వైరాగ్యప్రకరణము (సర్గ - 20) 113
అభిమాన మత్తుడగు పురుషుడు మదపుటేనుగ వంటివాడు; దోషములే వీని ముత్యములు (ఏనుగ
గండస్థలమున ముత్యము లుండునను విషయము లోక ప్రసిద్ధము) యౌవనమే వీనికి వినాశమును
జేకూర్చును; ఇదియే వానిని నిరంతరము కట్టియుంచు స్తంభము.
మనోవిపులమూలానాం దోషాశీ విషధారిణామ్ |
శోషరోదనవృక్షాణాం యౌవనం బత కాననమ్ ॥ 23
ఆహా ! యౌవనము శుష్కరోదనములను వృక్షము లుండు అడవి ; మనస్సే దీని మొదలు. దోషములను
సర్పములే దీన వాస మొనర్చుచున్నవి.
రసకేసరసంబాధం కువికల్పదలాకులమ్ ।
దుశ్చింతాచంచరీకాణాం పుష్కరం విద్ధి యౌవనమ్ || 24
దుశ్చింతలను తుమ్మెదలకు పద్మ మీ యౌవనము; సుఖలవమే దీని మధువు; అనురాగాదులే దీని
కేసరములు; తుచ్ఛకల్పనలే దీని దళములు;
కృతాకృత కుపక్షాణాం హృత్సరస్తీరచారిణామ్ |
ఆధివ్యాధి విహంగానామాలయో నవయౌవనమ్ ॥ 25
యౌవనము, హృదయ మను సరస్సుయొక్క తీరముల సంచరించు నవియు, కృతాకృతము లగు
పాపపుణ్యములను చెడురెక్కలు గలిగినవియు నగు చింతావ్యాధులను పక్షులకు గూడు.
జడానాం గతసంఖ్యానాం కల్లోలానాం విలాసి నామ్
అన పేక్షితమర్యాదో వారిధిర్నవయౌవనమ్ |
11 26
నవయౌవనము జరాదుఃఖములను చెలియలికట్ట గలిగి, వికల్ప తరంగములతో గూడుకొనిన
మహాసముద్రము; ఈ తరంగములు లెక్కకు మీరినవి, జడములు.
సర్వేషాం గుణసర్గాణాం పరిరూఢరజస్తమాః ।
అపనేతుం స్థితం దక్షో విషమో యౌవనానిలః ॥ 27
దుమ్మును లేవనెత్తి, చీకటిని గ్రమ్మజేయు పెనుగాలి సాలెగూళ్లను పాడుచేయ గలిగినట్లు; రజస్తమో
గుణముల ప్రాబల్య హేఏతువగు యౌవనము, ప్రయత్నములో సంపాదింపబడిన సద్గుణ జాలముల నాశన
మొనర్ప సమర్థమై యున్నది.
నయంతి పాండుతాం వక్రమాకులావకరోత్కటాః । 1
ఆరోహంతి పరాం కోటిం రూక్షా యౌవనపాంసవః ॥ 28
VI F8
114 యోగవాసిష్ఠము
ఇంద్రియ చాంచల్యమున పైకెగసిన యౌవనమను ధూళి, మనుష్యుల వదనములను వెల్లడిజేయుటలో
శ్రేష్ఠత నందును.
ఉద్బోధయతి దోషాలిం నికృంతతి గుణావలిమ్
I
నరాణాం యౌవనోల్లాసో విలాసో దుష్కృతశ్రియామ్ ॥ I Crack 29
పాపముయొక్క విలాస మగు యౌవనోల్లాసము దోషములను పెంచును; గుణములను త్రెంచును.
శరీరపంకజరజశ్చంచలాం మతిషట్పదీమ్ ।
నిబధ్నన్ మోహయత్యేష నవయౌవనచంద్రమాః ॥ 5030
యౌవనమను చంద్రుడు శరీరమను పద్మముయొక్క పుప్పొడిని బొందగోరు మనస్సను తుమ్మెదను
బద్ధమొనర్చి మోహిత మొనర్చును. (పద్మమున ప్రవేశించి మధువును త్రాగి మత్తిలు భ్రమరము, చంద్రోదయ
మైనంతనే పద్మము ముకుళించుకొని పోవ, అందు బంధీకృతమై పరితపించు నను విషయము కవిప్రసిద్ధము.)
శరీరఖండకోద్భూతా రమ్యా యౌవనవల్లరీ ।
లగ్నమేవ మనోభృంగం మదయత్యున్నతిం గతా ॥ 31
శరీర మను పొదరింట పుట్టిన యౌవన కుసుమములు, పొడసూపిన మాత్రముననే, మానసభ్రమరము
మోహమునం బడును.
శరీరమరుతాపోత్థాం యువతా మృగతృష్ఠికామ్ |
మనోమృగాః ప్రధావంతః పతంతి విషయావటే ॥ 32 32
మనస్సులను లేళ్లు, శరీర మను మరుభూమియందు కామతాపమువలన గల్గిన యౌవనమను
ఎండమావులకై పరుగులిడి విషయములను గర్తమునం గూలుచున్నవి.
శరీరశర్వరీజ్యోత్స్నా చిత్తకేసరిణః సటా ।
లహరీ జీవితాంబోధేర్యువతా మే న తుష్టయే ॥ 33 33
యౌవనము- శరీర మను రాత్రియొక్క వెన్నెల; చిత్త మను సింహముయొక్క జూలు; జీవన
సముద్రముయొక్క తరంగము - ఇవి నాకు సంతోషమును గలిగింపజాలవు.
దినాని కతిచిద్ యేయం ఫలితా దేహజంగలే |
యువతా శరదస్యాం హి న సమాశ్వాసమర్హథ ॥ 34
ఈ యౌవనమును శరత్కాలము దేహాటవియందు ఫలించునది అల్పకాలమే; అందువలన దీనిని
విశ్వసించుట తగదు.
వైరాగ్యప్రకరణము (సర్గ - 20) 115
ఝటిత్యేవ ప్రయాత్యేవ శరీరాద్యువతా ఖగః
|
క్షణేనై వాల్పభాగ్యస్య హస్తాచ్చింతామణిర్యథా
11 35
చింతామణి క్షణములో దురదృష్టవంతుని చేతినుండి జారిపోవునట్లు, యౌవన విహంగము
అల్పసమయములోనే దేహమునందుండి ఎగసిపోవును.
యదా యదా పరాం కోటిమధ్యారోహతి యౌవనమ్ ।
వల్గంతి సజ్వరాః కామాస్తదా నాశాయ కేవలమ్ ॥ 36
నడియౌవనమున, కామము సంతాపము గూర్చుచు ప్రాబల్యము నందును; ఇది వినాశనమును
గూర్చుటకొఱకే.
తావదేవ వివల్గంతి రాగద్వేషపిశాచకాః
1
నాస్తమేతి సమసైషా యావద్యౌవనయామినీ 37
యౌవనమను రాత్రి గడవనంతవఱకు రాగద్వేషాదులను పిశాచములు సంచరించుచునే యుండును.
నానావికారబహులే వరాకే క్షణనాశిని 1
కారుణ్యం కురు తారుణ్యే మ్రియమాణే సుతే యథా ॥ 38
చనిపోవు పుత్రునెడల కరుణను జూపదగునట్లు, నానావిధ వికారములతో గూడి, క్షణభంగుర మగు
యౌవనము ఎడల దయజూప నగును.
హర్షమాయాతి యో మోహాత్ పురుషః క్షణభంగినా ।
యౌవనేన మహాముగ్ధః స వై నరమృగః స్మృతః || 39
ఏ పురుషుడు క్షణభంగుర మగు యౌవనము నెడల ముగ్ధుడై, అజ్ఞానముతో సంతుష్టు డగునో
అతడు నరపశువు.
మానమోహాన్మదోన్మత్తం యౌవనం యో భిలష్యతి
1
అచిరేణ సదుర్బుద్ధిః పశ్చాత్తాపేన యుజ్యతే || 40
ఏవ్యక్తి, అభిమాన మోహమున గప్పబడి, మదోన్మత్త మగు యౌవనము నభిలషించునో ఆ దుర్మతి
అచిరముననే అనుతప్తు డగును.
తే పూజ్యాస్తే మహాత్మాన స్త ఏవ పురుషా భువి ।
యే సుఖేన సముత్తీర్ణాః సాధో యౌవనసంకటాత్ ॥ 41
సాధువర్యా! ఎవరు యౌవన సంకటమును సుఖముగ దాటిరో, వారే పూజ్యులు, వారే మహాత్ములు,
116 యోగవాసిష్ఠము
వారే పురుషులు.
సుఖేన తీర్యతేంబోధి రుత్కృష్ట మకరాకరః ॥
న కల్లోల బలోల్లాసి న దోషం హతయౌవనమ్॥ 42
పెనుమొసళ్లతో నిండిన సముద్రమును అనాయాసముగ దాటగలము గాని, రాగాదిదోష తరంగములతో
గూడి, దోషమయ మగు పాడు యౌవనమును దాటలేము.
వినయభూషితమార్యజనాస్పదం కరుణయోజ్జ్వలమావలితం గుణైః |
ఇహ హి దుర్లభమంగ సుయౌవనం జగతి కాననమంబరగం యథా ॥ 43
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే యౌవనగర్హా నామ వింశతితమః సర్గః ॥ 20 ॥
వినయముతో నలంకరింపబడి నదియు, ఆర్యుల శాంతిభూమియు, కరుణచే ప్రకాశించు నదియు,
సుగుణావృతమును నగు యౌవన మీ జగత్తున, ఆకాశ కుసుమమువలె దుర్లభము.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున యౌవనగర్హణమను వింశతితమ సర్గము ॥ 20 ॥
స్త్రీ జుగుప్సా వర్ణనము-21
శ్రీరామ ఉవాచ :
మాంసపాంచాలికాయాస్తు యంత్రలోలే ౦గపంజరే
1
స్నాయ్వస్థి గ్రంథి శాలిన్యా స్ట్రియాః కిమివ శోభనమ్ ॥
1
శ్రీరాముడు: నరములు, ఎముకల కూర్పులును, మాంసపు బొమ్మలును నగు స్త్రీల యంత్ర చంచలాంగముల
శోభను గూర్చు వస్తు వేమున్నది?
త్వఙ్మాంసరక్తబాష్పాంబు పృథక్ కృత్వా విలోచనమ్ ।
సమాలోకయ రమ్యం చేత్ కిం ముధా పరిముహ్యన్ ॥ 2
వనితయొక్క లోచనములను, చర్మమును, మాంసమును, రక్తమును, కన్నీటిని వివరించి చూడుము;
బాగున్న వలచుము, వృథా ముగ్ధుడు కానేల?
ఇతః కేశా ఇతో రక్తమితీయం ప్రమదాతనుః ।
కిమేతయా నిందితయా కరోతి విపులాశయః ॥ 3
వైరాగ్యప్రకరణము (సర్గ - 21) 117
ఇచ్చట కేశములు, ఇట రక్తము- వీటితో గూడినదే గదా స్త్రీయొక్క శరీరము! వివేకి దీనితో నే
మొనర్చును?
వాసో విలేపనైర్యాని లాలితాని పునః పునః ॥
తాన్యంగాన్యంగ లుంఠంతి క్రవ్యాదాః సర్వదేహినామ్ 4
ఆహా! వస్త్రములవలనను, లేపనములతోడను, మాటిమాటికి కోమల మొనర్పబడుచున్నవే, జీవుల
అవయవము లన్నియు! - వీటిని కుక్కలు నక్కలు పొట్టను పెట్టుకొనునే!
మేరుశృంగ తటోల్లాసి గంగాజలరయోపమా |
దృష్టా యస్మిన్ స్తనే ముక్తా హారసోల్లాస శాలితా ॥ 5
శ్మశానేషు దిగంతేషు స ఏవ లలనాస్తనః ।
శ్వభిరాస్వాద్యతే కాలే లఘుపిండ ఇవాంధసః ॥ 6
ఏ స్తనములు, మేరు శిఖరమున బ్రవహించు మందాకినీ జలధారలవలె ముత్యాల హారముల శోభతో
కనుల పండువొనర్చు చుండునో, అవి కాలవశమున శ్మశానమందొక మూల, కుక్కలకు రుచికరమగు
ఆహార మగుచున్నది.
రక్తమాంసాస్థిదిగ్ధాని కరస్య యథావనే
తథైవాంగాని కామిన్యాస్తాం ప్రత్యపి కో గ్రహః ॥ 7
అరణ్యమున తిరుగులాడు లొట్టె అవయవములవంటివే, రక్తమాంసాస్థులతో నిర్మింపబడిన స్త్రీ
అవయవములు; అగుచో వీటియందింత ఆశ ఎందులకు?
ఆపాతరమణీయత్వం కల్ప్యతే కేవలం స్త్రీయాః ।
మన్యే తదపి నాస్త్యత్ర మునే! మోహైకకారణమ్ 8
మునీ! పైపై మెరుగులు స్త్రీల కంటగట్టి అజ్ఞానవశమున అందగత్తెలని తలచుచున్నారు. కాని ఈ
రమణీయతకూడ సంపూర్ణభ్రమ యని గ్రహించితిని.
విపులోల్లాస దాయిన్యా మదమన్మథపూర్వకమ్
కో విశేషో వికారిణ్యా మదిరాయాః స్త్రియాస్తథా ॥
స్త్రీలకును, కల్లునకును భేద మేమియు లేదు. ఈ రెండును మత్తును గల్గించి, ఉల్లాసము నొసగి,
చిత్తవికారమును గూర్చును.
118 యోగవాసిష్ఠము
లలనాలానసంలీనా మునే! మానవదంతిన
ప్రబోధం నాధిగచ్చంతి దృడైరపి శమాంకుశైః || 10
మునీంద్రా! లలనయను స్తంభమునకు గట్టబడి మైమరచిన మానవులను ఏనుగులు శమయను
గట్టి అంకుశమున బొడువంబడియు, వివేకము నందుట లేదు.
కేశకజ్జలధారిణ్యో దుఃస్పర్శా లోచనప్రియాః ।
దుష్కృతాగ్నిశిఖా నార్యో దహంతి తృణవన్నరమ్ । 11
కాటుక కన్నులు, కురులు దాల్చి అందముగ కనంబడు నారీమణులు దుస్సహమగు అగ్నిజ్వాలలు.
వీరు పురుషులను గడ్డిపరకలుగ నొనర్చి దహించుచున్నారు.
జ్వలతామతిదూరే పి సరసా అపి నీరసాః |
స్త్రియో హి నరకాగ్నీనామింధనం చారు దారుణమ్ ॥ 12
అతిదూరమున ప్రజ్వరిల్లు నరకాగ్నికి స్త్రీలు, లావును చేవయు గల కట్టెలు; సరసములుగ కన్పడు
నీరసభోగముల పరిణతియే ఈ నరకము.
వికీర్ణాకారకబరీతరత్తారకలోచనా ॥
పూర్ణేందుబింబవదనా కుసుమోత్కరహాసినీ ॥ 13
లీలావిలోలపురుషా కార్యసంహార కారిణీ ॥
పరం విమోహనం బుద్ధేః కామినీ దీర్ఘయామినీ॥ 14
యువతుల కేశపాశములే చీకట్లు; వీరి చంచల నేత్రములే కదలెడు నక్షత్రములు. వీరి వదనమో
నిండుచందురుడు; వీరి నవ్వు పువ్వుల బోలును. ఇట్టి యువతులు పురుషులను విలాసముల లోనికి దింపి,
ధర్మవైరాగ్యాది కార్యములను మరిపింపజేసి, దీర్ఘరాత్రివలె ఆయువును నాశన మొనర్చుచున్నారు.
పుష్పాభిరామమధురా కరపల్లవశాలిని |
భ్రమరాక్షి విలాసాఢ్యా స్తనస్తబకధారిణీ ॥ 15
పుష్పకేసరగౌరాంగీ నరమారణతత్పరా |
దదాత్యున్మత్తవైవశ్యం కాంతా విషలతా యథా ॥ 16
విషపుతీగె తన్ను సేవించు మూర్ఖుల కున్మాదము కలుగజేయునట్లు, స్త్రీలు తమదరికి జేరు పురుషులను
కామోన్మాదమున వివశుల నొనర్చివైచుచున్నారు. వీరు పుష్పమధురలుగ కన్పడుదురు. వీరి చేతులు
చిగురుటాకులవంటివి; వీరి కన్నులు తుమ్మెదలం బోలును. వీరి స్తనములు పూలగుత్తుల వంటివి. వీరి
వైరాగ్యప్రకరణము (సర్గ - 21) 119
అవయవములు కేసరములవలె ధవళములు. అయినను, వీరు విషలత వలె నరమారణ తత్పరలు.
సత్కార్యోచ్ఛ్వాసమాత్రేణ భుజంగదలనోత్కయా |
కాంతయోద్రియతే జంతుః కరభ్యేవోరగా బిలాత్ ॥ 17
ఎలుగుగొడ్డు శ్వాసతో పాములను కన్నమునుండి పీల్చునట్లు, మాయ మర్యాదల అభినయ మొనరించి,
లలనలు విటుల సర్వస్వమును గైకొని, వారిని వశీకరించుకొనుచున్నారు.
కామనామ్నా కిరాతేన వికీర్ణా ముగ్ధచేతసామ్ ।
నార్యో నరవిహంగానామంగ బంధనవాగురాః ॥ 18
మన్మథుడను కిరాతునిచే మోహిత చిత్తులగు జనులను పక్షులను బట్టగా వనిత యను వల
పన్నబడినది.
లలనా విపులాలానే మనోమత్తమతంగజః |
రతిశృంఖలయా బ్రహ్మన్! బద్ధస్తిష్ఠతి మూకవత్ II 19
బ్రహ్మజ్ఞుడా! మనస్సను మదపు టేనుగ రమణి యను స్తంభమునకు రతి యను శృంఖలము
(సంకెళ్ళు)న బంధింపబడి మూగదానివలె నున్నది.
జన్మవల్వలమత్స్యానాం చిత్తకర్దమచారిణామ్ ।
పుంసాం దుర్వాసనా రజ్జుర్నారీ బడిశవెండికా॥ 20
పురుషులు సంసార మను నీటిగుంటయందలి చేపలు; చిత్తమను బురద వీరు తిరుగు చోటు;
చెడు కోర్కెలే ఈ చేపలను బట్టు కఱ్ఱకు గట్టిన దారము. నెలతయే దీనికి గ్రుచ్చబడిన ఎర.
మందురం చ తురంగాణామాలానమివ దంతినామ్ ।
పుంసాం మంత్ర ఇవాహీనాం బంధనం వామలోచనా ॥ 21
గుఱ్ఱములకు శాలయు, ఏనుగలకు స్తంభమును, పాములకు మంత్రమును బంధము లయినట్లు
పురుషునకు వామలోచనయే బంధము.
నానారసవతీ చిత్రా భోగభూమిరియం మునే!
స్త్రీయమాశ్రిత్య సంయాతా పరామిహ హి సంస్థితిమ్ ॥ "I 22
వివిధములగు శోకమోహాది రసములతో గూడిన విచిత్ర మగు, ఈ బ్రహ్మాండ భోగభూమి స్త్రీల
నాశ్రయించియే స్థిరత్వమును దాల్చినది.
120 యోగవాసిష్ఠము
సర్వేషాం దోషరత్నానాం సుసముధ్ధికయానయా |
దుఃఖశృంఖలయా నిత్యమలమస్తు మమ ప్రియా ॥ 23
రమణి దోషములకు రత్న పేటిక ; దుఃఖముల బట్టియుంచు సంకెల. దీనితో నాకు పనిలేదు.
కిం స్తనేన కిమక్షా వా కిం నితంబేన కిం భ్రువా |
మాంసమాత్రైకసారేణ కరోమ్యహమవస్తునా "I 24
స్తనములు, నేత్రములు, పిఱుదులు, కనుబొమ్మలు - వీటి సారము మాంసమే గదా? ఈ తుచ్చ
వస్తువులతో నేనేమి యొనర్తును?
ఇతో మాంసమితో రక్తమితో స్థీనీతి వాసరైః |
బ్రహ్మన్! కతిపయైరేవ యాతి స్త్రీ విశరారుతాం ॥ 650/25
బ్రహ్మఙ్ఞా! అస్థి మాంస రక్తముల ముద్దయగు రమణి కొన్నిదినములలోనే విశీర్ణమై పోవుచున్నది.
యాస్తాత పురుషైః స్థూలైర్లలితా మనుజై: ప్రియాః । I
తా మునే! ప్రవిభక్తాంగ్యః స్వపన్తి పితృభూమిషు ॥ "I 26
మునీంద్రా! స్థూల బుద్ధులగు పురుషులకు ప్రియమై లాలింపబడిన తరుణుల శరీరాంగములు
శ్మశానము ఇటనట చెల్లాచెదరై పడియున్నవి; వారట దీర్ఘనిద్ర పోవుచున్నారు. దండు
యస్మిన్ ఘనతర స్నేహం ముఖే పత్రాంకురా స్త్రియః ।
కాంతేన రచితా బ్రహ్మన్! పీయతే తేన జంగలే ॥ 27
ప్రియులు నెమ్మోములందు రచించిన తిలకములు నేడు అరణ్య భూములలో శుష్కించుచున్నవి.
కేశాః శ్మశానవృక్షేషు యాంతి చామరలేఖికామ్ ।
అర్థీ న్యుడువదాభాంతి దినైరవనిమండలే ॥
.28
వారి కేశములు శ్మశాన వృక్షములందలి చామరముల ట్లూగుచున్నవి; వారి అస్టులు భూమిపై బడి
నక్షత్రములవలె ఆభాసిల్లుచున్నవి.
పిబంతి పాంసవో రక్తం క్రవ్యాదాశ్చాప్యనేకశః ॥
చర్మాణి చ శివా భుంక్తే ఖం యాంతి ప్రాణవాయవః ॥ 29 29
వారి రక్తమున దుమ్ము పడుచున్నది; గ్రద్దలు మాంసమును దినుచున్నవి. వారి ప్రాణ వాయు
వాకాశమున లీన మగుచున్నది.
వైరాగ్యప్రకరణము (సర్గ - 21) 121
ఇత్యేషా లలనాంగానా మచిరేణైవ భావినీ।
స్థితిర్మయా వః కథితా కిం భ్రాంతి మనుధావథ ॥ 30
తరుణియొక్క అవయవముల స్థితి ఇట్లగుచుండ భ్రాంతి ఎందులకు?
భూతపంచకసంఘట్టసంస్థానం లలనాభిధమ్ ।
రసాదభివతత్వేతత్ కథం నామ ధియాన్వితః "I 31
పంచభూతముల సన్నివేశ మగు లలన యను దానియందు, బుద్ధిమంతు డేల అనురాగమును దాల్చును?
శాఖాప్రతానగహనా కట్వామ్ల ఫలమాలినీ।
సుతాలోత్తాలతామేతి చింతా కాంతానుసారిణీ ॥ 32
చిత్తము స్త్రీల ననుసరించిన, శాఖలతో దట్టమై, కట్వామ్లరుచి యుక్తము లగు అపక్వ ఫలములతో
గూడిన సుతాల లతవోలె, దట్టమై అలముకొనును.
కాం దిగ్భూతతయా చేతో మనగర్థాంధమాకులమ్ |
వరం మోహముపాదత్తే యూథ భ్రష్టమృగో యథా ॥ 33
కస్తూరిమృగము వాసనవలన నాకర్షింపబడి, పరుగిడి, మందను తప్పి పోవునట్లు కామపరవశమైన
మనస్సు, లక్ష్యమున దప్పి మోహమున గూలును.
శోచ్యతాం పరమాం యాతి తరుణస్తరుణీవరః |
నిబద్ధః కరిణీలోలో వింధ్యఖాతే యథా గజః ॥ 34
ఆడు ఏనుగును కలయ నిచ్చించు కరి, వింధ్యపర్వత ప్రాంతములందు ద్రవ్వబడిన అఖాతమున
గూలునట్లు, తరుణీగత చిత్తుడగు మనుష్యుడు దుఃఖమున గూలును.
యస్య స్త్రీ తస్య భోగేచ్ఛా నిః నిఃస్త్రీ శ్రీకస్య క్వ భోగభూః ।
స్త్రీయం త్యక్త్వా జగత్యక్తం జగత్యక్త్యా సుఖీ భవేత్ ॥ 35
వనిత యున్న వానికే భోగేచ్ఛ; వనిత లేనిచో భోగమున కాస్కార మెచ్చట? అందువలన, కామినీత్యాగ
మవశ్య మొనరింప నగును. రమణిని త్యజించుట యనిన జగత్తును త్యజించుటే. జగత్తును దృజించిన
సుఖి యగును.
ఆపాతమాత్రరమణేషు సుదుస్తరేషు
భోగేషు నాహమలిపక్షతిచంచలేము |
122 యోగవాసిష్ఠము
బ్రహ్మన్! రమే మరణరోగ జరాదిభీత్యా
శామ్యామ్యహం పరము పైమి పదం ప్రయత్నాల్ "I 36
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే స్త్రీ జుగుప్సా నామ ఏకవింశతితమః సర్గః ॥ 21 ॥
బ్రహ్మజ్ఞుడా! ఆపాత రమణీయములును, భ్రమర పక్షములవలె చంచలములును, దురతిక్రమములును
నగు భోగములందు జరామరణ భీతిచేత, ఆసక్తుడను కాను. 'ఉపరతి' నవలంబించి పరమపదము నందెదను.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున స్త్రీ జుగుప్సయను ఏకవింశతితమ సర్గము ॥ 21 ॥
జరాజుగుప్సా వర్ణనము -22
శ్రీరామ ఉవాచ:
అపర్యాప్తం హి బాలత్వం బలాత్ పిబతి యౌవనమ్ |
యౌవనం చ జరా పశ్చాత్ పశ్య కర్కశతాం మిథః ॥ 1
శ్రీరాముడు: యౌవనము కోర్కెలు నిండని బాల్యమును కబళించి వైచును, పిదస, వార్ధక్యము యౌవనమును
మ్రింగివైచును, చూడుడు, వీటి మోటుదనము.
హిమాశనిరివాంభోజం వాత్యేవ శరదంబుకమ్ ।
దేహం జరా నాశయతి నదీతీరతరుం యథా ॥ 2
మంచు అను వజ్రము పద్మములను, పెనుగాలి శరత్కాల మేఘములను, నది గట్టున నున్న చెట్టును
నాశన మొనర్చునట్లు, దేహమును ముదిమి పాడొనర్చుచున్నది.
జర్జరీకృత సర్వాంగీ జరా జరఠరూపిణీ|
విరూపతాం నయత్యాశు దేహం విషలవో యథా || 3
విషపు బొట్టువలె, ముసలితనము అవయవములను బడగొట్టుచున్నది; శరీరమును పెనుభూత
మట్లొనర్చుచు, తన ఆకృతిని దోపింప జేయుచున్నది.
శిథిలా దీర్ఘసర్వాంగం జరా జీర్ణకలేబరమ్ ।
సమం పశ్యంతి కామిన్యః పురుషం కరభం యథా ॥
జరాజీర్ణ శిథిలాంగుడగు పురుషుని స్త్రీలు గార్దభము (లేక ఉష్ట్రము) నట్లు అసహ్యదృష్టితో బరికింతురు.
ఆనాయాసకదర్థిన్యా గృహీతే జరసా జనే
5 పలాయ్య గచ్ఛతి ప్రజ్ఞా సపత్న్యేవాహతాంగనా ||
వైరాగ్యప్రకరణము (సర్గ - 22) 123
అవలీలగ దైన్యము నొసగ గల జర, మనుజుని ఆక్రమించి నంతటనే, బుద్ధి సవతివలనం దరుమబడిన
యువతివలె వెడలిపోవును.
దాసాః పుత్రాః స్త్రియశ్చైవ బాంధవాః సుహృదస్తథా |
హసంత్యున్మత్తకమివ నరం వార్ధకకంపినమ్ || 6
ముదుసలిని గాంచి సేవకులు, పుత్రులు, భార్య, బంధువులు, స్నేహితులును హీనుడగు పిచ్చివానిని
జూచి నవ్వునట్లు, నవ్వుదురు.
దుష్ప్రక్ష్యం జరఠం దీనం హీనం గుణపరాక్రమైః |
గృధ్రో వృక్షమివాదీర్ఘం గరోహ్యభ్యేతి వృద్ధకమ్ 7
ముసలిమ్రానిని గ్రద్ద ఆక్రమించుకొనునట్లు, లోభము చూడ నసహ్యము గొల్పు వృద్ధుని
ఆక్రమించుకొనును; అప్పుడతడు, గుణహీనుడు, శక్తిహీనుడు అయి దిగులుపడుచుండును.
దైన్యదోషమయీ దీర్ఘా హృది దాహప్రదాయినీ
సర్వాపదామేకసఖీ వార్ధకే వర్ధతే స్పృహా ॥ || 8
ఆపదలకు తోడగు కామము వార్ధక్యమున వర్ధిల్లుచుండును; ఈ కామము హృదయ తాపము
నిచ్చును; దీనత్వమును గలిగించును.
కర్తవ్యం కిం మయా కష్టం పరత్రేత్యతిదారుణమ్ ।
అప్రతీకారయోగ్యం హి వర్ధతే వార్ధకే భయమ్ ॥ 9
నే నేమి యొనర్తును? పరలోకమున దారుణ మగు పీడ ననుభవింపవలసి వచ్చునే! అను భయము
ముసలితనమున పెరుగును.
కోహం వరాకః కిమివ కరోమి కథమేవచ
తిష్ఠామి మౌనమేవేతి దీనతోదేతి వార్ధకే । "I 10
తుచ్ఛుడను! నేనేమి యొనర్పగలను? ఎట్లొనర్తును? నామాట విను వారెవ్వరు? మెదలక
కూర్చుందును? అని వృద్ధుడు తలపోయుచుండును.
కథం కదా మే కిమివ స్వాదుస్యాద్భోజనం జనాత్ ।
ఇత్యజస్రం జరా చైషా చేతో దహతి వార్ధకే "I 11
'ఎప్పుడు, ఎట్లు, ఎట్టి రుచికర పదార్థములు తినుటకు లభించును?' ఇట్టి చింత వార్ధక్యమున
124 యోగవాసిష్ఠము
మనుష్యుని చిత్తమును దహించుచుండును.
గరో 2 భ్యుదేతి సోల్లాసముపభోక్తుం న శక్యతే |
హృదయం దహ్యతే నూనం శక్తిదౌస్యేన వార్ధకే 12 11
కోరిన కలుగును గాని ఉల్లాసముతో భోగింపగా శక్తి యుండదు - ఇట్టి శక్తిహీన వృద్ధావస్థయందు
హృదయము నిశ్చయముగ దహించుకొని పోవును.
జరా జీర్ణబకీ యావత్ కాయక్లేశావకారిణీ
I
రౌతి రోగోరగాకీర్ణా కాయద్రుమశిర నృతా॥ 13 ព
తావదాత ఏవాళు కుతో ఒపి పరిదృశ్యతే |
మనాంధ్యతిమిరాకాంక్షీ మునే! మరణకౌశికః ॥ 14
మునీ! శరీరమను చెట్టుమీద నున్న పీడాకర మగు జరయను ముసలికొంగ; వ్యాధియను పామువలన
నాక్రమింపబడి మొరపెట్టుచున్నప్పు డెటనుండియో, మూర్ఛ యను చీకటిం గోరు మృత్యు వను గ్రుడ్లగూబ
వచ్చిపడును.
సాయం సంధ్యాం ప్రజాతం పై తమః సమనుధావతి ।
జరాం వపుషి దృష్ట్యేవ మృతిః సమనుధావతి || 15
సాయంసంధ్యను గాంచినతోడనే, చీకటి దానిని వెంటాడునట్లు, జరను గాంచిన తోడనే మృత్యువు
దానివెంటబడును.
జరాకుసుమితం దేహద్రుమం దృష్ట్యిన దూరతః ।
అధ్యాపతతి వేగేన మునే! మరణమర్కటః ॥ 16
మునీంద్రా! మృత్యువను కోతి, శరీరవృక్షమున, జరియను పువ్వు పూచుటను జూచినతోడనే దానిపై
బడును.
శూన్యం నగరమాభాతి భాతి చ్ఛిన్నలతో ద్రుమః ॥
భాత్యనావృష్టిమాన్ దేశో న జరాజర్జరం వపుః ॥ 17
జనులు లేని పురి, లత లేని తరువు, అనావృష్టి యున్న దేశము శోభిల్లును గాని జరా జీర్ణ మగు
శరీరము సొంపును బొందజాలదు.
క్షణాన్ని గరణాయైవ కాసక్వణితకారిణీ ।
గృధ్రీవామిషమాదత్తే తరసైన నరం జరా ॥ 18
వైరాగ్యప్రకరణము (సర్గ - 22) 125
కూయుచున్న గ్రద్ధ మ్రింగుటకే మాంసమును గ్రహించునట్లు, కాసదగ్గే ధ్వనిగా గల జర గూడ
కబళించుటకే మనుష్యుని గైకొనును.
దృష్ట్యేవ సోత్సుకేవాశు ప్రగృహ్య శిరసి క్షణమ్
I
ప్రలూనాతి జరా దేహం కుమారీ కైరవం యథా ॥ 19
బాలిక కౌతుకముతో కలువపూవును గైకొని తలలో ముడిచి, మరల వెంటనే సడలించి, త్రుంచి
పారవేయునట్లు, జరయు మనుష్యుని గ్రహించి నాశన మొనర్చుచున్నది.
సీత్కారకారిణీ పాంసుపరుషా పరిజర్జరమ్ ।
శరీరం శాతయత్యేషా వాత్యేవ తరుపల్లవమ్
II 20
చలిగాలి పెద్దగ వీచిన శరీరము పులకించు నట్లున్ను, ముసలిమ్రానులు ధూళీసిక్తములై పడునట్లును,
రూక్షమగు జర యరుదెంచిన శరీరము వడకును; శిథిలమై పడిపోవును.
జరసోపహతో దేహో ధత్తే జర్జరతాం గతః |
తుషారనికరాకీర్ణ పరిమ్లానాంబుజశ్రియమ్ 21 "I 21
జరాశీర్ణమగు శరీరము, మంచున దడిసి వాడిపోయిన తామరపూవువలె నగును.
జరాజ్యోత్నోదితై వేయం శిరః శిఖరిపృష్ఠితః
వికాసయతి సంరబ్ధం వాత కాస కుముద్వతీ ॥ 22
శిరమను శిఖరమున ముదిమి యను వెన్నెల ఉదయించి, వాతకాసాది రోగములను కలువలను
వికసింపజేయును.
పరిపక్వం సమాలోక్య జరాక్షారవిధూసరమ్ ।
శిరః కూష్మాండకం భుంక్తే పుంసాం కాలః కిలేశ్వరః ॥ || 23
తలయను గుమ్మిడికాయను జరయను బూడిద అలముకొనగా, కాలుడను ఒకానొక ప్రభువు దానిని
పరిపక్వమైన దానినిగ తెలిసికొని భక్షించును.
జహ్నుసుతోద్యుక్తా మూలాన్యస్య నికృంతతి ।
శరీర తీరవృక్షస్య చలత్యాయుషి సత్వరమ్ |
"I 24
జరయను గంగానది వేగముగ పరువిడు ఆయువను ప్రవాహమున, శరీరమను తీరవృక్షపు మొదలును
యత్నముతో పెకలించి పారవేయును.
126 యోగవాసిష్ఠము
జరామార్జారికా భుంక్తే యౌవనాఖుం తథోద్ధతా !
పరముల్లాసమాయాతి శరీరామిషగర్ధినీ 25 25
జరయను మార్జాలము, యౌవనమను మూషికమును భక్షించి శరీరమను మాంసమును తిను నిచ్ఛతో
ఉల్లాసమున వేచియుండును.
కాచిదస్తి జగత్యస్మిన్నామంగలకరీ తథా।
యథా జరాక్రోశకరీ దేహజంగలజంబుకీ II
26
వికట శబ్దము నొనర్చు ముదిమి యను నక్క, శరీర మను అరణ్యమున నున్నది; దీని ఊళను
బోలు అపశకునము మరొకటి ఈ జగత్తున లేదు.
కాసశ్వాసససీత్కారా దుఃఖధూమతమోమయీ |
జరాజ్వాలా జ్వలత్యేషా యస్యాసౌ దగ్ధ ఏవ హి |
27
జరయను అగ్నిజ్వాల ఎవ్వనియందు ప్రజ్వలించుచుండునో, ఆతడు నిశ్చయముగ దగ్ధు డగును;
కాకశ్వాసలు ఈ జ్వాలయొక్క చిటపట ధ్వనులు, దుఃఖమే దీని ధూమము.
జరసా వక్రతామేతి శుక్లావయవవల్లవా |
తాత తన్వీ తనుర్నౄణాం లతాపుష్పానంతా యథా ॥
28
మానవుల దేహము వృద్ధావస్థయందు, ధవళ పుష్పముల భారముతో అవనతమైన లతవోలె
వంగిపోవును. (ముసలితనమున అంగములు పాలిపోయి, నడుము వంగిపోవుట ఇట సూచింపబడినది)
జరా కర్పూరధవలం దేహకర్పూరపాదపమ్ ।
మునే! మరణమాతంగో నూనముద్ధరతి క్షణాత్ 29
ముదిమి యను కప్పురముతో వెల్లనైన శరీర మను కర్పూర వృక్షమును, మృత్యు వను ఏనుగ
క్షణములో పెల్లగించివేయును.
మరణస్య మునే రాజో జరాధవల చామరా।
ఆగచ్ఛతోఒ గ్రే నిర్యాతి స్వాధివ్యాధిపతాకినీ | "I 30
మునివర్యా! మృత్యువను రాజరుదెంచునప్పుడు ఆధివ్యాధులను సేన ముందుగ వచ్చును; జర
ఆరాజుయొక్క ధవళ చామరము.
న జితాః శత్రుభిః సంఖ్యే ప్రవిష్టా యేం ద్రికోటరే ।
తే జరాజీర్ణరాక్షస్యా పశ్యాశు విజితా మునే! 31
వైరాగ్యప్రకరణము (సర్గ - 22) 127
మునీంద్రా! పర్వతగుహయందు ప్రవేశించిన వానిని శత్రువులు జయింపజాలరు. కాని చూడుడు!
అట్టి వానినిగూడ జర యను రాక్షసి జయించుచున్నది.
జరా తుషారవలితే శరీరసదనాంతరే |
శకువంత్యక్ష శిశవః స్పందితుం న మనాగపి ॥ 32
జరయను పొగమంచుతో నిండిన శరీరమను గృహమధ్యమున నున్న, ఇంద్రియములను శిశువు
లొకింతయు కదలజాలరు.
దండతృతీయపాదేన ప్రస్థలంతో ముహుర్ముహుః |
కా సాధో వాయుమురజా జరా యోషిత్ ప్రనృత్యతి ॥ 33
జరయను నర్తకి దండమను * మూడవ చరణము నాశ్రయించి లేచిపడుచు, నృత్య మొనరించును;
కాసశ్వాసాదులే ఈ నాట్యమున నుపయోగింపబడు మద్దెలలు.
సంసారసంసృతేరస్య గంధకుట్యాం శిరోగతా ।
దేహయష్ట్యాం జరా నామ్నా చామరశ్రీః విరాజతే ॥ 34
రాజు సుగంధానులేపన మొనర్చుకొను గృహమున శ్వేతచామరములు వ్రేలుచుండునట్లు, సంసార
రాజున కుపయోగి యగు విషయములతో నిండిన శిరోభాగమున, జరయు వ్రేలుచుండును.
జరాచంద్రోదయనితే శరీరనగరే స్థితే |
క్షణాద్వికాసమాయాతి మునే! మరణకైరవమ్ ॥ 35
జరయను చంద్రోదయమున తెల్లబడిన శరీర నగరమున, క్షణములో మరణమను కలువ వికసించును.
జరాసుధాలేవనితే శరీరాంతఃపురాంతరే ।
అశక్తిరార్తిరాపచ్చ తిష్ఠంతి సుఖమంగనాః ॥ 36
ముదిమియను సున్నముతో వెల్లవేయబడిన, శరీరమను అంతఃపురమున, అశక్తి, ఆర్తి, ఆపదలను
ఆంగనలు సుఖముగ వాస మొనర్తురు.
అభావో గ్రేసరీ యత్ర జరా జయతి జంతుషు ।
కస్తత్రేహ సమాశ్వాసో మమ మందమతేర్మునే! || 37
* దండమన మఱియుకఱ్ఱ, దండమను సంగీత ; విశేషము, దీని మూడవ చరణమును హెచ్చుతగ్గు స్థాయిలతో
పాడవలెను. కఱ్ఱనూతగ గొనిన వృద్ధుడుగూడ లేచిపడుచు, నడుచును కదా.
128 యోగవాసిష్ఠము
మునీంద్రా! శరీరము లన్నియు, జరపాలిట బడునవియు, మృత్యువుచే గబళింపబడు నవియునై
యున్నవి. శరీరస్థితి ఇట్టి దగుటచే, మందమతి నగు నాకు దీనియందు విశ్వాసము గలుగకున్నది.
కింతేన దుర్జీవిత దుర్గ్రహేణ జరగలేనాపి హి జీవ్యతే యత్ ।
జరాజగత్యామజితా జనానాం సర్వేషణాస్తాత! తిరస్కరోతి 38
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే జరాజుగుప్సానామ ద్వావింకతితమః సర్గ:॥2॥
మునీశ్వరా! ముదిమి వచ్చినను, బ్రతుకవ లెనను పేరాస ఏల? జగత్తున జరను జయింపజాలిన
వారెవరును లేరు: ఈ జర కోర్కెలనన్నిటిని అపూర్ణముగనే యుంచును.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున జరాజుగుప్సయను ద్వావింశతితమ సర్గము ॥ 22 ॥
కాలాపవాద వర్ణనము -23
శ్రీరామ ఉవాచ:
వికల్పకల్పనానల్పజల్పితైరల్పబుద్ధిభిః |
భేదైరుద్ధురతాంనీతః సంసారకుహరే భ్రమః ॥
1
శ్రీరాముడు: ఇది నా భోగవస్తువు. దీని నీ ఉపాయ మవలంబించి పొందెదను; అని చెప్పుచు
దేహాత్మబుద్ధులగు మూఢులు, శత్రుమిత్రులు, ఇష్టానిష్టములు అగు వస్తువులవలన గలిగిన రాగద్వేషములతో,
నచ్ఛేద్యమగు ఈ సంసార కుహరమున బడుచున్నారు.
సతాం కథమివాసేహ జాయతే జాలవంజరే
బాలా ఏవాత్తుమిచ్చంతి ఫలం ముకురబింబితమ్ ॥
2
ఈ విషయముల నెడ సజ్జనుల కెట్లభినివేశము గల్గును? బాలురే అద్దమున ప్రతిబింబిత మగు
ఫలమును తినగోరుదురు.
ఇహాపి విద్యతే యేషాం పేలవా సుఖభావనా ।
ఆఖుస్తంతు మివాశేషం కాలస్తామపి కృంతతి 3
మూషికము సాలెగూటి నుత్తరించునట్లు, ఇట్టి జగత్తున సుఖభావన గొనియుండు వారిని, కాలము
ఉత్తరించును.
న తదస్తీహ యదయం కాలః సకలమస్మరః ।
గ్రసతే తజ్జగజ్జాతం ప్రోతాబ్దిమివ బాడబః ॥
వైరాగ్యప్రకరణము (సర్గ - 23) 129
గర్వితమగు సముద్రము బడబానలమున బడునట్లు, స్పష్టవస్తువు లన్నియు కాలముచే
గబళింపబడును. - ఈ స్థితి నందని వస్తువు లీ జగత్తున లేవు.
సమస్తసామాన్యతయా భీమః కాలో మహేశ్వరః ॥
దృశ్యసత్తామిమాం సర్వం కవలీకర్తుముద్యతః 5 "I
కాలుడు, భయంకరు డగు సంహారకాల రుద్రుడు. ఇది దృశ్యవస్తువుల అస్తిత్వమును రూపుమాప
సమకట్టియున్నది.
మహతామపి నో దేవః ప్రతిపాలయతి క్షణమ్ |
కాలః కవలితానంతవిశ్వో విశ్వాత్మతాం గతః ॥ 6
విశ్వాత్ముడును కబళిత విశ్వుడును అగు కాలదేవుడు గొప్పవారినిగూడ లెక్కగొనడు; వారినిగూడ
మ్రింగివేయును.
యుగవత్సర కల్పాఖ్యైః కించిత్ ప్రకటితాం గతః ।
|
రూపైరలక్ష్యరూపాత్మా సర్వమాక్రమ్య తిష్ఠతి || 7
కాలుని స్వరూపము ‘అగమ్య గోచరము'; కల్పములు, యుగములు, సంవత్సరములను ఉపాధితో
కొంచెము తనరూపును తోపింపజేయుచు, ఆతడు విశ్వమును వశపరచుకొనుచున్నాడు.
యే రమ్యా యే శుభారంభాః సుమేరు గురవోపి యే |
కాలేన వినిగీర్ణాస్తే గరుడేనేవ పన్నగాః ॥ 8
సర్పములు గరుడునిచే మ్రింగబడునట్లు; రమ్యములును, శుభారంభములును, మేరు దృఢములును
అగునవికూడ కాలునిచే మ్రింగబడుచున్నవి.
నిర్దయః కఠినః క్రూరః కర్కశః కృపణో ధమః |
న తదస్తి యదద్యాపి న కాలో నిగిరత్యయమ్ || 9
కాలుని కరాళ వదనమున బడని వారెవరును లేరు ; నిర్దయులు, కఠినులు, క్రూరులు, పరుషభాషులు,
వీరు వారననేల, అందఱును కాలముచే గబళింప బడుచున్నారు.
కాలః కవలనై కాంతమతిరత్తి గిరన్నపి ।
అనంతైరపి లోకౌఘైర్నాయం తృప్తో మహాశనః॥ 10
మ్రింగుటనిన కాలునకు కడుంగడు ఇష్టము; ఒక వస్తువును భుజించు నప్పుడే, మరొక వస్తువును
మ్రింగగలడు. అనంతము లగు లోకములను గళగత మొనర్చు కొనినను, వీని పొట్ట నిండదు.
VI F9
130 యోగవాసిష్ఠము
హరత్యయం నాశయతి కరోత్యత్తి నిహంతి చ ।
కాలః సంసారనృత్తం హి నానారూపం యథా నటః ॥ 11
కాలుడు సంసార నృత్యము నొనరించు నటకుడు; ఇతడు హరించుచున్నాడు. సృష్టించుచున్నాడు,
మ్రింగుచున్నాడు, సంహరించుచున్నాడు.
భినత్తి ప్రవిభాగస్థభూతబీజాన్యనారతమ్ |
జగత్యసత్తయా బంధాద్దాడిమాని యథా శుకః ॥ 12
చిలుక దానిమ్మకాయను పగిల్చి గింజలను దినునట్లు, కాలుడు సంహార మొనర్చి, జగత్తున నున్న
నానావిధ ప్రాణిబీజముల నన్నిటినీ నిర్మూలించుచున్నాడు.
శుభాశుభవిషాణాగ్రవిలూనజనపల్లవః ।
స్ఫూర్జతి సీృతజనతా జీవరాజ్జీవనీ గజ: || 13
అభిమానమున నుబ్బు జీవాత్మలను అరణ్యమున, కాలుడు మత్తగజమట్లు విజృంభించుచున్నాడు.
శుభాశుభ కర్మలే, ఈ కాలుడను మత్తగజము యొక్క దంతములు; జీవసమూహమే ఈ దంతములచే
విచ్ఛిన్న మొనర్పబడు చిగురు టాకులు.
విరించిమూలబ్రహ్మాండ బృహదేవతలద్రుమమ్ ।
బ్రహ్మకాననమాభోగివరమావృత్య తిష్ఠతి ॥
14
బ్రహ్మాండ * మను ఈ మహావృక్షమునకు మూలము బ్రహ్మ; దేవతలే దీని ఫలములు, బ్రహ్మమను
అరణ్యమే ఈ మాయావృక్షమునకు ఉనికి. ఈ అరణ్యములు కాలుని అధికారమున నున్నవి.
యామినీ భ్రమరాపూర్ణా రచయన్ దినమంజరీ |
వర్షకల్పకలావల్లీర కదాచన ఖిద్యతే ॥ || 15
ఈ కాలుడు అనవరతము రాత్రియను తుమ్మెదలతో నిండిన, పగళ్ళను పూలగుత్తులతో గూడిన
కల్పములు, వర్షములను లతను నిర్మించుచునే యుండును; కష్టమని విరమింపడు.
భిద్యతే నావభగ్నో ఏ దగ్ధం ఒ పి హి న దహ్యతే |
దృశ్యతే నాపి దృశ్యోఒ పి ధూర్త చూడామణిర్మునే! 16
మునీ! గడుసరి యగు కాలుడు, ఒకరూపమున (కార్యరూపమున) భగ్నుడైనను, మరొక రూపమున
ఇట, బ్రహ్మమున సూక్ష్మభూతముల సమిష్టి యగు హిరణ్యగర్భు డనియు, దేవతలన ఇంద్రియము లనియు,
బ్రహ్మమన పరబ్రహ్మ మనియు గ్రహించునది- అను.
వైరాగ్యప్రకరణము (సర్గ - 23) 131
(కారణరూపమున) భగ్నుడు కాడు. ఒకచోట దహింపబడియు మతొకచోట దహింపబడడు. ఒకట్లు
కనంబడుచు, మరొకట్లు కనంబడకున్నాడు.
ఏకేనైవ నిమేషేణ కించిదుత్థాపయత్యలమ్ ।
కించిద్వినాశయత్యుచ్ఛైర్మనోరాజ్యవదాతతః
" 17
మనస్సు, నిముషములో ఒకవస్తువును సృజించి భంగ మొనర్చునట్లు, కాలుడుగూడ ఒనర్చుచున్నాడు.
దుర్విలాసవిలాసిన్యా చేష్టయా కష్టపుష్టయా
ద్రవ్యైకరూపకృద్రూపం జనమావర్తయన్ స్థితః ॥ 18
కాలుడు శరీరమను ఆ వస్తువుతో నైక్యమందిన జీవుని, కష్టమును దుష్టమును నగు యత్నముతో
స్వర్గనరకములకు దీసికొనిపోవుచు, మరల కొనివచ్చుచున్నాడు.
తృణం పాంసుం మహేంద్రం చ సుమేరుం పూర్ణమర్లవమ్ 1
ఆత్మంభరితయా సర్వమాత్మసాత్ కర్తుముద్యతః II 19
కుక్షింభరు డగుట వలన కాలుడు గడ్డిని, బూదిని, కొండను, ఆకును, సంద్రమునుగూడ కబళింప
నున్నాడు.
క్రౌర్యమతైవ పర్యాప్తం లుబ్ధతాతైవ సంస్థితా |
సర్వదౌర్భాగ్యమత్రైవ చాపలం వాపి దుఃనహమ్ ॥ 20 || 20
క్రౌర్యము, లోభము, దౌర్భాగ్యము, చాంచల్యము- ఈ కాలునియందే నిండుకొనియున్నవి.
ప్రేరయన్ లీలయార్కేందూ క్రీడతీవ నభ్నులే ॥
నిక్షిప్తలీలాయుగలో నిజే బాల ఇవాంగణే ॥ 21
బాలుడు బంతిని తీయుచు వేయుచు, గృహంగణమున నాడుకొనునట్లు, కాలుడు సూర్యచంద్రులతో
ఆకాశమున నాడుకొనుచున్నాడు.
సర్వభూతాస్థి మాలాభిరాపాదవలితాకృతిః
విలసత్యేవ కల్పాంతే కాలః కలితకల్పనః ॥ 22
కాలుడు ప్రళయ సమయమున జీవుల నందరిని నాశన మొనర్చి, వారి పంచభూత మయాస్థులను
ఆపాద మస్తకము ధరించి, క్రీడించును.
అస్యోత్థామర పృత్తస్య కల్పాంతే గవినిర్గతైః |
ప్రస్ఫురత్యంబరే మేరుర్భూర్జత్వగివ వాయుభిః ॥ 23
132 యోగవాసిష్ఠము
కాలుని పనుల నెవరును అడ్డగింపజాలరు. వీని శరీరమునుండి వెలువడిన మహావాయువు
మేరుపర్వతమును భూర్జర పత్రమువలె పొడిచేసివైచును.
రుద్రో భూత్వా భవత్యేష మహేంద్రో థ పితామహః ।
శక్రో వైశ్రవణశ్చాపి పునరేవ న కించన ॥ 24 24
ఈ కాలుడే, ఒకప్పుడు రుద్రు డగును; మరొకప్పు డింద్రు డగును; ఇంకొకప్పుడు పితామహు
డగును; అన్యసమయమున రూపమే యుండదు.
ధత్తే జస్రోద్ధితోద్వస్తాన్ సర్గానమిత భాస్వరాన్ ।
అన్యాన్ దధద్దివానక్తం వీచీరబ్ధిరివాత్మని ॥ 25 I 25
ఒకే సమయమున పెక్కు అలలను గలిగించి, విరుచుచుండు సముద్రుని వలె, కాలుడు
సృష్టిసంహారముల నొనర్చుచుండును.
మహాకల్పాభిధానేభ్యో వృక్షేభ్యః పరిశాతయన్ |
దేవాసురగణాన్ పక్వాన్ ఫలభారానివ స్థితః ॥ 26
కాలుడు మహాకల్పములను వృక్షములనుండి, దేవాసురులను పక్వఫలములను బడవేయుచున్నాడు.
కాలో యం భూతమశకముంఘుమానాం ప్రపాతినామ్ உ 1
బ్రహ్మాండోదుంబరౌఘానాం బహృత్ పాదపతాం గతః ॥ 27
కాలమను ఉదుంబర వృక్షమునుండి, లెక్కకు మీరిన బ్రహ్మాండములను కాయలు జారిపడుచున్నవి;
వీటిమీద నినదించు మశకములే జీవులు.
సత్తామాత్ర కుముద్వత్యా చిజ్జ్యోత్స్నాపరిపుల్లయా॥
వపుర్వినోదయత్యేకం క్రియాప్రియతమాన్వితః || 28
చిత్ జ్యోత్స్నవలన వికసించిన సత్తయను కలువ సాయమున అద్వితీయుడగు కాలుడు
వినోదించుచున్నాడు; ప్రాణుల శుభాశుభ క్రియలే ఇతని పత్ని.
అనంతాపారపర్యంతబద్ధ పీఠం నిజం వపుః॥
మహాశైలవదుత్తుంగమవలంబ్య వ్యవస్థితః 29 ||
తుదిమొదళ్లు లేని పెద్దకొండవలె కాలుడు వెలయుచున్నాడు.
వైరాగ్యప్రకరణము (సర్గ - 23) 133
క్వచిచ్ఛ్యామతమః శ్యామం క్వచిత్ కాంతియుతం తతమ్ |
ద్వయేనాపి క్వచిద్రిక్తం స్వభావం భావయన్ స్థితః 30
కాలు డొకచోట కారునలుపు గలిగిన వస్తువులను, ఒకచోట కాంతి మంతములగు వస్తువులను,
మరొకచోట వర్ణశూన్యము లగు పదార్థములను సృజించుచున్నాడు.
సంలీనాసంఖ్యసంసారసారయాస్వాత్మసత్తయా |
ఉర్వ్యేవ భారఘనయా నిబద్ధపదతాం గతః ॥ 31
కాలుడు, లోపించిన జీవుల సారమెల్ల పృథివివలె భారమగు స్వకీయ సత్తతో నిలిచియున్నాడు.
న ఖిద్యతే నాద్రియతే నాయాతి న చ గచ్ఛతి |
నాస్తమేతి న చోదేతి మహాకల్పశతైరపి ॥ 32
మహాకల్పములు పెక్కులు గడచినను కాలుడు భేదింపడు, ఆదరింపడు, వీని స్థితిగతులకు
ఉదయాస్తమయములు లేవు.
కేవలం జగదారంభలీలయా మనహేలయా ।
పాలయత్యాత్మనాత్మానమనహంకారమాతతమ్ || 33
కాలుడు అనాయాసముగ లభించిన జగత్సృష్టియను క్రీడయందు, నిరహంకారుడై తనకు దన్నే
పాలించుకొనుచున్నాడు.
యామినీ పంకకలితాం దినకోకనదావలీమ్ |
మేఘభ్రమరికామాత్మనరస్యారోపయన్ స్థితః || 34
కాలుడు, సరోవరమునుబోలు తన స్వరూపమును, రాత్రియను పంకమును నించుకొని, మేఘములను
భ్రమరములు చుంబించు పగళ్లను ఎఱ్ఱతామర పూవులను ధరించియున్నాడు.
గృహీత్వా కృపణః కృష్ణాం రజనీం జీర్ణమార్జనీమ్ ।
ఆలోకకనకక్షోదానాహరత్యభితో గిరిమ్ ॥ 35
కాలుడను పిసినిగొట్టు రాత్రి యను సమ్మార్జని (చీపురుకట్ట)తో మేరు పర్వతమున నున్న
సూర్యకిరణములను బంగారమును ప్రోగుచేయుచున్నాడు.
సంచారయన్ క్రియాంగుల్యా కోణకేష్వర్క దీపికామ్ ।
జగత్పద్మని కార్పణ్యాత్ క్వ కిమస్తీతి వీక్షతే ॥ 36
134 యోగవాసిష్ఠము
పిసినిగొట్టు వ్రేలితో దీపపు వత్తి నెగద్రోసి, ఇంట నే మూల ఏమున్నదా యని చూచునట్లు కాలుడు
సూర్యకిరణములతో జగత్తున ఏ కోణమున నేమున్నదో యని చూచుచుండును.
ప్రేక్ష్యాహర్వినిమేషేణ సూర్యాక్ష పాకవన్యలమ్ | |
లోకపాలఫలాన్యత్తి జగజ్జీర్ణవనాదయమ్ ॥
"I 37
కాలుని నేత్రమే సూర్యుడు; పగలే కన్నులు దెరచుట. ఇట్లు కన్నులను దెరచి జగత్తను జీర్ణారణ్యమున
నున్న లోకపాలకులను ఫలములను కాలుడు భక్షించుచున్నాడు.
జగజ్జీర్లకుటీకీర్ణా సర్పయత్యుగ్రకోటరే ।
క్రమేణ గుణవల్లో కమణీన్ మృత్యుసముద్దకే
I 38
88
గుణైరాపూర్యతే యైవ లోకరత్నావలీ భృశమ్ |
భూషార్థమివ తామంగే కృత్వా భూయో నికృంతతి ॥ I 39
కాలుడు ప్రపంచమను జీర్ణకుటీరమున బడియున్న మణులను గుణవంతులను, యత్నముతో
మృత్యువను పెట్టెయందుంచును; రత్నమాలవలె వారిని ధరించి; మరల త్రెంపి ప్రోగులు పెట్టుచుండును.
దినహంసానుసృతయా నిశేందీవరమాలయా |
తారకేసరయాజస్రం చపలో వలయత్యలమ్ "I 40
చపలుడగు కాలుడు, పగళ్లను హంసలచే ననుసరింపబడి నదియు, తారకలను కేసరములు గలదియు
నగు, రాత్రియను నల్లకలువల దండను ధరించియున్నాడు.
శైలార్ణవధరాశృంగ జగదూర్ణాయు సౌనిక:
ప్రత్యహం పిబతే ప్రేక్ష్య తారరక్తకణానది ॥ 41
పర్వతములు, సముద్రము, స్వర్గము, పృథివి అను నాలుగు కొమ్ములు గల జగత్తను మేషమును
హింసించుచు, కాలుడు నక్షత్రములబోలు దానిరక్తపు బొట్లను జూచుచు, క్రోలుచున్నాడు.
తారుణ్యనలినీ సోమ ఆయుర్మాతంగకేసరీ ।
న తదస్తి న యస్యాయం తుచ్ఛాతుచ్ఛన్య తస్కరః ॥ 42
కాలుడు, యౌవన మను పద్మమునకు జంద్రుడు; ఆయువను ఏనుగకు సింగము, జగత్తున కాలుడు
గ్రహింపని వస్తువే లేదు.
కల్పకేలీవిలాసేన పిష్టపాతితజంతునా।
అభావో భావభాసేన రమతే స్వాత్మనాత్మని 43 ॥
వైరాగ్యప్రకరణము (సర్గ - 24) 135
సంహార రూపుడగు కాలుడు, కల్పాంతకేళియందు, ప్రాణుల నన్నిటిని సంహరించి, అజ్ఞాన
ప్రకాశకమును, తన యధిష్ఠానమును నగు బ్రహ్మము నవలంబించి నిలిచియుండును.
కర్తా భోక్తాథ సంహర్తా స్మర్తా సర్వపదం గతః ॥ 44
కాలుడే, విశ్వమున కంతటికి కర్త, భోక్త, సంహర్త, స్మర్తయునై యున్నాడు.
సకలమప్యకలా కలితాంతరం సుభగదుర్భగరూపధరం వపుః |
ప్రకటయన్ సహసైవ చ గోపయన్ విలసతీహ హి కాలబలం నృషు ॥ 45
ఇత్యార్షే వాసిష్ఠ-మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే కాలాపవాదో నామ త్రయోవింశతితమః సర్గః ॥23॥
కాలుడే మంచిగను చెడ్డగను ఎల్లయెడల వెలుగొందుచున్నాడు; బుద్ధిబలమున కాలుని నెవ్వరును
దెలిసికొనజాలరు. జీవులకంటె కాలుడే బలవంతుడు.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున కాలాపవాదమను త్రయోవింశతితమ సర్గము ॥ 23 ॥
కాలవిలాస వర్ణనము - 24
శ్రీరామ ఉవాచ :
అస్యోడ్డామరలీలస్య దూరాస్తసకలాపదః ।
సంసారే రాజపుత్రస్య కాలస్యాకలితాజసః ॥ 1
శ్రీరాముడు: కాలుని లీల అద్భుతము; వాని పరాక్రమము అచింత్యము, పరబ్రహ్మమను రాజునకు మాయ
యను పట్టమహిషియందు జనించిన కాలుడను యువరాజు చరిత్రను వర్ణించెద; వినుడు.
అస్యైవాచరతో దీనై ర్ముగ్గెర్భూతమృగవ్రజైః |
ఆఖేటకం జర్జరితే జగజ్జంగలజాలకే II 2
ఈ యువరాజు జగత్తను జీర్ణారణ్యమున దీనులును, మోహితులును నగు ప్రాణులను మృగముల
వేటాడుచున్నాడు.
ఏకదేశోల్ల సచ్చారువడవానలవంకజా |
క్రీడాపుష్కరిణీ రమ్యా కల్పకాల మహార్ణవః ॥ "I 3
ఈ ప్రపంచారణ్యమున నొకమూల ప్రళయ మను మహాసముద్ర మున్నది; అది యీ రాజపుత్రుని
క్రీడా సరోవరము. అందు బడబాగ్ని యను పద్మ మున్నది.
136 యోగవాసిష్ఠము
కటుతికామ్లభూతాద్యైః సదధిక్షీరసాగరైః ।
తైరేవతైః పర్యుషితైర్జగద్భిః కల్పవర్తనమ్ ॥
దధి క్షీర సముద్రములవలన పర్యుషిత మొనర్పబడిన (చలిది గావింపబడిన) ఈ జగత్తును, ప్రాణులను
పులుపు, తీపు, వగరు పదార్థముల, ఆదరువుతో కాలుడు కల్పాంత కాలమున, ప్రాతర్భోజన మొనర్చుచున్నాడు.
చండీ చతురసంచారా సర్వమాతృగణాన్వితా।
సంసారవనవిన్యస్తా వ్యాఫ్రీ భూతామఘాతినీ ॥ 5
ఈ కాలుని ప్రణయిని (భార్య) చండి (కాళరాత్రి). సర్వభూత వినాశిని యగు ఈపె మాతృగుణ
సహితయై, పెద్దపులివలె ఈజగద్వనమున సంచరించుచున్నది.
పృథ్వీకరతలే పృథ్వీ పానపాత్రీ రసాన్వితా I
కమలోత్పలకల్హార లోలజాలకమాలితా ॥
6
సర్వరసములతో గూడినదియు, కమలాది పుష్పముల గంధముతో నిండినదియు నగు ఈ పృథివి,
కాలుని హస్తమున నున్న పానపాత్ర.
విరావీ వికటాస్పోటో నృసింహా భుజపంజరే 1
సటావికట పీనాంసః కృతః క్రీడాశకుంతకః
7
భయంకరుడగు నృసింహమూర్తి క్షుద్రపక్షులంబోలు రాక్షసులను జంపు కేలి నొనర్ప, కాలుని
భుజపంజరమున క్రీడాశకుంతము (వేటపిట్ట) అయినాడు.
ఆలాబువీణామధురశ్శరద్వ్యోమలనచ్చవిః ।
దేవః కిల మహాకాలో లీలాకోకిలబాలకః ॥
8
వీణామధుర స్వరుడును, శరకాశ స్వచ్ఛకాంతియు నగు భైరవుడు కూడ కాలుని క్రీడాకోకిల
మైనాడు.
| వాంతదుఃఖశరావలిః అజస్రస్ఫూర్జితాకారో అభావనామకోదండ: పరిస్ఫురతి సర్వతః ॥ || 9
కాలుని ధనుస్సునుండి నిరంతరము అభావము (సంహారము) అను ధ్వని వినవచ్చుచునే యుండును.
అద్దానినుండి, ఎడతెగకుండ దుఃఖములను బాణములు పడుచుండును.
అనుత్తమస్త్యధిక విలాసవండితో భ్రమచ్చలన్ పరివిలసన్ విదారయన్
జరజ్జగజ్జనితవిలోలమర్కటః పరిస్ఫురద్వపురిహ కాల ఈహతే ॥ 10
వైరాగ్యప్రకరణము (సర్గ -25) 137
ఇత్యార్షే వాసిష్ట - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే కాలవిలాసోనామ చతుర్వింశతితమః సర్గః ॥24॥
అనుత్తముడును, విలాస పండితుడును నగు కాలుడను రాజకుమారుడు, జగత్తను కాననమున
విహరించుచు, అమోఘము లగు తన బాణములతో విషయ లంపటు లగు జీవులను చపల మర్కటములను
వేటాడుచున్నాడు.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున కాలవిలాసమను చతుర్వింశతితమ సర్గము ॥ 24 ॥
కృతాన్తవిలసిత వర్ణనము-25
శ్రీరామ ఉవాచ :
అత్రైకదుర్విలాసానాం చూడామణిరిహావరః |
కరోత్యతీతి లోకే ఒ స్మిన్ దైవం కాలశ్చ కథ్యతే ॥ 1
శ్రీరాముడు: కాలుడు దుర్విలాస చూడామణి (ఈతడు వెనుక వర్ణింపబడిన మహాకాలుడు కాదు- ఈతడు
తదుపాధి(భూతుడగు ఖండకాలుడు.) ఈతడు, ఈలోకములను సృజించి, సంహరించుచున్నాడు. ఈతడు,
దైవ మనియు, కాల మనియు అవస్థా భేదములచేత వ్యవహరింపబడుచున్నాడు.
క్రియామాత్రాదృతే యస్య స్వపరిస్పందరూపిణః |
నాన్యదాలక్ష్యతే రూపం న కర్మ న సమీహితమ్ II 2
ఈ కాలుని స్వరూపము క్రియ; ఇంకొక రూపము లేదు. కర్మఫలోత్పాదనమే ఇతని ఏకమాత్ర కర్తవ్యము.
తేనేయమఖిలా భూతసంతతిః పరిపేలవా |
తా పేన హిమమాలేవ నీతా విధురతాం భృశమ్ 3
సూర్యకిరణముల మంచు మాయ మగునట్లు, ఈ కాలునివలన పేలవము లగు ప్రాణులన్నియు
నశించుచున్నవి.
యదిదం దృశ్యతే కించిజ్జగదాభోగిమండలమ్ ।
తత్తస్య నర్తనాగారమిహాసావతి నృత్యతి ॥ 4
ఈ పరిదృశ్యమాన జగన్మండల మీ కాలుని నృత్యశాల; ఇందాతడు నిరంతరము నృత్య
మొనరించుచున్నాడు.
తృతీయం చ కృతాంతేతి నామ బిభ్రత్ సుదారుణమ్ |
కాపాలికవపుర్మత్తం దైవం జగతి నృత్యతి ॥ 5
138 యోగవాసిష్ఠము
దైవమను నాతడు మూడవవాడు. (మొదటివాడు పూర్వసరోక్త మహాకాలుడు, రెండవవాడు
క్రియాకాలుడు) ఈతడు భయంకర మగు కాపాలిక వేషమున నృత్యము చేయుచున్నాడు.
నృత్యతో హి కృతాంతస్య నితాంతమిన రాగిణః |
నిత్యం నియతికాంతాయాం మునే! పరమకామితా ॥ 6
మునీంద్రా! పరమ అనురాగివలె కన్నట్టు ఈ కృతాంతుడు తనభార్య యగు నియతియెడల
విశేషానురక్తుడు.
శేషః శశికలాశుభ్ర గంగా వాహశ్చ తౌ త్రిధా |
ఉపవీతే అతేచ ఉభౌ సంసార వక్షసి ॥ 7
చంద్రునివలె తెల్లనయిన శేషుడును, త్రిపథగామినియగు గంగయు, జగత్తను అతని వక్షస్థలమున
వెలయుచున్న యజ్ఞోపవీతములు.
చంద్రార్కమండలే హేమకటకౌ కరమూలయోః ।
లీలాసరసిజం హస్తే బ్రహ్మన్! బ్రహ్మాండకర్ణికా ॥
బ్రహ్మజ్ఞుడా! సూర్యచంద్రు లాతని హస్తభూషణములు; మేరుపర్వత మాతని లీలాకమలము.
తారాబిందుచితం లో లపుష్కరావర్తపల్లవమ్ |
॥ ఏకార్ణవపయోధౌతమేకమంబరమంబరమ్ 9
నక్షత్రములను చుక్కలతోను, పుష్కలావర్త మేఘములను అంచులతోను వెలయు అనంతాకాశము
ఈ కాలుని వస్త్రము; అయ్యది ప్రళయకాల ఏకార్ణవమున నుతకబడుచున్నది.
ఏవం రూపస్య తస్యాగ్రే నియతిర్నిత్యకామినీ।
అనస్తమితసంరంభమారంభైః పరినృత్యతి || 10
ఇట్టి కాలుని ముందు అతని నిత్యసహచరియు, ప్రియపత్నియు నగు నియతి విసుగు లేకుండ
ప్రాణుల భోగానుకూల కార్యములను సల్పుచు, నృత్య మొనరించుచున్నది.
తస్యా నర్తనలోలాయా జగన్మండపకోటరే ।
॥ ఆగమాపాయచంచురే 11 ఆరుద్ధస్పందరూపాయా అను నర్తనశాలకు, కాలుడు నిత్యము వచ్చుచు
ఇట్లు నృత్య మొనర్చు తనభార్యను గాంచి, జగత్తు పోవుచున్నాడు.
వైరాగ్యప్రకరణము (సర్గ - 25) 139
చారుభూషణమంగేషు దేవలోకాంతరావలీ |
ఆపాతాలం నభో లంబం కబరీ మండలం బృహత్ ॥ 12
దేవలోకము లన్నియు ఈ నియతి యను స్త్రీయొక్క ఆభరణములు; నభోమండలమునుండి
పాతాళము వఱకున్న ప్రదేశము వ్రేలెడు కేశరాశి.
నరకాలీ చ మంజీరమాలా కలకలోజ్జ్వలా 1
ప్రోతా దుష్కృత సూత్రేణ పాతాలచరణే స్థితా "I 13
పాతాళలోకము లాపై చరణములు; నరకము లాపె పాదనూపురములు. ఆ నూపురములు
దుష్కృత్యములను త్రాళ్ళచే కట్టబడియున్నవి; ఇవి నరకాగ్నివలన బ్రకాశించుచున్నవి. రోదనములే ఈ
అందియల ధ్వనులు.
కస్తూరికా తిలకకం క్రియాసఖ్యోపకల్పితమ్ ।
చిత్రితం చిత్రగుప్తేన యమే వదనపట్టకే ॥ 14
శుభక్రియలను సఖులు ఆపై కలంకరించిన చిత్రగుప్తుడను కస్తూరీ తిలకము, యముడను ఆపై
ముఖమండలమున వెలయుచున్నది.
కాలాస్యం సముపాదాయ కల్పాంతేషు కిలాకులా
నృత్యత్యేషా పునర్దేవీ స్ఫుటచ్ఛైలఘనారవమ్ ॥
|| 15
ఈ పె, ప్రళయకాలమున భర్తయొక్క కనుసన్నలను సైగలను గ్రహించి, అత్యంత చంచల భావమున
నృత్యము సల్పును; అప్పుడు పర్వతములు బ్రద్దలుగా వెలువడు ధ్వనులు ఆపై పాదధ్వనులు.
పశ్చాత్ ప్రాలంబవిభ్రాంత కౌమారమృత బర్హిభిః ।
నేత్రత్రయబృహద్రంధ్రభూరిభాంకారభీషణై: 16
లంబలోలజటాచంద్రవికీర్ణహరమూర్ధభిః । 1
ఉచ్చరచ్చారుమందారగౌరీకబరచామరై: "1 17
ఉత్తాండవాచలాకారభైరవోదరతుంబకై ।
రణత్ సశతరంధ్రీంద్రదేహభిక్షాకపాలకైః ॥ I 18
శుష్కశారీరఖట్వాంగభరైరాపూరితాంబరమ్ ।
భీషయత్యాత్మనాత్మానం సర్వసంహారకారిణీ।
"I 19
140 యోగవాసిష్ఠము
ప్రళయకాలమున సర్వసంహార కారిణియగు నియతి నభోంతరమున భీషణాకారముతో నిండి
తనకు దానే భయపడుచుండును. అప్పుడామె పశ్చాద్భాగమున కుమారుని మృతమయూరములు వ్రేలాడుచు
నూగుచుండును. ఆపె, కంఠమున కపాలమాల శోభిల్లుచుండును, ఆ కపాలములు బొత్తలుపడిన
మూడుకన్నులం గలిగి, (వాయువందు ప్రవేశింప) భయంకర మగు భాంకార శబ్దము నొనర్చుచుండును.
అప్పుడు ఎఱ్ఱటి మందారములతో శోభిల్లు గౌరీదేవి కబరీభరమే, ఆపై చామరము ఉద్దండ నృత్యము
సల్పును, పర్వతాకారుడగు భైరవుని ఉదరమే ఆపై కమండలువు. వేయికన్నులతో వికటశబ్ద మొనర్చు
ఇంద్రుని కంకాళమే ఆపె భిక్షాపాత్ర; వెన్నెముకయే ఆపె చేతనుండు దండము.
విశ్వరూప శిరశ్చక్ర చారు పుష్కరమాలయా |
తాండవేషు వివల్గంత్యా మహాకల్పేషు రాజతే ॥ 20 20
తాండవమువలన కదలు మస్తకములను పద్మములతోడను (వెనుక వర్ణించినట్లును) నియతి మహాకల్ప
సమయమున శోభిల్లుచుండును.
ప్రమత్తపుష్కరావర్తడమరోడ్డా మరారవైః |
తస్యాః కిల పలాయంతే కల్పాంతే తుంబురాదయః ॥ 21
ప్రళయసమయ పుష్కలావర్త మేఘములను డమరువుల శబ్దమును విని, తుంబురాది గంధర్వులు
తమప్రియలను వదలి పారిపోయెదరు.
నృత్యతో Lంతః కృతాంతస్య చంద్రమండలభాసినః ।
తారకాచంద్రికాచారువ్యోమపిచ్ఛావచూలినః 22 "I
ఇట్టి నృత్యశాలయందుండి, చంద్రమండల కుండలముతో భాసిల్లు కృతాంతునకు తారకలతోడను,
చంద్రికలతోడను, శోభిల్లు ఆకాశమండలమే చూడామణి యగు మయూరపింఛము.
।
ఏకస్మిక్షావణే దీప్తా హిమవానస్థిముద్రికా అపరే చ మహామేరు: కాంతా కాంచనకర్ణికా ॥ 23 "I
అతని, ఒక కర్ణమున హిమాలయమను అస్థిమయ కుండలమును, మఱి యొక కర్ణమున మేరు
పర్వతమను సువర్ణమయ కుండలమును శోభిల్లుచున్నవి.
అత్రైవకుండలే లోలే చంద్రార్కౌ గండమండలే ।
లోకాలోకాచలశ్రేణీ సర్వతః కటిమేఖలా ॥ 24
సూర్యచంద్రులు కపోలమున వ్రేలు (మఱియొక మాదిరి కుండలములు; చక్రవాళ పర్వత మాతని
మొలనూలు.
వైరాగ్యప్రకరణము (సర్గ - 25) 141
ఇతశ్చేతశ్చ గచ్చంతీ విద్యుద్వలయకర్ణికా|
అనిలాందోలితా భాతి నీరదాంశుకపట్టికా 25
నానావర్ణములచే శోభిల్లు మేఘమండల మాతని ఉత్తరీయము; ఇది వాయు వశమున చలించుచు
వెలయుచున్నది.
ముసలైః పట్టిసై: ప్రాసై శూలై: తోమరముద్గరైః
తీక్షణై: క్షీణజగద్వాతకృతాంతైరివ సంభృతైః 26 "I
సంసారబంధనాదీర్ఘ పాశే కాలకరచ్యుతే |
శేషభోగమహాసూత్రప్రోతే మాలాస్య శోభతే ॥ 27
పూర్వపు సృష్టులు నాశనమైన వాటినుండి ఉద్భవిల్లిన మృత్యువులు, ముసలము కాగా ముద్గర శూలాది
ఆయుధములై, జీవులను మృగములను బట్టి పన్నిన శేషనాగ సూత్రమున బంధింపబడి, ఈ కాలుని గళమున
హారమట్లు వెలయుచున్నవి.
జీవోల్లసన్మకరికా రత్నతేజోభి రుజ్జ్వలా ।
సప్తాబ్ధికంకణశ్రేణీ భుజయోరస్య భూషణమ్ ॥ 28
రత్నములతో బ్రకాశించుచు, జీవులను మొసళ్లతో నిండిన సప్తసాగరములను కంకణములు-
ఈకాలుని భుజాభరణములు.
వ్యవహారమహావర్తా సుఖదుఃఖపరంపరా |
రజఃపూర్ణతమశ్శ్యామా రోమాలీ తస్య రాజతే ॥ 29
లౌకిక వైదిక కర్మలే ఆతని శరీరమందున్న సుళ్లు; ఈ కర్మలవలన గలిగిన రజస్తమో యుతము లగు
సుఖదుఃఖములే రోమములు.
ఏవం ప్రాయస్స కల్పాంతే కృతాంతస్తాండ వోద్భవామ్ ।
ఉపసంహృత్య నృత్యహాం సృష్ట్యా సహ మహేశ్వరమ్ || 30
30
పునర్లాస్యమయీం నృత్యలీలాం సర్గస్వరూపిణీమ్ ।
తనోతీమాం జరాశోకదుఃఖాభిభవభూషితామ్ ॥ 31
ఇట్టి కాలుడు, కల్పాంతమున తాండవమును ముగించి విశ్రాంతి నందును. మరల, బ్రహ్మాదులతో
గూడిన ఈజగత్తును సృష్టించి, జరామరణ దుఃఖములతో గూడిన సృష్టియను లాస్యమయాభినయమును
ఒనర్చును.
142 యోగవాసిష్ఠము
భూయఃకరోతి భువనాని వనాంతరాణి లోకాంతరాణి జనజాలక కల్పనాం చ |
ఆచారచారుకలనామచలాం చలంచపంకాద్యథార్భకజనో రచనా మఖిన్న:32
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే కృతాంత విలసితం నామ పంచవింశతితమః
38: || 25 ||
బాలుడు, 'విసుగు విరామము లేకుండ' మట్టితో బొమ్మల నొనరించునట్లు కాలుడుగూడ
భువనములను, వనములను; వివిధములును, అసంఖ్యాకములును నగు జీవులను, వారివారి శ్రోతస్మార్తాది
సత్కర్మలను; కృత, త్రేతా, ద్వాపర కలి, యుగ ధర్మములను శ్రమ యనక సృష్టించుచుండును.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున కృతాంతవిలాసమను పంచవింశతితమ సర్గము ॥ 25 ॥
దైవదుర్విలాస వర్ణనము - 26
శ్రీరామ ఉవాచ:
వృత్తే స్మిన్నేవమేతేషాం కాలాదీనాం మహామునే!
సంసారనామ్ని కైవాస్థా మాదృశానాం వదత్విహ 1
శ్రీరాముడు: మహామునీ! ఈ కాలాదులకు లీలారంగమగు సంసారమున మాబోంట్ల కాశ్వాస మేమున్నది?
వచింపుడు!
విక్రీతా ఇవ తిష్ఠామ ఏతైర్డెవాదిభిర్వయమ్ ।
మునే! ప్రపంచరచనైర్ముగ్ధా వనమృగా ఇవ ॥ 2
మునీ! ప్రపంచరచనా నిపుణులగు ఈదైవాదులను గాంచి, మోహితులమై, వారి కమ్ముడుపోయి,
వనమృగములవలె నున్నారము.
ఏషోఒ నార్యన మామ్నాయః కాలః కబలనోన్ముఖః |
జగత్యవిరతం లోకం పాతయత్యాపదార్లవే ॥ II 3
అనార్య చరితుడును, సంహారకార్యోన్ముఖుండును నగు కాలుడు లోకులను నిరంతరము ఆపదలపాలు
గావించుచున్నాడు.
దహత్యంతర్దురాశాభిర్దేవో దారుణచేష్టయా।
లోకముష్ణప్రకాశాభిర్జ్వాలాభిర్దహనో యథా ॥ 4
వైరాగ్యప్రకరణము (సర్గ - 26) 143
అగ్ని, దారుణమై వేడిని గ్రక్కు జ్వాలలతో లోకములను దగ్ధ మొనర్చునట్లు, కాలుడు మహాయత్నమున
దురాశను రగుల్కొనజేసి లోకములను భస్మీపటల మొనర్చుచున్నాడు.
ధృతిం విధురయత్యేషా మర్యాదా రూపవల్లభా
స్త్రీత్వాత్ స్వభావచపలా నియతిర్నయతోన్ముఖీ। 5 11
నియతి, ఈ కాలకృతాంతుని భార్య; ఈపై స్త్రీ సహజమగు చాపల్యముతో, సమాధి పరాయణుడగు
మునినిగూడ ధైర్యచ్యుతు నొనర్చుచున్నది.
గ్రసతే విరతం భూతజాలం సర్పఇవానిలమ్ |
కృతాంతః కర్కశాచారో జరాం నీత్వా జరం వపు ॥ 6
పాము గాలిని మ్రింగునట్లు, క్రూరుడగు ఈ కృతాంతుడు ప్రాణులను జరాపతితులు నొనర్చి
మ్రింగుచున్నాడు.
యమో నిర్హణరాజేంద్రో నార్తం నామానుకంపతే |
సర్వభూతదయోదారో జనో దుర్లభతాం గతః ॥ 7
ఆర్తులనుగూడ నృశంసుడగు ఈ రాజేంద్రుడు కరుణింపడు; సర్వభూతములను దయజూపువారు
దొరకరు కదా!
సర్వా ఏవ మునే! ఫల్గువిభవా భూతజాతయః |
దుఃఖాయైవ దురన్తాయ దారుణా భోగభూమయః ॥ 8
మునీంద్రా! మూఢులు భోగముల కాకరములని తలంచున వన్నియు దుఃఖహేతువులు; అబ్రహ్మస్త్రంబ
పర్యంతము ఉన్నలోకము లన్నియు, దుఃఖ భూములే. ఐశ్వర్యము లనుకొనంబడు నవన్నియు తుచ్ఛములు.
ఆయురత్యంతచవలం మృత్యురేకాంతనిష్ఠురః।
తారుణ్యం చాతితరలం బాల్యం జడతయా హృతమ్ "I 9
ఆయు వత్యంత చంచలము. మృత్యువు నిష్ఠురము. యౌవన మశాశ్వతము. బాల్య మజ్ఞానావృతము.
కలాకలంకితో లోకో బంధవో భవబంధనమ్ ।
భోగా భవమహారోగాస్త్రృష్ణాశ్చ మృగతృష్టికా: || 10
లోకము లన్నియు విషయానుసంధానముగా గళంకితము లైనవి. బంధు మిత్రులు భవ బంధన
రజ్జువులు; భోగములు సంసార రోగములు, సుఖములు మరు మరీచికలు.
144 యోగవాసిష్ఠము
శత్రవశ్చేంద్రియాణ్యేవ సత్యం యాతమసత్యతామ్ । I
ప్రహరత్యాత్మనైవాత్మా మనసైన మనోరిపుః ॥ 11
ఇంద్రియములే పరమశత్రువులు. (వీటివలననే) సత్య మసత్య మట్లగపడుచున్నది. మనస్సు
ఆత్మయొక్క పరమవిరోధి. దీని సాంగత్యమున ఆత్మ తనకు తానే కష్టమును గల్పించుకొనుచున్నది.
అహంకారః కలంకాయ బుద్ధయః పరిపేలవాః । I
క్రియా దుష్ఫలదాయిన్యో లీలాః స్త్రీనిష్ఠతాం గతాః ॥ 12
అహంకార మాత్మకు గళంకము. మనోవృత్తులు శక్తిహీనములు. ప్రవృత్తులు కష్టదాయకములు.
విలాసములు స్త్రీనిష్ఠతో ముగియుచున్నవి.
వాంఛా విషయశాలిన్యః సచ్చమత్కృతయః క్షతాః |
నార్యో దోషపతాకిన్యో రసా నీరసతాం గతాః ॥ 13
కోర్కెలు విషయముల వైపు పరుగు లిడుచున్నవి. ఆత్మస్ఫురణము దుర్లభమై పోయినది.
ఆత్మానురాగము నీరసించినది.
వస్త్యవస్తుతయా జ్ఞాతం దత్తం చిత్తమహంకృతా |
అభావవేదితా భావా భావంతో నాధిగమ్యతే ॥ "I 14
వస్తు వవస్తు వట్లగపడుచున్నది. చిత్తమహంకారమున కంకిత మైనది. విషయము లన్నియు
క్షణభంగురములు; ఆత్మ అలభ్యమైపోయినది.
తప్యతే కేవలం సాధో మతిరాకులితాంతరా |
రాగరోగో విలసతి విరాగో నోపగచ్చతి I 15
సాధుపుంగవా! అందఱును నిరంతరము దహింపబడుచున్నారు; అందరిబుద్ధి వ్యాకులితమైనది.
అందరికిని రాగరోగము ప్రబలముగ నున్నది; అందువలన వైరాగ్యము దుర్లభమైనది.
రజోగుణహతా దృష్టిస్తమస్సంపరివర్ధతే ।
న చాధిగమ్యతే తత్త్వం తత్త్వ మత్యంత దూరతః ॥ 16
దృష్టి రజోగుణమున కప్పబడినది; తమోగుణ మెక్కుడగు చున్నది. సత్వగుణము దూరమైపోయినది.
కాన, తత్వజ్ఞానము దుర్లభము.
స్థితిరస్థిరతాం యాతా మృతిరాగమనోన్ముఖీ
ధృతిర్వైధుర్యమాయాతా రతిర్నిత్యమవస్తుని 17 ||
వైరాగ్యప్రకరణము (సర్గ - 26) 145
జీవిత మస్థిరము, మృత్యువు దాపురించుచున్నది. రతి తుచ్ఛవస్తువుల యందు -- ధైర్యము చెడినది.
మతిర్మాంద్యేన మలినా పాతైకపరమం వపుః ।
జ్వలతీవ జరా దేహే ప్రతిస్ఫురతి దుష్కృతమ్ | 18 ||
మతి మాంద్యమున మలిన మైనది, శరీరము నశింపనున్నది, జర శరీరమున మండుచున్నట్లున్నది.
పాపము లభివృద్ధి నందుచున్నవి.
యత్నే న యాతి యువతా దూరే సజ్జన సంగతిః ।
గతిర్నవిద్యతే కాచిత్ క్వచిన్నోదేతి సత్యతా॥ 19
యౌవనము ప్రయత్నించినను ఉండుట లేదు; సత్సంగము దూర మైనది; సత్యోదయ మగుట
లేదు; ఇంక గతి లేదు.
మనో విముహ్యతీవాంతర్ముదితా దూరతాం గతా |
నోజ్జ్వలా కరుణోదేతి దూరాదాయాతి నీచతా ॥ 20
అంతఃకరణము మోహాచ్ఛన్న మైనది; ఆనందము దూరమైపోయినది. కరుణ ఉదయించుట లేదు;
నీచత్వమె దరి జేరుచున్నది.
ధీరతా ధీరతామేతి పాతోత్పాతపరో జనః ।
సులభో దుర్జనాశ్లేషో దుర్లభస్సత్సమాగమః 21 ||
ధైర్య మధైర్య మందినది. జనన మరణములంబడు దుర్జనుల సాంగత్యమే సులభము; సజ్జనసంగతి
దుర్లభము.
ఆగమాపాయినో భావా భావనా భవబంధినీ।
నీయతే కేవలం క్వాపి నిత్యం భూతపరంపరా ॥ 22
దృశ్యవస్తువే, జనన మరణముల అధీనము; విషయ వాసనలు బంధన కారణములు. మృత్యువు
నిత్యము ఈ జీవుల నెచ్చటికో కొనిపోవుచున్నది.
దిశోఒపి న దృశ్యంతే దేశో వ్యన్యాపదేశభాక్ |
శైలా అపి విశీర్యంతే కైవార్డ్లో మాదృశే జనే ॥ 23
దిక్కులు పిక్కటిల్లు చున్నవి; దేశములు తారుమా రగుచున్నవి; పర్వతములు దుమ్మగుచున్నవి;
మాగతి ఏమి?
VI F10
146 యోగవాసిష్ఠము
అద్యతే సత్తయాపి ద్యౌర్భువనం చాపి భుజ్యతే। 1
ధరాపి యాతి వైధుర్యం కైవార్డ్లో మాదృశే జనే ॥ 24
సత్స్వరూపు డగు ఈశ్వరుడు భువనములను, ఆకాశమును మ్రింగు చున్నాడు. మామాట ఏమి?
శుష్యంత్యపి సముద్రాశ్చ శీర్యంతే తారకా అవి।
సిద్ధా అపి వినశ్యంతి కై వాస్థా మాదృశే జనే ॥ 25
సముద్రములు శుష్కించుచున్నవి; నక్షత్రములు జారిపోవుచున్నవి; సిద్ధులుగూడ వినష్టు లగుచున్నారు.
అగుచో, మా యునికి స్థిరమని యెట్లు విశ్వసింపగలము?
దానవా అవి దీర్యంతే ధ్రువో 2 ప్యధ్రువజీవితః
I
అమరా అపి మార్యంతే కైవాస్థా మాదృశే జనే ॥ 26
దానవులుగూడ విదీర్ణు లగుచున్నారు. 'ధ్రువుని జీవితము గూడ అధ్రువమే. అమరులు గూడ
మరణించుచున్నారు. ఇక మేమా స్థిరముగ నుండునది?
శక్రో ప్యాక్రమ్యతే వక్రై ర్యమోపి హి నియమ్యతే |
వాయుర ప్యేత్య వాయుత్వం కైవార్డ్లో మాదృశే జనే॥ 27 22
సోమోపి వ్యోమతాం యాతి మార్తాండో ఒ ప్యేతి ఖండతామ్ ।
మగ్నతామగ్నిర ప్యేతి కైవా మాదృశే జనే ॥ 28
పరమేష్ఠ్యపి నిష్ణావాన్ ప్రియతే హరిరప్యజః । 1
భవో వ్యభావమాయాతి కైవా మాదృశే జనే ॥ 20 29
కాలః సంకాల్యతే యేన నియతి శ్చాపనీయతే I
ఖమప్యాలీయతే నన్తం కైవార్డ్లో మాదృశే జనే
"I 30
ఇంద్రుడుగూడ మృత్యుముఖమున బడుచున్నాడు, యముడు నియమింపబడుచున్నాడు, వాయువు
ప్రాణహీను డగుచున్నాడు; సోముడు వ్యోము డగుచున్నాడు; మార్తాండుడు ఖండింపబడుచున్నాడు, అగ్ని
చల్లారి పోవుచున్నాడు. విరించి విరుగుచున్నాడు, హరి హరింపబడుచున్నాడు, భర్గుడు (శివుడు) భస్మ
మగుచున్నాడు. కాలుడు కాలుని బారినబడుచున్నాడు. నియతి విలయ మందుచున్నది. ఆకాశము వినాశ
మగుచున్నది - ఇక మాకవలంబన మేమున్నది?
అశ్రావ్యావాచ్యదుర్దర్శతత్యేనాజ్ఞాతమూర్తినా ।
భువనాని విడంబ్యంతే కేనచిదమదాయినా " 31
వైరాగ్యప్రకరణము (సర్గ - 26) 147
అహంకారకలామేత్య సర్వత్రాంతరవాసినా 1
న సోస్తి త్రిషు లోకేషు యస్తేనేహ న బాధ్యతే ॥ 32
శ్రవణేంద్రియ, వాగింద్రియముల కప్రాప్యమును, చక్షురాది ఇంద్రియముల కగోచరుడను,
అజ్ఞాతమూర్తియును నగు వస్తువేది యున్నదో, అది, తనంతటదానే, తనయందు, తన మాయవలన;
విశ్వమును గనపరచుచున్నాడు. ముల్లోకముల నిద్దాని నతిక్రమించునది లేదు. ఇదియే అహంకార రూపమున
సర్వత్ర వెలయుచున్నది.
శిలాశైలకవప్రేషు సాశ్వభూతో దివాకరః ॥
వనపాషాణవన్నిత్యమవశః పరిచోద్యతే 33 ||
కొండనుండి నీటివడికి రాళ్లు జారిపడునట్లు, ఆపరమ వస్తువువలన నియమింపబడియే, అశ్వయుతు
డగు సూర్యుడు దుర్గమము లగు శైల వప్ర ప్రదేశముల సంచరించుచున్నాడు.
ధరాగోలక మంతస్థసురాసురగణాస్పదమ్ ।
వేష్ట్యతే ధిష్ట్యచక్రేణ పక్వాటమివ త్వచా 34
అక్టోట (ఆక్రోట) ఫలము తోలువలన చుట్టబడి యుండునట్లు, సురాసుర గణముల కాశ్రయ మగు
ఈ భూగోళము అపరతత్వ ప్రభావమున, నిలువబడిన జ్యోతిశ్చక్రమువలన నావేష్టింపబడియున్నది.
దివి దేవా భువి నరాః పాతాలేషు చ భోగినః ।
కల్పితాః కల్పమాత్రేణ నీయంతే జర్జరాం దశామ్ ॥ 35
స్వర్గమున దేవతలు, భూలోకమున మనుష్యులు, పాతాళమున పాములు- ఆ పరమ పురుషుని
తలపులోనే పుట్టి గిట్టుదురు.
కామాశ్చ జగదీశానరణలబ్ధపరాక్రమః 1
అక్రమేణైవ విక్రాంతో లోకమాక్రమ్య వల్గతి 36
దురాచారియగు మన్మథు ప్రభుని అనుగ్రహమున బలిమిని సంపాదించి, లోకుల నేలుచు, తన
పరాక్రమమును జూపించుచున్నాడు.
వసంతో మత్తమాతంగో మదైః కుసుమవర్షణైః |
ఆమోదిత క కు ప క్రశ్చేతో నయతి చావలమ్ ॥ 37
మదపుటేనుగు మదధారలను వర్షించునట్లు వసంతుడు పువ్వులను గురిపించి, సువాసనలతో
148 యోగవాసిష్ఠము
దిఙ్మండలమును నింపి మనస్సును చలింపజేయుచున్నాడు.
అనురక్తాంగనాలోలలోచనాలోకి తాకృతిః । 1
స్వస్థీకర్తుం మనః శక్తే న వివేకో మహానపి॥
38
వివేకులుగూడ ప్రియాంగనాపాంగముల తమచిత్తముల స్థిరమొనర్ప జాలరు
పరోపకారకారిణ్యా వరారిపరితప్తయా |
బుద్ధ ఏవ సుఖీ మన్యే స్వాత్మశీతలయా ధియా ॥ 39
పరోపకార పరాయణులును, పరుల కాపదలు గల్గిన జింతించువారును, బుద్ధిబలమున తత్త్వజ్ఞానము
బడసిన వారును ధన్యు(సుఖు)లని యెంతును.
ఉత్పన్నధ్వంసినః కాలబడబానలపాతినః ।
సంఖ్యాతుం కేన శక్యంతే కల్లోలా జీవితాంబుధౌ ॥
40
లేచి విఱుగు నట్టివియు కాలమను బడబానలము పాలిటబడునవియు నగు తరంగము లెన్ని యీ
జీవితాంబునిధి యందున్నవో, లెక్కిడ నెవరి తరము?
సర్వ ఏవ నరా మోహాద్దురాశాపాశపాశినః
దోషగుల్మకసారంగా విశీర్ణా జన్మజంగలే || 41
మనుష్యు లందరును, మోహవశమున, జీవనమను అరణ్యమున, దురాశలను దోషంపు పొదతీవెలచే
బంధింపబడి లేళ్ళవలె అవయుచున్నారు.
సంక్షీయతే జగతి జన్మపరంపరాసు
లోకస్య తైరిహ కుకర్మభిరాయురేతత్ |
ఆకాశపాదవలతాకృత పాశకల్పం
యేషాం ఫలం న హి విచారవిదో జె పి విద్మః | 42
జనులు మరలమరల పుట్టుచు, జచ్చుచు, కుకర్మల నొనరించుచు, తమ ఆయుర్దాయమును
వ్యర్థపరచుచున్నారు. వారి కామ్యఫలములు, ఆకాశ వృక్షముయొక్క లతలచే నొనర్పబడిన ఉరిత్రాళ్ల వంటివి;
అనగా అళీకదుఃఖ ప్రదములు. వివేకుల కియ్యది కనంబడదు. (జ్ఞానుల కీ అవిద్యాజనిత కామకర్మలును,
తత్ఫలములును తుచ్ఛములని ఫలితార్థము.)
అద్యోత్సవో॰ యమృతురేష తథేహ యాత్రా
తే బంధవః సుఖమిదం సవిశేషభోగమ్ |
వైరాగ్యప్రకరణము (సర్గ - 27) 149
ఇత్థం ముదైవ కలయన్ సువికల్ప జాల
మాలోల పేలవమతిర్గలతీహ లోకః ॥ 43
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే దేవదుర్విలాసవర్ణనం నామ షడ్వింశః సర్గః ॥26॥
మనుజులు 'నే డీ యుత్సవము' నే డీ ఋతువు, నే డీ యాత్ర, ఇతడు నామిత్రుడు, ఇది సుఖము,
ఇది విశేషభోగము' అను మిథ్యాకల్పనలతోడను, చపలబుద్ధియందు విజృంభించిన సుఖకల్పనలతోడను,
రాత్రిందివములు వెచ్చబుచ్చుచున్నారు.
ఇది శ్రీ వాసిష్ఠ - ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున దేవదుర్విలాసవర్ణనమను షడ్వింశ సర్గము ॥ 26 ॥
నిఃశ్రేయస విరోధిభావానిత్యతా ప్రతిపాదనము - 27
శ్రీరామ ఉవాచ:
అన్యచ్చ తాతాతీతరామరమ్యే మనో రమే చేహ జగత్స్వరూపే |
న కించిదాయాతి తదర్థజాతం యేనాతివిశ్రాంతిము పైతి చేతః ॥ 1
శ్రీరాముడు: ఇంకను వినుడు - మనోహరమై కన్నట్టు ఈ కుత్సిత ప్రపంచమున, మనశ్శాంతిని గలిగించు
వస్తువొక్కటియు లేదు.
బాల్యే గతే కల్పితకేలిలోలే మనోమృగే దారదరీషు జీల్లే
శరీరకే జర్జరతాం ప్రయాతే విదూయతే కేవలమేవ లోకః ॥ 2
బాల్యము గతింప, కల్పితక్రీడల లోలమై, పత్నియను గుహలో బ్రవేశించి, మనస్సను మృగము
కృశించును. తుచ్ఛశరీరమును ముదిమి ఆక్రమింప కష్టములు గాక మరేమి? ఇట్లు, జనులు వ్యర్థజీవను లగుచున్నారు.
జరాతుషారాభిహతాం శరీరసరోజినీం దూరతరే విముచ్య॥
క్షణాద్గతే జీవితచంచరీకే జనస్య సంసారసరో వశుష్కమ్ ॥ 3
ముదిమియను మంచు పడ, వడలిపోయిన శరీరమ్మను పద్మమును విడిచి, ప్రాణమను తుమ్మెద
యెగిరిపోవును; అప్పు డిహలోకమను సరోవరము శూన్య మగును.
యదా యదా పాకముపైతి నూనం తదా తదేయం రతిమాతనోతి ।
జరాభరా నల్ప నవప్రసూనా విజర్జరా కాయలతా నరాణామ్ ॥
జరాతిశయమును బ్రకటించు నవకుసుమిత, విచ్ఛిన్న దేహలత ప్రాతబడుకొలది మృత్యువునకు
బ్రియ మగుచుండును.
150 యోగవాసిష్ఠము
తృష్ణానదీ సారతరప్రవాహగ్రస్తాఖిలానంత పదార్థజాతా |
తటస్థనంతోషసువృక్షమూలని కాషదక్షా వహతీహ లోకే ॥
5
గట్టున నున్న సంతోష మను వృక్షమూలమును బెకలించు నేర్పు గల, తృష్ణానది ప్రబల వేగమున,
వస్తుసముదాయమును పొట్టబెట్టుకొనుచు ప్రవహించుచున్నది.
శరీరనౌశ్చర్మనిబంధబద్ధా భవాంబుధావాలు లితా భ్రమంతీ ।
ప్రలోడ్యతే పంచభిరింద్రియాభ్యైరధోభవంతీ మకరైరధీరాః 6
శరీరమను నావ సంసార సాగరమున భ్రమించుచు మునుగ నున్నది; పంచేంద్రియములను మొసళ్లు
దానిని ఊగిసలాడించుచున్నవి. ఈ నావకు చుక్కాని - చర్మాచ్ఛాదనమున నిబద్ధమైన వివేకము.
తృష్ణాలతా కాననచారిణో మీ శాఖాశతం కామమహీరు హేషు।
పరిభ్రమంతః క్షపయంతి కాలమ్ మనోమృగా నో ఫలమాప్నువంతి ॥ 7
తృష్ణయను అరణ్యమున సంచరించు మనస్సనెడు కోతి కామవృక్షము యొక్క శాఖ లన్నిటియందు
పరిభ్రమించుచు, కాలమును వ్యర్థపరచుచున్నది; ఫల మేమియు దొఱకకున్నది.
కృత్రేషు దూరాస్త విషాదమోహాస్స్వాస్థ్యేషు నోత్సిక్తమనోభిరామాః ।
సుదుర్లభాః సంప్రతి సుందరీభిరనాహతాంతఃకరణా మహాంతః॥ 8
ఆపదలందు శోకించని వారును, సంపదలందు మత్తిల్లని వారును, యువతు లనిన చిత్తము వికలింపని
వారును అగునట్టి మహాత్ములు దుర్లభులు.
తరంతి మాతంగఘటాతరంగం రణాంబుధిం యే మయి తే న శూరాః ।
శూరాస్త ఏవేహమనస్తరంగం దేహేంద్రియాంబోధిమిమం తరంతి ॥ 9
'గజసమూహముల తరంగములతో సంక్షుభ్రమగు యుద్దసాగరమును దాటినవారు శూరులు కారు;
మనోవృత్తి తరంగములతో విక్షుబ్ధమైన శరీరేంద్రియ సముద్రమును దాటినవారే శూరులు' అని నేనెంతును.
అక్లిష్టపర్యంతఫలాభిరామా సందృశ్యతే కస్యచిదేవ కాచిత్।
క్రియా దురాశాహతచిత్తవృత్తి ర్యామేత్య విశ్రాంతి ముపైతి లోకః ॥ 10
దురాశాగ్రస్తుడగు మానవునకు శాంతి నిచ్చు అక్లేశకర కార్యము కన్పట్టదు.
కీర్త్య జగద్ధిక్కుహరం ప్రతాపైః శ్రియా గృహం సత్యబలేన లక్ష్మీమ్ ।
|
యే పూరయంత్యక్షత ధైర్యబంధా న తే జగత్యాం సులభా మహాన్తః ॥ 11
వైరాగ్యప్రకరణము (సర్గ - 27) 151
ధైర్యమును విడువక కీర్తితో జగత్తును, ప్రతాపముతో దిక్కులను, సంపదలతో భవనమును నింపి,
తొణకకుండు మహాత్ము లరుదు.
అవ్యంతరస్థం గిరిశైలభిత్తేర్వ జ్రాలయాభ్యంతరసంస్థితం వా ॥
సర్వం సమాయాంతి స సిద్ధివేగాః సర్వాః శ్రియాః సంతతమాపదశ్చ ॥ 12
పర్వత గుహయందున్నను, అభేద్యమైన వజ్రనిర్మిత గృహము నందున్నను, అదృష్టానుసారము
సంపదలు, ఆపదలు కలుగుచునే యుండును.
పుత్రాశ్చ దారాశ్చ ధనం చ బుద్ధ్యా ప్రకల్ప్యతే తాత! రసాయనాభమ్ ।
సర్వం తు తన్నోపకరోత్యథాంతే యత్రాతిరమ్యా విషమూర్ఛనైవ ॥ 13
మునీంద్రా! జనులు ధన దారా పుత్రాదులు, మధుర రసాయనములని భ్రాంతి నందుచున్నారు.
కాని, సంపదలు విషములై మూర్ఛను గల్పించు ఆ తుది నిముసమున భార్యాపుత్రులు సాయ మొనర్పజాలరు.
విషాదయుక్తో విషమామవస్థాముపాగతః కాయవయో॰ వసానే |
భావాన్ స్మరన్ స్వానిహ ధర్మరిక్తాన్ జంతుర్జరావానిహ దహ్యతే బింతః ॥ 14
అవసాన కాలమున, విషాదకర మగు అవస్థను బొంది, విషణ్ణచిత్తుడై, తానొనర్చిన పాపపు బనులను
దలంచుకొను ముదుకని అంతరము దహింప బడును.
కామార్థధర్మాప్తి కృతాంతరాభిః క్రియాభిరాదౌ దివసాని నీత్వా |
చేతశ్చలద్బర్హిణపిచ్ఛలోలం విశ్రాంతిమాగచతు కేన పుంసః ॥ 15
జనులు ధర్మానుపయోగము లగు అర్థకామములందు కాలమును వెచ్చించిన, నెమిలిపింఛమువలె
చంచల మగు మనస్సు నెట్లు సముదాయింప గలరు?
పురోగతై రప్యనవాప్తరూ పైస్తరంగిణీతుంగతరంగకల్పైః |
క్రియావలైప్లైవవశాదు పేతైర్విడంబ్యతే భిన్నరుచిర్హి లోకః ॥ 16
సత్కర్మల ఫలములుగూడ ఉత్తుంగ నదీతరంగములవలె క్షణ భంగురములు; సంచితము లైనను
వాటి ననుభవింప వీలులేదు. దైవవశాత్తు అవి ప్రారబ్ధ కర్మలుగ పరిణమించిన, భోగము లగును. అప్పుడు,
దేహాత్మ బుద్ధులగు మానవులు వాటిని లాభములని దలంచి మోసపోదురు.
ఇమాన్యమూనీతి విభావితాని కార్యాణ్యపర్యంత మనోరమాణి।
జనస్య జాయా జనరంజనేన జవారాంతం జరయంతి చేతః ॥ 17
152 యోగవాసిష్ఠము
నేడిది యొనర్తును, మాపిది యొనర్తునని సదా చింతించుచు మనుష్యు డొనరించు కర్మల
పరిణామము దుఃఖము. ఇట్టి యత్నము లొనర్చుటయందును, భార్యను, బంధువులను సంతోషపెట్టుటలోను
కాలము వ్యర్థమైపోవును. ముదిమి దాపురించును; వివేకము నశించును.
పర్ణాని జీర్ణాని యథా తరూణాం సమేత్య జన్మాశు లయం ప్రయాంతి
తథైవ లోకాః స్వవివేకహీనాః సమేత్య గచ్చంతి కుతో 2 ప్యహోభిః ॥ 18
ఆకులు చిగిర్చి, ఎండి, పడిపోవునట్లు, వివేక విహీను లగువారు జన్మించి, శీఘ్రముగనే
మరణించుచున్నారు.
ఇతస్తతో దూరతరం విహృత్య ప్రవిశ్య గేహం దివసావసానే ।
వివేకిలోకాశ్రయసాధుకర్మ రిక్తేహి రాత్రే క ఉపైతి నిద్రామ్ ॥ || 19
పగటిపూట, వివేకుల నాశ్రయించి సత్కర్మల నొనర్పక ఇటునటు తిరుగాడి, సాయంసమయమున
నింట బ్రవేశించిన ఏరీతి నిద్రపట్టును.
విద్రావితే శత్రుజనే సమస్తే సమాగతాయామభితశ్చ లక్ష్మ్యామ్ ।
సేవ్యంత ఏతాని సుఖాని యావత్ తావత్ సమాయాతి కుతో పి మృత్యుః ॥ 20
శత్రువులు నిర్జించినాడు; లక్ష్మి వచ్చినది. సుఖము లన్నియు గలిగినవి. సరిగ నిట్టి సమయముననే
మృత్యువు వచ్చిపడును.
కుతో ఒపి సంవర్ధితతుచ్చరూ పైర్భావైరమాభి: క్షణనష్టదృష్టి: |
విలోడ్యమానా జనతా జగత్యాం న వేత్యుపాయాత మహోనుపాతమ్ ॥ 21
విషయములు క్షణములో గన్పడి క్షణమున నశించును; ఇవి తుచ్ఛ రూపమున వృద్ధి నందును.
ఆహా! వీటం జిక్కికొనిన జనులు దాపున నున్న మృత్యువును గాంచలేరు.
ప్రియాసుభిః కాలముఖం క్రియంతే జనైడకాస్తే హతకర్మబద్ధాః
యైః పీనతామేవ బలాదుపేత్య శరీరబాధేన న తే భవంతి ॥ 22
తత్త్వజ్ఞానులు, కర్మపాశబద్ధులై యజ్ఞమేషములంబోలు మూఢులను యమవదన మని భావింతురు;
వీరు బంధము లన్నిటినుంటి విడివడినారు. అందువలన, జన్మ నెత్తవలసిన పనిలేదు.
అజస్రమాగచ్ఛతి సత్యరైవమనారతం గచ్ఛతి సత్వరైవ।
కుతోఒ పి లోలా జనతా జగత్యాం తరంగమాలా క్షణభంగురేవ ॥ 23
వైరాగ్యప్రకరణము (సర్గ - 27) 153
క్షణభంగురము లగు కెరటములవలె, జను లెటనుండి వచ్చుచున్నారో, ఎట కరుగుచున్నారో, ఎవ
రెరుంగుదురు?
ప్రాణాపహారైకపరా నరాణాం మనో మనోహారితయా హరంతి
రక్తచ్ఛదాశ్చంచలషట్పదాక్ష్యో విషద్రుమాలోలలతాః స్త్రియశ్చ || 24
స్త్రీలు విషవృక్షమునకు వ్రేలు తీగలవంటివారు. వీరు సౌందర్యమున పురుషుల నాకర్షించి, ప్రాణముల
హరింతురు. వీరు భ్రమర నయనలు, రక్తాధరోష్ఠలు.
ఇతో న్యతశ్చోపగతా ముధైవ సమాన సంకేత నిబద్ధభావా
యాత్రా సమాసంగసమా నరాణాం కలత్రమిత్రవ్యవహారమాయా ॥ 25
ఉత్సవ సమయములందలి జనసమాగమమువంటిదే- ఈ మాయాజనిత బంధుమిత్రకళత్ర
సమాగమము. 'ఈ మూలనుండి, ఆ మూలనుండి' అరుదెంచి అనుకొనినట్లు, కార్యముల నెరవేర్చుట
రెంటికిని సమానములే. (జనులు, స్వర్గ నరకములనుండి ఏగుదెంచి, అదృష్టానుసారము కార్యముల
నెరవేర్చుచున్నారు కదా!)
ప్రదీవశాంతిష్వవభుక్త భూరిద శాస్వతి స్నేహనిబంధనీషు
I
సంసారమాలాసు చలాచలాసు న జ్ఞాయతే తత్వమతాత్వికీషు
"I 26
మహద్దశ, స్నేహము, అస్థిరత - వీటితో గూడి నిర్వాణోన్ముఖ మగు దీపము బోలు, ఈ సంసారమందున్న
సార మేమియో తెలియజాలము.
సంసారసంరంభ కుచక్రికేయం ప్రాపృట్పయోబుద్బుదభంగురా పి |
అసావధానస్య జనస్య బుద్ధా చిరస్థిరప్రత్యయమాతనోతి I 27
సంసార ప్రవృత్తి యను చక్రము, వర్షాకాల జలబిందువువలె క్షణభంగుర మైనను, అజ్ఞాని మనస్సునకు
శాశ్వత మైనట్లే తోచును.
శోభోజ్జ్వలా దైవవశాద్వినష్టా గుణాః స్థితాః సంప్రతి జర్జరతే
ఆశ్వాసనా దూరతరం ప్రయాతా జనస్య హేమంత ఇవాంబుజస్య ॥ 28
మానవుడను పద్మమున, యౌవనమను శరత్కాలమున నున్న, సుగుణముల శోభ యను సుగంధము,
ముదిమి యను హేమంత ఋతువును నష్టమైపోవును - అప్పుడు చిత్తమును సంతోషపెట్టుట అసంభవము.
పునః పురర్దేవవశాదు పేత్య స్వతోహి భారేణ కృతోపకారః ।
1
విలూయతే యత్ర తరు: కుఠారైరాశ్వాసనే తత్ర హి కః ప్రసంగః॥ 29
154 యోగవాసిష్ఠము
అదృష్టవశమున జన్మించి, ఛాయాపుష్ప ఫలాదులచే లోకులకు మాటిమాటికి ఉపకార మొనరించిన
వృక్షము, గొడ్డలిపెట్టున గ్రుంగుచున్నది- ఇట్టి జగత్తున మనస్సు నాశ్వాసించుకొనుటెట్లు?
మనోరమస్యాప్యతిదోషవృత్తే రంతర్విమాతాయ సముస్థితస్య I
విషద్రుమస్యేవ జనస్య సంగా సాద్యతే సంప్రతి మూర్ఛనైవ 30
జనసంసర్గము మనోహర మైనను, అతిదుష్టస్వభావము గలిగి నాశనము గలిగించు విషవృక్షము
వంటిది. దీనివలన మోహము ప్రాప్తించును.
కల్పాభిధానక్షణజీవినో హి కల్పౌమసంఖ్యాకులనే విరించ్యాః |
అతః కలాశాలిని కాలజాలే లఘుత్వదీర్ఘత్వధియో వ్యసత్యాః 31
బ్రహ్మదేవుడు మొదలగు దేవలోకవాసులు గూడ, కల్పక్షణమాత్ర జీవులు. క్షణ మూహూర్త ఘటిత
మగు ఈ కాలచక్రమందలి హెచ్చుతగ్గులు కూడ మిథ్యలే.
కాస్తాదృశో యాసు న సంతి దోషాః కాస్తా దిశో యాసు న దుఃఖదాహః ।
కాస్తాః ప్రజా యాసు న భంగురత్వమ్ కాస్తాః క్రియా యాసు న నామ మాయా ॥32
దోషదృష్టి లేనివారెవరు? దుఃఖతాపము లేని దిక్కులేవి? నశింపని జీవు లెవ్వరు? మాయ కాని
క్రియలెవ్వి?
సర్వత్ర పాషాణమయా మహీధ్రా మృదా మహీ దారుభిరేవ వృక్షాః
మాంసైర్జనాః పౌరుషబద్ధభావా నాపూర్వ మస్తీహ వికారహీనమ్ ॥
పర్వతము లన్నియు పాషాణమయములు; భూమి మృణ్మయము; వృక్షములు దారుమయములు;
మనుష్యులు మాంసమయులు; వాస్తవమున కి వికారము లన్నియు కారణాతిరిక్తములు గావు; అందువలన
మూలకారణ మగు పరబ్రహ్మమున పర్యవసితము లగు, ఈ వివిధ నామములు కేవల సంజ్ఞా మాత్రకములు.
ఆలోక్యతే చేతనయానువిద్ధా పయో నుబద్ధ ఒ స్తనయో నభఃస్థాః |
1
పృథగ్ విభాగేన పదార్థాలక్ష్మ్యా ఏతజ్జగన్నేతరదస్తి కించిత్ ॥ 34
ఆహా! పదార్థాలక్ష్మికి లీలాభూమి యగు ఈ మిథ్యాజగత్తు అవివేకులకు మాత్రమే కన్పట్టుచున్నది.
వివేకు లిద్దానిని పంచభూత వికారమని ఎఱుగుదురు.
చమత్కృతిశ్చేహ మనస్విలోకచేతశ్చమత్కారకరీ నరాణామ్ |
స్వప్నే పి సాధో విషయం కదాచిత్ కేషాంచిదభ్యేతి న చిత్రరూపా ॥ 35
సాధుపుంగవా! నరులు, స్వప్నమునగూడ కష్టసుఖాది భోగముల ననుభవించి, విస్మితు లగుచున్నారు.
వైరాగ్యప్రకరణము (సర్గ - 27) 155
అగుచో; బుద్ధిమంతు లీమాయాజనిత జగత్తునందు దగులువడుట ఆశ్చర్యము కాదు.
అద్యాపి యాతే పి చ కల్పనాయా ఆకాశవల్లీ ఫలవన్మహత్యే |
ఉదేతి నో లోభలవా హతానా ముదారవృత్తాంతమయీ కథైవ ॥ 36
ఆకాశ లతాఫలములవలె అళీ కములగు భోగకల్పనలు అజ్ఞానవశమున ప్రబలము కాగా, సామాన్య
విషయములందు దగుల్కొనియున్న మనుజులు, యౌవనము గతించినను, పరమాత్మమాట దలపెట్టరు.
ఆదాతు మిచ్ఛన్ పదముత్తమానాం స్వచేత సైవాపహతోద్య లోక
పతత్యశంకం పశురద్రికూటాదానీలవల్లీ ఫలవాంఛయైవ ॥ 37
మేకలు పచ్చతీగెల పళ్లను దిను నాసతో కొండ కొమ్ముననుండి, క్రింద బడునట్లు మనుష్యులు
మంచి భోగముల ననుభవించు నిచ్ఛతో, తమదోషముల వలననే అధఃపతితు లగుదురు.
అవాంతరన్య న్తనిరర్థకాంశచ్చాయాలతా పత్రఫలప్రసూనాః॥
శరీర ఏవ క్షతసంపదశ్చ శ్వభ్రద్రుమా అద్యతనా సరాశ్చ॥ 38
దుర్గమ సాధనమున నున్న వృక్షములును, ఆధునికులును (అజ్ఞానులనుట) ఉపయోగము లేనివారు,
వీరిపని స్వాత్మరక్షణమే. ఇట్టి వృక్షముయొక్క, ఛాయా పత్ర పుష్ప ఫలాదులును, ఇట్టి పురుషుని గుణములును,
వ్యర్థము - అక్కరకు రావు.
క్వచిజ్జనా మార్దవ సుందరేషు క్వచిత్ కఠోరేషు చ సంచరంతి |
దేశాంతరాలేషు నిరంతరేషు వనాంతఖండేష్వివ కృష్ణసారాః "I 39
కృష్ణసారములు కొన్ని కోమల ప్రదేశములయందును, కొన్ని దుర్గమ ప్రదేశములందును
సంచరించునట్లు, కొందఱు దయాదాక్షిణ్య విద్యావినోదాది చిత్త వృత్తులతోడను, కొందఱు క్రోధలో భాదులగు
నిష్ఠుర చిత్త వృత్తులతోడను సంచరించుచున్నారు.
ధాతుర్నవాని దివసం ప్రతిభీషణాని
రమ్యాణి వా విలులితాంతతమా కులాని।
కార్యాణి కష్టఫలపాకహతోదయాని
విస్మాపయంతి న శవస్య మనాంసి కేషామ్ ॥ 40
శవమువలె హృదయ విహీనుడగు విధాతయొక్క, ఆపాత రమణీయములును, భయంకర పరిణామ
దాయకములును అగు నూతన కార్యములు దోషయుక్తము లైనను, అవివేకులు మోహపడుచున్నారు. వివేకు
లీకార్యములను గాంచి, ఆశ్చర్యపడకుండ నుండజాలరు.
156 యోగవాసిష్ఠము
జనః కామాసక్తో వివిధ కుకలాచేష్టనపరః
స తు స్వప్నే వ్యస్మిన్ జగతి సులభో నాద్య సుజనః ।
క్రియా దుఃఖాసంగా విధురవిధురా నూనమఖిలా
న జానే నేతవ్యా కథమిన దశా జీవితమయీ ॥ 41
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే నిఃశ్రేయసవిరోధిభావానిత్యతా ప్రతిపాదనం
నామ సప్తవింశతితమః సర్గః ॥27॥
జనులు నిరంతరము కుటిల యత్నముల నొనర్చుచు, కామాసక్తులై యున్నారు. వివేకులు
స్వప్నమునంగూడ కనబడుటలేదు. ఈ భయంకర జీవితము నెట్లు గడుపుదునో, తెలియజాలకుంటిని !
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున నిఃశ్రేయన విరోధి భావానిత్యతా ప్రతిపాదనమను
సప్తవింశతితమ సర్గము ॥ 27 ॥
సర్వభావాల విరత విపర్యాస ప్రతిపాదనము-28
శ్రీరామ ఉవాచ :
యచ్ఛేదం దృశ్యతే కించిజ్జగత్ స్థావర జంగమమ్।
తత్సర్వమస్థిరం బ్రహ్మన్! స్వప్నసంగమ సన్నిభమ్ ।
11
శ్రీరాముడు: బ్రహ్మజ్ఞుడా! ఈ కనబడు స్థావరజంగమాత్మక మగు జగత్తంతయు స్వప్నసంగమమువలె
నస్థిరము.
శుష్క సాగరసంకాశో నిఖాతో యోద్య దృశ్యతే|
స ప్రాతరభ్రసంవీతో నగస్సంపద్యతే మునే! 2
మునీంద్రా! నేడు ఎండిపోయిన సముద్రమువలె కన్పడు అఖాతము, రేపు మేఘమాలా పరివృత
మగు పర్వతముగ మారవచ్చును.
యో వనవ్యూహవిస్తీర్లో విలీఢగగనో మహాన్।
దినైరేవ స యాత్యుర్వీ సమతాం కూపతాం చవా ॥ 3
ఆకాశమును ముట్టు మహారణ్యము కొన్నిదినములలో నేలమట్టమై పోవచ్చును లేక నూయిగ
మారవచ్చును.
వైరాగ్యప్రకరణము (సర్గ - 28) 157
యదంగమద్య సంవీతం కౌశేయస్రగ్విలేపనైః |
దిగంబరం తదేవ శ్వో దూరే విశరితా వటే 4
నే డే శరీరమున పట్టుపుట్టములు చుట్టబడియున్నవో, మాలలు వేయబడినవో, ఆశరీరము మాపు
వస్త్రవిహీనమై, దూరమున నున్న గుంటలో పారవేయబడి, విశీర్ణ మగును.
యత్రాద్య నగరం దృష్టం విచిత్రాచారచంచలమ్ ।
తత్రైవోదేతి దివసైః సంశూన్యారణ్యధర్మతా 5 "I
నేడు విచిత్రాచారములతో నిండి కనబడుచున్న నగర మున్నచోట, అల్పదినములలో శూన్యారణ్యము
వెలయును.
యః పుమానద్య తేజస్వీ మండలాన్యధితిష్ఠతి |
స భస్మకూటతాం రాజన్ ! దివ సైరధిగచ్చతి 6 ||
నేడు, తేజమున మండలాధిపతియై వెలయు నాతడు, స్వల్పకాలముననే భస్మరాశిగ మారును.
అరణ్యాని మహాభీమా యా నభోమండలోపమా |
పతాకాచ్ఛాదితాకాశా సైవ సంపద్యతే పురీ ॥ 7
మహాభయంకరమును, గగనమువలె శూన్యమును, విశాలమును నగు అరణ్యము కాలవశమున
ఆకాశమండలము నావరించు పతాకలతో గూడిన పురముగ మారగలదు.
యా లతావలితా భీమా భాత్యద్య విపినావలీ | I
దివసైరేవ సాయాతి పునర్మరుమహీపదమ్ ।
|| 8
నేడు లతలచే నావరింపబడి, మహాభయంకరమై కన్పట్టునది కొన్ని రోజులలో మరుభూమి యగును.
సలిలం స్థలతాం యాతి స్థలీ భవతి వారిభూః ।
విపర్యస్యతి సర్వం హి స కాష్ఠాంబుతృణం జగత్ ॥
I 9
నీరు భూమి యగును, భూమి నీరగును; జగత్తంతయు పరివర్తనము నందునదే.
అనిత్యం యౌవనం బాల్యం శరీరం ద్రవ్యసంచయా:
భావాద్భావాంతరం యాంతి తరంగ వదనారతమ్ ॥
10
బాల్యము, యౌవనము, శరీరము, ద్రవ్యములు - ఇవన్నియు అనిత్యములు ; నిరంతరము
తరంగమువలె స్థిత్యంతరము నందుచుండును.
158 యోగవాసిష్ఠము
వాతాంతర్దీ ప కశిఖాలోలం జగతి జీవితమ్ ।
తడిత్స్ఫురణ సంకాశా పదార్థ శ్రీర్ణగత్రయే
|| 11
గాలిలో నున్న దీపమువలె, జీవితము చంచలము ; ముల్లోకముల నున్న వస్తువుల శోభ మెఱపువంటిది.
విపర్యాసమియం యాతి భూరిభూతపరంపరా ।
బీజరాశిరివాజస్రం పూర్యమాణః పునః పునః | 12
బీజములవలె భూతము లన్నియు మాటిమాటికి మార్పు నందుచున్నవి.
మనఃపవనపర్యస్త భూరిభూత రజఃపటా ।
పాతోత్పాతపరావర్తపరాభినయభూషితా ॥ 13
ఆలక్ష్యతే స్థితిరియం జాగతీ జనితభ్రమా |
నృత్తావేశవివృత్తేవ సంసారారభటీనటీ ॥ 14
ఆడంబరముతో గూడిన ఈ సంసార రచన నేర్పుగల నర్తకివలె కనుపించు చున్నది; ఇది మాటిమాటికి
కౌశలముతో అంగవిన్యాసము నొనర్చుచు, భ్రమింపజేయుచున్నది. మనస్సను గాలిచే లేవనెత్తబడు ధూళియను
జీవులు ఈ నర్తకియొక్క వస్త్రస్వరూపులు. జీవుల స్వర్గ నరక, భూలోక పతనమే దాని అభినయము.
గంధర్వనగరాకారవిపర్యాస విధాయినీ ।
అపాంగభంగురోదారవ్యవహార మనోరమా । 15
తడిత్తరలమాలోకమాతన్వానా పునః పునః ॥
సంసారరచనా రాజన్! నృత్తసక్తేవ రాజతే ॥ 16
లోక ప్రసిద్ధములగు, క్షణభంగుర వ్యవహారములే దీని చంచల కటాక్షములు. ఇది గంధర్వ నగరమును
బోలు భ్రమను గల్గించును. ఇంద్రజాలికవలె, అవస్తువునందు వస్తుభ్రమను గల్గించుచున్నది. దీనిదృష్టి
మెఱపుకంటెను చంచలము. ఇది ఈ నృత్యమునకు దగియే యున్నది.
దివసాస్తే మహాంతస్తే సంపదస్తాః క్రియాశ్చ తాః।
సర్వం స్మృతిపథం యాతం యామో వయమపి క్షణాత్ ॥ 17
ఆ రోజులు, ఆ సంపదలు, ఆ క్రియలు, ఆ మహాపురుషులు దృష్టిపథమును దాటిపోయినారు.
స్మృతికి దూరులైనారు. మనముగూడ క్షణములో ఇట్లే యగుదుము.
వైరాగ్యప్రకరణము (సర్గ - 28) 159
ప్రత్యహం క్షయమాయాతి ప్రత్యహం జాయతే పునః
అద్యాపి హతరూపాయా నాన్తో స్యాం దగ్ధసంస్కృతేః 18 ||
ప్రతిదినము క్షయమందుచు మరల నుత్పన్న మగుచున్నది; ఈ పాడు సంసారమున కంతము లేదు.
తిర్యక్ష్యం పురుషా యాంతి తిర్యంచో నరతామని ।
దేవాశ్చాదేవతాం యాంతి కిమివేహ విభో! స్థిరమ్ 19
ప్రభూ! మనుష్యులు పశువు లగుచున్నారు. పశువులు మనుష్యజన్మ నెత్తుచున్నవి. దేవతలు
దేవభావమును వీడుచున్నారు. ఈ జగత్తున స్థిరమైన దేమున్నది?
రచయన్ రశ్మిజాలేన రాత్ర్యహాని పునః పునః
అతివాహ్య రవిః కాలో వినాశావధిమిక్షతే 20
కాలాత్ముడగు సూర్యుడు తనకిరణములచే రాత్రిందివములను మాటిమాటికి గల్పించి గడపుచు,
ప్రాణుల అవసాన సమయాంతమును నిరీక్షించుచున్నాడు.
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ సర్వా వా భూతజాతయః |
నాశమేవానుదావంతి సలిలానీవ వాడవమ్ ॥ 21 21
నీరు బడబాగ్నియందు పడునట్లు త్రిమూర్తులును, తక్కుంగల జీవులును, వినాశనము నందుచున్నారు.
ద్యౌః క్షమా వాయురాకాశం పర్వతాస్సరితో దిశః ।
వినాశవాడబ స్యైతత్ సర్వం సంశుష్కమింధనమ్ ॥
II 22
దిఙ్మండలము, స్వర్గము, భూమి, ఆకాశము, వాయువు, పర్వతములు, నదులు-ఇవన్నియు ధ్వంసమను
బడబాగ్నికి ఎండుకట్టెలు.
ధనాని బాంధవా భృత్యా మిత్రాణి విభవాశ్చ యే ।
వినాశభయభీతస్య సర్వం నీరసతాం గతమ్ ॥ 23
మృత్యుభీతి గల మనుజునకు, ధనధాన్యములు, బంధుమిత్రులు, భృత్యులు, వైభవములు
ప్రీతికరములు కాజాలవు.
స్వదంతే తావదేవైతే భావా జగతి ధీమతే ॥
యావత్ స్మృతిపథం యాతి న వినాశకు రాక్షసః ॥ 24
మృత్యువను రాక్షసుడు గుర్తు తగలనంతవఱకు, ఈ భోగము లన్నియు రుచించును.
160 యోగవాసిష్ఠము
క్షణమైశ్వర్య మాయాతి క్షణమేతి దరిద్రతామ్ ।
25 క్షణం విగతరోగత్వం క్షణమాగతరోగతామ్ 25 ||
నిముసములో ధనికుడు దరిద్రు డగును; ఆరోగ్యవంతుడు రోగి యగును.
ప్రతిక్షణవిపర్యాసదాయినా నిహతాత్మనా |
జగద్రమేణ కే నామ ధీమంతో హి నమోహితాః ॥ 26
అనుక్షణము భ్రాంతిని గల్పించు నదియు, అశాశ్వతమును నగు జగత్తున విమోహితుడు కాని వివేకి
ఎవడు?
తమః పంకసమాలబ్ధం క్షణమాకాశమండలమ్ |
క్షణం కనకనిష్యందకోమలాలోకసుందరమ్ ॥ 27
క్షణం జలదనీలాబ్జమాలావలిత కోటరమ్
క్షణముద్దామరరవం క్షణం మూకమివ స్థితమ్ || 28
క్షణం తారావిరచితం క్షణమర్కేణ భూషితమ్ |
క్షణమిందుకృతాహ్లాదం క్షణం సర్వబహిష్కృతమ్ ॥ 29 29
ఆగమాపాయపరయా క్షణసంస్థితినాశయా
న బిభేతి హి సంసారే ధీరోపి క ఇవానయా ॥ 30 30
ఒకప్పు డాకాశము తమఃపంకపిండమున బూయబడి యుండును. మరొకప్పుడు కనకకాంతుల
శోభిల్లుచుండును. ఇంకొకప్పుడు మేఘములను నీలపద్మములతో నిండియుండును. అన్యసమయమున ధ్వనులతో
నిండి యుండును. మరొక నిముసమున మూగయై నిశ్శబ్దముగ నుండును. ఇంకొక క్షణమున సూర్యునితో
ప్రకాశించుచుండును. ఒకప్పుడు నక్షత్ర శోభితమై వెలయును. ఇంకొకప్పుడు చంద్రునితో రాజిల్లుచుండును.
మరొకప్పుడు నేమియు నుండవు. క్షణముండి క్షణములో పోవునట్టి ఈ జగత్తనిన భీతిల్లని వారెవరు?
ఆపదః క్షణమాయాంతి క్షణమాయాంతి సంపదః ।
క్షణం జన్మ క్షణం మృత్యుర్మునే! కిమివ న క్షణమ్ 31
మునీ! క్షణములో ఆపదలు అరుదెంచును; క్షణములో సంపదలు వచ్చును; క్షణములో జన్మ,
క్షణములో మృత్యువు. ఇక క్షణికము కాని దెయ్యది?
ప్రాగాసీదన్య ఏవేహ జాతస్యన్యో నరో దినై
సదైకరూపం భగవన్! కించిదస్తి న సుస్థిరమ్ 32 32
"I
వైరాగ్యప్రకరణము (సర్గ - 28) 161
భగవంతుడా! ప్రపంచమునందున్న వస్తువు లన్నియు (జన్మకు) పూర్వ మొకట్లును, తరువాత
మరొకట్లును నుండును. కొన్ని రోజులలో ఇంకొకట్లు మారును. స్థిరమును, ఏకమును నగు సద్రూపము
గలిగిన వస్తువొక్కటియు లేదు.
ఘటస్య పటతా దృష్టా పటస్యాపి ఘటస్థితిః ॥
న తదస్తిన యదృష్టం విపర్యస్యతి సంసృతా 33
ఈజగత్తున మార్పు నందని వస్తువొక్కటియు లేదు. ఘటము (కుండ) పటము (వస్త్రము) అగును.
పటము ఘట మగును.
తనోత్యుత్పాదయత్యత్తి నిహంత్యాసృజతి క్రమాత్ I
సతతం రాత్ర్యహానీవ నివర్తంతే నరం ప్రతి ॥ 34
వృద్ధి, పరివర్తన, అపక్షయము, వినాశము, పునర్జన్మ-ఇవి దేహాభిమాని యగు నరుని పట్ల రాత్రిందివము
లట్లు నిరంతరము మారుచున్నవి.
అశూరేణ హతః శూర ఏకేనాపి హతం శతమ్ |
ప్రాకృతాః ప్రభుతాం యాతాస్సర్వమావర్త్యతే జగత్ ॥ 35
బలహీనుడు బలవంతుని జంపుచున్నాడు; ఒకడు నూర్గురను మట్టుపెట్టుచున్నాడు. నీచులు ప్రభువు
లగుచున్నారు.- ఇట్లు జగత్తంతయు పరివర్తనము నందుచున్నది.
జనతేయం విపర్యాసమజస్ర మనుగచ్ఛతి |
జడస్పందపరామర్శాత్ తరంగాణామివావలీ ॥ 36
జలసంస్పర్శవలన తరంగములు విపర్యయ మందునట్లు, జనులు అచేతన పదార్థముల సంస్పర్శవలన
మార్పుల నందుచున్నారు.
బాల్యమల్పదినైరేవ యౌవనశ్రీస్తతో జరా |
దేహే నైకరూపత్వం కాస్థా బాహ్యేషు వస్తువు ॥ 37
బాల్యము గతించును, యౌవన మరుదెంచును, అది పోయి ముదిమి వచ్చును - ఇది శరీరము
యొక్క గతి. అగుచో నిక బాహ్యవిషయముల మాట ఏమి?
క్షణమానందితామేతి క్షణమేతి విషాదితామ్ ।
క్షణం సౌమ్యత్వమాయాతి సర్వస్మిన్నటవన్మనః ॥ 38
VI F11
162 యోగవాసిష్ఠము
మనస్సు నటునివలె, అన్ని విషయములను క్షణములో ఆనందమును, క్షణములో విషాదమును
క్షణములో సుముఖతను నందును.
ఇతశ్చాన్యదితశ్చాన్యదితశ్చాన్యదయం విధిః॥
రచయన్ వస్తు నాయాతి భేదం లీలాస్వివారకః || 39
క్రీడించు బాలునివలె విధాత విసుగు లేక, ఎడతెగకుండ, హర్షవిషాద మోహములను గల్పించు
వస్తువుల నిటనట సృజించుచున్నాడు.
చినోత్యుత్పాదయత్యత్తి నిహంత్యాసృజతి క్రమాత్ ।
సతతం రాత్ర్యహానీవ నివర్తంతే నరం ప్రతి ॥ 40
స్రష్ట జీవులను సృష్టించి రక్షించి భక్షించుచున్నాడు. హర్షవిషాద మోహము లను అహోరాత్రములవలె
వారిముందర త్రిప్పుచున్నాడు.
ఆవిర్భావతిరోభావభాగినో భవభాగినః॥
జనస్య స్థిరతాం యాంతి నాపదో న చ సంపదః ॥ 4
సంసార - భాగస్వాములగు జనులు పుట్టుచు చచ్చుచుందురు. వారికి శాశ్వతమైన దేదియు లేదు.
వారి సంపదలు, ఆపదలుకూడ అస్థిరములే.
కాలః క్రీడత్యయం ప్రాయః సర్వమాపది పాతయన్
హేలావిచలితాశేషచతురాచారచంచురః ॥ 42
అవలీలగా చతురు లగువారినింగూడ విచలితుల నొనర్పగల కాలము, అందరిని ఆపదలందు ముంచి
క్రీడించుచున్నది.
సమవిషమవిపాకతో విభిన్నా స్త్రిభువనభూతపరంపరా ఫలౌఘాః ।
సమయపవనపాతితాః పతంతి ప్రతిదినమాతతసంసృతిద్రుమేభ్యః 43 II
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే సర్వభావా విరత విపర్యాసప్రతిపాదనం నామ
అష్టవింశః సర్గః ॥ 28 |
ఈ సంసార వృక్షమున వ్రేలు, త్రిలోక జీవులను ఫలములు- వీటిలో కొన్ని మిగుల బండినవి, కొన్ని
దోరపండినవి - కాలమను వాయువులు నిరంతరము రాల్చబడుచున్నవి.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున సర్వభావావిరత విపర్యాస ప్రతిపాదనమను అష్టవింశ సర్గము॥28॥
వైరాగ్యప్రకరణము (సర్గ - 29) 163
సకలపదార్థానాస్థా ప్రతిపాదనము -29
శ్రీరామ ఉవాచ :
ఇతి మే దోషదావాగ్ని దగ్ధ మహతి చేతసి ।
ప్రస్ఫురంతి న భోగాశా మృగతృష్ణా సరస్వవ ॥ 1
శ్రీరాముడు: ఇట్టి దోషములను దావాగ్నివలన దహింపబడి, బలమును గూర్చుకొనిన నాచిత్తమను సరస్సున
ఎండమావు లుదయించునట్లు, భోగాభిలాష ఉదయించుట లేదు.
ప్రత్యహం యాతి కటుతామేషా సంసారసంస్థితిః ।
కాలపాకవశాల్లోలా రసా నింబలతా యథా ॥ 2
రోజులు గడచినకొలది యీ సంసారస్థితి నాకంతకంతకు, వేపచెట్టు నాశ్రయించి యున్న లతలవలె
చేదగుచున్నది.
బుద్ధిమాయాతి దౌర్జన్యం సౌజన్యం యాతి తానవమ్ |
కరంజకర్కశే రాజన్ ప్రత్యహం. జనచేతని ॥
|| 3
ముళ్ల చెట్టువలె కర్కశులగు మానవుల హృదయములు దినములు గడచినకొలది దుర్బలము
లగుచున్నవి. మంచి అడుగంటుచున్నది.
భజ్యతే, భువి మర్యాదా ఝటిత్యేవ దినం ప్రతి |
శుష్కేవ మాషశింబీకా టంకారకరవం వినా ॥
4
ఈ జగత్తు ఎండిన మినపతీగవలె శబ్ద మొనర్పకుండగనే, విరిగి పోవుచున్నది.
రాజ్యేభ్యో భోగపూగేభ్యశ్చింతావద్భ్యో మునీశ్వర! |
నిరస్తచింతా కలితా వరమేకాంతశీలతా ॥
5
మునీశ్వరా! రాజ్యములు, భోగములు, చింతలతో గూడినవి; అందువలన, ఇట్టి చింతలు లేని ఏకాంతసేవ
ఉత్తమము.
నానందాయ మమోద్యానం న సుఖాయ మమ స్త్రియః
న హర్షాయ మమార్థాశా శామ్యామి మనసా సహ | 6
ఉద్యాన వనములు, స్త్రీలు, ధనాశ - నాకానందములు గొల్పజాలవు. మనస్సుతో శాంతి నందగోరెదను.
164 యోగవాసిష్ఠము
అనిత్యశ్చాసుఖో లోకస్తృష్ణా తాత! దురుద్వహా |
చాపలోపహతం చేతః కథం యాస్యామి నిర్వృతిమ్ । || 7
లోకతృష్ణ, సుఖములు - ఇవి అనిత్యములు, కాని వీటిని జయించుట కష్టము. చిత్తము చంచలము.
నెనెట్లు శాంతి నందగలను?
నాభినందామి మరణం నాభినందామి జీవితుమ్
యథా తిష్ఠామి తిష్ఠామి తథైవ విగతజ్వరమ్ ॥ 8
నేను జీవితమును గోరను, మృతిని వాంఛింపను. నిశ్చింతుడనై, ఎట్లుండవలెనో అట్లుండ గోరెదను.
కిం మే రాజ్యేన కిం భోగైః కిమర్థన కిమిహితైః
అహంకారవశాదేతత్ స ఏవ గలితో మమ ॥ 9
రాజ్యములతోడను, భోగములతోడను, ధనములతోడను, ప్రయత్నము తోడను నాకు బని లేదు.
వీటి అన్నిటికిని కారణ మహంకారమే; నాకిది లేదు.
జన్మావలివరత్రాయామింద్రియగ్రంథయో దృఢాః ।
యే బద్ధాస్తద్విమోక్షార్థం యతంతే యే త ఉత్తమాః ॥
జన్మపరంపరలను రజ్జువుతో, దృఢముగ ముడివేయబడిన ఇంద్రియ గ్రంథులను విడదీయ
యత్నించువారే ప్రశంసాపాత్రులు.
మథితం మానినీలో కైర్మనో మకరకేతునా
కోమలం ఖురనిష్పేషైః కమలం కరిణా యథా ॥ 11
ఏనుగు కాళ్లతో తామరపువ్వులను రాచివేయునట్లు, మన్మథుడు స్త్రీలతో పురుషుల హృదయమును
హింసించుచున్నాడు.
అద్య చేత్ స్వచ్ఛయా బుద్ధ్యా మునీంద్ర! న చికిత్స్యతే |
భూయశ్చిత్త చికిత్సాయాస్తత్ కిలావసరః కుతః ॥ 12
మునీంద్రా! నిర్మలమగు బుద్ధియోగమున మనస్సునకు చికిత్స యొనర్పనిచో, ఇంక ముందెప్పుడు వీలగును?
విషం విషయవైషమ్యం న విషం విష ముచ్యతే |
జన్మాంతరఫ్న విషయా ఏకదేహహరం విషమ్ ॥ 13
విషము విషము కాదు; విషయములే విషము. విషము ఒక్క శరీరమునే హరించును గాని
వైరాగ్యప్రకరణము (సర్గ - 29) 165
విషయవిషము జన్మజన్మాంతరములంగూడి ముక్తికి అడ్డుదగిలి ప్రాణముల దీయును.
న సుఖాని న దుఃఖాని న మిత్రాణి న బాంధవాః ।
న జీవితం న మరణం బంధాయ జ్ఞస్య చేతనః ॥ || 14
సుఖ దుఃఖములు, బంధు మిత్రులు, జీవన మరణములు జ్ఞానిని బంధింపజాలవు.
తద్భవామి యథా బ్రహ్మన్ పూర్వాపరవిదాంవర!
వీతశోకభయాయాసో జ్ఞ ఆథోపదిశాశు మే ॥ 15
కార్యకారణ తత్త్వజ్ఞుడవగు బ్రాహ్మణోత్తమా! తత్వజ్ఞానమును బడసి, భయశోకాయాసముల నుండి
విడివడు మార్గమును శీఘ్రముగ నుపదేశింపుడు.
వాసనాజాలవలితా దుఃఖకంటకసంకులా ॥
నిపాతోత్పాత బహుళా భీమరూపా జ్ఞతాటవీ
|| 16
భయంకర మగు అజ్ఞానారణ్యము - వాసనా సమూహములతో జటిలమై, దుఃఖ కంటకములతో
సంకులమై, మిట్టపల్లములతో (సంపదలు, ఆపదలతో) గూడియున్నది.
క్రకచాగ్రవిని ష్పేషం సోడుం శక్నోమ్యహం మునే!
సంసారవ్యవహారోత్థం నాశా విషయవైశనమ్ ॥
|| 17
మునీ! ఱంపముయొక్క అంచుతో కోయబడిన సహింతును గాని, సంసారమందలి యీ
ఆశావిషయముల కోతను నే సహింపజాలను.
ఇదం నాస్తీదమస్తీతి వ్యవహారాంజనభ్రమః ।
ధునోతీదం చలం చేతో రజోరాశిమివానిలః ॥ 18
గాలి దుమ్మును లేవనెత్తునట్లు ఇది యున్నది. ఇది లేదు-అను నీ రూపమగు అజ్ఞానాంజనము
చిత్తమును విచలిత మొనర్చును.
తృష్ణాతంతులవప్రోతం జీవసంచయమౌక్తికమ్ ।
చిదచ్చాంగతయా నిత్యం వికసచ్చిత్తనాయకమ్ ॥ 19
సంసారహారమరతిః కాలవ్యాలవిభూషణమ్ |
త్రోటయామ్యహమక్రూరం వాగురామివ కేసరీ ॥
20
సంసారమను హారము తృష్ణయను దారమున గ్రుచ్చబడియున్నది. జీవులందలి ముత్యములు ;
166 యోగవాసిష్ఠము
సాక్షిస్వరూప మగు శుద్ధచిత్తమే ఇందలి మధ్యమణి. ఈ హారము కాలుడను లంపటుని అలంకారము.
సింహమువలన ద్రెంచునట్లు, వైరాగ్యముతో - (కామ క్రోధాదులతో గాదు) - దీనిని త్రెంపగోరెదను.
నీహారం హృదయాటవ్యాం మనస్తిమిరమాశు మే |
కేన విజ్ఞానదీపేన భింధి తత్త్వవిదాం వర॥ 21
తత్త్వజ్ఞశ్రేష్ఠుడా! నా హృదయారణ్యమందలి నీహార తిమిరమును, సుఖదాయక మగు జ్ఞానదీపముచే,
దూర మొనర్పుడు.
విద్యంత ఏవేహ న తే మహాత్మన్! దురాధయో న క్షమయా 22 ప్నువంతి
యే సంగమేనోత్తమమానసానాం నిశా తమాంసీవ నిశాకరేణ ॥ 22
మహాత్మా! చంద్రోదయ మైనపుడు నశింపని చీకట్లు లేనట్లు, సత్సంగమున నశింపని మనః పీడలు లేవు.
ఆయుర్వాయువిమట్టితాభ్రపటలీలంబాంబువద్భంగురం
భోగా మేఘవితానమధ్యవిలసత్ సౌదామినీచంచలాః
లోలా యౌవనలాలనాజలరయ శ్చేత్యాకలయ్య ద్రుతం
ముదైవాద్య దృఢార్పితా నను మయా చిత్తే చిరం శాంతయే॥
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే సకల పదార్థానాస్థాప్రతిపాదనం నామ
ఏకోనత్రింశః సర్గః ॥29||
ఆయువు వాయువుచే గొట్టబడిన మబ్బులందు వ్రేలాడు నీటిబొట్టువలె, క్షణభంగురము. భోగములు
మేఘముల నడుమ వెలుగు మెఱపులవలె చంచలములు, యౌవన విలాసములు జలప్రవాహమువలె
అస్థిరములు - అని విచార మొనర్చి, మనస్సున దృఢముగ ముద్రించితిని.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున సకలపదార్థానాస్థా ప్రతిపాదన మను ఏకోనత్రింశ సర్గము ॥ 29॥
ఉపదేశ ప్రార్థన - 30
శ్రీరామ ఉవాచ :
ఏవమభ్యుతితానర్థశతనంకటకోటరే
జగదాలోక్య నిర్మగ్నం మనోమనన కర్దమే 1
మనో మే భ్రమతీ వేదం సంభ్రమశ్చోపజాయతే |
గాత్రాణి పరికంపంతే పత్రాణీవ జరత్తరో: 2
వైరాగ్యప్రకరణము (సర్గ - 30) 167
శ్రీరాముడు: ఇట్లు లేచు అనర్థవృత్తుల పంకముచే నిండియున్న సంసార కోటరమున బడియున్న జనులన
గాంచి, నామనస్సు భ్రమించుచున్నది. నాకు భయ మగుచున్నది, ఎండుటాకులవలె నా యింద్రియములు
కంపించుచున్నవి.
అనాస్తోత్తమ సంతోష ధైర్యోత్సంగాకులా మతిః ॥
శూన్యాస్పదా బిభేతీహ బాలేవాల్పబలేశ్వరా 3 II
ధైర్యసంతోషముల క్రోడము నందక బుద్ధి, అల్పబలు డగు భర్తను బొందిన బాలికవలె, ఈ
సంసారమున భయపడుచున్నది.
వికల్పేభ్యో లుఠంత్యేతాశ్చాంతఃకరణవృత్తయః I
శ్వబ్రేభ్య ఇవ సారంగాస్తుచ్ఛాలంబ విడంబితాః | 4
గోతిని గప్పియున్న పచ్చికకై పరువిడి, లేళ్లందు పడునట్లు, తుచ్ఛ విషయములకై పరువిడి మనోవృత్తులు
దుఃఖమున గూలుచున్నవి.
అవివేకాస్పదా భ్రష్టాః కష్టే రూఢా న సత్పదే I
అంధ కూపమివాపన్నా వరాకాశ్చక్షురాదయః ॥ 5
అవివేకి నాశ్రయించి యున్న చక్షురాది ఇంద్రియములు, అంధకూపమున బడిన మనుజునివలె
కష్టకరమగు స్థానమున నున్నవి - ఇవి సత్పురుషుని ఆశ్రయించ లేదు.
నావస్థితిముపాయాతి న చ యాతి యథేప్సితమ్|
చింతా జీవేశ్వరాయత్తా కాంతేవప్రియసదని ॥ 6
జీవుడను భర్త కధీనమైన చింత యను భార్య, క్రొత్తగ కాపుర మొనర్ప నరిగిన స్త్రీవలె తనచోట
స్థిరముగ నుండలేదు. కోరు వస్తువులను బొందలేదు.
జర్జరీకృత్య వస్తూని త్యజంతి బిభ్రతీ తథా !
మార్గశీర్షాంతవల్లీవ ధృతిర్విధురతాం గతా ॥ 7
సంతోషము, పుష్యమాసమందలి లతవలె, కొన్ని కొన్ని వస్తువులను త్యజించుచు అవయుచున్నది.
అవహస్తి తసర్వార్థమనవస్థితిరాస్థితా ।
గృహీత్వోత్సృజ్య చాత్మానం భవస్థితిరవస్థితా 8
చిత్తచాంచల్యమున నాకు సంసార సుఖము లేకుండపోయినది, పారమార్థిక సుఖమును దొఱకలేదు.
168 యోగవాసిష్ఠము
ఈ సంసారము నన్ను సగము గైకొనినది, సగము గైకొనలేదు. (అనగా, సంపూర్ణముగా ఆత్మనిష్ఠయు
కుదరలేదు, సంసార విషయముల కించిత్ విరక్తియు గల్గినది).
చలితా చలితేనాంతరవష్టంభేన మే మతిః ।
దరిద్రా ఛిన్నవృక్షస్య మూలేనేవ విడంబ్యతే "I 9
కొమ్మలు లేని చెట్టును గాంచిన ఇంకొక వస్తువని భ్రమ కలుగునట్లు, ఆత్మతత్త్వ నిశ్చయము
కుదురక నామనస్సునకు భ్రమ కలుగుచున్నది.
చేతశ్చంచలమాభోగి భువనాంతర్విహారి చ
న సంభ్రమం జహాతీదం స్వవిమానమివామరాః 10
చంచల చిత్తము వివిధములగు భోగవాంఛలతో నిండియున్నది. మూడులోకముల నిది విహరించును.
అమరులు తమ తమ విమానములను వీడనట్లు, ఇదియు చంచలతను విడువకున్నది.
అతో2 తుచ్ఛమనాయాసమనుపాధిగతభ్రమమ్ I
కిం తత్ స్థితిపదం సాధో యత్ర శోకో న విద్యతే ||
సాధువర్యా! ఉత్తమమును, ఆయాస రహితమును, ఉపాధివర్జితమును, భ్రాంతినాశకమును, దుః
ఖహీనమును అగు పద మెయ్యది?
సర్వారంభసమారూఢాః సుజనా జనకాదయః ।
వ్యవహారపరా ఏవ కథముత్తమతాం గతాః ॥ 12 12
వ్యవహార పరులును, కర్మనిరతులును అయ్యు జనకాది మహాపురుషు లెట్లు శ్రేష్ఠు లైరి?
లగ్నేనాపి కిలాంగేషు బహుధా బహుమానదI
కథం సంసారపంకేన పుమానిహ న లిప్యతే 13
మాన్యుడా! సంసార పంకము నానావిధముల, అంగముల నంటినను, పురుషుడెట్లు దానివలన
లిప్తుడు కాకుండ నుండగలడు?
కాం దృష్టిం సముపాశ్రిత్య భవంతో వీతకల్మషాః
'
మహాంతో విచరంతీహ జీవన్ముక్తా మహాశయాః ॥ 14
మిమ్ముబోలు జీవన్ముక్త మహాపురుషు లెట్టి దృష్టితో ఈ సంసార క్షేత్రమున సంచరించుచున్నారు?
వైరాగ్యప్రకరణము (సర్గ - 30) 169
లోభయంతో భయాయైవ విషయా భోగభోగినః ।
భంగురాకారవిభవాః కథమాయాంతి భవ్యతామ్ । II 15
కుటిలములును, భయదములును, నశ్వరములును, నరక కారణములును నగు విషయ సర్పము
లెట్లు శుభప్రదములు కాగలవు?
మోహమాతంగమృదితా కలంకకలితాంబరా |
పరం ప్రసాదమాయాతి శేముషీ సరసీ కథమ్ ॥ 16
మోహమను ఏనుగువలన కెలకబడి, మకిలి యైన బుద్ధి యను సరోవర మెట్లు స్వచ్ఛము కాగలదు?
సంసార ఏవ నివహే జనో వ్యవహరన్నవి I
న బంధం కథ మాప్నోతి పద్మపత్రే పయో యథా ॥ 17
మనుజుడు సంసార వ్యవహారములందు బాల్గొనుచున్నను, తామరాకు నందలి నీటిబొట్టు వలె,
నిర్లిప్తుడై యుండుట కుపాయ మేమి?
ఆత్మవత్ తృణవచ్చేదం సకలం కలయన్ జనః |
కథముత్తమతామేతి మనోమన్మథమస్పృశన్ ॥ I 18
మనుష్యుడు కామాది దుర్వృత్తులను స్పృశింపక, జగత్తును బాహ్యదృష్టితో తృణమువలెను, అంతర్
దృష్టితో ఆత్మవలెను జూచుచు పరమపద మందగల ఉపాయ మేమి?
కం మహాపురుషం పారముపయాతం మహోదధేః |
ఆచారేణానుసంస్మృత్య జనో యాతి న దుఃఖితామ్ ॥ 19
అజ్ఞాన సముద్రమును దాటిన ఏ మహాపురుషుని ఆచరణ ననుసరించిన, జనులు దుఃఖము నుండి
తప్పించుకొనగలరు?
కిం తత్ స్యాదుచితం శ్రేయః కిం తత్ స్యాదుచితం ఫలమ్|
వర్తితవ్యం చ సంసారే కథం నామాసమంజసే ॥ 20
నే ననుసరింప దగిన శ్రేయ మెద్ది? దానిఫల మెట్టిది? అసమంజసముతో గూడిన ఈ జగత్తున నెట్లు
సంచరింపవలెను?
తత్త్యం కథయ మే కించిద్యేనాస్య జగతః ప్రభో!
వేది పూర్వాపరం ధాతుశ్చేష్టితస్యానవస్థితేః ॥
|| 21 21
170 యోగవాసిష్ఠము
ప్రభో! బ్రహ్మ సృజించిన ఈ అశాశ్వత జగత్తుయొక్క పూర్వాపరములను దెలియగల తత్త్యోపదేశము
నొనర్పడు.
హృదయాకాశ శశినశ్చేతసో మలమార్జనమ్।
యథా మే జాయతే బ్రహ్మంస్తథా నిర్విఘ్నమాచర I ॥ 22
హృదయాకాశము నందున్న చైతన్యచంద్రుని మచ్చతొలగిపోవు ఉపదేశమును శీఘ్రముగ నొనర్పుడు.
కిమిహ స్యాదుపాదేయం కిం వా హేయమథేతరత్ |
కథం విశ్రాంతిమాయాతు చేతశ్చపలమద్రివత్ 23
ఈ ప్రపంచమున గ్రాహ్యమెద్ది? త్యాజ్యమెద్ది? ఈరెండును కానిదెద్ది? చంచల చిత్తమును
పర్వతమువలె స్థిర మొనర్చు టెట్లు?
కేన పావనమంత్రేణ దుఃసంసృతివిషూచికా।
శామ్యతీయ మనాయాసమాయాస శతకారిణీ ॥ 24
లెక్కకు మించిన బాధలను గలిగించు ఈసంసార విషూచివ్యాధి ఏ పావన మంత్రమువలన
నుపశమించును?
కథం శీతలతామంతరానందతరుమంజరీమ్ |
పూర్ణచంద్ర ఇవాక్షీణాం భృశమాసాదయామ్యహమ్ ।
పూర్ణచంద్రునివలె నశింప నిదియు, హృదయానంద ముకుళమును నగు శీతలత్వము నెట్లందగలను?
ప్రాప్యాంతః పూర్ణతాం పూర్లో న శోచామి యథా పునః
సంతో భవంత స్తత్యజ్ఞాస్తథేహోపదిశంతు మామ్ || 26
మీరు తత్త్వజ్ఞులు అగుటచేత, నేను పూర్ణత్వమును బొంది మరల దుఃఖము నందకుండు ఉపదేశము
నొసగుడు.
అనుత్తమానందపదప్రధానవిశ్రాంతిరిక్తం సతతం మహాత్మన్! 1
కదర్థయంతీహ భృశం వికల్పాః శ్వానో వనే దేహమివాల్పజీవమ్ 27
ఇత్యార్చే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే ప్రయోజనకథనం నామ త్రింశత్తమః సర్గః॥30n
మహాత్మా! సర్వశ్రేష్ఠుడగు అత్యంతిక విశ్రాంతి (మోక్షము) నందని వానిని, వాని చిత్తవృత్తులు,
అరణ్యమున కుక్క అల్పజీవులను పీడించునట్లు, పీడించును.
ఇది శ్రీవాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున ప్రయోజన కథనమను ముప్పదియవ సర్గము ॥ 30 ॥
వైరాగ్యప్రకరణము (సర్గ - 31) 171
రాఘవప్రశ్న వర్ణనము-31
శ్రీరామ ఉవాచ:
ప్రోచ్చవృక్షచలత్ పత్రలంబాంబుల వభంగురే |
ఆయుషీశానశీతాంశుకలామృదుని దేహకే ॥ 1
కేదారవిరటద్భేకకంఠత్వక్కోణభంగురే |
వాగురావలయే జంతోః సుహృత్ స్వజనసంగమే 2
వాసనావాతవలితే కదాశాతడితి స్ఫుటే I
మోహోగ్రమిహికామే ఘే ఘనం స్ఫూర్జతి గర్జతి ॥ 3
నృత్యత్యుత్తాండవం చండే లోలే లోభకలాపిని ।
సువికాసిని సాస్ఫోటే హ్యన కుటజద్రుమే || 4
క్రూరే కృతాంతమార్జారే సర్వభూతాఖ హారిణి ।
అశ్రాంతస్యందసంచారే కుతో ప్యుపరిపాతిని ॥ 5
క ఉపాయో గతిః కా వా కా చింతా కః సమాశ్రయః
కేనేయమశుభోదర్కా న భవేజీవితాటవీ ॥ "I 6
శ్రీరాముడు: ఆయువు, ఎత్తైన చెట్టున కదలు ఆకుకొనకున్న నీటిబొట్టువలె పడనున్నది; శరీరమున
శివుని నెలవంకవోలె కన్పించదు; పొలాలలో అరచుచు చరించు కప్పల కంఠనాళ చర్మమువలె అస్థిరము.
జీవులకు బంధుమిత్రుల సమాగమము ఉరిత్రాడు. కోర్కెలను గాలులు చుట్టిముట్టి యున్నవి. దురాశ
యను మెఱుపు మెఱయుచున్నది. మోహమను మేఘములు పిడుగులను విడుచుచు గర్జించుచున్నవి;
లోభమను నెమళ్లు తాండవ మొనరించుచున్నవి. అనర్థమను పూపొద కొన్ని కొన్ని మొగ్గల విడుచుచున్నది.
క్రూరుడగు కృతాంతుడను పిల్లి జీవులను ఎలుకలను భక్షింప తొందరపడుచున్నది. జలప్రవాహమువలె
జీవు లెటనుండియో అరుదెంచుచున్నారు; ఇట పతనమునకు వీలున్నది. ఇట్టి స్థితియందు నా కుపాయ
మేమి? గతి ఏమి? దేనిని చింతింతును? దేనిని ఆశ్రయింతును? ఈ జీవితారణ్య మెట్లు శుభప్రదము
కాగలదు?
న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా క్వచిత్।
సుధియస్తుచ్ఛమ ప్యేతద్యన్నయంతి న రమ్యతామ్ ॥
"I 7
ఇట గాని, ద్యులోకమున గాని, స్వర్గమున గాని మిమ్ముబోలు మహాత్ముల ఇచ్చవలన రమణీయముగ
మారు తుచ్ఛపదార్థము లేదు.
172 యోగవాసిష్ఠము
అయం హి దగ్ధసంసారో నీరంధ్రకలనా కులః |
కథం సుస్వాదుతామేతి నీరసో మూఢతాం వినా ॥ 8
నిరంతరము, పీడను గల్గించు ఈపాడు సంసారము, మోహరహితమై, రుచికర మెట్లు కాగలదు?
ఆశాప్రతివిపాకేన క్షీరస్నానేన రమ్యతామ్ । 1
ఉపైతి పుష్పశుభ్రణ మధునేవ వసుంధరా ॥ 9
పుష్పధవళిత మగు వసంత సమయ పృథివివలె, సంతృప్తి యను క్షీర స్నానమున సంసారము
సుందరము కాగలదు.
అపమృష్టమలోదేతి క్షాలనేనామృత ద్యుతిః ।
మనశ్చంద్రమసః కేన తేన కామకలంకి తాత్ II 10
కామకళంకితుడగు నామనశ్చంద్రుడే యుపాయము నవలంబించిన అమృతమయ కళలతో
ప్రకాశింపగలడు?
ధృష్టసంసారగతినా దృష్టాదృష్టవినాశినా ।
కేనేవ వ్యవహర్తవ్యం సంసారవనవీథిషు ॥ 11
ఐహికాముష్మిక ఫలాశలను వర్ణించి సంసారగతిని గనుంగొనిన ఏ మహాపురుషుని ననుసరించి, ఈ
సంసారారణ్యమున చరింతును?
రాగద్వేషమహారోగా భోగపూగా విభూతయః ।
కథం జంతుం న బాధంతే సంసారార్ణవచారిణమ్ || 12
సంసార మందున్న మనుజుడు ఏ మొనరించిన రాగద్వేషాత్మకము లగు భోగసర్ప సమూహములు
పీడింపకుండును?
కథం చ ధీరవర్యాగ్నౌ పతతాపి న దహ్యతే |
పావకే పారదేనేవ రసేన రసశాలినా ॥ 13
రసమయ మగు పాదరస మగ్నిలో బడినను దహింపబడనట్లు మనుజు డేయుపాయమున సంసారాగ్నిం
బడియు తపింపబడకుండ నుండగలడు?
యస్మాత్కిల జగత్యస్మిన్ వ్యవహారక్రియాం వినా ।
న స్థితిః సంభవత్యభౌ పతితస్యాజలా యథా ॥ 14
సముద్రమున బడిన నీరంటకుండ ఉండదు; అట్లే సంసారమున బడిన వ్యవహారము లంటకుండ
వైరాగ్యప్రకరణము (సర్గ - 31) 173
నుండవు.
రాగద్వేషవినిర్ముక్తా సుఖదుఃఖవివర్జితా |
కృశానోర్దాహహీనేవ శిఖా నాస్తీహ సత్రియా ॥ 15
కాల్చని అగ్నిజ్వాల లేనట్లు రాగద్వేషములును, సుఖదుఃఖములును లేని సత్రియ ఈ జగత్తున లేదు.
మనోమననశాలిన్యాః సత్తాయా భువనత్రయే |
క్షయో యుక్తిం వినా నాస్తి బ్రూత తామలముత్తమామ్ ॥ 16
ఈ జగత్తుయొక్క అస్తిత్వము మలిన మగు మనస్సుపైననే ఆధారపడి యున్నది; ఇది
తత్త్వబోధవలనగాని క్షయము కాదు. అందువలన నాకు తత్వబోధ మూలకములగు వాక్యముల
నుపదేశింపుడు.
వ్యవహారవతో యుక్త్యా దుఃఖం నాయాతి మే యయా |
అథవా వ్యవహారస్య బ్రూత తాం యుక్తిముత్తమామ్ 17
కర్మ నొనర్చినను, లేక ఒనర్పక పోయినను, దుఃఖము గలుగని ఉత్తమమగు యోగము నా
కుపదేశింపుడు.
తత్కథం కేన వా కిం వా కృతముత్తమ చేతసా |
పూర్వం యేనైతి విశ్రామం పరమం పావనం మనః॥
18
ఎద్దాని నాచరించిన మనస్సు పవిత్ర మగునో, పరమశాంతి లభించునో, అద్దానిని పూర్వ మెట్లు,
ఎవరు, ఎందుల కొనరించిరో నాకు జెప్పుడు.
యథా జానాని భగవంస్తథా మోహనివృత్తయే ।
బ్రూహి మే సాధవో యేన నూనం నిర్దుఃఖతాం గతాః ॥ 19
భగవంతుడా! సాధుపురుషు లెట్లు దుఃఖమునుండి విడివడిరి?- మీకు దెలిసినట్లు వివరింపుడు.
అథవా తాదృశీ యక్తిర్యది బ్రహ్మన్ న విద్యతే |
న వక్తి మమ వా కశ్చిద్విద్యమానామపి స్ఫుటమ్ 20 20
స్వయం చైవ న చాప్నోమి తాం విశ్రాంతిమనుత్తమామ్ ।
తదహం వ్యక్తసర్వేహో నిరహంకారతాం గతః ॥ 21
174 యోగవాసిష్ఠము
న భోక్ష్యే న పిబామ్యంబు నాహం పరిదంబరమ్
కరోమి నాహం వ్యాపారం స్నానదానాశనాదికమ్ 22 "I
మహాత్మా! ఇట్టి వాక్యములు లేకపోయినను, ఉండినను, నా కెవరును వివరముగ దెలుపక
పోయినను, తెలిపినను, శాంతి లభింపక పోయినను - నేను అన్ని కోర్కెలను, అహంకారమును పరిత్యజింతును.
భుజింపను, త్రావను, వస్త్రములను ధరింపను, స్నానాది కార్యముల నొనర్పను.
న చ తిష్ఠామి కార్యేషు సంపత్స్వపద్ధశాను చ ।
న కించిదపి వాంఛమి దేహత్యాగాదృతే మునే! 23 23
మునీంద్రా! ఆపదలు రానీ, సంపదలు రానీ, కార్యముల నొనర్పను; శరీర త్యాగముకంటె ఇతర
మొండు కోరను.
కేవలం విగతాశంకో నిర్మమో గతమత్సరః | 1
మౌన ఏవేహ తిష్ఠామి లిపికర్మస్వివార్పితః ॥ "I 24
అహంకారము, సందేహము, అసూయ వీటిని పరిత్యజించి, మౌనమును వహించి బొమ్మవలె -
కూర్చుందును.
అథ క్రమేణ సంత్యజ్య ప్రశ్వాసోచ్ఛ్వాససంవిదః ॥
సంనివేశం త్యజావిమమనర్థం దేహనామకమ్ ॥ 25
అనంతరము క్రమముగ శ్వాసలను, జ్ఞానమును వదలి, ఈ అనర్థ దేహమును త్యజింతును.
నాహమస్య న మే నాన్యః శామ్యామ్య స్నేహదీపవత్।
సర్వమేవ పరిత్యజ్య త్యజావిదం కలేవరమ్ ॥ 26
ఈదేహము నాది కాదు; నేను దేహమును కాను. ఇతరదేహులు నావారు కారు. అన్నిటిని పరిత్యజించి,
చమురు లేని దీపమువలె ఆరిపోయెదను - ఈ శరీరమును త్యజింతును.
శ్రీవాల్మీకి రువాచ:
ఇత్యుక్తవానమలశీతకరాభిరామో రామో మహత్తరవిచార వికానిచేతాః॥
తూప్లీం బభూవ పురతో మహతాం ఘనానాం కేకారవం శ్రమవశాదివ నీలకంఠః
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే
రాఘవప్రశ్నో నామ ఏకత్రింశత్తమః సర్గః ॥ 31 ॥
వైరాగ్యప్రకరణము (సర్గ - 32) 175
వాల్మీకి: నిర్మలచంద్రునివలె శోభిల్లు శ్రీరామచంద్రుడు వివేకవికసిత మనస్కుడై, పైవిధముగా మహాత్ములతో
బల్కి, మేఘముల ఎదుట కేకలిడి అలసి విశ్రాంతి నందగోరు మయూరమువలె, మౌనమును వహించెను.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్యప్రకరణమున రాఘవప్రశ్న యను ఏకత్రింశత్తమ సర్గము ॥ 31 |
నభశ్చర సాధువాద వర్ణనము -32
శ్రీ వాల్మీకి రువాచ:
వదత్యేవం మనోమోహవినివృత్తికరం వచః ॥
రామే రాజీవపత్రాక్షే తస్మిన్ రాజకుమార॥ 1
సర్వే బభూవు స్తత్రాస్థా విస్మయోత్ఫుల్లలోచనాః
భిన్నాంబరా దేహరు హైః గిర శ్రోతుమివోదురైః 11 2
వాల్మీకి: కమలలోచను డగు రాము డిట్లు మనోమోహమును నశింపజేయు వాక్యములను బల్కుచుండగా,
అట నున్న వారందరు ఆశ్చర్యోత్ఫుల్లనేత్రులైరి. ఆవాక్యముల నన్నిటిని వినగా, వారి రోమములు వస్త్రములను
భిన్న మొనర్చినవో యను నట్లుండెను. (అనగా వా రావాక్యములను విని, పులకిత శరీరులైరని భావార్థము.)
విరాగవాసనాపాస్తసమస్తభవవాసనాః |
ముహూర్తమమృతాంభోధి వీచీ విలులితా ఇవ ॥ 3
వైరాగ్య వాసనవలన వారి సంసార వాసనలు నశించెను; వా రా ముహూర్తమున అమృత సాగర
వీచికలం దేలియాడిరి.
తా గిరో రామభద్రస్య తస్య చిత్రార్పితైరివ।
సంశ్రుతాః శృణు కైరంతరానందపదవీవరైః ॥ I 4
శ్రవణ కుశలురగు వారందరును ఆనందమును గన్పరచుచు, బొమ్మలవలె శ్రీరాముని వాక్యముల
నాకర్ణించిరి.
వసిష్ఠవిశ్వామిత్రాద్యై ర్మునిభిః సంసది స్థితైః
జయంతదృష్టీ ప్రముఖైర్మంత్రిభిర్మంత్రకోవిదైః | "I 5
నృపెద్దశరథప్రఖ్యైః పౌరై: పారశవాదిభిః।
సామంతై రాజపుత్రైశ్చ బ్రాహ్మణైర్బహ్మ వాదిభిః
6
176 యోగవాసిష్ఠము
తథా భృత్యై రమాత్యైశ్చ పంజరస్థైశ్చ పక్షిభిః I
క్రీడామృగైర్గత స్పందై స్తురంగైస్యక్తచర్వణైః
|| 7
కౌసల్యా ప్రముఖైశ్చైవ నిజవాతాయన స్థితైః I
సంశాంతభూషణారావై రస్పందైర్వనితాగణై: 8
ఉద్యానవల్లీ నిలయైర్విటంకనిలయైరపి
1
అక్షుబ్ధపక్షతతిబిర్విహంగైర్విరతారవైః ॥ 9
సిద్ధెర్నభశ్చరైశ్చైవ తథా గంధర్వ కిన్నరైః।
నారదవ్యాసపులహప్రముఖైర్మునిపుంగవైః ॥ 11 10
అన్యైశ్చ దేవదేవేశ! విద్యాధరమహోరగైః |
రామస్య తా విచిత్రార్థా మహోదారాగిరః శ్రుతాః || 11
సభయందున్న వసిష్ఠ విశ్వామిత్రాది మహర్షులును, మంత్రకుశలులగు జయంతాది మంత్రులును.
దశరథుడును, పారశవాది పౌరులును, సామంతులును, రాజపుత్రులును, వేదవిదులగు బ్రాహ్మణులును,
భృత్యులును, అమాత్యులును, పంజరమున నున్న పక్షులును, శ్రీరాముని వాక్యముల నాకర్ణింప దొడంగిరి.
క్రీడామృగములు నిస్తబ్ధము లయ్యు గుఱ్ఱములు నెమరు మానియు, కౌసల్యాది వనితలు అలంకారముల
శబ్దముల నొనర్పకుండ తమతమ వాతాయనముల గూర్చొనియు శ్రీరాముని వాక్యముల వినదొడగిరి.
పూపొదలందును, సౌధాగ్రమున నున్న పక్షులు కలవర మొనర్పకుండ లెక్కల నల్లార్పకుండ, శ్రీరాముని
వాక్యముల వినసాగెను. సిద్ధగంధర్వ కిన్నరాది ఆకాశ చారులును, నారద వ్యాస పులహాది మునులును,
తదితరులగు సురాసుర విద్యాధర గణములును రాముని విచిత్రార్థ పూర్ణఔదార్య వాక్యములను వినిరి.
అథ తూష్లీం స్థితవతి రామే రాజీవలోచనే ।
తస్మిన్ రఘుకులాకాశశశాంకే శశిసుందరే ॥ 12
సాధువాదగిరా సార్ధం సిద్ధసార్థసమీరితా।
వితానకసమా వ్యోమ్నః పౌష్పీవృష్టిః పపాత హ ॥ 13
శశిసుందరుడును, రఘుకులాకాశ శశియు, పద్మనేత్రుడును నగు రామచంద్రుడు, ఊరకుండ
సిద్ధపురుషులు పొగడి, పుష్పవర్షమును గుఱిపించిరి; అప్పు డాపుష్పములు వితానము (చాందినీ) వలె గన్పట్టెను.
మందార కో శవిశ్రాంత భ్రమరద్వంద్వనాదినీ।
మధురామోదసౌందర్యముదితోన్మదమానవా 14
వైరాగ్యప్రకరణము (సర్గ - 32) 177
వ్యోమవాత వినున్నేవ తారకాణాం పరంపరా |
పతితేవ ధరాపీఠే స్వర్గస్త్రీహని తచ్ఛటా
|| 15
వృష్యమూకకచన్మేమలవావలిరివ చ్యుతా 1
హైయంగవీనపిండానామి రితేవ పరంపరా॥ 16
హిమవృష్టి రివోదారా ముక్తాహారచయోపమా ।
ఐందవీ రశ్మిమాలేవ క్షీరోర్మీణామివాతతిః I 17
కింజల్కాంభోజవలితా భ్రమద్భృంగకదంబకా |
సీ త్కార గాయదామోదిమధురానిలలోలితా ॥
18
ప్రభ్రమత్కేతకీ వ్యూహా ప్రస్ఫురత్కరవోత్కరా ।
ప్రపతత్ కుందవలయా చలత్ కువలయాలయా ॥ 19
ఆపూరితాంగణరసా గృహాచ్ఛాదనవత్వరా |
ఉద్దీవపుర వాస్తవ్యనరనారీవిలోకితా ॥ 20 20
నిరబ్రోత్పలసంకాశవ్యోమవృష్టిరనాకులా |
అదృష్టపూర్వా సర్వస్య జనస్య జనితస్మయా ॥ 21
అదృశ్యాంబరసిధౌమకరోత్కరసమిరితా |
సా ముహూర్తే చతుర్భాగం పుష్పవృష్టిః పపాత హ ॥ 22
ఆకాశమున కనంబడకుండ నుండిన ఆ సిద్ధులు అరగంట కాలము, పుష్పవర్షమును గుఱిపించిరి.
అప్పుడు, మందార కుసుమములు నిద్రించు తుమ్మెదల జంట (క్రిందపడుటవలన) నాద మొనర్చెను;
మానవు లా మధుర సౌరభమున ఆనందపరవశులైరి. వాయువు నక్షత్రమండలమును భూతలమున
బడవేసినట్లును, దేవతా స్త్రీల హాసకాంతి క్రిందబడినట్లును, బంగారు ముద్దలు వెదజల్లబడినట్లును,
ముత్యములబోలు వడగళ్లు పడినట్లును, చంద్రకిరణములో లేక పాలకడలి తరగలో విస్తరించినట్లును, ఆ
పుష్పవర్షమును జూచిన వారికి తోచెను. కేసరములతో గదలుచున్న పద్మములతోడను, వికసించు
కలువలతోడను, పడుచున్న కుందము (మొల్ల) లతోడను, కదలుచున్న కైరవములతోడను, ఆ పుష్పవృష్టి
శోభిల్లెను. తుమ్మెదలు నలువైపుల తిరుగసాగెను, మధురవాయువు పూలను గదల్పసాగెను. నీలకమలకాంతి
గల గగనమునుండి కుఱిసిన పూలవానతో ముంగిలి పైకప్పు నిండిపోయెను. నగరవాసు లగు స్త్రీ పురుషు
లచ్చెరువుతో బరికింపసాగిరి; ఇట్టి విషయ మభూత మైనందువలన విస్మితులు గాదొడంగిరి.
VI F12
178 యోగవాసిష్ఠము
ఆపూరితసభాలోకే శాంతే కుసుమవర్షణే I
ఇమం సిద్ధగణాలాపం శుశ్రువుస్తే సభాగతాః ॥ 23
సభాసదులును, మంటవమును, పూలతో కప్పువడిరి. పుష్పవృష్టి ఆగిన పిమ్మట
సిద్ధులిట్లనుకొనుచుండుట సభాసదులు వినిరి.
ఆకల్పం సిద్ధసేనాసు భ్రమదిరభితో దివమ్ ।
అపూర్వమిద మస్మాభి శ్రుతం శ్రుతిరసాయనమ్ ॥ 24 24
యదనేన కిలోదారముక్తం రఘుకులేందునా ।
వీతరాగతయా తద్ధి వాకృతేరప్యగోచరమ్ 25
అహోబత మహత్పుణ్య మద్యాస్మాభిరిదం శ్రుతమ్ |
వచో రామముఖోద్భూతం మహాహ్లాదకరం ధియః ॥ 46 26
కల్పారంభమునుండి స్వర్గమున, సిద్ధుల మధ్య మనము తిరుగాడు చున్నాము, కాని నేడు విన్న
వాగమృతము నింతకు మునుపు వినలేదు. వైరాగ్యముతో, రఘుకుల చంద్రుడు పల్కిన మహావాక్యములను
బృహస్పతిగూడ ఎఱుంగడు. ఆహా! నేడు కదా, మనము హృదయానంద కరములగు శ్రీరాముని వాక్యములను
వింటిమి.
ఉపశమామృతసుందరమాదరాదధిగతోత్తమతాపదమేష యత్।
కథితవానుచితం రఘునందనః సపది తేన వయం ప్రతిబోధితాః ॥ 27
ఇత్యార్షే వాసిష్ఠ-మహారామాయణే వాల్మీకీయే వైరాగ్యప్రకరణే నభశ్చరసాధువాదో
నామ ద్వాత్రింశత్తమః సర్గః॥32॥
శ్రీరాముడు పల్కిన, శాంత్యమృత దాయకము లగు వాక్యములవలన మన ముద్బోధింపబడితిమి.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున నభశ్చర సాధువాద మను ద్వాత్రింశత్తమః సర్గము ॥ 32
179
నభశ్చర మహీచర సమ్మేళనము - 33
సిద్ధా ఊచు:
పావనస్యాస్య వచసః ప్రోక్తస్య రఘుకేతునా।
నిర్ణయం శ్రోతు ముచితం వక్ష్యమాణం మహర్షిభిః || 1
సిద్ధులు: రాఘవుడు పల్కిన పవిత్ర వచనములకు మహర్షు లేమి ప్రత్యుత్తర మిత్తురో వినదలతుము.
నారద వ్యాస పులహ ప్రముఖా మునిపుంగవాః |
ఆగచ్ఛతాశ్వవిఘ్నేన సర్వ ఏవ మహర్షయః ॥ I 2
నారద వ్యాస పులహాది మునిపుంగవులును, తదితరులును నిర్విఘ్నముగా రండు!
పతామః పరితః పుణ్యామేతాం దాశరథీం సభామ్ |
నీరంధ్రాం కనకోద్ద్యోతాం పద్మినీమివ షట్పదాః ॥ 3
తుమ్మెదలు బంగారు వెలుగులు రంగారు కేసరములు దాపిల్లు, పద్మము నాశ్రయించునట్లు
మనముకూడ, కనకదీప్తుల నీను దశరథుని సభ నాశ్రయింతము.
శ్రీవాల్మీకి రువాచ:
ఇత్యుక్తా సా సమసైవ వ్యోమవాసనివాసినీ।
తాం^పపాత సభాం తత్ర దివ్యా మునిపరంపరా ||
అగ్రస్థితమనుత్సృష్టరణద్వీపం మునీశ్వరమ్ ।
పయః పీనఘనశ్యామం వ్యాసమేవ కిలాంతరా ॥
5
భృగ్వంగిరఃవులస్త్యాదిమునినాయకమండితా ।
చ్యవనోద్దాలకోశీరశరలో మాదిమాలితా ॥
|| 6
పరస్పరపరామర్శదుఃస్సంస్థానమృగాజినా
లోలాక్షమాలావలయా సుకమండలుధారిణీ॥
7
తారావలిరివ వ్యోమ్ని తేజఃప్రసరపాటలా |
సూర్యావలిరివాన్యోన్యం భాసితాననమండనా ॥ 8
రత్నావలి రివాన్యోన్యం నానావర్ణకృతాంగికా |
ముక్తావలిరివాన్యోన్యం కృత శోభాతిశాయినీ
|| 9
180 యోగవాసిష్ఠము
కౌముదీ వృష్టిరన్యేవ ద్వితీయేవార్కమండలీ |
సంభృతే వాతికాలేన పూర్ణచంద్రపరంపరా 10
||
తారాజాల ఇవాంభోదో వ్యాసో యత్ర విరాజతే ।
తారౌమ ఇవ శీతాంశుర్నారదో ఒ త్ర విరాజతే ॥ 11
దేవేష్వివ సురాధీశః పులస్తోత్ర విరాజతే ।
ఆదిత్య ఇవ దేవానా మంగిరాస్తు విరాజతే ॥ 12
విమానస్థు లగు మును లిట్లు నుడివి ఆసభ కరుదెంచిరి. ఆమునిమండలి మొమ్మొదట వీణను
మీటు నారదు డుండెను. తరువాత, నీలమేఘశ్యాము డగు వ్యాసు డుండెను. మధ్య భృగువు, అంగిరనుడు,
పులస్త్యుడు, చ్యవనుడు, ఉద్దాలకుడు, ఉశీరుడు, శరలోముడు - ఇత్యాది ఋషు లుండిరి. ఒకరి నొకరు
త్రోసికొనుటవలన వారి కృష్ణాజినములు చెదరెను. వారి జపమాలలు కదలు చుండెను. వారి హస్తముల
ప్రశస్తములగు కమండలము లుండెను. తేజో తిశయమున వా రాకాశమునందలి నక్షత్రములవలె
మెరయుచుండిరి; ప్రకాశించు వదనములతో సూర్యులవలె గన్పట్టుచుండిరి. వారు రత్న సమూహములవలె
నానావర్ణములతోడ నుండిరి. ముత్యములవలె శోభిల్లుచుండిరి. వారిరాకవలన ఇంకొక వెన్నెలవాన ఇంకొక
సూర్యమండలము వచ్చినట్లుండెను; ఒకేచోట అనేకములగు పూర్ణచంద్ర మండలములు కూడినట్లుండెను.
వ్యాసు డున్నచోటు, నక్షత్రమండల సమీపమున నున్న మేఘమువలెను, నారదు డున్నచోటు నక్షత్ర
సమీపమున నున్న చంద్రమండలమువలెను బ్రకాశించెను. మునుల నడుమ, పులస్త్యుడు దేవతల నడుమ
నున్న ఇంద్రునివలెను, అంగిరసుడు దేవతల నడుమ నున్న సూర్యునివలెను బ్రకాశించిరి.
అథాస్యాం సిద్ధసేనాయాం పతంత్యం నభసో రసామ్ |
ఉత్తస్థా మునిసంపూర్ణా తదా దాశరథీ సభా ॥ 13
మిశ్రీభూతా విరేజుస్తే నభశ్చరమహీచరాః
పరస్పరవృతాంగాభా భాసయంతో దిశో దశ ॥ 14
అనంతరము, సిద్ధసమూహము భూమికి దిగుచుండ, దశరథుని సభయందున్న మునులు లేచి
నిలంబడిరి. అప్పు డాచర భూచరులు కలిసి, ఒండొరుల కప్పిపెట్టు కాంతులతో దిఙ్మండలమును బ్రకాశింపజేసిరి.
వేణుదండావృతకరా లీలాకమలధారిణః |
దుర్వాంకురాక్రాంతశిఖాః సచూడామణి మూర్ధజాః II 15
జటాజూటైశ్చ కపిలా మౌలిమాలిత మస్తకాః |
ప్రకోష్ఠగాక్షవలయా మల్లికావలయాన్వితాః ॥ 16
వైరాగ్యప్రకరణము (సర్గ - 33) 181
చీరవల్కల సంవీతాః ప్రక్కౌశ్రేయావగుంఠితాః |
విలోలమేఖలాపాశా శ్చలన్ముక్తాకలాపినః I 17
వసిష్ఠ విశ్రామిత్రా తాన్ పూజయామాసతుః క్రమాత్ |
అర్యైః పాద్యైర్వచోభిశ్చ సర్వానేవ నభశ్చరాన్ ॥ || 18
వారిహస్తముల వేణుదండములును, పద్మములును నుండెను. వారి శిఖల దూర్వారములును, శిరముల
చూడామణులును శోభిల్లుచుండెను. వారి జటాజూటములు కపిలములు; మస్తకముల మాలలు
చుట్టబడియుండెను. అక్షమాలలను, మల్లికామాలలను ధరించియుండిరి. వారు నారబట్టలను గట్టుకొని
యుండిరి. వారి మొలత్రాడులు, ముత్యాల మాలలు కదలుచుండెను. ఇట్టి సిద్దులను వసిష్ఠ విశ్వామిత్రులు,
అర్ఘ్యపాద్యములతోడను, మధుర వాక్యములతోడను బూజించిరి.
వసిష్ఠ విశ్వామిత్రా తే పూజయామాసురాదరాత్ ।
అధ్యైః పాద్యైర్వచోభిశ్చ నభశ్చరమహాగణాః ॥ 19
సిద్ధులుగూడ, అర్ఘ్యపాద్యములతోడను, మధురవాక్యములతోడను, వసిష్ఠ విశ్వామిత్రులను పూజించిరి.
సర్వాదరేణ సిద్ధాఘం పూజయామాస భూపతిః ।
సిద్ధాఘో భూపతిం చైవ కుశలప్రశ్నవార్తయా ॥ 20
దశరథుడుకూడ సిద్ధులను మిక్కుట మగు ఆదరముతో బూజించెను; సిద్ధులును దశరథుని కుశల
ప్రశ్నలతోడను; తత్కాలోచిత కార్యములతోడను, తృప్తు నొనరించిరి.
తైసైః ప్రణయసంరంభైరన్యోన్యం ప్రాప్తసత్రియాః ।
ఉపావిశన్ విష్టరేషు నభశ్చరమహీచరాః ॥ 221 || 21
ఇట్లు, వారందరు పరస్పరము సత్కరించుకొని ఆసనములందు గూర్చుండిరి.
వచోభిః పుష్పవర్షేణ సాధువాదేన చాభితః ।
రామం తే పూజయామాసు: పురః ప్రణతమాస్థితమ్ ॥ I 22
చేతులు జోడించి ఎదుట నిలబడిన రాముని, మధుర వాక్యములతోడను, పుష్పవర్షముతోడను,
ప్రశంసతోడను సిద్ధులు సన్మానించిరి.
ఆసాంచక్రే చ తత్రాసౌ రాజ్యలక్ష్మీవిరాజితః । 1
విశ్వామిత్రో వసిష్ఠశ్చ వామదేవోథ మంత్రిణః || 23 23
182 యోగవాసిష్ఠము
నారదో దేవపుత్రశ్చ వ్యాసశ్చ మునిపుంగవః |
మరీచిరథ దుర్వాసా మునిరాంగిరసస్తథా 24 ॥ 24
క్రతుః పులస్త్యః పులహః శరలోమా మునీశ్వరః ॥
వాత్స్యాయనో భరద్వాజో వాల్మీకి ర్మునిపుంగవః 22 "I 25
ఉద్దాలకో ఋచీకశ్చ శర్యాతిశ్చ్యవనస్తథా | || 26
ఏతే చాన్యే చ బహవో వేదవేదాంగ పారగాః ।
జ్ఞాతజ్ఞేయా మహాత్మాన ఆస్థితా స్తత్ర నాయకాః ॥ 27 27
రాజ్యలక్ష్మితో శోభిల్లు రాముడు వారి అనుమతితో గూర్చుండెను. విశ్వామిత్రుడు, వసిష్ఠుడు,
వామదేవుడు, మంత్రులు, నారదుడు, దేవపుత్రులు, వ్యాసుడు, మరీచి, దుర్వాసుడు, అంగీరసుడు, క్రతువు,
పులహుడు, శరలోముడు, వాత్స్యాయనుడు, భరద్వాజుడు, వాల్మీకి, ఉద్దాలకుడు, ఋచీకుడు, శర్యాతి,
చ్యవనుడు అను మునులును, వేదవేదాంగ పారగులగు తత్వజ్ఞ శ్రేష్ఠులును నచ్చట ఉపవిష్ణులైరి.
వసిష్ఠ విశ్వామిత్రాభ్యాం సహ తే నారదాదయః ।
ఇదమూచురనూచానా రామమానమితాననమ్ ॥ 28
నారదాదులును, వసిష్ఠ విశ్వామిత్రాదులును నతశిరుడైన రాము నుద్దేశించి యిట్లనిరి.
అహోబత కుమారేణ కల్యాణగుణశాలినీ ।
వాగుక్తా పరమోదారా వైరాగ్యరస గర్భిణీ ॥
II 2
కుమారుడగు రాముడు వైరాగ్య పూర్ణములును, ఉదారములును శుభప్రదములును నగు వాక్కుల నుడివినాడు.
పరినిష్ఠితవక్తవ్యసబోధముచితం స్ఫుటమ్ ।
ఉదారం ప్రియమార్యార్హమవిహ్వలమపి స్ఫుటమ్ 30 "I 30
అభివ్యక్తపదం స్పష్టమిష్టం స్పష్టం చ తుష్టిమత్।
కరోతి రాఘవప్రోక్తం వచః కస్య న విస్మయమ్ "I 31
ఈ వాక్యము లన్నియు, విచార యుతములును, జ్ఞానబోధములును, స్పష్టములును, ఉదారములును,
ప్రియకరములును, ఆర్యోచితములును, స్థిరములును, సుబోధకములును, విశుద్ధములును,
స్పష్టోచ్చరితములును, సంతోష దాయకములును నై యున్నవి; వీటిని విని యెవ రచ్చెరు వందకుండ
నుండగలరు.
వైరాగ్యప్రకరణము (సర్గ - 33) 183
శతాదేకతమ స్యైవ సర్వోదారచమత్కృతిః |
ఈప్సితార్థార్పణై కాంతదక్షా భవతి భారతీ ॥ 32
నూటి కొక్కని పలుకులు సర్వోత్కృష్టములును, సుందరములును, సువ్యక్తములును నై యుండును.
కుమార! త్వాం వినా కస్య వివేకఫలశాలినీ ।
పరం వికాసమాయాతి ప్రజ్ఞా శరలతాతతా ॥ 33
కుమారా! ప్రజ్ఞారూపిణియు, వివేక ఫలసమన్వితయు నగు శరవల్లి (బాణపుతీగె) ఇంకెవరి యందిట్లు
వికసింపగలదు?
ప్రజ్ఞాదీపశిఖా యస్య రామస్యేవ హృది స్థితా |
ప్రజ్వలత్యసమాలో కకారిణీ స పుమాన్ స్మృతః || 34
అసమాన కాంతులతో దీపిల్లు ప్రజ్ఞాదీపము, రాముని హృదయమున వెలుగు నట్లేవనియందు
ప్రకాశించు చుండునో అతడే పురుషుడు.
రక్తమాంసాస్థియంత్రాణి బహూన్యతితరాణి చ।
పదార్థానభికర్షంతి నాస్తి తేషు సచేతనః ॥ 35
పెక్కండ్రు, కర్తమాంసాస్థిమయ యంత్రములు; విషయలోలురు. ప్రజ్ఞాదీప్తుడగు పురుషుడు వీరిలో
లేడు. వీరి ఆత్మ జడము; వీరు పురుషార్థము కొఱకు యత్నించుచుండుట లేదు.
జన్మమృత్యుజరాదుఃఖమనుయాంతి పునఃపునః।
విమృశంతి న సంసారం పశవః పరిమోహితాః || 36
ఈ పశువు లందరును మరలమరల జన్మమరణ జరాదుఃఖములందు, మాటిమాటికి కూలుచుందురు.
మోహవశులై సంసారమన నేమియో విమర్శింపరు.
కథంచిత్ క్వచిదేవైకో దృశ్యతే విమలాశయః ॥
పూర్వాపరవిచారార్హో యథాయమరిమర్దనః ॥ 37
ఎక్కడనో, ఎట్లో, పూర్వాపర విచారమును సల్పు నిర్మలాశయు డగు, పురుషుడొక డీ రామునివలె
గన్పట్టుచుండును.
అనుత్తమచమత్కారఫలాః సుభగమూర్తయః ।
భవ్యా హి విరలా లోకే సహకారద్రుమా ఇవ ॥ 38
184 యోగవాసిష్ఠము
సుఫలములును, సుందరములును నగు రసాలతరువు లరుదైనట్లు, తత్త్యసాక్షాత్కారమును బడయు
పురుషు లరుదు.
సమ్యగ్దృష్టజగద్యాత్రా స్వవివేకచమత్కృతిః |
అస్మిన్ మాన్యమతావంతరియమద్యైవ దృశ్యతే "I 39
మాన్యుడును, మనీషియు నగు శ్రీరాము డీచిఱుత వయస్సుననే ఆత్మవివేక మాధుర్యము
ననుభవమునకు దెచ్చుకొనినాడు; జగత్స్వరూపమును గూడ చక్కగ దెలిసికొనినాడు.
సుభగాః సులభారోహాః ఫలపల్లవశాలినః । I
జాయంతే తరవో దేశే న తు చందన పాదపాః ॥ 40
చూడ చక్కనగు నవియు, ఏపుగా నెదిగి ఆకులతోను పూవులతోను, పండ్లతో నిండినవియు నగు
చెట్లు ఎల్లయెడల గాంచి నగును గాని, చందన తరువులు దొఱకవు.
వృక్షాః ప్రతివనం సంతి నిత్యం సఫలపల్లవాః
న త్వపూర్వచమత్కారో లవంగః సులభ స్సదా ॥ 41
ప్రతివనమునను ఫలపల్లవయుతము లగు చెట్లు, ఎల్లప్పుడును దొరకును గాని, లవంగతీగె దొఱుకదు.
జ్యోత్స్నేవ శీతాశశినః సుతరోరివ మంజరీ ।
పుష్పాదామోదలేఖేవ దృష్టా రామాచ్చమత్కృతిః 42
చంద్రుని చల్లని వెన్నెలవలె, ఉత్తమ వృక్షము పూలగుత్తివలె, పుష్పములనుండి నెత్తావివలె, రామునినుండి
మహద్వాణిని వింటిమి.
అస్మిన్నుద్దామదౌరాత్మ్యదైవనిర్మాణనిర్మితే |
ద్విజేంద్రా దగ్ధనంసారే సారోహ్యత్యంత దుర్లభః
|| 43
ద్విజేంద్రులారా! అతిక్రూర మగు దైవసృష్టి యగు, ఈ పాడు సంసారమున సారము లభింపజేసికొనుట,
చాలకష్టము.
యతంతే సారసంప్రాప్తో యే యశోనిధయో ధియః
ధన్యా ధురి సతాం గణ్యాస్త ఏవ పురుషోత్తమాః ॥ 44
ఏ యశోనిధులు సాధమును (ఆత్మను) బొంద యత్నించుచున్నారో, వారు ధన్యులు; వారే గణ్యులగు
పురుషోత్తములు.
వైరాగ్యప్రకరణము (సర్గ - 33) 185
న రామేణ సమో స్త్రీహ దృష్టో లోకేషు కశ్చన I
వివేకవానుదారాత్మా న భావీ చేతి నో మతిః ॥ 45
పరిదృశ్య మానము లగు ఈలోకములలో రాముని బోలు వివేకి, ఉదారాత్మ లేడు, ఉండబోడు. ఇది
మా నిశ్చయము.
సకలలో కచమత్కృతికారిణో వ్యభిమతం యది రాఘవ చేతసః
ఫలతి నో తదిమే వయమేవ హి స్ఫుటతరం మునయో హతబుద్ధయః || 46
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే దేవదూతోక్తే మోక్షోపాయే ద్వాత్రింశత్ సాహస్ర్యాం
సంహితాయాం, వైరాగ్యప్రకరణే నభశ్చర మహీచర సమ్మేలనం నామ
త్రయస్త్రింశః సర్గః ॥ 33 |
వైరాగ్యప్రకరణమ్ సంపూర్ణమ్
లోకముల నన్నిటిని ఆశ్చర్యపడజేయు రాముని అభిమతము సిద్ధింపనిచో, మునినామధారుల మగు,
మాబుద్ధి వ్యర్థము! (అనగా, రామునికి అతడు కోరు తత్త్వమును దప్పక ఉపదేశింపవలయునని భావార్థము)
ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీరామకృష్ణదేవ ప్రశిష్య శ్రీ శివానంద పురీ పూజ్యపాదశిష్య,
శ్రీపూర్ణానందకృత శ్రీ(యోగ) వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశిక యను ఆంధ్రానువాదమున వైరాగ్యప్రకరణమున నభశ్చర మహీచర
సమ్మేళనమను త్రయస్త్రింశ సర్గము || 33 |
వైరాగ్యప్రకరణము సంపూర్ణము
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే ॥