ప్రతిలోమ క్రమ ప్రళయము గురించి (How everything is eventually
getting into nothing)
మనో-బుద్ధుల సహాయంతో యోచించాలి. గమనించాలి. నిర్వేదము (Non-worrying)
వైరాగ్యయుక్తము (Detatchment) అగు చిత్తమును సంపాదించుకోవాలి. ఒకవైపునుండి
అటువంటి నిర్మల-నిశ్చల చిత్తముతో గురూపదేశములను - గురువుల ఉద్దేశ్యములను
పఠించి పాటించి మరొకవైపు నుండి ప్రాణాయామ పూజాది కార్యక్రమములకు
ఉపక్రమిస్తూ - క్రమంగా దేహాభిమానమును త్యజించాలి.
దృశ్యాభిమానం త్యజించటం (లేక) జయించటం మాటలతో చెప్పుకొనేంత తేలికైనది
కాదు. అందుకుగాను యమము-నియమము -ధారణ ఇత్యాది యోగమార్గములకు
(సాధనలకు) ఉపక్రమించాలి. మరొకవైపుగా వస్తుతత్త్వమును పరిశీలనచేస్తూ తర్క
విద్యద్వారా సర్వాధారమైన పరతత్తత్వముయొక్క అవగాహనను పెంపొందించుకుంటూ
ఉండాలి. ప్రతిమలను అర్చించటం - ధ్యానించటం ఇవన్నీకూడా ఏకాగ్రతకు ఉపాయాలై
ఉన్నాయి. అవన్నీ అవసరమే!
దేహమున్నంతవరకు కర్మలు అనివార్యం. కర్మలు కొంత దోషముతో కూడుకొనియే
ఉంటాయి. అందుచేత యోగి అయినవాడు ప్రమాదవశాత్ ఏమైనా నిందితకర్మలు
నిర్వర్తిస్తూ ఉంటే... వాటిని లోకానుకూలంగా మరల్చుకోవాలి. మరొకవైపుగా వాటివాటి దోషముల నివృత్తికొరకై ప్రాణాయామాది యోగసాధనలద్వారా ప్రయత్నము
కొనసాగిస్తూ ఉండాలి కూడా!
ఆ ప్రాయశ్చిత్తకర్మలు కూడా సులభంగాను సహజనులకు అనుకూలంగాను ఉండాలేగాని...
లోకాలను బాధించేటట్లు, తనను తాను బాధించుకునేటట్లు ఉండరాదు సుమా!
ఓ ఉద్దవా! ఈవిధంగా మన కర్మయోగాధికారి-భక్తియోగాధికారి - జ్ఞానయోగాధికారిల
గురించి చెప్పుకుంటున్నాం కదా! అయితే ఈ ముగ్గురికి గురువు తల్లి కూడా వేదమాతయే!
ఈ త్రివిధసాధకులు సద్గుణులు - ఏకాగ్రచిత్తులు అవ్వాలనునదే వేదహృదయం. ఒకనికి
కర్మ-భక్తి-జ్ఞాన అధికారమును అనుసరించి ప్రయత్నములచే ఏర్పడే ఏకాగ్రతనే
సగుణము అనే పేరుతో పిలుస్తున్నారు. గుణములవలన కొంచెము దోషముకూడా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
199
ఉంటుందని అనుకున్నాంకదా! అటువంటి గుణదోష విధానముల వలన కలిగే
సాంగత్యమును (side effect of relatedness (or) confinement) ప్రాయశ్చిత్త
విధానాలచే పరిహరించుకొంటూ ఉండాలి కూడా! ఎందుకంటే, కర్మలు సహజంగా
చూస్తే కొంత దోషభూయిష్టముగానే ఉంటాయి. అశుద్ధత కొంత ఉంటుంది.
శ్లో॥ స్వేస్వే అధికారే యా నిష్ణా సగుణః పరికీర్తితః
కర్మాణాం జాతి అశుద్ధానాం అనేన నియమః కృతః
గుణదోష విధానేన సంగానాం త్యాజనేచ్ఛయా
|| (అధ్యా 20, శ్లో 26)
అని పెద్దలు చెప్పుచున్న విషయమే కదా! కర్మలు అనర్ధములకు మూలములని కూడా
చెప్పబడుతోంది. అందుచేత "కొంత కొంతవరకు దృశ్య వ్యవహారములందు ప్రవృతిని
సంకోచింపచేసుకుంటూ ఉండాలికూడా!..." అనేది ఏమరువరాదు.
అందుచే ఓ ఉద్దవా! "కర్మ విశేషములందు ఉద్విగ్నుడు అయినవానికి ఆ విషయ
సమూహములన్నీ దుఃఖాత్మకములౌతాయని గమనించండి!..." అని నా లీలావిశేష
కథలద్వారా గుర్తుచేస్తూనే ఉన్నాను. ఒకవేళ విషయ సమూహములను విడవలేకపోతూ
ఉంటే.... "నాయందలి భక్తియొక్క ప్రభావంచేత విషయ వాసనలు తొలగుతాయి" అని
కూడా నా లీలలచే బోధిస్తూ వస్తున్నాను. భక్తియొక్క ప్రభావంచేత కర్మలకు సంబంధించిన
దోషములు తమకుతామే తప్పక తొలగుతాయి. క్రమంగా భక్తియొక్క విశిష్ఠత చేత
దుఃఖ పరిణామములగు విషయములు అనివార్యంగా అనుభవిస్తూ ఉండవలసి
వస్తున్నప్పటికీ... వాటియందు ప్రీతిని కలిగి ఉండకుండెదవు గాక! సర్వాత్మకుడగు
పరమాత్మయే నీకు ప్రీతిపాత్రమగుగాక! అట్టి అప్రీతి భావన స్వభావసిద్ధంగా భక్తిచే
పెంపొంద గలదు. అద్దాని వలన హృదయంలో ఉండే విషయవాసనలన్నీ వినష్టమౌతాయి.
శ్లో॥ భిద్యతే హృదయగ్రంధిః ఛిద్యంతే సర్వసంశయాః
క్షీయంతే చ అస్య కర్మాణి మయిదృష్టే అఖిలాత్మని॥ (అధ్యా 20, శ్లో 30)
సర్వాంతర్యామిని - పరమాత్మ స్వరూపుడను అగు నన్ను సాక్షాత్కరింపజేసుకొనే
ప్రయత్నంలో ఉంటూ ఉండగా....,
ఈ జీవునియొక్క జీవాహంకారము స్వయంగా వినష్టమౌతూ వస్తుంది.
హృదయంలో తిష్ఠవేసుకొనియున్న సర్వ సంశయాలు తొలగుతూ వస్తాయి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
200
ఛిన్నమైపోతూ వుంటాయి.
సర్వ కర్మబంధాలు - కర్మరాశి కూడా క్షయం అవుతూ వస్తుంది.
పరమాత్మ పట్ల ప్రియము - ఇష్టము... ఇదే భక్తి.
ప్రాపంచక విషయములపట్ల ఇష్టము - ప్రియమే సంసారము.
ఎవరి చిత్తమైతే నాపట్ల ఏకాగ్రమౌతూ - భక్తిపారవస్యమౌతూ వస్తోందో (ఇష్టము
అధికమవుతూ ఉంటుందో... అట్టివానికి జ్ఞాన-వైరాగ్యములు స్వభావ సిద్ధమగుచూ,
భక్తియే సర్వమునకు సాధనాసంపత్తిగా అగుచున్నది. జ్ఞాన వైరాగ్యములు స్వభావమే
అవుతాయి.
అంతేకాదు!
కర్మ-తపస్సు-జ్ఞానము-వైరాగ్యము-యోగాభ్యాసము - తీర్థయాత్రలు - వ్రతములు
మొదలైన ఆయా సాధనలచే లభించగలదానిని సర్వదేవతాస్వరూపుడనగు నాయొక్క
భక్తుడు భక్తియోగముచే అనాయాసముగా పొందుచున్నాడయ్యా! ఒకవేళ నా భక్తుడు
ఎప్పుడైనా స్వర్గమో-మోక్షమో-వైకుంఠధామమో కోరుకుంటాడనుకో...! అవన్నీ భక్తునికి
అనాయాసంగా లభించగలవని చేతులెత్తి ప్రకటిస్తున్నాను.
చమత్కారం ఏమిటో గమనిస్తున్నావా?
సర్వాంతర్యామిఅయిన నాపట్ల భక్తిని పెంపొందించుకొన్నవారు "భక్తికి ఫలితంగా భక్తియే
మాకుచాలు! మాకు ఇంకేమీ అఖర్లేదు ..." అని నిర్ణయించుకొని ఉంటున్నారు.
భక్త్యానందమునకు సాటి ఏది? "నాయనా! నీకు మోక్షము ప్రసాదిస్తాను"... అని నేను
ముందుకువచ్చినాకూడా "సర్వతత్త్వ స్వరూపుడవగు నీపట్ల మాకు సర్వదా ఇష్టరూపమైన
భక్తి ఉంటేచాలయ్యా, ...." అని ఎలుగెత్తి సమాధానం చెప్పుచున్నారు.
స్వప్నసదృశమైనట్టిలోక సంఘటన - సందర్భములపట్ల అపేక్షయే బంధము.
నిరపేక్షయే సర్వోత్కృష్టము. అత్యధికవంతము. సకల శ్రేయోప్రసాదకము.
నిరపేక్షత నిష్కామము ఎక్కడ ఉంటాయో... అక్కడ నా పట్ల భక్తి అవిచ్ఛిన్నంగా
వికాసమానమౌతూనే వుంటుంది.
భక్తియొక్క ప్రభావంచేత రాగము స్వయంగా తొలగుతుంది. రహితమౌతుంది. భక్తియొక్క
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
201
ప్రభావంచేత మాయాతీత భగవత్ వస్తువును స్వయముగా పొందుచున్నారు. అట్టి భక్తునికి
విధి-నిషేధములకు సంబంధించిన పుణ్యపాపములు తాకజాలవు. శాస్త్రములు కూడా
ఆతనిపట్ల ఎట్టివిధి - నిషేధములు విధించవు. "బాగా చదువుకుంటున్న బాలునికి
బాగా చదవటానికి ఏఏ జాగ్రత్తలు కావాలి".... అని నియమాలు చెప్పంకదా! ఇదీ
అంతే!
నేను చెప్పిన ఈ కర్మ-జ్ఞాన-భక్తి మార్గములను ఆచరిస్తూ వస్తున్నవారు... అట్టి
జ్ఞానభక్తియొక్క ప్రభావముచేత కాలము - మాయలచే స్పృశించబడనట్టి వైకుంఠధామము
పొందుచున్నారు.
పరబ్రహ్మతత్త్వమును ఎరిగినవారై బ్రహ్మమే తామై వెలుగొందుచున్నారు.
29. గుణదోష వ్యవస్థాస్వరూప రహస్యము
శ్రీకృష్ణభగవానుడు : ఓ ప్రియ ఉద్ధవా! ఇప్పటివరకు కర్మ-జ్ఞాన-భక్తియోగ మార్గముల
ప్రాసస్త్యమేమిటో చెప్పాను కదా!
శ్లో॥ య ఏతాన్ మత్పథో హిత్వా భక్తి-జ్ఞాన-క్రియాత్మకాన్
క్షుద్రాన్ కామాన్ చలైః ప్రాణైః జుషన్తః సం సరంతి తే ॥ (అధ్యా 21, శ్లో1)
నేను చెప్పుతూ వస్తున్న భక్తి-జ్ఞాన-కర్మయోగసంబంధములగు మార్గములను
అనుసరించకుండా, అశ్రద్ధ - - బద్ధకము - వ్యతిరిక్త భావన - అల్పావగాహనలతో
చంచలమగు మనస్సుగలవారియొక్క, తుచ్ఛములైనట్టి ఇంద్రియ విషయములపై ఆసక్తి
పెంపొందిచుకొనువారియొక్క - గతి ఏమిటో (The path they are walking ) అది
కూడా వివరిస్తాను విను.
ఇంద్రియములకు తారసబడుచున్న విషయములే గొప్పవి... అని తలచి రోజులు
గడుపువారు నానావిధ యోనులలో సుదీర్ఘప్రయాణము చేస్తూ ఉంటారని గుర్తుచేస్తున్నాను.
సగుణము : తనకు అర్హమైన ఆశ్రమము - అధికార మార్గమును సశాస్త్రీయముగా
ఆశ్రయించటం, ప్రేమ-దయ-దానము-దైవోపాసన - ఇత్యాధివి పెంపొందించుకొనే
ప్రయత్నంలో వుండటం - సగుణము.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
202
అట్లా ఆచరించకపోవటమే దుర్గుణము.
శ్రీ ఉద్ధవుడు : పరంధామా! సర్వము పరబ్రహ్మమేకదా! సర్వం ఖల్విదం బ్రహ్మ
అనికదా ఉపనిషత్ మహావాక్యము! మరి శాస్త్రములలో మరికొన్ని విభాగములు "ఇది
యోగ్యము ఇది అయోగ్యము" అని వస్తుసముదాయములగురించి, ఇది "శుద్ధము
- ఇది అశుద్ధము, ఇది శుభము - ఇది అశుభము" అని విధి-నిషేధ ప్రతిబంధక -
అనుబంధక విషయముల గురించి ఎందుకు చెప్పుచున్నాయ్?
ఈ రెండు ప్రవచనములను సమన్వయించుకోవటం ఎట్లా?
శ్రీకృష్ణుడు : ఈ జీవుడు స్వాభావికవృత్తిచే ద్రవ్య విశేషములపట్ల ఆరర్షితుడగుచు
ఆత్మదృష్టి - పరాదృష్టి ఏమరుస్తున్నాడు. ఫలితం? కల్పితము - క్షణక్షణ పరివర్తనము
అగు దృశ్యధ్యాస ఈతనిని దుఃఖితునిగా, అల్పాశయునిగా, బలహీనునిగా చేసివేస్తోంది.
మహనీయులగు మహర్షులు తమబిడ్డలగు అజ్ఞానజీవుల అపార జన్మ-జరా-సంసార
దుఃఖాలకు హృదయం ద్రవించి, వారి దుఃఖాలు తొలగించ పూనుకొనుచున్నారు.
అందుకు ప్రారంభ పాఠ్యాంశంగా...,
ఇది యోగ్యము. ఇది కాదు.
ఇది పుణ్యము - ఇది పాపము.
|
ఇది శుద్ధము - ఇది అశుద్ధము. |
ఇది విధి ఇది నిషిద్ధము.
మొదలైనవన్నీ శాస్త్రరూపంగా రచించి జనులకు ప్రసాదించటం జరుగుతోంది. అట్టి
ధర్మశాస్త్రములు, శాస్త్రప్రవచిత తదితరమార్గములు మొదలైనవి అనుసరణీయమని,
ఆచరణకు సాధ్యమేనని మనువు మొదలైన నా అవతారములద్వారా నేను జనులకు
దృష్టాంతపూర్వకంగా సర్వజనులకు బోధిస్తూ వస్తున్నాను.
ఓ ఉద్ధవా! స్వప్నము స్వప్న దర్శిలోంచే బయల్వెడలుతోంది కదా! సర్వమునకు మూలము
స్వస్వరూపమగు పరబ్రహ్మమే! అట్టి పరబ్రహ్మమునుండే ఆకాశము వాయువు
అగ్ని - జలము భూమి అనునవి బయల్వెడలుచున్నాయి. ఆ పంచభూతములే
బ్రహ్మనుండి - స్థావరము వరకు గల సర్వప్రాణుల శరీరాలకు మూలకారణం. అందుచేత
పంచభూతములు పంచభూత నిర్మిత భౌతికదేహములు పరమాత్మ వస్తువుతో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
203
సంబంధము కలిగి ఉన్నాయి. అనేక రకాలైన కుండలకు మట్టియే అధిష్ఠానం అయినట్లు
సర్వప్రాణులకు మూలవస్తువు సచ్చిదానంద బ్రహ్మమే!
అయితే....,
ప్రాణుల దేహములు, భౌతిక పదార్ధముల దృష్ట్యా సమానములే అయినప్పటికీ...
గుణములదృష్ట్యా భిన్నముగా ఉంటున్నాయి. అట్టి ఈ జీవుల పురుషార్ధసిద్ధి కొరకై
వేదములు సాధనాక్రమమును (The techniques and methods for practising)
ప్రతిపాదిస్తున్నాయి. పరమాత్మ సర్వదా ఒక్కటే అయినప్పటికీ జీవుల వివిధ
మనోస్థితిగతులకు ఔషధరూపంగా వివిధ దేవతా ఉపాసనలను - పూజాక్రమములను
యజ్ఞ యాగ విధానాలను కల్పించి మంత్ర - తంత్ర - విధి విధానములను
వేదములు అందించటం జరుగుతోంది!
ఓ సాధుశ్రేష్ఠా! విధి-నియమము లేకుంటే సాధన-సార్ధకత అనేవి లభించవు. కర్మల
నియమము ( conditioning the functioning) లేకపోతే ఈ జీవుడు ఈ సంసారారణ్యంలో
చిక్కుకొని దిక్కుతోచని బోటసారియే అయిపోతాడు.
శ్లో॥ దేశ-కాలాది భావానాం వస్తూనాం మమ సత్తమ।
గుణదోషా విధీయేతే నియమార్ధం హి హి కర్మణామ్ ॥ (అధ్యా 21, శ్లో 7)
అది దృష్టిలో పెట్టుకునే నేను దేశము కాలము ఇత్యాది పదార్ధములకు, ధాన్యముధనము ఇత్యాది వస్తువులకు గుణదోషములను - కాలదోషములను విధించాను సుమా!
ఓ ఉద్ధవా! సర్వము బ్రహ్మమే! అని చెప్పే వేదములే అనేక దేవతా ఉపాసనలు
వివిధ రీతులైన విధి-నిషేధములు - బ్రాహ్మణ - క్షత్రియ - వైస్య - శూద్రవర్ణ విభాగ
ధర్మములు కూడా ప్రతిపాదిస్తూ భేదత్వము కల్పిస్తున్నాయి. ఎందుచేత?.... అనే నీ
ప్రశ్నకు కొన్ని విశేషాలను సమాధానంగా చెప్పుకుంటున్నాము కదా! ఇంకా మరికొంత
వివరణను విను.
అన్ని అడవులు ఒక్కతీరైనవే! అయితే అడవులలో సాత్విక జీవులైన మృగములు
(జింకలు మొదలైనవి) ఉన్న ప్రదేశములు పవిత్రమైనవి.
అన్ని ప్రదేశములు ఒక్కతీరైన భూమి- ఆకాశము గాలి అగ్ని - జలముల
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
204
సమ్మేళనమే! అయితే, ఏ ప్రదేశంలో బ్రాహ్మజ్ఞానులు - బ్రాహ్మణులు (వేద-
పరిజ్ఞాన నిష్ఠులు) పూజించబడుచు, గౌరవించబడుచూ ఉంటారో... ఆ
ప్రదేశములు పవిత్రములని, అట్లు కాని ప్రదేశములు అపవిత్రములని
పవిత్రాశయులకు నివాసయోగ్యం కాదని చెప్పబడుతోంది.
ఏకాలములో ఉత్తమ కర్మలకై అవసరమగు ఉత్తమ ద్రవ్యములు లభిస్తాయో...
ఆ కాలము శుభప్రదం - పవిత్రము. గుణవంతులు - ఉత్తమ కర్మలు, అందుకు
అవసరమైన ద్రవ్యములు లభించని కాలము అశుభప్రదంగా - భావిస్తూ ఉంటారు.
కాలము ఎప్పుడూ ఒక్కటే అయినప్పటికీ - శుభ - అశుభ కాలములను
ఈవిధంగా బుధులు నిర్ణయిస్తూ ఉంటారు.
ఆగంతుకమైన దోషములు గల కాలము ప్రదేశము - పదార్ధములను
త్యజించటానికి అర్హమైనవిగా భావించబడతాయి.
వాక్కు ఒక్కటే అయినప్పటికీ శుభ-అశుభవాక్ భేదం గమనించి విజ్ఞులు
వాక్ఆపోధనులై ఉంటారు.
ఈవిధంగా...,
పదార్థములకు శుచిత్వము - అశుచిత్వములు,
ద్రవ్యములకు పవిత్ర - అపవిత్రములు,
వచనములకు శుభ - అశుభములు,
కాలమునకు
ప్రదోషకాలం (సూర్యాస్తమయ సమయములో చేయకూడనివి),
ప్రాతఃకాలము - బ్రహ్మీముహూర్తము (ఉపాసనలు చేయవలసిన సమయం ఉదా.
ఉదయం 4.00),
మధ్యాహ్నకాలము (తర్పణలు ఇత్యాదులు నిర్వర్తించవలసిన సమయములు),
ఉదయ - మధ్యాహ్న-సాయం-రాత్రి - అర్ధరాత్రులలో నిర్వర్తించవలసినవి -
నిర్వర్తించకూడనవి.
ఇత్యాది మంచి - చెడు కాలనియమాలు,
వచనములకు - ససంస్కార - కుసంస్కార సంబంధమైన శబ్దార్ధాలు,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
205
జనులలో మహనీయులు మహదాశయులు అల్పాశయులు ఇత్యాదులన్నీ
|
విభేధించబడుచున్నాయి. వేదములు - శాస్త్రములు మానవాళికి మార్గదర్శకత్వం
వహించటానికే భేదములను కల్పించే ఆయా విశేషాలన్నీ ప్రతిపాదిస్తున్నాయి.
ఇంకా దృష్టాంతపూర్వకంగా చెప్పుకోవాలంటే
వస్త్రము ఒక్కటే! ఆ వస్త్రము జలముతో పరిశుద్ధపరచి, ఆరవేసి అప్పుడు కట్టుకుంటే
పరిశుద్ధవస్త్రము అంటాము. స్వీకరిస్తాము. ధరిస్తాము. మరొకరికి ధరించటానికి ఇస్తాము.
అదే వస్త్రము మల-మూత్రములతోను, మురికిగాను ఉంటే? ఇది అపవిత్రవస్త్రము
అని పిలుస్తాము కదా! ఇంటికి వచ్చినవారు ధరించటానికి అటువంటి అశుభ్రవస్త్రమును
ఇస్తామా? లేదు కదా!
ఉద్ధవుడు : అవును కృష్ణా! మీరు చెప్పే భేద దృష్టి ఉత్తమమైన మార్గదర్శనం కొరకై
శాస్త్రకల్పితమని నేను ఒప్పుకుంటున్నాను. ఆమాత్రంచేత సర్వమ్ ఖల్విదం బ్రహ్మ ( అంతా
బ్రహ్మమే) అనే ఆప్తవాక్యానికి లోటేమీ ఉండదనుట యుక్తియుక్తమే!
అయితే...
ఏ ఏ పదార్ధము - ద్రవ్యము - వచనము - కాలము - సందర్భము - స్థలము
- స్థానము - వ్యక్తులు పవిత్రములు? స్వీకరించటానికి అర్హములు?
అనుసరనీయులు?
ఏవేవి అనుసరణీయం కావు? త్యజించటం సముచితం?
ఇది మేము నిర్ణయించుకునేది ఎట్లా? శాస్త్రహృదయం - శాస్త్రవాక్యం సమన్వయించు
కోవటం చేతకాకపోవటంచేత మేము దుర్మార్గానువర్తనులం (Followers of wrong
path) అగుచున్నామేమోనని కొన్ని సందర్భాలలో మాకు అనిపిస్తోంది! అప్పుడు అట్టి
సందర్భాలలో మేము ఏమి చేయాలి?
శ్రీకృష్ణభగవానుడు : అవునయ్యా! అటువంటి సందర్భముల కొరకేగదా,... విధాతసృష్టికర్త యగు బ్రహ్మదేవుడు మానవాళికి గురువులను ప్రసాదిస్తున్నారు! బ్రహ్మముఖం
నుండి వేదములు బయల్వెడలుచున్నది అందుకొరకేకదా, మరి!
ఒక తెలియని ఊరుకు బాటవెంబడి నడుస్తూ వెళ్ళేవాడు ఏం చేస్తాడు? త్రోవలో తారసబడే
అనుభజ్ఞులను - విజ్ఞులను సమీపించి, అయ్యా! నేను ఈపేరు గల ఊరు వెళ్ళాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
206
కుడివైపుకు వెళ్ళనా? ఎడంవైపుకు వెళ్ళనా? ఎంతెంత దూరం?.... అని సంప్రదిస్తున్నాడా,
లేదా! అట్లాగే ఆత్మానుభూతివైపుగా ప్రయాణించే మార్గాణ్వేషకుడు (లేక) ముముక్షువు
ఏం చేయాలి? "ఏది ఔను? ఏది కాదు?" అనే సందేహం వచ్చినప్పుడు...,
విజ్ఞుల - అనుభవజ్ఞుల వచనములు - - నిర్ణయములు పవిత్రములు. అజ్ఞులు |
చెప్పే మాటలు, సూచనలు, నిర్ణయములు అనుసరణీయములు కావు.
బ్రహ్మజ్ఞుల మాటలు వినాలి. అనుసరించాలి.
సంసార స్వభావమును పుణికి పుచ్చుకొని లౌకికమైన ఆశయములతో చెప్పుమాటలు
- అభిప్రాయములు అనుసరించకూడదు - అని గమనించాలి. -
ఓ మిత్రమా! శివుని పూజకై పుష్పములు తీసుకువస్తాం. అయితే... జలముతో సంప్రోక్షం
చేయబడి, చక్కగా - ప్రకాశవంతంగా నవనవంగా ఉండే పుష్పాలను పవిత్రంగా
భావించి చక్కటి వస్త్రములోకట్టి జాగ్రత్తగా తీసుకువస్తాం
అంతేకాని...,
నలిగిపోయినవి, వెలవెలపోయినవి, ఎవ్వరో వాసన చూచిచూచి ప్రక్కకు పడవేసినవి,
ధరించివదలినవి పూజకు ప్రోగు చేస్తున్నామా? లేదు. అట్టి పూలను పూజకు
అపవిత్రంగా భావిస్తాం కదా! లేత పూలను గుప్పిటలో నొక్కినొక్కి పూజకు తెస్తామా?
తేముకదా!
దశాహము అభిషేకము మొదలైన పితృదేవతా - దైవకార్యములు నెరవేర్చు
సందర్భములలో నూతనజలముతో జలజలపారే సరస్సు తటాకము నదుల
జలం పట్టుకు వస్తాం. అంతేకాని, నీరు నిలచిపోయిన మురికిగుంటలలోని నీళ్ళు
బిందెలతో నింపుకొని తెచ్చుకుంటామా? లేదే!
పెద్ద పెద్ద సరస్సులలో నీరు పవిత్రము
చిన్న చిన్న గుంటలలో బురదతో కూడిన నీరు అపవిత్రము.
అని ఏవిధంగా భావిస్తూ ఉంటామో...,
ఆవిధంగానే....,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
207
అనుభవజ్ఞులను, మహనీయులను, శాస్త్ర - లోక విధానములు ఎరిగిన బ్రహ్మజ్ఞులను,
భక్తులను, జ్ఞానులను, యోగులను, మంచి చెడు, శుభ అశుభ సమయ
సందర్భములు ఎరిగినట్టి మహనీయులను సమీపించి, వారి అభిప్రాయములను
అవగాహనలను అనుభవములను అనుభూతులను తెలుసుకొని, దేశ-కాలపదార్ధములను విశ్లేషించుకొని..., ఇకప్పుడు, "ఇది ఇట్లా చేసెదనుగాక! అది అట్లా
చేయనుగాక!" అని తెలివిగా, లోకకళ్యాణ దృష్టిని కూడా కలుపుకుని సమరసభావనను
సంరక్షించుకుంటూ విధి-విధానాలు, నిషేధాలు నిర్ణయించుకోవాలి సుమా!
శ్రీ ఉద్ధవుడు : మరి,... కొందరేమో అపవిత్రమైన సంసార సంబంధమైన -
సంకుచితమైన అభిప్రాయములు ఎలుగెత్తి ప్రకటిస్తూ..., మాకు అల్పాశయములను -
కుమార్గములను తెలిసో-తెలియకో చూపటంకూడా జరుగుతోంది కదా? అశాస్త్రీయంగా
చెప్పటం జరుగుతోంది కూడా కదా!
శ్రీకృష్ణుడు :
ఔను. నిజమే!
శ్లో॥ శక్త్యా శక్త్యాథవా బుధ్ధ్యా సమృద్ధ్యా చ యదాత్మనే
అఘం కుర్వంతి హి యథా దేశావస్థానుసారతః ॥ (అధ్యా 21, శ్లో 11)
కొందరు సామర్ధ్య - అసామర్ధ్యములను, బుద్ధిని అనుసరించి అల్పదృష్టిని, సాంసారిక
దృష్టిని, సంపద - ఆపదల భావావేశంతో సంకుచిత స్వభావమును వదలలేక....
అశుభంగా కర్మలు నిర్వర్తిస్తున్నారు. తదనుకూలమమైన తత్సంబంధమైన విషయాలను
పదేపదే ఇతరులకు సంబోధించటం జరుగుతూ ఉంటుంది కూడా! "అదంతా ఆరీతిగా
జదరగటం దేశ-కాలమాన పరిస్థితుల ప్రభావం కదా!..." అని గమనించి బుద్ధి
సూక్ష్మతతో స్వీకరించవలసినది - స్వీకరించవలసినంత వరకు స్వీకరించాలి.
త్యజించవలసిసనది - త్యజించవలసినంతవరకు త్యజించాలి. దేనినై మహదా
శయముతో, సూక్ష్మబుద్ధితో, యుక్తాయుక్త విచక్షణతో సద్గురుబుద్ధి - మహావాక్యముల
సహాయంతో పవిత్రము అపవిత్రము అనుసరణీయము అననుసరణీయం...
ఇత్యాదులు బహుజాగరూకతతో నిర్ణయించుకోవాలి. అందుకేకదా, స్వబుద్ధి ఉన్నది!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
208
లభించిన సమాచారమును పెద్దల అభిప్రాయములు విశాలమైన దృక్పథము
పవిత్రమైన హృదయము - సునిశితమైన బుద్దిల సహాయంతో ఏది పవిత్రమో - ఏది
కాదో విచక్షించుకొని అటుపై అనుసరించాలి. దృష్టాంతానికి....,
శ్లో॥ ధాన్య దార్వస్థితంతూనాం రస తైజస చర్మణామ్
కాల-వాయుః-అగ్ని-మృత్తోయైః పార్థివానాం యుతాయుతైః (అధ్యా 21, శ్లో 12)
ధాన్యము మొదలైన ఆహారసంబంధమైన పదార్థములు, పెసలు మినుగులు ఇత్యాది
తైలపదార్థాలు, ఏనుగుదంతము, ఎముకలు, ఇటువంటి ఉపసామాగ్రి, బంగారు
ఖనిజము మొదలైన లోహపదార్ధాలు, చర్మము మొదలైన ఉపకరణపదార్ధాలు....
ఇటువంటివన్నీ తారసబడినప్పుడు - లభించినప్పుడు జనులు ఏం చేస్తున్నారు చెప్పు?
వాటివాటిని జలముతోను, అగ్నితోను, వాయువుతోను, మృత్తిక (మట్టి) తోను పరిశుభ్రం
చేసుకుంటున్నారుకదా!
అట్లాగే లౌకిక జీవితంలో ఆయా ప్రదేశ సందర్భములలో ప్రాప్తించే యుక్తాయుక్త
విశేషయములనుకూడా శాస్త్రవాక్యములు - మహనీయుల అభిప్రాయములు - స్వబుద్ధి
మొదలైనవాటిని ఉపయోగించుకొని పరిశుభ్రపరచుకోవాలి! అనుసరణీయాలను
అనుసరించాలి. త్యజించవలసినవి త్యజించాలి.
వంటపాత్ర అపరిశుభ్రంగా ఉంటే ఒక ఇల్లాలు ఏం చేస్తున్నారు? మృత్తిక (మట్టి)
మొదలైనవాటితో అపరిశుభ్రతను తొలగించి, ఆ తరువాత ఆ పాత్రలను ఉపయోగించి
వంట చేస్తున్నారు. పూర్వరూపము వచ్చిన తరువాత పరిశుభ్రమైనదికదా!... అని
భావిస్తున్నారు. ఆ ఇల్లాలు "పాత్రలు అశుభ్రంగా వున్నాయి. వంట ఏమి చేస్తాములే?"...
అని అనుకుంటోందా? లేదుకదా! శుభ్రంలేదు - అశుభ్రం లేదు అనుకుంటోందా?
అదీ లేదుకదా!
శాస్త్రవిహిత ఉపాసన పూజ ధ్యానము - తపస్సు... ఇత్యాది పవిత్ర కర్మలను
ఆచరించటమే శాస్త్రోద్దేశ్యం. అటువంటి విధి - విధ్యాపూర్వక ఉపాసనాకర్మలు
నిర్వర్తించాలనుకునేవాడు మునుముందుగా స్నానము దానము - స్వధర్మ నిర్వహణ
ఇత్యాదులతో సంసిద్ధపడాలి. ఉపనయనము ఆసనము ఇత్యాది శాస్త్రప్రవచిత
సంస్కారములను ఆశ్రయించాలి. సంధ్యోపాసన - భగవన్నామస్మరణ మొదలైనవాటితో
-
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
209
బుద్ధిని పవిత్రము - సునిశితము - విస్తారము చేసుకోవాలి. అటువంటి ప్రయత్నములో
శాస్త్రములు చెప్పే విహిత-అవిహితములను, నియమ నిష్ఠలను సూచనలుగా భావించి
అనుసరించటమే ఉచితం!
"నేను నిర్వర్తించవలసిన నియమిత (Alloted) శాస్త్రీయ (ఉపాసనాపూర్వక) కర్మలునా బుద్ధిని పవిత్రము - విస్తారము చేసుకోవటానికి సుమార్గము - అవకాశము కదా!
-అను అవగాహనతో, సదుద్దేశ్యముతో కర్మలు నిర్వర్తించాలి.
శ్లో॥ మంత్రస్య చ పరిజ్ఞానం కర్మ శుద్ధిర్మదర్పణం
ధర్మ సంపద్యతే షటిః! అధర్మస్తు విపర్యయః | (అధ్యా 21, శ్లో 15)
సద్గురు ముఖతః మంత్రం స్వీకరించుటచే లక్ష్యశుద్ధి ఏర్పడుతుంది. పరమాత్మనగు
నాకు సమర్పణభావంతో కర్మ నిర్వర్తిస్తూ ఉంటే,... ఆ కర్మ పవిత్రమౌతుంది.
ఈవిధంగా 1. దేశము (Place)) 2. కాలము (Time) 3. ద్రవ్యము (Material) 4.
కర్త (Doer) 5. మంత్రము (Chanting) 6. కర్మ (Function)... ఈ ఆరు పవిత్రం
చేసుకోబడుతూ ఉండాలి. ఈ ఆరు పవిత్రము సుసంపన్నము అవుతూ ఉండగా
క్రమంగా చేసే సాధన పరిఢవిస్తూ ఉంటుంది. ధర్మముతో కూడిన భావాలు బలం
పుంజుకుంటూ వుంటాయి.
అట్లా కాకుండా ఉంటే? అధర్మము ప్రవృద్ధమయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని
హెచ్చరిక చేస్తున్నాను! ధర్మము శ్రద్ధగా ఆశ్రయించబడనిచోట అధర్మము స్వయముగా
వృద్ధి పొందుచున్నది. చిత్తడిరాయి పై నిలవనీటి ప్రభావంచేత పాచి తనంతటనే
ప్రవృద్ధమౌతోంది చూచావా? అది అంతే!
30. ధ్యాసలు - పర్యవసానములు
శ్రీకృష్ణుడు : ఓ ఉద్ధవా! ఒక గుణము (One type of quality (or) Approach) దేశ -
కాల సందర్భ - సంఘటనలను అనుసరించి మరొకచోట దోషము అవుతుంది.
అట్లాగే వేరొకచోట గుణమయినది ఇక్కడ దోషము అవుతుంది. ఒకే విషయము ఒకచోట
గుణము (Acceptable, Positive), మరొకచోట దోషము (Fault, Non-acceptable,
Negative) అవటం ఇదంతా సాంఘిక సందర్భ - సంబంధానుచితంగా ఉంటూ
ఉంటుంది. ఈవిధంగా గుణముగాని, దోషముగాని ఆయా సందర్భములలో వేరువేరుగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
210
ఉండటం అందరికీ విదితమైనదే! దీనివలన మనం గమనించవలసినది ఏమిటి? ఇది
సద్గుణము, ఇది దోషము - అనేది ఆచారాది వ్యవహారాదుల దృష్ట్యా చూస్తే కల్పితమే
గాని సహజం కాదు.
కానీ....,
కొన్ని గుణముల విషయంలో "ఏదోలే! ఒకరకంగా మంచి మరొకరకంగా చెడు కదా"
అని శాస్త్రవిహిత కర్మలవిషయంలో బద్ధకంతో సరిపెట్టుకోకూడదు. అతి జాగరూకులై
సమయము - అవకాశములను పరిశీలించుకుంటూ - సమన్వయించు కోవాలి సుమా!
అంతేగాని అశ్రద్ధ-బద్ధకము, ఆలస్యము సత్కర్మల విషయంలో పనికిరాదు. మహనీయులు
జనులగుణ దోషములను బలహీనతలను పరస్పర సానుకూల్యతలను దృష్టిలో
వుంచుకొని విధి-నిషేధములను శాస్త్ర రూపంగా ప్రవచిస్తున్నారు. కనుక అవి
అనుసరణీయం!
ఇక
సురాపానము (Intoxicated Drinks) సేవించటం చేత మంచివారు కూడా చెడ్డగా
వ్యవహరిస్తారు. కనుక అది నిషేధమే! కాని పతితుతుడైన వ్యక్తికి సురాపానం
వలన పతితమవటం క్రొత్తగా ఉండదుకదా!
యతులకు స్త్రీ సంగము నిషిద్ధము. మరి గృహస్థులకో! భార్యతో సంగమము
దోషము కాకపోగా, "ఈ భగవత్ స్వరూప జీవిత భాగస్వామిని సంగమము
ద్వారా ఉపాసిస్తూ పరమాత్మను సేవిస్తున్నాను..." అనే భావన ఒక ఉపాసన,
సద్గుణము కూడా!
మంచముపై పరుండినవాడు "ఆదమరచిక్రిందపడ్డాడే!..." అనేది సందర్భపడవచ్చు.
క్రింద పరుండినవాడో, క్రిందపడటం ఎక్కడుంటుంది?
అందుచేత "ఆతడు దుర్గుణము సేవిస్తున్నాడుకదా! పరులను దూషించటం మొదలైనవి
చేస్తున్నాడు కదా! ఇక నేనూ అట్లాగే చేస్తే తప్పా? ఏమీ కాదు..." అని ఒక సద్గుణుడు
దుర్గుణ ప్రయత్నశీలుడు కాదలచరాదు సుమా!
ఇక్కడ ఇంకొక విషయము కూడా గుర్తుచేస్తున్నాను విను.
శ్లో॥యతోయతో నివర్తేత విముచ్యేత తతస్తతః
ఏషధర్మో నృణాం క్షేమః శోక-మోహ-భయాపహః | (అధ్యా 21, శ్లో 18)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
211
ఎవ్వడైతే ఎంతెంతవరకు ఏఏ దృశ్యవిషయముల నుండి విరమిస్తున్నాడో,
నివర్తుడగుచున్నాడో... ఆతడు అంతంతవరకు ఆయా విషయములనుండి నివృత్తుడు
(Relieved) అగుచున్నాడు.
ఎవడు ఏఏ ప్రాపంచక విషయములందు కర్మచేతగాని మనస్సు- భావలనచేతగాని,
ఆవేశ-కావేశములచేతగాని, కోప తాప-భయములచేతగాని ప్రవృత్తుడు అగుచున్నాడో,
ఆతడు అంతంత వరకు బద్ధుడు (Bounded) అగుచున్నాడు.
ఒక ముఖ్య విశేషం ఏమంటే...,
నివృత్తి లక్షణ ధర్మమే జీవునికి పరమసుఖము కలిగించగలదు సుమా! నివృత్తి క్రమంగా
శోక-మోహ-భయములను సన్నగిల్లజేచేస్తూ వాటిని నశింపజేయగలదు.
విషయచింతనయే సంసారము అనబడుదానికి మూలము.
శ్లో॥ విషయేషు గుణాధ్యాసాత్ పుంసః సంగస్తతో భవేత్
సంగాత్ తత్ర భవేత్ కామః కామాత్ ఏవ కలిః నృణామ్ || (అధ్యా 21, శ్లో 19)
గుణములపట్ల విషయ చింతన సంగం కామము కలనము
ధ్యాస Chanting AttachDesire సంసారము
Avocation Memorizing ment Relatedness
క్రోధము మోహము తమస్సు వ్యవహార
కలనము | MisconcepAll సంకుచితత్వము
Emotional /
Bilittleness సంసారము tion, illusion bondages
Angry ignorences in situations
ఈవిధంగా విషయములు సదా మననము చేస్తూ ఉండగా వాటితో సంగము, సంగము
వలన కామము, తద్వారా క్రోధము, మోహము... మోహము నుండి అజ్ఞాన భ్రమ
రూపమగు సంసారము వచ్చి కప్పివేస్తున్నాయి.
మరి ఇప్పుడు ఉపాయమో?
ఏది కార్యము? ఏది అకార్యము?
ఏది ఉచితము? ఏది అనుచితము?
ఏది ముక్తి ? ఏది బంధము? ఏది అనుసరణీయము - ఏదికాదు?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
212
ఏది ఆదరణీయము? ఏది అనాదరణీయము?
ఏది మార్గము? ఏది అడ్డు?
ఇటువంటి విచారణతో కూడిన కార్య అకార్యములను విశ్లేషించక-ఆశ్రయించక కాలం
వెళ్ళబుచ్చే జీవుడు అసత్తుల్యుడే సుమా! ప్రాపంచక సంఘటనలను మననం చేస్తూ
ఆదుర్దా - ఆవేశము-అసూయ-అసంతృప్తి-భయ ఉద్వేగాలు మొదలైనవి పొందువాడు
ఎవరో వ్రాసిన కథలోని పాత్రలమధ్య గల సంబంధములను చదువుతూ వెక్కివెక్కి
ఏడ్చు వంటివాడు! అదంతాకూడా ఏదో నాటకం చూస్తూ, అందులోని సంఘటనలకు
స్పందించి ఇంటికివచ్చి తెల్లవార్లూ కోప - ఆవేశాలతో మ్రగ్గటం వంటిది.
తతోఅస్య స్వార్ధ విభ్రంసో! మూర్ఛితస్య మృతస్య చ (అధ్యా 21, శ్లో 21)
స్వస్వరూపార్ధము నుండి భ్రంసము పొందినవాడే అగుచున్నాడు. దృశ్యముతో తదాత్మ్యము
చెంది రోజులు గడుపువాడు ఆధ్యాత్మశాస్త్రానుసారం మూర్ఛితుడు, మృతుడు! భ్రష్టుడు!
విషయములందు మిక్కిలి అభినివేశము కలవాడు చేతనశూన్యుడై ... తనను తాను
గుర్తించలేడు! పరమాత్మనూ గుర్తించలేడు! ఒక వృక్షమువలె ప్రాణధారణ చేయటానికి
ఉపయోగబడే భౌతిక వస్తువులను మాత్రమే (భౌతిక దేహములను మాత్రమే)
గుర్తించగలడు.
ఆతడు ఊపిరి పీల్చడం - వదలటం - అదంతా కొలిమితిత్తిలో గాలి యొక్క ప్రవేశ
నిష్క్రమణములవంటిదే అవుతోంది. అనగా, అదంతా నిష్ప్రయోజనమే!
శ్రీ ఉద్ధవుడు : ఆయా కర్మలవలన స్వర్గము మొదలైన సుఖలోకాలు లభిస్తాయికదా,
కృష్ణయ్యా! వేదశాస్త్రములు అట్టి ఫలశ్రుతులను చెప్పుచున్నాయి కదా!
శ్రీకృష్ణుడు : అవును. కానీ ఏం లాభం? అవన్నీ పరమపురుషార్ధమును కలిగించలేవయ్యా!
వేదములు స్వర్గము –ఇత్యాది ప్రయోజనములగురించి ఎందుకు వర్ణిస్తున్నాయంటావా?
విను.
ఒక తండ్రి తన కుమారినికి రోగనివారణం కొరకై ఒక ఔషధం తెచ్చాడు. ఆ ఔషధము
పిల్లవాడిని ఆరోగ్యంగా తీర్చిదిద్దగలదు. ఆ విషయం పిల్లవాడికి కూడా తెలుసు. కానీ
ఆ ఔషధము యొక్క రుచి పిల్లవాడికి నచ్చక, విముఖుడై, త్రాగటానికి మారాం చేస్తున్నాడు.
అప్పుడు ఆ తండ్రి ఏదో మిఠాయివంటి మధుర పదార్థములను చూపించి "ఈ మిఠాయి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
213
ఇస్తాను. కానీ వెంటనే ఈ ఔషధం మింగాలి! మరి నీకు ఇష్టమేనా?..." అంటాడు.
అప్పుడు ఆ పిల్లవాడు మిఠాయికోసం ఔషధాన్ని సేవించటానికి ఒప్పుకుంటాడు. అటు
తరువాత ఒకటి-రెండు రోజులకు రుగ్మతనుండి ఔషధము కలిగించే ఉపశమనమును
గమనించి తనకు తనే, "నాన్నగారూ! ఔషధం ఇవ్వండి! చాలు..." అనటం ప్రారంభిస్తాడు.
స్వర్గాది లోక ఫలాలన్నీ కూడా ఒక తండ్రి తన బిడ్డను ఏమర్చటానికి, ఔషధసేవకు
సిద్ధం చేయటానికి చేసే ప్రయత్నము వంటిదే! బుజ్జగింపు మాటలవంటివి! ఎందుకంటే
స్వర్గలోకాలవంటి ఫలాలు ప్రాపంచకమైన సంపదల వంటివే!
వేదశాస్త్రములు మోక్షరూపమగు పరమ శ్రేయస్సును కలుగజేయానికి వ్రతాలు చేయండి!
కష్టాలు పోతాయి.... ఇటువంటి వాక్యాలు ఆ తీరుగా అందిస్తున్నాయని గమనించు!
31. అనర్ధ హేతువులందు ఆసక్తి
శ్లో॥ ఉత్పత్తైవహి కామేషు ప్రాణేషు స్వజనేషు చ
ఆసక్త మనసో మర్త్యా ఆత్మనో అనర్ధ హేతుషు ॥ (అధ్యా 21, శ్లో 24)
ఓ ప్రియ ఉద్ధవా! ఈ మానవులలో అనేకులు స్వభావసిద్ధంగానే అనర్ధములు కలిగించగల
కోరికలు దేహము స్వజనలు - వ్యవహారములపట్ల అత్యంత ఆసక్తిని -
పెంపొందించుకొని ఉంటున్నారు. మేము ధన-జన-యౌవన-వస్తు-గృహ సంపదల
కోసమే జీవించాలి!... అని భావావేశము ప్రదర్శించుకుంటున్నారు. ఇక్కడ కనబడే
ఇంద్రియ విషయములపట్ల అత్యంతాసక్తతతో జీవిస్తూ- ఇంద్రియ సందర్భములను
ఆత్మజ్ఞానానందము కొరకు ఏరీతిగా ఉపయోగించవచ్చు?..... అను విషయమై
అత్యంత అనాసక్తులై, ఏమరచినవారై "మానవజన్మ" అనే సదవకాశమును వృధా
చేసుకుంటున్నారు.
అందుచేత శాస్త్రములు మునుముందుగా "జగత్ లాభములు" అనే తాయిలం చూపించి
జీవులను "సాధన" అనే మార్గమునకు ఎలుగెత్తి పిలుస్తున్నాయి.
మిత్రమా!
పరమ సుఖమే (ఆత్మ సుఖమే) శాస్త్రకారుల మహదాశయమని గుర్తించు. అంతేగాని
భౌతిక సుఖ సంపదలు ముఖ్యోద్దేశ్యమే కాదు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
214
పునరావృత్తి దోషము :
పరమసుఖమును తెలుసుకోక, (అనగా) ఆత్మతత్త్వము గురించి (లేక) స్వస్వరూపము
గరించి సమాచారము సంపాదించి, అనుభవైకవేద్యం కొరకై ప్రయత్నించకుండా,
ఎవ్వరైతే...,
ఈలోకంలోనో (లేక) మరొకలోకంలోనో ఏదో సాధించాలి... అనే కామమార్గములో
అడుగులు వేస్తూ ఉంటారో..., కామ మార్గ సంచారాలు ఆవేశంగా కొనసాగిస్తూ
ఉంటారో.
...
అట్టివారిపట్ల పునరావృత్తి అనే దోషము కొనసాగుతూనే వుంటుంది. అట్టివారు మరల
అనేక తామసయోనులలో ప్రవేశించవలసిన అగత్యమును తొలగించుకోనివారే
అగుచున్నారు.
వేదములలో చెప్పిన దృశ్యసంబంధమైన ఫలములు - ప్రయోజనములు సత్యమే! అయితే,
కామ కామాః లభంతి.... అనునది ఆశయంగా కలవాడు వేదహృదయమైన వేదాంత
విద్యలో ఎలా ప్రకాసిస్తాడు చెప్పు? జీవునకు మోక్షమే ప్రసాదించగల మహదాశయ
స్వరూపమైన వేదమాత అల్పలక్ష్యములను మహాశయంగా చెప్పుతుందా? లేదు.
పిల్లవాడిచేత బాగా చదివించి విజ్ఞానదురంధరునిగాను, మహాపండితునిగాను తీర్చి
దిద్దాలనే ఉద్దేశ్యంగల అమ్మ "మా అబ్బాయి తియ్యటి లడ్లు, చెక్కిలాలు తింటే చాలండీ!
చదివి తెలివికలవాడు కానఖర్లేదు..." " అని అనుకుంటుందా? కానేకాదు.
పసిబిడ్డ స్వభావులగు జీవులను బుజ్జగించటానికి ఏదో స్వర్గ-తదితర సుఖలోక ఫలములు
- ప్రయోజనములు కొద్ది సమయం చెప్పుచున్నప్పటికీ... వేదమాత యొక్క సహృదయత
అంతిమలక్ష్యము మోక్షమే! ఆత్మజ్ఞానమే! ఆత్మానుభూతియే!
అవాంతర - ఆత్యంతిక ఫలన్యాయం
శ్లో॥ ఏవం వ్యవసితం కేచిత్ అవిజ్ఞాయ కుబుద్ధయః
ఫలశ్రుతిం కుసుమితాం న వేదజ్జా వదంతి హి || (అధ్యా 21, శ్లో 26)
ప్రతిఒక్క కార్యమునకు రెండువిధాలైన ఫలములు - (లేక) ప్రయోజనములు ఉంటూ
ఉంటాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
215
1. అవాంతర ఫలములు Temporarily appearing result/achievement
2. ఆత్యంతిక ఫలములు Final Result. Final outcome.
వేదములు ప్రతిపాదించే యజ్ఞయాగాదులకు అంతిమఫలము ఉత్తమ లోకములే!...
అనే ఉద్దేశ్యమును కొందరు కలిగి ఉంటున్నారు. వారిని అవిజ్ఞతులని, అల్పబుద్ధికి
పరిమితులగుచున్నారని చెప్పబడుతోంది. అట్టి ఫలములగురించిన వాక్యములు
(ఊర్ధ్వలోకములలో లభించే ఇంద్రియ సంబంధమైన సుఖముల గురించిన ప్రసంగాలు)
వినటానికి కొందరికి కమనీయంగా అగుపిస్తాయి. (పుష్పితాంవాచః ప్రవదంతి
అవిపశ్చితః).
అయితే, వేదజ్ఞులు అట్లా అనుటలేదు. స్వర్గలోకసుఖాలను దృష్టిలో పెట్టుకొని అగ్నికార్యము
మొదలైన కర్మలయందు అభినివేశము కలవారిని గమనించినప్పుడు వేదజ్ఞుల ఉద్దేశ్యంలో
వారు అల్పజ్ఞులు, అల్పకాముకులు, దీనులుగా చెప్పబడుచున్నారు. కర్మఫలములందు
ఆసక్తి గలవారి గురించి "వీరు ధూమమార్గమును అవలభించువారు (This path is
towards increasing ignorence, innocence and darkness)..." అని చెప్పుచున్నారు.
"ఏదో పొంది సుఖించెదముగాక..." అను భావావేశము, ఆశయములు కొన్ని
సందర్భాలలో - ఆత్మతత్త్వమును తెలుసుకొనే అగ్నియానం (మార్గము)లో - అడ్డుగా
నిలుస్తున్నాయి.
ఓ ఉద్ధవా! మిత్రమా! చూపు సన్నగిల్లినట్టి గ్రుడ్డివాడు అతి సమీపంలో ఉన్న అత్యంత
విలువైన వస్తువును గుర్తించలేడు, గమనించలేడు కదా! అట్లాగే, కర్మఫలవాదులు
"దృశ్య విషయములు - హింస" ఇత్యాదులతో కూడిన యజ్ఞములు మొదలైనవాటి పట్ల
మాత్రమే శ్రద్ధ-ఆసక్తి కలిగి ఉంటారు. అంతేగాని, యజ్ఞపురుషుడను, ఈ దృశ్యమాన
జగత్తుకు కారణభూతుడను, సర్వుల అంతః - హృదయాంతరంగుడు, సర్వాంతర్యామిని,
స్వస్వరూపుడను, అగు నన్ను తెలుసుకోలేకపోతున్నారయ్యా!
ఓ ఉద్ధవా! "స్వకీయాత్మయే జగత్తుగా కనిపిస్తోందికదా!..." అనే ఆత్మదేవోపాసనను
ఏమరచి, అపరోక్షజ్ఞానాశ్రయమును నిర్వర్తించక, కొందరు పరోక్షజ్ఞాన విశేషముల
వరకు మాత్రమే వేదములనుండి స్వీకరిస్తున్నారు. కర్మవాదులై వారు
యజ్ఞయాగాదులద్వారా స్వర్గాది దేవతలను పరోక్షవిధిగా ఉపాసిస్తున్నారు. హింసశ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
216
పశుమాంస భక్షణలతో కూడిన యజ్ఞములద్వారా కేవలం దేవతలను, పితృదేవతలను,
భూతములను ఆరాధిస్తూ ఉన్నారు. "యజ్ఞ-యాగాదుల ఆత్యంతికోద్దేశ్యము
ఆత్మోపాసనయే! ఆత్మ సాక్షాత్కారమే!..." " అనేది గమనించటం లేదు. సర్వ కర్మలు -
ఉపాసనలు - తపోధ్యానముల అంతిమలక్ష్యము ఏమిటి? - సర్వము ఆత్మస్వరూపంగా
సందర్శించి ఆత్మానందము - అలౌకికానందము అనునిత్యం చేసుకోవటమే! అంతేగాని,
(వేదముల ఉద్దేశ్యము) పరిమితములు - పరోక్షరూపములు అగు స్వర్గాదులు, ఉపాసనా
ఫలప్రద దైవలోకాలు కాదయ్యా!
ఒక దృష్టాంతము విను!
బాగా కష్టపడి ధనం సంపాదించిన ఒక వ్యాపారికి ఒక ఆలోచన వచ్చిందట. నా
దగ్గర ఉన్న డబ్బుతో సముద్ర జలాన్ని కొని అందులో వెతికి రత్నరాసులు పట్టుకొని
కోటానుకోట్ల ధన సంపన్నుణ్ణి అవుతాను కదా - అని అనుకున్నాడు. డబ్బంతా వెచ్చించి
సముద్రములో 2 చ॥మైళ్ళ విస్తీర్ణంగల సముద్ర జలముపై హక్కులు కొనుక్కున్నాడు.
ఆ 2 చ॥ మైళ్ళ విస్తీర్ణంలో ఆతనికి కొన్ని చేపలు తప్పించి రత్నాలేవీ దొరకలేదు. ఆ 2
చ॥ మైళ్ళ విస్తీర్ణ సముద్రము ఆతనికి మరొకమైన ఏరీతిగాను ఉపయోగించటం చేతకాదు.
ఆవిధంగా ఆ ధనికునికి డబ్బుపోయింది. రత్నాలు లభించలేదు. ఏమీ చేయలేకపోయాడు.
మరల బికారి అయ్యాడు.
పైన చెప్పిన వ్యాపారి దృష్టాంతంలాగా మందబుద్ధికలవారు "మాకు స్వర్గాది లోకాలలో
ఆనందమయ సుఖాలు లభించాలి" అని అనుకొని యజ్ఞ-యాగ క్రతు ఇత్యాదులు
నిర్వర్తిస్తున్నారు. లేదా, ఇహలోకంలో రాజ్యాధికారం కావాలి.... ఇత్యాదులు లక్ష్యంగా
ఆశయంగా కలిగి యజ్ఞ తదితర సాధనకర్మలకు ఉపక్రమిస్తున్నారు. అటువంటి
ఫలములు లభిస్తాయి. కాని ఏం లాభం? అవన్నీ కూడా...,
స్వప్నతుల్యము (Some Posh Building one happened to have been
seeing in his Dream)
నశ్వరము (It is going to slip from hands after some time)
కేవలము శ్రవణ ప్రియము (Happy to hear but not going to give real
happiness)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
217
అల్పాశయము కలిగి - శ్రమతో, ఆయా వేద ప్రవచిత ఉపాసనాది యజ్ఞములు మొదలైనవి
నిర్వర్తించటం ఉభయభ్రష్టుత్వమే! శ్రమకు శ్రమ! లభించబోయేది క్షణభంగురం (మరియు)
భ్రమాత్మకం మాత్రమే! అందుచేత, అల్పాశయములను ప్రక్కకు పెట్టి, మహదాశయముతో
అవి నిర్వర్తించటమే ఉచితం!
ఈవిధంగా రజోగుణ తమోగుణ ప్రేరితులైన కొందరు సాధకులు లౌకికమైన
ప్రయోజనము కొరకై అన్య దేవతోపాసనలకు ఉపక్రమిస్తున్నారు. కర్తకు అనన్య
స్వరూపుడను సర్వాత్మకుడను అగు నన్ను ఉపాసించటం ఏమరుస్తున్నారు.
అనన్యోపాసనయే ముఖ్యము సుమా!
ఆత్మసాక్షాత్కారమే లక్ష్యమగుగాక!
శ్లో॥ అనన్యాశ్చిన్తయన్తో యోతోమాం యేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ॥ (భగవద్గీత)
ఈ విషయమే అర్జునునికి యుద్ధభూమిలో చెప్పిన గీతలో బోధించిఉన్నాను కదా!
అనన్యం ఉపాసకునికి వేరైనది కానిది.
ఉపాసకునికి ఎదురుగా కనిపించేదంతా తానే అయి ఉన్నది.
ఇక్కడ అన్య దేవతోపాసనకుల గురించి మరొక్క విషయం కూడా చెప్పుచున్నాను. విను
మేము ఈ లోకంలో యజ్ఞములు - యాగములు క్రతువులు నిర్వర్తిస్తాము.
ఇంద్రాది అన్యదేవతలను సంతోషింపజేస్తాము.
స్వర్గలోకం సంపాదించుకుంటాము.
ఆ స్వర్గలోకంలో కొంతకాలం హాయిగా విహరిస్తాము. పుణ్యక్షయం వరకు
ఆనందిస్తాము.
అటుతరువాత భూమిపై ఉత్తమ వంశములలోను - సంపదలతోను విలసిల్లే
గృహాలలో జన్మిస్తాం.
ఇటువంటి చంచలచిత్తులు, దృశ్యాభిమానులు, లుబ్ధస్వభావులు - ఆత్మావలోకనమునకు
సంబంధించిన ఆత్యంతిక ఫలముపై ధ్యాస కలిగిఉండలేక పోతున్నారయ్యా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
218
త్రికాండ విషయా వేదః - పరరోక్ష వాదా!
శ్లో॥ వేదా బ్రహ్మాత్మ విషయాః త్రికాండ విషయా ఇమే
పరోక్షవాదా ఋషయః పరోక్షం మమ చ ప్రియమ్ (అధ్యా 21, శ్లో 35)
వేదములలో 3 విభాగాలు ఉన్నాయి.
1. కర్మకాండ (సంహిత)
ఉపాసనాకాండ 2. (బ్రాహ్మణములు)
3. జ్ఞానకాండ (ఉపనిషత్తులు)
ఈ మూడింటిలో కూడా ఈ జీవాత్మ బ్రహ్మమే అను విషయమే ప్రతిపాదితమై ఉంటోంది.
ఈ మూడిటిలోని మంత్రములు, ఆ మంత్రములను దర్శించిన మంత్రద్రష్టలగు ఋషులు
కూడా ఈ విషయమునే ప్రత్యక్షముగా - పరోక్షంగా కూడా నొక్కి వక్కాణించి లోకములకు
చేతులెత్తి ప్రకటిస్తున్నారు. జీవో బ్రహ్మేతి నాపరః సర్వం ఖల్విదం బ్రహ్మ... ఇత్యాది
మహావాక్యాలను ఆత్యంతికాశయంగా విశదీకరిస్తున్నారు సుమా!
(ఉదా - పితృకార్యాలలో - అన్నం బ్రహ్మ అహం బ్రహ్మ - భోక్తా బ్రహ్మా అని - -
చెప్పుచున్నట్లు)
ఓ ఉద్ధవా! ఆవిధంగా పరమసత్యమును గుప్తంగాను - ప్రదర్శితంగాను కూడా చెప్పటం
నాకు ఇష్టమే!
అయితే "అంతా నా ఆత్మ స్వరూపమే అయి ఉండి, యధాతథమై కూడా ఉన్నది..."
అను మహత్తర - అనుక్షణిక - పరమసత్యమునకు అంతఃకరణ శుద్ధులగు వారే
అర్హులగుచున్నారు సుమా! వారే ఇటు ప్రత్యక్ష, అటు పరోక్ష - ఆపై అపరోక్షవాదముల
అంతర్లీన గానాన్ని అద్వైత తత్త్వమును ఎరుగగలుగుచున్నారు.
వేదములు శబ్ద బ్రహ్మము. అది స్వరూపముగాగాని, అర్ధముగా గాని తెలియవచ్చేది
కాదు. అయితే, వేదము ప్రాణమయము ఇంద్రియమయము మనోమయము
అయి ఉన్నది.
వేదము - యొక్క శబ్దార్ధము తెలియబడునది.
వేదాంతము - యొక్క శబ్దార్ధము తెలియబడుదానికి ఆవలగల తెలుసుకొనువాడు
తెలుసుకొనువాని గురించి తెలియజెప్పే శాస్త్రమే - వేదాంత శాస్త్రము!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
219
తెలియబడుదానిలో తెలుసుకొనువాని గురించి వెతికితే లభించటం దుర్లభం. కల
ఎవ్వరిదో... ఆతడు తనకొరకై ఆ కలలో వెతికితే లభిస్తాడా? లేదే! ఈవిధంగా వేదములు
అపారము అనంతము - గంభీరము అగు సముద్రమువలె దుర్గాహ్యము.
అయితే...,
వేదాంత స్వరూపుడనైన నేను
చతుర్వేదసారుడను. వేదములలో దాగివున్న వాడను!
సర్వ వ్యాపకుడను!
అనంతశక్తి స్వరూపుడను!
అపరిచ్ఛిన్నుడను| !
తామరతూడునందలి దారము వలె ప్రాణులయందు తెలివి-నాదము రూపముతో |
లక్షితుడనై ఉన్నాను!
సాలెపురుగు యొక్క హృదయం నుండి ముఖమునుండి దారములు బయల్వెడలు
చున్నాయి. కదా! ఆరీతిగానే....
హిరణ్యగర్భ భగవానుడు ఛందోమయుడు. అమృతమయుడు.
నాదరూపమగు ఉపాదానముతో కూడుకొని ఉన్నవాడు. నాదరూపుడు.
ఆయన శబ్ద-స్పర్శ-రూప రస గంధాదులతో కూడిన మనస్సుతో హృదయాకాశం
నుండి ఓంకారనాదముతోకూడిన వేదములను ప్రకటించుచున్నారు. అట్టివేదములు ...,
ఆరోహణ - అవరోహణ శబ్దజాలముతో నిర్మించబడుచున్నాయి.
విచితమ్రులైనట్టి వైదిక - లౌకిక పరిభాషాదులతో విస్తృతమైనట్టివి.
ఉత్తరోత్తరా నాలుగు - నాలుగు అక్షరములతో వృద్ధి పొందు ఛందస్సులచే
ఉపలక్షితమైనట్టివి.
శబ్దములచే - అర్ధములచే సమాప్తి చెందినట్టివి.
అనేక మార్గములతో కూడినట్టిది.
వైఖరీ (Style) ప్రధానమైనట్టిది.
అట్టి అనంతము అపారము అగు శ్రుతులను (వేదములను) హృదయమునుండి
స్వయముగా సృష్టికర్త సృజించుచున్నారు! మరొకప్పుడు ఉపసంహరించుచున్నారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
220
శ్లో॥ గాయత్రి ఉష్టిక్ అనుష్టుప్ చబృహతీ పంక్తి రేవ చ
త్రిష్టుప్ జగతి అతిఛందో హి అత్యష్టి ఇతి జగద్విరాట్ || (అధ్యా 21, శ్లో 41)
గాయత్రి, ఉష్టిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి, అతిఛందము, అత్యష్టి,
అతిజగతి, అతివిరాట్, ఈ ఛందస్సులన్నీ "వైఖరి" అను వేదములోనివే! వేదము
సృష్టికర్తయగు బ్రహ్మదేవుని హృదయమే! బ్రహ్మదేవుని హృదయం సదా బ్రహ్మమే! ఈ
విధంగా అంతా బ్రహ్మమే! (వైఖరి = Technique Style)
జీవుడు బ్రహ్మమే! ఆతనిచే తెలియబడుచున్నది కూడా బ్రహ్మమే!
బ్రహ్మ సాక్షాత్కారమే బ్రహ్మదేవుని హృదయం.
ఈ జీవుడు సర్వము బ్రహ్మముగా ఆస్వాదించటమే సృష్టికర్తయగు బ్రహ్మదేవుని ఉద్దేశ్యము!
కర్మకాండయందు కనిపించే విధి వాక్యములచే విహితమైనదేది? అవిహితమైనదేది?
ఉపాసనాకాండలోగల మంత్ర వాక్యములచే ప్రకాశితమౌతున్నదేమిటి?
జ్ఞానకాండచే నిషేధింపబడుచు (నేతి) చెప్పబడుచున్నదేది?
ఈవిధమగు వేదవాక్యముల ప్రకృతి తాత్పర్యము పరమాత్మనగు నాకే ఎఱుక! అది
చర్చనీయాంశము కాదు!
నేను బ్రహ్మమునే! "అహమ్ బ్రహ్మస్మి" అనునది నిశ్చలం చేసుకోవటమే మహత్ ఆశయం!
మిగిలినదంతా సందర్భ సత్యము. సహజసత్యము కాదు.
సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ అనునదే సత్యవాక్కు! ఋషివాక్కు! నా వాక్కు ఇదియే
సహజసత్యము! పరమరహస్యమైన నిత్య సత్యము!
వేదములు కర్మకాండచే విధించుచున్నది నేనే!
...9
ఉపాసనాకాండమునందు ఉపాస్యదేవతా రూపముగా అభివర్ణించుచున్నది నన్నే!
జ్ఞానకాండలో ఆకాశ-అంతఃకరణాది రూపంతో అన్యవస్తువులను ఆరోపించటం|
నిషేధించటం కూడా జరుగుచున్నది - నాయందే!
ఇక, ఇక్కడ ఎదురుగా ఉన్నదంతా....,
మనయేవ ఇదమాప్తవ్యం !
మనోయః కరోతి తత్ కృతంభవతి ||
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
221
జగత్ స్వమనోరూపమేవ! ఇదంతా మనస్సే!
|
కానీ..., మనస్సనేది కల్పితమే! వాస్తవానికి మనస్సనేదే ఆత్మకు వేరుగా లేదు.
ఆత్మౌపమ్యేవ సర్వత్రా!
అద్వితీయం ఆత్మః |
సర్వశ్రుతులు నన్నే ఆశ్రయించి నాయందు భేదమును ఆరోపిస్తున్నాయి.
మాయాప్రదర్శకుడనని చెప్పి నినదిస్తున్నది నన్నే!
చివ్వరికి శ్రుతులు నా సమక్షంలో అన్నిటినీ నేతి నేతి వాక్యాలతో నిషేధించి
నాయందు సశాంతిస్తున్నాయి.
అధిష్ఠాన రూపంలో త్రికాలాలలో సర్వదా నేనే శేషిస్తున్నాను.
శేషసారమగు నేనే జగత్తులోని నేనుగా, జీవునిలోని నేనుగా, సాక్షిలోని నేనుగా
ఆస్వాదించబడుచున్నాను! ఆస్వాదిస్తున్నాను, ఆస్వాదించబడుచున్న జగత్తు
రూపంగా కనబడుచున్నాను! నాకు వేరుగా ఎప్పుడూ-ఎక్కడా ఏదీ లేదు!
నేనే నీవు! నీవే నేను! తత్త్వమసి! వేదములు ఓ ఉద్దవా! ఇది గానం చేస్తూ ఉన్నాయయ్యా!
ఇదే తత్త్వశాస్త్ర సారం!
31. తత్త్వ సంఖ్య
ప్రకృతి - పురుష వివేకము
-
శ్రీ ఉద్ధవుడు : ఓ దేవాదిదేవా! విశ్వేశ్వరా! విశ్వంభరా! మీ ప్రవచనం అమోఘం!
ఇప్పుడు సాంఖ్యయోగం దృష్ట్యా కొన్ని విశేషాలు మీవద్ద వినాలని కుతూహలపడుచున్నాను
స్వామీ!
వేరువేరు ఋషులు లోకములకు తాత్త్విక విశేషాలను అనేక సిద్ధాంతద్వారా
విశదపరచారు. విశదపరుస్తున్నారు.
అయితే...,
ఋషులు తత్త్వమును ఏఏవిధంగా విభజించి సిద్ధాంతీకరించి చెప్పారు? ఎందుకని
అట్లా చెప్పారు? మీరు ఇతఃపూర్వం... (19వ అధ్యాయంలో)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
222
జీవుడు = 9 + 11 + 5 + 3 (మొత్తం 28) తత్త్వాలుగా చెప్పియున్నారు. నాకు గుర్తు
ఉన్నది. కానీ... ఈ జీవునికి సంబంధించి
కొందరు 26 తత్త్వములని,
మరికొందరు 25 తత్త్వములని,
వేరే కొందరు 7 తత్త్వములని,
కొద 9 తత్త్వములని
ఇట్లాగే 17 అనీ, 14 అని, 13 తత్త్వాలని వేరువేరు గురువులు వారివారి శిష్యులకు,
వారివారిప్రవచన గ్రంథములలోను చెప్పుతూ వస్తున్నారు. ఈ విభాగ సంబంధమైన
తత్త్వ విశేషాల గురించి వివరించి చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఇటువంటి వివిధ
రీతులైన విభాగముల పాఠ్యాంశాలు వేరువేరు గురువులచే ఎందుచేత వేరువేరుగా
చెప్పబడుచున్నాయి?
శ్రీకృష్ణభగవానుడు : అవును! ప్రకృతి తత్త్వములను ఒక్కొక్క మహనీయుడు ఆయా
సంఖ్యాయుతంగా విభజించి మనస్సు బుద్ధి - చిత్తము అహంకారము
ఇంద్రియములు ఇంద్రియార్ధములు ఈవిధంగా (వేరువేరుగా) చెప్పటం
బోధించటం - సిద్ధాంతీకరించటం జరిగింది. జరుగుతోంది. జరుగబోతూ ఉంటుంది.
అవన్నీ యుక్తి యుక్తమే! వారంతా కూడా నాయొక్క మాయాశక్తిని ఆశ్రయించి తత్త్వ
విశ్లేషణ చేసి చెప్పటం జరుగుతోంది. అదంతా అసందర్భం కాదు.
మాయా యామా - ఏదైతే స్వతఃగా లేదో, అద్దానిని విశ్లేషించి, చెప్పేదంతా ఆత్మ
తత్త్వాన్ని విశదపరచటానికే! అదంతా పరతత్త్వాన్ని నిర్వచించటానికి ఉద్దేశ్యించ
బడుతోందయ్యా! అంతిమ సత్యమువైపుకు దారితీసే వివిధ మార్గవిశ్లేషణలు - విశేషాలు
అవన్నీ!
నదీనాం సాగరోగతిః!
దృష్టాంతంగా
...9
శ్లో॥ నైతదేవం యధా2_2 త్థ త్వం యదహం వచ్మి తత్తధా |
ఏవం వివదతాం హేతుం శక్తయో మే గురత్యయాః || (అధ్యా 22, శ్లో 5)
ఉదాహరణకు : నీవు ఒకటి సిద్ధాంతపూర్వకంగా విభాగించి చెప్పుతావనుకో! నేను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
223
వేరొకవిధంగా విభాగిస్తూ "నేను చెప్పేదే సరి అయినది. ఉద్ధవుడు విభాగించినది
కాదు" .. అంటూ ఉండటం జరుగుతూ వుంటుంది.
ఈవిధంగా వివిధ గురువులు వివిధరీతులుగా విభాగిస్తూ.... ఒక విభాగము మరొక
విభాగమునకు కొంత వేరైనట్లు భాష్యం చెప్పబడటం, ఈ వ్యవహారాలన్నీ వివాద
విషయములవలె కనిపించటం ఇదంతా కూడా దురత్యయమగు నా మాయా
విశేషమేనని గమనించు. నాయొక్క సత్త్వము - క్రియ - దర్శనము ఇత్యాది శక్తుల
కించిత్ చమత్కారమైన క్షోభచేతనే వాదించుకొనువారి వివిధ విషయభేదములు జగత్తులో
ఏర్పడి ఉండటం జరుగుతోంది. అవన్నీ వివిధ శ్రోతలకు వివిధమైన రీతులుగా
విశదీకరించబడుచూ కొన్ని- కొన్ని కొందరి కొందరికి ఎక్కువ సానుకూలమై
ఉంటున్నాయి.
అయితే...,
ఇంద్రియ - మనో నిగ్రహము ఇంకా తగినంత రూపుదిద్దుకోనిచోట మాత్రమే వివిధ
గురువుల సిద్ధాంతాలు వేరు వేరు రూపంగా అనిపిస్తోంది. ఆ సాధకుడు (లేక) ముముక్షువు
శమ-దమములు పొందుతూ ఉండగా ఆ వికల్పములన్నీ తమంతట తామే
లయమగుచున్నాయి. ఒకే నాదము భిన్న భిన్న రాగములుగా సంతరించుకొని శ్రోతలకు
ఆనందం కలుగజేయటంవంటిదే..., అదంతా!
ఏది ఏమైతేనేం! వికల్పములు సన్నగిల్లుచుండగా వివాదములు కూడా సమసిపోతాయి!
వేరు వేరు రీతులుగా తత్త్వము వేరువేరు ద్రష్టలచే (గురువులచే చెప్పబడుటానికి
ముఖ్యకారణం ఏమంటే శిష్యుల వేరువేరైన ఇతః పూర్వపు సంస్కారములే! శ్రద్ధగా
పరిశీలిస్తూ పోతూ వుంటే - తత్త్వవిచారణకు సంబంధమైన ఒకరీతైన విచారణలో
మరొక రీతి అయిన విచారణ (అంతరంగా గమనిస్తే) ఉండనే ఉంటోంది. ఒకటితో
మరొకటి అనుప్రవిష్టములై ఉంటాయి. ఇక విలక్షణ విశేషములను విచక్షణను
అనుసరించి.....
ఆ అభిప్రాయం ఈ సిద్ధాంతములో విభాగమే!
ఈ అభిప్రాయం ఆ సిద్ధాంతములో అంతర్లీనమే!
ఒక సిద్ధాంతంలో ఒకటి కార్యము!
మరొక సిద్ధాంతంలో అదే కారణము!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
224
ఒక సిద్ధాంతములో ఒకటి మార్గాన్వేషణం!
మరొక సిద్ధాంతంలో అదే మార్గదర్శనం!
(ఉదా : ద్వైత - విశిష్టాద్వైత - అద్వైతాలు)
ఆధ్యాత్మశాస్త్ర సిద్ధాంత విశేషాలలో ఒకదానిని అనుసరించి మరొకటి, మరొకదానిని
అనుసరించి ఇంకొకటి... ఈవిధమైన సమీక్షా సిద్ధాంతాలు అనుగతమై ఉంటూ
ఉంటాయి. వాస్తవానికి శ్రోతకు లాభించటానికి ఉద్దేశ్యించే ఆత్మానుభవం (లేక)
పరతత్త్వానుభవం వాక్కుకు - (చెప్పటానికి) - నిరూపణకు (To prove or define) సిద్ధాంతీకరించి ఇది ఇంతే అని పరిమితం చేయటానికి సాధ్యపడేది కాదు.
అది అనుభవైకవేద్యం!
సిద్ధాంతాలన్నీ సూచనామార్గాలు మాత్రమే!
కాని ఆయా సిద్ధాంతాలన్నీ - శ్రోతయొక్క శ్రద్ధ - సునిశిత బుద్ధిని అనుసరించి
విశ్లేషణ విమర్శ - ఆచరణలచే అనిర్వచనీయమగు ఆత్మానుభూతికి (లేక) ఆత్మ
సాక్షాత్కారానికి తప్పక దారితీయగలవు. అవగాహన-సాధన -శ్రద్ధల సహాయంచేత
ఆత్మౌపమ్యేవ సర్వత్ర అను మత్థానం (The state where I am placed (or) The
state that I am experiencing) లభించగలదు. అట్టి అనుభవమునకు చేరుచుండగా
సిద్ధాంతములు తమ విధి (Duty) పరిసమాప్తమైనది కాబట్టి స్వయంగా - సహజంగానే
ఉపశమిస్తున్నాయి. (ఉదా : గణితశాస్త్రంలో X అనుకొనుము అనునది సమాధానం
లభించేంతవరకే కదా!)
అందుచేత..., ఎవ్వరు ఏఏ రీతులుగా
తత్త్వశాస్త్రమునకు సంబంధించిన కార్య కారణ విశ్లేషణను,
ఇది ఇట్లు - అది అట్లుకాదు - ఇది ఉత్తమము - అది అల్పము అని చెప్పుచుండే
న్యూనాధిక భావములు,
వివిధ రీతులైన సంఖ్యావర్ణనములు,
విశ్లేషిస్తూ వివరణ చేస్తున్నారో,
ఏఏ గురువులు - మార్గదర్శకులు, ఏఏ ఉద్దేశ్యాలతో ఏఏవిధమైన సిద్ధాంతాలను
(To establish various Theories) ప్రవృత్తులగుచున్నారో...,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
225
అవన్నీ ఆయా రీతులుగా యుక్తియుక్తములే అయి, నాచే స్వీకరించబడుచున్నాయి.
తత్త్వానుభవానికి అవి మార్గదర్శకములు, ఉపకరణములుగా మలచుకొనుచున్నది
ఆ సిద్ధాంతముల శ్రోతయే! కనుక ఓ శ్రోతలారా! మీ బుద్ధిని విస్తారము,
సునిశితము, నిశ్చలము చేసుకొని సిద్ధాంతాలను పరిశీలిస్తూ ఉపయోగిం
చుకుంటూ ఉండండి!
ప్రియ ముముక్షువులారా! ఆయాగురువుల సిద్ధాంతములతో బయటకు (బాహ్యానికి)
కనిపించే కొన్ని భేదములను పెద్ద పెద్దగా భావించి ఒకరి సిద్ధాంతములను మరొకరు
దూషణములతో విమర్శించుకోవటానికి సంసిద్ధులు కాకండి! సారమును గ్రహించండి.
తస్మాత్ సారం విజానీయాం! సిద్ధాంతముల హృదయమును ఏరీతిగా సమన్వియించుకొని
ఉపయోగించుకోవాలో గమనించే సామర్ధ్యతను కలిగి ఉండండి. అవాక్
మానసగోచరముగా చెప్పబడే "ఆత్మౌపమ్యేవ సర్వత్ర సమం పస్యతి" అను స్ధానమునకు
వివిధ సాధనములు - వివిధ సిద్ధాంతములు, వాటియందు కనిపించే విభాగ భేదములు
సూచన చేస్తూ ఉన్నాయి. మార్గమును చూపుచూ వున్నాయి. సమన్వించుకుంటూ
ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేయవలసినది శ్రోతయే సుమా!
ఈవిధంగా వివిధ విభాగ పూర్వక సిద్ధాంతములు సంభవమే! యుక్తియుక్తమే! అవన్నీ
నేను స్వీకరించుచునే ఉన్నాను.
ఈ జీవుడు అనాది కాలమునుండి అవిద్యాగ్రస్తుడై ఉన్నాడు.
శ్లో॥ అనాద్యవిద్యాయుక్తస్య పురుషస్యాత్మ వేదనమ్
స్వతో న సంభవాత్ అన్యః తత్త్వజ్ఞో జ్ఞానదో భవేత్ || (అధ్యా 22, శ్లో 10)
అవిద్య : = ఒకడు ఒకరోజు ఒక నాటకం (లేక, సినిమా లేక, టివి సీరియల్) చూస్తూ
అందులోని కల్పితమైన సంఘటనలతో తాదాత్మ్యము చెందుతూ కోపము - ప్రేమభావము
- శృంగారభావము - భయము - సంతోషము మొదలైనవి పొందటం.... ఏవిధంగా
జరుగుతోందో,.... అదేవిధంగా - ఈ జీవుడు ఈ దృశ్యమును చూస్తూ, స్వస్వరూపమును
ఏమరచి కోపము-ఆవేశము మొదలైనవి పొందుతూ దుఃఖితుడు - మూర్ఖుడు అవటం
జరుగుతోంది! ఇదియే అవిద్య.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
226
అవిద్యయొక్క చమత్కారంచేత ఈ జీవుడు తననుతాను ఎరుగలేకున్నాడు. అట్టి అజ్ఞానమును
ఆవరణగా కలిగియుండి అనేక వేదనలతో దుఃఖములతో మ్రగ్గుచున్న జీవునికి
ఉపశమనం కలిగించగలిగినదెవ్వరు? జ్ఞాని మాత్రమే! దేహములు - దేహి, జాగ్రత్
స్వప్న సుషుప్త సాక్షిని ఎరిగిన ఆత్మజ్ఞాని మాత్రమే అజ్ఞానికి (దుఃఖము - ఆదుర్దాలు
తొలగటానికి) అత్యావస్యకమయ్యా! జ్ఞాని చెప్పేవిశేషాలచేత అజ్ఞాని స్వస్వరూపాత్మ యొక్క
ఔన్నత్యమేమిటో ఎరుగుచున్నాడు!
వేరు వేరు గురువుల విభాగయోగములు
ఇప్పుడు ఆత్మజ్ఞాన సంబంధంగా వేరువేరు గురువులు అధ్యాత్మశాస్త్ర పాఠ్యాంసాలుగా
తమ శిష్యులకు బోధిస్తున్న విభజన - విశ్లేషణా విశేషాలు కొన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాను.
1. జీవ-ఈశ్వరులు చిత్ అభేదత్వం (అద్వైతం)
జీవుని రూపము చిత్ (ఎరుగుట) చైతన్య రూపం
ఈశ్వరుని రూపముకూడా చిత్ చైతన్యరూపమే!
శ్లో॥ పురుష - ఈశ్వరయోః అత్ర న వైలక్షణ్యమ్ అణ్వపి
తత్ అన్యకల్పనా అపార్ధా జ్ఞానం చ ప్రకృతేర్గుణః||
జీవ ఈశ్వరులకు భేదమే లేదు. ఒక నాటకం పాత్రగా కనిపిస్తున్న ఒక వ్యక్తికి
(నటునికి) - బాహ్యాన మరొక సమయంలో స్నేహితులతో షికారుకు వెళ్ళుచున్న అదేవ్యక్తికి
భేదమేమున్నది? నాటకంలో నాటకరంగముపై ఏక-అనేక పాత్రుడుగా కనిపిస్తున్నది
అతడే! వ్యక్తిగత జీవితంలో స్నేహితులతో నవ్వులు చిందిస్తున్నదీ ఆతడేకాదా! అంతేగాని,
"ఈ నాటకంలోని పాత్రగా ఇతను వేరు - ఈతడే ఇంటివద్ద వున్నప్పుడు ఇతను వేరు" -
అని అంటామా!
జీవుడు - అందరిలో ఒకడు. ఈశ్వరుడు - అందరిగా ఉన్నవాడు.
జీవుడు - ఈశ్వరుడు ఈ ఇద్దరికి భేదం కల్పించటం అపార్ధమే! అజ్ఞానమే!
ప్రకృతికి సంబంధించిన గుణముల భేదంచేత వేరువేరుగా కనిపించవచ్చుగాక! గుణి
దృష్ట్యా (గుణములకు మునుముందే ఉండి గుణములను ప్రదర్శించే చైతన్యసత్త దృష్ట్యా)
జీవుడు - ఈశ్వరుడు ఒక్కటే! ఒక్క తీరైనవారే! (జీవో శివః! శివో జీవః! జీవో బ్రహ్మేతి
నా పరః!)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
227
2. త్రిగుణములు
1. సత్త్వము 2. రజము 3. తమము. ఈ మూడు గుణముల వివిధ పాళ్ళ కలయిక,
వాటి సామ్యావస్థయే ప్రకృతి అను శబ్దముయొక్క అర్ధమైయున్నది.
సృష్టి సత్వగుణము జ్ఞానము
స్థితి రజోగుణము కర్మ
లయము తమోగుణము అజ్ఞానము
సృష్టి-స్థితి-లయములకు హేతువు ఏమిటి? అని ప్రశ్నిస్తే.... త్రిగుణములే! అని
సమాధానం అవుతుంది.
అటువంటి త్రిగుణములు
ప్రకృతికి సంబంధించినవి మాత్రమే!
ఆత్మకు సంబంధించినవి కానే కావు.
ఈశ్వరుడు గుణములకు కారకుడు.
- గుణములను వ్యక్తీకరించువాడు
- కాలస్వరూపుడు. కాలనియామకుడు. కాలః కాలః!
- స్వభావమునకు అధిపతి (One who is exhibiting Features & Qualities)
- సర్వమునకు సూత్రధారి.
చమత్కారం ఏమిటంటే - త్రిగుణసమన్వితమగు నటనకు సూత్రధారి ఆతడే! పాత్రధారి
ఆతడే!
3. పంచభూతములు :
క్షితిః భూమి (Solid)
ఆపః జలము (Liquid)
జ్యోతిః అగ్ని (Heat)
అః వాయువు (Vapour)
నభః ఆకాశము (Space-Placement)
ఈ ఐదు మహాపంచ భూతములు. వీటి వివిధ పాళ్ళ కలయికయే దృశ్యప్రపంచము.
ఇంతకుమించి ఎక్కడా ఏదీ లేదు! ఏదైనా ఉంటే అది కూడా ఇవే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
228
4. నవతత్త్వములు :
పై పంచభూతములు " 5 మరియు
6. పురుషుడు వ్యష్ఠికర్మలకు కర్త. (Individual Experiencer)
7. ప్రకృతి స్వభావము (Features)
8. అవ్యక్తము దేహమనోబుద్ధులను వ్యక్తీకరిస్తూ ఉంటున్నది.
తాను వ్యక్తము కాక, సర్వము వ్యక్తీరించుచున్నట్టిది.
9. అహంకారము - ఇది నాది - మనస్సు నాది అని తలచు తత్త్వము.
5. జ్ఞానేంద్రియ పంచక - కర్మేంద్రియ పంచక దశ తత్త్వములు + మనస్సు
జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు
1. శోత్రము (చెవులు) వాక్కు
2. చర్మము చేతులు
3. చక్షువులు (కళ్ళు) పాదములు
4. నాశిక(ముక్కు) పాయువు (మలద్వారం)
5. నాలుక ఉపస్థ
ఈ పది జ్ఞానేంద్రియములు మరియు కర్మేంద్రియములను తన ఉపకరణంగా
ఉపయోగిస్తున్న 11వది మనస్సు. ఈ ఏకాదశ విశేషాలే ఇదంతా!
6. అంతరంగ చతుష్టయం
1. మనస్సు ఆలోచనావిభాగం (Thought)
ఏది ఆలోచించాలో నిర్ణయించుకునే 2. బుద్ధి విభాగం
(Intellectual)
3. చిత్తము ఇష్ట విభాగము. ఏది ఆలోచించాలో అది అభిరుచినిబట్టి
ఉంటుంది. అదియే ఇష్టము (లేక) చిత్తము (Interest)
4. అహంకారము ఇది నా ఆలోచన
ఇది నా తెలివి
ఇది నా ఇష్టము
నాది నాది అనుకునే విభాగం ("I" "My") -
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
229
7. జ్ఞానేంద్రియ విషయములు
శబ్దము (ఉపకరణం చెవులు)
స్పర్శ (ఉపకరణం - చర్మము)
(ఉపకరణం రూపము - కళ్ళు)
రసము (ఉపకరణం - నాలుక)
గంధము (ఉపకరణం - ముక్కు)
ఈ ఐదు తత్త్వములు - శక్తి తత్త్వములు.
(Veriety manifestations of the Universal Energy)
వీటి పరిణామమువల్లనే ఆకాశము వాయువు - అగ్ని - జలము భూమి రూపు
దిద్దుకుంటున్నాయి.
8. కర్మాయతన సిద్ధములు లేక కర్మేంద్రియ ఫలములు నాలుగు
శ్లో॥ శబ్దః స్పర్శో రసో గంధో రూపంచేత్ అర్థజాతయః
గక్త్యుత్సర్గ శిల్పాని కర్మాయతన సిద్ధయః ॥ (అధ్యా 22, శ్లో 16)
గతి Motion
ఉక్త్యుత్ Raise
ఉత్సర్గము Relationship
శిల్పము Form
పంచతన్మాత్రలు - శబ్ద స్పర్శ రూప రస గంధములు. వీటన్నిటి రచయిత యజమాని,
ఆస్వాదకుడు పరమాత్మయే!
9. వ్యక్తా వ్యక్తములు : సప్త ధాతువులు
వ్యక్తము (That being Exhibited and manifested) : ఈప్రదర్శించబడుచూ
ఇంద్రియములకు తారసడుచున్న (కంటికి కనబడేవి - చెవులకు వినబడేవి మొదలైనవి)
సృష్టికి-ఇద్దాని స్థితికి - లయమునకు కారణము - కార్యకారణ రూపిణియగు ప్రకృతియే!
– ఇదంతా అనుభవించబడునది ప్రకృతిచేతనే అయిఉన్నది (that being experienced)
అవ్యక్తుడు : సంభవింపజేయువాడు. ఈతడు అనుభవించబడుచున్నదానిని (That
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
230
being experiencesd) - అను దానికి వేరుగా - "అనుభవించువాడు One who is
experiencing" - గా ఉన్నవాడు. అనుభవములకు - అనుభవించబడుదానికి సాక్షి
(Beyond and mere witness) గా ఉన్నవాడు. అనుభవించబడుదానిని
పర్యవేక్షిస్తున్నవాడు. నిర్వచిస్తున్నవాడు. ఆస్వాదిస్తున్నాడు.
శ్రీ ఉద్ధవుడు : కృష్ణయ్యా! అట్టి అనుభవము (experiencing) కు విషయము (Material) అయి చెన్నొందుతున్న ఈ ప్రకృతి ఎక్కడినుండి ప్రదర్శితమౌతోంది. ఈ ప్రకృతికి
ఉత్పత్తి స్థానమేది?
శ్రీకృష్ణుడు :
శ్లో॥ ॥ వ్యక్తాదయో వికుర్వాణా ధాతవః పురుష ఈక్షయా |
లబ్ధవీర్యాః సృజంతి అండం సంహతాః ప్రకృతేర్బలాత్ ॥ (అధ్యా 22, శ్లో 18)
పురుషుడు - ప్రకృతి అని రెండు విశేషాలు చెప్పుకుంటున్నాము కదా!
పురుషుడు Perceiver
ప్రకృతి Perception - objects of perception
పురుషుని ఈక్షణ (visualization, perception) యే ప్రకృతి అను శబ్దము యొక్క
ఉత్పత్తి, నిర్వచనము కూడా!
పురుషుని నుండే ప్రకృతి బయల్వెడలుతోంది. (The nature of the Being is
emitting out of the said being only)
ప్రకృతి నుండి ఆకాశము వాయువు అగ్ని జలము భూమి (Space - -
Vapour - Heat - Liquid - Solid) అనే పంచభూతములు - జీవుడు - ఈశ్వరుడు
అనబడే సప్తధాతువులు (సప్తతత్త్వములు) ఉత్పన్నమగుచున్నాయి. ఈ సప్తధాతువులు
పరస్పరం వేరువేరు విధాలుగా సమ్మిళితమై ఈ వివిధరీతులుతో కూడిన బ్రహ్మాండము
ప్రదర్శితమౌతోంది.
సప్తధాతువుల సమ్మేళనమునుండి చలనము - గతి రూపంగా ప్రాణశక్తి ఉత్పన్నమౌతోంది.
శక్తియొక్క చమత్కారంగా దేహములు ఇంద్రియములు ఇంద్రియ శక్తులు
ప్రదర్శితమౌతున్నాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
231
అనగా...,
(ఆత్మాత్ - ఆకాశమ్ :: ఆకాశాత్ వాయుః అగ్ని :: అగ్నిః - ఆపః
:: ఆపః - పృధ్వి)
దేహము ఇంద్రియములు,
ప్రాణము
మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు ఇవన్నీ ఆత్మ నుండి బయల్వెడలి, వాస్తవానికి
ఆత్మకు అభిన్నమై చెన్నొందుతున్నాయి. ఆత్మయందు బయల్వెడలినవన్నీ..., ఆత్మకు
అభిన్నమై ఆత్మయందే లయమౌతున్నాయి. మట్టి నుండి తయారైన వివిధ ఆకారములు
గల పాత్రలన్నీ మట్టికి అభిన్నమేకదా! త్రికాలములలోనూ అంతా మట్టియే!
10. షట్ తత్త్వము
మరొక గురువు శిష్యులకు ఈ విభజనను 6 తత్త్వములుగా బోధిస్తున్నారు. ఆ గురువుల
దృష్టిలో... (వారి నిర్వచనములను అనుసరించి)...
పంచమహా భూతములు (ఆకాశాదులు)
6వ వాడు - పరమ పురుషుడు - పరమాత్మ
పరమ్ ఆవల! ఈవల ప్రదర్శితమయ్యే పంచమహాభూతాది జగద్వ్యవ
హారమంతా ప్రకృతి. జన్మలు - కర్మలు, మనోబుద్ధి చిత్త అహంకారాలు ప్రకృతిలోని
అంతర్విభాగ చమత్కారాలు! ఆవల సాక్షిగా ఉన్న ఆత్మ చైతన్యమే పరమాత్మ!
పరమాత్మ.... సంకల్పనిష్ఠుడైనప్పుడు...,
తన నుండి తనకు అభిన్నంగా సంకల్పచమత్కారంగా బహిర్గతమై ప్రదర్శిత
మగుచున్న పంచమహాభూతముల ద్వారా...,
ఈ పరిదృశ్యమానమగు జగత్తును సృష్టించుకొని....,
స్వయముగా తనకు తానే తన కల్పనా చమత్కార సదృశ జగత్తులో ప్రవేశించి..
తన జగత్తు అనే క్రీడా స్థలంలో తానే క్రీడాకారుడై విహరిస్తున్నాడు!
వ్యవహరిస్తున్నాడు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
232
11. చతుర్విధ తత్త్వములు
కొందరు మహనీయ గురువులు తత్త్వములు 4 విధములు అని చతుర్విధ తత్త్వములుగా
విభజించి చెప్పటం జరుగుతోంది.
శ్లో॥ చత్వార యేవేతి తత్రాపి తేజ-అపో-అన్నమ్-ఆత్మనః |
జాతాని తైరిదం జాతం జన్మావయవినః ఖలుః 11 (అధ్యా 22, శ్లో 21)
చతుర్విధ తత్త్వవిభాగ వేదుల దృష్టిలో...,
1. భూమి 2. జలము 3. తేజస్సు 4. ఆత్మ
అంతా కలిపి ఈ నాలుగే! ప్రతి జీవుడు జంతువు దేవత... ఈ నాలుగు
విశేషముల సమ్మేళనమే!
ఈ చతుర్విధ (కారణరూప) తత్త్వములనుండి కార్యరూపంగా ఈ సృష్టి అంతా
పరిఢవిల్లుతోంది!
అట్టి సృష్టిలోంచి జగత్తు ఉత్పన్నమౌతోంది.
చతుర్విధ మహాతత్త్వములుసృష్టి జగత్తు
12. సప్తదశ (17) సంఖ్యా విభాగాలు
1. పంచమహాభూతములు 5
పంచ తన్మాత్రలు 2. 5
(శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలు)
3. పంచేంద్రియములు 5
4. మనస్సు 1
5. ఆత్మ 1
ఈ 17 తత్త్వములే సర్వము కూడా!
13. షోడష (16) సాంఖ్యా వేదులు
వీరు 17 తత్త్వములు చెప్పు వారి వలనే విభజిస్తున్నారు. అయితే వీరి దృష్టిలో మనస్సు
- ఆత్మ వేరైనవి కావు. ఆ రెండు అభిన్నములు. మనస్సు ఆత్మలోనిదే! ఆత్మయే మనస్సుగా
కనిపిస్తోంది!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
233
14. త్రయోదశ (13) సాంఖ్యవేదులు
పంచ మహాభూతములు 5
పంచేంద్రియములు 5
మనస్సు 1
జీవాత్మ 1
పరమాత్మ 1
అని విభాగించి ప్రవచిస్తున్నారు.
15. ఏకాదశ (11) తత్త్వ సాంఖ్యవేదులు
పంచమహాభూతములు 5
పంచేంద్రియములు 5
ఆత్మ 1
16. నవ (9) తత్త్వవిదులు
అష్టవిధ ప్రకృతులు దృశ్యము - దేహము - ప్రాణము - మనస్సు-బుద్ధి -
చిత్తము - వ్యష్టి అహంకారము (జీవాత్మ) - -
దీనికి ఆవల పురుషుడు. ఆతని కావల పరమపురుషుడు!
జీవాత్మ పరమాత్మ
33. అధ్యాత్మము - అధిభూతము - అధి దైవము
వింటున్నావా? మిత్రమా, ఉద్ధవా! ఈవిధంగా సత్యాన్వేషకులై, సత్యద్రష్టలగు వేరువేరు
కాలాలలో ఋషులు గురువులై వారివారి యుక్తియుక్తములు - లెక్కలను, ఆత్మతత్త్వమును
బోధించటానికి వారనుకొన్న ఉపాయములను అనుసరించి - విభాగములు చేసి చెప్పటం
జరుగుతోంది. జరగబోతోంది. సత్యమును నిర్వచించి చెప్పేదంతా సత్యమే! అవి
ఋషివాక్కులు. అసత్యమెందుకౌతాయి?
శ్రీ ఉద్ధవుడు : కృష్ణయ్యా! ప్రకృతి :: పురుషుడు ఈ రెండూ సహజంగా విలక్షణులు
కదా! ప్రకృతి - పురుషులు (My qualities + I) ఈ రెండు కలసి ఉండటంచేత లౌకిక
సామాన్య దృష్టిచే ఆ రెండిటికీ భేదము కనిపించదు.
-
ఈ దేహము ప్రకృతిచే నిర్మితమౌతోంది! (ప్రకృతి - కారణము : దేహము
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
234
కార్యము). ప్రకృతియో - ఆత్మకు అంతర్గతము. ఆత్మయందు ప్రకృతి - ప్రకృతియందు
ఆత్మ లక్షితములై (ఒకదానికి మరొకటి లక్ష్యరూపములై -Aimed at) ఉంటున్నాయి.
ఓ పుండరీకాక్షా! సర్వజ్ఞా! శ్రీకృష్ణా!
ఇప్పుడు నేను చెప్పినపై విశ్లేషణ యుక్తియుక్తమేనా? (Is it so or not?)
శ్లో॥ త్వత్తో జ్ఞానం హి జీవానాం ప్రమోషస్తే అత్ర శక్తితః |
త్వమేవ హి ఆత్మమాయాయా గతిం వేత న చ అపరః 11 (అధ్యా 22, శ్లో 28)
స్వామీ! మీ యుక్తియుక్తమైన వాక్కులతో నాలో శేషించియున్న (ఇంకా మిగిలిపోయి
ఉన్న) సందేహములను తొలగించవలసినదిగా మిమ్ములను వినమ్రుడనై
వేడుకుంటున్నాను.
నీ అనుగ్రహముచేతనే జీవులకు జ్ఞానము కలుగుచున్నదయ్యా!
అట్లాగే....,
నీ మాయాశక్తి వలననే జీవులలో జ్ఞానము అజ్ఞానముచే కప్పబడి ఉంటోంది!
నీమాయా శక్తి స్వరూపమును నీవు మాత్రమే ఎరుగగలవు. ఇతరులెవ్వరు
ఎరుగజాలరయ్యా!
శ్రీకృష్ణభగవానుడు : ఓ పురుషశ్రేష్ఠుడా! ప్రియ మిత్రమా! ఉద్దవా! ప్రకృతి - పురుషులు
వేరుగా విభాగించుకున్నంత మాత్రంచేత తత్త్వం ప్రస్ఫుటం కాదు. బోధన సంపూర్ణం
కాదు. సామాన్యంలోంచి విశేషమును బుద్ధితో విభాగించి, ఆ తరువాత బుద్ధితో
విశేషముకు సామాన్యముతో ఏకము, సామాన్యమునందు లయము చేయటమే తత్త్వశాస్త్ర
పఠనము సుమా!
నిర్వికారమగు మట్టితో సాకారమగు అనేక బొమ్మలు తయారు చేయవచ్చునుగదా!
అయినాకూడా, మట్టిబొమ్మలుగా కనిపించేదంతా మట్టియేకదా! బొమ్మల దృష్ట్యా చూస్తే
అనేక విశేషములతో కూడిన ఆకారాలు! మట్టి దృష్ట్యా? అంతా ఒక్కటే!
అట్లాగే...,
ఆత్మ నిర్వికారము. నిరాకారము —— —
ప్రకృతి గుణముల క్షోభతో కూడుకొనినది. దేహాదుల సంరభముతో వెల్లివిరిసేది.
సవికారము. సాకారము.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
235
గుణమయమగు నా మాయ సత్త్వ - రజ తమో గుణ చమత్కారములతో
కూడిన భేదానుభవమునకు కారణమగుచున్నది. భేదదృష్టిని సృష్టిస్తోంది! అట్టి భేదములన్నీ
క్రోడీకరించి,....
1. అధి భౌతికము Differences being experienced because of
Physical factor)
2. అధి దైవికము Differences being experienced because of
incidents, relationships and points of view
3. అధ్యాత్మికము అనేకతరంగాలుగా జలము కనిపిస్తున్నట్లు
గాలి అనేక వస్తువులలో ప్రవేశించి ఆయా
ఆకారములుగా అయి వస్తువుల రూపంగా
కనిపిస్తున్నట్లు ఏకము అఖండమగు ఆత్మ అనేకముగా
కనిపించటం
బంగారము అనేక ఆభరములుగా విభాగమౌతోందా? లేదే! ఆభరణములెన్ని ఉన్నా
బంగారం ఒక్కటే కదా!
అంతే కాకుండా... ఇంకా విను! త్రివిధ విశ్లేషణము గురించి చెప్పేడప్పుడు శాస్త్రకారులు,
సిద్ధాంచీకరించే మహర్షులు ఏవిధంగా విశ్లేషించి వివరించుచున్నారో చెప్పుచున్నాను.
నేత్రేంద్రియములు అధ్యాత్మము
చూడబడే దృశ్య విశేషాలు అధిభూతము |
నేత్రగోళములో ఏర్పడి ఉన్నదై
ప్రకాశించే సూర్యగోళము అధి దైవము
ఈ మూడు కూడా (నేతేంద్రియము + దృశ్యము + చూపు శక్తి) పరస్పరాశ్రయముచే
సిద్ధించటం జరుగుతోంది.
అయితే...
ఈ ముడింటికి మూలకారణము మరొకటున్నది. అదియే.... ఆత్మ!
ఆకాశంలో స్వప్రకాశముచే సూర్యునికి దేనిపట్ల ఆపేక్ష అనేది లేక పోయినప్పటికీ....
అన్నిటినీ నిరపేక్షగానే ప్రకాశింపజేస్తూ ఉంటాడు చూచావా?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
236
అట్లాగే....,
ఆత్మ భగవానుడు కూడా అధ్యాత్మ - అధిభూత - అధి దైవముల ఉనికికి, తత్సంబంధమైన
కార్యక్రమములకు మూలకారణము కారణ కారణము అయి ఉన్నారు. అట్లాగే,
దేనికీ కారణము కాదు!
అందుచేత ఏకరూపము - అభిన్నము అగు ఆత్మ..., త్రివిధతత్త్వములకంటే భిన్నరూపమై
స్వయం ప్రకాశమై..., ప్రకాశించే సర్వవస్తువులకు (మనో-ప్రాణ-బుద్ధి-చిత్తఅహంకారాదులకు, దృశ్యమునకు కూడా) ప్రకాశకమై యున్నది!
ఇప్పుడు నేత్రములగురించి చెప్పుకున్నాం. అట్లాగే...,
శ్లో॥ ఏవం త్వక్ ఆది-శ్రవణ ఆది చక్షుః |
జిహ్వాది నాసాది చ చిత్త యుక్తమ్ ॥ (అధ్యా 22, శ్లో 32)
చర్మము - చెవులు నాలుక ముక్కు - చిత్తము బుద్ధిలకు కూడా త్రివిధ తత్త్వ
విశేషాలున్నాయి.
తాపము తపించబడునది. (that which is functioning)
తపించువాడు (one who is making to function) ఆత్మ !
అధ్యాత్మము అధిభూతము అధి దైవము
(Product) (Purpose) (Producer)
1. త్వక్ ఇంద్రియము స్పర్శ వాయు దేవుడు
స్పర్శేంద్రియము (చర్మము)
2. శోత్రము (చెవులు) శబ్దము (Sound) దిక్ దేవతలు
3. జిహ్వ (నోరు) రసము (Taste) వరుణ దేవుడు
నాసిక 4. (ముక్కు) గంధము (Smell) అశ్వనీ దేవతలు
5. చిత్తము ఇష్టము (Interest) వాసుదేవుడు
6. మనస్సు మనోవిషయము చంద్రుడు
7. తెలుసుకొనబడుచున్నది బ్రహ్మదేవుడు బుద్ధి
8. అహంకారము అహంకరించబడుచున్న
విషయము రుద్రుడు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
237
ఈవిధంగా అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము ఏర్పడినవై ఉన్నాయి.
వికారాత్మకమగు అహంకారము 1. వైకారము 2. తామసము 3. ఐంద్రియము
(ఇంద్రియ సంబంధమైన ఈ దృశ్యము) అనే ఈ మూడు మోహ వికారములకు (llusinary
misconceptions) కారణమై ఉంటోంది.
అనగా...,
అహంకారము...
1. వైకారికము దృశ్య విషయములను చూచి భావావేశము పొందటం
తాపము తపన - అవినాభావత్వము మొదలైనవి
సంతరించుకోవటం.
కోపముతో కూడిన 2. తామసము ఆవేశము, అధర్మయుతమైన
మార్గములో బాధించటం (Hurting) పగ (Revenge)
సాధించటం వేధించటం (Teasing)
3. ఐంద్రియము ఇంద్రియములకు వశం అయి అవిచారణ పూర్వకంగా
కాలము వెచ్చించటం, వెల్లబుచ్చటం, దురభ్యాసముల
నుండి వెనుకకు మరలలేకపోవటం
ఈ మూడు వికారములను ప్రదర్శించటం జరుగుతోంది!
శ్రీ ఉద్ధవుడు : మహాత్మా! శ్రీకృష్ణా! ఇక్కడ నాదొక మరొక సందేహము. ఆత్మ అఖండము,
అని వేదోపనిషత్తులు, ఋషి వాక్యములు ఎలుగెత్తి ప్రకటిస్తున్నప్పటికీ అఖండమగు
ఆత్మ ఉన్నదో? లేదో?... అనే సందేహం కూడా కొందరు కలిగియే ఉంటున్నారే?
శ్రీకృష్ణుడు : అవును! అఖండమగు ఆత్మ ఉన్నదని శాస్త్రాదులు నిర్వచిస్తూ ఉండగా
"అటువంటి అఖండమగు ఆత్మ ఏదీ లేదు!" అని కొందరు ఆ విషయమును తిరస్కరిస్తూ
ఉన్నారు.
అయితే...,
"ఆత్మ అనేది లేదు అద్దాని గురించి చర్చ, పరిశీలన అవసరంలేదు కూడా!" అని
నమ్మేవారు వాదించేవారి విషయంలో కూడా, "ఏది సత్యము?" అనే ప్రశ్నకు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
238
సమాధానం లభించక, "ఈ జీవుడు ఎట్టివాస్తవ స్వభావుడు?".... అనే విషయంలో
వారు ఒక కొలిక్కి తీసుకు రాలేక ఆ ప్రశ్న నివృత్తం కావటంలేదు! ఈ జీవుడెవరు?
పంచభూతముల కలయిక నుండి ఏర్పడిన ఏదైనా నూతన శక్తియా? దేహపతనంతో
లేనివాడగుచున్నాడా? వేరు వేరు అభిరుచిలుగల జీవులు, వారి స్వభావములు రక్తమాంస - బొమికలవా?
సత్యము యమ్ సత్
యొక్క అవగాహనకై తగిన ప్రయత్నమునకు ఉద్యుక్తుడు కానంతవరకు ఇటువంటి
అభిప్రాయ పరంపరలు బుద్ధిని భ్రమింపజేస్తూనే ఉంటాయి. బుద్ధి చంచలత్వమును
వీడదు. జీవునికి వాస్తవమైన - స్వభావసిద్ధమైన ప్రశాంతత లభించదు.
జీవుని వాస్తవ - సహజ-శాశ్వత స్వభావమును గురించి వినటం-పఠించటంతెలుకోయత్నించటం అనుక్షణికం చేసుకోవటముచే ఈ జీవుడు దేహ మనో చిత్త
అహంకారాదులకు యజమాని... అని తెలియబడగలదు.
శ్రీ ఉద్ధవుడు : ఓ దేవదేవా! నీవు సర్వతత్త్వ స్వరూపుడవు! నీ నుండి ప్రవృతమైన
బుద్ధిగల మానవులు వారివారి స్వయంకృత కర్మలను అనుసరించి - ప్రవాహంలోపడి
తరంగాలచే ఎటెటో కొట్టుకు పోబడుచున్న చెక్కముక్కవలె... అనేక ఉచ్ఛ- నీచ
ఉపాధులలో సంచారాలు చేయవలసి వస్తోంది. జగత్ విషయాలచే వారి బుద్ధి ఆవృతమై
ఉంటోంది. నీ తత్త్వమును గ్రహించటం అసాధ్యం! కానీ నీ కరుణచే మాత్రమే
అగ్రాహ్యమగు దివ్యతత్త్వాన్ని ఎరుగగలం... అని విజ్ఞులు అంటూ ఉంటారు.
మేమందరము నీ మాయచే మోహితలమైన వారము! అయితే, నీవు ఆశ్రిత వత్సలుడవు!
భక్తవత్సలుడవు! మీ తత్త్వము మీరు మాత్రమే ఎరుగగలరు! తెలియజెప్పగలరు!
మాయా మోహితుడనైన నన్ను మీరే రక్షించాలి. మీ తత్త్వమును ఎరుగుటమే
దురత్యయమైన మీ మాయను దాటటానికి ఉపాయం కదా! అందుకే మహనీయులందరు
కృష్ణచైతన్య తత్త్వమును గానంచేస్తూ నావంటి ఆర్తులగు జనుల చెవులకు - హృదయాలకు
ఔషధంగా ప్రసాదిస్తూ ఉంటారు.!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
239
34. దేహము దేహాభిమానము - దేహి
శ్రీ ఉద్ధవుడు : ఓ కృష్ణయ్యా! ఇప్పుడు ఈ సందర్భంలో నీ తత్త్వమును నీ నుండే వినాలని
నీకు విన్నవించుకుంటున్నాను.
శ్రీకృష్ణభగవానుడు : ఓ ఉద్ధవా! వేద - ఉపనిషత్ - మహర్షి ప్రవచనాలు నాయొక్క ఏ
తత్త్వము గురించి ఎలుగెత్తి గానం చేస్తూ వినిపిస్తున్నాయో అట్టి విశేషాలు చెప్పుతాను
విను.
ఈ భౌతిక దేహము పంచభూతము (భూ జల అగ్ని - వాయు ఆకాశము)లచే
నిర్మితమై యున్నది కదా! అటువంటి ఈ భౌతిక దేహము పంచేంద్రియములు (చెవులు,
చర్మము, కళ్ళు, నోరు, ముక్కు) కార్యక్రమములకు ఉపయుక్తమగు ఒక యంత్రము
వంటిది.
ఈ పంచేంద్రియములు తన ఉపకరణములుగా ఉపయోగించుకొనుచున్నది - మనస్సు.
మనస్సుకు యజమానియగు జీవుడు ఆ మనో ఉపకరణముతో ఒక దేహము నుండి
మరొక దేహమునకు, ఒక లోకము నుండి మరొక లోకమునకు సుదీర్ఘ - అవిశ్రాంత
ప్రయాణీకుడిలాగా బహుదూరపు బాటసారిగా కొనసాగించటం జరుగుతోంది.
ప్రయాణాలు చేస్తున్నాడు.
ఈ జీవుని వాస్తవరూపం ఏమిటి? అని పరిశీలిస్తే ఆత్మయే అనునదే సమాధానం.
ఆత్మయే దేహి. అట్టి ఆత్మ దేహముకంటే భిన్నమే అయినప్పటికీ.... అహంకారము
ద్వారా మనస్సు వెంట అనువర్తిస్తూ లోకాలోకాలలో దేహత్వమును అనుభవించటం
జరుగుతోంది. మనస్సు కర్మలకు అధీనమై ఎదురుగా ఇంద్రియములకు తారసబడే
విషయములను, ఆ విషయముల సంస్పర్శ - తాదాత్మ్యముచే సందర్భమౌతున్న కర్మకార్య క్రమములను క్షణక్షణం క్షణమునకు ఒకవిధంగా చింతన చేయటం
కొనసాగిస్తోంది!
ఈ మనస్సు ఏఏ విషయ సమూహములను చింతన చేస్తూ ఉన్నదో.... ఆ చింతనల
మధ్య మరల పుట్టి మరల మరల ఆ చింతనలలోనే లయిస్తూ, ఉన్నది! స్మృతిని
కోల్పోతూ, ఎప్పటికప్పుడు అనేక చింతనల మధ్య ప్రవర్తిస్తోంది
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
240
అనగా,...
ఈ మనస్సు దృశ్య సంబంధమైన - వేద విధి విధాన సంబంధమైన ఏవేవో చింతనలలో
జనిస్తోంది. లయిస్తోంది. మరల వేరైన విషయ చింతనలమధ్య జనిస్తోంది. మరల
లయిస్తోంది! పూర్వ చింతనల గురించి, పూర్వదేహ వ్యవహారముల గురించి స్మృతి
కోల్పోతోంది. విస్మృతి పొందుతోంది. పూర్వదేహముల వ్యవహారములచే రూపుదిద్దుకున్న
సంస్కారములచే మరల దేహ ప్రకాశ నిష్క్రమణలు (Manifesting and withdrawing
of Physics) కొనసాగిస్తోంది!
ఒక దేహము
ఆ దేహముతో అనేక కర్మల నిర్వహణ
అట్టి కర్మల నిర్వహణచే అనేక చింతనలు.
ఆ చింతనలచే ప్రోత్సహించబడిన మరికొన్ని కర్మ- పరంపరలు.
ఆ కర్మల ఫలములు. తద్వారా మరికొన్ని వేరైన కర్మలు - చింతనలు.
ఎప్పుడో ఈ భౌతిక దేహపతనము. వర్తమాన దేహమును త్యజించి ఈ జీవుడు
మరొక దేహాన్ని ఆశ్రయించటం.
ఆ మరొక దేహముతో వేరైన చింతనలు - కర్మలు - కర్మ ఫలములు - కర్మ
ఫలితానంతర చింతనలు.
ఆ చింతనల నుండి మరికొన్ని కర్మలు.
ఆ చింతన - కర్మ - చింతనల నుండి సుఖ దుఃఖానుభవాలు.
నూతన దేహముతో తారసపడే చింతన - కర్మలలో అత్యంత అభినివేశము వలన
పూర్వదేహమునకు చెందిన సంబంధ బాంధవ్యాదులు విస్మరించటం. (విస్మృతి
కలగటం).
ఒక దేహ చింతనా వ్యవహారం నుండి మరొక దేహమునకు ప్రయాణించటం (మృత్యువు)
చూచావా ఉద్ధవా! అటువంటి ఈ జన్మ - జన్మాంతర ప్రయాణం ఎటువంటిదంటే...
ఒకడు ఒక స్వప్నమునుండి మరొక స్వప్నములోనికి ప్రయాణించటం వంటిదే!
ఒక మనోరథము నుండి మరొక మనోరథానికి మనస్సును మరల్చటం వంటిది.
( From one type of Wants, Wishes, Exepctations, desires etc., to another such types of all those)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
241
స్వప్నము - మనోరథము (Dreaming & wishing) ఎట్లా తయారవుతున్నాయి?
వాటికి మూలము అభిమానమే (A kind of fondness) కదా!
ఆ రీతిగానే కొన్ని విషయములపట్ల - విశేషముల పట్ల - నామరూపాదులప
సంగతి, సందర్భ, సంఘటనల పట్ల విశేషమైన అభిమానము కలిగివుండుటచేతనే,
అదంతా కూడా జీవునిపట్ల "పునర్జన్మ" అను తతంగమునకు కారణభూతమైయున్నది.
ప్రస్తుత స్వప్నంలో ఉన్న ఒకానొకడు వెనుకటి రాత్రి స్వప్నంలోని అనుభూతులనువిశేషాలను స్మరిస్తున్నాడా? లేదు కదా! విస్మరించినవాడై వుంటున్నాడు కదా!
వర్తమాన మనోరథములలో (ఉదాహరణకు - యౌవన మనోరథములలో) ఉన్న జీవుడు
బాల్యములోని ఆట పాటలకు సంబంధించిన మనోరథములను స్మరిస్తున్నాడా?
గుర్తుచేసుకొని వాటివెంట పరుగులు తీస్తున్నాడా? లేదు.
అట్లాగే...,
వర్తమాన దేహమునందు - సంబంధిత వ్యవహారములయందు అభిమానము కలిగియున్న
ఈతడు పూర్వదేహ సంబంధములైన అభిమానములను సంస్మరించటంలేదు.
అయితే...,
పూర్వదేహమును (పూర్వ సందర్భమును) ధారణ చేసిన ఆత్మయే వర్తమాన దేహము
సందర్భములో కూడా ఆస్వాదించుతోంది. సద్యోజాతము అగు (అదియే ఇక్కడికి వచ్చింది)
ఆత్మ ఉభయ దేహములను ఆస్వాదించటం జరుగుతోంది. ఇంకా విను.
ఒక జీవుడు ఒక స్వప్నంలో అనేకమంది స్నేహితులను - శత్రువులను - బంధువులను
- తెలిసినవారిని - తెలియనివారిని చూస్తున్నాడనుకుందాం!
ఆ స్వప్న ద్రష్టకు కనిపిస్తున్నవారందరూ ఎవ్వరు? ఆ స్వప్నద్రష్ట యొక్క స్వయంకృతమైన
స్వప్నదృష్టి - స్వప్నసృష్టియే కదా! అంతేగాని, ఆతని స్వప్నములోకి మరొకరెవరో వచ్చి
ఆయా జనములను - దృశ్యములను సృష్టించారా? కల్పించి ఆ స్వప్నద్రష్టకు అవన్నీ
చూపిస్తున్నారా? లేదు కదా!
జీవుడు తన జాగ్రత్లోంచి ఏవేవో ఆలోచిస్తూ ఆలోచిస్తూ స్వప్నంలోకి
జారుకుంటున్నాడు. స్వప్న దృష్టియే స్వప్న దృశ్యంగా పరిఢవిస్తోంది.
అనగా....
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
242
జీవుడు తన స్వప్నమునందు తానే తన స్వప్న చైతన్యమునకు చెందిన సంస్కారములచేత
వివిధములగు దేహములను సృష్టించుకుంటున్నాడు. దర్శిస్తున్నాడు. ఆ స్వప్నాంతర్గత
స్వయంకృత దేహములతో సంచారాలు చేస్తున్నాడు. ఆడుకుంటున్నాడు. పాడుకుంటున్నాడు.
దుఃఖిస్తున్నాడు. భయము ఆవేశము మొదలైనవన్నీ అనుభ విస్తున్నాడు. స్వప్నద్రష్ట
యొక్క స్వప్నచైతన్యమే స్వప్నాంతర్గత సర్వరూపనామాదులన్నీ ధరిస్తోంది. స్వప్న ద్రష్టకు
నవరసానుభవములు కలిగిస్తోంది. నిద్రనుండి లేవగానే ఆ స్వప్న చైతన్యంలోనే
స్వప్నాంతర్గత విశేషాలు తరంగం జలంలో లయిస్తున్నట్లు- లయిస్తున్నాయి. స్వప్న
చైతన్యమేమో స్వప్నద్రష్ట యొక్క స్వస్వరూపంలోనే లయిస్తున్నది కదా!
జాగ్రత్లో కూడా జరుగుచున్నది అదే! జాగ్రత్ చైతన్యము స్వస్వరూపము నుండి
బయల్వెడలి, జాగ్రత్ వ్యవహారమంతా ఆస్వాదించబడిన తరువాత ఆత్మ చైతన్యమునందే
లయమౌతోంది.
మనస్సుయొక్క దేహ-దేహాంతర అభినివేశమువలన దృశ్య దృశ్యాంతర్గత విశేషములన్నీ
ఆత్మయందే అసద్రూపంగా వెల్లడి అగుచున్నాయి.
ఆత్మచైతన్యము
జాగ్రత్ చైతన్యము స్వప్న చైతన్యము
జాగ్రత్ ద్రష్ట స్వప్న ద్రష్ట
జాగ్రత్ దృశ్యానుభవం స్వప్న దృశ్యానుభవం
కనుక....,
ఆత్మయే అసద్రూపములగు బాహ్య అభ్యంతర కార్య కారణములకు, తత్భేదములకు
మూలకారణమగుచు, తాను అప్రమేయమై నిత్యమై సర్వదా సద్రూపమై ప్రకాశిస్తోంది...
అనునది గమనించు. ఆత్మయే జాగృత్ సాక్షిగా, జాగృత్ ద్రష్టగా, జాగృత్ దృశ్యముగా
స్వకీయ కల్పనా కళా విశేషం చేత అగుచున్నది. అదే రీతిగా - స్వప్నసాక్షిగా, స్వప్నద్రష్టగా,
స్వప్నదృశ్యముగా కల్పనాకళా విశేషం ఆస్వాదిస్తోంది. అట్లే సుషుప్తి కూడా!
ఓ ఉద్ధవా! కాలము (ఇది నా లక్ష్యము - అనునదేమీ లేకుండా....) అలక్ష్య వేగముతో
ప్రయాణిస్తూ ఉండగా, ప్రతిక్షణము అనేక దేహములు పుట్టుచున్నాయి. గిట్టుచున్నాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
243
అయితే...,
శ్లో॥ ॥ నిత్యదా హి అంగభూతాని భవంతి, న భవంతి చ
కాలేన అలక్ష్య వేగేన సూక్ష్మత్వాత్ తత్ న దృశ్యతే || (అధ్యా 22, శ్లో 43)
కాలముయొక్క గతి (The flow and movement of time) అత్యంత సూక్ష్మమైనది
అయి ఉండటంచేత అవివేకులైన (ఆత్మ తత్త్వ వివేకము సంపాదించుకోనంత వరకు)
మానవులు ఆ కాలచమత్కారమును గమనించలేకపోతున్నారు.
కాలగతిచే ఈ కనబడే దేహాలన్నీ కూడా పుట్టటం - బాల్య యౌవన వార్ధక్యాలు
మరణము ఇత్యాది గతులకు నిరంతరం గురి అగుచున్నాయి. కాలముచే వాయువు
అగ్నిరూపంగాను, అగ్ని స్థూల రూపములగు వస్తు రూపములుగాను, మానవ - జంతు
దేహములుగాను వివర్తము పొందుచూనే ఉన్నాయి. మరల ఈ భౌతిక వస్తు జాలమంతా
గాలిలో కలిసిపోతున్నాయి.
కాలముచే పరివర్తనము కానిది ఏమున్నది? అయినప్పటికీ అవివేకులైన జీవులు
వర్తమానం నిత్యమేకదా - అని అని భ్రమిస్తున్నారుభ్రమిస్తున్నారు. . భ్రమచేత..., నిన్ను కాలాతీతుడగు
ఆత్మగా గ్రహించు!
దీప జ్వాలకు హేతువు దీపము
జల తరంగానికి హేతువు జలము
అని అనుకొంటూ ఉంటారు. దీపాగ్ని జ్వాలగా మారుతోందా? నదీ జలము తరంగాలుగా
మారుతోందా? అట్లాగే ఆత్మయే ఈ జీవుడు - దేహములకు హేతువు అయినట్లో
(లేక) ఆ రీతిగా కల్పించుకున్నట్లో(కాక) ఆవిధంగా అగుచున్నట్లో అనిపించవచ్చుగాక!
మట్టిబొమ్మ - మట్టి... బొమ్మగా మారిందా? బంగారు ఆభరణం బంగారము..
ఆభరణముగా మారిందా? ఆత్మ సర్వదా యథాతథమేగాని, జీవుడుగా మారుచున్నది
ఎన్నడూ లేదు! ప్రజ్వలించే అగ్ని-అగ్ని జ్వాల, నదీ జలం-జలతరంగము ఒక్కటే
అయినట్లు పరమాత్మ-జీవాత్మ ఒక్కటే!
మండుచున్న కట్టెను నీళ్లతో ఆర్ఫామనుకో! అనగా, ఆ కట్టెను మండిస్తున్న అగ్ని
నశించిందా? లేదు కదా! అగ్నికి ఉత్పత్తి-వినాశనములు కట్టెను మండించటముచేత
- ఆర్పుటచేత కలుగుచున్నాయి... అని అనలేముకదా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
244
అట్లాగే కర్మలవలన జన్మ కలుగుతోంది. అప్పుడు జీవుడు పుట్టుచున్నాడు. ఆ కర్మలచే
దేహము నశించినప్పుడు ఆ జీవుడు (దేహి) నశిస్తున్నాడు అని అనుకోవటం కూడా!
జీవుని జన్మ-కర్మ-మరణములు కలగటమంతా దేహసంబంధమాత్రమే అయి ఉండగా,...
అవన్నీ అజ్ఞులు దేహికి (లేక) ఆత్మకు భ్రాంతిచే ఆపాదిస్తున్నారు. ఆత్మజ్ఞానము
సంపాదించుకోకపోవటంచేత "నేను దేహంతో పుట్టుచున్నాను. చస్తున్నాను. మరొక
దేహంలో ప్రవేశిస్తున్నాను..." అనునవన్నీ సత్యమువలె అనిపిస్తున్నాయి. భ్రాంతిచేతనే
జీవుడు పుట్టుక-చావు కలవానివలె ఉపలక్షితుడు అగుచున్నాడు. అగుపిస్తున్నాడు (లేక
అట్లా అనిపిస్తోంది). వాస్తవానికి ఈ జీవుడు దేహముతో జనించటములేదు.
(అంతకుముందే వున్నాడు) దేహంతో నశించటములేదు. (ఆ తరువాత కూడా వుంటాడు)
దేహాలు మాత్రమే వస్తున్నాయి - పోతున్నాయి.
ఈ భౌతిక శరీరావస్థలు ఏవేవి?
శ్లో॥ నిషేక గర్భ జన్మాని బాల్య కౌమార యౌవనమ్
వయోమధ్యం జరా మృత్యుః ఇతి అవస్థాః తనోః నవ ॥ (అధ్యా 22, శ్లో 47)
దేహికి దేహముతో కలుగుచున్న సంబంధ వ్యవహారములన్నీ 9 అవస్థలుగా
చెప్పబడుచున్నాయి.
1. నిషేకము - దేహాభివాన ఆవేశము 2. తల్లి గర్భములో ప్రవేశము 3. భూమిపై
జననము 4. బాల్యము 5. కౌమారము 6. యౌవనము 7. ప్రౌఢత్వము 8.
వార్ధక్యము 9. మరణము.
ఈ 9 అవస్థలు భౌతికదేహ-సంబంధమైనవి మాత్రమే! చిత్ చైతన్య స్వరూపుడగు
దేహి - సంబంధమైనవి కావు. ఇక వాటియొక్క అనుభూతి - మనస్సుయొక్క తీరుపై
ఆధారపడి ఉంటోంది.
దేహము వేరు - దేహి వేరు.
ఈ జీవుడు స్వాభావికమైన అవివేకముచేత, మనోరధముల ప్రభావంచేత, మనో
వికార జనితములైన తాదాత్మ్యముచేత - దేహమునకు సంబంధించిన అవస్థలను
తనవిగా భావించి అభిమానించి, తనయొక్క అప్రమేయత్వమును ఏమరస్తున్నాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
245
ఈ బాల్యం నాది! ఈ యౌవనం నాది! ఈ కష్ట సుఖాలు నావి! |
ఈ వార్ధక్యం నాది! ఈ మృత్యువు నాది! ఈ పునర్జన్మ నాది!
నావి! నావి! నావి!
అని అతడు స్వప్నసాదృశంగా భ్రమిస్తున్నాడు. రాత్రి స్వప్నంలో పుట్టాను. తిరిగాను.
పరుగులెత్తాను. తరువాత మెళుకువ వచ్చింది! - అనే స్వప్నానుభవం విషయంలో
స్వప్నానికి ముందు - ఆ స్వప్నానంతరం స్వప్న ద్రష్ట వున్నాడు కదా!
పరమేశ్వరానుగ్రహం చేత వివేకబలం పెంపొందించుకొన్న జీవుడు నాది అనే
అభిమనమును పాము కుబుసములాగా విడచి వేస్తున్నాడు. "జగత్ రచనా దురంధరా!
ఇదంతా నీదికదయ్య!" అని గమనిస్తున్నాడు! అప్పుడు ఈ జన్మకు ముందు ఆ
తరువాత కూడా నేను వున్నాను... అని గమనించటానికి అర్హుడగుచున్నాడు.
తండ్రి దేహియొక్క దేహమునుండి పుత్రదేహియొక్క దేహము బయల్వెడలుతోంది. పుత్ర
జననము వలన తండ్రి మరణించి పుత్రుడుగా జన్మిస్తున్నాడా? తండ్రి మరణమువలన
పుత్రుడు తన దేహం నశిస్తోందని అనుకుంటున్నాడా? లేదుకదా! దేహముల ఉత్పత్తివినాశనముల ధర్మములు ఎరిగినవాడు "పుత్రదేహం పుడుతోంది, తండ్రి దేహం
నశిస్తోంది" అన్నట్లుగా చూస్తాడు. తండ్రి మరణిస్తూ వుంటే ఈ దేహముయొక్క వినాశము
నాకు సంబంధించినదే అని కొడుకు అనుకోడు కదా!
వివేకి చావు - పుట్టుకలకు దేహ ధర్మములుగా చూస్తున్నడేగాని తన ధర్మములుగా
కాదు. తనను తాను ఆత్మస్వరూపుడుగాను, చావు పుట్టుకలు తనయొక్క జగత్-క్రియా
విశేషములుగాను గమనిస్తున్నాడు. వివేక - అవివేకములకున్న భేదం ఇంతవరకే!
బీజము నుండి వృక్షము వస్తోంది. బీజము నశించిందా? లేదు. బీజము వృక్షముగా
పరిణమించింది. అట్లాగే, " జననమరణ పునర్జన్మాదులు ఒక దశనుండి మరొక
దశకు కాలగతిచే జరుగుచున్న స్వభావ సిద్ధమైన పరిణామం" అనే దృష్టితో జ్ఞాని
చూస్తున్నాడు అంతేగాని, ఈ దేహపరంపరలను "దేహం నశిస్తోది. జనిస్తోంది..." అనే
దృష్టితో కూడా చూడడు. జడమైన దేహమునకు చావు ఏమిటి? పుట్టుక ఏమిటి?
బాల్యదశ దాటి ఒకడు యౌవ్వనంలో ప్రవేశిస్తున్నాడేగాని, - బాల్యం నశించి యౌవ్వనం
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
246
జనిస్తోందా? అట్లాగే జడ దేహమునకు పుట్టుక లేదు. చావు లేదు. చేతనమగు ఆత్మ
దేహంతో పుట్టదు. దేహంతో చావదు.
ఈ పురుషుడు (జీవుడు) తన స్వస్వరూపము యొక్క స్వరూప స్వభావాలు
గమనించకపోవటంచేత "ఆత్మ ప్రకృతికంటే భిన్నమైనది" అనేది గుర్తించటంలేదు.
విషయములందు ఆసక్తుడై దేహాభిమానమును ఆవేశంగా కొనసాగిస్తున్నాడు. ఫలితంగా
సంసార దశలను తెచ్చిపెట్టుకొని అనుభవిస్తున్నాడు. అభిమాన ఆవేశములే
సంసారమునకు మూలకారణం! వాస్తవానికి దేహము పుట్టుట లేదు. చచ్చుట లేదు.
ఇక మృత్యుభయం వుండవలసిన పనేమున్నది?
అజ్ఞానంతొలగి ఆత్మజ్ఞానం వికశించి వెల్లివిరయటానికే కర్మలు ఉద్దేశ్యించ బడుచున్నాయి.
కనుకనే, "ఉత్తమ కర్మలు మొట్టమొదట శ్రద్ధగా ఆశ్రయించండి! నిర్వర్తించండి!" అని
శాస్త్రములు ప్రారంభ పాఠంగా బోధిస్తున్నాయి. దేహమున్నంత వరకు నిర్వర్తిస్తూ వస్తున్న
కర్మలే, తదనంతర ఉపాధులను నిర్ణయిస్తున్నాయి.
శ్లో॥ సత్త్వసంగాత్ ఋషీన్ దేవాన్
రజసా అసుర మానుషాన్
తమసా భూత తిర్యక్త్వం
భ్రామితో యాతి కర్మభిః ॥ (అధ్యా 22, శ్లో 52)
కర్మలను అనుసరించే బుద్ధి రూపుదిద్దుకుంటూ ఉంటుంది. (బుద్ధిః కర్మాణుసారిణీ)
వర్తమాన కర్మలయొక్క ఫలములను అనుసరించే తదనంతర జన్మలు రూపుదిద్దు
....9
కుంటున్నాయి.
ఒకానొకడు సత్త్వగుణాధిక్యత చేత ఋషిత్వమో - దేవత్వమో సంపాదించుకొను
చున్నాడు.
మరొకడు రజోగుణ ప్రాబల్యంచేత అసురత్వమో - మానుష్యత్వమో పొందటం
జరుగుతోంది.
ఇంకొకడు తమోగుణముయొక్క ఆధిక్యతచేత భూత పశు-పక్షి ఇత్యాది జన్మ
పరంపరలు పొందటం జరుగుతోంది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
247
వాస్తవానికి ఈ జీవాత్మ మౌనము ప్రశాంతము - అప్రమేయము - నిత్యము
సర్వాతీతము అగు కేవలాత్మ స్వరూపుడే! అయితే ఏం? ఒకడు ఒక నర్తకినో (లేక)
గాయకునో (లేక) ఒక ప్రసిద్ధ వ్యక్తిని అనుకరిస్తూ (Imitate) ప్రవర్తిస్తూ (mimicree)
వుంటాడు. చూచావా?
శ్లో॥ నృత్యతో గాయతః పశ్యన్ యథైవ అనుకరోతి తాన్
ఏవం బుద్ధిగుణాన్ పశ్యన్ననీహో పనుకార్యతే ॥ (అధ్యా 22, శ్లో 53)
జీవాత్మ స్వస్వరూపము దృష్ట్యా సర్వక్రియాతీతుడే అయి ఉండి కూడా బుద్ధిగుణములను
అనుసరించి ఆయా ఉపాధులతో తాదాత్మ్యము చెందుతూ ఉన్నాడు. అనగా, ఆత్మ -
బుద్ధియొక్క గుణములను అనుకరించి బుద్ధి గుణములకు పరిమితమై ప్రవర్తించటం
జరుగుతోంది. ఎంతటి చమత్కారం!
ఒక రాజుగారు- మంత్రిని అనుకరించటం ప్రారంభించి, "నేను రాజును" అనునది
ఏమరచి, "నేను మంత్రినే! రాజును కాదు" - అని అనుకోవటం వంటిదే కదా!
మరొక రాజుగారు సింహాసనం దిగి నేను రాజును కదా అనునది ఏమరచి నృత్యం -
గానం చేసే నర్తకితో నృత్యం చేయటం ప్రారంభించారట అటువంటిదే, ఈ జీవుడు
ఆత్మ స్వరూపమును ఏమరచి మనో-బుద్ధులతో మమేకమగుచు నేను
దృశ్యాంతర్గతమగు దేహమును కదా! -అని బుద్ధితో తలచటం!
కదలుచున్న నీటి తరంగాలు గల తటాకజలంలో ప్రతిబింబిస్తున్న మహా వృక్షములు
(ఆ ప్రతిబింబమును చూస్తే)... నీటిలో చలించుచున్నట్లు అగుపించవచ్చు గాక!
వాస్తవానికి ఆ మహావృక్షములు అక్కడినుండి కదలుచున్నాయా? లేదు కదా!
అసలు జలంలో వృక్షాలు వున్నాయా? లేవు! ఇక "అవి నీళ్ళలో కదలుచున్నాయి"
అనే మాట వ్యావహారికంగా (దృశ్యంగా) సత్యమేనని (చూచేవానికి) అనిపించ
వచ్చునేమోగాని,... వాస్తవానికి అది సత్యమా కాదు!
పైత్యప్రకోపంచేత కళ్ళు తిరుగుచున్న సమయంలో భూమిపై వస్తువులన్నీ గిఱ్ఱున
తిరుగుచున్నట్లు కనిపించవచ్చు గాక! వస్తువులు పైకి - క్రిందికి - ప్రక్కప్రక్కలకు
కదలటం నిజమా? కాదు!
తన మనోరథంలో (ఊహాపధంలో) ఒకానొకడు... ఒక సంఘటనను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
248
జరుగుచున్నట్లు అనుభవిస్తున్నాడనుకో! (ఉదా - ఒకడు "తాను గొప్ప విద్యాకోవిదుడై,
ఒక గొప్ప సభలో ప్రవేశించి అక్కడి పండితులను తన వాదోపవాదములతో
తలవంచేటట్లు చేయుచుండగా రాజుగారు ఆశ్చర్యపడి మెచ్చుకుంటూ ధనంగల
మూటను ఇవ్వటానికి తెస్తున్నట్లు" - ఊహిస్తున్నాడనుకో!) ఆ ఊహాదృశ్యము
వాస్తవమా? లేనే లేదు కదా!
ఒక పెద్ద మనిషి తన కలలో ఏదో అరణ్యంలో ప్రవేశించి సంచారాలు చేస్తుంటే
ఆ స్వప్నబుద్ధికి తోచుచున్నది, అనుభూతమగుచున్నది నిజమా? కానేకాదు కదా!
అట్లాగే...,
ఈ జీవుడు పొందుచున్న విషయభోగములు, సంసార వ్యవహార తతంగము.... అదంతా
మిధ్యయే! ఒక ప్రేక్షకుడు నాటకం చూస్తూ, నాటకంలోని పాత్రల మధ్య జరిగే
సంఘటనలకు కోప తాపాలు పొందటం వంటిదే!
35. పరమేశ్వర నిష్ఠ
శ్రీ ఉద్ధవుడు : శ్రీకృష్ణా! మనం ఇప్పుడు సిద్ధాంతీకరించుకుంటున్నట్లు, అప్రమేయము
- ఆనందస్వరూపము - సర్వమునకు పరము అతీతము అగు ఆత్మయే ఈ జీవుని
వాస్తవ స్వరూపం కదా! మరి అట్టి ఈ జీవునికి సుఖ-దుఃఖానుభవాలు ఎందుకు
సంప్రాప్తిస్తున్నాయి? ఎవ్వరు కలుగజేస్తున్నారు? ఎందుకు కలుగజేస్తున్నారు? అట్లా
కలుగజేస్తే, వారికి వచ్చే లాభమేమిటి?
శ్రీకృష్ణభగవానుడు :
శ్లో॥ అర్థే హి అవిద్యమానే అపి సంస్కృతిః న నివర్తతే
ధ్యాయతో విషయాన్ అస్య స్వప్నే అనర్థాగమో యథా || (అధ్యా 22, శ్లో 56)
ఆయా విషయములను - సందర్భములను - సంబంధ బాంధవ్యములను రోజంతా
ఆవేశపూరితంగా మననం చేస్తున్న ఒకానొకడు రాత్రి పరుండినపుడు ఆయా సంబంధిత
విషయములను స్వప్నంలో అనుభవిస్తున్నాడు చూచావా?
ఆ రీతిగానే ఈ జగదనుభవం - దీర్ఘకాలంగా మరల మరల నిర్వర్తించే విషయమననము
వలన ఈ జీవునికి ప్రాప్తిస్తోంది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
249
ఆత్మకు సంసారబంధము స్వపాంతర్గత విశేషములవలె మిథ్యయే! కలలో ఎవ్వరో కనబడి
చేతులు - కాళ్ళు త్రాడుతో కట్టివేస్తే.... అది నిజమా? సంసార బంధము జీవునకు
అట్టిదే!
ఓ స్నేహితుడా! ఈ జీవుడు "నేను సుఖములను ఆస్వాదించాలి! పొందాలి" అని
అనుకొని విషయములను ధ్యానిస్తున్నాడు. విషయ ధ్యానము వలన సుఖదుఃఖ వృత్తులు
కలుగుచున్నాయి!
అందుచేత ఓ ప్రియమిత్రమా! ఉద్దవా!
శ్లో॥ తస్మాత్, ఉద్ధవ! మా భుంక్ష్వ విషయాన్ అసత్ ఇంద్రియైః
ఆత్మాగ్రహణ నిర్భాతం పశ్య వైకల్పికం భ్రమమ్ || (అధ్యా 22, శ్లో 57)
నీవు అసత్తుమాత్రమే అయినట్టి ఇంద్రియములకు అనుభూతములగుచున్న ఇంద్రియ
విషయములను సేవించటంలో నిమగ్నం (immersed, entangled) కావద్దు.
స్వప్నదర్శనముతో పోల్చతగినట్టి అజ్ఞానము వలననే ఈ జీవునికి వికల్పములన్నీ
కలుగుచున్నాయి. అదంతా అనేక భ్రమ విభ్రమములకు దారితీయటం గమనించమని
గుర్తు చేస్తున్నాను. ఈ కనబడేదంతా ఏమిటో గమనించి, జాగరూకుడవై ఉండవలసిన
పనిలేదా? కష్ట సుఖ భావనావేశమును ప్రక్కకు పెట్టి స్వబుద్ధితో సర్వాంతర్యామియగు
పరమాత్మను శరణువేడటమే సర్వదా క్షేమకరం సుమా!
అనగా పరమేశ్వర నిష్ఠను సర్వకాల - సర్వావస్థలయందు ఆశ్రయించు.
....9
దుర్జనులు నిన్ను వెళ్ళగొట్టవచ్చు గాక! అదలించవచ్చు గాక!
ఎవ్వరో వచ్చి నిన్ను అవమానించవచ్చు గాక! బాధ కలిగించే మాటలతో దూషించ
వచ్చు గాక!
ఇంకొందరు నిన్ను పరిహాసం చేయవచ్చుగాక! నిన్ను చూచి గేలి చేస్తూ పకపకా
నవ్వుకోవచ్చును గాక!
మరికొందరు దోషములు ఆరోపించి నిన్ను దూషించవచ్చు గాక! లేనిపోని
మాటలతో సతాయించవచ్చు గాక! ఎగతాళి చేయవచ్చు గాక!
నీవు బంధింపబడవచ్చును గాక!
నిన్ను ఎవ్వరో మోసము చేయవచ్చును గాక!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
250
పైన ఉమ్మివేయవచ్చు గాక!
|
నీపై మూత్రము విడవవచ్చు గాక!
ఇట్లా ఏఏ సందర్భములు సంఘటనలు ఎంతగా ఏర్పడినప్పటికీ నీవు మాత్రం
పరమేశ్వరనిష్ఠ నుండి విచలితుడవు కానేవద్దు. వారి-వీరిపై ఆపాదించి విషాదం
పొందవద్దు. మౌనమును, ప్రశాంతతను వీడకుండానే-సాక్షివై, అతీతుడవై వుంటూనే
జగన్నాటకంలో సందర్భానుచితంగా మాత్రమే ప్రవర్తించు. శ్రేయస్సును కోరుకొన్నవాడు
నానా కష్టములు అనుభవిస్తున్న సందర్భాలలో కూడా స్వబుద్ధితో పరమాత్మను శరణు
వేడుకుంటూనే ఉంటాడు. తద్వారా తనను తాను రక్షించుకొనుచున్నాడు! "సర్వము
పరమాత్మతత్త్వమే కదా!" అనే అవగాహన అభిప్రాయములను స్వీయ శ్రేయస్సు
కొరకై దీపమును రక్షించుకొన్నట్లు రక్షించుకుంటున్నాడు. హే పరమాత్మా! నీవుకదయ్యా,
నాకు సర్వదా తోడు-నీడ!.... అని హృదయభాషణ కలిగినవాడై వుంటాడు!
శ్రీ ఉద్ధవుడు : దేవా! వక్తలలో శ్రేష్ఠుడా! శ్రీకృష్ణా! అటువంటి సర్వసందర్భాలలో
పరమాత్మవగు నిన్నే గుర్తు చేసుకొని ఉండి శరణువేడటం ఎట్లాగో వివరించండి. అది
మావంటి అల్పజీవులకు సాధ్యమా?
ఎందుకంటే...,
ప్రకృతి అత్యంత బలీయమైనది కదా!
పండితులైనవారు, ధర్మనిరతులు, శాంతులు, భక్తులుకూడా ఆయా అవమాన సంఘటనల
సందర్భాలు కష్టమనియే తలుస్తున్నారే! అంతేగాని, "సర్వతత్త్వ స్వరూపమగు ఆత్మయే
నేను కదా!" అనే ఆత్మదేవ మననం ఆయా కష్ట-నిష్ఠుర సందర్భాలలో గుర్తు
పెట్టుకోలేకపోతున్నారు. "ఈ కనబడేదంతా - కనబడేవన్నీ నేనే..." అనే మననము
కలలో కూడా గుర్తుకు రావటం లేదే! ఇక మేమెంతటివారము చెప్పండి!
ఇది దృష్టిలో పెట్టుకొని...,
సర్వకాల సర్వావస్థలలోను నిన్ను మాత్రమే గుర్తుపెట్టుకొని బుద్ధితో మిమ్ములను శరణువేడి
ఉండటం ఎట్లాగో మరికొంత సోదాహరణంగా వివరించండి స్వామీ! "ఇదంతా కృష్ణ
చేతన్యమే! ఆత్మ చైతన్యమే... ఈ జగత్తంతా నా స్వస్వరూపమే..." అని సర్వదా గుర్తులో
ఉంచుకోవటం ఎట్లా?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
251
36. భిక్షు గీత - వైరాగ్యము
శ్రీ శుక మహర్షి : ఓ పరీక్షన్మహారాజా! యాదవ శ్రేష్ఠుడు - పుణ్యశ్లోకుడు - శ్రీకృష్ణ
భక్తుడు అగు ఉద్ధవుడు "సర్వమునకు అతీతంగా ఉండి సర్వేశ్వరుని సర్వదా స్మరించటం
ఎట్లా?..." అని ప్రశ్నించగా.
ఆ ప్రశ్నకు సంతోషించి కృష్ణ భగవానుడు ఉద్దవుని ప్రశంసించి, ఆపై ఈరీతిగా
చెప్పసాగారు.
శ్రీకృష్ణుడు : బృహస్పతి శిష్య సమానుడవగు ఓ ఉద్ధవా! నీవు చెప్పినట్లుగా ఒక సజ్జనుడు
దుర్జనుల దుష్టవాక్కులను, ఎత్తిపొడుపు మాటలను, దూషణవచనములను విని,
కలతచెందిన మనస్సును శాంతపరచి ఉంచటం కష్టతరమైన విషయమే! దుష్టుల
దుష్టపలుకులు బాధించినంతగా బాణముల మర్మభేదములు కూడా బాధించలేవు.
అయితే ఇందుకు పరిష్కారమార్గంగా పెద్దలు మహాపుణ్య జనకమైన భిక్షుగీత అనే
యితిహాసమును ముముక్షువులకొరకై చెప్పుతూ ఉంటారు. ఆ ఇతిహాస విశేషాలు నీ
ప్రశ్నకు సమాధానంగా మనం చెప్పుకుందాం! విను.
ఈ మనం చెప్పుకోబోవుచున్న యితిహాసంలో ఒకానొక భిక్షువు దుర్జనులచే ఎంతగానో
అవమానించబడి... అప్పుడు కూడా ధైర్యమును విడువకుండా, "ఇదంతా నా పూర్వజన్మ
దుష్కృత ప్రభావం మాత్రమే కదా!" అని భావించాడు. భిక్షుగీతను గానం చేశాడు.
"సర్వము సర్వదా ఆత్మ చైతన్య చమత్కారమే కదా! సర్వత్రా సచ్చిదానందమేగా!" -
అనే అంతిమ నిర్ణయానికి వచ్చాడు! అది వివరిస్తున్నాను. విను!
మాలవ దేశములో ఒకానొక విప్రుడు ఉండేవాడు. ఆతడు ఐశ్వర్యవంతుడు. కృషివాణిజ్యము మొదలైన వ్యాపార దక్షత గలవాడు. అయితే బహుసంపద-ధన కాముకుడు.
అత్యంత లోభికూడా! అంతేకాదు. భార్య - పుత్రులను కూడా బాధించే దుష్టస్వభావి.
అత్యంత కోపిష్టికూడా!
ఆతడు ఎప్పుడూ అతిథులనుగాని, బంధువులనుగాని మాటమాత్రంగా కూడా సంతోష
పెట్టేవాడు కాదు. ధర్మహీనుడై జీవితమును గడపుచూ ఉండేవాడు. ఆతని పలుకుశ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
252
మాట ఎంతో కరకుగా ఘాటుగా ఉండేది.
ఆతడు ఎంతటి లోభి అంటే..., గొప్ప సంపదలు సంపాదించుకొని ఉండికూడా తాను
తిని సుఖపడడు. ఇతరులకు కొంచెమైనా పెట్టి ఆనందించడు. పాపం లేదు. పుణ్యం
లేదు. ముందు డబ్బు సంపాదించటం-దోచటం దాయటం ఇదే ముఖ్యం అని
అనుకునేవాడు.
ఆతడు దుశ్శీలుడై, భార్య - పిల్లలు - తల్లి - తండ్రి తదితర బంధువులను, మిత్రులను
ద్వేషించటం - దూషించటం - అవమానించటం చేస్తూ ఉండేవాడు! ఇటువంటి చర్యల
కారణంగా అందరూ అతనిని తమలో ఎంతగానో ద్వేషించేవారు. ధనలోభంచేత ఆతడు
ఎవ్వరికీ ప్రియం కలిగించేవాడు కాదు. "ఈ భార్య - ఈ పిల్లలు నా డబ్బు తినడానికే
పుట్టారు" అని అరుస్తూ ఉండేవాడు. ఏమాత్రం కనికరం ఆతనిలో లేదు. హృదయమంతా
లోభత్వమే! ధన కాంక్షయే!
ఈవిధంగా కేవలము డబ్బు దాచుకోవటం, ధర్మముపట్ల విరతిచే ఉభయ భ్రష్టుడు
అగు ఆ విప్రుని దుష్టచర్యలు గమనిస్తున్న దేవ-పితృ-అతిధి ఇత్యాది పంచ యజ్ఞ
భాగులగు దేవతలు ఆతనిపై ఒకానొక సమయంలో కోపగించటం ప్రారంభించారు.
దేవతలు ప్రసాదించినది పొందుతూ వారికి సమర్పించవలసినది సమర్పించకపోవటం
అనర్ధహేతువు కదా! దొంగతనంతో సమానము కదా! దేవతలకు కోపం వస్తే ఇంకేమన్నా
ఉన్నదా?
ఆవిధంగా ఆతడు – ఇంద్రియములు - దేహము ప్రసాదించి సంరక్షిస్తున్న దేవతలను,
సంపద- సంతానములను కనికరించే పిత్రుదేవతలను, సహకారికారకులగు సహ
జీవులను - ఆదరించకపోవటంచేత ఆతని పుణ్యభాగము క్రమంగా క్షీనించసాగింది.
ఆతడు రాత్రింబవళ్ళు కష్టించి ప్రోగుచేసుకున్న ధనమంతా అనుకోని ఆపత్తులకు క్రమంగా
వెచ్చించవలసి వచ్చేది. ఆవిధంగా అంతా నష్టమైపోయింది. ఆతని ధనములో కొంత
భాగం ఆతని కొందరు జ్ఞాతులు మోసంచేసి హరించారు. మరికొంత భాగం దొంగలు
ఎత్తుకుపోయారు. ఇంకొంత భాగం దైవవశంగా కాలవశంగా నష్టమైపోయింది.
కొంతకొంత రాజులచేత-సేవకులచేత అపహృతం అయింది. ఈవిధంగా ధనమంతా
నష్టమైపోగా... ధర్మ-అర్థములను పోగొట్టుగొన్న ఆతనిని స్వజనులే పట్టించుకోవటం
మానివేశారు. అందరు ఆతనిని ఉపేక్షించసాగారు. ఛీదరించుకోసాగారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
253
అదంతా చూచిన ఆ విప్రుడు దుస్తరమైనటువంటి పరిస్థితులను పొందుచూ, ఇక
విషాదముతో విచారములో నిమగ్నము కాసాగాడు. విచారణలో పడిపోయాడు.
ధనాశ - పిసినారి అగు ఆతడు చాలా సంతప్తుడైనాడు. ఎవరికీ చెప్పుకోవటానికి
కూడా లేక, కృంగిపోసాగాడు.
క్రమంగా - ఏమిటిరా ఇదంతా? పుట్టినప్పటినుండీ ఇప్పటిదాకా
జరుగుచున్నదంతా ఏమిటి? - అని దీర్ఘచింతలో మునిగిపోయాడు.
ధనం పోతూవుంటే రాత్రి - పగలు పెద్ద గొంతుకతో ఏడవటం ప్రారంభించాడు.
ఇటువంటి దుఃఖాలు పొందుతూ పొందుతూ ఉండగా అతనిలో ఒకానొక సమయంలో
గొప్ప వైరాగ్యము రూపుదిద్దుకొనసాగించి.
ఆ విప్రుడు ఈవిధంగా ఆలోచించసాగాడు!
విప్రుడు : ఆహాఁ! నేను ఎంతో కష్టబడి శ్రమించి సంపాదించి దాచుకున్న ధనమంతా
అటు ధర్మమునకు గాని ఈవైపు నా భార్యా బిడ్డలకుగాని, ఇటు నా కామ
భోగములకైనాగాని, చేతికి రాకుండా అంతా వ్యర్ధంగా వ్యయం అయిపోయిందే? ఈ
నా శరీరాన్ని ఇప్పటిదాకా వ్యర్ధంగా అనేక ధన సంపాదన సంబంధమైన కార్య
కలాపాలలో నియమించుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చిన కష్టాలు ఎంత భరించరానివి!
దుస్సహవము! నా కష్టాలు చెప్పుకోటానికి ఎవ్వరూ లేరు! చెప్పటానికి అలవికాదు
కూడా! ఇంత జీవితంలో నేను ఏమి సాధించినట్లు? సర్వం వ్యర్ధం అయిపోయింది!
(సర్వ వ్యర్ధం మరణసమయమే సాంబ ఏకః సహాయః... అను) పెద్దల వాక్యాలు
ఇప్పటికి గుర్తుకొస్తున్నాయి.
అయ్యో! నావంటి నీచుల - కృపణుల - లోభుల సంపదలు, అధికారాలు ఎప్పుడూ
సుఖప్రదములు కాదు. దుఃఖప్రదములే! అంతేకాదు! ఈ సంపదలు ఇహలోకంలో
కష్టాలకు - పరలోకంలో నరకాదులకు కారణం అవుతాయికదా! ఈ విషయం మును
ముందుగానే నేను ఎందుకు గమనించలేదు? మూర్ఖుడనై జీవితాన్నంతా వృధా
చేసుకున్నానే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
254
అల్పమైన శ్వేకుష్ఠువు (చర్మమును తెల్లగా మార్చే చర్మవ్యాధి) క్రమంగా సుందరమైన
ముఖాన్ని అందవిహీనం చేసేస్తుందే! ఆవిధంగా (ధనసముపార్జనం జీవితంలో ఒక
చిన్న విషయమే అయినప్పటికీ) లోభగుణం అల్పమైనదైనప్పటికీ - సద్గుణవంతుల
సద్గుణములను, కీర్తిమంతుల నిర్మలమైన కీర్తిని నాశనం చేసివేయగలదని ఇప్పటికిగదా,
నేను గమనిస్తున్నాను!
శ్లో॥ అర్థస్య సాధనే సిద్ధే ఉత్కర్షే రక్షణే వ్యయే
నాశోపభోగ ఆయాసః త్రాసః చింతా భ్రమో నృణామ్ || (అధ్యా 23, శ్లో 17)
ఈ ధనమును
సంపాదించుకోవటంకోసం సాధనలు (పద్ధతులు) సమకూర్చుకోవటంలోను,
|
ఆ సాధనలను సిద్ధింపజేసుకోవటంలోను,
సంపాదించిన దానిని వృద్ధిపరచుకోవటంలోను,
వృద్ధిపొందుచున్న ధన సంపదను రక్షించుకోవటంలోను,
రక్షించుకుంటున్న ధనమును ఖర్చుచేయటంలోను,
ఆ ధనమును అనుభవించటంలోను,
అది ఖర్చుఅవుతుండగా "పోగొట్టుకుంటున్నామే?" అని వేదన చెందటంలోను
ఈ మానవులు ఎంతగా శ్రమ పొందుచున్నారు! ఎంతగా భయము చింత - భ్రమ
ఎదురౌతున్నాయి! ఇదా జీవితం? ఇందుకోసమా, పుట్టింది?
నిజమైన శ్రేయస్సు కోరుకొనేవాడు కళ్యాణకాముకుడు అగు వ్యక్తి అర్ధములను
(సంపదలను) అనర్ధంగానే చూస్తున్నాడు. అర్దములో పెద్దలు గుర్తుచేసే పంచదశ (15)
అనర్ధములను ఆతడు గమనిస్తున్నాడు. మమకారము మొదలంట్లా త్యజించి జాగరూకుడై
ఉంటున్నాడు.
అర్ధమును ఆశ్రయించి ఉంటున్న పంచదశ (15) అనర్ధములు :
శ్లో॥ స్తేయం హింసా అనృతం దంభః కామః క్రోధః స్మయో మదః
భేదో వైరమ్ అవిశ్వాసః సంస్పర్ధా వ్యసనాని చ
ఏతే పంచదశ అనర్ధా హి అర్ధమూలా మతా నృణామ్ |
తస్మాత్ అనర్ధమ్ అర్ధాఖ్యం శ్రేయోర్థీ దూరతఃత్యజేత్॥ (అధ్యా 23, శ్లో 18, 19)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
255
దొంగతనము (చౌర్యము) హింస అసత్యము దంభము కామము క్రోధము
విస్మయము గర్వము భేదబుద్ధి వైరము అవిశ్వాసము స్పర్ధ స్త్రీ జూదము
దుర్వ్యసనము - ఈ 15 ప్రమాదాలు అర్ధము వెంటనంటి ఉండే అనర్థాలని పెద్దలు
చెప్పుచున్నారు. నేను విననే లేదు కదా! ఆ రోజులలో ఆ మాటలు విని నవ్వుకున్నాను.
ఇప్పుడేమైనది? చిన్న విషయమైనట్టి ఈ అర్ధము వలన తల్లి-తండ్రి-భార్య-సోదరులుబంధువులు-మిత్రులు వీళ్ళంతా శత్రువులుగా కనిపించసాగారు. మనస్సంతా
అకారణమైన శత్రుత్వము అనే పశుస్వభావమగు అత్యంత ప్రమాదకరమైన దుష్టపదార్ధంతో
నిండిపోయింది కదా! ధన సంపదను చూచుకొనిన మరుక్షణం నేను లోభగుణం
అబ్బటంచేత - క్షుద్రుడను-కోపిష్టిని అయ్యాను. అయినవారిని, శ్రేయోభిలాషులను
అంత దూరంగా ఉంచి, అందుకు ఫలితంగా ఎంతగానో నష్టపోయాను.
సోదరులు-శ్రేయోభిలాషులు-విజ్ఞులు ధనవంతుని చూచి "ఈతనితో మనకెందుకులేరా
బాబూ!..." అని అల్లంత దూరంగా ఉండిపోతారు. మిత్రులు కూడా "వీడివల్ల మాకేమిటి
లాభం?..." అని తలుస్తూ ద్వేషం పొందినవారై ఇక మోసం చేయటానికైనా
చంపటానికైనా కూడా సిద్ధపడతారు.
భార్య-బిడ్డలే నావంటి లోభిని చూచి "వీడు మా చావుకు వచ్చాడురా!" అని
దూరమైపోయారు. అప్పుడేమో "వీళ్ళంతా పోతే పోనీ!" - అనుకుని సంపాదించుకున్న
ఒంటరితనము ఇప్పుడు శాపమై కూర్చున్నది.
అయ్యయ్యో! దేవతల కరుణచే ఈ మానవజన్మ లభించింది. అందులోనూ వేదాధ్యయనం
చేసి తరించవలసిన విప్రజన్మ ఎంతటి గొప్ప అవకాశం! అట్టి మహత్తరమైన దేవతా
ప్రసాదిత మహదవకాశమును ధనము ప్రోగుచేయటానికి మాత్రమే వెచ్చించి, లోభినై
ఆత్మహితమును నాశనము చేసుకొని అశుభగతిని ఆహ్వానించానే! కించిత్ అయినా
తెలివి ఉన్నదా, నాకు?
లేదు. ఎందుకంటే...,
మానవదేహం పొందటం ఏమైనా చిన్న విషయమా? కాదు. కానేకాదు. ఈ
మానవదేహము స్వర్గ - మోక్షములకు ముఖద్వారము వంటిది! అటువంటి
అవకాశమును సద్వినియోగపరచుకోకుండా అర్ధముకొరకై (సంపదలు సంపాదించి
ప్రోగుచేసుకోవటానికై) అఱ్ఱులు చాచి రోజులు గడపటం- బ్రతికినన్నాళ్లూ చావుకొరకై
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
256
సరంజామా తయ్యారు చేసుకోవటం వంటిదేకదా!
ధనమును దేవతలకు - ఋషులకు - పితరులకు పితరులకు - సహప్రాణులకు - జ్ఞాతులకు
బంధువులకు - దాయాదులకు వారివారి భాగములు వారికి ఇచ్చి సంతోషపరచకుండా,
తాను అనుభవించకుండా యక్షునివలె దాచి రక్షించుకోవటం, కుక్కవలె కాపలా
కాయటం- అధఃపతనానికి నాందీవాక్యాల ఉచ్ఛారణయే! ఎంతమంది ఎంతగా చెప్పినా...
ఇది నేను చెవినపెట్టానా? లేదు! పెడచెవిన పెట్టాను. "లోభిగా ఉండకురా, నాయనా!"
-అని పెద్దలు చెప్పుతుంటే, "వీళ్ళెవరు, నాకు చెప్పేది?"... అని విర్రవీగాను.
వివేకవంతులగు పురుషులు యాధృచ్ఛికంగా దేవతల దయచే లభించిన ధనసంపదలను
సరిఅయిన మార్గంలో వినియోగించి సిద్ధిని పొందుచున్నారు. మరి నేనో? ధనమును
ఆర్జించే వ్యాపారంలో మునిగి - తేలుతూ చివరికి ధనమును, ఆయుష్షును, బలమును
- అన్నిటినీ పోగొట్టుకొన్నాను. సాధన సంపత్తి గురించి పట్టించుకోనే లేదు. ఇప్పుడిక
వార్ధక్యము (ముసలితనము) వచ్చిపడింది. ఇక చేసేది ఏమున్నది? ధనమంతా చేయి
జారింది. బుద్ధి అనే విలువైన రత్నమును ధనదాహము అను రూపముగల మలములో
దాచుకున్నవాడినైనాను!
విప్రుడను, వేదాధ్యయనము చేసినవాడను, ద్విజుడను, గురువులు చెప్పగా వేదాంత
విద్యను వినినవాడను - అగు నేను ఎందుచేత వ్యర్థమగు ధనోపార్జన - అనే వ్యసనంలో
మునిగిపోయానోకదా! ఎందుచేత భ్రమించాను? ఎందుకు మోసపోయాను? ఆహాఁ!
ఏదో అనిర్దేశ్య శక్తి-అదృశ్యశక్తి కల్పించే మాయచే లోకజనులంతా నాతో సహ -
మోహితులమై చరిస్తున్నామనుటలో ఏ సందేహము లేదేమో! అసలీ శరీరమేమిటి?
ఇది ఏమి కాబోతోంది? అతి త్వరలోనే మృత్యువుచేత కబళించబడబోతోంది కదా! పోనీ
నాకు చాలా ఆయుష్షు వున్నదిలే! - అని మురిసిపోదామా? ఎప్పుడు ఏ శరీరం శ్మశానము
జేరబోతోందో ఏమీ చెప్పలేం! మరణించిన జీవుని వెంటనంటి ధనముగాని,
వస్తుసంపదగాని, భోగములుగాని వస్తున్నాయా? మరణ సమయంలో అన్నిటిని
వదలవలసిందే! వెంటనంటి రావు కదా! మరెవ్వడో వచ్చి ఈ ఇల్లు ఈ సంపద - ఈ
ధనము నాది.... అని మురిసిపోతూ వుంటే వాటిని కష్టపడి సంపాదించి
మరణించినవాడు- ఇవన్నీ నావిరా! - అని పలుకగలడా? తిరిగి భూమిపైకి రాగలడా?
రాలేడు. అటువంటి అల్పమగు మరొక జన్మలోనికి త్రోసివేయగల -ధనాదులను చూచి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
257
గర్వించటం ఏమిటి? జన్మపరంపరా చక్రమునుండి బయల్వెడలి జన్మరాహిత్యమును
సిద్ధించుకోవటానికి గదా, జన్మ అనే సందర్భమును ఉపయోగించుకోవలసినది?
ఇతఃపూర్వం నేను సంపాదించుకున్న ధనమంతా పోయింది. అదంతా ఎంతో కష్టపడి
- కక్కుర్తిపడి అత్యంత లోభత్వంతో నేను తినక - ఎవ్వరికీ పెట్టక, అనేకులను బాధించి
-వేధించి మరీ సంపాదించాను. ఆ ధనమంతా ఇప్పుడు దొంగలచేత - బంధువులచేత
- - ప్రకృతి వైపరీత్యములచేత - స్నేహితులచేత - వైద్యులచేత తలొకకొంత లాగుకొని
పోబడింది. ఈ ఖాళీ చేతులు మాత్రం నాకు మిగిలాయి!
అయితే... వారందరిని ఇప్పుడు పేరుపేరున తిట్టనా? తిట్టి ఏమిలాభం? ఇదంతా
నడిపిస్తున్న చరాచర సృష్టికర్త మరొకాయన ఉన్నారు. ఆయన కదా, అన్నింటికి
కారణం! అంతేగాని మరెవ్వరూ కాదు! హే పరమాత్మా! ఇదంతా చేస్తున్నది నువ్వయ్యా!
(కొంత నిశ్శబ్దంగా సమయం గడపిన తరువాత)
ఒకవేళ వాళ్ళంతా నా ధనాదులను దొంగిలించి, లాగుకొని ఉండకపోయినప్పటికీ
కొద్దిరోజులు సంవత్సరములలోగా ఒకానొక (ముందుగా అనుకోని) క్షణంలో
నేను ఈ దేహమును విడువవలసిందేకదా! కాల దేవత నన్ను ఇక్కడినుండి ఈ
దేహంలోంచి బలవంతంగా బహిర్గతం చేసి మరొక తల్లి గర్భంలోకి ప్రవేశింపజేయక
మానదుకదా! అప్పుడైనా ఇవన్నీ వదలవలసినదే! మరొకడెవడో వచ్చి నావలెనే "ఇవన్నీ
నావి!" అని భావించటం ఎవ్వరూ ఆపగలిగేది కాదు కదా! ఎప్పుడో ఒకప్పుడు నేను
వదలక తప్పని అర్ధ సంపదను ఇప్పుడే ఎవ్వరెవ్వరో వచ్చి లాక్కుపోయారు. కనుక
ఇప్పుడు నాకు వచ్చిన నష్టమేమున్నది? ఏది ఎటుపోవాలో... అటే పోయింది.
అవును! ఏ కష్టము వచ్చిందీ లేదు!
అమ్మయ్య! ఇప్పుడు అర్ధమైనది. అవును! అవునవును! నేను ఇంతకాలం ఈ అర్ధసంపదను
చూచుకొని - తొర్రలో దాగిన ముసలి పందికుక్కు "ఈ ధాన్యరాసులన్నీ నావే" అని
అరుస్తున్నట్లు - "నావి నావి" అని అహంకరించాను. ఘీంకరించాను. తల్లి తండ్రులు
- భార్య - బిడ్డలు బంధువులు స్నేహితులు పేదవారు.... వారందరిపై
రుసరుసలాడాను. నా ఉత్తరోత్తరగతుల దౌర్భాగ్యమేమిటో గమనించిన నా తండ్రి,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
258
జగతః పితయగు పరమాత్మ నేను సంపాదించి ప్రోగు చేసిన ధన సంపదను నానుంచి
వదలించారు! లాక్కున్నారు. ఆహాఁ! ధనం తొలగటం గొప్ప అదృష్టమే!
అవును! ఇది శాపం కాదు! వరం! సర్వదేవతా హృదయ స్వరూపుడగు శ్రీహరి నాపట్ల
ప్రసన్నుడైనారు. ఇందులో సందేహమే లేదు. ఎవరి ప్రేరణ - కృపలవలన నాకు ఈ
ధనహీన దశ ప్రాప్తించినదో... ఎవరి ప్రేమ-కరుణా కటాక్షవీక్షణలచే నేను సంసార
సముద్రమును దాటటానికి గొప్ప యంత్రశక్తిగల నావ వంటి వైరాగ్యము ప్రాప్తించిందో...
అట్టి శ్రీహరీ! లోక కళ్యాణమూర్తీ! పరంధామా! అంతా ఇచ్చింది నీవేకదయ్యా!
నాదైనదంతా నీదే! నాపై వాత్సల్యంతో ఇప్పుడు నన్ను ధనహీనుణ్ణి చేసి ఆదుకున్నావయ్యా!
కుక్కలాగా కాపలా కాసే శ్రమనుండి తప్పించావు! నా హృదయం పవిత్రం చేసి నీవు
ప్రవేశించాలనే నన్ను నిరుపేదగా బాటలో నిలబెట్టావు. నన్ను కన్నతండ్రివైన నిన్ను
శరణు వేడుచున్నాను! క్షమించు! కరుణించు! ఇదంతా నీ దయయే!
ఈ రోజుకూ ఇంకా ఈ వార్ధక్యదేహము నావద్దనే ఉన్నది. ఒకవేళ నాకు ఈ దేహంతో
ఆయుష్షు కొంత మిగిలి ఉంటే నేను దైవోపాసనకు సంబంధించిన సాధనములపట్ల
శ్రద్ధ వహిస్తాను. అప్రమత్తుడనై ఉంటాను. "శ్రీహరియే నా ఆత్మకదా" - అను ఆత్మ
సంతుష్టిని పెంపొందించుకుంటాను. ఇతఃపూర్వపు లోభ దురాశ సంస్కారాలు పూర్తిగా
తొలిగేయత్నం చేస్తాను. తపస్సుకొరకై ఈ శరీరమును ఉపకరణముగా ఉపయోగిస్తాను.
ఈ దేహము ఎంతకాలం ఉంటుందో అంత కాలంవరకు తుది క్షణం వరకు సర్వ
తత్త్వస్వరూపుడగు శ్రీహరి పాదపద్మములను నా మనస్సు ఆశ్రయించును గాక!
శ్రీహరిని ఆశ్రయించి ఉపాసించాలనుకునే నా యీ ప్రయత్నములకు సహకరిసస్తూ...
త్రిలోకాధిపతులగు దేవతలు నాపై అనుగ్రహము చూపుదురు గాక! వారి దయవల్లనే
కదా, ఖట్వాంగ చక్రవర్తి మొదలైనవారు కొద్దికాలంలో వైకుంఠధామం చేరారు! నాపట్ల
దేవతలు ఆవిధంగానే దయచూపి నన్ను క్షమించి, శ్రీహరి పాదాలుచేరటానికి నన్ను
ఆశీర్వదిస్తూ, నాపై ప్రేమతో సహకరించెదరు గాక! నాకు దారి చూపెదరుగాక!
వింటున్నావా? ఉద్ధవ మహాశయా! అవంతి దేశస్తుడైన ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు ఆవిధంగా
సర్వసంపదలు కోల్పోయిన ఆ సందర్భాన్ని విశ్లేషించుకొని బుద్ధితో ఒక నిర్ణయానికి
వచ్చేశాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
259
హృదయ గ్రంధులైనట్టి అహంకార మమకారములను మొదలంట్ల హృదయం |
లోంచి పెకలించి ఆవలపారవేయసాగాడు. "అవి నావి! ఇవి నావి" అనుకునే
బుద్ధి విభాగమును "కావు! కావు!" అనే మంత్ర మననంతో శాంతపరచసాగాడు.
శాంతుడు మౌని - సన్యాసి అయ్యాడు.
భిక్షకుడై దేహానికి ఆహారం అందిస్తూ తన దేహమును ఒక ఉపకరణంగా
మలచుకొని విదేహముక్తికి ప్రయత్నించటానికై సంసిద్ధుడైనాడు.
సన్యాసి అయి మనస్సును - ఇంద్రియములను - ప్రాణములను శాస్త్ర ప్రవచిత
మార్గంగా నిగ్రహించి పరమాత్మతత్త్వము వైపుగా ప్రేమగా నడిపించటం
ప్రారంభించాడు.
"అంతా శ్రీహరే! ఇక కళ్ళుమూతలెందుకు?" అని భావిస్తూ ఉత్తమమైన మానసిక
నిగ్రహాన్ని క్రమక్రమంగా సముపార్జించుకోసాగాడు.
ఆసక్తి శూన్యుడై పైకి దీనంగాను, లోలోన ఆత్మభావనాపరవశంతోను భిక్షాటన
చేస్తూ గ్రామాలు నగరాలు సంచరించసాగాడు. త్రిదండము - భిక్షాపాత్ర -
కమండలము - జపమాలలతో దేశద్రిమ్మరిగా తిరుగసాగాడు.
ఓ ఉద్దవా! వృద్ధుడు - మలిన వస్త్రములు ధరించినవాడు అగు ఆ విప్రుడిని చూచి
అసత్పధులగు కొందరు ఆకతాయిలు గేలిచేస్తూ ఉండేవారు. అవమానిస్తూ ఉండేవారు.
చిన్న కర్ర చూపించి బెదిరిస్తూ ఉండగా ఆతడు వేగంగా అడుగులు వేస్తూ ఉంటే
పకపకా నవ్వుకొంటూ ఉండేవారు. అనేకులు అజ్ఞులు ఆతనికి ఆహారం ఇవ్వకపోగా
"ఓయ్! పోఁ! తంతా! పిచ్చివాడా! చెత్త ముఖమా!..." ఇటువంటి తిరస్కార భాషణతో,
దూషణతో అవమానించ సాగారు.
కొందరు ఆతని త్రిదండమును లాక్కున్నారు.
మరికొందరు ఆతని భిక్షకపాత్రను, కమండలమును దొంగిలించారు.
ఇంకొందరైతే ఆతని జపమాలను - బొంతను కూడా ఆతని నుండి పెరుక్కున్నారు.
ఆతడు ఒకానొక సమయంలో ఏదో దొరికిన పాత్రలో ఎవ్వరో ఇచ్చిన ఆహారం తింటూ
ఉంటే, ఆతనిని ఏడిపించి ఆనందించాలనే ఉద్దేశ్యంతో ఆ పాత్రలో పనిగట్టుకొని
మూత్రమును కూడా విసర్జించారు. శిరస్సుపై కాండ్రించి ఉమ్మివేశారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
260
మహానుభవాడగు ఆ మునిని కొందరు అకతాయిలు రహదారిలో నిలబెట్టి "ఆ విషయం
చెప్పు! ఈ విషయం చెప్పు! శృంగారం గురించి మాటలు చెప్పు!" అని వేధించేవారు.
ఆతడు ఏమీ మాట్లాడక ఊరుకొని ఉంటే, "అడుగుతుంటే చెప్పవేరా? ఏమిరా నీ
పొగరు?" అని కర్రతో అదిలించేవారు. "వీడిని చెట్టుకు బంధించండిరా!" అని త్రాళ్ళు
తెచ్చి బంధించి తిట్లు-శాపనార్ధములతో వినోదించేవారు. అవును. కొందరు మూర్ఖజనులు
యుక్తాయుక్తములు, తదనంతర పరిణామములు మరచిపోతూ వుంటారు. ఇతరులను
బాధించుటలో వినోదమును పొందటం, తద్వారా అనేక పాప-అల్ప-దుఃఖపూరిత
స్థితి గతులకై వారికి వారే తలుపులు (ద్వారాలు తెరుచుకొని పరుగులు తీయటం
లోకంలో కొందరు అజ్ఞాన జనుల విన్యాసమేకదా!
ఇతఃపూర్వము ఆ విప్రుని పూర్వవిషయాలు తెలిసిన కొందరు ఆ విప్రవర్యుని వైపుగా
కుడిచేతి క్రింది నాలుగు వ్రేళ్ళతో (బొటనవేలు నిలువుగాను) చూపిస్తూ...,
ఈతడెవ్వడో మాకు తెలుసు.
ఉట్టి పిసినిగొట్టు. మన డబ్బంతా ఎక్కడో దాచాడు.
లోక వంచకుడు.
|
దొంగ సన్యాసి. వేషాలు వేస్తున్నాడు.
|
ధనమంతా కోల్పోవడంచేత ఈతని బంధువులంతా కలసి ఊరినుండి వెళ్లగొట్టారు
|
కాబోలు! కానీ ఈతని ధనమును ఈతడు ఎక్కడో దాచియే ఉంటాడు.
ఈ భిక్షకవృత్తిని అవలంబించి జనాలని మోసగించి ఆహారం సంపాదించు
కుంటున్నాడు. ఇంతటి లోభిని మరెక్కడా చూచివుండం!
ఒకప్పుడు ఈతడు ఎటువంటివాడో మీకు తెలుసా? డబ్బుమదంతో ఎవ్వరినీ
లెక్కచేసేవాడు కాదు. గొప్ప బలవంతుడు. దగ్గిరకు వెళ్ళితే పలికేవాడా? లేదు.
మీసాలు మెలేసేవాడు! కొంగలాగా అందరినీ అణగద్రొక్కి తన పనులు తాను
సాధించుకునేవాడు. కృత నిశ్చయంతో - మోసపూరిత భావాలతో అందరినీ
బాధించి, వీడి హాయి వీడు చూచుకునేవాడు. తల్లితండ్రులను, భార్య బిడ్డలను
కర్రలతో హింసించాడు.
ఈవిధంగా ఆతనిని అవమానించేవారు. ఎగతాళి చేసేవారు. కొందరు ఆతనిపై
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
261
అపానవాయువు వదులుతూ వుండేవారు!
మరికొందరైతే "ఈతడు ఏమాత్రం మంచివాడు కాదురా! ఈతనికి అనుభవిస్తేగాని
తెలియదు..." అని పలుకుచు బంధించి చిన్న గదిలోను - వాకిట్లోను - తోటలోను -
దొడ్డి స్థలాలలోను ఒకటి రెండు రోజులు పడవేసి ఉంచేవారు.
శ్రీ ఉద్ధవుడు : కృష్ణా! ఆ విప్రుడు పొందిన బాధలను సత్యానందస్వరూపుడవగు నీవు
వర్ణిస్తూ ఉంటే నాకే దుఃఖం వస్తోంది. ఇక ఆతని మానసిక స్థితి ఏమిటో? ఆతడు
ఎంతో వేదన చెందేవాడు కదా!
శ్రీకృష్ణుడు: లేదు!
శ్లో॥ ఏవం స భౌతికం దుఃఖం దైవికం దైహికం చ యత్
భోక్తవ్యం ఆత్మనోదిష్టం ప్రాప్తం ప్రాప్తమబుధ్యత ॥ (అధ్యా 23, శ్లో 40)
ఆ సన్యాసి...,
భౌతికము (దుర్జనులచే కలిగేవి)
దైహికము ( జ్వరము మొదలైన దేహసంబంధమైనవి)
దైవికము (శీతోష్ణాదులచే కలిగేవి)
అయినట్టి కష్టములను చూచి....
ఇవన్నీ దేవనిర్దిష్టములు! దైవ కల్పితములు!
అనివార్యములు - అపరిహార్యములు!
కాబట్టి అవస్యము అనుభవించవలసినవే! అవస్యమనుభోక్తవ్యం!
అనే నిశ్చయమును కలిగియుండేవాడు. (తస్మాత్ అపరిహార్యే అర్ధ న త్వమ్ శోచితమ్
అర్హసి). దుర్జనులు కొందరు నేను వర్ణించినట్లుగా ఈతనిని సన్యాసాశ్రమ
స్వధర్మచ్యుతునిగా చేయాలి!" - అని ఉద్దేశ్యించి అనేక అవమానాలు చేసినప్పటికీ...
ఆ సాధువు సాత్వికమైన ధైర్యమును అవలంభించాడు.
సన్యాస సంబంధమైన స్వధర్మమును అనుసరిస్తూనే ఈవిధంగా కార్య కారణ
వ్యవహారమును కీర్తించసాగాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
262
37. భిక్షక గీతా గానము
(The Song of interpreting the incidents of life)
భిక్షకుడు (విప్రుడు) : ఈ కష్టాలన్నీ నాకెందుకొచ్చినట్లు? అసలు ఏజీవుడికైనా కష్ట
సుఖాలు కలగటానికి అసలు కారణం ఏమై ఉన్నది? దీనిని ముందుగా మనం కనిపెట్టాలి!
? పూర్వజన్మ కర్మల వలననాగ్రహములు వక్రించుట చేతనా?
సహజీవులు, వారి కుబుద్ధుల వలననా?
కాల చక్ర చమత్కారమా? |
దైవేచ్ఛయా? దైవమాయయా? |
మరింకేవన్నా కారణాలు ఉంటాయా?
|
ఆఁ! ఆఁ! తెలిసింది. ఇవేవీ అసలు కారణాలు కావు!
శ్లో॥ నాయం జనో మే సుఖ-దుఃఖ హేతుః
న దేవత, ఆత్మా, గ్రహ, కర్మ, కాలాః,
మనః పరం కారణ మామనంతి
సంసార చక్రం పరివర్తయేత్ యత్|| (అధ్యా 23, శ్లో 42)
ఈ జనులు నా సుఖ దుఃఖాలకు హేతువులా? కాదు. వారు అందరినీ ఈ
విధంగా ఏడిపించటం లేదుకదా! నన్నుమాత్రమే ఏడిపిస్తున్నారు మరి!
దేవతలా? ఊహూ! కాదు. వాళ్ళు ఎప్పుడూ దయామయులే. నన్నెందుకు
కష్టపెడతారు.
ఆత్మయా? కానే కాదు! ఆత్మ నిర్వికారము - నిర్వికల్పము కదా! | -
లేదు! లేదు! వారు జీవునికి గ్రహములా? దేహం నిర్మించి ప్రసాదించేవారు.
కర్మ మార్గంలో మార్గ దర్శకులు. సర్వదా జీవులకు శ్రేయోభిలాషులు.
కర్మలా? కాదు! అవి ఆత్మజ్ఞానానికి సాధనములుకదా! పైగా, జడములు!
|
కాలమా? ... కాదు కాదు! అన్నీ ఇచ్చేది - పుచ్చుకునేది కాలమే! అది సదా
సర్వమునకు అప్రమేయము! కాలానికి ఏ ఉద్దేశ్యాలు ఉండవు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
263
మరి?..ఆఁ ఆఁ! ఇప్పుడికి కనిపెట్టాను!
నా మనస్సే అన్నిటికీ కారణం.
మనస్సే సంసారము అనే మహాచక్రమును తన కల్పనా చమత్కారంచేత తనకు తానుగా
నిర్మించుకొంటోంది. తానే అందులో ప్రవేశించి, ఆ మహా చక్రములో తానే గొప్ప
పరిభ్రమణము నిర్వర్తిస్తూ సుఖ-దుఃఖాలన్నీ కల్పించుకొంటోంది. అద్దానియందు తనకు
తానే బద్ధుడుగా అగుచున్నది.
ఈ సృష్టిని కల్పించుకొనేది, సృష్టిగా ఉన్నది, సృష్టిచే చంచలత్వము పొందేది, సృష్టిలో
బంధనము పొందేది, సృష్టిని త్యజించి ఒనానొకప్పుడు ఆత్మతో అద్వితీయత్వము పొందేది
- అంతా మనస్సే! మనస్సే బంధ - మోక్షములను కల్పనచేసుకుంటోంది.
మనస్సు కల్పనచేసుకోకపోతే వాస్తవానికి బంధము లేదు. మోక్షము లేదు. సుఖము
లేదు. దుఃఖము లేదు. గుణ - కర్మల రచయిత మనస్సే!
సర్వబలసంపన్నమగు మనస్సే సత్వము - రజము - తమము - అనబడే త్రిగుణములకు
ఒక గొప్ప రచయిత అయి - మహాకల్పనాచమత్కారి అయి ఈ దృశ్యమును సృష్టించు
కుంటోంది. ఆ త్రిగుణముల నుండి విలక్షణములైనటువంటి త్రివిధ కర్మలు బయల్వెడలు
చున్నాయి.
శుక్ల కర్మలు - సాత్విక (ప్రేమ-దయ-దాక్షిణ్యము- ధర్మనిరతి మొదలైనవి)
కృష్ణ కర్మలు - రాజసిక (ఏదో నిర్వర్తించాలి అనే అభినివేశము)
లోహిత కర్మలు - తామసిక (ప్రమాదో-క్రోధ-లోభ-ఆలస్య-నిద్ర ఇత్యాది)
అట్టి త్రిగుణములనుండి (వివిధములైన సత్వ రజ తమో గుణ మిశ్రమ చమత్కారంచేత)
వేరువేరు అధిక అల్ప కర్మల నిర్వహణచే వివిధ వర్ణములైన జీవులు
బయల్వెడలుచున్నారు. అనగా కర్మానురూపులైనటువంటి దేవ-మానవ - తిర్యక్ జన్మాది
గతులు(Sequencial paths) ఏర్పడుచున్నాయి.
ఈ జీవుడు వాస్తవానికి సర్వదా హిరణ్మయుడు. జ్ఞానానంద స్వరూపుడు. సర్వదా
క్రియాశీలకమైనట్టి మనస్సుతో ఉన్నవాడు. ఆతని యొక్క కేవల జ్ఞానానంద
ఆత్మస్వరూపము సర్వదా సర్వమునకు కేవలసాక్షి అయి, సర్వక్రియలకు అతీతమై
(మనస్సుకు సాక్షి మాత్రమై) సర్వమును వీక్షిస్తోంది! అట్టి కేవలసాక్షి స్వరూపమగు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
264
పరమాత్మ నుండి "నేను మనో సమన్వితుడను కదా!..." అనే తలపుగల జీవాత్మ
బయల్వెడలుతోంది. ఆ జీవాత్మ సంసారద్యోతకమైన మనస్సుతో తన్మయమై, మనస్సుకు
సంబంధించిన క్రియలతో కూడుకున్నదై, భోగ-రాగములను సేవిస్తూ, మనస్సును
మనో కల్పితాన్ని ఆత్మభావనతో సందర్శిస్తూ సంసారాసక్తుడు అగుచున్నది.
జీవాత్మయొక్క సంసారాసక్తతయే సర్వ దుఃఖములకు, గతి-దుర్గతులకు కారణం. మనస్సు
శాంతిస్తే సంసారము లేదు - సంసారగతులు లేవు. సర్వము సర్వదా ఆత్మానందమే!
జ్ఞానానందమే! అఖండమే! ఏ నీవు-నేను-దృశ్యము-కష్టము-సుఖము ఇత్యాది
భేదత్వమంతా మనస్సు పొందుతోందో.... అదంతా అఖండాత్మయొక్క సత్విన్యాసము
దృష్ట్యా లేనేలేదు. అద్దంలో దృశ్యము ప్రతిబింబించినంత మాత్రంచే ఆ అద్దంలో
వస్తుజాలము ఉన్నట్లా? కాదు కదా! అద్దంలోని ప్రతిబింబముయొక్క కుడి ఎడమలు,
ముందు వెనుకలు బింబస్వరూపుడగు నాకు చెందవుకదా!
కనుక నేను చంచలమగు మనస్సును నిగ్రహించి... సరి అయిన మార్గంలో
నియమించానా అప్పుడిక నాయొక్క సంసారాసక్తి ఉపశమించి అఖండాత్మానుభూతి,
ఆత్మ సాక్షాత్కారం పరిఢవిల్లగలదు కదా! అటువంటి ఈ మనస్సును నిరోధించటానికి
సమాయత్తమయ్యెదను గాక! అందుకుగాను ఇంద్రియములు - ఇంద్రియ విషయములపై
యుద్ధం ప్రకటించి సర్వశక్తులను ఒడ్డి ఈ మనస్సును నిరోధిస్తాను.
మనస్సును నిరోధించటానికే పెద్దలు కొన్ని ఉపాయాలు, సాధనామార్గాలు చెప్పుచున్నారు.
శ్లో॥ దానం స్వధర్మో నియమో యమశ్చ
శ్రుతం చ కర్మాణి చ సద్ర్వతాని
సర్వే మనోనిగ్రహ లక్షణాంతాః
పరో హి యోగో మనసః సమాధిః | (అధ్యా 23, శ్లో 45)
దానము ఇతరుల సంతోషం కొరకై మాటలతో, సేవలతో,
సమర్పణతో, సహకారములతో - ఇటువంటి ఆయా మొదలైన
విధాలుగా స్వకీయ ప్రవర్తనను తీర్చిదిద్దుకోవటం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
265
స్వధర్మ నిర్వహణఆశ్రమ ధర్మము - నియమిత ధర్మములను లోకకళ్యాణ దృష్టి,
సహజీవుల క్షేమస్థైర్య అభయ విజయ దృష్టితో కౌశలంగా
నిర్వర్తించటం.
యోగః కర్మశుకౌశలం
నియమము ఇంద్రియములను భగవంతుని ఉపాసించే మార్గంలో
నియమించటం.
యమము అహింస, ప్రేమ-వాత్సల్యము మొదలైన అభ్యాసములచే
ఇంద్రియములను నిగ్రహించటం.
శ్రుతము శాస్త్రముల - మహనీయుల వచనములను నిర్వచనములను
వినటం. ఆకళింపు చేసుకోవటం. విచారణ చేయటం.
ఏకాంతంగా స్మరించటం. నలుగురితో కలసి
సత్సంగపూర్వకంగా సంభాషించుకోవటం.
కర్మాణి వ్రత - పూజ - దేవాలయసేవ ఇత్యాదులు.
మొదలైనవన్నీ మనో నిగ్రహానికి ఉపాయాలు. మనో నిగ్రహమే పరమ యోగము.
ఓ సజ్జనులారా! దానము ఇత్యాదులగురించి చెప్పాను కదా! అయితే... ఇక్కడ కొన్ని
చమత్కారమైన విశేషాలు చెప్పుతాను, దయచేసి వినండి!
దుఃఖాదులకు కారణం దాన ధర్మాలు చేయలేదు కాబట్టా?
శ్లో॥ సమాహితం యస్య మనః ప్రశాంతం
దానాదిభిః కిం వద, తస్య కృత్యమ్?
అసంయతం యస్య మనో వినశ్యత్
దానాదిభిశ్చేత్ అపరం కిమేభిః? (అధ్యా 23, శ్లో 46)
సమాహితము - వశీభూతము అయినట్టి నిర్మల మనస్సు కలవానికి మనం చెప్పుకున్న
దానము - స్వధర్మనిర్వహణ-నియమము యమము మొదలైనవాటివలన క్రొత్తగా -
వచ్చే ప్రయోజనం ఏమున్నది? ఆతనికి అంతా కృష్ణచైతన్యానందముగానే సర్వే సర్వత్రా
ద్యోతమౌతోంది! ఆతని స్వభావంలో త్యాగము అంతర్లీనమై వుంటుంది!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
266
ఇక, అసమాహితమై (Going on getting immersed in number of differences)
అలసత్వమునకు (delaying and lazy)వశమై... ఏమాత్రం నియమితముగాని మనస్సు
నియమము కలవానికి దానము ధర్మము మొదలైనవి నిర్వర్తిస్తే మాత్రం
ఏంప్రయోజనం? మనస్సు "నీది నాది", జీవాత్మ-పరమాత్మ మొదలైన భేదభావాలు
వదలనంత వరకు జాడత్వము తొలగదు కదా!
పంచేంద్రియాలవలన దుఃఖం వస్తోందా?
ఈ ఇంద్రియాలు స్వతంత్రించి ఈ జీవునికి సుఖ-దుఃఖాలు కలిగించగలవా? లేదు.
వాటికా స్వతంత్రం లేదు. ఈ కళ్ళు-చెవులు.... ఇవన్నీ మనస్సు యొక్క వశంలో
వుంటున్నాయి.
శ్లో॥ మనోవశే అన్యే హి అభవన్ స్మ దేవా
మనశ్చ న అన్యస్య వశం సమేతి (అధ్యా 23, శ్లో 47)
మనస్సు ఇంద్రియముల వశంలో లేదు. ఇంద్రియములే మనస్సుకువశమై వుంటున్నాయి.
ఆహాఁ! ఈ మనస్సు బలవంతులందరికంటే కూడా బలవత్తరమైనది కదా! ఏమని
చెప్పాలి? గొప్ప గొప్ప సాధనలు చేస్తున్న యోగులంతటి వారు కూడా ఈ మనస్సుకు
దాసోహమ్ అంటూ, వశమైపోతున్నారే! ఆశ్చర్యమే మరి!
ఎవ్వరైతే ఈ మనస్సును తమవశం చేసుకుంటారో.... వారు దేవదేవుడే అవుతారు.
మనస్సు తనవశమయిందా, అంతకుమించిన స్నేహితుడు మరొకడుండడు.
వశంకాలేదా... అంతకుమించిన శత్రువు మరొకరెవరూ లేరు. ఎందుకంటే,.... రాగముమోహము-మమకారము-అపార్ధము మొదలైనవన్నీ కల్పించి,.... ఈ మనస్సు ఈ
భౌతిక శరీరముపై - హృదయమర్మ స్థానముపై కూడా దండయాత్ర చేసి పెత్తనము
చెలాయిస్తోందికదా!
శ్లో॥తం దుర్జయంశత్రుమ్ అసహ్యవేగం
అరుంతుదం తన్నవిజత్య కేచిత్
కుర్వంతి అసత్ విగ్రహమ్ అత్ర మర్యైః
మిత్రాణ్ ఉదాసీన రిపూన్ -విమూఢాః ॥ (అధ్యా 23, శ్లో 48)
దుర్జయము, సహించలేనంత వేగంతో చరించేది అయినట్టి ఈ మనస్సు అనే శత్రువు
దేహము-హృదయములను ఆక్రమించుకొని-తిష్ఠవేసుకొని వుండగా, ఈ జీవుడు అది
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
267
గమనించడేం? "మనస్సును వశంచేసుకొనేది-జయించేది ఎట్లాగురాబాబూ"... అనే
ఆలోచనయే చేయడాయె! చేయకపోగా, "ఇదిగో! వాళ్ళు నాశత్రువులు! వీళ్లేమో మావారు!
మిత్రులు! ఇక వీరువీరున్నారు చూచారూ! వీరు పరాయివాళ్ళు! నాకు వాళ్లతో పనియే
లేదు!" అని, తదితరులగురించి వ్యవహారాలు నడుపుచున్నాడు.
ఇంతకన్నా మూఢత్వం-తెలివితక్కువదనం మరొకటి వుంటుందా?
అసలీ దేహము ఏమైవున్నది? మనస్సు అనే మాయగాడు కల్పనచేసిన మాయా విశేషం
అటువంటిది. ఈ భౌతికదేహాన్ని చూచుకొని, ఈ జీవుడు మురిసిపోతున్నాడు. "ఆహాఁ!
నా దేహము! నా ముక్కు! నా పెదవులు! నా కనుబొమ్మలు! మిసమిసలాడే నా మీసాలు
కండరాలు!"... అని అద్దంలో చూచుకొని సంతోషపడి పోతున్నాడు.
ఈ దేహము నాది! నేను ఈ దేహమునకు చెందినవాడను ఈ దేహమే నేను!
అని భ్రమిస్తున్నాడు. ఫలితం? అటువంటి భ్రమచేత "దురంతము దురత్యయముఅపారము" అగు సంసార సముద్రంలో మునుగుచున్నాడు.
కాబట్టి నా దుఃఖములకు పంచేద్రియములు కారణం కాదు. అవి వున్నప్పుడు (జీవించి
వున్నప్పుడు) - లేనప్పుడు (స్వప్నసమయం - మరణానంతరము) నన్ను సుఖ దుఃఖాదులు
వదలటం లేదుకదా!
సహజనులు నా దుఃఖాలకు కారణమా?
నేను ఆత్మ స్వరూపుడనని మహనీయులగు ఆత్మశాస్త్రజ్ఞులు గుర్తు చేస్తూనే వున్నారు
కదా! ఆత్మ సర్వదా పరము-అప్రమేయము కూడా! మరి ఈ భౌతిక దేహమో! ఇది
మనోకల్పన మాత్రమేనని అనుకున్నాం కదా! భౌతికదేహము నేను కాదు నాది
కాదు! మరి ఇక తదితర భౌతిక దేహముల వలనగాని, ఈ దేహమువలనగాని నాకు
సుఖ-దుఃఖాలు ఎట్లా కలుగుతాయి.
సరేఁ! సహజనులు నాకు సుఖ దుఃఖ కారకులా? - అనే ప్రశ్నను మరొకకోణంనుంచి
పరిశీలిద్దాం!
నేను ఆత్మ స్వరూపుడను!
తదితరులో-వారూ ఆత్మస్వరూపులే!
ఆత్మ వేరువేరు ఖండములుగా అగుచున్నదా? లేదు! "ఆత్మ సర్వదా అఖండము"
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
268
అని కదా, వేద-వేదాంత ప్రవచన నినాదము!
అనగా నేను-తదితరులు.... అందరముకూడా ఏకము - అక్షరము అగు
అఖండాత్మ స్వరూపులం! (ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ!)
ఇప్పుడు... ఈ "నాదేహం-తదితర దేహులు"... అనే విషయాన్ని గమనిస్తే...,
శ్లో॥ జిహ్వాం క్వచిత్ సందశతి స్వదద్భిః
తత్ వేదనాయాం కతమాయ కుష్యేత్? (అధ్యా 23, శ్లో 50)
నేను భోజనం చేస్తూ వున్నాననుకోండి! అలా కొంచెం పరధ్యానంలో వుండగా,.... నా
పళ్ళు నా పెదిమలను గాయపరచాయి.
అప్పుడు నాకు నా పళ్ళపై కోపం వస్తుందా?
కోపంవచ్చి, ప్రక్కనే వున్న కంచు చెంబుని చేత్తో తీసుకొని, "ఓ నా దంతములారా!
మీ సంగతి చూస్తాను!".... అని బాదుకుంటానా?
మరి సహజనులంతా నా ఆత్మయొక్క ప్రత్యక్ష రూపాలే కదా! పెదిమలను గాయపరచిన
నా పళ్ళపై (దంతములపై) కోపగించనట్లే,... ఆత్మస్వరూపులగు సహజీవులపై
కోపగించటం ఎట్లా?
నా దుఃఖాలకు కారణం దేవతలా?
"దేవతలు" అనగా ఎవ్వరు? (ద ఇచ్చువారు). నాకు పంచేంద్రియములను
(కొంతకాలము వరకు) ప్రసాదించి, వీటిని పరిపోషిస్తున్న సంకల్పశక్తి స్వరూపులు
కదా! అంతేగాని, ఈ పంచేంద్రియములు నేను తయారుచేసుకోలేదే! ఇవి దేవతలు
ప్రసాదించినవి కాబట్టి వారి సొత్తు!
అనగా, ఈ పంచేంద్రియముల యొక్క కర్తృత్వ - భోక్తృత్వములు ఇంద్రియాభిమానులగు
దేవతలకు సంబంధించినవి మాత్రమే! ఆత్మస్వరూపుడనగు నాతో దేవతల సొత్తయినట్టి
ఇంద్రియములకు గల సంబంధం ఏమున్నది? అవి నాకు సుఖ-దుఃఖాలు కలిగించ
వలసిన అగత్యమేమున్నది?
ఇంద్రియాధిష్ఠాన దేవతలు = The creaters, contributers, owners,
Possessors and also Enjoyers of :
Eyes _ Eye-functions,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
269
Ears - Ear-functions,
Skin - Skin features and functions
Nose - Nose functions
Tongue - Tongue features and functions
ఆ అధిష్ఠాన దేవతలు సర్వదేహాలలోను స్పర్శ శబ్ద రూప రస-గంధ కార్యక్రమాలు
ప్రదర్శిస్తున్నారు. అంతేగాని నా ఒక్క దేహములోనే కాదు. అటువంటప్పుడు ఒక దేహముఇంకొక దేహము తాకుచున్నప్పుడు ఎవరు వారిని తప్పు పట్టుకోవాలి? ఒకే స్పర్శాధిష్ఠాన
దేవతయే అన్ని దేహాలలో వేంచేసి వున్నారు కదా!
ఆత్మయే దుఃఖ కల్పన చేసుకుంటోందా.
ఆత్మయే మనస్సుద్వారా తనయొక్క సుఖ-దుఃఖములను కల్పించుకొనుచుండగా... ఇక
ఒకని సుఖ-దుఃఖములకు మరొకరినెవరినో దూషించి, వారివి వీరివి తప్పులు పట్టుకొని,
వారిపై-వీరిపై ఆపాదించి గంటల తరబడి మాటలు చెప్పుకొని ఉండుటవలన ఏమి
లాభం? వృధాయాసం!
ఆత్మ మనస్సును కలిగి ఉండటం అనేది - ఆత్మయొక్క స్వభావమే అయిఉన్నది! -
మనస్సుకు జగత్కల్పన మనోస్వభావమే!
జగత్తు అనగా సుఖ-దుఃఖమయముగా ఆస్వాదించబడే దృశ్య తతంగమే!
బంగారమునకు "ఇది ఆకారం" - అనేదేమీ లేనప్పటికీ, ఆకారం లేకుండా బంగారం
ఉంటుందా? ఉండదుకదా!
అంతా ఆత్మస్వభావమే! ఆత్మతత్త్వమే! ఆత్మకు అన్యమైనదేదీ లేదు! (ఇదియే అద్వైత
సిద్ధాంతము). ఆత్మ జగద్రూపాన్ని కలిగియే వుంటుంది!
ఒకవేళ ఆత్మకు అన్యంగా ఏదైనా అనుభూతమైతే - అదంతా మిధ్యయే! ఒకడు తాను
వ్రాసుకొన్న ఒక కథను చదువుచూ, ఆ కథలోని ఒక దుఃఖ సంఘటనను చూచి తానే
దుఃఖం పొంది వెక్కి వెక్కి ఏడ్వటం వంటిదే!
దుఃఖముగాని వాస్తవానికి స్వకీయమైన భావన- నిర్ధారణ (Assumసుఖముగాని ing-Deciding) లకంటే వేరుగా లేనప్పుడు ఇక ఎవరిమీద కోపం? క్రోధం ఎందుకు?
క్రోధానికి ఏమి కారణమున్నది? తనకు తానే అన్నిటికీ కారణమై ఉండగా, అంతా
ఏకైకాత్మయే (అఖండాత్మయే) అయి ఉన్నప్పుడు ఇక ఎవరిని ఏమని అనాలి? దుఃఖము
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
270
ఎవరికి? తస్య కో మోహః కో శోకః?
ఇంకొక విషయం. దుఃఖము ఆత్మకా! అది అప్రమేయము-నిత్యానందముకదా! పోనీ
జీవునికా! ఈతడు ప్రతిబింబమాత్రుడు కదా! "నాకు దుఃఖాదులు లేవు. కానీ దర్పణం
(అద్దం)లో కనిపించే నా ప్రతిబింబానికి దుఃఖం.." అని అంటే... అదీ అర్ధం లేని
మాటయే కదా!
కాక, దుఃఖమనబడేది ఈ భౌతిక దేహానికా? ఇది జడముకదా! జడమాత్రమగు
దర్పణమునకు సుఖమేముంటుంది? దుఃఖమేముంటుంది? జడమాత్రమగు దేహానికి
కూడా సుఖము లేదు. దుఃఖము లేదు.
ఆత్మయే సుఖదుఃఖ కారణమందామా?
అంతా ఆత్మయే అయిఉండగా ఆత్మ అనన్యమై ఉండగా సుఖముగాని దుఃఖముగాని
వేరుగా లేనట్లే కదా! అనగా, అవి కూడా ఆత్మస్వరూపమేగా! కాంతి వలన మెరుస్తూ
కనిపించే రత్నములను చూచి కాంతికి సుఖమేమిటి? దుఃఖమేమిటి?
గ్రహములు సుఖ దుఃఖ కారణములా?
గ్రహముల ప్రభావంచేత సుఖ-దుఃఖాలు వస్తున్నాయని కాసేపు అనుకుందాం. కొందరు
దైవజ్ఞులు ఆకాశములో ఉండే గ్రహములచేత దేహములో ఉండే గ్రహములు బాధింపబడు
చుండటంచేత సుఖ-దుఃఖాలు ఏర్పడుచున్నాయని అంటున్నారు.
దేహమునకు పుట్టుక - నాశనములున్నాయి.
దేహి దేహముకంటే విలక్షణమైనవాడు. దేహికి జన్మలేదు-మరణము లేదుకదా!
దేహియే కదా, ఆత్మ స్వరూపుడు!
సర్వ దేహములలో గ్రహదేవతల కార్యక్రమవిధులు అంతర్లీనమై వుంటాయి.
కాబట్టి గ్రహముల ప్రభావం దేహముపై ఉంటే ఉండవచ్చుగాక! ఆ గ్రహములకు
దేహము కంటే భిన్నమైనట్టి ఆత్మపై కోపం చూపించవలసిన పనేమున్నది? గ్రహబలం
- తారాబలం గురించి చెప్పువారు మనో బలహీనతయొక్క ఓదార్పు కొరకో, మనస్సును
ఏదో రీతిగా ఉత్సాహపరచటానికో ఉద్దేశ్యిస్తున్నారు. బుద్ధి ఆత్మబలం పుంజుకున్నదా -
ఇక గ్రహ-తారాబలముల గురించిన అగత్యం ఏముంటుంది. లోక రక్షకులగు గ్రహదేవతలకు కొందరిపై ఆగ్రహం -మరికొందరిపై అనుగ్రహం నిష్కారణంగా
ఎందుకుంటుంది?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
271
కర్మలు సుఖ దుఃఖ హేతువందమా?
జడమైన దేహమునకు స్వకీయకర్మలు లేవు.
అజడమైన ఆత్మయో - సర్వమునకు అప్రమేయము, కర్మ వ్యవహారములకు
అతీతము.
జడము-అజడము కాని దానికి మాత్రమే కర్మలు - కర్మప్రభావములు
సంభవమౌతాయి.
ఈ జీవుడు స్వతఃగానే సర్వదా సుపర్ణుడు. అనగా శుద్ధజ్ఞాన శుద్ధచైతన్య
స్వరూపుడు. కర్మకిం ఫలం? అనికదా పెద్దల అభిప్రాయం!
కర్మతత్ జడమే! కర్మములుకూడా దేహమువలెనే - జడరూపములే!
ఈ జీవునికి సంబంధించి జడము-అజడము కానిదంటూ ఇంక ఏదీ లేదు.
అనగా, కర్మలే లేవు! కర్మలే లేనప్పుడు "అవి సుఖ-దుఃఖాలు కలుగజేస్తున్నాయి" అని
ఎట్లా అనగలరు? ఈ జీవుడు ఆత్మస్వరూపుడు కదా! జడమగు కర్మలకు చైతన్య
స్వరూపమగు ఆత్మపట్ల సుఖ దుఃఖాలు కలిగించగల సామర్ధ్యము ఎక్కడున్నది?
సుఖ దుఃఖాలు కాల ప్రభావమా? అంతా కాలమహిమ అంటారు కొందరు!
ఆత్మ కాలః కాలము. కాలమును నియమించునది. కాలముచే మార్పుచేర్పులు లేనిది.
అంతేకాదు! ఆత్మ సర్వమునకు ఆత్మయే! కాలమునకు కూడా ఆత్మయే! కాలాత్మకమైనది
కూడా! జాగృత్లోని కాలము జాగృత్కో పరిమితం. ఆత్మయో, జాగృత్-స్వప్న-సుషుప్తులకు
సాక్షియగు తురీయ స్వరూపం కదా! అటువంటప్పుడు, కాలము ఆత్మను ఎట్లా
క్షోభింపజేయ గలుగుతుంది?
ఎక్కడన్నా...,
అగ్నియొక్క వేడి అగ్నిని బాధిస్తోంది - అనగలమా? మంచుయొక్క చల్లదనము మంచుకు
చలి కలిగిస్తోంది - అని అనవీలున్నదా? ఏ ఆత్మకు వేరైనదంటూ లేదో, సర్వజీవులకు -
కాలమునకు కూడా అది ఆత్మయే అయి ఉన్నదో... అట్టి నా స్వస్వరూపాత్మను కాలము
బాధించటమేమిటి? సుఖ దుఃఖాలు కాలమహిమచేత, కాలచమత్కారంచేత వస్తున్నాయి...
అనునది కుదిరే వాక్యము కాదు. యుక్తికి సరిపోదు. (It is not logically acceptable)
కనుక, ఆత్మస్వరూపుడగు నాకు కాలప్రభావంగా సుఖాలు లేవు. దుఃఖాలు లేవు. నీవునేను అనునవన్నీ అప్రమేయమగు ఆత్మస్వరూపులము కానిదెన్నడు? ఎప్పుడు? ఎప్పుడూ
లేదు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
272
అహంకారము దుఃఖములను పొందుతోందా?
ఒక రచయిత ఒక నవల వ్రాశాడు. ఆ నవలలో ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్ర ఎటువంటిదో
సంసారము అనే నాటకములో అహంకారము అనునది అటువంటిది.
నవలలోని పాత్రకు వచ్చే కష్ట-సుఖాలకు ఆ నవలా రచయితకు సంబంధమేమున్నది?
"ఆ కష్ట సుఖాలు నవలా రచయితవే!" అని ఎవ్వరైనా అంటారా? "కాదండీ! కల్పనామయ
మగు నవలలోని ఆ పాత్రవండీ! అని మాత్రం అనగలరా? అదీ కుదరదు కదా!
అహంకారము ప్రకృతిలోనిది. ఆత్మ ప్రకృతికి అతీతమైనది. ఆత్మకు అహంకారముతో
ఏక్షణంలోనూ సంబంధమే లేదు-నాటక రచయితకు, నాటకంలోని పాత్రయొక్క గుణగణములకు సంబంధమే లేనితీరుగా!
ఈ విషయం గమనించి గ్రహించిన మానవుడికి భూత ప్రకృతికి ఇక భయమొందడు.
భూత ప్రకృతి నుండి మోక్షము పొందినవాడే అవుతాడు.
అందుచేత ప్రాచీనులగు మహర్షులు ఏ ఆత్మ తత్త్వమును సేవించారో... అటువంటి
ఆత్మజ్ఞానమును ఆశ్రయిస్తాను. (శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః అని) ఏమి
చెప్పుకుంటూ వచ్చారో అట్టి పరమాత్మయే పరతత్త్వమే నా ధ్యేయం.
ఎందుకంటే అదియే నా స్వస్వరూపం! అట్టి స్వస్వరూపాస్వాదనకు సర్వాంతర్యామి
మాయాతీతుడు - కేవలసాక్షి - సర్వతత్త్వ స్వరూపుడు అగు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క
పాదపద్మాలను (అ ఋషులవలెనే) ఆశ్రయిస్తాను. ఇక కష్ట-సుఖముల గురించి, సుఖదుఃఖముల గురించి, పట్టించుకోను. మాట్లాడను. ఊసైనా ఎత్తను. అస్సలు వాటిని
గుర్తించను. గమనించను. లెఖచేయను. ఎవ్వరికీ ఆపాదించను. పరుగెత్తే కుందేటి
రెండు కొమ్ములులాగా కష్ట-సుఖములు వాస్తవానికి మొదలే లేవు!
ఒకవేళ వుంటే, అవి మనో కల్పితాలు మాత్రమే!
మొదలే లేవు అని గమనించవలసిన కష్టసుఖాలను "నాకున్నాయో"? అని తలచి తెచ్చి
పెట్టుకొను దుస్తరమగు సంసారగతి నుండి నన్ను నేను తరింపజేసుకుంటాను గాక!
శ్రీకృష్ణభగవానుడు : వింటున్నావా మిత్రమా! ఉద్దవా! సర్వ భౌతికసంపదలను
పోగొట్టుకున్నవాడగు ఆ భిక్షువు సర్వభేదభావాలను క్రమంగా త్యజించసాగాడు. సన్యాసి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
273
అయి ఈ భూమిపై చరించాడు. కొందరు దుర్జనులు బాధలు కలుగజేసినప్పటికీ ఆతడు
స్వధర్మము - సన్యాసి ధర్మము నుండి ఏమాత్రం చ్యుతి పొందుటయే లేదు!
ఇతఃపూర్వమే మహర్షులచే ప్రతిపాదించబడిన ఆత్మ తత్త్వమును కీర్తిస్తున్నాడు.
ఆశ్రయిస్తున్నాడు.
కనుక..., సఖుడా!
శ్లో॥ సుఖ దుఃఖప్రదో నా న్యః పురుషస్య ఆత్మ విభ్రమః
మిత్రో- ఉదాశీన రిపవః సంసారస్తమసః కృతః ॥ (అధ్యా 23, శ్లో 59)
దుఃఖదాతా న కో ప్యస్తి! సుఖదాతా నకశ్చన! ఈ జీవునికి సుఖము ఇచ్చేవారెవ్వరు
లేరు? దుఃఖ ప్రదాతలు లేరు.
ఆత్మ తత్త్వమును ఏమరచటంచేత సుఖదుఃఖాలు కల్పితంగా (As an illusion) మనస్సుకు
అనుభవమగుచున్నాయి. " ఇది కష్టము-ఇది సుఖము, ఇతడు మిత్రుడు. ఆతడు సేవకుడు
ఈతడు శత్రువు" మొదలుగాగల సంసారమంతా కేవలము అజ్ఞాన కల్పితము మాత్రమే!
అట్టి సంసారరోగమునకు ఉపశమనోపాయము ఏమిటో చెప్పుచున్నాను విను.
నాయందు నీ బుద్ధిని పరిపూర్ణంగా నియమించు! "నాటకంలో పాత్రగా
నటిస్తున్నప్పుడు, ఆ పాత్రయొక్క కష్ట సుఖాలు ఆ నటుడివి అవుతాయా?"
అనురీతిగా గమనించు!
పరిపరివిధములైన భావావేశములను ఆశ్రయిస్తున్న నీ మనస్సును నిగ్రహించు.
ఇదియే భిక్షు గీతాసారము!
శ్లో॥ గీయ ఏతాం భిక్షుణా తాం, బ్రహ్మనిష్ఠాం సమాహితః |
ధారయన్ శ్రావయన్ శృణ్వన్ ద్వంద్వైర్నైవాభిభూయతే ॥ (అధ్యా 23, శ్లో 61)
ఆ భిక్షునిచే గానము చేయబడిన బ్రహ్మజ్ఞాన తత్త్వమును ప్రశాంత-సమాహిత చిత్తముతో
ఎవ్వరైతే పఠిస్తారో, ధారణ చేస్తారో, వినిపిస్తారో, వింటారో.., వ్యాఖ్యానిస్తారో...
వారు సుఖ దుఃఖాలకు వశులు కారు! ద్వంద్వాతీతులై ఏకస్థమగు ఆతమతత్త్వమును
సంపాదించుకునే బుద్ధిని ప్రవృద్ధపరచుకోగలరు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
274
38. సాంఖ్యతత్త్వోపదేశము
శ్రీకృష్ణభగవానుడు : ఓ ఉద్ధవా! ప్రాచీనులగు మహర్షులు ఆత్మతత్త్వమును అన్వేషించి,
కృతనిశ్చయించి సాంఖ్యయోగమును వివేచనచేయు వారికొరకై ప్రసాదించటం జరిగింది.
అట్టి సాంఖ్యయోగము శ్రద్ధగావింటే అట్టి శ్రోత భేదమూలకములగు సుఖ దుఃఖములు
మొదలైనవాటిని త్యజించివేస్తాడు. ఈ దృశ్యజగత్తును పీడగా కాకుండా క్రీడగా, బాలా
లీలా వినోదంగా చూడగలుగుతాడు.
ఒక్క విషయము. కృతయుగములోగాని, మరొక యుగంలోగాని, ప్రళయంలోగాని...
ఏ కాలమందైనాసరే... వివేకులైనట్టి పురుషులు ఉంటారు.
అట్టి వివేకవంతులకు సర్వకాల సర్వావస్థలయందును సర్వత్రా అఖండమగు బ్రహ్మమే
ద్యోతకమై అనుభవైకవేద్యమై ఉంటోంది.
స్వతఃసిద్ధమైనట్టి అఖండ పరబ్రహ్మమగు నేను మాత్రమే ఉన్నాను. (అనగా)
మొట్టమొదటగా ఏకము-అనునిత్యానుభవసిద్ధము అగు బ్రహ్మమొక్కటే ఉన్నది. అట్టి
మనో వాక్కాయములకు అగోచరము, వికల్పరహితము (నిర్వికల్పము), భేదరహితము,
ఏకము, సత్యము (Beyond thought and not expressible by throught . The
Thinker prior to thought. The Talker before talking, The one before and
beyond visualazation, before and beyond the perspective of differences.
The Unity prior to and during Diversity. Ever as it is existant) అగు పరబ్రహ్మమే
నేను! నాయొక్క మాయా విలాసంచే (through my own playful sense of illusion)
నాకు నేనే రెండు - (2) గా అగుచున్నాను.
అనగా... ఆత్మ 1. పరమాత్మ 2. జీవాత్మ Self and self related గా! (లేక)
1. ఆత్మ 2. ప్రకృతిగా!
ప్రకృతి నాయొక్క అంశయే! ఆత్మాంశయే! అట్టి నా ప్రకృతి రెండు విధములుగా
ఉంటోంది.
1. కారణము (Cause) 2. కార్యము (Effect).
ప్రకృతి యొక్క ఒకానొక అంతర్లీనమైన అంశ ఎరుగుట - జ్ఞానము (Knowledge).
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
275
అట్టి ప్రకృతియొక్క జ్ఞానాంశ స్వరూపమే ఈ జీవుడు లేక పురుషుడు అని కూడా
గమనించు! నా అంశయే ఈ జీవుడు!
పురుషోత్తముడను - పరమేశ్వరుడను అగు నేను నా భావనాసదృశమగు ప్రకృతిని
కించిత్ క్షోభింపజేయటం చేత త్రిగుణములు అభివ్యక్తమునకు కారణకారణు
డనగుచున్నాను.
1. సత్త్వగుణము 2. రజో గుణము 3. తమో గుణము.
పై గుణత్రయము నుండి క్రియా శక్తి సంపన్నమగు సూత్రము (Activity)
ప్రదర్శనమౌతోంది.
క్రియా వ్యవహారమైనట్టి సూత్రము నుండి జ్ఞానశక్తి ప్రధానమగు మహత్తత్వము
(The feature of ability) ప్రదర్శితమౌతోంది.
అనంతమగు మహత్తత్త్వము (Agility and ability) నుండి సర్వజీవులను
మోహింపజేసే అహంకారము (నేను-నేను-నాది నాది) బయల్వెడలుతోంది.
అహంకారము
వైకారికము తైజసము తామసము
(జాగృత్) (స్వప్నము) (గాఢనిద్ర)
అహంకారము
చిన్మయము (చైతన్యము) అచిన్మయము (జడము)
Active Passive
అహంకారము
శబ్ద-స్పర్శ-రూపచెవులు చర్మము మనస్సుకు
రస-గంధములనబడే కనులు-నోరు ముక్కు
తన్మాత్రలకుఅనే పంచేంద్రియములకు! |
వీటన్నిటికీ అహంకారమే కారణముగా అగుచున్నది!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
276
ఓ ఉద్దవా! ఈ జగత్తంతా కూడా కాలాత్మకుడను పరమేశ్వరుడను అగు నాచే కర్మయుక్తమై
ఉంటోంది. అది అట్లా ఉండగా...,
నా అంశయే అయినట్టి ఈ జీవుడు సత్వము-రజము-తమము అనే త్రిగుణములనబడే
జలముతో నిండిన సంసార సాగరములో ఒకసారి మునుగుచున్నాడు. మరొకసారి
లేచుచున్నాడు. మరల మునుగుచున్నాడు.
ఈ జగత్తులో కనిపించే-అనుభవమయ్యే చిన్న-పెద్ద-స్థూల సూక్ష్మములగు పదార్థాలన్నీ
కూడా ప్రకృతి-పురుషుడు... ఈ రెండింటినుంచీ బయల్వెడలినవే సుమా!
ఇక్కడ ఒకసూత్ర వాక్యం (సిద్ధాంత వాక్యం) చెప్పుచున్నాను. విను.
శ్లో॥ యస్తు యస్య ఆదిః - అంతశ్చ
స వై మధ్యం చ తస్యసన్
వికారో వ్యవహారార్థో
యథా తైజస, పార్థివాః ॥ (అధ్యా 24, శ్లో 17)
ఒకానొకటి మొట్టమొదలు - చిట్టచివర ఏది అయి ఉన్నదో... మధ్యలో కూడా అదే
అయి ఉన్నది. మధ్యలో మరొకటేదోగా చూడబడుచున్నా (లేక) అనుభూతమౌతూ
ఉంటే ... అప్పుడు అదంతా మనోవికారం (లేక) దృష్టియొక్క భేదముచే అనిపించేది
మాత్రమే! వ్యవహారం కొరకు సంభాషణకొరకు చెప్పుకునే మాటలు మాత్రమే! లేక
కల్పనయే! భావావేశానుభూతియే!
ఉదాహరణకు
స్వప్నంలో కనిపించేదంతా స్వప్న చైతన్యమే కదా! స్వప్నంలో కనిపించిన జంతువుమనిషి వేరువేరైనవవుతాయా? లేదు. అంతా స్వప్నచైతన్యముయొక్క చిత్కళా
సంప్రదర్శనమే! (లేక) ఊహా చమత్కారమే!
మట్టికుండ... మట్టిలోంచివచ్చి మరల మట్టిలోనే కలిసిపోతోంది. మరి మట్టినుండి
కుండగా కనబడేది మట్టికి వేరైనదా! మట్టికుండ అనే మాట వికారో
నామధేయము - వ్యవహారార్ధం కల్పించబడినదే కదా! కుండగా వున్నప్పుడు
కూడా అది మట్టియే!
బంగారు ఆభరణములో బంగారముకంటే ఆభరణము వేరా? కాదు. కనుక
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
277
బంగారు ఆభరణము అనుమాట వికారమాత్రం - వ్యవహారార్ధ కల్పితం. "ఇది
బంగారమండీ! ఇదేమో ఆభరణము" - అని ఎవ్వరైనా విడదీసి చూపగలరా!
ఆభరణముగా కనిపించేది బంగారము కానిదెన్నడూ లేదు!
జలతరంగము అనే దానిలో జలము వేరు తరంగము వేరు - అవుతాయా?
కాదు. కనుక జలతరంగము అనేమాట వ్యవహారార్ధం చెప్పబడేదే కాని, తరంగం
అనేది జలమునకు వేరుగా లేదు. తరంగము జలంలో ఉదయిస్తోంది. జలములోనే
ఉంటోంది. జలంతోనే లయిస్తోంది. తరంగము జలము కానిదెప్పుడు?
కాబట్టి
తరంగము జలమునకు అభిన్నము. బంగారు లోహము నుండి ఆభరణరూపంగా
తయారు చేబడిన ఆభరణము బంగారమునకు అభిన్నము. మట్టితో తయారు చేయబడిన
మట్టి ఏనుగు-మట్టి రాజు - మట్టి మంత్రి - మట్టి శత్రు సైనికులు - ఇవన్నీ కూడా
మట్టికి అభిన్నము.
అట్లాగే...,
పరమాత్మ అనే సాగరజలములో పుట్టి - లయించు జీవాత్మ తరంగము
పరమాత్మకు అభిన్నము.
పరమాత్మ అనే మృత్తిక (మట్టి)తో తయారైన జీవాత్మాహంకారము పరమాత్మయందే
జనించి పరమాత్మయందే లయిస్తోంది. కాబట్టి అహంకారము (జీవాహంకారము -
వ్యష్ఠి అహంకారము-దేహాహంకారము ఈశ్వరాహంకారము మొదలైనవన్నీ)
పరమాత్మకు అభిన్నము.
పరమాత్మ అనే బంగాముతో తయారైన మహత్తత్త్వము - మనో బుద్ధి చిత్త
అహంకారాలు-త్రిగుణములు ఇవన్నీ కూడా పరమాత్మ అనే మూల పదార్థానికి
అనన్యము. వేరు కాదు. అవన్నీ వేరువేరు బంగారు ఆభరణముల వంటివి.
అనగా...,
పరమాత్మ అనే నిమిత్త కారణము (లేక) మూలకారణము నుండి బయల్వెడలిన
జీవాత్మ
వ్యష్ఠి అహంకారము
ప్రకృతి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
278
దేహ-మనో-బుద్ధి-చిత్త అహంకారాలు
మహత్తత్త్వము (The 'Ahamkara' that is present in all 3 states
Jagruth, Swapna & Sushaptha)
జగదనుభవాహంకారము మొదలైన
ఇవన్నీ - పరమాత్మనుండి బయల్వెడలుచు, పరమాత్మలోనే లయం అవబోతూ,
వర్తమానంలో కూడా పరమాత్మతత్త్వమునకు అభిన్నమై చెన్నొందుచున్నాయి. ఆయా
నామధేయాలన్నీ ఆయా సందర్భాల గురించి సంభాషించుకోవటానికి చెప్పబడుచున్న
వ్యవహార కల్పిత సత్యములే కాని సహజసత్యములు కాదు. మూల సత్యము కాదు.
వికారో నామధేయాలు. మట్టికుండ-మట్టి మూకుడు-మట్టి పిడత... ఇవన్నీ ఒకే మట్టికి
కల్పించబడటం- ఆపాదించబడటం వంటిది. మనో-బుద్ధి-చిత్త-అహంకారాల విషయం
కూడా అటువంటిదే! అవన్నీ ఆత్మకు అభిన్నములు!
ఈవిధంగా....
బ్రహ్మ సత్యమ్ జగన్మిధ్య
జోవో బ్రహ్మేతి నాపరః
అద్వితీయం బ్రహ్మ
అహమ్ బ్రహ్మస్మి
ఇత్యాది మహా వాక్యార్ధాలు "సర్వము ఆత్మకు అభిన్నము ఈ జీవుడు ఆత్మ
స్వరూపుడే.."అనియే సిద్ధిస్తున్నాయి. అనగా ఋషిప్రవచిత వేద వేదాంత మహా
వాక్యార్ధాలు ఈవిధంగా నిరూపితమౌతున్నాయి.
జగత్తు అనే కార్యము (work) నకు ఉపాదాన కారణము (Worker) ప్రకృతి.
ప్రకృతి అనే కార్యమునకు ఉపదానకారణము (లేక) అధిష్ఠానము పురుషుడు (Individual Self)
పురుషుడు (లేక జీవుడు) అను కార్యము (Work) నకు ఉపాదాన కారణము (Worker)
త్రిగుణముల క్షోభను అభివ్యక్తం చేసే కాలము.
పురుషుడు - గుణములు - కాలము అను మూడిటికి ఉపాదాన కారణము పరమాత్మపరబ్రహ్మము అని వేదోపనిషత్తులచే చెప్పబడే నేనే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
279
నాకంటే భిన్నమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. నీవుగా కనిపించేది నేనే-త్వమేవాహమ్!
బంగారపు గొలుసు-గాజులు-ఉంగరము-వడ్రాణము-ఉగ్గుగిన్నె-ముక్కుపుడక
మొదలైనవ్నీ బంగారముకంటే వేరా? అవన్నీ ఆకార భేదంచేత సందర్భోచితంగా
సంభాషణయొక్క వసతి కొరకు కల్పించబడి చెప్పే పేర్లే కదా! నాకంటే జీవాత్మ -
మహత్తత్త్వము గుణములు జీవాత్మలు - అనుభూతులు దేహములు
దేహపరంపరలు - దృశ్యపరంపరలు వేరుకాదు. అన్నిటికీ మూలకారణము - నిమిత్త
కారణము నేనే! మిలిగినవన్నీ వికారోనామధేయాలు. సందర్భానుచితంగా కల్పించబడిన
పేర్లు. ఉపాదాన కారణాలు. భేదదృష్టిగల శిష్యునికి పరతత్త్వము - బ్రహ్మతత్త్వము
అగు నా గురించి విడమర్చి చెప్పటానికి తత్త్వవేత్తలచే కల్పించబడిన నామ రూప
వర్ణనా చమత్కారాలు. సందర్శనా చమత్కారాలు. పరమాత్మయొక్క యీక్షణా విశేషణా
చమత్కారాలు Perceptual creations). లీలా కల్పితాలు (created for a play).
స్వప్నాంతర్గతవస్తు భేదాలు!
ఈ కనబడేదంతా కూడా.... నాయొక్క లీలా వినోదమే! ఇంకా చెప్పాలంటే
అద్వితీయుడనగు నేనే! అఖండమగు నేనే జీవాత్మదృష్టిచే "అనేకము" గాను పరమాత్మ
దృష్టిచే "ఏకము" గాను అనుభాతమగుచున్నాను.
అట్టి జగత్తు కల్పన - సృష్టి అనే లీలా వినోదము యీక్షణా విన్యాసము
కొనసాగేంతవరకు సృష్టి-స్థితి-లయాలు, త్రిగుణాత్మక భావనానుభూతులు, వివిధ
స్వభావాలతో కూడిన జీవాత్మ పరంపరలు, ఆ జీవుల ఉపభోగములైన పిత్రు-పుత్రాది
రూప వ్యవస్థలు, సృష్టి చక్ర పరిభ్రమణములు - ఇవన్నీ నిరంతరము ప్రవర్తిస్తూనే
ఉంటాయి. కొనసాగుతూనే ఉంటాయి. కాలాత్మకుడనగు నాచేతనే సృష్టి స్థితి -
ప్రళయములకు ఆధార స్వరూపమైన బ్రహ్మాండముల కల్పన-ఉనికి-వినాశనము
నాయందు ఒకానొక విభాగంగా నా విభవంగా ప్రదర్శితమౌతూ ఉంటాయి.
నేను యథాతథస్వరూపుడనై స్వప్న సదృశంగా ఇదంతా కల్పించుకొని వినోదంగా
సృష్టించుకొంటున్నాను. పరిపోషిస్తున్నాను. లయింపజేస్తున్నాను. ఆస్వాదిస్తున్నాను. సృష్టిస్థితి-లయాలు అప్రమేయుడనగు నాస్వకీయ కల్పనలే!
ఈ ఇంద్రియములకు కనిపిస్తున్న దృశ్యజగత్తులు, బ్రహ్మాండ ప్రదర్శనములు... ఇవన్నీ
ఏమి కానున్నాయి? ఎటునుండి ఎటు వెళ్ళుచున్నాయి? - అని ప్రశ్నిస్తే...
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
280
ఈ దేహాలన్నీ అన్నమునుండి బయల్వెడలుచున్నాయి కదా!
|
ప్రళయకాలంలో ఈ కనబడే భౌతిక దేహాలన్నీ అన్నమునందు, అన్నము ధాన్యము
(బీజముల)యందు, ధాన్యము (బీజతత్త్వము) భూతత్త్వమునందు, భూతత్త్వము
గంధతత్త్వము నందు...,
గంధ తత్త్వము జలమునందు, ||||జలము తన "గుణము" అగు రసమునందు,
రసము తేజస్సులోను,
తేజస్సు రూపములోను, ▬▬▬| రూపము వాయువునందు,
వాయువు స్పర్శ తన్మాత్రయందు,
స్పర్శ ఆకాశమునందు,
ఆకాశము శబ్ద తన్మాత్రయందు విలీనమగుచున్నాయి.
ఇంద్రియములు తమ మూల (ఉపాదాన) తత్త్వములగు దేవతలయందు లీనమగు
చున్నాయి.
దేవతలు తన్నియామకమగు మనస్సులోను, మనస్సు - శబ్ద తత్త్వము
పంచభూతములకు కారణమగు అహంకారమునందు,
ఆ అహంకారము సర్వజగత్తును మోహింపజేస్తున్న త్రివిధాహంకార రూపమగు
(జాగ్రత్ - స్వప్న - సుషుప్తిలలో కనిపించే 3 రకముల అహంకారముల
రూపమగు) మహత్-తత్త్వమునందు లీనమగుచున్నది.
జ్ఞానక్రియాశక్తి ప్రధాన రూపమగు మహతత్త్వము తనకు కారణభూతమైనట్టి
గుణములలో...,
ఆ గుణములు - అవ్యక్త ప్రకృతి (తాను వ్యక్తము కాకుండా... సర్వము వ్యక్తీరించే
ప్రకృతి) యందు,
ఆ అవ్యక్త ప్రకృతి - తనకు మూలము - ప్రేరకము - నాశన రహితము అగు
కాలమునందు లీనమగుచున్నాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
281
ఒకవేళ కొద్దిసేపు జగత్తు (లేక) దృశ్యము (లేక) బ్రహ్మాండము (లేక) అనేకత్వము అగు
మాయాకల్పిత విశేషాలు ప్రదర్శితమైనా కూడా "ఇదంతా నాదేకదా! నేనే కదా! అఖండము
అప్రమేయము - నిత్య సత్యము అగు నాకల్పనయే కదా!" అను అహం బ్రహ్మస్మి
భావన వీడకుండానే నాచే ఇదంతా ప్రదర్శించబడుచు సర్వదా వినోదముగా అగుచున్నది!
అజ్ఞానము కూడా నాయొక్క చిత్కళయే! "మనో బుద్ధి చిత్తాహంకారాలు నాకు ఆభరణములై
అప్రమేయుడనగు నేను వాటిని ధరించి వినోదిస్తున్నాను...! జగత్తు నా ఆభరణమే!"
అని నీవు గ్రహించిన తరువాత... ఇక జగత్తు నీకు బంధమవటం ఎక్కడున్నది.
ఓ ఉద్ధవా! సర్వకార్యకారణ తత్త్వవేత్తను - తత్త్వమును అగు నేను ఈ కనబడే జగద్రూప
ధారణచే వినోదిస్తున్నాను! ఇదే నా సాంఖ్యయోగం! సృష్టి-స్థితి-ప్రళయ నిర్వచనములతో
కూడిన, సర్వసంశములను ఛేదించునట్టి సాంఖ్య విధి!
విన్నావు కదా! యోచనతో ద్ధితో నీ స్వస్వరూపము ఎట్టిదో........ గ్రహించి
బ్రహ్మాండ దర్శనములను అప్రమేయుడవై ప్రకాశించెదవుగాక!
మత్ స్థానమును సముపార్జించుకునెదవు గాక!
39. త్రిగుణ వృత్తులు - గుణాతీతత్త్వం
శ్రీ ఉద్ధవుడు : హే పరబ్రహ్మమూర్తీ! చిదానంద స్వరూపా! శ్రీకృష్ణా! సాంఖ్యయోగ
సారమును పూసగ్రుచ్చినట్లు చెప్పారు. అప్రమేయమగు నాయొక్క పరతత్త్వాన్ని ఆస్వాదించే
మార్గం చూపారు. ఈ సందర్భంలో... కనబడేదంతా త్రిగుణములు - గుణియొక్క
సంయోగమేనని కూడా మీ మాటలలో అభివ్యక్తం అవుతూ వస్తోంది! ఇప్పుడు .
అసంమిశ్రమము (Non-mixed) అనగా విభక్తిగా (వేరువేరుగా ఉన్న ఒక్కొక్క గుణముచేత
ఈ పురుషుడు (జీవుడు) ఏ ఏ రూపంగా ఉంటూ ఉంటాడో వివరించ ప్రార్థన.
శ్రీకృష్ణ భగవానుడు : విభక్తమగు (Non combined) త్రిగుణములలోని ఏఏ గుణముచే
ఈ జీవుడు ఏఏ రీతిగా ఉంటాడో... ఆతని వృత్తులు (Avocations, Behaviour) ఏఏ
విధంగా ప్రదర్శితం అవుతాయో... అద్దానిని నీవు అడిగినట్లు చెప్పుచున్నాను. విను!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
283
విభక్తంగా (Sperately each of the thru qualities)
1. సత్త్వగుణవృత్తుల లక్షణాలు
శ్లో॥ శమో దమస్తితిక్షేక్షా తపస్సత్యం దయా స్మృతిః
తుష్టిస్త్యాగో 2 స్పృహా శ్రద్ధా హీర్దయాదిస్స్వనిర్వృతిః || (అధ్యా 25, శ్లో 2)
శమము మనో నిగ్రహము (Control over Thought)
దమము ఇంద్రియ నిగ్రహము (Control over Physical Functions)
తితిక్ష ఓర్పు. (Forbearence)
ఈక్ష వివేకపూరితమైన దృష్టి. (Right Perception)
తపస్సు పరమాత్మతత్త్వము గురించి తపనయే తపస్సు. (Fondness
towards Divinity)
సత్యము యమ్ సత్ - సర్వవస్తువును అసత్నండి వేరుగా దర్శించటం
(Pondering over Truth)
దయ నేనెట్లా సహకరించగలను? అనే యోచన. (Kind hearted)
స్మృతి విన్నది - కన్నది విశ్లేషణకై జ్ఞాపకముంచుకోవటం!
(Evaluating Events)
తుష్టి-సంతోషము లభించినదానికి తృప్తితో కూడిన భావన.
(Wel-sastisfied with possessions)
త్యాగము సమర్పణ - పరోపకారము సేవాభావము. (Sacrifice)
అస్పృహా ప్రాపంచక విశేషాలు - సందర్భములపట్ల వైరాగ్యము -
అతీత్వము-అప్రమేయత్వము. (To be beyond)
శ్రద్ధ పరమాత్మ - ఆధ్యాత్మశాస్త్ర-వేదాంత విషయములపట్ల, శాస్త్ర
ప్రవచనములపట్ల దైనందికమైన కార్యక్రమములను
ఆశ్రయించటం. ఆసక్తిని పరిరక్షించుకోవటం. (Attention)
మహనీయుల మహదత్వము - గురువుల జ్ఞానైశ్వర్యముపట్ల ಲಜ್ಜ
అణకువ, తనలోని అల్పగుణములను గుర్తించి నివర్తించుకొనే
ప్రయత్నము చేయటం. (Shy of own mistakes)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
284
దయ ఇతరులపట్ల దాక్షిణ్యము. (Helpful) |
ఆత్మరతి ఆత్మయందు రమిస్తూ జగత్తిని త్యజిస్తూ ఉండటం. జగత్తును
పరమాత్మ స్వరూపంగా భావనచేసే అభ్యాసమును
ఆశ్రయించటం. (Enjoying everything as one's own self)
2. రజోగుణ వృత్తుల లక్షణాలు
శ్లో॥ కామ ఈహా మదస్తృష్ణా స్తంభ ఆశీర్భిదా సుఖమ్
మదోత్సాహో యశఃప్రీతిర్హాస్యం వీర్యం బలోద్యమః | II (అధ్యా 25, శ్లో 3)
కామము ఏదో కావాలని - పొందాలని, అప్పటికిగాని సుఖం లభించదనే
తీవ్ర తపన. (I have yet to get something to be happy)
ఈహాప్రయత్నము - ప్రాపంచకమైన ఆశయములతో ఏవేవో ప్రయత్నములతో,
సంరంభములతో, కార్యక్రమములతో నిమగ్నమై ఉండటం.
(Involving in worldly aims)
"ఇది నాసొంతముమదము " అనే భావనతో అభినివేశము. గర్వము.
(Proud)
తృష్ణ ఆవేశముతో కూడిన దురాశ. (Craving) |
దంభము గర్వము. ప్రదర్శనావేశము. (Exhibitive)
|
ఆశ ఎప్పుడూ ఏదో ఒకటి ఆశించటం. లభించకపోతే నిరాశ.
|
(Cragily Expecting)
అర్భదా భేదబుద్ది (Looking at Differences)
సుఖము సుఖములకై ఆశయ శక్తిని వ్యర్థం చేయుట. (Self-Comfort)
మదోత్సాహో మదగర్వముతో కూడిన ఉత్సాహము. పోట్లాడటం-తగాదాలపట్ల
అభినివేశము, అభిరుచి. ఎవరినైనా అవమానించేటప్పుడు,
బాధించేటప్పుడు మరింతగా ఉత్సాహపడటం.
(Fault-Finding / Belithling others)
యశః యశః కాముకత్వం. "ఇతరులు మనలను గురించి గొప్పగా
చెప్పుకోవాలి సుమా!" అను రూపమైన అనునిత్య ప్రయత్నం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
285
(For popularity)
కొన్ని కొన్ని దృశ్య వస్తు విషయ రూపములపట్ల ప్రీతిగొని
| leon
ఉండటం. (Attchment)
అపహాస్యం ఇతరులను అపహాస్యం చేయటానికి వెనుకాడకపోవటం.
ఇతరుల లోపములను వెతికి వెతికి సంభాషించుకోవటం.
(Heckling)
వీర్యం ప్రతాపము చూపాలనే ఉబలాటం. (Dominating)
బలోద్యమం హఠపూర్వకమైన ప్రయత్నములందు నిమగ్నం కావటం.
(Emotionally Efforting)
ఇవన్నీ రజోగుణ ప్రవృత్తుల ప్రవృద్ధమును సూచిస్తాయి.
3. తమో గుణ వృత్తుల లక్షణాలు
శ్లో॥ క్రోధో లోభో అనృతం హింసా యాచ్నా దంభః క్లమః కలిః
శోక మోహౌ విషాద ఆర్తీ నిద్రాశా భీః అనుద్యమః ॥ (అధ్యా 25, శ్లో 4)
క్రోధము ఇతరుల తప్పులను తీవ్రమైన ఆవేశంతో ఎంచటం,
దూషించటం. (Anger / Revngeful)
లోభము "నాది-నాదే-నాకు సంబంధించినదే" అనే మమకారము.
"ఎవ్వడైనా అడుగుతాడమో మరి?" అని దాచుకోవటం.
(Miserly)
అసత్యభాషణ - సత్-అసత్, శాశ్వత-అశాశ్వత విషయమును విశ్లేషించకుండా
అసత్ను సత్వలె భావిస్తూ సంభాషించటం. లేనిది ఉన్నట్లు
భావించి నమ్మి మాట్లాడటం. మానావమానములు -
మమకారములు అహంకారాలు ఉంటే తప్పేమున్నది? అని
నమ్మటం. (Misconception)
హింస ఇతరులను మాటలచేతగాని, చేతలచేతగాని బాధించటానికి
సంసిద్ధం కావటం. ఇతరులకు దుఃఖము కలిగించటానికి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
286
వెనుకాడకపోవటం. (Violent/ Unhezitatingly hurting)
యాచన ఇతరులనుండి ఏదో - ఏదేదో - ఏదో ఒకటి కోరుకోవటం.
"ఇతరులు నాకోసం శ్రమించాలి, మీరు ఎందుకు చేయరు?
ఎవరికోసం చేస్తారేం?..." అనే వృత్తి.
(Begging / Demanding)
దంభము తనది దాచుకొని - చూచుకొని గర్వించటం. మురిసిపోవటం.
రాయివలె ఇతరుల కష్టాలు పట్టించుకోకపోవటం.
(Posing / unresponsive to other's trouble)
క్లమః/శ్రమ అలిసిపోయినట్లు ఎంతో కష్టపడుచున్నట్లు, ఇతరులు హాయిగా
ఉన్నారు! ఊసురో!... ఇత్యాదిభావాలు ముఖంలో
ప్రతిబింబించటం. (Self-Sympathy / Dull)
కలిః కలహము (Quarelling)
శోకము దుఃఖించటం. "నా బాధలు నావి. ఎవ్వరేమి చేయలేరు! గతి
ఇంతే" అని తీవ్రంగా అనుక్షణికంగా బాధపడుచూ ఉండటం.
(Lamenting)
మోహము సత్యము పరిశీలించే దృష్టిని ఆశ్రయించక, లేనిది ఉన్నట్లు
భావించటం. ఉన్నది గుర్తించలేకపోవటం. (Illusion)
విషాదము దిగులు. (Meloncholy / Gloomy)
- ఆర్తి దైన్యము - బాధ - ఆవేదనలు. (Hungry of something)
|
నిద్ర సోమరితనము. బద్ధకము. ఎక్కువ సమయం నిద్రపోవాలనే
అభిలాష. (Sleepy / Drowsy )
ఆశ ఏవేవో ఆశలు వృద్ధి చేసుకోవటం. నిరాశపడటం. దురాశ!
|
పేరాశ! (Deep Expectation)
భీతి భీః దీనివలన ఏమౌతుందోదానివలన ! వాళ్లెట్లా ఉంటారో!
రేపు మాపు భీభత్సం కాదుకదా!... అని ప్రతిదానికీ
భయపడుతూ ఉండటం. (Timidity)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
287
అనుద్యమః నైరాశ్యము, ఉద్యమించటము / ప్రయత్నించటానికి సిద్ధం
కాకపోవటం. (Gloomy, Dull, )
ఇవన్నీ తమోగుణవృత్తులు వృద్ధి పొందుచున్నాయనటానికి సంకేతాలు.
ఓ ఉద్దవా! ఇప్పటివరకు సత్త్వ - రజ - తమో గుణములు విడివిడిగా ఎటువంటి
లక్షణాలు, వృత్తులు కలిగి ఉంటాయో చెప్పుకుంటూ వచ్చాను.
ఇప్పుడు ఈ త్రిగుణములు కలిసి ఉన్నప్పుడు గుణ వృత్తులు సంమిశ్రమైనప్పుడు ఏవిధంగా
ఉంటాయో కూడా ఇక్కడ చెప్పుకుందాం.
ఈ జీవులు నేను - నాది అను బుద్ధిని పెంపొందించుకొంటూ ఉండటం సమ్మిశ్రమము -
లైన త్రిగుణములకు సంబంధించినదేనయ్యా!
మనస్సు వలన అనుభూతమయ్యేది,
శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములనబడే ఇంద్రియార్ధముల వలన
అనుభవమయ్యేది,
ఇంద్రియములకు ఎదురుగా తారసబడే విషయాలు,
ప్రాణముల వలన (ప్రియత్వము వలన) ఏర్పడే వృత్తులుగా బయల్వెడలేవి
ఇవన్నీకూడా త్రిగుణములయొక్క మిశ్రమ వృత్తులేనని గమనించు.
ఈ పురుషుడు...,
ధర్మ-అర్ధ-కామ విషయములందు ఆసక్తుడవటం!
వాటిపట్ల ఏర్పడే శ్రద్ధ-ఆసక్తి-రతి!
సంపదలపట్ల ఏర్పడే అహంకార మమకారములు.
ఇవన్నీకూడా త్రిగుణ మిశ్రమవృత్తుల విన్యాసమే!
త్రిగుణ సంబంధంగా....
త్రిగుణ లక్షణ - గుణప్రవృద్ధములు
ప్రవృత్తి లక్షణములైనట్టి కామ్యకర్మలయందు (Acts with expectations) పురుషునికి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
288
ఆసక్తి కలిగినప్పుడు అట్టివాడు లౌకిక వ్యవహారములలో నిమగ్నుడౌతున్నాడు.
క్రమంగా ఎప్పుడో విసుగుచెంది "పరమాత్మను సమీపించటం ఎట్లాగురా?" అని యోచన
ప్రారంభిస్తున్నాడు. అప్పుడిక నివృత్తి-ఉపాసనా ధర్మములవైపుగా దృష్టిని సారిస్తూ
ఉన్నాడు. క్రమంగా పూజ-ధ్యానము-నిత్యధర్మము-నైమిత్తిక ధర్మములయందు రతుడు
అగుచున్నాడు. ఇదంతా కూడా త్రిగుణముల సమ్మిశ్రమ చమత్కారమే!
శమము-దమము... ఇటువంటి లక్షణాలు ప్రవృద్ధము అవుతూ ఉంటే... ఈతడు
సత్త్వగుణ యుక్తుడు అగుచున్నాడని చెప్పబడుచున్నాడు. కామము-ప్రాపంచక కర్మ
వ్యవహారములపట్ల అభిరుచి పెరుగుతూ ఉంటే అది రజోగుణ వృత్తుల ప్రవృద్ధి.
క్రోధము-లోభము ఇత్యాదులు తమోగుణ లక్షణాలు.
త్రిగుణ ప్రకృతి
ఫలము-ప్రతిఫలము కోరకుండా భక్తితో స్వకర్మలచే నన్నే సేవించాలనే ఉద్దేశ్యములను
వృద్ధి చేసుకుంటూ ఉంటే ఆతడు సత్త్వప్రకృతి కలవాడగుచున్నాడు. ఈతడు నాకొరకై
జగత్తులో జీవిస్తున్నాడు.
అట్లాకాకుండా, విషయములను అపేక్షించి స్వకర్మలతో నన్ను సేవిస్తూ ఉంటే... ఆతడు
రజోగుణ ప్రకృతి (స్వభావము) కలవాడు. జగత్ విషయములు- సంపదలకొరకై
నన్ను ఆరాధిస్తునాడు!
హింసను సంకల్పించి నన్ను ఆరాధిస్తూ ఉంటే ఆతనిది తమోగుణ ప్రకృతి! ఇతరులను
బాధించటానికి, ఇతరులపై అధికారము కొరకో నన్ను ఉపాసిస్తున్నాడు.
ఉద్ధవుడు : శ్రీకృష్ణా! ఇప్పుడు నాదొక సందేహము స్వామీ!
ఈ జగత్తంతా త్రిగుణాత్మకం మాత్రమేనని చెప్పబడుతోంది కదా! అట్టి త్రిగుణములు
పరమాత్మ స్వరూపుడవగు మీకు చెందినవా? లేక, జీవాత్మలగు మాకు చెందినవా?
కాక, అవి ఈ దృశ్యజగత్తుకు సంబంధించినవా?
శ్రీకృష్ణుడు : త్రిగుణములు జీవాత్మకు చెందినవి కావు. పరమాత్మను-నిర్మలాత్మ
స్వరూపుడను అగు నాకు చెందినవీ కావు.
మరి?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
289
ఈ త్రిగుణములు జీవుని యొక్క మనోసంభంధమైనవి మాత్రమే!
ఆత్మ స్వరూపుడగు జీవుడు మనో దేహముయొక్క త్రిగుణములు- అనే హస్తాలతో
దేహములు-దేహసంబంధమైన విషయాలైన దృశ్యములు, లోకములు-ఇవన్నీ
ఆస్వాదిస్తూ, ఆస్వాదిస్తూ... ఎప్పుడో వాటియందు ఆసక్తుడు అగుచున్నాడు. ఆ ఆసక్తి
ప్రియత్వము (చిత్తము)గాను, అవినాభావత్వము (అవి లేకుంటే నేనే లేను అనువిధం)గాను
పరిణమించటం జరుగుతోంది. ఈవిధంగా ఈ జీవుడు క్రమంగా సంసార
బద్ధుడగుచున్నాడు. అనగా,
సంసార బంధము అనబడేది జీవునియొక్క స్వకీయ విరచితము-స్వకీయ కల్పనస్వకీయ భావావేశమేగాని ఈ జీవునికి పరమాత్మయగు నేను కల్పించిది కాదు. నేను
సంసార బంధముతో సంబంధమేలేనట్టి అప్రమేయుడను, నిష్క్రియుడను!
ఎప్పుడైతే...,
సత్త్వ-రజో-తమో గుణములు, (లేక) ప్రకాశము-ప్రవృత్తి మోహము అనే
వ్యవహారములను (త్రిగుణములను) - సత్వగుణముచే, (అనగా)
"జ్ఞానము స్వచ్ఛత శాంతము"
అనే ఔషధములచే (లేక ఆయుధములచే) ఈ జీవుడు జయిస్తాడో... అప్పుడు ఆ పురుషుడు
(జీవుడు) త్రిగుణములను దాటివేసినవాడగుచున్నాడు!
తమోగుణము అధికమౌతూ వుంటే సత్వ రజములు అల్పము అవుతూ వుంటాయి.
అప్పుడు బద్దకము-నిద్ర-ఆలస్యము మొదలైన తమోలక్షణాలు అధికమౌతూ వుంటాయి.
ఈ జీవుడు కోపిష్ఠి-బద్ధకస్తుడు ఇతరులను దూషించువాడు తప్పులు పట్టుకొనువాడు,
విచారణ-వివరణ-పరిశీలనలకు సిద్ధపడనివాడు అగుచున్నాడు. మూఢత్వము-లయము
(Immersed) -జడములతో కూడిన ఆ మానవుడు శోకము-మోహము-హింస ఇత్యాది
గుణములతో కూడి ఉంటున్నాడు.
రజోగుణ ఆధిక్యత: సంగహేతువు (cause for attachement), భేద హేతువు (cause
for seeing and searching for differences), ప్రవృత్తి స్వభావము (a quality of
involving in multiple aspects) అయినట్టి రజోగుణము-అధికమౌతూ ఉన్నప్పుడో
(while dominating) ... అప్పుడు? ఆ జీవుడు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
290
దుఃఖము - Worrying
యశస్సు - Craze for popularity
సంపద - Attraction towards possessions
మొదలైన ఆశయములు, స్వభావములు కలిగినవారై ఉంటాడు.
గుణాధిక్యత - ఆయా ఫలితములు
సత్త్వము: చిత్తము నిర్మలమౌతూ ఉంటే, ఇంద్రియములు ప్రశాంతము పొందుతూ
వుంటే, దేహము అభయమును (భయరాహిత్యము) పొందుతూ వుంటే..., మనస్సు
విషయ సాంగత్య రహితం అవుతూ వుంటే..., పరమాత్మనగు నన్ను పొందటానికి
అధిష్ఠానభూతమైనట్టి సత్త్వగుణము వృద్ధిచెందుతూ ఉన్నట్లు (getting increased)
అని గ్రహించు.
రజము : ఈ జీవుడు అనేక కర్మ వ్యవహారములందు ఆసక్తుడై వికృతుడు అవుతూఉంటే,
చిత్తము చంచలంగా విక్షిప్తి చెందుతూ ఉంటే, బుద్ధి "ఏదో కావాలి - ఏదో కావాలి",
అనే రూపంగా అసంతుష్ఠి పొందుతూ ఉంటే, మనస్సు చాంచల్యం పొందుతూ ఉంటే,
కర్మేంద్రియములు వికారం పొందుతూ ఉంటే... దాని అర్థం?
ఈ సర్వ కారణముల వలన రజోగుణము ఉద్రిక్తత పొందుచున్నట్లు.
తమోగుణము
చిత్తము కలత చెందుతూ ఉంటే...,
చిత్తము చితత్త్వమును పూర్తిగా ఏమరుస్తూ ఉంటే,
సంకల్పాత్మకమైన మనస్సు బలహీనమౌతూ ఉంటే,
అజ్ఞానము-విషాదము వృద్ధి చెందుతూ ఉంటే,
తమోగుణము ఉద్రిక్తం అగుచున్నట్లు!
బలము
సత్త్వగుణము వృద్ధి అయ్యేడపుడు - దేవతలతకు,
-
రజోగుణము వృద్ధి చెందేడప్పుడు - అసురులకు,
తమోగుణము వృద్ధి పొందేటప్పుడు - రాక్షసులకు బలము వృద్ధి చెందుతూ ఉంటుంది!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
291
త్రి అవస్థలు
సత్త్వగుణము ప్రవృద్ధమైనప్పుడు - జాగరణము, (More Alert)
రజోగుణము ప్రవృద్ధమైనప్పుడు - స్వప్నము, (More Illusionary)
తమోగుణము వృద్ధి చెందేటప్పుడు - సుషుప్తి (More Sleepy)
అధికమై ఉంటాయి.
తురీయమును ఈ మూడు అవస్థలకు సాక్షియై, ఆత్మస్వరూపమై చెన్నొందుతోంది.
ఉత్తరోత్తర గతులు
సత్త్వగుణ సంపన్నులు క్రమముగా బ్రహ్మమును దర్శించు మార్గములో బ్రహ్మోపాసకులై
ఊర్ధ్వలోకాల వైపుగా యానం కొనసాగిస్తున్నారు. బ్రహ్మలోకమునకు చేరుతూ ఉంటారు.
రజో గుణయుక్తులగువారు మానవలోకమును పొందుతూ ఉంటారు.
తమో గుణమును ఆశ్రయించువారు స్థావరములవరకు అధోగతిని పొందుతూ ఉంటారు.
అనగా...,
సత్త్వగుణము వృద్ధి పొందుచుండగా మరణించినవారు స్వర్గము మొదలైన ఊర్ధ్వలోకాలు
పొందుచున్నారు. (ఊర్ధ్వంగచ్ఛంతి)
రజో గుణము వృద్ధి చెందుచున్నప్పుడు మరణిస్తున్నవాడు మరల మానవ జన్మకు
అర్హుడగుచున్నాడు. (మధ్యేతిష్ఠంతి)
తమోగుణము వృద్ధి పొందుచున్నప్పుడు నరకము మొదలైన అధోలోకములకు
చేరుచున్నారు. (అధోగచ్ఛంతి)
నిర్గుణులైన వ్యక్తులు జీవించి ఉన్నప్పుడే సర్వలోకాతీతులై నన్ను చేరుచున్నారు!
14 లోకాలకు కేవలసాక్షి - అతీతుడు అయి, వాటిని ఆస్వాదిస్తున్నారు
కర్మలు
సాత్విక కర్మలు - సర్వాంతర్యామియగు పరమాత్మకు ప్రీతి కలిగించే ఉద్దేశ్యముతో,
ఫలాభిలాష రహితంగా, సమర్పణ భావంతో అనుష్ఠింపబడే నిత్యము (Daily)
నైమిత్తకము (Occasional / Incidental) మొదలైన కర్మలు.
రాజస కర్మలు - లోకసంబంధమైన ఫలమును సంకల్పించి - ఉద్దేశ్యించి చేసే కర్మలు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
292
తామస కర్మలు సహజీవులను బాధిస్తూ, హింసతో కూడినవి. దంభముమాత్సర్యముతో కూడినవి. ఇతరుల తప్పులను ఎంచటమే ప్రధాముగా కలిగియున్నవి.
ఇతరులపై పెత్తనము-ఆధిక్యత ఉద్దేశ్యించేవి.
కర్త-కర్మ-క్రియ-కర్మసాధనములు-ఫలములు-అంతా పరమాత్మ స్వరూపంగా
బ్రహ్మముగా భావిస్తూ నిర్వర్తించే కర్మలు- గుణాతీత కర్మలు. (అద్వితీయం బ్రహ్మ!)
జ్ఞానము
సాత్విక జ్ఞానము : దేహమును-గుణమును అధిగమించి- దేహి -గుణి గురించి ప్రవచించే
- నిర్వచించే - తెలియజేసే జ్ఞానము. ఇదియే కైవల్య జ్ఞానము కూడా!
రాజస జ్ఞానము: దేహమునకు - ఇంద్రియములకు - విషయములకు సంబంధించిన
-భేదవివరణంతో కూడిన -లోక విశేషాలకు సంబంధించిన జ్ఞానము. దీనినే వైకల్పిక
జ్ఞానము అనికూడా అంటారు!
తామసజ్ఞానము : పెత్తనము-అధికారము-ఇతరులను లొంగతీసుకోవటం-బాధించటంలోభము ఇట్టి జ్ఞానము. ఇది ప్రాకృతజ్ఞానము. ఇంద్రియ సుఖములకు సంబంధించిన
జ్ఞానము.
పరమేశ్వర సంబంధమైనది - పరతత్త్వ విరణగురించినది నిర్గుణ జ్ఞానము.
వాసము (Place of Stay)
వనవాసము - సాత్విక వాసము.
గ్రామవాసము రాజసవాసము.
జూదమాడు గృహములలో వాసము తామసిక వాసము.
పరమాత్మ సన్నిధిలో ఉండటం (దేవాలయాదులలో ఉండటం) - నిర్గుణము.
కర్త (కర్మ నిర్వర్తించువాడు)
సాత్వికకర్త : అనాసక్త భావనతో కర్మలు ఆచరించేవాడు - సాత్వికుడు.
రాజసిక కర్త : రాగముతో జ్ఞానచక్షువులు మూసుకొని కర్మలు చేయువాడు - రాజసికుడు.
తామసిక కర్త: స్మృతి భ్రష్టుడై, పూర్వాపూర్వ విచారణ చేయకుండా కర్మలు చేయువాడు.
కేవలము సర్వాంతర్యామి - సర్వ బాహ్య అభ్యంతర స్వరూపుడగు పరమాత్మను ఉద్దేశ్యించి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
293
కర్మలు నిర్వర్తించువాడు - నిర్గుణుడు. My work is my worship అని భావించి కర్మలు
చేయువాడు నిర్గుణకర్త. అకర్త.
శ్రద్ధ
సాత్విక శ్రద్ధ : అధ్యాత్మ శాస్త్రము సూచిస్తున్న బోధిస్తున్న మార్గము ఆశయముల
పట్ల గల శ్రద్ధ - సాత్వికము. నేనెంత వరకు నిర్మల హృదయము, సునిశితమైన
విస్తారమైన బుద్ధి సంపాదించుకుంటూ శాస్త్రముల-ఆత్మజ్ఞుల బాటలో
నడుస్తున్నాను?... అను శ్రద్ధ స్వాతిక శ్రద్ధ!
రాజసిక శ్రద్ధ : ఇంకేదేదో ముందుముందు చెయ్యవలసి యున్నది ఎంతెంత
పొంచున్నాము? - అని కర్మలపట్ల శ్రద్ధచూపుతూ చరించేవాడు - రాజసికుడు.
తామసిక శ్రద్ధ : అధర్మమే నా ధర్మము అని భావించి శ్రద్ధ చూపువాడు - తామసికుడు.
భక్తియొక్క ప్రవృద్ధియే ఆశయముగా కలిగి, పరమాత్మను సేవించుటయందు శ్రద్ధగల
వాడు నిర్గుణుడు. గుణాతీతుడు.
ఆహారము
సాత్వికాహారము : హితకరము (పథ్యము), శుద్ధము, ఇతరులను బాధించకుండా
సంపాదించుకొన్నది (అనాయాస లబ్దం - అబాధిత లబ్దము-అనింద్యమైన యత్నముల
వలన లభించే ఆహారము.
రాజసాహారము : ఇంద్రియ సుఖము లక్ష్యముగా కలిగినవి, వగరు, పులుపు, ఉప్పు
పదార్దములు. సహ జీవుల బాధలను లెక్కచేయకుండా, పాప-పుణ్యాలు గమనించకుండా
సంపాదించుకునే ఆహారము.
తామసికాహారము : దాహము దైన్యము మత్తు కలిగించేవి. అపవిత్రములు.
ఇతరులను బాధించి మోసగించి సంపాదించుకునే ఆహారము.
నాకు సమర్పించబడినది నిర్గుణాహారము. సాత్వికము-దైవార్పితమున్యాయార్జితము మితము అయినది- గుణాతీతమైన ఆహారరూపం. (తస్మాత్
అన్నమయమ్ మనః)
సుఖము
సాత్విక సుఖము : ప్రేమ-దయ-కర్తవ్య నిర్వహణ-పరోపకారము మొదలైన కర్మల
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
294
నుండి లభించే సంతోషము వలన కలిగే సుఖము - సాత్వికము
రాజసిక సుఖము : విషయభోగమువలన కలిగే సుఖము - రాజసము.
తామసిక సుఖము : మోహము-దైన్యము - మత్తువలన ఇతరుల సాధక బాధకములను
లెక్క చేయకుండా కలిగే సుఖము తామసికము.
పరమాత్మను కీర్తించుటవలన కలిగే తన్మయతా-తదర్పితా ఇత్యాదుల వలన కలిగే
సుఖము - నిర్గుణము, గుణాతీతము.
ఓ ఉద్ధవా!
ద్రవ్యము :: దేశము :: ఫలము :: కాలము :: జ్ఞానము :: కర్మ :: కర్త :: శ్రద్ధ ::
అవస్థ :: ఆకృతి :: నిష్ఠ
ఇటువంటి భావములన్నీ త్రిగుణాత్మకములేనయ్యా! అవి సాత్విక - రాజసిక-తామసిక
మూడు విధాలుగా వుంటూ వుంటాయి. అంతే కాదు!
చూడబడినవి :: చూస్తున్నవి :: వినబడినవి :: వింటున్నవి :: ఆలోచించబడినవి ::
ఆలోచిస్తూ వున్నవి :: ప్రకృతి - పురుషుడు అను ద్వంద్వ భావములు - ఇవన్నీ కూడా
త్రిగుణాత్మకములే! త్రిగుణములలో ఏదో ఒకదానికి చెందివుండటం-విజ్ఞతతో
గమనించవచ్చు.
ఈ పురుషునకు (జీవునకు) కలిగే సంసారభావములన్నీ త్రిగుణ కర్మ-త్రిగుణ
సంబంధమైన ఆలోచనలవలననే కలుగుచున్నాయి. త్రిగుణములు కానిదంటూ
దృశ్యములో ఎక్కడా ఏదీ లేదు.
త్రిగుణములు చిత్తమునుండే ఉత్పన్నమౌతున్నాయి.
ఎవ్వడైతే...,
చిత్తముచే జనింపజేయబడుచున్న త్రిగుణములను చిత్తము చేతనే జయిస్తాడో...,
అట్టివానికి స్వభావసిద్ధంగానే నా పట్ల భక్తియోగం ఏర్పడుతోంది. భక్తియొక్క నిష్ఠచే
విచక్షుణుడై పరమాత్మత్వమును సమీపిస్తున్నాడు. సంతరించుకుంటున్నాడు. పరమాత్మతో
మమేకమవటానికై భక్తిగుణములు ఆశ్రయిస్తున్నాడు. భక్తి త్రిగుణాతీతస్థానమునకే దారి
తీస్తోందిసుమా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
295
అందుచేత...,
కాస్త విచక్షణ గల జీవుడు యుక్తాయుక్త విచక్షణ చేయగల - జ్ఞాన విజ్ఞాన సంభవమగు
మానవ దేహము పొందిన తరువాత... ఇక తాత్సారం చేయరాదు. చేయడు.
సదుపాయములను తెలివితక్కువగా వృధా చేసుకోడు. ఇక విచక్షణ -విచారణ
చేయనివానికి నేను చెప్పేదేమున్నది?
మరి ఏమి చెయ్యాలి?
గుణములయందు ఆసక్తిని త్యజించి గుణాతీతుడను తురీయుడను - సర్వసాక్షిని
అగు నన్నే సేవించాలి! నన్నే అంతటా అన్ని రూపాలుగా దర్శించాలి. తనయందే
సర్వదా వేంచేసియున్న నన్ను గుర్తించాలి. గమనించాలి. ఆస్వాదించాలి.
క్రమక్రమంగా - అప్రమత్తుడు, జితేంద్రియుడు, విషయాసక్తి శూన్యుడు అయి
నన్నే శరణువేడును గాక!
సాత్విక గుణము ద్రవ్యము - స్వభావములను సేవించి రజస్తమోగుణములను
జయించాలి.
ఆ తరువాత క్రమంగా గుణాతీతుడై, గుణములకు కేవలసాక్షి అయి సర్వమును
ఆస్వాదించాలి!
అనగా...,
ఉపశమనాత్మకమగు సత్వగుణముతో కూడినవాడై మిశ్రమ సత్వగుణములను
కూడా జయించాలి.
గుణత్రయ విముక్తుడై లింగదేహము (సంస్కారదేహము)ను కూడా అధిగమించి,
తనలోనే మనో-బుద్ధి-చిత్త-అహంకారములకు ఆవల సర్వదా వేంచేసియున్న
నన్ను పొందాలి.
ఈవిధంగా చిత్తమునుండి జనిస్తున్న గుణముల నుండి - లింగ దేహమునుండి విముక్తుడై
· బ్రహ్మరూపుడనైన నా అనుభూతిచే ఈ జీవుడు పరితృప్తుడు కాగలడు!
అట్టి పరితృప్తుడు ఇక ఇక్కడి విషయభోగములకు గాని, అంతర్బహిశ్చ దృశ్య విషయముల
చేతగాని బద్ధుడు కాడు! జగత్ విషయములపట్ల మౌనం వహిస్తాడు. ముక్తుడై చరిస్తాడు!
చిరునవ్వు సదా చిందిస్తూ - అతీతుడై వుంటాడయ్యా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
296
40. పురూరవ వైరాగ్య ఉక్తి (ఐలవ గీతము)
శ్రీ ఉద్ధవుడు : శ్రీకృష్ణా! మాయను అధిగమించటం ఎట్లా! నిన్ను చేరే మార్గమేమిటి?
శ్రీకృష్ణుడు : ఓ ఉద్ధవా!
శ్లో॥ మల్లక్షణమిమం కాయం లబ్ద్వా మద్ధర్మ ఆస్తితః
అనందం పరమాత్మానం ఆత్మస్ధం సముపైతి మామ్|| (అధ్యా 26, శ్లో 1)
పరమాత్మనగు నాయొక్క తత్త్వమును తెలుసుకోవటానికి అత్యంత ఉపయుక్తమైన
ఉపకరణము ఈ మానవ దేహము. అట్టి మానవ దేహోపకరణము సహాయంతో భాగవత
ధర్మమును - ఆశ్రయించి, నన్ను - ఆత్మ స్థితుడనుగా, పరమానందరూపుడనుగా,
పరమాత్మనుగా ఎఱిగి - నన్నే పొందుచున్నాడు. కాబట్టి మానవ జన్మ బహుదుర్లభమగు
మహత్తరమైన అవకాశముగా శ్రోతలు గమనించెదరు గాక! ఇది కాల బద్ధమైన
అవకాశము కూడా! (This is Time-Bound, but not permanent opportunity).
ఇది గమనించి గుణమయమగు ఈ సూక్ష్మోపాధి నుండి విముక్తులయ్యెదరు గాక!
గుణములు మాయా సంజాతములు కదా!
ఇక్కడి విషయములన్నీ స్వప్నాంతర్గత విశేషాలవలె -అవాస్తములు, మాయామాత్రములు.
గుణాతీతుడు ఈ విషయం గమనిస్తున్నాడు. గమనించి ఇక విషయాసక్తుడు
అగుటలేదు! ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఉదహరిస్తున్నాను.
విషయభోగములందు, కేవలము పొట్టనింపుకోవటానికో సంపద మొదలైనవాటి
కొరకో రోజులన్నీ వెచ్చించే వారిని, తదితర సాంసారిక భావ-ఆవేశములు
కలవారిని "అసత్పురుషులు" అని అంటారు. అధ్యాత్మ మార్గాణ్వేషకులు
అట్టివారితో స్నేహము చేయకపోవటమే ఉచితము. ఎందుకంటావా? గ్రుడ్డివాడిని
అనుసరిస్తున్న మరొక గ్రుడ్డివాడు ఏమౌతాడు? పోయి ఇద్దరు అంధకారంలోనే
పడతారుకదా! అట్లాగే అసత్పురుషుని అనుసరించేవాడు సద్వస్తువును ఎట్లా
చేరుతాడు చెప్పు!
ఈ సందర్భములో మహా యశస్వి-ఇలానందనుడును అయినట్టి, పురూరవ చక్రవర్తి
యొక్క ఒక సందర్భంలోని ఒక అనుభవం గుర్తుకొస్తోంది. ఆతడు మొదట ఊర్వశిని
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
297
కామించి విరహం పొందాడు. అత్యంత దుఃఖితుడైనాడు. ఆ తరువాత విచారణచే విరాగి
అయినాడు. ఆ విశేషం చెప్పుచున్నాను. విను.
పురూరవ చక్రవర్తి మహా ధైర్యవంతుడు! ప్రజారంజక పాలకుడు! గొప్ప తపస్వి!
మహా మేధావి. గొప్ప యజ్ఞములు చేసినవాడు. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలిస్తూ
ఉండేవాడు. ప్రజలంతా ఆ చక్రవర్తిని తమ ఆత్మ బంధువుగా-ఆత్మీయ భావనతో
ప్రేమిస్తూ గౌరవించేవారు. ఆయన ప్రకృతిని జయించివేసినట్లుగా చెప్పుకోబడుచూ
వుండేవాడు.
రోజులు ప్రశాంతంగా గడచిపోతున్నాయి.
ఒకానొకరోజు...,
పురూరవుడు వాహ్యాళికై ఒంటరిగా వెళ్ళుతూ ఉండగా, ఒక సరస్సు ఒడ్డున ఒకనొక
సౌందర్యరాశిని చూచాడు. ఆమె వన్నెలు చూచి అత్యంతాశ్చర్యం పొందాడు. "జగత్తులో
ఇంతటి కోమలమైన సుందర స్త్రీ ఉండటమే నాకు ఆశ్చర్యం వేస్తోందే!" అని
అనుకున్నాడు.
ఆమెను సమీపించాడు.
"ఓ కన్యకా! ఎవరు నీవు? నీ వన్నెలు ఈ వనానికే సిరివెన్నెలలు తెచ్చాయి. నేను ఈ
రాజ్యానికి చక్రవర్తిని. పురూరవ చక్రవర్తిని. నీ సౌందర్యం చూచి ఆశ్చర్యపోతున్నాను.
దేవకాంతవలె ప్రకృతిని రంజింపజేస్తున్నావు సుమా! ఇదిగో! నీ సౌందర్యానికి నేను
దాసుణ్ణి అవుచున్నాను. నా మహాసామ్రాజ్యము నీ పాదాలకు సమర్పిస్తున్నాను. నాకు
మహారాజ్ఞివై ఈ రాజ్యమును-నన్ను ఏలుకో! నీ సౌందర్యానికి దాసుడనై నేను అన్నీ
ఇచ్చివేస్తాను. నా సింహాసనాన్ని అధిరోహించు. దేవకాంతవలె మెరిసిపోతున్న నీకు
దాసానుదాసుణ్ణి అవటంచేత నాకు ఎంతగానో గర్వముగా ఉన్నది! ఓ సుందరీ! ఒకసారి
నీ పెదిమలు విప్పవూ? ఎవరునీవు! మనవకాంతవా! దివినుండి భువికి దిగివచ్చిన
గంధర్వకాంతవా?"...
అని పలకరించాడు.
ఊర్వసి : ఓ చక్రవర్తీ! పురూరవా! మహాప్రాజ్ఞా! అవును! నేను మానవ కాంతను కాను!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
298
దేవకాంతను. నాపేరు ఊర్వసి. దేవసభలో మిమ్ములను ప్రశంసిస్తూ వుంటే
మహానుభావుడగు మిమ్ములను సందర్శించాలనే కోరిక నాకు కలిగింది. మహాప్రభూ!
పుణ్యమూర్తీ! ప్రకృతి సౌందర్యం ఆస్వాదించటానికి, మరియు మిమ్ములను చూడటానికి
వచ్చాను. మీరు వేదవేదాంగాలు ఎరిగిన కర్మయోగులని విన్నాను. ఈ రోజు నాకు
సుదినం! సంతోషం! మీకు నమస్కరిస్తున్నాను. నాకు భూలోకంలో నియమితమైన
కాలము అయిపోవస్తుంది. కొద్ది క్షణాలలో తిరిగి దేవలోకం వెళ్ళక తప్పదు. ఇది
అప్రతిహతమగు ఇంద్రుని ఆజ్ఞ. ఊర్వశీలోకం తిరిగివెళ్ళాలి! మీ రాజ్యాదులు నాకెందుకు
చెప్పండి? మీ దర్శనం అయింది. నాకు చాలా సంతోషం. ఇక శెలవు ఇప్పించండి!
పురూరవుడు : ఓ దేవతాలోక విహారిణీ! ప్రణయేశ్వరీ! ఊర్వశీ! నీవు నా హృదయాన్ని
దోచావు. నన్ను పుణ్యమూర్తి - అని సంబోధించావు కదా! పుణ్యఫలితంగానే నీ దర్శన -
భాగ్యం నాకు కలిగింది కాబోలు! నీవు నన్ను విడిచి వెళ్ళవద్దు. ఇక్కడే నాతోనే ఉండు.
ఇప్పుడు నా మనఃస్థితి ఎమిటో తెలుసా? నిన్ను విడచి ఒక్కరోజు కూడా ఉండలేను.
ఒక్కక్షణం కూడా బ్రతకలేను.
ఊర్వశి : మహనీయా! మీరు ఇట్లా మాట్లాడుచున్నారేమి? ప్రాకృత దేహాలు చూచి
మీవంటివారు భ్రమించటమేమిటి? ఈ దేవ-మానవ దేహాలన్నీ ప్రకృతి కల్పనయే
కదా! స్వప్నంలో చూచిన దేహాలు ఎటువంటివో, జాగ్రత్లో కనిపించే దేహాలు
అటువంటివే కదా! భౌతిక దేహాకర్షణలకు లోను అవటం ఊర్ధ్వగతులకు
అధ్యాత్మయానానికి అవరోధాలని మీకు తెలియంది కాదు కదా!
పూరూరవుడు : అదియేమో నాకు తెలియదు. అవన్నీ ఇప్పుడు నాకు చెప్పవద్దు! నిన్ను
విడచి ఉండలేను. అంతే! నన్ను విడచి వెళ్ళవద్దు. నీవంటి సుందర దేహము పురుషుని
రంజింపచేయటానికే కదా, బ్రహ్మదేవుడు సృష్టించేది! మేము నిర్వర్తించియున్న యజ్ఞయాగముల ప్రయోజనము నీవంటి దేవకాంతలతో సమాగమమే కదా!
ఊర్వశి : చక్రవర్తీ! దేహములను చూచి భ్రమించటం మాయకు లోబడటమేకదా!
నన్ను విడవండి. నామాట వినండి. ఈ భౌతిక దృష్టినుండి దయచేసి మరల ఆధ్యాత్మదృష్టికి
మరలండి.
ఈవిధంగా ఊర్వశి మనోదౌర్బల్యం వీడవలసినదిగా ఎంతగానో బోధించింది.
బ్రతిమలాడింది. అనేక సోదాహరణములు - దృష్టాంతాలు గుర్తుచేసింది. పురూరవుడు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
299