[[@YHRK]] [[@Spiritual]]

Bruhath Jȃbȃla Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


బృహత్ జాబాల ఉపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

విషయ సూచిక :

ఉపనిషత్ పరిచయ శ్లోకము

యద్ జ్ఞానాగ్నిః స్వ అతిరిక్త అస్తితా భ్రమం భస్మకరోతి తత్ ఏ జ్ఞానాగ్ని అయితే స్వస్వరూపము కంటే వేరుగా ఏదో (జగత్) ఉనికి ఉన్నది అనే భ్రమను భస్మము చేయునో అది
బృహత్ జాబాల నిగమశిరో వేద్యం అహం మహః బృహత్ జాబాల ఉపనిషత్తుచే తెలియబడుచున్నదో ఆ మహత్తర జ్ఞానము నేనే.

ఒకటవ బ్రాహ్మణము -

జగత్ కార్యకారణ భస్మ జ్ఞానము, భస్మ పంచ నామములు

1.1 జగత్‌కు కారణ కార్యములు ఆత్మయే
ఓం. ఆపోవా ఇదం అసత్ సలిలం ఏవ ఓం (సత్ చిత్ ఆనంద స్వరూపమైన) పరమాత్మయే ఏకమై అఖండమై ఉండెను, ఈ అసత్ రూపమైన జగత్ పరమాత్మ యందు నిశ్చలమైన నీరే అయి ఉండెను.

[అనగా స్వతః సిద్ధత లేని జగత్తు నీరు వలె నామ రూప భేదరహితముగా అవ్యక్తముగా స్వతః సిద్ధుడైన పరమాత్మయందే పరమాత్మయై ఉండెను.]
స ప్రజాపతిః ఏకః పుష్కరపర్ణే సమభవత్ ఆ నీటిలో ప్రజాపతి ఒక్కడు తామరాకుయందు ప్రకటితమై ఉండెను.

[అనగా ఏ విధముగా ఐతే నీటి పైన ఉన్న తామరాకు యొక్క కాండము నీటి లోతులలో ఉండునో అట్లే మొట్టమొదటి ప్రజాపతి మూలము పరమాత్మ యందే ఉన్నది. అనగా పరమాత్మయే ప్రజాపతిగా అయి ఉండెను.]
తస్య అంతర్మనసి కామః సమవర్తత, ఇదగ్ం సృజేయం ఇతి ఆ ప్రజాపతి యొక్క అంతరహృదయమునందు కామము ఉదయించెను, ఈ విధముగా (తనను తాను ప్రజా రూపముగా) సృజింపచేసుకొనెదను అని.

[అనగా పరమాత్మయే ప్రజాపతి సంకల్పమై ప్రజలుగా తానే అయ్యెను. భేదరహితత్వము నందు కల్పిత భేదత్వమే కామము.]
తస్మాత్ యత్ పురుషో మనసా అభిగచ్ఛతి, తత్ వాచా వదతి, తత్ కర్మణా కరోతి కావున ప్రజాపతిలో (హిరణ్యగర్భునిలో) కల్పిత విభాగమైన జీవుడు కూడా అప్రతిఘటమైన కామముచే ఏ విధంగా మనస్సులో ప్రేరేపితుడగునో, అదే వాక్కుతో చెప్పును, అదే కర్మతో చెయ్యును.

[అనగా ప్రతి జీవుని యొక్క వాక్కుకు మఱియు కర్మకు పరమాత్మ ఆధార కామరూపేణ ప్రజాపతియే ప్రేరణ.]

(భగవద్గీత[3–15] - కర్మ బ్రహ్మోద్భవం విద్ధి! బ్రహ్మాక్షర సముద్భవం!)
తత్ ఏష అభి-అనూక్తా ఇది ఈ విధంగా (ఋగ్వేద శృతులలో) చెప్పబడినది
కామః తత్ అగ్రే సమవర్తత ఆధి, మనసో రేతః ప్రథమం యద్ ఆసీత్ దానికి (జగత్ కు) ముందు కామము మొట్టమొదటగా (ప్రజాపతి యందు) ఏర్పడును, అదే (జీవుని) మనస్సునందు సంకల్పరూపముగా ప్రథమముగా చిగురించును
సతో బంధుం అసతి నిరవిందన్ హృది ప్రతీష్యా కవయో మనీషా ఇతి మనస్సులో ఉదయించే కామమునకు ఆధారము ఏదని తమ హృదయములో పరిశోధించి అసత్(జగత్)కు సత్తునకు సంబంధమును దర్శించినవారు విజ్ఞానులు అని
ఉప ఏనం తత్ ఉపనమతి, యత్ కామో భవతి, య ఏవం వేద ఎవరైతే పరిశీలనగా కామమును అనుసరించి దాని మూలమునకు దగ్గరగా వెళ్లెదరో, ఆ కామమే తాము అగుదురు, వారే దానిని తెలుసుకున్నవారు.

[అనగా భేద దృష్టికి కారణమైన కామమునకు మూలము అభేద తత్వమైన పరమాత్మయే తామని తెలుసుకొని స్తిమితం చెందుదురు.]
1.2 భస్మ జ్ఞానము కొరకు భుసుండుని ప్రశ్న
స తపో అతప్యత, స తపః తప్త్వా, స ఏతం భుసుండం కాలాగ్నిరుద్రం అగమత్ ఆగత్య (జాబాలడు, అనగా జబాల మహర్షి వంశస్థుడు - భుసుండ నామధేయుడు) అతడు తపస్సును (జగత్ కారణమును) తపించెను (అన్వేషించెను). అతడు తపస్సు చేసిన తరువాత, ఆ (తపోఫలితంగా) భుసుండుడు కాలాగ్ని రుద్రుని వద్దకు చేరి,
భో విభూతేః మహాత్మ్యం బ్రూహి ఇతి, తథా ఇతి ప్రతి అవోచత్ ఓ మహానుభావా! (అభేద జ్ఞానమును సూచించు) విభూతి యొక్క మహత్యము చెప్పుము అనగా అట్లే అని బదులు చెప్పెను
భో భుసండ, వక్ష్యమాణం కిమితి? [కాలాగ్ని రుద్రుడు -] ఓ భుసుండా, దేనిని గురించి వివరించవలెను?
విభూతి రుద్రాక్షయోః మహాత్మ్యం బభాణ ఇతి [భుసుండుడు -] విభూతి మఱియు రుద్రాక్షల మహత్యము చెప్పుము అనెను
ఆద అవ ఏవ పైప్పలాదేన సహ ఉక్తం ఇతి తత్ ఫలశ్రుతిః, తస్య ఊర్ధ్వం కిం వదామి? ఇతి [కాలాగ్ని రుద్రుడు -] ఇది ఇంతకుముందే పైప్పలాదునిచే (పిప్పలాద ఋషి వంశస్థుడు లేక శిష్యునిచే) ఫలశృతితో సహా చెప్పబడినది, దానికి మించి ఏమి చెప్పుదును?

బృహత్ జాబాల అభిధాం ముక్తిశ్రుతిం మమ ఉపదేశం కురుష్వ ఇతి

[భుసుండుడు -] బృహత్ జాబాలం అనబడు ముక్తిని కలుగచేయు శృతిని దయ ఉంచి నాకు ఉపదేశము చేయుము, అనెను.
ఓం తథా ఇతి [కాలాగ్ని రుద్రుడు -] ఓం, అట్లు అగు గాక, అనెను.
1.3 భస్మ పంచ నామములు
సద్యోజాతాత్ పృథివీ, తస్యాః స్యాత్ నివృత్తిః, తస్యాః కపిలవర్ణా నందా, తత్ గోమయేన విభూతిః జాతా (ఈశ్వరుని పంచముఖములలో ఒకటైన) సద్యోజాతము (ఇచ్ఛాశక్తి) వలన పృథివి, దాని నుండి నివృత్తి, దాని నుండి నంద అను గోధుమరంగు ఆవు, దాని గోమయము నుండి విభూతి పుట్టినది.
వామదేవాత్ ఉదకం, తస్మాత్ ప్రతిష్ఠా, తస్యాః కృష్ణవర్ణా భద్రా, తత్ గోమయేన భసితం జాతం (ఈశ్వరుని పంచముఖములలో ఒకటైన) వామదేవుని నుండి జలము, దాని నుండి ప్రతిష్ఠ (స్థితి లక్షణము), దాని నుండి భద్ర అను నలుపు (బాగా నీలపు) రంగు ఆవు, దాని గోమయము నుండి భసితం పుట్టినది.
అఘోరాత్ వహ్నిః, తస్మాత్ విద్యా, తస్యా రక్తవర్ణా సురభిః, తత్ గోమయేన భస్మ జాతం (ఈశ్వరుని పంచముఖములలో ఒకటైన) అఘోరము నుండి అగ్ని, దాని నుండి విద్య, దాని నుండి సురభి అను ఎఱుపు రంగు ఆవు, దాని గోమయము నుండి భస్మ పుట్టినది.
తత్ పురుషాత్ వాయుః, తస్మాత్ శాంతిః, తస్యాః శ్వేతవర్ణా సుశిలా, తస్యా గోమయేన క్షారం జాతం (ఈశ్వరుని పంచముఖములలో ఒకటైన) తత్పురుష నుండి వాయువు, దాని నుండి శాంతి, దాని నుండి సుశిల అను తెలుపు రంగు ఆవు, దాని గోమయము నుండి క్షారము పుట్టినది.
ఈశానాత్ ఆకాశం, తస్మాత్ శాంతి అతీతా, తస్యాః చిత్రవర్ణా సుమనా, తత్ గోమయేన రక్షా జాతా (ఈశ్వరుని పంచముఖములలో ఒకటైన) ఈశాన నుండి ఆకాశము, దాని నుండి శాంతి అతీతము, దాని నుండి సుమన అను చిత్రమైన రంగులుగల ఆవు, దాని గోమయము నుండి రక్ష పుట్టినది.
విభూతిః భసితం భస్మ క్షారం రక్ష ఇతి భస్మనో భవంతి పంచనామాని విభూతి, భసితం, భస్మ, క్షారం, రక్ష అని భస్మమునకు ఐదు నామములు కలవు.
పంచభిః నామభిః భృశం - ఆ ఐదు నామములకు ఉన్న విశేషార్థములు ఏమనగా -
ఐశ్వర్య కారణాత్ భూతిః ఐశ్వర్యము కలుగచేయు కారణము చేత భూతి (విభూతి) అని,
భస్మ సర్వ అఘ భక్షణాత్ సర్వ పాపములను నశింపచేయునది కావున భస్మ అని,
భాసనాత్ భసితం భాసించునది (జ్ఞానము ప్రసాదించునది) కనుక భసితం అని,
క్షారణాత్ ఆపదాం క్షారం ఆపదలను తొలగించునది కావున క్షారము అని,
భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస అపస్మార భవ భీతిభ్యః అభిరక్షణాత్ రక్ష ఇతి భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస అపస్మార (వ్యాధి) మఱియు జనన మరణ సంసార దుఃఖకారణమైన భవ రోగము నుండి రక్షించునది కనుక రక్ష అని (భస్మమునకు ఈ ఐదు నామములు వచ్చినవి).


రెండవ బ్రాహ్మణము -

విభూతి తత్త్వము

    [Note: భస్మ అనగా ఏకత్వము. భస్మ జ్ఞానము, అనగా సమ్యక్ దృష్టి సాధించుకొనుటకు తెలుసుకోవలసినది,
    అదే ఇక్కడ చెప్పబడుచున్నది.
]

2.1 భస్మ జ్ఞానాగ్ని తత్వము
అథ భుసుండః కాలాగ్ని రుద్రం అగ్నీ సోమాత్మకం భస్మస్నాన విధిం పప్రచ్ఛ అటు పిమ్మట భుసుండుడు కాలాగ్ని రుద్రుని అగ్నీ సోమాత్మకమైన భస్మ స్నాన విధిని గురించి పరిప్రశ్నించెను.
అగ్నిః యథా ఏకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ, ఏకం భస్మ సర్వ భూత అంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిః చ [కాలాగ్ని రుద్రుడు -] ఏ విధంగా ఒకే అగ్ని భువనములో ప్రవేశించి ఏయే వస్తువులను ఆశ్రయించునో ఆయా వస్తువల రూపములే పొందునట్లు, ఒకే భస్మ (జ్ఞానము) సర్వ భూతముల అంతరాత్మయై అయా భూతముల రూపమును బాహ్యమున కూడా పొందినది.
అగ్నీ సోమాత్మకం విశ్వం ఇతి అగ్నిః ఆచక్షతే అగ్నీసోమాత్మకము (Heat & Cold Combinations), విశ్వమయము ఈ (భస్మ జ్ఞాన) అగ్ని అని చెప్పబడెను
రౌద్రీ ఘోరా యా తైజసీ తనూః రుద్ర సంబంధమైనది, ఘోరమైనదియగు ఆ అగ్ని తేజోవంతమైన దేహము కలవాడు
సోమః శక్తి అమృతమయః, శక్తికరీ తనూః (భస్మ జ్ఞాన) అగ్నియే సోముడు, శక్తి, అమృతమయుడు, శక్తిని ప్రసాదించు తనువు కలిగినవాడు
అమృతం యత్ ప్రతిష్ఠా, సా తేజో విద్యాకలా స్వయం ఆ అగ్ని యొక్క ప్రతిష్ఠ అమృతము, స్వయముగా విద్యా కళామయ తేజోరూపము
స్థూలసూక్ష్మేషు భూతేషు స ఏవ రస తేజసీ స్థూల సూక్ష్మ భూతముల యందు రసము, తేజము ఆ అగ్నియే!
ద్వివిధా తేజసో వృత్తిః సూర్యాత్మా చ అనలాత్మికా ఆ తేజస్సు యొక్క వృత్తి రెండు విధములు - సూర్యాత్మ మఱియు అనలాత్మ.
తథా ఏవ రసః శక్తిః చ, సోమాత్మా చ అనలాత్మికా, వైద్యుదాదిమయం తేజో మధురాదిమయో రసః అట్లే, ఆ భస్మ జ్ఞానాగ్నియే రసము మఱియు శక్తియు (తేజస్సు). సోమాత్మకము మఱియు అనలాత్మకము, విద్ద్యుల్లతామయము తేజస్సు, మధురమయము రసము
తేజోరసవిభేదైః తు వృత్తం ఏతత్ చర అచరం తేజస్సు మఱియు రస విభేదముల (Combinations and Variations) జీవన చక్రమే ఈ చర-అచరమంతయూ అయిఉన్నది
అగ్నేః అమృత నిష్పత్తిః అమృతేన అగ్నిః ఏధతే (భస్మ జ్ఞాన) అగ్నినుండి అమృతము పుట్టినది, అమృతము వలన అగ్ని ప్రాభవము వృద్ధిచెందుచున్నది
అత ఏవ హవిః క్లప్తం అగ్నీ సోమాత్మకం జగత్ అందుచేతనే హవిస్సుతో నిండినదై ఉన్నది ఈ అగ్నిసోమాత్మకమైన జగత్తు!
ఊర్ధ్వ శక్తిమయః సోమ అధో శక్తిమయో అనలః ఊర్ధ్వశక్తిమయుడు సోముడు, అధోశక్తిమయుడు అనలుడు
తాభ్యాం సంపుటితః తస్మాత్ శశ్వత్ విశ్వం ఇదం జగత్ కావున ఈ జగత్తు వారిద్దరి (సోముడు, అనలుడు) కలయికయై విశ్వవ్యాప్తమై ఉన్నది
అగ్నేః ఊర్ధ్వం భవతీ ఏషా యావత్ సౌమ్యం పరా అమృతం వ్యాపకమైన అగ్నికి ఊర్ధ్వముగా ఈ సౌమ్యమైన (సోమ సంబంధితమైన) పరా అమృతము ఉన్నది
యావత్ అగ్ని ఆత్మకం సౌమ్యం అమృతం విసృజతీ అధః వ్యాపకమైన అగ్నికి ఆత్మకమైన సౌమ్యమైన అమృతము క్రిందకు విడువబడుచున్నది
అత ఏవ హి కాలాగ్నిః అధస్తాత్ శక్తిః ఊర్ధ్వగా అందుచేతనే కాలాగ్ని (అనలాత్మకము) క్రిందకు, శక్తి (సోమాత్మకము) పైకి ఉన్నవి
యావత్ ఆదహనః చ ఊర్ధ్వం అధస్తాత్ పావనం భవేత్ మొత్తము దహన శక్తి పైకి, పావన శక్తి క్రిందకు ఉన్నవి
ఆధారశక్త్యా అవధృతః కాలాగ్నిః అయం ఊర్ధ్వగః, తథా ఏవ నిమ్నగః సోమః శివఃశక్తి పదాస్పదః ఇంద్రియశక్తికి ఆధారమైన క్రిందనున్న ఈ కాలాగ్ని (అనలుడు) ఊర్ధ్వముఖముగా ఉన్నాడు, అలాగే శివశక్తుల స్థానమునున్న పైనున్న సోముడు అధోముఖముగా ఉన్నాడు,

[అనగా అనలుడు (కాలాగ్ని) ఇంద్రియములకు మూల బల రూపముగా, వ్యక్తముగా బాహ్యముఖముగా ఉన్నాడు మఱియు శివశక్త్యాత్మకమైన సోముడు అవ్యక్తుడై అంతర్ముఖముగా ఉన్నాడు]


శివః చ ఊర్ధ్వమయః శక్తిః, ఊర్ధ్వశక్తిమయః శివః


శివుడే ఊర్ధ్వమయుడైన శక్తి, ఊర్ధ్వశక్తిమయుడే శివుడు,
తత్ ఇత్థం శివశక్తిభ్యాం న అవ్యాప్తం ఇహ కించన ఈ విధముగా ఆ శివశక్తులచే వ్యాప్తముకానిది జగత్తు యందు ఏదీ లేదు.
అసకృత్ చ అగ్నినా దగ్ధం జగత్ తత్ భస్మసాత్ కృతం అనేకసార్లు ఈ జగత్ అగ్నిచే దగ్ధము అయి ఆ భస్మముగా చేయబడినది.

[అనగా ఏ అవ్యక్త చిదాత్మయందు అనేకమార్లు అనేక జగత్తులు వ్యక్తమై లయమవుచున్నవో ఆ జ్ఞానాత్మయే భస్మ.]
అగ్నేః వీర్యం ఇదం ప్రాహుః తత్ వీర్యం భస్మ యత్ తతః (జ్ఞాన) అగ్ని యొక్క వీర్యమే ఇది అని ప్రాజ్ఞులు చెప్పుదురు, ఆ వీర్యమే భస్మగా అయినది
2.2 భస్మ జ్ఞానాగ్నితో భస్మస్నానము
యః చ ఇత్థం భస్మ సద్భావం జ్ఞాత్వా అభిస్నాతి భస్మనా అగ్నిః ఇతి ఆదిభిః మంత్రైః దగ్ధపాపః సః ఉచ్యతే ఎవరైతే ఈ విధంగా భస్మ యొక్క తత్వము తెలుసుకొని “అగ్నిః ఇతి” మొదలైన మంత్రములతో భస్మచే స్నానము చేయుదురో వారు పాపము దగ్ధము చేసుకున్నవారగుదురు అని చెప్పబడెను
అగ్నేః వీర్యం చ తత్ భస్మ సోమేన అప్లావితం పునః అగ్ని యొక్క వీర్యమైన ఈ భస్మము మరలా సోమునిచే తడుపబడినది (ఆత్మానుభవముచే శాంతింపబడినది).
2.3 భస్మస్నాన ఫలశృతి
అయోగయుక్త్యా ప్రకృతేః అధికారాయ కల్పతే యోగయుక్తిలేనిచో ప్రకృతి అధికారములో కట్టుబడెదరు,
యోగయుక్త్యాతు తత్ భస్మ ప్లావ్యమానం సమంతతః యోగయుక్తిచే ఆ భస్మతో శరీరమంతటా చక్కగా తడుపబడగా
శాక్తేన అమృతవర్షేణ హి అధికారాత్ నివర్తతే భస్మ శక్తి యొక్క అమృతవర్షముతో (ప్రకృతి) అధికారమునుండి విడిపడుదురు
అతో మృత్యుంజయాయ ఇత్థం అమృతప్లావనం సతాం దీనితో మృత్యువును జయించుటకు ఈ విధముగా (భస్మ) అమృతముతో తడుపుట సత్పురుషులచే చెప్పబడినది
శివశక్తి అమృతస్పర్శే లబ్ధ ఏవ కుతో మృతిః? శివశక్తి కలయికలో అమృతస్పర్శ పొందినవారికి మృత్యువు ఎట్లు కలుగును?
యో వేద గహనం గుహ్యం పావనం చ తత ఉదితం ఎవరైతే అత్యంత సూక్ష్మము, రహస్యము, పవిత్రము అయిన ఈ విషయము తెలుసుకుందురో
అగ్నీ సోమ పుటం కృత్వా న స భూయో అభిజాయతే వారు అగ్నీ సోమ పుటము చేసి మరలా పునరావృత్తి పొందరు,
శివాగ్నినా తనుం దగ్ధ్వా శక్తి సోమ అమృతేన యః ప్లావయేత్ యోగమార్గేణ శివాగ్నిచే తనువును దగ్ధం చేసి శక్తి సోమ అమృతముతో యోగమార్గముచే ఎవరు తడుపబడుదురో,

అనగా జ్ఞానదృష్టితో ఈ శరీరమును (జీవుడును) శివశక్తిమయముగా అర్థము చేసుకొనెదరో,
సః అమృతత్వాయ కల్పతే, సః అమృతత్వాయ కల్పతే వారు అమృతత్వము పొందెదరు, వారు అమృతత్వము పొందెదరు.


మూడవ బ్రాహ్మణము -

విభూతి సేకరణ

3.1 గోమయ సేకరణ
అథ భుసుండః కాలాగ్ని రుద్రం విభూతియోగం అనుబ్రూహి ఇతి హ ఉవాచ అటు పిమ్మట భుసుండుడు కాలాగ్ని రుద్రుని విభూతియోగము (విభూతిని ఏ విధంగా సేకరించవలెను) గురించి దయతో చెప్పుము అని అడుగగా, ఆ రుద్రుడు చెప్పసాగెను,
వికట అంగాం ఉన్మత్తాం మహాఖలాం మలినాం అశివ ఆది చిహ్న అన్వితాం అవయవములు వికటించినవి, మతి చెలించినవి, బహు చెడ్డవి, మలినమైనవి, అపశకునములు సూచించే చిహ్నములు కలవి,
న పునఃధేనుం కృశాంగాం వత్సహీనాం అశాంతాం అదుగ్ధదోహినీం పాలు ఇవ్వటం ఆపేసినవి, బలహీనమైన అవయవములు కలవి, దూడ సంతానము లేనివి, శాంతము లేకున్నవి, పాలు పితకబడలేనివి,
నిరింద్రియాం జగ్ధతృణాం కేశ చేల అస్థి భక్షిణీం అవయవలోపము కలిగినవి, గడ్డి నమలలేక వదిలివేసినవి, వెంట్రుకలు బట్టలు ఎముకలు తినునవి,
సంధినీం నవ ప్రసూతాం రోగార్తాం - గాం విహాయ అకాలముగా పాలు పితకబడినవి, క్రొత్తగా ఈనినవి, రోగములతో బాధపడుచున్నవి - ఇటువంటి ఆవులను అన్నీ వదిలిపెట్టి,
ప్రశస్త గోమయం ఆహరేత్ గోమయం ఖస్థం గ్రాహ్యం ప్రశస్తమైన ఆవు యొక్క గోమయము పేడ వేయుచుండగా గ్రహించవలెను,
శుభేస్థానే వా పతితం అపరిత్యజ్యాత ఊర్ధ్వం మర్దయేత్ లేదా మంచి ప్రదేశములందు పడిన గోమయము తీసుకొని క్రిందపెట్టకుండా పైన మర్దించవలెను,
గవ్యేన గోమయ గ్రహణం కపిలా వా ధవళా వా అలాభే తత్ అన్యా గౌః స్యాద్ దోషవర్జితా గోవు యొక్క గోమయము గ్రహించునప్పుడు అది కపిల (గోధుమ రంగు) ఆవు కాని తెల్ల ఆవు కాని, అవి దొరకనిచో మరేదైనా దోషములులేని ఆవు కాని చూసుకొనవలెను,
కపిలా గోః భస్మోక్తం లబ్ధ గోభస్మనాచేత్ అన్య గోక్షారం యత్ర క్వ అపి స్థితం చ యత్ తత్ న హి ధార్యం కపిలగోవు యొక్క గోమయము లభించినచో శ్రేష్ఠము, అట్లని ఎక్కడో ఎప్పుడో విడిచిన పేడను తెచ్చుకొని ధరింపరాదు,
సంస్కారసహితం ధార్యం, తత్ర ఏతే శ్లోకా భవంతి సంస్కారము చేసిన గోమయమునే ధరించవలెను, అందుకు శ్లోకములు ఉన్నవి.
విద్యా శక్తిః సమస్తానాం శక్తిః ఇతి అభిధీయతే విద్యా శక్తి అందరికీ (నిజమైన) శక్తి అని ప్రకటించబడెను,
గుణత్రయ ఆశ్రయా విద్యా సా విద్యా చ తత్ ఆశ్రయా త్రిగుణములు (సత్త్వ, రజో, తమో గుణములు) విద్యను ఆశ్రయించినవి, ఆ విద్య త్రిగుణములను ఆశ్రయించినది,
గుణ త్రయం ఇదం ధేనుః విద్యాభూత్ గోమయం శుభం మూత్రం చ త్రిగుణములు ఈ గో (భస్మ) విద్యా స్వరూపము, కావున గోమయము మఱియు గోమూత్రము శుభప్రదము,
ఉపనిషత్ ప్రోక్తం కుర్యాత్ భస్మ తతః పరం ఈ విధముగా ఉపనిషత్తుచే చెప్పబడెను (అని అర్థం చేసుకొని), అటు పిమ్మట భస్మ తయారు చేసుకొనవలెను
వత్సః తు స్మృతయః చ అస్య తత్ సంభూతంతు గోమయం దీని (ఉపనిషత్తుతో సామ్యరూపమైన గోవు) యొక్క దూడలే స్మృతులు, దాని నుండి ప్రభవించినదే గోమయము.
3.2 గోమూత్ర సేకరణ
ఆగావ ఇతి మంత్రేణ ధేనుం తత్ర అభిమంత్రయేత్ ఆగావ అనే మంత్రముతో ధేనువును అభిమంత్రించవలెను
గావో భగో గావ ఇతి ప్రాశయేత్ తర్పణం జలం గావో భగో గావ అనే మంత్రముతో తినిపిస్తూ జలము తర్పణము చేయవలెను
ఉపోష్య చ చతుర్దశ్యాం శుక్లే కృష్ణే అథవా వ్రతీ శుక్ల లేదా కృష్ణ పక్ష చతుర్దశినాడు ఉపవాసము చేసి వ్రతము చేయవలెను
పరేద్యుః ప్రాతః ఉత్థాయ శుచిః భూత్వా సమాహితః తరువాత రోజు ప్రాతఃకాలముననే లేచి శుచి చేసుకొని ప్రసన్నమనస్సుతో
కృతస్నానో ధౌతవస్త్రః పయోర్థం చ సృజేత్ చ గాం స్నానము చేసి శుభ్రమైన వస్త్రము ధరించి పాలు కొఱకు ఆవును సిద్ధంచేసుకొని
ఉత్థాప్య గాం ప్రయత్నేన గాయత్ర్యా మూత్రం ఆహరేత్ ప్రయత్నముతో గోవును పైకి లేపి గాయత్రీ మంత్రము చెప్పుకుంటూ గోమూత్రమును (ఏదైన పాత్రలో) గ్రహించవలెను

    Reference NOTE: ఈ ఉపనిషత్తులో ఉటంకించబడిన అగ్నిహోమమునకు సంబంధించిన మంత్రములు
    వేదవాఙ్మయములో “విరాజ హోమ మంత్రములు” మఱియు “వ్యాహృతి హోమ మంత్రములు” అన్న పేర్లతో ఉన్నవి.

3.3 అగ్నికార్యము
సౌవర్ణే రాజతే తామ్రే ధారయేన మృణ్మయే ఘటే పౌష్కరే అథ పలాశేవా పాత్రే గోశృంగ ఏవవా బంగారు, వెండి, రాగి లేదా మట్టి పాత్రలో గాని లేదా తామరాకు, పలాశ ఆకు లేదా ఆవు యొక్క కొమ్ములో గాని గోమూత్రమును గ్రహించవలెను
ఆదదీతహి గోమూత్రం గంధద్వార ఇతి గోమయం గంధధ్వార అను మంత్రముతో గోమయమును తీసుకొనవలెను
అభూమిపాతం గృహ్ణీయాత్ పాత్రే పూర్వ ఉదితే గృహీ భూమి మీద పడకుండా ఇంతకు ముందు చెప్పినట్లు పాత్రలో గ్రహించవలెను
గోమయం శోధయేత్ విద్వాస్ శ్రీర్మే భజతు మంత్రతః శ్రీర్మే భజతు అను మంత్రముతో గోమయమును శోధించవలెను
అలక్ష్మీర్మ ఇతి మంత్రేణ గోమయం ధాన్యవర్జితం అలక్ష్మీర్మ అను మంత్రముతో గోమయములో ధాన్యము లేకుండా చేయవలెను
సంత్వాసించామి మంత్రేణ గోమూత్రం గోమయే క్షిపేత్ సంత్వాసించామి అను మంత్రముతో గోమూత్రమును గోమయముపై చల్లవలెను
పంచానాం ఇతి మంత్రేణ పిండానాం చ చతుర్దశ పంచానాం అనే మంత్రముతో గోమయమును పద్నాలుగు (14) పిండములుగా చేసుకొనవలెను
కుర్యాత్ సంశోధ్య కిరణైః సౌరకైః ఆహరేత్ తతః నిదాధ్యాత్ వాటిని తగిన మంత్రములతో శోధించి సూర్య కిరణములతో ఎండింపచేయవలెను
అథ పూర్వోక్త పాత్రే గోమయ పిండకాన్, స్వగృహ్య ఉక్త విధానేన ప్రతిష్ఠాప్య అగ్నిం ఈజయేత్ తరువాత ఇంతకుముందు చెప్పినట్లు ఒక పాత్రలో ఎండిన గోమయ పిండములను ఉంచి, స్వగృహమునందు యుక్తమైన స్థలములో అగ్నిని ప్రతిష్ఠించి ప్రజ్వలింపచేయవలెను
పిండాం చ నిక్షిపేత్ తత్ర ఆద్యంతం ప్రణవేనతు పిండములను ఆ అగ్నిలో వేసి అవి పుటము అయ్యే వరకు ఓంకార మంత్రము జపించవలెను

షడక్షరస్య సూక్తస్య వ్యావృత్తస్య తథా అక్షరైః

(ఓం నమః శివాయ అనే) షడక్షర మంత్రముతో అగ్నిహోత్రమును (ఆజ్యముతో) ప్రజ్వలింపచేయవలెను
స్వాహా అంతే జుహుయాత్ తత్ర వర్ణ దేవాయ పిండకాన్ స్వాహా మంత్రములతో ఆయా వర్ణ (అక్షర) దేవతల కొఱకు అగ్నిలో హోమము చేయవలెను
ఆఘారా వా ఆజ్య భాగౌ చ ప్రక్షిపేత్ వ్యాహృతీః సుధీః తతో నిధనపతయే త్రయో వింశః జుహోతి చ ఆఘారములు లేదా ఆజ్య భాగములు పెట్టి సద్బుద్ధితో మహా వ్యాహృత్తులతో (ఓం భూః, భువః, సువః, మహః, జనః, తపః, ఓగ్ం సత్యం), తరువాత నిధనపతయే స్వాహా అనే ఇరవది మూడు (23) మంత్రములతో అగ్నికి హోమము చేయవలెను
హోతవ్యా పంచబ్రహ్మాణి నమోహిరణ్య బాహవే ఇతి సార్వహుతీః హుత్వా చతుర్థ్యంతైః చ మంత్రకైః ఋతుగ్ం సత్యం కద్రుద్రాయ యస్యవై కంకతి ఇతి చ పంచ బ్రహ్మలకు నమో హిరణ్యబాహవే, ఋతుగ్ం సత్యం, కద్రుద్రాయ యస్యవై, కంకతి అనే నాలుగు అంత్య మంత్రములతో సర్వాహుతులు ఇవ్వవలెను
ఏతైః చ జుహుయాత్ విద్వాన్ అనాజ్ఞాతత్రయం తథా ఈ విధంగా అనాజ్ఞాతత్రయమైన (జ్ఞాత త్రయములకు, అనగా తెలియబడునవియైన జాగృత్ స్వప్న సుషుప్తి స్థితులకు, ఆవల తెలియబడలేనిదియైన తురీయమును నిర్దేశించు) మంత్రములతో హోమము చేసి
వ్యాహృతీః అథ హుత్వా చ తతః స్విష్టకృతం హునేత్ వ్యాహృతీ మంత్రములతో హుతమునిచ్చి తరువాత స్విష్టకృత మంత్రములు చెప్పి
ఇధ్మ శేషంతు నిర్వర్త్య పూర్ణపాత్ర ఉదకం తథా పూర్ణాం అసి ఇతి యుజుషా జలేన అన్యేన బృంహయేత్ మిగిలిన హవిస్సులతో హోమశేషము నిర్వర్తించి పూర్ణపాత్రోదకమును పూర్ణాం అసి అనే మంత్రముతో యజ్ఞము చేసిన మరొక జలములో కలుపవలెను
బ్రాహ్మణేషు అమృతం ఇతి తత్ జలం శిరసి క్షిపేత్ బ్రాహ్మణేషు అమృతం అనే మంత్రముతో ఆ జలమును శిరస్సుపై చల్లుకొనవలెను
ప్రాచ్యాం ఇతి దిశం లింగైః దిక్షు తోయం వినిక్షిపేత్ తూర్పు దిక్కున నీటితో ప్రోక్షణ చేసి
బ్రాహ్మణే దక్షిణాం దత్వా శాంత్యై పులకం ఆహరేత్ బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి శాంతికై పులకమును (గడ్డి) తీసుకొని,
ఆహరిష్యామి దేవానాం సర్వేషాం కర్మగుప్తయే అందరి దేవతల కర్మ రక్షణ మఱియు సంతృప్తికై


జాతవేదసం ఏనం త్వాం పులకైః ఛాదయామి అహం మంత్రేణానేన


“జాతవేదసం ఏనం త్వాం పులకైః ఛాదయామి అహం” తత్ మంత్రసహితముగా
తం వహ్నిం పులకైః ఛాదయేత్ తతః జాతవేదసుడవైన (సర్వజ్ఞుడవైన) అగ్నిదేవా! నీకు పులకముతో కప్పుచున్నాను అని అగ్నిలో వేయవలెను.
త్రిదినం జ్వలనస్థిత్యై ఛాదనం పులకైః స్మృతం మూడు రోజులు హోమాగ్ని జ్వలనస్థితిలో ఉండుటకు పులకము (గడ్డి, ఊక మొదలగునవి) అగ్నిగుండములో కప్పవలెను
బ్రాహ్మణాన్ భోజయేత్ భక్త్యా స్వయం భుంజీత వాగ్యతః భక్తితో బ్రాహ్మణులకు భోజనము పెట్టి స్వయముగా భుజించి (మానసికముగా) మౌనము పాటించవలెను
భస్మాధిక్యం అభీప్సుః తు అధికం గోమయం హరేత్ అధికముగా భస్మము కావలెనన్నచో ఎక్కువగా గోమయమును సేకరించవలెను
దినత్రయేణ యది వా ఏకస్మిన్ దివసే అథవా మూడవ రోజున కాని లేదా ఒక్క రోజు తరువాత కాని లేదా
తృతీయ ఏవా చతుర్థ ఏవా ప్రాతః స్నాత్వా సితాంబరః మూడు రోజులు అయ్యాక నాలుగవ రోజున కాని ప్రొద్దున్నే లేచి స్నానము చేసి తెల్లని వస్త్రములు ధరించి
శుక్ల యజ్ఞోపవీతీ చ శుక్లమాల్యాను లేపనః తెల్లని యజ్ఞోపవీతమును ధరించి, తెల్లని పూలమాలను వేసుకొని, మంచి గంధమును ధరించి
శుక్లదంతో భస్మదిగ్ధో మంత్రేణ అనేన మంత్రవిత్ దంతములు తెల్లగా చేసుకొని, శరీరముపై భస్మము పూసుకొని, తత్ సంబంధిత మంత్రములు చెప్పుటకు సిద్ధపడవలెను
3.4 భస్మ సంప్రోక్షణ
ఓం తత్ బ్రహ్మ ఇతి చ ఉచ్చార్య పౌలకం భస్మ సంత్యజేత్ ఓం తత్ బ్రహ్మ అని ఉచ్చరించి పులక భస్మను తీసుకొని విడిచిపెట్టవలెను
తత్ర చ ఆవాహన ముఖ అనుపచారాంసః తు షోడశ కుర్యాత్ వ్యాహృతిభిః తు ఏవం తత అగ్నిం ఉపసంహరేత్ అక్కడ పదహారు ఆవాహన ఉపచార మంత్రములు చెప్పుచూ ముఖ అనుపచారము చేస్తూ వ్యాహృతీ మంత్రములు (ఓం భూః, భువః మొదలగునవి) చెప్పి అగ్నిని ఉపసంహారం చేయవలెను
అగ్నేః భస్మ ఇతి మంత్రేణ గృహ్ణీయాత్ భస్మ చ ఉత్తరం అగ్నేః భస్మ అనే మంత్రముతో భస్మను గ్రహించవలెను
అగ్నిః ఇత్యాది మంత్రేణ ప్రమృజ్య చ తతః పరం అగ్నిః మొదలైన మంత్రములతో ఆ భస్మను తడుపవలెను
సంయోజ్య గంధ సలిలైః కపిలా మూత్రకేణ వా మంచి గంధములో నీరు కాని కపిల గోమూత్రము కాని కలిపి బాగుగా భస్మను తడుపవలెను
చంద్ర కుంకుమ కాశ్మీరం ఉశీరం చందనం తథా అగరుత్రితయం చ ఏవ చూర్ణయిత్వా తు సూక్ష్మతః కర్పూరము, కుంకుమ, (సువాసన కొఱకు) కాశ్మీరవ్రేళ్ళు, చందనము, అగరులు కలిపి సూక్ష్మముగా చూర్ణము చేసి
క్షిపేత్ భస్మని తత్ చూర్ణం ఓం ఇతి బ్రహ్మమంత్రతః ప్రణవేన ఆహరేత్ విద్వాన్ బృహతో వటకాన్ అథ భస్మ మీద చల్లుతూ ఓం అను బ్రహ్మమంత్రమైన ప్రణవముతో భస్మను తీసుకొని ఉండలు చేసుకొనవలెను
అణోరణీయాన్ ఇతి హి మంత్రేణ చ విచక్షణః ఇత్థం భస్మ సుసంపాద్య శుష్కం ఆదాయ మంత్రవిత్ అణోరణీయాన్ అనే మంత్రముతో భస్మను సంపాదించి ఎండించుకొనవలెను, ఆ పైన మంత్రములు చెప్పుటకు సిద్ధపడవలెను.
3.5 భస్మ స్నానము
ప్రణవేన విమృజ్య అథ సప్తప్రణవ మంత్రితం ప్రణవముతో చేతిలో తీసుకొని సప్తప్రణవముతో (ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం) మంత్రించి,
ఈశాన ఇతి శిరోదేశం ముఖం తత్ పురుషేణతు (పంచబ్రహ్మమంత్రములైన) ఈశాన మంత్రముతో శిరస్సుపైన, తత్పురుషేణ మంత్రముతో ముఖముపైన
ఊరుదేశం అఘోరేణ గుహ్యం వామేన మంత్రయేత్ అఘోరేణ మంత్రముతో తొడలపైన, వామేన మంత్రముతో గుహ్యప్రదేశములందు
సద్యోజాతేనవై పాదాంత సర్వాంగం ప్రణవేనతు సద్యోజాత మంత్రముతో అన్ని అంగములలో పాదముల చివర వరకు ప్రణవ మంత్రము చెప్పుకుంటూ భస్మ రాసుకొనవలెను
తత ఉద్ధూళ్య సర్వాంగం ఆపాదతలమస్తకం తరువాత తల నుండి పాదముల వరకు అన్ని శరీర భాగములపై భస్మను చల్లుకొనవలెను
ఆచమ్య, వసనం ధౌతం తతః చ ఏతత్ ప్రధారయేత్ ఆచమనము చేసి ఉతికిన బట్టలను కట్టుకొనవలెను
పునరాచమ్య కర్మస్వం కర్తుమర్హసి సత్తమ పునరాచమనము చేసినచో నిత్య కర్మ చేయుటకు అర్హుడగును
3.6 భస్మ కల్పము
అథ చతుర్విధం భస్మ కల్పం ఈ భస్మము నాలుగు విధములుగా కల్పించబడినది,
ప్రథమం అనుకల్పం, ద్వితీయం ఉపకల్పం, ఉపోపకల్పం తృతీయం, అకల్పం చతుర్థం మొదటిది అనుకల్పం, రెండవది ఉపకల్పం, మూడవది ఉపోపకల్పం, నాలుగవది అకల్పం.
అగ్నిహోత్రసముద్భూతం విరజ అనలజం అనుకల్పం అగ్నిహోత్రమునందు సముద్భవించిన విరజాగ్ని నుండి పుట్టినది అనుకల్పం
వనే శుష్కం శకృత్ సంగృహ్య కల్పోక్త విధినా కల్పితం ఉపకల్పం స్యాత్ వనమునందు ఎండిన గోమయమును సంగ్రహించి కల్పోక్త విధితో కల్పించబడినది ఉపకల్పం
అరణ్యే శుష్క గోమయం చూర్ణీకృత్య అనుసంగృహ్య గోమూత్రైః పిండీకృత్య యథాకల్పం సంస్కృతం ఉపకల్పం అరణ్యమునందు ఎండిన గోమయమును పొడిచేసుకొని గోమూత్రముతో కలిపి ఉండలుగా చేసుకొని కల్పోక్త విధితో సంస్కరించబడినది ఉపోపకల్పం
శివాలయస్థం అకల్పం శతకల్పం చ శివాలయమునందు ఉన్నది అకల్పము మఱియు శతకల్పము
ఇత్థం చతుర్విధం భస్మ పాపం నికృంతయేత్ మోక్షం దదాతి ఇట్లు నాలుగు విధములైన భస్మము పాపము పోగొట్టి మోక్షమును ఇచ్చునది
ఇతి భగవాన్ కాలాగ్ని రుద్రః అని భగవంతుడైన కాలాగ్ని రుద్రుడు చెప్పెను.

నాలుగవ బ్రాహ్మణము -

భస్మస్నాన విధి, త్రిపుండ్ర విధి

4.1 భస్మస్నాన విధి
అథ భుసుండః కాలాగ్నిరుద్రం భస్మస్నానవిధిం బ్రూహి ఇతి హ ఉవాచ పిమ్మట భుసుండుడు కాలాగ్ని రుద్రుని భస్మస్నాన విధిని గురించి చెప్పుము అనగా (కాలాగ్ని రుద్రుడు) ఇలా చెప్పెను,
అథ ప్రణవేన విమృజ్య అథ సప్త ప్రణవేన అభిమంత్రితం ఆగమేన తు తేన ఏవ దిగ్బంధం కారయేత్ అప్పుడు ప్రణవ మంత్రము (ఓం) ఉచ్చరిస్తూ రెండు అరచేతులు తడిలేకుండా చేసుకొని, తరువాత సప్త ప్రణవ మంత్రముతో (ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం) అభిమంత్రించి దానితోనే దిగ్భంధనం చేసి,
పునరపి తేన అస్త్రమంత్రేణ అంగాని మూర్ధ ఆది ఉద్ధూళయేత్ మరల అస్త్రమంత్రముతో తల మొదలగు అంగములపై భస్మ చల్లుకొనవలెను,
మలస్నానం ఇదం ఈశాన ఆద్యైః పంచభిః మంత్రైః తనుం క్రమాత్ ఉద్ధూళయేత్ మలస్నానం ఆచరిస్తూ ఈశాన మొదలైన పంచబ్రహ్మ మంత్రములతో (సద్యోజాతం ప్రపద్యామి, వామదేవాయ నమో, అఘోరేభ్యో అథ ఘోరేభ్యో, తత్పురుషాయ విద్మహే, ఈశాన సర్వవిద్యానాం) తనువున క్రమముగా భస్మతో పూసుకొనవలెను,
ఈశాన ఇతి శిరోదేశం, ముఖం తత్పురుషేణతు, ఊరుదేశం అఘోరేణ, ఈశాన సర్వవిద్యానాం అనే మంత్రముతో శిరస్సుపైన, తత్పురుషాయ విద్మహే అనే మంత్రముతో ముఖముపైన, అఘోరేభ్యో అథ ఘోరేభ్యో అనే మంత్రముతో తొడలపైన,
గుహ్యకం వామదేవతః, సద్యోజాతేన వై పాదౌ, సర్వాంగం ప్రణవేన తు వామదేవాయ నమో అనే మంత్రముతో గుహ్య ప్రదేశములలో, సద్యోజాతం ప్రపద్యామి అనే మంత్రముతో పాదములపైన, ఓంకార మంత్రముతో ఇతర సర్వాంగములపైన,
ఆపాదతలమస్తకం సర్వాంగం తత ఉద్ధూళ్య, ఆచమ్య, వసనం ధౌతం శ్వేతం వా ప్రధారయేత్ పాదముల నుండి తల మస్తకము వరకు భస్మను రాసుకొని, ఆచమనం చేసి, శుచియైన తెల్లని వస్త్రమును కట్టుకొనవలెను.
విధిస్నానం ఇదం, తత్ర శ్లోకా భవంతి ఇది భస్మస్నాన విధి. అందుకు శ్లోకములు ఉన్నవి.
భస్మ ముష్టిం సముదాయ సంహితాం మంత్రమంత్రితాం (చతుర్వేద) సంహిత మంత్రములచే మంత్రించిన భస్మ సముదాయమును పిడికిలితో తీసుకొని,
మస్తకాత్ పాద పర్యంతం మలస్నానం పురా ఉదితం తల మస్తకము నుండి పాదముల వరకు మల స్నానం ఇంతకు ముందు చెప్పిన విధముగా చేయవలెను
తత్ మంత్రేణ ఏవ కర్తవ్యం విధిస్నానం సమ ఆచరేత్ (మల స్నానం) తర్వాత మంత్రపూర్వకముగా విధి స్నానం చేయవలెను,
ఈశానే పంచధా భస్మ వికిరేత్ మూర్ధ్ని యత్నతః ఈశాన సర్వవిద్యానాం అనే మంత్రముతో ఐదు సార్లు భస్మతో శిరస్సుపైన చల్లుకొనవలెను,
ముఖే చతుర్థవక్త్రేణ అఘోరేణ అష్టధా హృది అఘోరేభ్యో అథ ఘోరేభ్యో అనే మంత్రముతో నాలుగు సార్లు ముఖముపైన, ఎనిమిది సార్లు హృదయము మీద చల్లుకొనవలెను
వామేన గుహ్యదేశే తు త్రిదశస్థానభేదతః వామదేవాయ నమో అనే మంత్రముతో గుహ్య ప్రదేశములలో ముప్పయి సార్లు చల్లుకొనవలెను,

అష్టౌ అంతేన సాధ్యేన పాదౌ ఉద్ధూళ్య యత్నతః

ఎనిమిది సార్లు వంగి పాదములపైన భస్మను చల్లుకొనవలెను,
సర్వాంగ ఉద్ధూళనం కార్యం రాజన్యస్య యథా విధి సర్వాంగములందు భస్మను క్షత్రియుడైనవాడు యథా విథిగా రాసుకొనవలెను
ముఖం వినా చ తత్ సర్వం ఉద్ధూళ్య క్రమయోగతః సంధ్యాద్వయే నిశీధే చ తథా పూర్వ అవసానయోః ముఖము తప్ప మిగిలిన సర్వాంగములందు క్రమబద్ధముగా ఉదయ మఱియు సాయంకాల సంధ్యలందు, రాత్రులందు మొదట చివరన భస్మ ఉద్ధూళనము చేయవలెను
4.2 భస్మస్నాన నిషిద్ధము, ప్రాయశ్చిత్తము
సుప్త్వా భుక్త్వా పయః పీత్వా కృత్వా చ అవశ్యకాదికం నిద్రించిన, భుజించిన, నీరుత్రాగిన, కాలకృత్యములు తీర్చుకొనిన, మఱియు
స్త్రియం నపుంసకం గృధ్రం బిడాలం బక మూషికం స్పృష్ట్యా స్త్రీని, నపుంసకుని, గ్రద్ధను, పిల్లిని, కొంగను, ఎలుకను స్పృశించినప్పుడు
తథా విధ అనన్యాత్ భస్మ స్నానం సమాచరేత్ అలాగే విధిని అతిక్రమించిన సమయములందు భస్మ స్నానము ఆచరించవలెను
దేవ అగ్ని గురు వృద్ధానాం సమీపే అంత్యజ దర్శనే అశుద్ధ భూతలే మార్గే కుర్యాన్ న ఉద్ధూళనం వ్రతీ దేవతలు, అగ్ని, గురు, వృద్ధుల వద్దనున్నప్పుడు, హీనకులంవారిని దర్శించినప్పుడు, అశుచి ప్రదేశములందున మార్గములందున వ్రతనిష్ఠులు భస్మస్నానము చేయరాదు
శంఖ తోయేన మూలేన భస్మనా మిశ్రణం భవేత్ శంఖములో నీటిని పోయగా మూలమునుండి వచ్చు నీటితో భస్మను తడిచేసుకొనవలెను

యోజితం చందనేన ఏవ వారిణా భస్మసంయుతం

పొడిచేసిన చందనముతో భస్మను కలుపుకొనవలెను
చందనేన సమాలింపేత్ జ్ఞానదం చూర్ణం ఏవ తత్ చందనముతో చక్కగా కలిసిన భస్మము జ్ఞానమును ఇచ్చునదగును
మధ్యాహ్నాత్ ప్రాక్ జలైః యుక్తం తత్ అనువర్జయేత్ మధ్యాహ్నమునకు పూర్వముందున్న జలము వాడరాదు
4.3 త్రిపుండ్ర విధి
అథ భుసుండో భగవంతం కాలాగ్నిరుద్రం త్రిపుండ్రవిధిం పప్రచ్ఛ, తత్ర ఏతే శ్లోకా భవంతి పిమ్మట భుసుండుడు భగవంతుడైన కాలాగ్ని రుద్రుని త్రిపుండ్రవిధిని (మూడు రేఖలతో భస్మను శరీరంపై అద్దుకొని విధానం) గూర్చి పరిప్రశ్నించెను, అక్కడ కొన్ని శ్లోకములు ఉన్నవి.
త్రిపుండ్రం కారయేత్ పశ్చాత్ బ్రహ్మ విష్ణు శివాత్మకం త్రిపుండ్రములోని రేఖలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమము,
మధ్య అంగుళిభిః ఆదాయ త్రిసృభిః మూల మంత్రతః భస్మను మూల మంత్రముతో (పంచాక్షరితో) మంత్రించి మధ్య మూడు వ్రేళ్ళతో (తర్జనీ / చూపుడు వ్రేలు, మధ్యమ వ్రేలు, అనామిక / ఉంగరం వ్రేలు) సరిగా త్రిపుండ్రము పెట్టుకొనవలెను
అనామ మధ్యం అంగుష్ఠైః అథవా అస్యాత్ త్రిపుండ్రకం లేదా మధ్యమ వ్రేలు, తర్జనీ / చూపుడు వ్రేలు, బొటన వ్రేలుతో కలిపి త్రిపుండ్రము పెట్టుకొనవలెను
ఉద్ధూళయేత్ ముఖం విప్రః, క్షత్రియః తత్ శిరో ఉదితం విప్రుడు ముఖమున చల్లుకొనవలెను, క్షత్రియుడు భస్మను శిరస్సునందు చల్లుకొనవలెను
ద్వాత్రింశత్ స్థానకే చ అర్థం షోడశ స్థానకే అపి వా ముప్పది రెండు స్థానములందు కాని లేదా సగం అనగా పదహారు స్థానములందు కాని లేదా
అష్టస్థానే తథా చ ఏవ పంచస్థానే అపి యోజయేత్ ఎనిమిది స్థానములందు కాని లేదా ఐదు స్థానములందు కాని భస్మను అద్దుకొనవలెను
ఉత్తమాంగే లలాటే చ కర్ణయోః నేత్రయోః తథా, నాసా వక్త్రే గళే చ ఏవం అంసద్వయం అతః పరం ఉత్తమ అంగములందు, నుదుటి యందు, చెవుల యందు, కన్నుల యందు, ముక్కు యందు, నోటి యందు, కంఠము నందు, రెండు భుజములందు
కూర్పరే మణిబంధే చ హృదయే పార్శ్వయ ఊర్ధ్వయోః నాభౌ గుహ్యద్వయే చ ఏవం ఊర్వోః స్ఫిక్ బింబ జానునీ మోచేతులందు, మణికట్టులందు, వక్షస్థలమందు, ప్రక్కలందు, పైన, నాభి యందు, గుహ్యద్వయములందు, తొడలందు, పిరుదులందు, పిక్కలందు భస్మను పెట్టుకొనవలెను
జంఘా ద్వయే చ పాదౌ చ ద్వాత్రింశత్ స్థానం ఉత్తమం రెండు పిక్కలందు మఱియు పాదములందు (ఇంతకు ముందు చెప్పిన వాటితో) సహా ముప్పదిరెండు ఉత్తమస్థానములు
అష్టమూర్త్య అష్టవిద్యేశాన్ దిక్పాలాన్ వసుభిః సహ అష్టమూర్తులను, అష్టవిద్యేశులను, అష్టదిక్పాలకులను, అష్టవసువులను సహా (32 మంది),
ధరో ధృవః చ సోమః చ కృపః చ ఏవ అనిలః అనలః ప్రత్యూషః చ ప్రభాసః చ, వసవః అష్టౌ ఈరితాః ధర, ధృవ, సోమ, కృప, అనిల, అనల, ప్రత్యూష, ప్రభాస - అను వారు అష్ట వసువులు
ఏతేషాం నామ మంత్రేణ త్రిపుండ్రం ధారయేత్ బుధః వీరందరి పేర్లతో మంత్రించి త్రిపుండ్రమును బుద్ధిమంతులు ధరించెదరు,
విదధ్యాత్ షోడశస్థానే త్రిపుండ్రంతు సమాహితః (లేదా వీరిని స్మరించి) శరీరమునందు పదహారు స్థానములందు మాత్రమే కూడా పెట్టుకొనవచ్చును
శీర్షకే చ లలాటే చ కర్ణే కంఠే అంసకద్వయే కూర్పరే శిరస్సు, లలాటము, రెండు చెవులు, కంఠము, రెండు భుజములు, రెండు మోచేతులు,
మణిబంధే చ హృదయే నాభి పార్శ్వ్యయోః పృష్ఠే చ రెండు మణికట్టులు, హృదయము, నాభి, దాని రెండు ప్రక్కలందు, వీపు మీద -
ఏకం ప్రతిస్థానం జపేత్ తత్ర అధిదేవతాః ఈ పదహారు (16) స్థానములందు ప్రతీ స్థానమునకు ఆయా అధిష్ఠాన దేవతలను జపించవలెను
శివం శక్తిం చ సాదాఖ్యాం (చ) ఈశం విద్య ఆఖ్యాం ఏవ చ వామాది నవశక్తీః చ శివశక్తి సాదాఖ్యములు (శివసాదాఖ్య, అమృతసాదాఖ్య, మూర్తసాదాఖ్య, కర్తృసాదాఖ్య, కర్మసాదాఖ్య - 5 శక్తులు), ఈశ-విద్య ఆఖ్యములు (2 శక్తులు), మరియు వామ మొదలగు నవ (9) శక్తులు -

[సాదాఖ్య అనగా అవ్యక్తము మూర్తీభవించు తత్త్వము. శైవ ఆగమ శాస్త్రములలో అవ్యక్తమైన శివశక్తి సృష్టిగా మూర్తీభవించుట వర్ణించబడినది.]

[నవశక్తి / నవదుర్గ = 1. శైలపుత్రీ (మూలాధార చక్ర) 2. బ్రహ్మచారిణీ (స్వాధిష్ఠాన చక్ర) 3. చంద్రఘంట (మణిపుర చక్ర) 4. కూష్మాండా (అనాహత చక్ర) 5. స్కందమాతా (విశుద్ధ చక్ర) 6. కాత్యాయినీ (ఆజ్ఞా చక్ర) 7. కాలరాత్రీ / వామపాద సంహారిణీ (భాను చక్ర) 8. మహాగౌరీ (సోమ చక్ర) 9. సిద్ధిదాత్రీ (నిర్వాణ చక్ర)]

ఏతే షోడశ దైవతాః

ఈ పదహారు (16) అధిదేవతలు (వీరిని ఒకొక్కరిగా తలచుకొని ఒకొక్క శరీరాంగములయందు భస్మతో త్రిపుండ్రము రాసుకొనవలెను).
4.4 భస్మస్నాన - త్రిపుండ్ర విధులకు స్థానములు, అధిదేవతలు
నాసత్యః దస్రకః చ ఏవ అశ్వినౌ ద్వౌ సమ్ ఈరితౌ నాసత్యుడు, దస్రకుడు అనే ఇద్దరు జంట అశ్వనీ దేవతలు
అథవా మూర్ధ్ని అలీకే చ, కర్ణయో శ్వసనే తథా, బాహుద్వయే చ, హృదయే, నాభ్యాం, ఊర్వోర్యుగే తథా, జానుద్వయే చ, పదయోః, పృష్ఠ భాగే చ షోడశ శిరస్సు, లలాటము, రెండు చెవులు, ముక్కు, రెండు చేతులు, హృదయము, నాభి, రెండు తొడలు, రెండు మోకాళ్ళు, రెండు పాదములు, వీపు - ఇవి పదహారు (16) స్థానములు.
శివః చ ఇంద్రః చ రుద్ర అర్క విఘ్నేశో విష్ణుః ఏవ చ శ్రీః చ ఏవ హృదయేశః చ తథా నాభౌ ప్రజాపతిః నాగః చ నాగకన్యా చ ఉభే చ ఋషికన్యకే పాదయోః చ సముద్రాః చ తీర్థాః పృష్టే అపి చ స్థితాః ఏవం వా షోడశస్థానం శివుడు, చంద్రుడు, రుద్రుడు, సూర్యుడు, విఘ్నేశ్వరుడు, విష్ణువు, లక్ష్మీ, హృదయేశుడు, నాభి యందు ప్రజాపతి, నాగుడు, నాగకన్య, ఇద్దరు ఋషికన్యలు, రెండు పాదములందు సముద్రములు, వీపు యందు తీర్థములు వీరు పదహారు (16) స్థానముల అధిదేవతలు.
అష్టస్థానం అథ ఉచ్యతే - గురుస్థానం, లలాటం చ కర్ణద్వయం అనంతరం అంసయుగ్మం చ హృదయం నాభిః ఇతి అష్టమం భవేత్ ఇప్పుడు అష్టస్థానముల గురించి చెప్పెదను - గురుస్థానం (శిరస్సు), లలాటము, రెండు చెవులు, అటు పిమ్మట రెండు భుజములు, హృదయము, నాభి - ఇవి ఎనిమిది (8) స్థానములు.
బ్రహ్మా చ ఋషయః సప్త దేవతాః చ ప్రకీర్తితాః బ్రహ్మ మఱియు సప్తఋషులు (ఈ ఎనిమిది మంది ఎనిమిది స్థానములకు) అధిష్ఠాన దేవతలుగా కీర్తింపబడుచున్నారు,
అథవా మస్తకం బాహూ హృదయం నాభిః ఏవ చ పంచస్థానాని అమూని ఆహుః భస్మ తత్త్వ విదోజనాః లేదా శిరస్సు, రెండు చేతులు, హృదయం, నాభి - ఇవి పంచస్థానములు (5) అని భస్మ తత్వవేత్తలచే చెప్పబడెను.
యథా సంభవతః కుర్యాత్ దేశకాలాది అపేక్షయా దేశకాలములను బట్టి యథా సంభవముగా భస్మ స్నానము చేయవలెను
ఉద్ధూళనే అపి అశక్తః చేత్ త్రిపుండ్రాదీని కారయేత్ భస్మ ఉద్ధూళనము (స్నానము) చేయు శక్తి లేనిచో త్రిపుండ్ర విధియైనా చేసుకొనవలెను
లలాటే హృదయే నాభౌ గళే చ మణిబంధయోః బాహుమధ్యే బాహుమూలే పృష్ఠే చ ఏవ చ శీర్షకే నుదుటి యందు, హృదయమందు, నాభియందు, కంఠమునందు, మణికట్టులందు, బాహుమధ్యములందు భస్మ పెట్టుకొనవలెను
లలాటే బ్రాహ్మణే నమః, హృదయే హవ్యవాహనాయ నమః, నాభౌ స్కందాయ నమః నుదుటి యందు బ్రాహ్మణే నమః అని,
హృదయము నందు హవ్యవాహనాయ నమః అని,
నాభి యందు స్కందాయ నమః అని,
గళే విష్ణవే నమః, మధ్యే ప్రభంజనాయ నమః, మణిబంధే వసుభ్యో నమః కంఠమునందు విష్ణవే నమః అని,
(బాహు) మధ్యమునందు ప్రభంజనాయ నమః అని,
మణికట్టునందు వసుభ్యో నమః అని,
పృష్టే హరయే నమః, కుకుది శంభవే నమః, శిరసి పరమాత్మనే నమః వీపు మీద హరయే నమః అని,
భుజముల పైన (మెడ వెనక) శంభవే నమః అని,
శిరస్సున పరమాత్మనే నమః,
ఇత్యాది స్థానేషు త్రిపుండ్రం ధారయేత్ ఇవి మొదలగు స్థానములందు భస్మతో త్రిపుండ్రము (మూడు రేఖలు) ధరించవలెను.
త్రినేత్రం త్రిగూణాధారం త్రయాణాం జనకం ప్రభుం స్మరన్ త్రినేత్రుడు, త్రిగుణములకు ఆధారుడు, (త్రయ అణాం) మూడు లోకములకు తండ్రిని, ప్రభువుని స్మరించుచూ,
నమః శివాయ ఇతి లలాటే తత్ త్రిపుండ్రకం నమః శివాయ అని నుదుటిపైన త్రిపుండ్రకము రాసుకొనవలెను
కూర్పర అధః పితృభ్యాం తు ఈశానాభ్యాం తథా ఉపరి పితృభ్యాం నమః అని మోచేతుల దగ్గర,
ఈశానాభ్యాం నమః అని ఆ పైన,
ఈశాభ్యాం నమ ఇతి ఉక్త్వా పార్శ్వ్యయోః చ త్రిపుండ్రకం ఈశాభ్యాం నమః అని చెప్పి ప్రక్కలందు త్రిపుండ్రకము పెట్టుకొనవలెను,
స్వచ్ఛాభ్యాం నమ ఇతి ఉక్త్వా ధారయేత్ తత్ ప్రకోష్ఠయోః స్వచ్ఛాభ్యాం నమః అని చెప్పి అరచెయ్యి మఱియు
మోచెయ్యి మధ్యభాగములపై ధరించవలెను,
భీమాయ ఇతి తథా పృష్ఠే శివాయ ఇతి చ పార్శ్వ్యయోః భీమాయ నమః అని వీపు మీద,
శివాయ నమః అని ప్రక్కలందు,
నీలకంఠాయ శిరసి క్షిపేత్ సర్వాత్మనే నమః నీలకంఠాయ నమః అని తలపై,
సర్వాత్మనే నమః అని అంతటా భస్మ చల్లుకొనవలెను.
4.5 భస్మస్నాన - త్రిపుండ్ర విధులకు ఫలస్తుతి
పాపం నాశయేత్ కృత్స్నం అపి జన్మాంతర ఆర్జితం భస్మ స్నానము (భస్మము సూచించే ఏకత్వ జ్ఞానము) జన్మ జన్మలుగా సంపాదించిన పాపమును కూడా నశింపచేయును,
కంఠ ఉపరి కృతం పాపం నష్టంస్యాత్ తత్ర ధారణాత్ కంఠము పైభాగముతో చేసిన పాపములు కంఠమునందు భస్మ ధరించినందు వలన పోవును,
కర్ణేతు ధారణాత్ కర్ణ రోగాది కృతపాతకం చెవుల యందు భస్మ ధరించినచో చెవికి సంబంధించిన రోగములు మఱియు పాపములు నశింపచేయును,
బాహ్వోః బాహు కృతం పాపం, వక్షస్సు మనసాకృతం చేతుల యందు భస్మ ధరించినచో చేతులతో చేసిన పాపములు,
హృదయ స్థానమునందు భస్మ ధరించినచో మనస్సుతో చేసిన పాపములు ప్రక్షాళనం చేయును,
నాభ్యాం శిశ్నకృతం పాపం, పృష్ఠే గుదకృతం తథా నాభి యందు భస్మ ధరించుటచే పురుషాంగముతో చేసిన పాపము,
వీపు యందు ధరించుటచే పాయముతో చేసిన పాపము పోవును,
పార్శ్వయోః ధారణాత్ పాపం పర స్త్రియ ఆలింగనాదికం శరీర ప్రక్కలలో భస్మ ధరించినచో (మనస్సులోనైనా సరే) పర స్త్రీని కౌగిలించుకున్న పాపమును నాశనం చేయును
తత్ భస్మ ధారణం కుర్యాత్ సర్వత్ర ఏవ ఆ భస్మధారణే శరీరమంతా చేసుకొనవలెను
త్రిపుండ్రకం బ్రహ్మ విష్ణు మహేశానాం త్రయ అగ్నీనాం చ ధారణం త్రిపుండ్రక ధారణము బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము, త్రయ అగ్ని స్వరూపము (అనగా దక్షిణాగ్ని, గార్హపత్యము, ఆహవనీయము అనబడు యజ్ఞ సంబంధిత త్రేతాగ్నులు)
గుణలోక త్రయాణాం చ ధారణం తేనవై కృతం త్రిపుండ్రక ధారణము త్రిగుణాత్మకము (సత్త్వ, రజో, తమో గుణములకు ఆధారము),
కావున భస్మ ధారణ ఎల్లప్పుడూ చేయవలెను (అనగా అభేద జ్ఞానము మననము చేస్తూ ఉండవలెను)

ఐదవ బ్రాహ్మణము -

భస్మాగ్నులు, త్రిపుండ్ర ధారణ

5.1 భస్మాగ్నులు
మానస్తోకేన మంత్రేణ మంత్రితం భస్మధారయేత్ మానస్తోక అను (క్రింది) మంత్రముతో మంత్రింపబడిన భస్మను ధరింపవలెను

[మానస్తోక తనయే మాన ఆయుషీమానో గోషుమానో ఆశ్వేషురీరిషః
వీరాన్మానో రుద్ర భూమితోః అవధీః హవీష్మంతో నమసా విధేమతే ]
ఊర్ధ్వపుండ్రం భవేత్ సామ, మధ్య పుండ్రం త్రియ ఆయుషం (త్రిపుండ్రములలోని) పైన రేఖ సామమునకు (ఏకత్వమునకు) చిహ్నము, మధ్య రేఖ మూడు ఆయువులకు (బాల్య యవ్వన వార్ధక్యములకు) చిహ్నము
త్రియ ఆయుషాణి కురుతే లలాటే చ భుజద్వయే, నాభౌ శిరసి హృత్ పార్శ్వే బ్రాహ్మణాః క్షత్రియాః తథా మూడు ఆయువుల (అనగా దీర్ఘాయువు) కొఱకు నుదుటియందు మఱియు రెండు భుజములందు, నాభియందు, శిరస్సుయందు, హృదయమునందు మఱియు ప్రక్కలందు బ్రాహ్మణులు, క్షత్రియులు భస్మ పెట్టుకొనెదరు
త్రైవర్ణికానాం సర్వేషాం అగ్నిహోత్ర సముద్భవం మూడు వర్ణముల (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) వారందరికీ అగ్నిహోత్రమునుండి పవిత్రముగా ఉద్భవించిన భస్మ త్రిపుండ్ర విధికి ఉపయోగించెదరు
ఇదం ముఖ్యం గృహస్థానాం విరజ అనలజం భవేత్ ఇందులో గృహస్థులకు విరజాగ్ని నుండి తీసిన భస్మము ముఖ్యము అగును,
విరజ అనలజం చ ఏవ ధార్యం ప్రోక్తం మహర్షిభిః విరజాగ్ని నుండి తీసిన భస్మయే మహర్షులకు కూడా ధరింపదగినది అని చెప్పబడును,
ఔపాసన సముత్పన్నం గృహస్థానాం విశేషతః, ఔపాసనాగ్ని నుండి తీసిన భస్మ గృహస్థులకు విశేషము,
సమిద్ అగ్ని సముత్పన్నం ధార్యం వై బ్రహ్మచారిణా సమిదాగ్ని నుండి పవిత్రముగా తీసిన భస్మ బ్రహ్మచారులకు ధరింపతగినది,


శూద్రాణాం శ్రోత్రియాగార పచన అగ్ని సముద్భవం


శూద్రులకు వేదాధ్యయనము చేయువారి ఇంటిలో (వంట చేయుటకు ఉపయోగించిన) పచనాగ్ని నుండి తెచ్చుకున్న భస్మ ధరింపతగినది,
అన్యేషాం అపి సర్వేషాం ధార్యం చ ఏవ అనలోద్భవం ఇతరులందరికీ కూడా (పవిత్రమైన ఏదైనా) అగ్ని నుండి తీసిన భస్మ ధరింపతగినది,
యతీనాం జ్ఞానదం ప్రోక్తం, వనస్థానాం విరక్తిదం (ఈ భస్మ) యతులకు జ్ఞానము ఇచ్చునని చెప్పబడును, వానప్రస్థులకు విరక్తి ఇచ్చును,
అతివర్ణాశ్రమానాం తు శ్మశానాగ్ని సముద్భవం ఏ వర్ణాశ్రమమునకు చెందనివారికి శ్మశానాగ్ని నుండి పవిత్రముగా ఉద్భవించిన భస్మ ధరింపతగినది,
సర్వేషాం దేవాలయస్థం భస్మ అందరికీ కూడా దేవాలయము నుండి తీసుకున్న భస్మ ధరింపతగును,
శివాగ్నిజం శివయోగినాం శివాలయస్థం తత్ లింగ లిప్తం వా మంత్రసంస్కార దగ్ధం వా శివయోగులకు శివాగ్ని నుండి ఉద్భవించిన భస్మ అనగా శివాలయమునుండి అక్కడి శివలింగమునుండి లేదా మంత్రసంస్కారముచే దగ్ధము కాబడిన భస్మ ధరింపతగును,
తత్ర ఏతే శ్లోకా భవంతి ఈ విషయమున శ్లోకములు కలవు.
5.2 త్రిపుండ్ర ధారణ - సమ్యక్ దృష్టి అలవరచుకోవటం
తేన అధీతం శ్రుతం తేన తేన సర్వం అధిష్ఠితం యేన విప్రేణ శిరసి త్రిపుండ్రం భస్మనా ధృతం ఏ విప్రుడు తలపై భస్మతో త్రిపుండ్రము ధరించునో (సమ్యక్ దృష్టి అలవరచుకొనునో) వాని చేతనే వేదం చదువబడినట్లు, వాని చేతనే సర్వము అనుష్ఠింపబడినట్లు,
త్యక్త వర్ణాశ్రమ ఆచారో లుప్త సర్వ క్రియో అపి యః సకృత్ తిర్యక్ త్రిపుండ్రాంక ధారణాత్ సః అపి పూజ్యతే ఎవని చేత తలపై భస్మతో త్రిపుండ్రము ధరింపబడునో వాడు వర్ణాశ్రమములు వదిలేసినా వానికి సర్వ క్రియా లోపము కలిగినా అతడే పూజ్యుడగును,
యే భస్మధారణం త్యక్త్వా కర్మ కుర్వంతి మానవాః తేషాం నాస్తి వినిఃమోక్షః సంసారాత్ జన్మకోటిభిః ఎవరైతే భస్మ (సామ్యజ్ఞాన) ధారణ చేయక కర్మలు మాత్రమే చేయుదురో వారికి కోటి జన్మలైనా సంసారము నుండి మోక్షము లభించదు.
5.3 భస్మధిక్కార దోషము
మహాపాతకయుక్తానాం పూర్వజన్మార్జిత ఆగసాం త్రిపుండ్ర ఉద్ధూళన ద్వేషో జాయతే సుదృఢం బుధాః మహాపాతకములు కలిగినవారు, పూర్వజన్మలో పాపములు చేసినవారికి త్రిపుండ్ర విధి పట్ల ద్వేషము కలుగునని దృఢముగా బుద్ధిమంతులు తెలుసుకొనెదరు
యేషాం కోపో భవేత్ బ్రహ్మన్ లలాటే భస్మదర్శనాత్ తేషాం ఉత్పత్తి సాంకర్యం అనుమేయం విపశ్చితా ఎవరికి బ్రాహ్మణుని నుదుటి మీద ఉన్న భస్మధారణము చూసి కోపము కలుగునో వారికి జన్మ సాంకర్యము చెందినట్లుగా విజ్ఞులు తెలుసుకొనెదరు
యేషాం నాస్తి మునే శ్రద్ధా శ్రౌతే భస్మని సర్వదా గర్భాధానాది సంస్కారః తేషాం నాస్తి ఇతి నిశ్చయః ఎవరికి భస్మ యందు మౌనము, శుచి, శ్రద్ధ కలుగవో వారికి సర్వదా గర్భాధానాది సంస్కార యోగము లేదు అన్నది నిశ్చయము
యే భస్మధారిణం దృష్ట్వా నరాః కుర్వంతి తాడనం తేషాం చండాలతో జన్మ బ్రహ్మన్ ను ఊహ్యం విపశ్చితా ఎవరు భస్మను ధరించిన వారిని చూసి కొట్టెదరో వారికి చండాలుని వలన జన్మ కలిగినదని బ్రాహ్మణులు లెక్కించెదరు

యేషాం క్రోధో భవేత్ భస్మధారణే తత్ ప్రమాణకే తే మహాపాతకైః ఉక్తా ఇతి శాస్త్రస్య నిశ్చయః

ఎవరు భస్మధారణ పట్ల కోపము ప్రదర్శించెదరో శాస్త్ర ప్రమాణముచే వారు మహాపాతకులని శాస్త్రము యొక్క నిర్ణయము
త్రిపుండ్రం యే వినిందంతి నిందంతి శివం ఏవ తే త్రిపుండ్రమును నిందించినవారు శివుని నిందించినట్లే
ధారయంతి చ యే భక్త్యా ధారయంతి శివం చ తే త్రిపుండ్రమును భక్తితో ధరించినవారు శివుని ధరించినట్లే
ధిక్ భస్మ రహితం ఫాలం, ధిక్ గ్రామం అశివాలయం భస్మ లేని నుదురు ధిక్కరించతగినది, శివాలయము లేని గ్రామము ధిక్కరించతగినది
ధిక్ అనీశా అర్చనం జన్మ, ధిక్ విద్యాం అశివాశ్రయాం ఈశ్వరుని అర్చన చేయని జన్మ ధిక్కరించతగినది, ఈశ్వర తత్వము చెప్పని చదువు ధిక్కరించతగినది

[అనగా ఏ శాస్త్రమైనా అంతర్లీనముగా ఈశ్వరునకు అనుసంధానము చేసినప్పుడే ఆ శాస్త్రమునకు సంపూర్ణత చేకూరుతుంది.]
5.4 భస్మధారణ ఫలస్తుతి
రుద్రాగ్నేః యత్ పరం వీర్యం తత్ భస్మ పరికీర్తితం రుద్రాగ్ర్నిని సూచించు భస్మయే (అద్వైత జ్ఞానమే) పరమును సాధించిపెట్టునది,
తస్మాత్ సర్వేషు కాలేషు వీర్యవాన్ భస్మసంయుతః కాబట్టి సర్వకాలములందు భస్మము ధరించినవాడే వీర్యవంతుడు,

భస్మనిష్ఠస్య దహ్యంతే దోషా భస్మాగ్ని సంగమాత్

భస్మ ధారణ యందు నిష్ఠ కలిగినవాడు భస్మ జ్ఞానాగ్ని సంగముచేత దోషములు దహింపచేసుకొనును,
భస్మస్నాన విశుద్ధాత్మా భస్మనిష్ఠ ఇతి స్మృతః భస్మస్నానము చేత దేహము, చిత్తము శుద్ధము చేసుకున్నవాడు భస్మనిష్ఠుడు అని స్మృతులచే చెప్పబడెను,
భస్మ సందిగ్ధ సర్వాంగో భస్మ దీప్త త్రిపుండ్రకః శరీరాంగములందు భస్మ పూసుకున్నవాడు, త్రిపుండ్రము ధరించినవాడు భస్మముచే (శివుని వలె) ప్రకాశింపబడును,
భస్మ శాయీ చ పురుషో భస్మనిష్ఠ ఇతి స్మృతః భస్మపై శయనించు పురుషుడు భస్మనిష్ఠుడు అని స్మృతులచే చెప్పబడెను.


ఆరవ బ్రాహ్మణము -

భస్మ ధారణ మహత్తు

6.1 కరుణుడు - శుచిస్మిత గాథ
అథ భుసుండః కాలాగ్ని రుద్రం నామపంచకస్య మాహాత్మ్యం బ్రూహి ఇతి హ ఉవాచ అప్పుడు భుసుండుడు కాలాగ్ని రుద్రుని నామపంచకము (విభూతి, భసితం, భస్మ, క్షారం, రక్ష అను పంచ నామములు కలిగిన భస్మము) యొక్క మహత్యము చెప్పుము అని అడిగెను
అథ వసిష్ఠవంశజస్య శతభార్యాసమేతస్య ధనంజయస్య బ్రాహ్మణస్య [అప్పుడు కాలాగ్ని రుద్రుడు -] వసిష్ఠ వంశములో వందమంది భార్యలు కలిగిన ధనంజయుడు అనే బ్రాహ్మణుడి యొక్క
జ్యేష్ఠభార్యా పుత్రః కరుణ ఇతి నామ తస్య శుచిస్మితా భార్యా పెద్ద భార్యకు పుత్రుడైన కరుణుడు అను నామము కలవాడు ఉండెను, అతని యొక్క భార్య శుచిస్మిత.
6.2 కరుణుడికి శాపము
అసౌ కరుణో భ్రాతృవైరం అసహమానో భవానీ తటస్థం నృసింహం ఆగమత్ ఈ కరుణుడు సోదరులతో వైరము సహింపలేక భవాని తటాకమునందున్న నృసింహుని వద్దకు వెళ్లెను,
తత్ర దేవసమీపే అన్యేన ఉపాయనార్థం సమర్పితం జంబీరఫలం గృహీత్వా ఆజిఘ్రత్ అక్కడ దేవీసమీపమునందు ఇతరులచే కానుకగా సమర్పించబడిన నిమ్మజాతి పండును తీసుకొని వాసన చూసెను,
తదా తత్రస్థా అశపన్ పాప మక్షికో భవ వర్షాణాం శతం ఇతి అందుచే వెంటనే అక్కడివారిచే వంద సంవత్సరాలు దుష్ట ఈగగా అగుమని శపించబడెను.
6.3 కరుణుడి శాప విమోచనము
సః అపి శాపం ఆదాయ మక్షికః సన్ స్వచేష్టితం తస్యై నివేద్య అతడు అట్లు శాపము పొంది ఈగగా మారుటకు కారణము తాను చేసినది చెప్పి
మాం రక్ష ఇతి స్వభార్యాం అవదత్ తదా మక్షికః అభవత్ నన్ను రక్షించు అని తన భార్యను అడిగి ఈగగా మారిపోయెను.
తం ఏవం జ్ఞాత్వా జ్ఞాతయ సః తైలమధ్యే హి ఆమారయత్ అది తెలిసి జ్ఞాతులు ఆ ఈగను నూనెలో పారవేసి చంపిరి,
సా మృతం పతిం ఆదాయ అరుంధతీం అగమత్ చనిపోయిన తన భర్తను తీసుకొని అరుంధతి వద్దకు వెళ్ళగా,
భో శుచిస్మితే శోకేన అలం అరుంధతిః అహ అముం జీవయామి అద్య విభూతిం ఆదాయ ఇతి ఓ శుచిస్మితా! దుఃఖించవద్దు, అరుంధతియైన నేను నీ భర్తను ఈ విభూతి తీసుకొని బ్రతికించెదను,
ఏష అగ్నిహోత్రజం భస్మ, మృత్యుంజయేన మంత్రేణ మృతజంతౌ తదా క్షిపత్ ఇది అగ్నిహోత్రమునుండి జనించిన భస్మ అని దానిని మృత్యుంజయ మంత్రముతో మంత్రించి ఆ ఈగపై చల్లెను,
మందవాయుః తదా జజ్ఞే వ్యజనేన శుచిస్మితే చల్లగాలి అప్పుడు శుచిస్మితపై వీచినది,
ఉద అతిష్ఠత్ తదా జంతుః భస్మనో అస్య ప్రభావతః భస్మము ప్రభావముచేత ఆ జంతువు (ఈగ) బ్రతికి లేచినది,
తతో వర్షశతే పూర్ణే జ్ఞాతిః ఏకో హి అమారయత్ ఆ పిమ్మట వంద సంవత్సరాలు నిండగా, తరువాత ఒక జ్ఞాతి ఈగను చంపగా శాపము నుండి విడివడెను,
భస్మ ఏవ జీవయామ స కాశ్యాం పంచ తథా అభవన్ అదే విధంగా కాశీలో భస్మయే ఐదుగురును బ్రతికించినది,
దేవాన్ అపి తథా భూతాన్ మాం అపి ఏతాదృశం పురా దేవతలను కూడా, భూతములను, నన్ను కూడా పూర్వము ఈ భస్మ ఉద్ధరించినది,
తస్మాత్ తు భస్మనా జంతుం జీవయామి తదా అనఘే కావున భస్మముచే ఈగను జీవింపచేయుదును, ఓ పాపరహితా!
ఇతి ఏవ ముక్త్వా భగవాన్ దధీచః సమజాయత అని చెప్పి భగవంతుడైన దధీచి జీవింపచేయగా

స్వరూపం చ తతో గత్వా స్వం ఆశ్రమపదం యయౌ ఇతి

మరలా (మనుష్య) స్వరూపం పొంది (కరుణుడు) తన ఆశ్రమమునకు చేరుకొనెను
ఇదానీం అస్య భస్మనః సర్వ అఘ భక్షణ సామర్థ్యం విధత్త ఇతి ఆహ (కాలాగ్ని రుద్రుడు భుసుండునితో) ఇటువంటి ఈ భస్మనకు సర్వ పాపములను నశింపచేయు సామర్థ్యము ఉన్నది, అని చెప్పెను.
6.4 దేవతల కామ వికార దోషము
శ్రీ గౌతమ వివాహ కాలే తాం అహల్యాం దృష్ట్వా సర్వే దేవాః కామాతురా అభవన్ శ్రీ గౌతమ మహర్షి వివాహ కాలమున అహల్యను చూసి సర్వ దేవతలు కామమోహితులైనారు
తదా నష్టజ్ఞానా దుర్వాససం గత్వా పప్రచ్ఛుః అందుచేత జ్ఞానము నశించినవారై దుర్వాస మహర్షిని చేరి వినయముతో ప్రార్థించెను
తత్ దోషం శమయిష్యామి ఇతి ఉవాచ తత్ శతరుద్రేణ మంత్రితం మంత్రేణ ఆ దోషమును శమింపచేస్తాను అని దుర్వాసుడు చెప్పెను, అతడు శతరుద్రీయముతో మంత్రించబడిన
భస్మ వై పురా మయా అపి దత్తం బ్రహ్మహత్యాది శాంతం భస్మ ఇచ్చి ఇది పూర్వము బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టినది
ఇతి ఏవ ముక్త్వా దుర్వాసా దత్తవాన్ భస్మ చ ఉత్తమం అని చెప్పి దుర్వాసుడు ఉత్తమమైన భస్మను వారికి ఇచ్చెను.
6.5 దేవతల శాప విమోచనము
జాతా మత్ వచనాత్ సర్వే యూయం తే అధిక తేజసః శతరుద్రేణ మంత్రేణ భస్మోద్ధూళిత విగ్రహాః [దుర్వాస మహర్షి - ] నా వచనము ప్రకారము మీరందరూ శతరుద్రీయముతో మంత్రించబడిన భస్మను శరీరములందు ధరించినవారై అధిక తేజస్వులైనారు
నిర్ధూత రజసః సర్వే తత్ క్షణాత్ చ వయం మునే ఆశ్చర్యం ఏత జ్ఞానీమో భస్మ సామర్థ్యం ఈదృశం [అప్పుడు ఆ దేవతలందరూ -] ఓ మునీ, భస్మను ధరించిన క్షణమునే మా రజోగుణము తొలగించుకున్నాము. ఈ భస్మము యొక్క సామర్థ్యం చూసి ఆశ్చర్యచకితులం అయినాము.
6.6 హరి హరుల సంవాదము
అస్య భస్మనః శక్తిం అన్యాం శృణు ఈ భస్మ యొక్క శక్తి గూర్చి మరొక ఉదాహరణ విను,
ఏతద్ ఏవ హరి శంకరయోః జ్ఞానప్రదం, బ్రహ్మహత్యాది పాపనాశకం, మహావిభూతిదం ఇతి ఇదే హరిహరులకు జ్ఞానప్రదము, బ్రహ్మహత్యాది పాపములు నశింపచేయగలిగినది, గొప్ప ఐశ్వర్యములు ఇచ్చునది,
శివ వక్షసి స్థితం నఖేన ఆదాయ ప్రణవేన అభిమంత్ర్య శివ వక్షస్థలమందు భస్మను గోటితో గ్రహించి ఓంకారముచే అభిమంత్రించి
గాయత్ర్యా పంచాక్షరేణ అభిమంత్ర్య హరిః మస్తక గాత్రేషు సమర్పయేత్ గాయత్రీ మఱియు పంచాక్షర మంత్రములచే అభిమంత్రించి నారాయణుడు శిరస్సు ఇతర అవయవములందు ధరించించెను,
తథా హృది ధ్యాయస్వ ఇతి హరిం ఉక్త్వా హరః అప్పుడు హృదయమునందు ధ్యానింపమని హరికి చెప్పెను హరుడు,
స్వహృది ధ్యాత్వా దృష్ట అదృష్ట ఇతి శివం ఆహ తన హృదయమునందు ధ్యానించగా “కనిపించి కనిపించలేదు” అని హరి హరునితో చెప్పెను,
తతో భస్మ భక్షయ ఇతి హరిం ఆహ హరః, తతః భక్షయిష్యే అప్పుడు “భస్మ భక్షించు” అని హరిని హరుడు శాసించెను, అప్పుడు (హరి భస్మను) భక్షించెను,
శివం భస్మ స్నాత్వా అహం భస్మనా పురా పృష్ట శివుని యొక్క భస్మతో ముందు వెనుక భస్మస్నానము చేసి హరి “అహం (శివో౽స్మి)” అని
ఈశ్వరం భక్తిగమ్యం భస్మా అభక్షయత్ అచ్యుతః భక్తిచే పొందబడు ఈశ్వరుని అడిగి భస్మను తీసుకొని హరి భక్షించెను.
తత్ర ఆశ్చర్యం అతీవ ఆసీత్ ప్రతిబింబ సమద్యుతిః అప్పుడు గొప్ప ఆశ్చర్యకరమైన శివుని ప్రతిబింబము ఉదయించినది.
వాసుదేవః శుద్ధ ముక్తాఫల వర్ణో అభవత్ క్షణాత్, తదా ప్రభృతి శుక్లా భో వాసుదేవః ప్రసన్నవాన్ వాసుదేవుడు శుద్ధమైన ముత్యపు వర్ణములో క్షణములో మారిపోయెను, అప్పటి నుండి వాసుదేవుడు (శివునివలె) తెల్లగా మారి ప్రసన్నుడయ్యెను.
న శక్యం భస్మనో జ్ఞానే ప్రభావంతే, కుతో విభో, నమస్తే అస్తు, నమస్తే అస్తు, త్వాం అహం శరణం గతః, త్వత్ పాదయుగళే శంభో భక్తిః అస్తు సదా మమ [హరి ఇలా ప్రార్థించెను - ] భస్మము యొక్క ప్రభావమే తెలియ శక్యము కాదు, ఇక ప్రభువు యొక్క ప్రభావము తెలియునా? నీకు నమస్కారము, నీకు నమస్కారము, నీవే నాకు శరణాగతుడవు. శంభో! నీ పాదయుగళముయందు భక్తి నాకు సదా ఉండు గాక.
భస్మ ధారణ సంపన్నో మమ భక్తో భవిష్యతి [అప్పుడు శివుడు - ] భస్మధారణ చేసే సంపన్నుడు నాకు భక్తుడగును గాక.
6.7 అక్షర పద యోగము, బృహత్ జాబాల తత్త్వ మహిమ
అత ఏవ ఏషా భూతిః భూతికరీ ఇతి ఉక్తా అందుచేతనే ఈ విభూతి మహోన్నతమైన సంపద (స్థితి) కలుగచేయునది అని చెప్పబడుతున్నది
అస్య పురస్తాద్ వసవ ఆసన్, రుద్రా దక్షిణత, ఆదిత్యాః పశ్చాత్, విశ్వేదేవా ఉత్తరతో, బ్రహ్మ విష్ణు మహేశ్వరా నాభ్యాం, సూర్యా చంద్రం అసౌ పార్శ్వ్యయోః, తత్ ఏతత్ ఋచ అభ్యుక్తం ఆ అనుభవ స్థితి పొందినవాని యొక్క ముందున వసువులు ఉందురు, దక్షిణమున రుద్రులు, వెనుక ఆదిత్యులు, ఉత్తరమున విశ్వేదేవతలు, నాభియందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ప్రక్కలందు సూర్యచంద్రులు ఉందురు, ఈ విధంగా ఋక్కులచే నిర్ణయాత్మకముగా చెప్పబడినది
ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధివిశ్వే నిషేదుః ఋక్కులచే (సూచించబడు) అక్షరమైన పరమైన ఆకాశము (చిదాకాశము) నందు విశ్వమునకు అధిష్ఠానమైన దేవతలందరు ఉన్నారు
యః తం న వేద కిం ఋచా కరిష్యతి, య ఇత్తత్ విదుః త ఇమే సమాసతే ఎవరు దానిని తెలుసుకొనరో వారికి ఋక్కులతో ఏమి ప్రయోజనము ఉండును? ఎవరు దానిని తెలుసుకుందురో వారు (పైన చెప్పబడిన) ఆ స్థితిని చేరుకుందురు.
య ఏతత్ బృహత్ జాబాలం సార్వకామికం మోక్షద్వారం ఋఙ్మయం యజుర్మయం సామమయం బ్రహ్మమయం అమృతమయం భవతి ఏదైతే బృహత్ జాబాల తత్త్వం (ఉన్నదో అది) అన్ని కోరికలు తీర్చునది (అనగా కామము దాటించివేయగలిగినది), మోక్షద్వారమై ఉన్నది, ఋక్ మంత్రమయము, యజుర్ మంత్రమయము, సామ మంత్రమయము, బ్రహ్మమయము, అమృతమయము అయిఉన్నది,
య ఏతత్ బృహత్ జాబాలం బాలోవా యువావా వేద - స మహాన్ భవతి, స గురుః, సర్వేషాం మంత్రాణాం ఉపదేష్టా భవతి, మృత్యుతారకం, గురుణా లబ్ధం కంఠే బాహౌ శిఖాయాం వా బధ్నీత ఏదైతే బృహత్ జాబాల తత్త్వం (ఉన్నదో అది) తెలుసుకున్నవాడు బాలుడైనా యువకుడైనా అతడే మహనీయుడు అగును, అతడే గురువు, సర్వ మంత్రములను సారముతో సహా ఉపదేశించగలవాడు అగును, మృత్యువునుండి తరింపచేయునది, గురువుచే లభించిన (బ్రహ్మజ్ఞానము సూచించు ఆ భస్మము) కంఠమునందు బాహువులందు శిఖయందు ధరించవలెను.
సప్తద్వీపవతీ భూమిః దక్షిణార్థం న అవకల్పతే, తస్మాత్ శ్రద్ధయా యాం కాం చిత్ గాం దద్యాత్ సా దక్షిణా భవతి సప్తద్వీపములతో కూడిన ఈ భూమండలమంతా గురుదక్షిణగా ఇచ్చినా సరిపడదు. కనుక, ఈ భస్మ జ్ఞానమును ప్రసాదించిన గురువుకు శ్రద్ధతో ఒక్క గోవును దక్షిణగా ఇచ్చిన చాలును.

ఏడవ బ్రాహ్మణము -

భస్మ జ్యోతిస్సు

7.1 త్రిపుండ్ర విధి
అథ జనకో వైదేహో యాజ్ఞవల్క్యం ఉపసమేత్య ఉవాచ వైదేహుడైన జనకుడు యాజ్ఞవల్క్య మహర్షి దగ్గరకు వచ్చి ఇలా అడిగెను,
భగవన్! త్రిపుండ్రవిధిం నో బ్రూహి ఇతి, సహ ఉవాచ - భగవాన్! త్రిపుండ విధిని (భస్మతో మూడు రేఖలు ధరించు విధి విధానమును) గురించి చెప్పండి. జనకునితో యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను -
సద్యోజాతాది పంచబ్రహ్మమంత్రైః పరిగృహ్య సద్యోజాత మొదలగు పంచబ్రహ్మ మంత్రములు (సద్యోజాతం ప్రపద్యామి, వామదేవాయ నమో, అఘోరేభ్యో అథ ఘోరేభ్యో, తత్పురుషాయ విద్మహే, ఈశాన సర్వవిద్యానాం) జపిస్తూ భస్మను పరిగ్రహించి,
అగ్నిః ఇతి భస్మ ఇతి అభిమంత్ర్య అగ్నిః ఇతి భస్మ (అగ్నియే ఈ భస్మము) అనే మంత్రముతో అభిమంత్రించి,
మానస్తోక ఇతి సముద్ధృత్య మానస్తోక అనే మంత్రముతో చేతికి భస్మము తీసుకొని,
త్రియ ఆయుషం ఇతి జలేన సంసృజ్ఞ్య త్రియ ఆయుషం అనే మంత్రముతో నీటితో తడిపి,
త్రయంబకం ఇతి శిరో లలాట వక్ష స్కందేషు ధృత్వా పూతో మోక్షీ భవతి త్రయంబకం అనే మంత్రముతో తలపై, నుదుటిపై, వక్షస్థలముపై, భుజములపై ధరించినచో పవిత్రుడై ప్రశాంత చిత్తుడగును,
శతరుద్రేణ యత్ ఫలం అవాప్నోతి తత్ ఫలం అశ్నుతే శతరుద్ర జపముచే యే ఫలం వచ్చునో ఆ ఫలం వచ్చినవాడు అగును.
స ఏష భస్మ జ్యోతిః ఇతి వై యాజ్ఞవల్క్యః ఇదియే భస్మ జ్యోతిస్సు (విజ్ఞానము), అని యాజ్ఞవల్క్యుడు చెప్పెను.
7.2 భస్మధారణ ఫలం
జనకో హ వైదేహః స హ ఉవాచ యాజ్ఞవల్క్యం - వైదేహుడైన జనకుడు యాజ్ఞవల్క్య మహర్షిని ఇలా అడిగెను,
భస్మ ధారణాత్ కిం ఫలం అశ్నుత ఇతి భస్మ ధారణ చేత ఏటువంటి ఫలం పొందగలరు, అని.
స హ ఉవాచ - తత్ భస్మ ధారణాత్ ఏవ ముక్తిః భవతి యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను - ఆ భస్మధారణ మాత్రముచే ముక్తి లభించును,
శివసాయుజ్యం అవాప్నోతి, న స పునరావర్తతే, న స పునరావర్తతే శివసాయుజ్యము లభించును, మరలా పునరావృత్తి చెందరు, మరలా పునరావృత్తి చెందరు.
స ఏష భస్మ జ్యోతిః, ఇతి వై యాజ్ఞవల్క్యః ఇదియే భస్మ జ్యోతిస్సు (విజ్ఞానము), అని యాజ్ఞవల్క్యుడు చెప్పెను.
జనకో హ వైదేహః స హ ఉవాచ యాజ్ఞవల్క్యం - వైదేహుడైన జనకుడు యాజ్ఞవల్క్య మహర్షిని ఇలా అడిగెను,
భస్మ ధారణాత్ కిం ఫలం అశ్నుతే న వా ఇతి భస్మ ధారణ చేత ఏటువంటి ఫలం పొందగలరు? లేక ఫలం రాదా?, అని (మరల ధృవీకరించుకొనుటకు అడిగెను).
తత్ర పరమహంసా నామ సంవర్తక ఆరుణి శ్వేతకేతు దుర్వాస ఋభు నిదాఘ జడభరత దత్తాత్రేయః రైవతక భుసుండ (అందుకు యాజ్ఞవల్క్యుడు - ) పరమహంసలుగా చెప్పబడు సంవర్తక ఆరుణి, శ్వేతకేతు, దుర్వాసుడు, ఋభువు, నిదాఘుడు, జడభరతుడు, దత్తాత్రేయుడు, రైవతకుడు, భుసుండుడు
ప్రభృతయో విభూతి ధారణాత్ ఏవ ముక్తాస్స్యుః మొదలైనవారు భస్మధారణ (సామ్యజ్ఞానము పొందటము) చేతనే ముక్తులైరి,
సః ఏష భస్మ జ్యోతిః, ఇతి వై యాజ్ఞవల్క్యః ఇదియే భస్మ జ్యోతిస్సు (విజ్ఞానము), అని యాజ్ఞవల్క్యుడు చెప్పెను.
7.3 భస్మస్నాన ఫలం
జనకో హ వైదేహః స హ ఉవాచ యాజ్ఞవల్క్యం - వైదేహుడైన జనకుడు యాజ్ఞవల్క్య మహర్షిని ఇలా అడిగెను,
భస్మస్నానేన కిం జాయత ఇతి భస్మస్నానము చేత ఏమి ఫలం కలుగును?, అని.
యస్య కస్యచిత్ శరీరే యానంతో రోమకూపాః తావంతి లింగాని భూత్వా తిష్టంతి భస్మస్నానము చేసిన వాని శరీరము మీద ఎన్ని రోమకూపములు (వెంట్రుకలు) ఉన్నవో అవన్నీ శివలింగములై ఉండును.
బ్రాహ్మణో వా క్షత్రియో వా వైశ్యో వా శూద్రో వా తత్ భస్మధారణాత్ ఏవ బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా వైశ్యుడైనా శూద్రుడైనా ఆ భస్మధారణ చేతనే
తత్ శబ్దస్వరూపం యస్యాం తస్యాం హి ఏవ అవతిష్ఠతే దేని యందు భస్మ శబ్ద స్వరూపము (భస్మచే సూచించబడు అభేద అద్వైత సామ్య జ్ఞానము) కలదో దాని యందే స్థితి కలిగి ఉండెదరు.
7.4 త్రిపుండ్ర మహాత్మ్యము - ప్రజాపతిచే స్తుతి
జనకో హ వైదేహిః పైప్పలాదేన స హ ప్రజాపతిలోకం జగామ తం గత్వా ఉవాచ (మరొక సందర్భములో) వైదేహుడైన జనకుడు పైప్పలాదునితో (పిప్పల మహర్షి వంశస్థుడు లేక శిష్య పరంపరలోనివాడు) కూడి ప్రజాపతి లోకమునకు వెళ్లి ఈ విధంగా అడిగెను,
భో ప్రజాపతే త్రిపుండ్రస్య మాహాత్మ్యం బ్రూహి ఇతి ఓ ప్రజాపతీ! త్రిపుండ్రము యొక్క మహత్యము చెప్పుము, అని.
తం ప్రజాపతిః అబ్రవీత్ అథ ఏవ ఈశ్వరస్య మహాత్మ్యం తథా ఏవ త్రిపుండ్రస్య, ఇతి ఆ ప్రజాపతి ఇలా చెప్పెను - ఈశ్వరుని యొక్క మహత్తు ఎట్టిదో అట్టిదే త్రిపుండ్రము యొక్క మహత్తు కూడా, అని.
7.5 త్రిపుండ్ర మహాత్మ్యము - విష్ణువుచే స్తుతి
అథ పైప్పలాదో వైకుంఠం జగామ తం గత్వా ఉవాచ అటు పిమ్మట పైప్పలాదుడు వైకుంఠము వెళ్లి ఈ విధంగా అడిగెను,
భో విష్ణో త్రిపుండ్రస్య మాహాత్మ్యం బ్రూహి ఇతి ఓ విష్ణువా! త్రిపుండ్రము యొక్క మహత్యము చెప్పుము, అని.
అథ ఏవ ఈశ్వరస్య మహాత్మ్యం తథా ఏవ త్రిపుండ్రస్య ఇతి విష్ణుః ఆహ [విష్ణువు - ] ఈశ్వరుని యొక్క మహత్తు ఎట్టిదో అట్టిదే త్రిపుండ్రము యొక్క మహత్తు కూడా అట్టిది, అని విష్ణువు చెప్పెను.
7.6 త్రిపుండ్ర మహాత్మ్యము - కాలాగ్ని రుద్రునిచే స్తుతి
అథ పైప్పలాదః కాలాగ్ని రుద్రం పరిసమేత్య ఉవాచ అధీహి అప్పుడు పైప్పలాదుడు కాలాగ్ని రుద్రుని చేరి ఈ విధంగా అడిగెను,
భగవన్! త్రిపుండ్రస్య విధిం ఇతి, త్రిపుండ్రస్య విధిం మయా వక్తుం భగవాన్! త్రిపుండ్ర విధి ఇది అని, త్రిపుండ్రము యొక్క విధిని నాకు చెప్పుము.
న శక్యం ఇతి సత్యం ఇతి హ ఉవాచ [అప్పుడు కాలాగ్ని రుద్రుడు -] త్రిపుండ్రము యొక్క విధిని చెప్పుటకు నాకు సాధ్యము కాదు, ఇది సత్యము, అని చెప్పెను (అనగా అది అంతటి మహత్తరము)
అథ భస్మః ఛిన్నః సంసారాత్ ముచ్యతే ఈ భస్మము సంసారము ఛేదించి ముక్తిని ఇచ్చును,
భస్మ శయ్యా శయానః తత్ శబ్దగోచరః భస్మ శయ్య మీద పడుకున్నవాడు భస్మ శబ్దముచే సూచించబడు అభేద అద్వైత సామ్యజ్ఞానము గోచరించినవాడగును,
శివసాయుజ్యం అవాప్నోతి, న పునరావర్తతే, న పునరావర్తతే శివసాయుజ్యమును పొందును, పునరావృత్తి పొందడు, పునరావృత్తి పొందడు.
రుద్ర అధ్యాయీ సన్ అమృతత్వం చ గచ్ఛతి, స ఏష భస్మజ్యోతిః రుద్రము అధ్యయనము చేయుచూ చిత్తనివృత్తి పొందును మఱియు అమృతత్వము పొందును. ఇదియే భస్మ జ్యోతిస్సు (విజ్ఞానము).
విభూతి ధారణాత్ బ్రహ్మైకత్వం చ గచ్ఛతి విభూతి ధారణచే (అనగా భస్మము సూచించే అద్వైత జ్ఞానము ధారణ చేసుకొనగా) బ్రహ్మైక్య అనుభవము పొందును,
విభూతి ధారణాత్ ఏవ సర్వేషు తీర్థేషు స్నాతో భవతి విభూతి ధారణ మాత్రముచే సర్వ తీర్థములందు స్నానము చేసినవాడగును,
విభూతి ధారణాత్ వారాణస్యాం స్నానేన యత్ఫలం అవాప్నోతి తత్ఫలం అశ్నుతే, స ఏష భస్మ జ్యోతిః విభూతి ధారణచే వారణాసిలో (కాశీ గంగలో) స్నానము చేసిన ఏ ఫలము పొందునో ఆ ఫలము లభించును, ఇదియే భస్మ జ్యోతిస్సు (విజ్ఞానము).
యస్య కస్యచిత్ శరీరే త్రిపుండ్రస్య లక్ష్మవర్తతే ఎవని శరీరము యందు విభూతి త్రిపుండ్రము యొక్క చిహ్నము ఉండునో
ప్రథమా ప్రజాపతిః ద్వితీయా విష్ణుః తృతీయా సదాశివ ఇతి, స ఏష భస్మ జ్యోతిః ఇతి మొదటి రేఖ ప్రజాపతి, రెండవ రేఖ విష్ణువు, మూడవ రేఖ సదాశివుడు (అనగా త్రిపుండ్రము ధరించినవాడు సృష్టి-స్థితి-లయ రూపమైన త్రిమూర్తి స్వరూపుడు) అని అర్థము, ఇదియే భస్మ జ్యోతిస్సు (విజ్ఞానము).
7.7 రుద్రాక్ష ధారణ విధి మఱియు ఫలం
అథ కాలాగ్ని రుద్రం భగవంతం సనత్కుమారః పప్రచ్ఛ అధీ హి అటు పిమ్మట భగవంతుడైన కాలాగ్ని రుద్రుని సనత్కుమారుడు ఈ విధంగా పరిప్రశ్నించెను,
భగవన్! రుద్రాక్ష ధారణ విధిం భగవాన్! రుద్రాక్ష ధారణ విధిని చెప్పుము,
స హ ఉవాచ - రుద్రస్య నయనాత్ ఉత్పన్నా రుద్రాక్షా ఇతి లోకే ఖ్యాయంతే కాలాగ్ని రుద్రుడు ఇట్లు చెప్పెను - రుద్రుని యొక్క నేత్రమునుండి ఉత్పన్నమైనవి రుద్రాక్షలు అని లోకములో ఖ్యాతి ఉన్నది,
సదాశివః సంహారకాలే సంహారం కృత్వా సంహార అక్షం ముకుళీ కరోతి సదాశివుడు సంహారకాలమునందు సంహారము చేసి ఆ సంహారము చేసిన కన్నును మూసికొనెను,
తత్ నయనాత్ జాతా రుద్రాక్షా ఇతి హ ఉవాచ ఆ కన్ను నుండి జనించినవి రుద్రాక్షలు అని చెప్పబడెను,
తస్మాత్ రుద్రాక్షత్వం ఇతి అందుకే వాటికి రుద్రాక్షలు అని పేరు వచ్చినది,
తత్ రుద్రాక్షే వాక్ విషయే కృతే దశ గో ప్రదానేన యత్ ఫలం అవాప్న ఇతి తత్ ఫలం అశ్నుతే ఈ రుద్రాక్షల గురించి మాట్లాడుకోవటము మాత్రముచే పది గోవులు దానము చేసిన ఫలము లభించును.
స ఏష భస్మజ్యోతీ రుద్రాక్ష ఇతి ఈ రుద్రాక్షయే భస్మజ్యోతి అనబడును,
తత్ రుద్రాక్షం కరేణ స్పృష్ట్వా ధారణమాత్రేణ ద్విసహస్ర గోప్రదాన ఫలం భవతి అటువంటి రుద్రాక్షను చేతితో స్పృశించి ధరించినంత మాత్రముచే రెండు వేల గోవులను దానము చేసిన ఫలము లభించును,
తత్ రుద్రాక్షే కర్ణయోః ధార్యమాణే ఏకాదశ సహస్ర గో ప్రదాన ఫలం భవతి ఆ రుద్రాక్షను చెవులయందు ధరించినచో పదకొండు వేల గోవులను దానము చేసిన ఫలము లభించును,
ఏకాదశ రుద్రత్వం చ గచ్ఛతి ఏకాదశ రుద్రత్వము (మహాదేవ, శివ, మహారుద్ర, శంకర, నీలలోహిత, ఈషణ రుద్ర, విజయ రుద్ర, భీమ రుద్ర, దేవదేవ, భావోద్భవ, ఆదిత్యాత్మక శ్రీరుద్ర), అనగా పదకొండు గుణములు సూచించు రుద్రుల యొక్క తత్వజ్ఞానము పొందెదరు,
తత్ రుద్రాక్షే శిరసి ధార్యమాణే కోటి గో ప్రదాన ఫలం భవతి ఆ రుద్రాక్షలను శిరస్సు యందు ధరించినచో కోటి గోవులను దానము చేసిన ఫలం పొందుదురు,
ఏతేషాం స్థానానాం కర్ణయోః ఫలం వక్తుం న శక్యం ఇతి హ ఉవాచ ఏ ఏ స్థానములలో రుద్రాక్షలను ధరించినందు వలన కలుగు ఫలములు వినుటకు చెప్పుటకు సాధ్యము కాదు (అనగా అంత గొప్ప పుణ్య ఫలములు దక్కును అని),

మూర్ధ్ని చత్వారింశత్, శిఖాయాం ఏకం త్రయం వా, శ్రోత్రయోః ద్వాదశ

శిరస్సునందు నలుబది, శిఖయందు ఒకటి కాని మూడు కాని, చెవులయందు పన్నెండు చొప్పున,
కంఠే ద్వాత్రింశత్, బాహ్వోః షోడశ షోడశ కంఠమునందు ముప్పదిరెండు, బాహువులయందు పదహారు పదహారు చొప్పున,
ద్వాదశ ద్వాదశ మణిబంధయోః, షట్ షట్ అంగుష్ఠయోః పన్నెండు పన్నెండు చొప్పున మణికట్టులయందు, ఆరు ఆరు చొప్పున బొటన వ్రేళ్ళకు,
తతః సంధ్యాం సకుశో అహరహర ఉపాసీత అగ్నిః జ్యోతిః ఇత్యాదిభిః అగ్నౌ జుహుయాత్ ఆ విధంగా రుద్రాక్షధారణ చేసి సంధ్యవేళలలో దర్భలతో ప్రతిదినము ఉపాసిస్తూ “అగ్నిః జ్యోతిః” మొదలగు మంత్రములతో అగ్నియందు హోమము చేయవలెను.

ఎనిమిదవ బ్రాహ్మణము -

ఈ ఉపనిషత్ అధ్యయనమునకు ఫలస్తుతి

8.1 ఫలస్తుతి
అథ బృహత్ జాబాలస్య ఫలం నో బ్రూహి భగవన్ ఇతి ఆ పిమ్మట భుసుండుడు, భగవాన్! బృహత్ జాబాల ఉపనిషత్తు అధ్యయనం చేయుట వలన ఫలము ఏమి, అని అడిగెను.
స హ ఉవాచ - కాలాగ్ని రుద్రుడు ఇలా చెప్పెను -
య ఏతత్ బృహత్ జాబాలం నిత్యం అధీతే ఎవడు ఈ బృహత్ జాబాల ఉపనిషత్తు సారాంశము నిత్యము హృదయంలో మననము చేయునో
సః అగ్నిపూతో భవతి, స వాయుపూతో భవతి, స ఆదిత్యపూతో భవతి, స సోమపూతో భవతి, స బ్రహ్మపూతో భవతి, స విష్ణుపూతో భవతి, స రుద్రపూతో భవతి, స సర్వపూతో భవతి అతడు అగ్నిచే పవిత్రమైనవాడగును, వాయువుచే పవిత్రమైనవాడగును, సూర్యుడుచే పవిత్రమైనవాడగును, చంద్రునిచే పవిత్రమైనవాడగును, బ్రహ్మచే పవిత్రమైనవాడగును, విష్ణువుచే పవిత్రమైనవాడగును, రుద్రునిచే పవిత్రమైనవాడగును, సర్వ విధములుగా పవిత్రమైనవాడగును.
య ఏతత్ బృహత్ జాబాలం నిత్యం అధీయతే ఎవడు బృహత్ జాబాల ఉపనిషత్ సారాంశము నిత్యము అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తాడో,
సః అగ్నిం స్తంభయతి, స వాయుం స్తంభయతి, స ఆదిత్యం స్తంభయతి, స సోమం స్తంభయతి, స ఉదకం స్తంభయతి, స సర్వాన్ దేవాన్ స్తంభయతి, స సర్వాన్ గ్రహాన్ స్తంభయతి, స విషం స్తంభయతి, స విషం స్తంభయతి అతడు అగ్నిని స్తంభింపచేయగలడు, వాయువును స్తంభింపచేయగలడు, అతడు సూర్యుడిని స్తంభింపచేయగలడు, చంద్రుడిని స్తంభింపచేయగలడు, నీటిని స్తంభింపచేయగలడు, అతడు సర్వ దేవతలను స్తంభింపచేయగలడు, సర్వ గ్రహాలను స్తంభింపచేయగలడు, అతడు విషమును స్తంభింపచేయగలడు, విషమును సైతం స్తంభింపచేయగలడు!
య ఏతత్ బృహత్ జాబాలం నిత్యం అధీతే ఎవడు బృహత్ జాబాల ఉపనిషత్ సారాంశము నిత్యము అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తాడో,
స మృత్యుం తరతి, స పాప్మానం తరతి, స బ్రహ్మహత్యాం తరతి, స భ్రూణహత్యాం తరతి, స వీరహత్యాం తరతి, స సర్వహత్యాం తరతి అతడు మృత్యువును దాటగలడు, పాపములను దాటగలడు, అతడు బ్రహ్మహత్యా పాతకము నుండి తరించగలడు, శిశు పిండ హత్యా పాతకము నుండి తరించగలడు, అతడు మనిషి హత్యా పాతకము నుండి తరించగలడు, సర్వ హత్యా పాతకముల నుండి తరించగలడు,
స సంసారం తరతి, స సర్వం తరతి, స సర్వం తరతి అతడు సంసారమును దాటగలడు, అతడు సర్వమును దాటగలడు, అతడు సర్వమును దాటగలడు.
య ఏతత్ బృహత్ జాబాలం నిత్యం అధీతే ఎవడు బృహత్ జాబాల ఉపనిషత్ సారాంశము నిత్యము అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తాడో,
స భూలోకం జయతి, స భువర్లోకం జయతి, స సువర్లోకం జయతి, స సత్యలోకం జయతి, స సర్వాన్ లోకాన్ జయతి, స సర్వాన్ లోకాన్ జయతి అతడు భూలోకమును జయించును, భువర్లోకమును జయించును, సువర్లోకమును జయించును, అతడు సత్యలోకమును జయించును, అతడు సర్వలోకములను జయించును, అతడు సమస్తలోకములను జయించును.
య ఏతత్ బృహత్ జాబాలం నిత్యం అధీతే ఎవడు బృహత్ జాబాల ఉపనిషత్ సారాంశము నిత్యము అధ్యయనం చేస్తూ అభ్యాసం చేస్తాడో,
స ఋచో అధీతే, స యజూంషి అధీతే, స సామాని అధీతే, సః అథర్వణం అధీతే, సః ఆంగిరసం అధీతే, స శాఖా అధీతే, స కల్పాన్ అధీతే, స నారాశగ్ంసీః అధీతే, స పురాణాన్ అధీతే అతడు ఋగ్వేదమును అధ్యయనం చేసినవాడగును, అతడు యజుర్వేదమును అధ్యయనం చేసినవాడగును, అతడు సామవేదమును అధ్యయనం చేసినవాడగును, అతడు అథర్వణవేదమును అధ్యయనం చేసినవాడగును, అతడు వేదములలోని ఆంగీరస శాఖలు మఱియు కల్ప వేదాంగమును అధ్యయనము చేసినవాడగును, అతడు వేదములలోని అగ్ని, నర, శంస మంత్రములు అధ్యయనము చేసినవాడగును, అతడు పురాణములు అధ్యయనం చేసినవాడగును,
స బ్రహ్మ ప్రణవం అధీతే, స బ్రహ్మ ప్రణవం అధీతే అతడు బ్రహ్మమును సూచించు ఓంకార ప్రణవ మంత్రమును భావార్థములతో ధారణ చేసినవాడగును.
అనుపనీత శతం ఏకం ఏకేన ఉపనీతేన తత్ సమం ఉపనయనం కానివారు ఒక వంద మందితో ఉపనయనం చేసుకున్నవాడు ఒక్కడే సమము అగును,
ఉపనీత శతం ఏకం ఏకేన గృహస్థేన తత్ సమం ఉపనయనం చేసుకున్న ఒక వంద మందితో గృహస్థుడైనవాడు ఒక్కడే సమము అగును,
గృహస్థ శతం ఏకం ఏకేన వానప్రస్థేన తత్ సమం గృహస్థులు ఒక వంద మందితో ఒక్క వానప్రస్థుడు సమము అగును,
వానపస్థ శతం ఏకం ఏకేన యతినా తత్ సమం వానప్రస్థులు ఒక వంద మందితో యతి ఒక్కడే సమము అగును,
యతీనాం తు శతం పూర్ణం ఏకం ఏకేన రుద్రజాపకేన తత్ సమం యతులు పూర్తిగా ఒక వంద మందితో రుద్రజపము (భావార్థములతో) చేయువాడు ఒక్కడే సమము అగును,
రుద్రజాపక శతం ఏకం ఏకేన నృసింహతాపిన ఉపనిషత్ అథర్వణ శిరః శిఖా అధ్యాపకేన తత్ సమం రుద్రజపము చేయువారు ఒక వంద మందితో నృసింహ తాపిన ఉపనిషత్తు కలిగిన అథర్వ శృతి శిఖరం అధ్యయనము (మఱియు బోధ) చేయువాడు ఒక్కడు సమము అగును,
అథర్వ శిరః శిఖా అధ్యాపక శతం ఏకం ఏకేన బృహత్ జాబాల ఉపనిషత్ అధ్యాపకేన తత్ సమం అథర్వ శృతి శిఖరమును అధ్యయనము చేయువారు ఒక వంద మందితో బృహత్ జాబాల ఉపనిషత్తు అధ్యయనము (మఱియు బోధ) చేయువాడు ఒక్కడు సమము అగును,
తద్వా ఏతత్ పరంధామ బృహత్ జాబాల ఉపనిషత్ జపశీలస్య అటువంటి బృహత్ జాబాల ఉపనిషత్ అధ్యాపకునికి అభ్యాసముతో పరంధామము లభించును,
యత్ర న సూర్యః తపతి, యత్ర న వాయుః వాతి, యత్ర న చంద్రం ఆభాతి, యత్ర న నక్షత్రాణి భాంతి, యత్ర న అగ్నిః దహతి, యత్ర న మృత్యుః ప్రవిశతి, యత్ర న దుఃఖాని ప్రవిశంతి ఎక్కడ సూర్యుడు తాపము కలుగచేయడో, ఎక్కడ వాయువు వీచడో, ఎక్కడ చంద్రుడు ప్రకాశించడో, ఎక్కడ నక్షత్రములు ప్రజ్వలించవో, ఎక్కడ అగ్ని దహించదో, ఎక్కడ మృత్యువు ప్రవేశించదో, ఎక్కడ దుఃఖాలు ప్రవేశించవో,
సదానందం పరమానందం శాంతం శాశ్వతం సదాశివం బ్రహ్మాది వందితం, యోగి ధ్యేయం పరంపదం యత్ర గత్వా న నివర్తంతే యోగినః (అటువంటి) సదానందము, పరమానందము, శాంతము, శాశ్వతము, సదాశివము, బ్రహ్మాదులచే నమస్కరించబడు, యోగికి ధ్యానలక్ష్యమైనది అయిన ఏ పరమపదము పొందిన తరువాత యోగులు ఇక తిరిగి పునరావృత్తి కలుగరో అట్టి స్థితిని (ఈ ఉపనిషత్తు అధ్యయనం చేయువాడు) పొందును.
తత్ ఏతత్ ఋచాభ్యుక్తం ఇదే ఋక్కులచే చెప్పబడెను,
తద్విష్ణోః పరమపదగ్ం సదా పశ్యంతి సూరయః దివి ఇవ చక్షుః ఆతతం ఆ విష్ణువుయొక్క పరమపదస్థానము విద్వాంసులు ఆకాశము వలె అంతటా కన్నులు విస్తరించుకొని ఎల్లప్పుడూ చూచుచుందురు,
తత్ విప్రాసో విపన్యవో జాగృవాంసః సమింధతే, విష్ణోః యత్ పరమం పదం అది విప్రులచే నిష్కపటులచే అప్రమత్తులచే ప్రదీపింపబడునది, విష్ణువుయొక్క ఆ పరమపదము,
ఓగ్ం సత్యం, ఇతి ఉపనిషత్. ఓగ్ం సత్యం. ఇట్లు ఈ (బృహత్ జాబాల) ఉపనిషత్ చెప్పబడినది.

బృహత్ జాబాల ఉపనిషత్ - సారాంశ పుష్పమ్

బృహత్ జాబాల ఉపనిషత్ సమాప్తము



Bruhath Jȃbȃla Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com