[[@YHRK]] [[@Spiritual]]

Rȃma Uttara Tȃpini Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna (https://yhramakrishna.com)
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: Please email to yhrkworks@gmail.com


రామ ఉత్తర తాపినీ ఉపనిషత్

శ్లోక తాత్పర్య పుష్పమ్

విషయ సూచిక :

ఉపనిషత్ పరిచయ శ్లోకము

శ్రీరామ తాపనీయ అర్థం భక్త ధ్యేయ కలేవరం శ్రీరామ తాపనీ (ఉపనిషత్తు యొక్క) అర్థము, భక్తులకు ధ్యేయ మూర్తి (ధ్యాన లక్ష్యము),
వికలేవర కైవల్యం శ్రీరామ బ్రహ్మ మే గతిః మూర్తి రహితము (నిరవయవము), కైవల్యము అయిన శ్రీరామ బ్రహ్మమే నాకు గతి
1 అవిముక్తమే కురుక్షేత్రము, సకల దేవతలకు నిలయము, మోక్షస్థానము
ఓం. బృహస్పతిః ఉవాచ యాజ్ఞవల్క్యం ఓం. బృహస్పతి యాజ్ఞవల్క్య మహర్షిని ఈ విధముగా అడిగెను -
యత్ అను కురుక్షేత్రం దేవానాం దేవ యజనం సర్వేషాం భూతానాం బ్రహ్మ సదనం ఏది కురుక్షేత్రము వంటిది, దేవతలకు దేవయజ్ఞములకు నిలయము, సమస్త ప్రాణులకు బ్రహ్మ సదనము (మోక్ష స్థానము) వంటిది?
[యాజ్ఞవల్క్య ఉవాచ -] [యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను -]
అవిముక్తం వై కురుక్షేత్రం దేవానాం దేవ యజనం సర్వేషాం భూతానాం బ్రహ్మ సదనం అవిముక్తమే కురుక్షేత్రము, దేవతలకు దేవ యజ్ఞములకు నిలయము, సర్వ భూతములకు బ్రహ్మ సదనము

[Note: అవిముక్తము అనగా “వదలబడినది”. కాశీ క్షేత్రమును కూడా అవిముక్త స్థానము అందురు. అయితే ఇక్కడ అవిముక్తము అనునది ఒక భౌతికమైన ప్రదేశమును ఉద్దేశించుట లేదు. అవిముక్త స్థాన వర్ణన ముందు ముందు తెలుపబడినది.]
తస్మాత్ యత్ర క్వ చ స గచ్ఛతి తత్ ఏవ మన్యేత ఇతి కనుక ఎవరు ఎక్కడికి వెళ్లినా అదే (అవిముక్తమునే) గణనీయముగా తలచెదరు
ఇదం వై కురుక్షేత్రం దేవానాం దేవ యజనం సర్వేషాం భూతానాం బ్రహ్మ సదనం దేవతలకు, దైవయజ్ఞములకు, సర్వ భూతములకు బ్రహ్మ స్థానం ఇదే కురుక్షేత్రము
అత్ర హి జంతోః ప్రాణేషు ఉత్క్రమమాణేషు రుద్రః తారకం బ్రహ్మవ్యాచష్టే అక్కడే జీవులకు ప్రాణముల ఊర్ధ్వ ప్రయాణమునందు రుద్రుడు తారక బ్రహ్మ మంత్రము చెప్పును
యేన ఆసావ అమృతీ భూత్వా మోక్షీ భవతి దాని సోమరస ఆస్వాదనచే అమృతులు అయి మోక్షము పొందుదురు
తస్మాత్ అవిముక్తం ఏవ నిషేవ ఏత కావున అవిముక్తమునే నిరంతరము సేవించవలెను
అవిముక్తం న విముంచేత్ అవిముక్తమును ఎప్పుడూ త్యజించకూడదు
ఏవం ఏవ ఏతత్ యాజ్ఞవల్క్యః ఆ విధముగా యాజ్ఞవల్క్యుడు చెప్పెను
2 రామ మంత్రమే తారక మంత్రము
అథ హ ఏనం భారద్వాజః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యం - పిమ్మట భారద్వాజుడు యాజ్ఞవల్క్యుని పరిప్రశ్నించెను -
కిం తారకం కిం తారయతి ఇతి ఏది తారకము? ఏది తరింపచేయునది?
స హ ఉవాచ యాజ్ఞవల్క్యః - అతనితో యాజ్ఞవల్క్యుడు ఈ విధముగా చెప్పెను -
తారకం దీర్ఘ అనలం బిందుపూర్వకం తారకము (అనునది ఏది అనగా) దీర్ఘముతో కూడిన అగ్ని బీజాక్షరము మఱియు బిందువుతో సంయోగమై (అనగా “రాం”)
దీర్ఘ అనలం పునః మాయ నమః చంద్రాయ నమో భద్రాయ నమ ఇతి దీర్ఘముతో (ఆకారముతో) అగ్ని బీజాక్షరము, మరియు పునః మాయ రూపమైన “నమః” సహితమైనది (అనగా “రాం రామాయ నమః” అనునది షడక్షర తారక మంత్రము), దానితో పాటు “రామచంద్రాయ నమః”, “రామభద్రాయ నమః” (అనునవి సప్తాక్షర తారక మంత్రములు)
ఏతత్ బ్రహ్మాత్మికాః సత్ చిత్ ఆనంద ఆఖ్యా ఇతి ఉపాసితవ్యం ఇవి బ్రహ్మాత్మికములు, సత్ చిత్ ఆనంద స్వరూపముగా చెప్పబడినవి అని ఉపాసించవలెను

[అహం బ్రహ్మా౽స్మి, ఓం తత్ సత్, త్వం ఏవ అహం మంత్రములతో సమానము]
అకారః ప్రథమ అక్షరో భవతి అకారము మొదటి అక్షరము అయినది
ఉకారో ద్వితీయ అక్షరో భవతి ఉకారము రెండవ అక్షరము అయినది
మకారః తృతీయ అక్షరో భవతి మకారము మూడవ అక్షరము అయినది
అర్ధమాత్రం చతుర్ధ అక్షరో భవతి అర్ధమాత్ర నాలుగవ అక్షరము అయినది
బిందుః పంచమ అక్షరో భవతి బిందువు పంచమ అక్షరము అయినది
నాదః షష్ఠ అక్షరో భవతి నాదము ఆరవ అక్షరము అయినది
తారకత్వాత్ తారకో భవతి తత్ ఏవ తారకం బ్రహ్మత్వం విద్ధి తరింపచేయునది అగుటచే తారకము అయినది, ఆ తారకమే బ్రహ్మత్వము అనుభవింపచేయును
తత్ ఏవ ఉపాసితవ్యం ఇతి జ్ఞేయం అదే ఉపాసించదగినది, తెలియతగినది అని
గర్భ జన్మ జరా మరణ సంసార మహత్ భయాత్ సంతారయతి ఇతి తల్లి గర్భములో పడుట వలన, జన్మించుట వలన, ముసలితనము వలన, మృత్యువు వలన, సంసారము వలన కలుగు మహత్తరమైన భయముల నుండి బాగుగా తరింపచేయును అని
తస్మాత్ ఉచ్యతే షడక్షరం తారకం ఇతి దాని వలన ఇది (“రాం రామాయ నమః”) షడక్షర తారక మంత్రము అని చెప్పబడెను
య ఏతత్ తారకం బ్రహ్మ బ్రాహ్మణో నిత్యం అధీతే అటువంటి ఈ తారక బ్రహ్మ మంత్రమును ఏ బ్రాహ్మణుడు (అనగా బ్రహ్మము తెలియగోఱువాడు) నిత్యమూ ధారణ చేయునో
స పాప్మానం తరతి స మృత్యుం తరతి స బ్రహ్మహత్యాం తరతి అతడు పాపముల నుండి తరించును, అతడు మృత్యువు నుండి తరించును, అతడు బ్రహ్మహత్యా దోషము నుండి తరించును
స భ్రూణహత్యాం తరతి స వీరహత్యాం తరతి స సర్వహత్యాం తరతి అతడు విద్వాంసుడైన బ్రాహ్మణుని హత్య చేసిన పాపము నుండి తరించును, శిశు (మఱియు పిండ) హత్యా దోషము నుండి తరించును, సర్వ హత్యా పాపము నుండి తరింపచేయును
స సంసారం తరతి స సర్వం తరతి అతడు సంసారమును దాటవేయును, అతడు సర్వమును తరించును
సో అవిముక్తం ఆశ్రితో భవతి స మహాన్ భవతి అతడు అవిముక్తమును (కాశీ క్షేత్రమును) ఆశ్రయించువాడగును, అతడు మహాత్ముడు అగును
సో అమృతత్వం చ గచ్ఛతి అతడు అమృతత్వము పొందును
అత్ర ఏతే శ్లోకా భవంతి ఇక్కడ దానికి సంబంధించిన శ్లోకములు ఉన్నవి
3 సీతా రామ లక్ష్మణ భరత శతృఘ్నుల యొక్క తత్త్వము
అకార అక్షర సంభూతః సౌమిత్రిః విశ్వభావనః అకార అక్షర సంభూతుడు సౌమిత్రి (లక్ష్మణుడు), అతడే జాగృత్ అవస్థ అభిమానియైన విశ్వభావనుడు

[విశ్వుడు = జాగృత్ అవస్థలో నేను, అనుభవమగు జగత్తు, భేద అభిమానము కలిగిన చైతన్యాత్మకు విశ్వుడు అని నామము]
ఉకార అక్షర సంభూతః శత్రుఘ్నః తైజసాత్మకః ఉకార అక్షర సంభూతుడు శత్రుఘ్నుడు, అతడే స్వప్న అవస్థ అభిమానియైన తైజసాత్మకుడు

[తైజసుడు = స్వప్న అవస్థలో నేను, అనుభవమగు స్వప్నము, భేద అభిమానము కలిగిన చైతన్యాత్మకు తైజసుడు అని అంటారు]
ప్రాజ్ఞాత్మకస్తు భరతో మకార అక్షర సంభవః మకార అక్షర సంభవుడు భరతుడు, అతడే సుషుప్త అవస్థ అభిమానియైన ప్రాజ్ఞాత్మకుడు

[ప్రాజ్ఞుడు = సుషుప్త అవస్థలో అభిమానము కలిగిన చైతన్యాత్మకు ప్రాజ్ఞుడు అని అంటారు]
అర్ధమాత్రాత్మకో రామో బ్రహ్మానంద ఏక విగ్రహః అర్ధమాత్రాత్మకుడైన రాముడు బ్రహ్మానంద ఏక విగ్రహుడు [అనగా మూడు అవస్థలలో ఏకమై ఉన్న తురీయ చైతన్యాత్మయే రాముడు]
శ్రీరామ సాన్నిధ్య వశాత్ జగత్ ఆధార కారిణీ సాక్షియైన శ్రీరామ సాన్నిధ్య వశములో జగత్తుకు ఆధార కారిణీ
ఉత్పత్తి స్థితి సంహార కారిణీ సర్వ దేహినాం సర్వ దేహధారుల ఉత్పత్తి, స్థితి, సంహార కారిణీ అయిన
సా సీతా భవతి జ్ఞేయా మూలప్రకృతి సంజ్ఞికా ఆ సీత జ్ఞేయ (తెలియబడునదంతా) రూపముగా, మూల ప్రకృతికి సంజ్ఞగా (రాముని సమక్షములో) ఉన్నది
ప్రణవత్వాత్ ప్రకృతిః ఇతి వదంతి బ్రహ్మవాదినః ఇతి (అప్రకటితమగు) ప్రణవత్త్వమునకు (ప్రకటితమగు) ప్రకృతి సీత అని బ్రహ్మవాదులు చెప్పెదరు
4 అవస్థాత్రయ అతీతుడు రాముడు
ఓం ఇతి ఏతత్ అక్షరం ఇదం సర్వం తస్య ఉపవ్యాఖ్యానం ఓం అనునది అక్షరము (నాశరహితము, అవ్యయము), సర్వము కూడా దానికి ఉపవ్యాఖ్యానము
భూతం భవ్యం భవిష్యత్ ఇతి సర్వం ఓంకార ఏవ భూతము, వర్తమానము, భవిష్యత్తు సర్వము ఓంకారమే
యత్ చ అన్యత్ త్రికాల అతీతం తత్ అపి ఓంకార ఏవ ఏది త్రికాలములకు అన్యము అతీతమో అది కూడా ఓంకారమే
సర్వం హి ఏతత్ బ్రహ్మా, అయం ఆత్మా, బ్రహ్మ సో (సః) అయం ఆత్మా సర్వమూ ఈ ఓంకార సూచిక బ్రహ్మమే, ఇదే ఆత్మ, ఆ బ్రహ్మమే ఈ (జీవుని) ఆత్మ
చతుష్పాద్ జాగరిత స్థానో బహిః ప్రజ్ఞః నాలుగు పాదములు కలిగి, జాగ్రత్ స్థానము కలిగి బహిర్ముఖ ప్రజ్ఞ కలవాడు (ప్రజ్ఞావాన్ బ్రహ్మ)
సప్తాంగ ఏకోనవింశతి ముఖః స్థూల భుక్ వైశ్వానరః ప్రథమః పాదః ఏడు (7) అంగములు, పంతొమ్మిది (19) ముఖములు కలిగి స్థూల విషయములు అనుభవించు వైశ్వానరుడు ప్రథమ పాదము

[సప్త (7) అంగాః = 1) ద్యులోకము - శిరస్సు 2) సూర్యుడు - నేత్రములు 3) వాయువు - ప్రాణము 4) ఆకాశము - దేహ మధ్య భాగము 5) జలము - మూత్ర స్థానము 6) భూమి - పాదములు 7) అగ్ని - నోరు]

[ఏకోనవింశతి (19) ముఖాః = ఐదు జ్ఞానేంద్రియములు 1) చెవులు - వినికిడి 2) కన్నులు - చూపు 3) చర్మము - స్పర్శ 4) ముక్కు - వాసన 5) నోరు - రసము; ఐదు కర్మేంద్రియములు 6) వాక్కు 7) చేతులు 8) పాదములు 9) పాయువు - మల విసర్జనం 10) ఉపస్థ - మూత్ర విసర్జనం; పంచ ప్రాణములు - 11) ప్రాణ 12) అపాన 13) వ్యాన 14) ఉదాన 15) సమాన; అంతరంగ చతుష్టయము 16) మనస్సు 17) బుద్ధి 18) చిత్తము 19) అహంకారము]
స్వప్న అవస్థానో అంతః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః స్వప్న అవస్థలో అంతర ప్రజ్ఞ కలిగి ఏడు (7) అంగములు పంతొమ్మిది (19) ముఖములు కలవాడు
ప్రవివిక్త భుక్ తైజసో ద్వితీయః పాదః (స్వప్నములో బాహ్య కర్మ ఇంద్రియములు లేకుండా కేవలము అంతర ఇంద్రియమైన మనస్సుతో) ఏకాంతములో విషయములు అనుభవించు తైజసుడు ద్వితీయ పాదము
యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం ఏక్కడ సుప్త స్థితిలో ఏ కొంచెమైనా కామము కోరుకొనడో, ఏ కొంచెము స్వప్నము చూడడో అది సుషుప్తి (గాఢ నిద్రతో పోల్చదగినది)
సుషుప్త స్థాన ఏకీభూతః ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయో హి ఆనంద భుక్ చేతోముఖః ప్రాజ్ఞః తృతీయః పాదః సుషుప్త స్థానము ఏకీభూతుడై (ఒక్కడై) ఉన్నవాడు, ప్రజ్ఞాన ఘనుడే అయి, ఆనందమయుడు అయి స్వానందము అనుభవించువాడు, చేతోముఖుడు (తెలివి రూపమున ఉన్నవాడు) ప్రాజ్ఞుడు అని పిలువబడువాడు తృతీయ పాదము
5 ఆ రామ పరబ్రహ్మము నేనే!
ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యామి ఏష యోనిః సర్వస్య ప్రభవ అపి అయౌ హి భూతానాం [జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలలో ఏకముగా ప్రకటితమైన] అతడే సర్వేశ్వరుడు, అతడే సర్వజ్ఞుడు, అతడే అంతర్యామి, అతడే సర్వమునకు యోని, అతడే అన్ని భూతములకు ఉత్పత్తి మఱియు లయ కారణము
న అంతః ప్రజ్ఞం, న బహిః ప్రజ్ఞం, న ఉభయతః ప్రజ్ఞం, న ప్రజ్ఞం న అప్రజ్ఞం, న ప్రజ్ఞాన ఘనం అతడు (ఆ బ్రహ్మము) అంతర ప్రజ్ఞ కాదు, బాహ్య ప్రజ్ఞ కాదు, రెండూ కలిసిన ప్రజ్ఞ కాదు, ప్రజ్ఞ అప్రజ్ఞ కూడా కాదు, ప్రజ్ఞాన ఘనము కాదు
అదృశ్యం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం అదృశ్యము, అవ్యవహార్యము (వ్యవహార అతీతము), అగ్రాహ్యము, అలక్షణము, అచింత్యము, అవ్యపదేశ్యము (undefinable), ఏకాత్మ ప్రత్యయ సారము (basis for oneness)
ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే ప్రపంచ ఉపశమ స్థానము, శాంతము, శివము, అద్వైతము, చతుర్థము (తురీయము) అని (బ్రహ్మవేత్తలచే) భావించబడునది
స ఆత్మా స విజ్ఞేయః సదా ఉజ్జ్వలో అవిద్యా తత్ కార్య హీనః అదే ఆత్మ, అదే విజ్ఞేయము (బాగుగా తెలుసుకోదగినది), సదా ఉజ్జ్వలము, అది అవిద్యా కార్యము లేనిది (జగత్ కార్యమునకు కారణమైన అవిద్యకు కూడా మునుముందే అకారణమై ఉన్నది)
స్వాత్మ బంధహరః సర్వదా ద్వైతరహిత ఆనందరూపః సర్వాధిష్ఠాన సన్మాత్రో నిరస్త అవిద్యా తమో మోహో (సర్వులకు) స్వాత్మ, (దానిని తెలుసుకొని తలచుకొనుటచే) బంధమును హరింపచేయునది, సర్వదా ద్వైతరహిత ఆనందరూపము, సర్వాధిష్ఠానము, సన్మాత్రము (కేవల సత్తా స్వరూపము), (ఆత్మ యొక్క జ్ఞానము) అవిద్యను తమస్సును మోహమును నశింపచేయునది
అహం ఏవ ఇతి సంభావ్య అహం అంతః అది (ఆ రామ పరబ్రహ్మము) నేనే అని సంభావించవలెను, నేనే (సర్వులకు) అంతరమును
సత్ యత్ పరం బ్రహ్మ రామచంద్రః చిదాత్మకః సో అహం ఏది సత్, పరబ్రహ్మ, రామచంద్రుడు, చిదాత్మకమో అదే నేను
అంతః రామభద్ర పరంజ్యోతీ రసో అహం అంతరాత్మ, రామభద్రుడు, పరంజ్యోతి, రసస్వరూపము నేనే
ఓం ఇతి ఆత్మానం ఆదాయ మనసా బ్రహ్మణ ఏకీ కుర్యాత్ ఓం అని చిత్తములో స్మరిస్తూ మనస్సును (మననమును) బ్రహ్మమునందు ఏకము చేయవలెను
సదా రామో అహం అస్మి ఇతి తత్త్వతః ప్రవదంతియే సదా రాముడను (సర్వులలో రమించువాడను) నేనే అను సత్యమును చక్కగా ప్రకటించును
న తే సంసారిణో నూనం రామ ఏవ న సంశయ ఇతి ఉపనిషత్ అప్పుడు అతడు సంసారి కాడు, అతడు నిస్సంశయముగా రాముడే అని ఉపనిషత్ నిర్ధారిస్తున్నది
య యేవం వేద స ముక్తో భవతి ఇతి యాజ్ఞవల్క్యః ఇది ఎవడు తెలుసుకొనునో వాడు ముక్తుడు అగును అని యాజ్ఞవల్క్యుడు బోధించెను


6 అవిముక్త స్థానము
అథ హ ఏనం అత్రిః పప్రచ్ఛ యాజ్ఞవల్క్యం - తరువాత అత్రి ముని యాజ్ఞవల్క్య మహర్షిని ఈ విధముగా అడిగెను -
య ఏషో అనంతో అవ్యక్త పరిపూర్ణ ఆనంద ఏక చిదాత్మా తం కథం అహం విజానీయం ఇతి అటువంటి అనంత, అవ్యక్త, పరిపూర్ణ, ఆనంద, ఏక, చిదాత్మను నేను ఏ విధముగా తెలుసుకొనవలయును?
స హ ఉవాచ యాజ్ఞవల్క్యః - అతనితో యాజ్ఞవల్క్యుడు ఈ విధముగా చెప్పెను -
సో అవిముక్త ఉపాస్యో అయం అతడు (అది తెలుసుకొనగోఱువాడు) ఈ అవిముక్తమును ఉపాసించవలెను
య ఏషో అనంతో అవ్యక్త ఆత్మా సో అవిముక్తే ప్రతిష్ఠిత ఇతి ఏది అనంత, అవ్యక్త, ఆత్మయో అది అవిముక్తమునందే ప్రతిష్ఠితమై ఉన్నది
సో అవిముక్తః కస్మిన్ ప్రతిష్ఠిత ఇతి ఆ అవిముక్త స్థానము ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది?
వరణాయం నాస్యాం చ మధ్యే ప్రతిష్ఠిత ఇతి [యాజ్ఞవల్క్యుడు -] అవిముక్తము వరణ మఱియు నాసి మధ్యన ప్రతిష్ఠితమై ఉన్నది
కా వై వరణా కా చ నాసీ ఇతి [అత్రి -] ఏది వరణా? ఏది నాసీ?
జన్మాంతర కృతాన్ సర్వాన్ దోషాన్ వారయతి ఇతి తేన వరణా భవతి ఇతి [యాజ్ఞవల్క్యుడు -] జన్మ జన్మలలో చేసిన సర్వ దోషములను వారింపచేయునది కావున అది వరణా అయినది
సర్వాన్ ఇంద్రియ కృతాన్ పాపాన్ నాశయతి ఇతి తేన నాసీ భవతి ఇతి ఇంద్రియములచేత చేసిన సర్వ పాపములను నశింపచేయునది కావున అది నాసీ అయినది
కతమః చ అస్య స్థానం భవతి ఇతి [అత్రి -] వానిలో దీని (అవిముక్తము) యొక్క స్థానము ఎక్కడ ఉన్నది?
భ్రువోః ఘ్రాణస్య చ యః సంధిః సః ఏష ద్యౌః లోకస్య పరస్య చ సంధిః భవతి ఇతి [యాజ్ఞవల్యుడు -] భ్రూమధ్యము నాసికము యొక్క సంధి దాని (అవిముక్త) స్థానము, అది ద్యులోకము మఱియు పరలోకమునకు సంధి స్థానమై ఉన్నది
ఏతత్ ద్వై సంధిం సంధ్యాం బ్రహ్మవిద ఉపాసిత ఇతి ఈ రెండిటి సంధిని సంధ్యా దేవతగా బ్రహ్మవిదులు ఉపాసించెదరు
సో అవిముక్త ఉపాస్య ఇతి అతడు ఆ అవిముక్తమును ఉపాసించవలెను
సో అవిముక్తం జ్ఞానం ఆచష్టే అతడు ఆ అవిముక్త ఉపాసనచే బ్రహ్మజ్ఞానము పొందును
యో వా ఏతత్ ఏవం వేద ఈ విధముగా తెలుసుకొనవలెను (అట్లు తెలుసుకొనుటయే ఆత్మ జ్ఞానము)


7 శ్రీరామ పరబ్రహ్మము శివునికి ఇచ్చిన వరము
అథ తం ప్రతి ఉవాచ - అప్పుడు యాజ్ఞవల్క్యుడు తిరిగి చెప్పెను -
శ్రీరామస్య మనుం కాశ్యాం జజాప వృషభద్వజః కాశీలో వృషభద్వజుడు (శంకరుడు) శ్రీరాముని జపించెను
[Note: ఇక్కడ అవిముక్తము అనునది భౌతికమైన కాశీ / వారణాసి క్షేత్రమును సూచించబడినది]
మన్వంతర సహస్రైస్తు జప హోమ అర్చనాదిభిః వేలాది మన్వంతరములు జప హోమ అర్చనాదులు చేసెను
తతః ప్రసన్నో భగవాన్ శ్రీరామః ప్రాహ శంకరం అందుకు ప్రసన్నుడైన శ్రీరామ భగవానుడు శంకరునితో ఇట్లు చెప్పెను -
వృణీష్వ యత్ అభీష్టం తత్ దాస్యామి పరమేశ్వర - ఇతి నీ అభీష్టమును కోరుకొనుము, దానిని ఇచ్చెదను పరమేశ్వరా!
అథ సత్ చిత్ ఆనంద ఆత్మానం శ్రీరామం ఈశ్వరః పప్రచ్ఛ - అప్పుడు సత్ చిత్ ఆనంద ఆత్మకుడైన శ్రీరాముని ఈశ్వరుడు ఇట్లు వినయముగా అడిగెను -
మణికర్ణ్యాం మమ క్షేత్రే గంగాయాం వా తటే పునః మణికర్ణిక యందు కాని, నా క్షేత్రమందు కాని, గంగా తటాక ఒడ్డున యందు కాని
మ్రియతే దేహీం తత్ జంతోః ముక్తిం న అతో వరాంతరం ఇతి దేహ త్యాగము చేసిన జీవులకు నీవు ముక్తిని ఇమ్ము, మరే ఇతర వరము వద్దు
అథ సహ ఉవాచ శ్రీరామః - అప్పుడు ఈశ్వరునితో శ్రీరాముడు ఇట్లు చెప్పెను -
క్షేత్రే అస్మిన్ తవ దేవ ఈశ! యత్ర కుత్ర అపి వా మృతాః క్రిమి కీటాదయో అపి అశు ముక్తాః సంతు న చ అన్యథా దేవతలకు ఈశుడా! నీ ఈ క్షేత్రమునందు ఎక్కడైనా క్రిమి కీటకాదులు సైతం మరణించినచో వెంటనే మోక్షము పొందును, దీనికి తిరుగులేదు
అవిముక్తే తవ క్షేత్రే సర్వేషాం ముక్తి సిద్ధయే అహం సన్నిహితః తత్ర పాషాణ ప్రతిమాదిషు నీ అవిముక్త క్షేత్రమునందు సర్వులకు ముక్తిని సిద్ధింపచేయుటకు నేను అక్కడ పాషాణ ప్రతిమాదులందు సన్నిహితుడనై ఉండెదను
క్షేత్రే అస్మిన్ యో అర్చయేత్ భక్త్యా మంత్రేణ అనేన మాం శివ! శివా! ఈ క్షేత్రమునందు ఎవరు (రామ షడక్షర / సప్తాక్షర) మంత్రముతో భక్తితో నన్ను ధ్యానించెదరో
బ్రహ్మహత్యాది పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః బ్రహ్మహత్య మొదలగు పాపముల నుండి మోక్షము కలిగించెదను, శోకించరు!
త్వత్తో వా బ్రహ్మణో వా అపి యే లభంతే షడక్షరం నీ నుండి కాని, బ్రహ్మ నుండి కాని కూడా ఎవరికి షడక్షర మంత్రము లభించునో
జీవంతో మంత్ర సిద్ధాః స్యుః ముక్తా మాం ప్రాప్నువంతి తే వారు జీవించి ఉండగా మంత్ర సిద్ధిని పొందుదురు, మరణము తరువాత నన్ను పొందుదురు
ముమూర్షోః దక్షిణే కర్ణే యస్య కస్య అపి వా స్వయం చనిపోవుచున్నవారి కుడి చెవిలో ఎవరికైనా నీవు స్వయంగా
ఉపదేక్ష్యసి మత్ మంత్రం స ముక్తో భవితా శివ నా (రామ) మంత్రమును ఉపదేశించినచో వారు ముక్తులు అగును, ఓ శివా!
ఇతి శ్రీరామచంద్రేణ ఉక్తం అని ఈ విధముగా శ్రీరామచంద్రునిచే చెప్పబడెను
8 శ్రీరామ పరబ్రహ్మను ప్రీతి చేసుకొని హృదయంలో దర్శించుకొనుటకు మంత్రములు
అథ హ ఏనం భారద్వాజో యాజ్ఞవల్క్యం ఉవాచ అప్పుడు భారద్వాజుడు (భరద్వాజ ఋషి వంశస్థుడు) ఆ యాజ్ఞవల్క్యునితో ఈ విధముగా చెప్పెను -
అథ కైః మంత్రైః స్తుతః శ్రీరామచంద్రః ప్రీతో భవతి స్వాత్మానం దర్శయతి తాన్నో బ్రూహి భగవన్ ఇతి భగవాన్! ఇప్పుడు ఏ మంత్రములచే స్తుతించినచో శ్రీరామచంద్రుడు ప్రీతి చెంది స్వస్వరూప ఆత్మ దర్శనం చేయునో దానిని చెప్పుము?
స హ ఉవాచ యాజ్ఞవల్క్యః అతనితో యాజ్ఞవల్క్యుడు ఇట్లు చెప్పెను -
పూర్వం సత్యలోకే శ్రీరామచంద్రేణ ఏవం శిక్షితో బ్రహ్మా పునః ఏతయా గాథయా నమః కరోతి పూర్వము సత్యలోకమునందు శ్రీరామచంద్రునిచే ఏ విధముగా శిక్షితుడయ్యనో (బోధించబడిన) ప్రజాపతి మరలా దాని చేతనే, ఈ గాథతో (ఇప్పుడు చెప్పబోవు ప్రార్థనతో) నమస్కారము చేసెను
విశ్వరూపధరం మహావిష్ణుం నారాయణం అనామయం విశ్వరూపధరుని (విశ్వమే తన రూపముగా ఉన్నవాడిని), మహావిష్ణువుని, నారాయణుని, అనామయుని (వికారము లేనివాడుని)
పూర్ణ ఆనంద ఏక విజ్ఞానం పరబ్రహ్మ స్వరూపిణం పూర్ణ ఆనంద విజ్ఞానమైన పరబ్రహ్మ స్వరూపుడిని
మనసా సంస్మరన్ బ్రహ్మా తుష్ట ఆవ పరమేశ్వరం మనసా పరమేశ్వరుడిని (శ్రీరాముని) సంస్మరించి సంతుష్టి పొందెను
ఓం యో హ వై శ్రీరామచంద్రః సః భగవాన్ అద్వైత పరమానంద ఆత్మా యత్ పరంబ్రహ్మ భూర్భువస్సువః తస్మై వై నమో నమః ఓం, ఎవడు శ్రీరాముడో అతడు భగవంతుడు, అద్వైత పరమానంద ఆత్మ స్వరూపుడు, ఏ పరబ్రహ్మ భూః, భూః, భువః మొదలగు లోకములు తానే అయి ఉన్నాడో అతనికి (ఆ రామునికి) నమస్కారము
[యథా ప్రథమ మంత్రో ఉక్తా వాది అంతౌ తథా సర్వ మంత్రేషు జ్ఞాతవ్యౌ] [క్రింద చెప్పిన ప్రతి మంత్రమునకు ప్రథమమున “ఓం యో హ వై శ్రీరామచంద్రః సః భగవాన్” అనునది, మఱియు “తస్మై వై నమో నమః” అని చివరన చేర్చి చెప్పుకొనవలెను]
యః చ అఖండ ఏకరసాత్మా మఱియు ఎవడు అఖండ ఏకరసాత్మకుడో (సర్వములోని మూల తత్త్వసారము అయినవాడో )
యః చ బ్రహ్మానంద అమృతం మఱియు ఎవడు బ్రహ్మానంద అమృత స్వరూపుడో
యత్ తారకం బ్రహ్మ ఏది తారక బ్రహ్మమో
యో బ్రహ్మా విష్ణుః మహేశ్వరో ఎవడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అయిఉన్నాడో
యః సర్వ దేవాత్మా ఎవడు సర్వ దేవతలకు ఆత్మయో

[NOTE: దేవతలు అంటే ధర్మములు (Functions or Properties). సృష్టిలోని అన్ని ధర్మములకు ఎవడు ఆత్మయో..]
యే సర్వే వేద స అంగాః శాఖాః స ఇతిహాస పురాణాః ఎవడు సర్వ వేదములు వాటి అంగములు, శాఖలు మఱియు ఎవడు ఇతిహాసములు, పురాణములు అయిఉన్నాడో
యో జీవ అంతరాత్మా యః సర్వ భూత అంతరాత్మా ఎవడు జీవుని అంతరాత్మయో, ఎవడు సర్వ భూతముల అంతరాత్మయో
యే దేవ అసుర మనుష్యాది భావాః ఎవడు దేవతలు, అసురులు, మనుష్యులు మొదలైన వారి భావములు అయినవాడో
యే మత్స్య కూర్మాది అవతారాః ఎవడు మత్స్య, కూర్మ మొదలైన అవతారములైనవాడో
యో అంతఃకరణ చతుష్టయ ఆత్మా ఎవడు అంతఃకరణ చతుష్టయ (తురీయ) ఆత్మయో
యః చ ప్రాణః యః చ యమః యః చ అంతకః యః చ మృత్యుః యః చ అమృతం మఱియు ఎవడు ప్రాణమో, ఎవడు యముడో, ఎవడు అంతకుడో, ఎవడు మృత్యువో, మఱియు ఎవడు అమృతమో
యాని పంచమహాభూతాని యః స్థావర జంగమ ఆత్మా ఎవడు పంచమహాభూతములు అయినాడో, ఎవడు స్థావర జంగమములకు ఆత్మయో
యే పంచాగ్నయః యాః సప్త మహావ్యాహృతయః ఎవడు పంచాగ్నులైనవాడో, ఎవడు సప్త మహావ్యాహృతులైనవాడో
యా విద్యా యా సరస్వతీ యా లక్ష్మీః యా గౌరీ యా జానకీ ఏది విద్యయో, ఏది సరస్వతియో, ఏది లక్ష్మియో, ఏది గౌరీయో, ఏది జానకియో
యః చ త్రైలోక్యం యః సూర్యః యః సోమః ఎవడు త్రిలోకములో, ఎవడు సూర్యుడో, ఎవడు సోముడో
యాని చ నక్షత్రాణి యే చ నవ గ్రహాః ఏవి నక్షత్రములో, ఏవి నవ గ్రహములో అవి తానే అయినవాడో
యే చ అష్టౌ లోకపాలకాః యే చ అష్టౌ వసవః ఎవరు అష్ట లోకపాలకులో, ఎవరు అష్ట వసువులో
యే చ ఏకాదశ రుద్రాః యే చ ద్వాదశ ఆదిత్యాః ఎవరు ఏకాదశ రుద్రులో, మఱియు ఎవరు ద్వాదశ ఆదిత్యులో
యః చ భూతం భవ్యం భవిష్యత్ ఏది భూతము, భవ్యము, భవిష్యత్తో
యత్ బ్రహ్మాండస్య బహిః వ్యాప్తం ఏది బ్రహ్మాండమునకు బాహ్యమున వ్యాప్తమో
యో హిరణ్యగర్భః యా ప్రకృతిః యః చ ఓంకారః ఎవడు హిరణ్యగర్భుడో, ఎవడు ప్రకృతియో, మఱియు ఎవడు ఓంకారమో
యాః చ తస్రో అర్ధమాత్రాః యః పరమపురుషః ఎవడు ప్రణవములో అర్ధమాత్రా రూపుడు, ఎవడు పరమపురుషుడో
యః చ మహేశ్వరః యః చ మహాదేవః ఎవడు మహేశ్వరుడో, మహాదేవుడో
య ఓం నమో భగవతే వాసుదేవాయ యో మహావిష్ణుః ఎవడు “ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రార్థ స్వరూపుడో, ఎవడు మహావిష్ణువో
యః పరమాత్మా యో విజ్ఞానాత్మా ఎవడు పరమాత్మో, ఎవడు విజ్ఞానాత్మో
ఓం యో హ వై శ్రీరామచంద్రః స భగవాన్ అతడే ఓంకారుడు, భగవంతుడు అయిన శ్రీరామచంద్రుడు
అద్వైత పరమానంద ఆత్మాయః సత్ చిత్ ఆనంద అద్వైత ఏక చిదాత్మా అద్వైత పరమానంద ఆత్మయు, సత్ చిత్ ఆనంద అద్వైత ఏక చిదాత్మయు
భూః భువః సువః తస్మై వై నమో నమః - ఇతి భూ, భువ, సువ (మొదలగు లోకములన్నీ) తానే అయి ఉన్నవానికి నమస్కారము
తాన్ బ్రహ్మా అబ్రవీత్ అష్ట చత్వారింశత్ మంత్రైః నిత్యం దేవం స్తువం బ్రహ్మ చెప్పిన ఈ నలుబది ఎనిమిది (48) మంత్రములచే నిత్యము దేవుని స్తుతించినచో
తస్య దేవః ప్రీతో భవతి స్వాత్మానం దర్శయతి దానిచే దైవము (శ్రీరాముడు) ప్రీతి పొంది స్వాత్మ యందు దర్శనమీయును
తస్మాత్ ఆద్య ఏతైః మంత్రైః నిత్యం దేవం స్తౌతి కావున ఆద్యుడైన దైవమును (శ్రీరాముని) ఎవడు నిత్యము ఈ మంత్రములతో స్తుతించునో
స దేవం పశ్యతి సో అమృతత్వం చ గచ్ఛతి అతడు దైవమును (శ్రీరాముని) దర్శించును, మఱియు అతడు అమృతత్వము పొందును
ఇతి మహోపనిషత్ అనునది ఈ మహోపనిషత్
9 శ్రీరామచంద్ర షడక్షర మంత్రరాజము
అథ హ ఏనం భారద్వాజో యాజ్ఞవల్క్యం ఉపసమేతి ఉవాచ - అప్పుడు ఆ భారద్వాజుడు యాజ్ఞవల్క్యుని సమీపించి ఇట్లు పలికెను -
శ్రీరామ మంత్రరాజస్య మాహాత్మ్యం అనుబ్రూహి ఇతి శ్రీరామ మంత్రరాజము యొక్క మహత్యము దయచేసి చెప్పుము
స హ ఉవాచ యాజ్ఞవల్క్యః - అతనితో యాజ్ఞవల్క్యుడు ఈ విధంగా చెప్పెను -
స్వప్రకాశః పరంజ్యోతిః స్వానుభూతి ఏక చిన్మయః స్వప్రకాశుడు, పరంజ్యోతి స్వరూపుడు, స్వానుభూతి రూపుడు (స్వానుభవముచే మాత్రమే తెలియబడువాడు), ఏక చిన్మయుడు
తత్ ఏవ రామచంద్రస్య మనో ‘రా’ ఆది అక్షరః స్మృతః తత్ (పరబ్రహ్మము) అయిన శ్రీరామచంద్రుని యొక్క మంత్రమునకు ప్రథమ అక్షరమే (రా) స్మృతి (ధర్మశాస్త్రము)
అఖండ ఏకరస ఆనందః తారకబ్రహ్మ వాచకః (రాం) అఖండ ఏకరస ఆనందము, తారకబ్రహ్మ వాచకము
రామాయ ఇతి సువిజ్ఞేయః సత్యానంద చిదాత్మకః రామాయ అనునది సువిజ్ఞేయము, సత్యానంద చిదాత్మకము
నమః పదంతు విజ్ఞేయం పూర్ణ ఆనంద ఏక కారణం నమః అను పదము విజ్ఞేయము, పూర్ణ ఆనంద ఏక కారణము
సదా నమంతి హృదయే సర్వే దేవా ముముక్షవః ఇతి సర్వ దేవతలు, ముముక్షువులు ఎల్లప్పుడూ వారి హృదయములయందు నమస్కరించుచుందురు
10 శ్రీరామచంద్ర షడక్షర మంత్రరాజము యొక్క మహత్యము
య ఏవం మంత్రరాజం శ్రీరామచంద్ర షడక్షరం నిత్యం అధేతే ఎవడు ఈ శ్రీరామచంద్ర షడక్షర మంత్రరాజమును (రాం రామాయ నమః) నిత్యము అధ్యయనము చేయునో
సో అగ్నిపూతో భవతి స వాయుపూతో భవతి స ఆదిత్యపూతో భవతి స సోమపూతో భవతి అతడు అగ్నిపూతుడు (అగ్నిచే / అగ్ని వలె పవిత్రుడు) అగును, వాయుపూతుడు అగును, ఆదిత్యపూతుడు అగును, సోమపూతుడు అగును
స బ్రహ్మపూతో భవతి స విష్ణుపూతో భవతి స రుద్రపూతో భవతి అతడు బ్రహ్మపూతుడు అగును, విష్ణుపూతుడు అగును, రుద్రపూతుడు అగును
స సర్వైః దేవైః జ్ఞాతో భవతి అతడు సర్వ దేవతలును తెలుసుకొనువాడు అగును
స సర్వ క్రతుభిః ఇష్టవాన్ భవతి అతడు సర్వ క్రతువులు పూర్తి చేసినవాడు అగును

తేన ఇతిహాస పురాణానాం రుద్రాణాం శతసహస్రాణి జప్తాని సఫలాని భవంతి

అతడు ఇతిహాస పురాణములు, రుద్రములు లక్షసార్లు జపించిన సఫలములు పొందినవాడగును
శ్రీరామచంద్ర అనుస్మరణేన గాయత్ర్యాః శతసహస్రాణి జప్తాని ఫలాని భవంతి శ్రీరామచంద్రుని సంస్మరించినవాడు గాయత్రీ మంత్రమును లక్షసార్లు జపించిన ఫలితములు పొందును
ప్రణవా నామయుత కోటి జపా భవంతి ప్రణవము నామయుతముగా కోటిసార్లు జపించిన ఫలితము కలుగును
దశ పూర్వాన్ దశోత్తరాన్ పునాతి అతని పూర్వీకులు పది తరములవారు, అతని తరువాత పది తరములవారు పవిత్రము అగుదురు
స పంక్తిపావనో భవతి అతడు ఉన్న సమాజము పవిత్రమగును
స మహాన్ భవతి సో అమృతత్వం చ గచ్ఛతి ఇతి అతడు మహానుభావుడు అగును, మఱియు అతడు అమృతత్వము పొందును
11 రామ మంత్ర అధ్యయన ఫలితము
అత్ర ఏతే శ్లోకా భవంతి ఇక్కడ ఈ విషయములో శ్లోకములు కలవు
గాణపత్యేషు శైవేషు శాక్తసౌరేషు అభీష్టదః గాణపత్యమునందు, శైవమునందు, శాక్తసౌరములయందు అభీష్టములు ఇచ్చును
వైష్ణవేషు అపి సర్వేషు రామమంత్రః ఫల అధికః వైష్ణవమునందు, సర్వ సంప్రదాయములందు కూడా రామమంత్రము అధికమైన ఫలము కలది
గాణపత్యాది మంత్రేషు కోటికోటి గుణ అధికః గాణపత్యాది మంత్రములందు రామ మంత్రము కోటి కోటి రెట్లు గుణముచే అధికమైనది
మంత్రః తేషు అపి అనాయాస ఫలదో అయం షడక్షరః మంత్రములందు ఈ షడక్షర మంత్రము అనాయాస ఫలమును ఇచ్చునది
షడక్షరో అయం మంత్రః స్యాత్ సర్వ అఘౌఘ నివారణః షడక్షరమైన ఈ మంత్రము సర్వ పాపములను నివారించునది
మంత్రరాజ ఇతి ప్రోక్తః సర్వేషాం ఉత్తమోత్తమః మంత్రరాజము అని చెప్పబడునది, సర్వ మంత్రములలో ఉత్తమోత్తమమైనది
కృతం దినే యత్ దురితం పక్ష మాసః తు వర్షజం ఒక దినము, పక్షము, మాసము, సంవత్సరములో చేసిన దురితములు
సర్వం దహతి నిశ్శేషం (నిఃశేషం) తులారాశిం (తులా అచలం) ఇవ అనలః సర్వమునూ నిశ్శేషముగా (ఆ పాప) తులారాశిని అగ్ని వలె దహించును
బ్రహ్మహత్యా సహస్రాణి జ్ఞాన అజ్ఞాన కృతాని చ తెలిసి తెలియక చేసిన వేలాది బ్రహ్మహత్యా పాపములనైనా, మఱియు
స్వర్ణ స్తేయ సురాపాన గురుతల్ప ఆయుతాని చ స్వర్ణము దొంగిలించిన పాపము, సురాపానము మఱియు గురుతల్పముపై శయనించిన పాపములు
కోటి కోటి సహస్రాణి ఉపపాతకజాని అపి కోటి కోటి వేలాది ఉపపాతకములు (చిన్న పాపములు) కూడా
సర్వాణి అపి ప్రణశ్యంతి రామమంత్ర అనుకీర్తనాత్ సర్వ దురితములు కూడా రామమంత్రము (భావ యుక్తముగా) స్మరించుటచే నశింపగలవు
భూత ప్రేత పిశాచాద్యాః కూశ్మాండ గ్రహ రాక్షసాః దూరాది భూత ప్రేత పిశాచాదులు, కూశ్మాండ గ్రహ రాక్షసులను దూరముగా
ఏవ ప్రధావంతి రామమంత్ర ప్రభావతః తరిమికొట్టగలది ఈ శ్రీరామ మంత్ర ప్రభావము
12 శ్రీరామ షడక్షర మంత్ర ఫలశృతి
ఐహ లౌకికం ఐశ్వర్యం స్వర్గాద్యం పారలౌకికం కైవల్యం భగవత్త్వం చ మంత్రో అయం సాధయిష్యతి ఇహ లోక ఐశ్వర్యమును, స్వర్గసుఖమును, పారలౌకికమును కైవల్యమును మఱియు భగవత్త్వమును ఈ మంత్రము సాధించుచున్నది
గ్రామ్య అరణ్య పశుఘ్నత్వం సంచితం దురితం చ యత్ మద్యపానేన యత్ పాపం తదపి అశు వినాశయేత్ గ్రామమునందు, అరణ్యమునందు ఉన్న పశువులను చంపటం హింసించటం వంటి సంచిత దురితములను మద్యపానము చేసిన పాపమును కూడా, ఏ కొంచెము లేకుండా రామ మంత్ర జపము వినాశము చేయును
అభక్ష్య భక్షణ ఉత్పన్నం మిథ్యా జ్ఞాన సముద్భవం సర్వం విలీయతే రామ మంత్రస్య అస్య ఏవ కీర్తనాత్ తినకూడని పదార్థములు తినటము వలన ఉద్భవించిన పాపము, మిథ్యా జ్ఞానముచేత సముద్భవించిన పాపము ఈ రామ మంత్రము యొక్క కీర్తనము చేత సర్వ పాపములు నశింపచేయును
శ్రోత్రియ స్వర్ణ హరణాద్యత్ చ పాపం ఉపస్థితం రత్న ఆదేశః చ అపహారేణ తదపి అశు వినాశయేత్ వేద బ్రాహ్మణుని స్వర్ణమును దొంగిలించుట చేత కలుగు పాపమును రత్నములను దొంగిలించిన పాపమును కూడా రామ మంత్రము నశింపచేయును
బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం శూద్రం హత్వా చ కిల్బిషం సంచిత ఇతి నరో మోహాది అద్యత్ తదపి నాశయేత్ బ్రాహ్మణుని, క్షత్రియుని, వైశ్యుని మఱియు శూద్రుని చంపిన పాపమును సంచితమైన పాపమును, మోహముచేత చేసిన పాపమును కూడా నశింపచేయును
గత్వా అపి మాతరం మోహాత్ అగమ్యాః చ ఏవ యోషితః ఉపాస్యానేన మంత్రేణ రామః తదపి నాశయేత్ తల్లి వంటి స్త్రీని మోహించిన పాపమును, అగమ్యస్త్రీలను, పరదారలను కామించిన పాపమును రామ మంత్ర ఉపాసన చేత అవి కూడా నశించును
మహా పాతక పాపిష్ఠ సంగత్యా సంచితం చ యత్ నాశయేత్ తత్ కథా ఆలాప శయన ఆసన భోజనైః సంచిత మహా పాతక పాపిష్ఠ సంగత్యములు అట్టి సంగతి కథ ఆలాప, శయన, ఆసన, భోజనముల వలన కలిగిన పాపములను నశింపచేయును
పితృ మాతృ వధ ఉత్పన్నం బుద్ధిపూర్వం అఘం చ యత్ తత్ అనుష్ఠాన మాత్రేణ సర్వం ఏతత్ విలేయతే బుద్ధి పూర్వకముగా చేసిన పితృ మాతృ వధ చేత (లేదా అవమానించుట చేత) ఉత్పన్నమైన పాపమును దాని (శ్రీరామ షడక్షర మంత్ర) అనుష్ఠాన మాత్రము చేత అటువంటి సర్వ పాపములు నశించును
యత్ ప్రయాగాది తీర్థో ఉక్త ప్రాయశ్చిత్త శతైః అపి న ఏవ అపనోద్యతే పాపం తదపి అశు వినాశయేత్ ఏవి ప్రయాగ మొదలైన తీర్థములలో చెప్పు శతాది ప్రాయశ్చిత్తములు (కేవల రామ మంత్రము చెప్పి) ఆ పాపములను తొలగించుకోవచ్చు
పుణ్యక్షేత్రేషు సర్వేషు కురుక్షేత్రాదిషు స్వయం బుద్ధిపూర్వం అఘం కృత్వా తదపి అశు వినాశయేత్ పుణ్యక్షేత్రములందు సర్వ కురుక్షేత్రములందు స్వయముగా బుద్ధిపూర్వకముగా చేసిన పాపములను కూడా నశింపచేయును
కృచ్ఛ్రైః తప్త పరాకాద్యైః నానా చాంద్రాయణైః అపి పాపం చ న అపనోద్యం యత్ తదపి అశు వినాశయేత్ కృచ్ఛ్ర చాంద్రాయణ తపస్సు మొదలైనవాటితో పోని పాపములు కూడా తొలగించి వినాశము చేయును

[కృచ్ఛ్ర చాంద్రాయణ తపస్సు అనగా ప్రతి రోజు చంద్రుని వృద్ధి హీనతల క్రమము అనుసరించి ఆహారము పెంచుతూ తగ్గిస్తూ భుజించినచో శరీర అరోగ్యము కాపాడబడుచూ మనస్సు సత్త్వరూపము పొందును]
ఆత్మ తుల్య సువర్ణాది దానైః బహువిధైః అపి కించిత్ అపి అపరిక్షీణం తత్ అపి అశు వినాశయేత్ ఆత్మ తుల్యమైన (తన బరువంత తూగే) సువర్ణ దానములు బహువిధములుగా చేసినా కొంచెము కూడా పోని పాపములు సైతం పోగొట్టును
అవస్థా త్రితయేషు ఏవం మూలబంధం అఘం చ యత్ అవస్థా త్రయములలో (జాగృత్, స్వప్న, సుషుప్తులలో) చేసిన మూల బంధముగా (మూల అజ్ఞానముతో సంస్కార రూపముగా) ఉన్న పాపమును
తత్ మంత్ర ఉపదేశేన సర్వం ఏతత్ ప్రణశ్యతి సర్వము కూడా ఆ రామ మంత్ర ఉపదేశము చేత నశింప చేసుకొనవచ్చును
ఆబ్రహ్మ బీజ దోషాః చ నియమ అతిక్రమ ఉద్భవాః నియమ అతిక్రమము చేత కలిగిన బ్రహ్మ (సృష్టి) బీజ దోషములు
స్త్రీణాం చ పురుషాణాం చ మంత్రేణ అనేన నాశితాః స్త్రీలను మఱియు పురుషులను ఈ మంత్రము చేత వారి దోషములు నశించును
యేషు యేషు అపి దేశేషు రామభద్ర ఉపాస్యతే ఎక్కడెక్కడ ప్రదేశములలో రామభద్రుని ఉపాసించెదరో
దుర్భిక్షాదేః భయం తేషు న భవేత్ తు కదాచన దుర్భిక్షములు కలుగునన్న భయం వారికి ఉండదు
శాంతః పసన్న వదనో న క్రోధో భక్తవత్సలః శాంతుడు, ప్రసన్న వదనుడు, క్రోధ రహితుడు, భక్తవత్సలుడు
అనేన సదృశో మంత్రో జగత్స్వపి న విద్యతే అయిన రాముని యొక్క మంత్రమునకు సమానము జగత్తు అంతా కూడా మరొకటి లేదు
సమ్యక్ ఆరాధితో రామః ప్రసీదత ఏవ సత్వరం బాగుగా ఆరాధించినచో రాముడు సత్వరమే ప్రసన్నత చెంది
దదాతి ఆయుష్యం ఐశ్వర్యం అంతే విష్ణుపదం చ యత్ ఆయుష్షును, ఐశ్వర్యమును, చివరిలో విష్ణుపదమును ఇచ్చును
తత్ ఏతత్ ఋచ అభియుక్తం ఇది ఈ విధముగా ఋక్కులలో యుక్తముగా చెప్పబడినది
ఋచో అక్షరే పరమే వ్యోమన్ వేద అక్షరములలో ఈ పరమ వాక్యము చెప్పబడెను
యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుః ఇందులో (రామ మంత్రములో) విశ్వే దేవతలు అధిష్ఠానమై ఉందురు
యః తత్ న వేద కిం ఋచా కరిష్యతి ఎవరు దానిని (రామ మంత్ర మహత్యమును) తెలుసుకొనరో వారు ఋక్కులతో ఏమి చేసుకొనెదరు?
య ఇత్ తత్ విదుః త ఇమే సమాసతే ఎవరు దానిని తెలుసుకునెదరో వారు ఇక్కడే వచ్చి ఉండెదరు (రామ పదమును ఆశ్రయించెదరు)
తత్ విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః ఆ విష్ణువు పరమ పదమును ఆత్మవిదులు సదా చూచుచుందురు
దివి ఇవ చక్షుః ఆతతం ఆకాశము వలె అంతటా కన్నులు విస్తరించుకొని చూచెదరు
తత్ విప్రాసో విపన్యవో జాగృవాం సః సమింధతే దానిని విప్రులు (తెలుసుకున్నవారు) సంతోషముతో జాగరూకులై వారు ప్రకాశించుచున్నారు
విష్ణోః యత్ పరమం పదం ఏది విష్ణువు యొక్క ఆ పరమపదమో (దానిని పొందుచున్నారు)!
ఓం సత్యం ఇతి ఉపనిషత్ ఓంకారమే సత్యము, ఇది ఈ ఉపనిషత్తు
రామ ఉత్తర తాపినీ ఉపనిషత్ సమాప్తా రామ ఉత్తర తాపినీ ఉపనిషత్తు సమాప్తము


రామ ఉత్తర తాపినీ ఉపనిషత్ - సారాంశ పుష్పమ్

రామ ఉత్తర తాపినీ ఉపనిషత్ సమాప్తము



Rȃma Uttara Tȃpini Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com