[[@YHRK]] [[@Spiritual]]
Gopāla (Poorva) Tāpini Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 4
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com
గోపాలతాపనం కృష్ణం యాజ్ఞవల్క్యం వరాహకం . శాట్యాయనీ హయగ్రీవం దత్తాత్రేయం చ గారుడం .. |
శ్లో।। గోపాలతాపనం కృష్ణం యాజ్ఞవల్క్యం వరాహకం |
భక్తి, యోగ-ధ్యాన-ముక్తి ప్రదాతలగు (1) గోపాల తాపినీ (2) కృష్ణ (3) యజ్ఞవల్క్య (4) వరాహక (5) శాట్యాయని (6) హయగ్రీవ (7) దత్తాత్రేయ (8) గరుడ-ఉపనిషత్ మాతలకు నమస్కారము. |
హరిః ఓం సచ్చిదానందరూపయ కృష్ణాయాక్లిష్టకర్మణే . నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే .. |
||
1. ఓం। సచ్చిదానంద రూపాయ। కృష్ణాయ అక్లిష్టకారిణే నమో వేదాంత వేద్యాయ। గురవే బుద్ధి సాక్షిణే।। (వేదాంత వేద్యుడు = One who is knowing the knower in all) |
ఓం।। సత్-చిత్-ఆనందస్వరూపులు, అక్లిష్టకారులు (దుఃఖము, బాధ, కష్టములు తొలగించు స్వభావులు), వేదాంతములగు ఉపనిషత్ వాఙ్మయముచే తెలియబడువారు, జగద్రక్షకులు, సర్వజీవులలోని ‘బుద్ధి’కి సాక్షి అయి వేంచేసి ఉన్నవారు, జగద్గురువులు - అగు శ్రీకృష్ణ పరబ్రహ్మమునకు - నమో నమో నమో నమః। |
|
మునయో హ వై బ్రాహ్మణమూచుః . కః పరమో దేవః కుతో మృత్యుర్బిభేతి . కస్య విజ్ఞానేనాఖిలం విజ్ఞాతం భవతి . కేనేదం విశ్వం సంసరతీతి . |
||
మునయో - హ వై బ్రాహ్మణమ్ ఊచుః : కః పరమో దేవః? కుతో మృత్యుః భిభేతి? కస్య విజ్ఞానేన అఖిలం విజ్ఞాతం భవతి? కేన ఇదం విశ్వం సగ్ంసరతి-ఇతి? |
మునులు : ఓ ఆత్మతత్త్వజ్ఞులగు బ్రహ్మభగవాన్! దేవతలకే దేవుడు, దేవాది దేవుడు, మీకు కూడా దేవుడు, పరమో దేవుడు ఎవరు? ఈ జీవులగు మేమంతా మృత్యువును చూచి భయపడుతూ ఉండగా, మృత్యువు ఎవ్వరిని చూచి భయము పొందుతోంది? జీవులకు ‘అమృతప్రదాత’ ఎవరు? ఎవ్వరి గురించి తెలుసుకొన్న తరువాత, ఇక ఆపై ఈ సమస్త దృశ్యము యొక్క, 14 లోకముల యొక్క, జన్మ-కర్మలయొక్క ఆను-పానులేమిటో తెలిసిపోతాయి? ఈ విశ్వమంతటినీ ఇంతటి విధి విధానంగా, చమత్కారంగా నడుపుచున్న నావికుడు ఎవరు? |
|
తదుహోవాచ బ్రాహ్మణః . కృష్ణో వై పరమం దైవతం . గోవిందాన్మృత్యుర్బిభేతి . గోపీజనవల్లభజ్ఞానేనైతద్విజ్ఞాతం భవతి . స్వాహేదం విశ్వం సంసరతీతి . |
||
తదు హో వాచ బ్రాహ్మణః : కృష్ణో వై పరమం దైవతమ్। ‘‘గోవిందాత్’’ మృత్యుః బిభేతి। ‘‘గోపీజనవల్లభ’’ జ్ఞానేన ఏతత్ విజ్ఞాతం భవతి। ‘‘స్వాహా’’ ఇదగ్ం విశ్వగ్ం సగ్ంసరతీతి।। |
బ్రహ్మజ్ఞుడగు బ్రహ్మదేవుడు : సర్వాత్మకుడగు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు. ఆ గోవిందునికి మృత్యువు కూడా భయపడుతుంది. నేను ఎల్లప్పుడు అట్టి శ్రీకృష్ణచైతన్య తత్త్వమునే ఉపాసిస్తున్నాను. గోపీజనవల్లభాయ : గోపీజన వల్లభుని గురించిన జ్ఞానముచే దృశ్యజగత్తు, జీవాత్మల రాకపోకలతో సహా ఈ సమస్తము ‘తెలియబడునది’ (Wel-known) అవగలదు. స్వాహా: ‘స్వాహా’ (స్వ-అహ, సోఽహమ్) చేతనే ఈ విశ్వమంతా నడిపించ బడుతోంది. |
|
తదుహోచుః . కః కృష్ణః . గోవిందశ్చ కోఽసావితి . గోపీజనవల్లభశ్చ కః . కా స్వాహేతి . |
||
తదుహోచుః!। (తదు హ ఊచుః): కః కృష్ణః? గోవిందశ్చ కోసావితి? గోపీజనవల్లభశ్చ కః? కా స్వాహా - ఇతి? |
మునులు : ఈ కృష్ణుడు ఎవరు? ఎందుకు ‘గోవిందుడు ’ అని పిలుస్తున్నాము? గోపీజన-వల్లభుడు ఎవరు? ‘స్వాహా’ - అనగా ఏమిటి? మరికొంత వివరించండి? |
|
తానువాచ బ్రాహ్మణః . పాపకర్షణో గోభూమివేదవేదితో గోపీజనవిద్యాకలాపప్రేరకః . తన్మాయా చేతి సకలం పరం బ్రహ్మైవ తత్ . |
||
తానువాచ బ్రాహ్మణః : పాపకర్షణో గోభూమి వేదవిదితో గోపీజన విద్యా కలాపీ। ప్రేరకః। తత్ మాయా చ ఇతి। సకలం పరబ్రహ్మైవ తత్।। |
హిరణ్యగర్భుడు (బ్రహ్మదేవులవారు) : మునులారా! శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించినంత మాత్రంచేతనే - ఈ జీవుల సమస్త పాపకర్మల ఆకర్షణను తొలగించుకోగలరు. ఆయన వేదములకే జననస్థానమగు గోభూమిని ఏలువాడు. వేదనిదితులు. (జగత్తులన్నిటికీ జననస్థానముగా కలవారు) శ్రీకృష్ణుడు. గోపీజనుల జీవన్-బ్రహ్మైక్య విద్యయందు - అటు, ఇటు కూడా క్రీడించువారు. ఈ జగత్తులోని అణువణువును ప్రేరేపించు చైతన్యస్ఫూర్తి. ఈ జగద్దృశ్యమంతా ఆయన మాయయే! ఇదంతా కూడా ఆ శ్రీకృష్ణ చైతన్య-పరబ్రహ్మతత్త్వమే। | |
యో ధ్యాయతి రసతి భజతి సోఽమృతో భవతీతి . |
||
యో ధ్యాయతి రసతి భజతి, సో-మృతో భవతి-ఇతి।। (సో అమృతో భవతి - ఇతి)। |
అట్టి కృష్ణపరమాత్మను ఎవరు ధ్యానిస్తారో, ఇదంతా కృష్ణ చైతన్యస్వరూపంగా రసాస్వాదన చేస్తారో, ఈ విశ్వమంతా కృష్ణతత్త్వముగా భజిస్తారో, అట్టివాడు మార్పు - చేర్పులతో కూడిన మృత్యుపరిధిని దాటివేసి - అమృతస్వరూపుడు కాగలడు. ‘‘జన్మ-మృత్యువులకు ఆవల నేను సర్వదా యథాతథంగా కృష్ణ చైతన్యానంద స్వరూపుడను’’ అని గమనిస్తూ తన్మయుడై ఉండగలడు. |
|
తే హోచుః . కిం తద్రూపం కిం రసనం కిమాహో తద్భజనం తత్సర్వం వివిదిషతామాఖ్యాహీతి . |
||
తేహోచుః : (తే హ ఊచుః) : కిం తత్ రూపం? కిగ్ం రసనం? కిమాహో తద్భజనమ్? (కిమ అహో తత్ భజనమ్)? తత్సర్వం వివిదిషతామ్ ఆఖ్యాహి। ఇతి।। |
మునులు : హే బ్రహ్మజ్ఞా! ఆ కృష్ణ చైతన్యభగవానుని రూపము ఏమిటి? ఆయన రసతత్త్వము ఎట్టిది? ‘ఆయనను భజించటము’ అనగా ఏమి? ఎట్లా? ఇదంతా తెలుసుకోవాలనే ఉత్సుకత మాయందు పొంగిపొరలుతోంది. స్వామీ! దయచేసి వివరించి చెప్పండి. |
|
తదుహోవాచ హైరణ్యో గోపవేషమభ్రామం కల్పద్రుమాశ్రితం . తదిహ శ్లోకా భవంతి .. |
||
తదు హో వాచ : హైరణ్యో। గోపవేషమ్। ఆహ్రాభం తరుణం। కల్పద్రుమాశ్రితం।। - తదిహ శ్లోకా భవంతి। |
హిరణ్యగర్భుడు : బంగారు ఆభరణములన్నిటికీ బంగారమే అధిష్ఠానము కదా! అట్లాగే ఈ సమస్త సృష్టికి, ఇందలి సమస్త జీవులకు శ్రీకృష్ణ పరమాత్మయే హిరణ్మయుడు. ఆయనయే లీలామానుషంగా గోపాలబాల వేషధారుడు కూడా. వారు-వర్షధారలు ప్రసాదించి భూమిని సేద్యవంతము చేయు మేఘమువంటివారు. జీవులపై అమృతధారలు కురిపించువారు. కాలమునకు ఆవలివారు కాబట్టి - తరుణుడు (నిత్యయౌవనుడు). జీవులను తరింప జేయువారు. కల్పవృక్షమును ఆశ్రయించి ఉన్నవారు. ఇట్టి ‘కృష్ణతత్త్వవర్ణన’ను గురించి ఇంకా గానం చేస్తూ శ్లోకములు చెప్పబడు చున్నాయి (శ్లోకించబడుతోంది). |
|
సత్పుండరీకనయనం మేఘాభం వైద్యుతాంబరం . ద్విభుజం జ్ఞానముద్రాఢ్యం వనమాలినమీశ్వరం .. 1.. గోపగోపీగవావీతం సురద్రుమతలాశ్రితం . |
||
సత్పుండరీక నయనం మేఘాభం వైద్యుతాంబరం। ద్విభుజం। జ్ఞాన ముద్రాఢ్యం వనమాలినమ్ ఈశ్వరమ్।। గోపగోపీ గవావీతగ్ం సురద్రుమతల (లత) ఆశ్రయమ్।। |
🙏 పుండరీకాక్షుడు. తెల్లటితామరపూవులవంటి కనులతో ప్రకాశించువారు. కేవలమగు సత్-చిత్ ఆనంద దృష్టి సంపన్నులు. 🙏 మేఘపు మెరుపులవంటి వస్త్రములు ధరించినవారు. జగత్తులను అలంకార వస్త్రములుగా ధరించినవారు. 🙏 (యోగ - జ్ఞానములను) రెండు భుజములుగా కలవారు. 🙏 (చిన్ముద్ర ‘తత్‌త్వమ్అసి’ అను రూపముగల) జ్ఞానముద్రను సదా ధరించినవారు. ‘సాక్షాత్ తత్ త్వమ్ అసి’’ అను బోధతో సంభాషించువారు. 🙏 వనమాలను ధరించినవారు. ‘బ్రహ్మాండములు’ అనే వనమును పాలించువారు. సమస్త జీవులను పుష్పమాలవలె ధరించుచున్నవారు. 🙏 సమస్తమును నియామకము చేయు ఈశ్వరులు. సమస్తమునందు సమస్తముగా విస్తరించి ఉన్నవారు. 🙏 గోప-గోపీజనమధ్యగా విరాజిల్లువారు. ఆశ్రిత జనులతో (వ్రజగోపికలతో) - ఆత్మానందము అనే బృందావన/ఉపనిషత్ వనములో విహరించువారు. 🙏 భక్తుల పాలిటి కల్పవృక్షమై సమస్తము ప్రసాదించువారు. |
|
దివ్యాలంకరణోపేతం రత్నపంకజమధ్యగం .. 2.. |
||
దివ్యాలంకరణోపేతం। రత్న పంకజ మధ్యగమ్। |
🙏 దివ్యమైన ఆభరణములు ధరించినవారు. దివ్యత్వము ప్రదర్శించువారు. 🙏 రత్నమధ్యగా (విశ్వమునకు నాభి అయి) వేంచేసియున్నవారు. |
|
కాలిందీజలకల్లోలసంగిమారుతసేవితం . చింతయంచేతసా కృష్ణం ముక్తో భవతి సంసృతేః .. 3.. ఇతి.. |
||
కాళిన్దీ జల కల్లోల సంగి, మారుత సేవితమ్। చింతయన్ చేతసా కృష్ణం ముక్తో భవతి సంసృతేః। ఇతి।। |
🙏 కాళిందీ నదిలోని తరంగములను తాకుతూ వస్తున్న పిల్లగాలులను ఆస్వాదించువారు. అట్టి శ్రీకృష్ణ రూపమును మనస్సుతో చింతన చేయువాడు సమస్త సంసార బంధములనుండి విముక్తుడు కాగలడు. |
|
తస్య పునా రసనమితిజలభూమిం తు సంపాతాః . కామాది కృష్ణాయేత్యేకం పదం . గోవిందాయేతి ద్వితీయం . గోపీజనేతి తృతీయం . వల్లభేతి తురీయం . స్వాహేతి పంచమమితి |
||
2. తస్య పునా రసనమ్ ఇతి - జల భూమి ఇందు సంపాతకామాది। ‘కృష్ణాయ’ ఇతి ఏకం పదం। ‘గోవిందాయ’ ఇతి ద్వితీయం। ‘గోపీజన’ ఇతి తృతీయం। ‘వల్లభాయ’ ఇతి తురీయగ్ం। ‘స్వాహా’ ఇతి పంచమమ్। ।।ఇతి।। |
ఇంకా కృష్ణ ‘‘నామామృత-తత్త్వామృత’’ రసము ఈ విధమైనది. ఆయన రస స్వరూపమే జలమునందు, భూమియందు, చంద్రునియందు, పక్షులయందు, సర్వజీవులందు, వారి ఆశ్రయములందు విస్తరించి ఉన్నది. ఆయనయే విశ్వరస స్వరూపుడు. ‘గోవిందాయ’ - ఇది రెండవ పదము. ‘గోపీజన’ - ఇది మూడవ పదము. ‘వల్లభాయ’ - ఇది తురీయము. (చతురీయము - నాలుగవ పదము) ‘స్వాహా’ - ఇది ఐదవ పదము (తురీయాతీతము). |
|
పంచపదం జపన్పంచాంగం ద్యావాభూమీ సూర్యాచంద్రమసౌ తద్రూపతయా బ్రహ్మ సంపద్యత ఇతి . తదేష శ్లోకః |
||
పంచపదం జపన్ - పంచ అంగమ్ ద్యావా భూమీ సూర్యా చంద్రమసౌ తత్ రూపతయా బ్రహ్మ సంపద్యతే। బ్రహ్మసంపద్యత ఇతి।। తత్ ఏష శ్లోకః।। |
ఈ పంచ-అంగములను ‘పంచపదమంత్రము’గా జపిస్తూ ‘‘ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రమసము (చంద్రబింబము) - ఇవన్నీ శ్రీకృష్ణబ్రహ్మస్వరూపమే’’ - అను భావన, ఉపాసనలచే - బ్రహ్మమును ఎరిగినవాడై ఈ జీవుడు బ్రహ్మమే అగుచున్నాడు. ఇంకా ఈ విధంగా శ్లోకయుక్తంగా గానం చేయబడుతోంది. |
|
క్లీమిత్యేతదాదావాదాయ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయేతి బృహన్మానవ్యాసకృదుచ్చరేద్యోఽసౌ గతిస్తస్యాస్తి మంక్షు నాన్యా గతిః స్యాదితి . భక్తిరస్య భజనం . ఏతదిహాముత్రోపాధినైరాశ్యే- నాముష్మిన్మనఃకల్పనం . |
||
3. ‘క్లీం’ ఇతి ఏతత్ ఆదావాదాయ ‘‘కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయేతి’’ బృహత్ భానవ్యా (భావవ్యా) సకృత్ ఉచ్చరేత్।। |
‘‘క్లీం’’ అని మొదటగా మధ్యమ స్వరంతో ప్రారంభము చేసి, అప్పుడు ‘‘కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ’’ అను బృహత్ ప్రదర్శనముగా పలుకుచూ, ఒక్కసారిగా ‘స్వాహా’ అని (పై స్వరంగా) ఉచ్ఛరించాలి. (‘‘క్లీం’’ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా’’) |
|
యోఽసౌ గతిః తస్య అస్తి మంక్షు నాన్యాగతి (న అన్యాగతి)స్య అస్యాత్ ఇతి భక్తిరస్య భజనం తత్ ఇహ-ఆముత్ర ఉపాధి నైరాశ్యేన ఆముష్మిన్ మనః కల్పనమ్।। |
ఏ స్థితి-గతిలో ఉన్నప్పుడైనా కూడా పైన చెప్పిన అష్టాదశాక్షరమంత్రము పఠించెదరుగాక। ‘‘ఇక దేనినీ ఆశ్రయించవలసిన పనిలేదు. వేరే గతి లేదు’’ - అని నమ్మి భక్తితో ఈ మంత్రమును అభ్యాసం చేయుదురుగాక. భూలోకంలో లభించే ఇహ ఫలముల పట్ల, ‘స్వర్గలోకము’ మొదలైన ఆముష్మిక ఫలములపట్ల కూడా నైరాస్యము వహించి, నిష్కామంగా పై కృష్ణమంత్రమును జపించెదరుగాక! మనఃకల్పనలన్నీ జయించి, మనస్సును కేవలాత్మస్వరూపమగు కృష్ణతత్త్వమువైపుగా మాత్రమే నియమించండి. |
|
ఏతదేవ చ నైష్కర్మ్యం . |
||
ఏతదేవ చ ‘‘నైష్కర్మ్యమ్’’।। |
ఇదియే నైష్కర్మ్యస్థితి. ‘నాకు ఇది కావాలి’ అని కోరకుండా మంత్రమును జపించువానికి ఏది కావాలో అది పరమాత్మయగు శ్రీకృష్ణులవారు ప్రసాదించగలరు. (అడిగినవారికి అడిగినది, అడగనివారి ‘కావలసినది’ - ప్రసాదించువారు). |
|
కృష్ణం తం విప్రా బహుధా యజంతి |
||
‘కృష్ణం’ తం విప్రా బహుధా యజంతి। |
వేద-ఉపనిషత్‌ల హృదయము తెలిసిన విప్రులు - శ్రీకృష్ణపరమాత్మను అనేక విధాలుగా (సహస్రనామములతో, తాత్త్విక వివరణలతో, శ్రీకృష్ణ బాల్యలీలల ఆధ్యాత్మికార్థములతో) స్తుతిస్తున్నారు. |
|
గోవిందం సంతం బహుధా ఆరాధయంతి . గోపీజనవల్లభో భువనాని దధ్రే స్వాహాశ్రితో జగదేతత్సురేతాః .. 1.. |
||
‘గోవిందగ్ం’ సంతం బహుధా ఆరాధయంతి। ‘గోపీజన వల్లభో’ భువనాని దధ్రే। ‘స్వాహా’ శ్రీతోజగదైజత్సు రేతాః। (‘స్వాహా’ ఇతోజగత్ ఐజత్ సురేతాః) |
సంతలు (మహర్షులు) ఆ పరమాత్మను గోవిందా మొదలైన పేర్లతో బహువిధములుగా ఆరాధిస్తూ ఉన్నారు. ‘‘గోవిందా! గోవిందా! గోవిందా!’’ అని పలుకుచు బంధములను అధిగమిస్తున్నారు. ఆ గోపీజన వల్లభుడే సమస్త భువనములను ఆభరణములవలె ధరించు బ్రహ్మానందమయులు, ‘స్వాహా’ అను శ్రీ (సిరి) శబ్దము ఆయన జగత్తులను వృద్ధి చేయు చమత్కారము. ఈ శబ్దము సమస్త సంపదలకు ఆలవాలము. |
|
వాయుర్యథైకో భువనం ప్రవిష్టో జన్యేజన్యే పంచరూపో బభూవ . కృష్ణస్తదేకోఽపి జగద్ధితార్థం శబ్దేనాసౌ పంచపదో విభాతి .. 2.. ఇతి.. |
||
వాయుః యథా ఏకో భువనం ప్రవిష్ఠో జన్యే జన్యే పంచరూపో బభూవ, - కృష్ణః తథా ఏకోఽపి జగద్ధితార్థగ్ం (జగత్ హితార్థగ్ం) శబ్దేన అసౌ పంచపదో విభాతి - ఇతి।। |
వాయువు సర్వదా ‘ఒక్కటే అయి ఉండి కూడా భూమిపై ప్రవేశించి ప్రతి ప్రాణియందు (ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన) పంచప్రాణముల రూపము ఏ విధంగా వహిస్తోందో, (అదేవిధంగా) శ్రీకృష్ణ భగవానుడు తాను ఏకమే అయి ఉండి, ఈ జగత్ నిర్మాణము కొరకై శబ్ద స్పర్శ రూప రస గంధములుగా, పంచపదములుగా (దృశ్యము, దేహములు, ఇంద్రియములు, జీవుడు, ఈశ్వరుడుగా), పంచభూతములుగా ప్రకాశిస్తున్నారు. | |
తే హోచురుపాసనమేతస్య పరమాత్మనో గోవిందస్యాఖిలాధారిణో బ్రూహీతి . |
||
తే హ ఊచు (తే హోచు) : ఉపాసనమ్ ఏతస్య పరమాత్మనో గోవిందస్య అఖిలాధారిణో భ్రూహి ।ఇతి। |
మునులు : హే బ్రహ్మన్! అట్టి - ఈ సమస్తము తానే ధారణ చేస్తున్న పరమాత్మ అగు గోవిందుని ఉపాసనా విధానము దయచేసి వివరించం& |
|
తానువాచ యత్తస్య పీఠం హైరణ్యాష్టపలాశమంబుజం తదంతరాధికానలాస్త్రయుగం తదంతరాలాద్యర్ణాఖిలబీజం కృష్ణాయ నమ ఇతి బీజాఢ్యం సబ్రహ్మా బ్రాహ్మణమాదాయానంగగాయత్రీం యథావదాలిఖ్య భూమండలం శూలవేష్టితం కృత్వాంగవాసుదేవాది- రుక్మిణ్యాదిస్వశక్తిం నందాదివసుదేవాదిపార్థాదినిధ్యాదివీతం యజేత్సంధ్యాసు ప్రతిపత్తిభిరుపచారైః . తేనాస్యాఖిలం భవత్యఖిలం భవతీతి .. 2.. తదిహ శ్లోకా భవంతి . |
||
తానువాచ (తాన్ ఉవాచ) : యత్తస్య పీఠగ్ం హైరణ్యాష్ట పలాశమంబుజం తదంతరాళిక అనల అస్త్రయుగం। తదంతరాళాత్‌వర్ణాఖిల బీజం। ‘కృష్ణాయ నమ’ ఇతి బీజ-ఆద్యగ్ం। స బ్రహ్మాణమ్ ఆదాయ అనంగ-గాయత్రీం యథావత్ వ్యాలిఖ్యా భూమండలగ్ం శూలవేష్టితం కృత్వానం। |
బ్రహ్మభగవానుడు : ఆ గోవిందుని యొక్క పీఠము హిరణ్మయమైనది. అష్టదళ పద్మము. అట్టి పద్మముయొక్క అంతరాళముగా అనలాస్త్ర (అగ్ని) యుగము. అట్టి అగ్నిశిఖయందు - సమస్తము యొక్క బీజము (విశ్వబీజము). అంతరాళమున ‘‘కృష్ణాయనమః’’ - అను అఖిలవర్ణ బీజము. అట్టి కృష్ణాయనమః తత్త్వమునందు - - బ్రహ్మతో కూడిన ‘‘అనంగగాయత్రి’’ని లిఖించాలి. - భూమండలమును శూలవేష్ఠితము (శూలముపై ఉన్నట్లు)గా భావించి, (అనంగ గాయత్రి = శ్రీకృష్ణాయ విద్మహే, గోవిందాయ ధీమహి। తన్నో గోపీజనవల్లభాయ ప్రచోదయాత్।।) |
|
వాసుదేవాది, రుక్మిణ్యాది స్వశక్తిం, నందాది, వసుదేవాది, పార్థాది, నిధ్యాదివీతం యజేత్ సంధ్యాసు ప్రతిపత్తిభిః ఉపచారైః తేన అస్య అఖిలం భవతి। అఖిలం భవతీతి।। తత్ ఇహి శ్లోకా భవంతి।। |
- అట్టి అంతరహృదయ బీజములో రుక్మిణీసమేత వాసుదేవుని స్వశక్తిని ఆహ్వానించాలి. నంద, వాసుదేవ, పార్థ, నిధి (లక్ష్మీ / రుక్మిణీ) సహితంగా ఆ మూలశక్తిని ఉపాసించాలి. - ఉదయ - మధ్యాహ్న - సాయంత్ర సంధ్యలతో వాసుదేవ, రుక్మిణీ , నంద, పార్థ, వసుదేవ, నిధి-ఆదిశక్తికి ప్రపత్తులు సమర్పించాలి. - షోడశోపచారములతో పూజించాలి. అట్టి ఉపాసనచే సమస్తము లభించగలదు. అట్టి వాసుదేవోపాసన గురించి ఇంకా ఈ విధంగా శ్లోకములు ఉన్నాయి. |
|
ఏకో వశీ సర్వగః కృష్ణ ఈడ్య ఏకోఽపి సన్బహుధా యో విభాతి . తం పీఠం యేఽనుభజంతి ధీరా- స్తేషాం సిద్ధిః శాశ్వతీ నేతరేషాం .. 3.. |
||
4. ఏకో వశీ సర్వగః కృష్ణ ఈడ్య ఏకోఽపిసన్ బహుథా యో విభాతి, తం పీఠగం యో-ను భజంతి ధీరాః తేషాగ్ం సిద్ధిః శాశ్వతీ। నేతరేషామ్।। (న ఇతరేషామ్)।। |
ఏకస్వరూపుడు, సమస్తమునందు వశించువాడు, సర్వగతుడు - అగు కృష్ణుడే స్తుతింపతగినవాడు. ఎవ్వరైతే - ఏకమే అయి ఉండి కూడా, అనేకముగా ప్రదర్శనమగుచున్నారో, అట్టి శ్రీకృష్ణ భగవానుని ఏ ధీరుడైతే హృదయ పీఠమునందు ప్రతిష్ఠించి ఎల్లప్పుడూ భజిస్తూ, స్తుతిస్తూ ఉంటాడో - అట్టి అనన్యోపాసకుడు శాశ్వతమగు ఆత్మతత్త్వమును సిద్ధించుకోగలడు. అన్య దేవతా ఉపాసకులు శాశ్వత బ్రహ్మమును సిద్ధించుకోలేరు. |
|
నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానా- మేకో బహూనాం యో విదధాతి కామాన్ . తం పీఠగం యేఽనుభజంతి ధీరా- స్తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం .. 4.. |
||
నిత్యో నిత్యానాం, చేతనః చేతనానామ్ ఏకో బహూనాం యో విదధాతి కామాన్, తం పీఠగం యే-నుభజంతి ధీరాః తేషాగ్ం సుఖగ్ం శాశ్వతం। నేతరేషామ్।। (న ఇతరేషామ్)।। |
నిత్యమైనదానిలో నిత్యుడు, కదలికలన్నిటిలో కదిలించువాడు, ఏకమే అయి కూడా అనేకముగా ప్రదర్శనమగువాడు, సర్వజీవుల కోరికలు సిద్ధింపజేయువాడు - అగు ఆ శ్రీకృష్ణభగవానుని, గోపాలకృష్ణుని ఏ ధీరులైతే (తెలివిగలవారైతే) తమ హృదయపీఠమునందు ప్రతిక్షేపించుకొని భజిస్తూ ఉంటారో - అట్టి వారి సుఖమే శాశ్వతము. తక్కినవారి సుఖము శాశ్వతమైనది కాదు. (సందర్భములకు పరిమితమైనది మాత్రమే). |
|
ఏతద్విష్ణోః పరమం పదం యే నిత్యోద్యుక్తాస్తం యజంతి న కామాత్ . తేషామసౌ గోపరూపఃప్రయత్నా- త్ప్రకాశయేదాత్మపదం తదేవ .. 5.. |
||
ఏతత్ విష్ణోః పరమం పదమ్ యే నిత్యా ఉద్యుక్తాః తం యజంతే, న (స) కామాత్, తేషామ్ అసౌ గోపరూపః ప్రయత్నాత్, ప్రకాశయేత్ ఆత్మపదం తదేవ। |
ఎవరైతే అట్టి విష్ణు పరమపదమునకు నిత్యము ఉద్యుక్తులై, సమస్త బాహ్యమైన కోరికలను త్యజించి, ఆ ‘శ్రీకృష్ణ చైతన్యతత్త్వము’నందే కామము, (విరహము) కలిగి ఉంటారో, అట్టి ప్రయత్నశీలురు గోపరూపులగుచున్నారు. వారికి ఆత్మపదము స్వకీయముగా ప్రకాశమానము అవగలదు. (గోపము = ఆత్మభావనను రక్షించుకొంటూ ఉండటము). | |
యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో విద్యాం తస్మై గోపయతి స్మ కృష్ణః . తం హ దేవమాత్మబుద్ధిప్రకాశం ముముక్షుః శరణం వ్రజేత్ .. 6.. |
||
యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, యో విద్యాం తస్మై గోపయతిస్మ కృష్ణః, తగ్ం హ దేవమ్ ఆత్మబుద్ధి ప్రకాశం - ముముక్షుః శరణం వ్రజేత్।। |
ఏ పరమాత్మ - సృష్టికర్తయగు బ్రహ్మదేవుని కూడా సృష్టికి పూర్వమే సృష్టికొరకై సృష్టించినవారై యున్నారో, ఏ కృష్ణ భగవానుడైతే వేదములకు, బ్రహ్మవిద్యకు రక్షకులై యున్నారో - అట్టి ఆత్మదేవుడు బుద్ధికి ప్రకాశమానుడవటానికి ఏది ఉపాయం? ‘ముముక్షువు’ (మోక్షార్థి) అయి, ఆ గోపాలకృష్ణుని శరణు వేడటమే ఉపాయము. వేరే ఉపాయం లేదు. |
|
ఓంకారేణాంతరితం యే జపంతి గోవిందస్య పంచపదం మనుం . తేషామసౌ దర్శయేదాత్మరూపం తస్మాన్ముముక్షురభ్యసేన్నిత్యశాంతిః .. 7.. ఏతస్మా ఏవ పంచపదాదభూవ- న్గోవిందస్య మనవో మానవానాం . |
||
‘ఓం’కారేణ అంతరితం యే జపంతి, గోవిందస్య పంచపదం మనుమ్, తేషామ్ అసౌ దర్శయేత్ ఆత్మరూపం। తస్మాత్ ముముక్షుః అభ్యసేత్ నిత్య శాంత్యై।। ఏతస్మా ఏవ పంచపదా అభూవన్ గోవిందస్య మనవో మానవానామ్।। |
‘ఓం’ కారార్థామై యున్న గోవిందపంచమంత్రము (క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా)ను ఎవ్వరు ఎల్లవేళల జపిస్తూ ఉంటారో, వారికి ఆత్మరూపము సులభముగా దర్శనమవగలదు. అందుచేత ఈ జీవులు మోక్షేచ్ఛగల ముముక్షువులై గోవింద పంచమంత్రమును జపించి, శాంతిని సముపార్జించుకొనెదరుగాక! ఈ విధంగా గోవింద భగవానుని పంచపదమననము మానవులకు మననశీలమగు మహత్తర మంత్రరాజము. |
|
దశార్ణాద్యాస్తేఽపి సంక్రందనాద్యై- రభ్యస్యంతే భూతికామైర్యథావత్ .. 8.. |
||
5. దశార్ణాద్యాస్తేఽపి సంక్రందనాద్యైః అభ్యస్యంతే భూతికామైః యథావత్। తే పప్రచ్చుః। |
మునులు : హే భగవాన్! ‘‘కోరికలన్నీ దాటివేసినట్టి (భూరికాములు) అగు సంక్రందనుడు (ఇంద్రుడు) మొదలైనవారు దశార్ణవ (దశాక్షర) మంత్రము (గోపీజన వల్లభాయ నమః మంత్రమును) జపించినవారై - కోరికలతో ఉపాసించి కోరికలే లేని వారయ్యారు’’ - అని (దృష్టాంతంగా) లోకప్రసిద్ధము. దయతో ఎట్లాగో వివరించండి. | |
పప్రచ్ఛుస్తదుహోవాచ బ్రహ్మసదనం చరతో మే ధ్యాతః స్తుతః పరమేశ్వరః పరార్ధాంతే సోఽబుధ్యత . కోపదేష్టా మే పురుషః పురస్తాదావిర్బభూవ . |
||
తదు హో వాచ :
బ్రహ్మసదనం చరతో మే ధ్యాతః స్తుతః పరమేశ్వరః, పదార్థాంతే సో-బుధ్యత - కోపదేష్టా మే పురుషః పురస్తాత్ ఆవిర్బభూవ। |
బ్రహ్మభగవానుడు : ఒకానొకప్పుడు నేను బ్రహ్మలోకములో సంచరిస్తూ పరమేశ్వర సందర్శనముకొరకై ధ్యాసగా (ధ్యానిస్తూ) స్తుతించసాగాను. నాకు ఉపదేష్ట అగు ఆ పరమపురుషుడు పదార్థాంతంగా మేలుకొని నా బుద్ధికి ప్రత్యక్షమైనారు. పదార్థమునకు - (శక్తికి) ముందే ఉన్న ఆయన తత్త్వము నా బుద్ధికి అనుభవమవసాగింది. |
|
తతః ప్రణతో మాయానుకూలేన హృదా మహ్యమష్టాదశార్ణస్వరూపం సృష్టయే దత్త్వాంతర్హితః . |
||
తతః ప్రణతో, మయానుకూలేన హృదా మహ్యమ్ అష్టాదశార్ణం స్వరూపగ్ం సృష్టయే దత్వా, అంతర్హితః।। |
నేను ఆ జగన్నాధస్వామికి భక్తి - జ్ఞాన - వైరాగ్య పూర్వకంగా ప్రణతులు సమర్పించాను. అప్పుడు నాకు వారు బ్రహ్మతత్త్వము అణుక్షణికంగాను, స్వాభావికంగాను, నిత్యానుభవమయే నిమిత్తంగా సాధనకొరకై ‘‘అష్టాదశ వర్ణమంత్రము’’ను, అద్దాని ‘‘స్వరూప మహత్మ్యము’’ను చెప్పి, సృష్టి సామర్థ్యము కొరకై ఉపదేశించి, అంతర్థానమైనారు. |
|
పునస్తే సిసృక్షతో మే ప్రాదురభూవన్ . తేష్వక్షరేషు విభజ్య భవిష్యజ్జగద్రూపం ప్రాకాశయం . |
||
పునస్తే సిసృక్షుతో మే ప్రాదురభూత తేషు అక్షరేషు। విభజ్య ‘‘భవిష్యత్ జగత్ రూపం’’ ప్రకాశయన్। |
‘‘నేను సృష్టించాలి? మరి ఎట్లా’’ - అని తపన చెందుచుండగా, మరల ఆ పరమాత్మ నా ఎదురుగా, నేను ఉపాసిస్తున్న ‘‘క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా’’ అను అష్టావదశ (18) అక్షరములలో అక్షరస్వరూపులై (అష్టాదశపురాణ స్వరూపులై) బుద్ధియందు వికసితులైనారు. ఆ పరమాత్మయొక్క సంకల్పానుసారంగా నాకు భవిష్య జగత్ స్వరూపము యొక్క విభజనము తెలియరాసాగింది. |
|
తదిహ కాదాకాలాత్పృథివీతోఽగ్నిర్బిందోరిందుస్తత్సంపాతాత్తదర్క ఇతి . క్లీంకారాదజస్రం కృష్ణాదాకాశం ఖాద్వాయురుత్తరాత్సురభివిద్యాః ప్రాదురకార్షమకార్షమితి . తదుత్తరాత్స్త్రీపుంసాదిభేదం సకలమిదం సకలమిదమితి .. 3.. |
||
తత్ (ఇహకాత్) ఆకాశాత్। ఆకాశాత్ పృథివీ। అతో అగ్నిః బిందోః ఇందుః తత్ సంపాతాత్ తత్ అర్క ఇతి క్లీం కారాత్ - అజస్రం। |
ఆత్మ సంజ్ఞయగు ‘క్లీం’ - నుండి సమస్తము జనిస్తున్నాయి. మునుముందుగా ఆత్మనుండి ఆకాశము, ఆకాశము నుండి పృథివి. పృథివి నుండి అగ్ని, అగ్ని నుండి బిందువు, బిందువు నుండి ఇందువు (చంద్రుడు). తత్ సంపాతము వలన సూర్యుడు. ఇతి ‘‘క్లీం’’ కారము! |
|
కృష్ణాత్ ఆకాశం। ఖాత్ వాయుః। ఉత్తరాత్ సురభీ విద్యాః। ప్రాదుః ఆకర్ష మకార్షమ్ ఇతి। తత్ ఉత్తరాత్ స్త్రీ - పుమాది భేదగ్ం। సకలమ్ ఇదగ్ం। సకలమ్ ఇదమ్।। ఇతి।। |
సృష్టికర్తనై ఇకప్పుడు, - కృష్ణ చైతన్యమునుండి ఆకాశము ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి సురభి విద్య (సృష్టివిద్య) నిర్వర్తించ నారంభించాను. అట్టి కృష్ణచైతన్యము కర్షక (కర్తృత్వ) కారణము, కర్తృత్వము లేనిది కూడా! కృష్ణ చైతన్యమే సమస్తమునకు కర్త అయి ఉండగా, అది దేనియొక్క కర్తృత్వము కాదు. (Independent by itself). అట్టి ఆకర్షణ - సంకర్షణ తత్త్వము నుండి స్త్రీ - పురుష విశేషములతో కూడిన , ఈ అనేక భేదములుగా కనిపిస్తూ ఉన్న - ఈ కల్పనామాత్ర సృష్టి జనిస్తోంది. |
|
ఏతస్యైవ యజనేన చంద్రధ్వజో గతమోహమాత్మానం వేదయతి . ఓంకారాలికం మనుమావర్తయేత్ . సంగరహితోభ్యానయత్ . |
||
ఏతస్యైవ యజనే చంద్రధ్వజో గత మోహమ్, - ఆత్మానం వేదయతి। ‘ఓం’కారాళికం మనుమ్ ఆవర్తయేత్ సంగ రహితో-అభ్యానత్। |
ఓ మునులారా! అట్టి కృష్ణచైతన్య - కేవలీతత్త్వమును ‘‘ఈ సమస్తము అదే’’ - అని ఉపాసించండి. (దృష్టాంతంగా) చంద్రధ్వజుడు (మనో నిశ్చలుడు) మోహము తొలగగా, ఆత్మను ఎరుగుచున్నాడు. లోకములకు ఆత్మతత్త్వము తెలుపుచున్నాడు. లోకములన్నీ అతనికి ఆత్మస్వరూపమై స్వానుభవమగుచున్నాయి. అట్టి ‘ఓం’కార స్వరూపమగు కృష్ణతత్త్వమును సమస్త అసత్ విషయములతో సంగము రహితము చేసుకొంటూ, శ్రద్దగా అనువర్తించాలి. |
|
తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః . దివీవ చక్షురాతతం . తస్మాదేనం నిత్యమావర్తవేన్నిత్యమావర్తయేదితి . ..4.. |
||
తద్విష్ణోః పరమం పదగ్ం సదా పశ్యంతి సూరయః, దివీవ చక్షుః ఆతతమ్। తస్మాత్ ఏనం నిత్యమ్ ఆవర్తయే। నిత్యమ్ ఆవర్తయేత్ - ఇతి।। |
సంసార భావనలను జయించి, వశము చేసుకొన్న సూరులగు మహనీయులు (The Winners) - దివ్యమైన చక్షువులను (ఆత్మదృష్టిని) సంపాదించుకొని, ఈ సమస్త దృశ్యమును కృష్ణానందమయస్వరూపంగా నిత్యము దర్శిస్తూ అనుభూతము పొందుచూ, మమేకమగుచున్నారు. | |
తదాహురేకే యస్య ప్రథమపదాద్భూమిర్ద్వితీయపదాజ్జలం తృతీయపదాత్తేజశ్చతుర్థపదాద్వాయుశ్చరమపదాద్వ్యోమేతి . వైష్ణవం పంచవ్యాహృతిమథం మంత్రం కృష్ణావభాసకం కైవల్యస్య సృత్యై సతతమావర్తయేత్సతతమావర్తయేదితి .. 5.. |
||
తదాహుః ఏకే - యస్య ప్రథమపదాత్ - ‘భూమిః’। ద్వితీయ పదాత్ - ‘జలం’। తృతీయపదాత్ - ‘తేజః’। చతుర్థపదాత్ - ‘వాయుః’। చరమపదాత్ ‘ఓం’ ఇతి।। వైష్ణవం పంచవ్యాహృతి మయం। మంత్రం కృష్ణావభాసకం, కైవల్యస్య సృత్యై సతతమ్ ఆవర్తయేత్।। సతతమ్ ఆవర్తయేత్।। ఇతి।। |
‘‘క్లీం కృష్ణాయ గోవిందాయ, గోపీజనవల్లభాయ స్వాహా’’।। అను ఏకమగుకృష్ణతత్త్వమే - అనేకముగా అగుచూ ఉన్నది. అద్దాని నుండి = ప్రథమ పదము - భూమి. రెండవ పదము - జలము. మూడవపదము - తేజస్సు. నాలుగవ పదము - వాయువు. ఆఖరిది - ఆకాశము ‘‘ఓం’’। ఈ ఐదుగా విస్తారమగుచున్నది. ‘వైష్ణవము’ అనబడు ఈ పంచపద మంత్రము కృష్ణతత్త్వమును ప్రకాశింపజేసి ‘కైవల్యము’ ప్రసాదించగలదు. అందుచేత ఈ పంచపద మంత్రమును పరమార్థపూర్వకంగా ఉపాసించెదరు గాక। ఉపాశ్రయించెదరు గాక। |
|
తదత్ర గాథాః యస్య చాద్యపదాద్భూమిర్ద్వితీయాత్సలిలోద్భవః . తృతీయాత్తేజ ఉద్భూతం చతుర్థాద్గంధవాహనః .. 1.. పంచమాదంబరోత్పత్తిస్తమేవైకం సమభ్యసేత్ . |
||
6. తత్ అత్ర గాథాః - యస్య ప్రథమ పదాత్ ‘‘భూమిః’’। ద్వితీయ పదాత్ - సలిల-ఉద్భవః। తృతీయాత్ తేజః - ఉద్భూతం। చతుర్ధాత్ గంధ వాహనః। పంచమాత్ అంబరోత్పత్తిః। తమేవ ఏకగ్ం సమభ్యసేత్।। |
పై విషయము మహనీయులచే ఈవిధంగా చెప్పబడుతోంది. ప్రథమ పదము నుండి భూమి, రెండవ పదము నుండి సలిలము (నీరు/జలము), మూడవ పదము నుండి తేజస్సు, నాలుగవ పదము నుండి గంథవాహనమగు వాయువు, ఐదవ పదము నుండి ఆకాశము. అనుభవములు అనేకమైనప్పటికీ, ‘అనుభవి’ ఏకస్వరూపుడే। ఆట్లాగే - ఇవన్నీ కూడా ఒకే కృష్ణతత్త్వమునుండి బయల్వెడలి, విశ్వరూపంగా ప్రదర్శనమగుచున్నాయి. అందుచేత ఈ సమస్త జగత్ దృశ్యమును ఏకమగు కృష్ణతత్త్వముగా, కృష్ణచైతన్య ప్రదర్శనంగా ఉపాసించెదరు గాక। |
|
చంద్రధ్వజోఽగమద్విష్ణోః పరమం పదమవ్యయం .. 2.. |
||
చంద్రధ్వజోఽగమత్ విష్ణోః పరమం పదమ్-అవ్యయమ్। |
చంద్రధ్వజుడు (నిశ్చలమనస్సు పొందినవాడు) అట్టి అవ్యయమగు విష్ణుపదమును పంచపదమంత్రోపాసనచే సిద్ధించుకున్నారు. మీరందరూ కూడా మనస్సుతో అట్టి మంత్రోపాసనచే సిద్ధించుకోగలరు. |
|
తతో విశుద్ధం విమలం విశోక- మశేషలోభాదినిరస్తసంగం . యత్తత్పదం పంచపదం తదేవ స వాసుదేవో న యతోఽన్యదస్తి .. 3.. |
||
తతో విశుద్ధం, విమలం, విశోకం, అశేషలోభాది నిరస్తసంగమ్, యత్తత్పరం (యత్ తత్ ‘పరం’) పంచపదం। తదేవ స వాసుదేవో। న యతో అన్యత్ అస్తి।। |
కూడా మనస్సుతో అట్టి మంత్రోపాసనచే సిద్ధించుకోగలరు. అట్టి విష్ణుపదము విశుద్ధమైనది. సర్వసాంసారిక దోషములు స్పృశించనిది. విమలము. సర్వ ప్రాపంచక వేదనలకు చరమగీతమగు విశోకము. లోభము, మోహము మొదలైన అరిషట్ వర్గములు శమించగా, నిరస్తరంగ (తరంగములు శాంతించిన) జలమువంటి - స్థితి. పంచపదమంత్రోపాసనచే సిద్ధించు పరమపదమే వాసుదేవము (ఈ సమస్తము నాయందు ఈ సమస్తము నందు నేను వసించు ‘‘నేనైన నేను’’) . అద్దానికి ఆవల ఇంకేమీ పొందవలసినది శేషించదు. |
|
తమేకం గోవిందం సచ్చిదానందవిగ్రహం పంచపదం వృందావనసురభూరుహతలాసీనం సతతం మరుద్గణోఽహం పరమయా స్తుత్యా స్తోష్యామి .. |
||
తమ్ ఏకం గోవిందగ్ం సచ్చిదానంద (సత్ చిత్ ఆనంద) విగ్రహమ్। పంచపదం బృందావన సురభూరుహ - తల ఆసీనగ్ం సతతం మరుద్గణోఽహం పరమయా స్తుత్యా స్తోష్యామి।। |
- అట్టి ఏకస్వరూపుడగు శ్రీగోవిందుని - సర్వాత్మకుడగు సత్-చిత్-ఆనంద విగ్రహుని, - పంచపదుని, - బృందావన దేవతాభూ విహారిని, - బృందావన కల్పవృక్ష నివాసిని, - మరుత్ గణముతో కూడినవానిని, పరానంద స్వరూపునిగా స్తుతిస్తూ స్తోత్రములు సమర్పిస్తున్నాము. |
|
ఓం నమో విశ్వస్వరూపాయ విశ్వస్థిత్యంతహేతవే . విశ్వేశ్వరాయ విశ్వాయ గోవిందాయ నమోనమః .. 1.. |
||
|
హే శ్రీకృష్ణా! గోపాలా! ఈ విశ్వమంతా ‘స్వరూపముగా కలవాడా! ఈ విశ్వముయొక్క సృష్టి - స్థితి - లయములకు కారణమైయున్న స్వామీ! ఈ విశ్వనియామకుడవగు ఈశ్వరా! విశ్వమంతా నిండి ఉన్న స్వామీ! గోవిందా! నమో నమః।। |
|
నమో విజ్ఞానరూపాయ పరమానందరూపిణే . కృష్ణాయ గోపీనాథాయ గోవిందాయ నమోనమః .. 2.. |
||
|
తెలియబడేదంతా ‘నీవే’ అయి ఉన్న విజ్ఞానరూపాయా! పరమానంద స్వరూపా! హే శ్రీకృష్ణ భగవాన్! రుక్మిణీనాధా। గోపీవల్లభా। ఈ ఇంద్రియ జగత్తులను స్వకీయానందముగా కలిగియుండు గోవిందుడా! సర్వము కైంకర్యముగా స్వీకరించు గోవిందా! నమో నమః।। |
|
నమః కమలనేత్రాయ నమః కమలమాలినే . నమః కమలనాభాయ కమలాపతయే నమః .. 3.. |
||
|
కమలములవంటి కనులు కలవాడా! కమలములకు (జ్ఞానపాఠ్యాంశములకు) తోటమాలీ! కమలము గర్భమున ధరించి, సృష్టికర్తకు జననస్థానముగా కలవాడా! కమలాపతీ! నమో నమః। |
|
బర్హాపీడాభిరామాయ రామాయాకుంఠమేధసే . రమామానసహంసాయ గోవిందాయ నమోనమః .. 4.. |
||
బర్హా పీడాభిరామాయ। రామాయ అకుంఠమేధసే। రమా మానస హగ్ంసాయ। గోవిందాయ। నమో నమః।। |
నెమలిపింఛము ధరించినవాడా! అభిరామా! మొక్కవోని మేధస్సుచే వెలుగొందువాడా! రమాదేవి (లక్ష్మీదేవి) యొక్క మనస్సు - అనే సరోవరంలో సంచరించు హంసస్వరూపా! గోవిందా! నమో నమః। |
|
కంసవంశవినాశాయ కేశిచాణూరఘాతినే . వృషభధ్వజవంద్యాయ పార్థసారథయే నమః .. 5.. |
||
కంస వంశ వినాశాయ। కేశి చాణూర ఘాతినే। వృషభధ్వజ వంద్యాయ। పార్థసారథయే నమః।। |
క్రూరమైన స్వభావముగల కంసుని వంశమును నశింపజేసినవాడా। కేశి, చాణూరుడు మొదలైన రాక్షసులను సంహరించిన స్వామీ! వృషభధ్వజముచే సేవించబడు దేవా! అర్జునుని రథమునకు దుష్టశిక్షణకై సారధి అయిన స్వామీ! మీకు నమస్కారము. |
|
వేణునాదవినోదాయ గోపాలాయాహిమర్దినే . కాలిందీకూలలోలాయ లోలకుండలధారిణే .. 6.. |
||
7. వేణునాద వినోదాయ, గోపాలాయ అహి మర్దినే। కాళిందీ కూలలోలాయ లోలకుండల ధారిణే।। |
వేణునాదముతో వినోదిస్తూ లోకములకు ఆనందము ప్రసాదించుస్వామీ! (ఇంద్రియములనే) గోవులను పాలించు గోపాలా! మాలోని దుష్ట - అల్పభావాలను తొలగించు అహి (సర్ప) మర్దనా! కాళిందీ నదిలోని కాళీయుడు అను పేరుగల విష సర్పమును శిక్షించి, నదీ జలముయొక్క విషత్వము తొలగించిన పావనమగు పాదములు కలవాడా! పొడవైన కుండలములు ధరించిన కృష్ణయ్యా నమస్కారము. |
|
పల్లవీవదనాంభోజమాలినే నృత్తశాలినే . నమః ప్రణతపాలాయ శ్రీకృష్ణాయ నమోనమః .. 7.. |
||
వల్లవీ వదనాంభోజ మాలినే, నృత్తశాలినే। (వృత్తశాలినే)। నమః ప్రణత పాలాయ శ్రీకృష్ణాయ నమోనమః।। |
గోపికా స్త్రీల ముఖములనే పద్మములను వికసింపజేయు సూర్యభగవానుడా! జగన్నాటకమును నడిపించు నృత్తశాలీ! నట్వాంగా! జగత్‌వృత్తుల రచయితా! నమస్కరించువారిని ప్రియముగా పాలించువాడా! శ్రీకృష్ణప్రభూ! నమస్కారము! (వల్లవి = గొల్లది). |
|
నమః పాపప్రణాశాయ గోవర్ధనధరాయ చ . పూతనాజీవితాంతాయ తృణావర్తాసుహారిణే .. 8.. |
||
నమః పాప ప్రణాశాయ, గోవర్ధన ధరాయ చ। పూతనా జీవితాంతాయ। తృణావర్తాసు హారిణే।। |
మాలోని పాపములను, పాపదృష్టులను నశింపజేయు స్వామీ! గోపజనులను రక్షించటానికై గోవర్ధనగిరిని చిటికినవేలుపై నిలిపినట్టి కృష్ణభగవాన్! పాపస్వభావులగు పూతన, తృణావర్త మొదలైన రాక్షసులను సంహరించినవాడా! నమస్తే! |
|
నిష్కలాయ విమోహాయ శుద్ధాయాశుద్ధవైరిణే . అద్వితీయాయ మహతే శ్రీకృష్ణాయ నమోన్ నమః .. 9.. |
||
నిష్కళాయ। విమోహాయ। శుద్ధాయ। అశుద్ధవైరిణే। అద్వితీయాయ మహతే। శ్రీకృష్ణాయ నమో నమః। |
కళంకము లేని నిష్కళంకా! మోహమునకు ఆవల ఉండి మోహమును తొలగించు స్వామీ! శుద్ధ స్వరూపా! అశుద్ధగుణములకు శత్రువుల వంటివాడా! మహత్‌స్వరూపుడా! అద్వితీయుడా! హే శ్రీకృష్ణభగవాన్! నమో నమః।। |
|
ప్రసీద పరమానంద ప్రసీద పరమేశ్వర . ఆధివ్యాధిభుజంగేన దష్టం మాముద్ధర ప్రభో .. 10.. శ్రీకృష్ణ రుక్మిణీకాంత గోపీజనమనోహర . సంసారసాగరే మగ్నం మాముద్ధర జగద్గురో .. 11.. |
||
ప్రసీద పరమానంద। ప్రసీద పరమేశ్వర। ఆధి వ్యాధి భుజంగేన దష్టం మామ్ ఉద్ధర ప్రభో। శ్రీకృష్ణ రుక్మిణీకాంత గోపీజన మనోహర। సగ్ంసార సాగరే మగ్నం మామ్ ఉద్ధర జగద్గురో! |
హే పరమానందస్వరూపా! పరమేశ్వరా! ఆధి వ్యాధులనే (మానసిక-శారీరక రుగ్మతలనే) - పాపములను తొలగించువాడా! ఆదిస్వరూపా! మాపట్ల ప్రసన్నులవండి. ప్రభూ! మమ్ము సముద్ధరించండి। హే శ్రీకృష్ణా! రుక్మిణీకాంత యొక్క, గోపీజనముయొక్క మనస్సులను దొంగిలించినట్టి మనోహరా! స్వామీ! జగద్గురూ! సంసార సాగరంలో చిక్కుకున్న మిమ్ములను సముద్ధరించమని వేడుకుంటున్నాను. |
|
కేశవ క్లేశహరణ నారాయణ జనార్దన . గోవింద పరమానంద మాం సముద్ధర మాధవ .. 12.. |
||
కేశవ। క్లేశహరణ। నారాయణ। జనార్దన। గోవింద। పరమానంద। మాం సముద్ధర। మాధవ! |
హే కేశవా! క్లేశములు హరించువాడా! నారాయణా! జనార్ధనా! గోవిందా! పరమానందా! మాధవా! దయతో మమ్ములను సముద్ధరించండి. |
|
అథైవం స్తుతిభిరారాధయామి . తథా యూయం పంచపదం జపంతః శ్రీకృష్ణం ధ్యాయంతః సంసృతిం తరిష్యథేతి హోవాచ హైరణ్యగర్భః . |
||
అథైవగ్ం స్తుతిభిః ఆరాధయామి। తథా యూయం పంచపదం జపంతః, శ్రీకృష్ణం ధ్యాయంతః సగ్ంసృతిం తరిష్యథేతి। హో వాచ - హైరణ్యగర్భః।। |
బ్రహ్మభగవానుడు : ఓ మునులారా! నేను ఎల్లప్పుడు శ్రీకృష్ణభగవానుని పైన చెప్పిన విధంగా ఆరాధిస్తూనే, ఆయన సంకల్పానుసారంగా ఈ త్రిజగత్ - సృష్టిని కొనసాగిస్తూ ఉన్నాను. అట్లాగే జనులు కూడా మనము చెప్పుకున్న ‘‘క్లీం కృష్ణాయ గోవిందాయ గోవిందవల్లభాయ స్వాహా’’ - అను శ్రీకృష్ణ - గోపాలపంచపద మంత్రమును ధ్యానిస్తూ క్రమంగా సంసృతి (సంసారము) నుండి తరించెదరుగాక! - అని హిరణ్యగర్భడగు బ్రహ్మదేవుల వారు మునులకు సంబోధిస్తూ బోధించారు. |
|
అముం పంచపదం మనుమార్తయేయేద్యః స యాత్యనాయాసతః కేవలం తత్పదం తత్ . |
||
అముం పంచ పదం మనుమ్ ఆవర్తయేద్యః। స యాతి అనాయాసతః కేవలం తత్ పదం తత్।। (యత్)। |
ఎవ్వడైతే ఈ ‘పంచపదము’ను జపిస్తూ ఉంటారో, అట్టివాడు సునాయాసంగా కేవలమగు ‘తత్’ పదమును సిద్ధించుకోగలడు. సందర్భ సత్యములు మాత్రమే అయినట్టి - జీవాత్మ, అంతరంగ చతుష్టయము మొదలైన పరిధిలన్ని దాటివేసి - కేవలమగు స్వస్వరూపములో ప్రవేశించి ఆత్మానంద సాగరుడు కాగలడు. |
|
అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్పూర్వమర్షదితి . |
||
అనేజత్-ఏకం। మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ ఇతి।। |
ఓ సమస్త జనులారా! దేవతలంతటివారు కూడా దోషరహితము, ఏకము, మనస్సుకంటే కూడా అత్యంత సూక్ష్మము అగు పరమాత్మపదమును పొందలేక పోవుచున్నారు సుమా! ఉత్తమ సాధనచేత మాత్రమే ఈ జీవుడు ‘ఇంద్రియ విషయపంజరము’ నుండి విడవడి, ‘ఆత్మసౌందర్యము’ను ఆస్వాదించగలడు. |
|
తస్మాత్కృష్ణ ఏవ పరమం దేవస్తం ధ్యాయేత్ . తం రసయేత్ . తం యజేత్ . తం భజేత్ . ఓం తత్సదిత్యుపనిషత్ .. ఇతి గోపాలపూర్వతాపిన్యుపనిషత్సమాప్తా .. |
||
తస్మాత్ కృష్ణ ఏవ పరమో దేవః తం ధ్యాయేత్। తగ్ం రసయేత్। తం। యజేత్। తం భజేత్।। ‘‘ఓం తత్ సత్।’’ ఇతి ఉపనిషత్।। |
అందుచేత శ్రీకృష్ణ అష్టాదశాక్షరీ మహామంత్రోపాసనను అర్థపరమార్థ పూర్వకంగా ఉపాసించండి. ఓ మునులారా! శ్రీకృష్ణ భగవానుడే పరమో దైవము. ధ్యానించబడవలసిన వాడు. ఈ జగత్తంతా నిండి ఉన్నది → ఆ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద రసతత్త్వమే! ఆయన యొక్క తేజో విభవమే ఇదంతా! మనమంతా కూడా ఆయనయొక్క సచ్చిదానంద విభవులమే! ఓం తత్ సత్। - ఇతి - ఉపనిషత్. |
🙏 ఇతి గోపాల పూర్వ తాపిన్యుపనిషత్। |
శాంతి పాఠము
శ్లో।। ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః। భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః స్థిరైః అంగైః తుష్టువాగ్ంసః తనూభిః। వ్యశేమ దేవహితం యత్ ఆయుః। స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవాః। స్వస్తి నః పూషా విశ్వవేదాః। స్వస్తి నః తార్యో అరిష్టనేమిః। స్వస్తి నో బృహస్పతిః దధాతు।। ఓం శాంతిః। శాంతిః। శాంతిః।। |
ఓ దేవతలారా! మేము జ్ఞానప్రకాశయుక్తులమై, ఈ చెవులతో భద్రమగు ఆత్మసంబంధిత విశేషములనే వినెదముగాక। యజన-యాగదీక్షాపరులమగు మేము శుభప్రదమైన ఆత్మ విశేషమునే చూచుచుండెదముగాక! స్థిరమైన, బలముతో కూడిన అంగములతో స్వస్థితి - ఆరోగ్యము కలిగియున్నవారమై ఇంద్రియ ప్రజ్ఞా - సామర్థ్య ప్రదాతలగు మిమ్ములను స్తుతించుచూ, మాకు మీచే విధించబడిన ఆయుష్కాలము సద్వినియోగపరచుకొనెదము గాక। సర్వజీవులకు - సర్వేంద్రియ నియామకుడు, ఇంద్రియశక్తులను ప్రసాదించువారు, ఈ ఇంద్రియములకు కనిపిస్తున్న జగత్తులకు మునుముందే ఉండి ఉన్నట్టివారు, దివ్యప్రజ్ఞా చైతన్యమూర్తి, సూక్ష్మగ్రాహ్యములగు పెద్ద చెవులు కలవారు - అగు ఇంద్రభగవానుడు మాకు ‘స్వస్తి’ ‘శుభము’ ‘శాంతము’ ‘ఆనందము’లను కరుణతో ప్రసాదించెదరు గాక! ఈ విశ్వరహస్యమగు విశ్వేశ్వరుని తత్త్వము ఎరిగిన విశ్వవేదులగు పూషుడు (సూర్యభగవానుడు) మాకు స్వస్తి - శుభమును ప్రసాదించెదరు గాక! మిక్కిలి వేగము గలవారు, వాయువేగ సమన్వితులు అగు తార్యుడు (గరుడ భగవానుడు (లేక) వాయుదేవుడు) మాలోని ఆధ్యాత్మిక సంబంధమైన అరిష్టములను, దోషములను, అడ్డంకులను తొలగించి, మాపట్ల - శుభప్రదాత అయ్యెదరు గాక! మాకు స్వస్తి ప్రసాదించెదరు గాక! బుద్ధికి పరాకాష్ఠ, దేవతల గురువు అగు శ్రీ బృహస్పతులవారు మాకు సునిశితము, నిర్మలము, ప్రశాంతము, విస్తారము అగు బుద్ధిని ప్రసాదించి మాకు స్వస్తిని అనుగ్రహించెదరు గాక! |
(మాయొక్క ఆధిభౌతిక (Matter Related), ఆధిదైవిక (Incidents Related), ఆధ్యాత్మిక (Self Impressions Related) తాపములు ఆత్మానందమునందు సశాంతించును గాక। మా జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు కేవలాత్మ యందు లయమైయుండును గాక)
శ్లో।। శ్రీమత్ పంచపదాగారం స విశేషతయోజ్జ్వలమ్।
ప్రతియోగి వినిర్ముక్తం నిర్విశేషం హరిం భజేత్।।
(జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములకు ఆవలిదగు) పంచమపద - తురీయాతీత సాక్షీస్థానము తనదైనవారు, సమస్త జగత్ - విశేషములుగా ప్రకాశించువారు, వాదోపవాదములకు పట్టుబడనివారు, సమస్త విశేషములకు ఆవల నిర్విశేషులై ఉన్నవారు - అగు శ్రీహరిని భజించుచున్నాను. స్తుతించుచున్నాను.
(శ్రీ సిద్ధేంద్రయోగి విరచితము) |
---|
సౌరాష్ట్ర - ఆదితాళమ్ |
|
(1) శృంగార మోహనం - మంగళ ప్రదాయకం। ।।రాజగోపాలం భజే।। రాజగోపాలంభజే మమ జీవనం। రాధా లోలంభజే।। |
కూచిపూడి నృత్యాంతర్గత కైవారములు |
|
---|---|
(1) శ్రీమత్ సకల గీర్వాణ సంస్థూయమాన - |
![]() |
(6) కనక మణికుండల ద్యుతి ఛటాభోగ |
![]() |
ఇక మనము (పూర్వ) గోపాల తాపిన్యుపనిషత్‌లో ప్రవేసిస్తున్నాము
శ్లో।। శ్రీమత్ పంచపదాగారం |
ప్రతియోగివినిర్ముక్తం |
🌹 గోపాలతాపినీ, కృష్ణ, యాజ్ఞవల్క్య, వరాహ, శాట్యాయని, హయగ్రీవ, దత్తాత్రేయ, గారుడ ఉపనిషత్ దేవతలకు నమస్కరించుచున్నాము. |
స్తుతి
✤ సమస్త జీవులలో ‘ఉనికి - ఎరుక - ఆనందము’ అగు సత్ చిత్ ఆనంద స్వరూపులై వేంచేసియున్నవారు......,
✤ జీవుల వేదనలు, దుఃఖములు తొలగించు అక్లిష్టకారులు (క్లిష్టములు తీసివేయువారు), వేద-వేదాంగములచే అభివర్ణించబడుచున్న సర్వాత్మక వేదాంతపురుషుడు.
✤ ‘తెలుసుకొనబడుదానికి’ (వేదమునకు) ఆవల వేంచేసియున్న ‘‘తెలుసుకొనుచున్నవానిని’’ (వేదాంతము The knower) గురించి తెలియున్నవారు, - మాకు తమ బోధచే తెలియజేయువారు...
✤ జగద్గురువులు,
✤ సమస్త జీవులలో బుద్ధికి సాక్షి అయిఉన్నవారు
అగు శ్రీకృష్ణభగవానునికి ప్రణమిల్లుచున్నాము 🙏
(వేద = ఈ తెలియబడే సమస్తము.)
(వేదాంత = ఈ తెలియబడే దానికి ఆవల గల ‘‘తెలుసుకుంటూ ఉన్నవాడు).
(వేదాంత వేద్యుడు = తెలుసుకుంటున్న ‘‘నేను’’ ఎట్టిదో తెలిసియున్నవారు).
ఒకానొకరోజు కొందరు మునులు లోకాలన్నీ సంచరిస్తూ సత్యలోకము ప్రవేశించారు. సృష్టికర్త, లోకకళ్యాణమూర్తి అగు బ్రహ్మభగవానుని దర్శించారు. భక్తిప్రపత్తులతో శరణాగతిపూర్వకంగా నమస్కరించారు.
బ్రహ్మదేవుడు : మునిశ్రేష్ఠులారా! ఏమిటి విశేషం?
మునులు : భగవాన్! జగత్ సృష్టి దురంధరా! పితామహా! బ్రహ్మదేవా! నమో నమో నమో నమః। మేము ‘దైవోపాసన’ గురించి మీ సూచనలు పొందాలని సముత్సాహులమై పరమపవిత్రమగు తమ దర్శనానికి వచ్చాము.
కః పరమో దేవః? దేవతలకే దేవుడైన దేవాది దేవుడు, పరంధాముడు ఎవరు? సృష్టికర్త అగు మీరు కూడా ఉపాసిస్తున్నారా? ఎవరిని ఇష్టదైవముగా ఆరాధిస్తున్నారు?
కుతో మృత్యుః బిభేతి? 14 లోకములలోని జీవులంతా మృత్యువుకు భయపడుతూ ఉంటారు కదా! అట్టి మృత్యుదేవతకు కూడా భయముంటుందా? ఏ దేవదేవుని చూచి మృత్యువు భయపడుతూ ఉంటుంది?
కస్య విజ్ఞానేన అఖిలం విజ్ఞాతం భవతి? ఏ తత్త్వము తెలుసుకున్న తరువాత, ఇక ఆపై ఈ సృష్టి - సృష్టికర్త, స్థితి - స్థితికర్త, లయము - లయకర్తలతో సహా సమస్తము సుస్పష్టముగా ‘తెలియబడినవి’ అవగలవు?
[ (యత్ జ్ఞాత్వా తృప్తోభవతి, స్ధబ్దోభవతి, ఆత్మారామోభవతి। = నారదభక్తిసూత్రములు). ఏది తెలుసుకొన్న తరువాత జన్మకు ముందు, జన్మ, జీవితము, దేహానంతరము మొదలైనవన్నీ సుస్పష్టముగా వివేకపూర్వకంగా పూర్ణముగా తెలిసిపోయినవి అవుతాయి? ]
కేన ఇదగ్ం విశ్వం సగంసరతీతి? ఏ నావికునిచే ఈ ‘విశ్వము’ అనే నావ నడిపించబడుచూ ఉన్నది?
అట్టి ఈఈ విశేషముల గురించిన మహత్తర సత్యమును మాకు బోధించండి. మేము శ్రద్ధగా శ్రవణం చేసి పవిత్రులమయ్యెదము.
బ్రహ్మదేవుడు: మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానము ‘‘శ్రీకృష్ణభగవానుడే!’’ కృష్ణోవై పరమం దైవతమ్।
గోవిందాత్ మృత్యుః బిభేతి। (గో)। ఇంద్రియములను భావనామాత్రంగా కల్పించుకొని ఆనందించు శక్తిస్వరూపుడగు గోవిందుని చూచి మృత్యువు కూడా భయము కలిగి ఉంటోంది.
ఆ గోపీజనవల్లభునికి చెందిన బ్రహ్మతత్త్వ జ్ఞానము చేతను, కేవల స్వరూపుడగు ఆ పరమాత్మ గురించిన అనుభవముచేతను,
‘‘దృశ్యము, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ’’ మొదలైన చమత్కారములతో కూడిన ఈ సమస్తము తెలియబడినది - అగుచున్నది.
స్వాహా - ఇదగ్ం సగ్ం సరతి। ‘‘సమస్తము పరమాత్మకు సర్వదా స్వాభావికంగానే సమర్పితమైయున్నది’’ అను ‘స్వాహా’ జ్ఞానముచే ఈ సమస్తము యొక్క సరళి సుస్పష్టమవగలదు. (స్వ-అహమేవ, సోఽహమేవ ఇతి ‘స్వాహా’)
మునులు : పితామహా! ‘కృష్ణుడు’ అనగా ఎవరు? ఎవరు ‘గోవిందుడు’ అని అభివర్ణించబడుచున్నారు?
- ‘స్వాహా’ యొక్క పరమార్థము, గూడార్థము ఇంకా కూడా ఏమై యున్నది?
దయతో వివరించి చెప్పండి.
బ్రహ్మదేవుడు : మునులారా! వినండి! ఈ సమస్త లోకములుగా కనిపించేదంతా శ్రీకృష్ణ చైతన్యానందతత్త్వమే। అట్టి శ్రీకృష్ణభగవానుని స్మరించినంతమాత్రంచేతనే సమస్త పాపములు, పాపదృష్టులు కడిగివేయబడగలవు. ఆయన వేదములకు జననస్థానమగు గోభూమిని పాలించువారు. వేద హృదయుడు. వేద విదితుడు. వేదముల సారము ఆయనయే. గోపికాజనులను జీవబ్రహ్మైక్య విద్య యందు ప్రేరేపించుచూ క్రీడించువారు. ఈ జగత్తంతా కృష్ణతత్త్వమే. సమస్త జీవుల సహజ - వాస్తవ - స్వాభావిక స్వరూపము - శ్రీకృష్ణచైతన్యానందమే. అట్టి శ్రీకృష్ణుని సాకారరూపమును ఉపాసించెదము గాక.
‘‘సమస్తము శ్రీకృష్ణార్పణమస్తు’’ - అను భావనయే ‘‘స్వాహా’’ - అనబడుతోంది.
ఎవ్వరైతే అట్టి శ్రీకృష్ణుని సాకారరూపమును సర్వాంతర్యామిగాను, సర్వతత్త్వస్వరూపునిగాను
❋ ధ్యాయతి - సర్వదా తమ ధ్యాసయందు నిలుపుకొని ఉంటారో...,
❋ రసతి - రస స్వరూపముగా దర్శిస్తూ ‘ప్రేమ’ రసము కలిగి ఉంటారో....,
❋ భజతి - ( ‘‘శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానందం। హరే రామ హరే కృష్ణ రాధే గోవిందమ్।।’’, ‘‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే। హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే।।’’ )
మొదలైన భజనలు చేస్తూ) ఆ కృష్ణ సాకార రూపమును భజిస్తూ ఉంటారో,
అట్టి వారు మార్పు - చేర్పుల పరిధులను దాటివేసి, నిత్యానందమగు ‘అమృతస్వరూపము’ను సంతరించుకొనగలరు.
మునులు : బ్రహ్మభగవాన్! పితామహా! శ్రీకృష్ణుని రూపము ఎట్టిది? ‘రసతి’ అను రసనము ఏ తీరుగా భావించాలి? శ్రీకృష్ణుని భజన చేయు శ్రేష్ఠమైన మార్గము ఏది? ఏ విధంగా ఉపాసించాలి? ఈ ఈ విషయాలన్నీ మాకు సవివరంగా బోధించండి.
బ్రహ్మదేవుడు : శ్రీకృష్ణ దేవ దేవుని సాకార తాత్త్విక నిజ విశేషముల గురించి కొన్ని విశేషాలు చెప్పుకుంటున్నాము. వినండి.
హైరణ్యో : బంగారు ఆభరణములన్నిటికీ బంగారమే అధిష్ఠానము కదా! అట్లాగే ‘ఈ సమస్త జగత్తుకు, సమస్త జీవులకు-అంతర్యామి, అంతరాంతర - అనునిత్య స్వరూపుడు - శ్రీకృష్ణ పరమాత్మయే। ఆయన ఎవ్వరికీ అన్యుడు కాడు కనుక ‘అనన్యుడు’.
హి + అరణ్యో : ‘‘సమస్తము ఆయనయే అయి సమస్తమునకు వేరైన’’ శ్రీకృష్ణుని దర్శిస్తూ స్తుతించుచుండెదరు గాక.
సమస్తలోక - లోకపాలకులను తన ఆభరణములుగా ధరించిన శ్రీకృష్ణరూపము తలచుకొనుచుందురు గాక!
గోపవేషమ్ : లీలామానుష గోపబాలవేషధారుడు. పిల్లన గ్రోవి ధరించి అల్లరి చేస్తూ గోపబాలురను వెంట నిడుకొని గోవులను అరణ్యమునకు త్రోలుకొనిపోయి పరిపోషించువారు.
- ఇంద్రియములనే గోవులను పాలించువారు. (అంతేగాని ఇంద్రియములచే, ఇంద్రియ విషయములచే పాలించబడేవారు కాదు).
- నామ రూపాత్మకమైన సమస్త జగత్తును వస్త్రముగా ధరించినవారు.
ఆహ్రాజమ్ : మేఘములవంటి నల్లనిరంగువాడు. ‘బోధలు’ అనే మేఘములనుండి ‘అమృతవాక్కులు’ (ఈ జీవునియొక్క - మార్పు చెందని సహజాత్మ స్వరూపము గురించి గుర్తుచేసే వచనములు) అనే వర్షము కురిపించి మనందరినీ అమృతస్వరూపులుగా తీర్చిదిద్దువారు.
తరుణమ్ : ఉదయ కిరణములను లోకమంతా ప్రసరింపజేయువారు. అజ్ఞాన చీకట్లను తొలగించువారు.
కల్పదృమాశ్రితమ్ : భక్తుల పాలిట కల్పవృక్షమై భక్తజనులకు సమస్తము ప్రసాదించు స్వభావులు. భక్త పరాధీనులు.
అట్టి శ్రీకృష్ణ సాకార - పరతత్త్వముల గురించి ఇంకా ఈ విధంగా భక్తులచే స్తుతించబడుతోంది.
ఆ స్వామి పుండరీకాక్షుడు. ‘జ్ఞాననేత్రము’ అయినట్టి తెల్లటి తామరపూవులవంటి నయనములతో ప్రకాశించువారు. సర్వజనులకు ‘జ్ఞానదృష్టి’ని ప్రసాదించువారు. చల్లని చూపులతో ‘‘ఆత్మ బలము - ఆత్మ నమ్మకము’’ చేకూర్చువారు. ‘సత్’ ఆనందులు. సత్ పుండరీకనయనులు. మేఘమువలె నీలిమేఘశ్యాములు. మేఘములు, మెఱుపులు ప్రదర్శించు సౌందర్యమువలె ప్రకాశమానమగు వస్త్రములు ధరించినవారు. మేఘాభాం, వైద్యుతాంబరం।
✤ యోగ - జ్ఞానములు, ఇహ - పరములు ఇరువైపులా భజములుగా కలవారు. ద్విభుజమ్।
✤ ‘‘ఈ సమస్తము నేనే। నాకు వేరై ఏదీ లేదు’’ అను భావసమన్వితమగు జ్ఞానముద్ర ధరించినవారు. ‘‘అదియే నీవు-తత్ త్వమ్ అసి’’ అని సూచించు (బొటనవ్రేలు - చూపుడు వ్రేలు ఒకచోటికి తెచ్చిధరించు) చిన్ముద్రధారులు. జ్ఞానముద్రాఢ్యం।
✤ సకల జీవులను, సమస్త బ్రహ్మాండములను పూలదండగా ధరించినవారు. వనమాలినమ్।
✤ సమస్తముగా విస్తరించి ఉన్నవారు. ఈశ్వరమ్।
✤ గోపాల - గోపికా జనము మధ్యగా ఆభరణములో రత్నమువలె ప్రకాశించువారు. సమస్త హృదయములలో పూదండలోని దారమువలె వెల్లి విరియువారు. గోప గోపీ గవాతీతగ్ం।
✤ ‘దేవతలు’ అనే పూతీగలు ఆశ్రయించిన మహావృక్షము అయి ఉన్నవారు. సురద్రుమ లతాశ్రయమ్।
✤ ఈ ‘‘అంతరంగ, బహిరంగములన్నీ’’ కూడా తనయొక్క దివ్యమైన అలంకారములుగా కలవారు. సుందరమైన ఆభరణములచే అలంకృతులైనవారు. దివ్యాలంకరణోపేతమ్।
✤ రత్నపద్మము మధ్యగా సంప్రకాశించువారు। రత్నపంకజ మధ్యమమ్। సమస్త జీవుల హృదయాంతరములలో సర్వదా వికసించి ఉన్నవారు.
✤ కాళిందీనదీ తరంగములనుండి (జలకల్లోలములనుండి) వీచు వాయు వీచికలచే సేవించబడుచున్నవారు, కాళిన్దీజల కల్లోల సంగి - మారుత సేవితమ్। ‘కాళీయుడు’ అను సర్పరాజ విషమును తొలగించి కాళిందీనదీజలమును మధురముగా చేసి ప్రసాదించినవారు.
అగు ‘‘శ్రీకృష్ణపరమాత్మ’’ను చిత్తముతో సేవించువారు - సంసృతి (లేక) సమస్త సంసారబంధములనుండి విముక్తులు కాగలరు.
పవిత్రమగు అట్టి శ్రీకృష్ణానందరసమే ఈ సమస్తము। ఇక్కడి జలము, భూమి, చంద్రుడు, పక్షులు, సర్వజీవులు సమస్త జీవుల ఆశయములుగా సంప్రదర్శనము - ఇదంతా కృష్ణ చైతన్యానందమే। శ్రీకృష్ణ-ఆత్మానందతత్త్వమే।
⌘
మునులు : పితామహా! బ్రహ్మదేవా! అట్టి శ్రీకృష్ణతత్త్వమును మేము దర్శించి, ‘‘అనన్యత్వము’’ సిద్ధించుకోవటానికై ఉత్తమమైన మంత్రరాజము ఏదో, అది దయతో ప్రకటిస్తూ, మాకు ఉపదేశించండి.
బ్రహ్మదేవుడు : మునులారా। ఒకానొక మంత్రరాజమున్నది. అది వివరిస్తున్నాను. వినండి.
(క్లీం) కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా। ఇది పంచపదము. పంచ-అంగములు కలిగి ఉన్నట్టిది.
మొదటి పదము : |
‘‘కృష్ణాయ’’। - ఇతి |
‘కృష్ణాయ’ - ఇత్యేకపదమ్। |
రెండవ పదము : |
‘‘గోవిందాయ’’। - ఇతి। |
గోవిందాయేతి ద్వితీయమ్। |
మూడవ పదము : |
‘‘గోపీజన’’। - ఇతి। |
గోపజనేతి తృతీయమ్। |
నాలుగవ పదము : |
‘‘వల్లభాయ’’। - ఇతి। |
వల్లభాయేతి తురీయగ్ం। |
ఐదవ పదము : |
‘‘స్వాహా’’। - ఇతి। |
స్వాహాయేతి పంచమమ్। ఇతి।। |
ఈ పంచపద, పంచాంగముల మంత్రము జపిస్తూ ‘‘ఆకాశము, భూమి. సూర్యుడు, చంద్రమసము ఆ కృష్ణ చైతన్యసాకారరూపమే’’ - అను భావనతో శ్రీకృష్ణభగవానుని ఉపాసించువారు బ్రహ్మమును సిద్ధించుకోగలరు. బ్రహ్మమే తామై ఉండగలరు.
ఈ విశేషము గురించి ఇంకా కూడా - ఈ విధమైన శ్లోకములచే గానము చేయబడుచున్నది.
మంత్రము ఉచ్ఛరించే విధానము
యో అసౌగతిః తస్యాస్తి మంక్షు న అన్యాగతిస్యాత్ ఇతి। ఎప్పుడు ఎక్కడ ఏ స్థితి - గతులలో ఉన్నప్పుడు కూడా ‘‘నాకు ప్రాపంచికమైన గతి’’ (Move with in the scenary from one to another) తో పనిలేదు, ఈ మంత్రము న్యాసము చేయుటకంటే వేరైన ఉత్తమగతీ లేదు’’- అని భావించి, ఈ అష్టాదశాక్షరీ మంత్రమును ఉపాసించెదరు గాక.
భక్తిరస్య భజనం। పరమాత్మను ఆశ్రయించటానికి భక్తి ఒక్కటే (జ్ఞాన-యోగ మొదలైన) సమస్త మార్గములకంటే కూడా సులభము, శ్రేష్ఠము కూడా। భక్తితో కూడిన భజనను ఆశ్రయిస్తూ ఇక తదితరములైన జ్ఞాన-యోగాదులు భక్తిరస సమన్వితంగా శ్రీకృష్ణ భగవానునికి అవ్యాజముగా (As Non-business like) సమర్పించబడును గాక। అట్టి కృష్ణ భక్తియే నిష్కామకర్మ రూపమగు నైష్కర్మ్యము.
తం విప్రా బహుధా యజంతి। ఆ ‘‘కృష్ణ’’ చైతన్యమునే వేదార్థములు తెలిసిన విప్రులు ఆయా అనేక (సమస్త) దేవతల రూపముగా ఉపాసిస్తున్నారు. ఆ ‘గోవిందు’ని అనేక భావనలతో ఆరాధించుచున్నారు.
( గోవిందేతి సదా జ్ఞానం। గోవిందేతి సదాజపమ్। గోవిందేతి సదా ధ్యానం। సదా గోవింద కీర్తినమ్ )
ఆ ‘‘గోపీజన వల్లభుడే’’ సమస్త లోకములను ధారణ (Wearing) చేయుచున్నట్టివారు. ‘‘స్వాహా’’ రూపుడై జగత్తులన్నీ వృద్ధి చేయున్నట్టివారు.
వాయువు దేహములో ప్రవేశించి ‘‘ప్రాణ-అపాన-ఉదాన-వ్యాన-సమానములు’’ అనే పంచప్రాణముల రూపముగా వేరువేరైన ధర్మములు (Functions) నిర్వర్తిస్తోంది కదా! అట్లాగే శ్రీకృష్ణ చైతన్యుడు సర్వదా ఏక - అక్షర - అఖండ స్వరూపుడు అయి ఉండియే ‘జగత్తు’ అనే ప్రాంగణమును కల్పిస్తున్నారు. జగత్తులో ప్రవేశిస్తున్నారు. శబ్దము (concept of sound), స్పర్శ (Touch), రూప (Forms), రస(Taste), గంధములు (Smell) అనబడే పంచశక్తి ప్రదర్శనములు చేయుచున్నారు. అంతేకాకుండా ఈ జగద్దృశ్యములో ‘‘దృశ్యము - దేహము - ఇంద్రియములు - జీవుడు (The experiencer) - ఈశ్వరుడుగాను, అనేక దేహముల ధారుడు’’ గా ప్రకాశమానులగుచున్నారు.
ఉపాసన
మునులు : బ్రహ్మ భగవాన్! అట్టి శ్రీకృష్ణపరమాత్మను మేము ఏఏ విధములుగా ‘ఉపాసన’ చేయవచ్చునో దయతో వివరించండి. ఆయన సాకార రూపమును ఎట్లా ప్రతిక్షేపించుకోవాలి? ప్రతిమ, పీఠము ఎట్లా ఉండాలి? శ్రీకృష్ణుని ఉపాసనా ప్రతిమ ఉంచవలసి పీఠముపై ఏ విధమైన విశేషములు ఉండాలి? ఏఏ బీజాక్షరములు అక్కడ రచించబడాలి? ఏఏ విధంగా పీఠం ప్రతిక్షేపించాలి? ఏఏ దివ్యతత్త్వములను (శక్తులను) ఆ పీఠముపై సాంగ-సపరివార-సాయుధ యుక్తంగా ఆహ్వానించాలి? ఎట్లా పూజించాలి? ఇవన్నీ దయతో వివరించండి.
బ్రహ్మదేవుడు : దేవతలారా! చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే కేవలం కృష్ణతత్త్వం శ్రవణం చేసినంతమాత్రంచేత ఈ జీవుడు అనుభవము పుణికిపుచ్చుకోలేడు. అందుకుగాను ‘‘శ్రద్ధతో కూడిన కార్యక్రమరూపమగు ప్రయత్నము’’ అత్యవసరము.
(1) మొదటిగా - శ్రవణము : కృష్ణతత్త్వముగురించి శాస్త్రములు (వేదోపనిషత్తులు) చెప్పుచున్నది వినటము.
(2) అటుతరువాత మననము -
(i) మనస్సుతో మననము చేయటము. మనస్సును, బుద్ధిని ‘అనుకోవటము’ నందు నియమించటము.
అందుకుగాను ఇంద్రియములను ఉపయోగిస్తూ జగద్దృశ్యమును, శరీరమును ‘కృష్ణతత్త్వ ధ్యానము’ కొరకై నియోగించటము.
(ii) అట్టి ‘‘నియమము’’ లేక ‘‘దీక్ష’’ కొరకు శ్రీకృష్ణుని సాకారరూపమును పీఠము - ప్రతిమగా నిర్మించుకొనెదరుగాక।. (అందుకు బీజాక్షరములు = క్లీం కృష్ణాయ-గోవిందాయ-గోపీజన వల్లభాయ - స్వాహా।)
(iii) ఆ పీఠముపై శ్రీకృష్ణ విగ్రహము. ఆయన కళాస్వరూపములైన సాంగములు, సపరివారములు దివ్యశక్తుల రూపముగా చిత్రించుకొంటూ ప్రతిక్షేపించటము.
(iv) మంత్రముల సహాయంతో పూజాది క్రమము నిర్వర్తించటము.
- ఇవన్నీ అవసరము. అవును. సాధనాక్రమము లేనిదే ఈ జీవునికి తన మనస్సును, బుద్ధిని సర్వాంతర్యామి, సర్వతత్త్వస్వరూపుడు అగు ‘శ్రీకృష్ణపరమాత్మ’ తో (నదీజలం సముద్రంలో ప్రవేశించి సముద్రజలంతో మమేకమైనట్లు) ఏకము చేయటమనేది తేలిక కాదు.
అందుచేత ‘‘పీఠము - పీఠముపై రచించవలసిన విశేషాలు - బీజాక్షర రచన - కృష్ణాంశల ఆహ్వాన - ప్రపత్తులు, కృష్ణ విగ్రహము, ఉపచారములు గురించి చెప్పుకుందాము. ‘‘విగ్రహము నిగ్రహము కొరకు। నిగ్రహము సోఽహమ్ కృష్ణతత్త్వసిద్ధికొరకు!’’।
(1) యత్ తస్య పీఠగ్ం హైరణ్యం - ముందుగా పీఠము తయారుచేసుకోవాలి. అది బంగారు రంగుగా ఉండటము శ్రేష్ఠము.
(2) అష్ట పలాశం అబుజం। - దానిపై ‘8’ దళములు గల పద్మము.
(3) తత్ అంతరాళిక అనలాస్త్రయుగము - అంతరాళికంగా (మధ్యగా) అగ్నిశిఖలు (అనలాస్త్రయుగం) చిత్రించబడుగాక।
(4) తత్ అంతరాళాత్ వర్ణాఖిల బీజమ్। ‘కృష్ణాయ నమ’ ఇతి బీజాద్యగ్ం। - ఆ పద్మము యొక్క అంతరంగా (ఆ అగ్ని శిఖ- ఆకారముల మధ్యగా) సర్వవర్ణముల బీజాక్షరములు. ‘‘క్లీం కృష్ణాయ నమః’’ ‘‘శ్రీకృష్ణాయ నమః’’ - అని రచించబడు గాక।
(5) స బ్రహ్మణమ్ అదాయ అనంగగాయత్రీం యధావత్ వ్యాలిఖ్యా - మధ్యలో సృష్టికర్తయగు బ్రహ్మతో కూడిన అనంగ గాయత్రీ (గాయత్రీ హృదయము)తో కూడి బ్రహ్మదేవుని రూపము లిఖించాలి. (వేదాత్మనాయ విద్మహే, హిరణ్యగర్భాయ ధీమహి। తన్నో బ్రహ్మీ ప్రచోదయాత్ - అని రచించుకోబడుగాక।।
(6) భూమండలగ్ం శూల వేష్టితమ్। - భూమండలమును ‘‘ఓ’’ లిఖించాలి. శూలవేష్ఠిత్వము (మూలలతో కూడినదిగా) చిత్రించాలి.
వాసుదేవాది, రుక్మిణ్యాది, స్వశక్తిం, నందాది, వసుదేవాది, పార్థాది, నిధ్యాది వీతం యజేత్ సంధ్యాసు ప్రతిపత్తిభిః ఉపచారైః।
రుక్మిణీ మొదలైన అష్ట అంశలతోను నంద, వసుదేవ, పార్థ ఆదిగాగల సపరివార సమేతంగాను (వారంతా శ్రీకృష్ణుని అంశలుగా నమస్కరిస్తూ) సర్వాంతర్యామి (అందరిలోనూ సర్వదా వేంచేసిఉన్నవారు) అగు వాసుదేవ స్వరూప శ్రీకృష్ణ పరమాత్మను, త్రిసంధ్యలలోను షోడశోపచారములతో పూజించాలి.
ప్రతిపత్తిభిః ఉపచారైః - తేన అస్య అఖిలం భవతి। అఖిలం భవతీతి। ఈ విధమైన శ్రీకృష్ణ సాకార రూప ప్రతిపత్తి, షోడశోపాచార సమర్పణ, ధ్యానములచే సమస్తము లభించగలదు. ఇట్టి పూజావిధిచే - శ్రీకృష్ణ తత్త్వమగు సర్వాత్మత్వము, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్వము సిద్ధించుకోగలరు.
శ్లో।। ఏకో వశీ సర్వగః కృష్ణ ఈడ్య, ఏకోఽపి సన్ బహుథా యో విభాతి।
తం పీఠగం యోఽను భజంతి ధీరాః, తేషాగ్ం సిద్ధిః శాశ్వతీ। నేతరేషామ్।।
ఓ దేవతలారా! ఏ శ్రీకృష్ణానంద చైతన్యమైతే సర్వదా ఏకమే అయి ఉన్నదో, సమస్త జీవులందు సర్వదా సర్వత్ర వశించుచున్నదో, సర్వజనులచే అనేక విధములుగాను, పేర్లతోను, ఆకారములుగాను పూజింపబడుచూ ఉన్నదో - అట్టి శ్రీకృష్ణపరమాత్మను పీఠముపై భావన చేసి ఎవ్వరైతే భజిస్తారో అట్టి ధీరుని (ఉత్తమ బుద్ధి, అవగాహన కలవాని) సిద్ధియే శాశ్వతము.
అందుచేత।
నేను చూస్తున్న ఈ విగ్రహముతో ‘‘ఏక - వశీ - సర్వగః - ఏకోఽపిసన్ బహుధా విభాతుడు’’ అగు పరమాత్మ ఆహ్వానితుడై వేంచేసి సుఖాసీనుడై ఉన్నారు. నాపై మైత్రి, అనుగ్రహము, ప్రేమ, వాత్సల్యము, కురిపిస్తున్నారు।
అను ఎరుకతో పూజ నిర్వర్తించాలి. అంతేగాని ‘‘ఈయన ఒక వ్యక్తి’’ అను భావనతో కాదు. ‘‘సమస్తము ఈయనయే సిద్ధింపజేయువారు’’ = అను భావనతో ఉపాసించువారు సమస్తము సిద్ధించుకోగలరు.
నేను భజిస్తున్న ఈ శ్రీకృష్ణ భగవానుడు ఎట్టివాడంటే -
❋ ‘‘నిత్యో-అనిత్యానాం’’ : జనించి గతిస్తూ ఉండే ఈ అనిత్య విశేషములుగల జగత్తులో అంతరంగా, ఆధారంగా (జలంలో తరంగాలవలె) నిత్యుడై వెలుగొందుచున్నారు. (తరంగములు నిత్యముకాదు. జలము నిత్యము)
‘‘నిత్యోనిత్యానామ్’’ - (అని పాఠాంతరము) - నిత్యమైన దానిలో నిత్యస్వరూపులు.
❋ ‘‘చేతనః చేతనానామ్’’ : కదిలే ఈ సమస్త చేతనములలో కదిల్చువారై ఉన్నారు.
❋ దేహాలన్నిటిలో దేహాలు ధారణ చేస్తూ ఉన్న ‘దేహి’గా ఉన్నారు.
❋ వచ్చి పోయే ఆలోచనలకు ఆధారమై ‘ఆలోచించువారు’ గా ఉన్నారు.
❋ బుద్ధి చిత్త అహంకారముల అంతరంగా అవన్నీ తనవై, తాను కదలక, వాటిని కదిలుస్తూ ఉన్నారు.
ఏకో బహూనామ్ యో విదధాతి కామాన్ - ఏకస్వరూపుడే అయి ఉండియే తనయొక్క ఇష్టముచే లీలగా, క్రీడగా, వినోదముగా అనేక రూపములుగా విస్తరించి ఉంటున్నారు.
అట్టి సమస్తము తానే అయి, తన ఇష్టమే అయి వినోదించు శ్రీకృష్ణపరమాత్మను ఇక్కడ ఈ పీఠముపై బుద్ధినిశ్చలత కొరకై, శ్రీకృష్ణునితో తాదాప్య - మమైక్యములకొరకై ఆహ్వానించి పూజిస్తున్నాము. |
అని భావించి ఎవ్వరు పూజిస్తారో, వారిది మాత్రమే శాశ్వతమగు ఆత్మసుఖము. అంతేగాని ‘‘ఈయన నాకన్నా అన్యము। ఎక్కడో ఉన్నారు. ఒక వ్యక్తి వంటివారు’’ - అను భావనతో పూజించువారి సుఖము → సందర్భ పరిమితమేగాని, శాశ్వతము-అవ్యాజము కాదు. (సద్యోముక్తిగా) సంసార శృంఖములను త్రెంచేది కాదు.
అట్టి అఖండాత్మానంద స్వరూపమగు విష్ణుపదమును ఎవ్వరైతే అనునిత్యంగా సముత్సాహవంతులై, ఉద్యుక్తులై (నిత్యోద్యుక్తులై), నిష్కాములై (ప్రపంచంలో ఏదో నామరూపాత్మక దృశ్య సంబంధమైనది పొందాలి అనే వేదన లేకుండా) - సేవిస్తారో - అట్టివారిపట్ల ‘ఆత్మపదము’ తనకుతానే వికసితము, సుస్పష్టము అవగలదు!
‘‘ఆత్మపదము’’ అనగా సమస్తము స్వస్వరూపాత్మగా దర్శించటమే। అంతేగాని అది ఏదో ప్రదేశమో, బాహ్యాశయమో కాదు.
ఓ సమస్తజనులారా!
‘‘ఓం గోవిందాయ నమః’’
వారికి ఆత్మ తన స్వరూపమును వికసితము చేయగలదు!
అందుచేత ఓంకారముతో కూడిన పంచపదమును నిత్యము శాంతముగా అభ్యసించెదరుగాక. ఐదవదగు (తురీయాతీత) స్థానము ప్రసాదించటానికే ‘ఓం’కార పంచపదము నిర్మితమైనది.
‘‘ఓం గోపీజన వల్లభాయ నమః’’
దశాక్షరమంత్రము సంక్రందనుడు (ఇంద్రుడు) మొదలైన మహనీయులచే సమస్తకామములు జయించటానికై భజింపబడుతోంది.
⌘
మునులు : భగవాన్! పితామహా! బ్రహ్మదేవా! తమరు మహత్తరమగు ఈ సృష్టి సామర్థ్యమును ఎట్లా పొందగలిగారు?
బ్రహ్మ భగవానుడు : నేను ఈ సృష్టికి ముందుగా ఒకప్పుడు - ‘‘నిర్విషయము, నిరాకారము’’ అగు ‘‘బ్రహ్మాకాశము’’ నందు సంచారము చేస్తూ ఉండగా, ‘‘ఇప్పుడు నేను ఏమిచేయాలి?’’ అనే జిజ్ఞాస, ఉత్సుకత పొందసాగాను. పదార్థమునకు ఆవలగల పరబ్రహ్మము గురించి ధ్యాతనై (ధ్యానము చేయువాడనై) బుద్ధితో స్తుతించసాగాను.
కో ఉపదేష్టా మే పురుషః? నాకు ఉపదేష్ట అయి ఏమి చేయాలో చెప్పగల పురుషుడు నా బుద్ధికి ప్రత్యక్షమగునుగాక - అని తపనతో వెతుక సాగాను. తపనయే తపస్సు.
అప్పుడు నా బుద్ధికి ఎదురుగా ఒక పురుషుడు ప్రత్యక్షమైనారు. నా హృదయంలో ఆ పురుషుని సందర్శిస్తూ నమస్కరిస్తూ, ‘‘ఓ పరమపురుషా! నేను ఇప్పుడు ఏమి చేయాలి? బోధించండి’’ అని ప్రార్థనాపూర్వకంగా అభ్యర్థించాను.
అప్పుడా పురుషోత్తముడు నాకు ‘‘అష్టాదశాక్షర మహామంత్రము’’ (క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ)లోని ఒక్కొక్క అక్షరము యొక్క మహదర్థము బోధించి ‘‘సృష్టి యేతత్।’’ (సృష్టిని సృష్టించుము) అని పలికి అంతర్థానము అయినారు.
ఇక సృష్టించటం కొరకై ఉద్యుక్తుడనయ్యాను. అష్టాదశమహామంత్రము ఉచ్ఛరించటం (పైకి పలకటం) ప్రారంభించాను. అప్పుడు నాకు ప్రతిఒక్క అక్షరములోను ఆ పరమాత్మ సంకల్పశక్తి తేజో స్వరూపమై బుద్ధికి ప్రత్యక్షము కాసాగింది.
పునస్తే సిసృక్షతో మే ప్రాదుః అభూతే తేషు అక్షరేషు। ఆ అక్షరాలన్నీ - విభజ్య, భవిష్యత్ జగద్రూపం ప్రకాశయన్। - నా బుద్ధికి సృష్టి గురించి బోధగా నేర్పించసాగాయి. సృష్టిలో ఏవేవి ఎక్కడెక్కడుండాలో స్ఫురించసాగింది. వేరు వేరు అక్షరముల సమన్వయముతో (Permitation and Combination) సృష్టి నా దృష్టికి రూపము పొందసాగింది.
‘‘ఆత్మ’’ నుండి (లేక) పరమాత్మనుండి (అక్షరముల నుండి) అఖండము, నిర్విరామము అగు ‘‘ఆకాశము’’.
‘‘ఆకాశము’’ నుండి - ‘‘పృథివి’’ (పృథివి ఎక్కడ ఉండాలో, ఆచోటు)
‘‘పృథివి’’ వలన - తేజోరూపమగు ‘‘అగ్ని’’।
అగ్ని వలన - బిందువు.
బిందువు వలన - చంద్రుడు.
తత్ సంపాతాత్ - (బిందు చంద్రుల కలయికచే) - సూర్యుడు.
ఇంకా కూడా ఈ విధంగా....
‘‘క్లీం’’ కారము నుండి - కృష్ణ చైతన్యత్వము
కృష్ణ చైతన్యము నుండి - ఆకాశము (కృష్ణాత్ ఆకాశమ్)
ఆకాశము నుండి - వాయువు (ఖాత్ వాయుః)
వాయువు నుండి - సురభి విద్య (గాలి వీచికలు / ప్రకంపనములు)
ఇవన్నీ కల్పించాను.
సురభి (సృష్టి కల్పనా విద్య) నుండి ఆకర్ష - మాకర్షములు (ఉద్వేగ - అనుద్వేగములు) బయల్వెడలాయి. అటు తరువాత ‘‘భేదము’’ అనే చమత్కారము బయల్వెడలింది.
అట్టి భేదము (Different from each others) నుండి స్త్రీ - పురుష ((Female, Male) ....మొదలైన సకలనములు బయల్వెడలాయి. అట్టి అనేక విశేషములతో కూడినవే ఈ సమస్త జగత్తులు.
⌘
ఈ వివరములు గ్రహించిన ‘చంద్రధ్వజుడు’ అనే ముముక్షువు సర్వ మోహములనుండి విడివడినారు. మోహరహితుడై ‘ఆత్మ’ యొక్క స్వరూపము గ్రహించినవాడై లోకములకు ప్రవచించారు.
⌘
ఓ మునులారా! ‘ఓం’కారాళికం మనుమావర్తయేత్ సంగరహితో అభ్యానత్. దృశ్యమునకు సంబంధించిన సమస్త సంగము దాటి - ‘‘ఏకము, అక్షరము, సమస్తము’’ అయి ఉన్న ఆత్మకు అక్షర సంజ్ఞయగు ‘ఓం’ కారమును ఉచ్చరిస్తూ ధ్యానము చేయండి. జపించండి. ఆత్మనే మననము చేయండి. సమస్తమును ‘‘స్వస్వరూపాత్మకము - సర్వాత్మకము’’ అగు కృష్ణ చైతన్య పరమాత్మగా దర్శిస్తూ, సమస్త భేదములకు ఆవలి దృష్టిని అభ్యాసించువారై ఉండండి.
తద్విష్ణోః పరమమ్ పదగ్ం సదా పశ్యంతి సూరయః దివీచక్షురాతతమ్।
నిత్యానిత్య వివేకులగు సూరులు (పండితులు) సర్వత్రా సర్వదా పరమపరమగు తత్ విష్ణు చైతన్యముచే (అఖండాత్మనే) దివ్యమైన చక్షువులతో సందర్శిస్తున్నారు. సర్వదా అట్టి ఆత్మనే నిత్యము జపించుచున్నారు. - నిత్యమ్ ఆవర్తయేత్। నిత్యమ్ ఆవర్తయేత్।
దీనిని గురించి కొందరు ఈ విధంగా అభివర్ణిస్తున్నారు.
కృష్ణ భాసకము యొక్క
అట్టి వైష్ణవ పంచవ్యాహృతమును ‘‘క్లీం కృష్ణాయ....’’ - మంత్రముచే జపించెదరు గాక। అట్టి ‘ఏకము-సర్వాత్మకము’ అగు పరమాత్మ తత్త్వమును ఉపాసించినవారై చంద్రధ్వజుడు అవ్యయపదమును సిద్ధించుకున్నారు. (చంద్రధ్వజం = మనో నిశ్చలము సిద్ధించుకొన్న మహనీయుడు).
ఆత్మపదము ‘‘విశుద్ధము, విమలము, విశోకము, లోకములతో సంగము లేనట్టిది’’ - అయి ఉన్నది. అది ‘పంచమపదము’.
🥀 (జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయములకు ఆవల గల) తురీయాతీత పదము - అని కూడా పిలుస్తూ ఉంటారు.
🥀 అట్టి సర్వజీవులలో సాక్షిగా వేంచేసియుండి, సమస్తమునకు ‘‘కారణకారణుడు’’ అయిన పరమాత్మయే ‘‘వాసుదేవుడు’’.
(వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయమ్)। వాసుదేవునికి వేరైనది ఎక్కడా ఏదీ లేదు కాబట్టి ఆయన ‘అనన్యుడు’, స వాసుదేవో న యతో అన్యత్ అస్తి।
⌘
ఓ మునులారా! నేను ఎల్లప్పుడు అట్టి గోపాలకృష్ణుని -
తమ్ ఏకం గోవిందగ్ం : ఏకస్వరూపుడైయున్న గోవిందుని గాను,
సచ్చిదానంద విగ్రహమ్ : మూర్తీభవించిన సత్-చిత్-ఆనంద విగ్రహుని గాను,
పంచపదం। : జాగ్రత్ - స్వప్న - సుషుప్తులకు, తురీయునికి కూడా సాక్షి అయి ఉన్న తురీయాతీత పదము తనదైన వానిగాను, సందర్శించుచున్నాను.
బృందావన సురభూరుహ తలాసీనగ్ం। - బృందావన వటవృక్షపు కొమ్మపై కూర్చుని గోపాలురకు, గోపికలకు వేణునాదము వినిపిస్తున్న వానిని ‘‘అస్మత్ సహజాత్మస్వరూప పరమాత్మ’’గా స్తుతిస్తూ ఉన్నాను. ఉపాసిస్తున్నాను.
⌘
ఓం నమో విశ్వరూపాయ : ఓంకార స్వరూపులై ఈ సమస్త విశ్వముగా కనిపిస్తున్న శ్రీకృష్ణునకు నమస్కారము.
విశ్వస్థిత్యంత హేతవే। - ఈ విశ్వముయొక్క ఉత్పత్తి - స్థితి - అంతములకు హేతువైన కృష్ణా! నమోనమః।।
విశ్వేశ్వరాయ। - (స్వప్నమంతటా - స్వప్నద్రష్టవలె) - ఈ విశ్వమంతా విస్తరించియున్న ఈశ్వరా!
విశ్వాయ। - ఈ విశ్వము మీరే అయి ఉన్న విశ్వస్వరూపా! విశ్వశరీర ధారీ!
గోవిందాయ। - జగత్తులకు ఆనందము కలుగజేయు స్వామీ! నమోనమః। జీవులందరికీ ఇంద్రియములను, ఇంద్రియ విషయలౌకికానందమును ప్రసాదిస్తున్న గోవిందుడా! నమస్కారము.
విజ్ఞానరూపాయ। - సమస్త జనులలో ‘తెలుసుకోవటము’ అనే రూపముగా వేంచేసియున్న విజ్ఞాన స్వరూపీ।
(One which is present as "The Knower" in all the beings)
పరమానందరూపిణే - పరమ ఆత్మానంద స్వరూపా! (The "SELF" manifesting, in every body beyond all that being experienced)
గోపీనాథాయ। - గోపికలకు నాథుడు అయి ఉన్న నాథా!
గోవిందాయ నమో నమః
నమః కమలనేత్రాయ! - పద్మముల వంటి నేత్రములు గలవాడా!
నమః కమలమాలినే। - ఓ కమలముల తోటమాలీ! ‘జగత్తులు’ అనే తోటకు తోటమాలీ!
నమః కమలనాభాయ। - బొడ్డునందు కమలము ధరించినవాడా!
కమలాపతయే నమో నమః। - కమలములకు అధిపతివగు శ్రీకృష్ణా! గోవిందా।
నమస్తే। నమస్తే। నమస్తే। నమో నమః।।
బర్హాపీడాభిరామాయ। - శిరస్సుపై నెమలిపింఛములు ధరించిన చిన్నకృష్ణయ్య! అభిరామా!
రామాయ। - జీవ-బ్రహ్మైక్య స్వరూపుడవగు రామా! (రా = పరాత్మ; మ = జీవాత్మ)
అకుంఠమేధసే। - ఆత్మభావన నుండి అకుంఠితమైన (చెదరని) మేధస్సు గలవాడా!
రమా మానస హగ్ంసాయా। - లక్ష్మీదేవి ‘మనస్సు’ అనే సరోవరములో క్రీడించు హంసరూపా!
గోవిందాయ నమో నమః
కంస వంశ వినాశాయ। - రాక్షస స్వభావుడగు కంసుని వంశమునకు వినాశనము కలిగించినవాడా!
కేశి చాణూర ఘాతినే। - కేశి, చాణూరుడు మొదలైన దుష్ట స్వభావులను శిక్షించినవాడా!
వృషభధ్వజ వంద్యాయ। - వృషభము (ఎద్దు) ధ్వజముచే సేవించబడువాడా! శివునిచే స్తుతింపబడువాడా!
పార్థసారధయే నమః
వేణునాద వినోదాయ। - వేణునాదముచే సమస్త జీవులకు వినోదము కలుగజేయువాడా!
గోపాల। - గోవులను పాలించువాడా! ఇంద్రియ-ఇంద్రియార్థ జగత్తులను పరిపాలించువాడా!
అహి మర్దనే। - సర్పరూపము దాల్చిన రాక్షసుని మర్దించినవాడా!
కాళిందీకూలలోలాయ। - కాళిందీ నదిలో ‘కాళీయుడు’ అనే సర్పముయొక్క శిరస్సుపై నృత్యభంగిమలు చూపినవాడా! గర్వమును అణచినవాడా!
లోలకుండల ధారిణే। - కుండల లోలములను చెవులకు ధరించినవాడా!
వల్లవీ వదనాంభోజ మాలినే। - గోపికలు ముఖపద్మములను పాలించు సూర్యుడా!
నృత్తశాలినే। - అంగ ప్రత్యంగములచే హావభావములు తెలుపు భంగిమములు చూపువాడా!
వృత్తశాలినే : సమస్త ప్రవృత్తులను (నాటకరచయితవలె) పాలించువాడా!
నమః ప్రణత పాలాయ। - ప్రణతులను సమర్పించువారిని (నమస్కరించువారిని) రక్షించువాడా!
శ్రీకృష్ణాయ నమోనమః ।।
నమః పాపప్రణాశాయ। - మా పాపములను తొలగించువాడా!
గోవర్ధనధరాయ చ। - గోవర్ధన పర్వతమును చిటికిన వ్రేలుపై ధరించినవాడా!
పూతనా జీవితాంతాయ। - పసిపిల్లల ప్రాణములు తీయు స్వభావముగల పూతనయొక్క జీవితమును అంతము చేసినవాడా!
తృణావర్తాసు హారిణే। - తృణావర్తుని సంహరించినవాడా!
నిష్కళాయ। విమోహాయ। - నిర్మలమైన, మోహరహితమైన హృదయుడా!
శుద్ధాయా। అశుద్ధవైరిణే। - శుద్ధస్వరూపుడా। అశుద్ధ స్వభావులకు శత్రువైనవాడా।
అద్వితీయాయ। - జీవుడు - జగత్తు మొదలైనవన్నీ మీకు వేరుగా లేనివాడా! ద్వితీయమే లేనివాడా! అద్వితీయా!
శ్రీకృష్ణాయ నమోనమః ।।
ప్రసీద పరమానంద। ప్రసీద పరమేశ్వర। - పరమానంద స్వరూపా! పరమేశ్వరా! - పాహిమాం। రక్షించమాం। నాపట్ల ప్రసన్నులుకండి!
ఆధివ్యాధి భుజంగేన దష్టం మామ్ ఉద్ధర ప్రభో। - ప్రభూ! ‘‘మానసిక దోషముల (ఆధుల) శారీరక రుగ్మతల’’ (వ్యాధుల)- పాముకాటుల నుండి నన్ను సముద్ధరించండి!
శ్రీకృష్ణా! రుక్మిణీకాంత, గోపీజన మనోహరా! రుక్మిణియొక్క, గోపికలయొక్క మనస్సులను హరించినవాడా!
స్వామీ! సగ్ంసారసాగరే మగ్నం మామ్ ఉద్ధర జగద్గురో! సంసార సాగరంలో ఉన్న నన్ను సముద్ధరించండి।
⌘
ఓ మునులారా! ఈ విధంగా నేను ప్రతిక్షణము ఆ శ్రీకృష్ణ పరమాత్మను నేను వర్ణించి చెప్పినవిధంగా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటూనే, ఆయన సంకల్పమగు ఈ సృష్టి కార్యమును సమర్పితభావంతో నిర్వర్తిస్తూ ఉన్నాను.
తథైవ యూయం పంచపదం జపంతః। మీరు కూడా ఆ తీరుగానే ‘పంచపదము’ను జపించుచూ ఉండండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మను ఎవ్వరు ‘ధ్యాస’తో ధ్యానిస్తూ ఉంటారో అట్టివారు సమస్త సంసార బంధములనుండి స్వాభావికంగానే విముక్తి పొందగలరు।
⌘
ఈ విధంగా హిరణ్యగర్భుడు (బ్రహ్మదేవుడు, జగత్-పితామహుడు) మునులకు గోపాలకృష్ణ తత్త్వము గురించి బోధించారు.
దేవతలు ‘‘దోషరహితము, ఏకము, మనోవేగము తనదైనట్టిది’’ అగు ఆత్మతత్త్వమును ఇతఃపూర్వం పొందలేకపోయారు. ఇప్పుడో? పితామహుని సర్వజన శ్రేయోదాయకమగు ‘‘శ్రీకృష్ణ చైతన్యప్రభు నిత్యానంద తత్త్వము’’ను శ్రవణం చేసి, ఉపాసించారు. అఖండము, అప్రమేయము అగు ఆత్మతో మమేకము సంపాదించుకున్నారు.
⌘
తస్మాత్ - అందుచేత →
శ్రీకృష్ణ ఏవ పరమో దేవః। శ్రీకృష్ణుడే పరాత్పరుడగు దేవాదిదేవుడు.
తం ధ్యాయేత్। అట్టి శ్రీకృష్ణునే మనసా వాచా కర్మణా ధ్యానించెదము గాక.
తగ్ం రసయేత్। - ఆ కృష్ణతత్త్వమునే సేవించి ఆనందించెదము గాక।
తం యజేత్। - శ్రీకృష్ణ పాదపద్మములను యోగాభ్యాసులమైనప్పుడు కూడా ఉపాసించెదము గాక।
తం భజేత్। - ఆ శ్రీకృష్ణునే భజించి తరించెదము గాక।
ఓం తత్ సత్।
🙏 ఇతి గోపాల పూర్వ తాపిని ఉపనిషత్। |