[[@YHRK]] [[@Spiritual]]

Nrusimha Poorva Tȃpini Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


నృసింహ పూర్వ తాపినీ ఉపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

విషయ సూచిక :

ఒకటవ ఖండము -

నృసింహ సామ మంత్రము యొక్క నాలుగు పాదములు

1.1 జగత్‌కు కారణ కార్యములు ఆత్మయే
ఓం. ఆపోవా ఇదం అసత్ సలిలం ఏవ ఓం (సత్ చిత్ ఆనంద స్వరూపమైన) పరమాత్మయే ఏకమై అఖండమై ఉండెను, ఈ అసత్ రూపమైన జగత్తు పరమాత్మ యందు నిశ్చలమైన నీరే అయి ఉండెను.

[అనగా, స్వతః సిద్ధత లేని జగత్తు నీరు వలె అఖండముగా, నామ రూప భేదరహితముగా, అవ్యక్తముగా స్వతః సిద్ధుడైన పరమాత్మయందే పరమాత్మయై ఉండెను.]
స ప్రజాపతిః ఏకః పుష్కరపర్ణే సమభవత్ ఆ నీటిలో ప్రజాపతి ఒక్కడు తామరాకుయందు ప్రకటితమై ఉండెను.

[అనగా, ఏ విధముగా ఐతే నీటి పైన ఉన్న తామరాకు యొక్క కాండము నీటి లోతులలో ఉండునో, అట్లే మొట్టమొదటి ప్రజాపతి యొక్క మూలము పరమాత్మ యందే ఉన్నది. అనగా, పరమాత్మయే ప్రజాపతిగా అయి ఉండెను.]
తస్య అంతర్మనసి కామః సమవర్తత, ఇదగ్ం సృజేయం ఇతి ఆ ప్రజాపతి యొక్క అంతరహృదయమునందు కామము ఉదయించెను, ఈ విధముగా (తనను తాను ప్రజా రూపముగా) సృజింపచేసుకొనెదను అని.

[అనగా, పరమాత్మయే ప్రజాపతి సంకల్పమై ప్రజలుగా తానే అయ్యెను. కామము కూడా పరమాత్మయే! భేదరహితత్వము నందు కల్పిత భేదత్వమే కామము.]
తస్మాత్ యత్ పురుషో మనసా అభిగచ్ఛతి, తత్ వాచా వదతి, తత్ కర్మణా కరోతి కావున, ప్రజాపతిలో (హిరణ్యగర్భునిలో) కల్పిత విభాగమైన జీవుడు కూడా అప్రతిఘటమైన కామముచే ఏ విధంగా మనస్సులో ప్రేరేపితుడగునో, అదే వాక్కుతో చెప్పును, అదే కర్మతో చెయ్యును.

[అనగా, ప్రతి జీవుని యొక్క వాక్కుకు మఱియు కర్మకు పరమాత్మ ఆధార కామరూపేణ ప్రజాపతియే ప్రేరణ.]
తత్ ఏష అభి-అనూక్తా ఇది ఈ విధంగా (ఋగ్వేద శృతులలో) చెప్పబడినది.
కామః తత్ అగ్రే సమవర్తత ఆధి, మనసో రేతః ప్రథమం యద్ ఆసీత్ దానికి (జగత్‌కు) ముందు కామము మొట్టమొదటగా (ప్రజాపతి యందు) ఏర్పడును, అదే (జీవుని) మనస్సునందు సంకల్పరూపముగా ప్రథమముగా చిగురించును.
సతో బంధుం అసతి నిరవిందన్ హృది ప్రతీష్యా కవయో మనీషా ఇతి మనస్సులో ఉదయించే కామమునకు ఆధారము ఏదని తమ హృదయములో పరిశోధించి, అసత్(జగత్)కు సత్తునకు గల సంబంధమును దర్శించినవారు విజ్ఞానులు అని,
ఉప ఏనం తత్ ఉపనమతి, యత్ కామో భవతి, య ఏవం వేద. ఎవరైతే పరిశీలనగా కామమును అనుసరించి దాని మూలమునకు దగ్గరగా వెళ్లెదరో, ఆ కామమే తాము అగుదురు, వారే ఈ విధముగా దానిని (తత్) తెలుసుకున్నవారు.

[అనగా, భేద దృష్టికి కారణమైన కామమునకు మూలము అభేద తత్వమైన పరమాత్మయే తామని తెలుసుకొని స్తిమితం చెందుదురు.]
1.2 నారసింహ అనుష్టుప్ మంత్ర సామము
స తపో అతప్యత, స తపః తప్త్వా అతడు (హిరణ్యగర్భుడు) తపస్సు తపించెను, అతడు తపస్సు చేసినవాడై
స ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం పశ్యత్ అనుష్టుభ ఛందస్సులో ఉన్న నారసింహ మంత్రరాజమును దర్శించెను
తేన వై సర్వం ఇదం అసృజత్ దాని చేతనే ఈ సర్వమును సృజించెను
తస్మాత్ సర్వం అనుష్టుభం ఇతి ఆచక్షతే కావున, సర్వము అనుష్టుభం అని సూచింపబడెను
యత్ ఇదం కిం చ అనుష్టుభా ఏవ ఇమాని భూతాని జాయంతే ఏ కొంచెమైననూ అనుష్టుభమే, అందు నుండే ఇక్కడి భూతములు (ప్రాణులు) జనించును
అనుష్టుభా జాతాని జీవంతి, అనుష్టుభం ప్రయంతి అభిసంవిశంతి అనుష్టుభముచేతనే జనించినవి జీవించుచున్నవి, అనుష్టుభములో ప్రవేశించి ప్రలయం చెందుచున్నవి
తస్య ఏషా భవతి దానికి సంకల్పము (ఋక్కులలో) ఉన్నది
అనుష్టుప్ ప్రథమా భవతి, అనుష్టుప్ ఉత్తమా భవతి అనుష్టుపే ప్రథమమైనది, అనుష్టుపే ఉత్తమమైనది
వాగ్వా అనుష్టుప్, వాచ ఏవ ప్రయంతి వాచ ఉద్యంతి వాక్కే అనుష్టుప్, అనుష్టుప్ వాక్కులోనే లయమగును, వాక్కులోనే ఉదయించును
పరమ ఆవా ఏషా ఛందసాం యత్ అనుష్టుప్ ఇతి ఛందస్సులలో పరమ ఉత్కృష్టమైనది ఈ అనుష్టుప్
1.3 నారసింహ సామమునకు నాలుగు పాదములు
[సామము అనగా సమత్వము, ఏకత్వము]
స సాగరాం స పర్వతాం సప్త ద్వీపాం వసుంధరాం తత్ సామ్నః ప్రథమం పాదం జానీయాత్ 1) సాగరములతో, పర్వతములతో, సప్త ద్వీపములతో కూడిన భూమిని ఆ సామము యొక్క ప్రథమ పాదముగా తెలుసుకొనవలెను
యక్ష గంధర్వ అప్సరోగణ సేవితం అంతరిక్షం తత్ సామ్నో ద్వితీయం పాదం జానీయాత్ 2) యక్ష గంధర్వ అప్సర గణములచే సేవితమైన అంతరిక్షము ఆ సామము యొక్క ద్వితీయ పాదముగా తెలుసుకొనవలెను
వసు రుద్ర ఆదిత్యైః సర్వైః దేవైః సేవితం దివం తత్ సామ్నః తృతీయం పాదం జానీయాత్ 3) వసువులు, రుద్రులు, ఆదిత్యులు, సర్వ దేవతలచేత సేవితమైన దైవలోకము (ద్యులోకము) ఆ సామము యొక్క తృతీయ పాదముగా తెలుసుకొనవలెను
బ్రహ్మ స్వరూపం నిరంజనం పరమం వ్యోమకం తత్ సామ్నః చతుర్థం పాదం జానీయాత్ 4) బ్రహ్మ స్వరూపము, నిరంజనము అయిన పరమాకాశము ఆ సామము యొక్క నాలుగవ పాదముగా తెలుసుకొనవలెను

[అనగా విశ్వము, విశ్వ ధర్మములు అన్నీ నారసింహ సామమే!]
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఎవరు ఈ విధముగా తెలుసుకొనెదరో వారు అమృతత్వము పొందెదరు
ఋక్ యజుః సామ అథర్వాణః చత్వారో వేదాః స అంగాః స శాఖాః చత్వారః పాదా భవంతి దానికి అంగములతో శాఖలతో కూడిన ఋక్, యజుర్, సామ, అథర్వణమను నాలుగు వేదములు నాలుగు పాదములుగా అయి ఉన్నవి

[వేదములు, అనగా తెలియబడునదంతా, నారసింహమయమే!]
1.4 నారసింహ సామమునకు మూడు అంగములు
కిం ధ్యానం? కిం దైవతం? కాని అంగాని? కిం ఛందః? క ఋషిః? ఇతి [ఆ నారసింహ మంత్రరాజ సామమునకు] ఏది ధ్యానము? ఏది దేవత? ఏవి అంగములు? ఏది ఛందస్సు? ఎవరు ఋషి? అనగా
స హ ఉవాచ ప్రజాపతిః - ఆ ప్రజాపతి ఇట్లు చెప్పెను -
స యో హ వై సావిత్రస్య అష్టాక్షరం పదం శ్రియ అభిషిక్తం తత్ సామ్నో అంగం వేద శ్రియ హ ఏవ అభిషిచ్యతే 1) ఎవరైతే సావిత్రి యొక్క అష్టాక్షరములు శ్రీ(శుభము)తో కూడిన అభిషిక్తమైన పదమును ఆ సామమునకు అంగముగా తెలుసుకొనెదరో శ్రియము(లక్ష్మి)చేత అభిషేకించబడును
సర్వ వేదాః ప్రణవ ఆదిక అస్తం ప్రణవం తత్ సామ్నో అంగం వేద స త్రీన్ లోకాన్ జయతి 2) అన్ని వేదములు ప్రణవము ఆదిగా కలిగినవే! ఆ ప్రణవము సామమునకు అంగముగా ఎవరు తెలుసుకొనెదెరో వారు మూడు లోకములు జయించుదురు
చతుర్వింశతి అక్షరే మహాలక్ష్మీః యజుః తత్ సామ్నో అంగం వేద స ఆయుః యశః కీర్తి జ్ఞాన ఐశ్వర్యవాన్ భవతి 3) ఇరువది నాలుగు అక్షరాలయందు మహలక్ష్మి రూపమైన యజుస్సు ఆ సామము యొక్క అంగము అని ఎవరు తెలుసుకొనునో వారు ఆయువు, యశస్సు, కీర్తి, జ్ఞాన ఐశ్వర్యవంతులు అగుదురు
తస్మాత్ ఇదం స అంగం సామ జానీయాత్ యో జానీతే సో అమృతత్త్వం చ గచ్ఛతి కావున, అంగములతో కూడిన ఈ సామమును తెలుసుకొనవలెను. ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు.
1.5 ఉపదేశమునకు అర్హత
సావిత్రీం, ప్రణవం, యజుః లక్ష్మీం స్త్రీ శూద్రాయ న ఇచ్ఛంతి సావిత్రిని, ప్రణవమును, యజుస్సు అను లక్ష్మిని స్త్రీలు, శూద్రులు కొరకు కోరుకొనరాదు

[మంత్రము 1.13 యందు స్త్రీ పురుషులు ఎవరైనా సామ జ్ఞానమునకు అర్హులే అని ప్రత్యేకముగా చెప్పబడెను. కావున, ఇక్కడ స్త్రీలు అనగా చపలత్వం కలవారు అని, శూద్రులు అనగా ఆచార విహీనులు అని మాత్రమే లింగార్థం తీసుకోవలెను.]

ద్వాత్రింశత్ అక్షరం సామ జానీయాత్ యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ముప్పది రెండు అక్షరముల సామమును తెలుసుకొనవలెను, దానిని ఎవరు తెలుసుకొనెదెరో వారు అమృతత్వం పొందెదరు
సావిత్రీం, లక్ష్మీం యజుః, ప్రణవం యది జానీయాత్ స్త్రీ శూద్రః తు మృతో అధో గచ్ఛతి సావిత్రిని, యజుర్ లక్ష్మిని, ప్రణవమును ఎవరైనా స్త్రీ లేదా శూద్రుడు తెలిసుకున్నచో మృతులై అధోగతి పాలగుదురు
తస్మాత్ సర్వదా న ఆచష్టే యది ఆచష్టే స ఆచార్యః తేన ఏవ స మృతో అధో గచ్ఛతి కావున, ఎప్పుడూ వారికి చెప్పరాదు. చెప్పినచో, వారితో పాటు చెప్పిన ఆచార్యుడు మృతుడై అధోగతి పాలగును
1.6 నారసింహ సామము యొక్క నాలుగు పాదముల విశిష్ఠత
స హ ఉవాచ ప్రజాపతిః - ఆ ప్రజాపతి చెప్పెను -
అగ్నిః వై దేవా ఇదం సర్వం విశ్వా భూతాని ప్రాణా వా ఇంద్రియాణి పశవో అన్నం అమృతం సమ్రాట్ స్వరాట్ విరాట్ తత్ సామ్నః ప్రథమం పాదం జానీయాత్ 1) అగ్నియును, దేవతలు, ఈ విశ్వములోని సర్వ భూతములు, ప్రాణములు, ఇంద్రియములు, పశువులు, అన్నం, అమృతం, సమ్రాట్, స్వరాట్, విరాట్ - ఇవన్నీ ఆ సామము యొక్క ప్రథమ పాదముగా తెలుసుకొనవలెను
ఋక్ యజుః సామ అథర్వ రూపః సూర్యో అంతర ఆదిత్యే హిరణ్మయః పురుషః తత్ సామ్నో ద్వితీయం పాదం జానీయాత్ 2) ఋక్, యజు, సామ, అథర్వ వేదముల రూపుడు, సూర్యుడు, ఆదిత్యుని అంతరమైన హిరణ్మయుడైన పురుషుడు - ఆ సామము యొక్క ద్వితీయ పాదముగా తెలుసుకొనవలెను
య ఓషధీనాం ప్రభుః భవతి తారాధిపతిః సోమః తత్ సామ్నః తృతీయం పాదం జానీయాత్ 3) ఎవడు ఓషధులకు ప్రభువు, తారలకు అధిపతి అయిన సోముడో (చంద్రుడు), అతడు సామమునకు తృతీయ పాదముగా తెలుసుకొనవలెను
స బ్రహ్మా స శివః స హరిః స ఇంద్రః సో అక్షరః పరమః స్వరాట్ తత్ సామ్నః చతుర్థం పాదం జానీయాత్ 4) అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే హరి, అతడే ఇంద్రుడు, అతడే అక్షరుడు, పరమైనవాడు, స్వరాట్టు ఆ సామము యొక్క నాలుగవ పాదముగా తెలుసుకొనవలెను
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఎవరు ఈ విధముగా తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు
1.7 నారసింహ మంత్రములో నాలుగు పాదములలో ఉన్న మొదటి పదము
ఉగ్రం ప్రథమస్య ఆద్యం ఉగ్రం మొదటి పాదము యొక్క మొదలు
జ్వలం ద్వితీయస్య ఆద్యం జ్వలం రెండవ పాదము యొక్క మొదలు
నృసింహం తృతీయస్య ఆద్యం నృసింహం మూడవ పాదము యొక్క మొదలు
మృత్యుం చతుర్థస్య ఆద్యం మృత్యుం నాలుగవ పాదము యొక్క మొదలు
సామ జానీయాత్ యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఈ విధముగా సామమును ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు
తస్మాత్ ఇదం సామ యత్రకుత్రచిత్ ఆచష్టే, యది దాతుం ఉపేక్షతే పుత్రాయ శుశ్రూషవే దాస్యతి అన్యస్మై శిష్యాయ వా చ ఇతి కావున, ఈ సామమును ఎవరికి పడితే వారికి చెప్పకూడదు. ఎవరికైనా ఇవ్వదలచినచో (చెప్పదలచినచో) వినుటకు కుతూహలం కలిగిన శుశ్రూష చేయుచున్న పుత్రునికైనా, శ్రద్ధ కలిగిన శిష్యునికైనా ఇయ్యవచ్చును.
1.8 నారసింహ మంత్రములో నాలుగు పాదములలో ఉన్న రెండవ పదము
స హ ఉవాచ ప్రజాపతిః ఈ విధముగా ఆ ప్రజాపతి చెప్పెను
క్షీరద అర్ణవ శాయినం నృకేసరి విగ్రహం, యోగి ధ్యేయం పరం పదం సామ జానీయాత్ పాల (జ్ఞాన) సముద్రములో శయనించిన నారసింహ విగ్రహుడును, యోగికి ధ్యేయము, పరమ పదము అయిన ఆ సామమును తెలుసుకొనవలెను
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వము పొందెదరు
వీరం ప్రథమస్య ఆద్య అర్ధ అంత్యం మొదటి పాదము ప్రథమార్ధంలో (“ఉగ్రం” తరువాత) “వీరం” చేరును
తం స ద్వితీయస్య ఆద్య అర్ధ అంత్యం రెండవ పాదము ప్రథమార్ధంలో (“జ్వలం”తో కూడి) “తం స” చేరును
హంభీ తృతీయస్య ఆద్య అర్ధ అంత్యం మూడవ పాదము ప్రథమార్ధంలో (“నృసింహం” తో కూడి) “హంభీ” చేరును
మృత్యుం చతుర్థస్య ఆద్య అర్ధ అంత్యం నాలుగవ పాదము ప్రథమార్ధంలో (“మృత్యుం” తరువాత మరలా) “మృత్యుం” చేరును
సామ తు జానీయాత్ ఇట్లు సామమును తెలుసుకొనవలెను
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు
1.9 నారసింహ సామ మహిమ
తస్మాత్ ఇదం సామ యేనకేనచిత్ ఆచార్య ముఖేన యో జానీతే కావున, (నారసింహ మంత్ర రూప) సామమును ఏదో విధముగా ఆచార్యుని (సేవించుట) ద్వారా ఎవడు తెలుసుకొనునో
స తేన ఏవ శరీరేణ సంసారాత్ ముచ్యతే మోచయతి ముముక్షుః భవతి అతడు ఈ శరీరముతోనే సంసారము నుండి విడివడును, ఇతర ముముక్షువులను కూడా తరింపచేయును
జపాత్ తేన ఏవ శరీరేణ దేవతా దర్శనం కరోతి (ఈ మంత్రమును) జపించుటచేత ఈ శరీరముతోనే దేవతా దర్శనము చేయును
తస్మాత్ ఇదం ఏవ ముఖద్వారం కలౌ న అన్యేషాం భవతి కావున, కలి యుగమున ఇదే (మోక్షమునకు) ముఖద్వారము, మరియొకటి లేదు!
తస్మాత్ ఇదం స అంగం సామ జానీయాత్ కావున, ఈ సామమును అంగములతో సహా తెలుసుకొనవలెను
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు
1.10 నారసింహ సామ వర్ణన
ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం నరకేసరి విగ్రహం ఋతమును (సందర్భ సత్యము అయినవాడు), సత్యమును (సహజ సత్యము అయినవాడు), పరబ్రహ్మ పురుషుడను, నృసింహ విగ్రహుడను
కృష్ణ పింగలం ఊర్ధ్వరేతం విరూపాక్షం శంకరం నీలలోహితం కృష్ణపింగల (అతినీలము / నల్లటి) రూపుడను, ఊర్ధ్వరేతస్కుడు, విరూపాక్షుడు (వికారముగల / సరిగాలేని కన్నులు కలవాడు), శంకరుడు, నీలలోహితుడు (కంఠమందు నలుపును, కేశములందు ఎఱుపును కలవాడు)
ఉమాపతిః పశుపతిః పినాకీ హి అమితద్యుతిః ఉమాపతి, పశుపతి, పినాకీ, అమితమైన కాంతి కలవాడు
ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వ భూతానాం సర్వ విద్యలకు ఈశానుడు (the Master), సర్వ భూతములకు ఈశ్వరుడు (the Ultimate Essence)
బ్రహ్మాధిపతిః బ్రహ్మణోధిపతిః (యో వై) యజుర్వేద వాచ్యః బ్రహ్మాధిపతి, బ్రహ్మలకు అధిపతి, యజుర్వేద వాక్కు అయినవాడు
తం సామ జానీయాత్ యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి అటువంటి సామ స్వరూపుడను తెలుసుకొనవలెను, ఎవరు వానిని తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు
1.11 నారసింహ మంత్రములో నాలుగు పాదములలో ఉన్న మూడవ పదము
మహా ప్రథమం అంతర్ధానస్య ఆద్యం మొదటి పాదములో అంతిమార్ధంలో (“ఉగ్రం వీరం” తరువాత) “మహా” చేరును
సర్వతో ద్వితీయ అంత అర్ధస్య ఆద్యం రెండవ పాదములో అంతిమార్ధంలో (“జ్వలంతం” తరువాత) “సర్వతో” చేరును
షణం తృతీయ అంత అర్ధస్య ఆద్యం మూడవ పాదములో అంతిమార్ధంలో (“నృసింహం భీ”తో కూడి) “షణం” చేరును
నమా చతుర్థ అంత అర్ధస్య ఆద్యం నాలుగవ పాదములో అంతిమార్ధంలో (“మృత్యుం మృత్యుం” తరువాత) “నమా” చేరును
తం సామ జానీయాత్ యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి అని సామమును తెలుసుకొనవలెను, ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు
1.12 నారసింహ సామము సత్-చిత్-ఆనందమయ పరబ్రహ్మము
తస్మాత్ ఇదం సామ సత్ చిత్ ఆనందమయం పరం బ్రహ్మ అందుచేత ఈ సామము సత్-చిత్-ఆనందమయ పరబ్రహ్మము!
తం ఏవం విద్వాన్ అమృత ఇహ భవతి ఆ సామమును తెలుసుకున్న విద్వాంసుడు ఇక్కడే అమృతుడు అగును
తస్మాత్ ఇదం స అంగం సామ జానీయాత్ కావున, అంగములతో సహా సామమును తెలుసుకొనవలెను
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు
విశ్వసృజ ఏతేన వై విశ్వం ఇదం అసృజంత విశ్వసృజ కర్త (హిరణ్యగర్భుడు) దీని (ఈ సామజ్ఞానము) చేతనే ఈ విశ్వమును సృజించెను (have manifested Himself)
యత్ విశ్వం అసృజంత తస్మాత్ విశ్వసృజో విశ్వం ఏనాన్ అనుప్రజాయతే విశ్వము సృజించబడిన క్రమములో ఆ సామముచేతనే విశ్వకర్తలు అనుసరించి విశ్వములు సృజించబడి,
బ్రహ్మణః సలోకతాం సార్ష్టితాం సాయుజ్యం యాంతి బ్రహ్మ యొక్క సాలోక్యమును, సమాన ఐశ్వర్యమును, సాయుజ్యమును పొందెదరు
తస్మాత్ ఇదం స అంగం సామ జానీయాత్ కావున, అంగములతో సహా ఈ సామమును తెలుసుకొనవలెను
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు
1.13 నారసింహ మంత్రములో నాలుగు పాదములలో ఉన్న నాలుగవ పదము
విష్ణుం ప్రథమ అంత్యం మొదటి పాదములో (“ఉగ్రం వీరం మహా” తరువాత) చివరలో “విష్ణుం” చేరును
ముఖం ద్వితీయ అంత్యం రెండవ పాదములో (“జ్వలంతం సర్వతో” తరువాత) చివరలో “ముఖం” చేరును
భద్రం తృతీయ అంత్యం మూడవ పాదములో (“నృసింహం భీషణం” తరువాత) చివరలో “భద్రం” చేరును
మ్యహం చతుర్థ అంత్యం నాలుగవ పాదములో (“మృత్యుమృత్యుం నమా” తో కూడి) చివరలో “మ్యహం” చేరును
యో అసౌ వేద యత్ ఇదం కిం చ ఆత్మని బ్రహ్మణ్య ఏవ అనుష్టుభం జానీయాత్ ఆ క్రమములో దీనిని తెలుసుకొని ఏ కించిత్ ఐనా కూడా అనుష్టుభ బ్రహ్మమే అని తన ఆత్మయందు తెలుసుకొనవలెను
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు
స్త్రీ పుంస యోః వా య ఇహ ఏవ స్థాతుం అపేక్షతే తస్మై సర్వ ఐశ్వర్యం దదాతి స్త్రీ పురుషులు ఎవరు ఇక్కడే (ఈ జ్ఞాన స్థితిలో) ఉండగోరుదురో వారికి సర్వ ఐశ్వర్యములు కలుగును
[మంత్రము 1.5 యందు స్త్రీలకు చెప్పరాదు అనునది చపలచిత్తులను ఉద్దేశించి మాత్రమే!]
1.14 అనుష్టుప్ ఛందస్సు అనుసరించి నారసింహ మహామంత్రము
పాదము - 1 (ఎనిమిది అక్షరములు) ఉగ్రం వీరం మహావిష్ణుం
పాదము - 2 (ఎనిమిది అక్షరములు) జ్వలంతం సర్వతోముఖం
పాదము - 3 (ఎనిమిది అక్షరములు ) నృసింహం భీషణం భద్రం
పాదము - 4 (ఎనిమిది అక్షరములు ) మృత్యుమృత్యుం నమామ్యహం
1.15 ఫలశృతి
యత్ర కుత్ర అపి మ్రియతే దేహాంతే దేవః పరమం బ్రహ్మ తారకం వ్యాచష్టే సాముము తెలుసుకున్నవాడు ఎక్కడ ఏ విధముగా దేహము త్యజించిననూ దైవము వానికి పరబ్రహ్మ తారకము ఉపదేశించును
యేన అసావ్ (అసౌ) అమృతీ భూత్వా సో అమృతత్వం చ గచ్ఛతి ఆ సోమరసముచే అమృతుడై అట్టివాడు అమృతత్వం (పునరావృత్తి రాహిత్యము) పొందును (చిత్తము పరిపూర్ణముగా బ్రహ్మములో లీనమగును)
తస్మాత్ ఇదగం సామ మధ్యగం జపతి కావున, ఈ సామ మధ్యమును (సారమును) జపించవలెను
తస్మాత్ ఇదం సామ అంగం ప్రజాపతిః కావున, ఈ సామ అంగమే ప్రజాపతి!
తస్మాత్ ఇదం సామ మధ్యగం జపతి ప్రజాపతిః కావున, ఈ సామ మధ్యమును (సారమును) జపించినచో ప్రజాపతియే అగును
య ఏవం వేద ఇతి మహోపనిషత్ ఎవరు ఈ విధంగా తెలుసుకొనునో, అని చెప్పుచున్నది ఈ మహోపనిషత్
య ఏతాం మహోపనిషదం వేద సకృత పురశ్చరణో మహావిష్ణుః భవతి మహావిష్ణుః భవతి ఎవరు ఈ మహోపనిషత్తును తెలుసుకొని సక్రమముగా పురశ్చరణ (preparation) చేయునో, వారు మహావిష్ణువు అగును, మహావిష్ణువు అగును!

రెండవ ఖండము -

నృసింహ సామ మంత్రమునకు వివరణ

2.1 నారసింహ మంత్రరాజము తరింపచేయును
దేవా హ వై మృత్యోః పాప్మభ్యః సంసారాత్ చ బిభీయః దేవతలు మృత్యువు వలన, పాపముల వలన మఱియు సంసారము వలన భయము పొందిరి
తే ప్రజాపతిం ఉపాధావన్ తేభ్య ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం ప్రాయచ్ఛత్ తేన వై వారు ప్రజాపతి వద్దకు వెళ్లి, అభ్యర్థించగా వారికి అనుష్టుభ నారసింహ మంత్రరాజమును తరింపచేయుటకు చెప్పగా
తే మృత్యుం అజయన్ పాప్మానం చ ఆతరం సంసారం చ ఆతరం వారు మృత్యువును జయించిరి, పాపము నుండి తరించిరి మరియు సంసారమును దాటిరి
తస్మాత్ యో మృత్యోః పాప్మభ్యః సంసారాత్ చ బిభీయాత్ కావున, ఎవరు మృత్యువు వలన, పాపముల వలన మరియు సంసారము వలన భయము చెందునో
స ఏతం మంత్రరాజం (నారసింహ) అనుష్టుభం ప్రతిగృహ్ణీయాత్ వారు ఈ అనుష్టుభ నారసింహ మంత్రరాజమును ప్రతిగ్రహించినచో
స మృత్యుం తరతి స పాప్మానం తరతి స సంసారం తరతి వారు మృత్యువును దాటెదరు, వారు పాపములను నశింపచేసుకొనెదరు, వారు సంసారమును తరించెదరు
2.2 ప్రణవము యొక్క నాలుగు మాత్రలు
తస్య హ వై ప్రణవస్య - ఇప్పుడు ప్రణవము గురించి వివరణ -
యా పూర్వా మాత్రా పృథివీ అకారః స ఋగ్భిః ఋగ్వేదో బ్రహ్మా వసవో గాయత్రీ గార్హపత్యః సా సామ్నః ప్రథమః పాదో భవతి 1) ఆ ప్రణవమునకు మొదటి మాత్ర పృథివీ రూపమైన అకారము, అది ఋక్కులతో కూడుకున్న ఋగ్వేదము, బ్రహ్మ, (అష్ట) వసువులు, గాయత్రీ ఛందస్సు, గార్హపత్యాగ్ని ఆ సామము యొక్క ప్రథమ పాదము అగును
ద్వితీయ అంతరిక్షం స ఉకారః స యజుర్భిః యజుర్వేదో విష్ణు రుద్రాః త్రిష్టుప్ దక్షిణాగ్నిః సా సామ్నో ద్వితీయః పాదో భవతి 2) ఆ ప్రణవమునకు రెండవ మాత్ర అంతరిక్ష రూపమైన ఉకారము, అది యజుస్సులతో కూడుకున్న యజుర్వేదము, విష్ణువు, రుద్రులు, త్రిష్టుప్ ఛందస్సు, దక్షిణాగ్ని ఆ సామము యొక్క రెండవ పాదము అగును
తృతీయా ద్యౌః స మకారః స సామాభిః సామవేదో రుద్రాః ఆదిత్యాః జగతీ ఆహవనీయః సా సామ్నః తృతీయః పాదో భవతి 3) ఆ ప్రణవమునకు మూడవ మాత్ర ద్యులోక రూపమైన మకారము, అది సామములతో కూడుకున్న సామవేదము, రుద్రులు, ఆదిత్యులు, జగతీ ఛందస్సు, ఆహవనీయాగ్ని ఆ సామము యొక్క మూడవ పాదము
యా అవసానే అస్య చతుర్థి అర్ధమాత్ర సా సోమలోక ఓంకారః స అథర్వణైః మంత్రైః అథర్వ వేదః సంవర్తకో అగ్నిః మరుతో విరాడ ఏకర్షిః భాస్వతీ స్మృతా తత్ సామ్నః చతుర్థః పాదో భవతి 4) ఆ ప్రణవమునకు చివరలో ఉన్న నాలుగవది అర్ధమాత్ర, అది సోమలోక రూపమైన ఓంకారము, అది అథర్వణ మంత్రములతో కూడుకున్న అథర్వ వేదము, సంవర్తక అగ్ని, మరుత్తులు, విరాడ (విరాజ / త్రిష్టుప్) ఛందస్సు, ఏకర్షి (the Chief Sage), భాస్వతి స్మృతులు ఆ సామము యొక్క నాలుగవ పాదము అగును
2.3 నారసింహ మంత్రమునకు ఓంకారముతో కలిపి ఐదు అంగములు
అష్టాక్షరః ప్రథమః పాదో భవతి అష్టాక్షరాః త్రయః పాదా భవంతి మొదటి పాదము ఎనిమిది అక్షరములు కలది, మిగిలిన మూడు పాదములు కూడా ఎనిమిది అక్షరములు కలవు
ఇతి ఏవం ద్వా త్రింశత్ అక్షరాణి సంపద్యంతే ద్వాత్రింశత్ అక్షరా వా అనుష్టుప్ భవతి ఇవి అన్నీ ముప్పది రెండు అక్షరములు అగును, అవి అనుష్టుప్ ఛందస్సులో ముప్పది రెండు అక్షరముల ప్రకారము ఉండును
అనుష్టుభా సర్వం ఇదం సృష్టం తస్య హ ఏతస్య పంచ అంగాని భవంతి అనుష్టుప్ చేతనే ఈ సర్వము సృష్టింపబడినది, దానికి ఐదు అంగములు కలవు
చత్వారః పాదాః చత్వారి అంగాని భవంతి నాలుగు పాదములు నాలుగు అంగములుగా కలవు
సప్రణవం సర్వం పంచమం భవతి ప్రణవముతో కూడి సర్వం ఐదు అంగములు అగును
2.4 అంగ న్యాసము
హృదయాయ నమః, శిరసే స్వాహా, శిఖాయై వౌషట్, కవచాయు హుం, అస్త్రాయ ఫట్ ఇతి హృదయాయ నమః, శిరసే స్వాహా, శిఖాయై వౌషట్, కవచాయు హుం, అస్త్రాయ ఫట్ అని
ప్రథమం ప్రథమేన యుజ్యతే, ద్వితీయం ద్వితీయేన, తృతీయం తృతీయేన, చతుర్థం చతుర్థేన, పంచమం పంచమేన వ్యతిషజతి మొదటి పాదము మొదటి అంగముతో కలుపవలెను, రెండవది రెండవ అంగముతో, మూడవది మూడవ అంగముతో, నాలుగవది నాలుగవ అంగముతో మఱియు ఐదవది ఐదవ అంగముతో జత కలపవలెను
వ్యతిషిక్తావా ఇమే లోకాన్ తస్మాత్ వ్యతిషిక్తాని అంగాని భవంతి ఈ లోకములన్నీ ఆ విధముగా అంగములతో కలగలసియుండును
ఓం ఇతి ఏతత్ అక్షరం ఇదగ్ం సర్వం ఓం అను ఈ అక్షరమే ఈ జగత్ సర్వమూ!
తస్మాత్ ప్రత్యక్షరం ఉభయత ఓంకారో భవతి కావున, ప్రతీ అక్షరమునకు రెండు ప్రక్కలా ఓంకారమే ఉండును
2.5 అక్షర న్యాసము
అక్షరాణాం న్యాసం ఉపదిశంతి బ్రహ్మవాదినః (మంత్రములో) అక్షరముల యొక్క న్యాసమును బ్రహ్మవాదులు ఉపదేశించుచున్నారు
తస్య వాహ ఉగ్రం ప్రథమం స్థానం జానీయాత్ దాని యొక్క క్రమములో “ఉగ్రం” మొదటి స్థానముగా తెలియవలెను
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఆ విధముగా తెలుసుకున్నవాడు అమృతత్వము పొందును
వీరం ద్వితీయ స్థానం, మహావిష్ణుం తృతీయ స్థానం, జ్వలంతం చతుర్థం స్థానం “వీరం” రెండవ స్థానము, “మహావిష్ణుం” మూడవ స్థానము, “జ్వలంతం” నాలుగవ స్థానము
సర్వతో ముఖం పంచమం స్థానం, నృసింహం షష్ఠం స్థానం “సర్వతో ముఖం” ఐదవ స్థానము, “నృసింహం” ఆరవ స్థానము
భీషణం సప్తమం స్థానం, భద్రం అష్టమం స్థానం “భీషణం” ఏడవ స్థానం, “భద్రం” ఎనిమిదవ స్థానం
మృత్యుమృత్యుం నవమం స్థానం, నమామి దశమం స్థానం “మృత్యుమృత్యుం” తొమ్మిదవ స్థానం, “నమామి” పదొవ స్థానం
అహం ఏకాదశ స్థానం జానీయాత్ “అహం” పదకొండవ స్థానముగా తెలుసుకొనవలెను
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఆ విధముగా తెలుసుకున్నవాడు అమృతత్వము పొందును
ఏకాదశపదా వా అనుష్టుప్ భవతి అనుష్టుభా సర్వం ఇదం సృష్టం అనుష్టుభా పదకొండు పదములు అనుష్టుప్ (ఛందస్సు) అగును, ఈ సర్వము అనుష్టుప్ చేతనే సృష్టింపబడినది
సర్వం ఇదం ఉపసంహృతం తస్మాత్ సర్వం ఆనుష్టుభం జానీయాత్ దానిచే ఈ సర్వము ఉపసంహరింపబడినది. కావున, సర్వమును అనుష్టుభముగా తెలుసుకొనవలెను.
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఆ విధముగా తెలుసుకున్నవాడు అమృతత్వము పొందును
2.6 ఉగ్రం అనగా
దేవా హ వై ప్రజాపతిం అబ్రువత్ అథ కస్మాత్ ఉచ్యతే ఉగ్రం ఇతి దేవతలు ప్రజాపతిని ఇట్లు అడిగెను - దేనిచేత “ఉగ్రం” అని చెప్పబడెను?
స హ ఉవాచ ప్రజాపతిః - ఆ ప్రజాపతి వారితో ఇట్లు చెప్పెను -
యస్మాత్ స్వమహిమ్నా సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వాన్ ఆత్మనః సర్వాణి భూతాని ఉద్గృహ్ణాతి ఎందుచేత అనగా, తన మహిమ చేత సర్వ లోకములను, సర్వ దేవతలను, సర్వ జీవాత్మలను, సర్వ (పంచ మహా) భూతములను పైకి గ్రహించి
అజస్రం సృజతి విసృజతి వాసయతి ఉద్గ్రాహ్యత ఉద్గృహ్యతే స్తు హి శ్రుతం మరల మరలా సృజించుచూ, విసర్జించుచూ, స్థితి కలిగించుచూ (మరలా) పైకి లాగి (తనలోనే) పైకి గ్రహించుచూ ఋక్కులచే స్తుతించబడుచున్నవాడగుట చేత
గర్తసదం యువానం మృగం న భీమం ఉపహంతుం ఉగ్రం (అంతరాంతర హృదయ) రథముపై కూర్చున్న నిత్య యువకుడు, ఉగ్రరూపుడై భీకరమైన మృగము వలె సంహారము చేయువాడు (లయకారుడు)
మృడా జరిత్రే సింహః తవా నో అన్యంతే అస్మత్ నివపంతు సేనాః “నృసింహా! కరుణతో నా జీర్ణత్వమును (మృత్యువును) నీ సేనచే చెల్లాచెదురు చేయుము!”
తస్మాత్ ఉచ్యత ఉగ్రం ఇతి కావున, “ఉగ్రం” అని చెప్పబడుచున్నాడు
2.7 వీరం అనగా
అథ కస్మాత్ ఉచ్యతే వీరం ఇతి అప్పుడు “వీరం” అని దేనిచేత చెప్పబడుచున్నది?
యస్మాత్ స్వమహిమ్నా సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వాన్ ఆత్మనః సర్వాణి భూతాని విరమతి విరామయతి ఎందుచేత అనగా, తన మహిమ చేత సర్వ లోకములను, సర్వ దేవతలను, సర్వ జీవాత్మలను, సర్వ (పంచ మహా) భూతములను విరమించి స్థంభింపచేయును
అజస్రం సృజతి విసృజతి వాసయతి మరల మరలా సృజించుచూ, విసర్జించుచూ, స్థితి కలిగించును
యతో వీరః కర్మణ్యః సుదక్షో యుక్తగ్రావా జాయతే దేవకామః దేనిచే వీరుడు, కర్మ కుశలుడు, మంచి దక్షత కలిగినవాడు, రాయి నుండి (స్థంభము నుండి) ఉద్భవించినవాడు, దేవకాముడు
తస్మాత్ ఉచ్యతే వీరం ఇతి అందు చేత “వీరం” అని చెప్పబడుచున్నాడు
2.8 మహావిష్ణుం అనగా
అథ కస్మాత్ ఉచ్యతే మహావిష్ణుం ఇతి అప్పుడు “మహావిష్ణుం” అని దేనిచేత చెప్పబడుచున్నది?
యస్మాత్ స్వమహిమ్నా సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వాన్ ఆత్మనః సర్వాణి భూతాని వ్యాప్నోతి వ్యాపయతి ఎందుచేత అనగా, తన మహిమ చేత సర్వ లోకములను, సర్వ దేవతలను, సర్వ జీవాత్మలను, సర్వ (పంచ మహా) భూతములను వ్యాపించి వ్యాపింపచేయును
స్నేహో యథా పలలపిండం శాంతమూలం ఓతం ప్రోతం అనువ్యాప్తం వ్యతిషక్తో వ్యాప్యతే వ్యాపయతే మూలమునందు శాంతము కలిగినవాడు, నువ్వుల నూనె ధార వలె ఓతప్రోతమై (సృష్టిలో సర్వము ఒకదానికొకటి ముడిపడి) అఖండమై వ్యాపించి వ్యాపింపచేయువాడు
యస్మాత్ న జాతః పరో అన్యో అస్తియ ఆవివేశ భువనాని విశ్వా ప్రజాపతిః ప్రజయా సంవిదానః త్రీని జ్యోతీగ్ంషి స చ తే సషోడశీం ఎందుచేత అనగా, ఎవరికన్నా ఇతరమైనది పుట్టదో, ఎవరు లోకములన్నీ ప్రవేశించి విశ్వుడై ఉన్నాడో, ప్రజలతో కూడుకునియున్న ప్రజాపతియో, మూడు జ్యోతిస్సులను (సూర్య చంద్ర అగ్నులను) వ్యాపించినాడో, షోడశ కళా రూపుడై ఉన్నాడో
తస్మాత్ ఉచ్యతే మహావిష్ణుం ఇతి అందు చేత అతడు మహావిష్ణుం అని చెప్పబడుచున్నాడు
2.9 జ్వలంతం అనగా
అథ కస్మాత్ ఉచ్యతే జ్వలంతం ఇతి అప్పుడు “జ్వలంతం” అని దేనిచేత చెప్పబడుచున్నది?
యస్మాత్ స్వమహిమ్నా సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వాన్ ఆత్మనః సర్వాణి భూతాని తన మహిమ చేత సర్వ లోకములను, సర్వ దేవతలను, సర్వ జీవాత్మలను, సర్వ (పంచ మహా) భూతములను
స్వతేజసా జ్వలతి జ్వాలాయతి జ్వాల్యతే జ్వాలయతే స్వకీయ తేజస్సు చేత జ్వలించునో, జ్వలింపచేయునో, జ్వలింపబడునో, జ్వలింపబడునట్లు చేయునో
సవితా ప్రసవితా దీప్తో దీపయన్ దీప్యమానః సవిత్తు (సూర్య స్వరూపుడు), ప్రసవిత్తు (పితృదేవతా స్వరూపుడు), ప్రకాశించువాడు, ప్రకాశింపచేయువాడు, ఎల్లప్పుడు ప్రకాశించువాడు
జ్వలన్ జ్వలితా తపన్ వితపన్ సంతపన్ జ్వలించువాడు, జ్వలింపచేయువాడు, తపించువాడు, విశేషముగా తపించువాడు, బాగుగా తపించువాడు
రోచనో రోచమానః శోభనః శోభమానః కల్యాణః సంతోషించువాడు, సంతోషింపచేయువాడు, శోభనుడు, శోభమానుడు, కళ్యాణ స్వరూపుడు
తస్మాత్ ఉచ్యతే జ్వలంతం ఇతి అందు చేత జ్వలంతం అని చెప్పబడుచున్నాడు
2.10 సర్వతో ముఖం అనగా
అథ కస్మాత్ ఉచ్యతే సర్వతో ముఖం ఇతి అప్పుడు “సర్వతో ముఖం” అని దేనిచేత చెప్పబడుచున్నది?
యస్మాత్ స్వమహిమ్నా సర్వాన్ లోకాన్ సర్వాన్ దేవాన్ సర్వాన్ ఆత్మనః సర్వాణి భూతాని తన మహిమ చేత సర్వ లోకములను, సర్వ దేవతలను, సర్వ జీవాత్మలను, సర్వ (పంచ మహా) భూతములను
స్వయం అనింద్రియో అపి సర్వతః పశ్యతి సర్వతః శృణోతి సర్వతో గచ్ఛతి స్వయముగా తనకు ఇంద్రియాలు లేనివాడైనా సర్వత్రా చూచువాడు, సర్వత్రా వినువాడు, సర్వత్రా గమనము చేయువాడు
సర్వత ఆదత్తే సర్వగః సర్వగతః తిష్ఠతి అన్నిటినీ స్వీకరించువాడు, సర్వమును పొందియున్నవాడు, సర్వగతుడు (సర్వవ్యాపకుడు) అయిఉన్నవాడు
ఏకః పురస్తాత్ య ఇదం బభూవ యతో బభూవ భువనస్య గోప్తా ఏక స్వరూపుడు, ఈ సర్వమునకూ ముందే ఉన్నవాడు, భువనమునకు అంతర్లీనముగా రక్షకుడై ఉన్నవాడు
యం ఏతి భువనం సాంపరాయే నమామి తం అహం సర్వతోముఖం ఇతి కష్టము (అవసరము) వచ్చినప్పుడు లోకస్థులు ఎవరిని తమ హృదయములో నమస్కరించుదురో వారికి నేను సర్వతోముఖుడను (అని ప్రకటించువాడు)
తస్మాత్ ఉచ్యతే సర్వతో ముఖం ఇతి అందు చేత “సర్వతో ముఖం” అని చెప్పబడుచున్నాడు
2.11 నృసింహం అనగా
అథ కస్మాత్ ఉచ్యతే నృసింహం ఇతి అప్పుడు “నృసింహం” అని దేనిచేత చెప్పబడుచున్నది?
యస్మాత్ సర్వేషాం భూతానాం నృ (నరః) వీర్యతమః శ్రేష్ఠతమః చ సింహో వీర్యతమః శ్రేష్ఠతమః చ ఎందుచేత అన్ని భూతములలో మనిషి వీర్యోత్తముడో, ఉత్తమ శ్రేష్ఠుడో మఱియు సింహము కూడా వీర్యతమమైనదో, శ్రేష్ఠతమమైనదో
తస్మాత్ నృసింహ ఆసీత్ పరమేశ్వరో దాని (శ్రేష్ఠాతిశ్రేష్ఠత్వము) చేత నృసింహరూపుడై (చెప్పబడి) ఉన్నాడు పరమేశ్వరుడు
జగత్ హితం వా ఏతత్ రూపం యత్ అక్షరం భవతి జగత్తుకు హితకరమైన ఆ నృసింహ రూపమేదో అది అక్షరము (నాశనము / మార్పు లేనిది)
ప్రతతి విష్ణుః స్తవతే వీర్యాయ మృగోన భీమః కుచరో గరిష్ఠః వ్యాపించుటచేత విష్ణువు, వీర్యమునకై స్తుతించబడువాడు, మృగము (సింహము) వలె భీకరముగా చరించు గరిష్ఠుడు
యస్య ఉరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా తన యొక్క విశాలత్వము చేత మూడు (పాదములచే) లోకముల ఆక్రమణయందు విశ్వము చిన్నదయిపోవుటచే (అనగా, విశ్వవ్యాప్తుడై విశ్వమునకంటే వేరై విశ్వాత్మకుడు అగుటచే)
తస్మాత్ ఉచ్యతే నృసింహం ఇతి అందుచేత నృసింహం అని చెప్పబడును
2.12 భీషణం అనగా
అథ కస్మాత్ ఉచ్యతే భీషణం ఇతి అప్పుడు “భీషణం” అని దేనిచేత చెప్పబడుచున్నది?
యస్మాత్ భీషణం యస్య రూపం దృష్ట్వా ఎందుచేత అనగా, ఎవని యొక్క భీషణమైన రూపము చూచి
సర్వే లోకాన్ సర్వే దేవాన్ సర్వాణి భూతాని భీత్యా పలాయంతే సర్వ లోకవాసులు, సర్వ దేవతలు, అన్ని భూతములు భయపడి పలాయనము చెందుదురో
స్వయం యతః కుతః చ న బిభేతి స్వయముగా ఎవరి వలన కూడా భయము చెందడో
భీషా అస్మాత్ వాతః పవతే భీషా ఉదేతి సూర్యః ఎవని భయము చేత (1) వాయువు వీచుచున్నాడో, ఎవని భయము చేత (2) సూర్యుడు ఉదయించుచున్నాడో
భీషా అస్మాత్ అగ్నిః ఇంద్రః చ మృత్యుః ధావతి పంచమ ఇతి ఎవని భయము చేత (3) అగ్ని, (4) ఇంద్రుడు మఱియు ఐదవదగు (5) మృత్యువు (విధి నిర్వహణలో) త్వరపడుదురో
తస్మాత్ ఉచ్యతే భీషణం ఇతి అందుచేత భీషణం అని చెప్పబడును
2.13 భద్రం అనగా
అథ కస్మాత్ ఉచ్యతే భద్రం ఇతి అప్పుడు “భద్రం” అని దేనిచేత చెప్పబడుచున్నది?
యస్మాత్ స్వయం భద్రో భూత్వా సర్వదా భద్రం దదాతి ఎందుచేత అనగా, స్వయముగా భద్రుడై సర్వదా భద్రము ఇచ్చువాడు
రోచనో రోచమానః శోభనః శోభమానః కల్యాణః ప్రకాశుడై, ప్రకాశమానుడై, శోభనుడై, శోభమానుడై, కళ్యాణ స్వరూపుడు అయిఉన్నాడు
భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః దేవతలారా! భద్రమైన విషయములే మేము చెవులతో వినెదము గాక!
భద్రం పశ్యేమ అక్షభిః యజత్రాః యజ్ఞశీలురమై భద్రమైన విషయములే కన్నులతో చూచెదము గాక!
స్థిరైః అంగైః తుష్టువాగ్ం సః తనూభిః స్థిరమైన అంగములతో కూడిన శరరీములతో లోకయజ్ఞ కార్యముల ద్వారా స్తుతించి మిమ్ములను (దేవతలను) సంతృప్తి పరచెదము గాక!
వ్యశేమ దేవహితం యత్ ఆయుః దైవహితము కొఱకు మాత్రమే మా ఆయువును గడిపెదము గాక!
తస్మాత్ ఉచ్యతే భద్రం ఇతి అందుచేతనే భద్రం అని చెప్పబడును

NOTE -
యజ్ఞము అనగా, విశ్వము (the Entire System). ఈ యజ్ఞ కార్యక్రమములలో మనుగడకు అవసరమయ్యే ధర్మములను (Universal Properties and Functions) దేవతలు అని చెప్పబడెను. ఉదా- అగ్ని, వాయువు, భూమి మొదలగువారు.

[ భగవద్గీత (3–11) ] పరస్పర సహకారిణులై దేవతలు జీవుల కొఱకు పనిచేసెదరు, జీవులు / మనుష్యులు దేవతల హితమునకై కర్మలను చేయవలెను. ఇదే యజ్ఞ నియమము!

ప్రకృతి ప్రేరణచే జీవులన్నీ తమ జీవిత కాలము గడుపును. వాటిలో బుద్ధి ప్రత్యేకత కలిగిన మనుష్యులు జ్ఞాన సిద్ధి లక్ష్యముగా యజ్ఞ భావముతో జీవితములు గడుపటయే వేద శాస్త్రములు సూచించును.
2.14 మృత్యుమృత్యుం అనగా
అథ కస్మాత్ ఉచ్యతే మృత్యుమృత్యుం ఇతి అప్పుడు “మృత్యుమృత్యుం” అని దేని చేత చెప్పబడుచున్నది?
యస్మాత్ స్వమహిమ్నా స్వభక్తానాం స్మృత ఏవ మృత్యుం అపమృత్యం చ మారయతి ఎందుచేత అనగా, స్వకీయ మహిమచేత తన భక్తులకు తనను స్మరించినంతమాత్రమునే వారికి మృత్యువును, అపమృత్యువును కూడా తొలగించువాడు
య ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః ఎవడు తన ఆత్మను ఇచ్చువాడు, బలమును ఇచ్చువాడు, ఎవడు విశ్వాత్ముడో, విశ్వములోని వారిచే ఉపాసించబడునో, దేవతలు (Universal Properties and Functions) ఎవని యొక్క సంతతో
యస్య ఛాయా అమృతం ఎవని యొక్క ఛాయ అమృతమో
యో మృత్యుమృత్యుః కస్మై దేవాయ హవిషా విధేమ ఎవడు మృత్యువుకే మృత్యువో (మృత్యువుకు అతీతుడో, సాక్షియో) ఆ దేవుని కొఱకు కాక మరెవరికి యజ్ఞ హవిస్సులు సమర్పించెదము?
తస్మాత్ ఉచ్యతే మృత్యుమృత్యుం ఇతి అందువలనే “మృత్యుమృత్యుం” అని చెప్పబడెను
2.15 నమామి అనగా
అథ కస్మాత్ ఉచ్యతే నమామి ఇతి అప్పుడు “నమామి” అని దేనిచేత చెప్పబడుచున్నది?
యస్మాత్ ఆద్యం సర్వే దేవానాం అంతి ముముక్షవో బ్రహ్మవాదినః చ ఎందుచేత అనగా, సర్వులకు ముందే ఉన్న ఆద్యుడిగా ఎవనిని సర్వ దేవతలు, ముముక్షువులు మఱియు బ్రహ్మవాదులు తలచుదురో
ప్రసూనం బ్రహ్మణస్పతిః మంత్రం వదతి ఉక్థ్యం ఎవనిని ప్రజాపతికి పతియై ఉత్పత్తిస్థానముగా, మంత్ర దేవతగా చెప్పుదురో
యస్మిన్ ఇంద్రో వరుణో మిత్రో అర్యమా దేవా ఓకాంసి చక్రిరే ఎవని యందు ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు (సూర్యుడు), అర్యముడు (ఆదిత్యులలో ఒకడు), దేవతలు నివాసము ఉండి రక్షణ పొందుచున్నారో
తస్మాత్ ఉచ్యతే నమామి ఇతి దానిచేత “నమామి” అని చెప్పబడుచున్నాడు
2.16 అహం అనగా
అథ కస్మాత్ ఉచ్యతే అహం ఇతి అప్పుడు “అహం ” అని దేనిచేత చెప్పబడుచున్నది?
అహం అస్మి ప్రథమజా ఋతస్య ఋతమునకు (అనుభవములో సందర్భ సత్యముగా తోచుచున్నదానికి) ముందే అహం (నేను) జన్మించి ఉన్నాను
పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః దేవతలకు కూడా పూర్వమైన, అమృతమునకు నాభి (మూలము) అయి ఉన్న
యో మా దదాతి స ఇ దేవం ఆవాహః అహం అన్నమన్నమదంతమద్మి (అన్నం అన్నం అదంతం అద్మి) అటువంటి దేవుని ఆహ్వానించి ఎవరైతే అహం అనే అన్నమును అన్నముగా అంతరంగమునందే సమర్పించునో
అహం విశ్వం భువనమభ్యభవాం (భువనం అభి అభవాం) సువర్ణజ్యోతీః య ఏవం వేద (ఆ దేవుడే నేను అయి) నేనే విశ్వమును, భువనమునకు స్థితి లయములు చేయు సువర్ణజ్యోతి (శుద్ధ చిత్) స్వరూపుడను అని ఈ విధముగా తెలుసుకున్నవాడు అగును
ఇతి మహోపనిషత్ ఇది ఈ మహోపనిషత్

మూడవ ఖండము -

నృసింహ మంత్రమునకు శక్తి-బీజములు

3.1 నారసింహ మంత్రమునకు శక్తి బీజములు ఏవి?
దేవా హ వై ప్రజాపతిం అబ్రువన్ - దేవతలు ప్రజాపతిని అడిగిరి -
అనుష్టుభస్య మంత్రరాజస్య నారసింహస్య శక్తిం బీజం నో బ్రూహి భగవన్ ఇతి భగవాన్! నారసింహుని అనుష్టుభ మంత్రరాజము యొక్క శక్తి, బీజము గురించి మాకు వివరించుము
3.2 నారసింహ మంత్రమునకు మాయయే శక్తి
స హ ఉవాచ ప్రజాపతిః - అప్పుడు ఆ ప్రజాపతి చెప్పెను -
మాయా వా ఏషా నారసింహీ సర్వం ఇదం సృజతి నారసింహుని మాయ చేతనే ఈ సర్వమూ సృజింపబడినది
సర్వం ఇదం రక్షతి సర్వం ఇదం సంహరతి మాయ చేతనే ఈ సర్వము రక్షింపబడుచున్నది మఱియు ఈ సర్వము సంహరింపబడుచున్నది
తస్మాత్ మాయాం ఏతాం శక్తిం విద్య అద్య అందుచేత ఆ మాయనే శక్తి అని ఇప్పడు తెలుసుకొనవలెను
ఏతాం మాయాం శక్తిం వేద ఎవరు మాయను శక్తిగా తెలుసుకొనెదరో
స పాప్మానం తరతి, స మృత్యుం తరతి, స సంసారం తరతి వారు పాపమునుండి తరించుదురు, వారు మృత్యువును దాటుదురు, వారు సంసారమును జయించుదురు
సో అమృతత్వం చ గచ్ఛతి, మహతీం శ్రియం అశ్ను తే వారు అమృతత్వం పొందెదరు, మహత్తరమైన శ్రియమును (సంపదను) పొందెదరు
3.3 నారసింహ మంత్రమునకు ఆకాశమే బీజము
మీమాంస తే బ్రహ్మవాదినః హ్రస్వా దీర్ఘా ప్లుతా చ ఇతి బీజము గురించి బ్రహ్మవాదులు మీమాంస పడుదురు - అది హ్రస్వమా, దీర్ఘమా, ప్లుతమా? అని

[హ్రస్వము = ఒక మాత్ర, దీర్ఘం = రెండు మాత్రలు, ప్లుతం = మూడు మాత్రలు ]
యది హ్రస్వా భవతి, సర్వం పాప్మానం దహతి, అమృతత్త్వం చ గచ్ఛతి అది హ్రస్వం అయినచో (హ్రస్వ బీజముగా ఉచ్చరించినచో) సర్వ పాపములు దహించును, అమృతత్వం పొందుదురు
యది దీర్ఘా భవతి మహతీం శ్రియం అవాప్నోతి అమృతత్వం చ గచ్ఛతి అది దీర్ఘము అయినచో మహత్తరమైన సంపద పొందెదరు, అమృతత్వం పొందెదరు

యది ప్లుతా భవతి జ్ఞానవాన్ భవతి అమృతత్వం చ గచ్ఛతి

అది ప్లుతమైనచో జ్ఞానవంతులు అగుదురు, అమృతత్వం పొందెదరు
తత్ ఏతత్ ఋషిణా ఉక్తం నిదర్శనం ఈ విధముగా ఋషులచే నిదర్శనము చెప్పబడినది
స ఈం పాహి య ఋజీషిత రుద్రః ఆ బీజ సోమరస స్వరూప రుద్రుడు మమ్ము రక్షించు గాక!
శ్రియం లక్ష్మీం ఔపలాం అంబికాం గాం మా శ్రియమును, లక్ష్మిని, అంబికను (పంటలను), గోవులను రక్షించు గాక!
షష్ఠీం చ యాం ఇంద్రసేన ఇతి అదాహుః ఇంద్రసేన అని చెప్పబడు ఆ దైవము షష్టిని (సంతానమును) రక్షించు గాక!

[Note: కానుపు తరువాత తల్లి బిడ్డలు ఆరు రోజులు సున్నితముగా ఉండును, ఆ ఆరు రోజులు పరిరక్షించును గాక!]
తాం విద్యాం బ్రహ్మయోనిం సరూపాం ఇహ ఆయుషే శరణం అహం ప్రపద్యే బ్రహ్మవిద్య ద్వారా బ్రహ్మముతో సారూప్యము పొందుటకు (అధ్యయన అభ్యాసములకు) కావలసిన ఆయుష్షు కొఱకు నేను శరణాగతి వేడుకొనుచున్నాను!
సర్వేషాం వా ఏతత్ భూతానాం ఆకాశః పరాయణం ఈ సర్వ భూతములకు ఆకాశమే పరాయణము (మూల తత్త్వము)
సర్వాణి హ వా ఇమాని భూతాని ఆకాశాత్ ఏవ జాయంతే అన్ని భూతములు కూడా ఆకాశము వలనే ప్రకటించబడుచున్నవి
ఆకాశాత్ ఏవ జాతాని జీవంతి సర్వ భూతములు ఆకాశము వలనే జనించుచున్నవి, జీవించుచున్నవి
ఆకాశం ప్రయంతి అభిసంవిశంతి ఆకాశమునందే ప్రలయము చెందుచున్నవి
తస్మాత్ ఆకాశం బీజం విద్యా తత్ ఏవ జ్యాయః కావున, ఆకాశమే బీజము అని తెలుసుకొనవలెను
తత్ ఏతత్ ఋషిణా ఉక్తం నిదర్శనం ఇదే ఋషులచే నిదర్శనము చెప్పబడినది
హంసః శుచిః అద్వసుః ఆ నారసింహ పరబ్రహ్మము పరమహంస, శుద్ధుడు, అద్వయుడు అయి ఉన్నాడు
అంతరిక్ష సత్ హ ఉతా వేదిషద్ అతిథిః దురోణ సత్ సర్వము ఓతప్రోతముగా అంతరిక్షమే (ఆకాశమే) నివాసముగా ప్రకటితమై ఉన్న అతిథి (కాలాతీతుడు)
నృషద్వర సత్ ఋత సత్ వ్యోమ సత్ అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ పురుషోత్తముడు, ఋతము, సత్యము, (చిత్) ఆకాశ స్వరూపుడు, నీటియందు గోవులందు ధర్మమునందు పర్వతములందు అంతటా ప్రకటితమై ఉన్న మహనీయుడు
య ఏవం వేద ఇతి మహోపనిషత్ ఈ విధముగా తెలుసుకొనవలెను అని చెప్పుచున్నది ఈ మహోపనిషత్


నాలుగవ ఖండము -

నృసింహ అనుష్టుభమునకు అంగ మంత్రములు

4.1 నారసింహ మంత్రమునకు అంగ మంత్రములు
దేవా హ వై ప్రజాపతిం అబ్రువత్ దేవతలు ప్రజాపతిని అడిగెను -
అనుష్టుభస్య మంత్రరాజస్య నారసింహస్య అంగ మంత్రాత్ నో బ్రూహి భగవన్ ఇతి భగవాన్! నారసింహ అనుష్టుభ మంత్రరాజమునకు అంగ మంత్రములు మాకు వివరించండి
స హ ఉవాచ పజాపతిః ఆ ప్రజాపతి వారికి ఇట్లు చెప్పెను -
ప్రణవం సావిత్రీం యజుః లక్ష్మీం నృసింహ గాయత్రీం ఇతి అంగాని జానీయాత్ ప్రణవము, సావిత్రీ, యజుస్సు అనే లక్ష్మి, నృసింహ గాయత్రీ మంత్రములు నృసింహ మంత్రరాజమునకు అంగములుగా తెలుసుకొనవలెను
యో జానీతే సో అమృతత్వం చ గచ్ఛతి ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతత్వం పొందెదరు
4.2 జీవాత్మయే ఓంకార బ్రహ్మము
ఓం ఇతి ఏతత్ అక్షరం ఇదగ్ం సర్వం ఓం అను ఈ అక్షరమే ఇక్కడ ఉన్న సర్వము
తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్ ఇతి దాని యొక్క ఉపవ్యాఖ్యానమే భూత కాలము, వర్తమానము మఱియు భవిష్యత్తు
సర్వం ఓంకార ఏవ సర్వము ఓంకారమే!
యత్ చ అన్యత్ త్రికాల అతీతం తత్ అపి ఓంకార ఏవ ఏదైతే మూడు కాలములకు అతీతమో అది అంతా కూడా ఓంకారమే!
సర్వం హి ఏతత్ బ్రహ్మా ఈ సర్వమూ బ్రహ్మమే!
అయం ఆత్మా బ్రహ్మ ఈ ఆత్మ (నేను అను భావముతో ఉన్న జీవుడు) బ్రహ్మమే!
4.3 జీవాత్మయే చతుష్పాద బ్రహ్మము
సో అయం ఆత్మా చతుష్పాత్ జాగరిత స్థానో బహిః ప్రజ్ఞః నాలుగు (జాగ్రత్-స్వప్న-సుషుప్తి-తురీయ) పాదములు కలిగిన ఆ ఈ ఆత్మ యొక్క జాగరిత స్థానమే బాహ్య ప్రజ్ఞ
సప్త అంగ ఏకోనవింశతి ముఖః స్థూల భుక్ వైశ్వానరః ప్రథమః పాదః అది ఏడు (7) అంగములతో, పంతొమ్మిది (19) ముఖములతో [నోరులతో] ప్రకటితమైన స్థూల భోక్తయైన “వైశ్వానరుడు” - ఇది ఆత్మ యొక్క మొదటి పాదము

[సప్త (7) అంగాః = 1) ద్యులోకము - శిరస్సు 2) సూర్యుడు - నేత్రములు 3) వాయువు - ప్రాణము 4) ఆకాశము - దేహ మధ్య భాగము 5) జలము - మూత్ర స్థానము 6) భూమి - పాదములు 7) అగ్ని - నోరు]

[ఏకోనవింశతి (19) ముఖాః = ఐదు జ్ఞానేంద్రియములు 1) చెవులు - వినికిడి 2) కన్నులు - చూపు 3) చర్మము - స్పర్శ 4) ముక్కు - వాసన 5) నోరు - రసము; ఐదు కర్మేంద్రియములు 6) వాక్కు 7) చేతులు 8) పాదములు 9) పాయువు - మల విసర్జనం 10) ఉపస్థ - మూత్ర విసర్జనం; పంచ ప్రాణములు - 11) ప్రాణ 12) అపాన 13) వ్యాన 14) ఉదాన 15) సమాన; అంతరంగ చతుష్టయము 16) మనస్సు 17) బుద్ధి 18) చిత్తము 19) అహంకారము]
స్వప్నస్థానో అంతఃప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతిముఖః ప్రవివిక్త భుక్ తైజసో ద్వితీయః పాదః స్వప్న స్థానము, అంతర ప్రజ్ఞ, ఏడు (7) అంగములతో పంతొమ్మిది (19) ముఖములతో [నోరులతో] ప్రకటితమైన ప్రవివిక్త (ఏకాంత) భోక్తయైన “తైజసుడు” - ఇది ఆత్మ యొక్క రెండవ పాదము
యత్ర సుప్తో న కంచన కామం కామయతే, న కంచన స్వప్నం పశ్యతి ఎక్కడ సుప్తి (నిద్ర) స్థితిలో ఏ కోరిక కలిగి ఉండడో, ఏ కొంచెము స్వప్నము కూడా చూడడో
తత్ సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయో హి ఆ సుషుప్తియందు సుషుప్త స్థాన ఏకీభూతుడు, ప్రజ్ఞాన ఘనుడే ఆనందమయుడు,
ఆనంద భుక్ చేతోముఖః ప్రాజ్ఞః తృతీయ పాదః ఆనంద భోక్తయైన చేతోముఖుడైన “ప్రాజ్ఞుడు” - ఇది ఆత్మ యొక్క మూడవ పాదము
ఏష స్వర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామి ఏష యోనిః [తురీయము నాలుగవ పాదము.] ఇతడే (ఈ ఆత్మయే) సర్వేశ్వరుడు, ఇతడే సర్వజ్ఞుడు, ఇతడే అంతర్యామి, ఇతడే యోని
సర్వస్య ప్రభవ అపి అయౌ హి భూతానాం ఇతడే సర్వ భూతములకు ప్రభవ (జన్మ కారణ) స్థానము మరియు లయ స్థానము
నా అంతః ప్రజ్ఞం, న బహిః ప్రజ్ఞం, న ఉభయతః ప్రజ్ఞం, న ప్రజ్ఞం, న అప్రజ్ఞం, న ప్రజ్ఞాన ఘనం ఇతడు అంతర ప్రజ్ఞ కాడు, బాహ్య ప్రజ్ఞ కాడు, ఉభయ ప్రజ్ఞలు కాడు, ప్రజ్ఞ కాడు, అప్రజ్ఞ కాడు, ప్రజ్ఞాన ఘనుడు కాడు
అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం, ఏకాత్మ్య ప్రత్యయసారం అదృష్టుడు (దృష్టము కాడు), అవ్యవహార్యుడు, అగ్రాహ్యుడు, అలక్షణుడు, అచింత్యుడు, అనిర్వచనీయుడు, ఏకాత్మ ప్రత్యయ (హేతువు) సారమైనవాడు
ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః ప్రపంచము ఉపశమించు స్థానము, శాంతుడు, శివుడు, అద్వైతుడు, చతుర్థము (తురీయము) లేదా నాలుగవ పాదము అని తలచదరు - అతడే ఆత్మ, అతడే విజ్ఞేయుడు (తెలియబడదగినవాడు, తెలియబడునదంతా తానే అయినవాడు)
4.4 సావిత్రీ అష్టాక్షర మంత్రము
అథ సావిత్రీ, గాయత్ర్యా యజుషా ప్రోక్తా తయా సర్వం ఇదం వ్యాప్తం ఇప్పుడు సావిత్రీ గురించి! గాయత్రీ మంత్రము చేత, యజుస్సు చేత చెప్పబడినట్లుగా దాని(ఆత్మ) చేతనే ఈ సర్వము వ్యాప్తమై ఉన్నది
ఘృణిః ఇతి ద్వే అక్షరే, సూరియ ఇతి త్రీణి, ఆదిత్య ఇతి త్రీణి “ఘృణిః (సూర్యరశ్మి)” అని రెండు అక్షరములు, “సూరియ” అని మూడు అక్షరములు, “ఆదిత్య” అని మూడు అక్షరములు (2+3+3 = 8)
ఏతత్ వై సావిత్రస్య అష్టాక్షరం పదగ్ం శ్రియా అభిషిక్తం ఇదే సావిత్రి యొక్క అష్టాక్షర మంత్రము, శ్రీకారము చేత అభిషిక్తమైనది
య ఏవం వేద, శ్రియా స హ ఏవ అభిషిచ్యతే ఎవరు ఈ విధముగా తెలిసుకొనునో వారు శ్రియము (సంపద) చేత అభిషిక్తుడగును
తత్ ఏతత్ ఋచ అభియుక్తం ఈ విధముగా ఋచము (ఋక్కు) నిర్ధారించెను
ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధివిశ్వే నిషేదుః పరమ ఆకాశ (చిదాకాశ) స్థానమైన వేదాక్షరమునందు ఆ విశ్వే దేవతలందరు అధిష్ఠించియున్నారు
యః తత్ న వేద కిం ఋచా కరిష్యతి ఎవడు దానిని తెలుసుకొనలేడో వాడికి ఋక్కులు వలన ఏమి ఉపయోగము? [ఉపయోగము లేదు అని భావము]
య ఇత్ తత్ విదుః త ఇమే సమాసత ఇతి న హ వా ఏతస్యర్చా న యజుషా న సామ్నార్థో అస్తి యః సావిత్రీం వేద ఇతి ఎవరు దానిని బాగుగా తెలిసుకొనెదరో వారికి ఋక్కుతో కాని, యజుస్సుతో కాని, సామముతో కాని ఇక పనిలేదు (ఎందుచేత అనగా, వారు ఋక్కులు యొక్క, యజుస్సు యొక్క, సామము యొక్క అర్థం తెలుసుకున్నవారే అగుదురు), ఎవరు ఆ సావిత్రిని ఈ విధముగా తెలుసుకొనునో!
4.5 మహాలక్ష్మీ యజుః గాయత్రీ మంత్రము
ఓం భూర్లక్ష్మీర్భువర్లక్ష్మీస్స్వర్లక్ష్మీః కాలకర్ణీ తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఓం భూః లక్ష్మీః, భువః లక్ష్మీః, స్వః లక్ష్మీః, కాలకర్ణీ తన్నో (తత్ నో) లక్ష్మీ ప్రచోదయాత్
ఇతి ఏషా వై మహాలక్ష్మీ యజుః గాయత్రీ చతుర్వింశతి అక్షరా భవతి ఇది మహాలక్ష్మీ యజుర్ గాయత్రీ మంత్రము, ఇది ఇరువది నాలుగు (24) బీజ అక్షరములు కలది
గాయత్రీ వా ఇదగ్ం సర్వం యత్ ఇదం కిం చ ఏ కించిత్ సహా ఈ సర్వమూ గాయత్రీయే అయి ఉన్నది
తస్మాద్య ఏతాం మహాలక్ష్మీం యాజుషీం వేద మహతీం శ్రియం అశ్నుతే కావున, ఎవరు ఈ మహాలక్ష్మీ యజుస్సును తెలుసుకొనెదరో వారు మహత్తరమైన సంపద పొందుదురు
4.6 నృసింహ గాయత్రీ మంత్రము
ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నస్సిగ్ంహః ప్రచోదయాత్ ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో సింహః ప్రచోదయాత్
ఇతి ఏషా వై నృసింహ గాయత్రీ ఇదే నృసింహ గాయత్రీ మంత్రము
దేవానాం వేదానాం నిదానం భవతి దేవతలకు, వేదములకు ఇదే మూలము
య ఏవం వేద నిదానవాన్ భవతి దీనిని ఈ విధముగా తెలియువాడు నిదానుడు (స్థితప్రజ్ఞుడు) కాగలడు
4.7 నృసింహ దేవుని స్వాత్మయందు దర్శనము చేయించు మంత్రములు
దేవా హ వై ప్రజాపతిం అబ్రువత్ అథ అప్పుడు దేవతలు ప్రజాపతిని అడిగెను -
కైః మంత్రైః స్తుతో దేవః ప్రీతో భవతి స్వాత్మానం దర్శయతి ఏ మంత్రములచే స్తుతించబడగా నృసింహ దేవుడు ప్రీతి చెంది స్వాత్మయందు దర్శనమిచ్చునో
తాన్ నో బ్రూహి భగవన్ ఇతి వాటిని మాకు చెప్పుము, భగవాన్!
స హ ఉవాచ ప్రజాపతిః వారికి ప్రజాపతి ఇట్లు చెప్పెను -
1. ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ యః చ బ్రహ్మ భూః భువః సువః తస్మై వై నమో నమః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ బ్రహ్మ” భూః భువః సువః తస్మై వై నమో నమః

[ఓం. ఎవడు నృసింహ దేవ భగవంతుడో, ఎవడు బ్రహ్మయై, భూ-భువ-సువ లోకములకు ఆత్మయో - వానికి నమస్కారము]
(యథా ప్రథమ మంత్రో ఉక్తా వా ఆది అంతౌ తథా ద్రష్టవ్యౌ) ఈ మొదటి మంత్రములో వలె మొదలు చివరలు జతచేసుకొనవలెను.

అనగా - “ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ <క్రింద చెప్పిన లక్షణము> భూః భువః సువః తస్మై వై నమో నమః”
2. యః చ విష్ణుః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ విష్ణుః ” భూః భువః సువః తస్మై వై నమో నమః
3. యః చ మహేశ్వరః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ మహేశ్వరః” భూః భువః సువః తస్మై వై నమో నమః
4. యః చ పురుషః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ పురుషః” భూః భువః సువః తస్మై వై నమో నమః
5. యః చ ఈశ్వరః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ ఈశ్వరః” భూః భువః సువః తస్మై వై నమో నమః

6. యా సరస్వతీ

ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యా సరస్వతీ” భూః భువః సువః తస్మై వై నమో నమః
7. యా శ్రీః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యా శ్రీః” భూః భువః సువః తస్మై వై నమో నమః
8. యా గౌరీ ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యా గౌరీ” భూః భువః సువః తస్మై వై నమో నమః
9. యా ప్రకృతిః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యా ప్రకృతిః” భూః భువః సువః తస్మై వై నమో నమః
10. యా విద్యా ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యా విద్యా ” భూః భువః సువః తస్మై వై నమో నమః
11. యః చ ఓంకారః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ ఓంకారః” భూః భువః సువః తస్మై వై నమో నమః
12. యాః చ తస్రోర్ధమాత్రాః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యాః చ తస్రోర్ధమాత్రాః ” భూః భువః సువః తస్మై వై నమో నమః
13. యే వేదాః సా అంగాః స శాఖాః స ఇతిహాసాః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యే వేదాః సా అంగాః స శాఖాః స ఇతిహాసాః” భూః భువః సువః తస్మై వై నమో నమః
14. యే చ పంచాగ్నయః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యే చ పంచాగ్నయః” భూః భువః సువః తస్మై వై నమో నమః
15. యాః సప్త మహావ్యాహృతయః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యాః సప్త మహావ్యాహృతయః” భూః భువః సువః తస్మై వై నమో నమః
16. యే చ అష్టౌ లోకపాలాః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యే చ అష్టౌ లోకపాలాః” భూః భువః సువః తస్మై వై నమో నమః
17. యే చ అష్టౌ వసవః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యే చ అష్టౌ వసవః” భూః భువః సువః తస్మై వై నమో నమః
18. యే చ ఏకాదశ రుద్రాః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యే చ ఏకాదశ రుద్రాః ” భూః భువః సువః తస్మై వై నమో నమః
19. యే చ ద్వాదశ ఆదిత్యాః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యే చ ద్వాదశ ఆదిత్యాః” భూః భువః సువః తస్మై వై నమో నమః
20. యే చ అష్టౌ గ్రహాః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యే చ అష్టౌ గ్రహాః” భూః భువః సువః తస్మై వై నమో నమః
21. యాని పంచ మహాభూతాని ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యాని పంచ మహాభూతాని ” భూః భువః సువః తస్మై వై నమో నమః
22. యః చ కాలః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ కాలః” భూః భువః సువః తస్మై వై నమో నమః
23. యః చ మనుః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ మనుః” భూః భువః సువః తస్మై వై నమో నమః
24. యః చ మృత్యుః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ మృత్యుః” భూః భువః సువః తస్మై వై నమో నమః

25. యః చ యమః

ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ యమః” భూః భువః సువః తస్మై వై నమో నమః
26. యః చ అంతకః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ అంతకః” భూః భువః సువః తస్మై వై నమో నమః
27. యః చ ప్రాణః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ ప్రాణః” భూః భువః సువః తస్మై వై నమో నమః
28. యః చ సూర్యః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ సూర్యః” భూః భువః సువః తస్మై వై నమో నమః
29. యః చ సోమః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ సోమః” భూః భువః సువః తస్మై వై నమో నమః
30. యః చ విరాట్ పురుషః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ విరాట్ పురుషః” భూః భువః సువః తస్మై వై నమో నమః
31. యః చ జీవః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ జీవః” భూః భువః సువః తస్మై వై నమో నమః
32. యః చ సర్వం ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ “యః చ సర్వం” భూః భువః సువః తస్మై వై నమో నమః
ఇతి ద్వాత్రింశత్ ఇవి ముప్పది రెండు (32) మంత్రములు
ఇతి తాన్ ప్రజాపతిః అబ్రవీత్ అని వారికి (దేవతలకు) ప్రజాపతి చెప్పెను
ఏతైః మంత్రైః నిత్యం దేవం స్తువధ్వం ఈ మంత్రములచే భావయుక్తముగా నిత్యము దైవమును స్తుతించినచో
తతో దేవః ప్రీతో భవతిః, స్వాత్మానం దర్శయతి ఆ దైవము ప్రీతి చెందును, స్వాత్మయందు దర్శనమీయును
తద్య ఏతైః మంత్రైః నిత్యం దేవం స్తౌతి, స దేవం పశ్యతి, ఎవరు ఈ మంత్రములచే నృసింహ దేవుని నిత్యము స్తుతించునో వారు ఆ దేవుని చూడగలరు,
సో అమృతత్వం చ గచ్ఛతి య ఏవం వేద, ఇతి మహోపనిషత్ ఎవరు ఈ విధముగా తెలిసుకొనునో వారు అమృతత్వం పొందుదురు, ఇది మహోపనిషత్

ఐదవ ఖండము -

నారసింహ సుదర్శన మహాచక్రము

5.1 నారసింహ సుదర్శన మహాచక్రము వివరణకై ప్రశ్న
దేవా హ వై ప్రజాపతిం అబ్రువత్ దేవతలు ప్రజాపతిని అడిగిరి -
అనుష్టుభస్య మంత్రరాజస్య నారసింహస్య మహాచక్రం నామ చక్రం నో బ్రూహి భగవన్ ఇతి నారసింహ అనుష్టుభ మంత్రము యొక్క “మహాచక్రం” అని నామము గల చక్రమును గురించి మాకు చెప్పుము, భగవాన్!
సార్వకామికం మోక్షద్వారం యత్ యోగిన ఉపదిశంతి స హ ఉవాచ ప్రజాపతిః దేనినైతే సర్వ కామములు తీర్చునదిగా, మోక్షద్వారముగా యోగులు ఉపదేశించుదురో దానిని ప్రజాపతి వారికి చెప్పెను
5.2 షడక్షర సుదర్శన మహాచక్రం వర్ణన
షట్ అరం వా ఏతత్ సుదర్శనం మహాచక్రం తస్మాత్ షడక్షరం భవతి ఆ సుదర్శన చక్రమున ఆరు (6) అరములు (సువ్వలు = Spokes of a wheel), కావున అది ఆరు (6) అక్షరములు కలది
షట్ పత్రం చక్రం భవతి, షడ్వా ఋతవ ఋతుభిః సంమితం భవతి చక్రము ఆరు పత్రములు (ఆకులు) కలది, ఋతువులు ఆరు కావున ఆ పత్రములు సమ్మితమై (సమానమై) ఉన్నవి
మధ్యే నాభిః భవతి నాభ్యాం వా ఏతే అరాః ప్రతిష్ఠితా చక్రము మధ్యన నాభి ఉండును, నాభియందు అరములు ప్రతిష్ఠితమై ఉండును
మాయయా ఏతత్ సర్వం వేష్టితం భవతి మాయచే ఈ సర్వము చుట్టబడియున్నది [ఈశ్వర మాయా ప్రభావము చేత కాలచక్రము ప్రవర్తిస్తున్నది]
నా ఆత్మానం మాయా స్పృశతి తస్మాత్ మాయయా బహిః వేష్టితం భవతి మాయ ఆత్మను స్పృశించదు. కావున, మాయ చక్రము బయట వేష్టితమై ఉండును.
5.3 అష్టాక్షర సుదర్శన మహాచక్రం వర్ణన
అథ అష్ట అరం అష్ట పత్రం చక్రం భవతి ఇక మహా చక్రము ఎనిమిది (8) అరములు (సువ్వలు), ఎనిమిది (8) పత్రములు (ఆకులు) కలిగినది
అష్ట అక్షరా వై గాయత్రీ గాయత్ర్యా సమ్మితం భవతి ఎనిమిది (8) అక్షరములు కలది గాయత్రీ ఛందస్సు, ఆ గాయత్రీతో సమ్మితమై (సమానమై) ఉన్నది
బహిః మాయయా వేష్టితం భవతి బాహ్యమున మాయచేత పరివేష్టితమై ఉన్నది
క్షేత్రం క్షేత్రం వై మాయ ఏషా సంపద్యతే క్షేత్రమే మాయా క్షేత్రము అయి ఉన్నది కదా!

[క్షేత్రజ్ఞుడు ఆత్మ, క్షేత్రము అనాత్మ!]
5.4 ద్వాదశ సుదర్శన మహాచక్రం వర్ణన
అథ ద్వాదశ అరం ద్వాదశ పత్రం చక్రం భవతి పిమ్మట మహా చక్రము పన్నెండు (12) అరములు (సువ్వలు), పన్నెండు (12) పత్రములు (ఆకులు) కలిగినది
ద్వాదశాక్షరా వై జగతీ జగత్యా సమ్మితం భవతి పన్నెండు (12) అక్షరములు కలది జగతీ ఛందస్సు, ఆ జగతీతో సమ్మితమై (సమానమై) ఉన్నది
మాయయా బహిర్వేష్టితం భవతి మాయ అ చక్రము బాహ్యమున పరివేష్టితమై ఉన్నది
5.5 షోడశ సుదర్శన మహాచక్రం వర్ణన
అథ షోడశ అరం షోడశ పత్రం చక్రం భవతి పిమ్మట మహా చక్రము పదహారు (16) అరములు (సువ్వలు), పదహారు (16) పత్రములు (ఆకులు) కలిగినది
షోడశ కలో వై పురుషః పురుష ఏ వేదగ్ం సర్వం పురుషేణ సంమితం భవతి ఆత్మయే షోడశ (16) కళా పురుషుడు, ఏ పురుషుడు వేదముచే సూచింపబడుచున్నాడో ఆ పురుషునితో సమ్మితమై (సమానమై) ఈ చక్రము ఉన్నది
మాయయా బహిః వేష్టితం భవతి మాయచేత ఆ చక్రము బాహ్యమున పరివేష్టితమై ఉన్నది
5.6 ద్వాత్రింశత్ సుదర్శన మహాచక్రం వర్ణన
అథ ద్వాత్రింశత్ అరం ద్వాత్రింశత్ పత్రం చక్రం భవతి పిమ్మట మహా చక్రము ముప్పది రెండు (32) అరములు (సువ్వలు), ముప్పది రెండు (32) పత్రములు (ఆకులు) కలిగినది
ద్వాత్రింశత్ అక్షరా వా అనుష్టుప్ భవతి అనుష్టుభా సర్వం ఇదం భవతి ముప్పది రెండు (32) అక్షరములు కలది అనుష్టుప్ ఛందస్సు, అనుష్టుభమే ఈ సర్వము అయిఉన్నది
బహిః మాయయా వేష్టితం భవతి చక్రము బయట మాయచేత పరివేష్టితమై ఉండును
5.7 సుదర్శన మహాచక్రము వివరణ
అరైః వా ఏతత్ సుబద్ధం భవతి అరములచే (చక్రమునకు ఉన్న సువ్వలచే) ఈ చక్రము బాగుగా సుబద్ధమై ఉండును
వేదా వా ఏతే అరాః పత్రైః వా ఏతత్ సర్వతః పరాక్రమతి వేదములే చక్రమునకు ఉన్న అరములు, అవి పత్రములచే అమరిక చేయబడినది
ఛందాంసి వై పత్రాణి ఏతత్ సుదర్శనం మహాచక్రం ఛందస్సులే పత్రములు, ఇది సుదర్శన మహాచక్రము!
తస్య మధ్యే నాభ్యాం తారకం యత్ అక్షరం నారసింహం ఏక అక్షరం తత్ భవతి దాని మధ్యమున నాభియందు తారకము, ఏది నారసింహ ఏకాక్షర మంత్రమో అది తారకము
షట్ సుపత్రేషు షడక్షరం సుదర్శనం భవతి ఆరు (6) సుపత్రములందు షడక్షర (6) సుదర్శన మంత్రం యొక్క అక్షరములు ఉండును
అష్ట సుపత్రేషు అష్టాక్షరం నారయణం భవతి ఎనిమిది (8) సుపత్రములందు అష్టాక్షర (8) నారాయణ మంత్రం యొక్క అక్షరములు ఉండును
ద్వాదశ సుపత్రేషు ద్వాదశ అక్షరం వాసుదేవం భవతి పన్నెండు (12) సుపత్రములందు ద్వాదశాక్షర (12) వాసుదేవ మంత్రం యొక్క అక్షరములు ఉండును
షోడశ సుపత్రేషు మాతృకాద్యాః స బిందుకాః షోడశః స్వరా భవంతి పదహారు (16) సుపత్రములందు బిందువులతో సహా మాతృకాది అక్షరములు షోడశ (16) స్వరాలు ఉండును
ద్వాత్రింశత్ సుపత్రేషు ద్వాత్రింశత్ అక్షరం మంత్రరాజం నారసింహం అనుష్టుభం భవతి ముప్పది రెండు (32) సుపత్రములందు అనుష్టుభ నారసింహ మంత్రరాజము యొక్క ద్వాత్రింశత్ (32) మంత్రాక్షరములు ఉండును
5.8 సుదర్శన మహాచక్రమున దేవతల ప్రతిష్ఠ
తద్వా ఏతత్ సుదర్శనం నామ మహాచక్రం సార్వకామికం మోక్షద్వారం అదియే ఈ సుదర్శన నామ మహాచక్రం, ఇది సర్వ సత్కామములు ఇచ్చునది, మోక్షద్వారము
ఋఙ్మయం యజుర్మయం సామమయం బ్రహ్మమయం అమృతమయం భవతి ఋక్‌మయము, యజుర్మయము, సామమయము, బ్రహ్మమయము, అమృతమయము అయి ఉన్నది
తస్య పురస్తాత్ వసవ ఆసతే రుద్రా దక్షిణత ఆదిత్యాః పశ్చాత్ విశ్వేదేవా ఉత్తరతో దాని తూర్పున వసువులు ఉందురు, దక్షిణమున రుద్రులు, పశ్చిమమున ఆదిత్యులు, ఉత్తరమున విశ్వేదేవతలు ఉందురు
బ్రహ్మ విష్ణు మహేశ్వరా నాభ్యాం సూర్యాచంద్రం అసౌ పార్శ్వయోః నాభి (మధ్య) యందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ప్రక్కల యందు సూర్యచంద్రులు ఉందురు
తత్ ఏతత్ ఋచాభి ఉక్తం, ఋచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుః ఈ విధముగా ఋక్కులుచే చెప్పబడెను ఋక్కు సూచించు అక్షరమైన పరమైన ఆకాశము (చిదాకాశము) యందు విశ్వములోని అధి దేవతలు అందరూ అధిష్ఠించి ఉందురు
5.9 సుదర్శన మహాచక్రము మహత్యము
యః తత్ న వేద కిం ఋచా కరిష్యతి దీనిని ఎవడు తెలుసుకొనడో వాడు ఋక్కుతో ఏమి చేయును? (వాడిని ఋక్కు ఏమి ఉద్ధరించును?)
య ఇత్ తత్ విదుః త ఇమే సమానత ఇతి ఎవడు దీనిని తెలుసుకొనునో అతడు దీనికి (ఋక్కులకు / చక్రమునకు) సమానత పొందును
తత్ ఏతత్ సుదర్శనం మహాచక్రం బాలో వా యువా వా వేద స మహాన్ భవతి ఆ ఈ సుదర్శన మహాచక్రమును బాలుడు కాని, యువకుడు కాని ఎవడు తెలుసుకొనునో అతడు మహాన్ అగును
స గురుః సర్వేషాం మంత్రాణాం ఉపదేష్టా భవతి అతడు సర్వులకు గురువు అయి మంత్రములను ఉపదేశించు అర్హత పొందును
అనుష్టుభా హోమం కుర్యాత్ అనుష్టుభ అర్చనం కుర్యాత్ తత్ ఏతత్ రక్షోఘ్నం అనుష్టుభా హోమము చేసినచో, అనుష్టుభా అర్చన చేసినచో అది రాక్షసులను చంపును (అంతఃశత్రువులు జయింపబడును)
మృత్యుతారకం గురుణా లబ్ధం కంఠే బాహౌ శిఖాయాం వా బధ్నీత గురువుచే లభించిన మృత్యుతారకం కంఠమునందు లేక బాహువునందు లేక శిఖయందు కట్టి ధరించవలెను
సప్తద్వీపవతీ భూమిః దక్షిణార్థం న అవకల్పతే అటువంటి గురువుకు దక్షిణ కొఱకు సప్తద్వీపములు ఇచ్చినను తక్కువే అగును
తస్మాత్ శ్రద్ధయా యాం కాం చిద్ గాం దద్యాత్ సా దక్షిణా భవతి కావున, శ్రద్ధతో ఏదో ఒక (మంచి) గోవును సమర్పించినచో అదే (సరియైన) దక్షిణ అగును
5.10 ఫలశృతి
దేవా హ వై ప్రజాపతిం అబ్రువత్ అనుష్టుభస్య మంత్రరాజస్య నారసింహస్య ఫలం నో బ్రూహి భగవన్ ఇతి దేవతలు ప్రజాపతిని ఇట్లు అడిగెను - హే భగవాన్! నారసింహుని యొక్క అనుష్టుభ మంత్రమునకు ఫలము మాకు చెప్పుము
స హ ఉవాచ ప్రజాపతిః వారికి ప్రజాపతి ఇట్లు చెప్పెను -
య ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం నిత్యం అధీతే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో
సో అగ్నిపూతో భవతి, స వాయుపూతో భవతి, స ఆదిత్యపూతో భవతి అతడు అగ్నిపూతుడు అగును (అగ్నిచే పవిత్రమైనవాడు అగును), అతడు వాయుపూతుడు అగును, అతడు ఆదిత్యపూతుడు అగును

స సోమపూతో భవతి, స సత్యపూతో భవతి, స బ్రహ్మపూతో భవతి

అతడు సోమపూతుడు అగును, అతడు సత్యపూతుడు అగును, అతడు బ్రహ్మపూతుడు అగును
స విష్ణుపూతో భవతి, స రుద్రపూతో భవతి, స దేవపూతో భవతి అతడు విష్ణుపూతుడు అగును, అతడు రుద్రపూతుడు అగును, అతడు దేవపూతుడు అగును
స సర్వపూతో భవతి, స సర్వపూతో భవతి అతడు సర్వపూతుడు అగును, అతడు సర్వపూతుడు అగును
య ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం నిత్యం అధీతే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో
స మృత్యుం తరతి, స పాప్మానం తరతి, స బ్రహ్మహత్యాం తరతి అతడు మృత్యువు తరించును, అతడు పాపములు తరించును, అతడు బ్రహ్మహత్యా పాపము నుండి తరించును
స భ్రూణహత్యాం తరతి, స వీరహత్యాం తరతి, స సర్వహత్యాం తరతి అతడు బ్రూణ (ప్రాణి) హత్యా పాపము నుండి తరించును, అతడు వీర హత్యా పాపము నుండి తరించును, అతడు సర్వ హత్యా పాపము నుండి తరించును
స సంసారం తరతి, స సర్వం తరతి, స సర్వం తరతి అతడు సంసారమును తరించును, అతడు సర్వమును తరించును, అతడు సర్వమును తరించును
య ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం నిత్యం అధీతే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో
సో అగ్నిం స్తంభయతి, స వాయుం స్తంభయతి, స ఆదిత్యం స్తంభయతి అతడు అగ్నిని స్తంభింపచేయును, అతడు వాయువును స్తంభింపచేయును, అతడు ఆదిత్యుని స్తంభింపచేయును
స సోమం స్తంభయతి, స ఉదకం స్తంభయతి, స సర్వాన్ దేవాన్ స్తంభయతి అతడు చంద్రుని స్తంభింపచేయును, అతడు నీటిని స్తంభింపచేయును, అతడు సర్వ దేవతలను స్తంభింపచేయును
స సర్వాన్ గ్రహాన్ స్తంభయతి, స విషం స్తంభయతి, స విషం స్తంభయతి అతడు సర్వ గ్రహములను స్తంభింపచేయును, అతడు విషమును స్తంభింపచేయును, అతడు విషమును స్తంభింపచేయును
య ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం నిత్యం అధీతే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో
స దేవాన్ ఆకర్షయతి, స యక్షాన్ ఆకర్షతి, స నాగాన్ ఆకర్షయతి అతడు దేవతలను ఆకర్షించును, అతడు యక్షులను ఆకర్షించును, అతడు నాగులను ఆకర్షించును


స గ్రహాన్ ఆకర్షయతి, స మనుష్యాన్ ఆకర్షయతి, స సర్వాన్ ఆకర్షయతి


అతడు గ్రహాలను ఆకర్షించును, అతడు మనుష్యులను ఆకర్షించును, అతడు సర్వమును ఆకర్షించును
య ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం నిత్యం అధీతే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో
స భూర్లోకం జయతి, స భువర్లోకం జయతి, స స్వర్లోకం జయతి అతడు భూలోకమును జయించును, అతడు భువర్లోకమును జయించును, అతడు స్వర్లోకమును జయించును
స మహర్లోకం జయతి, స జనో లోకం జయతి, స తపో లోకం జయతి అతడు మహర్లోకమును జయించును, అతడు జన లోకమును జయించును, అతడు తపో లోకమును జయించును
స సత్య లోకం జయతి, స సర్వాన్ లోకాన్ జయతి, స సర్వాన్ లోకాన్ జయతి అతడు సత్య లోకమును జయించును, అతడు సర్వ లోకములను జయించును, అతడు సర్వ లోకములను జయించును!
య ఏతం మంత్రరాజం అనుష్టుభం నిత్యం అధీతే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో
సో అగ్నిష్టోమేన యజతే, స ఉక్థేన యజతే, స షోడశినా యజతే అతడు యజ్ఞష్టోమ యాగము చేసినవాడగును, అతడు ఉక్థ యాగము చేసినవాడగును, అతడు షోడశి యాగము చేసినవాడగును
స వాజపేయేన యజతే, సో అతిరాత్రేణ యజతే, సో ఆప్తోర్యామేణ యజతే అతడు వాజపేయ యాగము చేసినవాడగును, అతడు అతిరాత్ర (రాత్రి అంతా) యాగము చేసినవాడగును, అతడు ఆప్తోర్యామ యాగము చేసినవాడగును
సో అశ్వమేధేన యజతే, స సర్వైః క్రతుభిః యజతే, స సర్వైః క్రతుభిః యజతే అతడు అశ్వమేధ యాగము చేసినవాడగును, అతడు అన్ని క్రతువులు చేసినవాడగును, అతడు అన్ని క్రతువులు చేసినవాడగును!
య ఏతం మంత్రరాజం అనుష్టుభం నిత్యం అధీతే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో
స ఋచో అధీతే, స యజూంషి అధీతే, స సామాని అధీతే అతడు ఋక్కును అధ్యయనము చేసినవాడగును, అతడు యజుస్సును అధ్యయనము చేసినవాడగును, అతడు సామమును అధ్యయనము చేసినవాడగును
సో అథర్వణం అధీతే, సో అంగిరసం అధీతే, స శాఖా అధీతే అతడు అథర్వణమును అధ్యయనము చేసినవాడగును, అతడు ఆంగీరసమును అధ్యయనము చేసినవాడగును, వాటి శాఖలు చదివినవాడగును
స పురాణాని అధీతే, స కల్పాన్ అధీతే, స గాథా అధీతే, స నారాశంసీః అధీతే అతడు పురాణములు అధ్యయనము చేసినవాడగును, అతడు కల్పములు అధ్యయనము చేసినవాడగును, అతడు గాథలు అధ్యయనము చేసినవాడగును, అతడు నారాశంసులు అధ్యయనము చేసినవాడగును
స ప్రణవం అధీతే, యః ప్రణవం అధీతే స సర్వం అధీతే, స సర్వం అధీతే అతడు ప్రణవము అధ్యయనము చేసినవాడగును, ఎవడు ప్రణవమును అధ్యయనము చేయునో అతడు సర్వము అధ్యయనము చేసినవాడగును, సర్వము అధ్యయనము చేసినవాడు!
అనుపనీత శతం ఏకం ఏకేన ఉపనీతేన తత్ సమం ఉపనయనము కానివారు వందమందితో ఉపనీతుడు ఒక్కడు సమానము
ఉపనీత శతం ఏకం ఏకేన గృహస్థేన తత్ సమం ఉపనీతులు వందమందితో గృహస్థుడు ఒక్కడు సమానము
గృహస్థ శతం ఏకం ఏకేన వానప్రస్థేన తత్ సమం గృహస్థులు వందమందితో వానప్రస్థుడు ఒక్కడు సమానము
వానప్రస్థ శతం ఏకం ఏకేన యతినా తత్ సమం వానప్రస్థుడు వందమందితో యతి ఒక్కడు సమానము
యతీనాం తు శతం పూర్ణం ఏకం ఏకేన రుద్రజాపకేన తత్ సమం యతులు పూర్తిగా వందమందితో రుద్రము జపము చేయు ఒకేఒక్కనితో సమానము
రుద్రజాపక శతం ఏకం ఏకేన అథర్వశిరః శిఖా అధ్యాపకేన తత్ సమం రుద్రజాపకులు వందమందితో అథర్వ వేద శిరస్సును (వేదాంతమును) శిఖా అధ్యయనము చేసి బోధించు అధ్యాపకునితో సమానము
తాపనీయ ఉపనిషద్ అధ్యాపక శతం ఏకం ఏకేన మంత్రరాజ అధ్యాపకేన తత్ సమం తాపనీయ ఉపనిషద్ అధ్యాపకులు వందమందితో ఒక మంత్రరాజ అధ్యాపకునితో సమము
తద్వా ఏతత్ పరమం ధామ మంత్రరాజ అధ్యాపకస్య అటువంటి మంత్రరాజ అధ్యాపకునకు కలుగు పరమ ధామము ఏట్టిదనగా
యత్ర న సూర్యః తపతి, యత్ర న వాయుః వాతి, యత్ర న చంద్రమా భాతి ఎక్కడ సూర్యుడు తపించడో, ఎక్కడ వాయువు వీయడో, ఎక్కడ చంద్రుడు ప్రకాశించడో
యత్ర న నక్షత్రాణి భాంతి, యత్ర న అగ్నిః దహతి, యత్ర న మృత్యుః ప్రవిశతి, యత్ర న దుఃఖం ఎక్కడ నక్షత్రాలు ప్రకాశించవో, ఎక్కడ అగ్ని దహించదో, ఎక్కడ మృత్యువు ప్రవేశించదో, ఎక్కడ దుఃఖము లేదో
సదానందం, పరమానందం, శాంతం, శాశ్వతం ఆ పదము సదానందము, పరమానందము, శాంతము, శాశ్వతము
సదాశివం, బ్రహ్మాది వందితం, యోగి ధ్యేయం, పరమం పదం సదాశివము, బ్రహ్మాదులచే వందితము, యోగి యొక్క ధ్యేయము, పరమ పదము
యత్ర గత్వా న నివర్తంతే యోగినః ఎక్కడకు చేరినచో యోగికి పునరావృత్తి ఉండదో
తత్ ఏతత్ ఋచాభి ఉక్తం అదే ఋక్కులచే చెప్పబడినది
తత్ విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః ఆ విష్ణువు పరమ పదమును ఎల్లప్పుడు విద్వాంసులు చూచుచుండురు
దివి ఇవ చక్షుః ఆతతం ఆకాశము వలె అంతటా కన్నులు (చూపు) వ్యాపించియున్నది
తత్ విప్రా సో విపన్యవో జాగృవాంసః సమింధతే విప్రులు (సత్యము తెలుసుకున్నవారు) మహదాశ్చర్యముతో జాగరితులై ఆ ప్రకాశమును దర్శించుచున్నారు
విష్ణోః యత్ పరమం పదం విష్ణువు యొక్క పరమపదము ఏదో
తత్ ఏతత్ నిష్కామస్య భవతి, తత్ ఏతత్ నిష్కామస్య భవతి అది కేవలము నిష్కాముడే పొందును, అది కేవలము నిష్కాముడే పొందును
య ఏవం వేద, ఇతి ఉపనిషత్ ఎవడు ఈ విధముగా తెలుసుకొనునో అని చెప్పుచున్నది ఈ ఉపనిషత్

నృసింహ పూర్వ తాపినీ ఉపనిషత్ - సారాంశ పుష్పమ్

పాదము - 1 (ఎనిమిది అక్షరములు) ఉగ్రం వీరం మహావిష్ణుం
పాదము - 2 (ఎనిమిది అక్షరములు) జ్వలంతం సర్వతోముఖం
పాదము - 3 (ఎనిమిది అక్షరములు ) నృసింహం భీషణం భద్రం
పాదము - 4 (ఎనిమిది అక్షరములు ) మృత్యుమృత్యుం నమామ్యహం
నృసింహ పూర్వ తాపినీ ఉపనిషత్ సమాప్తము



Nrusimha Poorva Tȃpini Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com