వాసిష్ఠ మహా రామాయణమ్
ముముక్షు వ్యవహార ప్రకరణమ్
శుకుని విశ్రాంతి -1
శ్రీవాల్మీకి రువాచ :
ఇతి నాదేన మహతా వచస్యుక్తే సభాగతైః |
రామమగ్రగతం ప్రీత్యా విశ్వామిత్రో 2 భ్యభాషత 1
వాల్మీకి: సభ కరుదెంచిన జనులందరు అట్లు (పూర్వప్రకరణమున వర్ణింపబడి నట్లు) ఉచ్ఛస్వరమున
బల్కగ, విశ్వామిత్రు డెట్టెదుట నున్న రామునితో నిట్లనియె.
న రాఘవ తవాస్త్యన్యజ్ జ్ఞేయం జ్ఞానవతాంవర
స్వయైవ సూక్ష్మయా బుద్ధ్యా సర్వం విజ్ఞత వానసి 11 2
రాఘవా! జ్ఞానివరా! నీ వెఱుగదగిన దింకేమియు లేదు; సూక్ష్మ బుద్ధియొక్క బలమువలననే ఎఱుంగ
వలసిన దాని నంతటిని, కొదువ లేకుండ ఎఱిగితివి.
కేవలం మార్జనామాత్రం మనాగేవోపయుజ్యతే |
స్వభావవిమలే నిత్యం స్వబుద్ధిముకురే తప ॥ 3
కాని, సహజ నిర్మల మగు నీబుద్ధిరూప దర్పణమున కొకింత మెఱుగు కావలసి యున్నది.
భగవ ద్యాస పుత్రస్య శుకస్యేవ మతిస్తవ
విశ్రాంతిమాత్రమేవాంతర్ జ్ఞాతజ్ఞేయా వ్యపేక్షతే "I 4
వ్యాసపుత్రుడగు శుకునిబుద్ధివలె నీ బుద్ధిగూడ జ్ఞాతవ్య విషయమును గ్రహించియు, అంతశ్శాంతిని
మాత్రమే గోరుచున్నది.
శ్రీరామ ఉవాచ:
భగవద్వ్యాసపుత్రస్య శుకస్య భగవన్ కథమ్
జ్ఞేయే ప్యాదౌ న విశ్రాంతం విశ్రాంతం చ ధియా పునః ॥ 5

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -1) 187
శ్రీరాముడు: వేదవ్యాస పుత్రుడగు శుకుడు, విచారబుద్ధివలన జ్ఞానమును బడసియు, మొమ్మొదట శాంతి
నందక, పిదప ఎట్లు శాంతిని బడయగలిగెను?
శ్రీ విశ్వామిత్ర ఉవాచ:
ఆత్మోదంతసమం రామ! కథ్యమాన మిదం మయా |
శృణు వ్యాసాత్మజోదంతం జన్మనామంత కారణమ్ ॥ 6
విశ్వామిత్రుడు: రామా! శుకదేవుని వృత్తాంతమును చెప్పుచున్నాను, వినుము. స్వవృత్తాంతమువలె నిదియు
మోక్షదాయకము.
యో య మంజనశైలాభో నివిష్టో హేమవిష్టరే
పార్శ్వే తవ పితుర్వ్యాసో భగవాన్ భాస్కరద్యుతిః "I 7
అస్యాభూదిందువదన స్తనయో నయకోవిదః
శుకో నామ మహాప్రాజ్ఞో యజ్ఞో మూర్త్యేవ సుస్థితః "I 8
నీ తండ్రిప్రక్కన బంగారు గద్దెయందున్న యతడే వ్యాసుడు; ఈత డంజనా చలమువంటి కాంతి
గలిగియున్నాడు. సూర్యసమతేజస్వి. చంద్రవదనుడును, శాస్త్రజ్ఞుడును, ప్రాజ్ఞుడును నగు శుకు డీతని పుత్రుడు;
ఆతడు రూపుదాల్చిన యజ్ఞము.
ప్రవిచారయతో లోకయాత్రామలమిమాం హృది
తవేవ కిల తస్యాపి వివేక ఉదభూదయమ్ ॥
9
సంసారగతిని, దాని మాలిన్యమును చింతించుటవలన ఆయనకు నీవలెనే మనస్సున వివేక
ముదయించెను.
తేనాసౌ స్వవివేకేన స్వయమేవ మహామనాః 1
ప్రవిచార్య చిరం చారు యత్ సత్యం తదవాప్తవాన్ ॥
10
బుద్ధిమంతు డగు శుకదేవుడు. నిజబుద్ధిబలమున చాలకాలము విచారించి ప్రకృతమును,
సుందరమును, సత్యమును నగుదానిని బొందెను.
స్వయం ప్రాప్తే వేరే వస్తున్యవిశ్రాంతమనాః స్థితః
ఇదం వస్త్యితి విశ్వాసం నాసావాత్మన్యు పాయయౌ "I 11
తనంతట తానే సత్యవస్తువు బడసినను, ఆయన మనస్సు శాంతి నందలేదు; 'ఇదియే సత్యవస్తువు'
అను విశ్వాసమును ఆతని హృదయము కలిగించుకొనలేక పోయెను.

188 యోగవాసిష్ఠము
కేవలం విరరామాస్య చేతో విగతచాపలమ్
భోగేభ్యో భూరిభంగేభ్యో ధారాభ్య ఇవ చాతకః ॥ 12
చాతకము తరంగలోల మగు నదీజలమునుండి నివృత్త మగునట్లు, శుకుని సుస్థిర చిత్తము గూడ
క్షణభంగురము లగు విషయములనుండి విరతి నందెను.
ఏకదా సో మలప్రజ్ఞో మేరావేకాంత సుస్థితమ్ |
పప్రచ్ఛపితరం భక్త్యా కృష్ణద్వైపాయనం మునిమ్ ॥ 13
సంసారాడంబరమిదం కథమభ్యుర్థితం మునే!
కథం చ ప్రశమం యాతి కియత్ కస్య కదేతి వా ॥ 14
ఒకప్పుడు, విమలమతి యగు శుకదేవుడు, మేరుపర్వతమున ఏకాకియై యున్న తండ్రి యగు
కృష్ణద్వైపాయనుని భక్తితో నిట్లు ప్రశ్నించెను:- "ఈ సంసారాడంబర మెట్లు ఉదయించినది? ఇదెంతకాలము,
ఎచ్చట, ఎట్లుండును? దీని అవసాన మేమి? అది దేహేంద్రియాది సంఘాతమునకు సంబంధించినదా?
లేక, తద్వ్యతిరిక్తమా?
ఇతి పృష్టేన మునివా వ్యాసేనాఖిలమాత్మజే |
యథావదమలం ప్రోక్తం వక్తవ్యం విదితాత్మనా 15
పుత్రునిచే నిట్లు ప్రశ్నింపబడి, ఆత్మజ్ఞు డగు వేదవ్యాసముని నిర్మల భావమున, యథోచితముగ
ప్రత్యుత్తర మిచ్చెను.
జ్ఞానిషం పూర్వమేతదహమిత్యథ తత్పితుః |
స శుకః శుభయా బుద్ధ్యా న వాక్యం బహ్వమన్యత 16
ఇదివఱకే ఈ విషయముల నన్నింటినీ నేనెఱింగితిని" అని తలచి, శుకుడావాక్యముల అపూర్వతను
ఆదరింపజాలకపోయెను.
వ్యాస్కోపి భగవాన్! బుద్ధ్వా పుత్రాభిప్రాయమిదృశమ్
ప్రత్యువాచ పునః పుత్రం నాహం జానామి తత్త్వతః 17
జనకో నామ భూపాలో విద్యతే వసుధాతలే ।
యథావద్వేత్త్యసౌ వేద్యం తస్మాత్ సర్వమవాప్స్యసి 18 ||
వేదవ్యాసుడు పుత్రుని మనోభావమును గ్రహించి, మరల ఇట్లు పల్కెను. "నేనింతకంటె ఎక్కుడు

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -1) 189
ఎఱుగను. జనకు డనురాజు భూమండలమున నున్నాడు. ఆయనకడ ఎఱుంగదగిన దానినంతటిని
ఎఱుంగగలవు.
పిత్రేత్యుక్తే శుకః ప్రాయాత్ సుమేరోర్వసుధాతలే |
విదేహనగరీం ప్రాప జనకేనాభిపాలితామ్ ॥ 19
తండ్రి ఇట్లు పల్క, శుకదేవుడు సుమేరు శైలమును వీడి, భూమండలమున కరుదెంచి, జనకునిచే
బాలింపబడు విదేహ నగరమును బ్రవేశించెను.
ఆవేదితో 2సౌయాష్టీకైర్జనకాయ మహాత్మనే |
ద్వారి వ్యాససుతో రాజన్! శుకో త్ర స్థితవానితి । "I 20
జిజ్ఞాసార్థం శుకస్యాసావాస్తామేవేత్యవజ్ఞయా |
ఉక్త్యా బభూవ జనకస్తూప్లీం సప్తదినాన్యథ ॥ 21|| 21
"వ్యాసపుత్రు డగు శుకదేవుడు ద్వారదేశమున నిలబడియున్నాడు" అని ద్వారపాలకులు జనకునకు
నివేదింప, "అగుగాక" అని జనకుడు పల్కి, తూష్లేంభావమును వహించెను; శుకుని బరీక్షింప ఏడురోజులు
అట్లే యూరకుండెను.
తతః ప్రవేశయామాన జనకః శుకమంగణమ్ |
తత్రాహాని స సప్లైన తథైవావసదున్మనాః 22
పిదప అంగణమున జనకు డనుమతి నొసంగెను; తత్త్వజిజ్ఞాసు వగు శుకదేవుడు అట మరల
నేడుదినము లుండెను.
అథ ప్రవేశయామాన జనకోజెంతఃపురం శుకమ్ |
రాజా న దృశ్యతే తావదితి సప్తదినాని చ ॥ 23 23
తత్రోన్మదాభిః కాంతాభిర్భోజనైర్భోగనంచయై:
జనకో లాలయామాస శుకం శశిసమాననమ్ ॥ 24
అనంతరము, జనకుడు శుకుని అంతఃపురమునకు రానిచ్చి, మరల నింకొక వారమువఱకు
రాజదర్శనము లభింపదని తెలియపరచెను; తెలియబరచి మదమత్తలగు యువతులను, భోజనవస్తువులను,
విలాస ద్రవ్యములను బంపి చంద్రవదను డగు శుకునకు బరిచర్యలు జరిపించెను.
తే భోగాస్తాని దుఃఖాని వ్యాసపుత్రస్య తన్మనః
నాజహ్రుర్మందవవనాబద్ధ పీఠమివాచలమ్ ॥
"I 25

190 యోగవాసిష్ఠము
దుఃఖస్వరూపము లగు ఆభోగ వస్తువులు మందమారుతము లావుమ్రాకును గదల్ప లేనట్లు, శుకుని
సుస్థిర హృదయమును చంచల మొనర్ప జాలకపోయెను.
కేవలం సుసమః స్వస్థో మౌనీ ముదితమానసః ।
అతిష్ఠత్ స శుకస్తత్ర సంపూర్ణ ఇవ చంద్రమాః ॥ 26
శుకుడు, పూర్ణచంద్రునివలె సుసముడును, స్వస్థుడును, ముదిత చిత్తుడును నై, మౌనము నవలంబించి
యూరకుండెను.
పరిజ్ఞాతస్వభావం తం శుకం స జనకో నృపః | |
ఆనీతం ముదితాత్మానమవలోక్య సనామ హ ॥ 22 27
ఇట్లు, జనకనృపతి శుకదేవుని స్వభావమును గ్రహించి రప్పించి, వందన మొనర్చెను.
నిఃశేషితజగత్కార్యప్రాప్తా ఖిల మనోరథ!
కిమిప్సితం తవేత్యాశు కృతస్వాగతమాహ తమ్ ॥ 28
పిదప, రాజు స్వాగతప్రశ్న నొనర్చి, ఇట్లు పల్కెను; జగత్తున నున్న కర్తవ్యము నంతటిని ఒనర్చితివి,
నీవాంఛితము లన్నియు సిద్ధించినవి. కృతకృత్యుడా! నీ అభీప్సిత మేమి?
శ్రీ శుక ఉవాచ:
సంసారాడంబరమిదం కథమభ్యుర్థితం గురో!
కథం ప్రశమమాయాతి యథావత్ కథయాశు మే ॥
I 29
శుకుడు: గురూ! ఈ సంసారాడంబర మెట్లు ఉదయించినది? ఎట్లు ఉపశమించును? శీఘ్రమున వచింపుడు.
శ్రీవిశ్వామిత్ర ఉవాచ:
జనకేనేతి పృష్టేన శుకస్య కథితం తదా !
తదేవ యత్ పురా ప్రోక్తం తస్య పిత్రా మహాత్మనా ॥ 30
30 విశ్వామిత్రుడు: శుకునిచే నిట్లు ప్రశ్నింపబడి, జనకుడు, మున్ను వ్యాసుడు ప్రత్యుత్తర మిచ్చినట్లే ప్రత్యుత్తర
మిచ్చెను.
శ్రీశుక ఉవాచ:
స్వయమేవ మయా పూర్వమేతత్ జ్ఞాతం వివేకతః
ఏతదేవ చ పృష్టేన పిత్రా మే సముదాహృతమ్ । 31

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -1) 191
భవతాప్యేష ఏవార్థ: కథితో వాగ్విదాంవర!
ఏష ఏవ చ వాక్యార్థశ్శాస్త్రేమ పరిదృశ్యతే ॥ || 32
శుకుడు: వాగ్మివరా! నినేక బలమున ఈ విషయమును నేనిదివఱకే గ్రహించితిని; ప్రశ్నింప నా జనకుడును
ఇట్లే వచించెను. శాస్త్రములయందుగూడ ఈ యర్థ మిట్లే వివరింపబడుచున్నది.
యథా యం స్వవికల్పో ర్థస్స్వవికల్పపరిక్షయాత్ |
క్షీయతే దగ్ధసంసారో నిఃసార ఇతి నిశ్చయః ॥ || 33
నిస్సారమగు ఈ పాడుసంసారము అజ్ఞానమునుండి వెలువడుచున్నది; అజ్ఞానము నాశనమైన
ఇదియు నశించును. ఇది ముమ్మాటికి నిక్కము:
తత్ కిమేతన్మహాబాహో! సత్యం బ్రూహి మమాచలమ్ ।
త్వత్తో విశ్రాంతిమాప్నోమి చేతసా భ్రమతా జగత్ ॥ 34
మహాబాహూ! అయితే, ఇయ్యది యథార్థమేనా? నాయీ సంశయమును దూర మగునట్లు, తత్త్వము
నుపదేశింపుడు. తత్త్యసంశయమున భ్రమించుచున్న మనస్సును శాంతించు నట్లానర్పుము.
శ్రీజనక ఉవాచ:
నాతః పరతరః కశ్చిన్నిశ్చయో సూపరో మునే!
స్వయమేవ త్వయా జ్ఞాతం గురుతశ్చ పునః శ్రుతమ్ ॥ || 35
జనకుడు: మునీ! నీవు స్వయముగ గ్రహించిన దానికంటెను, నీ తండ్రికడ వినిన దానికంటెను, వేఱుగ
తెలిసికొనదగిన దింకొకటి లేదు.
అవిచ్ఛిన్నచిదాత్మైకః పుమానస్తీహ నేతరత్ |
స్వసంకల్పవశాద్బద్ధో నిఃసంకల్పశ్చ ముచ్యతే ॥ 36
అఖండ చైతన్య స్వరూపుడును, అద్వితీయుడును నగు పురుషుని కొక్కనికే, ఈ జగత్తున అస్తిత్వ
మున్నది. తక్కిన వన్నియు అస్తిత్వ హీనములు. అజ్ఞాన యుతము లగు సంస్కారములవలన నాతడు
బద్దు డగును. అవి నశించినచో, ముక్తుడై స్వస్వరూపమును పొందును.
తేన త్వయా స్ఫుటం జ్ఞాతం జ్ఞేయం యస్య మహాత్మనః
భోగేభ్యో విరతర్జాతా దృశ్యాత్ ప్రాక్సకలాదిహ ॥ 37
మహాత్మా! భోగముల ననుభవింపకుండగనే సమస్త దృశ్యప్రపంచమునెడ నీకు విరక్తి కలిగినది.
అందువలన నీవెఱుంగవలసిన దానిని చక్కగ గ్రహించితివి.

192 యోగవాసిష్ఠము
తవ బాల! మహావీర! మతిర్విరతిమాగతా
భోగేభ్యో దీర్ఘరోగేభ్యః కిమన్యత్రోతుమిచ్చన్|"I 38
చిఱుతతనముననే నీవు విషయముల నెడ విరక్తిని బ్రకటించి మహావీరుడ వైతివి. రోగము లగు
భోగములనుండి నీమతి విరతి నందినది. ఇంక దేనిని వినదలతువు?
న తథా పూర్ణతా జాతా సర్వజ్ఞానమహానిధేః!|
తిష్ఠతస్తపసి స్పారే పితుస్తవ యథా తవ ॥ 39
నీవందిన పూర్ణతను సర్వజ్ఞాన నిధియు, తపస్వియు నగు వేదవ్యాసుడు గూడ పొందలేదు.
వ్యాసాదధిక ఏవాహం వ్యాసశిష్యో తత్సుతః |
భోగేచ్ఛా తానవేనేహ మత్తో2ప్యత్యధికో భవాన్ ॥ 40
నేను వ్యాసునికంటె శ్రేష్ఠుడను, నీవు వ్యాసపుత్రుడవు, శిష్యుడవు గూడు. భోగేచ్ఛను ద్యజించి నీవు
నాకంటె అధికుడ వైతివి.
ప్రాప్తం ప్రాప్తవ్యమఖిలం భవతా పూర్ణచేతసా |
న దృశ్యే పతసి బ్రహ్మన్! ముక్తస్త్యం భ్రాంతిముత్సృజ ॥ 41
పొందదగిన దాని నంతటిని బొందితివి. నీ మనోరథము సిద్ధించినది. బ్రహ్మజ్ఞా! నీ వింక ఈ
దృశ్యప్రపంచమున దగుల్వడవు. భ్రాంతిని పరిత్యజింపుము. నీవు ముక్తుడవైతివి.
అనుశిష్టః స ఇత్యేవం జనకేన మహాత్మనా ।
అతిష్ఠత్నశుకస్తూన్లీం స్వచ్చే పరమవస్తుని ॥ 42
మహాత్ము డగు జనకునివలన నిట్లుపదేశింపబడి, శుకుడు తూష్లేంభావమును వహించి, మలినరహిత
మగు పరమవస్తువు నధిష్ఠించెను.
వీతశోకభయాయాసో నిరీహశ్చిన్న సంశయః I
జగామ శిఖరం మేరోః సమాధ్యర్థమనిందితమ్ ॥ 43
పిదప శుకదేవుడు, ఆయాస, శోక, భయములను వీడి సంశయ రహితుడును, నిష్కాముడునునై,
సమాధికొఱకు సాత్వికవృత్తికి తావల మగు ప్రశాంత మేరు శిఖరమున కఱిగెను.
తత్ర వర్షసహస్రాణి నిర్వికల్పసమాధినా
దశస్థిత్వా శశామాసావాత్మన్యస్నేహదీపవత్ ॥ ॥ 44

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -2) 193
శుకుడట నిర్వికల్ప సమాధియందు పదివేల ఏండ్లుండి, తైలహీన మగు దీపమువలె, ఆత్మస్వరూపమున
నిర్వాణము నందెను.
వ్యపగతకలనా కళంకశుద్ధః స్వయమమలాత్మని పావనే పదే సౌ||
సలిలకణ ఇవాంబుధౌ మహాత్మా విగలితవాసనమేకతాం జగామ ॥ 45
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే దేవదూతోక్తే మోక్షోపాయే ముముక్షు వ్యవహార ప్రకరణే
శుకనిర్వాణం నామ ప్రథమః సర్గః ॥ 1॥
నీలమేఘ సంబంధమును వీడి, జలబిందువు సాగరమున గలియునట్లు, దృశ్యసంబంధమున్ను,
అజ్ఞానమున్ను క్షీణింపగ: నిర్మలుడై, సంస్కార క్షీణానంతరము శుకదేవుడు, సునిర్మల స్వరూపుడును,
పరమ పావనుడును నగు పరమాత్మయందు లీను డయ్యెను.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయను ఆంధ్రానువాదమున, ముముక్షు వ్యవహార ప్రకరణమున శుకనిర్వాణమను ప్రథమ
సర్గము "1"
విశ్వామిత్రవాక్య వర్ణనము -2
శ్రీవిశ్వామిత్ర ఉవాచ :
తస్య వ్యాసతనూజన్య మలమాత్రోపమార్జనమ్ |
యథోపయుక్తం తే రామ! తావదేవోవయుజ్యతే 11 1
విశ్వామిత్రుడు: రామా! వ్యాసపుత్రుడగు శుకదేవున కెట్లొకింత మార్జన మవసర మయ్యెనో, నీకు గూడ
అట్లే ఒకింత అవసరము.
జ్ఞేయమేతేన విజ్ఞాతమశేషేణ మునీశ్వరాః 1
స్వదంతే స్మైన యద్భోగా రోగా ఇవ సుమేధనే ॥ 2
మునిశ్రేష్ఠులారా! శ్రీరాముడు తెలిసికొనదగిన దాని నంతటిని దెలిసికొనినాడు. ఏలయన, భోగము
లన్నియు రోగములవలె ఈ బుద్ధిమంతున కగపడుచున్నవి.
జ్ఞాతజ్ఞేయస్య మనసో నూనమేతద్ధి లక్షణమ్ ।
న స్వదంతే సమగ్రాణి భోగవృందాని యత్ పునః 3
భోగభావనయా యాతి బంధోదార్ఢ్య మవస్తుజః |
తయోప శాంతయా యాతి బంధో జగతి తానవమ్ ॥ 4
VI F13

194 యోగవాసిష్ఠము
భోగజాలములయెడ అరుచియే తత్త్వజ్ఞుని లక్షణము. సంసార బంధనము వాస్తవము కాకపోయినను,
భోగచింతవలన నిది దృఢ మగుచుండును; భోగచింత క్షయము నందిన నిదియు నశించును.
వాసనాతానవం రామ! మోక్ష ఇత్యుచ్యతేబుధైః |
పదార్థ వాసనాదార్యం బంధ ఇత్యభిధీయతే ॥ 11 5
రామా! పండితులచే, వాసనా క్షయమే ముక్తి యనియు, వాసనా వృద్ధియే బంధ మనియు
చెప్పబడుచున్నది.
స్వాత్మతత్త్వాభిగమనం భవతి ప్రాయశో నృణామ్
మునే! విషయవైరస్యం కదరాదుపజాయతే ॥ 6
ఆత్మతత్త్వ విషయిక మగు ఆపాతజ్ఞానము అల్పశ్రమమువలననే, అనగా శ్రవణాదులవలన, నరులకు
సామాన్యముగ కల్గును. కాని విషయ వితృష్ణ కష్టించిన గాని కలుగదు.
సమ్యక్ పశ్యతి యస్తద్లోజ్ఞాతజ్ఞేయః స పండితః
న స్వదంతే బలాదేవ తస్మై భోగా మహాత్మనే II 7
కామక్రోధాదులవలన నెవ్వని జ్ఞానశక్తి ప్రతిహతము కాకుండ నుండునో, అతడే తత్త్వజ్ఞు డగు
పండితుడు; తెలిసికొన దగినదాని నతడు తెలిసికొనినాడు. భోగములయెడ వీని కమితమగు అరుచి.
యశఃప్రభృతి యస్మై హేతునైవ వినా పునః
భువి భోగా న రోచంతే స జీవన్ముక్త ఉచ్యతే ॥ 8
యశస్సు, దంభములకొఱకు గాక, వాస్తవముగనే భోగములనుండి విరతి నందిన వారే జీవన్ముక్త
పురుషులని చెప్పబడుదురు.
జ్ఞేయం యావన్న విజ్ఞాతం తావత్తావన్న జాయతే|
విషయేష్వరతిర్జంతోర్మరుభూమౌ లతా యథా ॥ 9
జ్ఞేయమును గ్రహింపనంతవఱకు మరుభూమియందు లతోత్పత్తివలె, విషయవితృష్ణ కలుగుట అసంభవము.
అత ఏవ హి విజ్ఞాతజ్ఞేయం విద్ధి రఘూద్వహమ్ ।
యదేనం రంజయంత్యేతా రమ్యా భోగభూమయః న ॥ 10
రమణీయము లగు భోగభూములు శ్రీరాము నాకర్షింపజాలకున్నవి. కనుక, ఇతనిని తత్త్వజ్ఞానిగ
గ్రహించునది.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -2) 195
రామో యదంతర్జానాతి తద్వస్త్విత్యేవ సన్మఖాత్ |
ఆకర్ణ్య చిత్తవిశ్రాంతిమాప్నోత్యేవ మునీశ్వరాః || 11
మునులారా! రాము డంతరమున నెఱిగినది సత్యమే. (జ్ఞానియగు వసిష్ఠుని కడ) ఈవిషయము
నెఱింగిన నీతడు శాంతిని బడయగలడు.
కేవలం కేవలీభావవిశ్రాంతిం సమపేక్షతే |
రామబుద్ధి: శరల్లక్ష్మీః ఖలు విశ్రమణం యథా ॥ 12
శరలక్ష్మి మేఘశూన్య మగు నీల నిర్మలాంబరమును గోరునట్లు, శ్రీరాముని బుద్ధి కైవల్యశాంతిని
గోరుచున్నది.
అత్రాస్య చిత్తవిశ్రాంత్యై రాఘవస్య మహాత్మనః I
యుక్తిం కథయతు శ్రీమాన్ వసిష్తో భగవనాయమ్ ॥ 13
ఇప్పుడు మహాత్ము డగు రాఘవుని చిత్తశాంతి నిమిత్తము, శ్రీమంతుడగు వసిష్ఠ భగవానుడు యుక్తి
నుపదేశించు గాత!
రఘూణామేష సర్వేషాం ప్రభుః కులగురు: సదా ।
సర్వజ్ఞః సర్వసాక్షీ చ త్రికాలామల దర్శనః "I 14
పూర్వమునుండి, ఈయనయే రఘుకుల ప్రభువు; కులగురువు. మఱియు, సర్వజ్ఞుడు, సర్వసాక్షి,
త్రికాలవేత్త.
వసిష్ఠ భగవన్ ! పూర్వం కశ్చిత్ స్మరని యస్యయమ్
ఆవయోర్వైరశాంత్యర్థం శ్రేయసే చ మహాధియామ్ ॥
11 15
నిషధాద్రేర్మునీనాం చ సానౌ సరలసంకులే |
ఉపదిష్టం భగవతా జ్ఞానం పద్మభువా బహు ॥ 16
యేన యుక్తిమతా బ్రహ్మన్ ! జ్ఞానేనేయం హి వాసనా |
సంసారీ నూనమాయాతి శమం శ్యామేవ భాస్వతా ॥ 17
తదేవ యుక్తిమద్ జ్ఞేయం రామాయాం తే నివాసినే |
బ్రహ్మన్నుపదిశాశు త్వం యేన విశ్రాంతి మేష్యతి 18

196 యోగవాసిష్ఠము
వసిష్ఠమహర్షీ! భగవంతు డగు బ్రహ్మదేవుడు పూర్వము తన వైరమును శాంతింపజేయుటకును,
మహామతులగు ఋషుల మంగళము కొఱకును, సరళవృక్ష పరివృత మగు నిషధాద్రియందు ఉపదేశించిన
జ్ఞానము గుర్తునకు వచ్చుచున్నదా? ఆ యుక్తిపూర్ణ జ్ఞానోపదేశమువలన సంసార వాసనలు సూర్యోదయమున
జీకట్లు నశించునట్లు నశించును. బ్రహ్మజ్ఞా! జ్ఞేయమగు ఆ తత్త్యమును, యుక్తులతో శిష్యుడగు శ్రీరామున
కుపదేశింపుము. అతడిద్దానిని విని శాంతి నందగలడు.
కదర్దనా చ నైవైషా రామో హి గతకల్మషః 1
నిర్మలే ముకురే వక్త్రమయత్నేనైవ బింబతి ॥ 19
ఇట్టి యుపదేశము సార్థకము. ఏలయన, శ్రీరాముడు విశుద్ధ మగు ఆధారము-ఉపదేశ పాత్రుడు,
మకిలి లేని అద్దమున మోము సులువుగ కనబడును గదా!
తద్జ్ఞానం న చ శాస్త్రార్థస్తద్వైదగ్ధ్యమనిందితమ్
సచ్ఛిష్యాయ విరక్తాయ సాధో యదుపదిశ్యతే 20 20
వైరాగ్యవంతు డగు సచ్ఛిష్యున కుపదేశింపబడు శాస్త్రజ్ఞానమే సార్థకము. ఇట్టి ఉపదేశ మనిందితమై
నెగడును.
అశిష్యాయావిరక్తాయ యత్కించిదుపదిశ్యతే |
తత్ ప్రయాత్యపవిత్రత్వం గోక్షీరం శ్వదృతావివ ॥ 21
అశిష్యుడును, అవిరక్తుడును నగు అపాత్రున కుపదేశించిన శాస్త్రజ్ఞానము, కుక్కతోలుసంచి
యందుంచిన ఆవుపాలవలె, అపవిత్ర మగును.
వీతరాగభయక్రోధా నిర్మానా గలితైనసః
వదంతి తాదృశా యత్ర తత్ర విశ్రామ్యతీహ ధీఃII 22
వైరాగ్య సంపన్నులును, భయక్రోధ విహీనులును, నిర్మల స్వభావులును నగు సాధుజనులు మీ
బోంట్లు - ఏ విషయమును గుఱించి ఉపదేశింతురో, ఆ విషయమునం దుపదేశ సమయముననే బుద్ధి
విశ్రమించును.
ఇత్యుక్తే గాధి పుత్రేణ వ్యాసనారద పూర్వకాః|
మునయస్తే తమేవార్థం సాధుసాధ్విత్యపూజయన్
"I 23
విశ్వామిత్రు డిట్లు పల్కగ వ్యాస నారదాది ఋషిపుంగవులు దాని నామోదించి సాధువాదము
నొనర్చుచు ప్రశంసించిరి.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -2) 197
అథోవాచ మహాతేజా రాజ్ఞః పార్శ్వే వ్యవస్థితః 1
బ్రహ్మేవ బ్రహ్మణః పుత్రో వసిష్ఠా భగవాన్ముని: 24 11
అనంతరము, రాజపార్శ్వమున నుపవిష్టుడైన బ్రహ్మనంద నుండును, బ్రహ్మసమానుడును,
మహాతేజస్వియు నగు వసిష్ఠ భగవాను డిట్లు పల్కెను.
శ్రీవసిష్ఠ ఉవాచ:
మునే! యదాదిశసి మే తదవిఘ్నం కరోమ్యహమ్
కః సమర్థః సమర్థో పి సతాం లంఘయితుం వచః ॥ 25
శ్రీవసిష్ఠుడు: మునీ! తమ ఆజ్ఞను నిర్విఘ్నముగ నిర్వర్తింప సంసిద్ధుడను. సజ్జనుల వాక్యమును ఉల్లంఘింపక
శక్తి గలిగియున్నను, ఎవరుల్లంఘింప నేర్తురు? (నేను అతిసామాన్యుడను-అవశ్యము తమ ఆదేశమును
పాలింతును.)
అహం హి రాజపుత్రాణాం రామాదీనాం మనస్తమః
జ్ఞానే నాపనయామ్యాశు దీపేనేవ నిశాతమః
26
దీపమువలన చీకటిని నశింపజేయునట్లు, రాజుపుత్రులగు రామాదుల మనస్తమమును జ్ఞానోపదేశమున
వెంటనే నశింపజేయుచున్నాను.
స్మరామ్యఖండితం సర్వం సంసార భ్రమశాంతయే |
నిషధాదౌ పురా ప్రోక్తం యదనం పద్మజన్మనా || 27
పూర్వము, నిషధాద్రియందు బ్రహ్మ ఉపదేశించిన అఖండ - ఆత్మజ్ఞానము నంతటిని, సంసార
భ్రమశాంతి నిమిత్తము స్మరించుచున్నాను.
శ్రీవాల్మీకి రువాచ:
ఇతి నిగదితవానసౌ మహాత్మా పరికరబంధగృహీతవక్తృతేజః
అకథయదిదమఙ్ఞతో ప శాంత్యై పరమపదైకవిబోధనం వసిష్ఠః ॥ 28
ఇతి శ్రీవాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే ముముక్షు వ్యవహార ప్రకరణే విశ్వామిత్రవాక్యం
నామ ద్వితీయః సర్గః 2 ॥
వాల్మీకి: మహాత్ముడగు ఆ వసిష్ఠు డిట్లు ప్రతిజ్ఞ నొనర్చి దృష్టాంత, ఉపాఖ్యాన ప్రమాణాది పరికరముల
గూర్చుకొని, వక్తకు దగిన శోభతో బ్రకాశించుచు, ఈ పరతత్వ బోధక శాస్త్రమును అజ్ఞాన శాంతి కొఱకు

198 యోగవాసిష్ఠము
వచించెను.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు ముముక్షు వ్యవహార ప్రకరణమున విశ్వామిత్ర వాక్యమను ద్వితీయ సర్గము 2
సర్గానువర్ణనము-3
శ్రీ వసిష్ఠ ఉవాచ:
పూర్వముక్తం భగవతా యదజ్ఞానం పద్మజన్మనా
సర్గాదౌ లోకశాంత్యర్థం తదిదం కథయామ్యహమ్ ॥ 1
శ్రీవసిష్ఠుడు: పూర్వము సృష్టిప్రారంభమున, బ్రహ్మదేవుడు జగత్-శాంతికొఱకు వచించిన శాస్త్రమును,
ఇప్పుడు మరల నుడువుచున్నాను.
శ్రీరామ ఉవాచ:
కథయిష్యసి విస్తీర్ణం భగవన్! మోక్షసంహితామ్ ।
ఇమం తావత్ క్షణం జాతం సంశయం మే నివారయ ॥ 2
శ్రీరాముడు: భగవంతుడా! విపుల మగు మోక్షశాస్త్రమును పిదప వచించుదురు గాత!; మొమ్మొదట నాకు
గలిగిన ఈ సందియమును దీర్చుడు.
పితా శుకస్య సర్వజ్ఞో గురుర్వ్యాసో మహామతిః |
విదేహముక్తో న కథం కథం ముక్తః సుతో స్య సః ॥ 3
శుకదేవుని తండ్రియు, గురుడును, మహామతియును, సర్వజ్ఞుడును నగు వ్యాసమహర్షి ఏల
విదేహముక్తిని బొందలేదు? శుకుడేల నిర్వాణముక్తి నందినాడు. (తత్త్వజ్ఞాన ఫలము విదేహముక్తి యని
ప్రాఙ్నగమనము; వ్యాసుని ముక్తి అనుదాహృత మగుటవలన తత్త్వజ్ఞానముయొక్క అవ్యభిచారి ఫలము
శంకిత మైనది. వసిష్ఠుడు పైప్రశ్నకు పరోక్ష భావమున బ్రత్యుత్తర మిచ్చుచున్నాడు:-)
శ్రీవసిష్ఠ ఉవాచ:
పరమార్కప్రకాశాంత స్త్రిజగత్ప్రసరేణవః|
ఉత్పత్త్యోత్పత్త్య లీనా యే న సంఖ్యామువయాంతి తే 4
వర్తమానాశ్చ యాః సంతి త్రైలోక్య గణకోటయః I
శక్యంతే తాశ్చ సంఖ్యాతుం నైవ కాశ్చన కేనచిత్ 5

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -3) 199
భవిష్యంతి పరాంభోధౌ జగత్సర్గతరంగకాః 1
తాంశ్చ వై పరిసంఖ్యాతుం సా కథైవ న విద్యతే ॥ 6
వసిష్ఠుడు: సూర్యునివలె బ్రకాశించు పరమాత్ముని చైతన్య శక్తియందు లేచి లీన మగు బ్రహ్మాండ -
త్రసరేణువులు అసంఖ్యాకములు. ప్రస్తుతమున్న త్రిభువన - బ్రహ్మాండముల సంఖ్యను గూడ ఎవరును
నిర్ణయింపజాలరు; అగుచో బ్రహ్మమును సముద్రమున లేవబోవు, త్రిభువన - సృష్టులను తరంగముల
లెక్కయిడుటెక్కడ? (ఇట్టి జగద్రేణువులయందు జీవన్ముక్త పురుషులు నమ్మక ముంచరు; అందువలన,
వీరును విదేహ ముక్తతుల్యులే యని ఆశయము.)
శ్రీరామ ఉవాచ :
యా భూతా యా భవిష్యంతో జగత్సర్గ పరంపరాః
తాసాం విచారణా యుక్తా వర్తమానాస్తు కా ఇవ ॥ 7
శ్రీరాముడు: (వసిష్ఠుని అభిప్రాయమును గ్రహించి నుడువుచున్నాడు) గడిచినవియు, రాబోవునవియు
నగు సృష్టి ప్రవాహములు విచార విషయములే కాని, వర్తమానసృష్టి (న్యూన మగుటవలన) వీనిలో దేనితోడను
సమానము కావు. (దీనివలన బ్రహ్మతత్వమును నెఱుంగజాలము. కాని, వికృపవలన, ఆ అఖండ
బ్రహ్మతత్త్వమును గ్రహింపగలిగితిని. రాబోవు, అసంఖ్య స్పష్టుల కుపాదాన మగు చిద్రూపము మీవలన
బ్రదర్శింపబడినది; నేను గ్రహించితిని.)
శ్రీవసిష్ఠ ఉవాచ:
తిర్యక్ పురుష దేవాదేర్యోనామ స వినశ్యతిః
యస్మిన్నేవ ప్రదేశే సౌ తదైవేదం ప్రపశ్యతి ॥ 8
ఆతివాహిక నామ్నాంతః స్వహృద్యేవ జగత్రయమ్|
వ్యోమ్ని చిత్తశరీరేణ వ్యోమాత్మానుభవత్యజ:|| 9
వసిష్ఠుడు: (తత్త్య గ్రహణ సమర్థ మగు శ్రీరాముని బుద్ధిసూక్ష్మతకు మెచ్చి, సూక్ష్మ శరీరముయొక్క
మిథ్యాత్వమును వర్ణించుచున్నాడు:-) పశుపక్షి మనుష్య దేవతాది ప్రాణులయం దేజీవి యైనను మృతి
చెందినప్పుడు, ఆ జీవాత్మ "ఆతివాహిక మగు సూక్ష్మశరీరమును ధరించి, హృదయాకాశమున వాసనా
మయములగు త్రిలోకములను గాచుచుండును. వాస్తవమున కీయాత్మ జన్మాదివికారరహితుడగు పరబ్రహ్మమే.
ఏవం మృతా మ్రియంతే చ మరిష్యంతి చ కోటయః
1
భూతానాం యాం జగంత్యాశా ముదితాని పృథక్ పృథక్ ॥ 10 10

200 యోగవాసిష్ఠము
ఇట్లు భూతజాలము లన్నియు మృత్యుముఖమున బడుచున్నవి - పడును. మరణ సమయమున
అదృష్టఫలము ననుసరించి మానస పటమున నిలబడు కోర్కెలలో నెద్ది యగ్రగణ్య మగునో, దానినే జీవు
డనుభవించును.
సంకల్ప నిర్మాణమివ మనోరాజ్యవిలాసవత్ |
ఇంద్రజాలమాల ఇవ కథార్థ ప్రతిభాసవత్ 11 11
దుర్వాత భూకంప ఇవ త్రస్తబాలవిశాచవత్
ముక్తాలీవామలే వ్యోమ్ని నౌస్పందతరుయానవత్ 12
స్వప్నసంవిత్తిపురవత్ స్మృతిజాతఖపుష్పవత్ |
జగత్సంసరణం స్వాంతర్మతో నుభవతి స్వయమ్
11 13
మానసపూజ నొనర్చు నప్పుడు సంకల్పించు రత్నసింహాసనాదులవలెను, ఆకాశ హర్మ్యముల వలెను,
ఇంద్రజాలకునిచే గల్పింపబడు ముత్యాల మాలవలెను, కథలో జెప్పబడు విషయములు ఎట్టఎదుట
పొడగట్టుటవలెను, వాయు రోగమువలన బీడింపబడునపుడు తోచు భూకంపమువలెను, బాలుని
భయపెట్టుటకు గల్పింపబడిన పిశాచమువలెను, నిర్మలాకాశమున మసక కంటివాని కగపడు
ముత్యములవలెను, నావమీద పయనించువాని కగపడు చెట్ల కదలికవలెను, స్వప్నమున గాంచు పత్తనము
వలెను, మనోనిర్మిత ఆకాశ పుష్పము వలెను. జగత్తు అళీకము (మిథ్య) - మరణ సమయమునను, జనన
సమయమునను ఈవిషయము హృదయాకాశమున అనుభూత మగును.
తత్రాతిపరిణామేన తదేవ మనతాం గతమ్ |
ఇహ లోకోయ మిత్యేవ జీవాకాశే విజృంభతే "I 14
మృత్యుకాలమున అనుభూత మగు వాసనా ప్రపంచమే, అజ్ఞానమువలన గలిగిన చిరపరిచయము
వలన, పంచీకరణము నంది, దృఢమై, జీవాకాశమున, ఇహలోక" మనుపేర బ్రకాశిత మగుచున్నది.
పునస్తతైవ జన్మేహా మరణాద్యనుభూతమాన్
పరం లోకం కల్పయతి మృత స్తత్ర తథా పునః ॥ 15
బ్రతుకునందలి ఆశ, పుట్టుక, చావు - నీ కీ అనుభవములు ఈ కల్పిత - ఇహలోకముననే జరుగును.
మృతి చెందిన పిమ్మట వచ్చు పరలోకముగూడ ఇట్టిదే; ఇటగూడ జనన మరణములు సంభవించును.
తదంతరే న్యే పురుషా స్తేషా మన్త స్తథేతరే
1
సంసార ఇతి భాంతీమే కదళీదలపీఠవత్ ॥ 16

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -3) 201
ఈ స్థూలదేహము నందింకొక శరీర మున్నది -అది సూక్ష్మశరీరము. మరల, దీని యందింకొక శరీర
మున్నది - ఇది కారణశరీర మనబడుచున్నది. అరటిసారవలె, ఒకదానియం దింకొకటిగ నిమిడియున్న ఈ
త్రివిధ శరీరములే సంసార మనబడుచున్నవి.
న పృథ్వ్యాది మహాభూతగణా న చ జగత్రమాః |
మృతానాం సంతి తత్రాపి తథా2ప్యేషాంజగత్ప్రమాః11 17
మృతి చెందిన వారికి, పంచభూత సంబంధమును, తద్విషయిక మగు నియమములు కట్టుబాటును
లేకపోయినను, జగద్భమ మాసిపోలేదు- నిలచియే యున్నది. (స్థూలదేహము గాక మరేమియు లేనిచో
సంసారము శాంతింపవలయును; కాని, అట్లగుచుండుట లేదు. ఈభ్రమకు గారణ మింకొకటి ఉన్నది.
అది సూక్ష్మశరీరము' - అని ఈశ్లోకము ప్రతిపాదించుచున్నది)
అవిద్యైవ హ్యనర్తేయం నానాప్రసవశాలినీ
జడానాం సరిదాదీర్ఘ తరత్సర్గతరంగిణీ ॥ 18
పరమార్థాంబుధౌ స్పారే రామసర్గతరంగకాః 1
భూయో భూయో నువర్తంతే త ఏవాన్యే చ భూరిశః ॥ 19
ప్రళయ సమయమున గూడ అవిద్య లయము కాదు- దీనినుండియే నానావిధము లగు కార్యము
లుత్పన్నము లగుచున్నవి; ఈ యవిద్య తరంగ చంచల మగు నదివంటిది. నిద్రా సమయమునను, ప్రళయ
సమయమునను, దీనియందు తరంగము లుండవు. సృష్టిసమయమునను, స్వప్నాది సమయములలోను
భ్రాంతులను తరంగములు లేచుచున్నవి. రామా! విశాల మగు బ్రహ్మ సముద్రమున, పెద్ద పెద్ద సృష్టులను
తరంగ సమూహములు, మాటిమాటికి లీలగా, నరుదెంచుచున్నవి. [దేహత్రయమున కనాదినుండియు
బ్రహ్మముతో సంబంధ మున్నదనియు, బ్రహ్మమే దీనికి గారణ మనియు, బ్రహ్మమే దేహసంబంధ(ఉపాధి)
వశమునజేసి జీవుడని చెప్పబడుచున్న దనియు, నిట సూచింపబడినది.]
సర్వతః సదృశాః కేచిత్ కులక్రమమనోగుణైః |
కేచిదర్థేన సదృశాః కేచిచ్చాతివిలక్షణా: || 20
ఇవన్నియు, అనగా, మాటిమాటికి గైకొనబడు ఈ శరీరము లన్నియు, ఒక్కొక్కప్పుడు సమానములును,
మరొక్కొక్కప్పుడు విభిన్నములును నగుచున్నవి. ఒకప్పుడు పూర్వపు సంస్కారము లన్నియు అట్లే
నిలుచుచున్నవి. మరొకప్పు డీ వంశమానసిక గుణములు భేదించుచున్నవి.
ఇమం వ్యాసమునిం తత్ర ద్వాత్రింశం సంస్మరామ్యహమ్ ।
యథాసంభవవిజ్ఞానదృశా సందృశ్యమానయా ॥ 221 21

202 యోగవాసిష్ఠము
నాచృష్టి పోగలిగినంతవఱకు, తరచిచూడ, ఈ వ్యాసుడు నాకు ముప్పది రెండవ వాడుగ
గన్పడుచున్నాడు; ఇట్టి వ్యాసులు, పూర్వపు సృష్టులయందె ముప్పదియొక్కండ్రు చనిరి.
ద్వాదశాల్పధియస్తత్ర కులాకారే హితైః సమాః
దశ సర్వే సమాకారాః శిష్టాః కులవిలక్షణాః ॥ 22
అందు, మొదటి పన్నిద్దరు వ్యాసుల కులము, ఆకృతి, చరిత్రలు సమానములు ; వీరందరును
అల్పజ్ఞానులు. పదవవాని వంశము మాత్రము భిన్నము.
అద్యాప్యన్యే భవిష్యంతి వ్యాసవాల్మీకయస్తథా|
భృగ్వంగిరఃపులస్త్యాశ్చ తథైవాప్యన్యథైవ చ ॥ 23
ఇంకను, ఎందరో వ్యాసవాల్మీక భృగ్వంగిర పులస్త్యులును, తదితరులును, జన్మింప నున్నారు. వీరిలో,
కొందరి శరీరములు, మున్నుండినటులనే యుండును. మఱికొందఱి శరీరములు మారును.
నరాః సురర్షిదేవానాం గణాః సంభూయ భూరి శః |
ఉత్పద్యంతే విలీయంతే కదాచిచ్చపృథక్పృథక్ 24
ఎందరెందరో మనుష్యులు, దేవతలు, దేవర్షులు పూర్వమట్లు ఒకేకాలమున జన్మించి, ఒకే సమయమున
సమయుదురు. ఇంకొకప్పుడు వేర్వేరుగా జన్మించి విలీన మగుదురు.
బ్రాహ్మీ ద్వాసప్తతిస్త్రేతా ఆసీదస్తి భవిష్యతి ।
స ఏవాన్యశ్చ లోకాశ్చ త్వం చాహం చేతి వేద్మ్యహమ్
11 25 25
ఇయ్యది బ్రహ్మయుగమున డెబ్బది రెండవ త్రేతాయుగము. ఇట్టి విదివఱ కెన్నియో గడచినవి; ఇక
ముందెన్నియో గడవనున్నవి. పూర్వకల్పములం దున్నట్లు నీవును నేనును ఉన్నాము ; మఱికొందరు
క్రొత్తవారుగూడ నున్నారు.
క్రమేణాస్య మునేరిత్థం వ్యాసస్యాద్భుతకర్మణ:
సంలక్ష్యతే . వతారో2 యం దశమో దీర్ఘదర్శినః "I 26
అద్భుత కర్ముడును, దీర్ఘదర్శియును నగు ఈ వ్యాసుని పదవ అవతారము మదికి గన్పట్టుచున్నది.
అభూమ వ్యాసవాల్మీకియుక్తా వయమనేకశః 1
అభూమ వయమేవేమే బహుశశ్చ పృథక్పృథక్ ॥ 27
వ్యాసవాల్మీకులకు సమకాలికులమై మనమనేకమార్లు జన్మించి యుంటిమి; మనలో చాల మంది
మరల విడివిడిగ గూడ జన్మించిన యుంటిమి.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -3) 203
అభూమ వయమేమేమే సదృశా ఇతరే విదః
అభూమ వయమేవేమే నానాకారాః సమాశయాః | 28
మనమును, వీరును, ఇతరులగు జ్ఞానులును ఇట్టివే యగు శరీరములతో చాలామార్లు జన్మించి
యుంటిమి; ఇంకొకప్పుడు శరీరములు వేరైనను, ఒకేతరగతికి చెందిన మనోభావము లుండినవి.
భావ్యమద్యాప్యనేనేహ నను వార్తాష్టకం పునః
భూయో భారతం నామ సేతిహాసం కరిష్యతి 29
ఈవ్యాసు డింకను ఎనిమిది మార్లు జన్మించి, భారత ఇతిహాసమును ఎనిమిదిమార్లు రచింపనున్నాడు.
కృత్వా వేదవిభాగం చ నీత్వానేన కులప్రథామ్ |
బ్రహ్మత్వం చ తథా కృత్వా భావ్యం వైదేహమోక్షణమ్ II 30
ఈవ్యాసుడే వెనుకటియట్లు, మరల వేదములను విభజించి, భారత వంశమునకు కీర్తి దెచ్చి, పిదప
విదేహముక్తుడై బ్రహ్మభావము నందును.
వీతశోకభయః శాంతనిర్వాణో గతకల్పనః 1
జీవన్ముక్తో జితమనా వ్యాసో2 యమితి వర్ణిత: 11 31
ఈ వ్యాసు డిప్పుడు జీవన్ముక్తుడు, మనోనిగ్రహ యుతుడు, శాంతుడు, మోహరహితుడు; అహంకార
మమకారములు లేకపోవుటవలన శోకభయములు లేక వెలుగొందుచున్నాడు.
విత్తబంధువయః కర్మ విద్యావిజ్ఞానచేష్టితైః|
సమాని సంతి భూతాని కదాచిన్న తు తాని తు ॥ 32
క్వచిత్సర్గశతైస్తాని భవంతి న భవంతి వా
కదాచిదపి మాయేయమిత్థమంతర్వివర్జితా "I 33
భాగ్యము, బంధువులు, ఆయుర్దాయము, ప్రయత్నము, విద్య, జ్ఞానము లను సమముగ గైకొని ఈ
జీవులందరు ఒకప్పుడిట్లే యుందురు. మరొకప్పు డుండరు. మరొకప్పు డివి సమానముగ నుండవు.
ఇంకొకప్పుడు ప్రతిసృష్టియందును వీరుందురు. ఇదంతయు మాయ. దీనికంతము లేదని చెప్పినను
జెప్పవచ్చును.
యచ్ఛతీయం విపర్యాసం భూరిభూతపరంపరా |
బీజరాశిరివాజస్రం పూర్యమాణః పునఃపునః ॥ 34

204 యోగవాసిష్ఠము
కొలుచుటకు రాశిగ పోయబడిన ధాన్యపుగింజలు, కొలిచిన పిమ్మట అదే రీతిగ నుండనట్లు ప్రాణు
లందరును భిన్న భిన్న స్పష్టులలో భిన్న భిన్నముగ నుందురు.
తేనైవ సన్నివేశేన తథాన్యేన పునః పునః ॥
సర్గాకారా: ప్రవర్తంతే తరంగాః కాలవారిధేః 35
కాలమను సముద్రమునందలి తరంగము లగు సృష్టిసమూహము లొకప్పుడు పూర్వమున్న యటులే
ఉండును; మరొకప్పు డింకొక రూపమును దాల్చి ప్రకటిత మగుచుండును.
ఆశ్వస్తాంతఃకరణః శాంతవికల్పః స్వరూపసారమయః
పరమశమామృతతృప్త స్తిష్ఠతి విద్వాన్నిరావరణ: 36
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే ముముక్షువ్యవహార ప్రకరణే భూయోభూయః సర్గానువర్ణనం
నామ తృతీయః సర్గః 3 ॥
కాని, తత్త్వజ్ఞానికి అజ్ఞాన జనితములగు వికల్పములు లేవు: ఈ సృష్టి తరంగములవలన నతని
అంతరంగము తల్లడిల్లదు. ఏలయన నాతడు పరమ శాంత్యమృతమున సంతృప్తుడు. మాయావరణము
తొలగ, అతడు బ్రహ్మ స్వరూపమున వెలుగొందును. (కనుక జీవన్ముక్తిగూడ తత్త్వజ్ఞాన ఫలమే; వ్యాసు
డిద్దాని నందినాడు అని ఇట సూచింపబడినది. ఇట్లు పూర్వోక్త రాఘవ సంశయమునకు ప్రత్యుత్తర
మీయబడినది.)
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు, ముముక్షువ్యవహార ప్రకరణమున
భూయోభూయ సర్గానువర్ణనమను తృతీయ సర్గము ॥ 3 ||
పౌరుష వివరణము-4
శ్రీవసిష్ఠ ఉవాచ:
సౌమ్యాంబుత్వే తరంగత్వే సలిలస్యాంబుతా యథా |
సమైవాస్ధా తథా దేహసదేహమునిముక్తతా ॥ 1
వసిష్ఠుడు: సముద్రమున తరంగము లుండినను, లేకపోయినను, అందలి నీరు నీరుగనే యుండును.
అట్లే, మునులు సదేహముక్త (జీవన్ముక్తు) అయినను, విదేహముక్తు (నిర్వాణముక్తు) లయినను, ఒకటియే.
ఈ రెండు ముక్తులు భిన్నములు కావు.
సదేహావాస్యదేహా వా ముక్తతా విషయే నచ
అనాస్వాదితభోగస్య కుతో భోజ్యానుభూతయః 2

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -4) 205
ముక్తి - జీవన్ముక్తియే గానిమ్ము. లేక నిర్వాణ ముక్తియే గానిమ్ము - విషయాధీనము కాదు.
విషయములను విషయములుగ గ్రహింపని వారికి, వాటి భోగమెట్లు సిద్ధించును? జీవన్ముక్తిస్థితియందు
విషయభోగ మున్నచో, దానిని నిర్వాణముక్తి కంటే తక్కువదిగ నెంచుకొనవచ్చును; దీనియందు విషయ
రసబోధ లేదు. కనుక, నిదియును నిర్వాణముక్తి వంటిదే.
జీవన్ముక్త్రం మునిశ్రేష్ఠం కేవలం హి పదార్థవత్ ।
పశ్యామః పురతో నాస్య పునర్విఘాన్నో నరాశయమ్ ॥ 3
జీవన్ముక్తుడగు వ్యాసుని మన మితరములగు ఘటపటాది పదార్థమువలె గాంచుచున్నామే గాని,
అతని అంతరమును మనమే మెఱుంగుదుము?
న దేహాదేహముక్తానాం భేదః కో బోధరూపిణామ్|
యదేవాంబు తరంగత్వే సౌమ్యత్వేంపి తదేవ తత్ II 4
బోధస్వరూపులగు నిర్వాణ ముక్తులకును జీవన్ముక్తులకును భేదమే లేదని, ఇదివరకే చెప్పియుంటిని.
అలలుగ నున్నను నీరు నీరే; కదలకున్నను నీరు నీరే కదా!
న మనాగపి భేదోస్తి సదేహాదేహముక్తయోః ॥
స స్పందో వ్యథవా స్పందో వాయురేవ యథా నిలః 5
ఈ రెండు ముక్తులకును ఆవంతైనను తేడా లేదు; గాలి వీచుచున్నను వీవకపోయినను గాలియే కదా!
సదేహా వా విదేహా వా ముక్తతా న ప్రమాస్పదమ్ ।
అస్మాకమపి తస్యాస్తి స్వైకతాస్త్యవిభాగినీ ॥
11 6
నాయొక్కయు, వ్యాసునియొక్కయు లక్ష్యములు సదేహ విదేహ ముక్తులు గావు; మా లక్ష్యము
ద్వైతవిహీనమగు జీవాత్మపరమాత్మల అభేదము, ఐక్యము.
తస్మాత్ ప్రకృతమేవేదం శృణు శ్రవణభూషణమ్ ।
మయోపదిశ్యమానం త్వం జ్ఞానమజ్ఞాంధ్యనాశనమ్ ॥ 7
ఇక, ప్రస్తుత విషయమగు తత్త్వజ్ఞానము నుపదేశించుచున్నాను, వినుము. ఈ జ్ఞానము, అజ్ఞానమను
అంధత్వమును బోగొట్టును; శ్రవణ భూషణమును.
సర్వమేవేహ హి సదా సంసారే రఘునందన!
సమ్యక్ ప్రయుక్తాత్ సర్వేణ పౌరుషాత్ సమవాప్యతే ॥ 11 8
రఘునందనా! ఈ జగత్తున యధోచితముగ పౌరుషము (పురుషకారము) నుపయోగించిననే వాంఛిత

206 యోగవాసిష్ఠము
వస్తువు సిద్ధించును.
ఇహ హీందోరివోదేతి శీతలాహ్లాదనం హృది ।
పరిస్పందఫలప్రాప్తా పౌరుషాదేవ నాన్యతః ॥ || 9
క్రియాస్వరూపుడగు కాలుని నియమము ననుసరించియే, చంద్రునినుండి శీతలమును,
ఆనందకరమును నగు అమృతము లభించునట్లు, పురుష ప్రయత్నమువలననే జ్ఞానము లభించుచున్నది.
దీనివలన, కామాది తాపనాశనకర మగు జీవన్ముక్తి లభించుచున్నది.
పౌరుషం స్పందఫలవద్దృష్టం ప్రత్యక్షతో నయత్ ।
కల్పితం మోహితై ర్మందై వం కించిన్న విద్యతే II 10
పురుషకారముయొక్క ఫలమే కర్మ. ఇట్టి కర్మలవలననే, (నడచిన) దేశాంతర ప్రాప్తియు, (భుజించిన)
తృప్తియు గలుగుచున్నవి - ఇది ప్రత్యక్షానుభవ సిద్ధము. ఇక, దైవ (అదృష్ట) మన్ననో? మోహితులగు మూఢులు
గల్పించినదియే. ఏలయన, ఇయ్యది పూర్వజన్మలయం దొనర్పబడిన పురుషకారమే, తద్భిన్నము కాదు.
సాధూపదిష్ట మార్గేణ యన్మనోంగ విచేష్టితమ్
తత్ పౌరుషం తత్సఫల మన్య దున్మత్త చేష్టితమ్
11 11
సాధుపురుషుల ఉపదేశానుసారముగ, మనో వాక్కాయములను జరింప జేయుటయే, పురుషకారము.
ఇదియే ఫలప్రదము, తక్కిన దంతయు, ఉన్మత్తచేష్టు
యో యమర్థం ప్రార్థయతే తదరం చేహతే క్రమాత్
|
అవశ్యం స తమాప్నోతి న చేదర్థాన్ని వర్తతే ॥ 12
శాస్త్రోపదేశము ననుసరించిన, ఎవడేవస్తువును గోరునో, అతడద్దానిని బడయును. ప్రత్యవాయము
ఘటిల్లిన సగమునుండి వెనుకకు మరలిపోవలసి యుండును. (కనుక, శాస్త్రవిధిని ఏకదేశముగ గాక
సంపూర్ణముగ ఆచరింప వలయును. అట్లాచరించిననే ఫలము లభించును.)
పౌరుషేణ ప్రయత్నేన త్రైలోక్యైశ్వర్య సుందరామ్ ।
కశ్చిత్ ప్రాణివిశేషో హి శక్రతాం సముపాగతః ॥ 13
ఒకానొక జీవుడు ప్రబలమగు పురుషకారముచేత, త్రిలోకాధిపత్యముతో నొప్పారు ఇంద్రపదవిని
బొందగలిగినాడు.
పౌరుషేణైవ యత్నేన సహసాంభోరుహాస్పదమ్ |
కశ్చిదేవ చిదుల్లాసో బ్రహ్మతా మధితిష్ఠతి ॥ 14

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -4) 207
ఒకానొక జీవుడు పురుషకార ఫలముగ, పద్మాసనమున నాసీనుడై బ్రహ్మ యైనాడు.
సారేణ పురుషార్థన స్వేనైవ గరుడధ్వజః
కశ్చిదేవ పునూనేవ పురుషోత్తమతాం గతః ॥ 15
ఒకానొక పురుషుడు పౌరుషబలము చేత గరుడధ్వజుడగు విష్ణువైనాడు.
పౌరుషేణైవ యత్నేన లలనావలితాకృతిః |
శరీరీ కశ్చిదేవేహ గతశ్చంద్రార్ధచూడతామ్ " 16
ఒకానొక మనుజుడు నిజయత్నముచేత అర్ధనారీశ్వరుడును, చంద్రశేఖరుడును నగు శివుడైనాడు.*
ప్రాక్తనం చైహికం చేతి ద్వివిధం విద్ధి పౌరుషమ్ ।
ప్రాక్తనాద్యతనేనాశు పురుషార్థన జీయతే ॥ 17
ఈ పురుషకారము, ప్రాక్తనము (పూర్వపు జన్మలలోనిది.) అద్యతనము (ఈ జన్మయం దొనర్చినది.)
అని రెండు తెఱగులు. ప్రాక్తన పురుషకారము (దైవము, లేక అదృష్టము)ను ఈ అధ్యతన పురుషకారమువలన
జయింపగలము.
యత్నవద్భిర్దృఢాభ్యా సై: ప్రజోత్సాహసమన్వితైః |
మేరవో ఒపి నిగీర్యంతే కైవ ప్రాక్పౌరుషే కథా ॥ 18
ప్రయత్నవంతులును, దృఢాభ్యాస నిరతులును, ఉత్సాహవంతులును నగువారు, మేరువునే
జీర్ణమొనరించుకొనగలరన్న, వారికి అదృష్ట మొక లెక్కలోనిదా?
శాస్త్రనియంత్రితపౌరుషపరమా పురుషస్య పురుషతా యా స్యాత్ |
అభిమతఫలభరసిద్ద్యై భవతి హి సైవాన్యథా త్వనర్థాయ ॥ "I 19
శాస్త్రానుశాసితమగు కర్మల నాచరించుటయే, శుభఫలప్రద మగు పురుషకారము; తదితరము
లనర్థదాయకములు, వ్యర్థములును.
కస్యాంచిత్ స్వయమాత్మదుఃస్థితివశాత్ పుంసో దశాయాం శనై-
రంగుల్య గ్రనిపీడితైక చులు కాదా వావబిందుర్బహుః
* 13, 14, 15, 16 వ శ్లోకములందు బేర్కొనబడిన వన్నియు పదవులు. ఈపదవులు యాగసాపేక్షములు, ఆయా యాగముల
నొనర్చిన ఆయా పదవులు లభించును. విష్ణుత్వ, శివత్వము లన్న చోట, సారూప్యముక్తిని గ్రహించుట సమంజసము - అను.

208 యోగవాసిష్ఠము
కస్యాంచిజ్జలరాశి పర్వతపురద్వీపాంతరాలీకృతా
భర్తవ్యోచితసంవిభాగకరణే పృథ్వీ న పృథ్వీ భవేత్ ॥ 20 20
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే ముముక్షువ్యవహార ప్రకరణే పౌరుష-ప్రకరణం నామ చతుర్థఃసర్గః
ఒకానొకప్పుడు, శాస్త్రవిధి వ్యతిరిక్తమగు యథేషాచరణమువలన, వ్రేళ్లు కలిపి ఔపోశన పట్టుటకూడ
కష్టకర మగును; మరియు దాహశాంతికై అందలి నీటిబొట్టుకూడ అధికమే యనిపించును. (మందబుద్ధులును,
దరిద్రులును నగు ఇట్టివారు జ్ఞానులును, ధనికులు అగుటవలన-) శాస్త్రవిధి ననుసరించుటవలన మరొకప్పుడు
చేకూరిన ధనమును దాయాదులకు పంచిపెట్టి పోగా, సాగర గిరి నగర ద్వీప సమన్విత మగు ధరణీ
మండల మంతయు తుచ్ఛ మనిపించును.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు ముముక్షువ్యవహార ప్రకరణమున పౌరుషప్రకరణమను చతుర్థ సర్గము || 4 |
పౌరుష స్థాపనము -5
శ్రీవసిష్ఠ ఉవాచ :
ప్రవృత్తిరేవ ప్రథమం యథాశాస్త్రవిహారిణామ్ |
ప్రభవ వర్ణభేదానాం సాధనీ సర్వకర్మణామ్ "I 1
శ్రీ వసిష్ఠుడు: వెలుగే తెలుపు, నలుపు, పసుపు మున్నగు భిన్నభిన్న వర్ణముల అభివ్యక్తికి గారణ మైనట్లు,
ప్రవృత్తియే శాస్త్రవిధి ననుసరించి చను వివిధ- అధికారులు ఫలసిద్ధికి గారణ మగుచున్నది.
మనసా వాంచ్యతే యచ్చ యథాశాస్త్రం న కర్మణా 1
సాధ్యతే మత్తలీలాసౌ మోహనీ నార్థసాధనీ 2
మనస్సున గోరుకొనుట, శాస్త్రవిధి ననుసరింపక పోవుట, ఉన్మత్తక్రీడ - వీనివలన ప్రయోజనము
సిద్ధింపదు; పైపెచ్చు, ఇవి మోహకారణ మగును.
యథా సంయతతే యేన తథా తేనానుభూయతే |
స్వకర్మైవేతి చాస్తేన్యా వ్యతిరిక్తాన దైవకృత్ II 3
ఎవడెట్లు యత్నించునో, అతడట్టి కర్మనే పొందును; అదృష్టముకూడ ఏతద్వ్యతిరిక్తము గాదు.
ఉచ్ఛాస్త్రం శాస్త్రాతం చేతి ద్వివిధం పౌరుషం స్మృతమ్ |
తత్రోచ్ఛాస్త్రమనర్థాయ పరమార్థాయ శాస్త్రితమ్ ॥

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -5) 209
కర్మ శాస్త్రోచితము, శాస్త్రవిరుద్దము అని రెండు తెఱగులు, వీటిలో శాస్త్రోచిత మగునది పరమార్థము
కొఱకును, శాస్త్రవిరుద్ధ మైనది అనర్థము కొఱకునై యున్నది.
ద్వౌశూరావినయుధ్యేతే పురుషార్థా సమాసమౌ |
ప్రాక్తనశ్చైహికశ్చైవ శామ్యత్యత్రాల వీర్యవాన్ ॥
II 5
సమానబలము గలిగినట్టివియు, ఒకింత హెచ్చుతగ్గులు గలిగినట్టివియు నగు ప్రాక్తన అద్యతనకర్మలు
నిరంతరము మేకపోతులవలె ఒకదానితో నొకటి ఢీకొన సిద్ధపడుచుండును; వీటిలో బలహీనమైనది కూలును.
అతః పురుషయత్నేన యతితవ్యం యథా తథా |
పుంసా తంత్రేణ సద్యోగాద్యేనాశ్వద్యతనో జయేత్ " 6
అందువలన, శాస్త్రవిధి ననుసరించి పూర్వపుకర్మల బలహీన మొనర్చు సత్కర్మల నీజన్మలో నొనర్పదగును.
ద్వౌశూరావిన యుధ్యేతే పురుషార్థా సమాసమౌ
ఆత్మీయశ్చాన్యదీయశ్చ జయత్యతిబలన్తయోః || 7
సమబలములును, న్యూనాధిక బలములును నగు స్వకర్మలును, ఇతరుల కర్మలును, మేకలవలె
డీకొనుచుండును. (స్వకర్మ లనగా, మనుజు డొనర్చు తపస్సు మున్నగు కర్మలు; ఇతరుల కర్మలనగా,
దేవత లొనర్చు విఘ్నాదులు) వీటిలో బలవత్తర మైనది జయ మొందును.
అనర్థః ప్రాప్యతే యత్ర శాస్త్రితాదపి పౌరుషాత్
అనర్థకర్త, బలవత్తత్ర జ్ఞేయం స్వపౌరుషమ్ ॥
"I 8
శాస్త్రబోధిత సుకర్మల నొనర్చినను రోగాది అరిష్టములు సంభవించిన స్వీయదుష్కర్మ ప్రబలముగ
నున్నదని గ్రహింపదగును.
పరం పౌరుషమాశ్రిత్య దంతైర్దంతాన్ విచూర్ణయన్
శుభేనాశుభముద్యుక్తం ప్రాక్తనం పౌరుషం జయేత్ II
9
దృఢముగ మంగళ జనకములగు కర్మల నాశ్రయించిన ఫలోన్ముఖములగు ప్రాక్తన కర్మలనుగూడ,
పళ్లతో పళ్లను నలుగగొట్టునట్లు జయింపవచ్చును.
ప్రాక్తనః పురుషార్థో సౌ మాం నియోజయతీతి ధీః|
బలాదధస్పదీకార్యా ప్రత్యక్షాధికా న సా 10
ప్రాక్తన కర్మయే నన్నిట్టి పనిని చేయించుచున్నదను భావమును అణగద్రొక్కవలయును. ఇట్టి తలపు
ప్రత్యక్ష కర్మలముందు నిలబడజాలదు.
VI F14

210 యోగవాసిష్ఠము
తావత్తావత్ప్రయత్నేన యతితవ్యం సుపౌరుషమ్ ।
ప్రాక్తనం పౌరుషమ్ యావదశుభం శామ్యతి స్వయమ్ 11
ప్రాక్తన-దురదృష్టము జయింపబడ నంతవఱకు, శాస్త్రోచిత సత్కర్మల నొనర్చుచునే యుండునది.
దోషః శామ్యత్యసందేహం ప్రాక్తనో ద్యతనైర్గుణైః |
దృష్టాంతో త్ర హ్యస్త నస్య దోషస్యాద్యగుణైః క్షయః II 12
పూర్వకర్మలు, ప్రస్తుత మొనర్పబడు కర్మలవలన పరాస్తము లగునను విషయము నిశ్చితము. ప్రస్తుత
కర్మలవలన, ఆగామిదోషములు నివారిత మగుటయే దీనికి ఉదాహరణము.
అసదైవమధః కృత్వా నిత్యముద్రిక్తయా ధియా
సంసారోత్తరణం భూత్యై యతేతా ధాతుమాత్మని "1 13
ప్రయత్నశీలమగు బుద్ధిబలమున ఆ శుభదృష్టములు దూర మొనర్చి, సంసారమును తరించు
ఉపకరణములగు శమదమాదులను బొంద యత్నింప వలెను.
న గంతవ్య మసద్యోగైస్సామ్యం పురుషగర్దభైః |
ఉద్యోగస్తు యథా శాస్త్రం లోకద్వితయసిద్ధయే 14
ప్రయత్న విహీనుడు గర్దభము వంటివాడు; ఇతడు పరమ పదమును జేరజాలడు. శాస్త్రానుసారము
యత్నించువాడు ఇహపరముల రెంటిని బడయును.
సంసార కుహరాదస్మాన్నిర్గంతవ్యం స్వయం బలాత్ |
పౌరుషం యత్నమాశ్రిత్య హరిణే వారిపంజరాత్ ॥ 15
సింహము మనుజు లుంచిన పంజరమునుండి వెలువడునట్లు, ఈ సంసార కుహరమునుండి
పౌరుషము నాశ్రయించి బలపూర్వకముగ వెలువడుట కర్తవ్యము.
ప్రత్యహం ప్రత్యవేక్షేత దేహం నశ్వరమాత్మనః
సంత్యజేత్ పశుభిస్తుల్యం శ్రయేత్ సత్ఫరుషోచితమ్ 16 11
శరీర మస్థిరమని ప్రతిదినము విచారింపవలెను. పశుతుల్యమగు మూఢత్వమును ద్యజించునది.
సాధుసాంగత్యమును, సచ్ఛాస్త్ర పఠనాదులను ఒనర్చునది.
కించిత్ కాంతాన్నపానాది కలిలం కోమలం గృహే|
ప్రణే కీట ఇవాస్వాద్య వయః కార్యం న భస్మసాత్ 17 "

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -5) 211
ఈగ కురుపుమీద వ్రాలి రక్తము, చీము మున్నగు వానిని ద్రాగునట్లు, గృహము నందుండి అన్నపానాది
భోగముల కొఱకు కాలమును దగులపెట్టుట కూడని పని.
శుభేన పౌరుషేణాశు శుభమాసాద్యతే ఫలమ్ ।
అశుభేనాశుభం నిత్యం దైవం నామ నకించన ॥ 18
శుభకర్మలవలన శుభము చేకూరును; అశుభకర్మలవలన అశుభము లభించును. దైవము (అదృష్టము)
అను స్వతంత్ర వస్తు వింకొకటి వేరుగ లేదు.
ప్రత్యక్షమానముత్సృజ్య యోం నుమానము పైత్యసౌ |
స్వభుజాభ్యామిమౌ సర్పావితి ప్రేక్ష్య పలాయతే ॥ 19
ప్రత్యక్ష ప్రమాణమును వీడి అనుమాన ప్రమాణమును గైకొనినచో, తనచేతులను గాంచి పాము
లనుకొని పారిపోవలసియుండును.
దైవం సంప్రేరయతి మామితి దగ్ధధియాం ముఖమ్ |
అదృష్టశ్రేష్ఠదృష్టానాం దృష్ట్వా లక్ష్మీర్ని వర్తతే
"I 20
అదృష్టమే నన్నీపని నొనర్ప జేయుచున్నదని తలచువారి ముఖమును గాంచుటకు, లక్ష్మి ఇష్టపడదు.
తస్మాత్ పురుషయత్నేన వివేకం పూర్వమాశ్రయేత్
ఆత్మజ్ఞానమహార్థాని శాస్త్రాణి ప్రవిచారయేత్ ॥ 21
అందువలన, ముముక్షు వగువాడు పురుషకార బలమున మొమ్మొదట సాధన చతుష్టయ సంపత్తిని
ఆశ్రయింపవలెను. మరియు, ఆత్మజ్ఞానోద్బోధకములగు శాస్త్రములను బరింపవలెను.
చిత్తే చింతయతామర్థం యథాశాస్త్రం నిజేహితైః
1
అసంసాధయతామేవ మూఢానాం ధిగ్ దురీప్సితమ్ "1 22
మనస్సున కోరికలను గోరుకొని, శాస్త్రవిధి ననుసరించి వానిని బొంద యత్నింపని మూఢుల
భోగలిప్సకు ధిక్కారము.
పౌరుషం చ న వానంతం న యత్నమభివాంఛ్యతే |
న యత్నేనాపి మహతా ప్రాప్యతే రత్నమశ్మతః 23
శాస్త్రవిహిత పురుషకారము ఫలప్రదమే; దీనికంతు లేదని తలంపరాదు. కాన, రాతి నుండి రత్నమును
బడయజాలము; ఇట్టి యత్నము వ్యర్థము. శాస్త్ర చోదితయత్న మెన్నటికిని వ్యర్థము కాదు.

212 యోగవాసిష్ఠము
యథా ఘటః పరిమితో యథా పరిమితః పటః
నియతః పరిమాణస్థః పురుషార్థ స్తథైవ చ ॥ 24
లోకమున ఘటపటాదులకు పరిమాణ మున్నట్లే, పురుషార్థమునకును బరిణామ మున్నది; ఒనర్చిన
ప్రయత్నమును బట్టియే ఫలము సిద్ధించును.
స చ సచ్ఛాస్త్ర సత్సంగ సదాచారై ర్నిజం ఫలమ్ | 1
దదాతీతి స్వభావో యమన్యథా నార్థసిద్ధయే "I 25 25
సత్-శాస్త్రవిధి ననుసరించి, సత్సంగ మొనర్చి, సదాచారపూర్వకముగ ఒనర్చిన కర్మయే సంపూర్ణ
ఫలప్రద మగును; ఇట్లొనర్పక పోయినను ఫల మొసగదు. కర్మ యొక్క స్వభావమే ఇట్టిది.
స్వరూపం పౌరుషస్యైత దేవం వ్యవహరన్నరః I
యాతి నిష్ఫల యత్నత్వం న కదాచన కశ్చన ॥ 26
ఇయ్యది పౌరుషముయొక్క స్వరూపము. దీని నంతటిని గ్రహించి, చరించిన మనుజు డెన్నడును
విఫలయత్నుడు కాడు.
దైన్యదారిద్ర్య దుఃఖార్తా అవ్యన్యే పురుషోత్తమాః ।
పౌరుషేణైవ యత్నేన యాతా దేవేంద్ర తుల్యతామ్ ॥ 27
హరిశ్చంద్రాదులగు పురుషశ్రేష్ఠులు దారిద్ర్య దుఃఖమున గలత చెందిన వారయ్యు పురుషకార
ప్రభావమున ఇంద్రతుల్యు లైరి.
ఆబాల్యాదలమభ్యసై:శాస్త్రసత్సంగమాదిభిః 1
గుణైః పురుషయత్నేన స్వార్థః సంప్రాప్యతే యతః ॥ 28
ఇతి ప్రత్యక్షతో దృష్టమనుభూతం శ్రుతం కృతమ్
దైవాత్తమితి మన్యంతే యే హతా స్తే కుబుద్ధయః 29
బాల్యమునుండి మిక్కుటముగ మాటిమాటికి అభ్యసింపబడిన శాస్త్రచర్చ సత్సంగాదులవలన, కోరునది
సిద్ధించుటయే పురుషకారముయొక్క ఫలము అగుటచేత ప్రత్యక్షములును, అనుభూతములును,
దృష్టములును, శ్రుతములును, అనుష్ఠితములును నగు కార్యములను అదృష్టములుగ తలచు మూఢజనులు
జీవన్మృతులు.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -5) 213
ఆలస్యం యది న భవేజ్జగత్యనర్థః కో న స్యా ద్బహుధనకో బహుశ్రుతో వా|
ఆలస్యాదియమవనిః ససాగరాంతా సంపూర్ణా నరపశుభిశ్చ నిర్ధనైశ్చ I 30
అనర్ధ హేతువగు సోమరితనమే లేకున్న, గొప్పధనికుడుగనో లేక దొడ్డ పండితుడుగనో కానివాడెవ
డుండెడు వాడు? ఈ సోమరితనమువలననే, సముద్రములతో గూడిన ఈ ధరామండలము మూర్ఖులతోడను,
దరిద్రులతోడను నిండియున్నది.
బాల్యే గతే విరత కల్పిత కేలిలోలే దోర్దండమండితవయః ప్రభృతి ప్రయత్నాత్
సత్సంగమైః పదపదార్థ విశుద్ధబుద్ధిః కుర్యాన్నరః స్వగుణదోషవిచారణాని||31
కల్పితక్రీడలలో నిరంతరము చంచలమై తనరు బాల్యము గడచిన తోడనే, నిత్యానిత్య వస్తువివేక
మాదిగా గల సుగుణముల నలవరచుకొని, యౌవనము నుండియే, సత్సంగ మొనర్చుచు, స్వీయ
గుణదోషములను బరీక్షించు కొనుచుండవలెను.
శ్రీవాల్మీకి రువాచ:
ఇత్యుక్తవత్యథ మునౌ దివసో జగామ సాయంతనాయ విధయే స్తమినో జగామ |
స్నాతుం సభా కృతనమస్కరణా జగామ శ్యామాక్షయే రవికరేణ సహాజగామ॥32
ఇత్యార్షే వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే ముముక్షువ్యవహార ప్రకరణే పౌరుషస్థాపనం
నామ పంచమః సర్గః ॥ 5 ॥
వాల్మీకి : మునిశ్రేష్ఠు డగు వసిష్ఠు డిట్లు నుడువుచుండ, సూర్యాస్తమయ మయ్యెను. రాజును,
మునిమండలియు వసిష్ఠునకు నమస్కరించి, స్నానాది సాయంకృత్యముల నొనర్చుకొన నరిగిరి. *
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు ముముక్షువ్యవహార ప్రకరణమున
పౌరుషస్థాపనమను పంచమ సర్గము ॥ 5॥ ఇది ప్రథమదినము.
* ఇది ఈ శ్లోకమునకు లభించు సరళార్థము. టీకాకారుని అభిప్రాయమున, ఇట్లర్థమొనర్చిన భవిష్యత్పందర్భమున
విరోధము సంభవించును. ఆయన ఒనర్చిన అర్థము: దేవదూతఃవాల్మీకి భరద్వాజునితో నిట్లు ప్రసంగించుచుండ సాయంకృత్యముల
నాచరించుటకు మూలకారణమైన, సూర్యాస్తమయ మయ్యెను. మునులుగూడ వాల్మీకికి నమస్కరించి, స్నాన మొనర్ప నేగిరి.
అనంతరము, రాత్రి గడవ సూర్యకిరణములు పొడసూపి, ప్రాతఃకాల మయ్యెను.

214 యోగవాసిష్ఠము
దైవనిరాకరణము-6
శ్రీ వసిష్ఠ ఉవాచ:
తస్మాత్ ప్రాక్పౌరుషాద్దైవం నాన్యత్ తత్ ప్రోఝ్య దూరతః
సాధుసంగమసచ్ఛా స్త్రైర్జీవముత్తారయే ద్బలాత్ 1
వసిష్ఠుడు: అందువలన, ప్రాక్తన కర్మకాక అదృష్టమను వస్తు వింకొకటి లేదు. అదృష్ట మనుదానిని దూరమొనర్చి,
సాధుసంగమ సచ్ఛాస్త్రాలోచనల వలన తీవ్రముగ యత్నించి జీవుని ఉద్దరింపవలెను.
యథా యథా ప్రయత్నః స్యాత్ భవేదాశు ఫలం తదా !
ఇతి పౌరుష మే వాస్తి దైవమస్తు తదేవ చ ॥ 2
ఒనర్చు యత్నమును బట్టియే ఫలముండును; ఇట్లే అదృష్టముకూడ పౌరుషము ననుసరించును.
దుఃఖాద్యథా దుఃఖకాలే హా కష్టమితి కథ్యతే
1
హా కష్ట శబ్ద పర్యాయ స్తథా హా దైవమిత్యపి "I 3
దుఃఖ మనుభవించు సమయమున లోకులు "ఆహా! కష్టము అని నుడువునట్లే, పూర్వకర్మలను
గురించి ఆహా! అదృష్టము" అందురు. (ఇది పౌరుషము గాక వేరొండు కాదే!)
ప్రాక్స్వకర్మేతరాకారం దైవం నామ న విద్యతే
బాలః ప్రబలపుంసేవ తజ్జెతుమిహ శక్యతే 11
ప్రాక్తనకర్మలు గాక దైవ మనునది వేరొండు లేదు. బలశాలియగు పురుషుడు బాలుని లోబరచుకొన
గలిగినట్లు, అనాయాసముగా ఈ అదృష్టమును గూడ లోబరచుకొనవచ్చును.
హ్యస్తనో దుష్ట ఆచార ఆచారేణాద్య చారుణా |
యథాశు శుభతామేతి ప్రాక్తనం కర్మ తత్తథా | 5
ఈజన్మ యందొనర్చిన అశుభకర్మలను ప్రాయశ్చిత్తాది కార్యములవలన శుభములుగ మార్చునట్లు,
పూర్వకర్మలనుగూడ పౌరుషమువలన శుభప్రదములుగ నొనర్పవచ్చును.
తజ్జయాయ యతంతే యే న లోభలవలంపటాః
తే దీనాః ప్రాకృతా మూఢాః స్థితా దైవపరాయణాః ॥ 6
అల్పవిషయ లోభమున బడి, దైవమును జయింప యత్నింపక దానికి లోబడియుండువారు దీనులును,
హీనులును నగు పరమమూఢులు.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -6) 215
పౌరుషేణ కృతం కర్మ దైవాత్ యదభినశ్యతి 1
తత్ర నాశయితుర్ జ్ఞేయం పౌరుషం బలవత్తరమ్ ॥ 7
పురుషప్రయత్నము విఫల మైనచో పూర్వజన్మమందలి పురుషకారము ప్రబలముగ నున్నదని
గ్రహింపవలెను.
యదేకవృంతఫలయోరథైకం శూన్యకోటరమ్
తత్ర ప్రయత్నః స్ఫురితస్తథా తద్రససంవిదః ॥ 8
ఒకే గుత్తియందున్న రెండుపళ్లలో ఒకదానియందు రసము లేకున్న, దానికి, గారణము ఫలభోక్త
(తుమ్మెదలు మొదలుగా గల కీటకముల యొక్క కర్మయేనని గ్రహింపవలెను.
యత్ప్రయాంతి జగద్భావాః సంసిద్ధా అవి సంక్షయమ్ 1
క్షయకారకయత్నస్య హ్యత్ర జ్ఞేయం మహద్బలమ్ "I 9
జగత్తున నున్న ప్రసిద్ధములుగు పదార్థములు గూడ క్షయ మందుచున్నవి. ఇయ్యెడ క్షయకర్తయొక్క
బలమును గ్రహింపనగును.
ద్వౌహుడావివ యుధ్యేతే పురుషార్థా పరస్పరమ్ |
య ఏవ బలవాంస్తత్ర స ఏవ జయతి క్షణాత్ ॥ 10
ప్రాక్తనములును, ఐహికములును నగు పురుషకారములు రెండును మేకపోతులవలె, ఒకదానితో నొకటి
యుద్ధమొనర్చును. వీటిలో, ఎద్దాని బల మధికమో, అయ్యదియే క్షణములో జయమందును.
భిక్షుకో మంగళేభేన నృపో యత్ క్రియతే బలాత్
తదమాత్యేభపౌరాణాం ప్రయత్నస్య బలం మహత్ II
11
రాజవంశము లోపించిన, అమాత్యాదులు గజమును మంగళాలంకారముల నలంకరించి, అది
ఎన్నుకొనిన భిక్షుకుని రాజొనర్చుపట్ల, మంత్రులయొక్కయు, పౌరులయొక్కయు, ఏనుగ యొక్కయు
ప్రయత్నబలమే యని గ్రహింపవలయును. ఇట అదృష్టమునకు తావు లేదు.
పౌరుషేణాన్నమాక్రమ్య యథా దంతేనచూర్ణ్యతే
అన్యః పౌరుషమాశ్రిత్య తథా శూరేణ చూర్ణ్యతే 12
పురుషుడు నిజయత్నమువలననే అన్నమును గైకొని నమలునట్లు, బలశాలి పౌరుషబలముననే ఇతరుని
(బలహీనుని లేక అదృష్టమును) చూర్ణ మొనరించును.

యోగవాసిష్ఠము 216
అనుభూతా హి మహతాం లమవో యత్నశాలినామ్|
యథేష్టం వినియోజ్యం తే తన కర్మసు లోష్టవత్ ॥ 11 13
అందువలననే, బలహీనులు బలవంతులగు (సేవకాది) భోగ్యవస్తువు లగుచున్నారు ; బలవంతులు
వారిని తమ ఇచ్చ వచ్చిన కార్యములలో, ఎండిన మట్టి ముద్దలనువలె వినియోగించుచున్నారు.
శక్తస్య పౌరుషం దృశ్యమదృశ్యం వాపి యద్భవేత్
తదైవమిత్యశక్తేన బుద్ధమాత్మన్యబుద్ధి నా 14
సమర్థుడగు వ్యక్తియొక్క ప్రయత్నము దృష్టమే యగుగాక, అదృష్టమే యగుగాక; బలహీనుడును,
మూఢుడు నగు వ్యక్తి దానిని దైవమే యనును.
భూతానాం బలవద్భూతం యన్న దైవమితి స్థితమ్ |
తత్తేషామప్యధి ష్ఠాతృస తామేతత్ స్ఫుటం మిథః ॥ 15 ॥
ఈ సమర్థ వ్యక్తికంటే సమర్థుడగు వాడింకొక డున్నందువలన, అదృష్ట మనునది లేదని స్పష్ట
మగుచున్నది.
శాస్త్రామాత్యేభపౌరాణామవికల్పా స్వభావధీః
యా సా భిక్షుకరాజ్యస్య కర్తృదర్భప్రజాస్థితేః11 16
శాస్త్రము, మంత్రులు, హస్తి, పౌరులు - వీరి సమానాభిప్రాయ బుద్ధియే భిక్షుకునకు రాజ్య మొసంగినది.
ప్రజలను బాలించుచున్నది.
భిక్షుకో మంగళేభేన నృపో యత్రియతే క్వచిత్
ప్రాక్తనం పౌరుషం తత్ర బలవద్వాజేపి కారణమ్ ॥ 17
ఇంకొకపట్ల, భిక్షుకుని రాజుగ నొనర్చుపట్ల వాని పూర్వప్రయత్నమే కారణము కావచ్చును.
ఐహికః ప్రాక్తనం హన్తి ప్రాక్తనోద్యతనం బలాత్
సర్వదా పురుషస్పంద స్తత్రానుద్వేగవాన్ జయీ ॥ 18
ద్వయోరద్యతన స్యైవ ప్రత్యక్షాత్ బలితా భవేత్
దైవం జేతుం యతో యత్నై ర్బాలో యూనేవ శక్యతే ॥ 19
ఈ జన్మయం దొనరించిన యత్నము, పూర్వపౌరుషమును నష్టపరచగా, పూర్వపౌరుషము మరల
ఈ జన్మయందలి పౌరుషమును నాశన మొనర్చినపట్ల, చలింపనివాడే జయ మందును. ప్రాక్తనమును,

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -6) 217
ఐహికమును నగు పురుష కారముల మధ్య, ఐహికమునే అధికబలముగ నెంచవలెను. అందువలన, బాలుని
యువకు డనాయాసముగ జయించునట్లు, యత్నించినచో ప్రాక్తనమును జయింపవచ్చును.
మేఘన నీయతే యద్వద్వత్సరోపార్జితా కృషిః
మేమస్య పురుషార్థో సౌ జయత్యధికయత్నవాన్ II 20
సంవత్సర మంతయు కష్టపడి పండించిన పంట ఒక్క రోజులో వానదెబ్బకు పాడైనపట్ల, అది మేఘుని
పురుషార్థము (ప్రయత్నము) అని తెలియవలెను - అధికముగ యత్నించువాడు జయించును కదా.
క్రమేణోపార్జితే ప్యర్థే నష్టే కార్యే న భేదితా |
న బలం యత్ర మే శక్తం తత్ర కా పరివేదనా ॥ 21
కష్టపడి ఆర్జించిన విత్తమంతయు నష్టమైనపుడు (మరల పొందుటకు యత్నింపవలెను గాని
అట్లొనర్పక, ఊరక) దుఃఖించుట అనుచితము. అనువు గానిచోట శోకించిన లాభమేమి?
యన్న శక్నోమి తస్యార్థే యది దుఃఖం కరోమ్యహమ్ ।
తదమారిత మృత్యోర్మే యుక్తం ప్రత్యహ రోదనమ్ ॥ 22
ఒనర్పలేని దానికొఱకు దుఃఖించుట అనుచితము. అట్లు దుఃఖింపవలసిన, జయింప వీలులేని
మృత్యువును గుఱించి ప్రతిదినము దుఃఖించుచుండవలసినదే కదా!
దేశ కాల క్రియా ద్రవ్యవశతో విస్ఫురంత్యమా 1
సర్వ ఏవ జగద్భావా జయత్యధిక యత్నవాన్ 11 23
ఈ జగత్తున పదార్థము లన్నియు దేశ, కాల, క్రియా, ద్రవ్యముల శక్తి ననుసరించి ప్రకాశిత మగుచున్నవి.
వీటిలో అధిక యత్నశాలి యగునది జయించును.
తస్మాత్ పౌరుషమాశ్రిత్య సచ్ఛాసైః సత్సమాగమైః
ప్రజ్ఞామమలతాం నీత్వా సంసారజలధిం తరేత్
11 24
అందువలన పౌరుషబలము నాశ్రయించి, సాధుసంగ శాస్త్రవిచారముల వలన చిత్తశుద్ధిని సంపాదించి,
సంసార సాగరమును దాటవలెను.
ప్రాక్తనశ్చైహికళ్చేమే పురుషార్థ ఫలద్దుమౌ
సంజాతా పురుషారణ్యే జయత్యభ్యధికస్తయోః 25 25
జనులను ఈ అరణ్యమందు ప్రాక్తన, ఐహిక - పురుషకారములను రెండు ఫలవృక్షము లున్నవి.
వీటిలో నధికమైనది జయించును.

218 యోగవాసిష్ఠము
కర్మ యః ప్రాక్తనం తుచ్ఛం న నిహంతి శుభేహితైః
అజ్ఞో జంతురనీశో సావాత్మనః సుఖదుఃఖయోః ॥ 26 =
ఏ పురుషుడు నిజప్రయత్నముచేత ప్రాక్తనకర్మల నణగద్రొక్కడో, అతనికి సుఖ దుఃఖముల
రెంటియందును స్వాతంత్ర్యము లేదు.
ఈశ్వరప్రేరితో గచ్ఛేత్ స్వర్గం నరకమేవ వా|
స సదైవ పరాధీనః పశురేవ న సంశయః ॥ 27
పశుతుల్యుడగు ఈ పురుషుడు ఈశ్వర ప్రేరితుడై స్వర్గనరకముల కరుగుచు వచ్చుచుండునే గాని,
ఇతడు సర్వదా పరాధీనుడు; ఇతనికి మోక్షము లేదు.
యస్తూదారచమత్కారః సదాచారవిహారవాన్ |
స నిర్యాతి జగన్మోహాత్ మృగేంద్రః పంజరాదివ ॥ 28
సదాచార సంపన్నుడును ప్రయత్న కుశలుడును నగు వ్యక్తి, సింహము పంజరమును భేదించి
వెలువడునట్లు, ఈ జగన్మాయనుండి వెలువడును.
కశ్చిన్మాం ప్రేరయత్యేవమిత్యనర్థ కల్పనే 1
యఃస్థితో దృష్టముత్సృజ్య త్యాజ్యోఒసౌ దూరతో 2 ధమః 29 29
పురుషకారమును విడచి, ఎవరో నన్ను ప్రయత్నింప జేయుచున్నారు." అని అనర్థకల్పనల నూగులాడు
వ్యక్తిని దూరముగ పరిత్యజించుటయే మేలు.
వ్యవహారసహస్రాణి యాన్యుపాయాంతి యాంతి
యథాశాస్త్రం విహర్తవ్యం తేషు త్యక్త్యా సుఖాసుఖే ॥ 30
వేనకు వేలుగ వ్యవహారములు మనముందరకు వచ్చుచు పోవుచున్నవి. వీటియందు రాగద్వేషము
లుంచక శాస్త్రానుసార మాచరించుటయే ఉత్తమము.
యథాశాస్త్ర మనుచ్ఛిన్నాం మర్యాదాం స్వామనుజ్ఞ తః
ఉపతిష్ఠంతి సర్వాణి రత్నాన్యంబునిధావివ॥ 31
శాస్త్రానుసారము స్వీయమర్యాదను రక్షించుకొను వానికడకు, సముద్రమున రత్నములు చేరునట్లు,
అభీష్టము లన్నియు వచ్చి చేరును.
స్వార్థప్రాపకకార్యైకప్రయత్నపరతా బుధైః|
ప్రోక్తా పౌరుషశబ్దేన సా సిద్ధ్యా శాస్త్రయంత్రిత 32 32

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -6) 219
సుఖదాయకమును, దుఃఖనివృత్తికరమును నగు యత్నమునే బుధులు పౌరుషమని నిర్దేశించిరి.
శాస్త్రవిహితమగు ఇట్టి యత్నమే పురుషార్థ హేతువు.
క్రియయా స్పందధర్మిణ్యా స్వార్థసాధకతా స్వయమ్ ।
సాధుసంగమసచ్ఛాస్త్రతీక్షణయోన్నీయతే ధియా ॥ 33
బుద్ధిమంతులగు పురుషులు శుశ్రూషా, స్వాధ్యాయ, సాధుసంగమ, శ్రవణాది- క్రియలవలన చిత్తమును
కలుషరహిత మొనర్చి, ఆత్మోద్ధరణ మొనర్చుకొని, ఈప్సితసిద్ధిని బడయుచున్నారు.
అనంతం సమతానందం పరమార్థం విదుర్బుదాః
స స ఏభ్యః ప్రాప్యతే నిత్యం తే సేవ్యాః శాస్త్రసాధవః ॥ 34
బుధులు, అజ్ఞానజనితమగు వైషమ్య (-ద్వైత) నివృత్తిపూర్వకమగు సమతానందమునే పరమ
పురుషార్థమని ఎఱుంగుదురు. ఇది లభించు శాస్త్రములను, సాధువులను సతతము సేవింపవలెను.
దేవలోకాదిహాగత్య లోకద్వయహితం భవేత్|
ప్రాక్తనం పౌరుషం తద్వైదైవశనకథ్యతేI 35
పరలోకమున ననుభవింపగా మిగిలి, ఈ లోకమునకు వచ్చిన ప్రాక్తనకర్మనే దైవమందురు.
తద్యుక్తమేతదేతస్మిన్నాస్తి నాపవదామహే |
మూడై: ప్రకల్పితం దైవం మన్యంతే యే క్షయం గతాః 36
భ్రాంతమగు అదృష్టమును నిందించువారిని నిందింపము. పురుషకారమును త్యజించి, మూఢులచే
కల్పింపబడిన, అదృష్టమును ఆశ్రయించిన వారిని నిందింతుము. ఇట్టివారు నశింతురు.
నిత్యం స్వపౌరుషాదేవ లోకద్వయహితం భవేత్
హ్యస్తనీ దుష్క్రియాభ్యేతి శోభాం సత్రియయా యథా ॥ 37
అద్యైవం ప్రాక్తనీ తస్మాద్యత్నాద్యః కార్యవాన్ భవేత్,
కరామలకవద్దృష్టం పౌరుషాదేవ తత్ఫలం
మూఢః ప్రత్యక్ష ముత్సృజ్య దైవమోహే నిమజ్జతి 38
నిజ పౌరుష బలముననే ఇహపర లోకముల రెంటను మంచి చేకూరును. ప్రాక్తన దుష్కర్మలు
ప్రాయశ్చిత్తాది సత్కార్యముల శుభములుగ మారి, శోభను గూర్చుకొనును. అందువలన పురుషుడు
కార్యవంతుడు కావలెను; పౌరుష బలమున ఫలము, అరచేతియందలి ఉసిరికకాయవలె లభించును. మూఢుడే
ప్రత్యక్షమును బరిత్యజించి అదృష్ట మోహమున నిమగ్ను డగును.

220 యోగవాసిష్ఠము
సకల కారణ కార్య వివర్జితమ్
నిజ వికల్పబలాదుపకల్పితమ్ ।
తదనపేక్ష్య హి దైవమనన్మయమ్
శ్రయ శుభాశయ! పౌరుషమాత్మనః "I 39
శుభాశయా! కార్యకారణము లన్నిటినుండి విడివడిన చిత్తవృత్తిబలమున కల్పితమును, మిథ్యయు
నగు దైవము నపేక్షింపక, పౌరుషము నాశ్రయింపుము.
శాస్త్రైః సదాచార విజృంభిత దేశధర్మైః యత్కల్పితం ఫలమతీవ చిరప్రరూఢమ్
తస్మిన్ హృది స్ఫురతి చోపనమేతి చిత్త మంగావలీ తదను పౌరుష మేతదాహు : 40
చిరప్రసిద్ధములగు చిత్తశుద్ధి, జ్ఞానము అను ఫలములు వేదాది శాస్త్రములవలనను, సత్పురుషుల
ఆచరణవలనను ప్రకాశితమైన దేశధర్మము (స్వధర్మము) వలన లభించును. ఈ ఫలములను హృదయమున
స్ఫురింపజేయు ఉపాయము, వాటిని బొందవలె ననెడు వాంఛయే; పిదప, యత్నము దాని యంతట అదే
కలుగును. - దీనినే పౌరుష మందురు.
బుద్ధ్యెవ పౌరుషఫలం పురుషత్వమే తదాత్మప్రయత్నపరతైవ సదైవ కార్యా |
నేయా తతః సఫలతాం పరమామదాసాసచ్ఛాస్త్రసాధుజన పండిత సేవనేన॥ 41
మొమ్మొదట, బుద్ధిబలమున పురుషకారము నాశ్రయించి సతతము యత్నించుట ఉచితము.
పిమ్మట, శాస్త్రములను, సాధువులను, పండితులను సేవించి ఈ ప్రయత్నమును సఫల మొనర్చుట కర్తవ్యము.
దైవపౌరుషవిచారచారుభిశ్చేదమాచరిత మాత్మపౌరుషమ్|
నిత్యమేవ జయతీతి భావితైః కార్యఆర్యజన సేవయోద్యమః
11 42
దైవపౌరుషముల బలము నిట్లు విచారించి, పౌరుషము నాశ్రయించియే ఆర్యులు ఫలము నందుదురు.
కనుక, ఆర్యజన సేవితమగు శ్రవణ మననాదుల నాశ్రయించి, జ్ఞానమును బడయ నగును.
జన్మప్రబంధమయ మామయ మేష జీవో బ్యుహికం సహజపౌరుషమేవ సిద్యై ।
శాన్తిం నయత్వవితతేన వరౌషధేన మృష్టేన తుష్టపరపండిత సేవనేన ॥ 43
ఇతి శ్రీ వాసిష్ఠ- మహారామాయణే వాల్మీకీయే ముముక్షు వ్యవహార ప్రకరణే
దైవనిరాకరణం నామ షష్ఠః సర్గః ॥6
జీవులు స్వాభావికమగు ఐహిక పౌరుషమునే కార్యసిద్ధి కగు ఉపాయముగ నెంచి, నిత్యసంతుష్టులగు
గొప్పపండితుల సేవ యను ఉత్తమ ఔషధమువలన జనన మరణ రూపమగు రోగమును శాంతింప
జేసికొందురు గాక!
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు ముముక్షు వ్యవహార ప్రకరణమున దైవనిరాకరణమను షష్ఠ సర్గము 6II

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -7) 221
పౌరుష ప్రాధాన్య సమర్థనము-7
శ్రీవసిష్ఠ ఉవాచ :
ప్రాప్య వ్యాధి వినిర్ముక్తం దేహమల్పాధివేదనమ్ ।
తథా22 త్మని సమాదధ్యాద్యథా భూయో న జాయతే ॥ 1
వసిష్ఠుడు: వ్యాధులు లేనట్టిదియు, స్వల్పములగు మానసిక వ్యాధులతో గూడినట్టిదియు నగు శరీరమును
బడసి, జీవుడు మరల జన్మ నెత్తవలసిన అవసరము లేకుండు రీతి ఆత్మయందు సమాధాను డగు గాక!
దైవం పురుషకారేణ యో నివర్తితుమిచ్ఛతి |
ఇహ వా ముత్ర జగతి స సంపూర్ణాభివాంఛితః ॥ || 2
పురుష కారమువలన అదృష్టమును నివారింప యత్నించు వానికి, ఇహలోకమునను, పరలోకమునను
గూడ అభీష్టసిద్ధి యగును.
యే సముద్యోగముత్సృజ్య స్థితా దైవపరాయణాః
తే ధర్మమర్థం కామం చ నాశయన్త్యాత్మవిద్విషః ॥ 3
అదృష్టమును నమ్మి ప్రయత్న రహితులై యుండు ఆత్మశత్రువులు, ధర్మార్థ కామముల నాశన
మొనర్చుకొనుచున్నారు. ఇక మోక్షము వారి కసలే లేదని వేరుగ చెప్పవలెనా?
సంవిత్స్సందో మనఃస్పంద ఇంద్రియస్పందఏవ
ఏతాని పురుషార్థస్య రూపాణ్యేభ్యః ఫలోదయః 4
తత్వజ్ఞాన వికాసము, పురుషార్థమును సాధింప నిచ్చ, కర్మేంద్రియముల ప్రవృత్తి - ఇవి
పౌరుషముయొక్క స్వరూపములు- వీటినుండియే ఫలము లభించును.
యథా సంవేదనం చేతస్తథా తత్స్పందమృచ్ఛతి |
తథైవ కాయశ్చలతి తథైవ వలభోక్తృతా| 5
క్రియ ననుసరించియే ఫల ముండును. మనస్సున ఎట్టి విషయము స్ఫురించునో చిత్తము గూడ
అట్టి ఆకారమునే దాల్చును. ఇంద్రియముల యత్నము దీనినుండియే కల్గును.
ఆబాలమేతత్సంసిద్ధం యత్ర యత్ర యథా యథా |
దైవం తు న క్వచిద్దృష్టమతో జగతి పౌరుషమ్ ॥ 6
బాల్యమునుండి ఏ ఏ విషయములను గుఱించి, ఏ ఏ ప్రయత్నము లొనర్పబడునో, ఫలముగూడ

222 యోగవాసిష్ఠము
ఆతీరుగనే యుండును. దైవ మెచ్చటను కనబడదు. అందువలన, తేలున దేమన పౌరుష మొక్కటియే
జగత్తున నున్నది.
పురుషార్థన దేవానాం గురురేవ బృహస్పతిః |
శుక్రో దైత్యేంద్రగురుతాం పురుషార్థన చాస్థితః"I 7
పురుషకారము వలననే బృహస్పతి దేవగురు డైనాడు. శుక్రుడు రాక్షసుల కాచార్యుడై వెలయుచున్నాడు.
దైన్యదారిద్ర్యదుఃఖార్తా అపి సాధ్! నరోత్తమాః |
పౌరుషేణైవ యత్నేన యాతా దేవేంద్రతుల్యతామ్ ॥
" 8
సాధూ! దైన్యదారిద్ర్య దుఃఖమువలన పీడింపబడియు, ప్రయత్న శీలురగు మనుజు లనేకులు
పురుషకార బలమున నింద్రసము లైరి.
మహాంతో విభవాస్వాదైర్నానాశ్చర్యసమాశ్రయాః 1
పౌరుషేణైవ దోషేణ నరకాతిథితాం గతాః ॥ 9
కని విని ఎఱుగనట్టి సంపదలు గలిగిన నహుషాదులుగూడ అనేక వైభవముల భోగించియు; తమ
ప్రయత్న దోషము వలననే, నరకమున కతిథులైనారు.
భావాభావసహస్రేషు దశాను వివిధాను చ
స్వపౌరుషవశాదేవ నివృత్తా భూతజాతయః | 10
జీవులు, వేలకువేలుగ సంభవించు ఆపదలను, సంపదలను, ఇతరములగు దశలను తమ పౌరుష
బలమువలననే అవలీలగా దాటినారు.
శాస్త్రతో గురుతశ్చైవ స్వతశ్చేతి త్రిసిద్ధయః
సర్వత్ర పురుషార్థస్య న దైవస్య కదాచన॥ 11
శాస్త్రాలోచన, గురూపదేశము, నిజప్రయత్నము- ఈమూటి సాయము వలననే పురుషార్థము సర్వత్ర
సిద్ధించుచున్నది. దీని కదృష్టముతో సంబంధము లేదు.
అశుభేషు సమావిష్టం శుభేష్వేవావతారయేత్
ప్రయత్నాచిత్తమిత్యేష సర్వశాస్త్రార్థ సంగ్రహః ॥ 12
అశుభ మార్గమున నఱుగు చిత్తమును శుభమార్గమునకు ప్రయత్న బలమున మరలింపవలెను -
ఇదియే సకల శాస్త్రముల అర్థము.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -7) 223
యత్రేయోయదతుచ్ఛం చ యదపాయవివర్జితమ్
తత్తదాచర యత్నేన పుత్రేతి గురవః స్థితాః 13
వత్సా! శుభదాయకమును, పరమ సత్యమును, అపాయ రహితమును నగు కర్మను
యత్నపూర్వకముగ ఆచరించునది" అని గురుజను లుపదేశింతురు.
యథా యథా ప్రయత్నో మేఫలమాశు తథా తథా |
ఇత్యహం పౌరుషాదేవ ఫలభాఙ్నతు దైవతః 14
నే నేరీతిని బ్రయత్నింతునో, ఫలముగూడ ఆ తీరుగనే లభించును అందువలన, నేను
పౌరుషమువలననే ఫలము ననుభవించు చున్నానను విషయము నిక్కము. దైవమువలన నాకు ఫలము
చేకూరుట లేదు.
పౌరుషాదృశ్యతే సిద్దిఃపౌరుషాధీమతాం క్రమమ్ ।
దైవమాశ్వాసనామాత్రం దుఃఖే పేలవబుద్ధిషు "I 15
పౌరుష బలముననే కార్యసిద్ధి కలదు; బుద్దిమంతులు పౌరుష బలము నాశ్రయించియే కార్య
మొనర్తురు. కష్టములు సంభవించి నప్పుడు బుద్ధిహీనులను ఓదార్చుటకే దైవశబ్ద ముయోగింపబడుచున్నది.
ప్రత్యక్ష ప్రముఖైర్నిత్యం ప్రమాణైః పౌరుషక్రమః
1
ఫలితో దృశ్యతే లోకే దేశాంతరగమాదికః 16
ఈలోకము దేశాంతర గమనాదులవలన, పురుష కారమే ఫలవంతమని ప్రత్యక్ష మగుచున్నది.
భోక్తా తృప్యతి నాభోక్తా గంతా గచ్చతి నాగతిః|
వక్తా వక్తి న చావక్తా పౌరుషం సఫలం నృణామ్ 11 17
భుజించిన వానికే తృప్తి; భుజింపని వానికి తృప్తి ఎట్లు చేకూరగలదు? నడచు చున్నవాడే అరుగగలడు;
నడువని వాడెట్లు చనగలడు? వక్తయే చెప్పగలడు; మౌని మాట్లాడగలడా? అందువలన, పౌరుషమే నరులకు
సిద్ధిదాయకమని స్పష్ట మగుచున్నది.
పౌరుషేణ దురంతేభ్యః సంకటేభ్యః సుబుద్ధయః |
సముత్తరంత్యయత్నేన న తు మోఘతయానయా ॥ 18
బుద్ధిమంతులగు వారు పౌరుషము నాశ్రయించియే అనాయాసముగ గొప్పసంకటములనుండి
విడివడుచున్నారు. అదృష్టమును నమ్మి ఊరక గూర్చుండిన వారిపట్ల నియ్యది సంభవ మయ్యెడిది కాదు.

224 యోగవాసిష్ఠము
యో యో యథా ప్రయతతే స స తత్తత్పలైకభాక్ |
న తు తూష్లీం స్థితేనేహ కేనచిత్ ప్రాప్యతే ఫలమ్ 19
ఏ ఏ వ్యక్తి, ఎట్లు ఎద్దానిని గుఱించి యత్నించునో, అతడట్లే ఫలము నందును; తూష్లీం భావమును
వహించి ఊరకున్నవాని కేమియు సిద్దింపదు.
శుభేన పురుషార్థేన శుభమాసాద్యతే ఫలమ్ |
అశుభేనాశుభం రామ యథేచ్ఛసి తథా కురు ॥ 20 20
శుభపురుష కారమువలన శుభఫలము నందవచ్చును; అశుభప్రయత్నము వలన అమంగళమే
లభించును. రామా! ఇక నీ పెద్దానిని ఇచ్చింతువో, అద్దానినే ఒనర్చునది.
పురుషార్థాత్ ఫలప్రాప్తిర్దేశకాలవశాదిహ ||
ప్రాప్తా చిరేణ శీఘ్రం వా యాసౌ దైవమితి స్మృతా ॥ 21
వెనువెంటనే గానీ, ఆలస్యముననే గానీ, దేశకాలాధీనముగ పౌరుషబలమున లభించు ఫలమునే
దైవమందురు.
న దైవం దృశ్యతే దృష్ట్యా న చ లోకాంతరే స్థితమ్ |
ఉక్తం దైవాభిధానేన స్వర్లోకే కర్మణః ఫలమ్ ॥ 22 22
సర్వమున అనుభవించు దానినే దైవమందురు. దైవమన కళ్లకు కనబడనిదని గాని, ఇంకొక లోకము
నందున్నదని కాని, కాదు.
పురుషో జాయతే లోకే వర్ధతే జీర్యతే పునః
న తత్ర దృశ్యతే దైవం జరాయౌవనబాల్యవత్ II 23 25
పురుషు డీలోకముననే జన్మించుచున్నాడు, పెరుగుచున్నాడు, ముదుసలి యగుచున్నాడు; కాని
జరాయౌవన బాల్యములు ప్రత్యక్షము లగునట్లు ఇచ్చట “అదృష్టము” కనబడుట లేదే!
అర్థప్రాపకకార్యైకప్రయత్నపరతా బుధైః|
ప్రోక్తా పౌరుషశబ్దేన సర్వమాసాద్య తే నయా ॥ 24
పరమార్థమును సాధించు యత్నమునే బుధులు పౌరుష మందురు; దీనివలన అభీష్టము లన్నియు
లభించును.
దేశాదేశాంతరప్రాప్తిర్హస్తస్య ద్రవ్యధారణమ్ ।
వ్యాపారశ్చ తథాంగానాం పౌరుషేణ న దైవతః ॥ 25 25

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -7) 225
ఒకచోటనుండి ఇంకొకచోటి కరుగుట, చేతులతో వస్తువులను దీసికొనుట, ఇట్టివే యగు తక్కిన
ఇంద్రియములు ప్రయత్నములు - ఇవి పౌరుష బలముననే జరుగుచున్నవి. దైవబలమున గాదు.
అనర్థప్రాప్తి కార్యైకప్రయత్నపరతా తు యా
ప్రోక్తా ప్రోన్మత్తచేష్టేతి న కించిత్ ప్రాప్యతే నయా ॥ 26
చెడ్డనుగూర్చు పనుల నొనర్చుట పిచ్చిపని; దీనివలన కలుగన దేమియు లేదు;
క్రియయా స్పందధర్మిణ్యా స్వార్థసాధకతా స్వయమ్
సాధుసంగమసచ్ఛాస్త్రతీక్షయోన్నీయతేధియా 27
సత్సంగము, సచ్ఛాస్త్ర పర్యాలోచనలవలన బుద్ధి నిశితము కాగా, అంగస్పందన వ్యాపారమున అనగా
ప్రయత్నింప, కోరుకొనునది దొరకును.
అనంతసమతానందం పరమార్థం స్వకం విదుః
స ఏభ్యః ప్రాప్యతే యత్నాత్ సేవ్యాస్తే శాస్త్రసాధవః ॥ 28
అజ్ఞాన జనితమగు వైషమ్య నివృత్తి పూర్వకమగు అఖండానంద లాభప్రాప్తియే పరమ పురుషార్థమని
పండితు లందురు. ఇట్టి పరమార్థము లభించు శాస్త్రములను, సత్పురుషులను సేవించుట ఉచితము.
సచ్ఛాస్త్రాదిగుణో మత్యా సచ్చాస్త్రాది గుణాన్మతిః
I
వివర్ధతే మిథో భ్యాసాత్ సరోబావిన కాలతః 29
యథా సమయమున సరోవరమున తామరలు తంపరలై వృద్ధి నంది పరస్పరము శోభ నినుమడింప
జేసికొనునట్లు, సచ్ఛాస్త్ర సత్సంగములవలన బుద్ధియు, ఇట్టి బుద్ధివలన సచ్చాస్త్ర సాధుసంగమములును
వృద్ధి నందును.
ఆబాల్యాదలమభ్యసై: శాస్త్రసత్సంగమాదిభిః
గుణైః పురుషయత్నేన స్వార్థ: సంపద్యతే హితః 30
బాల్యమునుండి సాధుసంగమ సచ్ఛాస్త్రముల నభ్యసించినచో వీటివలననే అనగా పురుష
ఏప్రయత్నమువలననే హితకరమగు స్వార్థము (మోక్షము) సంపాదింపబడును.
పౌరుషేణ జితాదైత్యాః స్థాపితా భువనక్రియాః |
రచితాని జగంతీహ విష్ణునా న చ దైవతః ॥ 31
నిజప్రయత్నముననే విష్ణుమూర్తి రాక్షసులను జయించినాడు, జగత్తులను సృష్టించి రక్షించుచున్నాడు.
అదృష్టబలమున కాదు.
VI F15

226 యోగవాసిష్ఠము
జగతి పురుషకారకారణేస్మిన్ కురు రఘునాథ! చిరం తథా ప్రయత్నమ్
ప్రజని తరుసరీసృపాభిధానాం సుభగ యథా న దశామశంక ఏవ॥ 32
ఇతి శ్రీ వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే ముముక్షు వ్యవహార ప్రకరణే పౌరుష ప్రాధాన్య సమర్థనం
నామ సప్తమః సర్గః 7 ||
రాఘవా! ఈ జగత్తున పురుష ప్రయత్నమే ఇష్టసిద్ధికి కారణము. శంకను వీడి వృక్ష సర్పాదులయొక్క
స్థితి నందకుండునట్లు ఇటనే నీవు ప్రయత్నింపుము.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు, ముముక్షు వ్యవహార ప్రకరణమున పౌరుషప్రాధాన్య సమర్థనమను సప్తమ సర్గము 171
దైవ నిరాకరణము-8
శ్రీవసిష్ఠ ఉవాచ :
నాకృతిర్న చ కర్మాణి న స్పందో న పరాక్రమః |
తన్మిథ్యాజ్ఞానవద్రూఢం దైవం నామ కిముచ్యతే "I 1
వసిష్ఠుడు: అదృష్టమన నేమియో చెప్పజాలము. ఇది మిథ్యాజ్ఞానమువలె రూఢము. దీనికి ఆకారము లేదు
కర్మ లేదు, చలనము లేదు, పరాక్రమము లేదు.
స్వకర్మవలసంప్రాప్తావిదమిత్థమితీతి యాః
గిరస్తా దైవనామ్నైతాః ప్రసిద్ధిం సముపాగతాః ॥ 2
ఒనర్చిన కర్మఫలము లభించిన "ఈ కర్మ కీఫలము గలిగినది" అని చెప్పుటయే దైవమను పేరిట
ప్రసిద్ది గాంచినది.
తత్రైవ మూఢమతిభిర్దేవమస్తీతి నిశ్చయః |
ఆత్తో దురవబోధన రాజ్యామివ భుజంగమః 3
దీనివలననే (పైన జెప్పిన ప్రసిద్ధిని గాంచియే) మూఢవ్యక్తులు, భ్రాంతితో త్రాటియందు పాము
నారోపించునట్లు దైవ మున్నదని నిశ్చయించుచున్నారు.
హ్యస్తనీ దుష్క్రియాభ్యేతి శోభాం సత్రియయా యథా |
అధైవ్యం ప్రాక్తనీ తస్మాత్ యత్నాత్ సత్కార్యవాన్భవేత్ ॥
"
అప్పటికప్పుడే ఒనర్చిన చెడ్డపని సత్కార్యములవలన మంచిగ మారునట్లు, ప్రాక్తనకర్మగూడ
యత్నించిన శుభప్రదము కాగలదు. అందువలన మంచిపనుల నొనర్ప యత్నించుచుండుము.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -8) 227
మూఢానుమానసంసిద్ధం దైవం యస్యాస్తి దుర్మతే:I
దైవాదాహో స్తి నైవేతి గంతవ్యం తేన పావకే ॥
ఏ దుర్మతులు, మూఢులు అనుమానించి స్థాపించిన దైవమును నమ్ముదురో, వారు దైవ బలమున
అగ్ని మమ్ము దహింపదు అని నిశ్చయించి అగ్నిలో బడుట ఉచితము.
దైవ యేనేహ చేత్ కర్తృ పుంసః కిమివ చేష్టయా 1
స్నానదానాసనోచ్చారాన్ దైవమేవ కరిష్యతి ॥ 6 I
ఈ ప్రపంచమున దైవమునకే కర్తృత్వ మున్నయెడల, ఇక పురుష ప్రయత్న మేల? దైవమే స్నాన,
దాన, జపాదుల నొనర్చును.
కిం వా శాస్త్రోపదేశేన మూకో యం పురుషః కిల
సంచార్యతే తు దైవేన కిం కస్యేహోపదిశ్యతే11 7
మఱియు, శాస్త్రోపదేశముయొక్క ప్రయోజన మేమి? ఉపదేశించుట ఎందులకు? దైవమే అన్నిటిని
ఒనర్చును - పురుషుడు ప్రయత్నమును వీడు గాక!
న చ నిస్పందతా లోకే దృష్టేహ శవతాం వినా ।
స్పందాచ్ఛ ఫలసంప్రాప్తి స్తస్మాదైవం నిరర్థకమ్ ॥ 8
శవము తప్ప, ఈ ప్రపంచమున యత్నింపని దింకొకటి లేదు. యత్నము వలననే ఫలము లభించును.
అందువలన తేలున దేమన, దైవము (అదృష్టము) నిష్ప్రయోజనము.
న చామూర్తేన దైవేన మూర్తస్య సహ కర్తృతా I
పుంసః సందృశ్యతే కాచిత్ తస్మాదైవం నిరర్థకమ్ "I 9
ఆకృతి లేని దైవమును, ఆకృతి కల్గిన మనుజుడును ఒనర్చు ప్రయత్నము సమానములు కావు;
మిక్కుటముగ తారతమ్య మున్నది. అందువలన దైవము నిష్ప్రయోజనము.
మిథోగాని సమాసాద్య ద్వయోరేకైకకర్తృతా!
హస్తాదీనాం హతత్వే హ న దైవేన క్వచిత్ కృతమ్ ॥ || 10
కలమో లేక కత్తియో దొరికిన, రెండు చేతులలో నొకటి పనిచేయును; ఒకేసారిగ చేతులు రెంటితో
వ్రాయ వీలులేనందున ఒక్కటియే పని నొనర్చును. కాలుసేతులు లేనివానిచే దైవమేమైన ఒనర్పింపగలదా?

228 యోగవాసిష్ఠము
మనోబుద్ధివద ప్యేతదైవం నేహానుభూయతే |
ఆగోపాలం కృతప్రజ్ఞేస్తేన దైవమసత్సదా ॥ 11
ఈ జగత్తున మూఢుడగు గొల్లపిల్లవానినుండి మహామేధావి యగు పండితునివఱకు, దైవమును
మనో బుద్ధుల నెల్ల ప్రత్యక్ష మొనర్చుకొనిన వారెవరును లేరు; అందువలన దీనికి ఉనికిమనుకులు లేవు.
పృథక్చేత్ బుద్ధిరన్యో ర్థః సైవ చేత్ కాన్యతా తయోః |
కల్పనాయాం ప్రమాణం చేత్ పౌరుషం కిం న కల్ప్యతే 12
కర్మల నొనర్ప నుపయోగపడు బుద్ధి, దైవము- ఈరెండును వేరైనచో, దైవమును స్వీకరింపవలసిన
అవసరము లేదు. ఈ రెండును ఒకటియే, దైవము ననుసరించి బుద్ధి ప్రవర్తిల్లు చుండునందువా? మఱి,
ఈ రెంటికిని భేద మేమున్నది? అందువలన, బుద్దిగాక దైవమను వేరొక వస్తువున్నదని ఒప్పుకొన నక్కరలేదు.
సమానబుద్ది బలము గల ఇర్వురు ఒకే ఫలమునందే యత్నింపగా, అందులో నొకడు కృతకృత్యుడై మరొకడు
ఫలము నందుట తటస్థింపనప్పుడు, దీనికి గారణము దైవమే యని చెప్పుట యేల? ప్రయత్న దోషమని
నుడువరాదా! - ఇట్లనిన దోషమేమి?
నామూర్తేస్తేన సంగోస్తే నభసేవ వపుష్మతః I
మూర్తం చ దృశ్యతే లగ్నం తస్మాదైవం న విద్యతే 13
ఆకాశమను శరీరము తాకజాలదు. అట్లే, రూపము లేని దైవముతో కారణాంతరముయొక్క కలయిక
అసంభవము. ఆకృతి గల రెండువస్తువులకే పరస్పర సంయోగము. అందువలన, దైవ మనునది లేదని
ఏర్పడుచున్నది.
వినియోక్రథ భూతానామస్త్యన్యచ్చేజ్జగత్రయే |
శేరతే భూతప్పందాని దైవం సర్వం కరిష్యతి 14
ఈ ప్రపంచమున నియోగకర్త దైవమే యైన, జీవుల నందరిని పరుండనిమ్ము. దైవమే వలసిన దాని
నంతటిని ఒనర్చును!
దైవేన త్వభియుక్తో హం తత్కరోమి దృశం స్థితమ్ ।
సమాశ్వాసనవాగేషా న దైవం పరమార్థతః || 15
నేను అదృష్ట ప్రేరితుడనై పనుల నన్నిటిని ఒనర్చుచున్నాను, అదృష్ట బలముననే అన్నియు ఇట్లు
సిద్దించుచున్నవి." - ఇది ఓదార్పు మాత్రమే. అసలునకు దైవము లేదు.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -8) 229
మూడైః ప్రకల్పితం దైవం తత్పరాస్తే క్షయం గతాః |
ప్రాజ్ఞాస్తు పౌరుషార్థేన పదముత్తమతాం గతాః ॥ 16
మూఢులే అదృష్ట కల్పన నొనర్చినారు; అదృష్టపరాయణు లగువారు నశింతురు. బుద్ధిమంతు లగువారు
పురుష కారము వలననే గొప్పతన మందినారు.
యే శూరా యే చ విక్రాంతా యే ప్రాజ్ఞా యే చ పండితాః
తైసైః కిమివ లోకే స్మిన్ వద దైవం ప్రతీక్ష్యతే || 17
శూరులును, పరాక్రమ యుతులును, బుద్ధిమంతులును, పండితులును నగు వారేల దైవము కొఱకు
వేచియుండవలెనో చెప్పుము.
కాలవిద్భిర్వినిర్ణీతా యస్యాతిచిరజీవితా ।
స చేజ్జీవతి సంచ్ఛిన్నరాస్తదై వముత్తమమ్ 18
దైవజ్ఞులు (జ్యోతిష్కులు) 'చిరంజీవి, చాలకాలము బ్రతుకును' అని చెప్పిన వాని తల ఊడినను
జీవించి యుండుచో, దైవమే గొప్పదందురు.
కాలవిద్భిర్వినిర్ణీతం పాండిత్యం యస్య రామవ!
అనధ్యాపిత ఏవాసౌ తద్జ్ఞశ్చేదైవముత్తమమ్
I 19
రామా! దైవజ్ఞులచే పండితు డగునని నిర్ణయింప బడినవాడు, చదువకయే పండితుడైన అదృష్టమే
గొప్పదందును.
విశ్వామిత్రేణ మునినా దైవముత్సృజ్య దూరతః
పౌరుషేణైవ సంప్రాప్తం బ్రాహ్మణ్యం రామ! నాన్యథా 20
రాఘవా! విశ్వామిత్రుడు అదృష్టమును దూరమున విడిచిపెట్టి పురుష కారము వలననే బ్రాహ్మణత్వ
మందినాడు. అదృష్టము నాశ్రయించి కాదు.
అస్మాభిరపరై రామ! పురుషైర్మునితాం గతైః |
పౌరుషేణైవ సంప్రాప్తా చిరం. గగనగామితా ॥ 21
రామా! మేముకూడ, పురుష కారము నాశ్రయించియే మునుల మైతిమి; ఆకాశగమన శక్తిని
సంపాదించితిమి.
ఉత్సాద్య దేవసంఘాతం చక్రస్త్రిభువనోదరే |
పౌరుషేణైవ యత్నేన సామ్రాజ్యం దానవేశ్వరాః 22

230 యోగవాసిష్ఠము
రాక్షసరాజులు పౌరుషము నాశ్రయించియే దేవతలను నలుగగొట్టి, ముల్లోకములందు తమ ఏలుబడిని
సాగించిరి.
ఆలూనశీర్ణమాభోగి జగదాజహ్రురోజసా|
పౌరుషేణైవ యత్నేన దానవేభ్యః సురేశ్వరాః 23 23
దేవతలుగూడ పౌరుషము నాశ్రయించియే, యుద్ధమున ఛిన్నమును జీర్ణమును ఒనర్పబడిన
శత్రుసైన్యము గల (శత్రువులు హతమార్చి అనుట) ఈ జగత్తును హరించిరి.
రామ! పౌరుషయుక్త్యా చ సలిలం ధార్యతే నయా |
చిరం కరణకే చారు న దైవం తత్ర కారణమ్ ॥ 24
వెదుళ్ళతో నల్లిన బుట్టయందు నీరు నిలుచుట పురుషప్రయత్నము వలననే ; అదృష్టబలమున కాదు.
భరణాదానసంరంభవిభ్రమశ్రమభూమిషు
శక్తతా దృశ్యతే రామ న దైవస్యౌషధేరివ 25
రామా! కుటుంబ పోషణము శత్రురాజ్యాపహరణము, భోగవిలాసములు, కోపమున నితరుల
నరికట్టుట-ఇత్యాదులగు పెక్కులు కష్టకార్యములు పురుష ప్రయత్నమువలననే జరుగుచున్నవి. మణి, మంత్ర,
ఔషధముల శక్తివలె, ఆశ్చర్యకర మగురీతిని అదృష్టము వీటి నొనర్చుట లేదు; దీని శక్తియే కనబడుట లేదు.
సకలకారణకార్యవివర్జితం నిజవికల్పవశాదుపకల్పితమ్ |
త్వమనపేక్ష్య హి దైవమసన్మయం శ్రయ శుభాశయ! పౌరుషముత్తమమ్ ||26
ఇతి శ్రీ వాసిష్మ - మహారామాయణే వాల్మీకీయే ముముక్షు వ్యవహార ప్రకరణే దైవనిరాకరణం నామ
అష్టమః సర్గః 8 ॥
శుభాశయా! చాలూమూలా" లేని భ్రాంతివలన గల్పింపబడిన మిథ్య యగు దైవము నపేక్షింపక,
ఉత్తమ మగు పౌరుషము నాశ్రయింపుము.
ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు ముముక్షువ్యవహార ప్రకరణమున దైవనిరాకరణ మను అష్టమ సర్గము II 8 I


ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -9) 231
కర్మవిచార వర్ణనము - 9
శ్రీరామ ఉవాచ:
భగవన్! సర్వధర్మజ్ఞ! ప్రతిష్ఠాఫలమాగతమ్
యల్లోకే తద్వద బ్రహ్మన్! దైవం నామ కిముచ్యతే "I 1
రాముడు: సర్వధర్మజ్ఞా! విప్రవర్యా! భగవానుడా! ప్రపంచమున ప్రసిద్ధి గాంచిన ఈ దైవమను పదార్థము
సత్యముగ నున్నదా లేదా? చెప్పుడు (వెనుక, దైవమను వస్తువసలే లేదని కొన్ని చోట్ల, పూర్వజన్మలయందలి
కర్మయే దైవ మని కొన్నిచోట్ల, చెప్పబడినది. అందువలన దైవమును గుఱించి చక్కగ తెలిసికొనుటకై ఈ
ప్రశ్న యొనర్పబడినది.)
శ్రీ వసిష్ఠ ఉవాచ :
పౌరుషం సర్వకార్యాణాం కర్తృ రాఘవ! నేతరత్
ఫలభోక్తృ చ సర్వత్ర న దైవం తత్ర కారణమ్
2
వసిష్ఠుడు: పౌరుషమే పనులన్నిటిని ఒనర్చుచున్నది. ఫలితముల నన్నిటిని అదే యనుభవించుచున్నది.
దైవము లేక మఱింకొక వస్తువు కర్తయును కాదు, భోక్తయును కాదు.
దైవం న కించిత్ కురుతే న భుంక్తేన చ విద్యతే
న దృశ్యతే నాద్రియతే కేవలం కల్పనేదృశీ 3
దైవ మొనర్చున దేమియు లేదు; ఇది భోగించున దేమియు లేదు. దీని నెవ్వరు గనుట లేదు.
ఆదరించుట లేదు. ఇది కేవలము కల్పనామాత్రమే.
సిద్ధస్య పౌరుషేణేహ ఫలస్య ఫలశాలినా
శుభాశుభార్థసంపత్తిరై వశబ్దేన కథ్యతే | 4
ఫలప్రదమగు పౌరుషమువలన లభించు శుభాశుభ కర్మలను, లోకులు దైవమని వ్యవహరించుచున్నారు.
పౌరుషోపనతా నిత్యమిష్టానిష్టస్య వస్తునః
ప్రాప్తిరిష్టాప్యనిష్టా వాదైవశనకథ్యతే|| 5
పౌరుషమువలన లభించు ఇష్టానిష్టములను అజ్ఞులగువారు దైవమనుచున్నారు.
భావీత్వవశ్యమేవార్థ: పురుషార్ధికసాధనః |
యః సోస్మిన్లోకసంఘాతే దైవశనకథ్యతే| 6

232 యోగవాసిష్ఠము
ఒక్క పురుషార్థమువలననే ఈలోకమున ఫల మవశ్యము లభించుచున్నది. దీనినే జనులు దైవ
మనుచున్నారు.
నను రాఘవ! లోకస్య కస్యచిత్ కించిదేవ హి |
దైవమాకాశరూపం హి కరోతి న కరోతి చ ॥ 7
రాఘవా! దైవమునకు రూపము లేదు. దైవమువలన ఎవరికైన, ఏదైన చేకూరిన దనుట భ్రమయే,
వాస్తవమునకు, దైవ మొనర్చునది గాని, ఒనర్పకుండునది గాని ఏమియు లేదు.
పురుషార్థస్య సిద్ధస్య శుభాశుభఫలోదయే |
ఇదమిత్థం స్థితమితి యోక్తిస్తదైవముచ్యతే11 8
పురుషప్రయత్నము ననుసరించి శుభాశుభ ఫలములు లభించిన, జనులు మాటవరసకు వీడి
అదృష్టమిట్లా ఉంది. అని నుడువుదురు. ఈ మాటయే దైవము. అసలునకు దైవము లేదని భావము.
ఇత్థం మమాభవద్బుద్ధిరితం మే నిశ్చయో హ్యభూత్ ।
ఇతి కర్మఫలప్రాప్తా యోక్తిస్తవముచ్యతే||| 9
కర్మఫలము లభింప నాకిట్టి బుద్ధి కలిగినది. ఇట్లు నిశ్చయించుకొంటిని. ఇట్టి ఫలము లభించినది
అందురు. ఈ మాటయే దైవకల్పనకు మూలము.
ఇష్టానిష్టఫలప్రాప్తావిదమిత్యస్య వాచకమ్
ఆశ్వాసనామాత్రవచో దైవమిత్యేవ కథ్యతే "I 10
ఇష్టానిష్ట ఫలములు లభింప పూర్వకర్మవలనే ఇట్టి ఫలము కలిగినది. అని చెప్పబడు మాటయే దైవము.
శ్రీరామ ఉవాచ:
భగవన్! సర్వధర్మజ్ఞ! యత్రాక్కర్మోపసంచితమ్
తదైవం దైవ మిత్యుక్తమపమృష్టం కథం త్వయా || 11
రాముడు: సర్వధర్మజ్ఞా! భగవానుడా! పూర్వకర్మల సంచితమే దైవమని మరల మరల నుడుపుచు, మరల
లేదనుచున్నారు. ఇదేమి?
శ్రీవసిష్ఠ ఉవాచ:
సాధు! రాఘవ! జానాసి శృణు వక్ష్యామి తే ఖిలమ్ |
దైవం నాస్తితి తే యేన స్థిరా బుద్దిర్భవిష్యతి 12

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -9) 233
శ్రీవసిష్ఠుడు: రాఘవా! నీకు వివరించి చెప్పిన, ఈ విషయమును చక్కగ తెలిసికొనగలవు. చెప్పుచున్నాను,
మంచిది, వినుము. దీనివలన “దైవము లేదు. అను నిశ్చయము నీకు కలుగగలదు.
యా మనోవాసనా పూర్వం బభూవ కిల భూరి శః
సై వేయం కర్మభావేన నృణాం పరిణతిం గతా ॥ 13
వెనుకటి జన్మలలోనివగు వాసనలు ప్రబోధితములై, కర్మలుగ మారును.
జంతుర్యద్వాసనో రామ! తత్కర్తా భవతి క్షణాత్ |
అన్యకర్మానయభావశ్చేత్యేతన్నైవో పపద్యతే
II 14
రామా! వాసనల ననుసరించియే జీవుడొనర్చు కర్మగూడ నుండును. కర్మ లొకరీతిగను, మనోభావ
మింకొకట్లుగను నుండవు.
గ్రామగో గ్రామమాప్నోతి పత్తనార్థీ చ పత్తనమ్ ।
యో యో యద్వాసనస్తత్ర న స ప్రయతతే సదా ॥ 15 15
పల్లెకు పోగోరువాడు పల్లెనే చేరును. పట్టణమున కరుగగోరు నాతడు పట్టణమునకే ఏగును. (అట్లే)
ఎవనికెట్టి వాసన లుండునో వాడు వాటి నిమిత్తమే ఎల్లప్పుడు యత్నించుచుండును.
యదేవ తీవ్రసంవేగాదఢం కర్మకృతం పురా |
తదేవ దైవశబ్దేన పర్యాయేణేహ కథ్యతే 16
ఫలమును బొంద మిక్కుటమగు కోర్కెతో తీవ్రముగ నొనర్పబడు కర్మయే దైవ మనబడుచున్నది.
దీనినే దైవమనికూడ వ్యవహరించుచున్నారు.
ఏవం కర్మస్థ కర్మాణి కర్మప్రౌఢా స్వవాసనా ।
వాసనా మనసో నాన్యా మనో హి పురుషః స్మృతః 17
కర్తయొక్క కర్మలన్నియు పైరీతిగనే నిర్వహింపబడుచున్నవి. బలమును గూర్చుకొనిన వాసనలే కర్మలు.
ఈ వాసనలు మనస్సుకంటే భిన్నములు కావు. మనస్సుగూడ ఆత్మకంటె వేరు కాదు.
యదైవం తాని కర్మాణి కర్మ సాధో మనో! హి తత్ |
మనో హి పురుషస్తస్మాదైవం నాస్తితి నిశ్చయః 18
సాధూ! దైవమని చెప్పబడునదే కర్మ; ఈ కర్మయే మనస్సు; ఈ మనస్సే పురుషుడు. అందువలన,
పురుష కారముకంటే వేరొకటి లేదని తేలుచున్నది. దైవము మిథ్య.

234 యోగవాసిష్ఠము
ఏష ఏవ మనో జంతుర్యద్యత్ ప్రయతతే హితమ్ |
కృతం తత్తదవాప్నోతి స్వత ఏవ హి దైవతః | 19
ఈ జీవుడు మనోరూపమున నొనర్చు కార్యముల ఫలములను స్వస్వరూపుడగు దైవము నుండియే
పడయును.
మనశ్చిత్తం వాసనా చ కర్మ దైవం చ నిశ్చయః 1
రామ! దుర్నిశ్చయస్యైతా సంజ్ఞాస్సద్భిరుదాహృతాః"I 20 230
రామా! మనస్సు, చిత్తము, వాసన, కర్మ, దైవము - ఇవన్నియు చిజ్జడ భేదభావ నిశ్చయము లేని
మనస్సు గల పురుషుని పర్యాయ పదములని మావలన (సాధువులవలన) చెప్పబడుచున్నవి.
ఏవం నామా హి పురుషో దృఢభావనయా యథా |
నిత్యం ప్రయతతే రామ! ఫలమాప్నోత్యలం తథా ॥ 21
రామా! ఇట్టి పురుషుడు దృఢమగు భావనా బలమున నెట్లు యత్నించునో, ఫలములను గూడ నట్లే
పడయును.
ఏవం పురుషకారేణ సర్వమేవ రమూద్వహ!
ప్రాప్యతే నేతరేణేహ తస్మాత్ స శుభదో2స్తు తే ॥ 22
రఘుపుంగవా! ఇట్లు, పురుషకార మొక్కదానివలననే అభీష్టము లన్నియు సిద్దించుచున్నవి;
అదృష్టమువలన కాదు. అందువలన, ఈ పురుషకారము నీకు శుభదాయక మగు గాత!
శ్రీరామ ఉవాచ :
ప్రాక్తనం వాసనాజాలం నియోజయతి మాం యథా
మునే! తథైవ తిష్ఠామి కృపణః కిం కరోమ్యహమ్ ॥ 23 2 రాముడు: మునీంద్రా! ప్రాక్తన వాసనా సమూహములు నన్నెట్లోనర్పింప జేయుచున్నవో, అట్లే 43
ఒనర్చుచున్నాను. దీనుడ నగు నేనేమి చేయగలను?
శ్రీవసిష్ఠ ఉవాచ:
అత ఏవ హి రామ! త్వం శ్రేయః ప్రాప్నోషి శాశ్వతమ్ । |
స్వప్రయత్నవనీతేన పౌరుషేణైవ నాన్యథా ॥ 24
శ్రీవసిష్ఠుడు: రామా! అందువలననే, ఇప్పుడు ప్రయత్నించిన పురుష కారమువలననే నీకు శాశ్వతమగు
శ్రేయస్సు లభించును.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -9) 235
ద్వివిధో వాసనావ్యూహ శ్శుభశ్చైవాశుభశ్చ తే |
ప్రాక్తనో విద్యతే రామ! ద్వయో రేకతరో 2 థవా ॥ 25
రామా! శుభాశుభములగు ప్రాక్తన వాసనలు నీకున్నవి; లేక ఈ రెంటిలో నొక తెగకు జెందినవి
నీకున్నవి.
వాసనౌఘేన శుద్ధేన తత్ర చేదద్య నీయసే |
తత్రమేణ శుభేనైవ పదం ప్రాప్స్యని శాశ్వతమ్ "I 26
వీటిలో శుభములగు వాసనలవలన నీవు ప్రేరేపితుడ వైనపట్ల, శుభ పురుషకార బలమున క్రమముగ
శాశ్వతమగు ముక్తిని బొందగలవు.
అథ చేదశుభో భావస్యాం యోజయతి సంకటే ॥
ప్రాక్తనస్తదసౌ యత్నాజ్జేతవ్యో భవతా బలాత్ II 27
అట్లుగాక, అశుభవాసనలు ప్రబలములై నిన్ను కష్టములందు బ్రవేశపెట్టుచో, వాటిని ప్రయత్నించి
బలవంతముగ పెకల్చి పారవేయవలెను.
ప్రాజ్ఞశ్చేతనమాత్రస్త్యం న దేహస్యం జడాత్మకః 1
అన్యేన చేతసా తత్తే చేత్య త్వం క్వేవ విద్యతే || 28
నీవు ప్రాజ్ఞుడవగు చైతన్యస్వరూపుడవు; జడస్వరూప మగు దేహమవు కావు. నీవు చిన్మాత్ర
స్వరూపుడవు. అందువలన నీ వితరులకు లొంగి యుండవలసిన అవసరము లేదు.
అన్యస్యాం చేతయతిచేత్ తం చేతయతి కో పరః|
క ఇమం చేతయేత్తస్మా దనవస్థా న వాస్తవీ ॥ 29
నన్నితరులు చేతిత మొనర్చుచున్నా రనిన, వారిని మరల నెవ్వరు చేతిత మొనర్చుచున్నారు? ఈ
చేతయితను చేతిత మొనర్చుచున్న దెవరు? ఇట్లు అనవస్థా దోషము సంభవించు చున్నట్లు; ఇది వస్తుసిద్ధికి
ప్రతిబంధకము. ఇట్టి తలపు మిథ్య. నీవే చేతయితవు.
శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతీ వాసనాసరిత్ ,
పౌరుషేణ ప్రయత్నేన యోజనీయా శుభే పథి ॥ 30
ఈ వాసనానది శుభాశుభ మార్గములు రెంటను బ్రవహించుచున్నది. పురుష ప్రయత్నము వలన
దీనిని మంచి మార్గమున పెట్టవలెను.

236 యోగవాసిష్ఠము
అపబేషు సమావిష్టం శుభేష్వేవావతారయI
స్వం మనః పురుషార్థన బలేన బలినాం వర! 31
బలిష్ఠశ్రేష్ఠా! మనస్సు చెడుత్రోవలో బ్రవేశించిన, నీ పురుషకార బలమున దానిని మంచి త్రోవకు
మరల్చుము.
అశుభాచ్చాలితం యాతి శుభం తస్మాదపీతరత్ |
జంతోశ్చిత్తం తు శిశువత్ తస్మాత్ తచ్చాలయేద్బలాత్ II 32 32
జీవుని చిత్తము శిశువువలె చంచలము. దానిని, చెడునుండి మంచికి త్రిప్పిన, మంచికే మరలును.
మరల మంచినుండి మరల్చిన చెడ్డకు మ్రొగ్గును. అందువలన, చిత్తమును బల పూర్వకముగ మంచికి
మరల్పుము.
సమతా సాంత్వనేనాశు నద్రాగితి శనైః శనైః|
పౌరుషేణైవ యత్నేన పాలయేచ్చిత్తబాలకమ్ 33
33
ఇట్లు, చిత్తమను బాలుని వెంటనే - మృత్యువు దాపురించును గాన - ఉపాయముతో రాగాది
వైషన్యుములను వర్జింపజేసి, స్వాభావికమగు సమత్వమందు నల్గొనర్చునది. పిమ్మట, నెమ్మదిగ ఆత్మ
స్వరూపమున నిల్చునట్లు యత్నింపుము. హఠాత్తుగ, నిరోధ మొనర్పవలదు; ఏలయన, సమాధానమున
నిలుకడ కలుగక పోవచ్చును.
వాసనౌమస్యయా పూర్వమభ్యాసేన మనీకృతః |
శుభోవాప్యశుభోవా పి శుభమద్య మనీకురు ॥ వాపి 34
ఇంతదనుక, నీవు శుభాశుభ వాసనల రెంటిని గుదిగూర్చి కొంటివి; కాని, ఇటనుండి శుభవాసనలను
మాత్రమే గట్టి చేసికొనుము.
ప్రాగభ్యాసవశాద్యాతా యదా తే వాసనోదయమ్ ।
తదాభ్యాసస్య సాఫల్యం విద్ధి త్వ మరిమర్దన! 35
శత్రుమర్దనా! అభ్యాసవశముననే వాసనలు ప్రబలము లగుచున్నవని స్పష్టము; కనుక అభ్యాసము
ఫలవంతమని గ్రహింపుము.
ఇదానీమపి తే యాతి మనతాం వాసనానమ!
అభ్యాసవశతస్తస్మాచ్ఛుభాభ్యాసముపాహర 36 "I

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -9) 237
అనఘా! ఇప్పుడుకూడ అభ్యాసమువలననే నీ వాసనలు దట్టమగుచున్నవి. అందువలన, శుభవాసనలనే
అలవరుచుకొమ్ము.
పూర్వం చేర్హనతాం యాతా నాభ్యాసాత్తవ వాసనా ।
వర్ధిష్యతే తు నేదానీమపి తాత! సుఖీభవ ॥ 37
పూర్వపు చెడువాసనలు అభ్యాసమువలన దృఢము కాలేదందువా? - అవి ఇప్పటి చెడ్డవాసనలవలన
వృద్ధినందవు, కనుక, దుఃఖింపవలసిన అవసరము లేదు; సుఖింపుము.
సందిగ్ధాయామపి భృశం శుభామేవ సమాహర
అస్యాం తు వాసనావృద్ధా శుభాద్దోషో న కశ్చన ॥ I 38
అభ్యాసమువలన వాసనలు వృద్ధినందునా? అను సందియము కలిగినను, శుభవాసలకే సేవింపుము.
శుభ-ఆచరణవలన మంచివాసనలు వృద్ధినందును, కీడు లేదు.
యద్యదభ్యస్యతే లోకే తన్మయేనైవ భూయతే |
ఇత్యాకుమారం ప్రాజ్ఞేషు దృష్టం సందేహవర్జితమ్ || 39
ఈ జగత్తున ఎట్లభ్యసించునో, అట్లే యగును. ఈసంగతి "బుడుత" మొదలుగ “ముదుకని”
వఱకు అందఱికిని తెల్లము; సంశయింప నక్కరలేదు.
శుభవాసనయా యుక్తస్తదత్ర భవభూతయే ।
పరం పౌరుషమాశ్రిత్య విజిత్యేంద్రియ పంచకమ్ విజిత్యేంద్రియపంచకమ్ ॥ 40
అందువలన, నీవు మంచి కొఱకు, పౌరుషము నవలంబించి శుభవాసనల చేకూర్చుకొని,
పంచేద్రియములను జయింపుము.
అవ్యుత్పన్నమనా యావద్భవానజ్ఞాతతత్పదః
గురుశాస్త్ర ప్రమాణైస్తు నిర్ణీతం తావదాచర॥ 41
మనస్సుయొక్క స్థితిని గ్రహింప జాలనంతవఱకు, తత్త్వజ్ఞానము లభింపనంతవఱకు గురువు
శాస్త్రము, యుక్తి, -అనుభవములవలన నిర్ణయింపబడిన కర్మల నాచరింపుము.
తతః పక్వకషాయేణ నూనం విజ్ఞాతవస్తునా
శుభో వ్యసౌ త్వయా త్యాజ్యో వాసనౌఘో నిరాధినా ॥ 42
అనంతరము, రాగాది వాసనా కషాయములు శిథిలములు కాగా, ఆత్మవస్తువు ప్రతిభాత మగును'

238 యోగవాసిష్ఠము
అప్పుడు, నీ మనోవ్యాధు లన్నియు నశించును; శుభవాసనలుగూడ ఉండవు.
యదతిసుభగ మార్య సేవితం తత్ శుభమనుసృత్య మనోజ్ఞ భావబుద్ధ్యా
అధిగమయ పదం సదా విశోకం తదను తదప్యవముచ్య సాదు! తిష్ఠ "I 43
ఇతి శ్రీవాసిష్ఠ-మహారామాయణే వాల్మీకీయే ముముక్షువ్యవహార ప్రకరణే కర్మ విచారో నామ నవమః సర్గః 9
అందువలన, నీవు ఆర్యులవలన సేవింపబడు ఆ అతిసుందర శుభపదమును, శుభవాసనా బుద్ధితో
నిరంతరము అనుసరించుచు, శోకరహిత మగు పరమార్థ వస్తువును సాక్షాత్కరింప జేసికొనుము. తదుపరి
ఆ శుభవాసనల ననుసరించుటను గూడ వదలి, సత్స్వరూపమున అవస్థితుడవు కమ్ము.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు ముముక్షువ్యవహార ప్రకరణమున కర్మవిచారమను నవమసర్గము. ॥ 9 ॥
జ్ఞానావతరణము-10
శ్రీవసిష్ఠ ఉవాచ :
యథా స్థితం బ్రహ్మతత్త్వం సత్తానియతిరుచ్యతే
సా వినేతుర్వినేతృత్వం సా వినేయవినేయతా ॥
1
శ్రీవసిష్ఠుడు: బ్రహ్మతత్యము స్వయంప్రకాశము: ఇది సచ్చిదానంద స్వరూపమున సర్వత్ర వెలయుచున్నది.
దీని సత్తవలననే ఇతరము లన్నియు వెలుగొందుచున్నవి. ఇదియే భవిష్యత్కాల వ్యవహారమున నియతి
యనబడుచున్నది. కార్యకారణ స్వరూపముగూడ నిదియే.
అతః పౌరుషమాశ్రిత్య శ్రేయసే నిత్యబాంధవమ్ ।
ఏకాగ్రం కురు యచ్చిత్తం శృణు చోక్తమిదం మమ ॥
బ్రహ్మసత్తయే నియతి: అందువలన, ప్రతికూల శంకకు తావు లేదు. నాపల్కుల నాలించి
మంచికొఱకు, నిత్యబంధువగు చిత్తమును పౌరుష బలమున ఏకాగ్ర మొనర్పుము.
అవాంతరనిపాతీని స్వరూఢాని మనోరథమ్ ।
పౌరు షేణేంద్రియాణ్యాశు సంయమ్య సమతాం నయ ॥ 3
ఇంద్రియములు మనోరథముల నారోహించిన ముక్తికి ప్రతిబంధకములగు ఐహిక లేక పారలౌకిక
సుఖములందు గూలును. అగుటచే, దీనిని వాటియందు, పడకుండునట్లు పురుషకార బలమున నరికట్టి,
సమత్వమును సాధింపుము.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -10) 239
ఇహాముత్ర చ సిద్ధ్యర్థం పురుషార్థఫలప్రదామ్ ।
మోక్షోపాయమయీం వక్ష్యే సంహితాం సారనిర్మితామ్ ॥ 4
జ్ఞానదాయకమును, పురుషార్థ ప్రదమును, సారయుతమును నగు సంహితను వచించుచున్నాను.
ఇది స్వర్గవాసులకును, భూలోక వాసులకును, అధికార భేదము ననుసరించి ఉపయోగపడగలదు.
అపునర్గ్రహణాయాంతస్త్యక్త్యా సంసారవాసనామ్ ।
సంపూర్ణే శమసంతోషావాదాయోదారయా ధియా ॥ 5
స పూర్వాపర వాక్యార్థ విచారవిషయాహతమ్ |
మనస్సమరసం కృత్వా సానుసంధానమాత్మని II 6
సుఖదుఃఖక్షయకరం మహానందైకకారణమ్ ।
మోక్షోపాయమిమం రామ! వక్ష్యమాణం మయా శృణు "I 7
రామా! దేనికొఱకు సంసార వాసనలను దృజించి ఉదార బుద్ధితో సంపూర్ణముగ శమ సంతోషములను
గూర్చుకొనవలయునో; దేని నిమిత్తము కర్మకాండ జ్ఞానకాండల అర్థవిచారమును సల్పి, మనస్సును సమర
సతత్త్యమున నిల్పి ఆత్మాను సంధానము నొనర్పవలెనో; ఎద్ది సుఖదుఃఖాది ద్వంద్వనాశన హేతువో- అట్టి
యీ మోక్షోపాయమును - మరల జన్మ నెత్తవలసిన అవసరము లేకుండుటకుగాను - వచించుచున్నాను, వినుము.
ఇమాం మోక్షకథాం శ్రుత్వా సహ సర్వైర్వివేకిభిః |
వరం యాస్యసి నిర్దుఃఖం నాశో యత్ర న విద్యతే 8
ఈ మోక్షకథను వివేకులతోగూడి వినిన, అక్షయమును, దుఃఖ రహితమును నగు పదము నందెదవు.
ఇదముక్తం పురాకల్పే బ్రహ్మణా పరమేష్ఠినా1
సర్వదుఃఖ క్షయకరం పరమాశ్వాసనం ధియః ॥ 9
దుఃఖముల నన్నిటిని నాశన మొనర్చు నదియు, మనశ్శాంతి కరమును నగు, ఈమోక్ష కథను
కల్పాదియందు, పరమేష్ఠి యగు బ్రహ్మ వచించినాడు.
శ్రీరామ ఉవాచ :
కేనోక్తం కారణేనేదం బ్రహ్మన్ ! పూర్వం స్వయంభువా
కథం చ భవతా ప్రాప్తమేతత్ కథయ మే ప్రభో ॥ 10 10
రాముడు: బ్రహ్మజ్ఞా! పూర్వము బ్రహ్మ ఇద్దానిని, ఎవరికి, ఎందులకు, చెప్పినాడో వచింపుడు, ప్రభూ!
దీనిని మీరెట్లు పొందినారు.

240 యోగవాసిష్ఠము
శ్రీవసిష్ఠ ఉవాచ:
అస్త్యనంతవిలాసాత్మా సర్వగస్సర్వసంశ్రయః
చిదాకాశో వినాశాత్మా ప్రదీపస్సర్వజంతుము
"I 11
శ్రీవసిష్ఠుడు: అనంత మాయావిలాసమునకు కారణమును, సర్వాంతర్యామియును, సర్వాధారమును,
చిదాకాశమును, ప్రత్యక్ చిద్రూపమును, అవినశ్వరమును నగు ఆత్మతత్త్వ మొక్కటి ఉన్నది.
స్పందాస్పందన మాకారాత్ తతో విష్ణురజాయత
స్యందమానరసాపూరాత్ తరంగస్సాగరాదివ || 12
చలన ముండినను, లేకున్నను, నీరుగనే యుండు సముద్రమునుండి తరంగములు లేచునట్లు;
మాయను, కార్య మొనర్చు చుండినను, ఒనర్సకున్నను ఒకేరీతిగా నుండు ఆ నిర్వికార ఆత్మతత్త్వమునుండి
విష్ణు వుదయించెను.
సుమేరు కర్ణికాత్తస్య దిగ్ధలాదృదయాంబుజాత్
తారకా కేసరవతః పరమేష్ఠీ వ్యజాయత || 13
ఆ విష్ణుని నాభికమలమునుండి బ్రహ్మ జన్మించెను. అనాభికమలమునకు కర్ణిక మేరు పర్వతము;
దిక్కులే దాని దళములు; నక్షత్రములే కేసరములు.
వేదవేదార్థవిద్దేవ మునిమండలమండితః |
సోం సృజత్ సకలం సర్గం వికల్పాఘం యథా మనః ॥ 14
వేదవేదార్థవేత్త యగు ఆబ్రహ్మ దేవతలచేతను మునులవలనను పరివేష్టింపబడి, మనస్సు
వికల్పములను సృష్టించునట్లు, ప్రాణుల నన్నిటిని సృష్టించెను.
జంబూద్వీపస్య కోణే స్మిన్ వర్షే భారతనామని ।
ససర్జ జనసర్గామం హ్యాధివ్యాధి పరిప్లుతమ్ II 15
అతడు జంబూద్వీపమునందొక మూలనున్న ఈ భారత వర్షమున, ఆధివ్యాధులతో గూడి యున్న
ప్రాణిసమూహమును సృష్టించెను.
భావాభావావిషణ్ణంగముత్పాతధ్వంసతత్పరమ్ |
సర్దేస్మిన్ భూతజాతీనాం నానావ్యసనసంకులమ్ II 16
జన స్యైతస్య దుఃఖం తద్దృష్ట్వా సకలలోకకృత్
జగామ కరుణామిశః పుత్రదుఃఖాత్ పితా యథా ॥ 17

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -10) 241
ఈప్రాణుల మనస్సులు లాభాలాభములు గల్గినచో తల్లడిల్లుచుండెను. వీరు అల్పాయుష్కులును,
విషయభోగరతు లగుటవలన దుఃఖితులును నై యుండిరి. వీరిదగు ఈ కష్టదశను గాంచి, పుత్రుని కష్టదశను
గాంచిన తండ్రివలె, సకలలోక కర్తయగు బ్రహ్మకరుణను బొందెను.
క ఏతేషాం హతాశానాం దుఃఖస్యాంతో హతాయుషామ్
స్యాదితి క్షణమేకాగ్రం చింతయామాస భూతయే ॥ 18
హతాశులును, అల్పాయుష్కులును నగు ఈ జనుల దుఃఖమెట్లు తీరును- అని ఆయన వాని
మంచికొఱకు స్థిరచిత్తుడై ఒకింత చింతించెను.
ఇతి సంచింత్య భగవాన్! ససర్జ స్వయమీశ్వరః
తపో ధర్మం చ దానం చ సత్యం తీర్థాని చైవ హి ॥ 19
ఇట్లు చింతించి, దుఃఖనివారణ సమర్థుడగు బ్రహ్మదేవుడు తపస్సు, ధర్మము, దానము, సత్యము,
తీర్థములు - అను శుద్ధిసాధనములను సృష్టించెను.
ఏతత్సృష్ట్యా పునర్దేవశ్చింతయామాస భూతకృత్
పుంసాం నానేన సర్గస్య దుఃఖస్యాంత ఇతి స్వయమ్ 20 20
నిర్వాణం నామ పరమం సుఖం యేన పునర్జనః
న జాయతే న మ్రియతే తదా జ్ఞానాదేవ లభ్యతే 21
సంసారోత్తరణే జంతోరుపాయో జ్ఞానమేవ హి |
తపోదానం తథా తీర్థమనుపాయాః ప్రకీర్తితాః 22
తత్తావద్దు:ఖ మోక్షార్థం జనస్యాస్య హతాత్మనః1
ప్రత్యగ్రం తరణోపాయమాశు ప్రకటయామ్యహమ్ 11 23
భూతగణస్రష్ట యగు ఆయన వీటిని నిర్మించి ఇట్లు చింతించెను. "కేవలము వీటివలన జనుల దుః
ఖము పోదు. జన్మమరణ రహితమగు ఆ నిర్వాణ - పరమపదము జీవులకు ఒక్క జ్ఞానమువలననే లభించును.
ఈ సంసారమునుండి జీవుల నుద్ధరించు ఏకమాత్రోపాయము జ్ఞానమే; తపో దాన తీర్థములు కావు.
అందువలన జీవుల నుద్ధరించు నాతన దృడోపాయమును సత్వరము వెల్లడింతును.
ఇతి సంచింత్య భగవాన్ బ్రహ్మా కమలసంస్థితః |
మనసా పరిసంకల్ప్య మాముత్పాదిత వానిమమ్ ॥ 24
VI F16

242 యోగవాసిష్ఠము
ఇట్లు, కమలాసనుడగు బ్రహ్మ ఆలోచించి, సంకల్పమాత్రమున మనస్సువలన నన్ను సృష్టించెను.
కుతోఒ ప్యుత్పన్న ఏవాళు తతో హం సముపస్థితః
పితు స్తస్య పునః శీఘ్రమూర్మిరూర్మేరివానమ! 25 25
అనఘా! ఎటనో పుట్టిన తరంగము, తరంగమునే జేరునట్లు, అనిర్వచనీయ మాయవలన జన్మించిన
నేనును తండ్రి యగు బ్రహ్మదరి జేరితిని.
కమండలుధరో నాథః సకమండలునా మయా |
సాక్షమాలః సాక్షమాలం స ప్రణమ్యాభివాదిత: II 26
జపమాల కమండల సహితుడ నగు నేను, జపమాలా కమండలు శోభితుడగు బ్రహ్మ కభివందన
మాచరించితిని.
ఏహి పుత్రేతి మాముక్త్వా స స్వార్జెస్యోత్తరే దలే
శుక్లాభ్ర ఇవ శీతాంశుం యోజయామాస పాణినా ॥ 27
ఆయన “రమ్ము! పుత్రా!” అని వచించి తన పద్మాసన - ఉత్తరదళమున, శుక్ల మేఘముల చంద్రునివలె,
నన్ను స్వయముగ గూర్చుండ జేసెను.
మృగకృత్తిపరీధానో మృగకృత్తినిజాంబరమ్ |
మామువాచ పితా బ్రహ్మా సుహంసః సారసం యథా ॥ 28
హంస సారసమునకు తన యభిప్రాయమును దెల్పునట్లు, కృష్ణాజినధారి నగు నాతో కృష్ణాజినధరు
డగు బ్రహ్మ ఇట్లనెను.
ముహూర్తమాత్రం తే పుత్ర! చేతో వానరచంచలమ్ |
అజ్ఞానమభ్యావిశతు శశః శశధరం యథా | 29
"కోతివలె చంచలమగు నీ మనస్సున, చంద్రునియందు మచ్చవలె, ఒకింత తడవు అజ్ఞానము
ప్రవేశించును గాక!
ఇతి తేనాశు శప్తః సన్ విచారసమనంతరమ్|
అహం విస్మృతవాన్ సర్వం స్వరూపమమలం కిల ॥ 30
30 ఇట్లాతనివలన శపింపబడి వెంటనే నా నిర్మల స్వరూపమును మఱచితిని.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -10) 243
అథాహం దీనతాం యాతః స్థితో సంబుద్ధయా ధియా
దుఃఖశోకాభిసంతప్తో జాతే జన ఇవాధనః ॥ 31
పిమ్మట, నా బుద్ధి జడత్వము నందగా, దీనుడనై నిరుపేదవలె దుఃఖశోకముల వనర సాగితిని.
కష్టం సంసారనామాయం దోషః కథమిహాగతః
ఇతి చింతితవానంతస్తూష్టీమేవ వ్యవస్థితః || 32
మనస్సున, ఆహా! ఈ సంసారదోష మెందులకు అరుదెంచినది" అని చింతించి తూప్లీం భావమును
వహించుచుండెడు వాడను.
అథాభ్యధాత్ స మాం తాతః పుత్రః కిం దుఃఖవానసి
దుఃఖోపఘాతం మాం పృచ్చ సుఖీ నిత్యం భవిష్యని #1 33
పిమ్మట, నా జనకుడు "పుత్రా! నీ వెందులకు దుఃఖించుచున్నావు? దుఃఖ నివారణోపాయమును
ప్రశ్నింపుము; సుఖింపుము" అని పల్కెను.
తతః పృష్టః స భగవాన్ మయా సకలలోకకృత్
హేమపద్మదల సేన సంసారవ్యాధిభేషజమ్
"I 34
అనంతరము సువర్ణ పద్మదళస్థితుడ నగు నేను, సర్వలోక కర్తయగు ఆయనను సంసార వ్యాధిని
నెమ్మదింపజేయుటకు ఔషధము నడిగితిని.
కథం నాథ! మహాదుఃఖమయః సంసార ఆగతః ॥
కథం చ క్షీయతే జంతోరితి పృష్టేన తేన మే 35
తద్జ్ఞానం సుబహుప్రోక్తం యద్ జ్ఞాత్వా పావనం పరమ్
ఆహం పితురభిప్రాయః కిలాధిక ఇవ స్థితః "I 36
ప్రభూ! ఈ దుఃఖమయ సంసారమున జీవుడెట్లు తగుల్వడినాడు? దీనినుండి ఎట్లు విడివడును?
అని ప్రశ్నింపబడి ఆయన విస్తారమగు తత్వజ్ఞానము నుపదేశించెను. నేను పరమ పవిత్రమగు ఆ
తత్త్వజ్ఞానమును గ్రహించి తండ్రికంటే అధికనిర్మల మగు పరిపూర్ణ స్వభావ తత్త్వజ్ఞానమున అవస్థితుడ
నయిన వానివలె నుంటిని.
తతో విదితవేద్యం మాం నిజాం ప్రకృతిమాస్థితమ్
స ఉవాచ జగత్కర్తా వక్తా సకలకారణమ్ || 37

244 యోగవాసిష్ఠము
విదితవేద్యుడను, స్వస్వరూప ప్రాప్తుడను నగు నాతో సకలకారణవక్త యగు ఆ జగత్కర్త ఇట్లనెను.
శాపేనాజ్ఞపదం నీత్వా పృచ్ఛకస్త్యం మయా కృతః
పుత్రాస్య జ్ఞానసారస్య సమస్తజనసిద్ధయే 38
పుత్రా! అన్ని తరగతుల వారికి ఈ జ్ఞానముపయోగపడు నిమిత్తమే నేను నిన్ను శపించి మూఢుడ
వగు నట్లొనర్చి ప్రశ్నింపజేసితిని.
ఇదానీం శాంతశాపస్త్యం పరం బోధముపాగతః
సంస్థితో హమివైకాత్మాకనకం కనకాదివత్ ॥ 39
ఇప్పుడు నీ తాపము తీరినది; నీవు పరమ జ్ఞానము నందినావు. మకిలి - బంగారము" శుద్ధి నంది
బంగార మగునట్లు; నీవును నావలెనే ఏకాత్ముడవైతివి.
గచ్ఛేదానీం మహీపృష్టే జంబుద్వీపాంతరస్థితమ్
1
సాధో! భారతవర్షం త్వం లోకానుగ్రహహేతునా 40
సాధూ! ఇప్పుడు నీవు జనుల ననుగ్రహింప, భూమధ్యమున జంబూ ద్వీపమున వెలయు భారత
వర్షమున కఱుగుము.
తత్ర క్రియాకాండపరాస్యయా పుత్ర! మహాధియా |
ఉపదేశ్యాః క్రియాకాండక్రమేణ క్రమశాలినా | 41
విరక్తచిత్తాశ్చ తథా మహాప్రాజ్ఞా విచారిణః |
ఉపదేశాస్యయా సాధో! జ్ఞానేనానందదాయినా ॥ 42
"పుత్రా! మేధావీ! నీవట కఱిగి కర్మరతులకు క్రియాకాండను క్రమముగ నుపదేశింపుము. సాధూ!
ఆనంద దాయకమగు జ్ఞానమును విరక్త చిత్తులగు ప్రాజ్ఞుల కుపదేశింపుము.
ఇతి తేన నియుక్తో హం పిత్రా కమలయోనినా ।
ఇహ రాఘవ! తిష్ఠామి యావద్భూతపరంపరా II 43
రాఘవా! ఇట్లు తండ్రియగు బ్రహ్మదేవునిచే నాజ్ఞాపింపబడితిని; అధికారులగువా రుండు దనుక,
ఉందును.
కర్తవ్యమస్తి న మమేహ హి కించిదేవ
స్థాతవ్య మిత్యతిమనా భువి సంస్థితో 2 స్మి|

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -11) 245
సంశాతయా సతతసుప్తధియేహ వృత్యా
కార్యం కరోమి న చ కించిదహం కరోమి ॥ 44
ఇతి శ్రీవాసిష్ఠ-మహారామాయణే వాల్మీకీయే ముముక్షువ్యవహార ప్రకరణే జ్ఞానావతరణం
నామ దశమః సర్గః ॥10 ॥
నాకు వేరొక కర్తవ్యము లేదు. నేను నిర్మనస్కుడనై యీ పృథివి యందున్నాడను, అభిమాన రహితమగు
చిత్తముతో, యథాప్రాప్త కార్యముల నొనర్చుచున్నాడను; అహంకారమునకు లోబడి ఎట్టి కార్యమును
ఒనర్చుచుండుట లేదు.
ఇది శ్రీవాసిష్ఠ-తాత్పర్య ప్రకాశికయందు, ముముక్షువ్యవహార ప్రకరణమున జ్ఞానావతరణమను దశమ సర్గము ॥ 10 ॥
వక్తృపృచ్ఛక లక్షణము-11
శ్రీ వసిష్ఠ ఉవాచ :
ఏతత్తే కథితం సర్వం జ్ఞానావతరణం భువి
మయా స్వవిహితం చైవ కమలోద్భవచేష్టితమ్ ॥
"I 1
శ్రీవసిష్ఠుడు: రామా! భూలోకమునకు జ్ఞాన మరుదెంచిన రీతిని, నా జన్మ వృత్తాంతమును నాయొక్కయు
బ్రహ్మదేవుని యొక్కయు ప్రయత్నములను, నీకు జెప్పితిని.
తదిదం పరమం జ్ఞానం శ్రోతుమద్య తవానమ!
భృశముత్కంఠితం చేతో మహతః సుకృతోదయాత్
"I 2
అనఘా! గొప్పదగు సుకృతముచేత, ఈ పరమ జ్ఞానమును విన నీ చిత్తము తత్తరపడుచున్నది.
శ్రీరామ ఉవాచ:
కథం బ్రహ్మన్! భగవతో లోకే జ్ఞానావతరణే
సర్గాదనంతరం బుద్ధి: ప్రవృత్తా పరమేష్ఠినః11 3
రాముడు: బ్రహ్మజ్ఞా! లోకముల సృష్టించిన పిమ్మట, ఈలోకమున జ్ఞానమును బ్రవర్తింప జేయు బుద్ధి,
బ్రహ్మకేల పొడమినది?
శ్రీవసిష్ఠ ఉవాచ:
పరమే బ్రహ్మణి బ్రహ్మ స్వభావవశతః స్వయమ్|
జ్ఞాతః స్పందమయో నిత్యమూర్మిరంబునిధావివ || 4

246 యోగవాసిష్ఠము
శ్రీవసిష్ఠుడు: సముద్రమున తరంగ ముదయించునట్లు, బ్రహ్మ పరబ్రహ్మమున స్వభావానుసారము
క్రియాశక్తి యుతుడయి జన్మించెను.
దృష్యైవమాతురం సర్గం సర్గస్య సకలాం గతిమ్ |
భూతభవ్యభవిష్యస్థాం దదర్శ పరమేశ్వరః 5 "1
పరమేశ్వరుడగు ఈబ్రహ్మ తనవలన సృష్టింపబడిన జీవరాశి జరామరణ గ్రస్త మగుట గాంచి,
భూత భవిష్య ద్వర్తమానములను పర్యాలోచించెను.
సక్రియాక్రమకాలస్య కృతాదే: క్షయ ఆగతే |
మోహమాలోచ్య లోకానాం కారుణ్యమగమత్ ప్రభుః 6
స్వర్గము, మోక్షము - ఇట్టి పదవులను జేర్చు సాధనలకు దగిన త్రేతాది యుగములు గడవ జన్మించు
జీవుల మోహమును గాంచి, ఆయన కరుణా పరవశు డాయెను.
తతో మామీశ్వరః సృష్ట్వా జ్ఞానేనాయోజ్య చాసకృత్ | 1
విససర్జ మహీపీఠం లోకస్యాజ్ఞాన శాంతయే II 7
పిమ్మట, బ్రహ్మ నన్ను సృష్టించి, మిక్కుటముగ నుపదేశించి, జ్ఞానిగా నొనర్చి, లోకుల అజ్ఞానమును
బాప భూతలమునకు బంపెను.
యథా హం ప్రహితస్తేన తథాన్యే చ మహర్షయః ।
సనత్కుమార ప్రముఖా నారదాద్యాశ్చ భూరిశః ॥ 8
క్రియాక్రమేణ పుణ్యేన తథా జ్ఞానక్రమేణ
మనోమోహామయోన్నద్ధ ముద్ధర్తుం లోకమిరితాః
9
ఇట్లే, మనోమోహమను రోగమున కుందు జీవులను క్రియా, పుణ్య, జ్ఞానములవలన నుద్ధరింప,
సనత్కుమార నారదాది మహర్షులను గూడ బనిచెను.
మహర్షిభి స్తతసైసై: క్షీణే కృతయుగే పురా |
క్రమాత్ క్రియాక్రమే శుద్ధే పృథివ్యాం తనుతాం గతే ॥ 10
క్రియాక్రమవిధానార్థం మర్యాదానియమాయ |
పృథద్దేశవిభాగేన భూపాలాః పరికల్పితాః || 11
త్రేతాయుగము గడవ విశుద్ధములగు యజ్ఞాది క్రియలుగూడ అంతరింపజొచ్చెను. అప్పు డీ మహర్షులు
కర్మకాండ నుద్ధరించు నిమిత్తము. శాస్త్రమర్యాదను రక్షించుటకును వేర్వేరు దేశముల విభజించి, రాజులను

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -11) 247
కల్పించిరి.
బహూని స్మృతిశాస్త్రాణి యజ్ఞశాస్త్రాణి చావనౌ ।
ధర్మకామార్థ సిద్ధ్యర్థం కల్పితాన్యుచితాన్యథ 12
అనంతరము ధర్మార్థ కామ ప్రయోజనములు సిద్ధింపజేయు స్మృతి శాస్త్రములు, యజ్ఞశాస్త్రములు
రచింపబడెను.
కాలచక్రే మహత్యస్మింస్తతో విగలితే క్రమే
ప్రత్యహం భోజనపరే జనే శాల్యార్జనోన్ముఖే | " 13
ద్వంద్వాని సంప్రవృత్తాని విషయార్థం మహీభుజామ్
దండ్యతాం సంప్రయాతాని భూతాని భువి భూరిశః ॥ 14
తతో యుద్ధం వినా భూపా మహీం పాలయితుం క్షమాః
న సమర్థాస్తదా యాతాః ప్రజాభిః సహ దైన్యతామ్ ॥ II 15
ఇట్లు, కాలచక్రము పరివర్తన మందుచుండ జనులు ధనసంగ్రహ పరులును, భోజన వ్యగ్రులును
గాదొడంగిరి. సంపదలను గుఱించి రాజులు వివాదపడ దొడంగిరి. జనులు, (నేరముల నొనర్చి) దండార్హులు
కాదొడంగిరి. రాజులు యుద్ధములు లేకుండ భూమిని పాలింపకపోయిరి. ప్రజలును రాజులునుగూడ దీనతను
బొందిరి.
తేషాం దైన్యాపనోదార్థం సమ్యగ్దృష్టి క్రమాయ చ।
తతో స్మదాదిభిః ప్రోక్తా మహత్యో జ్ఞానదృష్టయః
16
అప్పుడు మాకు అనగా జ్ఞానదృష్టి గల మహాత్ములకు-వారి దైన్యమును బోగొట్టుటకుగాను
ఆత్మతత్త్వమును ప్రచార మొనర్పవలసివచ్చెను.
అధ్యాత్మవిద్యా తేనేయం పూర్వం రాజును వర్ణితా
తదను ప్రసృతా లోకే రాజవిద్యేతు దాహృతా
"I 17
అందువలన నీ అధ్యాత్మవిద్య మొమ్మొదట రాజులకు జెప్పబడెను; పిదప లోకమున బ్రచురింపబడినది.
కనుక, ఈ అధ్యాత్మవిద్యను రాజవిద్య యనిగూడ అందురు.
రాజవిద్యా రాజగుహ్యమధ్యాత్మజ్ఞానముత్తమమ్।
జ్ఞాత్వా రాఘవ! రాజానః పరాం నిర్దుఃఖతాం గతాః ॥ 18

248 యోగవాసిష్ఠము
రాఘవా! రహస్యమగు ఈ ఉత్తమ రాజవిద్యను దెలిసికొని, రాజులు దుఃఖమునుండి విడివడిరి.
అథ రాజస్వతీ తేషు బహుష్వమల కీర్తిము
అస్మాద్దశరథాద్రామ జాతో ద్య త్వమిహావనౌ ॥ 19
పిమ్మట, నిర్మలకీర్తులగు రాజు లనేకులు గతించిరి. ఇప్పుడు, నీవు భూమండలమున దశరథునకు
పుత్రుడవై జన్మించితిని.
తవ చాతిప్రసన్నేస్మిన్ జాతం మనసి పావనమ్ |
నిర్నిమిత్తమిదం చారు వైరాగ్యమరిమర్దన! 20
శత్రునాశకా! ప్రశాంతమగు నీ మనమున, కారణము లేకుండగనే సుందరమును పవిత్రమును నగు
ఈ వైరాగ్యము కలిగినది.
సర్వస్యైవ హి సర్వస్య సాధోరపి వివేకినః
నిమిత్తపూర్వం వైరాగ్యం జాయతే రామ! రాజసమ్ ॥
I 21
రామా! వివేకులని బ్రసిద్ధి గాంచిన వారందఱికిని, ప్రప్రథమమున నిర్వేదాది కారణముల వలననే
వైరాగ్యము జనించినది. ఈ వైరాగ్యము రాజస మనంబడును.
ఇదం త్వపూర్వ ముత్పన్నం చమత్కారకరం సతామ్
తవానిమిత్తం వైరాగ్యం సాత్వికం స్వవివేకజమ్ 11 22
నీకు ఎట్టికారణము లేకుండగనే అపూర్వమగు వివేకమువలన వైరాగ్యము కలిగినది. ఇట్టి వైరాగ్యమును
సాత్యిక వైరాగ్య మందురు. దీనిని గాంచి, సాధుపురుషులు గూడ అచ్చెరు వందుచున్నారు.
బీభత్సం విషయం దృష్ట్యా కో నామ న విరజ్యతే |
సతాముత్తమవైరాగ్యం వివేకాదేవ జాయతే ॥ 23
బీభత్స విషయములను గాంచిన విరాగ మెవరికి కలుగకుండును? కాని, సాధుపురుషులకు కలుగు
వైరాగ్య మిట్టిది కాదు; వారికి వివేకము నుండియే కలుగును.
తే మహాంతో మహాప్రాజ్ఞా నిమిత్తేన వినైవ హి |
వైరాగ్యం జాయతే యేషాం తేషాం హ్యమలమానసమ్ ॥ 24
నిర్నిమిత్తముగ వైరాగ్యము నందువారే గొప్పవారు, మహాప్రాజ్ఞులు. వారి మనస్సు నిర్మలము.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -11) 249
స్వవివేకచమత్కారపరామర్శవిరక్తయా
రాజతే హి ధియా జంతుర్యువేవ పరమాలయా ॥ 25 25
యువకుడు శ్రేష్ఠమగు మాలవలన శోభితుడగు నట్లు, వివేక జనిత వైరాగ్యమువలన జనులు శోభను
బొందుదురు.
పరామృశ్య వివేకేన సంసారరచనామిమామ్ ।
వైరాగ్యం యో ధిగచ్చంతి త ఏవ పురుషోత్తమాః ॥ 26
వివేకముతో ఈ సంసార రచననుగూర్చి విచారించి వైరాగ్యము నవలం బించువారే పురుషశ్రేష్ఠులు.
స్వవివేకవశాదేవ విచార్యేదం పునః పునః ॥
ఇంద్రజాలం పరిత్యాజ్యం స బాహ్యాభ్యంతరం బలాత్ ॥ 27
వివేకముతో లెస్సగ విచారించి, ఇంద్రజాలమగు ఈ మాయామయ దృశ్యప్రపంచమును దేహేంద్రియ
మనోబుద్ధులను, అవిద్య యగు అభ్యంతర జగత్తును పరిత్యజింపవలెను.
శ్మశానమాపదం దైన్యం దృష్ట్యా కో న విరజ్యతే |
తద్వైరాగ్యం పరంశ్రేయః స్వతో యదభిజాయతే ॥ 28
శ్మశానము, ఆపదలు, దైన్యము- వీటిని గాంచి విరాగి కాని వాడెవడు? కాని స్వతః కలుగు వైరాగ్యమే
చాలమంచిది.
అకృత్రిమవిరాగత్వం మహత్యమలమాగతః
యోగ్యోఒ సి జ్ఞానసారస్య బీజస్యేవ మృదుస్థలమ్ 29
నీవు ఆ కృత్రిమ వైరాగ్యమును, అతిశయ మహత్యమును బొందితివి. మెత్తటినేల విత్తుటకు దగినట్లు,
జ్ఞానముయొక్క సారోపదేశమునకు నీవు పాత్రుడవు.
ప్రసాదాత్ పరమేశస్య నాథస్య పరమాత్మనః 1
త్వాదృశస్య శుభాబుద్ధిర్వివేకమనుధావతి "I 30
పరమాత్ముడును, జగత్ప్రభుడును నగు పరమేశ్వరుని అనుగ్రహము వలననే, నీబోంట్ల శుభబుద్ధి
వివేకము నందుచున్నది.
క్రియాక్రమేణ మహతా తపసా నియమేన
దానేన తీర్థయాత్రాభిశ్చిరకాలం వివేకతః ॥ 31

250 యోగవాసిష్ఠము
దుష్కృతే క్షయమాపన్నే పరమార్థవిచారణే
కాకతాళీయయోగేన బుద్ధిర్జంతోః ప్రవర్తతే ॥ 32 32
యజ్ఞాదానాది క్రియలను, గొప్పదగు తపమును, సల్పుటవలనను, చిరకాలము తీర్థములను
సేవించుటవలనను, నియమములను అవలంబించుట వలనను, వివేక ముదయించును; పాపము నశించును.
అప్పుడు కాకతాళీయముగ మనుజులకు తత్త్వచింతయందు ఆసక్తి కలుగును.
క్రియాపరాస్తావదలం చక్రవర్తిభిరావృతాః 1
భ్రమంతీహ జనా యావన్న పశ్యంతి పరంపదమ్ ॥ 33
పరమపదమును దర్శింపనంతవరకు జనులు, చక్రమువలె తిరుగాడు రాగాదులవలన చుట్టబడి,
ఐహికాముష్మిక ఫలప్రదములగు క్రియల నాచరించు చుందురు.
యథాభూతమిదం దృష్ట్యా సంసారం తన్మయీం ధియమ్ ।
పరిత్యజ్య పరం యాంతి నిరాలానా గజా ఇవ ॥ 34
ఈ సంసారము నసారమని వివేకమువలన గ్రహించినప్పుడె, బంధము లను త్రెంపి పారిపోవు
ఏనుగువలె, సంసారబుద్ధిని ద్యజించి పరమపదమును నందుచున్నారు.
విషమేయమనంతేహ రామ సంసారసంసృతిః
దేహయుక్తో మహాజంతుర్వినా జ్ఞానం న పశ్యతి 35 35
రామా! ఈ సంసారముయొక్క గతి, అతికుటిలము; దీని కంతము లేదు. దేహబంధమున నున్న
మహాజంతువగు మనుష్యుడు జ్ఞానము వినా దీని అంతమును గనుగొనజాలడు.
జ్ఞానయుక్తిప్లవేనైవ సంసారార్ధం సుదుస్తరమ్ |
మహాధియః సముత్తీర్ణా నిమేషేణ రమూద్వహ! 36
రఘూద్వహా! వివేకులు జ్ఞానయుక్తి రూపకమగు తెప్పవలననే, దుస్తరమగు ఈ సంసార సాగరమును
తరింతురు.
తామిమాం జ్ఞానయుక్తిం త్వం సంసారాంభోధితారిణీమ్ ।
శృణుష్వావహితో బుద్ధ్యా నిత్యావహితయా తయా ॥ 37
అందువలన, నీవు సంసార సముద్రమును దాటించు ఈ జ్ఞాన విచారమును, విచారబుద్ధితో
ఏకాగ్రమనస్కుడవై వినుము.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -11) 251
యస్మాదనంతసంరంభా జాగత్యో దుఃఖభీతయః
చిరాయాంతర్దహంత్యేతా వినా యుక్తిమనిందితామ్ ॥ 38
ఏలయన, అనిందిత మగు ఈ జ్ఞానమును గూర్చుకొనినచో, కామ క్రోధాదులగు లెక్కకు మీరిన
వేగములతో నిండిన ఈ జగత్తున దుఃఖభయములు నిరంతరము నీ అంతరమును దహించుచుండును.
శీతవాతాతపాదీని ద్వంద్వదుఃఖాని రాఘవ!
జ్ఞానయుక్తిం వినా కేన సహ్యతాం యాంతి సాధుషు ॥ 39
రాఘవా! జ్ఞానయుక్తి బలమున గాక, మరెద్దానివలన సాధుపురుషులు శీతవాతాతపాది దుఃఖములను
సహింపగలుగుచున్నారు?
ఆపతంతి ప్రతిపదం యథాకాలం దహంతి
దుఃఖచింతా సరం మూఢం తృణమగ్నిశిఖా ఇవ ॥ 40
ఈ దుఃఖ చింత లన్నియు అనుక్షణము మూఢమానవుల దరిజేరి, ఎండుగడ్డిని అగ్ని దహించునట్లు,
దహించుచున్నవి.
ప్రాజ్ఞం విజ్ఞాతవిజ్ఞేయం సమ్యగ్దర్శనమాధయః 1
న దహంతి వనం వర్షాసిక్తమగ్నిశిఖా ఇవ ॥ 41
వానకు దడిసిన అడవిని నిప్పు దహింపజాలనట్లు అధ్యాత్మ శాస్త్రమును విచార పూర్వకముగ గ్రహించి,
ఆత్మతత్వమును సాక్షాత్కరింప జేసికొనిన వానిని, మానస వ్యాధులు దహింపజాలవు.
ఆధివ్యాధిపరావర్తే సంసారమరుమారుతే|
క్షుభితే2పి న తత్త్వజ్ఞో భజ్యతే కల్పవృక్షవత్ ॥ "I 42
ఈ సంసార మరుభూమియందు నిరంతరము ఆధివ్యాధులను సుడిగాలులు లేచుచున్నను, తత్త్వజ్ఞు
డగువాడు, కల్పవృక్షమువలె చలనము లేకుండ నుండును.
తత్త్యం జ్ఞాతుమతో యత్నాధీమానేవ హి ధీమతా
ప్రామాణికః ప్రబుద్ధాత్మా ప్రష్టవ్యః ప్రణయాన్వితమ్ 11 43
అందవులన వివేకి యగువాడు, తత్త్వజ్ఞానమును గ్రహింప ప్రమాణజ్ఞుడును, ప్రబుద్ధాత్ముడును.
బుద్ధిమంతుడును నగు వ్యక్తికి యత్నముతో నమస్కారాది సపర్యల నొనర్చి, ప్రేమపూర్వకముగ
ప్రశ్నింపవలెను.

252 యోగవాసిష్ఠము
ప్రామాణికస్య పృష్టస్య వక్తురుత్తమచేతనః
యత్నేన వచనం గ్రాహ్యమంశుకేనేవ కుంకుమమ్ ॥ 44
కుంకుమరంగునందు వస్త్రమును ముంచి దానికి రంగంటజేయునట్లు, మంచివాడును, పెద్దయు
నగువారిని బ్రశ్నించి అతడు చెప్పుదానిని యత్నముతో గ్రహింపవలెను.
అతత్యజ్ఞమనాదేయవచనం వాగ్విదాం వర! ॥
యః పృచ్ఛతి నరం తస్మాన్నాని మూఢతరో పరః 45
వాగ్మివరా! తత్త్వజ్ఞుడు కానివాడును, ఉపదేశము నొనర్పలేని వాడును నగు వానిని ఈ విషయమును
గుఱించి ప్రశ్నించు వానికంటే, మూఢుడు మరొక డుండడు.
ప్రామాణికస్య తద్జ్ఞస్య వక్తుః పృష్టస్య యత్నతః |
నానుతిష్ఠతి యో వాక్యం నాన్యస్తస్మాన్నరాధమః ॥ 46
రఘునందనా! ప్రమాణికుడగు తత్త్వవేత్తను యత్నముతో బ్రశ్నించి తదనుసార మాచరింపని వానికంటె,
నరాధముడు మరొక డుండడు.
అజ్ఞతాత జ్ఞతే పూర్వం వస్తుర్నిర్ణీయ కార్యతః 1
యః కరోతి నరః ప్రశ్నం పృచ్ఛక స్స మహామతిః ॥ 47
ఎవడు, ప్రశ్నింపక మున్నే వక్తయొక్క జ్ఞానాజ్ఞానములను నిర్ణయించుకొని వ్యవహార రీత్యా ప్రశ్నించునో,
అతడే మహామతి.
అనిర్ణియ ప్రవక్తారం బాలః ప్రశ్నం కరోతి యః |
అధమః పృచ్ఛకః స స్యాన్న మహార్థస్య భాజనమ్ ॥ 48
“వక్త సరియైనవా డగునా? కాదా" - అని నిర్ణయించుకొనకుండగనే ప్రశ్నించువాడు మూఢుడు;
ఈ మూఢుడు పరమార్థ జ్ఞానము నెన్నటికిని బడయజాలడు.
పూర్వాపరసమాధానక్షమబుద్ధావనిందితే 1
పృష్టం ప్రాజ్ఞేన వక్తవ్యం నాధమే పశుధర్మిణి 49
ప్రాజ్ఞుడగు వక్త, పూర్వాపర విచారమును సల్పి, అవధారణా సమర్థు డగు అనిందిత వ్యక్తికి, అడిగిన
విషయమును జెప్పవలెను. పశుస్వభావుడగు అధమున కేమియు వచింపరాదు.
ప్రామాణికార్థయోగ్యత్వం పృచ్ఛకస్యావిచార్య చ।
యో వక్తి తమిహ ప్రాజ్ఞాః ప్రాహుర్మూఢతరం నరమ్ ॥ 50

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -11) 253
పృచ్ఛకుని సామర్థ్యమును విచారింపకుండ ఉపదేశము నిచ్చు వ్యక్తిని ప్రాజ్ఞులు మూఢు డందురు.
త్వమతీవ గుణశ్లాఘీ పృచ్ఛకో రఘునందన!
అహం చ వక్తుం జానామి సమో యోగో యమావయోః ॥ 51
రఘునందనా! నీవు మిక్కుటముగ గుణముల నాదరింతువు; గుణ పక్షపాతివగు నీవు
ప్రశ్నించుచున్నావు. నేను సద్వక్తను. మనకిర్వురకును ఈ గురుశిష్యభావము తగియే యున్నది.
యదహం వచ్మి తద్యత్నాత్ త్వయా శబ్దార్థ కోవిద!
ఏతద్వస్త్వితి నిర్ణీయ హృది కార్యమఖండితమ్ ॥ 52 52
శబ్దార్థజ్ఞాననిపుణా! నేను వచించుదానిని తత్యమని గ్రహించి నిస్సందేహముగ ఆచరింపుము.
మహానని విరక్తోసి తత్వజ్ఞో ని జనస్థితా |
త్వయి చోక్తం లగత్యంతః కుంకుమాంబు యథాంశుకే ॥ 53
కులమునుబట్టియు, గుణములజేసియు, ఆచారముల ననుసరించియు, నీవు గొప్పవాడవు.
వైరాగ్యవంతుడవు. జీవుల గతిని గ్రహించితివి. కాన, నీకు చెప్పబడున దంతయు, వస్త్రమున
కుంకుమరంగువలె, నీయం దంకితము కాగలదు.
ఉక్తావధానపరమా పరమార్థ వివేచినీ
విశత్యర్థం తవ ప్రజ్ఞా జలమధ్యమి వార్కభాః11 54
సూర్యునికాంతి నీటియందు ప్రవేశించునట్లు, ఏకాగ్రభావమున ఉపదేశమును గ్రహించుట యందును,
పరమార్థ విచారమును సల్పుటయందు సమర్థమగు నీబుద్ధి, చెప్పబోవు తత్యార్థమున ప్రవేశింపగలదు.
యద్యద్వచ్మి తదాదేయం హృది కార్యం ప్రయత్నతః !
నో చేత్ ప్రష్టవ్య ఏవాహం న త్వయేహ నిరర్థకమ్ "I 55
నేను చెప్పబోవు దాని నంతటిని యత్నపూర్వకముగ హృదయమున గ్రహింపుము తదనుసార
మాచరింపము. వ్యర్థముగ ప్రశ్నింపకుము.
మనో హి చపలం రామ! సంసారవనమర్కటమ్ |
సంశోధ్య హృది యత్నేన శ్రోతవ్యా పరమార్థగీః ॥ 56
రామా! చంచలమగు ఈ మనస్సు సంసారమను వనమందు తిరుగాడు కోతి. దీనిని శుద్ధమొనర్చి
యత్నపూర్వకముగ పరమార్థ తత్యమును వినుము.

254 యోగవాసిష్ఠము
అవివేకి నమజ్ఞానమసజ్జనరతిం జనమ్ |
చిరం దూరతరే కృత్వా పూజనీయా హి సాధవః ॥ 52 57
అవివేకియును అజ్ఞుడును, అసత్-సంసర్గియు నగువాని సంపర్కము నెల్లప్పటికిని వీడి సాధువులను
పూజింపుము.
నిత్యం సజ్జనసంపర్కాద్వివేక ఉపజాయతే |
వివేకపాదప స్యైవ భోగమోక్షౌ ఫలే స్మృతౌ 58
నిరంతరము సాధుసంగమ మొనర్పగా వినేక ముదయించును. భోగ మోక్షములు రెండును గూడ
ఈ వివేక వృక్షముయొక్క ఫలములని చెప్పబడుచున్నవి.
మోక్షద్వారే ద్వారపాలాశ్చత్వారః పరికీర్తితాః
శమో విచారః సంతోషశ్చతుర్థః సాధుసంగమః | 59
శమము, విచారణ, సంతోషము, సాధుసంగమము ఈ నాలుగును మోక్షద్వారముయొక్క -
ద్వారపాలకులని చెప్పబడుచున్నవి.
ఏతే సేవ్యాః ప్రయత్నేన చత్వారో ద్వాత్రయో2 థవా |
ద్వారముద్ఘాటయంత్యేతే మోక్షరాజగృహే తథా || 60 50
ఈ నాలిగింటిని యత్నపూర్వకముగ అభ్యసింపవలెను. అన్నిటిని అలవరచుకొనజాలనిచో
మూడింటినిగాని లేక రెండింటినిగాని అభ్యసించునది. ఏలయన, వీటివలననే మోక్షద్వారము తెఱువబడును.
ఏకం వా సర్వయత్నేన ప్రాణాంస్త్యక్త్యా సమాశ్రయేత్
ఏకస్మిన్ వశగే యాంతి చత్వారో జేపి వశం యతః 61
అట్లు గాకున్న, ఏయొక్క దానినైనను అలవరచుకొన ప్రాణములు తెగించి యైనను యత్నించునది.
ఏలయన, ఒక్కటి వశమైన తక్కిన వన్నియు లోబడును.
స వివేకో హి శాస్త్రస్య జ్ఞానస్య తపస శ్రుతేః|
భాజనం భూషణాకారో భాస్కరస్తేజసామివI 62
శాస్త్రము, జ్ఞానము, తపస్సు, శ్రుతి- వీటికి వివేకియే యోగ్యు డగుచున్నాడు. సూర్యుడు
తేజోపదార్థముల కెల్ల శ్రేష్ఠు డైనట్లు వివేకియు జనులలో శ్రేష్ఠుడు.
ఘనతా ముపయాతం హి ప్రజ్ఞామాంద్య మచేతసామ్
యాతి స్థావరతామంబుజాడ్యాల్ పాషాణతామివ 63

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -11) 255
శైత్యాధిక్యమువలన నీరు రాతివలె గడ్డకట్టునట్లు, జడులగువారి బుద్ధిమాంద్యము క్రమముగ హెచ్చి
దుర్భేద్య మగును.
త్వం తు రాఘవ! సౌజన్యగుణ శాస్త్రార్థదృష్టిభిః |
వికాసితాంతఃకరణః స్థితః పద్మ ఇవోదయే ॥ 64
కాని రాఘవా! నీవు సౌజన్యము, గుణములు, శాస్త్రదృష్టులవలన సూర్యోదయ సమయమునందలి
పద్మమువలె, వికసితాంతః కరణుడ వైతివి.
ఇమాం జ్ఞానగిరం శ్రోతుమవబోద్ధుం చ సన్మతే 1
అర్హస్యుద్ధత కర్ణస్యం జంతుర్వీణాస్వనం యథా | 65
సాధుమతీ! చెవులు నిక్కపొడుచుకొనిన లేళ్లు వీణాధ్వనిని వినగలిగినట్లు, నీవుగూడ ఈ
జ్ఞానవాక్యములను విని, తెలిసికొనగలవు.
వైరాగ్యాభ్యాసయోగేన సమసౌజన్యసంపదామ్ |
ఆర్జనం కురుతాం రామ! యత్ర నాశో న విద్యతే 66
99
రామా! నాశనము లేనట్టి సౌజన్య సంపదను అభ్యాస, వైరాగ్యములవలన సంపాదింపుము.
శాస్త్ర సజ్జనసంసర్గపూర్వకైః స తపోదమైః
ఆదౌ సంసారముక్త్యర్థం ప్రజామేవాభివర్ధయేత్ ।
"I 67
సంసారమునుండి విడివడు నిమిత్తము, మొమ్మొదట శాస్త్రసజ్జన సంగమములను గ్రహించి తప
మాచరింపుము; దమమును గూర్చుకొనుము. దీనివలన ప్రజ్ఞాశక్తి వర్ధిల్లును.
ఏతదేవాస్య మౌర్ఖ్యస్య పరమం విద్ధి నాశనమ్ |
యదిదం ప్రేక్ష్యతే శాస్త్రం కించిత్ సంస్కృతయా ధియా ॥ 68
88
సంసారవిషవృక్షోఒ యమేకమాస్పదమాపదామ్ |
అజ్ఞం సమ్మోహయేన్నిత్యం మౌర్ఖ్యం యత్నేన నాశయేత్ II 69
శుద్ధమగు చిత్తముతో ఈ శాస్త్రమును బఠించిన, మూర్ఖత సంపూర్ణముగ సమయును. ఈ సంసార-
విషవృక్షము ఆపదలకు తావు; ఇది అజ్ఞుల నెల్లప్పుడు మోసపుచ్చుచున్నది. అందువలన బ్రయత్నముతో
మూర్ఖత్వమును నశింప జేయుము.
దురాశా సర్పగత్యేన మౌర్ఖ్యణ హృది వర్గతా ।
చేతః సంకోచమాయాతి చర్మాన్ని వివ యోజితమ్ ॥ 70

256 యోగవాసిష్ఠము
సర్పమువలె వక్రగామి యగు మూర్ఛత, దురాశతో హృదయము నంటి పెట్టికొని యున్న, అనలసంలగ్న
చర్మమువలె, హృదయము సంకుచిత మగును.
ప్రాజ్ఞే యథార్థ భూతే యం వస్తుదృష్టిః ప్రసీదతి ।
దృగివేందౌ నిరంభోదే సకలామల మండలే ॥ 71
ఈ యథార్థ తత్త్వదృష్టి మేఘములు లేని ఆకాశమున చంద్రమండల మగుపడునట్లు, ప్రాజ్ఞులయందే
ప్రసన్న భావమును పరిస్ఫురిత మగును.
పూర్వాపరి విచారార్థచారుచాతుర్యశాలినీ
సవికాసా మతిర్యస్య స పుమానిహ కథ్యతే "I 72
ఎవని బుద్ధి పూర్వాపర విచారమును సల్పి, అర్థజ్ఞానమును గ్రహింప జాలునో, అతడే పురుషుడని
చెప్పబడుచున్నాడు.
వికసితేన సితేన తమోముచా వరవిచారణ శీతలరోచిషా |
గుణవతా హృదయేన విరాజసా త్వమమలేన నభః శశినా యథా ॥ 73
ఇతి శ్రీ వాసిష్ఠ - మహారామాయణే ముముక్షువ్యవహార ప్రకరణే వక్తృపృచ్ఛకలక్షణం నామ ఏకాదశః సర్గః ॥11॥
చీకటిని బోగొట్టి తెలిచందురునివలన ఆకాశము శోభించునట్లు, తమో రహితమును స్వచ్ఛమును,
శాంత్యాది గుణయుతములు నగు హృదయముతో నీవు శోభిల్లుచున్నావు.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు ముముక్షు వ్యవహార ప్రకరణమున వక్తృపృచ్ఛకలక్షణమను ఏకాదశసర్గము ॥ 11॥
తత్త్వమాహాత్మ్య వర్ణనము-12
శ్రీవసిష్ఠ ఉవాచ :
పరిపూర్ణమైనా మాన్యః ప్రష్టుం జానాని రాఘవ!
వేత్సిచోక్తంతేనాహం ప్రవృత్తో వక్తుమాదరాత్ ॥ 1
శ్రీవసిష్ఠుడు: రాఘవా! నీ మనస్సు (చెప్పబోవు) సుగుణములతో నిండి యున్నది. నీవు ప్రశ్నింపగలవు;
చెప్పిన గ్రహింపగలవు. అందువలన నేను నీకాదరముతో ఈ తత్వజ్ఞానమును చెప్పబూనుచున్నాను.
రజస్తమోభ్యాం రహితాం శుద్ధసత్యానుపాతినీమ్ ।
మతిమాత్మని సంస్థాప్య జ్ఞానం శ్రోతుం స్థిరో భవ ॥ 2

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -12) 257
మనస్సును రజస్తమోగుణ శూన్య మగు నల్లొనర్చి దానిని ఆత్మయందు నిలిపి జ్ఞానమును విన
స్థిరుడవు కమ్ము.
విద్యతే త్వయి సర్వైవ పృచ్ఛకస్య గుణావళీ
వక్తుర్గుణాలీ చ మయి రత్నశ్రీర్జలధౌ యథా ॥ 3
నీ యందు ప్రశ్నకర్త కుండవలసిన గుణము లన్నియు నున్నవి. నాయందు వక్త కుండదగిన లక్షణము
లన్నియు, సముద్రమున రత్నములవలె నున్నవి.
ఆప్తవానని వైరాగ్యం వివేకాసంగజం సుత!
చంద్రకాంత ఇవార్ద్రత్వం లగ్న చంద్రకలోత్కరః 11 4
వత్సా! వివేకము, అనాసక్తులవలన కలిగిన వైరాగ్యమును నీవు పొందితివి. అందువలన, నీ చిత్తము
చంద్రకిరణ స్పర్శ తగిలిన చంద్రకాంతమణివలె ఆర్ద్రమైనది.
చిరమాశైశవాదేవ తవాభ్యాసో స్ర్తీ సద్గుణైః |
శుద్దె: శుద్ధస్య దీర్ఘశ్చ పద్మస్యేవాతిసంతతైః || 5
పద్మము సౌరభాది గుణములతో గూడియుండునట్లు, శైశవము నుండియు నీకు గూడ శుద్ధములగు
సద్గుణముల అభ్యాస మున్నది.
అతః శృణు కథాం వక్ష్యే త్వమేవాస్యా హి భాజనమ్ |
న హి చంద్రం వినా శుద్ధా సవికాసా కుముద్వతీ 6
అందువలన నేను చెప్పబోవు దానిని వినుము. నీవు ఉపదేశపాత్రుడవు. చంద్రుడు లేనిచో కలువలు
వికసింపవు కదా!
యే కేచన సమారంభా యాశ్చ కాశ్చన దృష్టయః
తే చ తాశ్చ పదే దృష్టే నిఃశేషం యాంతి పై శమమ్ ॥ 7
ఈ బాహ్యాడంబరములు, దృష్టులు - ఆ పరమపదము కనబడిన అంతరించును.
యది విజ్ఞానవిశ్రాంతిర్న భవేద్భవ్యచేతన
తదస్యాం సంసృతౌ సాధుశ్చింతామౌఢ్యం సహేత కః ॥ 8
సాధువ్యక్తులకు జ్ఞానమువలన పరమశాంతి లభింపకున్న, ఈ చింతా మౌఢ్యము నెవరు సహింప
గల్గెడివారు?
VI F17

258 యోగవాసిష్ఠము
పరం ప్రాప్య విలీయంతే సర్వా మననవృత్తయః
కల్పాంతార్క గణాసంగాత్ కులశైలశిలా ఇవ 9
ప్రళయాంతమున కులగిరు లన్నియు సూర్యసంపర్కమున విలీనమై పోవునట్లు, పరమపదము
లభించిన మనోవృత్తు లన్నియు నశించును.
దుఃసహా రామ! సంసారవిషావేశవిషూచికా |
యోగగారుడమంత్రేణ పావనేన ప్రశామ్యతి "I 10
రామా! దుస్సహమగు సంసార విషయముతో గూడిన యీ విషూచివ్యాధి పావన మగు యోగ గారుడ
మంత్రమువలన నుపశమించును.
స చ యోగః సజ్జనేన సహ శాస్త్రవిచారణాత్ |
పరమార్థజ్ఞానమంత్రో నూనం లభ్యత ఏవ చ ॥ 11
ఈ పరమార్థ జ్ఞానము సజ్జనులతోగూడి శాస్త్రచర్చ సల్పుటవలననే లభించును.
అవశ్య మిహ హి విచారే కృతే సకలదుఃఖ పరిక్షయో భవతీతి|
మంతవ్యం నాతో విచారదృష్టయో 2 వహేలయా ద్రష్టవ్యాః
"I 12
జ్ఞానవిచారమువలన దుఃఖము లన్నియు నశించును అని నిశ్చయముగ తెలియునది. అందువలన
విచారపరులగు వారిని హేళన దృష్టితో చూడదగదు.
విచారవతా పురుషేణ సకలమిద మాధిపంజరం సర్వేణ
త్వచమివ, పరిపక్వాం సంత్యజ్య విగతజ్వరేణ శీలాంతఃకరణేన
వినోదాదింద్రజాలమివ, జగదఖిలమాలోక్యతే; సమ్యగ్దర్శనవతా
అసమ్యగ్దర్శనవతో హి పరం దుఃఖ మిదమ్
13
పాము కుబుసమును వీడునట్లు, వివేకు లగువారు మొమ్మొదట ఈ ఆధి పంజరమును
ద్యజింపవలెను. పిమ్మట తత్వదర్శన మొనరించి, విగత జ్వరుడును, శీతలాంతః కరణుడును నై యీ
జగత్తు నంతటిని ఇంద్రజాలమువలె గాంచి నగును. సమ్యగ్దర్శనము నొనరింపనివారు కేవలము దుఃఖమునే
అనుభవింతురు.
విషమో హ్యతితరాం సంసారరాగో భోగీవ దశతి, అసిరివ ఛినత్తి, కుంత ఇవ వేధయతి,
ంజ్జరివావేష్టయతి, పావక ఇవ దహతి, రాత్రిరివాంధయతి,
అశంకితపరిపతితపురుషాన్ పాషాణ ఇవ వివశీకరోతి,

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -12) 259
హరతి ప్రజ్ఞాం, నాశయతి స్థితిం, పాతయతి మోహాంధకూపే,
తృష్ణా జర్జరీకరోతి, న తదస్తి కించిద్దుఃఖం సంసారీ యన్న ప్రాప్నోతి॥ 14
ఈ సంసారాసక్తి అతిభయంకర మైనది. ఇది అనర్థశంక లేని మోహగ్రస్త పురుషులను పామువలె
కరచును, కత్తివలె నఱకును, కుంతాస్త్రమువలె వేధించును, త్రాడువలె కట్టును, అగ్నివలె దహించును,
రాత్రివలె చూపును బోగొట్టును, రాత్రివలె మూర్ఛ నందించును, బుద్ధివృత్తిని స్థితిని పాడుపరచును, మోహాంధ
కూపమున బడగొట్టును, వేయేల? సంసారాసక్తు డగువా డనుభవించని దుఃఖమే లేదు.
దురంతేయం కిల విషయవిషూచికా యది న చికిత్స్యతే
తన్నితరాం నరకనగరనికరఫలానుబంధినీ తత్తత్కరోతి 15
ఈ దురంతవిషయ - విషూచి వ్యాధికి తగు చికిత్స నొనర్పనిచో, మలమూత్రములతో గూడిన
నరకములగు తనయొక్కయు, బంధుమిత్రాదుల యొక్కయు శరీరముల మమతను గల్గించి, నరక యాతన
ననుభవింపజేయును.
యత్ర శిలాశితాసిశాతః పాత ఉపలతాడనమగ్నిదాహో హిమావ
సేకోంగావకర్తనం చందనచర్చా తరువనాని ముణవృంతాంతః పరివే
షో2 ంగపరిమార్జనమనవరతానలవిచలితసమరనారాచనిపాతో
నిదాఘవినోదనం, ధారాగృహనీకరవర్షణం, శిరశ్ఛేదః
సుఖనిద్రా మూకీకరణమానసముద్రా బాంధుర్యం మహానుపచయః ॥ 16
రాళ్లను దినుట, కత్తితో కోయబడుట; కొండనుండి దొర్లింపబడుట; రాళ్ళతో మోదబడుట, నిప్పుచే
కాల్చబడుట, మందుతో తడుపబడుట, అవయవములు కత్తిరింపబడుట, గంధపు చెక్కవలె
అరుగదీయబడుట, రెండుకొయ్యల మధ్య బిగింపబడుట, కాలుచున్న సంకెళ్ళతో బంధింపబడుట, ముళ్ళతో
గీయబడుట, అగ్నిబాణముల వర్షమున దడియుట, నీడ లేకుండ మండు వేసవిని గడుపుట, నీటిధారలయందు
శీతకాలమున నిలబడుట, తల నరకబడుట, నిద్ర లేకుండుట, మోము కప్పబడుట, అవయవముల నెగుడు
దిగు డొనరించుట, కొండంత లావున శరీరము పెరుగుట-ఇట్టి వగు కష్టముల పెక్కింటిని ఈ నరకములయం
దనుభవింపవలెను.
తదేవం విధ కష్టచేష్టాసహస్రదారుణే సంసారచలయం త్రేస్మిన్ రాఘవ! నావహేలనా కర్తవ్యా
అవశ్యమేవం విచారణీయమేవం చావబోధవ్యం యథా కిల శాస్త్రవిచారాచ్చేయో భవతీతి 17
అందువలన నోరాఘవా! పలుకష్టములతో గూడుకొనియున్న యీ సంసార యంత్ర మతి దారుణము.
దీనిని లక్షింపకుండుట ఉచితము కాదు. శాస్త్ర విచారమువలన శ్రేయస్సు లభించును. దానిని ఆలోచించి

260 యోగవాసిష్ఠము
తెలిసికొనుము.
అన్యచ్చ రఘుకులేందో! యది చైతే మహామునయో మహర్షయశ్చ విప్రాశ్చ రాజానశ్చ
జ్ఞానకవచే నావగుంఠిత శరీరాస్తే కథ మదుఃఖక్షమా అవి దుఃఖకరీం తాం తాం వృత్తిపూర్వికాం
సంసార కదర్థనామను భవంతః సతతమేవ ముదితమనస స్తిష్ఠంతి 18
రఘుకులచంద్రా! మఱియు జ్ఞానకవచమును దొడిగి కొనిన మునులు, ఋషులు, బ్రాహ్మణులు,
రాజులును, దుఃఖానర్హులయ్యు, దుఃఖియగు మనస్సుతో ఈ సంసారపీడ ననుభవించుచున్నను, వీరు
నిరంతరము హృష్టచిత్తులై యున్నారు.
ఇహ హి,
వికౌతుకా విగత వికల్ప విప్లవా యథా స్థితా హరిహరపద్మజాదయః
నరోత్తమాః సమధిగతాత్మదీపకాస్తథా స్థితా జగతి విశుద్ధబుద్ధయః 19
ఎట్లన-విశుద్ధచిత్తులగు మానవులు ఆత్మదీపమును బొంది, హరిహర బ్రహ్మాదులగు దేవత లీ
సంసారమున కౌతుక విక్షేప హీనులై యున్నట్లు, వెలయుదురు.
పరిక్షీణే మోహే విగలతి మనే జ్ఞానజలదే
పరిజ్ఞాతే తత్త్యే సమధిగత ఆత్మన్యతితతే
విచార్యార్యై: సార్ధం చలిత వపుషో వై సదృశతో
ధియా దృష్టే తత్త్యే రమణమటనం జాగతమిదమ్ ॥ 20 20
మోహము క్షీణించి, గొప్పవగు జ్ఞానమేఘము లుదయించిన, విచ్ఛిన్నమైన ఆత్మతత్వము
నందవచ్చును. అప్పుడు జీవునకు జగద్వ్యాపారము లీలగా దోచును, పీడ అనిపించదు.
అన్యచ్చ రామవ!
ప్రసన్నే చిత్తత్త్యే హృది శమభవే వృతి పరే
శమాభోగీభూతాస్వఖిలకలనా దృష్టిషు పురః
సమం యాతి స్వాంతః కరణ మట నాస్వాదిత రసం
ధియా దృష్టి తత్త్యే రమణమటనం జాగతమిదమ్ | 221
మఱియు - రాఘవా! చైతన్యమాత్రమగు ఆత్మ ప్రసన్నమైన, పరమశాంతి లభించును. బుద్ధివృత్తు
లన్నియు శాంతి - రసమున మునుగును. అప్పుడు, బ్రహ్మరసాస్వాదనమున అంతఃకరణ వ్యాపారము
సమభావాపన్న మగును. ఈ స్థితియందు జ్ఞానులకు జగద్భమణము క్రీడగనే తోచును.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -12) 261
అన్యచ్ఛ.
రథః స్థాణుర్దేహ స్తురగరచనా చేంద్రియగతిః
పరిస్పందో వాతో వహన కలితానంద విషయః |
పరోణుర్వా దేహీ జగతి విహరా మిత్యనమయా
ధియా దృష్టే తత్త్యే రమణ మటనం జాగతమిదమ్ ॥ 22
ఇతి శ్రీ వాసిష్ఠ - మహారామాయణే ముముక్షు వ్యవహార ప్రకరణే తత్త్యమాహాత్మ్యవర్ణనం
నామ ద్వాదశః సర్గః ॥12 ॥
మఱియు - ఛిన్నతరువువలె అచేతన మగు ఈ తనువును రథముతో బోల్ప నగును. ఇంద్రియముల
చలనమే దీని కదలిక: ప్రాణవాయువువలన నీరథము కదలుచున్నది. మనస్సు దీని పగ్గము. ఆనందము
దీని గమ్యస్థానము. ఈ దేహరథమును నారోహించిన జీవుడు క్షుద్రుడైనను సమాధి సమయమున శుద్ధచిత్త
సాహాయ్యమున ఆత్మతత్త్వ దర్శనమైన యీ జగద్విహరణము సుఖ క్రీడయే.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు ముముక్షువ్యవహార ప్రకరణమున తత్త్యమాహాత్మ్య వర్ణనమను ద్వాదశ సర్గము ॥ 12॥
శమ నిరూపణము-13
శ్రీవసిష్ఠ ఉవాచ:
ఏతాం దృష్టిమవష్టభ్య దృష్టాత్మాన సుబుద్ధయః
విచరంతీహ సంసారే మహాంతో భ్యుదితా ఇవ ॥ 1
శ్రీవసిష్ఠుడు: రాఘవా! ఈసంసారమున బుద్ధిమంతులు అనగా వివేకులు ఈ జ్ఞానదృష్టిని బొంది,
ఆత్మసాక్షాత్కార మొనరించుకొని, రాజ్యమును బొందిన వారివలె గొప్పలై చరింతురు.
న శోచంతి న న వాంఛంతి న యాచంతే శుభాశుభమ్ |
సర్వమేవ చ కుర్వంతి న కుర్వంతీహ కించన ॥ 2
వీరు శోకింపరు, ఎద్దానినికూడ గోరరు. శుభాశుభముల నర్థింపరు. శాస్త్ర సమర్థితము లగు కర్మల
నొనర్తురు; శాస్త్ర విరుద్ధములగు కర్మల నొనర్పరు.
స్వచ్ఛమేవావతిష్ఠంతి స్వచ్ఛం కుర్వంతి యాంతి హి |
హేయోపాదేయతావక్షరహితాః స్వాత్మని స్థితాః"I 3

262 యోగవాసిష్ఠము
వీరు పవిత్రతయందే వసింతురు. వీరొనర్చున దంతయు మంచికొఱకే, అది సన్మార్గమునకే
మరలుచున్నది. "ఇది హేయము. అది ఉపాదేయము" - అను భిన్నజ్ఞానమును వర్ణించి ఆత్మనిష్ఠులై
నెగడుచున్నారు.
ఆయాంతి చ న చాయాంతి ప్రాయాంతి చ న యాంతిచ
కర్వంత్యతి న కుర్వంతి న వదంతి వదంతి
వీరి రాకపోకలుగూడ బుద్ధిపూర్వకములు గావు; వీరొనర్చునది, పల్కున దంతయుగూడ నిష్కామమే ॥
యే కేచన సమారంభా యాశ్చ కాశ్చన దృష్టయః
హేయోపాదేయతస్తాస్తాః క్షీయంతే ధిగతేపదే ॥ 5
పరమపదము లభించిన సమస్తకార్యములును దృష్టులును, హేయోపాయ విమర్శనా శూన్యములై నశించును.
పరిత్యక్తసమస్తేహం మనో మధురవృత్తిమత్
సర్వతః సుఖమభ్యేతి చంద్రబింబ ఇవ స్థితమ్ 11 6
వీరు వివిధ ఇచ్ఛలను కార్యములను బరిత్యజించిన, మధురమనోవృత్తి (శాంతరసమయి
బ్రహ్మాకారవృత్తి)తో గూడినవారై చంద్రమండలమందున్న దేవతలవలె సుఖము ననుభవింతురు.
అపి నిర్మననారంభమవ్యస్తాఖిల కౌతుకమ్
ఆత్మన్యేవ న మాత్యంతరిందావివ రసాయనమ్ |
"I 7
చంద్రబింబ మందమృత మున్నదో లేదో తెలియజాలనట్లు, ఇప్పుడు మనమున్న స్థితియందు,
విషయాభిలాషా శూన్యమును, కౌతుక విహీనమును అనగా ఏకాగ్రమగు మనస్సుయొక్క సుఖమెట్టిదో తెలియజాలము.
న కరోతీంద్రజాలాని నానుధావతి వాసనామ్ ।
బాలచాపలముత్సృజ్య పూర్వమేవ విరాజతే ॥ 8
ఆత్మవేత్త మాయ యను ఇంద్రజాలమును గాంచడు; దీనికి గారణమగు వాసనల ననుసరింపడు.
అతడు బాలచాపల్యమును వీడి, పూర్వమే లభించియున్న పరమాత్మసుఖమున రాజిల్లును. *
* వేదాంతు లందురు - ముక్తి నిత్యవస్తువు; అది సిద్ధించియే యున్నది. మఱి మనము యత్నించునది దేనికి?- అనిన
ముక్తికొఱకు గాదు. ముక్తిని గప్పియుంచిన మాయాబంధ నిర్మూలనమునకు, మాయ సళ్ళిన ముక్తి కరతలామలకము. ఎట్లన,
ఒకని మెడలో హార మున్నది. అతడు దానిని పోయిన దానినిగ దలచి, ఉరంతయు వెదకినాడు; కనబడలేదు. చివరకు, దానిని
మెడలోనే యున్నట్లు గ్రహించి వెదకుట మానినాడు. ఇది ప్రాప్యవస్తు ప్రాప్తి. ఆత్మ నిత్య శుద్ధ బుద్ధ స్వభావకమగు తన, ఇది సదా
ముక్తము. మాయను తొలగించుటయే మన మొనర్చుపని. కనుక, "పూర్వమే లభించియున్న ఆత్మసుఖ" మని ప్రయోగింపబడినది.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -13) 263
ఏవం విధా హి వృత్తయ ఆత్మతత్త్యాలోకనాభ్యంతే నాన్యథా 9
ఇట్టి జీవన్ముక్తస్థితి, ఆత్మదర్శనమువలననే లభించును; అన్యోపాయము వలన నిది లభింపదు.
తస్మాద్విచారేణాత్మైవాన్వేష్టవ్య ఉపాసనీయో |
జ్ఞాతవ్యో యావజ్జీవం పురుషేణ నేతరదితి | 10
అందువలన మనుజుడు విచారబుద్ధితో యావజ్జీవము ఆత్మాన్వేషణము సల్పుచు, దానిని
నుపాసించుచు, జ్ఞానమును బొందవలెను; తదితరమును కాదు.
స్వానుభూతేశ్చ శాస్త్రస్య గురోశ్చైవైక వాక్యతా
యస్యాభ్యాసేన తేనాత్మా సంతతే నావలోక్యతే ॥
|| 11
అభ్యాసమువలన ననుభవమును సంపాదించి, శాస్త్రానుశీలన మొనర్చి, గురువుయొక్క ఉపదేశమును
గ్రహింప యత్నించువాడే ఆత్మదర్శనమును బొందగలడు.
అవహేలిత శాస్త్రార్డై రవజ్ఞాత మహాజనైః |
కష్టామప్యాపదం ప్రాప్తో న మూడైః సమతామియాత్ II 12
ఇట్టివాడు, శాస్త్రార్థములను నిరసించుచు, మహాత్ముల నవమానించు మూఢునివలె, కష్టమును
బొందడు.
న వ్యాధిర విషం నాపత్తథా నాధిశ్చ భూతలే |
భేదాయ స్వశరీరస్థం మౌర్ఖ్యమేకం యథా నృణామ్ ॥ "I 13
మనుజుని వాని అజ్ఞానము కష్టముల పాలుచేయునంతగా భూతలమున వ్యాధులు, మానసిక చింతలు,
ఆపదలు దుఃఖమును గలిగింపజాలవు.
కించిత్ సంస్కృతబుద్దీనాం శ్రుతం శాస్త్రమిదం యథా |
మౌర్ఖ్యపహం తథా శాస్త్రమన్యదస్తి న కించన ॥ 14
ఒకింత చిత్తశుద్ధి గల వా రీశాస్త్రమును బఠించిన వారి అజ్ఞానము తొలగిపోవును; వారి కీశాస్త్రము
తోడ్పడునట్లితరములు తోడ్పడజాలవు.
ఇదం శ్రావ్యం సుఖకరం యథా దృష్టాంతసుందరమ్ |
అవిరుద్ధమశేషేణ శాస్త్రం వాక్యార్థ బంధునా ॥ 15
"పరమాత్మయే మాప్రియుడు" - అని వచించువారు అనగా ఆత్మవస్తువు నందగోరు వారు శ్రవణ

264 యోగవాసిష్ఠము
మధురమును, యథోచిత దృష్టాంత శోభితమును, ఆత్మసుఖ ప్రసాదియును, శ్రుతిస్మృతి సంగతమును
నగు ఈ శాస్త్రమును సంపూర్ణముగ వినవలెను.
ఆపదో యా దురుత్తారా యాశ్చ తుచ్చాః కుయోనయః
తాస్తా మౌర్ఖ్యత్ ప్రసూయంతే ఖదిరాదివ కంటకాః 16
కవిరిచెట్టునుండి ముళ్లు లేచునట్లు అనివార్యములును, తుచ్ఛములును, కుకారణములును నగు
ఆపదలు మూర్ఖత నుండియే వెలువడుచున్నవి.
వరం శరావహస్తస్య చాండాలాగారవీథిషు ।
భిక్షార్థమటనం రామ! న మౌర్ఖ్యహతజీవితమ్ ॥ 17 "I
రామా! మూఢునివలె జీవితమును గడుపుటకంటె మూకుడు చేతకొని మాలపల్లెలో తిరిపె మెత్తుట
మేలు.
వరం ఘోరాంధకూపేషు కోటరేష్వేవ భూరుహమ్ ।
అంధకీటత్వమేకాంతే న మౌర్ఖ్యమతిదుఃఖదమ్ | 18
అతిదుఃఖకరమగు మూర్ఖతా జీవితముకంటే చీకటినూతులలోనో, చెట్టుతొఱ్ఱలలోనో, ఒంటరి
పురుగువలె జీవితమును గడుపుట మేలు.
ఇమమాలోకమాసాద్య మోక్షోపాయమయం జనః
అంధతా మేతి న పునః కశ్చిన్మోహతమస్యపి " 19
జనులు మోక్షోపాయమగు ఈ జ్ఞానకాంతిని బడసినచో, మోహాంధకారమున కన్నులు మసకలు క్రమ్మవు.
తావన్నయతి సంకోచం తృష్ణా వై మానవాంబుజమ్
|
యావద్వివేక సూర్యస్య నోదితా విమలా ప్రభా 20 11
వివేకసూర్యుని పవిత్రజ్యోతి ప్రకాశితము కానంతవఱకు, తృష్ణ మానవులను పద్మములను
ముడుచుకొనియుండు నల్లొనర్చును.
సంసారదుఃఖమోక్షార్థం మాదృశైః సహబంధుభిః |
స్వరూపమాత్మనో జ్ఞాత్వా గురు శాస్త్రప్రమాణతః ॥ 21
జీవన్ముక్తాశ్చరంతీహ యథా హరిహరాదయః |
యథా బ్రహ్మర్షయశ్చాన్యే తథా విహర రాఘవ! ॥ 22 22

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -13) 265
రాఘవా! సంసార బంధములను త్రెంప మావంటి హితులతోగూడి గురువు. శాస్త్రము అను
ప్రమాణములనుండి ఆత్మస్వరూపము నెఱిగి, హరిహరాదులను తదితరులగు మహర్షులును జీవన్ముక్తులై
చరించునట్లు. నీవుకూడ చరింపుము.
అనంతానీహ దుఃఖాని సుఖం తృణలవోపమమ్ ।
నాతః సుఖీషు బర్నియాదృష్టిం దుఃఖానుబంధిషు ॥ 23
ఈ సంసారము అంతము లేని దుఃఖములకు తావు; సుఖము తృణమాత్రమే. అందువలన, దుః
ఖముతో గూడిన ఈ సంసార సుఖముల వైపునకు నీ దృష్టిని మరల్పకుము.
యదనంతమనాయాసం తత్పదం సారసిద్ధయే I
సాధనీయం ప్రయత్నేన పురుషేణ విజానతా ॥ 24
అనంతమును, క్లేశహీనమును నగు, మోక్షపదమును పొందుటకొఱకే వివేకి యగు మనుజుడు
ప్రయత్నింపవలెను.
త ఏవ పురుషార్థస్య భాజనం పురుషోత్తమాః ।
అనుత్తమపదాలంబి మనో యేషాం గతజ్వరమ్ 22511 25
ఎవరి మనస్సు సర్వోత్తమ మగు ఆ మోక్షపదము నాలంబన మొనర్చుకొని, కామాదిజ్వర శూన్యమైనదో,
ఆ పురుషోత్తములే పురుషార్థసిద్ధి నందుదురు.
సంభోగాశనమాత్రేణ రాజ్యాదిషు సుఖేషు యే 1
సంతుష్టా దుష్టమనసో విద్ధితానందదర్దురాన్11 26
రాజ్యాదివిషయ సుఖములతోడను, అన్నపానాదులగు భోగములతోడను సంతుష్టులగువారు గ్రుడ్డి
కప్పలని ఎఱుంగునది.
యే శశేషు దురంతేషు దుష్కృతా రంభశాలిషు |
ద్విషత్సు మిత్ర రూపేషు భక్తా పై భోగభోగిషు ॥ 27
తే యాంతి దుర్గమాదుర్గం దుఃఖాద్దుఃఖం భయాద్భయమ్ ।
నరకాన్నరకం మూఢా మోహమంథరబుద్ధయః II 28
ప్రబలవంచకులును, విషయ లాలసులును నగు మిత్రరూప శత్రువులయెడ నాసక్తులగు మోహాంధ
బుద్ధులు తతో2 ధికములగు కష్టములను, దుఃఖములను, భయములను, నరకములను బొందెదరు.

266 యోగవాసిష్ఠము
పరస్పరవినాశోక్తేః శ్రేయః న కదాచన
సుఖదుఃఖదశే రామ! తడిత్ ప్రసరభంగురే ॥ 22 29
సుఖదుఃఖములు పరస్పర నాశకారణములగు మెఱపు వెలుగుల వంటివి; క్షణభంగురములు, కనుక
నివి, ఆత్యంతిక శ్రేయస్సు అగు మోక్షమును గూర్పజాలవు;
యే విరక్తా మహాత్మానః సువివిక్తా భవాదృశాః |
పురుషాన్ విద్ధి తాన్ వంద్యాన్ భోగమోక్షైక భాజనాన్ ॥ 30
నీవలె విరక్తులును వివేకులు నగు పురుషులే భోగమోక్షముల నందుదురు. ఇట్టివారే వందనీయులు.
వివేకం పరమాశ్రిత్య వైరాగ్యాభ్యాసయో గతః|
సంసార సరితం ఘోరమిమామాపద ముత్తరేత్ ॥ 31
పరమ వివేకము నాశ్రయించి, వైరాగ్యాభ్యాసములు నాచరించిన, సంసారనది యగు ఘోరాపదను
దాటవచ్చును.
న స్వప్తవ్యం చ సంసార మాయాస్విహ విజానతా |
విషమూర్ఛనసమ్మోహదాయినీషు వివేకినా ॥ 32
విషమూర్ఛితునివలె వివేకియు, జ్ఞానియు నగు నాతడు మోహదాయిని యగు ఈ సంసార
మాయయందు నిద్రించుట (అనగా మోక్షము నంద ప్రయత్నింప కుండుట) ఉచితము కాదు.
సంసారమిమమాసాద్య యన్తిష్ఠత్యవ హేలయా
1
జ్వలితస్య గృహస్యోచ్చైః శేతే తార్లన్య సంస్తరే ॥ 33
ఈ సంస్కృతి యందుపడి, మోచనకై యత్నింపనివాడు, తగులబడిన ఇంట తృణశయ్య యందు
పరుండియున్నాడన్నమాట.
యత్రాప్య న నివర్తంతే యదాసాద్య న శోచతే
తత్పదం శేముషీలభ్యమస్త్యేవాత్ర న సంశయః 34
పునరావృత్తి రహితమును, శోకశూన్యమును నగు పదము కేవలము జ్ఞానమువలననే లభించును.
అవంతయు సంశయము లేదు.
నాస్తిచేత్ తద్విచారేణ దోషః కో భవతాం భవేత్
అస్తిచేత్ తత్సముత్తీర్ణా భవిష్యథ భవార్ణవాత్ II 35

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -13) 267
బ్రహ్మము లేదందువా? - అయినను విచార మొనర్చిన దోషమేమి? ఉన్నచో సంసార సాగరమును తరింతువు.
ప్రవృత్తిః పురుషస్యేహ మోక్షోపాయవిచారణే |
యదా భవత్యాశు తదా మోక్షభాగీ స ఉచ్యతే " 36
ఈశ్వరానుగ్రహమున, సచ్ఛాస్త్రమును సద్గురువును బడసి, మోక్షోపాయమును విచారించునప్పుడే
పురుషుడు మోక్షభాగి యనబడును.
అనపాయి నిరాశంకం స్వాస్థ్యం విగత విభ్రమమ్ ।
న వినా కేవలీభావాద్విద్యతే భువనత్రయే | 37
మూల్లోకముల మోక్షముకంటే నిరపాయమును, భ్రమశంకా రహితము నగు సుఖము మరొక్కటి
లేదు. ఇంద్రియ సుఖములును స్వర్గాది సుఖములును దీనితో సరిరావు.
తత్రాప్తావుత్తమప్రాప్తో న క్లేశ ఉపజాయతే |
న ధనాన్యుప కుర్వంతి న మిత్రాణి న బాంధవః ॥ 38
న హస్తపాదచలనం న దేశాంతరసంగమః |
న కాయక్లేశవైధుర్యం న తీర్థాయతనాశ్రయాః || 39
పురుషార్థిక సాధ్యన వాసనైకార్థకర్మణా |
కేవలం తన్మనోమాత్ర జయేనాసాద్యతే పదమ్ ॥ 40
మోక్షోపాయము నెఱుగ ప్రవృత్తి గల్గినచో మోక్షమును బొందుట కెట్టి ఆటంకమును లేదు. ధనము,
బంధుమిత్రులు, హస్తపాద చలనము (కర్మలు) తీర్థయాత్రలు, తన్నివాసము, కాయక్లేశ కరము లగు
ఉపవాసాదులు- దీని కెంతమాత్రము తోడ్పడజాలవు. కేవలము శ్రవణ మనన నిదిధ్యాస రూపకమగు
పురుష ప్రయత్నమువలన ద్వైతరూపక మగు మనస్సును జయించి, బ్రహ్మరసాకారిత మొనర్చుటవలననే
అట్టి మోక్షము లభించును.
వివేకమాత్రసాధ్యం తద్విచారైకాంత నిశ్చయమ్ ।
త్యజతా దుఃఖజాలాని నరేణైతదవాప్యతే ॥ || 41
ఈ బ్రహ్మపదమును కేవలము విచారమువలననే నిశ్చయింపనగును; దేహేంద్రియాదులకంటె అది
ఇతరమను వివేక మవసరము. దీని నందగోరువాడు దుఃఖజాలములగు విషయములను పరిత్యజింపవలెను.
సుఖ సేవ్యాసన స్థెన తద్విచారయతా స్వయమ్ ।
న శోచ్యతే పదం ప్రాప్య న స భూయో హి జాయతే ॥ 42

268 యోగవాసిష్ఠము
సమమును సుఖకరమును నగు ఆసనమున గూర్చుండి స్వయముగ విచారించి శోకరహితమగు ఆ
పదమును బొందువాడు మరల జన్మింపడు.
తత్సమస్తసుఖాసారసీమాంతం సాధవో విదుః।
తదనుత్తమనిష్పందం పరమాహూ రసాయనమ్ ॥ 43
సాధువులు ఈ పరమపదమును సమస్త సుఖముల పరమావధి యనియు, ఎనలేని దనియు, నాశము
లేని అమృత మనియు ఎఱుంగుదురు.
క్షయిత్వాత్ సర్వభావానాం స్వర్గమానుష్యయోర్ద్వయోః 1
సుఖం నాస్యేవ సలిలం మృగతృష్ణాస్వివైతయోః || 44
పదార్థములన్నియు నశించునవే; స్వర్గ మర్త్య లోకములలో, ఎండమావిలో నీరు లేనట్లు, సుఖము
లేదు.
అతో మనోజయశ్చింత్యశ్శమసంతోషసాధనః
అనంతసమసంయోగస్తస్మాదానంద ఆప్యతే ! ! 45
అందువలన, శాంతి సంతోషముల ద్వారా సాధింపదగు మనోజయమును గుఱించి చింతించుటయే
లగ్గు. ఈ మనోజయమునుండియే ఏకరస స్వరూపమగు ఆనందము లభించును.
తిష్ఠతా గచ్ఛతా చైవ పతతా భ్రమతా తథా |
రక్షసా దానవేనాపి దేవేన పురుషేణ వా 46
మనఃప్రశమనోద్భూతం తత్రాప్యం పరమం సుఖమ్ ।
వికాసి శమపుష్పన్య వివేకోచ్చతరో: ఫలమ్ ॥ 47
శాంతి యగు వికసిత పుష్పములతో గూడిన వివేకమను గొప్పవృక్షము యొక్క ఫలమును, మనశ్శాంతి
జనితమును నగు ఆ పరమసుఖము దేవదానవ మనుష్యాది జీవల కందఱికిని లభించును; దీనికి శరీర
పరిశ్రమ అక్కరలేదు.
మనః ప్రశాంతమత్యచ్చం విశ్రాంతం విగతభ్రమమ్ |
అనీహం విగతాభీష్టం నాభివాంఛతి నోజ్ఝతి ॥ 48
వ్యవహారపరేణాపి కార్యవృందమవిందతా ।
భానునేవాంబరసేన నోజ్ఝతేవాంఛతే ॥ 49
ఈ ముక్తి సుఖము నందినవాని మనస్సు ప్రశాంతము, నిర్మలము, విగతభ్రమము, యత్న శూన్యము,

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -13) 269
వాంఛాశూన్యమును అగును; అందువలన నత డెద్దానిని గోరడు, లేక పరిత్యజింపడు. మఱియు, కర్మల
నాచరించినను వాటి ఫలములను బొందడు. ఆకాశమునందలి సూర్యునివలె ఎద్దానినికూడ గోరడు,
త్యజింపడు.
ఎక్షద్వారే ద్వారపాలా నిమాన్ శృణు యథాక్రమమ్ ।
యేషా మేకత మాసక్త్యా మోక్షద్వారం ప్రవిశ్యతే ॥ 11 50
నేను మోక్షద్వార ద్వారపాలకులను గుఱించి, క్రమముగ చెప్పుచున్నాను, వినుము. దీనిలో
నేయొక్కదాని నాశ్రయించినను మోక్షద్వారమును బ్రవేశింప వచ్చును.
సుఖదోషదశా దీర్ఘా సంసారమరుమండలీ
జంతోః శీతలతామేతి శీతరశ్మే: సమప్రభా ॥ 51
సుఖాశయను దాహదోషముతో దీర్ఘమై దాటరానిదై యున్న ఈ సంసారము, మరుభూమి
చంద్రకిరణములచే చల్లపడునట్లు శమమువలన జల్లపడును.
శమేనాసాద్యతే శ్రేయః శమో హి పరమం పదమ్ ।
శమః శివః శమః శాంతిః శమో భ్రాంతినివారణమ్ ॥ 52
శమమువలన శ్రేయస్సు లభించును; శమమే ముక్తి, శమమే శుభము, శాంతి. ఇదియే
భ్రాంతినివారకము గూడ నై యున్నది.
పుంసః ప్రశమతృప్తస్య శీతలాచ్ఛతరాత్మనః|
శమభూషిత చిత్తస్య శత్రురప్యేతి మిత్రతామ్ ॥ 53
శమాలంకృత చిత్తుడును, తృప్తుడును, శాంతుడును నిర్మలుడును నగును. శత్రువులుగూడ ఇట్టివానికి
మిత్రు లగుదురు.
శమచంద్రమసా యేషామాశయః సమలంకృతః
క్షీరోదానామివోదేతి తేషాం పరమశుద్ధతా 54
శమమను చంద్రునివలన నలంకరింపబడిన చిత్తము గలవారు, క్షీర సముద్రమున స్నానమొనర్చిన
వారివలె పవిత్రు లగుదురు.
హృత్కు శేశయ కోశేషు యేషాం శమకుశేశయమ్ |
సతాం వికసితం తే హి ద్విహృత్పద్మాః సమా హరేః ॥ 55

270 యోగవాసిష్ఠము
ఎవరి హృదయ పద్మకోశమున శమమను పద్మము వికసించినదో, అట్టి పద్మద్వయ శోభితులు
విష్ణువువలె శోభిల్లుదురు.
శమశ్రీః శోభతే యేషాం ముఖేందావకలంకితే |
తే కులీనేందవో వంద్యాః సౌందర్యవిజితేందవః ॥ 56 56
ఎవరి అకళంకిత ముఖచంద్రునియందు శమసంపద శోభిల్లుచుండునో, ఆ కులశేఖరులు వంద్యులు.
వారి సౌందర్యము చంద్రునిగూడ మించును.
త్రైలోక్యోదరవర్తిన్యో నానందాయ తథా శ్రియః|
సామ్రాజ్యసంపత్ప్రతిమా యథా శమవిభూతయః ||A 57
రాజ్యసంపదలతో సమానములగు శమైశ్వర్యము లిచ్చు ఆనందమును ముల్లోకముల నున్న
సంపదలుగూడ ఒసగజాలవు.
యాని దుఃఖాని యా తృష్ణా దుస్సహా యే దురాధయః
తత్సర్వం శాంతచేతఃస్సుతమో ర్కేష్వివ నశ్యతి ॥ 58
దుఃఖములు, తృష్ణలు, దుస్సహములగు మనోవ్యాధులు - ఇవన్నియు శాంతచిత్తుని మనమ్మున,
సూర్యోదయమున తమస్సువలె, నశించును.
మనో హి సర్వభూతానాం ప్రసాద మధిగచ్ఛతి |
న తథేందోర్యథా శాంతే జనే జనితకౌతుకమ్ |
59
59
అందఱి మనస్సులును విషయములకు సంబంధించిన ఆనందము నందును గాని, శాంతచిత్తుడు
అనుభవించు ఆనందమునకును దీనికిని ఆకాశపాతాళముల భేదమున్నది. ఈ ఆనందము ముందు చంద్రుని
చల్లదనము కూడ నిలబడజాలదు.
శమశాలిని సౌహార్ధవతి సర్వేషు జంతుము |
సుజనే పరమం తత్త్వం స్వయమేవ ప్రసీదతి " 60
శమయుతుడును, సర్వజీవులయెడ స్నేహబుద్ధి గలవాడును నగు సజ్జనునియందు పరతత్వము
దానియంతట అదే ప్రతిఫలించును.
మాతరీవ పరం యాంతి విషమాణి మృదూని చ
విశ్వాసమిహ భూతాని సర్వాణి శ్రమశాలిని ॥ 61
కఠినులును, దయార్ద్రులును నగు జీవులందరు, శమసంపన్నుని తల్లినివలె లెస్సగ విశ్వసింతురు.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -13) 271
న రసాయనపానేన న లక్ష్మ్యాలింగనేన
తథా సుఖమవాప్నోతి శమేనాంతర్యథా మనః ॥ 62
శమవలన లభించు సుఖముబోలు సుఖము, ఇంద్రపదవియందు గాని, విష్ణుపదవియందు గాని
లభింపదు.
సర్వాధివ్యాధిచలితం క్రాంతం తృష్ణా వరత్రయా
మనః శమామృతా సేకైః సమాశ్వాసయ రాఘవ! ॥ 63
రాఘవా! పలువిధములగు ఆధివ్యాధులవలన కలచబడి నదియు, తృష్ణయను చర్మపాశముచే
లాగబడునదియు నగు మనస్సును శాంత్యమృత సేచనమున నెమ్మది పఱచుము.
యత్కరోషి యదశ్నాని శమశీతలయా ధియా
తత్రాతిస్వదతే స్వాదు నేతరత్ తాత! మానసే ॥ 64
వత్సా! శమవలన చల్లబడిన బుద్ధితో ఆచరించునది, గ్రహించునది, మధురముగ నుండును;
తదితరము లిట్లుండవు.
శమామృతరసాచ్ఛన్నం మనో యామేతి నిర్వృతిమ్
ఛిన్నాన్యపి తయాంగాని మన్యే రోహంతి రాఘవ ॥
65
రాఘవా! మనస్సు శాంత్యమృత రసమున గప్పబడి ఏ యానందము నందునో, ఆ ఆనందముయొక్క
అంశలు తునిగిపోయినను మరల చిగుర్చునని నేను తలంతును (శాంత్యానందము తఱుగు లేనిది,
శాశ్వతమైనది - అని అభిప్రాయము)
న పిశాచా న రక్షాంసి న దైత్యా న చ శత్రవః |
న చ వ్యాఘ్రభుజంగా వా ద్విషంతి శమశాలినమ్ ॥ 66
శమశాలి యగు పురుషుని పిశాచములు, రాక్షసులు, దైత్యులు, విరోధులు పాములు, పులులుగూడ ద్వేషింపవు.
సుసన్నద్ధసమస్తాంగం ప్రశమామృతవర్మణా |
వేదయంతి న దుఃఖాని శరా వజ్రశిలామివ ॥ 67
బాణము వజ్రమును భేదింపజాలనట్లు, శాంతిసుధయను కవచమున ఎవరి అంగములన్నియు
కప్పబడియున్నవో, వారిని దుఃఖములు పీడింపజాలవు.
న తథా శోభతే రాజా అప్యంతః పురసంస్థితః
సమయా స్వచ్ఛయా బుద్ధ్యా యథోపశమశీలయా ॥
I 68

272 యోగవాసిష్ఠము
సమమును, స్వచ్ఛమును, ఉపశమితమును నగు బుద్ధివలన పురుషుడు శోభిల్లునట్లు, అంతః
పురమునందలి రాజుగూడ శోభిల్లడు.
ప్రాణాత్ ప్రియతరం దృష్ట్యా తుష్టిమేతి న వై జనః |
యామాయాతి జనః శాంతిమవలోక్య శమాశయమ్ ॥ 69
ప్రాణాధికుడగు స్నేహితుని గాంచిన గలుగు శాంత్యానందములకంటె అధికమగు శాంత్వానందమును
శమయుతుడగు జనుని గాంచి నరులు పొందెదరు.
సమయా శమశాలిన్యా వృత్త్యా యః సాధు వర్తతే ।
అభినందితయా లోకే జీవతీహ స నేతరః ॥ 70
ఏవ్యక్తి, సమమును, శమయుతమును, లోక ప్రశంసితమును నగు ఆచరణతో సాధుభావమున
మెలగునో, అతని జీవితమే సఫలము; ఇతరుల జీవితము వ్యర్థము.
అనుద్ధతమనాః శాంతఃసాధుః కర్మ కరోతి యత్
తత్సర్వ మభినందంతి తస్యేమా భూతజాతయః II 71
నిగర్వియు, శాంతుడును నగు వాడాచరించు కర్మ లన్నిటిని, జీవులందరు పొగడుదురు.
శ్రుత్వా స్పృష్ట్వా చ దృష్ట్వా చ భుక్త్యాస్నాత్వా శుభాశుభమ్ ।
న హృష్యతి గ్లాయతి యః స శాంత ఇతి కథ్యతే | 72 "I
ఏ వ్యక్తి, శుభాశుభ దర్శన, స్పర్శన, శ్రవణ, స్నానముల నొనర్చియు హర్ష విషాదముల నందకుండునో,
అతడే శాంతుడని చెప్పబడుచున్నాడు.
యః నమః సర్వభూతేషు భావి కాంక్షతి నోజ్ తి
జిత్వేంద్రియాణి యత్నేన స శాంత ఇతి కథ్యతే 73 ||
సర్వభూతములను సమముగ గాంచువాడును, యత్నముతో నింద్రియములను జయించిన వాడును,
భావిసుఖములను గోరని వాడును, ప్రాప్తవిషయములను బరిత్యజింపని వాడును, శాంతుడనబడుచున్నాడు.
స్పృష్ట్వావదాతయా బుద్ధ్వా యథైవాంత స్తథా బహిః |
దృశ్యంతే యత్ర కార్యాణి స శాంత ఇతి కథ్యతే ॥ 74
పరుల కౌటిల్యాది దుర్గుణముల నెఱింగియు, బహిరంతరముల శుద్ధుడై, మోక్షము నిమిత్తమై కర్మల
నాచరించువాడు శాంతు డనబడుచున్నాడు.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -13) 273
స్థితో ఒపి న స్థిత ఇవ న హృష్యతి న కుప్యతి |
యః సుషుప్తసమః స్వస్థః స శాంత ఇతి కథ్యతే 75
నిద్రించువానివలె స్వస్థుడయ్యు స్వస్థుడు కానివాడును, హర్షక్రోధ శూన్యుడును నగు వాడు శాంతు
డనబడుచున్నాడు.
తుషాకరబింబాభం మనో యస్య నిరాకులమ్ |
మరణోత్సవయుద్ధేషు స శాంత ఇతి కథ్యతే | 11 76
మరణోత్సవ యుద్ధ సమయములందు గూడ నెవని మనస్సు భయరాగ క్రోధములు తల్లడిల్లక,
చంద్రబింబమువలె నిర్మలముగ నుండునో అతడే శాంతుడని చెప్పబడుచున్నాడు.
అమృతస్యందసుభగా యస్య సర్వజనం ప్రతి
దృష్టి: ప్రసరతి ప్రీతా స శాంత ఇతి కథ్యతే ॥
"1 77
అమృత ప్రవాహమువలె ఎవ్వని దృష్టి సకలజీవులయెడ సమాన ప్రీతితో ప్రసరితమగునో, అతడే
శాంతుడని చెప్పబడుచున్నాడు.
యో౨౦తః శీతలతాం యాతో యో భావేషు న మజ్జతి
వ్యవహారీ న సంమూఢః స శాంత ఇతి కథ్యతే || 78
శీతలాంతః కరణుడును, విషయములలో జరించినను మూఢునివలె నసంగుడును నగువాడు
శాంతుడని చెప్పబడుచున్నాడు.
ఆప్యాపత్సు దురంతాలు కల్పాంతేషు మహత్స్వవి
తుచ్చే హం న మనో యస్య స శాంత ఇతి కథ్యతే ॥ 79
కలకాల ముండునట్టి ఆపదలందునగాని, లేక ప్రళయ సమయమునగాని, నశ్వరదేహమున
నభిమానము వహింపని వానిని శాంతుడందురు.
ఆకాశసదృశీ యస్య పుంసః సంవ్యవహారిణః
కలంకమేతి న మతిః స శాంత ఇతి కథ్యతే "I 80
సంసార విషయములలో చరించుచున్నను ఎవని మనస్సు రాగాది వికారముల వలన మలినపడక,
ఆకాశమువలె స్వచ్ఛమై యుండునో, ఆతడు శాంతు డనబడుచున్నాడు.
తపస్విషు బహుజ్ఞేషు యాజకేషు నృపేషు చ
బలవత్సు గుణాఢ్యషు శమవానేవ రాజతే ॥
81 53
VI F18

274 యోగవాసిష్ఠము
తపస్వి, బహుదర్శి, యాజకుడు, రాజు, బలవంతుడు, గుణవంతుడు - వీరందరిలో శాంతుడే శోభిల్లును.
శమసంసక్త మనసాం మహతాం గుణశాలినామ్ |
ఉదేతి నిర్వృతి శ్చిత్తాజ్యోత్స్నవ సీతరోచిషః ॥ 82
చంద్రునినుండి వెన్నెల వెలువడునట్లు, శమాది యుక్తుడును, గుణవంతు డును నగు మహద్వ్యక్తినుండి
పరమానందము వెలువడుచుండును.
సీమంతో గుణపూగానాం పౌరుషైకాంతభూషణమ్ ।
సంకటేషు భయస్థానే శమః శ్రీమాన్ విరాజతే ॥ 83
సుగణముల కెల్లయగు పౌరుషమునకు ప్రధానాలంకారమగు శాంతియే సంకట సమయము
లందునను, భయస్థానములందును వెలయుచుండును.
శమమమృత మహార్యమార్యగుప్తమ్ పరమవలంబ్య పరంపదం ప్రయాతాః
రఘుతనయ! యథా మహానుభావాః క్రమమనుపాలయ సిద్ధయే తమేవ॥ 84
ఇతి శ్రీ వాసిష్ఠ -మహారామాయణే ముముక్షువ్యవహారప్రకరణే శమనిరూపణం నామ త్రయోదశః సర్గః 13
రఘునందనా! ఈ శమామృతమును ఇతరులు హరింపజాలరు, దానిని ఆర్యులు రహస్యముగ
దాచియుంచినారు. దీని నవలంబించి వారు పరమపదము అనగా మోక్షము నందినట్లే, నీవుగూడ దీని
ననుసరించి కార్యసిద్ధి నందుము.
ఇది శ్రీవాసిష్ఠ-తాత్పర్య ప్రకాశికయందు, ముముక్షువ్యవహార ప్రకరణమున శమనిరూపణమను త్రయోదశసర్గము ॥ 13 ॥
విచార నిరూపణము -14
శ్రీవసిష్ఠ ఉవాచ:
శాస్త్రావబోధామలయా ధియా పరమపూతయా |
కర్తవ్యః కారణజ్ఞాన విచారో 2 నిశమాత్మనః
|| 1
శ్రీవసిష్ఠుడు: కారణజ్ఞుడగు వ్యక్తి, శాస్త్రజ్ఞానము ననుసరించిన నిర్మల పవిత్ర బుద్ధితో, నిరంతర మాత్మవిచార
మొనర్చుచుండవలెను.
విచారాత్ తీక్షణతామేత్య ధీః పశ్యతి పరంపదమ్ ।
దీర్ఘసంసారరోగస్య విచారో హి మహౌషధమ్ | 2

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -14) 275
బుద్ధి ఇట్టి విచారమువలననే నిశితమై, పరమ పదమును గాంచును. దీర్ఘసంసారమను ఈ రోగమునకు
విచారమే మహౌషధము.
ఆపద్వనమనంతేహావరివల్ల వితాకృతి |
విచారక్రకచచ్ఛిన్నం నైవ భూయః ప్రరోహతి ॥ 3
ఎడతెరపిలేని రాగాది ప్రవృత్తులను చివుళ్లతో వెలయు ఈ ఆపదల అడవిని విచారమను శస్త్రముతో
ఛిన్న మొనర్చిన మరల చివుర్చదు.
మోహేన బంధునాశేషు సంకటేషు శమేషు చ
సర్వం వ్యాప్తం మహాప్రాజ్ఞ విచారో హి సతాం గతిః ॥ 4
మహాప్రాజ్ఞా! బంధువుల మృతి - ఇత్యాదులగు కష్టసమయమున మోహము దాపురించుచుండును.
ఇట్టి తావుల సాధుపురుషులకు విచారమే గతి.
న విచారం వినా కశ్చిదుపాయో స్త్రి విపశ్చితామ్ ।
విచారాదశుభం త్యక్త్యా శుభమాయాతి ధీ: సతామ్ ॥ 5
పండితులకు విచారము గాక మరొక ఉపాయము లేదు. సత్పురుషుల బుద్ధి విచారమువలననే,
అశుభమును బరిత్యజించి శుభము నాశ్రయించు చుండును.
బలం బుద్ధిశ్చ తేజశ్చ ప్రతిపత్తిః క్రియాఫలమ్
ఫలంత్యేతాని సర్వాణి విచారేణైవ ధీమతామ్
6
విచారమువలననే బుద్ధిమంతులకు బలము; బుద్ధి, తేజము, సమయోచిత మగు స్ఫురణ,
క్రియానుష్ఠానము; తత్ఫలము; లభించుచుండును.
యుక్తాయుక్త మహాదీపమభివాంఛితసాధకమ్ |
స్ఫారం విచారమాశ్రిత్య సంసారజలధిం తరేత్
|| 7
ఉచితానుచితముల ప్రవేశింపజేయు దీపమును, అభీష్ట సాధకమును, గొప్పదియు నగు విచారము
నాశ్రయించిన సంసార సముద్రమును దాటగలము.
ఆలూనహృదయాంభోజాన్ మహామోహమతంగజాన్ |
విదారయతి శుద్ధాత్మా విచారో నామకేసరీ ॥ 8
పవిత్ర విచారమను సింహము, జనుల హృదయమున నున్న, వివేకమను పద్మముల పాడుజేయు

276 యోగవాసిష్ఠము
మహామోహమను ఏనుగను చీల్చివేయును.
మూఢాః కాలవశేనేహ యద్గతాః పరమం పదమ్ ।
తద్విచారప్రదీపస్య విజృంభితమనుత్తమమ్ II
మూఢులు సంసార సముద్రమును దాటు నుపాయమును గనుగొనజాలక తుదకనేక జన్మలు
గడచిన పిమ్మట ముక్తి నందుచున్నారు. దీనికి గూడ కారణము విచారమే.
రాజ్యాని సంపదః స్పారా భోగో మోక్షశ్చ శాశ్వతః ।
విచారకల్పవృక్షస్య ఫలాన్యేతాని రాఘవ! 10
రాఘవా! రాజ్యములు, సంపదలు, భోగములు, శాశ్వతమగు మోక్షము - ఇవన్నియు విచారమను
కల్పవృక్షముయొక్క ఫలములే.
యా వివేకవికాసిన్యో మతయో మహతామిహ ।
న తా విపది మజ్జంతి తుంబకానీవ వారిణి ॥ 11
వివేకమువలన ఎండిన సొరకాయ బుఱ్ఱలు నీటిలో మునగనట్లు, వికసిత మైన మహాత్ముల బుద్ధిగూడ
ఆపదలందు మునుగదు.
విచారోదయకారిణ్యా ధియా వ్యవహరంతి యే ।
ఫలానామత్యుదారాణాం భాజనం హి భవంతి తే ॥
12
విచార బుద్ధితో వ్యవహరించువారు శ్రేష్ఠఫలముల నందుదురు. (విచారమువలన వివేక ముదయింప,
ముక్తి లభించునని అభిప్రాయము.)
। మూర్ఖహృత్కాననస్థానామాశాప్రథమరోధినామ్ అవిచారకరంజానాం మంజర్యో దుఃఖ రీతయః ॥ 13
గచ్చతీగెలు నలువైపుల అలముకొని దారిని కప్పబడజేయునట్లు, దుఃఖ వ్యవహారములు మూర్ఖుల
హృదయములను అడవుల వ్యాపించి ముముక్షుత్వమును నశింపజేయును.
కజ్జలక్షోదమలినా మదిరా మదధర్మిణీ
1
అవిచారమయీ నిద్రా యాతు తే రాఘవః క్షయమ్ " 14
రాఘవా! కాటుకవలె మలినమును, కల్లువోలె మత్తు గొల్పునదియు, విచార రహితమును నగు నీ
మోహనిద్ర నశించునుగాక!

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -14) 277
మహాపణిచె దీర్ఘషు సద్విచారపరో నరః
న నిమజ్జతి మోహేషు తేజోరాశి స్తమస్వివ॥ 15
తేజోరాశియగు సూర్యుడు చీకటియందు మునుగనట్లు; సద్విచార తత్పరుడగు మనుజుడు
విషయములను ఆపదలతో నిండియున్న దీర్ఘమోహమున నిమగ్నుడు కాడు.
మానసే సరసి స్వచ్ఛే విచారకమలోత్కరః |
నూనం వికసితో యస్య హిమవానివ భాతి సః ॥ 16
ఎవ్వని మనస్సు అను సరోవరమున విచారమను పద్మములు వికసించినవో, అతడు
హిమాలయమువలె శోభిల్లుచుండును.
విచారవికలా యస్య మతిర్మాంద్యము పేయుషః
కస్యోదేత్యశనిశ్చంద్రాన్ముధా యక్షః శిశోరివ ॥ 17
ఏ మూఢుని బుద్ధి విచారహీనమై యుండునో, అతనికడ బాలునిముందు బేతాళావిర్భావమువలె
మోహమువలన, చంద్రుని నుండియే పిడుగుపడును.
దుఃఖఖండకమస్థూలం విపన్నవలతామధు:
రామ! దూరే పరిత్యాజ్యో నిర్వివేకో నరాధమః 18
రామా! వివేకహీనుడు ఆపదలను క్రొంగొత్త తీగకు వసంత ఋతువు. మఱియు గొప్పవి యగు
దుఃఖబీజముల నుంచు పాత్ర. కావున ఇట్టి వానిని దూరముగ త్యజించునది.
యే కేచన దురారంభా దురాచారా దురాధయః
అవిచారణ తే భాంతి బేతాలా స్తమసా యథా ॥ 19
చీకటియందు దయ్య మగుపించునట్లు, చెడుపనులు, చెడ్డచేతలు, మానసిక వ్యాధులు, విచారణ
లేకుండుటవలననే సంభవించుచున్నవి.
అవిచారిణమేకాంతవనద్రుమసధర్మకమ్ |
అక్షమం సాధుకార్యేషు దూరే కురు రమూద్వహ! 20
రఘూద్వహా! నిర్జన ప్రదేశమునందున్న చెట్టువలె సత్కార్యముల కుపకరించని వివేకహీనుని
పరిత్యజింపుము.
వివిక్తం హి మనో జంతోరాశా వైవశ్యవర్జితమ్ 1
పరాం నిర్వృతిమభ్యేతి పూర్ణచంద్ర ఇవాత్మని ॥ 21 22

278 యోగవాసిష్ఠము
పూర్ణచంద్రుని గాంచి మనస్సు ఉల్లాసపడునట్లు; వాంఛా శూన్యమై విచారయుతమైన మనస్సు
ఏపరమానందము నందును.
వివేకితోదితా దేహే సర్వం శీతలయత్యలమ్ ।
అలంకరోతి చాత్యంతం జ్యోత్సేవ భువనం యథాయథా ॥ 22
వెన్నెల భూమండలమును చల్లబరచుచు అలంకరించునట్లు, వివేకము అందరిని చల్లబరచి అలంకారమై
వెలయుచున్నది.
పరమార్థ పతాకాయా ధియో ధవలచామరమ్
విచారో రాజతే జంతో రజన్యామివ చంద్రమాః ॥ 23 25
రాత్రియందు చంద్రుడు శోభిల్లునట్లు పరమార్థ పతాకయును, శుభబుద్ధి నలంకరించు ధవళ
చామరమును నగు విచారము జీవునియందు శోభిల్లును.
విచారచారవో జీవా భాసయంతో దిశో దశ |
భాంతి భాస్కరవన్నూనం భూయో భవభయాపహాః ॥ 24
విచార సమర్థులును, భవభయ నివారణ కారులును నగు జీవులు, సూర్యునివలె, దశదిశల వెలిగించుచు
శోభిల్లుదురు.
బాలస్య స్వమనో మోహ కల్పితః ప్రాణహారకః |
రాత్రా నభసి వేతాలో విచారేణ విలీయతే ॥ 25 25
రాత్రి ఆకాశమున బాలునివలన గల్పింపబడిన భూతము వాని ప్రాణములు గూడ గైకొన గలుగుచున్నది.
కాని, విచారమువలన ఆ భూతము మాయమై పోవుచున్నది. కనుక విచారమే సంసార భయమును
నివారింపగలదు.
సర్వ ఏవజగద్భావా అవిచారేణ చారవః |
అవిద్యమాన సద్భావా విచారవిశరారవః 26
ఈ జగత్తున నున్న పదార్థము లన్నియు విచారించి చూడ నంతవఱకు, మనోహరములై కన్పట్టును.
విచారించి చూచిన శిలాస్ఫాలిత లోష్టములవలె అసారములై కన్పట్టును.
పుంసో నిజమనోమోహకల్పితో 2 నల్పదుఃఖదః |
సంసారచిర వేతాలో విచారేణ విలీయతే ॥ 22 27

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -14) 279
సంసారమను ఈ భూతము మనుజుని మనోమోహమువలన కల్పింపబడి, మిక్కుటమగు దుఃఖ
మును గలిగించుచున్నది; ఈ భూతము విచారమువలన లయమైపోవును.
సమం సుఖం నిరాబాధమనంతమనపాశ్రయమ్ |
విధీమం కేవలీభావం విచారోచ్చతరో: ఫలమ్ ॥ 28
వైషమ్య శూన్యమును, సుఖప్రదమును, బాధారహితమును, అనంతమును నగు ఈ కైవల్యము
విచారమను మహావృక్షముయొక్క ఫలమని ఎఱుంగునది.
అచలస్థితితోదారా ప్రకటా భోగతేజసా |
తేన నిష్కామతోదేతి శీతతేవేందునోదితా ॥ 29
చంద్రోదయమైన చల్లదనము వచ్చునట్లు, విచారమువలన మోక్షోదయ మైన నిశ్చలమును,
ఉదారమును, ఆనంద స్వరూపమును నగు నిష్కామత కలుగును.
స్వవిచారమహౌషధ్యా సాధుశ్చిత్త నిషణ్ణయా1
తయోత్తమత్వప్రదయా నాభివాంఛతి నోజ్ తి ॥ 30
పురుషుడు తనచిత్త మందున్న శ్రేష్ఠత్వ ప్రదాయిని యగు విచారమును ఔషధమువలన సిద్ధుడైన
దేనినీ గోఱడు, పరిత్యజింపడు.
తత్పదాలంబనం చేతః స్ఫారమాభాసమాగతమ్
నాస్తమేతి న చోదేతి ఖమివాతి తతాంతరమ్ ॥ 31
చిత్తము బ్రహ్మభావము నాశ్రయించిన, వాసనలన్నియు నశించును; బ్రహ్మభావమును విస్తరింప,
ఆకాశమువలె ఉదయాస్తమయము లెవ్వియు లేకుండ నుండును.
న దదాతి న చాదత్త న చోన్నమతి శామ్యతి ।
కేవలం సాక్షివత్ పశ్యన్ జగదాభోగితిష్ఠతి ॥ 32
అప్పుడు పురుషుడు ఈ విశాల జగత్తును, కేవలము సాక్షివలె గనుచుండును; దేనినీ గ్రహింపడు,
భోగింపడు, శాంతుడై యుండును.
న చ శామ్యతి నా ప్యంతన్నావ్బాహ్యేవతిష్ఠతి |
న చ నైష్కర్మ్య మాదత్తే న చ కర్మణి మజ్జతి 33
"1
అప్పు డాతడు లోపల గాని, వెలుపల గాని వసింపడు. ఏ విధమైన దుఃఖమును బొందడు. కర్మల
నాచరింపడు. నైష్కర్మ్య సిద్ధికై యత్నింపడు.

280 యోగవాసిష్ఠము
ఉపేక్షతే గతం వస్తు సంప్రాప్త మనువర్తతే |
క్షుభో న చ వార్డుబో భాతి పూర్ణ ఇవార్ణవః ॥ 34
పోయిన దానిని గుఱించి చింతింపడు; వచ్చిన దాని ననుసరించును. దుఃఖింపడు, సంతసింపడు,
నిండు సముద్రునివలె తొణుకు బెణుకులు లేకుండ నుండును.
ఏవం పూర్ణేన మనసా మహాత్మానో మహాశయాః
జీవన్ముక్తా జగత్యస్మిన్ విహరంతీహ యోగినః ॥
35 35
ఇట్లు మహాత్ములును, మహాశయులును నగు యోగులు నిండుమనంబున జీవన్ముక్తులై, ఈ జగత్తున
సంచరించుచుందురు.
ఉషిత్వా సుచిరం కాలం ధీరాస్తే యావదీప్సితమ్ |
తే తమంతే పరిత్యజ్య యాంతి కేవలతాం తతామ్ ॥ 36
ధీరులగు ఈ జీవన్ముక్త పురుషులు ఇచ్చానుసారము చాలకాలము వసించి, పిదప ఉపాధి
లేశమునుగూడ పరిత్యజించి అపరిచ్ఛిన్నమగు విదేహముక్తి నందుదురు.
కోహం కస్య చ సంసార ఇత్యాపద్యపి ధీమతా
చింతనీయం ప్రయత్నేన స ప్రతీకారమాత్మనా |" 37
బుద్ధిమంతు డగువాడు ఆపత్సమయములందు గూడ, 'నే నెవడను? ఈ సంసార మెవరిది?' అని
చింతించుచు యత్నముతో ప్రతీకారమును సల్పవలెను.
కార్యసంకటసందేహం రాజా జానాతి రాఘవ!
నిష్ఫలం సఫలం వాపి విచారేణైవ నాన్యథా | 11 38
రాఘవా! చక్రవర్తిగూడ కష్టకార్యముల యందలి సందేహమును దీర్చుకొనవలసి వచ్చినప్పుడు, 'ఇది
సఫల మగునా? నిష్ఫల మగునా?' అని విచారించియే తెలిసికొనును; వేరొండు ఉపాయమువలన గాదు.
వేదవేదాంత సిద్ధాంతస్థితయః స్థితి కారణమ్
నిర్ణీయంతే విచారేణ దీపేన చ భువో నిశి | 39
రాత్రివేళ దీపసహాయమున నేలను గాంచగల్గునట్లు, విచారమువలననే పురుషుడు, కర్మకాండ
జ్ఞానకాండలయందు నిర్ణయింపబడిన ధర్మ (కర్మ), బ్రహ్మ, తత్వముల నరయగల్లును.
అనష్టమంధకారేషు బహుతేజః స్వజిహ్మతామ్
వశ్యత్యపి వ్యవహితం విచారశ్చారులోచనమ్ ॥ 40 40

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -14) 281
విచారమను సుందర నయనము చీకటియందు వినష్టము కాదు; అమిత తేజస్సును గాంచి చెదరదు.
దూరమున నున్న విషయములనుగూడ గ్రహింపగలదు. సాధారణ నేత్రములకున్న లోపములు దీనికి లేవు.
వివేకాంధో హి జాత్యంధః శోచ్యః సర్వస్య దుర్మతిః
దివ్యచక్షుర్వివేకాత్మా జయత్యఖిలవస్తుము | 41
వివేకాంధుడే, పుట్టుగ్రుడ్డి; అంధుడు కాదు ; వీని స్థితి శోచనీయము, వివేకాత్ముడే అన్నింట జయ
మందును; ఆపదల నెగద్రోసి ముక్తిని బడయును.
పరమాత్మమయీ మాన్యా మహానందైకసాధినీ।
క్షణమేకం పరిత్యాజ్యా న విచారచమత్కృతిః 42
విచారము సుందరమగు వస్తువు; పరమాత్మయను మహదానందము దీనివలననే సాధింపబడును.
అందువలన, దీనిని గౌరవింప నగును; ఒక్క నిముసమైన వీడకూడదు.
విచారచారుపురుషో మహతామపి రోచతే |
పరిపక్వచమత్కారం సహకారఫలం యథా ॥ 43
విచార నిపుణుడగు మానవుడు, మామిడిపండువలె జ్ఞానులకుగూడ రుచ్యమై వెలయును.
విచారకాంతమతయో నానేకేషు పునః పునః
లుఠంతి దుఃఖశ్వబ్రేషు జ్ఞాతాధ్వగతయో నరాః 44
వివేకము నాశ్రయించి దారి నెరింగినవారు దుఃఖములను గుంటలో మాటిమాటికి గూలరు.
న చ రౌతి తథా రోగీ నానర్థశతజర్జరః 1
అవిచారవినష్టాత్మా యథాజ్ఞః పరిరోదితి ॥ 45
విచారహీను డగుటవలన, ఆత్మఘాతియగు మూర్ఖుడు జన్మ జన్మాంతర ముల ననుభవించు బాధ,
విషశస్త్ర ఘాతమువలన శిథిలాంగుడైన రోగి పడు బాధకంటె అధికము.
వరం కర్దమభేకత్వం మలకీటకతా వరమ్
వరమందగుహాహిత్వం న నరస్యావిచారతా "I 46
విచార హీనుడగు మనుజుడై జన్మించుటకంటె, బురదయందుండు కప్పగనో, మలకీటక మయ్యో.
అంధకార గుహయందు పాముగనో, జన్మించుట మేలు.
సర్వానర్థనిజావాసం సర్వసాధుతిరస్కృతమ్ ।
సర్వదౌస్థిత్యనీ మాంతమవిచారం పరిత్యజేత్ 47

282 యోగవాసిష్ఠము
సకలానర్థములకు నివాస భూమియు, సాధుపురుషులచే గర్హింప బడునదియు, దుఃఖముల
తుదికొనయు నగు, విచార హీనతను పరిత్యజింప నగును.
నిత్యం విచారయుక్తేన భవితవ్యం మహాత్మనా
తథా2౦ కూపే పతతం విచారో హ్యవలంబనమ్
"I 48
మహాత్ము డగువాడు నిరంతరము విచారము నాశ్రయించుకొని యుండవలెను. రాగద్వేషాది
రూపకమైన అంధకూపమున బడిన వానికి ఈ విచారణయే గతి.
స్వయమేవాత్మనాత్మానమవష్టభ్య విచారతః
సంసారమోహజలధేస్తారయేత్ స్వమనో మృగమ్
"I 49
విచార బలముచేత, ఆత్మను స్థిరమొనరించి మనస్సను లేడిని, సంసార మను మోహ సముద్రమును,
దాటింపనగును.
కోహం కథమయం దోష: సంసారాఖ్య ఉపాగతః ।
న్యాయేనేతి పరామర్శో విచార ఇతి కథ్యతే
11 50
"నే నెవ్వడను? ఈ ఈ సంసారదోష మెట్లు వచ్చినది?" అని శ్రుతి స్మృత్యాదుల ననుసరించి ఒనర్చు
విమర్శననే విచార మందురు.
అంధాంధమోహసుమనం చిరం దుఃఖాయ కేవలమ్ |
కృతం శిలాయా హృదయం దుర్మతేశ్చవిచారిణ: 51
విచార విహీనుడగు దుర్మతి హృదయము రాతివంటిది; గ్రుడ్డికంటేగ్రుడ్డిది. మోహమువలన
మఱింత కట్టబడి దుఃఖములనే కూర్చుచుండును.
భావాభావగ్రహోత్సర్గ దృశామిహ హి రాఘవ!
న విచారాదృతే తత్వం జ్ఞాయతే సాధు కించన ॥ 52 52
రాఘవా! సత్యమును గ్రహించి అసత్య విషయములను బరిత్యజింపగోరు వారుగూడ, తత్త్వమును
పరిపూర్ణముగ నెఱుంగటకుగాను విచారము నాశ్రయించు చున్నారు; వేరొండు ఉపాయము లేదు.
విచారాజ్జాయతే తత్త్వంతత్త్వాద్విశ్రాంతిరాత్మని
అతో మనసి శాంతత్వం సర్వదుఃఖపరిక్షయః 53
విచారమునుండి తత్త్వజ్ఞానము లభించును. తత్వజ్ఞానమునుండి ఆత్మవిశ్రాంతియు, దీనినుండి

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -15) 283
మనశ్శాంతియు లభించుచున్నవి. ఈ శాంతివలననే దుఃఖము లన్నియు నశించును.
సఫలతాం ఫలతే భువి కర్మణాం ప్రకటతాం కిల గచ్ఛతి ఉత్తమామ్ ।
స్ఫుటవిచారదృశైవ విచారితా శమవతే భవతే చ విరోచతామ్ ॥ 54
ఇతి శ్రీవాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే ముముక్షు వ్యవహార ప్రకరణే విచారనిరూపణం నామ చతుర్దశః
38: || 14 ||
జను లందరు విచార దృష్టివలననే లౌకిక వైదిక కర్మల ఫలములను బడయు చున్నారు. అందువలన
నో రాఘవా! శమయుతుడ వగు నీకు గూడ ఈ విచారము ప్రీతికర మగు గాక !
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు ముముక్షువ్యవహార ప్రకరణమున విచారనిరూపణమను చతుర్దశ సర్గము ॥ 14 ॥
సంతోష నిరూపణము-15
శ్రీవసిష్ఠ ఉవాచ :
సంతోషో హి పరం శ్రేయః సంతోషః సుఖముచ్యతే |
సంతుష్టః పరమభ్యేతి విశ్రామ మరిసూదన! 1
శ్రీవసిష్ఠుడు సంతోషమే పరమశ్రేయస్సు, సంతోషమే సుఖము, సంతుష్టుడగు వాడే పరమ విశ్రాంతిని
అనగా మోక్షమును బడయును.
సంతో షైశ్వర్యసుఖినాం చిరవిశ్రాంతచేతసామ్ ।
సామ్రాజ్యమపి శాంతానాం జరతృణలవాయతే ॥ 2
సంతోషమను ఐశ్వర్య సుఖము నందిన వారి చిత్తము చిరవిశ్రాంతి నందినది. ఇట్టి శాంతవ్యక్తులకు
రాజ్యములుగూడ ఎండు గడ్డిపరకవలె తుచ్ఛములగుచున్నవి.
సంతోషశాలినీ బుద్ధి రామ! సంసారవృత్తిము
విషమాస్వప్యనుద్విగ్నా న కదాచన హీయతే ॥
3
రామా! సంతోష యుతమగు బుద్ధి సంసార దుఃఖములు సంభవించిన తల్లడిల్లదు; సుఖములు
సంభవించిన తబ్బిబ్బు కాదు.
సంతోషామృతపానేన యే శాంతాస్త్రృప్తిమాగతాః
భోగశ్రీరతులా తేషామేషా ప్రతివిషయతే ॥ 4

284 యోగవాసిష్ఠము
సంతోషామృతమును ద్రావి తృప్తులైన శాంతులకు, భోగసంపదలు విషమట్లు ప్రతికూలము
లగుచున్నవి.
న తథా సుఖయంత్యేతాః పీయూషరస వీచయః |
యథాతిమధురాస్వాదః సంతోషో దోష నాశనః ॥ 5
ఆశా దైన్యాది దోషముల నశింపజేయగల మధుర సంతోషరసము గూర్చు ఆనందమును, అమృతరస
- తరంగములు గూడ గూర్పజాలవు.
అప్రాప్తవాంఛాముత్సృజ్య సంప్రాప్తే సమతాం గతః
అదృష్టభేదాభేదో యః స సంతుష్ట ఇహ్రోచ్యతే ॥ || 6
అప్రాప్త విషయములను గోరక, పొందిన వానిని గూర్చి తబ్బిబ్బు కాక, సుఖ దుఃఖముల
ననుభవింపకుండ నుండువాడే సంతుష్టుడనబడుచున్నాడు.
ఆత్మనాత్మని సంతోషం యావద్యాతి న మానసమ్ ।
ఉద్భవంత్యాపదస్తావల్లతా ఇవ మనోబిలాత్ 7
మనస్సు విషయాంతరమును గోరక, దానియం దదియే ఆనందము నందనంతవఱకు, ఈ
మనోబిలమునుండి ఆపదలను లతలు పుట్టుచుండును.
సంతోషశీతలం చేతః శుద్ధవిజ్ఞానదృష్టిభిః I
భృశం వికాసమాయాతి సూర్యాం శుభిరివాంబుజమ్
" 8
సంతోషమువలన చల్లబడిన చిత్తము, సూర్యకిరణములచే పద్మము వికసించునట్లు, విశుద్ధ
విజ్ఞానమున మిక్కుటముగ వికసించును.
అజ్ఞానమనయామిన్యా సంకోచం న నరాంబుజమ్ |
యాత్యసావుదితో యస్య నిత్యం సంతోషభాస్కరః "I 9
సంతోషమను సూర్యుడు ప్రకాశించు చున్నచో మనుజులను పద్మములు, అజ్ఞానమను చీకటి
రాత్రులందు ముకుళింపవు.
ఆశా వైవశ్యవివశే చిత్తే సంతోషవర్జితే |
మానే వక్త్రమివాదర్శే న జ్ఞానం ప్రతిబింబతి ॥ 10 10
ఆశా వివశమును, సంతోష రహితమును నగు చిత్తమున, మలిన దర్పణమున ముఖము

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -15) 285
ప్రతిబింబించనట్లు, జ్ఞానము ప్రతిబింబించదు.
అకించనో వ్యసౌ జంతుః సామ్రాజ్య సుఖమశ్నుతే ।
ఆధివ్యాధి వినిర్ముక్తం సంతుష్టం యస్య మానసమ్ ॥
" 11
సంతుష్ట మనస్కునకు మనోవ్యాధులు గాని, వ్యాదులు గాని కలుగవు. ఇట్టివాడు నిరుపేద యైనను
సామ్రాజ్య సుఖము ననుభవించును.
నాభివాంఛత్యసంప్రాప్తం ప్రాప్తం భుంక్తే యథాక్రమమ్ 1
యః సుసౌమ్య సమాచారః సంతుష్ట ఇతి కథ్యతే "I 12
అప్రాప్తవిషయముల గోరని వాడును, యథాక్రమముగ వచ్చిన సుఖ దుఃఖముల ననుభవించు
వాడును, సౌమ్యాచరణయుతు డగువాడును నగు మనుజుడు సంతుష్టు డనబడును.
సంతుష్టిపరితృప్తస్య మహతః పూర్ణచేతనః
క్షీరాబ్ధారివ శుద్ధస్య ముఖే లక్ష్మీర్విరాజతే "I 13
సంతోషమువలన పరిపూర్ణముగ తృప్తి నందిన విశుద్ధ చిత్తము గల మహాత్ముని వదనమును
క్షీరసముద్రమువలె, లక్ష్మి వసించును. (అనగా, ఇట్టి పురుషుని మోము ప్రసన్నమై యుండునని భావము.)
పూర్ణతామలమాశ్రిత్య స్వాత్మన్యేవాత్మనా స్వయమ్ |
పౌరుషేణ ప్రయత్నేన తృష్ణాం సర్వత్ర వర్జయేత్
|| 14
నిరతిశయమును, ఆనంద రూపమును నగు పూర్ణత్వము నవలంబించి, పౌరుష బలమున తృష్ణను
సర్వత్ర వర్జింపవలెను.
సంతోషామృత పూర్ణస్య శాంత శీతలయా ధియా
స్వయం స్థైర్యం మనో యాతి శీతాంశోరివ శాశ్వతమ్ || 15
చంద్రునివలె, సంతోషామృతమున నిండుకొనియున్న వాని చిత్తము దాని యంతట నదే శాంతశీతల
మగు బుద్ధివలన స్థైర్యము నందును.
సంతోషపుష్టమనసం భృత్యా ఇవ మహర్ధయః
రాజానముపతిష్ఠంతి కింకరత్వముపాగతాః || 16
రాజును సేవకు లనుసరించునట్లు, సంతోష పరిపుష్టచిత్తుని సంపదలన్నియు భృత్యునివలె
ననుసరించును.