వాసిష్ఠ మహా రామాయణమ్
ప్రథమ సంపుటమ్ - వైరాగ్యప్రకరణమ్
సూత్రపాతనకము - 1
మంగళాచరణమ్.
యతః సర్వాణి భూతాని ప్రతిభాన్తి స్థితాని చ |
యత్రైవోపశమం యాన్తి తస్మై సత్యాత్మనే నమః ॥ 1
ఎద్దానినుండి భూతములన్నియు ఆవిర్భవించుచున్నవో, ఎద్దాన స్థితిని గనుచున్నవో, తుద కెద్దాన
లయమును బొందుచున్నవో, ఆ సత్యస్వరూపి యగు బ్రహ్మమునకు నమస్కారము.
జ్ఞాతా జ్ఞానం తథా జ్ఞేయం ద్రష్టా దర్శనదృశ్యభూః ।
కర్తా హేతుః క్రియా యస్మాత్ తస్మై జ్ఞప్త్యాత్మనే నమః॥ 2
జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయ, ద్రష్ట, దర్శన, కర్త, హేతు, క్రియ లను వ్యావహారిక తత్త్వము లెద్దానినుండి
ప్రభవించినవో, ఆ నిత్యజ్ఞాన స్వరూపి యగు బ్రహ్మమునకు నమస్కారము.
స్ఫురన్తి సీకరా యస్మాదానందాస్యాంబరేవనౌ
సర్వేషాం జీవనం తస్మై బ్రహ్మానందాత్మనే నమః ॥ 3
ఏ మహానంద సాగరమందలి కణమగు విషయానందము సమస్తజీవులలో ప్రకాశము నందుచున్నదో,
ఎద్దానియొక్క ఆనందకణము జీవులకు జీవనమో, - ఆ బ్రహ్మానంద రూపుడగు ఆత్మకు నమస్కారము.
కథారంభః
సుతీక్ష్ణో బ్రాహ్మణః కశ్చిత్ సంశయాకృష్టమానసః
అగస్తేరాశ్రమం గత్వా మునిం పప్రచ్చ సాదరమ్ ॥ 4
సుతీక్ష్ణుడను ఒకానొక బ్రాహ్మణుని మనస్సు సంశయ పీడితము కాగా, నాత డగస్తి మునీంద్రుని
ఆశ్రమమున కఱిగి వినయముతో నిట్లు ప్రశ్నించెను.
VI F1
2 యోగవాసిష్ఠము
సుతీక్ష్ణ ఉవాచ:
భగవన్! ధర్మతత్వజ్ఞ! సర్వశాస్త్ర వినిశ్చిత!
సంశయోఒస్తి మహానేకస్త్యమేతం కృపయా వద॥ 5
సుతీక్షణుడు: భగవానుడా! ధర్మరహస్యముల నన్నిటిని మీరెఱుంగుదురు. శాస్త్రముల నన్నింటిని నిశ్చిత
బుద్ధితో పఠించితిరి. నాకొక పెద్దసందియము కలిగినది. దానిని దీర్చ వేడెదను.
మోక్షస్య కారణం కర్మ జ్ఞానం వా మోక్షసాధనమ్ ।
ఉభయం వా వినిశ్చిత్య ఏకం కథయ కారణమ్ ॥ 6
మోక్షకారణము కర్మయా లేక జ్ఞానమా? లేక కర్మజ్ఞానములు రెండును గూడ మోక్షసాధనములా?
వీటిలో నెయ్యది మోక్షకారణమో నిశ్చయించి నాకు జెప్పుడు.
అగస్తి రువాచ:
ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథా ఖే పక్షిణాం గతిః |
తథైవ జ్ఞానకర్మాభ్యాం జాయతే పరమం పదమ్ ॥ 7
అగస్తి: పక్షు లాకాశమున రెండు లెక్కల సాయమున జరించునట్లు, జీవుడు జ్ఞానకర్మల సాహాయ్యమున
పరమపదమును బొందును.
కేవలాత్ కర్మణో జ్ఞానాన్న హి మోక్షో భిజాయతే |
కిం తూభాభ్యాం భవేన్మోక్షం సాధనం తూభయం విదుః ॥ 8
కేవలము కర్మవలన గాని, జ్ఞానమువలన గాని మోక్షము లభించదు. ఈ రెంటివలన మోక్షము
లభించును; కనుక సాధుజనులు ఈ రెంటిని మోక్షోపాయములని పరిగణింతురు.
అస్మిన్నర్థే పురావృత్త మితిహాసం వదామి తే |
కారుణ్యాఖ్యః పురా కశ్చిద్ బ్రాహ్మణో ఒధీతవేదకః | 9
అగ్నివేశ్యస్య పుత్రో ఒ భూత్ వేదవేదాంగ పారగః|
గురోరధీతవిద్యః సన్నాజగామ గృహం ప్రతి ॥ 10
ఈ ఈ సందర్భమున నీకొక పురాతనేతిహాసమును వచించుచున్నాను. పూర్వకాలమున అగ్నివేశ్యముని
పుత్రుడగు కారుణ్యుడను నాతడు ఉండెను. అతడు వేదవేదాంగములను బఠించెను. శాస్త్రముల నన్నిటిని
అభ్యసించెను. గురుకులమున అధ్యయనమును ముగించి గృహమునకు మరలివచ్చెను.
వైరాగ్యప్రకరణము (సర్గ - 1) 3
తత్త్వకర్మకృత్తూష్టీం సంశయానో గృహే తదా।
అగ్నివేశ్యో విలో క్యాథ పుత్రం కర్మ వివర్జితమ్ 11
ప్రాహ ఏతద్వచోఒ నిన్ద్యం గురుః పుత్రం హితాయచ ।
అప్పుడాయన కర్మకాండయెడల సంశయము గలిగి, కర్మలను దృజించి, తూప్లీంభావమును వహించి
యూరకుండెను. అప్పుడు అగ్నివేశ్యుడు కర్మవివర్జితుండగు పుత్రుని గాంచి వాని మంచికొఱకు ఇట్లు పల్కెను.
అగ్నివేశ్య ఉవాచ:
కిమేతత్ పుత్ర! కురుషే పాలనం న స్వకర్మణః? 12
అగ్నివేశ్యుడు: పుత్రా! ఇదేమి? నీవు స్వధర్మము (కర్మలను బాలించుటలేదేమి?
అకర్మనిరతః సిద్ధిం కథం ప్రాప్స్యసి తద్వద
కర్మణో స్మాన్నివృత్తేః కిం కారణం తన్నివేద్యతామ్ । "I 13
నీవు కర్మవివర్జితుడవై సిద్ధి నెట్లు పొందెదవో నాకు తెలియజెప్పుము. మఱియు కర్మల నెందులకు
ద్యజించితివో నుడువుము.
కారుణ్య ఉవాచ :
యావజ్జీవ మగ్నిహోత్రం నిత్యం సంధ్యా ముపాసయేత్ ।
|
ప్రవృత్తిరూపో ధర్మో యం శ్రుత్యా స్మృత్యా చ చోదితః ॥ 14
కారుణ్యుడు: 'మరణ పర్యంతము అగ్నిహోత్రము నొనర్చునది, నిత్యము సంధ్యావందన మాచరించునది'
- ఈ రూపములగు శ్రుతి స్మృతి వాక్యములన్నియు బ్రవృత్తి ధర్మమునకు జెందినవి.
న ధనేన భవేన్మోక్షః కర్మణా ప్రజయా న వా ॥
త్యాగమాత్రేణ కిం త్వేకే యతయోం శృంతి చామృతమ్ ॥ 15
ధనమువలన, కర్మలవలన, సంతానోత్పాదనమువలన మోక్షము లభింపదు. త్యాగము అనగా సర్వకర్మ
సంన్యాసమువలననే అమృతత్వమును బొందిరి. (ఇట్టి వాక్యము లన్నియు నివృత్తి పరములు.)
ఇతి శ్రుత్యోర్ధ్వయోర్మధ్యే కిం కర్తవ్యం మయా గురో!
ఇతి సందిగ్ధతాం గత్వా తూష్లీం భూతోస్మి కర్మణి "I 16
తండ్రీ! ఈ రెంటిలో నెద్దాని ననుసరింప నగును? అను సందియము కలిగి, సందిగ్ధ చిత్తుడనై
కర్మలను దృజించితిని.
4 యోగవాసిష్ఠము
అగస్తిరువాచ:
ఇత్యుక్త్యా తాత! విప్రో సౌ కారుణ్యో మౌనమాగతః ।
తథా విధం సుతం దృష్ట్వా పునః ప్రాహ గురుః సుతమ్ ॥ 17
అగస్తి: కారుణ్యుడు తండ్రి కిట్లు వచించి యూరకుండెను. అప్పుడు మౌనమును వహించిన పుత్రునితో
అగ్నివేశ్యు డిట్లు పల్కెను.
అగ్నివేశ్య ఉవాచ :
శృణు పుత్ర! కథామేకాం తదరం హృదయే ఖిలమ్ |
మత్తోఒ వధార్య పుత్ర! త్వం యథేచ్చని తథా కురు ॥ 18
అగ్నివేశ్యుడు: పుత్రా! నీకొక కథను జెప్పెదను; వినుము. విని, దానిని బాగుగా విచారించి చూచి నీకు
నచ్చినట్లొనర్పుము.
సురుచిర్నామ కాచిత్ స్త్రీ స్త్రీ అప్సరోగణ ఉత్తమా |
ఉపవిష్టా హిమవతః శిఖరే శిఖిసంవృతే "I 19
రమంతే కామసంతప్తాః కిన్నర్యో యత్ర కిన్నరైః |
స్వర్ధున్యోఘేన సంసృష్టే మహామౌమ వినాశినా ॥ 20 20
దూతమింద్రస్య గచ్ఛంత మంతరిక్షే దదర్శ సా॥
తమువాచ మహాభాగా సురుచిశ్చాప్సరోవరా ॥ 21 21 I
పూర్వము, కామతప్తలగు కిన్నరకిన్నరీ సమూహములు విహారములను సల్పునదియు, మయూరీ
మయూరములు ప్రమోదక్రీడల నొనర్చు నదియు, పాపనాశిని యగు గంగానది ప్రవహించు నదియు నగు
హిమవత్పర్వత శిఖరమున సురుచి యను అప్సరస కూర్చొని యుండెను. ఆమె, ఆకాశమున నరుగుచున్న
ఇంద్రదూతను గాంచి ఇట్లనెను.
సురుచి రువాచ :
దేవదూత! మహాభాగ! కుత ఆగమ్యతే త్వయా ।
అధునా కుత్ర గంతాని తత్సర్వం కృపయా వద॥ 22
సురుచి: దేవదూతా! ప్రకాశస్వరూపా! నీ వెటనుండి అరుదెంచుచున్నావు? ఇప్పుడెట కరుగుచున్నావు?
దయయుంచి నాకు జెప్పుము.
వైరాగ్యప్రకరణము (సర్గ - 1) 5
దేవదూత ఉవాచ :
సాధు! పృష్టం త్వయా సుభ్రు! యథావత్ కథయామి తే ॥
అరిష్టనేమి రాజర్షిత్వా రాజ్యం సుతాయ వై ॥ 23 23
వీతరాగః స ధర్మాత్మా నిర్యయౌ తపసే వనమ్ ।
తపశ్చరత్యసౌ రాజా పర్వతే గంధమాదనే ॥ 24
దేవదూత : సురుచీ! యుక్తప్రశ్న నొనరించితివి. నా వృత్తాంతమును వచించుచున్నాను. అరిష్టనేమి యను
రాజర్షి వైరాగ్యమును దాల్చి, పుత్రునకు రాజ్యభారము నొసగి, తపస్సు నొనరించుటకుగాను అరణ్యమున
కరిగెను. ఇప్పుడాయన గంధమాదన పర్వతమున తపము నాచరించుచున్నాడు.
కార్యం కృత్వా మయా తత్ర తత ఆగమ్యతే 2 ధునా ।
గంతా స్మి పార్శ్వే శక్రస్య తం వృత్తాంతం నివేదితుమ్ ॥ 25 I 25
(నేనింద్రుని ఆజ్ఞ ననుసరించి అట కరిగితిని.) అట నా కార్యమును నిర్వర్తించి, ఇంద్రుని కచ్చటి
వృత్తాంతమును నివేదించుటకుగాను మరల నరుగుచున్నాను.
అప్సరా ఉవాచ :
వృత్తాంతః కో భవత్తత్ర కథయస్వ మమ ప్రభో!
ప్రష్టుకామా వినీతా స్మి నోద్వేగం కుర్తుమర్హసి ॥
"I 26
అప్సరస: ప్రభూ! అచ్చటి వృత్తాంత మేమి? నేను వినగోరుచున్నాను. వినయముతో బ్రశ్నించుచున్నాను.
వచింపుడు; నన్ను చుల్కన చేయవద్దు.
దేవదూత ఉవాచ :
శృణు భద్రే! యథావృత్తం విస్తరేణ వదామి తే ॥
తస్మిన్ రాజ్ఞి వనే తత్ర తపశ్చరతి దుస్తరమ్ 27
దేవదూత: అచ్చటి వృత్తాంతమును వివరముగ వచించుచున్నాను, వినుము. అరిష్టనేమి గంధమాదన
పర్వతారణ్యమున కఠోరమగు తపస్సు నాచరించుచున్నాడు.
ఇత్యహం దేవరాజేన సుభ్రురాజ్ఞాపితస్తదా।
దూత! త్వం తత్ర గచ్ఛాశు గృహీత్వేదం విమానకమ్ ॥ 28
6 యోగవాసిష్ఠము
అప్సరోగణసంయుక్తం నానావాదిత్ర శోభితమ్ ।
గంధర్వసిద్ధయక్షైశ్చ కిన్నరాద్యైశ్చ శోభితమ్ ॥ 29
తాళవేణుమృదంగాది పర్వతే గంధమాదనే।
నానావృక్షసమాకీర్లే గత్వా తస్మిన్ గిరౌ శుభే ॥ 30
అరిష్టనేమిం రాజానం దూతారోప్య విమానకే।
ఆనయ స్వర్గభోగాయ నగరీమమరావతీమ్ ॥ 31
'నీవచ్చటికి శీఘ్రముగా అప్సరసలు, సిద్ధులు, కిన్నరులు, యక్షులతో గూడి నదియు; వేణువు, వీణ,
మృదంగము ఇత్యాదులగు మధుర వాద్యములతో శోభిల్లు నదియు నగు ఈ విమానము దీసికొని, గంధమాదన
పర్వతమున సాల, తాళ, తమాల హింతాలాది వృక్షములతో నిండియున్న ఆ పవిత్రశృంగమున కఱిగి,
అరిష్టనేమి నిందెక్కించుకొని రమ్ము. ఆయన ఇట కరుదెంచి స్వర్గభోగముల ననుభవించును' అని ఇంద్రు
డాజ్ఞాపించెను.
ఇత్యాజ్ఞాం ప్రాప్య శక్రస్య గృహీత్వా తద్విమానకమ్।
సర్వోపస్కరసంయుక్తం తస్మిన్న ద్రావహం యయౌ ॥ 32
నేనిట్లింద్రునిచే నాజ్ఞాపితుడనై పలువిధములగు భోగవస్తువులతో నలంకరింపబడిన ఆ విమానమును
గైకొని గంధమాదన పర్వతమున కేగితిని.
ఆగత్య పర్వతే తస్మిన్ రాజ్లో గత్వా క్రమం మయా ।
నివేదితా మహేంద్రస్య సర్వజ్ఞా రిష్టనేమయే "I 33
ఏగి, రాజర్షి యగు అరిష్టనేమి ఆశ్రమమును బ్రవేశించి, ఆయన కింద్రుని ఆజ్ఞ నంతటిని నివేదించితిని.
ఇతి మద్వచనం శ్రుత్వా సంశయానో వదచ్చుభే!
నాపల్కులను విని, అరిష్టనేమి సంశయచిత్తుడై ఇట్లు పల్కెను.
రాజోవాచ :
ప్రష్టుమిచ్ఛామి దూత! త్వాం తన్మే త్వం వక్తుమర్హసి | 34
గుణా దోషాశ్చ కే తత్ర స్వర్గే వద మమాగ్రతః ।
జ్ఞాత్వా స్థితిరి తు తత్రత్యాం కరిష్యే హం యథారుచి॥ 35
అరిష్టనేమి: ఓ ఇంద్రుడా! నిన్నొక్క విషయము అడిగి తెలిసికొనగోరెదను. నీవు చెప్పగలవు. స్వర్గమునందలి
వైరాగ్యప్రకరణము (సర్గ - 1) 7
గుణదోషములను వర్ణించి చెప్పుము. అచ్చటి పరిస్థితులను దెలిసికొనిన పిమ్మట నాకు నచ్చినట్లొనర్తును.
దూత ఉవాచ :
స్వర్గే పుణ్యస్య సామ్య భుజ్యతే పరమం సుఖమ్ ।
ఉత్తమైన తు పుణ్యేన ప్రాప్నోతి స్వర్గముత్తమమ్ | 36 "
మధ్యమేన తథా మధ్యః స్వర్ణో భవతి నాన్యథా |
కనిష్టేన తు పుణ్యేన స్వర్గో భవతి తాదృశః ॥ 37
దూత: పుణ్య మెక్కుడుగా నున్నచో, స్వర్గమున పరమసుఖము ననుభవింప వచ్చును. పుణ్యముయొక్క
తారతమ్యము ననుసరించి ఉత్తమ, మధ్యమ, అధమ భేదముల నొప్పు స్వర్గములు లభించును.
పరోత్కర్షాసహిష్ణుత్వం స్పర్ధ చైవ సమైశ్చ తైః |
కనిష్టేషు చ సంతోషో యావత్ పుణ్యక్షయో భవేత్ ॥ I 38
పుణ్యక్షయ మగు దనుక భోగముల ననుభవించుచు స్వర్గమున తమకంటే నెక్కుడు భోగముల
ననుభవించు వారియెడల నసూయ, తోటివారిని గాంచిన స్పర్ధ, తక్కువవారిని గాంచిన సంతోషము కలుగును.
క్షీణే పుణ్యే విశంత్యేతం మర్త్యలోకం చ మానవాః ।
ఇత్యాది గుణదోషాశ్చ స్వర్గే రాజన్నవస్థితాః || 39
పుణ్యక్షయ మైనతోడనే మరల మర్త్యలోకమున కరుగుచున్నారు. ఇట్టి గుణదోషములు స్వర్గమున
నున్నవి.
ఇతి శ్రుత్వా వచో భద్రే! న రాజా ప్రత్యభాషత
ఈ పల్కులను విని రాజిట్లు ప్రత్యుత్తర మిచ్చెను
రాజోవాచ :
నేచ్ఛామి దేవదూతాహం స్వర్గమిదృగ్విధం ఫలమ్ ॥ I 40 40
రాజు: ఓ దేవదూతా! నేనిట్టి ఫలములతో గూడిన స్వర్గమును గోరను.
అతఃపరం మహోగ్రం తు తపః కృత్వా కలవరమ్ । 1
త్యక్షామ్యహమశుద్ధం హి జీర్ణాం త్వచ మివోరగాః ॥ 41
నేనిక కఠోరతపము నొనరించి, పాము కుబుసమును వీడునట్లు అపవిత్ర మగు ఈ శరీరమును
విసర్జింతును.
8 యోగవాసిష్ఠము
దేవదూత! విమానం గృహీత్వా త్వం యథా గతః |
తథా గచ్ఛ మహేంద్రస్య సన్నిధౌ త్వం నమోస్తు తే ॥ 42
ఓ దేవదూతా! నీ వీ విమానమును దీసికొని ఇంద్రునికడకు వచ్చిన త్రోవనే మరలి వెళ్లుము. నీకు
నమస్కారము.
దేవదూత ఉవాచ:
ఇత్యుక్తోహం గతో భద్రే! శక్రస్యాగే నివేదితుమ్ ।
యథా వృత్తం నివేద్యాథ మహదాశ్చర్యతాం గతః ॥ 43
దేవదూత: రాజిట్లు పల్క, నీ వాక్యముల ఇంద్రుని కడకేగి విన్నవించితిని. ఇంద్రుడు మిక్కిలి అచ్చెరు
వందెను.
పునః ప్రాహ మహేంద్రో మాం ళ్లక్షణం మధురయా గిరా |
ఇంద్రుడు మరల మధురముగ, కోమలముగ నాతో నిట్లనియెను.
ఇంద్ర ఉవాచ :
దూత! గచ్ఛ పునస్తత్ర తం రాజానం నయాశ్రమమ్ 44
వాల్మీకేర్ తతత్వస్య స్వబోధార్థం విరాగిణమ్ ।
సందేశం మమ వాల్మీకేర్మహరేస్త్వం నివేదయ ॥ 45
ఇంద్రుడు: దూతా! మరల నీవచ్చటి కరుగుము. వైరాగ్యసంపన్ను డగు అరిష్టనేమిని తత్వజ్ఞుడగు వాల్మీకి
మహర్షి ఆశ్రమమునకు తత్త్వజ్ఞానార్థము దీసికొని వెళ్లుము. మఱియు నా సందేశమును వాల్మీకి కిట్లు
తెలుపునది.
మహర్షీ! త్వం వినీతాయ రాజ్ఞే స్మై వీతరాగిణే |
న స్వర్గ మిచ్ఛతే తత్త్వం ప్రబోధయ మహామున! 46
"మహర్షీ! విరాగియు, వినయియు, స్వర్గభోగ విరతుడును అగు ఈ రాజునకు తత్వజ్ఞాన
ముపదేశింపుడు. దానివలన, సంసార దుఃఖార్తుడగు ఈ రాజు క్రమముగా ముక్తి నందగలడు."
తేన సంసార దుఃఖార్తో మోక్ష మేష్యతి చ క్రమాత్ |
ఇత్యుక్త్యా దేవరాజేన ప్రేషితో ఒహం తదన్తికే ॥ 47
ఇంద్రునివలన నిట్లాజ్ఞాపింపబడి మరల నచ్చటికి (అరిష్టనేమి ఆశ్రమమునకు) పంపబడితిని.
వైరాగ్య ప్రకరణము (సర్గ - 1) 6
మయా.... గత్య పునస్తత్ర రాజా వల్మీకజన్మనే ।
నివేదితో మహేంద్రస్య రాజ్ఞా మోక్షస్య సాధనమ్ ॥ 48
రాజును వెంటనిడుకొని వాల్మీకి ఆశ్రమమున కఱిగితిని. అఱిగి, వాల్మీకికి మహేంద్రుని ఆజ్ఞయు,
రాజుయొక్క మోక్షయత్నమును నివేదించితిని.
తతో వల్మీకజన్మాసౌ రాజానం సమపృచ్ఛత |
అనామయ మతిప్రీత్యా కుశలప్రశ్న వార్తయా ॥ 49
వాల్మీకి అతిప్రేమతో రాజును దేశము, కోశము, (ధనాగారము) పుత్రులు, తపస్సు మున్నగు వానిని
గుఱించిన కుశలము నడిగెను.
రాజోవాచ :
భగవన్! ధర్మతత్వజ్ఞ! జ్ఞాతృజ్ఞేయవిదాం వర!
కృతార్థో 2 హం భవద్దృష్ట్యా తదేవ కుశలం మమ ॥ 50 50
రాజు: భగవానుడా! తాము ధర్మతత్వజ్ఞులు, జ్ఞానసంపన్నులు, లోకవ్యవహారజ్ఞులు. (ఇట్టి) మీ
దర్శనమువలనను, మీ కృపాదృష్టివలనను కృతార్థుడ నైతిని, ఇదియే నా కుశలము.
భగవన్! ప్రష్టు మిచ్ఛామి తదవిఘ్నేన మే వద
సంసారబంధదుఃఖార్తేః కథం ముంచామి తద్వద ॥ 51 51
భగవానుడా! మిమ్ముల నొక్కవిషయ మడిగి తెలిసికొనగోరెదను. నిర్విఘ్నముగా వచింపుడు.
సంసారబంధ బంధితుడనగు నేనెట్లు ముక్తుడ నగుదునో వచింపుడు.
వాల్మీకి రువాచ :
శృణు రాజన్! ప్రవక్ష్యామి రామాయణ మఖండితమ్
I
శ్రుత్వా ధార్య యత్నేన జీవన్ముక్తో భవిష్యని
II 52
వాల్మీకి: రాజా! అఖండ రామాయణమును వచించుచున్నాను, వినుము. దీనిని విని, అవగత మొనర్చుకొనిన
జీవన్ముక్తుడ వగుదువు.
వసిష్ఠరామసంవాదం మోక్షోపాయకథాం శుభామ్ |
జ్ఞాతస్వభావో రాజేంద్ర! వదామి శ్రూయతాం బుధ ! 53
జ్ఞాతస్వభావా! బుధా! వసిష్ఠరామ సంవాదమును, శుభదాయకమును, మోక్షోపాయమును నగుదానిని
నీకు వచించుచున్నాను. వినుము.
యోగవాసిష్ఠము 10
రాజోవాచ :
కో రామః కీదృశః కన్య బద్దో వా ముక్త ఏవ వా |
వర! ఏతన్మే నిశ్చితం బ్రూహి జ్ఞానం తత్త్వవిదాం 54
రాజు: తత్త్వజ్ఞా! రాము డెవడు? అత డెట్టివాడు? బద్ధుడా? ముక్తుడా? నా కిద్దాని దెలియజెప్పుడు.
వాల్మీకిరువాచ :
శాపవ్యాజవశాదేవ రాజవేషధరో హరి
ఆహృతా జ్ఞానసంపన్నః కించిద్ జ్ఞో సౌ భవత్ప్రభుః 55
వాల్మీకి: (నీ ఇష్టదైవ మగు) నారాయణుడే, భక్తులిచ్చిన శాపవాక్యముల సఫల మొనర్ప రాజవేషమును
ధరించి, జ్ఞానమును వీడి, అల్పజ్ఞునివలె ప్రకాశించెను.
రాజోవాచ :
చిదానందస్వరూపే హి రామే చైతన్యవిగ్రహే
శాపస్య కారణం బ్రూహి కః శప్తా చేతి మే వద॥ 56
రాజు: చిదానంద స్వరూపుడును, చైతన్య విగ్రహుడును నగు రామునకు శాప మేల గల్గినది? ఎవరు
శపించిరి? వచింపుడు.
వాల్మీకి రువాచ:
సనత్కుమారో నిష్కామో హ్యవసదృహ్మసద్మని I
వైకుంఠాదాగతో విష్ణు స్త్రీలో క్యాధిపతిః ప్రభుః ॥ 52 57
బ్రహ్మణా పూజితస్తత్ర సత్యలోకనివాసిభిః |
వినా కుమారం తం దృష్ట్యా హ్యువాచ ప్రభురీశ్వరః ॥ 58
వాల్మీకి: నిష్కాముడగు సనత్కుమారుడు బ్రహ్మలోకమున నుండెను. అప్పు డటకు వైకుంఠమునుండి
జగత్ప్రభు డగు నారాయణు డరుదెంచెను. బ్రహ్మలోక నివాసులును, బ్రహ్మయు గోవిందుని బూజించిరి.
కాని సనత్కుమారు డెట్టి సత్కారమును సలుపలేదు. అతనిని గాంచి మాధవుడిట్లనెను:
సనత్కుమార! స్తభో ఒసి నిష్కామో గర్వచేష్టయా |
అతస్త్యం భవ కామార్త: శరజన్మేతి నామతః || 59
వైరాగ్యప్రకరణము (సర్గ - 1) 11
సనత్కుమారుడా! నీకు యుక్తాయుక్త విచక్షణ లేదు; నిష్కాముడ నను గర్వ మున్నది. అందువలన
కుమారస్వామిపై జన్మించి కామపీడితుడవు కమ్ము!
తేనాపి శపితో విష్ణుః సర్వజ్ఞ త్వం తవాప్తి యత్ ।
కించిత్ కాలం హి తత్త్యక్త్యా త్వమజ్ఞానీ భవిష్యసి ॥ 60
విష్ణువుకూడ, సర్వజ్ఞత్వమును గోల్పోయి, అజ్ఞానియై, కొంతకాల ముండునట్లు, సనత్కుమారునివలన
శపింపబడెను.
భృగుభార్యాం హతాం దృష్ట్యా హ్యువాచ క్రోధమూర్చితః ।
విష్ణో తవాపి భార్యాయా వియోగో హి భవిష్యతి ॥ 61
భృగువు తనభార్య, కేశవునివలన జంపబడుట గాంచి, క్రోధపరవశుడై నీకు గూడ భార్యావియోగము
గలుగుగాక యని శపించెను.
వృందయా శపితో విష్ణు శ్చలనం యత్యయా కృతమ్ |
అతస్త్యం స్త్రీవియోగం తు వచనాన్మమ యాస్యసి ॥ 62
బృంద, విష్ణువు తన్ను మోసగించెనని గ్రహించి, భార్యావియోగము కలుగునని శపించెను.
భార్యా హి దేవదత్తస్య పయోష్ఠీ తీరసంస్థితా।
నృసింహవేషధృగ్విష్ణుం దృష్ట్యా పంచత్వ మాగతా ॥ 63
తేన శప్తో హి నృహరిర్దుఃఖార్తః స్త్రీవియోగతః ।
తవాపి భార్యయా సార్ధం వియోగో హి భవిష్యసి ॥ 64
దేవదత్తుని భార్య పయోష్ఠీనదీతీరమున నున్న నృసింహరూపి యగు విష్ణుని గాంచి, భయపడి
ప్రాణములను దృజించెను. అప్పుడు, భార్యావియోగ దుఃఖితు డగు దేవదత్తుడు, దుర్లభదర్శను డగు
నారాయణుని, నీకుగూడ భార్యావియోగము కల్గుగాక యని శపించెను.
61. ఖ్యాతి యను నా పె భృగుని పత్ని. ఈపె పురాకల్పమున విష్ణుని శరీరమున లీనము కావలెనని కోఱుకొనెను.
నారాయణు డాకోర్కెను సఫల మొనర్ప భృగువు, విష్ణువు తనభార్యను సంహరించినాడని భ్రమపడి ఇట్లు శపించెను. -
62. గోలోకమున ఒకప్పుడు రాధ అలిగి శాప మీయ, సుదాముడు దానవకులమున జలంధరుడై జన్మించెను;
బృంద ఈతని భార్య. ఈయమ సతీత్వము నాశనము గానిచో, జలంధరునకు మృతి లేదు. నారాయణుడు కపటరూపమున
బృందా పాతివ్రత్యమును భంగపరచెను. జలంధరుడు మృతి చెందెను. అందువలన, బృంద అలిగి శాపమిడెను. ఈ
కథ నెఱుంగగోరువారు బ్రహ్మవైవర్త, పద్మ పురాణములను జూచునది. - అను.
12 యోగవాసిష్టము
భృగుణైవం కుమారేణ శపితో దేవశర్మణా |
బృందయా శపితో విష్ణుస్తేన మానుష్యతాం గతః ॥ 65
నారాయణు డిట్లు, సనత్కుమార, భృగు, బృందా, దేవదత్తులవలన శపింపబడి మనుష్య రూపమును
డాల్చెను.
ఏతత్తే కథితం సర్వం శాపవ్యాజన్య కారణమ్ |
ఇదానీం వచ్మి తత్సర్వం సావధానమతిః శృణు 66 "
ఇత్యార్షే వాసిష్ట-మహారామాయణే వాల్మీకీయే దేవదూతోక్తే మోక్షోపాయే ద్వాత్రింశత్ సాహస్ర్యాం
సంహితాయాం వైరాగ్యప్రకరణే సూత్రపాతనకో నామ ప్రథమః సర్గః.
నీ కీ నానావిధ శాపముల గురించి వచించితిని. ఇప్పుడు మోక్షసాధనమును సంపూర్ణముగా
వచించెదను. సావధానుడవై వినుము.
ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ రామకృష్ణదేవ ప్రశిష్య శ్రీమత్ శివానంద పురీ
పూజ్యపాదశిష్య శ్రీ పూర్ణానందకృత శ్రీయోగవాసిష్ఠ తాత్పర్య ప్రకాశిక యను ఆంధ్రామవాదమున వైరాగ్య
ప్రకరణమున సూత్రపాతవకమను ప్రథమ సర్గము॥ 1॥
సూత్రపాతనకము - 2
దివి భూమౌ తథా22 కాశే బహిరంతశ్చ మే విభుః
యో విభాత్యవభాసాత్మా తస్మై సర్వాత్మనే నమః ॥ 1
భూలోకమున, అంతరిక్షలోకమున, స్వర్గలోకమున నాయందు బయట, లోపల వ్యాపించి అన్నిటిని
బ్రకాశింప జేయుచున్న సర్వాత్మకునకు నమస్కారము.
వాల్మీకి రువాచ :
అహం బద్దో విముక్తస్స్యామితి యస్యాస్తి నిశ్చయః |
నాత్యంతమజ్ఞో నో తజ్ఞః సోస్మిన్ శాస్త్రే ఒధికారవాన్ II 2
వాల్మీకి: నేను సంసారబద్ధుడను, ముక్తుడ నగుదును - ఇట్టి నిశ్చయము గలవాడే ఈ శాస్త్రమును
బఠింప నర్హుడు. అతి అజ్ఞుడును, (దేహాత్మబుద్ధి గలవాడును), తత్వజ్ఞుడును (ముక్తుడును) ఈ శాస్త్రమును
పఠింపదగదు.