Tripȃd Vibhooti Mahȃ Nȃrȃyana Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com
విషయ సూచిక :
ఉపనిషత్ పరిచయ శ్లోకము |
|
---|---|
యత్ర అపహ్నవతాం యాతి స్వ అవిద్యా పద విభ్రమః | అవిద్యా స్థితులలో ఉన్న తన (అధ్యాయి) యొక్క మతి భ్రమణము ఎక్కడకు వెళ్లి పూర్తిగా ఆగి లయించిపోవునో |
త్రిపాద్ నారాయణ ఆఖ్యాం తత్ స్వ మాత్రం అవశిష్యతే | త్రిపాద్ నారాయణ నామముతో చెప్పబడిన ఈ ఉపనిషత్ అక్కడకు (నారాయణ పదమునకు) తన (అధ్యాయి) యొక్క మతిని చేర్చి లయింపచేయును. |
NOTE: పౌరాణికముగా భాగవతములోని బలి చక్రవర్తి ఆఖ్యానమునందు, వామన అవతారములో ఒక అడుగుతో భూమండలమును, రెండో అడుగుతో మిగిలిన విశ్వమంతటినీ, మూడో అడుగుతో అహంకార పూరిత అంతరంగమును కొలచి సర్వమూ తనలోనే ఉన్నదని ప్రకటిస్తూ, సర్వమునకు తాను వేరై ఉన్న తత్త్వము త్రిపాద్విభూతి మహానారాయణుడు. కానీ, ఈ ఉపనిషత్తులో పరమ తత్త్వము అర్థం చేసుకొనుటకు అపరిమిత, అఖండ పరబ్రహ్మమును కొలత బద్దతలేని నాలుగు పాదములుగా (అంశలు, Facets) కల్పించబడినది. మొదటిది, క్రిందదియైన అవిద్యా పాదమందు కార్యకారణజాలము, అండ పిండ బ్రహ్మాండములన్నీ ప్రకటితమైనవి. ఇతరములైన విద్య, ఆనంద, తురీయ పాద త్రయము సర్వాతీత మోక్ష స్థానమునకు ప్రతీకము. వస్తు జాలమంతా ఆకాశము (Space) యందే ఉన్నా, ఆకాశము వాటిచే స్పృశించబడదు. అట్లే త్రిపాద్విభూతి మహానారాయణుడు తానే దృశ్య కోటి అగుచూ దానికి అతీతముగా ఉన్నాడు. అదే ప్రతీ జీవుని, ప్రతీ వస్తువు యొక్క వాస్తవ పరమ తత్త్వ స్వరూపము అని ఈ ఉపనిషత్తుచే నిరూపించబడినది. ఈశ్వరుడు విద్యా అవిద్యా స్వరూపుడు. బ్రహజ్ఞానమే విద్యగా, మిగిలిన అన్ని విషయ జ్ఞానములు అవిద్యగా వేదాంతులచే వర్ణించబడును. కేవలము విషయ జ్ఞానములలో మతి భ్రమణము చేయుచున్నవానికి ఈ ఉపనిషత్ అధ్యయనము చేయుటచేత తన యొక్క మహానారాయణ పరమపదమునందు మతి లయించును. |
1.1 పరమతత్త్వము గురించి బ్రహ్మదేవుని ప్రశ్న |
|
---|---|
ఓం అథ పరమ తత్త్వ రహస్యం జిజ్ఞాసుః పరమేష్ఠీ | ఓం. అప్పుడు పరమ తత్త్వ రహస్యమును జిజ్ఞాసతో తెలుసుకొనగోరి పరమేష్ఠి (బ్రహ్మదేవుడు) |
దేవమానేన సహస్ర సంవత్సరం తపః చచార | దేవమాన కాలము ప్రకారము వేయి సంవత్సరములు తపించెను |
సహస్ర వర్షే అతీతే అతి ఉగ్ర తీవ్ర తపసా ప్రసన్నం భగవంతం మహావిష్ణుం బ్రహ్మా పరిపృచ్ఛతి - | వేయి సంవత్సరములు నిండిన తరువాత అతి ఉగ్రమైన ఆ తపస్సకు ప్రసన్నుడైన భగవంతుడైన మహావిష్ణువుని బ్రహ్మదేవుడు పరిప్రశ్నించెను - |
భగవన్ పరమ తత్త్వ రహస్యం మే బ్రూహి ఇతి. | భగవాన్! పరమ తత్త్వ రహస్యమును నాకు వివరించుము - అని. [Fundamentally, what is the essence of everything at core?] |
1.2 బ్రహ్మదేవుడు చేయు మహావిష్ణు స్తుతి |
|
---|---|
పరమ తత్త్వ రహస్యస్య వక్తా త్వం ఏవ, న అన్యః కశ్చిత్ అస్తి | పరమ తత్త్వ రహస్యమును చెప్పగలిగినది నీవు మాత్రమే, మరి ఎవ్వరూ లేరు. |
తత్ కథం ఇతి తత్ ఏవ ఉచ్యతే | అది ఎట్లు అనగా అదే (ఇప్పుడు) చెప్పబడుచున్నది. |
త్వం ఏవ సర్వజ్ఞః, త్వం ఏవ సర్వశక్తిః | నీవే సర్వజ్ఞుడవు, నీవే సర్వశక్తివి |
త్వం ఏవ సర్వ ఆధారః, త్వం ఏవ సర్వ స్వరూపః | నీవే సర్వమునకు ఆధారుడవు, నీవే సర్వ స్వరూపుడవు |
త్వం ఏవ సర్వ ఈశ్వరః, త్వం ఏవ సర్వ ప్రవర్తకః | నీవే సర్వమునకు ఈశ్వరుడవు, నీవే సర్వముగా ప్రవర్తించువాడవు |
త్వం ఏవ సర్వ పాలకః, త్వం ఏవ సర్వ నివర్తకః | నీవే సర్వమును పాలించువాడవు, నీవే సర్వమును లయింపచేయువాడవు |
త్వం ఏవ సత్ అసత్ ఆత్మకః, త్వం ఏవ సత్ అసత్ విలక్షణః | నీవే సత్ అసత్తులకు ఆత్మవు, నీవే సత్ అసత్ వివిధ విశేష లక్షణములు ప్రకటించుకొనుచున్నవాడవు |
త్వం ఏవ అంతః బహిః వ్యాపకః, త్వం ఏవ అతి సూక్ష్మతరః | నీవే అంతరమున బాహ్యమున వ్యాపించినవాడవు, నీవే సూక్ష్మాతి సూక్ష్మము |
త్వం ఏవ అతి మహతో మహీయాన్ | నీవే (నా బుద్ధికి తోచుచున్న) అత్యంత మహత్తరము కన్నా మహత్తరుడవు |
త్వం ఏవ అసి మూల అవిద్యా విరహః, త్వం ఏవ సర్వ మూలా అవిద్యా నివర్తకః | నీవే మూల అవిద్యను వదిలింపచేయగలవాడవు, నీవే మూల అవిద్యను లయింపచేయగలవాడవు [నేను పరిమితుడను అను దృఢభావమే మూల అవిద్య] |
త్వం ఏవ విద్యా ఆధారకః, త్వం ఏవ విద్యా వేద్యః | నీవే విద్యకు ఆధారుడవు, నీవే విద్యను తెలిసినవాడవు |
త్వం ఏవ విద్యా స్వరూపః, త్వం ఏవ విద్యా అతీతః | నీవే విద్యా స్వరూపుడవు, నీవే విద్యకు అతీతుడవు |
త్వం ఏవ సర్వ కారణ హేతుః, త్వం ఏవ సర్వ కారణ సమిష్టిః | నీవే సర్వ కారణములకు మూలకారణము, నీవే సర్వ కారణ సమిష్టివి |
త్వం ఏవ సర్వ కారణ వ్యష్టిః, త్వం ఏవ అఖండ ఆనందః | నీవే సర్వ కారణ వ్యష్టివి, నీవే అఖండ అనంద స్వరూపుడవు |
త్వం ఏవ పరిపూర్ణ ఆనందః, త్వం ఏవ నిరతిశయ ఆనందః | నీవే పరిపూర్ణ ఆనంద స్వరూపుడవు, నీవే సాటి లేని ఆనంద స్వరూపుడవు |
త్వం ఏవ తురీయ తురీయః, త్వం ఏవ తురీయ అతీతః | నీవే తురీయమునకు తురీయుడవు, నీవే తురీయమునకు అతీతుడవు |
త్వం ఏవ అనంత ఉపనిషద్ విమృగ్యః | నీవే అనంత ఉపనిషత్తులచే అన్వేషించబడుచున్నవాడవు |
త్వం ఏవ అఖిల శాస్త్రైః విమృగ్యః | నీవే అఖిల శాస్త్రములచే అన్వేషించబడుచున్నవాడవు |
త్వం ఏవ బ్రహ్మ ఈశాన పురందర పురోగమైః | నీవే బ్రహ్మ, రుద్ర, పురందరుడు (ఇంద్రుడు) వీరికి మునుముందే ఉన్నవాడవు |
అఖిల అమరైః అఖిల ఆగమైః విమృగ్యః | అఖిల అమరులచేత, అన్ని ఆగమ శాస్త్రములచే అన్వేషించబడుచున్నవాడవు |
త్వం ఏవ సర్వ ముముక్షుభిః విమృగ్యః | నీవే సర్వ ముముక్షువులచే అన్వేషించబడుచున్నవాడవు |
త్వం ఏవ అమృతమయైః విమృగ్యః |
నీవే అమృతమయులచే (దేవతలచే) అన్వేషించబడుచున్నవాడవు |
త్వం ఏవ అమృతమయః, త్వం ఏవ అమృతమయః, త్వం ఏవ అమృతమయః | నీవే అమృతమయుడవు, నీవే అమృతమయుడవు, నీవే అమృతమయుడవు |
త్వం ఏవ సర్వం, త్వం ఏవ సర్వం, త్వం ఏవ సర్వం | నీవే సర్వము, నీవే సర్వము, నీవే సర్వము |
త్వం ఏవ మోక్షః, త్వం ఏవ మోక్షదః, త్వం ఏవ అఖిల మోక్ష సాధనం | నీవే మోక్షమువు, నీవే మోక్ష ప్రసాదకుడవు, నీవే అఖిల మోక్ష సాధనము [మోక్షము అనగా అజ్ఞాన గ్రంథులు (blocks of ignorance) నుండి బుద్ధి విడివడుట] |
న కించిత్ అస్తి త్వత్ వ్యతిరిక్తం | నీకంటే వేరుగా ఏదీ లేదు |
త్వత్ వ్యతిరిక్తం యత్ కించిత్ ప్రతీయతే తత్ సర్వం బాధితం ఇతి నిశ్చితం | నీకంటే వేరుగా ఏ కించిత్ ఉన్నదనిపించినా అది అంతయూ అసంబద్ధము. ఇది నిశ్చితము. |
తస్మాత్ త్వం ఏవ వక్తా, త్వం ఏవ గురుః | అందుచేత నీవే (పరమ తత్త్వ రహస్యము చెప్పుటకు) వక్తవు, నీవే గురుడవు |
త్వం ఏవ పితా, త్వం ఏవ సర్వ నియంతా, | నీవే తండ్రివి, నీవే సర్వ నియంతవు |
త్వం ఏవ సర్వం, త్వం ఏవ సదా ధ్యేయ ఇతి సునిశ్చితః | నీవే సర్వము, నీవే సర్వదా తెలియబడువాడవు. ఇది సునిశ్చితము. |
1.3 ప్రసన్నుడైన మహావిష్ణువు చెప్పనారంభించుట |
|
---|---|
పరమ తత్త్వజ్ఞః తం ఉవాచ మహావిష్ణుః అతి ప్రసన్నో భూత్వా | ఆ విధముగా బ్రహ్మదేవుడు స్తుతించగా పరమ తత్త్వజ్ఞుడైన మహావిష్ణువు అతి ప్రసన్నుడై |
సాధు సాధు ఇతి సాధు ప్రశగ్ంసా పూర్వకం | "బాగు, బాగు!" అని సాధు ప్రశంసా పూర్వకముగా |
సర్వం పరమ తత్త్వ రహస్యం తే కథయామి | పరమ తత్త్వ రహస్య సర్వమూ నీకు చెప్పెదను |
సావధానేన శృణు, బ్రహ్మన్! | సావధానుడవై వినుము, బ్రహ్మదేవా! |
దేవదర్శీ ఇతి ఆఖ్యా అథర్వ శాఖాయాం పరమ తత్త్వ రహస్య ఆఖ్యా | దేవదర్శి అని చెప్పబడు అథర్వ (వేద) శాఖలోని పరమ తత్త్వ రహస్యము అని చెప్పబడు |
అథర్వణ మహానారాయణ ఉపనిషది గురు శిష్య సంవాదః పురాతనః ప్రసిద్ధతయా జాగర్తి | అథర్వణ మహానారాయణ ఉపనిషత్తులో గురు శిష్య సంవాదము పురాతనమై ప్రసిద్ధమై జాగృతమై ఉన్నది |
పురా తత్ స్వరూప జ్ఞానేన మహాంతః సర్వే బ్రహ్మభావం గతాః | పూర్వము దాని స్వరూప జ్ఞానముచే మహాత్ములు అందరూ బ్రహ్మభావము పొందినారు |
యస్య శ్రవణేన సర్వ బంధాః ప్రవినశ్యంతి | దేనిని శ్రవణము చేయుటచే సర్వ బంధములు సమూలముగా నశించునో |
యస్య జ్ఞానేన సర్వ రహస్యం విదితం భవతి | దేని యొక్క జ్ఞానముచే సర్వ రహస్యము విదితమగునో |
తత్ స్వరూపం కథం ఇతి | దాని స్వరూపము ఎట్టిదనదో చెప్పుచున్నాను |
1.4 పరమతత్త్వమైన పరబ్రహ్మము యొక్క వర్ణన |
|
---|---|
శాంతో దాంతో అతివిరక్తః సుశుద్ధో గురుభక్తః తపోనిష్ఠః శిష్యో బ్రహ్మనిష్ఠం గురుం ఆసాద్య | శాంతుడు, నిగ్రహసంపన్నుడు, అతివిరక్తుడు, సుశుద్ధుడు, గురుభక్తి గలవాడు, తపోనిష్ఠుడు అయిన శిష్యుడు బ్రహ్మనిష్ఠుడైన గురువు వద్దకు చేరి |
ప్రదక్షిణ పూర్వకం దండవత్ ప్రణమ్య ప్రాంజలిః భూత్వా వినయేన ఉపసంగమ్య | ఎదురుగా వచ్చి, సాష్టాంగ ప్రణామము చేసి, దోసిలితో అంజలి ఘటించి, వినయముగా దగ్గరకు చేరి |
భగవన్! గురో! మే పరమతత్త్వ రహస్యం వివిచ్య వక్తవ్యం ఇతి | భగవాన్! గురుదేవా! నాకు పరమ తత్త్వ రహస్యము బాగుగా నిర్ణయించి చెప్పవలసినది అనెను. |
అతి ఆదర పూర్వకం అతి హర్షేణ శిష్యం బహూకృత్య గురుః వదతి | అతి ఆదరపూర్వకముగా, అతి సంతోషముతో, శిష్యుని అనేక విధములుగా అభినందించి గురువు ఈ విధముగా చెప్పెను. |
పరమతత్త్వ రహస్య ఉపనిషత్ క్రమః కథ్యతే | పరమ తత్త్వ రహస్య ఉపనిషత్ క్రమము ఎట్టిదనగా |
సావధానేన శ్రూయతాం | సావధానముగా వినుము |
కథం బ్రహ్మ? | బ్రహ్మము ఎట్టిది? అనగా |
కాలత్రయా అబాధితం బ్రహ్మ, సర్వకాల అబాధితం బ్రహ్మ, | (భూత, భవిష్యత్, వర్తమానము అను) మూడు కాలములచే బాధించబడనిది బ్రహ్మము, సర్వ కాలముచే స్పృశించబడనిది బ్రహ్మము |
సగుణ నిర్గుణ స్వరూపం బ్రహ్మ | సగుణ నిర్గుణ స్వరూపము బ్రహ్మము |
ఆది మధ్య అంత శూన్యం బ్రహ్మ | ఆదిమధ్యాంత రహితము బ్రహ్మము |
సర్వం ఖలు ఇదం బ్రహ్మ | సర్వమూ కూడా నిక్కముగా బ్రహ్మమే |
మాయాతీతం గుణాతీతం బ్రహ్మ | మాయాతీతము, గుణాతీతము బ్రహ్మము |
అనంతం అప్రమేయ అఖండ పరిపూర్ణం బ్రహ్మ | అనంతము, అప్రమేయము, అఖండము, పరిపూర్ణము బ్రహ్మము |
అద్వితీయ పరమానంద శుద్ధ బుద్ధ ముక్త సత్య స్వరూప వ్యాపక అభిన్న అపరిచ్ఛిన్నం బ్రహ్మ | అద్వితీయము, పరమానందము, శుద్ధ బుద్ధము (Absolute Consciousness), ముక్తము, సత్య స్వరూపము, సర్వ వ్యాపకము, అభిన్నము, అపరిచ్ఛిన్నము బ్రహ్మము |
సత్ చిత్ ఆనంద స్వప్రకాశం బ్రహ్మ | సత్ చిత్ ఆనంద స్వప్రకాశము బ్రహ్మము |
మనో వాచాం అగోచరం బ్రహ్మ | మనస్సుకు వాక్కునకు గోచరము కానిది బ్రహ్మము |
అఖిల ప్రమాణ అగోచరం బ్రహ్మ | అన్ని ప్రమాణాలకు అగోచరము బ్రహ్మము |
అమిత వేదాంత వేద్యం బ్రహ్మ | అమిత వేదాంత వేద్యము బ్రహ్మము |
దేశతః కాలతో వస్తుతః పరిచ్ఛేద రహితం బ్రహ్మ | దేశము (space) చేత, కాలము (time) చేత, వస్తువు (object) చేత పరిచ్ఛేద రహితము బ్రహ్మము |
సర్వ పరిపూర్ణం బ్రహ్మ | సర్వము పరిపూర్ణముగా బ్రహ్మమే అయి ఉన్నది |
తురీయం నిరాకారం ఏకం బ్రహ్మ | తురీయము (జాగృత్, స్వప్న, సుషుప్తి అను మూడు స్థితులకు సాక్షియైన నాలుగవది), నిరాకారము, ఏకము బ్రహ్మము |
అద్వైతం అనిర్వాచ్యం బ్రహ్మ | అద్వైతము, నిర్వచింపలేనిది బ్రహ్మము |
ప్రణవాత్మకం బ్రహ్మ | ప్రణవాత్మకము బ్రహ్మము |
ప్రణవాత్మకత్వేన ఉక్తం బ్రహ్మ | ప్రణవాత్మకత్వముతో చెప్పబడునది బ్రహ్మము |
ప్రణవాది అఖిల మంత్ర ఆత్మకం బ్రహ్మ | ప్రణవము మొదలైన అఖిల మంత్రాత్మకము బ్రహ్మము |
1.5 పరబ్రహ్మము యొక్క నాలుగు పాదములు |
|
---|---|
పాద చతుష్టయ ఆత్మకం బ్రహ్మ | పాద చతుష్టయాత్మకము బ్రహ్మము |
కిం తత్ పాద చతుష్టయం బ్రహ్మ భవతి? | బ్రహ్మమునకు ఆ నాలుగు పాదములు ఏవి అనగా |
అవిద్యా పాదః సువిద్యా పాదః ఆనంద పాదః తురీయ పాదః ఇతి | అవిద్యా పాదము , సువిద్యా పాదము , ఆనంద పాదము , తురీయ పాదము అనునవి [NOTE: పాదము అనునది ఒక కల్పిత విభాగము (అంశ, Facet). అనిర్వచనీయము, అనిర్దేశ్యము అయిన బ్రహ్మము యొక్క పూర్ణత్వమును అర్థం చేసుకొనుటకు గురువు ముందుగా ఒక విధమైన విభజన కల్పించుచున్నాడు.] |
తురీయ పాదః తురీయ తురీయం తురీయాతీతం చ | తురీయ పాదుడు a తురీయ తురీయము మఱియు తురీయాతీతము |
కథం పాద చతుష్టయస్య భేదః? | నాలుగు పాదములకు భేదము ఏమి అనగా |
అవిద్యా పాదః ప్రథమః పాదో, విద్యా పాదో ద్వితీయ, ఆనంద పాదః తృతీయ, తురీయ పాదః తురీయ ఇతి | అవిద్యా పాదము ప్రథమ పాదము, విద్యా పాదము రెండవది, ఆనంద పాదము మూడవది, తురీయ పాదము నాలుగవది |
మూల అవిద్యా ప్రథమ పాదే న అన్యత్ర | మూల అవిద్య ప్రథమ పాదమందు ఉండును, మరే పాదమునందు ఉండదు |
విద్య ఆనంద తురీయ అంశాః సర్వేషు పాదేషు వ్యాప్య తిష్ఠంతి | విద్య, ఆనంద, తురీయ అంశలు అన్ని పాదములందు వ్యాపించి ఉండును |
ఏవం తర్హి విద్యాదీనాం భేదః కథం ఇతి? | కనుక విద్య మొదలగు పాదములకు భేదము ఎట్లు ఉన్నది అనగా |
తత్ తత్ ప్రాధాన్యేన తత్ తత్ వ్యపదేశో వస్తుతస్ తు అభేద ఏవ | ఆయా ప్రాధాన్యములచే ఆయా పాదములు నిర్దేశింపబడినవి, నిజానికి ఏ భేదము లేదు |
తత్ర అధస్తనం ఏకం పాదం అవిద్యా శబలం భవతి | అక్కడ క్రింద ఒక పాదము (అనగా అవిద్యా పాదము) అవిద్యచేత వేరుగా ఉన్నది |
ఉపరితన పాదత్రయగ్ం శుద్ధ బోధానంద లక్షణం అమృతం భవతి | పైన మూడు పాదములు శుద్ధ బోధ ఆనంద లక్షణముల చేత అమృతము అయి ఉన్నది |
తత్ చ అలౌకిక పరమానంద లక్షణ అఖండ అమిత తేజో రాశిః జ్వలతి | మఱియు అది (బ్రహ్మము) అలౌకిక పరమానంద లక్షణము, అఖండ అమిత తేజోరాశిమయముగా జ్వలించును |
తత్ చ అనిర్వాచ్యం అనిర్దేశ్యం అఖండ ఆనంద ఏక రసాత్మకం భవతి | అది (బ్రహ్మము) నిర్వచింపలేనిది, నిర్దేశింపలేనిది, అఖండ ఆనంద ఏక రసాత్మకము అయినది |
తత్ర మధ్యమ పాదం మధ్య ప్రదేశే అమిత తేజః ప్రవాహ ఆకారతయా నిత్య వైకుంఠం విభాతి | అందు మధ్యమ పాదము (ఆనంద పాదము) మధ్య ప్రదేశమున అమిత తేజో ప్రవాహ ఆకారమున నిత్య వైకుంఠమై ప్రకాశించును. |
1.6 పరబ్రహ్మమునకు సంజ్ఞాపూర్వకమైన ఆదినారాయణుని వర్ణన |
|
---|---|
తత్ చ నిరతిశయ ఆనంద అఖండ బ్రహ్మానంద నిజమూర్తి ఆకారేణ జ్వలతి | మఱియు అది (బ్రహ్మము) నిరతిశయ (సాటి లేని) ఆనంద, అఖండ బ్రహ్మానంద నిజమూర్తి (తనకు తానే అయిన) ఆకారమున జ్వలించును |
అపరిచ్ఛిన్న మండలాని యథా దృశ్యంతే | అపరిచ్ఛిన్న మండలములు ఏ విధంగా కనిపించునో |
తద్వత్ అఖండ ఆనంద అమిత వైష్ణవ దివ్య తేజో రాశి అంతర్గత విలసత్ మహా విష్ణోః పరమం పదం విరాజతే | ఆ విధంగా అఖండ ఆనంద అమిత వైష్ణవ దివ్య తేజో రాశి (ప్రతీ జీవునికి) స్వ అంతర్గతమై విలాసముగా మహా విష్ణువు పరమ పదము విరాజిల్లును |
దుగ్ధ ఉదధి మధ్య స్థిత అమృత కలశవత్ వైష్ణవం ధామ పరమగ్ం సందృశ్యతే | పాల సముద్రము మధ్య ఉన్న అమృత కలశము వలె వైష్ణవ పరమ ధామము కనిపించును |
సుదర్శన దివ్య తేజో అంతర్గతః సుదర్శన పురుషో | సుదర్శన దివ్య తేజము అంతర్గతుడైన సుదర్శన పురుషుడు |
యథా సూర్య మండల అంతర్గతః స సూర్యనారాయణః | ఏ విధముగా ఐతే సూర్య మండల అంతర్గతుడై ఆ సూర్యనారాయణుడు ఉన్నాడో |
అమిత అపరిచ్ఛిన్న అద్వైత పరమానంద లక్షణ తేజో రాశి అంతర్గత ఆదినారాయణః తథా సందృశ్యతే | అమిత అపరిచ్ఛిన్న అద్వైత పరమానంద లక్షణ తేజో రాశి అంతర్గత ఆదినారాయణుడు ఆ విధముగా కనిపించును |
స ఏవ తురీయం బ్రహ్మ | అతడే తురీయ బ్రహ్మము |
స ఏవ తురీయాతీతః | అతడే తురీయ అతీతుడు |
స ఏవ విష్ణుః | అతడే విష్ణువు |
స ఏవ సమస్త బ్రహ్మ వాచక వాచ్యః | అతడే సమస్త బ్రహ్మ వాచక వాచ్యుడు (సమస్త బ్రహ్మ అను నామముతో చెప్పబడువాడు) |
స ఏవ పరంజ్యోతిః | అతడే పరం జ్యోతి స్వరూపుడు |
స ఏవ మాయ అతీతః | అతడే మాయా అతీతుడు |
స ఏవ గుణ అతీతః | అతడే గుణ అతీతుడు |
స ఏవ కాల అతీతః | అతడే కాల అతీతుడు |
స ఏవ అఖిల కర్మ అతీతః | అతడే అఖిల కర్మ అతీతుడు |
స ఏవ సత్య ఉపాధి రహితః | అతడే సత్యము, ఉపాధి రహితుడు |
స ఏవ పరమేశ్వరః | అతడే పరమేశ్వరుడు [Note: నేను పరిమితుడను, బద్ధుడను, జన్మ-జరా-మృత్యువులకు లోబడినవాడను అని అనుకొనుచున్న జీవుడు స్వతఃగా ఈ ఆదినారాయణుడే!] |
స ఏవ చిరంతనః, పురుషః, ప్రణవాది అఖిల మంత్ర వాచక వాచ్య, ఆది అంత శూన్య, ఆది దేశ కాల వస్తు తురీయ సంజ్ఞా నిత్య పరిపూర్ణః పూర్ణః, సత్య సంకల్ప ఆత్మా రామః | అతడే సనాతనుడు, పురుషుడు, ప్రణవము మొదలైన సకల మంత్ర వాచకములతో సూచించుబడువాడు, మొదలు చివర లేనివాడు, దేశ కాల వస్తువులకు ముందే ఉండి తురీయముచే సూచించబడుచూ, నిత్యుడు, పరిపూర్ణుడు అయి ఉన్నాడు. అతడు పూర్ణుడు, సత్య సంకల్ప ఆత్మా రాముడు. |
కాల త్రయా అబాధిత నిజస్వరూపః స్వయం జ్యోతిః, స్వయం ప్రకాశమయః | మూడు కాలములచే బాధించబడని నిజస్వరూపుడు అతడు స్వయం జ్యోతి, స్వయం ప్రకాశమయుడు |
స్వ సమాన అధికరణ శూన్యః, స్వ సమాన అధిక శూన్యో | తనకు సమాన అధికరణము (governing supremacy) లేనివాడు, తనకు సమానము అధికము అయినవాడు లేనివాడు |
న దివా రాత్రీ విభాగో, న సంవత్సరాది కాల విభాగః | దినము రాత్రి అని విభాగము లేనివాడు, సంవత్సరము మొదలగు కాల విభాగము లేనివాడు |
స్వానందమయ అనంత అచింత్య విభవ ఆత్మా అంతరాత్మా పరమాత్మా జ్ఞానాత్మా తురీయాత్మ ఇత్యాది వాచక వాచ్య అద్వైత పరమానందో విభుః | స్వానందమయుడు, అనంతుడు, అచింత్యుడు, విభవ (Omnipresent) అయి ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, జ్ఞానాత్మ, తురీయాత్మ మొదలగు వాచక శబ్దములచే నిర్దేశింపబడు అద్వైత పరమానంద విభుడు |
నిత్యో నిష్కళంకో నిర్వికల్పో నిరంజనో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణో, న ద్వితీయో అస్తి కశ్చిత్ ఇతి | నిత్యుడు, నిష్కళంకుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, వర్ణనాతీతుడు, శుద్ధుడు, దేవుడు, ఏకో నారాయణుడు, తనకు రెండవది లేనివాడు |
య ఏవం వేద స పురుషః తదీయ ఉపాసనయా తస్య సాయుజ్యం ఇతి, ఇతి అసంశయం, ఇతి ఉపనిషత్ | అటువంటివానిని ఎవరు తెలుసుకొనెదరో ఆ ప్రయత్నశీలుడు ఈ ఉపాసనచే ఆ మహా నారాయణుడి సాయుజ్యము పొందును అని చెప్పబడెను. ఇది నిస్సంశయము అని ఈ ఉపనిషత్తుచే ప్రకటించడుచున్నది. |
ఇతి అథర్వణ మహా నారాయణ ఉపనిషది పాదచతుష్టయ స్వరూప నిరూపణం నామ ప్రథమ అధ్యాయః | ఈ విధముగా మహా నారాయణ ఉపనిషత్తులో బ్రహ్మము యొక్క నాలుగు పాదముల స్వరూప నిరూపణము నామముతో ప్రథమ అధ్యాయము చెప్పబడెను |
2.1 సాకార మహానారాయణునికి నిత్యత్వం ఎట్లు పొసగును? అను ప్రశ్న |
|
---|---|
ఓం అథ ఇతి హ ఉవాచ ఛాత్రో గురుం భగవంతం - | ఓం. అప్పుడు శిష్యుడు భగవంతుడైన గురువుని ఈ విధముగా అడిగెను - |
భగవన్! వైకుంఠస్య నారాయణస్య చ నిత్యత్వం ఉక్తం | భగవాన్! వైకుంఠమునకు, నారాయణునకు నిత్యత్వము చెప్పబడినది |
స ఏవ తురీయం ఇతి ఉక్తం ఏవ | అతడే తురీయము అని చెప్పబడెను కదా! |
వైకుంఠః సాకారో, నారాయణః సాకారః చ | వైకుంఠము సాకారము మఱియు నారాయణుడు సాకారుడు |
తురీయం తు నిరాకారం | కాని, తురీయము నిరాకారము! |
సాకారః స అవయవో, నిరవయవం నిరాకారం | సాకారము అనునది అవయవ సహితము, నిరాకారము అనునది అవయవ రహితము |
తస్మాత్ సాకారం అనిత్యం, నిత్యం నిరాకారం ఇతి శృతేః | అట్లే సాకారము అనిత్యము, నిరాకారము నిత్యము అని శృతులచే చెప్పబడుచున్నది |
యద్యత్ స అవయవం తత్ తత్ అనిత్యం ఇతి అనుమానాః చ ఇతి ప్రత్యక్షేణ దృష్టత్వాః చ | ఏదైతే అవయవ సహితమో అది అంతా అనిత్యము అనునది అనుమాన ప్రమాణము మఱియు అది ప్రత్యక్ష ప్రమాణముచే కనబడుచున్నది |
అతః తయోః అనిత్యత్వం ఏవ వక్తుం ఉచితం భవతి | కావున, అందు అనిత్యత్వమే చెప్పుట యుక్తము కదా! |
కథం ఉక్తం నిత్యత్వం ఇతి? | మరి ఎందుచేత నిత్యత్వము చెప్పబడినది? |
తురీయం అక్షరం ఇతి శ్రుతేః తురీయస్య నిత్యత్వం ప్రసిద్ధం | తురీయము అక్షరము అని చెప్పు శృతులచే తురీయము యొక్క నిత్యత్వము ప్రసిద్ధము కదా! |
2.2 నారాయణుని యందు అనిత్యత్వము పరిహరించుట |
|
---|---|
నిత్యత్వ అనిత్యత్వే పరస్పర విరుద్ధ ధర్మౌ | [గురువు ఇట్లు సమాధానపరచుచున్నాడు -] నిత్యత్వ అనిత్యత్వములు పరస్పర విరుద్ధ ధర్మములు |
తయోః ఏకస్మిన్ బ్రహ్మణి అంత విరుద్ధం భవతి |
అందున ఒకటి (అనిత్యత్వము) బ్రహ్మమునందు విరుద్ధము కలదు [అనగా అనిత్యత్వము బ్రహ్మమునందు పొసగదు] |
తస్మాత్ వైకుంఠస్య చ నారాయణస్య చ నిత్యత్వం ఏవ ఉచితం భవతి సత్యం ఏవ భవతి ఇతి దేశికః పరిహరతి | కావున వైకుంఠమునకు మఱియు నారాయణునకు కూడా నిత్యత్వమే ఉచితము అనునది సత్యమే అని గురువు (అనిత్యత్వమును) పరిహరించుచున్నాడు |
2.3 నారాయణుని సాకార విధములు |
|
---|---|
సాకారః తు ద్వివిధః స ఉపాధికః నిరుపాధికః చ | అట్లే సాకారుడు మరలా రెండు విధములు - 1) ఉపాధి సహితుడు 2) ఉపాధి రహితుడు |
2.4 నారాయణుని ఉపాధి సహిత సాకారము |
|
---|---|
తత్ర స ఉపాధికః సాకారః కథం ఇతి | అందు ఉపాధి సహితుడు సాకారుడు ఎట్లనగా |
అవిద్యకం అఖిల కార్య కారణ జాలం అవిద్యా పాద ఏవ, న అన్యత్ర | అవిద్యా రూపమైన సకల కార్య కారణ జాలము అవిద్యా పాదమే, మరియొకటి కాదు [కారణ కార్య జాలము (cause and effect system) నారాయణుని సాకార అవిద్యా ఉపాధి. అది బ్రహ్మము యొక్క ఒక్క అవిద్యా పాదమునందే కలదు, ఇతర మూడు పాదములందు లేదు] |
తస్మాత్ సమస్త అవిద్య ఉపాధిః సాకారః స అవయవ ఏవ | కనుక సమస్త అవిద్యయు ఉపాధి సహిత సాకారుడు, అతడు అవయవ సహితుడే |
స అవయవత్వాత్ అవశ్యం అనిత్యం భవతి ఏవ | అవయవ సహితము వలన అవశ్యం అనిత్యమే అగును |
స ఉపాధిక సాకారో వర్ణితః | అట్లు ఉపాధి సహిత సాకారుడు వర్ణించబడెను |
2.5 నారాయణుని ఉపాధి రహిత సాకారము |
|
---|---|
తర్హి నిరుపాధిక సాకారః కథం ఇతి | అప్పుడు నిరుపాధిక సాకారుడు ఎట్లు అనగా |
నిరుపాధిక సాకారః త్రివిధః బ్రహ్మవిద్యా సాకారః చ ఆనంద సాకార ఉభయాత్మక సాకారః చ ఇతి | ఉపాధి రహిత సాకారుడు మూడు విధములు - 1) బ్రహ్మవిద్యా సాకారుడు 2) ఆనంద సాకారుడు 3) ఉభయాత్మక సాకారుడు |
త్రివిధ సాకారః అపి పునః ద్వివిధో భవతి, నిత్య సాకారో ముక్త సాకారః చ ఇతి | ఈ మూడు సాకారములు కూడా మరలా రెండు విధములు అగును - A) నిత్య సాకారము B) ముక్త సాకారము |
నిత్య సాకారస్త్వ ఆద్యంత శూన్యః శాశ్వతః | నిత్య సాకార స్థితి ఆది మఱియు అంతము లేనిది, శాశ్వతము |
ఉపాసనయా యే ముక్తిం గతాః తేషాగ్ం సాకారో ముక్తి సాకారః | ఉపాసనచే ఎవరు ముక్తి చెందుదురో వారు సాకార ముక్తి సాకారులు |
తస్య అఖండ జ్ఞానేన ఆవిర్భావో భవతి, సః అపి శాశ్వతః | అందు అఖండ జ్ఞానముచే ముక్తి ఆవిర్భావము అగును, అది కూడా శాశ్వతమే |
ముక్త సాకారస్త్వ ఐచ్ఛిక ఇతి అన్యే వదంతి | ముక్త సాకారుడు ఐచ్ఛికుడని కొందరు అనెదరు |
శాశ్వతత్వం కథం ఇతి అద్వైత అఖండ పరిపూర్ణ నిరతిశయ పరమానంద శుద్ధ బుద్ధ ముక్త సత్యాత్మక బ్రహ్మ చైతన్య సాకారత్వాత్ | మరి సాకరత్వము చేత శాశ్వతత్వము ఎట్లు అనగా, పొందబడిన జ్ఞానస్థితి అద్వైత, అఖండ, పరిపూర్ణ, నిరతిశయ, పరమానంద, శుద్ధ, బుద్ధ, ముక్త, సత్యాత్మక, బ్రహ్మ చైతన్యం కనుక |
నిరుపాధిక సాకారస్య నిత్యత్వం సిద్ధం ఏవ | ఉపాధి రహిత సాకారమునకు నిత్యత్వము సిద్ధించినదే అగును |
తస్మాత్ ఏవ నిరుపాధిక సాకారస్య నిరవయవత్వాత్ స్వాధికం అపి దూరతో నిరస్తం ఏవ | అందుచేతనే ఉపాధి రహిత సాకరమునకు అవయవ రహితము వలన స్వాధికం (తనకంటే మించినది, వేరైనది) కూడా లేనిదిగానే నిరూపించబడినది |
2.6 ఉపాధి రహిత సాకార విధములలో భేదము ఏమీ లేదు |
|
---|---|
నిరవయవం బ్రహ్మ చైతన్యం ఇతి సర్వ ఉపనిషత్సు సర్వ శాస్త్ర సిద్ధాంతేషు శ్రూయతే | చైతన్య బ్రహ్మము అవయవ రహితము అని సర్వ ఉపనిషత్తులలో సర్వ సిద్ధాంతములయందు వినబడుచున్నది |
అథ చ విద్య అనంద తురీయాణాం అభేద ఏవ శ్రూయతే | అట్లే విద్య, ఆనంద మఱియు తురీయము పాదములు అభేదమే అని వినబడుచున్నది |
సర్వత్ర విద్యాది సాకార భేదః కథం ఇతి? | సర్వత్రా విద్య మొదలగు పాదములందు సాకార భేదము ఎట్లు అనగా [ఇంతకు ముందు చెప్పిన ఉపాధి రహిత సాకార విధములైన బ్రహ్మవిద్య సాకారము, ఆనంద సాకారము, ఉభయాత్మక సాకారముల యందు భేదము ఎట్లు అనగా] |
సత్యం ఏవ ఉక్తం ఇతి దేశికః పరిహరతి | (ఉపనిషత్తులలో సిద్ధాంతీకరించబడినది) సత్యమే చెప్పబడినది అని గురువు (అనుమానమును) పరిహరించుచున్నాడు |
విద్యా ప్రాధాన్యేన విద్యా సాకారః | విద్యా ప్రాధాన్యముచే (మహా నారాయణుడు) విద్యా సాకారుడు |
ఆనంద ప్రాధాన్యేన ఆనంద సాకారః | ఆనంద ప్రాధాన్యముచే (మహా నారాయణుడు) ఆనంద సాకారుడు |
ఉభయ ప్రాధాన్యేన ఉభయ ఆత్మక సాకారః చ ఇతి | ఉభయ ప్రాధాన్యములచే (మహా నారాయణుడు) ఉభయాత్మక సాకారుడు |
ప్రాధాన్యేన అత్ర భేద ఏవ, స భేదో వస్తుతస్ అభేద ఏవ | ప్రాధాన్యముచే మాత్రమే ఇక్కడ భేదము, వస్తు తత్త్వము పరంగా ఏ భేదము లేదు అని చెప్పబడెను |
2.7 నారాయణుని సాకార నిరాకర ఉభయాత్మకము |
|
---|---|
భగవన్! అఖండ అద్వైత పరమానంద లక్షణ పరంబ్రహ్మణః సాకారనిరాకారౌ విరుద్ధధర్మౌ | [శిష్యుడు -] భగవాన్! అఖండ, అద్వైత, పరమానంద లక్షణుడైన పరబ్రహ్మకు సాకారనిరాకారములు అనునవి విరుద్ధ ధర్మములు కదా! |
విరుద్ధ ఉభయాత్మకత్వం కథం ఇతి | విరుద్ధ ఉభయాత్మకత్వము ఎట్లు పొసగును? |
సత్యం ఏవ ఇతి గురుః పరిహరతి | [గురువు -] (శాస్త్రముచే నిర్ధారించబడినది) సత్యమే అని గురువు (అనుమానమును) పరిహరించెను [అది ఎట్లనగా -] |
యథా సర్వగతస్య నిరాకారస్య మహావాయోః చ తత్ ఆత్మకస్య త్వచ్ పతిత్వేన ప్రసిద్ధస్య సాకారస్య మహావాయు దేవస్య చ అభేద ఏవ శ్రూయతే సర్వత్ర | ఏ విధముగా సర్వగతుడైన, నిరాకారుడైన మహావాయువు మఱియు ఆ మహావాయుదేవునకు ప్రాకృతికమైన, విడదీయలేని స్పర్శ కలిగించుట అను ప్రసిద్ధమైన సాకార గుణమునకు అభేదము వలె (పరబ్రహ్మకు సాకారనిరాకార విరుద్ధధర్మములు) సర్వత్రా అభేదమే వినబడుచున్నది |
యథా పృథివ్య ఆదీనాం వ్యాపక శరీరాణాం చ దేవ విశేషాణాం తత్ విలక్షణ అత అభిన్న వ్యాపక అపరిచ్ఛిన్నాః నిజమూర్తి ఆకార దేవతాః శ్రూయంతే సర్వత్ర | ఏ విధంగా వ్యాపించియుండుటయే శరీరములుగా కలిగిన పృథివి మొదలగు విశేష లక్షణ దేవతలకు వారి వారి విశేష లక్షణములతో వ్యాపించియుండుట అను అపరచ్ఛిన్న లక్షణముకు అభిన్నముగా తమ యొక్క మూర్తులతో కూడి సాకార దేవతలుగా సర్వత్రా వినబడుచున్నారో |
తద్వత్ పరబ్రహ్మణః సర్వాత్మికస్య సాకార నిరాకార భేదవిరోధో నాస్తి ఏవ | అదే విధముగా పరబ్రహ్మ సర్వాత్మకమునకు సాకార నిరాకార భేద విరోధము లేదు అని |
వివిధ విచిత్ర అనంత శక్తేః పరబ్రహ్మణః స్వరూపజ్ఞానేన విరోధో న విద్యతే | వివిధ విచిత్ర అనంత శక్తులు కలిగిన పరబ్రహ్మ యందు స్వరూపజ్ఞానముచే విరోధము (భేదము) లేదు |
తత్ అభావే సతి అనంత విరోధో విభాతి (భవతి) | దాని అభావమునందు (అనగా అజ్ఞానము చేతనే) అంత అనంత విరోధము కలుగును |
2.8 నారాయణుని సాకార-నిరాకరములు స్వభావ సిద్ధములు |
|
---|---|
అథ చ రామకృష్ణాది అవతారేషు అపి అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణః | పిమ్మట రాముడు, కృష్ణుడు మొదలైన అవతారములయందు కూడా అద్వైత, పరమానంద లక్షణ పరబ్రహ్మకు |
పరమతత్త్వ పరమవిభవ అనుసంధానం స్వీయతి ఏన శ్రూయతే సర్వత్ర | పరమతత్త్వ (Ultimate Essence), పరమవిభవ (Richness & Omniscience) అనుసంధానము స్వీయమే (పరబ్రహ్మ సంకల్పమే) అని సర్వత్రా వినబడుచున్నది |
సర్వ పరిపూర్ణస్య అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ వస్తునః కిం వక్తవ్యం | సర్వ పరిపూర్ణుడికి, అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ తత్త్వమునకు వాస్తవముగా ఏమని (ఇది లక్షణము అని ఎలా) చెప్పగలము? |
అన్యథా సర్వ పరిపూర్ణస్య పరబ్రహ్మణః పరమార్థతః సాకారం వినా కేవల నిరాకారత్వం యత్ అభిమతం | మరియొక విధముగా (చెప్పవలసినచో), సర్వ పరిపూర్ణుడైన పరబ్రహ్మ యొక్క పరమార్థమునకు సాకారము కాకుండా కేవల నిరాకారత్వం మాత్రమే అభిమతమైనచో |
తర్హి కేవల నిరాకారస్య గగనస్య ఇవ పరబ్రహ్మణో అపి జడత్వం ఆపాద్యతే | అప్పుడు కేవల నిరాకారమైన భౌతికమైన ఆకాశమునకు వలె పరబ్రహ్మకు కూడా జడత్వము ఆపాదించబడును |
తస్మాత్ పరబ్రహ్మణః పరమార్థతః సాకారనిరాకారౌ స్వభావసిద్ధౌ | కావున పరబ్రహ్మ పరమార్థతకు సాకారనిరాకారములు స్వభావసిద్ధములు |
2.9 ఆదినారాయణుని ఉన్మేష నిమేషములు |
|
---|---|
తథావిధస్య అద్వైత పరమానంద లక్షణస్య ఆదినారాయణస్య ఉన్మేషనిమేషాభ్యాం | అదేవిధంగా అద్వైత పరమానంద లక్షణుడైన ఆదినారాయణుని యొక్క ఉన్మేష నిమేషములుచే (కనురెప్పలు తెఱుచుట మూయుటచే) |
మూల అవిద్య ఉదయ స్థితి లయా జాయంతే | మూల అవిద్య యొక్క ఉదయ స్థితి లయములు కలుగుచున్నవి |
2.10 అవిద్యా ఆవిర్భావ క్రమము |
|
---|---|
కదాచిత్ ఆత్మారామస్య అఖిల పరిపూర్ణస్య ఆదినారాయణస్య స్వేచ్ఛానుసారేత్ ఉన్మేషో జాయతే (భవతి) | అప్పుడప్పుడు ఆత్మారాముడైన అఖిల పరిపూర్ణుడైన ఆదినారాయణునకు స్వేచ్ఛానుసారముగా ఉన్మేషము (కనురెప్పలు తెఱుచుట) కలుగును |
తస్మాత్ పరబ్రహ్మణో అధస్తన పాదే సర్వ కారణే మూల కారణ అవ్యక్త ఆవిర్భావో భవతి | దాని నుండి పరబ్రహ్మ యొక్క క్రింది (అవిద్యా) పాదమునందు సర్వ కారణములందు మూల కారణమైన అవ్యక్త ఆవిర్భావము (మూల ప్రకృతి) కలుగును [NOTE: ఇంతకు ముందు చెప్పిన విధముగా బ్రహ్మము యొక్క నాలుగు పాదములలో క్రిందిది అవిద్యా పాదము] |
అవ్యక్తాన్ మూల ఆవిర్భావో మూల అవిద్య ఆవిర్భావః చ | మఱియు మూల ఆవిర్భావ అవ్యక్తము నుండి మూల అవిద్య ఆవిర్భావమగును |
తస్మాత్ ఏవ సః శబ్ద వాచ్యం బ్రహ్మవిద్యా శబలం భవతి | దాని (మూల అవిద్య) నుండి సః (తత్ = అది) అను (పరబ్రహ్మ సూచిక) శబ్ద వాచిక చిత్రమైన వర్ణములు (గుణములు) గల బ్రహ్మవిద్యా శబలం ఆవిర్భవించును [NOTE: శబల బ్రహ్మం = సత్త్వరజస్తమో గుణాలు ఉపాధిగా కలిగిన అవిద్య అనే మాయలో సత్ శబ్ద వాచ్యుడు తటస్థలక్షణాలు కలిగి ఉన్న ఈశ్వరుడే శబల బ్రహ్మం అనిపించుకొన్నాడు] |
తతో మహత్, మహతో అహంకారః, అహంకారాత్ పంచ తన్మాత్రాణి | దాని ("సః" అను తటస్థ బ్రహ్మవిద్యా శబలం యొక్క త్రిగుణముల ) నుండి మహత్తు, మహత్తులో అహంకారము, అహంకారము నుండి పంచ తన్మాత్రలు (శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము) |
పంచ తన్మాత్రేభ్యః పంచమహాభూతాని | పంచ తన్మాత్రల నుండి పంచ మహాభూతములు |
పంచ మహాభూతేభ్యో బ్రహ్మ ఏక పాదం వ్యాప్తం ఏకం అవిద్యా అండం జాయతే | పంచ మహాభూతముల నుండి బ్రహ్మము యొక్క ఒక పాదము (అనగా అవిద్యా పాదము) వ్యాప్తమై (having manifested and expanded) ఒక అవిద్యా అండము జనించును |
పరిపూర్ణుడైన ఆదినారాయణుడు → స్వేచ్ఛానుసారముగా ఉన్మేషము → అవ్యక్తము (మూల ప్రకృతి) → అవిద్య → సః అను బ్రహ్మవిద్యా శబలం (తటస్థము) మరియు త్రిగుణములు → మహత్తు → అహంకారము → పంచ తన్మాత్రలు → పంచ మహా భూతములు → అవిద్యా అండము → అవిద్యా అండ నారాయణుడు → విరాట్ → అనంతకోటి బ్రహ్మాండములు → ఒక్కొక్క బ్రహ్మాండములో ఒక్కొక్క నారాయణుడు → ఒక్కొక్క నారాయణుడు నుండి స్థూల విరాట్ → ప్రపంచ ఆవిర్భావము మరియు విస్తారము "I am That - నేనే పరిపూర్ణుడైన ఆదినారాయణుడు" అని ఈ ఉపనిషత్తులో మున్ముందు ధృవీకరించబడుచున్నది." |
2.11 విరాట్ స్వరూప ప్రపంచ ఆవిర్భావము |
|
---|---|
తత్ర తత్త్వతో గుణాతీత శుద్ధసత్త్వమయో లీలాగృహీత నిరతిశయ ఆనంద లక్షణో మాయ ఉపాధికో నారాయణ ఆసీత్ | అక్కడ (అవిద్యా అండము రూపమున) సత్యముగా గుణాతీతుడు, శుద్ధసత్త్వమయుడు, లీల అనే గృహము కలిగిన, నిరతిశయ (సాటి లేని) ఆనంద లక్షణుడు, మాయ అనే ఉపాధి కలిగిన నారాయణుడు ఉన్నాడు |
స ఏవ నిత్య పరిపూర్ణః పాద విభూతి వైకుంఠ నారాయణః | అతడే నిత్య పరిపూర్ణుడు, (పరబ్రహ్మ యొక్క అవిద్యా) పాద విభూతి వైకుంఠ నారాయణుడు |
స చ అనంతకోటి బ్రహ్మాండానం ఉదయ స్థితి లయాది అఖిల కార్య కారణ జాల పరమ కారణ భూతో మహా మాయా అతీతః తురీయః పరమేశ్వరో జయతి | మఱియు అతడు అనంతకోటి బ్రహ్మాండములు ఉత్పత్తి స్థితి లయములు చేయువాడు, అఖిల కార్య కారణ జాలమునకు మూల కారణ భూతుడు , మహా మాయకు అతీతుడు, తురీయుడు, పరమేశ్వరుడు, జయించువాడు |
తస్మాత్ స్థూల విరాట్ స్వరూపో జాయతే | అతని (అవిద్యా అండ నారాయణుని) నుండి స్థూల విరాట్ స్వరూపుడు జనించును |
స సర్వ కారణ మూల విరాట్ స్వరూపో భవతి | అతడు సర్వ కారణ మూల విరాట్ స్వరూపుడు అగును |
సః అనంత శీర్షా పురుష అనంత అక్షి పాణి పాదో భవతి | అతడు అనంతమైన శిరములు కలిగిన (పరమ) పురుషుడు, అనంతమైన కన్నులు చేతులు పాదములు కలవాడు |
అనంత శ్రవణః సర్వం ఆవృత్య తిష్ఠతి | అనంతమైన చెవులు కలిగి, సర్వమూ ఆవరించి ఉండును |
సర్వ వ్యాపకో భవతి, సగుణ నిర్గుణ స్వరూపో భవతి | సర్వ వ్యాపకుడు అగును, సగుణ నిర్గుణ స్వరూపుడు అగును |
జ్ఞాన బల ఐశ్వర్య శక్తి తేజః స్వరూపో భవతి | జ్ఞాన బల ఐశ్వర్య శక్తి తేజ స్వరూపుడు అగును |
వివిధ విచిత్ర అనంత జగత్ ఆకారో భవతి | వివిధ విచిత్ర అనంత జగత్ ఆకార రూపుడు అగును |
నిరతిశయ ఆనందమయ అనంత పరమ విభూతి సమష్ట్యా విభ్వ ఆకారో భవతి | సాటిలేని ఆనందమయుడు, అనంత పరమ విభూతి సమిష్టిచే సర్వ వ్యాప్తుడు అగును |
నిరతిశయ నిరంకుశ సర్వజ్ఞ సర్వశక్తి సర్వ నియంతృత్వాది అనంత కళ్యాణ గుణ ఆకారో భవతి | సాటిలేనివాడు, నిరంకుశుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు, సర్వమును నియమించువాడు, అనంత కళ్యాణ గుణ ఆకారుడు అగును |
వాచాం అగోచర అనంత దివ్య తేజో రాశి ఆకారో భవతి | వాక్కునకు అగోచరమై అనంత దివ్య తేజోరాశి ఆకారుడు అగును [అన్ని బుద్ధులను వెలిగింపచేస్తూ ఏ బుద్ధికి గోచరము కాకుండా ఉన్నాడు] |
సమస్త అవిద్య అండ వ్యాపకో భవతి | సమస్త అవిద్య అండ వ్యాపకుడై ఉన్నాడు |
స చ అనంత మహా మాయా విలాసానాం అధిష్ఠాన విశేష నిరతిశయ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ విలాస విగ్రహో భవతి | మఱియు అతడు అనంత మహా మాయా విలాసములకు అధిష్ఠానమై, విశేషమైన సాటిలేని అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ విలాస విగ్రహుడు అగును |
అస్య ఏక ఏక రోమకూపాంతరేషు అనంత కోటి బ్రహ్మాండాని స్థావరాణి చ జాయంతే | ఇతని ఒక్కొక్క రోమకూపము నుండి అనంత కోటి బ్రహ్మాండముల స్థావరాలు జనించును |
2.12 అండ నారాయణుని నుండి సృష్టి వ్యాప్తి |
|
---|---|
తేషు అండేషు సర్వేషు ఏక ఏక నారాయణ అవతారో జాయతే | ఆయా అన్ని బ్రహ్మాండముల యందు ఒక్కొక్క అండమందు ఒక్కొక్క నారాయణుడు జనించును |
నారాయణాత్ హిరణ్యగర్భో జాయతే | నారాయణుని నుండి హిరణ్యగర్భుడు జనించును |
నారాయణాత్ అండ విరాట్ స్వరూపో జాయతే | నారాయణుని నుండి అండ విరాట్ స్వరూపుడు జనించును |
నారాయణాత్ అఖిల లోక స్రష్టృ ప్రజాపతయో జాయంతే | నారాయణుని నుండి అఖిల లోక సృష్టి చేయగల ప్రజాపతులు జనించును |
నారాయణాత్ ఏకాదశ రుద్రాః చ జాయంతే | మఱియు నారాయణుని నుండి ఏకాదశ రుద్రులు జనించును |
నారాయణాత్ అఖిల లోకాః చ జాయంతే | మఱియు నారాయణుని నుండి అఖిల లోకాలు కూడా జనించును |
నారాయణాత్ ఇంద్రో జాయతే | నారాయణుని నుండి ఇంద్రుడు జనించును |
నారాయణాత్ సర్వే దేవాః చ జాయంతే | మఱియు నారాయణుని నుండి సర్వ దేవతలు జనించును |
నారాయణాత్ ద్వాదశ ఆదిత్యాః సర్వే వసవః సర్వే ఋషయః సర్వాణి భూతాని సర్వాణి ఛందాంసి | నారాయణుని నుండి ద్వాదశ ఆదిత్యులు, సర్వ (అష్ట) వసువులు, సర్వ (సప్త) ఋషులు, అన్ని (పంచ) భూతములు, అన్ని ఛందస్సులు జనించును |
నారాయణా దేవ సముత్పద్యంతే, నారాయణాత్ ప్రవర్తంతే, నారాయణే ప్రలీయంతే | (ఈ విధముగా సర్వమూ) నారాయణ దేవుని నుండే బాగుగా ఉత్పత్తి చెందును, నారాయణుని యందే ప్రవర్తించును, నారాయణుని యందే లీనము చెందును |
అథ నిత్యో అక్షరః పరమః స్వరాట్ | ఈ నారాయణుడు నిత్యుడు, అక్షరుడు, పరమైనవాడు, స్వరాట్టు |
బ్రహ్మా నారాయణః, శివః చ నారాయణః | బ్రహ్మ (హిరణ్యగర్భుడు) కూడా నారాయణుడు, శివుడు కూడా నారాయణుడు |
శక్రః చ నారాయణః, దిశః చ నారాయణః, విదిశః చ నారాయణః | ఇంద్రుడు నారాయణుడు, (నాలుగు) దిశలు మఱియు (నాలుగు) విదిశలు నారాయణుడు [దిశలు = North, South, East, West; విదిశలు = North-East, North-West, South-East, South-West] |
కాలః చ నారాయణః, కర్మ అఖిలం చ నారాయణః | మఱియు కాలము కూడా నారాయణుడు, మఱియు అఖిల కర్మ కూడా నారాయణుడు |
మూర్త అమూర్తే చ నారాయణః | మూర్తము (Form) మఱియు అమూర్తము (Formless) కూడా నారాయణుడు |
కారణాత్మగ్ం సర్వం కార్యాత్మగ్ం సకలం నారాయణః | సర్వ కారణములకు మూలము, సకల కార్యములకు మూలము నారాయణుడు |
తత్ ఉభయ విలక్షణో నారాయణః, పరంజ్యోతిః, స్వప్రకాశమయః, బ్రహ్మానందమయః | ఆయా ద్వంద్వ విలక్షణములు (ధర్మ-అధర్మాలు, సుఖ-దుఃఖాలు, వేడి-చలి మొదలగు ద్వంద్వములు) నారాయణుడు, పరంజ్యోతి స్వరూపుడు, స్వప్రకాశమయుడు, బ్రహ్మానందమయుడు |
నిత్యో నిర్వికల్పో నిరంజనో నిరాఖ్యాతః శుద్ధో దేవ ఏకో నారాయణః | నిత్యుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు, నిరాఖ్యాతుడు, శుద్ధుడు, దేవుడు, ఏకో నారాయణుడు |
న ద్వితీయో అస్తి కశ్చిత్, న సమాన అధిక ఇతి అసంశయం పరమార్థతో య ఏవం వేద | తనకు రెండవది కొంచెమైనా లేనివాడు, తనకు సమానము అధికము లేనివాడు అని అసంశయముగా పరమార్థమును ఎవడు తెలుసుకుంటాడో |
సకల బంధాం ఛిత్వా మృత్యుం తీర్త్వా స ముక్తో భవతి, స ముక్తో భవతి | సకల (psychological) బంధములను ఛేదించి, మృత్యువును దాటి అతడు ముక్తుడు అగును, అతడు ముక్తుడు అగును! |
య ఏవం విదిత్వా సదా తం ఉపాస్తే పురుషః సః నారాయణో భవతి | ఎవడు ఈ విధముగా తెలుసుకొనుచూ, సదా ఆ నారాయణుని ఉపాసించే ప్రయత్నశీలుడు, అతడే (ఆమే) నారాయణుడు అగును అని చెప్పుచున్నది ఈ ఉపనిషత్. |
స నారాయణో భవతి ఇతి ఉపనిషత్ | అతడే (ఆమే) నారాయణుడు, ఇది ఉపనిషత్తు. |
ఇతి అథర్వణ మహానారాయణ ఉపనిషది పరబ్రహ్మణః సాకార నిరాకార స్వరూప నిరూపణం నామ ద్వితీయో అధ్యాయః | ఇది అథర్వణ మహానారాయణ ఉపనిషత్ యందు పరబ్రహ్మ యొక్క సాకర నిరాకార స్వరూప నిరూపణము అను నామము గల రెండవ అధ్యాయము. |
3.1 ప్రపంచ ఉత్పత్తి క్రమము గురించి ప్రశ్న |
|
---|---|
ఓం అథ ఛాత్రః తథా ఇతి హ ఉవాచ | ఓం. అప్పుడు శిష్యుడు ఈ విధముగా అడిగెను - |
భగవన్ దేశిక పరమతత్త్వజ్ఞ సవిలాస మహామూల అవిద్య ఉదయ క్రమః కథితః | భగవాన్! గురుదేవా! పరమతత్త్వజ్ఞా! (బ్రహ్మము నందు) క్రీడామాత్రముగా అవిద్య ఉదయించు క్రమము వివరించినావు |
తథా ప్రపంచ ఉత్పత్తి క్రమః కీదృశో భవతి, విశేషేణ కథనీయః | అట్లే ప్రపంచము యొక్క ఉత్పత్తి క్రమము ఏ విధంగా జరిగినది? విశేషించి వివరించుము |
తస్య తత్త్వం వేదితుం ఇచ్ఛామి | దాని యొక్క తత్త్వమును తెలుసుకొనవలెనని కోరిక కలిగియున్నాను |
3.2 ప్రపంచము నిత్యమా? అనిత్యమా? |
|
---|---|
తథా ఇతి ఉక్త్వా గురుః ఇతి ఉవాచ | అట్లే తెలిపెదను అని గురువు చెప్పెను - |
తథా అనాది సర్వ ప్రపంచో దృశ్యతే, నిత్యో అనిత్యో ఇతి సంశయ్యతే | ఈ విధంగా అనాదిగా కనబడుచున్న సర్వ ప్రపంచము నిత్యమా? అనిత్యమా? అనే సంశయము కలుగుచున్నది |
ప్రపంచో అపి ద్వివిథః విద్యా ప్రపంచః చ అవిద్యా ప్రపంచః చ ఇతి |
ప్రపంచము కూడా రెండు విధములు - 1) విద్యా ప్రపంచము 2) అవిద్యా ప్రపంచము - అని. |
3.3 విద్యా ప్రపంచము |
|
---|---|
విద్యా ప్రపంచస్య నిత్యత్వగ్ం సిద్ధం ఏవ, నిత్య ఆనంద చిత్ విలాసాత్మకత్వాత్ | విద్యా ప్రపంచమునకు నిత్యత్వము సిద్ధమే, (ఎట్లనగా) నిత్య ఆనంద చిత్ విలాసాత్మకత్వము చేత! |
అథ చ శుద్ధ బుద్ధ ముక్త సత్య ఆనంద స్వరూపత్వాత్ చ | మఱియు శుద్ధ బుద్ధ ముక్త సత్య ఆనంద స్వరూపము చేత! |
3.4 అవిద్యా ప్రపంచ ఆవిర్భావము |
|
---|---|
అవిద్యా ప్రపంచస్య నిత్యత్వం అనిత్యత్వం వా కథం ఇతి | అవిద్యా ప్రపంచమునకు నిత్యత్వమా అనిత్యత్వమా అనునది ఎట్లనగా |
ప్రవాహతో నిత్యత్వం వదంతి కేచన | ప్రవాహము (continuity) చేత నిత్యత్వము లక్షణమని కొందరు చెప్పుదురు |
ప్రళయాదికం శ్రూయమాణత్వాత్ అనిత్యత్వం వదంతి అన్యే | ఆది ప్రలయములు వినబడుటచేత అనిత్యత్యము లక్షణమని ఇంకొందరు చెప్పుదురు |
ఉభయః న భవతి, పునః కథం ఇతి | ఈ రెండు లక్షణములు కుదరవు, మరి అది ఎట్లనగా - |
సంకోచ వికాసాత్మక మహామాయా విలాసాత్మక ఏవ సర్వో అపి అవిద్యా విలాసత్వాత్ | అవిద్యా విలాసముచేత సర్వమూ కూడా సంకోచము (contraction) మఱియు వికాసము (expansion) కలిగిన మహామాయా విలాసాత్మకమే [The Big Bang Theory of Modern Astro Physics draws observations from capturing the oldest light with available instruments, estimates the age, and claims that the Universe, we know today, started in a small (mysterious) singularity with a big bang (i.e. all of a sudden emergence as if from nowhere) and has been expanding continuously over 13.8 billions of years. Around Bing Bang Theory, there are other active proposals in the Modern Astro Physics that the Universe must have been oscillating, i.e expanding and contracting continuously. In Vedanta philosophy, like the Modern Astro Physics, there are various proposals about cosmic evolution and the nature of the Universe. However, unlike Astro Physics, the subject of Vedanta Philosophy stresses and focuses more on the questions related to the Intelligence supporting the Universe (Experience), the Experiencer and the Experiencing itself more than the details of cosmic evolution. In the current context, the Universe is explained as playful projection within the Absolute Consciousness by virtue of the concept of Maya.] |
తత్ కథం ఇతి, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, న ఇహ నానా అస్తి కించన | అది ఎట్లు అనగా - బ్రహ్మము ఏకమే, అది అద్వితీయము. ఇక్కడ ఏదీ కొంచెమైనను నానా రకములుగా లేదు |
తస్మాత్ బ్రహ్మ వ్యతిరిక్తం సర్వం బాధితం ఏవ | కనుక బ్రహ్మమునకు వ్యతిరిక్తమైనది సర్వమూ బాధితమే [అనగా ప్రపంచము బ్రహ్మమునకు వేరుగా ఉన్నది అని అనినచో బ్రహ్మము యొక్క ఏకత్వ అద్వితీయ లక్షణమునకు పొసగదు] |
సత్యం ఏవ పరం బ్రహ్మ | సత్యమే (ఏది ఉన్నదో అదే) పర బ్రహ్మము |
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ | బ్రహ్మము సత్యం, జ్ఞానం, అనంతం |
3.5 అవిద్యా ప్రపంచ ఉపసంహారము |
|
---|---|
తతః సః విలాస మూల అవిద్య ఉపసంహార క్రమః కథం ఇతి | ఆ బ్రహ్మమునందు (చిత్) విలాస (playful) మూల అవిద్య ఉపసంహార (the act of withdrawing) క్రమము ఎట్టిదనగా |
అతి ఆదర పూర్వకం అతి హర్షేణ దేశిక ఉపదేశతి | అతి ఆదరపూర్వకముగా, అత్యంత హర్షముతో గురువు ఇట్లు బోధించుచున్నాడు |
చతుః యుగ సహస్రాణి బ్రహ్మణో దినం భవతి | నాలుగు వేల యుగములు బ్రహ్మకు (హిరణ్యగర్భునకు) ఒక పగలు అగును |
తావతా కాలేన పునః తస్య రాత్రిః భవతి | అదే కాల ప్రమాణము మరలా ఒక రాత్రి అగును |
ద్వే అహోరాత్రే ఏకం దినం భవతి | ఒక రాత్రి ఒక పగలు కలిపి ఒక దినము అగును |
తస్మిన్ ఏకస్మిన్ దినే ఆసత్య లోకానాం ఉదయ స్థితి లయా జాయంతే | అట్టి ఒక్క రోజులో సత్య లోకము వరకు అన్ని లోకములకు ఉదయ స్థితి లయములు జరుగును |
పంచ దశ దినాని పక్షో భవతి పక్ష ద్వయం మాసో భవతి | పదిహేను రోజులు పక్షము అగును, రెండు పక్షములు ఒక మాసము అగును |
మాస ద్వయం ఋతుః భవతి ఋతు త్రయం అయనం భవతి అయన ద్వయం వత్సరో భవతి | రెండు మాసములు ఋతువు అగును, మూడు ఋతువులు అయనము అగును, రెండు అయనములు ఒక సంవత్సరము అగును |
వత్సర శతం బ్రహ్మమానేన బ్రహ్మణః పరం ఆయుః ప్రమాణం | బ్రహ్మమానము ప్రకారము వంద సంవత్సరములు బ్రహ్మకు పరమాయువు ప్రమాణము అగును |
తావత్ కాలః తస్య స్థితిః ఉచ్యతే | ఆ కాలమెంతో అది బ్రహ్మ యొక్క స్థితి కాలము అనుదురు |
స్థితి అంతే అండ విరాట్ పురుషః స్వాంశం య హిరణ్యగర్భం అభ్యేతి | స్థితి అంత్యమునందు అండ విరాట్ పురుషుని స్వ అంశమైన హిరణ్యగర్భుని యందు (ప్రపంచము) ప్రవేశించును |
హిరణ్యగర్భస్య కారణం పరమాత్మానం అండ పరిపాలకం నారాయణం అభ్యేతి | హిరణ్యగర్భునకు కారణమైన పరమాత్ముని, అనగా అండ పరిపాలకుడైన నారాయణుని చేరుకొనును |
పునః వత్సర శతం తస్య ప్రలయో భవతి | మరల వంద (బ్రహ్మమాన) సంవత్సరములు అతనికి ప్రలయము అగును |
3.6 అవిద్యా ప్రపంచము విరాట్ పురుషునిలో ప్రలయము |
|
---|---|
తదా జీవాః సర్వే ప్రకృతౌ ప్రలీయంతే | అప్పుడు జీవులు అందరూ ప్రకృతిలో లీనమగుదురు |
ప్రలయే సర్వశూన్యం భవతి | ప్రలయమందు సర్వ శూన్యము అగును |
తస్య బ్రహ్మణః స్థితి ప్రలయ వా ఆదినారయణస్య అంశేన | ఆ బ్రహ్మ (హిరణ్యగర్భుడు) యొక్క స్థితి ప్రలయములు ఆదినారాయణుని యొక్క అంశచే |
అవతీర్ణస్య అజాండ పరిపాలకస్య మహావిష్ణోః అహో రాత్ర సంజ్ఞకౌ | అవతరించిన అనంత అండముల యొక్క పరిపాలకుడైన మహావిష్ణువునకు దివారాత్రులు అనే సంజ్ఞలు [NOTE: ఒక్కక్క అండమునకు మరలా ఒక్కొక్క నారాయణుడు ఉండును అని ఇంతకు ముందు చెప్పబడినది] |
తే అహో రాత్రే ఏకం దినం భవతి | ఆ అహోరాత్రులు ఒక రోజు అగును |
ఏవం దిన పక్ష మాస సంవత్సరాది భేదాః చ | అదే విధముగా రోజు, పక్షము, మాసము మఱియు సంవత్సర భేదములు కలుగును |
తదీయ మానేన శతకోటి వత్సర కాలః తస్య స్థితిః ఉచ్యతే | దాని అనుబంధ కాలమానము ప్రకారము శతకోటి సంవత్సరాల కాలము విష్ణువు స్థితి ఉండునని చెప్పబడెను |
స్థితి అంతే స్వాంశం మహావిరాట్ పురుషం అభ్యేతి | స్థితి అంత్యకాలమున తన యొక్క అంశమైన మహావిరాట్ పురుషునిలో (అవిద్యా ప్రపంచము) చేరుకొనును |
తతః సావరణం బ్రహ్మాండం వినాశం ఇతి | అప్పుడు తనయందే దాగియున్న బ్రహ్మాండము వినాశము అగును |
బ్రహ్మాండ ఆవరణం వినశ్యతి | ఇట్లు అంతర్గతమైన బ్రహ్మాండ వినాశము అగును |
తద్ధి విష్ణోః స్వరూపం, తస్య తావత్ ప్రలయో భవతి | అదే విష్ణువు స్వరూపము, ఆ విష్ణువుకు ప్రలయము వరకు ఆయువు కలదు |
ప్రలయే సర్వశూన్యం భవతి | ప్రలయమునందు సర్వ శూన్యము అగును |
అండ పరిపాలక మహావిష్ణో స్థితి ప్రలయ వా ఆది విరాట్ పురుషస్య అహో రాత్ర సంజ్ఞకౌ | అండ పరిపాలక మహావిష్ణువు యొక్క స్థితి, లయము లేదా మొదలు విరాట్ పురుషుని యొక్క అహోరాత్రములకు సంజ్ఞలు |
తే అహో రాత్రే ఏకం దినం భవతి, ఏవం దిన పక్ష మాస సంవత్సరాది భేదాః చ | అటువంటి ఒక పగలు ఒక రాత్రి కలిపి దినము అగును. అదే విధముగా దినము, పక్షము, మాసము, సంవత్సరము మొదలగు భేదములు కలుగును. |
తత్ ఈయమానేన శతకోటి వత్సర కాలః తస్య స్థితిః ఉచ్యతే | అతని (మహా విష్ణువు) కాలమానముచేత శతకోటి సంవత్సరముల కాలము అతని స్థితి ఉండునని చెప్పబడెను |
3.7 విరాట్ పురుషుడు అవిద్యాండ ఆదినారాయణునిలో లీనమగుట |
|
---|---|
స్థితి అంతే ఆది విరాట్ పురుషః స్వ అంశం మాయ ఉపాధిక నారాయణం అభ్యేతి | స్థితి అంత్యకాలమున ఆదివిరాట్ పురుషుడు తను మాయ ఉపాధిచే ఎవరి అంశయో ఆ నారాయణుని చేరును |
తస్య విరాట్ పురుషస్య యావత్ స్థితి కాలః తావత్ ప్రలయో భవతి, ప్రలయే సర్వ శూన్యం భవతి | ఆ నారాయణుని అంశయైన విరాట్ పురుషునికి ఎంత స్థితి కాలముండునో అంతే ప్రలయ కాలము ఉండును, ప్రలయకాలమందు సర్వ శూన్యము అగును |
విరాట్ స్థితిప్రలయౌ మూల అవిద్యా అండ పరిపాలకస్య ఆదినారాయణస్య అహో రాత్ర సంజ్ఞికౌ | విరాట్ పురుషుని స్థితి ప్రలయములు మూల అవిద్య అనే అండము పరిపాలకుడైన ఆదినారాయణునికి దివారాత్రులు అనే సంజ్ఞలు |
తే అహో రాత్రే ఏకం దినం భవతి, ఏవం దిన పక్ష మాస సంవత్సరాది భేదాః చ, తదీయ మానేన శతకోటి వత్సర కాలః తస్య స్థితిః ఉచ్యతే | ఆ అహోరాత్రులు ఒక రోజు అగును. అదే విధముగా రోజు, పక్షము, మాసము మఱియు సంవత్సర భేదములు కలుగును. దాని అనుబంధ కాలమానము ప్రకారము శతకోటి సంవత్సరాల కాలము ఆదినారాయణునికి స్థితి ఉండునని చెప్పబడెను. |
3.8 ఆదినారాయణుడు స్వస్వరూప నిర్గుణ బ్రాహ్మీ స్థితిని పొందుట |
|
---|---|
స్థితి అంతే త్రిపాద్విభూతి నారాయణసి ఇచ్ఛావశాత్ నిమేషో జాయతే | స్థితి అంత్యకాలమున త్రిపాద్విభూతి నారాయణునికి స్వేచ్ఛావశముచే నిమేషము (కనురెప్ప వాల్చడము) కలుగును |
తస్మాత్ మూల అవిద్య అండస్య సావరణస్య విలయో భవతి | కనుక మూల అవిద్య అనే అండమునకు తన యొక్క మొదలులో (అనగా త్రిపాద్విభూతి నారాయణుని యందు) విలయము జరుగును |
తతః సవిలాస మూల అవిద్యా సర్వ కార్య ఉపాధి సమన్వితా సత్ అసత్ విలక్షణా నిర్వాచ్య లక్షణ శూన్య ఆవిర్భావ తిరోభావ ఆత్మికా అనాది అఖిల కారణ కారణాంత మహా మాయా విశేషణ విశేషితా పరమ సూక్ష్మ మూల కారణం అవ్యక్తం విశతి, అవ్యక్తం విశేత్ బ్రహ్మణి | అప్పుడు తన విలాసమైన (క్రీడవంటి) మూల అవిద్య - సర్వ కార్య ఉపాధి సమన్వితమైన, సత్ మఱియు అసత్ విలక్షణమైనది, నిర్వచించలేనిది, ఏ లక్షణములు లేనిది, ఆవిర్భావ తిరోభావ ఆత్మికమైనది, అనాది, అఖిల కారణముల కారణమునకు ఆవల, మహా మాయా విశేషణ విశేషితమైన, పరమ సూక్ష్మ మూల కారణమైన అవ్యక్తమును చేరును, అవ్యక్తము బ్రహ్మమందు చేరును |
నిరంధనో వైశ్వానరో యథా తస్మాత్ మాయ ఉపాధిక ఆదినారాయణః తథా స్వస్వరూపం భజతి, సర్వే జీవాః చ స్వస్వరూపం భజంతే | ఇంధన రహితమైన వైశ్వానరుడు వలె ఆ విధముగా మాయా ఉపాధికుడైన ఆదినారాయణుడు స్వస్వరూపమును పొందును, సర్వ జీవులు స్వస్వరూపమును పొందుదురు |
యథా జపా కుసుమ సాన్నిధ్యాత్ రక్త స్ఫటిక ప్రతీతిః తత్ అభావే శుద్ధ స్ఫటిక ప్రతీతిః | స్ఫటికము జపా పుష్పము సన్నిధానములో ఎఱ్ఱగా కనిపించును, అది లేనప్పుడు శుద్ధ స్ఫటికముగా ఉండును |
బ్రహ్మణో అపి మాయ ఉపాధి వశాత్ సగుణ పరిచ్ఛిన్నాది ప్రతీతిః | (నిర్గుణమైన) బ్రహ్మమునకు కూడా (స్వకీయ) మాయా ఉపాధి వశముచే గుణములు, భేదములు కలిగినట్లు ప్రతీతి కలుగును |
ఉపాధి విలయాత్ నిర్గుణ నిరవయవాది ప్రతీతిః ఇతి ఉపనిషత్ | మాయా ఉపాధి విలీనమైనచో నిర్గుణ, అవయవ రహితముగా ప్రతీతి కలుగును (అనగా జ్ఞానములోనే లయమగును) అనునది ఉపనిషత్ వచనము |
ఇతి అథర్వణ త్రిపాద్విభూతి మహా నారాయణ ఉపనిషది మూల అవిద్యా ప్రలయ స్వరూప నిరూపణం నామ తృతీయో అధ్యాయః | ఇది అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో మూల అవిద్యా ప్రలయ స్వరూప నిరూపణము అను పేరు గల మూడవ అధ్యాయము |
4.1 మాయా ఉపాధి విలీనమైన అఖండ ఆనంద బ్రహ్మ స్వరూపము |
|
---|---|
ఓం తతః తస్మాత్ నిర్విశేషం అతి నిర్మలం భవతి | ఓం. దాని (స్వకీయ మాయా ఉపాధి) కన్నా ఆవల విశేషము లేదు కావున అది (అవిద్యా పాదము) అతి నిర్మలము అగును |
అవిద్యా పాదం అతి శుద్ధం భవతి | అవిద్యా పాదము అతి శుద్ధము అగును |
శుద్ధ బోధ ఆనంద లక్షణ కైవల్యం భవతి | (మాయా ఉపాధి విలీనమైన అవిద్యా పాదము) శుద్ధ బోధ ఆనంద లక్షణ కైవల్యము అగును |
బ్రహ్మణః పాదచతుష్టయం నిర్విశేషం భవతి | బ్రహ్మమునందు కల్పించిన నాలుగు పాదములు నిర్విశేషం అగును [అనగా ఆ నాలుగు పాదములు కూడా సమము అగును] |
అఖండ లక్షణ అనంత పరిపూర్ణ సత్ చిత్ ఆనంద స్వప్రకాశం భవతి | (కల్పిత నాలుగు పాదముల అభేదముచేత బ్రహ్మము) అఖండ లక్షణ, అనంత, పరిపూర్ణ, సత్ చిత్ ఆనంద స్వప్రకాశము అగును (అని సిద్ధాంతము) |
అద్వితీయం అనీశ్వరం భవతి | అద్వితీయము, అనీశ్వరము (అనగా అంతకంటే అధికం లేనిది) అగును |
అఖిల కార్య కారణ స్వరూపం | (బ్రహ్మమే) అఖిల కార్య కారణ స్వరూపము |
అఖండ చిత్ ఘన ఆనంద స్వరూపం | అఖండ చిత్ ఘన ఆనంద స్వరూపము |
అతి దివ్య మంగళ ఆకారం | అతి దివ్య మంగళ ఆకారము |
నిరతిశయ ఆనంద తేజోరాశి విశేషం | నిరతిశయ (అత్యంత అధికమైన) ఆనంద తేజోరాశి విశేషము |
సర్వ పరిపూర్ణ ఆనంద చిన్మయ స్తంభ ఆకారం | సర్వ పరిపూర్ణ ఆనంద చిన్మయ స్తంభ ఆకారము |
శుద్ధ బోధ ఆనంద విశేష ఆకారం | శుద్ధ బోధ ఆనంద విశేష ఆకారము |
అనంత చిత్ విలాస విభూతి సమష్టి ఆకారం | అనంత చిత్ విలాస విభూతి సమిష్టి ఆకారము |
అద్భుత ఆనంద ఆశ్చర్య విభూతి విశేష ఆకారం | అద్భుత ఆనంద ఆశ్చర్య విభూతి విశేష ఆకారము |
అనంత పరిపూర్ణ ఆనంద దివ్య సౌదామనీ నిచయ ఆకారం | అనంత పరిపూర్ణ ఆనంద దివ్య సౌదామనీ (మెరుపు) గుట్ట ఆకారము |
ఏవం ఆకారం అద్వితీయ అఖండ ఆనంద బ్రహ్మ స్వరూపం నిరూపితం | ఇటివంటి ఆకారము గల అద్వితీయ, అఖండ, ఆనంద బ్రహ్మ స్వరూపము నిరూపితమైనది |
4.2 బ్రహ్మము యొక్క నాలుగు పాదముల భేద అభేదములు |
|
---|---|
అథ ఛాత్రో వదతి | అప్పుడు శిష్యుడు అడిగెను - |
భగవన్! పాద భేదాదికం కథం? కథం అద్వైత స్వరూపం ఇతి నిరూపితం? | భగవాన్! (బ్రహ్మమునందు నాలుగు) పాదములందు (కల్పించబడిన) భేదము ఏ విధముగా ఉన్నది? ఏ విధముగా అద్వైత స్వరూపముగా నిరూపించబడినది? |
దేశికః పరిహరతి, విరోధో న విద్యతే | (బ్రహ్మమునందు కల్పించిన పాదముల వలన) విరోధము లేదు అని గురువు (భేదమును) పరిహరించుచున్నాడు |
బ్రహ్మా అద్వైతం ఏవ సత్యం | బ్రహ్మము అద్వైతమే అనునది సత్యము |
తథా ఏవ ఉక్తం చ బ్రహ్మ భేదో న కథితః | అట్లే చెప్పబడినది, మఱియు బ్రహ్మభేదము చెప్పబడలేదు |
బ్రహ్మ వ్యతిరిక్తం న కించిత్ అస్తి | బ్రహ్మ వ్యతిరిక్తమైనది కొంచెమైననూ లేదు |
పాద భేధాది కథనం తు బ్రహ్మ స్వరూప కథనం ఏవ తత్ ఏవ ఉచ్యతే | పాద భేదముల కథనమే బ్రహ్మ కథనము కూడా అనే చెప్పబడినది |
పాదచతుష్టయాత్మకం బ్రహ్మ | నాలుగు పాదములు (కల్పిత విభాగములు) కలది బ్రహ్మము |
తత్ర ఏకం అవిద్యా పాదం, పాద త్రయం అమృతం భవతి | అందు ఒకటి అవిద్యా పాదము, మూడు పాదములు అమృతం అగును |
శాఖ అంతర ఉపనిషత్ స్వరూపం ఏవ నిరూపితం | (ఈ అథర్వణ) శాఖలోని ఉపనిషత్తు దాని స్వరూపమే నిరూపించుచున్నది |
తమస్ అస్తు పరం జ్యోతిః పరమానంద లక్షణం | తమస్సుకు ఆవల జ్యోతి స్వరూపమై ఉన్నది, పరమానంద లక్షణము కలిగినది |
పాద త్రయాత్మకం బ్రహ్మ కైవల్యం శాశ్వతం పరం ఇతి | బ్రహ్మము మూడు పాదములు (విలక్షణములు) కలది - కైవల్యము, శాశ్వతము, పరము - అనునవి |
వేద అహం ఏతం పురుషం మహాంతం | [ఋషివాక్యం - ] ఆ మహత్తరమైన పురుషుని నేను తెలుసుకున్నాను |
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ | ఆదిత్య వర్ణముతో తమస్సుకు పరమై ఉన్నాడు |
తం ఏవం విద్వాన్ అమృత ఇహ భవతి | అతనిని తెలుకున్నవాడే విద్వాంసుడు, ఇక్కడ అమృతుడు (మృత్యువు దాటినవాడు) అగును |
న అన్యః పంథా విద్యతే అయనాయ | మోక్షమార్గముకు వేఱొక దారి లేదు |
సర్వేషాం జ్యోతిషాం జ్యోతిః, తమసః పరం ఉచ్యతే | అన్ని తేజస్సులకు తేజస్సు, తమస్సుకు పరము అని చెప్పబడెను |
సర్వస్య ధాతారం అచింత్యరూపం | సర్వమును ధరించి నిర్వహించునది, అచింత్య రూపము |
ఆదిత్యవర్ణం పరం జ్యోతిః తమస ఉపరి విభాతి | ఆదిత్యవర్ణముతో పరంజ్యోతి స్వరూపుడు తమస్సు పైన వెలుగొందుచున్నాడు |
యత్ ఏకం అవ్యక్తం అనంతరూపం విశ్వం పురాణం తమసః పరస్తాత్ | ఏది ఏకము, అవ్యక్తము, అనంతరూపము, విశ్వము, పురాణము (the beginning most!) అయి తమస్సుకు పరమై ఉన్నదో |
తత్ ఏవ ఋతం, తదు సత్యం ఆహుః | అదే ఋతము, అదే సత్యము అని చెప్పుచుందురు [Note: సత్యము త్రికాల అబాధితం; ఋతం కూడా సత్యమే, కానీ అది కాలానుగుణం.] |
తత్ ఏవ సత్యం, తత్ ఏవ బ్రహ్మ పరమం విశుద్ధం | అదే సత్యము, అదే పరమ విశుద్ధ బ్రహ్మము |
కథ్యతే తమసః శబ్దేన అవిద్యా | తమస్సు శబ్దముచే అవిద్య చెప్పబడినది |
పాదో అస్య విశ్వా భూతాని | (బ్రహ్మము యొక్క క్రింది) అవిద్యా పాదమే విశ్వ భూతములన్నీ! |
త్రిపాదస్య అమృతం దివి | (బ్రహ్మము యొక్క పైన) మూడు పాదములు దివ్యాకాశమునందు అమృతమై ఉన్నవి |
త్రిపాద్ ఊర్ధ్వ ఉదైత్ పురుషః | ఆ మూడు పాదముల పైన ఊర్ధ్వముగా పురుషుడు ఉండును |
పాదోస్య ఇహా భవాత్ పునః | మరలా ఇహములో ఒక పాదము ఉండును |
తతో విష్వఙ్ వ్యక్రమాత్ | దానితో విశ్వమంతయూ ఆక్రమించి ఉండును |
స అశన అనశనే అభి | అతడు అశనము (రయము) మఱియు అనశనము (ప్రాణము) రూపమున ప్రకటితమై ఉండును |
విద్య ఆనంద తురీయ ఆఖ్య పాదత్రయం అమృతం భవతి | విద్య, ఆనంద, తురీయ అని చెప్పబడు మూడు పాదములు అమృతమై ఉన్నవి |
అవశిష్టం అవిద్యా ఆశ్రయం ఇతి | మిగిలినది అవిద్యను ఆశ్రయించి ఉన్నది |
4.3 ఆది నారాయణుని యొక్క ఉన్మేష నిమేషములు |
|
---|---|
ఆత్మా రామస్య ఆది నారాయణస్య కీదృశా ఉన్మేషనిమేషౌ తయోః స్వరూపం కథం ఇతి గురుః వదతి | ఆత్మా రాముడైన ఆది నారాయణుని యొక్క ఉన్మేష నిమేషములు ఏ విధమైనవి? వాటి స్వరూపము ఎటువంటిది? అనునది గురువు వివరించుచున్నాడు |
పరాక్ దృష్టిః ఉన్మేషః | పరాక్ (బాహ్య) దృష్టి ఉన్మేషము (కనురెప్ప తెరవటం వంటిది) |
ప్రత్యక్ దృష్టిః నిమేషః | ప్రత్యక్ (అంతర) దృష్టి నిమేషము (కనురెప్ప మూయటం వంటిది) |
ప్రత్యక్ దృష్ట్యా స్వస్వరూప చింతనం ఏవ నిమేషః | ప్రత్యక్ (అంతర) దృష్టిచే స్వస్వరూప చింతనమే నిమేషము |
పరాక్ దృష్ట్యా స్వస్వరూప చింతనం ఏవ ఉన్మేషః | పరాక్ (బాహ్య) దృష్టిచే స్వస్వరూప చింతనమే ఉన్మేషము |
యావత్ ఉన్మేషకాలః తావత్ నిమేషకాలో భవతి | ఎంతసేపు ఉన్మేష కాలము ఉండునో అంతసేపు నిమేష కాలము ఉండును |
అవిద్యాయాః స్థితిః ఉన్మేష కాలే | అవిద్యా స్థితి ఉన్మేష కాలమందు ఉండును |
నిమేష కాలే తస్యాః ప్రలయో భవతి | నిమేష కాలమందు దానికి ప్రలయము జరుగును |
యథా ఉన్మేషో జాయతే తథా చిరంతన అతిసూక్ష్మ వాసనా బలాత్ పునః అవిద్యయా ఉదయో భవతి | ఏ విధముగా ఉన్మేషము (కనురెప్ప తెరవటం) జరుగునో అదే విధముగా సనాతనమైన, అతిసూక్ష్మ వాసనా బలము చేత మరలా అవిద్యా ఉదయము జరుగును |
యథా పూర్వం అవిద్యా కార్యాణి జాయంతే | పూర్వము వలె అవిద్యా కార్యములు కూడా జనించును |
కార్య కారణ ఉపాధి భేదాత్ జీవ ఈశ్వర భేదో అపి దృశ్యతే | కార్య, కారణ, ఉపాధి భేదములచేత జీవ ఈశ్వర భేదము కూడా కనిపించును |
కార్య ఉపాధిః అయం జీవః, కారణ ఉపాధి ఈశ్వరః | కార్య ఉపాధి కలిగినవాడు ఈ జీవుడు, కారణ ఉపాధి కలిగినవాడు ఈశ్వరుడు [కారణము (Cause) ఈశ్వరుడు, కార్యము (Effect) జీవుడు (మఱియు జగత్) - కనుక అన్ని కారణములకు మూల కారణము ఈశ్వరుడే! మనం పొందే మంచి చెడు అనుభవాలకు ఇతర జీవులు కారణము అనుకున్నచో బంధము కలుగును, అట్లు కాక ఈశ్వరుడే కారణము అనే భావ జాలము ముక్తికి సోపానమగును. NOTE: జీవుడు & ఈశ్వరుడు రెండూ నేనే. కాలము (Time), దేశము (Space), కర్మ (Causation) చేత నేను పరిమితుడను అని అనుకున్నప్పుడు నన్ను జీవుడు అంటారు; వాటి చేత నేను పరిమితుడను కాను అని convince అయినప్పుడు నన్ను ఈశ్వరుడు అంటారు.] |
4.4 మహామాయా విలాసము |
|
---|---|
ఈశ్వరస్య మహా మాయా తత్ ఆజ్ఞావశవర్తినీ తత్ సంకల్ప అనుసారిణీ | ఈశ్వరుని మహామాయ ఆయన అజ్ఞానుసారము వర్తించును, ఆయన సంకల్పమును అనుసరించును |
వివిధ అనంత మహా మాయా శక్తి సంసేవితా | (ఈశ్వరుడు) వివిధ అనంత మహా మాయా శక్తి సంసేవితుడు |
అనంత మహా మాయాజాల జనన మందిరా | అనంత మహా మాయా జాలమునకు పుట్టినిల్లు |
మహావిష్ణోః క్రీడా శరీర రూపిణి బ్రహ్మాదీనాం అగోచరా | (ఆ మహామాయ) మహావిష్ణువుకు క్రీడా (లీలా) శరీర రూపిణి, బ్రహ్మాదులకు కూడా అగోచరము |
ఏతాం మహామాయాం తరంతి ఏవ యే విష్ణుం ఏవ భజంతి, న అన్యే తరంతి కదాచన వివిధ ఉపాయైః అపి | ఎవరు విష్ణువునే భజించుదురో వారే ఆ మహామాయను తరింతురు, ఇతరులు ఏ విధమైన వివిధ ఉపాయముల చేత కూడా దాటలేరు |
అవిద్యా కార్యాణి అంతఃకరణాని అతీత్య కాల అననుతాని జాయంతే | అవిద్యా కార్యములు అంతఃకరణములకు అతీతముగా (by transcending) కాలమును అనుసరించి జనించును |
బ్రహ్మ చైతన్యం తేషు ప్రతిబింబితం భవతి | బ్రహ్మ చైతన్యము వాటియందు (అవిద్యా కార్యములందు) ప్రతిబింబితం అగును |
ప్రతిబింబా ఏవ జీవా ఇతి కథ్యంతే | ప్రతిబింబములే జీవులు అని చెప్పబడును |
అంతఃకరణ ఉపాధికాః సర్వే జీవా ఇతి ఏవం వదంతి | అంతఃకరణ ఉపాధికులు అందరూ జీవులు అని ఈ విధంగా చెప్పుదురు |
మహాభూత ఉత్థ సూక్ష్మ అంగ ఉపాధికాః సర్వే జీవా ఇతి ఏకే వదంతి | (పంచ) మహాభూత జనిత సూక్ష్మ అంగ ఉపాధికులు సర్వ జీవులు అని కొందరు చెప్పుదురు |
బుద్ధి ప్రతిబింబిత చైతన్యం జీవ ఇతి అపరే మన్యంతే | బుద్ధి యందు ప్రతిబింబిత చైతన్యమే జీవుడు అని మరికొందరు అనుకొనెదరు |
ఏత ఏషాం ఉపాధి నానాత్వం ఏవ భేదో న విద్యతే | ఈ విధముగా ఉపాధి చేత నానాత్వమే కాని, వేరు భేదము లేదు! |
సర్వ పరిపూర్ణో నారాయణస్తు అనయా నిజయా క్రీడతి స్వేచ్ఛయా సదా | సర్వ పరిపూర్ణుడైన నారాయణుడే స్వకీయ హేలతో స్వేచ్ఛగా ఎల్లప్పుడూ క్రీడించును |
తద్వత్ అవిద్యమాన ఫల్గు (ఫల్గుణ) విషయ సుఖ ఆశయాః సర్వే జీవాః ప్రధావంతి అసార సంసారచక్రే | ఆ విధముగా అవిద్యమాన నిస్సారమైన (worthless and insignificant) విషయ సుఖములే ఆశయముగా ఈ అసార సంసార చక్రములో సర్వ జీవులు తిరుగుచుందురు |
ఏవం అనాది పరంపరా వర్తతే, అనాది సంసార విపరీత భ్రమాత్ | అనాదియైన సంసార భ్రమచేత ఈ విధముగా అనాదిగా పరంపరగా జీవులు వర్తించుచున్నారు |
ఇతి అథర్వణ శాఖాయాం త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషది మహామాయా అతీత అఖండ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణః పరమతత్త్వ స్వరూప నిరూపణం నామ చతుర్థ అధ్యాయః పూర్వకాండః సమాప్తః | ఇది అథర్వణ శాఖలలో త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో మహామాయా అతీత, అఖండ, అద్వైత, పరమానంద లక్షణ, పరబ్రహ్మణ పరమతత్త్వ స్వరూప నిరూపణం అను పేరుతో నాలుగో అధ్యాయము, మఱియు పూర్వకాండ, సమాప్తము |
5.1 అవిద్యా పునః పునః ప్రచోదితము |
|
---|---|
హరిః ఓం. అథ శిష్యో వదతి గురుం భగవంతం నమః కృత్య | హరిః ఓం. పిమ్మట శిష్యుడు నమస్కరించి భగవంతుడైన గురువును అడిగెను - |
భగవన్! సర్వాత్మనా నష్టాయా అవిద్యాః పునః ఉదయః కథం? | భగవాన్! (ఆత్మలో లీనమై) పూర్తిగా నశించిన అవిద్య మరలా ఎట్లు ఉదయించినది? |
సత్యం ఏవ ఇతి గురుః ఇతి హ ఉవాచ | (అది) సత్యమే అని గురువు ఈ విధముగా చెప్పెను - |
ప్రావృట్ కాలే ప్రారంభే యథా మండూక ఆదీనాం ప్రాదుర్భావః | వర్షా కాల ప్రారంభమునందు ఏ విధముగా కప్పలు మొదలైనవి ఉద్భవించునో |
తద్వత్ సర్వాత్మనా నష్టాయా అవిద్యాయా ఉన్మేష కాలే పునః ఉదయో భవతి | ఆ విధముగా పూర్తిగా నశించిన అవిద్య (ఆదినారాయణుని) ఉన్మేష (కనురెప్పలు తెఱచుట) కాలములో మరలా ఉదయించుట జరుగును |
5.2 మోక్ష ఉపాయము ఏది? |
|
---|---|
భగవన్! కథం జీవానాం అనాది సంసార భ్రమః? | భగవాన్! ఏ విధంగా జీవులకు అనాదియైన సంసార భ్రమ కలుగుచున్నది? |
తత్ నివృత్తిః వా కథం ఇతి కో వా? | దాని నివృత్తి ఏ విధముగా కలుగును? |
కథం మోక్షమార్గం స్వరూపం చ? | మోక్షమార్గ స్వరూపము ఎట్టిది? |
మోక్ష సాధనం కథం ఇతి కో వా మోక్ష ఉపాయః? | మోక్ష సాధనము లేక మోక్ష ఉపాయము ఎట్టిది? |
కీదృశం మోక్ష స్వరూపం కా వా సాయుజ్య ముక్తిః? | మోక్ష స్వరూపము ఏ విధముగా ఉండును లేక ఏది సాయుజ్య (పరబ్రహ్మములో లీనమగు) ముక్తి? [చతుర్విధ ముక్తులు = స్వలోకతా, సమీపతా, స్వరూపతా, సాయుజ్యతా] |
ఏతత్ సర్వం తత్త్వతః కథనీయం ఇతి | ఈ సర్వ తత్త్వము చెప్పదగినది - అని అడిగెను |
అతి ఆదర పూర్వకం అతి హర్షేణ శిష్యం బహూకృత్య గురుః వదతి, శ్రూయతాం సావధానేన | అతి ఆదరపూర్వకముగా అతి హర్షముతో శిష్యుని (కుతూహలమును) మెచ్చుకొనుచూ గురువు ఇట్లు చెప్పెను - సావధానముగా వినుము! |
5.3 వాసనా బలము |
|
---|---|
కుత్సిత అనంత జన్మాభి అస్త అత్యంత ఉత్కృష్ట వివిధ విచిత్ర అనంత దుష్కర్మ వాసనాజాల విశేషైః దేహాత్మ వివేకో న జాయతే | గతించిన అనంతమైన కుత్సిత జన్మల నుండి ఉత్కృష్టమైన వివిధ విచిత్ర అనంత దుష్కర్మ వాసనా జాల విశేషములు వలన దేహాత్మ వివేకము కలుగదు |
తస్మాత్ ఏవ దృఢతర దేహాత్మ భ్రమో భవతి | అందుచేతనే దృఢతరమైన దేహాత్మ (దేహమే నేను) భ్రమ కలుగును |
అహం అజ్ఞః, కించిద్ జ్ఞో అహం, అహం జీవో, అహం అత్యంత దుఃఖకారో, అహం అనాది సంసారి ఇతి భ్రమ వాసనా బలాత్ సంసార ఏవ ప్రవృత్తిః తత్ నివృత్తి ఉపాయః కదా అపి న విద్యతే | నేను అజ్ఞానిని, నేను స్వల్పజ్ఞుడను, నేను (పరిమిత) జీవుడును, నేను అత్యంత దుఃఖకారుడను, నేను అనాది సంసారిని అనే భ్రమ యొక్క వాసనా బలము చేత సంసారమునందే ప్రవృత్తి కలుగుచున్నది, దాని నివృత్తికి ఉపాయము తోచుటలేదు |
మిథ్యా భూతాన్ స్వప్న తుల్యాత్ విషయ భోగాన్ అనుభూయ వివిధాన్ అసంఖ్యాన్ అతి దుర్లభాత్ మనోరథాన్ అనవరతం ఆశాస్యమానః అతృప్తః సదా పరిధావతి | మిథ్యా భూతములు, స్వప్న తుల్యములైన విషయ భోగములు అనుభవించి వివిధములు, అసంఖ్యాకములు, అతి దుర్లభములైన మనోరథములు, నిరంతరముగా ఆశలు కలిగినవాడై తృప్తి లేనివాడై పరుగులు తీయును |
వివిధ విచిత్ర స్థూల సూక్ష్మ ఉత్కృష్ట నికృష్ట అనంత దేహాన్ పరిగృహ్య | వివిధములైన విచిత్రములైన స్థూల, సూక్ష్మ, ఉత్కృష్ట, నికృష్ట అనంత దేహములు పరిగ్రహించి |
తత్ తత్ దేహ విహిత వివిధ విచిత్ర అనేక శుభ అశుభ ప్రారబ్ధ కర్మాణి అనుభూయ | ఆయా దేహ విహితములైన వివిధ విచిత్ర అనేక శుభ అశుభ ప్రారబ్ధ కర్మలను అనుభవించి |
తత్ తత్ కర్మ ఫల వాసనా జాల వాసిత అంతఃకరణానాం | ఆయా కర్మఫల వాసనా జాలము గూడు కట్టుకున్న అంతఃకరణములందు |
పునః పునః తత్ కర్మ ఫల విషయ ప్రవృత్తిః ఏవ జాయతే | మరల మరలా ఆ కర్మ ఫల విషయ ప్రవృత్తులే జనించును |
సంసార నివృత్తి మార్గ ప్రవృత్తిః అపి న జాయతే | సంసార నివృత్తి మార్గ ప్రవృత్తి కూడా కలుగదు |
తస్మాత్ అనిష్టం ఏవ ఇష్టం ఇవ విభాతి, ఇష్టం ఏవ అనిష్టం ఇవ భాతి | అందు వలన అయిష్టమే ఇష్టము వలె భాసించును, ఇష్టమే అయిష్టము వలె భాసించును |
అనాది సంసార విపరీత భ్రమాత్ | అనాదియైన సంసార విపరీత భ్రమ వలన ఈ విధముగా జరుగును |
తస్మాత్ సర్వేషాం జీవానాం ఇష్ట విషయే బుద్ధిః సుఖ బుద్ధిః దుఃఖ బుద్ధిః చ భవతి | అందువలన సర్వ జీవరాసులకు విషయములందు ఇష్ట బుద్ధి, సుఖ బుద్ధి మఱియు దుఃఖ బుద్ధి కలుగును |
పరమార్థతః అబాధిత బ్రహ్మ సుఖ విషయ ప్రవృత్తిః ఏవ న జాయతే | సత్యము (పరమార్థము), (దేశ కాల వస్తువుల చేత) అబాధితమైన బ్రహ్మ సుఖ విషయ ప్రవృత్తి ఏమాత్రమూ కలుగదు |
5.4 బ్రహ్మ భావము ఎందుకు కలుగుటలేదు? |
|
---|---|
తత్ స్వరూప జ్ఞాన అభావాత్ తత్ కథం ఇతి | తత్ (బ్రహ్మము) యొక్క స్వరూప జ్ఞాన అభావము వలన ఇక అది (బ్రహ్మసుఖము పొందవలెనను ప్రవృత్తి) ఎందుకు కలుగును? [కలుగదు కదా! అని భావము] |
న విద్యతే కథం బంధః కథం మోక్ష ఇతి | బంధము ఎట్టిది? మోక్షము ఎట్టిది? అను ఆలోచన కలుగదు |
విచార అభావాత్ చ |
(ఎందువలన అనగా) విచార అభావము వలన (విచారణ చేయకపోవటం వలన) |
తత్ కథం ఇతి అజ్ఞాన ప్రాబల్యాత్ | మరి అది ఎందువలన? అనగా అజ్ఞాన ప్రాబల్యము వలన |
కస్మాత్ అజ్ఞాన ప్రాబల్యం ఇతి | ఎందుచేత అజ్ఞాన ప్రాబల్యము అనగా |
భక్తి జ్ఞాన వైరాగ్య వాసనా అభావాత్ చ | భక్తి జ్ఞాన వైరాగ్యముల వాసనా అభావము వలన, మఱియు |
తత్ అభావః కథం ఇతి | వాని అభావము ఎందుచేత అనగా |
అతి అంతఃకరణ మాలిన్య విశేషాత్ | అత్యంత అంతఃకరణ మాలిన్య విశేషము చేత |
అసత్ సంసార తరుణ ఉపాయః కథం ఇతి | మరి అసత్ సంసారము నుండి తరించు ఉపాయము ఎట్లు అనగా |
దేశికః తం ఏవ కథయతి | గురువు అదే ఇక్కడ వివిరించుచున్నాడు |
5.5 బ్రహ్మ భావము ఎప్పుడు కలుగును? |
|
---|---|
సకల వేద శాస్త్ర సిద్ధాంత రహస్యం జన్మ అభ్యస్త | సకల వేద శాస్త్ర సిద్ధాంత రహస్య అభ్యాస జన్మ కలిగినవానికి |
అత్యంత ఉత్కృష్ట సుకృత పరిపాకవశాత్ సద్భిః సంగో జాయతే | అత్యంత ఉత్కృష్ట సుకృత కర్మ పరిపాకము వలన సత్పురుషుల సాంగత్యము కలుగును |
తస్మాత్ విధి నిషేధ వివేకో భవతి | దాని వలన విధి నిషేధముల (ఏది చేయవలసినది, ఏది చేయకూడనిది అను) వివేకము కలుగును |
తతః సదాచార ప్రవృత్తిః జాయతే | దానితో సదాచార ప్రవృత్తి కలుగును |
సదాచారాత్ అఖిల దురిత క్షయో భవతి | సదాచారము వలన అఖిల పాప క్షయము కలుగును |
తస్మాత్ అంతఃకరణం అతి విమలం భవతి | దాని వలన అంతఃకరణము అతి విమలము అగును |
తతః సద్గురు కటాక్షం అంతఃకరణం ఆకాంక్షతి | అందుచే సద్గురు కటాక్షమును అంతఃకరణము కోరుకొనును |
తస్మాత్ సద్గురు కటాక్ష లేశ విశేషేణ సర్వ సిద్ధయః సిద్ధంతి, సర్వ బంధాః ప్రవినశ్యంతి | అందు వలన సద్గురు కటాక్ష లేశ విశేషము చేత సర్వ సిద్ధులు సిద్ధించును, సర్వ బంధములు బాగుగా నశించును |
శ్రేయో విఘ్నాః సర్వే ప్రలయం యాంతి | శ్రేయస్సులు మఱియు విఘ్నములు సర్వము (వాటి పట్ల ఆసక్తి) ప్రలయము చెందును |
సర్వాణి శ్రేయాంసి స్వయం ఏవ యాంతి | సర్వ శ్రేయస్సులు స్వయముగానే వచ్చి చేరును |
యథా జాతి అంధస్య స్వరూప జ్ఞానం న విద్యతే | ఏ విధముగా పుట్టుకతో గ్రుడ్డివానికి తన (భౌతిక) రూప జ్ఞానము ఉండదో |
తథా గురు ఉపదేశేన వినా కల్పకోటిశతైః అపి తత్త్వజ్ఞానం న జాయతే | అదే విధముగా గురువు ఉపదేశము లేకుండా శతకోటి కల్పములకు కూడా తత్త్వజ్ఞానము కలుగదు |
తస్మాత్ సద్గురు కటాక్ష లేశ విశేషాణా అచిరాత్ ఏవ తత్త్వజ్ఞానం భవతి | కనుక సద్గురు కటాక్ష లేశ విశేషముచే అచిర కాలములోనే తత్త్వ జ్ఞానము కలుగును |
5.6 బ్రహ్మ భావము పొందు విధము |
|
---|---|
యదా సద్గురు కటాక్షో భవతి తదా భగవత్ కథా శ్రవణధ్యానాదౌ శ్రద్ధా జాయతే | ఎప్పుడు సద్గురు కటాక్షము కలుగునో అప్పుడు భగవంతుని కథాశ్రవణ ధ్యానాదుల యందు శ్రద్ధ కలుగును |
తస్మాత్ హృదయ స్థిత అనాది దుర్వాసనా గ్రంథి వినాశో భవతి | దానిచేత హృదయ స్థితమై అనాదిగా ఉన్న దుర్వాసనా గ్రంథి (psychological block) వినాశము అగును |
తతో హృదయ స్థితాః కామాః సర్వే వినశ్యంతి | అప్పుడు హృదయ స్థితములైన సర్వ కామములు వినాశమగును |
తస్మాత్ హృదయ పుండరీక కర్ణికాయాం పరమాత్మ ఆవిర్భావో భవతి | దానిచేత హృదయ పుండరీక కర్ణికము యందు పరమాత్మ ఆవిర్భావము అగును (అనగా పరమాత్మ దర్శన భావము ప్రకటితమగును) |
తతో దృఢతరా వైష్ణవీ భక్తిః జాయతే | అప్పుడు దృఢతరమైన వైష్ణవీ భక్తి జనించును |
తతో వైరాగ్యం ఉదేతి | అంతట వైరాగ్యము కలుగును |
వైరాగ్యాత్ బుద్ధి విజ్ఞాన ఆవిర్భావో భవతి | వైరాగ్యము వలన బుద్ధి విజ్ఞాన ఆవిర్భావమగును |
అభ్యాసాత్ తత్ జ్ఞానం క్రమేణ పరిపక్వం భవతి | అభ్యాసము వలన ఆ జ్ఞానము క్రమేణా పరిపక్వమగును |
పక్వ విజ్ఞానాత్ జీవన్ముక్తో భవతి | పక్వమైన విజ్ఞానము వలన జీవన్ముక్తి కలుగును |
తతః శుభ అశుభ కర్మాణి సర్వాణి స వాసనాని నశ్యంతి | అప్పుడు శుభ అశుభ కర్మలు అన్నీ వాసనలతో సహా నశించును |
తతో దృఢతర శుద్ధ సాత్త్విక వాసనయా భక్తి అతిశయో భవతి | అంతట దృఢతరమైన శుద్ధ సాత్విక వాసనచే భక్తి అతిశయము కలుగును |
భక్తి అతిశయేన నారాయణః సర్వమయః సర్వావస్థాసు ప్రవిభాతి | భక్తి అతిశయముచేత సర్వమయుడైన నారాయణుడు సర్వ అవస్థల యందు చక్కగా భాసించును |
సర్వాణి జగంతి నారాయణమయాని ప్రవిభాంతి, నారాయణ వ్యతిరిక్తం న కించిత్ అస్తి | సర్వ జగములు నారాయణమయములుగా భాసించును, నారాయణునికి వ్యతిరిక్తము కొంచెమైనా లేదు |
ఇతి ఏతత్ బుధ్వా విహరతి ఉపాసకః సర్వత్ర | ఈ విషయమును గ్రహించి ఉపాసకుడు సర్వత్రా (బ్రహ్మానందమున) విహరించును |
5.7 బ్రహ్మ జ్ఞాని భౌతిక దేహమును ఇచ్ఛాపూర్వకముగా వదలుట |
|
---|---|
నిరంతర సమాధి పరంపరాభిః జగదీశ్వర ఆకారాః సర్వత్ర సర్వ అవస్థాసు ప్రవిభాంతి | నిరంతర సమాధి పరంపరలచే (బ్రహ్మానుభవములచే) జగదీశ్వర ఆకారములు సర్వత్రా సర్వ అవస్థలయందు భాసించును [భాసించునదంతా ఈశ్వరుడేనని నిశ్చయం కలుగును] |
అస్య మహాపురుషస్య క్వచిత్ క్వచిత్ ఈశ్వర సాక్షాత్కారో భవతి | ఈ మహాపురుషునకు అప్పుడప్పుడు ఈశ్వర సాక్షాత్కారము అగును |
అస్య దేహత్యాగ ఇచ్ఛా యదా భవతి తదా వైకుంఠ పార్షదాః సర్వే సమాయాంతి | ఇతనికి ఎప్పుడు దేహత్యాగ ఇచ్ఛ కలుగునో అప్పుడు వైకుంఠ వాసులు అందరూ వచ్చెదరు |
తతో భగవద్ ధ్యాన పూర్వకం హృదయ కమలే వ్యవవస్థితం ఆత్మానం స్వమంతరాత్మానం సంచింత్య | అంతట భగవంతుని ధ్యాన పూర్వకముగా హృదయ కమలము యందు వ్యవస్థితమైన ఆత్మను తన అంతరాత్మను బాగుగా చింతించుచూ |
సమ్యక్ ఉపచారైః అభ్యర్చ్య హంసమంత్రం ఉచ్చరన్ సర్వాణి ద్వారాణి సంయమ్య | సరైన ఉపచారములతో పూజించి హంస మంత్రమును ఉచ్చరించుచూ సర్వ (ఇంద్రియ) ద్వారములు సంయమనము చేసి [హంస మంత్రము - సో౽హం తిరగవేసినచో అహం సః (I am That), అదే హంస మంత్రము] |
సమ్యక్ మనో నిరుధ్య చ ఊర్ధ్వగేన వాయునా సహ ప్రణవేన ప్రణవ అనుసంధానపూర్వకం శనైః శనైః ఆబ్రహ్మరంధ్రాత్ వినిర్గత్య | బాగుగా మనస్సును నిరోధించి మఱియు దేహములో పైకి చరించు వాయువుతో సహా ఓంకారముతో ప్రణవార్థమును అనుసంధానము చేయుచూ నెమ్మది నెమ్మదిగా బ్రహ్మ రంధ్రము నుండి (ప్రాణశక్తి) బయటకు వెడలి |
సో౽హం ఇతి మంత్రేణ ద్వాదశ అంత స్థిత పరమాత్మానం ఏకీకృత్య పంచ ఉపచారైః అభ్యర్చ్య | సో౽హం (సః అహం = అదియే నేను) అను మంత్రముతో పన్నెండు చక్రముల చివర స్థితమై ఉన్న పరమాత్మతో ఏకము చేసి పంచ ఉపచారములతో ఆరాధించి |
పునః సోహం ఇతి మంత్రేణ షోడశ అంత స్థిత జ్ఞానాత్మానం ఏకీకృత్య | మరల సోzహం అనే మంత్రముతో పదహారు పదముల చివర స్థితమైన జ్ఞానాత్మతో ఏకము చేసి |
సమ్యక్ ఉపచారైః అభ్యర్చ్య ప్రాకృత పూర్వ దేహం పరిత్యజ్య | బాగుగా (భావనలో) ఉపచారములచే పూజించి ప్రాకృతమైన పూర్వ దేహమును త్యజించి |
5.8 బ్రహ్మ భావములో ఊర్ధ్వలోక పయనము |
|
---|---|
పురఃకల్పిత మంత్రమయ శుద్ధబ్రహ్మ తేజోమయ నిరతిశయ ఆనందమయ మహావిష్ణు సారూప్య విగ్రహం పరిగృహ్య | ఇంతకు ముందు కల్పించబడినట్లు మంత్రమయ, శుద్ధబ్రహ్మ తేజోమయ, నిరతిశయ, ఆనందమయ మహావిష్ణు సారూప్య విగ్రహం (జ్ఞానమయ లింగ శరీరమును) పరిగ్రహించి |
సూర్యమండల అంతర్గత అనంత దివ్య చరణ అరవింద అంగుష్ఠ నిర్గత నిరతిశయ ఆనందమయ అమర నదీ ప్రవాహం ఆకృష్య | సూర్యమండల అంతర్గతముగా అనంత దివ్య చరణ అరవింద అంగుష్ఠమున ప్రకటితమైన నిరతిశయ ఆనందమయ అమర (ఆత్మ తేజో కాంతి) నదీ ప్రవాహమును ఆకర్షించి |
భావనయా అత్ర స్నాత్వా వస్త్ర ఆభరణాది ఉపచారైః ఆత్మపూజాం విధాయ | భావనచే అక్కడ స్నానము చేసి వస్త్రము, ఆభరణములు మొదలగు ఉపచారములతో ఆత్మపూజను చేయవలెను |
సాక్షాత్ నారాయణో భూత్వా | తాను సాక్షాత్తు నారాయణుడే అయి |
తతో గురు నమస్కార పూర్వకం ప్రణవ గరుడం ధ్యాత్వా | తరువాత గురు నమస్కార పూర్వకముగా ప్రణవ గరుడుని ధ్యానించి |
ధ్యానేన ఆవిర్భూత మహాప్రణవ గరుడం పంచ ఉపచారైః ఆరాధ్య | ధ్యానములో అవిర్భూతమైన మహాప్రణవ గరుడుని పంచ ఉపచారములచే ఆరాధించి |
గురు అనుజ్ఞయా ప్రదక్షిణ నమస్కార పూర్వకం ప్రణవ గరుడం ఆరుహ్య | గురువు అనుజ్ఞచే ప్రదక్షిణ నమస్కార పూర్వకముగా ప్రణవ గరుడుని అధిరోహించి |
మహావిష్ణోః సమస్త అసాధారణ చిహ్నచిహ్నితో | మహావిష్ణువు యొక్క సమస్త అసాధారణ చిహ్నములతో (గుర్తులతో) తానే ప్రకటితుడై |
మహావిష్ణోః సమస్త అసాధారణ దివ్యభూషణైః భూషిత సుదర్శన పురుషం పురస్కృత్య | మహావిష్ణువు యొక్క సమస్త అసాధారణ దివ్య భూషణములతో అలంకరించబడిన సుదర్శన పురుషుని ముందు ఉంచి |
విష్వక్సేన పరిపాలితో వైకుంఠ పార్షదైః పరివేష్టితో నభోమార్గం ఆవిశ్య | విష్వక్సేన పరిపాలితుడై వైకుంఠ సమూహముతో పరివేష్టితుడై ఆకాశ మార్గమున ప్రవేశించి |
పార్శ్వద్వయ స్థిత అనేక పుణ్యలోకాన్ అతిక్రమ్య | రెండు ప్రక్కల ఉన్న అనేక పుణ్య లోకములు అతిక్రమించి |
తత్రత్యైః పుణ్యపురుషైః అభిపూజితః సత్యలోకం ఆవిశ్య బ్రహ్మాణం అభ్యర్చ్య బ్రహ్మణా చ సత్యలోక వాసిభిః సర్వైః అభిపూజితః | అక్కడ ఉన్న పుణ్యపురుషులను పూజించి వారిచే పూజించబడి, సత్య లోకము ప్రవేశించి బ్రహ్మను పూజించి బ్రహ్మచే మఱియు సత్యలోక వాసులు అందరిచే పూజించబడి |
5.9 బ్రహ్మ భావములో ఇంకా ఊర్ధ్వలోక పయనము |
|
---|---|
శైవం ఈశాన కైవల్యం ఆసాద్య ధ్యాత్వా శివం అభ్యర్చ్య శివగణైః సర్వే శివేన చ అభి పూజితో | శైవుని ఈశాన కైవల్యము పొంది, శివుని ధ్యానించి, శివగణములు సర్వులచే మఱియు శివునిచే పూజించబడి |
మహర్షి మండలాన్ అతిక్రమ్య సూర్య సోమ మండలే భిత్వా | మహర్షి మండలములను అతిక్రమించి, సూర్య చంద్ర మండలములను భేదించి |
కీలక నారాయణం ధ్యాత్వా ధృవమండలస్య దర్శనం కృత్వా భగవంతం ధృవం అభిపూజ్య | (ధ్యాన) కీలక నారాయణుని ధ్యానించి, ధృవ మండలము యొక్క దర్శనము చేసి, భగవంతుడైన ధృవుని పూజించి |
తతః శింశుమార చక్రం విభిద్య శింశుమార ప్రజాపతిం అభ్యర్చ్య | పిమ్మట శింశుమార చక్రమును భేదించి, శింశుమార ప్రజాపతిని పూజించి |
చక్రమధ్యగతం సర్వాధారం సనాతనం మహావిష్ణుం ఆరాధ్య తేన పూజితః | చక్రమధ్యగతుని సర్వాధారుని సనాతుని మహావిష్ణువుని ఆరాధించి ఆ నారాయణునిచే పూజించబడి |
తత ఉపరి ఉపరి గత్వా పరమానందం ప్రాప్య ప్రకాశతే | దానికన్నా పైపైకి వెళ్లి పరమానందము పొంది ప్రకాశించును |
తతో వైకుంఠ వాసినః సర్వే సమాయాంతి | అప్పుడు వైకుంఠవాసులు అందరూ (ఆ అనుభూతిలో) వచ్చెదరు |
తాన్ సర్వాం తు సంపూజ్యతైః సర్వైః అభిపూజితః చ ఉపరి ఉపరి గత్వా | వారి అందరినీ పూజించి వారి అందరిచే పూజించబడి మఱియు పైకి పైకి వెళ్లి |
విరజా నదీం ప్రాప్య తత్ర స్నాత్వా భగవత్ ధ్యాన పూర్వకం పునః నిమజ్జ్య | విరజా నదిని పొంది అక్కడ స్నానము ఆచరించి భగవత్ ధ్యానపూర్వకముగా మరలా మునిగి |
తత్ర అపంచీకృత భూత ఉత్థ సూక్ష్మాంగం భోగసాధనం సూక్ష్మ శరీరం ఉత్సృజ్య | అక్కడ అపంచీకృత భూతముచే నిర్మితమైన సూక్ష్మ అంగము, భోగ సాధనము అయిన సూక్ష్మ శరీరమును వదిలివేసి |
కేవల మంత్రమయ దివ్య తేజోమయ నిరతిశయ ఆనందమయ మహావిష్ణు సారూప్య విగ్రహం పరిగృహ్య | కేవల మంత్రమయ దివ్య తేజోమయ నిరతిశయ ఆనందమయ మహావిష్ణు స్వరూపము వంటి విగ్రహము (ఆకారము) పరిగ్రహించి (పొంది) |
తత ఉన్మజ్జ్య ఆత్మ పూజాం విధాయ ప్రదక్షిణ నమస్కార పూర్వకం బ్రహ్మమయ వైకుంఠం ఆవిశ్య | అందు ఈదులాడి, ఆత్మపూజను చేసి, ప్రదక్షిణ నమస్కార పూర్వకముగా బ్రహ్మమయ వైకుంఠము ప్రవేశించి |
5.10 బ్రహ్మ భావములో ఇంకా ఇంకా ఊర్ధ్వలోక పయనము |
|
---|---|
తత్రః తాన్ విశేషేణ సంపూజ్య తత్ మధ్యే చ | అక్కడ వారిని విశేషముగా పూజించి వారి మధ్యన |
బ్రహ్మానందమయ అనంత ప్రాకార ప్రాసాద తోరణ విమాన ఉపవన వలీభిః | బ్రహ్మానందమయమైన అనంత ప్రాకార తోరణములు కలిగిన విమానములు మఱియు ఉపవనముల వరుసలలో |
జ్వలః శిఖరైః ఉపలక్షితో నిరుపమ నిత్య నిరవద్య నిరతిశయ నిరవధిక బ్రహ్మానంద అచలో విరాజతే | ప్రకాశించు శిఖరముతో గుర్తింపదగిన నిరుపమాన, నిరతిశయ, నిరవధిక బ్రహ్మానంద అచలము విరాజిల్లుచున్నది |
తత్ ఉపరి జ్వలతి నిరతిశయ ఆనంద దివ్య తేజోరాశిః | ఆ కొండ మీద జ్వలించుచున్న నిరతిశయ ఆనంద దివ్య తేజో రాశి ఉన్నది |
తత్ అభ్యంతర సంస్థానే శుద్ధ బోధ ఆనంద లక్షణం విభాతి | దాని మధ్యమున సంస్థాపితమై శుద్ధ బోధ ఆనంద లక్షణము ప్రకాశించును |
తత్ అంతరాలే చిన్మయ వేదికా, ఆనంద వేదికా, ఆనంద విభూషితా | దాని మధ్యలో చిన్మయ (Mere Consciousness / Awareness / Intelligence) వేదిక ఆనంద వేదిక ఆనంద విభూషితమై ఉన్నది |
తత్ అభ్యంతరే అమిత తేజోరాశిః తత్ ఉపరి జ్వలతి పరమ మంగల ఆసనం విరాజతే | దాని మధ్యలో అమిత తేజోరాశి ఆ వేదిక మీద ప్రకాశించు పరమ మంగళ ఆసనం విరాజిల్లును |
తత్ పద్మ కర్ణికాయాం శుద్ధ శేష భోగ ఆసనం విరాజతే | దాని పద్మ రేకులపై శుద్ధ శేష భోగ ఆసనం (శేషించియున్న మహాద్రష్ట / దృక్ స్వరూపము) ప్రకాశించును |
తస్య ఉపరి సమాసీనం ఆనంద పరిపాలకం ఆదినారాయణం ధ్యాత్వా | ఆ అసనము పైన చక్కగా ఆసీనుడైన ఆనంద పరిపాలకుడైన ఆదినారాయణుని ధ్యానించి |
తం ఈశ్వరం వివిధ ఉపచారైః ఆరాధ్య ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ | ఆ ఈశ్వరుని వివిధ ఉపచారములతో ఆరాధించి, ప్రదక్షిణ నమస్కారాలు చేసి |
తత్ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా పంచ వైకుంఠాన్ అతీతా | ఆయన అనుజ్ఞతో ఇంకా పైకి పైకి వెళ్లి పంచ వైకుంఠములు అతీతముగా |
అష్ట విరాట్ కైవల్యం ప్రాప్య తం సమారాధ్య ఉపాసకః పరమానందం ప్రాప్య, ఇతి ఉపనిషత్ | అష్ట విరాట్ కైవల్యం పొంది ఆ విరాట్టుని బాగుగా ఆరాధించి ఉపాసకుడు పరమానందం పొందును - అని ఉపనిషత్ చెప్పుచున్నది |
ఇతి అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషది సంసార తరుణ ఉపాయ కథన ద్వారా పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం నామ పంచమ అధ్యాయః | ఇది అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో సంసార తరుణ ఉపాయ కథనం ద్వారా పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం అను పేరుతో ఐదవ అధ్యాయము |
6.1 బ్రహ్మాండ అనుభూతి |
|
---|---|
ఓం. తత ఉపాసకః పరమానందం ప్రాప్య | ఓం. అంతట ఉపాసకుడు పరమానందమును పొంది [NOTE: బ్రహ్మాండములో నేను ఒక చిన్న విభాగము అను భావన నుండి నాలోనే అండ పిండ బ్రహ్మాండములు ఉన్నాయి అనే బ్రహ్మ భావములో ఉపాసకుడు రమిస్తున్నాడు] |
సావరణం బ్రహ్మాండం చ భిత్వా పరితః సమవలోక్య | సావరణమైన (తన బుద్ధి ఇరుక్కుని ఉన్న) బ్రహ్మాండమును భేదించి (ప్రజ్ఞతో దాటి) అంతటా పరికించి |
బ్రహ్మాండ స్వరూపం నిరీక్ష్య పరమార్థతః తత్ స్వరూపం బ్రహ్మజ్ఞానేనావ బుధ్య | బ్రహ్మాండ స్వరూపమును నిరీక్షించి పరమార్థమున దాని స్వరూపమును బ్రహ్మజ్ఞానముచే తెలుసుకొనును. |
సమస్త వేద శాస్త్ర ఇతిహాస పురాణాని సమస్త విద్యాజాలాని బ్రహ్మ ఆదయః సురాః సర్వే సమస్తాః పరమర్షయః చ | సమస్త వేద, శాస్త్ర, ఇతిహాస, పురాణాలు, సమస్త విద్యా జాలాలు, బ్రహ్మ మొదలు దేవతలు అందరూ మఱియు సమస్త పరమ ఋషులు |
అండ అభ్యంతర ప్రపంచ ఏక దేశం ఏవ వర్ణయంతి అండ స్వరూపం న జానంతి | అండములో ఇమిడి ఉన్న ప్రపంచము యొక్క ఒక ప్రదేశము మాత్రమే వర్ణించగలరు, వారికి అండ స్వరూపము అంతా తెలియదు |
బ్రహ్మాండాత్ బహిః ప్రపంచ జ్ఞానం న జానంతి ఏవ | బ్రహ్మాండము కంటే బయట ఉన్న ప్రపంచ జ్ఞానము అసలు తెలియరు |
కుతో అండ అంతరాంతః బహిః ప్రపంచ జ్ఞానం | ఇక వేరే అండముల లోపలి బయటి జ్ఞానము ఏమి తెలియగలరు? |
దూరతో మోక్ష ప్రపంచ జ్ఞానం అవిద్యా ప్రపంచ జ్ఞానం చ ఇతి | మోక్ష ప్రపంచ జ్ఞానము మఱియు అవిద్యా ప్రపంచ జ్ఞానము అసలు తెలియదు |
కథం బ్రహ్మాండ స్వరూపం ఇతి | ఇక బ్రహ్మాండ స్వరూపము ఎట్లు తెలియును? |
6.2 బ్రహ్మాండ వర్ణన |
|
---|---|
కుక్కుట అండ ఆకారం మహదాది సమష్ట్య ఆకారం (ఆకారణం) | (బ్రహ్మాండము) కోడి గ్రుడ్డు ఆకారమున మహత్తర సమష్టి ఆకారమున ఉండును |
అండం తపనీయమయం తుప్త జాంబూనద ప్రభం | అండము బంగారమయము, మేలిమి బంగారు నదీ ప్రవాహము వంటి కాంతి కలది [స్వప్రకాశము, అఖండము అయిన మహా చైతన్యమునందు అండ పిండ బ్రహ్మాండములు లీలా మాత్రముగా ప్రకటితమై లయిస్తూ మరలా ప్రకటితమవుతున్నాయి] |
ఉద్యత్ కోటి దివాకరాభం చతుర్విధ సృష్టి ఉపలక్షితం | ఉదయించు కోటి సూర్యుల ప్రభావము కలది, నాలుగు విధముల ఉపలక్షితముల సృష్టి కలది |
మహాభూతైః పంచభిః ఆవృతం | పంచ మహాభూతములచే ఆవృతమైనది |
మహత్ అహంకృతి తమోభిః చ మూల ప్రకృత్యా పరివేష్టితం | మహత్తర అహంకృతి (అహంకారము) మఱియు తమస్సు అనే మూల ప్రకృతి చేత పరివేష్టింపబడినది |
అండభిత్తి విశాలం సపాదకోటియోజన ప్రమాణం | అండములోని కొంచెము భాగమే కోటి పైన పావు యోజనముల ప్రమాణము కలది |
ఏక ఏక ఆవరణం తథా ఏవ | ప్రతీ ఒక్క ఆవరణము అట్లే ఉండును |
అండ ప్రమాణం పరితో అయుత ద్వయకోటి యోజన ప్రమాణం | అండ ప్రమాణము చుట్టూ అఖండముగా రెండు కోట్ల యోజనముల ప్రమాణము కలిగి |
మహామండూకాది అనంత శక్తిభిః అధిష్ఠితం | మహా మండూకాది అనంత శక్తులచే అధిష్ఠితమైనది |
నారాయణ క్రీడాకందుకం | (ఈ బ్రహ్మాండము) నారాయణునికి ఆడుకునే బంతి వంటిది |
6.3 మహానారాయణునిలో బ్రహ్మాండములు |
|
---|---|
పరమాణువత్ విష్ణు లోమసు సులగ్నం | పరమాణువు అంత చిన్నదిగా విష్ణువు రోమము (వెంట్రుక) యందు బ్రహ్మాండము బాగుగా లగ్నమై ఉన్నది |
అదృష్ట అశృత వివిధ విచిత్ర అనంత విశేషైః ఉపలక్షితం | దృష్టము కాని, అశృత (పక్వము కాని) వివిధ విచిత్ర అనంత విశేషములచే కూడియున్నది |
అస్య బ్రహ్మాండస్య సమంతతః స్థితాని అన్య ఏతాదృశాని అనంతకోటి బ్రహ్మాండాని సావరణాని జ్వలంతి | ఈ బ్రహ్మాండము పైన మఱియు చుట్టూ ఇటువంటి అనంత కోటి బ్రహ్మాండములు ఇమిడి ఉండి ప్రకాశించుచున్నవి |
చతుర్ముఖ పంచముఖ షణ్ముఖ సప్తముఖ అష్టముఖాది సంఖ్యా క్రమేణ సహస్ర అవధి ముఖాంతైః | నాలుగు ముఖములు, ఐదు ముఖములు, ఆరు ముఖములు, ఏడు ముఖములు, ఎనిమిది ముఖములు మొదలు (అనేక) సహస్ర ముఖములు కలిగిన |
నారాయణాంశైః రజోగుణ ప్రధానైః ఏక ఏక సృష్టి కర్తృభిః అధిష్ఠితాని | నారాయణ అంశ ఉన్న రజో గుణ ప్రధానులగు ఒక్కొక్క సృష్టికర్తలచే అధిష్ఠితమై బ్రహ్మాండములు ఉన్నవి |
విష్ణు మహేశ్వర ఆఖ్యైః నారాయణ అంశైః రజోగుణ ప్రధానైః | విష్ణు మహేశ్వరులని చెప్పబడు నారాయణ అంశ కలిగి రజోగుణ ప్రధానులు |
ఏక ఏక స్థితి సంహార కర్తృభిః అధిష్ఠితాని | ఒక్కొక్క స్థితి సంహార కర్తలు అధిష్ఠితమై బ్రహ్మాండములు ఉన్నాయి |
మహా జలౌఘ మత్స్య బుద్బుద అనంత సంఘవత్ భ్రమంతి | మహా జలాశయములో ఉండే చేపలు, బుడగల అనంత సంఘముల వలె బ్రహ్మాండములు మహానారాయణునిలో భ్రమించుచున్నవి |
క్రీడ ఆసక్త జాలక కరతల ఆమలక బృందవత్ | క్రీడాసక్తి కలవాని అరచేతిలో ఉసరిక పండ్ల గుత్తి వలె |
మహావిష్ణోః కరతలే విలసత్ అనంతకోటి బ్రహ్మాండాని | మహావిష్ణుని అరచేతిలో విలాసముగా అనంత కోటి బ్రహ్మాండాలు కలవు |
జలయంత్రస్థ ఘట మాలికా జాలవత్ | జలయంత్రమునకు కట్టియున్న మట్టి కుండల మాల వలె |
మహావిష్ణోః ఏక ఏక రోమ కూపాంతరేషు | మహావిష్ణుని ఒక్కొక్క రోమ కూపము లోపలి యందు |
అనంతకోటి బ్రహ్మాండాని సావరణాని భ్రమంతి | అనంత కోటి బ్రహ్మాండాలు నిక్షిప్తమై భ్రమణము చెందుచున్నవి |
6.4 బ్రహ్మాండ జాలమును దాటి మహావిరాట్ పదము పొందుట |
|
---|---|
సమస్త బ్రహ్మాండ అంతః బహిః ప్రపంచ రహస్యం బ్రహ్మజ్ఞానేనావ బుధ్వా | సమస్త బ్రహ్మాండ అంతర బాహ్య ప్రపంచ రహస్యము బ్రహ్మజ్ఞానముచే తెలుసుకొని |
వివిధ విచిత్ర అనంత పరమ విభూతి సమష్టి విశేషాన్ సమవలోక |
వివిధ విచిత్ర అనంత పరమ విభూతి సమష్టి విశేషములు చక్కగా అవలోకించి |
ఆశ్చర్య అమృత సాగరే నిమజ్జః | ఆశ్చర్య అమృత సాగరమునందు మునక వేసినవాడగును |
నిరతిశయ ఆనంద పారావారో భూత్వా సమస్త బ్రహ్మాండజాలాని సముల్లంఘ్య | నిరతిశయ ఆనంద సముద్రము అయి సమస్త బ్రహ్మాండ జాలమును ఉల్లంఘించి |
అమిత అపరిచ్ఛిన్న అనంత తమః సాగరం ఉత్తీర్య మూల అవిద్యా పురం దృష్ట్యా | అమిత అపరిచ్ఛిన్న అనంత తమో సాగరమును దాటి అవిద్యా పురమును చూసి |
వివిధ విచిత్ర అనంత మహామాయా విశేషైః పరివేష్టితాం | వివిధ విచిత్ర అనంత మహామాయా విశేషములుచే పరివేష్టితుడై |
అనంత మహామాయా శక్తి సమష్టి ఆకారాం అనంత దివ్య తేజోజ్వాలాజాలైః అలంకృతాం | అనంత మహామాయా శక్తి సమష్టి ఆకారుడై, అనంత దివ్య తేజో జ్వాలా జాలముచే అలంకృతుడై |
అనంత మహామయా విలాసానాం పరమ అధిష్ఠాన విశేష ఆకారం శశ్వత్ అమిత ఆనంద అచల ఉపరి | అనంత మహామాయా విలాసములకు పరమ అధిష్ఠాన విశేష ఆకారమైన శాశ్వత అమిత ఆనందమను అచలము మీద |
విహారిణీం మూల ప్రకృతి జననీం అవిద్యాలక్ష్మీం ఏవం ధ్యాత్వా వివిధ ఉపచారైః ఆరాధ్య | విహరించుచున్న మూల ప్రకృతికి జననియైన అవిద్యా లక్ష్మిని ఆ విధంగా ధ్యానించి, వివిధ ఉపచారములచే ఆరాధించి |
సమస్త బ్రహ్మాండ సమష్టి జననీం వైష్ణవీం మహామాయాం నమః కృత్య | సమస్త బ్రహ్మాండ సమష్టికి జననీయైన వైష్ణవీ మహామాయకు (హృదయములోనే) నమస్కారము చేసి |
తయా చ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా మహా విరాట్ పదం ప్రాప | ఆమె అనుజ్ఞ తీసుకొని పైకి పైకి వెళ్లి మహావిరాట్ పదము పొందును |
6.5 మహావిరాట్ స్వరూప వర్ణన |
|
---|---|
మహా విరాట్ స్వరూపం కథం ఇతి | మహావిరాట్ స్వరూపము ఎటువంటిది అనగా |
సమస్త అవిద్యా పాదకో విరాట్ | సమస్త అవిద్యా పాద స్వరూపము విరాట్టు |
విశ్వతః చక్షురత విశ్వతోముఖో విష్వతోహస్త ఉత విశ్వతః పాత్ | విశ్వమంత కన్నులు కలిగినది, విశ్వమంతా నోరు కలిగినది, విశ్వమంత హస్తము కలిగినది, విశ్వమంత పాదము కలిగినది |
సంబాహుభ్యాం నమతి సమ్పతత్రైః ద్యావా పృథివీ జనయన్ దేవ ఏకః |
చక్కగా రెండు బాహువులతో వంచి భూమి ఆకాశములను ఏకము చేయు ఏక దేవుడు |
న సందృశే తిష్ఠతి రూపం అస్య, న చక్షుషా పశ్యతి కశ్చన ఏనం | ఆ మహావిరాట్ రూపమును (మనస్సుతో) దర్శించుటకు వీలు కాదు, ఆ విరాట్టును కన్నులతో చూచుటకు వీలు కాదు |
హృదా మనీషా మనసాభి (న) కల్పతో య ఏవం విదుః అమృతాః తే భవంతి | హృదయముతో, బుద్ధితో, మనస్సుతో కూడా కల్పన చేయలేని ఆ విరాట్టును ఎవరు తెలుసుకొనెదరో వారు అమృతులు అగుదురు |
మనో వాచాం అగోచరం ఆదివిరాట్ స్వరూపం ధ్యాత్వా వివిధ ఉపచారైః ఆరాధ్య | మనస్సు వాక్కులకు అగోచరమైన ఆదివిరాట్ స్వరూపమును ధ్యానించి వివిధ ఉపచారములుచే ఆరాధించి |
తత్ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా వివిధ విచిత్ర అనంత మూల అవిద్యా విలాసాన్ అవలోక్య | ఆ విరాట్టుని అనుగ్రహము పొంది మఱియు ఇంకా పైకి పైకి వెళ్లి వివిధ విచిత్ర అనంత మూల అవిద్యా విలాసములను అవలోకించి |
ఉపాసకః పరమ కౌతుకం ప్రాప | ఉపాసకుడు పరమ ఉత్సాహము పొందును |
6.6 వైష్ణవీ మహా యోగమాయ వర్ణన |
|
---|---|
అఖండ పరిపూర్ణ పరమానంద లక్షణ పరబ్రహ్మణః | అఖండ పరిపూర్ణ పరమానంద లక్షణ పరబ్రహ్మము |
సమస్త స్వరూప విరోధ కారిణీ అపరిచ్ఛిన్న తిరస్కరిణి ఆకారా వైష్ణవీ మహా యోగమాయా | (ఆ పరబ్రహ్మమునకు) సమస్త స్వరూప విరోధ కారిణియైన, అపరిచ్ఛిన్న తిరస్కరణి ఆకారమైన (ఏకత్వమునకు వ్యతిరిక్తమైన లక్షణములు ప్రకటించు) వైష్ణవీ మహా యోగమాయ రూపమున |
మూర్తిమద్భిః అంతః మహా మాయాజాల విశేషైః పరిసేవితా | మూర్తిమయమై (అమూర్తియైన బ్రహ్మమునందే) స్వాంతర మహా మాయాజాల విశేషములచే (పరబ్రహ్మము) సేవించబడుచున్నది. |
తస్యాః పురం అతి కౌతుకం అతి ఆశ్చర్య సాగర ఆనంద లక్షణం అమృతం భవతి | ఆ మహామాయా పురము అతి సంతోషకర, అతి ఆశ్చర్య సాగర ఆనంద లక్షణముతో అమృతమై ఉన్నది |
అవిద్యా సాగర ప్రతిబింబిత నిత్య వైకుంఠ ప్రతివైకుంఠం ఇవ విభాతి | అవిద్యా సాగర ప్రతిబింబిత ప్రతివైకుంఠము నిత్య వైకుంఠ వలె ప్రకాశించును |
ఉపాసకః తత్ పురం ప్రాప్య యోగమాయా లక్ష్మీం ధ్యాత్వా వివిధ ఉపచారైః ఆరాధ్య | ఉపాసకుడు ఆ పురమును పొంది యోగమాయా లక్ష్మిని ధ్యానించి వివిధ ఉపచారములచే ఆరాధించి |
తయా సంపూజితః చ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా | ఆమెచే బాగుగా పూజించబడి, అమె అనుజ్ఞ పొందినవాడై మఱియు ఇంకా పైపైకి వెళ్లి |
అనంత యోగమాయా విలాసాన్ అవలోకే ఉపాసకః పరమ కౌతుకం ప్రాప | అనంత యోగమాయా విలాసాములు అవలోకించి ఉపాసకుడు పరమ సంతోషము పొందును |
తత ఉపరి పాద విభూతి వైకుంఠ పురం ఆభాతి | ఆ పైన (పరబ్రహ్మ చతుష్పాదములలో ఒక) పాద విభూతియై వైకుంఠ పురము ప్రకాశించుచున్నది |
6.7 అవిద్యా పాద వైకుంఠ వర్ణన |
|
---|---|
అతి ఆశ్చర్య అనంత విభూతి సమష్టి ఆకారం | అతి ఆశ్చర్య అనంత విభూతి సమష్టి ఆకారము |
ఆనంద రస ప్రవాహైః అలంకృతం | ఆనంద రస ప్రవాహముచే అలంకృతము |
అమిత తరంగిణ్యాః ప్రవాహైః అతి మంగళం | అమితమైన తరంగముల ప్రవాహముచే అతి మంగళము |
బ్రహ్మతేజో విశేష ఆకారైః అనంత బ్రహ్మవనైః అభితః తతం | బ్రహ్మతేజో విశేష ఆకారములు గల అనంత బ్రహ్మ వనములచే అన్ని ప్రక్కలా ఉన్నది |
అనంత నిత్య ముక్తైః అభివ్యాప్తం | అనంత నిత్య ముక్తులచే వ్యాపించి ఉన్నది |
అనంత చిన్మయ ప్రాసాదజాల సంకులం | అనంత చిన్మయ ప్రాసాద జాలముచే ఉన్నది |
అనాది పాద వైకుంఠం ఏవ భాతి | (అటువంటి) అనాది పాద వైకుంఠమే భాసించుచున్నది |
తత్ మధ్యే చ చిదానంద అచలో విభాతి | మఱియు దాని మధ్యలో చిదానంద అచలము ప్రకాశించుచున్నది |
తత్ ఉపరి జ్వలతి విభూతి నిరతిశయ ఆనంద దివ్య తేజోరాశిః | దాని మీద జ్వలనము యొక్క విభూతి నిరతిశయ ఆనంద దివ్య తేజోరాశియై ఉన్నది |
తత్ అభ్యంతరే పరమానంద విమానం విభాతి | దాని మధ్యలో పరమానంద విమానము భాసించుచున్నది |
తత్ అభ్యంతర సంస్థానే చిన్మయ ఆసనం విరాజతే | దాని మధ్య సంస్థానమున చిన్మయ ఆసనము విరాజిల్లుచున్నది |
తత్ పద్మకర్ణికాయాం నిరతిశయ దివ్య తేజోరాశి అంతర సమాసీనం ఆదినారాయణం ధ్యాత్వా ఉపచారైః | ఆ ఆసన పద్మకర్ణిక యందు నిరతిశయ దివ్య తేజోరాశిలో చక్కగా ఆసీనుడై ఉన్న ఆదినారాయణుని ధ్యానించి ఉపచారము చేసినవాడై |
తం సమారాధ్య తేన అభిపూజితః తత్ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా | (ఉపాసకుడు) ఆయనను బాగుగా ఆరాధించి, ఆయనచే పూజితుడై, ఆయనచే అనుజ్ఞ పొందినవాడై మఱియు పైపైకి వెళ్లి |
సావరణం అవిద్యాండం చ భిత్త్వ అవిద్యా పాదం ఉల్లంఘ్య విద్య అవిద్యయోః సంధౌ విష్వక్సేన వైకుంఠపురం ఆభాతి |
సావరణమైన (hidden) అవిద్యాండమును భేదించి, అవిద్యా పాదము ఉల్లంఘించి, విద్య అవిద్యల సంధిలో భాసించుచున్న విష్వక్సేన వైకుంఠపురమును పొందును |
అనంత దివ్య తేజో జ్వాలా జాలైః అభితో అనిశం ప్రజ్వలంతం అనంత బోధ ఆనంద వ్యూహైః అభితః తతం | అనంత దివ్య తేజో జ్వాలా జాలముచే నిండి ఎల్లప్పుడూ ప్రజ్వలించు అనంత బోధ ఆనంద వ్యూహములచే అంతటా వ్యాప్తమైనది |
శుద్ధ బోధ విమాన ఆవలిభిః విరాజితం అనంత ఆనంద పర్వతైః పరమ కౌతుకం ఆభాతి | శుద్ధ బుద్ధ విమాన ఆవలులచే (by rows of flights) విరాజితమైన అనంత ఆనంద పర్వతములచే (ఉపాసకుడు) పరమ ఉత్సాహము పొందును |
తత్ మధ్యే చ కళ్యాణ అచల ఉపరి శుద్ధ ఆనంద విమానం విభాతి | మఱియు దాని మధ్యనే కళ్యాణ అచలము మీద శుద్ధ ఆనంద విమానము ప్రకాశించుచుండును |
6.8 విష్వక్సేనుని వర్ణన |
|
---|---|
తత్ అభ్యంతరే దివ్య మంగళ ఆసనం విరాజతే | ఆ విమానము మధ్యలో దివ్యమంగళ ఆసనము విరాజిల్లును |
తత్ పద్మకర్ణికాయాం బ్రహ్మతేజోరాశి అంతర సమాసీనం | దాని పద్మకర్ణిక యందు బ్రహ్మ తేజోరాశిలో చక్కగా ఆసీనుడై ఉన్న |
భగవత్ అనంత విభూతి విధి నిషేధ పరిపాలకం | భగవత్ అనంత విభూతి విధి నిషేధ పరిపాలకుడు |
సర్వ ప్రవృత్తి సర్వ హేతు నిమిత్తకం నిరతిశయ లక్షణ మహా విష్ణు స్వరూపం | సర్వ ప్రవృత్తి సర్వ హేతు నిమిత్తకుడు, నిరతిశయ లక్షణ మహావిష్ణు స్వరూపుడు |
అఖిల అపవర్గ పరిపాలకం అమిత విక్రమం ఏవం విధం విష్వక్సేనం ధ్యాత్వా | అఖిల అపవర్గ (దేహాత్మ భావన నుండి విడుదల చేయు) పరిపాలకుడు, అమిత విక్రముడు, ఇటువంటి విష్వక్సేనుని ధ్యానించి |
ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ వివిధ ఉపచారైః ఆరాధ్య | ప్రదక్షిణ నమస్కారము చేసి, వివిధ ఉపచారములచే ఆరాధించి |
తత్ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా | ఆయన అనుజ్ఞ పొందినవాడై (ఉపాసకుడు) మఱియు ఇంకా పైపైకి వెళ్లి |
విద్యా విభూతిం ప్రాప్య విద్యామయ అనంత వైకుంఠాన్ పరితో అవస్థితాన్ | విద్యా విభూతిని పొంది అంతటా ఉన్న విద్యామయ అనంత వైకుంఠములను |
బ్రహ్మతేజోమయాన్ అవలోక్య ఉపాసకః పరమానందం ప్రాప | బ్రహ్మతేజోమయులను అవలోకించి ఉపాసకుడు పరమానందం పొందును |
6.9 నారాయణ సారూప్యమును పొందుట |
|
---|---|
విద్యామయ అనంత సముద్రాత్ అతిక్రమ్య బ్రహ్మవిద్యా తరంగిణీం ఆసాద్య | విద్యామయ అనంత సముద్రములను అతిక్రమించి బ్రహ్మవిద్యా తరంగిణిని చేరుకొని |
తత్ర స్నాత్వా భగవతో ధ్యానపూర్వకం పునః నిమజ్య | అక్కడ స్నానము చేసి, భగవంతుని ధ్యానపూర్వకముగా మరలా మునిగి |
మంత్రమయ శరీరం ఉత్సృజ్య | మంత్రమయ శరీరమును వదలిపెట్టి |
విద్యానందమయ అమృత దివ్య శరీరం పరిగృహ్య నారాయణ సారూప్యం ప్రాప్య | విద్యానందమయ అమృత దివ్య శరీరమును పరిగ్రహించి, నారాయణ సారూప్యమును పొంది |
ఆత్మపూజాం విధాయ బ్రహ్మమయ వైకుంఠవాసిభిః సర్వైః నిత్యముక్తైః సుపూజితః | ఆత్మపూజను చేసి, నిత్యముక్తులైన బ్రహ్మమయ వైకుంఠవాసులందరిచేత చక్కగా పూజింపబడి |
తతో బ్రహ్మవిద్యా ప్రవాహైః ఆనంద రస నిర్భరైః | అక్కడ అనంద రస నిర్భరులైన బ్రహ్మవిద్యా ప్రవాహములచే |
క్రీడ అనంత పర్వతైః అనంతైః అభివ్యాప్తం | అనంతములైన క్రీడా పర్వతములచే వ్యాప్తి చెందినట్టి |
6.10 మోక్ష సామ్రాజ్య లక్ష్మిని సేవించుట |
|
---|---|
బ్రహ్మవిద్యామయైః సహస్రప్రాకారైః ఆనందామృతమయైః | బ్రహ్మవిద్యామయులు, ఆనందామృతమయులు, సహస్ర ప్రాకారములచే |
దివ్యగంధైః స్వభావైః చిన్మయైః అనంత బ్రహ్మవనైః అతిశోభితం | దివ్య గంధములు, చిన్మయములు అయిన అనంత బ్రహ్మవనములచే అతి శోభితమైన |
ఉపాసకస్త్వ ఏవం విధం బ్రహ్మవిద్యా వైకుంఠం ఆవిశ్య | బ్రహ్మవిద్యా వైకుంఠమును ఈ విధముగా ఉపాసకుడు ప్రవేశించి |
తత్ అభ్యంతర స్థితి అత్యంత ఉన్నత బోధానంద ప్రాసాద అగ్ర స్థిత | దాని మధ్యమున ఉన్న అత్యంత ఉన్నత బోధానంద ప్రాసాదము ముందు ఉన్న |
ప్రణవ విమాన ఉపరి స్థితాం అపార బ్రహ్మవిద్యా సామ్రాజ్య అధిదేవతాం |
ప్రణవ విమానము పైన స్థితి కలిగియున్న అపార బ్రహ్మవిద్యా సామ్రాజ్య అధిదేవతను |
అమోఘ నిజ మంద కటాక్షేణ అనాది మూల అవిద్యా ప్రలయకరీం | అమోఘమైన తన మంద కటాక్షముచే మూల అవిద్యను ప్రలయము చేయునది అగు |
అద్వితీయాం ఏకాం అనంత మోక్ష సామ్రాజ్యలక్ష్మీం ఏవం ధ్యాత్వా | అద్వితీయము, ఏకము, అనంత మోక్ష సామ్రాజ్య లక్ష్మిని ఈ విధముగా ధ్యానించి |
ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ వివిధ ఉపచారైః ఆరాధ్య పుష్పాంజలిం సమర్ప్య | ప్రదక్షిణ నమస్కారమును చేసి, వివిధ ఉపచారములచే ఆరాధించి, పుష్పాంజలి సమర్పించి |
స్తుత్వా స్తోత్ర విశేషైః తయా అభిపూజితః తత్ అనుజ్ఞాతః చ ఉపరి ఉపరి గత్వా | స్తోత్ర విశేషములచే స్తుతించి, ఆమెచే పూజించబడి, ఆమె అనుజ్ఞ పొందినవాడై మఱియు ఇంకా పైపైకి వెళ్లి |
బ్రహ్మవిద్యా తీరే గత్వా బోధానందమయ అనంత సముద్రాత్ అతిక్రమ్య గత్వా గత్వా | బ్రహ్మవిద్యా తీరమునకు వెళ్లి బోధానందమయ అనంత సముద్రమును దాటి వెళ్లి వెళ్లి |
బ్రహ్మ వనేషు పరమ మంగళ అచల శ్రేణిషు తతో బోధ ఆనంద విమాన పరంపరాసు | బ్రహ్మ వనమునందు, పరమ మంగళ అచల శ్రేణియందు వెళ్లి అంతట బోధానంద విమాన పరంపరల యందు [బోధ = తనయందు తాను నిలిచియున్న స్థితి] |
ఉపాసకః పరమానందం ప్రాప | ఉపాసకుడు పరమానందము పొందును |
తతః శ్రీ తులసీ వైకుంఠ పురాం ఆభాతి | అక్కడ శ్రీ తులసీ వైకుంఠ పురము ప్రకాశించుచున్నది |
6.11 శ్రీ తులసీ వైకుంఠ వర్ణన |
|
---|---|
పరమ కల్యాణం అనంత విభవం అమిత తేజోరాశి ఆకారం | పరమ కళ్యాణము, అనంత విభవము, అమిత తేజోరాశి ఆకారము |
అనంత బ్రహ్మ తేజోరాశి సమష్ట ఆకారం చిత్ ఆనందమయ | అనంత బ్రహ్మ తేజోరాశి సమష్ట ఆకరాము, చిత్ ఆనందమయ |
అనేక ప్రాకార విశేషైః పరివేష్టితం అమిత బోధ ఆనంద అచల ఉపరి స్థితం | అనేక ప్రాకార విశేషములచే పరివేష్టితము, అమిత బోధానంద అచలము పైన ఉన్న |
బోధ ఆనంద తరంగిణ్యాః ప్రవాహైః అతి మంగలం | బోధ ఆనంద తరంగిణుల ప్రవాహముచే అతి మంగళము |
నిరతిశయ ఆనందైః అనంత బృందావనైః అభిశోభితం | నిరతిశయ ఆనందమయము, అనంత బృందావనములచే శోభితమైనది |
అఖిల పవిత్రాణాం పరమ పవిత్రం చిత్ రూపైః అనంత నిత్య ముక్తైః అతి అభివ్యాప్తం | అఖిల పవిత్రములలోను పరమ పవిత్రము, చిత్ రూపులచేత, అనంత నిత్య ముక్తుల చేత వ్యాప్తమైనది |
ఆనందమయ అనంత విమాన జాలైః అలంకృతం | ఆనందమయ అనంత విమాన జాలములచే అలంకృతమైనది |
అమిత తేజోరాశి అంతర్గత దివ్యతేజోరాశి విశేషం | అమిత తేజోరాశి యొక్క అంతర్గత దివ్య తేజోరాశి విశేషములుచే |
ఉపాసకస్త్వ ఏవం ఆకారం తులసీ వైకుంఠం ప్రవిశ్య | అట్టి ఆకారము కలిగిన తులసీ వైకుంఠమును ఆ విధముగా ఉపాసకుడు ప్రవేశించి |
తత్ అంతర్గత దివ్య విమాన ఉపరి స్థితాం | దాని లోపల దివ్య విమానము పైన స్థితి కలిగియున్న |
సర్వ పరిపూర్ణస్య మహావిష్ణోః సర్వాంగేషు విహారిణీం | సర్వ పరిపూర్ణుడైన మహావిష్ణువు యొక్క సర్వాంగములయందు విహరించు |
నిరతిశయ సౌందర్య లావణ్య అధిదేవతాం | నిరతిశయ సౌందర్య లావణ్య అధిదేవతను |
బోధ ఆనందమయైః అనంత నిత్య పరిజనైః పరిసేవితాం | బోధానందమయులైనవారు అనంత నిత్య పరిజనులచే చక్కగా సేవించబడు |
శ్రీసఖీం తులసీం ఏవం లక్ష్మీం ధ్యాత్వా | శ్రీసఖి తులసి లక్ష్మిని ఆ విధముగా ధ్యానించి |
ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ వివిధ ఉపచారైః ఆరాధ్య స్తుత్వా స్తోత్ర విశేషైః | ప్రదక్షిణ నమస్కారములు చేసి వివిధ ఉపచారములచే ఆరాధించి, స్తోత్ర విశేషములచే స్తుతించి |
తయా అభిపూజితః తత్రత్రైః చ అభిపూజితః తత్ అనుజ్ఞాతః | ఆమెచే పూజించబడి మఱియు అక్కడి వారిచే పూజించబడి వారిచే అనుజ్ఞ పొందబడి |
6.12 బోధానంద వనము చేరుట |
|
---|---|
ఉపరి ఉపరి గత్వా పరమానంద తరంగిణ్యాః తీరే గత్వా | పైకి పైకి వెళ్లి పరమానంద తరంగిణుల తీరమునకు వెళ్లి |
తత్ర పరితో అవస్థితాన్ శుద్ధ బోధ ఆనందమయా అనంత వైకుంఠాన్ అవలోక్య | అక్కడ అంతటా అవస్థితమైన శుద్ధ బోధానందమయములైన అనంత వైకుంఠములను అవలోకించి |
నిరతిశయ ఆనందం ప్రాప్య తత్రత్రైః చిత్ రూపైః పురాణ పురుషైః చ అభిపూజితః | నిరతిశయ ఆనందమును పొంది, అక్కడ ఉన్న చిత్ రూపులు మఱియు పురాణ పురుషులచే అభిపూజితులై |
తతో గత్వా గత్వా బ్రహ్మ వనేషు దివ్య గంధ ఆనంద పుష్ప వృష్టిభిః సమన్వితేషు | అక్కడ నుండి వెళ్లి వెళ్లి బ్రహ్మ వనములందు దివ్య గంధ ఆనంద పుష్ప వృష్టులతో కూడిన |
దివ్యమంగలాలయేషు నిరతిశయ ఆనంద అమృత సాగరేషు అమిత తేజోరాశి ఆకారేషు | దివ్య మంగళములతో కూడిన నిరతిశయ ఆనంద అమృత సాగరమునందు, అమిత తేజోరాశి ఆకారమునందు |
కల్లోల వన సంకులేషు తతో అనంత శుద్ధ బోధ విమాన జాల సంకుల ఆనంద అచల శ్రేణిషు | ఆనంద వన సమూహమునందు, అటు నుండి అనంత శుద్ధ బోధ విమాన జాల సమూహ ఆనంద అచల శ్రేణులందు వెళ్లి |
ఉపాసకః తత ఉపరి ఉపరి గత్వా విమాన పరంపరాసు | ఉపాసకుడు అక్కడి నుండి పైకి పైకి వెళ్లి విమాన పరంపరలందు |
అనంత తేజః పర్వత రాజిషు ఏవం క్రమేణ ప్రాప్య విద్య ఆనందమయయోః సంధిం | అనంత తేజో పర్వత శ్రేణులందు ఆ విధముగా క్రమేణ విద్య ఆనందమయముల సంధిని పొంది |
తత్ర ఆనంద తరంగిణ్యాః ప్రవాహేషు స్నాత్వా బోధ ఆనంద వనం ప్రాప్య | అక్కడ ఆనంద తరంగిణుల ప్రవాహములందు స్నానము చేసి బోధానంద వనము చేరును |
శుద్ధ బోధ పరమానంద ఆకార వనం సంతత అమృత పుష్ప వృష్టిభిః పరివేష్టితం | శుద్ధ బోధ పరమానంద ఆకార వనము ఎల్లప్పుడూ అమృత పుష్ప వృష్టులచే పరివేష్టితమై |
పరమానంద ప్రవాహైః అభివ్యాప్తం మూర్తిమద్భిః పరమమంగలైః పరమ కౌతుకం | పరమానంద ప్రవాహములచే అభివ్యాప్తమై, మూర్తిమంతులైన పరమ మంగళములచే పరమ సంతోషము |
అపరిచ్ఛిన్న ఆనంద సాగర ఆకారం క్రీడ ఆనంద పర్వతైః అభిశోభితం | అపరిచ్ఛిన్న ఆనంద సాగర ఆకారమును, క్రీడ ఆనంద పర్వతములచే అభిశోభితమై ఉండును |
6.13 బ్రహ్మవిద్యా పాద వైకుంఠ వర్ణన |
|
---|---|
తత్ మధ్యే చ శుద్ధ బోధ ఆనంద వైకుంఠం | దాని (బోధానంద వనము) మధ్యలో శుద్ధ బోధ ఆనంద వైకుంఠము కలదు |
యత్ ఏవ బ్రహ్మవిద్యా పాద వైకుంఠం సహస్ర ఆనంద ప్రాకారైః సముజ్జ్వలతి | అదే బ్రహ్మవిద్యా పాద వైకుంఠము, సహస్ర ఆనంద ప్రాకారములచే చక్కగా జ్వలించును |
అనంత ఆనంద విమాన జాల సంకులం | (అదే) అనంత ఆనంద విమాన జాల సమూహము |
అనంత బోధ సౌధ అభితో అనిశం ప్రజ్వలంతం | అనంత బోధ సౌధము నిరంతర ప్రజ్వలంతము |
క్రీడా అనంత మండప విశేషైః విశేషితం | క్రీడా అనంత మండప విశేషములచే విశేషితము |
బోధ ఆనందమయ అనంత పరమ ఛత్ర ధ్వజ చామర వితాన తోరణైః అలంకృతం | బోధానందమయ అనంత పరమ ఛత్రము, ధ్వజము, చామరములచే విశాల తోరణములచే అలంకృతమైనది |
పరమానంద వ్యూహైః నిత్యముక్తైః అభితః తతం | పరమానంద వ్యూహులైన (క్రమములలో ఉన్న) నిత్యముక్తులచే వ్యాప్తమైనది |
అనంత దివ్యతేజః పర్వత సమష్టి ఆకారం | అనంత దివ్య తేజో రూప పర్వత సమష్టి ఆకారము కలది |
అపరిచ్ఛిన్న అనంత శుద్ధ బోధ ఆనంద మండలం | అపరిచ్ఛిన్న అనంత శుద్ధ బోధ ఆనంద మండలము |
వాచాం అగోచరం ఆనంద బ్రహ్మ తేజోరాశి మండలం | వాక్కునకు అగోచరము (వర్ణింపశక్యము కానిది), ఆనంద బ్రహ్మ తేజోరాశి మండలము |
అఖండ తేజో మండల విశేషం | అఖండ తేజో మండల విశేషము |
శుద్ధ ఆనంద సమష్టి మండల విశేషం | శుద్ధ ఆనంద సమష్టి మండల విశేషము |
అఖండ చిత్ ఘన ఆనంద విశేషం | అఖండ చిత్ ఘన ఆనంద విశేషము |
ఏవం విధం బోధ ఆనంద వైకుంఠం ఉపాసకః ప్రవిశ్య | ఈ విధమైన బోధానంద వైకుంఠమును ఉపాసకుడు ప్రవేశించి |
తత్రత్రైః సర్వైః అభిపూజితః | అక్కడ ఉన్న వారందరిచే బాగుగా పూజింపబడినవాడగును |
6.14 ఆదినారాయణునితో ఏకత్వము |
|
---|---|
పరమానంద అచల ఉపరి అఖండ బోధ విమానం ప్రజ్వలతి | పరమానంద అచలము పైన అఖండ బోధ విమానము ప్రజ్వలించును |
తత్ అభ్యంతరే చిన్మయ ఆసనం విరాజతే | దాని మధ్యలో చిన్మయ ఆసనము విరాజుల్లుచున్నది |
తత్ ఉపరి విభాతి అఖండ ఆనంద తేజో మండలం |
దాని మీద అఖండ ఆనంద తేజో మండలం ప్రకాశించుచున్నది |
తత్ అభ్యంతర సమాసీనం ఆదినారాయణం ధ్యాత్వా ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ | దాని మధ్యలో చక్కగా ఆసీనుడై ఉన్న ఆదినారాయణుని ధ్యానించి ప్రదక్షిణ నమస్కారమును చేసి |
వివిధ ఉపచారైః సుసంపూజ్య పుష్పాంజలిం సమర్ప్య స్తుత్వా స్తోత్ర విశేషైః | వివిధ ఉపచారములచే బాగుగా పూజించి, పుష్పాంజలి సమర్పించి, స్తోత్ర విశేషములతో స్తుతించి |
స్వరూపేణ అవస్థితం ఉపాసకం అవలోక్య తం ఉపాసకం ఆదినారాయణః స్వ సింహాసనేషు సంస్థాప్య | తన స్వరూపముతో అవస్థితుడైన ఉపాసకుని అవలోకించి ఆదినారాయణుడు తన సింహాసనమునందు ఉపాసకుని సంస్థాపించి |
తత్ వైకుంఠ వాసిభిః సర్వైః సమన్వితః సమస్త మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకం ఉద్దిశ్య | ఆ వైకుంఠ వాసులు అందరితో కలసి సమస్త మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకమును ఉద్దేశించి |
మంత్రపూతైః ఉపాసకం ఆనంద కలశైః అభిషిచ్య | మంత్రపూర్వకముగా పవిత్రమైన ఆనంద కలశముతో ఉపాసకుని అభిషేకించి |
దివ్యమంగల మహావాద్య పురస్సరం వివిధ ఉపచారైః అభ్యర్చ్య | దివ్యమంగళ మహావాద్య పురస్సరముగా వివిధ ఉపచారములచే అర్చించి |
మూర్తిమద్భిః సర్వైః స్వచిహ్నైః అలంకృత్య ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ | మూర్తిమంతమైన సమస్త చిహ్నములతో అలంకరించి ప్రదక్షిణ నమస్కారములు చేసి |
త్వం బ్రహ్మ అసి, అహం బ్రహ్మ అస్మి, ఆవయోః అంతరం న విద్యతే | నీవు బ్రహ్మము, నేను బ్రహ్మము, ఇరువురికి భేదము లేదు |
త్వం ఏవ అహం, అహం ఏవ త్వం, ఇతి అభిధాయేత్ ఉక్త్వ ఆదినారాయణః తిరోదధే | నీవే నేను, నేనే నీవు - అని చెప్పి ఆదినారాయణుడు అంతర్ధానమయ్యెను |
తత్ ఇతి ఉపనిషత్ | ఇది ఈ ఉపనిషత్తు |
ఇతి అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషది పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం నామ షష్టి అధ్యాయః | ఇది అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం పేరుతో ఉన్న ఆరవ అధ్యాయము |
7.1 బ్రహ్మానంద విభూతులు దర్శించుట |
|
---|---|
అథ ఉపాసకః తదా ఆజ్ఞయా నిత్య గరుడం ఆరుహ్య వైకుంఠవాసిభిః సర్వైః పరివేష్ఠితో | అప్పుడు ఉపాసకుడు ఆయన (ఆదినారాయణుని) ఆజ్ఞచే నిత్య గరుడుని ఆరోహించి వైకుంఠవాసులు అందరితో పరివేష్ఠితుడై [గరుడుడు యోగమునకు చిహ్నము, అనగా ఇక్కడ ఉపాసకుడు యోగారూఢుడై సిద్ధిని పొందుచున్నాడు] |
మహా సుదర్శనం పురస్కృత్య విష్వక్సేన పరిపాలితః చ ఉపరి ఉపరి గత్వా బ్రహ్మానంద విభూతిం ప్రాప్య | మహా సుదర్శనం పురస్కరించుకొని విష్వక్సేన పరిపాలితుడు అగును మఱియు ఇంకా పైపైకి వెళ్లి బ్రహ్మానంద విభూతిని పొంది |
సర్వత్ర అవస్థితాన్ బ్రహ్మానందమయాన్ అనంత వైకుంఠాన్ అవలోక్య నిరతిశయ ఆనంద సాగరో భూత్వా | సర్వత్రా అవస్థితులైన బ్రహ్మానందమయములగు అనంత వైకుంఠములను అవలోకించి నిరతిశయ ఆనంద సాగరుడై |
ఆత్మారామ ఆనంద విభూతి పురుషాన్ అనంతాన్ అవలోక్య తాన్ సర్వ అనుపచారైః సమభ్యర్చ్య | ఆత్మారామ ఆనంద విభూతి పురుషులను అనంతమైనవారిని అవలోకించి వారికి సర్వ ఉపచారములతో అర్చన చేసి |
త్రైః సర్వైః అభిపూజితః చ ఉపాసకః తత ఉపరి ఉపరి గత్వా బ్రహ్మానంద విభూతిం ప్రాప్య | వారందరిచేత అభిపూజితుడై ఉపాసకుడు మఱి పైకి పైకి వెళ్లి బ్రహ్మానంద విభూతిని పొంది |
అనంత దివ్య తేజః పర్వతైః అలంకృతాన్ పరమానంద లహరీ వన శోభితాన్ | అనంత దివ్య తేజో పర్వతములచే అలంకరింపబడిన పరమానంద లహరితో ఉన్న వనములచే శోభితమై |
అసంఖ్యాక ఆనంద సముద్రాన్ అతిక్రమ్య | అసంఖ్యాక ఆనంద సముద్రములను అతిక్రమించి |
వివిధ విచిత్ర అనంత పరమతత్త్వ విభూతి సమష్టి విశేషాన్ పరమకౌతుకాన్ | వివిధ విచిత్ర అనంత పరమతత్త్వ విభూతి సమష్టి విశేషములను పరమ కౌతుకములను |
బ్రహ్మానంద విభూతి విశేషాన్ అతిక్రమ్య ఉపాసకః పరమకౌతుకం ప్రాప | బ్రహ్మానంద విభూతి విశేషములను అతిక్రమించి ఉపాసకుడు పరమ ఉత్సాహమును పొందును |
7.2 సుదర్శన వైకుంఠపురం |
|
---|---|
తతః సుదర్శన వైకుంఠపురం ఆభాతి | ఆ తరువాత అక్కడ సుదర్శన వైకుంఠపురం ప్రకాశించును |
నిత్యమంగలం అనంత విభవం సహస్ర ఆనంద ప్రాకార పరివేష్టితం | నిత్య మంగళము, అనంత ఐశ్వర్యము, సహస్ర ఆనంద ప్రాకార పరివేష్టితము |
అయుత కుక్షి ఉపలక్షితం అనంత ఉత్కట జ్వల దర మండలం | అవధిలేని కుక్షి వంటి లక్షణము కలది, అనంతమైన లోయ వలె ఉన్న అత్యధికమైన జ్వాలా చక్రము |
నిరతిశయ దివ్య తేజో మండలం బృందారక పరమానందం | నిరతిశయ దివ్య తేజో మండలము , బృందారక (శ్రేష్ఠమైన) పరమానందము |
శుద్ధ బుద్ధ స్వరూపం అనంత అనంద సౌదామనీ పరమవిలాసం | శుద్ధ బుద్ధ స్వరూపము, అనంత ఆనంద సౌదామనీ (మెఱుపు) వంటి పరమ విలాసము |
నిరతిశయ పరమానంద పారావారాం | నిరతిశయ పరమానంద సముద్రము |
అనంతైః ఆనంద పురుషైః చిద్రూపైః అధిష్ఠితం | అనంతులు, చిద్రూపులైన ఆనంద పురుషులచే అధిష్ఠితము అయి ఉన్నది |
7.3 సుదర్శన మహాచక్రం |
|
---|---|
తత్ మధ్యేచ సుదర్శనం మహాచక్రం | దాని (సుదర్శన వైకుంఠపురం) మధ్యలో సుదర్శన మహాచక్రం ఉన్నది |
చరణం పవిత్రం వితతం పురాణం | చరణం (చక్రము) పవిత్రమైనది, పురాణమై వ్యాపించినది |
యేన పూతః తరతి దుష్కృతాని | దేనిచే పునీతమయి, చేసిన దుష్ట కర్మల నుండి తరించునో |
తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతి పాప్మానం అరాతిం తరేషు | దాని పవిత్రతచే శుద్ధము పునీతము చేసి, పాపము అను శతృవును దాటింపజేయును |
లోకస్య ద్వారం అర్చిమత్ పవిత్రం జ్యోతిష్మత్ భ్రాజమానం మహస్వత్ | లోకమునకు ద్వారము వంటిది, బాగా వెలుగొందునది, పవిత్రమైనది, జ్యోతిమయమైనది, తేజోవంతమైనది, పులకింపజేయునది |
అమృతస్య ధార బహుధా దోహమానం చరణం | అమృతము యొక్క ధార బహు విధములుగా పితుకునదియగు చక్రము |
నో లోకే సుధితాం దధాతు |
మాకు లోకమునందు సుస్థిరము కలుగజేయు గాక! [మా చిత్తచాంచల్యములను వదిలింపజేయు గాక!] |
అయుతారం జ్వలంతం, అయుతార సమష్టి ఆకారం | ప్రకాశ యుక్తము, సమష్టి ఆకార యుక్తము |
నిరతిశయ విక్రమ విలాసం, అనంత దివ్య ఆయుధ దివ్యశక్తి సమష్టి రూపం | నిరతిశయ విక్రమ విలాసము, అనంత దివ్య ఆయుధ దివ్యశక్తి సమష్టి రూపము |
మహావిష్ణోః అనర్గళ ప్రతాప విగ్రహం అయుతాయుత కోటి యోజన విశాలం | మహావిష్ణువు అనర్గళ ప్రతాప విగ్రహము, కోటి యోజన విశాలము కలిగినది |
అనంత జ్వాలా జాలైః అలంకృతం సమస్త దివ్య మంగళ నిదానం | అనంత జ్వాలా జాలములచే అలంకృతమైనది, సమస్త దివ్య మంగళ మూలము |
అనంత దివ్య తీర్థానాం నిజమందిరం | అనంత దివ్య తీర్థములకు సనాతన మందిరము |
ఏవం సుదర్శనం మహాచక్రం ప్రజ్వలతి | ఈ విధముగా సుదర్శన మహాచక్రము ప్రజ్వలించుచున్నది |
తస్య నాభి మండల సంస్థానే ఉపలక్ష్యతే నిరతిశయ ఆనంద దివ్యతేజోరాశిః | దాని యొక్క నాభి మండల సంస్థానమున ఉపలక్ష్యముగా (to be understood by inference) నిరతిశయ ఆనంద దివ్యతేజోరాశి ఉన్నది |
7.4 సుదర్శన పురుషుడి దర్శనము |
|
---|---|
తత్ మధ్యేచ సహస్రార చక్రం ప్రజ్వలతి | దాని (ఆ సుదర్శన మహాచక్రము) మధ్యలో సహస్రార చక్రం (wheel of thousand petals) ప్రజ్వలిస్తోంది |
తత్ అఖండ దివ్యతేజో మండల ఆకారం | అది అఖండ దివ్య తేజో మండల ఆకారము |
పరమానంద సౌదామనీ నిచయోః జ్వలం | పరమానంద సౌదామనీ (మెఱుపుల) సముదాయము వంటి జ్వలనము |
తత్ అభ్యంతర సంస్థానే షట్ శతార చక్రం ప్రజ్వలతి | దాని మధ్య సంస్థానమున ఆరు వందల (600) ఆకులు గల చక్రము ప్రజ్వలించును [ఇక్కడ శుద్ధ జ్ఞానమునకు జ్వలనముతో పోలిక చూపబడుతోంది] |
తస్య అమిత పరమ తేజః పరమ విహార సంస్థాన విశేషం విజ్ఞాన ఘన స్వరూపం | దాని యొక్క అమిత పరమ తేజస్సు పరమ విహార సంస్థాన విశేషము, విజ్ఞాన ఘన స్వరూపము |
తత్ అంతరాళే త్రిశతార చక్రం విభాతి | ఆ చక్రము మధ్యలో మూడు వందల (300) ఆకులు గల చక్రము ప్రకాశించును |
తత్ చ పరమ కల్యాణ విలాస విశేషణం | మఱియు అది పరమ కళ్యాణ విలాస విశేషణము |
అనంత చిత్ ఆదిత్య సమష్టి ఆకారం | అనంత చిత్ ఆదిత్య సమష్టి ఆకారము |
తత్ అభ్యంతరే శతార చక్రం ఆభాతి | దాని మధ్యలో వంద (100) ఆకులు గల చక్రము భాసించుచున్నది |
తత్ చ పరమ తేజో మండల విశేషం | మఱియు అది పరమ తేజో మండల విశేషము |
తత్ మధ్యేచ షష్టి అర చక్రం ఆభాతి | దాని మధ్యన అరవై (60) ఆకుల చక్రము ప్రకాశించుచున్నది |
తత్ చ బ్రహ్మతేజః పరమ విలాస విశేషం | మఱియు అది బ్రహ్మ తేజో పరమ విలాస విశేషము |
తత్ అభ్యంతరం స్థానే షట్కోణ చక్రం ప్రజ్వలతి | దాని మధ్య స్థానమున ఆరు (6) కోణముల చక్రము ప్రజ్వలించును |
తత్ చ అపరిచ్ఛిన్న అనంత దివ్యతేజోరాశి ఆకారం | మఱియు అది అపరిచ్ఛిన్న అనంత దివ్యతేజోరాశి ఆకారము |
తత్ అభ్యంతరే మహ ఆనంద పదం విభాతి | దాని మధ్యమున మహా ఆనంద పదము భాసించుచున్నది |
తత్ కర్ణికాయాం సూర్య ఇందు వహ్నిమండలాని చిన్మయాని జ్వలంతి | దాని కర్ణికయందు సూర్య చంద్ర ఇంద్ర మండలాలు చిన్మయములు జ్వలించుచున్నవి |
తత్ర ఉపలక్ష్యతే నిరతిశయ దివ్యతేజోరాశిః | అక్కడ ఉపలక్ష్యముగా (to be understood by inference) నిరతిశయ దివ్య తేజోరాశి ఉన్నది [ఉపలక్ష్యముగా అనగా అది ప్రత్యక్షముగా చర్మచక్షువులతోను, మనస్సుతోను దర్శించునది కాదు, కేవలము యోగ ఉపాసనా పరాకాష్ఠగా జ్ఞాననేత్రముతో అవలోకించి దర్శించవలసిన పదము] |
తత్ అభ్యంతర సంస్థానే యుగపద్ ఉదిత అనంత కోటి రవి ప్రకాశః సుదర్శన పురుషో విరాజతే | దాని మధ్య సంస్థానమున ఒకేసారి ఉదయించిన అనంత కోటి రవి ప్రకాశము గల సుదర్శన పురుషుడు విరాజిల్లును |
సుదర్శన పురుషో మహావిష్ణుః ఏవ | ఆ సుదర్శన పురుషుడు మహావిష్ణువే! |
7.5 అద్వైత స్థానమును పొందుట |
|
---|---|
మహావిష్ణోః సమస్త అసాధారణ చిహ్న చిహ్నితః | మహావిష్ణువు సమస్త అసాధారణ చిహ్న చిహ్నితుడు (చిహ్నములచే సూచించుబడువాడు) |
ఏవం ఉపాసకః సుదర్శన పురుషం ధ్యాత్వా వివిధ ఉపచారైః ఆరాధ్య ప్రదక్షిణ నమస్కారాత్ విధాయ | ఈ విధముగా ఉపాసకుడు సుదర్శన పురుషుని ధ్యానించి వివిధ ఉపచారములచే ఆరాధించి ప్రదక్షిణ నమస్కారములు చేసి |
ఉపాసకః తేన అభిపూజితః తత్ అనుజ్ఞాతః ఉపరి ఉపరి గత్వా | ఉపాసకుడు ఆయనచే ప్రతిపూజితుడై, ఆయనచే అనుజ్ఞ పొందబడినవాడై, ఇంకా పైకి పైకి వెళ్లి |
పరమ ఆనందమయాత్ అనంత వైకుంఠాత్ అవలోక్య ఉపాసకః పరమానందం ప్రాప | పరమ ఆనందమయులైన అనంత వైకుంఠములను అవలోకించి ఉపాసకుడు పరమానందమును పొందును |
తత ఉపరి వివిధ విచిత్ర అనంత చిత్ విలాస విభూతి విశేషాన్ అతిక్రమ్య | అటు పైన వివిధ విచిత్ర అనంత చిత్ విలాస విభూతి విశేషములను అతిక్రమించి |
అనంత పరమానంద విభూతి సమష్టి విశేషాన్ | అనంత పరమానంద విభూతి సమష్టి విశేషములను |
అనంత నిరతిశయ ఆనంద సముద్రాత్ అతీత్య ఉపాసకః క్రమేణ అద్వైత సంస్థానం ప్రాప | అనంత నిరతిశయ ఆనంద సముద్రములను దాటి ఉపాసకుడు క్రమేణా అద్వైత సంస్థానమును పొందును |
7.6 అద్వైత స్థాన వర్ణన |
|
---|---|
కథం అద్వైతం స్థానం | అద్వైత స్థానము ఎట్లున్నది అనగా |
అఖండ ఆనంద స్వరూపం అనిర్వాచ్యం అమిత బోధ సాగరం అమిత ఆనంద సముద్రం | అఖండ ఆనంద స్వరూపము, అనిర్వాచ్యము, అమిత బోధ సాగరము, అమిత ఆనంద సముద్రము |
విజాతీయ విశేష వివర్జితం సజాతీయ విశేష విశేషితం | విజాతీయ విశేష వివర్జితము, సజాతీయ విశేష విశేషితము [అనగా వేఱు వేఱుగా కనిపిస్తున్న వస్తు విషయముల భేద విశేషములన్నీ ఏకరూపము చెందు స్థానము, ఒకే తీరుగనున్న వాటి విశేషముల మూల తత్త్వమైన స్థానము] |
నిరవయవం నిరాధారం నిర్వికారం నిరంజనం | నిరవయవము, నిరాధారము, నిర్వికారము, నిరంజనము |
అనంత బ్రహ్మానంద సమష్టి కందం | అనంత బ్రహ్మానంద సమష్టి కందము (the root of entirety) |
పరమ చిత్ విలాస సమష్టి ఆకారం | పరమ చిత్ విలాస సమష్టి ఆకారము |
నిర్మలం నిరవద్యం నిరాశ్రయం | నిర్మలము, నిరవద్యము (unobjectionable), నిరాశ్రయము |
అతి నిర్మల అనంత కోటి విప్రకాశ ఏక స్ఫుట లింగం | అతి నిర్మల అనంత కోటి విశేష ప్రకాశ ఏక స్ఫుట (వికసించి విస్తరించిన) లింగము (చిహ్నము) |
అనంత ఉపనిషత్ అర్థ స్వరూపం అఖిల ప్రమాణ అతీతం | అనంత ఉపనిషత్ అర్థ స్వరూపము, అఖిల ప్రమాణ అతీతము |
మనో వాచాం అగోచరం, నిత్య ముక్త స్వరూపం, అనాధారం, ఆది మధ్య అంత శూన్యం | మనో వాక్కులకు అగోచరము, నిత్య ముక్త స్వరూపము, అనాధారము, ఆది మధ్య అంతము లేనిది |
కైవల్యం, పరమం, శాంతం, సూక్ష్మాత్ సూక్ష్మ తరం, మహతో మహత్తరం | కైవల్యము, పరమం, శాంతము, సూక్ష్మములలో అత్యంత సూక్ష్మము, మహత్తు కంటే మహత్తరం |
అపరిమిత ఆనంద విశేషం, శుద్ధ బోధ ఆనంద విభూతి విశేషం | అపరిమిత ఆనంద విశేషము, శుద్ధ బోధ ఆనంద విభూతి విశేషము |
అనంత ఆనంద విభూతి విశేష సమష్టి రూపం | అనంత ఆనంద విభూతి విశేష సమష్టి రూపము |
అక్షరం, అనిర్దేశ్యం, కూటస్థం, అచలం, ధ్రువం, అదిగ్దేశకాలం | అక్షరము, అనిర్దేశ్యము, కూటస్థము, అచలము, ధ్రువము, దిక్కులు దేశము కాలము లేనిది |
అంతర బహిః చ తత్ సర్వం వ్యాప్య పరిపూర్ణం | అంతరమున మఱియు బాహ్యమున తోచుచున్నదంతా వ్యాపించి పరిపూర్ణమై ఉన్నది |
పరమ యోగిభిః విమృగ్యం | పరమ యోగులచే అన్వేషింపబడునది |
దేశతః కాలతో వస్తుతః పరిచ్ఛేద రహితం | దేశము (space) చేత, కాలము (time) చేత, వస్తువు (object) చేత పరిచ్ఛేద రహితము |
నిరంతర అభినవం, నిత్య పరిపూర్ణం, అఖండ అనంద అమృత విశేషం | నిరంతరము క్రొత్తగా ఉండునది, నిత్య పరిపూర్ణము, అఖండ ఆనంద అమృత విశేషము |
శాశ్వతం, పరమపదం, నిరతిశయ ఆనంద అనంత తటిత్పర్వత ఆకారం | శాశ్వతము, పరమపదము, నిరతిశయ ఆనంద అనంత నదీ పర్వత ఆకారము |
అద్వితీయం, స్వయంప్రకాశం, అనిశం జ్వలతి | అద్వితీయము, స్వయంప్రకాశము, ఎల్లప్పుడూ ప్రకాశవంతమైనది |
పరమానంద లక్షణ అపరిచ్ఛిన్న అనంత పరంజ్యోతిః | పరమానంద లక్షణ అపరిచ్ఛిన్న అనంత పరంజ్యోతి స్వరూపము |
శాశ్వతం, శశ్వత్ విభాతి | శాశ్వతము, శాశ్వతముగా ప్రకాశించునది |
తత్ అభ్యంతర సంస్థానే అమిత ఆనంద చిత్ రూప అచలం | దాని మధ్యలో అమిత ఆనంద చిత్ రూప అచలముగా సంస్థాపితమై ఉన్నది |
అఖండ పరమానంద విశేషం, బోధ ఆనంద మహోజ్జ్వలం, నిత్య మంగళ మందిరం | అఖండ పరమానంద విశేషము, బోధ ఆనంద మహోజ్జ్వలము, నిత్య మంగళ మందిరము |
చిన్మథన ఆవిర్భూత చిత్సారం, అనంత ఆశ్చర్య సాగరం, అమిత తేజోరాశి అంతర్గత తేజో విశేషం | చిన్మథన ఆవిర్భూత చిత్సారము, అనంత ఆశ్చర్య సాగరము, అమిత తేజోరాశి అంతర్గత తేజో విశేషము |
అనంత ఆనంద ప్రవాహైః అలంకృతం నిరతిశయ ఆనంద పారావార ఆకారం | అనంత ఆనంద ప్రవాహములచే అలంకృతమైన నిరతిశయ ఆనంద సముద్ర ఆకారము వంటిది |
7.7 త్రిపాద్విభూతి వైకుంఠ స్థానం వర్ణన |
|
---|---|
నిరుపమ నిత్య నిరవద్య నిరతిశయ నిరవధిక తేజోరాశి విశేషం | నిరుపమ (unequallable), నిత్య (permanent), నిరవద్య (unblamable), నిరతిశయ (unsurpassed), నిరవధిక (unlimited) తేజోరాశి విశేషము |
నిరతిశయ ఆనంద సహస్ర ప్రాకారైః అలంకృతం | నిరతిశయ ఆనంద సహస్ర ప్రాకారములచే అలంకృతమైనది |
శుద్ధ బోధ సౌధావళి విశేషైః అలంకృతం | శుద్ధ బోధ సౌధావళి విశేషములచే అలంకృతమైనది |
చిదానందమయ అనంత దివ్య ఆరామైః సుశోభితం | చిదానందమయ అనంత దివ్య ఆరామములుచే (రమించు ప్రదేశములుచే) సుశోభితము |
శశ్వత్ అమిత పుష్ప వృష్టిభిః సమంతతః సంతతం | శాశ్వత అమిత పుష్ప వృష్టులచే అన్నివైపులా నిండినది |
తత్ ఏవ త్రిపాద్విభూతి వైకుంఠ స్థానం | అదే త్రిపాద్విభూతి వైకుంఠ స్థానము |
తత్ ఏవ పరమ కైవల్యం, తత్ ఏవ అబాధిత పరమ తత్త్వం | అదే పరమ కైవల్యము, అదే అబాధిత పరమ తత్త్వము |
తత్ ఏవ అనంత ఉపనిషద్ విమృగ్యం | అదే అనంత ఉపనిషత్తులచే శోధింపబడుచున్నది |
తత్ ఏవ పరమ యోగిభిః ముముక్షుభిః సర్వైః ఆశాస్యమానం | అదే సర్వ పరమ యోగులుచే ముముక్షువులచే ఆశించబడేది |
తత్ ఏవ సత్ ఘనం, తత్ ఏవ చిత్ ఘనం, తత్ ఏవ ఆనంద ఘనం | అదే సత్ ఘనం, అదే చిత్ ఘనం, అదే ఆనంద ఘనం |
తత్ ఏవ శుద్ధ బోధ ఘన విశేషం | అదే శుద్ధ బోధ ఘన విశేషం |
అఖండ ఆనంద బ్రహ్మ చైతన్య అధిదేవతా స్వరూపం | అఖండ ఆనంద బ్రహ్మ చైతన్య అధిదేవతా స్వరూపము |
సర్వాధిష్ఠానం అద్వయ పరబ్రహ్మ విహార మండలం | సర్వాధిష్ఠానము, అద్వయ పరబ్రహ్మ విహార మండలము |
నిరతిశయ ఆనంద తేజోమండలం | నిరతిశయ ఆనంద తేజోమండలము |
అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణః పరమ అధిష్ఠాన మండలం | అద్వైత పరమానంద లక్షణమైన పరబ్రహ్మ యొక్క పరమ అధిష్ఠాన మండలము |
నిరతిశయ పరమానంద పరమమూర్తి విశేష మండలం | నిరతిశయ పరమానంద పరమమూర్తి విశేష మండలము |
అనంత పరమమూర్తి సమష్టి మండలం | అనంత పరమమూర్తి సమష్టి మండలము |
నిరతిశయ పరమానంద లక్షణ పరబ్రహ్మణః పరమమూర్తి పరమతత్త్వ విలాస విశేష మండలం | నిరతిశయ పరమానంద లక్షణ పరబ్రహ్మ యొక్క పరమమూర్తి పరమతత్త్వ విలాస విశేష మండలము |
బోధ ఆనందమయ అనంత పరమ విలాస విభూతి విశేష సమష్టి మండలం | బోధ ఆనందమయ, అనంత పరమ విలాస విభూతి విశేష సమష్టి మండలము |
అనంత చిత్ విలాస విభూతి విశేష సమష్టి మండలం | అనంత చిత్ విలాస విభూతి విశేష సమష్టి మండలము |
అఖండ శుద్ధ చైతన్య నిజమూర్తి విశేష విగ్రహం | అఖండ, శుద్ధ చైతన్య నిజమూర్తి విశేష విగ్రహము |
వాచాం అగోచరం అనంత శుద్ధ బోధ విశేష విగ్రహం | వాక్కునకు అగోచరము, అనంత శుద్ధ బోధ విశేష విగ్రహము |
అనంత ఆనంద సుముద్ర సమష్టి ఆకారం | అనంత ఆనంద సుముద్ర సమష్టి ఆకారము |
అఖండ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణః | అఖండ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మము |
పరమమూర్తి పరమతేజః పుంజ పిండ విశేషం | పరమమూర్తి, పరమతేజో పుంజ పిండ విశేషము |
చిత్ రూప ఆదిత్య మండలం | చిత్ రూప ఆదిత్య మండలము |
ద్వాత్రింశత్ వ్యూహ భేదైః అధిష్టితం | ముప్పది రెండు (32) వ్యూహ భేదములచే అధిష్ఠితమైనది |
వ్యూహ భేదాః చ కేశవాది చతుర్వింశతిః సుదర్శనాది న్యాస మంత్రాః సదర్శనాది యంత్ర ఉద్ధారః అనంత గరుడ విష్వక్సేనాః చ నిరతిశయ ఆనందాః చ | మఱియు ఆ వ్యూహ భేదములు అనగా కేశవ మొదలగు ఇరువది నాలుగు (24) నామములు, సుదర్శన మొదలగు న్యాస మంత్రములు, సుదర్శన మొదలగు యంత్ర ఉద్ధారము, అనంతుడు, గరుడుడు మఱియు విష్వక్సేనుడు |
ఆనంద వ్యూహ మధ్యే సహస్ర కోటి యోజనాయత ఉన్నత చిన్మయ ప్రసాదం | ఆనంద వ్యూహ మధ్యమున సహస్ర యోజన ప్రమాణము గల ఉన్నత చిన్మయ ప్రసాదము |
బ్రహ్మానందమయ విమానకోటిభిః అతి మంగలం | కోట్లాది బ్రహ్మానందమయ విమానములచే అతి మంగళము |
అనంత ఉపనిషత్ అర్థ ఆరామ జాల సంకులం | అనంత ఉపనిషత్ అర్థ రమ్య జాల సమూహము |
సామహంస కూజితైః అతి శోభితం | సామ హంస కూతలచే (వేద గానముచే) అతి శోభితము |
ఆనందమయ అనంత శిఖరైః అలంకృతం | ఆనందమయ అనంత శిఖరములచే అలంకృతము |
చిదానంద రస నిర్భరైః అభివ్యాప్తం | చిదానంద రసాధికములచే అభివ్యాప్తము |
అమిత ఆనంద తేజోరాశి అంతర స్థితం | అమిత ఆనంద తేజోరాశి అంతరమున స్థితము |
7.8 పరమ వైకుంఠ నారాయణ యంత్రం |
|
---|---|
అనంత ఆనంద ఆశ్చర్య సాగరం తత్ అభ్యంతర సంస్థానే | అనంత ఆనంద ఆశ్చర్య సాగరము, దాని మధ్య సంస్థానమున |
అనంత కోటి రవి ప్రకాశ అతిశయ ప్రాకారం, నిరతిశయ ఆనంద లక్షణం | అనంత కోటి రవి ప్రకాశ అతిశయ ప్రాకారము, నిరతిశయ ఆనంద లక్షణము |
ప్రణవ ఆఖ్యం విమానం విరాజతే | ప్రణవము అను విమానము విరాజిల్లును |
శతకోటి శిఖరైః ఆనందమయైః సముజ్జ్వలతి | శతకోటి శిఖరములతో ఆనందమయమై గొప్ప ఉజ్జ్వలమైనది |
తత్ అంతరాళే బోధ ఆనంద అచల ఉపరి అష్టాక్షరీ మంటపో విభాతి | ఆ విమాన అంతరమునందు బోధ ఆనంద అచలము పైన అష్టాక్షరి మంటపము భాసించుచున్నది |
తత్ మధ్యే చ చిదానందమయ వేదిక ఆనంద వన భూషితా | మఱియు దాని మధ్యన చిదానందమయ వేదిక ఆనంద భూషితమై ఉన్నది |
తత్ ఉపరి జ్వలతి నిరతిశయ ఆనంద తేజోరాశిః | దాని మీద నిరతిశయ ఆనంద తేజోరాశి జ్వలించుచున్నది |
తత్ అభ్యంతర సంస్థానే అష్టాక్షరీ పద్మ విభూషితం చిన్మయ ఆసనం విరాజతే | ఆ వేదిక మధ్య సంస్థానమున అష్టాక్షరీ పద్మ విభూషితమగు చిన్మయ ఆసనం విరాజిల్లుచున్నది |
ప్రణవ కర్ణికాయాం సూర్య ఇందు వహ్ని మండలాని చిన్మయాని జ్వలంతి | ప్రణవ కర్ణిక యందు సూర్య చంద్ర అగ్ని మండలాలు చిన్మయములు జ్వలించుచున్నవి |
తత్ర అఖండ ఆనంద తేజోరాశి అంతర్గతం పరమ మంగల ఆకారం అనంత ఆసన విరాజతే | అక్కడ అఖండ ఆనంద తేజోరాశి అంతర్గతమున పరమ మంగళ ఆకారమున అనంత ఆసనము విరాజిల్లును |
తస్య ఉపరి చ మహా యంత్రం ప్రజ్వలతి | దాని మీద మహా యంత్రము ప్రజ్వలించుచున్నది |
నిరతిశయ బ్రహ్మానంద పరమమూర్తి మహాయంత్రం | అది నిరతిశయ బ్రహ్మానంద పరమమూర్తి మహాయంత్రం |
సమస్త బ్రహ్మ తేజోరాశి సమష్టిరూపం చిత్ స్వరూపం నిరంజనం | సమస్త బ్రహ్మ తేజోరాశి సమష్టిరూపము, చిత్ స్వరూపము, నిరంజనము |
పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మణః పరమరహస్య కైవల్యం | పరబ్రహ్మ స్వరూపము, పరబ్రహ్మము యొక్క పరమరహస్య కైవల్యము |
మహాయంత్రమయ పరమ వైకుంఠ నారాయణ యంత్రం విజయతే | మహాయంత్రమయ పరమ వైకుంఠ నారాయణ యంత్రం విజయముగా ఉన్నది |
తత్ స్వరూపం కథం ఇతి, దేశికః తథా ఇతి హ ఉవాచ | దాని స్వరూపము ఎట్టిది అనగా గురువు ఈ విధముగా చెప్పుచున్నాడు |
7.9 యంత్ర నిర్మాణము |
|
---|---|
ఆదౌ షట్కోణ చక్రం, తత్ మధ్యే షట్ దల పద్మం | మొదట ఆరు కోణముల (angles) చక్రము, దాని మధ్యమున ఆరు దళముల పద్మము |
తత్ కర్ణికాయాం ప్రణవః ఓం ఇతి | దాని కర్ణికల (vertices) యందు ప్రణవము "ఓం" అని |
ప్రణవ మధ్యే నారయణ బీజం ఇతి | ప్రణవ మధ్యమున నారాయణ బీజము ("రా") అని వ్రాసి |
తత్ సాధ్య గర్భితం మమ సర్వ అభీష్ట సిద్ధిం కురు కురు స్వాహా ఇతి | దాని సాధ్య గర్భితమున - "మమ సర్వ అభీష్ట సిద్ధిం కురు కురు స్వాహా" అని |
తత్ పద్మ దలేషు విష్ణు నృసింహ షడక్షర మంత్రౌ, ఓం నమో విష్ణవే, ఐం క్లీం శ్రీం హ్రీం క్ష్మౌం ఫట్ | ఆ పద్మ దళముల యందు విష్ణు నృసింహ షట్ అక్షర మత్రములు - "ఓం నమో విష్ణవే", "ఐం క్లీం శ్రీం హ్రీం క్ష్మౌం ఫట్" |
తత్ దల కపోలేషు రామ కృష్ణ షడక్షర మంత్రౌ, రాం రామాయనమః, క్లీం కృష్ణాయ నమః | దాని దళ కపోలములందు రామ కృష్ణ షట్ అక్షర మంత్రములు - "రాం రామాయనమః", "క్లీం కృష్ణాయ నమః" |
షట్కోణేషు సుదర్శన షడక్షర మంత్రః సహస్రార హుం ఫట్ ఇతి | షట్ కోణములందు సదర్శన షట్ అక్షర మంత్రము - "సహస్రార హుం ఫట్ " అని |
షట్కోణ కపోలేషు ప్రణవ యుక్త శివ పంచాక్షర మంత్రః, ఓం నమః శివాయ ఇతి | షట్ కోణ కపోలములందు ప్రణవ సహితముగా శివ పంచాక్షర మంత్రము - "ఓం నమః శివాయ" అని |
తత్ బహిః ప్రణవ మాలా యుక్తం వృత్తం | దాని బాహ్యమున ప్రణవ మాలా యుక్తముగా వృత్తము |
వృత్తాత్ బహిః అష్టదల పద్మం | వృత్తము బయట అష్ట దళ పద్మము |
తేషు దలేషు నారాయణ నృసింహ అష్టాక్షర మంత్రౌ, ఓం నమో నారాయణాయ, జయ జయ నరసింహ | వాటి దళములందు నారాయణ, నృసింహ అష్ట అక్షర మంత్రములు - "ఓం నమో నారాయణాయ", "జయ జయ నరసింహ" |
తత్ దల సంధిషు రామ కృష్ణ శ్రీకర అష్టాక్షర మంత్రాః, ఓం రామాయ హుం ఫట్ స్వాహా, క్లీం దామోదరాయ నమః, ఉత్తిష్ఠ శ్రీకర స్వాహా | ఆ దళముల సంధుల యందు రామ, కృష్ణ, శ్రీకర అష్ట అక్షర మంత్రములు - "ఓం రామాయ హుం ఫట్ స్వాహా", "క్లీం దామోదరాయ నమః", "ఉత్తిష్ఠ శ్రీకర స్వాహా" |
తత్ బహిః ప్రణవ మాలా యుక్తం వృత్తం | దాని బయట ప్రణవ మాలా యుక్తముగా వృత్తము |
వృత్తాత్ బహిః నవ దల పద్మం | వృత్తము బయట తొమ్మిది దళముల పద్మము |
తేషు దలేషు రామ కృష్ణ హయగ్రీవ నవాక్షర మంత్రాః, ఓం రామచంద్రాయ నమః ఓం, క్లీం కృష్ణాయ గోవిందాయ క్లీం, హ్లౌం హయగ్రీవాయ నమో హ్లౌం | వాటి దళముల యందు రామ, కృష్ణ, హయగ్రీవ తొమ్మిది అక్షరముల మంత్రములు - "ఓం రామచంద్రాయ నమః ఓం", "క్లీం కృష్ణాయ గోవిందాయ క్లీం", "హ్లౌం హయగ్రీవాయ నమో హ్లౌం" |
తత్ దల కపోలేషు దక్షిణామూర్తి నవాక్షర మంత్రః, ఓం దక్షిణామూర్తిః ఈశ్వరం | ఆయా దళ కపోలముల యందు దక్షిణామూర్తి తొమ్మిది అక్షరముల మంత్రము - "ఓం దక్షిణామూర్తిః ఈశ్వరం" |
తత్ బహిః నారాయణ బీజ యుక్తం వృత్తం వృత్తాత్ బహిః దశ దల పద్మం | దాని బాహ్యమున నారాయణ బీజ యుక్తముగా వృత్తము, వృత్తము వెలుపల పది దళములతో పద్మము |
తేషు దలేషు రామ కృష్ణ దశాక్షర మంత్రౌ, హుం జానకీ వల్లభాయ స్వాహా, గోపీజన వల్లభాయ స్వాహా | ఆ దళముల యందు రామ, కృష్ణ దశ అక్షర మంత్రములు - "హుం జానకీ వల్లభాయ స్వాహా", "గోపీజన వల్లభాయ స్వాహా" |
తత్ దల సంధిషు నృసింహ మాలా మంత్రః, ఓం నమో భగవతే శ్రీ మహానృసింహాయ కరాళ దంష్ట్ర వదనాయ మమ విఘ్నాన్ పచ పచ స్వాహా | ఆ దళముల సంధుల యందు నృసింహ మాలా మంత్రము - "ఓం నమో భగవతే శ్రీ మహానృసింహాయ కరాళ దంష్ట్ర వదనాయ మమ విఘ్నాన్ పచ పచ స్వాహా " |
తత్ బహిః నృసింహ ఏకాక్షర యుక్తం వాసుదేవ ద్వాదశాక్షర మంత్రౌ, ఓం నమో భగవతే నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ | దాని బయట నృసింహ ఏకాక్షర ("క్ష్రౌం") యుక్తము వాసుదేవ ద్వాదశాక్షర మంత్రములు - "ఓం నమో భగవతే నారాయణాయ", "ఓం నమో భగవతే వాసుదేవాయ" |
తత్ దల కపోలేషు మహావిష్ణు రామ కృష్ణ ద్వాదశ మంత్రాః చ, ఓం నమో భగవతే మహావిష్ణవే, ఓం హ్రీం భరతాగ్రజ రామ క్లీం స్వాహా, శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ నమః | ఆ దళ కపోలముల యందు మహావిష్ణు, రామ, కృష్ణ ద్వాదశ మంత్రములు - "ఓం నమో భగవతే మహావిష్ణవే", "ఓం హ్రీం భరతాగ్రజ రామ క్లీం స్వాహా", "శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ నమః" |
తత్ బహిః జగన్మోహన బీజ యుక్తం వృత్తం, క్లీం ఇతి, వృత్తాత్ బహిః చతుర్దశ దల పద్మం | దాని బాహ్యమున జగన్మోహన బీజ యుక్త వృత్తము = "క్లీం" అని, వృత్తము బయట పద్నాలుగు దళములతో పద్మము |
తేషు దలేషు లక్ష్మీ నారాయణ హయగ్రీవ గోపాల దధి వామన మంత్రాః చ, ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః, ఓం నమః సర్వ కోటీ సర్వవిద్యారాజాయ, క్లీం కృష్ణాయ గోపాల చూడామణయే స్వాహా, ఓం నమో భగవతే దధి వామనాయ ఓం | దాని దళముల యందు లక్ష్మీ నారాయణ, హయగ్రీవ, గోపాల, దధి వామన మంత్రములు - "ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః", "ఓం నమః సర్వ కోటీ సర్వవిద్యారాజాయ", "క్లీం కృష్ణాయ గోపాల చూడామణయే స్వాహా", "ఓం నమో భగవతే దధి వామనాయ ఓం" |
తత్ దల సంధిషు అన్నపూర్ణేశ్వరీ మంత్రః, హ్రీం పద్మావతీ అన్నపూర్ణే మహేశ్వరి స్వాహా | దాని దళముల యందు అన్నపూర్ణేశ్వరీ మంత్రము - " హ్రీం పద్మావతీ అన్నపూర్ణే మహేశ్వరి స్వాహా " |
తత్ బహిః ప్రణవ మాలా యుక్తం వృత్తం వృత్తాత్ బహిః షోడశ దల పద్మం | దాని బాహ్యమున ప్రణవ మాలా యుక్తముగా వృత్తము, వృత్తము వెలుపల పదహారు దళములతో పద్మము |
తేషు దలేషు శ్రీ కృష్ణ సుదర్శన షోడశాక్షర మంత్రౌ చ, ఓం నమో భగవతే రుక్మిణీ వల్లభాయ స్వాహా, ఓం నమో భగవతే మహా సుదర్శనాయ హుం ఫట్ | దాని దళముల యందు శ్రీ కృష్ణ, సుదర్శన పదహారు అక్షరముల మంత్రములు - "ఓం నమో భగవతే రుక్మిణీ వల్లభాయ స్వాహా", "ఓం నమో భగవతే మహా సుదర్శనాయ హుం ఫట్" [హుం ఫట్ చేయువాడు అనగా అజ్ఞానముచే కలుగు భయము, దుఃఖములను తొలగించువాడు] |
తత్ దల సంధిషు స్వరాత్ సుదర్శన మాలా మంత్రాః చ, అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఏ ఐ ఓ ఔ అం అః [16] సుదర్శన మహాచక్రాయ దీప్త రూపాయ సర్వతో మాం రక్ష రక్ష సహస్రార హుం ఫట్ స్వాహా |
ఆ దళముల సంధుల యందు స్వరములతో సుదర్శన మాలా మంత్రములు - " అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఏ ఐ ఓ ఔ అం అః సుదర్శన మహాచక్రాయ దీప్త రూపాయ సర్వతో మాం రక్ష రక్ష సహస్రార హుం ఫట్ స్వాహా " |
తత్ బహిః వరాహ బీజ యుక్తం వృత్తం హుం ఇతి, వృత్తాత్ బహిః అష్టాదశ దల పద్మం | దాని బాహ్యమున వరాహ బీజ "హుం" యుక్తముగా వృత్తము, వృత్తము బయట పద్దెనిమిది దళములతో పద్మము |
తేషు దలేషు శ్రీ కృష్ణ వామనా అష్టాదశ అక్షర మంత్రౌ, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా, ఓం నమో విష్ణవే సురపతయే మహా బలాయ స్వాహా | దాని దళముల యందు శ్రీ కృష్ణ, వామనా అష్టాదశ అక్షర మంత్రములు - "క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా", "ఓం నమో విష్ణవే సురపతయే మహా బలాయ స్వాహా" |
తత్ దల కపోలేషు గరుడ పంచాక్షర మంత్రో గరుడ మాలా మంత్రః చ క్షిప ఓం స్వాహా, ఓం నమః పక్షిరాజాయ సర్వ విష భూత రక్షః కృతి ఆది భేదనాయ సర్వ ఇష్ట సాధకాయ స్వాహా | ఆయా దళ కపోలముల యందు గరుడ పంచాక్షర మంత్రము మఱియు గరుడ మాలా మంత్రము - "క్షిప ఓం స్వాహా", "ఓం నమః పక్షిరాజాయ సర్వ విష భూత రక్షః కృతి ఆది భేదనాయ సర్వ ఇష్ట సాధకాయ స్వాహా " |
తత్ బహిః మాయా బీజ యుక్తం వృత్తం వృత్తాత్ బహిః పునః అష్ట దల పద్మం | దాని బాహ్యమున మాయా బీజ యుక్తముగా వృత్తము, వృత్తము బయట మరలా అష్ట దళ పద్మము |
తేషు దలేషు శ్రీ కృష్ణ వామన అష్టాక్షర మంత్రౌ, ఓం నమో దామోదరాయ, ఓం వామనాయ నమ ఓం | దాని దళముల యందు శ్రీ కృష్ణ , వామన అష్టాక్షర మంత్రములు - "ఓం నమో దామోదరాయ", "ఓం వామనాయ నమ ఓం" |
తత్ దల కపోలేషు నీలకంఠ త్ర్యక్షరీ గరుడ పంచాక్షరీ మంత్రౌ చ, ప్రేం రీం ఠః, నమో అండజాయ | దాని దళ కపోలముల యందు నీలకంఠ మూడు అక్షరముల మఱియు గరుడ పంచాక్షరీ మంత్రములు - "ప్రేం రీం ఠః", "నమో అండజాయ" |
తత్ బహిః మన్మథ బీజ యుక్తం వృత్తం వృత్తాత్ బహిః చతుర్వింశతి దల పద్మం | దాని బాహ్యమున మన్మథ బీజ (క్లీం) యుక్తముగా వృత్తము, వృత్తము బయట ఇరువది నాలుగు దళములతో పద్మము |
తేషు దలేషు శరణాగత నారాయణ మంత్రో నారాయణ హయగ్రీవ గాయత్రీ మంత్రౌ చ, శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః ద్వయం ద్వయం, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్, వాగేశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్ |
ఆ దళముల యందు శరణాగత నారాయణ మంత్రము మఱియు నారాయణ హయగ్రీవ గాయత్రీ మంత్రములు - "శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే", "శ్రీమతే నారాయణాయ నమః ద్వయం ద్వయం", "నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్", "వాగేశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్" |
తత్ దల కపోలేషు నృసింహ సుదర్శన బ్రహ్మ గాయత్రీ మంత్రాః చ, వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహః ప్రచోదయాత్, సుదర్శనాయ విద్మహే హేతిరాజాయ ధీమహి తం నః చక్రః ప్రచోదయాత్ తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ |
దాని దళ కపోలముల యందు నృసింహ, సుదర్శన, బ్రహ్మ గాయత్రీ మంత్రములు - "వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహః ప్రచోదయాత్", "సుదర్శనాయ విద్మహే హేతిరాజాయ ధీమహి తం నః చక్రః ప్రచోదయాత్" "తత్ సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్" |
తత్ బహిః హయగ్రీవ ఏకాక్షర యుక్తం వృత్తం, హ్లౌః సౌం ఇతి, వృత్తాత్ బహిః ద్వాత్రింశత్ దల పద్మం | దాని బాహ్యమున హయగ్రీవ ఏకాక్షర బీజ యుక్తముగా వృత్తము, "హ్లౌః ", "సౌం" అని, వృత్తము బయట ముప్పది రెండు దళములతో పద్మము |
తేషు దలేషు నృసింహ హయగ్రీవ అనుష్టుభ మంత్రౌ, "ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం, నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామి అహం", "ఋక్ యజుః సామ రూపాయ వేద అహరణ కర్మణే, ప్రణవ ఉద్గీథ వపుషే మహా అశ్వ శిరసే నమః" |
ఆ పద్మ దళముల యందు అనుష్టుభ ఛందస్సులో నృసింహ, హయగ్రీవ మంత్రములు - "ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం, నృసింహ భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామి అహం", "ఋక్ యజుః సామ రూపాయ వేద అహరణ కర్మణే, ప్రణవ ఉద్గీథ వపుషే మహా అశ్వ శిరసే నమః" |
తత్ దల కపోలేషు రామ కృష్ణ అనుష్టుభ మంత్రౌ, "రామభద్ర మహేష్వాస రఘువీర నృపసత్తమ, భో! దశాస్య అంతక! అస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే", "దేవకీసుతా! గోవిందా! వాసుదేవా! జగత్పతే!, దేహి మే తనయం కృష్ణా! త్వాం అహం శరణం గతః" |
ఆ దళ కపోలముల యందు అనుష్టుభ ఛందస్సులో రామ, కృష్ణ మంత్రములు - "రామభద్ర మహేష్వాస రఘువీర నృపసత్తమ, భో! దశాస్య అంతక! అస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే", "దేవకీసుతా! గోవిందా! వాసుదేవా! జగత్పతే!, దేహి మే తనయం కృష్ణా! త్వాం అహం శరణం గతః" |
తత్ బహిః ప్రణవ సంపుటిత అగ్ని బీజ యుక్తం వృత్తం, ఓం రం ఓం ఇతి, వృత్తాత్ బహిః షట్ త్రింశత్ దల పద్మం | దాని బాహ్యమున ప్రణవముతో కూడి అగ్ని బీజ యుక్తముగా వృత్తము, "ఓం రం ఓం" అని, వృత్తము బయట ముప్పై ఆరు (36) దళములతో పద్మము |
తేషు దలేషు హయగ్రీవ షట్ త్రింశత్ అక్షర మంత్రః | ఆ దళముల యందు ముప్పై ఆరు (36) అక్షరములతో హయగ్రీవ మంత్రము |
పునః అష్ట త్రింశత్ అక్షర మంత్రః చ | మరలా ముప్పై ఎనిమిది (38) అక్షరములతో (ఈ క్రింది) మంత్రము - |
హంసః విశ్వ ఉత్తీర్ణ రూపాయ చిన్మయానంద రూపిణే, తుభ్యం నమో హయగ్రీవ విద్యా రాజాయ విష్ణవే, సో అహం, హ్లౌం సౌం ఓం నమో భగవతే హయగ్రీవాయ సర్వ వాగీశ్వర ఈశ్వరాయ సర్వవేదమయాయ సర్వవిద్యాం మే దేహి స్వాహా | హంసః విశ్వ ఉత్తీర్ణ రూపాయ చిన్మయానంద రూపిణే, తుభ్యం నమో హయగ్రీవ విద్యా రాజాయ విష్ణవే, సో అహం, హ్లౌం సౌం ఓం నమో భగవతే హయగ్రీవాయ సర్వ వాగీశ్వర ఈశ్వరాయ సర్వవేదమయాయ సర్వవిద్యాం మే దేహి స్వాహా |
తత్ దల కపోలేషు ప్రణవాది నమో అంతాః చతుర్థి అంతాః కేశవాది చతుర్వింశతి మంత్రాః చ | ఆ దళ కపోలముల యందు ప్రణవము ("ఓం") ప్రారంభముగా "నమో" అంత్యముగా చతుర్థి విభక్తితో ("ఆయ" రూపముగా) , కేశవ మొదలగు ఇరువది నాలుగు (24) మంత్రములు |
అవశిష్ట ద్వాదశ స్థానేషు రామ కృష్ణ గాయత్రీ ద్వయ వర్ణ చతుష్టయం ఏక ఏక స్థలే | మిగిలిన పన్నెండు (12) స్థానములందు రామ, కృష్ణ, గాయత్రీ ద్వయ వర్ణ (pair of letters) చతుష్టయముగా (as set of four) ఒక్కొక్క స్థలమున ఉంచవలెను - |
1. ఓం కేశవాయ నమః 2. ఓం నారాయణాయ నమః 3. ఓం మాధవాయ నమః 4. ఓం గోవిందాయ నమః 5. ఓం విష్ణవే నమః 6. ఓం మధుసూదనాయ నమః 7. ఓం త్రివిక్రమాయ నమః 8. ఓం వామనాయ నమః 9. ఓం శ్రీధరాయ నమః 10. ఓం హృషీకేశాయ నమః 11. ఓం పద్మనాభాయ నమః 12. ఓం దామోదరాయ నమః 13. ఓం సంకర్షణాయ నమః 14. ఓం వాసుదేవాయ నమః 15. ఓం ప్రద్యుమ్నాయ నమః 16. ఓం అనిరుద్ధాయ నమః 17. ఓం పురుషోత్తమాయ నమః 18. ఓం అధోక్షజాయ నమః 19. ఓం నారసింహాయ నమః 20. ఓం అచ్యుతాయ నమః 21. ఓం జనార్ధనాయ నమః 22. ఓం ఉపేంద్రాయ నమః 23. ఓం హరయే నమః 24. ఓం శ్రీకృష్ణాయ నమః |
1. ఓం కేశవాయ నమః 2. ఓం నారాయణాయ నమః 3. ఓం మాధవాయ నమః 4. ఓం గోవిందాయ నమః 5. ఓం విష్ణవే నమః 6. ఓం మధుసూదనాయ నమః 7. ఓం త్రివిక్రమాయ నమః 8. ఓం వామనాయ నమః 9. ఓం శ్రీధరాయ నమః 10. ఓం హృషీకేశాయ నమః 11. ఓం పద్మనాభాయ నమః 12. ఓం దామోదరాయ నమః 13. ఓం సంకర్షణాయ నమః 14. ఓం వాసుదేవాయ నమః 15. ఓం ప్రద్యుమ్నాయ నమః 16. ఓం అనిరుద్ధాయ నమః 17. ఓం పురుషోత్తమాయ నమః 18. ఓం అధోక్షజాయ నమః 19. ఓం నారసింహాయ నమః 20. ఓం అచ్యుతాయ నమః 21. ఓం జనార్ధనాయ నమః 22. ఓం ఉపేంద్రాయ నమః 23. ఓం హరయే నమః 24. ఓం శ్రీకృష్ణాయ నమః |
దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్ | దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్ |
దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తం నః కృష్ణః ప్రచోదయాత్ | దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తం నః కృష్ణః ప్రచోదయాత్ |
తత్ బహిః ప్రణవ సంపుటిత అంకుశ బీజయుక్తం వృత్తం, ఓం క్రోం ఓం ఇతి | ఆ పద్మము బయట ప్రణవముతో కూడి అంకుశ బీజయుక్తముగా, "ఓం క్రోం ఓం" అని |
తత్ బహిః పునః వృత్తం | దాని బయట మరలా వృత్తము |
తత్ మధ్యే ద్వాదశ కుక్షి స్థానాని స అంతరాళాని | దాని మధ్యన అంతరాళములతో కూడి పన్నెండు కుక్షి స్థానములు |
తేషు కౌస్తుభ వనమాలా శ్రీవత్స సుదర్శన గరుడ పద్మ ధ్వజ అనంత శార్ఙ్గ గదా శంఖ నందక మంత్రాః | వాటి యందు కౌస్తుభ, వనమాలా, శ్రీవత్స, సుదర్శన, గరుడ, పద్మ, ధ్వజ, అనంత, శార్ఙ్గ, గదా, శంఖ, నందక మంత్రములు |
ప్రణవాది నమో అంతాః చతుర్థి అంతాః క్రమేణ | ప్రణవము ("ఓం") ప్రారంభముగా "నమో" అంత్యముగా "ఆయ" చివరగా క్రమేణా |
ఓం కౌస్తుభాయ నమః ఓం వనమాలాయై నమః ఓం శ్రీవత్సాయ నమః ఓం సుదర్శనాయ నమః ఓం గరుడాయ నమః ఓం పద్మాయ నమః ఓం ధ్వజాయ నమః ఓం అనంతాయ నమః ఓం శార్ఙ్గాయ నమః ఓం గదాయై నమః ఓం శంఖాయ నమః ఓం నందకాయ నమః |
ఓం కౌస్తుభాయ నమః ఓం వనమాలాయై నమః ఓం శ్రీవత్సాయ నమః ఓం సుదర్శనాయ నమః ఓం గరుడాయ నమః ఓం పద్మాయ నమః ఓం ధ్వజాయ నమః ఓం అనంతాయ నమః ఓం శార్ఙ్గాయ నమః ఓం గదాయై నమః ఓం శంఖాయ నమః ఓం నందకాయ నమః |
తత్ అంతరాలేషు | దాని అంతరాళముల యందు |
ఓం విష్వక్సేనాయ నమః ఓం అచక్రాయ స్వాహా ఓం విచక్రాయ స్వాహా ఓం సుచక్రాయ స్వాహా ఓం ధీచక్రాయ స్వాహా ఓం సంచక్రాయ స్వాహా ఓం జ్వాలాచక్రాయ స్వాహా ఓం క్రుద్ధోల్కాయ స్వాహా ఓం మహోల్కాయ స్వాహా ఓం వీర్యోల్కాయ స్వాహా ఓం వ్యుల్కాయ స్వాహా ఓం సహస్రోల్కాయ స్వాహా |
ఓం విష్వక్సేనాయ నమః ఓం అచక్రాయ స్వాహా ఓం విచక్రాయ స్వాహా ఓం సుచక్రాయ స్వాహా ఓం ధీచక్రాయ స్వాహా ఓం సంచక్రాయ స్వాహా ఓం జ్వాలాచక్రాయ స్వాహా ఓం క్రుద్ధోల్కాయ స్వాహా ఓం మహోల్కాయ స్వాహా ఓం వీర్యోల్కాయ స్వాహా ఓం వ్యుల్కాయ స్వాహా ఓం సహస్రోల్కాయ స్వాహా |
ఇతి ప్రణవాది మంత్రాః | ఇవి ప్రణవాది ("ఓం" ప్రారంభముతో కూడిన) మంత్రములు |
తత్ బహిః ప్రణవ సంపుటిత గరుడ పంచాక్షర యుక్తం వృత్తం, ఓం క్షిప ఓం స్వాహా ఓం | దాని (వృత్తము) బయట ప్రణవముతో కూడి గరుడ పంచాక్షర బీజయుక్తముగా, "ఓం క్షిప ఓం స్వాహా ఓం" అని |
తత్ చ ద్వాదశ వజ్రైః స అంతరాలైః అలంకృతం, తేషు వజ్రేషు | అది పన్నెండు వజ్రములతో అంతరాళములతో కూడి అలంకృతమైనది, ఆ వజ్రముల యందు |
ఓం పద్మ నిధయే నమః ఓం మహాపద్మ నిధయే నమః ఓం గరుడ నిధయే నమః ఓం శంఖ నిధయే నమః ఓం మకర నిధయే నమః ఓం కచ్ఛప నిధయే నమః ఓం విద్యా నిధయే నమః ఓం పరమానంద నిధయే నమః ఓం మోక్ష నిధయే నమః ఓం లక్ష్మీ నిధయే నమః ఓం బ్రహ్మ నిధయే నమః ఓం వైకుంఠ నిధయే నమః |
ఓం పద్మ నిధయే నమః ఓం మహాపద్మ నిధయే నమః ఓం గరుడ నిధయే నమః ఓం శంఖ నిధయే నమః ఓం మకర నిధయే నమః ఓం కచ్ఛప నిధయే నమః ఓం విద్యా నిధయే నమః ఓం పరమానంద నిధయే నమః ఓం మోక్ష నిధయే నమః ఓం లక్ష్మీ నిధయే నమః ఓం బ్రహ్మ నిధయే నమః ఓం వైకుంఠ నిధయే నమః |
తత్ సంధి స్థానేషు | వాటి (అంతరాళముల) సంధి స్థానముల యందు |
ఓం విద్యా కల్పకతరవే నమః ఓం ఆనంద కల్పకతరవే నమః ఓం బ్రహ్మ కల్పకతరవే నమః ఓం ముక్తి కల్పకతరవే నమః ఓం అమృత కల్పకతరవే నమః ఓం బోధ కల్పకతరవే నమః ఓం విభూతి కల్పకతరవే నమః ఓం వైకుంఠ కల్పకతరవే నమః ఓం వేద కల్పకతరవే నమః ఓం యోగ కల్పకతరవే నమః ఓం యజ్ఞ కల్పకతరవే నమః ఓం పద్మ కల్పకతరవే నమః |
ఓం విద్యా కల్పకతరవే నమః ఓం ఆనంద కల్పకతరవే నమః ఓం బ్రహ్మ కల్పకతరవే నమః ఓం ముక్తి కల్పకతరవే నమః ఓం అమృత కల్పకతరవే నమః ఓం బోధ కల్పకతరవే నమః ఓం విభూతి కల్పకతరవే నమః ఓం వైకుంఠ కల్పకతరవే నమః ఓం వేద కల్పకతరవే నమః ఓం యోగ కల్పకతరవే నమః ఓం యజ్ఞ కల్పకతరవే నమః ఓం పద్మ కల్పకతరవే నమః |
తత్ చ శివగాయత్రీ పరబ్రహ్మ మంత్రాణాం వర్ణైః వృత్తికారేణ సంవేష్ట్య తత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ శ్రీమన్నారాయణో జ్యోతిః ఆత్మా నారాయణః పరః, నారాయణ పరంబ్రహ్మ నారాయణ నమోః స్తుతే |
శివగాయత్రీ, పరబ్రహ్మ మంత్రముల వర్ణములతో వృత్తాకారముగా చుట్టవలెను - "తత్ పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్" "శ్రీమన్నారాయణో జ్యోతిః ఆత్మా నారాయణః పరః, నారాయణ పరంబ్రహ్మ నారాయణ నమోః స్తుతే" |
తత్ బహిః ప్రణవ సంపుటిత శ్రీ బీజ యుక్తం వృత్తం, ఓం శ్రీం ఓం ఇతి వృత్తాత్ బహిః చత్వారింశత్ దల పద్మం | ఆ వృత్తము బయట ప్రణవముతో కూడి శ్రీ బీజ యుక్తముగా వృత్తము, "ఓం శ్రీం ఓం" అని, వృత్తమునకు బయట నలుబది దళముల పద్మము |
తేషు దలేషు వ్యాహృతి శిరసః సంపుటిత వేదగాయత్రీ పాద చతుష్టయ సూర్య అష్టాక్షరీ మంత్రౌ | ఆ పద్మ దళముల యందు వ్యాహృతులు (భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం) శిరస్సు, దానితో కూడి వేదగాయత్రీ పాద చతుష్టయ సూర్య అష్టాక్షరీ మంత్రము |
ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం సవితుః వరేణ్యం, ఓం భర్గో దేవస్య ధీమహి, ఓం ధియో యో నః ప్రచోదయాత్, ఓం పరోరజసే సావద ఓం, ఓం ఆపో జ్యోతీ రసో అమృతం బ్రహ్మ భూః భువః సువః ఓం, ఓం ఘృణిః సూర్య ఆదిత్యః | ఓం భూః, ఓం భువః, ఓగ్ం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం సవితుః వరేణ్యం, ఓం భర్గో దేవస్య ధీమహి, ఓం ధియో యో నః ప్రచోదయాత్, ఓం పరోరజసే సావద ఓం, ఓం ఆపో జ్యోతీ రసో అమృతం బ్రహ్మ భూః భువః సువః ఓం, ఓం ఘృణిః సూర్య ఆదిత్యః |
తత్ దల సంధిషు ప్రణవ శ్రీ బీజ సంపుటిత నారాయణ బీజం సర్వత్ర, ఓం శ్రీం అం శ్రీం ఓం | ఆ దళముల సంధుల యందు సర్వత్రా ప్రణవ శ్రీ బీజముతో కూడి నారాయణ బీజములు, ఓం శ్రీం అం శ్రీం ఓం |
తత్ బహిః అష్టశూల అంకిత భూచక్రం చక్రాంతః చతుః దిక్షు హంసః సో అహం మంత్రౌ, ప్రణవ సంపుటితౌ, నారాయణాస్త్ర మంత్రః చ | ఆ పద్మము బాహ్యమున అష్ట శూలములతో భూచక్రమును, చక్రము లోపల నాలుగు దిక్కులందు "హంసః" (అనగా అహం సః), "సోऽహం" మంత్రములను మఱియు ప్రణవముతో కూడి నారాయణాస్త్ర మంత్రము |
ఓం హంసః సోऽహం ఓం, ఓం నారాయణాయ హుం ఫట్ | ఓం హంసః సోऽహం ఓం, ఓం నారాయణాయ హుం ఫట్ |
తత్ బహిః ప్రణవ మాలా సంయుక్తం వృత్తం వృత్తాత్ బహిః పంచాశత్ దల పద్మం | ఆ భూచక్రము బాహ్యమున ప్రణవ మాలా సంయుక్తముగా వృత్తము, వృత్తము బాహ్యమున యాభై (50) దళములతో పద్మము |
తేషు దలేషు మాతృకా పంచాశత్ అక్షరమాలా లకార వర్జ్యా | ఆ పద్మ దళముల యందు యాభై మాతృకలతో అక్షరమాలను "ల"కారము లేకుండా |
తత్ దల సంధిషు ప్రణవ శ్రీ బీజ సంపుటిత రామ కృష్ణ మాలా మంత్రౌ | ఆ దళముల సంధుల యందు ప్రణవ శ్రీ బీజముతో కూడి రామ, కృష్ణ మాలా మంత్రములు |
ఓం శ్రీం ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వదనాయ అమిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః | ఓం శ్రీం ఓం నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వదనాయామిత తేజసే బలాయ రామాయ విష్ణవే నమః |
శ్రీం ఓం, ఓం శ్రీం ఓం నమః, కృష్ణాయ దేవకీపుత్రాయ వాసుదేవాయ నిర్గలః ఛేదనాయ సర్వలోక అధిపతయే సర్వ జగన్మోహనాయ విష్ణవే కామితార్థదాయ స్వాహా శ్రీం ఓం | శ్రీం ఓం, ఓం శ్రీం ఓం నమః, కృష్ణాయ దేవకీపుత్రాయ వాసుదేవాయ నిర్గలః ఛేదనాయ సర్వలోక అధిపతయే సర్వ జగన్మోహనాయ విష్ణవే కామితార్థదాయ స్వాహా శ్రీం ఓం |
తత్ బహిః అష్ట శూల అంకిత భూచక్రం | ఆ పద్మము బాహ్యమున అష్ట శూలములతో భూచక్రమును |
తేషు ప్రణవ సంపుటిత మహానీలకంఠ మంత్ర వర్ణాని, ఓం ఓం నమో నీలకంఠాయ ఓం, | వాటిలో ప్రణవముతో కూడి మహానీలకంఠ మంత్ర వర్ణములు, ఓం ఓం నమో నీలకంఠాయ ఓం |
శూల అగ్రేషు లోకపాల మంత్రాః | శూలముల మొదలు యందు లోకపాల మంత్రములు |
ప్రణవ ఆది నమో అంతః చతుర్థి అంతాః క్రమేణ | ప్రణవము ("ఓం") ప్రారంభముగా "నమో" అంత్యముగా చతుర్థి విభక్తితో ("ఆయ" రూపముగా), క్రమేణా |
ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం నిరృతయే నమః ఓం వరుణాయ నమః ఓం వాయవే నమః ఓం సోమాయ నమః ఓం ఈశానాయ నమః |
ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం నిరృతయే నమః ఓం వరుణాయ నమః ఓం వాయవే నమః ఓం సోమాయ నమః ఓం ఈశానాయ నమః |
తత్ బహిః ప్రణవ మాలా యుక్తం వృత్తత్రయం | దాని (పద్మము) బయట ప్రణవ మాలా యుక్తముగా మూడు వృత్తములు |
తత్ బహిః భూపుర చతుష్టయం చతుః ద్వారయుతం | దాని బయట భూపుర (part of a diagaram) చతుష్టయము (set of four) నాలుగు ద్వారములు ఉండునది |
చక్రకోణ చతుష్టయం మహావజ్ర విభూషితం | చక్రకోణ చతుష్టయము, మహావజ్ర విభూషితం |
తేషు వజ్రేషు ప్రణవ శ్రీ బీజ సంపుటిత అమృత బీజ ద్వయం, ఓం శ్రీం ఠం వం శ్రీం ఓం, ఇతి | ఆ వజ్రములందు ప్రణవ శ్రీ బీజముతో కూడి అమృత బీజ ద్వయము, ఓం శ్రీం ఠం వం శ్రీం ఓం, అని |
బహిః భూపుర వీథ్యాం - ఓం ఆధార శక్తయే నమః ఓం మూల ప్రకృత్యై నమః ఓం ఆదికూర్మాయ నమః ఓం అనంతాయ నమః ఓం పృథివ్యై నమః |
(నాలుగింటిలో) బాహ్యమున భూపుర వీథి యందు - ఓం ఆధార శక్తయే నమః ఓం మూల ప్రకృత్యై నమః ఓం ఆదికూర్మాయ నమః ఓం అనంతాయ నమః ఓం పృథివ్యై నమః |
మధ్య భూపుర వీథ్యాం - ఓం క్షీర సముద్రాయ నమః ఓం రత్న ద్వీపాయ నమః ఓం రత్న మంటపాయ నమః ఓం శ్వేతః ఛత్రాయ నమః ఓం కల్పకవృక్షాయ నమః ఓం రత్న సింహాసనాయ నమః |
(నాలుగింటిలో) మధ్య భూపుర వీథి యందు - ఓం క్షీర సముద్రాయ నమః ఓం రత్న ద్వీపాయ నమః ఓం రత్న మంటపాయ నమః ఓం శ్వేతః ఛత్రాయ నమః ఓం కల్పకవృక్షాయ నమః ఓం రత్న సింహాసనాయ నమః |
ప్రథమ భూపుర వీథ్యాం - ఓం ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య అధర్మ అజ్ఞాన అవైరాగ్య అనైశ్వర్య సత్త్వ రజః తమో మాయా విద్య అనంత పద్మాః |
ప్రథమ భూపుర వీథి యందు - ఓం, ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్య, సత్త్వ, రజః, తమో, మాయా, విద్య, అనంత, పద్మములు |
ప్రణవ ఆది నమో అంతాః చతుర్థి అంతాః క్రమేణ | ప్రణవము ("ఓం") ప్రారంభముగా "నమో" అంత్యముగా చతుర్థి విభక్తితో ("ఆయ" రూపముగా) క్రమేణా |
బాహ్య వృత్త వీథ్యాం విమల ఉత్కర్షిణీ జ్ఞాన క్రియా యోగాః | బాహ్య వృత్త వీథి యందు విమల, ఉత్కర్షిణీ, జ్ఞాన, క్రియా యోగములు |
ప్రహ్వీః సత్య ఈశానాః ప్రణవ ఆది నమో అంతాః చతుర్థి క్రమేణ | ప్రహ్వీ శక్తి, సత్య, ఈశానులు ప్రణవము ("ఓం") ప్రారంభముగా "నమో" అంత్యముగా చతుర్థి విభక్తితో ("ఆయ" రూపముగా), క్రమేణా |
అంతర్వృత్త వీథ్యాం ఓం అనుగ్రహాయై నమః ఓం నమో భగవతే విష్ణవే సర్వ భూతాత్మనే వాసుదేవాయ సర్వాత్మ సంయోగ పీఠాత్మనే నమః |
అంతర్వృత్త వీథి యందు - ఓం అనుగ్రహాయై నమః ఓం నమో భగవతే విష్ణవే సర్వ భూతాత్మనే వాసుదేవాయ సర్వాత్మ సంయోగ పీఠాత్మనే నమః |
వృత్త అవకాశేషు బీజం ప్రాణం చ శక్తిం చ దృష్టిం వశ్య ఆదికం తథా మంత్ర యంత్ర ఆఖ్య గాయత్రీ ప్రాణస్థాపనం ఏవ చ భూత దిక్పాల బీజాని యంత్రస్య అంగాని వై దశ, మూల మంత్ర, మాలా మంత్ర, కవచ, దిక్ బంధన మంత్రాః చ | వృత్తములో అవకాశమున్నచోట బీజము, ప్రాణము, శక్తిని, దృష్టిని, వశ్యము మొదలైనవి, అదే విధముగా మంత్ర గాయత్రీ, యంత్ర గాయత్రీ ప్రాణస్థాపన చేసి, భూత దిక్పాల బీజములను, యంత్రం యొక్క పది అంగములను, మూల మంత్రము, మాలా మంత్రము, కవచము, మఱియు దిక్ బంధన మంత్రములు |
ఏవం విధం ఏతత్ యంత్రం మహామంత్రమయం | ఈ విధముగా ఈ యంత్రము మహామంత్రమయము |
యోగ ధీర అంతైః పరమంత్రైః అలంకృతం | యోగ ధీర అంతములతో పరమంత్రముల అలంకృతమై |
షోడశ ఉపచారైః అభ్యర్చితం జపహోమాదినా సాధితం | పదహారు ఉపచారములచే అర్చితమై, జపము హోమము మొదలైనవాటిచే సాధించబడినది |
7.10 యంత్ర మహిమ |
|
---|---|
ఏతత్ యంత్రం శుద్ధబ్రహ్మ తేజోమయం, సర్వ అభయంకరం, సమస్త దురిత క్షయకరం, సర్వ అభీష్ట సంపాదకం, సాయుజ్య ముక్తి ప్రదం | ఇటువంటి యంత్రము శుద్ధబ్రహ్మ తేజోమయం, సర్వ అభయంకరం, సమస్త దురిత క్షయకరం, సర్వ అభీష్ట సంపాదకం, సాయుజ్య ముక్తి ప్రదం |
ఏతత్ పరమ వైకుంఠ మహానారాయణ యంత్రం ప్రజ్వలతి | ఈ విధముగా పరమ వైకుంఠ మహానారాయణ యంత్రం ప్రజ్వలించుచున్నది |
తస్య ఉపరి చ నిరతిశయ ఆనంద తేజోరాశి అభ్యంతరం ఆసీనం వాచాం అగోచరం ఆనంద తేజోరాశి ఆకారం | దాని మీద నిరతిశయ ఆనంద తేజోరాశి అభ్యంతరమున ఆసీనమై, వాక్కునకు అగోచరమై, ఆనంద తేజోరాశి ఆకారము |
చిత్ సార ఆవిర్భూత ఆనంద విగ్రహం | చిత్ సార ఆవిర్భూత ఆనంద విగ్రహము |
బోధానంద స్వరూపం నిరతిశయ సౌందర్య పారావారం | బోధానంద స్వరూపం, నిరతిశయ సౌందర్య సముద్రము |
తురీయ స్వరూపం తురీయాతీతం చ అద్వైత పరమానందం |
తురీయ స్వరూపం, తురీయాతీతం, మఱియు అద్వైత పరమానందం |
నిరంతర అతి తురీయ నిరతిశయ సౌందర్య ఆనంద పారావారం | నిరంతర అతి తురీయ, నిరతిశయ సౌందర్య ఆనంద సముద్రము |
లావణ్య వాహినీ కల్లోల తటిః భాసురం | లావణ్య వాహినీ కల్లోల మహసాగరము భాసించునది |
దివ్యమంగల విగ్రహం మూర్తిమద్భిః పరమమంగలైః ఉపసేవ్యమానం | దివ్యమంగళ విగ్రహము, మూర్తిమంతము, పరమ మంగళములచే సేవింపబడునది |
చిదానందమయైః అనంత కోటి రవి ప్రకాశైః అనంత భూషణైః అలంకృతం | చిదానందమయము, అనంత కోటి రవి ప్రకాశము, అనంత భూషణములచే అలంకృతము |
సుదర్శన పాంచజన్య పద్మ గదా అసి శార్ఙ్ఘ ముసల పరిఘాద్యైః | సుదర్శన, పాంచజన్య, పద్మ, గద, కత్తి, విల్లు, ముసలము, పరిఘ మొదలగు |
చిన్మయైః అనేక ఆయుధ గణైః మూర్తిమద్భిః సుసేవితం | చిన్మయములైన అనేక ఆయుధ గణములుచే మూర్తిమయమై సుసేవితము |
శ్రీవత్స కౌస్తుభ వనమాల అంకిత వక్షసం | శ్రీవత్స, కౌస్తుభ, వనమాలతో కూడిన వక్షస్థలము |
బ్రహ్మకల్ప వన అమృత పుష్ప వృష్టిభిః సంతతం ఆనందం | బ్రహ్మకల్ప వన అమృత పుష్ప వృష్టి కలిగినది, సతతం ఆనందం |
బ్రహ్మానంద రస నిర్భరైః అసంఖ్యైః అతి మంగలం | బ్రహ్మానంద రస నిర్భరము, అసంఖ్యాక అతి మంగళకరము |
శేష ఆయుత ఫణ జాల విపులః ఛత్ర శోభితం | విపులమైన (విశాలమైన) ఆదిశేషుని పడగ అనే ఛత్రముచే (గొడుగుచే) కప్పబడినది |
తత్ ఫణా మండల ఉదర్చిః మణిద్య ఉదిత విగ్రహం | అది పడగ మండల ఊర్ధ్వతేజో మణులచే ప్రకాశిత విగ్రహము |
తత్ అంగ కాంతి నిర్ఝరైః తతం | అది అంగముల కాంతి ప్రవాహముచే సర్వవ్యాప్తమైనది |
నిరతిశయ బ్రహ్మ గంధ స్వరూపం | నిరతిశయ బ్రహ్మ గంధ (లక్షణ) స్వరూపము |
నిరతిశయ ఆనంద బ్రహ్మ గంధ విశేష ఆకారం | నిరతిశయ ఆనంద బ్రహ్మ గంధ విశేష ఆకారము |
అనంత బ్రహ్మ గంధ ఆకార సమష్టి విశేషం | అనంత బ్రహ్మ గంధ ఆకార సమష్టి విశేషము |
అనంత ఆనంద తులసీమాల్యైః అభినవం | అనంత ఆనంద తులసీమాలలచే అభినవము (always young and fresh) |
చిదానందమయ అనంత పుష్ప మాల్యైః విరాజమానం తేజః | చిదానందమయ అనంత పుష్ప మాలలచే విరాజమాన తేజోమయము |
ప్రవాహ తరంగ తర్పరంపరాభిః జ్వలనతం | ప్రవాహ తరంగ తత్ పరంపరాభియై జ్వలించును |
నిరతిశయ అనంత కాంతి విశేష అవర్తైః అభితో అనిశం ప్రజ్వలంతం | నిరతిశయ అనంత కాంతి విశేష ఆవర్తములచే అంతటా ఎల్లప్పుడూ ప్రజ్వలించును |
బోధ ఆనందమయ అనంత ధూప దీపావలిభిః అతిశోభితం | బోధ ఆనందమయ అనంత ధూప దీపముల వరసలుతో అత్యంత శోభితము |
నిరతిశయ ఆనంద చామర విశేషైః పరిసేవితం | నిరతిశయ ఆనంద చామర (వింజామర) విశేషములచే పరిశోభితము |
నిరంతర నిరుపమ నిరతిశయ ఉత్కట జ్ఞాన ఆనంద అనంత గుచ్ఛ ఫలైః అలంకృతం | నిరంతర నిరుపమ నిరతిశయ ఉత్కట (అధికమైన) జ్ఞాన ఆనంద అనంత ఫల గుచ్ఛములచే అలంకృతము |
చిన్మయానంద దివ్య విమానః ఛత్ర ధ్వజ రాజిభిః విరాజమానం | చిన్మయానంద దివ్య విమాన, ఛత్ర, ధ్వజ రాజములచే విరాజమానము |
పరమ మంగల అనంత దివ్య తేజోభిః జ్వలంతం అనిశం | పరమ మంగళ, అనంత దివ్య తేజస్సులచే నిరంతరము జ్వలించును |
వాచాం అగోచరం అనంత తేజోరాశి అంతర్గతం | వాక్కునకు అగోచరము, అనంత తేజోరాశి, అంతర్గతము |
అర్ధమాత్రాత్మకం తుర్యం ధన్యాత్మకం తుర్యాతీతం అవాచ్యం | అర్ధమాత్రాత్మకం, తురీయము, ధన్యాత్మకము, తురీయాతీతము, అవాచ్యము |
నాదబిందు కలాది ఆత్మస్వరూపం చ ఇతి | నాదబిందు కళాది ఆత్మస్వరూపము |
ఇత్యాది అనంత ఆకారేణ అవస్థితం | ఇత్యాది అనంత ఆకారములచే అవస్థితము |
నిర్గుణం నిష్క్రియం నిర్మలం నిరవద్యం నిరంజనం నిరాకారం నిరాశ్రయం | నిర్గుణం, నిష్క్రియం, నిర్మలం, నిరవద్యం, నిరంజనం, నిరాకారం, నిరాశ్రయం |
నిరతిశయ అద్వైత పరమానంద లక్షణం ఆదినారాయణం ధ్యాయేత్ | నిరతిశయ అద్వైత పరమానంద లక్షణమైన ఆదినారాయణుని ధ్యానించవలెను |
ఇతి ఉపనిషత్ | ఇది ఉపనిషత్తు |
ఇతి అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషది పరమ మోక్ష స్వరూప నిరూపణ ద్వారా త్రిపాద్విభూతి పరమ వైకుంఠ మహానారాయణ యంత్ర స్వరూప నిరూపణం నామ సప్తమి అధ్యాయః | ఇది అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో పరమ మోక్ష స్వరూప నిరూపణ ద్వారా త్రిపాద్విభూతి పరమ వైకుంఠ మహానారాయణ యంత్ర స్వరూప నిరూపణం నామముతో ఉన్న ఏడవ అధ్యాయము |
8.1 అభేదములో వస్తు భేదము |
|
---|---|
ఓం తతః పితామహః పరిపృచ్ఛతి భగవంతం మహావిష్ణుం | ఓం. అంతట పితామహుడు (బ్రహ్మదేవుడు) భగవంతుడైన మహావిష్ణుని పరిప్రశ్నించెను - |
భగవన్ శుద్ధ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణః తవ కథం | భగవాన్! శుద్ధ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మవైన నీకు ఏ విధముగా |
విరుద్ధ వైకుంఠ ప్రాసాద ప్రాకార విమానాది అనంత వస్తుభేదః | విరుద్ధమైన (సాకారమైన) వైకుంఠ ప్రాసాద ప్రాకార విమానాది అనంత వస్తు భేదములు కలుగుచున్నవి? |
సత్యం ఏవ ఉక్తం ఇతి భగవాన్ మహావిష్ణుః పరిహరతి | సత్యమే అని చెప్పి భగవాన్ మహావిష్ణువు పరిహరించుచున్నాడు |
యథా శుద్ధ సువర్ణస్య కటక మకుట అంగదాది భేదః | ఏ విధముగా శుద్ధ సువర్ణమునకు కటకము (కంకణం), మకుటము (కిరీటము), అంగద (భుజకీర్తులు) మొదలగు వాటితో భేదమున్నదో |
యథా సముద్ర సలిలస్య స్థూల సూక్ష్మ తరంగ ఫేన బుద్బుద కరక లవణ పాషాణాది అనంత వస్తు భేదః | ఏ విధముగా సముద్ర జలమునకు స్థూల సూక్ష్మ తరంగములు, నురుగు, బుడగలు, నీటి గడ్డలు, ఉప్పు రాళ్ళు మొదలగు అనంత వస్తు భేదమున్నదో |
యథా భూమేః పర్వత వృక్ష తృణ గుల్మ లతాది అనంత వస్తు భేదః | ఏ విధముగా భూమికి పర్వతములు, వృక్షములు, గడ్డి, పొదలు, లతలు మొదలగు అనంత వస్తు భేదమున్నదో |
తథా ఏవ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మణో మమ సర్వ ద్వైతం ఉపపన్నం భవతి ఏవ | అదే విధముగా అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మమైన నాకు సర్వ ద్వైతము అభివ్యక్తమే (manifestation by virtue of attribution for value addition) అగుచున్నది |
మత్ స్వరూపం ఏవ సర్వం, మత్ వ్యతిరిక్తం అణుమాత్రం న విద్యతే | సర్వము నా స్వరూపమే నాకు వ్యతిరిక్తము అణుమాత్రమూ లేదు |
8.2 అవిద్యా పాదము మఱియు ఇతర పాద త్రయముల కర్తవ్యము |
|
---|---|
పునః పితామహః పరిపృచ్ఛతి | మరలా పితామహుడు పరిప్రశ్నించెను - |
భగవన్ పరమ వైకుంఠ ఏవ పరమ మోక్షస్త్వ ఏక ఏవ శ్రూయతే సర్వత్ర | భగవాన్! పరమ వైకుంఠమే పరమ మోక్షము, ఏకము అని సర్వత్రా వినబడుచున్నది |
కథం అనంత వైకుంఠాః చ అనంత ఆనంద సముద్ర ఆదయః చ అనంత మూర్తయః సంతి ఇతి | ఏ విధముగా అనంత వైకుంఠములు, మఱియు అనంత ఆనంద సముద్రములు మొదలగునవి, మఱియు అనంత మూర్తులు (ఏకమై) ఉన్నవి? |
తథా ఇతి హ ఉవాచ భగవాన్ మహావిష్ణుః | అట్లే అని భగవాన్ మహావిష్ణువు ఇట్లు చెప్పెను |
ఏకస్మిన్ అవిద్యా పాదే అనంతకోటి బ్రహ్మాండాని సావరణాని శ్రూయంతే | ఒక్క అవిద్యా పాదమందే అనంత కోటి బ్రహ్మాండములు ఇమిడి ఉన్నవని వినబడుచున్నది |
తస్మిన్ ఏకస్మిన్ అండే బహవో లోకాః చ బహవో వైకుంఠాః చ అనంత విభూతయః చ సంతి ఏవ | అటువంటి ఒక్క అండములోనే అనేక లోకములు, అనేక వైకుంఠాలు, మఱియు అనంత విభూతులు లీనమై (ఏకతత్త్వమై) ఉన్నవి |
సర్వ అండేషు అనంత లోకాః చ అనంత వైకుంఠాః సంతి ఇతి సర్వేషాం ఖలు అభిమతం | సర్వ అండముల యందు సర్వ లోకములు మఱియు అనంత వైకుంఠములు ఉన్నవని అందరి నిశ్చయ అభిమతము |
పాద త్రయే అపి కిం కర్తవ్యం | మరి (బ్రహ్మము నందు చెప్పబడిన మిగిలిన) పాద త్రయమునకు ఏమి కర్తవ్యము అనగా |
నిరతిశయ ఆనంద ఆవిర్భావో మోక్ష ఇతి మోక్ష లక్షణం పాదత్రయే వర్తతే | నిరతిశయ ఆనంద ఆవిర్భావము మోక్షము అని, మోక్ష లక్షణము పాద త్రయమునందు ఉన్నది |
తస్మాత్ పాద త్రయం పరమ మోక్షః, పాద త్రయం పరమ వైకుంఠః, పాద త్రయం పరమ కైవల్యం ఇతి | కావున పాద త్రయము పరమ మోక్షము, పాద త్రయము పరమ వైకుంఠము, పాద త్రయము పరమ కైవల్యము అని |
తతః శుద్ధ చిదానంద బ్రహ్మ విలాస ఆనందాః చ | అవి శుద్ధ చిదానంద బ్రహ్మ విలాస ఆనందములు, మఱియు |
అనంత పరమానంద విభూతయః చ అనంత వైకుంఠాః చ | అనంత పరమానంద విభూతములు, మఱియు అనంత వైకుంఠములు |
అనంత పరమానంద సముద్ర ఆదయః సంతి ఏవ | అనంత పరమానంద సముద్రములు మొదలగునవి ఉన్నవి |
8.3 బ్రహ్మ ఉపాసన |
|
---|---|
ఉపాసకః తతో అభ్యేత్య ఏవం విధం నారాయణం ధ్యాత్వా ప్రదక్షిణ నమస్కారాన్ విధాయ వివిధ ఉపచారైః అభ్యర్చ్య | అంతట ఉపాసకుడు దగ్గరగా చేరి ఆ విధమైన నారాయణుని ధ్యానించి, ప్రదక్షిణ నమస్కారములు చేసి, వివిధ ఉపచారములచే అర్చించి |
నిరతిశయ అద్వైత పరమానంద లక్షణో భూత్వా | నిరతిశయ అద్వైత పరమానంద లక్షణుడయి |
తత్ అగ్రే సావధానేన ఉపవిశ్య అద్వైత యోగం ఆస్థాయ | ఆయన ఎదుట సావధానముగా కూర్చుండి అద్వైత యోగము పొంది |
సర్వ అద్వైత పరమానంద లక్షణ అఖండ అమితతేజోరాశి ఆకారం విభావ | సర్వ అద్వైత పరమానంద లక్షణ అఖండ అమితతేజోరాశి ఆకారము భావించి |
ఉపాసకః స్వయం శుద్ధ బోధ ఆనందమయ అమృత | ఉపాసకుడు స్వయముగా శుద్ధ బోధ ఆనందమయ అమృత |
నిరతిశయ ఆనంద తేజోరాశి ఆకారో భూత్వా మహావాక్య అర్థం అనుస్మరన్ | నిరతిశయ ఆనంద తేజోరాశి ఆకారుడయి మహావాక్యముల అర్థము స్మరించుచూ |
బ్రహ్మ అహం అస్మి, అహం అస్మి బ్రహ్మ - బ్రహ్మ అహం అస్మి, యో అహం అస్మి బ్రహ్మ అహం అస్మి, అహం ఏవ అహం మాం జుహోమి స్వాహా | బ్రహ్మ అహం అస్మి (నేను బ్రహ్మము), అహం అస్మి బ్రహ్మ - బ్రహ్మ అహం అస్మి (నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను), యో అహం అస్మి బ్రహ్మ అహం అస్మి (ఏది నేను? బ్రహ్మమే నేను), అహం ఏవ అహం మాం జుహోమి స్వాహా (నేనే నన్ను నేనైన బ్రహ్మాగ్నిలో తర్పణము చేయుచున్నాను) |
8.4 బ్రహ్మ ఐక్యము |
|
---|---|
అహం బ్రహ్మ ఇతి భావనయా యథా పరమ తేజో మహానదీ ప్రవాహ పరమతేజః పారావారే ప్రవిశంతి | "అహం బ్రహ్మ" అనే భావనతో ఏ విధముగా పరమ తేజో మహానది పరమ తేజో సముద్రమును ప్రవేశించునో |
యథా పరమతేజః పారావార తరంగాః పరమతేజః పారావారే ప్రవిశంతి | ఏ విధముగా పరమతేజో సముద్ర తరంగములు పరమతేజో సముద్రమునందు ప్రవేశించునో |
తథా ఏవ సత్ చిత్ ఆనంద ఆత్మ ఉపాసకః సర్వ పరిపూర్ణ అద్వైత | అ విధముగా సత్ చిత్ ఆనంద ఆత్మ ఉపాసకుడు సర్వ పరిపూర్ణ అద్వైత |
పరమానంద లక్షణ పరబ్రహ్మణి నారాయణే మయి |
పరమానంద పరబ్రహ్మయైన నారాయణుడైన నా యందు |
సత్ చిత్ ఆనంద ఆత్మకో అహం అజో అహం పరిపూర్ణో అహం అస్మి ఇతి ప్రవివేశ | సత్ చిత్ ఆనంద ఆత్మకుడను నేను, జన్మలేనివాడను నేను, పరిపూర్ణుడను నేను అని ప్రవేశించును |
తత ఉపాసకో నిస్తరంగ అద్వైత అపార నిరతిశయ సత్ చిత్ ఆనంద సముద్రో బభూవ | పిమ్మట ఉపాసకుడు నిస్తరంగ, అద్వైత, అపార, నిరతిశయ, సత్ చిత్ ఆనంద సముద్రుడు అగును |
యస్తు అనేన మార్గేణ సమ్యక్ ఆచరతి స నారాయణో భవతి అసంశయం ఏవ | ఎవడు ఈ మార్గమును బాగుగా ఆచరించునో అతడు నారాయణుడు అగును, సంశయమే లేదు! |
అనేన మార్గేణ సర్వే మునయః సిద్ధిం గతాః | ఆ మార్గముననే సర్వ మునులు సిద్ధిని పొందినారు |
అసంఖ్యాకాః పరమయోగినః చ సిద్ధిం గతాః | అసంఖ్యాకులైన పరమ యోగులు కూడా సిద్ధిని పొందిరి |
8.5 సాలంబ, నిరాలంబ యోగములు |
|
---|---|
తతః శిష్యో గురుం పరిపృచ్ఛతి | తరువాత శిష్యుడు గురువును పరిప్రశ్నించెను - |
భగవన్ సాలంబ నిరాలంబ యోగౌ కథం ఇతి | భగవాన్! "సాలంబ" (స ఆలంబ) మఱియు "నిరాలంబ" యోగములు ఏ విధమైనవి? |
సాలంబస్తు కరచరణాది మూర్తి విశిష్టం మండలాది ఆలంబనం సాలంబ యోగః | సాలంబము అనగా కరచరణములు (కాళ్లు చేతులు) మొదలగునవి కలిగిన మూర్తి, విశిష్ట మండలములు మొదలగునవి (ఉపాసన కొఱకు) ఆలంబనము (support) చేయుట సాలంబ యోగము |
సర్వకామాది అంతఃకరణ వృత్తి సాక్షితయా తత్ ఆలంబన శూన్యతయా చ భావనం నిరాలంబ యోగః | (నిరాలంబము అనగా) సర్వకామాది అంతఃకరణ వృత్తులకు సాక్షిగా ఆలంబన శూన్యముగా (without support) "తత్" భావనము చేయుట నిరాలంబ యోగము |
అథ చ నిరాలంబ యోగ అధికారి కీదృశో భవతి | ఇక మరి నిరాలంబ యోగమునకు అర్హత ఏ విధముగా ఉండును? అనగా |
అమానిత్వాది లక్షణ ఉపలక్షితో యః పురుషః సః ఏవ నిరాలంబ యోగ అధికారీ | అమానత్వము (గర్వము లేకుండుట) మొదలగు లక్షణ ఉపలక్షణములు ఏ పురుషునకు ఉన్నవో అతడే నిరాలంబ యోగమునకు అధికారి |
8.6 భక్తి యోగ ప్రాశస్త్యము |
|
---|---|
కార్యః కశ్చిత్ అస్తి, తస్మాత్ సర్వేషాం అధికారిణాం అనధికారిణాం భక్తియోగ ఏవ ప్రశస్యతే | ఒకానొక కార్యము ఉన్నది, కావున అందరు అధికారులకు అనధికారులకు భక్తి యోగమే ప్రశస్త్యము [ఆ కార్యమే భక్తి అని ఇక్కడ చెప్పబడుచున్నది] |
భక్తియోగో నిరుపద్రవః, భక్తి యోగాత్ ముక్తిః | భక్తి యోగము ఉపద్రవము (adversity) లేనిది, భక్తి యోగము వలన ముక్తి కలుగును |
బుద్ధిమతాం అనాయాసేన అచిరాదేవ తత్త్వజ్ఞానం భవతి | బుద్ధిమంతులకు అనాయాసముగా అచిరకాలముననే తత్త్వజ్ఞానము కలుగును |
తత్ కథం ఇతి భక్త వత్సలః స్వయం ఏవ సర్వేభ్యో మోక్ష విఘ్నేభ్యో భక్తి నిష్ఠాన్ సర్వాన్ పరిపాలయతి | అది ఏట్లు అనగా భక్త వత్సలుడు స్వయముగానే సర్వ మోక్ష విఘ్నముల నుండి భక్తి నిష్ఠులు అందరినీ పరిపాలించును |
సర్వ అభీష్టాన్ ప్రయచ్ఛతి, మోక్షం దాపయతి | సర్వ అభీష్టములు ప్రసాదించును, మోక్షము ఇప్పించును |
చతుర్ముఖ ఆదీనాం సర్వేషాం అపి వినా విష్ణుభక్త్యా కల్పకోటిభిః మోక్షో న విద్యతే | చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు మొదలైన వారెవరికైనా విష్ణుభక్తి లేకుండా కోటి కల్పములకైనా మోక్షము లభించదు |
కారణేన వినా కార్యం నోద ఇతి భక్త్యా వినా బ్రహ్మజ్ఞానం కదాపి న జాయతే | కారణము లేనిదే కార్యము కలుగదు అనునట్లు భక్తి లేనిదే బ్రహ్మజ్ఞానము కూడా ఎన్నటికీ కలుగదు |
తస్మాత్ త్వం అపి సర్వ ఉపాయాన్ పరిత్యజ్య భక్తిం ఆశ్రయ! | కాబట్టి నీవు కూడా అన్ని ఉపాయములను పరిత్యజించి భక్తినే ఆశ్రయించు! |
భక్తి నిష్ఠో భవ! భక్తి నిష్ఠో భవ! | భక్తి నిష్ఠుడవు అగుము! భక్తి నిష్ఠుడవు అగుము! |
భక్త్యా సర్వ సిద్ధయః సిద్ధ్యంతి, భక్తేః న సాధ్యం న కించిత్ అస్తి | భక్తిచే సర్వ సిద్ధులు సిద్ధించును, భక్తికి సాధ్యము కానిది కించిత్ కూడా లేదు |
8.7 ఉపాసకుడు సాక్షాత్ నారాయణుడు అగుట |
|
---|---|
ఏవం విధం గురు ఉపదేశం ఆకర్ణ్య సర్వం పరమతత్త్వ రహస్యం అవబుధ్య | ఈ విధమైన గురు ఉపదేశం శ్రద్ధగా విని సమస్త పరమతత్త్వ రహస్యమును బాగుగా అర్థము చేసుకొని |
సర్వసంశయాత్ విధూయ క్షిప్రం ఏవ మోక్షం సాధయామి ఇతి నిశ్చిత్య | సర్వ సంశయములను తొలగించుకొని, త్వరగా మోక్షము సాధించుకొనెదను అని నిశ్చయించుకొని |
తతః శిష్యః సముత్థాయ ప్రదక్షిణ నమస్కారం కృత్వా గురుభ్యో గురుపూజాం విధాయ | తరువాత శిష్యుడు లేచి, ప్రదక్షిణ నమస్కారము చేసి, గురువులకు గురుపూజను చేసి |
గురు అనుజ్ఞయా క్రమేణ భక్తి నిష్ఠో భూత్వా భక్తి అతిశయేన పక్వ విజ్ఞానం ప్రాప్య | గురు అనుజ్ఞచేత క్రమేణా భక్తి నిష్ఠుడై, భక్తి అతిశయముచే పూర్ణ జ్ఞానము పొంది |
తస్మాత్ అనాయాసేన శిష్యః క్షిప్రం ఏవ సాక్షాత్ నారాయణో బభూవ | దాని వలన అనాయాసముగా శిష్యుడు వెంటనే సాక్షాత్ నారాయణుడు అయ్యెను |
ఇతి ఉపనిషత్ | ఇది ఉపనిషత్తు |
8.8 మహావిష్ణువు అంతిమ బోధ |
|
---|---|
తతః ప్రోవాచ భగవాన్ మహావిష్ణుః చతుర్ముఖం అవలోక్య | అట్లు ప్రవచించిన భగవాన్ మహావిష్ణువు చతుర్ముఖుని అవలోకగా చూచి - |
బ్రహ్మన్ పరమతత్త్వ రహస్యం తే సర్వం కథితం | బ్రహ్మా! పరమతత్త్వ రహస్యం నీకు సర్వము చెప్పబడినది |
తత్ స్మరణ మాత్రేణ మోక్షో భవతి | దాని స్మరించినంత మాత్రమున మోక్షము కలుగును |
తత్ అనుష్ఠానేన సర్వం అవిదితం విదితం భవతి | దాని అనుష్ఠానముచేత తెలియనిదంతా తెలియును |
యత్ స్వరూపజ్ఞానినః సర్వం అవిదితం విదితం భవతి | దేని స్వరూప జ్ఞానికి తెలియనిదంతా తెలియునో |
తత్ సర్వం పరమ రహస్యం కథితం | దాని పరమ రహస్య సర్వము చెప్పబడినది |
గురుః క ఇతి గురుః సాక్షాత్ ఆదినారాయణ పురుషః, స ఆదినారాయణో అహం ఏవ | గురువు ఎవరు అనగా గురువు సాక్షాత్ ఆదినారాయణ పురుషుడు, ఆ ఆదినారాయణుడు నేనే! |
తస్మాత్ మాం ఏకం శరణం వ్రజ, మత్ భక్తి నిష్ఠో భవ | కావున నన్ను ఒక్కడినే శరణు పొందుము, నాయందు భక్తి నిష్ఠుడవు అగుము |
మదీయ ఉపాసనాం కురు, మాం ఏవ ప్రాప్స్యసి | నన్ను ఉపాసన చేయుము, నన్నే పొందెదవు |
మత్ వ్యతిరిక్తం సర్వం బాధితం, మత్ వ్యతిరిక్తం అబాధితం న కించిత్ అస్తి | నాకు వ్యతిరిక్తమైనదంతా బాధితమే, నాకు వ్యతిరిక్తమై అబాధితమైనది కొంచెము కూడా లేదు |
నిరతిశయ ఆనంద అద్వితీయో అహం ఏవ, సర్వ పరిపూర్ణో అహం ఏవ | నిరతిశయ ఆనంద అద్వితీయుడను నేనే, సర్వ పరిపూర్ణుడను నేనే |
సర్వ ఆశ్రయో అహం ఏవ, వాచాం అగోచర నిరాకార పరబ్రహ్మ స్వరూపో అహం ఏవ | సర్వ ఆశ్రయుడను నేనే, వాక్కునకు అగోచరమైన నిరాకార పరబ్రహ్మ స్వరూపము నేనే |
మత్ వ్యతిరిక్తం అణుమాత్రం న విద్యతే | నాకు వ్యతిరిక్తము అణుమాత్రము లేదు |
ఇతి ఏవం మహావిష్ణోః పరం ఇదం ఉపదేశం లబ్ధ్వా పితామహః పరమానందం ప్రాప | ఈ విధముగా మహావిష్ణువు యొక్క పరం అయిన ఈ (this Ultimate) ఉపదేశము పొందినవాడై పితామహుడు పరమానందం పొందెను |
8.9 ఫలశృతి |
|
---|---|
విష్ణోః కరా అభిమర్శనేన దివ్యజ్ఞానం ప్రాప్య పితామహః | విష్ణువు యొక్క చేతి స్పర్శ చేత దివ్యజ్ఞానం పొందిన పితామహుడు |
తత సముత్థాయ ప్రదక్షిణ నమస్కారాన్ విధాయ వివిధ ఉపచారైః | పిమ్మట పైకి లేచి ప్రదక్షిణ నమస్కారములు చేసి వివిధ ఉపచారములచే |
మహావిష్ణుం ప్రపూజ్య ప్రాంజలిః భూత్వా వినయేన ఉపసంగమ్య | మహావిష్ణువుని బాగుగా పూజించి ప్రాంజలి ఘటించి వినయముగా దగ్గరకు వచ్చి |
భగవన్ భక్తి నిష్ఠాం మే ప్రయచ్ఛ, త్వత్ అభిన్నం మాం పరిపాలయ కృపాలయ | భగవాన్! భక్తి నిష్ఠను నాకు ప్రసాదించుము, ఓ కృపాలయా! నీకు అభిన్నమైన నన్ను పరిపాలించు |
తథా ఏవ సాధు సాధు ఇతి సాధు ప్రశంసాపూర్వకం మహావిష్ణుః ప్రోవాచ | అటులనే అగు గాక! సాధు! సాధు! అని సాధు ప్రశంసాపూర్వకముగా మహావిష్ణువు ఇట్లు చెప్పెను - |
మత్ ఉపాసకః సర్వ ఉత్కృష్టః సః భవతి | నా ఉపాసకుడు సర్వ ఉత్కృష్టుడు అగును |
మత్ ఉపాసనయా సర్వమంగళాని భవంతి | నా ఉపాసనచే సర్వ శుభములు కలుగును |
మత్ ఉపాసనయా సర్వం జయతి | నా ఉపాసనచే సర్వము జయించును |
మత్ ఉపాసకః సర్వ వంద్యో భవతి | నా ఉపాసకుడు సర్వ ప్రశంసలు పొందును |
మదీయ ఉపాసకస్య అసాధ్యం న కించిత్ అస్తి | నా యొక్క ఉపాసకునికి అసాధ్యము అనునది కొంచెమైనా లేదు |
సర్వ బంధాః ప్రవినశ్యంతి | సర్వ బంధములు బాగుగా వినాశమగును |
సత్ వృత్తం ఇవ సర్వే దేవాః తం సేవంతే | సత్ వృత్తము వలె సర్వ దేవతలు అతని (చుట్టూ చేరి) సేవింతురు |
మహా శ్రేయాంసి చ సేవంతే | మహా శ్రేయస్సులు సేవించును |
మత్ ఉపాసకః తస్మాత్ నిరతిశయ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ భవతి | కావున నా ఉపాసకుడు నిరతిశయ అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ అగును |
యో వై ముముక్షుః అనేన మార్గేణ సమ్యక్ ఆచరతి | ఎవరైతే ముముక్షువు ఈ మార్గమును బాగుగా ఆచరించునో |
స పరమానంద లక్షణ పరంబ్రహ్మ భవతి | అతడు (ఆమె) పరమానంద లక్షణ పరబ్రహ్మ అగును |
యః తు పరమతత్త్వ రహస్య అథర్వణ మహానారాయణ ఉపనిషదం అధీతే | ఎవడైతే పరమతత్త్వ రహస్య అథర్వణ మహానారాయణ ఉపనిషత్తును అధ్యయనం చేయునో |
స సర్వేభ్యః పాపేభ్యో ముక్తో భవతి | అతడు అన్ని విధములైన పాపముల నుండి ముక్తుడు అగును |
జ్ఞాన అజ్ఞాన కృతేభ్యః పాతకేభ్యో ముక్తో భవతి | తెలిసి తెలియక చేసిన పాపముల నుండి ముక్తుడు అగును |
మహాపాతకేభ్యః పూతో భవతి | మహాపాతకముల నుండి పవిత్రుడు అగును |
రహస్యకృత ప్రకాశకృత చిరకాల అత్యంత కృతేభ్యః తేః సర్వేభ్యః పాపేభ్యో ముక్తో భవతి | రహస్యముగా చేసిన, ప్రకాశముగా చేసిన చిరకాల అత్యంత కృతములైన సర్వ విధములైన పాపముల నుండి ముక్తుడు అగును |
స సకల లోకాన్ జయతి, స సకల మంత్ర జప నిష్ఠో భవతి | అతడు సకల లోకములను జయించును, అతడు సకల మంత్ర జప నిష్ఠుడు అగును |
స సకల వేదాంత రహస్య అధిగత పరమార్థజ్ఞో భవతి | అతడు సకల వేదాంత రహస్యము తెలుసుకున్న పరమార్థజ్ఞుడు అగును |
స సకల భోగ భుక్ భవతి, స సకల యోగ విత్ భవతి | అతడు సకల భోగ భోక్త అగును, అతడు సకల యోగ వేత్త అగును |
స సకల జగత్ పరిపాలకో భవతి | అతడు సకల జగత్ పరిపాలకుడు అగును |
సో అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ భవతి | అతడు అద్వైత పరమానంద లక్షణ పరబ్రహ్మ అగును |
ఇదం పరమ తత్త్వ రహస్యం న వాచ్యం గురుభక్తి విహీనాయ | ఇటువంటి పరమ తత్త్వ రహస్యము గురుభక్తి విహీనునకు చెప్పరాదు |
న చ అశుశ్రూషవే వాచ్యం, న తపో విహీనాయ నాస్తికాయ | శుశ్రూష చేయనివానికి చెప్పరాదు, తపో విహీనునకు మఱియు నాస్తికునికి చెప్పరాదు |
న డాంభికాయ మత్ భక్తి విహీనాయ మాత్సర్య అంకిత తనవే న వాచ్యం |
డాంభికునికి, నా యందు భక్తి లేనివానికి, మాత్సర్యము (అసూయ) కలవానికి చెప్పకూడదు |
న వాచ్యం మత్ అసూయ అపరాయ కృతఘ్నాయ | నా యందు అసూయ కలవానికి, పర దృష్టి లేనివానికి, కృతఘ్నునికి చెప్పరాదు |
ఇదం పరమ రహస్యం యో మత్ భక్తేషు అభిధా అస్యతి | నా భక్తులందు ఎవరు ఈ పరమ రహస్యమును బోధించుదురో |
మత్ భక్తి నిష్ఠో భూత్వా మాం ఏవ ప్రాప్స్యతి | నా భక్తి నిష్ఠుడై నన్నే పొందును |
ఆవయోర్య ఇమం సంవాద మధ్యేష్యతి స నరో బ్రహ్మనిష్ఠో భవతి | మన ఈ సంవాదమును ఎవడు పఠించునో ఆ నరుడు బ్రహ్మనిష్ఠుడు అగును |
శ్రద్ధావాన్ అనసూయః శృణుయాత్ పఠతి వా య ఇమం సంవాదం ఆవయోః సః పురుషో మత్ సాయుజ్యం ఇతి | శ్రద్ధగలవాడు, అసూయ లేనివాడు ఎవడు మన ఈ సంవాదమును వినునో లేదా పఠించునో ఆ పురుషుడు నా సాయుజ్యము పొందును |
తతో మహవిష్ణుః తిరోదధే తతో బ్రహ్మా స్వస్థానం జగాం | పిమ్మట మహావిష్ణువు అంతర్ధానమయ్యెను, తరువాత బ్రహ్మ తన స్వస్థానమునకు వెళ్లెను |
ఇతి ఉపనిషత్ | ఇది ఉపనిషత్తు |
ఇతి అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషది పరమ సాయుజ్య ముక్తి స్వరూప నిరూపణం నామ అష్టమ అధ్యాయః | ఇది అథర్వణ త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్తులో పరమ సాయుజ్య ముక్తి స్వరూప నిరూపణం పేరుతో ఉన్న ఎనిమిదవ అధ్యాయము |
ఉత్తరకాండః సమాప్తః, త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్ సమాప్తా | ఉత్తరకాండ సమాప్తము, త్రిపాద్విభూతి మహానారాయణ ఉపనిషత్ సమాప్తము |
ఈ ఉపనిషత్ ధ్యేయము (లక్ష్యము)
ఒకటవ అధ్యాయము - బ్రహ్మమునందు నాలుగు పాదముల స్వరూప నిరూపణము
చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు బహుకాలము తీవ్ర తపస్సు చేయగా మహావిష్ణువు ప్రత్యక్షమయ్యెను. అప్పుడు బ్రహ్మ పరిప్రశ్నించెను - భగవాన్! పరమ తత్త్వ రహస్యమును నాకు వివరించుము - అని. [Fundamentally, what is the essence of everything at core?]
బ్రహ్మదేవుడు సర్వజ్ఞుడైన మహావిష్ణువును ప్రార్థన చేయును.
ప్రసన్నుడైన మహావిష్ణువు దేవదర్శి అని చెప్పబడు అథర్వ (వేద) శాఖలోని పరమ తత్త్వ రహస్యము అని చెప్పబడు అథర్వణ మహానారాయణ ఉపనిషత్తులో గురు శిష్య సంవాదము చెప్పనారంభించెను.
పూర్వము పరమ తత్త్వ రహస్యమైన స్వస్వరూప జ్ఞానముచే మహాత్ములు అందరూ బ్రహ్మభావము పొందినారు. దానిని శ్రవణము చేయుటచే సర్వ బంధములు సమూలముగా నశించును.
పాద చతుష్టయాత్మకము బ్రహ్మమ. బ్రహ్మమునకు ఆ నాలుగు పాదములు ఏవి అనగా అవిద్యా పాదము , సువిద్యా పాదము , ఆనంద పాదము, తురీయ పాదము అనునవి
NOTE: పాదము అనునది ఒక కల్పిత విభాగము - అనిర్వచనీయము, అనిర్దేశ్యము అయిన బ్రహ్మము యొక్క పూర్ణత్వమును అర్థం చేసుకొనుటకు గురువు ముందుగా ఒక విధమైన విభజన కల్పించుచున్నాడు.
అవిద్యా పాదము ప్రథమ పాదము, విద్యా పాదము రెండవది, ఆనంద పాదము మూడవది, తురీయ పాదము నాలుగవది
మూల అవిద్య ప్రథమ పాదమందు ఉండును, మరే పాదమునందు ఉండదు.
[నేను పరిమితుడను అను దృఢభావమునకు కారణము మూల అవిద్య].
విద్య, ఆనంద, తురీయ అంశలు అన్ని (మిగిలిన మూడు) పాదములందు వ్యాపించి ఉండును
ఆయా ప్రాధాన్యములచే ఆయా (మిగిలిన మూడు) పాదములు నిర్దేశింపబడినవి, నిజానికి ఏ భేదము లేదు.
క్రింద ఒక పాదము (అనగా అవిద్యా పాదము) అవిద్యచేత వేరుగా ఉన్నది. పైన మూడు పాదములు శుద్ధ బోధ ఆనంద లక్షణము, అమృతము అగును.
అందు మధ్యమ పాదము (ఆనంద పాదము) మధ్య ప్రదేశమున అమిత తేజో ప్రవాహ ఆకారమున నిత్య వైకుంఠమై ప్రకాశించును.
అది (తత్ = బ్రహ్మము) నిర్వచింపలేనిది, నిర్దేశింపలేనిది, అఖండ ఆనంద ఏక రసాత్మకము అయినది.
ఏ విధముగా ఐతే సూర్య మండల అంతర్గతుడై ఆ సూర్యనారాయణుడు ఉన్నాడో అమిత అపరిచ్ఛిన్న అద్వైత పరమానంద లక్షణ తేజో రాశి అంతర్గత ఆదినారాయణుడు ఆ విధముగా ప్రకాశించుచుండును.
అతడే తురీయ బ్రహ్మము, అతడే విష్ణువు, అతడే పరమేశ్వరుడు, అతడే మాయా అతీతుడు.
అటువంటివానిని ఎవరు తెలుసుకొనెదరో ఆ ప్రయత్నశీలుడు ఈ ఉపాసనచే ఆ మహా నారాయణుడి సాయుజ్యము పొందును అని చెప్పబడెను.
ఇది నిస్సంశయము అని ఈ ఉపనిషత్తుచే ప్రకటించబడెను.
రెండవ అధ్యాయము - బ్రహ్మమునందు సాకార నిరాకార స్వరూప నిరూపణం
మూడవ అధ్యాయము - బ్రహ్మమునందు మూల అవిద్యా ప్రలయ స్వరూప నిరూపణం
నాలుగవ అధ్యాయము - మహా మాయా అతీత, అఖండ, అద్వైత, పరమానంద లక్షణ, పరబ్రహ్మణ పరమతత్త్వ స్వరూప నిరూపణం
ఐదవ అధ్యాయము - సంసార తరుణ ఉపాయ కథన ద్వారా పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం
వర్షా కాల ప్రారంభమునందు ఏ విధముగా కప్పలు మొదలైనవి ఉద్భవించునో ఆ విధముగా పూర్తిగా నశించిన అవిద్య ఆదినారాయణుని ఉన్మేష (కనురెప్పలు తెఱచుట) కాలములో మరలా ఉదయించుట జరుగును.
జన్మ జన్మ దుష్కర్మ వాసనా బలము చేత దృఢతరమైన దేహాత్మ (దేహమే నేను) భ్రమ కలుగును, దేహ ఆత్మ వివేకము కలుగదు.
వాసనా బలము చేత సంసారమునందే ప్రవృత్తి కలుగుచున్నది, దాని నివృత్తికి ఉపాయము తోచుటలేదు.
తత్ (బ్రహ్మము) యొక్క స్వరూప జ్ఞాన అభావము వలన, బంధము ఎట్టిది? మోక్షము ఎట్టిది? అను విచార అభావము వలన, అజ్ఞాన ప్రాబల్యము వలన, భక్తి జ్ఞాన వైరాగ్య అభావము వలన బ్రహ్మసుఖము పొందవలెనను ప్రవృత్తి కలుగదు.
ఈ మహాపురుషునకు ఎప్పుడు దేహత్యాగ ఇచ్ఛ కలుగునో అప్పుడు వైకుంఠ వాసులు అందరూ వచ్చెదరు
భగవంతుని ధ్యాన పూర్వకముగా హృదయ కమలము యందు వ్యవస్థితమైన ఆత్మను తన అంతరాత్మను బాగుగా చింతించుచూ హంస మంత్రమును (సోzహం) ఉచ్చరించుచూ, బాగుగా మనస్సును నిరోధించి, మఱియు దేహములో పైకి చరించు వాయువుతో సహా ఓంకారముతో ప్రణవార్థమును అనుసంధానము చేయుచూ, నెమ్మది నెమ్మదిగా బ్రహ్మ రంధ్రము నుండి (ప్రాణశక్తి) బయటకు వెడలి ప్రాకృతమైన పూర్వ దేహమును త్యజించి మంత్రమయ, శుద్ధబ్రహ్మ తేజోమయ, నిరతిశయ, ఆనందమయ మహావిష్ణు సారూప్య విగ్రహం పరిగ్రహించును
సూర్యమండల అంతర్గతముగా నిరతిశయ ఆనందమయ అమర (కాంతి) నదీ ప్రవాహమును ఆకర్షించి, భావనచే అక్కడ స్నానము చేసి, ఆత్మపూజను చేయవలెను
తాను సాక్షాత్తు నారాయణుడే అయి తరువాత గురు నమస్కార పూర్వకముగా ప్రణవ గరుడుని ధ్యానించి విష్వక్సేన పరిపాలితుడై వైకుంఠ సమూహముతో పరివేష్టితుడై, ఆకాశ మార్గమున ప్రవేశించి, సత్య లోకము ప్రవేశించి, బ్రహ్మను పూజించును
ఉపాసకుడు శైవుని ఈశాన కైవల్యము పొంది, మహర్షి మండలములను అతిక్రమించి, సూర్య చంద్ర మండలములను భేదించి, ధృవ మండలము దాటి, శింశుమార (ప్రజాపతి) చక్రమును భేదించి వైకుంఠమును చేరును
ఇంకా పైకి వెళ్లి విరాజ నదిలో మునిగి అక్కడ సూక్ష్మ శరీరమును వదిలివేసి, కేవల మంత్రమయ దివ్య తేజోమయ నిరతిశయ ఆనందమయ మహావిష్ణు స్వరూపము వంటి విగ్రహము (ఆకారము) పరిగ్రహించును
ఇంకా పైకి పైకి వెళ్లి తేజోమయ చిన్మయ ఆనంద పరిపాలకుడైన ఆదినారాయణుని ధ్యానించి, ఆయన అనుజ్ఞతో ఇంకా పైకి పైకి వెళ్లి పంచ వైకుంఠములు అతీతముగా అష్ట విరాట్ కైవల్యం పొంది, ఆ విరాట్టుని బాగుగా ఆరాధించి ఉపాసకుడు పరమానందం పొందును.
ఆరవ అధ్యాయము - పరమ మోక్ష మార్గ స్వరూప నిరూపణం
ఏడవ అధ్యాయము - పరమ మోక్ష స్వరూప నిరూపణ ద్వారా త్రిపాద్విభూతి పరమ వైకుంఠ మహానారాయణ యంత్ర స్వరూప నిరూపణం
ఎనిమిదవ అధ్యాయము - పరమ సాయుజ్య ముక్తి స్వరూప నిరూపణం
Tripȃd Vibhooti Mahȃ Nȃrȃyana Upanishad
Languages: Telugu and Sanskrit
Script: TELUGU
Sourcing from Upanishad Udyȃnavanam - Volume 6
Translation and Commentary by Yeleswarapu Hanuma Rama Krishna
NOTE: Changes and Corrections to the Contents of the Original Book are highlighted in Red
REQUEST for COMMENTS to IMPROVE QUALITY of the CONTENTS: yhrkworks@gmail.com