వైరాగ్య ప్రకరణము (సర్గ - 2) 13
కథోపాయాన్ విచార్యాదౌ మోక్షోపాయానిమానథ ।
యో విచారయతి ప్రాజ్ఞో న స భూయో భిజాయతే ॥ 3
మొదట కథారూప మగు సప్తకాండ రామాయణమును బఠించి, పిదప షట్పకరణాత్మక మగు ఈ
మోక్షతత్త్వము నాలోచించువాడు మరల జన్మింపడు.
అస్మిన్ రామాయణే రామకథోపాయాన్ మహాబలాన్ ।
ఏతాంస్తు ప్రథమం కృత్వా పురాహ మరిమర్దన!
శిష్యాయాస్మి వినీతాయ భరద్వాజాయ ధీమతే । |
ఏకాగ్రో దత్తవాం స్తస్మై మణిమబ్ధిరివారినే || 5
నేను మొదట రామకథను విరచించి సముద్రుడు కోరినవారికి రత్నముల నిచ్చునట్లు
బుద్ధిమంతుడును, వినయియు, శిష్యుడును నగు భరద్వాజున కొసంగితిని.
తత ఏతే కథోపాయా భరద్వాజేన ధీమతా
కస్మింశ్చిన్మేరుగహనే బ్రహ్మణో గ్ర ఉదాహృతాః ॥ 6
అథాస్య తుష్టో భగవాన్ బ్రహ్మ లోకపితామహః ।
వరం పుత్ర! గృహాణేతి తమువాచ మహాశయః ॥ 7
పిమ్మట భరద్వాజుడు దానిని సుమేరు పర్వతారణ్యమున నున్న బ్రహ్మకు వినిపించెను. లోక పితామహు
డగు బ్రహ్మదేవుడు సంతోషించి భరద్వాజుని వరము గోఱుకొను మనెను.
భరద్వాజ ఉవాచ:
భగవన్! భూతభవ్యేశ వరోఒ యం మే ద్య రోచతే
యేనాయం జనతా దుఃఖాన్ముచ్యతే తదుదాహర ॥ 8
భరద్వాజుడు: భగవానుడా! భూతభవిష్యద్వేదీ! దేనివలన జనులు దుఃఖమునుండి విముక్తులగుదురో,
దానిని వచింపుడు. ఇదియే నా ఇష్టవరము.
శ్రీబ్రహ్మోవాచ :
గురుం వాల్మీకి మత్రాశు ప్రార్థయస్వ ప్రయత్నతః।
తేనేదం యత్ సమారబ్ధం రామాయణ మనిందితమ్ ॥ 9
14 యోగవాసిష్ఠము
తస్మిన్ శ్రుతే సరో మోహాత్ సమగ్రాత్ సంతరిష్యతి |
సేతునేవాంబుధే: పార మపారగుణశాలినా ॥ 110
బ్రహ్మ: నీవఱిగి వెంటనే ఈ విషయమును వాల్మీకి నడుగుము. అతడారంభించిన రామాయణమును
వినినంతనే మనుజుడు సేతువువలన సముద్రమును దాటిపోవునట్లు మోహమును సంపూర్ణముగా
తరింపగలడు.
శ్రీవాల్మీకి రువాచ:
ఇత్యుక్త్యా స భరద్వాజం పరమేష్ఠీ మదాశ్రమమ్ ।
అభ్యాగచ్ఛత్ సమం తేన భరద్వాజేన భూతకృత్ "1 11
వాల్మీకి: ఇట్లు పలికి సృష్టికర్త యగు బ్రహ్మ భరద్వాజుని వెంటనిడుకొని నా యాశ్రమమున కఱుదెంచెను.
తూర్ణం సంపూజితో దేవః సోర్ఘ్యపాద్యాదినా మయా |
అవోచన్మాం మహాసత్యః సర్వభూతహితే రతః ॥ 12
నేనాయనకు వెంటనే అర్ఘ్యపాద్యాదుల నొసగి పూజించితిని. సర్వభూత హితరతుడును
సత్యమూర్తియును నగు బ్రహ్మ నాతో నిట్లనియె-
రామ! స్వభావకథనాదస్మాద్వరమునే! త్వయా |
నోద్వేగాత్ స పరిత్యాజ్య ఆసమాప్తేరనిందితాత్ | 13
'నీవారంభించిన ఆనందదాయక మగు రామచరిత్ర రచన ప్రయాసతో గూడినదని,' ముగింపక
వదలివేయకుము.
గ్రంథేనానేన లోకోఒ యమస్మాత్ సంసారసంకటాత్ ।
సముత్తరిష్యతి క్షిప్రం పోతేనేవారు సాగరాత్ ॥ 14
'నావ నెక్కి సముద్రమును దాటిపోవునట్లు, ఈ రామాయణమువలన జనులు సంసార సముద్రము
నరించగలరు.
వక్తుం తదేవమేవార్థమహమాగతవానయమ్
కురు లోకహితార్థం త్వం శాస్త్రమిత్యుక్తవానజ: || 15
నేనీ విషయమును నీకెఱింగించుటకే ఇట కరుదెంచితిని. లోకహితార్థ మీ శాస్త్రమును రచింపుము.'
మమ పుణ్యాశ్రమాత్ తస్మాత్ క్షణాదంతర్ధి మాగతః ।
ముహూర్తాభ్యుర్థితః ప్రోచ్చై స్తరంగ ఇవ వారిణః ॥ 16
నా యీ పుణ్యాశ్రమమునుండి నిమేషమాత్రమై లేచిన జలతరంగములవలె నంతర్హితుండాయెను.
వైరాగ్యప్రకరణము (సర్గ - 2) 15
తస్మిన్ ప్రయాతే భగవత్యహం విస్మయ మాగతః ।
పునస్తత్ర భరద్వాజమపృచ్ఛం స్వస్థయా ధియా ॥ 17
కిమేతద్ బ్రహ్మణా ప్రోక్తం భరద్వాజ ! వదాశు మే 1
ఇత్యుక్తేన పునః ప్రోక్తం భరద్వాజేన తేన మే॥ 18
బ్రహ్మదేవు డంతర్హితుడైన పిమ్మట, నాకు గల్గిన విస్మయమునుండి తేఱుకొని, బ్రహ్మ యేమి
వచించు నదియు తెల్ప భరద్వాజు నడిగితిని. అతడిట్లనియె.
భరద్వాజ ఉవాచ:
ఏతదుక్తం భగవతా యథా రామాయణం కురు
సర్వలోక హితార్థాయ సంసారార్ణవ తారకమ్ ॥ 19
భరద్వాజుడు: జనులందరి హితము కొఱకు సంసార సముద్రమునుండి తరింపజేయు రామాయణ
కథనమును పూర్తి నొనరింపుము అని బ్రహ్మ యాజ్ఞాపించినాడు.
మహ్యం చ భగవన్! బ్రూహి కథం సంసారసంకటే |
రామో వ్యవహృతో హ్యస్మిన్ భరతశ్చ మహామనాః ॥ 20 20
శత్రుఘ్నో లక్ష్మణశ్చాపి సీతా చాపి యశస్వినీ ।
రామానుయాయినస్తే వా మంత్రిపుత్రా మహాధియః ॥ 24 21
నిర్దుఃఖితాం యథైతే ను ప్రాప్తిస్తద్భూహి మే స్ఫుటమ్ |
తథైవాహం భవిష్యామి తతో జనతయా సహ ॥ 22
భగవానుడా! సంసార సంకటమునంబడి శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులును, సీతాదేవియు,
మంత్రిపుత్రులును ఎట్లు సంచరించిరి? దుఃఖము నేరీతిగ తప్పించుకొనిరి? నాకిద్దానిని వివరించి తెల్పుడు.
దీనిని విని నేనును, ఇతరులును దుఃఖవిముక్తిని పొందెదము.
భరద్వాజేన రాజేంద్ర! వదేత్యుక్తోఒ స్మి సాదరమ్ ।
తదా కర్తుం విభో! రాజ్ఞామహం వక్తుం ప్రవృత్తవాన్ ॥ 23 23
భరద్వాజుని వేడుకోలు గైకొని, బ్రహ్మదేవుని ఆజ్ఞ ననుసరించి చెప్ప మొదలిడితిని.
శృణు వత్స! భరద్వాజ! యథా పృష్టం వదామి తే ।
శ్రుతేన యేన సమ్మోహమలం దూరే కరిష్యసి ॥ 24
వత్సా! భరద్వాజా! నీవడిగిన దానిని జెప్పుచున్నాను వినుము. దీనిని వినిన మోహము దూరమైపోవును.
యోగవాసిష్ఠము 16
తథా వ్యవహర ప్రాజ్ఞ! యథా వ్యవహృతః సుఖీ ।
రాజీవలోచనః ॥ సర్వసంసక్తయా బుద్ధ్యా రామో 25
లక్ష్మణో భరతశ్చైవ శత్రుఘ్నశ్చ మహామనాః |
కౌసల్యా చ సుమిత్రా చ సీతా దశరథస్తథా ॥ 26
కృతాస్త్రశ్చావిరోధశ్చ బోధపార ముపాగతాః ।
వసిష్టో వామదేవశ్చ మంత్రిణో 2 ష్టా తథేతరే ॥ 27
ధృష్టిర్ణయంతో భాసశ్చ సత్యో విజయ ఏవ చ|
విభీషణః సుషేణశ్చ హనుమానింద్రజిత్తథా 28 ||
ఏతే పౌ మంత్రిణః ప్రోక్తాః సమనీరాగచేతనః |
జీవన్ముక్తా మహాత్మానో యథాప్రాప్తానువర్తినః ॥ 29
ఏతైర్యథా హుతం దత్తం గృహీతముషితం స్మృతమ్ |
తథా చేద్వర్తసే పుత్ర! ముక్త ఏవాసి సంకటాత్ II 30
పద్మనేత్రుడగు రాముడును, లక్ష్మణుడును, భరతుడును, శత్రుఘ్నుడును, కౌసల్యయును,
సుమిత్రయును, సీతయు, దశరథుడును, కృతాస్త్రా విరోధులను రామస్నేహితులును, వసిష్ఠ వామదేవాదులును,
అష్టమంత్రులును ఏరీతిగ నిర్లిప్తులై సంచరించి ఆనందము ననుభవించిరో, నీవును అట్లే యొనర్పుము.
దృష్టి, జయంతుడు, భాసుడు, సత్యుడు, విజయుడు, సుషేణుడు, హనుమంతుడు, ఇంద్రజిత్తు * *
వీరష్టమంత్రులు. వీరందరును సమదర్శనులు, వైరాగ్యచిత్తులు, జీవన్ముక్తులు, ప్రారబ్ధకర్మల ననుసరించువారు.
వీరొనరించినట్లు హోమ, దాన, గ్రహణ, స్మరణాదుల నొనరించిన నీవును సంకటమునుండి విముక్తుడ వగుదువు.
అపారసంసారసముద్రపాతీ లబ్ధ్వా పరాం యుక్తిముదారసత్వః
న శోక మాయాతి న దైన్య మేతి గతజ్వరస్తిష్ఠతి నిత్యతృప్తః 31
ఇత్యార్షే వాసిష్ఠ-మహారామాయణే వాల్మీకీయే మోక్షోపాయే సూత్రపాతనికో నామ ద్వితీయః సర్గః॥2॥
అపారమగు సంసార సముద్రమున మునిఁగిన వ్యక్తి, (పరమయోగమునుఁ బొంది) ఉత్కృష్ట జ్ఞానముఁ
బడసి శోకమును, దైన్యమును, అభిమానమును వీడి నిత్యతృప్తుడై వెలయును.
ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున సూత్రపాతనిక యను ద్వితీయ సర్గము ॥2॥
* ఈ ఇంద్రజిత్తు సుగ్రీవుని మంత్రి - అను.
వైరాగ్యప్రకరణము (సర్గ - 3) 17
తీర్థయాత్ర వర్ణనము -3
భరద్వాజ ఉవాచ :
జీవన్ముక్తస్థితిం బ్రహ్మన్ కృత్వా రాఘవ మాదితః ।
క్రమాత్ కథయ మే నిత్యం భవిష్యామి సుఖీ యథా ॥ 1
భరద్వాజుడు: బ్రహ్మవేత్తా! క్రమముగా జీవన్ముక్త్రస్థితి నెట్లు పొందవచ్చునో, రాముని ననుసరించి నాకు
జెప్పుడు. అట్లయిన సుఖి నగుదును.
శ్రీవాల్మీకి రువాచః
భ్రమస్య జాగతస్యాస్య జాతస్యాకాశవర్ణవత్ |
అపునః స్మరణం మన్యే సాధో! విస్మరణం వరమ్ ॥ I 2
శ్రీవాల్మీకి: సాధూ! ఆకాశమునకు రూపము లేకపోయినను నీలరూప మున్నట్లు, భ్రమ కలుగునట్లు,
వాస్తవమగు సత్త లేని జగత్తు బ్రహ్మమున ఆరోపింప బడుచున్నది. ఇట్టి కల్పిత ప్రపంచము మరల మనస్సున
నుదయింపకుండునట్లు, విస్మరించుటయే ముక్తిస్వరూపము. ఇయ్యది నా అనుభవము.
దృశ్యాత్యన్తాభావబోధం వినా తన్నానుభూయతే।
కదాచిత్ కేనచిన్నామ స్వబోధోఒ న్విష్యతామతః "I 3
కనుబడు ప్రతివస్తువును, (దృశ్యము) అస్తిత్వము లేనిది. ఈ జ్ఞానము కలుగనిదే పైన జెప్పబడిన,
ముక్తిస్వరూపమును ఎవరును దెలిసికొనజాలరు. అందువలన ఆత్మసాక్షాత్కారము కొఱకై ప్రయత్నింపుము.
స చేహ సంభవత్యేవ తదర్థమిదమాతతమ్
శాస్త్రమాకర్ణాయని చేత్ తత్త్యమాప్స్యసి నాన్యథా ॥
ఈ శాస్త్రాధికారికి ఆత్మదర్శనము లభించును. ఈ శాస్త్రమును వినినవెంటనే ఆత్మసాక్షాత్కారము డ
లభించును. మఱి ఇంకొక ఉపాయము లేదు.
జగద్రమోఒ యం దృశ్యో పి నాస్త్యేవేత్యనుభూయతే డ్యెడ కారిడ
వర్ణ వ్యోమ్న ఇవాఖేదాద్విచారేణామునాది నవు! crore bవంగ్ కు 5
అనఘా! భ్రాంతివలన కల్పింపబడిన ఈ జగత్తు కనులంబడుచున్నను, ఆకాశమునందలి రంగువలె,
అస్తిత్వము లేనట్టిది; శాస్త్రవిచారమువలన అనాయాసముగా ఇట్టి యనుభూతి కలుగును. cars ఆ
18 యోగవాసిష్ఠము
దృశ్యం నాస్తితి బోధేన మనసో దృశ్యమార్జనమ్ ।
సంపన్నం చేత్తదుత్పన్నా పరా నిర్వాణనిర్వృతిః "I 6
దృశ్యవస్తువు అసలునకు లేదు; మిథ్య. ఇట్టి తత్వజ్ఞానమువలన మనస్సునుండి దృశ్యవస్తువు
మాసిపోయినచో, నిర్వాణముక్తియొక్క పరమానందము లభించును.
అన్యథా శాస్త్రగర్తేషు లుఠతాం భవతామిహ |
భవత్యకృత్రిమాజ్ఞానాం కల్పైరపి న నిర్వృతిః "I 7
అట్లొనర్పక, అజ్ఞానమునకు లోబడి మరల మరల పుట్టుచు చచ్చుచుండు వ్యక్తి అనేక కల్పములుగ
శాస్త్రమను గుంటలోబడి కొట్టుకొనినను ముక్తి లభింపదు.
అశేషేణ పరిత్యాగో వాసనానాం య ఉత్తమః ।
మోక్ష ఇత్యుచ్యతే బ్రహ్మన్! స ఏవ విమలక్రమః 8
బ్రాహ్మణుడా! వాసనల సంపూర్ణ త్యాగమే ఉత్తమ మగు మోక్షము. చిత్తశుద్ధినుండియే
పరంపరాక్రమమున ఆ మోక్షము లభించుచున్నది.
క్షీణాయాం వాసనాయాం తు చేతో గలతి సత్వరమ్ ।
క్షీణాయాం శీతసంతత్యాం బ్రహ్మన్ హిమకణో యథా ॥ 9
శీతకాలము ముగిసినతోడనే మంచుతుంపురులు మాసిపోవునట్లు వాసనలు క్షయమైనచో మనస్సు
లయమైపోవును.
అయం వాసనయా దేహో ధ్రియతే భూతపంజరః।
తనునాంతర్నివిష్టేన ముక్తామ స్తంతునా యథా ॥ 10
ముత్యములు లోపల గ్రుచ్చబడిన దారమువలన ధరింపబడునట్లు ప్రాణులను పక్షులకు పంజర
మగు (లేక పంచభూత నిర్మిత మగు దేహ పంజరమను) ఈ శరీరము వాసనల బలముననే నిలబడియున్నది.
వాసనా ద్వివిధా ప్రోక్తా శుద్ధాచ మలినా తథా |
మలినా జన్మనో హేతుః శుద్ధా జన్మవినాశినీ 11
వాసనలు రెండువిధములని నుడువబడినవి. అవి శుద్ధములు, మలినములు. మలినవాసనలు జన్మకు 3 గారణములు. శుద్ధవాసనలు జన్మనాశమునకు తోడ్పడును.
అజ్ఞానసుమనాకారా మనాహంకారశాలినీ, CA
పునర్జన్మకరీ ప్రోక్తా మలినా వాసనా బుధైః ॥ 12
వైరాగ్యప్రకరణము (సర్గ - 3) 19
మలిన వాసనలు ప్రబలాహంకారమునంజేసి, అజ్ఞానక్షేత్రమున దట్టముగా పెఱిగి, పునర్జన్మ ఫలము
నొసగునని పండితులు చెప్పుదురు.
పునర్జన్మాంకురం త్యక్త్యా స్థితా సంభృష్టబీజవత్ ।
దేహార్థం ద్రియతే జ్ఞాతజ్ఞేయా శుద్ధేతి చోచ్యతే ॥ 13
శుద్ధవాసనలు తత్త్వజ్ఞానమున కనుకూల మైనవి. వీనియందు పునర్జన్మ కుపయోగపడు అంకురము
లుండవు. వీటిపని ఈ శరీరముతోడనే నిలిచిపోవును; అవి వేయించబడిన గింజలవంటివి అని చెప్పుదురు.
అపునర్జన్మకరణీ జీవన్ముక్తేషు దేహిషు।
వాసనా విద్యతే శుద్ధా దేహే చక్ర ఇవ భ్రమః ॥ 14
శుద్ధవాసనలు జీవన్ముక్త పురుషునియందు చక్రభ్రమణము* వలె నుండును. మరల జన్మను
కలుగజేయు సామర్థ్యము వాటికి లేదు.
యే శుద్ధవాసనా భూయోన జన్మానర్థభాజనమ్ ।
జ్ఞాతజ్ఞేయా స్త ఉద్యంతే జీవన్ముక్తా మహాధియః II 15
శుద్ధవాసనల నాశ్రయించి తత్త్వజ్ఞాన ఫలముగ అనర్థమగు పునర్జన్మను వదలి పోయిన వారందరు
జీవన్ముక్తు లనబడుచున్నారు.
జీవన్ముక్తిపదం ప్రాప్తో యథా రామో మహామతిః |
తత్తే హం శృణు వక్ష్యామి జరామరణశాంతయే ॥ 16
మహామతి యగు రాముడెట్లు జీవన్ముక్తస్థితిని బొందెనో, వచించుచున్నాను. జరామరణ నాశముకొఱ
కద్దానిని వినుము.
భరద్వాజ మహాబుద్ధే! రామక్రమమిమం శుభమ్ ।
శృణు వక్ష్యామి తేనైవ సర్వం జ్ఞాస్యసి సర్వదా 11 17
* చక్రభ్రమణము: కుమ్మరివాడు చక్రముబోలు సారెను మాటిమాటికి త్రిప్పుచు కుండలను తయారుచేయును. కుండలు
తయారుచేయుట అయిపోయిన నిక సారెను త్రిప్పడు. త్రిప్పకపోయిన పూర్వవేగమున కొంతవరకు సారె తిరుగుచునే
యుండును. అట్లే వాసనలుకూడ వాటి పూర్వశక్తి ననుసరించి ఆమరణాంతము జీవన్ముక్తునియందు పనిచేయుచుండును.
పిదప వాటికి సామర్థ్య ముండదు-అను.
20 యోగవాసిష్ఠము
భరద్వాజా! మహామతీ! రాముని శుభచరిత్రను జెప్పుచున్నాను వినుము. ఇద్దానివలననే అంతయు
దెలిసికొనగలవు.
విద్యాగృహాద్వినిష్క్రమ్య రామో రాజీవలోచనః |
దివసాన్యనయదేహే లీలాభిరకుతోభయః ॥ 18
పద్మలోచనుడగు రాముడు గురుకుల వాసమునుండి, విద్యలను ముగించి వచ్చి కొన్ని దినములు
లీలలందు నిర్భీకుడై గడపెను.
అథ గచ్ఛతి కాలే తు పాలయత్యవనిం నృపే | I
ప్రజాను వీతశోకాసు స్థితాసు విగతజ్వరమ్ ॥ I 19
దశరథుని పాలనమున ప్రజల కేవిధమైన దుఃఖములును, జ్వరాది ఉపద్రవములును లేకుండెను;
దినము లిట్లు జరుగసాగెను.
తీర్థపుణ్యాశ్రమశ్రేణీ ద్రష్టుముత్కంఠితం మనః ।
రామస్యాభూద్భృశం తత్ర కదాచిత్ గుణశాలినః ॥ 20 20
రామవశ్చిన్తయిత్వైవముపేత్య చరణా పితుః ॥
హంసః పద్మావివ నవౌ జగ్రాహ నఖకేసరౌ ॥ 21 21
అప్పుడొక దినమున శ్రీరాముని మనమున తీర్థములను, పవిత్రాశ్రమములను జూడ మిక్కుటమగు
కోర్కె పొడమెను. రాఘవుడు చింతించుచు, హంస పద్మముల నాశ్రయించునట్లు నఖకేసరముల (గోళ్లు
అను కింజల్కముల) తో గూడిన తండ్రి పాదపద్మముల గ్రహించెను.
శ్రీరామ ఉవాచ :
తీర్థాని దేవసద్మాని వనాన్యాయతనాని చ |
ద్రష్టుముత్కంఠితం తాత! మమేదం నాథ! మానసమ్ ॥ 22 22
శ్రీరాముడు: దేవా! నామనస్సు దేవాలయములను, తీర్థములను, తపోవనములను జూడ ఆతురపడుచున్నది.
తదేతామర్థితాం పూర్వాం సఫలాం కర్తుమర్హసి |
న సో స్త్రీ భువనే నాథ! త్వయా యోర్థీ న మానితః ॥ 23
*ఏక విజ్ఞానమున సర్వవిజ్ఞాన ప్రతిజ్ఞ ఈ శ్లోకము తెలుపుచున్నది.
వైరాగ్యప్రకరణము (సర్గ - 3) 21
నా ఈ మొదటి కోర్కెను చెల్లింపనగును. జగత్తున నీ వేయర్థి కోర్కెను నిరాకరించి యుండలేదు.
ఇతి సంప్రార్థితో రాజా వసిష్టేన సమం తదా।
విచార్యాముంచ దేవైనం రామం ప్రథమమర్థినమ్ ॥ 24
ఇట్లు ప్రార్థింపబడి, దశరథుడు వసిష్ఠునితో నాలోచించి, ప్రథమప్రార్థి యగు రాముని తీర్థయాత్ర
కంగీకరించెను.
శుభే నక్షత్రదివసే భ్రాతృభ్యాం సహ రాఘవః ॥
మంగళాలంకృతవపుః కృతస్వస్త్యయనో ద్విజైః || 25
వసిష్ఠ ప్రహితైర్విప్రైః శాస్త్రజ్జెశ్చ సమన్వితః |
స్నిగె కతిపయైరేవ రాజపుత్రవరైః సహ | 26
అంబాభిర్విహితాశీర్భిరాలింగ్యాలింగ్య భూషితః ।
నిరగాత్ స్వగృహాత్తస్మాత్ తీర్థయాత్రార్థముద్యతః
"I 27
నిర్గతః స్వపురాత్ పౌరైస్తూర్యఘోషేణ వాదితః ।
పీయమానః పురస్త్రీణాం నేత్రైర్భంగౌమభంగురైః | 28
గ్రామీణలలనాలో లహస్తపద్మావనోదితైః |
లాజవర్హెర్వికీర్ణాత్మా హిమైరివ హిమాచలః ॥
29
ఆవర్ణయన్ విప్రగణాన్ పరిశృణ్వన్ ప్రజాశిషః॥
ఆలోకయన్ దిగంతాంశ్చ పరిచక్రమ జాంగలాన్ ॥ 30
శుభదినమున శుభనక్షత్రమున రాఘవుడును, తమ్ములును మంగళాలంకారముల నలంకరింపబడిరి.
బ్రాహ్మణులు 'స్వస్తి' అని చెప్పిరి. వసిష్ఠుడు పంపిన శాస్త్రజ్ఞులగు విప్రులును, ముఖ్యస్నేహితులగు కొందఱు
రాజపుత్రులును సహచరులైరి. తల్లులు మాటిమాటికి మూర్కొనుచు, ఆశీర్వదించుచు, అలంకరించిరి. ఇట్లు
శ్రీరాముడు తీర్థయాత్రకై సంసిద్ధుడై తానుండు గృహమునుండి వెలికివచ్చెను. పురవాసులు 'బాకా'ల
నూదసాగిరి. పురస్త్రీలు తమకన్నులను తుమ్మెదలతో రాఘవుని వీక్షింపసాగిరి. గ్రామ స్త్రీలు చలించు చేతులతో
పేలాలను జల్లిరి. అప్పుడు రాముడు మంచుతుంపురులతో గప్పబడిన హిమాలయమువలె గన్పట్టెను.
బ్రాహ్మణులకు దక్షిణల నిచ్చుచు. ప్రజల దీవెనలను వినుచు దిగంతముల గాంచుచు. శ్రీరాము డడవులను
దాటిపోసాగెను.
22 22 యోగవాసిష్ఠము
ఆథారభ్య స్వకాత్తస్మాత్ క్రమాత్ కోసలమండలాత్ I
స్నానదానతపోధ్యానపూర్వకం సదదర్శ హ॥ Rodjou Bp 31
నదీతీరాణి పుణ్యాని వనాన్యాయతనాని చ।
జంగలాని జనాంతేషు తటాన్యబ్ధిమహీభృతామ్ ॥ 32 I
మందాకినీమిందునిభాం కాళిందీం చోత్పలామలామ్ ।
సరస్వతీం శతద్రూం చ చంద్రభాగామిరావతీమ్ ॥ 33
వేణీం చ కృష్ణవేణీం చ నిర్వింధ్యాం సరయూం తథా |
చర్మణ్వతీం వితస్తాం చ విపాశాం బాహుదామవి ॥ 34
ప్రయాగం నైమిషం చైవ ధర్మారణ్యం గయాం తథా |
వారాణసీం శ్రీగిరిం చ కేదారం పుష్కరం తథా | 35 35
మానసం చక్రమసరస్తథైవోత్తరమానసమ్ ।
బడవావదనం చైవ తీర్థబృందం ససాదరమ్ ॥ 36
96
అగ్నితీర్థం మహాతీర్థమింద్రద్యుమ్నసరస్తథా|
సరాంసి సరితశ్చైవ తథా నదహ్రదావలీమ్ ॥ 37
స్వామినం కార్తికేయం చ సాలగ్రామం హరిం తథా |
స్థానాని చ చతుష్షష్టిం హరేరథ హరస్య చ ॥ 38
నానాశ్చర్యవిచిత్రాణి చతురబ్ధితటాని చ
వింధ్యమందరకుంజాంశ్చ కులశైలస్థలాని చ ॥ 39
రాజర్షీణాం చ మహతాం బ్రహ్మర్షీణాం తథైవ చ ॥
దేవానాం బ్రాహ్మణానాం చ పావనానాశ్రమాఞ్భుభాన్ ॥ 40 40 11
శ్రీరాముడు స్వదేశమగు కోసలమునుండి ఆరంభించి, ఉచితరీతి స్నాన దాన ఉపవాసాదులను,
ధ్యానమును ఒనరించుచు పవిత్ర నదీతీరములను, అరణ్యములను, ఆశ్రమములను, చిట్టడవులను, సముద్ర
తీరములను, పర్వత భూములను, గంగాయమునలను, సరస్వతిని, ఐరావతి శతద్రూ చంద్రభాగలను,
వేణీకృష్ణవేణులను, నిర్వింధ్యాసరయూ చర్మణ్వతీనదులను, వితస్తా బాహుదా విపాశా నదులను, ప్రయాగ,
నైమిశారణ్య, ధర్మారణ్యములను, వారణాసీ, గయా, కేదార, శ్రీశైలములను; పుష్కర, మానస సరోవర, చక్రతీర్థ,
వైరాగ్యప్రకరణము (సర్గ - 3) 23
ఉత్తరమానసములను; బడబాముఖమును, అగ్నితీర మహాతీర్థములను, ఇంద్రద్యుమ్న సరోవరమును,
మఱియు ఇతర నదీ హ్రద సమూహములను, కార్తికేయుని, సాలగ్రామ నారాయణుని, హరిహరుల అరువది
నాలుగు స్థానములను, నానావిధ ఆశ్చర్యములతో గూడిన నాలుగు సముద్రతీరములను, వింధ్య మందర
పర్వత నికుంజములను, కులాచల భూములను, ముఖ్యులగు రాజర్షి, బ్రహ్మర్షి దేవ బ్రాహ్మణుల పవిత్ర
భూములను, ఆశ్రమములను గాంచెను.
భూయో భూయః స బభ్రమ భ్రాతృభ్యాం సహ మానదః ।
చతుర్వపి దిగంతేషు సర్వానేవ మహీతటాన్ II 41
దిగంతముల నన్నిటిని అనుజులతోగూడి మఱల మఱల శ్రీరాముడు పరిభ్రమించెను.
అమరకిన్నరమానవమానితః సమవలోక్య మహీమఖిలామిమామ్ ।
ఉపయయౌ స్వగృహం రఘునందనో విహృతదిక్ శివలోకమివేశ్వరః 11 42
ఇత్యార్షే వాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే తీర్థయాత్రాకరణం నామ
తృతీయః సర్గః ॥ ౩ |
సుర నర కిన్నర పూజితుడై రాఘవు డీ భూమండలము నంతటిని వీక్షించి, శివలోకమున కరుగు
ఈశ్వరునివలె నిజపురి కరుదెంచెను.
ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున తీర్థయాత్ర యను
తృతీయ సర్గము ॥3॥
24 యోగవాసిష్ఠము
దివసవ్యవహారనిరూపణము -4
శ్రీవాల్మీకిరువాచ:
రామః పుష్పాంజలివ్రాతైర్వికీర్ణః పురవాసిభిః |
ప్రవేశ గృహం శ్రీమాన్ జయంతో విష్టపం యథా ॥
వాల్మీకి : పురవాసులు పుష్పాంజలుల నర్పించగా శ్రీరాముడు, జయంతుడు స్వర్గమును బ్రవేశించునట్లు,
రాజభవనమును బ్రవేశించెను.
ప్రణనామాథ పితరం వసిష్ఠం భ్రాతృబాంధవాన్ |
బ్రాహ్మణాన్ కులవృద్ధాంశ్చ రాఘవః ప్రథమాగతః ॥ 2
పిదప రాఘవుడు తల్లిదండ్రులకు, వసిష్ఠునకు, జ్ఞాతి భ్రాతృగణమునకు, బ్రాహ్మణులకు,
కులవృద్ధులకు నమస్కరించెను.
సుహృద్భిర్మాతృభిశ్చైవ పిత్రా ద్విజగణేన ।
ముహురాలింగితాచారో రాఘవో న మమౌ ముదా | 3
తల్లిదండ్రులు, మిత్రులు, బ్రాహ్మణులు మాటిమాటికి కౌగిళ్ల దేల్చగా రాము డానందించెను.
తస్మిన్ గృహే దాశరథే : ప్రియప్రకథనైర్మిథః |
జుమూర్ఖుర్మధురైరాశా మృదువంశస్వనైరివ ॥ 4
దశరథుని గృహమున వేణునినాదమువంటి రాముని మధుర వాక్యముల నాలించి, అందఱును
సంతోషమున తబ్బిబ్బై తిరుగాడసాగిరి.
బభూవాథ దివాన్యష్టా రామాగమన ఉత్సవః ॥ 1
సుఖం మత్తజనోన్ముక్తకలకోలాహలాకులః ॥ 5
రాముని ప్రత్యాగమనమున ఎనిమిదిరోజులు ఉత్సవము జరిగెను. అది ఆనందితులగు జనుల
కోలాహలములతో నిండియుండెను.
ఉవాస స ముఖం గేహే తతఃప్రభృతి రాఘవః।
వర్ణయన్ వివిధాకారాన్ దేశాచారానితస్తతః ॥ 6
అప్పటినుండి రాముడు నానావిధ దేశాచారములను వర్ణించుచు, సుఖముగా గృహమున నుండెను.
వైరాగ్యప్రకరణము (సర్గ - 4) 25
ప్రాతరుత్థాయ రామో ఒసౌ కృత్వా సంధ్యాం యథావిధి ।
సభాసంస్థం దదర్శేంద్రసమం స్వపితరం తథా ॥ 7
ఉదయమున లేచి సంధ్యావందనాది నిత్యకృత్యములను నెరవేర్చి, సభామధ్యమున నున్న ఇంద్రసము
డగు తండ్రియైన దశరథుని గాంచుచుండెడివాడు.
కథాభిః సువిచిత్రాభిః స వసిష్ఠాదిభిః సహ |
స్థిత్వా దినచతుర్భాగం జ్ఞానగర్భాభిరాదృతః ॥ 8
జగామ పిత్రానుజ్ఞతో మహత్యా సేనయా 2 వృతః
వరాహమహిషాకీర్ణం వనమాఖేటకేచ్చయా I 9
అచ్చట ప్రథమయామమును జ్ఞానచర్చయందు గడుపుచుండెడివాడు. పిదప తండ్రి ఆజ్ఞను గైకొని,
మహా సైన్యమును వెంటనిడుకొని; మహిష వరాహములతో గూడిన వనమునకు వేటాడ నరిగెడువాడు.
తత ఆగత్య సదనే కృత్వా స్నానాదికం క్రమమ్ । |
సమిత్రబాంధవో భుక్త్యా నినాయ ససుహృత్ నిశామ్ ॥ 10
అటనుండి తిరిగివచ్చి, స్నానాదికము నొనరించి, బంధుమిత్రులతో గూడి భోజన మొనర్చి రాత్రి
గడిపెడువాడు.
ఏవం ప్రియదినాచారో భ్రాతృభ్యాం సహ రాఘవః।
ఆగత్య తీర్థయాత్రాయాః సమువాస వితురృహే ॥ 11
తీర్థయాత్రనుండి తిరిగివచ్చిన పిదప రాఘవుడు, ఇట్లు దైనికకృత్యముల నొనర్చుచు, తమ్ములతోగూడి
పితృగృహమున వాస మొనర్పసాగెను.
నృపతిసంవ్యవహారమనోజ్ఞయా సుజనచేతని చంద్రికయా నయా ॥
పరినినాయ దినాని న చేష్టయా స్తుతసుధారస పేశలయా నమ! 12
ఇత్యారే వాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే దివసవ్యవహారవిరూపణం - నామ
చతుర్థః సర్గః ॥ 4॥
అనఘా! రాజులతో సముచితరీతి నెగడుచు, సుజనహృదయముల మనోజ్ఞప్రవర్తన యను మధుర
కౌముదీ (వెన్నెల) రసమున సంతోషింపజేయుచు, రాఘవుడు దినములం గడుపసాగెను.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున
దివసవ్యవహార నిరూపణమను చతుర్థ సర్గము ॥ 4॥
26 యోగవాసిష్ఠము
కార్య నివేదనము -5
శ్రీవాల్మీకిరువాచ :
అథోనషోడశే వర్షే వర్తమానే రఘూద్వహే ।
రామానుయాయిని తథా శత్రుఘ్నే లక్ష్మణే చ ॥ 1
భరతే సంస్థితే నిత్యం మాతామహగృహే సుఖమ్ ।
పాలయత్యవని రాజ్ఞి యథావదఖిలా మిమామ్ ॥ 2
జన్యత్రార్థం చ పుత్రాణాం ప్రత్యహం సహ మంత్రిభిః : 1
కృతమంత్రే మహాప్రాజ్ఞే తద్ జ్ఞే దశరథే నృపే ॥ 3
కృతాయాం తీర్థయాత్రాయం రామో నిజగృహే స్థితః 1
జగామానుదినం కార్శ్యం శరదీవామలం సరః ॥ 4
వాల్మీకి : ఇట్లు గృహమున వసించుచున్న రాముడు శరత్కాల సరోవరము వలె శుష్కింపసాగెను. అప్పుడాతని
వయస్సు పదునైదేండ్లు. లక్ష్మణ శత్రుఘ్ను లాతని ననుసరించుచుండెడివారు. భరతుడు సుఖముగ
తాతగారియింట కాలమును వెళ్లబుచ్చుచుండెను. దశరథుడు భూమండలము నంతటిని నియమానుసారము
బాలించుచుండెను. మంత్రులతో పుత్రుల వివాహమును గుఱించి ప్రాజ్ఞుడగు దశరథు డాలోచింపసాగెను.
తీర్థయాత్రల నొనరించి వచ్చిన రాముడు (సంసార దుఃఖ మేమియు లేకపోయినను) కృశింపసాగెను.
కుమారస్య విశాలాక్షం పాండుతాం ముఖమాదదే |
పాకవుల్లదళం శుక్లం సాలిమాలమివాంబుజమ్ || 5
శ్రీరాముని విశాలలోచన ముఖమండలము పాలిపోయి భ్రమర చుంబితమును, వికసితమును నగు
తెల్లతామర పూవువలె నాయెను.
కపోలతల సంలీనపాణి: పద్మాసనస్థితః
చింతాపరవశస్తూన్లీ మవ్యాపారో బభూవ హ ॥ 6
శ్రీరామచంద్రుడు విచారపరవశుడై, చెక్కిలిమీద చేయివైచుకొని, పద్మాసనమున గూర్చుండి, ఏమియు
నొనర్పక తూప్లీంభావమును వహించి యుండెడువాడు.
కృశాంగశ్చింతయా యుక్తః ఖేదో పరమదుర్మనాః ।
నోవాచ కస్యచిత్ కించిలిపి కర్మార్పితోవమః 7 "
వైరాగ్యప్రకరణము (సర్గ - 5) 27
చింతవల్ల చిక్కి, శ్రీరాముడు విమనస్కుడై, బొమ్మవలెనుండి, ఎవరితోడను, ఏమియు
మాటలాడకుండెడువాడు.
ఖేదాత్ పరిజనేనాసౌ ప్రార్థ్యమానః పునః పునః।
చకారాహ్నికమాచారం పరిమ్లానముఖాంబుజః ॥ 8
సేవకులు మాటిమాటికి విచారముతో బ్రార్థింప, దినకృత్యముల నతికష్టముతో నెరవేర్చెడువాడు.
అతని మోము అను తామర వాడిపోయెను.
ఏవం గుణవిశిష్టం తం రామం గుణగణాకరమ్ |
ఆలోక్య భ్రాతరావస్య తామే వాయయతుర్దశామ్ II 9
గుణసముద్రుడగు రాముని ఈస్థితి గాంచి, అతని సోదరు లిర్వురుగూడ అదే స్థితిని బొందిరి.
తథా తేషు తనూజేషు భేదవత్సు కృశేషు చ।
సపత్నీకో మహీపాలశ్చింతా వివశతాం యయౌ ॥ 10
ఇట్లు పుత్రులు విచారముతో శుష్కించుచుండుట గాంచి, దశరథుడును, ఆయన భార్యలును
చింతావివశులైరి.
కా తే పుత్ర! మనా చింతేత్యేవం రామం పునః పునః।
అపృచ్ఛత్ స్నిగ్ధయా వాచా నైవాకథయదస్య సః ॥ 11
'పుత్రా! నీకున్న చింత ఏమి?' అని దశరథుడు అనేక పర్యాయములు స్నేహపూర్ణ వాక్యముల
ప్రశ్నించినను, రామచంద్రు డేమియును బల్కలేదు.
న కించిత్తాత! మే దుఃఖమిత్యుక్త్యా పితురఙ్కగః ।
రామో రాజీవపత్రాక్షన్తూ మేవ స్మ తిష్ఠతి ॥ 12
'తండ్రీ! నాకెట్టి దుఃఖమును లేదు!' అని తండ్రి తొడమీదనున్న రాముడు పల్కి యూరకుండెడువాడు.
తతో దశరథ రాజా రామః కిం ఖేదవానితి ।
అపృచ్ఛత్ సర్వకార్యజ్ఞం వసిష్ఠం వదతాం వరమ్ II 13
'రాముడు విచారపూరిత మనస్కుడైనాడేల?' అని అనంతరము దశరథుడు సర్వకార్యజ్ఞుడును.
వాఙ్మయును నగు వసిష్ఠుని బ్రశ్నించెను.
ఇత్యుక్తశ్చింతయిత్వా స వసిష్ఠమునినా నృపః ।
అస్త్యత్ర కారణం శ్రీమాన్ మా రాజన్! దుఃఖమస్తు తే ॥ 14
28 యోగవాసిష్ఠము
'దీనికిం దగు కారణ మున్నది, దుఃఖింపకుము' అని దశరథునితో వసిష్ఠుడు ధ్యాన మొనరించి
పల్కెను.
కోపం విషాదకలనాం వితతం చ హర్షం
నాల్సిన కారణవశేన వహంతి సంతః ।
సర్గేణ సంహృతిజవేన వినా జగత్యాం
భూతాని భూప! నమహాన్తి వికారవన్తి ॥ 15
ఇత్యార్షే వాసిష్ఠు - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే
కార్శ్య నివేదనం నామ పంచమః సర్గః ॥ 5॥
రాజా! ధీరులు సామాన్య కారణమునంజేసి విషాదమును, అత్యంత సంతోషమును, లేక క్రోధమును
బొందరు. జగత్తుయొక్క అంగములగు పృథివ్యాది పంచమహాభూతములు సృష్టిలో సంహారముయొక్క
వేగము లేకుండ వికారము నందునా?
ఇది వాసిష్ట - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున కార్శ్య నివేదనమను పంచమ సర్గము ॥ 5 ॥
విశ్వామిత్రాభ్యాగమనము - 6
శ్రీవాల్మీకి రువాచః
ఇత్యుక్తే మునినాథేన సందేహవతి పార్థివే ॥
భేదవత్యాస్థితే మౌనం కించిత్ కాలప్రతీక్షణే ।
"I 1
వాల్మీకి: మునినాథు డిట్లు పల్క, సందేహభేదము లుబికిన చిత్తముతో దశరథుడు కొంతకాలము మౌనమును
వహించి యూరకుండెను.
పరిఖిన్నాను సర్వాసు రాజేషు నృపసద్మను ।
స్థితాను సావధానాను రామచేష్టాను సర్వతః ॥ 2
ఏతస్మిన్నేవ కాలే తు విశ్వామిత్ర ఇతి శ్రుతః ॥
మహర్షిరభ్యగాత్ ద్రష్టుం తమయోధ్యానరాధిపమ్ ॥ 3
తస్య యజ్ఞో థ రక్షోభిస్తథా విలులుపే కిల।
మాయావీర్యబలోన్మత్తైర్ధర్మకార్యస్య ధీమతః ॥ 4
వైరాగ్యప్రకరణము (సర్గ - 6) 29
రక్షార్థం తస్య యజ్ఞస్య ద్రష్టు మైచ్చత్స పార్థివమ్ ।
న హి శక్నోత్యవిఘ్నేన సమాప్తం స మునిః క్రతుమ్ ॥ 5
రాణు లందరును రాజమందిరమున ఖిన్నులై యుండిరి; రాముని నడవడిపై తమదృష్టి నుంచి
సావధానత దాల్చియుండిరి. ఇట్టి సమయమున బ్రసిద్ధుడగు విశ్వామిత్రమహర్షి అయోధ్యాపతియగు దశరథుని
గాంచుట కరుదెంచెను. మాయాబలోన్మత్తులగు రాక్షసుల పీడవలన బుద్ధిమంతుడగు విశ్వామిత్రుని యజ్ఞము
సంపూర్ణము కాలేదు; యజ్ఞరక్షణకై రాజును జూడ నిచ్చించెను.
తతస్తేషాం వినాశార్థ ముద్యతస్తపసాం నిధిః ।
విశ్వామిత్రో మహాతేజా అయోధ్యామభ్యగాత్ పురీమ్ ॥ 6
పిదప, మహాతేజుడును తపోనిధియు నగు విశ్వామిత్రుడు రాక్షసులు జంప నడుముకట్టి అయోధ్య
కరుదెంచెను.
స రాజ్లో దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షానువాచ హ।
శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినః సుతమ్ | 7
తస్య తద్వచనం శ్రుత్వా ద్వాఃస్థా రాజగృహం యయుః ।
సంభ్రాంతమనసః సర్వే తేన వాక్యేన చోదితాః || 8
తే గత్వా రాజసదనం విశ్వామిత్రమృషిం తతః |
ప్రాప్తమావేదయామాసు: ప్రతిహారాః పతే స్తదా ॥
ఆయన రాజుం జూడగోరి ద్వారపాలకులతో రాజునకు గాధీనందను డరుదెంచినాడని తెల్పవచించెను.
వారామాటలను విని సంభ్రాంత చిత్తులై రాజ గృహమున కఱిగిరి; అఱిగి, విశ్వామిత్రుని ఆగమన వార్తను
దమప్రవున కెరింగించిరి.
అథాస్థానగతం భూపం రాజమండలమాలినమ్ ।
సముపేత్య త్వరాయుక్తో యార్టీకోఒ సౌ వ్యజిజ్ఞపత్ ॥ 10
దేవ! ద్వారి మహాతేజా బాలభాస్కరభాసురః ।
జ్వాలారుణజటాజూటః పుమాన్ శ్రీమానవస్థితః । " 11
సభూసురపతాకాంతం సాశ్వభపురుషాయుధమ్ ।
కృతవాంస్తం ప్రదేశం యస్తేజోభిః కీర్ణకాంచనమ్ ॥ 12
30 యోగవాసిష్ఠము
వీక్ష్యమాణే తు యాష్టీకే నివేదయతి రాజని ।
విశ్వామిత్రో మునిః ప్రాప్త ఇత్యనుద్దతయా గిరా ॥ ॥ 13 3333
అనంతరము ద్వారపాలకులలో ముఖ్యుడగు యాష్టీకుడు సామంతరాజ పరివేష్టితుడై అధివసించియున్న
దశరథునికడ కరుదెంచి ఇట్లు విన్నవించెను. "దేవా! బాలసూర్యునివలె బ్రకాశించు తేజస్వి యొకడు
ద్వారదేశమున నున్నాడు; అతని జటలు అగ్నిశిఖలవలె తామ్రవర్ణములు. అతని తేజస్సునంజేసి ఏనుగులు,
గుఱ్ఱములు, ఆయుధములు - ఇత్యాదులగు వస్తువులన్నియు బంగారు రంగును దాల్చినవి." అప్పుడు
దశరథుడు యాష్టీకుని వైపు దృష్టిని మరల్చ, నతడతి వినయముతో విశ్వామిత్ర మహర్షి అరుదెంచినాడని విన్నవించెను.
ఇతి యాష్టీకవచనమాకర్ణ్య నృపసత్తమః ।
స సమంత్రీ ససామంతః ప్రోత్తస్థా హేమవిష్టరాత్ ॥ II 14
ఈ మాటలను వినినంతనే దశరథుడు మంత్రులు, సామంతులతో సహితముగ, బంగారు గద్దెనుండి
లేచెను.
పదాతిరేవ సహసా రాజ్ఞాం వృందేన మాలితః |
వసిష్ఠ వామదేవాభ్యాం సహ సామంతనంస్తుతః ॥ 15
జగామ యత్ర తత్రాసౌ విశ్వామిత్రో మహామునిః ।
దదర్శ మునిశార్దూలం ద్వారభూమావవస్థితమ్ 16
కేనాపి కారణేనోర్వీతల మర్కముపాగతమ్ ।
బ్రాహ్మేణ తేజసా క్రాంతం క్షాత్రేణ చ మహౌజసా | 17
దశరథుడు వసిష్ఠ వామదేవులు వెంటరా, సామంతులు స్తుతించుచుండ, ద్వారదేశమున కఱిగి,
బ్రహ్మక్షత్రియ తేజములతో బ్రకాశించుచున్న విశ్వామిత్ర మహర్షిని గాంచెను. ఆ ప్రకాశమును గాంచిన,
యే కారణముననో సూర్యుడు భూమికి దిగివచ్చెనా యని యనిపించుచుండెను.
జరాజరఠయా నిత్యం తపఃప్రసరరూక్షయా |
జటావల్యావృతస్కంధం ససంధ్యాభ్రమివాచలమ్ 18
వార్ధక్య మగుటం జేసి కేశములు నెరసెను. తపస్సువలన శరీరము మోటువారెను. జటలచే నాతని
భుజములు కప్పబడి, సాయంకాల మేఘములచే గప్పబడిన పర్వతమా యనునట్లుండెను.
ఉపశాంతం చ కాంతం చ దీర్ఘమప్రతిఘాతి ।
నిభృతం చోర్జితాకారం దధానం భాస్వరం వపుః ॥ 19
వైరాగ్యప్రకరణము (సర్గ - 6) 31
పేశలేనాతిభీమేన ప్రసన్నేనాకులేనచ
గంభీరేణాతిపూర్ణేన తేజసా రంజితప్రభమ్ । 20
అనంతజీవితద శాసఖీమేకా మనిందితామ్ ।
ధారయంతం కరే శక్షణం కుండీ మమ్లానమానసమ్ ॥ 21 21
కరుణాక్రాంతచేతస్యాత్ ప్రసన్నైః మధురాక్షరైః |
వీక్షణైరమృతేనేవ సంసించన్తమిమాః ప్రజాః ॥ 22
యుక్తయజ్ఞోప వీతాంగం ధవళ ప్రోన్నత భ్రువమ్ ।
అనంతం విస్మయం చాంతః ప్రయచ్ఛన్తమివేక్షితు: 23
II 23
మునిమాలోక్య భూపాలో దూరాదే వానతాకృతిః | 1
ప్రణనామ గలన్మౌలి మణిమాలితభూతలమ్ I 24
అతని శరీరము దీప్తిమంతమును, ప్రశాంతమును, సౌఖ్యమును, ఉజ్జ్వలమును, బలిష్ఠమునునై
యుండెను. మనోజ్ఞమును, భీషణమును, ప్రసన్నమును, జటిలమును, విశాలమును, గంభీరమును నగు
అతని శరీరతేజము ప్రభను గల్పించుచుండెను. అతని చేతియందు జీవితసఖుడగు కమండల ముండెను;
చిత్తము ప్రసన్నమై యుండెను. కరుణతోగూడిన చిత్తము గలవాడగుటంజేసి, తియ్యని మాటలతోడను,
అమృత వీక్షణములతోడను జనులను దనుపుచుండెను. యజ్ఞోపవీత ముండెను. కనుబొమలు తెల్లబడెను.
అవి ఉన్నతములు. చూచువారల కాతడు ఆశ్చర్యమును గలిగించుచుండెను.
(ఇట్టి)మహర్షిని దూరమున గాంచియే వినయావనత శిరస్కుడై దశరథుడు కిరీట పరిశోభిత
మస్తకమును భూతలమున నుంచి ప్రణమిల్లెను.
మునిరప్యవనీనాథం భాస్వానివ శతక్రతుమ్ |
తత్రాభివాదయాంచక్రే మధురోదారయా గిరా ॥ 25 25
సూర్యు డింద్రునకు ప్రత్యభివందన మొనర్చునట్లు, విశ్వామిత్రుడు గూడ, మధురములగు
ఆదరవాక్యములతో ప్రత్యభివాద మొనర్చెను.
తతో వసిష్ఠప్రముఖాః సర్వ ఏవ ద్విజాతయః ।
స్వాగతాదిక్రమేణైనం పూజయామానురాదృతాః ॥ 26
పిదప, వసిష్ఠాది బ్రాహ్మణులు స్వాగత వచనములను బల్కి ఆదరముతో యథోచిత సపర్యల సల్పిరి.
32 యోగవాసిష్ఠము
దశరథ ఉవాచ :
అశంకితోపనీతేన భాస్వతా దర్శనేన తే ॥
సాధో! స్వనుగృహీతాః స్మో రవిణేవాంబుజాకరాః ॥ 22 27
దశరథుడు: సాధుపుంగవా! సూర్యునివలన పద్మము లనుగ్రహింపబడి నట్లు, మీ యీ పవిత్ర
దర్శనమువలన మేమనుగ్రహింపబడితిమి.
యదనాది యదక్షుణ్ణం యదపాయవివర్జితమ్ |
తదానందసుఖం ప్రాప్తం మయా త్వద్దర్శనాన్మునే! 28
మునిశ్రేష్ఠా! నీ దర్శనమువలన, వృద్ధిక్షయములు లేని ఆ అనంతసుఖము నందితిని.
అద్య వర్తామహే నూనం ధన్యానాం ధురి ధర్మతః |
భవదాగమన స్యేమే యద్వయం లక్ష్యమాగతాః ॥ 29
మీ దృష్టి మామీద పడినందువలన ధర్మబలమున నేడు మేము ధన్యులలో నగ్రగణ్యుల మైతిమి.
ఏవం ప్రకథయంతో ఒత్ర రాజానో థ మహర్షయః 1
ఆసనేషు సభాస్థానమాసాద్య సముపావిశన్ ॥ 30
ఇట్లు దశరథుడును, మహర్షులును పల్కుచు సభాగృహమును బ్రవేశించి, ఆసనముల నలంకరించిరి.
స దృష్ట్యా మాలితం లక్ష్మ్యా భీతస్తమృషిసత్తమమ్ |
ప్రహృష్టవదనో రాజా స్వయమర్థ్యం న్యవేదయత్ ॥ || 31
తపోలక్ష్మిచే నలంకరింపబడిన విశ్వామిత్రుని గాంచి అపరాధము గలుగునేమో యని భయపడుచు,
నగుమోముతో దశరథుడు అర్ఘ్యము నర్పించెను.
స రాజ్ఞః ప్రతిగృహ్యార్హ్యం శాస్త్రదృష్టేన కర్మణా 1
ప్రదక్షిణం ప్రకుర్వంతం రాజానం పర్యపూజయత్ ॥ 32
విశ్వామిత్రుడు శాస్త్రోచితరీతి అర్ఘ్యము గైకొని, ప్రదక్షిణ మొనర్చుచున్న దశరథుని బ్రశంసించెను.
న రాజ్ఞా పూజితస్తేన ప్రహృష్టవదనస్తదా।
కుశలం చావ్యయం చైవ పర్యవృచ్ఛన్నరాధిపమ్ ॥ 33
విశ్వామిత్రుడు (ఇట్లు) పూజితుడై, ప్రసన్న వదనుడై దశరథుని కుశలప్రశ్న మొనరించెను.
వైరాగ్యప్రకరణము (సర్గ - 6) 33
ఆర్థికవిషయముల నడిగెను.
వసిష్టేన సమాగమ్య ప్రహస్య మునిపుంగవః ॥
యథార్హం చార్చయిత్వైనం పప్రచ్చానామయం తతః ॥ 34
(పిదప) వసిష్ఠుని గలిసికొని యథోచితమగు గౌరవమును జూపి నవ్వుచు. శిష్యమృగ పక్ష్యాదుల..
కుశలమును బ్రశ్నించెను.
క్షణం యథార్హమన్యోన్యం పూజయిత్వా సమేత్య
తే సర్వే హృష్టమనసో మహారాజనివేశనే॥ 35
యథోచితాసనగతా మిథః సంవృద్ధతేజసః । 1
పరస్పరేణ పవ్రచ్చు: సర్వే నామయమాదరాత్ ॥ 36 It
443 వారందరు రాజభవనమున ఆసీనులై, ఒండొరులను పలుకరించుకొనుచు, ఆనంద మనస్కులైరి.
వారితేజస్సు వృద్ధి నొందెను. (అప్పుడు) వారు, పరస్పరము కుశలప్రశ్న నొనరించుకొనసాగిరి.
ఉపవిష్టాయ తస్మై స విశ్వామిత్రాయ ధీమతే ।
పాద్యమర్థ్యం చ గాం చైవ భూయోభూయో న్యవేదయత్ || 37
ఆసీనుడైన విశ్వామిత్రునకు దశరథుడు గంధ పుష్ప వస్త్రాలంకారములను, గోవులను, దక్షిణలను,
ఫలతాంబూలములను విరివిగా నర్పించెను.
అర్చయిత్వా తు విధివద్విశ్వామిత్రమభాషత I
ప్రాంజలిః ప్రయతో వాక్యమిదం ప్రీతమనా నృపః
69 38
విశ్వామిత్రునికి విధివిహితముగా పూజించి, ప్రీతుడై, చేతులు జోడించి, వినయముతో దశరథు
డిట్లనెను.
యథా మృతస్య సంప్రాప్తిర్యథావర్షమవర్ష కే
యథాంధ స్యేక్షణప్రాప్తిర్భవదాగమనం తథా ॥ 39
యథేష్టదారాసంపర్కాత్ పుత్రజన్మాది ప్రజానతః ।
స్వప్నదృష్టార్థ లాభశ్చ భవదాగమనం తథా ॥ 40
యథేప్పితేన సంయోగ ఇష్టస్యాగమనం యథా any of
ప్రనష్టస్య యథా లాభో భవదాగమనం తథా ॥ 41
VI F3
34 యోగవాసిష్ఠము
యథా హర్ష భోగత్యా మృతస్య పునరాగమాత్।
ఎ
తథా త్వదాగమాత్ బ్రహ్మన్! స్వాగతం తే మహామునే! 42
'మానవున కమృతము దొఱికినట్లు, కఱవురోజులలో వర్షము కుఱిసినట్లు, అంధునకు దృష్టి
లభించినట్లు మీ దర్శనము మాకు లభించినది. సంతాన హీనుడగు మనుజునకు వాంఛితవనితా సంగమమున
పుత్రుడు కలిగినట్లు, కలలో గాంచిన వస్తువు దొరకినట్లు, చాల రోజులనుండి కోరుకొన్న వస్తువు లభించినట్లు,
ఇష్టులగువా రరుదెంచినట్లు, పోయినది మరల దొరకినట్లు, మీ దర్శనము మాకు లభించినది. ఆకాశగమనము
వలనను, మృతు డగువాడు మరల జీవించినను కలుగు ఆనందము మీ రాకవలన మాకు గల్గినది. మీకు
సుస్వాగతము!
బ్రహ్మలోకనివాసో హి కస్య న ప్రీతి మావహేత్ ।
మునే! తవాగమస్తద్వత్ సత్యమేవ బ్రవీమి తే ॥ 43
‘బ్రహ్మలోక నివాస మెవనికి ఆనందమును గొల్పదు? మీ రాక అట్టిది. సత్యమును వచించుచున్నాను.
కశ్చ తే పరమః కామః కిం చ తే కరవాణ్యహమ్ ।
పాత్రభూతో2సి మే విప్ర ప్రాప్తః పరమధార్మికః || 44
'తమకోర్కె ఎద్ది? నేనేమి యొనర్పగలను? ధర్మపరాయణులును, దానపాత్రులును అగు
తామరుదెంచితిరి.
పూర్వం రాజర్షిశబ్దేన తపసా ద్యోతితప్రభః ॥
బ్రహ్మర్షిత్వమనుప్రాప్తః పూజ్యో ని భగవన్ మయా ॥ 45
“పూర్వము తాము తపఃకాంతులు వెదజల్లు రాజర్షులు; తపోబలమున బ్రహ్మర్షులైన తాము మాకు
పూజనీయులు.
గంగాజలాభిషేకేణ యథా ప్రీతిర్భవేన్మమ ।
తథా త్వద్దర్శనాత్ ప్రీతిరంతః శీతయతీవ మామ్ | 46
'గంగాస్నానమున తాపము శమించునట్లు, మీ దర్శనముచేత అంతఃకరణము చల్లబడినది.
విగతేచ్ఛా భయక్రోధో వీతరాగో నిరామయః ।
ఇద మత్యద్భుతం బ్రహ్మన్! యద్భవాన్మా ముపాగతః ॥ 47
'మీకు ఇచ్ఛాభయ క్రోధములు, కోర్కెలు, రోగములు లేవు. అయినను మీరు నాకడ కరుదెంచితిరి.
ఆశ్చర్యము!
వైరాగ్యప్రకరణము (సర్గ - 6) 35
శుభక్షేత్రగతం చాహమాత్మాన మపకల్మషమ్ |
1
చంద్రబింబ ఇవోన్మగ్నం వేదవేద్యవిదాంవర 48
‘ఓ తత్త్వజ్ఞ శ్రేష్ఠుడా! మీరాకవలన నాగృహము ఆత్మయు పవిత్రము లైనవి. నేనానందమున
అమృతమయ మగు చంద్రమండలమున దేలియాడుచున్నాను.
సాక్షాదివ బ్రహ్మణో మే తవాభ్యాగమనం మతమ్ ।
పూతోఒ స్య్మనుగృహీతశ్చ తవాభ్యాగమనాన్మునే! 49
'మీ రాక చతుర్ముఖుని రాకయే యని భావించుచున్నాను; మీరాకవలన నేననుగ్రహింపబడితిని,
పవిత్రుడ నైతిని.
త్వదాగమనపుణ్యేన సాధో! యదనురంజితమ్ ।
అద్య మే సఫలం జన్మ జీవితం తత్ సుజీవితమ్ ॥
|| 50 50
'సాధువరేణ్యా! మీరాకవలన లభించిన పుణ్యముచేత, నా జీవితము సఫలమైనది. నా జన్మ సార్థక మైనది.
త్వామిహాభ్యాగతం దృష్ట్యా ప్రతిపూజ్య ప్రణమ్య చ |
ఆత్మన్యేవ నమామ్యంతర్దృష్ట్వేందుం జలధిర్యథా || 51
చంద్రోదయమున సాగర ముబ్బి తబ్బిబ్బొనట్లు, మిమ్ములను పూజించి, నమస్కరించి ఆనందమును
బట్టజాలకున్నాను.
యత్కార్యం యేన వార్ధేన ప్రాప్తోని మునిపుంగవ!
కృతమిత్యేవ తద్విద్ధి మాన్యో నీతి సదా మమ ॥ 52
'మునిపుంగవా! మీరెద్దాని కొఱకు, ఎందులకు అరుదెంచితిరో, అయ్యది నెరవేర్పబడిన దనియే
యెంచునది. మీరు మాకు మాన్యులు కదా!
స్వకార్యే సవిమర్శం త్వం కర్తుమర్హసి కౌశిక!
భగవన్నాస్త్యదేయం మే త్వయి యత్ ప్రతిపద్యతే 53 11
'భగవానుడా! కౌశికా! ప్రయోజనమును గుఱించి అడుగుటకు సంకోచింపవలదు. మీ కియ్యదగని
దేమున్నది?
కార్యస్య న విచారం త్వం కర్తుమర్హసి ధర్మతః ।
కర్తా చాహ మశేషం తే దైవతం పరమం భవాన్ ॥ 54
'సంకోచింపవలదు. మీ కార్యమును సంపూర్ణ మొనరించు భారము నాది. మీరు మాకు పరదేవతలు.'
36 యోగవాసిష్ఠము
ఇదమతిమధురం నిశమ్య వాక్యం శ్రుతిసుఖమాత్మవిదా వినీతముక్తమ్ |
ప్రథితగుణయశా గుణైర్విశిష్టం మునివృషభః పరమం జగామ హర్షమ్ 55
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే
విశ్వామిత్రాభ్యాగమనం నామ షష్ఠః సర్గః ॥ 6॥
ఆత్మవేత్తయు, పరేంగితజ్ఞానియు నగు, మునివృషభుడు వినయముతో నొప్పారు దశరథుని
శ్రుతిమధుర వాక్యములను విని పరమానందము నొందెను.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున
విశ్వామిత్రాభ్యాగమనము అను షష్ఠి సర్గము 1 6 1
విశ్వామిత్రావాక్య వర్ణనము-7
శ్రీవాల్మీకి రువాచః
తచ్చుత్వా రాజసింహస్య వాక్య మద్భుత విస్తరమ్ ।
హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రో 2 భ్యభాషత "I 1
వాల్మీకి: మహాతేజుడగు విశ్వామిత్రుడు రాజసింహుడగు దశరథుని అద్భుతవాక్యముల విని పులకిత శరీరుడై
ఇట్లు పల్కెను.
సదృశం రాజశార్దూల! తవైవైతన్మహీతలే 1
మహావంశప్రసూతస్య వసిష్ఠవశవర్తినః 2
రఘువంశమున జన్మించి, వసిష్ఠుని ఆజ్ఞలలో మెలగుచున్న. నీకొక్కనికే ఇట్టి ఔదార్యము తగును.
యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యవినిర్ణయమ్ |
కురు త్వం రాజశార్దూలం ధర్మం సమనుపాలయ ॥ 3
రాజశార్దూలా! నామనస్సున నున్నదానిని విని, కార్యమును నిర్ణయించుకొని ధర్మరక్షణము నొనర్పుము.
అహం ధర్మం సమాతిస్తే సిద్ధ్యర్థం పురుషర్షభ!
తస్య విఘ్నకరా ఘోరా రాక్షసా మమ సంస్థితాః 4 "I
పురుషశ్రేష్ఠా! నేను యజ్ఞసిద్ధికొఱ కారంభించినప్పుడు విఘ్నదాయకు లగు రాక్షసులు వచ్చి చేరుచున్నారు.
వైరాగ్యప్రకరణము (సర్గ - 7) 37
యదా యదా తు యజ్ఞేన యజే హం విబుధప్రజాన్।
తదా తదా తు మే యజ్ఞం వినిఘ్నంతి నిశాచరాః ॥ 5
నేను దేవతలకొఱకు యజ్ఞము నారంభించినప్పుడెల్ల రాక్షసులు వచ్చి దానిని పాడుచేయుచున్నారు.
బహుశో విహితే తస్మిన్ మయా రాక్షసనాయకాః |
అకిరంస్తే మహీం యాగే మాంసేన రుధిరేణచ॥ 6
నేను యజ్ఞమును అనేక పర్యాయము లారంభించితిని; ప్రతి పర్యాయమును రాక్షసనాయకు లరుదెంచి,
రక్తమాంసములతో యజ్ఞభూమిని గప్పివేయుచున్నారు.
అవధూతే తథాభూతే తస్మిన్ యాగకదంబకే
కృతశ్రమో నిరుత్సాహస్తస్మాద్దే శాదుపాగతః "I 7
ఇట్లారంభించిన యజ్ఞము లన్నియు చాల శ్రమపడినను, పాడైపోవుటచే నిరుత్సాహముతో నిట
కరుదెంచితిని.
న చ మే క్రోధముత్ప్రష్టుం బుద్ధిర్భవతి పార్థివ!
తథా భూతం హి తత్ కర్మ న శాపస్తస్య విద్యతే "I 8
క్రోధమువలన (శాపమిచ్చి) వారిని నశింపజేయు ఇచ్ఛ పొడమకున్నది; ఆ యజ్ఞ మొనర్చు నప్పుడు
క్రోధాదులను దృజింపవలెను. క్రోధమును దెచ్చుకొనకుండ శాపమియలేము కదా!
ఈదృశీ యజ్ఞదీక్షా సా మమ తస్మిన్మహాక్రతౌ ।
త్వత్ప్రసాదాదవిఘ్నేన ప్రాపయేయం మహాఫలమ్ ॥ 9
యజ్ఞనియమ మిట్టిది. నీ యనుగ్రహమున ఆ మహాయజ్ఞమును నిర్విఘ్నముగా నొనరించి
మహాఫలము నందగలను.
త్రాతు మర్హసి మామార్తం శరణార్థి సమాగతమ్ |
ఆర్థినాం యన్నిరాశత్వం సత్తమే. భిభవో హి సః ॥ 10
నేనార్హుడను, శరణాపన్నుడను. నన్ను రక్షించుట నీ ధర్మము. అర్థులను నిరసించుట గొప్పవారికి
నింద.
తవాస్తి తనయః శ్రీమాన్ దృష్తశార్దూల విక్రమః ।
మహేంద్రసదృశో వీర్యో రామో రక్షోవిదారణః | 11
38 యోగవాసిష్ఠము
తం పుత్రం రాజశార్దూల! రామం సత్యపరాక్రమమ్ ।
కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతు మర్హసి ॥ 12
రాజశార్దూలా! శార్దూల పరాక్రముడును, ఇంద్ర సమబలుడును, సత్యపరాక్రముడును, జ్యేష్ఠుడును
కాకపక్ష ధరుడును అగు రాముడు రాక్షస వినాశ మొనర్పగలడు. వానిని నాకిమ్ము (అనగా నావెంట బంపుము.)
శక్తో హ్యేష మయా గుప్తో దివ్యేన స్వేన తేజసా ।
రాక్షసా యే పకర్తార స్తేషాం మూర్ధవినిగ్రహే || 13
నా దివ్యతేజమువలన రక్షింపబడి, రాముడు రాక్షసుల సంహరింపగలడు.
శ్రేయశ్చాస్య కరిష్యామి బహురూపమనంతకమ్ |
త్రయాణామపి లోకానాం యేన పూజ్యో భవిష్యతి 14
నానావిధములగు (అస్త్రముల నొసంగి) శ్రేయములను రామునకు గూర్చుదును. దాన నాతడు
త్రిలోకపూజితు డగును.
న చ తే రామమాసాద్య స్థాతుం శక్తా నిశాచరాః |
క్రుద్ధం కేసరిణం దృష్ట్వా వనే తృణ ఇవైణకాః ॥ 15
కోపించిన సింహము ముంగల లేళ్లు నిలబడలేనట్లు, రాముని ముందర రాక్షసులు నిలంబడజాలరు.
తేషాం న చాన్యః కాకుత్థాద్యోదు ముత్సహతే పుమాన్
ఋతే కేసరిణః క్రుద్ధాన్మత్తానాం కరిణామివ ॥ 16
మదించిన ఏనుగు నెదుర్కొన సింహము కాక అన్నిమృగము లుత్సహించినట్లు, వారితో శ్రీరాముడు
తప్ప ఇతరులు యుద్ధ మొనర్ప నుత్సహించరు.
వీర్యోత్సిక్తా హి తే పాపాః కాలకూటోపమా రణే |
ఖరదూషణయోర్భృత్యాః కృతాన్తాః కుపితా ఇవ ॥ 17
రామస్య రాజశార్దూల! సహిష్యంతే న సాయకాన్ |
అనారతగతా ధారా జలదస్యేవ పాంసవః ॥ 18
రాజశార్దూలా! బలగర్వితులును, పాపులును, విషస్వరూపులును, యమనిభులును నగు
ఖరదూషణభృత్యులు, ధూళిపుంజములు ఎడతెగని వర్షధారల సహింపజాలనట్లు, శ్రీరాముని శరముల
(బాణముల) సహింపజాలరు.
వైరాగ్యప్రకరణము (సర్గ - 7) 39
న చ పుత్రకృతం స్నేహం కర్తుమర్హసి పార్థివ!
న తదస్తి జగత్యస్మిన్ యన్నదేయం మహాత్మనామ్ ॥ 19
పుత్రునిపై మమతను జూపుట తగదు; మహాత్ముల కీయదగని దీప్రపంచమున లేదు కదా!
హంత నూనం విజానామి హతాంస్తాన్ విద్ది రాక్షసాన్।
న హ్యస్మదాదయః ప్రాజ్ఞాః సందిగ్ధ సంప్రవృత్తయః ॥ 20
రాక్షసులను జంపబడిన వారినిగా నేనెఱుంగుదును, నీవును అట్లే గ్రహించునది. మమ్ముబోలు ప్రాజ్ఞులు
సందిగ్ధ విషయముల బ్రవృత్తులు కారు.
అహం వేద్మి మహాత్మానం రామం రాజీవలోచనమ్ |
వసిష్ఠశ్చ మహాతేజా యే చాన్యే దీర్ఘదర్శినః II 21
కమలలోచనుడును, మహాత్ముడును నగు రాముని నేనెఱుంగుదును. వసిష్ఠు డాదిగా గల జ్ఞానులుగూడ
ఎఱుంగుదురు.
యది ధర్మో మహత్యం చ యశస్తే మనసి స్థితమ్ I
తన్మహ్యం సమభిప్రేతమాత్మజం దాతు మర్హసి || 22
ధర్మము మహత్యము, యశము - వీటియొక్క కాంక్ష నీకుండిన నేకోఱిన- పుత్రుని ఒసంగునది.
దశరాత్రశ్చ మే యజ్ఞో యస్మిన్ రామేణ రాక్షసాః |
హంతవ్యా విఘ్నకర్తారో మమ యజ్ఞస్య వైరిణః | 23
నా యజ్ఞము పదిదినములు పట్టును. ఇందు యజ్ఞవైరులగు రాక్షసులు రామునివలన
సంహరింపబడుదురు.
అత్రావ్యనుజ్ఞం కాకుత్ప దదతాం తవ మంత్రిణః ।
వసిష్ఠ ప్రముఖాః సర్వే తేన రామం విసర్జయ 24
శ్రీరాముని నాతో బంపుటకుగాను, మంత్రులకును వసిష్ఠాది ప్రముఖులకును, ఆజ్ఞ నొసగుము.
నాత్యేతి కాలః కాలజ్ఞ యథాయం మమ రాఘవ !
తథా కురుష్వ భద్రం తే మా చ శోకే మనః కృథాః 25 25
సమయజ్ఞుడవగు దశరథుడా! నాసమయము నష్టము కాకుండునట్లు చూడుము. నీకు శుభ మగుగాక!
పుత్రునకు కీడు గలుగునని శంకింపకుము.
40 యోగవాసిష్ఠము
కార్యమణ్వవి కాలే తు కృతమేత్యుపకారతామ్ ।
మహదప్యుపకారో జే పి రిక్తతామేత్యకాలతః
"I 26
సమయమునకు దగినట్లు కొంచెము సాయ మొనర్చినను, అది ఉపకారమగును. అవసరము లే
నప్పుడొనర్చిన గొప్పసాయము ఉపకారముక్రింద పరిగణింపబడదు.
ఇత్యేవముక్త్యా ధర్మాత్మా ధర్మార్థసహితం వచః ।
విరరామ మహాతేజా విశ్వామిత్రో మునీశ్వరః 27 22
ధర్మాత్ముడగు విశ్వామిత్రుడు ధర్మవాక్యములు బల్కి యూరకుండెను.
శ్రుత్వా వచో మునివరస్య మహానుభావ
స్క్రూష్లీ మతిష్ఠ దుప పన్నపదం స వక్త్రుమ్ ॥
నో యుక్తియుక్తకథనేన వినైతి తోషం
ధీమానపూరితమనో2 భిమతశ్చ లోకః ॥ 28
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే విశ్వామిత్ర వాక్యం నామ సప్తమః సర్గః ॥ 7॥
రాజు మునీంద్రుని పల్కులను విని ప్రత్యుత్తర వియ ఆలోచించుచు, కొంతసేపు మౌనమును
వహించి యూరకుండెను. బుద్ధిమంతులును, అపూర్ణ మనోరథులును నగు వారు యుక్తియుక్తములగు
వాక్యములచే గాక, సంతోషమును బడయరు.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్యప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున విశ్వామిత్రవాక్యమను సప్తమ సర్గము ॥ 7
దశరథ వాక్యవర్ణనము -8
శ్రీవాల్మీకి రువాచ:
తచ్చుత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితమ్ ।
ముహూర్తమాసీన్నిశ్చేష్టః సదైన్యం చేదమబ్రవీత్ 1 11
వాల్మీకి: దశరథుడు విశ్వామిత్రుని పల్కుల నాలించి కొంతసేపు నిశ్చేష్టుండై, దైన్యముతో నిట్లు పల్కెను.
ఊనషోడశవర్షా యం రామో రాజీవలోచనః ।
న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః || 2
వైరాగ్యప్రకరణము (సర్గ - 8) 41
కమలలోచనుడగు రాముని వయస్సు పదునైదేండ్లు. రాక్షసులతో యుద్ధ మొనర్పగల శక్తి వాని
కున్నదని నేననుకొనను.
ఇయమక్షోహిణీ పూర్ణా యస్యాః పతిరహం ప్రభో!
తయా పరివృతో యుద్ధం దాస్యామి పిశితాశీనామ్ ॥ 3
ప్రభూ! ఈ యక్షోహిణీ సంఖ్యాసైన్యమునకు నేనధిపతిని. నేనీ సైన్యమును నడిపి రాక్షసులతో
యుద్ధ మొనర్చెదను.
ఇమే హి శూరా విక్రాంతా భృత్యా మంత్రవిశారదాః ।
అహం చైషాం ధనుష్పాణిర్గోప్తా సమరమూర్ధని 4
ఈ శూరు లందరును బలపరాక్రమ సంపన్నులు; యుక్తిపరులు, నేను ధనుస్సును గైకొని రణరంగమున
నిలబడి వారిని రక్షింతును.
ఏభిః సహైవ వీరాణాం మహేంద్రమహతా మపి |
దదామి యుద్ధం మత్తానాం కరిణామివ కేసరీ ॥ 5
సింహము మదపుటేనుగు నెదుర్కొనునట్లు, ఇంద్రునికంటె గొప్పవారుగు వీరులంగూడ
నెదుర్కొనగలను.
బాలో రామస్త్యనీకేషు న జానాతి బలాబలమ్ |
అంతఃపురాదృతే దృష్ట్వా నానేనాన్యా రణావనిః | 6
బాలుడగు రాముడు సైన్యముల బలాబలముల నెఱుంగడు. పురమధ్యమున వినోదార్థము
కల్పింపబడిన రణరంగమును గాక, అసలైన యుద్ధక్షేత్రము నాతడు చూచియుండలేదు.
న శస్త్రైః పరమైర్యుక్తే న చ యుద్ధవిశారదః।
న వాస్త్రైః శూరకోటీనాం త స్సమరభూమిషు ॥ 7
అతడు అస్త్రశస్త్రముల నెఱుగడు; యుద్ధమున నేర్పరి గాడు; లెక్కకు మించిన వారల
నెట్లెదుర్కొనవలయునో అతడెఱుగడు.
కేవలం పుష్పఖండేషు నగలోపపనేము
ఉద్యానవన కుంజేషు సదైవ పరిశీలనమ్ ॥
విహర్తుమేష జానాతి సహ రాజకుమారకైః।
కీర్ణపుష్పోవహారాను స్వకాస్వజిరభూమిము ॥ 11 9
42 యోగవాసిష్ఠము
కేవలము ఉద్యానవనముల యందునను, నగరనికుంజములందునను విహరించుటయు,
మిత్రులతోగూడి పూలు రాలిన ప్రాంగణభూముల సంచరించుటయు నతడెఱుంగును.
అద్య త్వతితరాం బ్రహ్మన్! మమ భాగ్యవిపర్యయామ్ ।
హిమేనేవ హి పద్మాభస్సంపన్నో హరిణః కృశః ॥ 10
నా దురదృష్టము! రాముడిప్పుడు మంచు కుఱిసిన సరోవరమువలె, శోభావిహీనుడై పాలిపోయి
కృశించుచున్నాడు.
నాత్తుమన్నాని శక్నోతి న విహర్తుం గృహావనిమ్
అంతఃభేదపరీతాత్మా తూష్లీం తిష్ఠతి కేవలమ్ II 11
అన్నమును దినుట లేదు. ఇంటగూడ లేచి తిరుగుట లేదు. విచార మనస్కుడై ఊరక
కూర్చొనియుండును.
సదారస్సహభృత్యో హం తత్కృతే మునినాయక!
శరదీవ వయోవాహో నూనం నిస్సారతాం గతః ॥ 12
మునినాయకా! నేనును, నాభార్యలును, నా సేవకులును వాని కొఱకై, శరత్కాల మేఘములవలె
సుఖవిహీనుల మగుచున్నాము.
ఈదృశో ఒ సౌ సుతో బాల ఆధినాథ వశీకృతః ।
కథం దదామి తం తుభ్యం యోద్ధుం సహ నిశాచరైః ॥ 13
వయస్సున పిన్నయు, మనోవిచార పీడితుడును నగు రాముని రాక్షసులతో యుద్ధమొనర్ప
నీకెట్లర్పింపగలను?
అపి బాలాంగనాసంగాదపి సాధ్! సుధారసాత్।
రాజ్యాదపి సుఖాయైవ పుత్రస్నేహో మహామతే! 14
సాధుశ్రేష్ఠా, మహామతీ! పుత్రప్రేమ యువతీసంగమముకంటె, అమృతపానముకంటె, రాజ్యప్రాప్తికంటే
నెక్కుడు సుఖము నిచ్చును.
యే దురంతా మహారంభాస్త్రిషు లోకేషు భేదదాః ।
పుత్ర స్నేహేన సంతో ఒపి కుర్వతే తాననంశయమ్ ॥ 15
ముల్లోకముల దురంతములును, కష్టదములును నగు కార్యములను ధార్మికులును పుత్రస్నేహ
బద్ధులై నిస్సందేహముగ నొనర్చుచున్నారు.
వైరాగ్యప్రకరణము (సర్గ - 8) 43
అసవోఒథ ధనం దారా స్యజ్యంతే మానవైః సుఖమ్ ।
న పుత్రో మునిశార్దూల! స్వభావో హ్యేష జంతుము ॥ 16
మునిశార్దూలా! మనుజులు ధన ప్రాణములను, భార్యను, సుఖములను, త్యజింపగలరు. కాని పుత్రుని
వదలలేరు; ఇది మనుష్యస్వభావము.
రాక్షసాః క్రూరకర్మాణః కూటయుద్ధవిశారదాః ।
రామస్తాన్ యోధయత్విత్థం యుక్తిరేవాతిదుస్సహా ॥ I 17
రాక్షసులు క్రూరకర్ములు; కూటయుద్ధ విశారదులు. రాముడు వారితో యుద్ధ మొనరించునను
మాటనే సహింపజాలను.
విప్రయుక్తో హి రామేణ ముహూర్త మపి నోత్సహే |
జీవితుం జీవితాకాంక్షీ న రామం నేతు మర్హసి ॥ 18
రాముని విడిచి నేనొక్క క్షణమైన నుండజాలను. నేను బ్రతికి యుండవలెనన్న, రాముని
దీసికొనిపోవలదు.
నవవర్ష సహస్రాణి మమ జాతస్య కౌశిక
దుఃఖేనోత్పాదితాస్త్యేతే చత్వారః పుత్రకా మయా ॥ 19
కౌశికా! తొమ్మిదివేల ఏండ్లు కష్టపడి ఈ నల్గురు పుత్రలను గంటిని.
ప్రధానభూతస్తే ప్వేవ రామః కమలలోచనః |
తం వినేహ త్రయోప్యన్యే ధారయంతి న జీవితమ్ ॥ 20
వీరిలో కమలలోచనుడగు రాముడే ముఖ్యుడు; అతడు లేకున్న మిగిలిన మువ్వురును బ్రాణముల
నిల్పజాలరు.
స ఏవ రామో భవతా నీయతే రాక్షసావతి |
యది తత్పుత్రహీనం త్వం మృతమేవాశు విద్ధి మామ్ ॥ 21
ఇట్టి రాముని రాక్షసులతో యుద్ధ మొనర్పుటకుగాను, మీరు గొనిపోయిన, నేను పుత్రహీనుడనై
మరణింతును.
చతుర్ణామాత్మజానాం హి ప్రీతిరతైవ మే వరా
జ్యేష్ఠం ధర్మమయం తస్మా న్న రామం నేతుమర్హసి ॥ 22
44 యోగవాసిష్ఠము
నలుగురిలో రాముడే నాకు ప్రియతముడు. జ్యేష్ఠుడును ధర్మమయుడును నగు రాముని
దీసికొనిపోవలదు.
నిశాచరబలం హంతుం మునే! యది తవేప్సితమ్ |
చతురంగసమాయుక్తం మయా సహ బలం నయ ॥ 23
రాక్షసులను గూల్చుటయే మీ కోర్కెయైన చతురంగ బలయుతు డగు నన్ను గొనిపొండు.
కిం వీర్యా రాక్షసాస్తే తు కస్య పుత్రాః కథం చ తే ॥
కియత్ప్రమాణా కే చైవ ఇతి వర్ణయ మే స్ఫుటమ్ "1 24
ఆ రాక్షసుల బలమెట్టిది? వారెవరి పుత్రులు? వారెట్టి వారు? వారిసంఖ్య ఎంత? వారెవరు? వివరించి
నాకు జెప్పుడు.
కథం తేన ప్రకర్తవ్యం తేషాం రామేణ రక్షసామ్ ।
మామకై ర్బాలకై ర్బహ్మన్! మయా వా కూటయోధినామ్ ॥ 25 25
బ్రాహ్మణుడా! రాముడు గాని నాపుత్రులుగాని, నేను గాని మాయాయుద్ధ విశారదులగు వారిని
ఎట్లెదుర్కొనవలయును?
సర్వం మే శంస భగవన్! యథా తేషాం మహారణే ।
స్థాతవ్యం దుష్టభాగ్యానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః ॥ 26
ఆ రాక్షసుల నెదుర్కొను నప్పుడెట్లు మెలగవలయునో తెలిసికొనుటకు గాను, నేనడిగిన విషయములను
వివరించి చెప్పుడు. రాక్షసులు బలగర్వితులు గదా!
శ్రూయతే హి మహావీర్యో రావణో నామ రాక్షసః |
సాక్షాద్వైశ్రవణభ్రాతా పుత్రో విశ్రవసో మునేః ॥ 22 27
స చేత్తవ మఖే విఘ్నం కరోతి కిల దుర్మతిః |
తత్ సంగ్రామే న శక్తా స్స్మో వయం తస్య దురాత్మనః ॥ 28
రావణుడను రాక్షసవీరునిగురించి విందుము. అతడు కుబేరుని సహోదరుడు; విశ్రవసుని పుత్రుడు.
అతడా మీ యజ్ఞమును బాడుచేయునది? అట్లయిన, అతనితో యుద్ధమొనర్ప గల శక్తి మాకు లేదు.
కాలే కాలే పృథగ్ బ్రహ్మన్ భూరివీర్యవిభూతయః |
భూతేష్వభ్యుదయం యాంతి ప్రలీయంతే కాలతః ॥ 29
వైరాగ్యప్రకరణము (సర్గ - 8) 45
బలసంపదలు ఒక్కొక్కప్పు డొక్కొక్కనియందు వికసించి మరల కాలముతో బాటు వినష్టమై పోవును.
ఆద్యాస్మింస్తు వయం కాలే రావణాదిషు శత్రుము |
న సమర్థః పురః స్థాతుం నియతేరేష నిశ్చయః 30
ప్రస్తుతము, మేము కాలవశమున రావణుని ముందర నిలువజాలము; దీనికి గారణము
ఈశ్వరనియతియే!
తస్మాత్ ప్రసాదం ధర్మజ్ఞ! కురు త్వం మమ పుత్రకే ॥
మమ చైవాల్పభాగ్యస్య భవాన్ హి పరదైవతమ్ " 31
అందువలన నోధర్మజ్ఞా! మందభాగ్యుడ నగు నాయందు, నాపుత్రుని యందు దయజూపుము.
మీరే మాపరదేవతలు.
దేవదానవగంధర్వా యక్షాః పతగ పన్నగాః
న శక్తా రావణం యోద్ధుం కిం పునః పురుషా యుధి ॥ 32
దేవ, దానవ, గంధర్వ, యక్ష, పతగ, పన్నగులే రావణునితో బోరజాలరు. ఇక మనుష్యుల మాట యేమి?
మహావీర్యవతాం వీర్య మాదత్తే యుధి రాక్షసః | |
తేన సార్థం న శక్తాః స్మ సంయుగే తన్య బాలకై: 33
రావణుడు మహావీరులగు ఇంద్రాదులనే ఓడించినాడు, వానితో మేమే యుద్ధ మొనర్పజాలము.
ఈ బాలకు లేమి యొనర్పగలరు?
అయమన్యతమః కాలః పేలవీకృతసజ్జనః ।
రాఘవో ఒపి గతో దైన్యం యతో వార్ధకజర్జరః ॥ 11 34
కాలమాహాత్మ్య మిట్టిది! సజ్జనులు దుర్బలు లైరి. రఘుకులమున బుట్టియుకూడ నేను వార్ధక్యమున
శక్తిహీనుడ నైతిని.
అథవా లవణం బ్రహ్మన్ యజ్ఞమ్నం తం మధోః సుతమ్ ।
కథయ త్వసురప్రఖ్యం నైవ మోక్ష్యామి పుత్రకమ్ ॥ 11 35
మధుని పుత్రుడగు లవణాసురుడు మీ యజ్ఞమును పాడొనర్చుచున్నా డన్నను, నేను నా పుత్రుని విడువను.
సుందోపసుందయోశ్చైవ పుత్రా వైవస్వతోపమౌ ।
యజ్ఞవిఘ్నకరౌ బ్రూహి న తే దాస్యామి పుత్రకమ్ ॥ 36
46 యోగవాసిష్ఠము
యమునిబోలు సుందోపసుందుని పుత్రులు, యజ్ఞవిఘ్నకారు లన్నను, నా పుత్రు నొసగను.
అథ నేష్యని చేదబ్రహ్మం స్తద్ధతోస్మ్యహమేవ తే తే ।
అన్యథా తు న పశ్యామి శాశ్వతం జయమాత్మనః 37
బ్రాహ్మణుడా! బలాత్కారముగ తీసికొనిపోయిన, నన్ను మృతునిగ నెఱుంగునది; ప్రాణత్యాగము
తప్ప నాకు వేటొక ఉపాయము లేదు.
ఇత్యుక్త్వా మృదువచనం రఘూద్వహో సౌ
కల్లోలే మునిమతసంశయే నిమగ్నః
నాజ్ఞానీత్ క్షణమపి నిశ్చయం మహాత్మా
ప్రోద్వీచావివ జలధౌ న ముహ్యమానః 38
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే దశరథవాక్యం నామ అష్టమః సర్గః ॥ 8 |
మహాత్ముడును రఘుకుల శ్రేష్ఠుడును నగు దశరథు డిట్లు మృదువుగ పల్కి, విశ్వామిత్రుని నాజ్ఞ
నెరవేర్చుటెట్లా యని సందిగ్ధచిత్తుడై, ఉత్తాలతరంగ సంక్షుభిత సాగరమునం బడినవానివలె, ఏమి యొనర్ప
నగునో నిశ్చయించుకొన జాలకపోయెను.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్యప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున దశరథ వాక్యమను అష్టమ సర్గము ॥ 8 ||
వసిష్ఠ సమాశ్వాసన వర్ణనము -9
శ్రీవాల్మీకి రువాచ:
తచ్ఛుత్వా వచనం తస్య స్నేహపర్యాకులేక్షణమ్ |
స మన్యుః కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిమ్ ॥ 1
వాల్మీకి: స్నేహాకుల నేత్రములతో దశరథుడు పల్కిన వాక్యములను విని, విశ్వామిత్రుడు కోపమున నిట్లు పల్కెను.
కరిష్యామితి సంశ్రుత్య ప్రతిజ్ఞాం హాతు మర్హసి 1
స భవాన్ కేసరీ భూత్వా మృగతా మివ వాంఛని ॥ 2
'విూపని నొనర్చెదన'ని ప్రతిజ్ఞ నొనర్చి దానిని భంగపరుప నున్నావు. ఇయ్యది సింహము లేడి కాగోరు
చున్నట్లున్నది.
వైరాగ్యప్రకరణము (సర్గ - 9) 47
రాఘవాణా మయుక్తోఒ యం కులస్యాస్య విపర్యయః ।
న కదాచన జాయంతే శీతాంశోరుష్ణరశ్మయః 11 3
ఇట్టి విపరీతకార్యము రఘువంశమున బుట్టినవారికి దగని పని. చంద్రునినుండి ఉష్ణకిరణములు
వెలువడవు.
యది త్వం న క్షమో రాజన్! గమిష్యామి యథాగతమ్ |
హీనప్రతిజ్ఞ! కాకుత్థ! సుఖీ భవ సబాంధవః ॥ 4
దశరథా! నీవీపని నొనర్పజాలని యెడల, నేను వచ్చినట్లే వెడలుచున్నాను. నీవు ప్రతిజ్ఞాభంగ మొనర్చి
బంధువులతో సుఖముగ నుండుము.
శ్రీవాల్మీకి రువాచః
తస్మిన్ కోపపరీతే ఒథ విశ్వామిత్రే మహాత్మని ।
చచాల వసుధా కృత్స్నా సురాంశ్చ భయమావిశత్ ॥ 5
వాల్మీకి:విశ్వామిత్రు డిట్లు కోపింప భూమండల మంతయును గంపించెను; దేవతలు భయము నందిరి.
క్రోధాభిభూతం విజ్ఞాయ జగన్మిత్రం మహామునిమ్ ।
ధృతిమాన్ సువ్రతో ధీమాన్ వసిష్టో వాక్య మబ్రవీత్ 6
ధైర్యశాలియు, సువ్రతుడును బుద్ధిమంతుడును నగు వసిష్ఠుడు విశ్వామిత్రుని గోపించిన వానినిగ
నెఱిగి (దశరథునితో) ఇట్లు పల్కెను.
శ్రీవసిష్ఠ ఉవాచ :
ఇక్ష్వాకూణాం కులే జాతః సాక్షాద్ధర్మ ఇవాపరః ।
భవాన్ దశరథః శ్రీమాంస్త్రైలోక్యగుణభూషితః "I 7
ధృతిమాన్ సువ్రతో భూత్వా న ధర్మం హాతు మర్షన్।
త్రిషు లోకేషు విఖ్యాతో ధర్మేణ యశసా యుతః ॥
శ్రీవసిష్ఠుడు: ఇక్ష్వాకు కులమున జనించిన ధర్మమూర్తివి నీవు. ముల్లోకముల నున్న గుణవంతులు
గుణము లన్నియు నీయవి. ధైర్యశాలివి. సువ్రతుడవు. నీ ధర్మకీర్తి త్రిలోకప్రసిద్ధము. (ఇట్టి నీవు)
ప్రతిజ్ఞాహాని నొనర్చుట తగని పని.
48 యోగవాసిష్ఠము
స్వధర్మం ప్రతిపద్యస్వ న ధర్మం హాతు మర్హసి
మునే స్త్రిభువనేశస్య వచనం కర్తు మర్హసి I ॥
. మునివరుని ఆజ్ఞ ననుసరించుము. స్వధర్మమును బాలింపుము. ధర్మమును ద్యజింపకుముకరిష్యామితి సంశ్రుత్య తత్తే రాజన్న కుర్వతః |
ఇష్టాపూర్తం హరేద్ధర్మం తస్మాత్ రామం విసర్జయ|| 10
, ఒనర్తునని ప్రతిజ్ఞ నొనర్చి, ఒనర్పకపోయిన * ఇష్టాపూర్త ధర్మమును బోగొట్టుకొందువు. అందువలనరాముని నొసంగుము.
ఇక్ష్వాకువంశజాతో 2 పి స్వయం దశరథో ఒపి సన్,
న పాలయసి చేద్వాక్యం కో పరః పాలయిష్యతి 11 ||
ఇక్ష్వాకు కులమున జనించిన దశరథుడే మాట నిలబెట్టుకొననిచో, ఇంక ఇతరుల మాట యేమి?
యుష్మదాదిప్రణీతేన వ్యవహారేణ జంతవః |
మర్యాదాం న విముంచంతి తాం హాతుం త్వమర్హసి || 12
మీ యట్టివారు చూపిన ఆచరణ ననుసరించియే జనులు శాస్త్రమర్యాదకు లోబడుదురు. ఇట్టి
మర్యాద నుల్లంఘించుట నీకు పాడి కాదు.
గుప్తం పురుషసింహేన జ్వలనే నామృతం యథా |
కృతాస్త్రమకృతాస్త్రం - నైనం శక్ష్యంతి రాక్షసా: 13
ఈ పురుష సింహునిచే రక్షింపబడు వ్యక్తిని అతడు యుద్ధమున నేర్పరి కానిమ్ము, కాకపోనిమ్ము.
దేవలోకమున అగ్నిచే రక్షింపబడు అమృతము నితరులు చేరలేనట్లు, కన్నెత్తి చూడజాలరు.
ఏష విగ్రహవాన్ ధర్మ వీష వీర్యవతాం పరః॥
ఏష బుద్ధ్యాధికో లోకే తపసాం చ పరాయణమ్ || 14
ఈ ముని రూపుదాల్సిన ధర్మము. తపస్విశ్రేష్ఠుడు. బుద్ధిబలమున లోకోత్తరుడు. తపస్సున కాశ్రయస్వరూపుడు.
ఏషోఒస్త్రం వివిధం వేత్తి త్రైలోక్యే సచరాచరే
నైతదన్యః పుమాన్ వేత్తి న చ వేత్స్యతి కశ్చన I 15
* వైదికధర్మము త్రివిధము. అది ఇష్టా, పూర్త, దత్తములను పేర వ్యవహరింపబడుచున్నది. ఇష్టమైన అగ్నిహోత్రాల
యజ్ఞయాగములు. పూర్తమన కూపతటాకాది ఖననము, దత్తమన దాన ధర్మాదులు, ఇవియే ఇట సూచింపబడినవి - అను.
వైరాగ్యప్రకరణము (సర్గ - 9) 49
ఇతడు నానావిధ అస్త్రముల నెఱుగును. ఇతడెఱిగినన్ని అస్త్రములు నితరు లెవ్వరును ఎఱుగరు.
ఎఱుగబోరు.
న దేవా నర్షయః కేచి న్నాసురా న చ రాక్షసాః ।
న న నాగా యక్షగంధర్వాః సమేతాః సదృశా మునేః ॥ 16
దేవ, రాక్షస, నాగ, యక్ష, గంధర్వ, అసుర, ఋషి ప్రపంచ మంతయు కలిసినను విశ్వామిత్రున కీడు
కాదు.
అస్త్రమస్మై కృశాశ్వన పరైః పరమదుర్జయమ్।
కౌశికాయ పురా దత్తం యదా రాజ్యం సమన్వగాత్ ॥ 17
విశ్వామిత్రుడు పూర్వము రాజ్యాధిపత్యము నందినప్పుడు, కృశాశ్వుడు దుర్జయములగు అస్త్రముల
నీతనికి బ్రసాదించెను.
తే హి పుత్రాః కృశాశ్వస్య ప్రజాపతిసుతోపమాః ।
ఏనమన్వచరన్ వీరా దీప్తిమంతో మహౌజసః ॥ 18
ఈ యస్త్రములు సంహారకార్యమున రుద్రుని బోలునవి. వీర్యవంతములు; దీప్తిశాలియు,
మహాతేజుడును నగు విశ్వామిత్రుని అనుచరులు.
జయా చ సుప్రభా చైవ దాక్షాయణ్యా సుమధ్యమే
తయోఒస్తు యాన్యపత్యాని శతం పరమదుర్జయమ్ 19
పంచాశతం సుతాన్ జజ్ఞే జయా లబ్దవరా పురా
వధార్థం సురసైన్యానాం తే క్షమాః కామచారిణః || 20
సుప్రభా జనయామాస పుత్రాన్ పంచాశతం పరాన్
సంఘర్షాన్నామ దుర్దర్హాన్ దురాకారాన్ బలీయసః ॥ 21
ఏవం వీర్యో మహాతేజా విశ్వామిత్రో జగన్మునిః ।
న రామగమనే బుద్ధిం విక్షబాం కర్తు మర్హసి ॥ 22
జయానుప్రభలు దక్షుని పుత్రికలు, (కృశాశ్వుని భార్యలు) వీరికి నూర్గురు పుత్రులు గల్గిరి. వీరందరును
అస్త్రదేవతలు. జయ భర్త వరము నంది అమరుని వినాశార్థ మేబది పుత్రులం గనెను. వీరు కామచారులు.
కార్యనిర్వహణ సమర్థులు, సుప్రభ మజేబది పుత్రులం గనెను. వీరు బలిష్ఠులు, అజేయులు, తీక్షాకారులు.
VI F4
50 యోగవాసిష్ఠము
వారి నామము సంఘర్షులు. విశ్వామిత్రు డిట్టి బలము కలవాడు. అందువలన, రాము డరుగునని వికలమతివి
కావలదు.
అస్మిన్ మహాసత్యతమే మునీంద్రే
స్థితే సమీపే పురుషస్య సాధో।
ప్రాప్తే మృత్యావమరత్వ మేతి
మా దీనతాం గచ్ఛ యథా విమూఢః ॥ 23 23
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే వసిష్ఠ సమాశ్వాసనం నామ నవమః సర్గః ॥ 9 ॥ 11
మహాసత్త్యుడగు విశ్వామిత్రుడు దగ్గరనున్న, మృతిచెందనున్న పురుషుడు గూడ అమరత్వము
నందును. అందువలన, మూఢునివలె ఆతురపడవలదు.
ఇది శ్రీవాసిష్ఠ -తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున వసిష్ట సమాశ్వాసమను నవమ సర్గము ॥ 9 ॥
రాఘవ విషాద వర్ణనము -10
శ్రీవాల్మీకి రువాచ :
తథా వసిష్టే బ్రువతి రాజా దశరథః సుతమ్
సంప్రహృష్టమనా రామమాజుహావ సలక్ష్మణమ్ II 1
వాల్మీకి: వసిష్ఠుడిట్లు పల్కగ విని సంతోషించి, రామలక్ష్మణులను దోడ్కొని రమ్మని దశరథుడు దౌవారికున
కాజ్ఞాపించెను.
ప్రతిహారమహాబాహుం రామం సత్యపరాక్రమమ్ |
సలక్ష్మణ మనిఘ్నేన పుణ్యార్థం శీఘ్ర మానయ ॥ 2
దశరథుడు: ప్రతీహారీ! వీరుడును సత్యపరాక్రముడును నగు రాముని లక్ష్మణునితో తీసికొని రమ్ము;
పుణ్యకార్య మున్నది.
ఇతి రాజ్ఞా విసృష్టో సౌ గత్వాంతఃపుర మందిరమ్ ।
ముహూర్తమాత్రేణాగత్య తమువాచ మహీపతిమ్ ॥ 3
ఇట్లు దశరథునిచే నాజ్ఞాపింపబడి, లోనికఱిగి నిమిషములో దిరిగివచ్చి, దౌవారికు డిట్లు బల్కెను. నేను
వైరాగ్యప్రకరణము (సర్గ - 10) 51
దేవ! దోర్దళితాశేషరిపో రామః స్వమందిరే ।
విమనాః సంస్థితో రాత్రా షట్పదః కమలే యథా ॥
దేవా! వినిర్జితశత్రూ! రాత్రి తుమ్మెద పద్మమున గూర్చొని యుండునట్లు, రాముడు విషణ్ణుడై
గృహమున గూర్చొనియున్నాడు.
ఆగచ్ఛామి క్షణేనేతి వక్తి ధ్యాయతి చైకతః ॥
న కస్యచిచ్చ నికటే స్థాతు మిచ్ఛతి భిన్నధీః 5 11
'ఇప్పుడే వచ్చుచున్నాను. పద' అని వచించుచు చింతాపరుడైనాడు. ఖిన్నమనస్కుడగు రాము
డితరులకడ నుండగోరుట లేదు.
ఇత్యుక్తాస్తేన భూపాలస్తం రామానుచరమ్ జనమ్ |
సర్వమాశ్వాసయామాస పప్రచ్చ చ యథాక్రమమ్ 6
ఇట్లాతడు పల్కగ, (అతనివెంట నరుదెంచిన రామానుచరుని) ఆశ్వాసించి క్రమముగా నిట్లు
ప్రశ్నించెను.
కథం కీదృగ్విధో రామ ఇతి పృష్టో మహీభృతా।
రామ భృత్యజనః ఖిన్నో వాక్యమాహ మహీపతిమ్ ॥ 7 "I
రాముడెట్లు, ఏవిధముగ నున్నాడు? అని ప్రశ్నింప, రామసేవకుడు భేదముతో నిట్లు పల్కెను.
దేహయష్టి మిమాం దేవ! ధారయన్త ఇమే వయమ్|
ఖిన్నాః భేదే పరిమ్లానతనౌ రామే సుతే తవ ॥ 8
రాముడు దుఃఖవశమున కృశశరీరు డైనాడు. మేమును కృశించి ఎట్లో ఈ శరీరమును
దాల్చియున్నారము.
రామో రాజీవపత్రాక్షో యతః ప్రభృతి చాగతః ।
సవివ్రస్తీర్థయాత్రాతస్తతఃప్రభృతి దుర్మనాః 9
బ్రాహ్మణులతో గూడి తీర్థయాత్ర నొనర్చి వచ్చినప్పటి నుండి రాముడు ఖిన్నమనస్కుడై యున్నాడు.
యత్నప్రార్థనయాస్మాకం నిజవ్యాపారమాహ్నికమ్ 1
సో యమామ్లానవదనః కరోతి న కరోతి వా ॥ 10
మేము ప్రార్థించి, ప్రయత్నములు సల్పిననే, నిత్యకృత్యముల నొక్కొక్కప్పు డొనర్చును. మతొక్కప్పు డొనర్చడు.
52 యోగవాసిష్ఠము
స్నానదే వార్చనాదానభోజనాదిషు దుర్మనాః ।
ప్రార్థితో ఒపి హి నాతృప్తేరశ్నాత్యశనమీశ్వరః ॥ 11
ప్రభూ! స్నాన, దేవతార్చనా, దానాది విషయములలో అతని మనస్సు లేదు. బ్రతిమాలినను
కడుపునిండు నట్లన్నమును దినుట లేదు.
లోలాంతఃపురనారీభిః కృతదోలాభిరంగణే
1
న చ క్రీడతి లీలాభిర్ధారాభిరివ చాతకః ॥ 12
వర్షధారలతో క్రీడించు చాతకమువలె, అంతఃపుర కాంతలతో నుయ్యెలల నూగుట లేదు.
మాణిక్యము కుళప్రోతా కేయూర కటకావళిః |
నానందయతి తం రాజన్! ద్యౌః పాతవిషయం యథా ॥ 13
రాజా! భోగాంతమున స్వర్గమునుండి పడబోవువానికి, స్వర్గసుఖము లానందమును గూర్పజాలనట్లు,
మాణిక్యముకుళముతో గూర్పబడిన కేయూర కటకములు రాముని కానందమును గొల్పుట లేదు.
క్రీడద్వధూవిలోకేషు వహత్ కుసుమవాయుషు ॥
లతావలయగేహేషు భవత్యతివిషాదవాన్ ॥ 14
క్రీడించుచున్న వనితల చూడ్కులతోను, పూలగాలులతోను శోభిల్లు లతా గృహములలో గూడ రాముడు
విషాదము నందుచున్నాడు.
యద్రవ్య ముచితం స్వాదు పేశలం చిత్తహారి చ
బాష్పపూర్ణేక్షణ ఇవ తేనైవ పరిఖిద్యతే "I 15
రాజభోగ్యములును, రుచికరములును, మనోహరములును, మృదులములు నగు వాని గాంచియు
అతడు దుఃఖితుడగును. కనులు నీ రుబుకును.
కిమిమా దుఃఖదాయిన్యః ప్రస్ఫురంతిః పురాంగనాః ।
ఇతి నృత్తవిలా సేషు కామినీః పరినిందతి ॥ 16
హావభావములతో నృత్య మొనరించు పురాంగనలను గాంచి, దుఃఖ దాయిను లగు వారెవరు? అని
నిందించును.
భోజనం శయనం యానం విలాసం స్నానమాసనమ్ I
ఉన్మత్తచేష్టిత ఇవ నాభినందత్యనిందితమ్ ॥ 17
పిచ్చివానివలె, ఉత్తమములగు స్నాన, భోజన, ఆసన, శయన, యాన, విలాస, ద్రవ్యముల నిందించును.
వైరాగ్యప్రకరణము (సర్గ - 10) 53
కిం సంపదా కిం విపదా కిం గేహేన కిమింగితైః
సర్వమేవాసదిత్యుక్త్యా తూప్లీమేకో వతిష్ఠతే ।
"I 18
సంపదలు, ఆపదలు, భవనములు, కోర్కెలు, వీటితో పనియేమి? ఇవన్నియు అసారములు అని
పల్కి యూరకుండును.
నోదేతి పరిహాసేషు న భోగేషు నిమజ్జతి |
న చ తిష్ఠతి కార్యేషు మౌనమేవావలంబతే ॥ 19
పరిహాసములలో బాల్గొనడు. భోగాసక్తుడు కాడు, పనుల నొనర్పడు, మౌనమును మాత్రమే
అవలంబించి యూరకుండును.
విలోలాలకవర్యో హేలావలితలోచనాః ।
నానందయంతి తం నార్యో మృగ్యో వనతరుం యథా ॥ 20
లేడి అరణ్యవృక్షముల నానందింప జేయజాలనట్లు, ఊగులాడు ముంగురులు గల చపలనయనలు,
రాముని ఆనందింప చేయజాలకున్నారు.
ఏకాంతేషు దిగంతేషు తీరేషు విపినేషు చ ॥
రతిమాయాత్యరణ్యేషు విక్రీత ఇవ జంతుషు ॥ 21
అడవి మనుష్యున కమ్ముడు పోయిన వానివలె, రాము డిప్పుడు, జనశూన్య ప్రదేశమును
నదీతీరములందునను, వనమధ్యమునను నుండగోరుచున్నాడు.
వస్త్రపానాశనాదాన పరాఙ్ముఖతయా తయా |
పరివ్రాడ్ ధర్మిణం భూప! సో నుయాతి తపస్వినమ్ 22 "I
రాముడిప్పుడు అన్నపానాదులయెడం గల విరక్తిచేత పరివ్రాజకుడగు యతిని బోలుచున్నాడు.
ఏక ఏవ వసన్ దేశే జనశూన్యే జనేశ్వర!
న హసత్యేకయా బుద్ధ్యా న గాయతి న రోదత॥ 23
అత డేకాగ్రచిత్తుడై, ఏకాంతప్రదేశములు గూర్చొనియుండును; హాస గాన రోదనాదుల నొనర్పడు.
బద్ధపద్మాసనః శూన్యమనామకరస్థలే ।
కపోలతల మాధాయ కేవలం పరితిష్ఠతి || 24
శూన్యమనస్కుడై, చెక్కిలిపై చేతినుంచి పద్మాసనమున నూరక కూర్చొని యుండును.
54 యోగవాసిష్ఠము
నాభిమానముపాదత్తే న చ వాంఛతి రాజతామ్ |
నోదేతి నాస్తమాయాతి సుఖదుఃఖానువృత్తిషు ॥ 25 25
అతని కభిమానము లేదు. రాజగు కోర్కె లేదు. సుఖదుఃఖములందు హర్షశోకముల నందడు,
న విద్మః కిమసౌ యాతి కిం కరోతి కిమిహతే |
కిం ధ్యాయతి కి మాయాతి కథం కిమనుధావతి ॥ 26
అత డెందులకు చరించునో, ఏ మొనర్చునో దేనిని చింతించునో, దేనిని వెదకునో, ఎట్లు వెదకునో
మే మెఱుంగము.
ప్రత్యహం కృశతా మేతి ప్రత్యహం యాతి పాండుతామ్ |
విరాగం ప్రత్యహం యాతి శరదంత ఇవ ద్రుమః ॥ 27 22
రోజు రోజున కాతడు కృశించుచున్నాడు. రోజు రోజున కతడు పాలిపోవుచున్నాడు. వైరాగ్య మంతకంత
కెక్కు డగుచున్నది. అతనిస్థితి శిశిరఋతువునందలి వృక్షమువలె నున్నది.
అనుయాతౌ తథైవైతే రాజన్ శత్రుఘ్నలక్ష్మణా
తాదృశావేవ తస్యైవ ప్రతిబింబావివ స్థితా ॥ 11 28
అతని అనుచరులగు లక్ష్మణ శత్రుఘ్నుల స్థితియు నిట్లే యున్నది. వారాతని ప్రతిబింబ మట్లున్నారు.
భృత్యై రాజభి రంభాభి: సంపృష్టోం. పి పునః పునః |
ఉక్ష్యాన కించిదేవేతి తూష్లీ మాస్తే నిరీహతః ॥ 29
సామంతులు, తల్లులు, మాటిమాటికి ప్రశ్నింపగ, ఏమియు లేదని యూరకుండెను.
ఆపాతమాత్రహృద్యేషు మా భోగేషు మనః కృథాః |
ఇతి పార్శ్వగతం భవ్య మనుశాస్త్రి సుహృజ్జనమ్ 30
|| 30
విషయేంద్రియ సంయోగమువలన కలుగు నవియు దుఃఖాంతములును, క్షణికములును నగు
భోగముల మనస్సుంచకుము' అని ప్రక్కన నుండు మిత్రున కుపదేశించును.
నానావిభవ రమ్యాసు స్త్రీషు గోష్ఠీ గతాను చ
పురః స్థిత మివాస్నేహో నాశ మేవానుపశ్యతి ॥ 31
వినోదభవనమున నున్న సౌందర్యవతుల గాంచి సంతోషించు టట్లుండ వారిని మృత్యువట్లు గాంచును.
వైరాగ్యప్రకరణము (సర్గ - 10) 55
నీతమాయురనాయాస పదప్రాప్తి వివర్జితైః ।
చేష్టితైరితి కాకల్య భూయో భూయః ప్రగాయతి ॥ 32
మోక్షపదమున కుపయోగింపని ప్రయత్నములో వాయువు వ్యయింపబడు చున్నది అని మధురమును;
స్ఫుటమును నగు రీతి మాటిమాటికి బాడుచుండును.
సమ్రాడ్ భవేతి పార్శ్వస్థం వదంతమనుజీవినమ్|
ప్రలపంతమివోన్మత్తం హసత్యన్యమనా మునిః ॥ 33
'సామ్రాట్టువు కమ్ము' అని ప్రక్కన నున్న అనుజీవి పల్కిన, పిచ్చివానివలె వాగుచున్నాడే యనుకొని,
అన్యమనస్కుడై నవ్వుకొనును.
న ప్రోక్త మాకర్ణయతి ఈక్షతే న పురోగతమ్ |
కరోత్యవజ్ఞం సర్వత్ర సుసమేత్యాపి వస్తుని ॥ 34
మాటలాడిన వినడు; ఎదురనున్న వస్తువులను గాంచడు. మంచివస్తువులం గూడ తిరస్కార భావమున
బరికించును.
అప్యాకాశసరోజన్యా అప్యాకాశమహావనే I
ఇత్థమేతన్మన ఇతి విస్మయోస్య న జాయతే ॥ 35
ఆకాశమను సరోవరమున, ఆకాశపద్మముయొక్క ఉనికి అసంభవ మైనట్లు, ఈ మనస్సును
తత్కల్పిత సృష్టియు అళీకములు ఈ సంగతిని అతడు గ్రహించి యుండుటవలన సామాన్యుల
కాశ్చర్యమును గలిగింపజేయు విషయము లాతని కచ్చెరువును గల్పింపజాలకున్నది.
కాంతామధ్యగతస్యాపి మనోఒ స్య మదనేషవః ॥
న భేదయంతి దుర్భేద్యం ధారా ఇవ మహోపలమ్ ॥ 36
జలధారలు పెనురాతిబండను భేదింప లేనట్లు, అతడు కాంతాజన మధ్యమున నున్నను మన్మథ
బాణము లాతని భేదింపలేకున్నవి.
ఆపదామేకమావాసమభివాంఛని కిం ధనమ్ ।
అనుశిష్యతి సర్వస్వమర్థినే సంప్రయచ్ఛతి 37 "I
ధనమును ఆపదలకు పుట్టిల్లుగ దలంచి, అర్థుల కిచ్చివైచుచున్నాడు.
ఇయమాపదియం సంపదిత్యేవం కల్పనామయః ।
మనసోఒభ్యుదితో మోహ ఇతి శ్లోకాన్ ప్రగాయతి ॥ 38
56 యోగవాసిష్ఠము
ఇది ఆపద, ఇది సంపద అను భావములు కల్పనామయ మగు మనస్సున జనించిన మోహము
అను నీ యర్థము నిచ్చు శ్లోకముల బఠించును. -
హా హతోహ మనాథో ఒహ మిత్యాక్రందవరోఒపి సన్
1
న జనో యాతి వైరాగ్యం చిత్రమిత్యేవ వక్త్యసౌ ॥ 39
“చచ్చితిని, నాకు గతి లేదు" అని రోదించియు జనులు వైరాగ్యమును బడయకున్నారు. ఆశ్చర్యము?
అని నుడువుచుండును.
రముకాననశాలేన రామేణ రిపుఘాతినా ।
భృశమిత్తం స్థితేనైవ వయం భేదముపాగతాః ॥ 40
రఘుకులారణ్య సాలవృక్షమగు (రఘువంశ శ్రేష్ఠుడగు) రాముడిట్టి స్థితిని బొంద మేమును ఖిన్నుల
మైతిమి.
న విద్మః కిం మహాబాహో తస్య తాదృశచేతసః ।
కుర్మః కమలపత్రాక్ష గతిరత్ర హి నో భవాన్ ॥ 41
మహారాజా! ఇట్టి రామునితో నే మొనర్పవలసి నదియు తెలియజాల కున్నాము. మఱి మీరే గతి.
రాజానమథ వా విప్రముపదేష్టారమగ్రతః |
హసత్యజ్ఞమివాప్యగ్రః సో వధీరయతి ప్రభో 42
ప్రభూ! క్షత్రియుడేగానీ, బ్రాహ్మణుడేగానీ, రాజనీతి మొదలగు విషయముల నుపదేశింప బూనిన,
వారివాక్యములను విలువ లేనట్లు, ధీరభావమున దిరస్కరించును.
యదేవేదమిదం స్పారం జగన్నామ యదుస్థితమ్ |
నైతద్వస్తు న చైవాహమితి నిర్ణయ సంస్థితః ॥ 43
బహువిధముల బహిర్దృష్టికిం గన్పడు ఈజగత్తు లేదు. మిథ్య. స్థూలబుద్ధికి గోచర మగు
అహంకారముగూడ ఇట్టిదే అని నిర్ణయించుకొని తత్వజిజ్ఞాసువై యున్నాడు.
నారౌ నాత్మని నో మిత్రే న రాజ్యే న చ మాతరి ।
న సంపదా న విపదా తస్యాస్థా న విభో బహిః ॥ 44
శత్రుమిత్రులు; కష్టసుఖములు, రాజ్యము, తల్లి: శరీరము, ఇత్యాదులగు బాహ్యవిషయములు నాతడు
లక్షించుట లేదు.
వైరాగ్యప్రకరణము (సర్గ - 10) 57
నిరస్తాస్థో నిరాశో సౌ నిరీహోఒ సౌ నిరాస్పదః ।
న మూడో న చ ముక్తో సౌ తేన తప్యామహే భృశమ్ ॥ " 45
అతని కాశ లేదు, ప్రయత్నము లేదు, శాంతి లేదు; అతడు మూఢుడు కాదు. లేక ముక్తుడును
గాదు. అందువలన మేమందరము మిక్కుటముగ విచారించుచున్నాము.
కిం ధనేన కిమంబాభిః కిం రాజ్యేన కి విహయా ।
ఇతి నిశ్చయవానంతః ప్రాణత్యాగపరః స్థితః ॥ 3 46
ధనముతోడను, తల్లులతోడను, రాజ్యముతోడను, ప్రయత్నముతోడను, పని యేమని
నిశ్చయించుకొని, ప్రాణములను దృజింప నున్నాడు.
భోగే ప్యాయుషి రాజ్యేషు మిత్రే పితరి మాతరి |
పరముద్వేగమాయాత శ్చాతకో ఒవగ్రహే యథా ॥
47
అనావృష్టి చాతకముల కుద్వేగ కరమైనట్లు రాజ్యము, భోగములు, తల్లిదండ్రులు, జీవితము ·
అతని కుద్వేగకరము లైనవి.
ఇతి లోకే సమాయాతాం శాఖాప్రసరశాలినీమ్ |
ఆపత్తామలముద్దర్తుం సముదే తు దయాపరః ॥ 48
మీ పుత్రుని కిట్టి విపత్తు ఘటిల్లినది. శాఖాప్రశాఖలతో బెరుగ నున్నది. దీనిని దూర మొనర్ప
ప్రయత్నింపుడు.
తస్య తాదృక్ స్వభావస్య సమగ్రవిభవాన్వితమ్ ।
సంసారజాలమాభోగి ప్రభో ప్రతివిషయతే ॥ 49
ఇట్టి రాముడు పరిపూర్ణ విభవములతో గూడిన సంసారమును కృత్రిమ వేషమును దాల్చిన దానినిగ
నెన్ని, విషమువోలె గాంచుచున్నాడు.
ఈదృశః స్యాన్మహాసత్యః క ఇవాస్మిన్ మహీతలే |
ప్రకృతే వ్యవహారే తం యో నివేశయితుం క్షమః ॥ 50
అతని మనస్సును సంసారమునకు మళ్ళింప గల మహామహు లెవరైన ఈ ప్రపంచమున నున్నారా?
మనసి మోహమపాస్య మహామనః సకలమార్తితమః కిల సాధుతామ్ ।
సఫలతాం నయతీహ తమోహరన్ దినకరో భువి భాస్కరతామివ ॥ A 51
58 యోగవాసిష్ఠము
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే రాఘవవిషాదో నామ దశమః సర్గః ॥10॥
భాస్కరుడు అంధకారమును బోగొట్టి తన పేరును సార్థక మొనర్చునట్లు, రాముని హృదయమునందలి
మోహమును బోగొట్టి, తన ఉపదేశమును సార్థక మొనర్చుకొనగల మహాత్ము లెవరైన కలరా?
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున రాఘవవిషాదమను దశమ సర్గము ॥ 10 ॥
రాఘవ సమాశ్వాసన వర్ణనము -11
శ్రీవిశ్వామిత్ర ఉవాచ:
ఏవం చేత్తన్మహాప్రాజ్ఞా భవంతో రఘునందనమ్ |
ఇహా నయహాన యత్వరితా హరిణం హరిణా ఇవ ॥ 1
విశ్వామిత్రుడు: అట్లయిన నో ప్రాజ్ఞులారా! హరిణరాజును, హరిణములు గొనివచ్చునట్లు రాముని గొనిరండు.
ఏష మోహో రఘుపతే రాపద్భ్యో రాగతః ।
వివేక వైరాగ్యవతో బోధ ఏవ మహోదయః ॥ 2
ఈస్థితి రామున కాపదవలనగాని, రాగమువలనగాని కలుగ లేదు. ఇది వివేక వైరాగ్య పూర్వకమగు
జ్ఞానోదయము;
ఇహాయాతు క్షణాద్రామ ఇహ చైవ వయం క్షణాత్ |
మోహం తస్యాపనేష్యామో మారుతోం దేర్ఘనం యథా ॥ 3
రాము నిటకు రానిండు! వెంటనే, వాయువు పర్వతమున నున్న మేఘముల నెగురగొట్టునటు లతని
మోహమును మేము తొలగింతుము.
ఏతస్మిన్ మార్జితే యుక్త్యా మోహే స రఘునందనః ।
విశ్రాంతిమేష్యతి పదే తస్మిన్ వయమివోత్తమే ॥ 4
యుక్తివలన నతని మోహము దూరమైన, మావలెనే పరమపదమున విశ్రాంతి నందును, ముక్త
స్వరూపుడగును.
సత్యతాం ముదితాం ప్రజ్ఞాం విశ్రాంతిమపతాపతామ్ ।
పీనతాం వరవర్ణత్వం పీతామృత ఇవైష్యతి ॥ 10 5 "
వైరాగ్యప్రకరణము (సర్గ - 11) 59
అతడు సత్యస్వరూపమును, పరమానంద స్వరూపమును, జ్ఞాన స్వరూపమును, విశ్రాంతిని,
తాపహీనత్వమును, పుష్టిని, లావణ్యమును అమృతము ద్రాగినవానివలె పడయును.
నిజాం చ ప్రకృతా మేవ వ్యవహారపరంపరామ్ |
పరిపూర్ణమైనా మాన్య ఆచరిష్యత ఖండితమ్ । 6
అప్పుడతడు స్వవర్ణాశ్రమోచిత ధర్మముల నవిచ్చిన్నముగ, మనఃపూర్తిగ నాచరించును.
భవిష్యతి మహాసత్త్యో జ్ఞాతలోకపరావరః ॥
సుఖదుఃఖద శాహీనం సమలోష్టాశ్మకాంచనః ॥ 7
(అప్పుడు) అతని సత్యగుణము వృద్ధి నందును. లోకముల కార్యకారణ తత్త్వము నెఱుగును. సుఖదుః
ఖముల కతీతు డగును. గడ్డిపరకను, రాతిని, బంగారమును సమముగా జూచును.
ఇత్యుక్తే మునినాథేన రాజా సంపూర్ణమానసః |
ప్రాహిణోద్రామమానేతుం భూయో దూతపరంపరామ్ ॥ 8
మునినాథు డిట్లు వచింప, దశరథుడు సంతోషించి, రాముని గొనివచ్చుటకు మరల మరల దూతల
నంపెను.
ఏతావతాథకాలేన రామో నిజగృహాసనాత్।
పితుః సకాశమాగంతు ముత్తితో ఒర్క ఇవాచలాత్ II 9
ఇంతలో, తండ్రికడ కరుగుటకై రాముడు, ఉదయాద్రిని వీడు సూర్యునివలె నిజాసనము వీడెను.
వృతః కతిపయైరృత్యై రాతృభ్యాం చ జగామహ।
తల్ పుణ్యం స్వపితుః స్థానం స్వర్గం సురపతేరివ ॥
10
కొందఱు భృత్యులును, సోదరులును వెంట రాగా స్వర్గమునుబోలు తండ్రిసభ కఱిగెను.
దూరదేవ దదర్శాసౌ రామో దశరథం తదా ।
వృతం రాజసమూహేన దేవౌఘేనేవ వాసవమ్ ॥ 11
శ్రీరాముడు దూరమున నుండియే, రాజమండల పరివేష్టితుడై, దేవతలచే గొల్వబడు ఇంద్రునివలె
నున్న దశరథుని గాంచెను.
వసిష్ఠ విశ్వామిత్రాభ్యాం సేవితం పార్శ్వయోర్ద్వయోః ।
సర్వశాస్త్రార్థతదిన మంత్రిబృందేన మాలితమ్ |
12
60 యోగవాసిష్ఠము
చారు చామరహస్తాభిః కాంతాభిః సముపాసితమ్ |
కకుదిరివ మూర్తాభిః సంస్థితాభిర్యథోచితమ్ 13 "I
అతని ఉభయ పార్శ్వముల వసిష్ఠవిశ్వామిత్రులు గూర్చొని యుండిరి. నలువైపుల సర్వశాస్త్రార్థ విదులగు
మంత్రు లావేష్టించియుండిరి. సుందరములగు చామరముల చేతదాల్చిన వనిత లాతనిని దగురీతి
సేవించుచుండిరి; చూచుటకు వారు దిక్కు లాకృతిని దాల్చినవా యనునట్లుండిరి.
వసిష్ఠవిశ్వామిత్రాద్యాస్తథా దశరథాదయః |
దదృశూ రాఘవం దూరాదుపాయాంతం గుహోపమమ్ ॥ 14
సత్యావష్టబ్ధ గర్భేణ శైత్యేనేవ హిమాచలమ్ ।
శ్రితం సకలసేవ్యేన గంభీరేణ స్ఫుటేన చ ॥ 115
సౌమ్యం సమం శుభాకారం వినయోదారమానసమ్ ।
కాంతోప శాంతవపుషం పరస్యార్థస్య భాజనమ్ | 16 16
సముద్యద్యౌవనారంభం వృద్ధోపశమశోభనమ్ ।
అనుద్విగ్నమనానందం పూర్ణప్రాయమనోరథమ్ ॥ 17 17
విచారితజగద్యాత్రం పవిత్రగుణగోచరమ్ ।
మహాసత్త్యెకలోభేన గుణైరివ సమాశ్రితమ్ ॥ 18
ఉదార మార్యమాపూర్ణమంతఃకరణకోటరమ్
అవిక్షుభితయా వృత్త్యా దర్శయంతమనుత్తమమ్ ॥ I 19
వసిష్ఠ విశ్వామిత్రులును, దశరథాదులును దూరము నుండియే వచ్చుచున్న రాముని, కుమారస్వామిని
బోలువానిని గాంచిరి. అతడు సత్యగుణము, గాంభీర్యములతో నొప్పారుచు, తాపము నుపశమింపజేయు
హిమాలయ పర్వతమువలె నుండెను. అతడు ప్రియదర్శనుడును, సులక్షణుడును, శుభాకారుడును,
ప్రశాంతుడును, మనోహరుడును, వినయియు, పురుషార్థ అధికారియునై యుండెను. యౌవన
ప్రారంభముయొక్క సంపూర్ణ వికాసమును, వృద్ధుని ప్రశాంత భావమును నాతని నలంకరించి యుండెను.
అతని కుద్వేగము లేదు, ఆనందము లేదు. అతని కోర్కె పూర్ణప్రాయము. అతడు సంసారగతినిగూర్చి
చింతించెను; పవిత్రగుణముల కునికి. సత్యప్రాప్తి నందగోఱి గుణములన్నియు నాతని నాశ్రయించెనా
యను నట్లుండెను. అతడుదారుడు; ఉన్నతుడు. సాధనసంపన్ను డైనను, సత్యబోధ నందక పోవుటవలన
కలిగిన లోటు అతని ప్రవర్తనలో గనబడుచుండెను.
వైరాగ్యప్రకరణము (సర్గ - 11) 61
ఏవం గుణగణాకీర్ణో దూరాదేవ రఘూద్వహః ।
పరిమేయస్మితాచ్ఛాచ్ఛస్వహారాంబరవల్లవః
"I 20
ప్రణనామ చలచ్చారుచూడామణి మరీచినా
1.
శిరసా వసుధాకంపలోలదేవాచలశ్రియా ॥ 21 21
ఏవం మునీంద్రే బ్రువతి పితుః పాదాభివందనమ్ |
కర్తు మభ్యాజగామాథ రామః కమలలోచనః | 22
ప్రథమం పితరం పశ్చాన్మునీ మాన్యైకమానితౌ ।
తతో విప్రాంస్తతో బంధూంస్తతో గురుగణాన్ సుహృత్ ॥ 223 23
ఇట్టి గుణములతో శోభిల్లు రాముడు, నిర్మలమగు చిరునవ్వువలె వెల్లనగు వస్త్రాభరణముతో శోభిల్లుచు,
తండ్రికడ కరుదెంచి, మనోహరములగు మణిభూషణములతో రాజిల్లు శిరస్సును వంచి పితృచరణములకు
బ్రణమిల్లెను. అప్పుడు మేరుగిరివలె నుండెను. ఈసమయమున విశ్వామిత్రుడు దశరథునితో (వెనుక
వర్ణించినట్లు) సంభాషించుచుండెను. శోభాసహృదయుడగు శ్రీరాముడు మొదట తండ్రికిని, తఱువాత
మాన్యులగు వారిచేగూడ గౌరవింపబడు వషిష్ఠ విశ్వామిత్రులకును. పిదప విప్రులకును, కడపట
బంధువులకును, తుదకు గురుజనులకును నమస్కరించెను.
జగ్రాహ చ తతో దృష్ట్యా మనాఙ్మూÔ తథా గిరా |-
రాజలోకేన విహితాం తాం ప్రణామపరంపరామ్ ॥ 24
సామంతరాజు లొనర్చిన ప్రణామపరమగు చూడ్కులచేతను, తల నూపియు మాటలవలనను
గ్రహించెను.
విహితాశీర్మునిభ్యాం తు రామః సుసమమానసః |
ఆససాద పితుః పుణ్యం సమీపం సురసుందరః ॥ 25
వసిష్ఠవిశ్వామిత్రు లాశీర్వదించిన పిదప, సురసుందరుడగు రాముడు పవిత్రమగు పితృపార్శ్వమును
సమీపించెను.
పాదాభివందనపరం తమథాసౌ మహీపతిః ।
శిరస్యభ్యాలిలింగాశు చుచుంబ చ పునః పునః ॥ 26
శత్రుఘ్నం లక్ష్మణం చైవ తథైవ పరవీరహా
ఆలిలింగ ఘనస్నేహో రాజహంసో బుజే యథా ॥ 27
యోగవాసిష్ఠము 62
అనంతరము శత్రు వీరహంత యగు దశరథుడు శ్రీరామ లక్ష్మణ శత్రుఘ్నులను కౌగలించుకొని
శిరస్సును మూర్కొని, రాజహంస పద్మమును చుంబించునట్లు మరల మరల ముద్దిడుకొనెను. గరెడ
13
ఉత్సంగే పుత్ర! తిష్ఠతి వదత్యథ మహీపతా ।
భూమౌ పరిజనాన్తార్లే సోంశుకే న్యవిక్షత 28 11
‘ఒడిలో గూర్చొనుము' అని దశరథుడు పల్కినను వారు సేవకులు పరచిన వస్త్రము మీద గూర్చొనిరి.
రాజోవాచ:
పుత్రప్రాప్తవివేకస్త్యం కల్యాణానాం చ భాజనమ్ |
జడవజ్జీర్ణయా బుద్ధ్యా భేదాయాత్మా న దీయతామ్ ॥ 6629
రాజు: కుమారా! నీవు వివేకివి, శుభగుణ శోభితుడవు. మూఢునివలె బుద్ధిని గోల్పోయి దుఃఖితుడు కావలదు.
ప్రాంత
వృద్ధ వి ప్రగురుప్రోక్తం త్వదృశేనానుతిష్ఠతా ।
పదమాసాద్య తే పుణ్యం న మోహమనుధావతా ॥ 30
పెద్దలును, గురువులును నగువారు చెప్పినట్లాచరించుటవలననే నీ యట్టివారు పుణ్యపదమును
బొందుదురు. మోహాధీనులై కాదు.
తావదేవా ఒ పదో దూరే తిష్ఠంతి పరిపేలవః |
యావదేవ న మోహస్య ప్రసరః పుత్ర! దీయతే 31
పుత్రా! మోహాధీనుడు కానంతవఱకు, ఆపదలు నీదగ్గఱకు రాజాలవు.
శ్రీవసిష్ఠ ఉవాచ:
రాజపుత్ర! మహాబాహో! శూరస్త్యం విజితాస్వయా ।
దురుచ్చేదా దురారంభా అవ్యమి విషయారయః ॥ 32
శ్రీవసిష్ఠుడు: రాజపుత్రా! నీవు వీరుడవు. విషయములను, అజేయశత్రువులను జయించుట కష్టమైనను,
వాటిని నీవు జయించితివి.
కిమతద్ ఇవాజ్ఞానాం యోగ్యే వ్యామోహసాగరే ।
వినిమజ్జన కల్లోలబహుళే జాడ్యశాలిని ॥ 33 I
అయినను, నీవేల జడరూపమగు వ్యామోహ సముద్రమున అజ్ఞానివలె, మునుక లిడుచుంటివి?
వైరాగ్యప్రకరణము (సర్గ - 11) 63
శ్రీవిశ్వామిత్ర ఉవాచ:
చలన్నీలోత్పల వ్యూహనమలోచనలోలతామ్ ।
బ్రూహి చేతఃకృతాం త్యక్త్యా హేతునా కేన ముహ్యసి 11 34
విశ్వామిత్రుడు: మనోవికారమువలన నీ కండ్లు కదులుచున్న నీల పద్మములవలె నున్నవి; ఈ
చాంచల్యమును వీడి నీ మోహకారణమును వచింపుము.
కిం నిష్టాః కే చ తే కేన కియంతః కారణేన తే
ఆధయః ప్రవిలుంవంతి మనోగేహమివాఖవః ॥ 35
మూషికము లింటిని పాడుచేయునట్లు, నీ చిత్తమును గలంచు దుఃఖ మెట్టిది? కారణ మేమి?
ఎద్దానివలన నీ నీ కీదుఃఖము కల్గినది.
మన్యే నానుచితానాం త్వమాదీనాం పదముత్తమమ్ ।
ఆపత్సు చాప్రయోజ్యం తే నిహీనా అవి చాధయః ॥ 36
నీయట్టి వాని కిట్టి చింత తగదు. ప్రతీకార మొనర్చుట నీ కెంతటి పని? ఈచింతకు తావు లేదని
నేననుకొందును.
యథాభిమత మాశు త్వం బ్రూహి ప్రాప్స్యసి చానమ!
సర్వమేవ పునర్యేన భేత్స్యంతే త్వాం తు నాధయః ॥ 37
అనఘా54 ! నీ యభీష్ట మెట్టిదో వచింపుము. అది సిద్ధించును. మఱి, చింత నందవలసిన అగత్య ముండదు.
ఇత్యుక్తమన్య సుమతే రఘువంశకేతు
రాకర్ణ్య వాక్యముచితార్థ విలాస గర్భమ్ ।
తత్యాజ భేదమభిగర్జతి వారివాహే
బర్హీ యథా త్వనుమితాభిమతార్థసిద్ధిః
|| 38
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే రాఘవ సమాశ్వాసనం నామ ఏకాదశః సర్గః॥11 u
సుమతి యగు విశ్వామిత్రు డిట్లు యుక్తములగు పల్కులను బల్క, రాము డాకర్ణించి, మేఘగర్జనమును
విని నెమలి సంతసించునట్లు, వాంఛితార్థ ప్రాప్తి యగునని ఊహించి, సంతోషించెను.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున రాఘవ సమాశ్వాసనమను ఏకాదశ సర్గము ॥ 11॥
64 యోగవాసిష్ఠము
ప్రథమ పరితాప వర్ణనము -12
శ్రీవాల్మీకి రువాచ:
ఇతి పృష్టో మునీంద్రేణ సమాశ్వస్య చ రాఘవః ॥ 28
ఉవాచ వచనం చారు పరిపూర్ణార్ణ మంథరమ్
II
వాల్మీకి: ఇట్లు మునీంద్రునిచే బ్రశ్నింపబడి ఓదార్పబడిన రాముడు అర్థయుక్తములును, మధురములును
నగు వాక్యములను మెల్లగ నుడువసాగెను.
శ్రీరామ ఉవాచ:
భగవన్ ! భవతా పృష్టో యథావదధునా ఖిలమ్ |
కథయామ్యహమజ్ఞోపి కో లంఘయతి సద్వచః ॥ 2
శ్రీరాముడు: సాధుపురుషుల వాక్యముల నెవరుల్లంఘింపగలరు? అగుటంజేసి, అజ్ఞుడ నైనను ఉన్నదున్నట్లు
చెప్పుచున్నాను.
అహం తావదయం జాతో నిజేస్మిన్ పితృపద్మని ।
క్రమేణ వృద్ధిం సంప్రాప్తః ప్రాప్తవిద్యశ్చ సంస్థితః ॥ 3
నే నీ పితృగృహమున పుట్టి పెఱిగి, విద్యనార్జించి యుంటిని.
తతః సదాచారపరో భూత్వాం హం మునినాయక!
విహృతస్తీర్థయాత్రార్థముర్వీమంబుధిమేఖలామ్ || 4
మునీశ్వరా! పిదప సదాచార పరాయణుడనై, తీర్థయాత్రల సముద్ర వలయిత మగు భూమండలము
నందంతటను విహరించితిని.
ఏతావతాథకాలేన సంసారాస్థామిమాన్ హరన్
సముద్భూతో మనసి మే విచారః సో యమిదృశః ॥ 5
వివేకేన పరీతాత్మా తేనాహం తదనుస్వయమ్
భోగనీరసయా బుద్ధ్యా ప్రవిచారితవానిదమ్ ॥ 6
ఇప్పుడు నాకు సంసార మనిన, ఆసక్తి నశించినది. వివేకయుక్తుడనై, భోగేచ్ఛను బరిత్యజించి ఇట్లు
విచారించితిని.
వైరాగ్యప్రకరణము (సర్గ - 12) 65
కిం నామేదం బత సుఖం యేయం సంసారసంతతిః ।
జాయతే మృతయే లోకో మ్రియతే జననాయ చ ॥ 7
ఈ సంసార చక్రమున సుఖ మేమున్నది? చచ్చుటకై పుట్టుచున్నారు. మరల జన్మించుట కొఱకు
చచ్చుచున్నారు.
అస్థిరాః సర్వ ఏవేమే సచరాచరచేష్టితాః ।
ఆపదాం పతయః పాపా భావా విభవభూమయః || 8
స్థావర జంగమములగు జీవుల ప్రయత్నమున గలిగిన భోగవిషయములన్నియు అశాశ్వతములు,
ఆపదలకు తావు; పాపములకు గారణములు.
ఆయః శలాకాసదృశాః పరస్పరమసంగినః ।
శ్లేష్యంతే కేవలం భావా మనఃకల్పనయా స్వయా ॥ 9
విషయములకు పరస్పర సంబంధము లేదు. అవి ఇనుపకమ్ములవలె విడివడినవి. వాటి సంబంధము
కేవలము మనస్సుయొక్క కల్పనయే.
మనః సమాయత్త మిదం జగదాభోగి దృశ్యతే |
మనశ్చాసదివాళాతి కేన స్మ పరిమోహితాః ॥ | 10
మాయావేషమును దాల్చిన దీ జగత్తు దీనియొక్క సృష్టిస్థితిలయములు కూడ, మనఃకల్పితములే;
బాగుగా పరికించి చూచిన మనస్సున కస్తిత్వము లేదు. అగుటచే, మనము మోహబద్ధుల మగుట వృథా.
అసతైవ వయం కష్టం వికృష్ణా మూఢబుద్ధయః ।
మృగతృష్ణాంభసా దూరే వనే ముగ్ధమృగా ఇవ ॥ 11
ఎండమావుల నీళ్లు ద్రావ పరుగిడు లేళ్లవలె మూఢుల మగు మేము, సుఖము నొసగలేని *
ఆళీకవస్తువుల వెంటబడుచున్నాము.
న కేనచిచ్చ విక్రీతా విక్రీతా ఇవ సంస్థితాః
బత మూఢా వయం సర్వే జానానా అపి శాంబరమ్ ॥ 12
ఆహా! మాయయని తెలిసికొనియు, మూఢుల మగు మేము అమ్ముడు పోకపోయినను,
అమ్ముడుపోయిన వానివలె నుంటిమి.
* అళీకవస్తువన అసద్వస్తువు, తుచ్ఛము, శూన్యము, లేనట్టిది అని గ్రహించునది. ఆకాశపుష్పము, కుందేటికొమ్ము,
గంధర్వనగరము, వంధ్యాపుత్రుడు ఇత్యాదు లళీకవస్తువులు- అను.
VI F5
66 యోగవాసిష్ఠము
కిమేతేషు ప్రపంచేషు భోగా నామ సుదుర్భగాః
ముధైవ హి వయం మోహాత్ సంస్థితా బద్ధభావనాః || 13
ఈ ప్రపంచమున, విషయసుఖము లననేమి? - దృష్టములును, (నష్టస్వభావములును, దుః
ఖబీజములును అగుటవలన) దౌర్భాగ్య స్వరూపములు, మోహవశమున, వాంఛలవలన గట్టబడితిమి.
అజ్ఞాతం బహుకాలేన వ్యర్థమేవ వయం వనే |
మోహే నిపతితా ముగ్ధాః శ్వబ్రే ముగ్ధా మృగా ఇవ ॥ 14
ఇప్పటికి దెలిసికొంటిని. మృగములు వనమధ్య గర్తమున గూలునట్లు, మేమును మోహమున
బడియున్నార మని.
కిం మే రాజ్యేన కిం భోగైః క్కో హం కిమిద మాగతమ్ ।
యన్మిథ్యైవాస్తు తన్మిథ్యా కస్య నామ కిమాగతమ్ ॥ 15
నే నెవ్వడను? ఎందుల కిట కరుదెంచితిని? నాకీ రాజ్యములతోడను, భోగములతోడను బని
యేమున్నది? మిథ్య మిథ్యయే యగుగాక! ఐననేమి?
ఏవం విమృశతే బ్రహ్మన్! సర్వేష్వేవ తతో మమ ।
భావేష్వరతిరాయాతా పథికస్య మరుష్వివ II 16
బ్రహ్మజ్ఞా! ఇట్లు భావించుటవలన, పాంథునకు మరుభూమి యన్న విరక్తి గలుగునట్లు నాకును
భోగములన్న విరాగము గలిగినది.
తదేతద్భగవన్! బ్రూహి కిమిదం పరినశ్యతి ।
కిమిదం జాయతే భూయః కిమిదం పరివర్ధతే ॥ "I 17
భగవానుడా! ఈపరిదృశ్యమాన ప్రపంచము (లేక ఈశరీరము) నశించు టెందులకు, మరల జన్మించి
స్థితినందు టెందులకు- వచింపుడు. *
జరామరణమాపచ్చ జననం సంపదస్తథా |
ఆవిర్భావతిరోభావై ర్వివర్ధంతే పునఃపునః ॥ 18
దుఃఖదాయకములగు జరామరణములు, మృత్యువు, సంపదలు, మరలమరల వచ్చుచు పోవుచున్నవి.
* 'ఈ ప్రశ్నలకు ప్రత్యుత్తరము, క్రమముగ, ఉత్పత్తి, స్థితి, ఉపశమ, ప్రకరణముల ప్రవచింపబడినది
వైరాగ్యప్రకరణము (సర్గ - 12) 67
భోగైసైరేవ తైరేవ తుచ్చైర్వయ మమీ కిల।
పశ్య జర్జరతాం నీతా వాతెరిన గిరిద్రుమాః ॥ 19
భోగలంపటుల మగు మేము మాటిమాటికి జన్మల నెత్తి వాయువువలన శిథిల మొనర్పబడిన
- 'క్రములవలె ఎట్లుంటిమో కాంచుడు!
అచేతనా ఇవ జనాః పవనైః ప్రాణనామభిః ।
ధ్వనంతః సంస్థితా వ్యర్థం యథా కీచకవేణవః ॥ 20
జనులచేతనులవలె, ఏమియు దెలియనట్లు పురుషార్థ విహీనులై యున్నారే! * * కీచక వేణువట్లు
ప్రాణవాయు ప్రేరితులై శబ్దము నొనర్చుచున్నారు.
శామ్యతీదం కథం దుఃఖమితి తప్తో స్మి చింతయా |
జరద్రుమ ఇవోగ్రేణ కోటరస్థెన వహ్నినా ॥ 21
ఈ దుఃఖ మెట్లుపశమించునా యని, కోటరమందున్న అగ్నివలన తప్తమగు జీర్ణవృక్షమువలె తపించుచున్నాను.
సంసారదుఃఖపాషాణనీరంద్రహృదయో వ్యహమ్ |
నిజలోకభయాదేవ గలద్భాష్పం న రోదిమి ॥ 22
నా హృదయము సంసారదుఃఖమను గట్టిరాతివలన కప్పబడినను, తల్లిదండ్రులకు కష్టమును
గలిగింతునను భయమున, కన్నీరు గార్చి ఏడ్చుట లేదు.
శూన్యా మన్ముఖవృత్తిస్తాః శుష్కరోదననీరసాః ।
వివేక ఏవ హృత్సంజ్ఞ మమైకాంతేషు పశ్యతి | I 23
నా నా హృదయమున నున్న వివేకము తప్ప, ఇతరులు నారోదనమును, గ్రహించుట లేదు. నా ముఖవృత్తు
లన్నియు, (హాస్యాదు లన్నియు) నిరశ్రురోదనమున నీరసము లైనవి. నేనొనర్చు వాక్యాలాప హాస్యాదు
లన్నియు కృత్రిమములు.
భృశం ముహ్యామి సంస్మృత్య భావాభావమయీం స్థితిమ్ |
దారిద్ర్యేణేవ సుభగో దూరే సంసారచేష్టయా ॥ II 24
దురదృష్టవశమున దరిద్రుడైన ధనికునివలె, సంసార ప్రయత్నములు గుఱించియు, విషయముల
వినాశ శీలత్వమును గుఱించియు, మిక్కుటముగ మోహము నందుచున్నాను.
* వేణువన వెదురు. దీనికి రంధ్రముల నొనర్చి గాలిని పూరించిన ధ్వనించునను విషయము లోకప్రసిద్ధము. వెదుళ్లు
గాలికి ఊగులాడ, లోనికి గాలి ప్రవేశించినను, ధ్వనించును. ఇట్లు ధ్వనించు వెదురును కీచకవేణు వందురు.
68 యోగవాసిష్ఠము
మోహయంతి మనోవృత్తిం ఖండయంతి గుణావలిమ్ జరి5 జరి5 గోధ I
దుఃఖజాలం ప్రయచ్ఛంతి విప్రలంభపరాశ్ర్శియః ॥ 25
నిలుకడ లేని సిరి మనోవృత్తుల మోహింప జేయుచున్నది. గుణముల బాల ద్రోలుచున్నది, దుఃఖముల
నిచ్చుచున్నది.
చింతానిచయచక్రాణి నానందాయ ధనాని మే
సంప్రసూతకలత్రాణి గృహాణ్యుగ్రాపదామివ ॥ I 26
దరిద్రునకు, స్వగృహ ముపద్రవకర మైనట్లు, చింతలతో గూడబెట్టబడిన ధనరాసులు నాకానంద
దాయకములు కావు.
వివిధదోషదశా పరిచింతనై ర్వితతభంగుకారణకల్పితైః | I
మమ న నిర్వృతిమేతి మనో మునే! నిగడితస్య యథా వనదంతినః ॥ 27
ఉపాయ పూర్వకముగ బంధింపబడిన అడవి ఏనుగకు శాంతి లేనట్లు సంసారమునందలి వివిధ
దోషముల గతిని చింతించుటవలనను, అశాశ్వతములగు కారణపరంపరల దలపోయుటవలనను, నాకు
మనఃశాంతి లేకున్నది.
ఖలాః కాలేకాలే నిశి నిశితమో హైకమిహికా |
గతా లోకే లోకే విషయ శతచౌరాః సుచతురాః ॥
ప్రవృత్తాః ప్రోద్యుక్తా దిశి దిశి వివేకైక హరణే।
రణే శక్తాస్తేషాం క ఇవ విదుషః ప్రోయ్యె సుభటాః ॥ 28
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే ప్రథమపరితాపో నామ ద్వాదశః సర్గః ॥ 12॥
అజ్ఞానమను రాత్రియందు, దట్టమగు మోహజాలములను తుషార ధూమములందు జ్ఞానమను
వెలుగు కప్పబడగా చతురులును, పాపులును నగు విషయములను లెక్కకు మించిన చోరులు, వివేకమను
రత్నమును దొంగిలింప, అన్నివేళల అన్నిచోట్ల తిరుగుచుందురు. వీరితో యుద్ధ మొనరింప తత్త్వజ్ఞానిగాక
మరెవరు సమర్థులు?
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున ప్రథమపరితాపమను ద్వాదశ సర్గము ॥ 12 11 |
30
69
లక్ష్మీనిరాకరణ వర్ణనము -13
శ్రీరామ ఉవాచ :
ఇయమస్మిన్ స్థితోదారా సంసారే పరికల్పితా :
శ్రీర్మునే! పరిమోహాయ సాపి నూనం కదర్థదా 1
రాముడు: మునీ! మూఢులగువారు ఈసంసారమున లక్ష్మియే సుఖముల నిచ్చును, ఆమె చాల గొప్పది
అని అనుకొందురు. కాని నిజమున కిదియే మోహకారణము, అనర్థదాయకమును నై యున్నది.
ఉల్లాన బహుళానంతకల్లోలానలమా కులాన్
I
జడాన్ ప్రవహతి స్పారాన్ ప్రావృషీవ తరంగిణీ ॥ 2
పైకి లేచి పడుచుండు మలిన తరంగములందు బ్రవహించు వర్షాకాల నది వోలె, ఉత్సాహ పూర్వక
మగు బహుళ మనోరథములచే గలతబెట్టబడిన మనస్సు పెక్కురు మూర్ఖుల పరవశ మొనర్చును.
చింతాదుహితరో బహ్వ్యో భూరిదుర్లలితైధితాః ।
చంచలాః ప్రభవంత్యస్యాస్తరంగాః సరితో యథా ॥ 3
సరస్సున తరంగములు లేచునట్లు, ఈలక్ష్మికి చెడుచేతలచే పెఱుగు చింతలను అనేక కన్యలున్నారు;
వీరు చంచలలు.
ఏషా హి పదమేకత్ర న నిబధ్నాతి దుర్భగా I
దేవానియతాచారమితశ్చేతశ్చ ధావతి ॥ 4
కాలు కాలిన దానివలె ఇది ఒకచోట నుండ లేదు. ఇట నట తిరుగుచుండును.
జనయంతీ పరం దాహం పరామృష్టాంగికా సతీ।
వినాశమేవ ధత్తేన్హర్దీపలేఖేవ కజ్జలమ్ "I 5
దీపమును ముట్టుకొనిన చేయి కాలును, చేతికి మసి యంటుకొనును. అట్లే, లక్ష్మి నొకమారు
స్పృశించిన వ్యయాది రూపమగు తాపము గల్గును; మోహరూపమగు వినాశము గల్గును.
గుణాగుణవిచారేణ వినైవ కిల పార్శ్వగమ్ ।
రాజప్రకృతివన్మూడా దురారూఢావలంబతే ॥
6
దీని ప్రకృతి రాజుస్వభావమువలె మూఢమైనది; తన్ను సమీపింప గలిగినవారి నెవరినైనను గుణదోష
విచారము లేకయే ఆశ్రయించును.
70 యోగవాసిష్ఠము
కర్మణా తేన తేనైషా విస్తారమను గచ్ఛతి | 25
దోషాశీ విషవేగస్య యత్ క్షీరం విస్తరాయతే ॥ 7
పాలు పామునకు బలము నిచ్చునట్లు హింసావృత దోషములవలననే లక్ష్మి వృద్ధి నందును.
తావచ్చీతమృదుస్పర్శః పరేస్వే చ జనే జనః॥
వాత్యయేవ హిమం యావచ్చియా న పరుషీకృతః 11
సహజముగ మంచుతుంపురులు శీతస్పర్శను, మృదుత్వమును గల్గియుండును; గాలి తగిలిన
ఎండిపోవును. అట్లే లక్ష్మీస్పర్శ (ధనము) కలిగి మనుష్యుడు శుష్కించనంతవఱకు మృదుస్వభావమును,
శాంతమును గలిగియుండును.
ప్రాజ్ఞాః శూరాః కృతజ్ఞాశ్చ పేళలా మృదవశ్చ యే ।
పాంసుము ష్ట్యేవ మణయశ్రియా తే మలినీకృతాః
"I
మకిలిచెయ్యి మణులను బాడుచేయునట్లు శూరులును, కృతజ్ఞులును, మెత్తనివారును,
మృదుస్వభావులును అగువారు లక్ష్మివలన పాడుచేయబడినారు.
న శ్రీః సుఖాయ భగవన్ దుఃఖాయైవ హి వర్ధతే |
గుప్తా వినాశనం ధత్తే మృతిం విషలతా యథా ॥ 10
భగవానుడా! సంపదల నభివృద్ధిపరుప లభించునది దుఃఖమే, సుఖము కాదు. దానిని రక్షించుట
(కూడబెట్టుట) వినాశకారిణి యగు విషలతను బెంచుటవంటిది.
శ్రీమానజననింద్యశ్చ శూరశ్చాప్యవికతనః ।
సమదృష్టి: ప్రభుశ్చైవ దుర్లభాః పురుషాస్త్రయః ॥ 11
లోకనింద లేని ధనికుడు, పొగడ్త లేని వీరుడు, పక్షపాతము లేని ప్రభువు - ఇట్టి వారు లభింపరు.
ఏషా హి విషమా దుఃఖభోగినాం గహనా గుహా |
ఘనమోహగజేంద్రాణాం వింధ్యశైలమహాతటీ 12 ||
ఈలక్ష్మి - ఆపదలను పాములకు పుట్ట, మోహము లను ఏనుగులకు విశాల మగు వింధ్య
పర్వతభూమి. (అనగా, పాములు ఇతరులు చొరలేని గుహ నాశ్రయించుకొని యుండునట్లును, ఏనుగులు
వింధ్యపర్వతభూమి నాశ్రయించుకొని యుండునట్లును, దుఃఖమోహములు లక్ష్మి నాశ్రయించుకొని
యుండునని భావము.)
వైరాగ్యప్రకరణము (సర్గ - 13) 71
సత్కార్యపద్మరజనీ దుఃఖకైరవచంద్రికా
సుదృష్టిదీపికా వాత్యా కల్లోలౌమతరంగిణీ ॥ 13
ఈ లక్ష్మి - సత్కార్యములను పద్మములకు రాత్రి, దుఃఖములను కలువలకు వెన్నెల. పరమార్థదృష్టి
యను దీపమునకు పెనుగాలి, కోర్కెలను కల్లోల తరంగములకు తావగు చెఱువు.
సంభ్రమాభ్రాదిపదవీ విషాద విషవర్ధినీ।
కేదారికా వికల్పానాం ఖేదాయ భయభోగినీ ॥ 14
ఈలక్ష్మి - భయభ్రాంతులను మేఘములకు మొదలి బాట; విషాదమును బెంపొంద జేయును.
వికల్పముల కాటపట్టు, దుఃఖమును కల్పించు పేనుబాము.
హిమం వైరాగ్యవల్లీనాం వికారోలూకయామినీ।
రాహుదంష్ట్రా వివేకేందో సౌజన్యాంభోజచంద్రికా
"I 15
ఈ లక్ష్మి - వైరాగ్యలతకు మంచు, కామాది వికారములను గ్రుడ్లగూబలకు రాత్రి. వివేకమను
చంద్రునకు రాహువు. మంచి యను తామరకు వెన్నెల.
ఇంద్రాయుధవదాలోలనానారాగమనోహరా !
లోలా తడిదివోత్సన్నధ్వంసినీ చ జడాశ్రయా ॥ 16
ఈ లక్ష్మి - ఇంద్రధనుస్సువలె చలించు రంగులతో (రాగాది వికారములతో) మనోహరముగ
కన్పట్టును. మెఱపుతీగవలె చంచలము. "ఇట్టెవచ్చి, అట్టెపోవును." మూర్ఖుల నాశ్రయించుకొని యుండును.
(ధనికులందరు సామాన్యముగ మూర్ఖులే గదా!)
చాప లావజితారణ్యన కులీన కులీనజా॥
విప్రలంభనతాత్పర్యజితో గ్రమృగతృష్టికా 17
ఈ లక్ష్మి - చాపల్యమున అడవిముంగిని జయించును, సత్కులమున జనించిన వారికడ నుండదు.
మోసగించుటలో నెండమావిని మించినది.
లహరీవైకరూపేణ పదం క్షణమకుర్వతీ।
చలా దీప శిఖేవాతిదుర్యగతిగోచరా ॥ 18
ఈ లక్ష్మి - విరిగిపడిపోవు తరంగములవలె నొకచోటు వంటిపెట్టుకొని యుండదు. దీపశిఖవలె
చంచలము. దీని ఉనికి మనుకులను దెలియజాలము.
72 యోగవాసిష్ఠము రోడ్
సింహీప విగ్రహవ్యగ్రకరీంద్రకులపోథినీ।
ఖడ్గధారేవ శిశిరా తీక్షణతీక్షణాశయాశ్రయా || 2 డి 19
ఈ లక్ష్మి - ఆడుసింహమువలె, యుద్ధ మొనర్ప నిచ్చించు ఏనుగులను శత్రువుల నాశ మొనర్పును.
ఖడ్గధారవలె శీతలమైనను క్రూరాశయములు గలవారి నాశ్రయించుకొని యుండును. ఉదయ
నానయాపహృతార్థివ్యా దురాధిపరిలీనయా । jajoč
పశ్యామ్యభవ్యయా లక్ష్మ్యా కించిద్దుఃఖాదృతే సుఖమ్ ॥ 20 |
మహర్షీ! పరవంచన ఇత్యాదులకు పాపములం బ్రోగుజేయున దీ లక్ష్మి. ఇది దుఃఖములను
వెంటబెట్టుకొని వచ్చును. నేను గ్రహించిన దేమన, దీనిచే దుఃఖమే గాక, ఆవంతైన సుఖము లేదు.
దూరేణోత్సారితా లక్ష్మా పునరేవ తమాదరాత్ ।
అహోబతాశ్లేష్యతీవ నిర్లజ్జా దుర్జనా సదా ॥ 21 21
సపత్ని యగు దారిద్ర్యమువలన ఒకానొక పురుషుని నుండి తఱుమ బడియు, ఈలక్ష్మి సిగ్గులేని
దానివలె మరల ఆపురుషునే ఛీ! ఆలింగ మొనర్చుకొనును.
మనోరమా కర్షతి చిత్తవృత్తిం కదర్థసాధ్యా క్షణభంగుర
వ్యాలావలీ గాత్రవివృత్త దేహా శ్వభ్రతితా పుష్పలతేవ లక్ష్మీ 22
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే లక్ష్మీనిరాకరణం నామ త్రయోదశః సర్గః ॥ 13 ॥
ఈలక్ష్మి హత్యాదులగు దుస్సాహస కార్యములవలన లభించును; క్షణభంగురము ; పాములున్న
పాడునూతినుండి బయలువెడలిన పుష్పలతవలె మనోహరమై కన్పట్టి మనస్సులను హరించును.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున లక్ష్మీనిరాకరణమను త్రయోదశ సర్గము ॥ 13 ॥
జీవిత గర్హావర్ణనము - 14
శ్రీరామ ఉవాచ:
ఆయు: పల్లవ కోణాగ్ర లంబాంబుకణభంగురమ్ |
ఉన్మత్తమివ సంత్యజ్య యాత్యకాండే శరీరకమ్ ॥ 1
శ్రీరాముడు: ఆయువు చివురుటాకు కొననున్న నీటిబొట్టువలె క్షణభంగురము. ఉన్మత్తునివలె చటుక్కున
ఈ శరీరము వదలిపోవును.
వైరాగ్యప్రకరణము (సర్గ - 14) 73
విషయాశీ విషాసంగ పరిజర్జర చేతసామ్ ।
అప్రౌఢాత్మ వివేకానామాయురాయాస కారణమ్ ॥ 2
విషయములను విషసర్పములవలన చితికిన మనస్సు గలవారును, వివేకము లేనివారును నగు
వారికి ఆయువు దుఃఖహేతువు.
యే తు విజ్ఞాతవిజ్ఞేయా విశ్రాంతా వితతే పదే
భావాభావసమాశ్వాసమాయుస్తేషాం సుఖాయతే ॥ 3
తత్త్వజ్ఞాన బలమున బ్రహ్మపదమునుండి శాంతి నందిన వారికిని, లాభాలాభముల సమదృష్టితో
బరికించు వారికిని, ఆయువు (జీవితము) సుఖదాయకము.
వయం పరిమితాకారపరినిష్ఠితనిశ్చయాః ।
సంసారాభ్రతడిత్పుంజే మునే నాయుషి నిర్వృతాః 4
మునీ! మాకు ఆత్మబుద్ధి పరిమితాకార మగు ఈశరీరమునే (ఆత్మ అపరిమితుడు, అఖండుడు,
అని ఇచ్చట ధ్వని) అందువలన, మా కీ సంసార మేఘముల మెఱుపగు జీవితమున సుఖము లేదు.
యుజ్యతే వేష్టనం వాయోరాకాశస్య చ ఖండనమ్ ।
గ్రథనం చ తరంగాణా మాస్థా నాయుషి యుజ్యతే 5
గాలిని ప్రోగుచేయుట, ఆకాశమును తునుకలు గావించుట, తరంగముల దూచుట - సంభవము
లైన నగుగాక! అయినను, ఆయువును నమ్మజాలము.
పేలవం శరదీవాభ్ర మస్నేహ ఇవ దీపకః ॥
తరంగక ఇవాలోలం గతమేవోపలక్ష్యతే
II 6
జీవితము శరత్కాల మేఘములవలెను, చమురు లేని దీపమువలెను, సారశూన్యము; తరంగ
చంచలము; దీనిని పోయిన దానిగనే తలంచుట మంచిది.
తరంగం ప్రతిబింబేందుం తడిత్ పుంజం నభోఒంబుజమ్ |
గ్రహీతు మాం బధ్నామి న త్వాయుషి హతస్థితా 7
తరంగమును, చంద్రుని ప్రతిబింబమును, మెఱపు సమూహమును, ఆకాశకమలమును గైకొనుటను
నమ్మవచ్చును కాని, అస్థిరమగు జీవితమును నమ్మలేము.
అవిశ్రాంతమనాః శూన్యమాయురాతతమిహతే ।
దుఃఖాయైవ విమూఢ ఒంతర్గర్భమశ్వతరీ యథా ॥
8
74 యోగవాసిష్ఠము
వ్యాకులచిత్తముతో మూఢుల వ్యర్థమగు జీవితమును పొడిగింప జూతురు; ఇది అశ్వతరి *గర్భమును
గోరుటవంటిది.
Je 19
సంసార సంసృతావస్యాం ఫేనోస్మిన్ సర్గసాగరే ।
కాయవల్ల్యాంభసో బ్రహ్మన్! జీవితం మే న రోచతే ॥ 9 50%
బ్రహ్మజ్ఞుడా! ఈ సంసారమున పరిభ్రమించుట కనుకూలమైన శరీరలత, సృష్టి సముద్రము నందలి
నుఱుగువంటిది; ఇట్టి అశాశ్వత వస్తువునందు నాకు రుచి లేదు.
20
ప్రాప్యం సంప్రాప్యతే యేన భూయో యేన న శోచ్యతే।
పరాయా నిర్వృతేః స్థానం యత్తజీవిత ముచ్యతే। 2010
ఎద్దానివలన పరమపురుషార్థమగు మోక్షము లభించునో, పునర్జన్మ, దుఃఖము నశించునో, పరమ
సుఖమగు జీవన్ముక్తి సుఖమున కెయ్యది స్థానమో, అయ్యదియే యథార్థ జీవితము.
21
తరవోఒపి హి జీవంతి జీవంతి మృగపక్షిణః |
స జీవతి మనో యస్య మననేన న జీవతి ॥ Ce11
చెట్టచేమలును జీవించుచున్నవి. పశుపక్షులును జీవించుచున్నవి. (కాని వాని బ్రతుకు బ్రతుకు
కాదు) తత్వచింతనవలనగాని, వాసనాక్షయము వలనగాని, లయమైన మనస్సు గలవాని జీవితమే జీవితము.
జాతాస్త ఏవ జగతి జంతవః సాధుజీవితాః |
యే పునర్నేహ జాయంతే శేషా జరఠగర్దభాః ॥ 12
మరల పుట్టుక లేని సాధువుల జీవితమే జీవితము. అశుద్ధమగు దేహాత్మబుద్ధి గల తక్కిన జీవులందరు
ముసలి ఎద్దులు. (ముసలియెద్దువలె, దీర్ఘాయుర్దాయ మున్నను వారిజీవిత మప్రశస్తమని భావము)
భారో వివేకినః శాస్త్రం భారో జ్ఞానం చ రాగిణః ।
అశాంతస్య మనో భారో భారో నాత్మవిదో వపుః ॥ 13
అవివేకులకు శాస్త్రజ్ఞానము పెనుబరువు: అనర్థక శ్రమ హేతువు. కోర్కెలు గలవారికి సర్వ దుఃఖ
ములను దూరీకరించు జ్ఞానముకూడ బరువే! చింత గలవారికి మనస్సు బరువు. అనాత్మవిదునకు శరీరమే
బరువు,
అశ్వగర్దభములకు గలిగినది అశ్వతరి: దీని గర్భనిర్గమనము ఉదరవిదారణము వలననే యను సంగతి లోకప్రసిద్ధము.
వైరాగ్య ప్రకరణము (సర్గ - 14) 75
రూప మాయుర్మనోబుద్ధిరహంకార స్తథేహితమ్
భారో భారధరస్యేవ సర్వం దుఃఖాయ దుర్ధియః ॥ 14
బరువు మోయువారికి దుఃఖమును లేక కష్టమును గలిగించునట్లు, దుర్మతులకు రూపము, ఆయువు,
మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రయత్నము - ఇత్యాదు లన్నియు దుఃఖమును గలిగించును.
అవిశ్రాంతమనాః పూర్ణమాపదాం పరమాస్పదమ్ ।
నీడం రోగవిహంగానామాయురాయాసనం దృఢమ్ "I 15
ప్రత్యహం భేద ముత్సృజ్య శనైరలమనారతమ్ ।
ఆఖునేవ జరచ్చ్వభ్రం కాలేన వినిహన్యతే ॥ 16
ఆయువే అశాంతి, అతృప్తి, పరిశ్రమలకు కారణము, రోగములను పక్షులకు గూడు. ఎలుకలు
కష్టములకు భయపడక, ప్రతిదినము కలుగును ద్రవ్వునట్లు, కాలముగూడ ఆయువు నుత్తరించుచున్నది.
శరీరబిలవిశ్రాంతైర్విషదాహప్రదాయిభిః |
రోగైరాపీయతే రౌధైర్వ్యాలైరివ వనానిలః ॥ 17
అరణ్యవాయువును సర్పములు క్రోలునట్లు, శరీర బిలమున నున్న రోగము లాయువును బీల్చుచున్నవి;
వీటి స్వభావము క్రూరము. ఇవి విషమును బోలు లేపము నిచ్చును.
ప్రస్ను వానై రవిచ్ఛేదం తుచ్చైరంతరవాసిభిః ।
దుఃఖైరావృశ్చ్యతే క్రూరైర్హుణైరివ జరద్రుమః || 18
ఘుణమను పురుగు ఎండువారిన మ్రాను మొదలనుండి, పొట్టును జిమ్ముచు దాని నుత్తరించునట్లు
రోగాది దుఃఖములు శరీరమందుండి మలరక్తములను వెలువరించుచు, ఆయువును నశింపజేయుచున్నవి.
నూనం నిగరణాయాశు ఘనగరమనారతమ్ ।
ఆఖుర్మార్జారకేణేవ మరణే నావలో క్యతే 19
ఎలుకను మ్రింగ పిల్లి వేచియుండునట్లు, మృత్యువు జీవితమును గబళింప వేచియున్నది.
గంధాదిగుణ గర్భిణ్యా శూన్యయాఒ శక్తి వేశ్యయా
అన్నం మహాశనేనేవ జరయా పరిజీర్యతే॥ 20
రూపాది కృత్రిమగుణములు గల్గి శక్తిహీన యగు వేశ్యనుబోలి జర, ఆహార పుష్టి గల మనుజు
డెక్కుడుగ భోజన మొనర్చి హరించుకొనునట్లు, బలక్షయముతో బాటు ఆయువును జీర్ణమొనరించుకొనును.
76 యోగవాసిష్ఠము
దినైః కతిపయైరేవ పరిజ్ఞాయ గతాదరమ్
దుర్జనః సుజనేనేవ యౌవనే నావముచ్యతే "I 21
సుజనుడు దుష్టుని అల్పసమయముననే గుర్తించి నిరాదరణ పూర్వకముగ వానిని వదలునట్లు,
యౌవనముగూడ పురుషార్థప్రాప్తికై యత్న మొనరింపని పురుషుని నిరాదరణను దెలిసికొని, వానిని వెంటనే
వదలిపెట్టును. (అనగా యౌవన మనిత్య మనియు, బలశక్తులు కలిగియున్న సమయముననే మోక్షము కొఱకు
ప్రయత్నము సల్పవలె ననియు భావము.)
వినాశ సుహృదా నిత్యం జరామరణ బంధునా ।
రూపం లింగవరేణేవ కృతాంతే నాభిలష్యతే || 22
విటుడు సౌందర్యము నభిలషించునట్లు వినాశమునకును, జరామరణములకును మిత్రుడగు
యముడు ఆయువు నభిలషించును.
స్థిరతయా సుఖభాసితయా తయా సతత ముఖిత ముత్తమ ఫల్గు చ
జగతి నాస్తి తథా గుణవర్జితం మరణభాజన మాయురిదం యథా ॥ 23
ఇత్యార్షే వాసిష్ఠ-మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే జీవితగర్లో నామ చతుర్దశః సర్గః ॥ 14 |
ఆయువు సుఖవిహీనము, చంచలము, అతితుచ్ఛము, గుణవిహీనము, మరణభాజనము; జగత్తున
ఇట్టి వస్తువు మరొకటి లేదు.
ఇత్యార్షే వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున జీవితగర్షణమను చతుర్దశ సర్గము ॥ 14॥
అహంకార జుగుప్సా వర్ణనము -15
శ్రీరామ ఉవాచ :
ముథై వాభ్యుణ్ణితో మోహాత్ ముథైవ పరివర్ధతే।
మిథ్యామయేన భీతో ఒస్మి దురహంకారశత్రుణా || 1
శ్రీరాముడు: మోహమే, అనగా అజ్ఞానమే అహంకారమునకు మూలము; దీని ఉత్పత్తి స్థితులు వ్యర్థములు.
మిథ్యారూపమగు ఈ శత్రువనిన నాకు మిక్కుటమగు భయము.
అహంకారవశాదేవ దోషకోశకదర్థతామ్ ।
దదాతి దీనదీనానాం సంసారో వివిధాకృతిః 2 I
వైరాగ్యప్రకరణము (సర్గ - 15) 77
కర్మఫలపూర మగు సంసారమున జ్ఞానధనము లేని హీనులను, రాగద్వేషములున్న కోశమున కధిపతుల
జేయున దీయహంకారమే.
అహంకారవశాదావదహంకారాద్దు రాధయః ।
అహంకార వశాదీహా త్వహంకారో మమామయః ॥ 3
వ్యాధులు, చింతలు, కోర్కెలు, అహంకార వశముననే కలుగుచున్నవి; ఈ అహంకారమే నా రోగము.
తమహంకారమాశ్రిత్య పరమం చిరవైరిణమ్ ।
న భుంజే న పిబామ్యంభః కిము భోగాన్ భుజే మునే! 4
మునీంద్రా! ఇట్టి పరమ శత్రువగు అహంకారము నాశ్రయించి అన్నపానములను వదలి వైచితిని.
ఇంక భోగముల మాట యేమి?
సంసారరజనీ దీర్ఘా మాయా మనసి మోహినీ।
తతాహంకారదోషేణ కిరాతేనేవ వాగురా ॥ 50
కిరాతుడు వలను పన్నునట్లు, ఈ సంసారమను రాత్రియందు అహంకారముకూడ జీవుని మనస్సున
దీర్ఘమును, మోహరూపమును నగు వలను పన్నుచున్నది.
యాని దుఃఖాని దీర్ఘాణి విషమాణి మహాంతి చ |
అహంకారాత్ ప్రసూతాని తాన్యగాత్ ఖదిరా ఇవ ॥ 6
ఖదిరవృక్షములు పర్వతమునుండి పుట్టునట్లు, బహుకాల ముండు నవియు, నానావిధములును,
ప్రబలములును నగు దుఃఖములు అహంకారమునుండియే కలుగుచున్నవి.
శమేందు సైంహికే యాస్యం గుణసద్మ హిమాశనిమ్ ।
సామ్యమేమశరత్కాలమహంకారం త్యజామ్యహమ్ || 7
ఈ అహంకారము శమమను చంద్రునకు రాహువు, సుగుణములను పద్మములకు హిమరూపక
మగు వజ్రము, సర్వభూతదయ యను మేఘములకు శరత్కాలము; ఇద్దానిని విడుచుచున్నాను.
నాహం రామో న మే వాంఛా భావేషు న చ మే మనః ।
శాంత ఆసితు మిచ్ఛామి స్వాత్మనీవ జితో యథా ॥ 8
నేను రాముడను గాను, నాకు కోర్కెలు లేవు. నాకు మనస్సు లేదు, నేను బుద్దునివలె శాంతభావమున
సర్వభూతములను నావలె గాంచగోరెదను.
* జిత్ ఇతి వా పాఠః
78 యోగవాసిష్ఠము
అహంకారవశాద్యద్యన్మయా భుక్తం హుతం కృతమ్ ।
సర్వం తత్తదవస్త్యేన వస్త్యహంకారరిక్తతా ॥ 9
అహంకారవశుడనై నేను తినినది, వ్రేల్చినది, ఒనర్చినది, అన్నియు తుచ్ఛములు. అహంకారత్యాగమే సారవస్తువు.
అహమిత్యన్తిచేద్ బ్రహ్మన్నహమావది దుఃఖితః ।
నాస్తిచేత్ సుఖితస్తస్మాదనహంకారితా వరమ్ ॥ 10
'అహం' భావమున్న, ఆపదలందు 'అహం' పదవాచ్యుడ నగు నేను దుఃఖము ననుభవింపవలసి
యుండును; అహంకారము లేనిచో, మఱి దుఃఖము ననుభవించున దెవరు? దుఃఖము లేకపోవుటయే
సుఖము. అందువలన అహంభావము లేకపోవుటయే మంచిది.
అహంకారం పరిత్యజ్య మునే! శాన్తమనస్తయా।
అవతిష్టే గతోద్వేగో భోగౌఘో భంగురాస్పద ః 11
మునీ! నేనహంకారమును ద్యజించి మనశ్శాంతిని బడసి, ఉద్వేగ విహీనుడనైతిని. భోగ పదార్థములు
క్షణభంగురములు, ఇంద్రియాధీనములు; (వీటివలన నిట్టి స్థితి కలుగదు.)
బ్రహ్మన్! యావదహంకారవాద పరిజృంభతే
తావద్ వికాసమాయాతి తృష్ణాకుటజమంజరీ 12
మహాత్మా! అహంకార మేఘములు విస్తరించుచున్నంతవఱకు తృష్ణ యను కుటజమంజరులు
వికసించుచునే యుండును.
అహంకారమనే శాంతే తృష్ణా నవతడిల్లతా |
శాంతదీప శిఖావృత్యా క్వాలిపి యాత్యతిసత్వరమ్ । "I 13
అహంకార మేఘములు తేలిపోయిన, తృష్ణయను మెఱుపుతీగె ఆరిపోవు దీపమువలె ఎచ్చటికో
మాయమైపోవును.
అహంకారమహావింధ్యే మనోమత్త మహాగజః । |
విస్ఫూర్ణతి మనాస్ఫోటైః స్తనితైరివ వారిదః ॥ 14
మేఘము ఉఱుములతో నాడంబర మొనర్చునట్లు, మనస్సను మదపుటేనుగ అహంకారమను
వింధ్యపర్వత గుహలలో ఉత్సాహముతో విజృంభించుచుండును.
ఇహ దేహమహారణ్యే మనాహంకారకేసరీ ।
యోఒ యముల్లసతి స్పారస్తేనేదం జగదాతతమ్ ॥ 15
་
వైరాగ్యప్రకరణము (సర్గ - 15) 79
శరీరారణ్యమున నున్న, ఈ అహంకార సింహము నుండియే (సుకృత దుష్కృతఫలభోగ రూపమగు)
ఈ జగత్తు విస్తరిల్లుచున్నది.
తృష్ణాతంతులవప్రోతా బహుజన్మపరంపరా
అహంకారోగ్రఖింగేన కంఠే ముక్తావలీ కృతా ॥ 16
ఈ జన్మపరంపరలు తృష్ణయను దారమున గ్రుచ్చబడియున్నవి; దీనిని అహంకారమను విటుడు
ముత్యాలమాలవలె కంఠమున దాల్చినాడు.
పుత్రమిత్రకళత్రాదితంత్రమంత్ర వివర్జితమ్ ।
ప్రసారితమనేనేహ మునే హంకారవైరిణా ॥ 17
మునీ! పుత్రమిత్రకళత్రాది రూపకమగు వలను ఈఅహంకార శత్రువు మంత్రతంత్రముల సాయము
నపేక్షింపకయే పన్నినాడు *
ప్రమార్జితే 2 హమిత్యస్మిన్ పదే స్వయమపి ద్రుతమ్ |
ప్రమార్జితా భవంత్యేతే సర్వఏవ దురాధయః ॥ 18
అహంకారమును మొదలంట నరికి వైచిన తక్కిన బాధ లన్నియు తమంతట దామే తొలగిపోవును.
అహమిత్యంబుదే శాంతే శనైశ్చ శమశాతనీ ।
మనోగహనసమ్మోహమిహికా క్వాపి గచ్ఛతి ॥ 19
మనో గగనమున నున్న శాంతినాశిని యగు మోహమను మంచుబొట్టు, అహంకారమను పొగమంచు
తొలగినచో మాయమైపోవును.
నిరహంకారవృత్తేర్మే మౌర్ఖ్యాచ్ఛోకేన సీదతః
1
యత్కించిదుచితం బ్రహ్మంస్తదాఖ్యాతుమిహార్హన్ ॥ 20
బ్రహ్మజ్ఞా! నే నహంకారమును విడిచిపెట్టితిని. కాని అజ్ఞానవశమున దుఃఖము నందుచున్నాను.
నామంచి కవసరమగు దానిని వచింపుడు!
సర్వాపదాం నిలయమధ్రువ మంతరస్థ
మున్ముక్త ముత్తమగుణేన న సంశ్రయామి।
* లేక, అహంకారవైరిచే గూర్పబడిన ఈ పుత్రమిత్ర కళత్రాదులు, మంత్రతంత్రముల అవసర ముపేక్షింపకయే, మనుష్యుని
నేడ్పింతురు లేక మంత్రతంత్రముల వలనగూడ, ఈవలనుండి యీవల బడజాలము
- అన
80 యోగవాసిష్ఠము
యత్నాదహం కృతిపదం పరితో తిదుఃఖమ్ ।
21 శేషేణ మాం సమనుశాధి మహానుభావ! 21
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే అహంకార జుగుప్సా నామ పంచదశః సర్గః ॥ 15॥
మహానుభావా! సర్వాపదలకు నిలయమును, హృదయమునందలి సద్గుణము లన్నిటివలనను
ఖండింపబడి నదియు, దుఃఖప్రదమును నగు అహంకారమును ప్రయత్నముతో వివర్జించితిని. ఇక కర్తవ్య
మేమియో వచించి, నాకాత్మతత్యము నుపదేశింపుడు.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున అహంకారజుగుప్స యను పంచదశ సర్గము ॥ 15 ॥
వైరాగ్యచిత్త దౌరాత్మ్య వర్ణనము -16
శ్రీరామ ఉవాచ :
దో షైర్జర్జరతాం యాతి సత్కార్యాచార్య సేవనాత్ ।
వాతాన్తః పిచ్ఛలవవచ్చేతశ్చలతి చంచలమ్ ॥
శ్రీరాముడు: మనస్సు ముముక్షువుల కత్యంతావసరమగు సాధుసేవను విడిచి కామాది దోషముల నాశ్రయించి
శక్తిని గోల్పోవును; నెమిలిపింఛపు తుదికొన గాలిలో నూగులాడునటుల చంచలమై చలించుచుండును.
ఇతశ్చేతశ్చ సువ్యగ్రం వ్యర్థమేవాభిధావతి |
దూరాద్దూరతరం దీనం గ్రామే కౌలేయకో యథా ॥ 2
గ్రామమున కుక్క అటునిటు తిరుగులాడునట్లు, కారణము లేకుండగనే వ్యాకులమై దీనభావమున
దూరప్రదేశములు దిరుగులాడుచుండును.
న ప్రాప్నోతి క్వచిత్ కించిత్ ప్రాఫైరపి మహాధనైః |
నాంతః సంపూర్ణతామేతి కరణక ఇవాంబుభిః ॥ 3
దీని కెచ్చటను, ఏమియు దొఱకదు. గొప్పధనరాశి దొఱకినను దీనికడుపు *ఓటికుండవలె నిండదు.
నిత్యమేవ మునే! శూన్యం కదాశా వాగురావృతమ్ ।
న మనో నిర్వృతిం యాతి మృగో యూథాదివచ్యుతః ॥ 4
* మూలమున కరగుక మను శబ్దము ప్రయోగింపబడినది. కరగుకమన వెదుళ్లతోనల్లిన బుట్ట, దీనియందు నీళ్లు నిలువవు
కదా! - అను.
వైరాగ్యప్రకరణము (సర్గ - 16) 81
మునీ! దురాశ యను వలలో బడిన శూన్యచిత్తము, మందను వీడి వలలో బడిన లేడివలె శాంతిని
బొందజాలదు.
తరంగతరలాం వృత్తిం దధదాలూనశీర్ణతామ్ ।
పరిత్యజ్య క్షణమపి హృదయే యాతి న స్థితమ్ || 5
తరంగములవలె చంచల మగు మనస్సు, స్థూలసూక్ష్మావయవముల చింతను వీడి, హృదయమున
నొక్క నిమిషమైన స్థిరముగ నుండనేర
మనో మననవిక్షుబ్ధం దిశో దశ విధావతి ।
మందరాహననోద్ధూతం క్షీరార్ణవపయో యథా ॥ 6
మందర పర్వతమువలన మథింపబడిన క్షీరసముద్రమందలి నీటివలె, విషయానుచింతనమున
భిన్నమైన యీ మనస్సు దశ దిశలకు పరుగులిడుచున్నది.
కల్లోలకలితావర్తం మాయామకరమాలితమ్ |
న నిరోద్ధుం సమర్థోస్మి మనోమయమహార్ణవమ్
|| 7
వివిధములగు చిత్తవృత్తులవలన గల్పింపబడిన సుడిగుండములును, పరపంచన, క్రూరత్వములను
మొసళ్లును, ఈ మనసను మహాసముద్రమున నున్నవి; దీని నరికట్టలేకుంటిని.
భోగదూర్వాంకురాకాంక్షీ శ్వభ్రపాతమచింతయన్।
మనోహరిణకో బ్రహ్మన్! దూరం విపరిధావతి ॥ 8
మహాత్మా! మనస్సను లేడి కోర్కెలను పచ్చిగడ్డికై లోభముతో నరకమను గుంటలో పడుటనుగూర్చి
చింతింపక దూరముగ పరువు లిడుచున్నది.
న కదాచన మే చేతః స్వామాలూనవిశీర్ణతామ్ ।
త్యజత్యాకులయా వృత్త్యా చంచలత్వమివార్ణవః ॥
ఆకులములగు వృత్తులతో గూడుకొనియున్న నామనస్సు, సముద్రము చంచలత్వమును వీడలేనట్లు,
దేహచింతను వీడలేకున్నది.
చేతశ్చంచలయా వృత్త్యా చింతానిచయచంచురమ్ ।
ధృతిం బధ్నాతి నైకత్ర పంజరే కేసరీ యథా ॥ 10
మనస్సు స్వభావతః చంచలము; అన్యచింతలతో మరింత చంచల మైనది. శక్తి నంతయు వినియోగించి
నిరోధించినను, బోనులో నుంచబడిన సింహమువలె నొకచోట కుదురుకొని యుండజాలదు.
VI F6
82 యోగవాసిష్ఠము
మనో మోహరథారూఢం శరీరాత్ సమతాసుఖమ్ ।
హరత్యపహతోద్వేగం హంసః క్షీర మివాంభసః ॥ 11
మోహరథము నెక్కిన మనస్సు, హంస పాలను నీటినుండి వేఱుపరచి గైకొనునట్లు, ఉద్వేగ
నాశకరమగు సమరసత్వరూపక మగు ఆత్మజ్ఞానమును శరీరమునుండి వేఱుపరచి హరించుచున్నది.
అనల్పకల్పనాతల్పే విలీనాశ్చిత్తవృత్తయః । 1
మునీంద్ర! న ప్రబుధ్యంతే తన తప్యే హ మాకులః ॥ 12
మునీంద్రా! ద్వైతభావనా రూపకమగు వివిధకల్పనలను శయ్యయందు పరుండిన చిత్తవృత్తులు,
ఆచార్యోపదేశము నందినను మేల్కొనవు; అందువలననే నేను మిక్కుటముగ విచారించుచున్నాను.
క్రోడీకృత దృఢగ్రంథి తృష్ణాసూత్రే స్థితాత్మనా |
విహగో జాలకేనేవ బ్రహ్మన్! బద్ధో 2 స్మి చేతసా ॥ 13
మహాత్మా! వేటకాడు వాగురులను పన్ని, దారమును చేతనుంచుకొని, దూరమున పొంచియుండి,
పక్షు లందుబడినప్పుడు దారమును లాగి ముడిపడునట్లొనర్చి, వాటిని బంధించునట్లు; చిత్తము తృష్ణయను
సూత్రమును మమతయను క్రోడమున నుంచుకొని నన్ను బంధించుచున్నది.
సంతతామర్షధూమేన చింతజ్వాలాకులేన చ ।
వహ్నినేవ తృణం శుష్కం మునే! దగ్గోస్మి చేతసా ॥ 14
మునివరా! ప్రబలమగు రోషమను ధూమముచే నావృతమై, చింతలను జ్వాలలతో గూడిన అగ్నింబోలు
నాచిత్తము, ఎండుగడ్డినిబోలు నన్ను దహించుచున్నది.
క్రూరేణ జడతాం యాత స్తృష్ణా భార్యానుగామినా 1
శవం కౌలేయకేనేవ బ్రహ్మన్! భుక్తో2 స్మి చేతసా ॥ 15
బ్రహ్మజ్ఞా! క్రూరమగు చిత్తము తృష్ణయను భార్య అనుసరించుచు జ్ఞానవిహీనుడనగు నన్ను కుక్క
అచేతనశవమును భక్షించునట్లు భక్షించుచున్నది.
తరంగతరలాస్ఫాలవృత్తినా జడరూపిణా |
తటవృక్ష ఇవౌఘేన బ్రహ్మన్! నీతో 2 స్మిచేతసా || 16
బ్రాహ్మణుడా! గట్లుగొట్టుకొను నదీతరంగములు గట్టున నున్న చెట్టును బడగొట్టునట్లు అలలవలె
చంచలమును, కోరిన విషయములు లభింపకపోవుటవలన ఘాతప్రతిఘాతముల నందినదియు నగు చిత్తము
నన్ను పడగొట్టుచున్నది.
వైరాగ్యప్రకరణము (సర్గ - 16) 83 33
అవాంతరనిపాతాయ శూన్యే వా భ్రమణాయ చ ।
తృణం చండానిలేనేవ దూరే నీతో స్మి చేతసా ॥ 17
సుడిగాలి దూరమున పడవేయుటకు గాని, లేక ఆకాశమధ్యమున ద్రిప్పుటకు గాని, గడ్డిపరకను
దీసికొనిపోవునట్లు; చిత్తము నన్ను మధ్యపదములగు స్వర్గాదిభోగముల ననుభవింపజేయుటకో లేక
శూన్యస్వరూపమగు ఈ పృథివి యందు కీటక పతంగాది నానారూపముల భ్రమింపజేయుటకో తీసికొని
పోవుచున్నది.
సంసారజలధేరస్మాన్నిత్య ముక్తరణోన్ముఖః |
సేతునేవ పయఃపూరో రోధితోస్మి కుచేతసా ॥ ॥ 18
జలప్రవాహము అడ్డుకట్టిన నాగిపోవునట్లు, సంసార సాగరమునుండి బయటపడుటకు
యత్నించుచున్న నేను, దుష్టచిత్తమువలన నవరోధింపబడు చున్నాను.
పాతాలాద్గచ్ఛతా పృథ్వీం పృథ్వ్యా: పాతాల గామినా |
కూపకాష్ఠం దామేవ వేష్టితోస్మి కుచేతసా || 19
కట్టబడిన త్రాటివలన ఏతము క్రిందకు మీదకు బోవునట్లు, నేను మంచిచెడ్డలగు తలంపులతో
స్వర్గనరకముల కఱుగుచు వచ్చుచున్న మనస్సువలన బంధింపబడి యున్నాను.
మిథ్యైవ స్పారరూపేణ విచారాద్విశరారుణా
బాలో వేతాళకేనేవ గృహీతో 2 స్మి కుచేతసా ॥ 20
బాలకుడు భూతగ్రస్తు డగునట్లు కల్పితమును, మిథ్యయు నగు చిత్తమువలన నేను గ్రహింపబడి
యున్నాను.
వహ్నే రుష్టతరః శైలాదపి కష్టతరక్రమః ।
వజ్రాదపి దృడో బ్రహ్మన్! దుర్నిగ్రహమనోగ్రహః 21
బ్రాహ్మణుడా! మనస్సను ఈ భూతమును నిగ్రహించుట చాలకష్టము. ఇది అగ్నికంటె నెక్కుడుగ
తాపము నిచ్చును. దీని నతిక్రమించుట పర్వతమును దాటుటకంటె కష్టతరము. ఇది వజ్రముకంటె
కఠినమైనది.
చేతః పతతి కార్యేషు విహగః స్వామిషేష్వివ
క్షణేన విరతిం యాతి బాల క్రీడనకాదివ ॥
"I 22
పక్షులు మాంసమును జూచిన ఆకాశమునుండి దిగి దానిమీద బడునట్లు, చిత్తము సతతము
84 యోగవాసిష్ఠము
విషయములమీద వ్రాలుచున్నది. మఱియు బాలుడు ఆటలు దొఱకినచో చదువును విడిచిపెట్టునట్లు,
చిరాభ్యస్తములగు ధ్యానాది సత్ వ్యాపారములను క్షణములో విడిచి పెట్టుచున్నది.
జడప్రకృతిరాలోలో వితతావర్త వృత్తిమాన్।
మనో స్ధిరహితవ్యాలో దూరం నయతి తాత! మామ్ II 23 23
వృత్తులను పెద్ద సుడిగుండములు గలదియు, కామాది రిపుషట్కములను సర్పములతో గూడినదియు
నగు, కల్లోల మనోసముద్రము నన్ను దూరమునకు దీసికొని పోవుచున్నది.
అప్యబ్ధి పానాన్మహతః సుమేరూన్మూలనాదపి ।
అపి వహ్న్యశనాత్ సాధో విషమ శ్చిత్తనిగ్రహః ॥ 11 24
సాధువర్యా! మనస్సును వశపరచుకొనుట, సముద్రపానముకంటెను, మేరుపర్వతమును
పెకలించుటకంటెను, అగ్నిని భక్షించుటకంటెను కష్టతరము.
చిత్తం కారణమర్థానాం తస్మిన్ సతి జగత్రయమ్ |
తస్మిన్ క్షీణే జగత్ క్షీణం తచ్చికిత్స్యం ప్రయత్నతః ॥ 25
విషయములకు గారణము చిత్తమే. చిత్తమున్న మూడులోకములకును అస్తిత్వ మున్నది. చిత్తము
అనగా వాంఛలు నశించిన జగత్తున్ను క్షీణమగును. అందువలన, రోగచికిత్స నొనర్చునట్లు ప్రయత్నముతో,
మనశ్చికిత్స నొనర్పదగును.
చిత్తాదిమాని సుఖదుఃఖశతాని నూన
మభ్యాగతానవ్యగవరాదివ కాననాని ।
తస్మిన్ వివేకవశతస్తనుతాం ప్రయాతే
మన్యే మునే! నిపుణమేవ గలంతి తాని ॥ 26
మునీంద్రా! శతశతములగు ఈసుఖదుఃఖము లన్నియు, పెద్ద పెద్ద పర్వతములనుండి అరణ్యములు
వెలువడునట్లు, మనస్సునుండియే నిశ్చయముగ జనించుచున్నవి. వివేకమువలన మనోలయమైన ఈసుఖ
దుఃఖము లన్నియు నశించునని తలపోయుచున్నాను.
సకలగుణజయాశా యత్ర బద్దా మహద్భి
స్తమరిమిహ విజేతుం చిత్తమభ్యుర్థితో 2 హమ్ ।
1
విగతరతితయాన్తర్నాభినందామి లక్ష్మీం
జడమలినవిలాసాం మేమలేఖామివేందుః ॥ 27 22
వైరాగ్యప్రకరణము (సర్గ - 17) 85
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే చిత్తదౌరాత్మ్యం నామ షోడశః సర్గః ॥ 16 ॥
ముముక్షువు లెద్దానిని జయించి, అవిద్యాకామ కర్మముల బారినుండి బయటపడి; శాంత్యాది
సద్గుణముల కధిపతు లగుదురో, అట్టి చిత్తమును ఇప్పుడే జయింప గోరుచున్నాను. జలభారమున నీలిరంగును
దాల్చిన మేఘమును చంద్రుడు గోరనట్లు, అజ్ఞాన కళంకితులగు జనులను సంతోషపెట్టు లక్ష్మిని నేను
గోరు -- నాకు రుచింపదు.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున చిత్త దౌరాత్మ్యమను షోడశ సర్గము ॥ 16 ॥
తృష్ణా భంగవర్ణనము -17
శ్రీరామ ఉవాచ:
హార్దాంధకార శర్వర్యా తృష్ణయేహ దురంతయా |
స్ఫురంతి చేతనాకాశే దోషాః కౌశిక పంక్తయః II 1
శ్రీరాముడు: తృష్ణను ఖండించుట చాలకష్టము; ఇది ఆత్మతత్త్వమును మరగుపరచు రాత్రి. ఈరాత్రియందు
రాగద్వేషాదులను గ్రుడ్లగూబలు జీవుడను ఆకాశమున విహరించుచుండును.
అంతర్దాహప్రదాయిన్యాసమూఢరసమార్దవః ।
పంక ఆదిత్యదీప్త్యేవ శోషం నీతో స్మి చింతయా ॥ 2
సూర్యకిరణములు బురదను ఎండజేయునట్లు, హృదయతాపమును గలిగించు చింత దయా
వినయాది గుణములను శుష్కింపజేసి నా హృదయమును శూన్య మొనర్చుచున్నది.
మమ చిత్తమహారణ్యే వ్యామోహతిమిరాకులే |
శూన్యతాండవినీ జాతా భృశమాశాపిశాచికా 3
అజ్ఞానావృతమై విచారహీనమగు నామానసమను శూన్యారణ్య ప్రదేశమున ఆశయను పిశాచిని
తాండవము సల్పుచున్నది.
వచోరచితనీహారా కాంచనోపవనోజ్జ్వలా |
నూనం వికాసమాయాతి చింతాచణకమంజరీ || 4
చింతలను * చణకమంజరులు విలాపవాక్యములను హిమకణములవలన వికసించుచున్నవి.
బంగారమను ఉపవనము దీనికి శోభను గూర్చుచున్నది.
* చణక శబ్దార్థము సెనగ, మంజరులన మొగ్గలు, -- అను.
86 యోగవాసిష్ఠము
అలమంతరమాయైవ తృష్ణా తరలితాశయా |
ఆయాతా విషమోల్లాసమూర్మిరంబునిధావివ॥ 5
తరంగములు సముద్రమును గలచుచు లేచుచు సుడిగుండములను గల్పించుటకే; అట్లే తృష్ణయు
మాయారూప మగు మనఃక్షోభమును లేవదీసి, ధనార్జనాది భ్రమలను గల్పించుటకే సంచరించుచుండును.
ఉద్దామకల్లో లరవా దేహాద్రౌ వహతీహ మే ।
తరంగతరలాకారా తరతృష్ణాతరంగిణీ
|| 6
తృష్ణ నానావిధ విషయముల సంచరించుచుండును; దీని తరంగములు నా శరీరమను పర్వతమున
బ్రవహించుచున్నవి-ప్రవృత్తియే దీని తరంగములు. అసత్యవచనములు, పరనిందాది కుత్సిత భాషణములే
ఈ తరంగముల ధ్వనులు.
వేగం సంరోద్దుముదితో వాత్యయేవ జరతృణమ్ ।
నీతః కలుషయా క్వాపి తృష్ణయా చిత్తచాతకః ॥ 7
ఎండుగడ్డి గాలిచే నెగురకొట్టబడి ఎక్కడకోపోయి పడునట్లు, నామనస్సను చాతక పక్షి తృష్ణావేగమును
వారింప యత్నించియు, విఫలమై అనిర్దిష్టస్థలముల వ్రాలుచున్నది. (చాతకము మేఘజలములను దక్క
నితరముల ద్రావదను సంగతి లోక ప్రసిద్ధము. దాహమైనప్పు డటునిటు తిరుగుచు చెట్లకొమ్మలందు వ్రాలి
మేఘముల నాశించును. కాని దాహమెక్కు డగుటచే నక్కడ నిలువ జాలక మరొకచోట కెగిరిపోవును. అట్లే
మనస్సుగూడ ధర్మమేఘసమాధి రూపకమగు పరమపురుషార్థము నాశించి, ప్రయత్నించుచు, తృష్ణచే నీడ్వబడి
యత్నములచే నిలుకడ లేనిదని భావము.)
యాం యామహమతీవార్థం సంశ్రయామి గుణశ్రియమ్ |
తాం తాం కృంతతి మే తృష్ణా తంత్రీమివ కుమూషికా ॥ 8
మూషికము వీణతీగలను కొఱికివేయునట్లు, తృష్ణయు నేనాశ్రయించు వివేక వైరాగ్యాది గుణముల
నాశన మొనర్చుచున్నది.
పయనీవ జరత్పర్లం వాయావివ జరతృణమ్ ।
నభసీవ శరన్మేమశ్చింతాచక్రే భ్రమామ్యహమ్ ॥ 9 "
సుడిగుండమునందలి ఎండుటాకువలెను, సుడిగాలిలోని ఎండుగడ్డి పరకవలెను, ఆకాశము నందలి
శరన్మేఘములవలెను, చింతాచక్రమునబడి నేను పరిభ్రమించుచున్నాడను.
గంతుమాస్పదమాత్మీయమసమర్థధియో వయమ్ ।
చింతాజాలే విముహ్యామో జాలే శకునయో యథా ॥ 10
వైరాగ్యప్రకరణము (సర్గ - 17) 87
బుద్ధియోగమున స్వస్వరూప ప్రాప్తి నందలేక, పక్షులు మోసపోయి వలలో పడునట్లు చింతాజాలముల
బడి, మోహితుల మగుచున్నాము.
తృష్ణాభిధానయా తాత! దగ్గో స్మి జ్వాలయా తథా |
యథా దాహోపశమనమాశంకే నామృతైరపి 11 11
మునీంద్రా! తృష్ణాజ్వాలలబడి దగ్ధుడ నైతిని. అమృతమువలననైన నీతాపము తీరునా అని
యనుకొనుచున్నాను.
దూరం దూరమితో గత్వా సమేత్య చ పునఃపునః।
భ్రమత్యాశు దిగంతేషు తృష్ణోన్మత్తా తురంగమి ॥ 12
తృష్ణయను గుఱ్ఱము మాటిమాటికి స్వస్థానము నుండి దూరప్రదేశమున కఱిగి, మరల వెనుకకు
తిరిగి వచ్చుచు, దిగంతముల సంచరించుచున్నది.
జడసంసర్గిణీ తృష్ణా కృతోర్ధ్వాధోగమాగమా।
క్షుబ్షా గ్రంథమతీ నిత్యమారఘట్టాగ్ర రజ్జవత్ ॥ 13
అజ్ఞాన సంబంధము కలదియు, సంచలనము కలదియు, భోక్తృ, భోగ్య, తాదాత్మ్య, సంసర్గ,
అధ్యాసలను గ్రంథులు గలదియు, ధర్మాధర్మ విషయముల ననుసరించుటవలన స్వర్గనరకములకు బోవుచు
వచ్చుచున్నదియు నగు తృష్ణ ఘటీయంత్రమువలె నున్నది.
అంతర్గథితయా దేహే సర్వదుశ్ఛేదయా నయా |
రజ్జ్వేనాశు బలీవర్దస్తృష్ణయా వాహ్యతే జనః ॥
14
ముక్కుకు త్రాడు కుట్టుబడిన యెద్దువలె, త్రెంపనలవికాని తృష్ణా సూత్రముచే బంధింపబడిన మనుజుడు,
ఐహికాముష్మిక ఫలరూప మగు భారమును వ్యర్థముగ మోయుచున్నాడు.
పుత్రమిత్రకళత్రాదితృష్ణయా నిత్యకృష్ణయా |
ఖగేష్వివ కిరాత్యేదం జాలం లోకేషు రచ్యతే
|| 15
కిరాతుని భార్య పక్షులను బట్ట వలను పన్నునట్లు, తృష్ణ లోకులను బడద్రోయుటకుగాను పుత్రమిత్ర
కలత్రాది రూపకమగు వలను పన్నుచున్నది.
భీషయత్యపి ధీరం మామంధయత్యపి సేక్షణమ్ ।
భేదయత్యపి సానందం తృష్ణా కృష్ణవ శర్వరీ । || 16
తృష్ణ చీకటి రాత్రివంటిది - నేను ధీరుడ నైనను అది నాకు భయమును గలిగించుచున్నది. కళ్లున్నను
88 యోగవాసిష్ఠము
గ్రుడ్డిగ నొనర్చినది. ఆనందస్వరూపుడ నగు నాకు దుఃఖమును గలిగించుచున్నది.
కుటిలా కోమలస్పర్శా విషవైషమ్యశంసినీ ।
దశత్యపి మనాక్ స్పృష్ణా తృష్ణా కృష్ణవ భోగినీ ॥ 17
వక్రగమనము, కోమల స్పర్శ గలదియు, విషమును గుఱిపించునదియు నగు తృష్ణయను నీ నల్ల
త్రాచును ఒకింత స్పృశించినను కఱచును.
భిందతీ హృదయం పుంసాం మాయామయవిధాయినీ।
దౌర్భాగ్యదాయినీ దీనా తృష్ణా కృష్ణవ రాక్షసీ "I 18
నల్లరక్కసింబోలు తృష్ణ, దురదృష్టమునకు గారణము - మాయామయ ప్రపంచమును
గల్పించుచున్నది; మానవ హృదయములను భేదించుచున్నది.
తంద్రీతంత్రీగణై: కోశం దధానా పరివేష్టితమ్ |
నానందే రాజతే బ్రహ్మం సృష్ణా జర్జరవల్లకీ ॥
|| 19
బ్రహ్మజ్ఞా! ! పాడువడిన బుఱ్ఱకల వీణ ఆనందోత్సవములందు నుపయోగ పడనట్లు; నిద్రతోడను,
నాడీసమూహములతోడను గూడిన శరీరకోశమున నున్న తృష్ణ ఆనందతత్త్వమును బ్రకాశింపజేయజాలదు.
నిత్యమేవాతిమలినా కటుకోన్మాదదాయినీ।
దీర్ఘతంత్రీ మనస్నేహా తృష్ణా గహ్వర వల్లరీ "I 20
హృదయమను పర్వతగుహయందు పుట్టిన తృష్ణయను లత అతి మలినమును నీచమునునై యున్నది.
(నీచప్రకృతి యగుటవలన నికృష్టమును, సూర్యకిరణములు సోకకపోవుటవలన మలినము అని గ్రహించవలెను)
కోర్కెలు ఫలింపనందువలన పిచ్చిని గలిగించును; దీని పరిణామము దుఃఖము. దీని తీగెలు పొడవైనవి;
మోహదాయకములు.
అనానందకరీ శూన్యా నిష్ఫలా వ్యర్థమున్నతా I
అమంగలకరీ క్రూరా తృష్ణా క్షీణేన మంజరీ ॥ 21
వాడిపోయిన మొగ్గల గుత్తివలె తృష్ణాపుష్ప విహీనయును, ఫలశూన్యయును, వ్యర్థమును నైయున్నది.
క్రూరకంటకము (ముట్లు) వలె కష్టమును గూర్చును.
అనావర్జితచిత్తాం. ఏ సర్వమేవానుధావతి ।
న చాప్నోతి ఫలం కించిత్ తృష్ణా జీరేవ కామినీ॥ 22
వృద్ధవేశ్యవలె, మనస్సును లోబరచుకొనలేక పోయినను, అది అందరివెంట పరుగిడును; దీనివలన
వైరాగ్యప్రకరణము (సర్గ - 17) 89
ఫలము ఒకించుకైనను లభింపదు.
సంసారబృందే మహతి నానారససమాకులే |
భువనాభోగరంగేషు తృష్ణా జరఠనర్తకీ ॥ "I 23
సంసారము శోకమోహాది రసములతో గూడిన భోగనాట్యరంగము; తృష్ణ ఇందలి పరిపక్వ నర్తకి.
జరా కుసుమితారూఢా పాతోత్పాతఫలావలిః ॥ I
సంసారజంగలే దీర్ఘ తృష్ణావిషలతా తతా ॥ 24
విశాలమగు సంసారారణ్యమున తృష్ణయను విషలత దీర్ఘముగ వ్యాపించి యున్నది; జరయే దీని
పుష్పములు. హెచ్చుతగ్గులే దీని ఫలములు.
యన్న శక్నోతి తత్రాపి ధత్తే తాండవితాం గతిమ్
1
నృత్యత్యానందరహితం తృష్ణా జీర్ణేవ నర్తకీ || 25
వృద్ద నర్తకివలె తృష్ణ సాధింప వీలులేని తావులకు గూడ తాండవ మొనర్పబోవును; అఱిగి,
నిరుత్సాహముతోడ నృత్యము నొనర్చును.
భృశం స్ఫురతి నీహారే శామ్యత్యాలోక ఆగతే |
దుర్గం ఘ్యేషు పదం ధత్తే చింతా చపలబర్హిణీ ॥
I 26
చంచలమగు నెమలి వర్షాగమమును సూచించు మేఘావరణమును గాంచి నృత్యము సల్పునట్లును;
చొరరానిచోట్ల కఱిగి గూటిని గట్టుకొనునట్లును, చపలచిత్తముతో మోహావరణమున నృత్యము సల్పును;
అప్రాప్య విషయముల నాసక్తి గొనును; శరత్కాలము రాగా సూర్యుడు ప్రకాశించినచో నెమళ్ళ నాట్య మాగి
పోవును; అట్లే, వివేక మను వెలుగు పొడసూపిన మోహము మాసిపోవును.
జడకల్లో లబహులా చిరం శూన్యాంతరాంతరా ।
క్షణముల్లాసమాయాతి తృష్ణా ప్రావృటరంగిణీ 11 27
వర్షాకాలమందలి ఏఱువలె, తృష్ణ అజ్ఞాన తరంగములతోడను, జ్ఞానోదయ మైన పిదప శూన్యతను
పొందుచు క్షణకాలముమాత్రమే ఉల్లసిల్లుచున్నది.
నష్టముత్సృజ్య తిష్ఠనం తృష్ణా వృక్షమివాపరమ్ ।
పురుషాత్ పురుషం యాతి తృష్ణా లోలేవ పక్షిణీ || 28
ఆకలిదప్పుల వలన బాధపడుచు పండ్లు లేని చెట్టును వీడి మరొకచెట్టు నాశ్రయించు చంచలపక్షివలె,
90 యోగవాసిష్ఠము
తృష్ణ ఒకానొ క పురుషుని వీడి, మరొకనిని ఆశ్రయించుచుండును.
పదం కరోత్యలం ఘ్యే పి తృప్తాపి వలమాహతే |
చిరం తిష్ఠతి నైకత్ర తృష్ణా చపలమర్కటీ 29
తృష్ణయను చపలమర్కట మొకచోట నుండదు. పొందవీలులేని వస్తువులను బడయుటకు దుముకు
లిడును. తృప్తి నందినను, ఇతరవిషయములను వాంఛించును.
ఇదం కృత్వేదమాయాతి సర్వమేవాసమంజసమ్ |
అనారతం చ యతతే తృష్ణా చేష్టేవ దైవికీ 50 "I 30
'ఇది మంచిపని' అని ఒకదానిని ఆరంభించి అది ముగియక మునుపే అద్దానిని అశుభకార్యముగ
నెంచి మరొకకార్యము నారంభించుచు, 'విసుగు విరామము' లేకుండ శుభాశుభ ఫలములకొఱకు తృష్ణ
యత్నించుచునే యుండును. అందువలన ప్రాణుల కర్మల ననుసరించి ఫలముల నొసగు బ్రహ్మదేవుని
యత్నముతో నిద్దానిని బోల్ఫనగును.
క్షణమాయాతి పాతాలం క్షణం యాతి నభఃస్థలమ్
క్షణం భ్రమతి దిక్కుంజే తృష్ణా హృత్పద్మషట్పదీ II 31
హృత్కమల భ్రమర మగు తృష్ణ ఒక క్షణమున పాతాళమునను, మతొక క్షణమున ఆకాశమునను,
ఇంకొక క్షణమున దిక్కుంజము (దిక్కులను పొద) లందును విహరించుచుండును.
సర్వసంసారదోషాణాం తృష్ణకా దీర్ఘదుఃఖదా।
అంతఃపురస్థమని యా యోజయత్యతిసంకటే ॥ 32 I
సంసారమందున్న దోషము లన్నిటిలో, తృష్ణయే దీర్ఘదుఃఖమును గల్పించుచున్నది. అంతఃపురమున
నున్నవానిని గూడ (ధనాది ఆశలను జూపెట్టి) అతిసంకట ప్రదేశముల కాకర్షించును.
ప్రయచ్ఛతి పరం జాడ్యం పరమాలోకరోధినీ।
మోహం నీహారగహనా తృష్ణా జలదమాలికా ॥ 33
మంచుతో గూడిన మేఘముల గుంపు చలిని గలిగించి, సూర్యుని గప్పివేయునట్లు, మోహముతో
గూడిన తృష్ణ అజ్ఞానమును గలిగించి, ఆత్మజ్ఞానమును గప్పివేయుచున్నది.
సర్వేషాం జంతుజాతానాం సంసారవ్యవహారిణామ్ |
పరిప్రోతమనోమాలా తృష్ణా బంధనరజ్ఞావత్ ॥ 34
వైరాగ్యప్రకరణము (సర్గ - 17) 91
బహుపశువుల మెడలకు గట్టబడిన త్రాడు, మరొక పెద్ద త్రాటికి గట్టబడునట్లు, ఈ సంసారమున
చరించు జీవుల మనస్సు తృష్ణయను త్రాటికి గట్టబడియున్నది.
విచిత్రవర్ణా విగుణా దీర్ఘా మలినసంస్థితిః |
శూన్యా శూన్యపదా తృష్ణా శక్రకార్ముకధర్మిణీ || 35
తృష్ణకును ఇంద్రధనుస్సునకును సామాన్య ధర్మము లున్నవి; ఇంద్రధనుస్సు విచిత్రములగు
వర్ణములతో గూడియున్నది. విగుణ అనగా అల్లెత్రాడు లేనిది. పొడుగైనది. మలినములగు మేఘములపై
శూన్యమగు ఆకాశమున గల్పింపబడినది; అట్లే, తృష్ణయు విచిత్రములగు వివిధ విషయములతో గూడిన
సమ్మోహ రూపమును దాల్చి, అసద్గుణములతో వెలయుచున్నది. మరియు నిది, మలిన పురుషుని మనస్సున
గల్పింపబడిన అవస్తువు.
ఆశానిర్గుణసస్యానాం ఫలితా శరదాపదామ్ |
హిమం సంవిత్ సరోజానం తమసాం దీర్ఘయామినీ 11 36
ఈతృష్ణ - వివేకాది సుగుణములను పైరులకు పిడుగు; ఆపదలపంట కనువగు శరత్కాలము;
జ్ఞానకమలములకు మంచు; అజ్ఞానమునకు హేమంతరాత్రి.
సంసారనాటకనటీ కార్యాలయవిహంగమి |
మానసారణ్యహరిణీ స్మరసంగీతవల్లకీ 11 37
ఈతృష్ణ - సంసారమను నాటకరంగ మందలి నటి. ప్రవృత్తి యను గూటియందుండు పక్షి. మనస్సను
అరణ్యమున తిరుగు చంచలహరిణము. కోర్కెలను సంగీతమును ధ్వనించు వీణ.
వ్యవహారాబ్ధిలహరీ మోహమాతంగశృంఖలా |
సర్గన్యగ్రోధసులతా దుఃఖకైరవచంద్రికా ॥ 38
తృష్ణయే వ్యవహార ప్రపంచమందలి అలలను గల్పించుచున్నది. తృష్ణయే మోహమను ఏనుగును
బంధించుచున్నది. దీనివలననే, సంసార వటవృక్షముయొక్క ఊడలు దిగుచున్నవి. ఇదియే దుఃఖములను
కలువల వికసింపజేయు వెన్నెల.
జరామరణదుఃఖానామేకా రత్నసముద్దికా |
ఆదివ్యాధివిలాసానాం నిత్యం మత్తా విలాసినీ ॥ 39
జరామరణ దుఃఖములను రత్నపేటికయే, తృష్ణయను విలాసిని కడనున్నది. ఆధివ్యాధులె దాని
సంతోష సామగ్రి.
92 యోగవాసిష్ఠము
క్షణపూలోకవిమలా సాంధకారలవా క్షణమ్ 1
వ్యోమవీథ్యువమా తృష్ణా నీహారగహనా క్షణమ్ 40 40
తృష్ణయను ఆకాశమున - అప్పుడప్పుడు వివేకమను వెలుగు వెలుగుచుండును. అప్పుడప్పుడు ఆవి
వేకమును అంధకారము క్రమ్ముచుండును; అప్పుడప్పుడు అజ్ఞానమను మంచు ఆవరించుచుండును.
గచ్ఛత్యువశమం తృష్ణా కాయవ్యాయామశాంతయే |
తమి ఘనతమః కృష్ణా యథా రక్షోనివృత్తయే "I 41
మేఘములతో క్రమ్మువడిన రాత్రి ముగిసినపుడు రాక్షసులు పలాయన మొనరించునట్లు, తృష్ణ
ఉపశమించిన దేహపరిశ్రమకూడ నాశన మగును - ముక్తి లభించును.
తావన్ముహ్యత్యయం మూకో లోకో విలులితాశయః |
యావదేవానుసంధత్తే తృష్ణా విషవిషూచికా ॥ 42
విషూచి (కలరా) వ్యాధిచే బాధపడు మనుజుడు, అది తగ్గనంతవఱకు మాటలాడు శక్తిని గోల్పోయి,
మూర్ఛితుడై పడియుండునట్లు; సంసారియు తృష్ణోపశమనము కానంతవఱకు, వేదాంతశాస్త్రమున మూగయై,
వ్యాకులచిత్తుడై, మోహగ్రస్తుడై పడియుండును.
లోకోఒయ మఖిలం దుఃఖం చింతయోఙ్ఞతయోఙ్ఞతి |
తృష్ణా విషూచికామంత్రశ్చింతాత్యాగో హి కథ్యతే "I 43
చింతావర్ణనమే తృష్ణయను విషూచివ్యాధికి మహౌషధము అని చెప్పబడుచున్నది. చింతలను దృజించిన
లోకులు దుఃఖమును తప్పించుకొందురు.
తృణపాషాణకాష్ఠాది సర్వమామిషశంకయా ।
ఆదదానా స్ఫురత్యంతే తృష్ణా మత్స్యహ్రదే యథా ॥ 44
చెఱువునీటనుండి మాంసమను భ్రమతో తృణపాషాణ కాష్ఠాదులను కఱచికఱచి, తుదకు ఎర
కాశించి, చంపబడు చేపవంటి దీ తృష్ణ
రోగార్తిరంగనా తృష్ణా గంభీరమపి మానవమ్ ।
ఉత్తానతాం నయత్యాశు సూర్యాంశవ ఇవాంబుజమ్ ॥ 45
సూర్యకిరణములు పద్మమును ఊర్ధ్వవికసిత మొనర్చునట్లు; రోగపీడయు, స్త్రీ వాంఛయు ధీరుడగు
మనుజునిగూడ అధీరు నొనర్చి వైచును.
వైరాగ్యప్రకరణము (సర్గ - 17) 93
అంతఃశూన్యా గ్రంథిమతో దీర్ఘస్వాంకురకంటకాః |
ముక్తామణిప్రియా నిత్యం తృష్ణా వేణులతా ఇవ ॥ 46
తృష్ణయను వెదురు సారహీనమైనది. జడపదార్థముల చేతనబుద్ధి యను కణుపులు దీనికున్నవి.
చింతాద్వేషములు దీని కంటకాంకురములు. విషయము లను ప్రీతిం గొల్పు ముత్యముల నిది గోరును.
అహోబత మహచ్చిత్రం తృష్ణామపి మహాధియః | ॥
దుశ్ఛేదామవి కృంతంతి వివేకేనామలాసినా | 47
ఆహా! ఏమి ఆశ్చర్యము! అచ్ఛేద్యమైన యీ తృష్ణను బుద్ధిమంతులు వివేకమను నిశితఖడ్గముతో
కరుకుచున్నారు.
నాసిధారా న వజ్రార్చిర్నతప్తాయః కణార్చిషః |
తథా తీక్షా యథా బ్రహ్మంసృష్లేయం హృది సంస్థితా || 48
బ్రహ్మజ్ఞుడా! హృదయమున మెలంగు ఈ తృష్ణ ఖడ్గపు కొనకంటేను, వజ్రముకంటెను. కాలుచున్న
ఇనుపగుండ్ల మంటలకంటెను తీక్షణమైనది.
ఉజ్జ్వలాసితతీక్షాగ్రా స్నేహదీర్ఘదశా పరా ॥
ప్రకాశాదాహదు:స్పర్శా తృష్ణా దీపశిఖా ఇవ ॥ 49
తృష్ణ దీపజ్వాలవలె నుజ్జ్వలమై పొడుగాటి వత్తిని గలిగి, మలినమగు కొనతో ముట్టుకొనిన కష్టమును
కలిగించుచు, దీర్ఘకాలము వెలయునదై యున్నది. (అనగా, తృష్ణ బాల్యయౌవనములందు అత్యంతాసక్తిని
కల్పించుచు, చాలకాల ముండును. భోగాంతమున దీపపు కొడివలె కష్టము నిచ్చును. ఇట్టి తృష్ణపొంతకు
బోయిన వంతకాక మరేమి? హృదయతాపము -- నిచ్చును.
అపి మేరుసమం ప్రాజ్ఞమపి శూరమపి స్థిరమ్ ।
తృణీకరోతి తృష్టికా నిమేషేణ నరోత్తమమ్
|| 50
మేరుపర్వతమువలె ధీరుడును, బుద్ధిమంతుడును, పౌరుషయుక్తుడును, అపరిగ్రహ వ్రతమున
స్థిరుడును నగు పురుషునిగూడ తృష్ణ ఒక్క నిముసములో గడ్డిపరకవలె నొనర్చుచున్నది. (తృష్ణతో యాచింప
బూనినవాడు ఇతరుల దృష్టిలో గడ్డిపరకయే కదా!)
సంస్తీర్ణగహనా భీమా మనజాలరజోమయీ |
సాంధకారోగ్రనీహారా తృష్ణా వింధ్యమహాతటీ । 51
సాహస కార్యములను చొరరాని విశాలారణ్యములతోడను, ఆశాపాశ రూపకమగు రజోగుణమను
94 యోగవాసిష్ఠము
లతాధూళితోడను, అంధకార రూపకమగు తమోగుణమును అజ్ఞానహిమముతోడను గూడుకొనిన భయంకర
వింధ్యపర్వత భూమి యీ తృష్ణ
ఏకైవ సర్వభువనాంతరలబ్ధలక్ష్యా దుర్లక్ష్యతాముపగతైవ వపుః స్థితైవ |
తృష్ణా స్థితా జగతి చంచలవీచిమాలే క్షీరోదకాంబుతరలే మధురేవ శక్తిః ॥52
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే తృష్ణాభంగా నామ సప్తదశః సర్గః ॥ 17 ॥
ఒకే మాధుర్యశక్తి జలము లన్నిటియందును నున్నను, ఒకే మాదిరిగ గన్పడదు. జలభేదము ననుసరించి
రుచి మారును. అట్లే యీ శరీరమందున్న తృష్ణయే, జగత్తున నున్న సమస్త భోగ్యవస్తువులతో గలసియున్నను,
శరీర తృష్ణ యట్లగుపించదు: ఆశ, కామము ఇత్యాదులగు వివిధ భేదములతో నగుపించును.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున తృష్ణాభంగమను సప్తదశ సర్గము ॥ 17 ॥
కాయజుగుప్సా వర్ణనము -18
శ్రీరామ ఉవాచ:
ఆర్దాంత్రతంత్రీగహనో వికారీ పరిపాతవాన్।
దేహః స్ఫురతి సంసారే సోఒ పి దుఃఖాయ కేవలమ్ ॥ 1
శ్రీరాముడు : మలమూత్రముల తోలుసంచియు, నాడీ జటిలమును, కృశించుట మొదలుగా గల వికారములు
కలదియు, మరణశీలమును నగు ఈశరీరము సంసారమున సుఖభోగములకు ఇల్లు అని
అనుకొనబడుచున్నది. కాని, ఇదికూడ కేవలము దుఃఖము కొఱకే.
అజ్ఞోపి తదసదృశో వలితాత్మ చమత్కృతిః 1
యుక్త్యా భవ్యోపభవ్యో పి న జడో నాపి చేతనః II 2
దేహము జడవస్తు వైనను, పంచకోశములచే నావరింపబడిన ఆత్మయొక్క విచిత్ర సంసర్గమువలన
చేతన వస్తువువలెనే ప్రతిభాత మగుచున్నది. అసార వస్తువైనను సంసార తరణమునకు (మోక్షమునకు)
ఉపయోగపడుచున్నది. ఇది సాధారణ జడవస్తువుల వంటిది గాదు; మఱియు చేతనమును గాదు.
జడాజడదృశోర్మధ్యే దోలాయితదురాశయః |
అవివేకీ విమూఢాత్మా మోహమేవ ప్రయచ్ఛతి 3
శరీరము జడమా? చేతనమా? అను సందేహమున నూగులాడు మనస్సునకును, మూఢాత్మకును
వైరాగ్యప్రకరణము (సర్గ - 18) 95
నిలయమును, వివేకానుపయోగియును నగు శరీరము మోహమునే గల్పించుచున్నది.
స్త్రోక్తేనానంద మాయాతి స్త్రోక్తేనాయాతి ఖేదితామ్ |
నాస్తి దేహసమః శోచ్యో నీచో గుణబహిష్కృతః ॥ 4
అల్పములగు అన్నపానములు లభించిన సంతోషించుచున్నది. అల్పము లగు శీతతాపములు గల్గిన
దుఃఖించుచున్నది. అందువలన, దేహమును బోలు నీచమును, గుణహీనమును నగు శోచనీయ వస్తువు
మరియొకటి లేదు.
ఆగమాపాయినా నిత్యం దంతకేసరశాలినా |
వికాసస్మితపుష్పేణ ప్రతిక్షణమలంకృతః 11 5
భుజశాఖో మనస్కందో ద్విజస్తంభశుభస్థితిః
లోచనాలిబిలాక్రాంతః శిరఃపీఠబృహత్ఫలః ॥ II 6
శ్రవదంతరసగ్రస్తో హస్తపాదసుపల్లవః ।
గుల్మవాన్ కార్యసంఘాతో విహంగమకృతాస్పదః 7
సచ్ఛాయో దేహవృక్షో యం జీవపాంథగణాస్పదః ।
కస్యాత్మీయః కస్య పర ఆస్థానాస్థే కిలాత్ర కే ॥ 8
ఈ దేహమును వృక్షముతో బోల్పనగును, బాహువులే దీని శాఖలు, భుజములే దీని స్కంధము
(మ్రాను) కళ్లే తుమ్మెదలుండు తొఱ్ఱలు. కలయే దీని ఫలము. కాలుసేతులు దీని చివుళ్ళు. రోగములే దీని
తీగెలు. దీని చెవులు కంసాలి పిట్టలవలన బొడువబడుచున్నవి. ఇందు జీవేశ్వరులను రెండుపిట్టలు
నివసించుచున్నవి. దీన, రోగములను గుల్మము లున్నవి. ఇట్టి కార్యసంఘాతమగు శరీరమను చెట్టును
గొడ్డలితో నరుకునట్లు నరుకవచ్చును. ఇది నవ్వను పువ్వులతోడను, దంతములను కేసరముల తోడను
ఒప్పారుచున్నది; దీని శోభ క్షణకాలమే. మఱియు, ఈ దేహవృక్షము కాంతియను ఛాయతో విలసిల్లుచున్నది.
జీవుడను పథికున కిది విశ్రామ స్థానము. దీనితో, జీవునకు వాస్తవమగు సంబంధము లేదు. ఇది
ఎవ్వరిబంధువు, ఎవ్వరి శత్రువు? దీనియెడల ప్రేమ ఎవరికి? ద్వేష మెవరికి?
తాత సంతరణార్థేన గృహీతాయాం పునఃపునః ।
నావిదేహలతాయాం చ కస్య స్యాదాత్మభావనా "I 9
సంసార సాగరమును తరించుటకు నౌకగా గైకొనబడిన ఈ దేహలతయం దాత్మభావన ఏరికి
గల్గును?
96 యోగవాసిష్ఠము
దేహనామ్ని వనే శూన్యే బహుగర్తసమాకులే ॥
తనూరుహాసంఖ్యతరౌ విశ్వాసం కోరి ధిగచ్ఛతి " అండ దండకొర 10
రోమములను అసంఖ్య వృక్షములతోడను, నవరంధ్రములను గోతులతోడను నున్న దేహమను ఈ
శూన్యారణ్యమున చిరము వాస మొనర్తునను నిస్సందేహ బుద్ధి ఎవరికి కలుగును?
మాంసస్నాయ్వాస్థివలితే శరీరపట హే దృఢ I
మార్జారవదహం తాత! తిష్ఠామ్యత్ర గతధ్వనౌ (2011
చినిగి, డొల్లపడి, ధ్వనింపని డోలునందున్న పిల్లివలె, నేను మాంసము, నరములు, ఎముకలచే
నిర్మింపబడిన అదృఢ శరీరమున నున్నాను. దీనినుండి బయటపడు ఉపాయశబ్దమును విన వీలు కలుగుట
లేదు.
సంసారారణ్యసంరూడో విలసచ్చిత్తమర్కటః |
చింతామంజరితాకారో దీర్ఘదుఃఖముణక్షతః 12 "I
తృష్ణా భుజంగమి గేహం కోపకాకకృతాలయః |
స్మితపుష్పోద్గమః శ్రీమాన్ శుభాశుభమహాఫలః ॥ 13
సుస్కంధౌమలతాజాలో హస్తస్తబకసుందరః ।
పవనస్పందితాశేషస్వాంగావయవపల్లవః "I 14
సర్వేంద్రియఖగాధార: సుజానుస్తంభ ఉన్నతః |
సరసచ్ఛాయయా యుక్తః కామపాంథనిషేవితః ॥ 15
మూర్ధసంజనితా దీర్ఘశిరోరుహతృణావలిః |
అహంకారగృధ్రకృత కులాయ: సుషిరోదరః ॥
|| 16
విచ్ఛిన్నవాసనాజాల మూలత్వాద్దుర్ల వాకృతిః |
వ్యాయామవిరసః కాయపక్షోఒ యం న సుఖాయ మే ॥ உ 17
సంసారమను కారడవియందు, చింతలను మొగ్గలతోడను, దుఃఖములను ఘుణమువలన
కొట్టబడినదియు నగు దేహమను జీర్ణవృక్షము చిత్తమను చపల మర్కట మెక్కినది. ఈ దేహ(పక్ష) వృక్షము
కాముడను పథికున కాశ్రయము, యౌవనము దీనిఛాయ, రూక్షత్వమే దీని వ్యాయామ విహీనశాఖలు,
ఉదరమే దీని ఛిద్రము. తృష్ణ యను పాము, రోషమను కాకి, ఇంద్రియములను పక్షి గణములు,
వైరాగ్యప్రకరణము (సర్గ - 18) 971
అహంకారమను గ్రద్ద ఇందు నివసించుచున్నవి. చిఱునవ్వే దీని పువ్వులు, శుభాశుభములే దీనిఫలములు,
బాహువులే దీని శాఖలు, చేతులే దీని పూలగుత్తులు, ప్రాణవాయువువలన కంపింపబడిన అవయవములే
దీని చిగుళ్లు. ఉన్నతములగు జానువులే దీనియొక్క లావైన మొదళ్లు, శిరోజములే ఈ చెట్టున నుద్భవించు
తృణాదులు. గట్టిగ పెనవేసికొనిపోయిన కోర్కెలే దీని అచ్ఛేద్యమైన వేళ్ళు. ఇట్టి దేహవృక్షము నాకు సుఖమును
ద
కలేబరమహంకార గృహస్థన్య మహాగృహమ్ ।
లుఠత్వభ్యేతు వా స్థైర్యం కిమనేన మునే! మమ Ir
18
మునీ! అహంకారమను గృహస్థుని నివాస మందిరమగు ఈశరీరము ఉండిన ఉండుగాక! ఊడిన
ఊడుగాక, దీనితో నాకేమి పని?
పంక్తి బద్ధేంద్రియపశుం పలత్తృష్ణా గృహాంగణమ్ !
రాగరంజితసర్వాంగం నేష్టం దేహగృహం మమ ॥ 19
ఈశరీరగృహమున ఇంద్రియములను పశువులు వరుసగ కట్టబడియున్నవి. తృష్ణయను
గృహయజమానురాలు ఇటునటు తిరుగాడుచున్నది. ఇల్లంతయు నానావిధములగు కోర్కెలను మ్రుగ్గులతో
నలంకరింపబడియున్నది - ఇది నా కిష్టమును గూర్చు వస్తువు కాదు.
పృష్టాస్థి కాష్ఠ సం ఘట్ట పరిసంకట కోటరమ్ (శ్రీ కడ
ఆంత్రరజ్జుభిరాబద్ధం నేష్టం దేహగృహం మమ ॥ 20 పొందూర్చబడిన వెన్నెముకతో గూర్పబడిన గూడును, మలమూత్రాదులను త్రాటితో గట్టబడినదియు నగు ఈ
శరీరగృహమును నే నభిలషింపను.
ఒక
ప్రసృతస్నాయుతంత్రీకం రక్తాంబుకృతకర్దమమ్ |
ΤΩ జరామంకోలధవలం నేష్టం దేహగృహం మమ ॥ 21
వ్యాపించియున్న నాడులవలన నిలబెట్టబడినదియు, రక్తమాంసములను అడుసుచే పూయబడినదియు,
ముదిమియను సున్నముతో వెల్లవేయబడి నదియు నగు ఈదేహగృహము నా ఇష్టవస్తువు కాదు.
చిత్తభృత్యకృతానంతచేష్టావష్టబ్ధసంస్థితి
8S మిథ్యామోహమహాస్థూణం " నేష్టం దేహగృహం మమ ॥
22
చీత్తమను భృత్యుని ఎడతెగని ప్రయత్నములవలన, ఈ శరీరము నిలబడియున్నది; అనృతాజ్ఞానములే
దీని స్తంభములు - ఇట్టి దేహగృహమును నేను వాంచింపను. ایتدی
VI F7
98 యోగవాసిష్ఠము
దుఃఖార్భకకృతాక్రందం సుఖశయ్యామనోరమమ్ ।
దురీహాదగ్ధదాసీకం నేష్టం దేహగృహం మమ ॥ 230
ఈ దేహగృహము దుఃఖమను బాలకుని ఏడ్పులతో నిండియున్నది. సుఖములను శయ్యలతో
మనోహరమై చూపట్టుచున్నది. దుశ్చేష్టలను పాడుదాసీలు ఇందు తిరుగాడు చున్నారు - దీనిని నేను గోరను.
మలాఢ్యా విషయవ్యూహభాండోపస్కరసంకటమ్ 1
అజ్ఞానక్షారవలితం నేష్టం దేహగృహం మమ ॥ 24
బహువిధములగు విషయములను భాండముల నింపబడిన దోషములను గృహద్రవ్యములతో
గూడినదియు, అజ్ఞానమను చవిటితో గూడినదియు నగు ఈ శరీరగృహము నా ఇష్టవస్తువు కాదు.
గుల్ఫగుగ్గులు విశ్రాంతజానూర్ధ్వస్తంభమస్తకమ్ |
దీర్ఘదోర్దారుసుదృఢం నేష్టం దేహగృహం మమ ॥ 25 25
జానువులను ఈ దేహగృహస్తంభమునకు పాద గ్రంథి ఆధారకాష్ఠము; జానువులు దీనిపై నిలిచి
యున్నవి; బాహువులు, సంయోజక కాష్ఠములు. మూలము విశిష్టమైన, యీ గృహమంతయు పడిపోవును.
అందువలన, నేను దీనిని గోరను.
ప్రకటాక్షగవాక్షాంతః క్రీడత్ప్రజ్ఞాగృహాంగనమ్ I
చింతాదుహితృకం బ్రహ్మన్నేష్టం దేహగృహం మమ ॥ 26 26
బుద్ధియను గృహాంగన జ్ఞానేంద్రియములను గవాక్షముల క్రీడ సల్పుచున్నది; చింత దీని కూతురు.
ఇట్టి దేహగృహమును నేను వాంఛింపను.
మూర్ధజాచ్ఛాదనచ్ఛన్న కర్ణశ్రీచంద్రశాలికమ్ |
ఆదీర్ఘాంగులినిర్వ్యూహం నేష్టం దేహగృహం మమ ॥ 27
శిరోజములను మిద్దె కలదియు, కర్ణశ్రీయను శోభన గృహము కలదియు, వ్రేళ్ళను బొమ్మలు
కలదియునగు నీ శరీరగృహమును నేను గోరను.
| సర్వాంగ కుడ్యసంఘాతమనరోమయవాంకురమ్ సంశూన్యపేటవివరం నేష్టం దేహగృహం మమ ॥ 28
అవయవములే గోడలుగా గలదియు, వాటినుండి జనించు రోమములను యవాంకురములు
గలదియు, పొట్టయను ఛిద్రము గలదియు నగు ఈ దేహమును నేను అభిలషింపను.
వైరాగ్యప్రకరణము (సర్గ - 18) 99
నఖోర్ణనాభినిలయం సరమారణితాంతరమ్ |
భాంకారకారిపవనం నేష్టం దేహగృహం మమ ॥ 29
గోళ్ళను సాలెగూళ్ళతో నున్నదియు, క్షుధయను శునకముచే నాకులిత మొనర్పబడి నదియు,
ప్రాణవాయువుయొక్క భాంకార రవముతో గూడినదియు నగు ఈ శరీరగృహమును నేనభిలషింపను.
ప్రవేశనిర్గమవ్యగ్ర వాతవేగమనారతమ్ |
వితతాక్షగవాక్షం తన్నేష్టం దేహగృహం మమ ॥ 30
ఈ శరీరగృహమున నిరంతరము ఉత్ఛ్వాసనిశ్వాస వాయువులు వేగము చరించుచున్నది;
ఇంద్రియములను దీర్ఘగవాక్షములు దీని కున్నవి. ఇద్దానిని నేను గోరను.
జిహ్వామర్కటికాక్రాంతవదనద్వారభీషణమ్ 1
దృష్టదంతాస్థిశకలం నేష్టం దేహగృహం మమ ॥ 31
ఈ శరీర మందిరమునకు ప్రవేశ ద్వారము నోరు; ఇది నాలుకయను కోతిచే నాక్రాంతమై భయమును
గొల్పుచున్నది; పైకి కనబడు దంతములే దీని నాగబంధము. ఇది నాకిష్టవస్తువు కాదు.
త్వక్సుధాలేపమసృణం యంత్రసంచారచంచలమ్ |
మనః సదాఖునోద్ఘాతం నేష్టం దేహగృహం మమ ॥ 32
ఈ శరీరము చర్మమను పొడితో నద్దబడియున్నది. కీళ్ళను యంత్రముల చలనముతో చంచలమై
యెప్పుచున్నది. మనస్సును ఎలుక ఎల్లవేళల కన్నమును ద్రవ్వుచున్నది. ఇట్టి శరీరగృహమును నేనెట్లు
వాంఛింతును?
స్మితదీపప్రభోద్భాసి క్షణమానందసుందరమ్
I
క్షణం వ్యాప్తం తమఃపూరై ర్నేష్టం దేహగృహం మమ ॥ 33
33
ఒక్కొక్కప్పుడు ఈషత్ హాస్యమను దీపప్రభలతో వెలుగుచు, మరొకప్పుడు శోకమోహములను
అజ్ఞానాంధకారమున కప్పబడిపోవు శరీరమందిరమును నేను గోరను.
సమస్తరోగాయతనం వలీపలితపత్తనమ్ |
సర్వాధిసారగహనం నేష్టం దేహగృహం మమ ॥ 34
రోగముల కునికియు, ముడుతలుపడు చర్మమునకును, నెఱసిన వెంట్రుకలకును ఉనికియు
మనోవ్యాధుల అడవియును నగు ఈ దేహగృహమును నేను గోరను.
100% (81 యోగవాసిష్ఠము ఆడగండ్
అక్షరక్షోభవిషమా శూన్యా నిస్సార కోటరా ఉండడండుండి ఊర్ల డ
e్వ తమోగహనది క్కుంజా నేష్టా దేహాటవీ మమ్ము బండి నడవడ8 28 2018 35 es
ఈ శరీరారణ్యము ఇంద్రియములను ఎలుగుగొడ్ల క్షోభవలన నతిభయంకరమై యున్నది.
శూన్యములును, సారహీనములును నగు నవద్వార కోటరము లున్నవి; కుడియెడమల నున్న అవయవములను
చీకటిపొదలతో నిండియున్నది. ఇద్దానిని నేను గోరను.
దేహాలయం ధారయితుం న శక్నోమి మునీశ్వర! ఉడ్ పై గజ్జె అతడి θε
పంకమగ్నం సముద్ధర్తుం గజమల్పబలో యథా ॥ 36
మునీశ్వరా! బురదలో కూరుకొనిపోయిన ఏనుగును అల్పబలుడు ఉద్దరించలేనట్లు నేవీ శరీరం
మందిరమును వహించలేకున్నాను.
కిం శ్రియా కిం చ రాజ్యేన కిం కాయేన కిమాహితైమాహి : ని అక్కడి అందఉద Iε
దినైః కతిపయైరేవ కాలః సర్వం వికృంతతి 37
సంపదలతోడను, రాజ్యములతోడను, శరీరముతోడను, కోరికలతోడను బనియేమి? కొద్దిరోజులలోనే
మృత్యు వన్నింటిని తుదముట్టించును కదా!
రక్తమాంసమయస్యాస్య స బాహ్యాభ్యంతరం మునే! తతో దాడి ఉండ
SE
నాశైకధర్మిణో బ్రూహి కైవ కాయస్య రమ్యతా ॥ 38
ఈ శరీరము రక్తమాంసమయము; దీని పరిణామము నాశనమే. దీని రమ్యత యేమియో విచారించిన
చెప్పుడు!
మరణావసరే కాయా జీవం నాను సరంతి యే +
తేషు తాత కృతఘ్నేషు కైవాÔ వద ధీమతామ్ ॥డతండై రణత 39
చాల మునీంద్రా! చక్కగ పోషింపబడి, పెంచబడినను, మరణ సమయమున జీవు ననుసరింపని కృతఘ్న
శరీరములందు నమ్మక మెవరంచుదురు?
మత్తేభకర్ణాగ్రచల: కాయో లంబాంబుభంగురు క్రీడ ండ ంరంగా రెడ్లండ
4 న సంత్యజతి మాం యావత్తావదేవం త్యజామ్యహమ్ అజగరన్మండ 40
ఈశరీరము . ఏనుగు చెవివలె చంచలము; పడనున్న నీటిబొట్టు వంటిది, ఇది నన్ను విడువక
మునుపే నేను, దీనిని త్యజింతును. నిర్మల అధ్యలో..
వైరాగ్యప్రకరణము (సర్గ - 18) $901
పవనస్పందతరలః పేలవః కాయపల్లవః ॥ 20 dasjade ordet se
జర్జరస్తనువృత్తశ్చ నేష్టో మే కటునీరసః ॥ 41
దేహమను చిగురుటాకు ప్రాణవాయువు వలన స్పందించుచున్నది. జర్జరము. క్షుద్రము. దీనిని నేను
"ప్రేమింపను.
EST భుక్త్యా పీత్వా చిరంకాలం బ బాలవల్లవ బాలవల్లవ పేలవామ్ పేలవామ్ । | తెలుగు సంద
తనుతామేత్య యత్నేన వినాశమనుధావతి ॥ goldfab42
ఈ శరీరము చిరకాలము భోజనపానాదుల నొనర్చి చివురుటాకువలె మృదుత్వము నందుచున్నది;
యత్న మొనర్పకపోయిన కృశత్వమును, నాశనమును నందుచున్నది.తడు తీయ డ
టైతే తనని తాన్యేవ సుఖదుఃఖాని భావాభావమయాన్యసా అంతవరంలో బెండయంది
భూయోప్యనుభవన్ కాయః ప్రాకృతో హి న లజ్జతే ॥ వెంగనపల్లిరి డిర్రర్ లేదం43 11
శరీరము సుఖదుఃఖములను మాటిమాటికీ అనుభవించుచు, మరల మరల వాటినే గోరుచున్నది.
సిగ్గుపడదు. పామరులకు సిగ్గుండదు కదా! సైక్యది సెంట్రల్ ఆల్గొడు
సుచిరం ప్రభుతాం కృత్వా సంసేవ్య విభవశ్రియమ్ I
నోచ్ఛాయమేతి న స్థైర్యం కాయః కిమితి పాల్యతే IF 7 GMC 44
చాలకాలము ప్రభుత్వ మొనరించియు, భోగముల ననుభవించియు, శరీరము గొప్పతనమును గాని,
అవినాశత్వమునుగాని పొందదు, అగుచో దానిని పోషించి లాభమేమి?
జరాకాలే జరామేతి మృత్యుకాలే తథా మృతిమ్ |
సమ ఏ విశేషజ్ఞః కాయో భోగిదరిద్రయోః ॥
TREN 45
ముసలితనమున ముసలితనమును, మృత్యుకాలమున మృతిని, వివేచన లేకుండ ధనికుని శరీరమే
గాని, దరిద్రుని శరీరమే గాని- పొందుచున్నది.
సంసారాంబోధిజఠరే తృష్ణా కుహరకాంతరే ।
సుప్తస్తిష్ఠతి ముక్తేహో మూకో యం కాయకచవః 46
ఈ శరీరమను తాబేలు సంసార సముద్రగర్భమున, తృష్ణయను కలుగున, ఉద్గార ప్రయత్నము
నొనర్పకయే చల్లగ నిద్రించుచున్నది.
23
వహనై కార్థ యోగ్యాని కాయకాష్ఠాని భూరిశః ।
సంసారాబ్ధావిహోహ్యంతే కంచిత్తేషు నరం విదుః ॥ 47
102 యోగవాసిష్ఠము
ఈ సంసార సముద్రమున దేలుచున్న కట్టెలలో చాలకట్టెలు బరువుచేటు; వాటిలో కొన్ని మాత్రమే
నరదేహములు.
దీర్ఘదౌరాత్మ్యవలయా నిపాతఫలపాతయా |
న దేహలతయా కార్యం కించిదస్తి వివేకినః ॥ 48
దుర్మార్గ వలయము గలదియు, పతనమను ఫలము గలదియు నగు దేహలతతో వివేకులగు వారికి
బనియేమి?
మజ్జన్ కర్దమకోశేషు ఝటిత్యేవ జరాం గతః ॥
న జ్ఞాయతే యాత్యచిరాత్ కః కథం దేహదర్దుర "I 49
విషయములను బురదగుంటలో బడుచు, అమాంతముగ జరచే నాక్రమింపబడిన దేహమను కప్ప
ఇంతలో నెచ్చటి కెట్లరుగునో తెలియలేము.
ని:సారసకలారంభాః కాయాశ్చవలవాయవః ॥
రజోమార్గేణ గచ్చంతో దృశ్యన్తో నేహ కేనచిత్ ॥ 50 50
ఈ శరీరమను వాయువుయొక్క కార్యము లన్నియు సారహీనములు; ఇది రజోమార్గముననే జనును.
దీనిగతి నెవ్వరును గాంచజాలరు.
వాయోర్దీపస్య మనసో గచ్ఛతో జ్ఞాయతే గతిః |
ఆగచ్ఛతశ్చ భగవన్! శరీరస్య కదాచన ॥ 51
భగవంతుడా! వాయువుయొక్క యు, దీపముయొక్కయు, మనస్సు యొక్కయు, గమనాగమనముల
(ఉత్పత్తి నాశముల) నెఱిగిన నెఱుగగలము గాని, శరీరముయొక్క గమనాగమనముల నెఱుగజాలము.
బద్ధా యే శరీరేషు బద్ధ యే జగత్సితా |
తాన్మోహమదిరోన్మత్తాన్ దిగ్ ధిగస్తు పునః పునః ॥ 52
శరీరమును, జగత్తును; చిరస్థాయి, సత్యము, సారవంతము లనుకొను మోహమదిరోన్మత్తులకు
మాటిమాటికి ధిక్కార మగు గాత!
నాహం దేహస్య నో దేహో మమ నాయమహం తథా |
ఇతి విశ్రాంతచిత్తా యే తే మునే! పురుషోత్తమాః ॥ 53
మునీంద్రా! దేహమునకును నాకున్దు, నాకును దేహమునకును, సంబంధ మేమియును లేదు; నే
వైరాగ్యప్రకరణము (సర్గ - 18) 103
నీ జడదేహమును గాను అని తెలిసికొని పరమాత్మయందు విశ్రాంతి నందిన చిత్తము గలవాడే
పురుషోత్తముడు.
మానావమానబహులా బహులాభమనోరమాః ।
శరీరమాత్రబద్ధాస్థం మ్నంతి దోషదృశో నరమ్ ॥ 54
మానావమానములను వివిధ భ్రాంతులను జూపించి, జనుల మనస్సును హరించు అజ్ఞానశక్తి, దేహాత్మ
భ్రాంతు డగువానిని మృత్యువశ మొనర్చుచున్నది.
శరీరశ్వభ్రశాయిన్యా పిశాచ్యా పేశలాంగయా ॥
|
అహంకారచమత్కృత్యా ఛలేన ఛలితా వయమ్ 55
శరీర బిలమున శయనించి యున్న, అహంకారమను పిశాచివలన గల్పింపబడిన విషయ తృష్ణలవలన
మేము మోసగింపబడుచున్నారము.
ప్రజ్ఞావరాకీ సర్వైవ కాయబద్ధాయానయా।
మిథ్యాజ్ఞానకురాక్షస్య ఛలితా కష్టమేకికా || 56
ఆహా! శరీరము స్థిరమను నమ్మికకు మూలకారణ మగు మిథ్యయను రాక్షసి మోసమున, దీనయగు
సద్బుద్ధి ఏకాకియై (వివేక విహీనయై) పడుచున్నది.
న కించిదపి దృశ్యం స్మిన్ సత్యం తన హతాత్మనా |
చిత్రం దగ్ధశరీరేణ జనతా విప్రలభ్యతే "I 57
ఈజగత్తున సత్య మొకించుకైన లేకపోయినను అస్థిత్వ విహీనమగు ఈ పాడు శరీరము జనులను
వంచించుచున్నది.
దినైః కతిపయైరేవ నిర్వ రాంబుకణో యథా |
పతత్యయమయత్నేన జరఠః కాయపల్లవః ॥ 58 58
కొద్దిరోజులలోనే, ఈ శరీర పల్లవ మెండి, నిర్హరాంబుకణమువలె, పడిపోవుచున్నది.
కాయోఒ యమచిరాపాయో బుద్బుదోఒ ంబునిధావివ
వ్యర్థం కార్యపరావర్తే పరిస్ఫురతి నిష్ఫలః ॥ 59 59
సముద్ర జలమందలి బుడగవలె, క్షణధ్వంసి యగు ఈ శరీరము సంసార కార్యములను
సుడిగుండమున వ్యర్థముగ తిరుగుచున్నది.
104 యోగవాసిష్ఠము, ఆస్తి
గంగ మిథ్యాజ్ఞానవికారే స్మిన్ స్వప్నసంభ్రమపత్తనే గౌడల ఉడదేవల డి
కాయే స్ఫుటతరాపాయే క్షణమా న మే ద్విజ 60
ద్విజుడా! యీ శరీరము మిథ్యాజ్ఞాన పరిణామము; స్వప్నపురివంటిది. దీని ఉనికి క్షణ మాత్రకాలమే.
పైకాన, దీనియందు నాకు నమ్మకము లేదు. దడోది ఆంఢ ంద్ధ దాదా డరరి.
తడిత్సు శరదభ్రషు గంధర్వనగరేషు చ రంగం వారికి
స్థైర్యం యేన వినిర్ణీతం స విశ్వసితువిగ్రహే ద్కత్యం తరంగవ తం 61
మెఱుపుతీగెలను, శరత్ మేఘములను, గంధర్వ నగరములను స్థిరమని నమ్మువాడే -
౭శరీరమునుగూడ స్థిరమని నమ్ముగాక.. ఖంఢ జరిఢ త్య తండడం ఇం డల
సతతభంగురకార్యపరంపరా విజయిజాతజయం హఠవృత్తిము బడి రిరిక
ప్రబలదోషమిదం తు కలేబరమ్ తృణమివాహమపోహ్య సుఖం స్థితః mic :62
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే కాయజుగుప్సానామ అష్టాదశః సర్గః
|| 18 |
క్షణభంగురత్వమున నిది గంధర్వ నగరమును మించినది; దీనిని తృణసమముగ నెంచి నేను సుఖముగ
-నున్నాడను.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున కాయజుగుప్సయను అష్టాదశ సర్గము ॥18॥ దడ
బాల్యజుగుప్సా వర్ణనము-19 ఆరోరి ఉద్దవ రాత్రG 51
శ్రీరామ ఉవాచ:
లబావి తరలాకారే కార్యభార తరంగిణి |
సంసారసాగరే జన్మ బాల్యం దుఃఖాయ కేవలమ్ ॥ జరిుతిక :డ్తాది
1
శ్రీరాముడు: వివిధకార్య సమూహ తరంగములతో చంచలమును, సంకులమును నగు సంసార
సముద్రమున పడుట దుఃఖముకొఱకే; అందును బాల్యము కేవలము దుఃఖముతో కూడియున్నది.
అశక్తిరాపదస్తృష్ణా మూకతా మూఢబుద్ధితా | గౌడ ఉండడ
గృధ్నుతా లోలతా దైన్యం సర్వం బాల్యే ప్రవర్తతే డడ్కర౭ ర్ట్కడ
You 2
ఒడల శక్తి లేకపోవుట, ఆపదలు, చిఱుతిండ్లకోటిక, మాటలాడలేకపోవుట, మూఢత్వము, ఆటలాడ కోరిక,
చాపల్యము, ధైన్యము - ఇవన్నియు బాల్య ధర్మములు. ఏడడగడం గమక్మడ ఉండవంగవీటి
వైరాగ్యప్రకరణము (సర్గ - 19) 0105
రోషరోదనరౌద్రాసు దైన్యజర్జరితాను అంది విధంగా త్వత్రిక ด (అతని
దశాసు బంధనం బాల్యమాలానం కరిణామివ డెంగాడూ డూ 3
దీర్ స్తంభమునకు గట్టివేయబడిన ఏనుగువలె బాలుడు రోషరోదన చంచలత్వ దైన్యములవలన
బీడింపబడును.
సమృతౌ న జరారోగేన చాపది న యౌవనే గాడాంధ్ర ది జోడి 2. చేసి
తాశ్చింతాః పరికృంతంతి హృదయం శైశవేషు యాః గాఅర్థండ ర్ 4
రీరంంమ్మ . శైశవ సమయమున హృదయమును బీడించు చింతలు యౌవనమున, వార్ధక్యమున, రోగసమయమున
మృతించు నప్పుడుగూడ కలుగవు.
తిర్యగ్జాతిసమారంభః సర్వైరేవావధీరితః శంబరడ తిండక oris
లోలో బాలసమాచారో మరణాదపి దుఃఖదః ॥ డయర్థులు డెలి 5
బాల్యావస్థ మరణముకంటె దుఃఖప్రదము, అందరును తిరస్కరింతురు; చాపల్య మెక్కువ. అప్పటి
చేష్ట లన్నియు పశుపక్ష్యాదుల ననుకరించి యుండును.
Regula
ప్రతిబింబమనాజ్ఞానం నానాసంకల్ప పేలవమ్ SI ఉద్మోదరు కనిపెత్త
బాల్యమాలూనసంశీర్ణమనః కస్య సుఖావహమ్ ॥
"I 6
శైశవము ప్రతిబింబము అజ్ఞానము వంటిది. పలువిధము లగు అర్థహీన సంకల్పములతో
గూడుకొనినది; అందువలన మనస్సు విక్షిప్తమై సదా దుఃఖమున మునిగి యుండును. ఇట్టిదగ్గు బాల్య
మెవరికి సుఖమును గలిగించును?
జలవహ్న్యానిలాజప్రజాతభీత్యా పదేపదే ।
యద్భయం శైశవే బుద్ధ్యా కస్యావది హి తద్భవేత్ ।
"I
నీరు, నిప్పు, గాలులవలన చిన్నతనమున గలుగు భయమును బోలు భయము, ఎట్టి ఆపదల నున్న
వానికైనను గలుగదు.
లీలాసు దుర్విలాసేషు దురీహాసు దురాశయే ।
పరమం మోహమాధత్తే బాలో బలవదావతన్ ॥ 8
బాలుడు ఆటలలోను, చిలిపి చేష్టలలోను, ఇంగితములలోను ప్రబలాసక్తిని గన్పరచుచు అజ్ఞానమును
వెల్లడించుచుండును.
106 యోగవాసిష్ఠము
వికల్ప కల్పితారంభం దుర్విలాసం దురాస్పదమ్ ।
శైశవం శాసనాయైవ పురుషస్య న శాంతయే ॥ 9
బాలకుడు ఫలశూన్యములగు పనుల నుత్సాహముతో నొనర్చును. అల్లరి చేయును. విలువ లేని దీ
బాల్యము; పెద్దలు పెట్టు చివాట్లను, కొట్టు దెబ్బలను పడవలసియుండును. కనుక, దుఃఖమయ మైనది.
యే దోషా యే దురాచారా దుష్ప్రమా యే దురాధయః ।
తే సర్వే సంస్థితా బాల్యే దుర్గర్త ఇవ కౌశికాః ॥ 10
తప్పులు, చెడ్డపనులు, మనోవ్యాధులు -- ఇవన్నియు చీకటికొట్టమునకు గ్రుడ్లగూబలవలె బాల్యముననే
అరుదెంచును.
బాల్యం రమ్యమితి వ్యర్థబుద్ధయః కల్పయంతి యే ।
తాన్ మూర్ఖపురుషాన్ బ్రహ్మన్ దిగస్తు హతచేతనః ॥ 11 "I
మహాత్మా! బాల్యము రమ్యమని దలచు మూర్ఖులకు ధిక్కార మగు గాత!
యత్ర దోలాకృతిమనః పరిస్ఫురతి వృత్తిషు।
త్రైలోక్యాం భవ్యమపి తత్ కథం భవతి తుష్టయే 12
బాల్యమున చిత్త మెల్లప్పుడును దోలాయమాన మగుచుండును; ఇట్టి పాడుస్థితి మరొకటి మూడు
లోకములు వెదకిచూచినను గన్పట్టదు. ఇది సంతోషము నెట్లు గలిగించగలదు?
సర్వేషామేవ సత్వానాం సర్వావస్థాభ్య ఏవ హి |
మనశ్చంచలతామేతి బాల్యే దశగుణం మునే! 13
మునీంద్రా! ఎల్లరికిని, అన్ని వేళలకంటెను, బాల్యముననే చిత్తము పదిమడుంగు లెక్కువగ చంచల
మగును.
మనః ప్రకృత్యైవ చలం బాల్యం చ చలతాం వరమ్ । |
తయోః సంశ్లేష్యతోస్త్రాతా క ఇవాన్తః కుచాపలే ॥ 14
మనస్సు స్వభావతః చంచలము; బాల్యావస్థగూడ అత్యంత చంచలమైనది. ఈరెంటి కలయికవలన
కలిగిన చాపల్యమునుండి వెలువరింప ఎవరు సమర్థులు?
స్త్రీలోచనై సడిత్పుంజై ర్జ్వాలాజాలై స్తరంగ కైః |
చాపలం శిక్షితం బ్రహ్మన్ శైశవాక్రాంత చేతనః ॥ 15
వైరాగ్యప్రకరణము (సర్గ - 19) 107
స్త్రీల లోచనములును, విద్యుత్తులును, అగ్నిజ్వాలలును, తరంగములును - చంచలత్వమును బాలుర
కడనుండియే నేర్చుకొనినవి.
శైశవం చ మనశ్చైవ సర్వాస్వేవ హి వృత్తిషు ।
భ్రాతరావివ లక్ష్యేతే సతతం భంగురాస్థితీ || 16
అన్నివేళల, అన్ని కార్యముల, చంచలము లగు బాల్యము, మనస్సులు, అన్నదమ్ములవలె
కనంబడుచున్నవి.
సర్వాణి దుఃఖభూతాని సర్వే దోషా దురాధయః ।
బాలమేవోపజీవంతి శ్రీమంత మివ మానవాః ॥ 17
ధనికుని ఆశ్రయించుకొని ఇతరులగు జనులు జీవించునట్లు, అన్ని దుఃఖములును,
అన్నిదోషములును, అన్నిపీడలును, బాలునే ఆశ్రయించుకొని జీవించుచున్నవి.
నవం నవం ప్రీతికరం న శిశుః ప్రత్యహం యది।
ప్రాప్నోతి తదసౌ యాతి విషవైషమ్య మూర్ఛనామ్
|| 18
ప్రతిదినము క్రొత్తక్రొత్త వస్తువులు దొఱకక పోయిన బాలుడు విషమును బోలు చిత్తవికారము
నందును.
స్తోకేన వశమాయాతి స్త్రోక్తేనైతి వికారితామ్ ।
అమేధ్య ఏవ రమతే బాలః కౌలేయకో యథా ॥ 19
కొద్దితోడనే బాలుడు సంతోషించుచున్నాడు; మరల కొద్దిసేపటికే దుఖము నందుచున్నాడు. కుక్కవలె
అపవిత్రస్థితియందే క్రీడించుచున్నాడు.
అజస్ర బాష్పవదనః కర్దమాక్తో జడాశయః ।
వర్షక్షితస్య తప్తస్య స్థలస్య సదృశః శిశుః "I 20
శిశువు వర్షధారల నుంచిన కాలిన పెనమువంటివాడు; ఎడతెగకుండ కన్నీళ్ళను గార్చును, మలిన
శరీరుడు, జడుడు.
భయాహారపరం దీనం దృష్టాదృష్టాభిలాషి చ।
లోలబుద్ధి వపుర్ధత్తే బాల్యం దుఃఖాయ కేవలమ్ ॥
21
భయము, ఆహారవాంఛ, దీనత్వము, దృష్టాదృష్ట వస్తువులయెడ నభిలాష చంచలత్వము - ఇవి
బాల్యధర్మములు. ఇది కేవలము దుఃఖము కొఱకే.
108 (er - యోగవాసిష్ఠము గల
స్వసంకల్పాభిలషితాన్ భావాన ప్రాప్య తప్తధీః మడడ ఆ అగ్రి
దుఃఖమేత్య బలో బాలో వినిష్కృత్త ఇవాశయే ॥
బలహీనుడగు బాలుడు తాను కోరుకొను వస్తువులు దొటకకపోయిన, పరితపించును; హృదయము
విచ్చిపోయినంత దుఃఖమును బొందును. అర్థింఁగంధ ం అతడి అక్షర్ డాం
డు దురీహా లబ్ధలక్ష్యాణి బహువ క్రోల్బణాని బహువక్రోల్బణాని అదరణ త .అ దీర్ఘత
బాలస్య యాని దుఃఖాని మునే! తాని న కస్యచిత్ ॥ 23
మునీ! బాలుడు దుశ్చేష్టవలన, దుష్టమనోరథముల నెఱవేర్చుకొన వక్రోపాయముల నవలంబించును.
వాటివలన గలుగు దుఃఖము మరెవ్వరికిని గలుగదు.
అని రెండoబoపు ఆ ఉతCO-
బాలో బలవతా స్వేన మనోరథవిలాసినా | మనసా తప్యతే నిత్యం గ్రీష్మేణేవ వనస్థలి "I 24
గ్రీష్మమున వనభూమి తపించునట్లు, బాలుడు మనోరథముల వెంటనంటి పరుగిడ్డు తనమనస్సువలన
గొండ
తపింపబడుచున్నాడు18 .
Besar y e విద్యాగృహగతో బాలో పరామేతి కదరనామ్ 1
ఆలాన ఇవ నాగేంద్రో విష వైషమ్య భీషణామ్ || 25 25
పాఠశాల కఱిగిన బాలుడు కట్టుబడిన ఏనుగువలె, విషమములగు బాధల నందును. అ
నానామనోరథమయీ మిథ్యాకల్పితకల్పనా !
దుఃఖాయాత్యంత దీర్ఘాయ బాలతా పేలవాశయా ||
00:26
పలుకోర్కెలతోడను, మిథ్యాకల్పనలతోడను, ప్రారహీనములగు ఆశయములతోడను గూడిన బాల్యము
దీర్ఘదుఃఖము కొరకే. 3
{}
సంహృష్టో భువనం భోక్తుమిందు మాదాతుమంబరాత్
వాంఛతే యేన మౌర్యేణ తత్ సుఖాయ కథం భవేత్ ॥ 27
ప్రపంచమును భుజించు కోర్కెయు, ఆకాశమునుండి చంద్రుని గొనివచ్చు తలపును గల బాల్య
మైట్లు సుఖకరము కాగలదు?
అంతశ్చిత్తేర శక్తస్య శీతాతపనివారణే |
కో విశేషో మహాబుద్ధే! బాలస్యోర్వీరుహస్తథా మన వండర్ డి ఆయ్యరధ్యం 28
వైరాగ్య ప్రకరణము (సర్గ = 20) 1091
మహామతీ! బాలునకును వృక్షమునకును భేదమేమి? ఇరువురకు వాంఛ యున్నది - కాని శీతాతపముల
వారించుకొను శక్తి లేదు.
ఉడ్డీతుమభివాంఛంతి పక్షాభ్యాం క్షుత్పరాయణాః ।
భయాహారపరా నిత్యం బాలా విహగ ధర్మిణః ॥ "1 29
బాలుడు భీతి, ఆకలి కలిగినప్పుడు చేతుల జాపి పక్షివలె పై కెగురగోరును. ఆ
శైశవే గురుతో భీతి ర్మాతృతః పితృస్తథా అది అతద్మతింగ్లు
జనతో జ్యేష్ఠబాలాచ్చ శైశవం భయమందిరమ్ ॥ 30
శైశవమున గురువు, తల్లిదండ్రులు, అపరిచితులు, పెద్దపిల్లలవలన భయ మపరిమితముగ గల్గును.
(కాన) శైశవము భయమున కిల్లు., తెంచి 8 అంగారెందు లో
సకలదోషద శావిహతాశయం. శరణమవ్యవివేకవిలాసినః అతిడి ంచనిద్రత
ఉఇహ న కస్యచిదేవ మహామునే! భవతి బాల్యమలం పరితుష్టయే H Ideas 31
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే బాల్యజుగుప్సా నామ ఏకోనవింశః సర్గః ॥19॥
మహామునీ! బాల్యమున వివిధ దోషములవలన మనస్సు కలుషిత మగును; ఇది అవివేకమను
విలాసపురుషున కాశ్రయము. ఇట్టి బాల్యము జగత్తున ఎవరికిని సంతోషమును గలిగింపజాలదు.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున బాల్యజుగుప్స యను ఏకోనవింశ సర్గము ॥ 19 ॥
యౌవనగర్హా వర్ణనము -20
శ్రీరామ ఉవాచ :
బాల్యానర్థమథ త్యక్త్యా పుమానభిహతాశయః |
ఆరోహతి నిపాతాయ యౌవనం సంభ్రమేణ తు ॥ 1
శ్రీరాముడు: అనంతరము బాల్యానర్థమునుండి విడివడి, పెంపుగొను కోర్కెలతో యౌవనమును పొందును;
3 దీని ఫలితమును పతనమే.
తత్రానంత విలాసస్య లోలస్య స్వస్య చేతనః ।
వృత్తీరనుభవన్ యాతి దుఃఖాద్దుఃఖాంతరం జడః ॥ 2
జడుడగు యువకు డిచ్చట మనస్సుయొక్క చంచలములగు విలాస వృత్తులకు లోబడుచున్నాడు;
ఒక దుఃఖమునుండి విడివడి ఏమరొక దుఃఖము నందుచున్నాడు.
110 యోగవాసిష్ఠము
స్వచిత్తబిల సంఘేన నానాసంభ్రమకారిణా |
బలాత్ కామపిశాచేన వివశః పరిభూయతే ॥ 3
హృదయమునందున్న కామపిశాచమను వివిధములగు భయభ్రాంతులకు హేతువు, శక్తిహీనుడగు
యువకుడు దీనికి వశుడగుచున్నాడు.
చింతానాం లో లవృత్తినాం లలనానామివావృతీః |
అర్పయత్యవశం చేత్తో బాలానామంజనం యథా ॥ 4
ఈ సమయమున చిత్తము యువతులు చిత్తముకంటె నెక్కుడు చంచలముగ నుండును. దీనిని
లోబఱచుకొనజాలము. ఇది సిద్ధాంజనమువలె, భోగవస్తువుల కనంబడ జేయును.
తే తే దోషా దురారంభాస్తత్ర తం తాదృశాశయమ్ | (a)
తద్రూపం ప్రతిలుంపంతి దుష్టస్తేనైవ యే మునే! ॥ 5
మునీ! యౌవనమున, నాశకారణములగు స్త్రీద్యూత కలహాది దోషము లన్నియు, కామచింతా వివశు
డగు పురుషుని బాడుచేయుచున్నవి.
మహానరకబీజేన సంతతభ్రమదాయినా |
యౌవనేన న యే నష్టా నష్టా నాన్యేన తే జనాః ॥ 6
నరకబీజమును, భ్రాంతిప్రదమును నగు యౌవనమున పాడవనివాడు, ఇతరములవలన పాడవడు.
నానారసమయీ చిత్రవృత్తాంత నిచయోంభితా ।
భీమా యౌవనభూర్యేన తీర్థా ధీరః స ఉచ్యతే || 7
శృంగారాది రసములతో గూడినదియు, వివిధ విషయాభిలాషలతో నిండినదియు, భయంకరమును
అగు యౌవనాటవిని దాటినవాడు ధీరు డనబడుచున్నాడు.
నిమేషభాసురాకాలమాలోలమనగర్జితమ్ |
విద్యుత్ప్రకాశమశివం యౌవనం మే న రోచతే ॥ 8
క్షణమాత్రము దీపిల్లు ఉజ్జ్వల ప్రకాశమును, గర్జనమును గల మెఱుపుతీగను బోలు అశుభయౌవనము
నాకు రుచింపదు.
మధురం స్వాదు తిక్తం చ దూషణం దోషభూషణమ్ |
సురాకల్లోల సదృశం యౌవనం మే న రోచతే ॥ 9
వైరాగ్య ప్రకరణము (సర్గ - 20) 111
ఈ యౌవనమూ, భోగసమయమున మధురమై తోచుచు, కటు పరిణామము గల కల్లు వంటిది;
దూష్యవస్తువు. దోషముల మేటి. ఇది నాకు రుచించుట లేదు.
అసత్యం సత్యసంకాశ మచిరా ద్విప్రలంభదమ్ ।
స్వప్నాంగనాసంగసమం యౌవనం మే న రోచతే ॥ 10
యౌవనమును, స్వప్న స్త్రీసంగమమును సమానములు- ఈరెండును అసత్యములే. కాని నిజమట్లు
కనంబడి, వెను వెంటనే మోసగించును. ఇట్టిదగు యౌవనము నాకు రుచింపదు.
సర్వస్యాగ్రే సర్వపుంస: క్షణమాత్రమనోహరమ్
గంధర్వనగరప్రఖ్యం యౌవనం మే న రోచతే ॥
"I 11
క్షణికములగు మనోహర వస్తువు లన్నిటిలో నగ్రణియు, క్షణికమును, గంధర్వనగర సదృశమును
నగు యౌవనము నాకు రుచింపదు.
ఇషు ప్రపాతమాత్రం హి సుఖం దుఃఖభాసురమ్ |
దాహదోషప్రదం నిత్యం యౌవనం మే న రోచతే ॥ 12
సంధింపబడిన బాణమువలె, అల్పసుఖ దాయకమును, దుఃఖాంతమును, హృదయ తాపహేతువును
నగు యౌవనము నాకు రుచించుట లేదు.
ఆపాతమాత్రరమణం సద్భావరహితాంతరమ్ ।
వేశ్యాస్త్రీ సంగమప్రఖ్యం యౌవనం మే న రోచతే ॥
13
వేశ్యాసంగమమువలె ఆపాత మనోహరమును, నీచమును నగు యౌవనము నాకు రుచింపదు.
యే కేచన సమారంభాస్తే సర్వే సర్వదుఃఖదాః ।
తారుణ్యే సన్నిధిం యాంతి మహోత్పాతా ఇవ క్షయే ॥ 14
దుఃఖకారణము లగు కార్యము లన్నియు, ప్రళయ సమయమున ఉత్పాతము లరుదెంచునట్లు
యౌవనముననే గూడును.
హార్దాంధకారకారిణ్యా భైరవాకరవానపి ।
యౌవనాజ్ఞానయామిన్యా బిభేతి భగవానవి ॥ 15
హృదయము నంధకార మొనర్చు యౌవనమను అజ్ఞాన రాత్రియందు భైరవాకారమును దాల్చిన
భగవంతుడు గూడ భయపడును.
1121 ((J2 యోగవాసిష్ఠము వడగండ్
సువిస్మృత శుభాచారం బుద్ధి వైదుర్యదాయినమ్ అత
దదాత్యతితరామేష భ్రమం యౌవనసంభ్రమః డ్ అండడోది. 16
యౌవనమోహము మిక్కుటమగు భ్రమను గల్గించును; ప్రధాచారములు మరచు నట్టి నరించును;
బుద్ధిని మందగింపజేయును.
కొంతావియోగజాతేన హృది . దుఃస్పర్శవహ్నినా యుగం (డ నీకు యౌవనే దహ్యతే జంతుస్తరుర్దావాగ్నినా యథా ! డిండ్ డేటిండ్ ఁడడ్ . ఏడ
దావాగ్ని వృక్షమును దహించునట్లు, యౌవనమున మనుజుడు తరుణీ వియోగమువలను వలిగిన
దుఃసహ దుఃఖమువలన దహింపబడును. రెండు రగడ్క రధంగ
సునిర్మలాపి విస్తీర్ణా పావన్యపి హి యౌవనే ల క్ష on this clear tha | cut out
మతిః కలుషతామేతి ప్రావృషీవ తరంగిణీ ॥ || 18
సహజముగ బుద్ధి స్వచ్ఛమును, విశాలమును, పవిత్రమును అయినను, యౌవనమున వర్షాకాల
నదివలె కలుషిత మగును.
శక్యతే మనకల్లోలా భీమా లంఘయితుం నదీ ।
న తు తారుణ్యతరలా తృష్ణా తరలితాంతరా ॥ 19
కెరటములతో భయమును గొల్పు నదిని దాటవచ్చును గాని, చిత్తమను యౌవనమును చంచల
మొనర్చు తృష్ణను దాటలేము.
సా కాంతా తౌ స్తనౌ పీనౌ తే విలాసా స్తదాననమ్ ।
తారుణ్య ఇతి చింతాభి ర్యాతి జర్జరతాం జనః ॥ 20
ఆ వనిత, ఆ పీనస్తనములు, ఆ విలాసము, ఆ సోయగము - ఇట్టి చింతలతో పురుషుడు యౌవనముననే
శైథిల్యము నందును.
నరం తరళతృష్ణార్తిం యువానమిహ సాధవః ।
పూజయంతి న తు చ్ఛిన్నం జరతణలవం యథా ॥ || 21
సాధుపురుషులు, చంచల మగు తృష్ణచే పీడితు డగు యువకుని, గడ్డిపరకట్లు చూచుటయే గాక,
CO
అవజ్ఞ కూడ నొనర్తురు.
నాశాయైవ మదార్తస్య దోషమౌక్తికధారిణః ।
అభిమానమహేభస్య నిత్యాలానం హి యౌవనమ్ ॥ 22