[[@YHRK]] [[@Spiritual]]

Tripura Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 1
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
Courtesy - sanskritdocuments.org (For ORIGINAL Slokas Without Sandhi Splitting)


ఋగ్వేదాంతర్గత

5     త్రిపురోపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్



త్రిపురోపనిషద్వేద్యపారమైశ్వర్యవైభవం .
అఖండానందసామ్రాజ్యం రామచంద్రపదం భజే ..
శ్లో|| త్రిపురోపనిషత్ వేద్య అపారమ్ ఐశ్వర్య వైభవమ్ |
అఖండానంద సామ్రాజ్యమ్ రామచంద్రపదం భజే ||

(త్రిపురోపనిషత్ తెలియజేయుచున్న సంసారమునకు ఆవలగల అపారమగు ఆత్మైశ్వర్య వైభవము, అఖండ-ఆనంద సామ్రాజ్యము
అయినట్టి రామచంద్ర తత్త్వమును భజించుచున్నాము.)


ఓం తిస్రః పురాస్త్రిపథా విశ్వచర్షణా అత్రాకథా అక్షరాః
సన్నివిష్టాః .
అధిష్ఠాయైనా అజరా పురాణీ మహత్తరా మహిమా దేవతానాం .. 1..

నవయోనిర్నవచక్రాణి దధిరే నవైవ యోగా నవ యోగిన్యశ్చ .
నవానాం చక్రా అధినాథాః స్యోనా నవ ముద్రా నవ భద్రా మహీనాం .. 2..

ఏకా సా ఆసీత్ ప్రథమా సా నవాసీదాసోనవింశాదాసోనత్రింశత్ .
ఓం
1.) త్రిసః పురః|
రాత్రి పథా|
విశ్వచర్షణా||
అత్రా కథా అక్షరాః సన్నివిష్టాః |
అధిష్ఠాయా ఏనా అజరా పురాణీ ।|
మహత్తరా మహిమా దేవతానామ్ |
నవ యోనిః। నవ చక్రాణి దీధిరే।
నవైవ యోగా। నవ యోగిన్యశ్చ।
నవానాన్ చక్రా। అధినాథాస్యోనా!
నవ భద్రా! నవ ముద్రా। మహీనామ్।
ఏకా స ఆసీత్ |
ప్రథమ ఆసా నవా ఆసీత్ |
ఆసా ఏకోన వింశత్ (19)-ఆసో ఏకోన త్రింశాత్ (29)||
ప్రణవ స్వరూప ఆత్మ భగవానునికి నమోవాక్కములు.
మూడు పురములు ఉన్నాయి. (జాగ్రత్-స్వప్న-సుషుప్తులు)
ఆ మూడు పురములకు మూడు మార్గాలు ఉన్నాయి.
అవి విశ్వమంతా వ్యాపించినవై ఉన్నాయి.
వాటి వ్యవహారమంతా అక్షరమగు పరబ్రహ్మమునందు స్థానము కలిగి ఉన్నాయి.
దానిని అధిష్ఠించి-అజరమై (అవినాశనమై), పురాతనమై, మహత్తరమై, దేవతలయొక్క మహిమగా బ్రాహ్మీతత్త్వము (లేక) పరబ్రహ్మ తత్త్వము నిత్యప్రదర్శితమై ఉన్నది.
దేవతలందరికి మూలతత్త్వమై దేవతలు ఉన్నట్టి స్థానము అయి ఉన్నది.
సర్వమునకు ఆత్మదేవియే అధిష్ఠానము!
నిర్గుణ పరబ్రహ్మము లీలా వినోదముగా నిర్వర్తించు కేవలీతత్వమ్ సగుణంగా తొమ్మిది (9) యోని స్థానములు కలిగియున్నది. పరబ్రహ్మము ప్రకృతి స్వరూపుణీ జగన్మాత అయి 9 చక్రములు (నవ శ్రీచక్రాంతర్గత చక్రములు)తో ప్రకాశమానమగుచున్నది.
సగుణ తత్త్వమగు ఆ త్రిపురేశ్వరియే నవ (9) యోగములు. నవ (9) యోగిణులతో సృష్టి స్వరూపిణిగా ప్రదర్శితమగుచున్నది. నవ చక్రములకు నవ (9) అధినాథులను నియమించుచూ, నడిపించుచున్నది.
నవ (9) భద్రములు, నవ (9) ముద్రలు, నవ (9) మహిమలు కలిగి ఆ త్రిపుర సుందరీ బ్రాహ్మీతత్యము తదితర తత్త్వములన్నీగా ప్రదర్శితమగుచున్నప్పటికీ సర్వదా ఏకమే గాని అనేకము కాదు! నిర్గుణమునకు భిన్నము కాదు!
సర్వమునకు ప్రధమముగా, మునుముందుగా ఉన్నట్టి అఖండరూపమే త్రిపురేశ్వరీ దేవి!
ఆ ఏకము అఖండము అగు ఆత్మతత్త్వ స్వరూపిణియే ఏకోనవింశత్ (19) తత్త్వములుగా, ఏకోనత్రింశత్ (29) తత్త్వములుగా కూడా ఆగుచు, సృష్టి - స్థితి - లయ విన్యాసమంతా క్రీడార్థము నిర్వర్తించుచున్నది.


చత్వారింశాదథ తిస్రః సమిధా ఉశతీరివ మాతరో మా విశంతు .. 3..

ఊర్ధ్వజ్వలజ్వలనం జ్యోతిరగ్రే తమో వై తిరశ్శ్చీనమజరం తద్రజోఽభూత్ .
ఆనందనం మోదనం జ్యోతిరిందో రేతా ఉ వై మండలా మండయంతి .. 4..

తిస్రశ్చ [ యాస్తిస్రో ] రేఖాః సదనాని
భూమేస్త్రివిష్టపాస్త్రిగుణాస్త్రిప్రకారాః .
ఏతత్పురం [ ఏతత్త్రయం ] పూరకం పూరకాణామత్ర [
పూరకాణాం మంత్రీ ] ప్రథతే మదనో మదన్యా .. 5..

మదంతికా మానినీ మంగలా చ సుభగా చ సా సుందరీ సిద్ధిమత్తా .
లజ్జా మతిస్తుష్టిరిష్టా చ పుష్టా లక్ష్మీరుమా లలితా లాలపంతీ .. 6..

ఇమాం విజ్ఞాయ సుధయా మదంతీ పరిసృతా తర్పయంతః స్వపీఠం .
నాకస్య పృష్ఠే వసంతి పరం ధామ త్రైపురం చావిశంతి .. 7..

కామో యోనిః కామకలా వ్రజపాణిర్గుహా హసా మాతరిశ్వాభ్రమింద్రః .
పునర్గుహా సకలా మాయయా చ పూరూచ్యేషా విశ్వమాతాదివిద్యా .. 8..

2.) చత్వారింశత్ (40) అథ తిస్రః సమిధా
ఉశతీః ఇవ మాతరో మా విశంతు ।
ఊర్ధ్వజ్వల జ్వలనం జ్యోతిః అగ్రే
తమోవై తిరశ్చీనమ్ అజరమ్
తత్ రజో ఆభూత్ |
ఆనందమ్ మోదనమ్ జ్యోతిః
ఇందో రేతా ఉ వై
మండలా మండయంతి।

యాః తిస్రో రేఖాః సదనాని భూః త్రిః,
త్రివిష్టపాః
త్రి గుణాః,
త్రి ప్రకారాః|
ఏతత్ త్రయమ్ పూరకమ్ పూరకాణాం
మంత్రీ ప్రథతే మదనో మదన్యా,
మదంతికా, మానినీ, మంగళా చ సుభగా చ
సా సుందరీ, సిద్ధిమత్తా,
లజ్జా మతిః తుష్టిః, ఇష్టా చ, పుష్టా,
లక్ష్మీః, ఉమా, లలితా, లాలవంతీ |
ఇమామ్ విజ్ఞాయ సుధియా
మదంతీ పరిస్మృతా తర్పయంతః స్వ పీఠమ్ |
నాకస్య పృష్టే మహతో వసంతి।
పరంధామ త్రైపురంచా విశంతి |
కామో యోనిః కామకలా
వజ్రపాణిః గుహా హసా,
మాతరిశ్వ అభ్రమ్ ఇంద్రః,
పునః గుహా సకలా మాయయాచ,
పురూచ్య ఏషా, విశ్వమాతా, ఆదివిద్యా ||
చతుర్వింశతి (40) సమిధలు ధరించినదై ఆ చైతన్య స్ఫూర్తి స్వరూపిణియగు త్రిపురేశ్వరీ మాతృదేవి నాయందు దేహమంతా వాయువుగా ప్రవేశించినదై ఉన్నది.
సమిధలు (కట్టెలు) అగ్నిచే జ్వలించుచుండగా, (ఊర్ధ్వముగా అగ్ని జ్వలిస్తూ జ్యోతి స్వరూపమై అంధకారము తొలగించు రీతిగా) చతుర్వింశతి (40) సమిధా ధారిణియగు ఆ పరబ్రహ్మ మూర్తి స్వరూప త్రిపురేశ్వరీ చైతన్య స్వరూపిణి అంతరమున వ్యాపించి ఉన్నది. ఊర్ధ్వమున జ్యోతి స్వరూపిణియై ప్రకాశించు చున్నది.
చంద్రతత్య త్రిపురేశ్వరియే..., చంద్రకాంతి స్వరూపిణియై చంద్రజ్యోతితో (తేజస్సుతో) ప్రకాశించుచు, దుఃఖము-మనో జాడ్యములను తొలగించుచు, ఆనందానుభూతిని కలిగించుచున్నది. మండలములను (హృదయములను) అలంకారమయము చేయుచున్నది.

ఆ త్రిపురేశ్వరీ చైతన్యము త్రిరేఖలచే అలంకరించబడినదై ఉన్నది.
ఆ త్రిరేఖసంజ్ఞలు -
త్రిఃభుః → భూ-భువర్-సువర్ :: భౌతిక - మానసిక-బుద్ధిక
త్రివిష్టపా → జీవుడు- ఈశ్వరుడు-పరమాత్మ!
త్రిగుణాః → సత్వ-రజో-తమో గుణ
త్రిపురాకారములు → స్థూల-సూక్ష్మ-కారణములు.
ఈ త్రిపురతత్త్వములు పూరకమునకు పూరకము.
అట్టి త్రిపురతత్త్వమును మంత్రపూర్వకముగా ఉపాసించువాడు మదనుడై మదనియై ప్రకాశించుచున్నాడు.
మదన్య (నాకు వేరైనదంతా నేనే)గా సారూప్యుడగుచున్నాడు.
మదంతికా, మానినీ, మంగళా, సుభగా, సుందరి, సిద్ధి మత్త, లజ్జ, మతి, తుష్టి, ఇష్ట, పుష్ట, లక్ష్మి, ఉమ, లలిత, లాలవంతీ
- ఇవన్నీ త్రిపురేశ్వరీ అవతార సారూప్య తత్త్వ చమత్కారములు.

ఏ బుద్ధిమంతుడైతే (సుధియ) ఇవన్నీ అఖండ పరతత్వ స్వరూపుణి యొక్క వివిధ ప్రదర్శనా దైవీతత్వములుగా తెలుసుకుంటాడో, అట్టివాడు 'మదంతీ' అనే స్వస్వరూప పీఠమును అధిరోహించి ఆనందించుచున్నాడు.
మహదత్వముతో కూడిన నాకము (నడుము) యొక్క పృష్ఠభాగమున (మూలాధారమై) ఉండి పరంధామము అనే త్రైపురస్థానమును (సర్వము పరతత్వ స్వరూపంగా అనుకొనుచూ, భావించి, సేవించువాడుగా) ప్రకాశించుచున్నాడు.
కాముడు, యోని, కామకల, వజ్రపాణి, గుహుడు. వాయువు, మేఘము, ఇంద్రుడు, పునః (తిరిగి) గుహా ... ఇవన్నీ పరతత్వ స్వరూపిణియొక్క మాయా స్వరూపములు.
విశ్వాంతర్భాగములు. ఆ త్రిపురేశ్వరీ చైతన్యమే..., ఆది విద్యా స్వరూపుణియై, సర్వమునకు మునుముందే ఉన్నట్టి విశ్వమాత!

షష్ఠం సప్తమమథ వహ్నిసారథిమస్యా మూలత్రిక్రమా దేశయంతః .
కథ్యం కవిం కల్పకం కామమీశం తుష్టువాంసో అమృతత్వం
భజంతే .. 9..

త్రివిష్టపం త్రిముఖం విశ్వమాతుర్నవరేఖాః స్వరమధ్యం తదీలే .
[ పురం హంత్రీముఖం విశ్వమాతూ రవే రేఖా స్వరమధ్యం తదేషా . ]
బృహత్తిథిర్దశా పంచాది నిత్యా సా షోడశీ పురమధ్యం బిభర్తి .. 10..

యద్వా మండలాద్వా స్తనబింబమేకం ముఖం చాధస్త్రీణి గుహా సదనాని .
కామీ కలాం కామ్యరూపాం విదిత్వా [ చికిత్వా ] నరో జాయతే
కామరూపశ్చ కామ్యః [ కామః ] .. 11..

పరిసృతం ఝషమాద్యం [ ఝషమాజం ] ఫలం చ
భక్తాని యోనీః సుపరిష్కృతాశ్చ .
నివేదయందేవతాయై మహత్యై స్వాత్మీకృతే సుకృతే సిద్ధిమేతి .. 12..

3.) షష్ఠమ్ సప్తమమ్ అథ వహ్ని సారథిమ్
అస్యామూల త్రికమ్
ఆదేశయంతః,
కథ్యమ్ కవిమ్ కల్పకమ్|
కామమీశమ్ తుష్టవాంసో అమృతత్వం భజంతే |
పురం “హం” త్రిముఖమ్ విశ్వమాతూః
రవేః ఏకా స్వరమధ్యమ్ తత్ ఏషా |
బృహతిథిః, దశ, పంచ చ నిత్యా,
స షోడశికం పురమధ్యం బిభర్తి |
యద్వా మండల ఆద్యాః తస బింబమ్ ఏకమ్।
ముఖం చ అథ త్రీణి గుహాసదనాని |
కామీకలా కామరూపామ్
చికిత్వా నరో జాయతే కామరూపశ్చ కామః
పరిసృతం ఝషం, ఆజం పలఞ్చ భుక్తాని
యోనిః సుపరిషృతాశ్చ
నివేదయన్ దేవతాయై, మహత్యైః
స్వాత్మీకృతే సుకృతీ సిద్ధిమ్ ఏతి ॥
త్రిపురయోగమును ఉపాసించు సాధకుడు షష్ఠము (6వది - ఆజ్ఞా చక్రము)నుండి సప్తమము (7వది సహస్రారము) వరకు వహ్ని సారధి (నడిపించు అగ్ని-జ్యోతితత్త్వము) అయి ఉంటున్నాడు.
త్రిక (ఓం హ్రీం శ్రీం) మూలమంత్రమును జపిస్తూ - సహస్రారమును దాటుచున్నాడు.
జగత్ కథా ధారుడు, కవి, సర్వము కల్పించువాడు, కామేశ్వరుడు అగు పరమాత్మను దర్శించి స్తుతిస్తూ అమృతత్వమును పొందుచున్నాడు.

హం అనునది విశ్వమాత యొక్క త్రిముఖములతో కూడిన పురము.
ఆ చైతన్య స్వరూపిణి స్వరమధ్యమునందు (త్రిశుద్ధ చక్రము)తో సూర్యతేజో రూపమై విరాజిల్లుచున్నది.
"అహం"చే హంపూర్ణమగుచున్నది. ఆ త్రిపురేశ్వరీ ఆత్మ ప్రజ్ఞయే బృహతిథి, దశ, పంచ, నిత్య, షోడశికారూపియై పురము (దేహము) మధ్యలో షోడశ (16) కళలతో ప్రవర్తించుచు, సర్వమును రక్షించుచున్నది. భరించుచున్నది.
అంతేకాకుండా, మండలము (శ్రీచక్రము)నకు ఆదిస్థానముగా ఏకస్వరూపమై ఈ విశ్వమంతా వెలుగొందుచున్నది. ఈవిధముగా విశ్వ మండలమునకు ఆదిబింబ స్వరూపిణియై ఒక్క ముఖము - మూడు గుహ సదనములను, కామకలా రూపమైన ఆది తత్త్వమును తెలుసుకొని ఉపాసించువాడు కామరూపుడు (ప్రకృతి రూపము) - కాముడు (పురుషరూపము) తానే అయి పరబ్రహ్మముగా దీపించుచున్నాడు.
ఆతడు...,
-- చేప మేక అన్నములను (మనస్సు-బుద్ధి-అహంకారములను) సుపరిష్కృతమైన యోనులను (జన్మలను) దేవతలకు సమర్పించుచు, నివేదించుచు (సర్వ జన్మ కర్మలను బ్రహ్మర్పణము చేయుచు) సర్వమును "స్వాత్మరూపము" (Form of own Self) గా చేసినవాడై సుకృతుడు (ఉపాసకుడు) అయి, ఆత్మత్వమును సిద్ధించుకొనుచున్నాడు.

సృణ్యేవ సితయా విశ్వచర్షణిః పాశేనైవ ప్రతిబధ్నాత్యభీకాం .
ఇషుభిః పంచభిర్ధనుషా చ విధ్యత్యాదిశక్తిరరుణా విశ్వజన్యా .. 13..

భగః శక్తిర్భగవాన్కామ ఈశ ఉభా దాతారావిహ సౌభగానాం .
సమప్రధానౌ సమసత్వౌ సమోజౌ తయోః శక్తిరజరా విశ్వయోనిః .. 14..

పరిస్రుతా హవిషా భావితేన ప్రసంకోచే గలితే వైమనస్కః .
శర్వః సర్వస్య జగతో విధాతా ధర్తా హర్తా విశ్వరూపత్వమేతి .. 15..

ఇయం మహోపనిషత్త్రైపుర్యా యామక్షరం పరమో గీర్భిరీట్టే .
ఏషర్గ్యజుః పరమేతచ్చ సామాయమథర్వేయమన్యా చ విద్యా .. 16..

ఓం హ్రీం ఓం హ్రీమిత్యుపనిషత్ ..

4.) సృణ్యేవ సితయా విశ్వచర్షణిః|
పాశేనైవ ప్రతిభద్నాతి అళీకామ్|
ఇషుభిః పఞ్చభిః ధనుషా చ విద్ధ్యతి
ఆదిశక్తిః అ(ఉ)రుణా విశ్వజన్యా|
భగః శ్శక్తిః భగవాన్
కామ ఈశ ఉభదాతారా, విహ సౌభగానామ్ |
సమిప్రధానౌ సమసత్వౌ
సమోజౌ తయోశక్తిః, అజరా |
విశ్వయోనిః। పరిస్మృతా హవిషా భావితేన
ప్రసంకోచే గళితే, వై మనస్కః |
శర్వః సర్వస్య జగతో విధాతా ధర్తా హర్తా
విశ్వరూపత్వమేతి ||

ఇయమ్ మహెూపనిషత్ ||
త్రైపుర్యాయమ్ అక్షయం
పరమోగీర్భిరీట్టే,
ఏషణ్ (ఋజుః) యజుః పరమేతచ్చ
సామాయమ్ అథర్వేయమ్
అన్యాచ విద్యా !

ఓం హ్రీం| ఓం హ్రీం|

ఇత్యుపనిషత్

అట్టి యోగి సాత్వికతతో కూడిన తెల్లటి ఇంద్రియములను ప్రతిబంధిస్తున్నాడు.
త్రిపురేశ్వరి, విశ్వజననియగు ఆదిశక్తి ఐదు బాణములతోను, ధనస్సుతోను సర్వ ప్రతిబంధకములను కొట్టుచు పారత్రోలుచున్నది.
ఆదిశక్తి, విశ్వజనని మనలను రక్షించుచు విశ్వతత్వమగు పరబ్రహ్మమువైపుగా నడపుచున్నది.
సర్వము వెలుగించు భగశ్శక్తి-భగవంతుడు (పార్వతీ పరమేశ్వరులు) కామ - ఈశ ... ఈ ఇద్దరు మన సర్వ సౌభాగ్యములకు సర్వదా తోడై మనకు అవసరమైనదంతా ప్రసాదిస్తూ ఉంటారు.
ప్రకృతి-పురుషులు (శక్తి-శివులు) సమప్రధానాలు! సమసత్వులు.
విశ్వము-విశ్వేశ్వరుడు... ఇద్దరూ ఒక్కటే! సమ ఓజో ప్రకాశమానులు!
పురుష - ప్రకృతుల శక్తి నాశనము లేనిది (Energy is constant)!
విశ్వమునకు ఆ శివ-శక్తులే యోని (జనించి స్థానము) అయి ఉన్నారు.
హవిస్సులచే (సమర్పించబడు విధులచే) ఈ విశ్వమంతా నిండి ఉన్నవారు కూడా వారే!
విశ్వముయొక్క సంకోచ - వ్యాకోచములు విశ్వ విశ్వేశ్వరులగు పరబ్రహ్మమే!
మనస్సుచే ఇదంతా జనించి, మనస్సుతోనే లయించుచున్నది.
శర్వుడే ఈ సర్వజగత్ స్వరూపము. ఆతడే విధాత! సృష్టికర్త! ధరించునది ఆ ఆత్మ భగవానుడే! జీవుడూ ఆయనే! ఇదంతా హరించునది ఆయనే! ఈ విశ్వమంతా ఆయనయే! ఆయన యందే! ఆయనచేతనే! విశ్వేశ్వరుడే విశ్వరూపుడై ఉన్నారు.
విశ్వేశ్వరి ఆయనయే! విశ్వము ఆయనయే!

ఇతి మహెూపనిషత్ సారము! త్రైపుర్యా మహెూపనిషత్!
అట్టి పరమాత్మ జగత్ విభవమును ఎవ్వరైతే అక్షయరూపముగా ఆరాధిస్తారో వారు శివరూపులగుచున్నారు! శివానందము పొందుచున్నారు.
ఋక్ - సామ - యజో అధర్వణ వేదవిద్య అన్య విద్య సారమంతా ఇదే!
ఓం హ్రీం శివ - శక్త్యాయ నమో నమః! ఓం హ్రీం! ఓం హ్రీం!

పంచదశీ మంత్రము
క - ఏ - ఈ - ల - హ్రీం - హ - స - క - హ - ల - హ్రీం - స - క - ల - హ్రీం
1 - 2 - 3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15


ఇతి త్రిపురోపనిషత్
ఓం శాంతిః శాంతిః శాంతిః


ఋగ్వేదాంతర్గత

5     త్రిపుర ఉపనిషత్

అధ్యయన పుష్పము

శ్రీ మాతా బాలా త్రిపురసుందర్యై నమో నమః


ఒకానొక చోట మూడు పురములు : త్రిపురా - త్రిపురములు!

→ (స్థూల-సూక్ష్మ-కారణ దేహ పురములు!
→ జాగ్రత్-స్వప్న-సుషుప్తి అవస్థా పురములు!
→ ద్రష్ట-దర్శన-దృశ్య త్రిపుటీ పురములు!
→ అనుభవి-అనుభవ-అనుభవించబడు అనుభూతి పురములు!
→ కార్య - కారణ - కర్తృత్వ భావ పురములు!
→ భావించువాడు - భావించుట - భావించబడునది అగు అనుభవ పురములు!
→ ఇంద్రియములు ఉపయోగించుచున్నవాడు-ఇంద్రియములు-ఇంద్రియ విషయములు అను జగత్ రూప పురములు)

ఆ మూడు పురములకు మూడు పథములు (లేక) మార్గములు. (సాంఖ్య - భక్తి - యోగ - మార్గములు).

అవి ఈ విశ్వమంతా వ్యాపించి విశ్వరూపముగా సంప్రదర్శితమగుచున్నాయి.

అయితే....,

ఈ త్రిపురములలోని అంతర్గత విశేషాలన్నీ కాలగతిచే మార్పు చేర్పులు చెందుతూ ఉన్నాయి. మార్పు చేర్పులు చెందుచున్నవన్నీ కూడా నిత్య నూతనము-సర్వదా యథాతథము అగు అక్షరమునందు స్థానము (Placement) కలిగి ఉన్నాయి. అద్దానిని "అక్షర పరబ్రహ్మము" అని, "త్రిపురేశ్వరీతత్త్వము" అని “పరబ్రహ్మము” అని నిత్య సత్యము అని వర్ణించబడుతోంది. సదాశివము, అజరము (అజరము), పురాతనము, మహత్తర మహిమాసనిత్వము అగు పరబ్రహ్మము సర్వ దేవతా రూపములను అధిష్టించినదై ఉన్నది. దేవతలందరికి మూలతత్త్వము. వారు ఏర్పడి ఉన్న స్థానము కూడా అదియే! దేవతలు ఆ ఆత్మతత్త్వము యొక్క సంప్రదర్శనా రూపములు. అధిష్ఠాయా ఏనా అజరా, పురాణీ, మహత్తరా మహిమా దేవతానాం!

నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుణియగు త్రిపురేశ్వరీమాత (ఆత్మ) - కల్పనతో కూడిన ఈ "సృష్టి"ని - లీలా వినోదముగా కల్పించుకొనుచున్నది. ఇదంతా బాల త్రిపుర సుందరి యొక్క బాలా లీలా వినోదము.

అట్టి ఈ సృష్టి :-

ఇవన్నీ ఏకబ్రాహ్మీ - ఆత్మ చైతన్య స్వరూపుణియగు త్రిపురాదేవి యొక్క మహిమలుగా ప్రదర్శితమౌతున్నాయి. అయితే త్రిపురాదేవి ఏకస్వరూపిణియే గాని అనేకముగా అగుట లేదు.

ఆత్మ స్వరూపిణియగు త్రిపురేశ్వరీ దేవి....,

ఇవన్నిటితో సృష్టి స్థితి లయ క్రీడా వినోద విన్యాసమును నిర్వర్తించుచున్నది.

కథా రచయిత కథకు వేరై కథలోని సంఘటణలను పాత్రలను కల్పించుచున్న తీరుగా,.... కేవలాత్మ రూపిణియొక్క కేళీ విలాసమే ఈ జగత్తంతా కూడా!


చతుర్వింశతి సమిధలు (40)

పంచ భూతములు :  పృథివి ఆపః తేజో వాయు ఆకాశః (Solid Liquid Fire Vapour Space)

పంచ కర్మేంద్రియములు : చేతులు, కాళ్ళు, చర్మము, గుదము, శిశ్నము

పంచ జ్ఞానేంద్రియములు : త్వక్కు (చర్మము) చక్షువులు (కళ్ళు) రసము (నోరు) శోత్రము (చెవులు) ఫ్రూణము (ముక్కు)

పంచ ఇంద్రియ విషయములు (పంచతన్మాత్రయి) : శబ్ద - స్పర్శ - రూప రస గంధములు

పంచ కోశములు : అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞానమయ-ఆనందమయ

పంచ ప్రాణములు : ప్రాణ-అపాన-వ్యాన-ఉదాన-సమాన

దశవిధ నాడులు :  ఇడానాడి ముక్కుకు ఎడమభాగముగా,
పింగళనాడి ముక్కుకు కుడి భాగముగా,
సుమ్నానాడి ముక్కుకు మధ్య భాగముగా
గాంధారి నాడి కుడి కంటిలో
అస్తిని నాడి ఎడమకంటిలో, నాలుకలో
పుసానాడి కుడి చెవిలో
పయస్వనినాడి ఎడమ చెవిలో
ఆలంబన నాడి గుద స్థానమున
లకుహనాడి గుద స్థానమున
శంఖినీ నాడి నాభి స్థానమున
(NOTE: ఈ ఉపనిషత్తులో పై 40 విభాగించి వివరణగా చెప్పబడలేదు. యోగవిద్య యందు ప్రసిద్ధములు.)

చైతన్య స్ఫూర్తి రూపిణియగు త్రిపురేశ్వరి (పైన వివిధ ఇతర శాస్త్రములచే చెప్పబడిన) 40 సమిధల-తేజోరూపము ధరించినదై - వాయువు దేహములో ప్రవేశించి అంతటా విస్తరించిన తీరుగా - ఈ నా దేహములో ప్రవేశించినదై ఉన్నది. అట్లే అన్ని దేహములలోనూ కూడా! కట్టెలు అగ్నిచే వెలుగుచున్నప్పుడు చీకటి పటాపంచలౌతుంది కదా! ఆవిధంగా అగ్ని ఊర్ధ్వముగా వెలుగును కదా!

అట్లే,
-- నా అంతరమున 40 సమిధలను ధరించి ప్రవేశించినదై, జ్యోతి స్వరూపిణియై, ప్రకాశించుచుండగా నా అజ్ఞానాంధకారము తొలగిపోవును గాక!

ఆత్మజ్యోతి స్వరూపిణియగు త్రిపుర సుందరియే ...,
చంద్ర స్వరూపిణి అయి, చల్లటి చంద్ర కిరణముల తేజస్సుతో ప్రకాశిస్తోంది!
నాలోని దుఃఖ భావములను, మనోజాడ్యమును తొలగించుచూ, ఆనందానుభూతిని కలిగించుచుండును గాక! హృదయ మండలమును
అలంకరించి శోభ ప్రదము చేయును గాక!

ఆ త్రిపురేశ్వరీ ఆత్మచైతన్య విశ్వేశ్వరి ... ఈ లోకములన్నిటినీ నిండియున్నదై, త్రిరేఖలు ధరించి ప్రకాశించుచున్నది.

ఆ త్రిపురేశ్వరియే...,
త్రిభూః = స్వర్గ - మర్త్య - పాతాళ లోకములుగా, భౌతిక - మానసిక - బుద్ధి తత్త్వ రేఖలుగా,
త్రివిష్టపా = జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మగా,
త్రిగుణాః = సత్వ - రజో - తమో గుణములుగా,
త్రిప్రకారములు = స్థూల - సూక్ష్మ - కారణ రూపములుగా,
త్రిరేఖాలంకృతయై, సర్వే- సర్వత్రా సర్వముగా ప్రకాశమానమగుచున్నది.

ఆ త్రిపురేశ్వరీ మహా చైతన్య స్ఫూర్తి దేవి.....

పంచదశీ మంత్రము
ఓం ఐం హ్రీం క్లీం శ్రీం
ఓం క్లీంక్లోం
శ్రీచక్రము
క - ఏ - ఈ - ల - హ్రీం - హ - స - క - హ - ల - హ్రీం - స - క - ల - హ్రీం
1 - 2 - 3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15
శ్రీ మాతా బాలా త్రిపురసుందర్యై నమో నమః

త్రిపురతత్త్వమును మంత్ర పూర్వకముగా ఊపాసించువాడు -

  1. మదనుడు (కోరుకొనువాడు) - మదని (కోరుకొనబడునది)
  2. చూచువాడు - చూడబడునది
  3. భోగించువాడు - భోగించబడునది

ఈ మూడు తన స్వరూపమే అయి ప్రకాశించుచున్నాడు.

⌘ ⌘ ⌘

ఆ త్రిపుర సుందరీ చైతన్యము అనేక స్ఫూర్తి రూపములను ధరించి ఈ లోకములన్నీ పాలించుచున్నది.

మదంతికా; మాననీ; మంగళా; సుభగా; సుందరీ;
సిద్ధిమత; లజ్జ; మతి; తుష్టి; ఇష్ట;
పుష్టి; లక్ష్మి; ఉమ; లలిత; లాలపంతి.
- మొదలైనవన్నీ త్రిపురేశ్వరీ అవతార (సారూప్య) చిత్ చమత్కారములే!

ఏ బుద్ధిమంతుడైతే "సర్వము త్రిపురమహేశ్వరీ ఆనందతత్త్వమే".... అని గమనిస్తూ, దివ్యతత్త్వములతో, ప్రదర్శనా చమత్కారములతో కూడిన ఈ సర్వలోకములు త్రిపురేశ్వరీ స్వరూపముగా తెలుసుకుంటాడో...
అట్టివాడు "మదంతీ" (ఆత్యంతికమగు మత్ స్వరూపము) అనబడు స్వస్వరూప పీఠమును అధిరోహించి ఆనందించుచున్నాడు. (మత్ + అంతీ - 'నేను'కు ఆవల గల 'నేనైన నేను”).

యోగ సాధకుడు "మూలాధార చక్రము" అని పిలువబడు మహామహదత్వముతో కూడిన నాకము (నడుము) యొక్క పృష్ఠభాగములో
ప్రవేశించి, ఇక అక్కడినుండి 'తైపు' అనే సహస్రార ఊర్ధ్వ భాగమును చేరి, సర్వ ఇంద్రియ విషయములను అధిగమించినవాడై,
సర్వే-సర్వత్రా త్రిపురేశ్వరీ కేవల చైతన్య దర్శనము చేసుకొనుచున్నాడు. సర్వము త్రిపురేశ్వరీ తత్త్వముగా దర్శించుచున్నాడు. అదియే
బిందువు. (సర్వము త్రిపురేశ్వరీ రూపం సందర్శించు సహస్రాకాతీత బిందు స్థానము)!

పరంధామము; దివ్య స్థానము; త్రైపురీయోగము; ఆత్మసాక్షాత్కారము మొదలైన పేర్లతో ఆ త్రిపురేశ్వరీ వైభవము చెప్పబడుతోంది. సాలోక్య - సారూప్య - సామీప్య - సాయుజ్య వైభవముగా వర్ణిచబడుచూ చెప్పబడుతోంది.


త్రిపురేశ్వరీ మాయ

"కామోః యోనిః కామకలా" - ఈ లోకముల కల్పన అంతా కూడా త్రిపురేశరీ (ఆత్మదేవీ) కామ (ఇష్ట) జనితము ఆ దేవియొక్క ఇష్ట - కళా విశేషమైనట్టి మాయా కల్పనయే!

కామో (ఇచ్ఛ) ........ నిర్విషయము - అప్రమేయము అగు ఆత్మ “నాకు ద్వితీయమైనది కల్పించుకొనెదను గాక!” అని అనుకొనుచున్నది.
దృష్టాంతానికి, ఊరికినే కూర్చున్నవాడు ఊరికే ఉండబుద్ధి గాక ఏదో "ఊహ" లోకి వెళ్ళాలని అనుకోవటమే ... కామము.

యోనిః (కల్పనా జగత్) ....... ఈ లోకాలన్నీ త్రిపురేశ్వరీ దేవి యొక్క స్వకీయ ఇచ్ఛా శక్తి నిర్మితమైన ఊహా చమత్కారమే!

ఈ దృశ్య జగత్ కల్పన ఎక్కడి నుండి వచ్చింది? త్రిపురేశ్వరి (లేక) ఆత్మదేవి యొక్క కల్పన నుండే! కనుక ఇదంతా ఆత్మయొక్క కల్పనచే కల్పించబడి ఇచ్ఛనుండి ఏర్పడిన ఊహాదృశ్యమే! - ఈ లోకాలు.... అంతా ఊహాదృశ్యమే!

కామకలా .... కల తనదైనవాడు కల కల్పించుకొని, కల తనదేననే విషయం ఏమరచి, కలలోని వానివలె కలను చూస్తూ అనుభవిస్తూ ఉంటాడు కదా! అట్లాగే ఆ త్రిపురేశ్వరి అగు ఆత్మ "జగత్ కల్పన" అనే కలవంటి కల్పనలో ప్రవేశించి "నేను జీవుడను" అని భావిస్తూ ... ఆస్వాదించుచున్నది.

జగత్ కల్పన → ఆత్మదేవీ ఇష్ట - కామకళా కల్పనా విశేషం.

ఇంకా ఆ త్రిపురాకల్పినియగు ఆత్మ...,

మాతరిస్వ .... వాయువువలె జగత్తు - దేహములలో అంతటా సంచారము కలిగి ఉన్నది.

అభ్రమివ.... మేఘము సూర్యుని కప్పి ఉంచు తీరుగా, తన చైతన్య తత్త్వమును ఏమరచి విషయములచే కప్పి ఉంచుకొని ఉంటోంది.

ఇంద్రః.... ఇంద్రస్వరూపిణి అయి యింద్రియ విషయములను ఆస్వాదించుచున్నది.

పునఃగుహాయా .... చిన్న పిల్లవాడు (ఇసుకతో పిచ్చుకగూడు మొదలైన) ఆటలు ఆడుకుంటూ వాటిలో లీనమై, మరల ఎప్పుడో ఇల్లు గుర్తుకు వచ్చి, ఆటలు ఆపేసి ఇల్లు చేరుతాడు కదా! అట్లాగే, ఆ త్రిపురేశ్వరీ ఆత్మదేవి లోకకల్పనలు లోకాంతర జీవ రూప సంచారములు వదలి తిరిగి స్వస్వరూపమున ప్రవేశము పొంది,.... అంతా తానే అయి ఆనందించుచున్నది. తన హృదయ గుహయందు కల్పించుకొనటము, త్యజించటము నిర్వర్తిస్తోంది.

సకలా మాయయా చ .... ఇదంతా స్వకీయ మాయా కల్పనా బాలా లీలా వినోదమే! విశ్వ కల్పనా అంతర్భాగ విశేషాలు మాత్రమే!

ఇక ఆత్మ స్వరూపిణియగు త్రిపురేశ్వరియో?

ఆ ఆత్మస్వరూపుణియే "విశ్వమాతా" స్వరూపిణిగాను, "ఆదివిద్యా" స్వరూపిణిగాను కూడా ఉన్నది.

ఈ విధంగా త్రిపురేశ్వరీ యోగమును అభ్యసించు, ఉపాసించు, సాధనచేయు యోగి.... క్రమముగా షష్ఠమము (6వది - ఆజ్ఞాచక్రము) నుండి సప్తమము (7వది - బ్రహ్మ రంధ్రము) వరకు అగ్నిజ్యోతి (జ్ఞానము)ను నడిపించుచు "వహ్నిసారధి" అయి ఉంటున్నాడు.

త్రిక (ఓం హ్రీం శ్రీం) అను (శ్రీచక్ర) మూల మంత్రమును జపిస్తూ... ప్రజ్ఞను సహస్రారము దాటిస్తున్నాడు. ఆత్మత్వమును అవధరిస్తూ...

ఇక ఈ కల్పనా లోకములతో కూడిన జగత్తు విషయమై

అనగా....,
- అప్రమేయ త్రిపురేశ్వరీ పరస్వరూపము,
- మాయా కల్పన,
- మాయను విరమింపజేయటము,
- సర్వదా కేవలసాక్షీ - అప్రమేయ నిత్యత్వము....
ఎరిగినవాడు అగుచున్నాడు.

కథ్యమ్ కలిమ్ కల్పకమ్ - ఈ జగత్ దర్శనమంతా తాను కవియై కల్పించుకొన్న కథలాగా దర్శిస్తూ, త్రిపురేశ్వరీ స్వస్వరూపమును ఆస్వాదిస్తూ ఉంటున్నాడు. కామములను అధిగమించి, కామేశ్వరుడై పరమాత్మను దర్శించుచూ, స్తుతిస్తున్నాడు . అమృతత్వమ్ భజంతే! అమృతత్వమును ఆరాధిస్తూ అమృత స్వరూపుడు అగుచున్నాడు.

ఈవిధంగా ఈ విశ్వమంతా విశ్వమాతయొక్క త్రిముఖముల పురము.

హం - విశ్వమాత యొక్క 3 ముఖముల (జ్ఞాత-జ్ఞానము-జ్ఞేయము, తెలుసుకొనువాడు - తెలుసుకోవటం-తెలియబడునది
మొదలుగా గల) పురము.
అహం - అ + హమ్

అట్టి ఈ విశ్వమాతా విన్యాసమంతా కూడా చైతన్య స్వరూపుణియగు త్రిపురేశ్వరి యొక్క స్వరము (విశుద్ధ చక్రము)లో సూర్య తేజోరూపమై విరాజిల్లుచున్నది. కనుకనే అహమ్ ఏవ బ్రహ్మమ్ - అహమ్ బ్రహ్మాస్మి .... అగుచున్నది.

ఆ త్రైలోక్యమాత (త్రిపురధారిణి)
- బృహత్ తిథి (కాల) స్వరూపిణియై
- దశ (పంచ ప్రాణ, పంచ ఉపప్రాణ స్వరూపిణి) అయి,
- పంచ (పంచ కర్మేంద్రియ పంచ జ్ఞానేంద్రియములై),
- నిత్య (ఎల్లప్పుడు యథాతథ స్వరూపిణి) అయి,
స షోడశికమ్ : షోడశ కళలతో (పంచ కర్మేంద్రియములు + పంచ జ్ఞానేంద్రియములు + అంతరంగ చతుష్టయము + జీవాత్మ + ఈశ్వర కళాత్మికంగా)
ఈ త్రిపురముల పురమధ్యలో స్థానము కలిగియుండి సర్వమును ప్రదర్శించుచు, భిభర్తి - భరించుచున్నది.

అంతే కాకుండా....,
మండలమునకు (విశ్వమునకు-విశ్వభావములకు-శ్రీచక్రమునకు) నాభి-మధ్య స్థానములో ఉండి సర్వదా సర్వము తానే అయి, ఏకస్వరూపిణి అయి వెలుగొందుచున్నది.

ఈ విధముగా త్రిగృహముల యజమాని - గృహిణియగు త్రిపుర సుందరీ ఆత్మ చైతన్యము ఆదిబింబ స్వరూపిణి అయి ప్రతిబింబమాత్ర జగత్ దృశ్యమును ప్రతిబింబింపజేస్తూ

ఏకముఖము - ఏకద్రష్ట
మూడు గుహసదనములు - జాగ్రత్-స్వప్న-సుషుప్త, జీవ ఈశ్వ పరమాత్మ దర్శనములు ప్రదర్శిస్తూ,

ఇదంతా తనయొక్క కామకళగా ప్రదర్శించు కామేశ్వరీ - కామకళా రూపిణియగు త్రిపురతత్త్వమును తెలుసుకొని ఉపాశించువాడు...,

కాముడు - కామకలా రూపము
పురుషుడు - ప్రకృతి
తానే అయి పరబ్రహ్మముగా దీపించగలడు.

అట్టివాడు....,
పరిసృతం ఝుషమ్ · అజం పలఞ్చ భుక్తాని - చేప - మేక మాంసము-అన్నము (జీవుడు - ఈశ్వరుడు - బ్రహ్మము, మనస్సు - బుద్ధి - అహంకారము)లను, సుపరిష్కృతమైన యోనులను దేవతలకు లోక కళ్యాణార్థము సమర్పిస్తున్నవాడై...., నివేదన చేస్తూ.....,
మహత్యైః .... ఈ సర్వము త్రిపురేశ్వరీ ఆత్మస్వరూపుణియొక్క మహత్తుగా దర్శిస్తూ....,
స్వాత్మీకృతే సుకృతీ సిద్ధిమ్ ఏతి!
- సర్వమును బ్రహ్మార్పణముగా చేయుచు...,
- ఈ కనబడేదంతా స్వాత్మారూపముగా ఆస్వాదిస్తూ (Enjoying as form of own self) ఉన్నాడు.

(అట్టి సుకృతుడు) ఆత్మత్వమును సిద్ధించుకొని త్రిపురీదేవీ తత్త్వమై ప్రభవిస్తున్నాడు. ప్రకాశిస్తున్నాడు. విశ్వదేవీ భావనా - సాత్విక దృష్టులతో సర్వము అమృతప్రాయము చేయుచున్నాడు.

త్రిపురేశ్వరీ ఆత్మ చైతన్యముగా ఈ విశ్వమును ఉపాసించువాని యొక్క ప్రతిబంధకములన్నీ విశ్వజననియగు ఆదిశక్తి పంచబాణముల ప్రయోగముచే (కర్మ-భక్తి-జ్ఞాన-యోగ-సమాధి విధానములచే) పారత్రోలుచున్నది. ఆదిశక్తి, విశ్వజనని.... సాధకులము, ఉపసాకులము అగు మనలను రక్షించుచు, విశ్వతత్త్వమగు పరబ్రహ్మమువైపుగా నడపుచుండును గాక!

ఇక్కడ ద్విత్వము లేదు. ఏకతత్త్వమే అంతటా తాండవించుచున్నది. సర్వమును వెలిగించు భగః శక్తి-భగవంతుడు - కామీ (ప్రకృతి) ఈశ ఇరువురును ఏక స్వరూపులు.

⌘ పురుషుడు - ప్రకృతి
⌘ అనుభవించువాడు - అనుభవించబడునది (Experiencer Experiencing)
ఏకమే! ఉభయతత్త్వములు మనకు తోడై సర్వము ప్రసాదిస్తూ ఉన్నాయి.

ప్రకృతి - పురుషులు …...
⌘ ఇరువురు సమప్రధానులే! (Equally Important)
⌘ సమసత్వులే! (Equally Energitic)

పురుషుడు - ప్రకృతి, శివ-శక్తుల ఐక్యత్వము, సమాన ప్రధానత్వము, సమం-సత్వము, సమ ఓజోశక్తిత్వములను ఎరుగుటచే త్రిపురతత్త్వము అనుభూతమవగలదు.

✤ పురుషుడు - ప్రకృతి .... ఉభయము అవినాశనమైనవి
✤ ఈ విశ్వమునకు యోనిస్థానము (జనించు స్థానము) శివ-శక్తుల (Experiencer-Experiencing) యొక్క ఏకస్థానమే! ఆ ఇరువురు ఏకమగు ఆ ఉభయతత్త్వములు హవిస్సులచే (By respective contributions) ఈ విశ్వమంతా నిండి-నింపి ఉంచుచున్నారు.
✤ ఈ విశ్వముయొక్క సంకోచ-వ్యాకోచములు ఉభయములు పరబ్రహ్మము యొక్క విశేష వైశిష్ఠ్యము!
✤ ఈ విశ్వము విశ్వేశ్వరుని మనస్సుచే జనిస్తోంది. మనస్సు చేతనే లయిస్తోంది. మనస్సే దేవీ స్వరూపము!
✤ ఈ విశ్వముయొక్క రూపము విశ్వేశ్వరుడే! విశ్వేశ్వరుడే విశ్వరూపముగా ఉన్నాడు.
✤ స్వస్వరూపమగు శర్వుడే ఈ సర్వ జగత్ స్వరూపము. ఆతడే సృష్టికర్త! విధాత! సంరక్షకుడు! పరిపోషకుడు! హర్త!
✤ ఇదంతా ధరించుచున్నది, తన అనుభవరూపముగా నిర్వచించుకొనుచున్నది విశ్వేశ్వరుడే!
✤ ఆతడే ఆత్మ! ఆతడే ఈ జీవుడు! అతడే ప్రకృతి! అతడే సృష్టి - స్థితి - లయము! ఆతడే త్రిపురసుందరీ స్వరూపము!
✤ విశ్వమంతా విశ్వాత్మమయము. విశ్వాత్మయే జీవాత్మ కూడా!

ఇతి త్రిపురోపనిషత్ సారము! మహెూపనిషత్ వాక్యము! అట్టి త్రిపురేశ్వరుడగు పరమాత్మయొక్క విభవముగా ఈ జగత్తును, ఎవ్వరైతే ఆరాధిస్తూ ఉంటారో వారు స్వయం పరబ్రహ్మ స్వరూపులుగా నిర్వచనానందము పునికి పుచ్చుకొనుచున్నారు.

ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదముల, వేదాంతవిద్యయొక్క, అన్యవిద్యలయొక్క సారము - భిన్నముగా కనిపించేదాని ఏకత్వమే అయి ఉన్నది.

ఓం హ్రీం! ఓం హ్రీం! ఓం హ్రీం! శ్రీమాత్రే నమః!

🙏 ఇతి త్రిపుర ఉపనిషత్ సమాప్తః 🙏
ఓం శాంతిః! శాంతిః! శాంతిః!