Page:479
X. విద్య - అవిద్యోపాఖ్యానం
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! జీవుల ఉపభోగము కొరకై ఉద్దేశించబడే తినుబండారాలు ఆ జీవులచే భక్షించబడి (తమ రూపము కోల్పోయి) జీవుల రూపంగానే పరిణమిస్తున్నాయి కదా! అట్లాగే ఈ దృశ్యజగత్తంతా బాహ్యమందలి రూప ప్రకాశంతోను, అభ్యంతరమున సంకల్పాదుల తోను కూడి ఉండి, యథాస్థితమై ఉన్న ఈ దృశ్య జగత్తంతా కూడా చిదాకాశం యొక్క ఉపభోగం కొరకే అయివున్నది, అందుచేత ఇదంతా కేవలం చిదాకాశముగానే శేషించుచున్నది. ఒకనికి స్వప్నంలో నగరాలు కనిపిస్తున్నాయి. అవన్నీ సాక్షియగు స్వప్న ద్రష్ట యొక్క ఉపభోగము కొరకే కదా! కనుక, అవి స్వప్న సాక్షిచైతన్య చిద్రూపము కంటే వేరైనవి కావు. అట్లాగే ఈ జాగ్రత్ కూడా శాంతమగు చిదాకాశమే అయివున్నది.
"జగత్ తస్మాత్ నభః శాంతమ్! నే హ నానా స్తి కించన!”
అట్టి పరమశాంతరూపమగు (చిదాకాశరూపమగు) ఈ జగత్తునందు నానాత్వము కించిత్తు కూడా లేనేలేదు. చైతన్యము సర్వదా ఏకరూపమే అయివున్నది. కానీ నానారూపాలుగా స్పురిస్తోంది. అట్లా నానా రూపములుగా ఏదైతే కన్పట్టుచున్నదో అట్టి నానాత్వము వాస్తవిక చిత్స్వరూపం కాదు సుమా! అది అనాత్మయే అయివున్నది. జలములో తరంగములు - బుద్బుదములు - ఆవర్తములు మొదలైనవి కనబడుచున్నప్పటికీ అవన్నీ జలం యొక్క రూపాలని, జలానికి రూప - ఆకారాదులు కలవని ఎవరమూ అనం కదా! అట్లాగే చైతన్యం తన నామరూపరహిత చిత్స్వరూపాన్ని త్యజించకయే ఈ ఈ నామరూపాదులతోటి ప్రదర్శితమగుచున్నది. ఎట్లా అంటావా? స్వప్న - సంకల్ప గంధర్వ నగరాదుల సందర్భంలో వాటికి సాక్షియగు నిజాత్మ తన చిత్స్వరూపమునందే అసత్యములగు ఆయా నానారూపాల తోటి దర్శింపజేస్తూ, ఇంతలోనే, మరొక సమయంలో ఆ స్వప్నాది విశేషాలన్నీ ఉపసంహరించి అద్వైతరూపముగా వెలయుచున్నది కదా! జాగ్రత్ ద్రష్టయగు చిదాత్మకూడా తన యందు తాను దర్శించే జాగ్రత్ దర్శన వ్యవహారం ఒకప్పుడు ఉపసంహరించుకుని అద్వైత రూపము చెందుతోంది. అయితే… జాగ్రత్ యథాతథంగా ఉండగాకూడా, అద్దాని ద్రష్టయగు చిత్ చైతన్యము అద్వైత రూపంగానే ఉంటోందిగాని ద్వైతముగా అగుటలేదని గ్రహించు. ద్వైతంగా కనిపిస్తూ కూడా ఇదంతా అద్వైతంగా అనిపించటమే ‘అద్వైతానుభవం’.
ఓ రామచంద్రా! ఈ జగత్తు ప్రళయకాలంలో లేదు. ఇప్పుడు కూడా లేదు. ఇదంతా స్వప్నాకాశంలో మహానగరంలాగా మొదలే వాస్తవానికి లేకపోయినప్పటికీ, అభ్యాస మాత్రంచే
Page:480
ప్రాప్తిస్తున్నది. అయినప్పటికీ సత్యమైనదానివలె వెలయుచున్నది. ఈ సభలో మన ఈ సంవాదమును ఆలకిస్తూ ఇందలి ఆయా సర్వవిషయములను ఎప్పుడో సుస్పష్టంగా అనుభూతం చేసుకొనియున్న మహనీయులెందరో ఉన్నారు. అట్టి మహనీయులగు జ్ఞానులకు సత్య - అసత్య మయమగు ఈ సృష్టి యొక్క శబ్దార్థము తెలుసు. అజ్ఞానులకు అది తెలియదు. ఏది అజ్ఞానులకు ఘనీభూత సత్యముగా అగుపిస్తోందో… అది జ్ఞానులకు అట్లా అనిపించటం లేదు. శ్రీరాముడు : స్వామీ! ఎందుచేత?
శ్రీ వసిష్ఠ మహర్షి :
తజ్ఞా జ్ఞయోః తయోరన్తః ప్రతిపత్తా తు యత్ స్థితమ్ | న బోద్ధుం న చ వక్తుం తే జానీ తన్తి పరస్పరమ్ ॥
ఎందుచేతనంటే… జ్ఞానులు కేవలం అంతర్దృష్టి కలవారై ఉంటున్నారు. అనగా, వారు తమ యొక్క తదితర సహజీవుల యొక్క - కేవల సాక్షీరూపమును ఆస్వాదిస్తూ చెక్కుచెదరని ఆనందమును అనుభూతపరచుకొని ఉంటున్నారు.
అజ్ఞానులు కేవలం బాహ్యదృష్టి నాశ్రయించి ఉంటున్నారు. అనగా, దేహ-మనో-బుద్ధిచిత్త అహంకార పరిమితమైన దృష్టికి పరిమితులగుచున్నారు.
ఇక ఈ జగత్తో … ఆ రెండింటి మధ్యగల బుద్ధి వృత్తియందు స్ఫురించటం జరుగుతోంది. అందుచేత ఆ జ్ఞాన-అజ్ఞాను లిరువురు ఒకరి దృష్టిని మరొకరు ఎరుగటానికి గాని, ఒకరితో మరొకరు చెప్పుకోవటానికిగాని సమర్థులు కాలేకపోతున్నారు.
ఈ జగత్తుయొక్క శబ్ద-అర్థములు ఆ ఇద్దరి యొక్క వారి వారి బుద్ధియందు స్థితి నొందియున్నది. అందులో ఒకరు (జ్ఞానులు) భ్రాంతిరహితులు. రెండవారేమో (అజ్ఞానులు) భ్రాంతిసహితులు. జ్ఞాని యొక్క బుద్ధి సదా స్థిరమై…. ఆత్మ విషయంలో సదా మేల్కొనినదై ఉంటోంది. కాబట్టి అంతటా ఆత్మతత్త్వమును వీక్షిస్తోంది. "ఇన్నీగా పరమాత్మయే ప్రదర్శితమగుచున్నారు. నా మనో బుద్ధి - చిత్తాది రూపంగాను, ‘నేను’ గాను వారే వెలయుచున్నారు” అని గమనించి బుద్ధి సుస్థిరత కలిగి ఉంటున్నారు. అజ్ఞాని యొక్క బుద్ధి సర్వదా అస్థిరమై ఉంటోంది. అందుచేత అది అస్థిరమగు ఈ జగత్తు యొక్క బాహ్యరూపమునే గాంచుచున్నది.
ఇక ఈ రెండింటి మధ్యయందలి బుద్ధియందున్న ప్రపంచం యొక్క స్వరూపం కేవలం అభ్యంతరగానూ లేదు, కేవలం బాహ్యంగానూ లేదు. కాబట్టి ఆ జ్ఞాని-అజ్ఞానులకు జగత్తు గురించి ఏమీ తెలియటం లేదు. (జ్ఞాని జగతా రాహిత్యం చూస్తుంటే, అజ్ఞాని అనుక్షణం చంచల బుద్ధి కలిగి ఉంటున్నాడు. అందుకే ఇద్దరూ జగత్తు ఎరుగుటలేదని చమత్కారంగా వ్యాఖ్యానించబడుతోంది.)
❖
ఓ రామచంద్రా! జలంలో ద్రవత్వ కారణంగా ఆకారాదులతో కూడిన తరంగాలు స్థితి పొందుచున్నాయి కదా! అట్లాగే చైతన్యం (స్వతహాగా సృష్టి మొదలైనవి తనయొక్క స్వరూపం
Page:481
కానప్పటికీ) సృష్టిరూప తరంగాదులుగా స్థితినొంది ఉంటోంది. ఎట్లాగంటే స్వప్నచిత్ (లేక స్వప్నప్రజ్ఞ) తనయందు జీవులు-గృహములు మొదలైన ఆయా వస్తుజాలం కలిగి ఉండకపోయినప్పటికీ… స్వప్నంలో అవన్నీ దర్శిస్తోంది కదా! స్వప్నం అద్దాని రూపమే కదా! అట్లాగే జాగ్రత్ కూడా ద్రష్ట యొక్క [జాగ్రత్ చిత్ (లేక) జాగ్రత్ ప్రజ్ఞ యొక్క ] స్వయం ప్రకటనా చమత్కారమే అయివున్నది. అద్దంలో అద్దమునకు మార్పు చేర్పులు కలిగించకుండానే దృశ్యం - - ఆ దృశ్యంలో వస్తు కదలికలు ప్రతిబింబిస్తూ ఉంటాయి కదా! అట్లాగే నిర్వికారము, నిరాకారము అగు బ్రహ్మం తన యొక్క మాయావిభాగంలో ఈ నిరాకార జగదాకారమును స్ఫురింపజేసుకుంటోంది. పిశాచమునకు సంబంధించిన సంభ్రమమంతా బాలుని స్వీయమనోవిరచితమైన భ్రమయే కదా! దేహికి దేహము పట్ల “ఈ దేహమే నేను” అను రూపముగల దేహాత్మ భావన భ్రమయే! భ్రాంతి మాత్రమే! అట్టి దేహాత్మ భ్రాంతియే సమస్త క్లేశములకు మూలమైయున్నది. ఇది మనో రాజ్యమువలె అసత్యమైనది. చంచల జలబిందువువలె క్షణికమైనది. అట్టి దేహము పట్ల “ఈ దేహమే నేను - నాది”… అనే అభిమానం ఎందుకు?
ఓ రామచంద్రా! ఈ జాగ్రత్ స్వప్నములు ఆత్మనుండే బయల్వెడలుచున్నట్లు అనిపించ వచ్చుగాక! అయినప్పటికీ ఆత్మయందు అవేవీ లేనేలేవు.
చీల్చబడుచున్న వెదుళ్ళనుండి “ఝస్ - ఝస్" శబ్దం వస్తుంది. జలములోని తరంగముల నుండి “గుల్-గుల్” శబ్దం వినబడుతుంది. అగ్ని యొక్క జ్వాలలనుండి “ఛట్ ఛట్” శబ్దం బయల్వెడలు తోంది. వాయువు యొక్క తరంగాల నుండి ‘హోర్’ శబ్దం చెవులకు తాకుతుంది. కంఠం నుండి అనేక శబ్దపరంపరలు ఉచ్చరించబడుచున్నాయి.
అయితే… వాస్తవానికి వెదుళ్ళ పొట్టలోగాని, జలతరంగాలలో గాని, అగ్నిజ్వాలలలో గాని, వాయు తరంగాలలోగాని, కంఠం యొక్క లోలోపలగాని శబ్దాలు ఉన్నాయా? లేవు. అట్లాగే ఆత్మ యందు జాగ్రత్ - స్వప్న వికారాలు లేకపోయినప్పటికీ బయల్వెడలుచున్నాయి. శ్రీరాముడు : సృష్ట్యాదిలో జాగ్రత్ - స్వప్న జగత్తులుగా బయల్వెడలుచున్నదేది?
శ్రీ వసిష్ఠ మహర్షి : స్వప్న ద్రష్టయే స్వప్నాంతర్గత వ్యవహారరూపంగా సాధిక్యం పొందుచున్నాడు కదా! అట్లాగే స్వాత్మ చైతన్యమే సృష్ట్యాది నుండి ఈ జగద్రూపంగా స్ఫురిస్తోంది. అయితే స్వాత్మ చైతన్యమునకు వేరుగా చూస్తే జగత్తు యొక్క శబ్దముగాని, అర్థముగాని, దృశ్యముగాని లేవు. "ఈ జగత్తును అసాధారణ సరళిగా పొందుచున్న ఓ సహజీవుడా! నీ యొక్క సాధిక్యతయే నీవు పొందే జగత్తు! కనుక నీ జగత్తు నీ స్వరూపమే అయివుండగా, నీవు జగద్రహితమగు కేవల సాక్షివి”… అని మహనీయులు సర్వ సంసారజీవులకు గుర్తు చేస్తున్నారు. కనుక ఈ ఉన్నట్లుగా కనిపించే సర్వ దృశ్యము కూడా ‘పరమార్ధసత్త’ యగు చైతన్యమే అయివున్నది. ‘సత్త’ కంటే వేరుగా సృష్ట్యాది యందుగాని, ఇప్పుడుగాని ఏదీ భాసించుటయే లేదు.
ఓ రామచంద్రా! “నేను శుద్ధ చిదాకాశ స్వరూపుడను. అట్టి నా స్వరూపమగు శుద్ధ చిదాకాశము సమస్త పదార్థభేదరహితమై ఉన్నది. అదియే అధిష్టాన దృష్టిచే చూస్తే సమస్త పదార్థసహితమై
Page:482
ఉన్నది కూడా! అట్టి నేను సర్వవిధముల శాంతుడను. సుఖ స్వరూపుడను“ - అని గ్రహించి ఉండు. ఈ జీవుడు తనయందే అసద్రూపంగా ఆవిర్భవించినట్టి తమస్సును, విక్షేపమును “శుద్ధబోధైక స్వరూపమగు ఆత్మ” యందలి విశ్రాంతిచే త్యజించివేయాలి. ఎందుకంటే ప్రతిజీవుడు అనునిత్యంగా పరమశాంతమగు శుద్ధాత్మయే అయివున్నాడు కదా!
ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపుః ఆత్మనః ఆత్మాత్మనా నచేత్ త్రాతః తదుపాయోస్తి నే తరః
ఆత్మజ్ఞానము కొరకు నిరంతరమైన, దృఢమైన ప్రయత్నం చేస్తూ ఉంటే… ఈ జీవుడు తనకు తానే బంధువు అవుతాడు. అట్లా ప్రయత్నంలో ఉండకపోతే తనకు తానే శత్రువు. తనను తాను ఆత్మజ్ఞానముచే రక్షించుకొనే ఉపాయం ఆశ్రయించక అనుక్షణం మార్పు - చేర్పులతో కూడుకొని ఉండే ఈ దృశ్యమును సమాశ్రయించి ఉండాలనుకొంటే… ఇక ఆతనిని స్వకల్పిత మనోవేదనల నుండి రక్షించటానికి (ఆత్మజ్ఞానం కాకుండా) మరింకే ఉపాయమూ కనబడటం లేదు.
అందుచేత ఓ సర్వసభికులారా! బాల్యం అజ్ఞానంలోను, అసమర్థత గాను; వార్ధక్యం నిస్సహాయత గాను గడచిపోతున్నాయి. ఇక ఈ మన రామచంద్రునిలాగా యౌవన దశ ప్రారంభమగుచుండగానే “శుద్ధబుద్ధి” అనే నౌక ద్వారా “సంసారం” అనే సముద్రాన్ని దాటివేయాలి. ఇప్పటికిప్పుడే “ఆత్మజ్ఞానం” అనే శ్రేయమును సంపాదించుకోవాలి.
అద్యైవ కురు యత్శ్రేయో! వృద్ధః సన్కిం కరిష్యసి?
స్వగాత్రాణ్యపి భారాయ భవంతి హి విపర్యయే!
ఇప్పుడు తాత్సారం ఏమాత్రం పనికిరాదు “ఆ! తరువాత ముసలివాళ్ళం అయిన తరువాత చూసుకుందాములే!”… అని ఇప్పుడు యౌవన దశలో ఏదో రోజులు గడిపివేస్తూ ఉంటే, ఇక ముదుసలి అయిన తరువాత చేసేదేమిటి? అప్పుడు ఈ కాళ్ళు - చేతులు - తదితర ఇంద్రియాలు దేహానికీ భారభూతమౌతూ ఉంటే, ఆత్మజ్ఞానానికి ఎవడైనా ఎట్లా ప్రయత్నించగలడు? బాల్య - వార్ధక్యములు జ్ఞాన సాధకములు కావు. అందుచేత ఆ రెండు దశలు పశు - పక్షిత్వ సదృశాలని, మరణతుల్యములని విజ్ఞులు గుర్తు చేస్తున్నారు. యౌవనం ఒక్కటే సరి అయిన సమయం. యౌవనంలో కూడా వివేక సముపార్జనకు సంసిద్ధం కాకపోతే ఆ బ్రతుకు కుక్కబ్రతుకే కదా! అయితే ఈ యౌవనం శాశ్వతమా? కాదు. అందుకని దొరికిన కొద్ది సమయం అత్యుత్సాహంతో శ్రద్ధగా సద్వినియోగం చేసుకోవాలి సుమా! ఈ జీవితము మెరుపు యొక్క పతనమువలె అతి చంచలమైనది. ఇక సంసారము ఒక అతిదీర్ఘరోగము వంటిది. ఇట్టి సంసారం అనే మానసిక వ్యాధి కలిగి ఉన్నామని తెలుసుకొని కూడా ఈ జీవుడు “సచ్ఛాస్త్రము, సాధు సాంగత్యం” అనే ఔషధం సేవించకపోతే ఇక అజ్ఞానమనే పంకము (బురద) తొలగేది ఎట్లా? ‘అజ్ఞానం’ అనే బురదలో ఆత్మ మునిగి ఉండగా అద్దానిని ”శాస్త్రప్రవచనం - సాధనలు“ అనే ఉపాయములతో తమను తాము ఉద్దరించుకునే ప్రయత్నం చేయనివారు తమ పట్ల తామే ఎంతటి మహాక్రూరులు! ఎంతటి అధములు! వారి ఉత్తరోత్తర గతులను తలచుకుంటేనే మాకు “అయ్యో!” అనిపిస్తోందే!
Page:483
మట్టితో తయారు చేసిన ఖీళితాళ సభను చూచి “ఇదంతా మట్టియే” అని తెలుసుకోకపోవటం చేత ఒక గ్రామవాసి ఎంతో దుఃఖం, భయం పొందుతాడు చూచావా? ఆత్మజ్ఞానం సముపార్జించుకోని జీవుడు బ్రహ్మమయమే అయిన ఈ దృశ్యమును “బ్రహ్మమే” అని గ్రహించక బహుదుఃఖితుడు అగుచున్నాడు. యథార్థజ్ఞానం కలిగినప్పుడు “ఇదంతా ఆనందమయమగు బ్రహ్మమే” అని గ్రహించి పరమానంద స్వరూపుడు కాగలడు. తత్త్వజ్ఞాన బలం చేత ఈ దృశ్యం అశాంతమయినప్పటికీ తత్త్వ జ్ఞాని యొక్క బుద్ధి సశాంతిని పొంది ఉంటోంది. అంతాకూడా ఆత్మయందు లయమై (ఆత్మరూపంగా అనుభూతమై) దృశ్యము అదృశ్యమైపోతోంది. స్వప్నాంతర్గతమైన అనేక పదార్థములు, గృహాదులు, శత్రుమిత్రులు, సంఘటనా పరంపరలు … ఇవన్నీ కూడా “ఇది స్వప్నమే” అని తెలిసిన తరువాత అ మొదలంటా అసత్యములే అయి ఏ మాత్రమూ వేదనను కలిగించకుండా ఉంటాయి కదా! అట్లాగే ఈ సృష్టి కూడా కళ్ళకు సుస్పష్టంగా అనుభూతమగుచున్నప్పటికీ, మనస్సుకు సత్యముగా తోచుచున్నప్పటికీ తత్త్వజ్ఞానముచే చిన్మయాకాశమున శూన్యరూపంగా శేషించుచున్నది.
ఓ ప్రియజనులారా! ఈ ‘జీవితము’ అనే అరణ్యం జన్మ-జరా-కామ క్రోధ-లోభ-మోహాది దావాగ్నులచే ప్రదీప్తం అవుతుంటే అజ్ఞానులు ఇందులో చిక్కుకున్న లేడిసమూహంలాగా కాసేపు ఇష్ట వస్తువుల ప్రాప్తిచేతను, మరికొంతసేపు అయిష్ట వస్తువుల సంయోగము చేతనూ అటు ఇల్లు పరుగిడుతూ రోజులు గడుపుచున్నారే? ఈ ఇంద్రియములేమో మదించిన మనస్సుచే అదలించబడుచూ ప్రాణవాయువుల ద్వారా బాహ్య వస్తువులవైపు పరుగులిడుచున్నాయే! ఇక తాత్సారం ఉచితమేనా? ఒకవైపు ఇట్లా తగలబడుతూ ఉంటే "ఈ గదిలో వెచ్చగా ఉన్నది కదా” అని దుప్పటి కప్పుకుని పడుకుందా మనుకోవటం క్షేమమా? కాదు కదా! మీరు ఈ ఇంద్రియాలను జయించి జ్ఞానం ద్వారా అవిద్యను జయించ వలసిన సమయమిది. ముక్తులై జనన మరణ చక్రమును నిరోధించ వలసిన సందర్భం ఈ జీవితమే! ఈ మహత్తరమైన ’జీవితము’ను అనేక అనవసరమైన వ్యవహారాలతోను, దిగుళ్ళతోను నేలపాలు చేసుకోకండి. కనుక ఆత్మజ్ఞానం కొరకై నడుము బిగించండి.
శ్రీరాముడు : స్వామీ! సద్గురూ! వసిష్ఠ మహర్షీ!
వినా ఇంద్రియజయేనేదం నా జ్ఞత్వమ్ ఉపశామ్యతి ।
తదింద్రియాని జీయన్తో కథం కథయే మే మునే II
ఈ ఇంద్రియాలను జయించకపోతే అజ్ఞానం శమించదు కదా! మరి ఇంద్రియాలను జయించటం ఎట్లాగో ఈ సందర్భంలో మాకు బోధించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : అవును ఇప్పుడు నీ ప్రశ్న అత్యంత సమయోచితమైనదే! ఎందుకంటే దీపం వెలుగుచున్నప్పటికీ చూపు సన్నగిల్లినవానికి గదిలోని చిన్న చిన్న వస్తువులు (సూక్ష్మ వస్తువులు)
Page:484
కనిపించవు కదా! అట్లాగే… అనేక విషయములందు ఆసక్తుడైనవాడు, ఈ ప్రపంచంలో తన యొక్క ఏదో గొప్పతనమును సంపాదించుకోవాలనే ‘వేడుక’ కలవాడు, ధనార్జనయందు “అత్యాసక్తి” కలవాడు, ఇంద్రియములను జయించే ప్రయత్నం లేనివాడు… అగు మనుజుడు శాస్త్రములు వింటున్నప్పటికీ, శాస్త్ర ప్రవచితమైన ఆయా సాధనలకు అప్పుడప్పుడూ ఉపక్రమిస్తున్నప్పటికీ కూడా అవన్నీ బ్రహ్మదర్శనమునకు ఉపయుక్తమవటం లేదు. కాబట్టి ఇంద్రియ జయమునకు యుక్తి అత్యావశ్యకం. ఇంద్రియములు జయించబడ్డాయా… ఇక ఆపై స్వల్ప ప్రయత్నం చేతనే సులభంగా మోక్ష ఫలసిద్ధి కలుగగలదు. అందుచేత ఇంద్రియ జయమునకై కొన్ని యుక్తులను ఇక్కడ ప్రతిపాదిస్తు న్నాను. సభికులంతా శ్రద్ధగా వినెదరుగాక!
ఓ రామచంద్రా! ఈ జీవుడు స్వతహాగా చిన్మాత్ర స్వరూపుడే! అయితే చిత్తమునకు ప్రాప్తించే విషయాలకు ఆతని చిత్తము (ఆయా విషయములకు) అధీనం అగుచుండబట్టి ఈతనిని ‘చిత్స్వరూపుడు’ అని అనకుండా,…. ‘జీవుడు’ అని పిలుస్తున్నాం. ఈతడు తనయందు చిత్తవృత్తిచే వ్యాపించినవాడై ఆయా జగద్విషయములను అనునిత్యంగా సంకల్పిస్తున్నాడు. అతడు దేనిని ఈ చిత్తముతో తనయందు సంకల్పిస్తున్నాడో, అద్దానియందు (తన చిన్మాత్ర స్వరూపమును ఏమరచి) తన్మయుడగుచున్నాడు. వాటి వాటి యందు ఆసక్తి కలిగినవాడై ఉంటున్నాడు.
ఇప్పుడు ఈ చిత్తమునందు ఏర్పడి ఉన్న బాహ్యాకారత్వమును తొలగించి ఈ చిత్తమును బ్రహ్మాకారముగా మలచాలి. ఎట్లా? చిత్తమును ప్రత్యాహారము అనే ప్రయత్నం చేత అభ్యంతరమునకు ఆకర్షించాలి. "బ్రహ్మాకారత్వ ప్రబోధము” అనే అభ్యాస రూపమై సుతీక్షణమైన అంకుశము యొక్క పోట్ల చేత ‘చిత్తము’ అనే మదపుటేనుగును వశం చేసుకోవాలి. చిత్తమును నిరోధిస్తేగాని ఇంద్రియములు జయించబడవు.
‘ఇంద్రియములు’ అనే సేనకు సేనానాయకుడు చిత్తమే. పాదరక్షలు ధరించి బాటలో నడిచే వారికి నడిచే చోటంతా చర్మముచే కప్పబడినట్లే అవుతుంది కదా! ఈ ‘చిత్తము’ అనబడు ఒక్కదానిని జయించితే చాలు… సర్వ ఇంద్రియములపై అతి సులభంగా విజయం వరిస్తుంది.
ఎవడైతే తన జీవ సంవిత్తును (లేక చిత్తవృత్తిని) బ్రహ్మముతోటి ఏకంచేసి ఆత్మయందు స్థితి కలిగి ఉంటాడో… ఆతని మనస్సు పరమశాంతము పొందుతోంది?
చిత్తవృత్తిని బ్రహ్మముతోటి ఏకం చేయడం అంటే… “చిత్తముచే ఏఏ వృత్తి ద్వారా ఏఏ అనుభవము సిద్ధిస్తుందో… అట్టి వ్యవహారములు వ్యక్తులు - సందర్భములు - వస్తువులు సంఘటనలు అన్నీకూడా ఆ పరమాత్మయే ఆయా రూపములుగా ఉన్నారు” అనే భావన సర్వదా సర్వవేళలా అభ్యాసం చేస్తూ ఉండటమే సుమా! ఆ పరమాత్మయే సర్వరూపములుగా ఉన్నారు, …ఒకే జలం తరంగములుగా, బుద్బుదములుగా, ఆవర్తనలుగా, సుడి రూపములుగా ఉండి ఉన్నట్లు”… అను ప్రత్యాహార రూప చిత్తవృత్తియే అద్దానియొక్క బ్రహ్మము తోటి ఏకత్వము క్రమంగా అప్పుడు "ఈ
Page:485
సర్వము నాతో సహా ఆతనిదే! ఆతడే! ఆతని వ్యక్తీకరణ చమత్కారమే”… అని అంతిమ సాక్షాత్కారం క్రమంగా స్వయంగా ‘ఆ బ్రహ్మాకార చిత్తవృత్తి యొక్క ప్రాభవం’ చేత పరిఢవిల్లగలదు. “అంతటా బ్రహ్మమే” …అనే దృష్టిని పెంపొందించుకున్నవాడు బ్రహ్మమునే దర్శిస్తూ బ్రహ్మమే అగుచున్నాడు. (బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి!) “తన జీవసంవిత్తును, తన చిత్తవృత్తిని బ్రహ్మమునందు ఐక్యపరచటం” …అనగా “నావి” అని అనిపించే దృశ్య - - దేహ - మనో - బుద్ధులను… “పరమాత్మవే”… అని అనుకోవటం. అట్టి ప్రయత్నం చేత ఈ చిత్తవృత్తి ఏ ప్రకారంగా శమిస్తుందో… ఆ ప్రకారంగా (అంతంతగా) తీర్థములు సేవించటం చేతగాని, అనేక శాస్త్రములు పఠించటం చేతగాని, ఆయా యోగ శక్తులను సముపార్జించటం చేతగాని, గొప్ప తపస్సులు చేయటం వలనగాని, యజ్ఞ యాగాది క్రియా సమూహములచేతగాని శమించదు సుమా!
ఓ రాఘవా! ఏయే విషయాల యొక్క స్మరణం చిత్తవృత్తిలో బలాత్కారంగా సంభవిస్తోందో… ఆయా విషయములను అధిష్ఠాన బ్రహ్మ సంవిత్తునందు లయం చేయాలి. అనగా “ఈ ఈ రూప -నామ-గుణాలు గల ఈ జీవుడు పరబ్రహ్మమే సర్వదా స్వస్వరూపంగా కలిగి ఉన్నాడు” … అను అంతరములోని నిశ్చయమే ఆ దృశ్య విషయమును అధిష్ఠాన బ్రహ్మ సంవిత్తునందు లయంచేయటం అగుచున్నదని నీవు గ్రహించు. అప్పుడు క్రమంగా ఆయా విషయ సంస్కారములు నశించి, ప్రాపంచిక సంబంధమైన విషయములు గురించిన “స్మృతి” కలుగుచున్నది. అట్టి ప్రయత్న రూపమైన ఉపాయముచే భోగహేతువులగు విషయముల యొక్క విజయము క్రమక్రమంగా సముపార్జించబడగలదు.
ఓ ప్రియ సభికులారా! అభ్యాసముచే సర్వము సుసాధ్యమే! “ప్రియ పరమాత్మయే ఇన్నిన్ని రూపాలుగా అగుచున్నారు. నా బుద్ధికి కనిపించేదంతా వాస్తవానికి పరమాత్మ ప్రదర్శనమే!”. అను “నిజాభ్యాసం” అనే యత్నం చేత చిత్తవృత్తి ”ప్రాపంచిక విషయాలు” అనే దుర్వ్యసనం నుండి కొంచెం - కొంచెం నిరోధించబడినా కూడా, ఇక అట్టి అభ్యాసమును కొనసాగిస్తూ ఉండగా తత్త్వవేత్తల అనుభవసిద్ధమైయున్న “స్వారాజ్యం” పొందబడినదే అగుచున్నది.
శ్రీరాముడు : మహాత్మా! వర్ణాశ్రమాది అనేక ధర్మములు మేము ప్రవాహ ఫలితంగా ఆజన్మాంతరం నిర్వర్తించవలసి వస్తుంది కదా! ఇక ఈ ఇంద్రియాలను జయించగలిగే, అధిగమించగలిగే అవకాశం మా కెక్కడిది? జితేంద్రియత్వం మీ వంటి సర్వమును త్యజించిన మహనీయులకు మాత్రమే సాధ్యం. కుటుంబ వ్యవస్థలోను, లౌకిక వ్యవహారములలోను ఉన్నట్టి మాకెట్లా సాధ్యం?
శ్రీ వసిష్ఠ మహర్షి : (చిరునవ్వు నవ్వి) ఓ రామచంద్రా! “స్వధర్మనిరతి” అనేది వాస్తవానికి విజ్ఞులు పరమాత్మను చేరు మార్గంగా అభివర్ణిస్తున్నారు. “స్వకీయ వర్ణాశ్రమ ధర్మం యొక్క నిష్కామ పూర్వకమైన నిర్వహణ పరమాత్మ సాన్నిధ్యం సులభతరం చేస్తుంది” అనునది శాస్త్రప్రబోధయే అయివున్నది కదా! నిష్కామపూర్వకమైన స్వధర్మనిరతి చేతను, విషయాల పట్ల తృష్ణారాహిత్యం చేతనే ఈ ఇంద్రియాలను జయించి ఆత్మ పదమున వెలయుచు ఎందరో మహానుభావులు ఉన్నారు. స్వధర్మ వ్యవహారాలు పరమాత్మను చేరే సోపానాలై ఉండగా, “నిరోధకాలు” అని బద్ధకస్థులు మాత్రమే
Page:486
భావన చేస్తున్నారు. సర్వధర్మ విరుద్ధములైన పదార్థములందు కోర్కెను త్యజిస్తూ, స్వధర్మమును దైవసమానంగా దర్శిస్తూ, శమ - సంతోషములను సముపార్జించుచూ ఎవడుంటాడో… ఆతడు ‘జితేంద్రియుడు’ అని అనటానికి సందేహమే లేదు.
మనోశమనం - ఎవడైతే సహజీవులను చూస్తున్నప్పుడు
అభ్యంతర సంవిత్తు అగు ఆ బాహ్య సంవిత్తు అగు చిత్త దేహాదులపట్ల “ఇవి ఈతని సహజీవుని కేవల వాస్తవ రూపం కాదు కదా! జలము యొక్క తరంగము వలె చిత్స్వరూపము పట్ల ప్రియము భ్రమయుతము-క్షణికము కదా!" అనే ఒకానొక అభిరుచి, | ప్రీతి అప్రీతి, గాంభీర్యముతో కూడిన అతీతత్వము
కలిగి ఉంటాడో… అట్టి అభ్యాస వశంచేత ఈ మనస్సు క్రమంగా అతి త్వరలో జయించబడుతుంది. అట్టివారికి సకల సహజీవుల పట్ల “వీరు ఆత్మ స్వరూపులే“ అను దృష్టి పెంపొందుచూ, క్రమక్రమంగా “మమాత్మ స్వరూపులే”, “మమస్వరూపులే” అనే బుద్ధి నిశ్చలమౌతోంది. అప్పుడిక ”నేనే సర్వాంతర్యామి అగు ఆత్మను” అను నిశ్చలమైన బుద్ధి ఘనీభూతంకాగలదు. అదియే "ఆత్మదృష్టి” సుమా! సంవిత్ ప్రయత్న సంరోధాత్ మనః స్వాయన ముజ్జతి ।
చేతః చపలతోన్ముక్తం, వివేకమనుధావతి ॥
ఓ మిత్రులారా! ‘దేహ - - మనో - బుద్ధి - దృశ్య రూపములగు బాహ్య సంవిత్తు నేను కాదు. అఖండము, అప్రమేయము, నిత్యము, నిర్మలము, యథాతథము, సర్వజగత్ వాస్తవ స్వరూపము అగు అంతః సంవిత్తును నేను”…అనే అభ్యాసమునకు తాత్సారమెందుకో, వెనుకాట ఎందుకో, మొహమాటమెందుకో నాకు చెప్పండి? అట్టి “అంతర్ సంవిత్తేవా హమ్” (ఆ నిశ్చల అంతర్ సంవిత్తునే నేను. అదే ప్రతిఒక్క జీవుడు) అనబడే మనో-బుద్ధుల యొక్క కొంచెం కొంచెం ప్రయత్నంచే ఈ చిత్తవృత్తి నిరోధించబడగలదు. క్రమంగా “మనస్సు దుర్వ్యసనములవైపుగా పరుగిడటం” అనే దురభ్యాసమును ”అంతా పరమాత్మకు చెందినదే! పరమాత్మ స్వరూపమే” … అనే ప్రయత్నంచే జయించబడుతుంది. ఈ మనస్సు ఎప్పుడూ ఎటో ఒకవైపుగా పరుగులు తీయటమే స్వభావంగా కలిగివున్నది. అట్టి మనస్సు యొక్క నిత్య చలనత్వమును సద్వినియోగపరచుకోవాలి. ఎట్లా అంటే… మనస్సు విషయాల వైపుగా పరుగులు తీయకుండా చూచుకోండి. “వారు అట్టివారు, వీరు ఇట్టివారు” … అనే దృష్టిని "పరమాత్మ ఇట్లు ప్రదర్శిస్తున్నారు” …అని మనస్సును కొంచెం సంస్కరించి, సంయోగ - వియోగాతీతంగా నియమిస్తే అప్పుడది తనకు తానే వివేకము వైపుగా పరుగులు తీయసాగుతుంది.
అట్టి వివేకమును సముపార్జించుకొన్న బుద్ధి కలవాడే ‘జితేంద్రియుడు’ అని పిలువబడు చున్నాడు. ఆ విధంగా “అంతరంగ సాక్షి దృష్టి”ని పెంపొందించుకొనే బుద్ధిమంతుడు ఏ పరిస్థితులలో కూడా సంసార సముద్ర వాసనల తరంగములలో కొట్టుకుపోడు.
Page:487
ఓ ప్రియసభికులారా! అతి దీర్ఘకాలం వేచి ఉన్న తరువాత, అనేక ప్రయత్నములు నిర్వర్తించి ఈ ‘మానవజన్మ’ అనే అవకాశము పొందియున్నారని గుర్తు చేస్తున్నాను. అందుచేత ఇది సద్వినియోగ పరచుకోవాలి గాని దుర్వినియోగ పరచుకోకూడదు.
దుర్వినియోగం - వాసనలు అనే తరంగాల వెంటబడి ప్రాపంచిక వ్యక్తిగత సంఘటనా గతమైన అభ్యాసముచే బుద్ధిని మరింత కలుషిత పరచుకోవటం.
సద్వినియోగం - - ఇంద్రియ వ్యవహారములు పరమాత్మ పరంగా దర్శిస్తూ ఆత్మదృష్టి పెంపొందించుకోవటం.
ముందుగా అంతర్ సంవిత్ దృష్టిచే ఇంద్రియాలను, ఇంద్రియ ధ్యాసలను జయిస్తూ అట్టి ప్రయత్నం నిరంతరం కొనసాగిస్తూ ఉండాలి. ఆ ప్రయత్నంలోని ముఖ్యమైన విభాగంగా 1.సాధుజన సంపర్కం, 2. సచ్ఛాస్త్రముల అవలోకనం అనే ఉత్తమ ప్రయత్నములలో నిమగ్నమగుచూ రావాలి. అప్పుడు ఇంద్రియ విషయధ్యాసలు వాటికవే సన్నగిల్లుతూ వస్తాయి. సాధుజనులతో సంభాషించటం - సచ్ఛాస్త్రములు ప్రసాదించే పాఠ్యాంశాలను హృదయగతం చేసుకోవటం అనే ఉభయ ప్రయత్నముల ద్వారా ఇక ఈ జగత్తును యథార్థ రూపముతోటి “సత్య బ్రహ్మ మాత్రము”గా జితేంద్రియుడు వీక్షిస్తున్నాడు. ఎట్లా అంటే, “అది మృగతృష్ణ. అందులో వాస్తవంగా జలం ఉండదు” … అని తెలిసిన తరువాత కూడా ”అక్కడకు నడచి వెళ్ళి, ఆ కనబడే జలం తాగి దాహం తీర్చుకుంటాను” …అని ఎవరైనా శ్రమకు ఉపక్రమిస్తారా? లేదు. అట్లాగే సత్యవస్తువగు ఆత్మయొక్క అవలోకనముచే …ఈ జగత్తంతా మమాత్మయే… అని గ్రహించిన తరువాత సంసార భ్రమ స్వయముగా తొలగిపోతుంది. “ఇది పొందాను (రాగం). కాని అది ఇంకా పొందలేదు (కామం). నేను అల్పుడను” ఇట్టి అల్ప ప్రలాపములు వాటంతట అవే సమసిపోతాయి.
ఈ జగత్తు విషయశూన్యము - దృశ్య రహితము అగు కేవల చిన్మాత్రమే అయి వెలయుచున్నది - అని గ్రహించి సత్యబోధ సంపాదించుకున్నవానికి ఇక బంధమెచ్చట? మోక్షమెచ్చట? తటాక జలంలో జలం అనేక చిత్రవిచిత్ర తరంగాదులు ప్రదర్శించవచ్చుగాక! ఈ నీరు ఎండిపోయినప్పుడు ఆ తరంగ సమూహాలు ఇక ఉండవు కదా! అట్లాగే ఆత్మదృష్టి రూప అభ్యాసము యొక్క వేడిమిచే ఇంద్రియ విషయరూపమగు ఈ దృశ్యం కారణరహితమై ఇక మరల ఆత్మగానే కనబడుతుంది గాని దృశ్యముగా ఉద్భవించదు. దృశ్యమును దృశ్యంగా కాకుండా క్రమక్రమంగా పరమాత్మగా దర్శించ టంలో సుఖమే ఉన్నదిగాని, కష్టం కాదు. పైగా, అది సర్వ సంసారభ్రమల యొక్క సశాంతి స్థానం.
నేను, నీవు మొదలైనవి - ఓ రామచంద్రా! “చిదాకాశమాత్రము’ అగు సంవిత్తే అవిద్యచే, “నీవు-నేను” మొదలైన రూపములతో ఈ జగత్తును ధరించుచున్నది. అట్టి ఈ జగత్తు అనబడేది ఈ విధంగా “స్వాత్మ” యందే అధ్యస్తమైయున్నది. అట్టి ఈ “జగత్ వ్యవహారము” అనే తెరను జ్ఞానము అనే హస్తబలంతో ప్రక్కకునెట్టి ఈ అధ్యస్తమై ఉన్నదానికి భిన్నమైనట్టి “అధిష్ఠాన చిన్మాత్రమే నేను” అని గ్రహించి ఉండాలి.
Page:488
అధ్యస్తము అధిష్ఠానము
నేను - నీవులతో కూడిన నేను - నీవు - జగత్తులు
దృశ్య జగత్తు ఎందులో (జలంలో తరంగాలలాగా)
కనబడుచున్నాయో….. అట్టి స్వస్వరూపం
ఈ ‘నేను - నీవు’ మొదలైన రూపములతో - కూడిన ఈ జగత్తు అవిద్య మాత్రమే అయివున్నది. ఇది (దృశ్యముగా) వాస్తవానికి మిథ్యయే! అందుచేత “ఇది ఎట్లా శమిస్తుంది” …అనే దిగులు ఎవరికీ ఉండవలసిన పనిలేదు. ఈ జగత్ భావం అనబడేది వాస్తవానికి సర్వదా శమించినదై, శూన్యమాత్ర స్వరూపము కలిగినదై చిదాకాశము నందే అథ్యస్తమై వెలయుచున్నది. ఈ జగత్తు అనబడేది చిదాకాశమునందే చిదాకాశ ప్రతిబింబమై జగద్రూపంగా (అథ్యస్తమై) భాసిస్తోంది” …అనునది వేదోపనిషత్తులు ప్రకటించే సిద్ధాంతము. స్వప్నం అసత్తే అయినప్పటికీ సత్తువలె అనుభూతం అగుచున్నది కదా! అసత్తే అయినప్పటికీ సత్తువలె అనుభూతం అవటమనే వ్యవహారానికి ఇక్కడ స్వప్న దృశ్యమే దృష్టాంతమగుచున్నది. స్వప్నంలో కనిపించిన రాజ్య భోగ వైభవం స్వప్న చైతన్యరూపం గాక, మరింకేదీ కాదు కదా! అట్లాగే జాగ్రత్లో ప్రకటితమై, ప్రదర్శనమయేదంతా కూడా జాగ్రత్ చైతన్య వైభవమే అయివున్నది. స్వప్నంలో రాజ్య విలాసానికి కర్త ఎవరు? అనుభవించేదెవరు? ఏ ఇంద్రియములకు అవి అనుభూతమగుచున్నాయి?…. అట్లాగే ఈ జాగ్రత్లో కనిపించే ఈ విశాల జగదనుభవానికి కర్త - - కర్మ - క్రియలు లేవు. ఇదంతా ద్రష్ట యొక్క దృశ్య సత్తా చైతన్య రూపమే అయివున్నది. స్వయంకృత విశేషమే అయి ఉన్నది.
నేనెవరు? - ఏదైతే కర్త-కర్మ-కరణములు మొదలైన సామాగ్రి లేకుండా కూడా భాసించుచూనే ఉన్నదో… అట్టి చిల్డ్రన స్వరూపమే ‘నేను’ అయివున్నది. స్వప్నంలో స్వమరణం లేకపోయినప్పటికీ -ఒకడు తాను మరణించినట్లు, బంధువులు శోకిస్తున్నట్లు కలలో - గాంచుచున్నాడు కదా! స్వప్నంలో కనిపించేదానికి ఎవరికి కర్తృత్వం ఆపాదించగలం?
ఈ జగత్తు సృష్ట్యాదియందే కర్తృత్వ రహితమైయున్నది. దీనికి ‘కర్త’ అనబడువాడెవడూ లేడు. కనుక ఇది నా స్వయంప్రకాశ రూపమే అయి వున్నది. అయితే, అవిద్యా రూపమగు ఈ జగత్తు ఇట్లా విద్యమానమై ఉన్నప్పటికీ కూడా… ఇది జ్ఞానబలంచే “లేనిదే” (స్వప్న సదృశంగా) అగుచున్నది.
ఈ జగత్తు నా స్వస్వరూపమగు ‘చైతన్యం’ అనే మణి యొక్క ప్రకాశరూపమే! ఇదంతా చిదాత్మచే స్వాత్మయందు సంకల్పించబడినదై ఉన్నది. నాచే జగత్తుగా పొందబడుచున్నదంతా నా “సంకల్పం”… అనే రూపం తప్పితే వేరైన రూపమేదీ కలిగి ఉండలేదు. ఒక ఆలోచనకు కారణమే మున్నది? అట్లాగే ఈ జగత్తు అనబడేదంతా కారణరహితమై ఒప్పుచు కాకతాళీయ న్యాయముచే స్వయముగా (మిథ్యగా భాసిస్తోంది.
యథార్థానికి ఈ జగత్తు కారణరహితం. కనుక నాకు వేరుగా లేదు. (నా సంకల్పం లేకుండా) భాసించటమే లేదు. ఏ చిత్రకాశం చేత ఇదంతా ప్రత్యక్షంగా, వ్యక్తమై భాసిస్తోందో… ఆ చిత్రకాశమే
Page:489
“నేను” కూడా! ఆ చిత్ప్రకాశమును పెద్దలు, తత్త్వజ్ఞులు “పరమ పదము - చిదాత్మ బ్రహ్మము పరమాత్మ”… మొదలైన ఆయా శబ్దాలతో ఉద్దేశిస్తున్నారు.
ఓ రామచంద్రా! శూన్యత్వంగా కనిపించేది ఆకాశమాత్రమే కదా! ఆవర్త - తరంగాదులుగా కనిపించేది జలమే కదా! అట్లాగే… ఈ జీవుడు మొదలైన సర్వరూపాలుగా కనిపించేది / స్ఫురించేది ఆ చిద్రూపమే! ఒకానొక జీవుడు “ఒక్కడే” అయినప్పటికీ… అవయవిగా అనేక దేహ విభాగాలుగా కనిపిస్తున్నాడు కదా! అట్లాగే వాస్తవానికి అవయవ రహితము - ఏకము అయినట్టి బ్రహ్మము "జీవుడు - జగత్తు” మొదలైన అనేక అవయవ సహితముగా కనిపిస్తోంది.
ఒకే జీవుడు కుడికన్ను, ఎడమకన్నులతో వ్యవహరిస్తున్నట్లు సర్వదా ఏకమే అయి ఉన్న బ్రహ్మము ఈ దృశ్యములో అనేక దేహములుగాను, ద్రష్ట - దృశ్యములుగాను, జడ - చైతన్యములుగాను వ్యవహరిస్తోంది.
ప్రశాంతంగా ఉండే స్ఫటికశిలయందు ఎదురుగా ఉన్న వనములు - - వృక్షములు - పక్షులు మొదలైన వాటితో కూడి మహారణ్యం అభాసమాత్రంగా ప్రతిబింబిస్తోంది చూచావా? నాశరహితముపరమశాంతము అగు చిన్మాత్రమునందు ఈ దృశ్య జగత్తు అభాస మాత్రంగా, ప్రతిబింబమాత్రంగా ఇట్లు ఉంటోంది.
నిర్మల చిన్మాత్రమే తన స్వభావ ప్రభావం చేత ఈ జగద్రూపంగా వెలయుచున్నది. అనగా ఈ జగత్తు ఆత్మ స్వరూపమే అయివుండగా, … అట్టి ఈ జగత్తును గూర్చి ఎవరైనా సరే విచారించవలసిన పనేమున్నది?
ఓ రాఘవా! పరమ పదమగు బ్రహ్మమునందు "ఇది మొదలు, ఇది, మధ్య, ఇది అంతము” … అను కల్పన ఏదీ లేదు. ఇక ఈ జగత్తు, ఇద్దాని కారణరూపమగు అవిద్య ఈ రెండూ పరమాత్మ రూపములే అయివున్నాయి. పరమాత్మకు భిన్నంగా అవిద్య అనేది లేనేలేదు. విద్యా అవిద్యా స్వరూపుడై కనిపిస్తున్నది పరమాత్మయే! (విద్యా - అవిద్యా స్వరూపిణీ - లలితా సహస్రం
ఇక ఈ జీవులంటావా? ఈతడు ప్రబుద్ధుడై ఉండవచ్చుగాక! ఉండకపోవచ్చు గాక! స్వప్నము నుండి జాగ్రత్తులోనికి జాగ్రత్తు నుండి స్వప్నములోనికి ప్రవేశించుచు తాను సర్వదా ‘ఏకము’ అయినట్టి శుద్ధ చిద్రూపముతోటియే వెలయుచున్నాడు.
సుషుప్త్యవస్థలో… అజ్ఞానావృతమైన ఆత్మ; తురీయావస్థలో… శుద్ధాత్మ
ఈ రెండూ కూడా… “అజ్ఞాన రజ్జువు - కేవల రజ్జువు" (త్రాడును పాముగా అనుకొన్నప్పటి త్రాడు - త్రాడును త్రాడుగా దర్శిస్తున్నప్పటి త్రాడు) వలె ఉంటున్నాయి. సుషుప్తిలో, తురీయావస్థలో ఏ ఆత్మ అయితే ఉన్నదో, అదే ఆత్మ జాగ్రత్ - - స్వప్న సమయాలలో కూడా అదే రీతిగా ఉండి ఉన్నది. ని - జాగ్రత్ స్వప్నముల సమయంలో కూడా తురీయ స్థితిని ఎరుగుచున్నాడు.
అజ్ఞాని - - జాగ్రత్ స్వప్న సమయంలో తనయొక్క తురీయ స్థితిని ఏమరచుచున్నాడు.
Page:490
కాబట్టి జ్ఞానికి జాగ్రత్ - స్వప్న - - సుషుప్తులు మూడు స్థితులు కూడా తురీయమే అగుచున్నాయి. ఆతనిలో అవిద్య లేనందువల్ల ఆతడు ద్వైతములో ఉన్నప్పుడు కూడా అద్వైత రూపుడై వెలయుచున్నాడు. జ్ఞానియొక్క దృష్టి - అనుభవములు ‘ద్వైతము’ అనే పరిమిత అవస్థను అధిగమించినదై ఉంటోంది. అందుచేత ఆతనికి – ద్వైతము - అద్వైతము - నేను - నీవు - ఇది - - మొదలుకొని ఇంకెక్కడుంటాయి? ఆతడు సర్వత్రా పూర్ణత్వమును దర్శించుచుండగా ఇక ఆతనికి ‘శూన్యము’ అని అనిపించేదేమున్నది?
ద్వైతాద్వైత సముత్భేదైః వాక్య సందర్భ విభ్రమైః, క్రీడంతి అబుద్ధాః శిశవో! బోధవృద్ధా హసన్తి తాన్!
అజ్ఞానులగు బాలురు మాత్రమే “కాదు, ద్వైతం - కాదు కాదు, అద్వైతం”… మొదలైన భేదములతో కూడిన వాక్య విభ్రమముతోటి క్రీడిస్తున్నారు. ఇక బోధవృద్ధులగు జ్ఞానులో… వారిని చూచి నవ్వుకుంటున్నారు.
శ్రీరాముడు : మరి గురువులు ద్వైత అద్వైత ప్రవచనములు ఎందుకు సిద్ధాంతపూర్వకంగా శిష్యులకు ప్రతిపాదిస్తున్నారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : గురువులు “శిష్యుల ప్రబోధము” అనే ఫలమును ఫలదీకరింపజేయటానికి “ద్వైతాద్వైత వివాదముల కోర్కె” అనే ఫలతీగను పెంపొందింపజేయుచున్నారు. అజ్ఞానుల హృదయాలను పరిశుద్ధపరచటానికి, విజ్ఞానమయం చేయటానికి ఆయా ద్వైతాద్వైత వాదోపదాములు ఆవశ్యకమై ఉన్నాయి. అందుచేత గురు స్థానంలో ఉన్న నేను కల్పితమైనట్టి “ద్వైతాద్వైత విచారణ” అనే చీపురును మిత్ర భావంతో వివాద రహితంగా అంగీకరిస్తూ వస్తున్నాను. గృహిణి గదిని శుభ్రంగా ఊడ్చివేసిన తరువాత ధూళిని ప్రోగుచేసి తొలగించి ఆ చీపురు మాత్రం ఒక మూల ఉంచుతుంది కదా! ”జీవుల హృదయ గృహములను పరిశుభ్రపరచటం” అనే కార్యమునకు బ్రహ్మదేవునిచే ఉద్దేశించబడినట్టి బ్రహ్మ మానసపుత్రుడనగు నేను "ద్వైతాద్వైత విచారణ” అనే చీపురుచే ఆశ్రితుల హృదయాలలోని ధూళిని ఊడ్చివేస్తూ ఆ తరువాత ఆ విచారణను ఒకవైపుగా దూరంగా ఉంచుతూ వస్తున్నాను. అనుభవమును ఉద్దీపింపజేస్తున్నాను.
తచ్చిత్తాః తద్గగత ప్రాణా బోధయన్తః పరస్పరమ్ కథయన్తశ్చ తన్నిత్యం తుష్యంతి చ రమంతి చ ॥
ఆ విధంగా “అవిద్య” అనే ధూళి తొలగిపోయిన తరువాత అధికారులగు ముముక్షువులు బ్రహ్మమునందే నెలకొని ఉంటారు. వారికిక ద్వైత-అద్వైత పాఠ్యాంశమాత్ర దృష్టి - తన విషయత్వం కోల్పోతోంది. (అది చెప్పుకోదగ్గ విషయం కాకుండా పోతోంది.) ఉదాహరణకు "ఎడమ కన్ను, కుడి కన్ను ఉపయోగించుచున్న జీవుడు సర్వదా ఒక్కడే కదా!” … అనే దృష్ట్యాంతాన్ని ఆత్మ వస్తుపరంగా సుస్పష్టం చేసుకొన్న తరువాత “ఎడమకన్ను - కుడికన్ను ఒక్కటా? వేరువేరా?” అనే చర్చకు ప్రసక్తి ఎక్కడిది? అవిద్య తొలగిపోయిన తరువాత అట్టి అధికారులగు ముముక్షువులు తమ ప్రాణమనస్సు లను బ్రహ్మమునందే నెలకొల్పుకొని, బ్రహ్మం గురించే పరస్పరం బోధించుకుంటూ, నిత్యం
Page:491
బ్రహ్మమునందే క్రీడిస్తూ పరమానందానుభవులై ఉంటారు. తృప్తి, సంతోషం కలిగి ఉన్న వారై ఉంటారు. ఇక వారి దగ్గరకు వెళ్ళి “మీది ద్వైత సిద్ధాంతమా? అద్వైత సిద్ధాంతమా?” అని అడిగితే "అసలు విషయం తెలుసుకొనిరండి. అప్పుడు మీకు చెప్పుతాం!” అని చెప్పి మౌనంగా ఉంటారు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్
జాయతే బుద్ధియోగో సౌ యేన, తే యాన్తి తత్పదమ్ ||
ఇట్లు నిరంతరం ప్రీతిపూర్వకంగా బ్రహ్మతత్త్వమును విచారణ చేస్తూ, సేవిస్తూ ఉంటూ ఉండగా క్రమంగా నేను చెప్పినట్టి “సారాసార వివేచనా బుద్ధి యోగం” స్వయంగా దృఢమౌతుంది. అద్దానిచే వారు ‘మోక్షము’ అనే బ్రహ్మపదమును పొందుచున్నారు. ఓ ప్రియ సభికులారా! శ్రోతలారా! ఈ ప్రపంచంలో ఒక గడ్డిపరక సంపాదించాలంటే కూడా అది కొంత ప్రయత్నముచేత మాత్రమే సాధ్యమౌతుంది కదా! మరి, ఈ త్రిలోకములు ఎందులో కనిపిస్తున్నాయో అట్టి బ్రహ్మముతోటి ఏకత్వము సముపార్జించాలంటే, అట్టిది ప్రయత్నం లేకపోతే ఎవరైనా పొందేది ఎట్లా? కనుక మీరంతా మహదాశయముతో ప్రయత్నశీలురై ఉండాలి. ఓ ప్రియజనులారా! ప్రతి జీవుడు సుఖము పొందాలని నిత్యము అనేక ప్రయత్నములలో నిమగ్నమై ఉంటున్నాడు. మంచిదే! అయితే మనుష్యానందము మొదలుకొని బ్రహ్మదేవుని ఆనందము వరకు గల పది పది రెట్లు ఆనందమును ఏ బ్రహ్మానందము సమక్షంలో మహాసముద్ర జలము ముందు ఒక చుక్క నీటితో సమానంగా (ఉపనిషత్తులలో) పోల్చబడిందో… అట్టి బ్రాహ్మీ దృష్టికై ఎందుకు ప్రయత్నించి సంపాదించరాదు? మనస్సు యొక్క అంకుర స్వరూపమగు ఈ సంసారమునందలి రాజ్య సుఖం అసలు నిజమైన సుఖమా! ఆత్మానందం ముందు అది ఎంతటి అల్పమైనది? తత్త్వజ్ఞానమున పూర్ణ విశ్రాంతి ప్రాప్తించుకున్న మనుజునకు ఇంద్రుని త్రైలోక్య - ఆధిపత్యానందము ఒక తృణముతో (గడ్డిపరకతో) సమానమగుచున్నదే!
ఓ ప్రియజనులారా! అజ్ఞాన నిద్రయందున్న విషయలంపటులు దృశ్యము పట్ల ఎంతో ఆసక్తిపరులై ఉన్నారు కదా! వారెంత ఆసక్తి కనబరుస్తున్నారో… అంతగానూ తత్త్వజ్ఞులు దృశ్యము పట్ల నిదురించినవారివలె ఉంటూ… నిరతిశయమగు ఆత్మ పదమునందు మేల్కొని, సర్వదా అద్దానినే అంతటా గాంచుచున్నారు.
ఓ రామచంద్రా! మరల ప్రకటిస్తున్నాను. అట్టి నిత్య అపరోక్ష నిరతిశయానంద రూపమగు మోక్షరూప స్థితి ప్రయత్నముచేతనే లభించగలదు. “మహాభ్యాసము” అనే వృక్షము యొక్క ఫలమే పరమాత్మ పదము. కనుక సర్వజీవులారా! మీరు ఆ మార్గములో ప్రయత్నశీలురై ఉండండి.
సకల జనులపైగల అవ్యాజమైన ప్రేమ చేతనే ఈ రామచంద్రుని నిమిత్తముగా చేసుకొని లోకములకు ఈ జ్ఞాన శాస్త్రమును ప్రతిపాదిస్తున్నాను. ఒకడు, అజ్ఞాని అయినా సరే… జిజ్ఞాస - శ్రద్ధలతో యావృత్తి పూర్వకంగా ఆత్మజ్ఞాన శాస్త్రం పఠించటం, విజ్ఞుల ద్వారా ప్రవచనమును వినటం మొదలైన అభ్యాసములచే తప్పక గొప్ప ఆత్మజ్ఞాని కాగలడు. అట్లా కాకుండా, ఏదో
Page:492
కొంచెం చదివి “మాకు అంతా తెలిసిపోయింది”…. అని అనుకొని అభ్యాసపూర్వకంగా అధ్యయనం చేయకపోతే ఇంక వేరైన మార్గంలో “మోక్షము సులభమే! సుసాధ్యమే” అని తెలియజేసేది
ఎట్లా? మాకు తెలియటం లేదు!
పరమ పురుషార్థమగు మోక్షఫలమును ప్రసాదించగల బ్రహ్మదేవుని నిత్యమనోగతమైన ఈ శాస్త్రమును “వేదము” వలె మరల మరల పఠించాలి. వ్యాఖ్యానం చేయాలి. పూజించాలి. ఈ శాస్త్రము నుండి ఏది లభిస్తుందో, అద్దానిని ఎరిగినచో జీవునియొక్క క్రియ - జ్ఞానములు రెండూ పవిత్రమౌతాయి. వేద తాత్పర్యమే ఈ “శ్రీవసిష్ఠ-రామ సంవాదము (యోగవాసిష్ఠము మహారామాయణము)” అనబడెడు శాస్త్రము. ఇది వేదాంత శాస్త్రములలో ఉత్తమైనది. మీ అందరిపై గల స్వాభావ సిద్ధమైన ప్రేమచేతనే ఈ మోక్ష శాస్త్రమును మీ ముందు ఉంచుచున్నాను. మీరందరూ ఈ శాస్త్ర పఠనముచే ఆత్మానందము పొందాలనే ఉద్దేశమేగాని, మరింకేమీ కోరి ఈ ప్రవచనమును చెప్పటం లేదు. ఈ శాస్త్రమును పరిశీలించటంచే “ఈ దృశ్య సమూహం మాయ” అని గ్రహించగలరు. కనుక శ్రద్ధాసక్తులతో ఈ శాస్త్రమును పఠిస్తూ విచారణ చేయండి. ఈ “యోగ వాసిష్ఠము”ను పఠించిన తరువాత అప్పుడు తక్కిన శాస్త్రములను పరిశీలిస్తే అవన్నీ లవణము కలిపిన తరువాత పప్పులాగా అతి రుచికరంగా గోచరించగలవు. "ఆ! ఇది ఒక కావ్యం వలె చెప్పబడలేదు. అందు చేత ఉత్తమ శాస్త్రం అని అనిపించుకోదు” అని అనాదరించి, భాషాసక్తులు మాత్రమే అయి మీకు మీరే ద్రోహం చేసుకోకండని మా మనవి. మేము మా పూర్వీకులు చెప్పిన ఒక్క శాస్త్రాన్నే చదువుతాం. ఇది మాకు అక్కర్లేదు” … ని తలచి ఈ శాస్త్రమును పరిశీలించనివారు “మా తాతలు త్రవ్విన నూతి లోని నీరే త్రాగుతాం. ఇక తదితర నదీ జలములతో మాకేమి పని?” …అని తలచిన వారగుచున్నారని మా ఉద్దేశం.
కనుక రామచంద్రా! ఈ అఖండ రామాయణ శాస్త్ర పఠనము క్రమంగా ‘ఇంద్రియ జయము’ అనే ప్రయోజనమును స్వయంగా స్వభావసిద్ధంగా సిద్ధింపజేయగలదని ఋషులమగు మా ఉద్దేశం.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటే …ప్రపంచంలో వస్తువుల యొక్క ఆకారం, నామము, రంగు మొదలైనవి దృశ్యమానమగుచున్నవి కదా! అట్లాగే బ్రహ్మము ప్రకాశిస్తూ ఉంటే… ఈ జగత్తు విద్యమానమై ఉంటోంది. జగత్తు నామ రూపాత్మక మైనప్పటికీ, ఇది బ్రహ్మం యొక్క అవయవం వలె అనిపించినప్పటికీ, బ్రహ్మం సర్వదా నిరవయవి. ఇక జీవునికి - జీవునికి గల భేదము, ఆకాశ భేదం వలె (ఆకాశంలో కనిపించే, దిక్కులు - - పైన
క్రింద… మొదలైన వాటి వలె) అంతఃకరణం యొక్క దృష్టిచే కలుగుచున్నది మాత్రమే! సమస్త భేద-అభేదములు తన యొక్క ఉపాధిగా ప్రకటన సలుపుచున్నట్టి అఖండ పరిపూర్ణ బ్రహ్మమే
Page:493
నేను”… అను మహావాక్య బోధనచే సర్వజగత్ దృష్టులు స్వయముగా ఉపశమిస్తున్నాయి. అట్టి అఖండ బ్రహ్మముతో తన స్వరూపము యొక్క అభేదం సుస్పష్టపరచుకొన్న మహనీయునికి జీవాజీవ భేదమిక అగుపించటం లేదు. తత్త్వజ్ఞానికి శుద్ధ బ్రహ్మమే సర్వదా సర్వత్రా విషయమగుచున్నది. అట్టి శుద్ధ బ్రహ్మము సర్వకాల సర్వావస్థలయందును భేదకళంక రహితమై, సదా నిర్మలమై వెలయు చున్నది. అది సదా యథాతథంగానే ఉంటోంది. అంతేగాని, మరింకేదో రూపంగా అగుటయే లేదు.
ఇక తత్త్వజ్ఞానులు కానట్టి అజ్ఞానులకు అంటావా? వారికి తెలియవచ్చే “నేను, నాది, నీవు, నీది, వారు, వీరు“ …మొదలైనవాటి యొక్క వాటి వాటి వాస్తవ రూపాలేమిటో… వారికే తెలియాలి. ”ఎండమావులలో తరంగాల భేదం మాకు తెలియవస్తోంది“ అనే మాట ”అవి ఎండమా వులే! జలం అందులో ఉండదు” …అని తెలిసినవారికి అజ్ఞుల దృష్టితో పనిలేదు కదా! “వీడు జ్ఞాని, వాడు అజ్ఞాని, వీడు వేరు, వాడు వేరు” … మొదలైన బుద్ధి అజ్ఞాని యందు అనునిత్యంగా అజ్ఞానికి అనుభవమగుచున్నప్పటికీ… అట్టి భేదములు జ్ఞానికి కనిపించటం లేదు. దాహంగా ఉన్నవాడికే “ఆ మృగతృష్ణలో జలం ఉండవచ్చు”… అనే భ్రమ కలుగుతుంది కదా! ”ఇది విగ్రహం
- ఇది పురుషుడు”… అని తెలిసినవానికి ఇక ఏది పురుషుడో ఏది స్థాణువో సంశయముండదు కదా! బ్రహ్మతత్త్వము తెలిసిన తరువాత ఇక భేదజ్ఞానములన్నీ సమసిపోతున్నాయి.
ఓ రామచంద్రా! ఈ జగత్తు పూర్వము ఉండి ఉండలేదు. ఇప్పుడు కూడా లేదు. అసలు ఉత్పన్నమే అవలేదు. ఇక ముందు కూడా ఉండబోవటం లేదు. మరి? సద్వస్తువగు బ్రహ్మమే ఈ రీతిగా జగద్రూపంగా కనిపిస్తోంది. "అట్టి జగద్రూపంగా గ్రహించబడుచున్న చిదాకాశము యొక్క స్ఫురణ వాస్తవానికి స్వాత్మయందే స్థితి కలిగియున్నట్టిది” …అని విజ్ఞులు ఎరిగియే ఉన్నారు. అట్టి విజ్ఞులు జగత్తును బ్రహ్మముగానే ఎరుగుచున్నారేగాని… జడముగా కాదు. స్వప్నంలో కనిపించే దంతా ద్రష్ట స్వరూపమగు చిదాకాశమే! అట్లాగే మనోరాజ్యము యొక్క కల్పిత పురంగా కనిపించేది కూడా మనోద్రష్ట స్వరూపమగు చిదాకాశమే! అదే తీరుగా జాగ్రత్ ద్రష్ట స్వరూపమగు చిదాకాశమే ఏకము నిర్మలము అయి చెన్నొందుచూనే జాగ్రత్ దృశ్యరూపంగా కనిపిస్తోంది.
“ఈ జగత్తుకు పూర్వము ఏకమగు చిద్వస్తువు మాత్రమే కలదు - - (సదేవ సౌమ్యే దమగ్ర ఆసీదేకమేవారి ద్వితీయమ్ బ్రహ్మ)… అని శ్రుతులు చెప్పే వాక్యములే “ఈ జగత్తు ఏ సమయ మందునూ లేదు”… అని చెప్పటానికి ప్రమాణ వాక్యములైయున్నవి. ”సృష్టికి పూర్వము ఎచ్చటా కూడా నిమిత్త కారణంగాని ఉపాదాన కారణంగాని లేకయే ఉన్నాయి"… అని వేదవాక్కులు నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాయి.
(ఉపాదాన కారణం = మట్టి బొమ్మలోగల మట్టి; నిమిత్త కారణం = మట్టి బొమ్మ తయారు చేసే వ్యక్తి)?
ఇక జగత్తు ఎక్కడున్నది? ఇది కొంచెం కూడా ఉద్భవించనేలేదు. ఏది ఉద్భవించినట్లు తోచుచున్నదో… అది అనాదియగు పరబ్రహ్మమే అయివున్నది. సర్వదా శుద్ధమగు పరబ్రహ్మము తన యొక్క ‘స్వభావము’ అనే శక్తిచే, (లేక) చమత్కారముచే జగతూపంగా భాసించుచున్నది.
Page:494
జగత్ ద్రష్టయగు జీవుని భావనయే జగత్తు. జీవుని భావన జీవునికి అభిన్నం. కనుక జగత్తు జీవుని స్వస్వరూపమే! కనుక… సృష్ట్యాదిలో ఇక్కడ ఏదీ ఉత్పన్నం కాలేదు. అనగా… అజ్ఞానులచే ఎరుగబడుచున్న “బ్రహ్మదేవుడు” మొదలైన సమష్టి-వ్యష్టి జీవులుగాని, వారి వారి ఉపాధులుగాని వాస్తవానికి లేకయే ఉన్నాయి. బ్రహ్మదేవుడు ఈ జీవులు కూడా బ్రహ్మం సమక్షంలో బ్రహ్మమునకు వేఱుగా చూస్తే శూన్యరూపులే అయివున్నారు.
చిదాకాశమే… తన చిత్స్వభావముచే… ‘జగత్తు - జీవుడు’ అను రూపములుగా భాసిస్తోంది.
శ్రీరాముడు : మహర్షీ! జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల రూపమేమిటో, ఎద్దాని నుండి ఏది బయల్వెడలుచున్నదో ఆ వివరాలు మరొక్కసారి సవివరణగా ప్రవచించమని నా ప్రార్థన. శ్రీ వసిష్ఠ మహర్షి :
జాగ్రత్ స్వప్నము సుషుప్తి
ఈ జాగ్రత్ - స్వప్న సుషుప్తులు మూడూ కూడా పరస్పరం ఒకదానిలో మరొకటి ప్రవేశిస్తూ ఉన్నాయి. అందుచేత ఒక్కొక్కటి ప్రత్యేకంగా మూడు మూడు విధాలుగా అగుచున్నాయి.
జాగ్రత్ జాగ్రత్ జాగ్రత్తు
జాగ్రత్ జాగ్రత్ స్వప్నము
జాగ్రత్ జాగ్రత్ సుషుప్తి
స్వప్నము స్వప్న జాగ్రత్తు
స్వప్నము స్వప్న స్వప్నము
స్వప్నము స్వప్న సుషుప్తి
సుషుప్తి సుషుప్తి జాగ్రత్తు
సుషుప్తి సుషుప్తి స్వప్నము
సుషుప్తి సుషుప్తి సుషుప్తి
జాగ్రత్ స్వప్నం - ఇది మనోరాజ్య రూపం. ఇంద్రియాలు ఆ సమయంలో వ్యాపారరహితమై ఉంటున్నాయి. ఈ దశ కేవలము మనోమయత్వమై ఉన్నది. పదార్థముల యొక్క స్వప్న సాదృశ్యము వలన స్వప్నమే జాగ్రత్ దశను పొందుతోంది.
స్వప్నంలో కూడా "ఇంత కాలం నేను నిద్రించాను. ఇప్పుడు మేల్కొన్నాను”… అనే అనుభవం స్వప్నాంతర్గతమై ఉంటోంది కదా! స్వప్న జాగ్రత్ స్థితియందు స్వానుభవమగుచున్న జాగ్రత్తే జాగ్రత్ సమయంలో స్వప్నరూపంగా ఎరుగబడుచున్నది.
స్వప్నో జాగ్రత్ ప్రవిశతి, జాగ్రత్ స్వప్నాత్ర బుధ్యతే జాగ్రత్ స్వప్నం ప్రవిశతి, ప్రబుద్ధం స్వప్న జాగ్రతః ॥
Page:495
ఆత్మ జాగ్రత్ స్వప్నం నుండి మేల్కొని స్వప్న రూప జాగ్రత నందు ప్రవేశిస్తోంది. అట్లాగే స్వప్నరూప జాగ్రత్ నుండి జాగ్రత్ రూప స్వప్నంలో ప్రవేశిస్తోంది. ఈ విధంగా జాగ్రత్ స్వప్నములు రెండూ పరస్పరం ఒకదానికి మరొకటి కారణమగుచూ ఉంటున్నాయి.
జాగ్రత్ జాగ్రత్వంతుని స్వప్నం స్వప్నస్వప్నం అని; స్వప్నజాగ్రత్వంతుని యొక్క జాగ్రత్ –జాగ్రతాగ్రత్ అని కూడా చెప్పబడుతోంది.
స్వప్నంలో స్వప్నమందలి జాగ్రత్తు వర్తమాన జాగ్రత్తులాగానే అనుభూతమౌతోంది. కనుక స్వప్నంలోని జాగ్రత్తు జాగ్రత్తేగాని అప్పటి అనుభవం అనుసరించి అది స్వప్నం కాదు.
అట్లాగే “జాగ్రత్ స్వప్నము” అనే మనోరాజ్యమందలి జాగ్రత్తు అనుభవముచే స్వప్నమే అవుతుంది గాని, జాగ్రత్తు కాదు.
ఇక కాలవిషయానికి వస్తే… జాగ్రత్ కాలమునందు స్వప్నము సదా అల్పకాలికమై ఉంటోంది. అట్లాగే స్వప్న కాలమున జాగ్రత్ సదా అల్పకాలికమై ఉంటోంది.
కనుక ఓ రామచంద్రా! జాగ్రత్తు స్వప్నము వంటిదే! స్వప్నము జాగ్రత్తు వంటిదే! కనుక వాటిలో ఒకటి మరొక దాని నుండి బయల్వెడలటమనే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ రెండింటికీ భేదమే లేదాయె! ఇంటి యొక్క బయట - - లోపల ఒకే ఆకాశం వెల్లివిరుస్తోంది కదా!
అయితే… స్వప్నము జాగ్రత్తు నందు పూర్ణముగా శమించిపోవుచున్నది. అప్పుడు స్వప్న పదార్థములు శూన్య రూపములే అగుచున్నాయి.
శ్రీరాముడు : స్వామీ! స్వప్న సమయంలో జాగ్రత్తు శమించటం గాని, శూన్య రూపములుగా గాని అవటం లేదు కదా! జాగ్రత్లోని పదార్థములు మొదలైనవన్నీ స్వప్నమునకు పూర్వంలాగా స్వప్నానంతరం తిరిగి (జాగ్రత్తుకు వచ్చిన తరువాత) కొనసాగుచూనే ఉన్నాయి కదా! కానీ జాగ్రత్ అనంతరం స్వప్నంలో క్రితం రోజు (రాత్రి) స్వప్న వ్యవహారం కొనసాగటం లేదు. మరి స్వప్నము జాగ్రత్తు ఒక్కటే అని ఎట్లా అర్థం చేసుకోవటం?
అనగా… మహర్షీ!… నేడు స్వప్నంలో చూచినవి రేపటి స్వప్నంలో ఉండటం లేదు. కానీ… నేడు చూచిన జాగ్రత్తు రేపటికీ యథాతథంగా ఉంటోంది కదా? ఈ సాయంకాలపు జాగ్రతే, రేపు ఉదయం కొనసాగుతోంది కదా?
శ్రీ వసిష్ఠ మహర్షి : కానీ రామా! ఈ విషయం మనం చర్చించియే ఉన్నాం. అయినా, మరికొన్ని విశేషాలు చెప్పుతాను.
ఈ వర్తమానపు జాగ్రత్తు మరణానంతరం పరలోక జాగ్రత్ నందు శమించి పోతోంది. లేక ఆత్మ ప్రబోధ సమయానికి సమస్త ద్వైతం శమించిపోతోంది. అది అట్లా ఉంచి ప్రతిరోజు స్వప్నానుభవ కాలంలోను, సుషుప్తి స్థితి సమయానికీ జాగ్రత్తు పదార్థములన్నీ శూన్య రూపములయిపోతున్నాయి. కనుక “జాగ్రత్ - స్వప్నములు అభేదమైనవి” అనునది ఇక్కడ సిద్ధిస్తోంది కదా!
Page:496
ఈ “జీవితము” అనబడే స్వప్న సమయంలో “గత జన్మ జీవితము” అనే స్వప్నము సమసిపోయినదే అగుచున్నది కదా! అట్లాగే వర్తమాన జన్మ తదనంతర జన్మ జాగ్రత్ సమయానికి శూన్యరూపమై స్వప్నమువలె సమసిపోయినదే కాబోవుచున్నది. పరలోక జాగ్రత్ … ఇహలోక జాగ్రత్లో "అవిషయము - శూన్యరూపము అగుచునే ఉన్నది కదా!
నేటి స్వప్న విషయములో జాగ్రత్కు సంబంధించిన సర్వ పదార్థములు శూన్యమై పోవుచున్నాయి. మరల “నానా రూపాత్మకమగు ప్రపంచంలో నేను ఇంకా జీవించియే ఉన్నాను”… అనే బోధ ప్రారంభం కాగానే జాగ్రత్ ప్రారంభమౌతోంది. జాగ్రత్ రూపుదిద్దుకోగానే ఆ రాత్రి, ఆ ముందటి రాత్రి స్వప్నాలు పరలోక జీవితము వంటివే అగుచున్నాయి. ఈ రోజు జాగ్రత్తుకు ఈ రాత్రికి కలుగబోయే స్వప్నదశ రాబోవు పరలోకమే కదా! రాబోయే స్వప్నములోని ఏ పదార్థము ఇప్పటికి ఇంకా లేనివే కదా!
అట్లాగే మరణానంతర జాగ్రత్తు ఇప్పటికి లేదు. మరణానంతర జాగ్రత్తులో ఇప్పటి జాగ్రత్తు లేదు. ఈ విధంగా జన్మకు ముందటి జాగ్రత్తు ఇప్పటికి శూన్యమగుచున్నది.
ఈ వర్తమాన జాగ్రత్తు మరణానంతర జాగ్రత్తు దృష్ట్యా శూన్యరూపమే కానున్నది. స్వప్నములో కనిపించే త్రిలోకములు చైతన్యము యొక్క చమత్కారమే కదా! అట్లాగే సృష్ట్యాది నుండి ఈ విభాగ పూర్వకమైన రెండూ కూడా (జాగ్రత్తు ఈ జాగ్రత్తులో కనిపించే జాగ్రత్ జగత్తు) చైతన్యము
యొక్క చమత్కారమే అయి, హృదయమునందు భాసిస్తోంది.
ఓ రామచంద్రా! జాగ్రత్తు సమస్త పదార్థములు విశాలాకారయుక్తంగాను, స్థూలంగాను భాసిస్తున్నప్పటికీ కూడా స్వప్నంలోని భూమి ఆకాశం మొదలైన పదార్థములలాగానే ఇవన్నీ లేకయే ఉన్నాయి. స్వప్న జగత్తు స్వప్నంలో భాసిస్తున్నప్పటికీ ఎట్లా శూన్యరూపమే అయి ఉన్నదో… ఈ జాగ్రత్ పదార్థములు ఇంద్రియాల స్థితిని అనుసరించి పొందబడుచున్నప్పటికీ… పరమార్థమున లేకయే ఉన్నాయి! స్వప్నంలో కనిపించేదంతా చిదాకాశమే! అట్లాగే ఈ జాగ్రత్తులో కనిపించేదంతా కూడా చిదాకాశమే అయివున్నది. ఈ సూర్య చంద్రాదులతో కూడి భాసించటమనేది చిదాకాశం యొక్క స్వభావమే అయి ఉన్నది. స్వప్నంలో కనిపించిన భవనం ఏ సూర్యుని వెలుతురులో ప్రకాశిస్తోంది చెప్పు? అట్టి చైతన్యం ఆకాశం, గోడ, ఒక పరమాణువు, స్థలము, జలము, అన్నింటిలో ప్రకాశిస్తూ ఉండటమే ‘జగత్తు’ అనే పేరుచే పిలువబడుతోంది. అది అద్దాని స్వాభావిక చమత్కారమే!
భ్రాన్తాః అసత్యరూపాయాం స్థితాయాం సత్యవస్తువత్ | ఆకాశమాత్ర దేహాయాం క ఇవైనాం ప్రతిగ్రహః ॥
ఈ జగత్తు భ్రాంతి రూపమైనది. శూన్యమాత్ర రూపము కలది. అసత్యమైనది. అట్లయి ఉండి కూడా సత్య వస్తువువలె ఇంద్రియములకు అనుభూతం మాత్రం అవుతోంది. అట్టి ఈ అసత్య జగత్తు పట్ల విశ్వాసం కలిగి ఉండటమనేది మా ఉద్దేశంలో అనుచితమే! ఈ జగత్తు యొక్క రూపం
Page:497
1.గ్రహీత 2.గ్రహణం 3. గ్రాహ్యం అనబడే త్రిపుటి యొక్క సంయోగ రూపము మాత్రమే! ఇది అధిష్ఠానసత్తుచే “అసత్తు" అగుగాక! లేక, నిజసత్తుచే “సత్తు” అగుగాక! ఈ విషయంలో (ఈ జగత్తు ఉన్నది - - లేదు అనే విషయంలో) ఒక పక్షము స్థాపించాలనే మొండిపట్టుదల వలన మాకు ఏ ప్రయోజనమూ కనిపించకయే ఉన్నది. ఈ జగత్తు ఈ విధంగా ఉంటే ఏమున్నది? మరొక విధమైనది అయితే ఏమున్నది? అందులో ఏకపక్షం స్థాపించవలసిన పనేమిటి? ఎవరికైనా కించిత్ అవిచారణచే అట్టి ఏకపక్షాభిమానము ఉంటే ఉండవచ్చు గాక! కాని ఇప్పుడు ఈ జగత్తు యొక్క తత్త్వమేమిటో మనం ఈ శాస్త్ర సందేశము సహాయంచే గ్రహించాము కదా! కాబట్టి ఓ జనులారా! ఇట్టి కాలబుద్ధి, జగత్తు పట్ల భోగరూపమైన అల్ప ఫలములపట్ల కోర్కె అనవసరమనేది సునిశ్చితమే కదా! ఇక “ఇది సత్యమా? అసత్యమా?” అనే మీమాంసగాని, పట్టుదలగాని ఉండవలసిన అవసరమేదీ లేదనియే మా నిర్ణయం! భావనానుసారమే ఇది అనుభూతమౌతోందని మాత్రమే గమనిస్తున్నాం.
శ్రీరాముడు : హే మహర్షీ! అధ్యాత్మ శాస్త్రంలో "ఆత్మఖ్యాతి, అఖ్యాతి, అసత్యాతి, అన్యథా ఖ్యాతి” …అని నాలుగు శబ్దములు ఉపయోగించి … పరమాత్మ యొక్క నిర్వచనాన్ని శాస్త్రీయంగా చెప్పుతూ ఉంటారు. అవి సందర్భానుచితమని మీరు కూడా అనుకుంటే, ఆ ఆధ్యాత్మిక శాస్త్ర ప్రవచిత శబ్దార్థముల గురించి వివరించవలసినదని నా ప్రాథేయము.
శ్రీ వసిష్ఠ మహర్షి : “ఆత్మ” గురించి కొందరు గురువులు శిష్యులకు బోధించేటప్పుడు నీవు చెప్పిన నాలుగు శబ్దములు ఉపయోగించి వివరణను చెప్పటం జరుగుతోంది. అలౌకికమైనది, అఖండ తత్త్వమైనట్టిది ఆత్మ. అట్టి ఆత్మకు 4 విశేషములు పాఠ్యాంశబోధ కొరకై చెప్పబడుచున్నాయి.
ఆత్మఖ్యాతి - సృష్ట్యాదిలో పూర్ణము, వ్యాపకము (ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్నది) అగు చిదాకాశమే ఈ ప్రకారం జగత్ూపంగా తనలో తాను స్ఫురిస్తోంది. అట్టి చిదాకాశం తనలో ఏ నిజచైతన్య చమత్కారం చేత జగత్తును ఖ్యాపితం ఒనర్చుచున్నదో (ప్రసిద్ధి కలిగింప జేస్తోందో)… అట్టి జగత్కారణం “ఆత్మఖ్యాతి" అని చెప్పబడుతోంది. అనగా, ఆత్మలో ఏదైతే జగత్తుగా ప్రకటిత మవటానికి కారణభూతమౌతోందో… ’ఆత్మఖ్యాతి’ అని చెప్పబడుతోంది.
అఖ్యాతి - - ఏ విశేషం చేత ఆత్మ అంతటా ప్రసరింపబడినదై ఉండి కూడా తాను ఎటూ - ఎటు నుంచి కూడా రాక… సర్వదా యథాస్థితమైయున్నదో అదియే అఖ్యాతి.
వెళ్లక 3. అసతాఖ్యాతి - (ఏది వాస్తవానికి అసత్ అయివున్నదో వాస్తవానికి లేదో)… అట్టి ‘లేనిది’ ఉన్నట్లుగా అనిపించటానికి ఏది కారణమగుచున్నదో అద్దానిని “అసతాఖ్యాతి” అని చెప్పుచున్నారు.
Page:498
ఇక్కడ మరొక్క ముఖ్యమైన విషయం విను. వాస్తవానికి ఇక్కడ నదులు మొదలైనవి ప్రవహించటమూ లేదు. వాటిలో ఏదీ మునగటమూ లేదు, తేలటమూ లేదు. ఈ జగత్తులో జరిగే వ్యవహారాలన్నీ వాస్తవం కాదు. నిష్క్రియము, చిద్రూపము అయినట్టి చిదాకాశమే ఈ సమస్త జగద్రూపముచే నిజ చిదాకాశమునందు ఇట్లు స్ఫురించుచున్నదగుచున్నది.
ఖ్యాతి - భాషాపూర్వకంగా అర్థం స్ఫురించటం - ఆత్మ మరొకటిలాగా తానుగా స్ఫురించటం లేదు. ఆత్మ సర్వదా ఆత్మగానే ప్రకాశిస్తోంది. ఆత్మ సర్వదా సమస్త ప్రకటనా రహితమై ఉన్నది. స్వప్రకాశకమైనది. అది అజ్ఞాన దృష్టిచే జగత్తుగా ప్రకటితమగుచున్నట్లు అనిపిస్తోంది. అయినా, “జగత్తుగా కనిపించేది ఆత్మయే! కనుక ఈ జగత్తు ఆత్మఖ్యాతియే”… అని పదప్రయోగ పూర్వకంగా ఆత్మజ్ఞులు చెప్పుచున్నారు.
అఖ్యాతి - మరొక రీతిగా స్ఫురించకపోవటం జగత్తంతా ఆత్మయే అయివున్నది. ఆత్మ ఎన్నడూ కూడా తన స్వప్రకాశం కంటే భిన్నమైన ఎద్దాని చేతనూ తనకంటే భిన్నంగా ప్రకాశింపజేయ బడటమే లేదు. తనకు భిన్నమైనట్టి దేనిని తాను ప్రకాశింపజేయటమూ లేదు. అందుచేత ఆత్మ అఖ్యాతము. ఆత్మయే ఆత్మచేత “ఆత్మకు భిన్నమా?” అన్నట్లుగా ఈ జగత్తును ప్రకాశింపజేస్తోంది. మరొకటి (ఆత్మకు భిన్నంగా ఉండి) జగత్తును ప్రకాశింపజేయడం లేదు కాబట్టి జగత్తు ‘అఖ్యాతము’ (దేనిచేతా ప్రకాశింపబడజాలనిది) అని చెప్పబడుతోంది.
ఖ్యా (ధాతువు) = ప్రసిద్ధి; తి (ప్రత్యయం) = సత్త; ఖ్యాతి = ప్రసిద్ధరూపమగు సత్త; ఆత్మ = ప్రసిద్ధ రూపమగు ఖ్యాతి.
కొందరు “సజ్” + “ఖ్యాతి” = అఖ్యాతి. ఆత్మ అఖ్యాతి. కనుక, ఆత్మ అనబడేదే లేదు (బౌద్ధవాదులు) అని “అఖ్యాతి” కి వ్యాఖ్యానం చెప్పుచున్నారు.
కానీ… అది సరికాదు. ఆత్మను ఆత్మకు వేరైనదేదీ ప్రకాశింపజేయదు. ఆత్మయే ఆత్మచే ఆత్మను ప్రకాశింపజేస్తోంది. కనుక ఆత్మ (బాహ్యమైన ఎద్దాని చేతనూ కూడా) “అఖ్యాతము”… అనియే అఖ్యాత శబ్దానికి అర్థంగా గ్రహించాలని మా ప్రతిపాదనం. మా అవగాహన.
అసత్ఖ్యాతి - అసత్తును కల్పించేది ఆత్మయందే! అసత్తు అంటే లేనిది ఉన్నట్లుగా కల్పించటం. అట్లా కల్పించేవారెవరు? ఆత్మకు అన్యంగా ఎవరైనా వచ్చి అట్లా ఆత్మయందు ఆత్మకు వేరైన జగత్తును కల్పించి చూపిస్తున్నారా? లేనేలేదు. ఆత్మయందు ఆత్మయే ఆత్మను ఏమరచిన దృష్టిని కలిగి ఉన్నప్పుడు ‘జగత్తు’ అనే పేరుతో ప్రసిద్ధమగుచున్నది. ఈ విధంగా ఆత్మయందు ఆత్మచే ఆత్మకు వేరైన దృష్టియే ‘జగత్తు’ అనబడు “అసత్యాతి" అయివున్నది.
అన్యథాఖ్యాతి - సజ్ యథా ఖ్యాతి… ఖ్యాతి అంటే ప్రేరణాత్మకమైనది. ఆత్మయందు జగత్తును ప్రేరేపించేదేదీ లేదు. జగత్తు ఆత్మ చైతన్యమునకు భిన్నమైనది కాదు. భిన్నమైనదైయుంటే “ప్రేరేపించునది-ప్రేరేపించబడే జగత్తు ఉండేవి. అప్పుడు ఆత్మ అద్వితీయం ఎట్లా అవుతుంది?
సజ్ = సద్వస్తువగు ఉనికి; యథా = ఏ విధంగా అయితే; ఖ్యాతి = కనిపింపజేస్తోందో; ఆత్మ = అది ఆత్మయే
Page:499
ఆత్మయే ఆత్మను ఈ జగత్తుగా చూస్తోంది. ఈ విధంగా అసతాఖ్యాతి = అసత్తును కనిపింప చేసేది. అన్యథా ఖ్యాతి = మరొకటిగా మార్చుచున్నది.
ఇవన్నీ ఏమీ లేవు. అందుచేత 1. ఆత్మ వేరు - జగత్తు వేరు, 2. ఆత్మలో జగత్తు ఉన్నది?… రెండు కూడా ఖండించబడుచున్నాయి.
శ్రీరాముడు : ఆత్మ - జగత్తుల సంబంధ నిర్వచనములైన “అఖ్యాతి - అన్యథా ఖ్యాతి - అసత్యాతి” అనేవి స్వప్న - మనోరాజ్య - - తదితర దృశ్యములవలె కల్పనా మాత్రము లేనని అనుకోవచ్చు కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. ఆత్మ-జగత్తుల ఆ సంబంధము కల్పనామాత్రమేనని, జగత్తు చైతన్యము యొక్క చమత్కారభూతమేనని అనుకొంటే అద్దానియందు మాకు ఎట్టి అభ్యంతరమూ లేదు.
ఎప్పుడు, ఎచట- చిన్మాత్రాకాశం యొక్క ఏఏ నిర్మల విభాగాలు ఎట్లెట్లు (ద్రష్టత్వంచే) స్ఫురిస్తున్నాయో… అప్పుడు అచట - అది ఆయా ప్రకారంగానే స్థితినొంది ఉన్నదగుచున్నది.
ఆత్మఖ్యాతిః అసత్యాతిః అఖ్యాతిః ఖ్యాతిరన్యథా |
ఇత్యేతాః చిత్ చమత్కృత్యా ఆత్మఖ్యాతేర్విభూతయః ॥
కాబట్టి రామచంద్రా! లక్ష్యార్థము ఆత్మ యొక్క (లేక ఆత్మఖ్యాతి) యొక్క విభూతులే వ్యాఖ్యార్థమగు 1. ఆత్మఖ్యాతి, 2. అసత్యాతి, 3. అఖ్యాతి, 4. అన్యథాఖ్యాతి అనే నాలుగు అయివున్నాయి. అనాత్మ అయివున్నది, అన్యథాగా కనిపింపజేసేది… ఇవన్నీ ఆత్మ విభూతులే! అట్టి ఆత్మ విభూతులకు వేటే అయి సర్వదా యథాతథమై ఉన్నదేదో… అదియే ఆత్మ అనబడే ప్రతి జీవుని స్వస్వరూపం. ఆత్మకు వేరుగా ఏదైనా ఎక్కడైనా - ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటే… అట్లా అనిపించటమే అనాత్మత్వం.
చిద్రూపమగు పరబ్రహ్మము… ఆత్మఖ్యాతి (ఆత్మయొక్క ప్రసరణం) అనునదేదీ కలిగి ఉండలేదు. అద్దానికి వాచ్యార్థముకానిది, లక్ష్యార్థమయినది ఆత్మ. అట్టి ఆత్మకు ఆద్యంతాలు లేవు! జీవ - జగత్ పరిమితాలు లేవు! ఆ చిద్రూప పరబ్రహ్మమగు ఆత్మ వాక్కుచే చెప్పబడగలిగేది కాదు! అది సర్వదా ఏకము! శిలా గర్భము వలె అత్యంత ఘనీభూతమైనది!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సర్వ ద్వైత దృష్టులను నిరసిస్తూ జ్ఞానమును ప్రకాశింపజేసే “శిలాఖ్యానము” అను అధ్యాత్మ శాస్త్రములోని ఒక విశేషాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. విను.
మాకు తెలిసియున్నట్టి, మాకు ఎదురుగా కనిపిస్తూవున్నట్టి ఒకానొక “శిల” ఉన్నది. ఆ శిల పరిణామం కొన్ని కోట్ల - కోట్ల యోజనములు. అసలు అద్దాని పరిణామమెంతో మేము చెప్పలేం. అది అన్ని వైపులా విస్తరించి ఉన్నది. ఈ కనబడే ఆకాశమునంతా ఆక్రమించిన ఒక గోడ ఉన్నదనుకొంటే, అది అత్యంత విస్తారం కదా! అట్టి లక్షలాది గోడలకంటే కూడా విస్తీర్ణమైనది. ఆ శిల అతి కఠినమైనది. కానీ బహు నిర్మలమైనది, సువిశాలమైనది.
Page:500
మాకు కనబడుచున్న ఆ మహావిస్తీర్ణమైన గండశిలకు అవయవాలు లేవు. సంధులు లేవు. అది అతి దట్టమై, వజ్రంలా అతి దృఢమైనది. అతి విశాలమైనది. మిక్కిలి పరిపుష్టమైనది.
ఆ శిల యొక్క గర్భం అతి కఠినంగాను పరమ గాంభీర్యంగాను చెన్నొందుతోంది. అయినా ఆ శిలా గర్భకోశం ఆకాశంలాగా అతి నిర్మలమై ప్రకాశిస్తోంది. అసంఖ్యాక కల్ప సమూహములు గడచిపోతున్నప్పటికీ ఆ గండ శిల అద్దాని శిలాగర్భ విభాగము ఏ మార్పులు చేర్పులు లేకయే ప్రకాశిస్తోంది. అద్దాని ఉపరితలం, దేహభాగం… ఇవన్నీ అతి రమణీయమై, ప్రశాంతమయమై, అతి నిర్మలమై, మధురాతిమధురమై అత్యంత సౌందర్యంగా ఒప్పుచున్నాయి.
“ఆ శిల ఏ జాతి శిల?" అని నేను పరిశీలించాను. అప్పుడు “అద్దానికి భిన్నంగా మరొక వస్తువే లేదు. ఇక అద్దాని విశిష్ట జాతిని ఎవరం నిర్ణయించగలం?” అని నిశ్చయానికి వచ్చాను. ఆ మహా శిల ఏ ప్రదేశంలో ఉన్నది? ఏ కాలంలో ఉన్నది? ఏ ప్రకారంగా వర్తిస్తోంది? ఎక్కడి నుండి వచ్చింది?… అనే విషయాలు ఎన్నటికీ ఎవరికీ తెలియవచ్చేవి కావు. ఇక నాకు మాత్రం
ఏం తెలుసు?
వింటున్నావుగా రామచంద్రా! అత్యంత ఘనీభూతమై, మహాకఠినమై, వజ్రమువలె అతిదృఢమై, నాశరహితమై ఉన్న ఆ శిలయొక్క అంతర్భాగంలోకి తొంగిచూచాను. ఆ శిలయొక్క గర్భమునందు (అంతర్భాగంలో) పంచ మహాభూతాలుగాని (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశంగాని), చతుర్విధ భూత సముదాయాలు గాని (అండజ, స్వేదజ, వాయుజ, గర్భజ జీవులు గాని) నాకు ఏమాత్రం కనిపించలేదు. అంతా ఘనీభూతమై, ప్రశాంతంగా ఆకాశంవలె నిర్మలత్వము, అత్యంత నిశ్శబ్దముతో కూడిన ‘మౌనము’ అక్కడ తాండవిస్తోంది. అట్లా ఆ శిలయొక్క గర్భ ప్రదేశంలోకి దృష్టి సారించిన నాకు, ఆ శిలాగర్భంలో, స్ఫటిక శిలలోని రేఖలలాగా అనేక స్వావయవభూతములైన (వాటికవే అవయవాలుగా కలిగియున్న) అనేక పద్మములు, శంఖములు, గదలు, చక్రాలు మాత్రం కనిపించాయి. అవన్నీ శిలా దేహములే! ఆ శిలాగర్భంలో వాస్తవానికి ఆకాశ-వాయు-అగ్ని-జల –పృథివి మొదలైనవాటిచే నిర్మించబడిన జగత్తు ఏదీ లేదు. లేదు కానీ… అందులో అనేక రేఖలు ఉన్నాయి. ఆ రేఖలలో కొన్ని ఆకాశంగాను, మరికొన్ని జీవులుగాను కల్పించబడినట్లు కనిపించాయి. వాస్తవానికి ఆ శిలా గర్భంలో ఉన్నదంతా శిలయే అయినా… ఆ రేఖలు అనేక ఆకారాలుగా కనిపించాయి. అట్లా ఆకాశాదులుగాను, జీవులుగాను కనిపిస్తున్న ఆ రేఖలను చూస్తూ ఉన్నాను. శ్రీరాముడు : మహర్షీ! మీరు చూస్తున్నది శిల - అద్దాని కోశవిభాగం కదా! శిల ఎప్పుడూ జడమే కదా! ఆ శిలలో చేతనులగు ‘జీవులు’ అనే రేఖలు కనిపించటమేమిటి? ఇంతకీ అదంతా శిలయా? జీవులా? అందులో పంచభూతాలే లేవని అంటున్నారు కదా! ఇంతలోనే ‘ఆకాశము - - జీవులు’ అనబడే రేఖలు కనిపించాయని అంటున్నారేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నాచే దర్శింపబడుచున్న “విశాలమైనది - ప్రశాంతవంతమైనది” అగు ఆ శిల చేతనం కాదు. జడం కాదు. అద్దానికి భిన్నంగా జడ - చేతనములే లేనపుడు మరి
Page:501
అద్దానిని జడం అని చెప్పనా? చేతనము అని చెప్పమంటావా? అద్దానికంటే వేరుగా ఎవరూ ఎక్కడా లేరు.
శ్రీరాముడు : మునీంద్రా! దానికి వేరుగా ఎవడూ లేడా? లేకపోయినప్పుడు అద్దాని గర్భమందున్నట్టి ఆకాశ జీవులుగా కనిపించే రేఖలను చూస్తున్నదెవరు? ఆ శిలా గర్భంలో ఆ రేఖలను చిత్రీకరించిన వారెవరు? ఏ ఉలి మొదలైన సామాగ్రితో ఆ శిలా గర్భంలో రేఖలను చిత్రీకరించారు.
శ్రీ వసిష్ఠ మహర్షి : అతి దృఢమైన ఆ శిలను ఉలి మొదలైన పనిముట్లతో ఛేదించటం, చిత్రీకరించటం ఎవరివల్ల సాధ్యమయ్యేది కాదు. అద్దానిని ఛేదించగలిగిన వాడెవడూ లేడు. ఆ శిలయే తనయొక్క అపారమైన దేహంతో సర్వత్రా వ్యాపించి ఉన్నది. అయితే ఆ శిలాగర్భంలో రేఖారూపములైన వృక్ష సమూహాలు, పర్వత సమూహాలు, గ్రామ నగరాదులు నాకు కనిపించాయి. సూక్ష్మమైన సాకార - నిరాకారములగు ప్రతిమలలాగా ఆ శిలా గర్భంలో రేఖామయములైన అనేక దేవ దానవ కోట్లు ప్రదర్శనమగుచున్నాయి. అందులో విశాలమైన “ఆకాశం" అనే ఒక పెద్ద రేఖ ఉన్నది. మధ్య మధ్యలో సూర్యుడు, చంద్రుడు మొదలైన పేర్లు గల అనేక అడ్డ దిడ్డమైన రేఖలు కూడా ఉన్నాయి. శ్రీరాముడు : స్వామీ! ఆ శిలా గర్భంలో ఎప్పుడు ప్రవేశించారు? ఎందుకు ప్రవేశించారు? ఎవరు చూచారు? ఆ ఘనీభూతమైన శిలాకోశంలో ఆకాశము, మానవులు, దేవతలు, దానవులు మొదలైన జడము-చైతన్యము కూడా అయినట్టి ఆ రేఖలు ఎట్లా కనిపించాయి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ శిలాగర్భాంతర్గతమైన రేఖలన్నీ నేను చూచాను. కాస్త తలచుకుంటే నీవు కూడా ఆ ఆకాశ - జీవాది రేఖలను తప్పకుండా చూడలగవు.
శ్రీరాముడు : మహర్షీ! ఆ శిల వజ్రము వలె అతిదృఢమని, అద్దానిని ఛేదించటం ఎవరివల్లా కాదని మీరే అన్నారు కదా! ఆ శిలాంతర్భాగంలోకి మీరు ఆ ఆ శిలను ఛేదించి ఎట్లా ప్రవేశించారు? అందలి అంతర్భాగంలో ఆ రేఖలను ఎట్లా చూడగలిగారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ! నేనెట్లా ప్రవేశించి ఆ రేఖలను చూచానా! అనియా నీ సందేహం? అయితే విను. ఆ శిలాగర్భంలో నేను ప్రవేశించనేలేదు. ప్రవేశించవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే ఆ శిలా గర్భంలో గల రేఖలలో నేను కూడా ఒకానొక రేఖను అయి ఉన్నాను కాబట్టి. అందులో రేఖను కాబట్టే తదితర సర్వ రేఖలను దర్శించగలిగాను. అంతేగాని, ఆ శిలను ఛేదించటం ఎవరి తరం? శ్రీరాముడు : ఓ మునీశ్వరా! అసలు ఆ శిల వాస్తవంగా ఏమైవున్నది? “ఆ శిలా గర్భంలోగల నేను కూడా ఒకానొక రేఖను”… అని మిమ్ములను గురించి మీరు చెప్పుకుంటున్నారు కదా! తాము వాస్తవానికి ఎవరు? మా గురుదేవులు వసిష్ఠులు కాదా! మీరు అందులో జడము, చైతన్యము గాని ఒక రేఖ అనేది నేను ఊహించలేకపోతున్నానే! మీరు వర్తిస్తున్నది ఎచ్చట? ఆ శిలారూపం గురించి చెప్పటంలో తమ ఉద్దేశము ఏమిటి? ఆ శిలయందు తాము ఏమేమి చూచారు? అవన్నీ వివరించండి.
Page:502
శ్రీ వసిష్ఠ మహర్షి : నేను “శిలాఖ్యానము” అనే ఒకానొక చమత్కారమైన కథనాన్ని వినిపించాను కదా! ఈ విశేషమును సర్వవ్యాపకమగు పరమాత్మయొక్క ‘మహాసత్త’ గురించి చెప్పటానికే ఉద్దేశించాను. అంతేగాని మరేదో విశాలమైన శిల గురించి కాదు. ఆ ‘పరమాత్మ మహాసత్త’ అనబడే శిలాఘనము యొక్క గర్భమున నీవు, నేను, ఈ సర్వసహజీవులు మనమంతా ఏర్పడి ఉన్నవారమై వర్తిస్తున్నాం. ఈ ఆకాశము, సమస్త క్రియలు, ఈ శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాలు, సమస్త జీవుల వాసనలు, కాలము, సప్త సముద్రాలు, అందలి వివిధ జీవుల సంస్కారాలు… ఇవన్నీ కూడా ఆ మహాశిలాంతర్భాగపు విభాగములే సుమా! ఈ పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సర్వజీవుల మనస్సులు, బుద్ధులు, చిత్తములు, అహంకారములు… ఇవన్నీ కూడా ఆ పరమాత్మ సత్తా మహాశిల యొక్క వివిధ అంతర్భాగరేఖలే. వాస్తవానికి ఆ ’మహాసత్త’ కంటే వేరుగా ఇక్కడగాని, మరెక్కడైనాగాని, ఇప్పుడుగాని, మరొకప్పుడు గాని మరింకా ఏదీ లేనే లేదు. అద్దాని కంటే మనమంతా ఏమాత్రం వేరుకానప్పటికీ అద్దానికంటే నీవు, నేను, వారు, వీరు వేరుగా ఉన్నట్లు భ్రమ చేత మాత్రమే తలచుచున్నాము. సమస్తము చిన్మాత్రైక స్వరూపమే అయివున్నది. చిన్మాత్ర సత్తకంటే ఎచ్చట ఏది ఉన్నదో చెప్పు చూద్దాం! కుండ, మట్టి, దూది, వస్త్రం… అన్నీ కూడా శుద్ధ జ్ఞానైకమాత్రమేనయ్యా!
ఒకే స్వప్నం అనేక నామరూపాలుగా వర్తిస్తున్నట్లుగా… ఒకే జలం అనేక తరంగాలు వివిధ ఆకారాలుగా కనిపిస్తున్నట్లుగా… ఒకే వాయువు అనేక తరంగాలుగా ప్రసరణ మగు వేరువేరు చోట్ల వేరు వేరు కార్యక్రమములను నిర్వర్తిస్తున్నట్లు, ఒకే సూర్యుని నుండి అనంతసంఖ్యగా కిరణాలు బయల్వెడలుచున్నట్లు. ఏకము అయినట్టి చిద్రూపం మనందరి రూపాలుగా ఈ ఈ లోకాలుగా, అనుభవాలుగా వ్యక్త-అవ్యక్తములు ప్రదర్శితమౌతున్నాయి.
ఇదం బ్రహ్మఘనం సర్వం చిన్మాత్ర ఘనమాతతమ్ |
పరమార్ధ ఘనం శాంతమ్ సర్వమ్ “ఏకఘనమ్” విదుః ||
ఇదంతా కూడా ఇద్దాని భూత-వర్తమాన భవిష్యత్తులతో సహా “సర్వ వ్యాపకము, చిన్మాత్ర ఘనము, పరమ శాంతము, పరమార్థ ఘనస్వరూపం, ఏకము, నిర్లిప్తము, మహా మౌనస్వరూపం”… అగు పరబ్రహ్మమే అయి ఉన్నది.
ఓ రామచంద్రా! మనకు కనిపించే జగత్తంతా కూడా… “ఏకము, ఛిద్రరహితము, అనంతము, ఆది మధ్యాంత రహితము” అయినట్టి “మహాచైతన్యము” అనబడే ఒక మహాశిల యొక్క ఉదరభాగమే! అట్టి బ్రహ్మమే తన రూపముగా గల ఆ శిల తానే “సృష్టి-జగత్తు-భువనము” మొదలైన పర్యాయ పదములచే ప్రసిద్ధమగుచున్నది. అట్టి కల్పనను స్వీకరిస్తున్నది అదియే! అందుచేత ఓ సభికులారా! “నాచే దర్శించబడుచున్న ఈ సర్వ దృశ్యమంతా ఈ ద్రష్టగా వ్యవహరిస్తున్న నాతో సహా పరబ్రహ్మము
Page:503
నకు అద్వితీయమై, అభేదమై జలంలో జలతరంగాలలాగా… చెన్నొందుచున్నది”… అనే అధ్యాత్మ దృష్టిని, ఆత్మ దర్శనమును సముపార్జించుకొని తద్వారా సత్యద్రష్టలు కండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఇంతకుముందు నాలుగు ఖ్యాతుల గురించి చెప్పాను కదా! 1.ఆత్మఖ్యాతి : ఈ జగత్తు ఆత్మయొక్క విన్యాసం.
2.అసత్యాతి : ఈ జగత్తు అసత్తు. అట్టి అసత్తు సత్తుయగు పరమాత్మ నుండే వ్యక్తమౌతోంది. 3.అఖ్యాతి : నిర్మలమైన పరమాత్మలో దోషభూయిష్ఠమైనట్టి ఈ జగత్తు ఉంది. 4.అన్యథాఖ్యాతి : పరమాత్మలో పరమాత్మకు అన్యమైనట్టి ఈ జగత్తు ఉన్నది.
ఈ నాలుగు అవగాహనలు కూడా జ్ఞానియొక్క దృష్టిలో కుందేటి కొమ్ములలాగా మొదలే లేనివగుచున్నాయి. అనగా అవి మిథ్యయే! జ్ఞానికి అసత్యాతి మొదలైనవి సంభవించుటయే లేదు. ఎందుకంటే ఈ జగత్తు ఎట్లా ఉన్నప్పటికీ ఆతడు సదా శాంతము, అనిర్వచనీయము, సర్వ కల్పనలకు ఆవల ఉన్నది - చిత్తం యొక్క చేష్టలచే స్పృశించబడనిది, ఈ జీవ జగత్తులకు అతీతమైనది, అప్రమేయమైనది… అగు ఆత్మస్వరూపమునే అంతటా స్వభావ సిద్ధంగా గాంచుచున్నాడు.
‘ఆత్మఖ్యాతి’ మొదలైన భ్రాంతి దృష్టులన్నీ చిన్మాత్రము నుండే ఉదయిస్తున్నాయి. అట్టి చిన్మాత్రం పరమార్థమున “మహాశుద్ధము - సర్వ కల్పనా శూన్యము” అయినట్టి చిదాకాశమే అయివున్నది. కాబట్టి సమస్త కల్పన కూడా చిదాకాశమే అయివున్నది.
అయమాత్మా త్వియం ఖ్యాతిః ఇత్యస్తః కలనాభ్రమః |
న సంభవతి అతశ్చైనం శబ్దం త్యక్త్వా భవార్థభాక్ ॥
ఓ రామచంద్రా! ఇది ఆత్మ, ఇది ఆత్మ యొక్క ఖ్యాతి (సృష్టిరూపం) ఈ ప్రకారంగా అనిపించే దంతా కల్పనాప్రభావమే అయివున్నది. “ఆత్మ-ఆత్మకు వేరుగా సృష్టి“… అనబడే విభాగం ఎన్నడూ సంభవించటయే లేదు. కాబట్టి ఇట్టి శబ్ద విభాగమును త్యజించి ’పరమార్థభాగి’విగా అగుము. ”విభాగ రహితమగు పరమాత్మ యందు పరమాత్మకు వేరుకానట్టి పరమాత్మతత్త్వమే విభాగమే నేను”… అన్న భావనను పెంపొందించుకో! ఈ జగత్తులో జీవులు రావటం, జీవులు పోవటం, భోజనాదులు, అనుభూతులు, అనుభవాలు… ఇవన్నీ జరిగిపోతూ ఉన్నప్పటికీ వాస్తవానికి ఈ దృశ్యజగత్తు వ్యాపార శూన్యమై ఉన్నది. ఆకాశమువలె ఇదంతా మహామౌన స్వరూపమై ఉన్నది. అభేద్యమగు చిన్మాత్రమే ఈ జగత్తు.
ఈ జగత్తు… అనేక శబ్దములతో కూడుకొని ఉన్నప్పటికీ, యథార్థానికి మౌనంగా వర్తిస్తోంది. నిరంతరము గమన-ఆగమనము (రాక పోకలు) సల్పుచున్నప్పటికీ, ఇదంతా ఆకాశమువలె, ఒక పర్వతమువలె ఒకే స్థానములో ఉండి ఉన్నది.
Page:504
అనేక కార్యారంభములతో కూడుకొని ఉన్నప్పటికీ, మార్పు చేర్పులు లేనట్టి ఆకాశమువలె వెలయుచున్నది. పంచభూత సహితమైనప్పటికీ, పంచభూత రహితమైయున్నది. అనేక పదార్థములతో పరిపూర్ణమై ఉన్నప్పటికీ, సర్వ పదార్థ వర్జితమై కేవలము జ్ఞానమాత్రంగా చెన్నొందుచున్నది.
స్వప్నంలో కనిపించే మహానగరంలాగా అగుపిస్తున్నప్పటికీ… సదా నిర్మల చిన్మయ స్వరూపమే అయివున్నది. అనేక ప్రయత్న సంరంభములతో కూడుకొని ఉన్నప్పటికీ… సంకల్పం (ఊహ)లో కనిపించే దృశ్యంలాగా సర్వ ప్రయత్న శూన్యమై ఒప్పుచున్నది.
అంతేకాదు ఈ ‘జగత్తు’ అనబడే దృశ్యము స్వప్నంలో కనిపించిన స్త్రీతో సంగమంలాగా భ్రాంతిరూపము. ప్రతిబింబ స్త్రీవలె (అనుభూతమగుచున్నప్పటికీ) వ్యర్ధము అయివున్నది. ఇది అనేక అనుభవములతో కూడుకొని ఉండవచ్చుగాక! కానీ, వాస్తవానికి సర్వానుభవరహితమై వస్తుశూన్యమై వర్ధిల్లుతోంది!
శ్రీరాముడు : హే మహర్షీ!… ఎప్పుడైతే జాగ్రత్ స్వప్న రూపమని అనతగ్గ ఈ జగత్తు “లేనిదే” (లేక) “వాసనామాత్రమే” అయి కనిపిస్తోందో… ఇకప్పుడు ఇది “స్మృతి యొక్క రూపమేనని నేను అనుకుంటున్నాను. “సద్రూప బాహ్య పదార్థముల యొక్క స్మృతియే ఈ జగత్తుకు కారణం. అంతే గాని ఈ జగత్తు భ్రాంతి కాదు” అని కొందరికి అనిపిస్తోంది.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! చిదాకాశము నందు "అద్దానికి అభిన్నమే” అనతగిన రూపం గల ‘స్ఫురణ’ అనబడేది బయలుదేరుతోంది. అట్టి స్ఫురణకు, చిదాకాశము కంటే వేరైన రూపమేదీ లేదు. ఎందుకంటే చిదాకాశం కంటే వేరైనదేదీ చిదాకాశంలోనుంచి బయల్వెడలటానికి ఏ బాహ్య కారణం ఉండజాలదు కాబట్టి. అట్టి నిరాకారము - చిదాకాశ స్వరూపము అగు స్ఫురణకు కారణం లేదు. గాలియందు వాయుతరంగాలవలె, అగ్నియందు అగ్నిశిఖలకు గల ఆకారం వలె, బంగారమునకు ఆకారం వలె “చిదాకాశం యొక్క చిత్ స్ఫురణకు కారణమేమిటి?” అనే ప్రశ్నకు సమాధానం ఉండజాలదు. అందుచేత అది స్వభావసిద్ధమే!
చిదాకాశమునందు చిత్ స్ఫురణ స్వభావ సిద్ధమే! - అట్టి సత్తా మాత్రమైనట్టి స్ఫురణయే కాకతాళీయంగా శరీరమును ధరించినదై నిష్కారణంగా దృశ్యరూపంగా భాసిస్తోంది. అదియే భ్రాంతిరూపంగా కనిపించే ఈ జగత్తు. ఇక ‘స్మృతి’ అంటావా! అట్టి స్మృతియొక్క నాందీ ప్రస్తావనా రూపం స్ఫురణయే! అట్టి స్ఫురణ చిదాకాశమే! కనుక ఈ ’జీవుడు’ అనబడే ద్రష్ట - ఆతని స్మృతి రూపంగా నీవు అనుకుంటున్న ఈ జగత్తు… ఉభయములూ లేకపోయినప్పటికీ, (జలానికి అభిన్నమైన… జలానికి స్వభావమే అయి ఉన్న తరంగం వలె) ఆకారం కలిగి ఉంటోంది కదా! నాశరహితం, సర్వవ్యాపకం, శాంతం, జగద్రహితం - అయినట్టి పరమాత్మలో జగద్భావ రూపమగు ఈ జగత్తు పరమాత్మకు అభిన్నమై వెలయున్నది. సర్వ రూపం, పదార్థ రహితం, పరమ శాంతం, చిదాకాశమయం - అగు పరమాత్మ ఎట్లా కారణరహితమో… అట్లాగే జగత్తు చైతన్యమునకు అభిన్నమైన కారణంగా జగత్తు కూడా అకారణమే! అట్టి పరమాత్మ చైతన్యం ఎప్పుడెప్పుడు తనలో
Page:505
అవిద్య ద్వారా ఎట్లెట్లు స్ఫురిస్తోందో… అపుడపుడు అచ్చటచ్చట ఆయా ప్రకారంగానే ఈ జగత్తు భాసిస్తోంది. ఎక్కడెక్కడ చైతన్య స్ఫురణ భాసించదో… అక్కడక్కడ జగత్తు కూడా భాసించదు.
ఓ రామచంద్రా! బ్రహ్మస్వరూపమగు ఆత్మ తనయొక్క పరమాత్మ స్వరూపమును ఏమాత్రం ఏ క్షణంలోనూ త్యజించుటయే లేదు. అయ్యది సర్వ శక్తిమంతమగు చిత్స్వరూపమే కాబట్టి సర్వమునకు తానే కారణమై ఉంటోంది. తన నిర్మల స్వభావమగు బ్రహ్మ స్ఫురణకే “ఇది జాగ్రత్తు, ఇది స్వప్నం, ఇది సుషుప్తి, ఇది తురీయం, ఇది బ్రహ్మము, ఇది ఆత్మ"… ఇత్యాది నామములను తానే స్వయంగా గావించుచున్నది.
వస్తుతస్తు అస్తి న స్వప్నో, న జాగ్రత్, న సుషుప్తతా
న తుర్యం, న తతో అతీతం, సర్వం శాంతం పరం నభః ||
కానీ రాఘవా!… వాస్తవానికి జాగ్రత్తుగాని, స్వప్నంగాని, సుషుప్తిగాని లేవు. వాటన్నిటి యందు పుష్పమాలయందు దారమువలె అనుస్యూతమై, వాటన్నిటికంటే పరమై, శాంతమగు పరబ్రహ్మ రూప చిదాకాశమే ఆ సమస్తము కూడా అయివున్నది.
లేదా… ఇదంతా కూడా ఈ జగత్తంతా కూడా)… చైతన్యము ఏ క్షణము నిదురించదు కాబట్టి సర్వము అనునిత్య జాగ్రత్ రూపమే అయివున్నది. ఇదంతా చైతన్యము యొక్క స్వప్న మాత్రమే కాబట్టి, సర్వము స్వప్న రూపమే అయి ఒప్పుచున్నది. అంతా అవిద్య మాత్రమే కనుక… సర్వము సుషుప్తి రూపమే అయి వెలయుచున్నది.
ఈ ద్రష్ట సర్వదా అవస్థాత్రయమును దాటివేసిన తురీయరూపుడే కాబట్టి ఈ ‘జగత్తు’ అనబడే సర్వము తురీయ రూపమేనని కూడా మనం తప్పకుండా అనవచ్చు. ఆత్మానుభూతులగు జ్ఞానుల దృష్టి యందు ‘నీవు, నేను, అది, ఇది’ అనే కల్పనలు ఉండటం లేదు కనుక అంతా కూడా పరమాత్మ యందు పరమాత్మకు అభిన్నమై, పూర్ణశాంతరూపమై ఉన్నది… అన్నది కూడా ఎవరమూ కాదనలేని సత్యం.
అంతటా జలమయమైయున్న సముద్రంలోకి మనం పోయి… ఇవి తరంగాలు కాదు, తరంగాలుగా కనిపించేదంతా సముద్ర జలమే! ఇది తెల్లటి నురుగు కాదు, నురుగుగా కనిపించే సముద్ర జలమే! ఇవి బుద్బుదములు (బుడగలు) కావు, బుద్బుదములుగా కనిపించేదంతా జలమే! అయినా కూడా తరంగాలు వేరు, నురుగు వేరు. తుంపరలు వేరు. బుద్భుదములు వేరు… ఇట్లా చెప్పుకోవటం ఎట్లా ఎంతవరకు మిథ్య (మరియు) యుక్తియుక్తమో… అట్లాగే “చిదాకాశము” అనే మహాసముద్రంలో కనిపించే ఆయా విశేషాలను "ఇది జాగ్రత్. ఇది స్వప్నం. ఇది జగత్తు. ఇది ద్రష్ట”… అని చెప్పుకోవటం చిదాకాశం ద్రష్ట్యా మిథ్య - యుక్తియుక్తము కూడా అయివున్నది.
అయితే ఈ జగత్తు సత్తా? అసత్తా? అని ఎవరైనా ఇంకా ప్రశ్నించారనుకో, అపుడు, “ఒకానొకటి సత్తు అయినా, అసత్తు అయినా చిదాకాశం దేనిని ఎట్లు ఎరుగుచుండటం జరిగితే అది ఆ ప్రకారమే అనుభవమగుచున్నది”… అని చెప్పక తప్పదు. ఈ విధంగా చైతన్యం నిజ చిదాకాశమునందే
Page:506
సత్-అసత్ పదార్థములను స్వయంకృతంగా అనుభవమునకు, అనుభూతికి తెచ్చుకోవటం జరుగుతోంది. కనుక ఓ రామచంద్రా! ఈ జగత్తంతా కూడా చైతన్యము యొక్క స్ఫురణ మాత్రమే అయివున్నది. అనగా చైతన్యము ఎట్లా స్ఫురిస్తోందో… ఈ జగత్తు అట్లే భాసించుచున్నది. వాస్తవానికి చిదాకాశమునందు చిదాకాశమే జగద్రూపంగా భాసించుచున్నదగుచున్నది.
చైతన్యము చిదాకాశము యొక్క సారమేనయ్యా! అది సదా ఏకరూపమై ఉదయాస్తమయములు లేకయే వెలయుచున్నది. ఈ జీవుడు చైతన్య స్వరూపుడే! అట్టి చైతన్యము యొక్క స్వకీయమైన అవయవం వంటిదే ఈ జగత్తు. అనగా సృష్టి, మహా ప్రళయ రాత్రింబవళ్ళు, తదితర కాలవిభాగం, ఇవన్నీ కూడా చైతన్యం యొక్క అవయవ విభాగత్వముగానే ఏర్పడినవై ఉన్నాయి. అందుచేత వాయువు, వాయువు యొక్క చలనం వలె స్ఫురించేది, స్ఫురించనిది, చిద్రూపము, మాయారూపంగా భాసించేదీ… అంతా కూడా చిదాకాశం యొక్క ఒకానొక విభాగమే సుమా! దేహానికి గోళ్ళు మొదలైనవి శరీర విభాగంగానే ఉన్నట్లు జగత్తు చిదాకాశ దేహము యొక్క ఒకానొక విభాగము వంటిదే! కనుక ఇక జాగ్రత్తు ఏమి? స్వప్నం ఏమి? సుషుప్తి ఏమి? తురీయమేమి? స్మృతి ఏమి? విస్మృతి ఏమి? ఇచ్ఛ ఏమి? జగత్తు ఏమి? ఇట్టి కుదృష్టులన్నీ మిథ్యయే అయివున్నాయి.
అన్తః సంవేదనం భాతి స్వం బాహ్యార్థతయా యతః ॥
క్వ ద్వైతం? క్వచ కా అర్ధశ్రీః? స్మృతిరేవమతః కుతః ॥
చైతన్యం యొక్క స్వకీయమైన అభ్యంతర స్ఫురణయే బాహ్య పదార్థాకారంగా భాసించు చుండగా… ఇక ద్వైతమెక్కడ? పదార్థములెచట? పదార్థములే లేనప్పుడు, ఇక వాటి గురించిన ’స్మృతి’ ఎక్కడున్నది? నిరాధారమగు ఆకాశమున ప్రకాశించే సూర్యగోళం యొక్క ప్రకాశం దేనినీ ఆపేక్షించకుండానే అంతటా వెలుగొందుచున్నది చూచావా? భేదరహితమగు ఆత్మరూపంగా ఈ దృశ్యం భాసిస్తోంది. అట్టి ఆత్మ ప్రకాశం భౌతిక పదార్థవర్జితం. ఈ జగత్తు ఆత్మయొక్క నిజస్వరూప ప్రకాశమేగాని భౌతికం కాదు. భౌతికంగా (సాకారయుక్తంగా) లేదు.
ఈ భౌతిక పదార్థములు నిజదృశ్య రూపముచే సత్యమయివుంటే… అప్పుడు వాటికి సంబంధించిన స్మృతి సృష్టికి కారణభూతములని అనవచ్చునేమో! కానీ ఇది పంచభూత సమ్మేళనమే! ఏ దృష్టితో ఇవి చూడబడుచున్నాయో… అదంతా కూడా స్వకీయమైన ద్రష్టయొక్క కల్పనా సదృశమే! కల్పనా చమత్కారమే! సృష్ట్యాది యందు అంతా అకారణమై ఉండగా పంచభూతాలు ఉద్భవించటానికి కారణమేమున్నది? అట్టి కారణ అభావం చేత దృష్టికి వేరుగా పంచభూతములే జనించటం లేదు. ఈ రీతిగా ఈ బాహ్య పదార్థములు లేకయే ఉన్నాయి.
కుందేటి కొమ్ములు ఎవరి వలన ఏ కారణంచేత కనిపిస్తున్నాయి? ఆకాశంలో వెంట్రుకాకారాలు ఎవరి కారణంచేత మెలికలు పడిన దారమువలె అగుపిస్తున్నాయి? వంధ్యా పుత్రుడు (గొడ్రాలి కుమారుడు) వీథిలో ఎందుకు అల్లరి చేస్తున్నాడు? దూరపు కొండలు నునుపుగా ఎందుకున్నాయి? నక్షత్ర మండలం సింహము - - తేలు మొదలైన ఆకారాలలో ఎందుకు కనిపిస్తోంది? ఎండమావులలో జలము ఎందుకు అగుపిస్తోంది?
Page:507
ఈ జగత్తు కూడా అట్లాగే అనుభవమౌతోంది. కనుక ఈ జగత్తు వాస్తవం కాదు. ఇక ’నీవునేను’ మొదలైన వేరు వేరైనట్లుగా కనిపించే జగత్ పదార్థములన్నీ విచారణ చేయకపోవటం చేతనే అట్లా భాసిస్తున్నాయి. విచారణ చేసినప్పుడు అవన్నీ స్వప్నంలోని ‘నేను - నీవు’ లాగానే లేనివే అగుచున్నాయి. ఓ రామచంద్రా! అజ్ఞానులకు మహాకారయుక్తంగా భాసించుచున్న ఈ జగత్తు తత్త్వజ్ఞుల దృష్టి యందు “మూర్తామూర్త రహితమైనట్టి అఖండ చైతన్య ఘనము. నిత్యోదితమై ఉన్నప్పటికీ… అయ్యది వ్యవహారమునందు ఎప్పుడెప్పుడు ఉదయించుచున్నదో… అప్పుడప్పుడే అట్లే ఉదయ - అస్తమయము ఉన్నదానివలె అగుపిస్తోంది. ఎప్పుడైతే జీవుడు “ఇది భూమి - అది ఆకాశం”అని ఎరుగుచున్నాడో… అప్పుడు ఆత్మ సత్తా యొక్క ప్రకాశమే అట్లు ‘భూమి - ఆకాశము’ మొదలైన రూపములుగా ఆతనికి కనిపించుచున్నదగుచున్నది. జన్మరహితమగు మహాచైతన్య రూప చిదాకాశము తన యొక్క స్ఫురణకు ‘ఇది నేల, ఇది ఆకాశం’ మొదలైన పేర్లను కల్పించి, అటు తరువాత వాటితో వ్యవహరిస్తున్నది. ఒక పసిబాలుడు తన మనోరాజ్యంలో బంధు గృహములను, ఆట వస్తువులను, సహచరులగు బాలురను దర్శిస్తాడు చూచావా? అట్లాగే నాశనరహితమగు చిన్మాత్రము తనయొక్క ఆకాశమువలె నిర్మలము, విశాలము అయినట్టి స్వరూపమునే ఈ భూమి మొదలైన సర్వ విశేషములతో కూడి దృశ్యముగా దర్శిస్తోంది. ఓ ప్రియ సభికులారా! ప్రియ పాఠకులారా! మీకు జగత్తుగా కనిపించుచున్నదంతా నాశరహితము - నిర్మలము అగు పరమానంద చిన్మయాకాశమే! మీ మహానంద స్వస్వరూపమునకు అన్యంగా జగత్తు అనబడునది ఏదీ లేదు.
అంతా మీ చిదాకాశ స్వరూపమే అయివుండగా… ఇక స్ఫురణ ఎక్కడ? అస్ఫురణ ఎక్కడ? కనుక, “అయ్యో నాకీ జగత్ స్ఫురణ తొలిగేది ఎట్లా?" అనే వ్యర్థ భావన కూడా అనవసరమే కదా! ఎందుకంటే… వాయువుకు తరంగాలవలె! [అనగా వాయువు నిశ్చలం (అస్పందము) - - వాయు తరంగాలు చంచలం (స్పందము)] వాస్తవానికి మనందరి చిత్స్వరూపం నిశ్చలం. మన చిదానంద స్వస్వరూపం - చైతన్య శక్తిచే నిశ్చలం. ప్రాణ మనోశక్తిచే చంచలం. నిశ్చల చంచలములు మన ఆత్మయొక్క చమత్కారములే!
చిదాకాశము ఏ విధంగా స్ఫురిస్తోందో ఆయా ప్రకారంగానే ఈ భూమ్యాకాశాదులు భాసిస్తున్నాయి. అనగా మనకు భూమ్యాకాశాలుగా భాసించేది మనలో ప్రతి ఒక్కరి చిదాకాశ రూపమే! చిదాకాశమే చిదాకాశము నందు చిదాకాశంగా భాసిస్తోంది. చిదాకాశ స్వరూపులమగు మనయందు చిదాకాశ స్వరూపమగు మనస్సు ద్వారా చిదాకాశ స్వరూపమగు ‘జగత్తు’ భాసిస్తోందని వేదాంత జ్ఞానులగు మహనీయులు సుస్పష్టంగా నిర్దుష్టంగా గ్రహించియే ఉంటున్నారు.
ఓ జనులారా! “ఈ సమస్త రూపముగా రూపరహిత చిదాకాశమే ప్రకాశించుచుండగా, ఈ జగత్తు – నాతో సహా మనమందరం కూడా సర్వదా చిదాకాశరూపులమై సర్వదా ప్రకాశిస్తున్నాం!”… అను అవగాహనయే వేదాంత జ్ఞానము యొక్క పరాకాష్ఠ, ఓ రామచంద్రా! అట్టి ”స్వయమేవ ఆత్మన్ ఆత్మానం వేత”… స్వరూపులు, ఆత్మ సాక్షాత్కారానంద స్వరూపులగు మహనీయులు ఈ విశ్వామిత్ర నారదాది అనేకమంది ఎందరో ఈ సభలో ఉన్నారు. “చిత్స్వరూపుడగు జీవుని
Page:508
చిత్స్వరూప విన్యాసమే ఆతనికి కనిపించే జగత్తు” … అని వారు అత్యంత నిర్దుష్టంగా యెరిగియే మన ఈ సంవాదమును ఆనందంగా ఆస్వాదిస్తున్నారయ్యా!
ఇక ఈ అనేక నామ రూప భేదాలతో కూడిన ఈ జగత్తు అంటావా? ఇది ఎట్లా భాసిస్తుంటే అట్లాగే భాసించనీ! భాసించుచున్నదంతా వాస్తవానికి చిదాకాశ స్వరూపమే కదా! కనుక ఇదంతా సర్వదా సత్తు కాదు. అసత్తు కాదు. వస్తువు కాదు. అవస్తువు కాదు. “ఇది అనిర్వచనీయం”– అని మేము గ్రహించియే ఈ జగత్తులో క్రీడగా, లీలగా సంచారం చేస్తున్నాం.
ఇదమిత్థం అనిత్థంచ సద్వా అసద్వా యథా స్థితమ్ లోక పర్యాయ వృత్తాంతం ప్రాజ్ఞో జానాతి, నే తరః ॥
ఓ రామచంద్రా! ఈ జగత్తు ఈ ప్రకారంగానే ఉన్నదా? మరొక విధంగా ఉన్నదా? ఇది సత్తా? అసత్తా? ఇటువంటి లోక పర్యాయవృత్తాంతం తత్త్వజ్ఞాని మాత్రమే యథార్థంగా ఎరుగు చున్నాడు. తత్త్వజ్ఞానదృష్టి లేనివాడు ఈ జగత్తు ఎట్టిదో ఎరుగనేలేడు. ఎందుకంటే, తత్త్వజ్ఞుడు “సర్వుల హృదాకాశమున నేనే ఆత్మరూపంగా వెలుగొందుచున్నాను” అనీ, “నా రూపమే వీరికి ఈ జగత్తుగా కనిపిస్తోంది” అనికూడా గ్రహించి… ఉత్తమ బుద్ధిని సంతరించుకొని ఉంటున్నాడు. అందుచేత “నా యొక్క దృశ్య సంవిత్తే అభ్యంతర మనోబుద్ధ్యాదులు అయివుండగా, బాహ్యరూప బ్రహ్మాండములుగా వెలుగొందుచున్నది” అను అవగాహనచే ఆతడు ఈ దృశ్య వ్యవహారమంతా ఆస్వాదిస్తున్నాడు.
ఓ ప్రియ జనులారా! వాస్తవానికి ఇచ్చట బాహ్యం లేదు. అంతరం లేదు. దృశ్యం లేదు. అదృశ్యం లేదు. అందుచేత రామా! ఈ శాంత - అశాంత రూపమగు సమస్తమును “ఓం” కార లక్ష్యార్థమగు “శివ రూప బ్రహ్మం” నందు లయింపజేసినవాడవై పరమశాంత స్వరూపుడవగుము. శ్రీరాముడు : స్వామీ! అంతాకూడా శాంతరూప శివబ్రహ్మమే అయివుండగా, ఇక శరీర-మనోబుద్ధి-బాహ్య-అంతరంగాదుల గురించి శాస్త్రములు ప్రతిపాదించే సంవిధానమంతా వృథా కల్పనయేనంటారా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను! శాస్త్రీయ చర్చా సంరంభమంతా అధ్యాత్మాయానంలో ఒక చోట ఆగిపోవుచున్నాయి. అయితే… శాస్త్ర విచారణ లేకపోతే స్వయంకృత జగత్తు - సర్వాత్మకమగు సో హమస్మీ భావం అనుభవానికి రావు.
వాచ్య - వాచక సృష్టి లేకపోతే శాస్త్ర విచారణ సంభవించదు. ఇటువంటి శాస్త్రీయ దృక్పథం, అవగాహన… శాస్త్రకారులు ప్రతిపాదించేది, ప్రబోధించేది - మొదలైనదంతా కూడా ‘ఆత్మజ్ఞాన సిద్ధి’ కొరకే అయివున్నది. అట్టి ‘విచారణ’ లేకపోతే… దీపం ఉన్నప్పటికీ కళ్ళు మూసుకున్న వానికి గదిలో ఏదీ కనబడనట్లే… ఆత్మ అంతటా సర్వదా ఏర్పడియే ఉన్నప్పటికీ, తాను ఆత్మయే అయి ఉన్నప్పటికీ అజ్ఞానం తొలగదు. “నేను ఈ దేహ పరిమిత జీవుడను" అనే చీకటి తొలగదు. అసత్తే
Page:509
అయినప్పటికీ వాచ్య-వాచక వికల్ప వ్యవహారం శాస్త్ర జ్ఞానానుసారం ఆశ్రయించవలసియే ఉంటుంది. ఆ తరువాత క్రమంగా చర్చనీయాంశాలన్నీ ఎందుచేత అసత్ పరిమితమో కూడా స్వయంగా స్వభావ సిద్ధంగా గ్రహించబడుచున్నది కూడా! అందుకే మనం ఈ ’ఉత్తమ విచారణ’ను ఈ సభలో ఇన్ని రోజులుగా కొనసాగిస్తున్నాం. మన ఈ ’విచారణ’ను అనుసరిస్తూ వస్తే క్రమంగా బుద్ధి శుద్ధము, నిర్మలము, ఉత్కృష్టము అగుచూ వస్తుంది. అట్టి మధురమైన నిర్మల బుద్ధితో సంకల్పమయమగు సమస్త శారీరక శాస్త్రీయ జనిత వికల్ప సమూహములు అంతఃకరణం నుండి పారద్రోలివేయబడగలవు. అప్పుడీ మనస్సు సకల శాస్త్రముల అంతిమసారమగు అద్వయ సచ్చిదానందాత్మ యందే నెలకొనగలదు. ఓ రామా! అట్టి తదేక నిష్ణాపరుడవై, ఈ సంసారము ఏమిటో ఎరిగి, ఇద్దాని నుండి ఎగిరి మోక్ష గగనంలో విహరించు!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! వృక్షము అబుద్ధిపూర్వకంగానే కొమ్మలు, ఆకులు, కాయలు, పూలు మొదలైన విభాగములన్నీ తనయందు కలిగి ఉంటున్నట్లు… సముద్రము అబుద్ధిపూర్వకంగా తనలో ఆవర్తములు, తరంగాలు రచించుకొంటున్నట్లు… జన్మ-కర్మ మొదలైన ఎట్టి వికారాదులు లేని పరమాత్మ, ఆకాశము నిర్మలము-విశాలము అయినట్టి తన స్వరూపమునందు… శూన్య రూపములే అగు చిత్ర - విచిత్ర ప్రపంచముల యొక్క అధ్యాసలను, అనేక జాగ్రత్ స్వప్నచిత్ ప్రతిభాసములను గావించుచు… నిజ స్వరూపములగు జగదాకార సంవిత్తులకు, (లేక) చైతన్య వృత్తులకు “మనస్సు-బుద్ధి-చిత్తము-అహంకారము” మొదలైన వివిధ నామములను స్వయముగా కల్పించుచున్నాడు. చైతన్యమునకు, చైతన్యరూపమే అయి - - బుద్ధిరూప చైతన్యముచే అగుపించే దృశ్యము - సముద్ర తరంగములాగా అబుద్ధిపూర్వకమే అయివున్నది.
అబుద్ధిపూర్వకంగా బుద్ధి జనిస్తోంది. బుద్ధి జనించిన తరువాత సంకల్పించబడేదంతా బుద్ధిపూర్వకం అయివున్నది.
సముద్రంలో ఆవర్త-కణ-కల్లోల-తరంగాదులు ప్రవృత్తములగునట్లు చిన్మాత్రమగు ఆత్మ నుండి మనో-బుద్ధి-చిత్త-అహంకార రూపమగు సృష్టి ప్రవృత్తమౌతోంది. గోడపై ఉలిచే లిఖించబడిన చిత్రము గోడయే కదా! అట్లాగే చిదాకాశమున అభాస మాత్రమగు ఈ జగత్తు చిదాకాశమాత్రమే అయివున్నది. చైతన్యమునందు అబుద్ధిపూర్వకంగా ప్రవృత్తిరూపంగా ఈ సృష్టి ప్రారంభము పొందిన తరువాత, ఇక బుద్ధిచే కూడుకొనినదై ప్రకృతిచేత యథాయోగ్యమగు ఆకారముగా ఒనర్పబడుచున్నది. వృక్షం జనించిన తరువాత “ఇది కాండము, ఇది కొమ్మలు, ఇవి రెమ్మలు, ఇవి పూలు, ఇవి కాయలు” …అని ఎవరో పేర్లు పెట్టుచున్నారు కదా! వాస్తవానికి వృక్షమునకు వేరై వృక్షమునందు ఏమి ఉన్నది? అట్లాగే చైతన్యము నందు అబుద్ధిపూర్వకంగా జనించే ఈ పృథివి, ఆకాశము,
Page:510
సమష్టి, సృష్టి రూపులగు హిరణ్యగర్భుడు మొదలైన ఆయా పేర్లు పెట్టుచున్నారు. పరమాత్మ నుండి అబుద్ధిపూర్వకంగానూ, అకారణంగానూ జనించిన ఈ పృథివి మొదలైన వాటితో కూడిన జగత్తు పరమాత్మ కంటే వేరుకాదు. చిదాకాశరూపమగు ఆత్మయే, వ్యష్టి జీవునివలె అయి… “ఈ చిదాకాశమునకు అనన్యము” అయినట్టి ఈ ఎదురుగా కళ్ళకు కనిపించే సృష్టిని నామరూపాత్మకం తెచ్చిపెట్టుకుంటోంది.
చిద్రూప వృక్షమే ఈ ప్రకారంగా కార్యకారణ రూపమైన స్వీయాలంకారములతో స్వయంగా భాసించుచున్నది.
శ్రీరాముడు : మహాత్మా! కొందరు గురువులు తమ శిష్యులకు… ఇహ-పరలోకాలు ఉన్నాయి. ఇహంలో చేసిన పాప పుణ్య ఫలాలు పరలోకంలో అనుభవిస్తారు అని బోధిస్తున్నారు. ఈ సృష్టియే లేదని మీరు ప్రతిపాదదిస్తున్నారు కదా! మరి ఇహలోక విహిత - నిషిద్ధ కర్మలు, వాటి ఫలములను అనుభవించవలసియున్న పరలోకముల గురించి మీ అభిప్రాయం?
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! కర్మఫలములు, ఆ ఫలములను అనుభవించటానికి వేరే కొన్ని లోకములు ఉన్నాయనే అనుకుందాం. ఆ లోకములో అనుభవాలవంటివే ఈ ఇహలోకంలోకూడా అనుభవానికి వస్తున్నాయి కదా! ఈ జాగ్రత్లో పొందుచున్న సుఖ-దుఃఖాలు కూడా కర్మఫలరూపాలే అని ఎందుకనుకోకూడదు? “జగత్తు ఉన్నది” అని ఈ జీవుడు సంకల్పం కలిగి ఉన్నంతవరకు ఈ జగదనుభవములు సత్యముగానే సుఖ దుఃఖాదులుగా ప్రాప్తించటం కొనసాగుతూనే ఉంటుంది. అద్దానికి అంతు అనేదే లేదని మహాశవోపాఖ్యానంలో గమనించాము కదా!
నిరాకారమగు చైతన్యమున సాకారమగు ఈ జగత్తు చైతన్యము చేతనే సంకల్పింపబడినదై “ఇది నాకు దుఃఖం. ఇది నాకు సుఖం”… ఇటువంటి సుఖ దుఃఖ - అత్యాశ్చర్య - అతి సామాన్య రూప నిర్వచనాలన్నీ మూలముగా కలిగినదై చెన్నొందుతోంది. పుష్పానికి సుగంధంలాగా, అకాశానికి శూన్యత్వంలాగా, వాయువుకు చలనత్వంలాగా చైతన్యమునకు ఈ బ్రహ్మాండ సృష్టులన్నీ అభిన్నమై వెలయుచున్నాయి. చైతన్యమునకు వేరుగా చూస్తే ఈ సృష్టులు అత్యంత శూన్యరూపములే!
ఆకాశం కంటే శూన్యత్వం వేరుకాదు. జలముకంటే ద్రవత్వం వేరుగాలేదు. పుష్పము కంటే గంధము వేరుగా ఉండదు. వాయువుకు వేరుగా స్పందము లేదు. అగ్ని కంటే భిన్నంగా ఉష్ణము ఉండదు. మంచుకంటే శీతలత్వం వేరుకాదు.
అట్లాగే… చిదాకాశ స్వరూప పరమాత్మ కంటే జగత్తు వేరుగా లేదు. 1. సృష్ట్యాదిలో కనిపించే ఈ జగత్తు, 2.స్వప్నంలో కనిపించే దృశ్యము… ఈ రెండూ కూడా కూటస్థ చైతన్యము కంటే భిన్నం ఎట్లా అవుతాయి చెప్పు?
"చిత్ చైతన్యం కంటే చేత్య (తెలియబడే) జగత్తు వేరు కాదు” అనే సిద్ధాంతానికి దృష్టాంతం ఏమిటంటావా? స్వప్న ద్రష్ట కంటే స్వప్నము వేఱుగా ఉన్నదెప్పుడు? ఎక్కడ? అట్లాగే చిన్మాత్రము
Page:511
కంటే సారరూపమైనదేదీ ఈ జగత్తులో లేదు. జగద్రష్ట చిన్మాత్ర స్వరూపుడేనని మరల మరల గుర్తు చేస్తూనే ఉన్నాను.
శ్రీరాముడు : మహర్షీ! 1. స్మృతి-జగత్తు 2. స్మృతి-స్వప్నము …అను జంట విషయములలో ఇంకా కొంత సంశయం చోటుచేసుకొని ఉండటం చేత ఈ రెండింటి విషయంలో ఈ "జగత్తు యొక్క నిర్వచనం” గురించి మరొక్కసారి మాకు బోధించండి.
“స్వప్నం ఎక్కడి నుండి వస్తోంది" అనే ప్రశ్నకు సమాధానంగా… “గత స్మృతులందలి సంస్కారంలో నుంచే బయల్వెడలుతోంది. స్మృతులలో నుండి ‘అది’ అనబడే దత్తాంశముగా భాసిస్తోంది. జగత్తులో ‘ఇది’ అనే ఇదంశము రూపంలో పూర్వ స్మృతులు, వర్తమాన దృశ్యం సమ్మిళితమై జాగ్రత్ రూపంగా పొందబడుతోంది.
ఈ విధంగా బుద్ది నుండే రెండూ జాగ్రత్ - స్వప్నాలు స్మృతి రూపంగా సంభవిస్తున్నాయి. స్మృతిలో పూర్వకాలిక పదార్థానుభవములు ఘనీభూతమై ఉండి పరోక్షంగా స్వప్నంలోను, ప్రత్యక్షంగా జాగ్రత్తలోను పాల్గొనుచున్నాయి.
కాబట్టి జాగ్రత్ స్వప్నములు రెండూ స్మృతి రూపములే అవుతాయి కదా! (లేక) ఈ జీవుని స్వస్వరూపమే (చిదాకాశరూపమే) ఎట్లా అవుతాయి?” పై విధంగా కొన్ని సిద్ధాంతాలున్నాయి. వీటికి సమాధాన పూర్వకంగా ప్రవచనం ప్రసాదించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఒకానొకడు ఉదయం అడవికి వెళ్ళి ఒక సింహమును చూచాడు. భయపడి పరుగులు తీయనారంభించి ఎట్లాగో స్వగృహం చేరాడు. ఆ రాత్రి నిదురించినప్పుడు కలలో సింహం కనిపించింది. ఇప్పుడీ జాగ్రత్-స్వప్న అనుభవములను విశ్లేషిద్దాం. రాత్రి స్వప్నంలో కనిపించిన సింహం ఆ ఉదయం చూచిన సింహమే కదా! రెండూ ఒక్కటే అయితే అడవిలో సింహం అడవిలోనే ఎందుకుంటోంది?
కనుక స్వప్నంలో కనిపించేది వస్తువు లేకుండా స్మృతియే వస్తురూపంగా కూడా కనిపిస్తోందని తేలుతోంది కదా! అయితే స్వప్న సమయంలో అది సత్యమనియే అనిపిస్తోంది కాబట్టే స్వప్నం మనకు ఇప్పుడు చర్చనీయాంశమగు విషయమగుచున్నది. అవునా?… కనుక స్వప్నంలో కనిపించేది స్వప్న సమయంలో “ఇందంశము” అగుచున్నదే గాని తదంశము అవదు కదా!
ఇక ఈ జగత్తు ‘స్మృతి’ అనబడే ఇతఃపూర్వ అనుభవాలు దృష్టిని ప్రేరేపించునదై ’దృశ్యము’గా అనుభూతమగుచున్నది. అయితే స్వప్న దృశ్యమునకు, జాగ్రత్ దృశ్యమునకు ద్రష్ట ఒక్కడే కదా! అనగా ఉభయ సందర్భములలోను ద్రష్ట వేరుగా అప్రమేయుడై తాను మార్పు చేర్పులు చెందక ఆ రెండింటికీ కేవలం సాక్షి అయి, అదే సందర్భములలో ఆ రెండింటికీ అర్థము ప్రతిపాదించువాడై ఉన్నాడు కదా! ఆ ద్రష్ట ఏ సమయంలో ఎద్దానిని ఏ దృష్టితో చూస్తాడో అది అట్లే అనుభవమగు చున్నది. దృశ్యం దృష్టిపైనే ఆధారపడి ఉంటోంది. దృష్టి ద్రష్ట నుండే బయల్వెడలుతోంది. ద్రష్ట ద్రష్టత్వము వహించకముందే ఎట్లున్నాడో, దృశ్య సందర్భంలో కూడా యథాతథంగా అట్లే ఉన్నాడు.
Page:512
ఇక ఈ జగత్తు యొక్క స్థితి స్వప్నములోవలె కాకతాళీయంగా ఏర్పడే వృత్తి వంటిదే! జలంలో ఒకానొక తరంగం ఒకానొక ఆకారంగా బయల్వెడలటానికి ఏ విధంగా కార్య కారణములు లేవో …ఈ జగత్తు కార్యకారణ రహితమగు వృత్తి వ్యవహారం మాత్రమే! చైతన్యము తనయందే తనకు అవిభాజ్యము, అద్వితీయము, అభేదము అగు జాగ్రత్ స్వప్నములను, (ఆ తదనంతరం) అందరి ఆయా విశేష పరంపరలను కాకతాళీయంగా సిద్ధింపజేసుకొనుచున్నది. సముద్రంలోని తరంగాల వలె మొట్టమొదట అబుద్ధిపూర్వకంగా సృష్టి ఏర్పడుచుండగా, ఆ తరువాత అద్దాని అవయవ రచనాదుల స్థితి ప్రకృతి సిద్ధంగా బుద్ధిపూర్వకంగా సంభవించుచున్నది.
ముత్యపు చిప్పలో వెండి ఏ కారణంచేత కనిపిస్తోంది? అద్దానికి ఏ కారణమూ లేదు. కుందేటికి కొమ్ములున్నట్లు ఎందుకు (దూరం నుండి చూచినప్పుడు) కనిపిస్తోంది? అట్లాగే సృష్ట్యాది యందు ఈ జగత్తు జనించటానికి కారణం లేదు. అందుచేత ఇది ఉత్పన్నమే అయివుండలేదు. ఆద్య స్వరూపమగు బ్రహ్మమే జగద్రూపంగా కనిపిస్తూ బ్రహ్మము రూపముగానే స్థితినొంది ఉన్నది. విచారణచే “ఈ కనబడేదంతా మమాత్మకు అభిన్నం. అద్వితీయం" అని ఎవ్వరికైనా తెలియబడ
గలదని మా మనవి.
రత్నమునకు కాంతులు ఎట్లా అబుద్ధిపూర్వకంగా ప్రదర్శితమగుచున్నాయో, బ్రహ్మ సత్త అట్లాగే జగద్రూపంగా అబుద్ధిపూర్వకంగా స్ఫురిస్తోంది. ఈ విధంగా మొట్టమొదట జగత్తు భావనారూపంగాను, ఆ తరువాత ఇందులో అర్థ-క్రియా సామర్థ్యము ఏర్పడుతోంది. చిదాకాశము నందు ఏ కారణం లేకుండానే, సముద్రంలో తరంగాలలాగా, స్వప్న సమూహములవంటి అతిశూన్య రూపములగు అనేక బ్రహ్మాండములు ఉత్పన్నములై విలీనములగుచున్నాయి.
కార్య-కారణత్వముల పరిధిలో కనిపించేదంతా (ఈశ్వరుడు మొదలైన సమస్తం కూడా) మాయా మాత్రాలే అవటంచేత స్వపాంతర్గత వ్యవహారంలాగా శూన్య రూపములే అయివున్నాయి. జాయతే శూన్యమేవేదం శూన్యమేవ చ వర్ధతే ॥ |
నను శూన్యతయాత్యన్తం శూన్యమేవ వినశ్యతి ॥
ఈ జగత్తు “శూన్యమే లేనిది)”అగుచు ఉత్పన్నం అగుచున్నది. శూన్యమే అయి వృద్ధి పొందుతోంది. అత్యంత శూన్యరూపమే అయి, శూన్యరూపంగానే నాశనమును పొందుచున్నది. జలతరంగానికి ఆకారం జలంలోంచే బయల్వెడలి, జలంలో లయిస్తున్నట్లు - ఈ దృశ్యము శూన్యంలో జనించి, శూన్యంలో కనిపించి శూన్యంలోనే లయిస్తోంది. ఈ జగత్తు సర్వదా అసత్తే అయివుండి సత్తువలె అనుభూతమౌతోంది. స్వానుభవమగు స్వప్నమే ఇక్కడ మనకు దృష్టాంతం. అట్టి జగత్ స్వప్న సిద్ధాంతాన్ని తిరస్కరించటం ఎటువంటిదంటే… గొర్రెల కాపరి ఒక గొర్రెను తోడేలు ఎత్తుకు పోతుంటే “తోడేలే లేదు” అని పాటలు పాడుకోవటం వంటిది.
ఓ రామచంద్రా! చైతన్యము యొక్క చమత్కారమే స్వరూపంగా కలిగి ఈ జగత్తు అనుభవ మౌతోంది. ఇది అసద్రూపం. భ్రాంతి మాత్రమే. మహా కృత్రిమ స్వరూపం. అట్టి ఈ జగత్తు జ్ఞాని దృష్టిలో అకృత్రిమమగు బ్రహ్మంగానే భాసిస్తోందిగాని సాకారయుక్త జగత్తుగా కాదు.
Page:513
ఈ సృష్టి - ప్రళయ విభ్రమమంతా చాలాకాలం కొనసాగుచున్న సంకల్ప మాత్ర స్వభావం అయివున్నది. “ఈ కనబడే సృష్టి- ప్రళయములు యథార్థము - పారమార్థికము అగు స్వస్వభావము యొక్క స్ఫురణయే!” ఇది గమనించుటయే తత్త్వజ్ఞానం. భ్రాంతిచే ఇద్దానిని జగత్తు రూపంగా (స్వస్వరూపమునకు వైరైన మరొకటేదోగా) దర్శిస్తూ ఉండటమే అజ్ఞాన విజృంభణము.
మనందరికీ సుషుప్తి తరువాత ఏ కారణం లేకుండానే స్వప్నదృశ్యం అగుపిస్తోంది. అట్లాగే స్వప్నానంతరం అకారణంగానే జాగ్రత్ సంభవిస్తోంది. మరల జాగ్రత్ అనంతరం అకారణంగానే స్వప్న సుషుప్తులు అగుపిస్తున్నాయి. నిద్రించాం కాబట్టి స్వప్నం . గాఢ నిద్రవల్ల సుషుప్తి. మెళకువ వచ్చింది కాబట్టి జాగ్రత్తు. ఈ విధంగా ఈ మూడూ కూడా అంతకుమించి కారణం లేకుండానే సంభవిస్తున్నాయి కదా! అట్లాగే మాయాసహిత బ్రహ్మము ఏ కారణం లేకుండానే తనయందు ఈ దృశ్యము ఉదయించటం గాంచుచున్నది. అట్లా దృశ్యం పొందిన తదనంతరం అర్థ క్రియా సామర్థ్యం తోటి, కార్య కారణ భావాది రూపంగానూ నియతిని పొందుతోంది. వాస్తవానికి బ్రహ్మము తన చిత్స్వభావముననే ఉన్నది. అయినా కూడా సముద్రంలో తరంగాలు అకారణంగా పరిఢవిల్లుచున్నట్లు కాకతాళీయంగా చైతన్యమునందు చిద్రూప పర్యంతం వలన దృశ్యము స్వయంగా ప్రకాశిస్తోంది. చిదాకాశ మాత్రరూపమగు చైతన్యము తన చిన్మాత్రత్వమును త్యజించకయే జగత్తుగా స్ఫురించటమనేది అద్దాని స్వభావమే అయివున్నది.
మొట్టమొదట అబుద్ధిపూర్వకమైన "దృశ్యాకార ప్రతిభాస” వలన దృశ్యరూపముగా అగుచున్న చిదాత్మ అట్లు దృశ్యరూపంగా అయిన తరువాత, తనయందు “స్మృతి - పృథివి - ఆకాశం -బుద్ధి - కర్మ - జ్ఞానం” మొదలైన సంజ్ఞలను (తన యందలి దృశ్యమునకు) కల్పన గావించుచున్నది. ఇంతకు మించి దృశ్యమునకు వేరు కారణం లేదు. చిదాత్మయందు చిదాత్మయే చిదాత్మ రూపమగు దృశ్యమును అబుద్ధిపూర్వకంగా - అకారణంగా కాకతాళీయ న్యాయముచే నిర్వర్తించే దర్శనమే జగత్తు.
శ్రీరాముడు : హే మహర్షీ! ‘జగత్తు’ అనబడు ఈ ఎదురుగా కనబడే ‘దృశ్యం’ గురించి మీరు మాకు ప్రసాదించిన నిర్వచనం అమోఘం. ఇదంతా కూడా ఆత్మయందు ఆత్మయే కాకతాళీయంగా దృశ్య రూపంగా జాగ్రత్-స్వప్నములందు దర్శించుచున్నదనునది నిర్వివాదమైన సత్యమని అంగీకరించక తప్పదు. అయితే, ఇక్కడ నాదొక సందేహం -
ఇదంతా కూడా నిద్ర లేవగానే వచ్చిపడి, నిద్రపోగానే అదృశ్యమగు స్వప్నమువలె ప్రతిభాస యందలి కల్పనా మాత్రమేనని కాకతాళీయంగా వచ్చి కాకతాళీయంగా పోవుచున్నదని మీరు
Page:514
సిద్ధాంతీకరిస్తున్నారు కదా! మీరు వ్యాఖ్యానించిన దానిని అనుసరించి అప్పుడు ఈ జగత్తుకు క్షణిక వాద దోషం సంభవిస్తుదేమో? అప్పుడు ఈ ‘జగత్తు’ అనే అనుభవం తాత్కాలిక కల్పన మాత్రమే అవుతుంది కదా! ఈ వర్తమాన జగద్దర్శనం 1. స్మృతి (పాత జ్ఞాపకాలు), 2.ప్రత్యభిజ్ఞానయ (ఇతః పూర్వపు సంస్కార బంధము) 3. పూర్వం అనుభూతములైన విషయాల భాగస్వామ్యం కొనసాగటం అనేవి ఉండకూడదు కదా! మరి ఆ మూడు ఇప్పటి ఈ వర్తమాన క్షణ జగత్తులో పాల్గొనుచున్నాయి కదా! "పూర్వము ఉత్పన్నమైన బుద్ధి యొక్క ప్రామాణికానుభవము చేతనే ఇప్పుడు వర్తమానంలో సంస్కారము, ఆ సంస్కారములోంచి వర్తమాన బుద్ధి, ఆ బుద్దిచేత స్మృతి, ఆ ఆ స్మృతిలోంచి అనుభవములు వచ్చి కొనసాగుతున్నాయి” అనునది ఇక్కడి అందరి అనుభవం కదా!
మరి ఈ జగత్తు క్షణిక కల్పన, పూర్వాపర రహితం ఎట్లా అవుతుంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సింహము ఏనుగు పిల్లను చీల్చివేస్తుంది చూచావా! ఆ రీతిగా ఈ ప్రశ్న (లేక) ఆక్షేపమును ఛేదించివైచి అభేదరూపమగు అద్వైత తత్త్వానుభూతిని ప్రసాదించే వాక్యములు చెప్పుచున్నాను. విను!
“ఈ జగత్తు అసత్తు. క్షణికమైన ప్రతిభాసచే ఉత్పతన్నమౌతోంది“ అను (బౌద్ధ) సిద్ధాంతము మనం అంగీకరిస్తే అప్పుడు నీవు చెప్పినట్లు క్షణిక దోషము ఘటిల్లగలదు. అయితే వేదాంత సిద్ధాంతము “ఇదంతా క్షణికం” అని చెప్పి ఊరుకోవటం లేదు మరి?
నిత్య బ్రహ్మ సత్తా రూపమే అగు ఈ జగత్తు … బ్రహ్మము నందలి విశేషమగు అవిద్యావరణ విక్షేపశక్తుల ప్రభావం చేత… ఒకప్పుడు ఆవిర్భవించినదగుచున్నది. మరొకప్పుడు తిరోభావం పొందినదగుచున్నది. ఒకప్పుడు స్థిరంగాను, మరొకప్పుడు క్షణికంగాను భిన్న భిన్న రీతులుగా భాసించుచున్నది.
కాబట్టి ఈ జగత్తు అనబడుదానిపట్ల స్మృతి - ప్రత్యభిజ్ఞానము రెండూ తగియే ఉన్నాయి. కొయ్యలో చెక్కబడిన దేవతావిగ్రహం కొయ్యలోనే ఉండి ఉన్నట్లుగా ఈ జగత్ రూప దృశ్యము స్వస్వరూపమగు, చిదాకాశ చైతన్యము నందే చిత్రించబడినదై ఉంటోంది.
అయితే… ఒక కొయ్య యొక్క కొన్ని కొన్ని విభాగములను ఉలితో ఛేదించి వడ్రంగి కొయ్యను దేవతా విగ్రహంగా మలచుచున్నాడు. కాని అద్వితీయమగు చైతన్యమునందు ‘జగత్తు’ అనబడేది చెక్కటానికి ఉలివంటి పరికరములుగాని, వడ్రంగి వంటి నిమిత్త ఉపాదాన కారణాలుగాని లేవు. ఈ జగత్తుకు వేరుగా కర్త ఎవరూ లేరు. “కాదు బ్రహ్మదేవుడు దీనికి కర్త కదా!”… అంటావా? ప్రతి జీవునికి తన రీతిలో తన కల్పనానుసారమే జగదనుభవం ఉంటూ ఉండగా,… అద్దానికి మరొకరికి కారణం ఆపాదించటం ఎట్లా? కనుక ఈ జగత్తు వడ్రంగి వృక్ష కాండ ఖండంలో చెక్కే దేవతా విగ్రహం వంటిది కాదు.
జడమగు వృక్షస్తంభమును ఎవరో చెక్కితేగాని దేవతా విగ్రహంగా బయల్వెడలదు. కానీ, చైతన్యమున ఆ చైతన్యము యొక్క ప్రభావం చేతనే ‘జగత్తు’ అనే విగ్రహం పూర్ణముగా అభివ్యక్తం
Page:515
అవటం, ప్రకాశించటం జరుగుతోంది. ప్రతి జీవునియందు తనకు తనయందు తాను బ్రహ్మదేవత్వము వహించియుండటం ఏర్పడియే ఉన్నది.
ఈ జగత్తు సర్వదా చిదాకాశమే! ఇది పరమార్థ స్వరూపము నుండి చ్యుతిని పొందకుండానే చిన్మాత్రత్వముచే స్వాత్మయందే నెలకొని ఉంటోంది. కాబట్టి ప్రళయ - • సుషుప్తి సమయములలో ఇది సత్తామాత్ర స్వరూపం పొందినదై ఉంటోంది. అనగా ఆ సమయములలో ఇది కనబడకపోయినప్పటికీ, లేకుండా పోవటం లేదు.
సృష్ట్యాదియందు ప్రప్రథమంగా ఈ చైతన్యం నిర్వికల్పరూపంగానే ఉన్నది. ఆ తరువాత ప్రాణుల అభీష్టానుసారంగా మనో వికల్పములచే చిత్ర విచిత్రములైన సృష్టుల కల్పనను గావించుచున్నది. అనగా ఈ రోజు కన్నకలలాగా చిదాకాశరూపమగు చైతన్యము తన హృదయంలో జగద్రూప దృశ్యపరంపరలను తానే కల్పించుకొనుచున్నది.
ఇది చిన్మాత్రముతో కూడి సత్తా సామాన్య రూపమైనట్టి, జగత్తుకే బీజరూపమైనట్టి “బ్రహ్మకళ”. ఇది ఆ బ్రహ్మకళయందు ప్రతిబింబించే చైతన్యము. ఇది ప్రాణాదియుక్తమగు ప్రతిబింబ స్వరూపమగు జీవుడు. ఇది అభిమానవృత్తి ప్రధానమగు ఆ చిత్ప్రతిబింబరూపమగు అహంకారం. ఇది నిశ్చయాత్మక ప్రతిబింబ చైతన్య రూపమగు బుద్ధి. ఇది సంకల్పాత్మక ప్రతిబింబ చైతన్య రూపమగు చిత్తము. ఇది కాలము. ఇది ఆకాశము. ఇది ‘వీడు, వాడు, నేను, నీవు’ అనే రూపములు. ఇది క్రియ. ఇవి పంచతన్మాత్రలు. ఇవి ఇంద్రియ సమూహములు. ఇది మనో-బుద్ధి-ఇంద్రియ-చిత్త-అహంకారాది రూపమగు పూర్యష్టకము. ఇది దేహ ఇంద్రియ సమూహ మధ్యగా సంచరించే సూక్ష్మదేహం. ఇదేమో స్థూల శరీరం. నేను బ్రహ్మదేవుడను. నేను విష్ణువును. నేను మహేశ్వరుడను. నేను సూర్యుడను. ఇది బాహ్యము. ఇది సృష్టి. ఇది జగత్తు…
ఇటువంటివన్నీ చైతన్యము తనయందు సృష్ట్యాది యందు కల్పన గావించుకొనుచున్నది. అయితే… అట్టి కల్పనా సమూహమంతా కూడా సర్వదా అతి నిర్మలమగు చిదాకాశమే అయివున్నదిగాని… చిదాకాశముకంటే అన్యముగా అణుమాత్రం కూడా లేనేలేదు. కాబట్టి రామచంద్రా! ఇక అజ్ఞానులచే కల్పించబడే జడ పదార్థ సమూహమెచ్చట? స్మృతి ఎచ్చట? ద్వైత - ఏకత్వమెచట? చిదాకాశ రూపమే అగు విశాల జగత్ ఖండము కారణము లేకయే స్వప్నంలోలాగా భాసించుచు వికారయుక్తంగా ఉన్నదానివలె భాసిస్తోంది. చిన్మయమగు ఆకాశమున చిన్మయరూపమే అయి ఈ జగత్తు స్ఫురించుచున్నది. అట్టి జగత్తును ఎరుగుచున్నది కూడా చిదాత్మయే! తెలుసుకునేది తెలియబడేది కూడా చిదాత్మరూపమే అయివుండగా ఇక కల్పిత జగత్తు ఎచ్చట? ఆకాశంలో శూన్యత్వంలాగా “ఏకం, శాంతం” అయినట్టి చిదాకాశమున చిదాకాశ రూపమేయగు జగత్తు స్ఫురిస్తూ ఉంటే ఇక స్మృతి ఏమి? స్వప్నమెచట? కాలము ఎచట? అనేక బ్రహ్మాండాల కల్పన ఎచట?
ఓ రామచంద్రా! చిదనము యొక్క అంతరమున ఏ ‘సత్త’ కలదో… అదియే బాహ్యంగా పంచభూత రూపముగా ప్రదర్శితమౌతోందయ్యా! వాస్తవానికి బాహ్యమున గాని - అభ్యంతరమున
Page:516
గాని సన్మాత్రము తప్ప వేరుగా మరేదీలేదు. ఓ వాదోపవాదములు చేయు మిత్రులారా! ఇది
వినండి.
నిరస్తావయవాచ్ఛాన్తాదనాఖ్యాద్యత్ప్రవర్తతే
అకారణం భవేద్భూతం తదః కథమన్యథా?
అవయవ రహితము, శాంతము, వాక్కునకు అవిషయము అయినట్టి చిన్మాత్రము నుండి కారణము లేకయే ఏది ఉత్పన్నమగుచున్నదో, అది మంచుశిల యొక్క ఆకారమువలె ఉత్పన్నము కాకయే ఉన్నది సుమా! అయినా, కూటస్థమగు చైతన్యమును వికారవంతం చేసేదెవరు? ఎట్లా వికారవంతమౌతోంది? అందుచేత… పరబ్రహ్మము ఎట్టి శుద్ధ చిన్మయ స్వరూపము అయివున్నదో… ఈ దృశ్య జగత్తు కూడా అట్టి చిన్మయరూపమే అయివున్నది.
కలలో ఏది ద్రష్టరూపమో అదియే స్వప్ననగరం కదా! ఏది స్వప్న నగరమో అది స్వప్న ద్రష్టరూపమే కదా! అందుచేత ఈ దృశ్యము ఒకింతకూడా లేదు. నిర్మల జలంలో ధూళి ఎక్కడుంటుంది? పరమ చిదాకాశంలో దృశ్యం లేదు. ఇక ఇక్కడ ఏది భాసించుచున్నదో అది విషయరహితమై, కాబట్టి స్వమాత్ర ప్రకాశమై, ప్రశాంతమైనట్టి చిన్మాత్రమే… తనయందు ఈ ప్రకారంగా జగత్తువలె స్థితిపొందినదగుచున్నది.
పూర్ణాద్వై బ్రహ్మణః పూర్ణమప్యనుద్ధృతముద్ధృతమ్ ఇవేదం భాతి భారూపమాభాసం పరమాత్మకమ్ ||
పూర్ణమగు బ్రహ్మము నుండి పూర్ణము, ప్రకాశరూపము అగు ఏ ఈ జగత్తు వాస్తవానికి ఉత్పన్నమే కాకయున్నదో… కాని ఉత్పన్నము అయినట్లు భాసించుచున్నదో… అదంతా కూడా ప్రకాశరూపమగు పరమాత్మయే అయివున్నది. ఓ దృశ్య జగత్ రూపమగు పరమాత్మా! మాకు అనన్య స్వరూపమగు మీకు ఇవే మా సాష్టాంగ దండ ప్రణామములు!
శ్రీ వసిష్ఠ మహర్షి కాబట్టి ఓ సర్వసభికులారా! మీరంతా "చిదాకాశ రూపమ్ - శివో2 హమ్ -
శివోహమ్” అని గ్రహించినవారై జీవన్ముక్తులయి ఉండండి. శ్రీరాముడు : మహాత్మా! “జీవన్ముక్తుడు” అనగా ఎవరు? శ్రీ వసిష్ఠ మహర్షి :
న సుఖాయ సుఖం యస్య, దుఃఖ దుఃఖాయ యస్య నో॥ అంతర్ముఖమతోర్నిత్యం స ముక్త ఇతి కథ్యతే ॥
ఓ రామచంద్రా! ప్రత్యగాత్మయందు మాత్రమే ఆసక్తి గలిగియుండి అంతర్ముఖమైనట్టి నిత్యబుద్ధిని
ఏ ఆత్మజ్ఞాని సంపాదించుకుంటాడో… ఏ శుద్ధ దర్శనముచే సహజీవుల బాహ్య నామరూపాలకు అతీతంగా ఆ సహజీవులను ఆత్మదృష్టిచే దర్శిస్తూ ఆనందిస్తూ ఉంటాడో…ఏ అవగాహనాపరునికి
Page:517
సుఖహేతువగు విషయ సమూహము సుఖమునుగాని, దుఃఖహేతువగు విషయ సమూహము దుః ఖమునుగాని కలిగింపజాలవో… అట్టి వ్యక్తియే "జీవన్ముక్తుడు”. ఏ విధంగా అజ్ఞానుల బుద్ధి విశాలభోగవాసనలనుండి చలించకయే ఉంటుందో… ఆ విధంగానే, అంతగానూ జీవన్ముక్తుడగు జ్ఞాని యొక్క బుద్ధి చిదాకాశదృష్టిని విడజాలక అద్దానియందు నిశ్చలంగా ఉంటోంది. ఎవని చిత్తమైతే చిన్మాత్రాత్మయందు విశ్రాంతి పొందినదై, మనస్సు మరల ఈ దృశ్యమునందు ప్రీతి గొనకయే ఉంటుందో… అట్టివాడే ‘జీవన్ముక్తుడు’ అని శాస్త్రములచే నిర్వచించబడుచున్నాడు. శ్రీరాముడు : ఓ మునీంద్రా!
న సుఖాయ సుఖం యస్య, దుఃఖం దుఃఖాయ యస్య నో జగమేవ మునే మన్యే మానవమ్ తమచేతనమ్ ||
ఎవనికైతే సుఖహేతువైన విషయము సుఖమునుగాని, దుఃఖహేతువగు విషయము దుః ఖమునుగాని కలిగించవో… అట్టి జీవుని "చేతనరహితుడు” అని అనుకోవటం కద్దు కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! శుద్ధబోధ స్వరూపుడగు జీవన్ముక్తుడు సర్వదా చిదాకాశమునందే స్థితి కలిగి వుంటాడు. అప్రయత్నముగానే ఈ లౌకిక సుఖ దుఃఖములను అధిగమించినవాడై, అతీతుడై ఉంటాడు. అట్టి విశ్రాంత చిత్తునికి శాస్త్రములు ‘జీవన్ముక్తుడు’ అని పేరుపెట్టాయి. ఆతని యందు స్వవివేకముచే మూలాజ్ఞానము నశించి ఉంటుంది. సమస్త జగద్విషయముల పట్ల సర్వ సందేహములు తొలగిపోయి ఉంటాయి. ఆతడు ‘పరమాత్మ’ అనే మహత్తరమైన శయ్యలో పరమ విశ్రాంతి పొందుతూ ఈ జగత్తులో వ్యవహరిస్తూ ఉంటాడు. వ్యవహారములు నిర్వర్తిస్తున్నప్పటికీ ఆతని అంతరంగం ఈ దృశ్యంలో ఏ ఒక్క విషయము పట్ల ప్రీతిగొని ఉండదు. ఏ విశేషముపట్లాకూడా రాగం-కామం ఉండదు. సమస్త కార్యములపట్ల ఆతని యందు కోర్కె యొక్క సంకల్పము ఉండదు. ఏది చేయవలసి వచ్చినా ఫలాపేక్ష రహితుడై ఉంటాడు. అపేక్షా రహితంగా “ఇది విధ్యుక్త ధర్మానుసారం ఇట్లే జరుగుగాక”… అని ఒకానొక అస్పృశ్య - అంతర్ముఖ దృష్టి పెంపొందించుకొని ఉంటాడు.
యథా ప్రాప్తములైన పదార్థములను అనుభవిస్తూ రాగరహితుడై “ఏదీ తనకు చెందినది కాదు" అనే అవగాహనను సుస్థిరీకరించుకొని ఉంటాడు. ఓ రామచంద్రా! ఓ సర్వజనులారా! ఈ సంసార మార్గంలో ఎక్కడా విశ్రాంతి లేదు. ఆత్మజ్ఞానం - ఆత్మ దర్శనంలో మాత్రమే విశ్రాంతి ఈ జీవునికి లభిస్తుంది. ఇదంతా (ఈ సంసార మార్గమంతా) అతిదీర్ఘము, ఆధార వర్జితము.
అలసి ఉన్న ఓ బాటసారులారా! మీరంతా జీవన్ముక్తునివలె చిన్మాత్ర దర్శనమును అభ్యసించి ఆత్మయందు విశ్రాంతిని పొందటమే ఈ సంసార రోగమునకు ఔషధమని గమనించండి. ఆత్మయందు విశ్రాంతిని అనుభవించే జీవన్ముక్తుడే సర్వోత్తముడు.
ఓ సహమిత్రులారా! ఈ సంసారమునందు చిరకాలము పరుగులుతీసి అలసిపోయి ఉన్నారని విచారించకండి. ఆత్మజ్ఞానమును సముపార్జించి బ్రహ్మీదృష్టిచే జీవన్ముక్తుని వలె బ్రహ్మపదమునందు విశ్రాంతిని ఆశ్రయించండి.
Page:518
జీవన్ముక్తుడు బ్రహ్మపదమునందు విశ్రాంతిని పొందుచుండగా, ఇక ఈ జగత్తులో వ్యవహారపరుడైనప్పటికీ “సుషుప్తి” యందు ఉన్నవానివలె ఉంటాడు. అట్టి జ్ఞానులు ద్రష్ట - దృశ్య - దర్శన (త్రిపుటి) రహితమగు శుద్ధ స్వచిత్తాకాశంలో శుద్ధ చిద్రూపులై నిత్యోదిత సూర్యునివలె భాసిస్తూ ఉంటారు. వారికి ఈ సంసారము పట్ల ప్రీతి నిరాశ - దుఃఖము - గర్వము
మొదలైనవి ఉండవు. అట్టి ఉత్తమోత్తములగు జీవన్ముక్తులు దేహధారులై ఉండి కూడా దేహరహితులై ఉంటారు. లౌకిక వ్యవహారముల పట్ల నిద్రించుచున్న వారివలె ఉంటారు. వారు పైకి జడులుగా చూపట్టవచ్చునేమోగాని, జడులు మాత్రం కారు. అయితే, వారి దృష్టిలో ఈ జగత్తు స్వప్న సదృశమైపోవటం చేత ఇద్దానిపట్ల వారు అంతరంగంలో ఉదాశీనులై చరిస్తూ ఉంటారు. అందుచేత “వారు ఈ ప్రపంచం పట్ల నిద్రితులై ఉంటారు” అని చెప్పబడుచున్నారు. అంతేగాని, వాస్తవానికి వారు జడ నిద్రకు వశీభూతులైనవారు కానేకాదు సుమా!
వారు ‘సంసారము’ అనే దీర్ఘ మార్గమునందు పరిభ్రమించటం నుండి నివృత్తి పొందినవారై ఉంటారు. ఆత్మయందు సుఖ విశ్రాంతి పొంది ఉంటారు.
ఆ మహానుభావుడగు జీవన్ముక్తుడు బహిర్ముఖ వృత్తిగల అజ్ఞానులతో సంభాషించేటప్పుడు నిరతిశయానంద రూపమగు ఆత్మయందు మౌనముగా సుఖ విశ్రాంతిని కొనసాగిస్తూనే ఉంటాడు. అంతేగాని జడస్వరూపుడు కాదు.
యా నిశా సర్వభూతానామ్ అవిద్యాన్తమయాత్మికా | పరో బోధః పరా శాన్తిః తత్రాసౌ సమమాస్థితః ||
అవిద్యాంధకారంలో వ్యవహరించే సమస్త జీవులకు ఏది “రాత్రి"వలె ప్రాముఖ్యం లేక అపరిశీలనాత్మకమై ఉంటోందో, వారు అద్దాని పట్ల నిద్ర వ్యవహరిస్తున్నారో… అది జీవన్ముక్తునకు పరమబోధరూపమై, పరమ శాంత రూపమగు ఆత్మస్థానము అయి ఉంటోంది. ఆ ఆత్మదర్శనయోగం ఆతనికి సర్వదా జాగ్రత్ వ్యవస్థగా కన్పట్టుచున్నది. అట్టి జ్ఞానానందమయమగు జీవన్ముక్తుడు సదా సర్వత్రా సమరూపమున వెలయుచు పరమానందముగా ఈ జగత్తులో సంచరిస్తూ ఉంటే, అట్టి సమదర్శి యొక్క పవిత్ర పాదముల స్పర్శకు భూదేవత పులకిస్తూ ఉంటుంది. దుఃఖ ప్రదమగు ఏ ఈ సంసార రూప దృశ్యమున సమస్త సంసార తన్మయ ప్రాణులు మేల్కొని ఉన్నవారై అతిజాగరూకతతో ఏదేదో వెతుకుతూ కాలం వెళ్ళబుచ్చుచున్నారో… జీవన్ముక్తుడు అద్దానియందు నిదుర కలిగి ఉంటున్నాడు. ఆతడు పరమ సుఖి అయి ఉండగా… ఇక జడుడు ఎట్లా అవుతాడయ్యా?
యః కర్మౌఘమనాదృత్య స్వాత్మన్యేవావ తిష్ఠతే |
స ఆత్మారామ ఇత్యుక్తో, న జడో సౌ, రఘూద్వహ |
ఓ రఘుకుల శ్రేష్ఠుడగు రామచంద్రా! ఎవడైతే ఈ సంసారంయొక్క సర్వ విషయాల పట్ల విరక్తుడై సమస్త కర్మఫల సమూహాలను బుద్ధిచే త్యజించినవాడై, సర్వదా స్వాత్మయందే నెలకొని ఉంటాడో… అట్టివాడు “ఆత్మారాముడు” అని చెప్పబడుచున్నాడు. అట్టి ఆత్మారాముడు జడుడా?
Page:519
కానే కాదు. ఆతడు భవ్య పురుషుడు. విదిత వేద్యుడు. తెలుసుకొనవలసింది తెలుసుకొని ఉన్నవాడు. ఈ సంసార సముద్రపు ఆవలి తీరమును జేరి విశ్రాంతి సుఖమును అనుభవించుచున్నాడు. ఆత్మనే దర్శిస్తూ, ఆత్మనే ఆరాధిస్తూ, ఆత్మయందే రమిస్తూ, ఆత్మయందే స్థితి కలిగి ఉన్నాడు సుమా! ఆతడు మాకు తారసపడినప్పుడు మహర్షులమైన మేము ఆతనికి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం.
ఈ జీవుడు అనబడే బహుదూరపు పథికుడు (బాటసారి) సుదీర్ఘమగు సంసార మార్గంలో చిరకాలంగా సంచరించుటచే అలసిపోయి ఉన్నాడు. భోగసాధకాలగు పదార్థములను సేవించి, సంసారంచే మోసగించబడి వ్యాకులుడై ఉన్నాడు. వంచించుటలో అతి ప్రావీణ్యం చూపించే క్రూరులగు ’విషయాలు’ అనే దారిదోపిడిగాండ్రచే సంసార మార్గంలో అతి బాధితుడై వేదన చెందుతూ, బయటకు మాత్రం “నాకు అది తెలుసు, ఇది తెలుసు. వీళ్ళ సంగతి నేను చూస్తానుగా” ఇట్లా తలచుచు వ్యర్థంగా కాలమును, అవకాశాలను వృథా చేసుకుంటున్నాడు. వార్ధక్యం అనే మంచువర్షానికి పీడితుడై మరల మరల లోక వ్యవహారములచే పరివంచితుడగుచున్నాడు. ‘జన్మలు’ అనే మహారణ్యంలో చిక్కుకున్న జింకలాగా అటూ ఇటూ తిరుగాడటంలో వ్యర్థంగా ఆసక్తుడై ఉంటున్నాడు. అనేక దుఃఖ సంకటాలచే పరిపూర్ణమై ‘సుఖం’ అనే నీడయే కనబడనటువంటి సంసార ఎడారిలో స్వయంగా నిస్సహాయుడై దూరదూరంగా వెళ్ళుచున్నాడు. “పాపదృష్టులు” అనే మూట భుజముపై పెట్టుకొని అడుగడుగున పడుతూ, లేస్తూ దొర్లుతూపోతున్నాడే! అర్థ- అనర్థములనే రెండు అంచులు గల బాటలో నడుస్తూ అనేక సంకటములచే బుద్ధి కలత చెందుచుండగా తన దుఃఖములు తనకే అర్థం కాకుండా మహా ప్రయాణం కొనసాగిస్తున్నాడు.
ఆ విధంగా సంసార మార్గంలో నడుస్తూ మిక్కిలి అలసిపోయినట్టి ఈ జీవుడు ఒకానొకప్పుడు సౌభాగ్యవశం చేత, అనేక జన్మలలో చేసుకొన్న పుణ్యవశంచేత సాధన చతుష్టయ సంపత్తియుక్తుడై సచ్ఛాస్త్ర - సద్గురువుల అనుగ్రహమునకు పాత్రుడగుచున్నాడు. తత్త్వమును సేవించి తత్త్వసాక్షాత్కారం సముపార్జించుకొని ప్రబుద్ధుడగుచున్నాడు. ఆత్మజ్ఞాని అయి, సంసార సముద్రమును దాటి, ఆవలి తీరం చేరి శయ్య లేకున్నా సుఖముగా, విశ్రాంతిగా ఆత్మానుభూతియందు శయనిస్తున్నాడు. అట్లు ఆత్మనే అంతటా దర్శించే దృష్టియందు శయనించువాడే జీవన్ముక్తుడు.
ఆహా! ఆ జీవన్ముక్తుని ఆత్మదృష్టిలో పొందే సుఖనిద్ర గురించి ఏమని చెప్పమంటావు? అక్కడ భౌతికమైన ‘శయ్య’ లేకపోవచ్చు. ఆతని ప్రాణాలు ప్రశాంతత సంతరించుకుంటున్నాయి. ఆతడు స్వప్న రహితుడై, సుషుప్తి వర్జితుడై నిత్య ఆత్మసాక్షాత్కార జాగ్రత్లో స్వస్వరూపానందముచే సుఖంగా విశ్రమిస్తూ ఉంటే, బ్రహ్మ ఋషులమగు మేము కూడా ఆతనిని చూచి ఆనందిస్తున్నాం. ఆ జీవన్ముక్తునికి మేము చేతులెత్తి సదా నమస్కరిస్తున్నాం. ఆహా! జాతి గుఱ్ఱంలాగా ఆ ఆత్మజ్ఞాని భుజించుచున్నప్పుడు, నడుచుచున్నప్పుడు, శ్వాస తీసుకుంటున్నప్పుడు, మాట్లాడుచున్నప్పుడు, సంసార మహారణ్యం మధ్యగా ఉండి కూడా సుఖపూర్వకంగా ఆత్మయందు సుఖ విశ్రాంతిని ఆస్వాదిస్తున్నాడు కదా!
Page:520
ఓ రామచంద్రా! ఈ సంసారులుకూడా ఆదమరచి కొంచెంసేపు గాఢనిద్ర అనుభవిస్తున్నారు. అయితే తత్త్వజ్ఞుల యొక్క నిద్ర సాంసారిక నిద్ర కంటే అత్యంత విలక్షణమైనది. అక్కడ విశ్రాంతి అత్యంత ఘనీభూతమై ఒప్పుచున్నది. ఎందుకంటే గట్టిగా శబ్దం అయితే చాలు, సాంసారిక జీవుని సుఖ నిద్ర విచ్ఛేదనమౌతోంది. ఇక జీవన్ముక్తుని ఆత్మసుఖనిద్ర ప్రళయ గర్జనలచేతగాని, ఈ అవయవాలు ఛేదింపబడుచున్నప్పుడుగాని, మృత్యువు ఆసన్నమై ఈ దేహాన్ని స్తంభింపజేస్తున్నప్పుడు గాని, ఈ దేహాదుల రాకపోకల చేతగాని ఏ మాత్రం చెదరటమే లేదు. ఆహా! తత్త్వజ్ఞుల ఆత్మదర్శనం అపూర్వం! మహాఘనీభూతం! అమోఘం! చిన్మాత్ర దర్శనముచే వారు ప్రబుద్ధులై ఈ బాహ్యేంద్రియా లను నిరింద్రియాలుగా దర్శిస్తున్నారయ్యా! వారు కళ్ళు మూసుకోకపోయినప్పటికీ ఈ ప్రపంచమంతా ఇందలి సర్వ సంక్షోభాదులతో సర్వదా విలీనమై ఉంటోంది. జగత్తునంతా మ్రింగివైచి, జగత్తును స్వాత్మయందు లయం చేసివేసి, ఆత్మానంద రసామృతమును గ్రోలి పరమపూర్ణత్వమును పొందినవాడై ‘ఆత్మజ్ఞాని’ ప్రశాంతంగా జగద్విషయములపట్ల నిదురిస్తున్నాడు. ఆత్మయందు ప్రశాంత సుఖమును, జగత్తుపట్ల సుషుప్త సుఖమును సంపాదించుకొని తృప్తుడై ఉంటున్నాడు. ఆతని నిరతిశయమగు ఆనందం ముందు విషయజనితమైన ఆనందము, - సూర్యభగవానుని సహస్రకిరణ తేజస్సు ముందు నూనె దీపం వంటిది. అట్టి ఆత్మానందముతో కూడుకొనినవాడై స్వయంప్రకాశమగు స్వాత్మ ప్రకాశముచే అద్వయము - - తెంపులేనిది అగు సుఖమును అనుభవిస్తూ ఆత్మజ్ఞాని ఈ ఈ సర్వజగత్ విషయముల పట్ల మౌనరూప నిద్రాముద్రను వహించి ఉంటున్నాడు. కామ క్రోధ-లోభ-మోహ –మద-మత్సర్యాలు అనే అరిషడ్వర్గాంధకారమునకు ఆతని హృదయంలో చోటు దొరకటం లేదు. అమూర్తమగు ఆత్మ జ్ఞాన జ్యోతి వెలుగుచుండగా కామక్రోధాది చీకట్లు ఎట్లా ఉంటాయి? ఆత్మానంద రసము గ్రోలుచూ ఆతడు “ఇక్కడ నేనేం పొందాను? నా కర్మ! నా బ్రతుకు ఇంతే!”… ఇత్యాది అల్పవాక్యములు రావు. గంభీర్యము సంతరించుకున్నవి, ఈ జగత్తులన్నీ ఆక్రమించివేసినవి అగు మహత్తర, మహనీయ, మాననీయ వాక్యములు మాత్రమే ఆతని పెదవులు ఉచ్చరిస్తాయి.
ఆతడు సుఖంగా స్వాత్మయందు శయనించి ఉండగా, ఆతని ఒకానొక విభాగం ఈ ప్రపంచంలో ఆశ - అడియాసలచే స్పృశించబడకుండానే వర్ణాశ్రమమునకు ఉచితమైన వ్యవహారము నిర్వర్తిస్తూ లోక కల్యాణార్థం (లోకమునకు ఏ విధంగా సానుకూల్యమో… ఆ రీతిగా) వ్యవహరిస్తూ ఉంటోంది. ఆతడు సర్వదా సర్వ బాహ్య పదార్థములందు అనాసక్తుడై, అభ్యంతరమున ఆత్మానందరసమునందు మాత్రమే అనురక్తుడై ఆత్మయందు విశ్రాంతి పొందుచూ ఉండగా శాస్త్రములు ఉద్దేశసారం ఆతని యందు సార్థకమై ఉంటుంది.
ఆతడు ఆత్మను సూక్ష్మ పదార్థములన్నిటికంటే అతిసూక్ష్మమైన దానిగాను, స్థూలములన్నిటికంటే అతి స్థూలమైనదిగాను దర్శించుచు ‘చిదాకాశము’ అనే శయ్యపై పరుండి “మమాత్మా సర్వభూతాత్మా” …అను రూపముతో కూడిన ప్రశాంతతతో నిద్ర సుఖం అనుభవిస్తూ ఉంటున్నాడు.
“జగత్తులోనో, ఆయా లోకములలోనో ఒక మూలగా ఉండే ఈ దేహము నేను కాదు. నాది చిత్స్వరూప దేహం. అట్టి నా చిత్స్వరూపదేహంలో అణువణువునా ఇటువంటి అనేక బ్రహ్మాండాలు
Page:521
ఉన్నాయి. నా చిత్స్వరూపం అతి సూక్ష్మము అత్యంత స్థూలము అగుటచేత అణురూపం - విశ్వరూపము కూడా అయివున్నది. ఈ విశ్వమంతా నా దేహమే!” …అని తలచుచు ఆతడు ఈ బ్రహ్మాండములన్నీ తన యొక్క చిత్స్వరూప దేహమునందే గాంచుచున్నాడు. ఆహా! ఆత్మజ్ఞాని అనేక సృష్టి సమూహములను సంహారం చేసివేస్తూ, వాస్తవానికి దేనినీకూడా సంహారం చేయకయే ఉంటూ మహత్తరమైన ‘ఆత్మప్రకాశము’ అనే శయ్యపై యోగనిద్ర అనుభవిస్తున్నాడు. ఇక ఈ ఎదురుగా కనిపించే సంసార సమూహమంతా సాంసారిక జీవునికి దాటరాని సముద్రంలా అగుపిస్తుంటే… ఆ ఆత్మజ్ఞానియగు జీవన్ముక్తునికి ఇదంతా కలలో చూచే దృశ్యంలా అసలు విషయమే కానట్లు అనిపిస్తోంది. పూర్ణ ప్రకాశముతో వ్యక్తమయ్యే ఎనిమిది దిక్కులవలె ఆతడు అంతటా అన్నివైపులా “అంతా నా ఆత్మ స్వరూపమే” అనే ప్రకాశాన్ని అనుభవిస్తున్నాడు. “నేను నా సద్రూపంచే అంతటా (సర్వత్రా) సర్వదా వ్యాపించి ఉన్నాను. సమస్త పదార్థముల స్వసత్తా సామాన్యమును సంతరించుకొనియే ఉన్నాను. అంతటా వ్యాపించియున్న ఆకాశం కూడా నా చిత్ శరీర విభాగమే అగుచున్నది. అందుచే ఆకాశము కంటే కూడా అధిక వ్యాపకుడను" అని ఆతడు తన చిత్ శరీరమును గాంచుచున్నాడు.
"ఈ పృథివి మొదలైనవి ద్రవరూపం నుండి (ఆపోరూపం) వస్తున్నాయి. ద్రవరూపాలు అగ్ని నుండి వస్తున్నాయి. అగ్ని వాయువునుండి, వాయువు ఆకాశము నుండి వస్తున్నాయి. అట్టి ఆకాశము ఎందులోంచి బయల్వెడలుతోందో, ఎందులో ఉండి ఏది ఆధారముగా కలిగి ఉంటోందో… అట్టి చిదాకాశమే నా దేహం.”
అని అతడు సర్వము తనయందే గాంచుచున్నాడు. ఆతడు ఆత్మగా అంతటా అనుభూతం చేసుకొని ఉండగా, ఇక ‘ఆత్మ జ్ఞాన చర్చ’ అనే భాషా ప్రయుక్తితో కూడిన సుదీర్ఘ వ్యవహారంతో పనేముంది? "నిర్మల చిదాకాశ రూపుడను, సర్వదా సర్వమునకు కేవల సాక్షిని అగు నా యొక్క ఒకానొక మూల ‘జగత్తు’ అనబడే స్వప్న సదృశదృశ్యమును గాంచుచున్నాను కదా”… అను అనుభవముచే ఆత్మశయ్యపై నిద్రిస్తున్నప్పటి (ఇదంతా ఆతనికి) ‘జగత్’ అనే మధుర స్వప్నముగా అగుచున్నది. ‘ఆత్మ’ అనే రసముచే ఆతనికి ఇది మధుర పానీయమే అవుతోంది.
ఇక ప్రవాహ పతితమైన యథాప్రాప్తములైన వ్యవహారాలన్నిటినీ ‘ఆత్మజ్ఞానము’ అనే శయ్యపై శయనిస్తూనే, యోగనిద్రావశుడై ఉంటూనే నిర్వర్తిస్తున్నాడు. నిద్ర మేల్కాంచినవాడు నిద్రలో అనుభూతమైన స్వప్నమును ఎంతో ప్రయత్నం చేస్తేగాని స్మరించలేకపోవుచున్నాడు కదా! ఆత్మయందు మేల్కొనియున్న జీవన్ముక్తుడు అతి ప్రయత్నంచేత తనయొక్క బహిర్ముఖత్వమును, బాహ్య దేహత్వమును అతి కొంచెంగా వహిస్తూ ఆత్మయందే స్థితిని కొనసాగిస్తున్నాడు. ఆ పరమ చిదాకాశ రూపత్వము పొందిన ఆత్మజ్ఞాని ఆకాశమువలె విశాలమై, సూక్ష్మమైనట్టి నిజస్వరూపముయొక్క జ్ఞానమును సర్వదా కలిగి ఉంటున్నాడు. ఈ దేహాదుల వ్యవహారం ‘అసత్తు’ అని ఎరిగి ప్రయత్నపూర్వకంగా ఈ జీవ - జగదాది ధర్మములు లీలగా, క్రీడగా నెరవేరుస్తున్నాడు.
చూచావా రామచంద్రా! ఈ ప్రకారంగా జ్ఞాని ఆత్మయందు విశ్రాంతి పొందుచూ సదా నిదురిస్తున్నప్పటికీ, ఇక లోకప్రసిద్ధములై ఉన్న జాగ్రత్ - స్వప్నములలో ఇతరుల వలెనే మేల్కొనుచు,
Page:522
నిదురించుచూ ఇక్కడ లీలామాత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఆతనికి ఈ జగత్తుతో స్వస్వరూపానుసంధాన ప్రాభవం చేత మిత్రత్వమే గాని, శత్రుత్వం ఉండదు.
సర్వ వైషమ్యములను సర్వదా ఆతడు మొదలంటా త్యజించియే ఉంటాడు. సమచిత్తుడు కాబట్టి స్వభావ సిద్ధంగానే శమము, దమము, తితిక్ష, జ్ఞాన వైరాగ్యం, సంతోషము మొదలైన మనోహరమైన వృత్తిరూపుడై ఉంటాడు.
దేహమున్నంతవరకు దేహముతోను, ఆ తదనంతరం దేహరహితంగాను (విదేహం) ఆతడు కైవల్యమునందు విశ్రమిస్తున్నాడు. అంతేగాని ఈ తుచ్చ జగత్ విషయ పరంపరలయందు గాదు. ఆతని మిత్రత్వం సర్వదా శ్రేయోమయమే అయి ఉంటుంది. ఇదంతా ఆతనికి క్రీడయే! దృశ్య విషయములు అనే స్వకీయ మిత్రులలో లీలగా క్రీడిస్తూ హాయిగా గడుపుతూ ఉంటాడు.
శ్రీరాముడు : మహాత్మా! మహానుభావుడు, తత్త్వజ్ఞాని అగు జీవన్ముక్తుడు ఎవరెవరితో క్రీడిస్తాడు! ఆతనికి మిత్రులెవరు? ఆతని క్రీడ ఎట్టి స్వభావం కలిగి ఉంటుంది? ఆతని క్రీడ స్వాత్మస్థితి రూపమై నదా? లేక ప్రాపంచికమైనదా? ఆతడు తనయందే ప్రీతిని పదిలపరచుకుంటాడా? ఆతని ప్రీతి ఈ భోగపదార్థముల పట్ల అందరికీ ఉండే ప్రీతి వంటిదేనా? లేక ఆతని ప్రీతికి వేరే ప్రత్యేకత ఏమైనా
ఉంటుందా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఆతనికి ముగ్గురు కర్మ దేవతా రూపులగు దేవతలే స్నేహితులు. వారితోనే ఆతని క్రీడ!
సహజకర్మ : తాను జన్మించిన ఉపాధిని అనుసరించి కుల వృత్తి ధర్మంగా ఆతడు నిర్వర్తించవలసిన ఏఏ కర్మలు తదితరులకు సానుకూల్యమో… ఆయా విధులు-ధర్మములు ఆతనికి సహజ కర్మ మిత్రుడు. ఆతడే ఆతని మొదటి సహచర స్నేహితుడు.
శాస్త్రీయ కర్మ : లోకకల్యాణార్థం శాస్త్రములు ప్రవచించే ఏఏ కర్మాచరణం ఉంటుందో, అద్దానిని ఆతడు ప్రయత్నపూర్వకంగా నిర్వర్తిస్తాడు. శాస్త్రములు అందరి సానుకూల్యమును అనుసరించి చేయవలసినవి - చేయకూడనివి అని చెప్పుతాయి కదా! ఆ కర్మలచే స్పృశించబడకయే వాటిని స్వధర్మనిరతిగా సంతోషంగాను, ఉత్సాహంగాను, తదితరులకు సానుకూల్యంగాను నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ విధంగా శాస్త్రీయ కర్మదేవత ఆతని రెండవ స్నేహితుడు.
స్వకర్మ : స్వప్రయత్నముచే సచ్ఛాస్త్రములు అభ్యాసము, విచారణ, సత్సంగము, శమము, దమము, తితిక్ష, ఉపరతి, శౌచము, సంతోషము, ఈశ్వర ప్రణిధానము, సంయమము - ఇవి మనస్సును శుద్ధ పరచుకోవటానికి, విస్తార పరచుకోవటానికి, నిర్మల పరచుకోవటానికి, జ్ఞాన పరిపుష్టి కొరకు నిర్వర్తిస్తూ ఉంటాడు.
Page:523
అట్టి సహజ కర్మ - - శాస్త్రీయ కర్మ - స్వకర్మలు అనే దేవతలను తన స్నేహితులుగా చేసుకొని వారితో ఈ జగత్ మైదానంలో క్రీడిస్తూ (జీవన్ముక్తుడు) ఉంటాడు.
నాయనా! రామచంద్రా! ముముక్షువైనవాడు ఉత్తమ కర్మలను ఆశ్రయించాలి. అట్టి "ఉత్తమ కర్మ” అనే మిత్రుడు… తండ్రి వలె ఊరడిస్తాడు. ఆత్మీయురాలగు ప్రియ పత్ని వలె, అన్న వలె దుష్కర్మల నుండి నివారిస్తాడు. మహాసంకటాలలో ప్రియస్నేహితుని వలె తోడవుతాడు. ఉపాధ్యాయుని వలె, గురువు వలె కార్యములందు సంశయములను తొలగిస్తాడు.
అగ్నిని ఉష్ణము విడువనట్లు, పుష్పమును సుగంధం వదలనట్లు ఈ జీవుని ఆతని ఉత్తమ కర్మలే సదా తోడుగా ఆతనిని సంసారలంపటం నుండి ఎప్పటికైనా ఉద్ధరించగలుగుతాయి. ఉత్తమ కర్మలు జీవునకు కాలక్రమేణా యుక్తాయుక్త-నిత్యానిత్య విచక్షణా జ్ఞానం ప్రసాదించే మహావర ప్రసాదమగు కులదైవం. ఉత్తమ కర్మలు సత్పురుషులను సేవింపజేసి వారి సాంగత్యముచే ‘అజ్ఞానము’ అనే జన్మజన్మార్జితమైన మహాసంకటము నుండి పరిరక్షిస్తాయి.
ఓ రామచంద్రా! ఈ జీవుని సర్వవిధాలా రక్షించేది, అధ్యాత్మ మార్గంలో తోడు అయ్యేది, ఆత్మజ్ఞానం వైపుగా ప్రేరేపించేది, మహనీయులగు ఆత్మజ్ఞుల దగ్గరకు జేర్చేది ఈ సహజకర్మశాస్త్రీయ కర్మ - స్వకర్మ … అనబడే ముగ్గురు మిత్రులేనయ్యా! అందుకే ఉత్తమకర్మ నిర్వర్తించటం పట్ల మనుజుడు అత్యంత శ్రద్ధ, ఆసక్తి, పూజ్యభావన పెంపొందించుకొనటం ఆతనికి శ్రేయోదాయకం. ఇదియే తత్త్వశాస్త్రము యొక్క ‘కర్మ సిద్ధాంతము’ అయివున్నది. ఆత్మజ్ఞాని ఉత్తమ కర్మలయందు స్వభావ సిద్ధంగా అనునిత్యమూ ప్రేరేపితుడై ఉంటాడు.
ఓ రామచంద్రా! "జీవితము” అనే అవకాశమును సద్వినియోగపరచుకొనే ప్రయత్నశీలురగు జీవులు స్వకర్మను ఆరాధిస్తూ జీవన్ముక్తత్వము వైపుగా ధృతి - - ఉత్సాహాలతో ప్రయాణిస్తున్నారు. ఈ భౌతికమైన భార్య - పిల్లలు నిజమైన కుటుంబం కాదు.
స్నాన-దాన-తపో-ధ్యానములే ఆ ముముక్షువుకు పిల్లలు. అవి తదితరులను తనకు సానుకూల్యురై ఆధ్యాత్మికయానంలో తోడుగా ఉండేటట్లు ప్రేరేపించి తయారు చేస్తాయి. నిత్య సంతోషమే ఆతని భార్య. అట్టి నిత్యసంతోష కళత్రమును సంపాదించుకున్నవారు తదితరులనుకూడా అనేక రుగ్మతల నుండి వైదొలగింపజేస్తూ దర్శనమాత్రం చేతనే ఆనందిపజేస్తూ ఉంటారు.
ప్రేమ - కరుణ ఆతని చెలికత్తెలు. ‘సమత్వము’ ఆతని సోదరుడు. వినమ్రత, ధైర్యము, ధర్మనిరతి ఆతని బంధువులు. సర్వుల పట్ల మైత్రి ఆతని ప్రియసఖుడు.
ఈ విధంగా జీవన్ముక్తుడు కోమలమైన స్వభావముతో నిత్యసంతోషము అభ్యసిస్తూ స్వభావసిద్ధంగా ప్రేమ - - కరుణ - మైత్రి కలవాడై లోకకళ్యాణకారకుడై ఉంటాడు. ‘స్వకర్మ’ అనే మిత్రునితో వ్యవహరిస్తూ లాభాలాభములచే ప్రసన్నుడు గాక, క్రోధయుక్తుడు గాక సర్వదా
Page:524
వసంతకాలపు మేమరహిత ఆకాశంలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. నిరంతరం అనేక లోకవ్యవహారములమధ్య వ్యవహరిస్తూ ఉండవలసి వచ్చినప్పటికీ ఆ జీవన్ముక్తుడు అనుక్షణం నిర్వాణ-శాంత మనస్కుడై చెన్నొందుచున్నాడు. తత్త్వజ్ఞాన-రహితమైన, సారరహితమైన, సంభాషణలు ఆతనిని సమీపిస్తున్నప్పుడు ఆతడు శిలా విగ్రహమువలె మౌనం వహించినవాడై ఉంటాడు.
అర్హులు, ఆశ్రయించినవారు తటస్థపడితే ఆతని ఆత్మజ్ఞాన వ్యాఖ్యానాలు మహా ప్రవాహంలా పెల్లుబుకుతాయి. లోకవిరుద్ధమైన కర్మల పట్ల అతడు శవప్రాయంగానూ, శిష్ట అభ్యాస కార్యములందు ఆదిశేషునివలె - బృహస్పతివలె అతి ఉత్సాహ - శౌర్య - బుద్ధి పరాక్రమాదులతో అనువర్తిస్తూ ఉంటాడు. ఆతని నోటి వెంట పుణ్య కథలు గంగా ప్రవాహంలా జాలువారుతూ ఉంటాయి. ఆ జీవన్ముక్తుడు “ఏది మేలు, ఏది కీడు, ఏది ఉచితం, ఏది దోషం” ఎరిగియే ఉంటాడు. ఆ సమదృష్టి కలిగి ఉండటంచేత ఆతడు క్షణంలో ఉచితానుచితములను నిర్ణయించగలుగుచూ ఉంటాడు.
ఆతడు… సమదృష్టి కలిగి, దానశీలుడై, ఉదార చరితుడై, గుణదోషములను విభజించువాడై, అతి కోమల స్వభావుడై, మధుర స్నేహయుక్తుడై, మనోహరుడై, పుణ్యకీర్తిమంతుడై, ఈ జగత్తులో విలాసంగా, క్రీడగా, ఆనందంగా విహరిస్తూ ఉంటాడు.
ఓ రామచంద్రా! పవిత్ర మాతృమూర్తియగు ఈ భూదేవత అనేకమంది జీవన్ముక్తులగు సత్పుత్రులను కలిగియే ఉన్నదయ్యా! మనం చెప్పుకున్న ఉత్తమ గుణములు సమత్వ ప్రభావంచేత జీవన్ముక్తులకు సహజములై ఉంటున్నాయి. అంతేగాని ఎవరో చెప్పారనో, ఏదో ఆశించియో వారు ఆ ఉత్తమ కర్మలను - గుణములను ఆశ్రయించవలసిన అవసరం లేదు. అగ్నికి ఉష్ణము, సూర్యునికి ప్రకాశము, చంద్రునికి శీతల కిరణములు ఎవరైనా బోధిస్తేనో, నియమిస్తేనో, చెప్పితేనో వస్తున్నాయా? కాదు కదా! జీవన్ముక్తుల సద్గుణములు అట్టివే!
శ్రీరాముడు : తత్త్వవేత్తలలో శ్రేష్ఠుడవగు ఓ వసిష్ఠ మహర్షీ! అందరికీ ఎదురుగా ఘనీభూతమై కనిపించే ఈ దృశ్యమును తత్త్వవేత్తలగు మీవంటి మహనీయులు ఏ రీతిగా, ఏ అర్ధంగా, ఏ అవగాహనతో, ఏ రూపంగా, ఏ విధంగా, ఎట్టి భావనతో, ఏ అభిప్రాయంతో, ఏ ఉద్దేశంతో, ఏ ఆశయంతో చూస్తున్నారో …. అట్టి అవగాహన గురించి వర్ణించి చెప్పండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఒక్క మాటలో చెప్పాలంటే చిదాకాశము యొక్క ఆభాసయే ఈ జగత్తు. వాస్తవానికి జగత్తూ లేదు. ఆభాసకూడా లేదు. శూన్యము లేదు. వ్యక్తి చైతన్యము లేదు. శూన్యత్వము ఆకాశము కంటే వేరా? కానేకాదు కదా! అట్లాగే ‘జగత్తు’ అనబడునది ఏదైతే అజ్ఞానుల దృష్టిలో వేరువేరుగా భాసిస్తోందో… అది చిదాకాశము కంటే కించిత్ కూడా వేరుకాకయే ఉన్నది.
Page:525
దేశాద్దేశాన్తర ప్రాప్తా మధ్యే యత్సంవిదో వపుః ॥ తద్దృశ్యమితి భాతీదం దృశ్యమన్యన్న విద్యతే ॥
దేశాద్దేశాన్తర ప్రాప్తే యన్మధ్యే సంవిదో వపుః । స్వస్వభావో హి భూతానాం తత్పదం పరమాత్మకమ్ ॥
దేశాద్దేశాన్తర ప్రాప్తే యన్మధ్యే సంవిదో వపుః । ఏతత్తత్పరమాకాశమ్ అత్ర సర్వమ్ ప్రతిష్ఠితమ్
దేశాద్దేశాన్తర ప్రాప్తా యన్మధ్యే సంవిదోవపుః । ఏతస్యావ్యతిరేకేణ జగత్తా నాస్తి కించన ॥
దేశద్ధేశాన్తర ప్రాప్తా విద్ధి మధ్యమ సంవిదః ॥ జగదిత్యపరం నామ స్వరూపాదచ్యుతాత్మనః ॥
ఓ రామచంద్రా! మాకు ఈ దృశ్యము ఎట్టిదని సుస్పష్టంగా అనిపిస్తోందంటే… మరొక ప్రదేశము బుద్ధివృత్తి ఒక ప్రదేశము
ఒక ప్రదేశం నుండి ఈ బుద్ధి వృత్తి నేత్రేంద్రియం ద్వారా మరొక ప్రదేశానికి వెళ్ళు చున్నప్పుడు, ఆ రెండు ప్రదేశముల మధ్యగా నిర్విషయమగు ఏ చైతన్య రూపము కలదో… అదే ఈ దృశ్యముగా భాసిస్తోంది. అంతకు వేరుగా ఈ దృశ్యము ఏమాత్రమూ ఏ క్షణమందు కూడా లేనేలేదు.
ఆ రెండు ప్రదేశముల మధ్యగా ఏ నిర్విషయమగు చైతన్యము యొక్క స్వరూపము కలదో…అదియే సర్వ జీవుల స్వస్వభావమైయున్నది. అదియే అందరికీ నెలవైన పరమాత్మ పదం.
ఆ రెండు ప్రదేశముల మధ్య ఏ నిర్విషయమగు చిత్స్వరూపము కలదో,…. అదియే పరమాత్మ రూపమగు చిదాకాశము. అచటనే ఈ సమస్తము ప్రతిష్ఠితమై ఉన్నది. అదియే సర్వమునకు అధిష్ఠానం. నీవు, నేను, ఈ సర్వ సభికులు, భవిష్యత్ పాఠకులు ఉన్నది ఆ నిర్విషయ చైతన్యమునందే! ఆ నిర్విషయ చైతన్యముగానే! ఆ రెండు ప్రదేశముల మధ్య ఉన్న నిర్విషయ చైతన్యము కంటే వేరుగా జగత్తు ఏమాత్రం లేనే లేదు.
సుషుప్తి సంవిత్
జాగ్రత్ ప్రదేశం స్వప్న ప్రదేశం
సుషుప్తి సంవిత్తు సుషుప్తి సంవిత్తు
ప్రళయం
పూర్వసృష్టి ప్రదేశము తదనంతర సృష్టి ప్రదేశము
సంవిత్తు సంవిత్తు
సంవిత్తు - జాగ్రత్, స్వప్నముల మధ్య గల సుషుప్తి సంవిత్ రూపమే సృష్టి - తదనంతర సృష్టి మధ్యగల సుషుప్తి సంవిత్తు కూడా!
Page:526
మూర్ఛావస్థ సంవిత్తు . ఆ సుషుప్త సంవిత్తే జాగ్రత్ స్వప్నములను తన రూపంగా ప్రదర్శిస్తోంది.
ఆ ప్రళయ సంవిత్తే పూర్వ - - పర సృష్టుల రూపంగా కూడా వ్యవహరిస్తోంది. ఆ మూర్ఛావస్థ సంవిత్తే ….. ఇహ పర లోకాలుగా కూడా అభివ్యక్తతమౌతోంది.
ఆ సంవిత్తే సర్వకాల, సర్వావస్థల యందును యథాతథమైయున్నది. అది ప్రతిజీవుని కూటస్థ రూపం. అది ఎవరి పట్ల ఎద్దాని కొఱకు కూడా ఏమాత్రం తన స్థానం నుండి చ్యుతి పొందటం లేదు.
అట్టి చిద్రూపానకే కొందరు (అజ్ఞానులు) ‘జగత్తు’ అనే పేరుపెట్టారు. మహాప్రళయం తరువాత మరల ఆదిసృష్టి సంభవిస్తోంది. అయితే మహాప్రళయానికి ముందు ప్రళయం సృష్టుల మధ్యగా, సృష్టి కొనసాగు సమయంలో ముందు, ఆవల, ఈవల, ఇక్కడ, అక్కడ, ఇప్పుడు, అప్పుడు, మరెప్పుడైనా సరే… పరమాత్మ కంటే వేరుగా జగత్తుకు మరొక కారణం లేదు. జగత్తే పరమాత్మ! పరమాత్మయే జగత్తు. (సదేవ సౌమ్యే దమగ్ర ఆసీత్ - సృష్టికి పూర్వం సద్రూపమగు పరమాత్మయే కలదు!) మహాప్రళయదశలో ‘జగత్తు’ అనబడేదానికి బీజమే లేదు. ఇక “పరమాణువు మొదలైన వాటి నుండి ఈ మూర్తివంతమగు జగత్తు ఏర్పడుతోంది” అనే కల్పన అంతా అసంగతమే సుమా!
ఉత్పన్నమేవ నైవాతో మూర్తం దృశ్యమిదం జగత్ | వస్ధ్యాపుత్రఇవాత్యస్తమతో స్యేవ న దృశ్య ధీః |
మూర్తివంతమై కనిపించే జగత్తు ఆత్మదృష్ట్యా ఉత్పన్నమే అయివుండలేదు. సమస్త శ్రుతులు ఈ విషయం ఎలుగెత్తి గానం చేస్తున్నాయి. శ్రుతుల తాత్పర్యం ఇదియే! కాబట్టి గొడ్రాలి రెండవ కుమారునివలె ఈ దృశ్యము అత్యంత అసత్యమై ఒప్పుచున్నది. “ఈ నలువైపులా కనిపించే దృశ్యము పరమాత్మపదమగు శుద్ధ-నిర్మల చిదాకాశమే”… అని శ్రుతి తాత్పర్యవేత్తలు ఎరిగియే ఉన్నారు.
చిన్మాత్రము తన నిర్మల - నిర్వికార రూపమును త్యజించకయే సుషుప్తి నుండి స్వప్నమునకు, స్వప్నం నుండి జాగ్రత్తుకు, జాగ్రత్తు నుండి సుషుప్తికి వెళ్ళుచున్నది. అట్లాగే అయ్యది నిజచిదాకాశ రూపం త్యజించకయే సృష్ట్యాది, సృష్టి, సృష్టి అంతం పొందుచూ ఈ సృష్టిరూపంగా కూడా భాసిస్తోంది. సుషుప్తి నుండి స్వప్నదశకు వచ్చినప్పుడు ఆ స్వప్నంలో భాసించే నగరాలు మనో సంబంధమైన స్వప్న సంకల్ప రూపమే కదా! అట్లాగే చిదాకాశమే సృష్ట్యాది యందు సృష్టిరూపంగా (ఈ దృశ్య జగత్తుగా) భాసిస్తోంది. వాయువు స్పంద రూపమే ఎట్లా తన స్వరూపమునందు స్వయంగా చక్ర తరంగాది రూపములను చేష్టితం చేస్తోందో (ప్రదర్శిస్తోందో)… అట్లాగే అజ్ఞాన చిదాకాశ విభాగము కూడా సృష్ట్యాదిలో తానే స్వయంగా దృశ్యరూపమున తనయందు స్థితినొంది ఉన్నది. ఎరుగబడినప్పుడు (తత్త్వజ్ఞానము కలిగినప్పుడు త్రైలోక్యరూపమైనట్టి ఈ దృశ్యజగత్తు దృశ్య జగత్తుగా కాకుండా పరబ్రహ్మముగానే భాసించుచున్నది. కనుక పరబ్రహ్మమే తన యందు ఈ విధంగా దృశ్యరూపంగా నెలకొనియున్నట్లు సుస్పష్టమౌతోంది కదా!
Page:527
ఓ రామచంద్రా! ఈ పృథివి మొదలైనవి ఎప్పుడూ కూడా మూర్తివంతము సాకారము కాదు. ఇవన్నీ కూడా అజ్ఞాని దృష్టికి మూర్తివంతంగాను, జ్ఞానిదృష్టికి అమూర్తివంతంగాను అగుచున్నది. ఏది ఏమైనప్పటికీ మూర్త-అమూర్తవంతంగా విరాజిల్లుచున్నది పరబ్రహ్మమే సుమా!
స్వప్నంలో కనిపించేదంతా మూర్తవంతంగా కనిపించవచ్చుగాక! మేల్కొనిన తరువాత స్వప్నంలో కనిపించిన పర్వతం ఏమైపోతోంది? అంతా రూపరహితమై శూన్యాకాశమునందు విలీనం అగుచున్నది కదా! అట్లాగే ఆత్మజ్ఞానము సంపాదించుకొని అనుభూత మొనర్చుకొన్నవారికి ఈ ముల్లోకములు కూడా శాంత చిన్మాత్రాకాశముగా అగుచున్నాయి. జ్ఞానులు దృష్టియందు ఈ జగత్తు విభాగ రహితమగు పరబ్రహ్మముగానే విరాజిల్లుచున్నది. ఇక అజ్ఞానుల దృష్టియందంటావా … అజ్ఞానులనే అడుగు. ఎందుకంటే వారి దృష్టి క్షణ మొకరీతిగా ఉంటోంది.
ఓ రామచంద్రా! నిర్విషయమగు పరమాత్మ పదము ఎట్టి రూపము కలిగియున్నదో… ఈ సత్-అసదాత్మకమగు జగత్తు కూడా అట్టి రూపమే కలిగియున్నది. ఎట్లా అంటావా?
ఈ సమస్త ప్రపంచము పంచభూతములకంటే వేరు కాదు. ఇక పంచభూతములో… తమ అధిష్ఠానమగు పరమాత్మ కంటే వేరుగా ఎక్కడినుంచీ వచ్చియుండలేదు.
అందుచేత … బాహ్యేంద్రియములచే జనించే రూప - ప్రకాశాదులుగాని, అభ్యంతరమగు మనస్సుకు అధీనమైయుండే సంకల్పము-యోచన-భావన-వేదన గాని, ఈ సమస్త బాహ్య అభ్యంతర ప్రపంచము పరమాత్మ పదరూపమే అయివున్నది. మహాసముద్రంలో తరంగాలు, సుడులు, బుడగలు, ఆవర్తాలు మొదలైనవిలాగా… ఈ బాహ్య - అభ్యంతరాలలో అనుభవమగుచున్న సర్వము ‘పరమాత్మ పదము’ అనే మహాసముద్రంలోని అనన్యమగు విశేష పరంపరలేనయ్యా!
రాగము, ద్వేషము, భావము, అభావము…. ఇవన్నీ కూడా సద్రూపము త్యజింపకయే ఉన్నట్టి చిదాకాశ స్వరూపం అయివున్నాయి. తరంగములుగా ప్రదర్శితమగుచున్నప్పుడు సముద్రజలం తన ద్రవత్వము త్యజిస్తోందా? లేదు కదా!
త్యక్త్వా పూర్వాపరే కోట్యౌ మధ్యే యత్సంవిదో వపుః | స స్వభావః పరో జ్ఞేయో జగత్పయసి సంజ్ఞతః II
ఒకానొకడు ఒక వృక్ష శాఖమీదుగా ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుని వీక్షించుచున్నప్పుడు పూర్వవిభాగమగు శాఖను ఆ తరువాత విభాగమగు చంద్రుని… రెండింటిని విడిచిపెట్టితే మధ్యలో గల చైతన్యం యొక్క నిర్విషయమగు స్వరూపమేది ఉన్నదో… అదియే చైతన్యము యొక్క పరమోత్తమ మగు స్వభావం. మృగతృష్ణలో జలం కనిపిస్తున్నట్లు అద్దానియందే అద్దానికి అభిన్నమై ‘జగత్తు’ అనబడేది కనిపించటం జరుగుతోంది. వాస్తవానికి ఈ జగత్తు సృష్ట్యాది యందు జనించియే ఉండ లేదు. ఏది ఉత్పన్నమైనట్లు కనిపిస్తోందో… అది ఇంద్రజాలంలో కనిపించే వస్తు సమూహం వంటిదే!
Page:528
కష్టం! నాస్త్యేవ యదృశ్యం! తదపి “అస్థి” ఇతి సంస్థితమ్! యదపి అస్థి పరంబ్రహ్మ, కష్ట! “నాస్థి” ఇతి తతమ్ ||
ఆహా! ఏమి ఆశ్చర్యం! గాజును చూచి మణి అని, మణిని చూచి గాజు అని భ్రమించినట్లుగా అజ్ఞానులు ఏ జగదృశ్యం లేదో… అద్దానిలో “కలదు” అనే బుద్ధిని పొందుచున్నారు. ఏ పరబ్రహ్మం సర్వదా ఘనీభూతమై ఉండియే ఉన్నదో… అద్దాని పట్ల ‘లేదు’ అనే బుద్ధి ఏర్పడుచున్నదే! ఇంక ఏం చెప్పాలి?
❖
ఓ రామచంద్రా! నాకు బ్రహ్మం యొక్క భావనకు వేరైనట్టి వివర్తిత జగత్తు ఎక్కడా ఈషణ్మాత్రం కూడా కనిపించటమే లేదు. కొందరు అసత్తగు ఈ దృశ్యం ‘సత్తు’ అని చెప్పుచున్నారు. ’సర్వదా సత్తు’ అగు బ్రహ్మమును సత్తుగా వారు గమనించటం లేదు. వాస్తవానికి దృశ్యము కొంచెం కూడా ఉత్పన్నమే అయివుండలేదు. దృశ్యమనునది ఎక్కడా భాసించటమూలేదు. మరి? ఇక ఇట్లు భాసిస్తు న్నట్లుగా కనిపించే దంటావా? బ్రహ్మమే స్వయంగా ఇట్లు జగత్తు రూపంగా అజ్ఞానం చేత అనిపిస్తోంది. ఇక ఇంద్రనీలమణి, తన కంటే ఏమాత్రం వేరుకానట్టి ఇంద్రనీల కాంతులతో ప్రకాశిస్తుంది చూచావా? అట్లాగే చిదాకాశము కూడా తన కంటే ఏమాత్రం వేరుకానట్టి సృష్టిరూపంగా ప్రకాశిస్తోంది. సూర్యుడు కూడా శాంతమగు పరమాత్మ పదమునందే సద్రూపముతోటి వెలుగొందుచున్నాడు. ఆ పరమాత్మ యొక్క అవయవమే ఈ సూర్యుడు. సద్రూపుడగు పరమాత్మకంటే సూర్యుడు వేరుగా లేనే లేడు.ఈ సూర్య చంద్రులు చిత్స్వరూపమున ఉన్నవారైనప్పటికీ తమ భౌతిక ప్రకాశముచే ఆ చిత్స్వరూపమును ప్రకాశింపజేయలేకపోతున్నారు.
ఆ పరమాత్మయే సూర్య చంద్రులను ప్రకాశింపజేస్తున్నాడు. అంతేగాని సూర్యచంద్రులు పరమాత్మను ప్రకాశింపజేయటం కాదు.
ఆహా! ఆ చైతన్యము యొక్క ప్రకాశము చేతనే ఈ దృశ్య సమూహమంతా ప్రకాశిస్తోంది. ఇక “ఆ పరమాత్మ సాకారరూపుడా? నిరాకారరూపుడా?”… అనే శబ్దార్థ కల్పన “ఆకాశ పుష్పం”లాగా అసద్రూపమైనది. అటువంటి కల్పన తత్త్వజ్ఞానులలో సంభవించటమే లేదు.
సర్వులకు జీవమును ప్రసాదిస్తున్న జీవన ప్రదాత, జగద్రష్టలో సూర్యుని యొక్క తేజోకిరణంలో ఆయన అవయవరూపమగు అణువు కిటికీ ద్వారా ఎట్లా భాసిస్తోందో… అపరిచ్ఛిన్న చిత్రకాశమయ మగు బ్రహ్మంలో సూర్యుడు మొదలైనవి అణువులవలె భాసిస్తున్నాయి. ఇంకో విధంగా చూస్తే, పరబ్రహ్మంలో ఏదీ భాసించుటయే లేదు. ఎందుకంటే పరబ్రహ్మం సర్వదా అతినిర్మలం, పదార్థ రహితం, నిర్విషయం అయి ఉన్నది కాబట్టి! మణికి మణికాంతులు వేరైనవి ఎట్లా అవుతాయి? అట్లాగే ‘పరమాత్మ’ అనే మణి యొక్క వేరువేరు కిరణ రూపములైనట్టి ఈ జీవులు, సూర్యుడు, చంద్రుడు నీవు, నేను … ఇవన్నీ పరమాత్మకు వేరైనవి కావు. పరమాత్మ పదము ద్వంద్వాతీతం. అందుచేత అద్దానియందు చిత్ - జడ భేదం లేదు.
Page:529
అది సర్వత్రా పరిపూర్ణం. కనుక శూన్యవర్జితం. పదార్థములు అసత్తు కాబట్టి అది సర్వపదార్థ రహితం. సర్వకల్పనలకు అధిష్ఠానం అగు చైతన్యమునందు ఆరోపిత (కల్పిత) దృష్టిచే జగత్తులు ఉన్నాయి. అధిష్ఠాన దృష్టిచే అవేవీ లేవు. అట్లాగే ఈ సర్వజీవులు కూడా! మనమంతా ఆరోపిత దృష్టిచే ఆత్మయందే ఉన్నాం. అధిష్టాన దృష్టిచే అంతా ఆత్మయే కాబట్టి మనమెవరమూ లేము. అవయవ సహితంగా కనిపించే ఈ సర్వజీవులు, సూర్య చంద్రాది ఖగోళ పదార్థాలు, నీవు, నేను… మొదలైన మనమంతా కూడా అవయవ రహితమగు చిద్రూపంలో అవయవ రహితమగు చిద్రూపాణువులుగా ప్రకాశిస్తున్నాం. ఇవన్నీ ఆరోపిత దృష్టిచే చిద్రూపమునందే ఉన్నప్పటికీ… చిద్రూపం నిజ సత్తును త్యజించకయే ఉన్నది. ద్వైత-ఏకత్వాలు ఆ చిద్రూప నిజసత్తలో లేనేలేవు.
ఓ రామచంద్రా! ఆ ఆ శుద్ధ నిర్విషయ చిత్స్వరూపము, సమక్షంలో… “ఇది పదార్థ సహితం. ఇది పదార్థ రహితం. ఇది స్థూలం. ఇది సూక్ష్మం. ఇది అల్పం. ఇది అధికం”… ఇత్యాది కల్పనలు అతిదూరమైనవై ఉన్నాయి.
ఈ జగత్తు మాకు ఎట్లా కనిపిస్తోందంటే… ఏకం, శాశ్వతం, అనంతం, సదా అతివ్యాపకం - అయినట్టి “చిన్మాత్రాకాశసత్త` యే తనలో తాను ఈ ‘జగత్తు’ అను నామముతో స్థితినొంది ఉన్నట్లుగా!
ఈ బుద్ధివృత్తి ఒక విషయమును త్యజించి మరొక విషయమును గ్రహించుచున్నప్పుడు మధ్య ఉండే చైతన్యము యొక్క నిర్విషయ వృత్తిరహిత బుద్ధిరూప చైతన్యమే ఈ వివిధ జగత్ రూపములుగా ప్రకాశించుచున్నది. స్వప్నంలో జీవచైతన్యము అనేక రూపములుగా ప్రకాశిస్తున్నట్లే… జాగ్రత్ చైతన్యము ఈ వివిధ రూపములతో జగత్తుగా (వ్యాప్తరూపంగా) ప్రకాశిస్తోంది.
జబ సు సుషుప్తి నుండి స్వప్నంలో ప్రవేశించే చైతన్యము తన యొక్క నిజ ఒక షు స్వప్నం → స్వరూపమున యథారీతిగా ఉండి ఉండియే స్వప్న రూపమును మారి పొంది వివిధ స్వప్నాంర్గత రూపములను అనుభవిస్తోంది. ప్రళయము నుండి సృష్టియందు ప్రవేశించుచున్న ప్రళయ చైతన్యము ఎప్పటి యట్లుగా తన అద్వైత రూపమున ఉండియే ఈ జగత్ ’ సృష్టి రూపమును (వేషమువలె) ధరించినదై ఈ నానావిధ రూపములుగా యం
ప్రదర్శనమగుచున్నది.
అనగా… చైతన్యము ఒక సృష్టి ప్రళయము నుండి మరొక సృష్టిని కల్పిస్తున్నప్పటికీ, తన స్వస్వరూపములో కించిత్ మార్పు కూడా పొందటం లేదు. అంతే కాదు! చైతన్యమే ఈ సృష్టిగా, ఇందులోని వివిధ వస్తువులుగా భాసిస్తోంది.
సుషుప్తి ఎట్లు చిద్రూపమో… అట్లాగే స్వప్నము చిద్రూపమే అయివున్నది. జాగ్రత్తు కూడా అట్లే చిద్రూపము అయివున్నది. ఇట్లు ఈ జగత్తంతా కూడా చిదాకాశరూపమై వెలయుచున్నది. ఈ
Page:530
విధంగా తత్త్వవేత్తల దృష్టిలో జాగ్రత్ స్వప్న సుషుప్తి రూపమగు ఈ సమస్త జగత్తు కూడా తురీయమే అయివున్నది. అట్టి అవగాహన తత్త్వవేత్తల సంప్రదాయమే!
ఇక మూఢులేమి తలచుచున్నారో… ఏమి ఎరుగుచున్నారో… అది ఒక రూపమంటూ ఏదీ లేకుండా పోతూ, క్షణక్షణికం అగుచున్నది కదా! అందుచేత “అట్టిది, ఇట్టిది” అని మేము చెప్ప జాలకున్నాం. వారి దృష్టిని నిర్వచించలేకున్నాం.
ఈశ్వరుడే ఈ జగత్తుల యొక్క జీవుల యొక్క సమస్త పదార్థముల యొక్క అభ్యంతరము అయివున్నాడు. అంతర్యామి రూపముచే… ఈశ్వరుడు దుర్లక్ష్యమైయున్నాడు. అట్టి ఈశ్వరత్వము ప్రతి జీవుని యందు ప్రతి పదార్ధమునందు అంతర్యామి రూపంలో దుర్లక్ష్యమై… మనోబుద్ధులకు లభించనిదై ఉన్నది. మనోబుద్ధులకు అతీతంగా పరిశుద్ధమగు జీవ - చైతన్య స్వరూపమై ఉన్నది.
కనుక రామచంద్రా! సమస్త పదార్థములు ఈశ్వర స్వరూపములే అయి ఉన్నాయి. ఈ విధంగా చిద్రూపుడగు ఈశ్వరుడే జగదాకారంగా ఉన్నాడని నిరూపించబడుతోంది. అట్లాగే, “నిజ దృశ్యరూపముచే జగత్పదార్థములు సత్యములు కావు”… అని కూడా తెలియవచ్చుచున్నది కదా!
ఈ పృథివి మొదలైన సర్వ పదార్థములందు పరమాత్మ అంతర్యామి అయి సమస్తమునకు సాక్షిరూపము వహిస్తూనే సర్వమును పరిణామమొనర్చుచున్నాడు. అయితే “పరిణామము” అనే శబ్దం ఉపయోగించటమనేది లౌకికమైన వ్యవస్థను బట్టి ఉపదేశార్థమేగాని… పరమార్థంగా ‘పరిణామము’ అనే కించిత్ ప్రత్యయము కూడా ఎక్కడా లేనే లేదు. సమస్తము చిద్రూపమే అయివుండగా… ఇక పరిణామమనేదెక్కడ? వాస్తవానికి సాక్షిత్వ - ప్రేరణత్వాలు కూడా లేవు.
ఆదిసృష్టి మొదలుకొని ఇప్పటి దాకా సర్వదా “ఏకమే” అయినట్టి చిన్మాత్ర పరమాకాశమే మహాసత్తా రూమగు “స్వాత్మ” యందు ‘జగత్’ రూపంగా స్థితినొంది ఉన్నది. ఇందుకు తత్త్వవేత్తల యొక్క “పరిపూర్ణకాత్మ” గురించిన అనుభవం, ఆ అనుభవాన్ని క్రోడీకరిస్తూ (తత్వమ్ - స్కో
హమ్ - - జీవో బ్రహ్మేతినాపరః - అయమాత్మా బ్రహ్మ - త్వమేవాహమ్ - - సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ
శ్రీరాముడు : మరి జీవునికి (అజ్ఞాత భ్రష్టమ్) అగు దుఃఖం ఎందుచేత సుదీర్ఘంగా కొనసాగుతోంది? శ్రీ వసిష్ఠ మహర్షి :
పరిజ్ఞాతే యథా స్వప్నే స్వార్గీకారాత్సుఖం సుఖమ్ | అనంబ్లీకారతో దుఃఖం స దుఃఖమ్ భవతి క్షణాత్ ||
Page:531
ఒకానొకడు స్వప్నంలో దృశ్యముతో తాదాత్మ్యమై అనేక వేదనలు అనుభవిస్తున్నాడనుకో! అప్పుడిక మేల్కోగానే మహాసుఖముగాను, మేల్కొననంతవరకు మహా దుఃఖంగానూ ఉంటోంది కదా! అట్లాగే, ఈ జీవుడు ఆత్మ స్వరూపమును ఎరిగిన తరువాత “నేలతి - నే తి" సూత్రానుసారంగా అప్పటికీ శేషించు ఆత్మయొక్క అంగీకారముచే తాను అప్పటి నుంచి దర్శించే జగత్కౌతుకమంతా ఇక మహా సుఖప్రదమే అవుతుంది.
అట్లా కాకుండా “అప్రమేయ - కేవల శుద్ధాత్మ మాత్రము” యొక్క స్వరూపమును అంగీకరించక (ఎరుగక) పొందుచున్న జగత్తంతా దుఃఖప్రదమే అయి ఉంటోంది. “ఇదంతా స్వప్న సదృశమేకదా!” అని మొదలే ఎరిగియున్న కారణం చేత తత్త్వజ్ఞాని ఈ జగత్తునందు పాల్గొనుచున్నప్పుడు, ఇద్దానిని చూస్తున్నప్పుడు తనయందు “దుఃఖము” అనే విక్షేపభావమును బలపడనివ్వడు. అందుచేత ఆతడు కూర్చున్నప్పుడు, నిలుచున్నప్పుడు, మేల్కొనినప్పుడు, నిదురిస్తున్నప్పుడు… అన్ని వేళలా “ఆత్మదర్శనము” అనే సమాధి సుఖస్థితిని కొనసాగించుచున్నాడు.
ఎందుచేతనంటే… ఆతడు… మాయా నిర్మితములగు భేదములయందు వసించుచున్నప్పటికీ అభిన్నము - ఏకరసము అగు ఆత్మయందు తత్పరుడై ఉంటున్నాడు. దుఃఖాదులు ఉంటే ఉండవచ్చుగాక! ఆతడు మాత్రం నిరతిశయమగు స్వాత్మయందే వెలయుచున్నాడు. బాహ్యప్రపంచమున వ్యవహరిస్తూనే …అంతరంగమునందు సర్వదా ముక్తుడై బాహ్యత్వము-అసత్ ప్రపంచత్వము లేనివాడై ఉంటున్నాడు. ఇక అట్టి జ్ఞానికి గ్రహించతగినదేమి? త్యజింపవలసినదేమున్నది?
ఓ రామచంద్రా! పరిజ్ఞాతమగు ఆత్మజ్ఞాని బాహ్యమున సర్వకార్యములు నిర్వర్తిస్తూనే… అంతరమున ఏదీ గ్రహించడు. త్యజించడు. ఎల్లప్పుడు సర్వకార్య వర్జితమైనట్టి బ్రహ్మమునందే స్థితి కలిగి ఉంటున్నాడు. అగ్నికి ఉష్ణత్వం ఎట్లాగో, మంచుకు చల్లదనము ఎట్లాగో… అట్లా జ్ఞానికి నిర్విషయమగు ఆత్మత్వము స్వభావ సిద్ధమే అయివున్నది. అంతేగాని అది ప్రయత్నపూర్వకంగా చేసే కార్యము వంటిది కాదు. ఎవనికైతే “నాది అంటూ ఏదీ లేదు” అని గ్రహించినట్టి గ్రాహ్య - త్యాజ్యములకు అతీతమైన బుద్ధి నిశ్చలంగాను, స్వభావ సిద్ధంగాను ఉంటుందో…. అట్టివాడు “తత్త్వవేత్త” … అని పిలువబడుచున్నాడు. ఎవడికి “గ్రహించబడవలసిదిగాని, త్యజించబడవలసినది గాని ఏదీ ఈ దృశ్యమునందు లేదు”… అనునది స్వభావమై ఉండదో… అట్టివాడు జ్ఞాని ఎట్లా అవుతాడు? ఎందుకంటే ఆత్మకు అన్యమైనదాని పట్ల అభిలాష కలిగి ఉండటమే అజ్ఞానానికి చిహ్నమై ఉన్నది కదా! ‘అజ్ఞానం’ అనే ఆవరణం లేనట్టి జ్ఞాని సదా శాంతచిత్తుడై, “ఈతడు మిత్రుడు, ఈతడు శత్రువు” అను రూపంతో కూడిన వికల్పములన్నీ మొదలంటా క్షయించినట్టి వాడై, సారభూతమగు స్వాత్మ సుఖముచే పరిపూర్ణుడై, “మహాశాంతి” అనే అమృత పానముచే సంతృప్తి సంపాదించుచున్నవాడై, ఆత్మయందే సదా సర్వదా సర్వత్రా స్థితిని సుస్థిరీకరించుకొని ఉన్నవాడై, స్వయం ప్రకాశక–స్వయంజ్యోతి అయి వెలుగొందుచున్నాడు. అట్టి జ్ఞానమే సర్వుల ఆయా వివిధ సర్వసాధనముల అత్యుత్తమమగు ప్రయోజనమై ఉన్నది సుమా!
Page:532
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ విధంగా ఆదిప్రజాపతి అగు విరాట్ పురుషుడు కూడా "పృథివి మొదలైనట్టివి లేనిది - నిరావరణము” అగు చిదాకాశ స్వరూపుడే అయివున్నాడు. ఆతడు కేవలము మనోమాత్రుడుగాను, ఈ జగత్తు ఆతని మనోమాత్రముగాను శాస్త్రకారులు నిర్వచించియే ఉన్నారు. అట్టి సమష్టిరూప మనస్సు ఎక్కడి నుండి వచ్చింది? అది చైతన్య మాత్ర స్ఫురణయే కాబట్టి ఆతడు చిన్మాత్ర స్వరూపుడేనని నిర్ద్వంద్వంగా నిర్ణయించబడుచున్నది. ఎందుకంటే మననమే మనస్సు. జగత్తుకు సంబంధించిన మనోధర్మమగు మననాకార కల్పనకు పూర్వము ఆతడు చిన్మాత్రుడుగానే అయివున్నాడు. జలంలో తరంగాలు తదనంతరం ఏమి కానున్నాయి? జలంలోనే లయమగుచున్నాయి కదా! ఆ తరువాత జలంలోంచే తరంగాలు బయల్వెడలుచున్నాయి కదా! అట్లాగే విరాట్ పురుషుని (సమష్టి సృష్టికర్త యొక్క) మనోమాత్రమగు (భావనామాత్రమగు, సంకల్ప జనితమగు, ఊహవంటిదగు) ఈ వర్తమాన జగత్తు ఒకానొకప్పుడు ఆత్మయందే లయము పొందబోవుచున్నదగుచున్నది. ఆ బ్రహ్మదేవుడు జలంలో తరంగాలవలె తనయందుతానే ‘మనస్సు’ అనబడుదాని పేరుతో చైతన్య తాదాత్మ్యధ్యాస (చైతన్యము యొక్క దృశ్య సంబంధమైన ధ్యాస) ను కల్పించుకొనుచున్నాడు.
బ్రహ్మదేవుడు కేవల సత్తామాత్ర స్వరూపుడే! అట్టి సత్తాస్వరూపమునందు బుద్ధి మొదలైనవి ఎట్లా ఉంటాయి? శూన్య స్వరూపము-అనంతము అగు ఆకాశంలో మట్టి - ధూళి ఉండవు కదా! ఆ బ్రహ్మదేవుడు వాస్తవానికి శుద్ధ-బుద్ధ-స్వయమాత్మ స్వరూపుడే కాబట్టి ఆయనకు దేహముగాని, చిత్తాదులుగాని, ఇంద్రియములుగాని, వాసనలు గాని… ఇవన్నీ లేవు. జలమునకు తరంగాదుల పొడవు, వెడల్పులు జల స్వస్వభావమునకు ఆపాదితాలే గాని జలం యొక్క వాస్తవస్వరూప ధర్మములు కావు కదా! అయితే, వ్యవహార నిర్వహణార్థం కల్పిత దేహేంద్రియాదులు ఆతనిపట్ల సదా విద్యమానమై ఉన్నప్పటికీ, ఆతని స్వరూపము సర్వదా నిష్ప్రపంచము - నిర్వికల్పము అగు పరమాత్మయే! అట్టి ఆత్మకు వేరైన కారణమేమీ లేదు కదా! ఇక పూర్వ ప్రజాపతి పూర్వమే ముక్తుడైనాడు కదా! నూతన ప్రజాపతికి ఆతడు కారణం కాదు కదా! ఈ విధంగా ఆ వర్తమాన ప్రజాపతి (బ్రహ్మదేవుడు) ప్రభవించటానికి ఆత్మకు వేరుకారణమేదీ లేదు. కనుక ఆతడు ఆతని మనోవీథిలో ప్రభవించుచున్న ఈ సృష్టి ఆత్మకు అన్యమైనది కాదని (అభిన్నమని) సిద్ధాంతీకరించ బడుచున్నది. ఈ విధంగా ఉత్పత్తి స్మృతి అనునది మొదలే లేవు.
శ్రీరాముడు : మహర్షీ! ఇతఃపూర్వపు ప్రజాపతి (ఇతఃపూర్వపు సృష్టి యొక్క సృష్టికర్త) ముక్తుడై, ఆ తదనంతరం కించిత్ ఇతఃపూర్వ స్మృతిచేత మరల దేహోత్పత్తి పొందియుండవచ్చును కదా! ఆ విధంగా ఈ జగత్తు ‘స్మృతి’యే ఆధారముగా కలిగియున్నదని అనవచ్చునా? మరి, ఈ జగత్తుకు ఆధారమే లేదు అని ఎందుకనుకోవాలి?
Page:533
శ్రీ వసిష్ఠ మహర్షి : సంసారము కొనసాగుచున్నట్టి జనన - - మరణ పరివర్తన శీలురగు జీవులకు ‘స్మృతి’ కారణభూతమై కొనసాగుచున్నదని అనవచ్చు. అయితే శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదు లతో కూడిన ఈ జగత్ వ్యవహారాదుల నుండి, అందుకు మూలమైనట్టి భావనాదుల నుండి ముక్తత్వము పొందిన హిరణ్యగర్భుడు (సమష్టి సృష్టికర్త) వంటి వారికి సంసార స్మృతియే ఉండదు. స్మృతియే అవిషయమై, కల్పనామాత్ర స్వరూపమై, స్వప్నసంగతమైయున్న ముక్తునకు మరల దేహోత్పత్తి ఉండజాలదు. వారికిక దేశాంతరము గాని, కాలాంతరముగాని పునరావృత్తి పొంద జాలవు. కనుక వర్తమాన ప్రజాపతి సృష్టికి పూర్వ ప్రజాపతి యొక్క ‘స్మృతి’ కారణం కాజాలవని సుస్పష్టీకరించబడుతోంది.
సరే! కాసేపు పూర్వపు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునకు పూర్వకల్ప వాసనాజన్యమగు “హిరణ్యగర్భాహంభావం”… అనే స్మృతిచే దేహాదులు ఒకింత సంభవించి ఉండవచ్చునని కాసేపు అనుకుందాం. పూర్వపు సృష్టి కేవలము మనో (ఊహా) కల్పితాలే కదా! అట్లాగే వర్తమాన సృష్టి కూడా కేవలం మానసిక కల్పితాలే. పృథివి మొదలైనవి ఏవో పదార్థముల నుండి ఉత్పత్తి కానివి, అతి తుచ్ఛములు, సర్వదా శమించినవి, సంకల్ప నగర ప్రాయములు, మిథ్యాభూతములు మాత్రమే అగుచున్నవి కదా! కలలోనో, (లేక) ఊహ (సంకల్పము)లోనో కనిపించిన పర్వతాదులు ఎట్లా పృథివీ సంబంధం కావో (మిథ్యా భూతములో), అట్లాగే విరాట్టు యొక్క శరీర రూపమున ఏ పాదార్థిక విశ్వము స్ఫుటంగా కన్పించుచున్నదో అది పృథివీరహితమే (మిథ్యయే) అయివున్నది. మంచుతో ఏర్పడిన గృహం మంచు దృష్ట్యా ఎట్లా భ్రాంతియో, ఈ ఎదురుగా కనిపించే సృష్టి కూడా స్వకీయమైన భ్రాంతి దృష్టి వ్యవహారమే అయివున్నది. “క్రితం రోజు రాత్రి స్వప్నమే ఈ రోజు రాత్రి స్వప్న విశేషాలుగా కొనసాగుతోంది" అనునది జనుల అనుభవం కాదుకదా!
ఆది సృష్టి పూర్వానుభవమే లేదు. పూర్వానుభవము యొక్క అభావం చేత పూర్వ ప్రజాపతి యొక్క ‘స్మృతి’ నూతన సృష్టికి నాందిగా అవజాలదు.
శ్రీరాముడు : కొన్ని కొన్ని వేదవాక్యములను అనుసరించి (ఉదా: ధాతా యథా పూర్వమకల్పయత్
- బ్రహ్మదేవుడు పూర్వ కల్పానుసారంగా ఈ సూర్య - చంద్ర - - పృథివి మొదలైన వాటితో కూడిన జగత్తును కల్పించెను… అను శ్రుతి వాక్యముల ద్వారా) బ్రహ్మదేవునికి (వర్తమాన ఈ సృష్టి కర్తకు) పూర్వ స్మృతి ఉండి ఉంటుందని కూడా కొన్ని సందర్భాలలో శాస్త్రకారులచే సూచనగా చెప్ప బడుతోంది కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను! అయితే, అట్టి శ్రుతి వాక్యములు 1.లౌకికులగు అజ్ఞానుల నిమిత్తం, 2. అనాది సిద్ధమగు కర్మమార్గము యొక్క ప్రవర్తనము కొరకై, 3. ఇతరుల బుద్ధిని అనుసరించి సంహితా విభాగంలో (కర్మకాండ విభాగంలో) బోధించబడినది. అది మధ్యేమార్గ పాఠ్యాంశమే గాని అంతిమ వేదసారం కాదు. (ఉపనిషత్ అంగం యొక్క సారం గ్రహించినట్టి) తత్త్వవేత్తల యొక్క దృష్టి యందు ప్రజాపతికి “పూర్వస్మృతి” అనే ప్రసంగమే లేదు.
Page:534
శ్రీరాముడు : స్మృతి శాస్త్రమునందు ప్రావీణ్యులలో శ్రేష్ఠులు, ఉత్తమ గుణ నిలయులు అగు ఓ మునీశ్వరా! హిరణ్యగర్భాదులు స్మృతి లేకుండా సృష్టి ఎట్లా చేస్తున్నారు. వారికి స్మృతియే లేకుంటే పూర్వకాలికమైన బ్రహ్మాండం యొక్క సమస్త గుణాలు ఈ బ్రహ్మాండమంతా ఎట్లా సిద్ధిస్తున్నాయి? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ స్మృతిని రెండు విధాలుగా మనం ఇక్కడ చెప్పుకుందాం. 1. మాయోపహిత స్మృతి : ఈ స్మృతి కల్పిత విశేషములపై ఆధారపడి ఉన్నది. సత్య పదార్థ శూన్యం, కల్పితం, మొదలే భ్రాంతిమయము అయివున్నది. భ్రాంతి సంస్కారాలచే జనించినదై ఉన్నది. అద్దాని యందు మాత్రం కార్య కారణత్వముల కల్పన సంభవమౌతోంది.
ఆ బ్రహ్మ స్తమ్బపర్యన్తం దృశ్యం కించిన్న విద్యతే |
యత్ర, తత్ర కథం, కీదృక్, కుతః స్యాత్ సంభవః స్మృతేః ॥
కాబట్టి రామచంద్రా! ఎచ్చటైతే బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక గడ్డిపరక వరకు గల సమస్త దృశ్యము వాస్తవానికి కొంచెమైననూ ఆత్మకు వేరుగా లేకయే ఉన్నదో… అచ్చట ఇక ఏ స్మృతి ఎట్లు సంభవించగలదు చెప్పు? ఈ దృశ్యం గనుక వాస్తవానికి ఉత్పన్నమై, విద్యమాన దశయందు ప్రమాణములచే అనుభూతమౌతూ ఉంటే అప్పుడు దృశ్యమునకు పూర్వకాల స్మృతి కారణమగు చున్నదని అనవచ్చేమో? కానీ ఈ దృశ్యము స్వప్నదృశ్యములాగానే ఉత్పన్నము అయి ఉండనే లేదు. తత్త్వజ్ఞులకు ఇది సత్యముగా నిరూపణ కావటం లేదు. ఎవరు ఎట్టి దృష్టితో చూస్తే అట్లు అనుభూతమయ్యే ఈ దృశ్యమునకు ‘ఇది సత్యము’ అనునదేది? ఎక్కడ ఈ రీతిగా దృశ్యమే లేదో … అక్కడ “స్మృతి” యొక్క కల్పన ఎక్కడిది?
అత్యంతాభావఏవ అస్య దృశ్యస్య కిల సర్వదా,
సర్వం బ్రహ్మేతి సత్యార్థాం తత్ స్మృతేః కలనాః కుతః?
ఈ విధంగా వాస్తవానికి… 1. ఈ దృశ్యం యొక్క అత్యంత అభావం (స్వతహాగా ఏమాత్రం లేనిదిగా) సిద్ధించుచున్నది. 2. ఒకవేళ; “దృశ్యం అనుభవమౌతోంది కదా!” అని అంటే… అట్లా దృశ్యంగా విద్యమానమయ్యేదంతా సదా బ్రహ్మమే అయివున్నది. ఇక బ్రహ్మమునకు వేరుగా దృశ్యం యొక్క కల్పన ఎచట?
ఈ కారణం చేత ప్రజాపతికి ’ఆదిస్మృతి’యే సంభవించనేరదు. ఎందుకంటే, శుద్ధ జ్ఞాన రూపుడగు ఆతనికి దేహమేది? దేహమే లేనివానికి స్మృతి ఎక్కడిది? బ్రహ్మదేవునికి వాస్తవానికి ‘పూర్వజన్మ’ ఉండి ఉంటే, అప్పటి శరీరత్వ భావనావశముచే ఇపుడు “నేను జగత్తంతా శరీరముగా కలిగియున్నవాడను”… అని అనుకుని ఉండేవాడేమో? కాని లౌకిక జీవునివలె “ఈతడు తండ్రి, ఈతడు నా తాత” మొదలైన లౌకిక స్మృతులు బ్రహ్మదేవునికి (స్మృతిచే) జనించవు కదా! లౌకికమైన పితృ-మాతాది సంబంధాలు గృహబద్ధులైన జీవులు కలిగి ఉంటున్నారు. కాబట్టి స్మృతికి యోగ్యు
Page:535
లగుచున్నారు. కాని, బ్రహ్మదేవుని ఉపాసనా విషయమైనట్టి ఈ జగత్తు మనోరాజ్యము వంటిది కూడా కాదు. ఎందుచేతనంటావా?
స్కృతి = (ప్రాపంచకమైన అర్థం రీత్యా) అనుభూతమైనట్టి భూతకాలిక పదార్థముల యొక్క సంస్కారముల వశంగా వర్తమానంలో ఏర్పడే స్మరణయే “స్మృతి”.
ప్రజాపతికైతే (సృష్టికర్త / బ్రహ్మదేవునికి) కల్పాదియందు పదార్థములే లేవు. కాబట్టి ఆతనికి ‘స్మరణము’ తో కూడిన ‘స్మృతి’ ఎక్కడిది?
ఏవం హి ఖల్విదం బ్రహ్మ పరమేవాచలం యతః అనాది మధ్య పర్యన్తం కుతః స్మృత్యాదయస్తతః ?
ఈ ప్రకారంగా ఈ సమస్తమూ కూడా ఆది మధ్యాంతరహితమగు కూటస్థ పరబ్రహ్మమే అయివుండగా, ఇక స్మృత్యాదులు ఎక్కడివి? ఎవరివి?
ఇక నీవు, “చైతన్యం సమస్త పదార్థముల యొక్క ఆత్మయే అయివున్నది. కాబట్టి స్మృతి కూడా చిదాకాశం యొక్క స్ఫురణయే అయివున్నది. పూర్వ ప్రజాపతి యొక్క - వర్తమాన ప్రజాపతి యొక్క ఆత్మ ఒక్కటే” అని అంటావా?… అది మేమూ (వేదాంతవాదులు) ఒప్పుకుంటున్నాం. 1."ఏది కలదో… అదంతా బ్రహ్మమే”
“స్వప్నద్రష్ట పరమశాంత స్వరూపుడై ఉండియే, స్వప్నంలో అనేక విశేషాలు దర్శిస్తున్నాడు”… అనునదే ఇందుకు దృష్టాంతం… అని నేను చెప్పియే ఉన్నాను కదా! ఆత్మయొక్క అజ్ఞాత బ్రహ్మ స్వభావమే “స్మృతి” రూపంగా స్ఫురించటం జరుగుతోంది. “నేను బ్రహ్మమును” అనే సమగ్ర స్వస్వరూప తత్త్వమును కించిత్ ఏమరచి… "నేను సృష్టికి కర్తృత్వం వహించే బ్రహ్మదేవుడను” అనునట్టి ఉపాసనా రూపముచే బ్రహ్మరూపమగు ఆత్మయే మరల మరల అభ్యస్తమై ఉపాసనా ఫలరూపమగు బాహ్య పదార్థం వలె (ఉపాసనచే) కల్పితమైన ఆకాశం యొక్క సాదృశ్యముచే భాసిస్తోంది. అజ్ఞానోపహితమగు బ్రహ్మంచే (జీవుని ద్వారా) ఏఏ పదార్థం ఎట్లెట్లు ఎరుగబడు చున్నదో… ఆ ఆలంబనం యొక్క ఫలితంగా అట్టి ఆకారముతోడనే కూడి ఉంటోంది. అట్లు ఆ ఆకారము దర్శించు స్వభావమే ‘స్మృతి’ చే ఉద్దేశింపబడుతోంది.
‘మృగతృష్ణ’ అనే భ్రాంతియందు ‘జలతరంగాకారము’ అనే దృశ్యం భాసిస్తున్నట్లుగా స్మృతి యందు అవిద్యమానమైన ఆయా పదార్థములు భాసించుచున్నాయి.
స్మృతి = సత్యస్వరూపమైన సర్వాత్మకమగు పరబ్రహ్మము నందు / సమక్షంలో సాదృశము లగుచూ స్ఫురించే చైతన్య వృత్తులు.
ఈ విధంగా ‘స్మృతి’ అనబడేది సర్వాత్మకమగు చిద్రూప పరబ్రహ్మమునందు అద్దాని అవయవముల వలె ఉంటున్నాయి. ఈ స్మృతుల విషయముల వైపుగా ఉన్ముఖమై ఉండటం చేత పరోక్షములుగా అగుపిస్తున్నాయి. స్వతఃగా స్మృతులు కూడా చిద్రూపమునకు అపరోక్షములై ఉన్నాయి.
Page:536
ఈ విధంగా ఏ సంవిత్తు కాకతాళీయంగా (ఆకస్మికమైన ఉద్బోధవశంగా భాసించుచున్నదో, .అద్దాని స్వరూపము పేరే “స్మృతి" సంవిత్తు అనబడేది. సర్వాత్మకమగు పరబ్రహ్మము యొక్క స్వాంగభూతమై, సద్రూపమై స్వతఃగా స్ఫురిస్తూ అభ్యస్త పదార్థము యొక్క సాదృశ్యము వలన ప్రకాశించుచున్నప్పుడు… అదియే స్మృతి.
వాయువు యొక్క చలనమునకు హేతువు ఉండవచ్చు. ఉండకపోవచ్చు. మొత్తంమీద వాయు తరంగాలు అనుభవమగుచున్నాయి కదా! అట్లాగే హేతు సహితంగానో, హేతురహితంగానో అభ్యాసముచే రూఢిపడిన పదార్థముల గూర్చిన వృత్తుల ‘సాదృశము’ వలన ఏర్పడుచున్న దానినే లోకంలో ‘స్మృతి’ అని పిలుస్తున్నారు.
ఓ రామచంద్రా! నీ మనస్సు ఒకప్పుడు చేతులలోనో, కాళ్ళలోనో, తదితర అవయవములందో సంలగ్నమైనప్పుడు… ఆయా చోట్ల సంవిత్తు అనుభవరూపంలో భాసిస్తోంది కదా! అట్లాగే… చైతన్యము యొక్క కల్పిత అవయవభూతమే “సంవిత్తు” అయివున్నది.
ఆ సంవిత్తు కాకతాళీయ న్యాయంచేత ఒకానొకప్పుడు వేరే కాలపు వ్యవహారములందు స్ఫురిస్తూ ఉంటుంది. అట్టి సంవిత్ ప్రకాశము యొక్క పూర్వ సంబంధ విషయములకే ‘స్మృతి’ అనే పేరు పెట్టబడినది. స్మృతికి ముందే ఆ స్మృతిని వ్యవస్థీకరించుచున్న జీవాత్మ ఉండనే ఉన్నది కదా! అదియే పరమాత్మ స్వరూపం!
ఓ రామచంద్రా! ఇక్కడ స్వప్నమును, ఇంద్రజాలమును దృష్టాంతంగా తీసుకుందాం! ఈ రోజు రాత్రి నీకు వచ్చిన కలలో ఒకానొక స్వప్న ప్రపంచం కనబడటం, అందులో నీవు విహరించి ఉండటం జరిగిందని అనుకుందాం! ఆ స్వప్నలోకంలోని ఆయా విశేషాలే కనబడటానికి కారణం? కొంత స్మృతి అయివుండవచ్చు. (లేక) పూర్తిగా స్మృతికి సంబంధించినది అయి ఉండవచ్చు. ఒక్కొక్కసారి స్మృతికి ఏమాత్రం సంబంధించకపోయి ఉండకపోవచ్చు. “స్మృతియా? విస్మృతియా? అల్ప స్మృతియా? అత్యంత నూతనమా?“… అని ప్రశ్నిస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్వప్నం ఒక్కొక్క రీతిగా ఉంటోందే గాని, ”ఇది స్మృతియే! (లేక) స్మృతి కాదు!" అని ఏమీ చెప్పలేం. అయితే “మిథ్యా జ్ఞానంలో ఘట-వస్త్రాది ఆయా వస్తువులన్నీ కనిపించి, అవి సత్యమువలె అనుభూతమవటమే స్వప్నం”… అని మాత్రం అనగలం. ఏది ఏమైనప్పటికీ… స్వప్నంలోని పదార్థాలన్నీ ఆకస్మికంగా భాసిస్తున్నాయి కదా! అట్లాగే, ఆత్మయందు సర్వరూపములగు సంవిత్తులు కలవు. అవి ఆయా సమయములందు (స్వపాంతర్గత విషయములవలె) ఆకస్మికంగా భాసిస్తున్నాయి. ఈ విధంగా ఈ సృష్టి ఆకస్మికమేగాని… “స్మృతిమాత్రం” కాదు అని చెప్పబడుతోంది.
ఓ రామచంద్రా! "ఈ రోజు స్వప్నంలో ఆ భవనమే ఎందుకు కనిపించింది? ఆ వ్యక్తులే ఎందుకు కనిపించారు? ఆ సంఘటనలే ఎందుకు కనిపించాయి?”… అని స్వప్న పదార్థముల మూలమును ఎవరైనా విచారిస్తున్నారా? లేదు. ఎందుచేత? ఏది ఎట్లా కనిపించినప్పటికీ స్వప్నంలో కనిపించింది భ్రమయే కాబట్టి. స్వప్న సమయంలో అదంతా “నిజమే కదా!” అని పొరబడినప్పటికీ,
Page:537
జాగ్రత్ సమయానికి స్వప్నాంతర్గత విశేషాలన్నీ అసత్యమై తెలియవస్తున్నాయి. అట్లాగే జాగ్రత్లోని ఆయా సంబంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు, అనుబంధ విఘాతములు, మిత్ర శత్రుభావనలు, ఇష్ట-అయిష్ట అనుభూతులు - - ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానం ముందుసూర్యగోళము సమక్షంలో దీపపు బుడ్డీలవలె అగుచున్నాయి. అటువంటప్పుడు భ్రమమయమగు ఈ స్మృతి పదార్థముల యొక్క మూలమును గురించి ఎందుకు విచారిస్తున్నావో చెప్పు?
జ్ఞాని యొక్క దృష్టిలో… ఈ దృశ్యమే అసంభవమైయున్నది. కనుక వాస్తవానికి “స్మృతి” అనునది మొదలే ‘లేనిది’ అగుచున్నది. ఆతని అవగాహన యందు ఈ జగత్తు… పరమాత్మఘనమై, చిదాకాశమాత్రమై, యథారీతి సదానిర్వికారముగానే… ఉండివున్నది.
ఇక, అజ్ఞానియొక్క దృష్టియందో… ఈ జగత్తు దృశ్యరూపంగాను, సత్యముగాను - భాసించటం జరుగుతోంది. అందుచేతనే ఆతనికి (అజ్ఞాన దృష్టిని కొనసాగించుచున్నవానికి) భూతకాలంలో అనుభూతములైన పదార్థములూ, వాటికి సంబంధించిన స్మృతియు ’సత్యము’గా తోచుచున్నాయి. అప్పుడాతడు ఆయా సంబంధిత వర్తమాన పదార్థములందు పూర్వ - అపూర్వ అనుభవ, ఊహలను జోడించి దర్శిస్తూ తన్మయుడగుచున్నాడు. అందుచేతనే నిర్వికారుడై ఉండలేక పోవుచున్నాడు.
శ్రీరాముడు : హే మహాత్మా! అజ్ఞాని - - తత్త్వజ్ఞానుల పరస్పరానుభవం గురించి-(ఈ “స్మృతి”ని గురించి చర్చించుచున్న ఈ సందర్భంగా) మరికొన్ని విశేషాలు వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి :
న మోక్షోపాయ కథనం న చ జానామి తత్సితిమ్ | సందేహాదివ జిజ్ఞాసుం తావత్ మోక్ష కథోచ్యతే, యావత్ దృశ్యమ్ స్మృతిశ్చైవ సంస్మృతిశ్చాస్య శామ్యతి ||
ఓ రామచంద్రా! ’పూర్ణ తత్త్వజ్ఞాని’కి మోక్షోపాయము గురించిన కథన రచన చేయవలసిన ఆవశ్యకతయే ఉండదు. అజ్ఞానికి దృశ్యముపైగల నమ్మకం చేత మోక్షపాయ కథనాలు చెప్పినా లాభం ఉండదు. కనుకనే ఈ కథన రచన జిజ్ఞాసువు కొరకే!
ఇక అజ్ఞాని ‘తత్త్వజ్ఞాని’ గురించి ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాడనేది రెండు రకాలుగా ఉంటోంది. 1. ఈతడు పట్టించుకోవలసింది వదిలేసి చాదస్తంగా అనవసరమైనది పట్టుకొని వ్రేలాడుచున్నాడు. 2. ఈతడొక పిచ్చివాడు, అమాయకుడు, అనవసరంగా మోసగించబడుచున్నాడు. ఇదే అభిప్రాయం తత్త్వజ్ఞాని అజ్ఞాని గురించి కూడా కలిగి ఉంటున్నాడు.
అయితే ఇక్కడ ఒక విశేషం. ఆ అజ్ఞాని కూడా సౌభాగ్యవశంగా సాధన చతుష్టయ సంపత్తిని పెంపొందించుకొన్నప్పుడు ఈ దృశ్యము యొక్క తత్త్వ స్వభావముల పట్ల సందేహములు పొందినవాడై జిజ్ఞాసువు అగుచున్నాడు. అట్టి జిజ్ఞాసువు తత్త్వజ్ఞుడగు గురువును (మార్గదర్శకుని) సమీపిస్తున్నాడు. ఆత్మతత్త్వజ్ఞానమునందు అనుభవశీలుడగు ఆ గురువు ఆ ముముక్షువైనట్టి (మార్గాన్వేషి అయినట్టి)
Page:538
ఆశ్రిత శిష్యునికి ఆతనియొక్క “దృశ్య సశాంతి“ కొఱకై మోక్ష కథన రూపమగు మోక్ష శాస్త్రమును విశదీకరిస్తున్నాడు. అట్టి ఉపదేశము యొక్క ప్రభావముచే ఆ ముముక్షువు యొక్క దృశ్యము శమించినదై, ఇక ఆపై అవిద్యచే జనించిన “స్మృతికథనం” మొదలైనవి ఆతనిపట్ల “ఈ జగత్తు స్మృతి యొక్క ఫలమా? ఏక ఆత్మయొక్క విస్మృతియా? ఇదంతా కాకతాళీయమా? లేక ఇది కార్య-కారణ పరంపరయా?” అనే సందేహాలు పటాపంచలై పేరు లేకుండా అదృశ్యమైపోతున్నాయి.
ఏ విధంగా అయితే తత్త్వజ్ఞల జగత్ దర్శన విశేషం ఎటువంటిదో అజ్ఞులు (దృశ్యముపై “ఇది నిజమే కదా!”… అనే మూర్ఖత్వముతో కూడిన నమ్మకము గలవారు) ఎరుగ లేకపోతున్నారో… అట్లాగే మూర్ఖత్వము - - మోహములతో కూడిన అజ్ఞులకు ఏ అనునిత్యమైన సత్యము (శాశ్వతమైన విశేషం) ఈ దృశ్యములో అగుపిస్తోందో… అది తత్త్వజ్ఞులకు తెలియటం లేదు. కళ్ళు వినటం, చెవులు చూడటం జరుగదు కదా! సూర్యునికి రాత్రి అనుభవం ఉంటుందా? ఉండదు కదా! అట్లాగే తత్త్వజ్ఞుల తాత్త్విక దృష్టి అజ్ఞులకుగాని, అజ్ఞుల భోగాశ-నిరాశ దురాశ పరనిందలౌకికాశయములు మొదలైన వాటితో కూడిన వస్తు దృష్టి తత్త్వజ్ఞులకుగాని తెలిసిరావటం లేదు. శ్రీరాముడు : మహర్షీ! "సంసార” మని దేనిని ఉద్దేశించి అంటున్నారు?
శ్రీ వసిష్ఠ మహర్షి : అంతఃకరణసహిత చైతన్యంలో బాహ్యవస్తు సేవనం చేత బాహ్య వస్తుస్వరూపం భాసించటం జరుగుతోంది. అట్టి బాహ్య వస్తు స్వరూపము మరల మరల వ్యవహారముల ద్వారా అభ్యస్తమై అంతరంగమున నాటుకొనుచున్న స్థానమే “చిత్తము”. అట్టి చిత్తము ఇష్ట - అయిష్టాలతో కూడి వాసనారూపమై ఉండటం చేత అదియే “సంస్కార” మని శాస్త్రకారులచే పిలువబడుతోంది.
అయితే… తత్త్వజ్ఞానుల దృష్టియందు మాత్రం అట్టి “సంస్కారం, చిత్తం, మనస్సు, బుద్ధి” మొదలైన సమస్త పరికల్పిత పదార్థములు కూడా (అధిష్ఠాన దృష్టిచే) ఆత్మస్వభావ భూతములే అయి ఉంటున్నాయి. దర్పణంలో కనిపించే దృశ్యము దృశ్య దృష్టిచే దృశ్యముగా… దర్పణ దృష్టిచే దర్పణమాత్రంగా గమనించబడుచున్నది. కదా! అవన్నీ ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ (జ్ఞానదృష్టిచే) దగ్ధపటన్యాయమువలె (అగ్నిచే కాల్చబడిన వస్త్రం వస్త్రాకారము కలిగియున్నప్పటికీ వస్త్రమువలె ఉపయోగపడనట్లుగా)… అభాసగా ఉండీ ఆత్మకు వేరుగా లేనట్లే అగుచున్నది. వాటి యొక్క సాదృశ్యత్వం జ్ఞానుల దృష్టి యందు మొదలే తుడిచివేయబడినదై ఉంటోంది. అందుచే తత్త్వవేత్తల దృష్టిలో దృశ్యమే లేనప్పుడు ఇక దృశ్య సంసారమెక్కడిది? అది ఎప్పుడూ సంభవించకయే ఉన్నది. మృగతృష్ణలో జలం ఉండదు. ”స్వప్న పదార్థములు అసలు పదార్థములే కాదు”… అను అవగాహన వలె, జ్ఞానులకు- ఈ సృష్టి మొదలే లేనిదై, సృష్ట్యాదియందే అసలే భాసించినదై ఉంటోంది. "దృశ్యము వస్తుతః లేదు” అనే నిశ్చయమును వారు సర్వదా కలిగియే ఉంటున్నారు.
పరమాత్మ రూపమగు చిదాకాశమే తనయందు ఇట్లు జగత్ రూపంగా స్థితినొంది ఉన్నది. కాబట్టి 1. చిదాకాశము, 2. సృష్టి అనబడు రెండు శబ్దములూ పర్యాయ పదములే అయివున్నాయి.
Page:539
అంతా బ్రహ్మము రూపమే అయివుండగా ఇక ఇందులో గ్రాహ్యం యొక్క త్యాజ్యం యొక్క భాసనమేమున్నది? బ్రహ్మరూపమే అయినట్టి జగత్ చమత్కారంలో ఆకారవంతమైనది గాని, స్మృతి సంబంధమైనదిగాని సంభవించనే సంభవించదు. పరమాత్మ యందు జగత్తు భాసించటానికి ఉపాదాన కారణమంటూ (కుండ తయారవటానికి ఉపాదాన కారణం కుమ్మరిలాగా) ఏదీ పరిశీలనకు కించిత్ కూడా లభించటం లేదు. కాబట్టి… పరమాత్మ స్వరూపమే ఇట్లు జగత్తుగా అజ్ఞానదృష్టిచే భాసించుచున్నదగుచున్నది.
శ్రీరాముడు : స్వామీ! సాధన కొరకై ఈ జగత్తు సాకారమను భావన ఉచితమా? నిరాకారమను భావన ఉచితమా?
శ్రీ వసిష్ఠ మహర్షి : "ఈ జగత్తు సాకారము” అనే భావనను ఉపాసించే వారికి పుత్రుడు మొదలైనవారి మరణం యొక్క స్మృతియందులాగా… ఇద్దాని స్మృతి యందు కూడా దుఃఖం కలిగే అవకాశముంది. ఎందుకంటే… సాకారమైనదంతా నిరంతరం మార్పు చేర్పులు చెందుతూనే పోతోంది కదా!
ఈ జగత్తు యొక్క ఆకారము, అద్దాని స్మృతి… రెండూ కూడా మిథ్యయే! మిథ్య అయినది స్వయంగా బంధం కలిగించగలదా? లేదు. ఈ భూతాకాశమునందు కనిపించే నీలత్వంలాగా… చిదాకాశమునందు ఈ జగత్తు కూడా శూన్యరూపంగా వర్తించుచున్నది.
స్వప్నంలో విశాలమైన దిక్కులు, ఆకాశం మొదలైనవి కనబడుచున్నాయి. అవి ఎక్కడి నుండి అక్కడికి వచ్చాయి? స్వప్నంలో చిదాత్మ తనయొక్క చిదాత్మ నిజ స్వరూపమును త్యజించకుండానే ఆయా దిక్కులు, భూమి, ఆకాశము, కాలము మొదలైన వాటితో కూడిన జగద్రూపంగా భాసిస్తోంది కదా! ఎందుకంటే స్వప్న సమయంలో స్వప్నద్రష్టకంటే వేరుగా అక్కడ ఎవరూ లేరు. పోనీ, వేరుగా ఎవరైనా స్వప్న దృశ్యం కల్పించటానికి కారకులా? కాదు. కనుక స్వప్నమంతా కూడా స్వప్న ద్రష్టరూపమే! అట్లాగే పరబ్రహ్మము తన శుద్ధ సచ్చిదానంద స్వరూపమును త్యజించకయే ఈ సూర్య, చంద్ర, పర్వతాది రూపములుగా స్థితినొందియున్నది.
ఏ విధంగా తన శుద్ధ చిదాకాశ స్వరూపమును త్యజించని చిదాకాశము యొక్క అంతరమున స్వానుభవమాత్ర స్వరూపమై స్వప్న ద్రష్ట యొక్క స్వప్న పురము విద్యమానమగుచున్నదో… అట్లాగే ప్రతి జీవుడు తన చిదాకాశ స్వరూపమునందే ఈ జగత్తును గాంచుచున్నాడు. అనగా, తన స్వరూపమునకు అనన్యమైన దానియందే ఈ సర్వ దృశ్య వ్యవహారములను సందర్శించుచున్నాడు. సృష్టి యొక్క ఆదియందు కూడా (స్వప్నమందు లాగానే) పృథివి మొదలైనవి ఉత్పన్నమే కాలేదు. బ్రహ్మ సత్తయే సృష్ట్యాది యందు జగత్ రూపంగా భాసిస్తోంది.
Page:540
పరమాత్మయే “హిరణ్మగర్భుడు” అనబడే సమష్టి మనోరూపమును ధరించి, స్వకీయ భావనానుసారంగా సృష్టియొక్క కల్పనను గావించి, అద్దానియందు ప్రవేశించి, ”ఇది మట్టి, ఇది రాయి, ఇది గోడ, ఇది ఇల్లు”… ఇత్యాది సంజ్ఞలను గావించుచున్నాడు. అయితే పృథివి మొదలైన వాటి ఉనికియే అసంభవం. అందుచేత, ఈ జగత్తు బ్రహ్మదేవుని స్మృతి రూపమూ కాదు, సాకారమూ కాదు. భ్రాంతీ కాదు. వివర్త రూపమూ కాదు.
ఇది కేవలం బ్రహ్మమే! అట్టి బ్రహ్మము సృష్టి - - ప్రళయములందు కూడా తన నిర్వికార చిత్ స్వభావమునందే వెలయుచున్నది. అదియే రమణీయమగు ఈ జగత్తుగా కూడా భాసిస్తోంది. ఈ విధంగా సృష్టి - ప్రళయ - దృశ్య రూపములుగా భాసిస్తున్నప్పటికీ ఆ బ్రహ్మము సర్వదా ఏకము నిర్మలము ప్రశాంతము - నిత్యోదితము అయిన చిదాకాశముగానే చెన్నొందుచున్నది.
శ్రీరాముడు : హే మునీంద్రా! “సర్వానుభవరూపము, అనంతము, సర్వ స్వరూపము అయినట్టి ఆత్మయొక్క చమత్కారమే ఈ జగత్తు“….. అని మీరు నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నారు కదా! అంతా ఆత్మయే అయినప్పుడు అద్దానికి దేహంలోనే ”అహమ్”“అనే భావన కలిగివుండటం, ఒక రాయి కొండ మొదలైన జడ పదార్థములందు అహంభావము కలిగి ఉండకపోవటం… ఎందుకు జరుగుతోంది? అన్ని వస్తువుల యందు ఆత్మ అహంభావము కలిగివుండవచ్చు కదా! జడములందు ‘నేను’ అనునది ఎందుకు కలిగివుండటం లేదు?
ఆ చైతన్యము చైతన్య విరుద్ధములైన గోడ రాయి మట్టి-ఇల్లు వంటిరూపములను జాగ్రత్స్వప్నాలలో ఎందుకు కలిగి ఉంటోంది? చైతన్యము సర్వదా చైతన్యమే అయినప్పుడు,.
జడరూపములనేవే ఉండకూడదు కదా!
రాయి, కట్టె చైతన్యరూపం కాకపోయివుంటే అవి ‘లేవు’ అనటానికి వీలులేదు కదా! కనుక చైతన్యమునకు వేరైనది ఉన్నట్లే కదా! మరి చైతన్యం ‘అనన్యం’ అనటమెట్లా? రాయి, కట్టె చైతన్య రూపములే అయివుంటే, అవి జడరూపములే కదా! చైతన్యము ‘సత్’ అని, అందుకే అన్యమైనది ‘అసత్’ అని గదా సిద్ధాంతం!
కాబట్టి “చైతన్యము సర్వరూపమైనది” అనెడి జడవస్తువుల పట్ల ఎట్లా సిద్ధిస్తుంది? ఒక శరీరంవలెనే రాయి జడమా? చైతన్యమా? చైతన్యమునకు జడత్వం కూడా (రాయిలో) సిద్ధిస్తోందా? అది ఎట్లా? (లేక) చైతన్యం కొన్ని కొన్ని చోట్ల జడంగా ఉండిపోతోందా ఏమి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓహో! మంచి ప్రశ్నే అడిగావు. "చైతన్యము చైతన్య విరుద్ధమైన జడరూపమగు రాయి, కట్టెగా కూడా అగుచున్నదా?”… అని కదా నీ ప్రశ్న? కదిలే శరీరాలు చైతన్యమనవచ్చునుగాని, కదలని రాయి, కట్టె చైతన్యము లెట్లా అవుతాయి? అవి చైతన్యము కాకపోతే, మరప్పుడు ’సర్వజగత్
Page:541
చైతన్య స్వరూపమేవ’… అనే సిద్ధాంతం కుదురదు కదా! కట్టె - రాయి చైతన్యం కాకపోతే, అప్పుడు చైతన్యం కొన్నిచోట్ల జడంగా కూడా ఉంటుందా?… అని కదా నీ సందేహా?
సరే! జడంగా కనిపించే రాయి - కట్టె ఎట్లా చైతన్య స్వరూపములో వివరిస్తాను విను.
దేహధారియగు జీవుడు అనే చైతన్యం విశ్వరూప చైతన్యం
తోంది.
వృక్షాభిమానియగు జీవుడు వృక్షమంతటా 2. సర్వరూపమగు చైతన్యం వృక్షంలో వృక్ష ‘అహం’ భావము సమంగా కలిగివుంటాడు. కాని సంబంధమైన అహంకారం, పర్వతంలో పర్వత ఆకులలో ఆకులకు సంబంధించిన అహంభావం, సంబంధమైన అహంకారం, మానవులో మానవ కాండము వద్ద కాండమునకు సంబంధించిన దేహాహంకారం వేరు వేరుగా కలిగి ఉంటోంది. అంతే అహంభావం కలిగి ఉంటాడు. కాని, మానవుని యందు పర్వతాహంకారం కలిగి ఉండటం లేదు.
ఆకాశాభిమానియగు జీవునకు శూన్యత్వం 3. చైతన్యానికి శూన్యం నందు శూన్యమేవాహం నందే శూన్యత్వమును గూర్చిన అహంభావం భావం, మణి - సువర్ణాది ద్రవ్యముల పట్ల ద్రవ్యత్వ ఉంటోంది. ఆతనికి “వస్తురూప-దేహరూప" అహంభావం కలిగి ఉన్నదగుచున్నది. అహంభావం ఉండటంలేదు.
స్వప్నద్రష్టకు నిరాకారరూపమగు స్వప్న పురం 4. సర్వరూపమగు చైతన్యమునకు స్వప్నమందు పట్ల స్వప్న రూపత్వానికి సంబంధించిన అహం స్వప్నాహంభావం, జాగ్రత్ నందు జాగ్రదాహం భావం భావం ఉన్నది కదా! కలిగినదై ఉంటోంది.
మహాపర్వతాభిమానియగు జీవుడు ‘ఇది నా 5. “సర్వాత్మ” యగు చైతన్యమునకు మహా పర్వత శిలారూపం, ఇది నా వృక్ష రూపం, ఇది నా పుర ఆదిగా అహంకారాలు ఉండి ఉంటున్నాయి. జలరూపం’ … ఇత్యాది వివిధ అహంకారములు అయ్యది సర్వాహంకార రూఎం (ఇదంతా నేనే -
కలిగి ఉంటున్నాడు. అనే అహంకారం) కలిగి ఉన్నదై ప్రదర్శితమౌతోంది.
Page:542
మనుజుడు చైతన్య స్వరూపుడే కదా! 7. “సర్వస్వరూపుడు, శుద్ధ చైతన్య ఆతని దేహమో … గోళ్ళు, వెంట్రుకలు, రక్తం, స్వరూపుడు” అగు పరమాత్మ శరీరమగు ఈ జగత్తు ఆకాశం ఇత్యాది ధర్మాలు కలిగి ఉన్నదై చేతన కూడా స్థావరజంగమాత్మకాలతో, చేతన - అచేతనాత్మ కమై శోభాయమానంగా వెలుగొందు అచేతనాలతో కూడి శోభాయమానమై ఉన్నది. చున్నది కదా! అయినప్పటికీ ఇదంతా నిరాకారం, యథాతథం. 8. జీవుడు కలలో అనేక దృశ్యాలు “వాస్తవమే 8. ఈ జగత్తు కనిపించవచ్చుగాక. కానీ కదా” అనే బుద్ధితో చూస్తున్నాడు. మెలకువ సమ్యక్ జ్ఞానముచే ఇదంతా శమించినదై జడ + రాగానే…? స్వప్నాంతర్గతమైన స్వప్న భ్రమ క్షణంలో చైతన్యాలుగా కాకుండా కేవల శుద్ధ చైతన్యంగా తొలగి పోతోంది. అగుపిస్తోంది.
అతిదీర్ఘమైన అనేక బీభత్సాది విషయా 9. అట్లాగే… ఆత్మజ్ఞానము పొందిన తరువాత లతో కూడిన స్వప్నం నుండి తెల్లారి మెలుకువ ఇక ఈ దృశ్యము - ఇద్దానిని దర్శించే ద్రష్ట. రాగానే …ఆ స్వప్నాంతర్గత విశేషాలు, స్వప్నం, ఆ ఇరువురూ కూడా చిదాకాశమాత్ర రూపులై తెలియ స్వప్నద్రష్ట మటుమాయమై పోతున్నారు కదా! ఇక వస్తున్నారు. జగత్తే బ్రహ్మమగుచున్నది. ఇక జడ - స్వప్న ద్రష్ట లేడు, స్వప్నం లేదు. ఏమయ్యారు? చైతన్య భేదమెక్కడ? బ్రహ్మమే ఈ జగత్తు! మౌనరూపచిన్మాత్రాకాశంగా పరిణమిస్తున్నాడు కదా!
10.సముద్రంలో అసంఖ్యాక తరంగాలు పెల్లు 10. “చిదాకాశము” అనే మహా సముద్రంలో
బుకుతున్నాయి. సముద్రంలో అటు ఇటూ సంచ చిదాకాశానికి అనన్యమైనట్టి అనేక కోట్ల “సృష్టులు” రిస్తున్నాయి. ఆ తరంగాలన్నీ కాలాంతరంలో ఏమి అనే తరంగాలు ఉత్పన్నమై, కొంత కాలం కనిపించి కానున్నాయి? ఏ జలంలోనుంచి బయల్వెడలు మరల చిదాకాశమునందే విలీనమైపోతున్నాయి. చున్నాయో… ఆ జలంలో ఆకారాదులన్నీ త్యజించి అయినా కూడా, అసంఖ్యాక సముద్ర తరంగాల విలీనమవుతున్నాయి. వలె అసంఖ్యాక సృష్టులుగా కనిపించినప్పటికీ చిదాకాశము యొక్క “ఏక రూపత్వము”నకు వచ్చే హాని ఈషణ్మాత్రం కూడా లేదు.
| సృష్ట్యాదిగా అనేక సంజ్ఞలు రచించబడుచున్నాయి.
ఓ రామచంద్రా! అజ్ఞానికి జగత్తులో తనకు సంబంధించినవి - సంబంధించనివి అనేక వస్తు - విషయ - సంఘటన - వ్యక్తుల పరంపరలు అగుపిస్తున్నాయి కదా! అయితే జ్ఞానికి ఈ జగత్తు యథాతథంగా సదా నిర్వికారమగు పరబ్రహ్మముగా విద్యమానమగుచున్నది.
Page:543
జ్ఞానుల నిత్యస్వభావమగు “ఆత్మాహమ్” దృష్టిని సుస్పష్టపరచటానికి ఇక్కడ ఒక చమత్కారమైన దృష్టాంతపూర్వకమైన విశేషం చెపుతాను.
“నాహం తరంగః, సలిలమహమ్” ఇత్యేవ యుక్తితః బుద్ధం యేన తరన్గేణ కుతస్తస్య తరంగతా?
ఒకానొక మహాసముద్రం ఉన్నది. అద్దానియందు ఎక్కడో, ఎందుకో, ఏదో సమయంలో (సముద్ర జలంలో) ఒకానొక ‘తరంగం’ ఉత్పన్నమైనది. తదితర తరంగములలాగానే అది సుదీర్ఘకాలం అవిశ్రాంతంగా మహాసముద్ర జలంలో అటూ - ఇటూ సంచరిస్తూ ఎంతో చంచలత్వం, వేదన, శ్రాంతి(Restlessness), శ్రమ పొందినదయింది. అట్టి ఉద్వేగము, వేదనలను తొలగించుకోవటానికి మార్గం అన్వేషించటం ప్రారంభించింది. చివరికి ఆ తరంగమునకు ఎవరో ఉద్బోధించారు. ఏమని?
“నీవు జలము నుండియే ఉత్పత్తిని పొందావు. ఆ జలమును చేరగానే నీవు సశాంతిస్తావు”… అని. అప్పుడు ఆ తరంగం "జలం ఎక్కడున్నది? అద్దానిని దర్శించి అద్దానియందు లయమొందే ఉపాయమేమిటి?” అని తీవ్రమైన ఆందోళనతో కూడిన అన్వేషణ ప్రారంభించింది. అప్పుడు అద్దానికి మరెవరో ఇట్లా బోధించారు.
ఓ తరంగమా! నీవు జలముతోనే తయారయ్యావు. జలానికి అన్యంగా నీవు లేవు. ఇక తరంగత్వమునకు సంబంధించిన నామరూపాదులు నీ యొక్క భ్రమయే! నీవు జలమునకు వేరైన క్షణమే లేదు. జలమునకు అన్యంగాని నీవు జలం కోసం వెతకటమేమిటి?
పై అంశాన్ని గ్రహించిన ఆ తరంగం పరమానందమును పరమశాంతిని పొందినదై తన జల సంచారము లీలగా, క్రీడగా కొనసాగించసాగింది.
ఇప్పుడు “నేను జలమునే” అని గ్రహించిన ఆ తరంగమునకు “నేను ఈ తరంగత్వము -
అనే బంధం తొలగించుకునేది ఎట్లా?“ … అనే ఆవేదన ఉండదు కదా! ”చైతన్య మహాసముద్రంలోని చైతన్య స్వరూప తరంగమే నేను” …అని గ్రహించిన తరువాత, ఇక, “నాకు మోక్షం ఎప్పటికి? ఈ ‘జీవుడు’ అనబడే బంధం, ఈ దేహబంధం, ఈ దృశ్యబంధం ఇట్లాగే ఉంటాయా? తొలిగేది ఎన్నటికీ?” …అనే సంశయ -ఆవేదన - ఆందోళనలు ఉండవు.
-
ఈ జగత్తు ‘బ్రహ్మము’ అనే సముద్ర జలము యొక్క తరంగమువలె భాసిస్తోంది. తరంగం ఉన్నప్పుడు - లేనప్పుడు కూడా జలము సర్వదా జలమే అయినట్లుగా… 1. జగత్తు, 2. జగత్తు యొక్క అభావము ఈ రెండూ కూడా బ్రహ్మము యొక్క శక్తి చేతనే స్థితిని పొందినవగుచున్నాయి.
ఓ రామచంద్రా! స్వప్నంలో జడ-చైతన్య పదార్థములను గాంచుచున్న స్వప్న ద్రష్ట తన యొక్క స్వప్నమునకు అప్రమేయమైన స్వస్వరూపమును త్యజిస్తున్నాడా? లేదే! అట్లాగే, చిదాకాశము తన శుద్ధ స్వస్వరూపమును కించిత్ కూడా త్యజించకుండానే… పరస్పర ధర్మ-నియమములగు చేతనాభావం కలిగి ఉంటోంది. అట్టి చైతన్యంతో కూడిన సమష్టి భావనా స్వరూపమే “మనస్సు”. ఆ సమష్టి మనస్సే “పితామహుడు, సంకల్ప పురమువలె అకారణుడు, చిన్మాత్ర రూపుడు" అగు “ఆది ప్రజాపతి”.
Page:544
ఇప్పుడు సువర్ణాభరణమును దృష్టాంతంగా తీసుకొందాం. ఒక బంగారు భుజకీర్తి (భుజమునకు అలంకరించే ఆభరణం) “నేను బంగారంగా అవాలి. బంగారంగా ఉండాలి“… అని ఆవేదన చెందటం ప్రారంభించిందనుకో! ఆ ఆభరణము ”నేను బంగారమునే! ఈ ఆకారం ఆపాదితం, ఈ ఆకారం (భుజకీర్తిగా) కలిగి ఉన్నంత మాత్రంచేతగాని, (లేక) ఇది తొలగుటచేతగాని నేను బంగారం కాకపోవట మెక్కడిది?“… అని గ్రహించిన తరువాత, ఇక… అద్దానికి ఆభరణత్వమెక్కడిది? అట్లాగే “నేను సర్వదా చిదాకాశ స్వరూపుడనే” అని గ్రహించిన మహనీయునికి ఇక, “ఈ ‘జీవుడు’ అనే బంధం, ఈ అహంకారం, ఈ జన్మలు, ఈ కర్మలు నాకు తొలగేది ఎట్లా?” అనే ఆవేదన ఇంకెక్కడుంటుందయ్యా?
ఈ సృష్టికి కర్త అగు బ్రహ్మదేవుడు సంకల్ప స్వరూపుడు. చిన్మాత్రాకాశ దేహధారి. జన్మ రహితుడు. ఇక ఈ జగత్తులో భాసించే ‘అహమ్’ మొదలైనవి, అద్దానిని ఆధారంగా కలిగి ఉండి భాసించే తదితరములు… ఇవన్నీ కూడా బ్రహ్మదేవుని స్వరూపమే అయివున్నవి.
ఇక ఈ సృష్టి-స్థితి-లయాలంటావా? ఇవన్నీ కూడా చిదాకాశమున శూన్యరూపాలైన చైతన్య చమత్కృతులే! చిన్మాత్రాకాశము యొక్క స్వయం స్ఫురణయే బ్రహ్మదేవుడు. అట్టి స్వయం స్ఫురణ నిర్మలము, స్వప్నతుల్యము చిత్తత్త్వమాత్రము అయివున్నది. ఆద్యంతరహితమగు చిద్రూపమే స్ఫురణ మాత్రంగా సృష్టి-స్థితి-ప్రళయ విభ్రమరూపంగా స్ఫురిస్తోంది. హిరణ్యగర్భ రూప “సమష్టి మనస్సు”… “విరాట్” అని చెప్పబడుతోంది. అట్టి విరాట్ యొక్క సంకల్ప నగరం వంటి నిర్మల స్ఫురణములే ఈ భూ - భువన సమూహ సృష్టి. అనగా ఆ చిదాకాశరూపమగు విరాట్టుయే ఈ సృష్టి.
ఆ విరాట్ ఈ సృష్టిని తన రూపముగా కలిగివున్నాడు. స్వప్నద్రష్టయే స్వప్నరూపముగా అగుచున్నట్లుగా ఈ సృష్టియే ఆతని స్వప్నం. ఆ స్వప్నమే ఈ జాగ్రత్లోని వ్యష్టి - సమష్టి - జడాది దేహరూపములను ధరించుచున్నది. సుషుప్తియే స్వప్నానుభవంగా ఉత్పన్నమగుచున్నట్లుగా… ‘అవిద్య’ అనే అంధకారముచే ఆవృతమైన ఆత్మయే జగదనుభవముగా బయల్వెడలుచున్నది.
ఆ విరాడ్రూపుడగు పరమాత్మకు… కల్పాంతమందలి రాత్రి, అవాంతర ప్రళయములు చిన్న -పెద్ద కేశములవంటివి. కాలము-క్రియ-పగలు-రాత్రి ఆతని అవయవ సంధులు. అగ్ని ఆతని ముఖము. స్వర్గము శిరస్సు. ఆకాశము నాభి. భూమి పాదములు. సూర్య చంద్రులు నేత్రములు. దిక్కులు చెవులు. ఈ ప్రకారంగా మనఃకల్పనయే విరాడ్రూపంగా విజృంభించుచున్నది.
ఈ విధంగా విశాలరూపుడగు విరాట్ భగవానుడు ఈ విశాల విశ్వము రూపంలో ఘనీభూతమై బాగుగా కనిపిస్తున్నప్పటికీ.. ఇదంతా స్వప్నంలో కనిపించే మహా పర్వతంలాగా స్థితినొందియున్నది. వాస్తవానికి ఈ విరాట్ పురుషుడు ప్రపంచ రహితుడైన చిదాకాశరూపుడే అయివున్నాడు.
జగత్తు = ఏదైతే చిదాకాశమున… చేతనాత్మకమగు జీవరూపమును పొంది స్వయంగా అతిశయ రూపమున ప్రకాశించుచున్నదో… అదియే - - చిదాకాశ రూపమగు ఆత్మరూపజగత్తును చిదాకాశ రూపమగు ఆత్మయే పొందుచున్నదిగా - అగుచున్నది.
Page:545
విరాడ్రూపం - సర్వవ్యాపకమైన చిన్మయాకాశమే స్వప్నంలో వ్యవహారంలాగా ఇట్లు విరాడ్రూపంగా జడ - చేతనములతో కూడి భాసిస్తోంది.
అనుభవితైవ అనుభవం సత్యం స్వాత్మానమప్యసస్తమివ అనుభవతీయత్త్వేన స్వప్ననటః స్వప్నదేశమివ ॥
ఒకానొక నృత్య కళాకారుడున్నాడు. ఆతడు ఒక రాత్రి కలలో తాను నృత్యం చేస్తూ ఉండగా అనేక మంది ప్రేక్షకులు అభినందనలతో కరతాళ ధ్వనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడీ స్వప్నంలో జరుగుచున్నదేమిటి?… ఆ స్వప్నం, అందులోని ప్రేక్షకులు, వారి కళాభిరుచికి అనుగుణంగా నృత్యం చేసే తాను, ఆ నాటక రంగం, అక్కడి వాయిద్యములు, తదితర వాయిద్య కళాకారులు, తాళ - లయ విన్యాసం చేసే శబ్ద సూత్రధారి… ఇవన్నీ ఆ నటుని కల్పనయే అయి, ఆ నటుని స్వప్న స్వస్వరూపమే కదా!
అట్లాగే…అనుభవకర్తయగు చిదాత్మయే… అనుభవైక రసము, స్వస్వరూపము అయినట్టి స్వస్వరూప పరమాత్మమునందు- మాయావరణముచే స్వస్వరూపమును “లేనిదాని వలె” ఏమరచి, పరిచ్ఛిన్నమగు ప్రపంచమును తన స్వస్వరూపమున కల్పించుకొని, ఆ కల్పనను తనకు వేరైన సత్యము వలె …అనుభవిస్తోంది. ఇదియే మనలో ప్రతి ఒక్కరికి - మనచే దర్శించబడే దృశ్యమునకు గల సంబంధం.
శ్రీరాముడు : స్వామీ! ఈ దృశ్యము మాయా సమ్మిళితమైన స్వప్నరూపమేనని, స్వప్నంలోలాగా ఇది స్వస్వరూపమునకు వేరైనట్లు, (స్వస్వరూపము యొక్క తత్త్వమును ఏమరచిన సందర్భంలో అన్యమగు జగత్తుగా అనిపిస్తోందని… మీరు సిద్ధాంతపూర్వకంగా ఇంతసేపూ సుస్పష్టంగా ప్రకటించుచున్నారు. మీ "ఆత్మాపమ్యేవ సర్వత్రా” అను సిద్ధాంతము అమోఘం - అప్రతిహతం. అయితే, ద్రష్టయగు జీవునికి దృశ్యమునకు గల సంబంధమును వేర్వేరు విధాలుగా నిర్వచించి వేర్వేరు గురువులు తమ శిష్యులకు వేర్వేరు రీతులుగా ప్రబోధించటం లోకంలో చూస్తూ ఉన్నాం. ఆ గురు బోధానుసారం శిష్యుల యొక్క వారి వారి అనుభవం ఉంటున్నట్లు ప్రకటించటం కూడా చూస్తున్నాం. ఇది అట్లా ఎందుకు జరుగుతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను. వేర్వేరు గురువులు తమ శిష్యులకు వేర్వేరు సిద్ధాంతాలు ద్రష్ట దృశ్యముల సంబంధం గురించి నిర్వచించటం జరుగుచున్న మాట నిజమే! ఆ స్థితిని అనుభవించి గురువులు అనుభవ వాక్యములను బోధించటం ఆ శిష్యులు నిరూపణగా అనుభూతి పొందటం కూడా జరుగుతోందనే మాట నిజమే!
వేదాంతులు….. వారి గురువులు (వ్యాసులు)
అర్హతులు వారి గురువులు (అర్హత)
సాంఖ్యులు వారి గురువులు (కపిలముని)
సౌగతులు వారి గురువులు
Page:546
సూత్రాంతిక
వైభాషిక బుద్ధులు, పాశుపతులు అట్లాగే… యోగాచార గాణాపతులు, వైష్ణవులు, శక్తులు
మాధ్యమికులు
ఈ విధంగా వివిధ మతములున్నాయి. ఆయా గురువులు ఈ దృశ్యం, ద్రష్ట భావనానుసారమని, ద్రష్ట ఊహా స్వరూపమని, ద్రష్ట యొక్క స్వస్వరూపమేనని, ఇదంతా మాయా కల్పితమని, ద్రష్ట కోసం భగవంతుడు ఈ ఈ విధంగా కల్పించారని, “పరమాత్మ జగత్తులో లేడు; అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములకు ఆవల ఉన్నారు” అని, బుద్ధికి ఈవల జగత్తు-ఆవల పరమాత్మ అని, ఇహలోకంలో చేసినవి పరలోకంలో ఫలిస్తాయని, ఈ కనబడే ప్రకృతియే పరమాత్మయని, పరమాత్మ ఎక్కడా ఏ రూపంగానూ లేనే లేడని…
ఈ విధంగా ఆయా గురువులు తమ శాస్త్రములందు ఏఏ దృశ్య నిర్వచనము పొందుపరచి బోధిస్తున్నారో, వాటన్నిటి యొక్క రూపముచే అనువర్తులగు శిష్యులకు వారి వారి వాసనానుసారమే వారికి బ్రహ్మము ఆ చెప్పబడిన రీతిగానే స్ఫురిస్తోంది. ఆయా వాదుల యొక్క నిశ్చయానుకూలమగు ఐహిక - - పారలౌకిక ఫలములుగా స్ఫురించేదంతా బ్రహ్మమే అయివున్నది. ఎవరు ఏ దృఢ భావన కలిగివుంటే వారిపట్ల అదియే సత్యముగా అనుభూతమవటం బ్రహ్మము యొక్క ఒకానొక చమత్కారమైన ధర్మము అయివున్నది. ఎందుకంటే ఆయా వాదులంతా (ఆయా మత గురువులంతా) తమ ఆత్మయందే ఆయా ఫలసిద్ధిని గురించి భావించి ఆయా రీతులుగా పొందియున్నారు కాబట్టి! శిష్యులు కూడా అదే భావనచే అట్టిదేయగు ఫలమును సిద్ధించుకుంటున్నారు కాబట్టి!
బ్రహ్మము యొక్క మాయా చమత్కారం సర్వాత్మకమై, సర్వుల వాసనానుసారంగా ఆయా శరీరములను ధరించి ఆయా ఫలములన్నిటినీ సిద్ధింపజేస్తోంది. బ్రహ్మము యొక్క మహిమ అట్టిది మరి!
శ్రీరాముడు : మహాత్మా! "ఈ జగత్తు సంసార రూపం. ఇద్దానిని ధ్యాన తపో-సమాధి నిష్ఠల వంటి ప్రయత్నములచే తొలగించుకుంటేగాని బ్రహ్మము అనుభూతం కాదు. సాధకులు ఈ జగత్తును త్యజించగలిగే ఉపాయాలు ఆశ్రయించాలి” …అని కొందరు గురువులు (జైనమతం) తమ శిష్యులకు క్రమగతిపూర్వకంగా బోధిస్తున్నారు. వారి అభిప్రాయం గురించి వ్యాఖ్యానించ ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ముందుగా మా అభిప్రాయమగు ఒక పరమ సత్యమును ప్రకటిస్తున్నాను. విను.
Page:547
సృష్ట్యాది యందు కేవల చిన్మాత్రమే ఈ జగత్తుగా భాసిస్తోంది, - స్వప్న ద్రష్ట యొక్క చిన్మాత్ర స్వరూపమే స్వప్నంగా భాసించుచున్నట్లుగా!
ఇది శాస్త్ర నిర్ణయం. కనుక ఈ ముల్లోకములు బ్రహ్మమే అయివున్నాయి. ఇట్టి దృఢజ్ఞానమే మోక్షోపాయ ఔషధం. ‘బ్రహ్మము’ అనే మహా సముద్ర జలమునకు ఈ సృష్టులు తరంగముల వంటివి. తరంగములన్నీ ‘జలమే’ అయినట్లు సృష్టులన్నీ బ్రహ్మమే! ఎండమావులలోని జలమునకు ద్రవత్వం ఎట్టిదో సృష్టుల అనుభవం అట్టిది.
అయితే… అజ్ఞానుల దృష్టికి దుఃఖమయమై, “ఎట్లా దాటిపోవాలిరా బాబూ!” అనిపించే జగదనుభవ వ్యవహారం జ్ఞానముచే తుడిచివేయబడుతోంది. అజ్ఞానము తొలగినప్పుడు ఈ జీవుడు జీవన్ముక్తుడగుచున్నాడు. అట్టి జీవన్ముక్తునికి వ్యవహారార్థం శేషించియుండే ఈ జగత్తు ఇక అక్కడ “అద్వైతమా? ఏకమా? అనేకమా?”… మొదలైన ప్రశ్నలు ఉండజాలవు.
శ్రీరాముడు : స్వామీ! జీవన్ముక్తులు విదేహముక్తులు అనే రెండు పదాలు అధ్యాత్మశాస్త్రంలో చోటుచేసుకొంటున్నాయి. కదా! వారిరువురి అనుభవం ఒకే తీరుగా ఉంటుందా? వేర్వేరు తీరులుగా ఉంటుందా? వారీ జగత్తును ఏఏ విధాలుగా దర్శిస్తున్నారు? (లేక) ఎట్లా సమన్వయించు కుంటున్నారు? వారిరువురిలో అధిక సుఖి ఎవరు?
శ్రీ వసిష్ఠ మహర్షి : జీవన్ముక్తునకు జగత్తుగా కనిపించేది బ్రహ్మముగానే అయివున్నది. విదేహముక్తునకు - - బ్రహ్మమే ఉన్నదిగాని జగత్తనబడేది లేదు.
స్వప్న - సుషుప్తులలో ఒకదానిలో దృశ్యం ఉండవచ్చు. రెండవదానిలో లేకపోవచ్చు. కానీ రెండూ నిద్రారూపములే కదా! అట్లాగే జీవన్ముక్తునికి దృశ్యము బ్రహ్మముగాను, విదేహముక్తునికి బ్రహ్మము తప్పితే… దృశ్యము మొదలే లేనిదిగాను అగుచున్నప్పటికీ… ఆ ఇరువురి చిదాకాశము యొక్క మూల నిర్వచనం ఒక్కటే! కాబట్టి…. ఆ రెండింటి సుఖస్థితి సమానమే అయివున్నది. అంతేగాని భేదమేమీ లేదు. జాగ్రత్ - స్వప్నములు ఒకే నిద్రలోని విశేషములు అయినట్లు జీవన్ముక్త
- విదేహముక్తులు ఒకే ముక్తి యొక్క పరమానందభరితమైన రెండు ఆత్మసాక్షాత్కార చమత్కారాలు కలిగి ఉంటున్నారు. రాత్రి స్వప్నంలో ఒక నగరం కనబడిందనుకో. తెల్లవారి లేచిన తరువాత ఆ స్వప్న నగరం గురించి, “ఆ భవనాలు ఎవరు కట్టారు? ఎందుకొరకై కట్టారు? ఆ జనులు ఎక్కడి నుండి వచ్చారు? ఆ మన బంధువు అట్లా ఎందుకు మాట్లాడారో వారిని ఇప్పుడు కనుక్కుందామా?” …అని మనం పరిశీలించే ప్రయత్నంలో ఉంటున్నామా? లేదు. స్వప్నానంతరం స్వప్నంలాగానే బ్రహ్మమును ఎరిగిన తరువాత ఈ దృశ్యం (స్వప్న సదృశ్యంగా) భాసిస్తుంది. అప్పుడిక ఏ వివేకి ఈ జగత్తు గురించి ఆసక్తి కలిగి ఉంటాడో చెప్పు?
తత్త్వజ్ఞుడు… సృష్ట్యాది యందు నిర్వికల్పము నిర్విషయము అగు ఆత్మయందు సృష్టి జనించటానికి కారణమేమీ లేదు. కనుక సృష్టి మొదలే ఉత్పన్నమై ఉండలేదని
Page:548
సృష్టి యొక్క యథార్థ జ్ఞానం కలుగగానే స్వప్న దృశ్యంలాగా ఈ జగత్తు బాధితమై పోతోందని (జగత్తు మొదలే లేదని తెలిసిపోతోందని), అందుచేత ఇందు దుఃఖాదులు కలిగియుండటం అర్థంలేని పని అని… గ్రహించి ఉంటున్నాడు.
జాగ్రత్ దృష్ట్యా స్వప్నంలో వివిధ వాసనలచే ఆయా విశేషాలు ప్రదర్శనమయి ఉండినప్పటికీ, స్వప్నం అసత్యమేనని జాగ్రత్లో ఎరిగియే ఉంటున్నాడు కదా! అట్లాగే ఈ జగత్తులోని ఆయా వాసనా సమూహములు దగ్ధమైన కాగితపు ఆకారమువలె జ్ఞానికి ఏ మాత్రం క్లేశము కలిగించటం లేదు. ఈ విధంగా తత్త్వబోధచే ఈ దృశ్యం భ్రాంతిమాత్రంగా నిశ్చితమై, బాధితం అగుచున్నది. అంతేగాని, జగత్తు “పరమాణువుల సంయోగ - వియోగము” అనియో, లేక, “కర్మ వ్యవహారముల ఫలితం” అనియో, కాక “దీనికి మూల కారణం దైవము”… అనియో నిశ్చయము కలిగి ఉన్నంతకాలము భ్రాంతి తొలగిపోదని, ముముక్షువులకు నా మనవి. జగత్తు ఏదో కారణం చేత “ఉన్నది” అని గాని, “సత్యమే” అని గాని భావించినప్పుడు అది ఆ అనుభవమునకు సత్యమేనని అనిపించినప్పటికీ, జగత్ భ్రమ తొలగదు సుమా! శ్రుతులు “ఇది స్వప్న సదృశం” అని సిద్ధాంతీకరించియే ఉన్నాయి కదా! మరప్పుడు అతి సమీపమగు స్వప్న దృష్టాంతాన్ని జగత్తుకు ఎందుకు సమన్వయించరాదో చెప్పు?
"జగత్తు స్వప్నమువలె భ్రాంతియే”… అని చెప్పటానికి ఇంకొక ప్రత్యక్ష గుర్తు (ప్రమాణం) కూడా ఉన్నది. ఇది భ్రాంతి గాక సత్యమే అయివుంటే… అప్పుడు ఈ మనుజుడు తనకు ఇష్టమైన వస్తువులను స్వీకరించి, అయిష్టమైన వస్తువులను త్యజించివేసి హాయిగా సుఖంగా ఉండగలిగేవాడే! ఆకస్మిక దృశ్యమును (అయిష్టమయినప్పుడు) గాంచకయే హాయిగా ఎప్పుడూ సుఖమును కలిగి ఉండేవాడే! అట్లా జరుగుతోందా? లేదు. ప్రతి జీవుడు ఈ దృశ్యమును వెంబడించి అనేక దుః ఖాలను ఎందుకు కలిగి ఉంటున్నాడు? భ్రాంతిని భ్రాంతిగా గమనించకపోవటం చేతనే! ఈ విధంగా ఈ జగత్తు భ్రాంతి మాత్రమేనని (ఉపనిషత్ మొదలైన) వేద విభాగములచే నిర్ద్వంద్వంగా సిద్ధాంతీకరించబడుతోంది.
సమాధి -
శ్రీరాముడు : స్వామీ! కొందరు యోగులు "ఈ జగత్తు భ్రమ” అని గ్రహించి, - జన్మ జన్మలుగా అభ్యాస వశంచే సంస్కార రూపం దిద్దుకున్న ఇట్టి జగత్ భావోద్వేగం త్యజించి వేయటానికై ఏకాంత ప్రదేశంలో జగత్యాజ్యరూపమగు జగద్రహిత సమాధిని సాధనోపాయంగా గ్రహిస్తూ ఉంటారు. ఈ జగత్తు దుఃఖమయమని, జగద్రహిత సమాధి యొక్క అభ్యాసముచే ఆనందరూపమగు ఆత్మానుభూతిని, సమాధిసేవనముయొక్క ఆవశ్యకత గురించి విశదపరచండి.
ఓ రామచంద్రా! ఈ జగత్తును ఏమరచి జగద్రహిత సమాధిని ఆశ్రయించేవారి ప్రయత్నంలో …“ఈ జగత్తు సత్యమే!” …అను ఒక భ్రమ కొనసాగుచునే ఉన్నది. ఈ జగత్తును ఆత్మకు అన్యమైన దానిగా తలచి కొనసాగించే జగద్రహిత సమాధి మరల జడత్వమే అగుచున్నది. పైగా “జగత్తును ఏమరచాలి” అనే ఆవేశము కలిగి ఉండి జగద్రహిత సమాధికై శక్తి యుక్తులను వినియోగించటమనేది
Page:549
సవికల్ప సమాధియేగాని, నిర్వికల్ప సమాధి కాదు. అందుచేత అది సంసారమే అయివున్నది. అట్టి జగత్తును త్యజించివేయాలని తపనతో కూడిన సమాధి వలన పరమ పురుషార్థమగు మోక్షము కలుగనేరదు. “నిర్విషయక ధ్యానం” …సంసారమే అయివున్నదని మరల గుర్తు చేస్తున్నాను. అది శిల వంటి జడస్థితయే అయివున్నది. ఇక, మోక్షమో, వికల్పాత్మకమగు సంసార రూపం కాదు. శిలవంటి జడ స్థితి కూడా కాదు. జగత్తును వదలి ఆత్మకొరకై నిర్వికల్ప ధ్యానం వలన జడస్థితి కంటే అన్యమైనదేదీ లభించదు. అట్టి సమాధి వలన ముక్తి లభిస్తుందనుకుంటే, అప్పుడు మనుజునకు గాఢనిద్ర వలన కూడా ముక్తి లభించేదే కదా?
అందుచేత రామచంద్రా! ఉత్తమ ఆత్మజ్ఞానం ద్వారా 1.జగత్తుగా ఆత్మయే భ్రాంతిచే కనిపిస్తోందని, 2. ఆత్మ సర్వదా నిరతిశయ ఆనంద సచ్చిదేకరస స్వరూపము అని నిశ్చయించుటయే ఈ జగత్తు యొక్క లయము. అదియే జగత్తు యొక్క అత్యంతాభావము కూడా!
భ్రాంతిహేతువగు “జగత్తును ఆత్మకు వేరుగా దర్శించటం” … అనే అజ్ఞానావరణము క్షయించుటయే భ్రాంతి క్షయము.
జగత్తును ఆత్మరూపంగా దర్శించటమే ఆత్మ సాక్షాత్కారం. అట్టి (సర్వం ఖల్విదమ్ బ్రహ్మ మొదలైన వేద వాక్యార్థమైన) నిశ్చల దృఢాభిప్రాయమే సమాధి కూడా! (సమ + అధి ). వివేకి జీవన్ముక్తత్వము అదియే! అదియే (సర్వము ఆత్మయే అను దృష్టియే) ‘నిర్వికల్ప సమాధి’ అని, ‘అనంతమగు నిర్వాణము’ అని కూడా చెప్పబడుతోంది. "స్వస్వరూపమున వికారరహితంగా ఎప్పటి యట్లు స్థితి కలిగి ఉండటం” అనబడునది కూడా అదియే! అట్టి చిత్స్వరూపమాత్ర స్థితియే అనంత సుషుప్తి అని, ‘తురీయము’ అని, ‘నిర్వాణము’ అని, ‘మోక్షము’ అని కూడా పిలువబడుతోంది.
అట్టి సర్వము ఆత్మరూపంగా అనిపించటమే “సమ్యక్ జ్ఞానైక ఘనత్వం”. అదియే ధ్యానము. అట్టి దృశ్యము యొక్క అత్యంత ఆత్మభావపూర్వకమైన ఆత్మజ్ఞానమే పరమ పదము. ”ఇదంతా ఆత్మస్వరూపమే” …అను అత్యంత దృఢనిశ్చయమే (“మమాత్మా సర్వభూతాత్మా!”… “తత్త్వమసి”, "అయమాత్మా బ్రహ్మ” వంటి) వేదమహా వాక్యముల సారం కూడా!
“మోక్షస్థితి” అనబడేది… జడత్వం కాదు. ప్రకృతి విలయము వంటి సుషుప్తి కాదు. జగత్తును త్యజించిన జగద్రహిత సమాధి కూడా కాదు. సవికల్పము కూడా కాదు. అసత్, శూన్యము, నైరాత్మ్యరూపము (‘ఆత్మ అనబడేది లేదు’ అని తిరస్కరించి దర్శించటం వంటిది) కూడా కాదు.
ప్రియ రామచంద్రా! అది దృశ్యము పరమాత్మగా అనిపించే స్థితి. ఓ సర్వ సభికులారా! ఈ దృశ్యం సర్వదా ఆద్యస్వరూపమగు పరబ్రహ్మమే! అట్టి శుద్ధ బ్రహ్మమే నేను (అహం బ్రహ్మాస్మి) అనునట్టి దృఢభావం పొందటమే మోక్షం. ఆ బ్రహ్మము అధిష్ఠాన రూపముచే సర్వదా యథాతథమేగాని దృశ్యము కాదు. ఏ అనుభవం కూడా అట్టి బ్రహ్మం కంటే వేరుగా అనిపించని స్థితియే పరమపదము. అది నిరతిశయానంద స్థితి. ఆత్మయొక్క అట్టి ధ్యానముచే(అంతా పరమాత్మ స్వరూపమేనని ఉంటే) ఆత్మ యొక్క పరిపూర్ణజ్ఞానం తప్పక లభించగలదు. అదియే పరమ నిర్వాణం. అట్టి స్థితిలో ఈ జగత్తు ఇట్లాగానీ, మరింకెట్లాగైనాగాని కనిపిస్తున్నప్పటికీ స్వస్వరూపమగు ఆత్మగా అనిపించగలదు.
Page:550
అట్టి చిద్రూప పరమాత్మయందు ఏకత్వం లేదు. అనేకత్వం కూడా లేదు. అది పదార్థ రహితం కాదు. పదార్థ సహితం కాదు. “అది సమస్త సత్ - అసత్ పదార్థముల సీమాంతరము… అని చెప్పబడుతోంది. అట్టి స్వరూపస్థితియగు “నిర్వాణము” దృశ్యము యొక్క అత్యంత అసంభవపూర్వకమైనది, సర్వ విక్షేప రహితమైనది, నిరతిశయానందమయమైనది! అట్టి శుద్ధ బోధోదయమగు శాంతరూపమే పరమపదం. అదియే పరమ పురుషార్థమని గమనించు. అటువంటి “ఆత్మ స్వరూపమే ఈ దృశ్యము” అను ఉత్తమ బుద్ధి ఈ “యోగ వాసిష్ఠం” వంటి మోక్ష శాస్త్రముల పరిశీలనచే తప్పక కరతలామలకం కాగలదు. అందుచేత మోక్షోపాయమైనట్టి ఈ శాస్త్రమును విచారణపూర్వకంగా జనులు పఠించెదరు గాక! అధ్యాత్మ శాస్త్రమును విచారణపూర్వకంగా పరిశీలించుటచే ఆత్మయొక్క శుద్ధజ్ఞానము లభించగలదు.
న తీర్థేన న దానేన న స్నానేన న విద్యయా | న ధ్యానేన న యోగేన న తపోభిః నచాధ్వరైః ॥
భ్రాంతి మాత్రం కిలేదం సదసత్పదివ లక్ష్యతే |
వ్యోమైన జగదాకారం స్వప్నో అనిద్రే చిదంబరే ॥
ఓ రామచంద్రా! సత్-అసత్ రూపము, అనిర్వచనీయము అయినట్టి ఈ నామరూపాత్మక జగత్తు భ్రాంతిమాత్రమే అయివున్నది. అయితే అజ్ఞానముచే సత్యముగా అనిపిస్తుంది. నిద్రారహితమగు చిదాకాశమే చిదాకాశమున ఇట్లు స్వప్నరూపమై జగదాకారముగా స్థితినొంది ఉన్నదని గ్రహించు. ఇదంతా ఆత్మకు వేరుగా అనిపించటమే భ్రమ.
Page:551
న శామ్యతి తపస్తీరైః భ్రాంతిర్నామ కదాచన | తపస్తీర్ధాదినా స్వర్గాః ప్రాప్యన్తో, నతు ముక్తతా ॥
“ఇది ఆత్మకు వేరైన జగత్తు" అను భ్రాంతి (లేక) మాయ తపస్సులచేగాని, తీర్థములు సేవించటంచేతగాని తొలిగేది కాదు. అవన్నీ స్వర్గాది సుఖప్రదమైన లోకములు ప్రాప్తింపజేయగలవే గాని ముక్తిని కాదు. ముక్తి కొరకై జ్ఞానమయమైన ఆత్మదృష్టి పెంపొందింపబడి, పరిరక్షింపబడక తప్పదు. (దృష్టిమ్ జ్ఞానమయమ్ కత్వా పస్యేత్ బ్రహ్మమయమ్ జగత్). భ్రాంతి పూర్తిగా తొలగాలంటే ఆత్మ జ్ఞానమయమగు మోక్షోపాయమైన “వసిష్ఠ రామ సంవాదము” వంటి శాస్త్రములను, ఆత్మ దర్శన భాగ్యం సంపాదించుకున్న మహనీయుల వాక్య - అభిప్రాయములను సేకరించి హృదయస్థం చేసుకోవటమే ఉపాయం. క్రమంగా సర్వము పరమాత్మకళామయంగా దర్శిస్తూ ఉండగా మనోబుద్ధి చిత్త అహంకారాలు పవిత్రమై అవన్నీ వాటివాటి విషయములతో సహా పరమాత్మరూపంగానే అనుభమౌతాయి. సూర్యుడు ఉదయించిన తరువాత ఇక చీకటి, ఆ చీకటిలో కనిపించిన ఆకారాది వికారముల గురించి మీమాంస ఎక్కడిది? నిర్మల జ్ఞానమును కలుగజేయగల ఆధ్యాత్మ శాస్త్రముల యొక్క అర్థముచే సాంసారిక భ్రాంతి అంతా పూర్తిగా తొలగిపోగలదు. శమించగలదు. అయితే, అందుకు అత్యవసరమైయున్న నిర్మల మనోబుద్ధులను తపస్సు - తీర్థము మొదలైనవి ప్రసాదిస్తున్నాయి. కనుక, అవి అత్యవసర సాధనములుగా శాస్త్రములు ప్రతిపాదిస్తున్నాయి.
వాయువునందు వాయుతరంగాలవలె, జలమునందు ద్రవత్వంలాగా… స్వస్వరూపమగు చిదాకాశమునందు ఈ సృష్టి-స్థితి-లయముల ప్రతిభాసలు కనిపిస్తున్నాయి. ఇవి ఉంటే ఉండనీ, లేక ఉండకపోనీ, ప్రతిభాసా మాత్రము అగు ఈ జగత్ గా దర్శనమయ్యే దానిని ప్రక్కన ఉంచి ఇది ఏ ఆత్మయందు సర్వదా భాసిస్తోందో… అట్టి ఆత్మదర్శనము సర్వదృష్టి సంబంధమైన రుగ్మతలు వాటికవే తొలగుతాయి. అప్పుడిక (సాంసారిక భ్రాంతి "భ్రాంతి మాత్రం”గా గమనించబడిన తరువాత) ఆత్మీదృష్టి స్వభావసిద్ధమే అగుచున్నది. ఇక ఆపై తొలగవలసినదేమిటి? పొందవలసినదేమిటి?
కాబట్టి రామచంద్రా! వటవృక్షానికి (మఱిచెట్టుకు) ఆకులు పూయటం, రాలటం ఆ వృక్షము లోని విభాగమే కదా! వాయువులో అసంఖ్యాక తరంగాలు ఉద్భవించటం వాయువు యొక్క స్వభావమే అయివున్నది కదా! మాయా శబలితమైన చిదాకాశమునందు యథాస్థితి కలిగియున్న ఈ జగత్తుల యొక్క సృష్టి స్థితి లయాలు చిదాకాశమునకు వేదికీకాదు. చిదాకాశమే మాయచే జగత్తుగా కనిపిస్తోంది. కనిపించే జగత్తు స్వస్వరూపమగు చిదాకాశముగా అనిపించటమే మోక్షము, నిర్వాణము, విదేహముక్తి, ఆత్మలయం, పరమాత్మత్వం, పరమాత్మ దర్శనం, ఆత్మసాక్షాత్కారం మొదలైన ఆయా శబ్దములచే ఉద్దేశించబడుతున్నాయి.
ఆ ఆ శబ్దములన్నీ ఒక దానికి మరొకటి పర్యాయపదములేనయ్యా!