వసిష్ఠ రామ సంవాదం
(యోగ వాసిష్ఠమ్)
Egge
రెండవ సంపుటం స్థితి, ఉపశమన ప్రకరణములు
Page:1
శ్రీ వసిష్ఠ - రామ సంవాదము
(శ్రీవాల్మీకి మహర్షి ప్రణీత యోగవాసిష్ఠము)
రెండవ సంపుటం
స్థితి, ఉపశమన ప్రకరణములు
అనుసృజన: వై.హెచ్. రామకృష్ణ
రామ तज्ञोसः प्रचोदयात
మఠం
రామకృష్ణ మఠం దోమలగూడ, హైదరాబాదు - 500029
Page:2
Published by Adhyaksha Ramakrishna Math
Domalguda, Hyderabad - 29
O Ramakrishna Math, Hyderabad All rights reserved
I 1M –08–2010
12025
12028 (Set)
Printed at: RP Printers, Hyderabad.
Bound at Pridhvi Binders, Hyderabad.
Page:3
ప్రవేశిక
మొదటి సంపుటంలో వైరాగ్య-ముముక్షు ఉత్పత్తి ప్రకరణాలను అధ్యయనం చేశాము. ప్రపంచం అనిత్యం, అసుఖం అంటే మనకు అర్థం అవుతుంది. దృశ్య జగత్తు మూడు కాలాలలోనూ లేనే లేదు; ఉన్నదంతా ఒకే పరబ్రహ్మ చైతన్యం అంటే మనకు అంత తొందరగా అర్థమవదు. మనం అనాదిగా ఈ జగత్తు నిజమని భావిస్తూ వివిధ కర్మలనొనరిస్తూ, ఆ కర్మఫలాలను అనుభవిస్తూ వస్తున్నాము. కర్మాచరణం వలన ఏర్పడే సంస్కారాలు, మరల మరల ఆ కర్మల నొనరించే దిశగా మనల్ని ప్రేరేపిస్తుంటాయి. ఈ వాసనలు మనచే శరీరాలను ధరింపచేస్తూనే ఉన్నాయి. వాసనామయ మనోదేహాలే తన నిజస్వరూపం అన్న మిథ్యావగాహనతో సంసార యాత్రలో అనేక మజిలీలు చేస్తున్న జీవుడు ఎప్పటికో గమ్యం చేరుకుంటాడు. అజ్ఞానజనిత దృశ్య ప్రపంచంతో పూర్తిగా తాదాత్మ్యం చెంది ఉన్న జీవుడికి తాను అనుభవిస్తున్న జగత్తు మిథ్య అని వెంటనే బోధించటం వలన ప్రయోజనం ఉండదు. అందుకని వసిష్ఠ గురువరేణ్యులు ప్రపంచానికి జ్ఞానం గరపే నిమిత్తం దశరథాత్మజుడి మూలకంగా చేసిన బోధ ఐన ఈ కావ్యంలో ముందుగా వైరాగ్య భావనను ఉద్దీపింపచేయటానికి ప్రయత్నించారు; రామచంద్రుడికి కలిగిన వైరాగ్యాన్ని ప్రశంసిస్తూ, ఆ భావనే స్వస్వరూపాన్ని గ్రహించటానికి ప్రథమ సోపానం అని తెలియజేశారు. ప్రపంచం అనిత్యం, అశాశ్వతం, అపరిపూర్ణం, దుఃఖమయం కనుక విజ్ఞుడైనవాడు వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
తరువాతి ప్రకరణమైన ముముక్షు ప్రకరణంలో కేవలం పురుషప్రయత్నం ద్వారానే సాధకుడు జన్మ మృత్యు సంసార చక్రంనుంచి బయటపడగలడని, అంతకు మించి మార్గంలేదని నొక్కి వక్కాణిం చారు. వివిధ దృష్టాంతాలతో, ఇతఃపూర్వం ఎవరెవరు అలా పురుష ప్రయత్నంతో జగదవిద్యా వల నుంచి తప్పించుకున్నారో వారి జీవితగాథల ద్వారా జిజ్ఞాసువును తీవ్ర ప్రయత్నిన్ముఖుడిగా చేశారు.
ఇక మూడవదైన ఉత్పత్తి ప్రకరణంలో దృశ్య ప్రపంచం యావత్తూ మనోకల్పితమని, మనస్సుకు ఆవలగా జగత్తులేదని నిరూపించటానికి ప్రయత్నించారు. ఈ జగద్భావనను పునః పునః ధ్యానించటం వలన అసత్తు ఐన దృశ్యం, అవిద్య వలన రజ్జువులో సర్పాన్ని దర్శించే తీరున, సత్తుగా కనబడుతుందని బోధించారు.
ఈ రెండవ సంపుటంలో నాల్గవదైన స్థితి ప్రకరణము, ఐదవదైన ఉపశమన ప్రకరణములను అధ్యయనం చేయబోతున్నాం.
స్థితి ప్రకరణంలో అజ్ఞానం, భ్రాంతి గురించి ఎక్కువగా చెప్పకుండా సృష్టి అనేది నిజానికి ఏదీ లేదనీ, అది కేవలం ఒక పదం, ఒక శబ్దం మాత్రమేనని తెలుపుతూ దృశ్యం ఇంద్రధనుస్సు లాగా శూన్యంపై వేసిన చిత్రం అని సాధకుడి మనస్సు నుంచి దృశ్య భావనను ఉన్మూలించటానికి
Page:4
ప్రయత్నించారు. పగటి కలలాగా, జగదనుభవం కూడా ఒక కలే అని ఇంద్రియగోచర దృశ్య అవాస్తవికతను చాటుతూ, అహంకార జనిత మనస్సుకు సంబంధించిన ఎరుక వలననే ఈ అనుభవం కలుగుతుందని అంతకు మించి ఈ జగత్తుకు ఉనికి లేదని చాటారు.
ఐదవదైన ఉపశమన ప్రకరణంలో మనో మాలిన్యాలైన రజో తమస్సులను తొలగించుకొని, సత్త్వం వృద్ధి చెంది, ద్రష్ట దర్శన దృశ్య భేదం తొలగి కేవాలానంద స్వరూపమైన చిన్మాత్ర చైతన్యాన్ని అనుభూత మొనర్చుకోవచ్చని వసిష్ఠ మహర్షి వచిస్తారు. విచారణ ద్వారా అవిద్యాజనిత దృశ్యానుభూతిని తొలగించుకొని మనోరాహిత్యాన్ని పొందవచ్చునని ఈ ప్రకరణంలో తెలియజేస్తారు. శాస్త్రాధ్యయనం, సత్సాంగత్యం, సద్గురువును ఆశ్రయించటం ద్వారా మోక్షం కరతలామలకం అవుతుందని బోధ. దేహ భావన వలన ఆత్మ మలినమవదు. మనస్సు స్వభావాన్ని అర్థంచేసుకొని కోరికలను, సంకల్పాలను త్యజించినవారు ఉన్నత భూమికలను చేరుకుంటారు.
‘ద్వంద్వ భావనను వదిలి ఆత్మోపస్థితులవండి’ అని సర్వులను ఉద్దేశించి ఎలుగెత్తి చాటుతుంది ఈ ప్రకరణం.
Page:5
విషయ సూచిక
IV. స్థితి ప్రకరణం 1
1.ఈ జగత్తు ఏర్పడి ఉన్నదెక్కడ?…3; 2. అసంభవం … కాని ప్రత్యక్షం!… 8; 3. జగత్తు - వివిధ నిర్వచనములు… 10; 4.బీజము - అంకురము-బ్రహ్మము-జగత్తు… 12; 5. ఈ జగత్తుకు కర్త ఎవరు?…17; 6.స్మరణ-విస్మరణ… 19; 7.స్మృతి…23; 8. ఆత్మదృష్టి సృష్టిదృష్టి…26; 9. మనస్సే ఇదంతా !…27
II. భృగు = యమ సంవాదము 31
1.శుక్రుడు - ఇంద్ర సభాప్రవేశము… 31; 2. భావావేశము - జన్మపరంపరలు…34; 3.భౌతికం - కల్పితం…37; 4. స్వయంకృతం…38; 5. స్వీయ - మనోరథ మార్గం…44; 6.సంసార ప్రవృత్తి చమత్కారం…45; 7. ఈ జగత్తు బ్రహ్మమే… 51; 8. సంసారోత్పత్తి విస్తారము…56; తొమ్మిదవ రోజు 9. గడిచిన జన్మల స్మరణ…60; 10.జ్ఞానులు దేహములు…65; 11.శుక్రుని పునరుజ్జీవనము… 69
III. భృగు - యమ సంవాదము తదనంతర చర్చ 73
1.చిత్తము - ప్రాప్తాప్రాప్తములు…73; 2. సత్యవస్తు విచారణ… 75; 3. సంస్కారములు అనుభవములు… 77; 4. పరస్పరం…80; 5.జీవుడు - ఖండత్వము, అఖండత్వము…81; 6. శరీరము - జీవుడు - దృశ్యము - బ్రహ్మము… 83; 7. బ్రహ్మము - జగత్తు రూపంగా ప్రాప్తించటం…86; 8. చిత్తము - జగత్తులు… 91; 9. శుద్ధ చైతన్యము - ప్రాపంచిక
క్లేశములు…97; 10. జాగ్రత్ - స్వప్న - సుషుప్తి తురీయములు- …98; 11. మనస్సు
యొక్క రూపము…104; 12. విజ్ఞానవాదము… 106; 13. ఆత్మబోధ ఎట్టి వారికి?…113;
14.సాక్షి చైతన్యము - జగద్వ్యవహారము… 116; 15. జ్ఞానుల అజ్ఞానుల
అనుభవాలు…120; 16. శరీరము - నగరము - శరీరి రాజు…124; 17. మనోనిగ్రహం - ఇంద్రియ నిగ్రహం… 128; 18. ఉపేక్ష పనికి రాదు…130
IV. దామ = వ్యాళ = కటన్యాయం 134
1.శంబరాసుర సృష్టి… 134; 2. మమకారావిష్కరణ…137; 3. పునః యుద్ధం…142; 4.‘అహమ్’కారము దేనికి సంబంధించినది?…144; 5. సదాచారము ప్రయోజనము 151; 6.శ్రద్ధ - ప్రయత్నములు… 153; 7. దృశ్యము యొక్క అత్యంత - అభావము… 156; 8. అహంకారము యొక్క రూపము… 157; 9. అహంకారము నివారణోపాయం… 160; 10.త్రివిధ అహంకారములు… 161; 11.భీమ - భాస - దృఢ న్యాయం… 164; 12.వాసనా రాహిత్యము… 166
Page:6
V. దామవ్యాళకటోపాఖ్యానం : విషయ విచారణ (మనస్సు) 169
1.మనస్సు – ఉపశమనము… 169; 2. మనస్సు యొక్క రూప విశ్లేషణము…174; 3.‘చిత్’ ఆదిత్యుడు - స్వరూప స్వభావములు… 176; 4. విముక్తి… 180; 5. అనాసక్తబుద్ధి… 182; 6.మోక్షసన్న్యాసం… 188; 7. నిత్యము నందు అనిత్యం…189; 8. ఆత్మయొక్క ఔన్నత్యం …193; 9. ఇదంతా కూడా బ్రహ్మమే… 196; 10. అవిద్య - ఆత్మజ్ఞానానుభవం… 202; 11.క్షేత్రము - క్షేత్రజ్ఞుడు… 208; 12. వివిధ జీవోత్పత్తులు… 215; 13. పునఃశరీర ప్రాప్తులు పుర్యష్టకము… 219; 14. జగత్తులు - దేశకాలములు…224
VI. దాశూరోపాఖ్యానము(ప్రారంభ విచారణ) పదవ రోజు 230
1.జీవన్ముక్తుడు - స్థితి, గుణములు, గతులు…230; 2. బ్రహ్మాండముల చమత్కారం… 233; 3. జ్ఞాని ఇదంతా ఎట్లా చూస్తున్నాడు?…236; 4.ఈ ప్రపంచము ఎక్కడి నుండి వచ్చింది?… 239; 5. ప్రాప్తించేదంతా ఇతఃపూర్వపు అభాసానుగతమే!…242
VII. దాశూర కథనం 244
1.దాశూరుడు - చిత్త సువిశాలత్వం… 244; 2. వనదేవత - పుత్రాభిలాష…248; 3.భోత్తుడు - మూడు శరీరాలు…250; 4. సంసార సాగరము - వికల్ప వ్యవహారము… 253; 5.సంకల్పరాహిత్యం-ఆత్మాశ్రయం… 255; 6. సంకల్ప విచికిత్స… 259; 7. ఆరోపితం… 263; 8. ఉన్నది ఎల్లప్పుడూ ఉంటోంది - లేనిది ఏనాడు లేదు… 265; 9. ప్రయత్నించినవాడే గ్రహిస్తున్నాడు…265; 10. దాశూరాఖ్యాయిక: విజ్ఞాన సారాంశము… 267
VIII. కచోపాఖ్యానము - - ఉపోద్ఘాత చర్చ 268
1.ఈ సృష్టికి కర్త ఎవరు?… 268; 2. నిరపేక్ష-నిస్సంగము…271; 3.భ్రమచేతనే జగదుత్పత్తి…272; 4. సన్నిధాన మాత్రం… 273; 5. ఆత్మ అన్నివేళల అకర్తయే…274; 6. ఆత్మ సమష్టిరూప కర్తృత్వము… 275; 7.పూర్ణాశయస్వరూపము… 277; 8. తాత్సారం చేయవద్దు… 280; 9. ‘ముక్తుడు’ అంటే?… 281; 10. ఇక్కడ అభిలషింప తగినదేది?…281 IX. కచుని గానం 286
1.కచుని స్వవిచారణ…286; 2. ఆత్మాశ్రయం… 288; 3.బ్రహ్మము : బ్రహ్మదేవుడు -
చైతన్యము : సృష్టి… 289; 4. సృష్టి - ఉపసంహారం… 291; 5. “సృష్టి-జీవుడు" - పరిణామ చమత్కారం… 293; 6. సృష్టికి మూలం ఇచ్ఛయే!… 294; 7. జీవోత్పత్తి - జీవపతనము …295; 8. తత్పదము…297
X. స్థితి ప్రకరణము - విషయ సమీక్ష 298
V. ఉపశమన ప్రకరణం 307
I. ప్రకరణ పరిచయం 309
1.పదవ రోజు రాత్రి… పునశ్చరణ… 309; పదకొండవ రోజు 2. ఎఱుగబడటమే ప్రాప్తించటం
Page:7
…313; 3. ఇప్పటికి లేనిది? ఇంకనూ పొందవలసియున్నది?… 317; 4. కర్మబద్దులు విముక్తులు…322
II. జనకోపాఖ్యానము 325
1.సిద్ధగీతాగానం…325; 2. విచిత్ర ప్రపంచం స్థితిగతులు ముందువెనుకలు… 331; 3.సునిశ్చయం…341; 4. చిత్తమును శాసించటం… 344; 5. భూత భవిష్యత్లను జయించడం వర్తమానంలో ఏర్పడి ఉండడం… 348; 6. మనోవిచారణ… 351; 7. స్వయం విచారణ… 353; 8.మనస్సు-ప్రశాంతత… 356; 9.ప్రమత్తత-పరిభ్రమణం… 357; 10.’జలము’ ఉపమానం - చైతన్యము… 361; 11. అజ్ఞానవశం చేత… 363; 12. ఉపదేశములకు అర్హులు అనర్హులు… 365; 13. మనోనాశనం… 369; 14. తృష్ణ… 372; 15. చికిత్స…374; 16.జీవన్ముక్తుడు…376
III. పుణ్యుడు - పావనుడు సంవాదం పన్నెండవ రోజు 381
1.మహాత్ముల అవగాహన-సంచారం-స్వభావం… 381; 2. నదుఃఖార్హం… 388; 3. సంబంధ బాంధవ్యముల అతీతత్వము… 390; 4. ధ్యేయవాసన చికిత్స… 395
IV. బలి చక్రవర్తి 398
V. ప్రహ్లాద - - నారాయణ సంవాదం 425
1.హిరణ్యకశిప సంహారం…425; 2. నారాయణీకరణం…426; 3. విష్ణు స్తవనం…429; 4. దేవతలలో కలకలం-ఊరట…430; 5. తరుణోపాయం… 432; 6. తత్త్వ విచారణ 435; 7.వర్తమాన-భూత-భవిష్యత్తులను నిషేధించటం : దృశ్యము యొక్క అభావ స్థితి …442; 8.సుఖ విశ్రాంతి… 445; 9. ఇంద్రియాతీతజాగృత్…448; 10. ఆత్మ సూర్యో దయం - అహంకార, మమకార అస్తమయం…450; 11.మనస్సుతో మనోజయం … 452; 12.ఆత్మ స్తవనం…453; 13. నాకు … నేనే నమస్కారం!… 455; 14.ఓ స్వస్వరూపాత్మ దేవా!…457; 15.దానవులు-దీనత్వము…460; 16. సృష్టికే ఎసరు… 461; 17. నారాయణోపన్యాసము …462; 18.దేహము - జీవము జీవుడు…465; 19.ప్రహ్లాద పట్టాభిషేకము … 468;
20.సమీక్ష…470
VI. మనోదర్పణం గాధి వృతాంతం పదమూడవ రోజు 476
1.మాయాదర్శన కుతూహలం… 476; 2. శాస్త్ర విరుద్ధం…480; 3. సుదీర్ఘ మనో పరిభ్రమణం… 483; 4. సుజ్ఞానప్రాప్తి…492; 5. విచారణ యొక్క ఆవశ్యకత…497
Page:8
VII. ఉద్దాలకుని అంతరంగాన్వేషణ 505
1.చిత్తవృత్తులు…505; 2. ప్రయత్నము-సంఘర్షణ… 506; 3.ఓ మనస్సా! ఇక ఆపవయ్యా నీ పరుగులు!… 508; 4. నేనెవడను? ఈ శరీరమునా? ఒక జీవాత్మనా?… 511; 5. నిర్లిప్తుడనుఅప్రమేయుడను-అసంగుడను…515; 6.ఇక శోకం దేనికి?…517; 7.ఈ జీవుడు గమనిం చడేం?…519; 8. శాంతి విశ్రాంతి…522; 9. పరమపదము… 526; 10.స్వస్వరూప చైతన్యముతో ఏకత్వం-ధారణ…528; 11.ప్రశమనం…529; 12. ధ్యానము-విశ్లేషణ …531; 13.చిత్త విచికిత్స…534; 14. అభేద నిర్ణయం… 538
VIII. సురఘు-మాండవ్య-పర్ణాదుల సంవాదం 541
1.సురఘు అంతర్మథనం… 541; 2. ఇంతకీ నే నెవరు?… 546; 3. సురఘు పరిఘ సంవాదము… 551; 4. సమాధి సమాహిత చిత్తము…553; 5. సునిశ్చయం… 555; 6. కేవలీ తత్త్వధ్యానం… 557
IX. భాస – విలాస సంవాదం 562
1.అభిమాన త్యాజ్యం…562; 2. ఏమి క్షేమసమాచారం?… 563; 3. అయితే, ఇప్పుడేంచేయాలి? …566; 4.సంసక్తత-అసంసక్తత… 571; 5. ఆత్మదృష్టి-ఆసక్తిరాహిత్యం… 574;6. ఆత్మారామం …576; 7.ఆత్మ అప్రమేయమైనది… 579; 8. ఆత్మయే అంతా…. అన్నిటా… 583
X. వివేక దృష్టి పదునాల్గవ రోజు 587
1.ఆత్మ - దేహముల సంబంధం… 587; 2.ప్రపంచాతీతులు… 590; 3.ఎవరీ రచయిత? …593; 4. ఆశా రాహిత్యం… 597; 5. జ్ఞాన సందర్శనం 603; 6. సోదాహరణములు …606; 7.పరమ పురుషత్వం…612; 8.జీవన్ముక్తుల పవిత్ర దృష్టి… 614; 9. యోగ మార్గం…618; 10.జ్ఞాన మార్గం…624; 11. దృశ్య - దర్శన సంబంధాతీతత్వం… 627; 12.తత్త్వవేత్త… 632
XI. వీతహవ్యుడు - అంతర్మథన యోగము 634
1.సంబోధన…634; 2. స్వాత్మ - చిత్తముల సంవాదము… 638; 3. వీతహవ్యుడు ఇంద్రియముల సంవాదం… 642; 4. మనోజగత్…647; 5. భౌతిక దేహ పునరాశ్రయం … 652; 6. ఇంద్రియవర్గ నిరాకరణం… 655; 7. నిర్వాణము… 661; 8. విశ్రాంతి…663 XII. ఉపశమన ప్రకరణము - సమీక్ష 665
1.యోగుల దేహ మనముల వైచిత్ర్యం…665; 2. చిత్తోపశమనం…673; 3. శరీర తదాప్యం - నివారణ… 676; 4. అభావన ద్వారా అమనస్కం…678; 5. తెలియబడేదంతా ఉన్నది తెలుసుకుంటున్నవాని యందే!…680; 6. దృశ్య అదర్శనం…683; 7. అజడం జడం… 684; 8. వేరు వేరు ఉపాయాలు… 686; 9. మూడు అభ్యాసాలు ఒకేసారి!…689; 10.యుక్తి - ఉపాయం… 691; 11.జ్ఞానవానేవ బలవాన్…695
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
వసిష్ఠ - రామ సంవాదము IV. స్థితి ప్రకరణం
స్థితి ప్రకరణం
I. జగత్ స్థితి
శ్రీరాముడు: తండ్రీ! ఈ జీవుని యొక్క వాస్తవ స్వరూపము అనంతగుణ గంభీరమగు చిదాకాశమేనని అనుకున్నాముకదా! మరి ఈ జన్మ-కర్మ-బంధ-మోక్ష పరంపరల చమత్కారం అంతా ఏమిటి? ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి?
శ్రీవసిష్ఠ మహర్షి: మహా ప్రభావవంతమైనట్టి చిదాకాశము ఒక సమయంలో రజోగుణముచే కప్పబడిన దవుతోంది. ఆకాశము మేఘావృతము అవుతూ ఉంటుంది చూచావా? ఇది కూడా అట్టిదే. అట్లు రజోగుణముచే కప్పబడినప్పుడు అహంకారము అనబడే పరిమిత త్వమును, లేక ఆచ్ఛాదనను పొందుతోంది. మేఘములు కారణంగా ఆకాశము ఇంత మాత్రమే… అది పరిమిత మైనదే… అని బాలుడు అనుకుంటాడు చూశావా! బాలునితో సమానమైన ఈ జీవుడు నేను పరిమితుడను అను భావన పొందుచున్నాడు. ఆకాశము తన అనంతత్వమును త్యజించ కుండానే పరిమితత్వము పొందినదానివలె అగుపిస్తున్నట్లు, చిదాకాశము కూడా తన యొక్క ప్రకాశ రూపమును, అఖండత్వమును త్యజించకుండానే అహంకార-ప్రాణ-ఇంద్రియాలను అనుభవిస్తూ, తనపై తానే పరిమితత్వమును ఆపాదించుకుంటోంది!
మృగతృష్ణ అసత్తే. కానీ అందులో జలము కనిపిస్తున్నది కదా!
భ్రాంతి (Illusion) రూపముగా గల వాసనచే చిదాకాశము తన చిద్రూపము నుండి భావనా మాత్రంగా విడివడుచున్నది. ఒక వైపు ఈ పతనము ఇట్లు ఉండగా, మరొకవైపు విజ్ఞులైనవారు ఉత్తమ బుద్ధిని సంపాదిస్తున్నారు. ఇట్టి నిర్మల-సునిశిత బుద్ధి యొక్క ప్రభావం చేత ప్రత్యగాత్మ వైపుకు అభిముఖమగు అవగాహన సముపార్జించుచున్నారు. జీవో బ్రహ్మేతి నాపరః ( ఈ జీవుడు బ్రహ్మమే కాని, మరింకేమీ కాదు), సర్వం ఖల్విదం బ్రహ్మ (ఇదంతా ఇప్పటికీ, ఎప్పటికీ బ్రహ్మమే అయి ఉన్నది), అహం బ్రహ్మాస్మి (నేను బ్రహ్మమే అయి ఉన్నాను). తత్త్వమసి (నీవు బ్రహ్మమే అయి ఉన్నావు) సో హం (నేను ఆ బ్రహ్మమే) ఇత్యాది మహావాక్య రూపమగు వేదాంత శాస్త్ర జ్ఞానముచే, ఈ దృశ్యము అసత్తు అని ఎరుగుచున్నారు. ఇట్టి దృశ్యమును తమయందు రహితం చేసివేస్తున్నారు. తద్వారా సంసార సాగరమును దాటి వేసి నిర్వాణపదమును పొందుచున్నారు. ఈ విధంగా ఈ జీవులు రెండు వేరువేరు మార్గములలో ప్రవృత్తులగుచున్నారు.
ఏది ఏమైనా, వారంతా చిదాకాశమే స్వరూపముగా కలిగి ఉన్నారు కదా! కనుక మనలోని
ప్రతి ఒక్కరియొక్క చిదాకాశత్వమునకు ఏక్షణంలోనూ ఏమాత్రమూ హాని కలుగుట లేదు.
Page:4
ఓ రామచంద్రా! ఒక విషయం నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాను. మోక్షమునకు దారి చూపగల అట్టి వేదాంత శాస్త్రమే సత్యము, సుఖప్రదము, అనుసరణీయము కూడా! అందుకు వేరైనట్టి శుష్క మైన తర్కములన్నీ దుఃఖ-భయ-అసత్యమయములే అయి ఉన్నాయి. అట్టివన్నీ అనేక విధములైన వికారములకు కారణమగుచున్నాయి.
తర్కము, ఆత్మానుభవము - కేవలం తర్కశాస్త్రమును ఆశ్రయించదలిచేవారు పరమపురుషార్థ రూపమగు ’ఆత్మలాభము’ను పొందలేకపోవచ్చునని మా అభిప్రాయం. అట్లు కాకుండా, స్వానుభవము జోడిస్తూ, శ్రుతులచే ప్రసిద్ధముగా ప్రకటించబడుచున్న దానిని అనుసరించుచూ, ఉత్తమగతిని పొందుటకు సిద్ధపడేవానికి వినాశనము చేకూరు ప్రసక్తి ఉండదు. “ఇది ఒక గొప్ప సిద్ధాంతము - దీనిని విజయవంతముగా ప్రతిపాదించుట మాత్రమే మా లక్ష్యం. ఇంత మాత్రమే సత్యము ఇంకేమీ వినము విననీయము” అనునది సంకుచితత్వమునకే – దారి తీస్తోంది. సత్యము సర్వదా నిర్దుష్టము, అనుభవమాత్రమే అయివున్నది. ‘తర్కము’ అనునది అనేక సందర్భములలో ‘పరిమితదృష్టి’ అను జాడ్యముచే బాధింపబడుచూ ఉంటోంది.
ఈ జీవుడు “ఇది నాకు ఉండుగాక… ఇది నేను పొందనుగాక! వీరు నా వారు… వారు తదితరులు… ఈ శరీరమునందే నేను ఉన్నాను… ఈ శరీర శిథిలత్వముచే నేను శిథిలమగు చున్నాను…” అగు రూపముగల లోభ మోహములచే బాధింపబడుచున్నాడు. అట్టి భావనచే దీనత్వమును ఆశ్రయిస్తున్నాడు. మహావాక్యముల అర్థసారమును తిరస్కరిస్తూ తనను తానే దౌర్భాగ్యమునకు సమర్పించుకొనుచున్నాడు. అట్టివారు రక్షించబడేది ఎట్లా? వారు పొందే పురుషార్థము ఏమున్నది?
శ్రీరాముడు: హే సద్గురూ! అట్టి ఈ జీవుని గతి ఏమిటి? ఇతడు అనేక దుఃఖాదులను భరిస్తూ ముల్లోకములందు ప్రయాసతో సంచరిస్తూ ఉండవలసిందేనా?
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామా! నిరుత్సాహపడవలసిన పనేమీలేదయ్యా! ఏ ఉదార చరితుడైతే ఈ ముల్లోకములను ’తృణప్రాయం’గా చూస్తాడో, అట్టి మహాత్మునిచే సమస్త ఆపదలు కూడా - సర్పముచే కుబుసము విడవబడినట్లుగా విడువబడుతాయి. ఎవని అంతఃకరణమునందు సర్వ వేళల సాత్వికత్వం స్ఫురిస్తూ, ఉట్టిపడుతూ ఉంటుందో అట్టివానిని ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా, తమకు ఆధారమైన బ్రహ్మాండములను కాపాడుకుంటున్నట్లు పాలించి రక్షించుకుంటూ
ఉంటారు.
సన్మార్గము, అసన్మార్గము - ఓ ప్రియ రాఘవా! ఎట్టి ఘోరవిపత్తు నందు కూడా … అసన్మార్గము నందు ప్రవేశించకుండుటయే ఉత్తమము సుమా! అసన్మార్గము అవలంబించుట చేతనే రాహువు అమృతపానం చేసి కూడా ‘కురూపము - మృత్యువు’ - ఈ రెండింటినీ మరల మరల పొందుచున్నాడు.
స్థితి ప్రకరణం
ఓ జనులారా! మీరంతా సద్వస్తువును ప్రతిపాదిస్తున్న శాస్త్రములను అభ్యసించండి. సాధువులగు వారిని సేవించండి. ప్రేమ - సాత్విక - నిరహంకారములను ఆశ్రయించండి. మీకు తప్పక శుభము కలుగుతుంది. తదితర జీవులపట్ల ప్రేమ ఆప్యాయతలు అభ్యాసపూర్వకంగా ప్రకటించే వారియందు జగత్సంహారకారకుడు, ఉగ్రస్వరూపుడు అగు ఆ శివభగవానుడు ఆత్మ వస్తువును ప్రకాశింపజేస్తాడు.
సదాచారం (Good Conduct) సదాచారవంతులు మాత్రమే ఆత్మ సాక్షాత్కారమును ప్రకాశింపజేసుకో గలుగుచున్నారు. సచ్ఛాస్త్రములను, సాధువులను సేవించువారు మరల ఇంకెన్నటికీ మోహాంధకారమున చిక్కుకోరు. అట్టివారికి అవశములైనవి కూడా వశము అవుతూ ఉంటాయి. సమస్తమైన ఆపదలు తమంతట తామే శమిస్తాయి. ‘శమము-దమము’ మొదలైన ఉత్తమ గుణములను ఆశ్రయించే సత్పురుషులకు నాశరహితమైనట్టి ‘పరమోత్తమశ్రేయస్సు’ లభిస్తోంది. శమదమాదులే ఉత్తరోత్తర ప్రయోజనకరములౌతాయని మీరంతా నమ్మకం కలిగి ఉండండి. ఆధ్యాత్మ శాస్త్రములను వినుటయందును, సత్యమునందును మిక్కిలి ప్రీతి కలిగి ఉండండి. ఉత్తమ ఆశయమును, ప్రయత్నమును కలిగియున్నవారే ‘మనుష్యులు’ అని అనిపించు కుంటారు. ఇక తక్కినవారి గురించి నన్ను అడుగవద్దు. వారు పశుతుల్యులే.
ఎవరి ‘ప్రవర్తన’ అయితే ఇతర జీవుల హృదయసరోవరములను ఆహ్లాదపరుస్తూ ఉంటుందో అట్టి క్షీరసముద్రము వంటి పవిత్రమూర్తులందు సాక్షాత్తూ శ్రీమన్నారాయణమూర్తియే నివసిస్తూ ఉంటారు. వారు మాత్రమే చూడవలసినది చూడటం, పొందవలసినది పొందటం జరుగుతోంది.
ఓ జనులారా! ఈ ప్రాపంచిక విషయభోగములు మీ నుండి ఆత్మతత్త్వమును దూరంగా ఉంచుచున్నాయి. భవిష్యత్తులో అనేక దుర్భరమైన జన్మపరంపరలకు కారణం అగుచున్నాయి. “విషయముల పట్ల, పేరు ప్రతిష్ఠలు మొదలైనవాటిపట్ల ఆసక్తి యుక్తం కాదు. ఉచితం కాదు. పైగా, దుఃఖప్రదము" - అని మీరు దామ - - వ్యాళ - కటుల జీవితల చరిత్రలను చూచి ఈ “స్థితి” ప్రకరణములో గ్రహిస్తారు.
కాబట్టి మీ అధికారమును అనుసరించి శాస్త్రానుకూలంగా ప్రవర్తించండి.
ఆచార్యులచే మీ క్షేమము కోరి నియమించబడిన సదాచారములను జ్ఞానపూర్వకముగా, రాగద్వేషరహితులై శ్రద్ధతో ఆశ్రయించండి. ఏ భూమికయందు ఎంతకాలం ‘స్థితి’ కలిగి ఉండాలో, ఆ భూమికను అంతకాలం అభ్యసిస్తూ ఉండండి. క్రమంగా మీ అంతఃకరణము నుండి మిథ్యా భోగాల పట్ల భావన పూర్తిగా తొలగించుకోండి. మీ ఉత్తమగుణాలు, మహాశయాలు, యశో మహిమ స్వర్గపర్యంతము వ్యాపించు గాక! మీ సత్ప్రవర్తనచే సత్పురుషులను సంతోషింపజేయండి.
ప్రయత్నము - నాయనలారా! తుచ్ఛములైన ఈ ప్రాపంచిక భోగములు మృత్యువుతో ‘అంతము’ అయ్యేవే కదా! ఆ తరువాత గతి ఏమిటో చెప్పండి? ఒక ఉపమానం చెపుతాను. పైకి రుచికరంగా కనబడి, అర్ధరాత్రివేళకు భయంకరమైన అజీర్ణమును కలుగజేయగల పదార్థములను
Page:6
ఎవరైనా “ఆహా బాగున్నాయి… బాగున్నాయి” అని అనుకుంటూ తింటుంటే ఏమౌతుంది? అతి త్వరలో "అయ్యో! నేను ఎందుకు తిన్నాను?” అని పశ్చాత్తాపపడవలసి వస్తుంది కదా! ఈ అహంకార - మమకారములు (l & Mine) మీకు కలుగచేయగల శ్రేయస్సు ఏమున్నది చెప్పండి? ఎవని సుందర గుణములైతే వర్తమానము నందు, భవిష్యత్తు నందు శ్రేయస్సు కలుగజేస్తాయో, అట్టివారు ఈ భూమిని తమ ఉనికిచే ఆనందమయం చేస్తున్నారు. వారే జీవించి ఉన్నట్లు. ఇక తక్కినవారో, మృతప్రాయులే. నాయనలారా! మునులమైన మేము లోకశ్రేయస్సు, ఈ జీవుని శ్రేయస్సు కోరి ఈ సత్ప్రవర్తన - - సదాచారము - ఉత్తమప్రయత్నముల గురించిన వాక్యాలు చెప్పు చున్నాము. మీరంతా ఉత్తమమైన శుభప్రయత్నములందే ఉద్యుక్తులు అవండి. తదనుకూలమైన ఉద్యమమునే ఆశ్రయించండి. ఎవరు శాస్త్రానుసారం ఉద్వేగరహితంగా ప్రయత్నశీలుడౌతారో, అట్టివారు మోక్షసిద్ధిని ఎందుకు పొందరు? తప్పక పొందుతారు.
ఏమరుపు - చిరకాలము చేయబడిన ప్రయత్నముచే పరిపాకము పొందిన మనస్సు గల వ్యక్తి యొక్క సిద్ధి, దాని ప్రయోజనములు దృఢతరంగా ఉంటాయి. అందుచేత అవరోధములను, కష్టములను చూచి దిగులు చెందరాదు. పట్టుదలను ద్విగుణీకృతం చేయాలి. ఎట్టి లక్ష్యముల కొరకు పరిశ్రమిస్తున్నామో, అట్టి లక్ష్యములను పరిశుద్ధపరచుకోవాలి. ఓ ప్రియజనులారా! మీరంతా శోకమును, భయమును, క్రోధమును, పారుష్యమును దరిజేరనీయకండి. దైన్య-దుఃఖ ములను ఆశ్రయించి, తద్వారా విలువైన కాలమును వృథా చేసుకోకండి. మూర్ఖత్వము, పరిశీలనా రాహిత్యములను ఆశ్రయించి విషయములను సేవిస్తూ రోజులు గడపటం ఉచితమా? ఫలితంగా ఈ జీవుడు ‘సంసారము’ అను అంధకూపమున పడి వినాశనమే పొందుచున్నాడు కదా! అనేక పదార్థములందు ఆసక్తుడై ఉంటున్న ఈ జీవుడు ‘ఇంద్రియములు’ అనే త్రాళ్ళతో బంధించ బడినవాడై, ‘నేను చచ్చుచున్నాను’ అను అనుభవమును మరల మరల పొందుచున్నాడు. నిష్కారణముగా మృత్యువుకు అనేకసార్లు వశమగుచున్నాడు.
“ఎందుచేత?” అనే ప్రశ్నను మేము పరిశీలించాం.
“అతడు తన యొక్క చిదాకాశ స్వరూపమును ఏమరచుట చేతనే” అని కనుగొన్నాం.
‘సంసారము’ అను నిబిడాంధకారంలో కొట్టుమిట్టాడుతూ, సరిఅయిన మార్గములలో తన ప్రయత్నములను నియమించకపోవటం మానవుడైన వాడికి ఉచితం కాదు. ఈ శరీరముతో తాదాత్మ్యము ‘నా అంతటి వాడు లేడు…..’ వంటి మూర్ఖపు కేకలు అధమాధమ గతికే దారి తీస్తున్నాయని గ్రహింపబడుగాక!
‘వేదాంతము’ను ప్రబోధించు శాస్త్రములు ఆత్మవస్తువు గురించి అనేక విశేషాలు ప్రతిపాది స్తున్నాయి. స్వస్వరూపమును గుర్తు చేస్తున్నాయి. ఈ జీవుని ఘోరములైన ‘మృత్యువు’ మొదలైన భయముల నుండి రక్షిస్తున్నాయి. నాశరహితము, నిత్యము అయినట్టి ‘నిరతిశయానందము”ను ప్రసాదిస్తున్నాయి.
స్థితి ప్రకరణం
“ఈ ప్రాపంచిక జీవితము ఎట్టిది?” అనునది ఒకసారి సునిశిత బుద్ధితో పరిశీలించండి. ఇదంతా వేసవికాలంలో ఉష్ణత్వముచే నీరు ఇంకిపోవుచుండగా, మిక్కిలి దుర్గంధయుక్తమై యున్న బురద నీటిలోని కప్ప యొక్క జీవితము వంటిదే” - అని విజ్ఞులు గ్రహిస్తున్నారు. ఇదంతా పరమ తుచ్ఛమై ప్రవర్తిస్తోంది.
అందుచేతనే “హృదయము నుండి భోగాశను ముందుగా పారద్రోలండి” అని మేము హెచ్చరిస్తున్నాం. అనర్థప్రదములైన భోగముల కొరకు మాత్రమే ఉపయోగపడే ద్రవ్యలేశములను ఎంతో కష్టపడి సంపాదిస్తూ జీవించుటలో ఏమీ ఉత్తమత్వమున్నది? కాబట్టి, మీరు ఏదేది చేస్తున్నారో అదంతా "స్వధర్మము” అను అవగాహనచే ప్రక్షాళన చేసి ఉంచండి. ఓ మా స్వరూపమునకు వేరు కానట్టి సహజీవులారా! శ్రేష్ఠ బుద్ధి కలిగివున్న మీరందరూ మేము ప్రేమచే చెప్పుచున్న ఈ వాక్యములు ఆలకించండి. మోక్షప్రదములగు శాస్త్రములను అవలోకించండి. “ఈ కనబడేదంతా పరమాత్మ యొక్క సంప్రదర్శనమే! నీకునీవే ఇదంతా అయి ఆస్వాదిస్తున్నావు! సర్వతత్వాత్మవు-సర్వతత్వ విదూరకుడవు నీవే!”… అని బోధిస్తున్న తత్త్వశాస్త్రాన్ని అవలోకించండి, పఠించండి, ఆస్వాదించండి.
చైతన్యము, జీవుడు … బింబము, ప్రతిబింబము - ఎట్టి పరిచ్ఛిన్నము లేని చైతన్యమే బింబము. ఆ చైతన్యం అంతఃకరణం నుండి విషయాకారవృత్తులందు ప్రతిబింబించుచున్నది. అట్టి చిదాభాసుడే ఈ జీవుడు. వాస్తవానికి చైతన్యము (లేక) శుద్ధ బ్రహ్మమునకు జన్మ-కర్మ- ఉపాధి-మొదలైన వాటితో ఏమాత్రం సంబంధం లేదు. బింబము - • ప్రతిబింబముల సంబంధమే - ’బ్రహ్మము - జీవుడు’ లకు ఉన్న సంబంధము. అయితే, అంతఃకరణంలో ప్రతిబింబించే చిదాభాస ప్రతిబింబం, దానికి సంబంధించిన ఉపాధులు కూడా మిథ్యారూపాలే అయివున్నాయి. సర్వదా సర్వత్రా అభిన్నమైయున్న బింబము (లేక శుద్ధ చైతన్యపరమాత్మ) మాత్రమే సత్యమైనది.
ఓ సభికులారా! సర్వజనులారా! ఈ విధంగా తత్త్వవిచారణ చేయండి. ఇది మీకు శాంతిని కలుగజేస్తుంది. “నామ రూపములచే ఎదురుగా ప్రాప్తిస్తున్న జగత్తు, అట్టి జగత్తును నిర్విరామంగా పొందుచున్న అహంకారము - - ఈ రెండు కూడా స్వతహాగా ఈ వర్తమాన క్షణంలోనే (ఇప్పటికే) లేవు మరెప్పటికీ ఉండ - అను భావనను ఆశ్రయించి, అభ్యాసం చేయండి. అట్లు భావించుటచే మీరు కోల్పోయేదేమీ ఉండదని మనవి చేస్తున్నాను. అలా కాకుండా 66 ఈ శరీరమే ఉన్నది… మరింకేమీ లేదు"… అనునట్టి బుద్దిని ఆశ్రయించారా, ఈ మనస్సు పశుత్వమును పొందగలదు. దౌర్భాగ్యజనకము, అతి దీనము అయిన ధన-గృహ-స్వజనాదులకు సంబంధించిన సంకుచితదృష్టిని వహించి, తద్వారా ఆత్మవిషయంలో (లేక) మీ యొక్క స్వస్వరూపం విషయంలో గాఢనిద్ర వహించి వర్తమానమును వృథాపరచుకుంటే ఎట్లా? దీర్ఘనిద్ర నుండి లేవండి. మూఢత్వమును త్యజించి మోక్షమార్గమునందు జాగరూకులు కండి. ఒక అల్ప తటాకంలో ముసలి ఎద్దు వలె కునుకులు తీయవద్దు. ‘బద్ధకము’ అను జాడ్యమును ప్రయత్న
Page:8
పూర్వకంగా జయించండి. ఇప్పటికిప్పుడే జరామరణములను అధిగమించిన స్థితిని
ఆక్రమించుటకు సంసిద్ధులు కండి.
ఈ ధన-బంధుజన-వస్తువాహనాదులను చూచి మురిసిపోతున్నారా? లేదు. ఇవన్నీ అనర్థదాయకములుగానే పరిణమిస్తున్నాయి. “ధనాదులు సొంతం చేసుకొనుటచే ఉత్తమోత్తమమైన సంతృప్తి కలుగుతోందా? జీవితలక్ష్యము నెరవేరుతోందా?”… అనే విషయాలు ఇప్పటికే ఎంతో ధనవంతులై ఉన్నవారి మానసిక స్థితి గతులను సత్యదృష్టితో పరిశీలిస్తూ యోచించండి.
భోగములు భవరోగకారకములే అగుచున్నాయి. సంపదలన్నీ విపత్తులనే కలుగజేస్తున్నాయి. వాటిని మీరు ఏ విధంగానూ ఆదరించకున్నారా, అప్పుడు వాటిని మీరు జయించి వేస్తున్నట్లే. అసలు ధనాదులు “మీరు జీవించియుండుట” అను కార్యక్రమమునకు లక్ష్యమై ఉన్నాయా? అందుకొరకే బ్రతుకుచున్నారా? అవి మిమ్ములను నిజంగా రక్షించగలవా? తాను సంపాదించిన ధనాదులను తన మరణానంతరం తన వెంట తీసుకుపోయిన వారినెవ్వరినైనా మీరు చూచారా? బిడ్డలారా! ఇదంతా అవిచారణ చేతనే మిమ్ములను ఈ విధంగా భ్రమింపజేస్తోందని మీకు గుర్తు చేస్తున్నాను.
విచారణ, విశ్లేషణ - కనుక మీరు వెంటనే విచారణపరులు కండి. తదితర జనులకు, ప్రాణులకు అవిరోధముగా వ్యవహరిస్తూ, మీ స్వబుద్ధిని సునిశితం చేసుకునే ప్రయత్నంలో ఉండండి. శాస్త్రములను, శిష్టాచారములను అనుసరించి సత్కర్మలను అనుష్ఠించండి. సత్ఫలములను పొందుటలో సావధానులై ఉండండి.
ఉత్తమ ఆచరణ, పవిత్ర భావన, సునిశిత బుద్ధి - - ఈ మూడు విస్తృత పరచుకుంటున్నవారు ధన్యులు. వారు అతి స్వల్పకాలంలో "ఈ ప్రాపంచిక సౌఖ్యములు కేవలం దుఃఖప్రదములే” అని గ్రహించగలుగుచున్నారు. శాస్త్రరూపంలో ప్రకటించబడిన పెద్దల అనుభవజ్ఞానమును వారు అనుద్వేగపూరితంగా గ్రహిస్తున్నారు. సత్యమేమిటో వారికి తెలిసిపోతోంది.
అట్టివారి యశస్సు, ఆయుష్షు, గుణములు మొదలైనవన్నీ లోకములకు సౌభాగ్యప్రదం అవుచున్నాయి. అట్టి సత్ఫలమే మేము శిష్యుల నుండి కోరుకొను ప్రయోజనమని ప్రకటిస్తున్నాను.
శ్రీ వసిష్ఠ మహర్షి: ఓ రామచంద్రా! మనం ఇప్పటివరకు జగత్తు యొక్క ఉత్పత్తి గురించి విచారించాము కదా! ఇక మనం ’స్థితిప్రకరణం’లో ప్రవేశిస్తున్నాము. ఇది వింటే, అభ్యసిస్తూఉంటే
• తప్పక స్వయముగా మోక్షము చేకూరగలదు. శ్రద్ధగా విను.
ఒక్కసారి క్రితం ప్రకరణంలోకి తొంగిచూచి, ఆపై ముందుకు పోదాము.
స్థితి ప్రకరణం
ఇప్పటివరకు అనేక యుక్తులచే, న్యాయ నిర్ణయంచే “నేను-నీవు మొదలైన ప్రత్యయములతో కూడి ఈ దృశ్య జగత్తు ఆకారరహితము, శూన్యము, భ్రాంతి మాత్రము, అసత్మయము” అని మనం చెప్పుకున్నాం. ఇది నీవు స్పష్టీకరించుకున్నావనే అనుకుంటున్నాను.
కొందరు మహాజ్ఞానులగు పెద్దలు, విలక్షణమైన ఈ జగత్తును చమత్కారంగా కనబడే ఒక చిత్రపటంతో పోలుస్తూ ఉంటారు. అయితే, ఈ ‘జగత్తు’ అనే చిత్ర పటమునకు చిత్రకారుడంటూ ఎవరూ లేరు. అనగా, దీనికి ‘కర్త’ అంటూ ఎవరూ లేరు. హేతువు లేకుండా… కుంచెలురంగులు-చిత్ర కారుడు లేకుండా ఈ ‘జగత్తు’ అనే చిత్రం బ్రహ్మాండంగా భాసిస్తోంది.
శ్రీరాముడు : అదేమిటి స్వామీ! చిత్రకారుడే లేకుండా చిత్రపటం ఉండటమేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును అందుకు స్వప్నమే మనకు దృష్టాంతము. స్వప్నద్రష్టయే తన స్వప్నమును రచించుకొనుచున్నాడు కదా! అట్టి స్వప్నద్రష్ట ఆ స్వప్నంలో విభాగంగా ఉన్నాడా? స్వప్నమునకు ఆవల ఉన్నాడా? స్వప్నం అతని కంటే వేరైనదా? అందులోని వ్యవహారమంతా అతని ఇచ్ఛ యొక్క నిర్ణయమేనా? కాదా? ఏం చెప్పగలం? ఈ జగత్ చిత్రం కూడా - · ద్రష్ట రహితం (అనగా దృశ్యమును చూచువాడు దృశ్యములో ఉండలేదు). నిద్రావర్జితం, అనుభవరూపం అగు ఒక సుదీర్ఘమైన స్వప్నంలాగా ‘ఆకాశంలో’ ఉదయిస్తోంది. “భవిష్యత్తులో ఎప్పటికో ఏర్పడబోవుచున్నట్లున్న నగరంలోని వీథులలో విహారమునకు ఇప్పుడు వెళ్ళటం” అను అనుభవంలాగా చిత్తము నందే ఆవిర్భావం పొందుతోంది. ఒక చమత్కారమైన దృష్టాంతం చెపుతాను. కొన్ని కోతులు ఒక రోజు కొన్ని గురువిందగింజలను తెచ్చి ఒకచోట పోశాయట. ఎందుకో తెలుసా? అందలి ఎరుపును చూచి ”ఇది అగ్నియే. అందుచేత మనం చలికాచుకోవచ్చు" అని భావించి, ఉపశాంతి పొందటానికి! వాటికి ఆ గురువిందగింజలను చూస్తున్నంతసేపు నిజంగానే చలికాచుకుంటున్నట్టి అనుభవం కలుగుతూ ఉన్నదట!
ఆ విధంగానే అసత్తు, అర్థరహితం అయినప్పటికీ, ఈ జగత్తు ‘అర్థసాధకం’ అగుచున్నది. జలంలోని ఆవర్తం “జలం కంటే వేరు” అని అనగలమా? ఈ జగత్తు కూడా బ్రహ్మం కంటే భిన్నం కాదు. కాని, భిన్నంగా తోచుట మాత్రం జరుగుతోంది. ఈ కనబడే ‘జగచ్ఛిత్రం’ సద్రూప మగు పరమాత్మయే అయి, మరొకవైపుగా ఆకాశంలోని నీలత్వం వలె ఉనికిని పొందుతోంది.
రత్నము మధ్యలో కిరణసమూహముల సమన్వయం ఏదో చమత్కారమైన ’దృశ్యం’లాగా కనబడుతుంది. ఈ దృశ్యము కూడా ద్రష్ట యొక్క హృదయములోనే చమత్కారంగా రూపు దిద్దుకుంటోంది.
మృగతృష్ణలోని జలంలాగా, ఇదంతా అసత్యమై ఉండి కూడా సత్యం వలె అనుభవమౌతుంది.
ఒకడు “తనయొక్క దృఢ-దీర్ఘ-తీవ్ర సంకల్పము (Zone of Visualisation) నందు చూచే భవనములు" వలె… ఇదంతా కూడా విస్తారమై ప్రాప్తిస్తోంది. అయితే ఏం? వాస్తవానికి అసద్రూపమే (actually not existant) అయివున్నది.
Page:10
ఒక కవిచే కల్పించబడిన కథలోని పాత్రలు, ప్రదేశములు, సంఘటనలు పాఠకునికి “ఆహా! అయ్యోఁ!” అనురూపంగా ఆశ్చర్య-సంతోష-దుఃఖ-కోపాదులను కలిగిస్తూ ఉంటాయి చూచావా? ఇదంతా కూడా అట్లే కల్పనామాత్ర స్వరూపం కలిగియున్నది.
స్వప్నంలో చూడబడిన పర్వతంలో సారమేమున్నది? లేదు. కానీ, స్వప్నసమయంలో అది దృఢంగానే ప్రాప్తిస్తుంది కదా! ఇదంతా కూడా, అట్లే, భూతాకాశరూపమున వెలుగొందుచున్నది.
మేఘములు ఆకాశమును కప్పివేసి ఆకాశం కనబడకుండా, కేవలం అంతా మేఘమయం గానే ఉంటుంది చూచావా? ఈ జగదృశ్యము కూడా ఆత్మ సత్తను కప్పివేసినదై ఉంటోంది. ఇదంతా అక్షయంగా ప్రాప్తించటానికి కారణం జ్ఞానము యొక్క అభావమే.
స్వప్నములోని సుందరస్త్రీతో ఏర్పడే సమాగమం లాగా ఇక్కడ ఒకరికొకరికి సంబంధ - బాంధవ్యములు, ప్రియ-అప్రియములు, సుఖ-దుఃఖములు ఏర్పడుచున్నాయి. ఇదంతా నిరర్థకమై, వైచిత్రమై, ‘జగత్తు’ అను పేరుతో ఏర్పడి ఉంటోంది.
మనోరాజ్యము యొక్క ‘అనుభూతము’ వలె ఇదంతా అసత్యము, అవస్తువు అయి ఉన్నది. చిత్రంలోని కమలమునకు సువాసన ఉంటుందా? ఈ దృశ్య విషయం కూడా అంతే.
అనుభూతం మనోరాజ్య మివాసత్యమవాస్తవమ్ |
చిత్ర పద్మాకర ఇవ సార సౌంగధ్య వర్జితమ్ ॥
‘కల్పనామయంమాత్రమే’ అయివుండి కూడా ఇదంతా శూన్యమునందు వికశితమై, అనేక విధములైన వర్ణనలతో ఒప్పుచున్నది.
’ఇది మాత్రమే దీని ఆకృతి" అని చెప్పగలిగేదేదీ ఇక్కడెక్కడా లేదు. కనుక ఇదంతా మిథ్యారూపమే.
ఎందుచేత ఈ జగత్తు ప్రాప్తిస్తోంది?
“పరామర్శ” విచారణ లేనంతవరకు మాత్రమే ఈ జగత్తు ఇట్లు అనేక సత్య సంఘటనలు కలిగియున్న దాని వలె ప్రవర్తిస్తూ పోతుంది. ఎప్పుడైతే ‘పరమాత్మ’ గురించి సద్విచారణ చేస్తామో… మరుక్షణం, ఇదంతా శుష్కించి, ‘స్వస్వరూపానుభవము’ నందు లయించిపోతోంది. అత్యంత అసంభవమైనప్పటికీ, ప్రత్యక్షమై తోచుచుండుటయే ఈ జగత్తు యొక్క చమత్కారం!
జలములో ఏర్పడిన బుద్భుదముల (Bubbles) యొక్క ఆకారం కల్పితమైనదే కదా! లేకుంటే జలము బుద్బుదములుగా మార్పు చెందుచున్నదా? లేదు. చివరకు ఇదంతా శూన్యమే అయినప్పటికీ దీర్ఘము - ప్రకాశవంతము అయిన శరీరం కలిగి ఉంటోంది.
శ్రీరాముడు : తండ్రీ ఈ జగత్తులో కొంత మనోహరత్వము కూడా మనకు కనబడుతోంది కదా?
Page:11
శ్రీ వసిష్ఠ మహర్షి : నిజమే. కాని, ‘సుదీర్ఘ దృష్టి, తత్త్వ విచారణ’ లేకపోవుటచేతనే ఇది స్వల్ప సమయములలో ఈ జీవుని దృష్టికి ’మనోహరంగా కనిపించటం జరుగుతోంది. ’మనోహరము’ అని వర్తమానంలో చెప్పబడుచున్న అనేక విషయముల (వ్యవహారముల) పరిణామం అనేక సందర్భములలో ’కటు’ ప్రదం (Soarness), దుఃఖ ప్రదంగానే ఉంటోంది. జనన మరణములతో కూడినదై, జీవులను భ్రమింపజేయుటలో ఈ జగత్తును మించినదేమున్నది? పరిశీలించి, గ్రహించటం జరిగితే మాత్రం, ఈ జగచ్చిత్రంలో ఏమీ లేదు” అనియే తెలియవస్తోంది. ’రంగుల మేళనము’ అయినట్టి చిత్రపటంలో నిజమైన సూర్యుడు, కొండలు, పక్షులు ఉంటాయా? ఉండవు. కానీ, ఉన్నట్లు ఆ చిత్రపటం చూచే కొందరు ప్రేక్షకులు ఆ అనుభూతిని పొందుచున్నారే!
వివిధ శాస్త్రకారులు ఈ జగత్తును రకరకాలుగా నిర్వచించుచున్నారు. సాంఖ్యులు - ఇదంతా కేవలం జడాత్మకం. వేదాంతులు - ఇదంతా అవిద్యారూపమే.
పదార్థవాదులు - ఇదంతా కాలానుగుణంగా పరమాణువుల “కలయిక విడిపోవుట" అను ప్రక్రియచే ఏర్పడుతోంది. కనుక ఇదంతా రూపరహితం. నామరహితం.
కణాదగౌతములు - దీనికి “ఇది” అనబడు నియతి ఏదీ లేదు. ప్రతిదీ ఎప్పటికప్పుడు మరొక రూపాంతరం చెందుతుంది. కనుక ఈ జగత్తు లేదు. పరమాణువులు మాత్రం ఉన్నాయి.
ఇవన్నీ నిజమే కావచ్చు లేదా కాకపోవచ్చు. ఏది ఏమైనా, ఈ ద్రష్ట యొక్క అంతరంగము మాట ఏమిటి? ఈ చూచు, గ్రహించు, అర్థము చేసుకొను ద్రష్ట ఎవరు? ఈ ద్రష్ట యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి? ఎట్టిది?
బాహ్య అభ్యంతర న్యాయం - ఒకడు బాహ్య జగత్తును ఏ అభిప్రాయంతో అవగాహన చేసుకుంటాడో అంతరంగమున తన స్వరూపము గురించి అట్టి అవగాహనయే కలిగి ఉంటాడు. బాహ్య జగత్తు గురించిన న్యాయమే అంతరంగమునకు కూడా వర్తిస్తూ ఉంటుంది. అందుచేత, “నాచే, బాహ్య దృష్టిచే చూడబడుచున్న ఈ తదితర జీవులు భౌతికమాత్ర శరీరులు కాదు”…. అను అవగాహనయే క్రమేపీ స్వస్వరూపము గురించిన ఔన్నత్యమును ధృవీకరించగలదు.
“నేను పంచభూతమయుడను. శరీర పరిమితుడను” అను అనుభవం ఈ జీవునకు ప్రత్యక్షంగా ఉండిఉండవచ్చుగాక! కాని, యదార్థానికి ఇతడు భౌతిక ధర్మరహితుడు. (He is never bound by physical barriers) ఆకారము లేనివాడు. వాని రూపము ఒక నిశాచరుని వలె, చీకట్లో కదులుచున్నట్లు భ్రమచే కనిపించే రూపాల వలె ఆవిర్భవిస్తోంది. ఈ రూపాదులు అవాస్తవములు. ఈ విషయం సమగ్రమైన, సమున్నతమైన అవగాహనచే మాత్రమే అర్థమై, అనుభవమగుచున్నది.
వాస్తవానికి ఈ జీవుడు రూపరహితుడు.
Page:12
శ్రీరాముడు :“ఒక విత్తనములో మహావృక్షము యొక్క స్వభావములన్నీ నిద్రాణంగా దాగి వున్నాయి కదా!* అట్లాగే ’మహాప్రళయం’ - సమయంలో ఈ జగదృశ్యమంతా పరమాత్మయందే ఉండి ఉంటోంది. మరలా సృష్టికాలంలో ఆ పరమాత్మ నుండే ఉత్పన్నమై పరిఢవిల్లుతోంది”… అని మనకు శ్రుతులలోని కొన్ని సూత్ర వాక్యాలు చెప్పుచున్నాయి. అయితే, పరమాత్మ నిరాకారుడని, నిస్సంగుడని, జగద్రహితుడని మీరు ప్రతిపాదించారు. మరి ఈ రెండు అభిప్రాయాలకు, పొంతన ఎట్లా ఏర్పడుతుంది? మహా ప్రళయంలో ఈ జగత్తు ’స్వస్తత’తో కూడినదై తన కారణము నందు లయించి ఉంటోంది. ఇంతలోనే ఎప్పుడో విజృంభించి బహిర్గతమౌతోంది. మరల ఆ కారణము నందే లయించబోవుచున్నది" - అని కొందరి అభిప్రాయమై యున్నది కదా! అట్లు భావించేవారు మీ దృష్టిలో జ్ఞానులా? అజ్ఞానులా? మా అనుమానాలన్నీ తొలగాలనే ఉద్దేశంతో మిమ్ములను ఇట్లు ప్రశ్నిస్తున్నాను. ఈ విషయంలో మీ అభిప్రాయమేమిటో చెప్పప్రార్థన.
శ్రీవసిష్ఠ మహర్షి : విత్తనంలో ‘అంకురించటం’ అనే స్వభావం దాగివున్నట్లు, మహాప్రళయ సమయంలో స్వసత్తతో కూడిన పరమాత్మయందు ఈ జగత్తు దాగి వుంటోంది, అనేది నిర్వధికమైన సత్యం కాదని, మరి అది మధ్యేమార్గంలోని అభిప్రాయమేనని మేము అనుకుంటున్నాం. ఎందుచేతనంటావా? ఇది నీవు గ్రహించటానికి నీకొక యుక్తి చెపుతాను. విను.
ఆత్మయందు ‘జగత్తు’ అనబడేది ఏదైనా అసలు ఉన్నదా?
“ఉత్పత్తికి ముందే కారణము నందు కార్యము ఉండి ఉంటుంది" అని చెప్పువారిని ఒక చిన్న ప్రశ్నవేద్దాం. అట్టి కారణము నందు కార్యము (అనగా, బ్రహ్మము నందు జగత్తు)… ఏ
రూపంలో ఉంటోంది?
సత్త…? “సత్త” రూపంగా ఉంటోందా? (లేక)
సంస్కారం…? నిద్రాణమైయున్న ‘సంస్కారం’ రూపంలో ఉంటోందా?
దృష్టాంతానికి, విత్తులో భవిష్యత్తులో ప్రకటన కాబోయే మహావృక్షం, ఆకులు, కాయలు లాగా! గాలి, నీరు తగలగానే విత్తు మొలకెత్తునట్లుగానే… ఏదైనా పరిస్థితులచేత ఆత్మయందు జగత్తు ప్రకటితమగుచున్నదా? (లేక)
సదేవ సోమ్యే_దమగ్ర అసీత్ : ఈ జగత్తు మొట్టమొదట పరమాత్మ యందే ఉన్నది - వేదవాక్యం
Page:13
ఒక విత్తనం తగిన నేలలోనే, గాలి-నీరు లభిస్తూ ఉన్నప్పుడే మొలకెత్తుచున్నది అట్లా కాకుండా, ఆ విత్తును కఠిన శిలపైననో, లేక, నాటకుండా మరెక్కడో ఉంచితే మొలకెత్తుతుందా? లేదు. మరి, పరమాత్మయందు ఈ జగత్తు ఎట్లా ఉద్భవిస్తోంది? "ఏ సారవంతమైన నేల, నీరు, గాలి” మొదలైన బాహ్యకారణములచే జగత్తు యొక్క ఆవిర్భావం సాధ్యపడుతోంది? ఒకవేళ ఏదో సహకారి కారణములు ఉన్నాయనే అనుకుందాం. ఆ బాహ్య కారణములకు కర్త ఎవరు? పరమాత్మయేనా? మరెవరైనానా?
మరొక ప్రశ్న? ఒక బీజమున ఉండి ఉంటున్న “సత్తా సామాన్యమే” సర్వవస్తువులందు కూడా ఉండి ఉన్నది కదా! మరి ఒక విత్తనమును ఇనుముపై ఉంచినపుడు కూడా మొలవటం జరగాలి కదా? అట్లా మొలుస్తుందా? లేదే! పరమాత్మయందు ఏ అనుకూల స్థలప్రాప్తిచే ఈ జగత్తు ఉద్భవిస్తుంది? ఏ ప్రతికూల స్థలములందు ఇది ఉద్భవించదు?
పరమాత్మ ద్వితీయమా? అద్వితీయమా?
పోనీ… “బీజము వేరు. అంకురసత్త (మొలుచుట అను ధర్మము నిర్వర్తించు తత్త్వము) వేరు. ‘బీజము’ అను దాని యందు ‘అంకురము’ అనబడు వేరొక ధర్మము లేక తత్త్వము లేక ‘స్వభావ-సత్త’ ఉన్నది. ఆ విధంగానే పరమాత్మ వేరు… జగత్తు వేరు. కానీ, ఈ జగత్తు పరమాత్మయందే ఉన్నది…” అని అనవచ్చునా? అప్పుడు బీజము - అంకురముల సంబంధము, -
మరియూ, ఆత్మ - జగత్తుల సంబంధము ఈ రెండూ కూడా వస్త్రము - కుండలవంటి వేరు వేరు వస్తువుల సంబంధము వంటిదే అవుతుంది. “పరమాత్మ యందు జగత్తు వేరుగా ఉన్నది” అని అనదలచుకుంటే, పరమాత్మకు ద్వితీయమైనది కలదనీ, అది అద్వితీయం కాదనీ… నిర్ణయించవలసివస్తుంది…!
శ్రీరాముడు: అట్లా అనలేము కదా! అట్లా అంటే “పరమాత్మకు వేరైనదేదీ లేదు, అద్వితీయుడు. మరియు పరమాత్మ వస్తురహితము” అను ఉభయ వేదములు అభిప్రాయానికి భంగం వస్తుంది. ఆ తరువాత ఇంకా అనేక సమాధానాలు లేని ప్రశ్నలు కూడా ఉదయిస్తాయి.
శ్రీవసిష్ఠుడు: అవును. నీవు అన్నది వాస్తవమే. “విత్తనము కంటే అంకురము వేరైనది, అట్లే జగత్తు వేరు. పరమాత్మ వేరు”… అందామంటే వాటి ఆద్యంతాల కొరకు, ఆవిర్భావ తిరోభావాల కొరకు, ఆ రెండింటికీ సంబంధం కలుగజేయుచున్న మరొకదాని కొరకు వెతకాలి. పైగా, నీవు చెప్పినట్లు… ‘అద్వితీయం’ అను వేదవాక్కు తిరస్కరించబడినట్లే అవుతుంది.
బీజము-అంకురముల న్యాయము; పరమాత్మ-జగత్తుల న్యాయము -
మూడు సిద్ధాంతాలు మన ముందు ఉన్నాయి.
Page:14
ఆత్మయందు జగత్తు…! (అంకురము “బీజసత్త" రూపమున ఉన్నట్లు) జడజగత్తు అజడమగు పరమాత్మ యందు ఉండటం
ఆత్మయే జగత్తు…! (అంకురమే బీజము రూపమున, వృక్షము రూపమున ఉన్నట్లు) పరమాత్మయే జగత్తు రూపమున, అనేకత్వము వహించి ఉండటం.
ఈ మూడింటిలో కొంత లోపం కనబడుతోంది.
“కార్యము ‘స్వసత్త’ రూపమున తన కారణము నందు ఉండి ఉంటుంది” (The effect that is manifesting here was earlier hiding in its cause) అను బోధ వాస్తవం కాదు. "జగత్తు బ్రహ్మం నందు ఒకప్పుడు ఉండి ఇప్పుడు బయల్వెడలుచున్నది” అనేది సరికాదు. “భగవంతుని యందు ఈ జగత్తు కలదు” అనే బోధ విపరీత భావనయే అని అనక తప్పదు. ఇట్టి బోధ చెప్పేవాడిని, వినే వాడిని కూడా మోహంలో ముంచుతుంది.
చూచావా రామా! మరల చెప్పుచున్నాను. “ప్రళయ సమయంలో ఈ జగత్తు సత్స్వరూపమగు పరమాత్మయందు దాగి ఉన్నది. బీజంలో అంకురంలాగా పరమాత్మలో ఈ జగత్తు ఉన్నది"… అనునదంతా అనుచితమేనని మా అభిప్రాయం. అట్టి ఉపమాన దృష్టాంతముల కూడిన పాఠాలను ఆశ్రయిస్తే, అట్టి బుద్ధి భ్రాంతిరూపమునే పొందుతుంది. ఎందుకంటావేమో? బీజం ఇంద్రియాలకు గోచరిస్తుంది. కంటికి కనబడుతోంది. అట్లాగే దానియందలి అంకురము, ఆకులు, పూలు, పళ్ళు, కాయలు కూడా కళ్ళకు కనబడుచున్నాయి. కాని పరమాత్మ విషయమో?
పరమాత్మ మనస్సుకు ఇంద్రియములకు అతీతుడు కదా! మనస్సు లయించినప్పుడు మాత్రమే ‘పరమాత్మ’ యొక్క అనుభవం అవుతుంది. అతి సూక్ష్మము, స్వయం ప్రకాశకము, అసంగము అయిన పరమాత్మ స్థూలము, కార్యకారణ జనితము (something that is bound by cause and effect) అయినట్టి ఈ బ్రహ్మాండములకు, ఇందలి పదార్థములకు బీజమెట్లా అవుతాడు?
అసలు - ఆకాశము కంటే సూక్ష్ముడు (more subtle than even space), వాక్కులన్నిటికీ అతీతుడు, నామరూప రహితుడైన పరమాత్మ యందు “జగత్తు” అనబడే బీజమెట్లా సంభవిస్తుంది? పరమాత్మ సదా ఏకరసమై సత్స్వరూపమై ఉంటాడు కదా! అతడు అతి సూక్ష్ముడు. కాబట్టే స్థూల దృష్టిగల అజ్ఞానులు అనుభవమునకు ’అసత్తుల్యుడు - అగమ్యము” అయి ఉంటున్నాడు.
కొందరు ద్రష్టలు తమయొక్క స్థూల దృష్టి చేతనే, “ఈ జగత్తు ఒకప్పుడు ఒక రూపమున పరమాత్మ యందు కలదు” అని దర్శించటం జరుగుతోంది. బుద్ధి సూక్ష్మత్వము చెందగా, తత్ఫలితంగా ఈ జగత్తు యొక్క భ్రమ తొలగిపోతుంది. భ్రమలను ఆశ్రయించుటచేతనే ఏర్పడి ఉండి ఉంటున్న జగత్తు భ్రమ ’రహితస్థితి’లో స్వతహాగా లేనిదే అగుచున్నది.
పరమాత్మ యందు బీజత్వమెచ్చట? బీజమే లేని చోట అంకురం ఎచ్చట?
ఆకాశము కంటే నిర్మలమై, అజ్ఞానుల దృష్టియందు శూన్యమువంటిదై ఉంటున్నట్టి పరమ పదమున జగత్తుగాని, జగత్-పదార్థములు గాని ఎట్లా ఉంటాయి? పరమాత్మ యందు దృశ్య
Page:15
మానమగు అవయవమే లేదే! ఇక అందులో బ్రహ్మాండము అనబడు వస్తువు ఎక్కడ ఉండ గలదు? ఒకవేళ ఉంటే, అది ఎక్కడి నుండి వచ్చిందో మనకు ఎందుకు లభించుట లేదు? రూపమే లేనట్టి దాని యందు ఏ పదార్థమైనా ఎట్లా వచ్చి చేరుతుంది? ఎక్కడి నుండి వస్తుంది? శూన్యం లోంచి పర్వతాలు వస్తాయా?
ఆకార రహితమగు పరమాత్మ యందు ఏదీ ఉండజాలదు. ఈ ‘జీవుడు’ అనబడేవాడు కూడా సదా-సర్వదా నిరాకారుడేగాని, సాకారుడు కానేకాదు.
శ్రీరామచంద్రుడు : మహర్షీ! ‘బ్రహ్మము-జగత్తు… ఇవి రెండూ భేదరూపమున లేవు. ఏకత్వ రూపముననే ఉన్నాయి’ అని అనవచ్చా?
శ్రీవసిష్ఠ మహర్షి : చిత్స్వరూపమగు పరమాత్మకు, జడరూపమగు జగత్తుకు ఏకత్వమెట్లా ఘటిల్లగలదయ్యా? ఒక మఱివిత్తు ఒక ఆకారము కలిగి ఉన్నది. ‘అందు అంకురము కలదు’ అంటే ఒప్పుకోవచ్చు. అంతేకాని, ‘నిరాకారమగు పరమాత్మయందు విశాలాకారమగు ఈ జగత్తు ఉన్నది’ అనునది అసంగతమే కదా!
‘ప్రళయసమయంలో ఈ జగత్తు ‘స్వసత్త’ రూపమున పరమాత్మయందు ఉన్నది’ అను సిద్ధాంతం కొందరిచే ప్రతిపాదించబడుతోంది. అయితే ఇక్కడ రెండు ప్రశ్నలు1. ఆ విధంగా లౌకిక ప్రమాణములచే నిశ్చయిస్తున్నామా? లేక
ఈ రెండు విధానములను మనం విమర్శించవచ్చు.
లౌకిక ప్రమాణముల దృష్ట్యా - మనం ఈ దృశ్యమును చూస్తున్నాం. దేని సహాయంతో ’బుద్ధి మొదలుగాగల ఈ సమస్త ఇంద్రియ శక్తుల సహాయం చేతనే కదా? ఈ బుద్ధి, ఇంద్రియాలచే, వాటిని అనుసరించి అనుభవమయ్యే పదార్థజాలం ’ఇంద్రియాతీతస్థితి’కి సంబంధించనిదే
అవుతుంది కదా?
"ఈ పదార్థములు ప్రళయంలో లయించిపోయి, మరల ఆ తరువాత ఉద్భవిస్తున్నాయి.” అని ఇంకొక అభిప్రాయం.
బాగానే ఉన్నది. కానీ, అవి బుద్ధి వృత్తులను అనుసరించి ఒకరికి ఒక విధంగా, మరొకరికి మరొక విధంగా (అందంగాను సామాన్యంగాను, ఇష్టంగాను అయిష్టంగాను, ముఖ్యంగాను -స్వల్పంగాను…. ) తోచుచుండవలసిన పనేమున్నది? ‘ప్రత్యక్షము-అనుమానము’ అనబడు ఆయా బుద్ధి వృత్తులచే దర్శనము వేరు వేరుగా ప్రభావితం ఎందుకు అవుతోంది?
ఈ దృశ్యము ఒకప్పుడు కనిపిస్తుంది. మరొకప్పుడు లేకుండా పోతుంది. ఒకప్పుడు ఉండి, మరొకప్పుడు లేకుండా పోయేది వాస్తవమెట్లా అవుతుంది? లౌకిక ప్రమాణములందు సమగ్రమైన అవగాహన ఉన్న కుశలురు ఈ విషయం గ్రహిస్తూనే ఉన్నారు.
Page:16
ఎందుచేతనంటే…
ఏ దృశ్యము జాగ్రత్తులో చూస్తున్నామో, అది స్వప్నసమయంలో ఏర్పడి ఉండుటయే లేదు. స్వప్న సమయంలో మరొక రంగము ఏర్పడి ఉంటోంది.
శ్రుతి వాక్యముల దృష్ట్యా - “ఇది పరమాత్మయందు ఉన్నదై పరిఢవిల్లుతోంది." - అని కదా శ్రుతి యొక్క అభిప్రాయం! (సదేవసౌమ్యే దమగ్ర అసీత్) ను అనుసరించి ’కార్యము కారణమూలకు రెండు వేరైన సత్తలు లేవనియే తెలియవస్తోంది. మా ఉద్దేశ్యం ప్రకారం ఈ వాక్యం … ఏకమేవాద్వితీయం బ్రహ్మ - కేవలం అద్వితీయమగు బ్రహ్మము ఒక్కటే ఉన్నది … అను వాక్యమునకు గల అర్థం అనే లక్ష్యానికి మార్గమధ్యంగా అందించబడిన మధ్యేమార్గవాక్యమే గాని అందుకు వేరైన సిద్ధాంతం మాత్రం కాదు.
కార్య - కారణ సంబంధములు - ఇక్కడ సాంఖ్య సిద్ధాంతములో కనబడే ఒక అభిప్రాయం
గురించి చెపుతాను, విను.
కార్యమే (దృశ్యము) సత్యమా? - - పై వాక్యములను అనుసరించి కార్యమే సత్యమై అట్టి కార్యసత్యమే కారణత్వముగా రూపొందించుచున్నదా? లేక
కారణమే (ద్రష్టయే) సత్యమా? - “కారణమే సత్యమై, ఆ కారణమే కార్యము నందు ఆరోపించబడుచున్నది” అనాలా? లేక
కార్య - కారణములకు ఆవల ఉన్నట్టి పరమాత్మయే సత్యమా? - పరమాత్మయే సత్యమై, అద్దాని సత్తయే కార్య-కారణములందు ఆరోపించబడుచున్నదా?
ఈ మూడు ప్రశ్నలను సాంఖ్య సిద్ధాంతాలు బాగా తర్కించి విచారించాయి. చివరికి ఇలా నిర్ణయింపబడినదికార్యసత్యమే ఒకానొకప్పుడు కారణత్వము పొందుతోంది.
(అనగా బ్రహ్మమే ఒకానొకప్పుడు జగత్తుగా పరిణమిస్తోంది.)
మరల మరొకప్పుడు ఆ కారణత్వమంతా కార్యత్వములోనే లయిస్తోంది. (మరల ఈ జగత్తు మరొకప్పుడు బ్రహ్మమునందే లయిస్తోంది?)
ఇక మా అభిప్రాయం విను- ఆయా ‘బోధ’లలో మాకు కొంత భ్రాంతి కనబడుతోంది. “వాచారంభమ్, వికారో నామధేయమ్” అన్నట్లుగా మట్టివలన కలిగిన “కుండ-గోడ’… ఇవన్నీ కేవలం పేరుకు మాత్రమే వేరు వేరుగా ఉన్నాయి. ‘మట్టిగోడ’ అనునది మట్టికంటే వేరా? మట్టిగోడ అవటం, కుండ అవటం ఎక్కడున్నది? మట్టిలో గోడగా ఏర్పడవలసిన కారణమే ఉండదు కదా! బ్రహ్మమునందు కారణమే మిథ్య. కారణమే మిథ్య అయినప్పుడు కార్యము కూడా మిథ్యయే కదా! బ్రహ్మము నందు జగత్తు ఏర్పడటానికి ఏ సహకారి కారణం లభించుటయే లేదు. కారణమే అసత్యమైన చోట ఇక కార్యము ఉత్పన్నంకాజాలదు.
Page:17
"సత్యమగు కారణము కార్యత్వమును పొందుచుచున్నది బ్రహ్మమే జగత్తుగా
పరిణమిస్తోంది” అనునది ఆత్యంతిక సత్యము కాజాలదు. అందుచేతసద్వస్తువగు పరమాత్మ యందు కార్య కారణములు ఏ క్షణంలో కూడా లేవు. అద్దాని సత్త యందే “కార్య - కారణములు ఆరోపించబడుచున్నాయి. తదనంతరం, జాగ్రత్తుగా భ్రమ యందు వలె దర్శించబడుతోంది.”
ఈ అవగాహనయే జీవుని తన సత్యత్వము వైపు నిత్యత్వము వైపు నడిపిస్తుందని మా అభిప్రాయం. ఆరోపణ బుద్ధి కారణంగా ఆత్మయందు ఈ జగత్తు యొక్క కారణము, జగత్తు అనబడే కార్యము అసమగ్రమైన అవగాహన కలవారికి కనబడుచున్నది.
“ఈ జగత్తు పరమాత్మ నుండి ఆవిర్భవిస్తోంది“ అనే మాట శిష్యులకు బోధించుట కొరకై గురువులచే కల్పించబడిన ఒక మాధ్యే మార్గ విధానంగానో, లేక అసంపూర్ణమైన అవగాహన చేతనో ఏర్పడుచున్నది. అదంతా మిథ్య మాత్రమే…! అందుచేత “ఈ జగత్తు అనబడు ఒకానొకటి ఏర్పడింది” అనే అసత్యత్వపు భావనయే నీ నుండి తొలగించి వేయి. జగద్భావన త్యజించివేయ బడుగాక! అప్పుడు “ఆదిమధ్యాంత రహితము, సత్స్వరూపము” అగు పరమాత్మయే శేషిస్తోంది.
అదియే నీ యొక్క వాస్తవ స్వరూపం. ‘దానికి మించి వేరుగా ఎక్కడా ఏదీ (‘జగత్తు’ అనే పేరుతో) లేనే లేదు’ అని గ్రహించు.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ ప్రియ రామచంద్రా! సర్వదా తెలుసుకొనబడవలసిన వస్తువైయున్న ఆత్మను ఎరుగుటలో శ్రేష్ఠుడవు. ఇప్పుడు “ప్రళయ సమయంలో ఈశ్వరుని యందు ఈశ్వరునికంటే వేరైన జగత్తు ఉన్నదనుట దోషయుక్తము” అని నిరూపించబోవుచున్నాను. విను.
సృష్టి ఉంటే జగత్తు ఉంటుంది. మరి జగత్తే లేకపోతే…? సృష్టి ఉండజాలదు కదా! “ఉత్పత్తి” అనే క్రియ, కర్త ఉంటేనే సాధ్యపడుతుంది.
ఈ జగత్తుకు కర్త ఎవరు? ఒకవేళ “సద్రూపమగు పరబ్రహ్మమే జగత్తుకు కర్త” అని అంటామనుకో… అప్పుడాతను కర్తృత్వ, భోక్తృత్వములు కలవాడౌతాడు. ఈ జగత్తు ఒకప్పుడు ఉండటం, మరొకప్పుడు లేకపోవటం (ఉదా : జాగ్రత్ - సుషుప్తులు) అందరికీ అనుభవమే కదా! జగత్తును సృష్టిస్తున్న కర్తను సృష్టించుచున్న వేరొక ‘మహాకర్త’ ఉండి ఉండాలి.
(ఈ జగత్తును ఎవరో సృష్టించుచున్నాడని అనుకుంటే, ఆ వ్యక్తిని సృష్టించుచున్నదెవరు? అను ప్రశ్న ఉదయిస్తుంది)
Page:18
‘కాని కూటస్థమగు పరబ్రహ్మమునకు కర్త లేడు’ అనునది వేదవచనం. బ్రహ్మము ఉత్పత్తి రహితమైనది. ఉత్పత్తి అనబడు ప్రసక్తియే లేని పరబ్రహ్మమునందు ‘జగత్తు యొక్క సత్త’ మహాప్రళయ సమయంలో (జగత్తు రహితమైన స్థితియందు) ఎట్లు, ఎచ్చట, దాగి ఉండగలదు? కల్పనారహితమైన చిదాకాశము నందు ’కర్త’ను గురించి కల్పన చేయాలనుకుంటే, ఆ కర్తను సృష్టించునట్టి సహకారి కారణము ఏమిటో కూడా మనం గుర్తించగలగాలి.
బ్రహ్మమే కర్తయా? బ్రహ్మము సర్వదా ‘అకర్త’ కదా!
అసలు ఏ సహకారి కారణాలు లేకుండా జగత్తు తనంతట తానే బ్రహ్మము నందు ఉత్పత్తి పొందుచున్నదా? నీరు, గాలి, నేల వంటి సహకారి కారణాలు లేకుండా విత్తనం ఎక్కడన్నా మొలకెత్తుతుందా? ‘గొడ్రాలి రెండవ కూతురు గడుసుది’ అనేది ఎట్లా ఏర్పడగలదు? అట్లు ఎవ్వడూ, ఎక్కడా, ఏదీ గాంచుచుండుట లేదు కదా?
సర్ప రజ్జు భ్రాంతి - కనుక, ‘సహకారి కారణము’ లేకుండా ఎవరికైనా ఏదైనా కనిపిస్తుంటే, అది “త్రాడులో కనబడే పాము వంటిది" అని అనక తప్పదు.
త్రాడు పాముగా కనిపించుటంలో త్రాడు పాత్ర ఉన్నదా? - ఉన్నది.
త్రాడు స్వయముగా పాముగా అగుచున్నదా? - లేదు.
పాముగా కనబడవలెనను ఇచ్చ త్రాడు కలిగియున్నదా? లేదు.
ద్రష్టయే అట్లు త్రాడునందు పామును ఆరోపించుచున్నాడా? - అవును.
ద్రష్ట "పామును చూచెదనుగాక” అను ఇచ్ఛ కలిగియున్నాడా? అట్లని అనలేము. కానీ, అతని సంస్కారములే త్రాడును పాముగా చూచుటకు తెరవెనుక నుండి ప్రోత్సాహక కారణాలు అగుచున్నాయని అనవచ్చు. అయినప్పటికీ, త్రాడే లేకుంటే పాము స్ఫురించేదే కాదు కదా! పాము త్రాడునే ఆశ్రయించుకొనియున్నదా? అవును. కానీ, పాము’ అనబడునది మొదలే లేదుకదా! ఈ ‘పాము’ అనునది ఇతఃపూర్వం త్రాడునందే దాగి వున్నదా? లేని పాము త్రాడులో దాగి ఉండట మేమిటి? ఈ పాము త్రాడు కన్నా వేరా? కాదు. ఇదియే ’సర్పరజ్ఞు భ్రాంతి’.
సృష్ట్యాది యందు ఈ “జగత్తు“ లేక ”సృష్టి” రూపమున బ్రహ్మమే తనయందు స్థితి పొంది ఉంటోంది. ఆ బ్రహ్మం ఇప్పటికీ (సృష్టి సమయంలో కూడా) ఆకారరహితమై, తన స్వస్వరూపం నందే సర్వదా నెలకొనియే ఉంటోంది. అట్టి బ్రహ్మమునందు మరి “ఇది జనించునది. ఇది జనింపజేయునది” - అను భేదమెక్కడిది చెప్పు? అట్టి భావమునకు చోటే లేదు.
అట్లా కాకుండా, ప్రళయము నందు ‘జగత్తు’ అనబడుదాని ఉనికిని అంగీకరించామనుకో… అప్పుడు “బ్రహ్మములో ఉన్నట్టి ‘జగత్ సత్త’, జగత్తుగా పరిణామం చెందటానికి, ఎక్కడి నుండో సహకారి కారణాలు వచ్చి చేరుతున్నాయి” అని అనవలసి ఉంటుంది. (అంటే ”బ్రహ్మమునకు వేరుగా వేరొకచోట ఏదో ఉన్నది. అక్కడి నుండి ఈ సహకారి కారణాలు బయలుదేరుచున్నాయి”
Page:19
అనాలి.) అట్లా అనలేము కదా? బ్రహ్మమునకు బాహ్యమంటూ ఏదీ లేదని ’వేద ద్రష్టల’ యొక్క
అనుభవం కదా!
శ్రీరాముడు : మట్టి కుండ కావడానికి కుమ్మరి చక్రం, కుమ్మరివాడు సహకారి కారణాలు. అట్లాగే బంగారు ఆభరణం కావటానికి కొలిమి, వివిధ ఆకారములతో కూడిన లోహపాత్రలు, కంసాలి సహకారి కారణాలు. ఇక్కడి సహకారి కారణాలు బాహ్యము నుండి వస్తున్నాయి. అయితే, బ్రహ్మము నందు జగత్తు ఉద్భవించటానికి కారణమగుచున్న ఆ సహకారి కారణాలు "బ్రహ్మము నుండే వస్తున్నాయి” అని అనవచ్చు కదా?
శ్రీవసిష్ఠ మహర్షి : అట్లా అయితే… బ్రహ్మము-జగత్ సత్త - - సహకారి కారణాలు … ఇవన్నీ ఒక్క బ్రహ్మమే అయివున్నాయని నిరూపించబడుచున్నట్లే కదా!
బ్రహ్మమే అయివున్న ఈ జగత్తు బ్రహ్మమే కారణంగా బ్రహ్మమునందే స్ఫురించుచు, మరల బ్రహ్మమునందే లీనమగుచున్నది - అను ప్రవచనమునకు అర్హమగుచున్నది.
శ్రీరాముడు : మీరు చెప్పేది వాస్తవమే స్వామి! "ప్రళయములో ప్రకృతితో కూడుకొనిన పరమాత్మ యందు సహకారి కారణసహితమైన ఈ జగత్తు తిరోహితమై (having been withdrawn) నిశ్శబ్ద అప్రకటిత రూపమున ఉంటోంది” అని చెప్పబడేదంతా చిన్న పిల్లలు చెప్పుకొనేదే కాని, బుద్ధి మంతులు అట్లు గాంచరని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను.
శ్రీవసిష్ఠ మహర్షి: చూచావా? రామా? దీనిని బట్టి తేలేదేమిటి? ఈ జగత్తు సత్యమైన రూప మంటూ ఏదీ కలిగియుండలేదు. కలిగియుండుట లేదు. కలిగియుండబోవుట లేదు. శుద్ధమగు చిదాకాశమే భావనామాత్రంచేత శీఘ్రంగా తనయందు ఈ ‘జగత్ అనుభవం’ అను రూపమున వికసించుచున్నది. ఎప్పుడైతే ఈ విధంగా విచారణచే జగత్తు యొక్క అభావమే సిద్ధిస్తోందో అప్పుడిదంతా బ్రహ్మమే అవుతుంది కాని, మరింకేమి కాదు”.
ఈ బ్రహ్మము "తనను తాను” స్మరించుచున్నప్పుడు (పూర్ణముగా ఎరుగుచున్నప్పుడు) బ్రహ్మానుభవమే పొందుతోంది. అప్పుడిక జగత్తు యొక్క అనుభవం ఉండుటలేదు. తనను తాను విస్మరించినప్పుడో, ఈ జగత్తులోని అనేకత్వమును ఆశ్రయించి ఉంటోంది. జగత్సంబంధమైన సంస్కారముల ప్రభావం చేత ఇంద్రియములచే పొందబడుచున్నదే ’జగత్తు’గా చెప్పబడుతోంది. తనను తాను అంతటా దర్శించునట్టి అనుభవమే బ్రహ్మానుభవం సుమా!
మట్టికి రూపం లేదు. కాని కుండకు రూపం ఉన్నది. కుండ మట్టి కంటే వేరైనది కాదు. ‘రూపము పొందుట’ అను చమత్కారం మట్టి యందు సర్వదా ఉండియే ఉన్నది. అదే బ్రహ్మం నందు గల చిచ్ఛక్తి. కుండ పగిలినప్పుడు మట్టి-మట్టియే అగుచున్నది.
Page:20
శ్రీరాముడు : అంటే, ఈ జీవుడు గాఢ నిద్రాపరవశుడు అయినప్పుడో, లేక మరణించినప్పుడో జగత్తు యొక్క రాహిత్యమును అనుభవించుచున్నాడు కదా. కుండపగిలితే మట్టి అగుచున్నట్లు ఈ జీవుడు దేహము తొలగినప్పుడు పరబ్రహ్మమే అగుచున్నాడా?
శ్రీవసిష్ఠ మహర్షి : లేదు. అది సరి కాదు. ఈ జీవుడు గాఢనిద్రాపరవశుడైనప్పుడో, లేక మరణించినప్పుడో ఈ పదార్థ వ్యవహారము అతని నేత్రములకు గోచరించకపోవచ్చు. అంత మాత్రం చేత జగత్ సంస్కారం చిత్తమునందు ‘నివృత్తి’ చెందదు సుమా! ఈ చిత్తము మరల తదుపరి శరీరములను తనయందలి ‘మననత్వము’ అను కారణంచేత పొందుతూ పోతూనే ఉన్నది. సంకల్పవశంచేతనే అదంతా ప్రాప్తించటం జరుగుతోంది. అనగా మరణానంతరం కూడా ఈ జీవుడు పదార్థ పూరితమైన జగత్తును దర్శిస్తూ పోతూనే ఉన్నాడు. ఓ రామా! "ఈ దృశ్యమును పొందుట” అనబడునది శరీరప్రాప్తితోనే ప్రారంభమగుచున్నదని అనుకొంటున్నావా? లేదు. అట్లే శరీరము నశించిన మాత్రం చేత చిత్తము శమించుట లేదు. అసలీ దృశ్యమును ఇట్లు చూస్తున్నది ఎవరు? శరీరమా? చిత్తమా?… చిత్తమే చూస్తూన్నది గాని, శరీరము కాదు సుమా!
‘చిత్తం’ అంటే ఏమిటి?… "కామ్యకర్మలకు సంబంధించిన వాసనల యొక్క బీజమే చిత్తం”. దృశ్య శమనము అంటే అట్టి బీజము (చిత్తం) శమించుట.
అంతేగాని, ‘దృశ్యము శమించుట’ అంటే ‘పదార్థములు తొలగించుట’ - అని కాదు సుమా! పదార్థములు ప్రక్కకు పెట్టినంత మాత్రంచేత ‘దృష్టి - భావన’ తొలగుతాయని అనలేం. పదార్థములు శమిస్తే ఏమియు శమించనట్లే. చిత్తము శమించటమే నిజమైన శమము. జ్ఞానము లేకపోతే చిత్తము శమించదు. చిత్తం శమించకపోతే దృశ్యం ఉండియే తీరుతుంది. కనుక రామా! “దృశ్యం నాకుండకూడదు" అని భావించి, రాజ్యాదులను త్యజించినంతమాత్రంచేత ఏం లాభం? చిత్తములో సంస్కారవృత్తులు ఉన్నంతవరకు దృశ్యానుభవం యథారీతిగా ఉండనే ఉంటుంది.
“మనస్సులో అజ్ఞానము ఉండి ఉన్నది" అని గుర్తించబడాలి. అట్టి మూల అజ్ఞానం సహితంగా మనస్సును సంపూర్ణంగా అధిగమించివేయాలి.
అదే (లేక, అప్పుడే) మోక్షం. అంటే ‘దృశ్య’ మనే అనర్థమును సంక్షయింపజేయటమే మోక్షం. ఒకడు తనలోని అజ్ఞానపూర్వకమైన పదార్థ - - సంస్కారములను ఎదుర్కోకుండా, “ఈ జగత్తు ప్రళయంలో ఏమౌతుంది? ప్రళయానంతరం ఎక్కడి నుండి వస్తుంది?“ అని వాదోపవాదములు ఎన్ని జన్మల వరకు చేసినా మనకు లభించేదేమీ ఉండదు. ఏది స్వతహాగా లేదో “అది లేదు” అను జ్ఞానమే ముక్తికి సాధనము గాని, “ఉన్నట్లు ఎంత కాలం ఉంటుంది? నిద్రాణంగా మరెంత కాల ముంటుంది?” అని నిరుపయోగంగా కాలం వృథా చేసుకోవద్దని సత్యాన్వేషకులందరికి మా మనవి. ”పదార్థములు ఉండవచ్చు, లేకుండవచ్చు. ఈ రెండింటియందు అభేదమే సర్వదా సత్యం. కాబట్టి నా చిత్తం నుండి ’పదార్థములను స్మరించటం’ తొలగించి, బ్రహ్మమును స్మరించటంతో నింపివేస్తాను” అని లక్ష్యము కలిగియుండి, ఆ తరువాత ఏది ఎట్లు ఉచితమో అట్లే ఆచరించు.
Page:21
‘అజ్ఞానము’ అనబడు జాడ్యమునకు “ఆత్మ సాక్షాత్కారము” అనునదే ఔషధం. ఆత్మ సాక్షాత్కారముచే “చిదాకాశము” అనబడు రూపముగల ప్రబోధం కలుగుతుంది. అనగా, “ఈ జగత్తంతా చిన్మాత్రమగు బ్రహ్మమే అయి ఉన్నది. చిన్మయ రూపము కానిదంటూ లేశం కూడా ఎక్కడా లేదు” - అను జ్ఞానం పరిపక్వత పొందుతుంది. ”ఇతని పేరు ఇది, వీరు నా వారు, ఇవి నావి, నేను పుట్టాను, చచ్చాను”… అను భ్రమలు హృదయాంత రంగములలో ఉండజాలవు.
ఒక గోడపై చిత్రించబడిన చిత్రము వాస్తవమా? అందులో కనబడే పులి, మనుష్యులు మొదలైనవి బాలునకు భావావేశం కలిగించవచ్చునేమో! గోడపై చిత్రించబడిన కథా చిత్రంలోని సంఘటనను చూచి దుఃఖించటం అజ్ఞులు వ్యవహారమేకదా! గోడపై చిత్రముతో ‘తాదాత్మ్యము’ తొలగితే ’గోడ’ యొక్క అనుభవము మాత్రమే సిద్ధించునట్లు, ఆత్మజ్ఞానానుభవం సముపార్జించు వారికి ఈ జగత్తు అంతా కూడా “తనయొక్క మరొక స్వరూపం” గానూ, “స్వకీయమైన దర్శన చమత్కారం” గానూ గోచరించటం జరుగుతోంది.
చిత్రకథా న్యాయము -
గోడపై చిత్రించబడిన ఒక కథా దృశ్యం.
గోడ
ఆ గోడనూ, ఆ రంగుల కథా దృశ్యములను చూస్తున్నవాడు
ఈ మూడింటి సంబంధమునే ‘చిత్రకథాన్యాయం’ అని అంటూ ఉంటాము. ఈ కనబడే పర్వతాలు, భూములు, వర్షాలు, కాలము, జన్మ, మరణములు మొదలైనవన్నీ చిత్రకథా న్యాయమును అనుసరించే ఉన్నాయి. అట్లే కల్ప-మహాకల్పములు, ఈ సృష్టి, వేదావాజ్ఞయములో చెప్పబడిన "సృష్ట్యాది (సృష్టి యొక్క ఆరంభము)” మొదలైనవన్నీ కూడా సుమా! అంతే కాదు. ఈ ఆకాశాదుల సృష్టి క్రమము, కోట్ల కొలది బ్రహ్మాండములు, భూత - భవిష్యత్ - వర్తమానములోని సంబంధ బాంధవ్యములు, దేవతలు మనుష్యులు, చతుర్దశ భువనములు, సప్తద్వీపములు ఇవన్నీ చిత్రకథాన్యాయమును అనుసరించే ఉన్నాయి. ఇవన్నీ అల్పదృష్టికి వాస్తవముగానూ, ఉపాధి పరంపరల దృష్ట్యా స్వప్నతుల్యంగానూ, ఆత్మ దృష్ట్యా భ్రమగానూ ప్రాప్తిస్తున్నాయి. అనగా ఇవన్నీ “ఈ జీవుడు అనబడు ద్రష్టయొక్క స్వస్వరూపమే” అయివున్న ‘సర్వాత్మ’ అను గోడపై చిత్రించబడిన చిత్రకథ వంటిది.
ఆత్మకు వీటన్నిటితో సంబంధము లేనేలేదు. ఆత్మ యందు ఇవి లేవు.
శ్రీరాముడు : మరి ఇవన్నీ ఎందుకు కనబడుచున్నాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : నీవు ఆత్మదృష్టిని దృఢీకరించుకోక పోవుటచేతనే ‘జగదృష్టి’ అనునది ఏర్పడి ఉంటోంది. అట్టి జగదృష్టికి అవాస్తవమగు ఇవన్నీ దృశ్యమానమౌతున్నాయి.
పైన చెప్పిన దృశ్య వ్యవహారమంతా ఆవరణ రహితమే.
ఒక సత్యమును ప్రకటిస్తున్నాను, విను.
Page:22
అనంతమగు చిదాకాశమున ఏ చిత్స్వరూపము ఉండి ఉన్నదో అది ఇతఃపూర్వం ఎట్లున్నదో, ఇప్పుడు కూడా అట్లే స్ఫురించుచున్నది.
‘కిటికీ’ లోంచి సూర్యకిరణాలు గదిలోకి ప్రసరిస్తూ ఉంటే, ఆ కిరణాలలో కనబడే పరిచ్ఛిన్నములైన పరమాణువులన్నిటిలోను ప్రకాశించే సూర్యకాంతి ఒక్కటే కదా! ఈ సర్వ పదార్థములు ‘మహాచైతన్యము’ యొక్క ప్రభవములే అయివున్నాయి.
అయితే గోడపై చిత్రమునకు, ఈ జగత్తుకు ఒక భేదము ఉన్నది. గోడపై చిత్రం సాకారమైనది. ఈ సృష్టియో, రూపరహితము.
మనస్సుచే ’క్షుభితం’ అగుచున్న చైతన్యము తనయందలి చిత్-చమత్కారమైనట్టి ఈ జగద్రూపమంతా మననము చేయుచు (అనగా, భావన చేయుచు) అనుభవించుచున్నది.
మరొకప్పుడు అది మననమునకు అతీతమైయున్న తన స్వస్వరూపమగు ఆత్మవస్తువుతో ‘ఏకీభావము’ పొందుచున్నది.
’చిత్రములోని కథ’ను చూచువాడు ’గోడ’ను, ’గోడ’ను చూచువాడు ‘చిత్రము’ లోని సంఘటనలను చూడరు కదా! చైతన్యమే స్వరూపముగాగల ఈ జీవుడు ఆత్మను ఏమరచి ఉండు నప్పుడు జగత్తును గాంచుచున్నాడు. అట్లు జగత్తును గాంచుట ప్రారంభించుటయే ‘కల్పారంభం”. “జగత్ రాహిత్యం” అను అనుభవమే “కల్పాంతం” లేద జగద్రాహిత్యం.
‘దృష్టి’ యొక్క దోషం చేత ఒకనికి పెద్ద ‘స్ఫటికశిల’ యందు ఏవేవో రేఖలు చలనరహితంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆత్మయొక్క వాస్తవమైన స్వరూపమునందు ఈ బ్రహ్మాండములు ఉత్పన్నమగుట లేదు. నశించుటలేదు. అవి వచ్చుట లేదు, పోవుట లేదు. నిరాకారమగు ‘ఆకాశం’ నందు ‘నిరాకారమే’ అయివున్న ‘ఆకాశ విభాగము’ ప్రాప్తిస్తూ ఉన్నట్లు నిర్మలమగు ఆత్మ యందు, ఆత్మయే రూపముగా గల ఈ సృష్టులన్నీ స్ఫురించుచున్నాయి.
నీటి యందు ద్రవత్వము, వాయువు నందు చలనము, సముద్రము నందు కెరటములు, గుణవంతుని యందు గుణములు ఉన్నట్లే ఆత్మయందు ఈ జగత్తు ఉంటోంది. శాంతము, ఏకరసము, విజ్ఞానఘనము అయినట్టి బ్రహ్మమే స్వయముతో ’ఉత్పత్తి నాశనములు” అను వ్యవహారముగా కూడుకొనిన ఈ జగత్తు రూపమున వ్యాప్తమైయున్నది.
శ్రీరాముడు : స్వామి! ఈ ‘జగత్తు’ ఆత్మనుండియే ఉద్భవిస్తోందనునది మీరు ఒప్పుకుంటున్నారు కదా? లేక ఇవి ప్రకృతి నుండి ఉత్పన్నమౌతున్నాయా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మనుండి ఏదైనా ఉత్పన్నం కావటానికి సహకారి కారణమనేది ఏదీ లభించుటయే లేదని మనం చెప్పుకున్నాం కదా! అందుచేత “జగత్తు ఆత్మ నుండి ఉత్పన్నమౌతోంది” “ప్రకృతి నుండి ఆత్మయే రూపముగా గల ఈ జగత్తులు ఉదయిస్తున్నాయి.” మొదలైన భావాలన్నీ పిచ్చి పిచ్చి వాక్యాలూ, మధ్యేమార్గ వాక్యాలేగాని, ‘పూర్ణార్థవాక్యాలు’ కావు.
Page:23
ఆత్మ నుండి ఏదీ ఉద్భవించుటలేదు. స్వసంకల్పముచే ఆ ఆ చైతన్యమే జగదృష్టి కలిగియుండి, తన స్వరూపమునే ఇట్లు జగత్తుగా గాంచుచున్నది.
నాయనా! రాఘవా! ఇప్పుడు చెప్పుకున్న ఇన్ని వాక్యముల సారమేమిటో మరొక్కసారి సమీక్షిస్తూ వివరిస్తాను. ఈ సంక్షిప్త వాక్యాలు విను -
నిత్యోదిత స్వస్వరూపం - నీవు సర్వదా నిత్యోదయ స్వరూపముగల చైతన్యమువే గాని ఈ జడదేహమువు కాదు. నీవు భావనలుగా పరిణమించుటలేదు. అనగా, సర్వ భావములకు ఆవల స్వస్వరూపమునందే సర్వదా ఉండి ఉన్నావు.
సర్వమునకూ ముందుగానే…! సర్వ కల్పనలకు ముందే ఉన్న శుద్ధ స్వరూపమువే నీవు. కల్పనారూపములగు కళంకములేవీ నీ పట్ల ఉండజాలవు. అందుచేత ఇప్పటికిప్పుడే సర్వవేదనలు త్యజించి నిశ్చింతుడవై ఉండు.
సదవగాహన, నిస్సంగముల అభ్యాసం - స్వప్నరూపములతో పోల్చతగ్గ ఈ దృశ్యవస్తువులకు సంబంధించిన వికల్పములన్నీ నీనుండే బయల్వె డలుచున్నాయి. కనుక, అట్టి వికల్పములన్నీ “సదవగాహన నిస్సంగము”ల సహాయంతో తొలగించుకో.
స్వస్వరూపంలో జాగరుడవు కావటం - ‘అవిద్య’ అనబడే సుదీర్ఘమైన గాఢనిద్ర నుండి మేలుకో. నీ యొక్క పరమాకాశ స్వరూపమును గ్రహించి ప్రశాంతుడవు కమ్ము.
జ్ఞానమును జ్ఞాన మార్గాలను ఆశ్రయించటం - నిర్భయుడవై ఆత్మజ్ఞానమును ఆశ్రయిస్తూ జాగృతి పొందు.
“సర్వమునందు నన్ను, నాయందు సర్వమును గాంచటం" . “బ్రహ్మవిత్” స్వభావుడవై వెలుగొందుము. అన్ని భేదభావములను త్యజించివేయి. సర్వమును నీయందు, నిన్ను సర్వము నందు గాంచుచుండు. అప్పుడు నీ ఉనికి, సంచారం ఈ భూమండలమును “భూషితం’ చేగలదు.
స్మృతి
శ్రీరాముడు : ఓ మునీందా! మీరు మమ్ములను ఉత్తమోత్తమమైన భావనవైపుకే నడిపించు చున్నారు. చాలా సంతోషం. ఇప్పుడు నాదొక సందేహం.
మహాకల్పాంతము, సృష్ట్యాది - మహాకల్పాంతము తరువాత, సృష్ట్యాదియందు, ప్రథమ ప్రజాపతి (బ్రహ్మ) ‘స్మృతి” లేక “సంస్కారం” రూపముగా కలిగియుండి, జన్మించుచున్నాడని నేను అనుకుంటున్నాను. అట్టి ఆ ప్రజాపతి యొక్క స్మృతి లేక మనస్సే ఈ జాగ్రత్ రూపమున ఉత్పన్నమగుచున్నది కదా? అంతేనంటారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. నీవు చెప్పినట్లు “మహాప్రళయం” గతించిన తరువాత మరల “సృష్ట్యాది” యందు ప్రథమ ప్రజాపతి ‘స్మృతి’ రూపముననే ఉత్పన్నమగుచున్నాడు. కనుక
Page:24
“స్మృతి" యందే ఈ జగత్తు భాసిస్తోంది. అనగా, స్మృతి యందే ఈ జగత్తు యొక్క అనుభవం సంకల్పరూపమున స్థితి కలిగియున్నది.
అయితే, మట్టితో కొన్ని బొమ్మలు తయారయ్యాయనుకో… ‘మట్టి ఆకారములుగా మారుచున్నది’ అన వచ్చునా? ఆత్మ స్మృతి రూపమును పొందటం ఉంటుందా? ఒక మహా వృక్షమును చూపించి, ’దీని వ్రేళ్ళు ఆకాశంలో ఉన్నాయి. ఆకులు మాత్రం ఇక్కడ చేయికి అందుతున్నాయి’ అనటం ఎంత అసమంజసమో అదీ అంతే.
పరమాత్మ యందు స్మృతి లేదు. ‘జన్మ’ మొదలైన వికారములు లేవు.
‘స్మృతియే జన్మలకు కారణం’ అనేది మధ్యేమార్గవాక్యం మాత్రమే. ఈ వాక్యం, ‘జీవుడు ఆత్మస్వరూపుడే కనుక జన్మరహితుడు’ అను వాక్యాలు రెండూ ఒకేసారి ఒనగూడుచున్నాయి. “నదీ జలం-తటాకజలం-జలం”; “బొమ్మలోనికుండలోని మట్టి - మట్టి” ఒనగూడుచున్నట్లే ఆ రెండూ ఏర్పడుచున్నాయి.
శ్రీరాముడు : స్వామి! ‘ప్రళయం’ అంటే ప్రతి రోజు ఈ జీవుడు అనుభవించే ‘సుషుప్తి’ వంటిదే కదా! మనమందరం రాత్రిపూట గాఢనిద్ర అనుభవిస్తున్నాం. మరల మేల్కొన్నపుడు పూర్వ స్మృతులన్నీ యథాతథంగా ఉండి ఉంటున్నాయి.
అట్లాగే సృష్ట్యాదియందు ప్రజాపతి తనయందు స్మృతి కలిగి ఉంటున్నాడు అని అనవచ్చు కదా! ’మహా ప్రళయము యొక్క ప్రబల మోహము కారణంగా పూర్వకల్పములోని సంస్కారము లచే జనించిన స్మృతి అంతా నశిస్తుంది" అని కొందరు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. అట్లా ఎందుకు అనుకోవాలి? గాఢనిద్రలో లాగా మహాప్రళయంలో కూడా జగత్తుకు సంబంధించిన స్మృతులు దాగియే ఉంటాయని అనుకోవచ్చునంటారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : "ఈ జన్మకు సంబంధించినవాడను మాత్రమే నేను” అను దృఢమైన
అహంకారము కలవాడు ’జీవుడు’
“ ఈ అనేక సర్వఉపాధులను ధరించువాడను నేనే” అను సమష్టి అహంకారము గలవాడు - ”ప్రజాపతి (లేక) బ్రహ్మదేవుడు”.
ఓ రాఘవా! వినుపూర్వము జనించియున్న బ్రహ్మలందరు (సమష్టి సృష్టికర్తలందరు జ్ఞానులే కదా! అందుచేత వారంతా మహాప్రళయ సమయంలో దృశ్యాన్ని త్యజించివేస్తున్నారు. అనగా ముక్తులే అగుచున్నారు. అంటే అవశ్యము నిర్విషయ పరబ్రహ్మ స్వరూపమును పొందుచున్నారు. అప్పుడిక… “పూర్వ కాలమున ఉత్పన్నమైన ’స్మృతి’ని కలిగియుండి మరల కల్పారంభమున ప్రకటితం చేయటం” అనే క్రియకు కర్త ఎవ్వరో చెప్పు?
కర్త ముక్తుడు అయినప్పుడు, ఇక స్మృతి కూడా ముక్తిపొందినదై నిర్మూలనమగుట
జరుగుతుంది కదా!
Page:25
ఒకడు ఒక దీర్ఘ స్వప్నమును గాంచుచూ, మేలుకొన్నాడనుకో… అప్పుడాతని స్వప్నములోని వ్యవహారమును మరొకడు వచ్చి కొనసాగించగలడా? లేదుకదా! అతఃస్మర్తురభావేన స్మృతిర్వోదేతికిం కథమ్ | అవశ్యంహిమహాకల్పే సర్వేమోక్షైకభాగినః (సర్గ. 3; శ్లో. 8)
కర్మయే లేనప్పుడు, స్మృతి ఎట్లా సంభవిస్తుంది? ఏ విధానమును అనుసరించి సంభవిస్తుంది? ‘మహాకల్పము’ నందు సర్వము మోక్షము పొందుచుండును కదా! సర్వులు మోక్ష భాగులే అవుతారు. ‘మోక్షము’ పొందటం జరిగిన తరువాత ఇక ఇచ్చ - సంస్కారము - స్మృతి అనునవన్నీ నిష్ఫలములే అవుతాయి.
శ్రీరాముడు : మరి మీరు “స్మృతియే కల్పారంభమున ప్రవర్తిస్తోంది” అని అన్నారు కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : అవును, అన్నాను. కల్పారంభ వ్యవహారంలో ‘స్మృతి’ ప్రవర్తిస్తోందని చెప్పటంలో నా ఉద్దేశమేమిటో చెపుతాను, విను‘చిదాకాశము’ అనబడునది ఒకటి ఉన్నది. అది అనుభూతమా? కాదు. పోనీ అననుభూతమా కాదు. అట్టి చిదాకాశమందలి ఏ ‘స్మృతి’ అయితే ఈ జగత్తు యొక్క ఉత్పత్తికి హేతువు అగుచున్నదో అయ్యది చిదాకాశము యొక్క కళయే గాని వేరేమీ కాదు. సూర్యుని నుండి సూర్యకిరణములు వేరు కానట్లు ‘స్మృతి’ అనేది చిదాకాశమునకు వేరైనదేదీ కాదు. శ్రుతులు ఈ ఆశయమునే ప్రకటిస్తున్నాయి. ఈ జగదనుభవం అనబడే “స్మృతి కల్పిత చిత్కళ” అనునది అనంతము కూడా! చిదాకాశమే దాని స్వరూపము.
అంటే అర్థమేమిటి?… స్వయంభువు అగు పరమాత్మయే జగద్రూపమున ఉన్నాడని గ్రహించెదవు గాక! అతడే ఈ జగములను. మరల లోపలికి గొనుచున్నాడు. సూర్యకిరణములు ఒక గోపురంపై ప్రసరించటం, మరల ఆ ప్రసరణ ఉపసంహారం కావటం సహజమే కదా!
అనాదికాలంగా సిద్ధించియున్న బ్రహ్మము యొక్క నిజప్రకాశరూపమే ఈ ’జగత్తు’కు సూక్ష్మదేహం. ఈ బ్రహ్మాండ దేహమునకు ఉపాదాన కారణం పరమాత్మయే. కనుక, “ఈ బ్రహ్మాండము కూడా పరమాత్మయే" అని సిద్ధాంతీకరించబడుతోంది.
ఓ రామా! "దేశము, కాలము, క్రియ, ద్రవ్యము, రాత్రింబవళ్ళు, ఆకాశము, మేఘములు” మొదలైన అనేక విశేషములతో కూడి ఈ సువిశాల జగత్తు అంతా కనిపిస్తోంది కదా! అట్టి ఈ త్రిలోకములతో కూడిన జగత్తుఅంతా ఒక్క పరమాణువునందే భాసించుచున్నది. మరల ఈ త్రిలోకములలోని పరమాణువులందు ఈ త్రిలోకములంత విశాల సృష్టులు అసంఖ్యాకంగా భాసిస్తున్నాయి. మరల ఆ ఆ సృష్టులలో అసంఖ్యాకములైన పరమాణువులు - ఈ విధంగా వ్యవస్థ అవ్యవస్థారూపంగా ఒకదానియందు మరొకటి గ్రుచ్చబడి ఉన్నాయి. ఆయా దృష్టులకు అవన్నీ దృశ్యమానమగుచున్నాయి. అయితే రామా! అవన్నీ సత్యమని అనగలమా! కానే కాదు. ఇవన్నీ ద్రష్ట యొక్క చిత్కళాభావనా వైచిత్ర్యములే!
Page:26
ఈ విధంగా జ్ఞానుల దృష్టి సర్వదా జాగృతమై ఉంటోంది. వారికి ఇదంతా ఒక మొదలుగాని, చివరగాని లేని వ్యవహారంగా, సత్-అసత్స్వరూపంగా ప్రాప్తిస్తోంది. అజ్ఞానుల దృష్టి మిథ్యా రూపముగా అనుక్షణం గతించిపోతున్న వ్యవహారంగా అంతులేకుండా ఉండి ఉంటోంది. జ్ఞానుల దృష్టిలో ఈ ప్రపంచమంతా, నాశరహితము, శాంతము అగు కేవల పరబ్రహ్మమే అయి ఉన్నది. అదే ప్రపంచము అజ్ఞానుల దృష్టికి పదు నాలుగు లోకముల రూపమున ఉంటోంది.
యథేదంభాసురంభాతి జగదండకజృంభితమ్ | యథాకోటి సహస్రాణి భాంత్యన్యాన్యప్యణావణా || (సర్గ.3; శ్లో. 17)
ఈ బ్రహ్మాండము ఎట్లా భాసిస్తోందో, అదే విధంగా ఒక్క పరమాణువులో ఇటువంటి కోట్ల కొలది బ్రహ్మాండములు భాసించుచున్నాయి. స్తంభములో విగ్రహం, ఆ విగ్రహంలోని కాళ్ళు, చేతులలో మరి కొన్ని చిత్రములు లిఖించబడుచున్నట్లు, జగత్తులోని ప్రతి పరమాణువులో ముల్లోకముల విగ్రహము ఉన్నది.
ఆ ముల్లోకములలోని ప్రతి అణువులోను జగత్తులు ఉన్నాయి. ఈ వ్యవహారము అజ్ఞానము ఉన్నంతవరకు ఇట్లే ఉండి తీరుతుంది.
ఒక పర్వతము ఉన్నదనుకో… అందుగల అసంఖ్యాకములైన పరమాణువులు ఆ
పర్వతముకంటే వేరు కాదు కదా! అలాగే, ‘బ్రహ్మము’ అనే మహాపర్వతములో ఆ బ్రహ్మమునకు వేరు కానట్టి బ్రహ్మాండములు అనబడే పరమాణువులు అసంఖ్యాకంగా ఉన్నాయి.
సూర్యకిరణాలలో కనిపించే సూక్ష్మ పరమాణువులను (త్రసరేణువులను లెక్కించగలమా? “చిత్” అను సూర్యునిలో త్రిలోకముల రూపమున ప్రకాశించే బ్రహ్మాండ పరంపరలను లెక్కించ గలిగే వారెవ్వరు?
జలంలోను, ధూళిలోను అనేక పరమాణువులు పరిభ్రమించుచున్నట్లు చిదాకాశములో ‘ప్రపంచములు’ అనబడే అనేక పరమాణువుల పరిభ్రమణం చేస్తున్నాయి.
శ్రీరాముడు : స్వామీ! ఆ విధంగా చిదాకాశములో ప్రపంచముల రూపమున ప్రకాశించేదంతా ఏమిటి? అది బాహ్యము నుండి వస్తోందా? అంతకుముందే బ్రహ్మమున ఉండి ఉన్నదా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామా! ‘శూన్యము, నిరాకారము’ అయివున్న ఆ కనబడే ‘భౌతిక-ఆకాశము’ వైపు చూడు… అది నీలముగా కనబడుతోంది… అయినప్పటికీ ఆ నీలత్వము యథార్థానికి శూన్యరూపమే అయి ఉన్నది కదా! అట్లాగే, సృష్టి రూపంగా మనకు ఇక్కడ అనుభూతమగుచున్నదంతా చిదాకాశమే అయివున్నది.
Page:27
దీనిని ‘బ్రహ్మం’ రూపంగా ఎరిగితివా, ఆ దృష్టి ’మోక్ష’మను ఉత్తమ శ్రేయస్సును ప్రసాదిస్తుంది. అట్లా కాకుండా “సృష్టి" అనబడు ద్వైతభావనగా చూచావా, ఇది ‘నరకము’ మొదలైన అనేక అథోస్థితులను రుచి చూపిస్తుంది.
ఈ రెండు దృష్టులు నీ ఎదురుగానే ఉన్నాయి.
‘సృష్టి - దృష్టి’ అనుసరిస్తావా? ‘ఆత్మ-దృష్టి’ లేక ‘బ్రాహ్మీదృష్టి’ అనుసరిస్తావా? - నీ ఇష్టం. వాటి పర్యవసానం మాత్రం రెండు వేరైన త్రోవలుగా… ఒకటి సంసారము వైపూ, మరొకటి మోక్షము లేక దుఃఖ రాహిత్యమువైపు… ఉన్నాయి.
ఓ రామచంద్రా! ఇప్పటి వరకు అనేకసార్లు చెప్పిన వాక్యమునే మరొకసారి చెప్పుచున్నాను. ఈ జీవుడు మరింకేదో కాదు. ఇతడు సాక్షాత్, స్వయముగా ప్రత్యగాత్మ స్వరూపుడే. సూర్యకిరణాలన్నీ సూర్యుని ప్రతిభా విశేషాలే అయినట్లు, - ఈ బ్రహ్మాండాంతర్గత జీవులంతా చిదానంద సూర్యుని ప్రజ్ఞాకిరణపుంజాలే!
ప్రపంచము యొక్క ఉనికికి కారణభూతుడైన ఈశ్వరుడు - - ఈ జీవుడు … వీరిద్దరు కూడా పరమార్థ దృష్టితో చూసినప్పుడు పరిపూర్ణము, ఏకరసము అయిన పరబ్రహ్మమే అయి ఉన్నారు. అందుకు ప్రమాణం వేద వాక్యాలే. (పూర్ణమదః పూర్ణమిదమ్ - ఋగ్వేదము) “ఈ బాహ్య
- అభ్యంతరములు (The external & internal zones) రెండూ ఉపాధి భేదం చేత బ్రహ్మము నుండే
ఉత్పన్నమౌతున్నాయి” - అని శ్రుతులు ప్రవచిస్తున్నాయి. ఏది ఎందులోంచి వస్తోందో అది అద్దాని
రూపమే అయి ఉంటుంది. ఇందులో సందేహించవలసినదేమీ లేదు.
జ్ఞానోదయము - ఈ తెలియబడుచున్న ‘వేద్య వస్తు సముదాయము’ అంతా, ఈ ’నీవు-నేను `అతడు’ మొదలైన వాటితో సహా శుద్ధము, చిన్మాత్రము జ్ఞాన స్వరూపము అయిన ఆ స్వస్వరూప బ్రహ్మమే. అనగా, ఈ ’జీవుడు’ గా కనబడుచున్న ద్రష్టయే దృశ్యము రూపముగా విస్తరిస్తూ, అద్దానిని ఆస్వాదిస్తున్నాడు.
అనేక కోణముల నుండి ఈ సర్వమును దీర్ఘకాలంగా పరిశీలించిన మాకు ఈ విషయం నిస్సందేహంగా గ్రాహ్యమగుచున్నది. బ్రహ్మము తప్పితే మరింకెక్కడా ఏదీ లేనే లేదు.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! “ఇంద్రియ సమూహములను జయించుట” అను వంతెన చేతచే ఈ భవసాగరము దాటబడుచున్నది. మరింకే ఇతర కర్మల వలన గాని, వ్యవహారముల వలన గాని అది సాధ్యపడేది కాదు. ’శాస్త్రము-సజ్జన సాంగత్యము సాధన” … వీటి సహాయం చేత జీవుడు జితేంద్రియుడు, వివేకవంతుడు కాగలుగుచున్నాడు. జితేంద్రియుడు (ఇంద్రియముల
Page:28
ప్రభావమును అధిగమించినవాడు) మాత్రమే ఈ దృశ్యం యొక్క అత్యంత అభావమును ఎరుగగలడు. ఇంద్రియ జయమే సంసార భేదనము. ఇంద్రియవశత్వమే సంసారబంధనము.
చూచావా! రామా! ఇదీ, సంసార స్వరూపము. ఈ సంసార సాగరములు ఎట్లా ప్రాప్తిస్తున్నాయో, ఎట్లా నిర్వర్తిస్తున్నాయో ఈ విచారణల సహాయం చేత నీకు నీవే గ్రహించు. నిష్కామభావమును అవధరించు. ఆ పై ఏది ఎట్లు ఉచితమని భావిస్తావో, అట్లే నిర్వర్తించు.
ఇక ఎక్కువగా చెప్పవలసిన పనేమున్నది? ఈ మనస్సే ‘కర్మ’ అను వృక్షము యొక్క అంకుర మని గ్రహించు. ఈ మనస్సును ఉత్తమ అవగాహనతో నియమించితివా, ఇక విహిత - నిషిద్ధ (must do - must not do) కర్మల రూపమగు ఈ జగద్యృక్షము స్వయముగానే భిన్నమైపోతుంది. అంతా ఈ మనస్సే అయివున్నదని మరల మరల ప్రకటింస్తున్నాను. ఈ మనస్సుకు ఇక్కడే, ఇప్పుడే సరి అయిన చికిత్స చేయాలి. మరి ఇంకెప్పుడు ఏమి చేయగలవు చెప్పు?
మనః సర్వమిదం రామ, తస్మిన్ అంతఃచికిత్సి తే ॥ చికిత్సితోవై సకలో జగజ్జాలామయో భవేత్ ॥ (సర్గ. 4; శ్లో. 5)
ఈ మనస్సుకు ఇక్కడ సరి అయిన చికిత్స చేశావా, ఇది శమించిపోగలదు. అప్పుడు “జగత్సమూహము” అనబడే దృశ్యజాడ్యము మొదలంట్ల తొలగిపోగలదు.
మనస్సే ఈ దేహాకారముగా స్ఫురిస్తూ స్వప్నంలోలాగా ‘క్రియాసమర్థం’ అగుచున్నది. మనస్సుకంటే వేరుగా ఈ జడదేహం కార్యసమర్థమగుచున్నదెక్కడ? ఈ భౌతిక దేహం మనస్సుకన్న వేరైన లక్ష్యములు కలిగియుంటున్నదా? లేదు.
దృశ్యాత్యంతాసంభవేన ఋతేనాన్యేన హేతునా ।
మనఃపిశాచః ప్రశమం యాతికల్పశతైరపి ॥ (సర్గ. 4; శ్లో. 7)
అసలు ఈ ‘సంసారము’ అనబడే జాడ్యమునకు మూలకారణమేమిటి? విను, చెపుతాను. ఎప్పటి నుంచో తెలియదు గాని, ఈ జీవుణ్ణి “దృశ్యము” అనబడే ఒకానొక పిశాచము పట్టి పీడిస్తోంది. ఎందుకో, అతడు అది గుర్తించుట లేదు.
నా ఈ మాటలు జనులు శ్రద్ధగా ఆలకించెదరు గాక! జ్ఞానముచే ఈ దృశ్యమును పూర్తిగా రహితం చెయ్యాలి. అనగా, మొత్తము దృశ్యమునకు అతీతంగా వెళ్ళాలి. అదియే సర్వ
ప్రయత్నముల యొక్క ఉత్తమ ప్రయోజనం.
మరింకే వ్యవహారం ఎంతగా ఆశ్రయించినా సరే, ఈ దృశ్యము శమించేది కాదు సుమా!
మనోరోగమునకు పరమోత్తమమైన ఔషధం "దృశ్యము యొక్క పూర్ణ రాహిత్యం లేక సంపూర్ణమైన ’అతీతత్వం’ 22 అయివున్నది. ఇందుకు వేరే మందేమీ లేదు.
ఈ మనస్సే దేహాదులందు ఆత్మభావనమును కలుగజేసి, మోహమును ఉత్పత్తి చేసి అంది స్తోంది. జన్మించేదీ అదే. మరణించేదీ కూడా అది మాత్రమే. ఈ మనస్సు యొక్క ప్రభావం చేతనే
Page:29
జీవుడు బంధంలో తగుల్కోవటం జరుగుతోంది. ఎవడైతే ఈ మనస్సును ఆత్మజ్ఞానంవైపుగా ఉన్ముఖం చేస్తాడో, అట్టివాడు స్వయంగా విముక్తిని పొందుచున్నాడు. “ఓ దృశ్యమా! నీవు నా మనస్సు యొక్క ప్రదర్శనమే!" అని గానం చేసే వాని మనస్సు దృశ్యంలో తగుల్కొనే ప్రసక్తి ఎక్కడిది?
ఓ జనులారా! మీరంతా చూస్తున్న ఈ జగత్తు మరెక్కడో లేదు సుమా! ఇది మీ చిత్తము లందు ఇట్లు సంకల్పాదుల బలంచే జగత్తుగా ఏర్పడుచున్నది. ’శూన్యం’లో విశాల గంధర్వ నగరంలాగా స్వప్నంలో చమత్కారములైన అనేక వస్తుజాలమువలె ఇదంతా ప్రాప్తిస్తోంది. అవస్తువే అయి వుండి కూడా ఎంతో సత్యముగా తోచుచున్నది. నాయనలారా! మీరంతా వాస్తవానికి సత్య-నిత్య-నిరుపమానంద స్వరూపులే అయివున్నారు. కాని ఏం లాభం? నిష్కారణంగా మనస్సుచే ప్రభావితులై ’అసత్యము’ను అత్యంత సత్యముగాను, నిత్యసత్యమగు ’నిర్మల చైతన్య తత్త్వము’ను లేనట్టిదానిగాను గాంచుచున్నారని మనవి చేస్తున్నాను.
ఒక్కసారి మీ మనస్సులను నిలదీసి ప్రశ్నించండి. నిరోధించండి. ఆత్మవైపు ఉన్ముఖులు కండి. అప్పుడు ఈ జగత్తు సత్యమో, అసత్యమో నన్ను ఏమాత్రం అడగవలసిన పని ఉండదు.
ఒక పూలగుత్తిలోంచి వస్తున్న సుగంధం ఆ పూలగుత్తికి వేరైన దానిలాగా గోచరిస్తూ ఉంటుంది కదా! మనస్సు నందే స్థితించియున్న ఈ జగత్తు కూడా, మనస్సుకు వేరైన దానివలె గోచరిస్తూ ఉండటం జరుగుతోంది. ఎందుచేత? ఆత్మజ్ఞాన లేమి చేతనే సుమా!
“ఒక నువ్వు గింజలో నూనె”, “ఒక గుణిలో గుణములు" (చెడ్డవానిలో చెడుతనం, మంచివానిలో మంచితనం, అందగానిలో అందం, ధర్మపరునియందు ధర్మము మొ॥) ఎట్లా అంతర్లీనంగా ఉంటున్నాయో, ఈ చిత్తమునందే ‘జగత్తును గాంచుట’ అనబడు వాసనలతో కూడిన ‘ప్రవృత్తి’ ఉండి ఉంటోంది. సూర్యునియందు కిరణములు, తేజమునందు ప్రకాశము, అగ్ని యందు ఉష్ణత్వము ఉన్నట్లే -మనస్సునందు ఈ జగత్తు ఉన్నది. మంచునందు చల్లదనం లేదా? ఆకాశంలో శూన్యత్వం ఇమిడి ఉంటోంది కదా! వాయువు నందు చంచలత్వం అత్యంత సహజమై ఉంటోందే! అట్లాగే ఈ మనస్సునందు దృశ్య భావము ఉండి ఉన్నది.
ఇట్లు మనస్సే “జగదనుభవము” అను “సుఖ-దుఃఖ-ఆశ్చర్య-తిరస్కార-స్వ-పర” ఆదిగా గల చమత్కారములకు కారణమగుచున్నది. కాబట్టి రామచంద్రా!
మనస్సే ఈ సమస్త జగత్తు -
మరొక చమత్కారమైన విషయం :
మనస్సు నశిస్తే ఈ దృశ్య జాతమంతా స్వయంగా నశిస్తుంది. కాని, ఈ జగత్తు నశించినంతమాత్రంచేత మనస్సు నశించదు.
Page:30
అందుచేత రామా! ఈ జగత్తు విషయం కొంత సేపు ప్రక్కకు పెట్టు, మనస్సును ఎట్లా లంపజేయాలో ఆలోచించు.
సర్వ సంకల్పముల రహిత స్థితియగు ’స్వసత్త’ను అన్నివేళల ఆశ్రయించటం అలవరచుకో. అట్టి నిష్ఠను బలపరచగల కర్మ - జ్ఞానాదులను సముపార్జించు.