Page:591
XII. బ్రహ్మగీతాంతర్గత కుందదంతోపాఖ్యానం
శ్రీరాముడు : హే మహర్షీ! సూర్యుడు ఉదయించగానే సర్వ అంధకారములు తొలగిపోతాయి చూచారా? అట్లా…. “సర్వ వస్తువులు బ్రహ్మమే” అనే పూర్ణబోధ కొరకై తమరు నా యొక్క ఒకానొక సంశయమును ఛేదించ ప్రార్థన. నేను మీ ముందుంచబోయే ఈ సంశయం వెనుక ఒకానొక సంఘటన కొంత వరకు కారణమై ఉన్నది. అద్దానిని ముందుగా వర్ణించి చెప్పటానికి కొద్ది సమయమును ప్రసాదించమని మిమ్ములను వేడుకుంటున్నాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : అట్లాగే! ఆ సంఘటన ఏమిటో సవివరంగా చెప్పు. అంతా వింటాం. శ్రీరాముడు : ఓ మహాత్మా! వసిష్ఠ మహర్షీ! పితృదేవులగు దశరథ మహారాజా! ఈ సభకు వేంచేసిన తదితర సర్వసభికులారా! ఈ మహర్షి ప్రవచనం సందర్భంలో నా ఈ గురుదేవుల అనుజ్ఞతో చెప్పుచున్న ఈ కుందదంతాఖ్యాయిక వినండి.
కొన్ని నెలలు క్రితం ఒక రోజు అయోధ్యలోగల విద్యాపీఠంలో విద్వాంసులగు వేద పండితుల సదస్సు జరిగింది. రాజకుమారుడుగా ఆహ్వానితుడనై మా తండ్రిగారి అజ్ఞానుసారం నేనాసభలో పాల్గొన్నాను. ఆ రోజు విద్వత్తములైన ఎందరో పండిత బ్రాహ్మణ్యులు వేద - వేదాంత విశేషములను ప్రవచిస్తూ ఉండగా సోదరులతో కూడి అత్యంత ఏకాగ్రచిత్తులమై అందరం వింటున్నాం. అట్టి సమయంలో ఆ సభకు అక్కడి కార్యకర్తలు “విదేహ దేశము నుండి ఉత్తమ బ్రాహ్మణుడు, గొప్ప శాస్త్ర విద్వాంసుడుగా లోకప్రసిద్ధి పొందినవాడు, మహా శ్రీమంతుడు, మహాతపస్వి, గొప్ప జ్ఞానైశ్వర్య కాంతులతో ప్రకాశించువాడు, దుర్వాస మహర్షి వలె దుస్సవహమైన తేజోధారియగు ‘కుందదంతముని’ అతిథిదేవరూపులై వేంచేశారహో!” అని ప్రకటన చేశారు.
మేమంతా అప్పుడు నిజపఠితములైన వేదాంత - - సాంఖ్య సిద్ధాంతవాద - ప్రతివాదములను ఆపాం. ఆ బ్రహ్మయజ్ఞ సభలో ఉన్నవారమంతా లేచి గౌరవ సూచకంగా నిలబడి నమస్కరిస్తూ … కరతాళ ధ్వనులు చేయసాగాం. అప్పుడు మహా దీప్తివంతుడగు బ్రాహ్మణుడు మాకు ప్రతి నమస్కారాలు చేస్తూ సుపరిచితులతో కరచాలనం చేస్తూ మహారణ్యంలోంచి నడచివచ్చే గంభీర సింహంలాగా సభాగ్ర భాగంలో మేమున్న సభామండప అగ్రస్థానానికి నడచి వచ్చారు. అలవోక అయిన చిరునవ్వుతో నన్ను, మా ముగ్గురు సోదరులను పలకరించి సుఖాసీనులైనారు. అప్పుడు నేను లేచి వారి పాదములపై పుష్ప గుచ్ఛములు ఉంచి నమస్కరించాను. వారి ’ప్రియవాక్కును అనుసరించి అందరం సభలో ఆసీనులమైనాం. అప్పుడు నేను కుశల ప్రశ్న పూర్వకంగా పలకరించాను. పలకరిస్తూ ఒకానొక విషయం అడిగాను. అప్పుడు నాచే అడగబడిన విషయం
Page:592
అప్పటి మా చర్చలకు సానుకూల్యము - సందర్భోచితము అయివున్నది. నేను మొట్టమొదటగా ఇట్లా పలుకరించాను.
నేను (రామచంద్రుడు) : బ్రహ్మ విద్యావరేణ్యులైన ఓ బ్రాహ్మణోత్తమా! కుందదంతమునీ! తమరు విదేహదేశం నుండి ప్రయాణించి ఎంతో అలసిపోయి ఉంటారు. ఆ ఆసనముపై సవిశ్రాంతులయ్యెదరు గాక! మీ రూపం బ్రహ్మ తేజస్సుతో ఉట్టిపడుతోంది. అయినప్పటికీ మీ సుందరమైన కళ్ళలో ఏదో ఆతురత నాకు కనిపిస్తోంది. అందుచేత, ఇప్పటి మీ రాక ఎచ్చట నుండో, ఏది తెలియగోరుచున్నారో …తెలుపమని ప్రార్ధన. ఈ సభికులందరి తరఫున, అయోధ్యా నగర చక్రవర్తి - మా పితృదేవులైన శ్రీదశరథ మహారాజు తరఫున, అయోధ్యా నగరవాసుల తరఫున మీకు మరొక్కసారి సుస్వాగతం. ఇప్పుడు మీరు ఏది ఎరుగాలనే కించిత్ ఆవేశపూరితంగా కనిపిస్తున్నారో… అట్టి విశేషమును సవివరంగా ఈ పండిత సభకు ప్రకటించండి. మీరు సంభాషిస్తూ ఉంటే వినాలని ఇక్కడి సభికులంతా వేచి ఉన్నట్లున్నారు. దయచేసి మీ మనోహరమైన వాక్యపరంపర మాపై వెదజల్లండి. కుందదంత బ్రాహ్మణుడు : ఓ దశరథ వర కుమారా! శ్రీరాచంద్రా! నీవు చెప్పింది నిజమేనయ్యా! అత్యంత సునిశితమైన బుద్ధి కలవాడివి కాబట్టే అట్లా పలికావు. అవును. నేనిప్పుడు మహాప్రయత్న పరుడనై ఉన్నాను. ఒకానొక అతిముఖ్యమైన కార్యము కొరకై ఈ అయోధ్యకు వచ్చాను. ఇక్కడ సత్సంగము జరుగుచున్నట్లుగా విన్నాను. నీ దర్శనం, సభలో గల అనేకమంది వేద - వేదాంగ - వేదాంత పండితుల దర్శనం కోరుకున్నవాడనై ఇటు వచ్చాను.
ఓ రామచంద్రా! ఓ సభికులారా! మీ మీ చర్చనీయాంశానికి కొంచెం విఘాతం కలిగించానేమో! కానీ… మీ అతిథిమర్యాదలకు, ఈ శ్రీరామచంద్రుని ఆప్త వాక్య ప్రియత్వానికి పులకితుడనై మీ అందరి అనుజ్ఞతో ఇప్పుడు అస్మత్ సంబంధమైన ఒకానొక జరిగిన సంఘటనను ప్రస్తావిస్తాను.
ఎందుకు ఆ నా స్వీయానుభవం చెప్పుచున్నానంటారా? ఆ సంఘటన వలన నాలో ఒక గొప్ప సందేహం బయల్వెడలింది… “భూమి, సప్తసముద్రాలు, అనేక పర్వతాలు మొదలైన విశేషాలతో కనబడే ఈ ప్రపంచం అత్యంత సువిశాలమైనది కదా! "ఇక్కడికి చాలాదూరంలో ఒకానొక చిన్నగ్రామం ఉన్నది. ఆ గ్రామంలో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో నాకు పరిచయం గల ఒక కుటుంబం నివసి స్తోంది. ఆ ఇంట్లో కొన్ని గదులు ఉన్నాయి. అక్కడి ఒక్కొక్క గదిలో ఇంతటి సువిశాలమైన ఒక్కొక్క బ్రహ్మాండం ఉండి ఉన్నది. ఇది నమ్మసక్యమైన నిజమేనా? ఇది సాధ్యమా?
ముందుగా నా జన్మ -జన్మ స్థానముల గురించి ఈ విద్వత్ సభకు విన్నవించుకుంటున్నాను. ఈ భూమిపై ‘స్వర్గధామం’ అని చెప్పుకునే ‘విదేహం’ అనే ఒక దేశమున్నది. ఆ దేశంలో ఒకానొక బ్రాహ్మణ గృహంలో నేను జన్మించాను. మా ఇంట్లోనే తండ్రి దగ్గర కుల విద్యలగు వేదపారాయణ - వేదాంత విద్యలు బాల్యం నుండి అభ్యసించాను. నా దంతములు పుట్టినప్పటి అతిబాల్యం నుండి తెల్లటి స్వచ్ఛమైన ప్రకాశమును విరజిమ్ముచుండటం చేత మా పితామహులు "కుందదంతుడు” అనే నామధేయం నిర్ణయించారు. (కుందం = మొల్లపూవు)
Page:593
నేను నా విద్యాభ్యాసం ముగించుకొని ఆ తరువాత ఈ జగత్తు యొక్క నిత్యానిత్యాలు విచారణ చేయసాగాను. క్రమంగా, వైరాగ్యవంతుడనయ్యాను. ‘సంసారం’ అనే శ్రమ సశాంతించటానికై గొప్ప ప్రయత్నశీలుడై అనేక మున్యాశ్రమాలు, బ్రహ్మజ్ఞుల గృహాలు సందర్శించి అనేక తత్త్వజ్ఞాన విషయాలు సేకరించసాగాను. అట్లా సంచరిస్తూ సంచరిస్తూ, ఒకసారి దక్షిణ దిక్కుగా ఉన్న శ్రీశైలం వెళ్ళాను. అక్కడ పర్వత ప్రాంతంలో మున్యాశ్రమం నిర్మించుకొని చాలాకాలం వరకు కోమలమైన తపస్సు ఆచరించాను. ఆ మున్యాశ్రమం సమీపంలో దట్టమైన ఒక అరణ్యం ఉన్నది. ఒకసారి నేను కాకతాళీయంగా ఆ అరణ్యంలో ప్రవేశించి సంచరించసాగాను.
అట్లా తిరుగుతూ ఉంటే, అక్కడకు అల్లంత దూరంగా నాకు విస్తారమైన కొమ్మలు - శాఖలు గలిగి… 7–8 అడుగుల ఎత్తు మాత్రమే ఉండే పొట్టిదైన ఒక వృక్షం కనిపించింది. అది కోమలమైన లేత ఆకులతో సుకుమారమైన కొమ్మలతో చాలా ప్రత్యేకమైన ప్రకాశంతో ఆకర్షణీయంగాను, ఆహ్లాదంగాను అగుపించింది. అది చూచి, నేను దూరం నుండే ఆకర్షితుడనై కాసేపు విశ్రాంతి కొరకై ఆ వృక్షమును సమీపించాను.
ఆశ్చర్యం! ఆ వృక్షము యొక్క ఒక శాఖకు పాదాలు త్రాళ్ళతో బంధించబడి క్రిందకు వ్రేలాడే శరీరము - శిరస్సులతో పవిత్రమైన ఆకారంతో ప్రకాశిస్తూ ఒక మానవ దేహం కనిపించింది.
ఆ సమయంలో ఆ ఏకాంత ప్రదేశంలో ఆ వృక్షానికి తలక్రిందులుగా వ్రేలాడే ఆ దేహము కనిపించటం నాకు ఆశ్చర్యజనకం అయింది. “ఏమిటిరా ఇది” …అని అనిపించింది. “కొంపదీసి ఈ అఘాయిత్యాన్ని ఎవరైనా దుర్మార్గులు చేసి ఉంటారా?” …అని అనుకోసాగాను. నెమ్మదిగా ఆ
వృక్షాన్ని బాగా సమీపించి చూచాను. అతడెవరో శ్రోత్రియ బ్రాహ్మణుని వలె వీబూదితో ప్రకాశిస్తు న్నారు. కళ్ళు మూసుకుని ఉన్నారు. "అరె! ఇంకా ఈయనకు జీవకళ ఉన్నట్లే ఉన్నదే! ఏమి ఆశ్చర్యం!”… అని తలచుచు మరింత సమీపించాను. ఆతడు ఉచ్ఛ్వాస - నిచ్ఛ్వాసములు నిర్వర్తిస్తూ ఉండటం గమనించి, “ఈతడు నిర్జీవికానేకాదు. సజీవియే!” …అని గ్రహించాను. ఇంకా ఇంకా సమీపించి చేతులతో ఆతని మణికట్టు, కణత విభాగం - గుండె సున్నితంగా స్పృశించాను. ఆతడు నా చేతి స్పర్శను ఎరుగుచున్నారని గమనించాను. నేలకు రెండు మూడు అడుగుల ఎత్తులో మాత్రమే ఆతని శిరస్సు వ్రేలాడుచున్నది.
ఇక ఆ క్షణం నుంచి సమాధిలో ఉన్న ఆ వ్యక్తికి పరిశుభ్రం - హస్త స్పర్శ మొదలైన వాటితో సేవిస్తూ కొన్ని రోజులు గడిపాను. నేను సేవించటం ఆ వ్యక్తి గమనిస్తూనే ’ధ్యాననిష్ఠ’ను కొనసాగిస్తు న్నారని నేను గ్రహించి… వారితో సంభాషించాలనే ఉత్సుకతతో ఆ సేవానిరతిని కొన్ని రోజుల వరకు కొనసాగించాను. క్రమంగా ఆయనకు నాపై విశ్వాసం కలిగినట్లున్నది.
ఒక రోజు నావైపు కొంచెం కళ్ళు తెరచి చూచారు. అప్పుడు నేను, “మహాత్మా! మీరెవరు? ఈ లక్ష్య-అలక్ష్య రూపమగు జీవితము కలవారై ఇక్కడ ఈ దారుణమైన తపస్సు ఎందుకు కొనసాగిస్తున్నారు?” అని అత్యంత అనునయంగా ప్రశ్నించాను. అప్పుడాయన, పెదవులు విప్పి
Page:594
“బాబూ! నా యొక్క కుల దేశ తపః ప్రయోజనాలు తెలుసుకున్నందువల్ల నీకు ఏమి ప్రయోజనం చెప్పు? ఏదైనా ప్రయోజనముంటేనే ప్రాణులకు ఆయా విచిత్రములైన కోర్కెలు సంభవిస్తాయి. నా గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస వలన నీకు ఒరిగేదీ లేదు. జరిగేదీ లేదు. కనుక… నీవు వెళ్ళి నీ యథాతథ జీవితం కొనసాగించు” …అని చిరునవ్వుతో చెప్పి వెంటనే కనులు మూసుకున్నారు. నేనప్పుడు “ఈయన విషయం, చరిత్ర, ఆశయము తెలుసుకోవాల్సిందే!” …అని మరింత జిజ్ఞాస పొందాను. వారిని అట్లాగే సేవిస్తూ, పైన కొమ్మ వద్ద త్రాడుతో బంధింపబడిన పాదముల ఉపరితలమును అక్కడి ఔషధ రూప ఆకులతో సేవనం చేస్తూ మరికొన్ని రోజులు గడిపాను.
మరొక రోజు ఎప్పుడో ఆయన సేవాసంతుష్టి ప్రదర్శిస్తూ కనులు తెరిచారు. నేను మరల నా ప్రశ్నను పునరుద్ఘాటించాను. అప్పుడాముని మృదుమధురంగా, సౌమ్యంగా ఇట్లా పలికారు. చెట్టుకు రెండు పాదములు కట్టివేయబడి తపస్సు కొనసాగిస్తున్న ఆ ముని : “ఓ అకారణ మిత్రమా! బాటసారీ! నేను మధురా నగరంలో పుట్టాను. మా తండ్రిగారి శాస్త్రబోధచే పదపదార్థ జ్ఞానయుక్తుడ నైనాను. క్రమంగా యౌవన దశ పొందాను. అక్కడ నా తోటిమిత్రులు “అయితే చక్రవర్తిగానే పుట్టాలి. చక్కగా అన్ని భోగాలు అనుభవించటం జరుగుతుంది కదా!” అని చెప్పగా… "ఆహా! నేను సప్త ద్వీపాలతో కూడిన రాజ్యమునకు రాజునై, నన్ను అర్థించ వచ్చిన జనులకు ఏది కావాలంటే అది ఇవ్వగలిగే సమర్థత ఎప్పటికి పొందుతాను?” … అని చిరకాలం చింతించసాగాను. ఆ విధంగా ఈ భూమికంతటికీ చక్రవర్తిని కావాలనే ఆశయంతో ఇక్కడికి వచ్చి 12 సంవత్సరములుగా ఈ తపస్సు కొనసాగిస్తున్నాను. ఓ మిత్రమా! విషయం ఇది… విన్నావు కదా! ఇక నీకు ఎటు ఇష్టమో అటు వెళ్ళు. నేను నా అభీష్టం నెరవేరే వరకు ఇట్లాగే తపస్సు కొనసాగిస్తాను.”
అది విని… నేను “ఓ సాధూ! మీరు మీ అభీష్ట సిద్ధిని పొందేవరకూ మీకు సేవచేస్తూ మీ రక్షణ అనే రూపంగా నా తపస్సు నేనూ కొనసాగిస్తాను" …అని పలికాను. అది విన్న మరుక్షణం శమశీలుడగు ఆ తాపసి శిలవలె మౌనం వహించి, కనులు మూసుకొని, బాహ్య చేష్టలు త్యజించి తపస్సు నిర్వర్తించసాగారు. నేను అక్కడ కాలకృత్యమైన శీతోష్ణములను సహిస్తూ… భయ చింతారహితుడనై “ఈ తాపసి యొక్క తపోసమయ భౌతికదేహ సేవయే నా తపస్సు” అని అనుకుంటూ సేవానిరతిని కొనసాగించాను. అట్లా 6 నెలలు గడచిపోయాయి.
ఒక రోజు సూర్యబింబం నుండి జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఒక కాంతి పురుషుడు ఆ తపస్వికి ఎదురుగా నిలచాడు. అప్పుడు మేమిద్దరం వారికి ప్రణమిల్లాం. మనోవాక్కాయములతో వారికి పూజ సమర్పించాం. ఆ సూర్యకాంత పురుషుడు అమృతప్రాయంగా ఇట్లు పలికాడు. సూర్యతేజో పురుషుడు : వృక్ష శాఖకు వ్రేలాడుతూ సుదీర్ఘంగా తపస్సు చేయటంలో తత్పరుడవై ఉన్న ఓ బ్రాహ్మణుడా! ఇక నీ తపస్సు చాలించి, నీ అభిమతం ఏమిటో… ఆ వరమును స్వీకరించు. దీర్ఘ తపస్వి : ఓ ఆదిత్య పురుషుడా! మీరు సర్వాత్మ స్వరూపులు. నా అభీష్టం మీకు తెలియనిది
Page:595
కాదు. అయినా చెప్పుచున్నాను. నాకు సప్త మహాద్వీపములతో కూడిన భూ సామ్రాజ్యానికి చక్రవర్తిని అవాలని కోరిక ఉన్నది.
సూర్యతేజో పురుషుడు (ఆదిత్య పురుషుడు) : ఓ బ్రాహ్మణుడా! అట్లాగే నీవు ఈ శరీరంతో నిర్వర్తించిన తపస్సుకు ఆదిత్య హృదయులమగు మేము మెచ్చాం. ఇట్టి తపస్సు యొక్క పుణ్యంచేత నీవు సప్త సముద్రములచేత - సప్త ద్వీపముల చేత కూడియున్న భూమిని చక్రవర్తివై 7000 సంవత్సరములు పాలించగలవు.
ఈ విధంగా పలికి ఆ ఆదిత్య పురుషుడు అంతర్ధానం అయ్యాడు. అప్పుడా దీర్ఘతపస్వితో నేను ఇట్లా అన్నాను - "హే మహాత్మా! మీ అభిమతం నెరవేరింది కదా! మీ పాదముల నుండి ఈ కట్టు త్రాళ్ళను విప్పి వేయమంటారా? ఇక ఇక్కడి నుండి మీరు మీ గృహం చేరవచ్చు కదా!”
అప్పుడా తపస్వి “అట్లాగే” అని అనగానే, ఆయన సుతిమెత్తని పాదాలకు కట్టి ఉన్న కట్టుత్రాళ్ళను విప్పి ఆయనను నెమ్మదిగా భూమిపై జేర్చాను. అప్పుడా బ్రాహ్మణుడు ఆ ప్రక్కనేగల సెలయేరులో స్నానం చేసి అఘమర్ష మంత్రమును జపించారు. ఆ చెట్టు ఫలాలతో అప్పుడే పరమాత్మను నైవేద్యాది సేవలతో మంత్ర యుక్తంగా జపించారు. ఆ వృక్షం నీడలోనే ఇద్దరం కూడా క్షోభవర్జితులమై ఆ వృక్ష ఫలాలు భుజిస్తూ ఆతని పాదపీడనం యొక్క నివృత్తి అయ్యేవరకు 3 రోజులు అక్కడే ఉన్నాం.
కుందదంతుడు : ఓ రామచంద్రా! ఓ సభికులారా! 3 రోజుల తరువాత ఉదయమే అక్కడి నుండి ఇక మధురాపురమునకు సూర్య చంద్రులవలె సంతోషాంతరంగులమై బయలుదేరాం. పగలంతా నడుస్తూనే ఉన్నాం. సాయంకాలం “త్వరగా ఏదైనా సురక్షిత ప్రదేశమునకు చీకటి పడకముందే చేరుదాం” అని అనుకున్నాం. అట్లా పోతూ పోతూ మార్గమధ్యంలో “రోధ” అనే పేరుగల గ్రామం చేరాం. అక్కడి మామిడి తోటలలో రెండు రోజులు విశ్రాంతి తీసుకొని, ఇక అక్కడి నుండి అనేక సజల భూములు, నదీ ప్రాంతాలు, సెలయేళ్ళు, సరస్సులు దాటివేసి… ఆ రాత్రికి ఒక ప్రదేశంలో గల అరటితోటలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాం. ఆ తరువాత మరల 3 రోజులు ప్రయాణించి ఒక అరణ్య ప్రదేశం చేరాం. అప్పుడు ఆ దీర్ఘ తపస్వి నాతో ఇట్లా అన్నారు.
దీర్ఘ తపస్వి : మిత్రమా! మనం చక్కగా చాలాదూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చాం. అయితే, ఇక్కడి నుండి ఈ మధురానగరం వెళ్ళే మార్గాన్ని వదలి వేరే మార్గంలో ‘గౌర్యాశ్రమము’ అనే చోటికి పోదాం. ఎందుకో తెలుసా? ఆ గౌర్యాశ్రమంలోకి మనం ప్రవేశించటంలో నాకు రెండు ఉద్దేశాలు ఉన్నాయి.
Page:596
చేసుకుంటూ ఉంటారు. తపస్సుకు సానుకూల్యంగా పర్ణశాలలు ప్రకృతి సిద్ధంగానే నిర్మితమై ఉంటాయి. సెలయేళ్ళు అత్యంత ఆహ్లాదజనకంగా ఉంటాయి. అక్కడి చిలకలు కూడా వేదగానం చేస్తూ ఉంటాయి. బ్రహ్మలోకంతో సమానమైన ఆ ఆశ్రమ దర్శనం చేత చిత్తము యొక్క సర్వదోషములు శమిస్తాయి. అక్కడి తత్త్వదర్శనంచే పూర్ణ మనోహర చిత్తులగు మునుల దర్శనభాగ్యం కొరకు, సేవాభాగ్యం కొరకు, సుదూర ప్రాంతం నుండి కూడా ముముక్షువులగు జనులు వచ్చి వెళుతూ ఉంటారు. ధీరులు, విద్వాంసులు అగు మహనీయులతో సంభాషించటం కొరకు వెళ్ళే మనవంటి వారి విషయం ఇక వేరే చెప్పేదేమున్నది?
#
అది విని నేను ఆ దీర్ఘ తపస్వితో “సరే! తమ అభీష్టానుసారంగా అట్లే జరుగునుగాక! మనం ఇప్పుడు గౌర్యాశ్రమం వెళ్ళుదాం” … అని అన్నాను. అప్పుడు ఆయన చెప్పినట్లు మేము ‘గౌర్యాశ్రమం’ అనే ప్రదేశం చేరాం. అయితే ఆ దీర్ఘ తపస్వి … ఆ ప్రదేశమంతా శూన్యంగా ఉండటం చూసి, “ఇదేమిటి? ఇక్కడ 12 సంవత్సరాల క్రితం గొప్ప వనం ఉండాలే! ఇప్పుడిదంతా శూన్యంగా ఉన్నదే!“ అని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అక్కడ వృక్షాలు గాని, ప్రకృతి నిర్మితమైన కుటీరాలుగాని, పొదలుగాని, మనుజులుగాని, మృగములుగాని, ఆ బ్రాహ్మణ సోదరులుగాని కనిపించలేదు. ఆ విశాలారణ్య ప్రాంతం కేవలం శూన్యమై ఉండగా వేడిమిచే సర్వత్రా సంతప్తమైన కొండరాళ్ళతో కనిపించింది. ”అరె! ఏమి కష్టం! నా ఏడుగురు సోదరులు ఏమైనారు?” అని ఆ తాపసుడు కంగారుపడుతూ ఉండగా, మేమిద్దరం ఆ ప్రదేశమంతా ఏవైనా వృక్షములు కనిపిస్తాయేమోనని వెదుకసాగాం. అట్లా వెతకగా వెతకగా చాలా సేపటికి ఒకచోట కొంత దూరంలో ఒక వృక్షం కనిపించింది. మేము ఆ వృక్షమును సమీపించాము. ఆ వృక్షం దట్టమైన కొమ్మలు ఆకులు కలిగినదై మనోహరంగా ఉన్నది. ఆ వృక్షపు మొదట్లో ఒక వృద్ధ తపస్వి సమాధి పరాయణుడై కనిపించారు. ఆ వృద్ధుడు సమాధి నుండి లేచేంత వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకొని ఎదురుగా గల ఒక ప్రదేశంలో ఆసీనులమైనాం. కొంత సమయమైన తరువాత నేను ఉద్వేగం ఆపుకోలేక చపలచిత్తుడనై “ఓ మునీశ్వరా! ఇక మీరు సమాధి నుండి లేవండి”… అని బిగ్గరగా పలికాను. అప్పుడు మేఘగర్జనచే సింహం మేల్కాంచినట్లుగా …నా గొంతుక చేసిన శబ్దానికి ఆ మునివర్యులు సమాధి నుండి మేల్కొని కనులు తెరిచారు.
గౌర్యాశ్రమముని : ఓ సాధువులారా! మీరెవరు? (చుట్టూ ఒకసారి పరికించి, కించిత్ ఆశ్చర్యంగా) …అరె! గౌర్యాశ్రమం ఏమైనది? నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు? ఇప్పుడు ఏ కాలం కడుస్తోంది?
Page:597
నేను (కుందదంతుడు) : హే మహాత్మా! ఈ విషయాలు మాకుకూడా తెలియవు. తమరు సర్వజ్ఞులు. యోగబలం కలవారు. మీరే విశేషాలు దివ్యదృష్టిచే వాటిని గమనించగలుగుతారు కదా!
అప్పుడా గౌర్యాశ్రమముని మరల కనులు మూసుకొని, ధ్యానపరాయణులై తన యొక్క - మా యొక్క వృత్తాంతమంతా దివ్యదృష్టితో యోగబలంచేత వీక్షించసాగారు.
గౌర్యాశ్రమముని : ఓ ఆర్యులారా! కార్యవేత్తలారా! ఈ వృత్తాంతం ఏమి ఆశ్చర్యకరం! ఈ కదంబ (కడిమి) వృక్షమే మొదటి నుండి కూడా నా నివాస స్థానమై కొనసాగుతోంది. నేను గౌర్యాశ్రమం విడచి మరెక్కడా లేను.
ఒకసారి ఏదో ఒక కారణం చేత గౌరీదేవి సరస్వతీ రూపమును ధరించి, సమస్త ఋతువులచే సేవించబడుచూ ఇక్కడ 12 సంవత్సరాలు ఉండటం జరిగింది. ఆ కారణం చేతనే, ఈ ప్రదేశం ఒకప్పుడు అనేక వృక్షములచే దట్టమై విస్తరించటం జరిగింది. అనేక సరస్సులతోను, మున్యాశ్రమాల తోను ఈ ప్రదేశము ఒకప్పుడు ‘గౌరీవనము’ అనే పేరుతో ప్రసిద్ధికెక్కియున్నది. అందుచేతనే ఈ వనం ప్రకృతిదేవత మనోహరంగా తీర్చిదిద్దిన సౌందర్యలహరివలె ప్రకాశిస్తూ ఉండేది. అప్పట్లో ఆ గౌరీదేవి ఈ కదంబ వృక్షపు నీడలోనే వసించేది. ఆ భగవతి కరస్పర్శచేతనే ఈ వృక్షం వృద్ధాప్యం పొందక నిత్యయౌవనంతో విరాజిల్లుతోంది. ఆ గౌరీ భగవతి ఈ స్థానమును విడచివెళ్ళిన తరువాత ప్రదేశమంతా ఫల-పుష్ప-కాష్ఠాదులు అమ్ముకొని జీవించే జనులకు ఆశ్రయమై సామాన్యమైన వనంగా మారిపోయింది. ఆ గౌరిదేవికి మాత్రం "కదంబవనవాసినీ” అనే పేరు సార్థకమైనది.
ఇక నా గురించి. ఇక్కడికి సుదూరంగా ‘మాలవము’ అనే రాజ్యానికి నేనొకప్పుడు పూర్వాశ్రమంలో రాజును. ఒక సమయంలో వైరాగ్యపూర్వకంగా ఆ రాజ్యమును త్యజించి మునులచే పరివేష్టితమైన ఈ గౌర్యవనానికి వచ్చాను. ఇక్కడి ఆశ్రమవాసులచే సుస్వాగతుడనై కదంబ వృక్షం క్రింద ధ్యాన పరాయణుడనైనాను. కొంతకాలం తరువాత ఈ తాపసుడు, ఈతని ఏడుగురు సోదరులు తపస్సు చేసుకోవటానికి ఇక్కడికి ఆశ్రమానికి వచ్చి ఈ ప్రదేశపు తదితర తాపసువలెనే తమతమ తపస్సులు ప్రారంభించారు. ఒక 6 నెలలు తరువాత నీవు శ్రీశైల ప్రదేశపు అడవులలో తపస్సు చేసుకోవటానికి బయలుదేరావు కదా!
రెండవవాడు కార్తికేయస్వామి ఉండే ప్రదేశానికి, మూడవవాడు కాశీపుర ప్రాంతానికి, నాలుగవవాడు హిమాలయ పర్వత ప్రాంతానికి… తపస్సు కొరకై తమకు ప్రియమైన ప్రదేశాలకు వెళ్ళారు. మిగతా నలుగురు ఇక్కడే తపస్సు కొనసాగించారు. మీ 8 మంది సోదరుల ఆశయం కూడా "ఈ పృథివి కంతటికీ చక్రవర్తి కావాలి!” …అనియే కదా! మీ సోదరులందరూ ఇష్టదేవతా దర్శనముచే వరసిద్ధి పొందారు. నీవు ఇంకనూ తపస్సు కొనసాగిస్తూ ఉండగా… తక్కిన వారంతా మీ ఇల్లు చేరారు.
Page:598
“మేము ఈ పృథివికి ప్రభువులం కావాలి. మా పాలనలో ప్రజలందరూ అసత్యమును త్యజించి ధర్మనిరతులై ఉండాలి. జనులందరు వారి వారి ఆశ్రమ ధర్మములు చక్కగా నిర్వర్తిస్తూ ఉండాలి.”– అని మీ సోదరులు ఆశయము కలిగి, తమ తమ ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకొని, అది అట్లే వరంగా పొందారు.
ఆ తరువాత - తరువాత … ఇక్కడి చుట్టుప్రక్కల పట్టణంలోని ధనికులు ఇక్కడి ప్రదేశములను ఆక్రమించుకోవటం చేత ఇక్కడి ‘వనము’ శిథిలం కాసాగింది. ఇక్కడి ఆశ్రమవాసులంతా వేరే వేరే ప్రదేశాలకు తరలి వెళ్ళిపోకతప్పలేదు. నేను మాత్రం ఒంటరిగా ధ్యానమునందే లగ్నమైన చిత్తము కలవాడనై… గౌరీదేవి యొక్క కరస్పర్శచే పవిత్రమైయున్న ఈ కదంబ వృక్షము క్రిందే పర్వతం వలె నిశ్చలంగా ఉండిపోయాను. ఇక కాలం ఋతు సంవత్సర రూపంగా గడచిపోతూ ఉంటే ఈ వనమంతా అట్లా సమీప జనుల చేత ఛేదించబడినదయింది. ఈ కదంబ వృక్షమును మాత్రం “ఇది సరస్వతీ స్వరూపం” …అని తలచి జనులు పాడుచేయలేదు. ఇక్కడి సమాధిలో నిమగ్నుడైన నన్ను పూజిస్తున్నారు. అందుచేతనే ఈ ఒక్క వృక్షం యథాతథంగా మిగిలిపోయింది. ఆ తరువాత కొద్ది నెలలకు మీరిద్దరూ ఇక్కడికి వచ్చారు. ఓ ప్రియ మిత్రులారా! ఈ విధంగా నేను ధ్యాన నిష్ఠయందు చూచినదంతా మీకు చెప్పాను.
ఓ సుదీర్ఘ బాటసారులారా! ఇక మీరు మీ మీ గృహములకు వెళ్ళవచ్చు. అక్కడ ఈతని ఏడుగురు సోదరులు ఇప్పటికే ఇల్లు చేరి అక్కడి భార్య - పిల్లలు మొదలైన విశేషాలతో మునిగి తేలుచున్నారు. వారితో మరల కలయిక కలుగగలదు.
ఓ శ్రీరాముడు మొదలుగాగల ఆర్యులారా! అప్పుడు నాకు కలిగిన ఒక సందేహం గురించి యోచిస్తూ నేను ఈ విధంగా ప్రశ్నించాను.
నేను (కుందదంతుడు) : హే మహాత్మా! యోగిపుంగవులగు మీ సమక్షంలో నాకు ఇప్పుడో గొప్ప సందేహం వచ్చింది. కుందదంత నామధేయుడను, విదేహ సామ్రాజ్య వాసిని అగు నేను తమకు విధేయుడనై మీ పాదములు స్పృశిస్తూ నాకు వచ్చిన సందేహమును మీ ముందుంచుతాను. నివృత్తింపజేయ వేడుకొంటున్నాను.
కదంబ తాపసుడు : సరే! తప్పక అడుగు. నాకు తెలిసినంత వరకు నీ సందేహమును నివర్తింప జేయటానికి నేను సిద్ధమే!
నేను (కుందదంతుడు) : “ఇప్పుడీ 8 మంది అన్నదమ్ములు సప్తద్వీప సప్త సముద్ర సహిత పృథివికి చక్రవర్తులం కావాలి” … అనే వరాలను తమతమ ఇష్ట దేవతల నుండి సిద్ధింపజేసుకొన్నారు. కదా! మరి ఈ 8 మంది పొంది ఉన్న వరముల ఫలితాలు ఒక్కసారే ఈ పృథివిపై ఎట్లా సిద్ధి స్తాయి? ఒకే ఒరలో 8 కత్తులుండవు కదా! ఒకే భూమికి 8 మంది చక్రవర్తులు ఎట్లా కానున్నారు?
Page:599
కదంబ తాపసుడు : ఓహో! ఇదేనా నీ సందేహం? అయితే ఈ వ్యవహారంలో ఇంతకన్నా అసమంజస మైన మరొక విషయం (వీరి కుటుంబంలో) ఏర్పడి ఉన్నది. అదేమిటంటే, ఈ 8 మంది సోదరుల దేహాలు నశించిన తరువాత…వారు తమ గృహంలోనే, తమ తమ పడక గదులలో సప్తద్వీప సమన్వితమగు భూమిపై 7000 సంవత్సరాలు చక్రవర్తులై ఒకేసారి రాజ్యం ఏలబోతున్నారు. నేను (కుందదంతుడు) : ఆశ్చర్యమే! వారు తమ పడకగదులలోనే సప్తద్వీపములతో గూడి ఈ భూసామ్రాజ్యాన్ని ఎలా ఏలటం జరుగుతుంది? అటువంటి సందర్శనం, అగత్యము ఎట్లా వచ్చాయి? కదంబ తాపసుడు : ఆ విశేషమేమిటో కూడా… చెపుతాను విను.
ఈ 8 మంది సోదరులకు అష్టతారల వలె ఉత్తమ గుణ సంపన్నులగు 8 మంది భార్యలు ఉన్నారు. తమ భర్తలు చిరకాలం తపస్సు చేయటానికి వెళ్ళినప్పుడు వారు ఎంతో దుఃఖం పొందారు. భర్తకు దూరంగా ఉండటమనేది ఏ స్త్రీకైనా దుస్సహమైన విషయమే కదా! అందుచేత దుఃఖనివారణం కొరకై ఆ 8 మంది తోడికోడళ్ళు “శతచాంద్రాయణం” అనే కఠోరమైన తపస్సు ఆచరించారు. వారి తపస్సుకు మెచ్చినదై భగవతియైన పార్వతీదేవి పూజ జరుగుచున్న సమయంలోనే అశరీరవాణిగా, ఆ 8 మందితో విడివిడిగా, "ఓ బిడ్డా! నీకేం వరం కావాలో కోరుకో”అని పలికింది. ఆ వాక్యాలను విని “చిరంటిక” అనే పేరుగల మృధుభాషిణి యగు పెద్ద కోడలు ఈ నీ మిత్రుని అర్ధాంగి…. భగవతి యొక్క కరచరణాలపై మనోకల్పితమైన పుష్పగుచ్ఛాలు ఉంచి, దేవికి స్తవనం సమర్పించింది. చిరంటిక : దేవీ! దేవాదిదేవుడగు శ్రీశంకరుల పట్ల నీకు ఏ రీతిగా ప్రేమ గలదో… ఆ రీతిగా నా భర్త పట్ల కూడా నాకు ప్రేమ! అటువంటి నా భర్త మృత్యురహితుడై ఉండుగాక! ఇది వరంగా ప్రసాదించు!
శ్రీ పార్వతీదేవి : ఓ సువ్రతీ! చిరంటికా! నీ భర్తకు మృత్యువే ఉండకూడదనియా… నీవు కోరుకొనేది? అయితే సృష్ట్యాది నుండి ప్రవృత్తమై ఉన్న నియతి (లేక) ఈశ్వరాజ్ఞ యొక్క దృఢత్వం అనివార్యం. ఏ జీవునికైనా ఎప్పటికో అప్పటికి ఈ భౌతిక దేహం నశించవలసినదే! తపోధ్యానాదులచే మృత్యు రాహిత్య పదవి లభించజాలదు. ఇంకొక వరమేదైనా కోరుకో!
చిరంటిక : ఓ దేవదేవీ! అంబికా! సరే, అట్టి అమరత్వ పదవి లభింపకపోతే … నా భర్త ఎప్పుడు మరణించునో… అప్పుడు నా భర్త జీవచైతన్యం, మేము ఉండే పడకగదిలోనే, నా గృహంలోనే ఉండాలి. బయటకు పోనే కూడదు! ఈ వరం దయతో అనుగ్రహించు.
దేవి : పుత్రీ! అట్లే అగుగాక! మీరున్న గృహంలోనే మీ పడకగదిలోనే నీ భర్త సప్త ద్వీపములకు ఆధిపత్యం వహించటం జరుగుతుంది. ఆ తరువాత, ఈ నీ దేహానంతరం మరల నీవు ఆతని ప్రియురాలివగు భార్యవు అవుతావు. నీకు ఆనందమగుగాక!
వృద్ధ తాపసుడు : విన్నావా? కుందదంతా! ఇట్లా పలికి ఆ గౌరీదేవి అంతర్ధానం అయింది. అదే
Page:600
రీతిగా మిగతా ఏడుగురు భార్యలు అటువంటి వరాలే పొందారు. ఆ తరువాత ఈతని ఏడుగురు సోదరులు కూడా మహావరాలు పొందినవారై ఇంటికి జేరారు. ఈ పెద్ద సోదరుని గురించి అక్కడ వీరి కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తున్నారు. ఈతడు తన భార్యయగు చిరంటిక వద్దకు వెళ్ళును గాక! ఈ సోదరుల - - బంధువుల సమ్మేళనం ఆ విధంగా జరుగున్నది. కనుక వారు ఆ గృహంలోనే వారి వారి పడక గదులలో ఒకేసారి సప్త సముద్ర సహిత మహాసామ్రాజ్యాలకు ఒకే సమయంలో వేరు వేరుగా ఆధిపత్యం వహించనున్నారు.
ఇది ఇట్లా ఉండగా… అక్కడ ఇంకొక సంఘటన కూడా జరిగింది. అది కూడా చెప్పమంటావా? నేను (కుందదంతుడు) : స్వామీ! మీరు చెప్పింది ఇంకా ఆశ్చర్యం. ఈ 8 మంది సోదరులు ఒకే గృహంలో వారి వారి పడక గది ఆకాశాలలో 8 సప్త సముద్రములతో కూడిన మహా భూమండలాలకు వేరువేరుగా ఒకేసారి సుదీర్ఘంగా చక్రవర్తులై ఆధిపత్యం వహించచున్నారా? ఇదంతా ఎలా సాధ్యం? అది అలా ఉండి… ఇది కాక వీరి కుటుంబంలో మరొక విశేషం కూడా జరిగిందని అంటున్నారు కదా! అది ఏమిటో చెప్పండి.
వృద్ధ తాపసుడు : అట్లాగే విను. చెపుతాను.
ఈ 8 మంది సోదరులు తపస్సుకు తరలి వెళ్ళిన క్రొత్తలో తమ 8 మంది కోడళ్ళ యొక్క భర్తృవిరహ దుఃఖం చూడలేక వారి తల్లిదండ్రులు, ఆ కోడళ్ళకు అత్తమామలు అయినట్టి ఆ వృద్ధ దంపతులు తమ కోడళ్ళతో సహా తీర్థయాత్రలకు బయలుదేరారు. త్రోవలో అనేక తీర్థములు, మున్యాశ్రమములు సందర్శించటం జరిగింది. ఒకసారి ఆ పుణ్య దంపతులు శరీరం యొక్క శ్రమను కూడా లెక్కచేయక, తమ పుత్రులు కార్యక్రమ దిగ్విజయం కొరకై “కలాప” అనే తీర్థమునకు కోడళ్ళతో సహా బయల్వెడలారు. అట్లా నడుస్తూ ఉండగా ఒకచోట బాటప్రక్కగా ఊర్ధ్వ జటాధారియగు ఒక మనుజుడు కూర్చుని ఉన్నాడు. ఆయన తెల్లటి దేహంతో, పొట్టిగా అవయవములకు బూడిద పూసుకుని కనులు మూసుకొని ఉన్నాడు. కొందరు ఆతనికి నమస్కరిస్తూ వెళ్ళుచున్నారు. ఈ మన వృద్ధ దంపతులు ఆ మనుజుని చూచారు. కానీ “ఈతడు ఎవరో సామాన్యుడగు వృద్ధ బాటసారి అయి ఉంటాడులే” … అని అనుకొని నమస్కరించక కొంచెం నిరాదరణ దృష్టి కలిగి ఉన్నవారై త్వరత్వరగా నడువసాగారు. అప్పుడు వారి పాదముల తాకిడికి బాటపైగల కొంచెం ధూళి గాలికి లేచి ఆ బాట ప్రక్కనున్న మనుజునిపై పడింది. ఆయన మరెవరో కాదు. శివాంశ సంభూతుడగు దుర్వాస మహాముని. ఆ ధూళి తనపై పడటం గమనించి ఆ మహాముని కోపంతో కళ్ళు తెరచాడు. దుర్వాస మహాముని : పత్నీ-కోడళ్ళు-వియ్యంకుల సమేతంగా తీర్థయాత్రలకు బయలుదేరిన ఓ మూర్ఖుడా! దుర్వాసుడనగు నాకు నమస్కరించకుండా ధాటిగా దాటిపోతున్నావు కదా! అయితే నీ 8 మంది కుమారులు - 8 మంది కోడళ్ళు కలిసి తమ తమ తపస్సులచే ఏఏ వరములు పొందనున్నారో… వాళ్ళంతా మహా వరములు సముపార్జించినప్పటికీ కూడా… అవి విపరీత దుః ఖ ఫలములనే ఒసంగుగాక! అవి నిష్ప్రయోజనమగు గాక! వారి పట్ల వరం శాపముగా అగుగాక!
Page:601
ఇది విన్న ఆ వృద్ధ దంపతులు జరిగిన ప్రమాదం గుర్తించి ఆ మునికి సాష్టాంగ ప్రణామములు సమర్పించే లోపే ఆ దుర్వాసముని అంతర్ధానమయ్యారు. అప్పుడా వృద్ధ దంపతులు చాలా దుః ఖితులయ్యారు. "ఇదేమి కర్మరా బాబూ? ఆయన దుర్వాసముని అని మాకు తెలియదు కదా! ఎవ్వరో సామాన్యులైన బాటసారి అని అనుకున్నాం. ఇంత మాత్రానికి ఇంత శాపమా?” …అని కృశించినవారై. దీనముఖులై, నిరాశ చెందినవారై యాత్ర నుండి తిరిగి గృహానికి చేరారు.
చూచావా కుందదంతా! ఒకరు సప్త సముద్రములతో కూడిన రాజ్యముపై ఆధిపత్యం పొంది చక్రవర్తి కావాలని వరం కోరుకోవటం. ఇంకొకరు ఆ వరభోక్త తమ ఇంట్లోనే ఉండాలని వరం పొందటం. మరొకరు వారి వరం నిష్ఫలమై దుఃఖమాత్రం కావాలని శాపం పొందటం.
కాబట్టే వీరి కుటుంబ సభ్యుల వృత్తాంతమంతా ఒక అసమంజసం కాదు… అనేక అసమంజసాలతో కూడుకొని ఉన్నదని నేననటం జరిగింది. “కంఠముపై వాపు, ఆ వాపుపై కురుపు, ఆ కురుపు పగలటం" …ఇట్లా అనేక అసమంజసమైన విషయాలు వీరి గృహంలో సమకూడుకొని ఉన్నాయి. ఇదేమంత విచిత్రమేమీ కాదు. ఎందుకంటావా?
శూన్యరూపమైన ఆకాశంలో గంధర్వనగరం వంటి భూప్రదేశాలు, అందులో ఉల్కాపాతాలు, ఇంకా ఎన్నో దృశ్య విజృంభణములు సంభవించటం లేదా? చిదాకాశము యొక్క సంకల్ప రచితమగు ఈ జగద్రూప మహాపురములలో చిత్ర - - విచిత్రములైన అసమంజస విశేషాలకు కొదవ ఏమున్నది?
నేను (కుందదంతుడు) : ఓ రామచంద్రా! ఓ వేదవేత్తలతో కూడిన ప్రియ సభికులారా! వింటున్నారు కదా! అప్పుడు నేను ఆ గౌర్యాశ్రమ వృద్ధ తాపసుని మరల ఇట్లా ప్రశ్నించాను.
నేను (కుందదంతుడు) : హే తాపసేశ్వరా! మీరు చెప్పే చమత్కారమైన విషయం ఎట్లా సంభవించు చున్నదో నాకు ఇప్పటికీ ఏమాత్రం బోధపడనేలేదు.
2.ఈ జీవులు వారియొక్క దేహములు పతనమైన తరువాత కూడా వారంతా ఆ గృహాంతర్గత ప్రదేశాన్ని విడవకుండానే …. సప్తద్వీప సమేత సామ్రాజ్యాన్ని 7000 సంత్సరాలు ఎట్లా ఏలనున్నారు? 3.“ఆ వరములు నిష్ప్రయోజనం అవుతాయి” అన్న శాపం ఎట్లా కార్యోన్ముఖం కాగలదు? అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడా?
వరదాతలచే ఒసగబడిన వరములు శాపప్రదాతలచే ఒసగబడిన శాపములచే ఆ కుటుంబం విరుద్ధ ఫలితాలు ఎట్లా పొందనున్నది? పరస్పర విరుద్ధములైనట్టి ఈ వరములు - శాపములు
Page:602
ఒకే ధర్మం పట్ల ఒకే తరుణంలో విరుద్ధ ధర్మాలు ఎట్లా ప్రదర్శించ గలుగుతాయి? ఒకవేళ వర శాపములు శుభ - అశుభ ధర్మములు ఒకదానికి మరొకటి ఆశ్రయంగా కలిగియున్నాయందామా? ఎక్కడన్నా ఆధారమే ఆధేయం కాగలదా? నేలపై నడిచేవాడు నేలకే ఆధారం అవుతాడా, ఎక్కడన్నా? లేదుకదా!
గౌర్యాశ్రమ వృద్ధ తాపసి : ఓ సాధూ! వీటన్నిటిలో ఏ అసమంజమైనది నీకు కనిపిస్తోందో… నాకేమీ అర్థం కావటం లేదు. అయితే… ముందు ముందు ఏమి కానున్నదో అది చెప్పుతాను… విను. ఇందులోని చమత్కారం నీకే అర్థమౌతుంది.
భవిష్యత్లోని సంఘటనలు ఈ రోజు నుండి 8వ రోజుకు ఇతడు మధురానగరం జేరనున్నాడు. అక్కడ స్వబంధువులతో కొంతకాలం గడచిపోనున్నది. ఈతని రాకచే వీరి గృహాలలో అందరూ చాలా సంతోషంగా కొన్ని రోజులు గడుపుతారు. ఆ తరువాత కొన్నాళ్లకి ఈ 8 మంది సోదరులు
గృహంలో మరణించటం జరుగుతుంది. అప్పుడు బంధువులు ఆ దేహాలకు దహన క్రియలు నిర్వర్తిస్తారు. అటు తరువాత ఆ ఈ 8 జీవచిత్ సంవిదాకారములు అదే గృహంలో వేరువేరుగా స్థితి పొందియున్నవై… 4 ఘడియల కాలం సుషుప్తిని పొంది జడస్థితియందు ఉంటాయి. అప్పుడు ఒక చమత్కారమైన విషయం జరుగుతుంది.
ఆ 8 మంది సోదరుల జీవ సంవిత్తులు వీరి మరణానంతరం కొంత సమయం జడస్థితిని అనుభవిస్తూ ఉంటాయని చెప్పాను కదా!… ఆ సమయంలో వారి వరరూప కర్మలు శాపరూప కర్మలు అవశ్యం ఫల దాతృత్వం చేసే నిమిత్తమై సంసిద్ధమై వీరి చిత్తాకాశాలలో ఒకచోట సమావేశ మౌతాయి. ఆ వర కర్మలు - శాపకర్మలు ఆయా ఫలములను ప్రసాదించే అధిష్ఠాన రూప దేవతా రూపములు దాల్చుతాయి. వేర్వేరు శరీరములు రచించుకుంటాయి.
వరరూప దేవతలు - - ఉత్తమ సౌభాగ్యశీలురై, చేతులలో పుష్పాలు, బ్రహ్మదండాలు ధరించి అతి శుభ్రమైన అవయవాలు కలిగి విష్ణురూపధారులై అక్కడికి వస్తారు. శాపరూప దేవతలు త్రినేత్రులై, చేతిలో శూలం ధరించి, భయంకరాకారాలతో మేఘం వంటి నల్లని భుజాలతో క్రోధ ముఖులై వస్తారు.
వర దేవతలు : ఓ శాపములారా! ఇక మీరు దూరంగా పోండి. మేము ఫలించనున్నాము. మమ్ములను క్రియత్వమునుండి ఆపటానికి సమర్థులెవరూ లేరు.
శాపములు : ఓ వరములారా! ఇది మేము ఫలించే సమయం. మీరే దూరంగా పోవలసి ఉన్నది.
వరములు : మీరు దుర్వాసమునిచే సంకల్పించబడ్డారు. ఇక మేమో? సూర్య భగవానునిచే నియమించబడ్డాం. మునుల కంటే ముందే బ్రహ్మదేవుడు సూర్య భగవానుని సృష్టించారు. కాబట్టి మునుల కంటే సూర్య భగవానుడే అధికుడు.
Page:603
శాపములు : (క్రోధంగా) ఓ వరములారా! మీరు సూర్యునిచే సంకల్పించబడ్డారు. నిజమే. కాని మేము రుద్రభగవానుని అంశభూతుడగు దుర్వాసునిచే నియమించబడ్డాం. అందరు దేవతలలోను రుద్రుడే అధికుడన్నది లోక విదితమే కదా! (అని తమ శూలాలను వరాలపై గురిపెట్టుట జరుగుతుంది.)
వరములు : (పకపకా నవ్వుచూ) ఓ శాపములారా! మీరు పాపరూపమగు అనుచితత్వమును కాస్త ఆపండి. ఈ సందర్భమేమిటో కొంచెం విచారణ చేయండి. ఎందుకంటే… కలహమంతా ముగిసిన తరువాత ఏది కర్తవ్యమై ఉంటుందో… దానిని మొట్టమొదటే విచారణ చేయటం ఉచితం. కలహం కొనసాగించినా చివరికి మనకు బ్రహ్మదేవుని నిర్ణయమే శిరోధార్యం అవుతుంది కదా! ఆ పని మొదటే చేస్తే పోలా? కాబట్టి మనం బ్రహ్మదేవుని దర్శించి వారు ఏది నిర్ణయిస్తే అది అనుసరిద్దాం.
ఇది శాపములకు సానుకూల్యమైన యుక్తిగానే అనిపించింది. సందేహ నివారణ కొరకై మహానుభావులే సర్వదా శరణ్యం కదా! అందుచేత శాపాలు “సరే! అట్లాగే చేద్దాం”… అని ఒప్పుకున్నాయి. అప్పుడు వరములు, శాపములు బ్రహ్మలోకం జేరి బ్రహ్మదేవుని దర్శించి తమ తమ వృత్తాంతములు, తమకు "క్రియాశీలత్వంలో ఎవరు ముందు?” …అనే విషయంలో వచ్చిన అభిప్రాయ భేదం సవివరంగా విన్నవించుకున్నాయి. అదంతా ప్రశాంతంగా విని బ్రహ్మదేవుడు ఇట్లా పలికాడు.
శ్రీబ్రహ్మదేవుడు : వత్సలారా! వర-శాపాధిపతులారా! ఇందులో వివాదం ఎందుకు? మీలో ఎవరు లోన సారత్వం కలిగి ఉన్నారో, ఎవరు సంకల్పం యొక్క సుదృఢత్వం కలిగియున్నారో… వారే క్రియాశీలురు కాగలరు. ఒకరి హృదయం మరొకరు పరిశీలించి చూచుకోండి. ఎవరి ప్రయోజనము అసారమో, వారు ఉపేక్షించండి. సారసహితులైనవారు అపేక్షను కొనసాగించండి.
8
అప్పుడు ఒకరి సారత్వం మరొకరు పరిశీలించటానికై ఆ వర - శాపములు ఒకరి హృదయంలో మరొకరు పరిశీలించసాగాయి. దేని పట్టుదల, సాధన, ఉద్దేశము ఎంతవరకు బలవత్తరమో పరిశీలించాయి. అట్లా ఒకరినొకరు చక్కగా పరిశీలించుకున్న తరువాత.. ఎద్దానియందు ‘ఉద్దేశము’ అనే సారము బలవత్తమో … క్షణములలో ఒక అవగాహనికి వచ్చి… అప్పుడు మరల బ్రహ్మదేవుని సమక్షానికి వచ్చారు.
శాపములు : ఓ ప్రజానాథా! బ్రహ్మదేవా! మేమే ఓడిపోయి మా ఓటమిని అంగీకరిస్తున్నాం. మేము లోన సారత్వం కలవారం కాము. ఈ వరాలే బలసమన్వితమై, వెనుక బలవత్తరమైన ఉద్దేశంతో కూడిన ప్రయత్నంచే సారభూతమై ఉన్నాయి.
హే మహాత్మా! వరరూపులం - శాపరూపలం అగు మేము సంవిత్ యొక్క సంకల్పరూపులమే కదా! సంవిత్ (బుద్ధి) చైతన్య రూపమే అయివున్నది. కనుక చైతన్యం - చైతన్య సంవిత్లకు వేరుగా మాకెట్టి రూపమూ లేదు.
Page:604
వరదుడు వరలబ్ధుడు… ఈ ఇద్దరూ ఒకే చైతన్య సంవిత్తు యొక్క రెండు ప్రదర్శనములే కదా! అట్టి సంవిత్తు యొక్క ‘స్ఫురణ’యే విజ్ఞాన రూపత్వము దాల్చుచున్నది.
వరము ప్రసాదించువాని యొక్క సంవిత్తు “నేను వరం ప్రసాదిస్తున్నాను” అనే రూపం కలిగి ఉన్నది. వరము స్వీకరించువాని యొక్క సంవిత్తు “నేను వరం పొందుచున్నాను” అనే రూపం కలిగి ఉంటోంది. అట్టి విజ్ఞాన రూపమే… తన యొక్క సుఖభోగ భావనాబలం చేత శరీరత్వమును నిర్మించుకొంటోంది. అట్టి శరీరత్వధారణా సంవిత్తు క్రమంగా దేహాకారంగాను, దేశ - కాలాది అనేక భ్రమలకు అర్హముగాను అగుచున్నది. అట్టి భ్రమ సంవిత్తు క్రమంగా భ్రమచే ఆయా భోగ్య పదార్థములను గాంచుచూ, అనుభవించుచూ, భుజించుచూ కాలబద్దం అవుతోంది.
ఆ 8 మంది అన్నదమ్ములు దృఢ సంకల్పముచే "మేము తపస్సు చేసి చక్రవర్తులం కావాలి” అని దృఢభావన ఆశ్రయించటం చేత క్రమంగా తపోఫల సంవిత్తు దినానుదినంగా దృఢత్వం పొందటం జరిగింది. ఆ వర కల్పనారూప చైతన్యం కాలాంతరంగా ఫలావస్థ వైపుగా పరిపుష్టి పొంది ఉన్నది. సశాస్త్రీయమైన తపోయత్నమే ఆ పరిపుష్టికి కారణం. అందుచేతనే… ఆ 8 మందిలో సప్త ద్వీప భూమండలమునకు చక్రవర్తిత్వము సార్థకత పొందింది. కనుకనే “వరములు మా కంటే అధికంగా సారత్వము కలిగి ఉన్నాయి”… అనే నిర్ణయానికి మేము వచ్చాం.
వరము కోసం శాస్త్రీయ ప్రయత్నం (వరార్ధి వరఫలం కోసం సుదీర్ఘంగా ప్రయత్నించి ఉండటం); వరము ప్రసాదించేవారు అది ప్రసాదించటం (వరప్రదాత వరదానమును సుదీర్ఘంగా అభ్యసించి ఉండటం)… రెండు చిరకాలాభ్యాసముచే ఫలవంతమవటానికి ఎంతో సారసహితమై ఉన్నాయి. ఆశయము పట్ల లక్ష్య శుద్ధి అత్యధికంగా కలిగి ఉన్నాయి.
ఏ సంవిత్తు చిరకాలము బాగుగా అభ్యసింపబడుచున్నదో … అదే సారవంతం. అదే దృఢత్వం పొందుతోంది. అదే అధికంగా ఫలవంతమగుచున్నది. హే జగద్గురూ! బ్రహ్మదేవా! శాపములగు మేము, వరములు, వరశాపములు ప్రసాదించేవారు, వర శాపములు పొందేవారు, మీరు… మనమంతా సంవిత్ స్వరూపములమే కదా!
ఈ దృశ్యజగత్తులో ప్రయత్నము - ప్రయోజనములకు సంబంధించిన భేదముండవచ్చుగాక! ఏమైతేనేం? వరప్రదాత, వరము, వరాలబ్ధుడు, శాపప్రదాత, శాపము, శాపగ్రస్తుడు… ఈ ఆరుగురు ఒకే సంవిత్తు యొక్క స్వరూపములే!
శుద్ధ సంవిత్లందు ఏది అధికంగా శుద్ధమై (అభ్యాసపూర్వకంగా) ఉంటోందో … అదియే తక్కిన సంవిత్తులకంటే అధికంగా ప్రబలమై ఉంటుంది. అశుద్ధ సంవిత్తులందు ఏది (అభ్యాస పూర్వకంగా) అధిక ప్రబలమై ఉంటుందో… అదియే తక్కిన అశుద్ధ సంవిత్తులను జయిస్తూ ఉంటుంది.
అట్లాగే కాలదృష్టితో ఏది జ్యేష్ఠమైతే (ఏది అధిక కాలం అధికంగా అభ్యసించటం జరిగితే)… అదియే తక్కిన వాటిని జయించటం న్యాయమే కదా! అల్పకాలం మాత్రమే అల్పమైన శ్రద్ధతో అభ్యసించింది, మరి, అధికాభ్యాసంతో కూడిన దానిని జయించి వేయటం న్యాయం ఎట్లా అవుతుంది?
Page:605
శుభ - అశుభ కర్మలు తత్పలములగు వర - - శాపములు ఒకదానితో మరొకటి “ప్రమాణము - అభ్యాసము”లకు సంబంధించి సామ్యత్వం ఉన్నప్పుడైతే… అప్పుడు పాలు-నీళ్ళు కలిసినట్లు ఆ శుభ-అశుభ కర్మలు కలిసిపోయి మిశ్రమ ఫలములిస్తాయి. ఎక్కడ శుభ - అశుభ కర్మలు ఒకదానితో మరొకటి సామ్యత్వం ఉండదో - - అప్పుడు ఆ రెండింటి ఫలములు సామ్యత్వం కలిగి ఉండవు. ఎచ్చటైతే ఏకకాలంలోనే వేరు వేరైన కర్మఫలములుగా వర శాపములు ఫలీకృతం అవుతాయో …అక్కడ ఆ జీవుడు ఒకే సమయంలో వేర్వేరు ఉపాధులతో వర-శాపముల ఫలమును పొందటం కూడా జరుగవలసి ఉంటోంది. ఎట్లా అంటే, … నగర రూపధారియగు చైతన్యము ఆయా ఫలములను సామూహికంగా ఆ నగర జనులతో కూడిన అనేక రూపములతో పొందటం లేదా! ఇదీ అంతే.
హే ప్రభూ! తమ వద్ద మేము నేర్చుకొన్నదే… తమకు అప్పజెప్పుచున్నాం. అంతేగాని…. మీకు క్రొత్తగా తెలియజేయగల వారం కాదు. తమ సంకల్పమే మా రూపం కదా! కాబట్టి మా దుష్టత్వ రూపమగు అపరాధం చేత అల్పసార రూపమగు మేము అధికసార రూపమగు ఈ వరదేవతలను నిరోధించ యత్నించినందుకు క్షమించండి. మీకు సాష్టాంగ దండ ప్రణామములు. ఇక మాకు సెలవు ఇప్పించండి.
ఇట్లా పలికి ఆ శాపములు సిగ్గుపడుతూ తమను తామే శపించుకుంటూ - తిమిర రోగం వలన ఆకాశంలో కనిపించే కేశములు (దృష్టిదోషం పోయినప్పుడు) మటుమాయయినట్లు - అప్పటికప్పుడే ఎటో వెళ్ళిపోతాయి.
కుందదంతుడు : ఓ రామచంద్రా! ఓ పండిత సభా-మన్యులారా! ఆ 8 మంది సోదరుల యొక్క (ఆ గౌర్యాశ్రమ వృద్ధ తాపసి చెప్పుచున్న) సప్త ద్వీప సమేత భూమికంతటికీ చక్రవర్తులు కావాలనే వరం ఫలీకరించే సమయంలో జరుగబోవు విశేషాలు మీకు చెప్పుచున్నాను కదా! ఇంకా ఆ వృద్ధతాపసి తన సంభాషణమును ఇట్లు కొనసాగించారు.
గౌర్యాశ్రమ వృద్ధ తాపసి : ఓ కుందదంతా! ఆ విధంగా శాపములు అంతర్ధానమైన తరువాత ఇప్పుడు ఇరువురు వర పురుషులు పరమాత్మయగు బ్రహ్మదేవుని సమక్షంలో తమకున్న భేదాభిప్రాయాలను ఉటంకిస్తూ నిలబడతారు.
1.ఎనిమిది మందికి విస్తార భూమండలానికి చక్రవర్తిత్వము ప్రసాదించు మొదటి వరదేవత. 2.వారి భార్యలకు “మీ భర్తలు మీ పడక గదులలోనే ఉంటారు” …అను రూపంలో ప్రసాదింపబడినట్టి రెండవ వరదేవత.
మొదటి దేవత సూర్య పురుష సంకల్ప నిర్మితము. రెండవ దేవత గౌరీ వర ప్రసాదరూప వరదేవత. గౌరీ వరప్రసాద దేవత అంతకు ముందు శాపములు నిలబడ్డ స్థానంలోకి వచ్చి నిలబడి బ్రహ్మదేవునితో ఇట్లా విన్నవించుకుంటారు.
Page:606
గౌరీ వరప్రసాద దేవత : హే దేవేశ్వరా! మేము ఆ 8 మంది భార్యల వ్రత పుణ్యఫలం చేత గౌరీదేవిచే సంకల్పించబడ్డాం. మా విధిని అనుసరించి ఆ 8 మంది జీవ సంవిత్తులను ఆ గృహం నుండి బయటకు వెళ్ళనీయకుండా చేస్తాం. ఇక “ఆ గృహంలోంచి బయల్వెడలకుండా సప్త ద్వీప సమేత సామ్రాజ్యానికి ఎట్లా ఆధిపత్యం వహిస్తారు?”… అనే ప్రశ్నకు మాకు సమాధానం తెలియదు.
ఈ సూర్య పురుష వరదేవత ఎట్లా ఫలమును ప్రసాదిస్తుందో… అది మాకు సంబంధించిన విషయం కాదు కదా! ఈ సూర్య దత్త వరదేవతేమో ఆ 8 మంది జీవులను సప్తద్వీపేశ్వరులుగా, యుద్ధంలో దిగ్విజయ యుక్తులుగా గావించటానికి ఆ గృహం నుండి తీసుకుని వెళ్ళే ప్రయత్నంలో ఉంది. మేమేమో ఆ గృహం నుండి వారు బయటకు వెళ్ళకుండా నిరోధిస్తున్నాం.
ఓ బ్రహ్మదేవా! జగద్గురూ! గౌరీ వరరూపులగు మాకు సూర్యదేవ వరరూపియగు ఈ వరదేవతతో విరోధము అనివార్యమౌతోంది. ఇప్పుడు ఏది శ్రేయమో… అది ఆజ్ఞాపించండి. శ్రీబ్రహ్మదేవుడు : ఓ సప్త ద్వీపేశ్వర ప్రదాతయగు వరదేవతలారా! మరియూ …ఆ గృహము నుండి బహిర్గతం కాకుండా నిరోధించే వరదేవతలారా! మీరు ఒకరితో ఒకరు నిరోధించి తద్వారా విరోధం పొందవలసినది ఇక్కడ ఏమీ లేదు. మీరు పరస్పరం అపేక్షత్వమే పొందండి. ఒకరి కార్యమును మరొకరు దృష్టిలో ఉంచుకునే ప్రవర్తించండి. మీ ఇరువురి ప్రయత్నము ఇప్పుడు నెరవేరుతూనే ఉన్నది. ఎందుకంటే… ఆ 8 మంది సోదరులు మరణించిన మరుక్షణం నుండి చిరకాలంగా ఆ గృహంలో ఉండియే సప్తద్వీపేశ్వరత్వం వహించియే ఉన్నారు.
ఉభయ వరదేవతలు : హే మహాత్మా! బ్రహ్మదేవా! మీరు చెప్పేది ఎట్లా సాధ్యం? వారి 8 భూమండలాలు, ఆయా సప్త ద్వీపాలు, ఆ విధమైన ఐశ్వర్యములు ఒకే భూ మండలంలో ఎట్లా ఉంటాయి? ఇక అవన్నీ ఒకే గృహంలో ఉండటం అసాధ్యమని వేరే చెప్పక్కర్లేదు కదా! ఒక కలువ పువ్వులో 100 ఏనుగులు సంచరిస్తూ, నృత్యం చేస్తూ ఉంటాయా ఎక్కడన్నా?
హే పరంధామా! మేము ఒక్క భూమండలం గురించే విని ఉన్నాం. చూస్తున్నాం. అందులో ఒకేసారి 8 మంది సప్తద్వీపేశ్వరుల ఆధిపత్యం ఎట్లా ఒకనగూడుతుంది. అదీ వారంతా ఒకే గృహంలో ఉండి ఉండగానా?
శ్రీ బ్రహ్మదేవుడు : ఓ సూర్యదేవత సంకల్పిత - గౌరీ సంకల్పిత వరదేవతలారా! ఇందులో ఆశ్చర్యం ఏమున్నది? ఇందులోని విశేషం ఏమిటో మీకు చెపుతాను… వినండి! మీతోను… మాతోను గూడియున్నట్టి ఈ సృష్టి - సమష్టి సహిత సమస్త జగత్తు వాస్తవానికి చిదాకాశమాత్రమే కదా! ఇదంతా చైతన్య పరమాణువు నందు స్థితినొందియుండగా… ఇది అద్దానియందు స్వప్నంలో దృశ్యంలాగా అనుభూతమౌతోంది. ఒక్క చైతన్య పరమాణువులో అసంఖ్యాక బ్రహ్మాండములు ఏర్పడి ఉంటూ ఉండగా, కించిత్ స్వప్న స్ఫురణలో సువిశాల స్పప్న జగత్ దృశ్యం సదృశ్యమగు చుండగా …వారి గృహంలో ఆ 8 మందికి వేరువేరైన 8 భూమండలాలు అనుభూతం కావటంలో ఆశ్చర్యమేమున్నది? వారు మరణించిన మరుక్షణమే… “సచ్చిదానంద ఘనాకారము - పదార్థ
Page:607
శూన్యము” అయినట్టి చైతన్యమే… యథారీతి స్థితి కలిగి ఉన్న జగత్తుగా వారికి భాసించనారంభిం చింది. ఏ జీవుడైనా సరే, ఏదేది ఎట్లెట్లు పొందుచున్నాడో… అదంతా తన స్వయంకృత స్ఫురణ యొక్క చమత్కారంచేత స్వస్వరూపమగు చిదాకాశమునందే, చిదాకాశం పట్ల పొందటమే జరుగుతోందని ఒకప్పుడు మీకు బోధించియే ఉన్నాను కదా! ఇక ప్రస్తుత క్రమంలో గల ఆశ్చర్యం ఏమున్నది? వారు మరణించి, వారి వారి పడక గదులలో స్వస్వరూప చిదాకాశమునందే - వేరు వేరుగా భూమండలమును దర్శించి, వాటికి మహా నాయకత్వం వహిస్తున్నారు.
ఓ వరస్వరూపదేవతలారా! ఏదైతే ఈ కనబడే జగత్తుగా… మీకుగాని, నాకుగాని, మరెవరికైనా గాని… భాసిస్తోందో… అది చైతన్య తత్త్వమే అయివున్నది. వాస్తవానికి ఈ జగత్తు మూర్తము(సాకారం) కాదు. ఆ గృహంగాని, ఆ 8 మంది ఇప్పుడు పొందుచున్న భూమండలం గాని సాకారం కాదు. సర్వమూ నిరాకారమే! ఆకాశం శూన్యరూపంగా భాసిస్తున్నట్లు చిన్మాత్రమే జగత్ రూపంగా భాసిస్తోంది. గృహము-భూమండలము నిరాకారమగు చిదాకాశ స్వరూపములే అయినప్పుడు ఒకదానిలో మరొకటి అమరి ఉండటం - - అమరిక ఉండకపోవటం అనే ప్రసక్తి ఎక్కడిది? ప్రతి జీవుడు ప్రతిరోజు చూస్తున్న స్వప్నములలో ఏది ఎందులో ఇమడదు? గదిలో నిదురించే స్వప్న ద్రష్ట స్వప్నంలో మహానగరములు చుట్టి వస్తున్నాడు కదా!
ఓ వరదేవతలారా! మీరు ఆధిభౌతిక భ్రాంతిని త్యజించండి. తత్త్వ విచారణచే ఈ ఈ భౌతిక రూపములకు సంబంధించినదై ఉన్న సూక్ష్మ (అతివాహిక) దేహములను గమనించండి. ఆ సూక్ష్మ దేహములకు కూడా ఆధారమైయున్న చిదాకాశ స్వరూపమును సంస్మరించండి. ఇక మీరు వెళ్ళి మీ మీ విధ్యుక్త ధర్మాలను నెరవేర్చెదరు గాక!
ఓ కుందదంతా! ఆ ప్రకారంగా సర్వ వరదుడగు బ్రహ్మదేవుడు “అంతా సర్వదా చిదాకాశమే! చిదాకాశం యొక్క స్ఫురణ విశేషమే ఈ బ్రహ్మాండములు”… అని విశదీకరించి చెప్పినదంతా ఆ
ఉభయ వరదేవతలు శ్రద్ధగా వింటారు. అప్పటికప్పుడే తత్త్వవిచారణచే ఆధిభౌతిక భ్రాంతిని త్యజించివేస్తారు. సూక్ష్మ దేహధారులై పరమాత్మయగు బ్రహ్మదేవునికి ప్రణామం చేసి… ఆయా 8 మంది సోదరుల మనోకల్పితములైనట్టి సప్తద్వీప మండలములలో ప్రవేశించి తమ తమ వరప్రసాద సంకల్పిత ఫలములను ప్రసాదించ నారంభిస్తారు.
ఇక ఆ 8 మంది సోదరులు పరస్పరం తమ సప్తద్వీపేశ్వరత్వం (ఒకరిది మరొకరికి) తెలియకయే ఉండగలరు. ఎందుచేతనంటే తత్త్వజ్ఞానం లేకపోవటం చేతనే! ఒకరి స్వప్నంలోని విశేషాలు ఆ ప్రక్కనే నిదురిస్తూ కలలుగనే మరొకరికి కనబడవు కదా! అయితే, వారి వారి స్వస్పందనరూప భూమండలములో మాత్రం అన్యోన్య బంధువులతో అన్యోన్యహిత తత్పరులై మనుగడ సాగించగలరు.
కుందదంతుడు : ఓ రామచంద్రా! ఆ గౌర్య వన వృద్ధ తాపసి ఆ విధంగా ఆ 8 మంది సోదరుల
Page:608
భవిష్యత్ కథనములను నా “అసమంజసము కదా!” అనే సందేహం నివృత్తింపజేయటానికి నాకు చెప్పారు. అప్పుడు నేను ఆయనతో ఇట్లా అన్నాను.
నేను (కుందదంతుడు) : స్వామీ! మీరు చెప్పినదంతా విన్న తరువాత కొంత వరకు నా సందేహాలు తొలగాయి. అయితే, సాంసారిక దృష్టి నాకు మీ వలె ఎంతగానో తొలగవలసి ఉన్నది కాబోలు. హే మహాత్మా! ఆ వర - శాప దేవతలు బ్రహ్మలోకం నుండి బయల్వెడలారు కదా! వరదేవతలు ఆయా వరములను సిద్ధింపజేయటానికి వెళ్ళినప్పుడు ఆ 8 మంది బ్రాహ్మణోత్తముల సంవిత్ (జీవ) చైతన్యములు ఏమేమి పొందుతూ ఉంటాయో… అది కూడా చెప్పండి.
గౌర్యవన వృద్ధ తాపసి : సరే! అది కూడా, ఒకానొక సమయానికి ఏదిట్లా ఉండబోవుచున్నదో… చెపుతాను విను.
1వ సోదరుడు : యౌవనావస్థ యందు ఒప్పుచు ఉజ్జయినీ మహాపట్టణంలో విస్తారమైన రాజ్యం పరిపాలిస్తూ సుఖవంతుడై ఉంటాడు.
2వ సోదరుడు : శాకద్వీపవాసి “నాగలోకం జయించాలి” అనే కోర్కెతో సర్వ దిక్కులలో విజయం పొందటానికై యత్నశీలుడై సముద్ర గర్భంలో సంచరిస్తూ ఉంటాడు.
3వ సోదరుడు : కుశ ద్వీప రాజధానిలో మనోవ్యధారహితుడై సుఖంగా సమస్త ప్రజలతో కూడుకొని ఉండి ఉంటాడు. అప్పటికే దిగ్విజయుడై రాజపత్ని కౌగిలిలో సుఖంగా నిదురిస్తూంటాడు.
4వ సోదరుడు : శాల్మలి ద్వీప మహా పర్వత శిఖరంపై గల నగరంలో గల సరోవరంలో విద్యాధర స్త్రీలతో కూడి జలక్రీడాతత్పరుడై ఉంటాడు.
5వ సోదరుడు : దండయాత్రలు నిర్వహించి సప్త ద్వీపాల నుండి కొనిరాబడిన మహాసంపద లచే క్రౌంచ ద్వీపంలో 8 రోజులు అశ్వమేధయాగం నిర్వర్తించే సంరంభంలో ప్రవృత్తుడై ఉంటాడు. 6వ సోదరుడు : ద్వీపాంతరంలో ఒక రాజుతో యుద్ధం చేసే వ్యవహారంలో ప్రయత్నశీలుడై
ఉంటాడు.
7వ సోదరుడు : గోమేధ ద్వీప నివాసి అయి, గొప్ప సైన్యం కలిగి ఉండి, పుష్కర ద్వీపరాజును జయించి, అక్కడి రాజకుమారిని కామదృష్టిచే బంధించి తన వెంట రథంలో తీసుకునిపోతూంటాడు.
8వ సోదరుడు : పుష్కరీ ద్వీపవాసి మిత్రుడగు లోకాలోక పర్వత ప్రదేశపు రాజదూతతో భూమిలోగల ధన నిక్షేపములను గుర్తించటానికి బయల్వెడలుతూ ఉంటాడు.
ఓ కుందదంతా! ఈ ప్రకారంగా వారిలో ప్రతి ఒక్క సోదరుడు ఆ గృహాకాశంలోనే తమ బుద్ధికి యోగ్యం అయినట్టి సప్త ద్వీప ప్రభుత్వాధిపత్యం పొందే మార్గంలో ఉంటారు. అప్పుడు ఆ వరదేవతలు బ్రహ్మలోకం నుండి వచ్చినవారై తమ తమ సూక్ష్మ దేహాలను కూడా త్యజించి ఆ 8 మంది సోదరుల జవ సంవిత్తులతో ఏకత్వం పొందటం జరుగుతుంది. ఆ తరువాత ఆ 8 మంది సోదరులు తమ అభిమతములను పొందినవారై… సంతుష్టులై… సప్త ద్వీపేశ్వరులై చిరకాలం వెలయగలరు.
Page:609
చూచావా కుందదంతా! దీనినిబట్టి మనం గ్రహించవలసినది ఏమిటి? సాక్షి చైతన్యము యొక్క అభ్యంతరమున దృఢ నిశ్చయ రూపంగా ఏది స్ఫురిస్తుందో… అదియే బాహ్యానికి ప్రదర్శిత మౌతూ ఉంటుంది. కనుక, ఎవ్వడు ఎద్దానిని కోరుకుంటాడో - అందుకు ఉచితమైనట్టి తపస్సు, జపము, ధ్యానము, తదితర యత్నములు, కర్మలు కొనసాగిస్తే - ఈ జగత్తులో పొందరానిది ఏముంది?
కుందదంతుడు : ఓ రామాది సభిక శ్రేష్ఠులారా! ఆ విధంగా కదంబ వృక్షము క్రింద ఉన్న ఆ వృద్ధ తాపసుడు ఆయా భూత-భవిష్యత్ విశేషాలన్నీ చెప్పగానే మరల నా సందేహం తీరక నేను ఇట్లా ప్రశ్నించాను.
నేను (కుందదంతుడు) : స్వామీ! ఇంకా నాకు కొంత సందేహంగానే ఉన్నది. "ఒక్కొక్కటి 50 కోట్ల యోజనములు విస్తీర్ణంగల సప్తద్వీపములతో కూడిన 8 భూములు అల్ప విస్తీర్ణంగల ఒక గృహంలో ఎట్లా ఉండగలుగుతాయి?”… అనే ప్రశ్నకు నా బుద్ధికి సమాధానం కుదరటం లేదు. కదంబవన వృద్ధ తాపసి : ఓ సాధూ! మనందరి వాస్తవ స్వస్వరూపమే అయివున్న సర్వవ్యాపక చైతన్యము వాస్తవానికి ప్రపంచ శూన్యమైనది. అట్లా అయివుండి కూడా… తాను ఎచటెచట ఉనికిని అనుభూతపరచుకొంటే అచటచట స్వయంగా తనయందు తనను… త్రైలోక్య రూపంగానో, సుషుప్తి రూపంగానో, తురీయ రూపంగానో… సందర్శనము, అనుభవము కలిగి ఉంటుంది.
పరమార్థమున అయ్యది తన శుద్ధ తత్త్వరూపమును ఏమాత్రం త్యజించటమే లేదు. తరంగ ఆకారంగా అగుచున్న జలం తాను జలత్వం త్యజిస్తోందా? కోల్పోతోందా? లేదే! తరంగత్వం జలం యొక్క స్వభావమే అయివున్నది. నిర్మల చైతన్యత్వం జీవుని వాస్తవ స్వభావమే అయి ఉన్నది. నేను (కుందదంతుడు) : మహాత్మా! "ఏకం, నిర్మలం, శాంతం, మంగళకరం, పరమకారణం అయినట్టి పరబ్రహ్మము నందు… అట్టి తత్త్వమునకు - స్వభావమునకు విరుద్ధ స్వభావంగా ఈ ఈ నానా రూపత్వ స్థితి ఎట్లా కలుగుచున్నది?
కదంబవన వృద్ధ తాపసి : బిడ్డా! ఈ ఈ నానారూపత్వం వాస్తవం కాదు. ఇది భ్రాంతి మాత్రమే!
సర్వం శాంతం చిదాకాశం నానాస్తీ, హ న కించన I
దృశ్యమానమపి స్ఫారమావర్తాత్మా యథా అంబసి ||
సమస్తము శాంతమగు చిదాకాశమే! ఈ జగత్తు అనేక వస్తు - విశేషాదులతో సువిశాలమై ఉండవచ్చు గాక! ఇదంతా సర్వదా సత్ - చిత్ - ఆనందమే! ఏ తరంగం మొదలే జలము అయి ఉండలేదు? తరంగము యొక్క ఆకారమువలె అసత్యములైనప్పటికీ సత్యములవలె కనిపించే ఈ జగత్ పదార్థములన్నీ కూడా చిదాకాశము యొక్క నిజ నిర్మల యథార్థ స్వరూపమే! స్వప్నంలో కనిపించేదంతా స్వప్నద్రష్ట సంవిత్ స్వరూపమే అయినట్లు… జాగ్రత్ కూడా అట్టిదే!
Page:610
అయితే సర్వస్వరూపమగు పరమాత్మ వాస్తవ స్వరూపంలో సృష్ట్యాది స్వభావములూ లేవు. పదార్థములూ లేవు. ఇక సృష్ట్యాది యందు బ్రహ్మదేవునిచే ఏది ఎట్లు స్ఫురిస్తోందో… అది అట్లే స్థితినొందియున్నది. చిదాకాశమగు పరబ్రహ్మము యొక్క స్వరూపం… ప్రకాశాత్మకమూ కాదు, అప్రకాశాత్మకమూ కాదు. పదార్థరూపం కాదు. అచిద్రూపం కాదు. అది కేవలమూ శుద్ధ చిద్రూపములోనే స్థితినొందియున్నది. (చిద్రూపము = ఎరుగుటకు ముందే ఏర్పడియున్న నిర్మలమైన ‘ఎరుక’ స్వరూపం)
ఓ సాధూ! కుందదంతుడా! ఒకే స్వప్న చైతన్యము స్వప్న సైన్యంలో లక్షలాది సైనికుల రూపంగా అగుచున్నది కదా! అయినప్పటికీ ఆ చైతన్యము నిత్యనిర్మలం, సర్వమునకు పరము, అప్రమేయము కదా! ఒకే జాగ్రత్ చైతన్యము జాగ్రత్లో అనేక పదార్థముల రూపంలో అగుపిస్తూ కూడా తాను నిత్యనిర్మలమై ఉన్నది.
చిదాకాశము స్వతహాగా నిర్మల స్వరూపి అయి కూడా ఏఏ రూపములుగా స్ఫురిస్తోందో… ఆ స్ఫురణాకారమును స్వతహాగా తానే జగత్ రూపంగా అనుభవిస్తోంది.
స్వప్నంలో అగ్ని కనబడిందనుకో! అక్కడ వాస్తవానికి అగ్ని ఉన్నదా? స్వప్న చైతన్యమే ఉష్ణరూపంగా భాసిస్తోంది. కదా! స్వప్నంలో స్తంభము కనిపించిందనుకో! అది స్వప్నద్రష్ట బుద్ధి రూపమేగాని… వాస్తవమైన స్తంభం కాదు కదా! అట్లాగే జాగ్రత్లో కూడా ‘సంవిన్మాత్రము’ అగు చిదాకాశమున నిజస్వరూపమే నానారూపత్వంగాను, పదార్థాకారంగాను భాసిస్తోంది. చైతన్యంకంటే భిన్నమైనదేదీ ఎక్కడా లేదు.
ఆదిసృష్టియందు ఈ పదార్థములన్నిటి రూపము, నిర్మల చిద్రూపమే! అప్పుడు చిదాకాశము ఏ పదార్థమును ఏ అర్థంతో ఎరుగుట జరిగియున్నదో… అది నేటి వరకు ఆ రీతిగానే వర్తిస్తోంది. ఓ కుందదంతా! వృక్షమే పుష్పమునందు, ఆకుల యందు, పండ్లయందు, కాండమునందు వ్యాపించి ఉన్నట్లే… ఈ జగత్తంతా సర్వత్రా సర్వరూపమగు పరబ్రహ్మమే అయివున్నది. చిద్రూప మహా సముద్రంలో సృష్టి పరంపరలు జల తరగములవంటివి. తరంగాలన్నీ జలమే కదా! జలానికి వేరుగా తరంగాలు ఎక్కడున్నాయి? పరమార్థ మహాకాశమున ఈ సృష్టి ప్రతిభాసలు శూన్యరూపములే! ‘తత్త్వబోధ’ అనే పవిత్ర పాఠ్యాంశము ఎరిగితే… 1. సృష్టి, 2. పరమార్థ చిద్రూపము (చిత్ చైతన్యం) …ఈ రెండూ పర్యాయపదములే! ఇక అజ్ఞానము చేత… ఏది ద్వైతముగా (సృష్టి వేరు - ఆత్మ వేరు అను రూపంగా) తెలియబడుచున్నదో… అదంతా కూడా దుఃఖము కొరకే అగుచున్నది.
పరమార్థో - జగచ్ఛేదమ్ ’ఏకమ్’ ఇత్యేవ నిశ్చయః అధ్యాత్మ శాస్త్ర బోధేన భావేత్సైషా హి ముక్తతా!
అధ్యాత్మ శాస్త్ర జ్ఞానం చేత…“పరమార్థము జగత్తు ఒక్కటే” అనే నిశ్చయం తప్పక కలుగుతోంది. అట్టి అవగాహనయే ముక్తి. అదే అపరోక్షానుభూతి.
సంకల్పస్య వపుర్బహ్మ, సంకల్పకచిదాకృతేః
తదేవ జగతో రూపం, తస్మాత్ బ్రహ్మాత్మకమ్ జగత్ II
Page:611
సంకల్పించువాడు బ్రహ్మమే. సంకల్పము కూడా బ్రహ్మమే! ఆ సంకల్పముచే అనుభూతమయ్యే జగత్తు కూడా బ్రహ్మమే! కనుక ఈ జగత్తు బ్రహ్మాత్మకమే సుమా! ఇదంతా బ్రహ్మోత్సవం! నీ ఆలోచనయే ఈ జగత్తు రూపం. నీ ఆలోచన నీ రూపమే కదా! కనుక, ఈ జగత్తు నీ రూపమే!
యతో వాచో నివర్తన్త, న నివర్తన్త ఏవవా
విధయః ప్రతిషేధాశ్చ భావాభావదృశస్తథా ॥
ఎద్దానిని పొందజాలక “వాక్కులు, విధి నిషేధాలు, భావాభావ దృష్టులు" ఇవన్నీ వెనుకకు
మరలుచున్నాయో… కాని సర్వమునకు అధిష్ఠానమే అయి ఉండటం చేత ఆ వాక్కులు - విధినిషేధాలు
- - భావాభావ దృష్టులు అద్దాని నుండి వెనుకకు మరలకయే ఉన్నాయో… అదియే బ్రహ్మము.
అమౌనమౌనం జీవాత్మ యత్ పాషాణవత్ ఆసనమ్
యత్సదేవా సదాభాసం తద్భహ్మాభిధముచ్యతే ॥
మౌన - అమౌనముల మధ్యగల జీవస్వరూపము యొక్క చిదన స్థితియే బ్రహ్మము. సద్రూపమైనప్పటికీ ఈ శరీరము మొదలైన అసద్రూపముల ‘తాదాత్మ్యాధ్యాస’ చే అసత్తు వలె భాసించుచున్నట్టిది.
ఓ సాధూ! సర్వరూపము ఏకము - మహాచిదనము - నిర్వికారము అయినట్టి బ్రహ్మమునందు ఈ భావాభావ రూపపదార్థముల సృష్టి ఏమి? ప్రళయమేమి?… ఒకే ‘నిద్ర’లో విచిత్రంగా స్వప్న సుషుప్తులు భాసిస్తున్నట్లు ఇక్కడ జాగ్రత్ - స్వప్నాలు నిరంతరం భాసిస్తున్నాయి కదా! అట్లాగే చిదాకాశ సత్తయందు ఈ సృష్టి - ప్రళయములు విచిత్రంగా భాసిస్తున్నాయి.
‘జగత్తు’ అంటే ఏమిటి?… ప్రాణుల అంతఃకరణమున అభివ్యక్తమైన ప్రమాత అనే చిత్సారం ఈ నేత్రాదుల ద్వారా బాహ్యమునకు బయల్వెడలి వస్తు ఆకారావృత్తులతో ఏకమై “ద్రష్ట - దర్శన - దృశ్యములు” అనే త్రిపుటిలో ‘జగత్తు’ అనే కార్యము సిద్ధింపజేసుకుంటోంది. ఈ దృశ్యములోని సర్వ పదార్థములు తమ అధిష్ఠానమగు చైతన్యమునకు అధీనమై అట్టి సత్తా స్ఫూర్తితో సదా చిత్సారములే అయి ఉన్నాయి.
ద్రష్ట, దృశ్యము… ఈ రెండూ చిత్ స్వరూపములే! రెండింటిలో ఒకే చిన్మాత్రము వెలయుచు …ఒక దానిచే రెండవది ఉనికి కలిగి ఉంటున్నాయి. అట్టి చిన్మాత్రము యొక్క ద్రష్ట - దృశ్య ఏకత్వము సృష్ట్యాది యందు ఎట్లు వెలయుచున్నదో… ఇప్పుడు అట్లే వెలయుచున్నది. సమస్త పదార్థ శక్తులూ చిన్మాత్రమునందే వెలయుచు, చిన్మాత్రమును అనుసరించే స్థితి కలిగి ఉంటున్నాయి.
అవి నిశ్చలము - అమనస్క రూపము అయి ప్రకాశిస్తూ చైతన్యము యొక్క స్ఫురణచేతనే స్ఫురిస్తున్నాయి.
ఓ కుందదంతా! బ్రహ్మ - విష్ణు - రుద్రాది సహితంగా ఈ జగత్తు లేనిదే అయి ఉండి కూడా స్వప్నం వలె కనిపించుచు అనుభూతం అవుతోంది. ‘చిద్రూపము’ అనే జలంలో "హర్షము,
Page:612
క్రోధము, విషాదము, ఆశ, నిరాశ, ఆశయము, వాంఛ, కామము”… మొదలైన విచిత్ర స్పందరూప తరంగాలు స్వప్నంవలె కనిపిస్తున్నాయి.
ఆహా! ఏమని చెప్పాలి? అజ్ఞాన చిత్స్వభావనిష్ఠ రూపమగు విక్షేప శక్తిచే ఈ జగత్సమూహములు చమత్కారంగా స్ఫురిస్తున్నాయి. ఇందు సత్వ - రజ - తమో గుణములు, జనన - మరణములు అనే భ్రమతరంగ విన్యాసములు సత్యమును మరుగు పరచి… ఎంతటి భేదమును కలిగిస్తున్నాయో!
తిమిరరోగ యుక్తమైన దృష్టికి ఆకాశంలో ఏవో వెంట్రుకలు వ్రేలాడుచున్నట్లు కనిపిస్తాయి. అట్లాగే…. అజ్ఞానావృత చైతన్యదృష్టికి నిజ చిదాకాశమున జగత్య్రాంతి భాసిస్తోంది. "ఓ మిత్రమా! కుందదంతా! ఈ జగత్తు మొదలే లేదు. కానీ… సంకల్పం ఉన్నంత వరకు ఆ సంకల్పానుసారంగా జగత్తు ఉంటూనే ఉంటుంది.
యావత్ సంకల్పితం తావత్, యథా సంకల్పితం తథా | యథా సంకల్ప నగరం కచతీదం జగత్తథా ||
సంకల్పం ఉన్నంతవరకు సంకల్పంలో దృశ్యం కనిపిస్తూనే ఉంటుంది కదా! ఎంతవరకు సంకల్పించబడుతుందో… అంతవరకు సంకల్ప నగరంలాగా జగత్తు స్ఫురిస్తూనే ఉంటుంది. ఇది అసద్రూపమే అయినప్పటికీ… సంకల్పమును అనుసరించే సత్యమువలె అనుభవము వర్ధిల్లుతోంది.
అనగా, అనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు… అనే కథలో “ఎందుకు ఏడుగురు కొడుకులు ఉన్నారు? ఆరుగురో ఎనిమిది మందో ఉండవచ్చుగా?” అని ప్రశ్నిస్తే? “అది అట్లా సంకల్పించబడింది కాబట్టి" - అనేగా సమాధానం! ఈ దృశ్యం అట్టిదే.
ఇక వస్తు ధర్మములంటావా? బ్రహ్మదేవుడు తన సంకల్పములచే నియత పదార్థములకు ప్రసాదించియున్న ఆ “సంకల్పరూప నియతి” యే ఇప్పుడూ కొనసాగుతోంది. ముందు ముందు కూడా అదియే కొనసాగబోతోంది. ఆ ’నియతి’ని అనుసరించే ఈ స్థావర జంగమాది ప్రాణి సమూహమంతా ఈ ఈ నియతి రూపస్థితిని పొందియున్నాయి.
అట్టి నియతిని అనుసరించే… జంగమ ప్రాణి జంగమ ప్రాణి నుండి, స్థావరము స్థావరము నుండి ఉత్పన్నమౌతున్నాయి. జలం పల్లమునకు, అగ్ని ఊర్ధ్వమునకు చనుచున్నాయి! ఈ శరీరములు అనే యంత్రములు నడుస్తున్నాయ్! జ్యోతిర్మయములగు సూర్యగోళములు, నక్షత్రములు అనునిత్యంగా తపిస్తున్నాయి! వాయువు నిత్యం గమనశీలమై ఉన్నది! పర్వతాదులు స్థిరంగా ఉన్నాయి! కాలచక్రం దక్షిణాయన-ఉత్తరాయణములు ప్రదర్శిస్తూ ఉన్నాయి. వర్షఋతువులో వర్షం కురుస్తోంది. కాలము రాత్రి-పగలు-నెలలు-సంవత్సరాలు-యుగములు అనే చక్రరూపంలో తిరుగుతోంది. భూమి ద్వీపభేదములచే మధ్యమధ్యలో సముద్రాలు పర్వతాలు కలిగియున్నది! పదార్థములు ఉత్పత్తి, వృద్ధి, నాశనము, గ్రహణము, త్యాగము మొదలైన స్వభావములు కలిగియున్నాయి! ఇదంతా బ్రహ్మదేవుని నియతియే! ఇట్టి బ్రహ్మదేవుడు చిదాకాశ స్వరూపుడే! కనుక ఇదంతా చిదాకాశ స్వరూపమే!
Page:613
నేను (కుందదంతుడు) : స్వామీ! గురుదేవా! ఇప్పుడొక సందేహం తమకు విన్నవించుకొని, మీ అమృత వచనములచే సంసార రోగము నుండి ఉపశాంతి పొందుతాను.
ఏ జీవుని విషయంలోనైనా పూర్వము అనుభవించినవే స్మరణకు వస్తూ ఉంటాయి కదా! ఇక నా వంటి సామాన్య జనుల వ్యవహారాలన్నీ బ్రహ్మదేవుని సంకల్ప రూపనియతి చేతనే వ్యవస్థితమై ఉన్నాయి. అయితే సృష్ట్యారంభంలో ఈ సృష్టికి పూర్వానుభవ సంస్కారాలే కారణమయి ఉంటున్నాయని, పూర్వానుభవ జన్యమైన సంస్కారాలు తప్పితే వేరే కారణం ఏదీ ఈ సృష్టికి ఉండదని నాకు అనిపిస్తోంది. అట్టి ఆదిసృష్టి యందు బ్రహ్మదేవునికి సంస్కారాలు ఎట్లా సిద్ధించాయి? పూర్వ జగత్ అనుభవాలు లేకపోతే… బ్రహ్మదేవునికి ఈ జగత్తు ఎట్లా భాసించ గలుగుతుంది?
శ్రీ కదంబవన తాపసి : ఈ జగత్ సృష్టి సిద్దించటానికి పూర్వ సంస్కారాలు - పూర్వ జ్ఞాపకాలు అవసరమని నీవు ఎందుకనుకుంటున్నావో నాకు అర్థం కావటం లేదు. స్వప్నంలో ఒక్కసారిగా అనేక విశేషాలు ముందుగా అనుకోకుండానే అనుభూతమవటం జరుగుతోంది కదా! వాటిలో కొన్ని పూర్వానుభవాలకు సంబంధం ఉండవచ్చు. ఉండకపోవచ్చు కూడా కదా! కనుక ఓ కుందదంతా! బ్రహ్మదేవుడు స్మృతి - - సంస్కారాదులు - జ్ఞాపకములు మొదలైనవాటి ఆవశ్యకత లేకయే, అప్పటికప్పుడు దివ్యజ్ఞానముచే ఒక్క క్షణంలో అనాగతమైన ఈ సమస్త జగత్తును దర్శించుచున్నారు. ఇదంతా అపూర్వంగానే కనిపిస్తోంది. తత్ఫలితంగా చైతన్య వివర్తరూపమే అయివున్న సంకల్పిత దృష్టి ప్రవర్తించనారంభిస్తోంది. మరల అచ్చోటే అభ్యాసవశంగా “ఇదంతా పూర్వం నాకు తెలిసినదే! నేను చూచినదే”… అని ఈ విధంగా స్మృతియొక్క అధ్యాసకూడా అఆతనికి సంభవిస్తోంది.
చిదాకాశము స్వయంగా చిద్రూపం కూడా కదా! అందుచేత ఈ జగత్తు చిదాకాశముచే సంకల్ప నగర రూపంగా, చిదాకాశమునందే దర్శించబడుతోంది. ఒకప్పుడు భాసించుచున్న ఈ జగత్తు మరొకప్పుడు భాసించటం లేదు. ఏ జగత్తు నీకిప్పుడు కనబడుతోందో… అది నీకు గాఢ నిద్రా సమయంలో అగుపించకపోవటమే ఇందుకు దృష్టాంతం. ఈ విధంగా ఈ జగత్తు ఒకప్పుడు భాసించి… మరొకప్పుడు భాసించకయే ఉంటోంది కనుక… ఇది సత్తు కాదు. అసత్తు కాదు.
బిడ్డా! స్మరణము అనేది లేకుండానే… ఈ జీవునకు చైతన్య ప్రభావం చేత స్వప్నంలోను - సంకల్పములందు కల్పనామాత్రమైన అనుభవాలు కలుగుచున్నాయి కదా! ఇక శుద్ధ చిదాకాశమునకు సంకల్ప మాత్రముచే జగద్రూపం స్ఫురించడంలో నాకేమీ ఆశ్చర్యం అనిపించటం లేదు. జ్ఞాపకములకు వెనుకగా స్వభావం ఉంటోంది. స్వభావమునకు వెనుకగా ’చిదాత్మ’యే వేంచేసి ఉన్నది.
నేను (కుందదంతుడు) : ఈ జగత్తు ప్రారబ్ధ వేగము చేతనే ప్రవర్తిస్తోంది. ప్రవాహ పతితమైన మార్గంలో ఈ జనులు చనుచున్నారని కొన్ని శాస్త్రములు శాస్త్రీకరిస్తున్నాయి కదా!
శ్రీ కదంబవన వృద్ధతాపసి : “ఈ జగత్తు సత్యమే” అని భావన కలిగి ఉండటమే సంసారము. అట్టి వారికి ప్రారబ్ధ - ఆగామి - సంచిత కర్మల గురించి బోధించవచ్చుగాక! తత్త్వజ్ఞులు జగత్తే స్వప్న తుల్యంగా గమనిస్తున్నారు. అప్పుడు ప్రారబ్ధ - ఆగామి - సంచిత కర్మలు కూడా స్వప్నతుల్యమే
Page:614
కదా! అయితే ‘నియతి’ అనునది తత్త్వజ్ఞులపట్ల అయినా, అజ్ఞులపట్ల అయినా ఒకే రీతిగా ప్రవర్తిస్తోంది. ఈ జగత్తులో ఆత్మజ్ఞానమునకు ప్రయత్నించని జనులు జగత్తును చూస్తూ హర్ష, క్రోధ, సుఖ, దుః ఖాది భావాలు పొందుచున్నారు. ఇక తత్త్వజ్ఞులో?… వారు గుణదోషాల అస్మరణ స్థితిని ప్రజ్ఞతో అభ్యాసవశంగా సముపార్జించుకుంటున్నారు. ఇక వారిపట్ల ప్రారబ్ధ కర్మలు ఏమగుచున్నాయంటావా? వారు కుమ్మరివాని చక్రంలాగా ప్రారబ్ధ వేగమును పొందుచూ కూడా వాటిచే స్మృశించబడకయే ఇదంతా స్వప్నతుల్యంగాను, అధిష్ఠానముచే ఆత్మరూపంగాను ఒకేసారి దర్శిస్తున్నారు.
నిద్రావ్యపగమే స్వప్ననగరే యాదృశం స్మృతౌ |
చిద్వ్యోమాత్మ పరం విద్ధి తాదృశం త్రిజగత్ భ్రమమ్ ||
ఓ కుందదంతా! బిడ్డా! నిద్రలో నీకు ఒక భవనంలో కొందరి మిత్రులతో సమాగమం కనిపించిదనుకో! మెళకువ వచ్చేసరికి అదంతా ఒక ’స్మృతి’గా మాత్రమే మిగులుచున్నది కదా! అంతేగాని “ఆ భవనం నాది! నాది కాదు! వాళ్ళు నా వాళ్ళు! స్వప్నంలోని ఆ ప్రక్కవారు నా వారు కాదు.” ఇటువంటి మమత్వాదులు స్వప్నానంతరం ఉంటాయా? ఉండవు కదా! మమత్వాదులు ఉండవు కాబట్టి "స్మృతి కాదు” అని కూడా అనవచ్చును కదా! అట్లాగే జ్ఞానికి త్రైలోక్యభ్రమ నశించియే ఉంటుంది. కనుక అతనికి త్రైలోక్య స్మృతి ఉన్నప్పటికీ… అది స్మృతి కాకయే ఉంటుంది. ఆతడు సర్వమును అధిష్ఠాన మాత్రమగు చిదాకాశముగానే ఎరుగుచున్నాడు.
చైతన్యము యొక్క ‘స్ఫురణ’ లేక ’అభాస’ మాత్రమే ఈ జగత్తు. అట్టి స్ఫురణ కూడా చిదాకాశమే! మాకు చైతన్యమునకు అన్యంగా ఏదీ విషయమవటమే లేదు. నీ రూపము - నా రూపము వాస్తవానికి చిదాకాశమాత్రమే నని మేము ఎరిగియే ఉంటున్నాం.
యస్మిన్ సర్వమ్, యతః సర్వం, యత్సర్వం సర్వతశ్చ యత్ | సర్వం సర్వతయా సర్వం తత్సర్వం సర్వదా స్థితమ్ ।
(తస్మై సర్వాత్మనే నమః) దేనియందైతే ఈ సమస్తము కలదో… దేని నుండి ఈ సమస్తము ఆవిర్భవిస్తోందో… ఏది సర్వరూపమై సర్వత్రా సర్వదా వ్యాపించియే ఉన్నదో… అట్టి చిద్రూపమే …సదా… సర్వదా… సర్వరూపముగా స్థితినొందియున్నది. అట్టి సర్వాత్మకునికి సాష్టాంగ దండ
ప్రణామములు.
ఓ ప్రియ సాధువులారా! ఈ విధంగా… బ్రహ్మదేవునిచే రచించబడిన ఈ సృష్టి ఎట్టిదో… ఈ దృశ్యము యొక్క రూపము, భావన ఎట్టివో… తనకి, ఈతని తదితర 7 గురు సోదరులకు ఏమేమి సంభవించుచున్నదో… ఇవన్నీ యోగదృష్టితో పరిశీలించి చెప్పాను. ఒక మీరిరువురు లేవండి. మీమీ గృహములకు వెళ్ళండి. అచ్చట మీక అభిమతములైన సత్కర్మలను త్వరత్వరగా ఆచరించండి. సత్కర్మలు వాయిదా వేస్తే ఉత్తమ భక్తి - జ్ఞానములు ఎట్లా అలవడతాయి?
ఇక నా విషయమంటారా? నేను సమాధిశీలిని కదా! ఇప్పటికే చాలా సమయం సమాధిని అభ్యసించక మీ కొరకై ఆయా విషయాలు దర్శించి చెప్పటం చేత నాకు అలసటగా ఉన్నది. కించిత్
Page:615
భేదముగా ఉన్నది నా భేదం తొలగాలంటే… దుఃఖపరిహారము కొరకై తిరిగి సమాధిలో ప్రవేశించి చిరకాలం ఉండాలని నిర్ణయించుకున్నాను. మీకు శుభమగుగాక! ఇక సెలవు!
కుందదంతుడు : (అయోధ్యలోని ఆధ్యాత్మిక సభలో) ఓ రామచంద్రా! ఈ విధంగా పలికి ఆ వృద్ధ గౌరీవన తపస్వి ధ్యానమునందు ప్రవేశించటానికై కనులు మూసుకొన్నారు. ఆయన మనస్సు ప్రాణములు బాహ్య చేష్టా రహితమైనాయి. అప్పుడు మేమిద్దరం అనేక అనునయ వాక్యాలతో మరల మరల ప్రార్థించినప్పటికీ… ఆయన మాకు ప్రత్యుత్తరం ఇవ్వనేలేదు. ఎందుకంటే బాహ్యవృత్తిని ఉపశమింపజేసుకొని ఉండటం చేత మా శబ్దాలు ఆయనకు వినబడటం లేదు. ఆయన చిత్రము నందు లిఖించబడినవానివలె నిశ్చల స్వరూపులైనారు. అమృతతుల్యమైన ఆయన వాక్కు . - ఆ
వాక్కు అందించే మహత్తర జ్ఞాన విశేషాలు - వీటికి దూరం కావలసినందులకు మేము ఎంతో దుః ఖం పొందాం. ఆ మహనీయుని వాక్కులు ఆమాత్రమైనా వినగలిగిన మహత్ భాగ్యం ప్రసాదించిన మా ఇష్టదైవములకు కృతజ్ఞతలు తెలుపుకున్నాం. వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి మా వద్ద ఉన్న కొన్ని పుష్ప గుచ్ఛాలను వారి పాదాలకు సమర్పించి ఇక అక్కడి నుండి బయలుదేరి మేం మధురానగరం చేరాం. అక్కడి నుండి మా మా గృహాలు చేరాము. సుదీర్ఘకాలం తరువాత మా రాకచే మా మా కుటుంబ సభ్యుల నయనములు ఆనందమయం అయ్యాయి. ఆ తరువాత దేవతా పూజతో కూడిన ఉత్సవములు మా ఇంట్లోను, ఆ ఆ మిత్రుని ఇళ్ళలోను పండుగవలె జరిగాయి. ఆ విధంగా వారి గృహంలోను, మా గృహంలోను ఆనందపూర్వకంగా రోజులు గడవసాగాయి.
కుందదంతుడు : ఓ శ్రీరామచంద్రాదిగాగల సభ్యులారా! ఆ తరువాత విశేషాలు కూడా ఇక సంక్షిప్తంగా చెపుతాను - వినండి.
కాలం మహత్తరమైనది కదా! కాలముచే మ్రింగబడనిదేమున్నది? అయినా సరే… మనకు అతిప్రియమైన బంధుమిత్రులు మన వెంటే ఉంటారులే” అని అనుకుంటూ రోజులు గడుపుతాం. ఇంతలో వియోగ దుఃఖాలు వచ్చిపడుతూనే ఉంటాయి కదా!
కొంతకాలం గడచిన తరువాత ఆ 8 మంది సోదరులలో నా మిత్రుడు తప్ప మిగతావారంతా కొద్ది కాల వ్యవధిలోనే దేహములు త్యజించారు. నా మిత్రుడు తన సోదరుల పట్ల గల మమకారంతో దుఃఖితుడైనాడు. అప్పుడు నేను సాంత్వన వచనాలతోను, జ్ఞాన విశేషాలతోను ఓదార్చాను. ఇంతలో ఒక రోజు ఆ మృత్యుదేవత నా మిత్రుని కూడా నా నుంచి దూరం చేసివేసింది. ఇక నా దుఃఖానికి అంతులేకుండా పోయింది. నేనైతే నా మిత్రుని ఆతని సోదర వియోగం విషయంలో ఓదార్చానుగాని, …నన్ను ఓదార్చే వారు నాకు లభించలేదు. అంతటి దుఃఖంలో జ్ఞాన వచనాలు ఏవీ నాకు గుర్తుకు
Page:616
రావటం లేదు. అత్యంత దుఃఖితుడనై ఉన్న నేను “నాకు జ్ఞాన వచనాలు ప్రసాదించిన సద్గురువులగు ఆ గౌరీవన వృద్ధాతాపసియే శరణ్యం” … అనే నిర్ణయానికి వచ్చి … ఇక మా నగరం నుండి బయలుదేరి గౌర్యవనానికి వచ్చాను. అచ్చట వృద్ధ తాపసి సమాధిలో ఉన్నారు. “వీరిని నా కొరకై సమాధి నుండి విరమింపజేయటం ఉచితం కాదు. వీరు సమాధి నుండి బహిర్గతులై కనులు తెరచే వరకు ఇక్కడ వేచి ఉంటాను" అని… ఇక ఆ మహనీయుని సమక్షంలోనే వారిని ఆరాధిస్తూ, సమాధిని అనుభవించే ఆయన భౌతిక దేహాన్ని సేవిస్తూ… అక్కడే ఉండిపోయాను. 3 నెలలు గడచిపోయాయి. ఒక రోజు వారు కనులు తెరచి నన్ను చూచి ఆదరపూర్వకంగా చిరునవ్వు వెదజల్లారు.
నేను (కుందదంతుడు) : హే సద్గురూ! మీకు సాష్టాంగ దండ ప్రణామములు. స్వామీ! ఏమి చెప్ప మంటారు? నా మిత్రుడు దేహం చాలించాడు. ఇది నాకు ఎంతో దుఃఖం కలిగించింది. మీరు చెప్పి ఉన్న ఆప్తవాక్యాలను నా ప్రియ మిత్రునితో ఏర్పడిన వియోగ దుఃఖం కప్పివేసింది. ఇక దిక్కుతోచక మీ అమృతతుల్యమగు మధుర వాక్కులు వినాలని అనిపించింది. హే మహాత్మా! నాకీ దుఃఖం రావటానికి కారణమేమిటి? ఇది తొలగేది ఎట్లా? ఈ జగత్తుకు నాకు ఉన్న సంబంధం ఏమిటి? మీరు చెప్పినట్టి జ్ఞానవాక్యాలు నా మిత్రునికి బోధించానుగాని… నాకు మాత్రం దుఃఖం తొలగనేలేదు. ఈ దుఃఖం తొలగేది ఎట్లాగో చెప్పండి.
గౌర్యాశ్రమ వృద్ధ తాపసి బిడ్డా! నీకు బోధించవలసినది సవివరంగా బోధించియే ఉన్నాను. ఇప్పుడు నేను సమాధిని చాలించి ఒక్క నిమిషం కూడా ఉండలేను. కాబట్టి కొద్ది క్షణాలలో నేను తిరిగి సమాధియందు ప్రవేశించనున్నాను.
నాయనా! నీకు పరమార్థోపదేశం అప్పుడు చేశాను కదా! కానీ ఏం లాభం? అభ్యాసం తగినంతగా లేకపోవటం చేత పరమార్థోపదేశం నీకు అంటటంలేదు. అందుచేత నీవు మరొక జ్ఞానప్రాప్యుపాయం చేపట్టక తప్పదు.
కుందదంతుడు : హే మహాత్మా! నేనిప్పుడు ఏ జ్ఞానప్రాప్యుపాయం చేపట్టాలో సెలవియ్యండి. మీ ఆజ్ఞను శిరసావహించి ఆత్మజ్ఞానిగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటాను.
గౌర్యాశ్రమ వృద్ధ తాపసి బిడ్డా! కుందదంతుడా! ఆత్మజ్ఞాన వాక్యాలు వినటానికి ముందుగా మనస్సును కొంత నిర్మలం చేసుకోవటం అత్యావశ్యకం. ధూళికప్పిన దర్పణంలో మన ముఖం సరిగ్గా కనిపించదు కదా! అందుచేత నీ ఇష్టదైవమగు ఆ శివభగవానుని స్తోత్రం చేస్తూ, పూజాది కర్మలు నిర్వర్తిస్తూ కొంతకాలం నీకు ఇష్టమైన ప్రదేశంలో గడుపు. ఆ తరువాత ఏం చేయాలో… నీకు ఒక గొప్పఉపాయం చెప్పుచున్నాను, విను.
అయోధ్యానగరం గురించి నీవు వినియే ఉన్నావు కదా! అచట దశరథ మహారాజు ఉంటారు. ఆయనకు “శ్రీరామచంద్రుడు” అనే లోక ప్రసిద్ధుడైన కుమారుడు ఉన్నారు. నీవు ఆతని దగ్గరకు వెళ్ళు. ఆతని కొరకై ఇక్ష్వాకు కుల గురువు, సప్తఋషులలో ఒకడు, బ్రహ్మ మానసపుత్రుడు అయిన
Page:617
శ్రీవసిష్ఠ మహర్షి నిండు సభలో 22 రోజులు మోక్షశాస్త్రాన్ని లోక కల్యాణార్థం ప్రవచించనున్నారు. దివ్యమైన ఆ మోక్షోపాయ కథ విన్నావంటే… నీవు కూడా నా వలెనే పరమపావనమైనట్టి బ్రహ్మపదాన్ని పొంది చిరకాలం విశ్రాంతి పొందగలవు. ఇప్పుడు నాకు సమాధి యందు ప్రవేశించవలసిన సమయం ఆసన్నమైనది. ఇంతకన్నా అధికంగా నీతో సంభాషించలేను. నీకు శుభమగుగాక! “సద్గురూ!” అని సంబోధించియుండుటచే నా ఆశీర్వాదం నీ జ్ఞానమార్గ ప్రయత్నాలకు తోడుగా
ఉండగలదు. సెలవు. ఇక వెళ్ళిరా!
ఓ రామచంద్రా! ఓ ప్రియ వేదవరేణ్యులగు సభికులారా! నేను ఆ తరువాత విదేహ దేశం వచ్చి కొన్నాళ్ళు గురు ఆజ్ఞానుసారం పూజ - ధ్యానము గానము వంటి కార్యక్రమములతో పరమేశ్వరుడగు శివ భగవానుని అర్చించి ఈ రోజు అయోధ్యకు వచ్చాను. ఈ శ్రీరామచంద్రుడు ఈ సభకు వచ్చియున్నారని తెలిసి సభలో ప్రవేశించి మీ ముందు నా గత కథావిశేషాలన్నీ చెప్పాను. ఈ సమయమును కేటాయించి నా విన్నప సమన్వితమైన వాక్యములు విన్న సభికులకు, ఇక్కడి కార్యకర్తలకు, ఈ ప్రియ శ్రీరామచంద్రునికి ఇవే నా కృతజ్ఞతలు.
#
శ్రీరాముడు : హే మహర్షీ! సద్గురూ! వసిష్ఠ మునీంద్రా! ఒకానొక రోజు విద్వత్ వరేణ్యుల సభలో ప్రవేశించిన కుందదంతుడు చెప్పినదంతా పూసగుచ్చినట్లు చెప్పాను. ఈ విషయాలు చెప్పటానికి అనుజ్ఞ ప్రసాదించిన మీకు కృతజ్ఞతలు.
హే మహర్షీ! ఇదంతా ఎందుకు చెప్పానంటారా?… వినండి. ఆ సభలో ప్రసంగించిన కుందదంత నామధేయ బ్రాహ్మణుడు మరెవరో కాదు. ఇదిగో… ఈ ఆ ప్రక్కన ఆసీనుడై ఉన్న ఈతడే ఆ కుందదంతుడు. ఈతడు 21 రోజులుగా మీరు మహత్తరంగా ప్రవచించిన మోక్షోపాయ మంతా చక్కగా శ్రవణం చేశారు. అందుచేత స్వామీ! ఈ సంహితను వినిన తరువాత “వీరికి సందేహ నివృత్తి అయిందా? లేదా? అనే విషయం ఈతనినే చెప్పమంటే మన సంవాదమునకు సముచితమవుతుందని మీకు ప్రార్థనాపూర్వకంగా విన్నపం చేస్తున్నాను.
శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! శ్రీరాచంద్రుడు ఈ విధంగా పలికి వినయంగా లోక గురువగు శ్రీ వసిష్ఠ మహర్షి వైపుగా ప్రణామపూర్వకంగా నిలుచున్నాడు. ఆ శ్రీరామచంద్రుని మాటలు విని, వక్తలలో శ్రేష్ఠులు, మునివర్యులు, లోకకల్యాణమునకై కంకణం కట్టుకున్నవారు అయిన శ్రీ వసిష్ఠ మహర్షి చిరునవ్వుతో… శ్రీరామచంద్రుని ప్రేమాస్పదమైన కన్నుల కదలికచే సుఖాసీనుని చేశారు. అటు తరువాత కుందదంతుని చూచి ఇట్లు పలికారు.
శ్రీ వసిష్ఠ మహర్షి : పాపరహితుడవు, ఉత్తమ బ్రాహ్మణుడవు అగు ఓ కుందదంతా! ఈ శ్రీరామచంద్రుడు నీవు చెప్పినదంతా వివరించాడు. నేను చెప్పుకుంటూ వస్తున్న మోక్షశాస్త్రాన్ని 21 రోజులుగా విన్నావు కదా! ఇప్పుడు నిర్మొహమాటంగా చెప్పు తెలుసుకోవలసిన వాటిలోకెల్ల
Page:618
అత్యుత్తమమైనది, ప్రశాంతతను ప్రసాదించేది అయినట్టి బ్రహ్మ పదమును నీవు తెలుసుకొన్నావా? గ్రహించావా? ఇప్పుడు నీకేమనిపిస్తోందో సూటిగా సంక్షిప్తంగా చెప్పవచ్చు.
కుందదంతుడు : మహాత్మా! వసిష్ఠ మహర్షీ! మీ పాదములకు సాష్టాంగదండ ప్రణామములు. శ్రీవసిష్ఠ రామ సంవాదమునకు నాందీ వచనములు పలికిన బ్రహ్మర్షియగు విశ్వామిత్రుల సుందర పాదపద్మములకు హృదయపూర్వక నమోవాక్కులు.
హే మహర్షీ! ఇప్పుడు ఒకానొక అనిర్వచనీయమైన విశ్రాంతి సుఖమును ఆస్వాదిస్తున్నాను. సర్వ సంశయాలు ఛేదింపబడగా, నా చిత్తం అజ్ఞాన వీచికలను జయించివేసి దిగ్విజయానందమును పొందుతోంది. నా సమస్త సందేహాలు నశించాయి. నాయందు, సర్వులయందు జాజ్వల్యమానంగా వెలుగొందుచున్న భేదరహితమగు జ్ఞేయవస్తువైన ఆత్మానందమును, "ఆత్మను అంతటా దర్శిచ గలుగుట” అనబడు ఆత్మ సాక్షాత్కారమును మీ వాక్యములు విన్నటువంటి మహద్భాగ్యం చేత నేను పొందాను. ఈ 21 రోజులు వేలాది జన్మలలోని పుణ్యఫలం అని, నా ఇష్టదైవమగు శివదేవుని కృప అని, మద్గురువులు అగు గౌర్యవన వృద్ధతాపసి యొక్క కరుణా కటాక్ష వీక్షణమని నేను అనుకుంటున్నాను. హే మహాశయా! ఏమి ఈ నా భాగ్యం!
జ్ఞాతం జ్ఞాతవ్యమఖిలం, దృష్టం ద్రష్టవ్యమక్షతమ్ I
ప్రాప్తం ప్రాప్తవ్య మఖిలం, విశ్రాంతోస్మి పరే పదే ॥
ఇప్పుడు నేను తెలుసుకొనవలసిన నిర్మల వస్తువు గురించి తెలుసుకున్నాను. ఏది పొందాలో …అది పొందాను. ఉత్తమమగు బ్రహ్మ పదమునందు నేను విశ్రాంతి సుఖమును అనుభవిస్తున్నాను. హే మహాత్మా! నిజ చిదాకాశము కంటే ఇతఃపూర్వపు ఇప్పటి, ఇక ముందటి జగత్తులు ఏ మాత్రం వేరు కానేకాదు. మహా పదార్థ ఘనమైనట్టి ఆత్మ చైతన్యమే నా స్వరూపమని ఇప్పుడు ఘంటాపథంగా ఎరుగుచున్నాను. నాచే పొందబడిన, పొందబడుచున్న, పొందబడబోవు జగత్తులన్నీ నా చిత్ చైతన్య స్వరూపాలే! ఇక అవి నాకు వేరుకానప్పుడు నన్ను దుఃఖింపజేయటమనే మాట ఎక్కడిది?
సర్వాత్మకతయా సర్వరూపిణః సర్వగాత్మనః I
సర్వం సర్వేణ సర్వత్ర సర్వదా సంభవత్యలమ్ ॥
సర్వాత్మకమై… సర్వాత్మకం కాబట్టి సర్వరూపిణి అయి, సర్వరూపిణి కాబట్టి సర్వ వ్యాపకమై, సర్వవ్యాపకము కాబట్టి స్వస్వరూపమే అయి వెలయుచున్న పరమాత్మ యందు సర్వత్రా సర్వదా సర్వ విధములా సమస్తము సంపూర్ణముగా సుసంభవమే!
సంభవన్తి జగన్త్యన్తః సిద్ధార్థ కరకోటరే |
న సంభవన్తి చ యథా జ్ఞాతమేతత్ అశేషతః ॥
ఒక ఆవగింజ యొక్క లేశము (చిన్న విభాగము) నందు కూడా సర్వశక్తియుతమగు చైతన్య
సత్త వేంచేసియే ఉన్నది. అట్టి చైతన్య సత్త ఉండి ఉండటం చేత ఆ ఆవగింజ అవశేష విభాగంలో అనేక బ్రహ్మాండములు సంభవించగలవు. కానీ… అలా సంభవించగలిగినప్పటికీ కూడా… పరమార్థ
Page:619
దృష్టిచే ఏదీ సంభవించకయే ఉన్నది. ఈ విషయం మీ బోధచే సుస్పష్టంగా, నిర్దుష్టంగా నేను ఎరుగుచున్నాను.
గృహే_న్తః సంభవత్యేవ సప్తద్వీపా వసుంధరా
గేహంచ శూన్యమేవాస్తే సత్యమేతత్ అసంశయమ్ ॥
ఒక గృహంలో ఒకే సమయంలో సప్తద్వీపములతో కూడిన 8 విస్తార భూములు సంభవమే! ఇక నాకు సందేహం లేదు. కాని, వాస్తవానికి ఆ గృహము శూన్యరూపమే అయివున్నది. ఈ విషయం కూడా అత్యంత నిర్దుష్టమైన సత్యమే! ఇందులో కూడా ఏమాత్రం సంశయం లేదు.
ఏఏ వస్తువు ఎచ్చటెచ్చట ఎపుడెపుడు ఏఏ ప్రకారంగా భాసిస్తోందో… మరియు జీవులకు అనుభూతమౌతోందో… అది అచట అప్పుడు ఆ ప్రకారంగా… మహాచిదనము, ఆద్యంత రహితము ముక్త స్వరూపము అయినట్టి బ్రహ్మమే… ఆ విధంగా వర్తించుచున్నదగుచున్నది! బ్రహ్మము కంటే భిన్నంగా ఎవనికీకూడా ఎక్కడాకూడా ఏదీ, ఏమాత్రంకూడా అనుభూతం అవటం లేదు.
అనుభూతమయ్యే సర్వము బ్రహ్మమే! బ్రహ్మము సర్వ అనుభూతులకు మునుముందుగానే ఏర్పడి ఉన్నది. అట్టి బ్రహ్మమే నేను. ఈ సభికులంతా కూడా నా బ్రాహ్మీ స్వరూపులే! అట్లాగే సభలోని, సభ వెలుపలి ప్రతి ఒక్క జీవుని పరబ్రహ్మ స్వరూపమే నేను!
శ్రీ వాల్మీకి మహర్షి : ఓ భరద్వాజా! కుందదంతుడు ఈ ప్రకారంగా చెప్పి మౌనం వహించగా… అప్పుడు శ్రీవసిష్ఠ మహర్షి పరమార్ధ యోగ్యమైన మరికొన్ని విశేషాలు ఈ విధంగా చెప్పసాగారు. శ్రీ వసిష్ఠ మహర్షి : ఆహా రామచంద్రా! ఇది సంతోషకరమైన విషయం. మహాత్ముడగు కుందదంతుడు కరతల ఆమలకంలాగా (అరచేతిలోని ఉసిరికాయ వలె) ఈ ప్రపంచమును ఎటువంటి సందేహాలు లేకుండా, ప్రత్యక్షంగా “బ్రహ్మరూపముగా” దర్శిస్తున్నారు. ఓ సభికులారా! ”అయ్యో! మాకు భ్రాంతి తొలగటం లేదే! జగత్తులోని సంబంధాలు మొదలైనవి మేము కలిగి ఉంటున్నామే!” అని నిరుత్సాహ పడే బదులు… “భ్రాంతి కూడా బ్రహ్మరూపమే”… అనే దృష్టిని అలవరచుకోండి. భ్రాంతాత్మకమగు ఈ ప్రపంచం కూడా వాస్తవానికి జన్మ రహితమగు బ్రహ్మరూపంగానే భాసిస్తోంది. కనుక సమస్తము కూడా "శాంతము, ఏకము, నిర్వికారము”… అయినట్టి బ్రహ్మయే! ఇది గమనించండి.
యద్యథా యేన యత్రాస్తి యాదృగ్యావద్యదాయుతః
తత్తథా తేన తత్రాస్తి తాదృక్తావత్తదా తతః
ఏది, ఏ ప్రకారంగా, ఎట్లు, ఎంతగా, ఎప్పుడు, ఏ కారణం చేత, ఎచట ఉన్నదో… అది
Page:620
శివం శాంతం అజం మౌనమ్ అమౌనమ్ అజరం తతమ్ |
సుశూన్యా శూన్యమభవమ్ అనాది నిధనం ధ్రువమ్ ||
సమస్తము తానే అయి ఉన్న బ్రహ్మము - ఇక ఈ సర్వముకూడా అయి, - - శుభప్రదము శుభరూపము, పరమశివరూపము, జన్మాది వికారములు లేనిది, మౌన స్వరూపము, జడత్వ వర్జితము, జరత్వం (వార్ధక్యం) అనేది లేనిది, పదార్థ శూన్యము, ప్రపంచ వర్జితము, అనాది, సుస్థిరముగా ప్రకాశిస్తోంది.
ఈ జగత్తు బ్రహ్మము యొక్క కల్పనా విభాగమే! బ్రహ్మము సర్వదా యథాతథం. అద్దానికి అనన్యం అయినట్టి మాయా స్ఫురణ చమత్కార విభాగం ఏఏ విషయమును - విశేషమును దృఢ సంకల్పంతో భాసింపజేస్తోందో… ఆయా విశేషముగా విస్తారంగా అట్లే కనిపిస్తోంది.
ఈ బ్రహ్మాండమంతా చిదాకాశమునందే ఉన్నది. సముద్రంలో ఒక జలకణం ఉన్నట్లుగా… ఈ బ్రహ్మాండమంతా చిదాకాశములో పరమాణువై ఉన్నది. అంతేకాదు. తనయొక్క అభ్యంతరమున జగత్తును కలిగియుండటం చేత … చిదాకాశమే బ్రహ్మాండమైయున్నది. అనగా… ఈ బ్రహ్మాండమే …చిదాకాశము. చిదాకాశమే… ఈ బ్రహ్మాండం. ’ రెండు వేరువేరు’ అని చూచే దృష్టి భ్రమయే! కాబట్టి రామచంద్రా! ఈ సమస్త జగత్తూ కూడా - - ఆది మధ్యాంత రహితము, పరిపూర్ణము - శాంతము… అగు చిదాకాశమే! ఇది గమనించమని సభికులందరికీ పదే పదే గుర్తు చేస్తున్నాను. ‘ఈ శరీరం నేను’ మొదలుగాగల వైచిత్ర్య రూపములగు బంధములు నశించినవారై, కేవలము - -
నిర్వికారము నిర్వాణరూపము - యథాస్థితము అగు బ్రహ్మరూపులై ఉండండి.
మీరంతా దేహమనోస్వరూపులు కాదు. కేవల బ్రహ్మస్వరూపులే! (తత్త్వమసి)!
స్వయం దృశ్యం స్వయం ద్రష్టృ స్వయం చిత్తం, స్వయం జడమ్ |
స్వయం కించిన్న కించిచ్చ బ్రహ్మాత్మన్యేవ సంస్థితమ్ ||
వ్యవహార దృష్టిచే… బ్రహ్మమే ద్రష్ట దృశ్య, చిత్-జడ, దృశ్య- అదృశ్య రూపములుగా స్థితినొందియున్నది. కానీ, పరమార్థ దృష్టిచే… ఇదంతా పదార్థరూపం కానేకాదు. అద్వితీయ “స్వయం ప్రకాశానందైక స్వరూపము” అగు ఆత్మయందే ఆత్మకు అభిన్నంగా స్థితినొంది ఉన్నదై ప్రకాశిస్తోంది. అట్టి బ్రహ్మము… ఇచట ఆ రూపంతో వర్తిస్తోంది. అయినా కూడా నిజ చిదాకాశమునందు తన యథార్థ ‘సత్చిత్’ స్వరూపమును ఏ మాత్రం త్యజించటం లేదు. త్యజించకయే…ఇట్లు వర్తిస్తోంది.
బ్రహ్మ దృశ్యమితి ద్వైతం న కదాచిత్ యథా స్థితమ్ ఏకత్వం ఏతయోర్విద్ధి! శూన్యత్వాకాశయోరివ ॥
ఓ రామచంద్రా! ఓ ప్రియ సభికులారా! "బ్రహ్మము మాయచే జగదృశ్యముగా అగుచున్నది”… అని మీరు తలచకండి. జ్ఞానము యొక్క వర్తమానపు చర్చనీయాంశమగు స్థితిలో అటువంటి ద్వైతవాక్యాలకు (బ్రహ్మం వేరు - జగత్తు వేరు… అనే ద్వైత వ్యవహారానికి) తావు లేదు.
Page:621
“ముత్యపు చిప్ప వెండిలా భాసిస్తోంది" అని చెప్పినప్పుడు, “అక్కడ వెండి ఉన్నది” అని అర్థం కాదు కదా! నిర్వికారమగు ముత్యపు చిప్ప అట్లే ఉన్నది. అది ఏమాత్రం మారటంలేదు.
అట్లాగే నిర్వికారమగు బ్రహ్మము ఈ దృశ్యముగా భాసించుచున్నట్లు ప్రాపంచిక దృష్టికి అనిపించినప్పటికీ… బ్రహ్మము సర్వదా తనయొక్క "పారమార్థిక నిర్వికార రూపము” తోడనే సర్వత్రా వెలయుచున్నది. ఆకాశము - శూన్యత్వము… రెండూ ఒక్కటే కదా! అట్లాగే
బ్రహ్మము, దృశ్యము ఒక్కటే -
దృశ్యమేవ పరంబ్రహ్మ, పరంబ్రహ్మైవ దృశ్యతా
ఏతత్ న శాంతం నాశాంతం నానాకారం నచాకృతిః||
కనబడే దృశ్యమే పరబ్రహ్మము. పరబ్రహ్మమే ఈ దృశ్యమైయున్నది. అట్టి పరబ్రహ్మము… జగత్తుగా కూడా అయి ఉండుటచే ‘శాంతము’ కాదు. సర్వదా యథాతథము నిర్వికారము కాబట్టి ‘అశాంతము’ కాదు.
సర్వ ఆకారాలు అద్దానివే. కాబట్టి సాకారమే! "అద్దాని ఆకారం ఇది” అని అనలేం కదా! కనుక నిరాకారం. అది సర్వత్రా అనురాగము కలిగి ఉంటోంది. కనుక సరాగ స్వరూపమే! సర్వత్రా అనురాగమే విరాగం. కాబట్టి అది నిత్యవిరాగి!
శ్రీరాముడు మహర్షీ! అయితే, ఈ జగత్తు సాకారంగానే కనిపిస్తోంది కదా! బ్రహ్మమో….
నిరాకారం కదా!
శ్రీ వసిష్ఠ మహర్షి : నిద్రలో స్వప్నం సాకారమే. అయితే ఏం? స్వపద్రష్ట నిరాకారుడే కదా! నిద్ర లేవగానే? స్వప్నంలో కనిపించిన పదార్థాలన్నీ నిరాకారములుగానే భాసిస్తున్నాయిగా! అట్లాగే…
ఆత్మజ్ఞానం బుద్ధియందు ఉదయించనంతవరకు… ఈ జాగ్రద్దేహం సాకారం. ఆత్మజ్ఞాన ప్రాప్తికి అనంతరమో… ఈ జాగ్రత్ హం నిరాకారం.
స్వప్నంలో చిన్మాత్రాత్మ స్వయంగా సాకారంగా అనుభూతమైనప్పటికీ, వాస్తవానికి అట్టి ఆకారములన్నీ అసన్మయములే కదా! అట్లే జాగ్రత్లో కనిపిస్తున్న ఈ దేహాది ఆకారములన్నీ కూడా అనుభూతములైనప్పటికీ అసన్మయములే అయి ఒప్పుచున్నాయి. అయినా కూడా… నీ ప్రక్కన ఉన్న ఆ నీ మిత్రుడు కుందదంతుడు. దేహి, దేహముల కలయికయే కదా! ’మిత్రమా’ అని సంబోధిస్తున్నది, దేహినేగాని ఈ దేహమును కాదు కదా! దేహమునకు ఆకారము ఉన్నట్లుగా అ అనిపించవచ్చు గాక!
ఆకారం స్థిరం కాదు కదా! అది అట్లా ఉండగా, ఇక దేహికి ఆకారం ఎక్కడున్నది?… ఇక ఈ ప్రపంచంలోగల జడ చైతన్యములంటావా? ఈ జీవుడు చేతన స్వరూపుడే! చిన్మయుడే! అయితే ఏం? కాన ఈతడు సుషుప్తి (గాఢనిద్ర) యందున్నప్పుడో? జడుడే అగుచున్నాడు కదా! చేతన రూపుడగు ఈ జీవుడు గాఢనిద్రా సమయంలో జడుడై ఉంటున్నట్లే… చైతన్యమే స్థావరంగా కూడా కనిపిస్తోంది.
Page:622
సుషుప్తి దశనుండి జీవుడు… స్వప్న దశలకు వస్తున్నాడు. అప్పుడు జాగ్రత్ కల్పనలతో కూడి ఉంటున్నాడు. అట్లాగే… చైతన్యం సమక్షంలో ఘనీభూతమైన జడము ఒకానొకప్పటి ఆ జడమగు స్వతత్త్వము నుండి జంగమ - చేతన దశను పొందుతోంది.
ఓ సహ పరబ్రహ్మ స్వరూపులగు సభికులారా! బుద్ధికి ముక్తి కలుగనంత వరకు ఈ పృథివి, జలము, అగ్ని, వాయువు ఆకాశములందు అణువణువునా "స్వప్నతుల్యమైన - శూన్యరూపమైన’ అనేక జగత్తుల అనుభూతులు, అనుభవాలు, స్థితిగతులు భాసిస్తూనే ఉంటాయి.
ఈ మనుజుడు జాగ్రత్ నుండి గాఢనిద్ర యొక్క అధ్యాసను పొందుచున్నట్లుగా (గాఢనిద్రను ఆస్వాదించ సంసిద్ధుడై జగత్ రాహిత్యమును ఆస్వాదిస్తున్నట్లుగా)… చైతన్యము జడత్వము యొక్క అధ్యాసమును కావించుచున్నది. జడత్వమగు (ద్రష్టయొక్క) అధ్యాస చేతనే అది జడరూప వస్తు సముదాయంగా కూడా అగుపిస్తోందే గాని… వాస్తవానికి చైతన్యము జడత్వమును ధరించటమే లేదు. స్వప్నంలో జడమగు ఇల్లు, రహదారి, రాయి, కొండ మొదలైన జడవస్తువులు కనిపించినంతమాత్రమే… స్వప్న ద్రష్ట జడముగా అగుచున్నాడా? లేదే! అవన్నీ కూడా స్వప్నద్రష్ట యొక్క స్వప్నచైతన్య ప్రదర్శనములే కదా!
‘జడత్వము’ను అనుభవించే జీవుని చైతన్య విభాగమే స్థావర శరీరమును నిర్మించుచున్నది. అట్లాగే చైతన్యము అనుభవించే జీవుని చైతన్య విభాగం చేతనములను నిర్మించుచున్నది. ఓ రామచంద్రా! గాఢనిద్రను ఒక జీవుడు అనుభవిస్తూ ఉండగా… ఇప్పుడు ఆతడు జడమా? ఆతడు అచేతనుడై వాక్ మనోరహితుడై ఉండవచ్చుగాక! ఆతని చైతన్య విభాగమే జడత్వమును ఆశ్రయించి ఉన్నది కాబట్టి ఆతడు చేతనుడుగా కొనసాగుచున్నట్లే కదా! ఆ జడమే జాగ్రత్ స్వప్నములకు ఉత్పత్తి స్థానం కాబట్టి ఆతడు జాగ్రత్ - స్వప్న సమయములలో కూడా జడరూపుడే కదా! ఈ విధంగా జడ - చేతనములు మా దృష్టిలో ఏకత్వమునే సంతరించుకున్నవై ఉంటున్నాయి.
చేతనములైనట్టి చేతులు, కాళ్ళు, కళ్ళు మొదలైనవి, అచేతనములగు గోళ్ళు, కేశములు (జట్టు) మొదలైనవి ఒకే దేహంలో సమావేశమై ఉంటున్నాయి కదా! అన్నిటినీ కలిపే ‘దేహము’ అని పిలుస్తున్నాం. అయితే వాస్తవానికి దేహి రూపరహితుడు కదా! అట్లాగే నిరాకారమగు చైతన్యము నందు స్వాధ్యస్తములై కనబడే ఈ జగత్ శరీరుని జగత్ శరీర సమస్త స్థావర జంగమములు ఏక శరీర రూపములే అయి ఉన్నాయి.
సంకల్పమే బ్రహ్మదేవుని ప్రథమ సృష్టికి హేతువు. ఆ సంకల్పమే చిద్రూపమున (స్వప్నంలో లాగానే) స్థావర - జంగమాత్మక జగత్తుగా వ్యక్తీకరణమౌతోంది. అదే ప్రకారంగా ఇప్పటికీ స్థితినొందియున్నది. ఇట్లా ఈ జగత్తు చిరకాలంగా జడరూపంతో ఉన్నప్పటికీ… వాస్తవానికి ఇదంతా చిన్మయయే! ఇంతెందుకు? ఇదంతా సత్యము శాంతము నిరాకారము అయినట్టి బ్రహ్మమేనని మేము గమనిస్తున్నాం. ఈ రీతిగా జగత్తును జగత్తుగా కాకుండా… చిన్మయ బ్రహ్మముగా దర్శించటమే ‘సృష్టి నశించటం- సృష్టి అంతము’ అని చెప్పబడింది. ఎందుకంటే
Page:623
పారమార్థికంగా చూస్తే ఈ జగత్తు ఎప్పుడూ లేనేలేదు. లేదు కాబట్టి "బ్రహ్మమునందు జగత్తు వ్యక్తీకరణమవటం”… అనునది జరగటమే లేదు. జగత్తుగా కనిపించేదంతా బ్రహ్మముగా అనిపించటమే ‘జగత్ వినాశనం’ అయివున్నది. ఈ మార్గంగానే ఈ జగత్తు “బ్రహ్మము”గా (సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ) అయివున్నది. జగత్తుగా అనిపించటమే ‘జగదుత్పత్తి’. ఇంతకు మించి ఉత్పత్తి - - ప్రళయాలు ఎక్కడా లేవు.
ఓ రామచంద్రా! నిద్రాకోష్ఠము నందే స్వప్నం యొక్క “ఆది అంతము” కల్పించబడు చున్నాయేగాని, జాగ్రత్ కోష్ఠమున కాదు కాబట్టే జాగ్రత్ దృష్ట్యా స్వప్నము మిథ్యయే అయి ఉంటోంది. అట్లాగే… త్రికాలములందు కూడా ‘లేనిదే’ అగు ఈ జగత్తు యొక్క ఆది - అంతముల గురించిన కల్పన (జ్ఞాన సూర్యుని ఉదయానంతరం) మిథ్యయే అయివుంటోంది.
ఓ సభికులారా! ఆద్యంత రహితము - పరమాత్మ ఘనము అగు చైతన్యమొక్కటి తప్ప తదితరమైనదేదీ ఎక్కడా లేదు. అందుచేత పేరుకు కూడా సృష్టి - స్థితి - లయములు మా దృష్టికి అగుపించటం లేదు. ఆ సృష్టి, స్థితి, లయముల రూపంలో బ్రహ్మమే మాకు ప్రదర్శితమగుచున్నది. ఇక వాటి రూపమగు ఈ జగత్తుల గురించి వేరుగా చెప్పేదేమున్నది? చిత్ర లేఖనంలో సుందర స్త్రీ నిజమైన స్త్రీయా? కాదే! అట్లాగే సృష్టి - స్థితి - - లయాలు, ఆ మధ్యలో జగత్ృష్టికి ఈ జగత్తులు కనిపిస్తున్నాయి. ఇవి ఆత్మకంటే వేరుకాదు. (సర్వం ఖల్విదమ్ బ్రహ్మ).
ఎవరో అతిప్రావీణ్యుడైన చిత్రకారుడు కొన్ని రంగులను మేళవించి శుభ్రమైన తెల్లటి వస్త్రముపై రచించిన ఆ యుద్ధ సేనా చిత్రమును చూడు. అందులో అనేకమంది సైనికులు, రథములు, ఆయుధములు ఆ చిత్రకారుడు రచించాడు కదా! అందులో రచించిన యుద్ధ విన్యాసం, ఆ రథములు, ఆ ధూళి, ఆ ఆయుధములు, ఆ శత్రు, మిత్ర సేనలు ఇవన్నీ కూడా… అతికౌశలం గల చిత్రకారుని ఊహకంటే వేరుకాదు కదా! అట్లాగే… సాకారము, నానారూప సమన్వితము అగు ఈ సృష్టి - ఇద్దానిని సృజించు వాని యొక్క - ఇద్దానిని దర్శించు వానియొక్క “చిత్తముల యొక్క సారూప్యము” మాత్రమే! ఇదంతా చిత్తము కంటే ఏమాత్రము వేరుకాదు.
ఈ జగత్తంతా అద్వైత రూపమే అయి ఉన్నది - చిదనము సర్వదా ‘విభాగరహితం’. అయినప్పటికీ విభాగించబడిన దానివలె అగుపిస్తోంది. ‘అవిద్య’ అనే సుషుప్తి రూప ఆవరణచే వాస్తవ రూపం …. అగు ‘మోక్షము’ అనే ప్రసిద్ధమగు విభాగమును మరుగున పరచి ఉంచుతోంది. తాను చిత్తరూపంగా అయి ఈ జాగ్రత్ - స్వప్న విభాగములను దర్శింపజేస్తోంది. అయినా కూడా, “ఇది సృష్టి - ఇది ప్రళయము - ఇది స్వప్నము - ఇది జగత్తు" … అనునవన్నీ కూడా - నిరాకారము - ప్రజ్ఞాన ఘనము - అనేక చిద్రూప కిరణ సమాహితము - అగు “ఆత్మ” అనే మహాసూర్యుని ప్రకాశ భేదములే అయివున్నాయి.
చైతన్యము యొక్క వాసనా రూపమగు స్వప్న విభాగము ఉపాధి అంశ ప్రాధాన్యముచే “చిత్తము” అని పిలువబడుతోంది. చిదంశ ప్రాధాన్యమే “జీవుడు” అని పిలువబడుతోంది.
Page:624
ఆ జీవుడే దేవ - మనుష్య ఆదిగా గల అధికార దేహములను పొంది ’తత్త్వజ్ఞానము’చే అవిద్యను పారద్రోలివైచి ’ముక్తుడు’ అగుచున్నాడు. అనగా, ఆతడు 4వ 5వ భూమికలను అభ్యసిస్తూ, 6వ భూమికలో స్వయంగా అంతయు ఆత్మరూపంగా అన్వయించుకుంటున్నాడు. అప్పుడిక 7వ భూమికయందు ప్రవేశించి మోక్షరూపుడగుచున్నాడు”… అని మోక్షము గోరువారికి గురువులచే చెప్పబడుతోంది.
“అట్టి మోక్ష శాస్త్రము యొక్క ‘మోక్షము’ అనే శబ్దానికి అర్థం ఈ దృశ్యమును ఆత్మరూపంగా దర్శించటమే” అయివున్నది.
శ్రీరాముడు : హే మహాత్మా! నిర్మలమగు ఆత్మ నుండి వాసనా విభాగరూపంగా ఉపాధి అంశ ప్రాధాన్యముచే చిత్తము బయల్వెడలుతోంది కదా! అట్టి చిత్తము “దేవతలు, అసురులు, మానవులు” మొదలైన భేదములచే ఎంత పరిమాణము కలిగియున్నది? ఆ చిత్తము స్థితి ఎట్టిది? నిద్రానిద్ర స్వరూపమగు చైతన్యము నందు ఈ జగత్తు ఎంత పరిమాణము కలిగియున్నది? ఈ జగత్తు ఎంత కాలం ఉండబోతోంది? చైతన్యము యొక్క గర్భంలో ఈ జగత్తు ఎట్లా స్థితి కలిగి ఉన్నది? దయచేసి ఈ జగత్తు గురించి ఈ ఈ విషయాలు చెప్ప ప్రార్థన.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అవును. ఈ మనుష్య, దేవ, అసుర, స్థావర, స్త్రీ, పురుష, నాగ పర్వత, పిశాచ, రాక్షస, పక్షి, కీటకాదులన్నీ… ‘చిత్తమే’ అని ఎరుగు. అట్టి ఈ చిత్తం పరిమాణం అనంతం. అద్దాని యందు బ్రహ్మదేవుని నుండి స్తంభం వరకు గల ఇటువంటి జగత్తులు అసంఖ్యాంగా ఉన్నాయి. చిత్తమే ఇదంతా! ఈ నేత్ర జ్ఞానము ఊర్ధ్వమునకు పోయి సూర్య గోళమును కూడా దాటివేసి ఎంత దూరం పోగలదో… అదంతా చిత్తమే అయివున్నది. చిత్తము “అంతులేనంత విశాలం" అనునది అందరికీ అనుభవమైన విషయమే! ఇది ఇట్లా ఉండగా, ఈ చిత్తం అనేక దుస్సహ సంసార దుఃఖములచే పరిపూర్ణమై ఉండటం చేత అతిభయంకరమై ఒప్పుతోంది కూడా!
అయితే… ఈ చిత్తము వాస్తవానికి చైతన్య రూపమే! ప్రదర్శనా చమత్కారమే! ఎప్పుడైతే చిత్తము సమష్టి రూప విభాగంలో బ్రహ్మాండ కల్పన వలన లోక సమూహాలు కల్పనా మాత్రంగా వచ్చి చేరుచున్నాయో… అప్పుడు “చిత్తం నుండి సృష్టులు వచ్చినాయి” అని చెప్పబడుతోంది.
ఆద్యంత రహితమగు ఈ చిత్తమే “జీవుడు”. అన్ని కుండలలో ఆకాశం ఉన్నట్లు… ఈ చిత్తము సర్వదేహములందు కలదు. ఈ సర్వదేహములు బ్రహ్మదేవుని ఇచ్ఛయే కాబట్టి ”ఈ ఈ దేహాలలో చిత్తము లేదు. చిత్తములోనే ఈ ఈ దేహాలు ఉన్నాయి”… అని కొందరనటం కూడా యుక్తి యుక్తమే! నదీ ప్రవాహం సర్వ ప్రదేశాలలోనూ త్యజిస్తూ పోతున్నట్లు ఈ చిత్తము కూడా
అనేక ఉత్తమ - - అధమ దేహాలను గ్రహిస్తూ - - త్యజిస్తూ ఉంటుంది. “మృగతృష్ణలో జలం ఉండదు”
Page:625
..అని తెలిసిన తరువాత ఇక “అక్కడి జలం దాహం తీరుస్తుంది” అనే భ్రమ కూడా తొలగుతుంది కదా! ఆత్మ స్వరూపమును ఎరిగిన మరుక్షణం ఈ చిత్తము యొక్క దేహాది భ్రమ అతిశీఘ్రంగా నశించగలదు.
ఈ సువిశాల జగత్తును తన గర్భంలో ధరించుచున్నది ఈ చిత్తమే! అయితే ఏం? అనేక జగత్తులను కూడా తనయందలి స్వల్ప విభాగంలో ధరించగలిగి ఉండగలదో, అట్టి ఈ చిత్తము అణుప్రమాణము మాత్రమే!
అణుప్రమాణమై వుంటూకూడా, అది సర్వదా అభౌతికం. అట్టి అణు స్వరూపమగు చిత్తమే జీవుడు. కాబట్టి జీవుని అభ్యంతరముననే ఈ జగత్తు వెలయుచున్నది. స్వప్న భూముల వలె ఈ కనిపించే దృశ్యమంతా కూడా చిత్తమే అయివున్నది. ఆ చిత్తమే జీవుడు కూడా కదా! ఈ విధంగా జీవునికి - జగత్తుకు భేదం లేదు.
అయితే… చైతన్యమునకు అన్యమైన దేనికీ సత్తయే లేదు కదా! కాబట్టి ఇక్కడ పదార్థములే సంభవించవు. కనుక ఈ పదార్థ సమూహమంతా కూడా చిత్స్వరూపమే!
స్వప్నంలో స్వప్నదృశ్య వ్యవహారం ఉన్నట్లు… బంగారమునందు ఆభరణ విశేషం ఉన్నట్లు… సముద్రమునందు ఏకరూపమగు జలమున తరంగ - ఆవర్తాది భిన్న భిన్న రూపములు సర్వత్రా స్ఫురిస్తున్నట్లు… ఈ పదార్థ సమూహమంతా చైతన్యమునకు అభిన్నం. చిద్రూపమగు బ్రహ్మము నందు తదభిన్నరూపంగా అనేక దృశ్యరూప పదార్థములు స్ఫురించుచున్నాయి.
సముద్ర ఉదరంలో విద్యమానమగుచున్న “జలము - - ద్రవత్వము” అభిన్న రూపములే కదా! పరమాత్మ యందు పదార్థ సమూహాలు చైతన్యము కంటే వేరుకాకయే స్ఫురిస్తున్నాయి. ఈ జగత్ పదార్థాలన్నిటికీ చైతన్య అనుభూతియే ఆధారం. చైతన్యము - అద్దాని అనుభూతి అభేదం. కనుక ఈ జగత్తు - చైతన్యము అభేదం.
యథారీతిగా స్థితి కలిగియున్న ఈ జగత్తంతా కూడా… తన యొక్క శాంత చిత్స్వరూపమును త్యజించకుండానే…. స్వప్నరూపంగా చిదాకాశమున వ్యవస్థితమై విద్యమానమగుచున్నది. ఒక స్తంభము, అందులో శిల్పలేఖన రూపంగా రచించబడిన దేవతాప్రతిమ ఒక్కటే కదా! అట్లాగే… సమత్వం, సత్యత్వం, సత్త, ఏకత్వం, నిర్వికారత్వం, పరస్పర ఆధార ఆధేయత్వము అను వీటన్నిటియందూ జగత్తు - చైతన్యములు సాదృశ్యమైనవే! (ఒకదాని వంటిదే రెండవది అయి వున్నది.)
స్వప్నము - సంకల్పము; వరము - శాపము; సరోవరజలం - నదీజలం… ఇటువంటి ప్రతిభాసలన్నీ ఏకరూపమే కదా! అట్లాగే… జగత్ - - చైతన్యములకు వ్యవహార సమర్థమైన భేదం ఉండవచ్చుగాక! వస్తుతః పరమార్థమున భేదం లేదు.
బంగారపు ప్రక్కపిన్నుకు - బంగారమునకు సాదృశ్యమే యుక్తియుక్తం కదా!
Page:626
వర - శాపముల కార్య - కారణత్వం
శ్రీరాముడు : మహాత్మా! ఈ ప్రపంచంలో ఏదైనా జరగాలంటే “ఉపాదాన కారణం” అనేది ఉండాలి కదా! మరి వర-శాపముల విషయంలోనో? ఒకడు వరం పొందాడనుకోండి. లేక, శపించబడ్డాడనుకోండి. అప్పుడు ఏ ఉపాదానకారణం లేకుండానే ఆ వరమో, ఆ శాపమో ఎట్లా క్రియాశీలకం కాగలుగుతోంది?
ఉదాహణకు… ఇంద్ర పదవిలో ఉన్న నహుషునకు “నీవు సర్పమువై అరణ్యంలో సంచరిస్తావు గాక!” అని సప్త ఋషీశ్వరుడు శపించగా, ఆతని దేహం చంద్రామృత భాగం కోల్పోయి… పాంచ భౌతికమగు సర్పంగా అప్పటికప్పుడు పరిణమించటం. నంది (గోవు)కు “ఈశ్వరత్వము” వరంగా ఇవ్వబడగా, ఆ నంది భౌతిక దేహం పోయి చంద్రకిరణామృత నిర్మితమగు నందీశ్వరత్వం ప్రాప్తించటం… ఇవి ఉపాదాన కారణాలు లేకుండా ఎట్లా సంభవిస్తున్నాయి? అనేది ఇక్కడి ప్రశ్న. శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సముద్రంలో జలము యొక్క స్ఫురణమందు తరంగాలు ఆవర్తాలు కనిపిస్తున్నాయి. అంతా జలమే! కానీ అవన్నీ ఆకారయుక్తంగా అగుపిస్తున్నాయి. జగత్ స్ఫురణ చిదాకాశము నుండే బయల్వెడలుతోంది కదా!
కాబట్టి… అతి నిర్మలమగు చిదాకాశము యొక్క తత్త్వజ్ఞానము నుండి బయల్వెడలిన ’సత్య సంకల్పము”ను అనుసరించి ఏర్పడిన స్ఫురణయే జగత్తు. అందుకే ఇది సత్యముగా కనిపిస్తోంది. అట్టి సత్య సంకల్ప రూపులగు వర - - శాప ప్రదాతల సంకల్పనాశక్తియే ఘనీభూతమగు శాపవర భోక్త యొక్క అనుభవంగా రూపుదిద్దుకుంటోంది. ఈ జగత్తంతా సంకల్ప రూపమే కదా!
సముద్రజలంలోంచి ధ్వనులు బయల్వెడలుచున్నాయి చూచావా! బ్రహ్మదేవుని యొక్క “స్వాత్మ చైతన్యము” నందు “చిద్రూపములే” అగు జగద్భావములు అకస్మాత్తుగా భాసించుచున్నాయి. అట్టి భావములకే శ్రుతులు “సంకల్పములు” మొదలైన నామములు కల్పించుచున్నాయి. ఈ జగత్తు యొక్క మూల పదార్థము ఆ సంకల్పములే! అట్టి సంకల్పముల అనుభవం అజ్ఞాన దృష్టికి ‘సంసారము’ రూపంగా ప్రాప్తిస్తోంది. అదియే బంధము. అజ్ఞాన దృష్టి తొలగితే బంధమూ లేదు. మోక్షమూ లేదు. ”దృశ్యమునకు సంబంధించిన ఆశ - నిరాశ - పూర్వాపూర్వ విషయముల మననము - గుణదోషములు - - అభియోగదృష్టితో చూడటం… ఇదియే సంసారము. ఈ జీవుడు ఆత్మస్వరూపుడై ఉండి కూడా (ఆనందస్వరూపుడై ఉండి కూడా)… దుఃఖము పొందటానికి కారణం ఆత్మదృష్టి కొరవడటం తప్పితే వేరుకారణం లేదు. "తత్త్వదృష్టి అను శాస్త్రీయ ప్రతిపాదితమగు దివ్యౌషధమే అందుకు తరుణోపాయం. అభ్యాసయోగం చేతను, తత్త్వవిచారణ చేతను, శత్రు సమదర్శనము చేతను, నిర్మల సాత్విక భావములచేతను, భక్తి తత్పరతచేతను, ఈ సంసార దోష భూయిష్ఠుడగు జీవుడు సమ్యక్ జ్ఞానవంతుడు, యథార్థ తత్త్వదర్శి అగుచున్నాడు.
“యథార్థ తత్త్వదర్శి యగు జ్ఞానియొక్క బుద్ధి ద్వైత - ఏకత్వ వర్జితమై ఉంటోంది. చిన్మాత్రరూపమై, ఆవరణ రహితమై, చిద్ర్బహ్మరూపమై, కేవల చిత్ప్రకాశమాత్ర స్వరూపమై, దేహాదేహ
Page:627
వర్జితమై, అత్యంత నిర్మలమై ఉంటోంది. అట్టి నిర్మల బుద్ధి - నిరావరణ - జ్ఞానము పొందినట్టి మనుజుడు ఏదేది సంకల్పిస్తాడో… అద్దానినంతా కూడా ఆతడు స్వాత్మయొక్క స్ఫురణగాను, ప్రశాంత రూపంగాను, పరమార్థ చిద్రూపముకంటే ఏమాత్రం వేరుకానట్టిదిగాను దర్శిస్తూ ఉంటాడు.
ఈ జగత్తంతా కూడా అట్టి శుద్ధ నిరావరణ హిరణ్యగర్భ చైతన్యము సంకల్ప చమత్కారమే అయివున్నది. ఇదంతా సంకల్ప చమత్కారమే కనుక…. సంకల్ప నగరము, స్వపాంతర్గతమైన మహాపురము అయి కూడా, భౌతికంగా (ఘనీభూతమైన అభ్యాసవశంచేత) ఇట్లా కనిపిస్తోంది.
ఈ సృష్టికి కర్తయగు బ్రహ్మదేవుని (హిరణ్యగర్భుని) వలెనే శుద్ధాత్ములగు తదితరులు కూడా వర-శాపముల రూపములచే దేనిని ఏ ప్రకారంగా సంకల్పిస్తారో….. అది తదితరులపట్ల ఆ విధంగానే శీఘ్రంగా అగుచున్నది. నిర్మల హృదయులు ఏది ఎట్లు సంకల్పిస్తే అది అట్లే ఈ సంకల్ప నిర్మిత జగత్తులో సంభవిస్తూ ఉంటోంది.
ఒక బాలుడు తన ఊహాలోకంలో "శిలలు ఎగురుచున్నాయి” అని ఊహించి, అది అట్లే సత్యముగా అనుభూతిపొందుతూ ఉంటాడు. అట్లే శీఘ్రంగా అనుభవము పొందుతూ ఉంటాడు చూచావా? అదే ప్రకారంగా … హిరణ్యగర్భుడు మొదలైన నిరావరణ విజ్ఞాత్ములు వరము - -
శాపము - - మొదలైన ’నిజ సంకల్పము’ను తమకు అభిన్నమైన సత్యముగా ఎరుగుచున్నారు. ఒక పిల్లవాడు స్వప్నంలోనో, సంకల్పంలోనో “నేను ఇసుకను గుప్పిటలో తీసుకొని నలుపుతుంటే తైలం ధారగా కారుతోంది” అని ఊహిస్తూ ఉంటే,… అది అట్లే ఆ పిల్లవానికి అనుభూతమౌతుంది చూచావా? అట్లాగే కల్పనా జనితములగు సృష్ట్యాది సంకల్పముల చమత్కారంచే ’వరము-శాపము’ ఇక్కడ సిద్ధిస్తున్నాయి. శుద్ధాత్మజ్ఞాన బుద్ధిగలవాని సంకల్ప రూపమైన వరము శాపము ఇక్కడ సిద్ధిస్తోంది. అట్లా కాకుండా… ఆవరణ సహితమైన జ్ఞానము (ఉదా : నా వారు, నీ వారు, నాది, నీది, పాపులు, పుణ్యులు, మంచివారు, చెడ్డవారు… ఈ రూపంలో) కలవారికి భేదబుద్ధి నశించటం లేదు. వారు ద్వైతభావముతో కూడి ఉంటున్నారు. అట్టివారి ద్వైత సంకల్ప వాసనలు కారణంగా వారి వర - శాపాలు సిద్ధించటం లేదు.
నిరావరణ యుక్తులగు బ్రహ్మదేవుడు మొదలైన సృష్టి సంకల్ప దృఢకల్పన పూర్వము ఎట్లా ఉన్నదో… ఇప్పుడూ అట్లాగే ఉన్నది. అది అంతటి మరొక దృఢకల్పనచే ప్రయత్నపూర్వకంగా కావించబడనంతవరకు… ఆ సంకల్ప ఫలప్రదమైనదంతా అట్లే కొనసాగుతూ ఉంటుంది.
ఓ రామచంద్రా! అవయవసహితమగు ఈ శరీరాది పదార్థములకు ఏ విధంగా అయితే అవయవక్రమము స్థితి కలిగి ఉంటుందో… అట్లాగే అవయవ రహితము - స్థిరము అయినట్టి బ్రహ్మమునందు ఈ ద్వైత - - ఏకత్వాదులు, వర - శాపాదులు స్థితి కలిగి ఉన్నాయి. శ్రీరాముడు : హే మహర్షీ! ఆవరణ రహితమగు జ్ఞానము కలవారు, తపో ధర్మాది నిరతులు అగు వర -శాపములు ఎట్లా ప్రదర్శిస్తున్నారు? అవి ఎట్లా సత్యములగుచున్నాయి? ఈ విషయాలు తెలియ జేయమని మరల ప్రార్థిస్తున్నాను.
Page:628
శ్రీ వసిష్ఠ మహర్షి : చిద్రూపము, నిర్మల బ్రహ్మ స్వరూపము అగు బ్రహ్మదేవుడు ఏ రీతిగా అయితే సృష్ట్యాది యందు “తపస్సు - ధర్మము మొదలైనవాటి ప్రభావం చేత వరశాపాదులు సత్యములగుగాక!” …అని దేనిని సంకల్పించారో …. అది ఆత్మ అట్లే అనుభవించుచున్నది. అద్దానికి ఎట్టి ప్రతిబంధకము ఉండటం లేదు. ఆ ప్రజాపతియగు బ్రహ్మదేవుడు ఆత్మరూపము - సత్యము అగు బ్రహ్మమును అనుభవ - - అనుభూతి పూర్వకంగా ఎరిగియుండుటచే… ఆతడు సత్య సంకల్పయుక్తుడై వెలయుచున్నాడు. కానీ… ద్రవత్వము కంటే జలము వేరుకాదు కదా! బ్రహ్మదేవుడు బ్రహ్మము కంటే వేరుకాదు. కాబట్టి ప్రథమ ప్రజాపతియగు బ్రహ్మదేవుడు దేనిని ఎట్లు సంకల్పిస్తున్నాడో… అది శీఘ్రంగా అట్లే అవుతోంది.
తదేదం కల్పనమ్ జగత్ - ఈ జగత్తు ఆతని కల్పనయే అయివున్నది. అయితే… ఒక్క
విషయం.
నిరాధారం నిరాలంబం వ్యోమాత్మ వ్యోమ్ని భాసతే | దుర్దృష్టేరివ కేశోణ్ణం దృష్ట ముక్తావలీవచ ॥
కంటికి దోషం కలవారికి ఆకాశంలో కేశముల ముత్యముల సమూహం కనబడుతూ ఉంటుంది చూచావా? నిరాధారము నిరాలంబము అయినట్టి చిదాకాశమే చిదాకాశమున జగదాకారంగా భాసిస్తోంది.
I +
ఆ ప్రజాపతియగు బ్రహ్మదేవుడే ప్రజలు - ధర్మము - దానము - తపస్సు - - సౌశీల్యము మొదలైన సాత్విక గుణములను, 4 వేదములను, షట్ శాస్త్రములను, సమస్త జీవజాలమును, సాంఖ్య - యోగ - పశుపతి - వైష్ణవ - ఆత్మ అనబడే పంచజ్ఞానోపదేశములగు మతములను సంకల్పించారు. ఆ తరువాత "వేదవేత్తలగు తాపసులు వాదములతోగాని, (లేక) సహజ వృత్తిచేతగాని యేది సందర్శించి చెప్పుదురో… అది వారివారికి అట్లే అగుగాక”… అని కూడా సంకల్పించారు.
మరల… ఆ బ్రహ్మదేవుడే, చిద్రూపమగు బ్రహ్మము… ఛిద్ర స్వభావయుక్తమగు ఆకాశముగా అగుగాక! చలన స్వభావయుక్తమగు వాయువుగా అగుగాక! ఉష్ణ స్వభావమగు అగ్నిగా అగుగాక! ద్రవ స్వభావమగు జలముగా ఏర్పడుగాక! కఠిన స్వభావమగు పృథివిగా అగుగాక!…ఈ ప్రకారంగా సమస్త పదార్థముల స్వభావములను ఆ బ్రహ్మదేవుడే తన మనోవీథిలో సంకల్పించియున్నారు. అట్టి సమస్త కల్పన కూడా “ప్రజాపతి వేషధారి” అగు చైతన్యము చేతనే నిర్వర్తించబడుతోంది. అట్టి ప్రజాపతిరూప చిదాకాశముచేత కల్పించబడినదే ఈ జగత్తులో ప్రతి జీవియు అనుభవించడం జరుగుతోంది. అదియే నీ చేత - నా చేత అందరి చేత పొందబడుతోంది.
ఓ రామచంద్రా! ఒక స్వప్న ద్రష్ట తన స్వప్న చైతన్య రూపమును అసద్రూపములే అగు స్వప్న పదార్థములుగా సద్రూపమువలె పొందుచున్నాడు కదా! అట్లాగే చిదాకాశము ఏ వస్తువును ఎట్లు ఎరుగుచున్నదో… అట్లే పొందుచున్నది. సంకల్ప నగరంలో శిల్పం గాలిలోకి లేచి నృత్యం
Page:629
చేస్తున్నదని అంటే అందులో ఆశ్చర్యం ఉండదు కదా! ‘జగత్తు’ అనే సంకల్ప నగరంలో బ్రహ్మదేవుని అధికార ప్రారబ్ధ భోగ రూపమైన ఇచ్ఛ’సత్యము’ గానే భాసిస్తోంది. శుద్ధ చిత్ స్వభావము దేనిని ఏ రీతిగా ఎరుగునో అద్దానిని - - ఏ అశుద్ధచిత్ స్వభావము మరొక తీరుగా మరల్చజాలదు.
అశుద్ధ చిత్ స్వభావుడు మాయాగ్రస్తుడు అగు జీవుడు… వర్తమాన జాగ్రత్నందు, స్వప్నమునందు కూడా… తన అభ్యాస దార్జ్యముచే ’సమస్తము సత్యము’ అను రూపముననే గాంచుచున్నాడు. ఎందుచేతనంటావా? “నేను అల్పుడను, స్వల్పుడను, దేహమాత్రుడను”… ఇత్యాదిగా అస్వతంత్ర కల్పన యొక్క చిరభ్యాసంచేత “ఇది కల్పనా మాత్రము“ అనబడు సత్యానుభవమునకు విరుద్ధ కల్పన గురించిన స్వాతంత్ర్యము లేకయే ఉన్నాడు. ”నేను కర్మలచే - పరిస్థితులచే వ్యవహారములచే - జన్మమృత్యువులచే - పాపపుణ్యములచే బద్ధుడను”… అను రూపంగా దృఢమైన బంధమును అనుభవించుచున్నాడు. అట్టి బంధమునే స్వప్నంలో కూడా అనుభవిస్తున్నాడు.
కానీ… ఏకము - సత్యము అయినట్టి చిదాకాశమే సదా ద్రష్ట - - దర్శనము - దృశ్యము అగు త్రిపుటీ రూపమును గాంచుచు… ఈ రీతిగా జగదాకారంగా భాసిస్తోంది. అంతేగాని ఈ జీవుడు చిదాకాశమునకు వేరైనవాడు కాదు. అంతేకాదు.
ద్రష్ట, దృశ్యము… ఈ రెండూ కూడాఏక రూపమే అయివున్నాయి. ఎట్లా అంటావా?… ఏకము - సర్వవ్యాపకము అగు ‘చిత్సత్త’ చేతనే అవి రెండూ కూడా (ద్రష్ట - దృశ్యము కూడా) ఉపజీవింపబడుచున్నాయి. కాబట్టి… చిదాకాశము తన ఇచ్ఛానుసారమే ద్రష్టత్వము - దృశ్యత్వము గాంచుచు… తాను దానిని సత్యముగానే పొందుచున్నది.
వాయువునకు చలనమే అవయవ రూపం. జలమునకు ద్రవత్వమే అవయవ రూపం. బ్రహ్మమునకు మాయా శక్తిత్వమే అవయవ రూపం! ఈ రీతిగా ఈ జగత్తు విరాట్ పురుషుని అవయవమే అయివున్నది. అట్టి విరాట్ పురుషునకు “నేను బ్రహ్మమునే” అను నిర్మలానుభవం ఉండనే ఉన్నది. ఈ జగత్తో … విరాట్ పురుషుని శరీరమే కదా! కాబట్టి ఆకాశము - శూన్యత్వముల వలె… బ్రహ్మమునకు ఈ జగత్తుకు భేదమే లేదు.
అందుచేత… పర్వతము పై భాగం నుండి క్రిందకు గంగాజలధారలు పడుచున్నప్పుడు జలతుంపరలు గాలిలోకి ఎగసి తిరిగి జలంలోనే లయం అవుతూ ఉంటాయి. చూచావా? అట్లా లయంకాక ముందో? … జలకణములు గాలిలో భాసిస్తూ ఉంటాయి. ఈ విచిత్ర జగద్భేదములన్న అట్టివే! ఎందుకంటే ఇవన్నీ బ్రహ్మమునందే బయల్వెడలి మరల ఎప్పుడో విలీనం అవుతూ ఉన్నాయి. కాకపోతే… ఈ ఉపమాలంకారం ఒక్క భేదం మాత్రం కలిగి ఉన్నది. జలకణములేమో మనోబుధ్యహంకార రహితములై ఉన్నాయి. ఇక బ్రహ్మ సంవిత్తో … స్వయంగా నిజశరీరములందు మనస్సు - బుద్ధి - అహంకారముల కల్పనను గావించుకొని… తనకు భోగ్యమగుచున్న ఈ సృష్టిని (జలం ద్రవత్వమును అంగీకరిస్తున్నట్లుగా) అంగీకరిస్తోంది. ఓ రామచంద్రా! మనో బుద్ధి జనితమైన అజ్ఞానము యొక్క “దుద్బోధ” చేతనే ఈ జగత్తు ఆత్మకు వేరైనదన్నట్లుగా విద్యమానమౌతోంది.
Page:630
నేను అట్టి దుర్బోధరహితుడను. నా యొక్క దృష్టియందు … జగత్ నిర్మాణ కర్మ కేవలము కారణ వర్జితము, అద్వైత రూపము. (ఇది సర్వదా బ్రాహ్మమే కాబట్టి) ఇతఃపూర్వంగాని, ఇప్పుడుగాని, ఇక ముందుగాని ఏమాత్రం జనించనిదే అయివున్నది. మొదలే జనించని ఈ జగత్తును “బ్రహ్మదేవుడు ఎందుకు సృష్టించాడు?”… అనే ప్రశ్నయే ఉండదు. (స్వప్నంలో) “నేను, నీవు, మీరు, మేము, వీరు, వారు, ఇది, అది, ఇక్కడ, అక్కడ, ఇప్పుడు, అప్పుడు, ఇటు, అటు, ఎందుకు, ఇందుకు, అందుకు”… అని దేనిని ఎట్లు ఎరుగుచున్నామో అట్లే అసద్రూపములైనప్పటికీ సద్రూపములవలె నీ స్వప్నంలో నీవు, నా స్వప్నంలో నేను ఎరుగుచున్నాము కదా! అట్లాగే… సృష్ట్యాదిలో బ్రహ్మదేవ వేషధారియగు చిదాకాశము ఏది ఎట్లు ఎరుగుచున్నదో అది అసద్రూపమైన్పటికీ సద్రూపముగా ఎరుగుచున్నది. ఇక వ్యష్టిరూప వేషధారిఅగు చిదాకాశము “జగన్నాటకము”… అనే సందర్భంలో తత్ సానుకూల్యంగా "ఇది సద్రూపమే”… అని అంగీకారత్వం వహించి మాయానాటకంలో పాత్రధారి అగుచున్నాడు.
ఇది ఇట్లుండగా… పరమాత్మ యొక్క సత్తా మనోబుద్ధ్యాది రహితమై, నిర్విక్షేపమై నిశ్చల దీపకాంతివలె సదా చిద్రూపముగా అలరారుచున్నది. ఏ విధంగా ఈ శరీరమున మనోబుద్ధి రహితమగు మృతావస్థ - సంభవిస్తోందో… ఏ విధంగా శిలలందు జడసత్త విక్షేప రాహిత్యము కనబడుతోందో… చిద్రూపము యొక్క మనోబుద్ధి రాహిత్యము - విక్షేప రాహిత్యము అటువంటిది. అనగా (అవగాహన కొరకై) వాటితో పోల్చవచ్చు.
ఒకే నిద్రయందు స్వప్నం, సుషుప్తి ఉన్నట్లే… ఏకైక బ్రహ్మమునందు సృష్టి, ప్రళయం ఉన్నాయి. చేతన రూపుడే అయివుండి కూడా ఈ మనుజుడు గాఢనిద్రా సమయంలో “సుషుప్త స్థితి - - ఒక శిలయొక్క స్థితి”ని అనుభవిస్తున్నాడు చూచావా? అట్లాగే పరమాత్మ కూడా ఈ జడ పదార్థముల స్థితి అనుభవించుచున్నాడు.
ఒకడు ఎక్కడో మరొక విషయం పై ఏకాగ్రతతో కూడిన ధ్యాస కలిగియున్నప్పుడు (అనగా) ఆతని ధ్యాస ప్రీతిపూర్వకంగా మరెక్కడో సంలగ్నమై ఉన్నప్పుడు తన బొటన వ్రేలును గాని, భుజములనుగాని తాకుచున్న పిల్లగాలుల వస్తువుల స్పర్శ - అనుభవమునకు రావు కదా! అట్లాగే శిలలందు ఆత్మ విద్యమానమై ఉండికూడా అవిద్యమానప్రాయమే అగుచున్నది. ఆకాశము
- - శిల - జలాదులు ఆయా ఆకాశ దేవత - - శిలాదేవత - జలదేవతలకు “ఇదంతా మా శరీరమే”
అని అనుభూతం అగుచున్నది. అట్లాగే చిత్త రహితులగు మాకు సృష్టికాలంలో “ఈ సృష్టి అంతా మా శరీరమే” … అనురూపంగా అనుభూతమౌతోంది. అఖండము - అనంతము అగు కాలమునందు
రాత్రి - - పగలు - అసంఖ్యాకంగా ఏర్పడుచున్నట్లుగా… అనంత స్వరూపుడగు పరమాత్మ యందు అసంఖ్యాకములగు సృష్టి - - ప్రళయములు భాసిస్తున్నాయి.
ఆలోక రూప మనన అనుభవ ఈషణ ఇచ్చా ముక్తాత్మని స్ఫురతి వారి ఘనే స్వభావాత్ ఆవర్త వీచి వలయాది యథా తథాయం శాంతే పరే స్ఫురతి సంహృతి సర్గపూగః ||
Page:631
ఓ రామచంద్రా! ఈ దృశ్యాది వ్యవహారములు ఉండటంచేత కలత చెందవలసినదేమున్నది? ఆత్మ సర్వదా యథాతథం కదా! సముద్రమంతా శాంతమగు జలమాత్రమే అయినప్పటికీ… స్వభావ సిద్ధంగానే ఆ సముద్ర జలంలో జలమునకు అనన్యంగా ఆవర్తములు - తరంగములు - వలయములు - - బుడగలు మొదలైనవన్నీ ఏర్పడుచూ స్ఫురిస్తున్నాయి కదా! అట్లాగే పరమాత్మయొక్క స్వరూపము పరమశాంతము - నిర్లేపము నిర్లిప్తము అయివుండగా, అద్దానియందు స్వభావసిద్ధంగానే విషయముల యొక్క దర్శనములు, వాటి వాటి యొక్క రూపములు, మననములు,
అనుభవములు - ఈషణములు - ఇచ్ఛలు - - ఇవన్నీ ఏర్పడుచున్నాయి. జలము సర్వదా
నిరాకారమేగా! - అదేవిధంగా ఆత్మయందు ఇవన్నీ లేవు. ఒకవేళ ఉంటే అవి ఆత్మకు అభిన్నం. సృష్టి లయములతో సహా సర్వము ఆత్మయొక్క స్వభావమే అయి ఉండి, ఆత్మకు అభిన్నమే అయివుండి, ఆత్మ సర్వదా వీటన్నిటికీ అప్రమేయమై, అతీతమై అనునిత్య నిర్మలమైయున్నది. ప్రతిజీవుడు స్వతహాగా, నిర్ద్వంద్వంగా ఆత్మస్వరూపుడే అయివున్నాడు. ఇందులో సందేహించవలసిన దేమీలేనే లేదు.
ఓ సర్వజనులారా! మీరంతా నిర్మలము, అఖండము, జగత్తుచే అస్పృశ్యము - అగు ఆత్మయే స్వరూపముగా కలిగియున్నారు. అట్టి ఆత్మయే పరమసత్యమై ఉండగా ఇక తక్కిన సృష్టి-ప్రళయాలు ఆత్మయొక్క లీలావిన్యాసములు మాత్రమే! స్వభావమే అయి వున్నాయి! ఆత్మయే మీ స్వభావం! ఈ జగత్తు మీ శరీరమైనప్పటికీ, శరీరమునకు శరీరి వేరే అయివున్నట్లు… మీరు నిశ్చలము సర్వగతము అగు ఆత్మ స్వరూపములే అయివున్నారు. ఆ మీ ఆత్మ స్వరూపమును సర్వదా ఆస్వాదించి ఉండెదరుగాక! అట్టి మీ ఆత్మ స్వరూపమును ఋషులమగు మేము సదా ఉపాసిస్తున్నాం.
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ అసంఖ్యాక పదార్థముల యొక్క నియతి (కార్యకారణ భావాది నియమము)… ఎట్లా సంభవిస్తోంది? “అగ్నికి ఉష్ణత్వం, జలమునకు ద్రవత్వం, తదితర పదార్థములకు ఆయా స్వభావం”… ఇవన్నీ ఒకే విధంగా, సుస్థిరంగా, సుదీర్ఘంగా … ఏ కారణం చేత స్థితి పొంది ఉంటున్నాయి? ఎందుకంటే… జాగ్రత్ పదార్థాలలో నియతి కనిపిస్తోంది. కాని స్వప్నంలోను - మనోరథంలోను (ఊహాలోకంలోను) అటువంటి నియతి కనబడటంలేదు కదా! జాగ్రత్ పదార్థాలకు ఎట్లా ఈ నియతి ఏర్పడుతోంది? ఉదాహరణకు అసంఖ్యాకులగు దేవతలు ఉన్నప్పటికీ… అందు సూర్యుడు మాత్రమే మహా ప్రచండ ప్రకాశయుక్తుడై వర్తిస్తున్నారు. దివారాత్రములు సమయ నిర్ణయం (రోజుకు 24 గంటలు… ఇట్లా) ఏర్పడి ఉంటోంది. ఈ నియతి ఎట్లా ఏర్పడి ఎట్లా కొనసాగుతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! స్వప్నంలో ఏఏ పదార్థములు ఏఏ రూపంచే భావిస్తున్నాయో …అదంతా కాకతాళీయ న్యాయంచే అట్లా భాసిస్తోంది కదా! అట్లాగే బ్రహ్మదేవునికి ఆదిసృష్టి
Page:632
యందు కాకతాళీయ న్యాయం చేత ఏ పదార్థము ఏ రీతిగా స్వయంగా భాసిస్తోందో… అదే ప్రకారంగా అర్థ - క్రియాదులతో నియతమై నేటివరకు స్థితినొంది ఉండటం జరుగుతోంది. అట్లా నియతమై, కార్య-కారణ రూపంతో యథారీతిగా వర్తిస్తున్న దానినే "జగత్తు” అని పిలుస్తున్నాం. కనుక, పదార్థముల యొక్క స్వభావములకు బ్రహ్మదేవుని ఇచ్ఛయే హేతువు!
ఓ రామచంద్రా! ఈశ్వరుని యొక్క ఇచ్ఛయే ఈ కనబడేదంతా! సర్వశక్తిమంతుడగు ఈశ్వరుని “సత్య సంకల్ప సంవిత్తు”… యొక్క చమత్కారమే ఇది. ఆ సత్య సంకల్ప సంవిత్తుచే ఏఏ పదార్థము ఏఏ ప్రకారంగా ‘సృష్ట్యాది’ యందు భాసించిందో… అదియే ఈ ప్రకారంగా “నియతి” రూపంగా ఉంటోంది. అయితే… సంవిత్తు యొక్క భావనా మాత్రమే కదా ఇదంతా? ఆలోచనలచే ఆలోచించు వాడు బంధింపబడటమేమిటి? “ఒకని భావనచే ఆ భావికుడు బంధించబడుచున్నాడు!“… అనునది ఎంత అర్థరహితమో… ”నిర్విషయమగు సంవిత్తు నియతిచే బద్ధము”… అనునది అంతే అర్థరహితం! మాయారూప మాత్రమైన ఈ జగత్తు బ్రహ్మమునందు యథారీతిగా ఈ స్థితిని కలిగియుండి… చిరకాలం అద్దాని చైతన్య శక్తిచే భాసిస్తూ… ప్రళయకాలంలో ఇది సూక్ష్మత్వం పొందినదై ‘భాసించనిదే’ అగుచున్నది. నిద్ర లేవగానే అనేక ప్రాపంచిక విషయాలు అనుభవ మగుచుండగా… గాఢనిద్రా దశలో అవన్నీ సూక్ష్మస్థితిని పొంది ‘రహితం’ అవటం ప్రతిజీవునికి దైనందిన అనుభవమే కదా! ఇదీ అట్టిదే! ఈ విధంగా సర్వ వస్తువుల యొక్క “అర్థ క్రియాశక్తి” ఆత్మ యొక్క విలక్షణ లక్షణమే కాబట్టి, ఆత్మవలెనే ఇది కూడా అనాదియే అయివున్నది. ఆత్మయొక్క అనాదియగు జగత్ కల్పనా సందర్శన విశేషమే ‘నియతి’ అనే శబ్దముచే ఉద్దేశింపబడుతోంది.
ఏ బ్రహ్మమైతే స్వయంగా “ఇది అగ్ని-ఉష్ణము, ఇది జలము- శీతలము” … ఈ ప్రకారంగా భాసిస్తోందో… అట్టి సృష్టి - సంహార రూపధారియగు బ్రహ్మమే ‘నియతి’గా అనుభూతమగుచున్నది. ’నియతి’ అని వర్ణించబడేది అదియే!
ఓ రామచంద్రా! జలం కంటే ద్రవత్వం వేరా? కానేకాదు కదా! ఏ స్ఫురణ అయితే జాగ్రత్ లోను, స్వప్నంలోను, సుషుప్తిలోను స్వయంగా సంభవిస్తోందో… అది “నిర్మలం, ఏకం” అయినట్టి చిద్రూప బ్రహ్మం కంటే వేరుకాదు సుమా! ఆ స్ఫురణయే నియతి అనుభూతిని సిద్ధింపజేస్తోంది. యథా శూన్యత్వమ్ ఆకాశే, కర్పూరే సౌరభం యథా,
యదౌష్ట్యమాతపే, సాన్యజ్జాగ్రదాది తథా చితి ॥
ఆకాశమునకు శూన్యత్వం, కర్పూరమునకు సుగంధం, అగ్నికి ఉష్ణత్వం… ఎట్లా సహజమో, ఏ విధంగా అయితే, ఆ శూన్యత్వ, సుగంధ, ఉష్ణత్వాదులు - ఆకాశ, కర్పూర, అగ్నులకు వేరైనవి కాకయే ఉన్నాయో… అట్లాగే జాగ్రత్ - స్వప్న సుషుప్తులు చైతన్యమునకు వేరైనవి కావు. చిన్మాత్రాకాశ స్వరూపము - ఏకము అగు బ్రహ్మమునందు … అద్దానికి అభిన్నమైన సత్త కలిగి ఈ సృష్టి - స్థితి
ప్రళయములు అనాది ప్రవాహ రూపంగా ఏర్పడి ఉంటున్నాయి. కాబట్టే… ఇద్దాని యందు ఇవన్నీ “నియతము” అనబడే అర్ధ క్రియా సామర్థ్యము కలిగియున్నవై ఉండగలుగుచున్నాయి.
Page:633
సృష్టి దేనినైతే “సృష్టి ” అని - - చైతన్యము తన యొక్క స్ఫురణ ఇది కదా… ఎరుగుచున్నదో అదియే సృష్టి రూపమున అలరారుచున్నది. అదియే ‘నియతి’ రూపమున ప్రదర్శితమౌతోంది.
క్షణ - కల్పములు - చైతన్యము యొక్క స్ఫురణ దేనిని చూచి “ఇది కల్పము” అని ఎరుగుచున్నదో …అది వాస్తవానికి క్షణమే అయినప్పటికీ ’కల్పము’ రూపము అయి ఆ చైతన్య స్ఫురణచే
పొందబడుతోంది.
అట్లాగే, ఈ చైతన్యము దేనిపట్ల ఏ ఉద్దేశముతో కూడినదై ప్రసరిస్తోందో అదియే సంసారము, బంధము, స్వస్వరూపము, మంచి, చెడు, అభియోగము, వాస్తవము, అవాస్తవము, స్వల్పము, దుర్లభము, ఇది, అది, ఇట్లు, అట్లు, ఇట్లు కాదు, అట్లు కాదు… ఈ విధంగా ఆయా రూపములుగా (ఆ చైతన్యం యొక్క ఉద్దేశ స్ఫురణయే) అగుచున్నది. అట్టి చైతన్య స్ఫురణ ఏఏ రూపాలుగా దాల్చుచున్నదో… అదియే “నియతి”.
“సర్గోయమ్ ఇతి” తద్బుద్ధం క్షణం యత్కచనం చితః |
“కల్పోయమ్ ఇతి” తద్భుద్ధం క్షణం యత్కచనం చితః ॥
చితః (చిత్ స్ఫురణ)… దేనినైతే “ఇది సృష్టి” అని భావన చేస్తోందో… అది ’జగత్తు’గా అనుభవమౌతోంది. అది క్షణమును ‘కల్పము’ అని తలిస్తే అది కల్పము అవుతుంది. కల్పమును “ఇది క్షణికం” అని భావిస్తే అది క్షణికమాత్రమే అవుతుంది. కాబట్టి… రామచంద్రా! చైతన్యము యొక్క స్ఫురణను అనుసరించే సర్వ నియమ వ్యవస్థ వర్తించటం జరుగుతోంది.
శ్రీరాముడు : స్వామీ! మహర్షీ! మీరు చెప్పేది ఆశ్చర్యంగా ఉన్నదే! ఈ జగత్తులో కనిపించే వస్తు
వ్యావహారిక - - కాల - పరస్పర సంబంధములు మొదలైన వాటితో కూడిన “నియతి" అనేది స్వకీయమైన చైతన్యము యొక్క స్ఫురణ (లేక) ‘ఎరుక’ యొక్క చమత్కారమేనంటారా? ఇది మీరు చెప్పిన విధంగా అనిపించటం లేదే?
శ్రీ వసిష్ఠ మహర్షి : స్వప్నంలో కాలము, నియతి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! ఆ కాలమును నియమించిందెవరు? స్వప్న ద్రష్టయే కదా! ఆ స్వప్నంలోని సంఘటనలు, వాటికి అర్థాలు కల్పిస్తున్న దెవరు? స్వప్నకల్పనచేసే స్వప్న ద్రష్టయొక్క స్వప్న చైతన్య స్ఫురణ కాకుండా మరొకరెవరో ఆకాశంలో ఉండి నీ స్వప్నంలో వస్తువు, క్రియ, కాలము, వ్యవహారము, భయము, ఆశ్చర్యము, దుఃఖము మొదలైనవి కల్పించటం లేదే! స్వప్నంలో ఏ చిన్మాత్ర స్ఫురణ కలదో… అదే కాలము. అదే క్రియ. అదే ఆ స్వప్నంలోని తదితరములన్నీ కూడా కదా! స్వప్నంలోని ఆకాశం-ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కూడా అదియే! ఇంతెందుకు? “స్వప్నంలో కనిపించేదంతా కూడా ఆమూలాగ్రం స్వప్న చైతన్య స్ఫురణచే కల్పించబడి, ఆ స్వప్న చైతన్య స్ఫురణచే ఆయా రూపములుగా ‘నిజమే’ అన్నట్లుగా అనుభవించబడుతోంది” … అనేమాట ఎవరైనా కాదనగలరా?
ఇప్పుడు జాగ్రత్తుకు వద్దాం. ఇక్కడి బాహ్యమందలి రూపాదులు, అభ్యంతరమందలి మనః సంకల్పాదులు, ఇక్కడ అనుభూతమగుచున్న దేశ కాల క్రియాదులు… ఇవన్నీ కూడా అదే చైతన్య స్ఫురణ యొక్క ’జాగ్రత్ కల్పన’లోని విభాగములే!
Page:634
ఏ ‘కాలము’ చైతన్యముచే స్ఫురింపజేయబడుచున్నదో, ఏఏ ‘పదార్థములు’ చైతన్యముచే ‘ఇది ఇట్లు’ అని కల్పన గావించబడుచున్నదో … అదియే ‘నియతి’.
అట్టి ‘నియతి’ యొక్క రూపమంతా కూడా చైతన్యము యొక్క స్ఫురణ మాత్రమే అయివున్నది. ఒక నిమిషము మొదలుకొని ఒక కల్పము వరకు ఉండునట్టి ఏఏ పదార్థములైతే ప్రదర్శితమగు చున్నాయో… అవన్నీ కూడా (ఉదా: అగ్నికి ఉష్ణత్వం, జలమునకు శీతలత్వం మొదలైనవి) ఏ ఏకైక స్ఫురణచే అట్లట్లు పొందబడుచున్నాయో… అదియే “స్వభావము” - - అని స్వభావ తత్త్వమును బాగుగా ఎరిగిన విశాల బుద్ధులగు మహనీయులు నిర్వచిస్తున్నారు. ఒకే అగ్ని దేశ కాల
భేదములచే అనేక ప్రకారములుగా స్థితినొంది ఉండవచ్చుగాక! అయితే ఏం? అది తన యొక్క ‘ఉష్ణత్వము - ప్రకాశత్వము’ అనే సహజ లక్షణాలు త్యజించి ఉంటోందా? లేదు కదా! అట్లాగే - చైతన్యము అంశరూపుడగు ఒకే జీవుడు అనేక దేశ -కాలములలో మనుష్య - దేవ - పశు - పక్షి ఇత్యాది అనేక రూపములుగా స్థితి పొంది ఉంటే ఉండవచ్చుగాక! ఆ జీవుడు వాస్తవానికి సర్వానుగతమైన తన చిత్స్వరూపమును ఏమాత్రం త్యజించటమే లేదు.
చైతన్య స్ఫురణచే జగత్ నియతి పొందబడుచుండగా… చైతన్య స్ఫురణ నిర్విషయ చైతన్యము కంటే వేరు కాదు.
స్వభావము : ఏఏ పదార్థముల స్వభావము ఇట్లు కనిపిస్తోందో… అదంతా కూడా, ఎటువంటి దంటే… చిన్మయమగు పరబ్రహ్మమున, అట్టి పరబ్రహ్మముచే… ’స్వదేహం’తో పోల్చతగ్గ వృత్తి భేదములందు. ఏ ఏ వృత్తులకు ఏఏ ఆకార కల్పన గావించబడిందో… ఆ ఆకార కల్పనయే ఈ పృథివి - ఆకాశం మొదలైన వాటియొక్క స్వభావం అయివున్నది. “చిన్మయ - సంకల్పవృత్తి” అనునది కాకుండా ఈ భూమి-ఆకాశం మొదలైన వాటికి వేరే రూపాలే లేవు!
వాస్తవానికి నేల, నీరు, అగ్ని, వాయువు, ఆకాశముల పారమార్థిక స్వభావం అధిష్ఠానమగు చిదాకాశమే అయివున్నది. క్రమంగా ఆ పృథివి నీరు మొదలైనవి అనేకమైనట్టి వేరు వేరు కార్యములకు (పదార్థాలకు కారణరూపమై ఉంటున్నాయి. స్వప్నంలోని వస్తు ఆకారములకు కారణకారణంలాగా స్వప్న చైతన్యమే ఏర్పడి ఉండటం లేదా? ఈ నేల - ఆకాశం మొదలైనవాటి కారణ కారణం చిదాకాశ స్ఫురణయే!
ఈ విధంగా ఈ నేల - ఆకాశం మొదలైనవి స్వప్న సదృశమే! అట్టి స్వప్న సదృశ పదార్థములలో ఒకటైన సాకార కఠిన పదార్థం అగు ఈ భూమి సర్వ జనులకు నివాసయోగ్యమై, “మహత్తరమైన పీఠభూమి” అయి మహారాజువలె సర్వ జీవప్రదంగా చెన్నొందుతోంది. అట్లాగే… అన్నిటికీ ఆదికారణం చైతన్యము - చైతన్యము యొక్క జాగృత్ విభాగ చమత్కారం.
గంగ మొదలైన నదీ జలములకు సముద్రం కారణం, అగ్ని మొదలైన తేజోమయ పదార్థములకు - సూర్యుడు కారణం, చలనములన్నిటికీ - వాయువు కారణం, శూన్యత్వమునకు - ఆకాశము కారణం… ఇవన్నీ కార్య కారణములుగా అయి చెన్నొందుచున్నాయి. ఈ పంచ
Page:635
భూతముల కలయికలచే రకరకాల పదార్థాలు - దేహాలు ఆకారాలు, వాటి వాటి ధర్మాలు ఈ దృశ్యంలో తాండవిస్తున్నాయి. ఈ విధంగా ఈ కనబడే సర్వమునందు బ్రహ్మమే అనుగతమైనట్టి ‘సత్స్వభావం’ అయివున్నది. మరింక “సూర్యగోళం ఎట్లా ఏర్పడింది? చంద్రబింబం ఎక్కడి నుండి వచ్చింది?”… అనేవి పెద్ద విశేషాలెట్లా అవుతాయి?
చైతన్యము స్వయంప్రకాశము, సర్వప్రకాశకము, సర్వజ్ఞము కూడా! అట్టి చైతన్యము యొక్క సంవిత్తు సర్వ వ్యాపకమై, సర్వరూపమై, స్వస్వరూపంగాకూడా (దృశ్యము, ద్రష్టగా కూడా) సర్వదా ఏర్పడి ఉంటోందని విజ్ఞులు ఎరిగియే ఉన్నారు. చిదాకాశమే తనయొక్క స్వరూపంగా కలిగియున్నట్టి “చతుర్ముఖ బ్రహ్మ” అనే చిన్న పిల్లవానియొక్క చిలిపి ఊహలే ఈ సర్వ దృశ్యాంతర్గత సర్వ విశేషాలు కూడా! ఆతని స్ఫురణ రూపమే ఈ ఆకాశము - భూమి…. ఇవన్నీ కూడా! ఆటలో అంతా కల్పించబడి… ఆట ముగియగానే అందులో సర్వ విశేషాలు మటుమాయమౌతాయి చూచావా? అట్లాగే… ఎప్పుడైతే సర్వజ్ఞుడు - సంవిత్స్వరూపుడు అయిన ఆ బ్రహ్మదేవుని భావనా సంరంభం అయినట్టి ఈ స్థూల - - సూక్ష్మ ప్రపంచము ఉపసంహరించబడుతుందో… అప్పుడు (ఇక్కడి సంవిత్ స్వరూపము యొక్క అంగవిన్యాసము వంటి) ఈ జగత్ చమత్కారం (ఏ ఆత్మయందు బయల్వెడలినదో)… అద్దాని యందే లయమై పోవుచున్నది.
సాలెపురుగు తన సంకల్ప బలంచేత బాహ్య సాధనములు లేకుండానే కళాత్మకంగా ’సాలెగూడు’ అనే చిత్ర విచిత్రాకారమైన వల కల్పించుచున్నది చూచావా? అట్లాగే బ్రహ్మదేవుని సంకల్ప రచనగా ఈ జ్యోతిశ్చక్రము రచించబడింది. ఆ జ్యోతిశ్చక్రంలో సూర్యగోళం యొక్క గతిభేదం, ఉత్తరాయన
దక్షిణాయనాలు, రాత్రింబవళ్ళు… ఇవన్నీ అల్పకాలిక - దీర్ఘకాలిక విశేషాలతో కూడిన కాలచక్రంగా ప్రవర్తిస్తోంది. వాస్తవానికి చిదాకాశమే ఈ సమస్త జ్యోతిశ్చక్రము మొదలైన సర్వ దృశ్యరూపంగా భాసిస్తోంది. అట్టి చిదాకాశ కల్పితమైన (కానీ, చిదాకాశరూపమే అయిన) జ్యోతిశ్చక్రంలో… కొన్ని సుదీర్ఘంగా మహాప్రకాశ శీలములై ఉంటున్నాయి. (ఉదా: సూర్యగోళం, నక్షత్రాలు మొదలైనవి)
మరికొన్ని అల్ప ప్రకాశశీలకములై ఉంటున్నాయి. (ఉదా: చంద్రబింబం మొదలైనవి). ఇంకొన్ని స్వయం ప్రకాశరహితములై ఉంటున్నాయి. (ఉదా: భూమి మొదలైనవి). ఈ విధంగా ఈ కనబడే పదార్థాలన్నీ చిత్ర విచిత్రములుగా భాసిస్తున్నాయి.
అయితే రామచంద్రా! జ్ఞాని యొక్క “ఆత్మౌపమ్యేవ సర్వత్రా” దృష్టికి… ఇక్కడ ఈ పదార్థ సమూహమంతా ఉత్పన్నమే అయివుండనిదై, వాస్తవముకానిదై ఉన్నది. మట్టితో తయారు చేయబడిన అనేక బొమ్మలు చూచి "మట్టి మాయమై ఈ బొమ్మలు ప్రత్యక్షమైనదెప్పుడు?” … అనే ప్రశ్న
ఎవరికి ఉదయిస్తుంది?
మంచుగడ్డ యొక్క ఆకారం చూచి "ఇది నీరు కాదు. నీరు నీటి ఆవిరి కాదు. నీటి ఆవిరి ఆకాశ స్వరూపం కాదు. మంచుగడ్డ యొక్క చతురస్రాకారము సత్యమే”… అని ఆపః ధర్మాలు
Page:636
(జలము యొక్క ధర్మాలు) తెలిసియున్నవాడు అనుకుంటున్నాడా? ఆకాశమే వాయు రూపంగా అవుతోంది. కనుక వాయువు ఆకాశరూపమే! ఆ వాయు విభాగమే నీటి ఆవిరి. ఆ నీటి ఆవిరి రూపమే జలము. ఆ జలమే ఈ మంచుగడ్డ… అని విజ్ఞుడు గ్రహించయే ఉంటున్నాడు. అదే, …మంచుగడ్డ యొక్క వివిధ స్థితులు తెలియనివాడో…. రూపముతో కూడిన “ఈ మంచుగడ్డ రూపరహితమగు వాయువు ఎట్లా అవుతుంది? అవదు. ఆ వాయువు గుణరహితమగు ఆకాశం ఎట్లా అవుతుంది? కానే కాదు!”… అని అనుకుంటున్నాడు. అయితే, జ్ఞానికి ఈ సమస్త దృశ్యము కూడా (మంచుగడ్డ యొక్క ఆకారమువలె) అనుత్పన్నమైనదై, స్వప్న సదృశ్యమై “చిదాకాశరూపం”గా భాసిస్తోంది.
ఈ జగత్ దృశ్యము ఇట్లు చిదాకాశమే అయివుండగా… ఇక ఈ “నీవు నేను” అనే జగత్తులో అంతర్గతంగా కనిపించే వస్తువులను పరిశీలిద్దాం.
నీవు - నేను అనురూపంగా (మనలో ఒక్కొక్కరికి స్వస్వరూపంగా) అనుభూతమగుచున్నది చిన్మాత్రమే! అదియే నీవు - నేను ఇత్యాదులుగా భాసిస్తోంది. ఇక మనోబుద్ధి చిత్తాది అంతరంగ విభాగాలు గురించి వేరే చెప్పేదేమున్నది? ఏ చిదాకాశం ‘నీవు- నేను’ అయినట్లుగా కనిపిస్తోందో, ఏ ’నేను-నీవు’ను ఆశ్రయించి మనోబుద్ధి చిత్తాదులు కనిపిస్తున్నాయో… ఇవన్నీ కూడా జ్ఞానికి కేవలం చిన్మాత్ర రూపంగా యథాతథమై కనిపిస్తున్నాయి. ఈ నేను - నీవు మొదలైనవి దేహములు నశించినప్పుడు తాము కూడా నశిస్తున్నాయని "ఘనీభూత జగత్ దృశ్య” దృష్టిచే అనిపిస్తే అనిపిస్తోందేమో! మంచు కరిగితే ఆకారంతో సహా ఆ పదార్థం నశించిందా? లేదే! అది జలరూపంగానో, వాయురూపంగానో మారవచ్చుగాక! ‘వినాశనము’ అనేది ఎక్కడిది? ఏ చిన్మాత్రము ’నేను-నీవు’ ఇత్యాదులుగా కనబడుతోందో…. అయ్యది వాస్తవానికి దృశ్యరూపంగా భాసించటమూ లేదు, నశించటమూ లేదు.
అనగా… స్వప్నంలో దృశ్యంలాగా… చిదాకాశమే చిదాకాశమునందు చిదాకాశ సంకల్పం చేతనే జగదాకారంగా భాసిస్తోంది. ఈ జగత్తుకు చిదాకాశం కంటే వేరైన మరింకే రూపమూ లేదు! అట్టి ఆ చైతన్యమునకు ‘సృష్ట్యాది’ యందు ఏ పదార్థం ఏ రూపంగా స్ఫురిస్తోందో, అది ఆ ప్రకారంగానే అద్దానికి అనుభూతమౌతోంది. ఎంతవరకు ఏదేది వస్తురూపంగా విద్యమానమై ఉన్నదో అంతవరకు వాటివాటితో తాదాత్మ్యం నొందినదై స్ఫురించిన రూపము కలిగియున్నదగుచున్నది.
చైతన్యము యొక్క స్వకీయ స్ఫురణయే “స్వభావము”. చైతన్యము యొక్క స్ఫురణయే “నియతి”. బ్రహ్మదేవుని భావనయే సృష్టికి మూలం. కనుక ఇదంతా భావనారూపమే! ఆ బ్రహ్మ సత్త… చిదాకాశరూపుడగు బ్రహ్మదేవుని యొక్క సంకల్ప - - భావనా శరీరంలో శబ్దతన్మాత్ర స్థితిచే …ఆకాశంగానూ స్పర్శ తన్మాత్ర స్థితిచే … వాయువుగానూ… ఈ విధంగా విత్తనంలోంచి మహావృక్షం లాగా అగుచూ… మహాప్రశాతంగా (బ్రహ్మసత్తయే అయి-బ్రహ్మ సత్తగానే) స్థితి నొంది ఉన్నది. శబ్దతన్మాత్ర నుండి (ఆకాశం నుండి)… స్పర్శ తన్మాత్ర (వాయువు), స్పర్శ తన్మాత్ర నుండి
Page:637
.తేజోతన్మాత్ర (అగ్ని), తేజో తన్మాత్ర నుండి… రసతన్మాత్ర (జలము), రసతన్మాత్ర నుండి… పృథివీ తన్మాత్రా… ఈ విధంగా భూతభౌతికాత్మికమైన ఈ జగత్తు క్రమంగా ఉత్పన్నమైనదగుచున్నది. అయితే… రామచంద్రా! “ఆకాశాత్ వాయుః-వాయురగ్నిః - అగ్నిరాపః - ఆపః - పృథివీ"
…ఇత్యాది ఈ ’క్రమము’ను గూర్చిన కల్పన అజ్ఞానులు యొక్క తత్త్వబోధ కొరకై మునులచే ప్రతిపాదించబడుతోంది. అంతేగాని "ఈ సృష్టి వాస్తవమైన సత్యము”… అని ప్రతిపాదించటం కొరకై వారి ఉద్దేశంకాదు. ఈ సృష్టి నామరూపాత్మకమైన సత్యత్వము మూర్ఖులగువారిచేత మాత్రమే వెతకబడుతోంది. ఎందుకంటే….
నాస్తమేతీహా నో దేతి తత్కదాచన కించన
శిలాజఠరవత్ శాస్త్రం ఇదం నిత్యం సదప్యసత్ ।
బ్రహ్మసత్త జగత్తుగా ఉదయించదు. మరల జగత్రూపంగా అస్తమించదు. శిలయొక్క గర్భమువలె అది సదా పరమశాంతరూపము వహించియే ఉన్నది. ఈ జగత్తంతా పరమార్థ సత్తచే సత్యము, నామరూపాది వ్యవహారములచే అసత్యము అయి ఉన్నది.
“అవయవి” అగు పరమాత్మ యొక్క అవయవ రూపమగు ఈ దృశ్యము అనంతరూపమై ఉన్నది. తదవయవ ప్రాయములగు ఈ జగద్రూపాణువులు, అట్టి ప్రతి ఒక్క జగద్రూపాణువులో అసంఖ్యాక ప్రాణి సమూహములు అట్టి ప్రతిప్రాణి యొక్క అణువణువున అనేక జగత్తులు… ఇవన్నీ అనంత సంఖ్యారూపములుగా అయి చెన్నొందుచున్నాయి. సముద్రంలో తరంగాలు - - ఆ ఆ
తరంగాలలో జల బిందువులవలె, ఆ జలబిందువులలో జలపరమాణువుల వలె…. అసంఖ్యాక బ్రహ్మాండములు - అట్టి ప్రతి ఒక్క బ్రహ్మాండములో అసంఖ్యాక జగత్తులు, అట్టి ప్రతి ఒక్క జగత్తులో అసంఖ్యాక జీవులు, ఆ ప్రతి ఒక్క జీవునిలో అసంఖ్యాక జగత్తులు - ఇవన్నీ కూడా పరమార్థమున అనంతరూపములే! అవన్నీ పరమాత్మయందు ఉదయించక అస్తమించక వెలయుచున్నాయి. ఆకాశమున ఆకాశము ఉన్నట్లు ‘బ్రహ్మము’ అనే చిదాకాశమున జగత్తు అనే చిదాకాశము కలదు. బ్రహ్మ సత్తకంటే వేరుగా ‘జగత్ సత్త’ లేదు. ఈ జగత్తు చిద్రూపమే అయివుండగా, …ఇక ఇది ఉదయించటం ఏమున్నది? అస్తమించటం ఏమున్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! “మణిదీపన్యాయం”… అనే ఒకానొక దృష్టాంతం అధ్యాత్మ శాస్త్రంలో ప్రసిద్ధమైయున్నది. అది ఇప్పుడు ఉదహరిస్తున్నాను. విను.
చైతన్యము వస్తుతః అనంత ప్రకాశరూపము - - సర్వ వ్యాపకము అయివున్నది. అట్టి ‘చైతన్యము’ అనే మణి కాంతి ప్రసరణయే సత్తామాత్రము (సత్ అనుభవం). ఆ చైతన్య మణియొక్క అసంఖ్యాక కాంతిపుంజములే ఈ అసంఖ్యాక ‘జగత్తులు - - జీవులు’ కూడా! అట్టి చైతన్య సత్తా మాత్రము యొక్క స్ఫురణరూపమే స్వభావము.
Page:638
ఆ చైతన్యము, తనయొక్క ’సత్తా మాత్ర యథార్థ స్వభావము’ను కొంచెము ఏమరచి, అద్దాని విస్మరణముచే స్వయముగా కించిత్ విషయాభిముఖం అయినదానివలె అగుచున్నది. అద్దానిని ‘అజ్ఞాన సంవిత్’ అని పిలుస్తున్నారు.
అట్టి అజ్ఞాన సంవిత్తు అన్యథా భావము ఆశ్రయించినదగుచున్నది. అట్టి అన్యథా భావముచే పరామర్శపూర్వకంగా భావికాల ప్రపంచము యొక్క నామ అర్థ కల్పనలతో వ్యవహరించ నారంబి స్తోంది. అయితే, ఆ కల్పనల రూపంగా తానే అగుచున్నది. అట్టి నామ అర్థ కల్పనలతో ఆకాశము కంటే కూడా అతి సూక్ష్మము - శుద్ధము అయినట్టి రూపము ధరించి సర్వ పదార్థముల గూర్చిన భావి కాలపు నామ - రూపముల యొక్క ‘పర్యాలోచన’ నిర్వర్తిస్తోంది.
ఆ తరువాత అట్లు పర్యాలోచించినదానిని ప్రకాశింపజేయటానికి అభిముఖమగుచున్నది. (చేత యతీతి చిత్ - ప్రకాశింపజేసేదే చిత్). ఇప్పుడిది ‘చిత్ చైతన్యము’ అనే పేరుతో పిలువబడటానికి అర్హమగుచున్నది. ఆ తరువాత చిత్ చైతన్యము శరీరాదులందు ఘనీభూతమగు అభిమానము కలిగి ఉంటోంది. ఆ అభిమానముతో కూడిన ఆత్మసత్త భావికాలపు ‘జీవుడు’ మొదలైన సంజ్ఞలుగా అగుచున్నది.
అట్లు ‘జీవుడు’ అనే సంజ్ఞను పొందిన దేహాభిమానియగు ఆత్మసత్త మరల ఎప్పుడో క్రమంగా ఆధికారికమైన జన్మలను పొంది తిరిగి మరల పరమపదరూపమగు బ్రహ్మముగా అగుచున్నది. “బహిరంగంగా” “అంతరంగంగా”
చైతన్యము
జన్మలు స్ఫురణ
నామరూపార్థ కల్పన స్వభావము
విషయాభిముఖము అట్టి ఆత్మసత్త జీవదశయందు,
చిదాకాశమును కప్పి ఉంచే అవిద్యచే * తన చిదాకాశత్వము ఏమరచి జగత్ భావంతో ప్రదర్శించుకుంటోంది. అయ్యది జ్ఞాన లాభము చేతనో తాను బ్రహ్మము కంటే వేరుకానిదై భాసిస్తోంది. అయితే, ఆవృతజీవదశయందు మాత్రం దేహ - ఇంద్రియములతో ‘తాదాత్మ్య ధ్యాస’ చే అనేక ఉపాధులతో వివిధ జన్మలందు తిరుగాడటానికి అభిముఖం అవుతోంది. అందుచేత అది శుద్ధరూపము యొక్క ఏమరపుచే జనించినన మలిన కర్మల రజోగుణము ధరించినదై ఉంటోంది.
Page:639
ఓ రామచంద్రా! ఈ విధంగా ఆ అద్వితీయమగు బ్రహ్మసత్త శబ్ద స్పర్వ రూప-రస-గంధాది ఆయా గుణములను-తన గర్భమున ధరించినదై… “సవికల్ప చిద్భావన”చే సూక్ష్మ పంచభూతమగు చున్నది. ఆ సూక్ష్మ పంచభూతములే ఆకాశము మొదలైన నామముల యొక్క అర్ధ ప్రవృత్తికంతటికీ కారణభూతమౌతున్నాయి. ఆ సూక్ష్మభూత రూపమగు ‘బ్రహ్మసత్త’ నుండి లింగశరీరము (సూక్ష్మ శరీరము) యొక్క ప్రాణ సంచారక్రియ రూపుదిద్దుకుంటోంది. అట్టి లింగ శరీర ప్రాణసంచార క్రియచే ప్రేరితమైన అహంకారము కాలసత్తతో సహా ఉదయిస్తోంది. ఆ అహంకార-కాలసత్తలే ఈ జగత్తు యొక్క స్థితికి ముఖ్యబీజములై ఉంటున్నాయి.
“పరాచిత్శక్తి”… యొక్క “నిజస్ఫురణ మాత్రము”… అయినట్టి ఈ అపద్రూప జగత్ సమూహం “అధిష్ఠాన చైతన్యము” వలననే సత్తువలె స్థితి నొంది ఉంటోంది. “సంకల్పము” అనే మహా వృక్షమునకు బీజము చైతన్యమే సుమా! అట్టి చైతన్యము ’అహంత్వము’ను భావించుచు క్షణంలో అహంత్వరూపమై పోవుచున్నది. ”హిరణ్యగర్భుడు“… అనే శాస్త్రీయ నామంతో పిలువబడే ఆ చైతన్యము “ఉత్పత్తి - వినాశనము” అనే భ్రమలతో కూడుకొనియున్నదై - జలము జలమునందే పరిభ్రమిస్తున్నట్లు - బ్రహ్మము నందే పరిభ్రమిస్తోంది.
భావన సూక్ష్మభూతముల ఘనీభూతం స్థూల భూతముల
భావన ఒనర్చబడగా రూపం
ఆ చైతన్యమే ఆ తరువాత తరువాత “నామ - రూప - - శబ్దార్థము” అనే రూపం దాల్చుచున్నది.
ప్రతి ఒక్క జీవుని వాస్తవ - - నిజ స్వరూపమగు ఆ శుద్ధ చైతన్యమే వేద - శాస్త్రములకు పద - వాక్య - ప్రమాణములచే ఉద్దేశార్థమై చెన్నొందుతోంది. వేద శబ్దములకు ఆధారభూతమగు ఆ చైతన్యము నుండియే ఈ సమస్త జగత్తు ఉదయిస్తోంది. శబ్దము నుండి అర్ధభూత జగత్తు జనిస్తోంది. (సభూరిత వ్యాహరత్ భువమసృజత - ఆ చైతన్యము నుండి జనించిన ‘భూః’ శబ్దం చేత భూమి సృజించబడింది… ఇత్యాది).
ఈ ప్రకారంగా “విచిత్ర సంకల్పములు” నిర్వర్తిస్తున్న బ్రహ్మమే హిరణ్యగర్భుడు. ఆ హిరణ్యగర్భ బ్రహ్మము ఆ తరువాత అనేక సంజ్ఞల (శబ్దార్థముల)తో కూడిన రకరకాల ప్రాణి సమూహములకు బీజము. ఆ హిరణ్యగర్భ బ్రహ్మమునుండే ఆకాశమంతా వ్యాప్తమై 14 లోకములకు సంబంధించిన 14 విధములైన ప్రాణి సమూహములు దీపమునుండి కాంతిపుజముల వలె బయల్వెడలుచున్నాయి.
హిరణ్య గర్భ స్పందన చైతన్యము చైతన్యము రూపమైన బ్రహ్మదేవుడు | (చలనరూపమైన ఈ సృష్టికి కర్త చిన్మాత్రము
Page:640
సమూహలను చైతన్యము యొక్క ప్రసరణరూపంగా కలిగి ఉంటోంది. ఈ విధంగా అంతవరకు కూడా శబ్ద వ్యహారము, శరీరాదుల వ్యవహారములైనట్టి హిరణ్యగర్భ చైతన్యము అకస్మాత్తుగా, కాకతాళీయంగా తన యందు తనకు అనన్యమైనట్టి వ్యాప్తత్వ ధర్మం ప్రదర్శిస్తోంది.
స్పందత్వము : అంతవరకూ నిశ్చల సత్ూపంగా ఉన్న హిరణ్యగర్భ (సృష్టికర్త) చైతన్యము తనయందు స్పందమును (చలనమును) కల్పించుకొంటోంది. ఆ స్పందము, వాయు సమూహమునకు బీజమై త్వక్ (చర్మ సంబంధమైన స్పర్శ) అనే తన్మాత్ర రూపముగా అగుచున్నది. సమస్త ప్రాణుల సంచలన హేతువగు వాయువు జనించుచున్నది.
ప్రకాశత్వము : ఆ హిరణ్యగర్భ చైతన్యస్పందము నుండి వాయురూపమును పొందిన హిరణ్యగర్భ చైతన్యము చిద్విలాసంగా ‘ప్రకాశము’ నకు సంబంధించిన అనుభవం ఆశ్రయిస్తోంది. అదియే ‘రూపతన్మాత్ర’గా అగుచున్నది. భావికాలపు ‘తేజము’ అనే శబ్దమునకు అర్ధక్రియా కర్తృత్వము వహిస్తోంది.
ఓ రామచంద్రా! ’తేజము’లో ఏ ప్రకాశమున్నదో… అది చైతన్య ప్రకాశమే! అట్లాగే… స్పర్శ జ్ఞానమూ చైతన్యమే! చైతన్యమునకు అన్యంగా తేజము - స్పర్శ జ్ఞానము మొదలైనవి మరెక్కడి నుండో వచ్చి ఉండలేదు. అట్లాగే … ఆకాశకోశమున చైతన్యమే స్వయంగా శబ్దరూపమై ’శబ్దజ్ఞానము’ను అనుభవిస్తోంది. చైతన్యమునకు అన్యంగా శబ్దజనకమైనదంటూ ఏదీ లేదు.
కాబట్టి… సృష్ట్యాది యందు సమష్టి దశయే ఉన్నది కదా! సమష్టిదశయందు చైతన్యమునకు అన్యంగా మరొక ఏదైనా కారణం చేత శబ్ద తన్మాత్ర - స్పర్శతన్మాత్ర - రూపతన్మాత్ర - రసతన్మాత్ర - గంధతన్మాత్ర ఏర్పడటం జరుగుతోందా? లేదు! తన్మాత్రలన్నీ కూడా చైతన్యము నుండే, చైతన్య రూపంగా చైతన్యమునకు అనన్యమై జనించాయి. అవి చైతన్యరూపములే!
అట్లాగే, ఇప్పుడు ఈ సృష్టి దశయందు కూడా ద్వైత - ఏకత్వములకు క్రొత్తగా స్థానమెక్కడిది? అందుచేత సమష్టి నుండి వ్యష్టి వరకు కూడా చైతన్యమే సర్వపదార్థ రూపముగా వెలయుచున్నది. ఈ ఈ "శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు” అనబడే 5 తన్మాత్రలు స్వప్నమువలె అసత్యములే అయినప్పటికీ… వీటి మూలరూపము చైతన్యమే కాబట్టి… సత్యమువలె అనుభూతమగుచున్నాయి. తేజోరూపము పొందిన సూర్యుడు మొదలైన ప్రకాశ వస్తువులకు ఉత్పత్తి స్థానం అవుతోంది.
ఆ చైతన్యము ఈ ఈ రూపభేదములతోటి ప్రపంచము ఆ చైతన్య మణిదీప తేజమునుండే ప్రసరిస్తోంది. ‘రంగు’ అనే వికారమే ఉండనట్టి ఆకాశమునందు నీలంరంగు కనబడుతోంది చూచావా? అట్లాగే నిర్వికారమగు ఆ తేజోరూప చైతన్యము నుండే రసతన్మాత్ర జనించి జలముగా రూపుదిద్దుకుంటున్నది. అన్నపానాదుల యొక్క ‘మాధుర్య సంవిత్తు’ ఆ ’రసతన్మాత్రము’యే సుమా! ఆ హిరణ్యగర్భుడు అనే జీవుడు భవిష్యత్ పదార్థముల గూర్చి సంకల్పించువాడు కదా! సమస్త కార్య - కారణ రూపుడగు ఆతడు ఆ పిమ్మట గంధతన్మాత్రను కల్పించుచున్నాడు. ఆ గంధ తన్మాత్రయే సర్వులకు - సర్వమునకు ఆధారమైన ఈ ’భూమి’కి బీజముగా అగుచున్నది.
❖
Page:641
ఈ విధంగా… ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రల సమూహమంతా వాస్తవానికి ఉత్పన్నము కాకయే ఉన్నప్పటికీ… ఉత్పన్నమైన వాటివలె ఉంటున్నాయి. వాస్తవానికి ఇదంతా నిరాకారమే అయినప్పటికీ చైతన్యము యొక్క మాయా విభాగ కల్పనావశం చేత సాకారమువలె అనుభవమగుచున్నది.
చైతన్య రూపమగు ఈ తన్మాత్ర సమూహం కాకతాళీయంగా… ఏ స్థానం నుండి రూపమును ఎరుగుచున్నదో… అదే ‘నేత్రం’. ఏ స్థానం నుండి శబ్దమును ఎరుగుచున్నదో… అదే ‘చెవులు’. ఏ స్థానం నుండి స్పర్శను ఎరుగుచున్నదో… అదే ‘చర్మేంద్రియం’. ఏ స్థానం నుండి రసము (రుచి)ని ఎరుగుచున్నదో… అదే ‘జిహ్వ’ (నాలుక). ఏ స్థానం నుండి గంధము (వాసన) ఎరుగుచున్నదో… అదే ’ఘ్రాణేంద్రియం’ (ముక్కు).
ఈ విధముగా ఆ తరువాత నియమితమగు ఆకృతి పొందిన ఈ జీవుడు “ఇవి దిక్కులు ఇవి కాలము” మొదలైన ఈ ఈ భేదములన్నీ కల్పించుకుంటున్నాడు. ఆతడు వ్యష్టిభావమును పొందినవాడై “నేను ఈ దేహముతో సహావేరు - వీరు ఈ ఈ దేహములతో సహా నాకంటే వేరు వేరు” అనే కల్పనను ఆశ్రయించి ఎక్కడి కక్కడ పరిమిత రూపత్వ దోషమును పొందుచున్నాడు. అట్టి "పరిమితరూపత్వదోషము” చేతనే… కళ్ళతో చూస్తున్నాడు గాని ఆఘ్రాణించలేకపోతున్నాడు. అదే రీతిగా తదితర వేరువేరు దేహములచే వేరు వేరు భోగ్యములను ఎరుగుటలేదు.
ఓ రామచంద్రా! ఈ విధంగా ప్రతిజీవుని ఆత్మయందు అనంతమైన జగత్తుల కల్పన ఉండియే ఉన్నాయని గమనించు. కళ్ళతో వినలేనట్లే, ఈ జీవుడు “నేను ఈ దేహమే పరిమితిగా కలవాడను”… అను కల్పనను కాలగతంగా ఆశ్రయించి ఉంటున్నప్పటికీ ఈతని ఆత్మయందు అంతులేని జగత్తులున్నాయని ఈ వివరణ సారముగా అందరూ గ్రహించండి.
ఈ అనంత జగత్తు ఆత్మకంటే వేరు కాదు. ఇదంతా ఆత్మభూతమే అయి ఒప్పుచున్నది. కాబట్టి ఈ ఈ జగత్తులు పరమార్ధమున ఉదయించటమూ లేదు. అస్తమించటమూ లేదు. ఇదంతా కూడా… శిల్పము యొక్క గర్భ ప్రదేశమువలె… సచ్చిదానంద ఘనమగు మౌనరూపంగానే స్థితినొంది ఉన్నది.
“చైతన్యము” అనే మణి నుండి అనుక్షణికంగా ప్రసరిస్తున్న కాంతిపుంజములే ఈ జీవులు జగత్తులు - - బ్రహ్మాండములు - తన్మాత్రలు - దేహములు - భావములు - సుఖదుఃఖములు - జ్ఞానాజ్ఞానములు వగైరా! ఇందులో ప్రతి ఒక్క జీవుడు చైతన్య రూపమగు “మణి” అయి “మణి, దీపన్యాయము” అనే తాత్త్విక స్థితి అవధరించియే ఉన్నాడు. అట్లాగే, సర్వాత్మకమగు చిత్ చైతన్యమణి కాంతిపుంజము కూడా అయి ఉన్నాడు!
Page:642
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీకు ఇంతవరకూ కూడా శుద్ధ చైతన్యము హిరణ్యగర్భ చైతన్యము, సమష్టి తత్త్వములైన ఆకాశ - వాయు - - తేజములు, అద్దాని అంగములైన శబ్ద - స్పర్శ
- - రూప - రస -గంధ తన్మాత్రలు, వాటి నుండి ఉదయించిన జీవుడు, ఆ జీవునిచే కల్పించబడిన దిక్ సత్త - కాల సత్తలు … ఈ ఈ వరుస క్రమమంతా ఎందుకు చెప్పానో తెలుసా? “ఈ జీవుడు పరబ్రహ్మము కంటే వేరుకాదు” అని నిరూపించటానికి ప్రారంభ పరిచయంగా అవి చెప్పాను. అంతేగాని “ఈ జీవునికి ఉత్పత్తి - వినాశనాలు ఉన్నాయి”… అని చెప్పే ఉద్దేశంతో చెప్పినవి కావు. ఈ విధంగా ”ఆత్మ యొక్క అకృత్రిమ అవయవరూపుడు - విషయాభిముఖుడు" అగు అద్దానిని ‘చిదాభాసుడు’ అని “పరమాత్మ యొక్క అంశరూపుడు” అని పిలుస్తున్నారు.
ఆ చిదాభానుడే “జీవుడు" అనే పేరుతో కూడా పిలువబడుచున్నాడు. ఆ చిదాభాసునికే అనేక పేర్లు…!
జీవనము (ప్రాణము), కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ధరించటం చేత “జీవుడు” అని; విషయాభిముఖుడై ఉండటంచేత ‘చిత్తము’ అని; ఆయా విషయములు ఎరుగుచుండుటచే ‘చిత్’ (ఎరుక) రూపుడు అని; “ఇది ఇట్టిది కదా!” అనే బోధ కలిగియుండటం చేత “బుద్ధి” అని; సంకల్పించటంచే, ఊహ-అపోహలకు సంబంధించిన జ్ఞానం కలిగి ఉండటంచేత “మనస్సు” అని; ‘నేను’ ఉన్నాను అనే అభిమానపూర్వకమైన వృత్తితో కూడి ఉండటం చేత ‘అహంకారము” అని; చైతన్య పరిపూర్ణమగు ఆత్మ వస్తుస్వరూపుడే అయి ఉండటంచేత “చిత్స్వరూపుడు” అని; దృఢమైన సంకల్ప సమూహముచే పూరితుడై ఉండటం చేత “పుర్యష్టకము” అని; సృష్ట్యాదికాలంలో ప్రథమంగా (ప్రకృతిరూపుడై) విద్యమానుడై ఉండటం చేత “ప్రకృతి“ అని; ఉపాధిపరుడై ఉండటంచేత “ఔపాధికుడు” అని; తత్త్వజ్ఞానం విషయంలో ఏమరచి ఉండటం చేత (అవిద్యమానుడై ఉండటం చేత) “అవిద్యా స్వరూపుడు" అని… ఈ విధంగా శాస్త్రములచేత, శాస్త్రకారులచేత ‘చైతన్యమణి’ అనతగు కేవల చిత్ స్వరూపుడగు ఈ వ్యష్టి రూపుడు ‘చిదాభాసుడు’ అని, ‘జీవుడు’ అని వర్ణించి చెప్పబడుచున్నాడు.
అయితే… ఈ జీవుడు వాస్తవానికి నిరాకారుడు, నిర్వికారస్వరూపుడు. కాని, తన లింగ శరీరము యొక్క కల్పనచే “నాకు ఆద్యంతాలు ఉన్నాయి"… అని భ్రమను ఆశ్రయించి ఉంటున్నాడు. అట్లాగే స్వప్నము - సంకల్ప నగరము - వంటిదే ఈ త్రిలోకములతో కూడిన జగత్తు కూడా! భ్రమరూపమగు ఈ త్రైలోక్య జగత్తు అర్థ క్రియా సమర్థమై ఉన్నప్పటికీ కూడా… వాస్తవానికి ఇది శరీర రహితము, పదార్థ శూన్యము, నిరాకారము అయి భాసిస్తోంది.
కాబట్టి ఓ సర్వ సభికులారా! ఈ లింగ శరీరం (సూక్ష్మ శరీరం) చిదాకాశమే! ఈ చిత్త శరీరం వాస్తవానికి ఆకాశం కంటే కూడా అత్యంత శూన్యం! అయితే ఈ చిత్త శరీరమే 14 లోకములకు ఉత్పత్తి స్థానం. అట్టి ఈ ‘చిత్త శరీరం’ ఉదయించటమూ లేదు, అస్తమించటమూ
Page:643
అద్దము తనయందు ప్రతిబింబమును ధరిస్తుంది కదా! అట్లాగే ఈ చిత్తదేహము బాహ్య - అభ్యంతరములలో అనేక జగత్తులు ధరించి ఉంటోంది. అయినప్పటికీ కూడా… అది ఆకాశములె ’శూన్యరూపమే’ అయివున్నది. “ప్రాకృత ప్రళయం” అనబడే మహాకల్పము యొక్క అంతిమ క్షణంలో సర్వదృశ్యము సర్వనాశనమునకు సంసిద్ధమగుచున్నది. అప్పుడిక నిర్వికారమగు బ్రహ్మాత్మపదము మాత్రమే శేషించబోవు క్షణాలలో… మరల చైతన్యమున, శుద్ధచిత్స్వరూపమును కొంచెము కప్పిపుచ్చు ‘అజ్ఞానం’ చేత, చిదాకాశము స్వయంగా (ఇంతకు ముందు చెప్పిన క్రమంలో) సూక్ష్మ శరీరమును కల్పిస్తోంది. అట్టి బ్రహ్మము యొక్క ఒకానొక స్వల్ప విభాగము ‘జీవ రూపము’ అగు సూక్ష్మ శరీరమును ధారణ చేస్తోంది. “జగత్తును అవలోకించటం” అనే ఒకానొక ప్రకాశమును కలిగి ఉంటోంది. అద్దానికే ”బ్రహ్మదేవుడు” అని, ‘విరాట్టు’ అని శాస్త్రములు పేరు పెట్టాయి. అట్టి సూక్ష్మరూపుడగు పరమాత్మ యొక్క ఒకానొక విభాగమును “సనాతన పురుషుడు" అని, వేరొక విభాగమును “శ్రీమన్నారాయణుడు” అని, మరొక విభాగమును “ప్రజాపతి” అని శాస్త్ర పురాణ ఇతిహాస ద్రష్టలు పేర్లు పెట్టడం జరుగుతోంది. ఈ ‘జీవుడు’ అనబడేవాడు కూడా బ్రహ్మము యొక్క విభాగమే అయి, బ్రహ్మమునకు అద్వితీయుడై ఉన్నాడు. అనన్యమై ఉన్నాడు.
ఓ రామచంద్రా! ఈ దృశ్యమంతా కాకతాళీయ న్యాయం చేతనే ఏర్పడి ఉంటోంది. కాకతాళీయ న్యాయముచే ఏఏ విభాగమందు ఏఏ ప్రకారంగా పంచేంద్రియ సంవిత్తులు భాసిస్తున్నాయో… ఆ ప్రకారంగానే ఇంద్రియార్థములు, ఇంద్రియ విషయములు స్థితినొంది ఉంటున్నాయి. ఈ ప్రకారంగా ఈ విశాల దృశ్యము పొందబడుచున్నప్పటికీ… ఇదంతా స్వస్వరూపమునకు అనన్యమే అయివుండటం చేత… వాస్తవానికి ఇది పొందబడకయే ఉన్నది. సూర్య కిరణాలు ఆయా ఆకారాదుల ద్వారా ప్రసరించి, ఆయా ‘కిటికీ ద్వారము’ వంటి ఆకారములు పొందుచున్నప్పటికీ వాస్తవానికి సూర్య కిరణాలు ఏ ఆకారమూ పొందటమే లేదు కదా! సర్వత్రా వ్యాప్తమైయున్న ఆత్మతత్త్వము సర్వదృశ్య శూన్యమే అయి వెలయుచున్నది. ఆద్యంతరహితమగు పరబ్రహ్మము సత్తు కాదు. అసత్తు కాదు. అయితే, అదియే సర్వరూప సాక్షాత్కారము - సర్వరూప సాక్షాత్కార రహితము అయి… ఇట్లు సత్ - అసత్ రూప జగదాకారంగా స్థితినొందియున్నది.
ఓ రామచంద్రా! స్త్రీ సంగమధ్యాస కలవానికి కలలో స్త్రీ కనబడుతుంది చూచావా? అట్లాగే సూక్ష్మశరీర రూపుడగు ఆ బ్రహ్మదేవుని అనుభవముచే… ఆతని సంకల్పమే స్వయంగా ఇట్లు ‘జగత్’ రూపంగా పరిపుష్టమై ఉంటోంది. స్వప్నంలో కనబడేదంతా ఆకార రహితమే అయినప్పటికీ … చెట్లు, గృహాలు, గ్రామాలు, పట్టణాలు, అయినవాళ్ళు, కానివాళ్ళు - - ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా! ‘ఊహ’ అనే సంకల్పలోకంలో ఆ ఊహననుసరించి మిత్రుల ముఖాలు, ఇష్టమైన పదార్థాలు, ప్రదేశాలు (ఆ ఊహలో) అగుపిస్తాయి కదా!
Page:644
ఈ ‘జాగ్రత్’ నందు కూడా ఈ నిజదేహము ఈ జగత్తు కూడా వాస్తవానికి ఆకార రహితమే అయినప్పటికీ (ఒక ఊహయందువలె) అనుభూతం అవుతున్నాయి.
ఆ చిదాకాశము నిరాకారమై, పదార్థశూన్యమై ఉన్నప్పటికీ… స్వప్న జగత్తులాగానే అర్థక్రియా సమర్థమగుచున్నది. కఠినమైన ఆకారం కలిగి ఉంటోంది. ఇంతెందుకూ? ఈ జీవుని రూపమే అందుకు మనకు సుస్పష్టమైన దృష్టాంతం. ఈ జీవుడు స్థూలరూపంగా కనిపిస్తున్నాడు కదా! అయితే, ఈతనికి సూక్ష్మ శరీరం అనేది సుస్పష్టమే కదా! దేహానికి రూపముండవచ్చు! సూక్ష్మశరీరము ఏ ఆకారం? స్థూల - సూక్ష్మ దేహాల అనుభవం పొందే ఈ అనుభవమునకు ఆకారమెక్కడున్నది? అట్టి సూక్ష్మ శరీరరూపుడగు ఈ జీవుడు "నిరాకార శూన్య స్వరూపుడు - - స్వప్న సదృశుడు” అయిన ప్పటికీ స్వయముగా - క్రమంగా ఆకారమును పొంది అద్దానిని అనుభవిస్తున్నాడు.
’సూక్ష్మ శరీరరూపుడు’ అయినట్టి ఈ జీవుడు ఈ ’స్థూల దేహము’ను కల్పించుకొనుచున్నాడు. ఇక ఈ స్థూలదేహం ఎముకల అమరికచే ఆకారము పొందినదై, కాళ్ళు - చేతులు కలిగియున్నదై వెంట్రుకలు - గోళ్ళు - మాంసము - చర్మములతో కూడినదై ఈ ఆకారము కలిగివుంటోంది. అట్టి ఈ దేహమునందు… జన్మ - కర్మల అనుభవం పొందుచున్నాడు. దేహం వయస్సునుబట్టి పరిణామ స్థితిని పొందుచున్నాడు. దేశ కాలముల విస్తారముతో కూడిన అనేక కాలగత అనుభవాలను కలిగి ఉంటున్నాడు.
పదార్థముల భోగము కొరకై అనేక ఊహ - అపోహలతో కూడిన భ్రమ పరంపరలను రచించుకొంటున్నాడు. వార్ధక్య - మరణాలను, అనేక గుణదోషములను ధరించినవాడై ఉంటున్నాడు. దశదిక్కులా సంచరిస్తూ ‘నాది - నీది’ మొదలైన అనేక హావ - భావ - అభావములు చమత్కారంగా కలిగి ఉంటున్నాడు. జ్ఞాతృ జ్ఞాన - జ్ఞేయములు అనే త్రిపుటిని చేతిలో ధరించి ఇక్కడ సంచరిస్తున్నాడు. అనేక పదార్థముల జ్ఞానమును సముపార్జించి… వాటి వాటి ఆది మధ్య - అంతముల పట్ల హర్ష - దుఃఖములను పెంపొందించుకొని కాలమును వెళ్ళబుచ్చుచున్నాడు.
“ఈ తరువాత ఏమిటి? - ఇంతకు ముందు ఏమిటి?“ అన్న ప్రశ్నకు పరిమితమైన దృష్టులతో పరిమిత అవగాహన కావించుకొని “ఈ బొమికలు - రక్తము మాంసము చర్మములతో కూడిన ఈ ఆకారమే నాది” …. అని తలచి ఈ జగత్తును దర్శిస్తూ ”ఇంతకుమించి ఈ జగత్తు లేదు. ఇద్దానికి వేరుగా నేనూ లేను. ఇంకేదీ ఎక్కడా లేదు” అని తలచుచు ‘దృశ్యబద్ధుడు’ అగుచున్నాడు.
ఓ రామచంద్రా! ఈ విధంగా సనాతన పురుషుడగు పరమాత్మ సూక్ష్మ దేహరూపత్వము పొందినవాడై ‘మనో - బుద్ధి బుద్ది - - చిత్త చిత్త - అహంకారాలు’ అనే చతుర్ముఖములు కలవాడై “వ్యష్టి - సమష్టి - స్థూలదేహము” లను నిర్మించుకొంటున్నాడు. వాటి నిమిత్తమై స్వయంగా పృథివి
పదార్థ రూపుడగుచున్నాడు.
Page:645
“ఈ కనబడే జగత్ పదార్థములే నాకు ఆధారములు. నేను వీటి యొక్క అధేయుడను.” ఇటువంటి భ్రాంతిమయ సంసారమును గాంచుచు తన స్వస్వరూపమును తానే ఏమరచి తిరుగాడుచున్నాడు.
శ్రీ వసిష్ఠ మహర్షి : చూచావా రామచంద్రా! ఈ దృశ్యము కల్పన చేతనే ఏర్పడి, కల్పన చేతనే అనుభవమగుచున్నది. అనగా ఇద్దాని యొక్క సృష్టి కర్తయగు ఆది ప్రజాపతి బ్రహ్మదేవుడు (ఆది స్రష్ట - ఆది ద్రష్ట) - దృశ్యమును అనుభూతమొనర్చుకొనే ఈ ‘జీవుడు’ అనే ద్రష్ట… ఈ ఇద్దరూ కూడా తమ స్వకీయ కల్పనల మేళనము చేతనే దృశ్య సమన్వితము అయిన ఈ జగత్తును తయారు చేసినవారగుచున్నారు. ఇంకా చెప్పాలంటే … “ఆది ప్రజాపతి” (సృష్టికి ఆదియందు ఉన్నవాడై ఈ జగత్ కల్పనకు కారకుడగు బ్రహ్మదేవుడు) తనయొక్క మహాసూక్ష్మ శరీరము (చతుర్ముఖ శరీరము -మనో-బుద్ధి-చిత్త-అహంకారములు) యొక్క విస్తారం చేతను, సత్య సంకల్పమగు తనయొక్క సంవిత్స్వభావము చేతను కాకతాళీయ న్యాయంచే…. దీనికి కారకుడై ఉంటున్నాడు. అట్టి ఆదిప్రజాపతిచే ఏది ఏ రీతిగా కాకతాళీయంగా సంకల్పించబడిందో… అది ఆ రీతిగానే చిరకాలం స్థితిని పొందినదగుచున్నది. ఆహా! ఆశ్చర్యమే మరి! ఎందుకంటే… అట్టి సంవిత్తు యొక్క సంకల్ప మాత్రం చేతనే ఈ జగత్తు భాసిస్తోంది. ఇక "ఇట్టి జగత్తు సత్యము కాదు”… అని అనటంలో ఆశ్చర్యమేమున్నది? ఊహచే, కల్పనచే రచించబడింది సత్యమెట్లా అవుతుంది?
ఒకడు రచించిన కథలోని “ఒక రాజుగారికి ఇద్దరు భార్యలు. ఒక రోజు ఐదుగురితో వ్యాహ్యాళికి బయలుదేరాడు” అనే వాక్యం చదివి, “ఇప్పుడు రాజుగారికి ఇద్దరు భార్యలా? ఐదుగురు భార్యలా? ఏది సత్యం? ఏది కాదు?”… అనునది ఎటువంటి సత్యాన్వేషణయో… ఈ జగత్తు యొక్క సత్యాసత్యములు అట్టివే! మొదలు రాజుగారు - భార్యలు, అనునదే కల్పన కదా! ఇక ఆపై చర్చించటం, వాదించటం కల్పనా వ్యవహారములు కాక మరింకేమిటి? ఈ "ద్రష్ట - దర్శనము దృశ్యము”… అనే మూడింటి సంయోగమైనట్టి త్రిపుటి మొదలే అసత్యమైయున్నది. లేదా… అధిష్ఠాన రూపముచేత… ఈ సమస్తమూ కూడా ’వ్యాపక బ్రహ్మమే’ కనుక… ఇవన్నీ సత్యములే! అందుచేతనే, “ఇది సత్యమే”… అనుకున్న వారికి ఇదంతా ఘనీభూత సత్యంగాను, “భ్రమయే” అనుకునే వారికి ’కేవలం భ్రమ’గాను ఈ దృశ్యమంతా అవగతం అవుతోంది.
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ సృష్టి అంతా ‘ఆది ప్రజాపతి’ ఊహా (సంకల్ప) నిర్మితమైన సూక్ష్మ శరీరమేనని మనం కాసేపు అనుకుందాం. అట్టి సూక్ష్మ శరీరము సంకల్ప మాత్రము - భ్రాంతిమయము కదా! అంతా భ్రాంతిమయమే అయినప్పుడు మరి ఈ కొండలు - నేల కఠినంగా ఎట్లా కనబడుచున్నాయి? నదులు, నగరాలు… ఇవన్నీ ద్రవరూపంగా ఎందుకు అనుభవ
Page:646
మౌతున్నాయి? ఇవన్నీ కూడా ఘనీభూత రూపంగా వస్తురూపంగా ఎట్లా అగుచున్నాయి? నేను ఒక కొండగుహను ఊహిస్తే, ఆ కొండగుహ నాకు ఎదురుగా కనిపించగా… అందులో ప్రవేశించి పచార్లు చేయగలనా? కుదరదు కదా? స్వప్న పదార్థములు సత్యత్వం పొందటం, క్రియాసమర్థం అవటం ఎట్లా జరుగుతుంది? కాని, ఈ జాగ్రత్ జగత్తులో అన్నీ క్రియాసమర్థమై ఉంటున్నాయి కదా! శ్రీ వసిష్ఠ మహర్షి : ఇందులో ఆశ్చర్యమేమున్నది? సూక్ష్మ శరీరసంకల్పము నిరంతరము ఎడతెగకుండా స్వయంగా అనుభూతమగుచు, ఆదియే చిరకాలాభ్యాసముచే ఘనీభూతమైనదానివలె భాసిస్తోంది. ఐందవుల చిరకాల మనో అభ్యాసమే బ్రహ్మాండముల రూపం పొందలేదా? హరిశ్చంద్రుని సుదీర్ఘ స్వప్నమే ఆతనికి ఘనీభూతమై భౌతిక రూపంగా (శ్మశాన దృశ్యము మొదలైనవిగా) కనిపించలేదా? స్వప్నం కూడా చిరకాలాభ్యాసంచేత పరిపుష్టి పొంది అతి సత్యముగా అనుభవమవటం మనం మన ఈ సంవాదములో అనేక చరిత్రలలో గమనించాం కదా! అట్లాగే సూక్ష్మ శరీరము యొక్క సంకల్ప వ్యవహారం చిరకాలపు అభ్యాసం చేత ‘సత్యమే’ అన్నట్లుగాను, ఘనీభూతమైనట్లుగాను కనిపిస్తోంది. అట్టి సూక్ష్మ శరీరం యొక్క చిరకాల అనుభవంలో ’స్థూలత్వ బుద్ధి’ జనించటం… మృగతృష్ణలో జలతరంగాలు కనిపించటం వంటిదే!
“స్వప్న భ్రమ” వలె, “మృగతృష్ణాజలం” వలె స్థితి నొంది ఉన్నట్టి ఈ జగత్తు “సత్యమే” అనే విశ్వాసము కలిగించుచు భాసించవచ్చుగాక! కానీ ఇది ‘అసత్యమే’ అయివున్నది. ఇవన్నీ స్థూలంగా కనిపిస్తున్నప్పటికీ … వాస్తవానికి … ఈ వస్తుజాలము సూక్ష్మతత్త్వరూపములే అయివున్నాయి. సూక్ష్మ - సంకల్పమయ పదార్థములకు స్థూలత్వం అత్యంత అసత్యమే అయినప్పటికీ కూడా… అవివేకులు ఇద్దానియందు స్థూలత్వం స్వకీయమైన ఊహ కల్పించుకొని, తన్మయులై… తమ ఆసక్తిచే… ఆ స్థూలత్వమును స్వీకరిస్తున్నారు. “ఇవి శరీరములు - ఇది నా శరీరం - అది వాడి శరీరం - ఇది నేను ఇది ఈతడు - వీరు నాకంటే వేరు - ఇది భూమి - - అది
ఆకాశము వీరు నా పుత్రులు - వారు నా సోదరుని పుత్రులు - వీళ్లేమో వేరే వారు - అది
పర్వతం - అవి దిక్కులు” ఈ విధంగా స్వప్నంలో ప్రకాశమానమయ్యే వస్తుజాలంలాగా, ఈ .
జగత్ రూపమైనటువంటి "మిథ్యాభ్రమ” అంతా భాసిస్తోంది. అనగా… “ఆది స్రష్ట” అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క సూక్ష్మ శరీరము చిరకాలమైన దృఢాభ్యాసంచేత తన యందు తానే స్థూలత్వమును, ఈ పిండాకారమైన (స్థూలాకారమైన) భూమి - చెట్లు - - కొండలు మొదలైన రూపమును గాంచుచున్నది. చిదాకాశమే “నేను బ్రహ్మమును”… అను తనయొక్క యథార్థ స్వస్వరూపమును ఏమరచినదై, ’కల్పన’ను అనుసరించినదై “ఈ మనుష్యుడు మొదలైన దేహమే నేను. ఈ భూమి మొదలైనవే నాకు ఆధారం”… అని… ఈ విధంగా గాంచటం యందు ఆసక్తిని కలిగి ఉంటోంది.
ఓ ప్రియ సభికులారా! అసత్యములు అయినట్టి ఈ శరీరము మొదలైనవాటి యందు “ఇవే నాకు సంబంధించిన సత్యం. ఇవి లేకపోయాయా… ఇక నా గతి చెప్పలేను”… అను రూపంగా
Page:647
ఈ జీవుడు వాటిపట్ల సత్యబుద్ధితో కూడిన భావన కలిగి ఉంటున్నాడు. అట్టి భావనకు బద్ధుడగుచున్నాడు. అద్దానిని అనుసరిస్తూ అట్లే సుదీర్ఘకాలం దేహపురములలో మహాప్రయాణం కొనసాగించుచున్నాడు.
మొట్టమొదట ఆదిపురుషుడు ఆది ప్రజాపతి అగు బ్రహ్మదేవుడు శబ్ద స్వరూపుడై వైదిక - లౌకిక శబ్దములను సృజించుచున్నాడు. అటు తరువాత వాని యొక్క ఆయా ఉపాధివంతములైన అర్థములందు సంకేతముల ద్వారా సంజ్ఞలను రచిస్తున్నాడు. “ఓం” అని ఉచ్చరించి ఆ తరువాత శబ్దరాశి భూతములైన ‘వేదములు’ రచన చేస్తున్నాడు. ఆ వేదశబ్దములచే శీఘ్రంగా ఈ ప్రపంచ వ్యవహారమంతా కల్పించుచున్నాడు. అంతా మనోకల్పనయే సుమా! ఈ మనస్సు దేనిని కల్పించుచున్నదో… అద్దానితో తన్మయమగుచున్నది. ఎవడు దేనియందు తన్మయుడౌతాడో… ఆతడు అద్దానిని దర్శించకుండా ఎందుకుంటాడు? ఈ విధంగా ఈ జగత్ భ్రాంతి అసత్యమే అయినప్పటికీ …ఇదంతా దృఢత్వం పొందినదై ఉంటోంది. బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక గులకరాయి వరకు ఈ జగత్తంతా కూడా చిరకాల స్వప్నము - ఇంద్రజాలములవలె మిథ్యగానే భాసించుచున్నది. ఇక ఇందలి స్థూలత్వమంటావా? సూక్ష్మ దేహము యొక్క స్థూలత్వము దృఢ సంకల్పము యొక్క పర్యవసానమే ఇదంతా అయివున్నది.
వాస్తవానికి ’స్థూలత్వం’ అనేదేదీ ఎక్కడా కూడా కించిత్ కూడా లేనేలేదు. సూక్ష్మ రూపమే అభ్యాసముచే ఇట్టి స్థూలత్వభావనను పొందుతోంది. మిథ్యానుభవాత్మకం అయినట్టి ఈ జగత్తు యొక్క స్థూలత్వ రూపమంతా కూడా… మోహమునకు మూలరూపుడైనటువంటి ’ఆదిస్రష్ట’ యగు బ్రహ్మదేవుని వద్దనుండే వచ్చింది సుమా! అందుచేత తత్త్వవేత్తకు కూడా ‘జగత్ దర్శనము’ అనే భ్రమ ప్రారబ్ధ క్షయం అయ్యేవరకు ఉండియే ఉంటోంది. అయితే… రామచంద్రా! చిదేకరసరూపము అగు బ్రహ్మమునకు ‘జగద్రూపము’ అనే దశ ఎట్లా ఉంటుందయ్యా? లేదు. ఈ సమస్త జగత్తు కూడా స్వప్న ద్రష్ట యొక్క స్వప్న సామ్రాజ్యంలాగా భ్రాంతి మాత్రమే అయివున్నది. లేదా… బ్రహ్మమే లీలార్థం ’నిజశక్తి’చే జగత్తు - జీవుడు మొదలైన ఈ రూపములుగా భాసించుచున్నదని అనక తప్పదు.
నిర్మలము - - శాశ్వతము అగు బ్రహ్మము కంటే వేరుగా ఇట్టి జగత్తుకు మరొక కారణమేదీ లేనేలేదు. కార్యమే లేనపుడు కారణం ఎక్కడి నుండి వస్తుంది? “నిర్వికారము - కూటస్థము -
చిదానందము - అద్వయముఅద్వయము” ” - అగు బ్రహ్మమునందు కార్య - కారణాలు ఎట్లా సంభవిస్తాయి? కాబట్టి ఈ జగదాకారములుగా కనిపించేది దృష్టి యొక్క భ్రాంతియేగాని బ్రహ్మము సాకార జగత్తుగా అగుచుండటం కాదు. కనుక, ఈ జగత్తు ఈ వస్తు గుణ సాకారాదుల దృష్ట్యా సత్యము కాదు. పరబ్రహ్మముగా పరమ సత్యమూ, అత్యంత మాధుర్యమూ కూడా!