286 యోగవాసిష్ఠము
ఆత్మనైవాత్మని స్వస్థే సంతుష్టే పురుషే స్థితే |
ప్రశామ్యంత్యాధయః సర్వే ప్రావృషీవాశు పాంసవః ॥
17
వర్షాకాలమున దుమ్ము అణగిపోవునట్లు, తనయందు తానే సంతుష్టు డగు వ్యక్తియందు ఆధివ్యాధు
లన్నియు అణగిపోవును.
నిత్యం శీతలయా రామ! కలంకపరిభిన్నయా ।
పురుషః శుద్ధయా వృత్త్యా భాతి పూర్ణతయేందువత్ ॥ 18
రామా! కళంక రహితమును, శీతలమును, విశుద్ధమును నగు చిత్తవృత్తివలన నలంకరింపబడిన
పురుషుడు, పూర్ణచంద్రునివలె బ్రకాశించును.
సమతా సుందరం వక్త్రం పురుషస్యావలోకయన్
I
తోషమేతి యథా లోకో న తథా ధనసంచయైః ॥ 19
సంతోషమువలన సమబుద్ధియైన పురుషుని సుందర వదనమును గాంచిన గలుగు ఆనందము,
ధనరాసులను గాంచినను గలుగదు.
సమతయా మతయా గుణశాలినాం పురుషరాడిహ యః సమలంకృతః
తమమలం ప్రణమన్తి నభశ్చరా అపి మహామునయో రఘునందన! 20
ఇతి శ్రీ వాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే ముముక్షువ్యవహార ప్రకరణే సంతోష నిరూపణం నామ
పంచదశః సర్గః ॥ 15 ॥
రఘునందనా! గుణశాలురు గోరు సమబుద్ధివలన నలంకృతుడగు నిర్మలపురుషుని, దేవతలు
మహామునులుగూడ నమస్కరింతురు.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు ముముక్షు వ్యవహార ప్రకరణమున సంతోష నిరూపణమను పంచదశ సర్గము ॥ 15॥
సదాచార (సాధుసంగమ) నిరూపణము - 16
శ్రీవసిష్ఠ ఉవాచ :
విశేషేణ మహాబుద్ధే సంసారోత్తరణే నృణామ్
I
సర్వత్రోపకరోతీహ సాధుః సాధుసమాగమః ॥ 1
శ్రీవసిష్ఠుడు: మహామతీ! సాధుసంగమముకూడ అన్నివేళల నరులకు సంసారమును దాటుటకు

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -16) 287
మిక్కుటముగ తోడ్పడుచుండును.
సాధుసంగతరోద్ఘాతం వివేకకుసుమం సితమ్ ।
రక్షంతి యే మహాత్మానో భాజనం తే ఫలశ్రియః 2
ఏ మహాత్ములు సాధుసంగమమను ఈ వృక్షమున వికసించిన వివేకమను పుష్పమును
కాపాడుచుందురో, వారే మోక్షఫలమను సంపదను పొందుదురు.
శూన్యమాకీర్ణతామేతి మృతిరప్యుత్సవాయతే |
ఆవత్సంపదివాభాతి విద్వజ్జనసమాగమే ॥ 3
విద్వజ్జనుల సమాగమమువలన శూన్యప్రదేశము జనాకీర్ణ మగును. మృత్యువు ఉత్సవమట్లు తోచును.
ఆపదలు సంపద లగును.
హిమమాపత్సరోజిన్యా మోహనీహారమారుతః
జయత్యేకో జగత్యస్మిన్ సాధుః సాధుసమాగమః " 4
ఆపదలను పద్మములకు మంచును, మోహమను మంచునకు మారుతమును, జగత్తు లన్నింటికంటె
ప్రసిద్ధమును నగు సాధుసమాగమమునకు జయమగు గాక!
పరం వివర్ధనం శుద్ధేరజ్ఞానతరుశాతనమ్ |
సముత్సారణమాధీనాం విద్ధి సాధుసమాగమమ్ ॥ 5
ఈ సాధుసంగమమువలన బుద్ధి వర్ధిల్లును, అజ్ఞానమను చెట్టు ఛేదింపబడును. మనోవ్యాధులు
నశించునని తెలియునది.
వివేకః పరమో దీపో జాయతే సాధుసంగమాత్
మనోహరోజ్జ్వలో నూనమాసేకాదివ గుచ్చకః|| 6
తోటలో నీరు చల్లుటవలన పూలగుత్తులు పూయునట్లు, సాధసంగమము వలన మనోహరోజ్జ్వల
ప్రకాశయుత మగు వివేకము జన్మించును.
నిరపాయాం నిరాబాధాం నిర్వృతిం నిత్యపీవరమ్
అనుత్తమాం ప్రయచ్ఛంతి సాధుసంగవిభూతయః 7
సాధుసంగమమను సంపదలు అపాయ రహితమును, బాధాహీనమును, నిత్యప్రవర్ధన మానమును
నగు ఆనందమును నిరంతర మొసగుచుండును.

288 యోగవాసిష్ఠము
అపి కష్టతరాం ప్రాపైర్దశాం వివశతాం గతైః |
మనాగపి న సంత్యాజ్యా మానవైః సాధుసంగతిః ॥ 8
మనుజుడు కష్టములలోబడి వివశత నందినను సాధుసంగమమును ఒక్క క్షణమైన విడువగూడదు.
సాధుసంగతయో లోకే సన్మార్గస్య చ దీపికాః|
హార్దాంధకార హారిణ్యో భాసో జ్ఞాన వివస్వతః "I 9
ఈ సాధుసంగమము, జగత్తున అజ్ఞానమను చీకటి యుండునంతదనుక అందఱికిని సదాచాం
దీపమై తోడ్పడి, హృదయాంధకారమును బాపుచుండును; పిదప, జ్ఞానసూర్యుని కిరణముగ మారును.
యః స్నాతః శీతసితయా సాధుసంగతిగంగయా |
కిం తస్య దానైఃకింతీర్థాః కిం తపోభిః కిమధ్వరై:"I 10
చిత్తశుద్ధి దాయకము (స్వచ్ఛము)ను, మనశ్శాంతి ప్రదము (శీతలము)ను నగు సాధుసంగమ మను
గంగయందు స్నాన మొనర్చిన వానికి యజ్ఞ తపో దాన తీర్థములతో బనియేమి ?
నీరాగా శ్చిన్న సందేహో గలితగ్రంథయో నమ!
సాధవో యది విద్యంతే కిం తప స్తీర్థ సంగ్రహైః 11
అనఘా! రాగశూన్యులును, గ్రంథిహీనులును, సందేహ రహితులును నగు సాధుపురుషులు వెలయుచో
తీర్థయాత్రలతోడను తపస్సుతోడను అవసరమేమి?
విశ్రాంత మనసో ధన్యాః ప్రయత్నేన పరేణ హి |
దరిద్రేణేవ మణయః ప్రేక్షణీయా హి సాధవః 12
దరిద్రుడు మణులను గాంచునట్లు పరమ యత్నమున శాంతచిత్తులును, ధన్యులును నగు సాధువులను
జూడదగును.
సత్సమాగమసౌందర్యశాలినీ ధీమతాం మతిః
కమలేవాప్సరోవృందే సర్వదైవ విరాజతే ॥ 13
విష్ణునితోగూడి లక్ష్మి అప్సరలలో నెల్ల శ్రేష్ఠురాలుగ శోభించునట్లు, మహాత్ముల బుద్ధి సత్సంగమమువలన
సౌందర్యవృద్ధి సర్వదా దీపిల్లును.
తేనామలవిచారస్య పదస్యాగ్రావచూలితా ।
ప్రథితా యేన ధన్యేన న త్యక్తా సాధుసంగతిః ॥ 14

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -16) 289
సాధుసంగమమును ద్యజింపని ధన్యవ్యక్తి, నిర్మల విచార లభ్యమగు బ్రహ్మపదమును శిరోభూషణ
మొనర్చుకొని పేర్గాంచును.
విచ్చిన్నగ్రంథయస్తద్జ్ఞాః సాధవః సర్వసంమతాః 1
సర్వోపాయేన సంసేవ్యా స్తేహ్యుపాయా భవాంబుధౌ ॥ 15
బంధహీనులును, తత్త్వజ్ఞులును, సర్వసమ్మతులును నగు సాధుపురుషులను దాన మాన సేవనాది
సర్వప్రయత్నముల సేవింపవలెను. ఏలయన, భవ సముద్రమును దాటుటకు వీరే ఉపాయ స్వరూపులు.
తే ఏతే నరకాగ్నీనాం సంశుష్కేంధనతాం గతాః |
యైర్దృష్టా హేలయా సంతో నరకానలవారిదాః 16
నరకాగ్ని జ్వాలల నార్పు మేఘములగు సాధుపురుషులను అనాదరణతో గాంచువారు ఆ నరకాగ్నికి
ఇంధనము లగుదురు.
దారిద్య్రం మరణం దుఃఖ మిత్యాది విషయో భ్రమః
సంప్రశామ్యత్యశేషేణ సాధుసంగమభేషజైః ॥ 17
దారిద్ర్యము, మరణము, దుఃఖము మొదలుగా గల విషయ రోగము లన్నియు, సాధుసంగమమను
ఔషధమువలన సంపూర్ణముగ శాంతిల్లును.
సంతోషః సాధుసంగశ్చ విచారో2థ శమస్తథా |
ఏత ఏవ భవాంభోధావుపాయాస్తరణే నృణామ్ "I 18
సంతోషము, సాధుసంగమము, విచారము, శమము - ఇవియే నరులకు సంసార సముద్రమును
తరించుట కుపాయములు.
సంతోషః పరమో లాభః సత్సంగః పరమా గతిః |
విచారః పరమం జ్ఞానం శమో హి పరమం సుఖమ్ ॥ 19
సంతోషమే పరమ లాభము, సత్సంగమమే పరమ గతి, విచారమే పరమ జ్ఞానము, శమమే పరమ సుఖము.
చత్వార ఏతే విమలా ఉపాయా భవభేదనే ।
యైరభ్యస్తాస్త ఉత్తీర్ణా మోహవారిభవార్ణవాత్ I 20
సంసారమును భేదింప ఎవ రీ పవిత్ర చతుర్విధోపాయముల నభ్యసించిరో వారే ఈసంసారమను
మోహజల సముద్రమును దాటుచున్నారు.
VI F19

290 యోగవాసిష్ఠము
ఏకస్మిన్నేవ వై తేషామభ్యస్తే విమలోదయే
చత్వారోపి కిలాభ్యస్తా భవంతి సుధియాం పర॥
21
సుధీవరా! ఈ నాల్గింటిలో నేయొక్కదాని నభ్యసించినను, తక్కినవాటి నభ్యసించి నట్లగును.
ఏకో ఒ ప్యేకో పి సర్వేషా మేషాం ప్రసవభూరిహ |
సర్వసంసిద్ధయే తస్మాత్ యత్నేనైకం సమాశ్రయేత్ II 22
ఈ నాల్గింటిలో ఒక్కొక్క దానినుండి మిగిలినవి కలుగును; అందువలన, సర్వసంసిద్ధికొఱకు
ఏయొక్క దానినైన నభ్యసింపుము.
సత్సమాగమసంతోషవిచారాః సువిచారితమ్ ।
ప్రవర్తంతే శమస్వచ్చే వాహనానీవ సాగరే ॥ 23
సరకులతో గూడిన ఓడలు సముద్రమును బోయి చేరునట్లు, సంతోష విచార, సాధుసంగమములు
సావధానముగ శమమువలన నిర్మలుడైన పురుషుని కడ కరుదెంచును.
విచారసంతోషశమసత్సమాగమ శాలిని 1
ప్రవర్తంతే శ్రియో జంతా కల్పవృక్షాశ్రితే యథా | 24
కల్పవృక్షము నాశ్రయించిన వానికడకు సంపద లరుదెంచునట్లు, సంతోష విచార సాధుసంగమము
లున్న వానికడకు జ్ఞానసంపద, అరుదెంచును.
విచారశమ సత్సంగ సంతోషవతి మానవే ॥
ప్రవర్తంతే ప్రపూర్ణేందౌ సౌందర్యాధ్యా గుణా ఇవ ॥ 25
పూర్ణచంద్రుని సౌందర్యాది గుణములు స్వతః ఆశ్రయించునట్లు, శమము విచారము,
సాధుసంగమము, సంతోషములతో బూర్ణుడైన వ్యక్తిని ప్రసాదాది గుణము లాశ్రయించును.
సత్సంగ సంతోషశమవిచారవతి సమ్మతౌ |
ప్రవర్తంతే మంత్రవరే రాజనీవ జయశ్రియః II 26
ఆలోచింపబడిన విషయములను రహస్యముగ నుంచు రాజును జయలక్ష్మి వరించునట్లు, శమాది
పూర్వోక్త గుణములు గల్గిన వ్యక్తికడకు జయలక్ష్మి అరుదెంచును.
తస్మాదేకతమం నిత్య మేతేషాం రఘునందన!
పౌరుషేణ మనో జిత్వా యత్నే నాభ్యాహరేద్గుణమ్ ॥
" 27

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -16) 291
రఘునందనా! అందువలన పౌరుష బలమున మనస్సును జయించి, వీటిలో నేయొక్కదానినైన
యత్నపూర్వకముగ నిరంతర మవలంబింతుము,
పరం పౌరుషమాశ్రిత్య జిత్వా చిత్తమతంగజమ్ |
యాపదేకో గుణో నాంత స్తావన్నాస్త్యుత్తమా గతిః ॥ 28
చిత్తమను ఏనుగును పరమ పురుష కారమున జయించి, వీటిలో నేయొక్కదానినైన పొందనంతవరకు
ఉత్తమ గతి లేదు.
పౌరుషేణ ప్రయత్నేనదంతైర్దంతాన్ విచూర్ణయేత్ ।
యావన్నాభినివిష్టం తే మనో రామ! గుణార్జనే "I 29
రామా! నీమనస్సు ఈగుణముల నార్జింప యత్నింప నంతవఱకు, పౌరుషమున పండ్లను పటపట
లాడించుము, (గట్టిగా ప్రయత్నింపుము అని భావము).
దేవో భవాథ యజ్ఞో వా పురుషః పాదపోథవా |
తావత్తవ మహాబాహో! నోపాయో స్త్రీహ కశ్చన || 30
మహాబాహూ! నీవు దేవతవే కమ్ము, యక్షుడవే యగుదువు గాక. మనుజుడవే కాని, చెట్టే యగుము
- ఈ గుణముల నార్జింపకున్న గతి లేదు.
ఏకస్మిన్నేవ ఫలదే గుణే బలముపాగతే|
క్షీయంతే సర్వ ఏవాళు దోషా వివశచేతసః ॥ 31
వీటిలో, ఏ యొక్కటియైన బలమును గూర్చుకొని ఫలించిన, చంచల చిత్తము యొక్క దోషము
లన్నియు వెంటనే క్షీణించును.
గుణే వివృద్ధే వర్ధంతే గుణా దోషజయప్రదాః
దోషే వివృద్ధే వర్ధంతే దోషా గుణవినాశనాః ॥ 32
సుగుణములు వృద్ధి నందిన దోషములు జయింపజాలు సుగుణము లన్నియు వృద్ధినందును.
దోషములు వృద్ధి నందిన సుగుణములను నశింపజేయు ఇతర దోషములన్నియు వృద్ధి నందును.
మనోమోహవనే హ్యస్మిన్ వేగినీ వాసనా సరిత్
శుభాశుభబృహత్కూలా నిత్యం వహతి జంతుషు ॥ 33
మనస్సను మోహారణ్యమున వాసన యనునది వేగముగ జీవులందు నిరంతరము ప్రవహించుచున్నది.
దీనికి శుభాశుభములను రెండు పెద్ద గట్లున్నవి.

292 యోగవాసిష్ఠము
సా హి స్వేన ప్రయత్నేన యస్మిన్నేవ నిపాత్యతే |
కూలే తేనైవ వహతి యథేచ్ఛసి తథా కురు ॥ 34
నీవు యత్నముతో ఈప్రవాహము నేతీరమునకు బట్టుదువో ఆతీరమునకే మరలును; ఇట్లెఱిగి ఇక
నీ ఇచ్చవచ్చినట్లొనర్పుము.
పురుషయత్నజవేన మనోవనే శుభతటానుగతాం క్రమశః కురు |
వరమతే నిజభావమహానదీమహహ తేన మనాగపి నోహ్యసే "I 35
ఇతి శ్రీవాసిష్ఠ-మహారామాయణే వాల్మీకీయే ముముక్షువ్యవహార ప్రకరణే సదాచారనిరూపణం నామ షోడశః
38: || 16 ||
రామా! ఈ చిత్తారణ్యమున పౌరుష బలము నాశ్రయించి, వాసనా నదిని శుభతీరాభిముఖ మగు
నల్లొనర్పుము. ఇట్లొనర్చిన, శుద్ధమతీ! అశుభప్రవాహమున బడవు.
ఇది శ్రీ వాసిష్ఠ-తాత్పర్య ప్రకాశికయందు, ముముక్షువ్యవహార ప్రకరణమున సదాచార నిరూపణమను షోడశసర్గము ॥ 16 ॥
గ్రంథ సంఖ్యాది వర్ణనము -17
శ్రీవసిష్ఠ ఉవాచ :
ఏవ మంత ర్వివేకో యః స మహానిహ రాఘవ!
యోగ్యో జ్ఞానగిరః శ్రోతం రాజేవ నయభారతీమ్ ॥ 1
శ్రీవసిష్ఠుడు: రాఘవా! అంతరమున (వెనుక వర్ణింపబడినట్టి) వివేక ముదయించిన పురుషుడే,-నీతి
శాస్త్రమును విన రాజషి యైనట్లు ఈ జ్ఞానగర్భ వాక్యములను విన నర్హుడు.
అవదాతో వదాతస్య విచారస్య మహాశయః
జడసంగోష్ఠితో యోగ్యః శరదిందోర్యథా నభః ॥ 2
మేఘములు లేని ఆకాశ మండలము శరత్-చంద్రునకు దగునట్లు, మూర్ఖసంగ రహితుడును,
నిర్మలుడును, మహాశయుడును నగు వ్యక్తి విచారము నొనర్ప నర్హుడు.
త్వమేతయా ఖండితయా గుణలక్ష్మ్యా సమాశ్రితః ।
మనోమోహహరం వాక్యం వక్ష్యమాణమిదం శృణు 3 "I
నీకిట్టి గుణసంపద యున్నది. అందువలన, నేను నీకు మనోమోహమును బాపు వాక్యములను
జెప్పనున్నాను, వినుము.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -17) 293
పుణ్యకల్పద్రుమో యస్య ఫలభారానతః స్థితః
ముక్తయే జాయతే జంతో స్తస్యేదం శ్రోతుముద్యమః ॥ II 4
ఎవ్వని పుణ్యరాశి యను కల్పవృక్షము ఫలములతో నిండి వ్రాలియున్నదో, అట్టివ్యక్తికే ముక్తినిమిత్త
విూవిషయమును విన వాంఛ గల్గును.
పావనానాముదారాణాం పరబోధైకదాయినామ్ ।
వచసాం భాజనం భూత్యై భవ్యో భవతి నాధమః ॥ 5
ఇట్టి గుణములు గలిగిన వాడే ఉన్నతికొఱకు పరమ పవిత్రమగు ఈ జ్ఞానోపదేశమును విన నర్హుడు,
అధములగు ఇతర జనులు గారు.
మోక్షోపాయాభిధానేయం సంహితా సారసంమితా |
త్రింశద్వే చ సహస్రాణి జ్ఞాతా నిర్వాణదాయినీ "I 6
సారయుక్తమగు ఈ సంహితయందు మోక్షోపాయము వర్ణింపబడి యున్నది. దీనిని గ్రహించిన
ముక్తి లభించును. దీని శ్లోకసంఖ్య ముప్పదిరెండు వేలు.
దీపే యథా వినిద్రస్య జ్వలితే సంప్రవర్తతే
ఆలోకోఒ నిచ్ఛతో ఒ ప్యేవం నిర్వాణమనయా భవేత్ ॥ 7
వెలుగుచున్న దీపము ముందర నున్న మేలుకొనిన వాడు కోరుకున్నను వెలుతురు బడయునట్లు;
దీనిని బఠించిన అనాయాసముగ ముక్తి లభించును.
స్వయం జ్ఞాతా శ్రుతా వాపిభ్రాంతిశాంత్యైక సౌఖ్యదా
ఆప్రేక్ష్య వర్ణితా సద్యో యథా స్వర్గతరంగిణీ ॥ 8
ఈ సంహితను చక్కగ పరిశీలించి స్వయముగ గ్రహించినను లేక, వర్ణింపబడిన దానిని వినినను,
భ్రాంతిని దూర మొనర్చి, గంగవలె అనిర్వచనీయ సుఖము నొసంగును.
యథా రజ్జామహిభ్రాంతి ర్వినశ్యత్యవలోకనాత్ |
తథైతత్రేక్షణాత్ శాంతిమేతి సంసారదుఃఖితా ॥ 9
త్రాటిని ద్రాడుగ నెఱిగిన పామను భ్రమ తొలగి పోవునట్లు, ఈ శాస్త్రము నర్థము చేసికొనిన సంసార
దుఃఖము శాంతించును.
యుక్తియుక్తార్థ వాక్యాని కల్పితాని పృథక్ పృథక్
దృష్టాంతసారసూక్తాని చాస్యాం ప్రకరణాని షట్ ॥ 10

294 యోగవాసిష్ఠము
ఈ శాస్త్రమున ఆరు ప్రకరణములున్నవి. దీనియందు యుక్తి యుక్తమును, అర్థవంతములును
నగు వాక్యములును, ఉత్తమములగు దృష్టాంతములును, కథలును ఉన్నవి.
వైరాగ్యాఖ్యం ప్రకరణం ప్రథమం పరికీర్తితమ్ ।
విరాగో వర్ధతే యేన సేకేనేవ మరౌ తరుః ॥ 11
(అనుబంధేన సహితం దిష్టతత్త్వ నిరూపణం )
సార్ధం సహస్రం గ్రంథస్య యస్మిన్ హృది విచారితే |
ప్రకాశాచ్చుద్ధతో దేతి మణావివ సుమార్జితే 12 "I
ఇందలి మొదటి ప్రకరణము "వైరాగ్య" మనబడుచున్నది. దీనిని బఠించిన, నీరుపోసిన మరుభూమి
యందుగూడ మొక్కమొలచునట్లు, వైరాగ్యము వర్ధిల్లును. (ఇది అనుబంధముతో గూడుకొని యున్నది;
దీనియందు కాలతత్త్యము నిరూపింపబడినది) ఈప్రకరణ శ్లోకసంఖ్య పదునైదువందలు. మెరుగు పెట్టిన,
మణియందున్న మకిలి పోవునట్లు, దీనిని విచారించిన అజ్ఞాన జనిత మగు బుద్ధిమాలిన్యము తొలగిపోవును.
ముముక్షువ్యవహారాఖ్యం తతః ప్రకరణం కృతమ్ |
సహస్రమాత్రం గ్రంథస్య యుక్తిగ్రంథేన సుందరమ్ ॥ 13 "
స్వభావో హి ముముక్షూణాం నరాణాం యత్ర వర్ణ్యతే
తరువాతిది ముముక్షు వ్యవహార - ప్రకరణము. దీనియందు వేయిశ్లోకము లున్నవి. యుక్తి
పూర్ణములగు ఉపదేశముతో గూడి ఇది సుందరమై తనరుచున్నది. ఇందు ముముక్షువుల స్వభావము
వర్ణింపబడినది.
అథోత్పత్తి ప్రకరణం దృష్టాం తాఖ్యాయికామయమ్ II 14
సప్తగ్రంథసహస్రాణి విజ్ఞానప్రతిపాదకమ్ I
జాగతీ ద్రష్ట దృశ్య శ్రీరహం త్వమితి రూపిణీ ॥ 15
అనుత్పన్నైవోత్తి తేవ యత్రేతి పరివర్ణ్యతే |
యస్మిన్ శ్రుతే జగదిదం శ్రోతాంతర్బుధ్యతే ఖిలమ్ 16 "I
సాస్మద్యుష్మత్సవిస్తారం స లో కాకాశపర్వతమ్
పిండగ్రహవినిర్ముక్తం నిర్భిత్తికమపర్వతమ్ 17 12
"I
వృథ్వ్యాదిభూతరహితం సంకల్ప ఇవ పత్తనమ్
స్వప్నోపలంభ భావాభం మనోరాజ్యవదాతతమ్ 18

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -17) 295
గంధర్వనగరప్రఖ్యమర్థశూన్యోవలంభనాత్
ద్విచంద్ర విభ్రమాభాసం మృగతృష్ణాంబు వర్తనమ్ "I 19
నౌయానలోలశైలాభం సత్యలాభవివర్జితమ్
చిత్తభ్రమపిశాచాభం నిర్భీజమపి భాసురమ్ ॥ 20
కథార్థ ప్రతిభాసాభం వ్యోమముక్తావలినిభమ్ ।
కటకత్వం యథా హేమ్ని తరంగత్వం యథాంభని ॥ 21 21
యథా నభసి నీలత్వమసదేవోస్థితం సదా
అభిత్తిరంగరహితముపలబ్ధిమనోహరమ్ ॥ 22 22
స్వప్నే వా వ్యోమ్ని వా చిత్రమకర్త చిరభాసురమ్ |
అవహ్నిరేవ వహ్నిత్వం ధత్తే చిత్రానలో యథా | 23
దధాత్వేవం జగచ్ఛబ్దరూపార్థమసదాత్మకమ్ |
తరంగోత్పలమాలాభం దృష్టనృత్యమివోత్తితమ్
|| 24
చక్రచీత్కార పూర్ణస్య జలరాశిమివోద్యతమ్
శీర్ణపత్రం భ్రష్టనష్టం గ్రీష్మే వనమివారసమ్ ॥ 25 25
మరణవ్యగ్రచిత్తాభం శిలాగృహగుహాస్పదమ్ ।
అంధకారగు హైకై కనృత్తమున్మత్తచేష్టితమ్ 26
ప్రశాంతాజ్ఞాన నీహారం విజ్ఞానశరదంబరమ్ |
సముత్కీర్ణమివ స్తంభే చిత్రం భిత్తావివోదితమ్ | 27
వంకాదివాభిరచితం సచేతనమచేతనమ్
తరువాతిది మూడవది యగు ఉత్పత్తి.- ప్రకరణము. దీనియందు నానావిధములగు
దృష్టాంతములును, ఆఖ్యాయికలును ఉన్నవి. జ్ఞాన ప్రతిపాదక మగు ఈ గ్రంథభాగమున ఏడువేల శ్లోకము
లున్నవి. ఇందు లౌకికము లగు నీవు నేను, ఇత్యాది రూపక మగు ద్రష్ట దృశ్య భేదము వర్ణింపబడినది. ఈ
ద్రష్టృదృశ్యభేదము అనుత్పన్న మయ్యు, ఉత్పన్నమైన దానివలె నగుపించును - అని ఇందు చెప్పబడినది.
దీనిని వినిన, శ్రోతహృదయమున నీవు, నేను, బ్రహ్మాండములు, లోకములు, ఆకాశము పర్వతములతో
గూడిన స్థావర జంగమాత్మక మగు జగత్తు రూపవిహీన మనియు, అమూలక మనియు, పర్వత రహిత

296 యోగవాసిష్ఠము
మనియు, భూతవిహీన మనియు తోచును.
మఱియు, ఈ ప్రకరణమును వినిన సంసారము స్వకల్పనా రాజ్యము వంటిదని తెల్ల మగును;
స్వప్నమున గాంచిన వస్తువువలె అళీక మనియు, నాను మాత్రము అనగా వస్తుశూన్య మనియు, ఎండమావివలె
భ్రమజనిత మనియు, గంధర్వ నగరమువలె తుచ్ఛ మనియు, జబ్బుకంటివాని కగపడు ద్విచంద్రత్వమువలె
భ్రమమయ మనియు, పిశాచమువలె మోహకల్పిత మనియు అవగత మగును. నావ కదలుచుండ గట్టున
నున్న గుట్టలు కదలుచున్నట్లగపడు చక్కి, భ్రమకల్పిత రాక్షసునివలె, మాయవలనజేసి ఒకానొక సమయమున
ప్రతిభాత మగు ఈ సంసార మిప్పుడు తుచ్చమని బోధపడును. వర్ణనా ప్రభావమున ప్రత్యక్షముగ గోచరించు
పదార్థములవలెను, ఆకాశమున గనబడు ముత్యములవలెను, సంసారము మిథ్య యని అప్పుడు ఏర్పడును.
ఏలయన, సంసారమున వాస్తవమగు సారము లేదని అర్థమగును.
ఆభరణములు, తరంగములు-ఇవి బంగారము, జలములనుండి వేరు గానట్లు, జగత్తుకూడ మిథ్యయే;
ఇది ఆకాశమునందలి నీలిమమువలె, లేకున్నను ఉన్నట్లు తోచుచున్నది. మూలము, రంగు, కర్త - ఇవి
లేకుండ ఆకసముననో స్వప్నముననో దోచు చిత్రపటమువంటిది. చిత్రపటమునందలి అగ్ని అగ్నివలె
కన్పడుచున్నను, వాస్తవమున కగ్ని కానట్లు, ఈ జగత్తు అసత్తు అయ్యు జగత్తనియే వ్యవహరింపబడుచున్నది.
జలతరంగములనుగాంచి కలువల గుంపనుకొనునట్లు, పూర్వము గాంచిన నృత్యమును స్మరించి
(మనోనయనముల) మరల వీక్షించునట్లు, చక్రవాకముల ఏనుగులతో నిండియున్న ఆకాశ సరోవరమును
గల్పించునట్లు ఈ సంసార కల్పన గూడ తుచ్ఛమే యని ఉత్పత్తి - ప్రకరణమును జదివిన దేటపడును.
ఈ సంసారము మృత్యుముఖమున బడిన మనుజుని చిత్తమువలె, భ్రాంతిసంకులము, అస్థిరము;
పర్వతగుహవలె అంధకారాచ్ఛన్నము, శూన్యము, భీషణము; అంధకార గుహయందు ఒంటిగ నాట్యము
సల్పు పిచ్చిపని వంటిది- అని అప్పుడు తోచును. స్తంభముమీదనో లేక గోడమీదనో వ్రాయబడిన జీవితుని
ప్రతిమవలె దీనికి స్వతంత్రసత్త లేదు అని తెలియగలదు. ఈ పరమార్ధ దర్శనమున సంసారము అజ్ఞాన
నీహార శూన్యమును, విజ్ఞానమయమును నగు శరదాకాశము (అనగా బ్రహ్మ) గాక వేరొండు కాదని
గ్రహింతుము.
తతః స్థితిప్రకరణం చతుర్థం పరికల్పితమ్ । "I 28
త్రీణి గ్రంథసహస్రాణి వ్యాఖ్యానాఖ్యాయికామయమ్ ।
ఇత్థం జగదహంభావరూపస్థితిముపాగతమ్ ॥
" 29
ద్రష్టృదృశ్యక్రమం ప్రౌఢమిత్యత్ర పరికీర్తితమ్ ।
దశదిఙ్మండలాభోగభాసురోఒ యం జగద్భమః 30
30
ఇత్తమభ్యాగతో వృద్ధిమితి తత్రోచ్యతే చిరమ్

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -17) 297
తరువాతిది నాల్గవది యగు స్థితిప్రకరణము; దీని శ్లోకసంఖ్య మూడువేలు. దీనియందు పరమార్థ
తత్త్యము విశదముగ వ్యాఖ్యాత మైనది; నానావిధములగు కథ లున్నవి. ఈ జగత్తు, అహంభావ రూపమున
స్థితిని గనుచున్నదని నుడువబడి యున్నది. ద్రష్ట దృశ్యముల రీతి ఇందు వర్ణింపబడినది. దశదిక్కుల
విస్తరించి ప్రకాశించుచున్న ఈ భ్రాంతిమయ జగత్తు, ఎట్లు వృద్ధి నందినదో ఇందు వర్ణింపబడినది.
ఉపశాంతిప్రకరణం తతః పంచసహస్రకమ్ 11 31
పంచమం పావనం ప్రోక్తం యుక్తిసంతతి సుందరమ్ ।
ఇదం జగదహం త్వం చ స ఇతి భ్రాంతిరుణ్ణతా ॥ 32
ఇత్థం సంశామ్యతీత్యస్మిన్ కథ్యతే శ్లోకసంగ్రహైః |
ఉపశాంతిప్రకరణే శ్రుతే శామ్యతి సంసృతిః ॥ 33
ప్రభ్రష్టచిత్ర సేనేవ కించిల్లభ్యోపలంభనా ।
శతాంశశిష్టా భవతి సంశాంతభ్రాంతరూపిణీ ॥ 34
అన్యసంకల్పచిత్తస్థా నగర శ్రీరివాసతీ
అలభ్యవస్తు పార్శ్వస్థ స్వప్నయుద్ధ చిరారవా॥ 35
శాంతసంకల్పమత్తాభ్రభీషణాశనిశబ్దవత్ |
విస్మృత స్వప్నసంకల్పనిర్మాణనగరోపమా ॥ "I 36
భవిష్యనగరోద్యానప్రసూవంధ్యా మలాంగికా
తస్యా జిహ్వాచ్యమానో గ్రకథార్థానుభవోపమా
|| 37
అనుల్లిఖిత చిత్రస్య చిత్రవ్యాప్తేవ భిత్తిభూః
పరివిస్మర్యమాణార్థకల్పనానగరీనిభా || 38
సర్వర్తుమదనుత్పన్నవనస్పందాస్ఫుటాకృతిః |
॥ భావిపుష్పవనాకారవసంతరసరంజనా 39
అంతర్లీనతరంగౌమసౌమ్యవారిసరిత్సమా |
ఐదవది ఉపశమ ప్రకరణము; దీని శ్లోకసంఖ్య ఐదువేలు. ఇది అతి పవిత్రమైనది; నానా విధము
లగు యుక్తులతో గూడి సుందరమై తనరుచున్నది. ఈ జగత్తు, నీవు, నేను, వాడు అను భ్రాంతు -
లెట్లుపశమించునది- ఇందు వర్ణింపబడినది. దీనిని వినిన, సంసారము, చినుగుచున్న పటమునందలి సేనవలె,

298 యోగవాసిష్ఠము
మాయుచు ఒకింత కనబడుచుండును. అప్పుడు భ్రాంతి నూటికొకపాలు మిగులు పడియుండును.
ఒకానొకడు మనస్సున గాజ్యమును కల్పించుకొని చింతించుచున్నాడు. వాని ప్రక్క నింకొకడు
కలలో రాజ్యమును గెల్వ యుద్ధ మొనర్చుచు కేకలు పెట్టుచున్నాడు. స్వప్నరాజ్యము చింతారాజ్యముకంటె
ఒకింత స్పష్టమే యైనను లాభమేమియు లేదు. అట్లే, యీ జగత్తు ఒకని కొకింత అస్పష్టమును, మరొకని
కొకింత స్పష్టము అయినను, వాస్తవమున కియ్యది అసత్యమే. కల్పిత మేఘముల రవములు, కల్పననుండి
తేరుకొనిన పిమ్మట నశించునట్లు, ఈ జగత్తు స్వకల్పితమే గానిమ్ము, స్వప్నకల్పితమే గానిమ్ము నశించును.
అప్పు డీ సంసారము, నిర్మింపబోవు నగరోద్యానమునందలి గొడ్డురాలి కాన్పువలె అళీక మగును;
మూగవాడు వర్ణించిన వంధ్యాపుత్రుని వీరత్వ వర్ణనము లేక వంధ్యయొక్క ప్రసవవేదనా వర్ణనముయొక్క
అర్థానుభవమువలె అసత్యమై గన్పట్టును. సంపూర్ణముగ జగమ నశింపని వానికి సంసారము ముగియని
చిత్రపటమునందలి భిత్తివలెనో లేక, కల్పననుండి తొలగి పోవుచున్న నగరమువలెనో, అస్పష్టముగ గన్పడును.
ఋతువు లన్నిటియందు సమానముగనె యుండు భవిష్యదరణ్యము యొక్క కదలికవలెను, కల్పనా
మాత్రముననే పూదోటలోనికి వసంతము వచ్చునట్లు, సంసారము కల్పితము. కొందఱి కియ్యది, అంతర్నిహిత
తరంగములతో మనోహరమైన నదివలె, ప్రశస్త మైనదిగ గన్పట్టును.
నిర్వాణాఖ్యం ప్రకరణం తతః షష్టముదాహృతమ్ ॥ 40
శిష్ణో గ్రంథః పరీమాణం తస్య జ్ఞానమహార్థదః ।
బుద్ధే తస్మిన్ భవేచ్చేయో నిర్వాణం శాంతకల్పనమ్ ॥ 41
అచేత్యచిత్ ప్రకాశాత్మా విజ్ఞానాత్మా నిరామయః |
1
పరమాకాశకోశాచ్ఛః శాంతసర్వభవభ్రమః "I 42
నిర్వాపితజగద్యాత్రః కృత కర్తవ్యముస్థితః
సమస్తజనతారంభవజ్రస్తంభో నభోనిభః ॥ 43
వినిగీర్ణయథానంఖ్యజగజ్జాలాతితృప్తిమాన్ |
ఆకాశీభూతని:శేషరూపాలోక మనస్కృతిః ॥ 44
కార్యకారణకర్తృత్వ హేయాదేయదృశోషితః
స దేహ ఇవ నిర్దేహః స సంసారో ప్యసంసృతిః | 45
చిన్మయో మనపాషాణజఠరాపీవరోపమః
చిదాదిత్యన్త వంల్లో కానంధ కారోపరోపమమ్ ॥
" 46

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -17) 299
పరప్రకాశ రూపో పి పరమాంధ్య మివాగతః
రుద్ధ సంసృతిదుర్లీల:ప్రక్షీణాశావిషూచికః ॥ 47
నష్టాహంకారబేతాలో దేహవానకలేవరః
కస్మింశ్చిద్రోమకోట్యగ్రే తస్యేయమవతిష్ఠతే
జగల్లక్ష్మీర్మహామేరోః పుష్పే క్వచిదివాలినీ ॥ "I 48
పరమాణా పరమాణా చిదాకాశః స్వకోటరే
జగల్లక్ష్మీసహస్రాణి ధత్తే కృత్వాథ పశ్యతి 49
తరువాత ఆరవది యగు నిర్వాణ ప్రకరణము: దీని శ్లోకసంఖ్య పదునాలుగు వేల ఐదువందలు.
ఇది జ్ఞానమను గొప్పసంపద నొసంగును. ఈ ప్రకరణము నెఱింగిన కల్పన లన్నియు సమసిపోవును.
నిర్వాణమను పరమ శ్రేయస్సు లభించును.
అప్పుడు జ్ఞాని నిర్విషయమును, చిత్రకాశకమును, విజ్ఞాన సమయమును, నిరామయమును నగు
ఆత్మరూపమున బ్రతిష్ఠితు డగును. అప్పు డాతని సంసార భ్రమ లన్నియు తొలగిపోవును. అతడు
పరమాకాశమువలె స్వచ్ఛు డగును. అతని జగద్యాత్ర నిర్వాణమునందును పరిపూర్ణ మగును. కృతకృత్యు
డగుటవలన నాతడు స్థిరు డగును. వజ్ర నిర్మిత స్తంభము తనయందు ప్రతిబింబించు లోకములకును,
కార్యములకును నాశ్రయ మగునట్లు, అతడుగూడ పూర్ణు డైనందువలన, సమస్త లోకములకును,
కార్యములకును, ఆశ్రయమై (బ్రహ్మమై) ప్రకాశించును. సమస్త లోకములను భక్షించుటవలన అన్నట్లాతడు
తృప్తు డగును. అతని బాహ్యేంద్రియ భోగములు, చిత్తము చిదాకాశముగ మారును. అప్పు డాతనికి కార్యకారణ
కర్తృత్వముల యెడ నిరసన గాని, ఆదరణ గాని యుండదు. అప్పు డాతడు దేహి యైనను విదేహి యగును.
సంసారి యయ్యు అసంసారి యగును.
అతడు కఠిన పాషాణమువలె ఛిద్రరహితు డగును. అనగా, పరిపూర్ణమగు చిన్మయావస్థను బొందును.
అప్పు డాతడు, లోకప్రకాశకుడగు పరమ జ్యోతిర్మయ చిదాదిత్యుడు. దృశ్యము లన్నియు అదృశ్యములై
పోవుటవలన నల్లరాయివలె, దుర్భేద్య మగు అంధత్వమును బొందినాడు. అతనికి సంసార లీలయను
కుత్సిత విషూచివ్యాధి నశించినది. అహంకారమను దయ్యము వదలిపోయినది. శరీర మున్నను
దేహాత్మజ్ఞానము లేదు.
మేరుపర్వతమునందలి ఒకానొక పుష్పమున తుమ్మెద యుండునట్లు, స్వరోమాగ్రమువలె పరిచ్ఛిన్న
మగు అవిద్యయొక్క ఒకానొక అంశవలన ఈ జగత్తు నిలిచియున్నది. తన హృదయ చిదాకాశమునందు,
ప్రత్యేక పరమాణువున సహస్ర సహస్ర జగలక్ష్ములను గల్పించి అతడు దర్శింపగలడు.

300 యోగవాసిష్ఠము
వితతతా హృదయస్య మహామతే ర్హరిహరాబ్జజ లక్ష శతైరపి |
తులనమేతి న ముక్తిమతే యతః ప్రవితాతాస్తి నిరుత్తమవస్తు నః 50
ఇతి శ్రీ వాసిష్ఠ-మహారామాయణే వాల్మీకీయే ముముక్షు వ్యవహార ప్రకరణే గ్రంథసంఖ్యాది వర్ణనం నామ
సప్తదశఃసర్గః || 17 |
మహాత్ముడగు జీవన్ముక్తుని హృదయము పరమాత్మ: కోటి కోటి హరిహర బ్రహ్మాదులు కలసినను
ఈతనిని బోలరు. ఏలయన సత్తయొక్కయు, ఆనందము యొక్కయు విస్తారమున నితడు సర్వోత్తముడు.
ఆత్మయొక్క సర్వోత్కృష్ట విస్తృతి యీతని హృదయమున నున్నది.
ఇది శ్రీవాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు, ముముక్షువ్యవహార ప్రకరణమున గ్రంథసంఖ్యావర్ణనమను సప్తదశ సర్గము ॥ 17 ॥
దృష్టాన్త నిరూపణము-18
శ్రీవసిష్ఠ ఉవాచ :
అస్యాం వాచితమాత్రాయాం ప్రబోధః సంప్రవర్తతే |
బీజాదివసతో వ్యుప్తాదవశ్యంభావి సత్ఫలమ్ II 1
శ్రీవసిష్ఠుడు: మంచి నేలయందు యథాసమయమున గింజను పాతిన, తప్పకుండ మంచి ఫలము
లభించునట్లు, ఈ మోక్షోపాయ సంహితను పఠించినను, పఠింపింప జేసినను, జ్ఞానము లభించును.
అపి పౌరుషమాదేయం శాస్త్రం చేద్యుక్తిబోధకమ్ ।
అన్యత్యార్షమపి త్యాజ్యం భావ్యం న్యాయ్యైకసేవినా 2 "I
ఏశాస్త్రము యుక్తివలన తత్వనిర్ణయ మొనర్చుట కనుకూలమై యుండునో, అది మనుష్య రచిత
మైనను గ్రాహ్యము; అట్లు గానిచో, వేదాంతర్గతమైనను త్యాజ్యము. అందువలన, న్యాయసమ్మతమైన
మార్గమును అనుసరించుట మంచిది. (అనగా, కామ్యకర్మాది బోధకములగు వేదవాక్యములను ద్యజించి,
జ్ఞానోపదేశక భాగమును గ్రహింపవలెనని భావము. వీటిని వదలకున్న జిజ్ఞాసాధికారము లభింపదు.)
యుక్తియుక్తముపాదేయం వచనం బాలకాదపి
అన్యతృణమివ త్యాజ్యమప్యుక్తం పద్మజన్మనా "I 3
యుక్తియుక్తములగు వాక్యములను బాలుడు చెప్పినను గ్రహింప నగును. యుక్తిరహితములగు
వాక్యములను బ్రహ్మదేవుడు చెప్పినను తృణమువలె త్యజింపనగును.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -18) 301
యో స్మత్తాతస్య కూపో యమితి కౌవం పిబత్యపః
త్వక్త్యా గాంగం పురస్థం తం కో నాశాస్త్యతిరాగిణమ్ 4 ||
ఎట్టయెదుట నున్న గంగాజలమును వీడి "ఇది నాతండ్రి త్రవ్విన నూయి" అని నూతినీరు త్రాగువానికెవ
రుపదేశింతురు?
యథోషన్ ప్రవృత్తాయామాలోకో వశ్యమేష్యతి!
అస్యాం వాచితమాత్రాయాం సువివేకస్తధైష్యతి || 5
ఉషః కాలమైన తప్పక వెలుతురు వచ్చునట్లు, ఈగ్రంథమును బరించిన వివేక మవశ్యము గల్గును.
శ్రుతాయాం ప్రాజ్ఞవదనాత్ బుద్ధ్వాంతం స్వయమేవ
శనైః శనై ర్విచారేణ బుద్దా సంస్కార ఆగతే ॥ 6
పూర్వం తావదుతేత్యంతర్భృశం సంస్కృత వాక్యతా |
శుద్ధయుక్తా లతేవోచ్చైర్యా సభాస్థాన భూషణమ్ || 7
సాంతముగ ఈ గ్రంథమును ప్రాజ్ఞుని కడ విని, గ్రహింపగల్గిన, బుద్ధి విచార బలమున క్రమముగ
దృఢ సంస్కారమును గూర్చుకొనును. పిదప, సభాస్థాన అలంకారమగు ఆంతరిక సంస్కార సహితమగు
వాణి లభించును; ఈవాణి సభ నలంకరించు చక్కని లత వంటిది.
పరా నాగరతోదేతి మహత్త్యగుణశాలినీ
సా యయా స్నేహమాయాంతి రాజానో హ్యమరా అవి 8
పిదప మహత్తరమగు చాతుర్యము లభించును; దీనివలన రాజుల యొక్కయు, పండితుల యొక్కయు
స్నేహము లభించును.
పూర్వాపరజ్ఞః సర్వత్ర నరో భవతి బుద్ధిమాన్ ।
పదార్థానాం యథా దీపహస్తో నిశి సులోచనః 9
చూడ్కిగలవాడు రాత్రి దీపమును జేతబుచ్చుకొని వస్తువుల నన్నిటిని గాంచగల్గునట్లు, బుద్ధిమంతుడు
మాయామయ ప్రపంచమున ఈశాస్త్రమును బఠించి, పూర్వాపరములను, సమస్త పదార్థముల తత్త్వములను
గ్రహింపగలుగును.
లోభమోహోదయోదోషాస్తానవం యాన్త్యలం శనైః
ధియో దిశః సమాసన్నశరదో మిహికా యథా | 10

302 యోగవాసిష్ఠము
శరదృతువు ఆరంభ మైనతోడనే నలుప్రక్కల నున్న మంచు చెదిరిపోవునట్లు, ఈ శాస్త్ర ప్రభావమువలన
లోభమోహాది మానసిక దోషములు మెల్లగ వీడిపోవును.
కేవలం సమవేక్ష్యంతే వివేకాధ్యాసనం ధియః
న కించన ఫలం దత్తే స్వాభ్యాసేన వినా క్రియా ॥ 11
ఇప్పుడు నీబుద్ధికి వివేకాభ్యాస మొక్కటియే అవసరము; ఏలయన, అభ్యాస రహితమైన ఏ క్రియయు
ఫలము నొసంగజాలదు.
మనః ప్రసాదమాయాతి శరదీవ మహత్సర: 1
పరం సామ్యముపాదత్తే నిర్మందర ఇవార్ణవః ॥ 12
ఈ శాస్త్రమును బఠించిన, మనస్సు; శరత్కాల సరోవరమువలెను, మందర పర్వత రహితమగు
సముద్రమువలెను, నిర్మలమును, నిర్వికారమును నగును.
నిరస్త కాలిమారత్నశిఖేవాస్తతమఃపటా |
ప్రతిజ్వలత్యలం ప్రజ్ఞా పదార్థప్రవిభాగినీ ॥ I 13
మసిలేకుండ వెలుగుచు, చీకటిని బోగొట్టి వస్తువులను గన్పరచు రత్నదీపశిఖవలె ఈ శాస్త్రమును
బఠించిన బుద్ధి ప్రకాశించును; మోహము, అజ్ఞానములను బాపి బ్రహ్మపదార్థమును, తదితర పదార్థములను
జక్కగ తోపింపజేయును.
దైన్యదారిద్ర్యదోషాఢ్యా దృష్టయో దర్శితాంతరాః
న నికృంతంతి మర్మాణి ససన్నాహమివేషవః 14
కవచధారిని బాణములు కొట్టజాలనట్లు; దైన్యదారిద్య్ర దోషములతో నిండిన సంసారదృష్టి ఈ
శాస్త్రవేత్తను భేదింపజాలదు.
హృదయం నావలుంపంతి భీమా సంసృతిభీతయః |
పురఃస్థితమపి ప్రాజ్ఞం మహోపలమివేషవః ॥ 15
బాణములు రాతిని భేదింపజాలనట్లు, భయమును గొల్పు సంసారదృష్టి ఎట్టఎదుటనుండియు, ఈ
శాస్త్రము నెఱింగిన వానిని హృదయమును గ్రుచ్చ జాలదు.
కథం స్యాదాదితా జన్మకర్మణాం దైవపుంస్వయోః |
ఇత్యాదిసంశయగణః శామ్యత్యహ్ని యథా తమః 16

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -18) 303
జన్మ ముందా? లేక కర్మ ముందా? దైవము ముందా? లేక పురుష కారము ముందా? - ఇట్టివగు
సంశయములు పగటిపూట రాత్రివలె, తత్త్వజ్ఞునినుండి దూరమగును.
సర్వదా సర్వభావేషు సంశాంతిరుపజాయతే |
యామిన్యామివ శాంతాయాం ప్రజ్ఞాలోక ఉపాగతే 17
సూర్యు డరుదెంచిన రాత్రి తొలంగునట్లు, ఈ శాస్త్రపఠనముచేత ప్రజ్ఞలోక ముదయించిన, సమస్త
పదార్థముల యెడ రాగద్వేష భావములు తొలగిపోవును.
సముద్ర స్యేవ గాంభీర్యం ధైర్యం మేరోరివ స్థితమ్ |
అంతఃశీతలతా చేందోరివోదేతి విచారిణః ॥ 18
ఈశాస్త్రమును విచారించువాడు సముద్రునివలె గంభీరుడును, మేరువువలె ధీరును అగును,
చంద్రునివలె శీతలాంతఃకరణుడు నగును.
సా జీవన్ముక్తతా తస్య శనైః పరిణతిం గతా |
శాంతాశేష విశేషస్య శాంతాశేషవిశేషస్య భవత్యవిషయో గిరామ్ ॥ || 19
ఈ వ్యక్తి క్రమముగ భూమికల నారోహించుచు జీవన్ముక్తు డగును, అజ్ఞాన కల్పితములగు భేదము
లన్నియు నశించును. అప్పటి అతని స్థితి వర్ణన కతీతము.
సర్వార్థశీతలా శుద్ధా పరమాలోకదాస్య ధీ
పరం ప్రకాశమాయాతి జ్యోత్స్నవ శరదైందవీ ॥ 20
శరత్కాలమందలి వెన్నెలవలె, ఈ గ్రంథపాఠకుని బుద్ధి శీతలమును, శుద్ధమునునై, పరమాత్మ
దర్శనము నొనరింప జేయగలుగును.
హృద్యాకాశే వివేకార్కే శమాలోకి వినిర్మలే |
అనర్థసార్థకర్తారో నోద్యంతి కిల కేతవః ॥
21
ఆతని హృదయాకాశమున వివేకమను సూర్యుడు శమయను వెలుగుతో ప్రకాశించుచున్నాడు; ఇందు
అనర్థకములగు కామాదులను తోకచుక్క లుదయింపవు.
శామ్యంతి శుద్ధిమాయాంతి సౌమ్యస్తిష్ఠంతి సున్నతే
అచంచలే జలే తృష్ణా: శరదీవాభ్రమాలికాః ॥ 22
మంచినీటివలన దాహము తీరునట్లు, శరత్కాల మేఘములు ప్రశాంతము లగునట్లు, ఈ

304 యోగవాసిష్ఠము
జీవన్ముక్తపురుషులు సర్వోన్నతమును, సుస్థిరమును నగు ఆత్మపదమున ప్రశాంతులై, శుద్ధమును
ప్రశాంతమును నగు భావమున నుందురు.
యత్కించనకరీ క్రూరా గ్రామ్యతా వినివర్తితే ।
దీనాననా పిశాచానాం లీలేవ దివసాగమే ॥ 225 23
పగటిపూట దీనములగు పిశాచముల లీల అణగిపోవునట్లు, పరులను చిన్నబుచ్చజేయు బెండుపల్కులు
ఈ శాస్త్రమును బఠించువారి నోట వెల్వడవు.
ధర్మభిత్తా భృశం లగ్నాం ధియం ధైర్యధురం గతామ్
ఆధయో న విధున్వంతి వాతాశ్చిత్రలతామివ ॥ 24
పరమాత్మను దృఢముగ నాధారపఱచుకొని, దానిచే తవుల్కొని యున్నవారి బుద్ధిని,
చిత్రపటమునందలి లతను గాలి కదల్పలేనట్లు, మనోవ్యాధులు చలింపజేయజాలవు.
న పతత్యవటే జ్ఞస్తు విషయాసంగరూపిణి ।
కః కిల జ్ఞాతసరణిః శ్వభ్రం సమనుధావతి ॥ 25
ఈ జీవన్ముక్త పురుషుడు విషయములను గుంటలలో పడడు; ఎఱిగి ఎఱిగి, గుంటలో కూలుటకై
ఎవడు పరుగిడును?
సచ్ఛాస్త్ర సాధువృత్తానామవిరోధిని కర్మణి |
రమతే ధీర్యథా ప్రాప్తే సాధ్వీ వాంతఃపురాజిరే ॥ 26
ఆతడు తన ఇచ్చవచ్చినట్లొనర్పడు. అతని బుద్ధి అంతఃపురమందు స్త్రీవలె సచ్చాస్త్ర సదాచారముల
కనుకూలమగు కర్మలయందే ఆసక్తిని బూనియుండును.
జగతాం కోటిలక్షేషు యావంతః పరమాణవః |
తేషామేకైకశో ఒన్తఃస్థాన్ సర్గాన్ పశ్యత్యసంగధీః 27 22
అసంగ బుద్ధియగు పురుషుడు అసంఖ్యాకములగు బ్రహ్మాండముల నున్న; ఒక్కొక్క పరమాణువు
నందును అనేక బ్రహ్మాండములను గాంచును.
మోక్షోపాయావబోధేన శుద్ధాంతఃకరణం జనమ్ ।
న భేదయతి భోగౌఘే న చానందయతి క్వచిత్ ॥ 28 "I
మోక్షోపాయము నెఱిగి చిత్తశుద్ధిని బొందిన వానికి, భోగసమూహములు దుఃఖము నొసంగజాలవు
లేక సుఖమును గూర్పజాలవు.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -18) 305
పరమాణా పరమాణా సర్గవర్గా నిరర్గలా |
యే పతంత్యుత్పతంత్వంబు వీచివత్ తాన్ స పశ్యతి ॥
I 29
ప్రత్యేక పరమాణువునందు అసంకీర్ణములై అనేకములగు బ్రహ్మాండము లున్నవి; ఇవన్నియు
సముద్రమునందలి తరంగమువలె, లేచిపడుచున్నవి. వీటిని జీవన్ముక్త పురుషుడు గాంచగల్గును.
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి
కార్యాణ్యేష ప్రబుద్ధోపి నిష్ప్రబుద్ధ ఇవ ద్రుమః ॥ 30
కార్యములను, తత్ఫలములగు ఇష్టానిష్టములను, గ్రహించియు జీవన్ముక్త పురుషుడు వాటిని
వాంఛింపడు. నిరసింపడు. జడమగు వృక్షమువలె అజ్ఞుని చందమున ప్రవర్తించును.
దృశ్యతే లోకసామాన్యో యథా ప్రాప్తానువృత్తిమాన్ |
ఇష్టానిష్ట ఫలప్రాప్తా హృదయే నాపరాజితః ॥ 31
ఇష్టానిష్టము లరుదెంచిన, సామాన్యుని వలెనే జీవన్ముక్తుడు వాటిని భోగించును. కలవరపడడు.
బుద్ధ్వేదమఖిలం శాస్త్రం వాచయిత్వా వివిచ్యతామ్ ।
అనుభూయత ఏవైతన్నతూక్తం వరశాపవత్ ॥ 32
అందువలన, ఈ శాస్త్రమును సంపూర్ణముగ పఠించి, దీని అర్థమును యోచింపుము. వరము,
శాపములు ప్రత్యక్ష ఫలముల నొసంగ గలిగినట్లు, ఈ శాస్త్రముగూడ ప్రత్యక్ష ఫలము నొసంగును.
శాస్త్రం సుబోధమేవేదం సాలంకారవిభూషితమ్
కావ్యం రసమయం చారుదృష్టాంతై: ప్రతిపాదితమ్ ॥ 33
ఈ శాస్త్రమును తేలికగ అర్థము చేసికొనవచ్చును. మాధుర్యము, ఉపమ- ఇత్యాదులగు శబ్ద,
అర్థాలంకారము లిందున్నవి; మనోహరఏములగు దృష్టాంతములు దీనియందు నున్నవి. ఇది రసమయ
మగు కావ్యము.
బుధ్యతే స్వయమేవేదం కించిత్పదపదార్థవిత్
స్వయం వస్తు న వేల్తీదం శ్రోతవ్యం తేన పండితాత్ ॥
34
పదములను, వాటి అర్థములను ఒకింత గ్రహింప గలిగినవాడు, దీనిని తనయంతట తానే అర్థము
జేసికొనగలడు. అట్లు వీలుపడనిచో, పండితుని కడ విని అర్థమును గ్రహించునది.
యస్మిన్ శ్రుతే మతే జ్ఞాతే తపోధ్యానజపాదికమ్ ।
మోక్షప్రాప్తా నరస్యేహ న కించిదుపయుజ్యతే 35
VI F20

306 యోగవాసిష్ఠము
ఈ గ్రంథమును విని, మనన పూర్వకముగ అర్థమును గ్రహింపగల్గినచో, మోక్షవిషయమున ధ్యాన
జపాదు లుపయోగపడవు. (ఏలయన, వీటిఫలము ఏతదంతర్గతము.)
ఏతచ్ఛాస్త్రమనాభ్యాసాత్ పౌనఃపున్యేన వీక్షణాత్
పాండిత్యం స్యాదపూర్వం హి చిత్తసంస్కారపూర్వకమ్ "I 36
ఈశాస్త్రమును మాటిమాటికి పరికించుచు దృఢముగ నభ్యసించిన చిత్తసంస్కారముతో గూడిన
అపూర్వ పాండిత్యము లభించును. (తదితర గ్రంథముల నుండి పాండిత్యము లభించిన లభింపవచ్చును
గాని, అందు చిత్తసంస్కారము కొఱవడును,)
అహం జగదితి ప్రౌఢ ద్రష్టృదృశ్యపిశాచకః |
పిశాచోర్కోదయేనేవ స్వయం శామ్యత్యయత్నతః "I 37
సూర్యోదయమైన దయ్యము మాయ మగునట్లు ఈ శాస్త్రాధ్యయన మొనర్చిన అనాయాసముగ
నేను, ప్రపంచము అను ద్రష్టృ - దృశ్య భేద పిశాచము వదలిపోవును.
భ్రమో జగదహం చేతి స్థిత ఏవోపశామ్యతి |
స్వప్నమోహః పరిజ్ఞాత ఇవ నో భ్రమయత్యలమ్ ॥ 38
నేను, జగత్తు, అనుభ్రమ యున్నను; ఈ శాస్త్రమును బఠించిన ఉపశమించును. కల తేలిపోయిన,
అందగపడినది కలవరపెట్టజాలనట్లు, ఈ జగత్ప్రమయు అప్పుడు కలవర పెట్టజాలదు.
యథా సంకల్పనగరే పుంసో హర్షవిషాదితా |
న బాధతే తథైవాస్మిన్పరిజ్ఞాతే జగమే "I 39
చిత్రసర్పః పరిజ్ఞా న సర్పభయదో యథా ॥
దృశ్యసర్పః పరిజ్ఞాతస్తథా న సుఖదుఃఖదః ॥ 40
మనఃకల్పిత నగరమును కల్పితమే యని గ్రహించిన సుఖదుఃఖముల నొసగజాలనట్లు, చిత్రింపబడిన
పామును బొమ్మయని గ్రహించిన భయమును గలిగింపజాలనట్లు; ఈ జగత్ప్రమను, ఈ దృశ్య సర్పమును,
మాయ యని గ్రహించిన సుఖదుఃఖముల నొసంగజాలదు.
పరిజ్ఞానేన సర్పత్వం చిత్రసర్పస్య నశ్యతి ।
యథా తథైవ సంసారః స్థిత ఏవోపశామ్యతి I 41
చిత్రింపబడిన పాము నట్టిదానినిగనే గ్రహించిన దాని సర్పత్వము నశించునట్లు, (జ్ఞానఫలముగ)
ఈ సంసారముగూడ అధిష్ఠాన రూపమున (బ్రహ్మమున) లీనమైపోవును.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -18) 307
సుమనః పల్లవామరే కించిద్వ్యతికరో భవేత్
పరమార్థ పదప్రాప్తా న తు వ్యతికరో 2 లకః 42
పూవును, చిగురుటాకును, చించుట కొకింత ప్రయత్న మొనర్పవలయును. కాని, పరమార్థ లాభమున
కామాత్రముకూడ ప్రయత్నింపవలసిన అవసరము లేదు. (జ్ఞాన ప్రభావమున మాయామయమగు సంసారము
తేలికగ లీనమైపోవును.)
గచ్ఛత్యవయవః స్పందం సుమనః పత్రమర్దనే
ఇహ ధీమాత్రరోధస్తు నాంగావయవచాలనమ్ ॥ 43
పూవును, చిగురుటాకును జింప అవయవములను గదల్పవలయును. పరమార్థ లాభమునకో బుద్ధిని
నిరోధించిన చాలును. అవయవములను కదల్ప నక్కరయే లేదు.
సుఖాసనోపవిష్టేన యథాసంభవమశ్నతా
భోగజాలం సదాచార విరుద్ధేషు న తిష్ఠతా 44
యథా క్షణం యథా దేశం ప్రవిచారయతా సుఖమ్
యథాసంభవసత్సంగమిదం శాస్త్రమథేతరత్ ॥ 45
ఆసాద్యతే మహాజ్ఞానబోధః సంసార శాంతిదః
న భూయో జాయతే యేన యోనియంత్రప్రవీడనమ్ ॥
"1 46
సంసార తాపశాంతి నొసగు జ్ఞానమును బొందగోరు నెడల, సుఖాసనమున గూర్చుండుట; లభించిన
దానిని భోగించుట. సదాచార విరుద్ధములగు కార్యముల నొనర్పకుండుట, ఆయా యెడల వీలైనట్లు సత్సంగ
మొనర్చుట, యీ శాస్త్రమును గాని; ఉపనిషత్తులు, మోక్షధర్మము ఇత్యాదులగు ఇతర శాస్త్రములను గాని
పఠించుట అవసరములు. ఇట్లొనర్చిన గొప్పదగు జ్ఞానము లభించును. పునర్జన్మ తొలగును. మరల,
యోనియంత్రమున బడి బాధపడనక్కర లేదు.
ఏతావత్యపి యే భీతాః పాపా భోగరసే స్థితాః 1
స్వమాతృవిష్ణాకృమయః కీర్తనీయ న తే ధమాః
47
ఆయాస రహిత మగు ఇట్టి శాస్త్రమును బఠింప భయపడువారును, భోగరస స్థితులును నగు పాపులు
మాతృమల - కీటకములు; వీరి పేరైన దలచరాదు.
శృణు తావదిదానీం త్వం కథ్యమానమిదం మయా ।
రాఘవ! జ్ఞానవిస్తారం బుద్ధిసారతరాంతరమ్ ॥ 48

308 యోగవాసిష్ఠము
రాఘవా! నే జెప్పు జ్ఞానశాస్త్రమును వినుము. ఇది వివేకబుద్ధిచే గ్రహింప దగిన జ్ఞానము యొక్క
తుది. (అనగా, ఆత్మతత్త్వము.)
యథేదం శ్రూయతే శాస్త్రం తామాపాతనికాం శృణు |
విచార్యతే యథార్థో యం యథా చ పరిభాషయా ॥ 49
ఈ శాస్త్రశ్రవణమునకును, అర్థమును లెస్సగా తెలిసికొనుటకును, దోడ్పడు ఉపక్రమోపసంహారముల
అవతారికను వినుము.
యేనేహాననుభూతే ఒర్థే దృష్టే నార్ధేన బోధనమ్ ।
బోధోపకారఫలదం తం దృష్టాంతం విదుర్బుధా: 50
కాంచిన విషయము, సాదృశ్యమువలన కాంచనట్టి విషయమును గ్రహింప తోడ్పడును. ఇట్టిపట్ల,
నూతన విషయమును గ్రహింప దోడ్పడు విషయమును దృష్టాంత మందురు.
దృష్టాంతేన వినా రామ! నాపూర్వార్థో2 బుధ్యతే |
యథా దీపం వినా రాత్రా భాండోపస్కరణం గృహే ॥ 51
రామా! రాత్రికాలమున ఇంటియందున్న వస్తువులను దీపము లేనిచో గ్రహింపజాలనట్లు,
దృష్టాంతముయొక్క సాయము లేనిచో అపూర్వార్థము (అంతకు మున్నెరుంగని విషయము) బోధపడదు.
యైర్యై: కాకుత్థ! దృష్టాంతైన్యం మయేహావబోధ్యసే
సర్వే సకారణాస్తే హి ప్రాప్యం తు సదకారణమ్ ॥ 52
కాకుత్థా! నే నే దృష్టాంతముల సాయమును గొని నీకు బోధింప నుంటినో, అవన్నియు కారణములతో
గూడుకొని యున్నవి. జ్ఞేయమగు అసద్వస్తు వొక్కటియే కారణ రహితము, అనగా నిత్యము.
ఉపమా నోపమేయానాం కార్యకారణతోదితా
1
వర్ణయిత్వా పరం బ్రహ్మ సర్వేషామేవ విద్యతే || 53 55
పరబ్రహ్మము నొక్కదానిని విడిచిన, తక్కిన ఉపమానోపమేయ పదార్థములన్నిటియందు కార్య
కారణభావ మున్నది.
బ్రహ్మోపదేశ దృష్టాంతో యస్తవేహ హి కథ్యతే
ఏకదేశ సధర్మత్వం తత్రాంతః పరిగృహ్యతే ॥ 54
ఈ బ్రహ్మోపదేశ సందర్భమున, నేను నీకు జూపు దృష్టాంతముల, పరబ్రహ్మముయొక్క ఆంశిక

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -18) 309
సాధర్మ్యము మాత్రమే గ్రహింపబడును.*
యో యో నామేహ దృష్టాంతో బ్రహ్మతత్త్వావబోధనే
దీయతే న స బోద్ధవ్యః స్వప్నజాతో జగద్గతః ॥ 555 55
బ్రహ్మావబోధ నిమిత్తము గ్రహింపబడు ఉపమానము లన్నియు, స్వప్నమున గాంచిన వస్తువువలె,
మిథ్యయగు జగత్తునకు జెందినవే యని గ్రహించునది.
ఏవం సతి నిరాకారే బ్రహ్మణ్యాకారవాన్ కథమ్
దృష్టాంత ఇతి నోద్యంతి మూర్ఖ వైకల్పికోక్తయః
|| 56
అందువలన, నిరాకారమగు బ్రహ్మమున సాకార దృష్టాంతము లెట్లు సంగతము లగును?" అను
మూర్ఖుల వికల్పములకు తావులేదు.
అన్యాసి ద్ధ విరుద్ధాది దృగ్దృష్టాంత ప్రదూషణైః|
స్వస్నోపమత్వాజ్జగతః సముదేతి న కించన ॥
57
44
తార్కికులు చూపు హేత్వాభాసలను దోషము, జగత్తున నున్న పరమార్థములే స్వప్న పదార్థమువలె
మిథ్య లగుటవలన, ఆ పరమ వస్తువును బాధింపజాలవు.
అవస్తు పూర్వాపరయోర్వర్తమానే విచారితమ్ ।
యథా జాగ్రత్తథా స్వప్నః సిద్ధమాబాల మాగతమ్ ॥ 58
ఒకింత విచారించి చూచిన జాగ్రదావస్థయందును గాంచు వస్తువులకును, స్వప్నావస్థయందు గాంచు
వస్తువులకును భేదమే లేదు. ఈ రెండును మిథ్యలే యని తెలియగలదు. ఈ జగత్తు, భూత భవిష్యద్వర్తమాన
కాలములందు లేనట్టి అవస్తువు: బాల్యమునుండి మనల నావహించి యున్న ఈ జగదమ మిథ్య.
స్వప్ననంకల్పనాధ్యానవర శాపౌషధాదిభి:
1
యథార్థా ఇహ దృష్టాంతా సద్రూపత్వాజ్జగత్పితే: 59
59
స్వప్నము, సంకల్పము, ధ్యానము, వరము, శాపము, ఔషధము - ఇత్యాదులగు విషయములను
త్రాటియందు పామువలె, జగత్తు బ్రహ్మముయొక్క వివర్తము అన్నపట్ల, జగత్తున బ్రహ్మమునందున్న నిత్యనిరతిశయ
సుఖాదు లున్నవని కాదు. ఈ యుండుట రజ్జు - సర్పమున విషయ ముండుట సంభవించి నప్పుడే. అందువలన, వివర్తాంశము
మాత్రమే గ్రహింపబడుచున్నది. కనుకనే, సాధర్మ్యము ఆంశికమని పైశ్లోకమున నుడువబడినది అను.

310 యోగవాసిష్ఠము
గురించి చింతించిన “జగత్తు స్వప్నమువంటిది" అని చెప్పిన దృష్టాంతము బోధపడగలదు. *
మోక్షోపాయకృతా గ్రంథకారేణాన్యేఒ పి యే కృతాః
గ్రంథాస్తేష్వియమేవైకా వ్యవస్థా బోధ్యబోధనే " 60
ఈ మోక్షోపాయ రచయిత రచించిన గ్రంథములం దెల్లయెడల ఇదే నియమము పాటింపబడినది.
దృష్టాంతములందు సంభవమైన అంశము మాత్రమే గ్రహింపబడినది.
స్వప్నాభత్వం చ జగతః శ్రుతే శాస్త్రే ఒవబోధ్యతే
శీఘ్రం న పార్యతే వక్తుం వాక్కిల క్రమవర్తినీ॥ 61
జగత్తు స్వప్నతుల్యమను జ్ఞానము ఈశాస్త్రమును బరించినతోడనే కలుగునని చెప్పజాలము ; వాక్యబోధ
యగుట సంస్కారము ననుసరించి క్రమముగ జరుగవలసిన పని.
స్వప్న సంకల్పనా ధ్యాన నగరాద్యుపమం జగత్
యతస్త ఏవ దృష్టాంత స్తస్మాత్ సంతీహ నేతరే ॥ 62
స్వప్న, సంకల్ప, ధ్యానములందు కల్పింపబడిన నగరమువంటి జగత్తు; అగుటవలన, స్వప్నాదులే
యీ గ్రంథమున దృష్టాంతములుగ గ్రహింపబడినవి. ఇతరములు గ్రహింపబడలేదు.
అకారణే కారణతా యద్బోధాయోపవియతే
న తత్ర సర్వసాధర్మ్యం సంభవత్యువమాశ్రమై: 63
ఉపమేయస్యోప మానాదే కాంశేన సధర్మతా 1
అంగీకార్యావబోధాయ ధీమతా నిర్వివాదినా॥ 64
సువర్ణము కుండల వలయాది ఆభరణములకు గారణ మయినట్లు, బ్రహ్మముగూడ జగత్తునకు
గారణము. ఈ ఉపమ బ్రహ్మపదార్థమును దెల్ప ప్రయోగింపబడినది. ఇట సువర్ణము వికృతి నందునట్లు,
బ్రహ్మముగూడ వికారము నందునని తలపరాదు. ఏలయన, సువర్ణమునందున్న ధర్మము లన్నియు
గ్రహింపబడలేదు ; ఆంశికముగమాత్రమే గ్రహింపబడినవి. బుద్ధిమంతు డగువాడు తత్త్యమును గ్రహింప
ఉపమానమునందలి ఏకాంశమునే నిర్వివాదముగ గ్రహించును.
నిద్రించునప్పుడు కలగందుము. ఈ కలలో విషయములను చింతించుట అసంభవము కాదు. మఱియు, ఇష్టమూర్తిని
ధ్యానించి వరమును బడసి, శాపాది ఉపాయముల శత్రువులను జయించుటకూడ ఈ కలలందు గందుము. ఇవి జాగ్రదవస్థలో గూడ
ఫలించుచున్నవి. స్వప్నమున ఒకానొకనిచే నొసంగబడిన ఔషధ ప్రభావమున, జాగ్రదావస్థయందలి రోగములు నయ మగుచున్నవి.
కనుక, స్వప్నజాగరములకు భేదమే లేదనుట సమీచీనము - అను.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -18) 311
అర్థావలోకనే దీపాదాభామాత్రాదృతే కిల
న స్థానతైలవర్ణ్యాది కించిదప్యుపవయుజ్యతే ॥ 65 II
వస్తువులను గాంచ, దీప మొసగు వెల్తురు మాత్రమే తోడ్పడును; సెమ్మె, నూనె, వత్తి మొదలగునవి
ఉపయోగపడవు గదా!
ఏకదేశసమర్థత్వాదువ మేయావబోధనమ్
ఉపమానం కరోత్యంగదీపో 2ర్థ ప్రభయా యథా ॥ 66
వస్తువులను గాంచ దీపపు కాంతి యొక్కటియే ప్రయోజన మైనట్లు ఉపమ తన ఏకదేశశక్తి వలననే
ఉపమేయమును గ్రహింపజేయగలదు.
దృష్టాంతస్యాంశమాత్రేణ బోధ్యబోధోదయే సతి ।
ఉపాదేయతయా గ్రాహ్యో మహావాక్యార్థనిశ్చయః 67
దృష్టాంతమునందలి ఒకానొక అంశనుమాత్రమే గ్రహింపగలము. కనుక, మహావాక్యార్థ బోధలవలన
నిశ్చయముగ బ్రహ్మజ్ఞానము లభింపగలదు.*
న కుతార్కికతామేత్య నాశనీయా ప్రబుద్ధతా
1
అనుభూత్యవలాపాన్తెరపవిత్రైర్వికల్పితై: || 68
అనుభవ వ్యతిరేకము అని అపవిత్ర కుతర్క మొనరించి, తత్వజ్ఞానమును పాడుచేయుట పాడి కాదు.
విచారణా దనుభవకారివైరిణో ఒపి వాఙ్మయం త్వనుగతమస్మదాదిషు|
స్త్రియోక్త మవ్యపరమార్థ వైదికమ్ వచో వచః ప్రలపన మేవ నాగమః
69
విచారించి చూచినచో, మనము శత్రువులని తలచు ఋషుల వాక్యములు బ్రహ్మజ్ఞానము
నొసంగుచున్నవి; వీరు సంసారదోష దర్శకులు. వీరి వాక్యముల నశక్యము గ్రహింప నగునని తేలుచున్నది.
పరమార్థ తత్త్వము నెఱిగింపనట్టి వాక్యము ప్రియురాలు వచించినను ప్రలాపమే, ఆప్తవాక్యము (ఆగమము)
కాజాలదు.
అస్మాక మస్తి మతిరంగ తయేతి సర్వ- శాస్త్రైక వాక్యకరణం ఫలితం యతో యః
ప్రాతీతికార్థ మపశాస్త్ర నిజాంగ పుష్టాత్ సంవేదనాదితరదస్తి తతః ప్రమాణమ్ ||70
'ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్త్వమసి, అహం బ్రహ్మాస్మి' అను ఈ మహావాక్యములు జీవబ్రహ్మైక్య
బోధపరములు; చతుర్వేద సారములు. వీటిని గురుముఖతః విని, అర్థమును గ్రహించి, ధ్యాన మొనర్చిన బ్రహ్మజ్ఞానము లభించును.

312 యోగవాసిష్ఠము
ఇతి శ్రీ వాసిష్ఠ-మహారామాయణే వాల్మీకీయే ముముక్షువ్యవహార ప్రకరణే దృష్టాంతనిరూపణం నామ
అష్టాదశః సర్గః ॥ 18 ॥
రామా! బ్రహ్మసాక్షాత్కారము నొనరించుకొనగల శక్తితో గూడిన బుద్ధి మనకున్నది, దీనివలన,
పూర్వోక్తరూపమున సమస్త శాస్త్రముల ఏకవాక్యత (అనగా, అఖండమగు బ్రహ్మ తత్త్వముననే తాత్పర్యము)
నిర్ణయించితిమి. దీనిని గ్రహించిన పరమ పురుషార్థము లభించును. వేదాంత విరోధములగు శాస్త్రములు
శ్రుతి వ్యతిరేకములగు తర్కములతో నిండియున్నవి. "తత్వమసి" ఇత్యాదులగు మహావాక్యములు
వారిమతమును సమర్థింపజాలవు. ఈమతమున కనుకూలముగ నున్నవి. అందువలన, ఇదియే వేదానుగత
మతమని గ్రహింపుము.
ఇది శ్రీ వాసిష్ఠ - తాత్పర్య ప్రకాశికయందు ముముక్షు వ్యవహార ప్రకరణమున దృష్టాంత నిరూపణమను అష్టాదశ సర్గము ॥18
***
ప్రమాణ నిరూపణము-19
శ్రీవసిష్ఠ ఉవాచ :
విశిష్టాంశసమర్థత్వముపమానేషు గృహ్యతే
కో భేదః సర్వసాదృశ్యే తూపమానోపమేయయోః 1
శ్రీవసిష్ఠుడు: విశేషాంశముయొక్క సమాన ధర్మమే ఉపమయందు గ్రహింపబడును. అట్లుగాక అంశము
లన్నిటి సమాన ధర్మములున్న ఉపమానోపమేయముల భేదమేమి?
దృష్టాంత బుద్ధావేకాత్మజ్ఞానశాస్త్రార్థవేదనాత్ ।
మహావాక్యార్థన సిద్ధా శాంతిర్నిర్వాణముచ్యతే ॥ I 2
జీవబ్రహ్మముల స్వరూపమును గ్రహింప నుపయోగపడు దృష్టాంతమును నెఱిగిన, అఖండాకార
చిత్తవృత్తి ఉదయించును. మహావాక్యార్థ బోధవలన ఆత్మతత్వము స్ఫురించును. ఈ స్ఫురణవలన అజ్ఞానము,
దాని కార్యము నశించిపోవును; ఇదియే నిర్వాణము. ఇది దృష్టాంత జ్ఞానమువలననే లభించుచున్నది.
తస్మాద్దృష్టాంత దారాంత వికల్పోల్లసితైరలమ్ |
యయా కయాచిద్యుక్త్యా తు మహావాక్యార్థమాశ్రయేత్ 3 "I
దృష్టాంత దారాంతికము (ఉపమానోపమేయము)లను గుఱించి ఘర్షణ పడనక్కరలేదు. దీనివలన
నేమియు సిద్ధింపదు. ఏ యుక్తి ననుసరించినను సరే, మహావాక్యార్థము నాశ్రయించుటయే ముఖ్యము.
శాంతిః శ్రేయః పరం విద్ధి తత్రాపౌ యత్నవాన్ భవ
భోక్తవ్యమోదనం ప్రాప్తం కిం తత్సిదౌ వికల్పితైః "I

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -19) 313
'శాంతియే పరమశ్రేయస్సు' అని గ్రహింపుము; ఈ శాంతిని బడయ ప్రయత్నింపుము. అన్నము
లభించిన తినవలెను గాని, అది యెట్లు వండబడినది? అని వితర్కించిన లాభమేమి?
అకారణైః కారణిభిర్బోధార్థముపవియతే|
ఉపమానై స్తూప మేయైః సదృశైరేకదేశతః ॥ 5
కారణ రహితమును, కారణ యుతమును నగు ఉపమానోపమేయముల ఒకింత భేద మున్నను,
ఒకింత పోలిక యున్నందువలన ప్రయోగింపబడి సాదృశ్య జ్ఞానమును గలిగించుచున్నవి.
స్థాతవ్యం నేహ భోగేషు వివేకరహితాత్మనా |
ఉపలోదరసంజాతపరిపీనాంధభేకవత్ ॥ 6
రాతియందు పుట్టిన గ్రుడ్డి బోదురు కప్పవలె, వివేకహీనుడై భోగముల యందాసక్తుడై యుండుట
మనుజునకు తగదు.
దృష్టాంతైర్యత్నమాశ్రిత్య జేతవ్యం పరమం పదమ్ ।
విచారణవతా భావ్యం శాంతిశాస్త్రార్థశాలినా ॥ 7
వివేకముతో శాంతిమయములగు శాస్త్రార్థములను గ్రహించి, దృష్టాంత ప్రతిపాదితమగు
పరమపదమును బొంద యత్నింపవలెను.
శాస్త్రోపదేశసౌజన్య ప్రజ్ఞ తజ్జ్ఞసమాగమైః
అంతరాంతరసంపన్నధర్మార్థోపార్జనక్రియః || 8
తావద్విచారయేత్ ప్రాజ్ఞో యావద్విశ్రాంతిమాత్మని I
సంప్రయాత్యపునర్నాశాం శాంతిం తుర్యపదాభిధామ్ ॥ 9
ఆత్మవిశ్రాంతి లభింపనంతవరకు శాస్త్రోపదేశము, సౌజన్య స్వభావము, సాధుసంగమముల-
నాశ్రయించి ధర్మార్థములను, పురుషార్థములను సంపాదింప వలెను; పిదప, శాస్త్రముల అపూర్వార్థమును
గ్రహించి విచార పరాయణుడు కానగును. ఇట్లొనర్చిన తురీయ పదమని చెప్పబడు శాంతి లభించును.
తుర్యవిశ్రాంతియుక్తస్య ప్రతీవస్య భవార్ణవాత్
జీవతో 2 జీవతశ్చైవ గృహస్థస్య తథా యతేః 10 10
న కృతే నాకృతేనార్థో న శ్రుతిస్మృతివిభ్రమైః |1
నిర్మందర ఇవాంభోధిః స తిష్ఠతి యథాస్థితమ్ ।
"I 11

యోగవాసిష్ఠము 314
భవసముద్రమును దాట ఏ వ్యక్తి యీ తురీయ పదమున విశ్రమించినాడో, అతడు గృహియే గాని
యతియే గాని శ్రవణ మననాదుల నొనర్పనీ, ఒనర్పకపోనీ, ఐహికాముష్మిక ఫలము లాతని నంటవు.
అతడు నిర్మందరుడగు సముద్రునివలె, నిశ్చలుడై యుండును. *
ఏకాంశేనోవ మానానాముపమేయనధర్మతా
బోద్ధవ్యం బోధ్యబోధాయ న స్థేయం బోధచంచునా ॥ 12
బోధింపబడు వస్తువుల తత్త్యమును గ్రహించు నిమిత్తము, ఉపమాన ఉపమేయములు ఏకాంశ
సాధర్మ్యమును మాత్రమే గ్రహింపవలెను. అర్థమును నాలుకపై నుంచుకొనిన లాభము లేదు; మది
కెక్కించుకొనవలయును.
యయా కయాచిద్యుక్త్యా తు బోధవ్యం బోధ్యమేవ తే
I
యుక్తాయుక్తం న పశ్యంతి వ్యాకుల బోధచంచవః ॥ 13
ఏ యుక్తి ననుసరించినను సరే, బోధార్థమును గ్రహింపవలెను. బోధచంచువు లగువారు భ్రమపడి
యుక్తాయుక్తములను గాంచజాలరు.
హృదయే సంవిదాకాశే విశ్రాంతే నుభవాత్మని
వస్తున్యనర్థం యః ప్రాహ బోధచంచు: ఉచ్యతే ॥
I 14
హృదయ దేశమున బుద్ధిగుహయందు విశ్రమించి యున్న అనుభవ స్వరూపి యగు బ్రహ్మవస్తువునం
దనర కల్పనల నొనరించువాడు బోధచంచు వనబడుచున్నాడు.
అభిమానవికల్పాంశైరజ్లో జ్ఞప్తిం వికల్పయేత్
బోధం మలినయత్యంతః స్వం ఖమబ్ద ఇవామలమ్ ॥ 15
మేఘుడు నిర్మలాకాశమును మలిన మొనర్చునట్లు. అజ్ఞుడగు బోధచంచువు అభిమాన వికల్పముల
బ్రహ్మభావ వృత్తియందు వికల్పములను గల్పించి బోధను మలిన మొనర్చును.
సర్వప్రమాణసత్తానాం పదమబ్ధిరపామివ
ప్రమాణమేకమేవేహ ప్రత్యక్షం తదితః శృణు 16
జలము లన్నిటికీ సముద్ర మునికి యైనట్లు, ప్రమాణములన్నిటికి ప్రత్యక్షమే ఆధారమ్ము. దీనిని
గుఱించి చెప్పుచున్నాను; వినుము.
* నిర్మందరుడగు సముద్రుడు; ఇట్టిదే యగు ప్రయోగము 18 వ సర్గ 12వ శ్లోకమున గూడ నున్నది. అభిప్రాయ మిది;
దేవతలు రాక్షసులు. మందర పర్వతమును కవ్వ మొనర్చి, పాలసముద్రమును చిల్కినప్పుడది కల్లోల మైనది కదా! మందర పర్వతమును
దీసివైచినప్పుడు ప్రశాంత మైనది. కనుక, శాంతుడగు సముద్రుడను అర్థము లభించుచున్నది.

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -19) 315
సర్వాక్షసారమధ్యక్షం వేదనం విదురుత్తమాః |
నూనం తత్ప్రతివత్సిద్ధం తత్ ప్రత్యక్షముదాహృతమ్
"I 17
ప్రత్యక్ష జ్ఞానము లన్నిటికి మిన్నయగు నదియే అపరోక్షానుభూతి; ఇది జ్ఞాతృ, జ్ఞాన, జ్ఞేయములను
త్రిపుటితో గూడియున్నది. ఇదికూడ ప్రత్యక్షమే యని ఉత్తములగు వారందురు.
అనుభూతేర్వేదనస్య ప్రతిపత్తేర్యథాభిధమ్ ।
ప్రత్యక్షమితి నామేహ కృతం జీవః స ఏవ సః ॥ 18
అనుభవము, వేదన, ప్రతిపత్తి - యీ మూడింటితో గూడిన సాక్షి చైతన్యము ప్రత్యక్ష పదముయొక్క
యోగార్ధము. మా మతమున ఇదియే జీవుడు.
స ఏవ సంవిత్ సపుమానహంతా ప్రత్యయాత్మకః |
స యయోదేతి సంవిత్యా సా పదార్థం ఇతి స్మృతా ॥ 19
ఈ సాక్షియే “వృత్తి-ఉపాధితో గూడికొని నప్పుడు "సంవిత్ అని చెప్పబడుచున్నాడు. “అహం”
ప్రత్యయముతో గూడుకొనినప్పుడు ప్రమాత, పురుషుడు" అని చెప్పబడుచున్నాడు. విషయాకార వృత్తిని
దాల్చి బాహ్యావరణ ములను జీల్చి, ఆవిర్భవించినప్పుడు, "విషయము, జ్ఞేయము అని చెప్ప బడుచున్నాడు.
స సంకల్పవికల్పాద్యైః కృతనానాక్రమభ్రమైః |
జగత్తయా స్ఫురత్యంబు తరంగా తయా యథా ॥ 20
వీరు తరంగాది వివిధరూపముల ప్రకాశిత మగునట్లు, ఈ చైతన్యమే సంకల్ప వికల్పాది నానావిధ
భ్రాంతులతో జగద్రూపమున ప్రతిభాసిత మగుచున్నది.
ప్రాగకారణమేవాసుసర్గాదౌ సర్గలీలయా
స్ఫురిత్వా కారణం భూతం ప్రత్యక్షం స్వయమాత్మని | "I 21
ఈ సాక్షి చైతన్యమే పూర్వము సృష్టికి కారణము గాకుండియు, సృష్టిలీలయందు తానే కారణ
మైనట్లు ప్రకాశించుచున్నది.
కారణం త్వవిచారోత్థజీవస్యాసదపి స్థితమ్
స దివాస్యాం జగద్రూపం ప్రకృతా వ్యక్తిమాగతమ్ "I 22
స్వయమేవ విచారస్తు స్వత ఉతం స్వకం వపుః
నాశయిత్వా కరోత్యాశు ప్రత్యక్షం పరమం మహత్ ॥ 23

316 యోగవాసిష్ఠము
విచారశూన్యతనుండి గల్గిన జీవుని అజ్ఞాన మసత్యమయ్యు కారణ మట్లు ప్రతిపన్న మగుచు, సత్యము
ప్రతీయమాన మగుచున్నది. ఆ విచారముతో గూడిన ఈ ఆత్మప్రకృతియందు జగత్తు సత్యమట్లు
స్ఫురించుచున్నది. ఒకింత విచారించి చూచిన, చైతన్య విజగత్తును వినష్ట మొనర్చి పరమ మహత్
రూపమున బ్రకాశింపగలదు.
విచారవాన్విచారో 2పి ఆత్మానమవగచ్ఛతి 1
యదా తదా నిరుల్లేఖం పరమేవావశిష్యతే || 24
విచారపరుడు ఆత్మను గ్రహింప గల్గినచో విచారమునకును, శబ్దమునకును అతీతుడగు
పరబ్రహ్మమున బర్యవసించును.
మనస్యనీహితే శాంతే స్వబుద్ధీంద్రియకర్మభిః
న హి కశ్చిత్ కృతైరర్థోనాకృతైరవ్యభావనాత్ 25 "I 25
ఇట్లు ప్రపంచము బాధితమన, మనస్సు శూన్యమై శాంతించును. అప్పుడు జ్ఞానేంద్రియములు తమతమ
కార్యముల నెరవేర్చుచున్నను కర్మఫల మంటదు; నెరవేర్పక పోయినను భయము లేదు. ఏలయన, ఇట్టి
కార్యములనుండి సంస్కారము జనింపదు.
మనస్యనీహితే శాంతే న ప్రవర్తంత ఏవ తే
కర్మేంద్రియాణి కర్మదావసంచారి యంత్రవత్ ॥ 26
యంత్రమును నడపనిచో నడపనట్లు, మనస్సు యత్నశూన్యమై శాంతించిన కర్మేంద్రియములు
కర్మల నొనర్ప ప్రయత్నింపవు.
మనో యంత్రస్య చలనే కారణం వేదనం విదుః
ప్రణాలి దారు మేషస్య రజ్జరంతర్గతా యథా ॥ 27
కాష్ఠ-యంత్రమున నున్న మేక- బొమ్మలను డీకొల్పవలెనన్న, దాని క్రిందనున్న దారమును లాగవలెను.
అట్లే మనోయంత్రమును గదల్పవలెనన్న విషయ-వాసనలను త్రాడు కావలెను. (విషయ వాసనలు లేనిచో
మనస్సు శాంతించును.)
రూపాలోకమనస్కారపదార్థ వ్యాకులం జగత్
1
విద్యతే వేదనస్యాంతర్వాతాంతః స్పందనం యథా ॥ 28
గాలియందు చలనశక్తి అంతర్నిహితమై యున్నట్లు బాహ్యభోగములకును చింతలకును, ఆకారమగు
జగత్తు విషయవాసనలయందు సంస్కార రూపమున నున్నది.
1

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -19) 317
సర్వాత్మవేదనం శుద్ధం యథోదేతి తదాత్మకమ్ |
భాతి ప్రసృతదిక్కాల బాహ్యాంతా రూపదేహకమ్ ॥ 29
ప్రాణుల కర్మఫల భోగార్థ మిశ్వరునియందు సత్వగుణప్రధాన మగు వాసన ఉదయించును. వెంటనే
ఆ వాసన విశాల దిఙ్మండల రూపమున కాలముగను, బాహ్యాంతర పదార్థముల రూపునను ప్రకాశించును.
దృష్ట్వివ దృశ్యతాభాసం స్వరూపం ధారయన్ స్థితః
1
స్వం యథా యత్ర యద్రూపం ప్రతిభాతి తథైవ తత్ 30
పిదప ఈశ్వరుడే నానావిధములగు మలినోపాధుల సంసర్గమున, దేహాది దృశ్య పదార్థములనే
నిజస్వరూపమని యెంచి, జీవభావమును వహించి యుండును. వస్తున్వరూపము
నిజాభిప్రాయానుసారముగనే ప్రకాశించును.
స సర్వాత్మా యథా యత్ర సముల్లసముపాగతః
తిష్ఠత్యాశు తథా తత్ర తద్రూప ఇవ రాజతే ॥ 31
ఈ సర్వాత్ము డెట నేభావము రాజిల్లుచుండునో, అట నారూపమును దాల్చుచుండును.
సర్వాత్మకతయా ద్రష్టుర్దృశ్యత్వమివ యుజ్యతే
దృశ్యత్వం ద్రష్టసద్భావే దృశ్యతాం పి న వాస్తవీ॥ 32
సర్వదర్శి యగు ఆ పరమాత్మ సర్వ స్వరూపుడగుటవలననా యనునట్లు, దృశ్యము గూడ నగును.
ద్రష్ట యుండిన గదా దృశ్య మగుట? వాస్తవమునకు, దృశ్యత్వము గూడ సత్యము కాదు.
అకారణకమేవాతో బ్రహ్మసిద్ధమిదం స్థితమ్ I
ప్రత్యక్షమేవ నిర్మాతృ తస్యాం శాస్యను మాదయః 33
జన్యవస్తువు మాత్రమే మిథ్య. అందువలన, సత్యస్వరూప మగు బ్రహ్మము కారణ రహితము. ప్రత్యక్ష
తత్త్యము నాలోచించిన ఈ అద్వితీయ బ్రహ్మము సిద్ధించుచున్నది. ఇంక అనుమానాదులు ప్రత్యక్షముయొక్క
ఆంశికభేదములే కనుక, బ్రహ్మమే సర్వప్రమాణ తత్త్యము.
స్వయత్నమాత్రే యదుపాసకో యస్తదైవశబ్దార్థమపాస్య దూరే ॥
శూరేణ సాధో పదముత్తమం తత్ స్వపౌరుషేణైవ హి లభ్యతే .ంతః ॥ 34
స్వీయప్రాక్తన ప్రయత్నము గాక, దైవ మనునది వేరొండు లేదు. ఉపాసకుడు ఇంద్రియాదులను
జయించి, శూరుడని పేర్గాంచి, దైవమును దూరముగ పరిత్యజించి, పౌరుష ప్రభావమున నిజ హృదయముననే
బ్రహ్మసాక్షాత్కారము నందును.
9

318 యోగవాసిష్ఠము
విచారయాచార్యపరంపరాణాం మతేన సత్యేన సితేన తావత్|
యావద్విశుద్ధం స్వయమేవ బుద్ధ్యా హ్యనంతరూపం పరమభ్యుపైషి 35
ఇతి శ్రీవాసిష్ఠ-మహారామాయణే వాల్మీకీయే ముముక్షువ్యవహారప్రకరణే
ప్రమాణనిరూపణం నామ ఏకోనవింశః సర్గః ॥ 19॥
ఓరామా! స్వీయబుద్ధి బలమున అనంత బ్రహ్మమును సాక్షాత్కరింప జేసికొన జాలనంతవఱకు
ఆచార్యుల ప్రమాణసిద్ధ సత్యమతము ననుసరించుచు, తత్త్వవిచారము నొనర్పుము.
ఇది శ్రీ వాసిష్ఠ-తాత్పర్య ప్రకాశికయందు, ముముక్షువ్యవహార ప్రకరణమున ప్రమాణ
నిరూపణమను ఏకోనవింశ సర్గము ॥ 19 ॥
సదాచార నిరూపణము-20
శ్రీవసిష్ఠ ఉవాచ :
ఆర్యసంగమయుక్త్యాదౌ ప్రజ్ఞాం వృద్ధిం నయేద్బలాత్
తతో మహాపురుషతాం మహాపురుషలక్షణైః ॥ 1
శ్రీవసిష్ఠుడు: ముముక్షువు మొమ్మొదట సాధుసంగమ మొనర్చి వారి ఉపదేశములను గ్రహించి, తదనుసార
మాచరింపవలెను. ఇట్లు, గట్టిగ ప్రయత్నించి బుద్ధిని వికసింపజేయునది. పిదప, మహాపురుష లక్షణముల
ననుసరించి, తనయందు మహాపురుషత్వమును సంపాదింపవలెను.
యో యో యేన గుణా నేహ పురుషః ప్రవిరాజతే |
శిష్య తే తం తమేవాశు తస్మాద్బుద్ధిం వివర్ధయేత్ 2
మహాపురుష లక్షణము లన్నియు ఒక్కనియందే లభింపక పోయిన, ఎవనియందేలక్షణ మున్నదో
దానినే గ్రహించి, బుద్ధిని పెంపొంద జేయవలెను.
మహాపురుషతా హ్యేషా శమాది గుణశాలినీ ।
సమ్యగ్జ్ఞానం వినా రామ! సిద్ధిమేతి న కాంచన ॥ 3
రామా! శమాది గుణములతో గూడిన ప్రజ్ఞయే మహాపురుష లక్షణము; సమ్యక్ జ్ఞానము లేకున్న
నిది సిద్దింపదు.
జ్ఞానాచ్ఛమాదయో యాంతి వృద్ధిం సత్పురుషక్రమాః
శ్లాఘనీయాః ఫలేనాంతర్వృష్టేరివ నవాంకురాః

ముముక్షు వ్యవహార ప్రకరణము (సర్గ -20) 319
నూతన-అంకురములు వర్షధారలచే వృద్ధినంది ప్రశస్తములై ఫలముల నొసంగునట్లు, శమదమాదులు
జ్ఞానప్రభావమున వృద్ధినంది, ఆత్మసుఖము నొసగి ప్రశంసనీయము లగుచున్నవి.
శమాదిభ్యో గుణేభ్యశ్చ వర్ధతే జ్ఞానముత్తమమ్ ।
అన్నాత్మకేభ్యో యజ్ఞేభ్యః శాలివృష్టిరివోత్తమా "I 5
అన్నముతో యజ్ఞము నాచరించిన వర్షము కురియును; వర్షము కురిసిన పంటలు పండును. ఇట్లే,
జ్ఞానమువలన శమదమాదులు వృద్ధి నందును; శమదమాదులవలన జ్ఞానము వృద్ధి గాంచును.
గుణాః శమాదయో జ్ఞానాచ్ఛమాదిభ్యస్తథాజ్ఞతా |
పరస్పరం వివర్ధంతే తే అబ్జసరసీ ఇవ 6
పద్మము, సరస్సు- ఇవి పరస్పరము తమ అందమును ఇనుమడింప జేసుకొనునట్లు, జ్ఞానము
శమాదులుగూడ పరస్పర వృద్ధికరము లగుచున్నవి.
జ్ఞానం సత్పురుషాచారా జ్ఞానాత్ సత్పురుషక్రమః |
పరస్పరం గతౌ వృద్ధిం జ్ఞానసత్పురుషక్రమౌ ॥ 7
ఇట్లే, జ్ఞాన, సదాచారములుగూడ పరస్పర వర్ధకములై నెగడుచున్నవి.
శమప్రజ్ఞాదినిపుణ పురుషార్థక్రమేణ చ
అభ్యసేత్ పురుషో ధీమాన్ జ్ఞానసత్పురుషక్రమా॥ 8
శమప్రజ్ఞాదులు నిపుణులగు మహాపురుషుల చరిత్రముల నాదర్శముగ నుంచుకొని, ముముక్షువు
జ్ఞాన సదాచారముల నభ్యసింప నగును.
నా యావత్ సమమభ్యస్తా జ్ఞానసత్పురుషక్రమౌ |
ఏకోఒ పి నైతయోస్తాత! పురుషస్యేహ సిద్ధ్యతి"I 9
వత్సా! జ్ఞాన, సదాచారముల రెంటిని ఒకేమారు అభ్యసింపనియెడల, ఈ రెంటిలో నెద్దియు పట్టువడదు.
యథా కలమరక్షిణ్యా గీత్యా వితతతాలయా |
ఖగోత్సాదేన సహితః గీతానందః ప్రసాధ్యతే "I 10 10
జ్ఞానసత్పురు షేహాభ్యామకర్తా కర్తృరూపిణా |
తథా పుంసా నిరిచ్చేన సమమాసాద్యతే పదమ్ ॥ 11
ధాన్యక్షేత్రమును రక్షించు వనిత చప్పట్లు చరచుచు పాటలు పాడుచు, పక్షులను తరుముచుండును.

320 యోగవాసిష్ఠము
ఇట పక్షులను తరుముట, పాటలను పాడుట అను రెండుపనులు ఒకేతడవ జరుగునట్లు, నిస్పృహుడును,
కర్తృత్వ రహితుడును నగు ముముక్షు పురుషుడు, జ్ఞాన సదాచార అనుష్ఠానమున భ్రమప్రమాదాది విఘ్నముల
నాశన మొనర్చి, పరమ పదము నందును.
సదాచారక్రమః ప్రోక్తో మయైవం రఘునందన!
తథోపదిశ్యతే సమ్యగేవం జ్ఞానక్రమో2ధునా ॥ 12
రఘునందనా! సదాచార క్రమమును నీకు జెప్పితిని. ఇక జ్ఞానక్రమము గూడ సంపూర్ణముగ
నుపదేశింపబడుచున్నది.
ఇదం యశస్యమాయుష్యం పురుషార్థ ఫలప్రదమ్
తద్జ్ఞాదాప్తాచ్చసచ్ఛాస్త్రం శ్రోతవ్యం కిల ధీమతా ॥ 13
ఇది మనోదాయకమును, ఆయుష్కరమును, మోక్షప్రదమును నగు సచ్ఛాస్త్రము. దీనిని శాస్త్రజ్ఞుడును,
ఆప్తుడును నగు వానికడ వివేకి యగు ముముక్షువు విననగును.
శ్రుత్వా త్వం బుద్ధినైర్మల్యాద్బలాద్యాస్యని తత్పదమ్
యథా కతకసంశ్లేషాత్ ప్రసాదం కలుషం పయః ॥ 14
మడ్డినీరు ఇందుప (చిల్ల) గింజవలన తేరుకొనునట్లు (నిర్మల మగునట్లు) దీనిని వినిన వెంటనే నీవు
పరమపద ప్రాప్తి హేతు చిత్తశుద్ధిని బొందెదవు.
విదితవేద్యమిదం హి మనో మునేర్వివశమేవ హి యాతి పరంపదమ్ ।
యదవబుద్ధమఖండితముత్తమమ్ తదవబోధవశాన్న జహాతి హి ॥ 15
ఇత్యార్షే శ్రీవాసిష్ఠ - మహారామాయణే వాల్మీకీయే ముముక్షువ్యవహారప్రకరణే
ప్రమాణ నిరూపణం నామ వింశః సర్గః ॥ 20 ॥
ముముక్షు వ్యవహార ప్రకరణం సంపూర్ణమ్
ఈ సాధనవలన మనన శీలుడగు ముముక్షుని అంతఃకరణము తత్వజ్ఞానము నందును; అప్పుడాతడు
వాంఛింపకున్నను పరమపదమున బ్రవేశించును. ప్రవేశించుటయే కాదు, ఆజ్ఞానమును నశింపజేసి ప్రకాశించిన
ఆ పరము పదమును అంతఃకరణము వీడజాలదు.
ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు ముముక్షు వ్యవహార ప్రకరణమున సదాచార నిరూపణం అను వింశ సర్గము ॥ 20 ॥
ముముక్షు వ్యవహార ప్రకరణము సంపూర్ణము.