[[@YHRK]] [[@Spiritual]]

Soubhāgya Lakshmi Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


ఋగ్వేదాంతర్గత

10     సౌభాగ్య లక్ష్మ్యుపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



సౌభాగ్యలక్ష్మీకైవల్యవిద్యావేద్యసుఖాకృతి .
త్రిపాన్నారాయణానందరమచంద్రపదం భజే ..

స్తోత్రమ్
శ్లో॥ సౌభాగ్య కైవల్య లక్ష్మీ విద్యా వేద్య సుఖాకృతీ ।
త్రిపాద్ నారాయణానంద రామచంద్రపదం భజే ॥

“శ్రీ సౌభాగ్య కైవల్యలక్ష్మీ విద్యచే తెలియబడుచున్న పరమ సుఖాకృతి అయినట్టి త్రిపాద - నారాయణానంద రామచంద్రపదమును భజించుచున్నాము. ఓం శ్రీ ఆనంద - కర్దమ - చిక్లీత ఇందిరాసుత త్రైయార్షేయ నమః! ఓం శ్రీ మాతా మహాలక్ష్మ్యాః నమః


(సౌభాగ్యలక్ష్మీవిద్యాజిజ్ఞాసా)

హరిః ఓం .. అథ భగవంతం దేవా ఊచుర్హే
భగవన్నః కథయ సౌభాగ్యలక్ష్మీవిద్యాం .
తథేత్యవోచత్
ఓం
1.) అథ భగవంతమ్ దేవా ఊచుః
హే భగవన్! స కథయ,
“సౌభాగ్యలక్ష్మీ విద్యామ్” తథే అవోచత్ |

ఓంకార స్వరూపుడగు పరమాత్మకు నమస్కరిస్తూ :
ఒకానొక సందర్భములో దేవతలు భగవంతుడగు శ్రీమన్నారాయణుని దర్శించి, స్తుతించారు.
దేవతలు :  హే భగవాన్ ! శ్రీమన్నారాయణా! లక్ష్మీనారాయణా! ఆదినారాయణా ! మాపై కరుణను వర్షించు మహానుభావా ! జగత్ అంతర్యామీ! మీకు ఒక విన్నపము చేసుకుంటున్నామయ్యా! మాపై దయతో “శ్రీ సౌభాగ్యలక్ష్మీ విద్య”ను మాకు దయయుంచి బోధించ ప్రార్థన.


భగవానాదినారాయణః సర్వే దేవా
యూయం సావధానమనసో భూత్వా శృణుత
తురీయరూపాం తురీయాతీతాన్ సర్వోత్కటాం
సర్వమంత్రాసనగతాం పీఠోపపీఠదేవతాపరివృతాం
చతుర్భుజాం శ్రియం హిరణ్యవర్ణామితి
పంచదశర్గ్భిర్ధ్యాయేత్ .
2.) భగవాన్ ఆదినారాయణః (ఊచుః)
సర్వే దేవా! యూయం
సావధాన మనసో భుత్వా శృణుత!
తురీయ రూపామ్!
తురీయాతీతామ్!
సర్వ-ఉత్కటామ్!
సర్వమంత్రాసన గతామ్|
పీఠ - ఉపపీఠ దేవతా పరివృతామ్|
చతుర్భుజామ్! శ్రియమ్ ।

“హిరణ్య వర్ణామ్”….
ఇతి పంచదశ (15) ఋక్భిః ధ్యాయథ |

శ్రీమాన్ ఆదినారాయణుడు :
ఓ సర్వ దేవతలారా ! “సౌభాగ్య లక్ష్మీ విద్య” చెప్పటానికి సంతోషముగా సిద్ధపడుచున్నాను. మీరంతా కూడా సావధాన చిత్తులై వినండి.
- జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు అతీత - సాక్షి యగు తురీయ రూపిణి.
- తురీయమునకు కూడా కేవల ‘సాక్షి’ యగు తురీయాతీత.
- సృష్టినంతా చిత్ చైతన్యముచే అణువణువు ఉత్తేజ పరచు ‘సర్వోత్కట’ (లేక) సర్వ శ్రేష్ఠ.
- సర్వమంత్రములు తనయొక్క ఆసనముగా కలిగి ఆసీనురాలై ఉన్నట్టి భగవతియే ఆ లక్ష్మి.
- పీఠ-ఉపపీఠ దేవతా స్త్రీలచే పరివృతమైన దేవి!
- నాలుగు భుజములు కలిగి, సర్వ జీవులకు ఆహారము - పానీయము. రక్షణ - ప్రసాదించు ఆపార కరుణామూర్తి! శ్రియమ్ దేవి! శ్రీదేవి!

అట్టి జగజ్జనని, జగత్ పరిపోషిణి యగు సౌభాగ్యలక్ష్మీదేవిని “హిరణ్యవర్ణా…” మొదలుగా గల 15 ఋక్కులతో ముందుగా మీరంతా ధ్యానము చేసెదరు గాక !
(NOTE: ఈ ఉపనిషత్ వ్యాఖ్యానము చివరలో అనుబంధంగా (Annexure) ఇవ్వబడినది.)


అథ పంచదశ
ఋగాత్మకస్య శ్రీసూక్తస్యానందకర్దమచిక్లీతేందిరాసుతా
ఋషయః . శ్రీఋష్యాద్యా ఋచః
చతుర్దశానమృచామానందాద్యృషయః .
హిరణ్యవర్ణాద్యాద్యత్రయస్యానుష్టుప్ ఛందః .
కాంసోస్మీత్యస్య బృహతీ ఛందః .
తదన్యయోర్ద్వయోస్త్రిష్టుప్ . పునరష్టకస్యానుష్టుప్ .
శేషస్య ప్రస్తారపంక్తిః . శ్ర్యగ్నిర్దేవతా .
హిరణ్యవర్ణామితి బీజం . కాంసోఽస్మీతి శక్తిః .
హిరణ్మయా చంద్రా రజతస్రజా హిరణ్యా హిరణ్యవర్ణేతి
ప్రణవాదినమోంతైశ్చతుర్థ్యంతైరంగన్యాసః .
అథ వక్త్రత్రయైరంగన్యాసః . మస్తకలోచనశ్రుతిఘ్రాణ-
వదనకంఠబాహుద్వయహృదయనాభిగుహ్యపాయూరుజానుజంఘేషు
శ్రీసూక్తైరేవ క్రమశో న్యసేత్ .
అథ పంచదశ ‘ఋక్’ ఆత్మకస్య శ్రీ సూక్తస్య
“ఆనంద”, “కర్దమ”, “చిక్లీత”
ఇందిరా సుతా ఋషయః |
శ్రీః ఇతి ఆద్యా ఋచః|
చతుర్దశానామ్ ఋచామ్ ఆనందాది ఋషయః॥
‘హిరణ్యవర్ణామ్’ ఇత్యాది
ఋక్ త్రయస్య అనుష్టుప్ ఛందః|
‘కాంసోస్మి’ ఇతి అస్య బృహతీ ఛందః|
తదన్యయో ఊర్ధ్వయోః త్రిష్టుప్ ఛందః|
అనుష్టుప్ పునః అష్టకస్య|
శేషస్య ప్రస్తార పంక్తిః|
‘శ్రీ’ అగ్నిః దేవతా !
‘హిరణ్యవర్ణామ్’ ఇతి బీజమ్ |
‘కాంసోస్మి’ ఇతి శక్తిః |
హిరణ్మయా చంద్రా రజతస్రజా,
హిరణ్య స్రజా
హిరణ్యా హిరణ్య వర్ణేతి
‘ప్రణవ’ ఆది - ‘నమో’ అంతైః
చతుర్థి అంత్యైః అంగన్యాసః ।
అథ వక్త్రత్రయైః అంగన్యాసః |
మస్త - లోచన - శ్రుతి - ఘ్రాణ -
వదన - కంఠ - బాహుద్వయ -
హృదయ - నాభి - గుహ్య -
పాయు - ఊరు - జాను -
జంఘేషు
శ్రీ సూక్తాః ఏవ క్రమశో న్యశేత్ ॥

అట్టి “పంచదశ (15)” ఋక్ - ఆత్మకమగు ’శ్రీసూక్తము’నకు…

ఋషులు :  1. ఆనంద 2. కర్ధమ, 3. చిక్లీత - త్రి ఋషులు - వీరు ఇందిరా సుతులు.
శ్రీ యం - శ్రీర్మాదేవి మొదలైనవన్నీ ఋక్కులు పదునాలుగు ఋక్కులకు ఆనందుడు మొదలగువారు ఋషులు!

అనుష్టుప్ ఛందస్సు - హిరణ్యవర్ణాం - ఇతి - ఋతి త్రయస్య (మొదటి 3 శ్లోకాలు)
శ్లో॥ హిరణ్యవర్ణాం హరిణీం! సువర్ణ రజత స్రజాం ।
చక్రాం మహిరణ్మయీం లక్ష్మీమ్, జాదవేదో ! మమ ఆవహ!
శ్లో॥ తాం మ ఆవహ జాతవేదో ! లక్ష్మీమ్ అనపగామినీమ్!
యస్యాం హిరణ్యం విన్దేయం గామ్, అశ్వమ్ పురుషాన్ అహమ్ !
శ్లో॥ అశ్వ - పూర్వాం, రథమద్యామ్, హస్తినాద ప్రబోధినీమ్,
శ్రియందేవీమ్ ఉపహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్ ||

బృహతీ ఛందస్సు: - కాసో… అస్మితాన్ ఇతి (4వ శ్లోకం)
కాసోఽస్మితాం హిరణ్యం స్రాకారమ్, ఆర్ద్రాం
జ్వలన్తీం తృప్తాం తర్పయంతీమ్ |
పద్మే స్థితాం పద్మ వర్ణాం తామ్ ఇహ ఉపహ్వయే శ్రియమ్ ||

ఆ తరువాత రెండు స్తోత్ర శ్లోకాలు - త్రిష్టుప్ ఛందస్సు (5 నుండి 6 శ్లోకాలు)
ఆ తరువాత ‘8’ శ్లోకాలు మరల అనుష్టుప్ ఛందస్సు (7 నుండి 14 శ్లోకాలు)
మిగిలిన శ్లోకము ప్రస్తారపంక్తి ఛందస్సు (15వ శ్లోకం)

సంకల్పము : శ్రీ అగ్నిం … దేవతా! (తేజోరూపి)
హిరణ్యవర్ణామ్ - ఇతి బీజమ్! (బంగారు ఛాయ)
కాం సోఽస్మితామ్ … ఇతి శక్తిః (బ్రహ్మమే స్వరూపముగా కలిగి, సర్వదా చిరునవ్వుతో ఉండునది)

అథ ‘ప్రణవ’ ఆది-‘నమో’ అంత (’ఓం’తో ప్రారంభమై ’నమః’తో అంతమగు) చతుర్థాంతములతో కూడిన అంగన్యాసము - 1. ఓం 2. నామము 3. నమః 4. ఓం
ఓం ( హ్రీం శ్రీం క్లీం) హిరణ్మయాయ అంగుష్ఠాభ్యాం నమః ఓం।
ఓం హ్రీం శ్రీం క్లీం) చంద్రాయ తర్జనీభ్యాం నమః ఓం।
ఓం (హ్రీం శ్రీం క్లీం) రజతస్రజాయ మధ్యమాభ్యాం నమః ఓం
ఓం హ్రీం శ్రీం క్లీం) హిరణ్యప్రజాయ అనామికాభ్యాం నమః ఓం।
ఓం (హ్రీం శ్రీం క్లీం) హిరణ్యాయ కనిష్ఠికాభ్యాం నమః ఓం।
ఓం (హ్రీం శ్రీం క్లీం) హిరణ్యవర్ణాయ కరతల కరపృష్ఠాభ్యాం నమః ఓం।

అటు తరువాత…, చతుర్థ్యంత్యములుచే (హిరణ్మయాచంద్ర రజతప్రజా హిరణ్యప్రజా హిరణ్యా హిరణ్యం వర్ణాయ - మస్తకాభ్యాం నమః)
మూడు ముఖములతో అంగన్యాసము! (ఆదిశక్తి - పరాశక్తి - అంతశ్శక్తి ఓం)

ఆ తరువాత…, శ్రీసూక్త మంత్రములతో క్రమంగా అమ్మవారి సర్వాంగ న్యాసము…
మస్తకము (నుదురు), లోచనం (కళ్ళు), శ్రుతి (చెవులు), ఘ్రాణ (ముక్కు), వదన (ముఖము), కంఠ (కంఠము) బాహుద్వయము (రెండుచేతులు), హృదయము నాభి (బొడ్డు), గుహ్య (గుహము, శిశ్నము), పాయువు (విసర్జక రంధ్రము), ఊరు (తొడలు), జాను (మోకాళ్ళు), జంఘ (కాలిపిక్క) - వీటిని న్యాసము (భావనాస్పర్శతో భక్తి సమర్పణ) చేయవలెను.


అరుణకమలసంస్థా
తద్రజఃపుంజవర్ణా కరకమలధృతేష్టాఽభీతియుగ్మాంబుజా చ .
మణికటకవిచిత్రాలంకృతాకల్పజాలైః సకలభువనమాతా
సంతతం శ్రీః శ్రియై నః .. 1..

(సౌభగ్యలక్ష్మీచక్రం)

తత్పీఠకర్ణికాయాం ససాధ్యం శ్రీబీజం .
వస్వాదిత్యకలాపద్మేషు శ్రీసూక్తగతార్ధార్ధర్చా
తద్బహిర్యః శుచిరితి మాతృకయా చ శ్రియం యంత్రాంగదశకం
చ విలిఖ్య శ్రియమావాహయేత్ . అంగైః ప్రథమా వృత్తిః .
పద్మాదిభిర్ద్వితీయా . సోకేశైస్తృతీయా . తదాయుధైస్తురీయా
వృత్తిర్భవతి . శ్రీసూక్తైరావాహనాది . షోడశసహస్రజపః .

(ఏకాక్షరీమంత్రస్య ఋష్యాది)

సౌభాగ్యరమైకాక్షర్యా భృగునిచృద్గాయత్రీ . శ్రియ ఋష్యాదయః .
శమితి బీజశక్తిః . శ్రీమిత్యాది షడంగం .

3.) అరుణ, కమల సంస్థా,
తత్ రజః పుంజవర్ణా,
కరకమల ధృతేష్ణా,
అభీతి యుగ్మాంబుజాచ
మణిమకుట విచిత్రాలంకృత ఆకల్పజాలైః
సకల భువనమాతా
సంతతం శ్రీ శ్రియై నః ॥

తత్ పీఠకర్ణికాయాం
స సాధ్యం ‘శ్రీ’ బీజమ్
వసుః ఆదిత్య కలా పద్మేషు
శ్రీసూక్తగత అర్థార్థ అర్చా,
తత్ బహిర్యః
’యశ్శుచిః’ ఇతి మాతృకయా చ శ్రియమ్,
యంత్రాంగ దశకం చ విలిఖ్య
‘శ్రియమ్’ అవాహయేత్ |
అంగైః ప్రథమా ప్రతిః |
పద్మాదిభిః ద్వితీయా |
లోకేశైః తృతీయా |
తత్ ఆయుధైః తురీయా (చతురీయా) ప్రతిః భవతి ||
శ్రీ సూక్తైః ఆవాహనాది షోడశ సహస్ర జపః |

సౌభాగ్య రమా - ఏకాక్షర్యా (ఏకః + అక్షరః)
భృగుః నృచత్ గాయత్రీ ।
శ్రియో ఋష్యాదయః |
‘శం’ ఇతి బీజశక్తిః | |
‘శ్రాం’ ఇత్యాది (శ్రాం - శ్రీం
- శ్రూం - శైం - శ్రాం - శ్రః)
షడంగమ్ |

స్వచ్ఛమగు తేజస్సుతో విరాజిల్లు ఎర్రటి కమలమున సంస్థితమైనట్టిది, తెల్లటి వెండి వర్ణమున ప్రకాశించి తెల్ల కలువలను చేత ధరించినట్టిది,
- ఇష్టము, అభయము అను యుగ్మపద్మములను ధరించినట్టిది…
- విచిత్రమైన మణులతో ప్రకాశించు కిరీటము ధరించినట్టిది…,
- ఆకల్ప జాలములచే - (అనేక పుష్పములచే) అలంకృత అయినట్టిది…,
సకల భువనములకు అమ్మ అగు సర్వ జగన్మాత శ్రీ లక్ష్మీదేవి మాపట్ల సదా సంపత్ ప్రదాత్రి అయి ఉండునుగాక !

అమ్మవారి ప్రతిమను పీఠముపై పూజించుటకై ప్రతిష్ఠాపించాలి!
తత్ (ఆ) పీఠముయొక్క కర్ణికలంద (నాలుగు మూలలా) సత్ సాధ్య స్వరూపగు ‘శ్రీ’ అను బీజమును సంకల్పించాలి (రచించాలి). శ్రీచక్రమును ప్రతిక్షేపించాలి. అట్టి శ్రీ చక్రమునకు రెండు కలాపద్మములు వసువు-ఆదిత్య దేవతలను ఆహ్వానించి సాంగ-సపరివారంగా ఉపవిష్ఠులను చేయాలి.

వాటికి వెలుపల శ్రీసూక్తమంత్రగతములైనట్టు అర్ధార్థ అర్చలు అలంకరించాలి.
‘యాశ్శుచిః’ అను మాతృకతో ‘శ్రీ’ అక్షరముతోను, యంత్రాంగదశకము (10 విభాగములతో కూడిన శ్రీచక్రమును) రచించి ‘శ్రియమ్’ రూపిఅగు ఆ జగన్మాతను ఆ దశక యంత్రములోనికి ‘శ్రీ’ అని పలుకుచూ ఆహ్వానించాలి.

ఆ దేవీ ప్రతిమను పూజించాలి.
మొట్టమొదటి ప్రతి (Corner)-లక్ష్మీదేవి యొక్క అంగఉపాంగములు.
రెండవప్రతి (Corner) పద్మము - మొదలైనవి.
మూడవ ప్రతి (Corner) - త్రిమూర్తులు, లోకపాలకులు!
నాలుగవ ప్రతి (Corner) - లక్ష్మీదేవి వైభవము, దిక్పాలకులు.

శ్రీ సూక్త జపశ్లోకములతో ఆధ్యాయామి-ఆవాహయామి-నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి … ఇత్యాది షోడశోపచరాములుతో పూజించి
జపమునకు ఉపక్రమించాలి - సహస్ర జపము చేయాలి.

ఓం “సౌభాగ్యరమా” ఏకాక్షరము (ఏకము - అక్షరము అగు స్వరూపము)ను ఉపాసించుచున్నాము.
భృగువు - ఋషి !
నృచత్ గాయత్రి - చంధస్సు |
‘శ్రి’ యో ఋషి సమూహము!
శం - బీజశక్తి.
శ్రాం - శ్రీం - శ్రూం - శైం - శ్రాం - శ్రః - ఇతి షడంగన్యామము. (అంగుష్ఠాభ్యాం - తర్జనీభ్యాం మధ్యమాభ్యాం - అనామికాభ్యాం - కనిష్ఠకాభ్యాం - కరతలకర పృష్టాభ్యాం!)


భూయాద్భూయో
ద్విపద్మాభయవరదకరా తప్తకార్తస్వరాభా శుభ్రాభ్రాభేభయుగ్మ-
ద్వయకరధృతకుంభాద్భిరాసిచ్యమానా . రక్తౌఘాబద్ధమౌలి-
ర్విమలతరదుకూలార్తవాలేపనాఢ్యా పద్మాక్షీ పద్మనాభోరసి
కృతవసతిః పద్మగా శ్రీః శ్రియై నః .. 1..
4.) భూయాత్ భూయో ద్విపద్మా
అభయ వరదకరా
తప్త కార్త స్వరాభా,
శుభ్రాభ్రాభేభ యుగ్మ ద్వయ కరధృత
కుంభాలి రాసిచ్య మానా, రత్నాఘా బద్ధమౌళిః
విమలతర దుకూలార్తవా లేపనాధ్యా
పద్మాక్షీ, పద్మనాభో ఉరసి కృత వసతిః
పద్మగా శ్రీ శ్రియై నః ॥

స్తుతి :
- (వసువు - ఆదిత్యుడు ఆను) ద్వి (2) పద్మములు ధరించినట్టిది, వాత్సల్యముతో, భక్తులపై చిరు నవ్వు కురిపించునది, వరములు ఇచ్చుచూ,అభయము ప్రసాదించు - వరదాభయ చేతులు చూపునది,
- మేలిమి ప్రకాశమానమగు బంగారు ఛాయతో వెలుగుచున్నట్టిది,
- రెండు తెల్ల ఏనుగులు తొండముతో స్వర్ణ కుంభము ధరించి సమర్పించుచున్న అభిషేకము స్వీకరించు దేవి…, రత్నములచే పొదగబడిన కిరీట - వస్త్రములు ధరించి ఉన్నట్టిది,
- ఋతు-అనుకూలమగు సుగంధ లేపనములచే అలంకరించబడినది,
- పద్మము వంటి కనులు గలది, పద్మనాభుని (విష్ణువు) హృదయ కమలములో నివాసము కలిగి ఉన్నట్టిది
అగు శ్రీలక్ష్మీదేవి మాకు సంపద ప్రసాది అగును గాక ! - అని మరల మరల భావిస్తూ… ప్రతిమపై బుద్ధిని నిలపాలి.


(ఏకాక్షరీచక్రం)

తత్పీఠం . అష్టపత్రం వృత్తత్రయం ద్వాదశరాశిఖండం
చతురస్రం రమాపీఠం భవతి . కర్ణికాయాం ససాధ్యం శ్రీబీజం .
విభూతిరున్నతిః కాంతిః సృష్టిః కీర్తిః సన్నతిర్వ్యుష్టిః
సత్కృష్టిరృద్ధిరితి ప్రణవాదినమో తైశ్చతుర్థ్యంతైర్నవశక్తిం
యజేత్ .
తత్పీఠమ్, అష్టపత్రమ్, వృత్తత్రయమ్,
ద్వాదశ రాశిఖండమ్, చతురశ్రం, రమాపీఠమ్ భవతి।
కర్ణికాయాం ససాధ్యం శ్రీ బీజమ్ |
విభూతిః ఉన్నతిః కాంతిః
సృష్టిః కీర్తిః స్థితిః నతిః పుష్టిః
ఉత్కృష్టిః ’బుద్ధిః’ ఇతి ప్రణవాది నమోంతైః
చతుర్థ్యంతైః నవశక్తిమ్ యజేత్ |

ఆ లోక కళ్యాణి, జగన్మాతృమూర్తి యగు శ్రీ సౌభాగ్యలక్ష్మి యొక్క పీఠము ‘అష్టదళము’ (8) దళములచే నిర్మితమైనది. నాలుగు (4) వృత్తములతో, ద్వాదశ (12) రాశిఖండములలోను, చతురస్రము" అయిఉన్నది.
శ్రీ బీజ శ్రీపీఠ కర్ణికలు - విభూతి, ఉన్నతి, కాంతి, సృష్టి, పుష్టి, కీర్తి, స్థితి, నతి, ఉత్కృష్టి, స్వరూపములు. (’ఓం’తో మొదలు-నమో! నమః చివరగా) బుద్ధిని దేవిగాను, ఓంకార సంజ్ఞార్థములోని ’4’ అంశలగు ’అ’కార ’ఉ’కార, ’మ’కార అర్ధమాత్ర రూపిణిగాను, నవశక్తి స్వరూపిణిగాను యజించాలి.


అంగే ప్రథమా వృతిః .
వాసుదేవాభిర్ద్వితీయా . బాలాక్యాదిభిస్తృతీయా .
ఇంద్రాదిభిశ్చతుర్థీ భవతి .
ద్వాదశలక్షజపః .

(లక్ష్మీమంత్రవిశేషాః)

శ్రీలక్ష్మీర్వరదా విష్ణుపత్నీ
వసుప్రదా హిరణ్యరూపా
స్వర్ణమాలినీ రజతస్రజా స్వర్ణప్రభా స్వర్ణప్రాకారా
పద్మవాసినీ పద్మహస్తా
పద్మప్రియా ముక్తాలంకారా చంద్రసూర్యా బిల్వప్రియా ఈశ్వరీ
భుక్తిర్ముక్తిర్విభూతిరృద్ధిః సమృద్ధిః కృష్టిః
పుష్టిర్ధనదా ధనేశ్వరీ
శ్రద్ధా భోగినీ భోగదా సావిత్రీ ధాత్రీ
విధాత్రీత్యాదిప్రణవాదినమోంతాశ్చతుర్థ్యంతా
మంత్రాః . ఏకాక్షరవదంగాదిపీఠం . లక్షజపః .
దశాంశం తర్పణం .
దశాంశం హవనం . ద్విజతృప్తిః . నిష్కామానామేవ
శ్రీవిద్యాసిద్ధిః .
న కదాపి సకామానామితి .. 1..
5.) అంగైః ప్రథమావృతిః వాసుదేవాది ద్వితీయా!  బాలక్యాది తృతీయా! ఇంద్రాదిభిః చతుర్థీ భవతి||
ద్వాదశ లక్ష జపః|

శ్రీర్లక్ష్మీః| వరదా| విష్ణుపత్నీ!
వసుప్రదా। హిరణ్యరూపా। స్వర్ణమాలినీ।
రజతస్రజా| స్వర్ణ ప్రభా। స్వర్ణప్రాకార పద్మవాసినీ।
పద్మహస్తా। పద్మప్రియా|
ముక్తాలంకారా। చంద్రా। సూర్యా।
బిల్వప్రియా| ఈశ్వరీ। భుక్తిః ముక్తిః విభూతిః|
వృద్ధిః సమృద్ధిః। కృష్టిః పుష్టిఃః ధనదా। ధనేశ్వరీ।
శ్రద్ధా! భోగినీ। భోగదా। సావిత్రీ। ధాత్రీ। విధాత్రీ।
ఇత్యాది ’ప్రణవ’ ఆది, ‘నమో’-అంతాః
చతుర్థ్యంతా మంత్రాః ఏకాక్షరపదంగ ఆదిపీఠమ్,
లక్ష జపః దశాంశమ్ తర్పణమ్ |
శతాంశమ్ హవనమ్ । సహస్రాంశం ద్విజతృప్తిః |
నిష్కామానామేవ శ్రీ విద్యాసిద్ధిః।
న కదాపి సకామానామ్ | ఇతి ||

ప్రథమ ప్రతి … అంగములు (First Angle on పీఠము)
ద్వితీయ ప్రతి… వాసుదేవుడు మొదలగువారు (Secong Angle)
తృతీయ ప్రతి… బాలికమహర్షి మొదలగువారు (Third Angle)
నాలుగవ ప్రతి… ఇంద్రుడు మొదలగువారు (Fourth Angle) అయి ఉంటున్నారు.

ద్వాదశ (12) లక్షల జపము | శ్రీ లక్ష్మీ! వరదా! విష్ణుపత్నీ! వసు (భూ) ప్రదా! హిరణ్య (బంగారు) రూపా! స్వర్ణమాలినీ! రజిత (వెండి) ప్రజ! స్వర్ణ ప్రభ! స్వర్ణ ప్రాకార పద్మవాసిని! పద్మహస్త! పద్మ ప్రియ! ముక్తాలంకార! చంద్ర! సూర్యా! బిల్వ (దళ) ప్రియ! ఈశ్వరీ భుక్తి! ముక్తి! విభూతి! వృద్ధి! సమృద్ధి ! కృష్టి - పుష్టి - ధనదా! ధనేశ్వరీ! శ్రద్ధా! భోగినీ ! భోగదా ! సావిత్రీ! ధాత్రీ ! విధాత్రీ !
అని ‘ఓం’ ప్రణవముతో మొదలై, “నమః ఓం” తో అంతమగుచు చతుర్థ్యంత మంత్రమును గానం చేయాలి!

లక్ష్మీదేవి ఆదిపీఠము = ఏకము - అక్షరము అగు పదము.
లక్ష - జపము ; దశాంశము తర్పణము!
శతాంశము… హోమము!
సహస్రాంశము… ద్విజులకు భోజనసేవ!

ఇట్టి వ్రతము ఎవ్వరైతే నిష్కాములై సేవిస్తారో, వారికి ’శ్రీవిద్య’ సర్వప్రదయై సిద్ధించగలదు. ఎందుకంటే ఆ శ్రీవిద్య జాగ్రత్ - స్వప్న - సుషుప్త - తురీయములను దాటివేసినట్టి తురీయతీత స్వరూపిణి కదా!


ద్వితీయః ఖండః

(ఉత్తమాధికారిణాం జ్ఞానయోగః)

అథ హైనం దేవా ఊచుస్తురీయయా మాయయా నిర్దిష్టం
తత్త్వం బ్రూహీతి . తథేతి స హోవాచ .
యోగేన యోగో జ్ఞాతవ్యో యోగో యోగాత్ప్రవర్ధతే .
యోఽప్రమత్తస్తు యోగేన స యోగీ రమతే చిరం .. 1..
6.) అధ హి ఏనం దేవా ఊచుః
తురీయయా మాయయా
నిర్దిష్టం తత్ త్వం బ్రూహి | ఇతి ||
తథ ఇతి సహోవాచ, :
- యోగేన యోగో జ్ఞాతవ్యో!
యోగో యోగాత్ ప్రవర్థతే ।
యో అప్రమత్తస్తు యోగేన స యోగీ రమతే చిరమ్ |

దేవతలు :  హే భగవాన్ ! జగత్గురూ ! శ్రీమన్నారాయణ స్వామీ ! జాగ్రత్ - స్వప్న - సుషుప్తములకు ఆవలగా చెప్పబడు తురీయరూపము యొక్క నిర్దుష్టమైన రూపము ఏదై ఉన్నదో, అద్దాని గురించి మాకు బోధించ వేడుకొనుచున్నాము.

శ్రీమాన్ ఆదినారాయణ స్వామి : ఓ దేవతలారా ! యోగము చేతనే యోగము ఏమిటో తెలియవస్తుంది. యోగము చేతనే యోగము ప్రవృద్ధమగుచున్నది. ఏ యోగి అయితే ‘యోగము’ నందు సదా అప్రమత్తుడై ఉంటాడో, ఆ యోగి చిరకాలము యోగధారణచే కైవల్య లక్ష్మీ స్వరూపిణీ తురీయ పదమును పొందగలడు.

ముందుగా… యోగమును ఆశ్రయించు యోగి యోగాభ్యాసము చేయునప్పుడు కావల్సిన జాగ్రత్త గురించి వినండి.


సమాపయ్య నిద్రాం సిజీర్ణేఽల్పభోజీ
శ్రమత్యాజ్యబాధే వివిక్తే ప్రదేశే .
సదా శీతనిస్తృష్ణ ఏష ప్రయత్నోఽథ
వా ప్రాణరోధో నిజాభ్యాసమార్గాత్ .. 2..

వక్త్రేణాపూర్య వాయుం హుతవలనిలయేఽపానమాకృష్య ధృత్వా
స్వాంగుష్ఠాద్యంగులీభిర్వరకరతలయోః షడ్భిరేవం నిరుధ్య .
శ్రోత్రే నేత్రే చ నాసాపుటయుగలమతోఽనేన మార్గేణ సమ్యక్-
పశ్యంతి ప్రత్యయాశం ప్రణవబహువిధధ్యానసంలీనచిత్తాః .. 3..

(నాదావిర్భావపూర్వకో గ్రంథిత్రయభేదః)

శ్రవణముఖనయననాసానిరోధనేనైవ కర్తవ్యం .
శుద్ధసుషుమ్నాసరణౌ స్ఫుటమమలం శ్రూయతే నాదః .. 4..

విచిత్రఘోషసంయుక్తానాహతే శ్రూయతే ధ్వనిః .
దివ్యదేహశ్చ తేజస్వీ దివ్యగంధోఽప్యరోగవాన్ .. 5..

సంపూర్ణహృదయః శూన్యే త్వారంభే యోగవాన్భవేత్ .
ద్వితీయా విఘటీకృత్య వాయుర్భవతి మధ్యగః .. 6..

దృఢాసనో భవేద్యోగీ పద్మాద్యాసనసంస్థితః .
విష్ణుగ్రంథేస్తతో భేదాత్పరమానందసంభవః .. 7..

అతిశూన్యో విమర్దశ్చ భేరీశబ్దస్తతో భవేత్ .
తృతీయాం యత్నతో భిత్త్వా నినాదో మర్దలధ్వనిః .. 8..

(అఖండబ్రహ్మాకారవృత్తిః)

మహాశూన్యం తతో యాతి సర్వసిద్ధిసమాశ్రయం .

సమాపయ్య నిద్రాం, సుజీర్ణే అల్పభోజీ
శ్రమత్యాజ్య బాధే వివిక్తే ప్రదేశ్,
సదా ఆసీత నిస్తృష్ణ |
ఏష ప్రయత్నో అథవా,
ప్రాణరోధో నిజాభ్యాస మార్గాత్,
వక్త్రేణ ఆపూర్య వాయుం,
హుతవహ అనిల యే
‘అపానమ్’ ఆకృష్య ధృత్వా
స్వ-అంగుష్ఠాది అంగులీభిర్వః
వర కరతలయోః షట్(6)భిః ఏవం నిరుధ్య,
శ్రోత్రే నేత్రేచ నాసా పుట యుగళమ్ అధో
అనేన మార్గేణ సమ్యక్ పశ్యంతి ప్రత్యయాంసమ్
ప్రణవ బహువిధ ధ్యాన సంలీన చిత్తాః ॥
శ్రవణ ముఖ నయన నాసా
నిరోధనేన ఏవ కర్తవ్యమ్ |
శుద్ధ సుషుమ్నా సరణౌ స్ఫుటమ్
అమలమ్ శ్రూయతే నాదః |
విచిత్రఘోష సంయుక్తా
అనాహతే శ్రూయతే ధ్వనిః।
దివ్యదేహశ్చ తేజస్వీ దివ్యగంధోఽపి, అరోగవాన్।
సంపూర్ణ హృదయః-శూన్యే తు
ఆరంభే యోగవాన్ భవేత్ |

ద్వితీయామ్ విఘటీ కృత్య
వాయుః భవతి మధ్యగః।
ధృఢాసనో భవేత్ యోగీ
పద్మాది ఆసన సంస్థితః
‘విష్ణుగ్రంధేః’ తతో భేదాత్
పరమానంద సంభవః|
అతిశూన్యో విమర్దశ్చ
‘భేరిశబ్దః’ తతో భవేత్ |
తృతీయామ్ యత్నతో భిత్వా
నినాదో మర్దళధ్వనిః
‘మహాశూన్యమ్’ తతోయాతి
సర్వసిద్ధి సమాశ్రయమ్ ॥

యోగాభ్యాస విధులు :-
- నిద్రను, జడత్వమును జయించాలి!
- జాగ్రత్‌లో బద్ధకము, అశ్రద్ధలను దరిచేరనీయరాదు.
- అల్పమైన (మితమైన) అహారముతో చక్కగా జీర్ణము కలిగి ఉండాలి.
- “నేను శ్రమ పడుచున్నాను. బాధపడి యోగాభ్యాసము చేస్తున్నాను” - అనునది వదిలి యోగము ఆనందపూర్వకంగా నిర్వర్తించాలి.
- తృష్ణలన్నీ రహితం చేసుకొని ఏకాంత ప్రదేశములో ఆసీనుడై యోగమును అభ్యసించాలి.
- నోటితో (ముక్కుతో) వాయువును పూరించి, అగ్ని నిలయ స్థానమగు జఠరాగ్ని జనిత ప్రదేశము (పొట్ట) లోనికి ఆపానమును ఆకర్షించి, ధరించాలి.
- బొటనవేలు - ఉంగరపు వేలు కలుపుచూ అరచేతి భాగమును నిరోధించి, మిగిలిన ‘6’ వేళ్ళను నిట్టనిలువుగా కదలకుండా ఉంచాలి.
- చెవులను, కళ్ళను, ముక్కుపుటములను, మనస్సుతో వాయుబంధన మార్గముగా బిగదీసి, ప్రాణశక్తితో నింపియుంచి, ప్రణవ నాదమును భావించి, ఆ భావనతో బహువిధములైన ధ్యాసలు గల చిత్తమును లయంచేసి కదలికలు లేనిదిగా చేయాలి.
- ప్రత్యగాత్మ దర్శనము కొరకై చెవులు - ముఖము - కళ్ళు - ముక్కు నందు ప్రాణ ప్రసరణ నిరోధముచే చిత్తమును నిశ్చలము చేయుటము ఇక్కడ ముఖ్యకర్తవ్యము.

అట్టిప్రాణ వాయు నిరోధనాభ్యాసముచే సుషుమ్నా నాడి మార్గము ప్రస్ఫుటమగుచున్నది. నిరోధములు తొలగి - దోషరహిత మగుచున్నది. అట్టి శుద్ధ సుషుమ్నా నాడినుండి స్ఫుటము - అమలము అగు అంతర - నాదము, వినపడగలదు.

దేహములో షట్ చక్రములలో వెన్నెముకయందుండు, అనాహతము నుండి ధ్వని వినబడగలదు. అట్టి అనాహతధ్వనిని వినుచున్న అభ్యాసముగలవాడు దివ్య దేహి, మహా తేజోవంతుడు, దివ్య గంధము గలవాడు, రోగములేని వాడు అగుచున్నాడు.
అట్టివాడు శూన్యమునందు కూడా సంపూర్ణ హృదయుడు, జగత్-ఆరంభమునుండియే యోగవంతుడు కాగలడు.
రెండవ విఘటికి వాయువు మధ్యమము అగుచున్నది.
పద్మాసనమును స్వీకరించినప్పుడు సంస్థితుడైనప్పుడు ఆయోగి ధృడమైన ఆసనుడు అగుచున్నాడు.
అట్టి స్థిరాసన ధారణ - ప్రాణధారణలచే విష్ణుగ్రంధి భేదము జరిగి పరమానందము జనించుచున్నది.

యోగసాధన యొక్క క్రమ - ఉత్కృష్ట ద్వితీయ స్థితియందు అతి శూన్యము నుండి గొప్ప మర్దనానుభవం (As if Pressed) గల భేరీ శబ్ధము, వినబడుచున్నది.
ఇక తృతీయ స్థితిలో మద్దెల నినాదము వినబడగలదు.

ఆ తరువాత ఆతడు ఆ శబ్దములన్నీ త్యజించి సర్వసిద్ధిప్రదమైనటువంటి మహాశూన్య స్థానమును పొందుచున్నాడు. నిర్విషయ పరాకాష్ఠ తత్త్వమును సమాశ్రయించి… అట్టి మహాశూన్యము సిద్ధించుకొనుచున్నాడు. అట్టి శూన్యమునుండి జగత్తుల ఆగమన-నిష్క్రమణములను సాక్షి అయి దర్శిస్తున్నాడు.


చిత్తానందం తతో భిత్త్వా సర్వపీఠగతానిలః .. 9..

నిష్పత్తౌ వైష్ణవః శబ్దః క్వణతీతి క్వణో భవేత్ .
ఏకీభూతం తదా చిత్తం సనకాదిమునీడితం .. 10..

అంతేఽనంతం సమారోప్య ఖండేఽఖండం సమర్పయన్ .
భూమానం ప్రకృతిం ధ్యాత్వా కృతకృత్యోఽమృతో భవేత్ .. 11..

(నిర్వికల్పభావః)

యోగేన యోగం సంరోధ్య భావం భావేన చాంజసా .
నిర్వికల్పం పరం తత్త్వం సదా భూత్వా పరం భవేత్ .. 12..

అహంభావం పరిత్యజ్య జగద్భావమనీదృశం .
నిర్వికల్పే స్థితో విద్వాన్భూయో నాప్యనుశోచతి .. 13..

సలిలే సైంధావం యద్వత్సామ్యం భవతి యోగతః .
తథాత్మమనసౌరేక్యం సమాధిరభిధీయతే .. 14..

యదా సంక్షీయతే ప్రాణో మానసం చ ప్రలీయతే .
తదా సమరసత్వం యత్సమాధిరభిధీయతే .. 15..

యత్సమత్వం తయోరత్ర జీవాత్మపరమాత్మనోః .
సమస్తనష్టసంకల్పః సమాధిరభిధీయతే .. 16..

ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం .
సర్వశూన్యం నిరాభాసం సమాధిరభిధీయతే .. 17..

తృతీయ ఖండః

(ఆధారచకం)

స్వయముచ్చలితే దేహే దేహీ నిత్యసమాధినా .
నిశ్చలం తం విజానీయాత్సమాధిరభిధీయతే .. 18..

యత్రయత్ర మనో యాతి తత్రతత్ర పరం పదం .
తత్రతత్ర పరం బ్రహ్మ సర్వత్ర సమవస్థితం .. 19.. ఇతి.. .. 2..

7.) చిత్తానందం తతో భిత్వా సర్వపీఠగత - అనిలః
నిష్పత్తౌ ‘వైష్ణవః’ శబ్దః క్వణతీతి క్వణో భవేత్ |
ఏకీభూతం తదా చిత్తం
సనకాదిముని ఈడితమ్ ||
అంతే ‘అనన్తమ్’ సమారోప్య
ఖండే ఖండం సమర్పయన్।
భూమానం ప్రకృతిం ధ్యాత్వా కృతకృత్యో అమృతో భవేత్ |
యోగేన ‘యోగం’ - సంరోధ్య
భావం భావేన చ అంజసా,
నిర్వికల్పం పరం తత్వం
సదా భూత్వా పరం భవేత్|
‘అహంభావం’ - పరిత్యజ్య
జగద్భావమ్ అనీదృశమ్,
నిర్వికల్పస్థితో విద్వాన్
భూయో న అపి అనుశోచతి।
సలిలే సైంధవం యద్వత్ సామ్యం భవతి యోగతః,
తథా “ఆత్మ మనసోః ఐక్యమ్”
సమాధిః - అభిధీయతే ||
యదా సంక్షీయతే ప్రాణో
మానసం చ ప్రలీయతే,
తదా సమరసత్వం యత్ -
సమాధిః - అభిధీయతే |
యత్ సమత్వం త్రయోః అత్ర
జీవాత్మ పరమాత్మనోః
సమస్త నష్ట సంకల్పః -
సమాధిః అభిధీయతే । |
ప్రభాశూన్యం మనశ్శూన్యం
బుద్ధిశూన్యం నిరామయమ్,
సర్వశూన్యం నిరాభాసం
సమాధిః అభిధీయతే ॥

స్వయమ్ ఉత్ చలతే దేహే
దేహీ నిత్యమ్ సమాధినా,
నిశ్చలం తం విజానీయాత్
సమాధిః అభిధీయతే॥

యత్ర యత్ర మనోయాతి
తత్ర తత్ర పరం పదమ్,
తత్ర తత్ర పరం బ్రహ్మ
సర్వత్ర సమవత్ స్థితమ్ ||ఇతి||

ఇక ఆ యోగి సర్వపీఠముల వాయువులను ఉపాసించు క్రమంగా దాటి వేసినవాడై, “చిత్తానందము”ను దాటివేయుచూ “చిదానందము” నందు ప్రకాశించుచున్నాడు.
అంతటా ఉనికి రూపము, ఏకోభూతము, సనక - సనందనాదులచే సర్వదా ఉపాసించబడుచున్నది అగు చిత్ చిత్త స్వరూపుడు అగుచున్నాడు.
చివరికి అనంతమగు “ఆత్మలక్ష్మీ వైభవము”ను సంకల్పించుచూ, తదితరమైనదంతా ఖండ - ఖండములుగా చేసి ఆత్మ భావనయందు సమర్పించి వేయుచున్నాడు.
ప్రకృతిని భూమా ఆనంద స్వరూపమగు స్వస్వరూప పరతత్వముగా ధ్యానిస్తూ కృతకృత్యుడై స్వయముగా అమృతానంద స్వరూపుడగుచున్నాడు.
యోగముచే సంయోగ రూపమగు యోగమును నిరోధిస్తూ, భావముచే భావములను మ్రింగివేయుచూ నిర్వికల్పమగు పరతత్వమును ఆశ్రయించి, తత్ అనంత సర్వ - నిర్గుణ, పరరూపము తానే అగుచున్నాడు.

“నేను ఈ దేహమును, ఒక జీవుడను”… అను రూపమగు భావనలను మొదలంట్లా త్యజిస్తూ, వాటిని స్వల్ప విషయములుగా గమనిస్తూ…, ఈ జగత్తు అస్మత్ ఆత్మ స్వరూపమే!"… అనే జగత్ ఆనంద స్వరూప - ధారణను ఆశ్రయిస్తున్నాడు.
నిర్వికల్పస్థితిని ఎరిగి, అద్దానితో మమేకమై, ఇక ఆ విద్వాంసుడు దేహ - దృశ్య - జగత్ విషయములను చూచి ఏ మాత్రము శోచత్వము (దుఃఖము) పొందడు.

నీటిలో ఉప్పుగడ్డ పడవేసి నప్పుడు అద్దానినాను - రూపములు ఏమౌతున్నాయి? కరిగి రహితమైపోతున్నాయి. వాటి జాడకూడా తెలియకుండా పోతున్నాయి కదా !
అదే విధంగా ఎప్పుడైతే ఈ మనస్సు అనే ఉప్పుబొమ్మ తన హావ - భావ - బుద్ధి - ప్రియ - అప్రియ - ఆశయ - ఆకాంక్ష - ఆవేదన - చిత్తానందములతో సహా ‘ఆత్మ దేవి’ యందు ప్రవేశము పొంది సర్వము ఆత్మమయంగా చేసివేస్తుందో… అదియే “సమాధి స్థితి”.

ఎప్పుడైతే, 1) ‘ఇష్టము’ ను తన అంతరస్వరూపముగా కలిగియున్న ప్రాణము, 2) హావ-భావముల రూపమగు మనస్సు ఈ రెండూ ఆత్మతో ఏకమై - అభిన్నమగుచున్నాయో, అప్పుడు ఏర్పడు సమరసభావనా స్థితియే ‘సమాధి’… అని పిలువబడుతోంది.

ఎప్పుడైతే జీవాత్మకు జనిస్తున్న సర్వ సంకల్ప - వికల్పములు వినష్టమై, నిశ్శబ్దము వహించినవై జీవాత్మ - పరమాత్మల ఏకత్వము సహజ భావనగా సిద్ధిస్తుందో , అదియే ‘సమాధి’ అని ప్రవచించబడుతుంది.

ప్రభాశూన్యము; మనశూన్యము; నిర్విషయ నిరామయము (వేరొకటి లేకయే పోవటము). సర్వ శూన్యము, ఆభాసము (ప్రతిబింబత్వము) అనునది మొదలే రహితమైపోవడం… అట్టి స్థితియే సమాధి.

ఈ దేహి ’విషయ శూన్యత’ అను మానసిక అభ్యాసముచే , ‘దేహములోని నేను’ అను సంకుచిత-పరిమిత బంధ భావము నుండి బయల్వెడలి, మాంసమయ దేహము నుండి ఉత్-చలితుడై (బయటకు వచ్చినవాడై), చంచలమునకు ఆవల గల నిశ్చలత్వము ఎరుగుచుండుటయే సమాధి అభ్యాసము. (తరంగాలకు జలము ఆధారమైనట్లు) నిశ్చలుడై చంచల మనోభావములను సాక్షి అయి, తన అంతర్ విశేషములుగా నిత్యము
చూస్తూ ఉండగలగటమే సమాధి!

ఈ 1. కనబడేదంతా (దృశ్యము)ను, 2. చూస్తూ ఉన్నవాడిని (ద్రష్టను) - రెండిటినీ మౌనంగా నిత్యము చూస్తూ ఉండటము) అనబడు (కేవల దృక్ స్థితి) - ఇది సమాధి!

ఈ ఆలోచనల రూపమైన మనస్సు ఎక్కడెక్కడకు వెళ్ళి వాలుచున్నదో అదంతా ఆ మనస్సు స్వభావంగానే పరంబ్రహ్మముగా దర్శించు అభ్యాసముయొక్క ఫలమే సమాధి.

పరమపదము. ఆత్మపదమును అధిరోహించి సర్వత్రా సమమగు పరమాత్మను దర్శించు- మమేకమగు అట్టిస్థితియే…. యోగి సాధించుకొనవలసిన సంస్థితి! సర్వత్ర సమవత్ స్థితమ్!


అథ హైనం దేవా ఊచుర్నవచక్రవివేకమనుబ్రూహీతి .
తథేతి స హోవాచ ఆధారే బ్రహ్మచక్రం త్రిరావృత్తం
భగమండలాకారం . తత్ర మూలకందే శక్తిః పావకాకారం
ధ్యాయేత్ . తత్రైవ కామరూపపీఠం సర్వకామప్రదం భవతి .
ఇత్యాధారచక్రం . ద్వితీయం స్వాధిష్ఠానచక్రం
షడ్దలం . తన్మధ్యే పశ్చిమాభిముఖం లింగం
ప్రవాలాంకురసదృశం ధ్యాయేత్ . తత్రైవోడ్యాణపీఠం
జగదాకర్షణసిద్ధిదం భవతి .
8.) అథ హి ఏనం దేవా ఊచుః :-
నవచక్ర వివేకమ్ అనుబ్రూహీతి।

తథేతి సహోవాచ :-
(1) ఆధారే బ్రహ్మచక్రం।  త్రిరావృత్తి భంగిమండలాకారమ్|
తత్ర మూలకన్దే శక్తిః పావక ఆకారమ్
ధ్యాయేత్, తత్రైవ కామరూపపీఠమ్
సర్వకామ ఫలప్రదమ్ భవతి |
ఇతి ఆధార చక్రమ్ ||
(2) ద్వితీయం స్వాధిష్ఠాన చక్రమ్ |  షట్ (6) దళమ్ |
తన్మధ్యే పశ్చిమాభిముఖం, లింగం ప్రవాళాంకుర
సదృశం ధ్యాయేత్, తత్రైవ ఉడ్యాణపీఠం
జగదాకర్షణ సిద్ధిదం భవతి |

దేవతలు :  హే శ్రీమన్నారాయణ భగవాన్ ! మాకు “నవచక్ర” ధ్యాన - వివేకమును ప్రసాదించ ప్రార్థన !

శ్రీమన్నారాయణుడు :  నవ చక్ర ధ్యానము గురించిన కొన్ని విశేషములు వినండి!
1. మూలాధార : ఇది బ్రహ్మచక్రము. త్రిరావృత్తి (ధ్యాని - ధ్యానము - ధ్యేయము రూపమగు) మండలాకారము. ఈ మూలాధారమునందు శక్తి పావక ఆకారము (అగ్ని ప్రకాశములను) ధ్యానించాలి. ఈ ఆధార స్థానము కామరూప పీఠము. ఈ పీఠము సర్వఫల ప్రదము. ఇక్కడ శక్తి - అగ్ని తేజస్సులను ఆరాధించు వారి సర్వ కోరికలు సిద్ధించగలవు.
2. స్వాధిష్ఠాన చక్రము : ‘6’ దళములు కలది. అద్దాని మధ్యగా (1) పశ్చిమాభి ముఖముగా (Facing towards west) లింగమును, ప్రవాళ అంకుర (రత్నముయొక్క కోణ చివర వంటిది) సదృశమును ధ్యానించాలి. అక్కడ స్వాధిష్ఠాన చక్రములో గల ఉడ్యాణ పీఠము ఆ యోగికి జగదాకర్ష సిద్ధిని ప్రసాదిస్తోంది.


తృతీయం నాభిచక్రం పంచావర్తం సర్పకుటిలాకారం .
తన్మధ్యే కుండలినీం బాలార్కకోటిప్రభాం
తనుమధ్యాం ధ్యాయేత్ . సామర్థ్యశక్తిః సర్వసిద్ధిప్రదా
భవతి . మణిపూరచక్రం హృదయచక్రం .
అష్టదలమధోముఖం . తన్మధ్యే జ్యోతిర్మయలింగాకారం
ధ్యాయేత్ . సైవ హంసకలా సర్వప్రియా సర్వలోకవశ్యకరీ
భవతి . కంఠచక్రం చతురంగులం . తత్ర వామే ఇడా
చంద్రనాడీ దక్షిణే పింగలా సూర్యనాడీ తన్మధ్యే సుషుమ్నాం
శ్వేతవర్ణాం ధ్యాయేత్ . య ఏవం వేదానాహతా సిద్ధిదా భవతి .
(3) తృతీయ నాభిచక్రం | పంచావర్తం । సర్వ కుటిలాకారం ।
తన్మధ్యే కుండలినీం, బాలార్క కోటి ప్రభామ్ |
తనుమధ్యాం ధ్యాయేత్,
సామర్థ్య శక్తిః సర్వసిద్ధిప్రదా భవతి - మణిపూరకచక్రం |
(4) హృదయచక్రం | అష్టదళమ్ | అధోముఖమ్ |
తన్మధ్యే జ్యోతిర్మయ లింగాకారమ్ ధ్యాయేత్ |
స ఏవ హంసకళా, సర్వప్రియా
సర్వలోక వశ్యకరీ భవతి | - (అనాహత చక్రం)
(5) కంఠచక్రం | చతురంగులమ్|
తత్ర వామే ఇడా చంద్రనాడీ,  దక్షిణే పింగళా సూర్యనాడీ
తన్మధ్యే సుషుమ్నాం, శ్వేతవర్ణామ్ ధ్యాయేత్ ।  య ఏవం వేదా ‘అనాహత సిద్ధిదా’ భవతి |

3. నాభిస్థానము - మణిపూరక చక్రము: పంచ (5) ఆవర్తములు (ప్రవాహములు గలిగి ఉన్నది; సర్వకుటిలాకారము (వంకర టింకరగా); ఈ మణిపూరక చక్రమధ్యగా కోటి సూర్యులు ఉదయిస్తున్న కాంతి పుంజములు వెదజల్లు కుండలినీని శక్తి ప్రసరిస్తోంది. అట్టి కుండలినీ శక్తి శరీర మధ్యగా ఉన్నతీరును భావిస్తూ ధ్యానించాలి. అప్పుడు ఆ యోగికి సర్వ సామర్థ్యములు లభిస్తున్నాయి.
4. హృదయ స్థానము - అనాహత చక్రము : ‘8’ దళములు గలది. అధో (క్రిందివైపుగా) ముఖము గలది; అద్దాని మధ్యగా జ్యోతిర్మయ లింగాకారమును ధ్యానించాలి ! ఈ చక్రము హంసప్రియ (సోఽహమ్ ప్రియత్వము) రూపమై, సర్వులకు ప్రియమై, సర్వలోకములు ఆ అనాహత చక్రోపాసకునకు వశ్యము అవగలవు.
5. కంఠ స్థానము - విశుద్ధ చక్రము : 4 అంగుళముల స్థానము. ఇక్కడ ఎడమవైపు ‘ఇడ’ నాడి (చంద్రనాడి), కుడివైపు ’పింగళ నాడి (సూర్యనాడి) ఉన్నాయి. అట్టి కంఠచక్రము (విశుద్ధ చక్రము) మధ్యగా తెల్లటి వర్ణము గల "సుషుమ్న”ను యోగి - ధ్యానించును గాక! ఇది తెలుసుకొని యోగధ్యానము చేయువాడు ఆనాత స్థితి (మనో వాయు నిశ్చల స్థితి) సముపార్జించుకొనుచున్నాడు. అనగా మనోచంచలమునకు సాక్షిత్వము
సముపార్జించుకొనుచున్నాడు.


తాలుచక్రం . తత్రామృతధారాప్రవాహః .
ఘంటికాలింగమూలచక్రరంధ్రే రాజదంతావలంబినీవివరం
దశద్వాదశారం . తత్ర శూన్యం ధ్యాయేత్ . చిత్తలయో భవతి .
సప్తమం భ్రూచక్రమంగుష్ఠమాత్రం . తత్ర జ్ఞాననేత్రం
దీపశిఖాకారం ధ్యాయేత్ . తదేవ కపాలకందవాక్సిద్ధిదం
భవతి . ఆజ్ఞాచక్రమ్ అష్టమం .
(6) తాలు చక్రమ్ | తత్ర అమృతధారా ప్రవాహః|
ఘంటికా లింగం। మూలచక్ర రంద్రే రాజదంతావలంబినీ
వివరమ్| దశమ ద్వారమ్ - తత్ర శూన్యమ్ ధ్యాయేత్,
చిత్తలయమ్ భవతి |
(7) సప్తమం - భూ చక్రమ్ | అంగుష్ఠమాత్రమ్ ! తత్ర జ్ఞాననేత్రమ్!
దీపశిఖాకారమ్ ధ్యాయేత్ !
తదేవ కపాల కన్దమ్ ! వాక్ సిద్ధిదం భవతి |
ఆజ్ఞాచక్రమ్||

6. తాలుచక్రమ్ : గడ్డము - నోరు - కొండనాలుక స్థానము. ఈ చక్రములో అమృతధారా ప్రవాహము ఘంటికా లింగము (కొండనాలుక) ; మూలచక్ర రంధ్రము; రాజ-దంతావలంబనీ వివరము ; (కేవలీభావనా సిద్ధి), దశమ (10వ) ద్వారము. ఇక్కడ "నిర్విషయము -
(భావ-భావములు మధ్య ప్రదేశము) అగు “శూన్యము”ను ధ్యానించెదరుగాక ! అప్పుడు “చిత్త లయము” సులభముగా సిద్ధించగలదు.
7. భ్రూచక్రము : భ్రూమధ్య స్థానము : సప్తమము - అంగుష్ఠమాత్ర పురుష స్థానము; జ్ఞాననేత్రస్థానము. ‘దీపశిఖ’ ఆకారము కలిగి ఉన్నట్టివి. దీనిని కపాల - కన్దము అని కూడా అంటారు. ఇక్కడ చిత్తమును నిలుపుయోగికి ‘వాక్ శుద్ధి’ లభించగలదు.


బ్రహ్మరంధ్రం నిర్వాణచక్రం .
తత్ర సూచికాగృహేతరం ధూమ్రశిఖాకారం ధ్యాయేత్ . తత్ర
జాలంధరపీఠం మోక్షప్రదం భవతీతి పరబ్రహ్మచక్రం .
నవమమాకాశచక్రం . తత్ర షోడశదలపద్మమూర్ధ్వముఖం
తన్మధ్యకర్ణికాత్రికూటాకారం . తన్మధ్యే ఊర్ధ్వశక్తిః .
తాం పశ్యంధ్యాయేత్ . తత్రైవ పూర్ణగిరిపీఠం
సర్వేచ్ఛాసిద్ధిసాధనం భవతి .
(8) అష్టమమ్ బ్రహ్మరంధ్రం। నిర్వాణ చక్రమ్ | తత్ర సూచికా గృహేతరమ్।
ధూమ్ర శిఖాకారమ్ ధ్యాయేత్ | తత్ర జాలంధరపీఠమ్ |
మోక్షప్రదమ్ భవతి |
ఇతి పరబ్రహ్మ చక్రమ్||
(9) నవమమ్ ఆకాశ చక్రమ్ | తత్ర షోడశదళ పద్మమ్ । ఊర్ధ్వముఖమ్ |
తన్మధ్య కర్ణికా త్రికూటాకారమ్ |
తన్మధ్యే ఊర్ధ్వశక్తికాం పశ్యన్ |
ధ్యాయేత్ తత్రైవ పూర్ణగిరి పీఠమ్|
సర్వేచ్ఛా సిద్ధి సాధనమ్ భవతి ||

8. అష్టమము - ఆజ్ఞాచక్రమం : ఇది బ్రహ్మరంధ్రనిర్వాణ చక్రము, ఇక్కడి సూచిక గృహేతరము - ధ్రూమ్ర శిఖాకారమును ఇక్కడ ధ్యానించాలి. ఇక్కడ ధూమ్ర జాలంధరపీఠము… మోక్షప్రదము. ఇది ‘పరబ్రహ్మచక్రము’ అయి ఉన్నది.
9. నవమము ఆకాశచక్రము : “16” దళములతో కూడిన పద్మము, ఊర్ధ్వముఖముగా బాహ్యమునకు విస్తరించి ఉన్నది. ఇద్దానిని ఊర్ధ్వముగా ధ్యానించాలి. ఇద్దాని మధ్యలో త్రికూట ఆకారము. అద్దాని మధ్యలో “ఊర్థ్వ శక్తి”ని (Upward Energy Beyond Skill) దర్శించుచు ధ్యానము చేయాలి. అద్దానియందు ’పూర్ణగిరి పీఠము’ను భావన చేయాలి. ఇది సర్వ ఇచ్ఛలు సిద్ధింపజేయునది అగుచున్నది. విశ్వ విశ్వాంతరములు తనయందు ఇముడ్చుకొనుచున్న స్వస్థానము.


సౌభాగ్యలక్ష్మ్యుపనిషదం
నిత్యమధీతే యోఽగ్నిపూతో భవతి . స వాయుపూతో భవతి . స
సకలధనధాన్యసత్పుత్రకలత్రహయభూగజపశుమహిషీదాసీదాస-
యోగజ్ఞానవాన్భవతి . న స పునరావర్తతే న స పునరావర్తత
ఇత్యుపనిషత్ .
సౌభాగ్యలక్ష్మ్యుపనిదమ్ నిత్యమ్ అధీతే,
సో అగ్నిపూతో భవతి | స వాయుపూతో భవతి ||
స సకల ధన ధాన్య సత్పుత్ర కళత్ర హయ
భూ గజ పశు మహిషీ దాసీ దాస యోగ-జ్ఞానవాన్ భవతి |
స న పునరావర్తతే |
స న పునరావర్తత !
ఇత్యుపనిషత్ ॥

ఎవ్వరైతే ఈ “సౌభాగ్యలక్ష్మి ఉపనిషత్”ను నిత్యము పారాయణము చేస్తూ అర్థాన్ని సేవిస్తారో… వారు అగ్ని పవివత్రులు, వాయుపవిత్రులు అగుచున్నారు. సకల ధన, ధాన్య, సుపుత్ర - సుకళత్రవంతులు అగుచున్నారు. గుర్రములు - భూమి - ఏనుగులు - పశు సంపదలు మొదలైనవన్నీ కోరుకున్న విధంగా కలుగుచున్నాయి. మహిషీ (పట్టపుదేవి), దాస - దాసీ జనుల సేవలు పొందుచున్నారు. యోగజ్ఞాని అగుచున్నారు. మరల పునరావృత్తి ఉండనట్టి మోక్ష స్థానము చేరుచున్నారు.
ఇతి సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్.

ఇతి సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్ ।
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


ఋగ్వేదాంతర్గత

10     సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్

అధ్యయన పుష్పము

“ఓం”కార సంజ్ఞచే సులక్ష్యమగుచున్న పరమాత్మతత్త్వమునకు నమస్కారము!

"శ్రీ సౌభాగ్యలక్ష్మీ మహావిద్య”చే తెలియబడుచున్న పరమసుఖ స్వరూపము త్రిపాద (భూ-భువర్-సువర్ స్వరూప, జాగ్రత్-స్వప్న-సుషుప్తి స్వరూప, జీవ ఈశ్వర-పరమేశ్వర స్వరూప), శ్రీమన్నారాయణానంద - శ్రీరామచంద్ర బ్రహ్మా - సచ్చిదానంద పదమునకు నమస్కరిస్తున్నాము.

ఒక సందర్భములో దేవతలు మహానంద ప్రదము - లోక కళ్యాణకారకము అగు వైకుంఠంమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకొన్నారు. భక్తి ప్రపత్తులతో స్వామికి ప్రణామములు సమర్పించారు. దేవతలంతా సుఖాసీనులైన తరువాత సత్సంగపూర్వకమైన సంవాదము ప్రారంభించబడినది.

దేవతలు :  ఓ సౌభాగ్యలక్ష్మీ హృదయేశ్వరా! జగజ్జనని, జగత్ అంతర్గత మహాకుండలినీ స్వరూపిణియగు మహాలక్ష్మిని నిజహృదయమున కలిగియున్న శ్రీమన్నారాయణ భగవాన్! అపార కరుణామూర్తీ! పావనముల కన్నా పరమపావనమగు ఆత్మవిద్యా సాధన విషయమై మాకు ఉత్తమ “మార్గము - వ్రతము - ఉపాసన" పూర్వకమైన త్రోవను ప్రసాదించండి, బోధించండి!

శ్రీ ఆదినారాయణస్వామి : ఓ ప్రియదేవతలారా! మీ కోరికను అనుసరించి తప్పక చెబుతాను. యూయంసావధాన మనసో భూత్వా, శ్రుణుత! మీరంతా సావధాన మనస్కులై వినెదరుగాక ! నేను నా హృదయమున సర్వదా ఉపాసించు సౌభాగ్యలక్ష్మీదేవీ తత్త్వ మహిమ
వినండి !

దేవదేవియగు ‘సౌభాగ్యలక్ష్మీ దేవి’ యొక్క వాస్తవ తత్త్వమేమిటి? ఇది ముందుగా మనము చెప్పుకొనెదము.

తురీయ రూపామ్
→ జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు, ఎవరియొక్క స్వకీయకల్పనా చమత్కారములో,
→ ఎవ్వరికి జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు మూడూ కూడా వేరువేరైన ప్రదేశములలోని స్వీయకల్పిత క్రీడామైదానములో…,
→ ఎద్దాని నుండి ‘జాగ్రత్ - స్వప్న - సుషుప్తి’ అనుభవములు, భావములు బయల్వెడలినవై, ప్రదర్శితమై, తిరిగి వెనుకకు మరలి అవ్యక్తస్థితిలో సుశాంతించినవి అగుచూ ఉంటున్నాయో
…. అదియే తురీయము.

అట్టి తురీయ రూపమే’ శ్రీలక్ష్మీ దేవీదివ్య రూపము. [(తురీయము = 4వ రూపము (చతురీయము)]. శ్రీ సౌభాగ్యలక్ష్మీ ధామము!

తురీయాతీతము- తురీయమునకు సాక్షి అగు స్వస్వరూపము:

మనము చెప్పుకుంటున్న శ్రీ సౌభాగ్యలక్ష్మీ విభూతి అట్టి తురీయాతీతము కూడా! జాగ్రత్-స్వప్న-సుషుప్తులకే కాకుండా, తత్ సంచాలకుడగు తురీయమునకు కూడా ‘సాక్షి’ అయి ఉన్నట్టిది - కాబట్టి తురీయాతీతము.

సర్వోత్కటామ్:  ఈ పాంచభౌతిక జగత్ృశ్యమునకు, పాంచ భౌతిక దేహమునకు, ఇంద్రియములకు, అంతరంగ చతుష్ఠయమగు మనో-బుద్ధి-చిత్త-అహంకారములకు, జన్మ-మృత్యు-పునర్జన్మ వ్యవహారములకు కూడా వేరై, వాటికి ఆవల ఉన్నదై, కేవల చైతన్యమై వాటన్నిటికంటే ఉత్కటమై (శ్రేష్ఠమై) యున్నట్టిదియే లక్ష్మీదేవి తత్త్వమని గమనించండి! ఉపాసించండి!

సర్వమంత్రాసన గతామ్: శ్రీ మహాలక్ష్మీదేవి సర్వమంత్రాశ్రయ - ధేనువు! సర్వమంత్రములను, తన పీఠముగా కలిగిఉండి, సర్వమంత్రార్థములలోను సారభూతమై వేంచేసియున్నది. సర్వమంత్ర-మంత్రార్థ స్వరూపిణియై విరాజిల్లుచున్నది. హృదయదేవియై విరాజిల్లుచున్నది. కధలోని పాత్రలయొక్క ఆలోచనలన్నీ రచయితవే అయి ఉన్న తీరుగా, సర్వబీజాక్షరములు, వాటి తత్త్వార్థములు ఉపాసనావిధులు… ఇవన్నీకూడా తురీయాతీత, జగద్రచయిత అయినట్టి శ్రీదేవియొక్క కళావైభవమే! ఆ దేవీ మహిమను, దేవీ వైభవమును హృదయమందు నిలుపుకొని నేను కూడా ఈ విశ్వమును పాలిస్తున్నాను.

పీఠ-ఉపపీఠ దేవతా పరివృతామ్ : ఓ దేవతలారా! సర్వతత్త్వ స్వరూపిణి - సర్వజ్ఞానమయి అగు శ్రీ ఆది లక్ష్మీదేవిని ఆశ్రయించిన వారై ఉండండి. సర్వ పీఠ - ఉపపీఠ దేవతామూర్తులంతా పరివృతులై, ఆ జగజ్జనని ఆశీనురాలై ఉన్న పీఠమునకు నలువైపులా స్థానము కలిగి ఉన్నారు. ఆ సౌభాగ్యలక్ష్మి యొక్క పాదపీఠమే దేవలోకములకు ఉనికి స్థానమై ఉన్నది.

చతుర్భుజామ్ - మనో-బుద్ధి-చిత్త-అహంకారములు అనే (మరియు) జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములు అనే సామర్థ్యములచే సృష్టిని నింపి ఉంచుచున్నట్టి దేవి! సృష్టిని తన చైతన్య శక్తితో చేతనము చేయుచున్న లక్ష్మీదేవి!

శ్రియమ్ :  సర్వ జీవులందరికీ సంపదలు, సకల శ్రేయస్సులు కలుగజేయునది.

ఈ విధంగా "హిరణ్యవర్ణాం…”తో ప్రారంభమగుచున్న పంచదశ (15) శ్రీసూక్తాత్మకమైన ఋక్కులతో ముందుగా ఆ జ్ఞానాదంద స్వరూపిణియగు శ్రీ సౌభాగ్యప్రద లక్ష్మిదేవిని ప్రసన్నం చేసుకోవాలి.

అట్టి [ఈ అధ్యయన పుష్పమునకు అనుబంధముగా ఇవ్వబడిన పంచదశ (15)] ఋక్ ఆత్మకమగు శ్రీ సూక్త స్తోత్రములకు -
ఋషులు →→ ఇందిరా సుతులగు ఆనంద, కర్దమ, చిక్లీత ఋషులు.

శ్రీః ఇతి ఆధ్యాఋచః :  అట్టి లక్ష్మీదేవి ప్రసన్నముకొరకై.. “శ్రీ” ఇది మొట్టమొదటి ఋచము (మంత్రము) అగుచున్నది.

చతుర్దశానామ్ ఋచామ్… 14 లోకములు ఆదేవి గానములు

ఆనందాత్… ఋషయః - ఆనందుడు మొదలగువారు ఋషులు. 15 ఋక్కులు కూడా ముగ్గురు ఋషుల దేవీ వర్ణనములు.

ఈ మూడు ఋక్కులు - అనుష్టుప్ ఛందోబద్ధము -
(1) హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజామ్, చన్దామ్ హిరణ్మయీం లక్ష్మీమ్ జాతవేదో మమావహ॥

(2) తామ్ మ ఆవహ జాతవేదో లక్ష్మిమ్ అనపగామినీమ్, యస్యాం హిరణ్యం విన్దేయం గామ్ అశ్వం పురుషాన్ అహమ్||

(3) అశ్వ పూర్వాం రధ మధ్యాం హస్తినాద ప్రబోధినీం, శ్రియం దేవీమ్ ఉపహ్వయే శ్రీః మా దేవీ జుషతామ్॥

ఈ నాలుగవది బృహతీ ఛందోబద్ధము -
(4) కాంసోఽస్మితాం హిరణ్యప్రాకారామ్ ఆర్దామ్ జ్వలన్తీమ్ తృప్తాం, తర్పయంతీమ్! పద్మే స్థితామ్, పద్మవర్ణామ్ తామ్ ఇహ
ఉపహ్వయే శ్రియమ్|

ఇది త్రిష్టుప్ ఛందో బద్ధము -
(5) చంద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవ జుష్టామ్ ఉదారామ్ తామ్ పద్మినీ మీం శరణమ్ అహమ్ ప్రపద్యే
అలక్ష్మీః మే నశ్యతామ్ త్వామ్ వృణే.

ఆ తరువాతి ‘8’ ఋక్కులు (6 నుండి 13) అనుష్ఠుప్ ఛందోబద్ధము.

అటు తరువాత (14, 15) ఋక్కు - ప్రస్తారపంక్తీ ఛందోరూపము.

శ్రీ సూక్త రూప సౌభాగ్యలక్ష్మీ ఉపాసనా విధి

“శ్రీం” అగ్నిః దేవతా! (తేజోరూపిణి)
“హిరణ్యవర్ణామ్” ఇతి బీజమ్ | (బంగారుఛాయ)
“కాంసోఽస్మితామ్”  ఇతి శక్తిః | (చిరునవ్వుముఖము)

హిరణ్మయా! చంద్రా! రజతస్రజా। హిరణ్య స్రజా| హిరణ్యా॥ హిరణ్యవర్ణేతి - ఈ నామములకు ‘ఓం’ ఆది-‘నమః’ అంతము గాను -
ఓం హిరణ్యమయా అంగుష్ఠాభ్యాం నమః
ఓం చంద్రామ్ తర్జనీభ్యాం నమః
ఓం రజతస్రజామ్ మధ్యమాభ్యాం నమః
ఓం హిరణ్యస్రజామ్ అనామికాభ్యాం నమః
ఓం హిరణ్యామ్ కనిష్ఠికాభ్యాం నమః
ఓం హిరణ్యవర్ణేతి కరతలకరపృష్టాభ్యాం నమః

ఈ విధంగా – ప్రణవ ఆది - నామ - నమో అంతైః, చతుర్థి (4వది) అంతైః - అనగా, అర్ధమాత్ర అంతముగా అంగన్యాసః - నాలుగుసార్లు అంగన్యాసము చేయాలి.

ఆ తరువాత పురాణద్రష్టలచే ప్రసాదించబడిన శ్రీలక్ష్మీ ముఖమును భావన చేస్తూ అంగన్యాసము చేయాలి.

ఇక అటుపై అమ్మవారి మస్తకము (నుదురు); కళ్ళు, చెవులు, హృదయము, నాభి, జానువు (మోకాళ్ళు) జంఘము(కాలిపిక్క) భావనచేస్తూ ఈ క్రమంగా అమ్మవారి ఒక్కొక్క అంగమును మనోఫలకముపై నిలుపుకొంటూ పై సంకల్పమును గానం చేయాలి.

పురాణద్రష్టల ప్రవర్ణనమగు శ్రీ సౌభాగ్యలక్ష్మి మంగళరూపమును ధ్యానించాలి.

స్వశరీరంలోనే ఆయా భాగములలో ప్రసన్నలక్ష్మియొక్క ఉనికిని భావిస్తూ శబ్ద పూర్వకంగా ధ్యానం చేయాలి.

స్తోత్రము

శ్లో॥ అరుణ కమల, సంస్థా, తద్రజః || పుంజవర్ణా
కరకమల ధృత ’ఇష్ట - అభీతి’ యుగ్మాంబుజాతా,
మణిమకుట విచిత్రాలంకృత అకల్పజాలైః
సకల భువన మాతా సంతతం శ్రీ శ్రియై నః ||

తా|| స్వచ్ఛమై ఎర్రటి కమలములందు నివాసము కలిగియున్నట్టిది,
కమల పరాగ కిరణముల వంటి ఎర్రటి వర్ణము గల “ఇష్ట - అభయము” అనే రెండు పద్మములను రెండు చేతులతో (ధృత) ధరించినట్టిది….,
పద్మరాగమణులతో అలంకరించబడిన విచిత్ర కిరీటము ధరించినట్టిది…,
ఆకల్ప జాలములతో (కాలస్వరూపిణియై), అనేక కోటి బ్రహ్మాండ జనని అయి, దివ్య విగ్రహంగా అలంకృతమైనట్టిది…,
- అగు సకల భువనమాత శ్రీ సౌభాగ్యలక్ష్మీదేవి మనకు ఎల్లప్పుడూ సర్వసంపదలు ప్రసాదించుచుండును గాక!

పూజా విధి

శ్రీలక్ష్మీ అమ్మవారిని ప్రతిక్షేపించినట్టి ఆ పీఠము యొక్క నాలుగు మూలలా - “స సాధ్యమ్ ’శ్రీ’ బీజమ్” - సత్ సాధ్యస్వరూపమగు ‘శ్రీ’ బీజమును ఆహ్వానపూర్వకముగా సంకల్పిస్తూ చిత్రించాలి. పీఠముపై వసు - ఆదిత్య కళాపద్మములందు శ్రీసూక్తగతమైన అర్ధర్చలు (పూదండలు) బహిర్ అంగరూపంగా సమర్పించాలి.

సత్ = కేవాలాత్మ, సాధ్యము = ప్రకృతి ప్రదర్శనా చమత్కారము,
శ్రీ = సర్వశుభ ప్రదాయి, వసు = వెలుగు, ఆదిత్య = వెలిగించటం. సర్వమునకు మొట్టమొదటే ఉన్న తేజోరూపిణి.

ఆ పీఠముయొక్క వెలుపల "యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాత్ ఆజ్యమ్ అన్వహమ్” … అను మాతృకతో ‘శ్రీ’ అని, ’యంత్రాంగదశము’ను వ్రాయాలి !

అప్పుడు ’శ్రీయమ్’ దేవిని ఆవాహనం చేయాలి.

శ్రీదేవీ ప్రతిరూప విభాగాలు

అప్పుడు శ్రీ సూక్తమంత్రములచే…. ధ్యానముచేస్తూ ఆవాహనముచేసి, ఇక ఆ తరువాత హస్తయో, అర్ఘ్యము, పాదయో పాద్యము; ఉపచారికస్నానము; శుద్ధోదక స్నానము, వస్త్రయుగ్మము, ఉపవీతము; ఆభరణము, గంధము, అక్షతలు ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనము, మంత్రపుష్పము, సాష్టాంగ నమస్కారము… గా గల షోడశ (16) ఉపచారములు సమర్పించాలి.

శక్తి-వసతి అనుసరించి అష్టోత్తర శతనామార్చన, సహస్ర నామార్చన చేయాలి !

జపవిధి

సౌభాగ్య  … ఏకాక్షర్యా
భృగు  … ఋషిః
నృచగాయత్రీ … ఛందస్సు
’శ్రీ’యో … ఋషి నమోవాక్కములు
శ్రీ … దేవతా
శం  … ఇతి బీజశక్తిః

ఇతి శ్రాం-శ్రీం-శ్రూ-శైం-శ్రాం-శ్రః…లతో షడంగ న్యాసము నిర్వర్తించాలి.

స్తోత్రము

శ్లో॥ భూయాత్ భూయో ద్విపద్మా అభయ వరదకరా, తప్తకార్త స్వరాభా,
శుభ్రాభ్రాభేభ యుగ్మద్వయ కరధృత కుంభాత్ భి రాసిచ్యమానా,
రత్నాఘా బద్దమౌళిః విమలతల దుకూలార్తవా లేపనాఢ్యా
పద్మాక్షీ పద్మనాభ ఉరసి కృతవసతిః పద్మగాః శ్రీ శ్రియై నః ||

అన్ని సమయములందూ అభయవరదములు, ఆశ్రిత జన రక్షకములు అగు రెండు చేతులతో, రెండు “అభయ-వరప్రసాద” పద్మములు ధరించి ఉన్నట్టిది, ధగధగాయమానంగా మెరయు మేలిమి బంగారు ఆభరణములు ధరించినట్టిది, తెల్లటి రెండు ఏనుగులు తమ తొండములచే ధరించబడిన కనక కుంభములచే అభిషేకములు చేయబడుచున్నట్టిది; నవరత్నములు పొదగబడిన మహాప్రకాశమానమగు కిరీటము ధరించినట్టిది; నిర్మల ప్రకాశముతో కూడిన పట్టు వస్త్రములు ధరించినట్టిది; సుగంధ లేపనము గలది; పద్మదళముల వలె ప్రకాశమానమగు బ్రహ్మజ్ఞాన నేత్రములు కలది; విష్ణు భగవానుని వక్షస్థలము తన నిత్య నివాస స్థానముగా కలిగి ఉన్నట్టిది - అగు ఆ శ్రీదేవి మాకు జ్ఞాన-సిరి సంపదలు, శ్రేయస్సులు మరల మరల ప్రసాదించునుగాక!  “అమ్మా! శ్రీ సౌభాగ్యలక్ష్మీ! మీ కొరకై మేము సిద్ధము చేసిన ఈ శ్రీపీఠముపై పద్మకళలతో ఆశీనులు అవండి!” అని… జగదంబ యగు సౌభాగ్యలక్ష్మీదేవియొక్క ప్రసన్నము కొరకై స్తోత్రములు సమర్పించెదరు గాక ! ఆ దేవిని ఆహ్వానించిన పీఠమునకు భక్తి - ప్రణతులు సమర్పించెదరు గాక!

శ్రీలక్ష్మీదేవి అధిష్ఠించియుండు పీఠము (శ్రీచక్ర సూత్రానుసారంగా శ్రీ చక్రయంత్రానుసారంగా)

చెవుల స్థానమునందు ససాధ్య (సత్ సిద్ధిస్వరూప) శ్రీ బీజము అలంకరించి (చెవి ప్రోగులుగా) అమర్చబడుచున్నాయి.

ఆ దేవేశి యొక్క విభూతులు…., అష్టదళములు - నవశక్తి తత్త్వములు!
1.) ఉన్నతి (Progress)     2.) కాంతి (Enlightenment)     3.) సృష్టి (Creative ability)
4.) కీర్తి (సర్వే సర్వత్రా కీర్తించబడునది)     5.) బుద్ధి (Wisdom. Discrimination)     6.) స్థితి (Placement)
7.) నతి (నమస్కరించబడునది)     8.) పుష్ఠి (Strength)     9.) ఉత్కృష్ఠి (Placed on the Highest)

ఈ (9) బుద్ధి తత్త్వములు నవ విధకళలుగా ’ఓం’తో ప్రారంభము, ‘నమః’ అంతము (ఉదా: ఓం శ్రీ విభూతిదేవ్యై నమః) గా (’ప్రణవ’ఆది-‘నమః’ అంతముగా) చతుర్ధంతముగా (అర్ధమాత్ర శబ్దముతో) ఉచ్ఛరిస్తూ బుద్ధిరూప నవశక్తి తత్త్వదేవిని ఉపాసించెదరు గాక!

అంగములు… ప్రధమ ప్రతి;
‘వాసుదేవా’ ఇత్యాది… ద్వితీయ ప్రతి;
’బాలక్యా’ ఇత్యాది… తృతీయ ప్రతి;
‘ఇంద్ర’ ఇత్యాది… చతుర్థీ ప్రతి;
ఓం శ్రీ; శ్రీర్లక్ష్మీః; వరదా; విష్ణుపత్నీ నమః ఓం||
ఓం వసుప్రదా; హిరణ్యరూపా; స్వర్ణమాలినీ నమః ఓం||
ఓం రజతస్రజా, స్వర్ణప్రభా నమః ఓం||
ఓం స్వర్ణప్రాకార పద్మవాసినీ నమః ఓం||
ఓం పద్మహస్తా; పద్మప్రియాయై నమః ఓం||
ఓం ముక్తాలంకారా; చంద్ర - సూర్యాయై నమః ఓం||
ఓం బిల్వప్రియా; ఈశ్వరీయై నమః ఓం||
ఓం భుక్తిః, ముక్తిః; విభూత్యై నమః ఓం||
ఓం వృద్ధిః; సమృద్ధియై నమః ఓం||
ఓం కృష్టిః; పుష్టిః ధనద ధనేశ్వరీయై నమః ఓం||
ఓం శ్రద్ధా; భోగిన్డీ; భోగదాయై నమః ఓం||
ఓం సావిత్రీ; ధాత్రీ; విధాత్రీయై నమః ఓం||

ఇటువంటి ప్రణవము - ‘ఓం’ - తో మొదలై, ’నమః’తో ముగుయుచు చతుర్థ్యంతా (అర్ధమాత్రా) మంత్రయుక్త నామావళితో పూజించాలి ! ధ్యానించాలి ! జపించాలి !

4సార్లు పై విధిని పలుకుచూ, చతుర్థ్యంతముగా శ్రీసౌభాగ్యలక్ష్మిని “[1.] నామరూప [2.] ఇహ [3.] ఈశ్వర [4.] పరతత్త్వము”గా భావన చేస్తూ పూజించాలి!

ఏకాక్షరపదంగ-ఆదిపీఠమ్… (ఏక-అక్షర - పదంగ)
1. అనేకముగా కనిపిస్తూ ‘ఏకమే’ అయి ఉన్నదిగాను…, ఈ అనేకముగా కనిపించేదంతా ఏకస్వరూపిణియగు ఆ శ్రీదేవియేగాను…,
2. అక్షర-మార్పు-చేర్పులు లేనట్టిది గాను…,
3. పదంగము - ‘అ’ కారముతో ప్రారంభమై ‘క్ష’ కారమువరకు గల అక్షరములతో నిర్మితమైన పదములన్నీ తన అంగములుగా కలిగినట్టిది గాను,

- సర్వశబ్ద స్వరూపిణిగాను, ఈ నామ రూపాత్మకమైనదంతా తన ఒక అంగముగా కలిగి ఉన్నటిదిగాను ఉపాసించండి.
- సర్వ ఇహములకు పరము (ఆవల)గా ఉన్నట్టి, సర్వ ఇహములను చేతనము చేయు చైతన్యస్వరూపంగా ఆరాధించండి.

ఆది పీఠమ్

అంతేకాదు, “ఆదేవియే ఈ జగత్తుకు ఆదిపీఠము. మూలాధారము. మనమంతా ఆ ఆదిపీఠమునకు అంతర్గతులము" - అని భావన
చేస్తూ స్థుతించండి.

లక్ష జపమ్… నూరువేల జపము. గుఱి-ఆశయ-పరాకాష్ఠ స్వరూపముగా భావన చేయండి! లక్షణయుక్తంగా ఉపాసించెదరు గాక!

దశాంశము… ఆదేవి 10 అంశలు కలిగినదిగా (కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ స్వరూపిణి గా) ఆరాధించండి!

శతాశమానమ్…. ’100’ అంశలు సమర్పితము, సహస్రాంశద్విజతృప్తి… వేయి అంశలతో సహస్రనామావళీ శబ్దములచే సంతోషించునది-అని దర్శిస్తూ, స్థుతించండి!

తెలియబడేదానికంతటికీ ఆధారమై ఉన్నట్టిదిగా ఆ దేవిని భావన చేస్తూ నిష్కాములై, దృశ్యజగత్ ఆధార భావనగా ఉపాసించండి. దృశ్యముతో ‘ఏదోకావాలి’ అను భావనచే ఉపాసిస్తే ఆ దేవి పట్టుబడదు. "ఆ జగన్మాత యొక్క తత్త్వానందమే మా ఆశయము”… అను మహాశయులకు ఆ దేవి సులభ సాధ్యము. ఆ దేవియే తురీయ రూపిణి! మాయా రూపిణి! తురీయమునకు మాయకు సాక్షి కూడా!

దేవతలు :  శ్రీమన్నారాయణా! ఆర్తత్రాణపరాయణా! అటు తురీయతత్త్వము - ఇటు మాయా స్వరూపము కూడా అయినటువంటి ఆ దేవి యొక్క నిర్దుష్టరూపమును నిర్వచించి మాకు బోధించండి - అని మీకు మా విన్నపము. ఆ సౌభాగ్యలక్ష్మీయోగవైభవములో ఆ మేము ప్రవేశించేది ఎట్లా? దయతో శెలవియ్యండి!

శ్రీమన్నారాయణుడు :  ఓ దేవతలారా !

యోగేన యోగోజ్ఞాతవ్యో ! యోగేన యోగాత్ ప్రవర్ధతే !

అందుచేత యోగమును ఆశ్రయించి, నదీజల సముద్ర ప్రవేశమువలె ఆ సౌభాగ్యలక్ష్మీ యోగ వైభవము నందు ప్రవేశితులు అవండి.

ఈ విధంగా, సర్వమునకు ఆధారము - సర్వమునకు పరము - సర్వము అయి ఉన్న ఆ సౌభాగ్యలక్ష్మీదేవీ తత్త్వమును తెలుసుకొని, దర్శించి, ప్రవేశించు ప్రయత్నమే ‘యోగమార్గము’. యో అప్రమత్తస్తు యోగేన, సయోగీ రమతే చిరమ్ ! ఎవ్వరైతే యోగాభ్యాసమునందు అప్రమత్తులై ఉంటారో, వారే ఆ దేవీయోగమునందు ఎల్లప్పుడు రమించగలుగుచున్నారు. నిత్యము యోగమునందు క్రీడించగలరు.

వ్యష్ఠిత్వమును - సమష్ఠత్వమునందు, సమష్ఠత్వమును - సాక్షిత్వమునందు, సాక్షిత్వమును - ‘సర్వము’ అయి ఉన్న సౌభాగ్యలక్ష్మి అఖండాత్మత్వమునందు బుద్ధిని ఏకముచేయటమే యోగమార్గము.

దేవతలు :  స్వామీ ! అట్టి యోగాభ్యాసము గురించి మరికొంత వివరించండి.

శ్రీమన్నారాయణుడు :

ఏ యోగులైతే……

సదా ఆసీనులై ఉండి యోగాభ్యాసము చేస్తారో వారు శ్రీసౌభాగ్యలక్ష్మీ దేవీ సిద్ధిని తప్పక పొందుచున్నారు.

యోగాసనము

“మమాత్మస్వరూపిణి - సర్వాత్మ స్వరూపిణి - జగత్ స్వరూపిణియగు దేవీ ! నమో నమః !” - అని ఎలుగెత్తి మనోబుద్ధిలతో గానం చేయాలి !

శ్రవణ-ముఖ నయన-నాసా నిరోథనేననైవ కర్తవ్యమ్| - ఓ దేవతలారా ! చెవుల-ముఖ-కళ్ళ-నాసాపుటముల ఆయా స్థానములందు ప్రాణచలనమును నిరోధించి, తద్వారా విషయ ధ్యాసలనుండి వెనుకకు మరలటము యోగాభ్యాసములో ముఖ్యముగా నిర్వర్తించవలసినదిగా… యోగాభ్యాసులు గమనించెదరు గాక !

అట్టి ప్రాణవాయునిరోధన అనే శుద్ధ సుషుమ్నా అభ్యాసముచే సుషుమ్నానాడి - అనుభవమునకు వచ్చుచూ, ప్రకాశమానమగుచున్నది. ఆ సుషుమ్న నాడి పరిశుభ్రము దోషరహితము అగుచున్నది.

అట్టి శుద్ధ సుషుమ్నానాడి నుండి సుస్ఫుటముప్రస్ఫుటము-నిర్మలము అగు నాదము (ఓం … లోని అర్ధమాత్రా రూప విభాగ నాదముతో సహా) వినబడుగలదు. దేహములో షట్ చక్రములు స్థాపితమై యున్నట్టి ‘అనాహతము’ నుండి ఆ ధ్వని వినబడగలదు. అట్టి - "అనాహత ధ్వనిని బుద్ధి యొక్క ఏకాగ్రతచే వినటము” అను అభ్యాసముచే యోగి యొక్క దేహము పవిత్రమై, ఇక ఆతడు దివ్యదేహి (దేహము దివ్యత్వానుభూతి ప్రసాదించునదిగా) అగుచున్నాడు. ఆతడు క్రమంగా మహాతేజోవంతుడు, దివ్య గంధములు ప్రభవించువాడు, ఆరోగి అగుచున్నాడు. శారీరక-మానసిక రుగ్మతలు తమకు తామే తొలగుచున్నాయి. విషయములన్నీ అవిషయములగుచున్నాయి.

మొట్టమొదట హృదయమును - జగన్మాతా రూపభావనా అభ్యాసముచే…. క్రమక్రమంగా విషయశూన్యముగాను, సంపూర్ణ విషయరహిత స్వరూపముగాను తీర్చిదిద్దుకోవాలి. సంపూర్ణ హృదయశూన్యేతు ఆరంభే యోగవాన్ భవేత్ ! ఈ విధంగా యోగ సంసిద్ధతకు ఉపక్రమించాలి.

ఇక ఆపై రెండవస్థితిలో (At 2nd stage / phase) వాయునిరోధమునకు (పైన చెప్పినవిధంగా) ఉపక్రమించాలి. ‘విఘటీ’ స్థితిని (నిశ్చలతను) అభ్యాసము చేయాలి. క్రమంగా మూలాధారములో నిదురించు కుండలినీశక్తి సుషమ్నలో ప్రవేశించి బ్రహ్మగ్రంధిని ఛేదించగలదు.

ఆ యోగాభ్యాసి పద్మాసనమునుగాని, శరీరమునకు అనుకూలమైన మరేదైనా స్థిరాసనమునుగాని అవధరించును గాక !

అట్టి స్థిరాసనము - ధారణ - ప్రాణచలన నిరోధనములచే విష్ణుగ్రంధిబేధము జరిగి జగత్తుకు ఆవల స్థానమగు పరమానంద భావన జనించగలదు. జగత్తును నామ రూపాత్మకంగాకాకుండా, విష్ణుస్వరూపంగా సందర్శనము ఆరంభము కాగలదు. యోగసాధన యొక్క తర్వాతి-తర్వాతి స్థితులలో అతిశూన్యస్థానమునుండి గొప్ప మర్ధనానుభవముతో కూడిన భేరీశబ్దములు వినబడసాగుతాయి.

తృతీయ (3వ) యత్నస్థితిలో (Third stage / phase) నినాదముతో కూడిన మర్దళ నినాదధ్వనులు వినబడసాగుతాయి. ఆ తరువాత (At 4th stage) యోగి ఆ శబ్దములన్నీ త్యజిస్తూ, సర్వసిద్ధిప్రదమైనటువంటి ’మహాశూన్యస్థానము’ను పొందుచున్నాడు. ’నిర్విషయ పరాకాష్ఠ’ను ఆశ్రయించుచున్న ఆ యోగి ఒకానొక మహాశూన్య స్థానమును సిద్ధింపచేసుకొనుచున్నాడు. అటు తరువాత (5th stage) మౌనరూపమగు ‘సర్వత్రా ఏకత్వము’ సిద్ధిస్తోంది.

క్రమంగా చిత్తానందసంబంధమైన సర్వదర్శనములను త్యజించి, దాటివేయుచున్నాడు. షట్చక్ర-వాయుస్థానములను అధిగమించి ఏకీభూతము = సనక - సనందనాదుల వంటి బ్రహ్మమానసపుత్రులకు అనునిత్యానుభవము అగు "చిత్చిత్త స్వరూపుడు” అగుచున్నాడు.

అనగా, సర్వపీఠములలోని వైశ్వానరాగ్నిని ఉపాసిస్తూ, చిత్తానందమును దాటివేసి ‘వైష్ణవము’ అను శబ్దముచే చెప్పబడుచున్న సర్వత్రా సర్వమై వేంచేసి యున్నట్టిది, ఏకీభూతము, అణువణువు వ్యాపించి ఉన్నట్టిది, సనకుడు మొదలగువారిచే ఉపాసించబడునది” అగు దేవీతత్త్వోపాసనా చిత్ - సముపార్జించుకొనుచున్నాడు. అంతిమమున అనంతమగు ఆత్మసౌభాగ్యలక్ష్మీవైభవమును సమీపించుచూ, తదితరమైనదంతా ఖండ-ఖండపూర్వకముగా అఖండవైభవమునందు అంతర్గతము చేసివేయుచున్నాడు. ఇక ప్రకృతిని ఆమూలాగ్రము భూమానంద స్వస్వరూపతత్త్వముగా ధ్యానిస్తూ, కృతకృత్యుడగుచున్నాడు. (తత్ స్వయమ్) స్వయముగా అమృతానందమయమగు సౌభాగ్యలక్ష్మీవైభవోపేతుడగుచున్నాడు.

“యోగేన యోగం సంరోధ్య,… భావం భావేన చ అంజసా…,”

“నిర్వికల్పం పరం తత్వం సదాభూత్వా పరంభవేత్”

నిర్వికల్ప-(ఆలోచనా జనన స్థాన) సమగ్ర సహజభావ స్వరూపాన్ని స్వీకరించి, సర్వమునకు ఆవలగల పరస్వరూపమును ఆశ్రయించిఉండునుగాక! అట్టి నిర్వికల్ప (Thoughtless - Thinker conscious) స్థితిని తెలుసుకొని ఆస్వాదించు వాడు, ఆపై ఇక భావముల రాకపోకలను గమనిస్తూ, భావములకు బద్ధుడు కానివాడై, భావములకు ఆది-అతీతస్థానమునుండి భావములను గమనించుచున్నవాడై ఉంటున్నాడు.

ఇక ఆతడు భావపరిధులలో బంధితుడు-సంబంధితుడు కానివాడై, …. కేవలసాక్షిగా ఉన్నవాడగుచున్నాడు.

సమాధి - నిర్వచనములు

మనోలయం :

శ్లో॥ సలిలే సైంధవం యద్వత్ సామ్యం భవతి యోగతః, తథా ఆత్మ మనసోః ఐక్యమ్ “సమాధిః” అభిధీయతే॥

నీటిలో ఉప్పుగడ్డను వేసినప్పుడు అది తన నామ రూపములు త్యజించి నీటిలో కరిగినదై ఇక కనిపించకుండా పోతుంది కదా !

అదే విధంగా ఈ ‘మనస్సు’ అనబడే భావాభావ, ప్రియాప్రియ ఆశ, నిరాశ, ఆకాంక్ష-ఆవేదనాదులతో కూడిన ఉప్పుబొమ్మ ‘ఆత్మ’ అనే జలముతో ఐక్యమయినప్పుడు మనస్సు ఆత్మత్వము సంతరించుకొనుచున్నది. (“మనో వై ఇదగ్ం సర్వమ్| ఆత్మావై మనః అతో ఆత్మావై ఇదగ్ం సర్వమ్”  - అను స్థితి-స్వానుభవము అనునిత్యమవటమే “సమాధి” - అని చెప్పబడుచున్నది. (ఈ దృశ్యముగా పొందబడేదంతా స్వీయమనోరూపమే! మనస్సు ఆత్మరూపమే! కనుక ఇదంతా ఆత్మరూపమే!)

ప్రాణసమరసత్వమ్ : 

యదా సంక్షీయతే ప్రాణో మానసంచ ప్రలీయతే, తదా సమరసత్వం యత్ సమాధిః అభిధీయతే॥

ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి మనస్సుతోసహా క్షీణించినదై ‘ఆత్మ’ యందు లీనమగుచూ ‘సమరసత్వము’ పొందుచున్నదో అప్పటి ఆ సామరస్య - సమరస స్థితియే సమాధి ! మనస్సు, ప్రాణము ఆత్మకు అనన్యంగా దర్శించబడినప్పుడు, అట్టి స్థితియే సమాధి.

జీవాత్మలయమ్ : 

యత్ సమత్వం తయోః అత్ర జీవాత్మ పరమాత్మనో సమస్తనష్ట సంకల్పః సమాధిః అభిదీయతే। 

ఎప్పుడైతే తాను ఆశ్రయిస్తున్న సంకల్పములను త్యజించి ‘సదా సర్వ - సమత్వము’ అనే లక్షణమును ఆశ్రయించి ఈ జీవుడు ఆత్మత్వము పుణికి పుచ్చుకుంటాడో, … అదియే ‘సమాధి’ అను పేరుతో ఉద్దేశ్యించబడుచున్నది.

సర్వశూన్యం, ప్రభా శూన్యం, మనః శూన్యం. బుద్ధి శూన్యం, నిరామయమ్, సర్వం శూన్యం నిరాభాసం సమాధిః అభిధీయతే।

ప్రభాశూన్యం - తెలియబడునది తెలుసుకొనువాడు - ఇరువురి భేదము రహితమయినప్పుడు, (ఏకత్వము పొందినప్పుడు),
మనోశూన్యం - ఆలోచించబడునది-ఆలోచించువాడు.. ఈ రెండు ఏకత్వ స్థితికి చేరినప్పుడు,
బుద్ధిశూన్యం - తెలియబడునది-తెలివికలవాడు… ఈ రెండూ అభేదము పొందినప్పుడు,
నిరాభాసం - అభాస-ప్రతిబింబించు స్వభావము రహితమై, సర్వము స్వయంప్రకాశ రూపమే అగుచున్నప్పుడు…,
నిరామయం - వస్తువు - వస్తుభావకుడు, అనుభవము-అనుభవి… ఇవికూడా నిర్విషత్వమగుచుండగా, అప్పటికీ శేషించియే ఉండు కేవలీస్వస్వరూపాస్వాదనయే ‘సమాధి’ అని అనబడుచున్నది. అదియే శ్రీదేవీ తత్త్వము!

శ్లో॥ స్వయం ఉత్-చలితే దేహే, దేహీ నిత్యం సమాధినా।
నిశ్చలం తమ్ విజానీయాత్ ‘సమాధిః’ అభిధీయతే॥

దేహీ అనునిత్య ‘ఉత్’ భావన :

ఈ దేహము లోని దేహిత్వము యొక్క అనుక్షణికమైన నిత్యోదితత్వము, నిశ్చలస్వస్వరూపాను సంధానము, ఆత్మత్వమును ఎరిగి ఆస్వాదించుచుండటమే ‘సమాధి’ అని చెప్పబడుచున్నది. దేహభావమును వదిలి ‘దేహి’ భావము ఆశ్రయించటమే సమాధి !

మనస్సు - పరబ్రహ్మ భావన:

యత్ర యత్ర మనో యాతి, తత్ర తత్ర పరంపదమ్, తత్ర తత్ర పరంబ్రహ్మ సర్వదా సమవస్థితమితి। 

మనస్సు ఎక్కడెక్కడ వ్రాలితే, ఈ మనస్సు అక్కడక్కడ పరమపదమగు పరబ్రహ్మమునే ఆస్వాదిస్తూ, సర్వత్రా సమస్థితి కలిగి ఉండటము ఇదియే సమాధిస్థితి యొక్క సహజ స్వభావము.

నవ చక్ర స్థానములు - తత్ స్థాన-ధ్యాన ఫలములు

దేవతలు :  హే నారాయణ భగవాన్ ! సౌభాగ్యలక్ష్మీతత్త్వ మహిమగురించి మహత్తరమగు విశేషాలు చెప్పుచున్నారు ! స్వామీ ! ఇప్పుడు లక్ష్మీదేవి నవకళా విశేషంగా చెప్పబడుచున్న దేవీ నవచక్రముల గురించి వివరించి ప్రార్థన.

శ్రీమన్నారాయణుడు: కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాము. వినండి!

yoga-chakras

1.) ప్రథమం - ఆధారము : మూలాధారచక్రం : ఇది బ్రహ్మచక్రము

అట్టి మూలాధారములో ప్రకృతి-పురుష సమన్వితమగు కేవలశక్తి స్వరూపమును మూలకందనమునందు పావక ఆకారముగా (అగ్ని రూపముగా) ధ్యానించాలి. తేజోరూపము భావించి, ధ్యాస నిలపాలి!

2.) ద్వితీయం - స్వాధిష్ఠాన చక్రము (ఉత్-యానము-Leading to upward)

ఇక్కడ బుద్ధి-ఇచ్ఛలను నిలిపి ధ్యానించినప్పుడు ఆయోగి జనాకర్షణసిద్ధిని పొందుచున్నాడు.

3.) తృతీయ - నాభిచక్రం - మణిపూరకం

అట్టి మణిపూరకచక్రమధ్య స్థానమును ధ్యానించుటచే సర్వసామర్థ్యశక్తులు పెంపొందుతాయి. ఈ స్థానము సర్వసిద్ధులు ప్రసాదించునది. సిద్ధింపజేయునది.

4.) చతుర్థ - హృదయచక్రము: అనాహతచక్రము 

ఇది హంసకళ. సర్వప్రియ అయినట్టిది. అందుచేత సర్వలోక వశకరము అయిఉన్నది.

5.) పంచమ - కంఠచక్రము : విశుద్ధ చక్రము

అట్టి ‘సుషుమ్న నాడి’ని తెలుసుకోవటముచేత ‘అనాహతసిద్ధి’ (వాయునిశ్చలస్థితి, ప్రాణనిరోధస్థితి)… సిద్ధిస్తోంది.

6.) షష్ఠ-తాలుచక్రమ్  

అట్టి ధ్యానముచేత ‘చిత్తలయము’ సిద్ధించుచున్నది.

7.) సప్తమమ్ - భ్రూ చక్రము- ఆజ్ఞా చక్రము

అట్టి భూ చక్రములో దీపశిఖవంటి ప్రజ్ఞాతత్వకాంతిని ఉపాసించుటచే ఈ చక్రస్థానము వాక్సిద్ధి ప్రదాత అగుచున్నది.

8.) అష్టమమ్ - బ్రహ్మరంధ్రమ్ - నిర్వాణచక్రము

ఇక్కడ - బ్రహ్మరంధ్రమునందు ధ్యాస - ధ్యానము మోక్ష ప్రదము. అందుచేత “పరబ్రహ్మచక్రము” అని కూడా అంటున్నారు.

9.) నవమమ్ - ఆకాశచక్రమ్

సర్వేచ్ఛా సిద్ధి సాధనం భవతి। ఇది సర్వ ఇచ్ఛలను సిద్ధింపజేయునది.


ఫలశ్రుతి

సౌభాగ్యలక్ష్మ్యుపనిషదమ్ నిత్యమ్ అధీతే, స వాయుపూతో భవతి |

ఈ ఉపనిషత్ నిత్యము ఉపాశించు యోగి,

అట్టి వారు పునరావృత్తి లేనటువంటి మోక్షస్థానము చేరినవారై ఉంటున్నారు.

🙏 ఇతి సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్ । 🙏
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥


సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్ - ప్రథమ అనుబంధము

శ్రీ సూక్తమ్ (మంగళ శ్లోక తాత్పర్యములతో)

(పంచదశ శ్లోకీ)


హరిః ఓం |
1.) హిరణ్యవర్ణాం హరిణీం,
సువర్ణ రజత స్రజాం।
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం
జాతవేదో! మమ ఆవహ ||

ఓ జాతవేదా ! అగ్నిదేవా ! బంగారు ఛాయగలిగినట్టిది, పచ్చనికాంతి వెదజల్లునది, వెండివలె తెల్లని వర్ణములు గల పుష్పమాలికలను ధరించినట్టిది, పూర్ణ చంద్రునివలె ప్రశాంతకాంతులతో ప్రకాశించునట్టిది, … బంగారు కిరణములతో వెలుగొందుచున్నట్టిది అగు - శ్రీలక్ష్మీదేవిని మాకొరకై మా వద్దకు ఆహ్వానించండి! |

2.) తామ్ మ ఆవహ, జాతవేదో!
లక్ష్మీమ్, అనపగామినీమ్,
యస్యాం హిరణ్యం విన్దేయం
గామ్ అశ్వం పురుషాన్ అహమ్ ||

ఓ సద్గురు వరేణ్యా! జాతవేదా ! అనపగామిని (గమన-ఆగమనములు లేనట్టిది) అగు శ్రీ లక్ష్మీదేవిని మా కొరకై పిలుచుకురండి. ఏ తల్లి దయచే మేము గో - అశ్వ - ప్రాణశక్తి - వ్యవహార సామర్థ్య సంపదలను పొందుచున్నామో… ఆ మాతృవాత్సల్యనీ సామీప్యమును మేము మీ సహాయముచే పొందెదముగాక !

3.) అశ్వపూర్వాం రథ మధ్యాం
హస్తినాద ప్రబోధినీం,
శ్రియం దేవీమ్ ఉపహ్వయే
శ్రీః మా దేవీః జుషతామ్ ||

తెల్లటి గుర్రములచే పూర్చబడిన రధము మధ్యగా ఆనందముగా, చిరునవ్వు చిందిస్తూ ఆశీనురాలై ఉండగా, తెల్లటి ఏనుగలనాదములను వింటూ అలవోక చిరునవ్వుతో విచ్చుకుంటున్న కనులుగల ఈ దేవి యొక్క అనుగ్రహవీక్షణలు మేము పొందెదముగాక ! మా వద్ద ఆ జనని నెలకొని ఉండును గాక!

4.) కాంసో, స్మితాం, హిరణ్య ప్రాకారామ్,
ఆర్దాం జ్వలంతీం, తృప్తాం తర్పయన్తీమ్|
పద్మేస్థితాం, పద్మవర్ణాం
తామ్ ఇహ ఉపహ్వయే శ్రియమ్ ||

పరబ్రహ్మస్వరూపిణి, మందస్మిత వదనారవింద చిరునగవులు చిందించుమోము గలది, బంగారు ఛాయలతో ప్రకాశించునది, క్షీరసముద్రములో జనించుటచే ఎల్లప్పుడూ పాలతో తడిసి యున్నట్టిది, భక్తుల అభీష్టములను ప్రసాదిస్తూ ‘తృప్తి’ యందు తడిపి వేయునది, నమస్కరించినంతమాత్రము చేత సిరి - సంపదలతో నింపి వేయునది, పద్మము నందు నివాసము (స్థితి) కలిగియున్నట్టిది, పద్మదళముల కాంతి పుంజ వర్ణములతో విరాజిల్లునది అగు శ్రీలక్ష్మీదేవిని, శ్రియందేవిని మేమున్న లోకమునకు, స్థానమునకు ఆహ్వానించుచున్నాము. ఆ జగన్మాత మమ్ములను సమీపించి ఉండును గాక!

5.) చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం
శ్రియం లోకే దేవ జుష్టామ్
ఉదారామ్ |
తాం పద్మినీగ్ం ఈం శరణమ్
అహమ్ ప్రపద్యే|
అలక్ష్మీః మే నశ్యతాం
త్వాం వృణే ||

చల్లని అమృత కిరణములతో కూడిన పూర్ణచంద్రునివంటి రూపము కలిగినట్టిది, మిక్కిలి తేజస్సుతో ప్రకాశించునది, తనయొక్క యశస్సుచే లోకములన్నీ నింపినదై ఉండునది, సర్వజీవులకు శ్రేయస్సు కలుగజేయునది, స్వర్గలోక వాసులగు దేవతలచే కూడా దేవదేవిగా స్తోత్రములు చేయబడుచున్నది, జీవులకు సర్వము ప్రసాదించే ఉదార స్వభావి అయినట్టిది అగు ఆ శ్రీదేవిని మేము శరణము వేడుకొనుచున్నాము. ఓ సౌభాగ్యలక్ష్మీదేవి! మా యొక్క అలక్ష్మిని (దారిద్య్ర్యమును) తొలగించు నిన్ను రక్షకురాలిగా భావన చేస్తున్నామమ్మా ! సంపద - సద్భావన మొదలైనవి కొరతవడిన దారిద్ర్యము మాకు కలుగకుండును గాక!

6.) ఆదిత్యవర్ణే తపసో అధిజాతో
వనస్పతిః తవ వృక్షో అథ బిల్వః |
తస్య ఫలాని తపసానుదన్తు
మాయ అన్తరాయాశ్చ, బాహ్యా అలక్ష్మీః ||

సూర్యుని వంటి తేజస్సు కలిగి ఉన్నట్టి ఓ లక్ష్మీదేవీ! నీ సంకల్పము చేతనే పువ్వులు లేకయే ఫలములు ఇచ్చు బిల్వవృక్షము జనించింది. అట్టి బిల్వవృక్షములు నీదయచేతనే బాహ్య అభ్యంతర ఇంద్రియసంబంధమైన అలక్ష్మిని(దరిద్ర్యములను) తొలగించివేయునవిగా ఈ లోకములో ఉన్నాయి.

7.) ఉపైతు మాం దేవసఖః
కీర్తిశ్చ మణినా సహ
ప్రాదుః భూతోఽస్మి రాష్ట్రేఽస్మిన్
కీర్తిమ్ వృద్ధిమ్ దదాతు మే ॥

దేవతా సఖుడగు కుబేరుడు, దక్షకన్యయగు కీర్తి మాకు దేవీ అనుజ్ఞానుసారం సంపద కీర్తి ప్రసాదించెదరు గాక! ఈ ప్రదేశములో పుట్టిఉన్నట్టి మాకు మా పరిసరములలో కీర్తి, వృద్ధి కలుగ జేయుదురు గాక!

8.) క్షుత్ పిపాసామ్ అమలాం జ్యేష్టామ్
అలక్ష్మీం నాశయామి అహమ్|
అభూతిమ్ అసమృద్ధిం చ
సర్వాం నిర్ణుద మే గృహాత్ ||

జ్యేష్ఠాదేవి కృతములగు ఆకలి - దప్పికలతో మలిన మైన దేహముతో కూడిన అలక్ష్మీ విశేషాలు మాపట్ల తొలగినవై ఉండునుగాక ! అభూతి (లేమి, దరిద్ర్యము) అసమృద్ధి మొదలైనవన్నీ మా గృహమునుండి తొలగును గాక !

9.) గంధద్వారాం దురాధర్షాం
నిత్యపుష్టాం కరీషిణీమ్ ।
ఈశ్వరీగ్ం, సర్వభూతానామ్
తామ్ ఇహ ఉపహ్వయే శ్రియమ్ ।। 

మంచి సుగంధద్రవ్యములు ధరించినట్టిది, దుర్రాహ్యమైనట్టిది, నిత్యమూ సర్వ సస్యసంపదను పుష్టిని ప్రసాదించునది, సర్వజీవుల నియామకురాలు అగు ఓ సౌభాగ్యలక్ష్మీదేవీ! మాతా! ఇప్పుడు మాకు శ్రేయస్సును, సంపదలను ప్రసాదించుటకై-ఇక్కడికి నిన్ను ఆహ్వానిస్తూ, ఇక్కడే ఉపాసించుచున్నామమ్మా! దయతో వేంచేయి.

10.) మనసః కామమ్ ఆకూతిం
వాచః సత్యమ్ అశీమహి
పశూనాగ్ం ! రూపం అన్నస్య
మయి శ్రీః శ్రయతాం యశః ||

ఓ దేవదేవీ! జగజ్జననీ! శ్రీదేవీ! మా మనస్సులలోని కోరికలను సిద్ధింపజేయవమ్మా! మా ఆలోచనలు (ఆకూతీం), వాక్కు మహిమానిత్వమై సత్యత్వము పొందునుగాక పశుసంపదను, రూప సంపదను , అన్నమును, శ్రేయస్సును, యశస్సును నీ నీ యొక్క కరుణా వాత్సల్యములచే మేము పొందెదముగాక !

11.) కర్దమేన ప్రజాభూతా
మయి సంభవ, కర్దమ।
శ్రియం వాసయ మే కులే,
మాతరం, పద్మమాలినీమ్!

కర్దమమునికి కూతురువై జన్మించిన ఓ కర్దమాదేవీ ! మా గృహమునందు ఎల్లప్పుడూ ప్రేమాస్పదవై వేంచేసి ఉండెదవు గాక ! పద్మమాలను ధరించిన మాతా ! మాకు మా ఇళ్ళలో శ్రేయో-శిరి సంపదలు ప్రసాదించవమ్మా! మా వంశములో శ్రియముగా పద్మమాలినిపై ! వేంచేసి ఉండవమ్మా!

12.) ఆపః సృజన్తు స్నిగ్ధాని
చిక్లీత! వస మే గృహే!
నిచ దేవీం మాతరగ్ం
శ్రియం వాసయ మే కులే |

జలముతో స్నిగ్ధమగు (స్నేహపూర్వకమగు), సృజన్తమగు (సృజనాత్మకమగు) పుణ్యకార్యములు చేసే సద్బుద్ధిని మాకు చిక్లీతుడు గలుగజేయుదురు గాక! లక్ష్మీపుత్రుడగు చిక్లీతుడు మా గృహములో ఉండుటకు, మేము దేవియొక్క మాతృ వాత్సల్యము పొందుటకు యోగ్యులము అయ్యెదముగాక! ఓ శ్రీదేవీ! మాతా! మా వంశమునందు నివసిస్తూ మాకు జ్ఞానధనమును ప్రసాదించవమ్మా!

13.)  ఆర్ధ్రాం పుష్కరిణీం పుష్టిం
పింగళాం పద్మమాలినీమ్ ।
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం,
జాతవేదో ! మమ ఆవహ |

హే అగ్ని భగవాన్ ! జాతవేదా ! ఎల్లప్పుడూ పాల సముద్ర జలముచే తడిసిన శరీరముకలది, నిత్యాఅభిషేకములు సమర్పించ బడునది, పద్మమాలికను | ధరించినట్టిది, పింగళ (పసుపుపచ్చని) ఛాయ కలిగినట్టిది, చంద్రభాస  సమానమైనది అగు జగదంబిక శ్రీలక్ష్మీదేవికి నిత్యప్రార్ధనలు సమర్పించుకొనుటకై మేము సంసిద్ధులగుచున్నాము. మా కొరకై ఆ దేవికి మా సుస్వాగతమును తెలియజేయండి!

14.) ఆర్ధ్రాం యః కరిణీం యష్టిం (పుష్టిం)
సువర్ణాం హేమమాలినీమ్|
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం
జాతవేదో ! మమ ఆవహ ||

ఓ అగ్నిదేవా ! జాతవేదా! గురుదేవా!
ఆర్ద్ర (తడిసిన దేహము) గలది, ఈ సర్వజగత్ నిర్మాత, (తెల్లటి) పూలదండలు ధరించినట్టిది, బంగారు ఛాయగలది, జడలో బంగారు రంగు పుష్పధారిణి, సూర్యకాంతి తేజో పుంజములు వెదజల్లునది అగు శ్రీ లక్ష్మీమాతకు మేము భక్తి ప్రపత్తులు సమర్పిస్తున్నాం. (మీరు మా నమస్కృతులను ఆ మా మాతృదేవికి | అందించండి). మా కొరకై ఆ దేవికి మా నిత్యాహ్వానము అందజేయండి!

15.) తాం మ ఆవహ జాతవేదో !
లక్ష్మీమ్ అనపగామినీమ్,
యస్యాం హిరణ్యం ప్రభూతం
గావో దాస్యో అశ్వాన్
విన్దేయం పురుషాన్ అహమ్ |

ఓ అగ్నిదేవా ! ఏ అనపగామిని (నిర్మల, నిర్దోషి), బంగారపు ఛాయలతో ప్రకాశించునది, అగమా-ఆత్మ సౌభాగ్యదేవి, మా శ్రీసౌభాగ్యలక్ష్మీ అగు మాతనుండి మేము గోసంపదను, దాసజనమును, అశ్వసంపదను, పురుషకారమును పొందుచున్నామో…… అట్టి ఆ దేవతకు ఇవే మా ప్రణతులు. ఆ తల్లి మమ్ములను వీడక మా దగ్గరనే ఉండునట్లు కృప చూపండి ! ఆ శ్రీమాతకు మా ఆహ్వానమును దయచేసి తెలుపండి.

సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్

ఫలశృతి


శ్లో|| యః శుచిః ప్రయతో భుత్వా
జుహుయాత్ ఆజ్యమ్ అన్వహమ్
శ్రియః పంచదశ అర్చం చ శ్రీకామః సతతం జపేత్ |
ఆనందః కర్ధమశ్చైవ చిక్లీత ఇతి
విశ్రుతాః| ఋషయన్ తే త్రయః పుత్రాః ||
స్వయం శ్రీదేవి దేవతా !

ఎవ్వరైతే ఆజ్యమును (నేయిని) అగ్నికి సమర్పిస్తూ, అగ్న్యోపాసన యుక్తంగా ఆనంద-కర్దమ-చిక్లీత లక్ష్మీపుత్రులగు త్రైయార్షేయులు (ముగ్గురు ఋషులు) గానం చేసిన 15 శ్లోకములను శుచి శ్రద్ధలతో గానము చేస్తారో వారు శ్రీలక్ష్మీదేవతా అనుగ్రహ సిద్ధి పొందగలరు.

పద్మాసనే | పద్మ ఊరూ |
పద్మాక్షీ | పద్మ సంభవే |
త్వం మాం భజస్వ పద్మాక్షి,
యేన సౌఖ్యం లభామి అహమ్ ||

ఓ పద్మము ఆసనముగా గలదానా! పద్మము వంటి ఊరువులు (తొడలు) గల తల్లీ! పద్మమువంటి కనులు గలదానా! పద్మమునందు సంభవించిన (జనించిన) మాతా! చల్లటి తల్లివగు నిన్ను భజించి నీ పద్మమువంటి దృక్కులు ప్రసరించుటచే మేము సర్వసౌఖ్యములు పొందుచున్నాము. మేము ఇప్పటికే పొందుచున్న వాటన్నిటికీ నీకు సర్వదా కృతజ్ఞులము!

అశ్వదాయీ చ, గోదాయి, ధనదాయి
మహాధనే ! ధనం మే జుషతాం దేవీ,
సర్వకామార్థ సిద్ధయే |

ఓ అశ్వ-గో-ధన-మహా(జ్ఞాన) ధన సంపత్ ప్రదాయీ ! సర్వ కోరికలు సిద్ధించుటకై ‘సర్వ జగత్’ అనే ధన స్వరూపిణివగు నిన్ను అర్చించుచున్నాము.

పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తి అశ్వ, అజావిగో, రథమ్
ప్రజానాం భవసి మాతా ఆయుష్మన్తం కరోతు మామ్ !

పుత్ర-పౌత్ర-ధన-ధాన్య-గజ సంపదను, ఇచ్చి కోరిన కోర్కెలను తీర్చి, ప్రజలను (స్నేహితులను) ఇచ్చి మమ్ములను ఆయుష్మంతులుగా చేయుము.

చంద్రాభామ్ | లక్ష్మీమ్ | ఈశానామ్ |
సూర్యాభామ్ | శ్రియమ్ | ఈశ్వరీమ్ |
చంద్రసూర్యాగ్ని వర్ణాభామ్|
శ్రీ మహాలక్ష్మీమ్ ఉపాస్మహే |

చంద్రకళలు ప్రదర్శించునది; (సర్వ సంపదలు ప్రసాదిస్తోంది కాబట్టి) - లక్ష్మీనామధేయి; (సర్వత్రా విస్తరించినదై ఉండటంచేత) ఈశ్వరీ స్వరూపిణీ ; (జ్ఞాన) సూర్యకాంతులతో శోభాయమానమైనది; చంద్ర-సూర్య-అగ్ని సర్వశోభలతో వెలగొందునది అగు శ్రీ సౌభాగ్యమహాలక్ష్మిని మనసా వాచా కర్మణా సర్వదా ఉపాసించుచున్నాము.

ధనం అగ్నిః | ధనం వాయుః |
ధనం సూర్యో ! ధనం వసుః |
ధనం ఇంద్రో| బృహస్పతిః వరుణం(ణో) ధనమశ్నుతే |

ఆ లక్ష్మీ అమ్మవారి విభవములే అగ్ని, వాయువు, సూర్యుడు త్రిలోకపాలకుడగు ఇంద్రుడు, బృహస్పతి, వరుణ (వర్ష) దేవుడు కూడా ! ఆ అమ్మ అనుగ్రహించుట చేతనే వారంతా ధనమును, వైభవమును పొందినవారై, స్నేహభావనతో అవన్నీ మాకు ప్రసాదించుచున్నారు.

వైనతేయ! సోమం పిబ |
సోమం పిబతు వృత్రహా |
సోమం ధనస్య, సోమినో
మహ్యం దదాతు సోమినః |

వినతా సుతుడవగు ఓ వైనతేయా! గరుత్మంతా! మేము సమర్పించు సోమ రసము త్రాగండి! వృత్రాసురిని సంహరించిన ఇంద్ర దేవా! ఈ సోమ రసమును స్వీకరించండి! ఓ దేవతలారా! మేము సోమ యాగమును నిర్వర్తించుటకై పుష్కలంగా సంపదను ప్రసాదించండి! శ్రీలక్ష్మీ ఉపాసనయే మా సోమయాగము!

న క్రోధో, న చ మాత్సర్యం,
న లోభో, న అశుభామతి
భవంతి కృత పుణ్యానాం
భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా !

ఈ శ్రీ సూక్తమును జపించువాడు కృతకృత్యుడు, కృతపుణ్యుడు అగుచున్నాడు. ఆతనిలో ఇక క్రోధ మాత్సర్య లోభ అశుభ వాసననలు, దుర్బుద్ధులు నిలవనే నిలవవు. పటాపంచలై తొలగిపోగలవు. అట్టివాడు భక్తి సంపదను పొందుచున్నాడు.

వర్షన్తు యే విభావరి
దివో అభ్రస్య విద్యుతః
రోహన్తు సర్వబీజాని
అప (అవ) బ్రహ్మద్విషో జహి |

శ్రీసూక్త పారాణము చేయుటచే, ఆకాశములోని మేఘ - విద్యుత్తులనుండి వర్షించు జలమువలె, సర్వభాగ్యములు వర్షించగలవు. ఆ జలముచే జ్ఞానబీజములు మొలకెత్తగలవు. బ్రహ్మమును తిరస్కరించు స్వభావములు కడిగి వేయబడగలవు.

పద్మప్రియే | పద్మిని | పద్మహస్తే |
పద్మాలయే | పద్మదళాయతాక్షి |
విశ్వప్రియే | విష్ణుమనోనుకూలే |
త్వత్ పాదపద్మం మయి సన్నిధత్స్వ |

ఓ పద్మప్రియా ! పద్మినీ ! పద్మహస్తా ! పద్మాలయా ! పద్మదళాయతాక్షీ! విశ్వేశ్వరుడగు శ్రీ విష్ణుమూర్తి మనస్సును రంజింపచేయు తల్లీ ! నీ పాదపద్మ సామీప్యతను, సందర్శనమును మాకు ప్రసాదించవమ్మా!

యా సా పద్మాసనస్తా విపులకటితటీ, పద్మపత్రాయతాక్షీ,
గంభీరావర్త నాభిః, స్తనభరనమితా శుభ్రవస్త్రోత్తరీయా,
లక్ష్మీః దివ్యైః గజేంద్రః మణిగణఖచితైః స్నాపితా
హేమకుంభైః, నిత్యం సా పద్మహస్తా
మమ వసతు గృహే సర్వ మాఙ్గళ్యయుక్తా ॥

పద్మముపై ఆసీనురాలైనట్టిది; విపులమైన కటి (నడుము చుట్టు) కలిగియున్నట్టిది; తామర రేకులవంటి కన్నులు కలిగినట్టిది; లోతైన గంభీరమైన నాభి కలిగియున్నట్టిది; పాలిండ్ల భారముతో వంగి ఉన్నట్టిది; స్వచ్ఛమైన వస్త్ర-ఉత్తరీయములు ధరించినట్టిది; దివ్య , (దేవ) లోకములోని గజేంద్రునిచే మణులు-రత్నములతో పొదగబడిన బంగారు కలశములతో నిత్యమూ అభిషేకించ బడునట్టిది, చేత పద్మము ధరించినట్టిది; సర్వమంగళ స్వరూపిణియు అగు శ్రీమత్-మహాలక్ష్మీ దేవి మా గృహములో సర్వదా నివశించును గాక!

శ్లో॥ లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం
శ్రీరంగధామేశ్వరీం।  దాసీభూత సమస్త దేవ వనితాం
లోకైక దీపాంకురాం
శ్రీమత్ మందకటాక్ష లబ్ధ విభవత్
బ్రహ్మ-ఇంద్ర-గంగాధరాం,
త్వాం, త్రైలోక్య కుటుంబినీం
సరసిజాం| వందే, ముకుంద ప్రియాం ! 

సర్వ సంపదలకు ఆలవాలమైనట్టిది (లక్ష్మీమ్); క్షీర సముద్రరాజ కుమార్తె; శ్రీరంగధామములో ఈశ్వరి అయి వెలసినది; దేవలోక స్త్రీలందరు తన దాసీజనముగా కలిగి ఉన్నట్టిది; లోకమంతా ఏకైక దీపమై (అఖండ జ్యోతి అయి) వెలుగొందుచున్నట్టిది; తనయొక్క శ్రీ - శుభకరమగు కించిత్ కటాక్షముచే బ్రహ్మ-ఇంద్ర - గంగాధరులకు (శివునికి) వారివారి విభవములను ప్రసాదించునది, ముల్లోకములు తన కుటుంబముగా పాలించుచున్నట్టిది, తామర కొలనులో ఉద్భవించినది, ముకుందునకు ప్రియాతి ప్రియమైనది అగు సౌభాగ్య మహాలక్ష్మీ దేవికి మేము నమస్కరించుచున్నాము.

శ్లో॥ శు(సి)ద్ధలక్ష్మీ॥ మోక్షలక్ష్మీ| విజయలక్ష్మీ | సరస్వతీ ।  శ్రీఃలక్ష్మీ | వరలక్ష్మీశ్చ
ప్రసన్నా మమసర్వదా | -
వర-అంకుశౌ-పాశమ్-అభీతిముద్రాం
కరైః వహన్తీం, కమలాసనస్థాం,
బాలార్కకోటి ప్రతిభాం, త్రినేత్రాం,
భజే అహమ్ అంబాం, జగదీశ్వరీం తామ్ |

శుద్ధ లక్ష్మీ! పరమ నిర్మల స్వరూపిణీ! సిద్ధ లక్ష్మీ! మాకు సర్వము | సిద్ధింపజేయు దేవీ! ముక్తిని ప్రసాదించు మోక్ష లక్ష్మీ! సర్వ | విజయములను కలుగజేయు విజయలక్ష్మీ! సారస్వతమును ఉత్తమ స్వరమును ప్రసాదించు సరస్వతీ! పద్మమున జనించి, సర్వశిరులు సంపదలు అనుగ్రహించు శ్రీలక్ష్మీ! మాకు వరములు కటాక్షించు వరలక్ష్మీ! నీవు మా పట్ల సర్వదా ప్రసన్నురాలవై ఉండవమ్మా!

ఉభయ హస్తములలో…,
1. వరప్రసాదమగు క్రిందవైపుగా వ్రేలాడు అరచేయి మునివ్రేళ్ళు,
2. దుష్ట గుణములను తొలగించు అంకుశము,
3. సర్వజీవులపట్ల అంతులేని అవ్యాజమైన ఆప్యాయతను కురిపించు ప్రేమాస్పద ప్రసరణములు,
4. "నేను ఉన్నాను. వెంట ఉండి, బిడ్డలైన మిమ్ము కాపాడుకుంటాను కదా!” (సవ్యాపసవ్య మార్గస్థా! సర్వ ఆపద్ వినివారిణీ) - అను అభయహస్తము.

ఇవన్నీ ముద్రలుగా గల వహన్తి। పద్మమును ఆసనముగా కలిగి ఉన్నట్టిది! ఉదయించుచున్న కోటి సూర్యుల ప్రభవములు వెదజల్లుచున్నట్టిది! త్రికాలములను, త్రిమూర్తులను, త్రివేదములను, త్రిలోకములను, త్రి-స్థూల సూక్ష్మ కారణ దేహములనుమొదలైనవన్నీ తన త్రినేత్రములుగా కలిగియున్న దేవి! అట్టి అంబ, జగదీశ్వరిని అర్చించుచున్నాము. భజించుచున్నాము.

సర్వ మంగళముల కంటే అత్యంత మంగళ ప్రదమైనదిశ్లో॥ సర్వమఙ్గళ మాంగళ్యే! శివే! సర్వార్థ సాధికే! , సర్వ శుభ- సుఖ ప్రదాత, సర్వ సంపద ప్రదాత, శరణు వేడుటకు శరణ్యే! త్ర్యంబకే! దేవీ! అత్యంత అర్హమైనది, త్రిమూర్తి - త్రిమాతా - త్రి ఆకాశ నారాయణి! నమోస్తుతే। స్వరూపిణివగు ఓ లక్ష్మీ దేవీ! నీకు నమస్కారములు!

శ్లో॥ సరసిజ నిలయే (నయనౌ) సరోజహస్తే |
ధవళతరాంశుక గంధమాల్యశోభే।  భగవతి హరి వల్లభే| మనోజ్ఞే।
త్రిభువన భూతికరి, ప్రసీద మహ్యమ్।

పద్మములవంటి కనులు కలిగినది, పద్మము చేతియందు ధరించినది, అత్యంత తెల్లని, ప్రశాంత పవిత్రములైన వస్త్రములు - గంధమాలలచే శోభించుచున్నది, సర్వ జీవులలోను సర్వ విషయములను వెలిగించు చైతన్య స్ఫూర్తి స్వరూపిణి అగుటచే భగవతి, శ్రీహరిపత్ని, మనస్సును దృశ్యవస్తువు వంటిదిగా దర్శించు (ఎరుగు) ఆత్మ స్వరూపిణి, త్రిలోకములలోని సర్వజీవ పరిపోషకురాలు అగు లక్ష్మీదేవి మమ్ములను అనుగ్రహించును గాక!

శ్లో॥ విష్ణుంపత్నీం క్షమాం దేవీం
మాధవీం మాధవప్రియామ్ ।  విష్ణోః ప్రియసఖీం దేవీం
నమామి, అచ్యుత వల్లభామ్ |

విష్ణు భగవానుని అర్థాంగి, తల్లి అయి బిడ్డలందరి తప్పులను క్షమించు దేవి, తులసీ దేవిగా పవిత్రత ప్రసాదించు మాధవి, మాధవునికి అతి ప్రియమైనది, విష్ణువుయొక్క ప్రియ సఖి, అచ్యుతునకు ప్రియవల్లభి - ప్రీతి పాత్రమైనది … అగు శ్రీ దేవికి ప్రణమిల్లుచున్నాము!

శ్లో॥ శ్రీవర్చస్యమ్ ఆయుష్యమ్ ఆరోగ్యమ్
మామ్ విధాత్ పవమానం మహీయతే |
ధనం ధాన్య పశుం బహుపుత్రలాభం,
శత సంవత్సరం దీర్ఘమాయుః||

ఓ సౌభాగ్య మహాలక్ష్మీ దేవీ! మాకు శుభకరమగు శ్రీ వర్చస్సు, పూర్ణాయుష్షు, మంచి ఆరోగ్యము, సంపదలు ప్రసాదించవమ్మా! అట్లాగే ధనము, ధాన్యము, పశు సంపద, కీర్తి, బహుపుత్ర లాభము శత సంవత్సరముల దీర్ఘాయుర్దాయము అనుగ్రహించెదవు గాక! మేము నీ బిడ్డలము కదా!

ఓం మహాదేవ్యైచ విద్మహే |
విష్ణుపత్నై చ ధీమహి।  తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ||
హరిః ఓం।

మహాదేవీ తత్త్వమును ఎరుగుటకై విష్ణుపత్నిని స్తుతించుచున్నాము. ఆ సౌభాగ్యలక్ష్మీ దేవి మన బుద్దులను ప్రేరేపిస్తూ వికసింప జేయును గాక!

ఇతి శ్రీసూక్తమ్ |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||


సౌభాగ్య లక్ష్మి ఉపనిషత్ - ద్వితీయ అనుబంధము

లక్ష్మీ అమ్మవారి పాటలు


హారతి మీరేల ఇవ్వరే

హారతి మీరేల ఇవ్వరే అంబకు మంగళ హారతి మీరేల ఇవ్వరే హారతి మీరేల
ఇవ్వరే జ్ఞాన విద్యల్ల కెల్ల ప్రబలడి లీలతో పదిమారు వన్నెల మేలిమి బంగారు తల్లికి ||హా||

1.) ఇంతపరాకేల ననరే రుద్రుని దేవికి చెంత నుండి పూజ సేయూరే చెంతనుండీ పూజ
సేయరే శంఖరీ ఓం కారి, పూరికి కుంకుమా ద్యాయ లంకిణికి పొంతయైన వరాల తల్లికి ||హా||

2.) పాదములకు పూజ చేయరే మాతల్లి కిపుడు పారిజాతపు హారతి ఇవ్వరే పారిజాతపు
హారతి యివ్వరే మొల నూలు గజ్జెల జోడు వన్నెల రవ్వల పాపిట బొట్టును గెల సమయమున ధరియించు తల్లికి ||హా||

3.) లక్ష వత్తుల జ్యోతి కూర్చరే చెలులార మీరు రక్షింతంబుగాను పాడరే రక్షితం
బుగ వేదాక్షరముల తోను గూడిన రాక్షసా సంహారి కిపుడు ముచ్చటలరా పాడుకొనుచూ ||హా||


శ్రీలక్ష్మీదేవి హారతి

శ్రీ మాతా (శ్రీ లలితా) శ్రీలక్ష్మీ నీకు హారతి జయ జగదీశ్వరీ నీకు మనసు హారతీ ||

1.) పంచ భూతములను గీదు ప్రమిదగాను చేసినాను మించిపోయే గుణముసన్నీ వంచి వత్తి చేసినాను
కామక్రోధములను తీసి కైవత్తిగ వెలిగించి దూషణమను గుణము తీసి ధూపముగా వేసినాను ||శ్రీ||

2.) తామసమను గుణముతీసి తరచి చమురు పోసినాను అహంకారగుణముతీసి అక్షింతలు చేసినాను
మాయ అనే గుణముతీసి మల్లెపూల పూజచేసి మంచిగాను మనసు విప్పి మంత్రపుష్బముంచినాను ||శ్రీ||

3.) చెడు గుణంబులన్నితీసి ప్రదక్షిణములు చేసినాను ఇచ్ఛ అనే గుణము తీసి దక్షిణగా వుంచినాను
మా… మనసునే నీకు అర్పణ చేసినాము ||శ్రీ||


వరలక్ష్మి పాట

ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నెన్నెత్తు కొందు నమ్మా

1.) ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మనచు పిలచి కోట్లా ధన మిచ్చెదవమ్మా ||ఎ||

2.) పసిబాలవైతె ఎత్తు కొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పూవులు
పండ్లు, తోరణములతో పాల వెల్లి కట్టిన వేదిక పైన కాలి యందియలు
ఘల్లున మ్రోగగ కలహంస నడకలతో రావమ్మా ||ఎ||


సుందరవదనే

సుందరవదనే సుగుణ మనోహరి మందహాస ముఖ శశివదనే చందన కుంకుమ అలంకృత వదనే
దుర్గ మహేశ్వరి రాజ రాజేశ్వరి జగదంబ మహేశ్వరి రాజ రాజేశ్వరి ||సుం||
ఓంశక్తి, ఓంశక్తి, ఓంశక్తి, ఓంశక్తి, ఓంశక్తి


లలితా దేవి పాట

శివ వామభాగే శ్ీ లలితే సదాసుఖ దాయిని హైమవతే ||శి||
1.) ఇందు శయన హరి అభయ ప్రదాయిని పరమపావనీ పరాత్పరీ ఇ అంబ ||శి||
2.) లలితా సన్నిధిలో మనసే నిండెనుగా నిన్నే కొలిచెదము అంబ పరాత్పరి ||శి||


కోరెద కోరెద కోరిక కోరెద

కోరెద కోరెద కోరిక కోరెద కోరెద తల్లీ నిన్నొక కోరిక ||కో||

1.) అనుచితమైన కోరిక కాదు అర్హతలేని కోరిక కాదు
మణిమాన్యమ్ముల కోరిక కాదు పదవుల కొరకై కోరిక కాదు ||కో||

2.) నీపదములకడ వెలిగే జ్యోతినై నిరతము నిన్నే చూచెడి కోరిక
నిరతము నీరూపు నాలోన నిలిపి నిరతము నిన్నే చూచెడి కోరిక ||కో||

3.) నీ పాదయుగళా సరోజ రజమునై జీవిత శేషము గడిపే కోరిక
నిరతము నీ రూపు నాలో నిలిపి నీలో నేను లీనము కాగల ||కో||
కోరితి కోరిక, కోరిక కోరితి, కోరితి తల్లీ! ఈ చిన్న కోరిక ||కో||


లక్ష్మీదేవి పాట

వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరముల నొసపగే -
శ్రీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి వోముల వ్రతములు చేయండమ్మా ||వచ్చిం||

ముంగిట ముగ్గులు పెట్టండమ్మా పేరంటానికి పిలవండమ్మా ||వచ్చిం||

పసుపు కుంకుమ గంధాక్షింతలు దేవికి పూజలు చేయండమ్మా ||వచ్చిం||

ధూప దీప నైవేద్యములొసగి మంగళ హారతి పాడండమ్మా ||వచ్చిం||

వచ్చిందమ్మా క్రీ వరలక్ష్మీ వరముల నొసగే శ్రావణ లక్ష్మీ ||వచ్చిం||


శుక్రవారం పాట

ప|| వారంలో శుభవారం శుక్రవారం శుభకరకమైనది శుక్రవారం
శ్రీహరి హృదయేశ్వరి నితలచే వారం శ్రీ మహాలక్ష్మిని కొలచే శుభవారం

1.) తొలి సంధ్యారుణ కిరణం నిలచేటి వేళా మంగళకరనాదమే పలికేటి వేళా
మనసులలో భక్తి భావం విరిసేటి వేళా మహాలక్ష్మీ మా పూజలు అందుకునే వారం ||వా||

2.) కలువబాల నిద్దురలో మునిగేటి వేళా వెలుగురేఖ చీకటులను తరిమేటి వేళా
కలకంఠము గళమేత్తి పలికేటి వేళా మహాలక్ష్మీ మా పూజలు అందుకునే వారు ||వా|

3.) కర్మసాక్షి కలల మరిచి లేచేటి వేళా సుప్రభాత సుమ సేఖలు కురిసేటి వేళా
కర్పూరపు హారతి వెలిగేటి వేళా లోజనని పాదములే కొలిచే శుభవారం ||వా||


లలితా దేవి పాట

ప|| శ్రీ లలిత పరమేశ్వరి, జగదీశ్పరి మహేశ్వరి
శ్రీ చక్రపురవాసిని చింతామణి గృహేశి

1.) భద్రప్రియ భద్రమూర్తి భవపాపవినాశినీ
క్షుద్రశక్తి నిర్మూలిని శుభమంగళకారిణి
సకలాగమసన్నుత సర్వూధికారిణి ||శ్రీ||

2.) హిమశైల విహారిణి శృంగా గ్రమధ్యవాసిని
కామజనక సోదరి కామేశ్వరి వాత్యాయిని
అమల కమల లోచినీ అఖిలార్దదాయినీ ||శ్రీ||