[[@YHRK]] [[@Spiritual]]
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బహ్మసూత్ర భాష్యే
సంస్కృత మూలము : శ్రీ వ్యాసమహర్షి విరచిత శ్రీమద్భాగవత ఏకాదశస్కంధాంతర్గతము
అధ్యయన విద్యార్థి , రచన : యేలేశ్వరపు హనుమ రామకృష్ణ
[Chapters 24 to 46 out of total 46]
విషయ సూచిక :
Page number:150
అధ్యాయము–24.) ఆశ్రమ ధర్మాలు
|
ఓ ఉద్ధవా! మానవుడు దేనిని ఆశ్రయించి అభ్యాసం కొనసాగించాలో… అట్టి
సాధనాక్రమములను ఉదహరిస్తూ శాస్త్రకారులు చతుర్విధమైన ఆశ్రమములు - ఆశ్రమ
ధర్మములు ప్రవచిస్తున్నారు!
అట్టి ఆశ్రమ ధర్మాల గురించి కూడా ఇక్కడ ఉదహరిస్తున్నాను. విను!
1. బ్రహ్మచర్యాశ్రమం 2. గృహస్థాశ్రమం
3. వాసప్రస్థాశ్రమం 4. సన్యాసాశ్రమం
1. బ్రహ్మచర్యాశ్రమం
దేహభావం ఆశ్రయించటంచేత జన్మ వస్తోంది. దేహంతో సంబంధం ప్రారంభమౌతోంది.
అటు తరువాత శాస్త్ర ప్రతిపాదితమైన ఉపనయనము అను ప్రక్రియచే ద్విజత్వము
ప్రారంభమౌతోంది. పరమాత్మ తత్త్వము యొక్క సామీప్యము - సందర్శనారంభమే
ఉపనయన శబ్దార్థం!
ఉపనయన ప్రక్రియచే ఈ జీవుడు విద్యకు అర్హుడై విద్యార్ధి అవుతాడు. అట్టి ద్విజత్వ
నియమముచే ఆతడు గురుకులం జేరి బ్రహ్మవిద్యను అభ్యసించటానికి గురువును
ఆశ్రయించాలి. ఇంద్రియ ధ్యాసలను ప్రక్కకు పెట్టి వేదాధ్యయనమునకు ఉపక్రమించాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
150
అట్టివాడు వస్త్రధారణ అలంకారముల విషయములలో కూడా కొన్ని విధి
విధానములను నియమములను శాస్త్రములు నిర్వచిస్తున్నాయి. అట్టి బ్రహ్మచారి
జడధారిఅయి, చేతిలో దండము అక్షమాలను ధరించి, యజ్ఞోపవీతధారణ చేసి,
దర్భలను చేబూనినవాడై వుండాలి! దంభము - దర్పము - అభిమానము ప్రదర్శించే
వస్త్రధారణ ముఖాలంకారం దంతాలంకారం పీఠాసనం ఇటువంటి
కృత్రిమమైన విషయాలకు దూరంగా ఉండాలి.
మౌనంగా ఉండటానికి ప్రయత్నశీలుడై ఉండాలి! అననపరమై సంభాషణ - ఇతరులపై
నిందారోపణ… ఇత్యాదులు దగ్గరకి రానివ్వకూడదు. ముఖ్యంగా స్నానంచేసేటప్పుడు,
పఠించేటప్పుడు, భుజించేటప్పుడు, జపించేటప్పుడు లౌకిక - ప్రాపంచ విషయాలు
మననం చేయరాదు! భగవత్ విషయాలే మననం చేయాలి! రోమములకు - గోళ్ళకు
అలంకారములను ఆశ్రయించరాదు! అసంకల్పితంగా వీర్యపతనమైనప్పుడు స్నానము
· ప్రాణాయామము నిర్వర్తించాలి. గాయత్రీ జపం చేయాలి. సంకల్పితంగా
బుద్ధిపూర్వకంగా వీర్యపతనము చేయరాదు.
పవిత్రుడై వుండాలి!
ఏకాగ్రచిత్తమును అలవరచుకోవాలి! అనేకములో దాగియున్న ఏకమును
చింతించుచూ ఉండటమే ఏకాగ్రచిత్తము!
తదితర సర్వజగద్విషయాలపట్ల మౌనము వహించి ఉండాలి! మౌనిత్వము
అభ్యసిస్తూ ఉండాలి!
ప్రాతః - మధ్యాహ్న - సాయం సమయములలో త్రిసంధ్యోపాసకుడై గాయత్రిని
జపిస్తూ వుండాలి.
అగ్నిని, సూర్యుడిని, ఆచార్యుని, గోవుని, బ్రాహ్మణుని, గురువును, వృద్ధులను,
దేవతలను పూజిస్తూ - సేవిస్తూ వుండాలి!
శ్లో॥ ఆచార్యం మాం విజానీయాత్
నావమ్ అన్యేత కర్హిచిత్|
న మర్త్యబుద్ధ్యా అసూయేత
సర్వదేవమయో గురుః II (అధ్యా 17, శ్లో 27)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
151
ఆచార్యుని (Teacher) ప్రత్యక్ష భగవత్ స్వరూపంగా భావించాలి. ఆయనను సాధారణ
మనుష్యునితో పోలుస్తూ దోషదృష్టితో చూడకూడదు! జన్మజన్మలుగా అభ్యసించిన దోష
దృష్టియే మహనీయులలో దోషాలు ఎన్నుతూ వుండటానికి కనబడటానికి కారణం!
పరమాత్మయే ఆచార్యుల రూపంగా నాకు ఎదురుగా కనిపిస్తున్నారు - అను ఆచార్యస్య
భగవన్ స్వయం దృష్టిని అలవరచుకోవాలి! గురి చేత సర్వము లభిస్తాయి. గురి
లేనిచోటకాదు. గురియే గురువు! గురి లేకుంటే గురుతు లభించదు.
ఉదయం - సాయంకాలం భిక్షాటణలో లభించే దానిని గురువుకు మునుముందుగా
సమర్పించాలి. ఆతరువాత, ఆయన అనుజ్ఞను అనుసరించి ఆయా ఫలములు,
పదార్ధములు సేవించాలి.
ఆచార్యుడు ముందు నడుస్తూవుంటే, ఆయన వెనుక సేవా భావంతో “నేను స్వల్పుడను…”
అను అభిప్రాయంలో అడుగులు వేస్తూ వుండాలి. వినమ్రతగా నడవాలి.
నిద్రాసమయంలో గురుసేవపట్ల అప్రమత్త భావనతో నిదురించాలి. విశ్రాంతి సమయంలో
ఆచార్యులకు పాదములు ఒత్తుతూ ఉండాలి! ఆచార్యులు కూర్చుని ఉన్నప్పుడు చేతులు
జోడించి కృతాంజలుడై వుండాలి. వారు కూర్చున్న ప్రదేశానికి కొద్ది దూరంలో ఉండి
వారి ఆజ్ఞలు నిర్వర్తించటానికి సంసిద్ధత తెలుపుచూ ఉండాలి. ఆయనను ఉపాసించాలి.
వేదాధ్యయనం పూర్తి అయ్యేవరకు భోగములను విడచి, ఇప్పుడు మనం చెప్పుకొన్న
విధి-నియమములు పాటిస్తూ గురుకులంలో అఖండ బ్రహ్మచర్యవ్రతం పాటిస్తూ
వుండాలి.
అట్టి శ్రద్ధతో కూడిన అఖండబ్రహ్మచర్య వ్రతం నిర్వర్తిస్తూ తన జీవిత సర్వస్వమును
ఆచార్యునకు సమర్పించు నైష్ఠిక బ్రహ్మచర్యవ్రతుడు సులభంగా మహర్లోకము -
బ్రహ్మలోకమును ఎరుగగలడు! బ్రహ్మమై ప్రకాశించగలడు! శిష్యత్వమునకు అంతటి
ప్రభావమున్నది! ఓ ఉద్ధవా! బ్రహ్మచర్యవ్రతుడు క్రమంగా బ్రహ్మ తేజోసంపన్నుడై
అగ్నియందు, గురువునందు, సర్వ సహజీవులయందు, తనయందు అబేధబుద్ధి యుతుడై
నిర్మలము - అప్రమేయము -అఖండము అగు ఆత్మను సందర్శించగలుగుతాడు! సర్వత్రా
ఆత్మనే ఆస్వాదించగలుగుతాడు!
బ్రహ్మచర్య - వానప్రస్త - సన్యాసాశ్రమం సేవించేవారు స్త్రీలతో సరససంభాషణము
- పరిహాసము మొదలైనవాటికి దూరంగా ఉండాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
152
బ్రహ్మచర్యాశ్రమమే కాకుండా అన్ని ఆశ్రమముల వారికి సంబంధించి కొన్ని నియమ
అభ్యాసములు ఇక్కడ ఉదహరిస్తున్నాను.
1. శౌచము ( శుచి అయిన భావాలు పెంపొందించుకోవడం) 2. ఆచమనము 3.
స్నానము 4. సంధ్యోపాసన 5. జపము 6. జగత్ భావావేశములపట్ల అస్పృశ్యత
7. మత్తు - బద్ధకము - ఆవేశము పెంపొందించే పదార్థములు స్వీకరించకపోవడం
సాత్వికాహారం 8. లౌకిక విషయాలు సంభాషించకపోవటం 9. సర్వజీవులలో
వేంచేసియున్న అంతర్యామినగు నన్నే సర్వదా సందర్శిస్తూ - ఉపాసిస్తూ ఉండటం.
10. మనస్సును, వాక్కును కాయమును అదుపులో ఉంచుకొని ఉండటం.
నైష్ఠిక బ్రహ్మచారిగాని, తదితరులుగాని… పై గుణములను అభ్యసిస్తూ ఉండటంచేత
బ్రహ్మతోజోసంపన్నులై అగ్నివలె ప్రకాసిస్తున్నారు.
గురుసేవ - అధ్యయనం - తపస్సుల ప్రభావంచేత కర్మవాసనలన్నీ క్రమంగా తమంతట
తామే నాశనమగుచున్నాయి. తద్వారా ఆతడు నిష్కామభక్తిని సంపాదించుకో
గలుగుచున్నాడు. ముక్తుడగుచున్నాడు!
2. గృహస్థాశ్రమము
బ్రహ్మచర్యవ్రతం నిర్వర్తించిన తరువాత గృహస్థాశ్రమం ప్రవేశించదలచుకొన్నవాడు
వేదాధ్యయనం పూర్తి అయిన తరువాత గురుదక్షిణ సమర్పించుచున్నాడు. గురు ఆజ్ఞతో
సకాముడైతే …. బ్రహ్మచర్యాశ్రమం నుండి గృహస్థాశ్రమం స్వీకరించుచున్నాడు.
అకాముడు - నిష్కాముడు-అయితే బ్రహ్మచర్యాశ్రమం నుండి
వానప్రస్థాశ్రమం స్వీకరించుచున్నాడు.
నిష్కాముడు - బ్రహ్మజ్ఞాన సన్యాసాశ్రమం స్వీకరించుచున్నాడు. –}
శ్రేష్ఠుడు అయితే
లేదా….
ఒక ఆశ్రమం నుండి మరొక ఆశ్రమాన్ని స్వీకరించవచ్చు. భక్తజనులు తమయొక్క
ఆశ్రమ విధానములను, నియమములను సగౌరవిస్తూ వుంటారు!
వివాహం : “గృహస్థాశ్రమం స్వీకరించాలి” అని అనుకొనువాడు విద్యానంతరం తన
భావాలకు అనుకూలమైనది, సంఘముయొక్క కట్టుబాట్లకు సానుకూలమైనది, తనవలె
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
153
ఆశయములు - దృక్పధములు కలది, పెద్దలు సదుద్దేశ్యములకు అనుకూలమైనది,
తన వర్ణము (లేక) అవరోహణవర్ణమునకు చెందిన కన్యను వివాహమాడవచ్చును!
అధ్యయనము దానము - యజ్ఞయాగాలు ఇవన్నీ బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య
వర్ణులకు సరిసమానమైన ధర్మములు.
ప్రతిగ్రహణము - అధ్యయనము - యజ్ఞములు నిర్వర్తింపజేయటం… ఇవి బ్రాహ్మణ
కుల జాతులకు ముఖ్య స్వధర్మరూపములై వున్నాయి.
దానము స్వీకరించటం… అనేది తపస్సుకు, తేజస్సుకు, యశస్సుకు దోషము
కలిగిస్తాయేమో కదా!… అని ఎవరికైనా అనిపిస్తూ వుంటే … అప్పుడు అట్టివాడు
జీవనోపాధికై న్యాయబద్ధమైన - లోకసమ్మతమైన ఏదైనా ఆదాయంవచ్చే వృత్తిని నిర్వరిస్తు
ఇక ఆపై కులధర్మ - యజ్ఞ - దానాదులు నిర్వర్తిస్తూ ఉండవచ్చు.
ఓ ఉద్ధవా! ఈ పవిత్రమైన మానవ దేహమును క్షుద్రమైన కామ భోగములకు మాత్రమే
వెచ్చిస్తూ ఆయుష్షును నష్టపరచుకోవటం ఏమాత్రం ఉచితం కాదయ్యా! ఈ దేహము
ముఖ్యముగా పరతత్త్వజ్ఞానము యొక్క సముపార్జనకై ఉద్దేశ్యించబడిందని గమనించబడు
గాక! బుద్ధికి భాగవత ధర్మములు అభ్యాసం కావటానికై మానవజన్మ గొప్ప అవకాశం!
జీవించటం కోసం మాత్రమే ఆహారం! ధర్మమునకు ప్రతికూలంగాని లౌకిక వృత్తిచే
లభించిన దానితో సంతృప్తుడై, కష్ట - సుఖములు పరమాత్మయొక్క ప్రసాదిత విశేషాలుగా
దర్శిస్తూ, స్వధర్మ నిరతుడై వుంటూ, సర్వము పరమాత్మయొక్క ప్రత్యక్షరూపంగా వీక్షిస్తూ
భోగపారాయణం త్యజిస్తూ గృహస్థాశ్రమము దివ్యభావాలతో స్వీకరించేవాడు అతి
సులభంగా మోక్షార్హుడు కాగలడు!
ఎవ్వరైతే నా భక్తుల కష్టములను - దారిద్ర్యమును తొలగిస్తూ, రక్షణ ఇస్తూ సేవిస్తూ
వుంటాడో అట్టివానిని సంసార సముద్రం నుండి నావవలె నేను ప్రయత్న పూర్వకంగా
కాపాడుతాను.
ఇది నా ప్రతిజ్ఞ!
క్షత్రియ ధర్మం
శ్లో॥ సర్వాః సముద్ధరేత్ రాజా, పితేవ వ్యసనాత్ ప్రజాః
ఆత్మానమాత్మనా ధీరో యథా గజపతిః గజాన్ (అధ్యా 17, శ్లో. 45)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
154
ఒక గజరాజు తదితర గజములను రక్షిస్తూ వున్నట్లు ధీరుడగు నరపతి ప్రజలను
కన్నబిడ్డలనువలె రక్షించాలి! పరిపాలించాలి! క్షత్రియధర్మము ఆశ్రయించేవాడు తనను
తదితరులను రక్షించే ధర్మమును ఆశ్రయించినవాడై వుంటాడు.
ఏరాజైతే ప్రజలను సేవాభావంతో ధర్మనిరతితో, ప్రేమాస్పదంగా పరిపాలిస్తూ వుంటాడో…
అట్టి క్షత్రియుడు ఇహపరలోకములలోని సర్వదోషములనుండి విముక్తుడౌతాడు.
సూర్యునివలె ప్రకాశిస్తాడు ఇంద్ర లోకంజేరి స్వర్గసుఖాలకు సర్వానందములకు
అర్హుడౌతాడు. ఇంద్రసమానుడౌతాడు.
వైశ్య ధర్మం
జీవనోపాధికై క్రయ విక్రయములను నిర్వర్తించువాడు వైశ్యుడు. ఇతడు తదితరములైన
యోగాభ్యాసం - యజ్ఞం - దానం - తపస్సు నిర్వర్తిస్తూ స్వధర్మం - లౌకిక ధర్మంగా
వైశ్య వృత్తులను నిర్వర్తించువాడు- అట్టి ధర్మనిరతిచే మోక్షార్హుడు అగుచున్నాడు!
విప్రుడు అత్యవసమైనప్పుడు జీవనోపాధికై క్షత్రియ - వైశ్య ధర్మములు నిర్వర్తించవచ్చు.
క్షత్రియుడు ఆపదల సమయంలో వైశ్య వృత్తిని - బ్రాహ్మణవృత్తులను ఆపద్ధర్మంగా
అవలంబించి తద్వారా జీవితము గడుపవచ్చు.
వైశ్యవృత్తివాడు ఆపదల సమయాలలో చాపలు అల్లటం మొదలైన కారుజాతి వృత్తులను
అవలంబించవచ్చు!
దూష్యవృత్తిః మాత్రము నిషిద్ధం
బ్రాహ్మణ - క్షత్రియ - వైశ్య - శూద్రులలో ఎవ్వరూ నీచ వృత్తులైన దొంగతనం,
హింస… ఇటువంటి దూష్యవృత్తులకు (దుష్ట-తదితరులను బాధించే వృత్తులకు)
సంసిద్ధుడు కారాదు సుమా!
గృహస్థుడు చేయవలసియున్న దినచర్యలు
వేదాధ్యయనం చేస్తూ… తద్వారా ఋషులకు పూజా పుష్పాలు సమర్పించటం.
స్వథా మంత్రముచే పిత్రుదేవతలను పూజిస్తూ ఉండటం.
స్వాహా మంత్రముచే దేవతలను పూజించటం
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
155
ఉపాహార వస్తువులను సమర్పిస్తూ భూతజాలములను పూజించటం.
అన్న - ఉదకాలతో సహజీవులను పూజించటం.
ధన - సంపదల సమర్పణతో ఆశ్రిత - సేవక జీవులను పూజించటం.
యథాశక్తిగా యజ్ఞ - యాగ - పూజాదులు నిర్వర్తించటం.
గృహస్థుడు ధనికుడైనను, పేదవాడైనను - కుటుంబవిషయాలలో తన్మయుడై అత్యాసక్తుడై,
వేదనాపరుడై (As mentally worried) వుండరాదు. ఇక్కడి సందర్భాలు - సంబంధాలు
- సుఖ - దుఃఖాలు, సంపద ఆపదల నశ్వరం కదా! “ఇవన్నీ అశాశ్వతం - కాలబద్ధము -
కూడా!” అను అవగాహన అంతరంగమున సజీవమై ఉండుగాక! భగవత్ తత్త్వమునందు
సర్వదా సావధానుడై ఉండుగాక! అప్రమత్తుడై ఉండుగాక! స్వర్గాది సుఖలోకాలు కూడా
ఇట్టివే! కాలబద్ధమే! భ్రమాత్మకమైనవే….. అని గమనిస్తూ వుండుగాక!
శ్లో॥ పుత్ర దార - ఆప్తబంధూనాం సంగమః పాంథ సంగమః
అనుదేహం వియన్యేతే స్వప్నో నిద్రానుగోయథా | (అధ్యా 17, శ్లో 53)
కలలో కనిపించే స్వప్నదృశ్యాంతర్గత జీవులు, సంపదలు, సందర్భములు, బాంధవ్యములు
మెళుకువరాగానే ఏమౌతున్నాయి? మటుమాయమైపోతున్నాయి కదా!
అట్లాగే…
గృహస్థుడు కూడా- “ఇక్కడి పుత్రులు - భార్య - భర్త - ఆప్తులు బంధువులు -
మొదలైనవన్నీ చలివేంద్రంలో బాటసారుల కొద్దిసేపు సమావేశం చేత ఏర్పడినవై, ఆ
బాటసారులు ప్రయాణం కొనసాగిస్తున్న మరుక్షణం మటుమాయమైయ్యే విశేషాలవంటివే
కదా!”… అని జ్ఞానదృష్టితో అవగాహన కలిగి ఉండాలి. ఒకరికొకరం సంబంధించిన
వారమే కాదు. ఎవరి ప్రయాణం, ఎవరి గొడవ వారిదే! ఈ కాసేపు “ఒకొరికొకరం
సర్వస్వమైనట్లు కలిసి వుంటాం. కానీ, విడిపోవటం అనివార్యం” అని జ్ఞాపకం
పెట్టుకొనే వుండాలి.
ఒక అతిథి తాను ప్రవేశించిన ఒక గృహస్థుని ఇంట్లో మమత్వరహితుడై అనాసక్తుడై
వుంటాడు కదా! అట్లాగే గృహస్థుడు కూడా తన గృహంలోను, ఈ జగత్తులోను అనాసక్తుడై,
మమత్వరహితుడై బహుదూరపు బాటసారి ఒక గృహ ప్రాంగణంలో కొద్దిసేపు
సేదదీర్చుకొను రీతిగా ఉండటం అలవరచుకోవాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
156
భక్తుడు :
భక్తుడగువాడు మమత్వ - ఆసక్తరహితుడై స్వకర్మలను నిర్వహిస్తూ వుంటాడు. గృహస్థుడై
వుంటే తాను నిర్వర్తిస్తున్న కర్మలద్వారా… నన్ను ఆరాధిస్తూ వుంటున్నాడు.
లేక, సర్వసాంఘిక విషయములు త్యజించి అరణ్యంలో ఏకాంతంగా ప్రవేశించవచ్చు!
కాదా, సన్యాసము స్వీకరించి ఆశ్రమవాసియై వుండవచ్చు.
భక్తి మనోవికాసానికి సంబంధించినది. అంతేగాని, దృశ్య సంబంధమైనది కాదు.
ఆశ్రమములకు - లోకసంబంధమైనది కాదు! వస్త్రధారణలకుగాని, చారుర్వర్ణ్యములకు
గాని సంబంధితమైనది కానేకాదు. ప్రతి ఒక్కడు భక్తికి అర్హుడే!
గృహస్థాశ్రమం - మోక్షప్రదాత / బంధప్రదాత
గృహస్థాశ్రమం మోక్ష ప్రదాత తప్పక కాగలదు సుమా! ఏ ఆశ్రమవాసి అయినాసరే,
మోక్షానికి అర్హుడే కూడా!
అయితే…,
గృహస్థాశ్రమం ఎప్పుడు మోక్షమార్గానికి ప్రతిబంధకము, బంధప్రవృద్ధము అవగలదో…
అది కూడా జనుల జాగరూకతకొరకై చెప్పుచున్నాను. విను!
గృహస్థుడు కనుక మూఢుడై, వివేకశూన్యుడై, బంధు మిత్ర కళత్రాది విషయముల
పట్ల రాగద్వేషములు పెంపొందించుకొని, ఆసక్తిని ప్రవృద్ధపరచుకొంటూ వుంటే…
ఇక ఆపై జీవుడు అహంకార - మమకారములకు బద్ధుడు కాగలడుసుమా!
“నేను ఏదో పొందాలి! ఇంకా ఇంకా ఏదేదో చేయాలి! - నావారి నావా గతి ఏమి
కానున్నదో? నా భార్య, పిల్లలు దీనులు - అనాధలు అవుతారేమో? వారు దుఃఖం
పొందరాదు. అందులకై ధన సముపార్జనయే ముఖ్యము కదా! నా ధనరాసులు,
గృహసంపదలు ఏమి కానున్నాయో! మా వ్యాపార విశేషాలు ఇట్లాగే
కొనసాగుతాయా? లేక పిల్లల తెలివి తక్కువ చేత ఆదాయాలు కుంటుపడవుకదా!”
ఇట్లా యోచనలపై యోచనలు చేస్తూ గృహస్థాశ్రమంలో కాలం వృధా
చేసుకొనేవాడు అవివేకియే!
చేయవలసింది చేయటం! జరుగవలసింది జరుగుతుంది! మౌనంగా, అతీతంగా,
చిద్విలాస పూర్వకమైన చిరునవ్వుతో చూస్తూ ఉండటం ఇది సిద్ధులగు
మహనీయులు గృహస్తునికి చెప్పే ఉపాయం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
157
అసంతృప్తి, ఏదో లేదని - ఆవేశము, బంధువుల సమాచారములపట్ల అభినివేశము
ఇత్యాదులు ప్రవృద్ధపరచుకొంటూ ఆయిష్షును గడుపువాడు ఉత్తరోత్తర
మరణానంతరం అధమగతులకు చేరగలడని నా హెచ్చరిక!
3. వానప్రస్థాశ్రమము
ఉద్ధవా! ఇప్పుడు వాన ప్రస్థాశ్రమవాసులు విశేషాలు చెప్పుచున్నాను. విను.
వానప్రస్థాశ్రయులు గృహస్థాశ్రమబాధ్యతలన్నీ పుత్రులకో, సత్పురుషులకో చేతికందించి,
ఆ గృహస్థాశ్రమం పరిత్యజించి ఏకాంత వాసాన్ని ఆశ్రయిస్తున్నారు. భార్యను పుత్రుల
సంరక్షణలో ఉంచిగాని, (లేక) వెంటనిడుకొనిగాని బయల్వెడలుచున్నారు.
వనములలోనో, అరణ్యములలోనో, కొండప్రాంతాలలోనో,,, మరెక్కడో ఏకాంత ప్రదేశం
ఎన్నుకొనుచున్నారు.
శాంతచిత్తులై జీవితముయొక్క మూడవ విభాగం (The third part of life) వానప్రస్థం
ఆశ్రయించటం అహంకార మమకారత్యాజ్యములకు ఔషధమై యున్నది సుమా!
గొప్ప ఉపాయమైయున్నది!
వానప్రస్థులు వనములలో - అడవులలో గాలివాటుగా దొరికే కందమూలములను,
ఫలములను ఆహారంగా స్వీకరించనారంభించుచున్నారు. జింకచర్మమును, నారచీరలను,
ఆకులను వస్త్రములుగా ధరిస్తూ ఏకాంత సాధన కొనసాగిస్తున్నారు. వెంట్రుకల
అలంకరణ, గోళ్లు - మీసముల దంతముల శరీరసంబంధమైన అలంకార
వ్యవహారములు త్యజిస్తున్నారు. మూడు వేళల స్నానం చేస్తూ, నేలపై పరుండి… జీవితము
గడుపుచూ తదితర సర్వసమయములలో తమ తమ ఆధ్యాత్మసాధనలు నిర్వర్తిస్తున్నారు.
తమను తాము ఆధ్యాత్మ మార్గంలో ఉత్తేజపరచుకొంటున్నారు.
కొందరు వేసవి కాలంలో పంచాగ్నులమధ్య, వర్షాకాలంలో శీతల జల నదీ
ప్రదేశాలలోను ప్రకృతిని సాధనగా చేసుకొని అభ్యాసం కొనసాగిస్తున్నారు. ప్రకృతిని
ఉపాసనా దైవంగా భావనచేస్తున్నారు.
వారిలో మరికొందరు అగ్నిపక్వమైన కందమూలాలుగాని, కాలపక్వమైన
ఫలములతోగాని రోట రాయితో దంచబడివైన ధాన్యపుగింజలను గాని ఆహారంగా
స్వీకరిస్తూ ఇంద్రియాకర్షణను జిహ్వరుచులను జయిస్తున్నారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
158
దేశ - కాలానుసారంగా సామాన్యంగా లభించే వస్తువులలో (దాచిపెట్టుకోవటం
|
- కూడబెట్టుకోవటం లేకుండా) - సమయానుకూల వస్తువులతో సామాన్య జీవితం -
గడుపుచూ వానప్రస్థాశ్రమ జీవితం గడుపుచున్నారు.
అట్టి వానప్రస్థాశ్రమం ఆశ్రయించు వారు
వనములో అడవులలో (తామున్నచోట) లభించే సస్యములు మొదలైన
పదార్థములతో లోకోత్తరమై ఉపాసన - ధ్యాన - యజ్ఞాదులు నిర్వర్తిస్తూ వుంటారు.
జీవహింస కూడదు
ఓ ఉద్ధవా! జీవహింస చేయటమనేది నన్ను బాధించటమే! అందుచే ప్రతివిహితములైన
పశు-పక్షి మాంసములతో పరతత్త్వ స్వరూపుడను - సర్వాంతర్యామిని అయిన నన్ను
పూజించవలసిన అగత్యము లేదు. ఆ అవసరము-అట్టి అభిలాష సర్వజీవాంతర్గతుడును
సర్వదేవతా స్వరూపుడను అగునాకు ఉండదు.
మరికొన్ని వానప్రస్థ విశేషాలు:
జీవితాంతం దేహపతనం వరకు నన్ను వానప్రస్థాశ్రమంలో ఉపాసించువారు
బ్రహ్మలోకవాసులు కాగలరు.
మోక్ష జనకము - మహాకష్ట సంచితము అయిన తపస్సును స్వర్గము మొదలైన -
అల్పమైన ఫలములకో, లౌకికమైన రాజ్యాధికారంవంటి స్వప్నంతో సమానమైన
ప్రాప్తాప్రాప్తముల కొరకో ఉద్దేశ్యించటం సముచితం కానేకాదు! జీవితం అనేది
జన్మ-జన్మాంతర సంబంధమైన బహు విలువైన అవకాశము.
అందుచేత, గృహస్థాశ్రమంలోగాని, వానప్రస్థాశ్రమంలోగాని, సన్యాసాశ్రమంలోగాని
అనుష్ఠానములు నిష్కామంగాను, లోకకళ్యాణార్ధంగాను నిర్వర్తించటమే ఉత్తమము!
నిష్కామకర్మ మోక్ష సిద్ధిని సులభంగాను, దృఢంగాను ప్రసాదించగలదు.
వానప్రస్థులు తమ ఆశ్రమమునకు సంబంధించిన నియమములను నిర్వర్తించలేని
దేహస్థితికి వచ్చినప్పుడు,…. అట్టివారిలో కొందరు యజ్ఞాగ్నిని భావనచేసి, ఆ అగ్నులను
తమ అంతఃకరణంపై ఆరోపించి మనస్సును నాయందు నిలిపి, ఆ భావజనిత
యోగాగ్నిలో భౌతికదేహము ప్రవేశింపజేయటం జరుగుచూ ఉంటోంది. లేదా వంశజులబంధువుల-మిత్రుల-శిష్యుల గృహాలలో (లేక) సిద్ధపురుషుల ఆశ్రమాలలో
అంతిమదినము గడపవచ్చు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
159
160
తన ఆశీర్వాదము-కష్టముల ఉపశాంతి కోరివచ్చువారికి భగవత్స్తోత్రములతో
ధైర్యము సూచిస్తూ ఉంటాడు.
పవిత్ర భావాలు వెల్లివిరిసే ప్రదేశాలలో మాత్రమే ఉంటాడు. పవిత్ర ప్రదేశాలను
|
మాత్రమే సందర్శిస్తూ అపవిత్ర ప్రదేశములలో అడుగుపెట్టడు. లౌకిక విషయాలలో
తల దూర్చడు.
వస్త్రముతో వడగట్టిన జలము త్రాగుతూ ఉంటాడు.
నిర్మొహమాటంగా సత్యమునే అన్వేషిస్తూ - పలుకుతూ ఉంటాడు. సత్యమును
I
ప్రేమిస్తూ ఉంటాడు! పరమాత్మతత్త్వము గురించియే సంభాషిస్తూ, తనకు
తెలిసినంత వరకుసాధకజనుల సందేహములను తొలగిస్తూ వుంటాడు.
తనను గౌరవించేవారిపట్ల, అగౌరవించేవారిపట్ల, తటస్థులపట్లా (సర్వే- సర్వత్రా)
సమమైనట్టి వాత్సల్య సహితుడై ఉంటాడు.
వాక్-మనో-కాయములచే సమ-సత్కర్మవర్తనుడై ఉంటాడు.
శరీరముచే కామ్య కర్మ త్యాగి అయి ఉంటాడు. |
మనో దేహానికి ప్రాణాయామమే అతని దండము. మనో నిగ్రహము పరమాత్మ
ధ్యానములే ఆతని కమండలము-కమండలోదకం!
ఓ ఉద్ధవా!
వాక్కుకు మౌనము,
I
శరీరమునకు కామ్యకర్మ త్యాగము, మనస్సుకు ప్రాణాయమము, అనే మూడు
|
దండములు (త్రిదండములు) ధరించనివాడు భౌతికమైన కొయ్య దండమును
భౌతికమైన చేతులతో ధరించినంతమాత్రంచేత సన్యాసి కాలేడు సుమా!
ద్రోహచింతన హింసాస్వభావము గల ఇళ్ళను వదలి తదితర చాతుర్వర్ణ్యముల
గృహస్థులవద్ద ఆతడు భిక్ష స్వీకరించవచ్చు!
పేదవారిని భిక్ష కోరరాదు! అయాచితముగా ఆశీర్వదిస్తూ, పలకరిస్తూ, ప్రేమిస్తూ
వారితో శాంత-స్వాంత వచనములు పలుకుతూ వుండాలి.
గృహములలో లభించిన, లభించని వానితో తృప్తి చెందినవాడై వుండాలి!
సర్వదా సర్వులపై వాత్సల్యము కురిపిస్తూ వుండాలి!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
161
భిక్షగా లభించినదానిని గ్రామము చివరగల చెఱవు దగ్గరకు తీసుకొనిపోయి
సంప్రోక్షణతో పవిత్రం చేసి, విష్ణువు - బ్రహ్మ - సూర్యుడు మొదలగు దేవతలకు
వారి వారి భాగములను విభాగించి పక్షులు మొదలైనవి తిర్యక్ జంతువులకు
సమర్పించి, శేషించిన ఆహారం మాత్రమే స్వీకరిస్తూ ఉండాలి.
అట్టి సన్యాసాశ్రమవాసి
ఈ జగత్తంతా ఆత్మయొక్క సంప్రదర్శనమే! - అను భావనతో పరమాత్మశీలుడై,
ఆత్మరతుడై, ధీరుడై ఇంద్రియనిగ్రహముతో, సంగరహితుడై, ఏకాకియై ఈ భూమిపై
సంచరిస్తూ ఉంటాడు!
ఆత్మచే సంతృప్తుడై (ఆత్మ తృప్తుడై) వుంటాడు!
నిర్జన ప్రదేశాలలో ఉండి, నిర్భయంగా నాపై ధ్యాసనంతా నిలిపినవాడై ఉంటాడు. I
క్రమక్రమంగా విశుద్ధచిత్తుడై తనతో సహా సర్వము పరమాత్మయొక్క లీలా-క్రీడా
|
విన్యాసముగా సందర్శించే శుద్ధమైన బుద్ధిని సముపార్జించుకుంటూ వుంటాడు!
ఆత్మతత్త్వము మాత్రమే ధ్యానిస్తూ వుంటాడు!
సన్యాస యోగి…,
మునియై సర్వదా తనయొక్క బంధ-మోక్షములు గురించియే విచారణ చేస్తూ
వుంటాడు!
లోకశ్రేయస్సుకై చేసే స్తోత్రములు, బోధలు, పరిభాషణలు - ఇవన్నీ కూడా ఆతని
ఉపాసనా విధానం! జనులకు మేలుచేసే వచనములే ఆతని లోకేశ్వర ధ్యాన
విభాగాలు!
“ఇంద్రియ విషయములపట్ల నాకు గల చాపల్యమే బంధముయొక్క ప్రకటన
రూపం…” అని గమనించుచున్నవాడై వుంటాడు!
మనస్సుచే “అన్ని రూపాలు పరమాత్మయే! అందరిలోని అందరుగా కనిపించే
పరమాత్మయే నిత్యసత్యము! నాయొక్క ఆరాధ్య వస్తువు”… అని సర్వదా మననం
చేపట్టినవాడై వుంటాడు! నామరూపాత్మకమైన భేదమంతా బాహ్యమునందే త్యజించి,
సన్యసించి సత్ను న్యాసం ఆశ్రయించుటయే ఆతని కార్యక్రమం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
162
శ్లో॥ తస్మాత్ నియమ్య షడ్వర్గం మద్భావేన చరేత్ మునిః |
విరక్తః క్షుద్రకామేభ్యో లబ్ధి ఆత్మని సుఖం మహత్ || (అధ్యా 18, శ్లో 23)
అందుచేత సన్యాసయోగి క్రమక్రమం కామ క్రోధాలు విడచివేసినవాడై వుంటాడు.
క్షుద్రములైన విషయసుఖములపట్ల మొదలంటా విరక్తుడై వుంటాడు! చిదానందమును
అనుభవిస్తూ “ఈ కనపబడేదంతా మమాత్మ స్వరూపమే! అంతరాత్మయొక్క బాహ్య
చమత్కారమే!”… అనుభావనను ఆస్వాదనను ప్రవృద్ధపరచుకుంటూ వుంటాడు
అనుకుంటూ అనుకుంటూ వుంటే అనిపిస్తుంది కదా!
అధికంగా పవిత్రమైన ప్రదేశములలో, నదీనద స్థానములలో, పర్వతశ్రేణులలో,
ఆశ్రమములలో సంచరిస్తూ వుంటాడు. గ్రామ-పట్టణములను భిక్షాటనకై మాత్రమే
దర్శిస్తూ వుంటాడు. అధిక సందర్భాలలో వానప్రస్థులవద్దను, తీర్థయాత్రీకులవద్దను
భిక్ష స్వీకరిస్తూ వుంటాడు. శిలావృత్తి (రాత్రిపూట గృహస్తులను శేషించిన
ఆహారపదార్ధములను భిక్షకోరటం, మాధవకోళం) వలన లభించిన ఆహారము భుజిస్తూ
వుండుటచే చిత్తము మోహరహితమై, పరిశుద్ధమౌతూ ఉంటుంది. మోహరహితమైన
బుద్ధికి మోక్షము సులభంగా సిద్ధించగలదు.
అధ్యాయము–25.) యోగి - విశేష ధర్మాలు
|
శ్రీకృష్ణుడు : సర్వ ఆశ్రమములలో యోగసాధన అభ్యాసవశంగా సుసాధ్యమే! యోగి“ఈ ప్రత్యక్ష దృశ్యాన్ని చూస్తూ ప్రత్యక్షంగా కనిపించే దృశ్యవస్తువులన్నీ కాలంచేత
నాశనంపొందే ధర్మము కలిగి యున్నవికదా!” అని గమనిస్తున్నవాడై వుంటాడు.
నాశనధర్మమును దృష్టిలో పెట్టుకొన్నవాడై దేనియందూ ఆసక్తుడు కాడు. “ఏదీ నాది
కాదు. అంతా కాలస్వరూప భగవానునదే కదా!…” అని అంతరంగంలో గమనించి
వుంటాడు.
ముముక్షువైనవాడు గృహము - ధనము ఇత్యాది ఐహిక సంపదలందు, స్వర్గము మొదలైన
ఆముష్మిక సంపదలపట్ల అనాసక్తుడై వుంటాడు. నిష్కామ కర్మలయందు నిరతుడై
వుంటాడు.
తనయొక్క తార్కిక జ్ఞానంతో ఈ భౌతిక దేహము ప్రాణ-మనో బుధ్యాదులతో కూడిన
అహంకార దేహము స్వప్నతుల్యమే కదా! మాయారచితమే కదా! అని గమనిక
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
163
కలిగి వుంటాడు. సుఖ- దుఃఖములను స్వప్నతుల్యంగాను, మనో కల్పితంగాను,
లీలావినోదంగాను దర్శిస్తూ ఉంటాడు. సర్వమును త్యజించి ఆత్మనిష్ఠుడై సర్వమును
స్వాత్మ ప్రదర్శనా చమత్కారంగా దర్శిస్తూ వుంటాడు.
బాహ్య విషయాలను బాహ్యమునందే త్యజించి ఉంచి సర్వదా మోక్షముకొరకై జ్ఞాన
నిష్ఠుడై ఉంటాడు. లేదా… నాయందు తన ధ్యాసను నిష్ఠను - భక్తిని
పెంపొందించుకుంటూ మోక్షము అను దానిపట్ల ఇచ్చతో కూడి సర్వమును
అంతరంగంలో త్యజించి ఉంటాడు. ఇక త్రిదండము-కాషాయవస్త్రాలు ఆశ్రమ
పరిమిత నివాసము - ఇటువంటి సన్యాసాశ్రమ చిహ్నాలు అట్లాగే తదితరులు - వారివారి
బ్రహ్మచర్యము మొదలైన ఆశ్రమ చిహ్నాలు కూడా మానసికంగా త్యజించివేస్తాడు. విధినిషేధములకు అతీతుడై, సందర్భానుచిత ధర్మాలు మాత్రం నిర్వహిస్తూ ఉంటాడు.
శ్లో॥ బుధో - బాలవత్ క్రీడేత్,
కుశలో - జడవత్ చరేత్
వదేత్ ఉన్మత్తవత్ విద్వాన్,
గోచర్యాం నైగమశ్చరేత్|| (అధ్యా 18, శ్లో 29)
ప్రాజ్ఞుడు-వివేకి అయికూడా ఒక బాలునివలె క్రీడిస్తూ వుంటాడు. చిన్నపిల్లవానివలె
ఏమీ ఎరుగనివానివలె కనిపిస్తూ వుంటాడు.
అన్నీ తెలిసి, గొప్ప నిపుణుడై కూడా ఒక జడుడి వలె ఏమీ తెలియనట్లే చరిస్తూ
ఉంటాడు.
విద్వాంసుడై ఉండికూడా లౌకికుల దృష్టిలో సామాన్యునివలె - పిచ్చివానివలె
మాట్లాడుతూ ఉంటాడు.
వేదార్థములపట్ల నిష్ఠ వదలకయే నియమరహితమైన వృత్తితో మెలుగుతూ
ఉన్నట్లు కనిపిస్తాడు!
పరమహంసత్వము వైపుగా ప్రయాణించువాడు కర్మకాండయొక్క విధి- ఫలముల గురించి
పట్టుదల మొండితనములతో “అదియే చేయాలి ఇట్లాగే చేయాలి అట్లాగే -
ఇట్లా ఉండనేకూడదు” అనే రూపంగా మొండిగా ఉండటం కూడదు. ఉండాలి అట్లా అని…. దేనినీ పట్టించుకోకుండా రాయిలాగా (పాషండునివలె) అవకూడదు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
164
కేవలము తర్కవాద (Logically supporting some concepts and opposing certain
other concepts) రతుడై ఉండరాదు. “వాళ్ళది తప్పు! వీళ్ళు తెలివితక్కువ వారు! మరొకళ్ళు
తెలివిగలవారు కాదు”.. అంటూ శుష్కవాదము - నిష్ప్రయోజనములైన వాద-వివాదములు
చేయరాదు. ఏదో ఒక పక్షము వహించి (Taking one side) మిగతా వారు - మిగతా
పక్షములపట్ల (Others and other Theories) తప్పులెన్నుతూ దోషములను వర్ణించువాడు
అయి ఉండకూడదు. తదితరులను చూచి “వాళ్ళట్లా అంటారేం? వీళ్ళిట్లా ఉన్నారేం?
ఇట్లా కాకూడదు! అట్లూ ఉండాలిసిందే..” అని సహజీవులను కలత పెట్టరాదు. తాను
కలత చెందరాదు. తనను గురించి ఎవ్వరైనా అతివాదంతోను, ఆవేశంతోను, దూషణ
పదజాలముతోను మాట్లాడుచున్నప్పుడు - తాను మాత్రం ఓర్పుతో, శాంతముతో
సంతోషము - అతీతత్వము వీడకుండా సహనంగా బాలాలీలావినోదివలె వుండుగాక!
ప్రశాంత చిత్తము వీడకుండా ఉండాలి. ఎవ్వరినీ అవమానించరాదు. విరోధము కలిగి
ఉండకూడదు. పశువత్ వైరమ్ అను శాస్త్రనానుడి! తదితర దేహములను దేహులను
చూచి విరోధము-కలత రాగద్వేషములు కలిగి వుండటం-కొనసాగించటం
పశులక్షణం. అది మానవునికి అర్హం కాదు సుమా!
ఓ ఉద్ధవా! పరమహంస లక్షణములు పునికిపుచ్చుకున్నవారు చతుర్విధ ఆశ్రమములలో
ఎక్కడైనా వుండివుండవచ్చు సుమా! ఇంకా పరమహంస యొక్క విశేషదృష్టి ఎట్లా ఉంటుందో
విను!
శ్లో॥ ఏక ఏవ పరోహి ఆత్మా భూతేషు ఆత్మన్యవస్థితః
యథా ఇందు ఉదపాత్రేషు భూతాని ఏకాత్మకాని చ॥ (అధ్యా 18, శ్లో 32)
ఆకాశంలో శీతలకాంతులు వెదజల్లుచున్న పూర్ణచంద్రుడు అనేక చోట్లగల అనేక
పాత్రలలోని జలములో అనేక ఆకారాలుగా ప్రతిబింబిస్తూ ఉంటారు! ఆవిధంగా ఒకేసారి
అనేకచోట్ల గల జలంలో అనేక ఆకారాలుగా ప్రతిబింబించినంత మాత్రంచేత.,…
అనేకత్వము చంద్రబింబముపై ఆపాదించగలమా? చంద్రబింబమును అనేకత్వం
స్పృశిస్తుందా? లేదే!
అట్లాగే
….9
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
165
ఒకే పరమాత్మ విభిన్న దేహములలో విభిన్నమైన రూప-నామ-గుణాదులతో విభిన్న
జీవాత్మలవలె ప్రతిబింబిస్తున్నారు. అయితే ఏం? సర్వ దేహములలో అఖండము
అప్రమేయము అగు ఒకే ఆత్మ ప్రకాసిస్తూ ఉన్నది! నేనే అనేక దేహులలో అనేక రీతులుగా
ప్రదర్శినమగుచు వినోదిస్తున్నాను అనునది-పరమహంస యొక్క విశేష దృష్టి!
పరమయోగి(లేక) సన్యాసి (లేక) పరమహంస పరమ ధైర్యముకలవాడై ఉంటాడు.
ఆతడు తనకు రుచికరమైన - తాను కోరుకున్న ఆహారము లభించనప్పుడు దుఃఖించడు.
మరికొన్ని రోజులు తాను కోరుకున్న మృష్టాన్నము - రుచికరమైన ఆహారపదార్ధాలు
లభించటంచేత సంతోషము పొందడు. ఆహారముగాని, మరింకేమైనాగాని ఒకరోజు
లభించటం మరొకరోజు లభించకపోవటం ఇదంతా దైవాధీనంగా, దైవలీలగా
గమనిస్తూ ఉంటాడు.
శ్లో॥ ఆహారార్థం సమీహేత యుక్తం తత్రాణధారణమ్
తత్త్వం విమృశ్యతే తేన తద్విజ్ఞాయ విముచ్యతే ॥ (అధ్యా 18, శ్లో 34)
ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి ఏదో ఒక ఆహారం సంపాదించుకోవాలి. ప్రాణరక్షణ
దేనికి? తత్త్వ విచారణ చేయటానికి! తత్త్వవిచారణచే తత్త్వ జ్ఞానము లభించి ముక్తి
కలుగుతుంది కాబట్టి ఇక అదృష్టవశంగా లభించే ఆహారంగాని, విశ్రమించే చోటుగాని
ఎటువంటిదైనా… అది పెద్ద విశేషం కాదు! - అని సమన్వించుకుంటూ వుంటాడు.
ఓ ఉద్ధవా! సర్వాంతర్యామిని - ఈశ్వరుడను- సర్వతత్త్వ స్వరూపుడనుగా నన్ను నేను
ఎరిగివుండి కూడా, విధి నిషేధములకుపరిమితముగాని-లొంగని అపరిమిత
స్వరూపుడను అయినప్పటికీ,… లోక నియమానుసారం శాస్త్రానుకూలంగా విధి-నిషేధ
పూర్వకంగా కర్మలు ఆచరిస్తూ ఉంటాను.
పరమహంస-సన్యాసమార్గముగా ఆత్మసాక్షాత్కారము ఆశయముగా గలవాడు, అయి
కూడా, విధి - నిషేధములకు లొంగకుండానే, శౌచము ఆచమనము - స్నానము
వస్త్రధారణ ఇత్యాది కర్మలు లోకానుకూలంగా శాస్త్రానుకూలంగా
ఆచరిస్తూవుంటాడు! (Be as is convenient to the situations and the world but
with no bondage to any thing)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
166
ఓ ఉద్దవా! ఈవిధంగా ఆత్మజ్ఞానుకూలమైన జీవనసరళి కొనసాగిస్తూ ఉండగా… ఇక
అట్టి జ్ఞాననిష్ఠునిపట్ల భేదప్రతీతి (the sense of differences) సన్నగిల్లుతూ వస్తుంది.
సరిఅయిన సమయంలో అట్టివాడు నా అనుగ్రహం చేత నాస్థానం పొందుతాడు.
సర్వభూతములు తానై-సర్వసాక్షి అనగవేరై… అను స్వాత్మానంద సంస్థానమును
జేరుతాడు.
అందుచేత కొంచెము తెలివిగలవాడు “ఈ విషయానుభవములవలన అంతిమ ఫలితము
దుఃఖమే!” అని గమనిస్తున్నాడు. సర్వదృశ్య విషయములపట్ల అనురక్తిని ఉపశమింప
జేసుకుంటున్నాడు. విరక్తుడగుచున్నాడు. నన్ను పొందే సాధనలకు సంసిద్ధుడగుచున్నాడు.
ఆత్మసుఖాభిలాషి అయి పరబ్రహ్మ నిష్ఠుడగు గురుదేవుని శరణువేడుచున్నాడు. శ్రద్ధ
ఆసక్తి కలవాడై, అసూయా రహితుడై, భక్తికలవాడై గురుదేవునియందు నారూపమును
భావించి, సేవించి ఆత్మజ్ఞానసమాచారమును ఆలకిస్తున్నాడు.
ఇక్కడ ఒకానొక జాగరూకత (caution), సందర్భం వచ్చింది కాబట్టి, ప్రస్థావిస్తున్నాను.
విను
ఎవ్వడైతే
….9
జ్ఞాన - వైరాగ్యముల సంపదలేనివాడై….,
కామము - క్రోధము ఇత్యాది అరిషట్ వర్గముపై యుద్ధము ప్రకటించనివాడై,
ఇంద్రియ వ్యవహారములపట్ల అభినివేశము గల బుద్ధియొక్క చాంచల్యము
వదలకుండా…
ఉదరపోషణార్ధం (పొట్టకూటి కొరకు)
సన్యాసము కొనసాగిస్తూ, కేవలము కాషాయవస్త్రధారణతో సంచరిస్తూ వుంటాడో…,
అట్టివాడు అపరిణతుడు విషయవాసనాగ్రస్థుడు మాత్రమే అగుచున్నాడు.
“ప్రపంచము పరమాత్మస్వరూపమే” అనే దృష్టిని పెంపొందించుకొనే ప్రయత్నాలు
చేయకుండా “నేను సన్యాసిని! గమనించండి! గుర్తించండి!”… అనే లౌకికత్వము
కొనసాగించువాడు ఆశ్రమ ధర్మనాశకుడే! అట్టివాడు తన ఆత్మను, పరమాత్మనగు
నన్ను వంచించుచు ఇక ఆపై ఉభయ భ్రష్టుడు అవుతున్నాడు సుమా!
ఓ జనులారా! ధర్మనిరతిని వీడకండి! (ధర్మోరక్షతి రక్షితః)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
167
గృహస్థుని ప్రధాన ధర్మములు సహజీవులను సేవించడం, భూత దయ తపస్సు,
శౌచము, సంతోషము, యజ్ఞము, వ్రతము
ఇత్యాదులు
పరస్త్రీ వ్యామోహములేనివాడై. మాతృభావన కలిగి
వుండాలి.
అతడు నియమిత (ఋతుకాలము) నందు
మాత్రమే భార్యతో సాంగత్యము కలిగి ఉండడం
బ్రహ్మచర్యమే అవుతుంది.
బ్రహ్మచారి ప్రధాన ధర్మము గురుసేవ
సన్యాసి ప్రధాన ధర్మము శమము (ఇంద్రియ నిగ్రహము), అహింస,
తత్త్వచింతన, తత్త్వబోధ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు
ప్రోత్సహించటం
వానప్రస్థుని ప్రధాన ధర్మము తపస్సు, సత్సంగము, భగవత్స్తోత్రము. -
ఈ నలుగురు ఆశ్రమవాసులకు 1. ఆత్మజ్ఞాన సముపార్జనము, 2. భగవతోపాసన ఈ
రెండు ముఖ్య ధర్మములు అయి ఉన్నాయి.
ఈ విధంగా తమ వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ అనన్య భావనతో, “నేను పరమాత్మను
ఈఈ ధర్మ-కర్మలతో సేవిస్తున్నాను” అను అవగాహనతో జీవితము అనే అవకాశమును
సద్వినియోగపరచుకుంటూ, “సర్వులయొక్క అంతర్యామిగా నా ప్రియమైన పరమాత్మయే
సర్వదా వేంచేసియున్నారు…” అను అనుభూతిని దృఢపరచుకొనుచుండగా నాపట్ల
పరాభక్తి స్వభావసిద్ధంగానే దృఢమౌతుంది. “ఈ బాహ్య -అభ్యంతర జగత్కళా
విశేషమంతా పరమాత్మయే! నేను కూడా ఆయన యొక్క కళావిశేషమే! కనుక నేను
ఆయనకు చెందినవాడినే” ఇటువంటి త్రోవలో నిరంతరంగా ప్రవృద్ధమగుచున్నట్టి
అఖండ భక్తిచేత సృష్టి-స్థితి లయకారకుడను, సర్వలోకేశ్వరుడను, జగత్కారణుడను
పరబ్రహ్మమే స్వరూపముగా గలవాడు…. అగు నన్ను పొందుచున్నాడు. “ అహమ్
బ్రహ్మస్మి” - మహావాక్యమును క్రమక్రమంగా స్వతఃసిద్ధంగా అనుభవైకవేద్యం
చేసుకుంటున్నాడు. సంసారమునుండి తరిస్తున్నాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
168
ఓ ఉద్ధవా! స్వధర్మము (స్వీయ ఆశ్రమ ధర్మము) అనునది ఈవిధంగా పరమాత్మను
చేరటానికి మహత్తరమైన మార్గమై ఉన్నది. స్వధర్మమును ఉపాసనగా భావించి
నిర్వర్తించువాడు అంతఃకరణశుద్ధిని సంపాదించుకొని నా ఐశ్వర్యమును తెలుసుకొన్నవాడై,
జ్ఞాన-విజ్ఞాన సంపన్నుడై నన్ను తప్పక పొందుతాడు. ధర్మస్వరూపుడనగు నేను స్వఆశ్రమధర్మనిరతులకు సర్వదా తోడుగా వుంటూ వుంటానయ్యా!
మిత్రమా! ఈవిధంగా ఈ సందర్భంలో నీకు వివిధ వర్ణాశ్రమ ధర్మములేమిటో,
ఆచార-విచారాదులు ఏవిధంగా ఉంటాయో…. వివరించాను.
నాయందు భక్తిచే ముక్తి తప్పక లభిస్తుంది! ఇందులో సందేహమే లేదు.
ధర్మము(సమర్పిత భావముతో నిర్వర్తించబడే స్వ ఆశ్రమ ధర్మము) భక్తిని ప్రవృద్ధం చేసి
నన్ను పొందేటట్లు చేయగలదు!
కనుక సర్వ నిరుత్సాహములు త్యజించి స్వ-ఆశ్రమ ధర్మమును శ్రద్ధగా ఆచరించి నాకు
సమర్పించి నన్ను పొందటమే గొప్ప ఉపాయమని అందరికి గుర్తుచేస్తున్నాను.
అధ్యాయము–26.) జ్ఞాన - భక్తి - యోగ విశేషములు
|
శ్రీకృష్ణభగవానుడు : ఓ ఉద్ధవా! అజ్ఞానము తొలగటానికి, ఆత్మజ్ఞానము వికశించటానికి
సాధకులకు చతుర్విధ వర్ణాశ్రమ ధర్మాలు వేదవేదాంత శాస్త్రములు చెప్పుచున్నాయి.
వాటిలో మరికొన్ని ముఖ్య విషయాలు కొన్ని మనం ఇక్కడ చెప్పుకుందాము.
వర్ణాశ్రమానుసారంగా శ్రద్ధ భక్తులతో నిర్వర్తిస్తున్న స్వధర్మనిరతి భగవత్ ధ్యానముల
యొక్క ప్రభావంచేత జీవుడు ప్రత్యక్ష పరోక్ష జ్ఞానములను అధిగమించి అపరోక్ష
జ్ఞానములో ప్రవేశిస్తున్నాడు. క్రమంగా ఆత్మతత్త్వజ్ఞుడు అగుచూ వేదాంత శాస్త్రముయొక్క
పాఠ్యాంశసార శాస్త్రజ్ఞాన సంపన్నుడగుచున్నాడు.
అటుపై,
ఈ ఇంద్రియానుభవమైనట్టి ద్వైతప్రపంచమును, అట్టి ద్వైతానుభవముయొక్క నివృత్తి
కొరకై ఆశ్రయించిన ప్రవృత్తి సాధనములను క్రమంగా మాయా కల్పితముగా
ఎరుగుచున్నాడు. వాటిని కూడా త్యజించి ఆత్మసాక్షాత్కారం పొంది సర్వేసర్వత్రా ఆత్మగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
169
ఎరుగుచు, తానే ఆత్మ స్వరూపుడై ఆనందిస్తున్నాడు. ముల్లును ముల్లుతో తొలగించి …
ఆపై రెండు ముల్లులను దూరంగా వదలివేస్తాం కదా! ప్రవృత్తి సాధనములచే ప్రవృత్తి
స్వభావం అట్లే అగుచున్నది.
భక్తిచే నన్ను ఆశ్రయిస్తున్నాడు.
భక్తిచే పొందబడేది నన్నే! మద్భావోపపద్యతే ॥
అట్లాగే…,
సర్వకర్మల సాధనఫలములు, స్వర్గాపవర్గములు నేనే! జ్ఞానులు ఏ అంతిమ స్థితిని
లక్ష్యముగా కలిగి జ్ఞాన సాధనలచే పొందుచున్నారో, అది నన్నే! అందుచేత జ్ఞానిగాని,
భక్తుడుగాని నన్నే కోరుకుంటాడు గాని, మరింకేమీ కోరడు! అనగా జ్ఞాన - విజ్ఞాన
సంపన్నులంతా నా చరణారవిందములే శ్రేష్ఠముగా భావిస్తున్నారు.
జ్ఞానియగువాడు జ్ఞానసంపదతో నన్ను పూజించి, నాకు ఎంతో ఇష్టమైనవాడగుచున్నాడు.
కొంచెము తత్త్వజ్ఞానముచే కలుగగల సిద్ధి - అనేక తపో తీర్ధ దాన ఇత్యాది అనేక
పుణ్యకార్యములచే కూడా లభించదుసుమా! అందుచే ఓ ఉద్దవా! నీవు జ్ఞానముచే నీ
ఆత్మస్వరూపుడనగు నాయొక్క ఔన్నత్యమేమిటో గ్రహించు. జ్ఞాన-విజ్ఞాన (conceptual
knowledge-Applied knowledge) ల సహాయంతో భక్తి భావనతో నన్ను ఆరాధించు.
సర్వయజ్ఞేశ్వరుడనైన నన్ను పూర్వము మునులెందరో జ్ఞాన విజ్ఞాన రూపమగు యజ్ఞముచే
పూజించి మద్భావన-మత్ స్వరూపము-మత్ స్థానమును సిద్ధింపజేసుకున్నారు.
మిత్రమా! ఉద్ధవా! నిన్ను ఆవరించియున్న ఆధ్యాత్మిక - ఆధి ఆధి దైవిక దైవిక - ఆధి భౌతిక
వికారములను “మాయామాత్రమే” కదా! అని ఎఱుగుము. ఒకానొకడు ఒక త్రాడును
చూచి పాము అని అనుకొని భయపడుచున్నాడనుకో… త్రాడును చూడకముందు
పాముయొక్క భావన ఉన్నదా? లేదు. “ఇది త్రాడేకదా!” అని గ్రహించిన తరువాత?
పాముయొక్క అనుభూతి మిగిలి ఉంటోందా? లేదుకదా! అట్లాగే… ఈ జగత్తు ఆదిలో
లేదు. అంతమున లేదు. మధ్యలో అగుపిస్తోంది. పాము మొదలే లేనట్లే - జగత్తు
ఆత్మకు వేరుగా మొదలే లేదు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
170
సర్పంజ్జు భ్రాంతి జగత్ భ్రాంతి
భ్రాంతికి ముందు - భ్రాంతి సమయంలోను భ్రాంతికి ముందు - భ్రాంతి సమయములోను –
భ్రాంతి తొలగిన తరువాత కూడా అక్కడ ఉన్నది భ్రాంతి తొలగిన తరువాత కూడా ఇక్కడ ఉన్నది.
త్రాడు మాత్రమే! సర్పము ఎన్నడూ లేదు ఆత్మయే! జగత్తు అనబడునది ఎన్నడూలేదు!
సర్పము ఎన్నడూ లేదు. ఇక, “సర్పము ఎక్కడినుండి వచ్చింది? ఎటు వెళ్ళింది?”….
అని ప్రశ్నిస్తే? సమాధానం ఏమున్నది?
ఆత్మయే జగత్తుగా భ్రమదృష్టి (భ్రాంతిచేత) అనిపిస్తోంది. ఇక జగత్తు ఎప్పుడు
ఉత్పన్నమైనది? ఎటు ఎప్పుడు పోతోంది? అనే ప్రశ్న ఎక్కడిది?
జనించటం జీవించటం - మరణించటం ఇత్యాది ధర్మాలు శరీర సంబంధమైనవే
గాని ఆత్మ సంబంధమైనవి కాదు. వస్త్రము ధరిస్తే వస్త్రముతోకూడి ఇతరులకు
కనిపిస్తాము. కానీ వస్త్రరూపముగా అగుచున్నామా? లేదు.
“శరీరధారణచే శరీరధారుడుగా అగుపిస్తున్నాను. శరీరము నేను ధరించినదేగాని….
శరీరము నేనుకాదు!”
“నేను ఆత్మస్వరూపుడను! శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానందమును….!”
ఇది గమనించు. ఓ ఉద్ధవా! ఆత్మ స్వరూపడవగు నీకు ఎన్నడూ వినాశనము లేదు.
రజ్జువుయే (త్రాడుయే) సత్యము. సర్పము సత్యము కాదు. కనుక అసత్!
ఆత్మయే సత్యము. దేహము ఇత్యాది వికారాలన్నీ (త్రాడులో పాముగా కనిపించిన
వైనమువలె) అసత్!
ఆత్మకు భిన్నమైనదానికి దేనికీ సత్త లేదు.
ఆత్మకు అభిన్నమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు.
శ్రీ ఉద్ధవుడు :
శ్లో॥ జ్ఞానం విశుద్ధం విపులం యధైతత్
వైరాగ్య-విజ్ఞానయుతం పురాణమ్
ఆఖ్యాహి విశ్వేశ్వర! విశ్వమూర్తే!
త్వద్భక్తి యోగం చ మహద్విమృగ్యమ్|| (అధ్యా 19, శ్లో 8)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
171
ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! మరికొంత వివరణతో జ్ఞాన-భక్తి యోగములనబడే ఈ
రెండు విషయాలు మరొక్కసారి నాకు బోధించవలసినదిగా మిమ్ములను ప్రార్థిస్తున్నాను.
1. విశుద్ధము - విపులము - వైరాగ్య విజ్ఞానయుతము అయినటువంటి
జ్ఞానయోగము.
2. మహనీయులు ఎల్లప్పుడు ఆశ్రయిస్తు - పరిపోషించుకుంటూ
పరిరక్షించుకుంటూ ఉండే భక్తియోగము.
ఈ రెండింటి భేదమేమిటి? ఏకత్వమేమిటి?
స్వామీ! ఎప్పటినుంచో తెలియదుగాని, మేము తాపత్రయములతో కూడిన ఘోరమైన
సంసార మార్గంలో ఎందుకో చిక్కుకొని ఉన్న బాటసారులం! అమృతము వర్షించే
భక్తి-జ్ఞానయుతమైన మీ మనోహరమైన వాక్కులు, మీ పాదపద్మములే మాకు గతి -
త్రాణ కూడా! వేరే ఛత్రము మాకు లేదు.
హే మహామహనీయా!
మేము సంసారము అనే నూతిలో చిక్కి కప్పలవలె చిక్కుకుని నిస్సహాయంగా
బెకబెకలాడుచున్నము. కాలరూపము అనబడే సర్పముచే కరవబడి ఉన్నాము. క్షుద్రమైన
విషయ సుఖములు - అనే తృష్ణచే కాలము అనే కట్టుకొయ్యకు కట్టుబడిపోయి ఉన్నాము.
మావంటి బద్ధజీవులకు మోక్ష బోధకములైన మీ వాక్సుధయే దివ్యౌషధం! అందుకని
వినిఉన్న దాని గురించే మరొక్కసారి అడుగుచున్నాను.
శ్రీకృష్ణభగవానుడు : మిత్రమా! ఉద్ధవా! జ్ఞానయోగము - భక్తియోగముల గురించి
ఒక సందర్భంలో ఒక మహానుబావుడు చెప్పిన విశేషాలు చెప్పుతాను విను.
కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. యుధిష్ఠరుడు (ధర్మరాజు) ఆతరువాత ఎంతో మానసిక
వేదన చెందాడు. ఒకరోజు గ్రామ పట్టణాలలో సంచరిస్తూ “అయ్యో! నాయొక్క
రాజ్యకాంక్ష వల్లనేకదా,…. అనేకమంది మరణించారు. వారి భార్యలు అంతా పోగొట్టుకొని
ఇంటిలో రోదిస్తున్నారు! ఇంతమంది బంధువుల మరణానికి నేనేకదా కారణం!” అని
దుఃఖించసాగాడు. “నువ్వు కారణమవటమేమిటయ్యా? ఇదంతా ఈశ్వరమాయ…”
అని నేను చెప్పినా, ఆయనకు దిగులు దుఃఖము తొలగలేదు. అప్పుడేం చేయాలి?
ఆయన వేదన తొలగేది ఎట్లా? నాకొక ఉపాయం తట్టింది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
172
“ఓ యుధిష్ఠరా! నీ దుఃఖం తొలగాలంటే ఏదైనా గొప్ప ఉపాయంచేత అజ్ఞానం తొలగాలి.
అందుకు ఒకే మార్గం. మహనీయుల సత్సాంగత్యం. పద మహాజ్ఞాని-భక్తమహాశయుడు
అగు పితామహుడు శ్రీ భీష్ములవారి వద్దకు వెళ్లాం! వారి వాగమృతమే మనందరికి
దివ్యౌషధం…” అని చెప్పాను. అక్కడున్న భీమ- అర్జున-నకుల సహదేవులు, తదితరులు,
“అవును! శ్రీకృష్ణ వాక్యంతు కర్తవ్యం! తాతగారు భీష్మమహాశయుల భక్తి-జ్ఞాన పాఠ్యాంశాలే
మనకు ఇప్పుడు దివ్యౌషధం” అని పలికారు.
అందరము కలసి యుద్ధభూమిలో ఒకానొకచోట అంపశయ్యపై పవళించియున్న
మహాత్ములగు శ్రీభీష్ములవారిని సమీపించాము.
అప్పుడు భీష్మపితామహులవారు అనేక ధర్మ సూక్ష్మ విశేషాలు చెప్పుతూ - చెప్పుతూ,
చివరికి సర్వ శాస్త్ర సార విశేషమైనట్టి మోక్షధర్మము గురించి ప్రవచించారు. అది
జ్ఞాన-విజ్ఞాన-వైరాగ్య విశేషాలతో కూడిన మహత్తర అనుభవపూర్వక మహావాక్యాలు,
భావాలు కలిగియున్నట్టిది. ఆయన చెప్పిన వాక్యసారాంశము కొంత ఇప్పుడు
చెప్పుచున్నాను. విను.
ఆత్మజ్ఞానము : సృష్టికర్తయగు బ్రహ్మదేవునినుండి - కదలకుండా కనిపించే రాయివంటి
స్థావరముల వరకు (ఆబ్రహ్మ స్థంభ పర్యంతము) ఇదంతా కార్యరూపము అంటారు.
అనగా…. (దృష్టాంతానికి)……
మట్టితో కొన్ని బొమ్మలు (రాజు-మంత్రి-సైనికుడు గుఱ్ఱము - ఏనుగు మొదలైనవి)
తయారు చేసారనుకుందాం.
మట్టి కారణరూపము అంటారు.
బొమ్మలు వాటివాటి కధ-కమామీషు కార్యరూపముగా అనుకో!
ఇప్పుడు
కారణరూపముగా కార్యరూపము గమనిస్తే…. ఇదంతా సర్వదా శ్రీకృష్ణ చైతన్య
ప్రభునిత్యానందమే! మట్టి బొమ్మలలో మట్టియే సత్యము కదా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
173
కార్యరూపము :
1. పురుషుడు (Indvidual experiencer)
2. ప్రకృతి (Nature స్వభావము)
3. మహత్తత్వము (Multi presentation అనేకముగా కనిపించటం)
4. అహంకారము : (నేను-నేను అనిపించటం)
5–9 పంచతన్మాత్రలు: శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలు
10.–20 ఏకాదశ ఇంద్రియములు : కళ్ళు, చెవులు - కాళ్ళు - చేతులు - ముక్కు -
నాలుక - చర్మము - గుహ్యము - గుద - మనస్సు - బుద్ధి - జ్ఞప్తి
అనుభూతి
21–25 పంచభూతములు :
స్థూలము (Solid - భూమి)
ద్రవము (Liquid - జలము)
అగ్ని (Fire-Heat - అగ్ని)
వాయువు (Vapour - Air)
స్థలము (Placement - ఆకాశము)
- 26–28 గుణత్రయము - సత్వగుణము, రజోగుణము, తమోగుణము
ఇవన్నీ 28 తత్వములుగా వేరువేరుగా వేరువేరు ధర్మములతో కనిపిస్తున్నాయి కదా!
ఇవన్నీ కార్యరూపములు.
ఇవన్నీ వేరువేరుగా అగుపిస్తున్నప్పటికీ వీటియొక్క మూల పదార్ధము (The main
material all these made up of) పరమాత్మయే! అట్టి భిన్నత్వములో ఏకత్వమే అయినట్టి
(unity in the Diversity) పరమాత్మతత్త్వమును నిర్వచించి చెప్పు జ్ఞానమే ఆత్మజ్ఞానము!
విజ్ఞానము:
ఎవ్వరికైతే పూర్వమున ఉన్నవి - ఇప్పుడు కనిపిస్తున్నవి - ఇవన్నీ వేరువేరుగా కాకుండా
- సర్వము పరమాత్మ స్వరూపముగా అనిపిస్తుందో, అట్టి స్థితి - స్థానమే విజ్ఞానము
అనే శబ్దముతో చెప్పబడుతోంది. రూపముల-నామముల ధర్మముల దృష్టిచే అనేకంగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
174
కనిపిస్తున్నప్పటికీ, ఒక్కటిగా అనిపించటమే విజ్ఞానము.
“సృష్టిగా-స్థితిగా-లయముగా-అప్రమేయముగా, అద్వితీయముగా కనిపించేదంతా
మమాత్మయే!-నేనే” అని ఆస్వాదించబడుచుండటమే విజ్ఞానము!
ఏదైతే…,
సృష్టి-ప్రళయముల సందర్భాలలో కారణరూపంగాను,
స్థితి కాలంలో సర్వము ఆశ్రయించి ఉన్నట్టి… ఆశ్రయరూపంగాను, (కార్యరూపంగాను)
ఒక కార్యమునుండి మరొక కార్యమునకై నిరంతరం ప్రయాణిస్తున్న
అప్రమేయరూపంగాను (ఊదాహరణకు జాగ్రత్లోంచి స్వప్నంలోకి - స్వప్నంలోంచి
సుషుప్తికి, సుషుప్తినుండి స్వప్నమునకు ఆమూడు తనవై ప్రయాణిస్తూ -
తాను మాత్రం యధాతథంగా ఏర్పడి ఉన్న సర్వుల స్వస్వరూపంగాను….)
అంతా లయించినప్పుడు కూడా అప్పటికీ శేషించి ఉన్నదిగాను,
ప్రకాశిస్తోందో… అదియే సత్త-సత్-ఆది-పరతత్త్వము-తురీయము! అదియే
ఓంకారము…గా కూడా చెప్పబడుతోంది!
అదియే సత్త! (Existant) తదితరమైనదంతా అసత్త! (Non-Existant) ఈ జగత్తు
సందర్భరూపంగా అసత్తు. సహజరూపంగా బ్రహ్మమే!
జీవుడు ఆ సత్ వస్తువుగురించి, అద్దానితో తనకుగల అభేదత్వము, అద్వితీయత్వము,
తనయొక్క నిర్వికల్పము, అవాక్మానస గోచరత్వము గురించి ఎఱుగటమే విజ్ఞానము.
.…
ఇక దృశ్యమంటావా… ఇదంతా స్వప్నసదృశం మాత్రమే! కలలోని సంఘటనల గురించి
మెళుకువ వచ్చిన తరువాత దుఃఖించటంలో అర్ధమేముంటుంది?
చూచావా ఉద్ధవా! ఎదురుగా ప్రత్యక్షంగా ఈ నామ రూప జగత్తు (ఇంద్రియములకు
అగుపిస్తోంది. అయితే, ఇదంతా అసత్తు. దీనికి ఆవల (పరము)గా ఉన్న పరమాత్మ
తత్త్వమే సత్యము. సత్తుకూడా! మూలతత్త్వము! బ్రహ్మము! కనుక సందర్భ సత్యమగు
నామ రూప జగత్తును దాటి సహజసత్యమగు, బ్రహ్మమును ఆలంబన చేసుకో!
ఉద్ధవుడు : 1. ఎదురుగా ఘనీభూతమై కనిపిస్తున్న దృశ్య-భావనా జగత్తు 2. పుణ్య
కర్మఫలములుగా చెప్పబడుచూ - కొందరిచే జీవిత లక్ష్యములుగా భావించబడే స్వర్గము
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
175
మొదలైన సుఖమయ లోకములు… ఇవన్నీ అసత్తే అని, కేవలము కాలబద్ధమని తేల్చి
చెప్పుచున్నారు కదా! ఈ వాక్యము ఆత్మవిద్యను బోధించే గురువుల మొదటి వాక్యముగా
మేము విన్నాము. వింటూనే ఉన్నాము.
అయితే….
ఈ ఎదురుగా అగుపించేదంతా మాకు దుఃఖభరితంగాను, అనుల్లంఘ్యుమైనట్టి సంసార
సముద్రముగాను, అనేక జన్మల కర్మార్జిత బంధంగాను అనిపిస్తోందేగాని,…
ఇదంతా సందర్భరూపంగా అసత్తు! -
సహజరూపంగా చూస్తే ఆత్మయే!
అని ఏమాత్రం అనిపించటమేలేదు!
ఎవ్వరో మాయందు అనురక్తిని కల్పించి మమ్ములను ఈ దృశ్యమునకు, జన్మ-కర్మలకు
బద్ధునిగా చేసి ఉంచుచున్నట్లుగా అప్పుడప్పుడు అనిపిస్తోంది!
సంసార సాగరము అనబడే మా ఈ దృశ్యసత్తాధ్యాస తొలగేది ఎట్లా?
శ్రీకృష్ణభగవానుడు : ఔను! “నతు సత్యమిహ అణ్వపి” అని విబుధులు, ఆత్మకోవిదులు
ఎలుగెత్తి, తట్టి చెప్పుచున్నప్పటికీ, “ఇదంతా నాకు బంధము!…” అనే భ్రమ అనేకమంది
జీవులపట్ల తొలగటం లేదు! “ఈ కనబడేదంతా మమాత్మ స్వరూపమే! నేనే! నా కళా
విన్యాసమే!…” అనే ఆత్మజ్ఞాన విజ్ఞానోదయం కావటంలేదు.
ఇందుకు ఔషధంగా నాలుగు ప్రమాణాలు విజ్ఞులచే చెప్పబడుచున్నాయి.
1. శ్రుతి ప్రమాణము : వేద-ఉపనిషత్తులు మహావాక్యాలు ప్రసాదిస్తున్నాయి.
తత్ త్వమ్! అదియే నీవుగా కనిపిస్తోంది
జీవోబ్రహ్మేతి నాపరః! జీవుడుగా నాకు కనిపిస్తున్నది బ్రహ్మమే!
అయమాత్మా బ్రహ్మ! జీవాత్మయే పరబ్రహ్మము!
అహమాదిర్షిఅన్నిటికీ ! మొదలే నేనున్నాను!
సో హమ్! నేను పరమాత్మ స్వరూపుడనే!
త్వమేవా హమ్! నీవుగా కనిపించేదంతా నేనే!
అహమ్ సర్వస్య ప్రభవో! అన్నిటినీ ప్రభవింపజేస్తున్నది నేనే!
మత్తఃపరతరమ్ న అన్యత్ కించిదస్తి! నాకు వేరైనదంటూ ఎక్కడా ఏదీ లేదు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
176
ఇత్యాది శ్రుతి స్మృత మహావాక్యాల అర్ధము విచారణ చేస్తే, గురుముఖతః వింటే
స్వస్వరూపమగు ఆత్మయొక్క ఔన్నత్యం గ్రహించబడుచుండగా ఈ దృశ్యానుభవముయొక్క
స్వాప్నికత, దీనికి ఆధారమైన అనన్యపరతత్త్వము - మహదత్వము విశదీకరణమౌతోంది.
ఇది శాస్త్ర ప్రమాణము!
2. ప్రత్యక్ష ప్రమాణము : ఇంద్రియములకు గోచరమయ్యేది!
శాశ్వతమా?
సత్యమా?
మనోకల్పనయేనా?
ఒక సందర్భము - సంఘటన అజ్ఞులు ఎట్లా చూస్తున్నారు? ఆ అజ్ఞాని విజ్ఞానమును
సంపాదించుకొని అటుపై చూస్తే…. వాటి వాటి నిర్వచనాలు ఏవిధంగా ఉంటున్నాయి?
చూడబడేదంతా
చూచేవాడియొక్క మనోచమత్కారమేనా?
చూచేవాడిని చూచేవాడు (One who is perceiving the own perceiver of
the world) అనబడే ఆత్మ ప్రమేయమా? (Is it bounded and related to
what is being seen?) అప్రమేయమా? (is it beyond and unrelated)
ఇటువంటి ప్రత్యక్షముయొక్క విచారణచే ప్రత్యక్షము-పరోక్షము కూడా కానట్టి
అపరోక్షజ్ఞానము ఉదయిస్తోంది. ఆత్మయే అంతటా సాక్షాత్కారమై అభిన్నమై
అనుభూతమౌతోంది! ఈ మార్గమునే ప్రత్యక్షప్రమాణము అని అంటారు.
3. ఐతిహ్య ప్రమాణము : నాకు అనుభూతమైయ్యేదంతా ఆయా తీరుగా సత్యమా?
కాదా?…. అని అనుమానం వచ్చినప్పుడు ఈ జీవుడు ఏం చేయాలి? విజ్ఞులను
మహనీయులను ఆశ్రయించాలి. వారి అనుభవమును - నిర్ణయములను ప్రమాణంగా
తీసుకోవాలి కదా! అట్టి మహనీయుల చరిత్రలు - ప్రవచనములు అంతిమసార
వాక్యములు అభిప్రాయములను ఇతిహాసములుగా గ్రంథస్తమైనాయి. అట్టి
(రామాయణ-భారత-భాగవతాది) ఇతిహాసములు ముముక్షువులకు ప్రమాణములై
అంతిమసత్యమును సాక్షాత్కరింపజేస్తున్నాయి. (శ్రీవసిష్ఠవిరచిత యోగ వాసిష్ఠం, బ్రహ్మ
సూత్రములు… ఇత్యాదివి అందుకు ప్రమాణములు).
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
177
అధ్యాయము–27.) భక్తియోగ సాధనములు |
శ్రీ ఉద్ధవుడు : మహాత్మా! సద్గురూ! శ్రీకృష్ణా! ఇప్పుడు నాకు భక్తియోగ సాధనల గురించి
చెప్పండి.
శ్రీకృష్ణుడు : ఓ ఉద్దవా! నాకు ప్రియమానుడవగు నీకు భక్తియోగం గురించి ఇతఃపూర్వమే
చెప్పియున్నానుకదా! ఇప్పుడు నీకు భక్తియోగ సాధనల గురించి కూడా కొన్ని విశేషాలు
చెప్పుచున్నాను. విను.
నాపట్ల భక్తి ప్రవృద్ధం కావాలంటే త్రోవలు.
1. కథాశ్రవణం : అమృతమయములైనట్టి నా అవతార కథలను వినటం.
2. సంకీర్తనం - స్తవనం : నిరంతరం నా గుణములను, లీలలను, నామములను
సంకీర్తించటం, గానం చేయటం, నామస్మరణ చేయటం, స్తోత్రములతో స్తుతించటం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
178
ఓ ఉద్ధవా! ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఈ ధర్మములను పాటిస్తూ, ఆత్మనివేదన
నిర్వర్తిస్తూ ఉన్నవాని హృదయంలో పరాభక్తి ఉదయించి బాలచంద్రునివలె ప్రకాశిస్తుంది.
ఇక ఆతనికి 14 లోకాలలో లభించనిదంటూ ఏదీ ఉండదు. (కో అన్యో అర్ధ అస్య
అవశిష్యతే? (What is that he shall not get?) పరమాత్మరూపుడైన నాకు సత్వ
గుణసంపన్నము - శాంతము అగు తన చిత్తమును ఎవ్వడు సమర్పిస్తాడో అట్టివానికి
- ధర్మ-జ్ఞాన-వైరాగ్యయుక్తమైన ఐశ్వర్యములు స్వభావసిద్ధంగానే నాచే ప్రసాదించ
బడతాయి.
00॰
రజోగుణయుక్తమైన మనస్సు : ఎవ్వరి మనస్సైతే
దేహములు - ఇళ్ళు - నామరూపములు ఇత్యాది దృశ్యాది విషయములందు
లగ్నమగుచూ…,
ఇంద్రియములవెంట పరుగులు తీస్తూ….
ఇంద్రియ విషయములపట్ల ఆవేశము - ఆకర్షణ - ఆలోచన - ఆభావన
మొదలైనవాటిని కొనసాగిస్తూ…
రజోగుణయుక్తమై….,
అసత్తు - అసద్వస్తు - అయివున్న ప్రాపంచక సంఘటన సందర్భములందు లగ్నమై
ఉంటుందో….
అటువంటి మనస్సు
అధర్మమునకు…
అజ్ఞానమునకు….,
మోహమునకు
భ్రమ - విభ్రమములకు….,
ఆవేశ - కావేశములకు,
రాగ - ద్వేషములకు ఆలవాలమై, నిలయమై ఉంటోంది. అందుచేత ఓ ఉద్ధవా!
ధర్మము : ఏఏ ఉద్దేశ్యములు - ప్రయత్నములు నాయందు భక్తిని పెంపొందింపజేస్తుందో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
180
అదియే ధర్మము గా చెప్పబడుతోంది. ధర్మో మద్భక్తి-కృత్ ప్రోక్తో
జ్ఞానము - ఏఏ అవగాహనలు - సమాచారములు - పాఠ్యాంశములు - గురుబోధలు
మొదలైనవి అంతటా ఒకే పరమాత్మను సందర్శించటం(seeing unity
in diversity, సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరమ్)
అభ్యసింపజేస్తూ ఉన్నాయో- అదియే జ్ఞానము గా చెప్పబడుతోంది.
జ్ఞానం చ ఏకాత్మ్య దర్శనమ్
అసంగము - త్రిగుణ జగత్తెనట్టి ఈ దృశ్యమునకు సంబంధించినంత వరకు
గుణత్రయములపట్ల విరాగము కలిగి సర్వగుణములకు కేవలసాక్షినగు
నాపట్ల మాత్రమే ధ్యాస - అనురాగము పెంపొందించుకోవటం. గుణేషు
అసంగో వైరాగ్యమ్!
మహదాశయము -లౌకికలాభాలాభముల పట్ల - అణిమ - గరిమ - ఇత్యాది సిద్ధులపట్ల
విరాగులై ఉండటం. ఆత్మ భావనను సిద్ధించుకునే లక్ష్యము మాత్రమే
కలిగి ఉండటం.
ఇవి సాధనలుగా స్వీకరించబడుగాక!
శ్రీ ఉద్ధవుడు : స్వామి! సందర్భము వచ్చింది గనుక అడుగుచున్నాను.
నియమము అనగానేమియమము - ? ఎన్నివిధములైనవి?
శమము దమము - తితిక్ష - ధృతి అనగా ఏమిటి?
దానము - తపస్సు - శౌర్యము - సత్యము - ఋతము - - త్యాగము - ఇష్టము
ధనము - యజ్ఞము - దక్షిణ వీటి గురించి కూడా దయయుంచి వివరించ
ప్రార్థన! అంతే కాకుండా
ఈ జీవునికి ఏది బలము? దయ అనగా? లాభము ఏది? దేనిని ఉత్తమ విద్య
- అంటారు? లజ్జ-శ్రీ- సుఖదుఃఖములు వీటి కార్య - కారణ స్వభావాలు ఏమిటి?
పండిత లక్షణములు ఎట్టివి?
మూర్ఖుడు ఎవ్వడు? |
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
181
సన్మార్గమేమిటి? దుర్మార్గమేమిటి?
స్వర్గ నరకములు అనగా?
బంధువులు - గృహము - ధనవంతుడు - నిర్ధనుడు - కృపణుడు - ఈశ్వరుడు -
అని ఎవరెవరిని అంటారు?
ఈ ప్రశ్నలకు సమాధానములు, తదితర వ్యతిరిక్తములు కూడా ఏమిటో మీరు చెప్పగా
వినాలని నా మనవి!
శ్రీకృష్ణుడు : ఓహో! ఉద్ధవా! చాలా ప్రశ్నలు ఒక్కసారిగా సంధిస్తున్నావే! మంచిదేనయ్యా!
సరేఁ! కొన్ని విశేషాలు క్లుప్తంగా సమాధానంగా చెప్పుచున్నాను. విను.
1. యమము :
1. అహింస - Non-violence, Non troublling others - Either Physically or
mentally_ఇతరులపట్ల అవ్యాజమైన ప్రేమ వృద్ధి పొందితే మాత్రమే
ఇది సాధ్యము.
2. సత్యము - యమ్ సత్ - సత్పై ధ్యాస - అసత్పై ఉదాసీనత. (Attention
towards original and absolute truth)
3. అస్తేయము - తనదికానిది తనదిగా కావాలనుకొనే దొంగబుద్ధి లేకపోవటం.
ఓయీ జీవుడా! ఈ జగత్తులో ఏదీ నీది కాదు. ఇక లోభము-మోహముమాత్సర్యము ఎందుకు?
4. అసంగము - దేనిపట్లా సంగము లేకుండటం. (Non-attachment)
5. హ్రీ - నాకంటే గొప్పవారు ఎందరు లేరు? అని సిగ్గుతో ఉండటం. (Feel
shy for your mistakes and tolerence towards other’s
mistakes)
6. అసంచయము - దృశ్యముతో తన్మయం కాకపోవటం. Keepign away. Main
taining beyondness
7. ఆస్తిక్యము - ఈ దృశ్యమునకు ఆధారమై ఒకానొక పరతత్త్వము అన్నిటికీ కారణమై
ఉన్నది - అని గమనించి ఉండటం. (Respect towards divinity
which is the Author and Owner of all that is being seen).
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
182
బ్రహ్మచర్యము లౌకిక పాంచభౌతిక జగత్ భావములను ఉపశమింపజేస్తూ
అధిగమిస్తూ .. …, ఇదంతా పారలౌకికమగు పరబ్రహ్మమే
కదా అను భావనలయందు ప్రవేశించటం - చరించటం.
మననము బ్రహ్మము గురించిన పఠనము - హృదయస్థం -
చేసుకోవటం తత్ దర్శనము.
To Keep withdrawing from (or) keep going beyond senses
of the world.
To begin to interpret all this being sean as ‘Brahmam -
Divinity’ .
To keep on following along with it.
మౌనము సర్వ జగద్విషయములపట్ల అతీతత్వభావనచే ప్రశాంతదృష్టితో
నిస్పర్ధులై ఉండటం. (Silently and pleasently witnessing all
this without conflict)
స్థైర్యము “బ్రహ్మమే ఇదంతా కదా” అనే స్థిరభావం వదలకపోవటం.
బ్రహ్మావలోకధిషణం నజహాతి. (Couragious in divine
convictions).
క్షమ ఓర్పు! పోనీలే… అనే క్షమించే గుణం. తల్లికి తప్పే కనిపించదు
కదా! అటువంటి మాతృవాత్సల్యం కలిగి ఉండటం.
అభయము - భయపడక - బుద్ధితో ధైర్యము వహించి ఉండటం. (Why should
I fear when Lord Krishna is in me as me and as this world?)
ఈ పండ్రెండు యమములు అని అధ్యాత్మ శాస్త్రముచే విడమర్చి చెప్పబడుచున్నాయి.
నియమము
బాహ్య శౌచము తదితరులతో ప్రవర్తిస్తున్నప్పుడు శుచి అయిన (ప్రేమ -
సహకారము-క్షమ ఇత్యాది) భావాలు ప్రదర్శించటం.
(Positive behaviour and Responses)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
183
అభ్యంతర శౌచము హృదయంలోను - మనస్సులోను శుచి అయిన భావాలు
అభిప్రాయాలు - గుణాలు పెంపొందించుకొంటూ
పరిపోషించుకోవటం. “వారు అట్టివారు. వీరు ఇట్టివారు”..
ఇత్యాదులు త్యజించటం. భౌతిక సంఘటనలకు,
స్వభావాలను చూచి కోపము-ద్వేషము పొందకపోవటం
Positive inside the Heart)
జపము భగవంతుని అవతారమూర్తుల - గురువుల
నామరూపములు జపించటం, ఉపాశించటం!
తపము తపనయే తపస్సు. పరమాత్మ పాదాలు - సన్నిధికి
మనోబుద్ధులను చేర్చాలనే తపన కలిగి ఉండటం
హోమము వేదవిధానాలైన అగ్నోపాసన
శ్రద్ధ నియమిత కర్మలపట్ల - భగవత్ సాధనములపట్ల బుద్ధిని
మరీ మరీ నియమించటం.
ఆతిథ్యము తదితరులను పరమాత్మయొక్క ప్రత్యక్ష రూపములుగా
భావించి సేవాభావం కలిగి ఉండటం
అర్చన పరమాత్మను అర్చించటం. పూజించటం, కృతజ్ఞతలు
పలకటం. ఉపాసించటం. ఆరాధించటం.
తీర్ధాటనము తీర్ధప్రదేశములను - ఆశ్రమములను -
గురువాసములను సందర్శించటం. మ్రొక్కటం.
పరార్ధసేవ “పరోపకారార్ధమ్ - ఇదమ్ శరీరమ్” అనేది
జ్ఞాపకముంచుకొని “లోకాన్ సమస్తాన్ సుఖినోభవంతు”
అను భావనచే ఇతరులకు హితైషులై ఉండటం
సంతుష్టి లభిస్తున్నదానికి దైవమునకు కృతజ్ఞులై ఉండటం
లభించని దానిగురించి ఊసురోమని కాలాన్ని వృధా
చేసుకోకపోవటం. “నారు పోసినవాడు నీరు పోయక
మానుతాడా?” అని నమ్మి ఉండటం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
184
గురుసేవ ఆత్మజ్ఞులను - మహనీయులను - గురువులను
సమీపిస్తూ “వీరికి నేను ఏవిధమైన సేవ
అందించగలను!”…. అనే భావము - శ్రద్ధ!
ఈ 12 నియమములు అని చెప్పబడుచున్నాయి.
ఇంకా మరికొన్ని నిర్వచనాలు విను.
| శమము బుద్ధిని పరమాత్మయందు లగ్నము చేయటం.
శమో మన్నిష్ఠతా బుద్ధిః
దమము ఇంద్రియములను నిగ్రహించటం. ఇంద్రియ విషయముల
దమ ఇంద్రియ సంయమః పట్ల అభినివేశము లేకుండటం, ఇంద్రియములను
పరమాత్మ సేవాభావంతో నియమించటం.
|తితిక్ష దుఃఖములు - కష్టములు సందర్భపడుచున్నప్పుడు -
“ఆఁ! ఇటువంటి తితిక్షా దుఃఖ సంమరో కష్టాలు ఎంతమందికి లేవు! నాకన్నా
ఎక్కువ కష్టాలు పడుచున్నవారు ఎంతమంది లేరు?”..
అన్న అవగాహనతో ఓర్పువహించటం. “ఓర్పు
నేర్చుకోవటానికే కష్టాలు…” అనే ప్రజ్ఞతో కూడిన
అవగాహన పెంపొందించుకోవటం. నేర్పుతో ఓర్పు కలిగి
ఉండటం.
ధృతి/ధైర్యము నోటిని - జననేంద్రియములను అదుపులో
జిహ్వ-ఉపస్థ జయో ధృతిః ఉంచుకోవటం. వాటిని జయించటము.
ఇతరులకు దానము ద్రోహం చేయకుండా కష్టపెట్టకుండా
దండన్యాసః ఉండటము. వారి కష్టాలు తొలగించే ప్రయత్నం.
పరం దానం వారిని సంతోషింపచేయటం.
తపస్సు కోరికలను త్యజిస్తూ ఉండటము.
కామత్యాగః తపః స్మృతమ్
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
185
శౌర్యము వాసనలను జయిస్తూ ఉండటము.
స్వభావ విజయః శౌర్యం స్వభావాన్ని అధిగమించి స్వా-భావాన్ని ఆశ్రయించటం.
సత్యము (యమ్ సత్) - బ్రహ్మమునకు సంబంధించిన విచారణ
సత్యం చ సమ దర్శనమ్ సమదర్శనమే సత్యము - సత్యవ్రతము.
ఋతము సత్యము - ప్రియముతో కూడిన వాక్కు - ఋతము
ఋతం చ సూనృతా వాణీ పరమసత్యమును ప్రకటించే వాక్యాలే సూనృతవాణి.
శౌచము లౌకిక కర్మలయందు అనాసక్తులై ఉండటం. -
కర్మసు అసంగమః శౌచం
సన్యాసము కోరికలను త్యజిస్తూ ఉండటం. త్యాగ భావము.
త్యాగః సన్యాస ఉచ్యతే
ధర్మము - ధనము ధర్మమే నిజమైన ప్రీతిపూర్వకమైన ధనము. (ధర్మో రక్షతి
ధర్మం ఇష్టం ధనమ్ రక్షితః) లోకక్షేమం కొరకు ధర్మము.
నృణామ్
యజ్ఞము పరమాత్మనగు నేను యజ్ఞపురుషుడను. యజ్ఞకర్తను.
యజ్ఞో హం భగవత్తమః యజ్ఞ ఫలస్వరూపుడను. యజ్ఞస్వరూపుడను.
దక్షిణ ఆత్మజ్ఞానమును పఠించడం, నేర్వటం, ఉపదేశించటం.
దక్షిణా జ్ఞానసందేశం ఇదియే దక్షిణ.
బలము ప్రాణాయామం ఆధ్యాత్మిక మార్గంలో శ్రేష్టమైన బలము.
ప్రాణాయామం పరం బలమ్
భగము పరమాత్మయొక్క ఐశ్వర్యము. ఈ జగత్తంతా
భగో మే ఐశ్వరో భావో పరమాత్మయొక్క ఐశ్వర్యమే! 14 లోకాలు - జీవులు
అంతాకూడా నా ఐశ్వర్యమే! ప్రతి ఒక్కరు నారూపమే!
నావారే! నేను ఆ పరమాత్మయొక్క ఐశ్వర్యమునే!
లాభము భక్తియొక్క ప్రవృద్ధియే లాభము.
లాభో మద్భక్తిరుత్తమః భక్తియొక్క ఉన్నతియే జీవితాశయం!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
186
విద్య జీవుడే ఈశ్వరుడు. జీవుడే పరమాత్మ అను అఖండవిధ్యా త్మని భేదా బాధో అభిన్న-అద్వితీయ తత్త్వమును బోధించు శబ్దాలు
వాక్యాలు - వాక్యార్ధాలు - పాఠ్యాంశాలు .
భేదములన్నిటినీ బోధించునదే విద్య!
చెయ్యకూడని వికర్మలయందు / పట్ల హేయత్వము (I
జుగుప్సా హ్రీర కర్మసు should not do. Let me not do. I feel shy to keep
on doing wrong things) అనుదానిని
లజ్జ-సిగ్గు అని హ్రీ అని చెప్పబడుతోంది.
శ్రీర్గుణాః దృశ్యములో కనిపించే దేనిపట్లా కూడా అపేక్షలేనివాడై
శ్రీర్గుణా నైరపేక్ష్యాద్యాః - నిరపేక్షుడై ఉండటం. కావాలనిగాని - అఖర్లేదనిగాని
ఆవేశపడక పోవటం
సుఖము సుఖ-దుఃఖములను అతిక్రమించి ఉండటమే నిజమైన
సుఖం దుఃఖ సుఖాత్యయః సుఖము
దుఃఖము నాకు విషయభోగములు-లోక సంబంధమైన సుఖములు
దుఃఖం కామ సుఖాపేక్షా లభించాలి. కావాలి - అని అనుకోవటమే దుఃఖము.
పండితుడు దేనివలన బంధము - ఏది బంధము, దేనివలన మోక్షము
పండితో బంధ-మోక్ష విత్ - ఏది మోక్షము ఈ తతత్త్వము ఎఱిగినవాడు పండితుడు.
మూర్ఖుడు ఈ శరీరము - ఆయా దృశ్య విషయములపట్ల బంధుమూర్ఖదేహాద్యహం బుద్ధిః మిత్ర - గృహ-తదితర లోకసంబంధమైన విషయాల
పట్ల ఇవి నావి! నేను వీటికి చెందినవాడను అను
భావములను బలముగా ఆశ్రయిస్తున్నవాడు.
మార్గము/సత్పంధా సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడు అగు నన్ను
పన్ద మన్నిగమః స్మృతః చేరే ప్రయత్నములే పంధా!
కుపథము చిత్త విక్షేము - తత్త్వమునుఏమరుస్తూ - ప్రవృత్తి మార్గము
ఉత్పథః చిత్త విక్షేపః కుపథము (Right path). ప్రాపంచక విషయములపట్ల
సదా మననం చేయు చిత్త - విక్షేపము.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
187
సత్ స్వర్గము వర్గము
స్వర్గః సత్త్వగుణోదయః సత్వగుణమునకు సంబంధించిన ప్రేమ-వాత్సల్యముదయ-దాక్షిణ్యము ఇత్యాదియొక్క ప్రవృద్ధి.
కోపము నరకము - ఆవేశము - కసి - ద్వేషము - నిరుత్సాహము
నరకః తమ ఉన్నాహో - బద్ధకము - బుద్ధి మాంద్యము… ఇవన్నీ అధికమౌతూ
ఉంటే తమోగుణము వృద్ధి చెందుతున్నట్లు!
తమోగుణములు వృద్ధి చెందుతూ ఉండటమే నరకము!
బంధువు, గురువు, సఖుడు సర్వాంతర్యామినగు నేనే సర్వజీవులకు వాస్తవమైన
బంధుః గురురహం సఖే బంధువును, నీయొక్క - ప్రతి ఒక్కరియొక్క
ఆత్మస్వరూపుడనగు నేనే శ్రేయోభిలాషిని. గురువుని.
స్నేహితుడను. సఖుడను.
గృహం ఈ మానవ శరీరమే ఈ జీవునకు గృహము. ఇంటి
గృహం శరీరంమానుష్యం ఇల్లాలు ఇంటిలోకి చెత్తను రానిస్తుందా? ఉత్తమబుద్ది
గల బుద్ధిమంతుడు దేహములోనికి కామ క్రోథ-మదమాత్సర్యాలను రానీయడు.
ధనవంతుడు ఉత్తమ గుణములు కలవాడే ధనవంతుడు.
గుణాడ్యోహి ఆఢ్య ఉచ్యతే
దరిద్రుడు లభించినదానిని చూచుకొని సంతోషించకుండా లభించని
దరిద్రోహి యస్తు అసంతుష్టః వాటిని వరుసగా వ్రాసుకొని అసంతృప్తితో ఉన్నవాడు.
అసంతుష్టుడు.
కృపణుడు-అల్పుడు ఇంద్రియములను జయించనివాడు, ఇంద్రియములకు
కృపణోయో అజితేంద్రియః | వశుడై రోజులు గడిపేవాడు.
సంపద పరోపకారము దానము… ఇవే సంపద
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
188
ధీరుడు-స్వతంత్రుడు ఎవ్వడైతే విషయములందు ఆసక్తిలేనివాడై ఉంటాడో,
గుణేషు అసక్తః ధీరీశో అనుబంధ - సంబంధ - బాంధవ్యములను కలిగి
ఉంటూనే సర్వదా అతీతుడై ఉంటాడో, విషయములపట్ల
అంతరంగంలో అప్రమేయత్వమునకు సంబంధించిన
అవగాహన కలిగి ఉంటాడో…. ఆతడు స్వతంత్రుడు.
ఈ జీవుడు అంతరంగమున సర్వస్వతంత్రుడై బాహ్యము
ఆయా స్థాన-సందర్భ-పాత్రాచిత్యములలో మెలగటం
నేర్చుకుంటే…. ఆతడు సర్వదా స్వతంత్రుడే! నాటకంలో
పాత్రగా నటిస్తూ ఉంటే నాటకంలోని నాటకపాత్ర
యొక్క సాధక బాధకాలు నటుడివి అవుతాయా?
అవవు. కానీ అయినట్టు ప్రదర్శనం నిర్వర్తిస్తాడు. ఈ
కనబడేదంతా జగన్నాటకమేగా!
అస్వతంత్రుడు/ విషయములపట్ల - సందర్భ సంఘటనలపట్ల తీవ్రమైన
| గుణసంగుడు సక్తత - గుణ సంబంధమైన ఆవేశము కొనసాగించు
(గుణ సంగో విపర్యయః) వాడు అస్వతంత్రుడు. గుణసంగుడు.
ఓ ప్రియమిత్రమా! ఉద్దవా! నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ సంక్షిప్తంగా నా సమాధానమేమిటో
వివరించాను. మరొక్క విషయం!
గుణదోష లక్షణములగురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. ఏం లాభం? దానికి
అంతు-పొంతు లేదు కూడా!
గుణదోష దృశిర్దోషో
గుణస్తూభయ వర్జితః (అధ్యా 19, శ్లో 45)
గుణ దోషముల గురించి పెద్దగా మననం ఆలోచన పెద్ద తప్పు! దోషం! వాటిని
పెద్దగా పట్టించుకోక పోవటమే ఉచితం. ఆత్మవస్తువు నిత్య నిర్మలము-అప్రమేయమునిర్దోషము-సమము అని గుర్తు పెట్టుకొనెదవుగాక!
సద్గుణ-దుర్గుణములను రెండింటినీ ప్రక్కకుపెట్టి - సర్వే సర్వత్రా ఆత్మయే అని గమనిస్తూ
ఆత్మోపాసనకు ఉపక్రమించటమే ఉపాయం. అదే సర్వాత్మకుడనైన నన్నుజేరే
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
189
తరుణోపాయం! మంచివారి గురించి, మహనీయుల గురించి పెద్దగాను,
గుణదోషములగురించి చాలా చిన్నగాను పట్టించుకోవటం
మాట్లాడుకోవటం - సంసార నివృత్తికి సాహకారికమని నా అభిప్రాయము.
అధ్యాయము–28.) విధి నిషేధములు - యోగాధికారములు
|
శ్రీ ఉద్ధవుడు : హే పరంధామా! శ్రీకృష్ణ పరమాత్మా! నీ బోధలు ఈ సందర్భములో
నన్ను పవిత్రం చేస్తూ వున్నాయి. అంతేకాదు. అవి నా ద్వారా అనేకమంది
ముముక్షువులకు అందజేస్తున్న పాఠ్యాంశములు! అమోఘములు! ఒక్కమాటతో
చెప్పాలంటే, మీరు మా అందరిపై ప్రేమామృతమును కురిపిస్తున్నారు.
కృష్ణయ్యా! జ్ఞానః సంచ్చిన్న సంశయః అని మీరే ఒక సందర్భములో అని ఉన్నారు
కదా! అందుచేత వేదములు ప్రవచిస్తున్న వైదిక ధర్మాల విషయంలో నాకు చూచాయగా
గల కొన్ని సంశయాలను మీ ముందుంచుతాను అనుజ్ఞ ఇవ్వండి.
శ్లో॥ విధిశ్చ ప్రతిషేధశ్చ నిగమో హి ఈశ్వరస్యతే!
అవేక్షతే అరవిందాక్ష! గుణం దోషంచ కర్మణామ్ (అధ్యా 20, శ్లో1)
ఓ అరవిందాక్షా! కమలనయనా! వేదపురుషా! పురుషోత్తమా! వేదములు మీ విధినిషేధ రూపమైన ఆదేశములే…. అని వేదజ్ఞులు ప్రవచనం చేస్తూ ఉంటారు. అట్టి
వేదములు…
కర్మ దోషములను
గుణ దోషములను
పాపపుణ్యముల గురించి
వివరిస్తూ పాఠ్యాంశాలు అందిస్తున్నాయి. అటువంటి వేద శాస్త్రములు…,
వర్ణాశ్రమ భేదధర్మాల గురించి చెప్పుచున్నాయి.
ప్రతిలోమజ - అనులోమజ (అనుసరించటంచేత - నిర్వర్తించకపోవటం చేత)
కొన్ని కొన్ని గుణదోషముల గురించి కూడా చెప్పుచున్నాయి.
ద్రవ్య-దేశ-వయస్సు-ఆశ్రమ సంబంధమైన నియమములు బోధిస్తున్నాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
190
కాలగతమైనటువంటి యోగ్యత - అయోగ్యతలగురించి, స్వర్గ నరకముల గురించి
వివరణలు అందిస్తున్నాయి.
స్వామీ!
విధి-నిషేధములగురించి వేదవాఙ్మయం చెప్పుచున్నప్పుడు, గుణ-దోష-భేద దృష్టి
లేకుండా ఆ విధి నిషేధాలు వేదాలు చెప్పలేవు కదా!
“మానవునికి ముక్తి కలగాలి” అని కదా ఆధ్యాత్మశాస్త్రము (లేక) వేదాంత శాస్త్రము
యొక్క ఉద్దేశ్యం? విధి-నిషేధాలు లేకుండా ముక్తిగురించి చెప్పటం కుదరదు కదా!
ఓ దేవదేవా! వేదవాక్కులే ఆచరణీయములు అని శాస్త్ర ప్రసిద్ధి. నీ వాక్కే దేవతలకు
పితృదేవతలకు వేదము కదా! అట్టి నీవాక్కు మా అందరికీ ప్రమాణము.
అయితే వేదములు
1. సర్వ అనుభవములకు అతీతమగు కర్మ-జన్మలకు అప్రమేయమగు మోక్షసాధన
గురించి చెప్పుచున్నాయి.
2. మరొకవైపు స్వర్గ-నరకమార్గముల గురించిన విశేషాలు చెప్పుచున్నాము.
3. ఇంకొకవైపునుండి సాధ్య-సాధన సంబంధమైన వివరణలను, జ్ఞానమును వెల్లడి
చేస్తున్నాయి.
వేరొకవైపు నుండి జనులలో పరస్పర 4. ప్రేమ-స్నేహ-వాత్సల్య-సానుకూల్యతలను
ఉద్దేశ్యిస్తున్నాయి.
వేదవాక్కులు గుణ దోషముల గురించి భేద దృష్టిగా ప్రవచిస్తున్నప్పటికీ…. అదంతా
సందర్భ బోధయేగాని,…. స్వతఃసిద్ధమైన బోధ-ఆత్యంతికమైన బోధకాదు. భేదము
కల్పిస్తున్న వేదములు సర్వభేదములను తొలగించటానికే అయి ఉన్నది. (Differences
are being dealt for the sake of taking off differences as well as taking us to
beyond differences ) అని నాకు అనిపిస్తోంది.
అది అట్లా ఉండగా, నాకు ఎందుకో ఇంకా ఒక సందేహము వదలటం లేదు.
వేదముల ముఖ్యోద్దేశ్యం ఏమైవున్నది?
భేదములగురించి (పుణ్యపాప-అల్ప-మహనీయ గుణ భేదాల గురించి)
అంతిమంగా చెప్పటమా?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
191
లేక “సర్వమ్ ఖల్విదం బ్రహ్మ” - “ఏకోసత్ విప్రాబహుధా వదంతి”… ఇత్యాది
బోధలద్వారా సమము అఖండము - అప్రమేయము - స్వస్వరూపము అగు
పరమాత్మ తత్త్వమును జీవులకు అందించటానికే అంతిమంగా ఉద్దేశ్యిస్తున్నాయా?
నాకు గల ఈ సందేహం దయయుంచి తొలగించండి!
శ్రీకృష్ణ భగవానుడు :
ఓ ఉద్ధవా! మిత్రమా! మంచి ప్రశ్న అడిగావయ్యా! చెప్పుతాను విను. ఈ జీవుని -
శివునిగా, నరుని నారాయణునిగా, మానవుణ్ణి మాధవునిగా తీర్చిదిద్దటమే
ముఖ్యోద్దేశ్యం. అయితే మరందుకు మార్గం, ఉపాయము కావాలికదా!
॥ యోగాః త్రయో మయాప్రోక్తా నృణాం శ్రేయో విధిత్సయా!
జ్ఞానం కర్మ చ భక్తి శ్చ నోపాయో అన్యో అస్తి కుత్ర చిత్ II (అధ్యా 20, శ్లో 6)
మానవులకు శుభం కలగాలని, మానవజన్మలో కృతార్ధులవటానికి, జన్మ సార్ధకతకొరకై
నేను సృష్టి సందర్భంలో వేదములద్వారా మూడు యోగములను నిర్దేశించటం జరిగింది.
1. కర్మయోగము (సాధనలు)
2. జ్ఞాన యోగము (విచారణ)
3. భక్తి యోగము (పరాప్రేమ)
నో ఉపాయో అన్యోస్తి కుత్రచిత్ |
ఈ మూడింటికన్నా వేరుగా ఎక్కడా మరొక త్రోవ - మార్గము ఏదీ లేదు. వేదములు
ప్రతిపాదిస్తున్నది, అభివర్ణిస్తున్నది, నిర్వచిస్తున్నది, గానం చేస్తున్నది ఈ మూడింటినే!
మిగతావన్నీ ఈ మూడింటిలోనే ఉన్నాయని, అంతేకాకుండా, వాటిలో ప్రతిఒక్క దానిలో
మిగతా రెండు అంతర్లీనమై ఉన్నాయని కూడా. గమనించు.
ఎవరు దేనికి అధికారులు?
(Who deserve to take which path?)
1. కర్మయోగాధికారులు - వేదములలోని కర్మకాండ (సంహిత): ఎవ్వరికైతే కర్మలు
నిర్వర్తించటంలో అభిరుచి ఉంటుందో, కర్మఫలములందు ఎవ్వరికైతే ఆసక్తి మానసికంగా
కొనసాగడం జరుగుతోందో… అట్టివారి కొరకై కర్మయోగము నాచే మోక్షమార్గంగా
చెప్పబడింది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
192
అనగా,
కర్మ ఫలములపట్ల విరక్తి చెందనివారు,
“కర్మఫలములు అంతిమంగా దుఃఖముతో కూడినవే కదా!…. ”అనే అవగాహనతో
కూడిన బుద్ధిని ఇంకనూ పెంపొందించుకోనివారు,
సకామకర్ములు
వీరు కర్మయోగ మార్గమునకు అధికారులు. (They better deserve to the path of
Karma Yoga)
వీరికొరకై నిత్య - వైమిత్తికంగా నిర్వర్తించవలసిన ఆయా విధానము - తీరు, వాటికి
సంబంధించిన నియమ-నిష్ఠలు ఇత్యాదులన్నీ వేదములచే చెప్పబడుచున్నాయి. అవి
ఎప్పటిదాకా అవసరం? సకామకర్మలపట్ల - కర్మఫలముపట్ల అభిలాష ఉన్నంతవరకు!
అయితే….,
సకామి అయి యజ్ఞ యాగ-వ్రత-ప్రాణోపాసన-నియమాదులు నిర్వర్తించుటచే ఈ
జీవుడు సుఖమయమగు స్వర్గలోకాలు పొందుచున్నాడు కూడా!
నిషిద్ధ కర్మలు నిర్వర్తించటంచేత దుఃఖదాయకములగు లోకములు పొందటం
జరుగుచున్నది.
వేదములలోని కర్మవిభాగము ఇవి నిషిద్ధ కర్మలు
ఇవి ఆశ్రయించవలసిన కర్మలు
అని బోధిస్తున్నాయి. సూచిస్తున్నాయి. నియమిస్తున్నాయి. హేయ-ఉపాదేయ కర్మ
మార్గాలను నిర్దేసిస్తున్నాయి. వాటిని శ్రద్ధగా ఆశ్రయించుచున్నవాడు క్రమంగా నిష్కామి
అయి, మోక్షమునకసు అర్హుడగుచున్నాడు!
2. భక్తియోగాధికారులు - వేదములలోని ఉపాసనాకాండ (బ్రాహ్మణములు)
ఏదో కారణంచేత అవతారమూర్తుల కథలయందు త్రిమూర్తులయందు,
దేవతామూర్తులయందు ఆదరము కలిగియున్నవాడు
విషయములపట్ల వైరాగ్యము కలిగియున్నవాడు (లేదా) ఆదరణ - ఆకర్షణ
(Attraction) తగ్గుచూ వస్తున్నవాడు…,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
193
అట్టివాడు భక్తియోగమునకు అర్హుడై ఉంటున్నాడు. ఆతనికి భక్తియొక్క అభివృద్ధికొరకై
దేవతా అవతారమూర్తుల ఉపాసనలు, స్తోత్రములు, ధ్యాననిష్టలు… ఇత్యాదులన్నీ
వేదములయొక్క వివిధ బ్రాహ్మణముల విభాగములో అందించబడుచున్నాయి.
నిషిద్ధకర్మ త్యాగి శుద్ధచిత్తుడు స్వధర్మపరాయణుడు… ఇట్టివాడు మరేలోకం
వెళ్ళవలసిన అవసరం లేకుండానే ఇక్కడే క్రమంగా జ్ఞానభూమికలను అధిగమిస్తూ
భక్తిని పెంపొందించుకుంటున్నాడు. జ్ఞాన భక్తి సంపాదించుకుంటున్నాడు.
ఓ ఉద్ధవా! ఈ మానవజన్మ గొప్ప అవకాశం సుమా! ఎందుకంటావేమో?
అటు స్వర్గలోకంలోగాని ఇటు నరకలోకంలో గాని
జ్ఞానభక్తిని సాధించటానికి ఇంతటి అవకాశాలు వుండవు. అందుచేత జ్ఞానభక్తుడుగా
రూపుదిద్దుకుంటున్నవాడు - మానవజన్మనే అధికంగా కోరుకుంటాడు గాని స్వర్గలోక
నివాసం కాదు.
క్రమంగా భక్తి ప్రపత్తులు ప్రవృద్ధం అవుతూ ఉండగా…,
శ్లో॥ న నరః స్వర్గతిం కాంక్షేత్, నా నరకీం వా విచక్షణః
II
న ఇమం లోకం చ కాంక్షేత దేహావేశాత్ ప్రమాద్యతి || (అధ్యా 20, శ్లో 13)
దేహమే దేహికి ఒక తీరుగా సాధన వస్తువు - మరొక తీరుగా ఐహిక మోహం కదా!
అందుచేత ఉత్తమ భక్తి-ప్రపత్తులు రూపుదిద్దుకుంటూ ఉండగా….ఇక ఆతడు స్వర్గము
కోరడు. నరకము కోరడు. ఈలోకంలో ఏదో స్థానము కోరడు. ఏ దేహం వచ్చినా
రాకున్నా నా బుద్ధి మాత్రం సర్వదా మీ పదాలు ఆశ్రయించి ఉండే వరం ప్రసాదించు
స్వామీ!…. అని మాత్రమే నన్ను కోరుకుంటూ ఉంటాడు. ఆతడికి నేను తప్పితే మరింకేమీ
అఖర్లేదు. ఆతనిపట్ల - భక్తియే మోక్షస్థానమై ప్రకాశిస్తోంది!
3. జ్ఞానయోగాధికారులు :
భక్తిచే జ్ఞానము - జ్ఞానముచే భక్తి ప్రవృద్ధమై ఏకత్వము సంతరించుకొని ఆత్మౌపమ్యేవ
సర్వత్ర - సమంపస్యతి… అను ఆత్మసాక్షాత్కార స్థితిని కోరుకొనేవారికి జ్ఞానయోగ
మార్గము ఉపనిషత్తులద్వారా, తదితర వేదమహా వాక్యములద్వారా (తత్త్వమసి
జీవోబ్రహ్మేతి నా పరః సో హమ్ అయమాత్మా బ్రహ్మ – తత్త్వమ్ ఇత్యాది
మహావాక్య శబ్దముల ద్వారా) వేదములు బోధిస్తున్నాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
194
ఓ ఉద్ధవా! ఈ మానవ దేహము అశాశ్వతమైనది. వినాశనశీలము.
వార్ధక్యము-అనారోగ్యము ఇత్యాది దోషములు కలిగియున్నట్టిది! ఇది అందరికీ తెలిసిన
విషయమేకదా! అయితే మాత్రం ఏం? జీవితము అనేది మహత్తరమైన అవకాశము.
ఈ మానవ దేహము జీవునికి కర్మయోగము భక్తియోగము - జ్ఞానయోగము
ప్రసాదించగల అవకాశములు కలిగి ఉన్నట్టిది. మోక్షము అనే పురుషార్ధమును
ప్రసాదించగలిగినది సుమా! అందుచేత జీవుడు ఏం చేయాలి?
ఈ పురుషుడు అప్రమత్తమైన-సముత్సాహముతో కూడిన (Very alert and enthusiastic) భావన - ప్రయత్నము - ఉద్దేశ్యములతో…
మృత్యువు సమీపించటానికి మునుముందే…,
ముక్తికై ప్రయత్నాలు చేయాలి! కర్మ-భక్తి-జ్ఞానయోగములు మూడిటినీ ఒకేసారి
సమీకరించుకోవాలి!
అని గమనించబడు గాక!
కర్మ-భక్తి-జ్ఞాన మార్గాలను వేరువేరైనట్లుగా చూడవద్దు. అనుకోవద్దు. ప్రతి ఒక్క దానిలో
మిగిలిన రెండూ ఉన్నాయనేది గమనించు!
ఓ ఉద్ధవా! ఒక ముఖ్యమైన పాఠ్యాంశాన్ని గమనించాలని నీద్వారా జనులందరికి గుర్తు
చేస్తున్నానయ్యా!
శ్లో॥ ఛిద్యమానం యమైరేతైః కృతనీడం వనస్పతిమ్
ఖగః స్వకేతమ్ ఉత్సృజ్య క్షేమం యాతి హి అలంపటః (అధ్యా 20, శ్లో 15)
ఒకానొక గరుడ పక్షి ఒక పెద్ద వృక్షముపైగల అనువైనచోట ఒక పెద్దగూడు అందంగా
కట్టుకొని భార్య, పిల్ల - పాపలతో హాయిగా నివసిస్తోంది. రోజులు గడుపుతోంది. ఒక
రోజు కొంతమంది బోయవాళ్ళు ఆ మహావృక్షముక్రింద నిలబడి, “అరై! రేపు మళ్ళీవద్దాం!
ఈ మహావృక్షమును వంటచెరకుకై రాజుగారి వంటశాలకు అందజేద్దాం! దుడ్లు (డబ్బు)
బాగా లభిస్తాయి….” అని చెప్పుకుంటున్నారు. కొంతసేపైన తరువాత వారంతా
వెళ్ళిపోయారు.
తన గూడులో హాయిగా కూర్చుని ఉన్న ఖగరాజు (పక్షి) ఇట్లా అనుకొన్నది, "ఆహాఁ!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
195
యమభటులవంటి ఈ ఆటవికులు రేపువచ్చి ఈ వృక్షమును నరకబోతున్నారుకాబోలు!
వాళ్ళ కళ్ళ బడ్డామా, నన్ను - నా భర్య - బిడ్డలను బంధించి తీసుకుపోగలరు. ఏం
చేద్దాంరా బాబు?“ అని ఆలోచించసాగింది. ఆడ పక్షిని పిలిచి తాను విన్నదంతా చెప్పి
”ఏంచేద్దాం? చెప్పు?" అన్నది. ఆడపక్షి అంటోంది
ఇంక చేసేదేమున్నదయ్యా? ప్రమాదం వచ్చేవరకు తీరికగా కూర్చుని ఉంటామా?
లేదు. పదండి. ఈ వృక్షము ఈ గూడు వదలి మరొక చెట్టును చూచుకొని
గూడు కట్టుకుందాం!
వెంటనే ఆ పక్షుల కుటుంబం రాత్రికి రాత్రే మకాంమార్చి సుదూరంగా ఉన్న వేరొక
మఱిచెట్టుపై వ్రాలి గూడు కట్టుకోనారంభించాయి. ఆమాత్రం పక్షులకు ఉన్న తెలివి
మానవుడికి ఉండనఖర్లేదా? ఏమాత్రం తెలివి ఉన్నాకూడా….,
అయ్యో! రోజు రోజుకు ఆయుష్షు తగ్గుతోందే! యమభటులు ఒకానొకరోజు
చెప్పా పెట్టకుండా వచ్చి ఈ దేహమును లాక్కుపోబోతున్నారు కదా! కనుక
అత్యవసరంగా– శేషించి ఉన్న ఆయుష్షును సద్వినియోగం చేసుకోవాలికదా!
అని తలుస్తాడు. భయపడతాడు. సంగమును త్యజించి పరబ్రహ్మమును గుర్తించి
తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. దృశ్యము దేహములకు సంబంధించిన సర్వ
కామములు త్యజించి క్రమంగా నిష్కాముడై పరమశాంతిని సముపార్జించుకుంటాడు.
ఆత్మభగవానునితో మమేకమయ్యే ప్రయత్నములను తీవ్రపరచుకుంటాడు.
ఈ మానవశరీరము సర్వఫలములు సంపాదించుకోవటానికి గొప్ప ఉపకరణము.
అత్యంత దుర్లభంగా మాత్రమే లభిస్తుంది. చక్కటి కరణాలు (చూపు - వినికిడి మొదలైన
ఇంద్రియ శక్తులు) ఈ దేహంలో ఉన్నాయి. కనుక సంసార సాగరమును దాటటానికి
ఇది గొప్ప దృఢమైన నౌక!
శరణువేడితే చాలు, గురు దేవులు ఆత్మ విద్యను బోధిస్తారు. కర్ణధారులై (పడవను
నడిపే ఆయన) అటు సంసారసాగరం దాటిస్తారు.
భగవంతుని స్మరిస్తూ, శాస్త్రానుకూలమైన మార్గంలో కర్మలు నిర్వర్తిస్తూవుంటే…
ఈ పడవ లక్ష్యము వైపుగా తీసుకుపోతుంది
అని ఈ జీవుడు తీవ్రంగా అనుకోవాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
196
ఇంత చక్కని సర్వానుకూలమైన మానవదేహమును ఉపయోగించుకుని శాస్త్ర-గురు
ప్రవచిత సాధనలకు ఉపక్రమించి సంసారసాగరమునుండి తరించటం, ఆధ్యాత్మిక
జ్ఞానమును పెంపొందించు కోవటం అనే మార్గంలో ప్రయత్నాలు నిర్వర్తించకపోతేనో?
అట్టివాడు లభించిన అవకాశమును రెండుచేతులా జార్చుకుంటున్నట్లే! ఆత్మద్రోహం
చేసుకుంటున్నట్లే! అధఃపతనమును తెచ్చిపెట్టుకుంటున్నట్లే! చదువుకోరా అని తండ్రి
మంచి బడిలో జేర్పిస్తే, అల్లరి చిల్లరి పనులతో రోజులు వృధా చేసుకోవటం వంటిదే!
ఈ మనస్సు ఇంద్రియ విషయముల వైపుగా అతివేగంగా ప్రయాణిస్తోంది! ఒక్క విషయం
కాదు, రెండుగాదు ఒకేసారి సహస్రాధికంగా అనేక విషయములను అనుక్షణం మార్చి
మార్చి యోచనలు చేస్తూ దేహమున్నంతవరకు అతి చంచలమై ఉంటోంది. దేహము
బాగున్నంత వరకు ఆత్మ జ్ఞానమునకు ఉపక్రమించకపోవటంచేత, వేదములు చెప్పే
సాధనలను శ్రద్ధగా నిర్వర్తించి యత్నించకపోవటంచేత - పర్యవసానం? దేహమున్నప్పుడు
- దేహానంతరం - మరొక దేహము ఆరంభమౌతున్నప్పుడు కూడా ఉద్విగ్నత - దుఃఖము
భయము ఇత్యాదులు తొలగటమేలేదు. విజ్ఞులగువారు ఇదంతా గమనిస్తున్నారు.
“యేహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే। ఆద్యంతవంతః” అని మును
ముందుగానే గుర్తిస్తున్నారు. కర్మ-కర్మఫలములపట్ల విరక్తులగుచున్నారు. దృశ్య
ఫలములపట్లగల అనురక్తిని ఉపశమింపజేసుకొనే మార్గమును అన్వేషించి -
ఆశ్రయిస్తున్నారు. ఆత్మజ్ఞానమునకు సంబంధించిన వృత్తులను స్వీకరిస్తూ నిశ్చలమైన
భావంతో-యోగభావంతో మనస్సును ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే…
ఈ మనస్సు సముద్రతరంగాలకన్నా - వాయుతరంగాలకన్నా అతి చంచలం కదా!
ఇది లక్ష్యవస్తువుపై నిలకడగా ఉండదు. అది గమనించినయోగి ఈ మనోబాలకుణ్ణి
(లేక) చిత్తబాలకుణ్ణి అనురోధమైన (అనుకూలమైన - through positive methods)
మార్గములద్వారా స్వాధీనం చేసుకోవాలి. అంతేగాని, మనోగతిని ఉపేక్షించి, తగిన
సాధనలకు ఉపక్రమించకుండా రోజులు గడుపరాదు.
శ్లో॥ మనోగతిం న విసృజేత్ జితప్రాణో జితేంద్రియః
సత్త్వ సంపన్నయా బుద్ధ్యా మనః ఆత్మవశం నయేత్ || (అధ్యా 20, శ్లో 20)
ఇంద్రియములను సాధనలద్వారా జయిస్తూ (జితేంద్రియుడగుచు), ప్రియస్వరూపమైన
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
197
ప్రాణములను వశం చేసుకుంటూ (జితప్రాణుడగుచు)… సత్యగుణ సంపన్నమైనట్టి
బుద్ధి ద్వారా బుద్ధిని ఆత్మవశం చేసుకోవాలి!
అది ఎటువంటి ప్రయత్నమంటే….,
అశ్వారూఢుడు (గుర్రపురౌతు) గుర్రమును అధిరోహించి ఒక ముఖ్యమైన పనికోసం
ఒకచోటికి బయలుదేరాడనుకో! ఆ గుర్రము తనకు యిష్టం వచ్చిన మార్గంలో ఎటో
అడవులవైపుగా మేతకోసం పరుగులు తీస్తూ ఉంటే, “ఆఁ! ఏం చేద్దాం! పోనీలే!”
అని చూచీచూడనట్లు ఊరుకుంటాడా? ఊరుకుంటేనో? (లేక) ఏవేవో అనవసరమైన
వ్యాపకాలు మననం చేస్తూ మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ ఉంటేనో? ఏమౌతుంది?
ఆ గుర్రపుస్వారీ చేసే ఆయన తను చేరవలసిన స్థానం (పట్టణం) చేరుతాడా? లేదు.
ఏ అడవులలోనో చిక్కుకుని బహుయాతనలు పడతాడు. ఇది గమనించి, ఆ రౌతు ఏం
చేస్తున్నాడు? “ఈ గుర్రము నా మనోభావాలు గమనించి నేను వెళ్ళవలసిన వైపుగా
పరుగెత్తాలి? ఈ గుర్రం నామాటవినేటట్లు చేసేది ఎట్లా? …” అని ఉపాయాలు
యోచిస్తున్నాడు. కార్యరూపంగా ఆ ఉపాయాలు నిర్వర్తించి గుర్రము తన స్వాధీన
మయ్యేటట్లు చేసుకుంటున్నాడు.
పగ్గములను పట్టుకొంటాడు.
పూర్తిగా విడువడు. అట్లా అని గుర్రములు కదలనంతగా పట్టుకోడు.
మంచి శబ్దములతో - స్పర్శలతో - చండాకోలుతో - మాటలతో…. తను
అనుకున్నవైపుగా ముఖంత్రిప్పి పరిగెత్తేటట్లు చేసుకుంటున్నాడు.
ఆ గుర్రపు రౌతులాగానే మానవుడైనవాడు ఈ మనో అశ్వమును నయాన-భయానవేద-వేదాంగములు-స్మృతులు పెద్దలు గురువులు ప్రబోధిస్తున్న సాధన సంపత్తియొక్క
సహాయముతో తనవశం చేసుకోవాలి.
ఈ మనస్సు నిశ్చలత్వం పొందేవరకూ ఈ జీవుడు సాధనలను తత్త్వజ్ఞానమును
ఆశ్రయించాలి. ఈ దృశ్యములో అనుభవమగుచున్న స్థూలదేహమునుండి మహత్తత్త్వము
వరకు గల సర్వ పదార్థములను
అనులోమక్రమ సృష్టి గురించి (How from nothing every thing is coming
out and appearing)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
198
ప్రతిలోమ క్రమ ప్రళయము గురించి (How everything is eventually
getting into nothing)
మనో-బుద్ధుల సహాయంతో యోచించాలి. గమనించాలి. నిర్వేదము (Non-worrying)
వైరాగ్యయుక్తము (Detatchment) అగు చిత్తమును సంపాదించుకోవాలి. ఒకవైపునుండి
అటువంటి నిర్మల-నిశ్చల చిత్తముతో గురూపదేశములను - గురువుల ఉద్దేశ్యములను
పఠించి పాటించి మరొకవైపు నుండి ప్రాణాయామ పూజాది కార్యక్రమములకు
ఉపక్రమిస్తూ - క్రమంగా దేహాభిమానమును త్యజించాలి.
దృశ్యాభిమానం త్యజించటం (లేక) జయించటం మాటలతో చెప్పుకొనేంత తేలికైనది
కాదు. అందుకుగాను యమము-నియమము -ధారణ ఇత్యాది యోగమార్గములకు
(సాధనలకు) ఉపక్రమించాలి. మరొకవైపుగా వస్తుతత్త్వమును పరిశీలనచేస్తూ తర్క
విద్యద్వారా సర్వాధారమైన పరతత్తత్వముయొక్క అవగాహనను పెంపొందించుకుంటూ
ఉండాలి. ప్రతిమలను అర్చించటం - ధ్యానించటం ఇవన్నీకూడా ఏకాగ్రతకు ఉపాయాలై
ఉన్నాయి. అవన్నీ అవసరమే!
దేహమున్నంతవరకు కర్మలు అనివార్యం. కర్మలు కొంత దోషముతో కూడుకొనియే
ఉంటాయి. అందుచేత యోగి అయినవాడు ప్రమాదవశాత్ ఏమైనా నిందితకర్మలు
నిర్వర్తిస్తూ ఉంటే… వాటిని లోకానుకూలంగా మరల్చుకోవాలి. మరొకవైపుగా వాటివాటి దోషముల నివృత్తికొరకై ప్రాణాయామాది యోగసాధనలద్వారా ప్రయత్నము
కొనసాగిస్తూ ఉండాలి కూడా!
ఆ ప్రాయశ్చిత్తకర్మలు కూడా సులభంగాను సహజనులకు అనుకూలంగాను ఉండాలేగాని…
లోకాలను బాధించేటట్లు, తనను తాను బాధించుకునేటట్లు ఉండరాదు సుమా!
ఓ ఉద్దవా! ఈవిధంగా మన కర్మయోగాధికారి-భక్తియోగాధికారి - జ్ఞానయోగాధికారిల
గురించి చెప్పుకుంటున్నాం కదా! అయితే ఈ ముగ్గురికి గురువు తల్లి కూడా వేదమాతయే!
ఈ త్రివిధసాధకులు సద్గుణులు - ఏకాగ్రచిత్తులు అవ్వాలనునదే వేదహృదయం. ఒకనికి
కర్మ-భక్తి-జ్ఞాన అధికారమును అనుసరించి ప్రయత్నములచే ఏర్పడే ఏకాగ్రతనే
సగుణము అనే పేరుతో పిలుస్తున్నారు. గుణములవలన కొంచెము దోషముకూడా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
199
ఉంటుందని అనుకున్నాంకదా! అటువంటి గుణదోష విధానముల వలన కలిగే
సాంగత్యమును (side effect of relatedness (or) confinement) ప్రాయశ్చిత్త
విధానాలచే పరిహరించుకొంటూ ఉండాలి కూడా! ఎందుకంటే, కర్మలు సహజంగా
చూస్తే కొంత దోషభూయిష్టముగానే ఉంటాయి. అశుద్ధత కొంత ఉంటుంది.
శ్లో॥స్వేస్వే అధికారే యా నిష్ణా సగుణః పరికీర్తితః
కర్మాణాం జాతి అశుద్ధానాం అనేన నియమః కృతః
గుణదోష విధానేన సంగానాం త్యాజనేచ్ఛయా
|| (అధ్యా 20, శ్లో 26)
అని పెద్దలు చెప్పుచున్న విషయమే కదా! కర్మలు అనర్ధములకు మూలములని కూడా
చెప్పబడుతోంది. అందుచేత “కొంత కొంతవరకు దృశ్య వ్యవహారములందు ప్రవృతిని
సంకోచింపచేసుకుంటూ ఉండాలికూడా!…” అనేది ఏమరువరాదు.
అందుచే ఓ ఉద్దవా! “కర్మ విశేషములందు ఉద్విగ్నుడు అయినవానికి ఆ విషయ
సమూహములన్నీ దుఃఖాత్మకములౌతాయని గమనించండి!…” అని నా లీలావిశేష
కథలద్వారా గుర్తుచేస్తూనే ఉన్నాను. ఒకవేళ విషయ సమూహములను విడవలేకపోతూ
ఉంటే…. “నాయందలి భక్తియొక్క ప్రభావంచేత విషయ వాసనలు తొలగుతాయి” అని
కూడా నా లీలలచే బోధిస్తూ వస్తున్నాను. భక్తియొక్క ప్రభావంచేత కర్మలకు సంబంధించిన
దోషములు తమకుతామే తప్పక తొలగుతాయి. క్రమంగా భక్తియొక్క విశిష్ఠత చేత
దుఃఖ పరిణామములగు విషయములు అనివార్యంగా అనుభవిస్తూ ఉండవలసి
వస్తున్నప్పటికీ… వాటియందు ప్రీతిని కలిగి ఉండకుండెదవు గాక! సర్వాత్మకుడగు
పరమాత్మయే నీకు ప్రీతిపాత్రమగుగాక! అట్టి అప్రీతి భావన స్వభావసిద్ధంగా భక్తిచే
పెంపొంద గలదు. అద్దాని వలన హృదయంలో ఉండే విషయవాసనలన్నీ వినష్టమౌతాయి.
శ్లో॥ భిద్యతే హృదయగ్రంధిః ఛిద్యంతే సర్వసంశయాః
క్షీయంతే చ అస్య కర్మాణి మయిదృష్టే అఖిలాత్మని॥ (అధ్యా 20, శ్లో 30)
సర్వాంతర్యామిని - పరమాత్మ స్వరూపుడను అగు నన్ను సాక్షాత్కరింపజేసుకొనే
ప్రయత్నంలో ఉంటూ ఉండగా….,
ఈ జీవునియొక్క జీవాహంకారము స్వయంగా వినష్టమౌతూ వస్తుంది.
హృదయంలో తిష్ఠవేసుకొనియున్న సర్వ సంశయాలు తొలగుతూ వస్తాయి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
200
ఛిన్నమైపోతూ వుంటాయి.
సర్వ కర్మబంధాలు - కర్మరాశి కూడా క్షయం అవుతూ వస్తుంది.
పరమాత్మ పట్ల ప్రియము - ఇష్టము… ఇదే భక్తి.
ప్రాపంచక విషయములపట్ల ఇష్టము - ప్రియమే సంసారము.
ఎవరి చిత్తమైతే నాపట్ల ఏకాగ్రమౌతూ - భక్తిపారవస్యమౌతూ వస్తోందో (ఇష్టము
అధికమవుతూ ఉంటుందో… అట్టివానికి జ్ఞాన-వైరాగ్యములు స్వభావ సిద్ధమగుచూ,
భక్తియే సర్వమునకు సాధనాసంపత్తిగా అగుచున్నది. జ్ఞాన వైరాగ్యములు స్వభావమే
అవుతాయి.
అంతేకాదు!
కర్మ-తపస్సు-జ్ఞానము-వైరాగ్యము-యోగాభ్యాసము - తీర్థయాత్రలు - వ్రతములు
మొదలైన ఆయా సాధనలచే లభించగలదానిని సర్వదేవతాస్వరూపుడనగు నాయొక్క
భక్తుడు భక్తియోగముచే అనాయాసముగా పొందుచున్నాడయ్యా! ఒకవేళ నా భక్తుడు
ఎప్పుడైనా స్వర్గమో-మోక్షమో-వైకుంఠధామమో కోరుకుంటాడనుకో…! అవన్నీ భక్తునికి
అనాయాసంగా లభించగలవని చేతులెత్తి ప్రకటిస్తున్నాను.
చమత్కారం ఏమిటో గమనిస్తున్నావా?
సర్వాంతర్యామిఅయిన నాపట్ల భక్తిని పెంపొందించుకొన్నవారు “భక్తికి ఫలితంగా భక్తియే
మాకుచాలు! మాకు ఇంకేమీ అఖర్లేదు …” అని నిర్ణయించుకొని ఉంటున్నారు.
భక్త్యానందమునకు సాటి ఏది? “నాయనా! నీకు మోక్షము ప్రసాదిస్తాను”… అని నేను
ముందుకువచ్చినాకూడా “సర్వతత్త్వ స్వరూపుడవగు నీపట్ల మాకు సర్వదా ఇష్టరూపమైన
భక్తి ఉంటేచాలయ్యా, ….” అని ఎలుగెత్తి సమాధానం చెప్పుచున్నారు.
స్వప్నసదృశమైనట్టిలోక సంఘటన - సందర్భములపట్ల అపేక్షయే బంధము.
నిరపేక్షయే సర్వోత్కృష్టము. అత్యధికవంతము. సకల శ్రేయోప్రసాదకము.
నిరపేక్షత నిష్కామము ఎక్కడ ఉంటాయో… అక్కడ నా పట్ల భక్తి అవిచ్ఛిన్నంగా
వికాసమానమౌతూనే వుంటుంది.
భక్తియొక్క ప్రభావంచేత రాగము స్వయంగా తొలగుతుంది. రహితమౌతుంది. భక్తియొక్క
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
201
ప్రభావంచేత మాయాతీత భగవత్ వస్తువును స్వయముగా పొందుచున్నారు. అట్టి భక్తునికి
విధి-నిషేధములకు సంబంధించిన పుణ్యపాపములు తాకజాలవు. శాస్త్రములు కూడా
ఆతనిపట్ల ఎట్టివిధి - నిషేధములు విధించవు. “బాగా చదువుకుంటున్న బాలునికి
బాగా చదవటానికి ఏఏ జాగ్రత్తలు కావాలి”…. అని నియమాలు చెప్పంకదా! ఇదీ
అంతే!
నేను చెప్పిన ఈ కర్మ-జ్ఞాన-భక్తి మార్గములను ఆచరిస్తూ వస్తున్నవారు… అట్టి
జ్ఞానభక్తియొక్క ప్రభావముచేత కాలము - మాయలచే స్పృశించబడనట్టి వైకుంఠధామము
పొందుచున్నారు.
పరబ్రహ్మతత్త్వమును ఎరిగినవారై బ్రహ్మమే తామై వెలుగొందుచున్నారు.
అధ్యాయము–29.) గుణదోష వ్యవస్థాస్వరూప రహస్యము
|
శ్రీకృష్ణభగవానుడు : ఓ ప్రియ ఉద్ధవా! ఇప్పటివరకు కర్మ-జ్ఞాన-భక్తియోగ మార్గముల
ప్రాసస్త్యమేమిటో చెప్పాను కదా!
శ్లో॥ య ఏతాన్ మత్పథో హిత్వా భక్తి-జ్ఞాన-క్రియాత్మకాన్
క్షుద్రాన్ కామాన్ చలైః ప్రాణైః జుషన్తః సం సరంతి తే ॥ (అధ్యా 21, శ్లో1)
నేను చెప్పుతూ వస్తున్న భక్తి-జ్ఞాన-కర్మయోగసంబంధములగు మార్గములను
అనుసరించకుండా, అశ్రద్ధ - - బద్ధకము - వ్యతిరిక్త భావన - అల్పావగాహనలతో
చంచలమగు మనస్సుగలవారియొక్క, తుచ్ఛములైనట్టి ఇంద్రియ విషయములపై ఆసక్తి
పెంపొందిచుకొనువారియొక్క - గతి ఏమిటో (The path they are walking ) అది
కూడా వివరిస్తాను విను.
ఇంద్రియములకు తారసబడుచున్న విషయములే గొప్పవి… అని తలచి రోజులు
గడుపువారు నానావిధ యోనులలో సుదీర్ఘప్రయాణము చేస్తూ ఉంటారని గుర్తుచేస్తున్నాను.
సగుణము : తనకు అర్హమైన ఆశ్రమము - అధికార మార్గమును సశాస్త్రీయముగా
ఆశ్రయించటం, ప్రేమ-దయ-దానము-దైవోపాసన - ఇత్యాధివి పెంపొందించుకొనే
ప్రయత్నంలో వుండటం - సగుణము.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
202
అట్లా ఆచరించకపోవటమే దుర్గుణము.
శ్రీ ఉద్ధవుడు : పరంధామా! సర్వము పరబ్రహ్మమేకదా! సర్వం ఖల్విదం బ్రహ్మ
అనికదా ఉపనిషత్ మహావాక్యము! మరి శాస్త్రములలో మరికొన్ని విభాగములు “ఇది
యోగ్యము ఇది అయోగ్యము” అని వస్తుసముదాయములగురించి, ఇది “శుద్ధము
- ఇది అశుద్ధము, ఇది శుభము - ఇది అశుభము” అని విధి-నిషేధ ప్రతిబంధక -
అనుబంధక విషయముల గురించి ఎందుకు చెప్పుచున్నాయ్?
ఈ రెండు ప్రవచనములను సమన్వయించుకోవటం ఎట్లా?
శ్రీకృష్ణుడు : ఈ జీవుడు స్వాభావికవృత్తిచే ద్రవ్య విశేషములపట్ల ఆరర్షితుడగుచు
ఆత్మదృష్టి - పరాదృష్టి ఏమరుస్తున్నాడు. ఫలితం? కల్పితము - క్షణక్షణ పరివర్తనము
అగు దృశ్యధ్యాస ఈతనిని దుఃఖితునిగా, అల్పాశయునిగా, బలహీనునిగా చేసివేస్తోంది.
మహనీయులగు మహర్షులు తమబిడ్డలగు అజ్ఞానజీవుల అపార జన్మ-జరా-సంసార
దుఃఖాలకు హృదయం ద్రవించి, వారి దుఃఖాలు తొలగించ పూనుకొనుచున్నారు.
అందుకు ప్రారంభ పాఠ్యాంశంగా…,
ఇది యోగ్యము. ఇది కాదు.
ఇది పుణ్యము - ఇది పాపము.
|
ఇది శుద్ధము - ఇది అశుద్ధము. |
ఇది విధి ఇది నిషిద్ధము.
మొదలైనవన్నీ శాస్త్రరూపంగా రచించి జనులకు ప్రసాదించటం జరుగుతోంది. అట్టి
ధర్మశాస్త్రములు, శాస్త్రప్రవచిత తదితరమార్గములు మొదలైనవి అనుసరణీయమని,
ఆచరణకు సాధ్యమేనని మనువు మొదలైన నా అవతారములద్వారా నేను జనులకు
దృష్టాంతపూర్వకంగా సర్వజనులకు బోధిస్తూ వస్తున్నాను.
ఓ ఉద్ధవా! స్వప్నము స్వప్న దర్శిలోంచే బయల్వెడలుతోంది కదా! సర్వమునకు మూలము
స్వస్వరూపమగు పరబ్రహ్మమే! అట్టి పరబ్రహ్మమునుండే ఆకాశము వాయువు
అగ్ని - జలము భూమి అనునవి బయల్వెడలుచున్నాయి. ఆ పంచభూతములే
బ్రహ్మనుండి - స్థావరము వరకు గల సర్వప్రాణుల శరీరాలకు మూలకారణం. అందుచేత
పంచభూతములు పంచభూత నిర్మిత భౌతికదేహములు పరమాత్మ వస్తువుతో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
203
సంబంధము కలిగి ఉన్నాయి. అనేక రకాలైన కుండలకు మట్టియే అధిష్ఠానం అయినట్లు
సర్వప్రాణులకు మూలవస్తువు సచ్చిదానంద బ్రహ్మమే!
అయితే….,
ప్రాణుల దేహములు, భౌతిక పదార్ధముల దృష్ట్యా సమానములే అయినప్పటికీ…
గుణములదృష్ట్యా భిన్నముగా ఉంటున్నాయి. అట్టి ఈ జీవుల పురుషార్ధసిద్ధి కొరకై
వేదములు సాధనాక్రమమును (The techniques and methods for practising)
ప్రతిపాదిస్తున్నాయి. పరమాత్మ సర్వదా ఒక్కటే అయినప్పటికీ జీవుల వివిధ
మనోస్థితిగతులకు ఔషధరూపంగా వివిధ దేవతా ఉపాసనలను - పూజాక్రమములను
యజ్ఞ యాగ విధానాలను కల్పించి మంత్ర - తంత్ర - విధి విధానములను
వేదములు అందించటం జరుగుతోంది!
ఓ సాధుశ్రేష్ఠా! విధి-నియమము లేకుంటే సాధన-సార్ధకత అనేవి లభించవు. కర్మల
నియమము ( conditioning the functioning) లేకపోతే ఈ జీవుడు ఈ సంసారారణ్యంలో
చిక్కుకొని దిక్కుతోచని బోటసారియే అయిపోతాడు.
శ్లో॥దేశ-కాలాది భావానాం వస్తూనాం మమ సత్తమ।
గుణదోషా విధీయేతే నియమార్ధం హి హి కర్మణామ్ ॥ (అధ్యా 21, శ్లో 7)
అది దృష్టిలో పెట్టుకునే నేను దేశము కాలము ఇత్యాది పదార్ధములకు, ధాన్యముధనము ఇత్యాది వస్తువులకు గుణదోషములను - కాలదోషములను విధించాను సుమా!
ఓ ఉద్ధవా! సర్వము బ్రహ్మమే! అని చెప్పే వేదములే అనేక దేవతా ఉపాసనలు
వివిధ రీతులైన విధి-నిషేధములు - బ్రాహ్మణ - క్షత్రియ - వైస్య - శూద్రవర్ణ విభాగ
ధర్మములు కూడా ప్రతిపాదిస్తూ భేదత్వము కల్పిస్తున్నాయి. ఎందుచేత?…. అనే నీ
ప్రశ్నకు కొన్ని విశేషాలను సమాధానంగా చెప్పుకుంటున్నాము కదా! ఇంకా మరికొంత
వివరణను విను.
అన్ని అడవులు ఒక్కతీరైనవే! అయితే అడవులలో సాత్విక జీవులైన మృగములు
(జింకలు మొదలైనవి) ఉన్న ప్రదేశములు పవిత్రమైనవి.
అన్ని ప్రదేశములు ఒక్కతీరైన భూమి- ఆకాశము గాలి అగ్ని - జలముల
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
204
సమ్మేళనమే! అయితే, ఏ ప్రదేశంలో బ్రాహ్మజ్ఞానులు - బ్రాహ్మణులు (వేద-
పరిజ్ఞాన నిష్ఠులు) పూజించబడుచు, గౌరవించబడుచూ ఉంటారో… ఆ
ప్రదేశములు పవిత్రములని, అట్లు కాని ప్రదేశములు అపవిత్రములని
పవిత్రాశయులకు నివాసయోగ్యం కాదని చెప్పబడుతోంది.
ఏకాలములో ఉత్తమ కర్మలకై అవసరమగు ఉత్తమ ద్రవ్యములు లభిస్తాయో…
ఆ కాలము శుభప్రదం - పవిత్రము. గుణవంతులు - ఉత్తమ కర్మలు, అందుకు
అవసరమైన ద్రవ్యములు లభించని కాలము అశుభప్రదంగా - భావిస్తూ ఉంటారు.
కాలము ఎప్పుడూ ఒక్కటే అయినప్పటికీ - శుభ - అశుభ కాలములను
ఈవిధంగా బుధులు నిర్ణయిస్తూ ఉంటారు.
ఆగంతుకమైన దోషములు గల కాలము ప్రదేశము - పదార్ధములను
త్యజించటానికి అర్హమైనవిగా భావించబడతాయి.
వాక్కు ఒక్కటే అయినప్పటికీ శుభ-అశుభవాక్ భేదం గమనించి విజ్ఞులు
వాక్ఆపోధనులై ఉంటారు.
ఈవిధంగా…,
పదార్థములకు శుచిత్వము - అశుచిత్వములు,
ద్రవ్యములకు పవిత్ర - అపవిత్రములు,
వచనములకు శుభ - అశుభములు,
కాలమునకు
ప్రదోషకాలం (సూర్యాస్తమయ సమయములో చేయకూడనివి),
ప్రాతఃకాలము - బ్రహ్మీముహూర్తము (ఉపాసనలు చేయవలసిన సమయం ఉదా.
ఉదయం 4.00),
మధ్యాహ్నకాలము (తర్పణలు ఇత్యాదులు నిర్వర్తించవలసిన సమయములు),
ఉదయ - మధ్యాహ్న-సాయం-రాత్రి - అర్ధరాత్రులలో నిర్వర్తించవలసినవి -
నిర్వర్తించకూడనవి.
ఇత్యాది మంచి - చెడు కాలనియమాలు,
వచనములకు - ససంస్కార - కుసంస్కార సంబంధమైన శబ్దార్ధాలు,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
205
జనులలో మహనీయులు మహదాశయులు అల్పాశయులు ఇత్యాదులన్నీ
|
విభేధించబడుచున్నాయి. వేదములు - శాస్త్రములు మానవాళికి మార్గదర్శకత్వం
వహించటానికే భేదములను కల్పించే ఆయా విశేషాలన్నీ ప్రతిపాదిస్తున్నాయి.
ఇంకా దృష్టాంతపూర్వకంగా చెప్పుకోవాలంటే
వస్త్రము ఒక్కటే! ఆ వస్త్రము జలముతో పరిశుద్ధపరచి, ఆరవేసి అప్పుడు కట్టుకుంటే
పరిశుద్ధవస్త్రము అంటాము. స్వీకరిస్తాము. ధరిస్తాము. మరొకరికి ధరించటానికి ఇస్తాము.
అదే వస్త్రము మల-మూత్రములతోను, మురికిగాను ఉంటే? ఇది అపవిత్రవస్త్రము
అని పిలుస్తాము కదా! ఇంటికి వచ్చినవారు ధరించటానికి అటువంటి అశుభ్రవస్త్రమును
ఇస్తామా? లేదు కదా!
ఉద్ధవుడు : అవును కృష్ణా! మీరు చెప్పే భేద దృష్టి ఉత్తమమైన మార్గదర్శనం కొరకై
శాస్త్రకల్పితమని నేను ఒప్పుకుంటున్నాను. ఆమాత్రంచేత సర్వమ్ ఖల్విదం బ్రహ్మ ( అంతా
బ్రహ్మమే) అనే ఆప్తవాక్యానికి లోటేమీ ఉండదనుట యుక్తియుక్తమే!
అయితే…
ఏ ఏ పదార్ధము - ద్రవ్యము - వచనము - కాలము - సందర్భము - స్థలము
- స్థానము - వ్యక్తులు పవిత్రములు? స్వీకరించటానికి అర్హములు?
అనుసరనీయులు?
ఏవేవి అనుసరణీయం కావు? త్యజించటం సముచితం?
ఇది మేము నిర్ణయించుకునేది ఎట్లా? శాస్త్రహృదయం - శాస్త్రవాక్యం సమన్వయించు
కోవటం చేతకాకపోవటంచేత మేము దుర్మార్గానువర్తనులం (Followers of wrong
path) అగుచున్నామేమోనని కొన్ని సందర్భాలలో మాకు అనిపిస్తోంది! అప్పుడు అట్టి
సందర్భాలలో మేము ఏమి చేయాలి?
శ్రీకృష్ణభగవానుడు : అవునయ్యా! అటువంటి సందర్భముల కొరకేగదా,… విధాతసృష్టికర్త యగు బ్రహ్మదేవుడు మానవాళికి గురువులను ప్రసాదిస్తున్నారు! బ్రహ్మముఖం
నుండి వేదములు బయల్వెడలుచున్నది అందుకొరకేకదా, మరి!
ఒక తెలియని ఊరుకు బాటవెంబడి నడుస్తూ వెళ్ళేవాడు ఏం చేస్తాడు? త్రోవలో తారసబడే
అనుభజ్ఞులను - విజ్ఞులను సమీపించి, అయ్యా! నేను ఈపేరు గల ఊరు వెళ్ళాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
206
కుడివైపుకు వెళ్ళనా? ఎడంవైపుకు వెళ్ళనా? ఎంతెంత దూరం?…. అని సంప్రదిస్తున్నాడా,
లేదా! అట్లాగే ఆత్మానుభూతివైపుగా ప్రయాణించే మార్గాణ్వేషకుడు (లేక) ముముక్షువు
ఏం చేయాలి? “ఏది ఔను? ఏది కాదు?” అనే సందేహం వచ్చినప్పుడు…,
విజ్ఞుల - అనుభవజ్ఞుల వచనములు - - నిర్ణయములు పవిత్రములు. అజ్ఞులు |
చెప్పే మాటలు, సూచనలు, నిర్ణయములు అనుసరణీయములు కావు.
బ్రహ్మజ్ఞుల మాటలు వినాలి. అనుసరించాలి.
సంసార స్వభావమును పుణికి పుచ్చుకొని లౌకికమైన ఆశయములతో చెప్పుమాటలు
- అభిప్రాయములు అనుసరించకూడదు - అని గమనించాలి. -
ఓ మిత్రమా! శివుని పూజకై పుష్పములు తీసుకువస్తాం. అయితే… జలముతో సంప్రోక్షం
చేయబడి, చక్కగా - ప్రకాశవంతంగా నవనవంగా ఉండే పుష్పాలను పవిత్రంగా
భావించి చక్కటి వస్త్రములోకట్టి జాగ్రత్తగా తీసుకువస్తాం
అంతేకాని…,
నలిగిపోయినవి, వెలవెలపోయినవి, ఎవ్వరో వాసన చూచిచూచి ప్రక్కకు పడవేసినవి,
ధరించివదలినవి పూజకు ప్రోగు చేస్తున్నామా? లేదు. అట్టి పూలను పూజకు
అపవిత్రంగా భావిస్తాం కదా! లేత పూలను గుప్పిటలో నొక్కినొక్కి పూజకు తెస్తామా?
తేముకదా!
దశాహము అభిషేకము మొదలైన పితృదేవతా - దైవకార్యములు నెరవేర్చు
సందర్భములలో నూతనజలముతో జలజలపారే సరస్సు తటాకము నదుల
జలం పట్టుకు వస్తాం. అంతేకాని, నీరు నిలచిపోయిన మురికిగుంటలలోని నీళ్ళు
బిందెలతో నింపుకొని తెచ్చుకుంటామా? లేదే!
పెద్ద పెద్ద సరస్సులలో నీరు పవిత్రము
చిన్న చిన్న గుంటలలో బురదతో కూడిన నీరు అపవిత్రము.
అని ఏవిధంగా భావిస్తూ ఉంటామో…,
ఆవిధంగానే….,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
207
అనుభవజ్ఞులను, మహనీయులను, శాస్త్ర - లోక విధానములు ఎరిగిన బ్రహ్మజ్ఞులను,
భక్తులను, జ్ఞానులను, యోగులను, మంచి చెడు, శుభ అశుభ సమయ
సందర్భములు ఎరిగినట్టి మహనీయులను సమీపించి, వారి అభిప్రాయములను
అవగాహనలను అనుభవములను అనుభూతులను తెలుసుకొని, దేశ-కాలపదార్ధములను విశ్లేషించుకొని…, ఇకప్పుడు, “ఇది ఇట్లా చేసెదనుగాక! అది అట్లా
చేయనుగాక!” అని తెలివిగా, లోకకళ్యాణ దృష్టిని కూడా కలుపుకుని సమరసభావనను
సంరక్షించుకుంటూ విధి-విధానాలు, నిషేధాలు నిర్ణయించుకోవాలి సుమా!
శ్రీ ఉద్ధవుడు : మరి,… కొందరేమో అపవిత్రమైన సంసార సంబంధమైన -
సంకుచితమైన అభిప్రాయములు ఎలుగెత్తి ప్రకటిస్తూ…, మాకు అల్పాశయములను -
కుమార్గములను తెలిసో-తెలియకో చూపటంకూడా జరుగుతోంది కదా? అశాస్త్రీయంగా
చెప్పటం జరుగుతోంది కూడా కదా!
శ్రీకృష్ణుడు :
ఔను. నిజమే!
శ్లో॥ శక్త్యా శక్త్యాథవా బుధ్ధ్యా సమృద్ధ్యా చ యదాత్మనే
అఘం కుర్వంతి హి యథా దేశావస్థానుసారతః ॥ (అధ్యా 21, శ్లో 11)
కొందరు సామర్ధ్య - అసామర్ధ్యములను, బుద్ధిని అనుసరించి అల్పదృష్టిని, సాంసారిక
దృష్టిని, సంపద - ఆపదల భావావేశంతో సంకుచిత స్వభావమును వదలలేక….
అశుభంగా కర్మలు నిర్వర్తిస్తున్నారు. తదనుకూలమమైన తత్సంబంధమైన విషయాలను
పదేపదే ఇతరులకు సంబోధించటం జరుగుతూ ఉంటుంది కూడా! “అదంతా ఆరీతిగా
జదరగటం దేశ-కాలమాన పరిస్థితుల ప్రభావం కదా!…” అని గమనించి బుద్ధి
సూక్ష్మతతో స్వీకరించవలసినది - స్వీకరించవలసినంత వరకు స్వీకరించాలి.
త్యజించవలసిసనది - త్యజించవలసినంతవరకు త్యజించాలి. దేనినై మహదా
శయముతో, సూక్ష్మబుద్ధితో, యుక్తాయుక్త విచక్షణతో సద్గురుబుద్ధి - మహావాక్యముల
సహాయంతో పవిత్రము అపవిత్రము అనుసరణీయము అననుసరణీయం…
ఇత్యాదులు బహుజాగరూకతతో నిర్ణయించుకోవాలి. అందుకేకదా, స్వబుద్ధి ఉన్నది!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
208
లభించిన సమాచారమును పెద్దల అభిప్రాయములు విశాలమైన దృక్పథము
పవిత్రమైన హృదయము - సునిశితమైన బుద్దిల సహాయంతో ఏది పవిత్రమో - ఏది
కాదో విచక్షించుకొని అటుపై అనుసరించాలి. దృష్టాంతానికి….,
శ్లో॥ ధాన్య దార్వస్థితంతూనాం రస తైజస చర్మణామ్
కాల-వాయుః-అగ్ని-మృత్తోయైః పార్థివానాం యుతాయుతైః (అధ్యా 21, శ్లో 12)
ధాన్యము మొదలైన ఆహారసంబంధమైన పదార్థములు, పెసలు మినుగులు ఇత్యాది
తైలపదార్థాలు, ఏనుగుదంతము, ఎముకలు, ఇటువంటి ఉపసామాగ్రి, బంగారు
ఖనిజము మొదలైన లోహపదార్ధాలు, చర్మము మొదలైన ఉపకరణపదార్ధాలు….
ఇటువంటివన్నీ తారసబడినప్పుడు - లభించినప్పుడు జనులు ఏం చేస్తున్నారు చెప్పు?
వాటివాటిని జలముతోను, అగ్నితోను, వాయువుతోను, మృత్తిక (మట్టి) తోను పరిశుభ్రం
చేసుకుంటున్నారుకదా!
అట్లాగే లౌకిక జీవితంలో ఆయా ప్రదేశ సందర్భములలో ప్రాప్తించే యుక్తాయుక్త
విశేషయములనుకూడా శాస్త్రవాక్యములు - మహనీయుల అభిప్రాయములు - స్వబుద్ధి
మొదలైనవాటిని ఉపయోగించుకొని పరిశుభ్రపరచుకోవాలి! అనుసరణీయాలను
అనుసరించాలి. త్యజించవలసినవి త్యజించాలి.
వంటపాత్ర అపరిశుభ్రంగా ఉంటే ఒక ఇల్లాలు ఏం చేస్తున్నారు? మృత్తిక (మట్టి)
మొదలైనవాటితో అపరిశుభ్రతను తొలగించి, ఆ తరువాత ఆ పాత్రలను ఉపయోగించి
వంట చేస్తున్నారు. పూర్వరూపము వచ్చిన తరువాత పరిశుభ్రమైనదికదా!… అని
భావిస్తున్నారు. ఆ ఇల్లాలు “పాత్రలు అశుభ్రంగా వున్నాయి. వంట ఏమి చేస్తాములే?”…
అని అనుకుంటోందా? లేదుకదా! శుభ్రంలేదు - అశుభ్రం లేదు అనుకుంటోందా?
అదీ లేదుకదా!
శాస్త్రవిహిత ఉపాసన పూజ ధ్యానము - తపస్సు… ఇత్యాది పవిత్ర కర్మలను
ఆచరించటమే శాస్త్రోద్దేశ్యం. అటువంటి విధి - విధ్యాపూర్వక ఉపాసనాకర్మలు
నిర్వర్తించాలనుకునేవాడు మునుముందుగా స్నానము దానము - స్వధర్మ నిర్వహణ
ఇత్యాదులతో సంసిద్ధపడాలి. ఉపనయనము ఆసనము ఇత్యాది శాస్త్రప్రవచిత
సంస్కారములను ఆశ్రయించాలి. సంధ్యోపాసన - భగవన్నామస్మరణ మొదలైనవాటితో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
209
బుద్ధిని పవిత్రము - సునిశితము - విస్తారము చేసుకోవాలి. అటువంటి ప్రయత్నములో
శాస్త్రములు చెప్పే విహిత-అవిహితములను, నియమ నిష్ఠలను సూచనలుగా భావించి
అనుసరించటమే ఉచితం!
"నేను నిర్వర్తించవలసిన నియమిత (Alloted) శాస్త్రీయ (ఉపాసనాపూర్వక) కర్మలునా బుద్ధిని పవిత్రము - విస్తారము చేసుకోవటానికి సుమార్గము - అవకాశము కదా!
-అను అవగాహనతో, సదుద్దేశ్యముతో కర్మలు నిర్వర్తించాలి.
శ్లో॥ మంత్రస్య చ పరిజ్ఞానం కర్మ శుద్ధిర్మదర్పణం
ధర్మ సంపద్యతే షటిః! అధర్మస్తు విపర్యయః | (అధ్యా 21, శ్లో 15)
సద్గురు ముఖతః మంత్రం స్వీకరించుటచే లక్ష్యశుద్ధి ఏర్పడుతుంది. పరమాత్మనగు
నాకు సమర్పణభావంతో కర్మ నిర్వర్తిస్తూ ఉంటే,… ఆ కర్మ పవిత్రమౌతుంది.
ఈవిధంగా 1. దేశము (Place)) 2. కాలము (Time) 3. ద్రవ్యము (Material) 4.
కర్త (Doer) 5. మంత్రము (Chanting) 6. కర్మ (Function)… ఈ ఆరు పవిత్రం
చేసుకోబడుతూ ఉండాలి. ఈ ఆరు పవిత్రము సుసంపన్నము అవుతూ ఉండగా
క్రమంగా చేసే సాధన పరిఢవిస్తూ ఉంటుంది. ధర్మముతో కూడిన భావాలు బలం
పుంజుకుంటూ వుంటాయి.
అట్లా కాకుండా ఉంటే? అధర్మము ప్రవృద్ధమయ్యే ప్రమాదం పొంచి ఉంటుందని
హెచ్చరిక చేస్తున్నాను! ధర్మము శ్రద్ధగా ఆశ్రయించబడనిచోట అధర్మము స్వయముగా
వృద్ధి పొందుచున్నది. చిత్తడిరాయి పై నిలవనీటి ప్రభావంచేత పాచి తనంతటనే
ప్రవృద్ధమౌతోంది చూచావా? అది అంతే!
అధ్యాయము–30.) ధ్యాసలు - పర్యవసానములు
|
శ్రీకృష్ణుడు : ఓ ఉద్ధవా! ఒక గుణము (One type of quality (or) Approach) దేశ -
కాల సందర్భ - సంఘటనలను అనుసరించి మరొకచోట దోషము అవుతుంది.
అట్లాగే వేరొకచోట గుణమయినది ఇక్కడ దోషము అవుతుంది. ఒకే విషయము ఒకచోట
గుణము (Acceptable, Positive), మరొకచోట దోషము (Fault, Non-acceptable,
Negative) అవటం ఇదంతా సాంఘిక సందర్భ - సంబంధానుచితంగా ఉంటూ
ఉంటుంది. ఈవిధంగా గుణముగాని, దోషముగాని ఆయా సందర్భములలో వేరువేరుగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
210
ఉండటం అందరికీ విదితమైనదే! దీనివలన మనం గమనించవలసినది ఏమిటి? ఇది
సద్గుణము, ఇది దోషము - అనేది ఆచారాది వ్యవహారాదుల దృష్ట్యా చూస్తే కల్పితమే
గాని సహజం కాదు.
కానీ….,
కొన్ని గుణముల విషయంలో “ఏదోలే! ఒకరకంగా మంచి మరొకరకంగా చెడు కదా”
అని శాస్త్రవిహిత కర్మలవిషయంలో బద్ధకంతో సరిపెట్టుకోకూడదు. అతి జాగరూకులై
సమయము - అవకాశములను పరిశీలించుకుంటూ - సమన్వయించు కోవాలి సుమా!
అంతేగాని అశ్రద్ధ-బద్ధకము, ఆలస్యము సత్కర్మల విషయంలో పనికిరాదు. మహనీయులు
జనులగుణ దోషములను బలహీనతలను పరస్పర సానుకూల్యతలను దృష్టిలో
వుంచుకొని విధి-నిషేధములను శాస్త్ర రూపంగా ప్రవచిస్తున్నారు. కనుక అవి
అనుసరణీయం!
ఇక
సురాపానము (Intoxicated Drinks) సేవించటం చేత మంచివారు కూడా చెడ్డగా
వ్యవహరిస్తారు. కనుక అది నిషేధమే! కాని పతితుతుడైన వ్యక్తికి సురాపానం
వలన పతితమవటం క్రొత్తగా ఉండదుకదా!
యతులకు స్త్రీ సంగము నిషిద్ధము. మరి గృహస్థులకో! భార్యతో సంగమము
దోషము కాకపోగా, “ఈ భగవత్ స్వరూప జీవిత భాగస్వామిని సంగమము
ద్వారా ఉపాసిస్తూ పరమాత్మను సేవిస్తున్నాను…” అనే భావన ఒక ఉపాసన,
సద్గుణము కూడా!
మంచముపై పరుండినవాడు “ఆదమరచిక్రిందపడ్డాడే!…” అనేది సందర్భపడవచ్చు.
క్రింద పరుండినవాడో, క్రిందపడటం ఎక్కడుంటుంది?
అందుచేత “ఆతడు దుర్గుణము సేవిస్తున్నాడుకదా! పరులను దూషించటం మొదలైనవి
చేస్తున్నాడు కదా! ఇక నేనూ అట్లాగే చేస్తే తప్పా? ఏమీ కాదు…” అని ఒక సద్గుణుడు
దుర్గుణ ప్రయత్నశీలుడు కాదలచరాదు సుమా!
ఇక్కడ ఇంకొక విషయము కూడా గుర్తుచేస్తున్నాను విను.
శ్లో॥యతోయతో నివర్తేత విముచ్యేత తతస్తతః
ఏషధర్మో నృణాం క్షేమః శోక-మోహ-భయాపహః | (అధ్యా 21, శ్లో 18)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
211
ఎవ్వడైతే ఎంతెంతవరకు ఏఏ దృశ్యవిషయముల నుండి విరమిస్తున్నాడో,
నివర్తుడగుచున్నాడో… ఆతడు అంతంతవరకు ఆయా విషయములనుండి నివృత్తుడు
(Relieved) అగుచున్నాడు.
ఎవడు ఏఏ ప్రాపంచక విషయములందు కర్మచేతగాని మనస్సు- భావలనచేతగాని,
ఆవేశ-కావేశములచేతగాని, కోప తాప-భయములచేతగాని ప్రవృత్తుడు అగుచున్నాడో,
ఆతడు అంతంత వరకు బద్ధుడు (Bounded) అగుచున్నాడు.
ఒక ముఖ్య విశేషం ఏమంటే…,
నివృత్తి లక్షణ ధర్మమే జీవునికి పరమసుఖము కలిగించగలదు సుమా! నివృత్తి క్రమంగా
శోక-మోహ-భయములను సన్నగిల్లజేచేస్తూ వాటిని నశింపజేయగలదు.
విషయచింతనయే సంసారము అనబడుదానికి మూలము.
శ్లో॥ విషయేషు గుణాధ్యాసాత్ పుంసః సంగస్తతో భవేత్
సంగాత్ తత్ర భవేత్ కామః కామాత్ ఏవ కలిః నృణామ్ || (అధ్యా 21, శ్లో 19)
గుణములపట్ల విషయ చింతన సంగం కామము కలనము
ధ్యాస Chanting AttachDesire సంసారము
Avocation Memorizing ment Relatedness
క్రోధము మోహము తమస్సు వ్యవహార
కలనము | MisconcepAll సంకుచితత్వము
Emotional /
Bilittleness సంసారము tion, illusion bondages
Angry ignorences in situations
ఈవిధంగా విషయములు సదా మననము చేస్తూ ఉండగా వాటితో సంగము, సంగము
వలన కామము, తద్వారా క్రోధము, మోహము… మోహము నుండి అజ్ఞాన భ్రమ
రూపమగు సంసారము వచ్చి కప్పివేస్తున్నాయి.
మరి ఇప్పుడు ఉపాయమో?
ఏది కార్యము? ఏది అకార్యము?
ఏది ఉచితము? ఏది అనుచితము?
ఏది ముక్తి ? ఏది బంధము? ఏది అనుసరణీయము - ఏదికాదు?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
212
ఏది ఆదరణీయము? ఏది అనాదరణీయము?
ఏది మార్గము? ఏది అడ్డు?
ఇటువంటి విచారణతో కూడిన కార్య అకార్యములను విశ్లేషించక-ఆశ్రయించక కాలం
వెళ్ళబుచ్చే జీవుడు అసత్తుల్యుడే సుమా! ప్రాపంచక సంఘటనలను మననం చేస్తూ
ఆదుర్దా - ఆవేశము-అసూయ-అసంతృప్తి-భయ ఉద్వేగాలు మొదలైనవి పొందువాడు
ఎవరో వ్రాసిన కథలోని పాత్రలమధ్య గల సంబంధములను చదువుతూ వెక్కివెక్కి
ఏడ్చు వంటివాడు! అదంతాకూడా ఏదో నాటకం చూస్తూ, అందులోని సంఘటనలకు
స్పందించి ఇంటికివచ్చి తెల్లవార్లూ కోప - ఆవేశాలతో మ్రగ్గటం వంటిది.
తతోఅస్య స్వార్ధ విభ్రంసో! మూర్ఛితస్య మృతస్య చ (అధ్యా 21, శ్లో 21)
స్వస్వరూపార్ధము నుండి భ్రంసము పొందినవాడే అగుచున్నాడు. దృశ్యముతో తదాత్మ్యము
చెంది రోజులు గడుపువాడు ఆధ్యాత్మశాస్త్రానుసారం మూర్ఛితుడు, మృతుడు! భ్రష్టుడు!
విషయములందు మిక్కిలి అభినివేశము కలవాడు చేతనశూన్యుడై … తనను తాను
గుర్తించలేడు! పరమాత్మనూ గుర్తించలేడు! ఒక వృక్షమువలె ప్రాణధారణ చేయటానికి
ఉపయోగబడే భౌతిక వస్తువులను మాత్రమే (భౌతిక దేహములను మాత్రమే)
గుర్తించగలడు.
ఆతడు ఊపిరి పీల్చడం - వదలటం - అదంతా కొలిమితిత్తిలో గాలి యొక్క ప్రవేశ
నిష్క్రమణములవంటిదే అవుతోంది. అనగా, అదంతా నిష్ప్రయోజనమే!
శ్రీ ఉద్ధవుడు : ఆయా కర్మలవలన స్వర్గము మొదలైన సుఖలోకాలు లభిస్తాయికదా,
కృష్ణయ్యా! వేదశాస్త్రములు అట్టి ఫలశ్రుతులను చెప్పుచున్నాయి కదా!
శ్రీకృష్ణుడు : అవును. కానీ ఏం లాభం? అవన్నీ పరమపురుషార్ధమును కలిగించలేవయ్యా!
వేదములు స్వర్గము –ఇత్యాది ప్రయోజనములగురించి ఎందుకు వర్ణిస్తున్నాయంటావా?
విను.
ఒక తండ్రి తన కుమారినికి రోగనివారణం కొరకై ఒక ఔషధం తెచ్చాడు. ఆ ఔషధము
పిల్లవాడిని ఆరోగ్యంగా తీర్చిదిద్దగలదు. ఆ విషయం పిల్లవాడికి కూడా తెలుసు. కానీ
ఆ ఔషధము యొక్క రుచి పిల్లవాడికి నచ్చక, విముఖుడై, త్రాగటానికి మారాం చేస్తున్నాడు.
అప్పుడు ఆ తండ్రి ఏదో మిఠాయివంటి మధుర పదార్థములను చూపించి "ఈ మిఠాయి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
213
ఇస్తాను. కానీ వెంటనే ఈ ఔషధం మింగాలి! మరి నీకు ఇష్టమేనా?…“ అంటాడు.
అప్పుడు ఆ పిల్లవాడు మిఠాయికోసం ఔషధాన్ని సేవించటానికి ఒప్పుకుంటాడు. అటు
తరువాత ఒకటి-రెండు రోజులకు రుగ్మతనుండి ఔషధము కలిగించే ఉపశమనమును
గమనించి తనకు తనే, ”నాన్నగారూ! ఔషధం ఇవ్వండి! చాలు…" అనటం ప్రారంభిస్తాడు.
స్వర్గాది లోక ఫలాలన్నీ కూడా ఒక తండ్రి తన బిడ్డను ఏమర్చటానికి, ఔషధసేవకు
సిద్ధం చేయటానికి చేసే ప్రయత్నము వంటిదే! బుజ్జగింపు మాటలవంటివి! ఎందుకంటే
స్వర్గలోకాలవంటి ఫలాలు ప్రాపంచకమైన సంపదల వంటివే!
వేదశాస్త్రములు మోక్షరూపమగు పరమ శ్రేయస్సును కలుగజేయానికి వ్రతాలు చేయండి!
కష్టాలు పోతాయి…. ఇటువంటి వాక్యాలు ఆ తీరుగా అందిస్తున్నాయని గమనించు!
అధ్యాయము–31.) అనర్ధ హేతువులందు ఆసక్తి
|
శ్లో॥ ఉత్పత్తైవహి కామేషు ప్రాణేషు స్వజనేషు చ
ఆసక్త మనసో మర్త్యా ఆత్మనో అనర్ధ హేతుషు ॥ (అధ్యా 21, శ్లో 24)
ఓ ప్రియ ఉద్ధవా! ఈ మానవులలో అనేకులు స్వభావసిద్ధంగానే అనర్ధములు కలిగించగల
కోరికలు దేహము స్వజనలు - వ్యవహారములపట్ల అత్యంత ఆసక్తిని -
పెంపొందించుకొని ఉంటున్నారు. మేము ధన-జన-యౌవన-వస్తు-గృహ సంపదల
కోసమే జీవించాలి!… అని భావావేశము ప్రదర్శించుకుంటున్నారు. ఇక్కడ కనబడే
ఇంద్రియ విషయములపట్ల అత్యంతాసక్తతతో జీవిస్తూ- ఇంద్రియ సందర్భములను
ఆత్మజ్ఞానానందము కొరకు ఏరీతిగా ఉపయోగించవచ్చు?….. అను విషయమై
అత్యంత అనాసక్తులై, ఏమరచినవారై “మానవజన్మ” అనే సదవకాశమును వృధా
చేసుకుంటున్నారు.
అందుచేత శాస్త్రములు మునుముందుగా “జగత్ లాభములు” అనే తాయిలం చూపించి
జీవులను “సాధన” అనే మార్గమునకు ఎలుగెత్తి పిలుస్తున్నాయి.
మిత్రమా!
పరమ సుఖమే (ఆత్మ సుఖమే) శాస్త్రకారుల మహదాశయమని గుర్తించు. అంతేగాని
భౌతిక సుఖ సంపదలు ముఖ్యోద్దేశ్యమే కాదు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
214
పునరావృత్తి దోషము :
పరమసుఖమును తెలుసుకోక, (అనగా) ఆత్మతత్త్వము గురించి (లేక) స్వస్వరూపము
గరించి సమాచారము సంపాదించి, అనుభవైకవేద్యం కొరకై ప్రయత్నించకుండా,
ఎవ్వరైతే…,
ఈలోకంలోనో (లేక) మరొకలోకంలోనో ఏదో సాధించాలి… అనే కామమార్గములో
అడుగులు వేస్తూ ఉంటారో…, కామ మార్గ సంచారాలు ఆవేశంగా కొనసాగిస్తూ
ఉంటారో.
…
అట్టివారిపట్ల పునరావృత్తి అనే దోషము కొనసాగుతూనే వుంటుంది. అట్టివారు మరల
అనేక తామసయోనులలో ప్రవేశించవలసిన అగత్యమును తొలగించుకోనివారే
అగుచున్నారు.
వేదములలో చెప్పిన దృశ్యసంబంధమైన ఫలములు - ప్రయోజనములు సత్యమే! అయితే,
కామ కామాః లభంతి…. అనునది ఆశయంగా కలవాడు వేదహృదయమైన వేదాంత
విద్యలో ఎలా ప్రకాసిస్తాడు చెప్పు? జీవునకు మోక్షమే ప్రసాదించగల మహదాశయ
స్వరూపమైన వేదమాత అల్పలక్ష్యములను మహాశయంగా చెప్పుతుందా? లేదు.
పిల్లవాడిచేత బాగా చదివించి విజ్ఞానదురంధరునిగాను, మహాపండితునిగాను తీర్చి
దిద్దాలనే ఉద్దేశ్యంగల అమ్మ “మా అబ్బాయి తియ్యటి లడ్లు, చెక్కిలాలు తింటే చాలండీ!
చదివి తెలివికలవాడు కానఖర్లేదు…” " అని అనుకుంటుందా? కానేకాదు.
పసిబిడ్డ స్వభావులగు జీవులను బుజ్జగించటానికి ఏదో స్వర్గ-తదితర సుఖలోక ఫలములు
- ప్రయోజనములు కొద్ది సమయం చెప్పుచున్నప్పటికీ… వేదమాత యొక్క సహృదయత
అంతిమలక్ష్యము మోక్షమే! ఆత్మజ్ఞానమే! ఆత్మానుభూతియే!
అవాంతర - ఆత్యంతిక ఫలన్యాయం
శ్లో॥ ఏవం వ్యవసితం కేచిత్ అవిజ్ఞాయ కుబుద్ధయః
ఫలశ్రుతిం కుసుమితాం న వేదజ్జా వదంతి హి || (అధ్యా 21, శ్లో 26)
ప్రతిఒక్క కార్యమునకు రెండువిధాలైన ఫలములు - (లేక) ప్రయోజనములు ఉంటూ
ఉంటాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
215
పశుమాంస భక్షణలతో కూడిన యజ్ఞములద్వారా కేవలం దేవతలను, పితృదేవతలను,
భూతములను ఆరాధిస్తూ ఉన్నారు. “యజ్ఞ-యాగాదుల ఆత్యంతికోద్దేశ్యము
ఆత్మోపాసనయే! ఆత్మ సాక్షాత్కారమే!…” “ అనేది గమనించటం లేదు. సర్వ కర్మలు -
ఉపాసనలు - తపోధ్యానముల అంతిమలక్ష్యము ఏమిటి? - సర్వము ఆత్మస్వరూపంగా
సందర్శించి ఆత్మానందము - అలౌకికానందము అనునిత్యం చేసుకోవటమే! అంతేగాని,
(వేదముల ఉద్దేశ్యము) పరిమితములు - పరోక్షరూపములు అగు స్వర్గాదులు, ఉపాసనా
ఫలప్రద దైవలోకాలు కాదయ్యా!
ఒక దృష్టాంతము విను!
బాగా కష్టపడి ధనం సంపాదించిన ఒక వ్యాపారికి ఒక ఆలోచన వచ్చిందట. నా
దగ్గర ఉన్న డబ్బుతో సముద్ర జలాన్ని కొని అందులో వెతికి రత్నరాసులు పట్టుకొని
కోటానుకోట్ల ధన సంపన్నుణ్ణి అవుతాను కదా - అని అనుకున్నాడు. డబ్బంతా వెచ్చించి
సముద్రములో 2 చ॥మైళ్ళ విస్తీర్ణంగల సముద్ర జలముపై హక్కులు కొనుక్కున్నాడు.
ఆ 2 చ॥ మైళ్ళ విస్తీర్ణంలో ఆతనికి కొన్ని చేపలు తప్పించి రత్నాలేవీ దొరకలేదు. ఆ 2
చ॥ మైళ్ళ విస్తీర్ణ సముద్రము ఆతనికి మరొకమైన ఏరీతిగాను ఉపయోగించటం చేతకాదు.
ఆవిధంగా ఆ ధనికునికి డబ్బుపోయింది. రత్నాలు లభించలేదు. ఏమీ చేయలేకపోయాడు.
మరల బికారి అయ్యాడు.
పైన చెప్పిన వ్యాపారి దృష్టాంతంలాగా మందబుద్ధికలవారు ”మాకు స్వర్గాది లోకాలలో
ఆనందమయ సుఖాలు లభించాలి" అని అనుకొని యజ్ఞ-యాగ క్రతు ఇత్యాదులు
నిర్వర్తిస్తున్నారు. లేదా, ఇహలోకంలో రాజ్యాధికారం కావాలి…. ఇత్యాదులు లక్ష్యంగా
ఆశయంగా కలిగి యజ్ఞ తదితర సాధనకర్మలకు ఉపక్రమిస్తున్నారు. అటువంటి
ఫలములు లభిస్తాయి. కాని ఏం లాభం? అవన్నీ కూడా…,
స్వప్నతుల్యము (Some Posh Building one happened to have been
seeing in his Dream)
నశ్వరము (It is going to slip from hands after some time)
కేవలము శ్రవణ ప్రియము (Happy to hear but not going to give real
happiness)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
217
అల్పాశయము కలిగి - శ్రమతో, ఆయా వేద ప్రవచిత ఉపాసనాది యజ్ఞములు మొదలైనవి
నిర్వర్తించటం ఉభయభ్రష్టుత్వమే! శ్రమకు శ్రమ! లభించబోయేది క్షణభంగురం (మరియు)
భ్రమాత్మకం మాత్రమే! అందుచేత, అల్పాశయములను ప్రక్కకు పెట్టి, మహదాశయముతో
అవి నిర్వర్తించటమే ఉచితం!
ఈవిధంగా రజోగుణ తమోగుణ ప్రేరితులైన కొందరు సాధకులు లౌకికమైన
ప్రయోజనము కొరకై అన్య దేవతోపాసనలకు ఉపక్రమిస్తున్నారు. కర్తకు అనన్య
స్వరూపుడను సర్వాత్మకుడను అగు నన్ను ఉపాసించటం ఏమరుస్తున్నారు.
అనన్యోపాసనయే ముఖ్యము సుమా!
ఆత్మసాక్షాత్కారమే లక్ష్యమగుగాక!
శ్లో॥ అనన్యాశ్చిన్తయన్తో యోతోమాం యేజనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ॥ (భగవద్గీత)
ఈ విషయమే అర్జునునికి యుద్ధభూమిలో చెప్పిన గీతలో బోధించిఉన్నాను కదా!
అనన్యం ఉపాసకునికి వేరైనది కానిది.
ఉపాసకునికి ఎదురుగా కనిపించేదంతా తానే అయి ఉన్నది.
ఇక్కడ అన్య దేవతోపాసనకుల గురించి మరొక్క విషయం కూడా చెప్పుచున్నాను. విను
మేము ఈ లోకంలో యజ్ఞములు - యాగములు క్రతువులు నిర్వర్తిస్తాము.
ఇంద్రాది అన్యదేవతలను సంతోషింపజేస్తాము.
స్వర్గలోకం సంపాదించుకుంటాము.
ఆ స్వర్గలోకంలో కొంతకాలం హాయిగా విహరిస్తాము. పుణ్యక్షయం వరకు
ఆనందిస్తాము.
అటుతరువాత భూమిపై ఉత్తమ వంశములలోను - సంపదలతోను విలసిల్లే
గృహాలలో జన్మిస్తాం.
ఇటువంటి చంచలచిత్తులు, దృశ్యాభిమానులు, లుబ్ధస్వభావులు - ఆత్మావలోకనమునకు
సంబంధించిన ఆత్యంతిక ఫలముపై ధ్యాస కలిగిఉండలేక పోతున్నారయ్యా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
218
త్రికాండ విషయా వేదః - పరరోక్ష వాదా!
శ్లో॥ వేదా బ్రహ్మాత్మ విషయాః త్రికాండ విషయా ఇమే
పరోక్షవాదా ఋషయః పరోక్షం మమ చ ప్రియమ్ (అధ్యా 21, శ్లో 35)
వేదములలో 3 విభాగాలు ఉన్నాయి.
1. కర్మకాండ (సంహిత)
ఉపాసనాకాండ 2. (బ్రాహ్మణములు)
3. జ్ఞానకాండ (ఉపనిషత్తులు)
ఈ మూడింటిలో కూడా ఈ జీవాత్మ బ్రహ్మమే అను విషయమే ప్రతిపాదితమై ఉంటోంది.
ఈ మూడిటిలోని మంత్రములు, ఆ మంత్రములను దర్శించిన మంత్రద్రష్టలగు ఋషులు
కూడా ఈ విషయమునే ప్రత్యక్షముగా - పరోక్షంగా కూడా నొక్కి వక్కాణించి లోకములకు
చేతులెత్తి ప్రకటిస్తున్నారు. జీవో బ్రహ్మేతి నాపరః సర్వం ఖల్విదం బ్రహ్మ… ఇత్యాది
మహావాక్యాలను ఆత్యంతికాశయంగా విశదీకరిస్తున్నారు సుమా!
(ఉదా - పితృకార్యాలలో - అన్నం బ్రహ్మ అహం బ్రహ్మ - భోక్తా బ్రహ్మా అని –
చెప్పుచున్నట్లు)
ఓ ఉద్ధవా! ఆవిధంగా పరమసత్యమును గుప్తంగాను - ప్రదర్శితంగాను కూడా చెప్పటం
నాకు ఇష్టమే!
అయితే “అంతా నా ఆత్మ స్వరూపమే అయి ఉండి, యధాతథమై కూడా ఉన్నది…”
అను మహత్తర - అనుక్షణిక - పరమసత్యమునకు అంతఃకరణ శుద్ధులగు వారే
అర్హులగుచున్నారు సుమా! వారే ఇటు ప్రత్యక్ష, అటు పరోక్ష - ఆపై అపరోక్షవాదముల
అంతర్లీన గానాన్ని అద్వైత తత్త్వమును ఎరుగగలుగుచున్నారు.
వేదములు శబ్ద బ్రహ్మము. అది స్వరూపముగాగాని, అర్ధముగా గాని తెలియవచ్చేది
కాదు. అయితే, వేదము ప్రాణమయము ఇంద్రియమయము మనోమయము
అయి ఉన్నది.
వేదము - యొక్క శబ్దార్ధము తెలియబడునది.
వేదాంతము - యొక్క శబ్దార్ధము తెలియబడుదానికి ఆవలగల తెలుసుకొనువాడు
తెలుసుకొనువాని గురించి తెలియజెప్పే శాస్త్రమే - వేదాంత శాస్త్రము!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
219
తెలియబడుదానిలో తెలుసుకొనువాని గురించి వెతికితే లభించటం దుర్లభం. కల
ఎవ్వరిదో… ఆతడు తనకొరకై ఆ కలలో వెతికితే లభిస్తాడా? లేదే! ఈవిధంగా వేదములు
అపారము అనంతము - గంభీరము అగు సముద్రమువలె దుర్గాహ్యము.
అయితే…,
వేదాంత స్వరూపుడనైన నేను
చతుర్వేదసారుడను. వేదములలో దాగివున్న వాడను!
సర్వ వ్యాపకుడను!
అనంతశక్తి స్వరూపుడను!
అపరిచ్ఛిన్నుడను| !
తామరతూడునందలి దారము వలె ప్రాణులయందు తెలివి-నాదము రూపముతో |
లక్షితుడనై ఉన్నాను!
సాలెపురుగు యొక్క హృదయం నుండి ముఖమునుండి దారములు బయల్వెడలు
చున్నాయి. కదా! ఆరీతిగానే….
హిరణ్యగర్భ భగవానుడు ఛందోమయుడు. అమృతమయుడు.
నాదరూపమగు ఉపాదానముతో కూడుకొని ఉన్నవాడు. నాదరూపుడు.
ఆయన శబ్ద-స్పర్శ-రూప రస గంధాదులతో కూడిన మనస్సుతో హృదయాకాశం
నుండి ఓంకారనాదముతోకూడిన వేదములను ప్రకటించుచున్నారు. అట్టివేదములు …,
ఆరోహణ - అవరోహణ శబ్దజాలముతో నిర్మించబడుచున్నాయి.
విచితమ్రులైనట్టి వైదిక - లౌకిక పరిభాషాదులతో విస్తృతమైనట్టివి.
ఉత్తరోత్తరా నాలుగు - నాలుగు అక్షరములతో వృద్ధి పొందు ఛందస్సులచే
ఉపలక్షితమైనట్టివి.
శబ్దములచే - అర్ధములచే సమాప్తి చెందినట్టివి.
అనేక మార్గములతో కూడినట్టిది.
వైఖరీ (Style) ప్రధానమైనట్టిది.
అట్టి అనంతము అపారము అగు శ్రుతులను (వేదములను) హృదయమునుండి
స్వయముగా సృష్టికర్త సృజించుచున్నారు! మరొకప్పుడు ఉపసంహరించుచున్నారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
220
శ్లో॥ గాయత్రి ఉష్టిక్ అనుష్టుప్ చబృహతీ పంక్తి రేవ చ
త్రిష్టుప్ జగతి అతిఛందో హి అత్యష్టి ఇతి జగద్విరాట్ || (అధ్యా 21, శ్లో 41)
గాయత్రి, ఉష్టిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి, అతిఛందము, అత్యష్టి,
అతిజగతి, అతివిరాట్, ఈ ఛందస్సులన్నీ “వైఖరి” అను వేదములోనివే! వేదము
సృష్టికర్తయగు బ్రహ్మదేవుని హృదయమే! బ్రహ్మదేవుని హృదయం సదా బ్రహ్మమే! ఈ
విధంగా అంతా బ్రహ్మమే! (వైఖరి = Technique Style)
జీవుడు బ్రహ్మమే! ఆతనిచే తెలియబడుచున్నది కూడా బ్రహ్మమే!
బ్రహ్మ సాక్షాత్కారమే బ్రహ్మదేవుని హృదయం.
ఈ జీవుడు సర్వము బ్రహ్మముగా ఆస్వాదించటమే సృష్టికర్తయగు బ్రహ్మదేవుని ఉద్దేశ్యము!
కర్మకాండయందు కనిపించే విధి వాక్యములచే విహితమైనదేది? అవిహితమైనదేది?
ఉపాసనాకాండలోగల మంత్ర వాక్యములచే ప్రకాశితమౌతున్నదేమిటి?
జ్ఞానకాండచే నిషేధింపబడుచు (నేతి) చెప్పబడుచున్నదేది?
ఈవిధమగు వేదవాక్యముల ప్రకృతి తాత్పర్యము పరమాత్మనగు నాకే ఎఱుక! అది
చర్చనీయాంశము కాదు!
నేను బ్రహ్మమునే! “అహమ్ బ్రహ్మస్మి” అనునది నిశ్చలం చేసుకోవటమే మహత్ ఆశయం!
మిగిలినదంతా సందర్భ సత్యము. సహజసత్యము కాదు.
సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ అనునదే సత్యవాక్కు! ఋషివాక్కు! నా వాక్కు ఇదియే
సహజసత్యము! పరమరహస్యమైన నిత్య సత్యము!
వేదములు కర్మకాండచే విధించుచున్నది నేనే!
…9
ఉపాసనాకాండమునందు ఉపాస్యదేవతా రూపముగా అభివర్ణించుచున్నది నన్నే!
జ్ఞానకాండలో ఆకాశ-అంతఃకరణాది రూపంతో అన్యవస్తువులను ఆరోపించటం|
నిషేధించటం కూడా జరుగుచున్నది - నాయందే!
ఇక, ఇక్కడ ఎదురుగా ఉన్నదంతా….,
మనయేవ ఇదమాప్తవ్యం !
మనోయః కరోతి తత్ కృతంభవతి ||
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
221
జగత్ స్వమనోరూపమేవ! ఇదంతా మనస్సే!
|
కానీ…, మనస్సనేది కల్పితమే! వాస్తవానికి మనస్సనేదే ఆత్మకు వేరుగా లేదు.
ఆత్మౌపమ్యేవ సర్వత్రా!
అద్వితీయం ఆత్మః |
సర్వశ్రుతులు నన్నే ఆశ్రయించి నాయందు భేదమును ఆరోపిస్తున్నాయి.
మాయాప్రదర్శకుడనని చెప్పి నినదిస్తున్నది నన్నే!
చివ్వరికి శ్రుతులు నా సమక్షంలో అన్నిటినీ నేతి నేతి వాక్యాలతో నిషేధించి
నాయందు సశాంతిస్తున్నాయి.
అధిష్ఠాన రూపంలో త్రికాలాలలో సర్వదా నేనే శేషిస్తున్నాను.
శేషసారమగు నేనే జగత్తులోని నేనుగా, జీవునిలోని నేనుగా, సాక్షిలోని నేనుగా
ఆస్వాదించబడుచున్నాను! ఆస్వాదిస్తున్నాను, ఆస్వాదించబడుచున్న జగత్తు
రూపంగా కనబడుచున్నాను! నాకు వేరుగా ఎప్పుడూ-ఎక్కడా ఏదీ లేదు!
నేనే నీవు! నీవే నేను! తత్త్వమసి! వేదములు ఓ ఉద్దవా! ఇది గానం చేస్తూ ఉన్నాయయ్యా!
ఇదే తత్త్వశాస్త్ర సారం!
అధ్యాయము–32.) తత్త్వ సంఖ్య - ప్రకృతి - పురుష వివేకము
|
శ్రీ ఉద్ధవుడు : ఓ దేవాదిదేవా! విశ్వేశ్వరా! విశ్వంభరా! మీ ప్రవచనం అమోఘం!
ఇప్పుడు సాంఖ్యయోగం దృష్ట్యా కొన్ని విశేషాలు మీవద్ద వినాలని కుతూహలపడుచున్నాను
స్వామీ!
వేరువేరు ఋషులు లోకములకు తాత్త్విక విశేషాలను అనేక సిద్ధాంతద్వారా
విశదపరచారు. విశదపరుస్తున్నారు.
అయితే…,
ఋషులు తత్త్వమును ఏఏవిధంగా విభజించి సిద్ధాంతీకరించి చెప్పారు? ఎందుకని
అట్లా చెప్పారు? మీరు ఇతఃపూర్వం… (19వ అధ్యాయంలో)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
222
జీవుడు = 9 + 11 + 5 + 3 (మొత్తం 28) తత్త్వాలుగా చెప్పియున్నారు. నాకు గుర్తు
ఉన్నది. కానీ… ఈ జీవునికి సంబంధించి
కొందరు 26 తత్త్వములని,
మరికొందరు 25 తత్త్వములని,
వేరే కొందరు 7 తత్త్వములని,
కొద 9 తత్త్వములని
ఇట్లాగే 17 అనీ, 14 అని, 13 తత్త్వాలని వేరువేరు గురువులు వారివారి శిష్యులకు,
వారివారిప్రవచన గ్రంథములలోను చెప్పుతూ వస్తున్నారు. ఈ విభాగ సంబంధమైన
తత్త్వ విశేషాల గురించి వివరించి చెప్పవలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఇటువంటి వివిధ
రీతులైన విభాగముల పాఠ్యాంశాలు వేరువేరు గురువులచే ఎందుచేత వేరువేరుగా
చెప్పబడుచున్నాయి?
శ్రీకృష్ణభగవానుడు : అవును! ప్రకృతి తత్త్వములను ఒక్కొక్క మహనీయుడు ఆయా
సంఖ్యాయుతంగా విభజించి మనస్సు బుద్ధి - చిత్తము అహంకారము
ఇంద్రియములు ఇంద్రియార్ధములు ఈవిధంగా (వేరువేరుగా) చెప్పటం
బోధించటం - సిద్ధాంతీకరించటం జరిగింది. జరుగుతోంది. జరుగబోతూ ఉంటుంది.
అవన్నీ యుక్తి యుక్తమే! వారంతా కూడా నాయొక్క మాయాశక్తిని ఆశ్రయించి తత్త్వ
విశ్లేషణ చేసి చెప్పటం జరుగుతోంది. అదంతా అసందర్భం కాదు.
మాయా యామా - ఏదైతే స్వతఃగా లేదో, అద్దానిని విశ్లేషించి, చెప్పేదంతా ఆత్మ
తత్త్వాన్ని విశదపరచటానికే! అదంతా పరతత్త్వాన్ని నిర్వచించటానికి ఉద్దేశ్యించ
బడుతోందయ్యా! అంతిమ సత్యమువైపుకు దారితీసే వివిధ మార్గవిశ్లేషణలు - విశేషాలు
అవన్నీ!
నదీనాం సాగరోగతిః!
దృష్టాంతంగా
…9
శ్లో॥ నైతదేవం యధా2_2 త్థ త్వం యదహం వచ్మి తత్తధా |
ఏవం వివదతాం హేతుం శక్తయో మే గురత్యయాః || (అధ్యా 22, శ్లో 5)
ఉదాహరణకు : నీవు ఒకటి సిద్ధాంతపూర్వకంగా విభాగించి చెప్పుతావనుకో! నేను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
223
వేరొకవిధంగా విభాగిస్తూ “నేను చెప్పేదే సరి అయినది. ఉద్ధవుడు విభాగించినది
కాదు” .. అంటూ ఉండటం జరుగుతూ వుంటుంది.
ఈవిధంగా వివిధ గురువులు వివిధరీతులుగా విభాగిస్తూ…. ఒక విభాగము మరొక
విభాగమునకు కొంత వేరైనట్లు భాష్యం చెప్పబడటం, ఈ వ్యవహారాలన్నీ వివాద
విషయములవలె కనిపించటం ఇదంతా కూడా దురత్యయమగు నా మాయా
విశేషమేనని గమనించు. నాయొక్క సత్త్వము - క్రియ - దర్శనము ఇత్యాది శక్తుల
కించిత్ చమత్కారమైన క్షోభచేతనే వాదించుకొనువారి వివిధ విషయభేదములు జగత్తులో
ఏర్పడి ఉండటం జరుగుతోంది. అవన్నీ వివిధ శ్రోతలకు వివిధమైన రీతులుగా
విశదీకరించబడుచూ కొన్ని- కొన్ని కొందరి కొందరికి ఎక్కువ సానుకూలమై
ఉంటున్నాయి.
అయితే…,
ఇంద్రియ - మనో నిగ్రహము ఇంకా తగినంత రూపుదిద్దుకోనిచోట మాత్రమే వివిధ
గురువుల సిద్ధాంతాలు వేరు వేరు రూపంగా అనిపిస్తోంది. ఆ సాధకుడు (లేక) ముముక్షువు
శమ-దమములు పొందుతూ ఉండగా ఆ వికల్పములన్నీ తమంతట తామే
లయమగుచున్నాయి. ఒకే నాదము భిన్న భిన్న రాగములుగా సంతరించుకొని శ్రోతలకు
ఆనందం కలుగజేయటంవంటిదే…, అదంతా!
ఏది ఏమైతేనేం! వికల్పములు సన్నగిల్లుచుండగా వివాదములు కూడా సమసిపోతాయి!
వేరు వేరు రీతులుగా తత్త్వము వేరువేరు ద్రష్టలచే (గురువులచే చెప్పబడుటానికి
ముఖ్యకారణం ఏమంటే శిష్యుల వేరువేరైన ఇతః పూర్వపు సంస్కారములే! శ్రద్ధగా
పరిశీలిస్తూ పోతూ వుంటే - తత్త్వవిచారణకు సంబంధమైన ఒకరీతైన విచారణలో
మరొక రీతి అయిన విచారణ (అంతరంగా గమనిస్తే) ఉండనే ఉంటోంది. ఒకటితో
మరొకటి అనుప్రవిష్టములై ఉంటాయి. ఇక విలక్షణ విశేషములను విచక్షణను
అనుసరించి…..
ఆ అభిప్రాయం ఈ సిద్ధాంతములో విభాగమే!
ఈ అభిప్రాయం ఆ సిద్ధాంతములో అంతర్లీనమే!
ఒక సిద్ధాంతంలో ఒకటి కార్యము!
మరొక సిద్ధాంతంలో అదే కారణము!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
224
ఒక సిద్ధాంతములో ఒకటి మార్గాన్వేషణం!
మరొక సిద్ధాంతంలో అదే మార్గదర్శనం!
(ఉదా : ద్వైత - విశిష్టాద్వైత - అద్వైతాలు)
ఆధ్యాత్మశాస్త్ర సిద్ధాంత విశేషాలలో ఒకదానిని అనుసరించి మరొకటి, మరొకదానిని
అనుసరించి ఇంకొకటి… ఈవిధమైన సమీక్షా సిద్ధాంతాలు అనుగతమై ఉంటూ
ఉంటాయి. వాస్తవానికి శ్రోతకు లాభించటానికి ఉద్దేశ్యించే ఆత్మానుభవం (లేక)
పరతత్త్వానుభవం వాక్కుకు - (చెప్పటానికి) - నిరూపణకు (To prove or define) సిద్ధాంతీకరించి ఇది ఇంతే అని పరిమితం చేయటానికి సాధ్యపడేది కాదు.
అది అనుభవైకవేద్యం!
సిద్ధాంతాలన్నీ సూచనామార్గాలు మాత్రమే!
కాని ఆయా సిద్ధాంతాలన్నీ - శ్రోతయొక్క శ్రద్ధ - సునిశిత బుద్ధిని అనుసరించి
విశ్లేషణ విమర్శ - ఆచరణలచే అనిర్వచనీయమగు ఆత్మానుభూతికి (లేక) ఆత్మ
సాక్షాత్కారానికి తప్పక దారితీయగలవు. అవగాహన-సాధన -శ్రద్ధల సహాయంచేత
ఆత్మౌపమ్యేవ సర్వత్ర అను మత్థానం (The state where I am placed (or) The
state that I am experiencing) లభించగలదు. అట్టి అనుభవమునకు చేరుచుండగా
సిద్ధాంతములు తమ విధి (Duty) పరిసమాప్తమైనది కాబట్టి స్వయంగా - సహజంగానే
ఉపశమిస్తున్నాయి. (ఉదా : గణితశాస్త్రంలో X అనుకొనుము అనునది సమాధానం
లభించేంతవరకే కదా!)
అందుచేత…, ఎవ్వరు ఏఏ రీతులుగా
తత్త్వశాస్త్రమునకు సంబంధించిన కార్య కారణ విశ్లేషణను,
ఇది ఇట్లు - అది అట్లుకాదు - ఇది ఉత్తమము - అది అల్పము అని చెప్పుచుండే
న్యూనాధిక భావములు,
వివిధ రీతులైన సంఖ్యావర్ణనములు,
విశ్లేషిస్తూ వివరణ చేస్తున్నారో,
ఏఏ గురువులు - మార్గదర్శకులు, ఏఏ ఉద్దేశ్యాలతో ఏఏవిధమైన సిద్ధాంతాలను
(To establish various Theories) ప్రవృత్తులగుచున్నారో…,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
225
అవన్నీ ఆయా రీతులుగా యుక్తియుక్తములే అయి, నాచే స్వీకరించబడుచున్నాయి.
తత్త్వానుభవానికి అవి మార్గదర్శకములు, ఉపకరణములుగా మలచుకొనుచున్నది
ఆ సిద్ధాంతముల శ్రోతయే! కనుక ఓ శ్రోతలారా! మీ బుద్ధిని విస్తారము,
సునిశితము, నిశ్చలము చేసుకొని సిద్ధాంతాలను పరిశీలిస్తూ ఉపయోగిం
చుకుంటూ ఉండండి!
ప్రియ ముముక్షువులారా! ఆయాగురువుల సిద్ధాంతములతో బయటకు (బాహ్యానికి)
కనిపించే కొన్ని భేదములను పెద్ద పెద్దగా భావించి ఒకరి సిద్ధాంతములను మరొకరు
దూషణములతో విమర్శించుకోవటానికి సంసిద్ధులు కాకండి! సారమును గ్రహించండి.
తస్మాత్ సారం విజానీయాం! సిద్ధాంతముల హృదయమును ఏరీతిగా సమన్వియించుకొని
ఉపయోగించుకోవాలో గమనించే సామర్ధ్యతను కలిగి ఉండండి. అవాక్
మానసగోచరముగా చెప్పబడే “ఆత్మౌపమ్యేవ సర్వత్ర సమం పస్యతి” అను స్ధానమునకు
వివిధ సాధనములు - వివిధ సిద్ధాంతములు, వాటియందు కనిపించే విభాగ భేదములు
సూచన చేస్తూ ఉన్నాయి. మార్గమును చూపుచూ వున్నాయి. సమన్వించుకుంటూ
ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేయవలసినది శ్రోతయే సుమా!
ఈవిధంగా వివిధ విభాగ పూర్వక సిద్ధాంతములు సంభవమే! యుక్తియుక్తమే! అవన్నీ
నేను స్వీకరించుచునే ఉన్నాను.
ఈ జీవుడు అనాది కాలమునుండి అవిద్యాగ్రస్తుడై ఉన్నాడు.
శ్లో॥ అనాద్యవిద్యాయుక్తస్య పురుషస్యాత్మ వేదనమ్
స్వతో న సంభవాత్ అన్యః తత్త్వజ్ఞో జ్ఞానదో భవేత్ || (అధ్యా 22, శ్లో 10)
అవిద్య : = ఒకడు ఒకరోజు ఒక నాటకం (లేక, సినిమా లేక, టివి సీరియల్) చూస్తూ
అందులోని కల్పితమైన సంఘటనలతో తాదాత్మ్యము చెందుతూ కోపము - ప్రేమభావము
- శృంగారభావము - భయము - సంతోషము మొదలైనవి పొందటం…. ఏవిధంగా
జరుగుతోందో,…. అదేవిధంగా - ఈ జీవుడు ఈ దృశ్యమును చూస్తూ, స్వస్వరూపమును
ఏమరచి కోపము-ఆవేశము మొదలైనవి పొందుతూ దుఃఖితుడు - మూర్ఖుడు అవటం
జరుగుతోంది! ఇదియే అవిద్య.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
226
అవిద్యయొక్క చమత్కారంచేత ఈ జీవుడు తననుతాను ఎరుగలేకున్నాడు. అట్టి అజ్ఞానమును
ఆవరణగా కలిగియుండి అనేక వేదనలతో దుఃఖములతో మ్రగ్గుచున్న జీవునికి
ఉపశమనం కలిగించగలిగినదెవ్వరు? జ్ఞాని మాత్రమే! దేహములు - దేహి, జాగ్రత్
స్వప్న సుషుప్త సాక్షిని ఎరిగిన ఆత్మజ్ఞాని మాత్రమే అజ్ఞానికి (దుఃఖము - ఆదుర్దాలు
తొలగటానికి) అత్యావస్యకమయ్యా! జ్ఞాని చెప్పేవిశేషాలచేత అజ్ఞాని స్వస్వరూపాత్మ యొక్క
ఔన్నత్యమేమిటో ఎరుగుచున్నాడు!
వేరు వేరు గురువుల విభాగయోగములు
ఇప్పుడు ఆత్మజ్ఞాన సంబంధంగా వేరువేరు గురువులు అధ్యాత్మశాస్త్ర పాఠ్యాంసాలుగా
తమ శిష్యులకు బోధిస్తున్న విభజన - విశ్లేషణా విశేషాలు కొన్ని ఇక్కడ ఉదహరిస్తున్నాను.
1. జీవ-ఈశ్వరులు చిత్ అభేదత్వం (అద్వైతం)
జీవుని రూపము చిత్ (ఎరుగుట) చైతన్య రూపం
ఈశ్వరుని రూపముకూడా చిత్ చైతన్యరూపమే!
శ్లో॥ పురుష - ఈశ్వరయోః అత్ర న వైలక్షణ్యమ్ అణ్వపి
తత్ అన్యకల్పనా అపార్ధా జ్ఞానం చ ప్రకృతేర్గుణః||
జీవ ఈశ్వరులకు భేదమే లేదు. ఒక నాటకం పాత్రగా కనిపిస్తున్న ఒక వ్యక్తికి
(నటునికి) - బాహ్యాన మరొక సమయంలో స్నేహితులతో షికారుకు వెళ్ళుచున్న అదేవ్యక్తికి
భేదమేమున్నది? నాటకంలో నాటకరంగముపై ఏక-అనేక పాత్రుడుగా కనిపిస్తున్నది
అతడే! వ్యక్తిగత జీవితంలో స్నేహితులతో నవ్వులు చిందిస్తున్నదీ ఆతడేకాదా! అంతేగాని,
“ఈ నాటకంలోని పాత్రగా ఇతను వేరు - ఈతడే ఇంటివద్ద వున్నప్పుడు ఇతను వేరు” -
అని అంటామా!
జీవుడు - అందరిలో ఒకడు. ఈశ్వరుడు - అందరిగా ఉన్నవాడు.
జీవుడు - ఈశ్వరుడు ఈ ఇద్దరికి భేదం కల్పించటం అపార్ధమే! అజ్ఞానమే!
ప్రకృతికి సంబంధించిన గుణముల భేదంచేత వేరువేరుగా కనిపించవచ్చుగాక! గుణి
దృష్ట్యా (గుణములకు మునుముందే ఉండి గుణములను ప్రదర్శించే చైతన్యసత్త దృష్ట్యా)
జీవుడు - ఈశ్వరుడు ఒక్కటే! ఒక్క తీరైనవారే! (జీవో శివః! శివో జీవః! జీవో బ్రహ్మేతి
నా పరః!)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
227
త్రిగుణములు
సత్త్వము 2. రజము 3. తమము. ఈ మూడు గుణముల వివిధ పాళ్ళ కలయిక,
వాటి సామ్యావస్థయే ప్రకృతి అను శబ్దముయొక్క అర్ధమైయున్నది.
సృష్టి సత్వగుణము జ్ఞానము
స్థితి రజోగుణము కర్మ
లయము తమోగుణము అజ్ఞానము
సృష్టి-స్థితి-లయములకు హేతువు ఏమిటి? అని ప్రశ్నిస్తే…. త్రిగుణములే! అని
సమాధానం అవుతుంది.
అటువంటి త్రిగుణములు
ప్రకృతికి సంబంధించినవి మాత్రమే!
ఆత్మకు సంబంధించినవి కానే కావు.
ఈశ్వరుడు గుణములకు కారకుడు.
గుణములను వ్యక్తీకరించువాడు
కాలస్వరూపుడు. కాలనియామకుడు. కాలః కాలః!
స్వభావమునకు అధిపతి (One who is exhibiting Features & Qualities)
సర్వమునకు సూత్రధారి.
చమత్కారం ఏమిటంటే - త్రిగుణసమన్వితమగు నటనకు సూత్రధారి ఆతడే! పాత్రధారి
ఆతడే!
పంచభూతములు :
క్షితిః భూమి (Solid)
ఆపః జలము (Liquid)
జ్యోతిః అగ్ని (Heat)
అః వాయువు (Vapour)
నభః ఆకాశము (Space-Placement)
ఈ ఐదు మహాపంచ భూతములు. వీటి వివిధ పాళ్ళ కలయికయే దృశ్యప్రపంచము.
ఇంతకుమించి ఎక్కడా ఏదీ లేదు! ఏదైనా ఉంటే అది కూడా ఇవే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
228
నవతత్త్వములు :
పై పంచభూతములు " 5 మరియు
పురుషుడు వ్యష్ఠికర్మలకు కర్త. (Individual Experiencer)
ప్రకృతి స్వభావము (Features)
అవ్యక్తము దేహమనోబుద్ధులను వ్యక్తీకరిస్తూ ఉంటున్నది.
తాను వ్యక్తము కాక, సర్వము వ్యక్తీరించుచున్నట్టిది.
అహంకారము - ఇది నాది - మనస్సు నాది అని తలచు తత్త్వము.
జ్ఞానేంద్రియ పంచక - కర్మేంద్రియ పంచక దశ తత్త్వములు + మనస్సు
జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు
శోత్రము (చెవులు) వాక్కు
చర్మము చేతులు
చక్షువులు (కళ్ళు) పాదములు
నాశిక(ముక్కు) పాయువు (మలద్వారం)
నాలుక ఉపస్థ
ఈ పది జ్ఞానేంద్రియములు మరియు కర్మేంద్రియములను తన ఉపకరణంగా
ఉపయోగిస్తున్న 11వది మనస్సు. ఈ ఏకాదశ విశేషాలే ఇదంతా!
అంతరంగ చతుష్టయం
మనస్సు ఆలోచనావిభాగం (Thought)
ఏది ఆలోచించాలో నిర్ణయించుకునే 2. బుద్ధి విభాగం
(Intellectual)
చిత్తము ఇష్ట విభాగము. ఏది ఆలోచించాలో అది అభిరుచినిబట్టి
ఉంటుంది. అదియే ఇష్టము (లేక) చిత్తము (Interest)
అహంకారము ఇది నా ఆలోచన
ఇది నా తెలివి
ఇది నా ఇష్టము
నాది నాది అనుకునే విభాగం (“I” “My”) -
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
229
జ్ఞానేంద్రియ విషయములు
శబ్దము (ఉపకరణం చెవులు)
స్పర్శ (ఉపకరణం - చర్మము)
(ఉపకరణం రూపము - కళ్ళు)
రసము (ఉపకరణం - నాలుక)
గంధము (ఉపకరణం - ముక్కు)
ఈ ఐదు తత్త్వములు - శక్తి తత్త్వములు.
(Veriety manifestations of the Universal Energy)
వీటి పరిణామమువల్లనే ఆకాశము వాయువు - అగ్ని - జలము భూమి రూపు
దిద్దుకుంటున్నాయి.
కర్మాయతన సిద్ధములు లేక కర్మేంద్రియ ఫలములు నాలుగు
శ్లో॥ శబ్దః స్పర్శో రసో గంధో రూపంచేత్ అర్థజాతయః
గక్త్యుత్సర్గ శిల్పాని కర్మాయతన సిద్ధయః ॥ (అధ్యా 22, శ్లో 16)
గతి Motion
ఉక్త్యుత్ Raise
ఉత్సర్గము Relationship
శిల్పము Form
పంచతన్మాత్రలు - శబ్ద స్పర్శ రూప రస గంధములు. వీటన్నిటి రచయిత యజమాని,
ఆస్వాదకుడు పరమాత్మయే!
వ్యక్తా వ్యక్తములు : సప్త ధాతువులు
వ్యక్తము (That being Exhibited and manifested) : ఈప్రదర్శించబడుచూ
ఇంద్రియములకు తారసడుచున్న (కంటికి కనబడేవి - చెవులకు వినబడేవి మొదలైనవి)
సృష్టికి-ఇద్దాని స్థితికి - లయమునకు కారణము - కార్యకారణ రూపిణియగు ప్రకృతియే!
– ఇదంతా అనుభవించబడునది ప్రకృతిచేతనే అయిఉన్నది (that being experienced)
అవ్యక్తుడు : సంభవింపజేయువాడు. ఈతడు అనుభవించబడుచున్నదానిని (That
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
230
being experiencesd) - అను దానికి వేరుగా - “అనుభవించువాడు One who is
experiencing” - గా ఉన్నవాడు. అనుభవములకు - అనుభవించబడుదానికి సాక్షి
(Beyond and mere witness) గా ఉన్నవాడు. అనుభవించబడుదానిని
పర్యవేక్షిస్తున్నవాడు. నిర్వచిస్తున్నవాడు. ఆస్వాదిస్తున్నాడు.
శ్రీ ఉద్ధవుడు : కృష్ణయ్యా! అట్టి అనుభవము (experiencing) కు విషయము (Material) అయి చెన్నొందుతున్న ఈ ప్రకృతి ఎక్కడినుండి ప్రదర్శితమౌతోంది. ఈ ప్రకృతికి
ఉత్పత్తి స్థానమేది?
శ్రీకృష్ణుడు :
శ్లో॥॥ వ్యక్తాదయో వికుర్వాణా ధాతవః పురుష ఈక్షయా |
లబ్ధవీర్యాః సృజంతి అండం సంహతాః ప్రకృతేర్బలాత్ ॥ (అధ్యా 22, శ్లో 18)
పురుషుడు - ప్రకృతి అని రెండు విశేషాలు చెప్పుకుంటున్నాము కదా!
పురుషుడు Perceiver
ప్రకృతి Perception - objects of perception
పురుషుని ఈక్షణ (visualization, perception) యే ప్రకృతి అను శబ్దము యొక్క
ఉత్పత్తి, నిర్వచనము కూడా!
పురుషుని నుండే ప్రకృతి బయల్వెడలుతోంది. (The nature of the Being is
emitting out of the said being only)
ప్రకృతి నుండి ఆకాశము వాయువు అగ్ని జలము భూమి (Space - -
Vapour - Heat - Liquid - Solid) అనే పంచభూతములు - జీవుడు - ఈశ్వరుడు
అనబడే సప్తధాతువులు (సప్తతత్త్వములు) ఉత్పన్నమగుచున్నాయి. ఈ సప్తధాతువులు
పరస్పరం వేరువేరు విధాలుగా సమ్మిళితమై ఈ వివిధరీతులుతో కూడిన బ్రహ్మాండము
ప్రదర్శితమౌతోంది.
సప్తధాతువుల సమ్మేళనమునుండి చలనము - గతి రూపంగా ప్రాణశక్తి ఉత్పన్నమౌతోంది.
శక్తియొక్క చమత్కారంగా దేహములు ఇంద్రియములు ఇంద్రియ శక్తులు
ప్రదర్శితమౌతున్నాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
231
చతుర్విధ తత్త్వములు
కొందరు మహనీయ గురువులు తత్త్వములు 4 విధములు అని చతుర్విధ తత్త్వములుగా
విభజించి చెప్పటం జరుగుతోంది.
శ్లో॥ చత్వార యేవేతి తత్రాపి తేజ-అపో-అన్నమ్-ఆత్మనః |
జాతాని తైరిదం జాతం జన్మావయవినః ఖలుః 11 (అధ్యా 22, శ్లో 21)
చతుర్విధ తత్త్వవిభాగ వేదుల దృష్టిలో…,
భూమి 2. జలము 3. తేజస్సు 4. ఆత్మ
అంతా కలిపి ఈ నాలుగే! ప్రతి జీవుడు జంతువు దేవత… ఈ నాలుగు
విశేషముల సమ్మేళనమే!
ఈ చతుర్విధ (కారణరూప) తత్త్వములనుండి కార్యరూపంగా ఈ సృష్టి అంతా
పరిఢవిల్లుతోంది!
అట్టి సృష్టిలోంచి జగత్తు ఉత్పన్నమౌతోంది.
చతుర్విధ మహాతత్త్వములుసృష్టి జగత్తు
సప్తదశ (17) సంఖ్యా విభాగాలు
పంచమహాభూతములు 5
పంచ తన్మాత్రలు 2. 5
(శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలు)
పంచేంద్రియములు 5
మనస్సు 1
ఆత్మ 1
ఈ 17 తత్త్వములే సర్వము కూడా!
షోడష (16) సాంఖ్యా వేదులు
వీరు 17 తత్త్వములు చెప్పు వారి వలనే విభజిస్తున్నారు. అయితే వీరి దృష్టిలో మనస్సు
ఆత్మ వేరైనవి కావు. ఆ రెండు అభిన్నములు. మనస్సు ఆత్మలోనిదే! ఆత్మయే మనస్సుగా
కనిపిస్తోంది!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
233
త్రయోదశ (13) సాంఖ్యవేదులు
పంచ మహాభూతములు 5
పంచేంద్రియములు 5
మనస్సు 1
జీవాత్మ 1
పరమాత్మ 1
అని విభాగించి ప్రవచిస్తున్నారు.
ఏకాదశ (11) తత్త్వ సాంఖ్యవేదులు
పంచమహాభూతములు 5
పంచేంద్రియములు 5
ఆత్మ 1
నవ (9) తత్త్వవిదులు
అష్టవిధ ప్రకృతులు దృశ్యము - దేహము - ప్రాణము - మనస్సు-బుద్ధి -
చిత్తము - వ్యష్టి అహంకారము (జీవాత్మ) - -
దీనికి ఆవల పురుషుడు. ఆతని కావల పరమపురుషుడు!
జీవాత్మ పరమాత్మ
అధ్యాయము–33.) అధ్యాత్మము - అధిభూతము - అధి దైవము |
వింటున్నావా? మిత్రమా, ఉద్ధవా! ఈవిధంగా సత్యాన్వేషకులై, సత్యద్రష్టలగు వేరువేరు
కాలాలలో ఋషులు గురువులై వారివారి యుక్తియుక్తములు - లెక్కలను, ఆత్మతత్త్వమును
బోధించటానికి వారనుకొన్న ఉపాయములను అనుసరించి - విభాగములు చేసి చెప్పటం
జరుగుతోంది. జరగబోతోంది. సత్యమును నిర్వచించి చెప్పేదంతా సత్యమే! అవి
ఋషివాక్కులు. అసత్యమెందుకౌతాయి?
శ్రీ ఉద్ధవుడు : కృష్ణయ్యా! ప్రకృతి :: పురుషుడు ఈ రెండూ సహజంగా విలక్షణులు
కదా! ప్రకృతి - పురుషులు (My qualities + I) ఈ రెండు కలసి ఉండటంచేత లౌకిక
సామాన్య దృష్టిచే ఆ రెండిటికీ భేదము కనిపించదు.
ఈ దేహము ప్రకృతిచే నిర్మితమౌతోంది! (ప్రకృతి - కారణము : దేహము
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
234
కార్యము). ప్రకృతియో - ఆత్మకు అంతర్గతము. ఆత్మయందు ప్రకృతి - ప్రకృతియందు
ఆత్మ లక్షితములై (ఒకదానికి మరొకటి లక్ష్యరూపములై -Aimed at) ఉంటున్నాయి.
ఓ పుండరీకాక్షా! సర్వజ్ఞా! శ్రీకృష్ణా!
ఇప్పుడు నేను చెప్పినపై విశ్లేషణ యుక్తియుక్తమేనా? (Is it so or not?)
శ్లో॥త్వత్తో జ్ఞానం హి జీవానాం ప్రమోషస్తే అత్ర శక్తితః |
త్వమేవ హి ఆత్మమాయాయా గతిం వేత న చ అపరః 11 (అధ్యా 22, శ్లో 28)
స్వామీ! మీ యుక్తియుక్తమైన వాక్కులతో నాలో శేషించియున్న (ఇంకా మిగిలిపోయి
ఉన్న) సందేహములను తొలగించవలసినదిగా మిమ్ములను వినమ్రుడనై
వేడుకుంటున్నాను.
నీ అనుగ్రహముచేతనే జీవులకు జ్ఞానము కలుగుచున్నదయ్యా!
అట్లాగే….,
నీ మాయాశక్తి వలననే జీవులలో జ్ఞానము అజ్ఞానముచే కప్పబడి ఉంటోంది!
నీమాయా శక్తి స్వరూపమును నీవు మాత్రమే ఎరుగగలవు. ఇతరులెవ్వరు
ఎరుగజాలరయ్యా!
శ్రీకృష్ణభగవానుడు : ఓ పురుషశ్రేష్ఠుడా! ప్రియ మిత్రమా! ఉద్దవా! ప్రకృతి - పురుషులు
వేరుగా విభాగించుకున్నంత మాత్రంచేత తత్త్వం ప్రస్ఫుటం కాదు. బోధన సంపూర్ణం
కాదు. సామాన్యంలోంచి విశేషమును బుద్ధితో విభాగించి, ఆ తరువాత బుద్ధితో
విశేషముకు సామాన్యముతో ఏకము, సామాన్యమునందు లయము చేయటమే తత్త్వశాస్త్ర
పఠనము సుమా!
నిర్వికారమగు మట్టితో సాకారమగు అనేక బొమ్మలు తయారు చేయవచ్చునుగదా!
అయినాకూడా, మట్టిబొమ్మలుగా కనిపించేదంతా మట్టియేకదా! బొమ్మల దృష్ట్యా చూస్తే
అనేక విశేషములతో కూడిన ఆకారాలు! మట్టి దృష్ట్యా? అంతా ఒక్కటే!
అట్లాగే…,
ఆత్మ నిర్వికారము. నిరాకారము ———
ప్రకృతి గుణముల క్షోభతో కూడుకొనినది. దేహాదుల సంరభముతో వెల్లివిరిసేది.
సవికారము. సాకారము.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
235
గుణమయమగు నా మాయ సత్త్వ - రజ తమో గుణ చమత్కారములతో
కూడిన భేదానుభవమునకు కారణమగుచున్నది. భేదదృష్టిని సృష్టిస్తోంది! అట్టి భేదములన్నీ
క్రోడీకరించి,….
1. అధి భౌతికము Differences being experienced because of
Physical factor)
2. అధి దైవికము Differences being experienced because of
incidents, relationships and points of view
3. అధ్యాత్మికము అనేకతరంగాలుగా జలము కనిపిస్తున్నట్లు
గాలి అనేక వస్తువులలో ప్రవేశించి ఆయా
ఆకారములుగా అయి వస్తువుల రూపంగా
కనిపిస్తున్నట్లు ఏకము అఖండమగు ఆత్మ అనేకముగా
కనిపించటం
బంగారము అనేక ఆభరములుగా విభాగమౌతోందా? లేదే! ఆభరణములెన్ని ఉన్నా
బంగారం ఒక్కటే కదా!
అంతే కాకుండా… ఇంకా విను! త్రివిధ విశ్లేషణము గురించి చెప్పేడప్పుడు శాస్త్రకారులు,
సిద్ధాంచీకరించే మహర్షులు ఏవిధంగా విశ్లేషించి వివరించుచున్నారో చెప్పుచున్నాను.
నేత్రేంద్రియములు అధ్యాత్మము
చూడబడే దృశ్య విశేషాలు అధిభూతము |
నేత్రగోళములో ఏర్పడి ఉన్నదై
ప్రకాశించే సూర్యగోళము అధి దైవము
ఈ మూడు కూడా (నేతేంద్రియము + దృశ్యము + చూపు శక్తి) పరస్పరాశ్రయముచే
సిద్ధించటం జరుగుతోంది.
అయితే…
ఈ ముడింటికి మూలకారణము మరొకటున్నది. అదియే…. ఆత్మ!
ఆకాశంలో స్వప్రకాశముచే సూర్యునికి దేనిపట్ల ఆపేక్ష అనేది లేక పోయినప్పటికీ….
అన్నిటినీ నిరపేక్షగానే ప్రకాశింపజేస్తూ ఉంటాడు చూచావా?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
236
అట్లాగే….,
ఆత్మ భగవానుడు కూడా అధ్యాత్మ - అధిభూత - అధి దైవముల ఉనికికి, తత్సంబంధమైన
కార్యక్రమములకు మూలకారణము కారణ కారణము అయి ఉన్నారు. అట్లాగే,
దేనికీ కారణము కాదు!
అందుచేత ఏకరూపము - అభిన్నము అగు ఆత్మ…, త్రివిధతత్త్వములకంటే భిన్నరూపమై
స్వయం ప్రకాశమై…, ప్రకాశించే సర్వవస్తువులకు (మనో-ప్రాణ-బుద్ధి-చిత్తఅహంకారాదులకు, దృశ్యమునకు కూడా) ప్రకాశకమై యున్నది!
ఇప్పుడు నేత్రములగురించి చెప్పుకున్నాం. అట్లాగే…,
శ్లో॥ ఏవం త్వక్ ఆది-శ్రవణ ఆది చక్షుః |
జిహ్వాది నాసాది చ చిత్త యుక్తమ్ ॥ (అధ్యా 22, శ్లో 32)
చర్మము - చెవులు నాలుక ముక్కు - చిత్తము బుద్ధిలకు కూడా త్రివిధ తత్త్వ
విశేషాలున్నాయి.
తాపము తపించబడునది. (that which is functioning)
తపించువాడు (one who is making to function) ఆత్మ !
అధ్యాత్మము అధిభూతము అధి దైవము
(Product) (Purpose) (Producer)
1. త్వక్ ఇంద్రియము స్పర్శ వాయు దేవుడు
స్పర్శేంద్రియము (చర్మము)
2. శోత్రము (చెవులు) శబ్దము (Sound) దిక్ దేవతలు
3. జిహ్వ (నోరు) రసము (Taste) వరుణ దేవుడు
నాసిక 4. (ముక్కు) గంధము (Smell) అశ్వనీ దేవతలు
5. చిత్తము ఇష్టము (Interest) వాసుదేవుడు
6. మనస్సు మనోవిషయము చంద్రుడు
7. తెలుసుకొనబడుచున్నది బ్రహ్మదేవుడు బుద్ధి
8. అహంకారము అహంకరించబడుచున్న
విషయము రుద్రుడు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
237
ఈవిధంగా అధ్యాత్మము, అధిభూతము, అధిదైవము ఏర్పడినవై ఉన్నాయి.
వికారాత్మకమగు అహంకారము 1. వైకారము 2. తామసము 3. ఐంద్రియము
(ఇంద్రియ సంబంధమైన ఈ దృశ్యము) అనే ఈ మూడు మోహ వికారములకు (llusinary
misconceptions) కారణమై ఉంటోంది.
అనగా…,
అహంకారము…
1. వైకారికము దృశ్య విషయములను చూచి భావావేశము పొందటం
తాపము తపన - అవినాభావత్వము మొదలైనవి
సంతరించుకోవటం.
కోపముతో కూడిన 2. తామసము ఆవేశము, అధర్మయుతమైన
మార్గములో బాధించటం (Hurting) పగ (Revenge)
సాధించటం వేధించటం (Teasing)
3. ఐంద్రియము ఇంద్రియములకు వశం అయి అవిచారణ పూర్వకంగా
కాలము వెచ్చించటం, వెల్లబుచ్చటం, దురభ్యాసముల
నుండి వెనుకకు మరలలేకపోవటం
ఈ మూడు వికారములను ప్రదర్శించటం జరుగుతోంది!
శ్రీ ఉద్ధవుడు : మహాత్మా! శ్రీకృష్ణా! ఇక్కడ నాదొక మరొక సందేహము. ఆత్మ అఖండము,
అని వేదోపనిషత్తులు, ఋషి వాక్యములు ఎలుగెత్తి ప్రకటిస్తున్నప్పటికీ అఖండమగు
ఆత్మ ఉన్నదో? లేదో?… అనే సందేహం కూడా కొందరు కలిగియే ఉంటున్నారే?
శ్రీకృష్ణుడు : అవును! అఖండమగు ఆత్మ ఉన్నదని శాస్త్రాదులు నిర్వచిస్తూ ఉండగా
“అటువంటి అఖండమగు ఆత్మ ఏదీ లేదు!” అని కొందరు ఆ విషయమును తిరస్కరిస్తూ
ఉన్నారు.
అయితే…,
“ఆత్మ అనేది లేదు అద్దాని గురించి చర్చ, పరిశీలన అవసరంలేదు కూడా!” అని
నమ్మేవారు వాదించేవారి విషయంలో కూడా, “ఏది సత్యము?” అనే ప్రశ్నకు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
238
సమాధానం లభించక, “ఈ జీవుడు ఎట్టివాస్తవ స్వభావుడు?”…. అనే విషయంలో
వారు ఒక కొలిక్కి తీసుకు రాలేక ఆ ప్రశ్న నివృత్తం కావటంలేదు! ఈ జీవుడెవరు?
పంచభూతముల కలయిక నుండి ఏర్పడిన ఏదైనా నూతన శక్తియా? దేహపతనంతో
లేనివాడగుచున్నాడా? వేరు వేరు అభిరుచిలుగల జీవులు, వారి స్వభావములు రక్తమాంస - బొమికలవా?
సత్యము యమ్ సత్
యొక్క అవగాహనకై తగిన ప్రయత్నమునకు ఉద్యుక్తుడు కానంతవరకు ఇటువంటి
అభిప్రాయ పరంపరలు బుద్ధిని భ్రమింపజేస్తూనే ఉంటాయి. బుద్ధి చంచలత్వమును
వీడదు. జీవునికి వాస్తవమైన - స్వభావసిద్ధమైన ప్రశాంతత లభించదు.
జీవుని వాస్తవ - సహజ-శాశ్వత స్వభావమును గురించి వినటం-పఠించటంతెలుకోయత్నించటం అనుక్షణికం చేసుకోవటముచే ఈ జీవుడు దేహ మనో చిత్త
అహంకారాదులకు యజమాని… అని తెలియబడగలదు.
శ్రీ ఉద్ధవుడు : ఓ దేవదేవా! నీవు సర్వతత్త్వ స్వరూపుడవు! నీ నుండి ప్రవృతమైన
బుద్ధిగల మానవులు వారివారి స్వయంకృత కర్మలను అనుసరించి - ప్రవాహంలోపడి
తరంగాలచే ఎటెటో కొట్టుకు పోబడుచున్న చెక్కముక్కవలె… అనేక ఉచ్ఛ- నీచ
ఉపాధులలో సంచారాలు చేయవలసి వస్తోంది. జగత్ విషయాలచే వారి బుద్ధి ఆవృతమై
ఉంటోంది. నీ తత్త్వమును గ్రహించటం అసాధ్యం! కానీ నీ కరుణచే మాత్రమే
అగ్రాహ్యమగు దివ్యతత్త్వాన్ని ఎరుగగలం… అని విజ్ఞులు అంటూ ఉంటారు.
మేమందరము నీ మాయచే మోహితలమైన వారము! అయితే, నీవు ఆశ్రిత వత్సలుడవు!
భక్తవత్సలుడవు! మీ తత్త్వము మీరు మాత్రమే ఎరుగగలరు! తెలియజెప్పగలరు!
మాయా మోహితుడనైన నన్ను మీరే రక్షించాలి. మీ తత్త్వమును ఎరుగుటమే
దురత్యయమైన మీ మాయను దాటటానికి ఉపాయం కదా! అందుకే మహనీయులందరు
కృష్ణచైతన్య తత్త్వమును గానంచేస్తూ నావంటి ఆర్తులగు జనుల చెవులకు - హృదయాలకు
ఔషధంగా ప్రసాదిస్తూ ఉంటారు.!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
239
అధ్యాయము–34.) దేహము దేహాభిమానము - దేహి
|
శ్రీ ఉద్ధవుడు : ఓ కృష్ణయ్యా! ఇప్పుడు ఈ సందర్భంలో నీ తత్త్వమును నీ నుండే వినాలని
నీకు విన్నవించుకుంటున్నాను.
శ్రీకృష్ణభగవానుడు : ఓ ఉద్ధవా! వేద - ఉపనిషత్ - మహర్షి ప్రవచనాలు నాయొక్క ఏ
తత్త్వము గురించి ఎలుగెత్తి గానం చేస్తూ వినిపిస్తున్నాయో అట్టి విశేషాలు చెప్పుతాను
విను.
ఈ భౌతిక దేహము పంచభూతము (భూ జల అగ్ని - వాయు ఆకాశము)లచే
నిర్మితమై యున్నది కదా! అటువంటి ఈ భౌతిక దేహము పంచేంద్రియములు (చెవులు,
చర్మము, కళ్ళు, నోరు, ముక్కు) కార్యక్రమములకు ఉపయుక్తమగు ఒక యంత్రము
వంటిది.
ఈ పంచేంద్రియములు తన ఉపకరణములుగా ఉపయోగించుకొనుచున్నది - మనస్సు.
మనస్సుకు యజమానియగు జీవుడు ఆ మనో ఉపకరణముతో ఒక దేహము నుండి
మరొక దేహమునకు, ఒక లోకము నుండి మరొక లోకమునకు సుదీర్ఘ - అవిశ్రాంత
ప్రయాణీకుడిలాగా బహుదూరపు బాటసారిగా కొనసాగించటం జరుగుతోంది.
ప్రయాణాలు చేస్తున్నాడు.
ఈ జీవుని వాస్తవరూపం ఏమిటి? అని పరిశీలిస్తే ఆత్మయే అనునదే సమాధానం.
ఆత్మయే దేహి. అట్టి ఆత్మ దేహముకంటే భిన్నమే అయినప్పటికీ…. అహంకారము
ద్వారా మనస్సు వెంట అనువర్తిస్తూ లోకాలోకాలలో దేహత్వమును అనుభవించటం
జరుగుతోంది. మనస్సు కర్మలకు అధీనమై ఎదురుగా ఇంద్రియములకు తారసబడే
విషయములను, ఆ విషయముల సంస్పర్శ - తాదాత్మ్యముచే సందర్భమౌతున్న కర్మకార్య క్రమములను క్షణక్షణం క్షణమునకు ఒకవిధంగా చింతన చేయటం
కొనసాగిస్తోంది!
ఈ మనస్సు ఏఏ విషయ సమూహములను చింతన చేస్తూ ఉన్నదో…. ఆ చింతనల
మధ్య మరల పుట్టి మరల మరల ఆ చింతనలలోనే లయిస్తూ, ఉన్నది! స్మృతిని
కోల్పోతూ, ఎప్పటికప్పుడు అనేక చింతనల మధ్య ప్రవర్తిస్తోంది
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
240
అనగా,…
ఈ మనస్సు దృశ్య సంబంధమైన - వేద విధి విధాన సంబంధమైన ఏవేవో చింతనలలో
జనిస్తోంది. లయిస్తోంది. మరల వేరైన విషయ చింతనలమధ్య జనిస్తోంది. మరల
లయిస్తోంది! పూర్వ చింతనల గురించి, పూర్వదేహ వ్యవహారముల గురించి స్మృతి
కోల్పోతోంది. విస్మృతి పొందుతోంది. పూర్వదేహముల వ్యవహారములచే రూపుదిద్దుకున్న
సంస్కారములచే మరల దేహ ప్రకాశ నిష్క్రమణలు (Manifesting and withdrawing
of Physics) కొనసాగిస్తోంది!
ఒక దేహము
ఆ దేహముతో అనేక కర్మల నిర్వహణ
అట్టి కర్మల నిర్వహణచే అనేక చింతనలు.
ఆ చింతనలచే ప్రోత్సహించబడిన మరికొన్ని కర్మ- పరంపరలు.
ఆ కర్మల ఫలములు. తద్వారా మరికొన్ని వేరైన కర్మలు - చింతనలు.
ఎప్పుడో ఈ భౌతిక దేహపతనము. వర్తమాన దేహమును త్యజించి ఈ జీవుడు
మరొక దేహాన్ని ఆశ్రయించటం.
ఆ మరొక దేహముతో వేరైన చింతనలు - కర్మలు - కర్మ ఫలములు - కర్మ
ఫలితానంతర చింతనలు.
ఆ చింతనల నుండి మరికొన్ని కర్మలు.
ఆ చింతన - కర్మ - చింతనల నుండి సుఖ దుఃఖానుభవాలు.
నూతన దేహముతో తారసపడే చింతన - కర్మలలో అత్యంత అభినివేశము వలన
పూర్వదేహమునకు చెందిన సంబంధ బాంధవ్యాదులు విస్మరించటం. (విస్మృతి
కలగటం).
ఒక దేహ చింతనా వ్యవహారం నుండి మరొక దేహమునకు ప్రయాణించటం (మృత్యువు)
చూచావా ఉద్ధవా! అటువంటి ఈ జన్మ - జన్మాంతర ప్రయాణం ఎటువంటిదంటే…
ఒకడు ఒక స్వప్నమునుండి మరొక స్వప్నములోనికి ప్రయాణించటం వంటిదే!
ఒక మనోరథము నుండి మరొక మనోరథానికి మనస్సును మరల్చటం వంటిది.
( From one type of Wants, Wishes, Exepctations, desires etc., to another such types of all those)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
241
స్వప్నము - మనోరథము (Dreaming & wishing) ఎట్లా తయారవుతున్నాయి?
వాటికి మూలము అభిమానమే (A kind of fondness) కదా!
ఆ రీతిగానే కొన్ని విషయములపట్ల - విశేషముల పట్ల - నామరూపాదులప
సంగతి, సందర్భ, సంఘటనల పట్ల విశేషమైన అభిమానము కలిగివుండుటచేతనే,
అదంతా కూడా జీవునిపట్ల “పునర్జన్మ” అను తతంగమునకు కారణభూతమైయున్నది.
ప్రస్తుత స్వప్నంలో ఉన్న ఒకానొకడు వెనుకటి రాత్రి స్వప్నంలోని అనుభూతులనువిశేషాలను స్మరిస్తున్నాడా? లేదు కదా! విస్మరించినవాడై వుంటున్నాడు కదా!
వర్తమాన మనోరథములలో (ఉదాహరణకు - యౌవన మనోరథములలో) ఉన్న జీవుడు
బాల్యములోని ఆట పాటలకు సంబంధించిన మనోరథములను స్మరిస్తున్నాడా?
గుర్తుచేసుకొని వాటివెంట పరుగులు తీస్తున్నాడా? లేదు.
అట్లాగే…,
వర్తమాన దేహమునందు - సంబంధిత వ్యవహారములయందు అభిమానము కలిగియున్న
ఈతడు పూర్వదేహ సంబంధములైన అభిమానములను సంస్మరించటంలేదు.
అయితే…,
పూర్వదేహమును (పూర్వ సందర్భమును) ధారణ చేసిన ఆత్మయే వర్తమాన దేహము
సందర్భములో కూడా ఆస్వాదించుతోంది. సద్యోజాతము అగు (అదియే ఇక్కడికి వచ్చింది)
ఆత్మ ఉభయ దేహములను ఆస్వాదించటం జరుగుతోంది. ఇంకా విను.
ఒక జీవుడు ఒక స్వప్నంలో అనేకమంది స్నేహితులను - శత్రువులను - బంధువులను
- తెలిసినవారిని - తెలియనివారిని చూస్తున్నాడనుకుందాం!
ఆ స్వప్న ద్రష్టకు కనిపిస్తున్నవారందరూ ఎవ్వరు? ఆ స్వప్నద్రష్ట యొక్క స్వయంకృతమైన
స్వప్నదృష్టి - స్వప్నసృష్టియే కదా! అంతేగాని, ఆతని స్వప్నములోకి మరొకరెవరో వచ్చి
ఆయా జనములను - దృశ్యములను సృష్టించారా? కల్పించి ఆ స్వప్నద్రష్టకు అవన్నీ
చూపిస్తున్నారా? లేదు కదా!
జీవుడు తన జాగ్రత్లోంచి ఏవేవో ఆలోచిస్తూ ఆలోచిస్తూ స్వప్నంలోకి
జారుకుంటున్నాడు. స్వప్న దృష్టియే స్వప్న దృశ్యంగా పరిఢవిస్తోంది.
అనగా….
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
242
జీవుడు తన స్వప్నమునందు తానే తన స్వప్న చైతన్యమునకు చెందిన సంస్కారములచేత
వివిధములగు దేహములను సృష్టించుకుంటున్నాడు. దర్శిస్తున్నాడు. ఆ స్వప్నాంతర్గత
స్వయంకృత దేహములతో సంచారాలు చేస్తున్నాడు. ఆడుకుంటున్నాడు. పాడుకుంటున్నాడు.
దుఃఖిస్తున్నాడు. భయము ఆవేశము మొదలైనవన్నీ అనుభ విస్తున్నాడు. స్వప్నద్రష్ట
యొక్క స్వప్నచైతన్యమే స్వప్నాంతర్గత సర్వరూపనామాదులన్నీ ధరిస్తోంది. స్వప్న ద్రష్టకు
నవరసానుభవములు కలిగిస్తోంది. నిద్రనుండి లేవగానే ఆ స్వప్న చైతన్యంలోనే
స్వప్నాంతర్గత విశేషాలు తరంగం జలంలో లయిస్తున్నట్లు- లయిస్తున్నాయి. స్వప్న
చైతన్యమేమో స్వప్నద్రష్ట యొక్క స్వస్వరూపంలోనే లయిస్తున్నది కదా!
జాగ్రత్లో కూడా జరుగుచున్నది అదే! జాగ్రత్ చైతన్యము స్వస్వరూపము నుండి
బయల్వెడలి, జాగ్రత్ వ్యవహారమంతా ఆస్వాదించబడిన తరువాత ఆత్మ చైతన్యమునందే
లయమౌతోంది.
మనస్సుయొక్క దేహ-దేహాంతర అభినివేశమువలన దృశ్య దృశ్యాంతర్గత విశేషములన్నీ
ఆత్మయందే అసద్రూపంగా వెల్లడి అగుచున్నాయి.
ఆత్మచైతన్యము
జాగ్రత్ చైతన్యము స్వప్న చైతన్యము
జాగ్రత్ ద్రష్ట స్వప్న ద్రష్ట
జాగ్రత్ దృశ్యానుభవం స్వప్న దృశ్యానుభవం
కనుక….,
ఆత్మయే అసద్రూపములగు బాహ్య అభ్యంతర కార్య కారణములకు, తత్భేదములకు
మూలకారణమగుచు, తాను అప్రమేయమై నిత్యమై సర్వదా సద్రూపమై ప్రకాశిస్తోంది…
అనునది గమనించు. ఆత్మయే జాగృత్ సాక్షిగా, జాగృత్ ద్రష్టగా, జాగృత్ దృశ్యముగా
స్వకీయ కల్పనా కళా విశేషం చేత అగుచున్నది. అదే రీతిగా - స్వప్నసాక్షిగా, స్వప్నద్రష్టగా,
స్వప్నదృశ్యముగా కల్పనాకళా విశేషం ఆస్వాదిస్తోంది. అట్లే సుషుప్తి కూడా!
ఓ ఉద్ధవా! కాలము (ఇది నా లక్ష్యము - అనునదేమీ లేకుండా….) అలక్ష్య వేగముతో
ప్రయాణిస్తూ ఉండగా, ప్రతిక్షణము అనేక దేహములు పుట్టుచున్నాయి. గిట్టుచున్నాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
243
అయితే…,
శ్లో॥ ॥ నిత్యదా హి అంగభూతాని భవంతి, న భవంతి చ
కాలేన అలక్ష్య వేగేన సూక్ష్మత్వాత్ తత్ న దృశ్యతే || (అధ్యా 22, శ్లో 43)
కాలముయొక్క గతి (The flow and movement of time) అత్యంత సూక్ష్మమైనది
అయి ఉండటంచేత అవివేకులైన (ఆత్మ తత్త్వ వివేకము సంపాదించుకోనంత వరకు)
మానవులు ఆ కాలచమత్కారమును గమనించలేకపోతున్నారు.
కాలగతిచే ఈ కనబడే దేహాలన్నీ కూడా పుట్టటం - బాల్య యౌవన వార్ధక్యాలు
మరణము ఇత్యాది గతులకు నిరంతరం గురి అగుచున్నాయి. కాలముచే వాయువు
అగ్నిరూపంగాను, అగ్ని స్థూల రూపములగు వస్తు రూపములుగాను, మానవ - జంతు
దేహములుగాను వివర్తము పొందుచూనే ఉన్నాయి. మరల ఈ భౌతిక వస్తు జాలమంతా
గాలిలో కలిసిపోతున్నాయి.
కాలముచే పరివర్తనము కానిది ఏమున్నది? అయినప్పటికీ అవివేకులైన జీవులు
వర్తమానం నిత్యమేకదా - అని అని భ్రమిస్తున్నారుభ్రమిస్తున్నారు. . భ్రమచేత…, నిన్ను కాలాతీతుడగు
ఆత్మగా గ్రహించు!
దీప జ్వాలకు హేతువు దీపము
జల తరంగానికి హేతువు జలము
అని అనుకొంటూ ఉంటారు. దీపాగ్ని జ్వాలగా మారుతోందా? నదీ జలము తరంగాలుగా
మారుతోందా? అట్లాగే ఆత్మయే ఈ జీవుడు - దేహములకు హేతువు అయినట్లో
(లేక) ఆ రీతిగా కల్పించుకున్నట్లో(కాక) ఆవిధంగా అగుచున్నట్లో అనిపించవచ్చుగాక!
మట్టిబొమ్మ - మట్టి… బొమ్మగా మారిందా? బంగారు ఆభరణం బంగారము..
ఆభరణముగా మారిందా? ఆత్మ సర్వదా యథాతథమేగాని, జీవుడుగా మారుచున్నది
ఎన్నడూ లేదు! ప్రజ్వలించే అగ్ని-అగ్ని జ్వాల, నదీ జలం-జలతరంగము ఒక్కటే
అయినట్లు పరమాత్మ-జీవాత్మ ఒక్కటే!
మండుచున్న కట్టెను నీళ్లతో ఆర్ఫామనుకో! అనగా, ఆ కట్టెను మండిస్తున్న అగ్ని
నశించిందా? లేదు కదా! అగ్నికి ఉత్పత్తి-వినాశనములు కట్టెను మండించటముచేత
- ఆర్పుటచేత కలుగుచున్నాయి… అని అనలేముకదా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
244
అట్లాగే కర్మలవలన జన్మ కలుగుతోంది. అప్పుడు జీవుడు పుట్టుచున్నాడు. ఆ కర్మలచే
దేహము నశించినప్పుడు ఆ జీవుడు (దేహి) నశిస్తున్నాడు అని అనుకోవటం కూడా!
జీవుని జన్మ-కర్మ-మరణములు కలగటమంతా దేహసంబంధమాత్రమే అయి ఉండగా,…
అవన్నీ అజ్ఞులు దేహికి (లేక) ఆత్మకు భ్రాంతిచే ఆపాదిస్తున్నారు. ఆత్మజ్ఞానము
సంపాదించుకోకపోవటంచేత “నేను దేహంతో పుట్టుచున్నాను. చస్తున్నాను. మరొక
దేహంలో ప్రవేశిస్తున్నాను…” అనునవన్నీ సత్యమువలె అనిపిస్తున్నాయి. భ్రాంతిచేతనే
జీవుడు పుట్టుక-చావు కలవానివలె ఉపలక్షితుడు అగుచున్నాడు. అగుపిస్తున్నాడు (లేక
అట్లా అనిపిస్తోంది). వాస్తవానికి ఈ జీవుడు దేహముతో జనించటములేదు.
(అంతకుముందే వున్నాడు) దేహంతో నశించటములేదు. (ఆ తరువాత కూడా వుంటాడు)
దేహాలు మాత్రమే వస్తున్నాయి - పోతున్నాయి.
ఈ భౌతిక శరీరావస్థలు ఏవేవి?
శ్లో॥ నిషేక గర్భ జన్మాని బాల్య కౌమార యౌవనమ్
వయోమధ్యం జరా మృత్యుః ఇతి అవస్థాః తనోః నవ ॥ (అధ్యా 22, శ్లో 47)
దేహికి దేహముతో కలుగుచున్న సంబంధ వ్యవహారములన్నీ 9 అవస్థలుగా
చెప్పబడుచున్నాయి.
1. నిషేకము - దేహాభివాన ఆవేశము 2. తల్లి గర్భములో ప్రవేశము 3. భూమిపై
జననము 4. బాల్యము 5. కౌమారము 6. యౌవనము 7. ప్రౌఢత్వము 8.
వార్ధక్యము 9. మరణము.
ఈ 9 అవస్థలు భౌతికదేహ-సంబంధమైనవి మాత్రమే! చిత్ చైతన్య స్వరూపుడగు
దేహి - సంబంధమైనవి కావు. ఇక వాటియొక్క అనుభూతి - మనస్సుయొక్క తీరుపై
ఆధారపడి ఉంటోంది.
దేహము వేరు - దేహి వేరు.
ఈ జీవుడు స్వాభావికమైన అవివేకముచేత, మనోరధముల ప్రభావంచేత, మనో
వికార జనితములైన తాదాత్మ్యముచేత - దేహమునకు సంబంధించిన అవస్థలను
తనవిగా భావించి అభిమానించి, తనయొక్క అప్రమేయత్వమును ఏమరస్తున్నాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
245
ఈ బాల్యం నాది! ఈ యౌవనం నాది! ఈ కష్ట సుఖాలు నావి! |
ఈ వార్ధక్యం నాది! ఈ మృత్యువు నాది! ఈ పునర్జన్మ నాది!
నావి! నావి! నావి!
అని అతడు స్వప్నసాదృశంగా భ్రమిస్తున్నాడు. రాత్రి స్వప్నంలో పుట్టాను. తిరిగాను.
పరుగులెత్తాను. తరువాత మెళుకువ వచ్చింది! - అనే స్వప్నానుభవం విషయంలో
స్వప్నానికి ముందు - ఆ స్వప్నానంతరం స్వప్న ద్రష్ట వున్నాడు కదా!
పరమేశ్వరానుగ్రహం చేత వివేకబలం పెంపొందించుకొన్న జీవుడు నాది అనే
అభిమనమును పాము కుబుసములాగా విడచి వేస్తున్నాడు. “జగత్ రచనా దురంధరా!
ఇదంతా నీదికదయ్య!” అని గమనిస్తున్నాడు! అప్పుడు ఈ జన్మకు ముందు ఆ
తరువాత కూడా నేను వున్నాను… అని గమనించటానికి అర్హుడగుచున్నాడు.
తండ్రి దేహియొక్క దేహమునుండి పుత్రదేహియొక్క దేహము బయల్వెడలుతోంది. పుత్ర
జననము వలన తండ్రి మరణించి పుత్రుడుగా జన్మిస్తున్నాడా? తండ్రి మరణమువలన
పుత్రుడు తన దేహం నశిస్తోందని అనుకుంటున్నాడా? లేదుకదా! దేహముల ఉత్పత్తివినాశనముల ధర్మములు ఎరిగినవాడు “పుత్రదేహం పుడుతోంది, తండ్రి దేహం
నశిస్తోంది” అన్నట్లుగా చూస్తాడు. తండ్రి మరణిస్తూ వుంటే ఈ దేహముయొక్క వినాశము
నాకు సంబంధించినదే అని కొడుకు అనుకోడు కదా!
వివేకి చావు - పుట్టుకలకు దేహ ధర్మములుగా చూస్తున్నడేగాని తన ధర్మములుగా
కాదు. తనను తాను ఆత్మస్వరూపుడుగాను, చావు పుట్టుకలు తనయొక్క జగత్-క్రియా
విశేషములుగాను గమనిస్తున్నాడు. వివేక - అవివేకములకున్న భేదం ఇంతవరకే!
బీజము నుండి వృక్షము వస్తోంది. బీజము నశించిందా? లేదు. బీజము వృక్షముగా
పరిణమించింది. అట్లాగే, “ జననమరణ పునర్జన్మాదులు ఒక దశనుండి మరొక
దశకు కాలగతిచే జరుగుచున్న స్వభావ సిద్ధమైన పరిణామం” అనే దృష్టితో జ్ఞాని
చూస్తున్నాడు అంతేగాని, ఈ దేహపరంపరలను “దేహం నశిస్తోది. జనిస్తోంది…” అనే
దృష్టితో కూడా చూడడు. జడమైన దేహమునకు చావు ఏమిటి? పుట్టుక ఏమిటి?
బాల్యదశ దాటి ఒకడు యౌవ్వనంలో ప్రవేశిస్తున్నాడేగాని, - బాల్యం నశించి యౌవ్వనం
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
246
జనిస్తోందా? అట్లాగే జడ దేహమునకు పుట్టుక లేదు. చావు లేదు. చేతనమగు ఆత్మ
దేహంతో పుట్టదు. దేహంతో చావదు.
ఈ పురుషుడు (జీవుడు) తన స్వస్వరూపము యొక్క స్వరూప స్వభావాలు
గమనించకపోవటంచేత “ఆత్మ ప్రకృతికంటే భిన్నమైనది” అనేది గుర్తించటంలేదు.
విషయములందు ఆసక్తుడై దేహాభిమానమును ఆవేశంగా కొనసాగిస్తున్నాడు. ఫలితంగా
సంసార దశలను తెచ్చిపెట్టుకొని అనుభవిస్తున్నాడు. అభిమాన ఆవేశములే
సంసారమునకు మూలకారణం! వాస్తవానికి దేహము పుట్టుట లేదు. చచ్చుట లేదు.
ఇక మృత్యుభయం వుండవలసిన పనేమున్నది?
అజ్ఞానంతొలగి ఆత్మజ్ఞానం వికశించి వెల్లివిరయటానికే కర్మలు ఉద్దేశ్యించ బడుచున్నాయి.
కనుకనే, “ఉత్తమ కర్మలు మొట్టమొదట శ్రద్ధగా ఆశ్రయించండి! నిర్వర్తించండి!” అని
శాస్త్రములు ప్రారంభ పాఠంగా బోధిస్తున్నాయి. దేహమున్నంత వరకు నిర్వర్తిస్తూ వస్తున్న
కర్మలే, తదనంతర ఉపాధులను నిర్ణయిస్తున్నాయి.
శ్లో॥ సత్త్వసంగాత్ ఋషీన్ దేవాన్
రజసా అసుర మానుషాన్
తమసా భూత తిర్యక్త్వం
భ్రామితో యాతి కర్మభిః ॥ (అధ్యా 22, శ్లో 52)
కర్మలను అనుసరించే బుద్ధి రూపుదిద్దుకుంటూ ఉంటుంది. (బుద్ధిః కర్మాణుసారిణీ)
వర్తమాన కర్మలయొక్క ఫలములను అనుసరించే తదనంతర జన్మలు రూపుదిద్దు
….9
కుంటున్నాయి.
ఒకానొకడు సత్త్వగుణాధిక్యత చేత ఋషిత్వమో - దేవత్వమో సంపాదించుకొను
చున్నాడు.
మరొకడు రజోగుణ ప్రాబల్యంచేత అసురత్వమో - మానుష్యత్వమో పొందటం
జరుగుతోంది.
ఇంకొకడు తమోగుణముయొక్క ఆధిక్యతచేత భూత పశు-పక్షి ఇత్యాది జన్మ
పరంపరలు పొందటం జరుగుతోంది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
247
వాస్తవానికి ఈ జీవాత్మ మౌనము ప్రశాంతము - అప్రమేయము - నిత్యము
సర్వాతీతము అగు కేవలాత్మ స్వరూపుడే! అయితే ఏం? ఒకడు ఒక నర్తకినో (లేక)
గాయకునో (లేక) ఒక ప్రసిద్ధ వ్యక్తిని అనుకరిస్తూ (Imitate) ప్రవర్తిస్తూ (mimicree)
వుంటాడు. చూచావా?
శ్లో॥ నృత్యతో గాయతః పశ్యన్ యథైవ అనుకరోతి తాన్
ఏవం బుద్ధిగుణాన్ పశ్యన్ననీహో పనుకార్యతే ॥(అధ్యా 22, శ్లో 53)
జీవాత్మ స్వస్వరూపము దృష్ట్యా సర్వక్రియాతీతుడే అయి ఉండి కూడా బుద్ధిగుణములను
అనుసరించి ఆయా ఉపాధులతో తాదాత్మ్యము చెందుతూ ఉన్నాడు. అనగా, ఆత్మ -
బుద్ధియొక్క గుణములను అనుకరించి బుద్ధి గుణములకు పరిమితమై ప్రవర్తించటం
జరుగుతోంది. ఎంతటి చమత్కారం!
ఒక రాజుగారు- మంత్రిని అనుకరించటం ప్రారంభించి, “నేను రాజును” అనునది
ఏమరచి, “నేను మంత్రినే! రాజును కాదు” - అని అనుకోవటం వంటిదే కదా!
మరొక రాజుగారు సింహాసనం దిగి నేను రాజును కదా అనునది ఏమరచి నృత్యం -
గానం చేసే నర్తకితో నృత్యం చేయటం ప్రారంభించారట అటువంటిదే, ఈ జీవుడు
ఆత్మ స్వరూపమును ఏమరచి మనో-బుద్ధులతో మమేకమగుచు నేను
దృశ్యాంతర్గతమగు దేహమును కదా! -అని బుద్ధితో తలచటం!
కదలుచున్న నీటి తరంగాలు గల తటాకజలంలో ప్రతిబింబిస్తున్న మహా వృక్షములు
(ఆ ప్రతిబింబమును చూస్తే)… నీటిలో చలించుచున్నట్లు అగుపించవచ్చు గాక!
వాస్తవానికి ఆ మహావృక్షములు అక్కడినుండి కదలుచున్నాయా? లేదు కదా!
అసలు జలంలో వృక్షాలు వున్నాయా? లేవు! ఇక “అవి నీళ్ళలో కదలుచున్నాయి”
అనే మాట వ్యావహారికంగా (దృశ్యంగా) సత్యమేనని (చూచేవానికి) అనిపించ
వచ్చునేమోగాని,… వాస్తవానికి అది సత్యమా కాదు!
పైత్యప్రకోపంచేత కళ్ళు తిరుగుచున్న సమయంలో భూమిపై వస్తువులన్నీ గిఱ్ఱున
తిరుగుచున్నట్లు కనిపించవచ్చు గాక! వస్తువులు పైకి - క్రిందికి - ప్రక్కప్రక్కలకు
కదలటం నిజమా? కాదు!
తన మనోరథంలో (ఊహాపధంలో) ఒకానొకడు… ఒక సంఘటనను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
248
జరుగుచున్నట్లు అనుభవిస్తున్నాడనుకో! (ఉదా - ఒకడు “తాను గొప్ప విద్యాకోవిదుడై,
ఒక గొప్ప సభలో ప్రవేశించి అక్కడి పండితులను తన వాదోపవాదములతో
తలవంచేటట్లు చేయుచుండగా రాజుగారు ఆశ్చర్యపడి మెచ్చుకుంటూ ధనంగల
మూటను ఇవ్వటానికి తెస్తున్నట్లు” - ఊహిస్తున్నాడనుకో!) ఆ ఊహాదృశ్యము
వాస్తవమా? లేనే లేదు కదా!
ఒక పెద్ద మనిషి తన కలలో ఏదో అరణ్యంలో ప్రవేశించి సంచారాలు చేస్తుంటే
ఆ స్వప్నబుద్ధికి తోచుచున్నది, అనుభూతమగుచున్నది నిజమా? కానేకాదు కదా!
అట్లాగే…,
ఈ జీవుడు పొందుచున్న విషయభోగములు, సంసార వ్యవహార తతంగము…. అదంతా
మిధ్యయే! ఒక ప్రేక్షకుడు నాటకం చూస్తూ, నాటకంలోని పాత్రల మధ్య జరిగే
సంఘటనలకు కోప తాపాలు పొందటం వంటిదే!
అధ్యాయము–35.) పరమేశ్వర నిష్ఠ
|
శ్రీ ఉద్ధవుడు : శ్రీకృష్ణా! మనం ఇప్పుడు సిద్ధాంతీకరించుకుంటున్నట్లు, అప్రమేయము
- ఆనందస్వరూపము - సర్వమునకు పరము అతీతము అగు ఆత్మయే ఈ జీవుని
వాస్తవ స్వరూపం కదా! మరి అట్టి ఈ జీవునికి సుఖ-దుఃఖానుభవాలు ఎందుకు
సంప్రాప్తిస్తున్నాయి? ఎవ్వరు కలుగజేస్తున్నారు? ఎందుకు కలుగజేస్తున్నారు? అట్లా
కలుగజేస్తే, వారికి వచ్చే లాభమేమిటి?
శ్రీకృష్ణభగవానుడు :
శ్లో॥అర్థే హి అవిద్యమానే అపి సంస్కృతిః న నివర్తతే
ధ్యాయతో విషయాన్ అస్య స్వప్నే అనర్థాగమో యథా || (అధ్యా 22, శ్లో 56)
ఆయా విషయములను - సందర్భములను - సంబంధ బాంధవ్యములను రోజంతా
ఆవేశపూరితంగా మననం చేస్తున్న ఒకానొకడు రాత్రి పరుండినపుడు ఆయా సంబంధిత
విషయములను స్వప్నంలో అనుభవిస్తున్నాడు చూచావా?
ఆ రీతిగానే ఈ జగదనుభవం - దీర్ఘకాలంగా మరల మరల నిర్వర్తించే విషయమననము
వలన ఈ జీవునికి ప్రాప్తిస్తోంది.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
249
ఆత్మకు సంసారబంధము స్వపాంతర్గత విశేషములవలె మిథ్యయే! కలలో ఎవ్వరో కనబడి
చేతులు - కాళ్ళు త్రాడుతో కట్టివేస్తే…. అది నిజమా? సంసార బంధము జీవునకు
అట్టిదే!
ఓ స్నేహితుడా! ఈ జీవుడు “నేను సుఖములను ఆస్వాదించాలి! పొందాలి” అని
అనుకొని విషయములను ధ్యానిస్తున్నాడు. విషయ ధ్యానము వలన సుఖదుఃఖ వృత్తులు
కలుగుచున్నాయి!
అందుచేత ఓ ప్రియమిత్రమా! ఉద్దవా!
శ్లో॥ తస్మాత్, ఉద్ధవ! మా భుంక్ష్వ విషయాన్ అసత్ ఇంద్రియైః
ఆత్మాగ్రహణ నిర్భాతం పశ్య వైకల్పికం భ్రమమ్ || (అధ్యా 22, శ్లో 57)
నీవు అసత్తుమాత్రమే అయినట్టి ఇంద్రియములకు అనుభూతములగుచున్న ఇంద్రియ
విషయములను సేవించటంలో నిమగ్నం (immersed, entangled) కావద్దు.
స్వప్నదర్శనముతో పోల్చతగినట్టి అజ్ఞానము వలననే ఈ జీవునికి వికల్పములన్నీ
కలుగుచున్నాయి. అదంతా అనేక భ్రమ విభ్రమములకు దారితీయటం గమనించమని
గుర్తు చేస్తున్నాను. ఈ కనబడేదంతా ఏమిటో గమనించి, జాగరూకుడవై ఉండవలసిన
పనిలేదా? కష్ట సుఖ భావనావేశమును ప్రక్కకు పెట్టి స్వబుద్ధితో సర్వాంతర్యామియగు
పరమాత్మను శరణువేడటమే సర్వదా క్షేమకరం సుమా!
అనగా పరమేశ్వర నిష్ఠను సర్వకాల - సర్వావస్థలయందు ఆశ్రయించు.
….9
దుర్జనులు నిన్ను వెళ్ళగొట్టవచ్చు గాక! అదలించవచ్చు గాక!
ఎవ్వరో వచ్చి నిన్ను అవమానించవచ్చు గాక! బాధ కలిగించే మాటలతో దూషించ
వచ్చు గాక!
ఇంకొందరు నిన్ను పరిహాసం చేయవచ్చుగాక! నిన్ను చూచి గేలి చేస్తూ పకపకా
నవ్వుకోవచ్చును గాక!
మరికొందరు దోషములు ఆరోపించి నిన్ను దూషించవచ్చు గాక! లేనిపోని
మాటలతో సతాయించవచ్చు గాక! ఎగతాళి చేయవచ్చు గాక!
నీవు బంధింపబడవచ్చును గాక!
నిన్ను ఎవ్వరో మోసము చేయవచ్చును గాక!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
250
పైన ఉమ్మివేయవచ్చు గాక!
|
నీపై మూత్రము విడవవచ్చు గాక!
ఇట్లా ఏఏ సందర్భములు సంఘటనలు ఎంతగా ఏర్పడినప్పటికీ నీవు మాత్రం
పరమేశ్వరనిష్ఠ నుండి విచలితుడవు కానేవద్దు. వారి-వీరిపై ఆపాదించి విషాదం
పొందవద్దు. మౌనమును, ప్రశాంతతను వీడకుండానే-సాక్షివై, అతీతుడవై వుంటూనే
జగన్నాటకంలో సందర్భానుచితంగా మాత్రమే ప్రవర్తించు. శ్రేయస్సును కోరుకొన్నవాడు
నానా కష్టములు అనుభవిస్తున్న సందర్భాలలో కూడా స్వబుద్ధితో పరమాత్మను శరణు
వేడుకుంటూనే ఉంటాడు. తద్వారా తనను తాను రక్షించుకొనుచున్నాడు! “సర్వము
పరమాత్మతత్త్వమే కదా!” అనే అవగాహన అభిప్రాయములను స్వీయ శ్రేయస్సు
కొరకై దీపమును రక్షించుకొన్నట్లు రక్షించుకుంటున్నాడు. హే పరమాత్మా! నీవుకదయ్యా,
నాకు సర్వదా తోడు-నీడ!…. అని హృదయభాషణ కలిగినవాడై వుంటాడు!
శ్రీ ఉద్ధవుడు : దేవా! వక్తలలో శ్రేష్ఠుడా! శ్రీకృష్ణా! అటువంటి సర్వసందర్భాలలో
పరమాత్మవగు నిన్నే గుర్తు చేసుకొని ఉండి శరణువేడటం ఎట్లాగో వివరించండి. అది
మావంటి అల్పజీవులకు సాధ్యమా?
ఎందుకంటే…,
ప్రకృతి అత్యంత బలీయమైనది కదా!
పండితులైనవారు, ధర్మనిరతులు, శాంతులు, భక్తులుకూడా ఆయా అవమాన సంఘటనల
సందర్భాలు కష్టమనియే తలుస్తున్నారే! అంతేగాని, “సర్వతత్త్వ స్వరూపమగు ఆత్మయే
నేను కదా!” అనే ఆత్మదేవ మననం ఆయా కష్ట-నిష్ఠుర సందర్భాలలో గుర్తు
పెట్టుకోలేకపోతున్నారు. “ఈ కనబడేదంతా - కనబడేవన్నీ నేనే…” అనే మననము
కలలో కూడా గుర్తుకు రావటం లేదే! ఇక మేమెంతటివారము చెప్పండి!
ఇది దృష్టిలో పెట్టుకొని…,
సర్వకాల సర్వావస్థలలోను నిన్ను మాత్రమే గుర్తుపెట్టుకొని బుద్ధితో మిమ్ములను శరణువేడి
ఉండటం ఎట్లాగో మరికొంత సోదాహరణంగా వివరించండి స్వామీ! “ఇదంతా కృష్ణ
చేతన్యమే! ఆత్మ చైతన్యమే… ఈ జగత్తంతా నా స్వస్వరూపమే…” అని సర్వదా గుర్తులో
ఉంచుకోవటం ఎట్లా?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
251
అధ్యాయము–36.) భిక్షు గీత - వైరాగ్యము
|
శ్రీ శుక మహర్షి : ఓ పరీక్షన్మహారాజా! యాదవ శ్రేష్ఠుడు - పుణ్యశ్లోకుడు - శ్రీకృష్ణ
భక్తుడు అగు ఉద్ధవుడు “సర్వమునకు అతీతంగా ఉండి సర్వేశ్వరుని సర్వదా స్మరించటం
ఎట్లా?…” అని ప్రశ్నించగా.
ఆ ప్రశ్నకు సంతోషించి కృష్ణ భగవానుడు ఉద్దవుని ప్రశంసించి, ఆపై ఈరీతిగా
చెప్పసాగారు.
శ్రీకృష్ణుడు : బృహస్పతి శిష్య సమానుడవగు ఓ ఉద్ధవా! నీవు చెప్పినట్లుగా ఒక సజ్జనుడు
దుర్జనుల దుష్టవాక్కులను, ఎత్తిపొడుపు మాటలను, దూషణవచనములను విని,
కలతచెందిన మనస్సును శాంతపరచి ఉంచటం కష్టతరమైన విషయమే! దుష్టుల
దుష్టపలుకులు బాధించినంతగా బాణముల మర్మభేదములు కూడా బాధించలేవు.
అయితే ఇందుకు పరిష్కారమార్గంగా పెద్దలు మహాపుణ్య జనకమైన భిక్షుగీత అనే
యితిహాసమును ముముక్షువులకొరకై చెప్పుతూ ఉంటారు. ఆ ఇతిహాస విశేషాలు నీ
ప్రశ్నకు సమాధానంగా మనం చెప్పుకుందాం! విను.
ఈ మనం చెప్పుకోబోవుచున్న యితిహాసంలో ఒకానొక భిక్షువు దుర్జనులచే ఎంతగానో
అవమానించబడి… అప్పుడు కూడా ధైర్యమును విడువకుండా, “ఇదంతా నా పూర్వజన్మ
దుష్కృత ప్రభావం మాత్రమే కదా!” అని భావించాడు. భిక్షుగీతను గానం చేశాడు.
“సర్వము సర్వదా ఆత్మ చైతన్య చమత్కారమే కదా! సర్వత్రా సచ్చిదానందమేగా!” -
అనే అంతిమ నిర్ణయానికి వచ్చాడు! అది వివరిస్తున్నాను. విను!
మాలవ దేశములో ఒకానొక విప్రుడు ఉండేవాడు. ఆతడు ఐశ్వర్యవంతుడు. కృషివాణిజ్యము మొదలైన వ్యాపార దక్షత గలవాడు. అయితే బహుసంపద-ధన కాముకుడు.
అత్యంత లోభికూడా! అంతేకాదు. భార్య - పుత్రులను కూడా బాధించే దుష్టస్వభావి.
అత్యంత కోపిష్టికూడా!
ఆతడు ఎప్పుడూ అతిథులనుగాని, బంధువులనుగాని మాటమాత్రంగా కూడా సంతోష
పెట్టేవాడు కాదు. ధర్మహీనుడై జీవితమును గడపుచూ ఉండేవాడు. ఆతని పలుకుశ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
252
మాట ఎంతో కరకుగా ఘాటుగా ఉండేది.
ఆతడు ఎంతటి లోభి అంటే…, గొప్ప సంపదలు సంపాదించుకొని ఉండికూడా తాను
తిని సుఖపడడు. ఇతరులకు కొంచెమైనా పెట్టి ఆనందించడు. పాపం లేదు. పుణ్యం
లేదు. ముందు డబ్బు సంపాదించటం-దోచటం దాయటం ఇదే ముఖ్యం అని
అనుకునేవాడు.
ఆతడు దుశ్శీలుడై, భార్య - పిల్లలు - తల్లి - తండ్రి తదితర బంధువులను, మిత్రులను
ద్వేషించటం - దూషించటం - అవమానించటం చేస్తూ ఉండేవాడు! ఇటువంటి చర్యల
కారణంగా అందరూ అతనిని తమలో ఎంతగానో ద్వేషించేవారు. ధనలోభంచేత ఆతడు
ఎవ్వరికీ ప్రియం కలిగించేవాడు కాదు. “ఈ భార్య - ఈ పిల్లలు నా డబ్బు తినడానికే
పుట్టారు” అని అరుస్తూ ఉండేవాడు. ఏమాత్రం కనికరం ఆతనిలో లేదు. హృదయమంతా
లోభత్వమే! ధన కాంక్షయే!
ఈవిధంగా కేవలము డబ్బు దాచుకోవటం, ధర్మముపట్ల విరతిచే ఉభయ భ్రష్టుడు
అగు ఆ విప్రుని దుష్టచర్యలు గమనిస్తున్న దేవ-పితృ-అతిధి ఇత్యాది పంచ యజ్ఞ
భాగులగు దేవతలు ఆతనిపై ఒకానొక సమయంలో కోపగించటం ప్రారంభించారు.
దేవతలు ప్రసాదించినది పొందుతూ వారికి సమర్పించవలసినది సమర్పించకపోవటం
అనర్ధహేతువు కదా! దొంగతనంతో సమానము కదా! దేవతలకు కోపం వస్తే ఇంకేమన్నా
ఉన్నదా?
ఆవిధంగా ఆతడు – ఇంద్రియములు - దేహము ప్రసాదించి సంరక్షిస్తున్న దేవతలను,
సంపద- సంతానములను కనికరించే పిత్రుదేవతలను, సహకారికారకులగు సహ
జీవులను - ఆదరించకపోవటంచేత ఆతని పుణ్యభాగము క్రమంగా క్షీనించసాగింది.
ఆతడు రాత్రింబవళ్ళు కష్టించి ప్రోగుచేసుకున్న ధనమంతా అనుకోని ఆపత్తులకు క్రమంగా
వెచ్చించవలసి వచ్చేది. ఆవిధంగా అంతా నష్టమైపోయింది. ఆతని ధనములో కొంత
భాగం ఆతని కొందరు జ్ఞాతులు మోసంచేసి హరించారు. మరికొంత భాగం దొంగలు
ఎత్తుకుపోయారు. ఇంకొంత భాగం దైవవశంగా కాలవశంగా నష్టమైపోయింది.
కొంతకొంత రాజులచేత-సేవకులచేత అపహృతం అయింది. ఈవిధంగా ధనమంతా
నష్టమైపోగా… ధర్మ-అర్థములను పోగొట్టుగొన్న ఆతనిని స్వజనులే పట్టించుకోవటం
మానివేశారు. అందరు ఆతనిని ఉపేక్షించసాగారు. ఛీదరించుకోసాగారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
253
అదంతా చూచిన ఆ విప్రుడు దుస్తరమైనటువంటి పరిస్థితులను పొందుచూ, ఇక
విషాదముతో విచారములో నిమగ్నము కాసాగాడు. విచారణలో పడిపోయాడు.
ధనాశ - పిసినారి అగు ఆతడు చాలా సంతప్తుడైనాడు. ఎవరికీ చెప్పుకోవటానికి
కూడా లేక, కృంగిపోసాగాడు.
క్రమంగా - ఏమిటిరా ఇదంతా? పుట్టినప్పటినుండీ ఇప్పటిదాకా
జరుగుచున్నదంతా ఏమిటి? - అని దీర్ఘచింతలో మునిగిపోయాడు.
ధనం పోతూవుంటే రాత్రి - పగలు పెద్ద గొంతుకతో ఏడవటం ప్రారంభించాడు.
ఇటువంటి దుఃఖాలు పొందుతూ పొందుతూ ఉండగా అతనిలో ఒకానొక సమయంలో
గొప్ప వైరాగ్యము రూపుదిద్దుకొనసాగించి.
ఆ విప్రుడు ఈవిధంగా ఆలోచించసాగాడు!
విప్రుడు : ఆహాఁ! నేను ఎంతో కష్టబడి శ్రమించి సంపాదించి దాచుకున్న ధనమంతా
అటు ధర్మమునకు గాని ఈవైపు నా భార్యా బిడ్డలకుగాని, ఇటు నా కామ
భోగములకైనాగాని, చేతికి రాకుండా అంతా వ్యర్ధంగా వ్యయం అయిపోయిందే? ఈ
నా శరీరాన్ని ఇప్పటిదాకా వ్యర్ధంగా అనేక ధన సంపాదన సంబంధమైన కార్య
కలాపాలలో నియమించుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చిన కష్టాలు ఎంత భరించరానివి!
దుస్సహవము! నా కష్టాలు చెప్పుకోటానికి ఎవ్వరూ లేరు! చెప్పటానికి అలవికాదు
కూడా! ఇంత జీవితంలో నేను ఏమి సాధించినట్లు? సర్వం వ్యర్ధం అయిపోయింది!
(సర్వ వ్యర్ధం మరణసమయమే సాంబ ఏకః సహాయః… అను) పెద్దల వాక్యాలు
ఇప్పటికి గుర్తుకొస్తున్నాయి.
అయ్యో! నావంటి నీచుల - కృపణుల - లోభుల సంపదలు, అధికారాలు ఎప్పుడూ
సుఖప్రదములు కాదు. దుఃఖప్రదములే! అంతేకాదు! ఈ సంపదలు ఇహలోకంలో
కష్టాలకు - పరలోకంలో నరకాదులకు కారణం అవుతాయికదా! ఈ విషయం మును
ముందుగానే నేను ఎందుకు గమనించలేదు? మూర్ఖుడనై జీవితాన్నంతా వృధా
చేసుకున్నానే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
254
అల్పమైన శ్వేకుష్ఠువు (చర్మమును తెల్లగా మార్చే చర్మవ్యాధి) క్రమంగా సుందరమైన
ముఖాన్ని అందవిహీనం చేసేస్తుందే! ఆవిధంగా (ధనసముపార్జనం జీవితంలో ఒక
చిన్న విషయమే అయినప్పటికీ) లోభగుణం అల్పమైనదైనప్పటికీ - సద్గుణవంతుల
సద్గుణములను, కీర్తిమంతుల నిర్మలమైన కీర్తిని నాశనం చేసివేయగలదని ఇప్పటికిగదా,
నేను గమనిస్తున్నాను!
శ్లో॥ అర్థస్య సాధనే సిద్ధే ఉత్కర్షే రక్షణే వ్యయే
నాశోపభోగ ఆయాసః త్రాసః చింతా భ్రమో నృణామ్ || (అధ్యా 23, శ్లో 17)
ఈ ధనమును
సంపాదించుకోవటంకోసం సాధనలు (పద్ధతులు) సమకూర్చుకోవటంలోను,
|
ఆ సాధనలను సిద్ధింపజేసుకోవటంలోను,
సంపాదించిన దానిని వృద్ధిపరచుకోవటంలోను,
వృద్ధిపొందుచున్న ధన సంపదను రక్షించుకోవటంలోను,
రక్షించుకుంటున్న ధనమును ఖర్చుచేయటంలోను,
ఆ ధనమును అనుభవించటంలోను,
అది ఖర్చుఅవుతుండగా “పోగొట్టుకుంటున్నామే?” అని వేదన చెందటంలోను
ఈ మానవులు ఎంతగా శ్రమ పొందుచున్నారు! ఎంతగా భయము చింత - భ్రమ
ఎదురౌతున్నాయి! ఇదా జీవితం? ఇందుకోసమా, పుట్టింది?
నిజమైన శ్రేయస్సు కోరుకొనేవాడు కళ్యాణకాముకుడు అగు వ్యక్తి అర్ధములను
(సంపదలను) అనర్ధంగానే చూస్తున్నాడు. అర్దములో పెద్దలు గుర్తుచేసే పంచదశ (15)
అనర్ధములను ఆతడు గమనిస్తున్నాడు. మమకారము మొదలంట్లా త్యజించి జాగరూకుడై
ఉంటున్నాడు.
అర్ధమును ఆశ్రయించి ఉంటున్న పంచదశ (15) అనర్ధములు :
శ్లో॥ స్తేయం హింసా అనృతం దంభః కామః క్రోధః స్మయో మదః
భేదో వైరమ్ అవిశ్వాసః సంస్పర్ధా వ్యసనాని చ
ఏతే పంచదశ అనర్ధా హి అర్ధమూలా మతా నృణామ్ |
తస్మాత్ అనర్ధమ్ అర్ధాఖ్యం శ్రేయోర్థీ దూరతఃత్యజేత్॥ (అధ్యా 23, శ్లో 18, 19)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
255
దొంగతనము (చౌర్యము) హింస అసత్యము దంభము కామము క్రోధము
విస్మయము గర్వము భేదబుద్ధి వైరము అవిశ్వాసము స్పర్ధ స్త్రీ జూదము
దుర్వ్యసనము - ఈ 15 ప్రమాదాలు అర్ధము వెంటనంటి ఉండే అనర్థాలని పెద్దలు
చెప్పుచున్నారు. నేను విననే లేదు కదా! ఆ రోజులలో ఆ మాటలు విని నవ్వుకున్నాను.
ఇప్పుడేమైనది? చిన్న విషయమైనట్టి ఈ అర్ధము వలన తల్లి-తండ్రి-భార్య-సోదరులుబంధువులు-మిత్రులు వీళ్ళంతా శత్రువులుగా కనిపించసాగారు. మనస్సంతా
అకారణమైన శత్రుత్వము అనే పశుస్వభావమగు అత్యంత ప్రమాదకరమైన దుష్టపదార్ధంతో
నిండిపోయింది కదా! ధన సంపదను చూచుకొనిన మరుక్షణం నేను లోభగుణం
అబ్బటంచేత - క్షుద్రుడను-కోపిష్టిని అయ్యాను. అయినవారిని, శ్రేయోభిలాషులను
అంత దూరంగా ఉంచి, అందుకు ఫలితంగా ఎంతగానో నష్టపోయాను.
సోదరులు-శ్రేయోభిలాషులు-విజ్ఞులు ధనవంతుని చూచి “ఈతనితో మనకెందుకులేరా
బాబూ!…” అని అల్లంత దూరంగా ఉండిపోతారు. మిత్రులు కూడా “వీడివల్ల మాకేమిటి
లాభం?…” అని తలుస్తూ ద్వేషం పొందినవారై ఇక మోసం చేయటానికైనా
చంపటానికైనా కూడా సిద్ధపడతారు.
భార్య-బిడ్డలే నావంటి లోభిని చూచి “వీడు మా చావుకు వచ్చాడురా!” అని
దూరమైపోయారు. అప్పుడేమో “వీళ్ళంతా పోతే పోనీ!” - అనుకుని సంపాదించుకున్న
ఒంటరితనము ఇప్పుడు శాపమై కూర్చున్నది.
అయ్యయ్యో! దేవతల కరుణచే ఈ మానవజన్మ లభించింది. అందులోనూ వేదాధ్యయనం
చేసి తరించవలసిన విప్రజన్మ ఎంతటి గొప్ప అవకాశం! అట్టి మహత్తరమైన దేవతా
ప్రసాదిత మహదవకాశమును ధనము ప్రోగుచేయటానికి మాత్రమే వెచ్చించి, లోభినై
ఆత్మహితమును నాశనము చేసుకొని అశుభగతిని ఆహ్వానించానే! కించిత్ అయినా
తెలివి ఉన్నదా, నాకు?
లేదు. ఎందుకంటే…,
మానవదేహం పొందటం ఏమైనా చిన్న విషయమా? కాదు. కానేకాదు. ఈ
మానవదేహము స్వర్గ - మోక్షములకు ముఖద్వారము వంటిది! అటువంటి
అవకాశమును సద్వినియోగపరచుకోకుండా అర్ధముకొరకై (సంపదలు సంపాదించి
ప్రోగుచేసుకోవటానికై) అఱ్ఱులు చాచి రోజులు గడపటం- బ్రతికినన్నాళ్లూ చావుకొరకై
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
256
సరంజామా తయ్యారు చేసుకోవటం వంటిదేకదా!
ధనమును దేవతలకు - ఋషులకు - పితరులకు పితరులకు - సహప్రాణులకు - జ్ఞాతులకు
బంధువులకు - దాయాదులకు వారివారి భాగములు వారికి ఇచ్చి సంతోషపరచకుండా,
తాను అనుభవించకుండా యక్షునివలె దాచి రక్షించుకోవటం, కుక్కవలె కాపలా
కాయటం- అధఃపతనానికి నాందీవాక్యాల ఉచ్ఛారణయే! ఎంతమంది ఎంతగా చెప్పినా…
ఇది నేను చెవినపెట్టానా? లేదు! పెడచెవిన పెట్టాను. “లోభిగా ఉండకురా, నాయనా!”
-అని పెద్దలు చెప్పుతుంటే, “వీళ్ళెవరు, నాకు చెప్పేది?”… అని విర్రవీగాను.
వివేకవంతులగు పురుషులు యాధృచ్ఛికంగా దేవతల దయచే లభించిన ధనసంపదలను
సరిఅయిన మార్గంలో వినియోగించి సిద్ధిని పొందుచున్నారు. మరి నేనో? ధనమును
ఆర్జించే వ్యాపారంలో మునిగి - తేలుతూ చివరికి ధనమును, ఆయుష్షును, బలమును
- అన్నిటినీ పోగొట్టుకొన్నాను. సాధన సంపత్తి గురించి పట్టించుకోనే లేదు. ఇప్పుడిక
వార్ధక్యము (ముసలితనము) వచ్చిపడింది. ఇక చేసేది ఏమున్నది? ధనమంతా చేయి
జారింది. బుద్ధి అనే విలువైన రత్నమును ధనదాహము అను రూపముగల మలములో
దాచుకున్నవాడినైనాను!
విప్రుడను, వేదాధ్యయనము చేసినవాడను, ద్విజుడను, గురువులు చెప్పగా వేదాంత
విద్యను వినినవాడను - అగు నేను ఎందుచేత వ్యర్థమగు ధనోపార్జన - అనే వ్యసనంలో
మునిగిపోయానోకదా! ఎందుచేత భ్రమించాను? ఎందుకు మోసపోయాను? ఆహాఁ!
ఏదో అనిర్దేశ్య శక్తి-అదృశ్యశక్తి కల్పించే మాయచే లోకజనులంతా నాతో సహ -
మోహితులమై చరిస్తున్నామనుటలో ఏ సందేహము లేదేమో! అసలీ శరీరమేమిటి?
ఇది ఏమి కాబోతోంది? అతి త్వరలోనే మృత్యువుచేత కబళించబడబోతోంది కదా! పోనీ
నాకు చాలా ఆయుష్షు వున్నదిలే! - అని మురిసిపోదామా? ఎప్పుడు ఏ శరీరం శ్మశానము
జేరబోతోందో ఏమీ చెప్పలేం! మరణించిన జీవుని వెంటనంటి ధనముగాని,
వస్తుసంపదగాని, భోగములుగాని వస్తున్నాయా? మరణ సమయంలో అన్నిటిని
వదలవలసిందే! వెంటనంటి రావు కదా! మరెవ్వడో వచ్చి ఈ ఇల్లు ఈ సంపద - ఈ
ధనము నాది…. అని మురిసిపోతూ వుంటే వాటిని కష్టపడి సంపాదించి
మరణించినవాడు- ఇవన్నీ నావిరా! - అని పలుకగలడా? తిరిగి భూమిపైకి రాగలడా?
రాలేడు. అటువంటి అల్పమగు మరొక జన్మలోనికి త్రోసివేయగల -ధనాదులను చూచి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
257
గర్వించటం ఏమిటి? జన్మపరంపరా చక్రమునుండి బయల్వెడలి జన్మరాహిత్యమును
సిద్ధించుకోవటానికి గదా, జన్మ అనే సందర్భమును ఉపయోగించుకోవలసినది?
ఇతఃపూర్వం నేను సంపాదించుకున్న ధనమంతా పోయింది. అదంతా ఎంతో కష్టపడి
- కక్కుర్తిపడి అత్యంత లోభత్వంతో నేను తినక - ఎవ్వరికీ పెట్టక, అనేకులను బాధించి
-వేధించి మరీ సంపాదించాను. ఆ ధనమంతా ఇప్పుడు దొంగలచేత - బంధువులచేత
- - ప్రకృతి వైపరీత్యములచేత - స్నేహితులచేత - వైద్యులచేత తలొకకొంత లాగుకొని
పోబడింది. ఈ ఖాళీ చేతులు మాత్రం నాకు మిగిలాయి!
అయితే… వారందరిని ఇప్పుడు పేరుపేరున తిట్టనా? తిట్టి ఏమిలాభం? ఇదంతా
నడిపిస్తున్న చరాచర సృష్టికర్త మరొకాయన ఉన్నారు. ఆయన కదా, అన్నింటికి
కారణం! అంతేగాని మరెవ్వరూ కాదు! హే పరమాత్మా! ఇదంతా చేస్తున్నది నువ్వయ్యా!
(కొంత నిశ్శబ్దంగా సమయం గడపిన తరువాత)
ఒకవేళ వాళ్ళంతా నా ధనాదులను దొంగిలించి, లాగుకొని ఉండకపోయినప్పటికీ
కొద్దిరోజులు సంవత్సరములలోగా ఒకానొక (ముందుగా అనుకోని) క్షణంలో
నేను ఈ దేహమును విడువవలసిందేకదా! కాల దేవత నన్ను ఇక్కడినుండి ఈ
దేహంలోంచి బలవంతంగా బహిర్గతం చేసి మరొక తల్లి గర్భంలోకి ప్రవేశింపజేయక
మానదుకదా! అప్పుడైనా ఇవన్నీ వదలవలసినదే! మరొకడెవడో వచ్చి నావలెనే “ఇవన్నీ
నావి!” అని భావించటం ఎవ్వరూ ఆపగలిగేది కాదు కదా! ఎప్పుడో ఒకప్పుడు నేను
వదలక తప్పని అర్ధ సంపదను ఇప్పుడే ఎవ్వరెవ్వరో వచ్చి లాక్కుపోయారు. కనుక
ఇప్పుడు నాకు వచ్చిన నష్టమేమున్నది? ఏది ఎటుపోవాలో… అటే పోయింది.
అవును! ఏ కష్టము వచ్చిందీ లేదు!
అమ్మయ్య! ఇప్పుడు అర్ధమైనది. అవును! అవునవును! నేను ఇంతకాలం ఈ అర్ధసంపదను
చూచుకొని - తొర్రలో దాగిన ముసలి పందికుక్కు “ఈ ధాన్యరాసులన్నీ నావే” అని
అరుస్తున్నట్లు - “నావి నావి” అని అహంకరించాను. ఘీంకరించాను. తల్లి తండ్రులు
- భార్య - బిడ్డలు బంధువులు స్నేహితులు పేదవారు…. వారందరిపై
రుసరుసలాడాను. నా ఉత్తరోత్తరగతుల దౌర్భాగ్యమేమిటో గమనించిన నా తండ్రి,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
258
జగతః పితయగు పరమాత్మ నేను సంపాదించి ప్రోగు చేసిన ధన సంపదను నానుంచి
వదలించారు! లాక్కున్నారు. ఆహాఁ! ధనం తొలగటం గొప్ప అదృష్టమే!
అవును! ఇది శాపం కాదు! వరం! సర్వదేవతా హృదయ స్వరూపుడగు శ్రీహరి నాపట్ల
ప్రసన్నుడైనారు. ఇందులో సందేహమే లేదు. ఎవరి ప్రేరణ - కృపలవలన నాకు ఈ
ధనహీన దశ ప్రాప్తించినదో… ఎవరి ప్రేమ-కరుణా కటాక్షవీక్షణలచే నేను సంసార
సముద్రమును దాటటానికి గొప్ప యంత్రశక్తిగల నావ వంటి వైరాగ్యము ప్రాప్తించిందో…
అట్టి శ్రీహరీ! లోక కళ్యాణమూర్తీ! పరంధామా! అంతా ఇచ్చింది నీవేకదయ్యా!
నాదైనదంతా నీదే! నాపై వాత్సల్యంతో ఇప్పుడు నన్ను ధనహీనుణ్ణి చేసి ఆదుకున్నావయ్యా!
కుక్కలాగా కాపలా కాసే శ్రమనుండి తప్పించావు! నా హృదయం పవిత్రం చేసి నీవు
ప్రవేశించాలనే నన్ను నిరుపేదగా బాటలో నిలబెట్టావు. నన్ను కన్నతండ్రివైన నిన్ను
శరణు వేడుచున్నాను! క్షమించు! కరుణించు! ఇదంతా నీ దయయే!
ఈ రోజుకూ ఇంకా ఈ వార్ధక్యదేహము నావద్దనే ఉన్నది. ఒకవేళ నాకు ఈ దేహంతో
ఆయుష్షు కొంత మిగిలి ఉంటే నేను దైవోపాసనకు సంబంధించిన సాధనములపట్ల
శ్రద్ధ వహిస్తాను. అప్రమత్తుడనై ఉంటాను. “శ్రీహరియే నా ఆత్మకదా” - అను ఆత్మ
సంతుష్టిని పెంపొందించుకుంటాను. ఇతఃపూర్వపు లోభ దురాశ సంస్కారాలు పూర్తిగా
తొలిగేయత్నం చేస్తాను. తపస్సుకొరకై ఈ శరీరమును ఉపకరణముగా ఉపయోగిస్తాను.
ఈ దేహము ఎంతకాలం ఉంటుందో అంత కాలంవరకు తుది క్షణం వరకు సర్వ
తత్త్వస్వరూపుడగు శ్రీహరి పాదపద్మములను నా మనస్సు ఆశ్రయించును గాక!
శ్రీహరిని ఆశ్రయించి ఉపాసించాలనుకునే నా యీ ప్రయత్నములకు సహకరిసస్తూ…
త్రిలోకాధిపతులగు దేవతలు నాపై అనుగ్రహము చూపుదురు గాక! వారి దయవల్లనే
కదా, ఖట్వాంగ చక్రవర్తి మొదలైనవారు కొద్దికాలంలో వైకుంఠధామం చేరారు! నాపట్ల
దేవతలు ఆవిధంగానే దయచూపి నన్ను క్షమించి, శ్రీహరి పాదాలుచేరటానికి నన్ను
ఆశీర్వదిస్తూ, నాపై ప్రేమతో సహకరించెదరు గాక! నాకు దారి చూపెదరుగాక!
వింటున్నావా? ఉద్ధవ మహాశయా! అవంతి దేశస్తుడైన ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు ఆవిధంగా
సర్వసంపదలు కోల్పోయిన ఆ సందర్భాన్ని విశ్లేషించుకొని బుద్ధితో ఒక నిర్ణయానికి
వచ్చేశాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
259
హృదయ గ్రంధులైనట్టి అహంకార మమకారములను మొదలంట్ల హృదయం |
లోంచి పెకలించి ఆవలపారవేయసాగాడు. “అవి నావి! ఇవి నావి” అనుకునే
బుద్ధి విభాగమును “కావు! కావు!” అనే మంత్ర మననంతో శాంతపరచసాగాడు.
శాంతుడు మౌని - సన్యాసి అయ్యాడు.
భిక్షకుడై దేహానికి ఆహారం అందిస్తూ తన దేహమును ఒక ఉపకరణంగా
మలచుకొని విదేహముక్తికి ప్రయత్నించటానికై సంసిద్ధుడైనాడు.
సన్యాసి అయి మనస్సును - ఇంద్రియములను - ప్రాణములను శాస్త్ర ప్రవచిత
మార్గంగా నిగ్రహించి పరమాత్మతత్త్వము వైపుగా ప్రేమగా నడిపించటం
ప్రారంభించాడు.
“అంతా శ్రీహరే! ఇక కళ్ళుమూతలెందుకు?” అని భావిస్తూ ఉత్తమమైన మానసిక
నిగ్రహాన్ని క్రమక్రమంగా సముపార్జించుకోసాగాడు.
ఆసక్తి శూన్యుడై పైకి దీనంగాను, లోలోన ఆత్మభావనాపరవశంతోను భిక్షాటన
చేస్తూ గ్రామాలు నగరాలు సంచరించసాగాడు. త్రిదండము - భిక్షాపాత్ర -
కమండలము - జపమాలలతో దేశద్రిమ్మరిగా తిరుగసాగాడు.
ఓ ఉద్దవా! వృద్ధుడు - మలిన వస్త్రములు ధరించినవాడు అగు ఆ విప్రుడిని చూచి
అసత్పధులగు కొందరు ఆకతాయిలు గేలిచేస్తూ ఉండేవారు. అవమానిస్తూ ఉండేవారు.
చిన్న కర్ర చూపించి బెదిరిస్తూ ఉండగా ఆతడు వేగంగా అడుగులు వేస్తూ ఉంటే
పకపకా నవ్వుకొంటూ ఉండేవారు. అనేకులు అజ్ఞులు ఆతనికి ఆహారం ఇవ్వకపోగా
“ఓయ్! పోఁ! తంతా! పిచ్చివాడా! చెత్త ముఖమా!…” ఇటువంటి తిరస్కార భాషణతో,
దూషణతో అవమానించ సాగారు.
కొందరు ఆతని త్రిదండమును లాక్కున్నారు.
మరికొందరు ఆతని భిక్షకపాత్రను, కమండలమును దొంగిలించారు.
ఇంకొందరైతే ఆతని జపమాలను - బొంతను కూడా ఆతని నుండి పెరుక్కున్నారు.
ఆతడు ఒకానొక సమయంలో ఏదో దొరికిన పాత్రలో ఎవ్వరో ఇచ్చిన ఆహారం తింటూ
ఉంటే, ఆతనిని ఏడిపించి ఆనందించాలనే ఉద్దేశ్యంతో ఆ పాత్రలో పనిగట్టుకొని
మూత్రమును కూడా విసర్జించారు. శిరస్సుపై కాండ్రించి ఉమ్మివేశారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
260
మహానుభవాడగు ఆ మునిని కొందరు అకతాయిలు రహదారిలో నిలబెట్టి “ఆ విషయం
చెప్పు! ఈ విషయం చెప్పు! శృంగారం గురించి మాటలు చెప్పు!” అని వేధించేవారు.
ఆతడు ఏమీ మాట్లాడక ఊరుకొని ఉంటే, “అడుగుతుంటే చెప్పవేరా? ఏమిరా నీ
పొగరు?” అని కర్రతో అదిలించేవారు. “వీడిని చెట్టుకు బంధించండిరా!” అని త్రాళ్ళు
తెచ్చి బంధించి తిట్లు-శాపనార్ధములతో వినోదించేవారు. అవును. కొందరు మూర్ఖజనులు
యుక్తాయుక్తములు, తదనంతర పరిణామములు మరచిపోతూ వుంటారు. ఇతరులను
బాధించుటలో వినోదమును పొందటం, తద్వారా అనేక పాప-అల్ప-దుఃఖపూరిత
స్థితి గతులకై వారికి వారే తలుపులు (ద్వారాలు తెరుచుకొని పరుగులు తీయటం
లోకంలో కొందరు అజ్ఞాన జనుల విన్యాసమేకదా!
ఇతఃపూర్వము ఆ విప్రుని పూర్వవిషయాలు తెలిసిన కొందరు ఆ విప్రవర్యుని వైపుగా
కుడిచేతి క్రింది నాలుగు వ్రేళ్ళతో (బొటనవేలు నిలువుగాను) చూపిస్తూ…,
ఈతడెవ్వడో మాకు తెలుసు.
ఉట్టి పిసినిగొట్టు. మన డబ్బంతా ఎక్కడో దాచాడు.
లోక వంచకుడు.
|
దొంగ సన్యాసి. వేషాలు వేస్తున్నాడు.
|
ధనమంతా కోల్పోవడంచేత ఈతని బంధువులంతా కలసి ఊరినుండి వెళ్లగొట్టారు
|
కాబోలు! కానీ ఈతని ధనమును ఈతడు ఎక్కడో దాచియే ఉంటాడు.
ఈ భిక్షకవృత్తిని అవలంబించి జనాలని మోసగించి ఆహారం సంపాదించు
కుంటున్నాడు. ఇంతటి లోభిని మరెక్కడా చూచివుండం!
ఒకప్పుడు ఈతడు ఎటువంటివాడో మీకు తెలుసా? డబ్బుమదంతో ఎవ్వరినీ
లెక్కచేసేవాడు కాదు. గొప్ప బలవంతుడు. దగ్గిరకు వెళ్ళితే పలికేవాడా? లేదు.
మీసాలు మెలేసేవాడు! కొంగలాగా అందరినీ అణగద్రొక్కి తన పనులు తాను
సాధించుకునేవాడు. కృత నిశ్చయంతో - మోసపూరిత భావాలతో అందరినీ
బాధించి, వీడి హాయి వీడు చూచుకునేవాడు. తల్లితండ్రులను, భార్య బిడ్డలను
కర్రలతో హింసించాడు.
ఈవిధంగా ఆతనిని అవమానించేవారు. ఎగతాళి చేసేవారు. కొందరు ఆతనిపై
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
261
అపానవాయువు వదులుతూ వుండేవారు!
మరికొందరైతే “ఈతడు ఏమాత్రం మంచివాడు కాదురా! ఈతనికి అనుభవిస్తేగాని
తెలియదు…” అని పలుకుచు బంధించి చిన్న గదిలోను - వాకిట్లోను - తోటలోను -
దొడ్డి స్థలాలలోను ఒకటి రెండు రోజులు పడవేసి ఉంచేవారు.
శ్రీ ఉద్ధవుడు : కృష్ణా! ఆ విప్రుడు పొందిన బాధలను సత్యానందస్వరూపుడవగు నీవు
వర్ణిస్తూ ఉంటే నాకే దుఃఖం వస్తోంది. ఇక ఆతని మానసిక స్థితి ఏమిటో? ఆతడు
ఎంతో వేదన చెందేవాడు కదా!
శ్రీకృష్ణుడు: లేదు!
శ్లో॥ ఏవం స భౌతికం దుఃఖం దైవికం దైహికం చ యత్
భోక్తవ్యం ఆత్మనోదిష్టం ప్రాప్తం ప్రాప్తమబుధ్యత ॥ (అధ్యా 23, శ్లో 40)
ఆ సన్యాసి…,
భౌతికము (దుర్జనులచే కలిగేవి)
దైహికము ( జ్వరము మొదలైన దేహసంబంధమైనవి)
దైవికము (శీతోష్ణాదులచే కలిగేవి)
అయినట్టి కష్టములను చూచి….
ఇవన్నీ దేవనిర్దిష్టములు! దైవ కల్పితములు!
అనివార్యములు - అపరిహార్యములు!
కాబట్టి అవస్యము అనుభవించవలసినవే! అవస్యమనుభోక్తవ్యం!
అనే నిశ్చయమును కలిగియుండేవాడు. (తస్మాత్ అపరిహార్యే అర్ధ న త్వమ్ శోచితమ్
అర్హసి). దుర్జనులు కొందరు నేను వర్ణించినట్లుగా ఈతనిని సన్యాసాశ్రమ
స్వధర్మచ్యుతునిగా చేయాలి!" - అని ఉద్దేశ్యించి అనేక అవమానాలు చేసినప్పటికీ…
ఆ సాధువు సాత్వికమైన ధైర్యమును అవలంభించాడు.
సన్యాస సంబంధమైన స్వధర్మమును అనుసరిస్తూనే ఈవిధంగా కార్య కారణ
వ్యవహారమును కీర్తించసాగాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
262
అధ్యాయము–37.) భిక్షక గీతా గానము
|
భిక్షకుడు (విప్రుడు) : ఈ కష్టాలన్నీ నాకెందుకొచ్చినట్లు? అసలు ఏజీవుడికైనా కష్ట
సుఖాలు కలగటానికి అసలు కారణం ఏమై ఉన్నది? దీనిని ముందుగా మనం కనిపెట్టాలి!
? పూర్వజన్మ కర్మల వలననాగ్రహములు వక్రించుట చేతనా?
సహజీవులు, వారి కుబుద్ధుల వలననా?
కాల చక్ర చమత్కారమా? |
దైవేచ్ఛయా? దైవమాయయా? |
మరింకేవన్నా కారణాలు ఉంటాయా?
|
ఆఁ! ఆఁ! తెలిసింది. ఇవేవీ అసలు కారణాలు కావు!
శ్లో॥ నాయం జనో మే సుఖ-దుఃఖ హేతుః
న దేవత, ఆత్మా, గ్రహ, కర్మ, కాలాః,
మనః పరం కారణ మామనంతి
సంసార చక్రం పరివర్తయేత్ యత్|| (అధ్యా 23, శ్లో 42)
ఈ జనులు నా సుఖ దుఃఖాలకు హేతువులా? కాదు. వారు అందరినీ ఈ
విధంగా ఏడిపించటం లేదుకదా! నన్నుమాత్రమే ఏడిపిస్తున్నారు మరి!
దేవతలా? ఊహూ! కాదు. వాళ్ళు ఎప్పుడూ దయామయులే. నన్నెందుకు
కష్టపెడతారు.
ఆత్మయా? కానే కాదు! ఆత్మ నిర్వికారము - నిర్వికల్పము కదా! | -
లేదు! లేదు! వారు జీవునికి గ్రహములా? దేహం నిర్మించి ప్రసాదించేవారు.
కర్మ మార్గంలో మార్గ దర్శకులు. సర్వదా జీవులకు శ్రేయోభిలాషులు.
కర్మలా? కాదు! అవి ఆత్మజ్ఞానానికి సాధనములుకదా! పైగా, జడములు!
|
కాలమా? … కాదు కాదు! అన్నీ ఇచ్చేది - పుచ్చుకునేది కాలమే! అది సదా
సర్వమునకు అప్రమేయము! కాలానికి ఏ ఉద్దేశ్యాలు ఉండవు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
263
మరి?..ఆఁ ఆఁ! ఇప్పుడికి కనిపెట్టాను!
నా మనస్సే అన్నిటికీ కారణం.
మనస్సే సంసారము అనే మహాచక్రమును తన కల్పనా చమత్కారంచేత తనకు తానుగా
నిర్మించుకొంటోంది. తానే అందులో ప్రవేశించి, ఆ మహా చక్రములో తానే గొప్ప
పరిభ్రమణము నిర్వర్తిస్తూ సుఖ-దుఃఖాలన్నీ కల్పించుకొంటోంది. అద్దానియందు తనకు
తానే బద్ధుడుగా అగుచున్నది.
ఈ సృష్టిని కల్పించుకొనేది, సృష్టిగా ఉన్నది, సృష్టిచే చంచలత్వము పొందేది, సృష్టిలో
బంధనము పొందేది, సృష్టిని త్యజించి ఒనానొకప్పుడు ఆత్మతో అద్వితీయత్వము పొందేది
- అంతా మనస్సే! మనస్సే బంధ - మోక్షములను కల్పనచేసుకుంటోంది.
మనస్సు కల్పనచేసుకోకపోతే వాస్తవానికి బంధము లేదు. మోక్షము లేదు. సుఖము
లేదు. దుఃఖము లేదు. గుణ - కర్మల రచయిత మనస్సే!
సర్వబలసంపన్నమగు మనస్సే సత్వము - రజము - తమము - అనబడే త్రిగుణములకు
ఒక గొప్ప రచయిత అయి - మహాకల్పనాచమత్కారి అయి ఈ దృశ్యమును సృష్టించు
కుంటోంది. ఆ త్రిగుణముల నుండి విలక్షణములైనటువంటి త్రివిధ కర్మలు బయల్వెడలు
చున్నాయి.
శుక్ల కర్మలు - సాత్విక (ప్రేమ-దయ-దాక్షిణ్యము- ధర్మనిరతి మొదలైనవి)
కృష్ణ కర్మలు - రాజసిక (ఏదో నిర్వర్తించాలి అనే అభినివేశము)
లోహిత కర్మలు - తామసిక (ప్రమాదో-క్రోధ-లోభ-ఆలస్య-నిద్ర ఇత్యాది)
అట్టి త్రిగుణములనుండి (వివిధములైన సత్వ రజ తమో గుణ మిశ్రమ చమత్కారంచేత)
వేరువేరు అధిక అల్ప కర్మల నిర్వహణచే వివిధ వర్ణములైన జీవులు
బయల్వెడలుచున్నారు. అనగా కర్మానురూపులైనటువంటి దేవ-మానవ - తిర్యక్ జన్మాది
గతులు(Sequencial paths) ఏర్పడుచున్నాయి.
ఈ జీవుడు వాస్తవానికి సర్వదా హిరణ్మయుడు. జ్ఞానానంద స్వరూపుడు. సర్వదా
క్రియాశీలకమైనట్టి మనస్సుతో ఉన్నవాడు. ఆతని యొక్క కేవల జ్ఞానానంద
ఆత్మస్వరూపము సర్వదా సర్వమునకు కేవలసాక్షి అయి, సర్వక్రియలకు అతీతమై
(మనస్సుకు సాక్షి మాత్రమై) సర్వమును వీక్షిస్తోంది! అట్టి కేవలసాక్షి స్వరూపమగు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
264
పరమాత్మ నుండి “నేను మనో సమన్వితుడను కదా!…” అనే తలపుగల జీవాత్మ
బయల్వెడలుతోంది. ఆ జీవాత్మ సంసారద్యోతకమైన మనస్సుతో తన్మయమై, మనస్సుకు
సంబంధించిన క్రియలతో కూడుకున్నదై, భోగ-రాగములను సేవిస్తూ, మనస్సును
మనో కల్పితాన్ని ఆత్మభావనతో సందర్శిస్తూ సంసారాసక్తుడు అగుచున్నది.
జీవాత్మయొక్క సంసారాసక్తతయే సర్వ దుఃఖములకు, గతి-దుర్గతులకు కారణం. మనస్సు
శాంతిస్తే సంసారము లేదు - సంసారగతులు లేవు. సర్వము సర్వదా ఆత్మానందమే!
జ్ఞానానందమే! అఖండమే! ఏ నీవు-నేను-దృశ్యము-కష్టము-సుఖము ఇత్యాది
భేదత్వమంతా మనస్సు పొందుతోందో…. అదంతా అఖండాత్మయొక్క సత్విన్యాసము
దృష్ట్యా లేనేలేదు. అద్దంలో దృశ్యము ప్రతిబింబించినంత మాత్రంచే ఆ అద్దంలో
వస్తుజాలము ఉన్నట్లా? కాదు కదా! అద్దంలోని ప్రతిబింబముయొక్క కుడి ఎడమలు,
ముందు వెనుకలు బింబస్వరూపుడగు నాకు చెందవుకదా!
కనుక నేను చంచలమగు మనస్సును నిగ్రహించి… సరి అయిన మార్గంలో
నియమించానా అప్పుడిక నాయొక్క సంసారాసక్తి ఉపశమించి అఖండాత్మానుభూతి,
ఆత్మ సాక్షాత్కారం పరిఢవిల్లగలదు కదా! అటువంటి ఈ మనస్సును నిరోధించటానికి
సమాయత్తమయ్యెదను గాక! అందుకుగాను ఇంద్రియములు - ఇంద్రియ విషయములపై
యుద్ధం ప్రకటించి సర్వశక్తులను ఒడ్డి ఈ మనస్సును నిరోధిస్తాను.
మనస్సును నిరోధించటానికే పెద్దలు కొన్ని ఉపాయాలు, సాధనామార్గాలు చెప్పుచున్నారు.
శ్లో॥ దానం స్వధర్మో నియమో యమశ్చ
శ్రుతం చ కర్మాణి చ సద్ర్వతాని
సర్వే మనోనిగ్రహ లక్షణాంతాః
పరో హి యోగో మనసః సమాధిః | (అధ్యా 23, శ్లో 45)
దానము ఇతరుల సంతోషం కొరకై మాటలతో, సేవలతో,
సమర్పణతో, సహకారములతో - ఇటువంటి ఆయా మొదలైన
విధాలుగా స్వకీయ ప్రవర్తనను తీర్చిదిద్దుకోవటం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
265
స్వధర్మ నిర్వహణఆశ్రమ ధర్మము - నియమిత ధర్మములను లోకకళ్యాణ దృష్టి,
సహజీవుల క్షేమస్థైర్య అభయ విజయ దృష్టితో కౌశలంగా
నిర్వర్తించటం.
యోగః కర్మశుకౌశలం
నియమము ఇంద్రియములను భగవంతుని ఉపాసించే మార్గంలో
నియమించటం.
యమము అహింస, ప్రేమ-వాత్సల్యము మొదలైన అభ్యాసములచే
ఇంద్రియములను నిగ్రహించటం.
శ్రుతము శాస్త్రముల - మహనీయుల వచనములను నిర్వచనములను
వినటం. ఆకళింపు చేసుకోవటం. విచారణ చేయటం.
ఏకాంతంగా స్మరించటం. నలుగురితో కలసి
సత్సంగపూర్వకంగా సంభాషించుకోవటం.
కర్మాణి వ్రత - పూజ - దేవాలయసేవ ఇత్యాదులు.
మొదలైనవన్నీ మనో నిగ్రహానికి ఉపాయాలు. మనో నిగ్రహమే పరమ యోగము.
ఓ సజ్జనులారా! దానము ఇత్యాదులగురించి చెప్పాను కదా! అయితే… ఇక్కడ కొన్ని
చమత్కారమైన విశేషాలు చెప్పుతాను, దయచేసి వినండి!
దుఃఖాదులకు కారణం దాన ధర్మాలు చేయలేదు కాబట్టా?
శ్లో॥ సమాహితం యస్య మనః ప్రశాంతం
దానాదిభిః కిం వద, తస్య కృత్యమ్?
అసంయతం యస్య మనో వినశ్యత్
దానాదిభిశ్చేత్ అపరం కిమేభిః? (అధ్యా 23, శ్లో 46)
సమాహితము - వశీభూతము అయినట్టి నిర్మల మనస్సు కలవానికి మనం చెప్పుకున్న
దానము - స్వధర్మనిర్వహణ-నియమము యమము మొదలైనవాటివలన క్రొత్తగా -
వచ్చే ప్రయోజనం ఏమున్నది? ఆతనికి అంతా కృష్ణచైతన్యానందముగానే సర్వే సర్వత్రా
ద్యోతమౌతోంది! ఆతని స్వభావంలో త్యాగము అంతర్లీనమై వుంటుంది!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
266
ఇక, అసమాహితమై (Going on getting immersed in number of differences)
అలసత్వమునకు (delaying and lazy)వశమై… ఏమాత్రం నియమితముగాని మనస్సు
నియమము కలవానికి దానము ధర్మము మొదలైనవి నిర్వర్తిస్తే మాత్రం
ఏంప్రయోజనం? మనస్సు “నీది నాది”, జీవాత్మ-పరమాత్మ మొదలైన భేదభావాలు
వదలనంత వరకు జాడత్వము తొలగదు కదా!
పంచేంద్రియాలవలన దుఃఖం వస్తోందా?
ఈ ఇంద్రియాలు స్వతంత్రించి ఈ జీవునికి సుఖ-దుఃఖాలు కలిగించగలవా? లేదు.
వాటికా స్వతంత్రం లేదు. ఈ కళ్ళు-చెవులు…. ఇవన్నీ మనస్సు యొక్క వశంలో
వుంటున్నాయి.
శ్లో॥ మనోవశే అన్యే హి అభవన్ స్మ దేవా
మనశ్చ న అన్యస్య వశం సమేతి (అధ్యా 23, శ్లో 47)
మనస్సు ఇంద్రియముల వశంలో లేదు. ఇంద్రియములే మనస్సుకువశమై వుంటున్నాయి.
ఆహాఁ! ఈ మనస్సు బలవంతులందరికంటే కూడా బలవత్తరమైనది కదా! ఏమని
చెప్పాలి? గొప్ప గొప్ప సాధనలు చేస్తున్న యోగులంతటి వారు కూడా ఈ మనస్సుకు
దాసోహమ్ అంటూ, వశమైపోతున్నారే! ఆశ్చర్యమే మరి!
ఎవ్వరైతే ఈ మనస్సును తమవశం చేసుకుంటారో…. వారు దేవదేవుడే అవుతారు.
మనస్సు తనవశమయిందా, అంతకుమించిన స్నేహితుడు మరొకడుండడు.
వశంకాలేదా… అంతకుమించిన శత్రువు మరొకరెవరూ లేరు. ఎందుకంటే,…. రాగముమోహము-మమకారము-అపార్ధము మొదలైనవన్నీ కల్పించి,…. ఈ మనస్సు ఈ
భౌతిక శరీరముపై - హృదయమర్మ స్థానముపై కూడా దండయాత్ర చేసి పెత్తనము
చెలాయిస్తోందికదా!
శ్లో॥తం దుర్జయంశత్రుమ్ అసహ్యవేగం
అరుంతుదం తన్నవిజత్య కేచిత్
కుర్వంతి అసత్ విగ్రహమ్ అత్ర మర్యైః
మిత్రాణ్ ఉదాసీన రిపూన్ -విమూఢాః ॥ (అధ్యా 23, శ్లో 48)
దుర్జయము, సహించలేనంత వేగంతో చరించేది అయినట్టి ఈ మనస్సు అనే శత్రువు
దేహము-హృదయములను ఆక్రమించుకొని-తిష్ఠవేసుకొని వుండగా, ఈ జీవుడు అది
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
267
గమనించడేం? “మనస్సును వశంచేసుకొనేది-జయించేది ఎట్లాగురాబాబూ”… అనే
ఆలోచనయే చేయడాయె! చేయకపోగా, “ఇదిగో! వాళ్ళు నాశత్రువులు! వీళ్లేమో మావారు!
మిత్రులు! ఇక వీరువీరున్నారు చూచారూ! వీరు పరాయివాళ్ళు! నాకు వాళ్లతో పనియే
లేదు!” అని, తదితరులగురించి వ్యవహారాలు నడుపుచున్నాడు.
ఇంతకన్నా మూఢత్వం-తెలివితక్కువదనం మరొకటి వుంటుందా?
అసలీ దేహము ఏమైవున్నది? మనస్సు అనే మాయగాడు కల్పనచేసిన మాయా విశేషం
అటువంటిది. ఈ భౌతికదేహాన్ని చూచుకొని, ఈ జీవుడు మురిసిపోతున్నాడు. “ఆహాఁ!
నా దేహము! నా ముక్కు! నా పెదవులు! నా కనుబొమ్మలు! మిసమిసలాడే నా మీసాలు
కండరాలు!”… అని అద్దంలో చూచుకొని సంతోషపడి పోతున్నాడు.
ఈ దేహము నాది! నేను ఈ దేహమునకు చెందినవాడను ఈ దేహమే నేను!
అని భ్రమిస్తున్నాడు. ఫలితం? అటువంటి భ్రమచేత “దురంతము దురత్యయముఅపారము” అగు సంసార సముద్రంలో మునుగుచున్నాడు.
కాబట్టి నా దుఃఖములకు పంచేద్రియములు కారణం కాదు. అవి వున్నప్పుడు (జీవించి
వున్నప్పుడు) - లేనప్పుడు (స్వప్నసమయం - మరణానంతరము) నన్ను సుఖ దుఃఖాదులు
వదలటం లేదుకదా!
సహజనులు నా దుఃఖాలకు కారణమా?
నేను ఆత్మ స్వరూపుడనని మహనీయులగు ఆత్మశాస్త్రజ్ఞులు గుర్తు చేస్తూనే వున్నారు
కదా! ఆత్మ సర్వదా పరము-అప్రమేయము కూడా! మరి ఈ భౌతిక దేహమో! ఇది
మనోకల్పన మాత్రమేనని అనుకున్నాం కదా! భౌతికదేహము నేను కాదు నాది
కాదు! మరి ఇక తదితర భౌతిక దేహముల వలనగాని, ఈ దేహమువలనగాని నాకు
సుఖ-దుఃఖాలు ఎట్లా కలుగుతాయి.
సరేఁ! సహజనులు నాకు సుఖ దుఃఖ కారకులా? - అనే ప్రశ్నను మరొకకోణంనుంచి
పరిశీలిద్దాం!
నేను ఆత్మ స్వరూపుడను!
తదితరులో-వారూ ఆత్మస్వరూపులే!
ఆత్మ వేరువేరు ఖండములుగా అగుచున్నదా? లేదు! “ఆత్మ సర్వదా అఖండము”
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
268
అని కదా, వేద-వేదాంత ప్రవచన నినాదము!
అనగా నేను-తదితరులు…. అందరముకూడా ఏకము - అక్షరము అగు
అఖండాత్మ స్వరూపులం! (ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ!)
ఇప్పుడు… ఈ “నాదేహం-తదితర దేహులు”… అనే విషయాన్ని గమనిస్తే…,
శ్లో॥ జిహ్వాం క్వచిత్ సందశతి స్వదద్భిః
తత్ వేదనాయాం కతమాయ కుష్యేత్? (అధ్యా 23, శ్లో 50)
నేను భోజనం చేస్తూ వున్నాననుకోండి! అలా కొంచెం పరధ్యానంలో వుండగా,…. నా
పళ్ళు నా పెదిమలను గాయపరచాయి.
అప్పుడు నాకు నా పళ్ళపై కోపం వస్తుందా?
కోపంవచ్చి, ప్రక్కనే వున్న కంచు చెంబుని చేత్తో తీసుకొని, “ఓ నా దంతములారా!
మీ సంగతి చూస్తాను!”…. అని బాదుకుంటానా?
మరి సహజనులంతా నా ఆత్మయొక్క ప్రత్యక్ష రూపాలే కదా! పెదిమలను గాయపరచిన
నా పళ్ళపై (దంతములపై) కోపగించనట్లే,… ఆత్మస్వరూపులగు సహజీవులపై
కోపగించటం ఎట్లా?
నా దుఃఖాలకు కారణం దేవతలా?
“దేవతలు” అనగా ఎవ్వరు? (ద ఇచ్చువారు). నాకు పంచేంద్రియములను
(కొంతకాలము వరకు) ప్రసాదించి, వీటిని పరిపోషిస్తున్న సంకల్పశక్తి స్వరూపులు
కదా! అంతేగాని, ఈ పంచేంద్రియములు నేను తయారుచేసుకోలేదే! ఇవి దేవతలు
ప్రసాదించినవి కాబట్టి వారి సొత్తు!
అనగా, ఈ పంచేంద్రియముల యొక్క కర్తృత్వ - భోక్తృత్వములు ఇంద్రియాభిమానులగు
దేవతలకు సంబంధించినవి మాత్రమే! ఆత్మస్వరూపుడనగు నాతో దేవతల సొత్తయినట్టి
ఇంద్రియములకు గల సంబంధం ఏమున్నది? అవి నాకు సుఖ-దుఃఖాలు కలిగించ
వలసిన అగత్యమేమున్నది?
ఇంద్రియాధిష్ఠాన దేవతలు = The creaters, contributers, owners,
Possessors and also Enjoyers of :
Eyes _ Eye-functions,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
269
Ears - Ear-functions,
Skin - Skin features and functions
Nose - Nose functions
Tongue - Tongue features and functions
ఆ అధిష్ఠాన దేవతలు సర్వదేహాలలోను స్పర్శ శబ్ద రూప రస-గంధ కార్యక్రమాలు
ప్రదర్శిస్తున్నారు. అంతేగాని నా ఒక్క దేహములోనే కాదు. అటువంటప్పుడు ఒక దేహముఇంకొక దేహము తాకుచున్నప్పుడు ఎవరు వారిని తప్పు పట్టుకోవాలి? ఒకే స్పర్శాధిష్ఠాన
దేవతయే అన్ని దేహాలలో వేంచేసి వున్నారు కదా!
ఆత్మయే దుఃఖ కల్పన చేసుకుంటోందా.
ఆత్మయే మనస్సుద్వారా తనయొక్క సుఖ-దుఃఖములను కల్పించుకొనుచుండగా… ఇక
ఒకని సుఖ-దుఃఖములకు మరొకరినెవరినో దూషించి, వారివి వీరివి తప్పులు పట్టుకొని,
వారిపై-వీరిపై ఆపాదించి గంటల తరబడి మాటలు చెప్పుకొని ఉండుటవలన ఏమి
లాభం? వృధాయాసం!
ఆత్మ మనస్సును కలిగి ఉండటం అనేది - ఆత్మయొక్క స్వభావమే అయిఉన్నది! -
మనస్సుకు జగత్కల్పన మనోస్వభావమే!
జగత్తు అనగా సుఖ-దుఃఖమయముగా ఆస్వాదించబడే దృశ్య తతంగమే!
బంగారమునకు “ఇది ఆకారం” - అనేదేమీ లేనప్పటికీ, ఆకారం లేకుండా బంగారం
ఉంటుందా? ఉండదుకదా!
అంతా ఆత్మస్వభావమే! ఆత్మతత్త్వమే! ఆత్మకు అన్యమైనదేదీ లేదు! (ఇదియే అద్వైత
సిద్ధాంతము). ఆత్మ జగద్రూపాన్ని కలిగియే వుంటుంది!
ఒకవేళ ఆత్మకు అన్యంగా ఏదైనా అనుభూతమైతే - అదంతా మిధ్యయే! ఒకడు తాను
వ్రాసుకొన్న ఒక కథను చదువుచూ, ఆ కథలోని ఒక దుఃఖ సంఘటనను చూచి తానే
దుఃఖం పొంది వెక్కి వెక్కి ఏడ్వటం వంటిదే!
దుఃఖముగాని వాస్తవానికి స్వకీయమైన భావన- నిర్ధారణ (Assumసుఖముగాని ing-Deciding) లకంటే వేరుగా లేనప్పుడు ఇక ఎవరిమీద కోపం? క్రోధం ఎందుకు?
క్రోధానికి ఏమి కారణమున్నది? తనకు తానే అన్నిటికీ కారణమై ఉండగా, అంతా
ఏకైకాత్మయే (అఖండాత్మయే) అయి ఉన్నప్పుడు ఇక ఎవరిని ఏమని అనాలి? దుఃఖము
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
270
ఎవరికి? తస్య కో మోహః కో శోకః?
ఇంకొక విషయం. దుఃఖము ఆత్మకా! అది అప్రమేయము-నిత్యానందముకదా! పోనీ
జీవునికా! ఈతడు ప్రతిబింబమాత్రుడు కదా! “నాకు దుఃఖాదులు లేవు. కానీ దర్పణం
(అద్దం)లో కనిపించే నా ప్రతిబింబానికి దుఃఖం..” అని అంటే… అదీ అర్ధం లేని
మాటయే కదా!
కాక, దుఃఖమనబడేది ఈ భౌతిక దేహానికా? ఇది జడముకదా! జడమాత్రమగు
దర్పణమునకు సుఖమేముంటుంది? దుఃఖమేముంటుంది? జడమాత్రమగు దేహానికి
కూడా సుఖము లేదు. దుఃఖము లేదు.
ఆత్మయే సుఖదుఃఖ కారణమందామా?
అంతా ఆత్మయే అయిఉండగా ఆత్మ అనన్యమై ఉండగా సుఖముగాని దుఃఖముగాని
వేరుగా లేనట్లే కదా! అనగా, అవి కూడా ఆత్మస్వరూపమేగా! కాంతి వలన మెరుస్తూ
కనిపించే రత్నములను చూచి కాంతికి సుఖమేమిటి? దుఃఖమేమిటి?
గ్రహములు సుఖ దుఃఖ కారణములా?
గ్రహముల ప్రభావంచేత సుఖ-దుఃఖాలు వస్తున్నాయని కాసేపు అనుకుందాం. కొందరు
దైవజ్ఞులు ఆకాశములో ఉండే గ్రహములచేత దేహములో ఉండే గ్రహములు బాధింపబడు
చుండటంచేత సుఖ-దుఃఖాలు ఏర్పడుచున్నాయని అంటున్నారు.
దేహమునకు పుట్టుక - నాశనములున్నాయి.
దేహి దేహముకంటే విలక్షణమైనవాడు. దేహికి జన్మలేదు-మరణము లేదుకదా!
దేహియే కదా, ఆత్మ స్వరూపుడు!
సర్వ దేహములలో గ్రహదేవతల కార్యక్రమవిధులు అంతర్లీనమై వుంటాయి.
కాబట్టి గ్రహముల ప్రభావం దేహముపై ఉంటే ఉండవచ్చుగాక! ఆ గ్రహములకు
దేహము కంటే భిన్నమైనట్టి ఆత్మపై కోపం చూపించవలసిన పనేమున్నది? గ్రహబలం
- తారాబలం గురించి చెప్పువారు మనో బలహీనతయొక్క ఓదార్పు కొరకో, మనస్సును
ఏదో రీతిగా ఉత్సాహపరచటానికో ఉద్దేశ్యిస్తున్నారు. బుద్ధి ఆత్మబలం పుంజుకున్నదా -
ఇక గ్రహ-తారాబలముల గురించిన అగత్యం ఏముంటుంది. లోక రక్షకులగు గ్రహదేవతలకు కొందరిపై ఆగ్రహం -మరికొందరిపై అనుగ్రహం నిష్కారణంగా
ఎందుకుంటుంది?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
271
కర్మలు సుఖ దుఃఖ హేతువందమా?
జడమైన దేహమునకు స్వకీయకర్మలు లేవు.
అజడమైన ఆత్మయో - సర్వమునకు అప్రమేయము, కర్మ వ్యవహారములకు
అతీతము.
జడము-అజడము కాని దానికి మాత్రమే కర్మలు - కర్మప్రభావములు
సంభవమౌతాయి.
ఈ జీవుడు స్వతఃగానే సర్వదా సుపర్ణుడు. అనగా శుద్ధజ్ఞాన శుద్ధచైతన్య
స్వరూపుడు. కర్మకిం ఫలం? అనికదా పెద్దల అభిప్రాయం!
కర్మతత్ జడమే! కర్మములుకూడా దేహమువలెనే - జడరూపములే!
ఈ జీవునికి సంబంధించి జడము-అజడము కానిదంటూ ఇంక ఏదీ లేదు.
అనగా, కర్మలే లేవు! కర్మలే లేనప్పుడు “అవి సుఖ-దుఃఖాలు కలుగజేస్తున్నాయి” అని
ఎట్లా అనగలరు? ఈ జీవుడు ఆత్మస్వరూపుడు కదా! జడమగు కర్మలకు చైతన్య
స్వరూపమగు ఆత్మపట్ల సుఖ దుఃఖాలు కలిగించగల సామర్ధ్యము ఎక్కడున్నది?
సుఖ దుఃఖాలు కాల ప్రభావమా? అంతా కాలమహిమ అంటారు కొందరు!
ఆత్మ కాలః కాలము. కాలమును నియమించునది. కాలముచే మార్పుచేర్పులు లేనిది.
అంతేకాదు! ఆత్మ సర్వమునకు ఆత్మయే! కాలమునకు కూడా ఆత్మయే! కాలాత్మకమైనది
కూడా! జాగృత్లోని కాలము జాగృత్కో పరిమితం. ఆత్మయో, జాగృత్-స్వప్న-సుషుప్తులకు
సాక్షియగు తురీయ స్వరూపం కదా! అటువంటప్పుడు, కాలము ఆత్మను ఎట్లా
క్షోభింపజేయ గలుగుతుంది?
ఎక్కడన్నా…,
అగ్నియొక్క వేడి అగ్నిని బాధిస్తోంది - అనగలమా? మంచుయొక్క చల్లదనము మంచుకు
చలి కలిగిస్తోంది - అని అనవీలున్నదా? ఏ ఆత్మకు వేరైనదంటూ లేదో, సర్వజీవులకు -
కాలమునకు కూడా అది ఆత్మయే అయి ఉన్నదో… అట్టి నా స్వస్వరూపాత్మను కాలము
బాధించటమేమిటి? సుఖ దుఃఖాలు కాలమహిమచేత, కాలచమత్కారంచేత వస్తున్నాయి…
అనునది కుదిరే వాక్యము కాదు. యుక్తికి సరిపోదు. (It is not logically acceptable)
కనుక, ఆత్మస్వరూపుడగు నాకు కాలప్రభావంగా సుఖాలు లేవు. దుఃఖాలు లేవు. నీవునేను అనునవన్నీ అప్రమేయమగు ఆత్మస్వరూపులము కానిదెన్నడు? ఎప్పుడు? ఎప్పుడూ
లేదు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
272
అహంకారము దుఃఖములను పొందుతోందా?
ఒక రచయిత ఒక నవల వ్రాశాడు. ఆ నవలలో ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్ర ఎటువంటిదో
సంసారము అనే నాటకములో అహంకారము అనునది అటువంటిది.
నవలలోని పాత్రకు వచ్చే కష్ట-సుఖాలకు ఆ నవలా రచయితకు సంబంధమేమున్నది?
“ఆ కష్ట సుఖాలు నవలా రచయితవే!” అని ఎవ్వరైనా అంటారా? “కాదండీ! కల్పనామయ
మగు నవలలోని ఆ పాత్రవండీ! అని మాత్రం అనగలరా? అదీ కుదరదు కదా!
అహంకారము ప్రకృతిలోనిది. ఆత్మ ప్రకృతికి అతీతమైనది. ఆత్మకు అహంకారముతో
ఏక్షణంలోనూ సంబంధమే లేదు-నాటక రచయితకు, నాటకంలోని పాత్రయొక్క గుణగణములకు సంబంధమే లేనితీరుగా!
ఈ విషయం గమనించి గ్రహించిన మానవుడికి భూత ప్రకృతికి ఇక భయమొందడు.
భూత ప్రకృతి నుండి మోక్షము పొందినవాడే అవుతాడు.
అందుచేత ప్రాచీనులగు మహర్షులు ఏ ఆత్మ తత్త్వమును సేవించారో… అటువంటి
ఆత్మజ్ఞానమును ఆశ్రయిస్తాను. (శృణ్వంతి విశ్వే అమృతస్య పుత్రః అని) ఏమి
చెప్పుకుంటూ వచ్చారో అట్టి పరమాత్మయే పరతత్త్వమే నా ధ్యేయం.
ఎందుకంటే అదియే నా స్వస్వరూపం! అట్టి స్వస్వరూపాస్వాదనకు సర్వాంతర్యామి
మాయాతీతుడు - కేవలసాక్షి - సర్వతత్త్వ స్వరూపుడు అగు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క
పాదపద్మాలను (అ ఋషులవలెనే) ఆశ్రయిస్తాను. ఇక కష్ట-సుఖముల గురించి, సుఖదుఃఖముల గురించి, పట్టించుకోను. మాట్లాడను. ఊసైనా ఎత్తను. అస్సలు వాటిని
గుర్తించను. గమనించను. లెఖచేయను. ఎవ్వరికీ ఆపాదించను. పరుగెత్తే కుందేటి
రెండు కొమ్ములులాగా కష్ట-సుఖములు వాస్తవానికి మొదలే లేవు!
ఒకవేళ వుంటే, అవి మనో కల్పితాలు మాత్రమే!
మొదలే లేవు అని గమనించవలసిన కష్టసుఖాలను ”నాకున్నాయో"? అని తలచి తెచ్చి
పెట్టుకొను దుస్తరమగు సంసారగతి నుండి నన్ను నేను తరింపజేసుకుంటాను గాక!
శ్రీకృష్ణభగవానుడు : వింటున్నావా మిత్రమా! ఉద్దవా! సర్వ భౌతికసంపదలను
పోగొట్టుకున్నవాడగు ఆ భిక్షువు సర్వభేదభావాలను క్రమంగా త్యజించసాగాడు. సన్యాసి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
273
అయి ఈ భూమిపై చరించాడు. కొందరు దుర్జనులు బాధలు కలుగజేసినప్పటికీ ఆతడు
స్వధర్మము - సన్యాసి ధర్మము నుండి ఏమాత్రం చ్యుతి పొందుటయే లేదు!
ఇతఃపూర్వమే మహర్షులచే ప్రతిపాదించబడిన ఆత్మ తత్త్వమును కీర్తిస్తున్నాడు.
ఆశ్రయిస్తున్నాడు.
కనుక…, సఖుడా!
శ్లో॥ సుఖ దుఃఖప్రదో నా న్యః పురుషస్య ఆత్మ విభ్రమః
మిత్రో- ఉదాశీన రిపవః సంసారస్తమసః కృతః ॥ (అధ్యా 23, శ్లో 59)
దుఃఖదాతా న కో ప్యస్తి! సుఖదాతా నకశ్చన! ఈ జీవునికి సుఖము ఇచ్చేవారెవ్వరు
లేరు? దుఃఖ ప్రదాతలు లేరు.
ఆత్మ తత్త్వమును ఏమరచటంచేత సుఖదుఃఖాలు కల్పితంగా (As an illusion) మనస్సుకు
అనుభవమగుచున్నాయి. “ ఇది కష్టము-ఇది సుఖము, ఇతడు మిత్రుడు. ఆతడు సేవకుడు
ఈతడు శత్రువు” మొదలుగాగల సంసారమంతా కేవలము అజ్ఞాన కల్పితము మాత్రమే!
అట్టి సంసారరోగమునకు ఉపశమనోపాయము ఏమిటో చెప్పుచున్నాను విను.
నాయందు నీ బుద్ధిని పరిపూర్ణంగా నియమించు! “నాటకంలో పాత్రగా
నటిస్తున్నప్పుడు, ఆ పాత్రయొక్క కష్ట సుఖాలు ఆ నటుడివి అవుతాయా?”
అనురీతిగా గమనించు!
పరిపరివిధములైన భావావేశములను ఆశ్రయిస్తున్న నీ మనస్సును నిగ్రహించు.
ఇదియే భిక్షు గీతాసారము!
శ్లో॥ గీయ ఏతాం భిక్షుణా తాం, బ్రహ్మనిష్ఠాం సమాహితః |
ధారయన్ శ్రావయన్ శృణ్వన్ ద్వంద్వైర్నైవాభిభూయతే ॥ (అధ్యా 23, శ్లో 61)
ఆ భిక్షునిచే గానము చేయబడిన బ్రహ్మజ్ఞాన తత్త్వమును ప్రశాంత-సమాహిత చిత్తముతో
ఎవ్వరైతే పఠిస్తారో, ధారణ చేస్తారో, వినిపిస్తారో, వింటారో.., వ్యాఖ్యానిస్తారో…
వారు సుఖ దుఃఖాలకు వశులు కారు! ద్వంద్వాతీతులై ఏకస్థమగు ఆతమతత్త్వమును
సంపాదించుకునే బుద్ధిని ప్రవృద్ధపరచుకోగలరు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
274
అధ్యాయము–38.) సాంఖ్యతత్త్వోపదేశము |
శ్రీకృష్ణభగవానుడు : ఓ ఉద్ధవా! ప్రాచీనులగు మహర్షులు ఆత్మతత్త్వమును అన్వేషించి,
కృతనిశ్చయించి సాంఖ్యయోగమును వివేచనచేయు వారికొరకై ప్రసాదించటం జరిగింది.
అట్టి సాంఖ్యయోగము శ్రద్ధగావింటే అట్టి శ్రోత భేదమూలకములగు సుఖ దుఃఖములు
మొదలైనవాటిని త్యజించివేస్తాడు. ఈ దృశ్యజగత్తును పీడగా కాకుండా క్రీడగా, బాలా
లీలా వినోదంగా చూడగలుగుతాడు.
ఒక్క విషయము. కృతయుగములోగాని, మరొక యుగంలోగాని, ప్రళయంలోగాని…
ఏ కాలమందైనాసరే… వివేకులైనట్టి పురుషులు ఉంటారు.
అట్టి వివేకవంతులకు సర్వకాల సర్వావస్థలయందును సర్వత్రా అఖండమగు బ్రహ్మమే
ద్యోతకమై అనుభవైకవేద్యమై ఉంటోంది.
స్వతఃసిద్ధమైనట్టి అఖండ పరబ్రహ్మమగు నేను మాత్రమే ఉన్నాను. (అనగా)
మొట్టమొదటగా ఏకము-అనునిత్యానుభవసిద్ధము అగు బ్రహ్మమొక్కటే ఉన్నది. అట్టి
మనో వాక్కాయములకు అగోచరము, వికల్పరహితము (నిర్వికల్పము), భేదరహితము,
ఏకము, సత్యము (Beyond thought and not expressible by throught . The
Thinker prior to thought. The Talker before talking, The one before and
beyond visualazation, before and beyond the perspective of differences.
The Unity prior to and during Diversity. Ever as it is existant) అగు పరబ్రహ్మమే
నేను! నాయొక్క మాయా విలాసంచే (through my own playful sense of illusion)
నాకు నేనే రెండు - (2) గా అగుచున్నాను.
అనగా… ఆత్మ 1. పరమాత్మ 2. జీవాత్మ Self and self related గా! (లేక)
1. ఆత్మ 2. ప్రకృతిగా!
ప్రకృతి నాయొక్క అంశయే! ఆత్మాంశయే! అట్టి నా ప్రకృతి రెండు విధములుగా
ఉంటోంది.
1. కారణము (Cause) 2. కార్యము (Effect).
ప్రకృతి యొక్క ఒకానొక అంతర్లీనమైన అంశ ఎరుగుట - జ్ఞానము (Knowledge).
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
275
అట్టి ప్రకృతియొక్క జ్ఞానాంశ స్వరూపమే ఈ జీవుడు లేక పురుషుడు అని కూడా
గమనించు! నా అంశయే ఈ జీవుడు!
పురుషోత్తముడను - పరమేశ్వరుడను అగు నేను నా భావనాసదృశమగు ప్రకృతిని
కించిత్ క్షోభింపజేయటం చేత త్రిగుణములు అభివ్యక్తమునకు కారణకారణు
డనగుచున్నాను.
1. సత్త్వగుణము 2. రజో గుణము 3. తమో గుణము.
పై గుణత్రయము నుండి క్రియా శక్తి సంపన్నమగు సూత్రము (Activity)
ప్రదర్శనమౌతోంది.
క్రియా వ్యవహారమైనట్టి సూత్రము నుండి జ్ఞానశక్తి ప్రధానమగు మహత్తత్వము
(The feature of ability) ప్రదర్శితమౌతోంది.
అనంతమగు మహత్తత్త్వము (Agility and ability) నుండి సర్వజీవులను
మోహింపజేసే అహంకారము (నేను-నేను-నాది నాది) బయల్వెడలుతోంది.
అహంకారము
వైకారికము తైజసము తామసము
(జాగృత్) (స్వప్నము) (గాఢనిద్ర)
అహంకారము
చిన్మయము (చైతన్యము) అచిన్మయము (జడము)
Active Passive
అహంకారము
శబ్ద-స్పర్శ-రూపచెవులు చర్మము మనస్సుకు
రస-గంధములనబడే కనులు-నోరు ముక్కు
తన్మాత్రలకుఅనే పంచేంద్రియములకు! |
వీటన్నిటికీ అహంకారమే కారణముగా అగుచున్నది!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
276
ఓ ఉద్దవా! ఈ జగత్తంతా కూడా కాలాత్మకుడను పరమేశ్వరుడను అగు నాచే కర్మయుక్తమై
ఉంటోంది. అది అట్లా ఉండగా…,
నా అంశయే అయినట్టి ఈ జీవుడు సత్వము-రజము-తమము అనే త్రిగుణములనబడే
జలముతో నిండిన సంసార సాగరములో ఒకసారి మునుగుచున్నాడు. మరొకసారి
లేచుచున్నాడు. మరల మునుగుచున్నాడు.
ఈ జగత్తులో కనిపించే-అనుభవమయ్యే చిన్న-పెద్ద-స్థూల సూక్ష్మములగు పదార్థాలన్నీ
కూడా ప్రకృతి-పురుషుడు… ఈ రెండింటినుంచీ బయల్వెడలినవే సుమా!
ఇక్కడ ఒకసూత్ర వాక్యం (సిద్ధాంత వాక్యం) చెప్పుచున్నాను. విను.
శ్లో॥ యస్తు యస్య ఆదిః - అంతశ్చ
స వై మధ్యం చ తస్యసన్
వికారో వ్యవహారార్థో
యథా తైజస, పార్థివాః ॥ (అధ్యా 24, శ్లో 17)
ఒకానొకటి మొట్టమొదలు - చిట్టచివర ఏది అయి ఉన్నదో… మధ్యలో కూడా అదే
అయి ఉన్నది. మధ్యలో మరొకటేదోగా చూడబడుచున్నా (లేక) అనుభూతమౌతూ
ఉంటే … అప్పుడు అదంతా మనోవికారం (లేక) దృష్టియొక్క భేదముచే అనిపించేది
మాత్రమే! వ్యవహారం కొరకు సంభాషణకొరకు చెప్పుకునే మాటలు మాత్రమే! లేక
కల్పనయే! భావావేశానుభూతియే!
ఉదాహరణకు
స్వప్నంలో కనిపించేదంతా స్వప్న చైతన్యమే కదా! స్వప్నంలో కనిపించిన జంతువుమనిషి వేరువేరైనవవుతాయా? లేదు. అంతా స్వప్నచైతన్యముయొక్క చిత్కళా
సంప్రదర్శనమే! (లేక) ఊహా చమత్కారమే!
మట్టికుండ… మట్టిలోంచివచ్చి మరల మట్టిలోనే కలిసిపోతోంది. మరి మట్టినుండి
కుండగా కనబడేది మట్టికి వేరైనదా! మట్టికుండ అనే మాట వికారో
నామధేయము - వ్యవహారార్ధం కల్పించబడినదే కదా! కుండగా వున్నప్పుడు
కూడా అది మట్టియే!
బంగారు ఆభరణములో బంగారముకంటే ఆభరణము వేరా? కాదు. కనుక
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ -ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
277
బంగారు ఆభరణము అనుమాట వికారమాత్రం - వ్యవహారార్ధ కల్పితం. “ఇది
బంగారమండీ! ఇదేమో ఆభరణము” - అని ఎవ్వరైనా విడదీసి చూపగలరా!
ఆభరణముగా కనిపించేది బంగారము కానిదెన్నడూ లేదు!
జలతరంగము అనే దానిలో జలము వేరు తరంగము వేరు - అవుతాయా?
కాదు. కనుక జలతరంగము అనేమాట వ్యవహారార్ధం చెప్పబడేదే కాని, తరంగం
అనేది జలమునకు వేరుగా లేదు. తరంగము జలంలో ఉదయిస్తోంది. జలములోనే
ఉంటోంది. జలంతోనే లయిస్తోంది. తరంగము జలము కానిదెప్పుడు?
కాబట్టి
తరంగము జలమునకు అభిన్నము. బంగారు లోహము నుండి ఆభరణరూపంగా
తయారు చేబడిన ఆభరణము బంగారమునకు అభిన్నము. మట్టితో తయారు చేయబడిన
మట్టి ఏనుగు-మట్టి రాజు - మట్టి మంత్రి - మట్టి శత్రు సైనికులు - ఇవన్నీ కూడా
మట్టికి అభిన్నము.
అట్లాగే…,
పరమాత్మ అనే సాగరజలములో పుట్టి - లయించు జీవాత్మ తరంగము
పరమాత్మకు అభిన్నము.
పరమాత్మ అనే మృత్తిక (మట్టి)తో తయారైన జీవాత్మాహంకారము పరమాత్మయందే
జనించి పరమాత్మయందే లయిస్తోంది. కాబట్టి అహంకారము (జీవాహంకారము -
వ్యష్ఠి అహంకారము-దేహాహంకారము ఈశ్వరాహంకారము మొదలైనవన్నీ)
పరమాత్మకు అభిన్నము.
పరమాత్మ అనే బంగాముతో తయారైన మహత్తత్త్వము - మనో బుద్ధి చిత్త
అహంకారాలు-త్రిగుణములు ఇవన్నీ కూడా పరమాత్మ అనే మూల పదార్థానికి
అనన్యము. వేరు కాదు. అవన్నీ వేరువేరు బంగారు ఆభరణముల వంటివి.
అనగా…,
పరమాత్మ అనే నిమిత్త కారణము (లేక) మూలకారణము నుండి బయల్వెడలిన
జీవాత్మ
వ్యష్ఠి అహంకారము
ప్రకృతి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
278
దేహ-మనో-బుద్ధి-చిత్త అహంకారాలు
మహత్తత్త్వము (The ‘Ahamkara’ that is present in all 3 states
Jagruth, Swapna & Sushaptha)
జగదనుభవాహంకారము మొదలైన
ఇవన్నీ - పరమాత్మనుండి బయల్వెడలుచు, పరమాత్మలోనే లయం అవబోతూ,
వర్తమానంలో కూడా పరమాత్మతత్త్వమునకు అభిన్నమై చెన్నొందుచున్నాయి. ఆయా
నామధేయాలన్నీ ఆయా సందర్భాల గురించి సంభాషించుకోవటానికి చెప్పబడుచున్న
వ్యవహార కల్పిత సత్యములే కాని సహజసత్యములు కాదు. మూల సత్యము కాదు.
వికారో నామధేయాలు. మట్టికుండ-మట్టి మూకుడు-మట్టి పిడత… ఇవన్నీ ఒకే మట్టికి
కల్పించబడటం- ఆపాదించబడటం వంటిది. మనో-బుద్ధి-చిత్త-అహంకారాల విషయం
కూడా అటువంటిదే! అవన్నీ ఆత్మకు అభిన్నములు!
ఈవిధంగా….
బ్రహ్మ సత్యమ్ జగన్మిధ్య
జోవో బ్రహ్మేతి నాపరః
అద్వితీయం బ్రహ్మ
అహమ్ బ్రహ్మస్మి
ఇత్యాది మహా వాక్యార్ధాలు “సర్వము ఆత్మకు అభిన్నము ఈ జీవుడు ఆత్మ
స్వరూపుడే..”అనియే సిద్ధిస్తున్నాయి. అనగా ఋషిప్రవచిత వేద వేదాంత మహా
వాక్యార్ధాలు ఈవిధంగా నిరూపితమౌతున్నాయి.
జగత్తు అనే కార్యము (work) నకు ఉపాదాన కారణము (Worker) ప్రకృతి.
ప్రకృతి అనే కార్యమునకు ఉపదానకారణము (లేక) అధిష్ఠానము పురుషుడు (Individual Self)
పురుషుడు (లేక జీవుడు) అను కార్యము (Work) నకు ఉపాదాన కారణము (Worker)
త్రిగుణముల క్షోభను అభివ్యక్తం చేసే కాలము.
పురుషుడు - గుణములు - కాలము అను మూడిటికి ఉపాదాన కారణము పరమాత్మపరబ్రహ్మము అని వేదోపనిషత్తులచే చెప్పబడే నేనే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
279
నాకంటే భిన్నమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. నీవుగా కనిపించేది నేనే-త్వమేవాహమ్!
బంగారపు గొలుసు-గాజులు-ఉంగరము-వడ్రాణము-ఉగ్గుగిన్నె-ముక్కుపుడక
మొదలైనవ్నీ బంగారముకంటే వేరా? అవన్నీ ఆకార భేదంచేత సందర్భోచితంగా
సంభాషణయొక్క వసతి కొరకు కల్పించబడి చెప్పే పేర్లే కదా! నాకంటే జీవాత్మ -
మహత్తత్త్వము గుణములు జీవాత్మలు - అనుభూతులు దేహములు
దేహపరంపరలు - దృశ్యపరంపరలు వేరుకాదు. అన్నిటికీ మూలకారణము - నిమిత్త
కారణము నేనే! మిలిగినవన్నీ వికారోనామధేయాలు. సందర్భానుచితంగా కల్పించబడిన
పేర్లు. ఉపాదాన కారణాలు. భేదదృష్టిగల శిష్యునికి పరతత్త్వము - బ్రహ్మతత్త్వము
అగు నా గురించి విడమర్చి చెప్పటానికి తత్త్వవేత్తలచే కల్పించబడిన నామ రూప
వర్ణనా చమత్కారాలు. సందర్శనా చమత్కారాలు. పరమాత్మయొక్క యీక్షణా విశేషణా
చమత్కారాలు Perceptual creations). లీలా కల్పితాలు (created for a play).
స్వప్నాంతర్గతవస్తు భేదాలు!
ఈ కనబడేదంతా కూడా…. నాయొక్క లీలా వినోదమే! ఇంకా చెప్పాలంటే
అద్వితీయుడనగు నేనే! అఖండమగు నేనే జీవాత్మదృష్టిచే “అనేకము” గాను పరమాత్మ
దృష్టిచే “ఏకము” గాను అనుభాతమగుచున్నాను.
అట్టి జగత్తు కల్పన - సృష్టి అనే లీలా వినోదము యీక్షణా విన్యాసము
కొనసాగేంతవరకు సృష్టి-స్థితి-లయాలు, త్రిగుణాత్మక భావనానుభూతులు, వివిధ
స్వభావాలతో కూడిన జీవాత్మ పరంపరలు, ఆ జీవుల ఉపభోగములైన పిత్రు-పుత్రాది
రూప వ్యవస్థలు, సృష్టి చక్ర పరిభ్రమణములు - ఇవన్నీ నిరంతరము ప్రవర్తిస్తూనే
ఉంటాయి. కొనసాగుతూనే ఉంటాయి. కాలాత్మకుడనగు నాచేతనే సృష్టి స్థితి -
ప్రళయములకు ఆధార స్వరూపమైన బ్రహ్మాండముల కల్పన-ఉనికి-వినాశనము
నాయందు ఒకానొక విభాగంగా నా విభవంగా ప్రదర్శితమౌతూ ఉంటాయి.
నేను యథాతథస్వరూపుడనై స్వప్న సదృశంగా ఇదంతా కల్పించుకొని వినోదంగా
సృష్టించుకొంటున్నాను. పరిపోషిస్తున్నాను. లయింపజేస్తున్నాను. ఆస్వాదిస్తున్నాను. సృష్టిస్థితి-లయాలు అప్రమేయుడనగు నాస్వకీయ కల్పనలే!
ఈ ఇంద్రియములకు కనిపిస్తున్న దృశ్యజగత్తులు, బ్రహ్మాండ ప్రదర్శనములు… ఇవన్నీ
ఏమి కానున్నాయి? ఎటునుండి ఎటు వెళ్ళుచున్నాయి? - అని ప్రశ్నిస్తే…
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
280
ఈ దేహాలన్నీ అన్నమునుండి బయల్వెడలుచున్నాయి కదా!
|
ప్రళయకాలంలో ఈ కనబడే భౌతిక దేహాలన్నీ అన్నమునందు, అన్నము ధాన్యము
(బీజముల)యందు, ధాన్యము (బీజతత్త్వము) భూతత్త్వమునందు, భూతత్త్వము
గంధతత్త్వము నందు…,
గంధ తత్త్వము జలమునందు, ||||జలము తన “గుణము” అగు రసమునందు,
రసము తేజస్సులోను,
తేజస్సు రూపములోను, ▬▬▬| రూపము వాయువునందు,
వాయువు స్పర్శ తన్మాత్రయందు,
స్పర్శ ఆకాశమునందు,
ఆకాశము శబ్ద తన్మాత్రయందు విలీనమగుచున్నాయి.
ఇంద్రియములు తమ మూల (ఉపాదాన) తత్త్వములగు దేవతలయందు లీనమగు
చున్నాయి.
దేవతలు తన్నియామకమగు మనస్సులోను, మనస్సు - శబ్ద తత్త్వము
పంచభూతములకు కారణమగు అహంకారమునందు,
ఆ అహంకారము సర్వజగత్తును మోహింపజేస్తున్న త్రివిధాహంకార రూపమగు
(జాగ్రత్ - స్వప్న - సుషుప్తిలలో కనిపించే 3 రకముల అహంకారముల
రూపమగు) మహత్-తత్త్వమునందు లీనమగుచున్నది.
జ్ఞానక్రియాశక్తి ప్రధాన రూపమగు మహతత్త్వము తనకు కారణభూతమైనట్టి
గుణములలో…,
ఆ గుణములు - అవ్యక్త ప్రకృతి (తాను వ్యక్తము కాకుండా… సర్వము వ్యక్తీరించే
ప్రకృతి) యందు,
ఆ అవ్యక్త ప్రకృతి - తనకు మూలము - ప్రేరకము - నాశన రహితము అగు
కాలమునందు లీనమగుచున్నాయి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
281
ఒకవేళ కొద్దిసేపు జగత్తు (లేక) దృశ్యము (లేక) బ్రహ్మాండము (లేక) అనేకత్వము అగు
మాయాకల్పిత విశేషాలు ప్రదర్శితమైనా కూడా “ఇదంతా నాదేకదా! నేనే కదా! అఖండము
అప్రమేయము - నిత్య సత్యము అగు నాకల్పనయే కదా!” అను అహం బ్రహ్మస్మి
భావన వీడకుండానే నాచే ఇదంతా ప్రదర్శించబడుచు సర్వదా వినోదముగా అగుచున్నది!
అజ్ఞానము కూడా నాయొక్క చిత్కళయే! “మనో బుద్ధి చిత్తాహంకారాలు నాకు ఆభరణములై
అప్రమేయుడనగు నేను వాటిని ధరించి వినోదిస్తున్నాను…! జగత్తు నా ఆభరణమే!”
అని నీవు గ్రహించిన తరువాత… ఇక జగత్తు నీకు బంధమవటం ఎక్కడున్నది.
ఓ ఉద్ధవా! సర్వకార్యకారణ తత్త్వవేత్తను - తత్త్వమును అగు నేను ఈ కనబడే జగద్రూప
ధారణచే వినోదిస్తున్నాను! ఇదే నా సాంఖ్యయోగం! సృష్టి-స్థితి-ప్రళయ నిర్వచనములతో
కూడిన, సర్వసంశములను ఛేదించునట్టి సాంఖ్య విధి!
విన్నావు కదా! యోచనతో ద్ధితో నీ స్వస్వరూపము ఎట్టిదో…….. గ్రహించి
బ్రహ్మాండ దర్శనములను అప్రమేయుడవై ప్రకాశించెదవుగాక!
మత్ స్థానమును సముపార్జించుకునెదవు గాక!
అధ్యాయము–39.) త్రిగుణ వృత్తులు - గుణాతీతత్త్వం
|
శ్రీ ఉద్ధవుడు : హే పరబ్రహ్మమూర్తీ! చిదానంద స్వరూపా! శ్రీకృష్ణా! సాంఖ్యయోగ
సారమును పూసగ్రుచ్చినట్లు చెప్పారు. అప్రమేయమగు నాయొక్క పరతత్త్వాన్ని ఆస్వాదించే
మార్గం చూపారు. ఈ సందర్భంలో… కనబడేదంతా త్రిగుణములు - గుణియొక్క
సంయోగమేనని కూడా మీ మాటలలో అభివ్యక్తం అవుతూ వస్తోంది! ఇప్పుడు .
అసంమిశ్రమము (Non-mixed) అనగా విభక్తిగా (వేరువేరుగా ఉన్న ఒక్కొక్క గుణముచేత
ఈ పురుషుడు (జీవుడు) ఏ ఏ రూపంగా ఉంటూ ఉంటాడో వివరించ ప్రార్థన.
శ్రీకృష్ణ భగవానుడు : విభక్తమగు (Non combined) త్రిగుణములలోని ఏఏ గుణముచే
ఈ జీవుడు ఏఏ రీతిగా ఉంటాడో… ఆతని వృత్తులు (Avocations, Behaviour) ఏఏ
విధంగా ప్రదర్శితం అవుతాయో… అద్దానిని నీవు అడిగినట్లు చెప్పుచున్నాను. విను!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
283
విభక్తంగా (Sperately each of the thru qualities)
1. సత్త్వగుణవృత్తుల లక్షణాలు
శ్లో॥ శమో దమస్తితిక్షేక్షా తపస్సత్యం దయా స్మృతిః
తుష్టిస్త్యాగో 2 స్పృహా శ్రద్ధా హీర్దయాదిస్స్వనిర్వృతిః || (అధ్యా 25, శ్లో 2)
శమము మనో నిగ్రహము (Control over Thought)
దమము ఇంద్రియ నిగ్రహము (Control over Physical Functions)
తితిక్ష ఓర్పు. (Forbearence)
ఈక్ష వివేకపూరితమైన దృష్టి. (Right Perception)
తపస్సు పరమాత్మతత్త్వము గురించి తపనయే తపస్సు. (Fondness
towards Divinity)
సత్యము యమ్ సత్ - సర్వవస్తువును అసత్నండి వేరుగా దర్శించటం
(Pondering over Truth)
దయ నేనెట్లా సహకరించగలను? అనే యోచన. (Kind hearted)
స్మృతి విన్నది - కన్నది విశ్లేషణకై జ్ఞాపకముంచుకోవటం!
(Evaluating Events)
తుష్టి-సంతోషము లభించినదానికి తృప్తితో కూడిన భావన.
(Wel-sastisfied with possessions)
త్యాగము సమర్పణ - పరోపకారము సేవాభావము. (Sacrifice)
అస్పృహా ప్రాపంచక విశేషాలు - సందర్భములపట్ల వైరాగ్యము -
అతీత్వము-అప్రమేయత్వము. (To be beyond)
శ్రద్ధ పరమాత్మ - ఆధ్యాత్మశాస్త్ర-వేదాంత విషయములపట్ల, శాస్త్ర
ప్రవచనములపట్ల దైనందికమైన కార్యక్రమములను
ఆశ్రయించటం. ఆసక్తిని పరిరక్షించుకోవటం. (Attention)
మహనీయుల మహదత్వము - గురువుల జ్ఞానైశ్వర్యముపట్ల ಲಜ್ಜ
అణకువ, తనలోని అల్పగుణములను గుర్తించి నివర్తించుకొనే
ప్రయత్నము చేయటం. (Shy of own mistakes)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
284
దయ ఇతరులపట్ల దాక్షిణ్యము. (Helpful) |
ఆత్మరతి ఆత్మయందు రమిస్తూ జగత్తిని త్యజిస్తూ ఉండటం. జగత్తును
పరమాత్మ స్వరూపంగా భావనచేసే అభ్యాసమును
ఆశ్రయించటం. (Enjoying everything as one’s own self)
2. రజోగుణ వృత్తుల లక్షణాలు
శ్లో॥ కామ ఈహా మదస్తృష్ణా స్తంభ ఆశీర్భిదా సుఖమ్
మదోత్సాహో యశఃప్రీతిర్హాస్యం వీర్యం బలోద్యమః | II (అధ్యా 25, శ్లో 3)
కామము ఏదో కావాలని - పొందాలని, అప్పటికిగాని సుఖం లభించదనే
తీవ్ర తపన. (I have yet to get something to be happy)
ఈహాప్రయత్నము - ప్రాపంచకమైన ఆశయములతో ఏవేవో ప్రయత్నములతో,
సంరంభములతో, కార్యక్రమములతో నిమగ్నమై ఉండటం.
(Involving in worldly aims)
“ఇది నాసొంతముమదము ” అనే భావనతో అభినివేశము. గర్వము.
(Proud)
తృష్ణ ఆవేశముతో కూడిన దురాశ. (Craving) |
దంభము గర్వము. ప్రదర్శనావేశము. (Exhibitive)
|
ఆశ ఎప్పుడూ ఏదో ఒకటి ఆశించటం. లభించకపోతే నిరాశ.
|
(Cragily Expecting)
అర్భదా భేదబుద్ది (Looking at Differences)
సుఖము సుఖములకై ఆశయ శక్తిని వ్యర్థం చేయుట. (Self-Comfort)
మదోత్సాహో మదగర్వముతో కూడిన ఉత్సాహము. పోట్లాడటం-తగాదాలపట్ల
అభినివేశము, అభిరుచి. ఎవరినైనా అవమానించేటప్పుడు,
బాధించేటప్పుడు మరింతగా ఉత్సాహపడటం.
(Fault-Finding / Belithling others)
యశః యశః కాముకత్వం. “ఇతరులు మనలను గురించి గొప్పగా
చెప్పుకోవాలి సుమా!” అను రూపమైన అనునిత్య ప్రయత్నం.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
285
(For popularity)
కొన్ని కొన్ని దృశ్య వస్తు విషయ రూపములపట్ల ప్రీతిగొని
| leon
ఉండటం. (Attchment)
అపహాస్యం ఇతరులను అపహాస్యం చేయటానికి వెనుకాడకపోవటం.
ఇతరుల లోపములను వెతికి వెతికి సంభాషించుకోవటం.
(Heckling)
వీర్యం ప్రతాపము చూపాలనే ఉబలాటం. (Dominating)
బలోద్యమం హఠపూర్వకమైన ప్రయత్నములందు నిమగ్నం కావటం.
(Emotionally Efforting)
ఇవన్నీ రజోగుణ ప్రవృత్తుల ప్రవృద్ధమును సూచిస్తాయి.
3. తమో గుణ వృత్తుల లక్షణాలు
శ్లో॥క్రోధో లోభో అనృతం హింసా యాచ్నా దంభః క్లమః కలిః
శోక మోహౌ విషాద ఆర్తీ నిద్రాశా భీః అనుద్యమః ॥ (అధ్యా 25, శ్లో 4)
క్రోధము ఇతరుల తప్పులను తీవ్రమైన ఆవేశంతో ఎంచటం,
దూషించటం. (Anger / Revngeful)
లోభము “నాది-నాదే-నాకు సంబంధించినదే” అనే మమకారము.
“ఎవ్వడైనా అడుగుతాడమో మరి?” అని దాచుకోవటం.
(Miserly)
అసత్యభాషణ - సత్-అసత్, శాశ్వత-అశాశ్వత విషయమును విశ్లేషించకుండా
అసత్ను సత్వలె భావిస్తూ సంభాషించటం. లేనిది ఉన్నట్లు
భావించి నమ్మి మాట్లాడటం. మానావమానములు -
మమకారములు అహంకారాలు ఉంటే తప్పేమున్నది? అని
నమ్మటం. (Misconception)
హింస ఇతరులను మాటలచేతగాని, చేతలచేతగాని బాధించటానికి
సంసిద్ధం కావటం. ఇతరులకు దుఃఖము కలిగించటానికి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
286
వెనుకాడకపోవటం. (Violent/ Unhezitatingly hurting)
యాచన ఇతరులనుండి ఏదో - ఏదేదో - ఏదో ఒకటి కోరుకోవటం.
“ఇతరులు నాకోసం శ్రమించాలి, మీరు ఎందుకు చేయరు?
ఎవరికోసం చేస్తారేం?…” అనే వృత్తి.
(Begging / Demanding)
దంభము తనది దాచుకొని - చూచుకొని గర్వించటం. మురిసిపోవటం.
రాయివలె ఇతరుల కష్టాలు పట్టించుకోకపోవటం.
(Posing / unresponsive to other’s trouble)
క్లమః/శ్రమ అలిసిపోయినట్లు ఎంతో కష్టపడుచున్నట్లు, ఇతరులు హాయిగా
ఉన్నారు! ఊసురో!… ఇత్యాదిభావాలు ముఖంలో
ప్రతిబింబించటం. (Self-Sympathy / Dull)
కలిః కలహము (Quarelling)
శోకము దుఃఖించటం. “నా బాధలు నావి. ఎవ్వరేమి చేయలేరు! గతి
ఇంతే” అని తీవ్రంగా అనుక్షణికంగా బాధపడుచూ ఉండటం.
(Lamenting)
మోహము సత్యము పరిశీలించే దృష్టిని ఆశ్రయించక, లేనిది ఉన్నట్లు
భావించటం. ఉన్నది గుర్తించలేకపోవటం. (Illusion)
విషాదము దిగులు. (Meloncholy / Gloomy)
- ఆర్తి దైన్యము - బాధ - ఆవేదనలు. (Hungry of something)
|
నిద్ర సోమరితనము. బద్ధకము. ఎక్కువ సమయం నిద్రపోవాలనే
అభిలాష. (Sleepy / Drowsy )
ఆశ ఏవేవో ఆశలు వృద్ధి చేసుకోవటం. నిరాశపడటం. దురాశ!
|
పేరాశ! (Deep Expectation)
భీతి భీః దీనివలన ఏమౌతుందోదానివలన ! వాళ్లెట్లా ఉంటారో!
రేపు మాపు భీభత్సం కాదుకదా!… అని ప్రతిదానికీ
భయపడుతూ ఉండటం. (Timidity)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
287
అనుద్యమః నైరాశ్యము, ఉద్యమించటము / ప్రయత్నించటానికి సిద్ధం
కాకపోవటం. (Gloomy, Dull, )
ఇవన్నీ తమోగుణవృత్తులు వృద్ధి పొందుచున్నాయనటానికి సంకేతాలు.
ఓ ఉద్దవా! ఇప్పటివరకు సత్త్వ - రజ - తమో గుణములు విడివిడిగా ఎటువంటి
లక్షణాలు, వృత్తులు కలిగి ఉంటాయో చెప్పుకుంటూ వచ్చాను.
ఇప్పుడు ఈ త్రిగుణములు కలిసి ఉన్నప్పుడు గుణ వృత్తులు సంమిశ్రమైనప్పుడు ఏవిధంగా
ఉంటాయో కూడా ఇక్కడ చెప్పుకుందాం.
ఈ జీవులు నేను - నాది అను బుద్ధిని పెంపొందించుకొంటూ ఉండటం సమ్మిశ్రమము -
లైన త్రిగుణములకు సంబంధించినదేనయ్యా!
మనస్సు వలన అనుభూతమయ్యేది,
శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములనబడే ఇంద్రియార్ధముల వలన
అనుభవమయ్యేది,
ఇంద్రియములకు ఎదురుగా తారసబడే విషయాలు,
ప్రాణముల వలన (ప్రియత్వము వలన) ఏర్పడే వృత్తులుగా బయల్వెడలేవి
ఇవన్నీకూడా త్రిగుణములయొక్క మిశ్రమ వృత్తులేనని గమనించు.
ఈ పురుషుడు…,
ధర్మ-అర్ధ-కామ విషయములందు ఆసక్తుడవటం!
వాటిపట్ల ఏర్పడే శ్రద్ధ-ఆసక్తి-రతి!
సంపదలపట్ల ఏర్పడే అహంకార మమకారములు.
ఇవన్నీకూడా త్రిగుణ మిశ్రమవృత్తుల విన్యాసమే!
త్రిగుణ సంబంధంగా….
త్రిగుణ లక్షణ - గుణప్రవృద్ధములు
ప్రవృత్తి లక్షణములైనట్టి కామ్యకర్మలయందు (Acts with expectations) పురుషునికి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
288
ఆసక్తి కలిగినప్పుడు అట్టివాడు లౌకిక వ్యవహారములలో నిమగ్నుడౌతున్నాడు.
క్రమంగా ఎప్పుడో విసుగుచెంది “పరమాత్మను సమీపించటం ఎట్లాగురా?” అని యోచన
ప్రారంభిస్తున్నాడు. అప్పుడిక నివృత్తి-ఉపాసనా ధర్మములవైపుగా దృష్టిని సారిస్తూ
ఉన్నాడు. క్రమంగా పూజ-ధ్యానము-నిత్యధర్మము-నైమిత్తిక ధర్మములయందు రతుడు
అగుచున్నాడు. ఇదంతా కూడా త్రిగుణముల సమ్మిశ్రమ చమత్కారమే!
శమము-దమము… ఇటువంటి లక్షణాలు ప్రవృద్ధము అవుతూ ఉంటే… ఈతడు
సత్త్వగుణ యుక్తుడు అగుచున్నాడని చెప్పబడుచున్నాడు. కామము-ప్రాపంచక కర్మ
వ్యవహారములపట్ల అభిరుచి పెరుగుతూ ఉంటే అది రజోగుణ వృత్తుల ప్రవృద్ధి.
క్రోధము-లోభము ఇత్యాదులు తమోగుణ లక్షణాలు.
త్రిగుణ ప్రకృతి
ఫలము-ప్రతిఫలము కోరకుండా భక్తితో స్వకర్మలచే నన్నే సేవించాలనే ఉద్దేశ్యములను
వృద్ధి చేసుకుంటూ ఉంటే ఆతడు సత్త్వప్రకృతి కలవాడగుచున్నాడు. ఈతడు నాకొరకై
జగత్తులో జీవిస్తున్నాడు.
అట్లాకాకుండా, విషయములను అపేక్షించి స్వకర్మలతో నన్ను సేవిస్తూ ఉంటే… ఆతడు
రజోగుణ ప్రకృతి (స్వభావము) కలవాడు. జగత్ విషయములు- సంపదలకొరకై
నన్ను ఆరాధిస్తునాడు!
హింసను సంకల్పించి నన్ను ఆరాధిస్తూ ఉంటే ఆతనిది తమోగుణ ప్రకృతి! ఇతరులను
బాధించటానికి, ఇతరులపై అధికారము కొరకో నన్ను ఉపాసిస్తున్నాడు.
ఉద్ధవుడు : శ్రీకృష్ణా! ఇప్పుడు నాదొక సందేహము స్వామీ!
ఈ జగత్తంతా త్రిగుణాత్మకం మాత్రమేనని చెప్పబడుతోంది కదా! అట్టి త్రిగుణములు
పరమాత్మ స్వరూపుడవగు మీకు చెందినవా? లేక, జీవాత్మలగు మాకు చెందినవా?
కాక, అవి ఈ దృశ్యజగత్తుకు సంబంధించినవా?
శ్రీకృష్ణుడు : త్రిగుణములు జీవాత్మకు చెందినవి కావు. పరమాత్మను-నిర్మలాత్మ
స్వరూపుడను అగు నాకు చెందినవీ కావు.
మరి?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
289
ఈ త్రిగుణములు జీవుని యొక్క మనోసంభంధమైనవి మాత్రమే!
ఆత్మ స్వరూపుడగు జీవుడు మనో దేహముయొక్క త్రిగుణములు- అనే హస్తాలతో
దేహములు-దేహసంబంధమైన విషయాలైన దృశ్యములు, లోకములు-ఇవన్నీ
ఆస్వాదిస్తూ, ఆస్వాదిస్తూ… ఎప్పుడో వాటియందు ఆసక్తుడు అగుచున్నాడు. ఆ ఆసక్తి
ప్రియత్వము (చిత్తము)గాను, అవినాభావత్వము (అవి లేకుంటే నేనే లేను అనువిధం)గాను
పరిణమించటం జరుగుతోంది. ఈవిధంగా ఈ జీవుడు క్రమంగా సంసార
బద్ధుడగుచున్నాడు. అనగా,
సంసార బంధము అనబడేది జీవునియొక్క స్వకీయ విరచితము-స్వకీయ కల్పనస్వకీయ భావావేశమేగాని ఈ జీవునికి పరమాత్మయగు నేను కల్పించిది కాదు. నేను
సంసార బంధముతో సంబంధమేలేనట్టి అప్రమేయుడను, నిష్క్రియుడను!
ఎప్పుడైతే…,
సత్త్వ-రజో-తమో గుణములు, (లేక) ప్రకాశము-ప్రవృత్తి మోహము అనే
వ్యవహారములను (త్రిగుణములను) - సత్వగుణముచే, (అనగా)
“జ్ఞానము స్వచ్ఛత శాంతము”
అనే ఔషధములచే (లేక ఆయుధములచే) ఈ జీవుడు జయిస్తాడో… అప్పుడు ఆ పురుషుడు
(జీవుడు) త్రిగుణములను దాటివేసినవాడగుచున్నాడు!
తమోగుణము అధికమౌతూ వుంటే సత్వ రజములు అల్పము అవుతూ వుంటాయి.
అప్పుడు బద్దకము-నిద్ర-ఆలస్యము మొదలైన తమోలక్షణాలు అధికమౌతూ వుంటాయి.
ఈ జీవుడు కోపిష్ఠి-బద్ధకస్తుడు ఇతరులను దూషించువాడు తప్పులు పట్టుకొనువాడు,
విచారణ-వివరణ-పరిశీలనలకు సిద్ధపడనివాడు అగుచున్నాడు. మూఢత్వము-లయము
(Immersed) -జడములతో కూడిన ఆ మానవుడు శోకము-మోహము-హింస ఇత్యాది
గుణములతో కూడి ఉంటున్నాడు.
రజోగుణ ఆధిక్యత: సంగహేతువు (cause for attachement), భేద హేతువు (cause
for seeing and searching for differences), ప్రవృత్తి స్వభావము (a quality of
involving in multiple aspects) అయినట్టి రజోగుణము-అధికమౌతూ ఉన్నప్పుడో
(while dominating) … అప్పుడు? ఆ జీవుడు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
290
దుఃఖము - Worrying
యశస్సు - Craze for popularity
సంపద - Attraction towards possessions
మొదలైన ఆశయములు, స్వభావములు కలిగినవారై ఉంటాడు.
గుణాధిక్యత - ఆయా ఫలితములు
సత్త్వము: చిత్తము నిర్మలమౌతూ ఉంటే, ఇంద్రియములు ప్రశాంతము పొందుతూ
వుంటే, దేహము అభయమును (భయరాహిత్యము) పొందుతూ వుంటే…, మనస్సు
విషయ సాంగత్య రహితం అవుతూ వుంటే…, పరమాత్మనగు నన్ను పొందటానికి
అధిష్ఠానభూతమైనట్టి సత్త్వగుణము వృద్ధిచెందుతూ ఉన్నట్లు (getting increased)
అని గ్రహించు.
రజము : ఈ జీవుడు అనేక కర్మ వ్యవహారములందు ఆసక్తుడై వికృతుడు అవుతూఉంటే,
చిత్తము చంచలంగా విక్షిప్తి చెందుతూ ఉంటే, బుద్ధి “ఏదో కావాలి - ఏదో కావాలి”,
అనే రూపంగా అసంతుష్ఠి పొందుతూ ఉంటే, మనస్సు చాంచల్యం పొందుతూ ఉంటే,
కర్మేంద్రియములు వికారం పొందుతూ ఉంటే… దాని అర్థం?
ఈ సర్వ కారణముల వలన రజోగుణము ఉద్రిక్తత పొందుచున్నట్లు.
తమోగుణము
చిత్తము కలత చెందుతూ ఉంటే…,
చిత్తము చితత్త్వమును పూర్తిగా ఏమరుస్తూ ఉంటే,
సంకల్పాత్మకమైన మనస్సు బలహీనమౌతూ ఉంటే,
అజ్ఞానము-విషాదము వృద్ధి చెందుతూ ఉంటే,
తమోగుణము ఉద్రిక్తం అగుచున్నట్లు!
బలము
సత్త్వగుణము వృద్ధి అయ్యేడపుడు - దేవతలతకు,
రజోగుణము వృద్ధి చెందేడప్పుడు - అసురులకు,
తమోగుణము వృద్ధి పొందేటప్పుడు - రాక్షసులకు బలము వృద్ధి చెందుతూ ఉంటుంది!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
291
త్రి అవస్థలు
సత్త్వగుణము ప్రవృద్ధమైనప్పుడు - జాగరణము, (More Alert)
రజోగుణము ప్రవృద్ధమైనప్పుడు - స్వప్నము, (More Illusionary)
తమోగుణము వృద్ధి చెందేటప్పుడు - సుషుప్తి (More Sleepy)
అధికమై ఉంటాయి.
తురీయమును ఈ మూడు అవస్థలకు సాక్షియై, ఆత్మస్వరూపమై చెన్నొందుతోంది.
ఉత్తరోత్తర గతులు
సత్త్వగుణ సంపన్నులు క్రమముగా బ్రహ్మమును దర్శించు మార్గములో బ్రహ్మోపాసకులై
ఊర్ధ్వలోకాల వైపుగా యానం కొనసాగిస్తున్నారు. బ్రహ్మలోకమునకు చేరుతూ ఉంటారు.
రజో గుణయుక్తులగువారు మానవలోకమును పొందుతూ ఉంటారు.
తమో గుణమును ఆశ్రయించువారు స్థావరములవరకు అధోగతిని పొందుతూ ఉంటారు.
అనగా…,
సత్త్వగుణము వృద్ధి పొందుచుండగా మరణించినవారు స్వర్గము మొదలైన ఊర్ధ్వలోకాలు
పొందుచున్నారు. (ఊర్ధ్వంగచ్ఛంతి)
రజో గుణము వృద్ధి చెందుచున్నప్పుడు మరణిస్తున్నవాడు మరల మానవ జన్మకు
అర్హుడగుచున్నాడు. (మధ్యేతిష్ఠంతి)
తమోగుణము వృద్ధి పొందుచున్నప్పుడు నరకము మొదలైన అధోలోకములకు
చేరుచున్నారు. (అధోగచ్ఛంతి)
నిర్గుణులైన వ్యక్తులు జీవించి ఉన్నప్పుడే సర్వలోకాతీతులై నన్ను చేరుచున్నారు!
14 లోకాలకు కేవలసాక్షి - అతీతుడు అయి, వాటిని ఆస్వాదిస్తున్నారు
కర్మలు
సాత్విక కర్మలు - సర్వాంతర్యామియగు పరమాత్మకు ప్రీతి కలిగించే ఉద్దేశ్యముతో,
ఫలాభిలాష రహితంగా, సమర్పణ భావంతో అనుష్ఠింపబడే నిత్యము (Daily)
నైమిత్తకము (Occasional / Incidental) మొదలైన కర్మలు.
రాజస కర్మలు - లోకసంబంధమైన ఫలమును సంకల్పించి - ఉద్దేశ్యించి చేసే కర్మలు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
292
తామస కర్మలు సహజీవులను బాధిస్తూ, హింసతో కూడినవి. దంభముమాత్సర్యముతో కూడినవి. ఇతరుల తప్పులను ఎంచటమే ప్రధాముగా కలిగియున్నవి.
ఇతరులపై పెత్తనము-ఆధిక్యత ఉద్దేశ్యించేవి.
కర్త-కర్మ-క్రియ-కర్మసాధనములు-ఫలములు-అంతా పరమాత్మ స్వరూపంగా
బ్రహ్మముగా భావిస్తూ నిర్వర్తించే కర్మలు- గుణాతీత కర్మలు. (అద్వితీయం బ్రహ్మ!)
జ్ఞానము
సాత్విక జ్ఞానము : దేహమును-గుణమును అధిగమించి- దేహి -గుణి గురించి ప్రవచించే
- నిర్వచించే - తెలియజేసే జ్ఞానము. ఇదియే కైవల్య జ్ఞానము కూడా!
రాజస జ్ఞానము: దేహమునకు - ఇంద్రియములకు - విషయములకు సంబంధించిన
-భేదవివరణంతో కూడిన -లోక విశేషాలకు సంబంధించిన జ్ఞానము. దీనినే వైకల్పిక
జ్ఞానము అనికూడా అంటారు!
తామసజ్ఞానము : పెత్తనము-అధికారము-ఇతరులను లొంగతీసుకోవటం-బాధించటంలోభము ఇట్టి జ్ఞానము. ఇది ప్రాకృతజ్ఞానము. ఇంద్రియ సుఖములకు సంబంధించిన
జ్ఞానము.
పరమేశ్వర సంబంధమైనది - పరతత్త్వ విరణగురించినది నిర్గుణ జ్ఞానము.
వాసము (Place of Stay)
వనవాసము - సాత్విక వాసము.
గ్రామవాసము రాజసవాసము.
జూదమాడు గృహములలో వాసము తామసిక వాసము.
పరమాత్మ సన్నిధిలో ఉండటం (దేవాలయాదులలో ఉండటం) - నిర్గుణము.
కర్త (కర్మ నిర్వర్తించువాడు)
సాత్వికకర్త : అనాసక్త భావనతో కర్మలు ఆచరించేవాడు - సాత్వికుడు.
రాజసిక కర్త : రాగముతో జ్ఞానచక్షువులు మూసుకొని కర్మలు చేయువాడు - రాజసికుడు.
తామసిక కర్త: స్మృతి భ్రష్టుడై, పూర్వాపూర్వ విచారణ చేయకుండా కర్మలు చేయువాడు.
కేవలము సర్వాంతర్యామి - సర్వ బాహ్య అభ్యంతర స్వరూపుడగు పరమాత్మను ఉద్దేశ్యించి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
293
కర్మలు నిర్వర్తించువాడు - నిర్గుణుడు. My work is my worship అని భావించి కర్మలు
చేయువాడు నిర్గుణకర్త. అకర్త.
శ్రద్ధ
సాత్విక శ్రద్ధ : అధ్యాత్మ శాస్త్రము సూచిస్తున్న బోధిస్తున్న మార్గము ఆశయముల
పట్ల గల శ్రద్ధ - సాత్వికము. నేనెంత వరకు నిర్మల హృదయము, సునిశితమైన
విస్తారమైన బుద్ధి సంపాదించుకుంటూ శాస్త్రముల-ఆత్మజ్ఞుల బాటలో
నడుస్తున్నాను?… అను శ్రద్ధ స్వాతిక శ్రద్ధ!
రాజసిక శ్రద్ధ : ఇంకేదేదో ముందుముందు చెయ్యవలసి యున్నది ఎంతెంత
పొంచున్నాము? - అని కర్మలపట్ల శ్రద్ధచూపుతూ చరించేవాడు - రాజసికుడు.
తామసిక శ్రద్ధ : అధర్మమే నా ధర్మము అని భావించి శ్రద్ధ చూపువాడు - తామసికుడు.
భక్తియొక్క ప్రవృద్ధియే ఆశయముగా కలిగి, పరమాత్మను సేవించుటయందు శ్రద్ధగల
వాడు నిర్గుణుడు. గుణాతీతుడు.
ఆహారము
సాత్వికాహారము : హితకరము (పథ్యము), శుద్ధము, ఇతరులను బాధించకుండా
సంపాదించుకొన్నది (అనాయాస లబ్దం - అబాధిత లబ్దము-అనింద్యమైన యత్నముల
వలన లభించే ఆహారము.
రాజసాహారము : ఇంద్రియ సుఖము లక్ష్యముగా కలిగినవి, వగరు, పులుపు, ఉప్పు
పదార్దములు. సహ జీవుల బాధలను లెక్కచేయకుండా, పాప-పుణ్యాలు గమనించకుండా
సంపాదించుకునే ఆహారము.
తామసికాహారము : దాహము దైన్యము మత్తు కలిగించేవి. అపవిత్రములు.
ఇతరులను బాధించి మోసగించి సంపాదించుకునే ఆహారము.
నాకు సమర్పించబడినది నిర్గుణాహారము. సాత్వికము-దైవార్పితమున్యాయార్జితము మితము అయినది- గుణాతీతమైన ఆహారరూపం. (తస్మాత్
అన్నమయమ్ మనః)
సుఖము
సాత్విక సుఖము : ప్రేమ-దయ-కర్తవ్య నిర్వహణ-పరోపకారము మొదలైన కర్మల
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
294
నుండి లభించే సంతోషము వలన కలిగే సుఖము - సాత్వికము
రాజసిక సుఖము : విషయభోగమువలన కలిగే సుఖము - రాజసము.
తామసిక సుఖము : మోహము-దైన్యము - మత్తువలన ఇతరుల సాధక బాధకములను
లెక్క చేయకుండా కలిగే సుఖము తామసికము.
పరమాత్మను కీర్తించుటవలన కలిగే తన్మయతా-తదర్పితా ఇత్యాదుల వలన కలిగే
సుఖము - నిర్గుణము, గుణాతీతము.
ఓ ఉద్ధవా!
ద్రవ్యము :: దేశము :: ఫలము :: కాలము :: జ్ఞానము :: కర్మ :: కర్త :: శ్రద్ధ ::
అవస్థ :: ఆకృతి :: నిష్ఠ
ఇటువంటి భావములన్నీ త్రిగుణాత్మకములేనయ్యా! అవి సాత్విక - రాజసిక-తామసిక
మూడు విధాలుగా వుంటూ వుంటాయి. అంతే కాదు!
చూడబడినవి :: చూస్తున్నవి :: వినబడినవి :: వింటున్నవి :: ఆలోచించబడినవి ::
ఆలోచిస్తూ వున్నవి :: ప్రకృతి - పురుషుడు అను ద్వంద్వ భావములు - ఇవన్నీ కూడా
త్రిగుణాత్మకములే! త్రిగుణములలో ఏదో ఒకదానికి చెందివుండటం-విజ్ఞతతో
గమనించవచ్చు.
ఈ పురుషునకు (జీవునకు) కలిగే సంసారభావములన్నీ త్రిగుణ కర్మ-త్రిగుణ
సంబంధమైన ఆలోచనలవలననే కలుగుచున్నాయి. త్రిగుణములు కానిదంటూ
దృశ్యములో ఎక్కడా ఏదీ లేదు.
త్రిగుణములు చిత్తమునుండే ఉత్పన్నమౌతున్నాయి.
ఎవ్వడైతే…,
చిత్తముచే జనింపజేయబడుచున్న త్రిగుణములను చిత్తము చేతనే జయిస్తాడో…,
అట్టివానికి స్వభావసిద్ధంగానే నా పట్ల భక్తియోగం ఏర్పడుతోంది. భక్తియొక్క నిష్ఠచే
విచక్షుణుడై పరమాత్మత్వమును సమీపిస్తున్నాడు. సంతరించుకుంటున్నాడు. పరమాత్మతో
మమేకమవటానికై భక్తిగుణములు ఆశ్రయిస్తున్నాడు. భక్తి త్రిగుణాతీతస్థానమునకే దారి
తీస్తోందిసుమా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
295
అందుచేత…,
కాస్త విచక్షణ గల జీవుడు యుక్తాయుక్త విచక్షణ చేయగల - జ్ఞాన విజ్ఞాన సంభవమగు
మానవ దేహము పొందిన తరువాత… ఇక తాత్సారం చేయరాదు. చేయడు.
సదుపాయములను తెలివితక్కువగా వృధా చేసుకోడు. ఇక విచక్షణ -విచారణ
చేయనివానికి నేను చెప్పేదేమున్నది?
మరి ఏమి చెయ్యాలి?
గుణములయందు ఆసక్తిని త్యజించి గుణాతీతుడను తురీయుడను - సర్వసాక్షిని
అగు నన్నే సేవించాలి! నన్నే అంతటా అన్ని రూపాలుగా దర్శించాలి. తనయందే
సర్వదా వేంచేసియున్న నన్ను గుర్తించాలి. గమనించాలి. ఆస్వాదించాలి.
క్రమక్రమంగా - అప్రమత్తుడు, జితేంద్రియుడు, విషయాసక్తి శూన్యుడు అయి
నన్నే శరణువేడును గాక!
సాత్విక గుణము ద్రవ్యము - స్వభావములను సేవించి రజస్తమోగుణములను
జయించాలి.
ఆ తరువాత క్రమంగా గుణాతీతుడై, గుణములకు కేవలసాక్షి అయి సర్వమును
ఆస్వాదించాలి!
అనగా…,
ఉపశమనాత్మకమగు సత్వగుణముతో కూడినవాడై మిశ్రమ సత్వగుణములను
కూడా జయించాలి.
గుణత్రయ విముక్తుడై లింగదేహము (సంస్కారదేహము)ను కూడా అధిగమించి,
తనలోనే మనో-బుద్ధి-చిత్త-అహంకారములకు ఆవల సర్వదా వేంచేసియున్న
నన్ను పొందాలి.
ఈవిధంగా చిత్తమునుండి జనిస్తున్న గుణముల నుండి - లింగ దేహమునుండి విముక్తుడై
· బ్రహ్మరూపుడనైన నా అనుభూతిచే ఈ జీవుడు పరితృప్తుడు కాగలడు!
అట్టి పరితృప్తుడు ఇక ఇక్కడి విషయభోగములకు గాని, అంతర్బహిశ్చ దృశ్య విషయముల
చేతగాని బద్ధుడు కాడు! జగత్ విషయములపట్ల మౌనం వహిస్తాడు. ముక్తుడై చరిస్తాడు!
చిరునవ్వు సదా చిందిస్తూ - అతీతుడై వుంటాడయ్యా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
296
అధ్యాయము–40.) పురూరవ వైరాగ్య ఉక్తి (ఐలవ గీతము)
|
శ్రీ ఉద్ధవుడు : శ్రీకృష్ణా! మాయను అధిగమించటం ఎట్లా! నిన్ను చేరే మార్గమేమిటి?
శ్రీకృష్ణుడు : ఓ ఉద్ధవా!
శ్లో॥ మల్లక్షణమిమం కాయం లబ్ద్వా మద్ధర్మ ఆస్తితః
అనందం పరమాత్మానం ఆత్మస్ధం సముపైతి మామ్|| (అధ్యా 26, శ్లో 1)
పరమాత్మనగు నాయొక్క తత్త్వమును తెలుసుకోవటానికి అత్యంత ఉపయుక్తమైన
ఉపకరణము ఈ మానవ దేహము. అట్టి మానవ దేహోపకరణము సహాయంతో భాగవత
ధర్మమును - ఆశ్రయించి, నన్ను - ఆత్మ స్థితుడనుగా, పరమానందరూపుడనుగా,
పరమాత్మనుగా ఎఱిగి - నన్నే పొందుచున్నాడు. కాబట్టి మానవ జన్మ బహుదుర్లభమగు
మహత్తరమైన అవకాశముగా శ్రోతలు గమనించెదరు గాక! ఇది కాల బద్ధమైన
అవకాశము కూడా! (This is Time-Bound, but not permanent opportunity).
ఇది గమనించి గుణమయమగు ఈ సూక్ష్మోపాధి నుండి విముక్తులయ్యెదరు గాక!
గుణములు మాయా సంజాతములు కదా!
ఇక్కడి విషయములన్నీ స్వప్నాంతర్గత విశేషాలవలె -అవాస్తములు, మాయామాత్రములు.
గుణాతీతుడు ఈ విషయం గమనిస్తున్నాడు. గమనించి ఇక విషయాసక్తుడు
అగుటలేదు! ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఉదహరిస్తున్నాను.
విషయభోగములందు, కేవలము పొట్టనింపుకోవటానికో సంపద మొదలైనవాటి
కొరకో రోజులన్నీ వెచ్చించే వారిని, తదితర సాంసారిక భావ-ఆవేశములు
కలవారిని “అసత్పురుషులు” అని అంటారు. అధ్యాత్మ మార్గాణ్వేషకులు
అట్టివారితో స్నేహము చేయకపోవటమే ఉచితము. ఎందుకంటావా? గ్రుడ్డివాడిని
అనుసరిస్తున్న మరొక గ్రుడ్డివాడు ఏమౌతాడు? పోయి ఇద్దరు అంధకారంలోనే
పడతారుకదా! అట్లాగే అసత్పురుషుని అనుసరించేవాడు సద్వస్తువును ఎట్లా
చేరుతాడు చెప్పు!
ఈ సందర్భములో మహా యశస్వి-ఇలానందనుడును అయినట్టి, పురూరవ చక్రవర్తి
యొక్క ఒక సందర్భంలోని ఒక అనుభవం గుర్తుకొస్తోంది. ఆతడు మొదట ఊర్వశిని
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
297
కామించి విరహం పొందాడు. అత్యంత దుఃఖితుడైనాడు. ఆ తరువాత విచారణచే విరాగి
అయినాడు. ఆ విశేషం చెప్పుచున్నాను. విను.
పురూరవ చక్రవర్తి మహా ధైర్యవంతుడు! ప్రజారంజక పాలకుడు! గొప్ప తపస్వి!
మహా మేధావి. గొప్ప యజ్ఞములు చేసినవాడు. ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలిస్తూ
ఉండేవాడు. ప్రజలంతా ఆ చక్రవర్తిని తమ ఆత్మ బంధువుగా-ఆత్మీయ భావనతో
ప్రేమిస్తూ గౌరవించేవారు. ఆయన ప్రకృతిని జయించివేసినట్లుగా చెప్పుకోబడుచూ
వుండేవాడు.
రోజులు ప్రశాంతంగా గడచిపోతున్నాయి.
ఒకానొకరోజు…,
పురూరవుడు వాహ్యాళికై ఒంటరిగా వెళ్ళుతూ ఉండగా, ఒక సరస్సు ఒడ్డున ఒకనొక
సౌందర్యరాశిని చూచాడు. ఆమె వన్నెలు చూచి అత్యంతాశ్చర్యం పొందాడు. “జగత్తులో
ఇంతటి కోమలమైన సుందర స్త్రీ ఉండటమే నాకు ఆశ్చర్యం వేస్తోందే!” అని
అనుకున్నాడు.
ఆమెను సమీపించాడు.
“ఓ కన్యకా! ఎవరు నీవు? నీ వన్నెలు ఈ వనానికే సిరివెన్నెలలు తెచ్చాయి. నేను ఈ
రాజ్యానికి చక్రవర్తిని. పురూరవ చక్రవర్తిని. నీ సౌందర్యం చూచి ఆశ్చర్యపోతున్నాను.
దేవకాంతవలె ప్రకృతిని రంజింపజేస్తున్నావు సుమా! ఇదిగో! నీ సౌందర్యానికి నేను
దాసుణ్ణి అవుచున్నాను. నా మహాసామ్రాజ్యము నీ పాదాలకు సమర్పిస్తున్నాను. నాకు
మహారాజ్ఞివై ఈ రాజ్యమును-నన్ను ఏలుకో! నీ సౌందర్యానికి దాసుడనై నేను అన్నీ
ఇచ్చివేస్తాను. నా సింహాసనాన్ని అధిరోహించు. దేవకాంతవలె మెరిసిపోతున్న నీకు
దాసానుదాసుణ్ణి అవటంచేత నాకు ఎంతగానో గర్వముగా ఉన్నది! ఓ సుందరీ! ఒకసారి
నీ పెదిమలు విప్పవూ? ఎవరునీవు! మనవకాంతవా! దివినుండి భువికి దిగివచ్చిన
గంధర్వకాంతవా?”…
అని పలకరించాడు.
ఊర్వసి : ఓ చక్రవర్తీ! పురూరవా! మహాప్రాజ్ఞా! అవును! నేను మానవ కాంతను కాను!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
298
దేవకాంతను. నాపేరు ఊర్వసి. దేవసభలో మిమ్ములను ప్రశంసిస్తూ వుంటే
మహానుభావుడగు మిమ్ములను సందర్శించాలనే కోరిక నాకు కలిగింది. మహాప్రభూ!
పుణ్యమూర్తీ! ప్రకృతి సౌందర్యం ఆస్వాదించటానికి, మరియు మిమ్ములను చూడటానికి
వచ్చాను. మీరు వేదవేదాంగాలు ఎరిగిన కర్మయోగులని విన్నాను. ఈ రోజు నాకు
సుదినం! సంతోషం! మీకు నమస్కరిస్తున్నాను. నాకు భూలోకంలో నియమితమైన
కాలము అయిపోవస్తుంది. కొద్ది క్షణాలలో తిరిగి దేవలోకం వెళ్ళక తప్పదు. ఇది
అప్రతిహతమగు ఇంద్రుని ఆజ్ఞ. ఊర్వశీలోకం తిరిగివెళ్ళాలి! మీ రాజ్యాదులు నాకెందుకు
చెప్పండి? మీ దర్శనం అయింది. నాకు చాలా సంతోషం. ఇక శెలవు ఇప్పించండి!
పురూరవుడు : ఓ దేవతాలోక విహారిణీ! ప్రణయేశ్వరీ! ఊర్వశీ! నీవు నా హృదయాన్ని
దోచావు. నన్ను పుణ్యమూర్తి - అని సంబోధించావు కదా! పుణ్యఫలితంగానే నీ దర్శన -
భాగ్యం నాకు కలిగింది కాబోలు! నీవు నన్ను విడిచి వెళ్ళవద్దు. ఇక్కడే నాతోనే ఉండు.
ఇప్పుడు నా మనఃస్థితి ఎమిటో తెలుసా? నిన్ను విడచి ఒక్కరోజు కూడా ఉండలేను.
ఒక్కక్షణం కూడా బ్రతకలేను.
ఊర్వశి : మహనీయా! మీరు ఇట్లా మాట్లాడుచున్నారేమి? ప్రాకృత దేహాలు చూచి
మీవంటివారు భ్రమించటమేమిటి? ఈ దేవ-మానవ దేహాలన్నీ ప్రకృతి కల్పనయే
కదా! స్వప్నంలో చూచిన దేహాలు ఎటువంటివో, జాగ్రత్లో కనిపించే దేహాలు
అటువంటివే కదా! భౌతిక దేహాకర్షణలకు లోను అవటం ఊర్ధ్వగతులకు
అధ్యాత్మయానానికి అవరోధాలని మీకు తెలియంది కాదు కదా!
పూరూరవుడు : అదియేమో నాకు తెలియదు. అవన్నీ ఇప్పుడు నాకు చెప్పవద్దు! నిన్ను
విడచి ఉండలేను. అంతే! నన్ను విడచి వెళ్ళవద్దు. నీవంటి సుందర దేహము పురుషుని
రంజింపచేయటానికే కదా, బ్రహ్మదేవుడు సృష్టించేది! మేము నిర్వర్తించియున్న యజ్ఞయాగముల ప్రయోజనము నీవంటి దేవకాంతలతో సమాగమమే కదా!
ఊర్వశి : చక్రవర్తీ! దేహములను చూచి భ్రమించటం మాయకు లోబడటమేకదా!
నన్ను విడవండి. నామాట వినండి. ఈ భౌతిక దృష్టినుండి దయచేసి మరల ఆధ్యాత్మదృష్టికి
మరలండి.
ఈవిధంగా ఊర్వశి మనోదౌర్బల్యం వీడవలసినదిగా ఎంతగానో బోధించింది.
బ్రతిమలాడింది. అనేక సోదాహరణములు - దృష్టాంతాలు గుర్తుచేసింది. పురూరవుడు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
299
ఆ మాటలన్నీ “ఈ దేవకన్య నన్ను ఏమరచటానికి ప్రయత్నిస్తోంది…” అన్న దృష్టితో
చూచాడేగాని, ఆమె చెప్పే భౌమావిశేషాలను (ఆత్మతత్త్వ ప్రవచనములను) వినటమేలేదు.
ఇక ఊర్వశి చేసేదేమి లేక ఆకాశంలో ప్రయాణిస్తూ నిజమార్గంలో అతర్ధానమైనది.
పురూరవునకు అది చూచి పిచ్చిపట్టినట్లు అయింది. దుఃఖముతో కేకలు పెట్టాడు.
బట్టలు చింపుకున్నాడు.
పురూరవుడు : దేవీ! ఈర్వశీ! ఇది ఘోరం! నన్ను విడచి వెళ్ళిపోతున్నావా! నిలువు!
నిలువు! పరుగెత్తి పోవద్దు! ఏదీ! నీ ముఖపద్మం మరొక్కసారి చూపించవూ!
అని దీనంగా కేకలు వేయసాగాడు. ఉన్మత్తుడైనాడు. చెట్లలోను- పొదలలోను ఊర్వశి
దాగుకున్నదేమోనని వెతకసాగాడు. దిగంబరుడై మరింకేమి పట్టించుకోక ఊర్వశి ఎక్కడ
ఎక్కడ? అని అనుకుంటూ పిచ్చివాడై అనేకచోట్ల సంచరించాడు. ఆతని వేదన -
రోదన గమనించిన ఊర్వశికి మనసు కరిగింది.
తిరిగి వచ్చిన ఊర్వశిని చూచి పురూరవుడు అత్యంత ఉత్సాహంతో సమీపించాడు.
ఆమెను ఆలింగనం చేసుకొన్నాడు. ఇరువురు ఊర్వశీలోకం చేరారు. ఆమెతో సాంగత్యం
పొందాడు. ఆ ఇరువురి సాంగత్యంలో అనేక సంవత్సరాలు గడచిపోయాయి.
కాలచక్రము మౌనముగా, అప్రమేయంగా తిరుగసాగింది.
చాలా కాలం తరువాత ఎప్పుడో క్రమంగా పురూరవుడు ఊర్వశీ సాంగత్యము పట్ల
విరక్తుడు కాసాగాడు. అవును మరి! సుదీర్ఘమైన అభ్యాసంచేత ఇంద్రియానుభవాలు
మనస్సుకు అరుచి కావటం ఇంద్రియ విషయముల విషయంలో స్వాభావికమేకదా!
ఊర్వశీలోకంలో ఊర్వశీ సాంగత్యంలో అనేక సంవత్సరాలు గడపినప్పటికీ ఆతనికి
తృప్తి కలుగలేదు. రాత్రులు-పగళ్ళు-నెలలు-సంవత్సరాలు గడచిపోతున్నప్పటికీ
“ఇకచాలు” అని అనిపించటమూ లేదు. కానీ క్రమంగా అలసట విసుగు పొందసాగింది.
ఒకానొకరోజు ఆ పురూరవుడు ఒక వంటరి ప్రదేశం చేరాడు. “నేను ఇంతకాలం
చేస్తున్నదేమిటి? ఊర్వశితో సాన్నిధ్యంవలన పొందినదేమిటి?…” అని ఆలోచించ
సాగాడు. అతనిలో ఏదో వైరాగ్యం బయల్వెడలింది.
ఇట్లు ఈవిధంగా గానం చేయసాగాడు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
300
పురూరవుడు :
శ్లో॥ అహో! మే మోహవిస్తారః కామ కశ్మల చేతసః
దేవ్యా గృహీత కంఠస్యన్ ఆయుఃఖండా ఇమే స్మృతాః ॥ (అధ్యా 26, శ్లో 7)
ఆహాఁ! కామముచే నా మనస్సు దూషితమైపోయింది కదా! నా మోహమునకు
అంతులేకుండా పోయింది! ఊర్వశీ ఆలింగనంలో నాకు పగలు రాత్రి తెలియకుండానే
అనేక రోజులు-నెలలు-సంవత్సరాలు ఇట్టే గడచిపోయాయి. “ఆహాఁ! ఈమెతో
సాంగత్యం ఎంత మధురం!” అని తలుస్తూ సుదీర్ఘకాలం గడిపాను.
లాభం? కామము శమించాలి కదా? శమించిందా? లేదు. బెంగ-తపన-ఆవేదన
ఇంకా ఇంకా పెరిగాయి. “ఏ రోజు ఈ ఊర్వశి నన్ను విడచి వెళ్ళిపోతుందో? ఎప్పుడు
ఇంద్రుడు ఈమెను వెనక్కి రమ్మని ఆజ్ఞాపిస్తాడో? అప్పుడు నా గతి ఏమిటి?…” అని
ప్రతిరోజు దిగులు అనుభవించాను. ఇప్పటికీ పరిస్థితి అంతే!
నష్టము! “చదువుకుని బాగుపడరా బాబూ!” అని తండ్రి ధనము వెచ్చించి మరీ పిల్లవాడిని
విద్యాలయంలో జేర్పిస్తాడే! ఆవిధంగా ఈ విశ్వము అనబడే విద్యాలయంలో (విశ్వ
Univerceవిద్యాలయము -University)లో నా ఆత్మయొక్క దివ్యత్వాని
సుస్పష్టపరచుకోవటానికి “మానవజన్మ” అనే తరగతిలో జగతః పితయగు పరమేశ్వరుడు
జేర్పించారు.
నేను నేర్చినదేమిటి?
స్త్రీ సాంగత్యమే సర్వస్వము- అని అహోరాత్రములు గడపటమా? “ఇప్పుడు నాకు ఈ
లాభించినది ఎవ్వరైనా తొలగించరు కదా? అప్పుడు నాగతి?”…. అని వర్తమానమును
కామ-రాగ-లోభములతో కప్పిఉంచటమా? ఆకాశము వైపు చూచి ఏదో లభించక
పోతుందా? - అని నోరుతెరచి ఉంచుకున్నవాడికి ఆకలి తీరుతుందా? కామ-రాగములతో
రోజులు గడిపిన నాకు ఇప్పుడు ఆగతే పట్టింది!
ఈలోగా ఆయుర్దాయం చేజారిపోతూ ఉన్నది! అది నేను గమనించటమే లేదు! ఇప్పుడిక
క్రమంగా వార్ధక్యం నన్ను సమీపిస్తోంది. నేను జీవితంలో ఏమి సాధించినట్లు? ఏమి
ఉద్ధరించినట్లు? ఎవరిని సంతోషపెట్టినట్లు? ఆత్మద్రోహీ-కరణవివశో!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
301
శ్లో॥ నాహం వేదాభి నిర్ముక్తః సూర్యోవా అభ్యుదితో ముయా
ముషితో వర్ష పూగానాంబతాహాని గతాన్యుత ॥ (అధ్యా 26, శ్లో 8)
ఊర్వశియొక్క నామ-భౌతిక రూపాదులచే వంచించబడినట్టి నేను అనేక రోజులు
తెల్లవారటం-ప్రొద్దుగూకటం కూడా గుర్తించలేక పోయాను! అయ్యో! ఎన్ని రోజులు -
ఎన్ని సంవత్సరాలు నిష్ప్రయోజనంగా ఈ నాజీవితంలో గడచిపోయాయి. వృధా
అయిపోయాయి! ఆ గడచిపోయిన ఆయుష్షును తిరిగి ఎవ్వరిస్తారు? ఎవ్వరూ ఇవ్వరు!
ఆహాఁ! నామనో మోహం ఎంతటిది. (ఆయుషః క్షణ ఏకో పి సర్వరత్నైః న లభ్యతే॥)
శ్లో॥ అహో మే ఆత్మసమ్మోహో యేన ఆత్మా యోషితాం కృతః
క్రీడా మృగః చక్రవర్తీ నర దేవశిఖామణిః || (అధ్యా 26, శ్లో 9)
రాజశ్రేష్ఠుడను, చక్రవర్తిని, గొప్ప భక్తి-జ్ఞాన సంపన్నుడను అని అందరు చెప్పుకొనే
నేను… ఈనాడు ఒక స్త్రీ చేతిలో క్రీడామృగంగా, కీలుబొమ్మగా అయిపోయానే! ఇందుకు
( ఊర్వశి లభించినందుకు సంతోషించాలా? లేక ఒక ఆడుదాని చేతిలో చిక్కి ఉత్తమ
ఉపాసనామార్గమునుండి చ్యుతిపొంది కుమార్గంలో చాలా దూరం ప్రయాణించి
వచ్చినందుకు దుఃఖించాలా? అరెరె! రాజ్యాదులతో కూడిన నాయొక్క చక్రవర్తిత్వమును,
తత్సబంధమైన స్వధర్మమును గడ్డిపోచలాగా చూచి, ఉన్మత్తుడునై (పిచ్చివాడినై)
దిగంబరుడనై యేడ్చుచు… నానుండి వెడలిపోవుచున్న ఊర్వశి వెంటబడి “పోకు! నా
వెంటనే ఉండు!…” అని యాచించి మరీ బంధమంతా తెచ్చిపెట్టుకున్నానే! వెనుక
కాళ్ళతో తన్నించుకొనికూడా గాడిదవెంట పడటం ఎటువంటిదో.. “వద్దురా బాబూ..”
- అని అంటున్నాకూడా, గీపెట్టి-ఏడ్చి ఊర్వశితో సాంగత్యము తెచ్చి పెట్టుకొనటం
అటు వంటిది కదా! నన్ను ఏమనాలి? మహనీయులు నాగురించి ఏమని చెప్పుకుంటారు?
స్త్రీ లోలుడనై జడ దేహముతో ఆలింగనము కొరకై దేవురించిన నావెంట ఇక మహత్మ్యము
గాని, తేజస్సుగాని, సర్వజన నియంతృత్వముగాని ఇంకా ఎందుకుంటాయి?
శ్లో॥ కిం విద్యాయా? కిం తపసా? కిం త్యాగేన శ్రుతేన వా?
కిం వివిక్తేన మౌనేన? - స్త్రీభిర్యస్య మనో హృతమ్ ? (అధ్యా 26, శ్లో 12)
స్త్రీ దేహమును చూచి (లేక స్త్రీ-పురుషుని దేహమును చూచి) మురిసిపోయి మనసంతా
దేహ విశేషములతో నింపుకున్న వారిగతి ఏమిటి? నిర్గతే! ఆ వ్యక్తియొక్క తపస్సు,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
302
గ్రంధ పఠనముచే సంపాదించుకున్న విద్యావిశేషాలు, సన్యాసియై కాషాయ వస్త్రాలు
ధరించటం, ఏకాంతవాసము, తెలివితేటలు, వికాసము . ఈ కష్టపడి
సంపాదించుకున్నవన్నీ బూడిదలో పోసిన పన్నీరే కదా! వృధాయే కదా! వ్యర్ధమే కదా!
శ్లో॥ స్వార్ధస్యాకోవిదం ధిజ్ఞాం, మూర్ఖం పండిత మానినమ్
యోహం ఈశ్వరతాం ప్రాప్య స్త్రీబిర్గోఖరవత్ జితః ॥ (అధ్యా 26, శ్లో 13)
సర్వజనులపై నియంతృత్వము చెలాయించే చక్రవర్తినయ్యాను. “పండితుడుశ్రేయామర్గము పొందినవాడు మన ఈ పురూరవ చక్రవర్తి …” అని నన్ను సభలో
కవిత్వముతో కవులు శ్లాఘించారు. “ఈతడు జ్ఞాని. మనకు అనుసరణీయుడు.
మహనీయుడు!…” అని సభికులంతా నాగురించి నిండు సభలో పాటలు పాడుతూ
ఉంటే..నేను ఆ సమయములలో, ఆరోజులలో “ఓహోఁ! నిజమే కాబోలు” అని నేను
లోలోన చాలా సంతోషించాను. గర్వించాను. కించిత్ అహంకరించాను కూడానేమో!
కానీ కాలక్రమేణా ఏమైయ్యింది? ఒక ఆవు-గాడిదవలె స్త్రీ సాంగత్యానికి
వశుడనైపోయాను. పోనీ స్త్రీ సాంగత్యం పొందినందుకు తృప్తి పొందానా?
శ్లో॥ సేవతో వర్షపూగాన్ మే ఊర్వశ్యా అధరాసవమ్
న తృప్త్యత్యాత్మభూః కామో వహ్నిః ఆహుతిభిః యథా|| (అధ్యా 26, శ్లో 14)
కట్టెలు వేసినకొలదీ, నేయి పోసినకొలదీ అగ్ని అధికమే అవుతుంది గాని….
తరుగుతుందా? అనేక సంవత్సరాలు ఊర్వశియొక్క అధరామృతమును గ్రోలినాకూడా
నాపట్ల కామము శమించలేదు. మనస్సు తృప్తి పొందలేదు. పైగా కామజ్వరం ఇంకా
ఇంకా వృద్ధి పొందింది! ఇక శాంతి ఎక్కడిది?
ఈ స్త్రీ పురుష పరస్పర దేహసంబంధములలో ఇరుక్కొని పోయిన చిత్తమును వెనుకకు
మరల్చటం తేలికైన విషయమా? నావల్ల అయ్యేదే కాదు! నా చిత్తమునకు కామజ్వరం
నుండి విముక్తి కలిగించటానికి ఆత్మారాములకు ఆరాధ్యుడైనట్టి ఆ అధోక్షజుడే దిక్కు!
దేవుడే దిక్కు! ఇంకెవ్వరు నన్ను రక్షించేది?
ఆహాఁ! ఆనాడు ఊర్వశి మొట్టమొదటే అనేక యుక్తియుక్తమైన వాక్యములతో నన్ను
సమాధానపరచటానికి ప్రయత్నించింది. నాకెంతగానో బోధించింది. ఇంద్రియములకు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
303
వశుడైనవాడను, మందమతిని, దుర్మతిని అయినట్టి నేను ఆమె మాటలు విన్నానా? విని
కూడా ఏమైన విచారణ-విచక్షణ చేశానా? లేదు. మనోగతమైన మోహంతో “నీవు
లేకపోతే నేను చచ్చిపోతాను. దిగంబరినై బాటలవెంట తిరుగుతాను …” అని బెదిరించి
మరీ ఆమెతో భౌతిక సాంగత్యమును బలవంతంగా సంపాదించుకున్నాను. నా మనో
గతమైన మోహము అప్పటికిగాని ఇప్పటికిగాని ఏమాత్రం తొలగలేదు.
ఊర్వశిని దర్శించటం చేతనేనా, నాకీగతి పట్టింది? కాదు. కానే కాదు.
ఊర్వశి నాకేమి అపకారము చేసింది? ఏమీ చేయలేదు.
ఒకానొకడు బాటలో పోతూ బాటకు అడ్డంగా మెలికలు తిరిగి కనిపించిన త్రాడును
చూచి “చచ్చాన్రా బాబోయ్! ఈ పాము కరిచిందా! అంతే!…” అని అనుకొని పాముగా
భ్రమిస్తే… ఆ తప్పు త్రాడుదా? కాదే! ఆ త్రాడు బాటసారిని పిలచి, “నన్ను పాము అని
అనుకోవయ్యా!” - అని ఏమన్నా బ్రతిమలాడిందా? లేదే!
అట్లాగే అజితేంద్రియుడినని (ఇంద్రియములను జయించక-పైగా వాటికి వశుడు అయిన
వాడను) అగు నాదే తప్పంతా? దోషమంతా నాదగ్గర పెట్టుకొని ఊర్వశినో - మరొకరినో
తప్పు ఎంచి మరొక తప్పు చేయను.
ఆహాఁ! ఆహాఁ!
ఆ ఊర్వశిని మొట్టమొదటగా చూచినప్పుడు “ఈమె శరీరము అప్పుడే వికశించిన లేత
సౌగంధిక పుష్పమే!..” అని పరవశించాను. అది ఎంతటి అజ్ఞానకృతమైన
ఉత్ప్రేక్షాలంకారము!
సుకుమారము- సుగంధములతో కూడినది - అత్యంత ఆహ్లాదకరము అగు ఆ సౌగంధిక
పుష్పము యొక్క సౌందర్యము ఎక్కడ? అతి దుర్గంధభూయిష్టము, అనేక మలిన
పదార్ధములతో కూడినవి, అశుచి అయినవి అగు ఈ స్త్రీ-పురుషుల శరీములెక్కడ?
నాయొక్క దట్టమైన అజ్ఞానము-ఇంద్రియ దృష్టి చేతనే… ఆ ఊర్వశి దేహము చూచి
ఏవేవో సౌందర్య వర్ణనములు చేసే కవుల కల్పిత వాక్యములను మనస్సులో గుర్తు
చేసుకుని భ్రమతో సౌందర్యమును ఆరోపించాను. బద్ధుడనయ్యాను. ఎవ్వరిని ఏమి
అనను? ఏమి అనుకుని ఏమి లాభం, తప్పంతా నాదగ్గరే ఉంచుకొని?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
304
ఓ శరీరమా!
ఎవరివి నీవు? ఎవ్వరిచే కల్పించబడ్డావు? ఎవ్వరికి చెందినదానవు? కాలగతిచే అనేక
పదార్ధముల సమీకరణముగా రూపు దిద్దుకున్న నీజన్మ రహస్యం ఏమిటి? నీ సొంతదారు
ఎవరు?
శ్లో॥ పిత్రోః కిం? స్వం ను భార్యాయాః? స్వామినో? అగ్నేః? శ్వగృధ్రయోః
కిమాత్మనః? కిం సుహృదామ్ ఇతి యో నావసీయతే? (అధ్యా 26, శ్లో 19)
తల్లిదండ్రులు బిడ్డపుట్టగానే చూచి, మురిసిపోయి “నా బిడ్డ! మా బిడ్డ…” అని అందరికీ
చూపి మురిసిపోతారు. అమ్మ వాత్సల్యంగా చూచి “నా గర్భంలో 9 నెలలు ఎదిగిన ఈ
బిడ్డ నా గర్భవాసి కాబట్టి నాబిడ్డయే…” అని తలచి ఆనందబడిపోతుంది. కనుక ఈ
దేహము అమ్మ యొక్క ఆస్థియా? తండ్రియొక్క ఆస్థియా? వారిద్దరి సొత్తా?
యుక్త వయస్సులో వివాహమౌతుంది. వివాహం జరిగిన పందిరిలో భార్య భర్తను
చూచి స్పృశిస్తూ “ఈ పురుష దేహం నాది?…” అని అనుకొని సంతోషపడుతోంది. ఆ
పురుషుడో “ఈ స్త్రీ దేహము ఇప్పుడు నాకు చెందినదే కదా! …” అని ఆహ్లాదబడి
పోతున్నాడు. కనుక స్త్రీ దేహము ఆమె భర్తయొక్క ఆస్ట్రియా? పురుష దేహము ఆ
భార్య యొక్క ఆస్ట్రియా? వారిరువురి దేహాలు పరస్పరం ఒకరిది మరొకరి సొత్తా?
సొంతదారు ఎవరు? (Is this body a belonging of Better-Half?)
ఒక యజమాని తన సేవకుని దేహము చూచి, “ఈతనిని జీత భత్యాలు ఇచ్చి
నియమించుకున్నాను కదా! నేను ఏమి చెప్పితే అది చేస్తున్నాడు. కనుక ఈ సేవకుని
దేహము నాదే! ఇంకెవరూ ఈతనికి ఏ పనీ చెప్పటానికి వీలులేదు. ఈతడు నా మాటే
వినాలి! ఇంకొకరి మాట వింటే నేనూరుకుంటానా? ” అని తలుస్తున్నాడు. కనుక
ఈ దేహము ఆ యజమానిదా? (Is the physical body of the servant a belonging
of the master?)
ఒకానొకప్పుడు ప్రాణముపోయిన తరువాత బంధువులు ఈ భౌతిక దేహమును
శ్మశానానికి తీసుకొనిపోయి కట్టెలతో కాలుస్తున్నారు? కనుక ఇది అగ్ని దేవుని సొత్తా?
శ్మశానికి చెందిన ఆస్థియా? కట్టెలయొక్క సొంతమా! (Is this the property of Fire,
fire-wood, or Burrial Ground?)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
305
కొందరు చనిపోయిన తమ బంధువుయొక్క భౌతిక దేహమును అడవిలో విడచి వస్తున్నారు.
జంతువులు-పక్షులు ఆ దేహమును ఆహారంగా మెక్కుచున్నాయి. కాబట్టి ఇది కాకులయొక్క
కుక్కలయొక్క, గ్రద్దలయొక్క సొత్తా? (Is this physical body a food stuff belonging
to insects?)
లేక, దేహము జీవునిదా? నాది-నాది అని అనుకుంటూ దీనికి అందంగా వస్త్రధారణ
చేసి, బొట్లు అలంకరించి ఊరు ఊరు త్రిప్పుచున్నాడు కదా! కాబట్టి “నేను” అను
రూపముగల జీవునిదే అని అందామా? ఈ జీవుడేమన్నా ఈ దేహమునకు తానుగా
కాళ్లు-చేతులు-పొట్ట-జీర్ణవిధానం అమర్చాడా? తానుగా ఒక వెంట్రుక అయినా
మొలిపించాడా? పోనీ, ఏ తల్లి గర్భవాసం నుండి బయల్వెడలిందో అది ఈ జీవునియొక్క
నిర్ణయమా?
స్నేహితులు కొంతమంది వీడు మా వూరివాడే! మావాడేనండీ! మాజాతి వాడే! మా
పాఠశాలలోని వాడే! అని చెప్పుకొంటూ ఆ మిత్రుని దేహమును తమసొత్తువలె
చూస్తున్నారు. మరి ఈ దేహము అటువంటి స్నేహితులదా?
ఎంతగా ఆలోచించికూడా ఈ దేహమునకు సొంతదారు ఎవరని చెప్పాలి? ఎందుచేతనని
చెప్పాలి? ఏ నిర్ణయానికి రాగలం? దేనిని కాదని తిరస్కరించగలం?
ఇది ఇట్లా ఉండగా… మరొక విచిత్రమైన విషయం!
“ఆహా! ఆ స్త్రీయొక్క ముక్కు పలువరుస పెదిమలు - బుగ్గలు ఎంత అందం! ఎంత
బాగున్నాయి..” అని పురుషుడు స్త్రీని చూచి అనుకుంటున్నాడు. ఇక స్త్రీయో “ఆ
భుజములు! వాటి బలం! ఆ నుదురు! అద్భుతం! అబ్బో ఆ ముక్కుతీరు, ఆ కళ్ళు, ఆ
పెదవులు, ఆ జుట్టు… ఎంత బాగున్నాయి! తనివితీరా చూడబుద్ది అవుతోంది…” అని
అనుకుంటోంది. ఇంతకీ అక్కడున్నదేమిటి? ఒకరిని మరొకరు చూచుకొని మురిసిపోతూ
ప్రేమావేశంతో ముసి-ముసి నవ్వులు నవ్వుకుంటున్నది దేనిని గురించి?
మలమూత్రములతో - చీము నెత్తురులతో నిండినది…,
బొమికల అమరికను కప్పి ఉంచుచున్న చర్మము కలిగి ఉన్నది….,
… ఇటువంటివాటితో కూడిన రక్తమాంస నిర్మితమైన శరీరములను చూచి, “ఆహాఁ!
ఆ ముక్కు ఎంత అందమైనది? ఈ ముదరు! ఆమె బుగ్గలు! ఈతని పెదిమలు! నల్ల
కలువల వంటి కళ్ళు! తెల్లటి జాతి రత్నాలతో పోల్చతగ్గ పలువరుసలు!…” ఇటువంటి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
306
వర్ణనలు కవులు ఎట్లా చేస్తున్నారు? వాటిని వింటూ, చదువుతూ పాఠకులు ఎందుచేత
రసాస్వాదులగుచున్నారో … ఇప్పుడు నాకు అర్దమే కావటం లేదు. ఎందుకు దేనిని
చూచి ఆ పరవశం?
శ్లో॥ త్వక్ మాంస రుధిర స్నాయు మేదో మజ్జా అస్థి సంహతౌ
విణ్మూత్రపూయే రమతాం కృమీణాం కియదంతరమ్? (అధ్యా 26, శ్లో 21)
చర్మము-మాంసము-రక్తము-క్రొవ్వు-మేదస్సు-మజ్జ-ఎముకలు-మలముమూత్రము-చీము ఇటువంటి పదార్ధములతో కూడిఉండే ఈ మానవదేహముల
పట్ల “రమించాలి” అని భావావేశం పొందుచున్న స్త్రీ - పురుషులకు “ఇదే జీవితాశయం” “
అనుకునే వారిదేహాలకు… మల మూత్రములందు తిరుగాడే లద్దె పురుగుల దేహాలకు
ఉన్న అంతరమేమిటి?
అందువలన…,
వివేకవంతుడైన మానవుడు స్త్రీ-పురుషులు శృంగార విశేషములతోను, శృంగార
లంపటులతోను స్నేహము చేయనే చేయరాదు.
ఎందుకంటే… విషయేంద్రియ సంయోగముల వలన ముఖ్యంగా శృంగారముచేత
- మనస్సు చంచలమైనంతగా మరింకే విషయములోను చంచలము కాడేమో!
తదితర దృశ్య విశేషాలు- ఎదురుగా కళ్ళకు కనబడితేనే- మనస్సు కలత చెందుతుంది.
ఈ సపరస్పర దేహాకర్షణ విషయములో… కొంచము చూచీ-చూడకపోయినా కూడా,
ఆలోచించినంత మాత్రం చేతనే మనస్సు వికలమైపోగలదు. కనబడీ-కనబడకుండానే
దేహాకర్షణలు ఊహ-అపోహలు కల్పించగలవు. ..
”ఆహాఁ! ఆమె నావైపే చూచి చిరునవ్వు నవ్వుతోంది.
ఓహో! ఈతడు నావంకే చూచి నా బుగ్గల సౌందర్యానికి ముగ్ధుడు అవుతున్నాడు.
అరె! ఆమె మాటలు నాపట్ల ఏదో ఇష్టమున్నట్లు సూచిస్తున్నాయి. ఊ! ఈతడు నా
అందానికి ఆకర్షితుడు అవటంచేతనే కలుపుగోలుగా ఉంటున్నాడు…“ ఇటువంటి అర్ధం
పర్ధం లేని ఆలోచనలు-ఊహలు హృదయములోని ”దేహాకర్షణ" అనే దోషంచేత
అసందర్భ ప్రదేశములలో కూడా నిద్రలేపబడగలవు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
307
ఎవ్వడైతే ఇంద్రియ నిగ్రహమును అభ్యసిస్తూ ఉంటాడో… అట్టివాని మనస్సు మాత్రమే
నిశ్చలమై, శాంతిని పొందగలుగుతోంది.
అందుచేతనే శృంగార సంబంధమైన దేహాకర్షణలకు, అట్టి ఆకర్షణలతో నిమగ్నమయ్యే
సంఘటణ సందర్భములకు బహుదూరంగా ఉండటమే ఉచితం!
నేను ఈ ఊర్వసీ లోకమును అధ్యాత్మ జ్ఞాన శ్రేయస్సు కొరకై వెంటనే ఇప్పుడే త్యజించెదను
గాక!
శ్రీకృష్ణుడు : వింటున్నావా? ఉదవా? రాజశ్రేష్ఠుడగు ఆ పురూరవుడు ఆవిధంగా విచారణ
చేసి వెంటనే ఊర్వశీ లోకమును విడచిపెట్టాడు. తనకు అభిన్నమును - పరమాత్మను
అగు నన్ను తెలుసుకొని జగద్విషయములను దాటవేయటానికి ఉపక్రమించాడు. తపోధ్యానములను పునః శ్రద్ధతో ప్రారంభించాడు.
క్రమంగా నా తత్త్వమేమిటో తెలుసుకున్నాడు! అజ్ఞానము నశించసాగింది. శాంతిని
పొందాడు.
అందుచేత ఉద్ధవా! బుద్ధిమంతుడై పరమాత్మను తెలుసుకొనే ఉద్యమము ప్రారంభించు
వాడు మొట్టమొదటగా దుష్టవిషయాలతో, ఇంద్రియములను ప్రలోభపెట్టే సందర్భాలలో
తనకు ఏర్పడియున్న సాంగత్యమును త్యజించనారంభించాలి.
సత్సాంగత్యమునందు ఆసక్తుడు కావాలి.
సత్పురుషులతో ఆధ్యాత్మిక సంబంధము పెంపొందించుకోవాలి. వారిని సేవించి
సంతోషింప చేయాలి. అట్టి సత్పురుషులు తమయొక్క సదుపదేశములతో మనో
వ్యాసంగమును, ఇంద్రియ వృత్తులను శమింపజేయగల సమాచారమును, ఉపాసనలను
ప్రసాదిస్తూ ఆసక్తిని సన్నగిల్ల చేయగలరు.
కనుక సత్పురుషలను సదా ప్రతిరోజు ఆశ్రయించాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
308
శ్రీ ఉద్ధవుడు : సత్పురుషుల లక్షణములు ఎటువంటివి? వారు ఎట్లా ఉంటారు? ఎక్కడ
వుంటారు? ఏమి చేస్తూ వుంటారు?
శ్రీకృష్ణుడు :
శ్లో॥ సంతో అనపేక్షా మచ్చితాః ప్రశాంతాః సమదర్శినః
నిర్మమా నిరహంకారా నిర్ద్వంద్వా నిష్పరిగ్రహాః ॥ (అధ్యా 26, శ్లో 27)
సత్పురుషులు….
నిష్కాములై ఉంటారు. ఏదీ కోరుకోరు. త్యజించరు. (తొలగాలి అనే ఆవేశము కలిగి
ఉండరు). అదేదో కావాలి - ఇదేదో తొలగాలి - రెండింటినీ అధిగమించినవారై ఉంటారు.
వారి మనస్సు చిత్తము పరతత్త్వ స్వరూపుడనైన నాపైనే నిలిపి ఉంచుతారు.
కనబడేదంతా శ్రీకృష్ణ చైతన్యానందంగా ఉపాసిస్తూ - ఆస్వాదిస్తూ ఉంటారు.
ప్రశాంత చిత్తులై లోక సంఘటనలచే, సందర్భములచే స్పృశించబడనివారై
ఉంటారు. చిద్విలాసులై-అసంగులై-అతీతులై ఇదంతా క్రీడా విశేషమాత్రంగా
చూస్తూ వుంటారు!
సమదర్శులై సర్వే సర్వత్రా ఆత్మ సాక్షాత్కారమే సందర్శిస్తూ ఉంటారు. మట్టిని
చూచేవారికి - మట్టి బొమ్మల ఆకారముల దృష్టిచే కనిపించే - వేరు వేరైనదంతా
కనిపించదు కదా! వారికి అనేకంగా కనిపిస్తున్నదంతా ఒక్కటిగా అనిపిస్తూ
ఉంటుంది. ఇక, సంగతి-సంఘటనపూర్వకంగా చూచేవారికో?
మనరాజు-శత్రురాజు-శత్రుసైనికులు… ఇత్యాది వ్యవహారాలు (ఆ బొమ్మలో)
కనిపిస్తాయి.
సత్పురుషులు మమత్త్వ బుద్ధి లేనివారై ఉంటారు. “ఇది నాకు చెందినది.
దీనికి నేను చెందినవాడను” అనే భ్రమను జయించినవారై ఉంటారు.
అహంకార శూన్యులై ఉంటారు. జీవుడుగా నేను చీమకంటే కూడా గొప్పవాడిని
కాదు. ఎందుకంటే చీమలో - చీమగా ఉన్నది నా ఉపాసనా వస్తువగు పరబ్రహ్మమే
కదా! ఇక పరబ్రహ్మముగా అంతా నేనే… అనునది గమనిస్తున్నవారై ఉంటారు.
అపరిగ్రహులై ఉంటారు. ప్రపంచంలో కనబడే దేనినీ స్వీకరించరు. స్వప్నంలో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
309
కనిపించిన వస్తు జాలమును మూటకట్టుకొని జాగ్రత్తులోకి తెచ్చుకొంటున్నాడా,
ఎవ్వడైనా?
ఓ ఉద్దవా! అట్టి మహానుభావులు ఎల్లప్పుడూ నా అవతార కథలను, ప్రవచనములను,
ఆ ప్రవచనముల అంతర్లీన గానాన్ని వింటూ-సంభాషిస్తూ-కీర్తిస్తూ ఉంటారు. నా
అవతార కథలు శ్రద్ధతో వినుచున్న మానవుల పాపములను అవి నశింపజేయగలవు!
శ్లో॥తాయే శృణ్వంతి గాయంతి హి అనుమోదంతిచాదృతాః
మత్పరాః శ్రద్ధదానాశ్చ భక్తిం విందంతి తే మయి ||
భక్తిం లబ్ధవతః సాధోః కిమ్ అన్యత్ అవశిష్యతే
మయ్యనంతగుణే బ్రహ్మణి ఆనందానుభవాత్మని ॥ (అధ్యా 26, శ్లో 29, 30)
నా లీలలను శ్రద్ధగా-ఆదరముగా విని కీర్తించి తాత్త్వికార్ధాన్ని అర్ధం చేసుకొని నాయందు
ఆసక్తి పెంపొందించుకోవటం చేత స్వభావసిద్ధమైన భక్తి-ప్రపత్తి పెంపొందుతూ
వుంటాయి. సర్వసాక్షిని, అనంతగుణ విశేషుడను, చిదానందమయుడను, పరబ్రహ్మ
స్వరూపుడను అగు నాయందు భక్తి కలిగియున్న వానికి భక్తియే మహత్తరమైన
ప్రయోజనం. ఆతనికి ఈ ముల్లోకాలలో కోరుకొనవలసినది, పొందవలసినది అంటూ
మరింకేమీ ఉండదు. అగ్నిని (దీపమును) వెలిగించేచోటు వేడిని వేరుగా ఆహ్వానించాలా?
చీకటిని పోగొట్టమని వేరుగా విన్నవించుకోవాలా? సత్పురుషులు చేతులెత్తి వివరిస్తున్న
శ్రీకృష్ణచైతన్యానందమును పొందుచున్నవానిపట్ల కర్మబంధము, సంసార భయము,
సంసారమునకు మూలమైన అజ్ఞానము వాటంతట అవే స్వభావసిద్ధంగా తొలగిపోతాయి.
సత్పురుషులతో సాంగత్యము
ఒకడు నీటిలో మునిగిపోతున్న తరుణంలో, ఆ మార్గంలో బహు దగ్గిరగా ఒక నౌక
వస్తూ ఉంటే? ఆతనికి ఎంతటి ఆనందం! ఇక భయం - శ్రమ - ఆక్రందన - అన్నీ
కూడా శమిస్తాయి కదా! "ఓ నావ నడిపే పెద్దమనిషీ! రండి! నన్ను కాపాడండి!…’
అని మాత్రమే కేకవేస్తాడు కదా!
అట్లాగే…,
సంసార సముద్రంలో మునిగి తేలుచున్న మానవునకు శాంతచిత్తులు, బ్రహ్మవేత్తలగు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
310
సత్పురుషుల సాంగత్యమే గొప్ప నౌక!
అంతేకాకుండా,
ఓ ఉద్ధవా! సత్పురుషుల వెంటనంటి నేనుంటాను! ప్రాణులకు అన్నము ఏవిధంగా
రుచికరము-జీవనముకూడా అయి ఉంటోందో, శరణాగతులగు ఆర్తులకు సత్పురుషుల
సాంగత్యము-నా రక్షణ ఆవిధంగా ఉభయతారకమై ఉండగలవు.
ధర్మమే పరలోకమునకు ధనము కదా!
ఆ రీతిగానే,
సంసారమున పడి, సర్వభయములు, వేదనలు పొందుచున్న జీవునకు సత్పురుషుల
సాంగత్యము, వారు గుర్తు చేస్తున్నట్టి ఆత్మజ్ఞానము, బోధిస్తున భక్తి మార్గములే పరమరక్ష.
వారే ఆర్త జన రక్షకులు!
సూర్యుడు ఉదయించగానే చీకటి పటాపంచలౌతుంది కదా! జనులు జగత్తును
చూడగలుగుతారు కదా! అదేవిధంగా సత్పురుషులు పరమాత్మను దర్శించటానికి జీవులకు
జ్ఞానచక్షువులను ప్రసాదిస్తున్నారయ్యా!
అట్టి సత్పురుషులే ఈ జీవునికి దేవతలు, బంధువులు, ఆత్మ కూడా అయి ఉన్నారు.
ఓ ఉద్ధవా!
స్వయంగా నేనే సత్పురుషుల రూపముగా ఉన్నాను.
కనుక ఓ జనులారా! సత్పురుషులను ఆశ్రయించటం నేర్చుకోండి. అహంకారమును
వీడండి. మమకారమును త్యజించండి. సత్స్వరూపమగు మత్థానమునకు చేరండి!
ఓ మిత్రమా! ఉద్ధవా! ఆవిధంగా పురూరవుడు ఊర్వశితో సందర్శన సరాగేచ్ఛను
త్యజించాడు. ఇక అక్కడినుండి సత్సాంగత్యమును ఆశ్రయించాడు.
ముక్త సంగుడైనాడు.
ఆత్మారాముడై ఈ భూమిపై సంచరించాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
311
అధ్యాయము–41.) క్రియా యోగము - అర్చనా విధి
|
శ్రీ ఉద్ధవుడు : శ్రీ కృష్ణా! యాదవ శ్రేష్టా! భక్త జనాశ్రయా! దేవాది దేవా! వసుదేవనందనా!
ఏ ఏ విధమైన భక్తులు, ఏఏ విధంగా… ఏఏ విధమైన క్రియా యోగం చేత నిన్ను
అర్చిస్తూ ఉంటారో…
అట్టి ఆరాధనరూపమైన క్రియా యోగముల విశ్లేషణ - విశేషాలను వివరించండి!
“ఓ జనులారా! నాయనలారా! పరమాత్మను అర్చించండి! అదే మీకు శ్రేయస్సు కలుగ
జేస్తుంది!…” అని మహనీయులైన నారదమహర్షి, వ్యాసభగవానులవారు, దేవతలకు
ఆచార్యులైన బృహస్పతులవారు… మొదలైనవారంతా మాటిమాటికి ఎలుగెత్తి
చెప్పుచున్నారు.
ఏ క్రియాయోగమైతే…,
మీ ముఖారవిందమునుండి మొట్టమొదటగా వెలువడిందో..,
|
మీచేత మీ పుత్రులగు బ్రహ్మదేవునికి బోధించబడినదో…,
సృష్టికర్తయగు బ్రహ్మ దేవునిచే భృగువు మొదలైన సప్తర్షులకు తదితర
మహనీయులకు చెప్పబడిందో, విశదపరచబడిందో…,
ఆ తరువాత కొన్ని సందర్భాలలో భగవానుడగు శంకరునిచే, జగన్మాతయగు
పార్వతీదేవికి బోధించబడిందో…,
ఆ క్రియాయోగమును నాకు చెప్పండి. నాకు బోధించండి.
మీయొక్క ఉపాసనయే సర్వవర్ణములవారికి, సర్వ ఆశ్రమములలోని వారికి, సర్వ స్త్రీపురుషులకు సర్వ శ్రేష్ఠమని, శ్రేయోదాయకమని నేను గ్రహిస్తున్నాను.
ఓ కమలనయనా! విశ్వేశ్వరా! విశ్వంభరా! మీకు భక్తులము, మీపట్ల అనురక్తులము
అగు మేము కర్మబంధముల నుండి విడవడగల ఉపాయంగా చెప్పబడే క్రియాయోగము
గురించి వివరించండి.
శ్రీ కృష్ణభగవానుడు : ఓ ఉద్ధవా! నీవు అడుగుచున్న క్రియాయోగము లేక భగవంతుని
జేర్చగల కర్మకాండకు ఇది ఇంతమాత్రమే అని ఒక పరిధిలోనికి తెచ్చి చెప్పలేము.
అంతము లేదు. (వేదో నంతః) అందుచేత ఒకానొక పూర్వ పర క్రమమును దృష్టిలో
పెట్టుకొని కొన్ని కొన్ని విశేషాలు వర్ణించి చెప్పుచున్నాను. విను.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
312
పరతత్వ స్వరూపడనగు నన్ను అర్చించే విధానాలు ముఖ్యంగా 3 గా విభజించవచ్చును.
1. వైదికము (వేదోక్తమైనది - మంత్రములతో కూడినది.)
2. తాంత్రికము (భౌతిక సంబంధమైన విధి-విధానములతో కూడినది)
3. మిశ్రమము (మంత్ర-తంత్ర విధిపూర్వకమైనది.)
ఈ మూడింటిలో ఎవ్వరికి ఏది ఇష్టమని అనిపిస్తుందో వారు ఆ విధిని అనుసరించ
వచ్చును. ఈ మూడింటినీ ఒక్కసారే కూడా అనువర్తించవచ్చు.
మొట్టమొదటగా…,
తన ఆర్హత - ఆచారము అధికారములను అనుసరించి ఒకనొక సమయంలో “ఈ
రోజు నుండి శాస్త్ర విధిగా దైనందికమైన శ్రద్ధాసక్తులతో కూడినవాడనై ఈ ఉపాసనా
క్రమములను అభ్యసిస్తాను. నిర్వర్తిస్తాను…” అని నిర్ణయించుకోవటం ఉచితం. అదియే
“ఉపనయన సంస్కారము” అని (లేక) ఉపనయన ప్రక్రియ అని శాస్త్రోక్తంగా
మంత్రతంత్రయుక్తంగా శాస్త్రకారులు సూచిస్తున్నారు. నియమిస్తున్నారు. ఇక ఆతడు
నన్ను శ్రద్ధాసక్తులతో అర్చించటం ప్రారంభించు గాక! ఇప్పుడు ఆ సాధకుడు ద్విజుడుగా
చెప్పబడతాడు. (One that is adapting II Phase)
పూజ
ఆ ద్విజుడు (one who commenced second phase of life and shaping the
routine with adoration) భక్తితో
ప్రతిమలయందు…, (లేక)
ఒకానొక భూస్థలమునందు…, (లేదా)
అగ్నియందు…,
సూర్యునియందు…,
జలమునందు లేదా తన హృదయమునందు
ఎటువంటి కాపట్యము ( Artificiality) లేకుండా,
విద్యుక్తములైన - పెద్దల ప్రవచనములను (లేక) శాస్త్ర విధి-విధానములను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
313
అనుసరిస్తూ
తన యొక్క స్వస్వరూపుడనే అయిఉన్న నన్ను తనకు ఇష్టమైన నామ రూపాలతో
పూజించటం ప్రారంభించాలి.
శ్లో॥ పూర్వం స్నానం ప్రకుర్వీత ధౌతదంతో అంగశుద్ధయే
ఉభయైరపి చ స్నానం మంత్రైః మృత్గ్రహణాదినా ||(అధ్యా 27, శ్లో 10)
తెల్లవారుఝామున (బ్రాహ్మీ ముహుర్తంలో) నిదుర లేవాలి. దంత ధావనం చేసుకొని,
దేహశుద్ధి కొరకై స్నానం చేయాలి. అటుతరువాత వైదిక తాంత్రిక మంత్రములను
ఉచ్ఛరిస్తూ - అనుసరిస్తూ మట్టి మొదలైన లేపనములతో మరల స్నానం నిర్వర్తించాలి.
ఆపై పరమేశ్వరుడనగు నాపై భక్తితో తమకు విహితము-అనుకూలము అయినట్టి
వేదోక్త-శాస్త్రోక్త-ఆర్యోక్తమైన విధి విధానములతో “పూజ” అనే కర్మను - కర్మపాశములు
త్రెంచుకోవటానికై - నిర్వర్తించాలి.
ప్రతిమ
ప్రతిమ (లేక) విగ్రహము ఎందుకు? ధ్యాసను ఏకాగ్రపరచటానికే!
పూజకు ప్రతిమ సహకారికం కదా! అట్టి ఇష్టదైవము యొక్క ప్రతిమయొక్క వివిధ
రీతులు - 8 గా చెప్పబడుచున్నాయి.
1. శిలామయము (Made up of stone)
2. దారుమయము (Made up of wood)
లోహమయము (బంగారు వెండి - పంచలోహాలు 3. ఇత్యాదివాటితో తయారైనది.
(Made up of some metal)
4. లేప్యము - చందనము మట్టి మొదలైన వాటితో తయారైనది.
(Made of Chandana wood powders - Mud etc.,)
5. లేఖ్యము (Painting)
6. సైకతము (ఇసుకతో నిర్మించినది) (Made up of sand)
మనోమయము7. . (Visualized)
8. మణి మయము (Made of pearls)
ఈ విధంగా ప్రతిమలు ఈ ఎనిమిదింటిలో ఏదో ఒక్కటి (లేదా) కొన్ని సాధకుని మనో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
314
అనుకూల్యతను అనుసరించి ఉండవచ్చు!
ప్రతిమ చలము (can be moved), అచలము (Embeded) అని రెండుగా ఉంటాయి.
ఆ ఉభయములు, పైన చెప్పిన 8 విధములైన ప్రతిమలు నేను వేంచేసి ఉండే
మందిరాలుగా భావించాలి! అచలప్రతిమ (un moved / embeded form)
పూజించేడప్పుడు ఆవాహన-ఉద్వాసనలతో పనిలేదు.
అస్థిరమైన ప్రతిమలు (ఉదా : మట్టి ప్రతిమలు) ఉపయోగించేడప్పుడు కొన్నిచోట్ల
ఆవాహన-ఉద్వాసనలు ఉంటాయి. మరి కొన్నిచోట్ల ఉండవు. పిండితో తయ్యారైన
ప్రతిమలకు మాత్రం ప్రతిరోజు ఆవాహన - ఉద్వాసనలు తప్పక ఉంటాయి.
మృత్తికా ప్రతిమ - చిత్రలేఖనం (Form made up of mud-painted form) ఈ రెండిటికీ
రోజూ జలంతో స్నానం చేయించఖర్లేదు. తుడిస్తే చాలు. తదితరములైన ప్రతిమలకు
రోజూ స్నానము చేయించటం ఉచితం.
మరొక్క విషయం!
ప్రసిద్ధములై సులభంగా లభించే పదార్ధములతో గృహంలో ప్రతిమలు పెట్టుకొని
పూజించటం ఉచితం. అంతేగాని, ఎప్పుడో ఎక్కడో (లేక) గొప్ప ఖర్చుచే లభించే
పదార్ధాలగురించి తపనపడి అవి పొందనపుడు పూజకే ఉపక్రమించకపోవటం ఉచితము
కాదు. విగ్రహం నిగ్రహం కొరకు మాత్రమే! నిష్కాముడైన భక్తుడు అనాయాసంగా
లభించే పదార్ధాలతో నన్ను పూజిస్తున్నాడు. ఉత్తమమైన భావన శ్రద్ధతో కూడిన ఉపాసన
ముఖ్యము గాని “ఎంత ఖరీదైన - కష్టలభ్యమైన వస్తుజాలముతో పూజిస్తున్నాము?…”
అనేది నాకు ముఖ్యము కాదు. భావనానుసారంగా నేను వేంచేస్తాను. అంతేగాని,
వస్తుప్రాముఖ్యంబట్టి కాదు!
ఓ ఉద్ధవా!
ప్రతిమకు స్నానాదులు సమర్పించటం, పసుపు-గంధము-కుంకుమలతో, పుష్పాదులతో
అలంకరించటం ఇటువంటి కార్యక్రమములు నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను.
మట్టితోను - కొయ్యతోను వేదికలు తయారుచేసి - అలంకరించి ఆ వేదికపై ప్రతిమను
ఉంచి అంగప్రధానంగా అక్కడ పూజించటం నాకు ఇష్టం. అట్లాగే అగ్నిని నేయితో
పూజించాలి. తిలలను, చందన పదార్ధములను సమర్పించటం కూడా నేను ఇష్టపడుతూ
ఉంటాను.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
315
సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ గాయత్రీ, సూర్యస్తోత్రం - సూర్యసూక్తము - సూర్యకవచం
మొదలైన మంత్రాలతో నన్ను ఉపాసించటం నాకు సంతోషం కలుగజేస్తాయి.
జలమునందు తర్పణ మొదలైనవాటితో కూడా నన్ను ఉపాసించవచ్చు. భక్తితో జలము
సమర్పించినా సరే, నేను ప్రియముగా స్వీకరిస్తాను.
ఏదైనా భక్తితో సమర్పించాలి సుమా! భక్తిలేని పూజ పత్రిచేటు! భక్తి లేకుండా (without
Devine_Love) ఎవ్వడు ఎన్నెన్ని విశేష పదార్థాలు సమర్పించినా… అవన్నీ నాకు
సంతుష్టిని కలుగజేయవు. భక్తితో లభ్యమయినంత వరకు సమర్పించే గంధ పుష్ప -
అక్షింతలు, ధూప-దీప నైవేద్యాలకే నేను తృప్తిపడతాను. సంతోషిస్తాను. పెద్దగా
చెప్పేదేమున్నది? ద్రవ్యములు - విధి విధానములు ప్రావీణ్యత-వీటన్నిటికన్నా నాకు
భక్తి ముఖ్యము. నేను చూచేది - నేనుకోరేది - భక్తియే!
ప్రతిమను నిలిపే విధానం :
పూజ చేయాలనుకునేవాడు ముందుగా తాను శుచి అవ్వాలి.
శ్లో॥ శుచిస్సంభృత సంభారః పాగ్దర్బైః కల్పితాసనః
ఆసీనః ప్రాగుదగ్వార్చేత్ అర్చాయామథ సమ్ముఖః (అధ్యా 27, శ్లో 19)
అర్పించువాడు ముందుగా చక్కగా శుచుడవ్వాలి.
పూజా సామాగ్రిని సానుకూలంగా అమర్చుకోవాలి.
దర్భాసనాన్ని తూర్పుదిక్కుగా ఉండేటట్లు అమర్చుకోవాలి. అనగా, పూజించువాడు
తూర్పుముఖంగా ఆశీనుడవటం ప్రశస్తము. లేదా, ఉత్తరదిక్కుగా ముఖం
ఉండేట్లుకూడా బాగే! ఏదిఏమైనా స్థిరప్రతిమకు ఎదురుగా కూర్చోవాలి.
మొట్టమొదట గురువులకు - దేవతలకు నమస్కారము సమర్పించాలి! త్వదనుజ్ఞయా
అని వారి దగ్గిర అనుజ్ఞను అభ్యర్ధన పూర్వకంగా తీసుకోవాలి.
అంగన్యాసం కరన్యాసం
తరువాత కరన్యాసం అంగుష్ఠాభ్యాం నమః … హృదయాయనమః
తర్జనీభ్యాం నమః …. శిరసే స్వాహా
మధ్యమాభ్యాం నమః …. శిఖాయాయవౌషట్
అనామికాభ్యాం నమః కవచాయుహుమ్
కనిష్ఠికాభ్యాం నమః… నేత్రత్రయాయవేషట్
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
316
కరతలకరపృష్టాభ్యం నమః… అస్త్రాయఫట్ ఇతిదిగ్బంధంః
అంగన్యాసం దైవ ప్రతిమయొక్క పాదములు మొదలైన
ప్రతిమావయవములను ఒక్కొకటిగా భక్తితో
పూజించనారంభించాలి.
ప్రోక్షణపాత్రలోని జలముతో…
ముందుగా పూజా స్థానమును (దేవం-దేవీం సంప్రోక్ష్య)
తరువాత పూజార్ధం తెచ్చియున్న పూజా ద్రవ్యములను (పూజా ద్రవ్యాని
సంప్రోక్ష్య)
ఆ తరువాత తన శిరస్సును - దేహమును (ఆత్మానం చ సంప్రోక్ష్య) సంప్రోక్షణ
చేయాలి.
ఆతరువాత పరమాత్మ విగ్రహమునకు (ప్రతిమకు) ఎదురుగా కొంచెం దూరంగా 3
పాత్రలను ఉంచుకోవాలి.
1. పాద్యముకొరకు (పాదములు కడిగిన జలము జారవిడవటానికి)
ఆచమనీయము 2. (స్వామి- ఓం కేశవాయ స్వాహా :: ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయి స్వాహా :: అను మంత్రముతో త్రి ఆచమనముగా - స్వీకరించే
జలము జారవిడవటానికి)
3. అర్ఘ్యము కొరము (స్వామి చేతులు కడిగే జలమును జారవిడవటానికి)
ఆ మూడు పాత్రలను క్రమంగా
హృదయ మంత్రముతోను (హృదయాయ నమః)
శిరో మంత్రముతోను (శిరసే స్వాహా)
శిఖా మంత్రముతోను (శిఖయాయ ఔషట్).
గాయత్రీ మంత్రముతోను (ఓం భూర్భువసువః మొదలైనవి) సంస్కరించాలి.
అటుతరువాత…,
శ్లో॥ పిండే వాయ్వగ్ని సంశుద్ధే
హృత్ పద్మస్థాం పరాం మమ
అణ్వీం జీవకలాం ధ్యాయేత్
నాదాంతే సిద్ధభావితామ్ || (అధ్యా 27, శ్లో 23)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
317
స్వదేహమును పరిశుద్ధపరచుకొని పూజకు
భౌతిక దేహమును (పాంచభౌతిక దేహమును) వాయువుతో నింపి శరీరమంతా
అణువణువూ అగ్నిని భావనచేసి పరిశుద్ధం చేసుకోవాలి. ప్రాణాయామం ద్వారా
దేహములోని అణువణువులోను వాయువుతో నింపి, స్థిరంగా ఉంచి ఉష్ణమును
ఆహ్వానించి శుద్ధపరచుకోవాలి.
హృత్ స్థానంలో హృత్ పద్మాసనముపై ఆహ్వానించబడిన పరమాత్మను భావనచేసి
- ధ్యానించి - నమస్కరించి,
నాదాంతము - ఓం = అ + ఉ + మ …మ్ మ్ మ్ అకార ఉకార మకార
బిందు-నాదములనే ఐదింటిని వాగింద్రియము (నోటి) తోను, మనో
భావముతోను ఉచ్ఛరించి
సూక్ష్మాకారము-శ్రేష్ఠము-జీవకళాంసుడు అగు కేవల పరమాత్మను మనో
హస్తములతో - మననం చేస్తూ ఉపాసించాలి.
ఆత్మరూపముచే ఆవాహితమూర్తిత్వము దేహమంతా వ్యాప్తము కాగా
ఆ భగవత్ ప్రతిమామూర్తిని మానసికోపచారములతో పూజించి,
తన్మయమైన భావనతో రెండుచేతల ముని వ్రేళ్ళతో బాహ్యవిగ్రహము (లేక)
ప్రతిమ యొక్క పాదములను స్పృశిస్తూ, తన్మయమైన భావనను ఆ ప్రతిమలో
ప్రవేశింప జేయాలి.
ఆ ప్రతిమయందు ఆవిధంగా ఆహ్వానిస్తూ నన్ను స్థాపింపచేయాలి.
అటు తరువాత అంగన్యాస - కరన్యాసములతో ఆ ప్రతిమగా ఉన్న నన్ను పూజించాలి.
వింటున్నావా! మిత్రమా!
ఇప్పుడు మానసిక పూజ కూడా ఇట్లా కొనసాగించాలి.
ధర్మ-జ్ఞానాది-(జ్ఞానము-విజ్ఞానము-యోగము-ఉపాసన-సమర్పణ-దర్శనస్పర్శన-ధర్మము-భక్తి) నవవిధ శక్తులతోను నాకు స్వీయ హృదయంలో ఆసనం
కల్పించాలి.
ఆ ఆసనంపై కర్ణిక - కేసరములతో సముజ్వలమైన అష్టదళముల పద్మమును
కల్పించాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
318
ఆ అష్టదళ పద్మముపై సర్వాంతర్యామి - సర్వతత్త్వ స్వరూపుడనగు నన్ను వారివారి
|
ఇష్ట దైవరూపంగా ఆసీనుణ్ణి చేయాలి.
వేదోక్తములు తంత్రోక్తములు అయినట్టి వివిధ మంత్రములతో పాద్యము,
అర్ఘ్యము, ఆచమనీయము మొదలైనవి ఉపచారములను ఆ హృదయస్థ దేవ
దేవునికి సమర్పించాలి.
అలా పూజించిన తరువాత…, నా గురించిన భావనగా…
సుదర్శన చక్రమును,
పాంచజన్య శంఖమును,
|
గదను,
ఖడ్గమును,
బాణమునుII ,
ధనస్సును,
హలమును,
ముసలమును,
కౌస్తుభమాలను,
శ్రీవత్సమును
ఒక్కొక్కటిగా-స్థిరోభవ, వరదోభవ, సుస్థిరాసనం కురు,
మాకరుణాదృక్ ప్రసాదయ - మొదలైన మర్యాదపూర్వక వచన-భావనలతో
పూజించాలి.
ఆ పిమ్మట…,
ఎనిమిది దిక్కులలోను ప్రతిష్టేపించుచు…,
నందుడు : సునందుడు
ప్రచండు : చండుడు,
మహాబలుడు : బలుడు,
కుముదుడు : కుముదేక్షణుడు
అని పిలవబడే 8 పార్షదులను, (అష్టదికాన అధిపతులను) ఎదురుగా గరుడుని
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
319
పూజించాలి.
ఆ తరువాత…
నాలుగు కోణములందు
దుర్గాదేవి
వినాయకుని,
వ్యాసుని,
విష్వక్సేనుని
ఎడమవైపుగా…, గురువులను
తూర్పు ఇత్యాది దిక్కులలో… ఇంద్రుడు, వరుణుడు, వాయవు, యముడు ఇత్యాది
దేవతలను ప్రోక్షణము-పూలు-అక్షతలు.. ఇత్యాదులతో పూజించాలి.
“వీరందరూ కూడా తమతమ స్థానములయందు ఉండి నా యిష్టదేవతకు అభిముఖముగా
ఉన్నారు…, నాపై కరుణను ప్రసాదిస్తున్నారు”… అని భావన చేయాలి!
అటు తరువాత…., ఇష్టదైవమును ఉద్దేశ్యించి
సువర్ణమంత్రము - ఘర్మమంత్రముల ఉచ్ఛారణతో, “జితతే పుండరీకాక్ష”, సహస్ర
శీర్షా పురుషః మొదలైన పురుష సూక్తి ఇత్యాది మంత్రములను,
“ఇంద్రం నరో నేమధితా హవంత” మొదలైన మంత్రోక్తమైన రాజసాది
సామములను పఠిస్తూ…,
చందనము - వట్టివేరు - కర్పూరము - కుంకుమ - అగరు
మొదలైన ద్రవ్యములతో, సువాసితమైన జలముతో భగవత్ ప్రతిమకు స్నానం
చేయించాలి. పరిశుభ్రపరచాలి.
వస్త్రము - ఉపవీతము - ఆభరణము - పత్రరచన - తులసీమాల - పుష్పమాల
గంధము - అను లేపనము మొదలైనవాటిచే ప్రతిమను తగినవిధంగా అలంకరించాలి.
నేతితో బెల్లము పాయసము చేసిన పిండిపదార్ధాలు చక్కెలములు
ఆపూపములు- ఉండ్రాళ్ళు - పులిహోర పెరుగు - పప్పు మొదలైన పదార్ధములు
నాకు సమర్పించాలి. భగవత్ విగ్రహాన్ని రోజూగాని (లేదా) పర్వదినాలలో గాని
అభ్యంగన స్నానం చేయిస్తూ ఉండాలి.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
320
పరిశుభ్రపరచుకుంటూ ఉండాలి
|
రంగు-మెరుపు దగధగ్గాయమానంగా ఉండేటట్లు చూచుకోవాలి.
|
అభిషేక ద్రవ్యములు, భక్ష్య భోజ్యములు రుచికరమైనవి నైవేద్యంగా ఇస్తూ
ఉండాలి.
వేదములలో చెప్పినరీతిగా వేదికను వ్రేలాడే పూలు-ఆకులు-ఫలములతో
|
మందిరము చుట్టూ అలంకారం చేయాలి.
సమిధలను - వాటి యొక్క చివరలను ఒకచోటికి ప్రోగుచేసి - అగ్ని గుండమును
|
ప్రజ్వలింప చేయాలి!
నిప్పు కణముతో కూడిన సమిధలను (పుల్లలను) రెండు - మూడింటిని దర్భలపై
ఉంచటం అనే అన్వాధానకర్మను నిర్వర్తించాలి.
హోమమునకు ఉపయోగపడే ద్రవ్యములను అగ్నికి ఉత్తర దిక్కుగా ఒకానొక
వరుసగా ఉంచుకోవాలి.
ప్రోక్షణ పాత్రలో ఉన్న జలముతో హోమద్రవ్యమును, ప్రజ్వలితమైన అగ్నికి
సంప్రోక్షించి ఆ అగ్నియందు పరమాత్మయగు నన్ను ధ్యానించాలి.
అనగా…
తప్తకాంచన వర్ణము (మిలమిల మెరిసే బంగారుఛాయగలది),
చతుర్భుజములతో-చతుర్హస్తములతో శంఖ-చక్ర-గదా-పద్మములతో కూడియున్నది,
పరమప్రశాంతము,
పద్మమణివలె పచ్చనైన వస్త్రముతో శోభిల్లునది,
|
శోభాయమానముగా వెలుగొందుచున్న కిరీటము-కంకణము-కటిసూత్రమునూపురము మొదలైన ఆభరణములతో ప్రకాశించునది.
శ్రీవత్సముతో కూడిన వక్షస్థలము గలది.
ధగధగాయమానమగు కౌస్తుభమణిచే విరాజిల్లునది,
వనమాలచే విభూషితము.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
321
అగు నా రూపమును అగ్నియొక్క తేజస్సుతో ధ్యానించాలి. ధ్యానిస్తూ పూజించాలి.
ఆవిధంగా ధ్యానిస్తూ నేయిలో ముంచిన సమిధలను (పుల్లలను) అగ్నియందు ఆహుతి
చేయాలి. ఆ తరువాత రెండు-రెండు ఆహూతులతో హవనము చేయాలి. (నేయిని
ప్రజ్వరిల్లుతున్న సమిధలపై పోయాలి). ఆ రెండు ఆహూతులను 1. ఆఘారము 2.
ఆజ్యభాగము అను పేర్లతో చెప్పుతారు.
“ఓం నమో నారాయణాయ” అను అష్టాక్షరిని మొదలు - చివర ఉచ్ఛరిస్తూ హవనము
నిర్వర్తించాలి. ధర్మదేవతకు - తదితర దేవతలకు స్వాహా అను శబ్దముతో అంతమగు
మంత్రములతో నేయితో హవనము చేస్తూ పురుషసూక్త మంత్రములను గానం చేస్తూ
ఉండాలి.
శ్లో॥ అభ్యర్యాథ నమస్కృత్య పార్షదేభ్యో బలిం హరేత్
మూలమంత్రం జపేత్ బ్రహ్మన్ స్మరన్ నారాయణాత్మకమ్ || (అధ్యా 27, శ్లో 42)
ఆ తరువాత అగ్నియందు వేంచేసియున్న భగవానునిపూజించి, నమస్కరించి పాలుతేనె-పళ్ళరసం ఇత్యాదుల నివేదనలను - బలిని సమర్పించాలి. నారాయణ స్వరూపమగు
పరబ్రహ్మమును స్మరించి యథాశక్తిగా “ఓం నమో నారాణాయ” అను మూల
మంత్రమును (11మార్లు :: 21 మార్లు :: 36 మార్లు :: 54మారు :: 108 మార్లు …
ఇట్లా అవకాశాన్ని అనుసరించి) జపించాలి.
శ్లో॥దత్త్వా 2 చమనం ఉచ్ఛేషం విష్వక్సేనాయ కల్పయేత్
ముఖవాసం సురభిమత్ తాంబూలాద్యమథార్హయేత్ || (అధ్యా 27, శ్లో 43)
ఆ తరువాత నివేదనానంతరం మిగిలియున్న కొన్ని మధుర పదార్ధములను విష్వక్సేనునికి
సమర్పించాలి. సుగంధయుక్తమైనటువంటి తాంబూలమును ప్రతిగృహ్యతామ్… అని
పలుకుతూ ప్రేమతో సమర్పించాలి.
శ్లో॥ ఉపగాయన్ గృణన్ నృత్యన్ కర్మాణి-అభినయన్ మమ
మత్కథాః శ్రావయన్ - శృణ్వన్ ముహూర్తం క్షణికో భవేత్॥ (అధ్యా 27, శ్లో 44)
పూజ అయిన తరువాత
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
322
పరమాత్మయొక్క అవతారములు - భక్తుల కథలు గానం చేస్తూ
పరమాత్మయొక్క మహిమను కీర్తిస్తూ,
ఇతరులకు ఆ కథలను వినిపిస్తూ, తాను స్వయముగా (ఇతరులు చెప్పుచుండగా)
వినుచూ,
నా కర్మలను (చిన్ని కృష్ణుని ఆట-పాట-అల్లరి.. ఇత్యాదులను) అభినయిస్తూ,
“ధీంత ధీంత తకతధీంత - తకత ఝణుత తక్కిటతక - తరికిటతక తళాంగు
తద్ధిత్తకిటతకతరికిటతోం” - ఇటువంటి నృత్య శబ్దములకు లయగా నృత్యం చేస్తూ…
కొద్ది సమయము ఈఈ రీతి అయిన ఉత్సవపూర్వక ఉపాసనలు నిర్వర్తించాలి.
శ్లో॥ సవైరుచ్ఛావచైః స్తోత్రైః పౌరాణైః ప్రాకృతైరపి
స్తుత్వా ప్రసీద భగవన్ ఇతి వందేత దండవత్ II (అధ్యా 27, శ్లో 45)
ప్రాచీనులచేత (Ancestral and Traditional)- నవీనులచే (Present time) గానం
చేయబడిన ఉత్కృష్ట-అపకృష్టమగు (సంగీత-జానపద) - రాగములతో కూడిన
స్తోత్రములతో నన్ను స్తుతిస్తూ… “దేవా! దేవాదిదేవా! ప్రసన్నుడవు అగుము” అని ప్రార్థించి
సాష్టాంగదండ ప్రణామములు చేయాలి!
శ్లో॥ శిరో మత్పాదయోః కృత్వా బాహుఖ్యాం చ పరస్పరమ్
ప్రసన్నం పాహి మామీశ భీతం మృత్యు గ్రహార్ణవాత్ || (అధ్యా 27, శ్లో 46
నాయొక్క పాదయుగళమునందు శిరస్సును - నుదురును స్పర్శింపజేస్తూ చేతులతోను
నా రెండు పాదములను స్పృశిస్తూ….,
“హే పరంధామా! దీనజనబంధూ! ఆర్తత్రాణ పరాయణా! నేను భీతుడను. నీకు
శరణాగతుడను. అతి భయంకరము-మృత్యువుతో సమానము అగు సంసార
సముద్రములో పడి మునిగిపోతున్న నన్ను కాపాడండి! ఉద్దరించండి!” - అని ఎలుగెత్తి
గానం చేస్తూ నమస్కరించాలి.
ఆవిధంగా ప్రార్ధన చేస్తూనే నా నిర్మాల్యమును - అక్షితలను భక్తితో ప్రసాదభావనా
పూర్వకంగా శిరస్సుపై ధరించాలి. వాటిని వదల దలచుకొంటే ప్రతిమయందు
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
323
అథ్యస్తమైయున్న జ్యోతిని మరల మరల తన హృదయమందు వేంచేసియున్న జ్యోతియందు
లీనం చేస్తూ పూజించబడిన శిరోధార్యమైన పుష్పాక్షతలను హృదయముపై స్పృశింపజేసి
ఒక పళ్లెములో విడవాలి!
శ్రీ ఉద్ధవుడు : స్వామీ! శ్రీకృష్ణ ప్రతిమ ఎట్లా ఏ రీతిగా ఉంటే… అది ప్రాసస్త్యం? ఏఏ
దేవతా ప్రతిమలంటే నీకు ఇష్టం?
శ్రీకృష్ణుడు : (పకపక నవ్వుచూ) ఓ ఉద్ధవా! నా భక్తునికి ఏది ఇష్టమైతే అదే నాకూ ఓ
ఇష్టము. ఎప్పుడు ఎవరికి ఏ ప్రతిమయందు ఇష్టము కలుగుతుందో… అప్పుడు ఆ
రూపముగల ప్రతిమతో నన్ను పూజించవచ్చు! ఎందుచేతనంటే, నేను…
సర్వాంతర్యామినై - సర్వభూతములందు ఆత్మస్థుడనై, సర్వభూతజాలము అస్మదాత్మ
యందు వేంచేసియే ఉండగా… సర్వప్రకాశకుడను (one who is exhibiting and
manifesting as every thing) అయి ఉన్నాను కదయ్యా!
నాపై భక్తి-ప్రపత్తులచే కొందరు నా పూజ-ధ్యానము మొదలైనవాటికై మందిరములు
నిర్మిస్తున్నారు. సుందరమైన ఉద్యానవనములను నిర్మిస్తున్నారు. పూజాదులు చక్కగా
నిర్వహింపబడటానికి భూమిని, సంపదను సమర్పణ చేస్తున్నారు. నాకు సమర్పించబడిన
సంపద ద్విగుణీకృతమై ఆ ప్రదాతయొక్క ఇహ-పరములను పవిత్రము-ఐశ్వర్యమయము
చేయగలవు.
శ్లో॥ ప్రతిష్ఠయా సార్వభౌమం
సద్మనా భువన త్రయం
పూజాదినా బ్రహ్మలోకం
త్రిభిర్మత్సామ్యతామి యాత్ II (అధ్యా 27, శ్లో 52)
విగ్రహ ప్రతిష్ఠచేత - సార్వభౌమ పదవి,
మందిర నిర్మాణంచేత - త్రిలోకాధిపత్యము,
పూజచే బ్రహ్మలోకము,
ఈ మూడింటిచే నాతో సమానత్వము లభించగలదు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
324
శ్రీరామ మానసిక పూజ
శ్రీరామ జయరామ - శ్రీకర శృంగార రామ
మా రామ రఘురామ మానస పూజలను గొనుమ శ్రీరామ ॥
అఖిలాంబర ముని నాయక ఆవాహనమిదో మీకు
—
అఖిలలోక రక్షకా సింహాసన మిదోమీకు
పాతక సంహరణ మీకు - పాద్యమిదో పాదములకు
అంతరాత్మ అమరవంద్య - అర్ఘ్యమిదో హస్తములకు
సతతదీనమందార - స్నానమునకు జలంబిదిగో
వ్రతఫల సంధానశీల - వస్త్రయుగ్మ మిదో మీకు
యదుకులావతార ధీర - యజ్ఞోపవీత మిదిగొమీకు
చతురానన జనకదేవ చందనం బిదోమీకు
పూతచరిత పురుషోత్తమ - పుష్పధామ మిదోమీకు
అతి దయకర పతితపావన అగరుధూప మిదోమీకు
కరుణాకర సుగుణధామ - కర్పూరదీప మిదోమీకు
నరమృగావతార ధీర - నైవేద్యం బిదోమీకు
దారుణదారిద్ర్య హరణ తాంబూలము స్వీకరించు
నీరజాసనాది వినుత నీరాంజన మిదోమీకు
మారకోటి సుందరాంగ - మంత్రపుష్ప మిదో మీకు
పరమపురుష రామచంద్ర - ప్రదక్షిణం బిదోమీకు
శ్యామసుందర షోడషోపచారములను స్వీకరించు
కామేశ్వరదాస వరద -కరుణతోడ కైవల్యమొసగు ॥
శ్రీరామ జయరామ - శ్రీకర శృంగార రామ
మారామ రఘురామ - మాసపూజలను గొనుమ ॥
(A Song sung by Sri Sri Kameswara Dasu)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
325
చూచావా ఉద్ధవా!
నిష్కామ భక్తియోగంతో నన్ను అర్చించేవాడు నన్నే పొందుచున్నాడు. పూజ మందిర
నిర్మాణము విగ్రహ ప్రతిష్ఠలచే భక్తియోగము ప్రవృద్ధమౌతోంది.
నేను సదా భక్త సులభుడను.
తనచే ఇవ్వబడినదిగాని పరులచే ఇవ్వబడినదిగాని… అయినట్టి దేవాలయపు
సొమ్ములను హరించువాడు, బ్రాహ్మణ విత్తము హరించువాడు - కోట్లాది సంవత్సరాలు
మలమును భక్షించే క్రిమి కీటకముల జన్మలు ఎత్తవలసి వస్తుంది సుమా! ఆవిధంగా
అపహరించు వాడే కాదు! అతనికి సహకరించువాడు, ప్రేరేపించువాడు, ఆమోదించువాడు
కూడా తనకు తానే అల్పజన్మలకు ఎర అగుచున్నాడు.
నా భక్తులను, సాత్వికులను భాధించువాడు అల్పజన్మల రూపంగా నాచే శిక్షించ
బడటానికి అర్హుడగుచున్నాడు.
నా భక్తులను సేవించువారు, వారికి సహకరించువారు, వారికి తనకున్న సంపదలో
కొంత భాగము సమర్పించువారును నాకు ప్రియతములగుచున్నారు.
అధ్యాయము–42.) యోగాభ్యాసోపాయాలు
|
శ్రీకృష్ణుడు :
శ్లో॥ పర స్వభావ - కర్మాణి న ప్రశంసేత్ న గర్హ్వయేత్
విశ్వమ్ ఏకాత్మకం పశ్యన్ ప్రకృత్యా పురుషేణ చ ॥ (అధ్యా 28, శ్లో 1)
ఓ ఉద్ధవా! ఎదురుగా ఇంద్రియములకు తారసబడే దృశ్య ప్రపంచము, ఈ కనబడే
విశ్వము ఇదంతా కూడా -నిత్యము-అప్రమేయము-కేవలము-సత్-చిత్,
ఆనందస్వరూపము అగు అఖండ - ఏకాత్మ యొక్క పురుష-ప్రకృతుల (Experience -
experiences - perceiver - perception) కల్పనా సంయోగమే.
“ఈ కనబడే విశ్వ దృశ్యమంతా - ఇందులోని కాలాంతర్గత సంగతి-సంబంధముసందర్భము-వ్యవహారములు, వాటి యొక్క స్థితి గతి-నిర్గతులతో సహా
అంతర్యామియగు పరమాత్మచే నిర్దేశితమైనదే కదా! శివాజ్ఞయే కదా!” అని
గమనించినవాడు - గ్రహించినవాడు - అర్ధము చేసుకొన్నవాడు … దీనినంతా మౌనంగా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
326
అతీతుడై హాయిగా చూస్తూ ఉంటాడు. ఇక్కడి శాంతము ఘోరము మొదలైన
స్వభావములను, వ్యక్తులను, సంఘటనలను చూస్తూ కూడా ఎవ్వరినీ - దేనినీ
ప్రశంసించడు. నిందించడు! ఎవ్వడైతే ఇక్కడి స్వభావములను, కర్మవ్యవహారములను,
సంఘటన సందర్భములను
ప్రశంసిస్తూనో…,
వారిని - వీరినీ నిందిస్తూనో…
రోజులన్నీ గడిపివేస్తూ ఉంటాడో… అట్టివాడు అధ్యాత్మ శాస్త్ర పండితులచే - “ఈతడు
అసత్యమునందు అభినివేశము కలిగియున్నవాడు” - అని చెప్పబడుచున్నాడు.
కధ చదువుతూ పాత్రల సంబంధ - కష్ట సుఖములను చూచి ఆ పాఠకుడు సుఖమోదుఃఖమో పొందటమేమిటి?
కలలో కనబడిన అద్దాలమేడ మెళుకువ వచ్చిన తరువాత “అయ్యో! లేదే? ఏమైయ్యింది?
పోయిందా?” అని దుఃఖము - వేదన పొందటం ఎటువంటిది?
ఈ దృశ్య సంఘటనల గురించి ప్రశంసించటం, నిందించటం ఆత్మజ్ఞుల దృష్టిలో
అటువంటిది!
ఎవ్వడైతే దేహ-గృహ-సంగతి-సంఘటనలపట్ల ఆసక్తిని పెంపొందించుకుంటూ రోజులు
గడుపుచున్నాడో ఆతడు ఆత్మద్రోహి - ఇంద్రియములకు వశుడు-తెలివితక్కువగా తనకు
తానే అగుచున్నాడు. ఆతడు స్వఅర్ధము- సత్యములనుండి భ్రష్టుడగుచున్నాడు.
జాగ్రత్లో ఉత్సాహంగా ప్రవర్తిస్తూ దృశ్యానుభవముల వెంటబడుచున్న ఇంద్రియములు
రోజులో కొంత సమయంలో నిద్రాణమగుచున్నాయి. అప్పుడు తైజసానుభవం
(స్వప్నావస్థ) పొందుచున్న శరీరస్థుడగు జీవుడు స్వప్నరూపమగు మాయను తన
హృదయమునందే కల్పించుకొని అనుభవిస్తున్నాడు. స్వప్నంలో కనిపించేదీ భ్రాంతియే!
ఆ తరువాత స్వప్న మనస్సు కూడా లయంకాగా… అప్పుడు సుషుప్త్యస్థితి మృత్యువుతో
(మృతానుభవముతో) సమానమే కదా! సుషుప్తిలో మౌనము-నిర్విషయము-అలౌకికము
అగు నిర్విషయ వృత్తిని ఆస్వాదిస్తున్న ఈ ద్రష్ట (లేక) జీవాత్మ తిరిగి ఎప్పుడో మెళుకవవచ్చి
జాగృత్లో ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి ఊరుకుంటున్నాడా? లేదు.
ద్వంద్వాభినివేశి అయి,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
327
జాగృత్ దృశ్యములో సుఖదుఃఖములు, నిందా- ప్రశంసలు… దృశ్య-ద్రష్టత్వములు,
|
మంచి-చెడ్డ, బంధము-ముక్తి మొదలైనవన్నీ ఒక్కసారిగా పొందినవాడై మరల
స్వప్నదశ పొందేకొరకు జాగృత్లోనే అనుభవపరంపరలు కొనసాగిస్తున్నాడు.
ఇదినాది. ఎవ్వరినీ రానివ్వను.
వారు మంచివారు. వీరు చెడ్డవారు.
వారు నావారు. వీరు కాదు.
నావారి చెడుకూడా మంచియే!
పరాయివారి మంచి కూడా చెడ్డయే!
ఇట్లా ఉంటున్నాయి, ఆతని స్వకల్పనా పరంపరలు! సుషుప్తిలో మౌనమువహించి
అప్రదర్శితంగా వున్నట్టి ఇవన్నీ- జాగ్రత్లో మరల నిద్ర లేస్తున్నాయి. వాస్తవానికి
ద్వైతముగా కనిపించేదంతా కూడా విక్షేపముచే అనుభవమయ్యే మిధ్యయే! - జాగ్రత్లో
అయినా, స్వప్నంలో అయినా!
శ్లో॥కిం భద్రం కిమ్ అభద్రం వా? ద్వైతస్య అవస్తునః కియత్? ’
వాచోదితం తదనృతం మనసా ధ్యాతమేవ చ ॥ (అధ్యా 28, శ్లో 4)
ఇక్కడ వేరువేరుగా ద్వితీయముగా (రెండవదిగా) కనిపించే ద్వైతము మొదలే కలలో
కనిపించిన రెండస్తుల అద్దాలమేడ వలె అవస్తువు అయి ఉన్నది. ఇలలో కనిపించేదంతా
కలలోని చమత్కారమువంటిదే? ఇక ఇక్కడ భద్రమేమిటి? అభద్రమేమిటి? ఏది మంచి?
ఏది చెడు? అటువంటి ప్రసక్తి మొదలే లేదు.
“కలలో కనిపించిన ఆతడు అట్లా ఎందుకున్నాడు? అదే కలలోని ఈతడు ఇట్లా
ఎందుకున్నాడు?” అనే ప్రశ్న-దాని సమాధానాలు… ఏముంటాయి? బంగారు
ఆభరణంలో ఆభరణము అనే బంగారమునకు వేరైన - వస్తువేదైనా ఉన్నదా?
ఇక్కడ మాటలలో ఏభేద దృష్టులు చెన్నొందుచున్నాయో అవన్నీ - అదంతా వాక్
ఆడంబరము (కథలోని మహారాజు తెలివిగల మంత్రివలె)… మాత్రమే! అనగనగా
ఒక రాజు అని ఏదో కథ గురించి అనుకోగా అనుకోగా… చెప్పుకోగా-చెప్పుకోగా ఆ
పాత్రలు-స్వభావాలు ఉన్నట్లే జనులు భావించి… అందులోని ధర్మ-అధర్మాల గురించి
వాదోప వాదములులు చేసుకోవటం వంటిది!
ఓ మిత్రమా! ఉద్ధవా! ఇక్కడ మనస్సుచేత చింతింపబడుచు, ఫలితంగా వాక్కుచేత
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
328
మాట్లాడబడుచున్నదంతా కూడా మిధ్యాభూతమే (Experience out of illusion) అయి
ఉన్నదయ్యా!
ఒకానొకాయన తెల్లటి గోడను చూస్తూ ఉండగా తన ఛాయ (Reflection of
own form because of light from behind) కనబడితే దానిని చూచి “వీడెవ్వడో
నావెంటబడ్డాడురోయ్…” అని అరవడం ఎటువంటిది?
ఒకడు ఒక గుహలో ప్రవేశించి “ఓయ్” అని ధ్వనిచేయగానే “ఓయ్ ఓయ్
ఓయ్” అని ప్రతిధ్వనిస్తూ ఉంటే “ఆఁ! ఎవ్వడో ఈ గుహలో ఉండి నాతో
మాటకు మాట అని నన్ను ఎగతాళి చేస్తున్నాడురా?…” అని అనుకోవడం
ఎటువంటి చమత్కారం?
ఒక ముత్యపు చిప్పను చూచి, “అబ్బో! ఇందులో వెండి ఉన్నదిరా?..” అని
అనుకోవటం, ఇంటికి తీసుకువెళ్ళి కరిగించటం ఆరంభించటం ఏతీరైనది?
అవన్నీ మిధ్యయేకదా! మిధ్యయే అయి ఉండికూడా అవి భయము-మోహము- కోపముఆవేశము-విస్మయము (అజ్ఞానికి-విషయమేమిటో తెలియనివానికి) కలిగిస్తున్నాయి కదా?
అట్లాగే…,
ఈ భౌతిక దేహము మొదలైనవన్నీ మిధ్యావస్తువులే అయినప్పటికీ కూడా, ఈ జీవునికి
ముక్తి కలిగేవరకు భయము-మోహము-విస్మయము మొదలైన సంసార సంరంభమును,
సంసారానుభవములను కలుగజేస్తూ పోతున్నాయి.
శ్లో॥ ఆత్మైవ తదిదం విశ్వం సృజ్యతే సృజతి ప్రభుః
త్రాయతే త్రాతి విశ్వాత్మా ప్రియతే హరతీశ్వరః ॥ (అధ్యా 28, శ్లో 6)
పరమాత్మ ఈ విశ్వమునకు ప్రభువు, ఈ విశ్వమునకు ఆత్మ (విశ్వాత్ముడు) కూడా!
అట్టి పరమాత్మ ఆత్మకు అభిన్నమైనటువంటి ఈ విశ్వమును సృష్టించుచున్నాడు. కర్తభోక్త-క్రియ-క్రియా విషయం కూడా ఆత్మయే! అనగా ఈ విశ్వము ఆత్మస్వరూపము
ఆత్మయొక్క విన్యాసము కూడా! విశ్వమునకు అభిన్నమైన విశ్వేశ్వరుడు…
సృష్టించుచున్నాడు. స్వయముగా సృష్టిరూపుడు అగుచున్నాడు. అనగా
సృష్టించబడుచున్నాడు కూడా!
భావనలు రచిస్తున్నాడు. భావనలలో చిక్కుకుని వుంటున్నాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
329
రక్షిస్తున్నాడు. రక్షింపబడుచున్నాడు కూడా!
ఇదంతా ఆస్వాదిస్తున్నాడు. ఆస్వాదించబడుచున్నాడు!
భ్రమిస్తున్నాడు - భ్రమింపజేస్తున్నాడు కూడా!
దీనిని హరిస్తున్నాడు. హరింపబడుచున్నాడు కూడా!
పునఃగా కల్పిస్తున్నాడు-కల్పన చేయబడుచున్నాడు.
ఈ విధంగా,
ఈ కనబడే సృష్టి అంతా ఇందులోని విషయాలు సందర్భాలు మొదలైనవి
స్వతంత్రములైనవి కావు. అనగా అవన్నీ పరమాత్మకు వేరైనవి కావు. పరమాత్మయొక్క
స్వయంకల్పిత భావనాతరంగ విన్యాసములే! అట్టి ఆత్మపట్ల (లేక జీవాత్మపట్ల) ఆధ్యాత్మిక
ఆధిభౌతిక ఆధి దైవికమైన జ్ఞానమంతా - స్వప్నంలో ఒకానొకడు ప్రదర్శించే
తెలివితేటలు (జ్ఞానవైశిష్ట్యము వలె) భ్రమరూపము - భ్రాంతియుక్తమేనయ్యా!
ఇదంతా త్రిగుణాత్మకమైనదేనని, త్రిగుణాత్మకమైనదంతా మాయయేనని గమనించు.
మాయకు యజమానియో… జీవాత్మ స్వరూపుడై, క్రీడగా-లీలగా ప్రదర్శితుడు అగుచున్న
పరమాత్మయే! నేనే! ఈ సర్వ జీవాత్మలు వారివారి అనేకరూపములైన
దృష్టులు - ఇదంతా నాయొక్క ఒకనానొక అంశావిశేషమే!
ఎవ్వడైతే నేను ఉపదేశిస్తున్న ఈ జ్ఞాన విజ్ఞానయుక్తమైన వాక్యములను
అన్వయించుకుంటూ స్వస్వరూపం-తన సహజరూపం గురించి తెలుసుకుంటాడో…
ఇక ఆతడు ఎవ్వరినీ నిందించడు. స్థుతించడు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ
తాను సర్వమును ప్రకాశింపజేస్తున్న లోకాలన్నిటికీ అతీతుడై, నిర్లిప్తుడై- అప్రమేయుడైకేవలసాక్షి అయి చూస్తూ ఉంటాడు కదా! ఆత్మ తత్త్వముగా ఎరిగినవాడు సూర్యునివలె
ఆరీతిగా సమభావసంపన్నుడై మెలగుతూ ఉంటాడు! ఇక్కడి విషయాల మధ్య ఉంటూనే
వీటికి అతీతుడై, కేవలసాక్షియై, మౌని అయి ఉంటాడు!
ఓ ఉద్దవా! ప్రత్యక్షము-అనుమానముల సహాయంలో “ఆత్మౌపమ్యేవ సర్వత్రా” అను
ఆత్మానుభూతి సహాయం చేతను, శాస్త్రములు చెప్పే వివరణను చెవులతో విని బుద్ధితో
గ్రహించుట చేతను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
330
ఈ జగత్తు మిధ్యమాత్రమే!
ఇదంతా ఉత్పత్తి-వినాశన శీలము!
మనోనుకూలము (అనగా మనస్సు ఏరీతిగా ఉంటే, ఇది, అట్లే
అనుభవమౌతుంది.
కాబట్టి ఇది ఇట్టిది అని ఏమీ చెప్పలేము అనిర్దేశ్యము…
అని గ్రహించిన విజ్ఞుడు నిస్సంగుడై-నిస్సంకోచుడై ఈ జగత్తులో వ్యవహరిస్తున్నాడు.
లీలా వినోదంగా ఆస్వాదిస్తున్నాడు. నేను చూస్తున్నది (జగత్) నాటకమే! అని
గ్రహించి ఉన్నవాడు, “నాటకములోని సంఘటనలకు పాత్రధారుడు - చూచేవాడు
కూడా అగు నేను సుఖదుఃఖాదులు పొందవలసిన అగత్యమేమున్నది?….” అని
గమనిస్తున్నాడు. అజ్ఞులను ప్రశ్నిస్తున్నాడు.
అధ్యాయము–43.) సుఖ దుఃఖాలు ఎవరికి? ఎవరివి?
|
శ్రీ ఉద్ధవుడు : ప్రియ స్వస్వరూపాత్మ చైతన్య స్వరూపా! అవతారమూర్తీ! శ్రీకృష్ణయ్యా!
నీవు కొంత వివరించి యున్నప్పటికీ మరల అదే ప్రశ్న ఒకటి నిన్ను అడగాలనిపిస్తోంది!
ఆత్మ-దేహముల కలయికచేతనే కదా. జీవుడు అనబడేది ప్రదర్శితం అగుచున్నది?
అనగా, ద్రష్ట-దృశ్యములను ఆత్మస్వరూపుడగు జీవుడు పొందుచుండటం ఇక్కడ
జరగుతోంది కదా! ఇప్పుడు చెప్పండి? సుఖ దుఃఖాలు ఎవరికి? ఎవరివి? ఎవరివలన?
ఎందుకు? ఆత్మకా? దేహమునకా? అనుభవములగుచున్నాయి కాబట్టి ఉన్నట్లా? భ్రమ
వంటివి కాబట్టి లేనట్లా?
ఈ ద్రష్ట - దర్శనముల చమత్కారము ఆత్మకు సంబంధించినదా? దేహానికి
సంబంధించినదా? జీవుడు అనబడువానికి సంబంధించినదా? జగత్తుకు
సంబంధించినదా? ఈశ్వరునిదా?
శ్లో॥ నైవాత్మనో న దేహస్య సంస్కృతిః ద్రష్ణుృ - దృశ్యయోః
అనాత్మస్వదృశోరీశ కస్యస్యాదుపలభ్యతే?
శ్లో||॥ ఆత్మా అవ్యయో అగుణః శుద్ధః స్వయంజ్యోతిరనావృతః
అగ్నివత్ దారువదచిద్దేహః కస్య ఇహ సంస్కృతిః? (అధ్యా 28, శ్లో 10, 11)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
331
ఆత్మ స్వతఃసిద్ధంగానే జ్ఞాన సంపన్నము. అవినాశనము. అవ్యయము (మార్పు చేర్పులు
లేనిది). గుణాతీతము. శుద్ధము. అగ్నివలె స్వయంప్రకాశము. ఆవరణశూన్యము
(దేనిచేతా ఆవరించబడేది కాదు. అందుచేత - సుఖ దుఃఖాలు ఆత్మకు కలుగుచున్నాయి
అని, (లేక) సుఖ దుఃఖాలు ఆత్మవి… అని అనటానికే వీలే లేదు. ఆత్మ సర్వదా
అప్రమేయమే కదా!
ఇక ఈ భౌతిక దేహానికి వచ్చి పరిశీలిస్తే? ఈ దేహము జడము. స్వతఃగా కదలలేదు.
ఆత్మ స్వరూపుడగు దేహియొక్క చైతన్య విన్యాసముచే మాత్రమే కదులుతోంది. ఒక
కట్టెవలె జడమైనది. కనుక సుఖ-దుఃఖములు జడదేహమునకు కలుగుచున్నాయని
గాని, సంబంధించినవనిగాని అనలేము. ఆత్మ కదలించునది. దేహము కదలునది.
సుఖ-దుఃఖాది అనుభవాలు ఈ రెండిటిలో దేనివి? దేనికియు లేక, ఈ రెండుకాక,
సుఖ దుఃఖాలకు సొంతదారు మరొకటేదైనా వున్నదా?
శ్రీ కృష్ణభగవానుడు : ఈ ప్రశ్న మరొక్కసారి నీవు అడగటం ఉచితమే! సందేహాలు
పూర్తిగా తొలగాలి కదా! విను!
శ్లో॥ యావత్ దేహ-ఇంద్రియ-ప్రాణైః ఆత్మనః సంనికర్షణమ్
సంసారః ఫలవాం తావత్ అపార్థోపి అవివేకినః II (అధ్యా 28, శ్లో 12)
ఓ ఉద్దవా! ఆత్మకు దేహ-ఇంద్రియ-ప్రాణములతో ఎంతెంతవరకైతే సంబంధము
ఉంటుందో… అంతంత వరకు అవివేకులైన పురుషులకు మిధ్యాభూతమైన ఈ
ప్రపంచము “సత్యమే కదా!” అనువిధంగా స్ఫురిస్తూ ఉంటుంది! అట్లు అనిపించటమే
సంసారము అను శబ్దముచే చెప్పబడుతోంది.
వివేకముచేతనో, “ఈ ప్రపంచము స్వప్నసదృశమే! మిధ్యయే! …” అని తెలియవస్తోంది.
అప్పుడిక సంసారము అని చెప్పబడే దానియొక్క ఊసైనా ఉండదు!
ఒకాయన సుష్ఠుగా తిని, తాంబూలం సేవించి హాయిగా నిద్రకు ఉపక్రమించాడు.
నిద్రలో ఏదో స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఆతడు బాటలో వెళ్ళుచుండగా ఒక
పులి- ఒక విషసర్పము, వెంటబడ్డాయి. ఇక ఆ పెద్ద మనిషి భయగ్రస్తుడై కేకలు
వేస్తూ… పరుగులు తీయసాగాడు.
ఇప్పుడు చెప్పు! ఆతనికి అంతటి భయము ఎందుకు కలిగింది? ఎవరివలన కలిగింది?
బయటనుండి ఎవ్వరైనా ఆతనిమీద కోపంతో ఆతని స్వప్నములోనికి పులినిశ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
332
విషసర్పమును తీసుకొచ్చి పెట్టారా? లేదే? మరి? ఆ స్వప్న ద్రష్టయొక్క స్వప్నభావన
చేతనే పులి-విషసర్పము కల్పించబడ్డాయి. స్వప్న భావన చేతనే ఆతడు వాటిని చూచి
భయపడుచు గజ గజ వణుకుచు (స్వప్నంలోనే) బాటలలో పరుగులు తీస్తున్నాడు!
అంతాకూడా స్వయంకృతమే! మరింకెవరికీ పాత్రయే లేదు. మెళుకువ వచ్చిన తరువాతనో
“పులి లేదు. విషనాగు లేదు! అంతా నా ఊహయే! భ్రమయే! నాయొక్క కల్పనయే!…”
అని ఆతడు ఎవ్వరూ చెప్పకుండానే తెలుసుకుంటున్నాడా, లేదా? లేక, “ఓ మిత్రులారా!
నా కలలోకి పాము వచ్చింది! చంపుదాం రండి!…” అని (నిదురలేచిన తరువాత)
పిలుస్తున్నాడా? లేదే!
అట్లాగే…,
కలలో కనబడిన పులి-పాము మిధ్యయే అయినప్పటికీ చూడటం వలన ఏర్పడిన
కలలోని భయంలాగానే…, స్వకీయ భ్రమ-కల్పనలచేత ఆశ్రయించబడిన విషయచింతన
యందు వ్యాకులత చెందినట్టి (లేక) పొందినట్టి ఆత్మకు మిధ్యామాత్రము (Merely
illusion / ideation/ own Mind - Making) అయిన సంసారము - వాస్తవానికి మిధ్యయే
అయి ఉండి కూడా - అవివేకమువలన సత్యమువలె స్ఫురించటం జరుగుతోంది!
కలగంటున్నవానికి కలలో ఎన్నో అనర్ధమైన-అర్ధరహితమైన స్వప్నదృశ్య పదార్ధాలు
కనిపించవచ్చు గాక! మేలుకొన్న తరువాత కలలో కనిపించినవి మోహమును
కలుగజేయలేవు కదా? నిద్ర లేచిన తరువాత “కలలో కనిపించిన నా భవనము ఏమైనది?”
అని ఎవ్వడైనా జాగ్రత్లో వెతుకుతాడా? జ్ఞానము అనే మెలుకవ తెచ్చుకొన్నవానికి
దృశ్య మోహము అనే జాడ్యము ఉండదు! “ఈ లోకాలేమిటి? నేనేమిటి? వారేమిటి?
వీరేమిటి” - అనే ప్రశ్నలే ప్రశ్నించటానికి అనర్హమౌతున్నాయి.
ఆత్మ ఒకానొకప్పుడు అనిర్వచనీయ కారణంగా అహంకారము అనే ద్వైతము
(ద్వితీయత్వము)ను ఆశ్రయిస్తోంది. అది లీల - క్రీడ (సరదా) అని అనవచ్చునేమో!
అహంకార కారణంగా దేహాభిమానము అను కార్యము రూపు దిద్దుకుంటోంది.
అట్టి అహంకారము, దేహాభిమానము యొక్క క్రియావిశేషాలే శోకము - హర్షముభయము-క్రోధము-లోభము-మోహము-స్పృహ-జననము-మరణము….
ఇత్యాదులన్నీ కూడా! అనగా… అవన్నీ అహంకార కార్యములు! దేహాభిమాన కార్యములు.
ఆత్మకు వాటితో సంబంధము లేదు. జడమగు దేహానికీ వాటితో సంబంధము లేదు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
333
దేహాదుల అభిమాని
శ్లో॥ దేహేంద్రియ ప్రాణమనో అభిమానో
జీవో అంతరాత్మా గుణకర్మ మూర్తిః
సూత్రం మహానిత్యురుధేవగీతః
సంసార ఆధావతి కాల తంత్రః || (అధ్యా 28, శ్లో 16)
ఈ జీవుడు వాస్తవానికి అంతరాత్మానంద స్వరూపుడే! గుణ-కర్మలకు యజమానియే
గాని బద్ధుడు కాడు. సూత్రాత్మ స్వరూపుడు! (అనేక పూలతో గ్రుచ్చబడిన పూదండలోని
దారమువంటి స్వరూపుడు) నిత్య-సత్య-బుద్ధాత్ముడే! ఎందుకంటే- ఈ జీవుని
సహజస్వరూపము సర్వదా అప్రమేయమగు ఆత్మయే! అయితే ఏ జీవుడైతే తన
సహజానంద రూపమును ఏమరచి దేహాభిమాని - మొదలైనవి అగుచున్నాడో…, ఆ
అభిమానమే ఇవన్నీ పొందుతోంది!
దేహాభిమాని భౌతిక దేహము నాకు అవినాభావ సంబంధము ఉన్నది అని
తలచువాడు.
కనిపించేవి - వినిపించేవి ఇంద్రియాభిమాని - తదితర శబ్ద-స్పర్శ రూప-రసగంధాదుల పట్ల “నావే! నాకు కావాలి నేను వీటికి
చెందినవాడను. ఇవి నాకు చెందినవి” అని భావించువాడు.
ప్రాణాభిమాని - ప్రాణములకు (శక్తికి) సంబంధిచిన వాడను. ప్రాణములుంటేనే
నేను. లేకుంటే లేను… అని ప్రాణములతో అవినాభావావేశము
పెంపొందించుకొని ఉంటున్నవాడు. “ప్రాణాలు పోతే నేనూ
పోతాను…” అని ఉద్వేగాభిప్రాయము కలిగి వుంటున్నాడు.
మనో అభిమాని మనస్సుయొక్క ప్రియాప్రియత్వము-చంచలత్వము మొదలైన -
లక్షణములు తనకు సంబంధించినవిగా భావించువాడు.
మనస్సులో చేరుచున్న అనుభూతులు, అభిమానాలు, సుఖదుఃఖ
భావాలు తన స్వరూప స్వభావాలుగా భావించువాడు.
అట్టి దేహ - ఇంద్రియ - ప్రాణ - మనో అభిమాని మహాసూత్ర నరకము చేరుచున్నాడని
చెప్పబడుచున్నాడు. అనగా కాలమునకు అధీనుడై అజ్ఞానముచేత సంసారారణ్యములో
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
334
తిరుగాడుచు దేహ-మనో బుద్ధి-చిత్త- లక్షణాలను అప్రమేయమగు ఆత్మపై ఆపాదిస్తూ
తత్ఫలితంగా అనేక ఉపాధిపరంపరలు పొందుచు-విడచుచు తన్మయుడౌచున్నాడు.
శ్రీ ఉద్ధవుడు : కృష్ణయ్యా! మీరు చెప్పే అహంకారము - సంసారము అనువాటియొక్క
వాస్తవ స్వరూపమేమిటి? అవి ఎట్లా, ఎందుచేత ఎప్పటి నుండి ఏర్పడినవై ఉంటున్నాయి?
ఎందుకు ఆత్మానంద స్వరూపుడగు ఈ జీవుని తమవైపు ఆకర్షించి నిబద్ధునిగా
చేస్తున్నాయి?
శ్రీకృష్ణుడు : ఓ ప్రియ ఉద్దవా! వాస్తవానికి అహంకారమునకుగాని, అహంకారము
కలిగిస్తున్న బంధమునకుగాని, ఆ బంధము వలన ఏర్పడే సంసారము అను
శృంఖలాలకుగాని వాస్తవమైన రూపం అంటూ ఏదీ లేదు. ఒక మూలము (A source
where from they come out) అనునది కూడా ఏదీ లేదు. అజ్ఞానమే అన్నిటికీ
కారణం!
అహంకార రూపమగు సంసారము అనుదానికి ఉనికి అంటూ ఏదీ లేకపోయినప్పటికీ…
అది జీవుని అజ్ఞానకారణంగా గారడివాడు చూపే లేనివస్తువు వలె- అనేక రూపాలుగా
వెల్లడి అవుతోంది. పరవశం కలుగజేస్తోంది.
మనస్సు-వాక్-ప్రాణ-శరీర - కర్మల ద్వారా సంసారము రూపుదిద్దుకొని
పరిణితమౌతోంది. సాధకుడగు మౌని అహంకారరూప సంసారము కలుగజేసే
నిమ్నగతులను గమనించి విజ్ఞుడగు గురువును ఆశ్రయిస్తున్నాడు.
“నేనెవరు? అహంకార దోషం ఎక్కడినుండి వచ్చింది? సంసారము అనగానేమి? ఇది
ఎట్లా రూపుదిద్దుకొంటోంది? నేను తరించగల మార్గమేమిటి?” - అను ప్రశ్నలతో
గురువుకు శరణువేడుచున్నాడు. గురువులు ఉపదేశిస్తున్న తత్-త్వమ్ అనబడు తత్త్వ
శాస్త్ర ప్రవచనాలను, వేదాంతశాస్త్ర విశేషాలను వింటున్నాడు. ఆకళింపు
చేసుకుంటున్నాడు. గురూపదేశముచే అతితీక్షణమైన పదునైన జ్ఞానాసి (జ్ఞాన ఖడ్గము)ను
సంపాదించు కుంటున్నాడు. హృదయములోని లౌకికసంబంధమైన వాసనలను
ఛేదించివేస్తున్నాడు. ఆత్మజ్ఞానియై ఆత్మతత్త్వమునందు ప్రశాంతంగా, హాయిగా
సంచరిస్తున్నాడు. అప్పుడిక సంసారమనబడేది ఆతనికి ఆతనియొక్క భావసంబంధమైన
లీల-క్రీడ-ఆత్మ విన్యాసం అవుతోంది! ఆత్మ - అనాత్మ వివేకమే జ్ఞానము!
జగత్తు అనబడేదానియొక్క మొదలు - చివర ఏమై ఉన్నదో…. అదే వర్తమానంలోకూడా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
335
అయి ఉన్నది. మొదలు – చివర అనేకము లేదు. మధ్యలోనూ లేదు! ఆత్మయే జగద్రూపంగా
మనస్సుచే ఆస్వాదించబడుతోంది. బంగారు ఆభరణములన్నీ బంగారమే కదా!
జీవులందరు (మనో-బుద్ధి-చిత్త-అహంకారాలతో సహా) ఆత్మయొక్క ప్రత్యక్ష స్వరూపులే!
ఆత్మ సర్వదా యధాతథము, అఖండము, అప్రమేయము, ఆనందస్వరూపము.
“ఈ జగత్తు కూడా సర్వదా ఆత్మ స్వరూపమే!” - అనునది ఆయా ప్రమాణములద్వారా
నిరూపమణ మగుచున్నది.
ప్రమాణములు – వేద ప్రమాణము
గురూపదేశ ప్రమాణములు
ఇతిహాసముల ప్రమాణములు
కాలము |
హేతువు (Reasoning) ప్రమాణము
అనుమానము
బంగారు నాణెమును ఒక ఆభరణంగా తయారుచేసి, చాలాకాలం ధరించి, దానిని
కరగించి తిరిగి బంగారపు నాణెముగా మార్చామనుకో! అనగా… బంగారము
ఆభరణంగా ఉన్నపుడు ఆభరణాకారం తొలగించినప్పుడు కూడా బంగారమే అయిఉన్నది
కదా! అయినా కూడా బంగారు లోహము (Gold Metal) బంగారు ఆభరణము
(ornaments) అనే పదాలు ప్రయోగిస్తాము. ఆభరణములను కూడా ఇవి బంగారు
గాజులు. ఇవి బంగారు గొలుసులు ఇత్యాది మాటలు(శబ్దాలు) చెప్పుకుంటాము.
ఆభరణములు బంగారము కానిది ఎప్పుడు? అట్లాగే…
ఈ విశ్వమునకు కారణభూతుడును విశ్వేశ్వరుడను-విశ్వరూపుడను (బంగారము
ఆభరణమునకువలె) నేనే!
నాకంటే భిన్నంగా విశ్వము లేదు. జీవులు లేరు! జగత్తు లేదు!
జాగ్రత్ - స్వప్న - సుషుప్తి మూడు అవస్థలు,
ఆ మూడు అవస్థలకు (అవస్థాత్రయము) కారణభూతంగా చెప్పబడుచున్న సత్త్వ
రజో - తమో త్రిగుణములు (గుణత్రయము),
ఆ మూడు అవస్థలతో కూడిన మనస్సు,
త్రిగుణములబనడే కారణమునకు కార్యభూతమైన స్వర్గ-భూ-పాతాళములనబడే
..
త్రివిధ జగత్తులు,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
336
ఆధిభౌతిక - అధిదైవిక - అధ్యాత్మకములనబడే త్రివిధ తాపములు,
ఇవన్నీ నాయొక్క తురీయ చైతన్యము యొక్క బహురూప చమత్కారములే! సమాధిఅసమాధులకు కేవలసాక్షి అయిన బ్రహ్మము మాత్రమే సత్యము. మిగిలినవన్నీ
కల్పితము - వికారోనామధేయములు! జగన్మిధ్యా! అట్టి పరబ్రహ్మమే నేను!
ఈ జీవుడు తరంగమైతే పరబ్రహ్మము జలము వంటిది (యో పా మాం యతనమ్
వేదా)
ఈ జీవుడు ఆభరణమువంటివాడైతే పరబ్రహ్మము బంగారు లోహము వంటిది.
అనగా…,
ఈ జీవుడు పరమాత్మ అనే తత్త్వముయొక్క ఆభరణ స్వరూపము.
ఒక ముఖ్యమైన విషయం!
ఏదైనా ఒకానొక వస్తువు నాకు వర్తమానంలో నామ రూపాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ…
అది మొట్టమొదట (సృష్టికి ముందు) లేనిది ప్రళయంలో లేకుండా పోవుచున్నది
అయి ఉంటే… అట్టిది స్థితికాలంలో కూడా మూలపదార్ధం కంటే వేరు కాదు. బంగారు
ఆభరణము బంగారమునకు మధ్యలో వచ్చి కనబడుచున్నప్పటికీ… ఆ ఆభరణము
బంగారమే అయి ఉన్నది కదా!
ఏ పదార్ధము దేనినుండి పుట్టుచున్నదో, దేనిచే ప్రకాశితం అగుచున్నదో అదియే ప్రకాశిత
వస్తువుయొక్క పరమార్ధ సత్యమై యున్నది…. అనునది వేదాంతశాస్త్ర ప్రవచన
సిద్ధాంతము.
స్వప్నంలో కనిపించేవన్నీ స్వప్న చైతన్య స్వరూపమే!
జాగ్రత్లో కనిపించేవన్నీ జాగ్రత్ చైతన్య స్వరూపమే!
ఈ జగత్తు మొట్టమొదట బ్రహ్మమే! లయించిన తరువాత బ్రహ్మమే! కనుక, వర్తమానంలో
కూడా ఇదంతా బ్రహ్మమే! పరమాత్మ స్వరూపమే!
జగత్తు జగదీశ్వర స్వరూపమే!
విశ్వము విశ్వేశ్వరరూపమే!
దృశ్యము ద్రష్ట యొక్క స్వరూపమే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
337
ద్రష్ట దృక్ స్వరూపమే! (ఆ ద్రష్టను చూచువాని స్వరూపమే!)
దృక్-ఆత్మస్వరూపమే!
బ్రహ్మముయొక్క సమక్షంలో జీవుడు అనే పరిణామము ఏనాడు వాస్తవానికి లేనేలేదు.
జీవుడు అనే వికారము మొదలే లేకపోయినప్పటికీ జీవుడు - ఆతని అనుభమైనట్టి ఈ
దృశ్యజగత్తు - ఉన్నట్లే అగుపిస్తోంది. (అజ్ఞాన దృష్టికి) అనిపిస్తోంది!
ఆవిధంగా వాస్తవంగా లేకున్నప్పటికీ ఉన్నట్లే అనిపించటమును రాజసికదృష్టి (లేక)
రాజసిక సృష్టి - అని పిలుస్తూ ఉంటారు. ఇదంతా సదా సర్వదా స్వయం ప్రకాశమగు
బ్రహ్మమే! బ్రహ్మము రజోగుణమును తనకుతానుగా ఉత్తేజ పరచుకొనుచున్నప్పుడు
జగదనుభవము అనునది బయల్వెడలటం జరుగుతోంది!
కనుక ఇంద్రియములు, పంచతన్మాత్రలు, మనస్సు, పంచమహాభూతములు అనే
రంగు రంగులచే చిత్రించబడిన - చిత్రితమైన ఈ విశ్వమంతయు బ్రహ్మమే! వేదముప్రత్యక్షము - ఉపదేశము - అనుమానము మొదలైన మీమాంసా విభాగులు సుస్పష్టముగా -
“ఇదంతా బ్రహ్మమే! మనయేవ ఇదమాప్తవ్యం!” అని యుక్తియుక్తంగా నిరూపిస్తూ
వస్తున్నాయి. ఇక సందేహం దేనికో చెప్పు!
సద్గురూపదేశముచేత “ఈ దేహమే నేను - వారు తదితర దేహములు…” అను దేహాత్మ
భావన స్వయంగా తొలగిపోగలదు. కనుక ఓ జనులారా! మీరంతా ఆత్మానంద
పరితుష్టులు అవండి! కామపరతంత్రములగు ఇంద్రియములు - ఇంద్రియ విషయముల
నుండి ఉపరతులు (withdrawn) అవండి! ఇంద్రియార్దములు-మనో-బుద్ధి-చిత్తఅహంకారములు దాటివేయండి.! అవన్నీ ఆత్మకు ఎందుకు అభిన్నమో గమనించండి!
ఆత్మ కేవలసాక్షి! సర్వమునకు యజమాని! రాజాధిరాజు! అందుచేత…
భౌతికమైన ఈ దేహము ఆత్మకాదు. అదేవిధంగా..,
ఈ ఇంద్రిములు, వాటికి అధిష్ఠాతలైన దేవతలు, ప్రాణములు, బుద్ధి, మనస్సు, చిత్తము,
అహంకారము ఇవన్నీ కూడా ఆత్మకాదు. అవన్నీ అన్నమును (ఆహారమును) ఆశ్రయించి
ఉంటాయి. సవికారములు. ఆత్మయో… నిర్వికారము!
ఆట్లాగే…. వాయువు జలము తేజస్సు ఆకాశము భూమి అనబడే
పంచభూతములు, శబ్ద-స్పర్శ-రూప-రస-గంధములనబడే ఇంద్రియవిషయములు,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
338
ప్రకృతి… ఇవన్నీ భౌతికమే కాబట్టి అవికూడా ఆత్మస్వరూపములు కావు!
ఆకాశమును మేఘములు ఆవరించినా - ఆవరించకపోయినా సూర్యునికి ఎటువంటి
హాని-వృద్ధులు ఉండవు కదా! సాక్షాత్ స్వస్వరూపుడనగు నాయొక్క స్వరూపము
తెలుసుకొన్నవానికి,… “ ఇక త్రిగుణములగు ఇంద్రియములు నిశ్చలమైనా (లేక)
చంచలమైనా కూడా (విక్షిప్తములైనా కూడా) ఆత్మకు ఎట్టి గుణదోషములు
ఉండవు. అంటవు!” - అనునది గమనిస్తున్నాడు!
శ్లో॥ యధా నభో వాయుః అనల అంబు భూ గుణైః
గతాగతైః వర్తుగుణైః న సజ్జతే
తథా అక్షరం సత్త్వరజస్తమోమలైః
అహం మతే సంస్కృతి హేతుభిః పరమ్ ॥ (అధ్యా 28, శ్లో 26)
వాయు వీచికలచేతగాని, అగ్ని శిఖలచేతగాని, జలతరంగముల ఉధృతముచేతగాని,
భూమియొక్క విస్తారముచేతగాని, వచ్చి పోయే శీతోష్ణాదులచేతగాని ఆకాశము ఏదైనా
మార్పు-చేర్పులు పొందుచున్నదా? లేదుకదా? అహంకారము కంటే కూడా పరమై,
అహంకారమునకు ఉత్పత్తి స్థానమైన పరమాత్మ- ప్రపంచమునకు కారణభూతమైన
సత్త్వ-రజ-తమోగుణములచే మలినము కాదు!
అయినప్పటికీ కూడా…. (Even though it is so)…,
శ్లో॥ తథాపి సంగః పరివర్జనీయో
గుణేషుమాయా రచితేషు తావత్
మద్భక్తి యోగేన దృఢన యావత్
రజో నిరస్యేత మనః కషాయః || (అధ్యా 8, శ్లో 27)
ఎంతెంతవరకైతే పరతత్త్వ స్వరూపుడునగు నాపట్ల భక్తియోగము యొక్క ప్రభావముచే
ఇంద్రియ విషయములనుండి, త్రిగుణ విశేషములనుండి మనస్సు తొలగడం
జరుగుటలేదో… అంతంత వరకు ఈ జీవుడు మాయా రచితములైన దృశ్య విషయముల
నుండి ఆసక్తి (Attachment) ని పూర్తిగా విడిచే ప్రయత్నంలో ఉంటూనే ఉండాలి.
ఎందుచేతనంటావా?
రోగము పూర్తిగా తొలగనంతవరకు చికిత్స కొనసాగిస్తూనే ఉండాలికదా? లేకపోతేనో?
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
339
రోగము మరల మరల వృద్ధి చెందుతూ, తిరగబెడుతూ ఆ రోగికి బాధ కలిగిస్తూనే
ఉంటుంది కదా! అదే రీతిగా….
1. మనోగతములైన (మనస్సులో పేరుకొనియున్న) దృశ్య సంబంధమైన వాసనలు
(Tendencies that are being carried since long and that are thickly formed in
the inner zone)
2. అట్టి వాసనల ప్రభావముచేత తన్మూలములైనట్టి కర్మబంధము (బంధభావన).
పై రెండూ సంపూర్ణముగా నశించవు. నశించకపోతేనో? ధన-పుత్ర-కళత్ర-పేరుప్రతిష్ఠ ఇటువంటి ఆసక్తులు మనస్సులో ఉన్నంతవరకు మనస్సే పెత్తనం చెలాయిస్తుందే
గాని, దృశ్యమునకు-ద్రష్టకు సాక్షి అయినట్టి ఆత్మానుభవమునకు మనస్సు సహకరించదు.
దృశ్య విషయములపట్ల ఆసక్తమైన మనస్సు అల్పజ్ఞాని అయిన జీవుని స్వా-అర్ధము
(ఆత్మానుభవము) నుండి భ్రష్టునిగా చేయగలదు సుమా!
అందుకే దృఢమైన భక్తియోగమును, భక్తి గుణములను (అద్వేష్టా సర్వభూతానాం,
అమానిత్వమదంభిత్వం ఇత్యాది భక్తి-జ్ఞాన అభ్యాసములను) జీవుడు అభ్యసించ
వలసినదే!
శ్రీ ఉద్ధవుడు : శ్రీకృష్ణా! నాదొక సందేహము. ఒకానొకడు భక్తియోగ మార్గంలో నిన్ను
ఉపాసించడం ప్రారంభించికూడా, ఏకారణంచేతనో ఏవేవో చిక్కులవలన ఆ భక్తి
లక్షణములు అభ్యసించే మార్గములో అంతరాయాలు-విఘ్నాలు కలిగాయనుకోండి!
మీరు భక్తి మార్గాన్ని వదలకూడదని అంటున్నారు. మరి అట్టి విఘ్నములవలన యోగభ్రష్ట
డైతేనో? ఆతని గతి ఏమిటి? నిర్గతి కాదు కదా?
శ్రీకృష్ణుడు : ప్రియమిత్రమా! ఆయా విఘ్నముల వలన భక్తిమార్గమును కొనసాగించలేక
యోగభ్రష్టుడైనవాడు, మరల ఎప్పుడో ఏ సందర్భంలోనో భక్తియోగము యొక్క పూర్వస్థితి
నుండి పునః ప్రయత్నశీలుడగుచున్నాడు. జన్మాంతర సంస్కార బలంచేత మరల భక్తి
యోగ మార్గమునందు ఆసక్తుడౌతున్నాడు. ఇతఃపూర్వపు భక్తి మార్గమునందు ఎంతవరకు
కృతకృత్యుడై ఉంటాడో, అంతంతవరకు కర్మ మొదలైన దృశ్య వ్యవహారాదులందు
అనాసక్తుడవటం ప్రారంభిస్తున్నాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
340
ಅಜ್ಜಲು
ఈ జీవులు సామాన్యంగా పూర్వ సంస్కారములచే ప్రేరితులై ఆజన్మాంతరము
కర్మలయందు నిమగ్నులై ఉండటం జరుగుతోంది. అంతేకాదు! ఆయా కర్మలచే, వాటి
ఫలితములచే హర్ష-విషాదములు పొందటం, కొన్ని కర్మల ఫలితంగా మరికొన్ని కర్మల
పట్ల ఆసక్తులై ఉండటం కూడా జరుగుతూ ఉన్నది
విద్వాంసులు
అయితే ఆత్మతత్త్వమును ఎరిగిన విద్వాంసుల విషయం వేరుగా ఉంటోంది.
వారు దేహధారులై, దేహాంతర్గతులై, దృశ్యాంతర్గతులై ఉంటూ కూడా… స్వానుభవముచే
ఆత్మానంద పరితృప్తులై, నిరహంకారులై ఈ సంసార సంరభమునకు ఆవల సాక్షీభూతంగా
చిరునవ్వుతో చూస్తూ ఉన్నారు. సర్వ సాంసారిక విషయములపట్ల మౌనము
అతీతత్వము వహించి ఉంటున్నారు. వారు సంసారమును పొందుటయే లేదు. పడవ
నీళ్ళలో ఉంటుంది. కాని పడవ తనలోకి నీళ్ళను రానిస్తుందా? విజ్ఞులగు విద్వాంసులు
సంసార వ్యవహారముల మధ్య దేహధారులై ఉండికూడా…. తమయందు సంసారము
రహితము చేసుకొన్నవారై ఉంటున్నారు.
శ్లో॥ తింష్ఠతం ఆసీనమ్ ఉత ప్రజంతం
శయానం ఉక్షంతమ్ అదంతమన్నమ్
స్వాభావ మన్యత్ కిమపీహమానమ్
ఆత్మానమాత్మస్థమతిః న వేద || (అధ్యా 28, శ్లో 31)
ఆత్మయందు - సర్వం ఆత్మస్వరూపంగా ఆస్వాదించుటయందు నిలకడ - నిశ్చలత
సంపాదించున్నట్టి మనుజుడు…,
ఈ దేహము ఉండటం - లేకుండటం,
కూర్చుని ఉండటం, నడుస్తూ ఉండటం,
స్వీకరించటం - విసర్జించటం,
–…" అన్నమును భక్షించటం - త్యజించటం,
తదితరములైన సర్వ స్వాభావిక కర్మలు,
ఇవన్నీ నిర్వర్తించబడుచుండగా తాను ఏదీ నిర్వర్తించనివాడుగా - కర్మరహితునిగా
చూస్తూ అతీతుడై - యథాతథుడై ఉంటున్నాడు! అవన్నీ గుర్తించనివాడై (లేక) గుర్తిస్తూ
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
341
సంబంధించనివాడై ఉంటున్నాడు. కల కంటున్నవాడు, నిదురలేచిన “కలలో కనిపించినవి
నేను కోల్పోయాను కదా!” అని అనుకుంటున్నాడా? లేదు. “అవన్నీ వాస్తవమే కాదు! నా
ఊహాపరంపరలు రూపుదిద్దుకోగా అది అట్లు స్వప్నంలో కనిపించింది కదా!” అని తలచి
కలలో ఏదీ పొందనట్లు, ఏదీ త్యజించనట్లు (మెలుకువ వచ్చిన తరువాత) ఉంటున్నాడు
కదా!
అట్లానే వివేకవంతుడైనవాడు అసత్తగు ఇంద్రియ విషయ స్వరూప జగత్తును చూస్తూ
ఉండి కూడా… ఆత్మకు వేరైనదేదీ అంగీకరించడు.
అనగా…,
సర్వము ఆత్మ స్వరూపంగానే దర్శిస్తూ ఉంటాడు. ఆత్మ సర్వదా యథాతథము కదా!
మట్టిని ఎవ్వరైనా ఒక మట్టిబొమ్మగా తయారు చేస్తున్నప్పుడు ఆ మట్టి ఏదైనా
కోల్పోతోందా? ఆ బొమ్మ ఖండమై మరల మట్టిగా మారుచున్నప్పుడు మాత్రం? మట్టి
బొమ్మ ఏదైనా కోల్పోతోందా? రెండూ లేదు కదా! మట్టి బొమ్మగా మలచబడుచున్నప్పటికీ
మట్టి యథాతథం కదా! “ఆత్మ జగత్తు రూపంగా కల్పన చేయబడుచున్నప్పటికీ ఆత్మ
యథాతథం!” అని ఆత్మజ్ఞుడు గమనిస్తున్నవాడై ఉంటాడు!
శ్రీ ఉద్ధవుడు : కృష్ణయ్యా! ఈ జీవుడు ఆత్మయే వాస్తవ స్వరూపముగా కలిగి ఉన్నాడు
కదా! అట్టి నిర్మల అప్రమేయ ఆత్మతత్త్వమును అజ్ఞానము ఎక్కడినుండి వచ్చి
ఆవరిస్తోంది? మరల అది ఎట్లా తొలగుతోంది? అనగా బంధ - మోక్షములు ఆత్మకు
ఏ ఆవస్యకతచేత ఎట్లా ఏర్పడుచున్నాయి.
శ్రీకృష్ణుడు : (పకపక నవ్వుతూ) ప్రియ ఉద్దవా! ఆత్మకు బంధము లేదు! మోక్షము లేదు!
శ్లో॥ పూర్వం గృహీతం గుణకర్మ చిత్రమ్
అజ్ఞానమాత్మన్య వివిక్త మంగమ్
నివర్తతే తత్ పునరీక్ష యైవ
న గృహ్యతేనాపి విసృజ్య ఆత్మా! (అధ్యా 28, శ్లో 33)
ఆత్మ - విషయములచేతగాని, కర్మలచేతగాని, గుణములచేతగాని - కప్పబడటమూ
లేదు! అవి తొలగించబడటమూ లేదు. ఆత్మ దేనిచేతా స్వీకరించబడటమూ లేదు.
త్యజించబటమూ లేదు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
342
ఒక పలకపై రంగురంగుల బలపములతో ఒక పిల్లవాడు ఏవో బొమ్మలు చిత్రించి
తుడిచివేస్తూ ఉంటాడు చూచావా? ఆ పలకకు బలపములతో చిత్రించబడిన చిత్రముతో
సంబంధమేమన్నా వున్నదా?
ఆత్మ ఒకానొకప్పుడు లీలగా క్రీడగా స్వప్న స్వీకరణవలె తనయందు గుణ కర్మలను
స్వీకరించి వాటితో కించిత్ తన్మయము అవుతోంది! అవిచారణచే గుణ-కర్మసందర్భముల అభినివేశము ఆత్మచే స్వీకరించబడుతోంది. అనగా ఆత్మచే అన్యమైనది
గృహీతము అవుతోంది. అదియే అజ్ఞానముగా వేదాంత శాస్త్రముచే వర్ణించి
చెప్పబడుతోంది. అదియే సంసారము అనబడునది కూడా! ఆత్మ గురించిన తత్త్వ
జ్ఞానము ఏమరచటమే అజ్ఞానము - అనే శబ్దముచే ఉద్దేశ్యించబడుచున్నది. ఆ అజ్ఞానము
“ఆత్మకు సంబంధించిన జ్ఞానము, ఆత్మగా సర్వమును సందర్శించుటచే
తొలగిపోతోంది. అయితే… ఆత్మ దేనిచేత (అజ్ఞానముచేతగాని - జ్ఞానముచేతగాని)
స్వీకరించబడటమూ లేదు! విడువబడటమూ లేదయ్యా!” అజ్ఞానముకూడా
ఆత్మానందముయొక్క ఒకానొక విశేష చమత్కారం మాత్రమే అని ఆత్మజ్ఞాని
గమనిస్తున్నాడు.
ఒక దృష్టాంతం చెప్పుతాను. విను. ఒక బాటసారి ఒక ప్రదేశంలో ఆశీనుడైనాడు. అది
అర్ధరాత్రి. కటిక చీకటిగా ఉన్నది. చుట్టు ప్రక్కల ఎక్కడ ఏమున్నదో ఏమీ ఏమాత్రము
కనబడుటలేదు. కొంతసేపైన తరువాత సూర్యోదయం అయింది. ఇప్పుడు ఆ బాటసారి
కనులు తెరిచాడు. ఆహాఁ! ఒకవైపు కొండలు మరొకవైపు తటాకం. దగ్గిరలో వృక్షాలు.
పక్షులు ఇవన్నీ కనిపించసాగాయి. ఆ ప్రదేశమంతా పచ్చటి గడ్డి మొక్కలతో-పూల
మొక్కలతో బహుసుందరంగా కనిపిస్తోంది!
ఎప్పుడైతే చీకటి తొలగిందో… అంతా సుస్పష్టంగా కనిపించసాగింది. ఇప్పుడు చెప్పు!
సూర్యకాంతి క్రొత్తగా ఏదైనా సృష్టించిందా? లేక, రాత్రిపూట అంధకారము దేనినై
మ్రింగిందా? ఏదీ లేదు.
“ఆత్మ విద్య” అనే సూర్యుడు ఉదయించగానే అజ్ఞానము అనే చీకటి - బుద్ధి నేత్రము
నుండి తొలగిపోతోంది. “ఆత్మ జ్ఞానముచే - సర్వదా ఇతఃపూర్వమే సిద్ధంచియున్న,
అనునిత్య స్వస్వరూపతత్త్వమైన ఆత్మ తిరిగి అనుభవమునకు వస్తోంది” అని
అనవలసిందే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
343
జీవాత్మ ప్రకాశించబడుచున్నవాడు (That being exhibited / manifested)!
పరమాత్మయో-జీవాత్మను - జీవాత్మయొక్క సర్వ అనుభవములను ప్రకాశింపజేసే వాడు!
అట్టి పరమాత్మ ….
స్వయంప్రకాశకుడు (పరమాత్మను ప్రకాశింపజేసేది మరొకటేదీ లేదు. తనకు
తానే ప్రకాశిస్తోంది).
అజుడు (జన్మరహితమైనది). I
అప్రమేయుడు. (దృశ్యమునకు వేరై ఉన్నట్టి కేవల ద్రష్ట.
సర్వవ్యాపకుడు. (స్వప్న ద్రష్ట తన చైతన్య విశేషంచేత స్వప్న దృశ్యమంతా వ్యాపించి
ఉన్నట్లు).
చిత్సమూహుడు. ఎరుక అను కిరణములను ప్రదర్శించువాడు! (One who
emits the rays of knowing)
సర్వజ్ఞుడు {జాగ్రత్ - స్వప్న - సుషుప్తులను, దృశ్య - దేహ - మనో - చిత్త -
|
బుద్ధి అహంకారాలను ఎరుగుచున్నవాడు. (one who is knowing all else)}
స్వజాతీయ - విజాతీయ భేదము లేనివాడు (మట్టితో కొన్ని బొమ్మలు చేస్తే ఆ
మట్టి- “ఈ మట్టి బొమ్మలు నావి ఆ మట్టి బొమ్మలు నావి కావు” అని
అనుకుంటుందా?)
అవాక్ మానస గోచరుడు
అట్టి పరమాత్మయొక్క ప్రేరణ (Inspiration) చేతనే ప్రాణములు - వాక్కు - - మనో
బుద్ధి - చిత్త అహంకారాలు ఇవన్నీ తమతమ స్థానాలలో ఉండి జగన్నాటకంలో
తమ తమ పాత్రలు నిర్వర్తిస్తున్నాయి.
అటువంటి అభిన్నము - వికల్ప రహితము అగు ఆత్మపట్ల ఇది జీవాత్మ - ఇది
పరమాత్మ అనే భేద కల్పన కూడా మనో భ్రమయే! ఎందుకంటే ఆత్మ ఏర్పరచుకొంటున్న
మనో భ్రమకు కర్తృత్వము - అధిష్ఠానము మరొకటేదీ లేదు.
పంచభూత సమ్మేళనము నామరూపాత్మకము అగు ఈ ద్వైతమును - ద్వైత
ప్రపంచమును కొందరు భాషాకోవిదులు - “ఈ పంచరంగుల నామరూపాత్మక దృశ్యము
ఈఈ కారణాలుగా సత్యమే…” అని అభివర్ణించటం - అదంతా అర్థరహితమగు వాక్
ఆడంబరము మాత్రమే!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
344
అధ్యాయము–44.) యోగాభ్యాసంలో అడ్డంకులు తొలగించుకోవటం ఎట్లా?
|
శ్రీ ఉద్ధవుడు : శ్రీకృష్ణ స్వామీ! ఒకడు యోగాభ్యాసం సందర్భంలో ఆ ఆ యోగసాధన
కొనసాగించుచూ… ఇంకా యోగసాధన ముగియకముందే (పూర్తికాకుండానే) ఏవైనా
అనారోగ్యము - మొదలైన ఉపద్రవములు వస్తూ ఉంటే అప్పుడు ఆ యోగి ఏ
ఉపాయములు అనుసరించాలి? వాటిని ఆతడు ఎట్లా ఎదుర్కోవాలి?
శ్రీకృష్ణుడు : మనం ఆత్మతత్త్వమును చర్చిస్తున్నాం. నీవేమో యోగులు భౌతికమైన
ఇబ్బందులకు ఏ ఉపాయాలు (క్రియా యోగసాధనా సమయంలో) ఆశ్రయియించాలి…
అని ప్రశిస్తున్నావు! సరే చెప్పుతాను. విను.
వారు…, (యోగాభ్యాసులు)
శీతోష్ణ తాపములను : సూర్యోపాసన-చంద్రోపాసనల (సూర్య చంద్ర ధారణోపాసనల
సహాయంతో) అధిగమిస్తున్నారు. నేనే సూర్య చంద్రుల స్థానంలో ఆత్మ స్వరూపుడనై
ఉన్నాను కదా! …అనే భావనను ఆశ్రయిస్తున్నారు. తద్వారా శీత-ఉష్ణ సంబంధమైన
బాధను జయించివేస్తున్నారు!
వాతము - పిత్తము - ఇత్యాది శారీరక రుగ్మతలను: ఆసనము - ప్రాణాయామముల
ద్వారా జయిస్తున్నారు.
బాహ్యమైన నిరోధములను : తపస్సు - మంత్రములద్వారా దూరంగా ఉంచుచున్నారు.
దేహబాధలను - బాహ్యమైన ఔషధము - పౌష్ఠికాహారము - - జలము పండ్లరస -
పానీయముల వంటివాటిచే నిరోధిస్తున్నారు. బాధకు సాక్షిగా వుండటమనే అభ్యాసము
కూడా నిర్వర్తిస్తున్నారు!
కామము మొదలైన విఘ్నములను నన్ను ధ్యానిస్తూ కృష్ణతత్త్వమును బుద్ధితో
గ్రహిస్తూ ఎదుర్కొంటున్నారు. కామము మొదలైనవి పసిపిల్లలవలె వాత్సల్యముగా
మార్చుకోవటంచేత తప్పక జయించవచ్చు.
క్రోధ-లోభ-మోహాలను : శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానందం… ఇటువంటి నామ
సంకీర్తనల ద్వారా అణచి - రహితం చేసుకుంటున్నారు.
అశుభ ప్రదములగు దంభము మొదలైన వాటిని -మహనీయులగు యోగీశ్వరులను
దర్శించి వారి బాటను అనుసరించి క్రమంగా త్యజిస్తున్నారు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
345
ఈవిధంగా యోగులు యోగసాధనకు ఉపకరణము అగు ఈ భౌతిక దేహమును
స్థిరంగాను, ఆరోగ్యవంతంగాను, రోగరహితంగాను చేసుకొంటున్నారు. ఇంకొందరు
యోగులు పరకాయ ప్రవేశము ద్వారా ఉపాధి పరంపరలను ఆశ్రయిస్తూ యోగసాధన
కొనసాగించటం కూడా జరుగుతోంది. ఒక దేహం శిధిలం అవుతూ ఉంటే ప్రకృతి
నిర్మితమైన మరొక ఉపాధిలో ప్రవేశించి ధారణ కొనసాగిస్తున్నారు. మరికొందరు
యోగసాధకులు ప్రకృతిలోను - వాయువులోను ప్రకృతిచే ప్రక్షిప్తం చేయబడిన ఔషధ
రసాలను ప్రాణాయమాది ప్రత్నములతో స్వీకరించి ఈ భౌతిక దేహములో మనోచిత్త
హస్తములతో తెచ్చి నింపి నిత్యయౌవ్వనులై యోగసాధన కొనసాగిస్తున్నారు కూడా!
అయితే…, దేహసంబంధమై… ఆత్మ విద్యాకోవిదుల అవగాహన మరొకవిధంగా
వుంటోంది!
శ్లో॥ నహి తత్కుశలాదృత్యం తదాయాసోహి అపార్థకః
అంతవత్వాత్ శరీరస్య ఫలస్యేవ వనస్పతేః || (అధ్యా 28, శ్లో 42)
వారు ఈ భౌతిక దేహ సంరక్షణకై ఉద్దేశ్యించిన ఔషధములను రసములను,
మంత్రములను, పరకాయ ప్రవేశమువంటి ఉపయోగసాధనములను పెద్ద
విషయములుగా లెక్కలోకి తీసుకోరు. ఎందుచేత నంటావా?
ఆత్మ వృక్షమువలె స్థిరమైనది.
ఈ భౌతిక దేహములో? - ఫలములవలె (Like fruits) నశ్వరము (Physical
body is any way time-bound)
అందుచేత “ఈ భౌతికదేహమును స్థిరంగాను, యౌవనవంతముగాను సుదీర్ఘకాలం
ఉంచాలి! తద్వారా క్రియా యోగ సాధన సుదీర్ఘకాలం కొనసాగించాలి …” అని ఎవ్వరైనా
సరే మరీ పట్టుదలగా అనుకుంటే అదంతా నిరర్ధకమేనని గుర్తుచేస్తున్నాను.
నిత్యము యోగసాధనచేస్తూ ఉండే అభ్యాసపరులకు ఈ దేహము సుదృఢంగాను,
ఆరోగ్యంగాను, ఉత్సాహవంతం గాను, నైరాస్యరహితంగాను, గొప్ప ఉపకరణంగాను
ఉండగలదనుమాట నిర్వివాదాంశమే!
అయినప్పటికీ, బుద్ధిమంతులగు యోగాభ్యాసులకు యోగానుష్ఠానము పైనే శ్రద్ధ-ధ్యాసలు
ఉంటాయి. అంతేగాని నశ్వరము-వినాశన శీలము అగు ఈ భౌతిక దేహముపై కాదు!
“దీనిని ఎట్లా రక్షించుకుంటామురా బాబూ!…” అనే విషయం మీద కాదు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
346
శ్లో॥ యోగచర్యాం ఇమాం యోగీ విచరన్ మదపాశ్రయః
నాంతరాయైర్విహన్యేత నిఃస్పృహః స్వసుఖానుభూః ॥ (అధ్యా 28, శ్లో 44)
సర్వాంతర్యామిని - సర్వతత్త్వ స్వరూపుడను యోగి యొక్క స్వస్వరూపమునకు
అభిన్నుడను - అగు…, నన్ను ఆశ్రయించుచున్న యోగి,
అంతరాయములు అవే వస్తాయి. అవే పోతాయి! నా కార్యక్రమమును అవి నిరోధించవు.
నిర్దేశించవు!
అని భావిస్తూ లోకరీతులకు, దేహములకు, సందర్భములను, సంగతులకు సర్వదా
అతీతుడై భక్తి-క్రియాయోగసాధనలను కొనసాగిస్తూ ఉంటాడు. సర్వలౌకిక విషయాలకు
అతీతుడు - నిస్పృహుడు అయి ఉంటాడు. విఘ్నములు ఆతనిని జయించలేవు. పట్టుదల
కలవారికి దేహబాధలు దైనందికమైన స్వల్ప విషయాలుగా అనిపిస్తూ ఉంటాయి.
దేవభక్తులు-రాజభక్తులు అగు యుద్ధవీరుల విషయంలో ఇట్టిది గమనిస్తాము కదా!
మత్ప్రసాదముచే సర్వ విఘ్నములను ఆతడు తప్పక జయిస్తున్నాడు. “కొంచము ఓపిక
పడితేచాలు…” అని ఆతడు గ్రహించి ఉంటున్నాడు.
ఈ దేహముల ఆయురారోగ్య వ్యవహారములు, కష్ట సుఖములు ఆతని ధారణకు
ఎటువంటి విఘ్నములు కలిగించ జాలవు.
లక్ష్య శుద్ధి కలవానికి విఘ్నములు ఏమి చేస్తాయయ్యా! మిత్రమా! లక్ష్యశుద్ధి లేనివానికి
ఆతనియొక్క అల్పమైన ఆశయములే ఆతని నిజమైన విఘ్నములు
అధ్యాయము–45.) భాగవత ధర్మములు - భక్తియోగ సాధనములు
|
శ్రీ ఉద్ధవుడు : ఓ అచ్యుతా! మనస్సు స్వాధీనంలో లేనంతకాలము మానవుడు మీరు
బోధించే యోగ-భక్తి సాధనలు అనుష్ఠించటం చాలా కష్టమేమోనని నాకు
అనిపిస్తోందయ్యా!
అందుచేత…, ఈ సందర్భములో
కొంత అనాయాసంగా పురుషుడు ఉత్తమసిద్ధిని పొందటానికి సులభము - సుగమము
అయిన సాధనములను బోధించవలనసినదిగా నిన్ను అర్థిస్తున్నాను!
ఎందుకంటావేమో? పుండరీకాక్షా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
347
యోగులు కొందరు తమ మనస్సును సమాధానపరచుకోవటానికి - నిగ్రహపరచుకోవటానికి
ప్రయత్నిస్తున్నప్పటికీ… వారు ఆ కార్యక్రమములో కృతకృత్యులు కాలేకపోవటం కొన్నిచోట్ల
జరుగుతోంది! “మేము ఆశయము యోగసాధనలలో పటిష్టులము కామేమో!” -
అని కూడా మాకు అనిపిస్తోంది.
ఓ కమలనయనా! విశ్వేశ్వరా!
ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఈ దృశ్యమును అధిగమించిన కొందరు
సార-అసార వివేకులు సంపూర్ణమగు ఆశయముగా ఆనందము కలిగినవారై నీ
పాదపద్మములను సుఖముగా హాయిగా ఆశ్రయిస్తున్నారు!
కుయోగులు అల్పబుద్ధి అల్పయోగ సంపన్నులు “మేము క్రియాయోగమే
ఆశ్రయిస్తాం!…” అని తలచి తత్ కర్మలయందు అభిమానము అభిమ
కలిగియున్నవారై … నీ చరణకమలములను ఆశ్రయించక పోవటాన్ని (భక్తి యోగం
ఆశ్రయించక పోవటం) కూడా కొందరి విషయంలో చూస్తూ ఉంటాం! వారు
మాయామోహితులై, నీయొక్క మాయకు బద్ధులై ముక్తిని కాంచలేకపోతున్నారేమోనని
నాకు అనిపిస్తోంది.
నిఖిల బాంధవా! అచ్యుతా! అది అట్లా ఉండగా…,
బ్రహ్మ - శివుడు మొదలైన దేవతలు కూడా ప్రకాశమానమగు కిరీటములు ధరించి
తమ శిరస్సులను వంచి మీ పాదపద్మములకు నమస్కరించి మిమ్ములను విష్ణులోకానికి
తిరిగి రమ్మని ఆహ్వానించటం ఈ ఉదయం నేను గమనించాను.
నీవు భక్త వత్సలుడవు. నీకు అయినవారు లేరు. కానివారు లేరు. అందరు నీవారే!
శరణన్నవారిని తప్పక రక్షిస్తావు. అటువంటి నీవు (రామావతారములో) వానరులతో
స్నేహం చేశావు. (ఈ అవతారములో) - అనన్య శరణార్హులైనట్టి నందుడు, గోపికలకు,
(వామనావతారంలో) - బలిచక్రవర్తి మొదలైన వారికి అధీనుడవైయ్యావు.
ఇందులో ఆశ్చర్యమేమున్నది? భక్తులకు వశుడవై ఉండటం, వారిని సర్వవిధాల
రక్షించటం నీ స్వభావమే కదా!
ఎవ్వరైనా సరే, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు మొదలైన వారిపై నీవు చూపిన వాత్సల్యము
- అనుగ్రహము తెలియజేసే విశేషకథలను విన్నతరువాత, సర్వతత్త్వస్వరూపుడవు -
సర్వజీవుల యొక్క ప్రియ అంతర్యామివి - ఈశ్వరుడవు, చతుర్విధ పురుషార్ధములను
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
348
ప్రసాదించు వాడవు అని గమనించిన తరువాత - నిన్ను వదులుకుంటారా? తెలివితక్కువ
వారౌతారా? లేదు. లేదు.
అది అట్లా వుండగా, కొందరైతే నీవు ప్రసాదిస్తున్న స్వర్గలోక సుఖములు చూచుకొని
తెలివితక్కువగా నిన్నే మరుస్తున్నారు! తెలివిగలవాడెవ్వడైనా నిన్ను వదలుకొని
స్వర్గలోకాలు కోరుకుంటాడా? లేనేలేదు. కోరుకోడు!
నీ పాదధూళిని ఆశ్రయించి సేవించే మాకు ఇంకేమి కొదువ?
దేవా! ఎవ్వరైతే నిన్ను భక్తితో శరణువేడతారో… వారి అశుభములను, విఘ్నములను,
విషయవాసలను తొలగిస్తున్నావు. బయట ఆచార్యరూపంగాను, లోపల అంతర్యామిగాను
ఉండి, నీ నిజరూపమును మాకు ప్రసాదిస్తున్నావు.
మాయందే శ్రీకృష్ణతత్త్వమును ఆశ్రయిస్తున్నట్టి మేము భక్తి అనే పరమానందమునందు
నిమగ్నులమై బ్రహ్మజ్ఞాన సంపన్నులం అగుచున్నాము. కల్పాంతము వరకు నీ
నియమానుసారంగా నీ సేవయందు నియుక్తులమగుచున్నాము. నీవు ప్రసాదిస్తున్నది
స్మరిస్తూ పరమానందమును అనుభవిస్తున్నాము. అందుచే శ్రీకృష్ణా! నీ ఋణమునుండి
మేము విముక్తులము అయ్యే ప్రసక్తే లేదు!
శ్రీ శుకమహర్షి : ఓ పరీక్ష్మణ్మహారాజా! ఓ సుభికులారా! ఈవిధంగా అంతరాంతరంగ
అనురక్తచిత్తుడు - భక్తి పారవస్యముతో హృదయమును నింపుకున్నవాడు అయినట్టి
ఉద్దవుడు అనేక స్తోత్రాలు శ్రీకృష్ణ భగవానుకి సమర్పించాడు. ఈ జగత్తంతా తనకు
క్రీడోపకరణం అయినవాడు, స్వశక్తిచే త్రిమూర్తులుగా ప్రదర్శనమగుచు లోకములకు -
సర్వజీవులకు ఆనంద ఐశ్వర్యములను ప్రసాదించువాడు, బ్రహ్మవంటి సృష్టికర్తకు కూడా
ఈశ్వరుడు అగు శ్రీకృష్ణుడు ముగ్ధమనోహరముగా నవ్వుచూ ప్రేమగా ఈవిధంగా
పలికాడు.
శ్రీకృష్ణ భగవానుడు : ప్రియ ఉద్ధవా! సర్వజనావళియొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని
“నిన్ను చేరటానికి సులభమైన మార్గము చెప్పు!” అని నన్ను కోరావు. సహజీవుల పట్ల
నీవలె ప్రేమ-వాత్సల్యము కురిపించువారంటే నాకు చాలా ఇష్టము.
మరణశీలుడగు మానవుడు ఏ శ్రద్ధతో ఏఏ ధర్మములను ఆచరించటంచేత అతి
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
349
దుర్జయమగు మృత్యువును కూడా సులభముగా జదయించటానికి సమర్ధుడు అగుచున్నాడో
అట్టి భాగవత ధర్మములు గురించి చెప్పుచున్నాను. శ్రద్ధగా విను.
శ్లో॥ కుర్యాత్ సర్వాణి కర్మాణి మదర్థం శనకైః స్మరన్
మయ్యర్పిత మనశ్చిత్తో మద్దర్మాత్మమనోరతిః ॥ (అధ్యా 29, శ్లో 9)
ఎవ్వరు ఏ వర్ణాశ్రమ ధర్మములోనైనా ఉండవచ్చుగాక! “నాకు నియమితమైన నా ఈ
స్వధర్మ-కర్మలను సర్వాంతర్యామియగు పరమాత్మకు ప్రేమతో - భక్తితో సమర్పణగా
నిర్వర్తించెదను గాక!…” అను భావాలతో ఆచరిస్తూ ఉండుగాక! శాంత మృదు భావాలతో
నాయందే మనోవృత్తులను నిలిపి, నాపట్ల సర్వదా అనురక్తులై నన్నే ధ్యానించుచు
నాకొరకే అనువర్తించటమే సులభమైన మార్గము. ఎందుకంటే, జీవునకు కర్మ నిర్వహణ
ఎటుతిరిగీ అనివార్యం కదా! “ఇది నా భగవదోపాసనయే (This work is my worship
towards Al-Pervading Divine Presence)” అని భావించి కర్మలు నిర్వర్తించటంలో
కష్టమేముంటుంది చెప్పు!
ఎక్కడ నివసించాలి : ఎక్కడైతే నా భక్తులు నివసిస్తూ ఉంటారో… అది పవిత్రమైన
పుణ్య ప్రదేశము. దేవతలలోను, మానవులలోను, అసురులలోను, వారిమధ్యగల నా
భక్తుల ప్రవర్తన - సంభాషణలే అనుసరణీయాలు. భక్తులున్నచోట నేనుంటాను!
స్వామి ప్రీతి కొరకై : నా ప్రీతికొరకై నృత్య - గీత - వాద్యాదులను చక్కగా నిర్వర్తించి
ఒంటరిగా గాని, ఇతరులతోగాని కలసి యాత్రలు, మహోత్సవములు నిర్వర్తిస్తూ
ఉండెదరుగాక!
పరమాత్మ దర్శనం : నన్ను దర్శించటమంటే భౌతిక రూప సందర్శనమాత్రం కాదు
సుమా! “ఈ కనబడేవారంతా కృష్ణచైతన్య స్వరూపులే…” అను భావన రూపుదిద్దు
కోవటమే అది! సర్వము పరమాత్మయొక్క ప్రత్యక్షరూపంగా దర్శించటమునే ఆత్మ
సాక్షాత్కారము అని, శ్రీకృష్ణ సాయుజ్యము అని చెప్పబడుతోంది. ఆకాశమువలె లోపల
- బయట (అంతర్బహిశ్చ తత్సర్వమ్) పరిపూర్ణుడనై ఉన్నవాడను, ఆవరణ శూన్యుడను,
ఈశ్వరుడను అగునన్ను ఎవ్వడైతే తనయందును, సర్వ సహజీవులయందును,
సర్వమునందును సదా సందర్శిస్తూ ఉంటాడో…. ఆతడే నన్ను దర్శిస్తున్నటు! అదియే
భగవత్ దర్శనము. భాగవతుల మహదాశయము!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ- ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
350
పండితుడు : ఎవ్వరైతే…
కేవలము ఆత్మజ్ఞానమును ఆశ్రయించి,
సర్వభూతములందును నారూపమే ఉన్నదని గమనించి, భావించి,
సమదర్శి అయి |
విద్యావినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును, |
చండాలుడు అని చెప్పబడువానియందు, |
ఒక దొంగయందు,
గొప్ప దానగుణము గల దాతయందు,
|
ఆ దానము స్వీకరిస్తున్న భోక్తయందు,
|
సూర్యునియందు, |
ఒక నిప్పురవ్వ యందు, |
ఒక పరమ శాంత చిత్తునియందు,
ఒక క్రూరునియందు
అంతటా - అన్నిటా, నన్నే సర్వస్థితి - గతులయందు సందర్శిస్తూ ఉంటాడో…
ఆతడే నిత్యానిత్య వివేకియగు పండితుడు! అతడే శ్రీకృష్ణ తత్త్వ సందర్శనుడు!
ఓ ఉద్ధవా! సములు (Peers) - ఉత్తములు (Great People) - హీనులు (Ordinary
People) అగు సర్వ మానవులయందు, సర్వ జీవరాసులయందు నేనే ఉన్నానని
- ఆ భావించు. అప్పుడు ఆ మరుక్షణం అహంకారము అహంకాముతోపాటు స్పర్థ,
స్పర్ధతోబాటు అసూయ తిరస్కార భావాలు మొదలైనవన్నీ స్వభావసిద్ధంగానే
వినష్టమైపోగలవు.
శ్లో॥ విసృజ్య స్మయమానాన్ స్వాన్ దృశం వ్రీడాం చ దైహికీమ్
ప్రణమేద్దండవత్ భూమావ అశ్వచాండాలగోఖరమ్ || (అధ్యా 29, శ్లో 16)
బంధువులు చేసే పరిహాసాలను పట్టించుకోకుండా “సర్వభూతములందు పరమేశ్వరు
డున్నాడు” అను బుద్ధితో ఒక బిచ్చగానికి, అపరిచయస్తునికి, చండాలునికి, ఒక కుక్కకు,
గోవుకు, గాడిదకు… అట్లాగే తదితర సర్వజీవులకు భూమిపై పడి సాష్టాంగ దండ
ప్రమాణము మనస్సుతోనో - దేహంతోనో చేస్తూ వుండు!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
351
“నేను కొందరు-కొందరు కంటే అధికుడను! నా నిపుణత కొంత - కొంతమందికి ఎట్లా
వస్తుందిలే! వారి-వీరి ముందర నన్ను ఎవ్వరైనా తక్కువ చేసి మాట్లాడితే నాకు సిగ్గు,
కోపం!”…. ఇటువంటి అహంకారము-లజ్జలను సమరసభావన అనే జలంతో
పరిశుద్ధము చేసుకోవాలి.
శ్లో॥ యావత్ సర్వేషు భూతేషు మద్భావోనో పజాయతే
తావత్ ఏవమ్ ఉపాసీత వాజ్మనః కాయవృత్తిభిః || (అధ్యా 29, శ్లో 17)
ఎంతెంతవరకైతే సర్వప్రాణులయందు భగవత్ భావన నీయందు సుస్థిరంకాదో….
అంతంత వరకు మనో-వాక్-కాయ కర్మలచే, ఆయా ప్రణామాదులు-ఉపదేశములు
- సాధనములను ఆశ్రయించటం ద్వారా నన్ను ఉపాశిస్తూనే ఉండాలయ్యా!
ఈ దేహము ఉన్నప్పుడు - ఇది పోతున్నప్పుడు - మరొక దేహం వస్తున్నప్పుడు కూడా
ఉపాసనను విడువరాదు.
ఆవిధంగా ఉపాసించువాడు క్రమంగా ఆత్మబుద్ధికి సంబంధించిన విద్యను మరల మరల
అభ్యసిస్తూ సర్వము బ్రహ్మాత్మకమే!… అని భావిస్తూ, సంశయములను
తొలగించుకుంటూ…, ఇక ఆపై సర్వ క్రియలనుండి విరమితుడు కాగలడు!
సులభోపాయం!
ఉపాయాలన్నిటిలో…, సర్వభూతములయందు నన్నే - నన్నే సర్వభూతములుగా
సందర్శించటం గొప్పదైన, సులభమైన మహత్ ప్రభావము అయిన ఉపాయం! అని
నా అభిప్రాయం. ఇదియే ముఖ్యమైన భాగవత ధర్మము. అనుకుంటూ-అనుకుంటూ
వుంటే,…. అనిపించక ఏం చేస్తుంది?
ఎక్కడైతే నిష్కామమగు భాగవత ధర్మము అభ్యసించటం - అనువర్తించటం ప్రారంభ -
మౌతుందో…, అక్కడ ఇక ద్వేషము - అసూయ - కోపము - బాధించటం ఇత్యాది
దుర్గుణములకు చోటు ఉండదు! ఎందుకంటే సర్వజ్ఞుడనగు నేను దుష్టభావములన్నీ
మొదలంట్ల తొలగించటంలో తోడుగా ఉంటాను కనుక! నేనే తొలగిస్తాను కనుక!
శ్రీ ఉద్ధవుడు : శ్రీకృష్ణా! నీకు ఏఏ కర్మలు సమర్పించాలి. ఎటువంటి ఎటువంటి
కర్మలు నీకు సమర్పించటానికి అర్హము కాదు? వివరించ ప్రార్థన!
శ్రీకృష్ణుడు : సర్వకర్మలు నన్ను ఉద్దేశ్యించి నాకు సమర్పించటానికి సంసిద్ధమై “పరమాత్మా!
ఈ కర్మ ద్వారా నిన్ను ఉపాసిస్తున్నానయ్యా!” అని పలికి నిర్వర్తిస్తే…. అట్టి కర్మలు ఏవైనా
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
352
సరే పవిత్రమే కాగలవు.
భయము-శోకము-దుఃఖము-అవమానము మొదలైనవి గాని
ఆ భయ - శోకాదులతో కలిగిన పలాయనము-ఆక్రందనము మొదలైన
కార్యములు కాని,
అవన్నీ కూడా ఆత్మ రూపుడనైనట్టి నన్ను ఉద్దేశ్యించి అనన్యభావంతో నిర్వర్తిస్తే…
అవికూడా త్వరితగతిని ధర్మ స్వరూపములు - కర్మ పుష్పములు కాగలవు. అందుచేత,
ఏ కర్మచేసి నాకుడా… “ఇది నీకే ప్రేమతో సమర్పిస్తున్నానయ్యా!…” అని భావించువాని
కర్మ మార్గమును నేను తప్పక సరిచేసుకుంటాను. అందుచేత, అవినాశనము - సత్యము
అగు నా తత్త్వమును గ్రహించి నన్నుపొందటమే…,
బుద్ధిమంతుల సుతీక్షబుద్ధి యొక్క సత్ప్రయోజనము,
చతురులలోని చతురతయొక్క సత్ఫలము.
నశ్వరము-అసత్యము అగు ఈ భౌతిక దేహము ధరించినందుకు సద్వినియోగము!
ఫలశ్రుతి
విన్నావు కదా! ప్రియ ఉద్ధవా! నాకు భక్తుడువగుటచేత, ప్రేమ-వాత్సల్యములతో నిండిన
పరమసాత్వికుడవు అవటంచేత - దేవతలకు కూడా దుర్రాహ్యమైనట్టి బ్రహ్మతత్త్వమును
సంగ్రహంగా, సంక్షిప్తంగా, కొన్ని కొన్ని విషయాలుకొంతవివరంగా కూడా ఇప్పుడు
నీకు చెప్పాను. విస్పష్టము, యుక్తియుక్తము అయినట్టి ఆత్మసందర్శన - ఆత్మసాక్షాత్కార
విశేషాలు విన్నావు కదా! ఈ విషయాలు తెలుసుకొన్నవారు సంశయరహితులౌతారు!
ముక్తిని పొందగలరు.!
మన ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదములోని నీ ప్రశ్నలు నేనిచ్చిన సమాధానాలు ఎవ్వరైతే
పరిశీలించి సారమును గ్రహిస్తారో, అట్టివారు సనాతనము - పరమ రహస్యము అగు
బ్రహ్మమును పొందగలరు.
నేను నీకు ఈ సందర్భములో ఉపదేశించిన ఆత్మతత్త్వ జ్ఞానమును ఎవ్వరైతే నా భక్తులకు
అందజేస్తారో…,
శ్లో॥ య ఏతన్మమమ భక్తేషు సంప్రదద్యాత్ సుపుష్కలమ్
తస్యాహం బ్రహ్మదాయస్య దదామి ఆత్మానమాత్మనా ||(అధ్యా 29, శ్లో 26)
అట్టి జ్ఞానోపదేష్టకు ప్రేమగా నన్ను నేనే సమర్పించుకుంటాను సుమా!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
353
ఎవ్వరైతే పరమపవిత్రము - చిత్తశోధకము - మనో శుచి ప్రదాయకము అగు మన ఈ
తత్త్వశాస్త్ర సంవాదమును ఎలుగెత్తి తాను పఠిస్తూ - ఇతరులకు చక్కగా శ్రద్ధగా శ్రావ్యమైన
పలుకులతో వినిపించుతాడో ఆతడు పవిత్రుడౌతాడు. అంతేకాకుండా శ్రోతలకు కూడా
జ్ఞానకాంతి దీపమును వెలిగించి వారివారి అజ్ఞానాంధకారమును పటాపంచలు
చేయుచున్న నిపుణుడు అవుతాడు. స తరతి! స తారయతి!
శ్లో॥ య ఏతచ్ఛద్ధయా నిత్యమవ్యగ్రః శృణుయాన్నరః
మయిభక్తిం పరాం కుర్వన్ కర్మభిర్న స బధ్యతే ॥ (అధ్యా 29, శ్లో 28)
ఎవ్వరైతే సావధానముగాను - శ్రద్ధగాను అనుదినము మన ఈ సంభాషణను శ్రవణం
చేస్తారో… వారు నాయందు స్వభావసిద్ధమైన భక్తి ప్రపత్తులను పెంపొందించుకొన
గలరు. తద్వారా కర్మబంధములనుండి సులభంగా విముక్తిని పొందగలరు!
మిత్రమా! ఉద్ధవా! నేను చెప్పిన ఈ బ్రహ్మతత్త్వము నీకు వినటానికి సులభముగానే
ఉన్నదికదా? తేలికగా అవగతం అయిందికదా! నీ మోహము, శోకము, వేదన
తొలగినాయా?
శ్రీ ఉద్ధవుడు : ధన్యోస్మి స్వామీ! ధన్యోస్మి. మీరు నాకు ఇప్పుడు చెప్పియున్న తత్త్వసార
విశేషాలను అనేకులకు బోధిస్తూ… వారితోపాటు నేను ధన్యుడను అవుతాను.
అధ్యయనుడను అవుతాను.
శ్రీకృష్ణుడు : ఈ తత్త్వ రహస్య సమన్వితమైన సంవాద విశేషాలను నీవు…, దాంభికునికి
నాస్తికునికి - మోసము చేయు స్వభావము గలవానికి, వినటానికి ఇష్టం లేనివానికి
- భక్తి లేనివానికి, శుశ్రూష (సేవా) నిరతి లేనివానికి, దుర్నీతి పరునికి…. ఉపదేశించవద్దు
సుమా! ముఖ్యార్ధానికి సంసిద్ధులు కానందువల్ల వారిపట్ల బూడిదలో పోసిన పన్నీరే!
ఆ తీరైన దోషములను సన్నగిల్లచేసుకొన్న వానికి, బ్రాహ్మణులకు - భక్తులకు, సాధు
స్వభావులకు, శుచి అయిన భావములు ఆశయములు కలవానికి తప్పకుండా
ఉపదేశించు. నాయందు భక్తి ఉన్నచో … స్త్రీ - శూద్రులు కూడా ఈ బ్రహ్మతత్త్వ
జ్ఞానము వినటానికి అర్హులే అని అనటంలో కించిత్ కూడా సందేహం లేదు.
అమృతము త్రాగినవానికి ఇంక క్రొత్తగా త్రాగవలసిన పానీయము ఏముంటుంది?
అట్లాగే… మన ఈ సంభాషణాసారమైన ఆత్మజ్ఞాన విశేషాలను చక్కగా తెలుసుకున్న
తరువాత…,
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము -
354
నైతద్విజ్ఞాయ జిజ్ఞాసోః జ్ఞాతవ్యం అవశిష్యతే |
పీత్వా పీయూషమమృతం పాతవ్యం నావశిష్యతే ॥ (అధ్యా 29, శ్లో 32) II
క్రొత్తగా తెలుసుకొనవలసినదేముంటుంది? ఇదంతా పరిశీలించిన శ్రోతలకు వారివారి
అర్హతను ఆశయమును అనుసరించి జ్ఞానము - కర్మ - యోగము - వాణిజ్యములకు
సంబంధించిన చతుర్విధ (4 రకములైన) ధర్మార్థకామమోక్ష పురుషార్ధ ఫలములు
లభించగలవు. ఇక నీవంటి అనన్యభక్తునికైతే … చతుర్విధపురుషార్ధ ఫలములుగా
నేనే అగుచున్నాను.
ఒక్క సారవాక్యం మరొక్కసారి విను.
శ్లో॥మరో యదా త్యక్త సమస్తకర్మా
నివేదితాత్మా విచికీర్షితో మే
తదామృతత్వం ప్రతిపద్య మానో
మయా 22 త్మ భూయాయ చ కల్పతే వై ॥ (అధ్యా 29, உஉ (అధ్యా 29, శ్లో శ్లో 34)
సర్వ కర్మలు నాయందు వదలి, సర్వ కర్మలను మనస్సుచే త్యజించి - సమర్పించిసర్వము నాకు సమర్పణ చేసినవాడు…. యోగులకంటే - జ్ఞానులకంటే కూడా నా
ఇచ్ఛచే మిక్కిలి జ్ఞాన సంపన్నుడు కాగలడు.
క్రమంగా అమృతత్వమగు ఆత్మతత్త్వమే తానై వెలుగొందగలడు! నాతో సమానమైన
మమాత్మా సర్వ భూతాత్మా అను ఐశ్వర్యమునకు అర్హుడగుచున్నాడు.
శ్రీ శుకమహర్షి : ఓ మహనీయులు - తత్త్వస్వరూపులు అగు శ్రోతలారా! సభికులారా!
శ్రీ ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదమగు మహత్తర తత్త్వశాస్త్ర సారవిశేషాలు మీముందు
ఉంచగలగడం శ్రీకృష్ణ ప్రసాదితమైన మహత్తరమైన అవకాశంగా భావిస్తూ సభలోని
మాన్యులకు - పెద్దలకు పేరుపేరున నమస్కరిస్తున్నాను.
ఆవిధంగా సంపూర్ణముగా శ్రీకృష్ణ ప్రవచనమైనట్టి యోగ మార్గోపదేశమును పొందినట్టి
మహనీయుడగు ఆ ఉద్దవుడు భాష్పపూరితలోచనుడయ్యాడు. సత్పురుషులచే మనసావాచా సేవించబడుతూ కీర్తించబడే శ్రీకృష్ణబోధ విని ప్రీతిచే రుద్ధమైన కంఠము
కలవాడయ్యాడు. అంజలి బద్ధుడైనాడు. కాసేపు ఏమీ మాట్లాడలేక పోయాడు!
క్రమంగా ప్రేమతో నిండిన చిత్తముతో మాట్లాడటానికి సంసిద్ధుడైనాడు. కృతార్ధ స్మి!
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
355
నేను కృతార్ధుడను అయ్యాను కదా!…. అని భావించి లేచి శ్రీకృష్ణుడిని సమీపించాడు.
భగవానుని పాదపద్మములను శిరస్సుతో స్పృశిస్తూ కృతాంజలి సమర్పించాడు. ఇట్లు
పలుకసాగాడు.
శ్రీ ఉద్ధవుడు : దేవదేవా! ఆది పురుషా! ఆత్మబంధూ! అస్మత్ చైతన్యాత్మ స్వరూపమా!
శ్రీకృష్ణా! మిత్రమా! సద్గురూ!
శ్లో॥ విద్రావితో మోహ మహాంధకారో ||
య ఆశ్రితో మే తవ సన్నిధానాత్
విభావసోః కిం ను సమీపగస్య
శీతం తమో భీః ప్రభవంత్య జాద్య ॥ (అధ్యా 29, శ్లో 37)
మోహాంధకారములో సుదీర్ఘకాలంగా పడియున్న నేను నీ సాంగత్యం చేత, తత్త్వ
సంభాషణా మాధుర్యము చేత ఉత్సాహ వర్ధనుడనయ్యాను! ఉత్సాహవర్ధనమహమ్!
చీకట్లోంచి నీ సాన్నిధ్యం వైపుగా బయల్వెడలి వచ్చేశాను! సూర్యునియొక్క - అగ్ని
యొక్క సమీపము పొందినవానిపట్ల ఇక చలి-చీకటి-భయము ఉంటాయా? ఉండవు!
తొలగిపోతాయి! నీ సామీప్యత పొందిన నాకు అజ్ఞానాంధకారము వలన భయం ఇక
శేషించదు. ప్రజ్ఞా తత్త్వస్వరూపుడవగు నీ సాన్నిధ్యములో అజ్ఞానాంధకార వీచికలు
నన్ను స్పృశించనే లేవు.
నీకు భృత్యుడనైన నాపట్ల దయగలవాడవై, నీ మాయచే అపహరించబడిన విజ్ఞాన
స్వరూప జ్ఞాన దీపమును తిరిగి నాయందు వెలిగించావు. నీ ఉపకారమును నేను
మాటలలో వర్ణించగలనా? జన్మల జన్మలకు మరువగలనా?
నీ మాయచే యాదవ వంశాభివృద్ధికై దాశార్హ - వృష్టి - అంధక సాత్విత వంశీయుల
యాదవులతో బాటు నన్నుకూడా నీ దృఢస్నేహ పాశములతో కట్టి ఉంచావు. ఇప్పుడో!
ప్రేమాస్పదంగా ఆత్మతత్త్వ జ్ఞానము ప్రసాదించి సర్వ సంసార సృంఖలములను,
స్నేహపాశములను ఖండించివేసి నన్ను అనుగ్రహించావు.
ఓ యోగీశ్వరా! నీకు సహస్రకోటి సాష్టాంగ దండ ప్రణామాలు! నేను సదా ఆర్తుడనై
నిన్ను శరణు వేడినందుకుగాను ప్రతిఫలంగా ఆత్మజ్ఞానామృతాన్ని పంచి ఇచ్చావు. నిన్కొక్క
వరం కోరుకుంటున్నాను.
నాకు నీ చరణ కమలముల పట్ల అనన్య భక్తిని జన్మ జన్మలకు ప్రసాదించమని వేడుకుంటున్నాను.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
356
నా భౌతికమైన కళ్ళకు కనిపించేది చెవులకు వినిపించేది… ఇదంతా శ్రీకృష్ణ
చైతన్యానందమే… అనే విషయం జన్మజన్మలకు మరువకుండునట్టి మనోబుద్ధులను
వరంగా ప్రసాదించమని మిమ్ములను మనసా-వాచా కర్మణా వేడుకొంటున్నాడు.
శ్రీకృష్ణ భగవానుడు : ఓ ఉద్దవా! సంతోషము! నేను సూచించిన విధంగా నా ఆశ్రమమే
(నివాసస్థానమే) అయినట్టి బదరికాశ్రమమునకు ఇప్పుడిక బయలుదేరి వెళ్ళు. అక్కడ
విష్ణు పాద రజముచే పవిత్రముగా చేయబడిన గంగానదీ తీర్థములో స్నానము ఆచరించి,
ఆచమనములను నిర్వర్తించి పవిత్రుడవయ్యెదవు గాక! గంగానదీ తీర్ధముచే నీమనస్సు
నిర్మలమౌతుంది! ఇక అటు తరువాత..,
నారచీరలు ధరించి, కందమూల ఫలములు భుజించి విషయ సుఖములపట్ల ఇచ్ఛధ్యాసలను త్యజించిన వాడవై ఉండెదవుగాక!
శీతము - ఉష్ణము ఇత్యాది ప్రకృతి విషయములపట్ల సహనము కలవాడవయ్యెదవు
గాక!
సహనశీలుడవై - సుశీలుడవై, ఇంద్రియములను వాటి వాటి విషయములతో
సహా జయించివేసి ఉండెదవు గాక!
పరమశాంతుడవు - జ్ఞాన విజ్ఞానయుక్తుడవు అయ్యెదవు గాక! ||
ఇప్పుడు మనం సంభాషించుకున్నట్టి భక్తి - జ్ఞాన - వైరాగ్య మొదలైన
విశేషములపట్ల మననశీలుడవయ్యెదవు గాక!
అట్టి మనో మనన శీలత్వము సహాయంతో నీ మనో-వాక్కులను నిష్ఠతో
|
నాయందుంచుము!
నిత్యము - సదా భాగవత ధర్మమునందు, ఆత్మ సందర్శన ధర్మమునందు ఆసక్తుడవై |
ఉండెదవు గాక!
అర్హులగు సహజీవులకు బోధించెదవు గాక! వారి చెవులలో ఆత్మతత్త్వ జ్ఞానగానము
మార్మోగుచుండునుగాక!
క్రమంగా త్రిగుణాతీతత్వమును అభ్యసిస్తూ దేవ-మనుష్య-తిర్యక్ సంస్కారములను
అధిగమించి త్రిగుణాతీతుడను - నిర్గుణుడను అగునన్ను చేరుకొనెదవు గాక!
శ్రీ శుకమహర్షి : ఓ పరీక్షణ్మహారాజా! ఆవిధంగా ఆ ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానునిచే
ఆజ్ఞాపించబడ్డాడు.
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
357
శ్రీకృష్ణునికి ప్రదక్షిణం 3 సార్లు చేసి ఆయన చరణయుగళమును శిరస్సుపై ఉంచుకొని
ప్రేమాస్పదచిత్తుడైనాడు. ఆనంద భాష్పబిందువులచే శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను
అభిషేకించాడు.
ఏమాత్రం వదలలేక, ప్రేమవలన కలిగే ఎడబాటు సహించలేక ఆయన సమక్షంలోనే
కొంతసేపు మౌనంగా కూర్చునిపోయాడు. అయినప్పటికీ “భగవానుని ఆజ్ఞ
అనుల్లంఘ్యనీయం కదా!…” అని నెమ్మది నెమ్మదిగా గుర్తుచేసుకున్నాడు! ఆయన
పాదుకలను శిరస్సుపై ఉంచుకొని మాటి మాటికి వెనుకకు తిరిగి నమస్కరిస్తూ నెమ్మదిగా
బదరికాశ్రమం వైపుగా అడుగులు వేయసాగాడు.
భక్తాగ్రేసరుడు - పరమభాగవతోత్తముడు అగు ఆ ఉద్ధవుడు తన హృదయములో
శ్రీకృష్ణుని రూపమును నిండుగా నింపుకొని బదరికాశ్రమం చేరాడు.. శ్రీకృష్ణుడు
ఉపదేశించిన విధంగా గంగానదీ స్నానం నిర్వర్తించాడు. భాగవతోత్తములచే
అనుసరించబడుచు - శ్రీ లీలాకృష్ణునిచే ప్రవచించబడిన భాగవత ధర్మాలు
స్వీకరించాడు.
భగవత్ సారూప్యము - సామీప్యమును - సాలోక్యమును - సాయుజ్యమును అతి
స్వల్ప కాలములో సముపార్జించుకున్నాడు.
అధ్యాయము–46.) భక్తిమార్గ సంమిశ్రితమైన జ్ఞానామృతం |
శ్రీ శుకమహర్షి : ఓ భాగవతోత్తములారా! శ్రోతలారా! యోగజన - యోగేశ్వర సేవితుడు
అగు శ్రీకృష్ణ పరమాత్మ భాగవత ప్రధానుడగు మన ఉద్దవునకు ఏ
“భక్తిమార్గంతో సంమిశ్రితమైన జ్ఞానామృతం”
ను ఉపదేశించారో… అట్టి జ్ఞాన-విజ్ఞాన పవిత్రజలమును కొలదిగా సేవించినా కూడా…
ఈ జీవుడు ముక్తుడు కాగలడు. అట్టివాని సంసర్గముచే జగత్తు-జగత్తులోని అనేకమంది
ముముక్షువులు కూడా ముక్తి పొందగలరు.
శ్లో॥ భవభయమపహంతుం జ్ఞాన - విజ్ఞాన సారం
నిగమకృదుపజహ్రే భృంగవత్ వేదసారం
అమృతముదధితశ్చాపాయయత్ భృత్యవర్గాన్
పురుషమృషభమాద్యం కృష్ణసంగం నతోస్మి ॥ (అధ్యా 29, శ్లో 49)
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
358
వేదవేద్యుడు - వేదపురుషుడు - వేదకర్తయగు జనార్ధనుడు
|
జీవుల సంసారభయమును పోగొట్టటానికికై
తుమ్మెద అనేక పూలపై వ్రాలి తేనెను సేకరించువిధంగా
సర్వవేదముల నుండి
|
సారరూపంగా
|
జ్ఞాన విజ్ఞాన శ్రేష్ఠమైనట్టి భాగవతుల భక్తిరసామృతాన్ని వెలికి తీశారు.
|
క్షీరసారగమధనానంతరం ఏవిధంగా విష్ణుభగవానుడు మోహినీరూపంగా మధింపబడిన
క్షీరసాగర జలం నుండి అమృతమును వెలికితీసి తామసిక స్వభావులు, క్రూర
కర్మలయందు ఆసక్తులు అగు అసురలను వంచించి సాత్వికులు, భక్తులు, తన్ను
సేవించువారు అయినట్టి దేవతలకు పంచిపెట్టారో…
ఆవిధంగా…,జగత్కారణుడు ఆద్యుడు - శ్రీకృష్ణనామ సంజ్ఞుడు అగు శ్రీకృష్ణ
చైతన్యానందమూర్తి “ఉద్ధవునితో సంభాషించటం” అనే మిషతో ఉద్ధవ- శ్రీకృష్ణ సంవాద
రూపంగా భక్తిరస పూరిత మాధుర్యముతో కూడిన ఆత్మతత్త్వ జ్ఞానాన్ని - మనలోని
అల్పజ్ఞత-అల్పాశయత్వం తొలగటానికై
మందరికీ పంచిపెట్టారు.
అట్టి మమాత్మ స్వరూపులగు శ్రీ కృష్ణయోగీశ్వర భగవానునికి కృతజ్ఞతాపూర్వకంగా
సాష్టాంగ దండ ప్రణామములు.
శ్రీ వ్యాస భగవాన్! నమో నమో నమో నమః!
ఇతి
శ్రీమద్భాగవతే - మహా పురాణే బ్రహ్మసూత్ర భాష్యే
పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యామ్
ఏకాదశ స్కంధే భగవదుద్ధవ సంవాదే
అధ్యయన పుష్పము
శ్రీకృష్ణ పరబ్రహ్మణి పాదరవిందార్పణమస్తు
చిన్ని కృష్ణుని లీలలు మనకు గ్రంథస్థం చేసి ప్రసాదించిన శ్రీ వ్యాస మహర్షికి,
శ్రీ శుక మహర్షికి, శ్రీ పోతనామాత్యుల వారికి నమో నమో నమో నమః
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ-ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
359
గొల్లవారము
గొల్ల…వారమూ సద్గురుకృపచే పాలవారము…..
1. వరయోగీ…. తిరుమణి గురుసేవ…
వదలక మిము…. కొలచే వారికి…
సాధునెరిగి….రామానుచార్యుల
వార్తలందు…. చల్ల…లమ్మే ॥గొల్లవారము||
2. గోత్రమనియె….తిరుమంత్రముచే
గొడ్డ…లొకటి…. చేత…బూనీ
అండ…గోరాండమనియె
అడవినరకి దొడ్డి…. కట్టే ||గొల్లవారము॥
3. చీకటనియె…కోనలోన
చిట్టడివి మే…సేటి పసువుల
చిత్తమందున….దొడ్డీ…లోన
చెదరకుండ….మంద…చేసే ||గొల్లవారము||
4. అందమైన….బిందెనిండ
చిందకుండ…. పాలు పితకే
పొందికైనా… అనువుమీరా
పొంగకుండా…. పాలు.. కాచే |॥గొల్లవారము||
5. శాంతమను…పా…లారాబోసి
చిత్రాక్షనియె…తోడు చేసి
ఆత్మ అనియె… భాండవలోన
అందముగా… తాయారునచె ||గొల్లవారము||
6. తిరుమంత్రమనియె… కవ్వముతోడ
భుజమంత్రమనియె పెరుగుచిలికి
తిరుమార్ధమనియె…. వెన్న… తీసి
చెదరకుండా… ముద్ద…చేసే ॥గొల్లవారము||
7. అన్నీ విధముల…. అమర కాచీ
వన్నెమీరగ … నేయి చేసి
వినయమనియె… విన్నపముతో
నిష్టతో… నిజగురునిచేరే… నిష్ఠతో శివగురుని చేరే
నిష్టతో కృష్ణ గురుని చేరే…. ||గొల్లవారము||
శ్రీమత్ భాగవత మహాపురాణే ఏకాదశ స్కంధౌ బ్రహ్మసూత్ర భాష్యే శ్రీ శ్రీకృష్ణ - ఉద్ధవ సంవాదం - అధ్యయన పుష్పము
360