Page:765
IV. మనోమృగ విశ్రాంతి
శ్రీరాముడు : ’సమాధి’ అనే వృక్షం యొక్క చల్లటి నీడలో ఈ జీవునికి చక్కటి విశ్రాంతి కలుగగలదని విజ్ఞానవేత్తలు అంటూ ఉండటం విన్నాను. అట్టి సమాధి వృక్షం గురించి వివరించండి. శ్రీవసిష్ఠ మహర్షి : అవును. సమాధి అనే వృక్షం ’వివేక జనులు’ అనే వనంలో ఉన్నది. వివేకులకు అది సర్వదా జీవన మూలమై ఉన్నది. అతి విశాలమై, పత్ర-పుష్ప సహితమై కనిపిస్తున్న ఆ సమాధి వృక్షం గురించి విజ్ఞులు ప్రవచిస్తున్నదేమిటో చెప్పుతాను విను.
‘సంసారం’ అనే ఒక మహారణ్యం ఉన్నది. అందులో అనేక జీవులు అనేక సుఖ-దుఃఖాలను పరంపరగా పొందుతూ అతి దీర్ఘకాలంగా సంచరిస్తూ ఉన్నారు. ‘ఆశ’ అనే పాశంతో ఆయా జీవులు ఆయా చోట్ల బంధింపబడి, దిక్కు తోచక అలమటించటం మేము గమనిస్తూనే ఉన్నాం. అయితే అట్టి సంసారంలో అవిశ్రాంతంగా తిరుగాడుచున్న అసంఖ్యాక జీవులలో కొందరికి మాత్రం ఆ సంసారారణ్యం పట్ల వైరాగ్యం ఉద్భవిస్తోంది. అట్టి వైరాగ్యం ఉదయించటానికి కారణం : 1. స్వజనులచే గావించబడిన అవమానాదులు కావచ్చు… కాక,
ధనాదులకు సంబంధించిన వియోగ సంఘటనలు కావచ్చు… లేదా,
సౌభాగ్యవశం చేత కావచ్చు, కాదా…
మహాత్ముల ఉపదేశ ప్రభావం చేత వచ్చిన గుర్తు కావచ్చు.
కారణం ఏదైతేనేం… ఈ సంసారం కలిగించే అనేక దుఃఖాదులను గమనించిన కొందరు జీవులు ఈ సంసారం పట్ల పరమ వైరాగ్యాన్ని ఆశ్రయిస్తున్నారు. అట్టి వైరాగ్యమే సమాధి వృక్షం యొక్క బీజం. అట్టి బీజమునకు క్షేత్రం ఈ చిత్తమే! అయితే అట్టి చిత్త క్షేత్రం ‘శుభకర్మలు’ అనే నాగళ్ళతో దున్నబడి ‘శాంతి’ అనే జలముచే తడుపబడి, ‘ప్రాణాయామం’ మొదలైన పిల్ల కాలువ లతో నీళ్ళు పొందినదై ఆ సమాధి బీజం మొలకెత్తి సమాధి వృక్షంగా ప్రవృద్ధమౌతోంది. వివేకం చేత శుద్ధం చేయబడిన చిత్త భూమియందు వైరాగ్య సమాధి బీజం తనంతట తానే వచ్చి చేరుతుంది.
ఈ విధంగా స్వచిత్తమునందు వచ్చి చేరిన వైరాగ్య సమాధి బీజమును వృద్ధి నొందింప జేయాలి. దృఢబుద్ధితో సర్వభేద భావములను త్యజిస్తూ… ఆ వైరాగ్య బీజమును సమాధి వృక్షంగా పెంపొందించుకోవటం ఎట్లాగో చెప్పుతాను… విను.
మనోశుద్ధి - మనస్సును ముందుగా శుద్ధంగాను, పవిత్రంగాను, సుందరంగాను, మధురం గాను తయారు చేసుకోవాలి. ‘సత్సాంగత్యం’ అనే క్షీరంతో ఆ మనస్సును మరల మరల నానపెట్టాలి.
Page:766
ఆ తర్వాత శాస్త్ర వాక్య మననం ప్రారంభించాలి. ‘సంసార సాగరం దుఃఖమ్, జీవో బ్రహ్మేతి నాపర’, నేతి నేతి… వంటి శాస్త్ర వాక్యముల అర్థసారాన్ని ఆ మనస్సులో నిండుగా ప్రవహింప జేయాలి. గురువాక్యాలు ఆశ్రయించాలి.
గురువు యొక్క ‘హృదయం’ అనే బ్రహ్మ సరోవరంలోంచి ప్రవేహించే ఆత్మజ్ఞాన వాక్యాలు వినాలి. ఆత్మతత్త్వ పరిపూర్ణులు, నిర్మలులు అగు సద్గురువులు వాక్యాలు సర్వ ద్వైతమును నిషేధిస్తూ వస్తాయి. అంతఃకరణమున సంసార శూన్యత్వను గురించి బోధిస్తూ ఉంటాయి. అమృత ప్రవాహాన్ని బోలిన ఆ గురువుల నుండి లభించే శాస్త్రార్థములను శ్రవణ మననాదులచే గ్రోలాలి. వాటితో చిత్తములో ప్రవేశించిన వైరాగ్య బీజమును ప్రవృద్ధ పరచాలి.
అట్టి ‘సంసార వైరాగ్యం’… అనే సమాధి బీజమును తీక్షణ బుద్ధితో చిత్త భూమిలో పరికించి, కనుగొని, ప్రయత్నపూర్వకంగా పరిరక్షించుకోవాలి. శరీరక-వాచిక-మానసిక తపస్సులు అందుకు దోహదపడతాయి. దాన ధర్మాది గుణాల చేత, అమానిత్వ- అదంభిత్వాది సద్గుణ సంపత్తితో కూడిన క్రియా-ప్రయత్నాదుల చేత, పవిత్ర క్షేత్ర దర్శనాది వృత్తి విస్తార రూపకల్పనలచే ఆ సమాధి బీజమును పరిరక్షించుకోవాలి.
వైరాగ్యము - క్రమంగా ఆ వైరాగ్య బీజం అంకురించటం ప్రారంభిస్తుంది. అట్టి బీజాంకురాన్ని రక్షించుకునే ఉపాయాలను అతి జాగరూకతతో, నిపుణత్వంతో ఆశ్రయించి ఉండాలి. ‘సంతోషము’ అనే తోటమాలిని అహర్నిశలు బీజాంకురాన్ని కాపాడి ఉంచే ఉద్యోగంలో నియమించాలి.
ఆ వైరాగ్య-సమాధి బీజాన్ని హరిద్దామని కొన్ని పక్షులు కాపుకాస్తూ ఉంటాయి సుమా!ఆ పక్షులే పూర్వ వాసనలతో ఆవిర్భవించే దేహ పుత్ర-మిత్ర కళాత్రాదుల పట్ల కలిగే వ్యామోహాలు, అనురాగాలు మొదలైనవి. కామ క్రోధాది డేగలు దరిచేరకుండా చూచుకోవాలి. హింస - అహంకారం-దంభం-దర్పం-అభిమానం-క్రోధం-పారుష్యం-అభిజాత్యం మొదలైనవి ఆ మొలకెత్తే వృక్షాన్ని పట్టే చీడలాంటివి. వాటిని దరిజేరకుండా చూచుకోవాలి. అందుకుగాను, అహింసా ప్రధానత్వంచే మృదువైన ‘యమ నియమాలు’ అనే చీపురుతో ‘రజోగుణం’ అనే ధూళిని చిత్త క్షేత్రం నుండి ఎప్పటికప్పుడు - ఊడ్చివేస్తూ ఉండాలి. ఇంకా, అంచిత్యమైన ‘బ్రహ్మ ప్రకాశం’ అనే వివేక సూర్యుని కిరణాలు ఆ వైరాగ్య-సమాధి బీజంపై నిరాటంకంగా ప్రసరించేటట్లు చూచుకుంటూ ఉండాలి. ‘అజ్ఞానం’ అనే చీకటి ఆవరించకుండా చిత్త క్షేత్రాన్ని కాపాడుకోవాలి. దుష్కృతాలు, క్షణ భంగురాలైన వనిత-సంపద మొదలైన భోగ వాసనలు అనే పిడుగులు ఆ సమాధి అంకురం వైపుగా రానీయకుండా చూచుకోవాలి. అందుకుగాను ‘ప్రణవార్థం’ అనే త్రిశూలమును ధరించి ‘ధైర్యము-ఔదార్యం’ అనే మంత్రాలను జపిస్తూ జప-తప-స్నాన-దానాదులచే భోగ వాసనలను
సుదూరంగా ఉంచుతూ రావాలి.
ధ్యానము : ఈ విధంగా రక్షించబడిన వైరాగ్య బీజం క్రమంగా ‘ధ్యానం’ అనే మొక్కగా రూపు దాలుస్తోంది. ఆ మొక్కకు ‘వివేకం’ అనే నూతనమైన కొమ్మలు మొలకెత్తుచున్నాయి. అట్టి
Page:767
వివేకాంకురం చే చిత్తభూమి ప్రకాశవంతంగాను, వికాసవంతంగాను, అతి శోభాయమానంగాను, రమణీయంగాను భాసిల్లగలదు. అప్పుడా వివేకాంకురం నుండి ’సచ్ఛాస్త్రములు-విచారణ-సాధు సంసర్గం’ అనే ఆకులు బయల్వెడలుతాయి. ఆ చెట్టు ‘సంతోషం’ అనే గట్టి తోలుతో పరివేష్టితమౌతూ వస్తుంది. వైరాగ్యం అనే రసంతో ఆ వృక్షం శోభిస్తూ క్రమంగా బలమైన కాండాన్ని పెంపొందించు కొంటుంది. ’శాస్త్రములు’ అనే వర్షమును పొందుతూ క్రమంగా ఆ సమాధి వృక్షం మహోన్నతిని పొందగలదు. అది ఇంకా ఇంకా శాస్త్ర విచారణ సాధు సంగమము-వైరాగ్యము అను రసములతో మరింత పరిపుష్టమగు గాక!
రాగ-ద్వేష విదూరకం - అట్లు పరిపుష్టమైన ఆ ధ్యాన వృక్షమునకు ఇంకెప్పుడు ‘రాగ ద్వేషాలు’ అనే వానరాలు కొంచెం కూడా క్షోభను కలిగించలేవు. వాటి దూకుళ్లకు అది చలించదు.
సద్గుణముల సముపార్జన - జ్ఞానముచే శోభితమైన ఆ వివేక వృక్షం వైరాగ్య రసంతో విశాలంగా విలాసవంతంగా ఆత్మ ప్రదేశము వరకు విస్తరించినదగుచున్నది. ఆ ధ్యాన వృక్షమును ఆశ్రయించ టానికి ‘ఆత్మతత్త్వం యొక్క స్ఫుటత్వం, సత్యత్వం, ఆత్మస్థితి, ధీరత్వం, నిర్వికల్పత్వం, సమత్వం, శాంతి, మైత్రి, కరుణ, కీర్తి, ఆర్యత్వం’ మొదలైన లతలు వచ్చి చేరుతాయి. ‘శాంతి’ మొదలైన ఆకులతో, పుష్పాలతో శోభించే ఆ సమాధి వృక్షమే యోగులకు విశ్రాంతి స్థానం. ఆ వివేక వృక్షం రోజు రోజుకు ప్రవృద్ధమై, క్రమంగా అజ్ఞానమూలాన్ని నశింపజేస్తుంది.
ఆ యోగికి సప్త భూమికా పర్యంతము విశ్రాంతిదాయకమౌతుంది. ‘బ్రహ్మ సాక్షాత్కారము’ అనే మహా ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఉదారత్వాది గొప్ప గుణాలతో కూడిన ప్రజ్ఞను చిగురింప జేస్తుంది. శమమును, చిత్తాకాశంలోని దిక్కులన్నిటినీ శాంత పరుస్తుంది. సంసార తాపాన్ని నశింప జేసి ఆ యోగికి పరమ సుఖాన్ని ప్రసాదిస్తుంది. శమమును చిత్త స్థైర్యమును వృద్ధి పరుస్తుంది. ‘ఆత్మజ్ఞానం’ అనే పునాదిని గట్టి పరుస్తుంది. కైవల్యం అందిస్తుంది. హృదయవనంలో ఉద్భవించే ఈ సమాధివృక్షం హృదయం యొక్క త్రివిధ తాపాలను హరించి శీతలత్వం ప్రసాదిస్తుంది.
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ మనస్సు అనే ఒకానొక మృగం అనేక జన్మలలో ఎన్నెన్నో దుఃఖాలను అనుభవించి ఉంటోంది. ఒకవేళ దైవయోగం చేత సన్మార్గం లభించినప్పటికీ ఆయా వాదఉపవాదాల కోలాహలంలో పడటం చేత సన్మార్గమున ప్రయాణించటంలో అత్యంత జాప్యం జరుగుతోంది. ఆ మృగం (మనస్సు) అనేక భూములలో తిరిగి, తిరిగి, అలసి సొలసి చివరికి ఎట్లాగో వైరాగ్య వృక్షం క్రిందకు విశ్రాంతి కొరకై వెతుకుతోంది.
అహంకార-కామ-క్రోధ-భయ-ఉద్వేగముల నిరోధం - ఆ మృగ చర్మం సంపాదించాలని కామక్రోధాలు అనే బోయవారు తరుముకు వస్తున్నారు. ఇక ఆ మనో మృగమో, ‘దేహాలు’ అనే ముళ్ళ
Page:768
పొదలలో దాగుకొనుచు అక్కడి ముళ్లచే బాధించబడుచూ భయం-ఉద్వేగాలచే శిథిలమై ఉంటోంది. ఇంతలోనే అది ‘సంసారం’ అనే అరణ్యంలో ‘వాసనలు’ అనే ఆవేశముచే ప్రేరితమై సంచరిస్తోంది. ’ఏదో పొందాలి’ అనే ఆర్తిని వదలక ‘అహంకారం’ అనే మృగతృష్ణా జలంవైపు పరుగులు తీస్తూ… విష పీడితమైన అంతఃకరణం కలిగి ఉంటోంది. ఆ అంతఃకరణంలో తృష్ణాదాహం అంతకంతకు అధికమౌతోంది!
విషయ నిరోధం - ఆహా! ఏమని చెప్పాలి. ఈ మనస్సు ‘సంపదలు’ అనేచోట చిక్కుకుని తత్ఫలితంగా అనేక శోక-మోహాలు పొందుతూ ఎటో తెలియరాని చోట్లకు చేరుకొని దిక్కు తోచక ఉంటోంది. ఏ దేహాలలో తాను దాగుకొన్నదో… ఆ దేహాలు శిథిలమగుచుండగా, ఇక తానే శిథిల మగుచు బహు దుఃఖాలు అనుభవిస్తోంది. శరీర సంబంధితులైన పుత్ర పౌత్రాదులతో ఏర్పడే సంబంధ-బాంధవ్యాలను నమ్ముకొని అనేకసార్లు మోసపోతూ శోకముచే, క్షుత్పిపాసచే అలమటి స్తోంది. జ్ఞానేంద్రియ-కర్మేంద్రియములచే లభించే శబ్దాది విషయాలే పైకి సుముఖంగాను, చివరికి వేటగాండ్ర బాణముల వలె బాధించేవిగాను అగుచున్నాయి. పూర్వకాలిక దుఃఖానుభవములన్నీ ఆ మనస్సు యొక్క అంతరాంతరమున పేరుకొని ఉండగా వర్తమానంలో అప్పటికప్పుడు మాత్రం ప్రక్క ప్రక్కన గల ‘విషయములు’ అనే గడ్డి పరకలు నలుముచూ రోజులు గడుపుతోంది.
మనోమృగం - ఈ మనస్సే స్వర్గ నరకాది ఉన్నత నీచ ప్రదేశాలలో పైకి-క్రిందికి వెళ్ళు చున్నది. ‘ప్రాపంచిక వికారములు’ అనే రాళ్ల మీద జారిపడి గాయములు పొందుతోంది.
ఈ మనోమృగమునకు ‘తృష్ణ’ అనే లతలలోను, ‘దేహము’ అనే పొదలలోను తిరుగాడటానికి బహు ప్రావీణ్యం పొందినదై ఉంది. స్వబుద్ధిచే అనేక ఆచారములు కల్పించుకొని వాటిలో తానే బంధించబడుతోంది. అంతేగాని స్వయంకల్పితమైన మాయ ఏమిటో గ్రహించటానికి స్వబుద్ధిని ఉపయోగించటం లేదు. ఏమని చెప్పాలి?
ఈ మనోమృగం ‘ఇంద్రియములు’ అనే గ్రామానికి వచ్చి గ్రామసింహంలాగా (కుక్కవలె) పరుగులెత్తటం ప్రారంభిస్తోంది. అక్కడ ‘కామము’ అనే దుస్సాధ్యమైన భయంకరమైన పిచ్చి ఎత్తిన ఏనుగు ఎదురుపడగా ఆ ఏనుగు కాళ్ళ క్రిందపడి నుజ్జునుజ్జు అవుతోంది.
ఈ మనోమృగం యొక్క శరీర భాగములు ‘క్రోధము’ అనే దావాగ్నిచే దహించబడటంచే అనేక బొబ్బలు కలిగి ఉన్నదగుచున్నది. విషయాలలో మరల మరల సంచరించటం చేత ‘చింతశోకము’ అనే దీర్ఘవ్యాధులు ఆ మనస్సు యొక్క అంతఃకరణమును ఎంతగానో బాధిస్తున్నాయి.
ఈ మనోమృగం తనయందు పేరుకొనియున్న అనేక అభిలాషలచే ఉపద్రవములెన్నిటినో తెచ్చి పెట్టుకొంటోంది. భోగేచ్ఛలతో కాళ్ళు అరిగిపోయేటట్లుగా సంసారమనే ఎడారిలో పచార్లు చేస్తోంది. స్వకర్మచే ఉత్పన్నమైన అనేక దారిద్య్రములచే పీడించబడుతోంది. పుత్ర-మిత్ర కళాత్రాదుల పట్ల వ్యామోహంచే గ్రుడ్డిదిగా అయి ’కపటములు-నీచకృత్యములు’ అనే గోతులలో మ్రగ్గుతోంది. ‘మానము’ అనే భూతమును తనయందు ఉంచుకొని తత్ఫలితంగా అనేకసార్లు అవమానములపాలు
Page:769
అవుతోంది. తాను నమ్ముకొన్నవాటినన్నిటినీ ‘మృత్యువు’ అనే చోట పోగొట్టుకొని అలమటిస్తూ మరల మరొక చోట ప్రయాణానికి ఉపక్రమిస్తోంది.
‘గర్వము’ అనే కొండచిలువ ఆ మనస్సును అనేకసార్లు దిగమ్రింగగా అదిపడే పాట్లకు అంతులేదు. అనేక కోరికలు కలిగి ఉన్న కారణంగా దీనత్వమును, యాచకత్వమును పొందుతోంది. కాసేపు ఇంపైన దేహం ధరించి, ఇంద్రియములచే మోసగింపబడినదై… ఇంతలోనే ఆ ఇంద్రియములచే ఎచ్చటనెచ్చటనో నీచ ప్రదేశములలోకి విసరివేయబడుతోంది.
ఓ రామచంద్రా! రాత్రి పూట ‘అంధకారం, (మరియు) భయంకరమైన చలిచే’ పీడితుడగు చున్న ఓ మనుజుడు తెల్లవారి సూర్యుడు ఉదయించగానే సుఖ శాంతులను పొందుతాడు చూచావా! అనేక దోషములను తన యందు ప్రోగు చేసుకొని ఈ సంసార ముళ్ళ పొదలలో చిక్కుకున్న ఈ మనస్సు అనేక జన్మలలో ఆర్జించుకున్న పుణ్యవశం చేత అధికారి దేహము సంపాదించుకుని ‘శమము-దమము’ మొదలైన సాధనలచేత మనం ఇంతకుముందు చెప్పుకొన్న వైరాగ్య-సమాధి వృక్షం క్రింద చేరిందా… ఇక పరమ విశ్రాంతి పొందగలదు. ఓ ప్రియ సభికులారా! ఈ ప్రపంచంలో కనిపించే ఆయా భోగములలో మీ మనస్సు విశ్రాంతిని పొందింప జేయటమనేది - ఒక మృగం ఎండకు తాళలేక తాటి వృక్షం క్రిందకు వెళ్ళటం వంటిది. తాటి వృక్షపు నీడ వడగాలితో కూడిన ఎండనుండి కాపాడగలదా? లేనే లేదు. ‘సమాధి’ అనే చోట మాత్రమే మీ మనస్సు నిరతిశయమగు విశ్రాంతి పొందగలదని, సంపాదించుకోగలదని గమనించండి.
అనేక కార్యక్రమములలో ఉంటూ కూడా, ’సమాధి’ని తప్పక అభ్యాసపూర్వకంగా. నిర్వర్తించవచ్చని ఈ సందర్భంలో సకల జనులకు గుర్తు చేస్తున్నాను. అట్టి నిశ్చల ఆత్మదృష్టిని సకల జనులకు గుర్తు చేయడానికే నా తండ్రి, జగత్పిత అయిన బ్రహ్మదేవుడు నన్ను సృష్టించటం, ఈ అవతారమూర్తి రామచంద్రమూర్తి వేంచేయడం… మొదలైనవన్నీ ఉద్దేశింబడినాయి. సుమా!
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ మనస్సు ‘ధ్యానము’ అనే సమాధి వృక్షమును సమీపించిన తర్వాత అప్పుడు ఉత్తరోత్తర స్థితులు ఎట్లా ఉంటాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : చెబుతాను విను. ‘ధ్యానము’ అనే వృక్షపు నీడను జేరిన మనస్సు ఇక ఆ ధ్యానమునందే ప్రీతి కలిగి మరొక వృక్షమును దేనినీ కోరుకోదు. ధ్యానమే సమాధి యొక్క రూపం. మెల్లమెల్లగా ఆ మనస్సు ధ్యాన ప్రభావం చేత ‘అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞాన మయ-ఆనందమయ’ కోశములకావల ఉన్న ‘ఆత్మ స్వరూపము’ అనే కైవల్య ఫలముపై ధ్యాస మరలుతోంది. క్రమక్రమంగా ఉత్తరోత్తరభూమికలు పూర్ణముగా ప్రకటన మగుచున్నాయి. ఆ మనస్సు ‘ఆత్మ సాక్షాత్కారం’ వైపు దృష్టి సారించగానే ఇక ప్రాపంచిక వస్తువులపై విరక్తి స్వభావ
Page:770
సిద్ధంగా (వేరే ప్రయత్నం ఏదీ లేకుండానే) కలుగుతోంది. మధురఫలం కనబడిన తర్వాత పచ్చికాయల వైపు నుండి దృష్టి మరలటం స్వభావసిద్ధమే కదా! ఇక ఆ మనస్సు వివేక వృక్ష - ఆరోహణం ప్రారంభిస్తోంది.
దేహాదులను అధిగమించటం - అట్టి మనస్సు దేహము-తత్సంబంధమైన ప్రాపంచిక వస్తువుల పట్ల అహంకార మమకారాలు త్యజించటం ప్రారంభిస్తుంది. సంసార పదార్థాల పట్ల ఇష్టవృత్తి తొలగనారంభిస్తుంది. ‘నేను-నాది అనేది భ్రమ మాత్రమే’ అనే నూతనమైన అవగాహన అంకురించ నారంభిస్తుంది.
సాంసారిక సంస్కార త్యాజ్యం - వివేక వృక్షమును అధిరోహిస్తున్న మనస్సు ’ఆత్మ సాక్షాత్కారము’ అనే మహాశయ ప్రభావం చేత నెమ్మది నెమ్మదిగా పూర్వార్జితమై సంస్కారములను త్యజించటం ప్రారంభిస్తుంది. అంతకుముందటి తన మానసిక స్థితిగతులను, విలువలను గమనించి ఇప్పుడు నవ్వుకోవటం ప్రారంభిస్తుంది.
హసతి ఉఛ్ఛాః పదారూఢమ్ ఆత్మానమవలోకయన్ I
’ఏతావన్తమ్ అహమ్ కాలం కృపణః కో అభవంతి?’ ఇతి ॥
ఆత్మయొక్క ఔన్నత్యమేమిటో గ్రహించిన ఆ మనస్సు “అరెరే! ఇంత కాలంగా ఈ ’ఇంద్రియ విషయములు’ అనే స్వల్ప విషయాలే గొప్పవనుకొని అనేక దేహ వృక్షాలలో సంచరిస్తూ… ఈ ధ్యాన వృక్షంపై గల మధురమైన ‘ఆత్మావలోకనం’ అనే పండును ఎందుకు ఏమరచాను? ఈ ప్రాపంచిక విషయాలు ఎంత స్వల్పమైనవి!”… అని బిగ్గరగా నవ్వటం ప్రారంభిస్తుంది.
మైత్రి-కరుణ :ఇక ఆ మనస్సు తదితర సహజీవులతో వ్యవహరిస్తున్నప్పుడు స్వభావ సిద్ధముఅకారణము-ఆత్యంతికము అగు మైత్రి, కరుణ ప్రదర్శిస్తూ ఉంటుంది. పూర్ణకాముడై లోభమును త్యజించినవాడై ఉంటాడు. దినదినము మనస్సు తృష్ణను జయించి ఉంటుంది.
ఉపేక్ష-అపేక్ష రాహిత్యము:
ఉపేక్షతే న సంప్రాప్తం, న అప్రాప్తం అభివాంఛతి |
సోమ సౌమ్యౌ భవతి అన్తఃశీతలః సర్వవృత్తిషు ॥
ఆ మనస్సు ప్రాప్తించిన పదార్థాలను ఉపేక్షించదు. ప్రాప్తించని పదార్థములను అపేక్షించదు. సర్వ వృత్తులలో చంద్రుని వలె సౌమ్యమైన అంతఃకరణం కలవాడై, శీతల స్వభావుడై అతడు ఉంటాడు.
శాస్త్రముల అర్థ పరిశీలన - అట్టి సమాధి వృక్షముపైనే ఆసీనమై అతడు శాస్త్రార్థములోని అతిసూక్ష్మ తంతువుల శబ్దమును గ్రహిస్తూ ఉంటాడు.
ఇక ఉత్తోరత్తర భూమికలను అధిరోహిస్తూ, మనోహరమైన చిత్తవృత్తి సహితుడౌతాడు. జ్ఞానవంతుడై ఈ పుత్ర-మిత్ర-స్త్రీ-ధనాది సమస్త పదార్థములను స్వప్నములోని విషయాలవలెను, మరొక జన్మకు సంబంధించిన విశేషాలుగాను దర్శిస్తూ ఉంటాడు. అతనికి ఇక్కడ కనబడే రాగద్వేష-భయ-ఉన్మాద-అభిమాన-మోహాల ఆధిక్యత నటులు ప్రదర్శించే (కృత్రిమ) నటనలాగా
Page:771
కనిపిస్తుంది. వారికి ఎదురుగా ఈ సంసారము ఉన్నప్పటికీ ఇదంతా మృగతృష్ణ వలె మిథ్యగాను, నిస్సారంగాను అగుపడుతుంది. తరంగముల వలె క్షణభంగురంగాను, పిచ్చివాని చేష్టల వలె అర్థరహితంగాను కనిపిస్తుంది. ఆతడు అపూర్వము - - నిత్య సంసిద్ధము అగు ఆత్మపదమునందు విశ్రాంతి పొందినవాడై జీవించియున్నను అజ్ఞానివలె లోకైషణ, దారైషణ, ధణైషణ మొదలైనవి లేకుండుటచే సాంసారిక జీవుల దృష్టికి జడునివలె ఉంటాడు.
అట్టి స్థితిలో అతడు కేవలం శుద్ధమైన, కేవలమైన, బోధమయమైన, మహోన్నతమైన ఆత్మ ఫలమునకు అర్హత సంపాదించుకొంటూ ఉంటాడు. పూర్వపు అజ్ఞాన దశల వలన కలిగిన ఆపదలను గుర్తించుకొంటూ జ్ఞాన బలంచే శ్రద్దను వీడక ఉంటాడు. ‘సంతోషము’ అనే పానీయము త్రాగి భగవన్మత్తుడై ఉంటాడు. అనర్థ రూపములగు ధనాదులు నశించినప్పుడు కూడా అదంతా అతనికి సంతోషమే కలుగజేస్తుంది గాని, దుఃఖం కాదు. అది ఐదవ భూమికాస్థానం అని అంటూ
ఉంటారు.
శ్రీరాముడు : స్వామీ! తదితరులు అతనిని బలవంతంగా భోగదాయకములగు ఆవశ్యకకార్యముల వైపుగా బలవంతంగా మేలుకొలుపుతూ ఉంటారు కదా! అప్పుడు ఆ ఐదవ భూమికలో ఉన్నవారికి ఇబ్బంది కదా!
శ్రీవసిష్ఠ మహర్షి : అవును. ఎవరైనా భోగదాయకములగు ఆశశ్యక కార్యముల వైపుగా అతనిని ప్రోద్బలం చేస్తున్నప్పుడు, అతనికి గాఢనిద్ర నుండి బలవంతంగా మేల్కొలుపబడిన మానవునివలె అప్రసన్నంగానే ఉంటుంది. దీర్ఘమైన ప్రయాణంచేసి ఒకచోట కొంచెం నడుం వాల్చిన వానిని మరల నడకకు ఉపక్రమించడమంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! దీర్ఘకాలంగా జననమరణాలతో కూడిన సాంసారిక బాటయందు అజ్ఞానంచేత చరించిన ఆ జీవబాటసారి ఇప్పటి వివేక సమాధియందు ఉదారతతో కూడిన అబాధితమైన ఆత్మ విశ్రాంతి అవిఘాతంగా ఉండాలని కోరుకొంటూ ఉంటాడు. ప్రాణధారణచే అతడు తదితర జనులలాగానే బయటకు కనబడు చున్నప్పటికీ అతడు అంతరమున అహంకార రహితుడై కట్టెలు లేని అగ్నివలె ప్రకాశిస్తూ ఆత్మ యందు శాంతిని చవిచూస్తూ ఉంటాడు. అభ్యాసవశంగా బాహ్యపదార్థముల పట్ల విరక్తి గలిగి ఉంటూనే, యథాప్రాప్తములయ్యే వాటిని నిరాకరించటానికి కూడా చిత్తము కలిగి ఉండడు.
ఈ ప్రకారంగా పరమార్థ ఫలమును కలుగజేసే గొప్పదగు ఆత్మ పదమువైపు ప్రయాణిస్తూ క్రమంగా మాటలకు అందజాలని, అగోచరమైన ఆఱవ భూమికను పొందుచున్నాడు. ఇకప్పుడు బాటసారికి బాటప్రక్కన ఉన్న శ్మశాన భూములపై ఇష్టము కలుగనట్లుగా సర్వ భోగముల పట్ల అతడు విరక్తి కలిగి ఉంటాడు. సంసార వృత్తులన్నిటిపట్ల అతడు నిదురించి ఉంటాడు. ఆత్మానందంచే మదోన్మత్తుడు అవుతాడు. క్రమంగా పరిపూర్ణమైన మనస్సు పొంది ఒకానొక అనిర్వచనీయ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. అట్టి స్థితి యందు అతడు ‘మోక్షము’ అనే పరమార్థ ఫలమునకు అత్యంత సమీపంలో ఉంటాడు. ఆ తర్వాత ఏడవ భూమిక పొందుచున్నాడు. అప్పుడిక ఆకాశం వలె
Page:772
విశాలరూపుడై ఉంటాడు. సమస్త వాసనలను, బుద్ధి వృత్తులను త్యజించి ఆవరణ-విక్షేప రహితుడౌతాడు. నిరతిశయానందమగు ‘బ్రహ్మభావం’ అనే ఫలాన్ని అస్వాదిస్తూ, అద్దానిచే అత్యంత తృప్తుడౌతాడు. ఓ రామచంద్రా! ‘పరమార్థ ప్రాప్తి’ అనునదే ఈ జీవుని యొక్క పరమావధి సుమా!
సంకల్పార్థ పరిత్యాగాత్ దిన - అనుదినమ్ ఆతతా |
శుద్ధ స్వభావ విశ్రాన్తిః ’పరమార్థాప్తిః’ ఉచ్యతే ॥
సంకల్పిత పదార్థాల యొక్క పరిత్యాగపు ప్రభావం చేత ఆరోజుకారోజు సంభవించే విశాల మైన ‘శుద్ధాత్మ స్వభావం’ నందలి విశ్రాంతియే ‘పరమార్థ ప్రాప్తి’ అని చెప్పబడుతోంది. శ్రీరాముడు : మహాత్మా! ‘బ్రహ్మము’ అని దేనిని విజ్ఞులు పిలుస్తున్నారో విశదపరచండి. శ్రీవసిష్ఠ మహర్షి
భేద బుద్ధిః విలీనార్థ అభేదేవ అవశిష్యతే |
శుద్ధమ్ ఏకమ్ అనాద్యంతం “తత్ బ్రహ్మేతి” విదుర్ బుధాః ॥
చూచేవాడు-చూడటం-చూడబడేది, అనుభవించేవాడు-అనుభవించటం-అనుభవించబడేది …ఇట్టి త్రిపుటిని గూర్చిన భేదబుద్ధి విలీనం కాగా… అప్పుడు అభేదం-శుద్ధం-ఏకం-అనాదిఅనంతం అగు సాక్షిమాత్ర చైతన్యం శేషిస్తోంది. అట్టి శుద్ధ చైతన్యమునే విజ్ఞులగు శాస్త్రకారులు ‘బ్రహ్మం’ అనే పేరుతో పిలుస్తున్నారు. అట్టి బ్రహ్మానుభవమే బ్రహ్మపదము.
‘లోకైషణా’ విరక్తేన, త్యక్త ‘దారైషణ’ ఏన చ
‘ధనైషణా’ విముక్తేన తస్మిన్ విశ్రామ్యతే పదే ॥
లోకేషణ, దారైషణ, ధనైషణ… వీటిని ఈషణత్రయం అంటారు. అట్టి త్రివిధములైన ఈషణము లను పరిత్యజించిన మనుజునకు బ్రహ్మపదమున విశ్రాంతి లభిస్తుంది.
సర్వ భేద బుద్ధులు విలీనమైపోవాలి సుమా! అప్పుడే ఈ చిత్తము ‘చిత్’ ను సందర్శించగలదు. చిత్తశోధన - ’దృశ్యము’ యొక్క తత్త్వశోధనచే ‘సత్’ మాత్రము శేషిస్తోంది. ’ద్రష్ట’ యొక్క తత్త్వశోధనచే ‘చిత్’ మాత్రము (ఎఱుక) శేషిస్తోంది.
అఖండైక్యము వలన నిరతిశయానందరూపంగా ఈ చిత్తము పరిణమిస్తోంది. అప్పుడు చిత్తము యొక్క అంతిమ సాక్షాత్కార వృత్తి చేత ‘భేదబుద్ధి’ నశించిపోగలదు. కోమలమగు పూల దండను ఏ ఆకారంగా పరచినప్పటికీ మరల చేతితో తీసుకోగానే యథాతథమైన ఆకృతిని పొంద గలదు కదా! అట్లాగే, ఆత్మసాక్షాత్కారము పొందిన చిత్తము ఉన్నా కూడా… ఇతఃపూర్వపు అజ్ఞాన స్థితిని ఏమాత్రం పొందదు. అదిగో! ఆ ఎదురుగా కనబడే శిలను చూడు. ఆ శిలలో ఒక శిల్పి విష్ణుమూర్తి యొక్క నాలుగు చేతులను-పాదములను తన శిల్ప లాఘవంతో చిత్రీకరించగలడు. అనగా, కాబోయే శిల్పము శిలలోనే ఉన్నది కదా! కానీ ఇప్పుడు కనబడుతోందా? లేదు. శిలలో గల అప్రకటితమైన శిల్పము (విగ్రహము) ఉండియు లేకయు (సత్తుగాని-అసత్తుగాని) కూడా
Page:773
ఎట్లున్నదో … ఆ పరమాత్మ యందు ఈ విశ్వము యొక్క స్థితి ఉన్నదని గ్రహించు. ఆత్మసాక్షాత్కారము పొందిన చిత్తమునకు జగత్తు సత్తుగాను అసత్తుగాను కాకయే ఉన్నది.
శ్రీరాముడు : పరమాత్మను సాకారునిగా కొందరు కొలచుచున్నారు. మరికొందరు అతడు సాకారుడు అవటానికే వీలులేదని వాదనలు చేస్తున్నారు. ఏది యుక్తియుక్తం?
శ్రీవసిష్ఠ మహర్షి : సాధక భక్త జనుల సౌకర్యార్థం నీవు ఇన్ని రోజుల సంవాదానంతరం కూడా ఇట్లు ప్రశ్నిస్తున్నావని నేను గమనిస్తున్నాను. సందేహ నివృత్తి అత్యంతావశ్యకం కాబట్టి సముచితమే!నీ ప్రశ్నకు సూటి అయిన సమాధానం మరల ఒక్కసారి చెప్పుచున్నాను. విను.
ధ్యానం నశక్యతే కర్తుం నచైతత్ ఉపయుజ్యతే | అబోధేన విబుద్ధస్తు స్వయమ్ అతైవ తిష్ఠతి ॥
ఓ రామచంద్రా! చిత్తం ప్రపంచమును నమ్మియున్నప్పటి అజ్ఞాన దశయందు నిష్ప్రపంచక మగు బ్రహ్మమును గూర్చిన ధ్యానం కష్టతరం అవగలదు. అజ్ఞానం యొక్క ప్రభావం చేత ప్రపంచ రహిత బ్రహ్మము ధ్యానించటం శక్యం కాదు… అని చెప్పవచ్చు. అంతేకాదు. అది యుక్తియుక్తం కూడా కాదు. అట్లాగే, ప్రబుద్ధమైన చిత్తమును సముపార్జించుకున్న తర్వాత స్వయంగానే తత్ బ్రహ్మ భావం (నిష్ప్రపంచ బ్రహ్మం) నందు స్థితి కలుగుతుంది. అట్టి స్థితిలో తన ఆరాధ్యమును సాకార పరిమితం చేయటం కూడా కష్టమే అవుతుంది. అయితే ‘బ్రహ్మమే ఈ జగత్తు రూపంలో ఉన్నది’ అను పూర్ణ గ్రాహ్య స్థితిలో సాకార-నిరాకార ధ్యానాలకు సంబంధించిన విరోధ భావాలన్నీ తమంతట తామే తొలగుతాయని కూడా గ్రహించు. సర్వ దృశ్య పదార్థములపట్ల ఎవనికి సంపూర్ణ వైరాగ్యం ఉంటుందో… అతడే జ్ఞాని. ఎందుకంటే జ్ఞాని మాత్రమే దృశ్యమును త్యజించగల సమర్థత కలిగి ఉంటాడు. అజ్ఞానికి దృశ్యమును త్యజించగలిగే సమర్థత ఉండదు. దృశ్యం యొక్క సాక్షీరూప బోధయే బ్రహ్మం. అట్టి సాక్షి రూప బోధచే మాత్రమే ఈ దృశ్యం యొక్క యథార్థ స్వరూప స్థాపనకు సమాధానం. అదియే సమాధి.
సమ్యక్ ఆధానం = సమాధానం (దృశ్యం యొక్క వాస్తవ రూపాన్ని గ్రహించటమే సమాధానం) అదియే సమాధి. అట్టి బోధచే ఈ దృశ్యము నాశరహితమగు బ్రహ్మమే అగుచున్నది.
ఎప్పుడైతే ద్రష్ట (సాక్షి)- దృశ్యముల యొక్క ఐక్యముతో మనోవృత్తి ఏకమగు అఖండాత్మా కారమున స్థితి కలిగి ఉంటుందో… అదియే సమాధి యందలి విశ్రాంతి. దృశ్య స్వభావ విరుద్ధమైన (‘దృశ్యము తనకు అభేదం’ అను అవగాహనతో కూడిన) చిదానంద స్వభావమే బ్రహ్మజ్ఞాని యొక్క నిజ స్వభావం. ’దృశ్యము వైపుగా ఉన్ముఖమవడమే (నేను చూచే వాడిని - ఇది చూడబడేది… అనే -
భేద భావమే) అజ్ఞానము’… అని విజ్ఞులు పలుకుచున్నారు.
ఈ సాంసారిక విషయాలు (ద్వితీయంగా) అజ్ఞానికి మాత్రమే వాటి వాటి భేద రూపాలుగా కొన్ని స్వాదిష్టములుగా తోచుచూ ఉంటాయి. జ్ఞానికి ఇందులో ఇష్ట - అయిష్టములు ఉండవు. అమృతం తాగేవాని దగ్గరకు వెళ్ళి ‘ఏవయ్యా! ఆ అమృతం త్రాగటం ఆపి ఈ పాత్రలోని కల్లు తాగకూడదా?’… అంటే అతడు ఇష్టపడతాడా? లేదు.
Page:774
ఓ రామచంద్రా! ఎవడు తన హృదయంలోని ‘తృష్ణ’ అను మకిలిని తొలగించుకొంటాడో, లోక-స్త్రీ-ధన ఈషణాలను పరిత్యజిస్తాడో, ఆత్మనిష్ఠ అభ్యసించ నారంభిస్తాడో… అట్టివానికి ’ధ్యానం - సమాధి’ అనేవి అప్రయత్నంగానే కలుగుతాయి. తృష్ణ ఉన్న చోట ఆత్మ స్వరూప-అనుసంధాన రూపమగు బోధ చలించిపోతుంది. గురువుల వాక్యములు సత్ఫలితమగు ప్రయోజనం కలిగించ లేవు. ఎవనికి తృష్ణ ఉండదో, అట్టి తత్త్వజ్ఞునకు ద్రష్ట-దర్శన దృశ్యములనే త్రిపుటికి చోటే దొరకదు.
మరొక విధంగా… తృష్ణారహితుడైన జ్ఞాని యొక్క తృష్ణ అనంతత్వము సంతరించుకోగలదని కూడా చెప్పవచ్చు. ఏ విధంగా అంటావా? తృష్ణారాహిత్యం యొక్క ప్రభావం చేత అకృత్రిమమైన సమాధిని అవధరించిన మహానీయుడు స్వయంగా విభాగరహితమైన అనంతాత్మ స్వరూపంగా ఉదయించుచున్నాడు. అనగా, సర్వ ధ్యానములు అతనివే అగుచున్నాయి. అతని యొక్క సర్వత్రా అనురాగమే విరాగమగుచున్నది. అట్టివాని చింతనీయమగు బాహ్య పదార్థ సంబంధమైన బోధ ఎట్లా ఉన్నప్పటికీ,… అతడు తన చిత్తమును సమాధియందు లగ్నము చేసినా (లేక) చేయకపోయినా కూడా… వ్యవహార తత్పరుడు అయినా (లేక) కాకపోయినా కూడా… అతడు సంసార ధ్యాత కాడు. అతని దృష్టియందు అంతా కూడా ఆత్మరూపంగానే ఉంటుంది. కనుక అతడు సమాధిని అవధరించినవాడే అవుతాడు. టెక్కలు లేని పక్షికి స్వయంగా నిశ్చలత్వం సంభవించినట్లుగా… తృష్ణారహితుడగు జ్ఞానికి అనంతాత్మ యొక్క ధ్యానం స్వయంగా (వేటే ప్రయత్నమనేదేదీ లేకుండానే) కలుగుతోంది. అతనికి శుద్ధ బోధ రూపమగు ఆత్మ సాక్షాత్తుగా అనుభూతమౌతూ ఉండగా ఇక జ్ఞాన విరోధమైనదంటూ ఏదీ ఉండదు. ప్రజ్వలిస్తున్న అగ్నిలో నెయ్యి బిందువు ఉండదు కదా!
పరం విషయ వైతృష్ణ్యం సమాధానముదాహృతమ్ |
అహృతం యేన తన్నూనం తస్మై నృబ్రహ్మణే నమః ॥
సంపూర్ణ విషయతృష్ణా రాహిత్యమే ‘సమాధి’! విషయం తృష్ణారాహిత్యాన్ని ఎవరు సంపాదించు కుంటారో, అట్టి స్వయంబ్రహ్మ స్వరూపునికి నా నమస్కారాలు సమర్పిస్తున్నాను. ఎవరికి నిజమైన విషయతృష్ణా రాహిత్యం యొక్క ప్రభావం చేత, జ్ఞానం చేత సమస్త భేదాలు నశిస్తాయో, అతనిదే ‘ఉత్తమం-దృఢం’ అయిన ధ్యానం. వాని ఆత్మధ్యానం తొలగించటానికి ఇంద్రాది దేవతలు, అసురులు కూడా చాలరు. ఓ ముముక్షువులారా! మీరంతా కూడా అట్టి దృఢమైన ఉత్తమమైన (తృష్ణారహిత) ధ్యానాన్ని సంపాదించుకొనెదరు గాక! తృణ ప్రాయమైన ఇతర ధ్యానాల వల్ల ఏం ప్రయోజనం?
శ్రీరాముడు : మహర్షీ! ప్రపంచము-ప్రపంచాధీశుడగు పరమాత్మ… అను ఈ రెండింటినీ సమగ్రంగా అవగాహన చేసుకోవటమెట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : ’ప్రపంచం’ అనే శబ్దం, అద్దాని అర్థం ప్రతిపాదించబడేదంతా అజ్ఞాని యొక్క అజ్ఞాన నాశనం కొఱకే గాని, జ్ఞాని కొఱకు కాదు. సర్వ సభికులారా! ఏ నిరతిశయానంద ప్రపంచం,
Page:775
ప్రపంచాధీశుడు - ఇవన్నీ కూడా ఏకరూపమై అభిన్నంగా భాసిస్తాయో అట్టి బ్రహ్మం నందే విశ్రాంతిని పొందండి. ఎందుకంటారా? ఆత్మ తప్పితే ఇక్కడగాని, మరొక చోటగాని మరింకేదీ లేదు. 1.ఆరుక్షువుల యొక్క (సాధనపరుల), 2. ఆరూఢుల యొక్క (యోగాన్ని అధిరోహించినవారి)
సర్వ మననాది ఆయా భూమికలన్నిటిలో ఆత్మకంటే వేరైన సత్త-అసత్తలు గాని, మరింకే ద్వైతాద్వైతములు గాని లేవు. అట్టి తదితరములైన ఏవైనా కార్యక్రమములు శాస్త్రములు ఎక్కడైనా చెప్పటం జరిగితే అవన్నీ అజ్ఞుల కొరకే గాని, విజ్ఞుల కొరకు కాదు.
శ్రీరాముడు : అట్టి బ్రహ్మమునందు విశ్రాంతి పొందటానికి సాధకులమగు మాకు ఏవైనా సుల భోపాయలు చెప్పండి.
శ్రీవసిష్ఠ మహర్షి : అందుకు 3 సులభోపాయలు చెబుతాను, విను.
ఉపాయ ఏకః ’శాస్త్రార్ధో’, ద్వితీయో ‘జ్ఞసమాగమః’|
‘ధ్యానం’ తృతీయం నిర్వాణే శ్రేష్ఠః తత్ర ఉత్తరోత్తరః ||॥
మొదటి ఉపాయం నిరంతర శాస్త్రార్థములను అభ్యసించటం; రెండవ ఉపాయం విజ్ఞులను సమీపించి, శరణువేడి వారితో సంభాషిస్తూ ఉండటం; మూడవ ఉపాయం - - ధ్యానం (శాస్త్రార్థాలను వివేకంతో మననం చేస్తూ ధ్యాసను జగత్మ నుండి పరమాత్మవైపు తరలించడం) .ఈ మూడు పై వరస ప్రకారం ఒక దానికంటే తరువాతది శ్రేష్ఠమైనది.
అపరిచ్ఛిన్నము, నిత్యం అపరోక్షమైనది (ప్రత్యక్షముగాని, పరోక్షముగాని కానిది) అగు బ్రహ్మ చైతన్యమే ఈ ’జీవుడు’ అను రూపము పొందింది. స్వ ప్రతిబింబమే దర్పణంలో అగుపడునట్లు బ్రహ్మమే అంతఃకరణోపాధి వశంచేత పరస్పరం భిన్నం అయినట్టి ఈ జీవుడు అనబడు రూపం గ్రహిస్తోంది సుమా! ఈ జగత్తులో రాగద్వేషముల సంఘటనచే బ్రహ్మ మొదలు స్తంభము వరకు అనేక విశేషాలున్నాయి. అయితే స్వతఃసిద్ధము-శుద్ధము అగు చైతన్యమే ఈ సర్వ విశేషములందు అంతటా వ్యాపించి ఉన్నది. స్వకర్మ వైచిత్రముచే ఈ కనబడే సమ-విషమ శరీర భేదములందు అంతటా ఉదయించి ఉన్నది ఆ చైతన్యమేనయ్యా! ఈ జీవుడు బ్రహ్మమే అయి ఉండి కూడా ఈ నిస్సార జగత్తులో జన్మకర్మాదులన్నీ ఆశ్రయిస్తూ సుదీర్ఘ కాలం వెళ్ళబుచ్చుచున్నాడు.
ఇట్లు సంసార చక్రంలో తిరుగాడుచున్న అసంఖ్యాక జీవులలో ఒకానొకడు సౌభాగ్యవశం చేత మోక్షమునకు అధికార యోగ్యమగు జన్మను పొందుచున్నాడు. అట్లా పొంది, శాస్త్ర జ్ఞానం, సజ్జనులతో సాంగత్యం… ఇటువంటి ఉపాయాలు ఆశ్రయిస్తున్నాడు… అప్పుడు సమస్త ‘జననమరణ-భ్రమణ’ రూపమగు ఈ ‘జగత్తు’ అనే ఆట యొక్క పూర్వపరాలేమిటో చక్కగా గ్రహిస్తు న్నాడు. అట్లు బాగుగా ఎఱిగిన మహాత్ముడు 1. జ్ఞానం, 2. తృష్ణారాహిత్యం అనే రెండు దీపాలలో ఒకదానిని వెలిగిస్తున్నాడు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి సిద్ధించినా కూడా రెండవది తనంతట తానే సిద్ధించగలదు. ఇక ఈ జగత్తు విషయమంటావా? అగ్నితో భస్మీభూతమైన దూదిప్రోగులు గాలిచే ఎగురగొట్టబడి ఆకాశంలోకి ఎగసిపోవునట్లు జగద్విషయాలన్నీ కూడా ఏదో అనామక ప్రదేశంలో
Page:776
పడిపోతాయి! అట్లాగే జ్ఞానాగ్నితో భస్మీభూతమైన జగత్భావనలన్నీ ఆత్మ బుద్ధి అనే గాలిచే ఎరుగగొట్టబడి శాంతమగు పరమాత్మ అనే ఆకాశంలో ఎచ్చటనో లయమైపోతాయి.
శబ్దమాత్ర జ్ఞానం -
చిత్రాగ్నినేవ బోధేన తేన జాడ్యం న శామ్యతి ।
నిర్మూలాపి జగత్ భ్రాంతిః ఏనాశు న విలీయతే ॥
ఓ రామచంద్రా! కొందరు వేదాంత జ్ఞానాన్ని మాటలతో పలుకుచున్నారు గాని… అనుభవైక వేద్యం చేసుకొనే ప్రయత్నం చెయ్యటం లేదు. చిత్రపటంలోని అగ్నిచే చలిపోతుందా? పైపై జ్ఞానంచే అజ్ఞాన మూలం నశించదు. అట్టి ఆపాత జ్ఞానంచే జగద్ర్భాంతి త్వరగా తొలగిపోయినట్లే కనిపించి నప్పటికీ కూడా… వాస్తవానికి అజ్ఞానం “నిర్మూలనం కానిదే” అగుచున్నదని గుర్తు చేస్తున్నాను.
ఏ విధంగా అజ్ఞానికి అతని అజ్ఞత్వం కారణం చేత జగద్ర్భాంతి రోజు రోజుకూ అభివృద్ధి చెందుతూ ఉంటుందో… అదే విధంగా జ్ఞానికి తన యొక్క విజ్ఞాన కారణం చేత జగత్ప్రమ రోజు రోజుకూ తరుగుతూ వస్తుంది. అజ్ఞానం కలిగి ఉండకపోవటమే జ్ఞానానికి గుర్తు. అట్లు దహించివేయ బడిన అజ్ఞానం గల జ్ఞాని యొక్క దృష్టికి ‘జగత్తు’ శబ్దార్థ రహితమైనదిగా కనబడుతుంది. అజ్ఞానికి కనబడే జగత్తు జ్ఞానికి చిత్రపటంలోని స్వర్గ మర్త్య-పాతాళ లోకాలుగానూ, ‘శూన్యం’ అనే మూల పదార్థంచే తయారుచేయబడిన బొమ్మలకొలువుగాను, నిద్రించిన వానిచే కల్పించబడిన స్వప్నదృశ్యం గాను అనిపిస్తోంది. జ్ఞాని యొక్క అనుభవమునకు ఇక్కడి చిత్తం, ఆ చిత్తం వెంటనంటి ఉండే ఇచ్ఛ, ఆ ఇచ్ఛకు కనిపించే జగత్తు ఇవన్నీ కూడా చిదాకాశముగానే తెలియవస్తున్నాయి. ఎందుకంటే బోధ ఉదయించిన తర్వాత జ్ఞానికి ఇచ్ఛా జగత్తులు రెండూ ఇక మచ్చుకనైనా ఉండజాలవు.
అహంకాం = “ఏకం - - అఖండం -సర్వం అయిన చిదాకాశం (లేక, బ్రహ్మం) కంటే నేను వేఱుగా ఉనికి కలిగి ఉన్నాను. ’నేను’తో బాటు ‘నాది’ అనేది ఉంది…” అనే దర్శనం.
జగత్ స్థితి = ‘పరమాత్మకు అన్యమై ఈ జగత్తు కలదు’ అనే దర్శనం.
… పై ఉభయ దర్శనాలు పరమాత్మ గురించిన అద్వితీయ జ్ఞానం ఉదయించగానే సూర్యోదయా నంతర చీకటి తెరల వలె తొలగిపోతాయి. అట్టి జ్ఞానికి ఈ జగతి స్థితి పరమ ప్రకాశరూపమగు బ్రహ్మముగానే చెన్నొందుచున్నది. అది పూర్ణ ప్రబుద్ధుని స్థితి.
ఇక అర్ధ ప్రబుద్ధుని స్థితో?… అతని చిత్తమునకు ఈ జగత్ స్థితి అనుక్షణికమైన మార్పులతో కూడినదై ఉండటంచేత దీనికి ’ఇది’ అని చెప్పగలిగిన రూపమేదీ కనిపించడం లేదు. అయినప్పటికీ అతనికి 1. బ్రహ్మం, 2. జగత్ స్వభావం అనబడే రెండు వేర్వేరైన తత్త్వములు ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ అర్ధ ప్రబుద్ధుడు ఇంకా ఆత్మతత్త్వమును పూర్తిగా పొంది ఉండకపోవటం చేత… ఆత్మ యొక్క ‘బోధాధిక్యత’ చేత… ఒకప్పుడు ఈ జగత్తును ’ఏకం’గా గాంచుచున్నాడు. ఇక మరొకప్పుడు ఏమఱపు చేత దీనినంతటినీ ’అనేకంగా గాంచుచున్నాడు. ఏక రూపం-అనేక రూపాల మధ్య అతడు సంచారం చేస్తున్నాడు. అంటే బోధ యొక్క ప్రభావం చేత ఒక సమయంలో ’మైత్రి-కరుణ’ మొదలైన ఉత్తమ గుణములను ఆశ్రయిస్తున్నాడు. మరొక సమయంలో ఈ జగత్తును నమ్మి
Page:777
ఉండటం చేత, అజ్ఞానవశం చేత ఇక్కడ పరస్పర వివాదాలతో తాదాత్మ్యం పొందుతూ వ్యవహరిస్తు న్నాడు. అనగా ఆ అర్ధప్రబుద్ధుడు ‘జ్ఞాన అజ్ఞానాలు’ అను రెండింటిలో ఏ భాగం ఎప్పుడు తన యందు ప్రబలంగా ఉంటుందో, ఆ సమయంలో అట్లే తన్మయుడై ఉంటాడు. అతడు తన యొక్క సాధనాక్రమమును కొనసాగిస్తూ ఉండగా పరిపక్వ స్థితిని పొందగలడు. పరిపక్వ స్థితిని పొందిన జ్ఞాని ఇక ఈ జగత్తు యొక్క భావాభావాలు పొందడు. తురీయావస్థలో ఉన్నవాడు జాగ్రత్స్వప్న సుషుప్తులను పొందకయే ఉన్నట్లుగా… జ్ఞాని ఈ జగత్తును చూస్తూ కూడా, దానిని పొందడు. శ్రీరాముడు : హే మహానుభావా! ఈ మనస్సే కదా జగత్తును పొందుచున్నది?
శ్రీవసిష్ఠ మహర్షి : అవును. మనస్సే ఈ జగత్తును పొందుతోంది, త్యజిస్తోంది కూడా! శ్రీరాముడు : ఈ మనస్సు యొక్క రూపం ఏమిటి? అది నశించేది ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి :
వాసనైవ మనః సేయం స్వ విచారేణ నశ్యతి |
అవస్తుత్వాదతో మోక్షో నాత్మనాశే ప్రవర్తతే ॥
మనస్సు యొక్క రూపం వాసనలే! అయితే అట్టి వాసన ‘ఆత్మ విచారణ’ చే నశించగలదు. కాగా, మనస్సు అవస్తుమయమే (మాయ-అవిద్యామయమే) కదా! కాబట్టి మనస్సు (వాసనలు) అవిద్యమానమై ఉన్నంత వరకు మోక్షము సంభవించదు. వాసనలు నశించాయా, మోక్షం స్వతః సిద్ధంగానే ప్రాప్తించగలదు.
ఓ రామచంద్రా! ఈ విధంగా ముముక్షువు యొక్క మనోమృగం ‘ధ్యానం’ అనే వృక్షాన్ని సమీపించి అక్కడ ‘బోధ’ అనే ఫలం సంపాదించుకుంటోంది. పూర్ణపరిపక్వస్థితిని సంపాదించు కుంటోంది. ’పరమాత్మ బోధ స్వరూపము - పరమానంద లక్షణముతో కూడుకున్నది’… అయిన అమృత ఫలమును భుజిస్తోంది. అప్పుడు సంసార బంధనము నుండి విముక్తినొందుచున్నది.
కాబట్టి…‘వివేకం-వైరాగ్యం’ మొదలుగా గల సాధనల ద్వారా ‘ధ్యానం’ సహాయంతో మనస్సును ‘జగత్తు’ అనే అనేకములతో కూడిన స్థానం నుండి ఉపసంహరించి ‘ఆత్మ’ అను ఏకస్థానంలో లయింపజేయుటమే మోక్షప్రాప్తి. లేక “ఈ సంసారం’గా కనబడేదంతా సర్వదా పరమాత్మ యొక్క స్వరూప విన్యాసమే” అనే దృఢానుభవమే మోక్షం.
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ’పరమార్థ ఫలప్రాప్తి’కి సోపానములు ఈ విధంగా ఉంటాయి. 1. ప్రాపంచిక భేద విషయాలపట్ల అనురక్తి, తత్ఫలితంగా జన్మ-కర్మలు
అనురక్తి నుండి … ‘విరక్తి’
విరక్తి నుండి … ‘వైరాగ్యము’
Page:778
ధ్యానముచే పరమార్థ ఫలం తిన్నగా అనుభూతం కాగలదు. అప్పుడీ జీవుడు ముక్తి రూపంగా పరిణామం పొందుతాడు. అప్పటి ముక్తి రూప స్థితిలో అజ్ఞానము నశించిన కారణం చేత-అప్పటి దాకా వెంటనంటి ఉన్న చరమ సాక్షాత్కార వృత్తి రూప బోధ కూడా అసత్తుగా పరిణమిస్తుంది. అప్పుడు ఇతఃపూర్వం ఉండి ఉన్న ‘మనస్సు’ కేవలం పరమార్థమగు ఆత్మ స్వరూపమే అగుచున్నది. ఆ మనస్సు యొక్క పూర్వకాలికమైన విషయాన్వేషణ అనే సంస్కారం ‘నూనె అయిపోయిన తర్వాత దీపం’ లాగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అక్కడ ఇక అనంతమైన ఆత్మ ప్రకాశరూపమగు పరమాత్మదశ మాత్రమే శేషించుచున్నది. అనగా, ధ్యానము యొక్క పరమార్థ ఫలము సంప్రాప్తించటం చేత మనస్సు బోధ రూపత్వం చెందుతోంది. అప్పుడే మనస్సు టెక్కలు తెగిన తర్వాత పడి ఉండే పర్వతం లాగా వజ్రతుల్యమైన దృఢనిశ్చల స్థితిని అవధరిస్తోంది. విషయములు గురించి చింతించుచుండే మనోస్వభావం ఎచ్చటికో పారిపోతుంది. ‘బోధ రహితం-విభాగ శూన్యం-సర్వాత్మకం-సద్రూపం’ అయినట్టి నిర్మల బోధ (చిన్మాత్రం) మాత్రమే శేషిస్తోంది. మనస్సు సర్వ భేదములను త్యజించినప్పుడు ఇక అద్దానిని ‘బోధ స్వరూపం’ అంటారు. అంతేగాని మనస్సు అని అనరు.
పూర్వ కాలంలో ఈ మనస్సు - ఈ జడ దేహాదుల గూర్చిన అవివేకముచే - జడంగానే ఉండేది. ఇప్పుడో, జ్ఞానబలిమిచే సువివేచనచే దేహమును జడమాత్రంగా అది దర్శిస్తోంది. అట్టి దర్శన ప్రభావం చేత బోధ రూపంగా ఉదయిస్తోంది. ఇక ఆ బోధరూప సత్త ’అనాది-అనంతమునిర్మలము’ అగు ఆత్మ ప్రకాశమును కలుగజేయునదిగా అగుచున్నది. సమస్త వాంఛలు త్యజించటం చేత… ‘అనాది’ గాను, అనంతమగు ఆత్మ యొక్క ధ్యానముచే… ‘అనంతం’ గాను, సంసార దోషం తొలగటంచే ‘నిర్మలం’ గాను, ఆ బోధరూపచిత్కళ స్వయంగా సిద్ధిస్తోంది.
ఎంతవరకైతే ఈ ప్రపంచం పట్ల ధ్యానం ఉంటుందో అంత వరకు ఆత్మధ్యానం కుదిరేది కాదు. ఎంత వరకు జీవుడు ఆత్మధ్యానం చేత బ్రహ్మమును పొందలేదో, అంత వరకు విషయాల మననం కారణంగా పరమపదమున విశ్రాంతి లభించదు. పరమార్థమగు ఆత్మతోటి ఏకత్వం పొందిన మరుక్షణం మనస్సు ఎచటికో తుఱ్ఱుమంటుంది. ఆ మనస్సుతోటే దాని సైనికులైనట్టి ‘వాసన-కర్మ-హర్షం-క్రోధం’… వీటికి సంబంధించిన మనోవృత్తులు కూడా ఎచటికో పరుగులు తీస్తాయి. ఆ స్థితియందు యోగి కేవలం ధ్యాన నిష్ఠుడై కనిపిస్తాడు. అతని ఆత్మ ధ్యాన నిష్ఠ అత్యంత దృఢతరమై ఉంటుంది. సమాధిస్థితి ఎప్పుడు సిద్ధిస్తుంది?
ఓ రామచంద్రా! యోగికి సమాధి స్వయంగా సిద్ధించగలిగేది ఎప్పుడో చెబుతాను విను. 1. సమస్త భోగములందు విరక్తి కలిగినవాడు.
Page:779
ఈ దృశ్యం పదార్థములన్నిటి పట్ల ‘అ రుచి’ కలిగియున్నవాడు
ఆత్మనే దర్శిస్తూ ఆత్మయందే రమించే వాడు. అనగా సహజీవులందరిలోని నిర్మలాత్మను అంతరంగ దృష్టిచే అన్నివేళలా దర్శించే అభ్యాసం కలవాడు.
క్రమంగా ప్రాపంచిక వృత్తులన్నీ నశించినవాడు.
మనస్సును ప్రపంచం నుండి ఉపశమింపజేసి విశ్రాంతిని పొందింపజేసినవాడు…
.. అట్టి వానికి సమాధి స్వయంగా సిద్ధిస్తుంది. అప్పుడతనికి సమస్తము బ్రహ్మరూపమే అగుచుండగా ఇక దేనిని గురించి ధ్యానించాలి? ఇక అతనికి శాస్త్రములు ధ్యాననిష్ఠ యందు నియమించవలసిన బోధించవలసిన అగత్యమే ఉండదు. ఎందుకంటే ఆతని అనుక్షణిక దర్శనం ఆత్మభావనచే పరితప్తమై, పరిశ్రుతమై ఉంటుంది.
ఎంత వరకైతే భోగములు కనబడుతూ ఉంటాయో, అంత వరకు విషయ వైరాగ్యమును యోగులు సముపార్జిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఆత్మవంతుడగు జ్ఞానికి వాసనల యొక్క అభావ బలం చేత జగత్పదార్థములు కనబడకయే పోతాయో, అప్పుడు ఆ జ్ఞాని సమాధియందున్నట్లే! అట్టివాడు తదితర సహజీవులను ఉద్దేశించి దేహముతో కర్మలు నిర్వర్తిస్తున్నప్పటికీ అతని సమాధి స్థితికి వచ్చే లోటేమీ ఉండదు.
‘గుడ పిపీలికాన్యాయం’ను అనుసరించి (బెల్లమును ఆశ్రయించిన గండుచీమ ఆ బెల్లమును వదల లేకున్నట్లు) ఆత్మానందనమును ఆస్వాదించ ప్రారంభించిన మనుజుడు ఇక తన మనస్సును ఆత్మాస్వాదన నుండి మరలించనే లేడు.
ధ్యాన యుక్తమగు చిత్తమునందు ’జ్ఞానము’ ద్వారా ఏ విషయ విరక్తి అతిస్వభావికమై ఉంటుందో… అదియే ‘సమాధి’. తదితరమైనదేదీ నిజమైన సమాధి కాదు. రాగాదులతో కూడిన మనస్సు ఎక్కడున్నదో అక్కడ ఎవనికీ నిజమైన సమాధి జనించదని గ్రహించు. రాగము లేని మనస్సు సమాధి స్వరూపమే అవుతుంది.
శ్రీరాముడు : మహర్షీ! భోగాల పట్ల విరక్తి కలిగిన తర్వాత, ఇక ధ్యానాన్ని, సాధకుడు సంపాదించు కోవటమెట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! భోగాల పట్ల విరక్తి కలిగిన తర్వాత ఇక ‘ధ్యానం’ అనే కార్య క్రమం, తత్సంబంధమైన బుద్ధి యొక్క అవసరం నాకేమీ కనిపించటం లేదు. భోగాల పట్ల అనురక్తి కలిగి ఉన్నప్పుడంటావా? అట్టి అనురక్తి ఉన్నంత కాలం ధ్యానం వలన ఏం ప్రయోజనం? విషయా నురక్తి ఉన్న చోట విషయధ్యాస స్వయంగానే కలుగుతుంది సుమా! కనుక ఈ సాధకుడు విషయాల పట్ల విరక్తి సంపాదించుకుంటే చాలు, ధ్యానం దానంతట అదే రూపుదిద్దుకుంటుంది. ’ఇదంతా ఆత్మ స్వరూపమే కదా!’ అను దృశ్యం పట్ల ఏర్పడే దృఢమైన అభిప్రాయంతో చేసే మననమే ధ్యానం.
దృశ్యాస్వాదనముక్తస్య, సమ్యక్ జ్ఞానవతో మునేః ॥ నిర్వికల్పం సమాధానం అవిరామం ప్రవర్తతే ॥
Page:780
దృశ్యం యొక్క ఆస్వాదన లేనివాడు, ఉత్తమ జ్ఞానయుక్తుడు… అగు మునికి నిర్వికల్ప సమాధి నిరంతరం స్వయంగానే కలుగుతూ ఉంటుంది. ఎవనికి ఈ దృశ్యం కించిత్ కూడా రుచించకయే ఉంటుందో, అతడే ‘ఉత్తమ జ్ఞాని’ అని చెప్పబడుచున్నాడు. ఎందుకంటే, భోగాలు ఎప్పుడైతే రుచించవో, మరుక్షణం అతనిలో ఉత్తమ జ్ఞానం తనంతట తానే ఉదయిస్తోంది. ఎవనికైతే ‘బ్రహ్మ స్వభావము’ నందు విశ్రాంతి ప్రాప్తించిందో… అతనికి భోగాలలో రుచి ఎట్లా కలుగుతుంది. ఎందుకంటే బ్రహ్మ స్వభావ విరుద్ధమైన అజ్ఞానముచేతనే భోగము పట్ల రుచి ఏర్పడుతోంది. జ్ఞానంచే ఆ అజ్ఞానం తొలగిందా… అప్పుడిక భోగాల పట్ల అరుచి స్వయంగానే ఏర్పడగలదు. శ్రీరాముడు : మహర్షీ! ఈ మనస్సును బోధరూపంగా మలచటానికి వేదాంత శ్రవణాది ఉపాయాలు అవసరం కదా! అట్టి శ్రవణం ఎప్పుడు ముగించవచ్చు? ఎప్పటికి సమాధిలో తత్పరుడై ఉండవచ్చు? శ్రీవసిష్ఠ మహర్షి : (చిరునవ్వుతో) సాధకుడు మొట్టమొదట 1. వేదాంత శ్రవణం, 2. ఉపనిషత్తులు వంటి మోక్ష శాస్త్రాల పఠనం చేయటం, 3. ప్రణవాదుల జపం… మొదలైనవి కొనసాగిస్తూ క్రమంగా మనస్సును సమాధి యందు తత్పరం చేయాలి.
సమాధి నుండి లేచిన వెంటనే శ్రవణ-మనన-పఠన-జపాదులను అందుకోవాలి. ఎట్లాగైనా సరే ‘భేద రహితము-సర్వ సంశయ వర్జితము-అతి రమణీయము-సుషుప్తి వలె శాంతం-సమం-శుద్ధం’ అగు చిత్తంతో నిర్వాణ రూపమగు సమాధిలో పై (ఉభయ సందర్భాల లోను) అతడు నెలకొని ఉండు గాక! యథా సమయంలో సర్వాత్మత్వానుభవం సిద్ధించిన తర్వాత అభ్యాసావశ్యకత స్వయంగానే ఉపశమించగలదు. అంతటా స్వస్వరూపమగు ఆత్మ విన్యాసమే ప్రత్యక్షమగుచుండగా ఇంక సమయాసమయములు, విధి-నిషేధములు ఎక్కడ మిగులుతాయి?
శ్రీరాముడు : హే మహాత్మా! వసిష్ఠ మహర్షీ ’సమాధి గురించి మీరు ప్రవచించిన సూక్ష్మార్థం అత్యంత అమోఘమైనది. కేవలం ’మనస్సును సర్వ జగద్విషయ రహితమైన స్థానంలో ప్రతిక్షే పించటం’… అను సర్వజన సర్వస్థితుల సుసాధ్యమైన అభ్యాసం చేత ధ్యాన సమాధులు ఒనగూడుతాయి అనేది సర్వశాస్త్ర అమోదమైన ప్రవచనంగా నేను గమనిస్తున్నాను. అట్టి సులభతర మార్గాన్ని ప్రబోధించిన మీకు ముముక్షువులమగు మేమంతా సర్వదా కృతజ్ఞులం. స్వామీ! సంసార భారాన్ని మోస్తూ మిక్కిలి శ్రమ అనుభవిస్తూ, మరణ మూర్ఛాది అనేక సంకటములలో దొరలుచున్న దేహికి ఆత్మలో విశ్రాంతి కలిగించగల సమాధిని సంపాదించటానికి గల వరుసక్రమమైన సోపానాలను (మెట్లను) మరల ఒకసారి ప్రవచించవలసినదిగా వేడుకొంటున్నాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! నీవు అడిగినట్లే సోపానరూపమైన విధానం చెప్పుతాను విను. 1. సంసారంముపట్ల వైరాగ్యం - సుదీర్ఘ మార్గంలో ప్రయాణిస్తూ సూర్య తాపముచే ఎంతగానో భేదం పొందిన బాటసారులు విశాలమైన నీడను ప్రసాదించే వృక్షం కనబడగానే ఆ విశాల వృక్షం
Page:781
క్రిందకు పరుగులు తీస్తారు చూచావా? అట్లాగే పూర్వ జన్మలయందు గాని, ఈ జన్మయందు గాని గావించిన జప-తప-సత్కార్యముల ప్రయోజనంగా సంసార మార్గ బాటసారియగు జీవునికి ఎప్పుడో ఈ సంసారం పట్ల అరుచి (లేక) వైరాగ్యం కలుగుతోంది. "అనుక్షణం మార్పు చెందే ఈ సంసారమును నమ్మి ఉన్నందుకు నాకీ అవిశ్రాంతమైన దౌర్భాగ్యం వాటిల్లుతోంది కదా! ఇట్లా అజ్ఞానులతో సహవాసము, సంబంధ బాంధవ్యములు కలిగి ఉన్నందుకు నాకు అనేకసార్లు దుః ఖం-బంధం-మోహం అధికమగుచున్నాయే!”… అనే వివేకం హృదయంలో ఉత్పన్న మౌతోంది. అట్టి వైరాగ్యమయమైన వివేకపు అంకురం మనస్సులో ఉదయించగానే ఇక అతను మెల్లగా కనులు తెరచి ‘సాధుత్వముచే సువిశాలమైన హృదయము గల మహానీయులు ఎక్కడెక్కడున్నారా?’… అని పరికించి చూడటం ప్రారంభిస్తున్నాడు. మునుముందుగా అజ్ఞానులతో సహవాసమును తగ్గిస్తూ త్యజించి వేయటం మొదలెడుతున్నాడు. పవిత్రులగు విద్వజ్ఞుల మార్గంలో స్నాన-దాన-తపోయజ్ఞాదులు ప్రారంభిస్తున్నాడు. తనకు యోగ్యము, కోమలము, తన స్వభావమునకు అనుకూలము, తదితర జనులకు హితము, అందరికీ కూడా ఆనందకరం అగు శ్రేయో విధులను ఆశ్రయిస్తున్నాడు. పెద్దల-విజ్ఞుల అభిప్రాయాలను గౌరవిస్తూ తనయందు దురహంకారములను పారద్రోలుచున్నాడు. సర్వజన ప్రియునిగా, భవ్యశీలునిగా పరోపకారిగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. శాస్త్ర సమ్మతాలైన పవిత్ర కార్యక్రమాలకు, భగవత్ స్తోత్ర పఠనాలు సామూహిక పూజలు వంటి భగవత్ కార్యక్రమాలకు ఉత్సాహం చూప ప్రారంభిస్తున్నాడు. అతని మాట, క్రియ, ప్రవర్తన - సౌమ్యత సంతరించుకో నారంభిస్తున్నాయి.
పటాపంచలు చేసి వేయగలదు సుమా!
ధరించగలుగుతుంది.
Page:782
సాధు జనుల సాంగత్యంచే శుద్ధమైన చిత్తమూ, అధ్యాత్మ శాస్త్రములచే శోధితమైన బుద్ధి, సాత్విక కార్యక్రమాలచే పరిపోషించబడిన మనస్సూ… గలవాడు వేడినీళ్లలో పరిశుభ్రం చేయబడ్డ వస్త్రం వలె ప్రకాశిస్తాడు. అతడు సూర్యుని వలె స్వవివేక తేజంచే భాసిస్తాడు. అట్టి వాడు అభ్యాస వశం చేత తన హృదయంలోని అలోచనలన్ని శాస్త్రార్థాల గురించి, గురు వాక్యాల మహోద్దేశాల గురించి ఎక్కుబెట్టబడి ఉంటాయి. కలలో కూడా వాటినే యోచిస్తూ ఉంటాడు. క్రమంగా శాస్త్రార్థా లలో స్నానం చేస్తు తద్వారా ‘రాగ ద్వేషాలు’ అనే ధూళిని కడిగి వేసుకుంటూ ఉంటాడు. ‘క్రోధం, అసూయ’ మొదలైన దుర్గుణాలు సమసిపోతూ ఉండగా, మైత్రి-భోగాల పట్ల ‘వాటిని దాటివేసినట్టి స్వభావం’ మొదలైనవి అలవడుచుండగా, ఇక అతడు బోనులోంచి వెలువడిన సింహం వలె గంభీరంగా శోభిస్తాడు. ‘భోగానుసరణం’ అనే దౌర్భాగ్యాన్ని తన వివేకంచే పరిత్యజిస్తూ ఉండగా ఆతడు, ఆతని వల్ల వంశం, ఆతడు ఉన్న పరిసరాలు, సమాజం - శోభిస్తూ ఉంటాయి.
భోగ త్యాజ్యం - ఆతనిలో ’భోగాలు పొందలేదే? పొంది ఉన్న భోగాలు తొలగుతా యేమో?” అనే రూపంలో ఉండే దీనత్వం వివేకాగ్నిచే కాల్చివేయబడుతుంది. కేతువుచే విడువబడిన పూర్ణచంద్రునిలాగా ఆతని ముఖం నూతన కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. ముల్లోకాలలోని సర్వ పదార్థములను ఆతడు తృణప్రాయంగా ఎంచుతూ ఉండటం చేత మహాత్ముల మధ్య కూడా ఆతడు కీర్తనీయుడగుచున్నాడు. ప్రారబ్ధవశం చేత ఆతనిని సమీపించే భోగాలను ‘త్యాగం’ అనే రసంతో తడిపి ఉంచుతాడు. ‘సర్వ ద్వేషములను త్యజించిన నేను ఈ భోగాలను మాత్రం ఎందుకు ద్వేషించటం?’…అని తలచుచూ, వాటి ప్రయోజనాల పట్ల లోలోన సిగ్గును కలిగి ఉంటాడు. భోగాల ప్రాప్తిచే సిగ్గు, భోగాల అప్రాప్తిచే సంతోషం ఆతని అంతరంలో ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడాతడు స్త్రీ సాంగత్యాది క్రియలలోని ఉన్మాదాన్ని గుర్తు చేసుకొని అప్పటి తన అవివేకాన్ని చూచి నవ్వుకుంటూ ఉంటాడు.
సిద్ధులు-తత్ అనాదరణ త్యాగ బుద్ధి - అటుపై భూమిపై ఉదయించిన చంద్రుని వంటి ‘వివేకి’ని చూచి ఆనందించాలనే ఉద్దేశంతో మిత్రత్వంతో గూడి సిద్ధులు ఆతనిని సమీపిస్తాయి. నిరంతరం సర్వభోగాలను అనాదరించే ఆ వివేకి ఆ సిద్ధులను కూడా తన ఉదారబుద్ధితో అత్యంత సామాన్యమైన విషయాలుగా దర్శిస్తాడు. చూచావా రామచంద్రా! జడత్వ రహితుడు-గంభీర హృదయుడు అగు వివేకి యందు, మొట్టమొదట సంసారము పట్ల ‘విరసత్వం’ (లేక) వైరాగ్యం జనిస్తోంది. ఆరోగ్యం కావాలనుకునే రోగి వైద్యుణ్ణి సమీపిస్తాడు చూచావా? అట్లాగే ఆ వివేకి సజ్జనులతో సాంగత్యాన్ని స్వయంగా ఆశ్రయిస్తున్నాడు. ఆ సజ్జనులు చెప్పే వాక్యాలకు ప్రభావితుడై శాస్త్రార్థములను పఠించటంలోను, శ్రవణంలో, ధారణయందు నిమగ్నుడగుచున్నాడు. అతనిలో శాస్త్రార్థముల ప్రభావంచేత త్యాగబుద్ధి వచ్చి చేరుతోంది. అట్టి త్యాగబుద్ధికి, రెండు మహత్తరమైన గుణాలు వెంటనంటి ఉండి బలవత్తరమగుచున్నాయి.
ఇతరుల ధనాన్ని ఆశించటంలో అరుచి, 2. తనకున్న దానితో సంతృప్తి… ఆ త్యాగం
Page:783
ఇంకనూ బలవత్తరమగుచుండగా, ఇక అతడు తన దగ్గర గల ధనాదులను కూడా ఇతరుల సుఖసంతోష-ఆనందాల కొరకై వినియోగించటం ఆరంభిస్తున్నాడు. తనను ఎవరైనా యాచించినప్పుడు ఆ త్యాగశీలియగు వివేకి తన దగ్గర ఉన్నదేదైన ఇచ్చివేయటానికి ఉత్సుకుడౌతున్నాడు.
దదాతి కణపిణ్యాకశాకాద్యపి హి యాచతే |
తేనైవ అభ్యాసయోగేన స్వమాంసాని దదాత్య సౌ ॥
తనను ఎవరైనా యాచించినప్పుడు తన దగ్గర మిగిలి ఉన్న నూకలను-కూరలను కూడా ఇచ్చివేయటానికి సంసిద్ధుడగుచున్నాడు. అట్టి త్యాగముయొక్క అభ్యాసంచేత ఇక తనను అర్థించినవారికి తన శరీరంలోని మాంసాన్ని కూడా ఇచ్చివేయటానికి వెనుకాడని స్థితికి వస్తున్నాడు. క్రమంగా ఆతని చిత్తము లయించనారంభిస్తుంది. చిత్తము యొక్క రూపము ప్రాపంచిక పదార్థముల పట్ల ఇష్టమే గాని, మరింకేమీ కాదు కదా! వివేకము వైపుగా పరుగులు తీస్తున్న ఆ మహనీయుని అజ్ఞానం అల్పత్వం పొందసాగుతుంది. పరుగులు తీస్తున్నవాడు అతి సులభంగా చిన్ని చిన్ని గుంటలను దాటివేయగలుగుచున్నట్లు ఆతడు చిత్తములోని ఆయా విషయ పరంపరలను అతిసులభంగా (ఆ స్థితిలో) జయించివేయగలుగుతాడు.
న తాదృశం జగత్ యస్మిస్ దుఃఖం నరకకోటిషు |
యాదృశం యావత్ ఆయుష్కం అర్థోపార్జన శాసనమ్ ||
ఈ జీవితమును ధనోపార్జనయే ముఖ్యమైన లక్ష్యంగా వెచ్చించే వారి దుఃఖములు కోట్ల కొలది నరకములు అనుభవించే వారికి కూడా ఉండవు. ఎందుకంటావా?
ఆసనే, శయనే, యానే, గమనే, రమణే జనే
‘ఆధి’ చింతాపరాఏవ’, నను మూఢ విదన్తు తామ్ ॥
ధన సముపార్జనలో బుద్ధిని నియమించిన వారు ఇక కూర్చున్నప్పుడు, పరుండినప్పుడు, నడుస్తున్నప్పుడు, క్రీడిస్తున్నప్పుడు, జనుల మధ్య ఉన్నప్పుడు… అన్ని వేళలా ఆలోచనలన్నీ “ధనాన్ని సంపాదించటం, దాచటం, కాపాడుకోవటం”… అనే వ్యవహారాల పట్లనే ధ్యాసంతా కలిగి ఉంటారు. వారు తమ మనసుకి పట్టిన చింతలేమిటో తమకే తెలియకుండానే అనేక చింతలలో
సతమతమౌతూ ఉంటారు.
వారు తమ-తమ చింతల గురించి ఇతరులకు చెప్పుకోలేరు. తాము భరించలేరు! వివేకంతో విచారించి చూస్తే… ధనం మహా అనర్థముల కొరకే అయి ఉన్నది. సంపదలు నిరంతర ఆపదలవైపే ఎక్కుబెట్టబడి ఉన్నాయి. భోగములు సంసార రోగముల వృద్ధి కొరకే అగుచున్నవి. ఎంతెంతవరకైతే
Page:784
ఈ జీవుడు ‘ధనము’ అనే అనర్థమును అభిలషించకయే ఉంటాడో, అంతంత వరకు ఈతడు ’విషయ చింతనలు’ అనే సెగలచే దహించక ఉంటాడు. ఎవనికైతే ’శాశ్వతము-సర్వోత్తమము’ అగు మోక్షము రుచించుచున్నదో, అంత వరకు ఆతడు ధనమును, విషయ జగత్తును గడ్డిపరక యొక్క చివరి ముక్కలాగా అతితుచ్ఛంగా గాంచగలుగుతాడు. ధనస్పృహాత్యాజ్యం సంపాదించుకొన్న వారికి ఆత్మయందే సుఖమును గాంచటం క్రమక్రమంగా అతిసులభమౌతుంది. అనేక శోక-మోహాది భావ వికారములు, అనేక దుష్కర్మలు, దీనత్వము, దుష్టచేష్టలు ఇవన్నీ కూడా ధనము పట్ల గల దురాశయే మూలముగా కలిగి ఉన్నాయని చెప్పబడుచున్నది.
తీస్తూ ఈ సంసారారణ్యంలో తిరుగాడుచున్నాడు. ఆతని పాట్లు చెప్పు క్రింద పడ్డ పురుగులాగా అతిదీనంగా ఉంటున్నాయి. ‘ధనవాంఛ’ అనే వికృతరూపము దాల్చిన జీవుడు ఎన్నటికీ శాంత స్థితికి చేరుకోనే లేడు సుమా!
అర్ధోపార్జన-రక్షాణాం జానన్నపి కదర్ధనామ్ ।|
యఃకరోతి స్పృహాం మూడో, ‘నృపశుం’ తం న సంస్కృశేత్ II
ధనము యొక్క ‘ఆర్జన రక్షణ’ మొదలైన వాటిలో గల దుఃఖమును, కాలయాపనను గమనించి కూడా ఏ మూఢుడు అట్టి ఆశాపాశముల నుండి విడవడటానికి ఇష్టపడడో, అట్టి నరపశువును తాకనే కూడదు సుమా! ఎవడైతే “తృష్ణారాహిత్యము” అనే కొడవలితో మనస్సు యొక్క (1) బాహ్య విషయానుసరణము (2) అభ్యంతర సంకల్ప పరంపరలు అనే రెండు దోషాలనూ ఒకేసారి కోసివేయుచున్నాడో… అట్టి వాని హృదయక్షేత్రంలో ‘ఆత్మజ్ఞానం’ అత్యల్ప సమయంలో ప్రకాశించగలదు. జ్ఞాని ఈ దృశ్యవిషయ సముదాయమును స్వప్న విషయమువలె అసద్రూపంగా గమనిస్తున్నాడు. కాని అజ్ఞానులకు ఇదంతా సత్యంగా, శాశ్వతంగా, సద్రూపంగానూ అనిపిస్తోంది. అట్లా అనిపించటానికి కారణం సత్యము-నిత్యము అగు దానిపట్ల అభ్యాసరహిత్యమే సుమా!
ఓ రామచంద్రా! ఈ విధంగా - మొట్టమొదట ఈ సంసారం పట్ల వైరాగ్యం, తరువాత సత్సాంగత్యం, అటుపై అధ్యాత్మ శాస్త్రార్థముల యొక్క భావనచే భోగములను పరిత్యజించి ఉండటం, ఆపై తృష్ణారాహిత్యం యొక్క దృఢాభ్యాసం… పై సోపానముల ద్వారా జీవుడు పరమార్థమగు ఆత్మతత్త్వమును ఎఱిగి తనను తాను మోక్షార్హునిగా తీర్చిదిద్దుకుంటున్నాడు.
Page:785
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "ఈ జీవుడు పరమేశ్వరుని చేరేది ఎట్లా?” అనే విషయం మనం సంభాషిస్తున్నాం కదా! అందుకు ఏమేమి ఆవశ్యకమో మరల ఒక్కసారి గుర్తు చేసుకొని ఇక ఆ పై ఆత్మ యందు విశ్రాంతి ఎట్లా సుస్థిరపడుతుందో చెప్పుకుందాం.
ఆవశ్యకతలు
ఇట్లు జ్ఞానప్రకాశం వైపు ఉన్ముఖమైన వివేకి ఇక ధనాదులను వాంఛించడు. సర్వప్రాపంచిక విషయాలను హృదయం నుండి ఊడ్చివేసి ఉంటాడు. అప్పుడాతనికి స్త్రీ-ధన-బాంధవ్యాదులు కూడా భారంగా అనిపిస్తాయి. యథాశక్తి, యథాకాలం వాటిని మనస్సుచే త్యజించి వేసి ఉంటాడు. ఇక ఈ ఇంద్రియాలు ఇంద్రియార్గములలో ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ వాటియందు ఆతడు తప్పనిసరిగా సంలగ్నం కావలసి వస్తున్నప్పటికీ… అంతరంలో పరమ శాంతచిత్తుడై ఉండటం చేత… వాటినన్నిటిని పొందకయే ఉంటాడు.
ఆతనికి ఇక ఏకాంత దశలలో గాని, సరోవరాలలో గాని, అరణ్యాలలో గాని, వనవాటిక లలో గాని, పవిత్రస్థానాలలో గాని, స్వగృహంలో గాని, మిత్రులతో ఏర్పడే క్రీడావిలాసాలలోగాని, ఉత్తమ ఉద్యానాలలో గాని, భోజనాది క్రియాకలాపాలలో గాని, శాస్త్ర తర్క వితర్కాలలో గాని…. ఆసక్తి ఉండదు. వాటిలో వేటి యందూ దీర్ఘకాలం ఉండడు.
ఆతడు ఎల్లప్పుడూ తనయందే వెలయుచూ ఉంటాడు. ఆతడిక పరమశాంతుడై ఉంటాడు. దాంతుడై (ఇంద్రియాలను జయించినవాడై ఉంటాడు. ఆత్మారాముడుగాను, మునిగాను, విజ్ఞానైక నిరతుడుగాను ఉంటాడు. తన దేహ- ఇంద్రియాలకే సాక్షి అయినట్టి ‘ప్రత్యగాత్మ’ యొక్క అన్వేషణలో మాత్రమే ఉంటాడు. తాపముచే సంతృప్తుడైన మనుజుడు చల్లటి నీళ్ళతో స్నానం చేసి విశ్రాంతి పొందుతాడు చూచావా? ఆ ప్రకారంగా ’ఆత్మాన్వేషణం’ అనే అభ్యాసం చేత ‘శాంతుడు’ అగుచున్న యోగి పరమపదమగు ‘ఆత్మ’ యందు విశ్రాంతిని సంపాదించుకుంటున్నాడు.
శ్రీరాముడు : మహాత్మా! ఈ బాహ్య-అభ్యంతర రూపమైన దృశ్య పదార్థమంతా ఎట్లా ఉదయిస్తోంది? ఇదంతా ఏమైయున్నది? ఏమి కానున్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి :
స బాహ్య–అభ్యంతరం శాన్తా జ్ఞతైవార్థ తయోదితా | ‘న సంభవతి భిన్నో అర్థ’ ఇత్యేవ పరమం పదమ్ ||
Page:786
స్వాత్మ గురించిన అజ్ఞానమే ఈ బాహ్య - అభ్యంతర దృశ్య పదార్థరూపంగా ఉదయిస్తోంది! కాబట్టి అట్టి అజ్ఞానం ఆ పదార్థముల కంటే భిన్నమైనది కాదు. అనగా ఆయా దృశ్య పదార్థముల పట్ల అనుభవరూపమే అజ్ఞానం యొక్క రూపం. పదార్థములకు వేఱుగా అజ్ఞానం ఎచ్చటా సంభవించదు. కనుక ఎప్పుడైతే ఈ దృశ్యం త్యజించబడుతుందో, అట్టి త్యాగము చేత మాత్రమే అజ్ఞానం శమిస్తుంది. అట్టి దృశ్య త్యాగం చేత అద్దాని సాక్షియగు ఆత్మయందు స్థితి కలుగుతుంది. సాక్షియందు స్థితి కలిగిన తరువాత శేషించే శాంతమగు ఆత్మస్థితియే ’పరమ పదం’ అయి ఉన్నది. శ్రీరాముడు : స్వామీ! ‘పరమ పదము’ అనగా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఎచ్చటయితే కేవల చిత్తు లేక ‘బోధ’ తప్ప ఇక తదితరమైన పదార్థం గాని, శూన్యత్వం గానీ మచ్చుకైనా ఉండదో… అట్టి అంతరంగము నందలి నిజానుభవ స్థితియే ’పరమ పదం’ అని చెప్పబడుతోంది. ఓ రామచంద్రా! సమస్త పదార్థములు కూడా ఉపరూపమగు బోధగా పరిణమించటం జరుగగా… ఇక ఎచ్చటైతే పదార్థం గాని, పదార్థత్వం గాని, శూన్యత్వం గాని లేకయే ఉన్నాయో, అట్టి స్థితికి శాస్త్రకారులు ‘పరమపదం’ అనే పేరుపెట్టారు.
ఓ రాఘవా! కేవలం స్వాత్మామాత్రమున విశ్రాంతి పొందిన మనో అతీత స్వభావులగు మహాత్ములకు విషయాల పట్ల ‘కించిత్’ కూడా రుచి ఉండదు. బహిర్ముఖత్వ నిరోధ రూపమగు స్వభావమును సంపాదించుకున్నవాడు, మౌని, ఈ శరీరాదులందు ’ఇవి సుస్థిరం’ అను అభిప్రాయం లేనివాడు, ఆత్మజ్ఞుడు అగు మహనీయుడు ’చిత్రం’లో లిఖించబడిన ‘నదీజలం’ లాగా నిశ్చలంగా ఆత్మ స్వభావమునందే నెలకొని ఉంటాడు.
ఇక ఆత్మజ్ఞాని యొక్క హృదయం … సర్వ పదార్థములతో కూడుకొని ఉన్నప్పటికీ… పదార్థ రహితంగాను, విస్తారమై ఉన్నప్పటికీ… పరమాణుసదృశంగాను, అశూన్యమైనప్పటికీ… శూన్య సమంగాను ఆత్మజ్ఞాని యొక్క హృదయం భాసిల్లుతోంది. ఈ అహంభావం, జగత్తు, ఈ జగత్తు యొక్క చేష్టలు, దేశ-కాలాదుల కల్పన, జ్ఞాతృ-జ్ఞాన-జ్ఞేయములతో కూడుకున్న త్రిపుటి, శూన్య అశూన్యములు - ఈ మొదలైనవన్నీ ఎదురుగా ఉన్నప్పటికీ ఆత్మజ్ఞాని యొక్క దృష్టిలో ఇవన్నీ “మిథ్యమాత్రం” గాను, స్వతఃగా కించిత్ కూడా ‘లేనివి’ గాను అగుచున్నాయి.
మానవాకార జ్ఞాన సూర్యుడు దీపం వెలగగానే అంధకారం పటాపంచలైపోతుంది చూచావా?… నిర్మలమగు ఆత్మపదమనే వెలుగును అధిరోహించినట్టి జ్ఞాని యొక్క హృదయంలో దృశ్యం-రాగం -ద్వేషం-భయం అనే అంధకారానికి చోటు ఉండదు.
ఎవని రజోగుణం సంపూర్ణంగా నశించి ఉంటుందో, తన శుద్ధ సత్త్వగుణం చేత ఎవని తమోగుణం మొదలంట అధిగమించబడి ఉంటుందో, ఎవని సమక్షంలో అజ్ఞానాంధకారం ఆతని జ్ఞానప్రకాశంచే మ్రింగివేయబడి ఉంటుందో… అట్టి మానవాకార సూర్యుడు తదితర జనులందరికీ నమస్కరించుటకై అర్హుడగుచున్నాడు. భేదం సంపూర్ణంగా శమించగా అప్పుడు చిత్తం అదృశ్యమవు తోంది. అప్పుడిక అట్టి ఆత్మజ్ఞాని స్థితి ఎట్టిదో… అది వాక్కుచే చెప్పటానికి సాధ్యపడేది కాదు.
Page:787
రాత్రింబవళ్ళు చాలా కాలంగా ఒనర్చిన ’పరమ భక్తి’చే సంతోషించిన ఆ ఈశ్వరుడు నిష్కల్మషనిర్భేద హృదయుడైన వివేకికి ’నిర్వాణం’ అనబడే సర్వాత్మ దర్శన స్వరూపమగు ఉత్తమ స్థితిని ప్రసాదిస్తున్నాడు.
సర్వము ఈశ్వరమయం -
శ్రీరాముడు : స్వామీ! ఈశ్వరుడు అనగా?
ఈశ్వరఃకో? మునిశ్రేష్ఠ! కథం భక్త్యా ప్రసాద్యతే | ఏతన్మే తత్త్వతో బ్రూహి, సర్వతత్త్వ విదాంవర ॥
తత్త్వవేత్తలలో శ్రేష్ఠుడగు ఓ మునివరా! మీరు చెప్పిన ఆ ‘ఈశ్వరుడు’ అనగా ఎవరు? భక్తిచే ఆతడు ఎట్లా ప్రసన్నం అవుతాడు? దయచేసి నాకీ విషయం యథార్థంగా తెలియజేయండి. శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీ ప్రశ్నకు సూటి అయిన సమాధానం విను!
ఈశ్వరో న, మహాబుద్దే! దూరే, న చ దుర్లభః, మహా బోధమయైకాత్మా, ’స్వాత్తైవ పరమేశ్వరః’!
ఓ మహాబుద్దీ! ఆ ఈశ్వరుడు ఎక్కడో దూరంగా లేడు. కొందరు ’ఆతడు అతి దుర్లభుడు. సామాన్యులకు లభించేవాడు కాదు…. అని అంటూ ఉంటారు. అదీ నిజం కాదు. మరి? మహాబోధమయైక స్వరూపమగు స్వాత్మయే ఆ పరమేశ్వరుడు.
మహాబోధమయైక స్వరూపమగు స్వాత్మ అనగా… ఆత్మ యొక్క ప్రపంచాన్ని పొందే మనన విభాగమే మనస్సు (లేదా) మనోచైతన్యం. ‘మనస్సు’ నుండి ప్రపంచత్వాన్ని ప్రక్కకు పెట్టి నప్పుడు మిగిలి ఉండేదే నిర్మల చైతన్యం. అట్టి ప్రతి ఒక్కరి యొక్క నిర్మల చైతన్యమే పరమేశ్వరుని స్వరూపం.
అంటే, చైతన్యం ఎక్కడ ‘దృశ్య సంబంధ తృష్ణ’ అనే స్వభావాన్ని ప్రదర్శిస్తోందో, దానిని ‘జీవుడు’ అని పిలుస్తున్నాం. అద్దానినే ‘మనస్సుతో కూడిన చైతన్యం’ లేక ‘మనో చైతన్యం’ అని కూడా అంటున్నాం. చైతన్యం తన మనో స్వభావాన్ని అతిక్రమించి ఉన్నప్పుడు శివుడు “శుద్ధచైతన్యం” అంటున్నాం. అట్టి శుద్ధ చైతన్యమే ఈ జీవుని నిజమైన రూపం.
మనస్సులో ‘జగద్దర్శనం’ అనే అభ్యాసాన్ని తొలిగించి చూస్తే దానిని ‘బోధ స్వరూపం’ అంటాం. అట్టి బోధస్వరూపాన్ని దేహ మనో బుద్ధ్యాది పరిధులను త్యజించిస్తే ‘మహాబోధ స్వరూపం’ అంటాం. అట్టి మహాబోధ స్వరూపమగు స్వాత్మయే ‘పరమేశ్వరుడు’ అను శబ్దంచే ఉద్దేశింపబడుతోంది.
ఈ సమస్తమూ ఆ పరమేశ్వరుని కొరకే అయి ఉన్నది! ఆ పరమేశ్వరుని నుండే ఈ సమస్తం ఉత్పన్నమగుచున్నది! ఆ పరమేశ్వరుడే ఈ సమస్తం అయి, అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు! సమస్త జీవుల హృదయంలో వెలుగొందుచున్నది ఆతడే! ఆ పరమాత్మయే సర్వాన్ని ఆక్రమించుకొని సర్వమయుడై ఉన్నాడు. సర్వమునందలి నిత్యుడు అతడు మాత్రమే. సర్వ స్వరూపుడు, సర్వాత్మకుడు అగు ఆ పరమేశ్వరునికి మేము నిత్యం ప్రణమిల్లుచున్నాము.
Page:788
తస్మాదిమాః ప్రసూయన్తో సర్గ ప్రలయ విక్రయాః ॥ అకారణం కారణతో గతయః పవనాదివ II
ఆ పరమేశ్వరుని నుండే ఈ ‘సృష్టి-స్థితి -ప్రళయం’ అనే చమత్కార విశేషాలన్నీ జనిస్తున్నాయ్! ప్రపంచంలో సర్వము కార్య కారణ ములచే ఏర్పడుచున్నాయి. అయితే ఆ పరమేశ్వరుడో? ఆతడు స్వయంగా కారణ రహితుడు. అయినప్పటికీ ఆతడే సర్వ కారణములందు వ్యాపించి ఉన్నాడు. అంతే కాదయ్యా! సర్వ ప్రాణులలోని ప్రాణాదుల గతులన్నీ ఆతని వలననే సంభవిస్తున్నాయి. ఈ ప్రాణకోట్లంతా తాము కోరుకున్న పదార్థములను ప్రసాదిం టానికి గాను ఆయననే నిరంతరం ఆయా అన్ని చోట్లా అనేక నామ రూపాలతో పూజిస్తున్నారు. ఈ జీవులు తమ యథేష్టమగు రుచి ననుసరించి అనేక జన్మలలో ఆయనను పూజిస్తూ ఉండగా ఆయన వారి పట్ల ప్రసన్నుడగుచున్నాడు. ప్రసన్నః స మహాదేవః, స్వయమాత్మా మహేశ్వరః |
బోధాయ ప్రేరయత్యాశు దూతం పూతం శుభేహితైః ||
మహాదేవుడు, పరమేశ్వరుడు, సర్వాత్మకుడు అగు ఆయన ఈ జీవులు చేసే పూజలకు ప్రసన్నుడై, ‘బోధ’ కొఱకై పవిత్రుడగు తన దూతను ప్రేరేపణ చేయుచున్నాడు.
వివేక మహత్యము -
శ్రీరాముడు : ఆత్మనా పరమేశాన కోదూతః ప్రేత్యతే మునే?
సదూతో బోధనం వాపి కరోతి? వద మే కథమ్?
శ్రీరాముడు : మునీంద్రా! ఆత్మస్వరూపుడగు ఆ పరమేశ్వరుడు ఏ తన దూతను ప్రేరేపిస్తున్నారు? ఆ దూత ఏ రీతిగా బోధ చేస్తున్నారు. వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మ స్వరూపుడగు ఆ పరమేశ్వరునిచే ప్రేరేపించబడే దూత మరెవరో కాదు.ఆయన ఈ జీవులలో గల ’వివేకము’నే ప్రేరేపణ చేస్తున్నారయ్యా! హృదయంలో ప్రవేశించిన ఆ ‘వివేకం’ అనే దూత ఆకాశంలో ప్రవేశించిన చంద్రుని వలె అత్యంత ఆహ్లాదకారకుడగుచున్నాడు. ఆ ‘వివేకము’ అనే దూత వాసనామయుడగు ఆ జీవునికి క్రమక్రమంగా ‘ఉద్బోధ’ చేస్తున్నాడు. క్రమంగా ఆ జీవుని ఆ వివేకదూత సంసార సాగరం నుండి తరింపజేస్తున్నాడు.
బోధాత్మై ఏషో అంతరాత్మైవ పరమః పరమేశ్వరః
అస్యైవ వాచకోనామ ప్రణవో వేద సమ్మతః |
బోధస్వరూపుడగు ఆ ‘అంతరాత్మ’ యే ఉత్తముడగు పరమేశ్వరుడయ్యా! మరి ఆతని పేరు? నామరూపాలు ఆయనకి ఆపాదించటమెట్లా? అదట్లా ఉండగా, నామ-రూపాదుల సహాయం లేకపోతే ఆయనను మననం చేయటమెట్లా? అందుచేత వేద సమ్మతమైన ‘ఓం’ (అకార - ఉకార
- - మకారాలు) అనే ప్రణవమే ఆతని వాచకమై ఒప్పుచున్నది. ఈ దేవతలు, మనుజులు, నాగులు, అసురులు మొదలైన వారంతా కూడా వారి వారి బుద్ధి, ఊహ, ప్రమాణం, సంస్కారాలను అనుసరించి నామరూప సహితంగానో, లేక నామరూప రహితంగానో వారి వారి జప-హోమPage:789
తప-దాన-పఠన-యజ్ఞ-యాగాది ఆయా క్రియా క్రమములచే ఆ ఓంకారవాచక పరమేశ్వరునే నిత్యము ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
స్వర్గం ఆ పరమేశ్వరుని శిరస్సు. భూమి ఆయన పాదాలు. నక్షత్రాలు ఆయన రోమ సమూహాలు. సమస్త ప్రాణికోట్లు ఆయన అస్టులు. ఆకాశం ఆయన హృదయం. చిత్స్వరూపుడైనట్టి ఆ పరమేశ్వరుడు అన్ని చోట్ల ప్రవేశిస్తున్నాడు.
సర్వత్రైష చిదాత్మత్వాత్ యాతి, జాగర్తి, పశ్యతి, తేనైష సర్వతో లక్ష్య కర కర్ణ అక్షి పాదభృత్ ||
అంతటా నిరంకుశంగా ప్రవేశిస్తున్నాడు. సర్వదా ఆయన మేలుకొనియే ఉన్నాడు. సర్వులను గాంచుచునే ఉన్నాడు. సర్వుల లక్ష్య స్వరూపుడు అయి ఉన్నాడు. సర్వత్రా చేతులు-పాదములుచెవులు-నేత్రములు మొదలైన ఇంద్రియములన్నీ ధరించుచున్నది ఆయనే! ఆ పరమాత్మ ఈ జీవుని ప్రార్థనాదులకు సంతోషించి ఆతనియందు వివేకము అనే దూతను ఉద్బోధిస్తున్నారు కదా! ఆ వివేక దూత హృదయంలో ప్రవేశించి ‘చిత్తము’ అనే పిశాచమును చంపి ఈ జీవునికి తన యొక్క మహత్తరమైన ’ఆత్మ పదము’ను పొందింపజేస్తున్నాడు.
స్వాత్మయగు పరమేశ్వరుని శరణువేడండి! - కాబట్టి ఓ ప్రియ జనులారా! మీరంతా మీ పురుష ప్రయత్నంచే అనర్థయుతాలైన సమస్త వికారాలను, సమస్త వికల్ప సమూహాలను త్యజించండి. సర్వ ప్రయత్నాలచే స్వయంగా ఆత్మ చేతనే ఆత్మ భూతుడగు ఆ సర్వాత్మకుని, పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోండి. ఈ సంసారమనగా ఏమిటో కాస్త గమనించండి. అతి చపలమైనట్టి ‘మనస్సు’ అనే పిశాచంతో కూడుకొన్నదై, శోక-మోహాదులు అనే మేఘాలచే క్రమ్ముకొన్నదై ఈ సంసారం హృదయంలో వ్యాపించి ఉంది. మరిక స్వాత్మయగు పరమేశ్వరుని శరణు వేడటమే ఉపాయం. ఆయనే వివేక సూర్యుని రూపంలో ఈ సంసారాంధకారాన్ని పటాపంచలు చేయగలడు.
సంసారం ఎట్టిదో వినండి. ఇది ఒక అగాధం వంటిది. ఇందులో “మరణం పునర్జన్మ” మొదలైన దురవస్థలు-ఆవర్తాలు (సుడులు) కలిగి ఉన్నది. అతి వ్యాకులమై ఉంటోంది. ‘తృష్ణ’ అనే చంచల తరంగాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. మనస్సు అనే సుడిగాలి ఇందులో అవిశ్రాంతిగా వీస్తోంది. ఇందులో ‘ఇంద్రియ విషయాపేక్షలు’ అనే మొసళ్లు సంచరిస్తున్నాయి. అట్టి ఈ సంసార సముద్రాన్ని దాటటానికి ఉన్నది ఒక్కటే ఉపాయం - అదే ‘వివేకం’ అనే నావను ఆశ్రయించటం.
ఓ ప్రియ జనులారా! ముందుగా మీకు అభిమతమైన మార్గంలో పూజ-తపస్సు మొదలైన వాటితో ఆ పరమేశ్వరుని సంతోషింపజేయండి. ఆయన ‘వివేకం’ అనే పవిత్రమైన దూతను మీకు ప్రసాదిస్తున్నాడు. ఇక ‘సత్సాంగత్యం, శాస్త్రాభ్యాసం’ అనే పరమార్థ బోధను ప్రవృద్ధం చేసుకోండి. మీ వివేకం క్రమక్రమంగా వికసించుగాక! అప్పుడా వివేక దూత ‘పరమార్థబోధ’ ద్వారా ఈ జీవుని ‘నిర్మలం-ఏకం-అద్వితీయం-ఆద్యం’ అయినట్టి ఆత్మపదాన్ని పొందింపజేయగలడు.
Page:790
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ‘వాసనలు’ అనే మలాన్ని తమయందు పూర్తిగా తొలగించు కొన్నట్టి దృఢ వివేకులగు మహనీయులలో లోకోత్తరమైన ఒకానొక మహనీయత్వముతో కూడిన బుద్ధి జనిస్తోంది. వారి బుద్ధి ఔదార్యం-మహనీయత్వం-మహత్వం-గాంభీర్యత్వం-అతి సౌందర్యం సంతరించుకొంటోంది.అట్టి బుద్ధికి అగుపించే తాత్త్వికదర్శనం తదితర సామాన్య జనులకు అర్థం కానిది. అట్టి బుద్ధిని ప్రలోభపరచగలిగేదేది ఈ 14 లోకాలలో ఎక్కడా ఏదీ లేదు. ఉండజాలదు.
“ఈ జగత్తు అనబడేది చిత్తభ్రాంతి మాత్రమే!” అనే విశ్వాసం సజ్జనులలో ఉంటోంది. వారిలో బాహ్యాలైన ఈ శబ్ద-స్పర్శ-రూపాది విషయాలు గాని, అభ్యంతరాలైన సంకల్పాలుమనస్సు-ఇంద్రియార్థాలు గాని, వాటన్నిటి వల్ల జనించే అజ్ఞానం గాని చోటు పొందలేకయే పోతున్నాయి. ‘రెండవ చంద్రుడు-మృగతృష్ణ-ఆకాశంలో కేశాలు’… వంటి జగత్ భ్రాంతిని స్ఫురింపజేసే వాసనావృత్తి వారి హృదయం నుండి తొలగి, దీపం వెలిగించిన తరువాతి చీకటిలాగా, ఎచటికో తొలగిపోతున్నది. వాసనావృత్తి హృదయంలో చోటు చేసుకొని ఉండటం చేతనే ‘జగత్తు’ అనబడే బహువిధ విషయ-విశేషముల సముదాయం ద్యోతకమౌతుంది. వాసనావృత్తి (లేక) దృశ్యవృత్తి నశించినప్పుడు అంతటా చిదాకాశమే ఉన్నట్లు అనుభవం కాగలదు. అయితే అట్టి వాసనాశూన్యావస్థ మనస్సు యొక్క ‘అభావ స్థితి’ యందు మాత్రమే (అమనస్క స్థితిలో మాత్రమే) సిద్ధించగలదు. వివేకి అయినవాడు అట్టి మనో అభావ స్థితిని ఎందుకు వదలుకోవాలి?
నాలుగవ అవస్థ - తురీయావస్థ -
శ్రీరాముడు : స్వామీ! మనస్సు యొక్క అభావ స్థితి (లేక) అమనస్క స్థితి అంటే ఏమిటి. శ్రీ వసిష్ఠ మహర్షి : సామాన్యంగా జీవులందరికీ 1. జాగ్రదవస్థ, 2.స్వప్నావస్థ, 3. సుషుప్త్యావస్థ అనే మూడు అవస్థలే అనుభవమౌతున్నాయి. జనులందరూ ఈ మూడు అవస్థలను ఒకదాని తర్వాత మరొకదాన్ని ఆటవిడుపు లేకుండా అనుభవిస్తున్నారు కదా! వాస్తవానికి ఈ మూడు కాకుండా మరొక అవస్థ ఉన్నది. అది ఈ మూడు అవస్థలకు సంబంధించక, ఆ మూడిటిచే స్పర్శించబడక, ఆ మూడు సందర్భముల చేత అవిభాజ్యమై-అనిరోధకమై, అనుశ్రుతమై, అవిరామమై, అనునిత్యమై చెన్నొందుతోంది. ఆ అవస్థలకు శాస్త్రకారులు ‘తురీయావస్థ’ అని పేరు పెట్టారు.
ఉదాహరణకు… ఒకాయన ఇంట్లో ఉండటమో, వీథిలోకి వెళ్ళటమో, ఊరు వెళ్ళటమో జరిగిందనుకో. ఆయన ఇంట్లో ఉంటేనేమో ‘ఇంట్లోని మనిషి’ అంటాం. వీథిలోకి వెళ్ళినప్పుడు ’వీథి లోని మనిషి’ అంటాం. ఊరు వెళ్ళినప్పుడు ‘ఊరు వెళ్ళిన మనిషి’ అంటాం. ఆ మూడు సందర్భా లలోను ఆయన ఒక్కడే-ఒకే రీతిగా ఉన్నాడు గాని మరొకటిగా అగుట లేదు కదా! ఆయన ఆయన గానే యథాతథంగా ఉన్నప్పటికీ, ఆయన గురించి చెప్పుకొనేవారి సౌలభ్యం కొరకై ‘ఇంట్లోని ఆయన వీథిలోని ఆయన ఊరు వెళ్ళినాయన’… అనేవన్నీ వచ్చాయి. ఆయన వస్తు సంబంధంగా చూస్తే ఈ మూడిటికీ సంబంధించినవాడే కదా!
Page:791
అట్లాగే తురీయావస్థ వాస్తవానికి ఒక అవస్థ కాదు. అది ‘అవస్థాత్రయ సాక్షి’ అని అనవచ్చు. అట్టి అవస్థాత్రయ సాక్షిత్వము సంపాదించుకొని ఉన్న వివేకియందు అజ్ఞానం నశించి ఉండటంచే వాస్తవానికి ఈ జగత్తును చూచుటయే లేదు. అయినా కూడా ప్రారబ్ద విశేషం చేత అతడు ఈ జగత్తులో దేహాన్ని ధరించి కనబడుచున్నాడు. కాబట్టి, అతడు జగత్తును చూస్తూ ఉన్నట్లే అన్యులకు కనిపిస్తూ ఉంటుంది. అతని దృష్టి మాత్రం ఈ జాగ్రత్-స్వప్న సుషుప్తులను అధిగమించినదై ఉంటోంది. ఆ వివేకి దృష్టి అవస్థాత్రయాన్ని తనలో కలుపుకొని ఉన్నట్టి అప్పటికీ శేషించి ఉన్నట్టి ’పరమావస్థ’ను దర్శిస్తూ ఉంటుంది.
శ్రీరాముడు : అనగా? వారు ప్రారబ్ధానంతరం ఈ దేహాదులు పొందరని అనుకోవచ్చా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ దేహాలకు - ఆ వివేకులకు అనునిత్యంగా అనుభవమయ్యే తురీయావస్థకు సంబంధమే లేదు. అనగా వారి అసిధారావృతమైన తురీయానుభవం శరీరాలు వచ్చినప్పుడుగాని, లేక అవి తొలగుచున్నప్పుడు గాని ఆటవిడుపు పొందేది కాదు. వారి యొక్క వ్యుత్థాన కాలమందు సమాధి నుండి మరలుటలేదు. వారు ఈ జగత్తును ఘన పదార్థములుగా (భూమి మొదలైన వివిధ వికార రూపాలుగా) చూడరు. రత్నం యొక్క వివిధ కాంతిపుంజాలు వివిధమైన దిక్కులుగా ప్రసరిస్తూ ఉన్నప్పటికీ ఆ వేర్వేరు కాంతిపుంజాలు రత్నమునకు సంబంధించినవే కదా! అట్లాగే వారికి జగత్తులో కనిపించే భేదమంతా అభాసమాత్రంగా, పరమాత్మ యొక్క కిరణపుంజాలుగా కనిపిస్తుంది. వారికి ఈ జగత్తు జగత్తుగానే కనిపిస్తూనే, మరొక ప్రక్క ఇదంతా శూన్యమాత్రంగా సుస్పష్టమౌతూనే ఉంటుంది. స్వస్వరూపచమత్కారంగా అనుభవమౌతుంది.
న ఇహ సత్యాని భూతాని, న జగత్తా, న శూన్యతా, ఇదం బ్రహ్మాఖ్యరత్నేశ ప్రభాజాలం విజృంభితమ్ ॥
వాస్తవానికి ఇక్కడ కనిపించే భూతజాలం (జీవులు, దేహములు మొదలైనవి) సత్యం కాదు. అట్లాగే జగత్తు కూడా! ఆ రీతిగానే ‘శూన్యత్వము’ అనునది కూడా! అవి లేవు. మరి ’ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి కదా’… అని అంటావా? అవన్నీ కూడా సర్వ శక్తిమంతుడగు ‘బ్రహ్మం’ అనే రత్నం యొక్క కిరణ సమూహాల విలాసం మాత్రమే! జలం అనేక తరంగాలుగా కనిపిస్తున్నప్పటికీ అన్ని తరంగాలలోనూ కనిపించేది ఒకే జలమే కదా! అనేక బంగారు ఆభరణాలలో కనిపించేదంతా బంగారం ఒక్కటే కదా! అట్లాగే అనేకత్వము వాస్తవానికి లేదు కాబట్టి, ఇక సృష్టియే లేదు. సృష్టియే లేనప్పుడు నాశనరూపమగు ప్రళయం మాత్రం ఎక్కడున్నది? అదీ లేదు.
ఈ కనబడేదంతా స్వకీయకల్పనమే! -
శ్రీరాముడు : జగత్తులో కనిపించే సృష్టి స్థితి-లయాలు, జన్మ-జీవన-మృత్యువుల మాటేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ జీవుడు దేహం పొందవచ్చు. కోల్పోనూ వచ్చు. వాస్తవానికి ఈ జీవుడు స్వతఃసిద్ధమైన స్థితి దృష్ట్యా జన్మించటమూ లేదు, మరణించటమూ లేదు. ఇక ఇవన్నీ అంటావా? ఇవి ‘కల్పన’ అను చమత్కారము యొక్క విన్యాసము మాత్రమే!
Page:792
అనగా, ’కల్పన’యే మూర్తివంతమై ఈ విధంగా జగత్తు రూపంగా భాసిస్తోంది. అంతేగాని ఇక్కడ మూర్తి వంతమైనదేదీ యథార్థానికి లేదు. నిరాకారమైన బంగారము రకరకాలైన ఆకారాలు ధరించి-గాజు-గొలుసు ఉంగరంగా కనిపిస్తోంది కదా! యథార్థానికి బంగారమునకు ‘ఇది ఆకారం’ అనునదేమున్నది? ఈ జగత్తులో కనిపించే మూర్తిత్వములన్నీ అట్టివే! ఎందుచేతనంటావా? ఈ జగత్తులో ఏఏ మూర్తిత్వములు (రూపాదులు) కనిపిస్తున్నాయో… అవన్నీ అట్లు ద్రష్ట యొక్క సంకల్ప ప్రభావం చేతనే కన్పిస్తున్నాయి. ఒకడు కళ్ళు మూసుకొని తన యొక్క మనోరాజ్యంలో అనేక వస్తువులు చూస్తున్నట్లే, కళ్ళు తెరచినప్పుడు కూడా మనోరాజ్య మాత్రంగా ఈ జగత్తును చూస్తున్నాడే గాని, యథాతథంగా చూచుటలేదని ఇక్కడ గమనించవలసిన విషయం సుమా! సంకల్పంలోనూ, స్వప్నంలోనూ కనిపించేవన్నీ నిరాకారమేనని అందరికీ తెలుసుకదా! ఈ జగత్తుగా దర్శించబడేది కూడా అట్టిదే! ఇట్టి శూన్యరూపమగు జగత్ స్థితియందు వివేకులకు రాగద్వేషాది భావాలు ఎట్లా కలుగుతాయి? ఎప్పుడో భవిష్యత్లో ఉండబోయే ఆకాశ వృక్షంపై ఏ పక్షి వ్రాలుతుంది? ఆకాశంలో వృక్షం ఎట్లా ఉంటుంది? అది ఎంత అర్థరహితమో… వివేకుల దృష్టిలో ఇక్కడ ఇష్ట-అయిష్ట విశేషాలు ఉండటం అంతటి అర్థరహితం.
ఇదంతా ఆత్మాంతర్గతం!- కాబట్టి రామచంద్రా! ఈ సమస్త జగత్తుకు గాని, ఇందలి ప్రాణులకు గాని వాస్తవానికి ఎట్టి మూర్తిత్వం లేదు. శూన్యత్వం లేదు. అందుచేత ‘చిత్తం’ అనునది కూడా ఎప్పుడో అస్తమించిన సూర్యుని రూపం వంటిదే! ఈ విధంగా ఎప్పుడైతే చిత్తం యొక్క రహితత్వాన్ని గమనించామో… ఇక ఆ పై శేషించేది సన్మాత్ర ఆత్మయే! అట్టి ఆత్మ ‘అభావం’ ఎన్నటికీ కాదు. భావాలన్నీ ఆ ఆత్మవే! అది భావనలకు ఆవల ఉండి ఆత్మభావనచే సులభ లభ్యమే అయి ఉన్నది.
తత్త్వవేత్తకు ఈ వివిధ రూపాలతో కూడిన జగత్తు ఈ వివిధరూపరహితమై, ఏకమగు ఆత్మగా మాత్రమే భాసిల్లుతోంది. సమస్తమగు అభరణములు ఏకమగు సువర్ణ పిండమున ఒదిగి ఉన్నట్లు… ఈ నానావిధ పదార్థములన్నీ ఏకమగు ఆత్మయందు అంతర్గతములై ఉన్నాయి. నిత్య సిద్ధమగు చిత్స్వభావమున ‘స్థితి’ కలిగి ఉన్న జ్ఞాని యొక్క దృష్టిలో ఈ అహంభావ సహిత జగత్తు, ఈ చిత్తం… ఇవన్నీ లయించిపోయినవై కనిపిస్తున్నాయి. అనగా, జగత్తు జగత్తుగా కాకుండా ఆత్మ గానే కనిపిస్తోంది. చిత్తం చిత్తంగా కాకుండా ఆత్మగానే తెలియవస్తోంది. ఈ జగత్తు-చిత్తం లయించి పోగా, అప్పుడు శేషించునట్టి ‘చిదేకరసమును’ వర్ణించి చెప్పటానికి అచిత్ స్వభావాశ్రయులకు కుదిరేది కాదు. జగత్ దృష్టి తొలగినపుడు మాత్రమే చిదేకరసానుభవుల దృష్టి అవగతమౌతుంది.
రామచంద్రా! ఇక్కడి ఉన్నత, అవనత విషయాల వైపుగా ఎవరి బుద్ధి పరుగులు తీస్తున్నదో… అట్టివారు పొందే క్లేశాలకు అంతూ పొంతూ ఉండటం లేదు. అందుచేత వారి బుద్ధికి సద్రూపమగు ఆత్మ భాసించటమే లేదు. వారికి అఖండ అప్రమేయ ఆత్మానుభవం ఎట్టిదో చెప్పినా, వారు గమనించ లేక పోతున్నారు. కాబట్టి కాస్త ‘యుక్తి’ (ఉపాయం) అభ్యసిస్తే సత్య పదార్థం తప్పక విదితమౌతుంది.
ఎవడైతే ఈ భూత-భవిష్యత్ వర్తమాన సర్వ పదార్థ రూపమగు ఈ జగత్తు యొక్క ఆవిర్భావాన్ని, దీని కార్యకారణత్వాదులను విమర్శించి చూస్తాడో… అట్టివాడు క్రమక్రమంగా ఈ
Page:793
జగత్తులోని స్థూలత్వం నుండి సూక్ష్మత్వం వైపుగా పయనిస్తాడు. అనగా స్థూలంగా కనిపించేవన్నీ పదార్థాల వర్తమాన దశయేగాని, నిత్యమైన స్థితి కాదని గ్రహిస్తాడు. ఉష్ణభేదం చేత మంచు-జలవాయు స్థితులు కనిపిస్తున్నాయి కదా! వాస్తవానికి ఈ జగత్తు యొక్క స్థూల-సూక్ష్మ స్థితులను అధిగమించి పరిశీలించినప్పుడు శేషించునది "సన్మాత్రం - అఖండబోధ రూపం” అగు ఆత్మయేనని గ్రహించబడగలదు.
అనగా, ‘ఈ జీవుడు స్థూల విషయములైన దేహాదులు, తత్సంబంధమైన ఆయా విషయాలు కాదు. సూక్ష్మ భూతములైన ‘భావన-మనస్సు-బుద్ధి-అహంకారం’ మొదలైనవి కూడా కాదు. మరి? ఈతడు ‘అఖండమగు బోధ స్వరూపుడే‘… అని గ్రహించబడగలదు. అట్టి అద్వైత బ్రహ్మం నందు ‘శాంతి’ని పొందినట్టి మనుజుని దృష్టియందు ఈ ’ప్రపంచం’ అనేదేదీ లేనే లేదు. సద్గుణాలు గల సజ్జనునకు ‘ఓర్పు-దయ-దాక్షిణ్యము’ మొదలైనవి హృదయానికి హత్తుకుంటాయి చూచావా? అట్లాగే జగద్విషయముల పట్ల ’అపేక్ష’ను జయించిన జ్ఞానికి ఇప్పుడు మనం చెప్పుకునే ‘జగత్తు వాస్తవానికి లేదు’ అనే పాఠం అతిసులభంగా అనుభవైకవేద్యం అగుచున్నది.
శ్రీవసిష్ఠ మహర్షి :
పిండత్వం నాస్తి భూతానాం, శూన్యత్వంచాపి అసంభవాత్, అతేవ మనో నాస్తి, శేషం ‘సత్’ తత్ అవస్థితిః ॥
ఓ రామచంద్రా! మట్టిబొమ్మలో ఆకారం కనిపిస్తున్నప్పటికీ మట్టికి వాస్తవానికి ఆకారం లేదు కదా! ఎందుకంటే మట్టి ముద్దతో ఏ ఆకారం తయారుచేస్తే అదే మట్టి యొక్క ఆకారంగా కనిపిస్తోంది! ఏ ఆకారమైనా తయారవటానికి సిద్ధమగుచుండగా ఇక మట్టికి ‘ఇది దీని ఆకారం’… అని ఎట్లా కుదురుతుంది? అట్లాగే ఈ ప్రాణులకి మూర్తిత్వం (ఆకారాదులు) వాస్తవానికి లేదు. మరి వీరు శూన్యరూపులా? లేదు. శూన్యమైనట్టిది ప్రాప్తించటం ఎట్లా జరుగుతుంది? ఇక ’మనస్సు’ అనేది కూడా ఎక్కడా లేదు. ఈ మూర్తి-శూన్య-అమూర్తి రూపములగు కల్పనలను వదిలివేస్తే అప్పుడు శేషించేదే ‘సన్మాత్రము’ అని, ‘ఆత్మ’ అని చెప్పబడుచున్నది. అదియే నీ యొక్క, నా యొక్క ప్రతి ప్రాణి యొక్క వాస్తవ స్థితి.
సంసారము… అనగా! -
శ్రీరాముడు : ఈ జీవుడు-జగత్తులు మొదలైనవన్నీ (మీరు చెప్పినట్లుగా)… లేనప్పుడు మరి ‘సంసారము’ అని దేనిని పిలుస్తున్నాం?
శ్రీవసిష్ఠ మహర్షి : ’కేవల సాక్షి చైతన్యం’ అగు ప్రత్యగాత్మ ఒకానొకప్పుడు ’స్వస్వరూపానుభవ మాత్ర స్థితి’ నుండి విషయముల వైపుకు ఉన్ముఖమౌతుంది. అట్టి ఉన్ముఖత్వమే సంసారము. కేవల
Page:794
జ్ఞాన స్వరూపం సంసార జ్ఞానంగా ఉదయించుటయే ‘సంసారం’ అను అనర్థమునకు కారణం. అట్లు ఉదయించకుండుటయే ‘శ్రేయము’ కొరకు అయి ఉన్నది.
శీతలత్వంచే జలం ఘనీభవించి పొడవు-వెడల్పు మొదలైన ఆకారాలు కలిగిన మంచుగడ్డగా అగుచున్నది చూచావా! కేవల శుద్ధ జ్ఞానంలో ఉదయించిన సంసార జ్ఞానమే ఒకానొక సమయంలో బాహ్యత్వం పొంది మూర్తిత్వంగా ప్రాప్తించుచున్నది. ఈ జీవుడు సర్వదా ఆత్మ స్వరూపుడే! అయితే చిద్రూపమగు ఆత్మయే తన స్వరూపమును గూర్చిన ‘అజ్ఞానం’ చేత మూర్తిత్వమును గ్రహిస్తోంది.
ఒకడు అదమరచి నిదరపోయి, ఆ నిదురలో పొందిన స్వప్నంలో కనిపించిన ఆయా రూపాలన్నీ తనకు భిన్నములైనవని భ్రమిస్తూ ఉంటాడు చూచావా? అట్లాగే చిద్రూపమగు ఆత్మయే తన శుద్ధ జ్ఞానత్వమును ఏమఱచి పదార్థముల వలె మూర్తిత్వం తనకు అన్యంగా గ్రహిస్తోంది. అట్లా గ్రహించిన కారణంగా చిత్తత్వమును ధరిస్తోంది. అట్టి చిత్తం చేతనే ఈ దేహమును ధరిస్తోంది. అట్టి దేహం ద్వారా తదితరమైనట్లుగా శబ్ద స్పర్శ - రూప-రసాదుల రూపంతో కూడిన ‘జగత్తు’ అనబడు దానిని కూడా ధారణ చేస్తోంది. అట్టి జగత్తులో అనేక ఆశాపాశములు కల్పించుకొని అనేక ఉపాధులు పొందటం, కోల్పోవటం కాలానుగతంగా చేస్తోంది.
ఏతావతీషు అవస్థాసు బోధస్యోదేతి నాన్యతా,
శబ్ద కల్పనయా భేదః కేవలం పరికల్పితః ॥
అయితే… ఆయా సర్వ అవస్థలలోనూ చైతన్యం చైతన్యంగానే ఉంటోంది గాని అన్యమైనదిగా (మూర్తిత్వం-చిత్తత్వం-దేహత్వం-విషయత్వం-జగదత్వం మొదలైనవిగా) తాను అవటమే లేదు. జలంగా, తరంగాలుగా, సుడులుగా, బుడగలుగా, బుడగరూపవృత్తంగా అగుచున్నప్పుడు జలం తన జలత్వం పోగొట్టుకొంటోందా? లేదే! మరి ఈ భేదమంతా ఏమిటంటావా? కేవలం శబ్దమాత్ర వ్యవహారంచే ఆయా భేదమంతా కల్పన చేయబడుతోంది. స్వప్న దర్శన సమయంలో మనస్సే బాహ్య-అభ్యంతర విషయరూపమున వికృతినొందుతూ భాసిస్తోంది కదా! అయితే స్వపద్రష్ట సర్వదా యథాతథంగానే ఉంటున్నాడు కదా! ఉంటున్నాడు కాబట్టే స్వప్న సంఘటనానంతరం మరల జాగ్రత్తులోకి వస్తున్నాడు. అట్లాగే ‘ఆత్మ ఆయా విశేషములన్నీ పొందుచున్నప్పటికీ, తాను యథాతథంగానే ఉంటోంది’… అనునదే జ్ఞాన-విజ్ఞాన సారం.
బోధరూపమగు ఆత్మయందు ఎట్టి మూర్తిత్వ-చిత్తత్వ-దేహత్వాది వికారములు ఏర్పడటానికి అవకాశమే లేదు. ఆకారం లేని జలం ఒకప్పుడు తరంగాకారంగా కనిపిస్తున్నట్లు అమూర్త రూపమైన ఆత్మ ఒకప్పుడు చిత్తాకారంగా అగుపిస్తోంది. చిదాత్మ ఆకాశం వలె, కాలం వలె ఎల్లప్పుడు అవికృత రూపంగానే ఉంటోంది. స్వప్న పదార్థాలన్నీ స్వప్నద్రష్ట ఊహారూపాలే అయి ఉన్నట్లు, సమస్త పదార్థాలు చిదాకాశరూపమే అయి ఉన్నాయి. కానీ చిదాకాశం పదార్థ రూపాలుగా అవటం లేదు.
ఈ చిత్తం… చిదాకాశమే! అయితే చిదాకాశం చిత్తంగా అవటం లేదు. ఆభరణం… బంగారమే! అయితే బంగారం బంగారంగానే ఉన్నది గాని, ‘ఆభరణం’ అవటం లేదు. మట్టి బొమ్మలో బొమ్మగా అయినది మట్టియే! అయితే, మట్టి బొమ్మగా అవుతోందా? అవటం లేదు కదా!
Page:795
శ్రీరాముడు : మహర్షీ! చైతన్యము ఎన్నటికీ జడపదార్థంగా (అట్లాగే, జీవుడు మొదలైనవిగా) అగుటకు అవకాశం లేదనునది యుక్తియుక్తమేనని అనుకుందాం. అయితే జడపదార్థం (అట్లాగే జీవుడు మొదలైనవి) చైతన్యముగా ఎప్పటికైనా కాకూడదా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! బాహ్య జడ పదార్థం తత్త్వబోధవశంగా కూడా అభ్యంతర చిదాకాశ రూపం పొందజాలదు! ఎందుకంటావా? ఈ జడ పదార్థం ‘అత్యంత అసదృశం’. “తరంగం తన ఆకారం కోల్పోయి ఎప్పటికైనా జలంగా కాకూడదా?” అనే వాక్యం ఎట్టిదో అదీ అట్టిదే! జలానికి కనబడిన తరంగాకారం అసదృశమే కాని, ఆపాదితమే కాని వాస్తవం కాదు కదా!
ఇక ఈ దృశ్య వ్యవహారానికి వస్తే, చిదాత్మయే వివర్త భావం చేత ఈ దృశ్య జడ స్థితిని పొందుతోంది. పరమార్ధమున చైతన్యం జడ భావం పొందుటయే లేదని గ్రహించు. కదిలించేది చైతన్యం, కదిలేది జడం కదా! ’కదిలించేది’ కదిలేదిగా అవుతోందా? లేదు. కదిలించే చైతన్యం సర్వ అవస్థలయందునూ తన స్వస్వరూపాన్నే యథాతథంగా ఎప్పటియట్లే స్థితినొంది ఉన్నదే గాని లేశంగా కూడా అది అన్య రూపత్వం పొందడం లేదు. ఒకని బుద్ధి సప్తమభూమిక వరకు పరిణామం పొందినదై, అచ్చట అత్యంత శుద్ధబోధైక రూపమగు ఆత్మ భావనలో ఉదయిస్తోంది. అట్టి అఖండ మగు ఆత్మత్వం ఉదయించగానే బోధ-అబోధ ఇటువంటి శబ్దాల పాత్ర కూడా అస్తమించిపోతోంది.
ఓ రాఘవా! ఈ చిత్తం యొక్క దృఢ భావనచేతనే సూక్ష్మ శరీరాలకు ఈ స్థూలమైనట్టి ఆధిభౌతిక రూపం ఉదయించటం జరుగుతోంది. ఒక నటుడు నాటకంలో పిశాచ వేషం ధరిస్తాడు చూచావా? అట్లాగే ఆకాశం వలె నిర్మలమైనట్టి సూక్ష్మ చిత్తం ఈ ‘మిథ్య’ అయినట్టి ఆధిభౌతిక రూపం ధరిస్తోంది.
ఈ చిత్తం తన యొక్క అన్యమనన స్వభావం కారణంగా ఈ దేహ-జగత్ రూపాలన్నీ భ్రమచే పొందుతోంది. ‘నేను పిచ్చివాడను కాదు. అందరిలాగానే మంచి బుద్ధి కలవాడనే’… అనే మననముచే ‘ఉన్మత్తత’ శమిస్తుంది చూచావా? అట్లాగే, భ్రమ రహితమగు సత్య వస్తువును గురించిన అభ్యాసం చేత ఈ దేహ-జగత్ రూపమగు భ్రాంతి తప్పక శమించగలదయ్యా!
“నేను మనో స్వరూపడను గాను, ఆత్మ స్వరూపుడను (ఆత్మయే స్వరూపంగా కలవాడను) ఈ దేహము-పంచేంద్రియాలకు విషయాలయ్యే జగత్తు… ఇవన్నీ కూడా నా యొక్క క్రీడాకల్పనచే ప్రాప్తించేవి మాత్రమే.”
అని మననం, మరియు ’జ్ఞానం’చే లేక ’బుద్ధి’చే వాసన ప్రశమనం పొందగలదు. ఏది ఎంతవరకు భ్రాంతియో గ్రహించటం చేత ‘జగత్తు సత్యం’ అనే వాసన వివర్తిస్తుంది. ఎట్లా అంటే స్వప్నం స్వప్నరూపంగా ఎఱుగబడిన తర్వాత ఇక ఆ స్వప్నంలో కనిపించే వస్తువులు-విషయములుస్వప్న జీవులు సత్యమేనని ఎవరూ నమ్మి ఉండరు కదా! వాసన శమించటం చేత సంసారము శమించుచున్నది. వాసనయే మహాపిశాచి సుమా! అందుకే వివేకులైన వారు ఈ వాసనను, (లేక, దృశ్యము పట్ల ఏర్పడిన సత్యత్వ బుద్ధిని) ఛేదించివేయుటయందు తత్పరులై ఉంటారు.
Page:796
ఏ విధంగా అజ్ఞానం యొక్క అభ్యాసం చేత అజ్ఞానరూపమగు ’భావనా ఉన్మత్తత, పుట్టు కొస్తోందో… ఆ విధంగానే జ్ఞానం యొక్క అభ్యాసం చేత కాలక్రమంగా ఆ ఉన్మత్తత శమించి పోతోంది. భావన చేతనే ఈ స్థూల-సూక్ష్మ శరీరాలన్నీ మరలమరల ప్రవర్తిస్తున్నాయి. ఈ స్థూల శరీరం భ్రాంతి మాత్రమే. "ఇది ఉన్నా, ఊడినా, మరల వచ్చిపడినా, నేను మాత్రం యథాతథ స్వరూపుడనై ఉంటాను” అనే అభ్యాసం చేత ఈ స్థూలశరీర భావన సూక్ష్మశరీర భావనతో లయమై పోతోంది. ఆ సూక్ష్మ శరీర భావనయో (అతివాహక శరీర భావనయో)… ’బ్రహ్మ మాత్రత్వం’గా రూపుదిద్దుకొంటోంది. ‘నేను స్థూల శరీరుడనై జీవిస్తున్నాను’ - - అను స్థితి నుండి వివేకి క్రమంగా “నా యొక్క జీవనం సూక్ష్మ దేహంగాని, ఈ స్థూల దేహంగా కానీ కాదు” అను జ్ఞానమును సుస్థిరీకరించుకుంటూ వస్తున్నాడు.
ఈ విధంగా దృఢమైన జ్ఞానాభ్యాసం చేత ఆ సూక్ష్మ దేహపదమునకు కూడా బ్రహ్మత్వము పొందింపజేయాలి. “నా యందు ఉత్పన్నమైన పదార్థములు నా రూపాలే అవుతాయి కదా! అట్లాగే సమస్త పదార్థముల ఉత్పత్తి స్థానం పరమాత్మయే కాబట్టి ఇవన్నీ పరమాత్మ స్వరూపములే” అనే ఉద్బోధ (లేక) భావన (లేక) జ్ఞానము ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు ‘సూక్ష్మ దేహం అనేది మాత్రం ఎక్కడున్నది? అది కూడా స్థూల దేహంలాగే మిథ్యయే’… అనే నిశ్చయం కలుగుతుంది. అటువంటి నిశ్చయం కలగడానికి ఉద్దేశించకుండా, ఊరకే ‘హూం హూం’ వంటి ఎన్ని శబ్దాలు ఉచ్చరిస్తే మాత్రం ఏం ప్రయోజనం? సంసార గ్రంథి నివర్తమౌతుందా? లేదు.
మొట్టమొదట ఈ జగుత్తు తత్కారణమైన ‘ఈశ్వరుడు’ ఈ ఇరువురి ఏకత్వము గ్రహించాలి. అది ’తత్’ పదార్థ శోధనం ద్వారా ఎఱుగబడగలదు. ఆ తర్వాత ‘త్వం’ పదార్థ శోధనం ద్వారా “ఈ ప్రత్యగాత్మ వాస్తవానికి అసంగుడు. పరమాత్మ కంటే ద్వితీయుడైన వాడు కాదు (అద్వితీయుడు)”… అని ఎఱుగబడుతోంది. ఈ విధంగా తన యొక్క ‘భావన + బుద్ధి’ కూడా క్రమక్రమంగా ‘తత్త్వ స్వరూప-ఐక్యరూపమగు అఖండాకార వృత్తి’ అనదగు ఆత్మ రూపంగా పరిణమించాలి. అటువంటి అఖండాకార వృత్తి యందు ప్రత్యగాత్మ లయించినదై అట్టి ఆత్మకు అన్యమైనదేదీ ఎఱుగనంతటి అఖండ బోధ జనించుగాక! ఎంత వరకు అట్టి అఖండ బోధ జనించదో… అంత వరకు శ్రుతులు చూపించిన మార్గంగా ‘తత్ త్వమ్’ పదార్థ ద్వయ శోధన ద్వారా దృఢ జ్ఞానాన్ని సంపాదించు కుంటూనే ఉండాలి. బాహ్య అభ్యంతరాలలో చోటు చేసుకొని ఉన్న ఈ ‘చిత్తం’ పూర్తిగా ఎప్పుడైతే శమిస్తుందో, అప్పుడు అది తన సాక్షి రూపమగు ’చిత్స్వరూపం’గా ప్రకాశిస్తుంది. ’ఆకాశం వలె నిర్మలం-శీతలం’ అయినట్టి అట్టి తన చిత్స్వభావమును ఆశ్రయించి ఈ మనుజుడు శాంత స్వరూపుడై అప్పుడు ఉండగలడు.
జ్ఞానవాన్ జ్ఞానయజ్ఞస్థో ధ్యానరూపం విరోపయన్ I
జగత్ విజిత్య జయతి, సర్వత్యాగైక దక్షిణః ||
జ్ఞాని అయినవాడు ‘జ్ఞానము’ అనే మహా యజ్ఞమునందు సర్వదా నెలకొని ఉంటాడు. ఆ జ్ఞాన యజ్ఞశాలలో ‘ధ్యానము’ అనే దృఢమైన, ఉన్నతమైన ’యజ్ఞ స్తంభము’ను నాటుకుంటాడు.
Page:797
అట్లా జ్ఞానయజ్ఞతత్పరుడై ‘చిత్స్వభావము’ అను అధిదేవతకు ‘సర్వ త్యాగము’ అనే ముఖ్య దక్షిణను ఇచ్చివేసినవాడై ఈ విశ్వమును మొదలంట జయించివేయటమే నిజమైన ‘విశ్వజిత్ యాగం’. అట్టి విశ్వమునకు సాక్షియై, సర్వోత్కృష్టుడై, మాటలకు అందనివాడై ఉంటాడు. అతడు ఆత్మయందు ఏకరూపుడై ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక ఆపై, అగ్ని వర్షం కురిసినప్పటికీ, ప్రళయ వాయువు వీచి నప్పటికీ, ఈ భూతలం గాలికి ఎగిరిన కాగితపు ముక్కలాగా ఎటో ఆకాశంలోకి వెళ్ళిపోవుచున్న ప్పటికీ, ఏది ఏమైనప్పటికీ అతడు సర్వదా ఆత్మయందు ఏకరూపుడుగానే ఉంటాడు. అట్టి అనుక్షణిక అఖండాత్మానుభవమే వజ్రతుల్యమగు ‘దృక్తి’ అనికూడా పిలువబడుతోంది. అయితే…
1.తృష్ణా రాహిత్యముచే శాంతి పొందిన మనస్సు గలవాడు, 2. ఇంద్రియ విషయాలన్నిటి పట్ల నిరోధ దశను సంపాదించుకున్నవాడు… ఈ రెండూ సంపాదించుకున్నట్టి మనుజునికి మాత్రమే అట్టి అకృత్రిమ సమాధియందలి వజ్రతుల్యమగు ‘దృకిస్థితి’ లభిస్తుంది.
మనో శమము -
శ్రీరాముడు : మహాత్మా! ఈ మనస్సు పూర్ణంగా శాంతించటానికి (శమించటానికి సులభోపాయం
ఏమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ మనస్సు శాస్త్రములు ప్రతిపాదించిన అభ్యాస క్రమాలచే, ఉపదేశాలచే, ఇంద్రియ దమంచే శమించగలదు. అయితే, ‘బాహ్య పదార్థములన్నిటి పట్ల తృష్ణారాహిత్యం’ అనే అభ్యాసంచే శమించినంత సులభంగా మరే విధంగానూ ఈ మనస్సు శమించదు. జీవుడెందుకో ’సంపత్తి పొందాలి’ అను భావనకు లోను అవుచున్నాడు. అక్కడి నుండి తృష్ణ-అజ్ఞానాలు మహా వాయు వీచికల వలె బయల్వెడలుచున్నాయి. కాబట్టి ‘సంపత్తి అంతా మహా అపత్తియే’ అను భావనను, ‘ఇవన్నీ నావి కానే కావు’ అను ప్రజ్ఞచే సునిశ్చితం చేసుకోవాలి. ఏదేది ‘నాది కాదు’ అని గ్రహిస్తామో, అది త్యజించబడినదే అవుతుంది. ఆ విధంగా సర్వత్యాగం, తృష్ణారాహిత్యం అభ్యసిస్తూ చరమ సాక్షాత్కారమైన ఆత్మతత్త్వాన్ని హృదయంలో వెలిగించాలి. అట్టి జ్ఞానదీపంచే అజ్ఞానాంధ కారం, అద్దాని అలవాలమైన అహంకార మమకార పిశాచాలు, ఆకారాదుల పట్ల ఏర్పడి ఉన్న ఆకర్షణ… ఇవన్నీ వాటంతట అవే తొలగుతాయి. ఆపై ‘ఈ సమస్తం చిదాత్మయే. నా ఆత్మయే తన అఖండ స్వభావం చేత ఈ సర్వంగా ప్రకాశిస్తోంది’ అను అవగాహన సుస్పష్టమవగలదు.
చైతన్యం సర్వదా యథాతథం- ఓ రామచంద్రా! పొగ ఆకాశంలో ప్రవేశించి అనేక ఆకారా లుగా కనిపిస్తుంది చూచావా? అట్లాగే, ఈ కనబడే మనుష్య-నాగ-అసురాది స్థానములు, పర్వతగుహాది పదార్థములు ఇవన్నీ కూడా చైతన్యమే ఆయా వివిధ వైచిత్ర్యములుగా అగుచున్నదనీ, (కానీ) యథార్థానికి (పొగలాగానే) చైతన్యము సర్వదా యథాతథంగానే ఉన్నదనీ - భావన చేయి. రసరూపమగు వర్షజలం జడమగు భూమియందు ప్రవేశించి రసస్వరూపములగు ఈ వృక్షపుష్ప-ఫలాదులుగా అగుచున్నదే! అట్లాగే చైతన్యము బ్రహ్మాండమున ప్రవేశించి తన యొక్క ప్రాణ శక్తిచే ఆత్మ యొక్క వివర్త రూపములైన ఈ ప్రాణికోట్ల శరీరములందు చలించుచున్నది. జలంలో సంచరించే చేప ఒక రోజు వలలో చిక్కుకొని ఎటూ వెళ్ళలేక తిప్పలుపడుచున్నట్లుగా, ’చిదాకాశము’
Page:798
అను దానిలో విహరించవలసిన ఈ జీవుడు ’దేహ స్వభావము’ అనే మోహజాలంలో చిక్కుకొని ఆయా అగచాట్లన్నీ పడుచున్నాడు. తన ఆత్మ స్వరూపాన్ని (ఆత్మ స్థితిని) స్మరించక దృశ్యవస్తు సముదాయాన్ని స్మరిస్తూ ‘తృష్ణ’ అనే ఎఱ తగిలించబడిన గాలంలో చిక్కుకొని విలవిల్లాడుచున్నాడు.
ఓ రామచంద్రా! నిర్మల చైతన్యమే ‘నిజ స్వరూపం’ అనే ప్రాంగణంలో స్వర్గ -మర్త్యపాతాళాలలోని అనేక పదార్థముల రూపంగా స్ఫురిస్తోందయ్యా! ఈ జీవులలో కనిపించే తేడా అంతా వాసనల యొక్క అల్ప-ఆధిక్యతలు మాత్రమే!
సర్వ ఏవ సమా జీవా వాసనాం అన్తరేణచ శుష్క పర్ణవత్ ఉడ్డీనా జడాః శ్వసన వేణవః ॥
వాసనల యొక్క అల్ప ఆధిక్యతలు తప్పిస్తే ఈ జీవులందరూ సమానులే! అందరూ కూడా చైతన్య స్వరూపులే! వాసనల వల్లనే వారు ఎండుటాకులవలె ఎగిరి స్వర్గ-భూ-పాతాళములలో పడుచున్నారు. ప్రాణవాయువు సహాయంతో ఆయా శబ్దములు పలుకుచున్నారు.
అందుచేత రామచంద్రా! మొట్టమొదట ఈ జీవుడు పురుషప్రయత్నం చేత సాధనా చతుష్టయ సంపత్తిని సముపార్జించుకోవాలి. ఆ ఆ తర్వాత అతని ఆత్మధ్యానమునకు విఘ్నము కలిగిస్తున్న దృశ్య ప్రకంపనములను ప్రాణయామాదుల అభ్యాసంచే జయించాలి. సమాధిచే బహిరృష్టిని విడనాడి నిర్వికల్ప సమాధియందు ప్రవేశించాలి. అట్లు ప్రవేశించటం ద్వారా పూర్వం సంపాదించుకొని ఉన్న వాసనా సమూహమును పారత్రోలాలి. ఈ సంసారపాశము అనే ఘనమైన పంజరమును విరగగొట్టాలి. అప్పుడాతడు పూర్ణానందైకరసమగు బ్రహ్మముగా ఉదయించగలడు. అటుపై ఇక అజ్ఞానము యొక్క ఛాయ కూడా ఉండదు. దీపం వెలిగిన తర్వాత చీకటి ఇంకా ఉంటుందా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ కనబడే 10 దిక్కులలోనూ ఉన్న ‘మనుజ-నాగ-దేవగంధర్వ’… ఆదిగా గల పేర్లతో కనబడే ఈ జీవసమూహాలన్నీ కూడా వాసనా భేదం చేతనే వేర్వేరుగా ఉన్నాయి. వాసనలను ప్రక్కన పెట్టి చూచామా… వాటిలో ఎటువంటి తేడా లేదు. ఈ వాసనా వైచిత్ర్యమంతా 7 రకాలుగా విభజించి చెప్పబడింది.
వాసనావస్థలు - - 1. స్వప్న జాగ్రదావస్థ, 2. సంకల్ప జాగ్రదవస్థ, 3. కేవల జాగ్రత్తు అవస్థ, 4. చిర జాగ్రత్తు అవస్థ, 5. ఘన జాగ్రదవస్థ, 6. జాగ్రత్ స్వప్నావస్థ, 7. క్షీణ జాగ్రదవస్థ
సముద్రంలో అనేక ఆకారాలు గల తరంగాలు ఉన్నట్లుగా, ఈ ఈ సప్తవిధ జీవులు
చిదాకాశంలో ఉన్నారు.
శ్రీరాముడు : మీరు చెప్పిన 7 విధములైన వివిధ వాసనామయ జీవుల గురించి మరికొన్ని
వివరణలు ప్రస్తావించ ప్రార్థన.
Page:799
శ్రీ వసిష్ఠ మహర్షి : సరే వివరిస్తాను, విను.
కస్మింశ్చిత్ ప్రాక్తనే కల్పే, కస్మింశ్చిత్ జగతి క్వచిత్ I కేచిత్ సుప్తాః స్థితా దేహైః జీవా జీవిత ధర్మిణః |
యే స్వప్నమ్ అభిపశ్యన్తి తేషాం స్వప్నమిదం జగత్ | విద్ధి తే హి ఖలూచ్యన్డే జీవకాః స్వప్నజాగరాః ॥
ఓ రామచంద్రా! ఒకానొక పూర్వ కల్పమునందు… ఒకానొక జగత్తులో, ఒకానొక చోట, దేహమును ధరించి జీవించుచున్న … ఏ కొందరో జీవులు నిద్రించుచూ… ఏ స్వప్నమును గాంచుచున్నారో… ఆ వారి యొక్క స్వప్నమే, ఈ జగత్తు అయి ఉన్నది!
ఆ స్వప్నమును గాంచుచున్న జీవులు ‘స్వప్న జాగరులు’ అని చెప్పబడుచున్నారు! ఆ ఒకానొక జగత్తునందు నిద్రించుచున్న జీవులకు స్వయంగా ఆవిర్భవించిన ’స్వప్న ప్రపంచం’లో మనం ప్రవేశించాం. ఎందుచేతనంటే, మనం కూడా సమాన కర్మ-వాసనాదులు కలిగి ఉండటం చేత మనం ఆ స్వప్నంలో ఉంటున్నాం. అతని స్వప్నంలోని విషయాలే మన యొక్క స్వప్న వశం చేత మనకు కూడా (అవి) విషయాలుగా అగుచున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మనందరం అతని స్వప్నంలో మనుజులమే అవుతాం. చిరకాలత్వం కారణంగా వారి స్వప్నం ఈ విధంగా జాగ్రత్ రూపం పొందింది. కాబట్టి అట్టి అవస్థయందున్న ఆ జీవులు ’స్వప్న జాగరులు’గా పిలువబడుచు న్నారు. ’జీవనోటోపాఖ్యానం’లో ఈ విషయం గమనించాం.
ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వసత్తాప్రదుడు కదా! ఆ స్వప్న జాగరుడు ఈశ్వర స్వరూపుడే అయి ఉండటం చేత సర్వత్రా సర్వం సంభవిస్తోంది. ఈ విధంగా స్వప్నయుతులైన ఆ జనులకు మనమందరం స్వప్న మనుజులమై ఉన్నాం. అనగా ఆ స్వప్న జాగరుల స్వప్న సదృశ్య ఊహాస్వరూపమే మన ఈ జాగ్రత్ అవస్థ.
శ్రీరాముడు : మునీంద్రా! పూర్వపు ఏ కల్పమునందో ఆ స్వప్న జాగరులు స్వప్నం గాంచారని కదా, మీరు అంటున్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును.
శ్రీరాముడు : ఆ స్వప్న జాగరుల పూర్వకాలిక స్వప్నమందలి సమస్త పదార్థాలు, దేహాలు నేటికి క్షయించిపోయి ఉండాలి కదా! ఇప్పుడు ఆ స్వప్నం నుండి మేల్కాంచిన ఆ జీవులకు మరల గడిచి పోయిన ఆ స్వప్న జగత్ కల్పంలో స్థితి ఎట్లా సంభవిస్తోంది? వారి గడచిపోయిన స్వప్నం మనకు ఎలా ప్రాప్తిస్తోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! ఆ స్వప్నజాగ్రతులు తదనంతర దశలను పొందుతూ ఉంటారు. 1. ఆ స్వప్న జాగరులు మన ఈ ప్రపంచరూపమగు వారి స్వప్నమైన దైవయోగం చేత తత్త్వ జ్ఞానం పొందారనుకో. అప్పుడు వారి స్వప్నభ్రమ రూపమగు సంసారం నుండి విముక్తి పొందుతారు.
Page:800
(లేదా) 2. అట్లా తమ (స్వప్న సదృశ) సంసారమునుండి విముక్తి పొందకుండానే నిద్రలేచారనుకో… అప్పుడో? అప్పుడు మరల సంకల్పానుసారంగా అన్య దేహాలను ఆశ్రయించి వ్యవహరిస్తూ ఉంటారు.
దృష్టి ఉన్నంత వరకు సృష్టి ఉంటూనే ఉంటుంది. కనుక దృష్టియే సృష్టి. దృష్టి కొనసాగటం అవుతుంది. అందుచేత ఒక విధంగా చూస్తే వారి స్వప్న జగత్తు కొనసాగుతున్నట్లే! వారు ఇతః పూర్వము వలెనే అన్యములైన కల్పిత జగత్తును, కల్పమును గాంచుచూనే ఉంటారు. ఆ కల్పనలకు అంతు ఎక్కడ? ఆత్మజ్ఞానమే ఆ అంతు. చిదాకాశము అనంతం కనుక, వారి కల్పనలకు, వారివారి స్వప్నాంతర్గత విశేషములకు చోటు లేకపోయే ప్రసక్తి ఉండదు. ఆ స్వప్న జాగరులు ‘సంకల్పాత్మక మైన జగత్తులు’ అనే మేడి పండ్లలోని కీటకముల వంటివారు.’
అనగా… వీరిలో 3 లక్షణాలు మనకు కనిపిస్తాయి.
ఈ సంకల్ప జాగరుల సంకల్పము చిరకాలం స్థిరంగా ఉండటం చేత ఆ సంకల్ప వ్యవహారం ఘనీభూతమై జాగ్రద్రూపంగా అగుచుండటం.
అట్టి సాంకల్పికమైన పదార్థములందే అయించిన మనశ్చేష్ఠ గలవారై పూర్వ పర స్థితులు లేకయే ఉంటున్నారు.
ఆ సంకల్పము ఎప్పటికో శమిస్తుంది. అప్పుడు మరల అదే సంకల్ప కథనాన్ని గాని, (లేక) మరొక సంకల్పమునుగాని వారు ఆశ్రయిస్తూ ఉంటారు.
వారి సంకల్పమయ దేహంలో మనమందరం సంకల్పరూపులమై ఉన్నాం. వారి సంకల్పంలో మనం, తదితర జీవులు లోకములు ఉన్నాయి కదా! కనుక వారి దృష్టియందు ఈ సర్వము సంకల్ప జాగరరూపములు మాత్రమే! వారికి మనమంతా వారి ఊహలుగా అనిపిస్తూ ఉంటుంది.
కేవల జాగరులు వీరు దామ-వ్యాళ-కటుల వంటివారు. వీరికి పూర్వపు-ఉత్పత్తివికాసము మొదలైన స్వప్న సదృశ విషయాలు ఉండవు. వీరు వర్ధమానశీలమగు బ్రహ్మము నుండి మొట్టమొదటిగా శరీరము ధరించినవారు. అందుచేత వీరిని కేవల జాగరులు’ అని పిలుస్తారు.
చిర జాగరులు - కేవల జాగరులు ఇప్పుడే జన్మకు ఉపక్రమించారు కదా! వారే మరల తర్వాత తర్వాత జన్మలు పొందినవారై… కార్యములగు జాగ్రత్, స్వప్నాలలో; కారణములగు సుషుప్తి యందును… సంచరిస్తూ ఉంటారు. అట్లా సంచరిస్తూ ప్రౌఢత్వం చెందటం చేత వారిని
‘చిర జాగరులు’ అంటారు.
Page:801
జాగరులు’ అంటారు.
పైన చెప్పిన 5 విధములగు జీవులు ‘బద్దజీవులు’ సుమా! ఇక ముక్తి వైపు ప్రయాణిస్తున్న తదితర 2 రకాల జీవుల గురించి విను.
అంటూ ఉంటారు.
సంకల్పములకు మునుముందే స్వస్వరూపాత్మ - రామచంద్రా! ఈ విధంగా సముద్రంలో ఉన్నదంతా జలమే అయినప్పటికీ రకరకాల ఆకారాలు గల తరంగాలు ఉన్నట్లుగా ఈ జీవ మహాసముద్రంలో మనం పైన చెప్పుకున్న 7 రకాల జీవులు అన్ని జీవజాతులలోనూ ఉన్నారు. వీటిని తెలుసుకొన్నవాడవై ఉత్తరోత్తర భూమికలయందు తత్పరుడవై ఉండుము.
నాయనా! నీవిక ఈ జగత్తును గూర్చిన ‘ద్వైతబుద్ధి’ అనే భ్రాంతిని త్యజించు. ఎందుచేతనంటే నీవు ఇప్పటికే పూర్ణముగా బోధైక రూప ఘనత్వమును (ఘనీభూతమైన దృకామాత్ర రూపమును) పొంది ఉన్నావు. తరంగాలలో భేదం ఉన్నా జలం సర్వదా ఒక్కటే కదా! ద్వితీయాదుల అభావం చేత ఏకత్వ భావన కూడా అవసరం లేదు. అందుచేత ‘ఏకత్వ-ద్విత్వ-శూన్యత్వ-అశూన్యత్వ’… ఆదిగాగల సర్వ ధర్మములను వదిలినవాడవై ఉండు. కల్పనలన్నింటికంటే ఆది ఏమిటో గ్రహించు. అట్టి ‘ఆది’ అయిన అధిష్ఠాన సన్మాత్రుడవై శేషించుము. అదియే నీ స్వభావము.
ఓ సర్వ సభికులారా! మీ అందరి యొక్క వాస్తవరూపం సర్వ కల్పనలకు ముందే ఉన్న ఆత్మ రూపమేనని గ్రహించి తత్పరులై ఉండండి.
Page:802
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు ‘అకారణంగా’ అని అంటున్నప్పుడు నిజమే చెప్పావు. కారణం (లేక) కార్యము ఎన్నటికీ ఉత్పన్నం కాదు. కాబట్టి వాస్తవానికి కేవల జాగ్రత్ జీవులు ఉత్పన్నమే అయి ఉండలేదు. అగ్ని శిఖలలో ఒక్కొక్క శిఖ ఒక్కొక్క ఆకారం కలిగి ఉన్నప్పటికీ అగ్నికి ఏ సమయమందునూ ’ఇట్టిది’ అన్న ఆకారమేదీ లేనే లేదు చూచావా? అట్లాగే జాగ్రత్ జీవులు వాస్తవానికి ఉత్పన్నమే కాలేదు. కాబట్టి తదితర పరిణామ ఫలితమైన తక్కిన జీవభేదం ఏనాడు సంభవించి ఉండలేదు. అంతా కూడా యథాతథంగానే ఉన్నది.
నే_హ ప్రజాయతే కించిత్ నేహ కించన నశ్యతి | ఉపదేశ్యోపదేశార్థం శబ్దార్థ కలనోదయః ॥
ఓ రామచంద్రా! వాస్తవానికి బ్రహ్మమునందు ఈ రకరకాల జీవులు మొదలైనవి ఉత్పన్నమవటమూ లేదు, నశించుటయూ లేదు. మరి? ఈ 7 రకాల జీవుల గురించి ఎందుకు చెప్పానంటావా? ఇదంతా కూడా కేవలం శిష్యునికి ఉపదేశించటానికి మాత్రమే శ్రుత్యాదులు ఈ శబ్దార్థ కల్పనలన్నీ చేశాయి. చివరికి జీవ భేదంతో సంబంధం లేని బ్రహ్మమును బోధించటమే ఆ శ్రుతుల అంతిమ లక్ష్యం.
శ్రీరాముడు :
కః కరోతి శరీరాణి, మనో బుద్ధ్యాది చేతనైః?
కో మోహయతి భూతాని, స్నేహరాగాది బంధనైః?
మునీంద్రా! నాదొక చిన్న సందేహం. బ్రహ్మమునందు జీవాది విశేషములేవీ జనించటం లేదని, బ్రహ్మము సర్వదా నిర్మలత్వముచే యథాతథంగానే ఉన్నదని అనుకుంటున్నాం కదా! మరి ‘మనస్సు-బుద్ధి’ ఇటువంటి చేతన వస్తువులన్నీ ఉపయోగించి భోగసాధనమగు ఈ శరీరమును తయారుచేస్తున్నది ఎవరు? మరియు ఈ జగత్తులో స్నేహము-రాగము మొదలైన ఆయా బంధనములన్నీ కల్పించి ఈ ప్రాణులందరినీ మోహపెట్టుచున్నది ఎవరు?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! వాస్తవానికి ఈ శరీరాలను ఎవడూ ఎన్నడూ నిర్మించటమూ లేదు. ఈ ప్రాణులందరినీ ఎవడూ మోహపెట్టటమూ లేదు. జలంలో తరంగాలు, ఆవర్తాలు మొదలైన జలాకారాలన్నీ పొంది జలమే ఆయా రూపాలుగా కనిపిస్తోంది చూచావా? అనాదిఅనంతం-బోధ రూపం అయినట్టి పరమాత్మయే ఈ అనేక పదార్థ రూపాలుగా తన స్వరూపముననే ఉండి ఉంటున్నాడు.
వాస్తవానికి బాహ్యపదార్థం అంటూ ఏదీ లేదు. మరి? బీజంలోంచే వృక్షం బయల్వెడలుచు న్నట్లుగా అభ్యంతరమైన బోధ రూప హృదయం నుండే బోధయే (చైతన్యమే) బాహ్యపదార్థం వలె స్ఫురిస్తోంది.
ఒక శిలలో శిల్పం ఉన్నట్లుగా బోధ యందే ఈ ‘ప్రపంచం’ అనబడేది స్థితి నొంది ఉన్నది. అట్టి బోధ దేశ కాలాలచే ఏకం-అనంతం కూడా! అట్టి ‘బోధ’ యొక్క విస్తారమే ఈ బాహ్యాభ్యంతర జగత్తు అని గ్రహించు.
Page:803
అంతేకాదు వాసనలచేతనే సిద్ధిస్తున్న బ్రహ్మలోకం మొదలైన తదితర లోకాలన్నీ కూడా పరమాత్మ యందే ఉన్నాయి. పరమాత్మయో, వాసనలన్నిటికీ ఆవల కేవలమై ఉన్నారు! కాబట్టి వాసనాక్షయమును నిరంతర భావన చేయాలి. అప్పుడు వాసనాక్షయ భావనా బలంచేత అనుభవం సిద్ధించగలదు. శాంతులగు జ్ఞానులు ఆత్మ కొఱకై ఆ లోకంలోనో ఈ లోకోంలోనో వెతకరు.
ఆత్మ అంతటా నిండి ఉండటంచేత ‘ఆత్మ ఎక్కడో ఉన్నది’ అనురూపమైన వాసనలు వారియందు ఎన్నటికీ జొరబడవు.
సద్రూపమగు ఆత్మయే దేశ-కాల-క్రియా-ప్రకాశ-రూప-చిత్తాదులతో కూడి ఉన్నది. అయితే వాస్తవానికి దేశ-కాల చిత్తాదులు శబ్ద-అర్థములు ఆత్మకు లేవు. అయినప్పటికీ ఆత్మ శూన్యం కాదు.
ఎవరి దృష్టియందైతే దృశ్యము సర్వదా శమించియే ఉన్నదో… అట్టి తత్త్వవేత్తలగు ద్రష్టలకు మాత్రమే ఆత్మ పదం యొక్క బోధస్థితి అనుభవమగుచున్నది. అన్యులకు అది సుబోధకం అవటం లేదు. అహంకారం అనే పిశాచం ఈ హృదయాన్ని అవహించి ఉన్నంత వరకు ఆత్మపదం సుబోధకం కాదు. ‘చంచలం-విస్తారం’ అయిన ‘అహంకారం’ అనే గోతిలో ఎవడు పడతాడో… అట్టి వాడు
ఎప్పుడూ ఆత్మ ప్రకాశాన్ని గాంచలేడు.
ఓ రామచంద్రా! ఆత్మ జ్ఞానికి ఈ 14 లోకాలు, ఇందులోని సర్వజీవులు తన యొక్క అవయవాల వలె తోచుచూ ఉంటాయి. జ్ఞానుల యొక్క దృష్టికి ఈ ‘సృష్టి’ అనేది ఉదయించటమూ లేదు, అస్తమించటమూ లేదు. ఎందుకంటే ఏదైనా ‘కారణం’ అనేది ఉంటే కదా, ‘కార్యం’ అనేది ఉండేది? కారణమే లేకపోతే కార్యం ఎక్కడి నుండి వస్తుంది? పరమాత్మ అకారణుడు. అతడు దేనికి కారణం కాదు. కనుక ఈ సృష్టికి కారణమే లేదు. కారణమే లేదు కాబట్టి సృష్టియే లేదు. జ్ఞానులు ఈ సృష్టిని ఉదయం గాని, అస్తమయం గాని లేనిదానిగా దర్శిస్తున్నారు.
శ్రీరాముడు : మరి ‘పరమాత్మ నుండే ఈ సృష్టి ఆవిర్భవిస్తోంది’… అని వేద వచనం కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : సరే, అయితే… కారణం యొక్క స్వభావమే కార్యం కూడా కలిగి ఉంటుంది కదా! కారణమగు పరమాత్మ ఎట్లు సత్-చిత్-నిరాకార రూపమే అయి ఉన్నదని జ్ఞానులు గ్రహిస్తున్నారో కార్య రూపమగు జగత్తు కూడా సత్చిత్ నిరాకార రూపమేనని గమనిస్తున్నారు. అజ్ఞానులో ఇదంతా ఆకార రూపంగా మాత్రమే దర్శిస్తున్నారు.
‘బంగారు అభరణం’ అనుదానిలో… అభరణం అనే కార్యం ‘బంగారం’ అనే కారణం నందే ఉన్నప్పుడు, ‘ఆభరణం’ అనే దానికి బంగారం కంటే వేరైన ఉనికి ఎక్కడ? అట్లాగే కారణమగు పరబ్రహ్మమునందే ఆ పరబ్రహ్మం రూపంగానే ఈ జగత్తు ఉన్నప్పుడు ఇక వేరే ‘కారణత్వం’ అనేది పరబ్రహ్మానికి ఏమున్నది? బంగారపు ముద్ద ఉంగరం మొ॥న ఆకారంగా ఉన్నప్పుడు ఆభరణం అంటున్నాం. ఆభరణంలో బంగారం తప్ప వాస్తవానికి మరింకేమీ లేదు కదా! అట్లాగే పరమాత్మయే సృష్టి రూపంగా కనిపిస్తోంది. అంతేగాని సృష్టికి పరమాత్మ కంటే వేరైన రూపం లేదు. ఒకవేళ
Page:804
పరమాత్మ కంటే వేరుగా ఎక్కడైనా సృష్టి అనేది ఎవరికైనా అనుభవమౌతుంటే… అది అసత్తే గాని (వాస్తవానికి లేనిదే గాని) సత్తు కాదు. ఎప్పుడైతే (బంగారు ఆభరణంలో ఆభరణం వలె) అసత్తో, అప్పుడు పరమాత్మ యందు గల ‘కారణత్వం’ అనేది కూడా అసత్తే (లేనిదే) అగుచున్నది.
‘మరి మాకు జగత్తు కనిపిస్తోంది కదా’ అని ఎవరైనా అంటారా?
శాంతమగు మహా సముద్రంలో ‘తరంగాలు-ఆవర్తనాలు’ ఉంటున్నట్లే, శాంతముక్షోభరహితము అగు బ్రహ్మం నందు ‘జగత్తులు-చిత్తములు’ ఉంటున్నాయి. ఒకే మట్టి అనేక మట్టి పాత్రల రూపంగా అగుచున్నట్లు, ఒకే బంగారం అనేక పేర్లతో పిలువబడే ఆభరణాలుగా, అగు చున్నట్లు… ఒకే బ్రహ్మం అనే పిండం అనేక జీవులుగా, జగదృశ్యములుగా, చిత్తములుగా అగు చున్నది. అయినప్పటికీ కూడా బ్రహ్మపిండం సర్వదా ఏకం- నిర్మలం అయి ఉన్నది. మట్టి ఎన్ని పాత్రలుగా అగుచున్నప్పటికీ బంగారం ఎప్పటికీ బంగారమే! అట్లాగే బ్రహ్మం సర్వదా బ్రహ్మమే!
కుండగా ఉన్నప్పటికీ… అది మట్టియే! మట్టిగా ఉన్నప్పటికీ అందులో కుండగా అవగల తత్త్వం సర్వదా ఉన్నది. మట్టి మట్టిగా ఉన్నప్పుడు, కుండగా ఉన్నప్పుడు కూడా ఉభయ స్థితులందు ఏక వస్తువును కుమ్మరి దర్శించగలడు. అట్లాగే, జ్ఞాని సహజీవుల వైపు చూచేటప్పుడు ఆ సహజీవుల వాసనాయుక్తమైన మనస్సులను వదలిపెట్టి అతీత దృష్టితో చూడగలుగుతాడు. అతని యొక్క సత్యవస్తుజ్ఞాన ప్రభావం చేత సహజీవులంతా ఆత్మ స్వరూపంగానే అగుపిస్తారు. జ్ఞానులకు ఈ జాగ్రత్ స్వప్నతుల్యంగా తెలియవస్తుంది. స్వప్నం జాగ్రత్తు వంటిదే అవుతుంది. జాగ్రత్తు స్వప్నం వంటిదే అవుతుంది.
ఆత్మ కంటే వేఱుగా ఏదైనా వారికి కనిపిస్తే అద్దానినంతా వారు స్వప్నతుల్యంగా చూస్తారు. అందుచేత వారికి అంతటా అన్నిటా ఒకే వస్తువు భాసిస్తోంది. మృగతృష్ణ ’మృగతృష్ణ’గా తెలియబడిన తర్వాత ఇక ఆ మృగతృష్ణలో కనిపించే ఒక తరంగం మరొక తరంగం మధ్య గల తేడా భ్రమగానే తెలియవస్తుంది గాని, ఆ తేడా వాస్తవమని అనుకోం కదా! ఈ అనేక విశేషములతో కనిపించే జగత్తు చిత్త మాత్రంగా ఎఱుగబడిన తర్వాత ఇదంతా స్వప్న తుల్యంగా అనిపించటంలో ఆశ్చర్యం ఏముంటుంది? ఆకాశంలో మేఘాలు అనేక ఆకారాలతో కనిపిస్తున్నాయి. అయితే మేఘాలన్నీ జలబిందువుల యొక్క ఘనీభూతమైన హిమ (మంచు) స్థితియే కదా! ఆ మేఘాలు వర్షించాయనుకో, ఇప్పుడేమైనది? ఆ ఆ మేఘాలన్నీ జల బిందువులై నేలపై వర్షించాయి కదా! మరి మునుముందటి మేఘాకారాలన్నీ ఏమైనాయి? అట్లాగే ఆత్మ యొక్క సమ్యక్ జ్ఞానం ఉదయించగానే జ్ఞానికి ఈ కనబడే సర్వ దేహాలతోసహా సమస్తం చిత్త త్యాజ్య రూపమున త్యజించబడుతుంది. ఇదంతా ఏకము - నిర్మలము అగు ఆత్మగా సుస్పష్టంగా అనుభవమగుచున్నది.
మేఘాలు ఆవరించినప్పుడు ఆకాశం కనిపించదు. మేఘాలే కనిపిస్తాయి. మరి మేఘాలు తొలగినప్పుడో? ఆకాశం యథాతథంగా నిర్మలము అనంతము అయి కనిపిస్తుంది. మేఘాలు ఉన్నప్పుడు తొలగినపుడు కూడా ఆకాశం సర్వదా యథాతథమే కదా! ’సత్యము’ యొక్క పరిజ్ఞానం
Page:805
చేత అహంకార సహితమగు జగత్తు కూడా శమిస్తుంది. ఆ స్థానంలో ఏకము-అఖండముఅనంతము-అప్రమేయము అగు ఆత్మ మాత్రమే గోచరిస్తుంది. ఆత్మ జ్ఞానము సంతరించుకొన్న తర్వాత ఆపై అనుభవించబడే శబ్ద స్పర్శ-రూప రస గంధాలన్ని కూడా మృగతృష్ణాజలం వలె మొదలే శమించియే అక్కడ ఉంటాయి. అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండగానే అందులో ఆకులు, వస్త్రములు, కట్టెలు మొదలైనవి వేశామనుకో, అవన్నీ ఏకం అయిపోతాయి కదా! అట్లాగే జ్ఞానాగ్నిచే జగత్తు-చిత్తము మొదలైనవన్నీ ఏకత్వం పొందుచున్నాయి. తెలివితేటలు గల బాలునికి చీకట్లో పిశాచాకారాలు కనిపించవు కదా! అట్లాగే జ్ఞానికి ఈ మూడు లోకములలో సాకారమంతా (మూర్తిత్వమంతా) క్రమక్రమంగా లేనిదిగా తెలియవస్తోంది.
చిత్తే చిత్తముగా భాసిస్తోంది! - అనంత రూపమైనట్టి ‘బోధ’ (చైతన్యము) తన నిజస్వరూపమున ఈ జగత్తు-చిత్తాదులుగా భాసిస్తోంది. మరి అప్పుడు బోధయందు మూర్తిత్వం (నామ-రూపాదులు) ఎచ్చటివి? ఆత్మను గూర్చిన అజ్ఞానం చేతనే ‘జగత్తు చిత్తం’ అను వేర్వేరు రూపాలుగా అనిపించటం జరుగుతోంది. ఎప్పుడు ఆత్మ జ్ఞానముచే అజ్ఞానం నశిస్తుందో… అప్పుడు మూర్తిమంతం యొక్క అస్థిత్వం ఎచ్చట? అగ్నిచే బంగారం కరిగి అతి సూక్ష్మత్వం పొందుతోంది చూచావా? అప్పుడిక బంగారం యొక్క ఇతఃపూర్వపు ఆకారం ఏమయినట్లు? ఎప్పుడు ఆత్మ జ్ఞానంచే ఈ జగత్తు స్వప్న తుల్యమని ఎఱుగబడుతుందో… అప్పుడు ఈ జగత్తు మూర్తిత్వమును వీడుచున్నది. అనగా అప్పుడు ఈ జగత్తు నిరాకారమని, నామ రూప భేదకల్పనా రహితమని ఎఱుగబడుచున్నది.
ద్రవ రూపంలో ఉన్న బంగారం క్రమక్రమంగా ఘన రూపం పొందుతూ ఉంటుంది చూచావా? అట్లాగే స్వస్వరూపమున ఉన్నట్టి బోధ రూపమగు ఆత్మ దేశ కాలాలనేవి ఏర్పడటానికి ముందే తనయందు జాగ్రత్-స్వప్నాలను రచించుకొని ఘనత్వాన్ని పొందినదాని వలె అగుచున్నది. ఆత్మ విచారణచే జాగ్రత్-స్వప్నాలు కల్పిత మాత్రాలని, ఆ రెండింటికి ’కారణం-ఆధారంఅప్రమేయం’ అయి ఆత్మ సర్వదా ప్రకాశించుచున్నదని తెలియబడగలదు. ఈ ప్రకారంగా ఆత్మ విచారణచే జాగ్రత్-స్వప్నములు తుచ్ఛములైనవని తెలియబడగానే ఇక భోగాల పట్ల అనురాగం దానంతట అదే సన్నగిల్లుతుంది.
ఈ ‘దృశ్యం’ అనబడేది వివేకికి అవివేకికీ కూడా విద్యమానమై ఉంటోంది. అయితే వివేకులకు ఈ దృశ్యము అత్యంత తుచ్ఛమైనదిగా కన్పట్టుచున్నది. స్వప్నంలో విద్యమాన మయ్యే పదార్థ జాలం ఏ విధంగా నమ్మకమునకు అనర్హమో, ఈ జాగ్రత్ పదార్థజాలం కూడా అంతే అనర్హం. ఎందుకంటావా? ఆత్మయందు లభించే సుఖ విశ్రాంతి ఎచ్చట? ఈ విషయాస్వాదనలు ఎచ్చట? తత్త్వజ్ఞానికి కూడా ఈ విషయాల పట్ల ప్రీతి-నమ్మకం కలుగుతుందంటే, ఇక జాగ్రత్-స్వప్నములు ఒక్కటే అవుతాయి. జ్ఞాన అజ్ఞానాలు ఒక్కటే అవుతాయి. అది కుదిరేది కాదుకదా! కనుక తత్త్వజ్ఞానికి విషయాల పట్ల నమ్మకం ఉండదు. ఈ జగత్తు చిత్తము చేతనే సిద్ధిస్తోందని, ఇదంతా స్వప్నంలాగా భ్రాంతి మాత్రమేనని తెలియవచ్చిందో, ఇక ఆ సుజ్ఞానికి ఇక్కడి రూపం పట్ల, పదార్థాల పట్ల సత్యత్వ బుద్ధి స్వయంగా తొలగిపోతోంది. మృగతృష్ణలో జలం రుచిగా ఉంటుందని
Page:806
ఆ జలం కోసం పరుగులు తీసేవాడు తెలియనివాడే గాని, తెలిసినవాడు కాదు కదా! అట్లాగే వివేకి అయినవాడు దృశ్య పదార్థముల పట్ల ‘ఇవన్నీ సత్యము-నిత్యము’… అని తలచడు. బయట నుండి కిటికీ గుండా ప్రవేశించిన దీపకాంతికి ఆకారము కనబడవచ్చు గాక! అయితే మాత్రం దీపకాంతికి ఆకారం అంటూ ఏమున్నది? ఏమీ లేదు. శాంతుడగు వివేకికి ఈ జగత్తునందు ఆకారాదులు కనిపిస్తున్నప్పటికీ ఇదంతా నిరాకారంగాను, ఆకాశరూపంగాను గ్రహిస్తున్నాడు.
జాగ్రతో వస్తుతః శూన్యాత్ పరిజ్ఞాతాత్ నివర్తతే |
చిత్త భ్రమాత్మనో భ్రాన్తిర్ రూపాస్వాదన భావనా ॥
ఒకడు మేలుకొనిన తర్వాత స్వప్నంలో కనిపించిన వస్తువుల కోసం వెతకాలని అనుకుంటాడా? అనుకోడు. ఎందుచేత? అవి అవాస్తవములని, శూన్య మాత్రములని, కేవలం భ్రమచే సిద్ధించాయని బాగా తెలుసు కనుక! అట్లాగే ఈ జగత్ పదార్థములన్నీ చిత్తం యొక్క భ్రమ-చాంచల్యములచే మాత్రమే సిద్ధిస్తున్నాయని తెలిసిన తర్వాత జ్ఞానికి వీటిని పొందాలనే ఉద్వేగమంతా మొదలంటా తొలగుతోంది. ఏ వస్తువు పట్ల అయినా గ్రాహ్య బుద్ధి (సంపాదించుకోవాలనే ఆలోచన) ఎట్లా కలుగుతుంది? ఆ వస్తువుపై గల నమ్మకం చేతనే కదా! జ్ఞానికి అదంతా స్వప్నంలో కనిపించిన బంగారు గొలుసు కావలసిందేనని కోరుకోవటం వంటిదే అవుతుంది. జ్ఞానికి సర్వదా సర్వ విశేషాల పట్ల రాగబుద్ధి తొలగుతోంది. ‘ద్రష్ట-దృశ్యం’ అనే దోషాన్ని అతడు తనయందు తొలగించుకొని ఉంటున్నాడు. లేదా దోష గ్రంథుల యొక్క ఛేదనం కొఱకై ప్రయత్నశీలుడై, నిమగ్నుడై ఉంటున్నాడు.
’జ్ఞాని’ సకల బంధుత్వాలలో రాగ రహితుడై, దృశ్య పదార్థాల పట్ల మనన వర్జితుడై, అహంకార శూన్యుడై, ద్వేషమంటూ ఏదీ లేనివాడై, సాంసారిక ప్రయత్న రహితుడై, శాంతుడై వెలయుచున్నాడు.
వాసనలు - అపేక్ష - ఉపేక్ష - దీపశిఖ నశిస్తే దీపకిరణాలు నశిస్తాయి కదా! అట్లాగే భోగాలపై అపేక్ష తగ్గుచున్న కొలదీ వాసనలు సన్నగిల్లుతూ వస్తాయి. కాక, భోగాలపై అపేక్ష పెరుగు చున్నదా… వాసనలు ప్రవృద్దమౌతూ ఉన్నట్లే. ఆపేక్ష తప్పించి వాసనలకు వేరే రూపమేదీ లేదు.
ఓ ప్రియ సహజీవులారా! ఈ జగత్తంతా గంధర్వ నగరంలాగా భ్రాంతి రూపమేనని మీరు గమనించండి! తత్త్వబోధచే ఇదంతా సూక్ష్మమైనట్టి సత్-చిత్ ఆకాశంగా గమనించ బడగలదు.
యత్రనా2 త్మా న శూన్యంచ న జగత్కలనాపిచ ॥
న చిత్త దృశ్యో ఉదయ ధీః, సర్వంచ అస్తి యథా స్థితమ్ ॥
ఆ పరమాత్మ జీవుడు కాదు. శూన్యమా? కానే కాదు. ఆ పరమాత్మ పదమున జగత్కల్పన గాని, చిత్తం గాని, దృశ్యోదయం గూర్చిన బుద్ధిగాని లేవు. మరి? ఇదంతా కూడా యథాస్థితమగు బ్రహ్మమే అయి ఉన్నది. అజ్ఞానులకు కనిపించే సాకారమంతా జ్ఞాని దృష్టికి అతని యొక్క తత్త్వ జ్ఞానంచే లయించి పోవుచున్నది. అందుచేత దృశ్య విషయాల పట్ల ఉపేక్ష పెంపొందించుకోండి. శ్రీరాముడు : అనగా అతని దృష్టికి ఈ జగత్తు అసలు కనిపించదా?
Page:807
శ్రీవసిష్ఠ మహర్షి : కనిపిస్తుంది. ఇదంతా కనిపిస్తున్నప్పటికీ ఇవన్నీ శూన్య రూపాలుగాను, లేనివి గాను అగుపిస్తాయి. ‘ఈ జలానికి ఆవర్తములు ఎందుకు వచ్చాయి?’… అని అనుకొని ఎవడైనా జలంలోని ఆవర్తములను తొలగించి జలమును పరిశుద్ధపరచాలని అనుకొంటాడా? జలమునందు ఆవర్తనములు ఉన్నప్పటికీ (లేక) ఉండనప్పటికీ జలం సర్వదా యథాతథంగా ఉంటోందని జల తత్త్వం తెలిసినవాడు అనుకుంటాడు కదా! జ్ఞాని ఈ వివిధ వికారాలతో కూడిన జగత్తు ఒక ప్రక్క కనిపిస్తున్నప్పటికీ ఇచ్చట ఆత్మ ఆత్మయందే యథారూపంగా ఉన్నదని గ్రహిస్తున్నాడు. అతడు (జ్ఞాని) ఆకాశం వలె నిర్మలుడై, సౌమ్యరూపుడై, సంగరహితుడై, కేవలమూ సమాధితత్పరుడై ఉన్ననూ, లేనివాడై ఒప్పుచూ ఉంటాడు. అతని మనస్సు సర్వదా అస్తమించియే ఉంటుంది. అతడు మౌనియై, ఇంద్రియ-మననాలను అధిగమించినవాడై ఉంటాడు. సమస్త కర్మల యొక్క అంతమును సంపాదించుకొని ఉంటాడు. సంసార సముద్రమును దాటివేసి ఉంటాడు.
స్థూల-సూక్ష్మ-కారణ-మహాకారణ చతుర్విధ దేహముల యొక్క
ఆ దేహమునకు ఆధారమై ఈ 14 లోకముల యొక్క
ఆ 14 భువనములకు ఆధారమైన ఆకాశము యొక్క,
పర్వత సమూహముల యొక్క,
విషయ సాధనా క్రమముల యొక్క
వీటన్నిటి యొక్క ఉపాదాన కారణము ‘మూలాజ్ఞానమే’! అట్టి మూలాజ్ఞానం నశించిందా, ఇక ఆపై ఈ శరీరము, ఈ భూమి మొదలైనవి కనబడుతూనే అతనికి ‘లేనివి’ గా తెలియవస్తున్నాయి. ఈ ప్రకారంగా జ్ఞాని… శాంతమైన అంతఃకరణం కలిగినవాడౌతాడు. వికల్ప రహితుడై ఉంటాడు. స్వరూపసారమయుడై ప్రకాశిస్తాడు. పరమానందమగు ’ఆత్మానందం’తో ఎల్లవేళలా పరితృప్తుడై ఉంటాడు, నిరావరణ భూమానంద స్వరూపుడై వర్తిస్తాడు.
శ్రీరాముడు : మునీంద్రా! చిదాత్మ వాస్తవానికి కేవల బోధ రూపం కదా! మరి ఏ క్రమం చేత అది జగత్తు వలె భాసిస్తోంది? చిత్తము యొక్క భేదనివారణ కొరకై ఈ విషయం తెలియజేయ ప్రార్ధన. శ్రీవసిష్ఠ మహర్షి : రామచంద్రా! వృక్షస్యేవ విమూఢస్య యదృష్టా తత్స్వచేతసి - విత్తులోని ఒకే చేతనసత్త వృక్షం యొక్క మూలం-ఆకులు-పుష్పం-ఫలం మొదలైన ఆకారాలు పొందుచున్నది చూచావా? అట్లాగే అజ్ఞాని యొక్క అంతరంగంలోని అజ్ఞాన దృష్టియే ఇట్లు ఈ దృశ్య పదార్థాలుగా అనుభవమగుచున్నది.
యన్నదృష్టా న తచ్చిత్తే భవతి అల్పతరస్మృతే - దృష్టియందు ఉన్నదే చిత్తము నందు ఉంటోంది. చిత్తం నందు ఉన్నదే దృశ్యంగా ప్రాప్తిస్తోంది. దృష్టిలోను, చిత్తంలోను లేనిదేదీ దృశ్యంగా ప్రాప్తించుటలేదు. దృష్టిలో లేనిదేదీ కించిత్తు కూడా స్మరించబడటం లేదు, దర్శించబడటం లేదు.
Page:808
అయితే, వివేకి అయిన వాడు శాస్త్రార్థముల పూర్వ-పరములను గ్రహించియే, ఆపై దర్శనం చేస్తాడు. అంతేగాని ఈ ఇంద్రియాలకు కనబడినట్లుగా కాదు. శాస్త్రములకు నిషిద్ధమైన విశేషాలను సమీపంగా ఉన్నప్పటికీ వాటిని చూడటానికి కూడా అతడు ఇచ్చగించడు. వీటిని గురించి ఎటువంటి చిత్త పరిశ్రమ కలిగి ఉండడు. కాబట్టి రామచంద్రా! నీవు కూడా చిత్తశుద్ధికి అనుకూల మైన అనుష్ఠానమునందు మాత్రమే తత్పరుడవై ఉండెదవు గాక! శాస్త్ర సమ్మతమైన చిత్తమును మాత్రమే పెంపొందించుకో. శాస్త్రముల యొక్క అత్యుత్తమార్థములందు మాత్రమే మననశీలుడవై ఉండు. శ్రవణములకు భూషణములైన ఈ ఉపదేశం విను.
అవిద్య-దృశ్యభ్రాంతి పర్యాయపదాలే! ఈ దృశ్య సమూహం గూర్చిన భ్రాంతియే అవిద్య. ఇంతకు మించి అవిద్య అనగా ఏదీ లేదు. మృగతృష్ణలో జలం అంటూ ఏదీ లేనట్లు వేఱుగా అవిద్య అంటూ ఏదీ లేదు.
అయినా కూడా… మన ఈ ఉపదేశ్య-ఉపదేశముల కొఱకై కాసేపు ‘అవిద్య అనునది ఏదో ఉన్నది’ అని అనుకొని (కాసేపు అవిద్య వేరే నిజంగా ఉన్నదని అనుకొని)… ఈ నా వాక్యాలు విను. ‘అవిద్య ఎట్టిది? ఎక్కడ నుండి వచ్చింది?’… మొదలైన వికల్పములను కాసేపు కట్టిపెట్టి నేను చెప్పబోయేది వింటే ‘జగత్తు గాని, అవిద్యగాని లేవు’ అని నీవే స్వయంగా గ్రహిస్తావు.
అనేక విశేషాలతో, రకరకాల పదార్థాలతో పూర్ణమై ఉండి కనిపిస్తున్న ఈ స్థావర జంగమాత్మక ప్రపంచం ‘కల్పాంతం’ నందు నశిస్తోంది. కాస్త విమర్శించి చూస్తే… ఈ జగత్తు ‘భూలోకం’ మొదలైన విభాగాలు ఒక్కొక్కటి విశ్లేషిస్తూ వస్తే ‘ఇది లేదు’ అని ఆ ఒక్కొక్కటీ తొలగుతూ రాగలదు. ఒక కుండలో నీళ్లు ఉన్నాయనుకో, అందులో ఒక్కొక్క బిందువు తొలగించుతూ ఉండగా, ఆ కుండ లోని నీళ్లన్నీ ఒక నాటికి అయిపోక తప్పదు కదా! ఈ జగత్తు కూడా విమర్శచే అంతే!
“ఈ జగత్తు బ్రహ్మము యొక్క అవయవమా?” ఈ జగత్తు బ్రహ్మం యొక్క అవయవ మనియే కొద్దిసేపు అనుకుందాం. అప్పుడు ’అవయవం’ అగు ఈ జగత్తు నశిస్తే, ’అవయవి’ అగు బ్రహ్మం కూడా నాశనం పొందాలి. బ్రహ్మమునకు ‘నాశనం’ అనే ధర్మమే ఉంటే ‘ఆత్మ అనంతం’ అనే వేదవాక్కుకు విఘ్నం కలుగుచున్నట్లే కదా! కాబట్టి ’ఆత్మ-చిదేకరసం-నిరవయవం’ అయినట్టి బ్రహ్మమునకు ఈ జగత్తు అవయవం అవటానికి కూడా వీలు లేదు.
“పరమాణువుల సంయోగంలోంచి ‘నేను’ వస్తోందా? వియోగంచే పోతుందా?”ఇక మరొక (చార్వాకుల) వాదం ఇక్కడ చెప్పుకుందాం.
"భూమి మొదలైన ఈ పంచభూతాలు స్వతహాగా జడమే. కానీ కల్లు త్రాగినప్పుడు దేహ మంతా ’నిషా’ ప్రసరించినట్లుగానే ఈ పంచ భూతాలు ఒక చోట ఒక విధానంగా సమావేశం అయినప్పుడు చైతన్యం ఉదయిస్తోంది. అందుచేత ఈ దేహాలలో ‘నేను’ అను ప్రజ్ఞ ఉదయిస్తోంది. ఆ అణువులు విడిపోగానే ‘నేను’ అంతరిస్తుంది. ఇంతకు మించి ఏమీ లేదు.”
Page:809
ఈ వాదన మాకు సమ్మతం కాదు. ఎందుకంటావా? ఈ దేహం ‘విజ్ఞానం’ (ప్రజ్ఞ) పై ఆధారపడి ఉంది గాని, దేహంపై ప్రజ్ఞ ఆధారపడి లేదని మేం గమనిస్తున్నాం. ప్రజ్ఞయే దేహాన్ని నడిపిస్తోంది. అంతే గాని ప్రజ్ఞ దేహంలో ‘కాలు-చేయి-జీర్ణకోశం’ వలె ఒక విభాగం కాదు. చేతిని నీవు కదిలిస్తున్నావు. అంతేగాని, చేయి నిన్ను కదిలిస్తోందా? లేదు. అనగా ‘నేను’ అని స్ఫురించే చైతన్య అధీనంలోనే ఈ దేహం ఉన్నది. అంతేగాని దేహ అధీనంలో చైతన్యం లేదు.
3. “యథా ద్రష్టం - తథా దృశ్యం" - ఇక ఈ దృశ్యానికి వద్దాం. మా ఉద్దేశానుసారంగా కూడా ఈ దృశ్యం ఎట్లా ఒకనికి కనబడుచున్నదో… అది ఈ దృశ్యము యొక్క అసలు రూపం కాదు. దీని రూపం మరొకటేదీ కూడా కాదు. మరి? ఈ దృశ్యము ఎవరు ఏ దృష్టితో చూస్తే ఆ విధంగా అనుభవమౌతూ ఉంటోంది. కనుక ఇది ‘అనిర్వచనీయం’ అని చెప్పబడుతోంది. ఇది అవిద్యచే ఇట్లిట్లు అనుభవమౌతోంది. ఇది ఎట్లెట్లు అనుభవమౌతోందో,.. అదంతా కూడా విద్యచే తప్పక నశించగలదు. ‘జగద్దర్శనము’ అనేది మధ్యలో వచ్చి మధ్యలోనే పోవుచుండేది. (జగత్ = జనించి గతించేది) అందుచేత జ్ఞానముచే అవిద్యను నశింపజేయాలి. అట్లు బోధ గావించి బంధ నివృత్తికి మార్గం చూపటమే శాస్త్రముల సాఫల్యము.
5. “సాకారం నిరాకారం అయి, మరల నిరాకారంలోంచి సాకారం వస్తోందా?” అభిప్రాయమేమిటంటే, "సాకారమగు ఈ జగత్తే ‘ప్రళయం’ అనే ఒకానొక సమయంలో నిరాకార మౌతోంది. అట్టి నిరాకార స్థితిలో ఆకాశరూపంగా అగుచున్నది. సాకార జగత్తు ఒకప్పటికి (ప్రళయ సమయంలో) నిరాకరం అవుతోంది కనుక ఈ జగత్తు శాశ్వతం కాదు.”
ఇంత వరకు బాగానే ఉన్నది గాని, అసలు సాకారమైనది నిరాకారం ఎట్లా అవుతోంది? ‘ప్రళయం తర్వాత తన రూపం ఈ జగత్తు తిరిగి పొందుతోంది‘… అని అనదలచుకొంటే, అప్పుడు ప్రళయంలో కూడా నశించకయే ఉన్నది కదా! అట్లా ఉండకపోతే, (నశించిపోతే) నశించినది మరల ఎట్లా ఉత్పన్నం అవుతున్నట్లు? కనుక ప్రళయ సమయంలో కూడా ఈ జగత్తు నశించకయే ఉన్నది’… అని అనవలసిరాక తప్పదు. అనగా… “ప్రళయం” అనేది ఈ విధంగా 1. సృష్టిలోని విభాగమే ప్రళయం, 2. కారణమగు ‘అవాక్యత్వము (నిర్విషయ చైతన్య తత్త్వం) కార్యమగు ఈ సృష్టి ఏ సమయమందును, వేర్వేరుగా లేవు’… అను మహావాక్యర్థము సిద్ధిస్తోంది.
Page:810
ఈ సృష్టియే పరమాత్మ. అలా చెప్పుటలో మా ఉద్దేశం1. భావనయే ‘సృష్టి’ అను అనుభవమునకు మూల స్వరూపం;
భావన భావుకుని కంటే వేఱు కాదు;
భావుకుడు చిదాకాశము కంటే వేఱుగా లేడు.
కనుక ఈ సృష్టి పరమాత్మయే గాని మరింకేమీ కాదు. వేఱుగా ఎక్కడైనా ఏదైనా ఎవరికైనా కనిపిస్తుంటే, అది భ్రమ మాత్రమే! వేఱుగా కనిపించేదంతా కాలముచే మార్పు చేర్పులు పొందుతూనే వస్తోంది.
దృష్టియే సృష్టి. దృష్టికి ఈ సృష్టి కనబడుతూనే ఉంటున్నప్పటికీ ఇది శూన్యమాత్రంగా (నిర్విషయ మాత్రంగా) ఎప్పుడు తెలియవస్తుందో… అట్టి నిర్విషయానుభవమే ‘ప్రళయం’. ఇంతకు మించి ’సృష్టి నశించటం’ అనేది ఎక్కడా ఏదైనా ఉంటే నాకు చెప్పు. అట్టిదేదీ లేనే లేదు.
6. “సృష్టి-ప్రళయాలు ‘ఆలోచన వచ్చి-పోయి మరొక ఆలోచన రావటం’ వంటివి" ఈ జగత్తు ప్రళయంలో నశించి మరల ఈ జగత్తే సృష్టి సమయంలో సృజించబడుతోంది….,
అని అనటం కంటే….., ఈ జగత్తు నశించుచు మరల వేరైనది జనిస్తోంది… అని అనటమే యుక్తం. ఈ సృష్టి-ప్రళయాలు ఒక ఆలోచన వచ్చి-పోయి మరొక ఆలోచన ప్రారంభమవటం
వంటిది.
అయితే, విత్తులోని ఒకే సత్త ఆయా వృక్ష విభాగాలుగా కనిపిస్తూ ఉండటం చేత వృక్ష సత్త మరొకటిగా అవటం… అనేది వాస్తవానికి లేదు.
ఏకమగు సతత్త్వము (సత్ మాత్రము) నిజ స్వభావమున ఉంటూనే మాయచే వివిధ దేశ కాలాదుల రూపంగా కనిపిస్తోంది. పరమార్థంగా చూస్తే ఇక్కడ నానాత్వభేదం లేదు. మా దృష్టిలో ఈ సమస్తం ఆత్మరూపమే! తత్త్వవిచారణచేతనూ, తత్త్వజ్ఞానాంతర అనుభవ ప్రమాణం చేతనూ ఇదంతా కూడా ‘శాంతం అనాది ఆకాశం వలె నిర్మలము కేవలము-బోధ మాత్రము’… అగు పరమాత్మగానే శేషించ గలదు. అయితే, సద్రూపమగు చిదాత్మ… ఏ విధంగా అయితే అనుభవమునకు రాగలదో, ఏ విధంగా అయితే అనుభవమునకు సిద్ధించదో … అట్టి విషయ క్రమమును వివరిస్తున్నాను. విను.
Page:811
శ్రీవసిష్ఠ మహర్షి : ’సర్వ కల్పనారాహిత్య స్థితి’ అని చెప్ప తగు “మహా కల్పాంతం" అను స్థితి గురించి శాస్త్రములు ప్రతిపాదించి చెప్పుచున్నాయి. అట్టి ’మహా కల్పాంతము’న పురుగు నుండి మహాదేవుని వరకు గల మనో బుద్ధి కర్మ సహితమగు సమస్త దృశ్యమండలం నశిస్తోంది. ఆకాశవాయు-అగ్ని మొదలైన పంచభూతాలు, కాలం మొదలైన అపంచీకృత విశేషాలు కూడా శమిస్తాయి. అప్పుడు అంధకారం కూడా ధ్వంసమైపోతుంది. జలము-పృథ్వి కూడా క్షయిస్తాయి. శబ్ద-అర్థ విభాగమంతా కూడా అస్తమిస్తుంది.
అప్పుడిక బోధ రూపమగు ఆత్మ మాత్రమే శేషించి ఉంటుంది. అట్టి సర్వశేష్యము, సర్వాత్మకము అగు ఆత్మ… పరమ శాంతము, నిర్మలము; అబాధితం (అది దేనిచేత బాధింప బడజాలదు); అనాది, అనంతం, సౌమ్యం; అవ్యయం, అవాచ్యం; అవ్యక్తం, అతీంద్రియం; నామ రూప రహితం, సర్వ భూతాత్మకం; సర్వవస్తు శూన్యం, అన్య పదార్థ రహితం; సర్వలక్షణ సమన్వితం, సర్వలక్షణ విలక్షణం; పదార్థముల దృష్ట్యా అసత్తుల్యం, సన్మాత్రం, సర్వోత్తమమగు ‘బోధ’ రూపం.
ఇదంతా మహాకల్పాంతంలో కూడా శేషించే ఆత్మ యొక్క మాహాత్మ్యము. ఆ పరమాత్మ వాయువు కాదు. ఆకాశము కాదు. మనస్సు- బుద్ధి మొదలైనవి కాదు. శూన్యము కూడా కాదు. అది ఏ పదార్థమూ కాదు. కానీ… సర్వ రూపములూ అదే! అది అనిర్వచనీయమైన చిదాకాశం! తద్విదా, తత్పదస్థేన, తన్ముక్తేన అనుభూయతే ॥ ||
“నేనే ఆత్మను” - అట్టి ఆత్మ గురించి ఎఱిగినవాడు, ఆత్మ పదమును ఆశ్రయించి ఆ పదము నందే ఉన్నవాడు, సర్వ కల్పనల నుండి విముక్తుడైనవాడు మాత్రమే తత్త్వజ్ఞాని అయి ఆత్మను అనుభవానికి తెచ్చుకోగలడు! అఖండము-అప్రమేయము-సర్వము అగు ఆత్మ తానేనని గ్రహించుటే జ్ఞాన సారం! ఇక తదితరుల విషయమంటావా?
అన్యైః కేవలమ్ ఆమ్నాతై రాగమైరేవ వర్ణ్యతే ॥ II (ఆమ్నాయః = వేదం శిష్యపరంగా వర్ణించటం)
కొందరు ఆత్మ గురించి ‘అది అప్రమేయం-అనంతం-నిత్యం-సత్యం-అఖండం’… ఇత్యాదిగా వర్ణించగలరు. ఏ గ్రంథంలో ఎట్లు చెప్పబడిందో, ఎవరిచే ఎచ్చోట ఏ విధమైన దృష్టాంతాలతో ఎట్లెట్లు వర్ణించబడిందో ఉపన్యసించగలరు. అనేక వాదోపవాదాలతో ఆత్మ ఎంతటిదో నిర్ణయించి ప్రవచించ గలరు. వేద ప్రమాణములు వల్లించగలరు. అవన్నీ మంచిదే కాని అంతటితో సరిపోదు.
’ఆత్మకు అన్యమైనది లేదు. కాబట్టి నేను స్వతఃసిద్ధమగు ఆత్మనే.’ సహజీవులంతా నా స్వరూపులే. నేను సహజీవుల స్వరూపుడనే. స్వస్వరూపమగు నా ఆత్మ పదం జన్మ-మృత్యు జరాదు లచే గాని, మనో-బుద్ధి-అహంకారాదులచే గాని, మార్పు చేర్పులు పొందేది కాదు. నేను కేవల స్వరూపుడను. జాగ్రత్-స్వప్న సుషుప్తులకు కేవల సాక్షిని. జన్మ-జరా మరణములకు కూడా సాక్షిని. ఈ దేహము-మనస్సు-బుద్ధి-అహంకారములను చూచేవాడినే గాని, అవి నేను కాదు. అవి నావి
Page:812
కావు… అను అనుభవమును పుణికిపుచ్చుకున్నప్పుడే అతడు ’ఆత్మజ్ఞాని’ అవుతాడు. అనుభవజ్ఞుడు కానివాడు ఆత్మను వర్ణించువాడే గాని ‘ఆత్మజ్ఞుడు’ కాదు.
న కాలో, న మనో, నా త్మా, న సన్నాసన్న దేశ-దిక్ । |
న మధ్యమేతయోః నాన్తం న బోధో నాఅపి అబోధితమ్ ||
ఆ ఆత్మ కాలము కాదు. మనస్సు కాదు. జీవుడు కాదు. సత్తు కాదు. అసత్తు కాదు. సత్తుఅసత్తుల మధ్యగా ఉన్నదేదో కాదు. దేహము కాదు. దిక్కు కాదు. అంతము కాదు. తన స్వరూపము కంటే అభిన్నమైన ఏదో ‘బోధ’ కాదు. ‘అబోధ’ కూడా కాదు.
ఆత్మ సర్వదా ఆత్మగానే ఉన్నది. అద్దాని యందు తదితరమైనదేదీ లేదు. ఏర్పడజాలదు.
ఇక ఈ కనబడే అనేక జీవులు, వారి మధ్య అనిపిస్తున్న అనుకూల-ప్రతికూల-ఉదాసీన ఆదిగా గల సంబంధాలంటావా? ఇవన్నీ జలంలో కనిపించే అనేక తరంగాల యొక్క సంఘాతవిఘాత చమత్కారాల వంటివే! ఒక తరంగం మరొక తరంగమును అనుసరించటం-ఢీకొనటంఎదురు బొదురు అవటం.. ఇవన్నీ జలంలోని అంతర్గత విన్యాసాలయినప్పటికీ జలము సర్వదా సర్వతరంగాతర్గతము-యథాతథము కదా! ఈ అనంత జీవ (మనో-బుద్ధి-అహంకారాది) తరంగాలన్నీ ఆత్మ యొక్క విన్యాసమే అయినప్పటికీ ఆత్మ సర్వదా యథాతథము.
కిమప్యేవ తదత్యచ్ఛం బుద్ధ్యతే బోధపారగైః
శాంత సంసార విస్తారైః పరాం భూమిముపాగతైః ||
అయినప్పటికీ కూడా… ‘బోధ’ యందు పారంగతులు, ‘సంసార విస్తారము’ శమించినట్టి వారు, పంచమ-షష్ఠ-సప్తమ భూమికలను అధిరోహించినవారు… అగు మహాత్ములే ఆ ’విలక్షణంఅతి నిర్మలం’… అగు ఆత్మను అనుభవముగా కలిగి ఉంటున్నారు.
ఇక జగత్తు-మనస్సు-బుద్ధి మొదలైనవి వాస్తవానికి లేవు. లేకపోయినప్పటికీ శాస్త్రాలు అవి ఆత్మబోధ కొరకై కల్పించి, విశ్లేషించాయి. శాంత సముద్రంలో అనేక తరంగాలు ఉన్నట్లు శ్రుతులలో నిషేధించిన వాటిని నిషేధించి, ఉపదేశించిన వాటిని ఉపదేశిస్తూ నేను కూడా ఈ సభలో ఇన్ని రోజులుగా ప్రవచనం చేశాను, చేస్తున్నాను. అదంతా ఆత్మబోధ కొరకై మాత్రమే. అంతేగాని మనస్సు మొదలైన వాటి ఉనికి అంగీకరించి-నిషేధించటం కానే కాదు సుమా! కనుక మనస్సు మొదలైనవన్నీ ఆత్మ పాఠ్యాంశాన్ని బోధించటానికి, తత్ సౌలభ్యం కొరకు కల్పించి చెప్పబడేవి మాత్రమే - అని గమనించు.
అటు చూడు! ఆ పెద్ద శిల ఉన్నది. ఆ శిలలో శిల్పి అనేక శిల్పాలు చెక్కగలడు. అయితే ఆ చెక్కబోయే శిల్పరూపాలన్నీ ఈ కనబడే శిలలోనే ఉన్నాయి కదా! ఏ రూపంగా ఉన్నాయి? శ్రీరాముడు : ఆ శిలలోనే శిల రూపంగానే చిత్రీకరించబడబోయే శిల్పాలన్నీ - అప్రకటిత రూపంలో ఉన్నాయి.
శ్రీ వసిష్ఠ మహర్షి : అవునా! అట్లాగే నిజ స్వరూపముననే ఉన్న పరమాత్మయందు ఈ వివిధ జగత్తులు జగత్ పదార్థములు ఒదిగి ఉన్నాయి.
Page:813
ఈ ప్రకారంగా అధిష్ఠాన రూపము చేత మనోబుద్ధి - చిత్త చిత్త - అహంకారాలు, దృశ్య వ్యవహారం, ఈ సమస్త పదార్థములు పరమాత్మయందే ఉన్నాయి. (శిల్ప రచన అంతా శిలల్లోనే ఉన్నట్లు!). అయినా కూడా దృశ్యరూపంగా చూస్తే (వేర్వేరు మృగాలు-చెట్లు-వ్యక్తులు… చిత్రీకరించి `బడిన శిల్పం వలె)… దృశ్యం లేదు. (శిల్పంలో ఉన్నదంతా శిలయే కదా!)
ఆ పరమాత్మయే సర్వ స్వరూపుడు. ఈ మనో-బుద్ధి-చిత్త-అహంకారాలు, ఈ సంగతిసంబంధ-బాంధవ్యాదులు… ఇవన్నీ కూడా “పరమాత్మాంతర్గత -పరమాత్మ స్వరూపాలే!”
కానీ అతడు తనకు తదితరమైన ఏ రూపంగానూ అగుటయే లేదు. అతడే పదార్థ రూపుడుగా అగుచున్నాడు. కానీ అతడు అపదార్థ స్వరూపుడుగానే ఉన్నాడు.
శిలయందు ఇంకా విగ్రహం చెక్కబడుతున్నప్పుడు ఆ శిలలో విగ్రహం ఉన్నదా? లేదా? ఉన్నదనీ చెప్పవచ్చు. ఎందుకంటే… శిల్పి శిల నుండే కదా… విగ్రహం తయారు చేస్తున్నాడు! లేదని కూడా అనవచ్చు. ఎందుకంటే, శిల ఎల్లప్పుడూ శిలయే కదా!
“అంతా - అంతటా ఆత్మయే"- అట్లాగే, ఆత్మైక్యం పొందిన మహానీయులు తమ ఇచ్ఛను అనుసరించి ఆ పరమాత్మను ’సర్వ పదార్థయుక్తుడు’ గాను, ’సర్వ పదార్థ రహితుడు’ గాను కూడా దర్శిస్తూ ఉంటారు.
సర్వం సర్వాత్మకంచైవ సర్వార్థ రహితం పదమ్ | సర్వార్థ పరిపూర్ణం చ తత్ ‘ఆద్యం’ పరిదృశ్యతే ॥
‘సమస్తమునకు ఆది’ అయినట్టి ఆ ’ఆత్మపదము’ను జ్ఞానులు ‘సర్వరూపంగాను, సర్వాత్మకం గాను, సర్వ పదార్థ రహితంగాను, సర్వ పదార్థ పరిపూర్ణంగాను’… వీక్షిస్తూ ఉంటారు.
అసంశయం - సమగ్రం - ఎవరైనా “సర్వ పదార్థముల ఉపశమనరూపమగు ‘సమ్యక్ జ్ఞానం’ ఉత్పన్నం కాలేదు… అని అనటానికి గుర్తు ఏమిటి?” అని అడిగితే… అందుకు గుర్తు వారికి ఇంకా సంశయములు మిగిలి ఉండటమే సుమా! సర్వ సంశయములు శమించినట్టి జ్ఞాని దృశ్యము యొక్క అభాస లేనివాడౌతాడు. స్వభావ సిద్ధంగానే నిర్మలాంతఃకరణుడు, శాంతుడు అవుతాడు. అట్టివాడు ఆత్మ స్వభావమును అప్రయత్నంగానే పరికిస్తాడు.
బంగారం ముద్దలో రకరకాల అభరణాలు ఉన్నట్లు, ఆ పరమాత్మలో ’నేను-నీవు-వాడువీడు’ మొదలైన త్రికాల జగద్భమ అగుపిస్తోంది. బంగారానికి వేరుగా అభరణం ఎక్కడున్నదయ్యా? పరమార్థఘనమగు పరమాత్మ కంటే వేఱుగా జగత్తు కూడా లభించనే లభించదు. ‘గొలుసుఉంగరం’ మొదలైన అభరణాల పేర్ల కంటే బంగారం వేఱుగా ఉన్నట్లుగానే… ‘నామ రూపమయంద్వైతాత్మకం-మిథ్య’ అయినట్టి జగత్తు కంటే ‘నిజ స్వరూపభూతుడు’ అగు పరమాత్మ వేఱుగా ఉన్నాడు. అట్టి ఆత్మకు దేశ కాల క్రియాది శబ్ద-అర్థములు లేవు. కానీ దేశ కాల-క్రియాదులుగా కనిపిస్తున్నదీ, ఒప్పుచున్నదీ అదే! ఇంకా… యథా స్థితమైనట్టి ఈ సమస్త జగత్తు కూడా అధిష్ఠాన రూపం చేత అద్దానియందే ఉన్నది. అనగా, దీనికి ఆత్మకు వేరైన రూపమేదీ లేనే లేదు.
Page:814
ఆత్మకు వేరుగా దృశ్యం లేదు. ఆత్మ దృశ్యంగా లేదు. శాంత సముద్రంలో తరంగాదులు ఉన్నట్లు, చిత్రకారుని చిత్తంలో చిత్రం ఉన్నట్లు, మట్టిలో మట్టి పాత్రల వివిధాకారములున్నట్లు,… బ్రహ్మమున ఈ జగత్తు ఉన్నది.
ఈ విధంగా జగత్తే బ్రహ్మము. బ్రహ్మమే జగత్తు. ఈ రెండూ అభేదమై ఉన్నాయి. కాబట్టి పరమాత్మలో జగత్తు ఉన్నది. జగత్తు లేదు కూడా!
తత్త్వజ్ఞానము సంపాదించుకొన్న తర్వాత, ఇక అట్టి దృష్టిచే ఈ జగత్తు ‘నిత్యము-నిర్మలముశాంతము’… అయినట్టి పరమాత్మయందు తన్మయము (బ్రహ్మము) గాను, శాంతముగాను వెలయుచున్నదే అగుచున్నది. గొప్ప కొయ్య నందు ఇంకను చెక్కబడని విగ్రహము అప్రకటితమై ఉన్నట్లుగానే,.. ఈ స్వర్గ మర్త్య - పాతాళ లోకములు బ్రహ్మమునందు ‘నిజసాక్షి చైతన్యము’ అను శిల్పికి కనిపించుచున్నాయి. కొయ్యయందు విగ్రహం ఆ కొయ్యను చెక్కినప్పుడే కదా అగుపించేది! కానీ, బ్రహ్మము విషయానికి వస్తే… బ్రహ్మము సర్వదా వికార రహితము అయినప్పటికీ…. స్పష్టాత్మకమైన వివర్త రూపంగా గోచరిస్తోంది. ‘నిరతిశయానందము’ అను పూర్ణానందమునందు ‘చిన్మయము’ నుండి జాలువారినవై ఈ సృష్టులు భాసిస్తున్నాయి. కానీ అవిద్య చేత మాత్రమే ఈ సృష్టులు ‘చిదనము’ నందు విభాగయుక్తంగాను, క్షోభ సహితంగాను, నిజమే అయినట్లుగా ప్రకాశించుచున్నాయి. అట్లు విభాగయుక్తంగా (అజ్ఞాన దృష్టికి కనిపిస్తున్నప్పటికీ ఈ జగత్తులకు ‘ఉనికి స్థానం’ అనతగిన ఆత్మ (లేక) బ్రహ్మము సర్వదా విభాజక ధర్మరహితము, క్షోభవర్జితము, స్వయంప్రకాశకము అయి ఉన్నది.
పరమశాంతమగు బ్రహ్మమున అనేక భేదములతో కూడిన ఈ జగదృశ్యము బ్రహ్మమునకు కించిత్తు కూడా వేఱుకాకయే ఉంటోంది. ’చిదనరూపము’ అగు బ్రహ్మము నందు అణువణువునా జగత్సమూహములు భాసిస్తున్నాయి.
ఆద్యంత రహితమగు బ్రహ్మమున ఆద్యంత సహితములగు జగత్తులు భ్రమచే ఆవిర్భవిస్తున్నాయి. అయితే కూడా… బ్రహ్మము సర్వదా బ్రహ్మముగానే ఉన్నది. ఈ జీవుడు బ్రహ్మమే స్వస్వరూపముగా కలిగి ఉన్నాడు. అత్యంత నిర్మలమగు బ్రహ్మమునందు ఈ జగత్తు మొదలైనవి ఉండజాలవు.
ఓ రామచంద్రా! ‘అవయవ రహితము-నిరాకారము అగు బ్రహ్మము (లేక) పరమాత్మకు ఆ ఆకాశ-వాయు-కాల ఆదిగా గల పదార్థములు అవయవ రూపములు వంటివి’… అని వర్ణించి చెప్పటం కూడా వాస్తవానికి మిథ్యా వర్ణనమేనయ్యా! ‘పరమాత్మ అంతయు అధిష్ఠించియున్నవాడు’ అను వాక్యార్థమును శోధించగా, పరమాత్మ సర్వదా నిరవయవుడే! ఆత్మతత్త్వము సర్వభావ వికార రహితమై ఉన్నప్పటికీ,… ’అధ్యారోపదృష్టి’ (అదియే ఇవన్నీ అవధరించుచున్నది.. అను దృష్టిచే) శ్రుతులు ఆ పరమాత్మను ‘సర్వ రూపుడు’ (ఈ సర్వము ఆయన రూపములే)… అని వర్ణించాయి.
Page:815
బ్రహ్మ సత్యమ్ - జగత్ మిథ్యా
శ్రీరాముడు : మహాత్మా! అల్పజ్ఞులగు శిష్యులకు మహనీయులగు తమ వంటి జగద్గురువులు సుబోధకమయ్యేంత వరకు సమస్త విషయములు చర్వితచర్వణంగా బోధిస్తూనే ఉంటారు కదా!
ఇప్పుడు నా ఈ విన్నపం వినండి - ఈ జగత్తులో అనేక అసాధారణ విశేషాలు వినిపిస్తున్నాయి.
చేత్యము (స్మృతి) యందు చేతనత్వం (స్మృతిత్వం); కాలము నందు కాలత్వం; ఆకాశం నందు ఆకాశత్వం; జడమునందు జడత్వం; వాయువునందు వాయుత్వం; భూత-భవిష్యత్వర్తమానములందు త్రికాలత్వం; స్పందనము నందు స్పందత్వం; మూర్తము (ఆకారం) నందు మూర్తత్వం; భిన్నమునందు భిన్నత్వం; అనంతము నందు అనంతత్వం; దృశ్యమునందు దృశ్యత్వం; సృష్టులలో సృష్టిత్వం… ఈ విధంగా ’స్మృతిత్వం-ఆకారత్వం-జడత్వం-వాయుత్వం-త్రికాలత్వంస్పందత్వం–మూర్తత్వం-భిన్నత్వం-అనంతత్వం దృశ్యత్వం -సృష్టిత్వం… మొదలైన అసామాన్యమైన విశేషాలన్నీ సర్వసామాన్య రూపమగు బ్రహ్మం నుండి ఏ క్రమంచే ఏర్పడి పరిఢవిల్లుచున్నాయో… ఆ విశేషం చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు చెప్పిన ఆ సమస్త వస్తువులకు ‘ఆధారము’ ఏదైతే ఉన్నదో… అయ్యది మహాచిదనము అగు బ్రహ్మమే! అట్టి బ్రహ్మము పరమాకాశమై, అవేద్యమై (తెలుసుకునేదంతా అదే కాబట్టి అది తెలియబడనిదై), చిద్రూపమయమై (ఎఱుక), శాంతమై, ఏకమై (అది ఎప్పుడూ అనేకంగా అవటం లేదు), సర్వత్రా సమమై ఉన్నది.
దృష్టిచే సృష్టి కనిపిస్తోంది. సృష్టియందు నీవు చెప్పిన జ్ఞప్తిత్వాదులు దర్శనమగుచున్నాయి. అయితే కనిపించేదానినంతటినీ అధిగమించి చూస్తే… అప్పుడు నిత్య నిర్మల-నిర్విషయ చిదాకాశం మాత్రమే శేషించి ఉంటుంది, చూడబడే సర్వమునకు ఆవల చూచేవాడు ఉన్నాడు కదా! చూడబడేదంతా అధిగమించి పరిశీలిస్తేనే దృశ్య దర్శన రహితుడగు శుద్ధాత్మ గమనించ బడతాడు.
అట్లు అధిగమించినప్పటి పరిశీలనయే ‘మహా ప్రళయం’. అట్టి మహా ప్రళయంలో సర్వ విషయాలు ‘లేనివిగా’ తెలియవస్తాయి. అట్టి సర్వనాశన (సర్వ రాహిత్య స్థితిలో) బ్రహ్మ-విష్ణుమహేశ్వరులతో సహా సర్వ నామ రూపాలు అంతర్థానమౌతాయి. అప్పటికీ ఏ శుద్ధ సన్మాత్రం శేషిస్తుందో …అద్దానిలో ఈ జన్మకారకాలైన ‘మాయ-మోహం-భ్రమ-పాపం’ మొదలైన ఆకృతులు కలిగిన బీజాలే ఉండవు. అట్టి చిదాకాశం యొక్క ఘనత్వం ముందు ఈ అతిసూక్ష్మ మగు భౌతికాకాశం కూడా శిల వలె అత్యంత స్థూలంగా కన్పట్టుచున్నది. అట్టి పరమ సూక్ష్మం కేవలం శాంతం -అతి నిర్మలం-ఆద్యంత రహితం-సన్మాత్రం అయి ఉన్నదానినే శాస్త్రములు ‘బ్రహ్మం’ అనే పేరుతో పిలుస్తున్నాయి. అది ఉన్నదా? ఉనికి లేనిదా?
నచ ‘నాస్తి’ ఇతి తద్వక్తుం, యజ్యతే చిద్వపుర్యదా ।
నచైవ ‘అస్తి’ ఇతి తద్వక్తుం, యుక్తం శాంతమలం తదా॥
Page:816
ఎప్పుడైతే ఆ చిన్మాత్ర స్థానం ‘మాయ’ అనే దోషము లేనిదై ఉంటుందో… అద్దానిని ’ఉన్నది – లేదు’ అనే వాచ్య వృత్తిచే చెప్పలేం. ఒకానొకదానిని - ‘ఉన్నది’ అని ’లేదు’ - అని ఇంద్రియార్థముల దృష్ట్యా (శబ్ద-స్పర్శ-రూప- రస గంధముల దృష్ట్యా) మాత్రమే చెప్పుతూ ఉంటాం. ఆత్మయే, ఇంద్రియార్థములకు విషయం కాదు. కనుక ‘లేదు’ అనవచ్చేమో! కాని, ఈ ఇంద్రియార్థములు ఎద్దాని భావనచే ఏర్పడుచున్నాయో, ఎయ్యది భావనలన్నిటికీ ఆవిర్భావస్థానమో, అట్టి చిత్సత్తే లేకపోతే భావనలకు-ఇంద్రియార్థములకు ఉనికి ఎక్కడిది? కనుకనే "అది ‘ఉన్నది లేదు’ అను చర్చకు విషయమే కాదు అని చెప్పబడుతోంది.”
శ్రీరాముడు : శుద్ధతత్త్వమగు అట్టి శుద్ధ బ్రహ్మము మనకు అనుభవమయ్యేది ఎక్కడ?
శ్రీ వసిష్ఠ మహర్షి : కనబడుచున్న ఈ సర్వమునకు ఆధారము, వాస్తవ సత్త అగు బ్రహ్మము ఎచ్చట ఎట్లు ఉన్నదో, సూచించటానికి ఒకటి రెండు విశేషాలు చెపుతాను, విను.
నిమేషే యోజనశతే ప్రాప్రాయామ్ ఆత్మ సంవిది
మధ్యే తస్యాస్తు యద్రూపం, రూపం తస్య పదస్య తత్ II
నీవు ఒకచోట నిలబడి వేలాది మైళ్ళ దూరంలో ఉన్న దేనినైనా (ఉదాహరణకు చంద్రుణ్ణి) చూస్తున్నావనుకో. ఇప్పుడు జరుగుతున్నదేమిటి? నిమిషమాత్రంలో ద్రష్టయగు నీ యొక్క సంవిత్తు (జ్ఞానము) నేత్రవృత్తి ద్వారా సుదూరంగా వేలాది మైళ్ళ దూరంలో ఉన్న చంద్రబింబాన్ని చూస్తోంది కదా! అట్లా ఒక వృక్షము యొక్క శాఖల మధ్యగా చంద్రబింబాన్ని చూస్తున్నావనుకో, అప్పుడు ‘వృక్ష శాఖ’ను అధిగమించిన తర్వాత… చంద్రబింబమును ఇంకనూ చేరకముందు మధ్యలో ఏ నిర్విషయ జ్ఞాన (లేక) ప్రజ్ఞ స్వరూపము ఉన్నదో… అదియే పరమాత్మపదము.
ఈ మధ్య స్థానంలో దృష్టి సంవిత్తు నిర్విషయమై ఉన్నది. ఆ నిర్విషయ ప్రజ్ఞయే ఆత్మపదము యొక్క స్థానం. ఆ ప్రదేశంలోని విషయరహితమగు శుద్ధ ప్రజ్ఞయే ఆత్మ స్వరూపం
విషయ ప్రజ్ఞ (-) విషయములు = ‘శుద్ధ సంవిత్తు’
Page:817
ఓ రామచంద్రా! ఈ ఆకారయుక్తం-భేద సహితం-సకారణంగా తోచుచూ ఏ ఈ జగత్తు స్పష్టంగా కంటికి కనిపిస్తోందో… అట్టి ఇదంతా కూడా ఆత్మ పదంలో ఉత్పత్తియే అయి ఉండలేదు. ఎందుకంటే ఆత్మయందు ‘జగత్తు’ అనేది ఉత్పత్తి అవటానికి కారణమే లేదు కనుక! కాబట్టి ఇదంతా వాస్తవానికి ఆకారయుక్తంగానూ లేదు. ఏకమూ కాదు. ద్వైతమూ అయి ఉండలేదు. ఏది స్వతహాగా కారణరహితమై ఉన్నదో అయ్యది ఈ జగత్తులో విషయ సత్తగా లేదు. అంతే కాదు.
ఏది స్వయంగా ‘అనునిత్యానుభూత స్వరూపం’ అట్టి ’చిత్’ను ఇక్కడి నుండి తొలగించటం
ఎవరి తరమూ కాదు.
శ్రీరాముడు : ’జగత్తుకు కారణం లేదు’ అనే బదులు, ‘బ్రహ్మమే జగత్తుకు కారణం’… అని అనవచ్చును కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : బ్రహ్మం జగత్తుకు కారణం కాజాలదు. ఎందుకంటావా? ‘బ్రహ్మం దృశ్య శూన్యం, ఆద్యంతరహితం, చిద్రూపం, నిరాకారం’ అని బ్రహ్మజ్ఞుల నిత్యానుభవం, అట్టి బ్రహ్మం సాకారం, దృశ్యం, అబ్రహ్మరూపం అగు జగత్తుకు కారణం ఎట్లా అవుతుంది చెప్పు?
తస్మాత్ తత్ర జగద్రూపం యదాభాతం తదేవ తత్,
స్వయమేవ తత్ ఆభాతి చిదాకాశమితి స్తితమ్ ||
అందుచేత, కారణ రహితమగు బ్రహ్మమునందు ఏ జగత్తు భాసిస్తోందో అది ’చిదాకాశమే ఆ రూపంగా’ భాసిస్తున్నదగుచున్నది.
గొలుసుగాను, గాజుగాను బంగారమే అగుచున్నప్పటికీ గొలుసు-గాజుల భేదానికి బంగారం కారణం కాదుకదా! బంగారం దృష్ట్యా ఏ భేదం గొలుసుకు-గాజుకు అగుపిస్తోందో అది భ్రమ మాత్రమే! ఈ జగత్తు చిద్రూపమగు బ్రహ్మమే అయి ఉండటం చేత జగత్తులో వేర్వేరు ధర్మాలుగా అగుపిస్తున్న వస్తువుల మధ్య భేదం భ్రమయే! అదంతా అనేక ఆకారములు గల తరంగాల వంటిది. ఒకే లోహం యొక్క అనేక పనిముట్ల వంటిది. కావున, సర్వత్రా ’ఏకం-అజం-శాంతంద్వైత-ఏకత్వ రహితం, సర్వరూపం-నిర్వికారం అగు బ్రహ్మమే అంతటా నిండి ఉన్నది.
పూర్ణాత్ పూర్ణం విసరతి, పుర్ణే పూర్ణం విరాజతే, | పూర్ణమేవ ఉదితం పూర్ణే, పూర్ణమేవ వ్యవస్థితమ్ ।…
భ్రమ శమించిందా… అంతటా బ్రహ్మమే! అప్పుడు పూర్ణమగు బ్రహ్మము నుండి పూర్ణమగు జగత్తు ప్రసరించినదగుచున్నది. పూర్ణమగు బ్రహ్మమున పూర్ణమగు జగత్తు ఉదయించినదై విరాజిల్లుచున్నదగుచున్నది.
కాబట్టి ఓ రామచంద్రా! ‘బ్రహ్మము నుండి అనేక విషయములతో కూడిన ఈ జగత్తు ఏ క్రమమును అనుసరించి ఉద యించింది?’… అని అడిగావు కదా!
Page:818
మా సమాధానం విను. ఈ జగత్తంతా కూడా… సదా, సర్వ ఆకారవర్జితము, శాంతము, సమము, ఉదయ-అస్తమయరహితము, ఆకాశము వలె నిర్మలము, ఏకము, సత్-అసత్ రూపమున వ్యక్తము అగు బ్రహ్మమే స్వయముగా అయి ఉన్నది. బ్రహ్మము తప్పించి ‘జగత్తు’ అనబడు శబ్దార్థములు ఆత్మానుభవ దృష్టికి అగుపించటమే లేదు.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జగత్తు అనే నిర్మలమైన ఆకాశము సద్రూపము అయిన ‘బ్రహ్మాకాశము’ నందే నెలకొని ఉన్నది.
జగత్ నామ నభః స్వచ్ఛం సత్ బ్రహ్మ నభసి స్థితమ్
నభో నభసి భాతీదం ‘జగత్’ శబ్దార్థ ఇతి అజమ్ ||
చిదాకాశమే చిదాకాశమునందు ‘జగత్తు’ అను శబ్ద-అర్థములతో నెలకొని ఉన్నది. కనుక జగత్తు కూడా చిదాకాశము వలెనే వికార శూన్యమగు బ్రహ్మమే అయి ఉన్నది. ‘నీవు-నేనుజగత్తు’ ఇత్యాదిగా గల శబ్దములు, వాటి అర్థములు అంతర్హిత దృష్టిచే చిదాకాశముతోటి సమముగా భాసించుచున్నవి. అవన్నీ చిదాకాశమునకు వేరై లేకయే ఉన్నది. అవి సర్వదా సద్రూపమగు బ్రహ్మమే అగుచూ, బ్రహ్మమునందే వెలయుచున్నాయి. ఈ పృథ్వి-మేఘముపర్వతము-సముద్రము మొదలైన సమస్త పదార్థములు… ఇవన్నీ కూడా ‘జన్మాది రహితము - కాష్ఠమౌన స్వరూపము’ అగు బ్రహ్మమునందే ఉండి ఉన్నాయి. అట్లే….
దృశ్య స్వభావరహితుడైన ద్రష్ట, కర్తవ్య-కారణ స్వభావరహితుడైన కర్త… వీరుభయులు చిన్మాత్ర స్వభావమగు స్వాత్మ యందే స్థితి కలిగి ఉన్నారు.
ద్రష్ట యొక్క భావనచే దృశ్యం అనుభవమౌతోంది. దృశ్యము యొక్క ‘అభావము’ చేతనో…? ‘శుద్ధచిత్’ స్వభావమున జ్ఞత్వము గాని, కర్తృత్వము గాని, జడత్వము గాని, శూన్యత్వము గాని, పదార్థముగాని, ఆకాశత్వముగాని… లేకయే ఉన్నాయి. ఈ కనబడే సమస్తం కూడా ఒక పెద్ద శిల యొక్క మధ్య భాగం వలె ‘సత్చిత్’ ఘనము-ఏకము-అజము-సర్వ వ్యాపకము శాంతము ఆద్యంతరహితము - విధినిషేధాలలో విధినిషేధాలలో సమా సమాన రూపము’… అయినట్టి పరబ్రహ్మమే అయి ఉంది.
మరణం జీవితం సత్యం అసత్యం చ శుభ- అశుభమ్ |
సర్వం ఏకమ్ అజమ్ వ్యోమ, వీచిజాలజలం యథా II
తటాకంలో కనిపించే రకరకాల తరంగాలు, ఆవర్తాలు, ఆ తరంగాలు లయించటం, తరంగాలు ఒకదానిని ఒకటి ఢీ కొనటం, ఒకదానికొకటి అనుసరించటం ఇవన్నీ కూడా జల స్వరూపమే గాని… అవేవీ జలానికి అన్యం కాదు కదా! అట్లాగే ఇక్కడ దృశ్య విభాగమై కనిపించే జీవనము-మరణము-సత్యము-అసత్యము-శుభము-అశుభము ఇవన్నీ కూడా స్వప్నంలో కనిపించిన నగరంలోని ఆయా విశేషాలుగా భ్రమతుల్యమే!
Page:819
సృష్టికి పూర్వం మొట్టమొదటగా ఏ నిష్ప్రపంచమగు బ్రహ్మము ఉండి ఉన్నదో… అదియే ఇప్పుడు కూడా తన నిర్మల చిదాకాశమున ఈ జగద్రూపంగా స్థితినొంది ఉన్నది. స్వప్న ద్రష్టలోనే స్వప్నం ఉన్నట్లుగా చిదాకాశమునందే ఈ జగత్తు ఉన్నది. కాబట్టి సర్వాత్మకమగు ఈ సర్వ జగత్తు కూడా నిష్ప్రపంచకమగు బ్రహ్మము రూపముననే ఇప్పుడు కూడా (సృష్టికి ముందువలె) ఉన్నది. ఆ పరమాత్మ నిర్విషయం కదా! ఒక ప్రదేశపు ధ్యాస నుండి మరొక ప్రదేశపు ధ్యాస మధ్య ఏ ‘నిర్విషయ చైతన్యరూపం ఉన్నదో అదియే ఆ పరమాత్మ యొక్క రూపం’.
తరంగం యొక్క ముందు-మధ్య-ఉత్తర మూడు స్థితులూ జల రూపమే కదా! అట్లాగే ఈ జగత్తు యొక్క పూర్వ-మధ్య-ఉత్తర స్థితులందు ఇదంతా శాంత రూపమగు బ్రహ్మమే కానీ, మరింకేమీ కాదు. ఏది ఆరోపిత జగత్ రూపంగా ఉదయించినట్లు అనిపిస్తోందో… అదంతా జ్ఞాన దృష్టిచే ఉదయించనే లేదు. ఒక విషయం -మరొక విషయం మధ్య ఏది మనస్సుకు నిర్విషయమై లభిస్తుందో… అట్టిది నిర్విషయ చైతన్యం కంటే భిన్నం కాదు. తరంగం తరంగం మధ్యగల జలం జలంగా సుస్పష్టంగా కనిపించునట్లు, తరంగం కూడా జలమే అయినప్పటికీ తరంగత్వదర్శనం చేత జలంగా అజ్ఞానజ్ఞప్తికి అనిపించకపోయినట్లు… నిర్విషయ చైతన్యం విషయాస్వాదన లయించిన ప్పటి స్థితిలో ఘనీభూతమై అనుభవమౌతోంది.
ఈ విధంగా సృష్టి చైతన్యము కంటే భిన్నం కాదు. ఒకవేళ ఎవరికైనా భిన్నంగా అనిపిస్తోందం టారా? దూరంగా కుందేలు కదలుతూ ఉంటే అద్దాని చెవులు నిక్క పొడుచుకోవటం చేత కుందేటికి కొమ్ములు ఉన్నట్లు అనిపిస్తుంది. అంతమాత్రం చేత కుందేటికి కొమ్ములు ఉన్నాయా? లేవు. మరి కొమ్ములు కనిపిస్తున్నాయి కదా? కుందేలును సమీపంగా చూస్తే ‘కుందేటికి కొమ్ములు ఉండవు’ అని తెలియగలదు కదా! జగత్తుగా కనబడేదంతా (చైతన్యమునకు వేరై తోచేదంతా) భ్రమ మాత్రమే! ’కుందేలుకు కొమ్మలు కనబడటానికి అసలు కారణమేమిటి?’… అని వెతికామనుకో. దానికి కారణం ఏముంటుందీ… ‘భ్రమ’ తప్పితే? అసత్యమగు భ్రమ సత్యమెట్లా అవుతుంది. శ్రీరాముడు : స్వామీ! ‘భ్రమ’ అని దేనిని అంటున్నాం?
శ్రీ వసిష్ఠ మహర్షి :
యత్ అకారణం భాతి తదభాతం భ్రమాత్మకమ్ |
భ్రమస్య, అసత్య రూపస్య ‘సత్యతా’ కథమ్ ఉచ్యతే ॥
ఏది కారణం లేకయే భాసిస్తుందో (అనుభవమౌతోందో)… అది భ్రమాత్మకం. అది వాస్తవా నికి భాసించనిదే (అనుభవార్హత లేనిదే) అగుచున్నది. కాబట్టి అసత్యం-భ్రామరూపం అగు జగత్తు ’సత్యం’ అని ఎట్లా అంటారు. బ్రహ్మమున ‘జగత్తు’ అనబడేది ఉండటానికి కారణమే లేదు. కారణమే లేనిదానికి ‘సత్త’ ఎక్కడి నుండి వస్తుంది? గొడ్రాలికి కలలో కనిపించిన కుమారుడు నిజమైన కొడుకు ఎట్లా అవుతాడు? ఏది కారణం లేకయే భాసిస్తోందో, అది “ద్రష్ట యొక్క చైతన్యమే అట్లు ఆ స్వరూపంగా విజృంభిస్తోంది" అని అనక తప్పదు. ఉదాహరణకు ఒకడు స్వప్నంలో కొన్ని
Page:820
వస్తువులను చూస్తున్నాడు. ఆ వస్తులన్నీ ఎచ్చటనుండి తయారయ్యాయి? స్వప్న ద్రష్ట యొక్క ’స్వప్న చైతన్యము’ చేతనే ఆ స్వప్నాంతర్గత రూపాలన్నీ రూపుదిద్దుకున్నాయని అనక తప్పదు కదా!
ఏ ‘సంవిత్తు’ అయితే నేత్రవృత్తి ద్వారా ఒక దృశ్యం నుండి మరొక దృశ్యం వైపుకు వెళ్ళు చున్నదో… అదియే ఆ రెండు విషయాల (దృశ్యాల) మధ్యగా దృశ్య రహిత స్థితిలో ఉన్నది కదా! అదే 1. దృశ్య వృత్తి, 2. దృశ్యరూపము కూడా ధరిస్తోంది. కనుక ‘జగత్తు’గా ద్రష్టకు అనుభవమయ్యే దంతా అతని సంవిత్తే నేత్ర వృత్తి ద్వారా దృశ్యరూపము అవధరించినదై… అతనికి అనుభవమౌతోం దని సూక్ష్మ దృష్టిచే గ్రహించు. అయితే చైతన్యం దృశ్య వృత్తి ద్వారా దృశ్యం పొందుచున్నప్పటికీ చైతన్యం సర్వదా యథాతథంగానే ఉన్నదని గ్రహించుటయే పూర్ణ జ్ఞానం. ఆకాశం కంటే కూడా ‘అత్యంత సూక్ష్మం’ అయినట్టి బోధరూపమగు చైతన్యమే పదార్థ రూపంగా కూడా ప్రకాశిస్తోంది. అంతఃకరణంలో కలిగే ‘స్వప్నం-ఊహారూపాలు’… మొదలైనవే ఇక్కడ మనకు దృష్టాంతం. శ్రీరాముడు మహర్షీ! ఈ జగత్తు చైతన్య స్వరూపుడగు ద్రష్ట యొక్క కల్పనా దర్శనమే అని అనుకుందాం. అయితే ఈ జగత్తు ‘అకారణం’ అని మీరు సిద్ధాంతీకరిస్తున్నారు. ‘ఒక మట్టి విత్తులో భావికాలపు సువిశాలమైన మఱివృక్షం ఉన్న విధంగా చైతన్య పరమాణువునందు జడరూపంగా ఈ జగత్తు ఉన్నది’ అని ఎందుకు అనుకోకూడదు?
శ్రీ వసిష్ఠ మహర్షి : బీజం సాకారం కాబట్టి అది ఒకప్పుడు మట్టి- జలముల సహకారి కారణం చేత కాలక్రమంగా అంకురించి సాకారమై అనేక శాఖలతో కూడిన మహా వృక్షముగా అగుచున్నది. కానీ చైతన్యము నిరాకారం కదా! నిరాకారంలో సాకారమైన ఏ సహకారి కారణం పొసగుతుంది చెప్పు? మహా ప్రళయంలో సమస్త జగత్తు నశించినప్పటి స్థితిలో జగత్తు మరల ఉత్పత్తి కావటానికి కారణం కాగల సాకారమగు బీజము ఎక్కడిది? ఆ బీజమునకు ‘జగత్తు’ అనే రూపంగా అంకురింపజేసే సహకారి కారణాలు ఎక్కడున్నాయి? ఎక్కడి నుండి వస్తాయి?
పైగా…‘శాంతము-శుద్ధము-నిరాకారము’ అగు పరబ్రహ్మమునందు ఆకారముల కల్పన ఎచ్చట? పరమా ణువు యొక్క సంబంధం ఏమున్నది? అందులో బీజం ఎట్లా ఉంటుంది?
కారణస్యేతి బీజస్య సత్య-అసత్యైక కారిణః
అసంభవాత్ జగసత్తా, కథం కేన కుతః క్వ కా?
కనుక ‘సత్-అసత్’ రూపమగు బీజరూప కారణమే అసంభవమైనప్పుడు ఇక చైతన్యమునందు జగత్తు యొక్క ఉత్పత్తి ఎట్లు, దేనిచే, ఎచట, ఏ రీతిగా సంభవం? సంభవం కాదు. కాబట్టి ‘పరమాత్మ’ అనే అణువునందు "జగత్తు కలదు” అని అనటం ఉచితం కాదు. ఆవగింజలో మేరుపర్వతం ఎట్లా దాగి ఉంటుంది? కాదు… ‘జగత్తు కూడా నిరాకారమే కదా!’… అని అంటావా? సాకారమగు బీజం ఉన్నప్పుడు మాత్రమే ‘కారణ-కార్య’ దృష్టులు ప్రవర్తిస్తాయి. నిరాకారమగు దానిలో బీజమేమిటి? జన్య-జనక క్రమం ఎక్కడుంటుంది?
కనుక రామచంద్రా! ఏ పరతత్త్వమగు బ్రహ్మము కలదో… అదియే (మాయచే) ఈ జగత్తు
Page:821
రూపంగా కనబడుచూ ఉన్నది. వాస్తవానికి ఇక్కడ ఏదీ ఉత్పన్నం కావటం లేదు, నశించటమూ లేదు. చిదాకాశమున చిదాకాశమే ‘జగత్తు’ రూపంగా నెలకొని ఉన్నది.
చిత్తము నందలి చైతన్యం యొక్క ‘స్ఫురణ’చే ఈ ‘జగత్ భ్రమ’ ఉదయిస్తోంది. అశుద్ధ చిత్తం దీనిని అశుద్ధ జగత్తుగా (ఎక్కువ తక్కువలు, జీవులు, అయినవాళ్ళు-కానివాళ్ళు మొదలైనవిగా) దర్శిస్తోంది. శుద్ధ చిత్తము దీనినంతటినీ నిత్య బ్రహ్మముగా దర్శిస్తోంది. ఇక్కడి జగద్విశేషం ఇంత మాత్రమే! ఆకాశమందు శూన్యత్వము, జలమునందు ద్రవత్వము ఉన్న విధంగానే ఆత్మయందు ‘ఆత్మ వివర్తరూపము-శుద్ధము’… అగు ఈ సృష్టి రూప అన్యత్వం (అజ్ఞాన దృష్టికి) అనిపిస్తోంది. ఇక మా సిద్ధాంతమేమిటో విను- ఈ జగత్తు సర్వదా ’శాంతం-వ్యాపకం-సత్యం-ఆద్యంత రహితం’… అగు బ్రహ్మమే అయి ఉన్నది. ఇది వాస్తవానికి ఉదయించనూ లేదు. అస్తమించబోవ టమూ లేదు. ఏ నిర్విషయ శుద్ధ చైతన్యం అంతటా ఉన్నదో అదియే ఈ ద్రష్ట-దృశ్యాలు కూడా. చిదాకాశమే అల్ప దృష్టికి ఇట్లా కనిపిస్తోంది. వాయువులో స్పందత్వం, జలంలో ద్రవత్వం, ఆకాశంలో శూన్యత్వం వాటివాటికి అభేదమై భాసించుచున్నట్లే… ఆత్మయందు ఈ జగత్తు అసంగఅద్వయ స్వభావంతో భాసిస్తోంది. ఈ జగత్తు చిదాకాశమే అయి ఆత్మయందు స్థితి కలిగి ఉన్నది.
అట్లు స్థితి కలిగి ఉన్నదగు ఆత్మాకాశం భూతాకాశం వంటిది కాజాలదు. సూర్య రహితమై, ఆ సూర్య ఉదయ-అస్తమయాలు లేనట్టి ఆత్మయందు ఏ భూతాకాశం ఉంటుంది?… భూతాకాశం ఎక్కడా లేదు. దాని మూల రూపం బయటకు కనబడేది (కళ్ళకు-చెవులకు విషయం కాదు.
ఈ సమస్తము ఆత్మకు స్వభావ సిద్ధమగు అంగభూతమే! ఆత్మ ఈ సమస్తము అయి కూడా, దీనంతటికీ వేరుగా ఉన్నది. కాబట్టి రామచంద్రా! నీవు సర్వ దృశ్య - నామ రూప కల్పనను విడనాడి ఉండెదవు గాక! శుద్ధ చిదాకాశమాత్రుడవై స్థితి నొంది ఉండుము.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ భావ- అభావాలు ఈ గ్రహణ త్యాగాలు ఈ స్థూల సూక్ష్మములు, ఈ స్థావర జంగమాలు ఇవన్నీ చిదాత్మయందు ఉదయించటానికి కారణమేమీ లేనే లేదు. ఎందుకంటే చిదాత్మ సర్వదా అకారణం కదా! అందుచేత ఇవన్నీ సృష్ట్యాదిలో ఉత్పన్నమే అయి ఉండలేదు. నిరాకారం - స్వాత్మరూపం అగు చైతన్యం ఏ సమయమందూ సాకార పదార్థము లకు ‘కారణం’ కాజాలదు. సాకార పదార్థం మాత్రమే సాకారమునకు కారణం కాగలదు కదా! ఈ కారణం చేత తత్త్వజ్ఞాని సమస్త జగత్తును ‘చిత్స్వభావం’ గానే భావిస్తూ ఉంటాడు. తత్ఫలితంగా సర్వదా ఆత్మయందే నెలకొని ఉంటాడు.
కల్లు తాగినవాడు క్షోభచే తన నీడను చూచి తానే ప్రలాపాదులతో కూడిన “ప్రమత్తత” కలిగి ఉంటాడు చూచావా? ఆకాశరూపమగు చైతన్యం కూడా తాను ఎట్లు భావన చేస్తున్నదో… ఆ
ప్రకారంగానే తన నిజరూపమగు ఈ సృష్టిని పొందుతోంది. ఎప్పుడైతే ఎదురుగా కనిపిస్తున్న
Page:822
ప్పటికీ, నిర్మలమైన దృష్టికి ఇదంతా కూడా భావనామయ మాత్రమై, వాస్తవానికి ఉత్పన్నం కాకయే ఉన్నట్లు అవుతుందో… అప్పుడు ఈ జగత్తు శాంతం-సమం అగు బ్రహ్మంగానే కనబడగలదు.
జలంలో జలం యొక్క ద్రవత్వమే ప్రదర్శనమగుచున్నది కదా! చిదాకాశంలో చిదాకాశమే జగత్తుగా వర్తిస్తోంది. “చిదాత్మ వలననే, చిదాత్మ చేతనే జగత్తు పొందబడటం” అనే సంఘటనను శ్రుతులు “చైతన్యముచే ఈ జగత్తు రచించబడింది…” అని చెప్పుచున్నాయి. స్వప్నంలో స్వప్న జగత్తు ఎట్లా పొందబడుతోంది? స్వప్న ద్రష్ట తన స్వభావమును ఏమరచుటచేతనే కదా! ’కాచ’ అనే రోగముతో కూడిన కళ్ళకు ఆకాశంలో వెంట్రుకలు కనిపిస్తున్నాయి. ఎందుచేత? ఆ కంటి దోషంచేతనే కదా! అట్లాగే జగత్తు అనబడేది భ్రమ చేత స్ఫురిస్తోంది. ఈ జాగ్రత్-జగత్తు స్వప్న జగత్తులాగానే చిదాకాశమునందే ఉన్నది. "సృష్ట్యాది” యందు “హిరణ్యగర్భుడు” అను సమష్టి జీవునియందలి చైతన్యము యొక్క స్వప్నమే ఇక్కడ ‘జగత్తు’ అనబడుతోంది. ఈ రోజు రాత్రి వ్యష్టి జీవుని (నిద్రావస్థలో పనిచేసే) ఊహా వ్యవహారమును “స్వప్నం” అని అంటున్నాం. సమష్టి జీవుడగు హిరణ్యగర్భుడు స్వస్వరూప సమక్షంలో ఆశ్రయించిన కల్పనా చమత్కారమును ‘జగత్తు’ అంటున్నాం. ఈ సమష్టి జీవుని జగత్ స్వప్నానికి, వ్యష్టి జీవుని జాగ్రత్ స్వప్నానికి వాస్తవానికి భేదమేమీ లేదు. శ్రీరాముడు : స్వామీ! సృష్టి ‘అవాస్తవం’ అనుకుంటున్నాం కదా! మరి ఇక్కడ ‘నియతి’ ఉన్నది కదా! ఉదాహరణకు మామిడి విత్తు మామిడి వృక్షంగానే అగుచున్నది కాని, ఆముదము వృక్షం కాదు కదా! ఆవు కడుపున గేద జనించదు కదా! మరి ‘నియతి’ దృష్ట్యా ఇక్కడ కార్యకారణములు ఉన్నట్లే కదా! ఇక జగత్తు లేనిది ఎట్లా అవుతుంది.?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నియతి సృష్ట్యాదిలో ఎట్లా నియమించబడియున్నదో -
అదియే ఇప్పటికీ కొనసాగుతోంది. పూర్వకాలంలో ప్రవర్తించిన నదీజల ప్రవాహం ఇప్పటికీ (ప్రతి సంవత్సరము ఆయా సమయములందు) అట్లే ప్రవర్తిస్తోంది. నదులయందలి జలము యొక్క “తరంగసత్త” ఆ జలసత్తా కంటే భిన్నమా? కాదుకదా! చిదాకాశమున సృష్టి రూపసత్త, అందులోని నియతి, అనియతి ఇదంతా చిదాకాశం కంటే భిన్నం కాదు!
శ్రీరాముడు : హే జగద్గురూ! ఈ జగత్తులో జీవుడు జనిస్తున్నాడు. పుట్టినప్పటినుండి అనేక భావాభావములు పొందుచున్నాడు. మరల ఎప్పుడో ‘అభావస్థితి’ అనదగు మరణము చేరుచున్నాడు. జీవించినంత కాలం సుఖ దుఃఖములు అనుభవిస్తున్నాడు. “మరి జగత్తు లేదు” అన్నది ఎట్లా యుక్తియుక్తం? అట్లా అనుకున్నంత మాత్రం చేత దుఃఖాదులు తొలగుతాయా? మృత్యువు ఏదో ఒకనాటికి అనివార్యం కదా! ఈ విధంగా జీవన-మృత్యువులు రెండూ దుఃఖప్రదములే కదా! శ్రీ వసిష్ఠ మహర్షి :
మృతస్య అత్యంతనాశశ్చేత్ తన్నిద్రా సుఖమేవతత్ |
భూయశ్చ ఉదేతి సంసారః తత్ సుఖం నవమేవతత్ ॥
మరణించిన తర్వాత అత్యంత అభావమే కలుగుతుందని కాసేపు అనుకుందాం. అప్పుడు అది కూడా గాఢ నిద్రాస్థితిలో జీవులు రోజూ పొందే నిరతిశయానంద సుఖము వంటిదే అవుతుంది
Page:823
కదా! కాబట్టి మరణము అనేది కూడా చిదానంద సుఖస్వరూపమే! మరల ఆ జీవుడు దేహాది రూపముగా సంసారంలో ఉదయిస్తున్నాడనుకుందాం. ఆ నూతన దేహము, నూతన వ్యవహార పరంపరలూ సుఖస్వరూపమే. ఎందుచేతనంటే ప్రతి జీవుడు ‘నేను దీర్ఘకాలం జీవించాలి. ఇంకా ఇంకా బ్రతకాలి’… అని అనుకుంటున్నాడు కదా! సుఖ స్వరూపం కాకపోతే జీవించాలని ఎందుకనుకుంటాడు? ఈ విధంగా జీవన -మరణములు రెండూ సుఖ స్వరూపములేనని అనిపించుకుంటున్నాయి. మనం అనేకసార్లు ఇప్పటివరకు చెప్పుకున్నట్లుగా జగత్సత్తా ‘ఆత్మసత్తా’ కంటే వేఱుకాదు. కాబట్టి జనన మరణభీతి జీవునికి అఖరయే లేదని… అది అజ్ఞానముచే మాత్రమే ఏర్పడుచున్నదని జ్ఞానుల ఉద్దేశం.
ఇక సుఖ-దుఃఖాలంటావా?… “దుష్కర్మలచే నాకు నరకాదుల దుఃఖం వచ్చిపడు తుందేమో…?” అనేది కూడా “సుఖసత్తా” యే మూలముగా కలిగి ఉన్నది. సుఖం లభించక పోవటమే దుఃఖం. దుఃఖం కలగక పోవటమే సుఖం. ఆ రెండిటి మూలభావం ఒక్కటే. కాబట్టి సుఖ దుఃఖములు అనేవి అవినాభావ సంబంధంచే ఏర్పడేవే గాని స్వతఃసిద్ధమైనవి కావు. సుఖ-దుః ఖములందు ఇంతకుమించి నిర్మాణ విశేషమేమీ లేదు.
దృష్టాంతానికి….ఒక వస్తువు లభించి తద్వారా ‘సుఖభావన’ ఉదయించిందనుకో… తక్షణం లోనే “ఇది కోల్పోతామేమో….’ అనే దుఃఖభావం వెంటనంటే ఉన్నది. ఏ కారణం చేతనో (లభించ వలసినది లభించకపోవటమో, అనుకున్నది జరగకపోవటమో, ఆశించినది సిద్ధించక పోవటమో) దుఃఖం ఏర్పడిందనుకో, “ఇది తొలగగానే నాకు సుఖం లభిస్తుంది” అనే భావన వెంటనంటే ఉన్నది కదా! అట్టి దుఃఖ భయం మరణానంతరం కూడా కొనసాగుతూనే ఉన్నది. కాబట్టే జీవుడు మరల దేహధారుడగుచున్నాడు. కనుక దేహధారణ దేహత్యాగ స్థితులు సుఖ దుఃఖములు రెండూ అందరికీ ఒకేరీతిగా సుఖ దుఃఖ సమన్వితములై ఉంటున్నాయి.
సుఖ దుఃఖములు రెండూ వాస్తవానికి లేవు. ఆ రెండూ అనుభవించేవాడు మాత్రమే వాస్తవమైన ‘సత్త’ కలిగి ఉన్నాడు.
అంతఃశీలుడు -
మరణం - - జీవితం నాస్తు సహజే వాసనే తయోః |
ఇతి విశ్రాంత చిత్తో యః సో “అన్తఃశీతల” ఉచ్యతే ॥
మరణమైనా జీవితమైనా అవి రెండూ దేహసంబంధమైనవి గాని దేహికి సంబంధించినవి కాదు. దేహి పుట్టడు, చావడు. ఎవనికైతే జీవించటం - మరణించటం అను రెండూ కూడా స్వాభావిక బ్రహ్మసుఖ రూపములుగా ఉంటాయో.. అట్టి అనునిత్య విశ్రాంత చిత్తుడగు జీవుని “అంతఃశీలుడు” అని పిలుస్తారు.
ముక్తుడు - వృత్తులన్నీ ఎవరియందు నశించి, ఎవడు దశ్యస్ఫురణ లేకయే ఉంటాడో… అట్టివాడు సర్వబంధ వినిర్ముక్తుడు అవుతాడు. అట్టివాడు. చిద్రూపమగు ఆత్మయందు తన్మయుడై
Page:824
ఉంటాడు. అట్టివాడు “ముక్తుడు” అని అనిపించుకుంటాడు. ముక్తునికి (ఆత్మ తన్మయునికి) సుఖ దుఃఖములు, జీవన్మరణములు సమానంగానే కనబడతాయి.
అందుచేత రామచంద్రా! ఆత్మజ్ఞాన ప్రభావం చేత ఈ దృశ్యమంతా “స్వప్నతుల్యము” అను భావనా పటిమ పటిష్టమగుచున్నది. దృశ్యము యొక్క “అత్యంతాభావన” చేత (అట్టి కారణంగా) ఈ సృష్టి ఉంటున్నా లేక ఉండకపోయినా ఆ ఆత్మజ్ఞానానికి ఒక్కటే అవుతుంది.
“దేహిగా నేను ఏదై ఉన్నాను? ఈ దృశ్యము ఏమై ఉన్నది?” అను రెండు విషయాలు జ్ఞానముచే సుస్పష్ట పరచుకున్నవానికి దృశ్యము ఉన్నా కూడా లేనట్లే! జన్మ మృత్యువులు కనబడుచున్నా అవి దూరంగా ఉన్న అపరిచిత గ్రామంలోని దైనందిన సంఘటనలవలె చూడబడతాయి. జ్ఞానియందు సర్వ దృశ్యానుభవరహితమగు "శుద్ధ నిర్విషయచైతన్యము” నిత్యోదయమై ఉంటోంది. అట్టి శుద్ధ చైతన్యము దృశ్యరూపం కాదు. విషయరూపం కాదు. చేతనావృత్తి రూపం కాదు. చేతితము కాదు. అట్టి చైతన్యముతోటి ఏకత్వము పొందిన మహనీయులు సంసార వ్యవహారరహితులై ఉంటారు. వారి పట్ల సంసారము ఏదో ఉబుసుపోకకు చదివే కథలోని సంఘటనల వలె ఉంటోందిగాని సుఖ-దుఃఖ కారకము కాజాలదు.
“అతి నిర్మలము” అగు చిదాకాశమున “చైతన్యము” అను గాజు (కళ్ళజోడు) యొక్క నిరంతర స్ఫురణయే ఈ జగత్తు. కాబట్టి అంతా చైతన్యమే అయి ఉండగా, ఇక బంధ మోక్షములు ఎచట? ఈ జగత్తు చిదాకాశము యొక్క స్ఫురణమాత్రము, సంకల్ప రూపము అయి ఉన్నది. కాబట్టి ఇదంతా సత్చిన్మయమే గాని మట్టి-గాలి కాదు. ఇక్కడ వాస్తవానికి దేశము- కాలము - పదార్థము-క్రియ-ఆకాశము మొదలైనవి ఆత్యంతిక దృష్టిచే లేవు. ఈ జగత్తు ప్రతిభాసమాత్రంగా అన్యోన్యత్వం చేత వృద్ధి చెందనీ, చెందకపోనీ… అట్టి స్వకీయ కల్పన దృష్ట్యా (కల్పన చేత ఏర్పడి ఉంటోంది కాబట్టి) ఇది లేనిదే, అసత్తే! అధిష్ఠాన రూపం చేతనో… ఇదంతా ఆత్మయే. కనుక సత్తే.
ఈ ప్రకారంగా ఈ ’జగత్తు’ రూపంగా కేవల ఘనమగు ఆత్మయే ప్రకాశిస్తోంది. అట్టి ఆత్మ ఆకాశము కంటే కూడా అతి నిర్మలము అయి ఉన్నది. అది శూన్యం కాదు, అశూన్యం కాదు. అది “సాకారం”గా ఉన్నట్లు తోచినప్పటికీ వాస్తవానికి నిరాకారంగానే ఉన్నది. అసత్తువలె కన్పట్టినప్పటికీ మిక్కిలి ప్రకాశవంతమై ఉన్నది. అతి శుద్ధం. స్వప్న నగరం వలె అంతులేని విస్తీర్ణం కలిగి ఉన్నది.
ఈ ప్రకారంగా చిదాకాశము యొక్క కలుషిత జగద్రూపం, వాస్తవానికి, శుద్ధవ్యాపక నిర్వాణ రూపమే అయి ఉన్నది. అట్టి నిర్వాణ రూపముచే వ్యాపించబడనిదేదీ లేదు. ఆకాశంలో శూన్యత్వంవలె, జలమునందు ద్రవత్వంలాగా ఈ జగత్తు పరమాత్మ రూపమే! అంతేగాని ఇది నానావిధ రూపములుగా కూడి ఉన్నది కాదు.
శ్రీరాముడు : నిర్లిప్తము, నిర్విషయము అగు అత్మ నుండి విషయరూపమగు మనస్సు ఉద్భవించటం చమత్కారమే కాదా!
శ్రీవసిష్ఠ మహర్షి : ఎవడైతే ‘సూర్య కిరణములు సూర్యుని కంటే వేరే’… అని అనుకుంటాడో, వానికి ఆ సూర్య కిరణములు అన్యమైనట్లే భాసిస్తాయి. ’బంగారము కంటే అభరణములు వేరైనవి’… అనుకునే వాని అనుభవం అట్లే (వేరైనట్లుగానే) ఉంటుంది గాని, అది ‘బంగారం కదా’ అని అతను అనుకోవటం లేదు. కానీ, ‘సూర్యబింబము నుంచే బయలుదేరిన కిరణములు సూర్యునికి వేరైనవి ఎట్లా అవుతాయి? బంగారము కంటే ఆభరణం వేరైనదని అనటం ఎట్లా?’… అని భావించావనుకో? అప్పుడు మొదటి వానికంటే వ్యతిరిక్తమైన అనుభవమే ఉంటుంది.
తరంగములు చూచేవానికి తరంగబుద్ధియే ఉంటుందిగాని, జలబుద్ధి ఉండదు. “తరంగములు జలము కుంటే వేరు కాదు” అని తలచేవాడికో? ఇతనికి జలబుద్ధియే ఉంటుంది గాని, తరంగ బుద్ధి ఉండదు. “బంగారము యొక్క ఆకారములైన ఆభరణములందు కూడా ఉన్నది బంగారమే”… గ్రహించేవాడు మహాబుద్ధిమంతుడై ఉంటాడు. అట్టివాడు “నిర్వికల్పుడు” అని చెప్పబడతాడు. “త్రిగుణాత్మకమై కనిపించే ఈ దృశ్యాంతర్గత జీవులంతా త్రిగుణాతీతమగు పరమాత్మ యొక్క సంప్రదర్శనా విన్యాసమే” - అని గమనించడాన్నే ‘నిర్వికల్పము’ అను శబ్దముచే ఉద్దేశించబడుతోంది.
పుట: 522
CONQUER YOURSELF రామకృష్ణ మఠం ISBN 93–83972–14–2 (Set)
దోమలగూడ, హైదరాబాదు–29
Casseరామకృష్ణ email : publication@rkmath.org
మఠం 9789383972142
Vasishta Rama Samvadam : Vol 3 ISBN 93–83972–12–8 1000/- (set) www.rkmath.org