[[@YHRK]] [[@Spiritual]]
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బహ్మసూత్ర భాష్యే
సంస్కృత మూలము : శ్రీ వ్యాసమహర్షి విరచిత శ్రీమద్భాగవత ఏకాదశస్కంధాంతర్గతము
అధ్యయన విద్యార్థి, రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ
[Chapters 19 to 23 out of total 46]
విషయ సూచిక :
Page number:113
అధ్యాయము-19.) భక్తియోగము - ధ్యాన విధానము |
ఉద్ధవుడు: హే శ్రీకృష్ణా! భగవానుడగు బ్రహ్మదేవుడు వివిధ ఋషులు-మానవుల
శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సాంఖ్యమార్గం, యోగ మార్గం, ధ్యాన మార్గం, త్యాగ
మార్గం ఈ విధములైన వివిధ సాధన మార్గాలు బోధిస్తున్నారు కదా! ఆయా మార్గాలలో
అన్నింటికన్నా శ్రేష్టమైన మార్గంఏదో... అది చెప్పండి! మా అందరికి సులభము
ఉత్తమమైనది - శ్రేయస్సు కలుగజేయగల అతిముఖ్యమైనదేదో.. చెప్పండి!
మీరు భక్తి యోగం బోధిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. మీ పట్ల నిష్కామమైన భక్తి
యోగం సర్వగురువుల సమ్మతమా! లేక, యోగ ధ్యాన - కర్మ - యాగాదులు
ప్రదిపాదిస్తున్న వేరు వేరు గురువులయొక్క వారు బోధిస్తున్న ఆయా మార్గాలే అధికంగా
సమ్మతమా!
జీవుడుగా నాకు ఏ మార్గం సులభము? సర్వజనామోదం? నన్ను త్వరితగతిని ఉద్ధరించ
గల మార్గమేదో... అదీ చెప్పండి!
శ్రీ కృష్ణభగవానుడు : ఓ ఉద్దవా! పూర్వాపర వివరణలతో ఇక్కడ నీ ప్రశ్నకు సమాధానంగా
కొన్ని విశేషాలు చెప్పుతాను! విను!
ఈ కనబడేదంతా నా ఆత్మ యొక్క విన్యాసమే! ఆత్మ సర్వదా అఖండమైవుండి, ఈ
తదితరంగా అనిపిస్తోంది!... అను జ్ఞానమే ఆత్మజ్ఞానం! వేదములు అట్టి ఆత్మ ధర్మమును
ఎలుగెత్తి గానం చేస్తున్నాయి అట్టి ఆత్మ ధర్మము (The characterisitc feature of
self) ను మొట్టమొదట నేను సృష్టికర్త యగు బ్రహ్మ దేవునికి బోధించటం జరిగింది.
అట్టి ఆత్మధర్మము అను పరమసత్యము సృష్టికి ముందు - సృష్టికి తరువాత - సృష్టి
సందర్భంలో కూడా సర్వదా అనునిత్య సత్యమై యున్నది.
అట్టి ఆత్మధర్మము యొక్క అవగాహన ప్రళయకాలంలో ఏమరచబడటంచేత సృష్ట్యాదిలో
బ్రహ్మ దేవునికి వేదవాణి రూపంగా బోధించాను. బ్రహ్మదేవుడు తన కుమారుడుస్వయంభువు అగు మనువుకు బోధించారు. భృగువు, అంగీరసుడు, మరీచి, పులహుడు,
అత్రి, పులస్త్యుడు, క్రతువు... అను సప్త బ్రహ్మమహర్షులకు బోధించటం జరిగింది!
భృగువు మొదలైన ఆ సప్త బ్రహ్మమహర్షులు తమ తమ సంతానమగు దేవతలు
దానవులు, గుహ్యకులు, మనుష్యులు, సిద్ధ - గంధర్వ-విద్యాధర చారణులు,
కింపురుషులు, కిన్నెరులు - నాగులు - రాక్షసులు - కింపురుషులు మొ॥వారికి బోధించగా
Page number:114
వారిలో అనేకులు అది గ్రహించారు. అయితే...., ఆయా జీవులంతా భిన్న భిన్నములైన
సత్వ - రజో తమోగుణ సంపన్నులై ఉండటంచేత భిన్న భిన్నములైన దృష్టి -
అవగాహనలు కలిగి ఉండసాగారు! వాసనలను (tendencies) అనుసరించే దేవతలు
- అసురులు - మనుష్యులు - భూతములు - భూతపతులు భిన్న-భిన్నంగా ఉంటారు
కదా! ఆయా జీవులంతా వారి వారి చిత్ర - విచిత్రమైన వాసనలను అనుసరించి ఆత్మ
తత్త్వ జ్ఞానము (త్వమ్ స్వరూపతః మమాత్మ యేవ అను పాఠ్యాంశాము) విషయమై
అన్వయించుకోసాగారు. ఆవిధంగా చిత్ర విచిత్రములైన వర్ణనలు వేదవ్యాఖ్యానరూపంగా
వెలువడసాగాయి. వెలువడుతున్నాయి. అనేక శబ్దాలు వాటికి వేరు వేరైన అర్ధ
ప్రయోగాలు బయల్వెడలుచున్నాయి. అంతేకాదు! ఈ మానవుల స్వభావాన్ని అనుసరించి
బుద్ధిభేదం ఏర్పడుతోంది. ఇంకా కొందరు వేదముల అధ్యయనం చేయనివారై ఒకానొక
గురువు యొక్క కొన్ని వాక్యములను (లేక) అభిప్రాయములను మాత్రమే ప్రమాణంగా
తీసుకొని పారంపర్యంగా ఆవాక్యాలకు మరికొన్ని అర్ధాలను కల్పించుకొని "ఇంతే!
ఇంతవరకే ! మరింకెవరు ఏది చెప్పినా ఆలోచించవద్దు! విచక్షించవద్దు! అసలు ఇంకేమీ
వినవద్దు!" - అనే పరిమితమైన అవగాహనకు కట్టుబడినవారై వుంటున్నారు. ఇందులో
కొందరు పాషండమతస్తులై "పరమాత్మలేదు! దేహమే వున్నది ! మరణానంతరం ఈ
జీవుడు నశిస్తాడు! ఇక ఆపై మరేమీ లేదు! ఉన్నంత వరకు తినండి! త్రాగండి! అంతే!
ఇంతకుమించి ఏదీ విచారణ చేయకండి! ఇదే వేదసారం!".. అని కొన్ని దేహసంబంధమైన
సంకుచిత భావాలకు - అభిప్రాయాలకు కట్టుబడినవారై వుంటున్నారు.
ఇక, మరికొందరు, "మనమంతా ఒక జాతివారం! ఇతర జాతివారిని హింసించటం,
బాధించటమే మన గురువుయొక్క సేవ!"-అనికూడా భావన చేస్తున్నారు. హింసాత్మకమైన
ప్రవర్తనకు సిద్ధమగువారు! అందుకు చావుకైనా సిద్ధపడేవారు కూడా ఉంటున్నారు!.
ఓఉద్ధవా! పురుషశ్రేష్ఠా! నా మాయచే మోహితులైన మరికొందరు వారివారికి రుచించే
క్రియలు-కర్మలను అనుసరించి నానా విధములైన సాధనలను, సాధనాక్రమమును
నమ్మి... అదే తదితరులకు బోధించే వారుకూడా వున్నారు!. ఉండబోవుచున్నారు కూడా!
"ధనమే అన్నింటికీ మూలం! దైవభక్తి వలన ధనం లభిస్తుంది" - అనే భావం ఆశ్రయించి
దైవభక్తిని సాధనముగాను, ధన-సంపదలను సాధ్యముగాను భావించటం కూడా కొందరి
విషయంలో జరుగుతోంది.
Page number:115
మరికొందరు ధర్మమే శ్రేయోసాధనం. పరోపకారులమై వుంటే చాలు. ఆత్మవిచారణతో
పనిలేదు - అను భావన కలిగి ఉంటున్నారు.
యశస్సు - కామము - దమము శమము - ఐశ్వర్యము - భోగములు - యజ్ఞము
తపస్సు వ్రతనియమము ఇత్యాదులు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా
శ్రేయోసాధనములుగా కలిగి వుంటున్నారు?.
ఈ విధమైన భావనలచే ఆశ్రయిస్తున్న అనేక కర్మపరంపరలను ఆశ్రయించటంచేత,...
కాలక్రమేణా వాటిలో కొన్నిటి యొక్క అంతిమ ప్రయోజనములన్నీ దుఃఖ పరిణామములు
గాను, మోహజనకములుగాను, అల్పఫలప్రదాతలు గాను, శోకయుక్తములు గాను
అయి వుండటంకూడా జరుగనారంభించాయి.
ఓ ఉద్దవా! ఎవ్వరైతే తమ మనస్సును సర్వాత్మకుడనగు నాయందు నిలుపుతూ
క్రమక్రమంగా మనస్సును విషయశూన్యం చేసుకుంటూ వుంటారో.. అట్టివారు నా
పరతత్త్వమును తెలుసుకుంటారు. పరతత్త్వాన్ని ఎఱిగి ఆస్వాదించున్ను వారి ఆత్మ
సుఖమును – స్వప్నతుల్యమగు ఇంద్రియ సుఖంతో ఏ మాత్రం పోల్చ వీలుండదు సుమా!
మనో - బుద్ధులలో కించత్వము లేనివారు (వారు తక్కువవారు - ఇది గొప్పది ఇత్యాది
అభిప్రాయములను ఆశ్రయించనివారు), శమ దమాది గుణాలంకారులు, శాంత
మనస్కులు, తమలోని పరస్వరూపుడనగు నన్ను చూసి ఆనందించువారు - ఇట్టివారు
మాత్రమే ఈ సర్వజగత్తును సుఖమయంగా దర్శించగలుగుచున్నారయ్యా!
ఇంద్రియ విషయాభిలాషికి ఈ జగత్తంతా దుఃఖమయంగానే అనుభవమౌతూ
వుంటుంది!.
సర్వాంతర్యామిని సర్వతత్త్వ స్వరూపుడను - ద్రష్టయొక్క స్వస్వరూపుడను అగునాపై
మనస్సు నిలిపినవాడు ఇక ఆపై బ్రహ్మ - ఇంద్ర ఇంద్ర - మహేంద్ర - సార్వ భౌమాది
పదవులను గాని, పాతాళలోకాధిపత్యమును గాని, అణిమ-గరిమ మొదలైన సిద్ధులను
గాని కోరుకోడు!.
స చ మే భక్తి మాం ప్రియః !
ఓ ఉద్ధవా! నా భక్తుడు నాకు ఇష్టమైనంతగా - నాపుత్రుడగు బ్రహ్మదేవుడు గాని,
హృదయేశ్వరియగు లక్ష్మీదేవిగాని, స్వరూపభూతుడగు శంకరుడుగాని, నా సోదరుడుగు
బలరాముడుగాని, నా ఆత్మగాని ఇష్టం కాదు సుమా! నేను భక్త సులభుడను! ఇష్టంగా
Page number:116
భక్తులను సర్వదా ఆశ్రయించి ఉంటాను. అంతేకాదు! భక్తుల పాదధూళితో
బ్రహ్మండములన్నీ పవిత్రం చేయటానికై నేను వారి వెంటనంటియే ఉంటాను. నిస్మృహుడు
(One who does cross the relatedness of wordly matters), సదా పరతత్త్వజ్ఞాన
మననశీలుడు, పరానందస్వరూపముచే పరమానందుడు, శాంతుడు, వైరభావరహితుడు,
సమదర్శియు అగు నాభక్తుని నేను సర్వదా అనుసరించియే ఉంటాను! ఆతడు
అల్పభావములను త్యజించినవాడై (నిష్కించనుడై) నాకు సమర్పించిన అనురక్త
బుద్ధికలవాడై, శాంతుడై, మహాశయుడై వుంటాడు! సర్వజీవరాసులను వాత్సల్యదృష్టితో
చూస్తూ ఉంటాడు.
అట్టివారు బాహ్య దృశ్యములపట్ల సర్వ అపేక్షలకు అతీతమైన అనిర్వచనీయమైన
ఆత్మసుఖం ఆస్వాదిస్తూ వుంటారు.
ఆపేక్ష (Inquisitiveness towards what is being outwardly seen) కొనసాగించేవారు
ఆత్మ సుఖమును పొందలకేపోతున్నారని గుర్తుచేస్తున్నాను! ఉపేక్షచే
ఆత్మసుఖానుభవులగుచున్నారు.
భక్తి - ప్రపత్తి
ఉద్ధవుడు: స్వామీ! మీపై భక్తి ప్రవత్తులు ఉండికూడా.. పూర్వాభ్యాసవశంచేత
ఇంద్రియములను ఇంకను జయించని నా వంటి ప్రాకృత భక్తుల స్థితి - గతుల మాట
ఏమిటి?
శ్రీకృష్ణుడు : నా యందు భక్తి ప్రవత్తులు పవృద్ధమౌతూ ఉంటే... క్రమంగా సామాన్య
విషయాలకు - ప్రలోభాలకు లొంగని బుద్ధి దానంతట అదే బలం పుంజుకుంటూ
ఉంటుంది. దృశ్యాకర్షణ క్రమంగా తొలగనారంభిస్తుంది!.
అంతేకాదు...!
భక్తియోగమే కాకుండా, అనేకమైన అధ్యాత్మ మార్గాలు ఉన్నాయి, సాంఖ్య (విచారణా
మార్గం) - స్వధర్మ నిర్వహరణ, సమర్పణ - స్వాధ్యాయం (వేదమంత్రాల పఠణం).
తపస్సు మొదలైనవి! అయితే అవన్నీ భక్తియోగానికి సాటిరావని, పరమాత్మనగు నన్ను
వశం చేసుకోవటానికి భక్తితో సమానంగా సులభంకాదని రెండు చేతులు ఎత్తి
ప్రకటిస్తున్నాను.. అవన్నీ భక్తిలో అంతర్విభాగాలవటమే నాకు ఇష్టం.
Page number:117
భక్తి శ్రద్ధచే ప్రవృద్ధమౌతుంది. భక్తి క్రమంగా అనునిత్యసాధనాక్రమంగా అనన్య భక్తిగా
రూపుదిద్దుకుంటుంది. అప్పడు ఈ జగత్తంతాకూడా కృష్ణచైతన్యానందంగా
అనుభవమౌతుంది! సాధువులు పరమాత్మను - సర్వప్రియ స్వస్వ రూపుడను అగునన్ను
భక్తితో లాభింపజేసుకుంటున్నారు! ఏకాగ్రతచే, సర్వ జీవులుగా ఉన్నది పరమాత్మయే....
అనే భావనను ఆశ్రయిస్తూ ఉంటే భక్తి రూపుదిద్దుకుంటోంది.
అట్టి అనన్య భక్తిచే చండాలురుకూడా పరమపవిత్రులౌతారు!.
పరమాత్మ స్వరూపుడనగు నాయందు భక్తి ప్రపత్తి లేని వానిలో గల దయ-ధర్మము
సత్యము - తపస్సు - జ్ఞానము ఇవన్నీకూడా పరాకాష్ఠయగు పవిత్రతను సంతరించు
కోలేవు సుమా!
శరీరము పులకితం కానంతవరకు, చిత్తము ద్రవించనంతవరకు, ఆనందాశ్రువులు
కళ్ళ నుండి ప్రవహించనంతవరకు భక్త్యావిర్భావము యొక్క ఔన్నత్యము గాని, భక్తివలన
కలిగే చిత్తశుద్ధిగాని, భక్తియొక్క ప్రభావమైన అనిర్వచనీయ ఆత్మానందముయొక్క
అనుభూతి గాని పూర్తిగా అర్దంకావు!.
భక్తిచే కంఠం గద్గదమౌతుంది! చిత్తము వెన్నవలె ద్రవీభూతమౌతుంది! అట్టివాడు
ఒక్కొక్కసారి ఆనందంగా నవ్వుతాడు! సిగ్గువిడిచి పెద్దగా గానం చేస్తూ వుంటాడు!
తన్మయత్వంతో నృత్యం చేస్తూ వుంటాడు..
అట్టి భక్తుడు తనయొక్క పరాప్రేమచే మూడులోకాలను పరమపావనం చేస్తూ వుంటాడు!.
అగ్నిచే సంతప్తమై బంగారు ఖనిజం తనలోని మలినములను తొలగి పోగా దగ
దగాయానంగా ప్రకాశిస్తుంది చూచావా! ఆ విధంగా, స్వభావంగా దృశ్య సంబంధం
గల చిత్తముకూడా భక్తి యోగం చేత తప్తమై తనయందలి దోషములను తొలగించుకొని
ప్రకాశిస్తుంది! చిత్స్వరూపుడనగు నన్ను స్వభావసిద్ధంగా సేవిస్తుంది! ఆస్వాదిస్తుంది!
తన్మయమౌతుంది. అంతా తానే అయి, అంతటికీ వేరై... అనిర్వచనీయ చిదానందముగా
అగుచున్నది.
ధూళిచే ఆవరించబడిన కనులు గలవారికి అంజన ఔషధంచేత (కాటుకమందుచేత)
కంటిదోషం తొలగించితే వస్తువులు చూడగలుగుతారు చూచావా? అట్లాగే, నాయొక్క
అవతార లీలలు, మహిమలు కీర్తించటంచేత చిత్తములోని దోషములు తొలగిపోతాయి.
విషయములను సదా ఆలోచించే చిత్తము ఆ విషయములందే చిక్కుకుంటోంది! అదే
Page number:118
చిత్తము సర్వతత్త్వస్వరూపుడనగు-సత్యరూపమగు నా గురించి ఆలోచన చేస్తూ వుంటే,
నాయందు లీనమౌతుంది!.
స్వప్నంలో కనిపించిన ఇల్లు మెళువవచ్చేటప్పటికి కనబడదేం?.. అని ఎవ్వరైనా
దుఃఖిస్తున్నారా? లేదు కదా! ఇక్కడి ఆశ - నిరాశ - దురాశల రూపమైన మనోరధాలు
స్వప్నసదృశాలే సుమా! "ఇక్కడ నాకు ఇంకా ఏదో ఏదేదో లభించలేదు.." అనే
వేదనలను మొదలంట్ల వదలి,... పరమాత్మనగు నన్నే ఏకాగ్రతతో అనుస్మరించటం
ఉచితమని గుర్తుచేస్తున్నాను! వివేకవంతుడైనవాడవు కనుక, నీవు భౌతిక దేహ
సంబంధమైన సాంగత్యములకు అతీతత్వమును సముపార్జించుకుంటూ, సంగమును
త్యజిస్తూ ఏకాంతంగా, సావధానంగా ధ్యానం అభ్యసిస్తూ చిత్తమును నా వైపుగా
నడిపెదవుగాక!
ఓ ఉద్ధవా! దృశ్య సంగముచేతనే ఈ జీవునికి క్లేశములన్నీ వచ్చి పడుచున్నాయయ్యా!
బంధమునకు కారణం దృశ్య ధ్యానం చేత ఏర్పడే సంగమేగాని, (Attchment -సంగాత్
సంజాయతే కామః), మరొకదెవరూ జీవునికి బంధం కల్పించటం లేదు.
ధ్యానయోగము
ఉద్ధవుడు: ఓ అరవిందాక్షా! శ్రీ కృష్ణా! ముముక్షువులు నీ యొక్క ఏ రూపమును ఏ
భావనతో ఏ విధంగా ధ్యానం చేస్తూ ఉన్నారో, అది నా సాధన కొరకై నాకు
తెలియజేయప్రార్ధన. ధ్యానయోగ విధానం తెలుపండి!
శ్రీకృష్ణుడు :
|
శ్లో॥ సమ ఆసన అసీనస్సమకాయో యథాసుఖమ్ । హస్తావుత్సంగ ఆధాయ స్వనాసాఽగ్రకృతేక్షణః ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 14, శ్లోకం 31) |
శ్లో॥ సమ ఆసన అసీనః సమకాయః యథాసుఖమ్ । హస్తౌ ఉత్సంగ ఆధాయ స్వనాసా-అగ్రకృత-ఈక్షణః ॥ |
|
శ్లో॥ ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభకరేచకైః । విపర్యయేణాపి శనైరభ్యసేన్నిర్జితేంద్రియః ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 14, శ్లోకం 32) |
శ్లో॥ ప్రాణస్య శోధయేత్ మార్గం పూర-కుంభక-రేచకైః । విపర్యయేణ అపి శనైః అభ్యసేత్ నిర్జిత-ఇంద్రియః ॥ |
ధ్యానయోగ ప్రావీణ్యులు ఎత్తుగాని పల్లంగాని కానటువంటి సమ ప్రదేశంలో
సమమగు సుఖాసనం ఆశ్రయించి చేతులు ఒడిలో పెట్టుకొని దృష్టిని నాసాగ్రంపై
సారించి ధ్యానం అభ్యసిస్తున్నారు. ప్రాణాయామం-ఇంద్రియ జయయోగం కొరకై
ఉద్దేశ్యించ బడింది! ఇంద్రియములను జయించాలి (లేక) ఇంద్రియవిషయములన్నీంటినీ
Page number:119
దాటి వేసి మనోబుద్ధులను సమస్థితికి తేవాలి.
పూరక కుంభక - రేచక - వరుసలోగాని, రేచక కుంభక పూరక
వరుసలోగాని నెమ్మదినెమ్మదిగా.. కాలం పెంచుకుంటూ అభ్యాసం చేయాలి! అప్పుడు
క్రమక్రమంగా మనో - బుద్ధులు తమయొక్క దృశ్య సంబంధమైన సంస్కారాలను
అధిగమించి క్రమక్రమంగా ఏకాగ్రత - మౌనము సంతరించుకోగలవు.
కుండలినీ శక్తిని అవిచ్ఛిన్నంగా కంఠ స్థానంలో లయింపజేయటం :
|
శ్లో॥ హృద్యవిచ్ఛిన్నమోంకారం ఘంటానాదమ్ బిసోర్ణవత్ । ప్రాణేనోదీర్య తత్రాథ పునస్సంవేశయేత్స్వరమ్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 14, శ్లోకం 33) |
శ్లో॥ హృది అవిచ్ఛిన్నమ్ "ఓం"కారం ఘంటానాదమ్ బిస-ఊర్ణవత్ । ప్రాణేన ఉదీర్య తత్ర అథ పునః సంవేశయేత్ స్వరమ్ ॥ |
తామరతూడు లోని దారం బీజాంకుర స్థానం నుండి - పుష్పము యొక్క అడుగుభాగం
వరకు విస్తరించి యున్న తామరతూడు చివరస్థానం వరకు అవిచ్ఛిన్నంగా విస్తరించినదై
ఉంటోంది కదా! ఆ విధంగా మూలాధార స్థానం నుండి హృదయస్థానం వరకు
ప్రసరిస్తున్న (ఘంటానాదంతో పోల్చతగిన నాదస్వరూప -ఓంకారమును మూలాధార
స్థానము నుండి ప్రాణవాయువుతోసహా 12 అంగుళముల వరకు అవిఛిన్నముగా
విస్తరింపజేస్తూ స్వరస్థానం (కంఠబిందువు, పంచదశ బిందువు) వరకూ విస్తరించి
అక్కడ లయింపజేస్తూ వున్నారు-విజ్ఞులగు కుండలినీ ఉపాససకులు!
|
శ్లో॥ ఏవం ప్రణవసంయుక్తం ప్రాణమేవ సమభ్యసేత్ । దశకృత్వస్త్రిషవణం మాసాదర్వాగ్జితానిలః ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 14, శ్లోకం 34) |
శ్లో॥ ఏవం ప్రణవసంయుక్తం ప్రాణం ఏవ సమ్-అభ్యసేత్ । దశకృత్వః త్రిషవణం మాసాత్ అర్వాక్ జిత-అనిలః ॥ |
ఆసన 1. జయం - నాసాగ్ర స్థాన ధ్యానం
2. పూరక - కుంభక - రేచకముల అభ్యాసం, రేచక - కుంభక - పూరకముల
అభ్యాసం
3. ఓంకార రూపమగు ప్రాణముల కదలికకు కారణమయ్యే శక్తిని మూలాధారం
నుండి - హృదయస్థానం ద్వారా కంఠస్థానం వరకు నడిపించి, ఆ స్వరస్థానంలో
ప్రతిక్షేపించటం. లయింపజేయటం.
విధానముల ద్వారా ప్రతిరోజు కనీసం 3 వేళల ఓంకారముతో కూడిన
ప్రాణాయామమును అభ్యసిస్తూ వుండగా ఒక నెల కాలంలో ప్రాణవాయువు-ప్రాణశక్తి
స్వాధీనం అవుతాయి.
Page number:120
హృత్ పుండరీక ధ్యానం-పరతత్త్వ ధ్యానము
హృదయంలో ఇష్టదైవ రూపాన్ని ప్రతిక్షేపించుకొని-పరమాత్మత్వంతో మమైకమయ్యే ఒకానొక
మార్గమును ఉదహరిస్తున్నాను. విను.
|
శ్లో ॥ హృత్పుండరీకమన్తఃస్థమూర్ధ్వనాలమధోముఖమ్ । ధ్యాత్యోర్ధ్వముఖమున్నిద్రమష్టపత్రం సకర్ణికమ్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 14, శ్లోకం 35) |
శ్లో ॥ హృత్-పుండరీకమ్ అంతఃస్థమ్ ఊర్ధ్వనాలమ్ అధోముఖమ్ । ధ్యాత్యా ఊర్ధ్వముఖమ్ ఉన్నిద్రమ్ అష్టపత్రం సకర్ణికమ్ ॥ |
|
కర్ణికాయాం న్యసేత్సూర్యసోమాగ్నీనుత్తరోత్తరమ్ । వహ్నిమధ్యే స్మరేద్రూపం మమైతద్ధ్యానమంగళమ్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 14, శ్లోకం 36) |
కర్ణికాయాం న్యసేత్ సూర్య-సోమ-అగ్నీన్ ఉత్తర-ఉత్తరమ్ । వహ్నిమధ్యే స్మరేత్ రూపం మమ ఏతత్ ధ్యానమంగళమ్ ॥ |
దేహమునకు అంతర్గతమై, ఊర్ధ్వనాళములు కలదై, ముకిళితమై, కర్ణికములతో కూడినదై
8 దళములు గల హృదయ పుండరీకమును ధ్యానం చేస్తూ వుండాలి. అట్టి హృదయము
యొక్క కర్ణికలలో సూర్య చంద్రులను, అగ్నియొక్క తేజస్సును భావన చేస్తూ వుండాలి.
అట్టి తేజస్సులో మంగళప్రదమగు నా రూపమును ధ్యానం చేస్తూ ఉండాలి!
సమము, ప్రశాంతము, సుముఖము,
చతుర్భుజములు గలది, |
చారుసుందరమైనది,
అందమైన నుదురుగలది,
|
చిరునవ్వు చిందించేది,
రెండు చెవులు ||||||| - కుండలములు ధరించినది,
బంగారు ఛాయగల పంచ ధరించినది,
నీల మేఘ ఛాయ దేహము గలది,
శ్రీవత్సమణి ధరించిన హృదయస్థానము కలది,
శంఖ-చక్ర-గద-పద్మములను ధరించినది,
విస్థారమైన - ఎత్తైన పాదములు గలది,
కౌస్తుభమణి ధరించిన కంఠము గలది,
కిరీటము మొదలైన ఆభరణములతో శోభిల్లునది,
సర్వాంగ సుందరమైనది, |
Page number:121
మనోహరమైనది,
|
చల్లటి చూపులు ప్రసరిస్తున్న కళ్ళుగలది, |
అతి కోమలము
|
అయినట్టి నాయొక్క భగవదవతారరూపమును హృదయంలో మననం చేస్తూ వుండు.
బుద్ధిమంతుడైనవాడు మనస్సును ఇంద్రియవిషయ ధ్యాసలనుండి ఉపసంహరించి, బుద్ధి
అనే సారధి సహాయంతో చిత్తమును నాయొక్క వివిధాంగముల దర్శనాభ్యాసంలో
నియమించుచున్నాడు! క్రమంగా అనేకచోట్ల ఉబుసుపోకగా విహరించే చిత్తమును
నాయొక్క ఒక్కొక్క అవయవంపై ఏకాగ్రం చేస్తూ వస్తున్నాడు! అన్నిటికంటే చిరునవ్వులు
చిందించే ముఖమండలముపై ధ్యాస నిలపటం సౌలభ్యముతో కూడిన అభ్యాసం
అని నా అభిప్రాయము.
క్రమంగా "అన్ని రూపములుగా - భావములుగా - స్వభావములుగా - గుణములుగా
కనిపిస్తున్నది సర్వతత్త్వ తత్త్వానంద స్వరూపుడగు పరమాత్మయే" అనే
నిశ్చయమును బుద్ధిచే ధ్యానం - ఆరాధనం - సందర్శనం ఒకేసారి అభ్యసిస్తూ ఉండాలి!
గుర్తు చేసుకుంటూ మరల మరల మననం చేసుకుంటూ ఉండాలి!
అనగా....
1. మొట్ట మొదట... "అనేక విషయములు ధ్యానించటము" అనే మనోరుగ్మతను
"ఇష్టదైవము - అవతారమూర్తియొక్క ఒక్కొక్క అవయవ మననము" అనే ఔషధం
సేవిస్తూ ... బుద్ధిని లౌకికమైన విషయములనుండి మరల్చాలి.
2. క్రమంగా అనేక అవయవముల ధ్యానం నుండి దృష్టిని మరల్చి అవతారమూర్తియొక్క
చిరునవ్వుతో కూడిన ముఖమండలమును మాత్రమే ధ్యానించటం - అను అభ్యాసమును
ఆశ్రయించాలి.
3. ఆ తరువాత ముఖమండలమునుండి కూడా చిత్తమును ప్రత్యాకర్షింపజేస్తూ భూమిజలము-అగ్ని-వాయువులకు ఉనికిస్థానమైన ఆకాశమునందు ప్రతి క్షేపిస్తూ అభ్యాసం
కొనసాగించాలి. పరమాత్మయొక్క ఆకాశతత్త్వాన్ని ఉపాసిస్తూ ఉండాలి.
4. ఆ తరువాత ఆకాశమునుండి కూడా చిత్తమును వెనుకకు మరలుస్తూ శుద్ధ
బ్రహ్మస్వరూపమును సర్వదా సర్వముగా - సర్వాతీతంగా దర్శించే అభ్యాసమునకు
Page number:122
ఉపక్రమించాలి. అనన్యధ్యానంతో సర్వ అన్యమైన ధ్యాసలను జయించి చిత్తమును
లోకాతీతంగా-దృశ్యాతీతంగా- సమగ్రంగా, పూర్ణభావసమేతంగా తీర్చిదిద్దాలి.
నీవు-నేను-అది-ఇది గుణములు. అంతఃకరణము అంతా పరమాత్మయే. చిత్తము
చిత్ స్వరూపమై సర్వమును తనయందు దర్శించునట్లుగా "కృష్ణా! నీవు కానిదేదీ లేదయ్యా!"
అను భావామృతమునుండి - కృష్ణ చైతన్యమునకు వేరైనదంటూ ఏదీలేదు. నేను
కృష్ణచైతన్యమునే! నేను కానిదేది లేదు కదా! అను గానామృతమును ఆస్వాదించుగాక!
సందర్శించునుగాక! తత్వమ్-సోహమ్ ఏకత్వము పొందిపరిఢవిల్లును గాక!
అట్టి సందర్శనముచే ఆతడు "సమాహిత చిత్తుడు" అని చెప్పబడుచున్నాడు!
అట్టి సమాహితచిత్తుడు .
ఒక జ్యోతియందు మరొకజ్యోతివలె తనయందు సర్వసహజీవులను, ఈ జగత్తును....
పరమాత్మయందు జీవాత్మను, పరమాత్మయే జీవాత్మగాను సమదర్శనమును సర్వదా
ఆస్వాదిస్తున్నాడు!
పరమాత్మలో జీవాత్మను,
జీవత్మ పరమాత్మగాను,
జీవబ్రహైక్యముగాను,
స్వస్వరూపమే సర్వస్వరూపంగాను,
జీవాత్మకు కేవల సాక్షిగాను,
తనను తాను - తనలో తాను తానైన తనను దర్శిస్తాడు. ఆస్వాదిస్తాడు! "ఇదంతా
నాలోని నేనైన నేనే!" అను అనుభూతితో పరవసిస్తాడు.
ఓ ఉద్ధవా! ఈవిధంగా ధ్యానయోగం అను దైనందికమైన అభ్యాసం చేత
పరమాత్మయగు నాయందే మనస్సును లగ్నం చేయి! క్రమంగా ద్రవ్య (Material) -
జ్ఞాన (Knowledge and thought related )- క్రియ (దేహ-మనో-బుద్ధిచర్యలు
కదలికలు) అనే భ్రమలను త్యజించు! ఆధిభౌతిక - ఆధిదైవిక -ఆధ్యాత్మిక భ్రమలను
నీ మనస్సు అధిగమించివేయును గాక! కర్మ-భక్తి-యోగ మార్గాలు "అఖండాత్మత్వాహమ్"
స్ధానమునకే దారితీస్తున్నాయని గమనించు.
Page number:123
త్రివిధ భ్రమలను త్యజించిన చిత్తము స్వయంగా - స్వభావసిద్ధంగా పరమాత్మయగు
నాయందు మమేకం కాగలదు! పరమాత్మవే అయి మత్తః పరతరం నాన్యత్ కంచిదస్తి
అని సర్వము నీవై, సర్వసాక్షిగా అయి ప్రకాసించగలవు. నా స్థానమును చేరగలవు.
అధ్యాయము-20.) అష్టాదశ సిద్ధులు - నిత్యసిద్ధ పరమాత్మ |
శ్రీకృష్ణ భగవానుడు : ఓ ఉద్ధవా! జగదంతర్-బహిర్స్వరూపడనగు నేను సర్వదా సిద్ధ
స్వరూపుడను! ఏ యోగి అయితే ఇంద్రియములను, వాటి విషయములను జయించిన
వాడై (అధిగమించిన దృష్టి కలవాడై) శ్వాసను జయించినవాడై (కదలే శ్వాసకు ఆవల
శ్వాసను కదలించే ప్రాణశక్తితో మమేకత్వము పొందినవాడై) స్థిరచిత్తుడై క్రమంగా
సర్వతత్త్వ స్వరూపము-సర్వతత్త్వ విదూరకము అగు నా తత్త్వమునందు చిత్తమును
నిలుపుతూ వస్తాడో... అట్టి వానిని కొన్ని సిద్ధులు తమంతట తామే ఒక మిత్రుని
సమీపించినట్లుగా ఆశ్రయిస్తూవుంటాయి. అనునది-ఒకానొక జగత్ చమత్కార విశేషము!
ఉద్ధవుడు : హే అచ్యుతా! ఏఏధారణలచేత ఏఏ సిద్ధులు యోగికి సిద్ధిస్తూ వుంటాయో,
అది మీ నుంచి కించిత్ వినాలని ఇప్పుడు అనిపిస్తోంది. యోగులకు సిద్దులను
ప్రసాదించే సిద్ధపురుషడవు నీవే కదా! అందుచేత నీ నుండి యోగ సిద్ధులు - అవి
సిద్ధించటానికి కారణమయ్యే సాధనలు వాటివాటి ప్రయోజనములు చిత్తము
మీయొక్క పరతత్త్వంలో లయించటానికి ఆయా సిద్ధులు ఎంతవరకు అవసరం
ఎంతవరకు ఉపకరిస్తాయి... ఇత్యాది విశేషాలు తెలియజేయవలసినదిగా నా విన్నపం!
శ్రీకృష్ణభగవానుడు : (చిరునవ్వు చిందిస్తూ) ప్రియ ఉద్దవా! మనం ఇంతదాకా
చెప్పుకుంటున్నట్టి చిత్తమును పరతత్త్వ ధ్యానం ద్వారా సర్వభూతాత్మానుభూతియందు
లయింపజేయటానికి నీవు తెలుసుకోవాలనుకుంటున్న సిద్ధులతో పనేమీలేదు.
ఎందుచేతనంటావా! సిద్ధులు దృశ్య సంబంధమైనవి! ఆత్మానందమో... దృక్ స్వరూపధ్యాన
సంబంధమైనది. దృశ్య వాసనా సంబంధమైన సిద్ధులు అనేక సందర్భాలలో
బ్రహ్మజ్ఞానానుభవానికి అడ్డంకులవవచ్చు కూడా!
పై విషయాలను దృష్టిలో పెట్టుకొని, నీవు అడిగావుకాబట్టి చెప్పుతాను. మహదాశయమగు
పరతత్త్వానందమును ఏమరువకుండా ఇప్పుడు సిద్ధులగురించి విను.
Page number:124
యోగశాస్త్ర పారంగతులగు మహనీయులు సిద్ధులను 18 విశేషములుగా విభజించి
శాస్త్రీకరిస్తూ వున్నారు. అందులో 8 సిద్దులు భగవత్ సంబంధమైనవి. స్వాభావికమైనవి!
10 సిద్ధులు సత్త్వగుణమును పెంపొందించుకోవటానికి ఉపకరించేవి! (లేక) గుణ
సంబంధమైనవి.
స్వాభావికమైన అష్ట సిద్ధులు (8)
|
శ్లో॥ అణిమా మహిమా మూర్తేర్లఘిమా ప్రాప్తిరింద్రియైః । ప్రాకామ్యం శ్రుతదృష్టేషు శక్తిప్రేరణమీశితా ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 4) |
శ్లో॥ అణిమా మహిమా మూర్తేః లఘిమా ప్రాప్తిః ఇంద్రియైః । ప్రాకామ్యం శ్రుతదృష్టేషు శక్తిప్రేరణమ్ ఈశితా ॥ |
I. దేహసంభందమైన సిద్ధులు : 1. అణిమ
(మూర్తి సంబంధమైనవి) 2. మహిమ,
3. లఘిమ,
II. ఇంద్రియముల సబంధమైన సిద్ధులు 4. ప్రాప్తి,
(ఇంద్రియ అధిష్ఠాతృ దేవతలకు సంబంధించినవి)
III. అనుభవ సంబంధమైన సిద్ధులు 5. ప్రాకామ్య
(లౌకిక-పార లౌకిక పదార్థాలు - కోరుకొన్నవి
ఇష్టానుసారం అనుభవంగా పొందటం)
IV తదితరులకు ప్రేరేపణ కలిగించగల సిద్ధి : 6. ఈశ్వితసిద్ధి
V విషయములందు ఉండికూడా వాటియందు ఆసక్తి
లేకపోవటం, గుణములతో అసంగత్వము సిద్ధింపచేసే సిద్ధి 7. వశిత్వసిద్ధి
VI కోరుకున్న సుఖములను సిద్ధింపజేసే సిద్ధి 8. కామావసాయిత సిద్ధి
ఈ 8 సిద్ధులు స్వాభావికములు. నిరతిశయములు.
సత్త్వగుణజాత సిద్ధులు - (ప్రత్యేక సిద్ధులు 10)
అనూర్మిమత్త్వ సిద్ధి ఆకలి - దప్పికల వేగమును జయింప 1.
జేయగల సిద్ధి
దూరశ్రవణ దూరంగా సిద్ధి ఎక్కడో 2. వున్న దృశ్యమును
దూరదర్శన సిద్ధి చూడగల 3. - వినగల సిద్ధులు
Page number:125
Page number:126 to 132
ఈ ఐదు రాజసిక తామసిక సిద్ధులు. ఇవి ఇతరులపై కొంతవరకు పెత్తనమునకు సంబంధించినవి అవటం చేత క్షుద్ర సిద్ధులు అని కూడా చెప్పబడటం జరుగుతోంది!
అధ్యాయము-21.) చిత్తముయొక్క ధారణచే సిద్ధులు |
యోగధారణచే సిద్ధించగల నామరూప లక్షణములు విన్నావు కదా! చిత్తమును (లేక మనస్సును) ఆయా విశేషములందు బహుకాలం నిలిపి ఉంచటంచేత ఆ సాధనయోగికి కాలక్రమంగా ఆయా సిద్ధులు సిద్ధిస్తూ వుంటాయి. ఇప్పుడు ఏ ధారణచే ఏవిధంగా ఎటువంటి సిద్ధులు కలుగగలవో... ఆ ధారణల గురించి కొన్ని విశేషాలు వివరిస్తున్నాను.
1.) అణిమా సిద్ధి :
|
భూతసూక్ష్మాత్మని మయి తన్మాత్రం ధారయేన్మనః । ఆణిమానమవాప్నోతి తన్మాత్రోపాసకో మమ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 10) |
భూతసూక్ష్మ-ఆత్మని మయి తత్ మాత్రం ధారయేత్ మనః । ఆణిమానమ్ అవాప్నోతి తత్ మాత్ర ఉపాసకః మమ ॥ (శ్లోకం 10) |
సహజీవుల స్థూలరూపమును మనోదృష్టి పరంగా అధిగమించి, వారిలోని - మనస్సును (చిత్తమును) మనోతత్త్వమును (లేక) సూక్ష్మరూపమును ఉపాధిగా ధారణ చేస్తున్న స్వస్వరూప అంతర్యామియగు నన్ను ఉపాసిస్తూ రాగా ఇతరుల కంటికి కనబడనంత సూక్ష్మరూపమును సిద్దించుకోగల అణిమ సిద్ధిలభిస్తుంది. అనగా, ఇతరులను భౌతికదేహంగా కాకుండా...., శబ్ద - స్పర్శ – రూప - రస - గంధములను అలంకారప్రాయంగా ఆభరణములవలె ధరిస్తున్న సూక్ష్మదేహధారులుగా సందర్శిస్తూ రాగా, అణిమాసిద్ధి (అణువంతరూపంగా) భౌతికదేహమును కుదించగల సిద్ధి లభిస్తుంది.
2.) మహిమా సిద్ధి :
|
మహత్యాత్మని మయి పరే యథాసంస్థం మనో దధత్ । మహిమానమవాప్నోతి భూతానాం చ పృథక్ పృథక్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 11) |
మహతి-ఆత్మని మయి పరే యథా సంస్థం మనః దధత్ । మహిమానమ్ అవాప్నోతి భూతానాం చ పృథక్ పృథక్ ॥ (శ్లోకం 11) |
పరమాత్మయొక్క మహదాకృతియే ఈ సమగ్ర దృశ్యము... అను రీతిగా మహదాకృతియందు చిత్తమును అభ్యసింపజేసే యోగాభ్యాసంచేత మహిమ అనే సిద్ధి లభిస్తుంది. సిద్ధి అనగా, అట్టివాడు "దేహాత్ముడను" అను సంకుచిత దేహాత్మ భావన నుండి, "ఈ దృశ్యమంతా నా దేహమే! ఈ సర్వలోకాలు లోకవాసులు... ఇదంతా కూడా నాయొక్క ఆత్మ మహిమయే..." అనే అనుభవానంద స్థితిని సుస్థిరీకరించుకవడం. అట్లు అనుకుంటూ ఉండగా.... మహిమా సిద్ధి సిద్ధిస్తోంది. అంతేకాకుండా అద్దానిని ఆశ్రయించినవారికి అనేకమైనట్టి అవతారపురుషుల మహిమలు కూడా అనుభూతమౌతూ ఉంటాయి.
3.) లఘిమా సిద్ధి :
|
పరమాణుమయే చిత్తం భూతానాం మయి రంజయన్ । కాలసూక్ష్మార్థతాం యోగీ లఘిమానమవాప్నుయాత్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 12) |
పరమాణుమయే చిత్తం భూతానాం మయి రంజయన్ । కాల-సూక్ష్మ-అర్థతాం యోగీ లఘిమానమ్ అవాప్నుయాత్ ॥ (శ్లోకం 12) |
పంచభూతములుగా... వాటి వాటి ధర్మములుగా విరాజిల్లుచున్నట్టి పరమాణువుల అంతర్యామిగా నన్ను తమ చిత్తమునందు ధ్యానిస్తూ లగ్నంచేసే యోగులకు స్థూలదేహస్వరూపమును పరమాణువులతో ధారణ చేయగలసిద్ధి లభిస్తోంది. అనగా, సూక్ష్మపరమాణురూపం ధరించగల సిద్ధిని పొందుచున్నారు. "నేను (లేక నా ఆరాధ్య దైవం) పంచభూతములయొక్క అణువణువు విస్తరించియున్న - ప్రసరించియున్న అంతర్యామిని కదా! అణువులను ఉత్తేజపరరచి దేహానిర్మాణమును ఇంద్రియ చమత్కారమును ఉత్తేజపరచే పరతత్త్వమే కదా!"... అను ఉపాసనచే ఎక్కడినుండి ఎక్కడికైనా ప్రయాణించగలడు.
4.) ప్రాప్తి సిద్ధి :
|
ధారయన్ మయ్యహంతత్త్వే మనో వైకారికేఽఖిలమ్ । సర్వేంద్రియాణామాత్మత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మన్మనాః ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 13) |
ధారయన్ మయి అహంతత్త్వే మనః వైకారికే అఖిలమ్ । సర్వ-ఇంద్రియాణామ్-ఆత్మత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మత్ మనాః ॥ (శ్లోకం 13) |
సర్వజీవుల అహమ్ స్వరూపంగా పరమాత్మయే ప్రదర్శితమౌతున్నారు... అను సందర్శనమునందు చిత్తమును నిలుపుచున్న యోగ సాధకులకు క్రమంగా సర్వేంద్రియములకు అధిష్ఠానత్వం లభిస్తుంది. సర్వేంద్రియములు, వాటివాటి సర్వ అనుభవాంతర్గతములు నేను ధరిస్తున్న ఆభరణములువంటివి... అను భావనా క్రమంగా సర్వదృశ్యమునకు అధిష్ఠానత్వంగా చెప్పబడే ప్రాప్తిసిద్ధి లభిస్తోంది. "మట్టిబొమ్మలన్నిటికీ మట్టియే అధిష్ఠానమైనట్లు నేనే సర్వదృశ్యములకు అధిష్ఠానమును" ...అను భావనచే ఏది ప్రాప్తించాలనుకుంటే అది ప్రాప్తించే సిద్ధి లభిస్తోంది. ఆశయమును సిద్ధింపచేసుకొనే సిద్ధి లభించగలదు.
5.) ప్రాకామ్య సిద్ధి :
|
మహత్యాత్మని యస్సూత్రే ధారయేన్మయి మానసమ్ । ప్రాకామ్యం పారమేష్ఠ్యం మే విన్దతేఽవ్యక్తజన్మనః ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 14) |
మహతి-ఆత్మని యః సూత్రే ధారయేత్ మయి మానసమ్ । ప్రాకామ్యం పారమేష్ఠ్యం మే విందతే అవ్యక్తజన్మనః ॥ (శ్లోకం 14) |
అహమ్'ను వ్యక్తీకరించే అవ్యక్త - మహదత్వ స్వరూపమై పరమాత్మయే ఉన్నారు... అను భావనయందు చిత్తమును ఏ యోగులైతే ఏకాగ్రం చేస్తూ సాధన చేస్తున్నారో.... అట్టివారు నాయొక్క సర్వమును వ్యక్తీరిస్తూ తాను అవ్యక్తంగా ఉంటూ ఉండే ప్రాకామ్య సిద్ధిని పొందుచున్నారు. ఇదంతా నాయొక్క ఇష్టమును అనుసరించే సంప్రదర్శితమౌతోంది..... అను సిద్ధిని ప్రాకామ్యసిద్ధిగా చెప్పబడుతోంది. అతడు ఏది ఇష్టపడతారో, అవన్నీ పొందగలుగుతారు. సహజీవులకు ఆత్మీయులౌతారు. "ఆత్మయే పిపీలికాది బ్రహ్మపర్యంతము వ్యక్తీకరిస్తోంది"... అను ధారణచే ప్రాకామ్యసిద్ధి సిద్ధిస్తోంది.
6.) ఈశిత్వ సిద్ధి :
|
విష్ణౌ త్ర్యధీశ్వరే చిత్తం ధారయేత్కాలవిగ్రహే । స ఈశిత్వమవాప్నోతి క్షేత్రక్షేత్రజ్ఞచోదనామ్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 15) |
విష్ణౌ త్రి-అధి-ఈశ్వరే చిత్తం ధారయేత్ కాలవిగ్రహే । స ఈశిత్వమ్ అవాప్నోతి క్షేత్ర-క్షేత్రజ్ఞ చోదనామ్ ॥ (శ్లోకం 15) |
త్రిగుణమాయ ఎవ్వరియొక్క ఆధీనంలో ఉన్నదో, ఎవ్వరైతే కాలస్వరూపుడై లీలగా క్రీడిస్తున్నాడో... అట్టి నాయొక్క విష్ణుతత్త్వముపై మనస్సును లగ్నంచేస్తూ ఉపాసించే యోగి క్రమంగా సర్వజీవులలో ప్రేరణాశక్తి కలిగించే ఈశిత్వము అనే సిద్ధిని పొందుచున్నాడు. తదితరులను తన వాక్-ఆలోచనలచే ప్రోత్సాహపరచగలఆకర్షించగల- ఉజ్జీవింపజేయగల సిద్ధిని పొందుచున్నాడు (Ability to inspire others). ఎవ్వరు ప్రేమతో సమీపిస్తే వారిని కర్మ-భక్తి-జ్ఞాన-యోగ మార్గాలలో ప్రేరణ-రక్షణ-ఉపశాంతి-సంతోషము కలిగించగల సిద్ధి సిద్ధిస్తోంది.
7.) వశిత్వ సిద్ధి :
|
నారాయణే తురీయాఖ్యే భగవచ్ఛబ్దశబ్దితే । మనో మయ్యాదధద్యోగీ మద్ధర్మా వశితామియాత్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 16) |
నారాయణే తురీయ-ఆఖ్యే భగవత్-శబ్ద-శబ్దితే । మనః మయి ఆదధత్ యోగీ మత్ ధర్మా వశితామ్ ఇయాత్ ॥ (శ్లోకం 16) |
జాగ్రత్ - స్వప్న- సుషుప్తులకు ఆధారము, తత్ప్రదర్శకుడు, వాటికి కేవలసాక్షి తురీయము కదా! అట్టి తురీయుడే నారాయణుడు అని పౌరాణికంగా చెప్పబడుచున్నాడు. ఏ యోగి అయితే తన మనస్సును నారాయణుడు-భగవంతుడు మొదలైన శబ్దములచే ఉద్దేశ్యించబడే తురీయస్వరూపుడనగు నాయందు లగ్నం చేసి ఉపాసిస్తూ ఉంటాడో,... అట్టివాడు త్రిగుణాతీత స్వరూపమగు వశిత్వ సిద్ధిని పొందుచున్నాడు. గుణములచేత వశుడు కానివాడై ఆసక్తులను జయించినవాడై వుంటున్నాడు. త్రిగుణములకు, మనో-బుద్ధి-చిత్త-అహంకారాలకు సాక్షిత్వము వహించటం అభ్యసించుచుండగా వశిత్వము సిద్ధిస్తోంది. త్రిగుణాదులు ఇంద్రియములు మొదలైనవి వశములో వుండటంచేత మాయను జయించటానికి సుమార్గమగుచున్నది.
8.) అకామ సిద్ధి :
|
నిర్గుణే బ్రహ్మణి మయి ధారయన్ విశదం మనః । పరమానందమాప్నోతి యత్ర కామోఽవసీయతే ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 17) |
నిర్గుణే బ్రహ్మణి మయి ధారయన్ విశదం మనః । పరమ-ఆనందమ్ ఆప్నోతి యత్ర కామః అవసీయతే ॥ (శ్లోకం 17) |
నాయొక్క నిర్గుణ పరబ్రహ్మతత్త్వము నందు మనస్సును నిలిపి ధారణను అభ్యసించువాడు సర్వ కామములు నశింపజేసుకొని స్వాభావికమైన అనునిత్య పరమానంద స్థితిని సిద్ధింప చేసుకుంటున్నాడు. లభించిన లభించని వస్తు విషయములకు అతీతుడై అకామసిద్ధిని సిద్ధింపజేసుకుంటున్నాడు.
9.) సాత్విక సిద్ధి :
|
శ్వేతద్వీపపతౌ చిత్తం శుద్ధే ధర్మమయే మయి । ధారయన్ శ్వేతతాం యాతి షడూర్మిరహితో నరః ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 18) |
శ్వేత-దీప-పతౌ చిత్తం శుద్ధే ధర్మమయే మయి । ధారయన్ శ్వేతతాం యాతి షడ్-ఊర్మిరహితః నరః ॥ (శ్లోకం 18) |
సత్త్వాత్మ స్వరూపుడునుగా శ్వేతదీప్తునిగా, (శ్వేత ద్వీప పతిగా) సాత్వికధర్మస్వరూపుడనుగా నన్ను ఉపాసిస్తూ మనస్సును ఏకాగ్రము - లగ్నము చేయు అభ్యాసం కొనసాగించేవాడు ఆకలి - దప్పికలు షడూర్ములను జయిస్తాడు. శుద్ధ రూపమును పొందుతాడు. రజో-తమో గుణముల ప్రభావమును జయించివేస్తున్నాడు! సాత్విక భావాలు - సాత్విక గుణం త్వరత్వరగా స్వభావసిద్ధమగుచున్నది.
10.) దూరశ్రవణ సిద్ధి :
|
మయ్యాకాశాత్మని ప్రాణే మనసా ఘోషముద్వహన్ । తత్రోపలబ్ధా భూతానాం హంసో వాచశ్శృణోత్యసౌ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 19) |
మయి ఆకాశ-ఆత్మని ప్రాణే మనసా ఘోషమ్ ఉద్వహన్ । తత్ర ఉపలబ్ధా భూతానాం హంసః వాచః శృణోతి అసౌ ॥ (శ్లోకం 19) |
ఆకాశరూపుడును - శుద్ధ ప్రాణ (శక్తి) స్వరూపుడను అగు నా యందు బుద్ధిని నిలుపుతూ ఉపాసనకు ఉపక్రమించేవాడు... క్రమంగా అట్టి ఆకాశంలో అభివ్యక్తమయ్యే ప్రాణుల శబ్దాలను అత్యంత దూరంనుండి కూడా వినగల దూరశ్రవణ సిద్ధిని పొందుచున్నాడు.
11.) దూరదర్శన సిద్ధి :
|
చక్షుస్త్వష్టరి సంయోజ్య త్వష్టారమపి చక్షుషి । మామ్ తత్ర మనసా ధ్యాయన్ విశ్వం పశ్యతి సూక్ష్మదృక్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 20) |
చక్షుః త్వష్టరి సంయోజ్య త్వష్టారమ్ అపి చక్షుషి । మామ్ తత్ర మనసా ధ్యాయన్ విశ్వం పశ్యతి సూక్ష్మదృక్ ॥ (శ్లోకం 20) |
రెండు కళ్ళలో సూర్యమండలమును, సూర్యమండలములో రెండుకళ్ళను సంయుక్తం చేస్తూ నాపట్ల ధ్యానం కొనసాగించే యోగులు.... దూరంనుంచే సర్వవస్తువులను - దృశ్యములను సందర్శించగల సిద్ధిని పొందుచున్నారు.
12.) మనోజవ సిద్ధి :
|
మనో మయి సుసంయోజ్య దేహం తదనువాయునా । మద్ధారణాఽనుభావేన తత్రాత్మా యత్ర వై మనః ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 21) |
మనః మయి సుసంయోజ్య దేహం తద్-అనువాయునా । మత్-ధారణా అనుభావేన తత్ర ఆత్మా యత్ర వై మనః ॥ (శ్లోకం 21) |
"నాయొక్క - తదితర సర్వ జీవులయొక్క మనోదేహములు ప్రాణవాయువులతో సహా పరమాత్మ సంప్రదర్శనమే".... అని ధ్యానించువాడు - అనుకున్న ప్రదేశమునకు క్షణంలో పోవటం - అను మనోజవ సిద్ధిని పొందుచున్నాడు.
13.) కామరూప సిద్ధి :
|
యదా మన ఉపాదాయ యద్యద్రూపం బుభూషతి । తత్తద్భవేన్మనోరూపం మద్యోగబలమాశ్రయః ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 22) |
యదా మనః ఉపాదాయ యద్ యత్ రూపం బుభూషతి । తత్ తత్ భవేత్ మనః రూపం మద్ యోగబలమ్ ఆశ్రయః ॥ (శ్లోకం 22) |
మనస్సును ఒక ఉపకరణంగా పరమాత్మ యందు లగ్నం చేయువాడు ఆ మనస్సు సహాయంతో తాను కోరుకొన్న భౌతిక రూపమును ధరించగల కామరూప సిద్ధిని సిద్ధింపజేసుకుంటున్నాడు. అచింత్య శక్తియుతుడనగు నాయందు
(చేతులతో ఒక వస్తువును పట్టుకున్నట్లుగా) తన మనస్సును ఉపాసనా రూపంగా లగ్నం చేయువాడు అట్టి కామరూపసిద్ధి పొందుచున్నాడు. అతడు అనుకున్న రూపముగల దేహమును ధరించి తదితరులకు దర్శనమీయగలడు.
14.) పరకాయ ప్రవేశ సిద్ధి :
|
పరకాయం విశన్ సిద్ధ ఆత్మానం తత్ర భావయేత్ । పిండం హిత్వా విశేత్ప్రాణో వాయుభూతష్షడంఘ్రివత్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 23) |
పరకాయం విశన్ సిద్ధ ఆత్మానం తత్ర భావయేత్ । పిండం హిత్వా విశేత్ ప్రాణో వాయుభూతః షడంఘ్రివత్ ॥ (శ్లోకం 23) |
యోగాభ్యాసంచే సర్వదేహములలో వేంచేసియున్న నన్ను ఏకాగ్రతతో ఉపాసించువాడు తాను అనుకున్నప్పుడు మరొక దేహంలో ప్రవేశించి "ఈ శరీరములో నేను ఉన్నాను"... అను పరకాయ ప్రవేశసిద్ధిని పొందుచున్నాడు. అట్టివాడు ప్రాణమును ఒక ఉపకరణమువలె ధారణచేసి వాయు మార్గములో ప్రాణశక్తిని ప్రయాణింపజేసి మరొక శరీరములో ప్రవేశించి "ఇది నా శరీరమైయుండు గాక! ఈ దేహమును నేను ఉపకరణంగా ఉపయోగించెదను గాక!" అను ప్రక్రియను సిద్ధింపజేసుకోగలడు. ఒక పుష్పమును వదలి మరొక పుష్పముపై వ్రాలు తేనెటీగవలె ఆతడు ఒక శరీరమును వదలి మరొకరి శరీరమును ధారణ చేయగలడు. ఈ విధంగా పరకాయప్రవేశ సిద్ధి లభిస్తోంది.
15.) బ్రహ్మరంధ్ర ద్వార ఆత్మసంయోగ సిద్ధి :
|
పార్ష్ణ్యాఽఽపీడ్య గుదం ప్రాణం హృదురఃకంఠమూర్ధసు । ఆరోప్య బ్రహ్మరంధ్రేణ బ్రహ్మ నీత్వోత్సృజేత్తనుమ్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 24) |
పార్ష్ణ్యా ఆపీడ్య గుదం ప్రాణం హృద్-ఉరః-కంఠ-మూర్ధసు । ఆరోప్య బ్రహ్మరంధ్రేణ బ్రహ్మ నీత్వా ఉత్సృజేత్ తనుమ్ ॥ (శ్లోకం 24) |
కాలియొక్క మడమచే గుదద్వారమును నిరోధించి ప్రాణశక్తిని ఊర్ధ్వముఖం చేసే యోగులు క్రమంగా ఆ ప్రాణ శక్తిని హృదయంలోకి ప్రయాణింపచేస్తున్నారు. మరల ఆ హృదయ స్థానం నుండి శిరోభాగానికి, శిరస్సుయొక్క ఊర్ధ్వభాగానికి తరలింపజేస్తూ యోగ సాధన చేస్తున్నారు. అటు తరువాత బ్రహ్మరంధ్రము ద్వారా బ్రహ్మవస్తువునందు ప్రాణశక్తిని విలీనంచేసి దేహమునకు విషయ ప్రపంచమునకు అతీతులై కేవలం సాక్షిస్వరూపులై సర్వము చిరునవ్వుతో ఆస్వాదిస్తున్నారు. బ్రహ్మకపాల మోక్ష స్వరూపులై విరాజిల్లుచున్నారు!
16.) సత్త్వగుణ దేవతా సందర్శన సిద్ధి :
|
విహరిష్యన్ సురాక్రీడే మత్స్థం సత్త్వం విభావయేత్ । విమానేనోపతిష్ఠంతి సత్త్వవృత్తీస్సురస్త్రియః ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 25) |
విహరిష్యన్ సురాక్రీడే మత్-స్థం సత్త్వం విభావయేత్ । విమానేన ఉపతిష్ఠంతి సత్త్వవృత్తీః సురస్త్రియః ॥ (శ్లోకం 25) |
శుద్ధ సాత్విక స్వరూపులు - ఆనంద స్వరూపులు అగు దేవతల సందర్శనేచ్ఛగల యోగి శుద్ధ సత్వభావన యొక్క అభ్యాసముచే క్రమంగా శుద్ధ సాత్విక స్వరూపమును సిద్ధించుకుంటున్నాడు. అట్టి యోగసాధన కొనసాగిస్తూ ఉండగా క్రమంగా సత్వగుణాంశ స్వరూపులగు దేవతా స్త్రీలను ఎదురుగా సందర్శించగల సిద్ధిని పొందుచున్నాడు. "సర్వులు నా ప్రేమ-స్నేహములకు మాతా-శిశు వాత్సల్యములకు సర్వసందర్భములలోను అర్హులే!" - అను అభ్యాసముచే సత్త్వగుణ దేవతార్హత లభిస్తోంది.
17.) సత్యసంకల్ప సిద్ధి :
|
యథా సంకల్పయేత్ బుద్ధ్యా యదా వా మత్పరః పుమాన్ । మయి సత్యే మనో యుంజంస్తథా తత్సముపాశ్నుతే ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 26) |
యథా సంకల్పయేత్ బుద్ధ్యా యదా వా మత్ పరః పుమాన్ । మయి సత్యే మనః యుంజన్ తథా తత్ సమ్-ఉప-అశ్నుతే ॥ (శ్లోకం 26) |
సత్యసంకల్పమయుడనగు నాయందు శ్రద్ధతో తన మనస్సును నిలపటం సర్వమును పరమాత్మ సంకల్పంగా దర్శించటం అభ్యసించువాడు క్రమంగా సత్యసంకల్పి కాగలడు. తాను ఏది సంకల్పిస్తే అది లోకంలో సత్యమై సిద్ధింపజేయగల సిద్ధిని పొందగలడు.
18.) ఆప్రతిహత ఆజ్ఞా సిద్ధి :
|
యో వై మద్భావమాపన్న ఈశితుర్వశితుః పుమాన్ । కుతశ్చిన్న విహన్యేత తస్య చాజ్ఞా యథా మమ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 27) |
యో వై మత్ భావమ్ ఆపన్న ఈశితుః వశితుః పుమాన్ । కుతశ్చిత్ న విహన్యేత తస్య చ ఆజ్ఞా యథా మమ ॥ (శ్లోకం 27) |
పరమాత్మనగు నాయొక్క సర్వ నియామకత్వము, సర్వ వశీకరణత్వములతో కూడిన యోగీశ్వరత్వమును ఉపాసించు యోగి క్రమంగా సర్వమును తన నిర్ణయములకు ఆధీనంగా సిద్ధింపజేసుకోగలడు. జంతువులు - మనుష్యులు తన ఆజ్ఞానువర్తులై ఉండటం అనే ఆజ్ఞాసిద్ధిని పొందగలడు.
19.) త్రికాలజ్ఞత్వ సిద్ధి :
|
మద్భక్త్యా శుద్ధసత్త్వస్య యోగినో ధారణావిదః । తస్య త్రైకాలికీ బుద్ధిః జన్మమృత్యూపబృంహితా ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 28) |
మత్ భక్త్యా శుద్ధసత్త్వస్య యోగినః ధారణా-విదః । తస్య త్రైకాలికీ బుద్ధిః జన్మమృత్యు-ఉపబృంహితా ॥ (శ్లోకం 28) |
యోగాభ్యాసంచే నాయొక్క జాగ్రత్-స్వప్న-సుషుప్త సాక్షియగు స్వరూపమునందు ఎల్లప్పుడు తన మనస్సును నిలిపి ఉంచే యోగసాధకుడు నాపట్ల భక్తిని పెంపొందించుకోగలడు. తద్వారా నాయొక్క ప్రభావముచే శుద్ధుడు కాగలడు. అట్టి శుద్ధ బుద్ధిచే ఈ దేహము ముందు - దేహ సమయం - దేహానంతరం... ఏర్పడి ఉన్న స్థితి గతులను, అందు అంతర్లీనమై నిశ్చలమైయున్న అప్రమేయత్వమును ఎరుగగలడు. లౌకికమైన భూత-భవిష్యత్-వర్తమానములను, జీవుల తత్త్వమును కూడా ఎరుగగలడు.
20.) అప్రతిహత వజ్రదేహ సిద్ధి :
|
అగ్న్యాదిభిర్న హన్యేత మునేర్యోగమయం వపుః । మద్యోగశాన్తచిత్తస్య యాదసాముదకం యథా ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 29) |
అగ్ని-ఆదిభిః న హన్యేత మునేః యోగమయం వపుః । మత్ యోగశాంతచిత్తస్య యాదసామ్ ఉదకం యథా ॥ (శ్లోకం 29) |
పరమాత్మయొక్క పాంచభౌతిక-అతీత్వమును ఉపాసించు యోగి క్రమంగా భక్తి యోగ సంపన్నుడు - శాంతచిత్తుడు అవుతాడు! వజ్ర దేహసిద్ధిని కూడా పొందుచున్నాడు. అట్టివాని మనో సంకల్పిత భౌతికదేహమును అగ్ని కాల్చలేదు. నీరు తడుపజాలదు. అగ్నిలోని జీవులను అగ్ని కాల్చదు కదా! నీటిలో నివశించే జీవుల శరీరములను నీరు హానికలిగింపలేదు కదా! అట్లాగే పరతత్త్వ స్వరూపుడనగు నాయందు భక్తి-ప్రపత్తులు నిలిపి ధ్యానం చేసే యోగి యొక్క శాంత చిత్తమును భక్తి పారవశ్యమును పంచభూతములుగాని, సంగతి-సందర్భములు గాని హాని కలిగించజాలవు. "పరమాత్మ అనే మహాసముద్రజాలంలో నేను ఒక తరంగమును".... అను రూపంగా ఉపాసించువాడు పంచభూతములచే హానికలుగని దేహమును పొందటానికి సమర్ధుడౌచున్నాడు.
21.) అజేయ అపరాజిత సిద్ధి :
|
మద్విభూతీరభిధ్యాయన్ శ్రీవత్సాస్త్రవిభూషితాః । ధ్వజాతపత్రవ్యజనైస్స భవేదపరాజితః ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 30) |
మద్ విభూతీః అభిధ్యాయన్ శ్రీవత్స అస్త్ర విభూషితాః । ధ్వజ-అతపత్ర-వ్యజనైః స భవేత్ అపరాజితః ॥ (శ్లోకం 30) |
ఏ యోగి అయితే నాయొక్క ధ్వజము, శంఖము, చక్రము, గద, పద్మము మొదలైన విభూతులతో కూడిన నారాయణ - శ్రీకృష్ణ ఇత్యాది రూపమును ధ్యానం చేస్తూ వుంటాడో, నాయొక్క త్రిమూర్త్యాది అవతారములలో తనకు ఇష్టమైన రూపమును ఉపాసనా స్వరూపంగా భావించి ఆరాధిస్తూ వుంటాడో.... ఆతడు సర్వదా తదితరులచే అజేయత్వము అగు ఆనందస్థితిని ఆస్వాదిస్తూ వుంటాడు. ఆతని ఆనందస్థితిని ఛేదించేది ఏదీ వర్తమానంలోగానీ, జన్మ జన్మాంతరాలలోగాని ఉండజాలదు.
Page number:133
ఓ ఉద్ధవా! ఇప్పుడు నీకు కొన్ని కొన్ని యోగ ధారణల స్థితిగతులేమిటో... అవి సిద్ధింప
జేయగల సిద్ధులు ఏరీతిగా ఉంటాయో విశదీకరిస్తూ వచ్చానుకదా! ఒక్కమాటలో
చెప్పాలంటే ఎవ్వడైతే ఇంద్రియములను జయించి, వాటి వాటి విషయపరంపరలకు
అతీతత్వము సముపార్జించి, ఇంద్రియ-మనో నిగ్రహము కలవాడై శ్వాసనుప్రాణమును-చిత్తమును పరతత్త్వమవైపుగా నియమించి నాయొక్క పరతత్త్వ ధ్యానమును
అభ్యసిస్తాడో - అట్టి వానికి ఈ 14 లోకాలలో అసాధ్యమైనదేదీ ఉండదయ్యా!
మనం ఇప్పుడు చెప్పుకున్న సిద్ధులు - వాటివాటి ప్రయోజనములు ఆత్మానందానుభవము
యొక్క సమక్షంలో చిన్న చిన్న విశేషములే సుమా! ఎవ్వడైతే నాయందు భక్తితో నా
స్వరూపనందమును సముపార్జించుకునే ప్రయత్నంలో ఉంటాడో.... అట్టివాడు ఆయా
సిద్ధులన్నిటినీ "ఇవన్నీ నా పరతత్త్వ చింతనకు, పరమేశ్వర విభూతియందు లయం
పొందటానికి మధ్యేమార్గంలో కలిగే విఘ్నములేకదా!" అను దృష్టితో చూస్తూ వుంటాడు.
పరతత్త్వ ధ్యానం అభ్యసించే వానికి ఇహలోకంలో ఔషధము-తపస్సు-మంత్రము
మొదలైన వాటివలన కలిగే సిద్ధులు తమంతటతామే సమీపిస్తాయి. అయితే-"భక్తిప్రత్తులచే లభించే నా పరతత్త్వ సారూప్యస్థితి సిద్ధులచే లభించేది కాదు" అని గమనించు.
|
శ్లో॥ సర్వాసామపి సిద్ధీనాం హేతుః పతిరహం ప్రభుః । అహం యోగస్య సాంఖ్యస్య ధర్మస్య బ్రహ్మవాదినామ్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 15, శ్లోకం 35) |
శ్లో॥ సర్వాసామ్ అపి సిద్ధీనాం హేతుః పతిః అహం ప్రభుః । అహం యోగస్య సాంఖ్యస్య ధర్మస్య బ్రహ్మవాదినామ్ ॥ |
సర్వ యోగములకు, యోగసిద్ధులకు...
సాంఖ్యుల - నిష్కామకర్ముల - బ్రహ్మావాదుల ఆశయములకు...,
ఆశయసిద్ధిని నేనే సుమా!
సర్వ జగత్ చమత్కారములకు అంతర్గతుడను, నేనే!
అవన్నీ ఉన్నది నాయందే!
సర్వధర్మములకు చరమస్థానం నేనే!
సర్వజీవులయొక్క ఆత్మ నేనే!
నాయందే సర్వజీవులు సర్వదా స్థానము పొందినవారై ఉన్నారు!
సర్వజీవుల బాహ్య-అభ్యంతరములలో బాహ్యభ్యంతరములుగా సర్వదా విరాజిల్లుచున్నది నేనే!
Page number:134
సర్వజీవులు నాయొక్క విభూతులే!
అట్టి నాయొక్క స్వస్వరూప విభూతి యోగాన్ని ఆశ్రయించు యోగి నన్నే పొందుచున్నాడు!
ఇక ఆతనికి వేరే సిద్ధులతో పనిఏమున్నది? ప్రయోజనమేమున్నది? అవసరమేమున్నది?
అధ్యాయము-22.) భగవత్ విభూతులు - అనాసక్త యోగం |
శ్రీఉద్ధవుడు : ఓ దేవదేవా! మీరు ఆద్యంతరహితులు! సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు!
సర్వపదార్థములయొక్క సృష్టి-స్థితి లయములకు కారణస్వరూపులు. సర్వమునకు
ఆస్థానం మీరే! స్వామీ! వేదార్ధములు తెలిసి ఆనందించే మహనీయులలోను, కర్మరహస్యం
తెలిసి ఆచరించు ఉత్తమ కర్మయోగులలోను, దృశ్యతాదాత్మ్యముచే పారవస్యం పొంది
ఉపాధి పరంపరలను పొందుచున్న అజ్ఞానులలోను సమానంగా వేంచేసి ప్రత్యక్షమై
యున్నారు! సర్వజీవుల అనుభవరూపమైన బాహ్య-అభ్యంతరములు మీయొక్క
చమత్కారమే! మీరే!
మహనీయులెందరో మిమ్ములను ఉపాసించి మీ పాదాలు చేరుచున్నారు. హే
మహదాశయ సిద్ధి స్వరూపా! ఇప్పుడు మరొక వివరణకొరకై విన్నవించుకుంటాను.
యోగ-ఉపాసన మార్గంలో అడుగులు వేస్తూ వుండే ఆయా మహానుభావులు మీయొక్క
ఏఏ విభూతులను సాధనగా స్వీకరించి మిమ్ము ఉపాసిస్తున్నారో, అట్టి మీ విభూతి
విశేషములను ప్రవచించవలసినదిగా ప్రార్థన చేస్తున్నాను.
సర్వజీవులలో వేంచేసి ఉండి, సర్వజీవులకు రక్షకుడవగు ఓ పరంధామా! మీరు
సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నారు. అయితే ఏం? మేము సర్వతత్త్వ స్వరూపుడుగా
ఆస్వాదించలేకపోతున్నాం! మీ మాయకు విమోహితులమై "వీరు అయినవాళ్ళు - వాళ్ళు
కానివారు" ... అని భ్రమిస్తూ సంసారంలో చిక్కుకుంటున్నాం! ఈ రీతిగా సంసారంలో
చిక్కుకున్న మాకు దివ్యౌషధం మీ విభూతులే కదా!
అచింత్యమైన యోగేశ్వరులగు ఓ ఆదిదేవా! ఇక్కడి స్వర్గ - మర్త్య - పాతాళాలలో మీ
చమత్కారముగా అమర్చబడియున్న మీ విభూతులను నాకు సవివరంగా చెప్పండి!
ఏఏ విభూతిని సాధనకొరకై ఆశ్రయించటంచేత మేము సర్వాత్మ స్వరూపమగు మీ
పాదాలు చేరి క్షేమంగా ఉండగలమో... ఆయా విభూతులను గురించి విశదీకరించండి!
శ్రీకృష్ణభగవానుడు : ప్రశ్నించుటలో అత్యంత ప్రావీణ్యంగల ఓ మిత్రమా! ఉద్దవా!
Page number:135
కౌరవ- పాండవ సంగ్రామ ప్రారంభంలో నీలాగానే అర్జునుడు నన్ను నాయొక్క త్రిలోక
విభూతులను ఉపాసనకొరకై వివరించవలసినదిగా కోరటం జరిగింది. ఆ యుద్ధ
ప్రారంభంలో, "అయ్యో! నాకు ఈ నా బంధువులను చంపుచున్నానే! బంధుజనులను
చంపిన పాపం నన్ను చుట్టుకోబోతోందే!"... అనే ప్రాకృతిబుద్ధి, భౌతిక దేహ దృష్టి
ఆతని బుద్ధిని ఆవరించటం జరిగింది! "నా బంధువులను చంపి నేను దుఃఖం
పొందనున్నానే!" ... అని భావించి, నేను యుద్ధం చేయలేను! నిన్ను శరణు వేడుచున్నాను!
ఇప్పుడు నేనేం చేయాలి? నా కర్తవ్యం ఏమిటి?... అని శరణాగతుడై ప్రశ్నించడం
జరిగింది. అప్పుడు నేను యుక్తియుక్తంగా సాంఖ్యయోగం, భక్తియోగం, జ్ఞానయోగం,
శరణాగతి యోగం, ఇత్యాది విశేషాలన్నీ నిర్వచనపూర్వకంగా చెప్పటం జరిగింది. ఆ
సందర్భంలోనే - మూడులోకములలోని నా విభూతులగురించి చెప్పిన విశేషాలు నీ
ప్రశ్నకు సమాధానంగా - కొంత వేరైన వివరణగా - చెప్పుచున్నాను. ఏ ఏ రీతులుగా
నన్ను ఉపాసించటం సానుకూల్యమో విను!
సర్వజీవుల ఆత్మస్వరూపుడను నేను!
సర్వప్రాణులకు హితం చేస్తున్నవాడను!
సర్వ ప్రాణుల బాహ్య-అభ్యంతరములు నాయొక్క విభూతి చమత్కారమే!
సర్వజీవులు జనించింది నాయందే! ఉన్నది నాలోనే! లయిస్తున్నది నాయందే!
ఈ సర్వమునకు సృష్టి-స్థితి-లయమును నేనే!
గతిశీలములైనవాటి కన్నిటికీ గతిని నేనే! (I am the feature of movement in
all moving objects),
ఈ కనపబడే సర్వము కాలముచే జనించి కాలముచే నశించేదేకదా! అట్టి
ఉత్పతి వినాశనములకు కర్తయగు "కాలము" నా స్వరూపమే!
కాలఃకాలుడను, కాల నియామకుడను! |
సర్వ జీవులలో నేనుగా ఉన్నది నేనే! నేను - నీవు - అది - ఇది ఆతడు - |
ఇతడు ఇవన్నీ నేనే!
గుణయుక్తములైన సర్వవస్తువులు పుష్పములుగా గమనిస్తే... ఆ గుణముల
పుష్పమాలకు అంతర్యామిని. సూత్రాత్మను, పూలదండలోని దారమువంటివాడను!
Page number:136
సూక్ష్మ పదార్థములలో సూక్ష్మాత్మను, మహత్ పదార్థములలోని మహదత్వము నేనే!
|
దుర్జయములుగా కనిపించే సర్వవిశేషములకు మనఃస్వరూపుడను నేనే! సర్వుల
మనోరూపము నాయొక్క విభూతియే! నేనే సర్వులలోని మనోరూపుడను!
తెలియబడేదంతా నాస్వరూపమే! తెలుసుకుంటున్నది కూడా నేనే! నేను వేద
స్వరూపుడను. వేదాంత స్వరూపుడను! (I am that what all being known. I
am the knower. I am the witness to the knower)
శాస్త్రరూపములగు వేదములు నా స్వరూపమే! వేదములు అంతిమసారంగా గానం
చేస్తున్నది నా తత్త్వమే! నన్నే! ఆ గానము - గానము చేస్తున్నది కూడా నేనే!
వేదమంత్రములు ప్రతిపాదిస్తున్న ఓం కారస్వరూపము నేనే!
అ ఉ మ { అ self (ఆత్మ) ఉమ ప్రకృతి (Self related) }
అక్షరాలలో అ కారము నేనే!
ఛందస్సులలో భర్గో దేవస్య ధీమహి అని అభ్యర్ధనాగాన స్వరూపమగు
త్రిపదాగాయత్రి నాస్వరూపమే!
దేవతలలో ఇంద్రుడను.
అష్టవసువులలో అగ్నిని!
ఆదిత్యులలో విష్ణువును!
ఏకాదశరుద్రులలో నీల లోహితుడను నేనే!
రాజర్షులలో మనువును!
దేవర్షులలో నారదుడను!
ధేనువులలో కామధేనువును!
సిద్ధేశ్వరులలో కపిలమునిని!
పక్షులలో గరుడుడను!
ప్రజాపతులలో దక్షప్రజాపతిని!
పిత్రుగణంలో అర్యముడను!
దైత్యులలో ప్రహ్లాదుడను.
Page number:137
ఆకాశదీపికలలో, నక్షత్రాలలో ఔషధప్రదాతయగు చంద్రుడు నా విభూతియే!
యక్ష - రాక్షసులలో కుబేరుడను!
ఏనుగులలో ఐరావతము నా చిత్కళయే!
జలదేవతాస్వరూపులలో జలచరముల ప్రభువగు వరుణుడను!
తపింపజేస్తూ దీప్తితో వెలుగొందు వస్తువులలో సూర్య గోళమును!
మానవులలో రాజు నా ప్రదర్శనమే! వ్యక్తీకరణమే!
|
అశ్వములలో ఉఛైశ్రవము (దేవతా లోకంలోని అశ్వము) నేనే!
|
ధాతువులలో బంగారమును!
జీవుల దుష్టకర్మల శిక్షకులలో యమధర్మరాజును!
సర్పములలో వాసుకిని!
నాగులలో అనంత నామధేయ ఆదిశేషుడను!
నాలుగు కాళ్ళ - కొమ్ములు కోఱలు మొ॥నవి గల జంతువులలో సింహమును!
ఆశ్రమములలో తుర్యము అనబడే సన్యాసాశ్రమమును!
వర్ణములలో బ్రాహ్మణ వర్ణమును!
|
తీర్థము - నదులలో గంగను!
జలాశయములలో సముద్రమును!
|
ఆయుధములలో ధనుస్సును!
ధనుర్ధాదులలో త్రిపురసంహారియగు ఆదిశంకరుడను నేను!
స్థానములలో మేరు పర్వతమును!
పర్వతములలో హిమాలయ పర్వతమును!
వృక్షములలో రావివృక్షమును!
ఓషధములలో ధాన్యమును!
పురోహితులలో వసిష్ఠ మహర్షిని! |
బ్రహ్మజ్ఞానులలో బృహస్పతిని!
|
సేనాపతులలో కార్తికేయుడను!
|
అగ్రగణ్యులలో భగవంతుడగు బ్రహ్మదేవుడను! సృష్టిభావ కవిని!
|
Page number:138
యజ్ఞములలో "సర్వము బ్రహ్మమే" అను సాధనా ద్రవ్యముతో కూడిన
బ్రహ్మయజ్ఞమును!
వ్రతములలో అహింసావ్రతమును!
పరిశుద్ధము చేయు సాధనములలో వాయువు - అగ్ని - జలము - వాక్కు నేనే! -
అష్టాంగయోగములలో ఆత్మ సంయమయోగమును!
మంత్రద్రష్టలలోని మంత్ర మననము నేనే!
కౌశలములలో "దృశ్యమును ఆత్మగా దర్శించు అన్వీక్షికీ కౌశలము" ను!
ఖ్యాతి వేదులలో వికల్పస్వరూపము నేనే!
(ఖ్యాతి - ఆత్మ జగత్తుగా కనిపించటం అనే చమత్కారము ఎరిగినవారు)
స్త్రీలలో శతరూపను. పురుషులలో స్వాయంభువన మనువును!
మునులలో నారాయణుడను!
బ్రహ్మచారులలో సనత్కుమారుడను!
ధర్మములలో ఇంద్రియ - మనో - బుద్ధి - చిత్త- జీవ సాక్షి ధర్మమును
విశదీకరించు కర్మసన్యాస యోగమును! అభయప్రదాన ధర్మస్వరూపుడను నేనే!
క్షేమములలో అంతరంగ సంస్థాపనా క్షేమమును! అంతర హృదయములో ప్రత్యక్షమై
యుండే ఆత్మానుభవమును! అబహిరనుభవమును! (I am the inner devine
sense).
రహస్యములలో పరమసత్యమును నేనే! సూనృతం అహమేవ! ప్రియవచన
స్వరూపుడను. (I am the sweet and enjoyable words and verses)
రూపములలో మౌనరూపమును!
మిధునములలో ప్రజాపతిని! అజుడను!
మార్పు-చేర్పులకు అతీతమైన - అప్రమత్త పదార్ధములలో సంవత్సరము అనునది నేనే!
ఋతువులలో వసంత ఋతువును.
మాసములలో మార్గశీర్షమును
నక్షత్రములలో అభిజిత్ నక్షత్రమును!
యుగములలో కృతయుగమును!
Page number:139
ధీరులలో దేవలుడను, అసితుడను!
|
వేదవిభాగులలో ద్వైపాయనుడను. (వ్యాసమహర్షిని)
కవులలో కావ్య స్వరూపుడను!
పండితులలో, వివేకవంతులలో శుక్రాచార్యుడను!
భగవత్ ప్రదర్శనములలో వాసుదేవుడను!
భాగవత శ్రేష్ఠులలో ఉద్దవుడను! (నీవే నేను)!
కింపురుషులలో హనుమంతుడను!
విద్యాధరులలో సుదర్శనుడను నేనే!
రత్నములలో పద్మరాగమును.
సౌందర్యముతో కూడిన పదార్థములలో పద్మకోశమును!
దర్భజాతులలో కుశమును!
హవ్యములలో ఆవునెయ్యిని!
పరిశ్రమించు వారిలో శ్రమశక్తి స్వరూపిణియగు లక్ష్మిని నేనే!
కపట విశేషములలో ద్యూతమును!
కష్టములు అనుభవించువారిలో సహనమును, తితీక్షను నేనే!
సాత్వికులలోని సత్త్వగుణమును. ||||
బలవంతులలోని ఉత్సాహం, పరాక్రమం, సాహసం నేనే!
సాత్వికులలోని సాత్విక ప్రదర్శనం నేనే!
నవ విధ సాత్వతమూర్తులలో ఆదిమూర్తియగు వాసుదేవుడను నేనే.
(నవమూర్తులు వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు,
నారాయణుడు, హయగ్రీవుడు, వరాహుడు, నృశింహుడు, బ్రహ్మ)
గంధ్వరులలో విశ్వావసుడను!
అప్సరసలలో పూర్వచిత్తిని!
భూతత్వంలో స్థైర్యమును.
పృధివిలోని గంధతన్మాత్రను!
Page number:140
జలములో రుచి దాహక స్వాంతనము - జీవపోషకము నేనే!
తోజోమయ వస్తువులలో సూర్యగోళమును!
సూర్యచంద్ర - నక్షత్రములలో తేజస్సు - ప్రభ నేనే!
ఆకాశంలోని శబ్దతత్వము నేనే!
బ్రాహ్మణ భక్తులలో విరోచనపుత్రుడగు వైరోచనుడను (బలిచక్రవర్తిని).
వీరాధివీరులలో అర్జునుడను. |
ప్రతిప్రాణియొక్క ఉత్పత్తి - ఉనికి - వినాశనము నా యొక్క చమత్కారమే!
పాదాలలో దాగి ఉండి ప్రదర్శితమగుచున్న గమనశక్తి నేనే!
నోటియొక్క మాట్లాడేశక్తి, విసర్జనేంద్రియములలో విసర్జనశక్తి, చేతులలోని
|
గ్రహణశక్తి, జననేంద్రియములోని ఆనందభోగ శక్తి, చర్మముయొక్క స్పర్శశక్తి,
కళ్ళలోని చూపుశక్తి, ముక్కుయొక్క ఆఘ్రాణశక్తి నేనే! నా విన్యాసమే! అస్మత్
కళా సంప్రదర్శనమే!
పంచభూతములగు పృథివి - వాయువు ఆకాశము జలము అగ్నిగా
కనిపించే పంచభూతములు నేనే! పంచ మహాభూతములు నా ప్రదర్శనమే!
అహంకారము, మహత్తత్త్వము, ప్రకృతి, పురుషుడు, సత్త్వరజస్తమోగుణములు,
మనోబుద్ధి చిత్రాలు, సర్వపదార్థాల పరిగణము, జ్ఞానము, వాటి ఫలస్వరూపమైన
తత్త్వనిర్ణయమును, పరబ్రహ్మము కూడా నేనే!
ఈ సర్వ నామరూపములుగా విస్తరించి యుండి, సర్వజీవుల అంతర్భహి
స్వరూపంగా సర్వజీవులకు అనుభవమగుచున్నట్టి ఈశ్వరుడను - సర్వేశ్వరుడను
కూడా నేనే! సర్వాంతర్యామిని, సర్వప్రదర్శన విన్యాసమును నేనేనయ్యా!
నేనే జీవుడను! నేనే గుణములు! నేనే గుణిని! క్షేత్రజ్ఞుడను - సర్వాత్మకుడను
కూడా నేనే! నేను కానిదంటూ మరెక్కడా ఏదీ లేనే లేదు!
పరమాణు సంఖ్యాస్వరూపుడను, అసంఖ్యా స్వరూపుడను స్వరూపుడను -
కాల-క్రియా తత్త్వమును నేనే!
అయినప్పటికీ అసంఖ్యములగు బ్రహ్మాండములను సృష్టించు నా విభూతులను
నేనే లెక్కించి చెప్పజాలను!
Page number:141
సర్వవస్తువులలోని - జీవులలోని తేజస్సు - శ్రీ - కీర్తి - పరాక్రమము - ఓర్పు
| | -
- నేర్పు - విజ్ఞానము... మొదలైనవన్నీ నా అంశలే!
నీవు - నీ సందర్శనము-ఉభయము నేనే సుమా!
ఓ ఉద్ధవా! నాయొక్క విభూతులను ఈవిధంగా సంక్షిప్తంగా వర్ణించి చెప్పాను!
అయితే ఒక్క విషయం గుర్తుంచుకో!
ఈ దృశ్యములో కనిపించే అజ్ఞాన-సాంసారిక సంగతులు - సందర్భములు - సంఘటనలు
మొదలైనవన్నీ పరమార్ధవస్తువులు కావు! అవన్నీ మనస్సుయొక్క వికార చమత్కారములే!
వాక్కుకు మాత్రమే విషయములు - కల్పితములు సుమా! ఆకాశంలో సరస్సువలె ఊహా
చమత్కారములు! కాబట్టి ఈ దృశ్యపదార్ధములపట్ల అభినివేశము కలిగి ఉండటం
అనుచితం!
నాటకంలో నటించేవాడు తన పాత్రయొక్క సుఖ - దుఃఖాలు, ప్రేమ-ద్వేషాలు తనవేనని
అనుకోడుగా! తనవిగా ప్రేక్షకులకు భ్రమింపజేయటం మాత్రమేచేస్తాడు కదా!
జగత్తులో సందర్భానుచితంగా (సందర్భములను అనుసరించి) వుంటూనే
సందర్భములకు అతీతుడవై వుండటం అభ్యసించు.
అందుచేత ఓ ఉద్ధవా! నీవు మొట్టమొదటే వాక్కును - మనస్సును - ప్రాణములను
ఇంద్రియములను సంయమనం చేసే ప్రయత్నంలో ఉండు! అనగా, ఆమూడింటిని
శాస్త్రములు, పెద్దలు సూచిస్తున్న సాధనా విధానములందు నియమించి బుద్ధిని సత్త్వ
సంపన్నం చేసి తద్వారా బుద్ధి సంయమనం సముపార్జించు. సర్వము నాస్వరూపంగా
సందర్శించు. అప్పుడిక సంసారమార్గంలో పడవలసిన అవసరం నీకుండదు! నీవు
పడవు!
సంయమనముతో సాత్వికమై కూడిన బుద్ధితో వాక్-మనస్సులను పరిశుద్ధ
పరచుకుంటూ సర్వమునకు కేవలసాక్షిత్వము అవధరించి ఉచితానుచితానుసారంగా
కర్మ-ధర్మములను నిర్వర్తించుచూ ఉండటం అలవరచుకో! క్రమంగా వ్రతములు
Page number:142
తపస్సు మొదలైన సాధనలన్నీ-భక్తిని ప్రవృద్ధపరుస్తూ - ఎప్పుడో పచ్చికుండలో పోసి
ఉంచిన నీరువలె తమంతట తామే ఇగిరిపోగలవు!
సర్వకాల - సర్వావస్థలలో పరాప్రేమతో కూడినవాడవై నాకు భక్తుడవైవుండు.
భక్తియోగంచే బుద్ధి-వాక్కు-మనస్సు సంయమింపజేయటం సులభమే! సాధ్యమే!
అందుచేత నిరుత్సాహం వదలిపెట్టు.
సంయమముచే (చంచలత్వాన్ని అధిగమిస్తూ వుండగా) కృతకృత్యుడవు కాగలవు! నీ
త్రోవలో - మార్గములో సర్వ సందర్భములలో తోడుగా నేను సర్వదా ఉండియే ఉన్నాను!
ఉండియే ఉంటాను! ఉండి తీరుతాను. కాస్త యోచన-శ్రద్ధలతో-సాధనలకు
ఉపక్రమించు. భక్తి-యోగ-సాధన మార్గములలో తోడుగా వుండటమే ఈ నా
అవతారము యొక్క ముఖ్యోద్దేశ్యం.
అధ్యాయము-23.) మార్గములు : స్వకర్మ - ధర్మము - జ్ఞానము |
శ్రీ ఉద్ధవుడు : స్వామీ! శ్రీకృష్ణా! సర్వాంతర్యామివి, సర్వప్రదర్శన స్వరూపడవు అగు
నీపట్ల ఏకాగ్రమైన ధ్యాస ధ్యానం నిర్వర్తించటం గురించి చెప్పుతూ వస్తున్నారు! ఏకాగ్రత
లభించాలంటే భక్తిని పెంపొందించుకోవాలని మీ వాక్యానుసారం గ్రహించాను! వర్ణాశ్ర
ధర్మములు పాటించేవారికి పాటించనివారికి కూడా భక్తి శ్రేయోమార్గమైయున్నదని
మీ మాటలననుసరించి గ్రహించాను!
భక్తిచే నీపట్ల ధ్యాస లభిస్తుంది. అయితే, భక్తి ప్రవృద్ధం కావాలంటే ధర్మాచరణ (లేక)
కర్మాచరణ ఉపాయం కదా!
ధర్మాచరణ పూర్వకమై కర్మచేత భక్తి - భక్తిచేత దృఢమైన భగవత్ ధ్యాస - అట్టి భాగవత
ధ్యాసచే పరమాత్మ లభిస్తాయని నేను మీ ప్రవచనం ద్వారా గమనిస్తూ వస్తున్నాను.
ఇప్పుడు కర్మవిషయకమైన ధర్మాచరణ ఎట్లూ వివరించబడిందో, నిర్దేశించబడిందో...
మీనుంచి వినాలని ఉన్నది. ఓ మాధవా! ఒకప్పుడు మీరు హంసరూపంలో బ్రహ్మదేవుని
ముందు ప్రత్యక్షమై జీవుల శ్రేయస్సు కోరి వర్ణాశ్రమాలు - ఆశ్రమ ధర్మాలు - సర్వమానవ
ధర్మాలు.... వివరించి చెప్పటం జరిగిందని నేను పెద్దల ద్వారా విని ఉన్నాను.
పరమధర్మము గురించి కూడా చెప్పడం జరిగిందట! మీరు చెప్పిన ఆశ్రమధర్మాలు
కర్మను అనుష్ఠాన పూర్వకంగా నిర్వర్తించటం మొదలైన విశేషాలు చాలాకాలం గడచుటచే
Page number:143
జనులు ఏమరచి కర్మలకు బద్ధులగుచున్నారని, ఆ కారణంగా ఈభూలోకం
నష్టప్రాయమైనదని అనుకోగా కూడా వింటూ ఉంటాము. పునరుద్ధరించటమే మీ
అవతరాముయొక్క ముఖ్యోద్దేశ్యమని వసుదేవుడు -మొదలైన పెద్దలు చెప్పగా విన్నాను.
ఓ అచ్యుతా! కర్మ-ధర్మము అను శబ్దములకు గల సశాస్త్రీయమైన నిగూడార్ధం
వివరించగలిగినవారు మీతో సమానమైనవారు ఎవ్వరు? ఎవ్వరూ లేరు!
మీరు ధర్మస్వరూపులు! ధర్మమునకు ప్రవర్తకులు! ధర్మరక్షకులు! ధర్మనిర్దేశకులు! మీరు
అవతారం చాలించిన తరువాత మాకు ధర్మవిశేషాలు ఎవరు బోధించగలరు చెప్పండి!
అందుచేత ఓ సర్వధర్మజ్ఞా! ఈ సందర్భంలో మాకు ధర్మాలు - ధర్మ రక్షణ - ధర్మనిరతి
- మీ పాదలకు త్రోవతీయగల భక్తి యోగం మొదలైనవాటి గురించి మరొక్కసారి ఇప్పుడు
వివరించండి!
శ్రీ శుక మహర్షి : ఓ పరీక్షన్మహారాజా! ఆవిధంగా ధర్మవిషయం గురించి ఉద్ధవుడు
ప్రశ్నించగా,... సర్వ జీవులను మోహింపజేసే చిరునవ్వు చిందిస్తూ..... శ్రీకృష్ణభగవానుడు
ఇట్లా సమాధానం ప్రసాదించ సాగారు.
శ్రీకృష్ణభగవానుడు : ఓ మిత్రమా! ధర్మవిశేషము గురించి నీవు అడిగిన ప్రశ్న సముచితము.
మానవుడు స్వధర్మగురించి, వర్ణాశ్రమ ధర్మాల ప్రాముఖ్యత గురించి, ధర్మనిరతిని
ఏమరచటంచేత వచ్చే దుష్ప్రయోజనముల గురించి చక్కగా వివరణ పూర్వకంగా ఎరిగి
ఉండటం అత్యంతావస్యకం! ధర్మనిరతిచేత భక్తి సుదృఢమౌతుంది సుమా!
కృతయుగం :మొట్టమొదటిదైన కృతయుగారంభంలో "హంస" అను (సర్వము
పరతత్త్వమే... అను శబ్దార్ధంతోకూడిన) వర్ణము ఒక్కటే ఉండేది! అప్పుడు అట్టి
సమయంలో జనులు జన్మతః అనన్యభక్తి పారాయణులై వుండేవారు! జగత్తును
ఈశ్వరభావంతో ఉపాసిస్తూ - అనన్యభక్తిచే సాధకులు అతిత్వరగా కృతకృత్యులయ్యేవారు.
హంసయోగపారాయణం లోకప్రసిద్ధమై ఉండేది.
హంసయోగం - సోఽహమ్ ఈ చరాచర సృష్టి ఆత్మయొక్క ప్రతిబింబ
రూపమే!ఇహ స్వరూపానుభవమంతా
స్వస్వరూపాత్మయొక్క క్రీడావినోద
లీలా చమత్కారమే... అనే దృష్టి ఎఱుక -జ్ఞప్తి
Page number:144
జనులు హంసయోగంచే కృతకృత్యులయ్యేవారు కాబట్టి "కృతయుగము" అని కాలశాస్త్ర
వేదులచే పేరుపెట్టబడింది! కృతయుగంలో వేదము ప్రణవాత్మకంగా అనుభవమయ్యేది.
అనగా....,
తెలియబడేదంతా (వేదము).... ఆత్మౌపమ్యేవ సర్వత్రా - ఆత్మైవమిదగ్ం సర్వమ్
అను అనుభూతిగా ఆస్వాదించబడేది.
అట్టి కృతయుగంలో ధర్మస్వరూపుడనైన నేను నాలుగు పాదములతో ఆనందంగా గోవునై
సృష్టియందు సంచారాలు చేస్తూ వుండేవాడను!
నా ధర్మధేను స్వరూపం యొక్క నాలుగు పాదములు....,
1. సత్యము
2. దయ
3. శౌచము
4. తపస్సు
ఈ నాలుగు పాదములతో జీవులకు ముక్తిని ప్రసాదిస్తూ వుండేవాడను! తపోనిష్ఠులై
మహనీయులు ఈ జగత్తును నాయొక్క విశుద్ధ హంసరూపముగా ధ్యానిస్తూ ఉండేవారు.
తరువాత త్రేతాయుగం!
త్రేతాయుగంలో నా ప్రాణశక్తి - హృదయములనుండి ఋక్వేదం (మంత్రం), యజుర్వేదం
(తంత్రం) సామవేదం (గానం) అనే 3 వేదములు ఆవిర్భవించటం జరిగింది. అదే
త్రయీవిద్య అట్టి త్రయీవిద్యగా
ఋక్ నుండి హౌత్ర (మంత్రములు, మంత్రపూర్వక దేవతాహ్వానములు)
యజుర్ నుండి అధ్వర్యవ (యజ్ఞవిధానాలు)
సామ నుండి ఔద్దాత్రము (గానము / స్తోత్రములు)
అను మూడు విధములైన యజ్ఞరూపములను నేను ధరించటం జరుగుతోంది. ప్రతి
యజ్ఞములోను, కార్యక్రమములోను ఈ మూడు ఉంటూనే ఉంటాయి.
నాయొక్క విరాట్ రూపధారణ నుండి స్వధర్మము అనే ఒకానొక ధర్మతత్త్వము సృష్టి
చమత్కారము కొరకై బయల్వెడలింది! అట్టి స్వధర్మ లక్షణయుక్తములకై సృష్టియొక్క
Page number:145
లీలా వినోదము కొరకై చతుర్విధ (4 రకములైన) స్వధర్మ నిరతులు బయల్వెడటం
జరిగింది!
నా విరాట్ పురుష - ధర్మదేవతా చమత్కారము యొక్క....
ముఖమునుండి విప్రజన స్వధర్ములు (శాస్త్ర పారంగతులు శాస్త్రార్ధ నిరతులు)
....
బాహువుల నుండి ....... క్షత్రియజన స్వధర్ములు (శౌర్య - ధైర్య - పరాక్రమ నిరతులు)
ఊరువులు (తొడలనుండి)....వైశ్యజన స్వధర్ములు (కృషి-గో రక్షణ నిరతులు)
పాదముల నుండి .... శూద్ర స్వధర్మ నిరతులు (సేవానిరతి గల స్వధర్మ నిరతులు)
బయల్వెడలుచున్నారు. నాలుగువిధములైన స్వధర్మోపాసనలు చాతుర్వర్ణ్యములుగా
గణుతికెక్కాయి.
ఈ నలుగురు స్వధర్మనిరతులు. సృష్టికి నాలు స్థంభాలవంటివారు!
ఆపై...,
నా విరాట్ రూపం నుండి 4 ఆశ్రమాలు బయల్వెడలాయి.
మోకాళ్ళ (జఘన) ప్రదేశం నుండి చాతుర్వర్ణ్య ప్రియులకు గృహస్థాశ్రమం
హృదయం నుండి బ్రహ్మతత్త్వోపాసకులగు నైష్ఠిక బ్రహ్మచర్యాశ్రమం
వక్షస్థలం నుండి .... వనవాసప్రియులగు వానప్రస్థాశ్రమం
నుదురు (మస్తకము) నుండి .. సన్యాసాశ్రమం
వివిధములైన గుణసంపన్నులగు ముముక్షువులగు సాధక జనుల సానుకూల్యత కొరకై
పైన చెప్పిన నాలుగు ఆశ్రమములు సంకల్పించబడ్డాయి.
ఈ నాలుగు ఆశ్రమాలలో కూడా ఆయా మానవుల స్వభావమును అనుసరించి ఉత్తములు
- మధ్యములు - అధములు అగువారు (నాలుగు ఆశ్రమాలలో) వుంటూ వుండటం
జరుగుతోంది. (బాగా చదువుపట్ల శ్రద్ధగలవారు ఒక మాదిరైన శ్రద్ధగలవారు - -
శ్రద్ధ ఇంకా ఏర్పడనివారు ఉన్నట్లే అదికూడా!) అదంతా కూడా నానుండి బయల్వెడలినట్టి
ప్రకృతియొక్క దివ్య ప్రదర్శనా చమత్కారమే! జగన్నాటక కథారచనా కళా విన్యాసమే!
Page number:146
Page number:147
Page number:148
అదంభము గర్వము - దర్పము - దంభములను త్యజిస్తూ అణకువప్రతిపత్తి శరణాగతితో కూడిన భావములు కలవారై
ఉంటారు.
బ్రహ్మసేవనం బ్రహ్మజ్ఞులు - వేదజ్ఞులపట్ల సేవాభావం కలిగినవారై
ఉంటారు.
అతుష్ఠిరర్ధో ఉపచయేత్ సంపదలను పెంపొందించే ఉత్సాహముతోకూడి ఉంటారు.
4. శూద్ర స్వధర్మ స్వభావులు
శుశ్రూషణం అమాయయా - దేవ - గురు - బ్రాహ్మణునులు మొదలైనవారిపట్ల
- నిష్కపట సేవానిరతి కలిగి ఉంటారు. నిస్వార్థ తత్ర-లబ్దే సంతోషః - సేవించి, తద్వారా లభించిన దానితో సంతృప్తులై జీవిస్తూ
ఉంటారు.
అంత్యజ స్వధర్మ స్వభావులు (Negative Features)
ఓ ఉద్ధవా! వీరు బ్రాహ్మణ - క్షత్రియ-వైస్య - శూద్ర స్వధర్మ నిరతిని ఏమరిచినవారు
సుమా!
|
శ్లో॥ అశౌచమనృతం స్తేయం నాస్తిక్యం శుష్కవిగ్రహః । కామః క్రోధశ్చ తర్షశ్చ స్వభావో అంతేవసాయినామ్ ॥ (వ్యాస భాగవతం, స్కంధం 11, అధ్యాయం 17, శ్లోకం 20) |
శ్లో॥ అశౌచమ్ అనృతం స్తేయం నాస్తిక్యం శుష్కవిగ్రహః । కామః క్రోధః చ తర్షః చ స్వభావః అంతేవసాయినామ్ ॥ |
అశౌచము దోషములను ఆపాదించి - అశుభమైన భావములతో జగద్దర్శనం చేస్తూ ఉంటారు. అనృతము అసత్యమును సత్యమైనవాటి వలె ఆశ్రయించి రోజులు గడుపుతారు!
స్తేయం ఇతరుల సంపదలను దొంగిలించాలని, పొందాలని |
ఆవేశము పెంపొందించుకొంటూ ఉంటారు. దొంగిలిస్తే
తప్పేమున్నది? దొంగలెంతమంది లేరు?... ఇటువంటి
దుష్ట వివేకము పెంపొందించుకొని వుంటాడు.
నాస్తిక్యం సమస్తము ప్రసాదిస్తూ - పరిరక్షిస్తున్న పరమాత్మయొక్క
ఉనికినే ప్రశ్నిస్తూ ఉంటారు.
Page number:149
శుషవిగ్రహులు వృథాగా సరిఅయిన కారణంలేకయే కలహము
శతృత్వము ప్రదర్శించువారు
కామము "ఇంకా ఇంకా ఏదో కావాలి! ఇంకేదో పొందాలి!"... అనే
తపనతో కాలం గడుపుతూ వుంటారు. అసంతృప్తితో
అనుక్షణం అలమటిస్తూ ఉంటారు.
క్రోథము ఇతరుల తప్పులను మననము చేస్తూ.... ఇతరులపై కోపము
|
- క్రోధము వదలనివారై ఉంటారు!
తర్షము ఇంద్రియ విషయములపట్ల సదా మననము ప
పెంపొందించుకుంటూ ఉంటారు.
ఇవి లక్షణములుగా గలవారు మానవులలో కింద తరగతివారు. అధములుగా
చెప్పబడువారు.. మానవ జన్మను వారు సద్వినియోగ పరచుకోకపోగా దుర్వినియోగ
పరచుకుంటున్నారు.
చాతుర్వర్ణ్యములు అనుసరణీయమైన ధర్మములు.
పంచమ స్వభావము త్యజించవలసిన మార్గం.
మిత్రమా! ఇప్పుడు సర్వమానవులకు అనుసరణీయము - సుసాధ్యము - ఆవస్యకము
అయిన సమానధర్మాలు కొన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాను విను. ఇది 4 రకాల (common features) స్వధర్ములు తప్పక ఆచరించాలి.
అహింస ఇతరులను శారీరకంగాగాని, మానసికంగా గానీ బాధించక
పోవటం
సత్యము సత్యమును-ఆశయంగా కలిగివుండటం, దర్శించటం, |
ఆశ్రయించటం, పలకటం "యమ్ సత్ - ఏదైతే
పరమసత్యమో" అను అన్వేషణ కలిగి ఉండటం
అస్తేయం ఇతరుల సంపదలను దొంగిలించాలనే చొరబుద్ధి
లేకుండటం.
Page number:150
అక్రోధం ఎవ్వరిపట్లా కూడా క్రోధము, తత్సంబంధమైన ఆవేశము
త్యజించటం రహితం చేసుకోవటం
అలోభం నాది నాకే వుండాలి! మరెవ్వరితోనూ పంచుకోను.... అనే
లోభబుద్ధిని త్యజించి ఉండటం!
భూతప్రీతి సహజీవులకు ప్రీతి - సంతోషము కలుగజేయు
ఉద్దేశ్యములు కలిగి ఉండటం!
భూతహితము ఇతరుల హితము - శ్రేయస్సు కోరుకోవటం. అందుకు
ప్రయత్నించటం. సహజీవులగు జంతువులను పక్షులను
వృక్షములనుఆహార-పానీయములతో సంతోషింపజేయటం!
ఇవి మానవ ధర్మాలు! సర్వులు, సర్వవర్ణులు పాటించవలసిన ధర్మాలు.