రమం ఎప్పుడు మోక్షమార్గానికి ప్రతిబంధకము, బంధప్రవృద్ధము అవగలదో...
అది కూడా జనుల జాగరూకతకొరకై చెప్పుచున్నాను. విను!
గృహస్థుడు కనుక మూఢుడై, వివేకశూన్యుడై, బంధు మిత్ర కళత్రాది విషయముల
పట్ల రాగద్వేషములు పెంపొందించుకొని, ఆసక్తిని ప్రవృద్ధపరచుకొంటూ వుంటే...
ఇక ఆపై జీవుడు అహంకార - మమకారములకు బద్ధుడు కాగలడుసుమా!
"నేను ఏదో పొందాలి! ఇంకా ఇంకా ఏదేదో చేయాలి! - నావారి నావా గతి ఏమి
కానున్నదో? నా భార్య, పిల్లలు దీనులు - అనాధలు అవుతారేమో? వారు దుఃఖం
పొందరాదు. అందులకై ధన సముపార్జనయే ముఖ్యము కదా! నా ధనరాసులు,
గృహసంపదలు ఏమి కానున్నాయో! మా వ్యాపార విశేషాలు ఇట్లాగే
కొనసాగుతాయా? లేక పిల్లల తెలివి తక్కువ చేత ఆదాయాలు కుంటుపడవుకదా!"
ఇట్లా యోచనలపై యోచనలు చేస్తూ గృహస్థాశ్రమంలో కాలం వృధా
చేసుకొనేవాడు అవివేకియే!
చేయవలసింది చేయటం! జరుగవలసింది జరుగుతుంది! మౌనంగా, అతీతంగా,
చిద్విలాస పూర్వకమైన చిరునవ్వుతో చూస్తూ ఉండటం ఇది సిద్ధులగు
మహనీయులు గృహస్తునికి చెప్పే ఉపాయం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
157

అసంతృప్తి, ఏదో లేదని - ఆవేశము, బంధువుల సమాచారములపట్ల అభినివేశము
ఇత్యాదులు ప్రవృద్ధపరచుకొంటూ ఆయిష్షును గడుపువాడు ఉత్తరోత్తర
మరణానంతరం అధమగతులకు చేరగలడని నా హెచ్చరిక!
3. వానప్రస్థాశ్రమము
ఉద్ధవా! ఇప్పుడు వాన ప్రస్థాశ్రమవాసులు విశేషాలు చెప్పుచున్నాను. విను.
వానప్రస్థాశ్రయులు గృహస్థాశ్రమబాధ్యతలన్నీ పుత్రులకో, సత్పురుషులకో చేతికందించి,
ఆ గృహస్థాశ్రమం పరిత్యజించి ఏకాంత వాసాన్ని ఆశ్రయిస్తున్నారు. భార్యను పుత్రుల
సంరక్షణలో ఉంచిగాని, (లేక) వెంటనిడుకొనిగాని బయల్వెడలుచున్నారు.
వనములలోనో, అరణ్యములలోనో, కొండప్రాంతాలలోనో,,, మరెక్కడో ఏకాంత ప్రదేశం
ఎన్నుకొనుచున్నారు.
శాంతచిత్తులై జీవితముయొక్క మూడవ విభాగం (The third part of life) వానప్రస్థం
ఆశ్రయించటం అహంకార మమకారత్యాజ్యములకు ఔషధమై యున్నది సుమా!
గొప్ప ఉపాయమైయున్నది!
వానప్రస్థులు వనములలో - అడవులలో గాలివాటుగా దొరికే కందమూలములను,
ఫలములను ఆహారంగా స్వీకరించనారంభించుచున్నారు. జింకచర్మమును, నారచీరలను,
ఆకులను వస్త్రములుగా ధరిస్తూ ఏకాంత సాధన కొనసాగిస్తున్నారు. వెంట్రుకల
అలంకరణ, గోళ్లు - మీసముల దంతముల శరీరసంబంధమైన అలంకార
వ్యవహారములు త్యజిస్తున్నారు. మూడు వేళల స్నానం చేస్తూ, నేలపై పరుండి... జీవితము
గడుపుచూ తదితర సర్వసమయములలో తమ తమ ఆధ్యాత్మసాధనలు నిర్వర్తిస్తున్నారు.
తమను తాము ఆధ్యాత్మ మార్గంలో ఉత్తేజపరచుకొంటున్నారు.
కొందరు వేసవి కాలంలో పంచాగ్నులమధ్య, వర్షాకాలంలో శీతల జల నదీ
ప్రదేశాలలోను ప్రకృతిని సాధనగా చేసుకొని అభ్యాసం కొనసాగిస్తున్నారు. ప్రకృతిని
ఉపాసనా దైవంగా భావనచేస్తున్నారు.
వారిలో మరికొందరు అగ్నిపక్వమైన కందమూలాలుగాని, కాలపక్వమైన
ఫలములతోగాని రోట రాయితో దంచబడివైన ధాన్యపుగింజలను గాని ఆహారంగా
స్వీకరిస్తూ ఇంద్రియాకర్షణను జిహ్వరుచులను జయిస్తున్నారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
158

దేశ - కాలానుసారంగా సామాన్యంగా లభించే వస్తువులలో (దాచిపెట్టుకోవటం
|
- కూడబెట్టుకోవటం లేకుండా) - సమయానుకూల వస్తువులతో సామాన్య జీవితం -
గడుపుచూ వానప్రస్థాశ్రమ జీవితం గడుపుచున్నారు.
అట్టి వానప్రస్థాశ్రమం ఆశ్రయించు వారు
వనములో అడవులలో (తామున్నచోట) లభించే సస్యములు మొదలైన
పదార్థములతో లోకోత్తరమై ఉపాసన - ధ్యాన - యజ్ఞాదులు నిర్వర్తిస్తూ వుంటారు.
జీవహింస కూడదు
ఓ ఉద్ధవా! జీవహింస చేయటమనేది నన్ను బాధించటమే! అందుచే ప్రతివిహితములైన
పశు-పక్షి మాంసములతో పరతత్త్వ స్వరూపుడను - సర్వాంతర్యామిని అయిన నన్ను
పూజించవలసిన అగత్యము లేదు. ఆ అవసరము-అట్టి అభిలాష సర్వజీవాంతర్గతుడును
సర్వదేవతా స్వరూపుడను అగునాకు ఉండదు.
మరికొన్ని వానప్రస్థ విశేషాలు:
జీవితాంతం దేహపతనం వరకు నన్ను వానప్రస్థాశ్రమంలో ఉపాసించువారు
బ్రహ్మలోకవాసులు కాగలరు.
మోక్ష జనకము - మహాకష్ట సంచితము అయిన తపస్సును స్వర్గము మొదలైన -
అల్పమైన ఫలములకో, లౌకికమైన రాజ్యాధికారంవంటి స్వప్నంతో సమానమైన
ప్రాప్తాప్రాప్తముల కొరకో ఉద్దేశ్యించటం సముచితం కానేకాదు! జీవితం అనేది
జన్మ-జన్మాంతర సంబంధమైన బహు విలువైన అవకాశము.
అందుచేత, గృహస్థాశ్రమంలోగాని, వానప్రస్థాశ్రమంలోగాని, సన్యాసాశ్రమంలోగాని
అనుష్ఠానములు నిష్కామంగాను, లోకకళ్యాణార్ధంగాను నిర్వర్తించటమే ఉత్తమము!
నిష్కామకర్మ మోక్ష సిద్ధిని సులభంగాను, దృఢంగాను ప్రసాదించగలదు.
వానప్రస్థులు తమ ఆశ్రమమునకు సంబంధించిన నియమములను నిర్వర్తించలేని
దేహస్థితికి వచ్చినప్పుడు,.... అట్టివారిలో కొందరు యజ్ఞాగ్నిని భావనచేసి, ఆ అగ్నులను
తమ అంతఃకరణంపై ఆరోపించి మనస్సును నాయందు నిలిపి, ఆ భావజనిత
యోగాగ్నిలో భౌతికదేహము ప్రవేశింపజేయటం జరుగుచూ ఉంటోంది. లేదా వంశజులబంధువుల-మిత్రుల-శిష్యుల గృహాలలో (లేక) సిద్ధపురుషుల ఆశ్రమాలలో
అంతిమదినము గడపవచ్చు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
159

4. సన్యాసాశ్రమం
కొందరికి కర్మ పరిపాకమైనట్టి లోకవిషయములపట్ల వాటి యొక్క తదనంతర
పరిణామములపట్ల సంపూర్ణ వైరాగ్యం కలుగుతోంది. అట్టి వైరాగ్యము పొందగలిగినవారు
యథావిధిగా యజ్ఞాగ్నులను పరిత్యజించి సన్యాసాశ్రమం స్వీకరిస్తున్నారు!
సన్యాసాశ్రమం స్వీకరించే అభిలాష గలవారు...,
యజ్ఞములద్వారా నన్ను ముందుగా ఆరాధిస్తున్నారు.
వేదజ్ఞులను, ఋత్విక్కులను ఆహ్వానించి తమకున్నదంతా సమర్పించివేస్తున్నారు.
వేదమంత్రములద్వారా ఆత్మను అగ్నిగా భావనచేసి చిత్త విషయములను అట్టి
ఆత్మాగ్నిలో వ్రేల్చి నిరపేక్షతో కూడిన చిత్తముతో సన్యాసాశ్రమం స్వీకరిస్తున్నారు.
ఇక్కడ ఒక చమత్కారం!
"నేను సన్యాసధర్మం సీకరిస్తాను. అట్టి సన్యాస ధర్మంయొక్క సాయంతో పరబ్రహ్మమును
పొందదలచుకున్నాను!".... అని సంకల్పించే యత్నపరులకు కొందరు అధిష్టాన దేవతలు
"ఈతడు మమ్ములను తిరస్కరిస్తున్నాడే! మేము కల్పించిన జగత్తును
తూష్టీకరిస్తున్నాడేం?"... అని తలచి కొన్ని విఘాతాలు కలిగిస్తూ ఉండవచ్చు. ఓర్పు -
నేర్పులలో భక్తి-జ్ఞాన-వైరాగ్య-యోగ పూర్వకంగా అట్టి అడ్డంకులను సన్యాయోగి
అధిగమిస్తూ ఉండవలసి వస్తుంది. భార్య-స్త్రీ-పుత్రులు -... ఇత్యాది విశేషాలతో కూడా
వారు పరీక్షించబడుతూ ఉంటారు.
సన్యాసి....,
కౌపీనం ధరిస్తూ ఉంటాడు.
ఆ కౌపీనము కనిపించకుండా చిన్న వస్త్రం ధరిస్తున్నాడు.
దండము-కమండలము తప్ప ఆతడు మరింకేమీ ధరించడు.
ఆపదసమయములో ఆతనికి ఏ నియమములు వర్తించవని కూడా గమనించు.
ఆతడు...,
దృష్టిని పవిత్రం చేసుకుంటూ అంతా పరమాత్మయొక్క ప్రత్యక్ష రూపంగా సదా
దర్శిస్తూ ఉంటాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
-
160

తన ఆశీర్వాదము-కష్టముల ఉపశాంతి కోరివచ్చువారికి భగవత్స్తోత్రములతో
ధైర్యము సూచిస్తూ ఉంటాడు.
పవిత్ర భావాలు వెల్లివిరిసే ప్రదేశాలలో మాత్రమే ఉంటాడు. పవిత్ర ప్రదేశాలను
|
మాత్రమే సందర్శిస్తూ అపవిత్ర ప్రదేశములలో అడుగుపెట్టడు. లౌకిక విషయాలలో
తల దూర్చడు.
వస్త్రముతో వడగట్టిన జలము త్రాగుతూ ఉంటాడు.
నిర్మొహమాటంగా సత్యమునే అన్వేషిస్తూ - పలుకుతూ ఉంటాడు. సత్యమును
I
ప్రేమిస్తూ ఉంటాడు! పరమాత్మతత్త్వము గురించియే సంభాషిస్తూ, తనకు
తెలిసినంత వరకుసాధకజనుల సందేహములను తొలగిస్తూ వుంటాడు.
తనను గౌరవించేవారిపట్ల, అగౌరవించేవారిపట్ల, తటస్థులపట్లా (సర్వే- సర్వత్రా)
సమమైనట్టి వాత్సల్య సహితుడై ఉంటాడు.
వాక్-మనో-కాయములచే సమ-సత్కర్మవర్తనుడై ఉంటాడు.
శరీరముచే కామ్య కర్మ త్యాగి అయి ఉంటాడు. |
మనో దేహానికి ప్రాణాయామమే అతని దండము. మనో నిగ్రహము పరమాత్మ
ధ్యానములే ఆతని కమండలము-కమండలోదకం!
ఓ ఉద్ధవా!
వాక్కుకు మౌనము,
I
శరీరమునకు కామ్యకర్మ త్యాగము, మనస్సుకు ప్రాణాయమము, అనే మూడు
|
దండములు (త్రిదండములు) ధరించనివాడు భౌతికమైన కొయ్య దండమును
భౌతికమైన చేతులతో ధరించినంతమాత్రంచేత సన్యాసి కాలేడు సుమా!
ద్రోహచింతన హింసాస్వభావము గల ఇళ్ళను వదలి తదితర చాతుర్వర్ణ్యముల
గృహస్థులవద్ద ఆతడు భిక్ష స్వీకరించవచ్చు!
పేదవారిని భిక్ష కోరరాదు! అయాచితముగా ఆశీర్వదిస్తూ, పలకరిస్తూ, ప్రేమిస్తూ
వారితో శాంత-స్వాంత వచనములు పలుకుతూ వుండాలి.
గృహములలో లభించిన, లభించని వానితో తృప్తి చెందినవాడై వుండాలి!
సర్వదా సర్వులపై వాత్సల్యము కురిపిస్తూ వుండాలి!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
161

భిక్షగా లభించినదానిని గ్రామము చివరగల చెఱవు దగ్గరకు తీసుకొనిపోయి
సంప్రోక్షణతో పవిత్రం చేసి, విష్ణువు - బ్రహ్మ - సూర్యుడు మొదలగు దేవతలకు
వారి వారి భాగములను విభాగించి పక్షులు మొదలైనవి తిర్యక్ జంతువులకు
సమర్పించి, శేషించిన ఆహారం మాత్రమే స్వీకరిస్తూ ఉండాలి.
అట్టి సన్యాసాశ్రమవాసి
ఈ జగత్తంతా ఆత్మయొక్క సంప్రదర్శనమే! - అను భావనతో పరమాత్మశీలుడై,
ఆత్మరతుడై, ధీరుడై ఇంద్రియనిగ్రహముతో, సంగరహితుడై, ఏకాకియై ఈ భూమిపై
సంచరిస్తూ ఉంటాడు!
ఆత్మచే సంతృప్తుడై (ఆత్మ తృప్తుడై) వుంటాడు!
నిర్జన ప్రదేశాలలో ఉండి, నిర్భయంగా నాపై ధ్యాసనంతా నిలిపినవాడై ఉంటాడు. I
క్రమక్రమంగా విశుద్ధచిత్తుడై తనతో సహా సర్వము పరమాత్మయొక్క లీలా-క్రీడా
|
విన్యాసముగా సందర్శించే శుద్ధమైన బుద్ధిని సముపార్జించుకుంటూ వుంటాడు!
ఆత్మతత్త్వము మాత్రమే ధ్యానిస్తూ వుంటాడు!
సన్యాస యోగి...,
మునియై సర్వదా తనయొక్క బంధ-మోక్షములు గురించియే విచారణ చేస్తూ
వుంటాడు!
లోకశ్రేయస్సుకై చేసే స్తోత్రములు, బోధలు, పరిభాషణలు - ఇవన్నీ కూడా ఆతని
ఉపాసనా విధానం! జనులకు మేలుచేసే వచనములే ఆతని లోకేశ్వర ధ్యాన
విభాగాలు!
"ఇంద్రియ విషయములపట్ల నాకు గల చాపల్యమే బంధముయొక్క ప్రకటన
రూపం..." అని గమనించుచున్నవాడై వుంటాడు!
మనస్సుచే "అన్ని రూపాలు పరమాత్మయే! అందరిలోని అందరుగా కనిపించే
పరమాత్మయే నిత్యసత్యము! నాయొక్క ఆరాధ్య వస్తువు"... అని సర్వదా మననం
చేపట్టినవాడై వుంటాడు! నామరూపాత్మకమైన భేదమంతా బాహ్యమునందే త్యజించి,
సన్యసించి సత్ను న్యాసం ఆశ్రయించుటయే ఆతని కార్యక్రమం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
162

శ్లో తస్మాత్ నియమ్య షడ్వర్గం మద్భావేన చరేత్ మునిః |
విరక్తః క్షుద్రకామేభ్యో లబ్ధి ఆత్మని సుఖం మహత్ || (అధ్యా 18, శ్లో 23)
అందుచేత సన్యాసయోగి క్రమక్రమం కామ క్రోధాలు విడచివేసినవాడై వుంటాడు.
క్షుద్రములైన విషయసుఖములపట్ల మొదలంటా విరక్తుడై వుంటాడు! చిదానందమును
అనుభవిస్తూ "ఈ కనపబడేదంతా మమాత్మ స్వరూపమే! అంతరాత్మయొక్క బాహ్య
చమత్కారమే!"... అనుభావనను ఆస్వాదనను ప్రవృద్ధపరచుకుంటూ వుంటాడు
అనుకుంటూ అనుకుంటూ వుంటే అనిపిస్తుంది కదా!
అధికంగా పవిత్రమైన ప్రదేశములలో, నదీనద స్థానములలో, పర్వతశ్రేణులలో,
ఆశ్రమములలో సంచరిస్తూ వుంటాడు. గ్రామ-పట్టణములను భిక్షాటనకై మాత్రమే
దర్శిస్తూ వుంటాడు. అధిక సందర్భాలలో వానప్రస్థులవద్దను, తీర్థయాత్రీకులవద్దను
భిక్ష స్వీకరిస్తూ వుంటాడు. శిలావృత్తి (రాత్రిపూట గృహస్తులను శేషించిన
ఆహారపదార్ధములను భిక్షకోరటం, మాధవకోళం) వలన లభించిన ఆహారము భుజిస్తూ
వుండుటచే చిత్తము మోహరహితమై, పరిశుద్ధమౌతూ ఉంటుంది. మోహరహితమైన
బుద్ధికి మోక్షము సులభంగా సిద్ధించగలదు.
25. యోగి - విశేష ధర్మాలు
శ్రీకృష్ణుడు : సర్వ ఆశ్రమములలో యోగసాధన అభ్యాసవశంగా సుసాధ్యమే! యోగి"ఈ ప్రత్యక్ష దృశ్యాన్ని చూస్తూ ప్రత్యక్షంగా కనిపించే దృశ్యవస్తువులన్నీ కాలంచేత
నాశనంపొందే ధర్మము కలిగి యున్నవికదా!" అని గమనిస్తున్నవాడై వుంటాడు.
నాశనధర్మమును దృష్టిలో పెట్టుకొన్నవాడై దేనియందూ ఆసక్తుడు కాడు. "ఏదీ నాది
కాదు. అంతా కాలస్వరూప భగవానునదే కదా!..." అని అంతరంగంలో గమనించి
వుంటాడు.
ముముక్షువైనవాడు గృహము - ధనము ఇత్యాది ఐహిక సంపదలందు, స్వర్గము మొదలైన
ఆముష్మిక సంపదలపట్ల అనాసక్తుడై వుంటాడు. నిష్కామ కర్మలయందు నిరతుడై
వుంటాడు.
తనయొక్క తార్కిక జ్ఞానంతో ఈ భౌతిక దేహము ప్రాణ-మనో బుధ్యాదులతో కూడిన
అహంకార దేహము స్వప్నతుల్యమే కదా! మాయారచితమే కదా! అని గమనిక
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
163

కలిగి వుంటాడు. సుఖ- దుఃఖములను స్వప్నతుల్యంగాను, మనో కల్పితంగాను,
లీలావినోదంగాను దర్శిస్తూ ఉంటాడు. సర్వమును త్యజించి ఆత్మనిష్ఠుడై సర్వమును
స్వాత్మ ప్రదర్శనా చమత్కారంగా దర్శిస్తూ వుంటాడు.
బాహ్య విషయాలను బాహ్యమునందే త్యజించి ఉంచి సర్వదా మోక్షముకొరకై జ్ఞాన
నిష్ఠుడై ఉంటాడు. లేదా... నాయందు తన ధ్యాసను నిష్ఠను - భక్తిని
పెంపొందించుకుంటూ మోక్షము అను దానిపట్ల ఇచ్చతో కూడి సర్వమును
అంతరంగంలో త్యజించి ఉంటాడు. ఇక త్రిదండము-కాషాయవస్త్రాలు ఆశ్రమ
పరిమిత నివాసము - ఇటువంటి సన్యాసాశ్రమ చిహ్నాలు అట్లాగే తదితరులు - వారివారి
బ్రహ్మచర్యము మొదలైన ఆశ్రమ చిహ్నాలు కూడా మానసికంగా త్యజించివేస్తాడు. విధినిషేధములకు అతీతుడై, సందర్భానుచిత ధర్మాలు మాత్రం నిర్వహిస్తూ ఉంటాడు.
శ్లో॥ బుధో - బాలవత్ క్రీడేత్,
కుశలో - జడవత్ చరేత్
వదేత్ ఉన్మత్తవత్ విద్వాన్,
గోచర్యాం నైగమశ్చరేత్|| (అధ్యా 18, శ్లో 29)
ప్రాజ్ఞుడు-వివేకి అయికూడా ఒక బాలునివలె క్రీడిస్తూ వుంటాడు. చిన్నపిల్లవానివలె
ఏమీ ఎరుగనివానివలె కనిపిస్తూ వుంటాడు.
అన్నీ తెలిసి, గొప్ప నిపుణుడై కూడా ఒక జడుడి వలె ఏమీ తెలియనట్లే చరిస్తూ
ఉంటాడు.
విద్వాంసుడై ఉండికూడా లౌకికుల దృష్టిలో సామాన్యునివలె - పిచ్చివానివలె
మాట్లాడుతూ ఉంటాడు.
వేదార్థములపట్ల నిష్ఠ వదలకయే నియమరహితమైన వృత్తితో మెలుగుతూ
ఉన్నట్లు కనిపిస్తాడు!
పరమహంసత్వము వైపుగా ప్రయాణించువాడు కర్మకాండయొక్క విధి- ఫలముల గురించి
పట్టుదల మొండితనములతో "అదియే చేయాలి ఇట్లాగే చేయాలి అట్లాగే -
ఇట్లా ఉండనేకూడదు" అనే రూపంగా మొండిగా ఉండటం కూడదు. ఉండాలి అట్లా అని.... దేనినీ పట్టించుకోకుండా రాయిలాగా (పాషండునివలె) అవకూడదు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
164

కేవలము తర్కవాద (Logically supporting some concepts and opposing certain
other concepts) రతుడై ఉండరాదు. "వాళ్ళది తప్పు! వీళ్ళు తెలివితక్కువ వారు! మరొకళ్ళు
తెలివిగలవారు కాదు".. అంటూ శుష్కవాదము - నిష్ప్రయోజనములైన వాద-వివాదములు
చేయరాదు. ఏదో ఒక పక్షము వహించి (Taking one side) మిగతా వారు - మిగతా
పక్షములపట్ల (Others and other Theories) తప్పులెన్నుతూ దోషములను వర్ణించువాడు
అయి ఉండకూడదు. తదితరులను చూచి "వాళ్ళట్లా అంటారేం? వీళ్ళిట్లా ఉన్నారేం?
ఇట్లా కాకూడదు! అట్లూ ఉండాలిసిందే.." అని సహజీవులను కలత పెట్టరాదు. తాను
కలత చెందరాదు. తనను గురించి ఎవ్వరైనా అతివాదంతోను, ఆవేశంతోను, దూషణ
పదజాలముతోను మాట్లాడుచున్నప్పుడు - తాను మాత్రం ఓర్పుతో, శాంతముతో
సంతోషము - అతీతత్వము వీడకుండా సహనంగా బాలాలీలావినోదివలె వుండుగాక!
ప్రశాంత చిత్తము వీడకుండా ఉండాలి. ఎవ్వరినీ అవమానించరాదు. విరోధము కలిగి
ఉండకూడదు. పశువత్ వైరమ్ అను శాస్త్రనానుడి! తదితర దేహములను దేహులను
చూచి విరోధము-కలత రాగద్వేషములు కలిగి వుండటం-కొనసాగించటం
పశులక్షణం. అది మానవునికి అర్హం కాదు సుమా!
ఓ ఉద్ధవా! పరమహంస లక్షణములు పునికిపుచ్చుకున్నవారు చతుర్విధ ఆశ్రమములలో
ఎక్కడైనా వుండివుండవచ్చు సుమా! ఇంకా పరమహంస యొక్క విశేషదృష్టి ఎట్లా ఉంటుందో
విను!
శ్లో॥ ఏక ఏవ పరోహి ఆత్మా భూతేషు ఆత్మన్యవస్థితః
యథా ఇందు ఉదపాత్రేషు భూతాని ఏకాత్మకాని చ (అధ్యా 18, శ్లో 32)
ఆకాశంలో శీతలకాంతులు వెదజల్లుచున్న పూర్ణచంద్రుడు అనేక చోట్లగల అనేక
పాత్రలలోని జలములో అనేక ఆకారాలుగా ప్రతిబింబిస్తూ ఉంటారు! ఆవిధంగా ఒకేసారి
అనేకచోట్ల గల జలంలో అనేక ఆకారాలుగా ప్రతిబింబించినంత మాత్రంచేత.,...
అనేకత్వము చంద్రబింబముపై ఆపాదించగలమా? చంద్రబింబమును అనేకత్వం
స్పృశిస్తుందా? లేదే!
అట్లాగే
....9
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
165

ఒకే పరమాత్మ విభిన్న దేహములలో విభిన్నమైన రూప-నామ-గుణాదులతో విభిన్న
జీవాత్మలవలె ప్రతిబింబిస్తున్నారు. అయితే ఏం? సర్వ దేహములలో అఖండము
అప్రమేయము అగు ఒకే ఆత్మ ప్రకాసిస్తూ ఉన్నది! నేనే అనేక దేహులలో అనేక రీతులుగా
ప్రదర్శినమగుచు వినోదిస్తున్నాను అనునది-పరమహంస యొక్క విశేష దృష్టి!
పరమయోగి(లేక) సన్యాసి (లేక) పరమహంస పరమ ధైర్యముకలవాడై ఉంటాడు.
ఆతడు తనకు రుచికరమైన - తాను కోరుకున్న ఆహారము లభించనప్పుడు దుఃఖించడు.
మరికొన్ని రోజులు తాను కోరుకున్న మృష్టాన్నము - రుచికరమైన ఆహారపదార్ధాలు
లభించటంచేత సంతోషము పొందడు. ఆహారముగాని, మరింకేమైనాగాని ఒకరోజు
లభించటం మరొకరోజు లభించకపోవటం ఇదంతా దైవాధీనంగా, దైవలీలగా
గమనిస్తూ ఉంటాడు.
శ్లో॥ ఆహారార్థం సమీహేత యుక్తం తత్రాణధారణమ్
తత్త్వం విమృశ్యతే తేన తద్విజ్ఞాయ విముచ్యతే ॥ (అధ్యా 18, శ్లో 34)
ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి ఏదో ఒక ఆహారం సంపాదించుకోవాలి. ప్రాణరక్షణ
దేనికి? తత్త్వ విచారణ చేయటానికి! తత్త్వవిచారణచే తత్త్వ జ్ఞానము లభించి ముక్తి
కలుగుతుంది కాబట్టి ఇక అదృష్టవశంగా లభించే ఆహారంగాని, విశ్రమించే చోటుగాని
ఎటువంటిదైనా... అది పెద్ద విశేషం కాదు! - అని సమన్వించుకుంటూ వుంటాడు.
ఓ ఉద్ధవా! సర్వాంతర్యామిని - ఈశ్వరుడను- సర్వతత్త్వ స్వరూపుడనుగా నన్ను నేను
ఎరిగివుండి కూడా, విధి నిషేధములకుపరిమితముగాని-లొంగని అపరిమిత
స్వరూపుడను అయినప్పటికీ,... లోక నియమానుసారం శాస్త్రానుకూలంగా విధి-నిషేధ
పూర్వకంగా కర్మలు ఆచరిస్తూ ఉంటాను.
పరమహంస-సన్యాసమార్గముగా ఆత్మసాక్షాత్కారము ఆశయముగా గలవాడు, అయి
కూడా, విధి - నిషేధములకు లొంగకుండానే, శౌచము ఆచమనము - స్నానము
వస్త్రధారణ ఇత్యాది కర్మలు లోకానుకూలంగా శాస్త్రానుకూలంగా
ఆచరిస్తూవుంటాడు! (Be as is convenient to the situations and the world but
with no bondage to any thing)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
166

ఓ ఉద్దవా! ఈవిధంగా ఆత్మజ్ఞానుకూలమైన జీవనసరళి కొనసాగిస్తూ ఉండగా... ఇక
అట్టి జ్ఞాననిష్ఠునిపట్ల భేదప్రతీతి (the sense of differences) సన్నగిల్లుతూ వస్తుంది.
సరిఅయిన సమయంలో అట్టివాడు నా అనుగ్రహం చేత నాస్థానం పొందుతాడు.
సర్వభూతములు తానై-సర్వసాక్షి అనగవేరై... అను స్వాత్మానంద సంస్థానమును
జేరుతాడు.
అందుచేత కొంచెము తెలివిగలవాడు "ఈ విషయానుభవములవలన అంతిమ ఫలితము
దుఃఖమే!" అని గమనిస్తున్నాడు. సర్వదృశ్య విషయములపట్ల అనురక్తిని ఉపశమింప
జేసుకుంటున్నాడు. విరక్తుడగుచున్నాడు. నన్ను పొందే సాధనలకు సంసిద్ధుడగుచున్నాడు.
ఆత్మసుఖాభిలాషి అయి పరబ్రహ్మ నిష్ఠుడగు గురుదేవుని శరణువేడుచున్నాడు. శ్రద్ధ
ఆసక్తి కలవాడై, అసూయా రహితుడై, భక్తికలవాడై గురుదేవునియందు నారూపమును
భావించి, సేవించి ఆత్మజ్ఞానసమాచారమును ఆలకిస్తున్నాడు.
ఇక్కడ ఒకానొక జాగరూకత (caution), సందర్భం వచ్చింది కాబట్టి, ప్రస్థావిస్తున్నాను.
విను
ఎవ్వడైతే
....9
జ్ఞాన - వైరాగ్యముల సంపదలేనివాడై....,
కామము - క్రోధము ఇత్యాది అరిషట్ వర్గముపై యుద్ధము ప్రకటించనివాడై,
ఇంద్రియ వ్యవహారములపట్ల అభినివేశము గల బుద్ధియొక్క చాంచల్యము
వదలకుండా...
ఉదరపోషణార్ధం (పొట్టకూటి కొరకు)
సన్యాసము కొనసాగిస్తూ, కేవలము కాషాయవస్త్రధారణతో సంచరిస్తూ వుంటాడో...,
అట్టివాడు అపరిణతుడు విషయవాసనాగ్రస్థుడు మాత్రమే అగుచున్నాడు.
"ప్రపంచము పరమాత్మస్వరూపమే" అనే దృష్టిని పెంపొందించుకొనే ప్రయత్నాలు
చేయకుండా "నేను సన్యాసిని! గమనించండి! గుర్తించండి!"... అనే లౌకికత్వము
కొనసాగించువాడు ఆశ్రమ ధర్మనాశకుడే! అట్టివాడు తన ఆత్మను, పరమాత్మనగు
నన్ను వంచించుచు ఇక ఆపై ఉభయ భ్రష్టుడు అవుతున్నాడు సుమా!
ఓ జనులారా! ధర్మనిరతిని వీడకండి! (ధర్మోరక్షతి రక్షితః)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
167

గృహస్థుని ప్రధాన ధర్మములు సహజీవులను సేవించడం, భూత దయ తపస్సు,
శౌచము, సంతోషము, యజ్ఞము, వ్రతము
ఇత్యాదులు
పరస్త్రీ వ్యామోహములేనివాడై. మాతృభావన కలిగి
వుండాలి.
అతడు నియమిత (ఋతుకాలము) నందు
మాత్రమే భార్యతో సాంగత్యము కలిగి ఉండడం
బ్రహ్మచర్యమే అవుతుంది.
బ్రహ్మచారి ప్రధాన ధర్మము గురుసేవ
సన్యాసి ప్రధాన ధర్మము శమము (ఇంద్రియ నిగ్రహము), అహింస,
తత్త్వచింతన, తత్త్వబోధ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
ప్రోత్సహించటం
వానప్రస్థుని ప్రధాన ధర్మము తపస్సు, సత్సంగము, భగవత్స్తోత్రము. -
ఈ నలుగురు ఆశ్రమవాసులకు 1. ఆత్మజ్ఞాన సముపార్జనము, 2. భగవతోపాసన ఈ
రెండు ముఖ్య ధర్మములు అయి ఉన్నాయి.
ఈ విధంగా తమ వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ అనన్య భావనతో, "నేను పరమాత్మను
ఈఈ ధర్మ-కర్మలతో సేవిస్తున్నాను" అను అవగాహనతో జీవితము అనే అవకాశమును
సద్వినియోగపరచుకుంటూ, "సర్వులయొక్క అంతర్యామిగా నా ప్రియమైన పరమాత్మయే
సర్వదా వేంచేసియున్నారు..." అను అనుభూతిని దృఢపరచుకొనుచుండగా నాపట్ల
పరాభక్తి స్వభావసిద్ధంగానే దృఢమౌతుంది. "ఈ బాహ్య -అభ్యంతర జగత్కళా
విశేషమంతా పరమాత్మయే! నేను కూడా ఆయన యొక్క కళావిశేషమే! కనుక నేను
ఆయనకు చెందినవాడినే" ఇటువంటి త్రోవలో నిరంతరంగా ప్రవృద్ధమగుచున్నట్టి
అఖండ భక్తిచేత సృష్టి-స్థితి లయకారకుడను, సర్వలోకేశ్వరుడను, జగత్కారణుడను
పరబ్రహ్మమే స్వరూపముగా గలవాడు.... అగు నన్ను పొందుచున్నాడు. " అహమ్
బ్రహ్మస్మి" - మహావాక్యమును క్రమక్రమంగా స్వతఃసిద్ధంగా అనుభవైకవేద్యం
చేసుకుంటున్నాడు. సంసారమునుండి తరిస్తున్నాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
168

ఓ ఉద్ధవా! స్వధర్మము (స్వీయ ఆశ్రమ ధర్మము) అనునది ఈవిధంగా పరమాత్మను
చేరటానికి మహత్తరమైన మార్గమై ఉన్నది. స్వధర్మమును ఉపాసనగా భావించి
నిర్వర్తించువాడు అంతఃకరణశుద్ధిని సంపాదించుకొని నా ఐశ్వర్యమును తెలుసుకొన్నవాడై,
జ్ఞాన-విజ్ఞాన సంపన్నుడై నన్ను తప్పక పొందుతాడు. ధర్మస్వరూపుడనగు నేను స్వఆశ్రమధర్మనిరతులకు సర్వదా తోడుగా వుంటూ వుంటానయ్యా!
మిత్రమా! ఈవిధంగా ఈ సందర్భంలో నీకు వివిధ వర్ణాశ్రమ ధర్మములేమిటో,
ఆచార-విచారాదులు ఏవిధంగా ఉంటాయో.... వివరించాను.
నాయందు భక్తిచే ముక్తి తప్పక లభిస్తుంది! ఇందులో సందేహమే లేదు.
ధర్మము(సమర్పిత భావముతో నిర్వర్తించబడే స్వ ఆశ్రమ ధర్మము) భక్తిని ప్రవృద్ధం చేసి
నన్ను పొందేటట్లు చేయగలదు!
కనుక సర్వ నిరుత్సాహములు త్యజించి స్వ-ఆశ్రమ ధర్మమును శ్రద్ధగా ఆచరించి నాకు
సమర్పించి నన్ను పొందటమే గొప్ప ఉపాయమని అందరికి గుర్తుచేస్తున్నాను.
26. జ్ఞాన - భక్తి - యోగ విశేషములు
శ్రీకృష్ణభగవానుడు : ఓ ఉద్ధవా! అజ్ఞానము తొలగటానికి, ఆత్మజ్ఞానము వికశించటానికి
సాధకులకు చతుర్విధ వర్ణాశ్రమ ధర్మాలు వేదవేదాంత శాస్త్రములు చెప్పుచున్నాయి.
వాటిలో మరికొన్ని ముఖ్య విషయాలు కొన్ని మనం ఇక్కడ చెప్పుకుందాము.
వర్ణాశ్రమానుసారంగా శ్రద్ధ భక్తులతో నిర్వర్తిస్తున్న స్వధర్మనిరతి భగవత్ ధ్యానముల
యొక్క ప్రభావంచేత జీవుడు ప్రత్యక్ష పరోక్ష జ్ఞానములను అధిగమించి అపరోక్ష
జ్ఞానములో ప్రవేశిస్తున్నాడు. క్రమంగా ఆత్మతత్త్వజ్ఞుడు అగుచూ వేదాంత శాస్త్రముయొక్క
పాఠ్యాంశసార శాస్త్రజ్ఞాన సంపన్నుడగుచున్నాడు.
అటుపై,
ఈ ఇంద్రియానుభవమైనట్టి ద్వైతప్రపంచమును, అట్టి ద్వైతానుభవముయొక్క నివృత్తి
కొరకై ఆశ్రయించిన ప్రవృత్తి సాధనములను క్రమంగా మాయా కల్పితముగా
ఎరుగుచున్నాడు. వాటిని కూడా త్యజించి ఆత్మసాక్షాత్కారం పొంది సర్వేసర్వత్రా ఆత్మగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
169

ఎరుగుచు, తానే ఆత్మ స్వరూపుడై ఆనందిస్తున్నాడు. ముల్లును ముల్లుతో తొలగించి ...
ఆపై రెండు ముల్లులను దూరంగా వదలివేస్తాం కదా! ప్రవృత్తి సాధనములచే ప్రవృత్తి
స్వభావం అట్లే అగుచున్నది.
భక్తిచే నన్ను ఆశ్రయిస్తున్నాడు.
భక్తిచే పొందబడేది నన్నే! మద్భావోపపద్యతే ॥
అట్లాగే...,
సర్వకర్మల సాధనఫలములు, స్వర్గాపవర్గములు నేనే! జ్ఞానులు ఏ అంతిమ స్థితిని
లక్ష్యముగా కలిగి జ్ఞాన సాధనలచే పొందుచున్నారో, అది నన్నే! అందుచేత జ్ఞానిగాని,
భక్తుడుగాని నన్నే కోరుకుంటాడు గాని, మరింకేమీ కోరడు! అనగా జ్ఞాన - విజ్ఞాన
సంపన్నులంతా నా చరణారవిందములే శ్రేష్ఠముగా భావిస్తున్నారు.
జ్ఞానియగువాడు జ్ఞానసంపదతో నన్ను పూజించి, నాకు ఎంతో ఇష్టమైనవాడగుచున్నాడు.
కొంచెము తత్త్వజ్ఞానముచే కలుగగల సిద్ధి - అనేక తపో తీర్ధ దాన ఇత్యాది అనేక
పుణ్యకార్యములచే కూడా లభించదుసుమా! అందుచే ఓ ఉద్దవా! నీవు జ్ఞానముచే నీ
ఆత్మస్వరూపుడనగు నాయొక్క ఔన్నత్యమేమిటో గ్రహించు. జ్ఞాన-విజ్ఞాన (conceptual
knowledge-Applied knowledge) ల సహాయంతో భక్తి భావనతో నన్ను ఆరాధించు.
సర్వయజ్ఞేశ్వరుడనైన నన్ను పూర్వము మునులెందరో జ్ఞాన విజ్ఞాన రూపమగు యజ్ఞముచే
పూజించి మద్భావన-మత్ స్వరూపము-మత్ స్థానమును సిద్ధింపజేసుకున్నారు.
మిత్రమా! ఉద్ధవా! నిన్ను ఆవరించియున్న ఆధ్యాత్మిక - ఆధి ఆధి దైవిక దైవిక - ఆధి భౌతిక
వికారములను "మాయామాత్రమే" కదా! అని ఎఱుగుము. ఒకానొకడు ఒక త్రాడును
చూచి పాము అని అనుకొని భయపడుచున్నాడనుకో... త్రాడును చూడకముందు
పాముయొక్క భావన ఉన్నదా? లేదు. "ఇది త్రాడేకదా!" అని గ్రహించిన తరువాత?
పాముయొక్క అనుభూతి మిగిలి ఉంటోందా? లేదుకదా! అట్లాగే... ఈ జగత్తు ఆదిలో
లేదు. అంతమున లేదు. మధ్యలో అగుపిస్తోంది. పాము మొదలే లేనట్లే - జగత్తు
ఆత్మకు వేరుగా మొదలే లేదు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
170

సర్పంజ్జు భ్రాంతి జగత్ భ్రాంతి
భ్రాంతికి ముందు - భ్రాంతి సమయంలోను భ్రాంతికి ముందు - భ్రాంతి సమయములోను --
భ్రాంతి తొలగిన తరువాత కూడా అక్కడ ఉన్నది భ్రాంతి తొలగిన తరువాత కూడా ఇక్కడ ఉన్నది.
త్రాడు మాత్రమే! సర్పము ఎన్నడూ లేదు ఆత్మయే! జగత్తు అనబడునది ఎన్నడూలేదు!
సర్పము ఎన్నడూ లేదు. ఇక, "సర్పము ఎక్కడినుండి వచ్చింది? ఎటు వెళ్ళింది?"....
అని ప్రశ్నిస్తే? సమాధానం ఏమున్నది?
ఆత్మయే జగత్తుగా భ్రమదృష్టి (భ్రాంతిచేత) అనిపిస్తోంది. ఇక జగత్తు ఎప్పుడు
ఉత్పన్నమైనది? ఎటు ఎప్పుడు పోతోంది? అనే ప్రశ్న ఎక్కడిది?
జనించటం జీవించటం - మరణించటం ఇత్యాది ధర్మాలు శరీర సంబంధమైనవే
గాని ఆత్మ సంబంధమైనవి కాదు. వస్త్రము ధరిస్తే వస్త్రముతోకూడి ఇతరులకు
కనిపిస్తాము. కానీ వస్త్రరూపముగా అగుచున్నామా? లేదు.
"శరీరధారణచే శరీరధారుడుగా అగుపిస్తున్నాను. శరీరము నేను ధరించినదేగాని....
శరీరము నేనుకాదు!"
"నేను ఆత్మస్వరూపుడను! శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానందమును....!"
ఇది గమనించు. ఓ ఉద్ధవా! ఆత్మ స్వరూపడవగు నీకు ఎన్నడూ వినాశనము లేదు.
రజ్జువుయే (త్రాడుయే) సత్యము. సర్పము సత్యము కాదు. కనుక అసత్!
ఆత్మయే సత్యము. దేహము ఇత్యాది వికారాలన్నీ (త్రాడులో పాముగా కనిపించిన
వైనమువలె) అసత్!
ఆత్మకు భిన్నమైనదానికి దేనికీ సత్త లేదు.
ఆత్మకు అభిన్నమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు.
శ్రీ ఉద్ధవుడు :
శ్లో॥ జ్ఞానం విశుద్ధం విపులం యధైతత్
వైరాగ్య-విజ్ఞానయుతం పురాణమ్
ఆఖ్యాహి విశ్వేశ్వర! విశ్వమూర్తే!
త్వద్భక్తి యోగం చ మహద్విమృగ్యమ్|| (అధ్యా 19, శ్లో 8)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
171

ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! మరికొంత వివరణతో జ్ఞాన-భక్తి యోగములనబడే ఈ
రెండు విషయాలు మరొక్కసారి నాకు బోధించవలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తున్నాను.
1. విశుద్ధము - విపులము - వైరాగ్య విజ్ఞానయుతము అయినటువంటి
జ్ఞానయోగము.
2. మహనీయులు ఎల్లప్పుడు ఆశ్రయిస్తు - పరిపోషించుకుంటూ
పరిరక్షించుకుంటూ ఉండే భక్తియోగము.
ఈ రెండింటి భేదమేమిటి? ఏకత్వమేమిటి?
స్వామీ! ఎప్పటినుంచో తెలియదుగాని, మేము తాపత్రయములతో కూడిన ఘోరమైన
సంసార మార్గంలో ఎందుకో చిక్కుకొని ఉన్న బాటసారులం! అమృతము వర్షించే
భక్తి-జ్ఞానయుతమైన మీ మనోహరమైన వాక్కులు, మీ పాదపద్మములే మాకు గతి -
త్రాణ కూడా! వేరే ఛత్రము మాకు లేదు.
హే మహామహనీయా!
మేము సంసారము అనే నూతిలో చిక్కి కప్పలవలె చిక్కుకుని నిస్సహాయంగా
బెకబెకలాడుచున్నము. కాలరూపము అనబడే సర్పముచే కరవబడి ఉన్నాము. క్షుద్రమైన
విషయ సుఖములు - అనే తృష్ణచే కాలము అనే కట్టుకొయ్యకు కట్టుబడిపోయి ఉన్నాము.
మావంటి బద్ధజీవులకు మోక్ష బోధకములైన మీ వాక్సుధయే దివ్యౌషధం! అందుకని
వినిఉన్న దాని గురించే మరొక్కసారి అడుగుచున్నాను.
శ్రీకృష్ణభగవానుడు : మిత్రమా! ఉద్ధవా! జ్ఞానయోగము - భక్తియోగముల గురించి
ఒక సందర్భంలో ఒక మహానుబావుడు చెప్పిన విశేషాలు చెప్పుతాను విను.
కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుధిష్ఠరుడు (ధర్మరాజు) ఆతరువాత ఎంతో మానసిక
వేదన చెందాడు. ఒకరోజు గ్రామ పట్టణాలలో సంచరిస్తూ "అయ్యో! నాయొక్క
రాజ్యకాంక్ష వల్లనేకదా,.... అనేకమంది మరణించారు. వారి భార్యలు అంతా పోగొట్టుకొని
ఇంటిలో రోదిస్తున్నారు! ఇంతమంది బంధువుల మరణానికి నేనేకదా కారణం!" అని
దుఃఖించసాగాడు. "నువ్వు కారణమవటమేమిటయ్యా? ఇదంతా ఈశ్వరమాయ..."
అని నేను చెప్పినా, ఆయనకు దిగులు దుఃఖము తొలగలేదు. అప్పుడేం చేయాలి?
-
ఆయన వేదన తొలగేది ఎట్లా? నాకొక ఉపాయం తట్టింది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
172

"ఓ యుధిష్ఠరా! నీ దుఃఖం తొలగాలంటే ఏదైనా గొప్ప ఉపాయంచేత అజ్ఞానం తొలగాలి.
అందుకు ఒకే మార్గం. మహనీయుల సత్సాంగత్యం. పద మహాజ్ఞాని-భక్తమహాశయుడు
అగు పితామహుడు శ్రీ భీష్ములవారి వద్దకు వెళ్లాం! వారి వాగమృతమే మనందరికి
దివ్యౌషధం..." అని చెప్పాను. అక్కడున్న భీమ- అర్జున-నకుల సహదేవులు, తదితరులు,
"అవును! శ్రీకృష్ణ వాక్యంతు కర్తవ్యం! తాతగారు భీష్మమహాశయుల భక్తి-జ్ఞాన పాఠ్యాంశాలే
మనకు ఇప్పుడు దివ్యౌషధం" అని పలికారు.
అందరము కలసి యుద్ధభూమిలో ఒకానొకచోట అంపశయ్యపై పవళించియున్న
మహాత్ములగు శ్రీభీష్ములవారిని సమీపించాము.
అప్పుడు భీష్మపితామహులవారు అనేక ధర్మ సూక్ష్మ విశేషాలు చెప్పుతూ - చెప్పుతూ,
చివరికి సర్వ శాస్త్ర సార విశేషమైనట్టి మోక్షధర్మము గురించి ప్రవచించారు. అది
జ్ఞాన-విజ్ఞాన-వైరాగ్య విశేషాలతో కూడిన మహత్తర అనుభవపూర్వక మహావాక్యాలు,
భావాలు కలిగియున్నట్టిది. ఆయన చెప్పిన వాక్యసారాంశము కొంత ఇప్పుడు
చెప్పుచున్నాను. విను.
.
ఆత్మజ్ఞానము : సృష్టికర్తయగు బ్రహ్మదేవునినుండి - కదలకుండా కనిపించే రాయివంటి
స్థావరముల వరకు (ఆబ్రహ్మ స్థంభ పర్యంతము) ఇదంతా కార్యరూపము అంటారు.
అనగా.... (దృష్టాంతానికి)......
మట్టితో కొన్ని బొమ్మలు (రాజు-మంత్రి-సైనికుడు గుఱ్ఱము - ఏనుగు మొదలైనవి)
తయారు చేసారనుకుందాం.
మట్టి కారణరూపము అంటారు.
బొమ్మలు వాటివాటి కధ-కమామీషు కార్యరూపముగా అనుకో!
ఇప్పుడు
కారణరూపముగా కార్యరూపము గమనిస్తే.... ఇదంతా సర్వదా శ్రీకృష్ణ చైతన్య
ప్రభునిత్యానందమే! మట్టి బొమ్మలలో మట్టియే సత్యము కదా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
173

కార్యరూపము :
1. పురుషుడు (Indvidual experiencer)
2. ప్రకృతి (Nature స్వభావము)
3. మహత్తత్వము (Multi presentation అనేకముగా కనిపించటం)
4. అహంకారము : (నేను-నేను అనిపించటం)
5-9 పంచతన్మాత్రలు: శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలు
10.-20 ఏకాదశ ఇంద్రియములు : కళ్ళు, చెవులు - కాళ్ళు - చేతులు - ముక్కు -
నాలుక - చర్మము - గుహ్యము - గుద - మనస్సు - బుద్ధి - జ్ఞప్తి
అనుభూతి
21-25 పంచభూతములు :
స్థూలము (Solid - భూమి)
ద్రవము (Liquid - జలము)
అగ్ని (Fire-Heat - అగ్ని)
వాయువు (Vapour - Air)
స్థలము (Placement - ఆకాశము)
- 26-28 గుణత్రయము - సత్వగుణము, రజోగుణము, తమోగుణము
ఇవన్నీ 28 తత్వములుగా వేరువేరుగా వేరువేరు ధర్మములతో కనిపిస్తున్నాయి కదా!
ఇవన్నీ కార్యరూపములు.
ఇవన్నీ వేరువేరుగా అగుపిస్తున్నప్పటికీ వీటియొక్క మూల పదార్ధము (The main
material all these made up of) పరమాత్మయే! అట్టి భిన్నత్వములో ఏకత్వమే అయినట్టి
(unity in the Diversity) పరమాత్మతత్త్వమును నిర్వచించి చెప్పు జ్ఞానమే ఆత్మజ్ఞానము!
విజ్ఞానము:
ఎవ్వరికైతే పూర్వమున ఉన్నవి - ఇప్పుడు కనిపిస్తున్నవి - ఇవన్నీ వేరువేరుగా కాకుండా
- సర్వము పరమాత్మ స్వరూపముగా అనిపిస్తుందో, అట్టి స్థితి - స్థానమే విజ్ఞానము
అనే శబ్దముతో చెప్పబడుతోంది. రూపముల-నామముల ధర్మముల దృష్టిచే అనేకంగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
174

కనిపిస్తున్నప్పటికీ, ఒక్కటిగా అనిపించటమే విజ్ఞానము.
"సృష్టిగా-స్థితిగా-లయముగా-అప్రమేయముగా, అద్వితీయముగా కనిపించేదంతా
మమాత్మయే!-నేనే" అని ఆస్వాదించబడుచుండటమే విజ్ఞానము!
ఏదైతే...,
సృష్టి-ప్రళయముల సందర్భాలలో కారణరూపంగాను,
స్థితి కాలంలో సర్వము ఆశ్రయించి ఉన్నట్టి... ఆశ్రయరూపంగాను, (కార్యరూపంగాను)
ఒక కార్యమునుండి మరొక కార్యమునకై నిరంతరం ప్రయాణిస్తున్న
అప్రమేయరూపంగాను (ఊదాహరణకు జాగ్రత్లోంచి స్వప్నంలోకి - స్వప్నంలోంచి
సుషుప్తికి, సుషుప్తినుండి స్వప్నమునకు ఆమూడు తనవై ప్రయాణిస్తూ -
తాను మాత్రం యధాతథంగా ఏర్పడి ఉన్న సర్వుల స్వస్వరూపంగాను....)
అంతా లయించినప్పుడు కూడా అప్పటికీ శేషించి ఉన్నదిగాను,
ప్రకాశిస్తోందో... అదియే సత్త-సత్-ఆది-పరతత్త్వము-తురీయము! అదియే
ఓంకారము...గా కూడా చెప్పబడుతోంది!
అదియే సత్త! (Existant) తదితరమైనదంతా అసత్త! (Non-Existant) ఈ జగత్తు
సందర్భరూపంగా అసత్తు. సహజరూపంగా బ్రహ్మమే!
జీవుడు ఆ సత్ వస్తువుగురించి, అద్దానితో తనకుగల అభేదత్వము, అద్వితీయత్వము,
తనయొక్క నిర్వికల్పము, అవాక్మానస గోచరత్వము గురించి ఎఱుగటమే విజ్ఞానము.
.
ఇక దృశ్యమంటావా... ఇదంతా స్వప్నసదృశం మాత్రమే! కలలోని సంఘటనల గురించి
మెళుకువ వచ్చిన తరువాత దుఃఖించటంలో అర్ధమేముంటుంది?
చూచావా ఉద్ధవా! ఎదురుగా ప్రత్యక్షంగా ఈ నామ రూప జగత్తు (ఇంద్రియములకు
అగుపిస్తోంది. అయితే, ఇదంతా అసత్తు. దీనికి ఆవల (పరము)గా ఉన్న పరమాత్మ
తత్త్వమే సత్యము. సత్తుకూడా! మూలతత్త్వము! బ్రహ్మము! కనుక సందర్భ సత్యమగు
నామ రూప జగత్తును దాటి సహజసత్యమగు, బ్రహ్మమును ఆలంబన చేసుకో!
ఉద్ధవుడు : 1. ఎదురుగా ఘనీభూతమై కనిపిస్తున్న దృశ్య-భావనా జగత్తు 2. పుణ్య
కర్మఫలములుగా చెప్పబడుచూ - కొందరిచే జీవిత లక్ష్యములుగా భావించబడే స్వర్గము
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
175

మొదలైన సుఖమయ లోకములు... ఇవన్నీ అసత్తే అని, కేవలము కాలబద్ధమని తేల్చి
చెప్పుచున్నారు కదా! ఈ వాక్యము ఆత్మవిద్యను బోధించే గురువుల మొదటి వాక్యముగా
మేము విన్నాము. వింటూనే ఉన్నాము.
అయితే....
ఈ ఎదురుగా అగుపించేదంతా మాకు దుఃఖభరితంగాను, అనుల్లంఘ్యుమైనట్టి సంసార
సముద్రముగాను, అనేక జన్మల కర్మార్జిత బంధంగాను అనిపిస్తోందేగాని,...
ఇదంతా సందర్భరూపంగా అసత్తు! -
సహజరూపంగా చూస్తే ఆత్మయే!
అని ఏమాత్రం అనిపించటమేలేదు!
ఎవ్వరో మాయందు అనురక్తిని కల్పించి మమ్ములను ఈ దృశ్యమునకు, జన్మ-కర్మలకు
బద్ధునిగా చేసి ఉంచుచున్నట్లుగా అప్పుడప్పుడు అనిపిస్తోంది!
సంసార సాగరము అనబడే మా ఈ దృశ్యసత్తాధ్యాస తొలగేది ఎట్లా?
శ్రీకృష్ణభగవానుడు : ఔను! "నతు సత్యమిహ అణ్వపి" అని విబుధులు, ఆత్మకోవిదులు
ఎలుగెత్తి, తట్టి చెప్పుచున్నప్పటికీ, "ఇదంతా నాకు బంధము!..." అనే భ్రమ అనేకమంది
జీవులపట్ల తొలగటం లేదు! "ఈ కనబడేదంతా మమాత్మ స్వరూపమే! నేనే! నా కళా
విన్యాసమే!..." అనే ఆత్మజ్ఞాన విజ్ఞానోదయం కావటంలేదు.
ఇందుకు ఔషధంగా నాలుగు ప్రమాణాలు విజ్ఞులచే చెప్పబడుచున్నాయి.
1. శ్రుతి ప్రమాణము : వేద-ఉపనిషత్తులు మహావాక్యాలు ప్రసాదిస్తున్నాయి.
తత్ త్వమ్! అదియే నీవుగా కనిపిస్తోంది
జీవోబ్రహ్మేతి నాపరః! జీవుడుగా నాకు కనిపిస్తున్నది బ్రహ్మమే!
అయమాత్మా బ్రహ్మ! జీవాత్మయే పరబ్రహ్మము!
అహమాదిర్షిఅన్నిటికీ ! మొదలే నేనున్నాను!
సో హమ్! నేను పరమాత్మ స్వరూపుడనే!
త్వమేవా హమ్! నీవుగా కనిపించేదంతా నేనే!
అహమ్ సర్వస్య ప్రభవో! అన్నిటినీ ప్రభవింపజేస్తున్నది నేనే!
మత్తఃపరతరమ్ న అన్యత్ కించిదస్తి! నాకు వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
176

ఇత్యాది శ్రుతి స్మృత మహావాక్యాల అర్ధము విచారణ చేస్తే, గురుముఖతః వింటే
స్వస్వరూపమగు ఆత్మయొక్క ఔన్నత్యం గ్రహించబడుచుండగా ఈ దృశ్యానుభవముయొక్క
స్వాప్నికత, దీనికి ఆధారమైన అనన్యపరతత్త్వము - మహదత్వము విశదీకరణమౌతోంది.
ఇది శాస్త్ర ప్రమాణము!
2. ప్రత్యక్ష ప్రమాణము : ఇంద్రియములకు గోచరమయ్యేది!
శాశ్వతమా?
సత్యమా?
మనోకల్పనయేనా?
ఒక సందర్భము - సంఘటన అజ్ఞులు ఎట్లా చూస్తున్నారు? ఆ అజ్ఞాని విజ్ఞానమును
సంపాదించుకొని అటుపై చూస్తే.... వాటి వాటి నిర్వచనాలు ఏవిధంగా ఉంటున్నాయి?
చూడబడేదంతా
చూచేవాడియొక్క మనోచమత్కారమేనా?
చూచేవాడిని చూచేవాడు (One who is perceiving the own perceiver of
the world) అనబడే ఆత్మ ప్రమేయమా? (Is it bounded and related to
what is being seen?) అప్రమేయమా? (is it beyond and unrelated)
ఇటువంటి ప్రత్యక్షముయొక్క విచారణచే ప్రత్యక్షము-పరోక్షము కూడా కానట్టి
అపరోక్షజ్ఞానము ఉదయిస్తోంది. ఆత్మయే అంతటా సాక్షాత్కారమై అభిన్నమై
అనుభూతమౌతోంది! ఈ మార్గమునే ప్రత్యక్షప్రమాణము అని అంటారు.
3. ఐతిహ్య ప్రమాణము : నాకు అనుభూతమైయ్యేదంతా ఆయా తీరుగా సత్యమా?
కాదా?.... అని అనుమానం వచ్చినప్పుడు ఈ జీవుడు ఏం చేయాలి? విజ్ఞులను
మహనీయులను ఆశ్రయించాలి. వారి అనుభవమును - నిర్ణయములను ప్రమాణంగా
తీసుకోవాలి కదా! అట్టి మహనీయుల చరిత్రలు - ప్రవచనములు అంతిమసార
వాక్యములు అభిప్రాయములను ఇతిహాసములుగా గ్రంథస్తమైనాయి. అట్టి
(రామాయణ-భారత-భాగవతాది) ఇతిహాసములు ముముక్షువులకు ప్రమాణములై
అంతిమసత్యమును సాక్షాత్కరింపజేస్తున్నాయి. (శ్రీవసిష్ఠవిరచిత యోగ వాసిష్ఠం, బ్రహ్మ
సూత్రములు... ఇత్యాదివి అందుకు ప్రమాణములు).
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
177

4. అనుమానము-గూరువుల అనుభవ వాక్య ప్రమాణము : స్వకీయమైన పరిశీలన
విశ్లేషణయే చివరికి జీవునికి ఆత్మ జ్ఞానమును - ఆత్మదర్శనమును - ఆత్మానుభూతిని
ఆత్మానందమును ప్రసాదించగలవు.
శ్రుతి - ప్రత్యక్షము - ఐతిహ్యము /ఇతిహాసములు) - గురువులు స్వకీయమైన విచారణకు
తోడగుచున్నాయి. మార్గదర్శకమౌతున్నాయి.
శ్లో॥ శ్రుతిః ప్రత్యక్షమ్ ఐతిహ్యమ్ అనుమానం చతుష్టయమ్
ప్రమాణేషు అనవస్థానాత్ వికల్పాత్ స విరజ్యతే॥ (అధ్యా 19, శ్లో 17)
పైన చెప్పబడుచున్న 4 ప్రమాణముల సహాయంతో జీవుడు దృశ్యముపట్ల క్రమంగా
విరక్తుడై, ఆత్మసందర్శనము పట్ల అనురక్తుడగుచున్నాడు.
ఇక ఇహ-పరములైన సంపద-స్వర్గాదిఫలముల సంగతేమిటంటావా?
యజ్ఞాదులవలన లభించగల స్వర్గలోకనివాసము ఇత్యాది ప్రత్యక్ష విషయ సుఖములన్నీ
నశ్వరములు (అశాశ్వతము - Time Bound)
దుఃఖకరములు (Worries do continue)
అమంగళములు (Does not lead to true welfare)
అని మునుముందుగానే గ్రహించినవారై ఉంటున్నారు.
27. భక్తియోగ సాధనములు
శ్రీ ఉద్ధవుడు : మహాత్మా! సద్గురూ! శ్రీకృష్ణా! ఇప్పుడు నాకు భక్తియోగ సాధనల గురించి
చెప్పండి.
శ్రీకృష్ణుడు : ఓ ఉద్దవా! నాకు ప్రియమానుడవగు నీకు భక్తియోగం గురించి ఇతఃపూర్వమే
చెప్పియున్నానుకదా! ఇప్పుడు నీకు భక్తియోగ సాధనల గురించి కూడా కొన్ని విశేషాలు
చెప్పుచున్నాను. విను.
నాపట్ల భక్తి ప్రవృద్ధం కావాలంటే త్రోవలు.
1. కథాశ్రవణం : అమృతమయములైనట్టి నా అవతార కథలను వినటం.
2. సంకీర్తనం - స్తవనం : నిరంతరం నా గుణములను, లీలలను, నామములను
సంకీర్తించటం, గానం చేయటం, నామస్మరణ చేయటం, స్తోత్రములతో స్తుతించటం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
178

3. పూజ : పుష్పాదులతోను, ఇంద్రియములతోను నన్ను పూజించుటయందు నిష్ఠకలిగి

4. సేవ : భగవత్ సంబంధమైన సేవలు, సహజీవుల రూపాలుగా ఉన్నట్టి నా ప్రత్యక్ష
రూపములను సేవాభావంతో ఉపాసించటం.
5. ప్రణామము : ఎనిమిది అంగములతో సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించటం
(సర్వాంగైరభివందనం)
6. మద్భక్తపూజ : నా భక్తులను సేవించటం. పూజించటం, సన్మానించటం, వారి
మనస్సులకు ఆహ్లాదం కలిగించటం.
7. సర్వభూతేషు మన్మతిః : సర్వ ప్రాణులలోను - సర్వప్రాణులుగాను నన్నే చూచే
బుద్ధిని పెంపొందించుకోవటం.
8. మదర్ధేషు అంగచేష్ఠా : శరీరముతో చేస్తున్న సర్వకార్యములు నన్ను ఉద్దేశ్యించియే
నిర్వర్తించటం. స్వధర్మములను భగవత్ సేవాభావంగా ఉద్దేశ్యించి నిర్వర్తించటం!
9. వచసామద్గుణేరణమ్: ఈ ప్రకృతికి రచయితనయిన నా అవతారముల
గుణవిశేషములనే కీర్తించటం, వాక్కుతో గానం చేయటం, వర్ణించటం.
10. మయ్యర్పణంచ మనసః : తన మనస్సును - మనోభావాలను సర్వాత్మకుడుసర్వతతత్త్వ స్వరూపుడు అగు నాకు సమర్పించటం. "మనస్సు పరమాత్మయొక్క సొత్తేగాని
నాది కాదు".... అని భావించటముద్వారా సమర్పించటం.
11. సర్వకామ వివర్జితమ్ : దృశ్యములో ఏదో లభిస్తేకాని - మరేవో స్థితిగతులచేతగాని
నాకు ఆనందం కలుగదేమో!... అనేరూపమైన సర్వకామములు వదలి ఉండటం
విసర్జించటం, పరిత్యజించటం.
12. మదర్ధే-అర్థపరిత్యాగో-భోగస్యచ-సుఖస్యచ : ఓ పరమాత్మా! నావి అనిపించే ఈ
ధనములు-భోగములు-సహ జనులు ఇవన్నీ నావి కావయ్యా! నీవి! - అని సమర్పణ
భావంతో భోగత్యాగభావంతో జీవిస్తూ ఉండటం.
13. ఇష్టందత్తం హుతం జప్తం మదర్ధం : యజ్ఞము దానము హోమము
జపము ఇవన్నీ నాకొరకై నిర్వర్తించటం.
13. మదర్ధం మద్ర్వతం - తపః : పరాత్పరస్వరూపుడైన నన్ను చేరటానికై వ్రతములు
- తపస్సు నిర్వర్తించటం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
179

ఓ ఉద్ధవా! ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఈ ధర్మములను పాటిస్తూ, ఆత్మనివేదన
నిర్వర్తిస్తూ ఉన్నవాని హృదయంలో పరాభక్తి ఉదయించి బాలచంద్రునివలె ప్రకాశిస్తుంది.
ఇక ఆతనికి 14 లోకాలలో లభించనిదంటూ ఏదీ ఉండదు. (కో అన్యో అర్ధ అస్య
అవశిష్యతే? (What is that he shall not get?) పరమాత్మరూపుడైన నాకు సత్వ
గుణసంపన్నము - శాంతము అగు తన చిత్తమును ఎవ్వడు సమర్పిస్తాడో అట్టివానికి
- ధర్మ-జ్ఞాన-వైరాగ్యయుక్తమైన ఐశ్వర్యములు స్వభావసిద్ధంగానే నాచే ప్రసాదించ
బడతాయి.
00
రజోగుణయుక్తమైన మనస్సు : ఎవ్వరి మనస్సైతే
దేహములు - ఇళ్ళు - నామరూపములు ఇత్యాది దృశ్యాది విషయములందు
లగ్నమగుచూ...,
ఇంద్రియములవెంట పరుగులు తీస్తూ....
ఇంద్రియ విషయములపట్ల ఆవేశము - ఆకర్షణ - ఆలోచన - ఆభావన
మొదలైనవాటిని కొనసాగిస్తూ...
రజోగుణయుక్తమై....,
అసత్తు - అసద్వస్తు - అయివున్న ప్రాపంచక సంఘటన సందర్భములందు లగ్నమై
ఉంటుందో....
అటువంటి మనస్సు
అధర్మమునకు...
అజ్ఞానమునకు....,
మోహమునకు
భ్రమ - విభ్రమములకు....,
ఆవేశ - కావేశములకు,
రాగ - ద్వేషములకు ఆలవాలమై, నిలయమై ఉంటోంది. అందుచేత ఓ ఉద్ధవా!
ధర్మము : ఏఏ ఉద్దేశ్యములు - ప్రయత్నములు నాయందు భక్తిని పెంపొందింపజేస్తుందో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
180

అదియే ధర్మము గా చెప్పబడుతోంది. ధర్మో మద్భక్తి-కృత్ ప్రోక్తో
జ్ఞానము - ఏఏ అవగాహనలు - సమాచారములు - పాఠ్యాంశములు - గురుబోధలు
మొదలైనవి అంతటా ఒకే పరమాత్మను సందర్శించటం(seeing unity
in diversity, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరమ్)
అభ్యసింపజేస్తూ ఉన్నాయో- అదియే జ్ఞానము గా చెప్పబడుతోంది.
జ్ఞానం చ ఏకాత్మ్య దర్శనమ్
అసంగము - త్రిగుణ జగత్తెనట్టి ఈ దృశ్యమునకు సంబంధించినంత వరకు
గుణత్రయములపట్ల విరాగము కలిగి సర్వగుణములకు కేవలసాక్షినగు
నాపట్ల మాత్రమే ధ్యాస - అనురాగము పెంపొందించుకోవటం. గుణేషు
అసంగో వైరాగ్యమ్!
మహదాశయము -లౌకికలాభాలాభముల పట్ల - అణిమ - గరిమ - ఇత్యాది సిద్ధులపట్ల
విరాగులై ఉండటం. ఆత్మ భావనను సిద్ధించుకునే లక్ష్యము మాత్రమే
కలిగి ఉండటం.
ఇవి సాధనలుగా స్వీకరించబడుగాక!
శ్రీ ఉద్ధవుడు : స్వామి! సందర్భము వచ్చింది గనుక అడుగుచున్నాను.
నియమము అనగానేమియమము - ? ఎన్నివిధములైనవి?
శమము దమము - తితిక్ష - ధృతి అనగా ఏమిటి?
దానము - తపస్సు - శౌర్యము - సత్యము - ఋతము - - త్యాగము - ఇష్టము
ధనము - యజ్ఞము - దక్షిణ వీటి గురించి కూడా దయయుంచి వివరించ
ప్రార్థన! అంతే కాకుండా
ఈ జీవునికి ఏది బలము? దయ అనగా? లాభము ఏది? దేనిని ఉత్తమ విద్య
- అంటారు? లజ్జ-శ్రీ- సుఖదుఃఖములు వీటి కార్య - కారణ స్వభావాలు ఏమిటి?
పండిత లక్షణములు ఎట్టివి?
మూర్ఖుడు ఎవ్వడు? |
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
181

సన్మార్గమేమిటి? దుర్మార్గమేమిటి?
స్వర్గ నరకములు అనగా?
బంధువులు - గృహము - ధనవంతుడు - నిర్ధనుడు - కృపణుడు - ఈశ్వరుడు -
అని ఎవరెవరిని అంటారు?
ఈ ప్రశ్నలకు సమాధానములు, తదితర వ్యతిరిక్తములు కూడా ఏమిటో మీరు చెప్పగా
వినాలని నా మనవి!
శ్రీకృష్ణుడు : ఓహో! ఉద్ధవా! చాలా ప్రశ్నలు ఒక్కసారిగా సంధిస్తున్నావే! మంచిదేనయ్యా!
సరేఁ! కొన్ని విశేషాలు క్లుప్తంగా సమాధానంగా చెప్పుచున్నాను. విను.
1. యమము :
1. అహింస - Non-violence, Non troublling others - Either Physically or
mentally_ఇతరులపట్ల అవ్యాజమైన ప్రేమ వృద్ధి పొందితే మాత్రమే
ఇది సాధ్యము.
2. సత్యము - యమ్ సత్ - సత్పై ధ్యాస - అసత్పై ఉదాసీనత. (Attention
towards original and absolute truth)
3. అస్తేయము - తనదికానిది తనదిగా కావాలనుకొనే దొంగబుద్ధి లేకపోవటం.
ఓయీ జీవుడా! ఈ జగత్తులో ఏదీ నీది కాదు. ఇక లోభము-మోహముమాత్సర్యము ఎందుకు?
4. అసంగము - దేనిపట్లా సంగము లేకుండటం. (Non-attachment)
5. హ్రీ - నాకంటే గొప్పవారు ఎందరు లేరు? అని సిగ్గుతో ఉండటం. (Feel
shy for your mistakes and tolerence towards other's
mistakes)
6. అసంచయము - దృశ్యముతో తన్మయం కాకపోవటం. Keepign away. Main
taining beyondness
7. ఆస్తిక్యము - ఈ దృశ్యమునకు ఆధారమై ఒకానొక పరతత్త్వము అన్నిటికీ కారణమై
ఉన్నది - అని గమనించి ఉండటం. (Respect towards divinity
which is the Author and Owner of all that is being seen).
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
182

8. బ్రహ్మచర్యము లౌకిక పాంచభౌతిక జగత్ భావములను ఉపశమింపజేస్తూ
అధిగమిస్తూ .. ..., ఇదంతా పారలౌకికమగు పరబ్రహ్మమే
కదా అను భావనలయందు ప్రవేశించటం - చరించటం.
మననము బ్రహ్మము గురించిన పఠనము - హృదయస్థం -
చేసుకోవటం తత్ దర్శనము.
- To Keep withdrawing from (or) keep going beyond senses
of the world.
- To begin to interpret all this being sean as 'Brahmam -
Divinity' .
- To keep on following along with it.
9. మౌనము సర్వ జగద్విషయములపట్ల అతీతత్వభావనచే ప్రశాంతదృష్టితో
నిస్పర్ధులై ఉండటం. (Silently and pleasently witnessing all
this without conflict)
10. స్థైర్యము "బ్రహ్మమే ఇదంతా కదా" అనే స్థిరభావం వదలకపోవటం.
బ్రహ్మావలోకధిషణం నజహాతి. (Couragious in divine
convictions).
11. క్షమ ఓర్పు! పోనీలే... అనే క్షమించే గుణం. తల్లికి తప్పే కనిపించదు
కదా! అటువంటి మాతృవాత్సల్యం కలిగి ఉండటం.
12. అభయము - భయపడక - బుద్ధితో ధైర్యము వహించి ఉండటం. (Why should
I fear when Lord Krishna is in me as me and as this world?)
ఈ పండ్రెండు యమములు అని అధ్యాత్మ శాస్త్రముచే విడమర్చి చెప్పబడుచున్నాయి.
2. నియమము
1. బాహ్య శౌచము తదితరులతో ప్రవర్తిస్తున్నప్పుడు శుచి అయిన (ప్రేమ -
సహకారము-క్షమ ఇత్యాది) భావాలు ప్రదర్శించటం.
(Positive behaviour and Responses)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
183

2. అభ్యంతర శౌచము హృదయంలోను - మనస్సులోను శుచి అయిన భావాలు
- అభిప్రాయాలు - గుణాలు పెంపొందించుకొంటూ
పరిపోషించుకోవటం. "వారు అట్టివారు. వీరు ఇట్టివారు"..
ఇత్యాదులు త్యజించటం. భౌతిక సంఘటనలకు,
స్వభావాలను చూచి కోపము-ద్వేషము పొందకపోవటం
Positive inside the Heart)
3. జపము భగవంతుని అవతారమూర్తుల - గురువుల
నామరూపములు జపించటం, ఉపాశించటం!
4. తపము తపనయే తపస్సు. పరమాత్మ పాదాలు - సన్నిధికి
మనోబుద్ధులను చేర్చాలనే తపన కలిగి ఉండటం
5. హోమము వేదవిధానాలైన అగ్నోపాసన
6. శ్రద్ధ నియమిత కర్మలపట్ల - భగవత్ సాధనములపట్ల బుద్ధిని
మరీ మరీ నియమించటం.
7. ఆతిథ్యము తదితరులను పరమాత్మయొక్క ప్రత్యక్ష రూపములుగా
భావించి సేవాభావం కలిగి ఉండటం
8. అర్చన పరమాత్మను అర్చించటం. పూజించటం, కృతజ్ఞతలు
పలకటం. ఉపాసించటం. ఆరాధించటం.
9. తీర్ధాటనము తీర్ధప్రదేశములను - ఆశ్రమములను -
గురువాసములను సందర్శించటం. మ్రొక్కటం.
10. పరార్ధసేవ "పరోపకారార్ధమ్ - ఇదమ్ శరీరమ్" అనేది
జ్ఞాపకముంచుకొని "లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు"
అను భావనచే ఇతరులకు హితైషులై ఉండటం
11. సంతుష్టి లభిస్తున్నదానికి దైవమునకు కృతజ్ఞులై ఉండటం
లభించని దానిగురించి ఊసురోమని కాలాన్ని వృధా
చేసుకోకపోవటం. "నారు పోసినవాడు నీరు పోయక
మానుతాడా?" అని నమ్మి ఉండటం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
184

12. గురుసేవ ఆత్మజ్ఞులను - మహనీయులను - గురువులను
సమీపిస్తూ "వీరికి నేను ఏవిధమైన సేవ
అందించగలను!".... అనే భావము - శ్రద్ధ!
ఈ 12 నియమములు అని చెప్పబడుచున్నాయి.
ఇంకా మరికొన్ని నిర్వచనాలు విను.
| శమము బుద్ధిని పరమాత్మయందు లగ్నము చేయటం.
శమో మన్నిష్ఠతా బుద్ధిః
దమము ఇంద్రియములను నిగ్రహించటం. ఇంద్రియ విషయముల
దమ ఇంద్రియ సంయమః పట్ల అభినివేశము లేకుండటం, ఇంద్రియములను
పరమాత్మ సేవాభావంతో నియమించటం.
|తితిక్ష దుఃఖములు - కష్టములు సందర్భపడుచున్నప్పుడు -
"ఆఁ! ఇటువంటి తితిక్షా దుఃఖ సంమరో కష్టాలు ఎంతమందికి లేవు! నాకన్నా
ఎక్కువ కష్టాలు పడుచున్నవారు ఎంతమంది లేరు?"..
అన్న అవగాహనతో ఓర్పువహించటం. "ఓర్పు
నేర్చుకోవటానికే కష్టాలు..." అనే ప్రజ్ఞతో కూడిన
అవగాహన పెంపొందించుకోవటం. నేర్పుతో ఓర్పు కలిగి
ఉండటం.
ధృతి/ధైర్యము నోటిని - జననేంద్రియములను అదుపులో
జిహ్వ-ఉపస్థ జయో ధృతిః ఉంచుకోవటం. వాటిని జయించటము.
ఇతరులకు దానము ద్రోహం చేయకుండా కష్టపెట్టకుండా
దండన్యాసః ఉండటము. వారి కష్టాలు తొలగించే ప్రయత్నం.
పరం దానం వారిని సంతోషింపచేయటం.
తపస్సు కోరికలను త్యజిస్తూ ఉండటము.
కామత్యాగః తపః స్మృతమ్
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
185

శౌర్యము వాసనలను జయిస్తూ ఉండటము.
స్వభావ విజయః శౌర్యం స్వభావాన్ని అధిగమించి స్వా-భావాన్ని ఆశ్రయించటం.
సత్యము (యమ్ సత్) - బ్రహ్మమునకు సంబంధించిన విచారణ
సత్యం చ సమ దర్శనమ్ సమదర్శనమే సత్యము - సత్యవ్రతము.
ఋతము సత్యము - ప్రియముతో కూడిన వాక్కు - ఋతము
ఋతం చ సూనృతా వాణీ పరమసత్యమును ప్రకటించే వాక్యాలే సూనృతవాణి.
శౌచము లౌకిక కర్మలయందు అనాసక్తులై ఉండటం. -
కర్మసు అసంగమః శౌచం
సన్యాసము కోరికలను త్యజిస్తూ ఉండటం. త్యాగ భావము.
త్యాగః సన్యాస ఉచ్యతే
ధర్మము - ధనము ధర్మమే నిజమైన ప్రీతిపూర్వకమైన ధనము. (ధర్మో రక్షతి
ధర్మం ఇష్టం ధనమ్ రక్షితః) లోకక్షేమం కొరకు ధర్మము.
నృణామ్
యజ్ఞము పరమాత్మనగు నేను యజ్ఞపురుషుడను. యజ్ఞకర్తను.
యజ్ఞో హం భగవత్తమః యజ్ఞ ఫలస్వరూపుడను. యజ్ఞస్వరూపుడను.
దక్షిణ ఆత్మజ్ఞానమును పఠించడం, నేర్వటం, ఉపదేశించటం.
దక్షిణా జ్ఞానసందేశం ఇదియే దక్షిణ.
బలము ప్రాణాయామం ఆధ్యాత్మిక మార్గంలో శ్రేష్టమైన బలము.
ప్రాణాయామం పరం బలమ్
భగము పరమాత్మయొక్క ఐశ్వర్యము. ఈ జగత్తంతా
భగో మే ఐశ్వరో భావో పరమాత్మయొక్క ఐశ్వర్యమే! 14 లోకాలు - జీవులు
-
అంతాకూడా నా ఐశ్వర్యమే! ప్రతి ఒక్కరు నారూపమే!
నావారే! నేను ఆ పరమాత్మయొక్క ఐశ్వర్యమునే!
లాభము భక్తియొక్క ప్రవృద్ధియే లాభము.
లాభో మద్భక్తిరుత్తమః భక్తియొక్క ఉన్నతియే జీవితాశయం!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
186

విద్య జీవుడే ఈశ్వరుడు. జీవుడే పరమాత్మ అను అఖండవిధ్యా త్మని భేదా బాధో అభిన్న-అద్వితీయ తత్త్వమును బోధించు శబ్దాలు
వాక్యాలు - వాక్యార్ధాలు - పాఠ్యాంశాలు .
భేదములన్నిటినీ బోధించునదే విద్య!
చెయ్యకూడని వికర్మలయందు / పట్ల హేయత్వము (I
జుగుప్సా హ్రీర కర్మసు should not do. Let me not do. I feel shy to keep
on doing wrong things) అనుదానిని
లజ్జ-సిగ్గు అని హ్రీ అని చెప్పబడుతోంది.
శ్రీర్గుణాః దృశ్యములో కనిపించే దేనిపట్లా కూడా అపేక్షలేనివాడై
శ్రీర్గుణా నైరపేక్ష్యాద్యాః - నిరపేక్షుడై ఉండటం. కావాలనిగాని - అఖర్లేదనిగాని
ఆవేశపడక పోవటం
సుఖము సుఖ-దుఃఖములను అతిక్రమించి ఉండటమే నిజమైన
సుఖం దుఃఖ సుఖాత్యయః సుఖము
దుఃఖము నాకు విషయభోగములు-లోక సంబంధమైన సుఖములు
దుఃఖం కామ సుఖాపేక్షా లభించాలి. కావాలి - అని అనుకోవటమే దుఃఖము.
పండితుడు దేనివలన బంధము - ఏది బంధము, దేనివలన మోక్షము
పండితో బంధ-మోక్ష విత్ - ఏది మోక్షము ఈ తతత్త్వము ఎఱిగినవాడు పండితుడు.
మూర్ఖుడు ఈ శరీరము - ఆయా దృశ్య విషయములపట్ల బంధుమూర్ఖదేహాద్యహం బుద్ధిః మిత్ర - గృహ-తదితర లోకసంబంధమైన విషయాల
పట్ల ఇవి నావి! నేను వీటికి చెందినవాడను అను
భావములను బలముగా ఆశ్రయిస్తున్నవాడు.
మార్గము/సత్పంధా సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడు అగు నన్ను
పన్ద మన్నిగమః స్మృతః చేరే ప్రయత్నములే పంధా!
కుపథము చిత్త విక్షేము - తత్త్వమునుఏమరుస్తూ - ప్రవృత్తి మార్గము
ఉత్పథః చిత్త విక్షేపః కుపథము (Right path). ప్రాపంచక విషయములపట్ల
సదా మననం చేయు చిత్త - విక్షేపము.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
187

సత్ స్వర్గము వర్గము
స్వర్గః సత్త్వగుణోదయః సత్వగుణమునకు సంబంధించిన ప్రేమ-వాత్సల్యముదయ-దాక్షిణ్యము ఇత్యాదియొక్క ప్రవృద్ధి.
కోపము నరకము - ఆవేశము - కసి - ద్వేషము - నిరుత్సాహము
నరకః తమ ఉన్నాహో - బద్ధకము - బుద్ధి మాంద్యము... ఇవన్నీ అధికమౌతూ
ఉంటే తమోగుణము వృద్ధి చెందుతున్నట్లు!
తమోగుణములు వృద్ధి చెందుతూ ఉండటమే నరకము!
బంధువు, గురువు, సఖుడు సర్వాంతర్యామినగు నేనే సర్వజీవులకు వాస్తవమైన
బంధుః గురురహం సఖే బంధువును, నీయొక్క - ప్రతి ఒక్కరియొక్క
ఆత్మస్వరూపుడనగు నేనే శ్రేయోభిలాషిని. గురువుని.
స్నేహితుడను. సఖుడను.
గృహం ఈ మానవ శరీరమే ఈ జీవునకు గృహము. ఇంటి
గృహం శరీరంమానుష్యం ఇల్లాలు ఇంటిలోకి చెత్తను రానిస్తుందా? ఉత్తమబుద్ది
గల బుద్ధిమంతుడు దేహములోనికి కామ క్రోథ-మదమాత్సర్యాలను రానీయడు.
ధనవంతుడు ఉత్తమ గుణములు కలవాడే ధనవంతుడు.
గుణాడ్యోహి ఆఢ్య ఉచ్యతే
దరిద్రుడు లభించినదానిని చూచుకొని సంతోషించకుండా లభించని
దరిద్రోహి యస్తు అసంతుష్టః వాటిని వరుసగా వ్రాసుకొని అసంతృప్తితో ఉన్నవాడు.
అసంతుష్టుడు.
కృపణుడు-అల్పుడు ఇంద్రియములను జయించనివాడు, ఇంద్రియములకు
కృపణోయో అజితేంద్రియః | వశుడై రోజులు గడిపేవాడు.
సంపద పరోపకారము దానము... ఇవే సంపద
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
188

ధీరుడు-స్వతంత్రుడు ఎవ్వడైతే విషయములందు ఆసక్తిలేనివాడై ఉంటాడో,
గుణేషు అసక్తః ధీరీశో అనుబంధ - సంబంధ - బాంధవ్యములను కలిగి
ఉంటూనే సర్వదా అతీతుడై ఉంటాడో, విషయములపట్ల
అంతరంగంలో అప్రమేయత్వమునకు సంబంధించిన
అవగాహన కలిగి ఉంటాడో.... ఆతడు స్వతంత్రుడు.
ఈ జీవుడు అంతరంగమున సర్వస్వతంత్రుడై బాహ్యము
ఆయా స్థాన-సందర్భ-పాత్రాచిత్యములలో మెలగటం
నేర్చుకుంటే.... ఆతడు సర్వదా స్వతంత్రుడే! నాటకంలో
పాత్రగా నటిస్తూ ఉంటే నాటకంలోని నాటకపాత్ర
యొక్క సాధక బాధకాలు నటుడివి అవుతాయా?
అవవు. కానీ అయినట్టు ప్రదర్శనం నిర్వర్తిస్తాడు. ఈ
కనబడేదంతా జగన్నాటకమేగా!
అస్వతంత్రుడు/ విషయములపట్ల - సందర్భ సంఘటనలపట్ల తీవ్రమైన
| గుణసంగుడు సక్తత - గుణ సంబంధమైన ఆవేశము కొనసాగించు
(గుణ సంగో విపర్యయః) వాడు అస్వతంత్రుడు. గుణసంగుడు.
ఓ ప్రియమిత్రమా! ఉద్దవా! నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ సంక్షిప్తంగా నా సమాధానమేమిటో
వివరించాను. మరొక్క విషయం!
గుణదోష లక్షణములగురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ఏం లాభం? దానికి
అంతు-పొంతు లేదు కూడా!
గుణదోష దృశిర్దోషో
గుణస్తూభయ వర్జితః (అధ్యా 19, శ్లో 45)
గుణ దోషముల గురించి పెద్దగా మననం ఆలోచన పెద్ద తప్పు! దోషం! వాటిని
పెద్దగా పట్టించుకోక పోవటమే ఉచితం. ఆత్మవస్తువు నిత్య నిర్మలము-అప్రమేయమునిర్దోషము-సమము అని గుర్తు పెట్టుకొనెదవుగాక!
సద్గుణ-దుర్గుణములను రెండింటినీ ప్రక్కకుపెట్టి - సర్వే సర్వత్రా ఆత్మయే అని గమనిస్తూ
ఆత్మోపాసనకు ఉపక్రమించటమే ఉపాయం. అదే సర్వాత్మకుడనైన నన్నుజేరే
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
189

తరుణోపాయం! మంచివారి గురించి, మహనీయుల గురించి పెద్దగాను,
గుణదోషములగురించి చాలా చిన్నగాను పట్టించుకోవటం
మాట్లాడుకోవటం - సంసార నివృత్తికి సాహకారికమని నా అభిప్రాయము.
28. విధి నిషేధములు - యోగాధికారములు
శ్రీ ఉద్ధవుడు : హే పరంధామా! శ్రీకృష్ణ పరమాత్మా! నీ బోధలు ఈ సందర్భములో
నన్ను పవిత్రం చేస్తూ వున్నాయి. అంతేకాదు. అవి నా ద్వారా అనేకమంది
ముముక్షువులకు అందజేస్తున్న పాఠ్యాంశములు! అమోఘములు! ఒక్కమాటతో
చెప్పాలంటే, మీరు మా అందరిపై ప్రేమామృతమును కురిపిస్తున్నారు.
కృష్ణయ్యా! జ్ఞానః సంచ్చిన్న సంశయః అని మీరే ఒక సందర్భములో అని ఉన్నారు
కదా! అందుచేత వేదములు ప్రవచిస్తున్న వైదిక ధర్మాల విషయంలో నాకు చూచాయగా
గల కొన్ని సంశయాలను మీ ముందుంచుతాను అనుజ్ఞ ఇవ్వండి.
శ్లో॥ విధిశ్చ ప్రతిషేధశ్చ నిగమో హి ఈశ్వరస్యతే!
అవేక్షతే అరవిందాక్ష! గుణం దోషంచ కర్మణామ్ (అధ్యా 20, శ్లో1)
ఓ అరవిందాక్షా! కమలనయనా! వేదపురుషా! పురుషోత్తమా! వేదములు మీ విధినిషేధ రూపమైన ఆదేశములే.... అని వేదజ్ఞులు ప్రవచనం చేస్తూ ఉంటారు. అట్టి
వేదములు...
కర్మ దోషములను
గుణ దోషములను
పాపపుణ్యముల గురించి
వివరిస్తూ పాఠ్యాంశాలు అందిస్తున్నాయి. అటువంటి వేద శాస్త్రములు...,
వర్ణాశ్రమ భేదధర్మాల గురించి చెప్పుచున్నాయి.
ప్రతిలోమజ - అనులోమజ (అనుసరించటంచేత - నిర్వర్తించకపోవటం చేత)
కొన్ని కొన్ని గుణదోషముల గురించి కూడా చెప్పుచున్నాయి.
ద్రవ్య-దేశ-వయస్సు-ఆశ్రమ సంబంధమైన నియమములు బోధిస్తున్నాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
190

కాలగతమైనటువంటి యోగ్యత - అయోగ్యతలగురించి, స్వర్గ నరకముల గురించి
వివరణలు అందిస్తున్నాయి.
స్వామీ!
విధి-నిషేధములగురించి వేదవాఙ్మయం చెప్పుచున్నప్పుడు, గుణ-దోష-భేద దృష్టి
లేకుండా ఆ విధి నిషేధాలు వేదాలు చెప్పలేవు కదా!
"మానవునికి ముక్తి కలగాలి" అని కదా ఆధ్యాత్మశాస్త్రము (లేక) వేదాంత శాస్త్రము
యొక్క ఉద్దేశ్యం? విధి-నిషేధాలు లేకుండా ముక్తిగురించి చెప్పటం కుదరదు కదా!
ఓ దేవదేవా! వేదవాక్కులే ఆచరణీయములు అని శాస్త్ర ప్రసిద్ధి. నీ వాక్కే దేవతలకు
పితృదేవతలకు వేదము కదా! అట్టి నీవాక్కు మా అందరికీ ప్రమాణము.
అయితే వేదములు
1. సర్వ అనుభవములకు అతీతమగు కర్మ-జన్మలకు అప్రమేయమగు మోక్షసాధన
గురించి చెప్పుచున్నాయి.
2. మరొకవైపు స్వర్గ-నరకమార్గముల గురించిన విశేషాలు చెప్పుచున్నాము.
3. ఇంకొకవైపునుండి సాధ్య-సాధన సంబంధమైన వివరణలను, జ్ఞానమును వెల్లడి
చేస్తున్నాయి.
వేరొకవైపు నుండి జనులలో పరస్పర 4. ప్రేమ-స్నేహ-వాత్సల్య-సానుకూల్యతలను
ఉద్దేశ్యిస్తున్నాయి.
వేదవాక్కులు గుణ దోషముల గురించి భేద దృష్టిగా ప్రవచిస్తున్నప్పటికీ.... అదంతా
సందర్భ బోధయేగాని,.... స్వతఃసిద్ధమైన బోధ-ఆత్యంతికమైన బోధకాదు. భేదము
కల్పిస్తున్న వేదములు సర్వభేదములను తొలగించటానికే అయి ఉన్నది. (Differences
are being dealt for the sake of taking off differences as well as taking us to
beyond differences ) అని నాకు అనిపిస్తోంది.
అది అట్లా ఉండగా, నాకు ఎందుకో ఇంకా ఒక సందేహము వదలటం లేదు.
వేదముల ముఖ్యోద్దేశ్యం ఏమైవున్నది?
భేదములగురించి (పుణ్యపాప-అల్ప-మహనీయ గుణ భేదాల గురించి)
అంతిమంగా చెప్పటమా?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
191

లేక "సర్వమ్ ఖల్విదం బ్రహ్మ" - "ఏకోసత్ విప్రాబహుధా వదంతి"... ఇత్యాది
బోధలద్వారా సమము అఖండము - అప్రమేయము - స్వస్వరూపము అగు
పరమాత్మ తత్త్వమును జీవులకు అందించటానికే అంతిమంగా ఉద్దేశ్యిస్తున్నాయా?
నాకు గల ఈ సందేహం దయయుంచి తొలగించండి!
శ్రీకృష్ణ భగవానుడు :
ఓ ఉద్ధవా! మిత్రమా! మంచి ప్రశ్న అడిగావయ్యా! చెప్పుతాను విను. ఈ జీవుని -
శివునిగా, నరుని నారాయణునిగా, మానవుణ్ణి మాధవునిగా తీర్చిదిద్దటమే
ముఖ్యోద్దేశ్యం. అయితే మరందుకు మార్గం, ఉపాయము కావాలికదా!
యోగాః త్రయో మయాప్రోక్తా నృణాం శ్రేయో విధిత్సయా!
జ్ఞానం కర్మ చ భక్తి శ్చ నోపాయో అన్యో అస్తి కుత్ర చిత్ II (అధ్యా 20, శ్లో 6)
మానవులకు శుభం కలగాలని, మానవజన్మలో కృతార్ధులవటానికి, జన్మ సార్ధకతకొరకై
నేను సృష్టి సందర్భంలో వేదములద్వారా మూడు యోగములను నిర్దేశించటం జరిగింది.
1. కర్మయోగము (సాధనలు)
2. జ్ఞాన యోగము (విచారణ)
3. భక్తి యోగము (పరాప్రేమ)
నో ఉపాయో అన్యోస్తి కుత్రచిత్ |
ఈ మూడింటికన్నా వేరుగా ఎక్కడా మరొక త్రోవ - మార్గము ఏదీ లేదు. వేదములు
ప్రతిపాదిస్తున్నది, అభివర్ణిస్తున్నది, నిర్వచిస్తున్నది, గానం చేస్తున్నది ఈ మూడింటినే!
మిగతావన్నీ ఈ మూడింటిలోనే ఉన్నాయని, అంతేకాకుండా, వాటిలో ప్రతిఒక్క దానిలో
మిగతా రెండు అంతర్లీనమై ఉన్నాయని కూడా. గమనించు.
ఎవరు దేనికి అధికారులు?
(Who deserve to take which path?)
1. కర్మయోగాధికారులు - వేదములలోని కర్మకాండ (సంహిత): ఎవ్వరికైతే కర్మలు
నిర్వర్తించటంలో అభిరుచి ఉంటుందో, కర్మఫలములందు ఎవ్వరికైతే ఆసక్తి మానసికంగా
కొనసాగడం జరుగుతోందో... అట్టివారి కొరకై కర్మయోగము నాచే మోక్షమార్గంగా
చెప్పబడింది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
192

అనగా,
కర్మ ఫలములపట్ల విరక్తి చెందనివారు,
"కర్మఫలములు అంతిమంగా దుఃఖముతో కూడినవే కదా!.... "అనే అవగాహనతో
కూడిన బుద్ధిని ఇంకనూ పెంపొందించుకోనివారు,
సకామకర్ములు
వీరు కర్మయోగ మార్గమునకు అధికారులు. (They better deserve to the path of
Karma Yoga)
వీరికొరకై నిత్య - వైమిత్తికంగా నిర్వర్తించవలసిన ఆయా విధానము - తీరు, వాటికి
సంబంధించిన నియమ-నిష్ఠలు ఇత్యాదులన్నీ వేదములచే చెప్పబడుచున్నాయి. అవి
ఎప్పటిదాకా అవసరం? సకామకర్మలపట్ల - కర్మఫలముపట్ల అభిలాష ఉన్నంతవరకు!
అయితే....,
సకామి అయి యజ్ఞ యాగ-వ్రత-ప్రాణోపాసన-నియమాదులు నిర్వర్తించుటచే ఈ
జీవుడు సుఖమయమగు స్వర్గలోకాలు పొందుచున్నాడు కూడా!
నిషిద్ధ కర్మలు నిర్వర్తించటంచేత దుఃఖదాయకములగు లోకములు పొందటం
జరుగుచున్నది.
వేదములలోని కర్మవిభాగము ఇవి నిషిద్ధ కర్మలు
ఇవి ఆశ్రయించవలసిన కర్మలు
అని బోధిస్తున్నాయి. సూచిస్తున్నాయి. నియమిస్తున్నాయి. హేయ-ఉపాదేయ కర్మ
మార్గాలను నిర్దేసిస్తున్నాయి. వాటిని శ్రద్ధగా ఆశ్రయించుచున్నవాడు క్రమంగా నిష్కామి
అయి, మోక్షమునకసు అర్హుడగుచున్నాడు!
2. భక్తియోగాధికారులు - వేదములలోని ఉపాసనాకాండ (బ్రాహ్మణములు)
ఏదో కారణంచేత అవతారమూర్తుల కథలయందు త్రిమూర్తులయందు,
దేవతామూర్తులయందు ఆదరము కలిగియున్నవాడు
విషయములపట్ల వైరాగ్యము కలిగియున్నవాడు (లేదా) ఆదరణ - ఆకర్షణ
(Attraction) తగ్గుచూ వస్తున్నవాడు...,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
193

అట్టివాడు భక్తియోగమునకు అర్హుడై ఉంటున్నాడు. ఆతనికి భక్తియొక్క అభివృద్ధికొరకై
దేవతా అవతారమూర్తుల ఉపాసనలు, స్తోత్రములు, ధ్యాననిష్టలు... ఇత్యాదులన్నీ
వేదములయొక్క వివిధ బ్రాహ్మణముల విభాగములో అందించబడుచున్నాయి.
నిషిద్ధకర్మ త్యాగి శుద్ధచిత్తుడు స్వధర్మపరాయణుడు... ఇట్టివాడు మరేలోకం
వెళ్ళవలసిన అవసరం లేకుండానే ఇక్కడే క్రమంగా జ్ఞానభూమికలను అధిగమిస్తూ
భక్తిని పెంపొందించుకుంటున్నాడు. జ్ఞాన భక్తి సంపాదించుకుంటున్నాడు.
ఓ ఉద్ధవా! ఈ మానవజన్మ గొప్ప అవకాశం సుమా! ఎందుకంటావేమో?
అటు స్వర్గలోకంలోగాని ఇటు నరకలోకంలో గాని
జ్ఞానభక్తిని సాధించటానికి ఇంతటి అవకాశాలు వుండవు. అందుచేత జ్ఞానభక్తుడుగా
రూపుదిద్దుకుంటున్నవాడు - మానవజన్మనే అధికంగా కోరుకుంటాడు గాని స్వర్గలోక
నివాసం కాదు.
క్రమంగా భక్తి ప్రపత్తులు ప్రవృద్ధం అవుతూ ఉండగా...,
శ్లో న నరః స్వర్గతిం కాంక్షేత్, నా నరకీం వా విచక్షణః
II
న ఇమం లోకం చ కాంక్షేత దేహావేశాత్ ప్రమాద్యతి || (అధ్యా 20, శ్లో 13)
దేహమే దేహికి ఒక తీరుగా సాధన వస్తువు - మరొక తీరుగా ఐహిక మోహం కదా!
అందుచేత ఉత్తమ భక్తి-ప్రపత్తులు రూపుదిద్దుకుంటూ ఉండగా....ఇక ఆతడు స్వర్గము
కోరడు. నరకము కోరడు. ఈలోకంలో ఏదో స్థానము కోరడు. ఏ దేహం వచ్చినా
రాకున్నా నా బుద్ధి మాత్రం సర్వదా మీ పదాలు ఆశ్రయించి ఉండే వరం ప్రసాదించు
స్వామీ!.... అని మాత్రమే నన్ను కోరుకుంటూ ఉంటాడు. ఆతడికి నేను తప్పితే మరింకేమీ
అఖర్లేదు. ఆతనిపట్ల - భక్తియే మోక్షస్థానమై ప్రకాశిస్తోంది!
3. జ్ఞానయోగాధికారులు :
భక్తిచే జ్ఞానము - జ్ఞానముచే భక్తి ప్రవృద్ధమై ఏకత్వము సంతరించుకొని ఆత్మౌపమ్యేవ
సర్వత్ర - సమంపస్యతి... అను ఆత్మసాక్షాత్కార స్థితిని కోరుకొనేవారికి జ్ఞానయోగ
మార్గము ఉపనిషత్తులద్వారా, తదితర వేదమహా వాక్యములద్వారా (తత్త్వమసి
జీవోబ్రహ్మేతి నా పరః సో హమ్ అయమాత్మా బ్రహ్మ తత్త్వమ్ ఇత్యాది
మహావాక్య శబ్దముల ద్వారా) వేదములు బోధిస్తున్నాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
194

ఓ ఉద్ధవా! ఈ మానవ దేహము అశాశ్వతమైనది. వినాశనశీలము.
వార్ధక్యము-అనారోగ్యము ఇత్యాది దోషములు కలిగియున్నట్టిది! ఇది అందరికీ తెలిసిన
విషయమేకదా! అయితే మాత్రం ఏం? జీవితము అనేది మహత్తరమైన అవకాశము.
ఈ మానవ దేహము జీవునికి కర్మయోగము భక్తియోగము - జ్ఞానయోగము
ప్రసాదించగల అవకాశములు కలిగి ఉన్నట్టిది. మోక్షము అనే పురుషార్ధమును
ప్రసాదించగలిగినది సుమా! అందుచేత జీవుడు ఏం చేయాలి?
ఈ పురుషుడు అప్రమత్తమైన-సముత్సాహముతో కూడిన (Very alert and enthusiastic) భావన - ప్రయత్నము - ఉద్దేశ్యములతో...
మృత్యువు సమీపించటానికి మునుముందే...,
ముక్తికై ప్రయత్నాలు చేయాలి! కర్మ-భక్తి-జ్ఞానయోగములు మూడిటినీ ఒకేసారి
సమీకరించుకోవాలి!
అని గమనించబడు గాక!
కర్మ-భక్తి-జ్ఞాన మార్గాలను వేరువేరైనట్లుగా చూడవద్దు. అనుకోవద్దు. ప్రతి ఒక్క దానిలో
మిగిలిన రెండూ ఉన్నాయనేది గమనించు!
ఓ ఉద్ధవా! ఒక ముఖ్యమైన పాఠ్యాంశాన్ని గమనించాలని నీద్వారా జనులందరికి గుర్తు
చేస్తున్నానయ్యా!
శ్లో ఛిద్యమానం యమైరేతైః కృతనీడం వనస్పతిమ్
ఖగః స్వకేతమ్ ఉత్సృజ్య క్షేమం యాతి హి అలంపటః (అధ్యా 20, శ్లో 15)
ఒకానొక గరుడ పక్షి ఒక పెద్ద వృక్షముపైగల అనువైనచోట ఒక పెద్దగూడు అందంగా
కట్టుకొని భార్య, పిల్ల - పాపలతో హాయిగా నివసిస్తోంది. రోజులు గడుపుతోంది. ఒక
రోజు కొంతమంది బోయవాళ్ళు ఆ మహావృక్షముక్రింద నిలబడి, "అరై! రేపు మళ్ళీవద్దాం!
ఈ మహావృక్షమును వంటచెరకుకై రాజుగారి వంటశాలకు అందజేద్దాం! దుడ్లు (డబ్బు)
బాగా లభిస్తాయి...." అని చెప్పుకుంటున్నారు. కొంతసేపైన తరువాత వారంతా
వెళ్ళిపోయారు.
తన గూడులో హాయిగా కూర్చుని ఉన్న ఖగరాజు (పక్షి) ఇట్లా అనుకొన్నది, "ఆహాఁ!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
195

యమభటులవంటి ఈ ఆటవికులు రేపువచ్చి ఈ వృక్షమును నరకబోతున్నారుకాబోలు!
వాళ్ళ కళ్ళ బడ్డామా, నన్ను - నా భర్య - బిడ్డలను బంధించి తీసుకుపోగలరు. ఏం
చేద్దాంరా బాబు?" అని ఆలోచించసాగింది. ఆడ పక్షిని పిలిచి తాను విన్నదంతా చెప్పి
"ఏంచేద్దాం? చెప్పు?" అన్నది. ఆడపక్షి అంటోంది
ఇంక చేసేదేమున్నదయ్యా? ప్రమాదం వచ్చేవరకు తీరికగా కూర్చుని ఉంటామా?
లేదు. పదండి. ఈ వృక్షము ఈ గూడు వదలి మరొక చెట్టును చూచుకొని
గూడు కట్టుకుందాం!
వెంటనే ఆ పక్షుల కుటుంబం రాత్రికి రాత్రే మకాంమార్చి సుదూరంగా ఉన్న వేరొక
మఱిచెట్టుపై వ్రాలి గూడు కట్టుకోనారంభించాయి. ఆమాత్రం పక్షులకు ఉన్న తెలివి
మానవుడికి ఉండనఖర్లేదా? ఏమాత్రం తెలివి ఉన్నాకూడా....,
అయ్యో! రోజు రోజుకు ఆయుష్షు తగ్గుతోందే! యమభటులు ఒకానొకరోజు
చెప్పా పెట్టకుండా వచ్చి ఈ దేహమును లాక్కుపోబోతున్నారు కదా! కనుక
అత్యవసరంగా– శేషించి ఉన్న ఆయుష్షును సద్వినియోగం చేసుకోవాలికదా!
అని తలుస్తాడు. భయపడతాడు. సంగమును త్యజించి పరబ్రహ్మమును గుర్తించి
తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. దృశ్యము దేహములకు సంబంధించిన సర్వ
కామములు త్యజించి క్రమంగా నిష్కాముడై పరమశాంతిని సముపార్జించుకుంటాడు.
ఆత్మభగవానునితో మమేకమయ్యే ప్రయత్నములను తీవ్రపరచుకుంటాడు.
ఈ మానవశరీరము సర్వఫలములు సంపాదించుకోవటానికి గొప్ప ఉపకరణము.
అత్యంత దుర్లభంగా మాత్రమే లభిస్తుంది. చక్కటి కరణాలు (చూపు - వినికిడి మొదలైన
ఇంద్రియ శక్తులు) ఈ దేహంలో ఉన్నాయి. కనుక సంసార సాగరమును దాటటానికి
ఇది గొప్ప దృఢమైన నౌక!
శరణువేడితే చాలు, గురు దేవులు ఆత్మ విద్యను బోధిస్తారు. కర్ణధారులై (పడవను
నడిపే ఆయన) అటు సంసారసాగరం దాటిస్తారు.
భగవంతుని స్మరిస్తూ, శాస్త్రానుకూలమైన మార్గంలో కర్మలు నిర్వర్తిస్తూవుంటే...
ఈ పడవ లక్ష్యము వైపుగా తీసుకుపోతుంది
అని ఈ జీవుడు తీవ్రంగా అనుకోవాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
196

ఇంత చక్కని సర్వానుకూలమైన మానవదేహమును ఉపయోగించుకుని శాస్త్ర-గురు
ప్రవచిత సాధనలకు ఉపక్రమించి సంసారసాగరమునుండి తరించటం, ఆధ్యాత్మిక
జ్ఞానమును పెంపొందించు కోవటం అనే మార్గంలో ప్రయత్నాలు నిర్వర్తించకపోతేనో?
అట్టివాడు లభించిన అవకాశమును రెండుచేతులా జార్చుకుంటున్నట్లే! ఆత్మద్రోహం
చేసుకుంటున్నట్లే! అధఃపతనమును తెచ్చిపెట్టుకుంటున్నట్లే! చదువుకోరా అని తండ్రి
మంచి బడిలో జేర్పిస్తే, అల్లరి చిల్లరి పనులతో రోజులు వృధా చేసుకోవటం వంటిదే!
ఈ మనస్సు ఇంద్రియ విషయముల వైపుగా అతివేగంగా ప్రయాణిస్తోంది! ఒక్క విషయం
కాదు, రెండుగాదు ఒకేసారి సహస్రాధికంగా అనేక విషయములను అనుక్షణం మార్చి
మార్చి యోచనలు చేస్తూ దేహమున్నంతవరకు అతి చంచలమై ఉంటోంది. దేహము
బాగున్నంత వరకు ఆత్మ జ్ఞానమునకు ఉపక్రమించకపోవటంచేత, వేదములు చెప్పే
సాధనలను శ్రద్ధగా నిర్వర్తించి యత్నించకపోవటంచేత - పర్యవసానం? దేహమున్నప్పుడు
- దేహానంతరం - మరొక దేహము ఆరంభమౌతున్నప్పుడు కూడా ఉద్విగ్నత - దుఃఖము
భయము ఇత్యాదులు తొలగటమేలేదు. విజ్ఞులగువారు ఇదంతా గమనిస్తున్నారు.
"యేహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః" అని మును
ముందుగానే గుర్తిస్తున్నారు. కర్మ-కర్మఫలములపట్ల విరక్తులగుచున్నారు. దృశ్య
ఫలములపట్లగల అనురక్తిని ఉపశమింపజేసుకొనే మార్గమును అన్వేషించి -
ఆశ్రయిస్తున్నారు. ఆత్మజ్ఞానమునకు సంబంధించిన వృత్తులను స్వీకరిస్తూ నిశ్చలమైన
భావంతో-యోగభావంతో మనస్సును ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే...
ఈ మనస్సు సముద్రతరంగాలకన్నా - వాయుతరంగాలకన్నా అతి చంచలం కదా!
ఇది లక్ష్యవస్తువుపై నిలకడగా ఉండదు. అది గమనించినయోగి ఈ మనోబాలకుణ్ణి
(లేక) చిత్తబాలకుణ్ణి అనురోధమైన (అనుకూలమైన - through positive methods)
మార్గములద్వారా స్వాధీనం చేసుకోవాలి. అంతేగాని, మనోగతిని ఉపేక్షించి, తగిన
సాధనలకు ఉపక్రమించకుండా రోజులు గడుపరాదు.
శ్లో॥ మనోగతిం న విసృజేత్ జితప్రాణో జితేంద్రియః
సత్త్వ సంపన్నయా బుద్ధ్యా మనః ఆత్మవశం నయేత్ || (అధ్యా 20, శ్లో 20)
ఇంద్రియములను సాధనలద్వారా జయిస్తూ (జితేంద్రియుడగుచు), ప్రియస్వరూపమైన
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
197

ప్రాణములను వశం చేసుకుంటూ (జితప్రాణుడగుచు)... సత్యగుణ సంపన్నమైనట్టి
బుద్ధి ద్వారా బుద్ధిని ఆత్మవశం చేసుకోవాలి!
అది ఎటువంటి ప్రయత్నమంటే....,
అశ్వారూఢుడు (గుర్రపురౌతు) గుర్రమును అధిరోహించి ఒక ముఖ్యమైన పనికోసం
ఒకచోటికి బయలుదేరాడనుకో! ఆ గుర్రము తనకు యిష్టం వచ్చిన మార్గంలో ఎటో
అడవులవైపుగా మేతకోసం పరుగులు తీస్తూ ఉంటే, "ఆఁ! ఏం చేద్దాం! పోనీలే!"
అని చూచీచూడనట్లు ఊరుకుంటాడా? ఊరుకుంటేనో? (లేక) ఏవేవో అనవసరమైన
వ్యాపకాలు మననం చేస్తూ మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ ఉంటేనో? ఏమౌతుంది?
ఆ గుర్రపుస్వారీ చేసే ఆయన తను చేరవలసిన స్థానం (పట్టణం) చేరుతాడా? లేదు.
ఏ అడవులలోనో చిక్కుకుని బహుయాతనలు పడతాడు. ఇది గమనించి, ఆ రౌతు ఏం
చేస్తున్నాడు? "ఈ గుర్రము నా మనోభావాలు గమనించి నేను వెళ్ళవలసిన వైపుగా
పరుగెత్తాలి? ఈ గుర్రం నామాటవినేటట్లు చేసేది ఎట్లా? ..." అని ఉపాయాలు
యోచిస్తున్నాడు. కార్యరూపంగా ఆ ఉపాయాలు నిర్వర్తించి గుర్రము తన స్వాధీన
మయ్యేటట్లు చేసుకుంటున్నాడు.
పగ్గములను పట్టుకొంటాడు.
పూర్తిగా విడువడు. అట్లా అని గుర్రములు కదలనంతగా పట్టుకోడు.
మంచి శబ్దములతో - స్పర్శలతో - చండాకోలుతో - మాటలతో.... తను
అనుకున్నవైపుగా ముఖంత్రిప్పి పరిగెత్తేటట్లు చేసుకుంటున్నాడు.
ఆ గుర్రపు రౌతులాగానే మానవుడైనవాడు ఈ మనో అశ్వమును నయాన-భయానవేద-వేదాంగములు-స్మృతులు పెద్దలు గురువులు ప్రబోధిస్తున్న సాధన సంపత్తియొక్క
సహాయముతో తనవశం చేసుకోవాలి.
ఈ మనస్సు నిశ్చలత్వం పొందేవరకూ ఈ జీవుడు సాధనలను తత్త్వజ్ఞానమును
ఆశ్రయించాలి. ఈ దృశ్యములో అనుభవమగుచున్న స్థూలదేహమునుండి మహత్తత్త్వము
వరకు గల సర్వ పదార్థములను
అనులోమక్రమ సృష్టి గురించి (How from nothing every thing is coming
out and appearing)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
198