ఆ మాటలన్నీ "ఈ దేవకన్య నన్ను ఏమరచటానికి ప్రయత్నిస్తోంది..." అన్న దృష్టితో
చూచాడేగాని, ఆమె చెప్పే భౌమావిశేషాలను (ఆత్మతత్త్వ ప్రవచనములను) వినటమేలేదు.
ఇక ఊర్వశి చేసేదేమి లేక ఆకాశంలో ప్రయాణిస్తూ నిజమార్గంలో అతర్ధానమైనది.
పురూరవునకు అది చూచి పిచ్చిపట్టినట్లు అయింది. దుఃఖముతో కేకలు పెట్టాడు.
బట్టలు చింపుకున్నాడు.
పురూరవుడు : దేవీ! ఈర్వశీ! ఇది ఘోరం! నన్ను విడచి వెళ్ళిపోతున్నావా! నిలువు!
నిలువు! పరుగెత్తి పోవద్దు! ఏదీ! నీ ముఖపద్మం మరొక్కసారి చూపించవూ!
అని దీనంగా కేకలు వేయసాగాడు. ఉన్మత్తుడైనాడు. చెట్లలోను- పొదలలోను ఊర్వశి
దాగుకున్నదేమోనని వెతకసాగాడు. దిగంబరుడై మరింకేమి పట్టించుకోక ఊర్వశి ఎక్కడ
ఎక్కడ? అని అనుకుంటూ పిచ్చివాడై అనేకచోట్ల సంచరించాడు. ఆతని వేదన -
రోదన గమనించిన ఊర్వశికి మనసు కరిగింది.
తిరిగి వచ్చిన ఊర్వశిని చూచి పురూరవుడు అత్యంత ఉత్సాహంతో సమీపించాడు.
ఆమెను ఆలింగనం చేసుకొన్నాడు. ఇరువురు ఊర్వశీలోకం చేరారు. ఆమెతో సాంగత్యం
పొందాడు. ఆ ఇరువురి సాంగత్యంలో అనేక సంవత్సరాలు గడచిపోయాయి.
కాలచక్రము మౌనముగా, అప్రమేయంగా తిరుగసాగింది.
చాలా కాలం తరువాత ఎప్పుడో క్రమంగా పురూరవుడు ఊర్వశీ సాంగత్యము పట్ల
విరక్తుడు కాసాగాడు. అవును మరి! సుదీర్ఘమైన అభ్యాసంచేత ఇంద్రియానుభవాలు
మనస్సుకు అరుచి కావటం ఇంద్రియ విషయముల విషయంలో స్వాభావికమేకదా!
ఊర్వశీలోకంలో ఊర్వశీ సాంగత్యంలో అనేక సంవత్సరాలు గడపినప్పటికీ ఆతనికి
తృప్తి కలుగలేదు. రాత్రులు-పగళ్ళు-నెలలు-సంవత్సరాలు గడచిపోతున్నప్పటికీ
"ఇకచాలు" అని అనిపించటమూ లేదు. కానీ క్రమంగా అలసట విసుగు పొందసాగింది.
ఒకానొకరోజు ఆ పురూరవుడు ఒక వంటరి ప్రదేశం చేరాడు. "నేను ఇంతకాలం
చేస్తున్నదేమిటి? ఊర్వశితో సాన్నిధ్యంవలన పొందినదేమిటి?..." అని ఆలోచించ
సాగాడు. అతనిలో ఏదో వైరాగ్యం బయల్వెడలింది.
ఇట్లు ఈవిధంగా గానం చేయసాగాడు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
300
పురూరవుడు :
శ్లో॥ అహో! మే మోహవిస్తారః కామ కశ్మల చేతసః
దేవ్యా గృహీత కంఠస్యన్ ఆయుఃఖండా ఇమే స్మృతాః ॥ (అధ్యా 26, శ్లో 7)
ఆహాఁ! కామముచే నా మనస్సు దూషితమైపోయింది కదా! నా మోహమునకు
అంతులేకుండా పోయింది! ఊర్వశీ ఆలింగనంలో నాకు పగలు రాత్రి తెలియకుండానే
అనేక రోజులు-నెలలు-సంవత్సరాలు ఇట్టే గడచిపోయాయి. "ఆహాఁ! ఈమెతో
సాంగత్యం ఎంత మధురం!" అని తలుస్తూ సుదీర్ఘకాలం గడిపాను.
లాభం? కామము శమించాలి కదా? శమించిందా? లేదు. బెంగ-తపన-ఆవేదన
ఇంకా ఇంకా పెరిగాయి. "ఏ రోజు ఈ ఊర్వశి నన్ను విడచి వెళ్ళిపోతుందో? ఎప్పుడు
ఇంద్రుడు ఈమెను వెనక్కి రమ్మని ఆజ్ఞాపిస్తాడో? అప్పుడు నా గతి ఏమిటి?..." అని
ప్రతిరోజు దిగులు అనుభవించాను. ఇప్పటికీ పరిస్థితి అంతే!
నష్టము! "చదువుకుని బాగుపడరా బాబూ!" అని తండ్రి ధనము వెచ్చించి మరీ పిల్లవాడిని
విద్యాలయంలో జేర్పిస్తాడే! ఆవిధంగా ఈ విశ్వము అనబడే విద్యాలయంలో (విశ్వ
Univerceవిద్యాలయము -University)లో నా ఆత్మయొక్క దివ్యత్వాని
సుస్పష్టపరచుకోవటానికి "మానవజన్మ" అనే తరగతిలో జగతః పితయగు పరమేశ్వరుడు
జేర్పించారు.
నేను నేర్చినదేమిటి?
స్త్రీ సాంగత్యమే సర్వస్వము- అని అహోరాత్రములు గడపటమా? "ఇప్పుడు నాకు ఈ
లాభించినది ఎవ్వరైనా తొలగించరు కదా? అప్పుడు నాగతి?".... అని వర్తమానమును
కామ-రాగ-లోభములతో కప్పిఉంచటమా? ఆకాశము వైపు చూచి ఏదో లభించక
పోతుందా? - అని నోరుతెరచి ఉంచుకున్నవాడికి ఆకలి తీరుతుందా? కామ-రాగములతో
రోజులు గడిపిన నాకు ఇప్పుడు ఆగతే పట్టింది!
ఈలోగా ఆయుర్దాయం చేజారిపోతూ ఉన్నది! అది నేను గమనించటమే లేదు! ఇప్పుడిక
క్రమంగా వార్ధక్యం నన్ను సమీపిస్తోంది. నేను జీవితంలో ఏమి సాధించినట్లు? ఏమి
ఉద్ధరించినట్లు? ఎవరిని సంతోషపెట్టినట్లు? ఆత్మద్రోహీ-కరణవివశో!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
301
శ్లో॥ నాహం వేదాభి నిర్ముక్తః సూర్యోవా అభ్యుదితో ముయా
ముషితో వర్ష పూగానాంబతాహాని గతాన్యుత ॥ (అధ్యా 26, శ్లో 8)
ఊర్వశియొక్క నామ-భౌతిక రూపాదులచే వంచించబడినట్టి నేను అనేక రోజులు
తెల్లవారటం-ప్రొద్దుగూకటం కూడా గుర్తించలేక పోయాను! అయ్యో! ఎన్ని రోజులు -
ఎన్ని సంవత్సరాలు నిష్ప్రయోజనంగా ఈ నాజీవితంలో గడచిపోయాయి. వృధా
అయిపోయాయి! ఆ గడచిపోయిన ఆయుష్షును తిరిగి ఎవ్వరిస్తారు? ఎవ్వరూ ఇవ్వరు!
ఆహాఁ! నామనో మోహం ఎంతటిది. (ఆయుషః క్షణ ఏకో పి సర్వరత్నైః న లభ్యతే॥)
శ్లో॥ అహో మే ఆత్మసమ్మోహో యేన ఆత్మా యోషితాం కృతః
క్రీడా మృగః చక్రవర్తీ నర దేవశిఖామణిః || (అధ్యా 26, శ్లో 9)
రాజశ్రేష్ఠుడను, చక్రవర్తిని, గొప్ప భక్తి-జ్ఞాన సంపన్నుడను అని అందరు చెప్పుకొనే
నేను... ఈనాడు ఒక స్త్రీ చేతిలో క్రీడామృగంగా, కీలుబొమ్మగా అయిపోయానే! ఇందుకు
( ఊర్వశి లభించినందుకు సంతోషించాలా? లేక ఒక ఆడుదాని చేతిలో చిక్కి ఉత్తమ
ఉపాసనామార్గమునుండి చ్యుతిపొంది కుమార్గంలో చాలా దూరం ప్రయాణించి
వచ్చినందుకు దుఃఖించాలా? అరెరె! రాజ్యాదులతో కూడిన నాయొక్క చక్రవర్తిత్వమును,
తత్సబంధమైన స్వధర్మమును గడ్డిపోచలాగా చూచి, ఉన్మత్తుడునై (పిచ్చివాడినై)
దిగంబరుడనై యేడ్చుచు... నానుండి వెడలిపోవుచున్న ఊర్వశి వెంటబడి "పోకు! నా
వెంటనే ఉండు!..." అని యాచించి మరీ బంధమంతా తెచ్చిపెట్టుకున్నానే! వెనుక
కాళ్ళతో తన్నించుకొనికూడా గాడిదవెంట పడటం ఎటువంటిదో.. "వద్దురా బాబూ.."
- అని అంటున్నాకూడా, గీపెట్టి-ఏడ్చి ఊర్వశితో సాంగత్యము తెచ్చి పెట్టుకొనటం
అటు వంటిది కదా! నన్ను ఏమనాలి? మహనీయులు నాగురించి ఏమని చెప్పుకుంటారు?
స్త్రీ లోలుడనై జడ దేహముతో ఆలింగనము కొరకై దేవురించిన నావెంట ఇక మహత్మ్యము
గాని, తేజస్సుగాని, సర్వజన నియంతృత్వముగాని ఇంకా ఎందుకుంటాయి?
శ్లో॥ కిం విద్యాయా? కిం తపసా? కిం త్యాగేన శ్రుతేన వా?
కిం వివిక్తేన మౌనేన? - స్త్రీభిర్యస్య మనో హృతమ్ ? (అధ్యా 26, శ్లో 12)
స్త్రీ దేహమును చూచి (లేక స్త్రీ-పురుషుని దేహమును చూచి) మురిసిపోయి మనసంతా
దేహ విశేషములతో నింపుకున్న వారిగతి ఏమిటి? నిర్గతే! ఆ వ్యక్తియొక్క తపస్సు,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
302
గ్రంధ పఠనముచే సంపాదించుకున్న విద్యావిశేషాలు, సన్యాసియై కాషాయ వస్త్రాలు
ధరించటం, ఏకాంతవాసము, తెలివితేటలు, వికాసము . ఈ కష్టపడి
సంపాదించుకున్నవన్నీ బూడిదలో పోసిన పన్నీరే కదా! వృధాయే కదా! వ్యర్ధమే కదా!
శ్లో॥ స్వార్ధస్యాకోవిదం ధిజ్ఞాం, మూర్ఖం పండిత మానినమ్
యోహం ఈశ్వరతాం ప్రాప్య స్త్రీబిర్గోఖరవత్ జితః ॥ (అధ్యా 26, శ్లో 13)
సర్వజనులపై నియంతృత్వము చెలాయించే చక్రవర్తినయ్యాను. "పండితుడుశ్రేయామర్గము పొందినవాడు మన ఈ పురూరవ చక్రవర్తి ..." అని నన్ను సభలో
కవిత్వముతో కవులు శ్లాఘించారు. "ఈతడు జ్ఞాని. మనకు అనుసరణీయుడు.
మహనీయుడు!..." అని సభికులంతా నాగురించి నిండు సభలో పాటలు పాడుతూ
ఉంటే..నేను ఆ సమయములలో, ఆరోజులలో "ఓహోఁ! నిజమే కాబోలు" అని నేను
లోలోన చాలా సంతోషించాను. గర్వించాను. కించిత్ అహంకరించాను కూడానేమో!
కానీ కాలక్రమేణా ఏమైయ్యింది? ఒక ఆవు-గాడిదవలె స్త్రీ సాంగత్యానికి
వశుడనైపోయాను. పోనీ స్త్రీ సాంగత్యం పొందినందుకు తృప్తి పొందానా?
శ్లో॥ సేవతో వర్షపూగాన్ మే ఊర్వశ్యా అధరాసవమ్
న తృప్త్యత్యాత్మభూః కామో వహ్నిః ఆహుతిభిః యథా|| (అధ్యా 26, శ్లో 14)
కట్టెలు వేసినకొలదీ, నేయి పోసినకొలదీ అగ్ని అధికమే అవుతుంది గాని....
తరుగుతుందా? అనేక సంవత్సరాలు ఊర్వశియొక్క అధరామృతమును గ్రోలినాకూడా
నాపట్ల కామము శమించలేదు. మనస్సు తృప్తి పొందలేదు. పైగా కామజ్వరం ఇంకా
ఇంకా వృద్ధి పొందింది! ఇక శాంతి ఎక్కడిది?
ఈ స్త్రీ పురుష పరస్పర దేహసంబంధములలో ఇరుక్కొని పోయిన చిత్తమును వెనుకకు
మరల్చటం తేలికైన విషయమా? నావల్ల అయ్యేదే కాదు! నా చిత్తమునకు కామజ్వరం
నుండి విముక్తి కలిగించటానికి ఆత్మారాములకు ఆరాధ్యుడైనట్టి ఆ అధోక్షజుడే దిక్కు!
దేవుడే దిక్కు! ఇంకెవ్వరు నన్ను రక్షించేది?
ఆహాఁ! ఆనాడు ఊర్వశి మొట్టమొదటే అనేక యుక్తియుక్తమైన వాక్యములతో నన్ను
సమాధానపరచటానికి ప్రయత్నించింది. నాకెంతగానో బోధించింది. ఇంద్రియములకు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
303
వశుడైనవాడను, మందమతిని, దుర్మతిని అయినట్టి నేను ఆమె మాటలు విన్నానా? విని
కూడా ఏమైన విచారణ-విచక్షణ చేశానా? లేదు. మనోగతమైన మోహంతో "నీవు
లేకపోతే నేను చచ్చిపోతాను. దిగంబరినై బాటలవెంట తిరుగుతాను ..." అని బెదిరించి
మరీ ఆమెతో భౌతిక సాంగత్యమును బలవంతంగా సంపాదించుకున్నాను. నా మనో
గతమైన మోహము అప్పటికిగాని ఇప్పటికిగాని ఏమాత్రం తొలగలేదు.
ఊర్వశిని దర్శించటం చేతనేనా, నాకీగతి పట్టింది? కాదు. కానే కాదు.
ఊర్వశి నాకేమి అపకారము చేసింది? ఏమీ చేయలేదు.
ఒకానొకడు బాటలో పోతూ బాటకు అడ్డంగా మెలికలు తిరిగి కనిపించిన త్రాడును
చూచి "చచ్చాన్రా బాబోయ్! ఈ పాము కరిచిందా! అంతే!..." అని అనుకొని పాముగా
భ్రమిస్తే... ఆ తప్పు త్రాడుదా? కాదే! ఆ త్రాడు బాటసారిని పిలచి, "నన్ను పాము అని
అనుకోవయ్యా!" - అని ఏమన్నా బ్రతిమలాడిందా? లేదే!
అట్లాగే అజితేంద్రియుడినని (ఇంద్రియములను జయించక-పైగా వాటికి వశుడు అయిన
వాడను) అగు నాదే తప్పంతా? దోషమంతా నాదగ్గర పెట్టుకొని ఊర్వశినో - మరొకరినో
తప్పు ఎంచి మరొక తప్పు చేయను.
ఆహాఁ! ఆహాఁ!
ఆ ఊర్వశిని మొట్టమొదటగా చూచినప్పుడు "ఈమె శరీరము అప్పుడే వికశించిన లేత
సౌగంధిక పుష్పమే!.." అని పరవశించాను. అది ఎంతటి అజ్ఞానకృతమైన
ఉత్ప్రేక్షాలంకారము!
సుకుమారము- సుగంధములతో కూడినది - అత్యంత ఆహ్లాదకరము అగు ఆ సౌగంధిక
పుష్పము యొక్క సౌందర్యము ఎక్కడ? అతి దుర్గంధభూయిష్టము, అనేక మలిన
పదార్ధములతో కూడినవి, అశుచి అయినవి అగు ఈ స్త్రీ-పురుషుల శరీములెక్కడ?
నాయొక్క దట్టమైన అజ్ఞానము-ఇంద్రియ దృష్టి చేతనే... ఆ ఊర్వశి దేహము చూచి
ఏవేవో సౌందర్య వర్ణనములు చేసే కవుల కల్పిత వాక్యములను మనస్సులో గుర్తు
చేసుకుని భ్రమతో సౌందర్యమును ఆరోపించాను. బద్ధుడనయ్యాను. ఎవ్వరిని ఏమి
అనను? ఏమి అనుకుని ఏమి లాభం, తప్పంతా నాదగ్గరే ఉంచుకొని?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
304
ఓ శరీరమా!
ఎవరివి నీవు? ఎవ్వరిచే కల్పించబడ్డావు? ఎవ్వరికి చెందినదానవు? కాలగతిచే అనేక
పదార్ధముల సమీకరణముగా రూపు దిద్దుకున్న నీజన్మ రహస్యం ఏమిటి? నీ సొంతదారు
ఎవరు?
శ్లో॥ పిత్రోః కిం? స్వం ను భార్యాయాః? స్వామినో? అగ్నేః? శ్వగృధ్రయోః
కిమాత్మనః? కిం సుహృదామ్ ఇతి యో నావసీయతే? (అధ్యా 26, శ్లో 19)
తల్లిదండ్రులు బిడ్డపుట్టగానే చూచి, మురిసిపోయి "నా బిడ్డ! మా బిడ్డ..." అని అందరికీ
చూపి మురిసిపోతారు. అమ్మ వాత్సల్యంగా చూచి "నా గర్భంలో 9 నెలలు ఎదిగిన ఈ
బిడ్డ నా గర్భవాసి కాబట్టి నాబిడ్డయే..." అని తలచి ఆనందబడిపోతుంది. కనుక ఈ
దేహము అమ్మ యొక్క ఆస్థియా? తండ్రియొక్క ఆస్థియా? వారిద్దరి సొత్తా?
యుక్త వయస్సులో వివాహమౌతుంది. వివాహం జరిగిన పందిరిలో భార్య భర్తను
చూచి స్పృశిస్తూ "ఈ పురుష దేహం నాది?..." అని అనుకొని సంతోషపడుతోంది. ఆ
పురుషుడో "ఈ స్త్రీ దేహము ఇప్పుడు నాకు చెందినదే కదా! ..." అని ఆహ్లాదబడి
పోతున్నాడు. కనుక స్త్రీ దేహము ఆమె భర్తయొక్క ఆస్ట్రియా? పురుష దేహము ఆ
భార్య యొక్క ఆస్ట్రియా? వారిరువురి దేహాలు పరస్పరం ఒకరిది మరొకరి సొత్తా?
సొంతదారు ఎవరు? (Is this body a belonging of Better-Half?)
ఒక యజమాని తన సేవకుని దేహము చూచి, "ఈతనిని జీత భత్యాలు ఇచ్చి
నియమించుకున్నాను కదా! నేను ఏమి చెప్పితే అది చేస్తున్నాడు. కనుక ఈ సేవకుని
దేహము నాదే! ఇంకెవరూ ఈతనికి ఏ పనీ చెప్పటానికి వీలులేదు. ఈతడు నా మాటే
వినాలి! ఇంకొకరి మాట వింటే నేనూరుకుంటానా? " అని తలుస్తున్నాడు. కనుక
ఈ దేహము ఆ యజమానిదా? (Is the physical body of the servant a belonging
of the master?)
ఒకానొకప్పుడు ప్రాణముపోయిన తరువాత బంధువులు ఈ భౌతిక దేహమును
శ్మశానానికి తీసుకొనిపోయి కట్టెలతో కాలుస్తున్నారు? కనుక ఇది అగ్ని దేవుని సొత్తా?
శ్మశానికి చెందిన ఆస్థియా? కట్టెలయొక్క సొంతమా! (Is this the property of Fire,
fire-wood, or Burrial Ground?)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
305
కొందరు చనిపోయిన తమ బంధువుయొక్క భౌతిక దేహమును అడవిలో విడచి వస్తున్నారు.
జంతువులు-పక్షులు ఆ దేహమును ఆహారంగా మెక్కుచున్నాయి. కాబట్టి ఇది కాకులయొక్క
కుక్కలయొక్క, గ్రద్దలయొక్క సొత్తా? (Is this physical body a food stuff belonging
to insects?)
లేక, దేహము జీవునిదా? నాది-నాది అని అనుకుంటూ దీనికి అందంగా వస్త్రధారణ
చేసి, బొట్లు అలంకరించి ఊరు ఊరు త్రిప్పుచున్నాడు కదా! కాబట్టి "నేను" అను
రూపముగల జీవునిదే అని అందామా? ఈ జీవుడేమన్నా ఈ దేహమునకు తానుగా
కాళ్లు-చేతులు-పొట్ట-జీర్ణవిధానం అమర్చాడా? తానుగా ఒక వెంట్రుక అయినా
మొలిపించాడా? పోనీ, ఏ తల్లి గర్భవాసం నుండి బయల్వెడలిందో అది ఈ జీవునియొక్క
నిర్ణయమా?
స్నేహితులు కొంతమంది వీడు మా వూరివాడే! మావాడేనండీ! మాజాతి వాడే! మా
పాఠశాలలోని వాడే! అని చెప్పుకొంటూ ఆ మిత్రుని దేహమును తమసొత్తువలె
చూస్తున్నారు. మరి ఈ దేహము అటువంటి స్నేహితులదా?
ఎంతగా ఆలోచించికూడా ఈ దేహమునకు సొంతదారు ఎవరని చెప్పాలి? ఎందుచేతనని
చెప్పాలి? ఏ నిర్ణయానికి రాగలం? దేనిని కాదని తిరస్కరించగలం?
ఇది ఇట్లా ఉండగా... మరొక విచిత్రమైన విషయం!
"ఆహా! ఆ స్త్రీయొక్క ముక్కు పలువరుస పెదిమలు - బుగ్గలు ఎంత అందం! ఎంత
బాగున్నాయి.." అని పురుషుడు స్త్రీని చూచి అనుకుంటున్నాడు. ఇక స్త్రీయో "ఆ
భుజములు! వాటి బలం! ఆ నుదురు! అద్భుతం! అబ్బో ఆ ముక్కుతీరు, ఆ కళ్ళు, ఆ
పెదవులు, ఆ జుట్టు... ఎంత బాగున్నాయి! తనివితీరా చూడబుద్ది అవుతోంది..." అని
అనుకుంటోంది. ఇంతకీ అక్కడున్నదేమిటి? ఒకరిని మరొకరు చూచుకొని మురిసిపోతూ
ప్రేమావేశంతో ముసి-ముసి నవ్వులు నవ్వుకుంటున్నది దేనిని గురించి?
మలమూత్రములతో - చీము నెత్తురులతో నిండినది...,
బొమికల అమరికను కప్పి ఉంచుచున్న చర్మము కలిగి ఉన్నది....,
... ఇటువంటివాటితో కూడిన రక్తమాంస నిర్మితమైన శరీరములను చూచి, "ఆహాఁ!
ఆ ముక్కు ఎంత అందమైనది? ఈ ముదరు! ఆమె బుగ్గలు! ఈతని పెదిమలు! నల్ల
కలువల వంటి కళ్ళు! తెల్లటి జాతి రత్నాలతో పోల్చతగ్గ పలువరుసలు!..." ఇటువంటి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
-
306
వర్ణనలు కవులు ఎట్లా చేస్తున్నారు? వాటిని వింటూ, చదువుతూ పాఠకులు ఎందుచేత
రసాస్వాదులగుచున్నారో ... ఇప్పుడు నాకు అర్దమే కావటం లేదు. ఎందుకు దేనిని
చూచి ఆ పరవశం?
శ్లో॥ త్వక్ మాంస రుధిర స్నాయు మేదో మజ్జా అస్థి సంహతౌ
విణ్మూత్రపూయే రమతాం కృమీణాం కియదంతరమ్? (అధ్యా 26, శ్లో 21)
చర్మము-మాంసము-రక్తము-క్రొవ్వు-మేదస్సు-మజ్జ-ఎముకలు-మలముమూత్రము-చీము ఇటువంటి పదార్ధములతో కూడిఉండే ఈ మానవదేహముల
పట్ల "రమించాలి" అని భావావేశం పొందుచున్న స్త్రీ - పురుషులకు "ఇదే జీవితాశయం" "
అనుకునే వారిదేహాలకు... మల మూత్రములందు తిరుగాడే లద్దె పురుగుల దేహాలకు
ఉన్న అంతరమేమిటి?
అందువలన...,
వివేకవంతుడైన మానవుడు స్త్రీ-పురుషులు శృంగార విశేషములతోను, శృంగార
లంపటులతోను స్నేహము చేయనే చేయరాదు.
ఎందుకంటే... విషయేంద్రియ సంయోగముల వలన ముఖ్యంగా శృంగారముచేత
- మనస్సు చంచలమైనంతగా మరింకే విషయములోను చంచలము కాడేమో!
తదితర దృశ్య విశేషాలు- ఎదురుగా కళ్ళకు కనబడితేనే- మనస్సు కలత చెందుతుంది.
ఈ సపరస్పర దేహాకర్షణ విషయములో... కొంచము చూచీ-చూడకపోయినా కూడా,
ఆలోచించినంత మాత్రం చేతనే మనస్సు వికలమైపోగలదు. కనబడీ-కనబడకుండానే
దేహాకర్షణలు ఊహ-అపోహలు కల్పించగలవు. ..
"ఆహాఁ! ఆమె నావైపే చూచి చిరునవ్వు నవ్వుతోంది.
ఓహో! ఈతడు నావంకే చూచి నా బుగ్గల సౌందర్యానికి ముగ్ధుడు అవుతున్నాడు.
అరె! ఆమె మాటలు నాపట్ల ఏదో ఇష్టమున్నట్లు సూచిస్తున్నాయి. ఊ! ఈతడు నా
అందానికి ఆకర్షితుడు అవటంచేతనే కలుపుగోలుగా ఉంటున్నాడు..." ఇటువంటి అర్ధం
పర్ధం లేని ఆలోచనలు-ఊహలు హృదయములోని "దేహాకర్షణ" అనే దోషంచేత
అసందర్భ ప్రదేశములలో కూడా నిద్రలేపబడగలవు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
307
ఎవ్వడైతే ఇంద్రియ నిగ్రహమును అభ్యసిస్తూ ఉంటాడో... అట్టివాని మనస్సు మాత్రమే
నిశ్చలమై, శాంతిని పొందగలుగుతోంది.
అందుచేతనే శృంగార సంబంధమైన దేహాకర్షణలకు, అట్టి ఆకర్షణలతో నిమగ్నమయ్యే
సంఘటణ సందర్భములకు బహుదూరంగా ఉండటమే ఉచితం!
నేను ఈ ఊర్వసీ లోకమును అధ్యాత్మ జ్ఞాన శ్రేయస్సు కొరకై వెంటనే ఇప్పుడే త్యజించెదను
గాక!
శ్రీకృష్ణుడు : వింటున్నావా? ఉదవా? రాజశ్రేష్ఠుడగు ఆ పురూరవుడు ఆవిధంగా విచారణ
చేసి వెంటనే ఊర్వశీ లోకమును విడచిపెట్టాడు. తనకు అభిన్నమును - పరమాత్మను
అగు నన్ను తెలుసుకొని జగద్విషయములను దాటవేయటానికి ఉపక్రమించాడు. తపోధ్యానములను పునః శ్రద్ధతో ప్రారంభించాడు.
క్రమంగా నా తత్త్వమేమిటో తెలుసుకున్నాడు! అజ్ఞానము నశించసాగింది. శాంతిని
పొందాడు.
అందుచేత ఉద్ధవా! బుద్ధిమంతుడై పరమాత్మను తెలుసుకొనే ఉద్యమము ప్రారంభించు
వాడు మొట్టమొదటగా దుష్టవిషయాలతో, ఇంద్రియములను ప్రలోభపెట్టే సందర్భాలలో
తనకు ఏర్పడియున్న సాంగత్యమును త్యజించనారంభించాలి.
సత్సాంగత్యమునందు ఆసక్తుడు కావాలి.
సత్పురుషులతో ఆధ్యాత్మిక సంబంధము పెంపొందించుకోవాలి. వారిని సేవించి
సంతోషింప చేయాలి. అట్టి సత్పురుషులు తమయొక్క సదుపదేశములతో మనో
వ్యాసంగమును, ఇంద్రియ వృత్తులను శమింపజేయగల సమాచారమును, ఉపాసనలను
ప్రసాదిస్తూ ఆసక్తిని సన్నగిల్ల చేయగలరు.
కనుక సత్పురుషలను సదా ప్రతిరోజు ఆశ్రయించాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
308
శ్రీ ఉద్ధవుడు : సత్పురుషుల లక్షణములు ఎటువంటివి? వారు ఎట్లా ఉంటారు? ఎక్కడ
వుంటారు? ఏమి చేస్తూ వుంటారు?
శ్రీకృష్ణుడు :
శ్లో॥ సంతో అనపేక్షా మచ్చితాః ప్రశాంతాః సమదర్శినః
నిర్మమా నిరహంకారా నిర్ద్వంద్వా నిష్పరిగ్రహాః ॥ (అధ్యా 26, శ్లో 27)
సత్పురుషులు....
నిష్కాములై ఉంటారు. ఏదీ కోరుకోరు. త్యజించరు. (తొలగాలి అనే ఆవేశము కలిగి
ఉండరు). అదేదో కావాలి - ఇదేదో తొలగాలి - రెండింటినీ అధిగమించినవారై ఉంటారు.
వారి మనస్సు చిత్తము పరతత్త్వ స్వరూపుడనైన నాపైనే నిలిపి ఉంచుతారు.
కనబడేదంతా శ్రీకృష్ణ చైతన్యానందంగా ఉపాసిస్తూ - ఆస్వాదిస్తూ ఉంటారు.
ప్రశాంత చిత్తులై లోక సంఘటనలచే, సందర్భములచే స్పృశించబడనివారై
ఉంటారు. చిద్విలాసులై-అసంగులై-అతీతులై ఇదంతా క్రీడా విశేషమాత్రంగా
చూస్తూ వుంటారు!
సమదర్శులై సర్వే సర్వత్రా ఆత్మ సాక్షాత్కారమే సందర్శిస్తూ ఉంటారు. మట్టిని
చూచేవారికి - మట్టి బొమ్మల ఆకారముల దృష్టిచే కనిపించే - వేరు వేరైనదంతా
కనిపించదు కదా! వారికి అనేకంగా కనిపిస్తున్నదంతా ఒక్కటిగా అనిపిస్తూ
ఉంటుంది. ఇక, సంగతి-సంఘటనపూర్వకంగా చూచేవారికో?
మనరాజు-శత్రురాజు-శత్రుసైనికులు... ఇత్యాది వ్యవహారాలు (ఆ బొమ్మలో)
కనిపిస్తాయి.
సత్పురుషులు మమత్త్వ బుద్ధి లేనివారై ఉంటారు. "ఇది నాకు చెందినది.
దీనికి నేను చెందినవాడను" అనే భ్రమను జయించినవారై ఉంటారు.
అహంకార శూన్యులై ఉంటారు. జీవుడుగా నేను చీమకంటే కూడా గొప్పవాడిని
కాదు. ఎందుకంటే చీమలో - చీమగా ఉన్నది నా ఉపాసనా వస్తువగు పరబ్రహ్మమే
కదా! ఇక పరబ్రహ్మముగా అంతా నేనే... అనునది గమనిస్తున్నవారై ఉంటారు.
అపరిగ్రహులై ఉంటారు. ప్రపంచంలో కనబడే దేనినీ స్వీకరించరు. స్వప్నంలో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
309
కనిపించిన వస్తు జాలమును మూటకట్టుకొని జాగ్రత్తులోకి తెచ్చుకొంటున్నాడా,
ఎవ్వడైనా?
ఓ ఉద్దవా! అట్టి మహానుభావులు ఎల్లప్పుడూ నా అవతార కథలను, ప్రవచనములను,
ఆ ప్రవచనముల అంతర్లీన గానాన్ని వింటూ-సంభాషిస్తూ-కీర్తిస్తూ ఉంటారు. నా
అవతార కథలు శ్రద్ధతో వినుచున్న మానవుల పాపములను అవి నశింపజేయగలవు!
శ్లో॥తాయే శృణ్వంతి గాయంతి హి అనుమోదంతిచాదృతాః
మత్పరాః శ్రద్ధదానాశ్చ భక్తిం విందంతి తే మయి ||
భక్తిం లబ్ధవతః సాధోః కిమ్ అన్యత్ అవశిష్యతే
మయ్యనంతగుణే బ్రహ్మణి ఆనందానుభవాత్మని ॥ (అధ్యా 26, శ్లో 29, 30)
నా లీలలను శ్రద్ధగా-ఆదరముగా విని కీర్తించి తాత్త్వికార్ధాన్ని అర్ధం చేసుకొని నాయందు
ఆసక్తి పెంపొందించుకోవటం చేత స్వభావసిద్ధమైన భక్తి-ప్రపత్తి పెంపొందుతూ
వుంటాయి. సర్వసాక్షిని, అనంతగుణ విశేషుడను, చిదానందమయుడను, పరబ్రహ్మ
స్వరూపుడను అగు నాయందు భక్తి కలిగియున్న వానికి భక్తియే మహత్తరమైన
ప్రయోజనం. ఆతనికి ఈ ముల్లోకాలలో కోరుకొనవలసినది, పొందవలసినది అంటూ
మరింకేమీ ఉండదు. అగ్నిని (దీపమును) వెలిగించేచోటు వేడిని వేరుగా ఆహ్వానించాలా?
చీకటిని పోగొట్టమని వేరుగా విన్నవించుకోవాలా? సత్పురుషులు చేతులెత్తి వివరిస్తున్న
శ్రీకృష్ణచైతన్యానందమును పొందుచున్నవానిపట్ల కర్మబంధము, సంసార భయము,
సంసారమునకు మూలమైన అజ్ఞానము వాటంతట అవే స్వభావసిద్ధంగా తొలగిపోతాయి.
సత్పురుషులతో సాంగత్యము
ఒకడు నీటిలో మునిగిపోతున్న తరుణంలో, ఆ మార్గంలో బహు దగ్గిరగా ఒక నౌక
వస్తూ ఉంటే? ఆతనికి ఎంతటి ఆనందం! ఇక భయం - శ్రమ - ఆక్రందన - అన్నీ
కూడా శమిస్తాయి కదా! "ఓ నావ నడిపే పెద్దమనిషీ! రండి! నన్ను కాపాడండి!...'
అని మాత్రమే కేకవేస్తాడు కదా!
అట్లాగే...,
సంసార సముద్రంలో మునిగి తేలుచున్న మానవునకు శాంతచిత్తులు, బ్రహ్మవేత్తలగు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
310
సత్పురుషుల సాంగత్యమే గొప్ప నౌక!
అంతేకాకుండా,
ఓ ఉద్ధవా! సత్పురుషుల వెంటనంటి నేనుంటాను! ప్రాణులకు అన్నము ఏవిధంగా
రుచికరము-జీవనముకూడా అయి ఉంటోందో, శరణాగతులగు ఆర్తులకు సత్పురుషుల
సాంగత్యము-నా రక్షణ ఆవిధంగా ఉభయతారకమై ఉండగలవు.
ధర్మమే పరలోకమునకు ధనము కదా!
ఆ రీతిగానే,
సంసారమున పడి, సర్వభయములు, వేదనలు పొందుచున్న జీవునకు సత్పురుషుల
సాంగత్యము, వారు గుర్తు చేస్తున్నట్టి ఆత్మజ్ఞానము, బోధిస్తున భక్తి మార్గములే పరమరక్ష.
వారే ఆర్త జన రక్షకులు!
సూర్యుడు ఉదయించగానే చీకటి పటాపంచలౌతుంది కదా! జనులు జగత్తును
చూడగలుగుతారు కదా! అదేవిధంగా సత్పురుషులు పరమాత్మను దర్శించటానికి జీవులకు
జ్ఞానచక్షువులను ప్రసాదిస్తున్నారయ్యా!
అట్టి సత్పురుషులే ఈ జీవునికి దేవతలు, బంధువులు, ఆత్మ కూడా అయి ఉన్నారు.
ఓ ఉద్ధవా!
స్వయంగా నేనే సత్పురుషుల రూపముగా ఉన్నాను.
కనుక ఓ జనులారా! సత్పురుషులను ఆశ్రయించటం నేర్చుకోండి. అహంకారమును
వీడండి. మమకారమును త్యజించండి. సత్స్వరూపమగు మత్థానమునకు చేరండి!
ఓ మిత్రమా! ఉద్ధవా! ఆవిధంగా పురూరవుడు ఊర్వశితో సందర్శన సరాగేచ్ఛను
త్యజించాడు. ఇక అక్కడినుండి సత్సాంగత్యమును ఆశ్రయించాడు.
ముక్త సంగుడైనాడు.
ఆత్మారాముడై ఈ భూమిపై సంచరించాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
311
41. క్రియా యోగము - అర్చనా విధి
శ్రీ ఉద్ధవుడు : శ్రీ కృష్ణా! యాదవ శ్రేష్టా! భక్త జనాశ్రయా! దేవాది దేవా! వసుదేవనందనా!
ఏ ఏ విధమైన భక్తులు, ఏఏ విధంగా... ఏఏ విధమైన క్రియా యోగం చేత నిన్ను
అర్చిస్తూ ఉంటారో...
అట్టి ఆరాధనరూపమైన క్రియా యోగముల విశ్లేషణ - విశేషాలను వివరించండి!
"ఓ జనులారా! నాయనలారా! పరమాత్మను అర్చించండి! అదే మీకు శ్రేయస్సు కలుగ
జేస్తుంది!..." అని మహనీయులైన నారదమహర్షి, వ్యాసభగవానులవారు, దేవతలకు
ఆచార్యులైన బృహస్పతులవారు... మొదలైనవారంతా మాటిమాటికి ఎలుగెత్తి
చెప్పుచున్నారు.
ఏ క్రియాయోగమైతే...,
మీ ముఖారవిందమునుండి మొట్టమొదటగా వెలువడిందో..,
|
మీచేత మీ పుత్రులగు బ్రహ్మదేవునికి బోధించబడినదో...,
సృష్టికర్తయగు బ్రహ్మ దేవునిచే భృగువు మొదలైన సప్తర్షులకు తదితర
మహనీయులకు చెప్పబడిందో, విశదపరచబడిందో...,
ఆ తరువాత కొన్ని సందర్భాలలో భగవానుడగు శంకరునిచే, జగన్మాతయగు
పార్వతీదేవికి బోధించబడిందో...,
ఆ క్రియాయోగమును నాకు చెప్పండి. నాకు బోధించండి.
మీయొక్క ఉపాసనయే సర్వవర్ణములవారికి, సర్వ ఆశ్రమములలోని వారికి, సర్వ స్త్రీపురుషులకు సర్వ శ్రేష్ఠమని, శ్రేయోదాయకమని నేను గ్రహిస్తున్నాను.
ఓ కమలనయనా! విశ్వేశ్వరా! విశ్వంభరా! మీకు భక్తులము, మీపట్ల అనురక్తులము
అగు మేము కర్మబంధముల నుండి విడవడగల ఉపాయంగా చెప్పబడే క్రియాయోగము
గురించి వివరించండి.
శ్రీ కృష్ణభగవానుడు : ఓ ఉద్ధవా! నీవు అడుగుచున్న క్రియాయోగము లేక భగవంతుని
జేర్చగల కర్మకాండకు ఇది ఇంతమాత్రమే అని ఒక పరిధిలోనికి తెచ్చి చెప్పలేము.
అంతము లేదు. (వేదో నంతః) అందుచేత ఒకానొక పూర్వ పర క్రమమును దృష్టిలో
పెట్టుకొని కొన్ని కొన్ని విశేషాలు వర్ణించి చెప్పుచున్నాను. విను.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
312
పరతత్వ స్వరూపడనగు నన్ను అర్చించే విధానాలు ముఖ్యంగా 3 గా విభజించవచ్చును.
1. వైదికము (వేదోక్తమైనది - మంత్రములతో కూడినది.)
2. తాంత్రికము (భౌతిక సంబంధమైన విధి-విధానములతో కూడినది)
3. మిశ్రమము (మంత్ర-తంత్ర విధిపూర్వకమైనది.)
ఈ మూడింటిలో ఎవ్వరికి ఏది ఇష్టమని అనిపిస్తుందో వారు ఆ విధిని అనుసరించ
వచ్చును. ఈ మూడింటినీ ఒక్కసారే కూడా అనువర్తించవచ్చు.
మొట్టమొదటగా...,
తన ఆర్హత - ఆచారము అధికారములను అనుసరించి ఒకనొక సమయంలో "ఈ
రోజు నుండి శాస్త్ర విధిగా దైనందికమైన శ్రద్ధాసక్తులతో కూడినవాడనై ఈ ఉపాసనా
క్రమములను అభ్యసిస్తాను. నిర్వర్తిస్తాను..." అని నిర్ణయించుకోవటం ఉచితం. అదియే
"ఉపనయన సంస్కారము" అని (లేక) ఉపనయన ప్రక్రియ అని శాస్త్రోక్తంగా
మంత్రతంత్రయుక్తంగా శాస్త్రకారులు సూచిస్తున్నారు. నియమిస్తున్నారు. ఇక ఆతడు
నన్ను శ్రద్ధాసక్తులతో అర్చించటం ప్రారంభించు గాక! ఇప్పుడు ఆ సాధకుడు ద్విజుడుగా
చెప్పబడతాడు. (One that is adapting II Phase)
పూజ
ఆ ద్విజుడు (one who commenced second phase of life and shaping the
routine with adoration) భక్తితో
ప్రతిమలయందు..., (లేక)
ఒకానొక భూస్థలమునందు..., (లేదా)
అగ్నియందు...,
సూర్యునియందు...,
జలమునందు లేదా తన హృదయమునందు
ఎటువంటి కాపట్యము ( Artificiality) లేకుండా,
విద్యుక్తములైన - పెద్దల ప్రవచనములను (లేక) శాస్త్ర విధి-విధానములను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
313
అనుసరిస్తూ
తన యొక్క స్వస్వరూపుడనే అయిఉన్న నన్ను తనకు ఇష్టమైన నామ రూపాలతో
పూజించటం ప్రారంభించాలి.
శ్లో॥ పూర్వం స్నానం ప్రకుర్వీత ధౌతదంతో అంగశుద్ధయే
ఉభయైరపి చ స్నానం మంత్రైః మృత్గ్రహణాదినా || (అధ్యా 27, శ్లో 10)
తెల్లవారుఝామున (బ్రాహ్మీ ముహుర్తంలో) నిదుర లేవాలి. దంత ధావనం చేసుకొని,
దేహశుద్ధి కొరకై స్నానం చేయాలి. అటుతరువాత వైదిక తాంత్రిక మంత్రములను
ఉచ్ఛరిస్తూ - అనుసరిస్తూ మట్టి మొదలైన లేపనములతో మరల స్నానం నిర్వర్తించాలి.
ఆపై పరమేశ్వరుడనగు నాపై భక్తితో తమకు విహితము-అనుకూలము అయినట్టి
వేదోక్త-శాస్త్రోక్త-ఆర్యోక్తమైన విధి విధానములతో "పూజ" అనే కర్మను - కర్మపాశములు
త్రెంచుకోవటానికై - నిర్వర్తించాలి.
ప్రతిమ
ప్రతిమ (లేక) విగ్రహము ఎందుకు? ధ్యాసను ఏకాగ్రపరచటానికే!
పూజకు ప్రతిమ సహకారికం కదా! అట్టి ఇష్టదైవము యొక్క ప్రతిమయొక్క వివిధ
రీతులు - 8 గా చెప్పబడుచున్నాయి.
1. శిలామయము (Made up of stone)
2. దారుమయము (Made up of wood)
లోహమయము (బంగారు వెండి - పంచలోహాలు 3. ఇత్యాదివాటితో తయారైనది.
(Made up of some metal)
4. లేప్యము - చందనము మట్టి మొదలైన వాటితో తయారైనది.
(Made of Chandana wood powders - Mud etc.,)
5. లేఖ్యము (Painting)
6. సైకతము (ఇసుకతో నిర్మించినది) (Made up of sand)
మనోమయము7. . (Visualized)
8. మణి మయము (Made of pearls)
ఈ విధంగా ప్రతిమలు ఈ ఎనిమిదింటిలో ఏదో ఒక్కటి (లేదా) కొన్ని సాధకుని మనో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
314
అనుకూల్యతను అనుసరించి ఉండవచ్చు!
ప్రతిమ చలము (can be moved), అచలము (Embeded) అని రెండుగా ఉంటాయి.
ఆ ఉభయములు, పైన చెప్పిన 8 విధములైన ప్రతిమలు నేను వేంచేసి ఉండే
మందిరాలుగా భావించాలి! అచలప్రతిమ (un moved / embeded form)
పూజించేడప్పుడు ఆవాహన-ఉద్వాసనలతో పనిలేదు.
అస్థిరమైన ప్రతిమలు (ఉదా : మట్టి ప్రతిమలు) ఉపయోగించేడప్పుడు కొన్నిచోట్ల
ఆవాహన-ఉద్వాసనలు ఉంటాయి. మరి కొన్నిచోట్ల ఉండవు. పిండితో తయ్యారైన
ప్రతిమలకు మాత్రం ప్రతిరోజు ఆవాహన - ఉద్వాసనలు తప్పక ఉంటాయి.
మృత్తికా ప్రతిమ - చిత్రలేఖనం (Form made up of mud-painted form) ఈ రెండిటికీ
రోజూ జలంతో స్నానం చేయించఖర్లేదు. తుడిస్తే చాలు. తదితరములైన ప్రతిమలకు
రోజూ స్నానము చేయించటం ఉచితం.
మరొక్క విషయం!
ప్రసిద్ధములై సులభంగా లభించే పదార్ధములతో గృహంలో ప్రతిమలు పెట్టుకొని
పూజించటం ఉచితం. అంతేగాని, ఎప్పుడో ఎక్కడో (లేక) గొప్ప ఖర్చుచే లభించే
పదార్ధాలగురించి తపనపడి అవి పొందనపుడు పూజకే ఉపక్రమించకపోవటం ఉచితము
కాదు. విగ్రహం నిగ్రహం కొరకు మాత్రమే! నిష్కాముడైన భక్తుడు అనాయాసంగా
లభించే పదార్ధాలతో నన్ను పూజిస్తున్నాడు. ఉత్తమమైన భావన శ్రద్ధతో కూడిన ఉపాసన
ముఖ్యము గాని "ఎంత ఖరీదైన - కష్టలభ్యమైన వస్తుజాలముతో పూజిస్తున్నాము?..."
అనేది నాకు ముఖ్యము కాదు. భావనానుసారంగా నేను వేంచేస్తాను. అంతేగాని,
వస్తుప్రాముఖ్యంబట్టి కాదు!
ఓ ఉద్ధవా!
ప్రతిమకు స్నానాదులు సమర్పించటం, పసుపు-గంధము-కుంకుమలతో, పుష్పాదులతో
అలంకరించటం ఇటువంటి కార్యక్రమములు నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను.
మట్టితోను - కొయ్యతోను వేదికలు తయారుచేసి - అలంకరించి ఆ వేదికపై ప్రతిమను
ఉంచి అంగప్రధానంగా అక్కడ పూజించటం నాకు ఇష్టం. అట్లాగే అగ్నిని నేయితో
పూజించాలి. తిలలను, చందన పదార్ధములను సమర్పించటం కూడా నేను ఇష్టపడుతూ
ఉంటాను.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
315
సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ గాయత్రీ, సూర్యస్తోత్రం - సూర్యసూక్తము - సూర్యకవచం
మొదలైన మంత్రాలతో నన్ను ఉపాసించటం నాకు సంతోషం కలుగజేస్తాయి.
జలమునందు తర్పణ మొదలైనవాటితో కూడా నన్ను ఉపాసించవచ్చు. భక్తితో జలము
సమర్పించినా సరే, నేను ప్రియముగా స్వీకరిస్తాను.
ఏదైనా భక్తితో సమర్పించాలి సుమా! భక్తిలేని పూజ పత్రిచేటు! భక్తి లేకుండా (without
Devine_Love) ఎవ్వడు ఎన్నెన్ని విశేష పదార్థాలు సమర్పించినా... అవన్నీ నాకు
సంతుష్టిని కలుగజేయవు. భక్తితో లభ్యమయినంత వరకు సమర్పించే గంధ పుష్ప -
అక్షింతలు, ధూప-దీప నైవేద్యాలకే నేను తృప్తిపడతాను. సంతోషిస్తాను. పెద్దగా
చెప్పేదేమున్నది? ద్రవ్యములు - విధి విధానములు ప్రావీణ్యత-వీటన్నిటికన్నా నాకు
భక్తి ముఖ్యము. నేను చూచేది - నేనుకోరేది - భక్తియే!
ప్రతిమను నిలిపే విధానం :
పూజ చేయాలనుకునేవాడు ముందుగా తాను శుచి అవ్వాలి.
శ్లో॥ శుచిస్సంభృత సంభారః పాగ్దర్బైః కల్పితాసనః
ఆసీనః ప్రాగుదగ్వార్చేత్ అర్చాయామథ సమ్ముఖః (అధ్యా 27, శ్లో 19)
అర్పించువాడు ముందుగా చక్కగా శుచుడవ్వాలి.
పూజా సామాగ్రిని సానుకూలంగా అమర్చుకోవాలి.
దర్భాసనాన్ని తూర్పుదిక్కుగా ఉండేటట్లు అమర్చుకోవాలి. అనగా, పూజించువాడు
తూర్పుముఖంగా ఆశీనుడవటం ప్రశస్తము. లేదా, ఉత్తరదిక్కుగా ముఖం
ఉండేట్లుకూడా బాగే! ఏదిఏమైనా స్థిరప్రతిమకు ఎదురుగా కూర్చోవాలి.
మొట్టమొదట గురువులకు - దేవతలకు నమస్కారము సమర్పించాలి! త్వదనుజ్ఞయా
అని వారి దగ్గిర అనుజ్ఞను అభ్యర్ధన పూర్వకంగా తీసుకోవాలి.
అంగన్యాసం కరన్యాసం
తరువాత కరన్యాసం అంగుష్ఠాభ్యాం నమః ... హృదయాయనమః
తర్జనీభ్యాం నమః .... శిరసే స్వాహా
మధ్యమాభ్యాం నమః .... శిఖాయాయవౌషట్
అనామికాభ్యాం నమః కవచాయుహుమ్
కనిష్ఠికాభ్యాం నమః... నేత్రత్రయాయవేషట్
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
316
కరతలకరపృష్టాభ్యం నమః... అస్త్రాయఫట్ ఇతిదిగ్బంధంః
అంగన్యాసం దైవ ప్రతిమయొక్క పాదములు మొదలైన
ప్రతిమావయవములను ఒక్కొకటిగా భక్తితో
పూజించనారంభించాలి.
ప్రోక్షణపాత్రలోని జలముతో...
ముందుగా పూజా స్థానమును (దేవం-దేవీం సంప్రోక్ష్య)
తరువాత పూజార్ధం తెచ్చియున్న పూజా ద్రవ్యములను (పూజా ద్రవ్యాని
సంప్రోక్ష్య)
ఆ తరువాత తన శిరస్సును - దేహమును (ఆత్మానం చ సంప్రోక్ష్య) సంప్రోక్షణ
చేయాలి.
ఆతరువాత పరమాత్మ విగ్రహమునకు (ప్రతిమకు) ఎదురుగా కొంచెం దూరంగా 3
పాత్రలను ఉంచుకోవాలి.
1. పాద్యముకొరకు (పాదములు కడిగిన జలము జారవిడవటానికి)
ఆచమనీయము 2. (స్వామి- ఓం కేశవాయ స్వాహా :: ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయి స్వాహా :: అను మంత్రముతో త్రి ఆచమనముగా - స్వీకరించే
జలము జారవిడవటానికి)
3. అర్ఘ్యము కొరము (స్వామి చేతులు కడిగే జలమును జారవిడవటానికి)
ఆ మూడు పాత్రలను క్రమంగా
హృదయ మంత్రముతోను (హృదయాయ నమః)
శిరో మంత్రముతోను (శిరసే స్వాహా)
శిఖా మంత్రముతోను (శిఖయాయ ఔషట్).
గాయత్రీ మంత్రముతోను (ఓం భూర్భువసువః మొదలైనవి) సంస్కరించాలి.
అటుతరువాత...,
శ్లో॥ పిండే వాయ్వగ్ని సంశుద్ధే
హృత్ పద్మస్థాం పరాం మమ
అణ్వీం జీవకలాం ధ్యాయేత్
నాదాంతే సిద్ధభావితామ్ || (అధ్యా 27, శ్లో 23)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
317
స్వదేహమును పరిశుద్ధపరచుకొని పూజకు
భౌతిక దేహమును (పాంచభౌతిక దేహమును) వాయువుతో నింపి శరీరమంతా
అణువణువూ అగ్నిని భావనచేసి పరిశుద్ధం చేసుకోవాలి. ప్రాణాయామం ద్వారా
దేహములోని అణువణువులోను వాయువుతో నింపి, స్థిరంగా ఉంచి ఉష్ణమును
ఆహ్వానించి శుద్ధపరచుకోవాలి.
హృత్ స్థానంలో హృత్ పద్మాసనముపై ఆహ్వానించబడిన పరమాత్మను భావనచేసి
- ధ్యానించి - నమస్కరించి,
నాదాంతము - ఓం = అ + ఉ + మ ...మ్ మ్ మ్ అకార ఉకార మకార
బిందు-నాదములనే ఐదింటిని వాగింద్రియము (నోటి) తోను, మనో
భావముతోను ఉచ్ఛరించి
సూక్ష్మాకారము-శ్రేష్ఠము-జీవకళాంసుడు అగు కేవల పరమాత్మను మనో
హస్తములతో - మననం చేస్తూ ఉపాసించాలి.
ఆత్మరూపముచే ఆవాహితమూర్తిత్వము దేహమంతా వ్యాప్తము కాగా
ఆ భగవత్ ప్రతిమామూర్తిని మానసికోపచారములతో పూజించి,
తన్మయమైన భావనతో రెండుచేతల ముని వ్రేళ్ళతో బాహ్యవిగ్రహము (లేక)
ప్రతిమ యొక్క పాదములను స్పృశిస్తూ, తన్మయమైన భావనను ఆ ప్రతిమలో
ప్రవేశింప జేయాలి.
ఆ ప్రతిమయందు ఆవిధంగా ఆహ్వానిస్తూ నన్ను స్థాపింపచేయాలి.
అటు తరువాత అంగన్యాస - కరన్యాసములతో ఆ ప్రతిమగా ఉన్న నన్ను పూజించాలి.
వింటున్నావా! మిత్రమా!
ఇప్పుడు మానసిక పూజ కూడా ఇట్లా కొనసాగించాలి.
ధర్మ-జ్ఞానాది-(జ్ఞానము-విజ్ఞానము-యోగము-ఉపాసన-సమర్పణ-దర్శనస్పర్శన-ధర్మము-భక్తి) నవవిధ శక్తులతోను నాకు స్వీయ హృదయంలో ఆసనం
కల్పించాలి.
ఆ ఆసనంపై కర్ణిక - కేసరములతో సముజ్వలమైన అష్టదళముల పద్మమును
కల్పించాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
318
ఆ అష్టదళ పద్మముపై సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడనగు నన్ను వారివారి
|
ఇష్ట దైవరూపంగా ఆసీనుణ్ణి చేయాలి.
వేదోక్తములు తంత్రోక్తములు అయినట్టి వివిధ మంత్రములతో పాద్యము,
అర్ఘ్యము, ఆచమనీయము మొదలైనవి ఉపచారములను ఆ హృదయస్థ దేవ
దేవునికి సమర్పించాలి.
అలా పూజించిన తరువాత..., నా గురించిన భావనగా...
సుదర్శన చక్రమును,
పాంచజన్య శంఖమును,
|
గదను,
ఖడ్గమును,
బాణమునుII ,
ధనస్సును,
హలమును,
ముసలమును,
కౌస్తుభమాలను,
శ్రీవత్సమును
ఒక్కొక్కటిగా-స్థిరోభవ, వరదోభవ, సుస్థిరాసనం కురు,
మాకరుణాదృక్ ప్రసాదయ - మొదలైన మర్యాదపూర్వక వచన-భావనలతో
పూజించాలి.
ఆ పిమ్మట...,
ఎనిమిది దిక్కులలోను ప్రతిష్టేపించుచు...,
నందుడు : సునందుడు
ప్రచండు : చండుడు,
మహాబలుడు : బలుడు,
కుముదుడు : కుముదేక్షణుడు
అని పిలవబడే 8 పార్షదులను, (అష్టదికాన అధిపతులను) ఎదురుగా గరుడుని
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
319
పూజించాలి.
ఆ తరువాత...
నాలుగు కోణములందు
దుర్గాదేవి
వినాయకుని,
వ్యాసుని,
విష్వక్సేనుని
ఎడమవైపుగా..., గురువులను
తూర్పు ఇత్యాది దిక్కులలో... ఇంద్రుడు, వరుణుడు, వాయవు, యముడు ఇత్యాది
దేవతలను ప్రోక్షణము-పూలు-అక్షతలు.. ఇత్యాదులతో పూజించాలి.
"వీరందరూ కూడా తమతమ స్థానములయందు ఉండి నా యిష్టదేవతకు అభిముఖముగా
ఉన్నారు..., నాపై కరుణను ప్రసాదిస్తున్నారు"... అని భావన చేయాలి!
అటు తరువాత...., ఇష్టదైవమును ఉద్దేశ్యించి
సువర్ణమంత్రము - ఘర్మమంత్రముల ఉచ్ఛారణతో, "జితతే పుండరీకాక్ష", సహస్ర
శీర్షా పురుషః మొదలైన పురుష సూక్తి ఇత్యాది మంత్రములను,
"ఇంద్రం నరో నేమధితా హవంత" మొదలైన మంత్రోక్తమైన రాజసాది
సామములను పఠిస్తూ...,
చందనము - వట్టివేరు - కర్పూరము - కుంకుమ - అగరు
మొదలైన ద్రవ్యములతో, సువాసితమైన జలముతో భగవత్ ప్రతిమకు స్నానం
చేయించాలి. పరిశుభ్రపరచాలి.
వస్త్రము - ఉపవీతము - ఆభరణము - పత్రరచన - తులసీమాల - పుష్పమాల
గంధము - అను లేపనము మొదలైనవాటిచే ప్రతిమను తగినవిధంగా అలంకరించాలి.
నేతితో బెల్లము పాయసము చేసిన పిండిపదార్ధాలు చక్కెలములు
ఆపూపములు- ఉండ్రాళ్ళు - పులిహోర పెరుగు - పప్పు మొదలైన పదార్ధములు
నాకు సమర్పించాలి. భగవత్ విగ్రహాన్ని రోజూగాని (లేదా) పర్వదినాలలో గాని
అభ్యంగన స్నానం చేయిస్తూ ఉండాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
320
పరిశుభ్రపరచుకుంటూ ఉండాలి
|
రంగు-మెరుపు దగధగ్గాయమానంగా ఉండేటట్లు చూచుకోవాలి.
|
అభిషేక ద్రవ్యములు, భక్ష్య భోజ్యములు రుచికరమైనవి నైవేద్యంగా ఇస్తూ
ఉండాలి.
వేదములలో చెప్పినరీతిగా వేదికను వ్రేలాడే పూలు-ఆకులు-ఫలములతో
|
మందిరము చుట్టూ అలంకారం చేయాలి.
సమిధలను - వాటి యొక్క చివరలను ఒకచోటికి ప్రోగుచేసి - అగ్ని గుండమును
|
ప్రజ్వలింప చేయాలి!
నిప్పు కణముతో కూడిన సమిధలను (పుల్లలను) రెండు - మూడింటిని దర్భలపై
ఉంచటం అనే అన్వాధానకర్మను నిర్వర్తించాలి.
హోమమునకు ఉపయోగపడే ద్రవ్యములను అగ్నికి ఉత్తర దిక్కుగా ఒకానొక
వరుసగా ఉంచుకోవాలి.
ప్రోక్షణ పాత్రలో ఉన్న జలముతో హోమద్రవ్యమును, ప్రజ్వలితమైన అగ్నికి
సంప్రోక్షించి ఆ అగ్నియందు పరమాత్మయగు నన్ను ధ్యానించాలి.
అనగా...
తప్తకాంచన వర్ణము (మిలమిల మెరిసే బంగారుఛాయగలది),
చతుర్భుజములతో-చతుర్హస్తములతో శంఖ-చక్ర-గదా-పద్మములతో కూడియున్నది,
పరమప్రశాంతము,
పద్మమణివలె పచ్చనైన వస్త్రముతో శోభిల్లునది,
|
శోభాయమానముగా వెలుగొందుచున్న కిరీటము-కంకణము-కటిసూత్రమునూపురము మొదలైన ఆభరణములతో ప్రకాశించునది.
శ్రీవత్సముతో కూడిన వక్షస్థలము గలది.
ధగధగాయమానమగు కౌస్తుభమణిచే విరాజిల్లునది,
వనమాలచే విభూషితము.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
321
అగు నా రూపమును అగ్నియొక్క తేజస్సుతో ధ్యానించాలి. ధ్యానిస్తూ పూజించాలి.
ఆవిధంగా ధ్యానిస్తూ నేయిలో ముంచిన సమిధలను (పుల్లలను) అగ్నియందు ఆహుతి
చేయాలి. ఆ తరువాత రెండు-రెండు ఆహూతులతో హవనము చేయాలి. (నేయిని
ప్రజ్వరిల్లుతున్న సమిధలపై పోయాలి). ఆ రెండు ఆహూతులను 1. ఆఘారము 2.
ఆజ్యభాగము అను పేర్లతో చెప్పుతారు.
"ఓం నమో నారాయణాయ" అను అష్టాక్షరిని మొదలు - చివర ఉచ్ఛరిస్తూ హవనము
నిర్వర్తించాలి. ధర్మదేవతకు - తదితర దేవతలకు స్వాహా అను శబ్దముతో అంతమగు
మంత్రములతో నేయితో హవనము చేస్తూ పురుషసూక్త మంత్రములను గానం చేస్తూ
ఉండాలి.
శ్లో॥ అభ్యర్యాథ నమస్కృత్య పార్షదేభ్యో బలిం హరేత్
మూలమంత్రం జపేత్ బ్రహ్మన్ స్మరన్ నారాయణాత్మకమ్ || (అధ్యా 27, శ్లో 42)
ఆ తరువాత అగ్నియందు వేంచేసియున్న భగవానునిపూజించి, నమస్కరించి పాలుతేనె-పళ్ళరసం ఇత్యాదుల నివేదనలను - బలిని సమర్పించాలి. నారాయణ స్వరూపమగు
పరబ్రహ్మమును స్మరించి యథాశక్తిగా "ఓం నమో నారాణాయ" అను మూల
మంత్రమును (11మార్లు :: 21 మార్లు :: 36 మార్లు :: 54మారు :: 108 మార్లు ...
ఇట్లా అవకాశాన్ని అనుసరించి) జపించాలి.
శ్లో॥ దత్త్వా 2 చమనం ఉచ్ఛేషం విష్వక్సేనాయ కల్పయేత్
ముఖవాసం సురభిమత్ తాంబూలాద్యమథార్హయేత్ || (అధ్యా 27, శ్లో 43)
ఆ తరువాత నివేదనానంతరం మిగిలియున్న కొన్ని మధుర పదార్ధములను విష్వక్సేనునికి
సమర్పించాలి. సుగంధయుక్తమైనటువంటి తాంబూలమును ప్రతిగృహ్యతామ్... అని
పలుకుతూ ప్రేమతో సమర్పించాలి.
శ్లో॥ ఉపగాయన్ గృణన్ నృత్యన్ కర్మాణి-అభినయన్ మమ
మత్కథాః శ్రావయన్ - శృణ్వన్ ముహూర్తం క్షణికో భవేత్॥ (అధ్యా 27, శ్లో 44)
పూజ అయిన తరువాత
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
322
పరమాత్మయొక్క అవతారములు - భక్తుల కథలు గానం చేస్తూ
పరమాత్మయొక్క మహిమను కీర్తిస్తూ,
ఇతరులకు ఆ కథలను వినిపిస్తూ, తాను స్వయముగా (ఇతరులు చెప్పుచుండగా)
వినుచూ,
నా కర్మలను (చిన్ని కృష్ణుని ఆట-పాట-అల్లరి.. ఇత్యాదులను) అభినయిస్తూ,
"ధీంత ధీంత తకతధీంత - తకత ఝణుత తక్కిటతక - తరికిటతక తళాంగు
తద్ధిత్తకిటతకతరికిటతోం" - ఇటువంటి నృత్య శబ్దములకు లయగా నృత్యం చేస్తూ...
కొద్ది సమయము ఈఈ రీతి అయిన ఉత్సవపూర్వక ఉపాసనలు నిర్వర్తించాలి.
శ్లో॥ సవైరుచ్ఛావచైః స్తోత్రైః పౌరాణైః ప్రాకృతైరపి
స్తుత్వా ప్రసీద భగవన్ ఇతి వందేత దండవత్ II (అధ్యా 27, శ్లో 45)
ప్రాచీనులచేత (Ancestral and Traditional)- నవీనులచే (Present time) గానం
చేయబడిన ఉత్కృష్ట-అపకృష్టమగు (సంగీత-జానపద) - రాగములతో కూడిన
స్తోత్రములతో నన్ను స్తుతిస్తూ... "దేవా! దేవాదిదేవా! ప్రసన్నుడవు అగుము" అని ప్రార్థించి
సాష్టాంగదండ ప్రణామములు చేయాలి!
శ్లో॥ శిరో మత్పాదయోః కృత్వా బాహుఖ్యాం చ పరస్పరమ్
ప్రసన్నం పాహి మామీశ భీతం మృత్యు గ్రహార్ణవాత్ || (అధ్యా 27, శ్లో 46
నాయొక్క పాదయుగళమునందు శిరస్సును - నుదురును స్పర్శింపజేస్తూ చేతులతోను
నా రెండు పాదములను స్పృశిస్తూ....,
"హే పరంధామా! దీనజనబంధూ! ఆర్తత్రాణ పరాయణా! నేను భీతుడను. నీకు
శరణాగతుడను. అతి భయంకరము-మృత్యువుతో సమానము అగు సంసార
సముద్రములో పడి మునిగిపోతున్న నన్ను కాపాడండి! ఉద్దరించండి!" - అని ఎలుగెత్తి
గానం చేస్తూ నమస్కరించాలి.
ఆవిధంగా ప్రార్ధన చేస్తూనే నా నిర్మాల్యమును - అక్షితలను భక్తితో ప్రసాదభావనా
పూర్వకంగా శిరస్సుపై ధరించాలి. వాటిని వదల దలచుకొంటే ప్రతిమయందు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
323
అథ్యస్తమైయున్న జ్యోతిని మరల మరల తన హృదయమందు వేంచేసియున్న జ్యోతియందు
లీనం చేస్తూ పూజించబడిన శిరోధార్యమైన పుష్పాక్షతలను హృదయముపై స్పృశింపజేసి
ఒక పళ్లెములో విడవాలి!
శ్రీ ఉద్ధవుడు : స్వామీ! శ్రీకృష్ణ ప్రతిమ ఎట్లా ఏ రీతిగా ఉంటే... అది ప్రాసస్త్యం? ఏఏ
దేవతా ప్రతిమలంటే నీకు ఇష్టం?
శ్రీకృష్ణుడు : (పకపక నవ్వుచూ) ఓ ఉద్ధవా! నా భక్తునికి ఏది ఇష్టమైతే అదే నాకూ ఓ
ఇష్టము. ఎప్పుడు ఎవరికి ఏ ప్రతిమయందు ఇష్టము కలుగుతుందో... అప్పుడు ఆ
రూపముగల ప్రతిమతో నన్ను పూజించవచ్చు! ఎందుచేతనంటే, నేను...
సర్వాంతర్యామినై - సర్వభూతములందు ఆత్మస్థుడనై, సర్వభూతజాలము అస్మదాత్మ
యందు వేంచేసియే ఉండగా... సర్వప్రకాశకుడను (one who is exhibiting and
manifesting as every thing) అయి ఉన్నాను కదయ్యా!
నాపై భక్తి-ప్రపత్తులచే కొందరు నా పూజ-ధ్యానము మొదలైనవాటికై మందిరములు
నిర్మిస్తున్నారు. సుందరమైన ఉద్యానవనములను నిర్మిస్తున్నారు. పూజాదులు చక్కగా
నిర్వహింపబడటానికి భూమిని, సంపదను సమర్పణ చేస్తున్నారు. నాకు సమర్పించబడిన
సంపద ద్విగుణీకృతమై ఆ ప్రదాతయొక్క ఇహ-పరములను పవిత్రము-ఐశ్వర్యమయము
చేయగలవు.
శ్లో॥ ప్రతిష్ఠయా సార్వభౌమం
సద్మనా భువన త్రయం
పూజాదినా బ్రహ్మలోకం
త్రిభిర్మత్సామ్యతామి యాత్ II (అధ్యా 27, శ్లో 52)
విగ్రహ ప్రతిష్ఠచేత - సార్వభౌమ పదవి,
మందిర నిర్మాణంచేత - త్రిలోకాధిపత్యము,
పూజచే బ్రహ్మలోకము,
ఈ మూడింటిచే నాతో సమానత్వము లభించగలదు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
324
శ్రీరామ మానసిక పూజ
శ్రీరామ జయరామ - శ్రీకర శృంగార రామ
మా రామ రఘురామ మానస పూజలను గొనుమ శ్రీరామ ॥
అఖిలాంబర ముని నాయక ఆవాహనమిదో మీకు
—
అఖిలలోక రక్షకా సింహాసన మిదోమీకు
పాతక సంహరణ మీకు - పాద్యమిదో పాదములకు
అంతరాత్మ అమరవంద్య - అర్ఘ్యమిదో హస్తములకు
సతతదీనమందార - స్నానమునకు జలంబిదిగో
వ్రతఫల సంధానశీల - వస్త్రయుగ్మ మిదో మీకు
యదుకులావతార ధీర - యజ్ఞోపవీత మిదిగొమీకు
చతురానన జనకదేవ చందనం బిదోమీకు
పూతచరిత పురుషోత్తమ - పుష్పధామ మిదోమీకు
అతి దయకర పతితపావన అగరుధూప మిదోమీకు
కరుణాకర సుగుణధామ - కర్పూరదీప మిదోమీకు
నరమృగావతార ధీర - నైవేద్యం బిదోమీకు
దారుణదారిద్ర్య హరణ తాంబూలము స్వీకరించు
నీరజాసనాది వినుత నీరాంజన మిదోమీకు
మారకోటి సుందరాంగ - మంత్రపుష్ప మిదో మీకు
పరమపురుష రామచంద్ర - ప్రదక్షిణం బిదోమీకు
శ్యామసుందర షోడషోపచారములను స్వీకరించు
కామేశ్వరదాస వరద -కరుణతోడ కైవల్యమొసగు ॥
శ్రీరామ జయరామ - శ్రీకర శృంగార రామ
మారామ రఘురామ - మాసపూజలను గొనుమ ॥
(A Song sung by Sri Sri Kameswara Dasu)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
325
చూచావా ఉద్ధవా!
నిష్కామ భక్తియోగంతో నన్ను అర్చించేవాడు నన్నే పొందుచున్నాడు. పూజ మందిర
నిర్మాణము విగ్రహ ప్రతిష్ఠలచే భక్తియోగము ప్రవృద్ధమౌతోంది.
నేను సదా భక్త సులభుడను.
తనచే ఇవ్వబడినదిగాని పరులచే ఇవ్వబడినదిగాని... అయినట్టి దేవాలయపు
సొమ్ములను హరించువాడు, బ్రాహ్మణ విత్తము హరించువాడు - కోట్లాది సంవత్సరాలు
మలమును భక్షించే క్రిమి కీటకముల జన్మలు ఎత్తవలసి వస్తుంది సుమా! ఆవిధంగా
అపహరించు వాడే కాదు! అతనికి సహకరించువాడు, ప్రేరేపించువాడు, ఆమోదించువాడు
కూడా తనకు తానే అల్పజన్మలకు ఎర అగుచున్నాడు.
నా భక్తులను, సాత్వికులను భాధించువాడు అల్పజన్మల రూపంగా నాచే శిక్షించ
బడటానికి అర్హుడగుచున్నాడు.
నా భక్తులను సేవించువారు, వారికి సహకరించువారు, వారికి తనకున్న సంపదలో
కొంత భాగము సమర్పించువారును నాకు ప్రియతములగుచున్నారు.
42. యోగాభ్యాసోపాయాలు
శ్రీకృష్ణుడు :
శ్లో॥ పర స్వభావ - కర్మాణి న ప్రశంసేత్ న గర్హ్వయేత్
విశ్వమ్ ఏకాత్మకం పశ్యన్ ప్రకృత్యా పురుషేణ చ ॥ (అధ్యా 28, శ్లో 1)
ఓ ఉద్ధవా! ఎదురుగా ఇంద్రియములకు తారసబడే దృశ్య ప్రపంచము, ఈ కనబడే
విశ్వము ఇదంతా కూడా -నిత్యము-అప్రమేయము-కేవలము-సత్-చిత్,
ఆనందస్వరూపము అగు అఖండ - ఏకాత్మ యొక్క పురుష-ప్రకృతుల (Experience -
experiences - perceiver - perception) కల్పనా సంయోగమే.
"ఈ కనబడే విశ్వ దృశ్యమంతా - ఇందులోని కాలాంతర్గత సంగతి-సంబంధముసందర్భము-వ్యవహారములు, వాటి యొక్క స్థితి గతి-నిర్గతులతో సహా
అంతర్యామియగు పరమాత్మచే నిర్దేశితమైనదే కదా! శివాజ్ఞయే కదా!" అని
గమనించినవాడు - గ్రహించినవాడు - అర్ధము చేసుకొన్నవాడు ... దీనినంతా మౌనంగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
326
అతీతుడై హాయిగా చూస్తూ ఉంటాడు. ఇక్కడి శాంతము ఘోరము మొదలైన
స్వభావములను, వ్యక్తులను, సంఘటనలను చూస్తూ కూడా ఎవ్వరినీ - దేనినీ
ప్రశంసించడు. నిందించడు! ఎవ్వడైతే ఇక్కడి స్వభావములను, కర్మవ్యవహారములను,
సంఘటన సందర్భములను
ప్రశంసిస్తూనో...,
వారిని - వీరినీ నిందిస్తూనో...
రోజులన్నీ గడిపివేస్తూ ఉంటాడో... అట్టివాడు అధ్యాత్మ శాస్త్ర పండితులచే - "ఈతడు
అసత్యమునందు అభినివేశము కలిగియున్నవాడు" - అని చెప్పబడుచున్నాడు.
కధ చదువుతూ పాత్రల సంబంధ - కష్ట సుఖములను చూచి ఆ పాఠకుడు సుఖమోదుఃఖమో పొందటమేమిటి?
కలలో కనబడిన అద్దాలమేడ మెళుకువ వచ్చిన తరువాత "అయ్యో! లేదే? ఏమైయ్యింది?
పోయిందా?" అని దుఃఖము - వేదన పొందటం ఎటువంటిది?
ఈ దృశ్య సంఘటనల గురించి ప్రశంసించటం, నిందించటం ఆత్మజ్ఞుల దృష్టిలో
అటువంటిది!
ఎవ్వడైతే దేహ-గృహ-సంగతి-సంఘటనలపట్ల ఆసక్తిని పెంపొందించుకుంటూ రోజులు
గడుపుచున్నాడో ఆతడు ఆత్మద్రోహి - ఇంద్రియములకు వశుడు-తెలివితక్కువగా తనకు
తానే అగుచున్నాడు. ఆతడు స్వఅర్ధము- సత్యములనుండి భ్రష్టుడగుచున్నాడు.
జాగ్రత్లో ఉత్సాహంగా ప్రవర్తిస్తూ దృశ్యానుభవముల వెంటబడుచున్న ఇంద్రియములు
రోజులో కొంత సమయంలో నిద్రాణమగుచున్నాయి. అప్పుడు తైజసానుభవం
(స్వప్నావస్థ) పొందుచున్న శరీరస్థుడగు జీవుడు స్వప్నరూపమగు మాయను తన
హృదయమునందే కల్పించుకొని అనుభవిస్తున్నాడు. స్వప్నంలో కనిపించేదీ భ్రాంతియే!
ఆ తరువాత స్వప్న మనస్సు కూడా లయంకాగా... అప్పుడు సుషుప్త్యస్థితి మృత్యువుతో
(మృతానుభవముతో) సమానమే కదా! సుషుప్తిలో మౌనము-నిర్విషయము-అలౌకికము
అగు నిర్విషయ వృత్తిని ఆస్వాదిస్తున్న ఈ ద్రష్ట (లేక) జీవాత్మ తిరిగి ఎప్పుడో మెళుకవవచ్చి
జాగృత్లో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి ఊరుకుంటున్నాడా? లేదు.
ద్వంద్వాభినివేశి అయి,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
327
జాగృత్ దృశ్యములో సుఖదుఃఖములు, నిందా- ప్రశంసలు... దృశ్య-ద్రష్టత్వములు,
|
మంచి-చెడ్డ, బంధము-ముక్తి మొదలైనవన్నీ ఒక్కసారిగా పొందినవాడై మరల
స్వప్నదశ పొందేకొరకు జాగృత్లోనే అనుభవపరంపరలు కొనసాగిస్తున్నాడు.
ఇదినాది. ఎవ్వరినీ రానివ్వను.
వారు మంచివారు. వీరు చెడ్డవారు.
వారు నావారు. వీరు కాదు.
నావారి చెడుకూడా మంచియే!
పరాయివారి మంచి కూడా చెడ్డయే!
ఇట్లా ఉంటున్నాయి, ఆతని స్వకల్పనా పరంపరలు! సుషుప్తిలో మౌనమువహించి
అప్రదర్శితంగా వున్నట్టి ఇవన్నీ- జాగ్రత్లో మరల నిద్ర లేస్తున్నాయి. వాస్తవానికి
ద్వైతముగా కనిపించేదంతా కూడా విక్షేపముచే అనుభవమయ్యే మిధ్యయే! - జాగ్రత్లో
అయినా, స్వప్నంలో అయినా!
శ్లో॥ కిం భద్రం కిమ్ అభద్రం వా? ద్వైతస్య అవస్తునః కియత్? '
వాచోదితం తదనృతం మనసా ధ్యాతమేవ చ ॥ (అధ్యా 28, శ్లో 4)
ఇక్కడ వేరువేరుగా ద్వితీయముగా (రెండవదిగా) కనిపించే ద్వైతము మొదలే కలలో
కనిపించిన రెండస్తుల అద్దాలమేడ వలె అవస్తువు అయి ఉన్నది. ఇలలో కనిపించేదంతా
కలలోని చమత్కారమువంటిదే? ఇక ఇక్కడ భద్రమేమిటి? అభద్రమేమిటి? ఏది మంచి?
ఏది చెడు? అటువంటి ప్రసక్తి మొదలే లేదు.
"కలలో కనిపించిన ఆతడు అట్లా ఎందుకున్నాడు? అదే కలలోని ఈతడు ఇట్లా
ఎందుకున్నాడు?" అనే ప్రశ్న-దాని సమాధానాలు... ఏముంటాయి? బంగారు
ఆభరణంలో ఆభరణము అనే బంగారమునకు వేరైన - వస్తువేదైనా ఉన్నదా?
ఇక్కడ మాటలలో ఏభేద దృష్టులు చెన్నొందుచున్నాయో అవన్నీ - అదంతా వాక్
ఆడంబరము (కథలోని మహారాజు తెలివిగల మంత్రివలె)... మాత్రమే! అనగనగా
ఒక రాజు అని ఏదో కథ గురించి అనుకోగా అనుకోగా... చెప్పుకోగా-చెప్పుకోగా ఆ
పాత్రలు-స్వభావాలు ఉన్నట్లే జనులు భావించి... అందులోని ధర్మ-అధర్మాల గురించి
వాదోప వాదములులు చేసుకోవటం వంటిది!
ఓ మిత్రమా! ఉద్ధవా! ఇక్కడ మనస్సుచేత చింతింపబడుచు, ఫలితంగా వాక్కుచేత
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
328
మాట్లాడబడుచున్నదంతా కూడా మిధ్యాభూతమే (Experience out of illusion) అయి
ఉన్నదయ్యా!
ఒకానొకాయన తెల్లటి గోడను చూస్తూ ఉండగా తన ఛాయ (Reflection of
own form because of light from behind) కనబడితే దానిని చూచి "వీడెవ్వడో
నావెంటబడ్డాడురోయ్..." అని అరవడం ఎటువంటిది?
ఒకడు ఒక గుహలో ప్రవేశించి "ఓయ్" అని ధ్వనిచేయగానే "ఓయ్ ఓయ్
ఓయ్" అని ప్రతిధ్వనిస్తూ ఉంటే "ఆఁ! ఎవ్వడో ఈ గుహలో ఉండి నాతో
మాటకు మాట అని నన్ను ఎగతాళి చేస్తున్నాడురా?..." అని అనుకోవడం
ఎటువంటి చమత్కారం?
ఒక ముత్యపు చిప్పను చూచి, "అబ్బో! ఇందులో వెండి ఉన్నదిరా?.." అని
అనుకోవటం, ఇంటికి తీసుకువెళ్ళి కరిగించటం ఆరంభించటం ఏతీరైనది?
అవన్నీ మిధ్యయేకదా! మిధ్యయే అయి ఉండికూడా అవి భయము-మోహము- కోపముఆవేశము-విస్మయము (అజ్ఞానికి-విషయమేమిటో తెలియనివానికి) కలిగిస్తున్నాయి కదా?
అట్లాగే...,
ఈ భౌతిక దేహము మొదలైనవన్నీ మిధ్యావస్తువులే అయినప్పటికీ కూడా, ఈ జీవునికి
ముక్తి కలిగేవరకు భయము-మోహము-విస్మయము మొదలైన సంసార సంరంభమును,
సంసారానుభవములను కలుగజేస్తూ పోతున్నాయి.
శ్లో॥ ఆత్మైవ తదిదం విశ్వం సృజ్యతే సృజతి ప్రభుః
త్రాయతే త్రాతి విశ్వాత్మా ప్రియతే హరతీశ్వరః ॥ (అధ్యా 28, శ్లో 6)
పరమాత్మ ఈ విశ్వమునకు ప్రభువు, ఈ విశ్వమునకు ఆత్మ (విశ్వాత్ముడు) కూడా!
అట్టి పరమాత్మ ఆత్మకు అభిన్నమైనటువంటి ఈ విశ్వమును సృష్టించుచున్నాడు. కర్తభోక్త-క్రియ-క్రియా విషయం కూడా ఆత్మయే! అనగా ఈ విశ్వము ఆత్మస్వరూపము
ఆత్మయొక్క విన్యాసము కూడా! విశ్వమునకు అభిన్నమైన విశ్వేశ్వరుడు...
సృష్టించుచున్నాడు. స్వయముగా సృష్టిరూపుడు అగుచున్నాడు. అనగా
సృష్టించబడుచున్నాడు కూడా!
భావనలు రచిస్తున్నాడు. భావనలలో చిక్కుకుని వుంటున్నాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
329
రక్షిస్తున్నాడు. రక్షింపబడుచున్నాడు కూడా!
ఇదంతా ఆస్వాదిస్తున్నాడు. ఆస్వాదించబడుచున్నాడు!
భ్రమిస్తున్నాడు - భ్రమింపజేస్తున్నాడు కూడా!
దీనిని హరిస్తున్నాడు. హరింపబడుచున్నాడు కూడా!
పునఃగా కల్పిస్తున్నాడు-కల్పన చేయబడుచున్నాడు.
ఈ విధంగా,
ఈ కనబడే సృష్టి అంతా ఇందులోని విషయాలు సందర్భాలు మొదలైనవి
స్వతంత్రములైనవి కావు. అనగా అవన్నీ పరమాత్మకు వేరైనవి కావు. పరమాత్మయొక్క
స్వయంకల్పిత భావనాతరంగ విన్యాసములే! అట్టి ఆత్మపట్ల (లేక జీవాత్మపట్ల) ఆధ్యాత్మిక
ఆధిభౌతిక ఆధి దైవికమైన జ్ఞానమంతా - స్వప్నంలో ఒకానొకడు ప్రదర్శించే
తెలివితేటలు (జ్ఞానవైశిష్ట్యము వలె) భ్రమరూపము - భ్రాంతియుక్తమేనయ్యా!
ఇదంతా త్రిగుణాత్మకమైనదేనని, త్రిగుణాత్మకమైనదంతా మాయయేనని గమనించు.
మాయకు యజమానియో... జీవాత్మ స్వరూపుడై, క్రీడగా-లీలగా ప్రదర్శితుడు అగుచున్న
పరమాత్మయే! నేనే! ఈ సర్వ జీవాత్మలు వారివారి అనేకరూపములైన
దృష్టులు - ఇదంతా నాయొక్క ఒకనానొక అంశావిశేషమే!
ఎవ్వడైతే నేను ఉపదేశిస్తున్న ఈ జ్ఞాన విజ్ఞానయుక్తమైన వాక్యములను
అన్వయించుకుంటూ స్వస్వరూపం-తన సహజరూపం గురించి తెలుసుకుంటాడో...
ఇక ఆతడు ఎవ్వరినీ నిందించడు. స్థుతించడు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ
తాను సర్వమును ప్రకాశింపజేస్తున్న లోకాలన్నిటికీ అతీతుడై, నిర్లిప్తుడై- అప్రమేయుడైకేవలసాక్షి అయి చూస్తూ ఉంటాడు కదా! ఆత్మ తత్త్వముగా ఎరిగినవాడు సూర్యునివలె
ఆరీతిగా సమభావసంపన్నుడై మెలగుతూ ఉంటాడు! ఇక్కడి విషయాల మధ్య ఉంటూనే
వీటికి అతీతుడై, కేవలసాక్షియై, మౌని అయి ఉంటాడు!
ఓ ఉద్దవా! ప్రత్యక్షము-అనుమానముల సహాయంలో "ఆత్మౌపమ్యేవ సర్వత్రా" అను
ఆత్మానుభూతి సహాయం చేతను, శాస్త్రములు చెప్పే వివరణను చెవులతో విని బుద్ధితో
గ్రహించుట చేతను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
330
ఈ జగత్తు మిధ్యమాత్రమే!
ఇదంతా ఉత్పత్తి-వినాశన శీలము!
మనోనుకూలము (అనగా మనస్సు ఏరీతిగా ఉంటే, ఇది, అట్లే
అనుభవమౌతుంది.
కాబట్టి ఇది ఇట్టిది అని ఏమీ చెప్పలేము అనిర్దేశ్యము...
అని గ్రహించిన విజ్ఞుడు నిస్సంగుడై-నిస్సంకోచుడై ఈ జగత్తులో వ్యవహరిస్తున్నాడు.
లీలా వినోదంగా ఆస్వాదిస్తున్నాడు. నేను చూస్తున్నది (జగత్) నాటకమే! అని
గ్రహించి ఉన్నవాడు, "నాటకములోని సంఘటనలకు పాత్రధారుడు - చూచేవాడు
కూడా అగు నేను సుఖదుఃఖాదులు పొందవలసిన అగత్యమేమున్నది?...." అని
గమనిస్తున్నాడు. అజ్ఞులను ప్రశ్నిస్తున్నాడు.
43. సుఖ దుఃఖాలు ఎవరికి? ఎవరివి?
శ్రీ ఉద్ధవుడు : ప్రియ స్వస్వరూపాత్మ చైతన్య స్వరూపా! అవతారమూర్తీ! శ్రీకృష్ణయ్యా!
నీవు కొంత వివరించి యున్నప్పటికీ మరల అదే ప్రశ్న ఒకటి నిన్ను అడగాలనిపిస్తోంది!
ఆత్మ-దేహముల కలయికచేతనే కదా. జీవుడు అనబడేది ప్రదర్శితం అగుచున్నది?
అనగా, ద్రష్ట-దృశ్యములను ఆత్మస్వరూపుడగు జీవుడు పొందుచుండటం ఇక్కడ
జరగుతోంది కదా! ఇప్పుడు చెప్పండి? సుఖ దుఃఖాలు ఎవరికి? ఎవరివి? ఎవరివలన?
ఎందుకు? ఆత్మకా? దేహమునకా? అనుభవములగుచున్నాయి కాబట్టి ఉన్నట్లా? భ్రమ
వంటివి కాబట్టి లేనట్లా?
ఈ ద్రష్ట - దర్శనముల చమత్కారము ఆత్మకు సంబంధించినదా? దేహానికి
సంబంధించినదా? జీవుడు అనబడువానికి సంబంధించినదా? జగత్తుకు
సంబంధించినదా? ఈశ్వరునిదా?
శ్లో॥ నైవాత్మనో న దేహస్య సంస్కృతిః ద్రష్ణుృ - దృశ్యయోః
అనాత్మస్వదృశోరీశ కస్యస్యాదుపలభ్యతే?
శ్లో|| ॥ ఆత్మా అవ్యయో అగుణః శుద్ధః స్వయంజ్యోతిరనావృతః
అగ్నివత్ దారువదచిద్దేహః కస్య ఇహ సంస్కృతిః? (అధ్యా 28, శ్లో 10, 11)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
331
ఆత్మ స్వతఃసిద్ధంగానే జ్ఞాన సంపన్నము. అవినాశనము. అవ్యయము (మార్పు చేర్పులు
లేనిది). గుణాతీతము. శుద్ధము. అగ్నివలె స్వయంప్రకాశము. ఆవరణశూన్యము
(దేనిచేతా ఆవరించబడేది కాదు. అందుచేత - సుఖ దుఃఖాలు ఆత్మకు కలుగుచున్నాయి
అని, (లేక) సుఖ దుఃఖాలు ఆత్మవి... అని అనటానికే వీలే లేదు. ఆత్మ సర్వదా
అప్రమేయమే కదా!
ఇక ఈ భౌతిక దేహానికి వచ్చి పరిశీలిస్తే? ఈ దేహము జడము. స్వతఃగా కదలలేదు.
ఆత్మ స్వరూపుడగు దేహియొక్క చైతన్య విన్యాసముచే మాత్రమే కదులుతోంది. ఒక
కట్టెవలె జడమైనది. కనుక సుఖ-దుఃఖములు జడదేహమునకు కలుగుచున్నాయని
గాని, సంబంధించినవనిగాని అనలేము. ఆత్మ కదలించునది. దేహము కదలునది.
సుఖ-దుఃఖాది అనుభవాలు ఈ రెండిటిలో దేనివి? దేనికియు లేక, ఈ రెండుకాక,
సుఖ దుఃఖాలకు సొంతదారు మరొకటేదైనా వున్నదా?
శ్రీ కృష్ణభగవానుడు : ఈ ప్రశ్న మరొక్కసారి నీవు అడగటం ఉచితమే! సందేహాలు
పూర్తిగా తొలగాలి కదా! విను!
శ్లో॥ యావత్ దేహ-ఇంద్రియ-ప్రాణైః ఆత్మనః సంనికర్షణమ్
సంసారః ఫలవాం తావత్ అపార్థో పి అవివేకినః II (అధ్యా 28, శ్లో 12)
ఓ ఉద్దవా! ఆత్మకు దేహ-ఇంద్రియ-ప్రాణములతో ఎంతెంతవరకైతే సంబంధము
ఉంటుందో... అంతంత వరకు అవివేకులైన పురుషులకు మిధ్యాభూతమైన ఈ
ప్రపంచము "సత్యమే కదా!" అనువిధంగా స్ఫురిస్తూ ఉంటుంది! అట్లు అనిపించటమే
సంసారము అను శబ్దముచే చెప్పబడుతోంది.
వివేకముచేతనో, "ఈ ప్రపంచము స్వప్నసదృశమే! మిధ్యయే! ..." అని తెలియవస్తోంది.
అప్పుడిక సంసారము అని చెప్పబడే దానియొక్క ఊసైనా ఉండదు!
ఒకాయన సుష్ఠుగా తిని, తాంబూలం సేవించి హాయిగా నిద్రకు ఉపక్రమించాడు.
నిద్రలో ఏదో స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఆతడు బాటలో వెళ్ళుచుండగా ఒక
పులి- ఒక విషసర్పము, వెంటబడ్డాయి. ఇక ఆ పెద్ద మనిషి భయగ్రస్తుడై కేకలు
వేస్తూ... పరుగులు తీయసాగాడు.
ఇప్పుడు చెప్పు! ఆతనికి అంతటి భయము ఎందుకు కలిగింది? ఎవరివలన కలిగింది?
బయటనుండి ఎవ్వరైనా ఆతనిమీద కోపంతో ఆతని స్వప్నములోనికి పులినిశ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
332
విషసర్పమును తీసుకొచ్చి పెట్టారా? లేదే? మరి? ఆ స్వప్న ద్రష్టయొక్క స్వప్నభావన
చేతనే పులి-విషసర్పము కల్పించబడ్డాయి. స్వప్న భావన చేతనే ఆతడు వాటిని చూచి
భయపడుచు గజ గజ వణుకుచు (స్వప్నంలోనే) బాటలలో పరుగులు తీస్తున్నాడు!
అంతాకూడా స్వయంకృతమే! మరింకెవరికీ పాత్రయే లేదు. మెళుకువ వచ్చిన తరువాతనో
"పులి లేదు. విషనాగు లేదు! అంతా నా ఊహయే! భ్రమయే! నాయొక్క కల్పనయే!..."
అని ఆతడు ఎవ్వరూ చెప్పకుండానే తెలుసుకుంటున్నాడా, లేదా? లేక, "ఓ మిత్రులారా!
నా కలలోకి పాము వచ్చింది! చంపుదాం రండి!..." అని (నిదురలేచిన తరువాత)
పిలుస్తున్నాడా? లేదే!
అట్లాగే...,
కలలో కనబడిన పులి-పాము మిధ్యయే అయినప్పటికీ చూడటం వలన ఏర్పడిన
కలలోని భయంలాగానే..., స్వకీయ భ్రమ-కల్పనలచేత ఆశ్రయించబడిన విషయచింతన
యందు వ్యాకులత చెందినట్టి (లేక) పొందినట్టి ఆత్మకు మిధ్యామాత్రము (Merely
illusion / ideation/ own Mind - Making) అయిన సంసారము - వాస్తవానికి మిధ్యయే
అయి ఉండి కూడా - అవివేకమువలన సత్యమువలె స్ఫురించటం జరుగుతోంది!
కలగంటున్నవానికి కలలో ఎన్నో అనర్ధమైన-అర్ధరహితమైన స్వప్నదృశ్య పదార్ధాలు
కనిపించవచ్చు గాక! మేలుకొన్న తరువాత కలలో కనిపించినవి మోహమును
కలుగజేయలేవు కదా? నిద్ర లేచిన తరువాత "కలలో కనిపించిన నా భవనము ఏమైనది?"
అని ఎవ్వడైనా జాగ్రత్లో వెతుకుతాడా? జ్ఞానము అనే మెలుకవ తెచ్చుకొన్నవానికి
దృశ్య మోహము అనే జాడ్యము ఉండదు! "ఈ లోకాలేమిటి? నేనేమిటి? వారేమిటి?
వీరేమిటి" - అనే ప్రశ్నలే ప్రశ్నించటానికి అనర్హమౌతున్నాయి.
ఆత్మ ఒకానొకప్పుడు అనిర్వచనీయ కారణంగా అహంకారము అనే ద్వైతము
(ద్వితీయత్వము)ను ఆశ్రయిస్తోంది. అది లీల - క్రీడ (సరదా) అని అనవచ్చునేమో!
అహంకార కారణంగా దేహాభిమానము అను కార్యము రూపు దిద్దుకుంటోంది.
అట్టి అహంకారము, దేహాభిమానము యొక్క క్రియావిశేషాలే శోకము - హర్షముభయము-క్రోధము-లోభము-మోహము-స్పృహ-జననము-మరణము....
ఇత్యాదులన్నీ కూడా! అనగా... అవన్నీ అహంకార కార్యములు! దేహాభిమాన కార్యములు.
ఆత్మకు వాటితో సంబంధము లేదు. జడమగు దేహానికీ వాటితో సంబంధము లేదు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
333
దేహాదుల అభిమాని
శ్లో॥ దేహేంద్రియ ప్రాణమనో అభిమానో
జీవో అంతరాత్మా గుణకర్మ మూర్తిః
సూత్రం మహానిత్యురుధేవగీతః
సంసార ఆధావతి కాల తంత్రః || (అధ్యా 28, శ్లో 16)
ఈ జీవుడు వాస్తవానికి అంతరాత్మానంద స్వరూపుడే! గుణ-కర్మలకు యజమానియే
గాని బద్ధుడు కాడు. సూత్రాత్మ స్వరూపుడు! (అనేక పూలతో గ్రుచ్చబడిన పూదండలోని
దారమువంటి స్వరూపుడు) నిత్య-సత్య-బుద్ధాత్ముడే! ఎందుకంటే- ఈ జీవుని
సహజస్వరూపము సర్వదా అప్రమేయమగు ఆత్మయే! అయితే ఏ జీవుడైతే తన
సహజానంద రూపమును ఏమరచి దేహాభిమాని - మొదలైనవి అగుచున్నాడో..., ఆ
అభిమానమే ఇవన్నీ పొందుతోంది!
దేహాభిమాని భౌతిక దేహము నాకు అవినాభావ సంబంధము ఉన్నది అని
తలచువాడు.
కనిపించేవి - వినిపించేవి ఇంద్రియాభిమాని - తదితర శబ్ద-స్పర్శ రూప-రసగంధాదుల పట్ల "నావే! నాకు కావాలి నేను వీటికి
-
చెందినవాడను. ఇవి నాకు చెందినవి" అని భావించువాడు.
ప్రాణాభిమాని - ప్రాణములకు (శక్తికి) సంబంధిచిన వాడను. ప్రాణములుంటేనే
నేను. లేకుంటే లేను... అని ప్రాణములతో అవినాభావావేశము
పెంపొందించుకొని ఉంటున్నవాడు. "ప్రాణాలు పోతే నేనూ
పోతాను..." అని ఉద్వేగాభిప్రాయము కలిగి వుంటున్నాడు.
మనో అభిమాని మనస్సుయొక్క ప్రియాప్రియత్వము-చంచలత్వము మొదలైన -
లక్షణములు తనకు సంబంధించినవిగా భావించువాడు.
మనస్సులో చేరుచున్న అనుభూతులు, అభిమానాలు, సుఖదుఃఖ
భావాలు తన స్వరూప స్వభావాలుగా భావించువాడు.
అట్టి దేహ - ఇంద్రియ - ప్రాణ - మనో అభిమాని మహాసూత్ర నరకము చేరుచున్నాడని
చెప్పబడుచున్నాడు. అనగా కాలమునకు అధీనుడై అజ్ఞానముచేత సంసారారణ్యములో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
334
తిరుగాడుచు దేహ-మనో బుద్ధి-చిత్త- లక్షణాలను అప్రమేయమగు ఆత్మపై ఆపాదిస్తూ
తత్ఫలితంగా అనేక ఉపాధిపరంపరలు పొందుచు-విడచుచు తన్మయుడౌచున్నాడు.
శ్రీ ఉద్ధవుడు : కృష్ణయ్యా! మీరు చెప్పే అహంకారము - సంసారము అనువాటియొక్క
వాస్తవ స్వరూపమేమిటి? అవి ఎట్లా, ఎందుచేత ఎప్పటి నుండి ఏర్పడినవై ఉంటున్నాయి?
ఎందుకు ఆత్మానంద స్వరూపుడగు ఈ జీవుని తమవైపు ఆకర్షించి నిబద్ధునిగా
చేస్తున్నాయి?
శ్రీకృష్ణుడు : ఓ ప్రియ ఉద్దవా! వాస్తవానికి అహంకారమునకుగాని, అహంకారము
కలిగిస్తున్న బంధమునకుగాని, ఆ బంధము వలన ఏర్పడే సంసారము అను
శృంఖలాలకుగాని వాస్తవమైన రూపం అంటూ ఏదీ లేదు. ఒక మూలము (A source
where from they come out) అనునది కూడా ఏదీ లేదు. అజ్ఞానమే అన్నిటికీ
కారణం!
అహంకార రూపమగు సంసారము అనుదానికి ఉనికి అంటూ ఏదీ లేకపోయినప్పటికీ...
అది జీవుని అజ్ఞానకారణంగా గారడివాడు చూపే లేనివస్తువు వలె- అనేక రూపాలుగా
వెల్లడి అవుతోంది. పరవశం కలుగజేస్తోంది.
మనస్సు-వాక్-ప్రాణ-శరీర - కర్మల ద్వారా సంసారము రూపుదిద్దుకొని
పరిణితమౌతోంది. సాధకుడగు మౌని అహంకారరూప సంసారము కలుగజేసే
నిమ్నగతులను గమనించి విజ్ఞుడగు గురువును ఆశ్రయిస్తున్నాడు.
"నేనెవరు? అహంకార దోషం ఎక్కడినుండి వచ్చింది? సంసారము అనగానేమి? ఇది
ఎట్లా రూపుదిద్దుకొంటోంది? నేను తరించగల మార్గమేమిటి?" - అను ప్రశ్నలతో
గురువుకు శరణువేడుచున్నాడు. గురువులు ఉపదేశిస్తున్న తత్-త్వమ్ అనబడు తత్త్వ
శాస్త్ర ప్రవచనాలను, వేదాంతశాస్త్ర విశేషాలను వింటున్నాడు. ఆకళింపు
చేసుకుంటున్నాడు. గురూపదేశముచే అతితీక్షణమైన పదునైన జ్ఞానాసి (జ్ఞాన ఖడ్గము)ను
సంపాదించు కుంటున్నాడు. హృదయములోని లౌకికసంబంధమైన వాసనలను
ఛేదించివేస్తున్నాడు. ఆత్మజ్ఞానియై ఆత్మతత్త్వమునందు ప్రశాంతంగా, హాయిగా
సంచరిస్తున్నాడు. అప్పుడిక సంసారమనబడేది ఆతనికి ఆతనియొక్క భావసంబంధమైన
లీల-క్రీడ-ఆత్మ విన్యాసం అవుతోంది! ఆత్మ - అనాత్మ వివేకమే జ్ఞానము!
జగత్తు అనబడేదానియొక్క మొదలు - చివర ఏమై ఉన్నదో.... అదే వర్తమానంలోకూడా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
335
అయి ఉన్నది. మొదలు – చివర అనేకము లేదు. మధ్యలోనూ లేదు! ఆత్మయే జగద్రూపంగా
మనస్సుచే ఆస్వాదించబడుతోంది. బంగారు ఆభరణములన్నీ బంగారమే కదా!
జీవులందరు (మనో-బుద్ధి-చిత్త-అహంకారాలతో సహా) ఆత్మయొక్క ప్రత్యక్ష స్వరూపులే!
ఆత్మ సర్వదా యధాతథము, అఖండము, అప్రమేయము, ఆనందస్వరూపము.
"ఈ జగత్తు కూడా సర్వదా ఆత్మ స్వరూపమే!" - అనునది ఆయా ప్రమాణములద్వారా
నిరూపమణ మగుచున్నది.
ప్రమాణములు – వేద ప్రమాణము
గురూపదేశ ప్రమాణములు
ఇతిహాసముల ప్రమాణములు
కాలము |
హేతువు (Reasoning) ప్రమాణము
అనుమానము
బంగారు నాణెమును ఒక ఆభరణంగా తయారుచేసి, చాలాకాలం ధరించి, దానిని
కరగించి తిరిగి బంగారపు నాణెముగా మార్చామనుకో! అనగా... బంగారము
ఆభరణంగా ఉన్నపుడు ఆభరణాకారం తొలగించినప్పుడు కూడా బంగారమే అయిఉన్నది
కదా! అయినా కూడా బంగారు లోహము (Gold Metal) బంగారు ఆభరణము
(ornaments) అనే పదాలు ప్రయోగిస్తాము. ఆభరణములను కూడా ఇవి బంగారు
గాజులు. ఇవి బంగారు గొలుసులు ఇత్యాది మాటలు(శబ్దాలు) చెప్పుకుంటాము.
ఆభరణములు బంగారము కానిది ఎప్పుడు? అట్లాగే...
ఈ విశ్వమునకు కారణభూతుడును విశ్వేశ్వరుడను-విశ్వరూపుడను (బంగారము
ఆభరణమునకువలె) నేనే!
నాకంటే భిన్నంగా విశ్వము లేదు. జీవులు లేరు! జగత్తు లేదు!
జాగ్రత్ - స్వప్న - సుషుప్తి మూడు అవస్థలు,
ఆ మూడు అవస్థలకు (అవస్థాత్రయము) కారణభూతంగా చెప్పబడుచున్న సత్త్వ
రజో - తమో త్రిగుణములు (గుణత్రయము),
ఆ మూడు అవస్థలతో కూడిన మనస్సు,
త్రిగుణములబనడే కారణమునకు కార్యభూతమైన స్వర్గ-భూ-పాతాళములనబడే
..
త్రివిధ జగత్తులు,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
336
ఆధిభౌతిక - అధిదైవిక - అధ్యాత్మకములనబడే త్రివిధ తాపములు,
ఇవన్నీ నాయొక్క తురీయ చైతన్యము యొక్క బహురూప చమత్కారములే! సమాధిఅసమాధులకు కేవలసాక్షి అయిన బ్రహ్మము మాత్రమే సత్యము. మిగిలినవన్నీ
కల్పితము - వికారోనామధేయములు! జగన్మిధ్యా! అట్టి పరబ్రహ్మమే నేను!
ఈ జీవుడు తరంగమైతే పరబ్రహ్మము జలము వంటిది (యో పా మాం యతనమ్
వేదా)
ఈ జీవుడు ఆభరణమువంటివాడైతే పరబ్రహ్మము బంగారు లోహము వంటిది.
అనగా...,
ఈ జీవుడు పరమాత్మ అనే తత్త్వముయొక్క ఆభరణ స్వరూపము.
ఒక ముఖ్యమైన విషయం!
ఏదైనా ఒకానొక వస్తువు నాకు వర్తమానంలో నామ రూపాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ...
అది మొట్టమొదట (సృష్టికి ముందు) లేనిది ప్రళయంలో లేకుండా పోవుచున్నది
అయి ఉంటే... అట్టిది స్థితికాలంలో కూడా మూలపదార్ధం కంటే వేరు కాదు. బంగారు
ఆభరణము బంగారమునకు మధ్యలో వచ్చి కనబడుచున్నప్పటికీ... ఆ ఆభరణము
బంగారమే అయి ఉన్నది కదా!
ఏ పదార్ధము దేనినుండి పుట్టుచున్నదో, దేనిచే ప్రకాశితం అగుచున్నదో అదియే ప్రకాశిత
వస్తువుయొక్క పరమార్ధ సత్యమై యున్నది.... అనునది వేదాంతశాస్త్ర ప్రవచన
సిద్ధాంతము.
స్వప్నంలో కనిపించేవన్నీ స్వప్న చైతన్య స్వరూపమే!
జాగ్రత్లో కనిపించేవన్నీ జాగ్రత్ చైతన్య స్వరూపమే!
ఈ జగత్తు మొట్టమొదట బ్రహ్మమే! లయించిన తరువాత బ్రహ్మమే! కనుక, వర్తమానంలో
కూడా ఇదంతా బ్రహ్మమే! పరమాత్మ స్వరూపమే!
జగత్తు జగదీశ్వర స్వరూపమే!
విశ్వము విశ్వేశ్వరరూపమే!
దృశ్యము ద్రష్ట యొక్క స్వరూపమే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
337
ద్రష్ట దృక్ స్వరూపమే! (ఆ ద్రష్టను చూచువాని స్వరూపమే!)
దృక్-ఆత్మస్వరూపమే!
బ్రహ్మముయొక్క సమక్షంలో జీవుడు అనే పరిణామము ఏనాడు వాస్తవానికి లేనేలేదు.
జీవుడు అనే వికారము మొదలే లేకపోయినప్పటికీ జీవుడు - ఆతని అనుభమైనట్టి ఈ
దృశ్యజగత్తు - ఉన్నట్లే అగుపిస్తోంది. (అజ్ఞాన దృష్టికి) అనిపిస్తోంది!
ఆవిధంగా వాస్తవంగా లేకున్నప్పటికీ ఉన్నట్లే అనిపించటమును రాజసికదృష్టి (లేక)
రాజసిక సృష్టి - అని పిలుస్తూ ఉంటారు. ఇదంతా సదా సర్వదా స్వయం ప్రకాశమగు
బ్రహ్మమే! బ్రహ్మము రజోగుణమును తనకుతానుగా ఉత్తేజ పరచుకొనుచున్నప్పుడు
జగదనుభవము అనునది బయల్వెడలటం జరుగుతోంది!
కనుక ఇంద్రియములు, పంచతన్మాత్రలు, మనస్సు, పంచమహాభూతములు అనే
రంగు రంగులచే చిత్రించబడిన - చిత్రితమైన ఈ విశ్వమంతయు బ్రహ్మమే! వేదముప్రత్యక్షము - ఉపదేశము - అనుమానము మొదలైన మీమాంసా విభాగులు సుస్పష్టముగా -
"ఇదంతా బ్రహ్మమే! మనయేవ ఇదమాప్తవ్యం!" అని యుక్తియుక్తంగా నిరూపిస్తూ
వస్తున్నాయి. ఇక సందేహం దేనికో చెప్పు!
సద్గురూపదేశముచేత "ఈ దేహమే నేను - వారు తదితర దేహములు..." అను దేహాత్మ
-
భావన స్వయంగా తొలగిపోగలదు. కనుక ఓ జనులారా! మీరంతా ఆత్మానంద
పరితుష్టులు అవండి! కామపరతంత్రములగు ఇంద్రియములు - ఇంద్రియ విషయముల
నుండి ఉపరతులు (withdrawn) అవండి! ఇంద్రియార్దములు-మనో-బుద్ధి-చిత్తఅహంకారములు దాటివేయండి.! అవన్నీ ఆత్మకు ఎందుకు అభిన్నమో గమనించండి!
ఆత్మ కేవలసాక్షి! సర్వమునకు యజమాని! రాజాధిరాజు! అందుచేత...
భౌతికమైన ఈ దేహము ఆత్మకాదు. అదేవిధంగా..,
ఈ ఇంద్రిములు, వాటికి అధిష్ఠాతలైన దేవతలు, ప్రాణములు, బుద్ధి, మనస్సు, చిత్తము,
అహంకారము ఇవన్నీ కూడా ఆత్మకాదు. అవన్నీ అన్నమును (ఆహారమును) ఆశ్రయించి
ఉంటాయి. సవికారములు. ఆత్మయో... నిర్వికారము!
ఆట్లాగే.... వాయువు జలము తేజస్సు ఆకాశము భూమి అనబడే
పంచభూతములు, శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములనబడే ఇంద్రియవిషయములు,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
338
ప్రకృతి... ఇవన్నీ భౌతికమే కాబట్టి అవికూడా ఆత్మస్వరూపములు కావు!
ఆకాశమును మేఘములు ఆవరించినా - ఆవరించకపోయినా సూర్యునికి ఎటువంటి
హాని-వృద్ధులు ఉండవు కదా! సాక్షాత్ స్వస్వరూపుడనగు నాయొక్క స్వరూపము
తెలుసుకొన్నవానికి,... " ఇక త్రిగుణములగు ఇంద్రియములు నిశ్చలమైనా (లేక)
చంచలమైనా కూడా (విక్షిప్తములైనా కూడా) ఆత్మకు ఎట్టి గుణదోషములు
ఉండవు. అంటవు!" - అనునది గమనిస్తున్నాడు!
శ్లో॥ యధా నభో వాయుః అనల అంబు భూ గుణైః
గతాగతైః వర్తుగుణైః న సజ్జతే
తథా అక్షరం సత్త్వరజస్తమోమలైః
అహం మతే సంస్కృతి హేతుభిః పరమ్ ॥ (అధ్యా 28, శ్లో 26)
వాయు వీచికలచేతగాని, అగ్ని శిఖలచేతగాని, జలతరంగముల ఉధృతముచేతగాని,
భూమియొక్క విస్తారముచేతగాని, వచ్చి పోయే శీతోష్ణాదులచేతగాని ఆకాశము ఏదైనా
మార్పు-చేర్పులు పొందుచున్నదా? లేదుకదా? అహంకారము కంటే కూడా పరమై,
అహంకారమునకు ఉత్పత్తి స్థానమైన పరమాత్మ- ప్రపంచమునకు కారణభూతమైన
సత్త్వ-రజ-తమోగుణములచే మలినము కాదు!
అయినప్పటికీ కూడా.... (Even though it is so)...,
శ్లో॥ తథాపి సంగః పరివర్జనీయో
గుణేషుమాయా రచితేషు తావత్
మద్భక్తి యోగేన దృఢన యావత్
రజో నిరస్యేత మనః కషాయః || (అధ్యా 8, శ్లో 27)
ఎంతెంతవరకైతే పరతత్త్వ స్వరూపుడునగు నాపట్ల భక్తియోగము యొక్క ప్రభావముచే
ఇంద్రియ విషయములనుండి, త్రిగుణ విశేషములనుండి మనస్సు తొలగడం
జరుగుటలేదో... అంతంత వరకు ఈ జీవుడు మాయా రచితములైన దృశ్య విషయముల
నుండి ఆసక్తి (Attachment) ని పూర్తిగా విడిచే ప్రయత్నంలో ఉంటూనే ఉండాలి.
ఎందుచేతనంటావా?
రోగము పూర్తిగా తొలగనంతవరకు చికిత్స కొనసాగిస్తూనే ఉండాలికదా? లేకపోతేనో?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
339
రోగము మరల మరల వృద్ధి చెందుతూ, తిరగబెడుతూ ఆ రోగికి బాధ కలిగిస్తూనే
ఉంటుంది కదా! అదే రీతిగా....
1. మనోగతములైన (మనస్సులో పేరుకొనియున్న) దృశ్య సంబంధమైన వాసనలు
(Tendencies that are being carried since long and that are thickly formed in
the inner zone)
2. అట్టి వాసనల ప్రభావముచేత తన్మూలములైనట్టి కర్మబంధము (బంధభావన).
పై రెండూ సంపూర్ణముగా నశించవు. నశించకపోతేనో? ధన-పుత్ర-కళత్ర-పేరుప్రతిష్ఠ ఇటువంటి ఆసక్తులు మనస్సులో ఉన్నంతవరకు మనస్సే పెత్తనం చెలాయిస్తుందే
గాని, దృశ్యమునకు-ద్రష్టకు సాక్షి అయినట్టి ఆత్మానుభవమునకు మనస్సు సహకరించదు.
దృశ్య విషయములపట్ల ఆసక్తమైన మనస్సు అల్పజ్ఞాని అయిన జీవుని స్వా-అర్ధము
(ఆత్మానుభవము) నుండి భ్రష్టునిగా చేయగలదు సుమా!
అందుకే దృఢమైన భక్తియోగమును, భక్తి గుణములను (అద్వేష్టా సర్వభూతానాం,
అమానిత్వమదంభిత్వం ఇత్యాది భక్తి-జ్ఞాన అభ్యాసములను) జీవుడు అభ్యసించ
వలసినదే!
శ్రీ ఉద్ధవుడు : శ్రీకృష్ణా! నాదొక సందేహము. ఒకానొకడు భక్తియోగ మార్గంలో నిన్ను
ఉపాసించడం ప్రారంభించికూడా, ఏకారణంచేతనో ఏవేవో చిక్కులవలన ఆ భక్తి
లక్షణములు అభ్యసించే మార్గములో అంతరాయాలు-విఘ్నాలు కలిగాయనుకోండి!
మీరు భక్తి మార్గాన్ని వదలకూడదని అంటున్నారు. మరి అట్టి విఘ్నములవలన యోగభ్రష్ట
డైతేనో? ఆతని గతి ఏమిటి? నిర్గతి కాదు కదా?
శ్రీకృష్ణుడు : ప్రియమిత్రమా! ఆయా విఘ్నముల వలన భక్తిమార్గమును కొనసాగించలేక
యోగభ్రష్టుడైనవాడు, మరల ఎప్పుడో ఏ సందర్భంలోనో భక్తియోగము యొక్క పూర్వస్థితి
నుండి పునః ప్రయత్నశీలుడగుచున్నాడు. జన్మాంతర సంస్కార బలంచేత మరల భక్తి
యోగ మార్గమునందు ఆసక్తుడౌతున్నాడు. ఇతఃపూర్వపు భక్తి మార్గమునందు ఎంతవరకు
కృతకృత్యుడై ఉంటాడో, అంతంతవరకు కర్మ మొదలైన దృశ్య వ్యవహారాదులందు
అనాసక్తుడవటం ప్రారంభిస్తున్నాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
340
ಅಜ್ಜಲು
ఈ జీవులు సామాన్యంగా పూర్వ సంస్కారములచే ప్రేరితులై ఆజన్మాంతరము
కర్మలయందు నిమగ్నులై ఉండటం జరుగుతోంది. అంతేకాదు! ఆయా కర్మలచే, వాటి
ఫలితములచే హర్ష-విషాదములు పొందటం, కొన్ని కర్మల ఫలితంగా మరికొన్ని కర్మల
పట్ల ఆసక్తులై ఉండటం కూడా జరుగుతూ ఉన్నది
విద్వాంసులు
అయితే ఆత్మతత్త్వమును ఎరిగిన విద్వాంసుల విషయం వేరుగా ఉంటోంది.
వారు దేహధారులై, దేహాంతర్గతులై, దృశ్యాంతర్గతులై ఉంటూ కూడా... స్వానుభవముచే
ఆత్మానంద పరితృప్తులై, నిరహంకారులై ఈ సంసార సంరభమునకు ఆవల సాక్షీభూతంగా
చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు. సర్వ సాంసారిక విషయములపట్ల మౌనము
అతీతత్వము వహించి ఉంటున్నారు. వారు సంసారమును పొందుటయే లేదు. పడవ
నీళ్ళలో ఉంటుంది. కాని పడవ తనలోకి నీళ్ళను రానిస్తుందా? విజ్ఞులగు విద్వాంసులు
సంసార వ్యవహారముల మధ్య దేహధారులై ఉండికూడా.... తమయందు సంసారము
రహితము చేసుకొన్నవారై ఉంటున్నారు.
శ్లో॥ తింష్ఠతం ఆసీనమ్ ఉత ప్రజంతం
శయానం ఉక్షంతమ్ అదంతమన్నమ్
స్వాభావ మన్యత్ కిమపీహమానమ్
ఆత్మానమాత్మస్థమతిః న వేద || (అధ్యా 28, శ్లో 31)
ఆత్మయందు - సర్వం ఆత్మస్వరూపంగా ఆస్వాదించుటయందు నిలకడ - నిశ్చలత
సంపాదించున్నట్టి మనుజుడు...,
ఈ దేహము ఉండటం - లేకుండటం,
కూర్చుని ఉండటం, నడుస్తూ ఉండటం,
స్వీకరించటం - విసర్జించటం,
-- …" అన్నమును భక్షించటం - త్యజించటం,
తదితరములైన సర్వ స్వాభావిక కర్మలు,
ఇవన్నీ నిర్వర్తించబడుచుండగా తాను ఏదీ నిర్వర్తించనివాడుగా - కర్మరహితునిగా
చూస్తూ అతీతుడై - యథాతథుడై ఉంటున్నాడు! అవన్నీ గుర్తించనివాడై (లేక) గుర్తిస్తూ
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
341
సంబంధించనివాడై ఉంటున్నాడు. కల కంటున్నవాడు, నిదురలేచిన "కలలో కనిపించినవి
నేను కోల్పోయాను కదా!" అని అనుకుంటున్నాడా? లేదు. "అవన్నీ వాస్తవమే కాదు! నా
ఊహాపరంపరలు రూపుదిద్దుకోగా అది అట్లు స్వప్నంలో కనిపించింది కదా!" అని తలచి
కలలో ఏదీ పొందనట్లు, ఏదీ త్యజించనట్లు (మెలుకువ వచ్చిన తరువాత) ఉంటున్నాడు
కదా!
అట్లానే వివేకవంతుడైనవాడు అసత్తగు ఇంద్రియ విషయ స్వరూప జగత్తును చూస్తూ
ఉండి కూడా... ఆత్మకు వేరైనదేదీ అంగీకరించడు.
అనగా...,
సర్వము ఆత్మ స్వరూపంగానే దర్శిస్తూ ఉంటాడు. ఆత్మ సర్వదా యథాతథము కదా!
మట్టిని ఎవ్వరైనా ఒక మట్టిబొమ్మగా తయారు చేస్తున్నప్పుడు ఆ మట్టి ఏదైనా
కోల్పోతోందా? ఆ బొమ్మ ఖండమై మరల మట్టిగా మారుచున్నప్పుడు మాత్రం? మట్టి
బొమ్మ ఏదైనా కోల్పోతోందా? రెండూ లేదు కదా! మట్టి బొమ్మగా మలచబడుచున్నప్పటికీ
మట్టి యథాతథం కదా! "ఆత్మ జగత్తు రూపంగా కల్పన చేయబడుచున్నప్పటికీ ఆత్మ
యథాతథం!" అని ఆత్మజ్ఞుడు గమనిస్తున్నవాడై ఉంటాడు!
శ్రీ ఉద్ధవుడు : కృష్ణయ్యా! ఈ జీవుడు ఆత్మయే వాస్తవ స్వరూపముగా కలిగి ఉన్నాడు
కదా! అట్టి నిర్మల అప్రమేయ ఆత్మతత్త్వమును అజ్ఞానము ఎక్కడినుండి వచ్చి
ఆవరిస్తోంది? మరల అది ఎట్లా తొలగుతోంది? అనగా బంధ - మోక్షములు ఆత్మకు
ఏ ఆవస్యకతచేత ఎట్లా ఏర్పడుచున్నాయి.
శ్రీకృష్ణుడు : (పకపక నవ్వుతూ) ప్రియ ఉద్దవా! ఆత్మకు బంధము లేదు! మోక్షము లేదు!
శ్లో॥ పూర్వం గృహీతం గుణకర్మ చిత్రమ్
అజ్ఞానమాత్మన్య వివిక్త మంగమ్
నివర్తతే తత్ పునరీక్ష యైవ
న గృహ్యతేనాపి విసృజ్య ఆత్మా! (అధ్యా 28, శ్లో 33)
ఆత్మ - విషయములచేతగాని, కర్మలచేతగాని, గుణములచేతగాని - కప్పబడటమూ
లేదు! అవి తొలగించబడటమూ లేదు. ఆత్మ దేనిచేతా స్వీకరించబడటమూ లేదు.
త్యజించబటమూ లేదు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
342
ఒక పలకపై రంగురంగుల బలపములతో ఒక పిల్లవాడు ఏవో బొమ్మలు చిత్రించి
తుడిచివేస్తూ ఉంటాడు చూచావా? ఆ పలకకు బలపములతో చిత్రించబడిన చిత్రముతో
సంబంధమేమన్నా వున్నదా?
ఆత్మ ఒకానొకప్పుడు లీలగా క్రీడగా స్వప్న స్వీకరణవలె తనయందు గుణ కర్మలను
స్వీకరించి వాటితో కించిత్ తన్మయము అవుతోంది! అవిచారణచే గుణ-కర్మసందర్భముల అభినివేశము ఆత్మచే స్వీకరించబడుతోంది. అనగా ఆత్మచే అన్యమైనది
గృహీతము అవుతోంది. అదియే అజ్ఞానముగా వేదాంత శాస్త్రముచే వర్ణించి
చెప్పబడుతోంది. అదియే సంసారము అనబడునది కూడా! ఆత్మ గురించిన తత్త్వ
జ్ఞానము ఏమరచటమే అజ్ఞానము - అనే శబ్దముచే ఉద్దేశ్యించబడుచున్నది. ఆ అజ్ఞానము
"ఆత్మకు సంబంధించిన జ్ఞానము, ఆత్మగా సర్వమును సందర్శించుటచే
తొలగిపోతోంది. అయితే... ఆత్మ దేనిచేత (అజ్ఞానముచేతగాని - జ్ఞానముచేతగాని)
స్వీకరించబడటమూ లేదు! విడువబడటమూ లేదయ్యా!" అజ్ఞానముకూడా
ఆత్మానందముయొక్క ఒకానొక విశేష చమత్కారం మాత్రమే అని ఆత్మజ్ఞాని
గమనిస్తున్నాడు.
ఒక దృష్టాంతం చెప్పుతాను. విను. ఒక బాటసారి ఒక ప్రదేశంలో ఆశీనుడైనాడు. అది
అర్ధరాత్రి. కటిక చీకటిగా ఉన్నది. చుట్టు ప్రక్కల ఎక్కడ ఏమున్నదో ఏమీ ఏమాత్రము
కనబడుటలేదు. కొంతసేపైన తరువాత సూర్యోదయం అయింది. ఇప్పుడు ఆ బాటసారి
కనులు తెరిచాడు. ఆహాఁ! ఒకవైపు కొండలు మరొకవైపు తటాకం. దగ్గిరలో వృక్షాలు.
పక్షులు ఇవన్నీ కనిపించసాగాయి. ఆ ప్రదేశమంతా పచ్చటి గడ్డి మొక్కలతో-పూల
మొక్కలతో బహుసుందరంగా కనిపిస్తోంది!
ఎప్పుడైతే చీకటి తొలగిందో... అంతా సుస్పష్టంగా కనిపించసాగింది. ఇప్పుడు చెప్పు!
సూర్యకాంతి క్రొత్తగా ఏదైనా సృష్టించిందా? లేక, రాత్రిపూట అంధకారము దేనినై
మ్రింగిందా? ఏదీ లేదు.
"ఆత్మ విద్య" అనే సూర్యుడు ఉదయించగానే అజ్ఞానము అనే చీకటి - బుద్ధి నేత్రము
నుండి తొలగిపోతోంది. "ఆత్మ జ్ఞానముచే - సర్వదా ఇతఃపూర్వమే సిద్ధంచియున్న,
అనునిత్య స్వస్వరూపతత్త్వమైన ఆత్మ తిరిగి అనుభవమునకు వస్తోంది" అని
అనవలసిందే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
343
జీవాత్మ ప్రకాశించబడుచున్నవాడు (That being exhibited / manifested)!
పరమాత్మయో-జీవాత్మను - జీవాత్మయొక్క సర్వ అనుభవములను ప్రకాశింపజేసే వాడు!
అట్టి పరమాత్మ ....
స్వయంప్రకాశకుడు (పరమాత్మను ప్రకాశింపజేసేది మరొకటేదీ లేదు. తనకు
తానే ప్రకాశిస్తోంది).
అజుడు (జన్మరహితమైనది). I
అప్రమేయుడు. (దృశ్యమునకు వేరై ఉన్నట్టి కేవల ద్రష్ట.
సర్వవ్యాపకుడు. (స్వప్న ద్రష్ట తన చైతన్య విశేషంచేత స్వప్న దృశ్యమంతా వ్యాపించి
ఉన్నట్లు).
చిత్సమూహుడు. ఎరుక అను కిరణములను ప్రదర్శించువాడు! (One who
emits the rays of knowing)
సర్వజ్ఞుడు {జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను, దృశ్య - దేహ - మనో - చిత్త -
|
బుద్ధి అహంకారాలను ఎరుగుచున్నవాడు. (one who is knowing all else)}
స్వజాతీయ - విజాతీయ భేదము లేనివాడు (మట్టితో కొన్ని బొమ్మలు చేస్తే ఆ
మట్టి- "ఈ మట్టి బొమ్మలు నావి ఆ మట్టి బొమ్మలు నావి కావు" అని
అనుకుంటుందా?)
అవాక్ మానస గోచరుడు
అట్టి పరమాత్మయొక్క ప్రేరణ (Inspiration) చేతనే ప్రాణములు - వాక్కు - - మనో
బుద్ధి - చిత్త అహంకారాలు ఇవన్నీ తమతమ స్థానాలలో ఉండి జగన్నాటకంలో
తమ తమ పాత్రలు నిర్వర్తిస్తున్నాయి.
అటువంటి అభిన్నము - వికల్ప రహితము అగు ఆత్మపట్ల ఇది జీవాత్మ - ఇది
పరమాత్మ అనే భేద కల్పన కూడా మనో భ్రమయే! ఎందుకంటే ఆత్మ ఏర్పరచుకొంటున్న
మనో భ్రమకు కర్తృత్వము - అధిష్ఠానము మరొకటేదీ లేదు.
పంచభూత సమ్మేళనము నామరూపాత్మకము అగు ఈ ద్వైతమును - ద్వైత
ప్రపంచమును కొందరు భాషాకోవిదులు - "ఈ పంచరంగుల నామరూపాత్మక దృశ్యము
ఈఈ కారణాలుగా సత్యమే..." అని అభివర్ణించటం - అదంతా అర్థరహితమగు వాక్
ఆడంబరము మాత్రమే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
344
44. యోగాభ్యాసంలో అడ్డంకులు తొలగించుకోవటం ఎట్లా?
శ్రీ ఉద్ధవుడు : శ్రీకృష్ణ స్వామీ! ఒకడు యోగాభ్యాసం సందర్భంలో ఆ ఆ యోగసాధన
కొనసాగించుచూ... ఇంకా యోగసాధన ముగియకముందే (పూర్తికాకుండానే) ఏవైనా
అనారోగ్యము - మొదలైన ఉపద్రవములు వస్తూ ఉంటే అప్పుడు ఆ యోగి ఏ
ఉపాయములు అనుసరించాలి? వాటిని ఆతడు ఎట్లా ఎదుర్కోవాలి?
శ్రీకృష్ణుడు : మనం ఆత్మతత్త్వమును చర్చిస్తున్నాం. నీవేమో యోగులు భౌతికమైన
ఇబ్బందులకు ఏ ఉపాయాలు (క్రియా యోగసాధనా సమయంలో) ఆశ్రయియించాలి...
అని ప్రశిస్తున్నావు! సరే చెప్పుతాను. విను.
వారు..., (యోగాభ్యాసులు)
శీతోష్ణ తాపములను : సూర్యోపాసన-చంద్రోపాసనల (సూర్య చంద్ర ధారణోపాసనల
సహాయంతో) అధిగమిస్తున్నారు. నేనే సూర్య చంద్రుల స్థానంలో ఆత్మ స్వరూపుడనై
ఉన్నాను కదా! ...అనే భావనను ఆశ్రయిస్తున్నారు. తద్వారా శీత-ఉష్ణ సంబంధమైన
బాధను జయించివేస్తున్నారు!
వాతము - పిత్తము - ఇత్యాది శారీరక రుగ్మతలను: ఆసనము - ప్రాణాయామముల
ద్వారా జయిస్తున్నారు.
బాహ్యమైన నిరోధములను : తపస్సు - మంత్రములద్వారా దూరంగా ఉంచుచున్నారు.
దేహబాధలను - బాహ్యమైన ఔషధము - పౌష్ఠికాహారము - - జలము పండ్లరస -
పానీయముల వంటివాటిచే నిరోధిస్తున్నారు. బాధకు సాక్షిగా వుండటమనే అభ్యాసము
కూడా నిర్వర్తిస్తున్నారు!
కామము మొదలైన విఘ్నములను నన్ను ధ్యానిస్తూ కృష్ణతత్త్వమును బుద్ధితో
గ్రహిస్తూ ఎదుర్కొంటున్నారు. కామము మొదలైనవి పసిపిల్లలవలె వాత్సల్యముగా
మార్చుకోవటంచేత తప్పక జయించవచ్చు.
క్రోధ-లోభ-మోహాలను : శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానందం... ఇటువంటి నామ
సంకీర్తనల ద్వారా అణచి - రహితం చేసుకుంటున్నారు.
అశుభ ప్రదములగు దంభము మొదలైన వాటిని -మహనీయులగు యోగీశ్వరులను
దర్శించి వారి బాటను అనుసరించి క్రమంగా త్యజిస్తున్నారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
345
ఈవిధంగా యోగులు యోగసాధనకు ఉపకరణము అగు ఈ భౌతిక దేహమును
స్థిరంగాను, ఆరోగ్యవంతంగాను, రోగరహితంగాను చేసుకొంటున్నారు. ఇంకొందరు
యోగులు పరకాయ ప్రవేశము ద్వారా ఉపాధి పరంపరలను ఆశ్రయిస్తూ యోగసాధన
కొనసాగించటం కూడా జరుగుతోంది. ఒక దేహం శిధిలం అవుతూ ఉంటే ప్రకృతి
నిర్మితమైన మరొక ఉపాధిలో ప్రవేశించి ధారణ కొనసాగిస్తున్నారు. మరికొందరు
యోగసాధకులు ప్రకృతిలోను - వాయువులోను ప్రకృతిచే ప్రక్షిప్తం చేయబడిన ఔషధ
రసాలను ప్రాణాయమాది ప్రత్నములతో స్వీకరించి ఈ భౌతిక దేహములో మనోచిత్త
హస్తములతో తెచ్చి నింపి నిత్యయౌవ్వనులై యోగసాధన కొనసాగిస్తున్నారు కూడా!
అయితే..., దేహసంబంధమై... ఆత్మ విద్యాకోవిదుల అవగాహన మరొకవిధంగా
వుంటోంది!
శ్లో॥ నహి తత్కుశలాదృత్యం తదాయాసోహి అపార్థకః
అంతవత్వాత్ శరీరస్య ఫలస్యేవ వనస్పతేః || (అధ్యా 28, శ్లో 42)
వారు ఈ భౌతిక దేహ సంరక్షణకై ఉద్దేశ్యించిన ఔషధములను రసములను,
మంత్రములను, పరకాయ ప్రవేశమువంటి ఉపయోగసాధనములను పెద్ద
విషయములుగా లెక్కలోకి తీసుకోరు. ఎందుచేత నంటావా?
ఆత్మ వృక్షమువలె స్థిరమైనది.
ఈ భౌతిక దేహములో? - ఫలములవలె (Like fruits) నశ్వరము (Physical
body is any way time-bound)
అందుచేత "ఈ భౌతికదేహమును స్థిరంగాను, యౌవనవంతముగాను సుదీర్ఘకాలం
ఉంచాలి! తద్వారా క్రియా యోగ సాధన సుదీర్ఘకాలం కొనసాగించాలి ..." అని ఎవ్వరైనా
సరే మరీ పట్టుదలగా అనుకుంటే అదంతా నిరర్ధకమేనని గుర్తుచేస్తున్నాను.
నిత్యము యోగసాధనచేస్తూ ఉండే అభ్యాసపరులకు ఈ దేహము సుదృఢంగాను,
ఆరోగ్యంగాను, ఉత్సాహవంతం గాను, నైరాస్యరహితంగాను, గొప్ప ఉపకరణంగాను
ఉండగలదనుమాట నిర్వివాదాంశమే!
అయినప్పటికీ, బుద్ధిమంతులగు యోగాభ్యాసులకు యోగానుష్ఠానము పైనే శ్రద్ధ-ధ్యాసలు
ఉంటాయి. అంతేగాని నశ్వరము-వినాశన శీలము అగు ఈ భౌతిక దేహముపై కాదు!
"దీనిని ఎట్లా రక్షించుకుంటామురా బాబూ!..." అనే విషయం మీద కాదు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
346
శ్లో॥ యోగచర్యాం ఇమాం యోగీ విచరన్ మదపాశ్రయః
నాంతరాయైర్విహన్యేత నిఃస్పృహః స్వసుఖానుభూః ॥ (అధ్యా 28, శ్లో 44)
సర్వాంతర్యామిని - సర్వతత్త్వ స్వరూపుడను యోగి యొక్క స్వస్వరూపమునకు
అభిన్నుడను - అగు..., నన్ను ఆశ్రయించుచున్న యోగి,
అంతరాయములు అవే వస్తాయి. అవే పోతాయి! నా కార్యక్రమమును అవి నిరోధించవు.
నిర్దేశించవు!
అని భావిస్తూ లోకరీతులకు, దేహములకు, సందర్భములను, సంగతులకు సర్వదా
అతీతుడై భక్తి-క్రియాయోగసాధనలను కొనసాగిస్తూ ఉంటాడు. సర్వలౌకిక విషయాలకు
అతీతుడు - నిస్పృహుడు అయి ఉంటాడు. విఘ్నములు ఆతనిని జయించలేవు. పట్టుదల
కలవారికి దేహబాధలు దైనందికమైన స్వల్ప విషయాలుగా అనిపిస్తూ ఉంటాయి.
దేవభక్తులు-రాజభక్తులు అగు యుద్ధవీరుల విషయంలో ఇట్టిది గమనిస్తాము కదా!
మత్ప్రసాదముచే సర్వ విఘ్నములను ఆతడు తప్పక జయిస్తున్నాడు. "కొంచము ఓపిక
పడితేచాలు..." అని ఆతడు గ్రహించి ఉంటున్నాడు.
ఈ దేహముల ఆయురారోగ్య వ్యవహారములు, కష్ట సుఖములు ఆతని ధారణకు
ఎటువంటి విఘ్నములు కలిగించ జాలవు.
లక్ష్య శుద్ధి కలవానికి విఘ్నములు ఏమి చేస్తాయయ్యా! మిత్రమా! లక్ష్యశుద్ధి లేనివానికి
ఆతనియొక్క అల్పమైన ఆశయములే ఆతని నిజమైన విఘ్నములు
45. భాగవత ధర్మములు - భక్తియోగ సాధనములు
శ్రీ ఉద్ధవుడు : ఓ అచ్యుతా! మనస్సు స్వాధీనంలో లేనంతకాలము మానవుడు మీరు
బోధించే యోగ-భక్తి సాధనలు అనుష్ఠించటం చాలా కష్టమేమోనని నాకు
అనిపిస్తోందయ్యా!
అందుచేత..., ఈ సందర్భములో
కొంత అనాయాసంగా పురుషుడు ఉత్తమసిద్ధిని పొందటానికి సులభము - సుగమము
అయిన సాధనములను బోధించవలనసినదిగా నిన్ను అర్థిస్తున్నాను!
ఎందుకంటావేమో? పుండరీకాక్షా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
347
యోగులు కొందరు తమ మనస్సును సమాధానపరచుకోవటానికి - నిగ్రహపరచుకోవటానికి
ప్రయత్నిస్తున్నప్పటికీ... వారు ఆ కార్యక్రమములో కృతకృత్యులు కాలేకపోవటం కొన్నిచోట్ల
జరుగుతోంది! "మేము ఆశయము యోగసాధనలలో పటిష్టులము కామేమో!" -
అని కూడా మాకు అనిపిస్తోంది.
ఓ కమలనయనా! విశ్వేశ్వరా!
ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఈ దృశ్యమును అధిగమించిన కొందరు
సార-అసార వివేకులు సంపూర్ణమగు ఆశయముగా ఆనందము కలిగినవారై నీ
పాదపద్మములను సుఖముగా హాయిగా ఆశ్రయిస్తున్నారు!
కుయోగులు అల్పబుద్ధి అల్పయోగ సంపన్నులు "మేము క్రియాయోగమే
ఆశ్రయిస్తాం!..." అని తలచి తత్ కర్మలయందు అభిమానము అభిమ
కలిగియున్నవారై ... నీ చరణకమలములను ఆశ్రయించక పోవటాన్ని (భక్తి యోగం
ఆశ్రయించక పోవటం) కూడా కొందరి విషయంలో చూస్తూ ఉంటాం! వారు
మాయామోహితులై, నీయొక్క మాయకు బద్ధులై ముక్తిని కాంచలేకపోతున్నారేమోనని
నాకు అనిపిస్తోంది.
నిఖిల బాంధవా! అచ్యుతా! అది అట్లా ఉండగా...,
బ్రహ్మ - శివుడు మొదలైన దేవతలు కూడా ప్రకాశమానమగు కిరీటములు ధరించి
తమ శిరస్సులను వంచి మీ పాదపద్మములకు నమస్కరించి మిమ్ములను విష్ణులోకానికి
తిరిగి రమ్మని ఆహ్వానించటం ఈ ఉదయం నేను గమనించాను.
నీవు భక్త వత్సలుడవు. నీకు అయినవారు లేరు. కానివారు లేరు. అందరు నీవారే!
శరణన్నవారిని తప్పక రక్షిస్తావు. అటువంటి నీవు (రామావతారములో) వానరులతో
స్నేహం చేశావు. (ఈ అవతారములో) - అనన్య శరణార్హులైనట్టి నందుడు, గోపికలకు,
(వామనావతారంలో) - బలిచక్రవర్తి మొదలైన వారికి అధీనుడవైయ్యావు.
ఇందులో ఆశ్చర్యమేమున్నది? భక్తులకు వశుడవై ఉండటం, వారిని సర్వవిధాల
రక్షించటం నీ స్వభావమే కదా!
ఎవ్వరైనా సరే, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు మొదలైన వారిపై నీవు చూపిన వాత్సల్యము
- అనుగ్రహము తెలియజేసే విశేషకథలను విన్నతరువాత, సర్వతత్త్వస్వరూపుడవు -
సర్వజీవుల యొక్క ప్రియ అంతర్యామివి - ఈశ్వరుడవు, చతుర్విధ పురుషార్ధములను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
348
ప్రసాదించు వాడవు అని గమనించిన తరువాత - నిన్ను వదులుకుంటారా? తెలివితక్కువ
వారౌతారా? లేదు. లేదు.
అది అట్లా వుండగా, కొందరైతే నీవు ప్రసాదిస్తున్న స్వర్గలోక సుఖములు చూచుకొని
తెలివితక్కువగా నిన్నే మరుస్తున్నారు! తెలివిగలవాడెవ్వడైనా నిన్ను వదలుకొని
స్వర్గలోకాలు కోరుకుంటాడా? లేనేలేదు. కోరుకోడు!
నీ పాదధూళిని ఆశ్రయించి సేవించే మాకు ఇంకేమి కొదువ?
దేవా! ఎవ్వరైతే నిన్ను భక్తితో శరణువేడతారో... వారి అశుభములను, విఘ్నములను,
విషయవాసలను తొలగిస్తున్నావు. బయట ఆచార్యరూపంగాను, లోపల అంతర్యామిగాను
ఉండి, నీ నిజరూపమును మాకు ప్రసాదిస్తున్నావు.
మాయందే శ్రీకృష్ణతత్త్వమును ఆశ్రయిస్తున్నట్టి మేము భక్తి అనే పరమానందమునందు
నిమగ్నులమై బ్రహ్మజ్ఞాన సంపన్నులం అగుచున్నాము. కల్పాంతము వరకు నీ
నియమానుసారంగా నీ సేవయందు నియుక్తులమగుచున్నాము. నీవు ప్రసాదిస్తున్నది
స్మరిస్తూ పరమానందమును అనుభవిస్తున్నాము. అందుచే శ్రీకృష్ణా! నీ ఋణమునుండి
మేము విముక్తులము అయ్యే ప్రసక్తే లేదు!
శ్రీ శుకమహర్షి : ఓ పరీక్ష్మణ్మహారాజా! ఓ సుభికులారా! ఈవిధంగా అంతరాంతరంగ
అనురక్తచిత్తుడు - భక్తి పారవస్యముతో హృదయమును నింపుకున్నవాడు అయినట్టి
ఉద్దవుడు అనేక స్తోత్రాలు శ్రీకృష్ణ భగవానుకి సమర్పించాడు. ఈ జగత్తంతా తనకు
క్రీడోపకరణం అయినవాడు, స్వశక్తిచే త్రిమూర్తులుగా ప్రదర్శనమగుచు లోకములకు -
సర్వజీవులకు ఆనంద ఐశ్వర్యములను ప్రసాదించువాడు, బ్రహ్మవంటి సృష్టికర్తకు కూడా
ఈశ్వరుడు అగు శ్రీకృష్ణుడు ముగ్ధమనోహరముగా నవ్వుచూ ప్రేమగా ఈవిధంగా
పలికాడు.
శ్రీకృష్ణ భగవానుడు : ప్రియ ఉద్ధవా! సర్వజనావళియొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని
"నిన్ను చేరటానికి సులభమైన మార్గము చెప్పు!" అని నన్ను కోరావు. సహజీవుల పట్ల
నీవలె ప్రేమ-వాత్సల్యము కురిపించువారంటే నాకు చాలా ఇష్టము.
మరణశీలుడగు మానవుడు ఏ శ్రద్ధతో ఏఏ ధర్మములను ఆచరించటంచేత అతి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
349
దుర్జయమగు మృత్యువును కూడా సులభముగా జదయించటానికి సమర్ధుడు అగుచున్నాడో
అట్టి భాగవత ధర్మములు గురించి చెప్పుచున్నాను. శ్రద్ధగా విను.
శ్లో॥ కుర్యాత్ సర్వాణి కర్మాణి మదర్థం శనకైః స్మరన్
మయ్యర్పిత మనశ్చిత్తో మద్దర్మాత్మమనోరతిః ॥ (అధ్యా 29, శ్లో 9)
ఎవ్వరు ఏ వర్ణాశ్రమ ధర్మములోనైనా ఉండవచ్చుగాక! "నాకు నియమితమైన నా ఈ
స్వధర్మ-కర్మలను సర్వాంతర్యామియగు పరమాత్మకు ప్రేమతో - భక్తితో సమర్పణగా
నిర్వర్తించెదను గాక!..." అను భావాలతో ఆచరిస్తూ ఉండుగాక! శాంత మృదు భావాలతో
నాయందే మనోవృత్తులను నిలిపి, నాపట్ల సర్వదా అనురక్తులై నన్నే ధ్యానించుచు
నాకొరకే అనువర్తించటమే సులభమైన మార్గము. ఎందుకంటే, జీవునకు కర్మ నిర్వహణ
ఎటుతిరిగీ అనివార్యం కదా! "ఇది నా భగవదోపాసనయే (This work is my worship
towards Al-Pervading Divine Presence)" అని భావించి కర్మలు నిర్వర్తించటంలో
కష్టమేముంటుంది చెప్పు!
ఎక్కడ నివసించాలి : ఎక్కడైతే నా భక్తులు నివసిస్తూ ఉంటారో... అది పవిత్రమైన
పుణ్య ప్రదేశము. దేవతలలోను, మానవులలోను, అసురులలోను, వారిమధ్యగల నా
భక్తుల ప్రవర్తన - సంభాషణలే అనుసరణీయాలు. భక్తులున్నచోట నేనుంటాను!
స్వామి ప్రీతి కొరకై : నా ప్రీతికొరకై నృత్య - గీత - వాద్యాదులను చక్కగా నిర్వర్తించి
ఒంటరిగా గాని, ఇతరులతోగాని కలసి యాత్రలు, మహోత్సవములు నిర్వర్తిస్తూ
ఉండెదరుగాక!
పరమాత్మ దర్శనం : నన్ను దర్శించటమంటే భౌతిక రూప సందర్శనమాత్రం కాదు
సుమా! "ఈ కనబడేవారంతా కృష్ణచైతన్య స్వరూపులే..." అను భావన రూపుదిద్దు
కోవటమే అది! సర్వము పరమాత్మయొక్క ప్రత్యక్షరూపంగా దర్శించటమునే ఆత్మ
సాక్షాత్కారము అని, శ్రీకృష్ణ సాయుజ్యము అని చెప్పబడుతోంది. ఆకాశమువలె లోపల
- బయట (అంతర్బహిశ్చ తత్సర్వమ్) పరిపూర్ణుడనై ఉన్నవాడను, ఆవరణ శూన్యుడను,
ఈశ్వరుడను అగునన్ను ఎవ్వడైతే తనయందును, సర్వ సహజీవులయందును,
సర్వమునందును సదా సందర్శిస్తూ ఉంటాడో.... ఆతడే నన్ను దర్శిస్తున్నటు! అదియే
భగవత్ దర్శనము. భాగవతుల మహదాశయము!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
-
350
పండితుడు : ఎవ్వరైతే...
కేవలము ఆత్మజ్ఞానమును ఆశ్రయించి,
సర్వభూతములందును నారూపమే ఉన్నదని గమనించి, భావించి,
సమదర్శి అయి |
విద్యావినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును, |
చండాలుడు అని చెప్పబడువానియందు, |
ఒక దొంగయందు,
గొప్ప దానగుణము గల దాతయందు,
|
ఆ దానము స్వీకరిస్తున్న భోక్తయందు,
|
సూర్యునియందు, |
ఒక నిప్పురవ్వ యందు, |
ఒక పరమ శాంత చిత్తునియందు,
ఒక క్రూరునియందు
అంతటా - అన్నిటా, నన్నే సర్వస్థితి - గతులయందు సందర్శిస్తూ ఉంటాడో...
ఆతడే నిత్యానిత్య వివేకియగు పండితుడు! అతడే శ్రీకృష్ణ తత్త్వ సందర్శనుడు!
ఓ ఉద్ధవా! సములు (Peers) - ఉత్తములు (Great People) - హీనులు (Ordinary
People) అగు సర్వ మానవులయందు, సర్వ జీవరాసులయందు నేనే ఉన్నానని
- ఆ భావించు. అప్పుడు ఆ మరుక్షణం అహంకారము అహంకాముతోపాటు స్పర్థ,
స్పర్ధతోబాటు అసూయ తిరస్కార భావాలు మొదలైనవన్నీ స్వభావసిద్ధంగానే
వినష్టమైపోగలవు.
శ్లో॥ విసృజ్య స్మయమానాన్ స్వాన్ దృశం వ్రీడాం చ దైహికీమ్
ప్రణమేద్దండవత్ భూమావ అశ్వచాండాలగోఖరమ్ || (అధ్యా 29, శ్లో 16)
బంధువులు చేసే పరిహాసాలను పట్టించుకోకుండా "సర్వభూతములందు పరమేశ్వరు
డున్నాడు" అను బుద్ధితో ఒక బిచ్చగానికి, అపరిచయస్తునికి, చండాలునికి, ఒక కుక్కకు,
గోవుకు, గాడిదకు... అట్లాగే తదితర సర్వజీవులకు భూమిపై పడి సాష్టాంగ దండ
ప్రమాణము మనస్సుతోనో - దేహంతోనో చేస్తూ వుండు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
351
"నేను కొందరు-కొందరు కంటే అధికుడను! నా నిపుణత కొంత - కొంతమందికి ఎట్లా
వస్తుందిలే! వారి-వీరి ముందర నన్ను ఎవ్వరైనా తక్కువ చేసి మాట్లాడితే నాకు సిగ్గు,
కోపం!".... ఇటువంటి అహంకారము-లజ్జలను సమరసభావన అనే జలంతో
పరిశుద్ధము చేసుకోవాలి.
శ్లో॥ యావత్ సర్వేషు భూతేషు మద్భావోనో పజాయతే
తావత్ ఏవమ్ ఉపాసీత వాజ్మనః కాయవృత్తిభిః || (అధ్యా 29, శ్లో 17)
ఎంతెంతవరకైతే సర్వప్రాణులయందు భగవత్ భావన నీయందు సుస్థిరంకాదో....
అంతంత వరకు మనో-వాక్-కాయ కర్మలచే, ఆయా ప్రణామాదులు-ఉపదేశములు
- సాధనములను ఆశ్రయించటం ద్వారా నన్ను ఉపాశిస్తూనే ఉండాలయ్యా!
ఈ దేహము ఉన్నప్పుడు - ఇది పోతున్నప్పుడు - మరొక దేహం వస్తున్నప్పుడు కూడా
ఉపాసనను విడువరాదు.
ఆవిధంగా ఉపాసించువాడు క్రమంగా ఆత్మబుద్ధికి సంబంధించిన విద్యను మరల మరల
అభ్యసిస్తూ సర్వము బ్రహ్మాత్మకమే!... అని భావిస్తూ, సంశయములను
తొలగించుకుంటూ..., ఇక ఆపై సర్వ క్రియలనుండి విరమితుడు కాగలడు!
సులభోపాయం!
ఉపాయాలన్నిటిలో..., సర్వభూతములయందు నన్నే - నన్నే సర్వభూతములుగా
సందర్శించటం గొప్పదైన, సులభమైన మహత్ ప్రభావము అయిన ఉపాయం! అని
నా అభిప్రాయం. ఇదియే ముఖ్యమైన భాగవత ధర్మము. అనుకుంటూ-అనుకుంటూ
వుంటే,.... అనిపించక ఏం చేస్తుంది?
ఎక్కడైతే నిష్కామమగు భాగవత ధర్మము అభ్యసించటం - అనువర్తించటం ప్రారంభ -
మౌతుందో..., అక్కడ ఇక ద్వేషము - అసూయ - కోపము - బాధించటం ఇత్యాది
దుర్గుణములకు చోటు ఉండదు! ఎందుకంటే సర్వజ్ఞుడనగు నేను దుష్టభావములన్నీ
మొదలంట్ల తొలగించటంలో తోడుగా ఉంటాను కనుక! నేనే తొలగిస్తాను కనుక!
శ్రీ ఉద్ధవుడు : శ్రీకృష్ణా! నీకు ఏఏ కర్మలు సమర్పించాలి. ఎటువంటి ఎటువంటి
కర్మలు నీకు సమర్పించటానికి అర్హము కాదు? వివరించ ప్రార్థన!
శ్రీకృష్ణుడు : సర్వకర్మలు నన్ను ఉద్దేశ్యించి నాకు సమర్పించటానికి సంసిద్ధమై "పరమాత్మా!
ఈ కర్మ ద్వారా నిన్ను ఉపాసిస్తున్నానయ్యా!" అని పలికి నిర్వర్తిస్తే.... అట్టి కర్మలు ఏవైనా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
352
సరే పవిత్రమే కాగలవు.
భయము-శోకము-దుఃఖము-అవమానము మొదలైనవి గాని
ఆ భయ - శోకాదులతో కలిగిన పలాయనము-ఆక్రందనము మొదలైన
కార్యములు కాని,
అవన్నీ కూడా ఆత్మ రూపుడనైనట్టి నన్ను ఉద్దేశ్యించి అనన్యభావంతో నిర్వర్తిస్తే...
అవికూడా త్వరితగతిని ధర్మ స్వరూపములు - కర్మ పుష్పములు కాగలవు. అందుచేత,
ఏ కర్మచేసి నాకుడా... "ఇది నీకే ప్రేమతో సమర్పిస్తున్నానయ్యా!..." అని భావించువాని
కర్మ మార్గమును నేను తప్పక సరిచేసుకుంటాను. అందుచేత, అవినాశనము - సత్యము
అగు నా తత్త్వమును గ్రహించి నన్నుపొందటమే...,
బుద్ధిమంతుల సుతీక్షబుద్ధి యొక్క సత్ప్రయోజనము,
చతురులలోని చతురతయొక్క సత్ఫలము.
నశ్వరము-అసత్యము అగు ఈ భౌతిక దేహము ధరించినందుకు సద్వినియోగము!
ఫలశ్రుతి
విన్నావు కదా! ప్రియ ఉద్ధవా! నాకు భక్తుడువగుటచేత, ప్రేమ-వాత్సల్యములతో నిండిన
పరమసాత్వికుడవు అవటంచేత - దేవతలకు కూడా దుర్రాహ్యమైనట్టి బ్రహ్మతత్త్వమును
సంగ్రహంగా, సంక్షిప్తంగా, కొన్ని కొన్ని విషయాలుకొంతవివరంగా కూడా ఇప్పుడు
నీకు చెప్పాను. విస్పష్టము, యుక్తియుక్తము అయినట్టి ఆత్మసందర్శన - ఆత్మసాక్షాత్కార
విశేషాలు విన్నావు కదా! ఈ విషయాలు తెలుసుకొన్నవారు సంశయరహితులౌతారు!
ముక్తిని పొందగలరు.!
మన ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదములోని నీ ప్రశ్నలు నేనిచ్చిన సమాధానాలు ఎవ్వరైతే
పరిశీలించి సారమును గ్రహిస్తారో, అట్టివారు సనాతనము - పరమ రహస్యము అగు
బ్రహ్మమును పొందగలరు.
నేను నీకు ఈ సందర్భములో ఉపదేశించిన ఆత్మతత్త్వ జ్ఞానమును ఎవ్వరైతే నా భక్తులకు
అందజేస్తారో...,
శ్లో॥ య ఏతన్మమమ భక్తేషు సంప్రదద్యాత్ సుపుష్కలమ్
తస్యాహం బ్రహ్మదాయస్య దదామి ఆత్మానమాత్మనా || (అధ్యా 29, శ్లో 26)
అట్టి జ్ఞానోపదేష్టకు ప్రేమగా నన్ను నేనే సమర్పించుకుంటాను సుమా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
353
ఎవ్వరైతే పరమపవిత్రము - చిత్తశోధకము - మనో శుచి ప్రదాయకము అగు మన ఈ
తత్త్వశాస్త్ర సంవాదమును ఎలుగెత్తి తాను పఠిస్తూ - ఇతరులకు చక్కగా శ్రద్ధగా శ్రావ్యమైన
పలుకులతో వినిపించుతాడో ఆతడు పవిత్రుడౌతాడు. అంతేకాకుండా శ్రోతలకు కూడా
జ్ఞానకాంతి దీపమును వెలిగించి వారివారి అజ్ఞానాంధకారమును పటాపంచలు
చేయుచున్న నిపుణుడు అవుతాడు. స తరతి! స తారయతి!
శ్లో॥ య ఏతచ్ఛద్ధయా నిత్యమవ్యగ్రః శృణుయాన్నరః
మయిభక్తిం పరాం కుర్వన్ కర్మభిర్న స బధ్యతే ॥ (అధ్యా 29, శ్లో 28)
ఎవ్వరైతే సావధానముగాను - శ్రద్ధగాను అనుదినము మన ఈ సంభాషణను శ్రవణం
చేస్తారో... వారు నాయందు స్వభావసిద్ధమైన భక్తి ప్రపత్తులను పెంపొందించుకొన
గలరు. తద్వారా కర్మబంధములనుండి సులభంగా విముక్తిని పొందగలరు!
మిత్రమా! ఉద్ధవా! నేను చెప్పిన ఈ బ్రహ్మతత్త్వము నీకు వినటానికి సులభముగానే
ఉన్నదికదా? తేలికగా అవగతం అయిందికదా! నీ మోహము, శోకము, వేదన
తొలగినాయా?
శ్రీ ఉద్ధవుడు : ధన్యోస్మి స్వామీ! ధన్యోస్మి. మీరు నాకు ఇప్పుడు చెప్పియున్న తత్త్వసార
విశేషాలను అనేకులకు బోధిస్తూ... వారితోపాటు నేను ధన్యుడను అవుతాను.
అధ్యయనుడను అవుతాను.
శ్రీకృష్ణుడు : ఈ తత్త్వ రహస్య సమన్వితమైన సంవాద విశేషాలను నీవు..., దాంభికునికి
నాస్తికునికి - మోసము చేయు స్వభావము గలవానికి, వినటానికి ఇష్టం లేనివానికి
- భక్తి లేనివానికి, శుశ్రూష (సేవా) నిరతి లేనివానికి, దుర్నీతి పరునికి.... ఉపదేశించవద్దు
సుమా! ముఖ్యార్ధానికి సంసిద్ధులు కానందువల్ల వారిపట్ల బూడిదలో పోసిన పన్నీరే!
ఆ తీరైన దోషములను సన్నగిల్లచేసుకొన్న వానికి, బ్రాహ్మణులకు - భక్తులకు, సాధు
స్వభావులకు, శుచి అయిన భావములు ఆశయములు కలవానికి తప్పకుండా
ఉపదేశించు. నాయందు భక్తి ఉన్నచో ... స్త్రీ - శూద్రులు కూడా ఈ బ్రహ్మతత్త్వ
జ్ఞానము వినటానికి అర్హులే అని అనటంలో కించిత్ కూడా సందేహం లేదు.
అమృతము త్రాగినవానికి ఇంక క్రొత్తగా త్రాగవలసిన పానీయము ఏముంటుంది?
అట్లాగే... మన ఈ సంభాషణాసారమైన ఆత్మజ్ఞాన విశేషాలను చక్కగా తెలుసుకున్న
తరువాత...,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
354
నైతద్విజ్ఞాయ జిజ్ఞాసోః జ్ఞాతవ్యం అవశిష్యతే |
పీత్వా పీయూషమమృతం పాతవ్యం నావశిష్యతే ॥ (అధ్యా 29, శ్లో 32) II
క్రొత్తగా తెలుసుకొనవలసినదేముంటుంది? ఇదంతా పరిశీలించిన శ్రోతలకు వారివారి
అర్హతను ఆశయమును అనుసరించి జ్ఞానము - కర్మ - యోగము - వాణిజ్యములకు
సంబంధించిన చతుర్విధ (4 రకములైన) ధర్మార్థకామమోక్ష పురుషార్ధ ఫలములు
లభించగలవు. ఇక నీవంటి అనన్యభక్తునికైతే ... చతుర్విధపురుషార్ధ ఫలములుగా
నేనే అగుచున్నాను.
ఒక్క సారవాక్యం మరొక్కసారి విను.
శ్లో॥ మరో యదా త్యక్త సమస్తకర్మా
నివేదితాత్మా విచికీర్షితో మే
తదామృతత్వం ప్రతిపద్య మానో
మయా 2 2 త్మ భూయాయ చ కల్పతే వై ॥ (అధ్యా 29, உஉ (అధ్యా 29, శ్లో శ్లో 34)
సర్వ కర్మలు నాయందు వదలి, సర్వ కర్మలను మనస్సుచే త్యజించి - సమర్పించిసర్వము నాకు సమర్పణ చేసినవాడు.... యోగులకంటే - జ్ఞానులకంటే కూడా నా
ఇచ్ఛచే మిక్కిలి జ్ఞాన సంపన్నుడు కాగలడు.
క్రమంగా అమృతత్వమగు ఆత్మతత్త్వమే తానై వెలుగొందగలడు! నాతో సమానమైన
మమాత్మా సర్వ భూతాత్మా అను ఐశ్వర్యమునకు అర్హుడగుచున్నాడు.
శ్రీ శుకమహర్షి : ఓ మహనీయులు - తత్త్వస్వరూపులు అగు శ్రోతలారా! సభికులారా!
శ్రీ ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదమగు మహత్తర తత్త్వశాస్త్ర సారవిశేషాలు మీముందు
ఉంచగలగడం శ్రీకృష్ణ ప్రసాదితమైన మహత్తరమైన అవకాశంగా భావిస్తూ సభలోని
మాన్యులకు - పెద్దలకు పేరుపేరున నమస్కరిస్తున్నాను.
ఆవిధంగా సంపూర్ణముగా శ్రీకృష్ణ ప్రవచనమైనట్టి యోగ మార్గోపదేశమును పొందినట్టి
మహనీయుడగు ఆ ఉద్దవుడు భాష్పపూరితలోచనుడయ్యాడు. సత్పురుషులచే మనసావాచా సేవించబడుతూ కీర్తించబడే శ్రీకృష్ణబోధ విని ప్రీతిచే రుద్ధమైన కంఠము
కలవాడయ్యాడు. అంజలి బద్ధుడైనాడు. కాసేపు ఏమీ మాట్లాడలేక పోయాడు!
క్రమంగా ప్రేమతో నిండిన చిత్తముతో మాట్లాడటానికి సంసిద్ధుడైనాడు. కృతార్ధ స్మి!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
355
నేను కృతార్ధుడను అయ్యాను కదా!.... అని భావించి లేచి శ్రీకృష్ణుడిని సమీపించాడు.
భగవానుని పాదపద్మములను శిరస్సుతో స్పృశిస్తూ కృతాంజలి సమర్పించాడు. ఇట్లు
పలుకసాగాడు.
శ్రీ ఉద్ధవుడు : దేవదేవా! ఆది పురుషా! ఆత్మబంధూ! అస్మత్ చైతన్యాత్మ స్వరూపమా!
శ్రీకృష్ణా! మిత్రమా! సద్గురూ!
శ్లో॥ విద్రావితో మోహ మహాంధకారో ||
య ఆశ్రితో మే తవ సన్నిధానాత్
విభావసోః కిం ను సమీపగస్య
శీతం తమో భీః ప్రభవంత్య జాద్య ॥ (అధ్యా 29, శ్లో 37)
మోహాంధకారములో సుదీర్ఘకాలంగా పడియున్న నేను నీ సాంగత్యం చేత, తత్త్వ
సంభాషణా మాధుర్యము చేత ఉత్సాహ వర్ధనుడనయ్యాను! ఉత్సాహవర్ధనమహమ్!
చీకట్లోంచి నీ సాన్నిధ్యం వైపుగా బయల్వెడలి వచ్చేశాను! సూర్యునియొక్క - అగ్ని
యొక్క సమీపము పొందినవానిపట్ల ఇక చలి-చీకటి-భయము ఉంటాయా? ఉండవు!
తొలగిపోతాయి! నీ సామీప్యత పొందిన నాకు అజ్ఞానాంధకారము వలన భయం ఇక
శేషించదు. ప్రజ్ఞా తత్త్వస్వరూపుడవగు నీ సాన్నిధ్యములో అజ్ఞానాంధకార వీచికలు
నన్ను స్పృశించనే లేవు.
నీకు భృత్యుడనైన నాపట్ల దయగలవాడవై, నీ మాయచే అపహరించబడిన విజ్ఞాన
స్వరూప జ్ఞాన దీపమును తిరిగి నాయందు వెలిగించావు. నీ ఉపకారమును నేను
మాటలలో వర్ణించగలనా? జన్మల జన్మలకు మరువగలనా?
నీ మాయచే యాదవ వంశాభివృద్ధికై దాశార్హ - వృష్టి - అంధక సాత్విత వంశీయుల
యాదవులతో బాటు నన్నుకూడా నీ దృఢస్నేహ పాశములతో కట్టి ఉంచావు. ఇప్పుడో!
ప్రేమాస్పదంగా ఆత్మతత్త్వ జ్ఞానము ప్రసాదించి సర్వ సంసార సృంఖలములను,
స్నేహపాశములను ఖండించివేసి నన్ను అనుగ్రహించావు.
ఓ యోగీశ్వరా! నీకు సహస్రకోటి సాష్టాంగ దండ ప్రణామాలు! నేను సదా ఆర్తుడనై
నిన్ను శరణు వేడినందుకుగాను ప్రతిఫలంగా ఆత్మజ్ఞానామృతాన్ని పంచి ఇచ్చావు. నిన్కొక్క
వరం కోరుకుంటున్నాను.
నాకు నీ చరణ కమలముల పట్ల అనన్య భక్తిని జన్మ జన్మలకు ప్రసాదించమని వేడుకుంటున్నాను.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
356
నా భౌతికమైన కళ్ళకు కనిపించేది చెవులకు వినిపించేది... ఇదంతా శ్రీకృష్ణ
చైతన్యానందమే... అనే విషయం జన్మజన్మలకు మరువకుండునట్టి మనోబుద్ధులను
వరంగా ప్రసాదించమని మిమ్ములను మనసా-వాచా కర్మణా వేడుకొంటున్నాడు.
శ్రీకృష్ణ భగవానుడు : ఓ ఉద్దవా! సంతోషము! నేను సూచించిన విధంగా నా ఆశ్రమమే
(నివాసస్థానమే) అయినట్టి బదరికాశ్రమమునకు ఇప్పుడిక బయలుదేరి వెళ్ళు. అక్కడ
విష్ణు పాద రజముచే పవిత్రముగా చేయబడిన గంగానదీ తీర్థములో స్నానము ఆచరించి,
ఆచమనములను నిర్వర్తించి పవిత్రుడవయ్యెదవు గాక! గంగానదీ తీర్ధముచే నీమనస్సు
నిర్మలమౌతుంది! ఇక అటు తరువాత..,
నారచీరలు ధరించి, కందమూల ఫలములు భుజించి విషయ సుఖములపట్ల ఇచ్ఛధ్యాసలను త్యజించిన వాడవై ఉండెదవుగాక!
శీతము - ఉష్ణము ఇత్యాది ప్రకృతి విషయములపట్ల సహనము కలవాడవయ్యెదవు
గాక!
సహనశీలుడవై - సుశీలుడవై, ఇంద్రియములను వాటి వాటి విషయములతో
సహా జయించివేసి ఉండెదవు గాక!
పరమశాంతుడవు - జ్ఞాన విజ్ఞానయుక్తుడవు అయ్యెదవు గాక! ||
ఇప్పుడు మనం సంభాషించుకున్నట్టి భక్తి - జ్ఞాన - వైరాగ్య మొదలైన
విశేషములపట్ల మననశీలుడవయ్యెదవు గాక!
అట్టి మనో మనన శీలత్వము సహాయంతో నీ మనో-వాక్కులను నిష్ఠతో
|
నాయందుంచుము!
నిత్యము - సదా భాగవత ధర్మమునందు, ఆత్మ సందర్శన ధర్మమునందు ఆసక్తుడవై |
ఉండెదవు గాక!
అర్హులగు సహజీవులకు బోధించెదవు గాక! వారి చెవులలో ఆత్మతత్త్వ జ్ఞానగానము
మార్మోగుచుండునుగాక!
క్రమంగా త్రిగుణాతీతత్వమును అభ్యసిస్తూ దేవ-మనుష్య-తిర్యక్ సంస్కారములను
అధిగమించి త్రిగుణాతీతుడను - నిర్గుణుడను అగునన్ను చేరుకొనెదవు గాక!
శ్రీ శుకమహర్షి : ఓ పరీక్షణ్మహారాజా! ఆవిధంగా ఆ ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానునిచే
ఆజ్ఞాపించబడ్డాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
357
శ్రీకృష్ణునికి ప్రదక్షిణం 3 సార్లు చేసి ఆయన చరణయుగళమును శిరస్సుపై ఉంచుకొని
ప్రేమాస్పదచిత్తుడైనాడు. ఆనంద భాష్పబిందువులచే శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను
అభిషేకించాడు.
ఏమాత్రం వదలలేక, ప్రేమవలన కలిగే ఎడబాటు సహించలేక ఆయన సమక్షంలోనే
కొంతసేపు మౌనంగా కూర్చునిపోయాడు. అయినప్పటికీ "భగవానుని ఆజ్ఞ
అనుల్లంఘ్యనీయం కదా!..." అని నెమ్మది నెమ్మదిగా గుర్తుచేసుకున్నాడు! ఆయన
పాదుకలను శిరస్సుపై ఉంచుకొని మాటి మాటికి వెనుకకు తిరిగి నమస్కరిస్తూ నెమ్మదిగా
బదరికాశ్రమం వైపుగా అడుగులు వేయసాగాడు.
భక్తాగ్రేసరుడు - పరమభాగవతోత్తముడు అగు ఆ ఉద్ధవుడు తన హృదయములో
శ్రీకృష్ణుని రూపమును నిండుగా నింపుకొని బదరికాశ్రమం చేరాడు.. శ్రీకృష్ణుడు
ఉపదేశించిన విధంగా గంగానదీ స్నానం నిర్వర్తించాడు. భాగవతోత్తములచే
అనుసరించబడుచు - శ్రీ లీలాకృష్ణునిచే ప్రవచించబడిన భాగవత ధర్మాలు
స్వీకరించాడు.
భగవత్ సారూప్యము - సామీప్యమును - సాలోక్యమును - సాయుజ్యమును అతి
స్వల్ప కాలములో సముపార్జించుకున్నాడు.
46. భక్తిమార్గ సంమిశ్రితమైన జ్ఞానామృతం
శ్రీ శుకమహర్షి : ఓ భాగవతోత్తములారా! శ్రోతలారా! యోగజన - యోగేశ్వర సేవితుడు
అగు శ్రీకృష్ణ పరమాత్మ భాగవత ప్రధానుడగు మన ఉద్దవునకు ఏ
"భక్తిమార్గంతో సంమిశ్రితమైన జ్ఞానామృతం"
ను ఉపదేశించారో... అట్టి జ్ఞాన-విజ్ఞాన పవిత్రజలమును కొలదిగా సేవించినా కూడా...
ఈ జీవుడు ముక్తుడు కాగలడు. అట్టివాని సంసర్గముచే జగత్తు-జగత్తులోని అనేకమంది
ముముక్షువులు కూడా ముక్తి పొందగలరు.
శ్లో॥ భవభయమపహంతుం జ్ఞాన - విజ్ఞాన సారం
నిగమకృదుపజహ్రే భృంగవత్ వేదసారం
అమృతముదధితశ్చాపాయయత్ భృత్యవర్గాన్
పురుషమృషభమాద్యం కృష్ణసంగం నతోస్మి ॥ (అధ్యా 29, శ్లో 49)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
358
వేదవేద్యుడు - వేదపురుషుడు - వేదకర్తయగు జనార్ధనుడు
|
జీవుల సంసారభయమును పోగొట్టటానికికై
తుమ్మెద అనేక పూలపై వ్రాలి తేనెను సేకరించువిధంగా
సర్వవేదముల నుండి
|
సారరూపంగా
|
జ్ఞాన విజ్ఞాన శ్రేష్ఠమైనట్టి భాగవతుల భక్తిరసామృతాన్ని వెలికి తీశారు.
|
క్షీరసారగమధనానంతరం ఏవిధంగా విష్ణుభగవానుడు మోహినీరూపంగా మధింపబడిన
క్షీరసాగర జలం నుండి అమృతమును వెలికితీసి తామసిక స్వభావులు, క్రూర
కర్మలయందు ఆసక్తులు అగు అసురలను వంచించి సాత్వికులు, భక్తులు, తన్ను
సేవించువారు అయినట్టి దేవతలకు పంచిపెట్టారో...
ఆవిధంగా...,జగత్కారణుడు ఆద్యుడు - శ్రీకృష్ణనామ సంజ్ఞుడు అగు శ్రీకృష్ణ
చైతన్యానందమూర్తి "ఉద్ధవునితో సంభాషించటం" అనే మిషతో ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాద
రూపంగా భక్తిరస పూరిత మాధుర్యముతో కూడిన ఆత్మతత్త్వ జ్ఞానాన్ని - మనలోని
అల్పజ్ఞత-అల్పాశయత్వం తొలగటానికై
మందరికీ పంచిపెట్టారు.
అట్టి మమాత్మ స్వరూపులగు శ్రీ కృష్ణయోగీశ్వర భగవానునికి కృతజ్ఞతాపూర్వకంగా
సాష్టాంగ దండ ప్రణామములు.
శ్రీ వ్యాస భగవాన్! నమో నమో నమో నమః!
ఇతి
శ్రీమద్భాగవతే - మహా పురాణే బ్రహ్మసూత్ర భాష్యే
పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యామ్
ఏకాదశ స్కంధే భగవదుద్ధవ సంవాదే
అధ్యయన పుష్పము
శ్రీకృష్ణ పరబ్రహ్మణి పాదరవిందార్పణమస్తు
చిన్ని కృష్ణుని లీలలు మనకు గ్రంథస్థం చేసి ప్రసాదించిన శ్రీ వ్యాస మహర్షికి,
శ్రీ శుక మహర్షికి, శ్రీ పోతనామాత్యుల వారికి నమో నమో నమో నమః
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
359
గొల్లవారము
గొల్ల...వారమూ సద్గురుకృపచే పాలవారము.....
1. వరయోగీ.... తిరుమణి గురుసేవ...
వదలక మిము.... కొలచే వారికి...
సాధునెరిగి....రామానుచార్యుల
వార్తలందు.... చల్ల...లమ్మే ॥గొల్లవారము||
2. గోత్రమనియె....తిరుమంత్రముచే
గొడ్డ...లొకటి.... చేత...బూనీ
అండ...గోరాండమనియె
అడవినరకి దొడ్డి.... కట్టే ||గొల్లవారము॥
3. చీకటనియె...కోనలోన
చిట్టడివి మే...సేటి పసువుల
చిత్తమందున....దొడ్డీ...లోన
చెదరకుండ....మంద...చేసే ||గొల్లవారము||
4. అందమైన....బిందెనిండ
చిందకుండ.... పాలు పితకే
పొందికైనా... అనువుమీరా
పొంగకుండా.... పాలు.. కాచే |॥గొల్లవారము||
5. శాంతమను...పా...లారాబోసి
చిత్రాక్షనియె...తోడు చేసి
ఆత్మ అనియె... భాండవలోన
అందముగా... తాయారునచె ||గొల్లవారము||
6. తిరుమంత్రమనియె... కవ్వముతోడ
భుజమంత్రమనియె పెరుగుచిలికి
తిరుమార్ధమనియె.... వెన్న... తీసి
చెదరకుండా... ముద్ద...చేసే ॥గొల్లవారము||
7. అన్నీ విధముల.... అమర కాచీ
వన్నెమీరగ ... నేయి చేసి
వినయమనియె... విన్నపముతో
నిష్టతో... నిజగురునిచేరే... నిష్ఠతో శివగురుని చేరే
నిష్టతో కృష్ణ గురుని చేరే.... ||గొల్లవారము||
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
360