Page:692
ఈ సృష్టి యొక్క మూలఛ్ఛేదం బ్రహ్మజ్ఞానం చేతనే అగుచున్నది. ఇక 'సృష్టి' అనే భ్రమ కల్పన ఆ ప్రజ్ఞానియందు మరల ఉదయించదు. ఆత్మజ్ఞానం లేకపోయిందా... ఈ సృష్టి సుషుప్తిప్రళయాదులలో మౌనంగా ఉన్నప్పటికీ బీజరూపంలో ఉండియే ఉంటోంది. అనగా కార్యరూపంలో ఉండకపోయినా కూడా, కారణరూపంలో దాగియే ఉంటోంది. మనం ఐందవోపాఖ్యానంలో చెప్పుకున్నట్లు కారణరూపంలో అంతరాళాల్లో దాగిన జగత్తులు మరల ఎప్పుడో కార్యరూపం దాల్చుచున్నాయి. కనుక 'ఆత్మజ్ఞానం' అనే అగ్నిచే మాత్రమే కారణత్వము దహనం కాగలదు సుమా! స్వప్నంలో కనిపించే మనుజులు, వారి మాటలు కూడా అసద్రూపమేకదా! స్వప్నంలో కనిపించిన ఆ మిత్రుడు అట్లా ఎందుకు నన్నంత మాట అన్నాడు? అనే ప్రశ్నకు అర్థమేమున్నది? అట్లాగే ఏ మనుజుని దృష్టిలో ఏ 'సృష్టి' అనేది విద్యమానమై ఉన్నదో... ఆ సృష్టి - ఆ సృష్టిని పొందే జీవుడు కూడా మృగతృష్ణలోని జలతరంగాలు, జలం లాగా - - అసద్రూపులే అయి ఉన్నారు. ఆ ఉభయములకు అప్రమేయమై ఉండే చిదానంద స్వరూపం మాత్రమే సర్వదా సత్యం, నిత్యం కూడా!
అసతామేవ సద్భావమివ ఏషామ్ ఉపేయుషామ్ న వయం నిర్ణయం విద్మో వంధ్యాపుత్రగిరామివ
"వంధ్యాపుత్రుని (గొడ్రాలి కుమారుని మాటలు - అభిప్రాయాలు వింటుంటే ఎంత బాగు న్నాయో!” - - అనే నమ్మకం కలవారి నిర్ణయం ఏమిటో తెలియవస్తుందా? అట్లాగే అసత్పదార్థములను ‘సద్భావం’గా అంగీకరించేవారికి కనిపించే నిర్ణయాలు మాకు తెలియటం లేదు. జీవ-జగత్ పదార్థాలను నిర్వచించే విషయంలో కొందరి నిర్ణయములు ఆత్మజ్ఞానం విషయంగా అసంబద్ధంగానే ఉంటున్నాయి. అయితే జ్ఞానులో? పరిపూర్ణమైన సముద్రంలాగా 'అద్వితీయ చిదానందం' యొక్క పూర్ణత్వము సదా వారిపట్ల సంతరించుకొని ఉంటోంది. వారు ఈ ద్రష్ట - దృశ్యాల దృష్టిని ఏ మాత్రం పొందటమే లేదు. వారు ఈ జగత్తును చూస్తూ కూడా పర్వతం వలె అచంచలులై ఉంటు న్నారు. గాలి వీచని చోట ఉంచబడిన దీపం వలె నిర్విచారులై, నిర్వికారులై ప్రకాశిస్తున్నారు. ఆచార సహితులైనప్పటికీ ఆచారరహితులై సదా స్వస్థచిత్తులై ఉంటున్నారు.
ఆపూర్తైకార్ణవ ప్రఖ్యా కాప్యన్తః పూర్ణతోదితా అన్తః శీతలతా జ్ఞప్తిః జ్ఞస్యా పూర్త్వైవ లక్ష్యతే ॥
జ్ఞాని యొక్క హృదయంలో పూర్ణ సముద్రం వంటి అపూర్వమైన పూర్ణత్వం ఉదయిస్తోంది. జ్ఞానరూపమైనట్టి అపూర్వ శీతలత్వం అతని యందు కనిపిస్తోంది.
ఇక అజ్ఞానియో?... వాసనలే అజ్ఞానం కాబట్టి, ఆతడు వాసనారూపుడే అగుచున్నాడు. వాసనలు రహితమైనప్పుడు “ఇది జీవుడు - - ఇది ఆత్మ (బ్రహ్మం)” అను భేదమే కానరాదు. అయితే వాసనలు తొలిగేది ఎట్లా? విచారణ చేయటం చేతనే!... “నా స్వరూపం వాసనాబద్ధం కాదు. అపరిమితమైన ఆత్మ పరిమిత వాసనలచే బద్ధమవటమేమిటి? అనంతమగు ఆకాశం పరిమితమైన మేఘాలచే ఆచ్ఛాధించబడవచ్చునేమో గాని, అది తన సహజ స్వభావమగు అనంతత్వం మేఘాల
Page:693
కారణంగా కోల్పోతుందన్నదను మాట ఎక్కడిది?"... అనే నూతనమైన సహజ స్వభావం పునః దర్శనమగుచున్నది. విచారణ యొక్క ప్రభావం చేత వాసనలు తమ ఉనికినే కోల్పోతాయి. అనగా "ప్రపంచంలో జరిగేదంతా నా స్వరూపానికి అప్రమేయమైనది”... అను నూతనమైన అవగాహన రూపుదిద్దుకుంటుంది. కాబట్టి సంసారం అనేది తనంతటతానే అంతర్ధానమగుచున్నది. లేదూ? ఆత్మజ్ఞానం ఒనగూడనంతకాలం సంసారం ప్రత్యక్షమయ్యే ఉంటోంది.
ఓ రామచంద్రా! ఇక్కడ “ఆత్మయొక్క అనవలోకనం” అనే కారణం చేత సంబంధబాంధవ్య - స్వ-పర-కర్తృత్వ-భోక్తృత్వాలతో కూడిన మాయ అంతా అనుభవమౌతోంది. 'ఆత్మజ్ఞానము' అనే ప్రకాశముచే ఇవన్నీకూడా “అవలోకనసిద్ధి”యందు లయించిపోతాయి. చీకటి ఉన్నప్పుడు కనబడే భ్రమాకారాలు, “అక్కడ దయ్యం ఉందేమో? ఇటు దొంగలు వస్తారేమో?” మొదలైన భయాలు వెలుగురాగానే ఏమౌతున్నాయి? భ్రమ తొలగగా నలువైపులా బట్టబయలు కాగా “దయ్యాలు లేవు. ఆకారాలు లేవు. అవి చెట్లు, ఇది వీథి"... అని తెలియవస్తోంది. కదా! మాయా విరచితమైన మానావమాన - ఆశనిరాశ - ఆగామిసంచితాదులన్నీ “లేనివే” అని జ్ఞానకాంతి ప్రసరించగానే తెలిసిపోతుంది. అనగా జ్ఞానప్రకాశ ప్రభావం చేత1. ఈ దేహమాంసాది 'స్థూల శరీరం’ - - పంచభూతాలు ఆయాపాళ్ళలో కలవగా ఏర్పడిన పంచీకృత భూతసముదాయంగా, అసత్తుగా, భ్రమరూపంగా, జడమైనదిగా తెలిసిపోతోంది.
2. ఈ బుద్ధి - అహంకార చిత్తాది రూపమైన “సూక్ష్మశరీరం" కూడా - అపంచీకృత భూతమయమై, వికారవంతమై, అసత్తే, జడమే అయి ఉన్నదని కూడా సుస్పష్టమౌతోంది.
బుద్ధి అహంకార - చిత్తాదుల అపంచీకృత భూతరూపత్వమును కూడా వదలాలి. అనగా “వాటన్నిటి నామ రూపములు మిథ్యయే” అని గ్రహించబడాలి!
అప్పుడు శేషించిఉండే స్వప్రకాశమగు చిన్మాత్రమునందు స్థితిపొందిన జీవుడు ఇక ముక్తిని పొందినట్లే! ఇంతకు మించి వేరే అర్థమేదీ 'ముక్తి' అను శబ్దమునకు లేదు... అనునదే మా ఉద్దేశం. అట్లా కాకుండా వాస్తవానికి స్వయంప్రకాశమగు ఆత్మచైతన్యము లింగ శరీరమునందు (మనో - బుద్ధి - అహంకారాదులందు) తాదాత్మ్యధ్యాస ఉంటే? అప్పుడు ఏర్పడుచున్న విషయోన్ముఖత్వముచే వాసనలు ఉంటున్నాయి. ఆ వాసనలు ఆత్మ చైతన్యమును ఆవరించి ఉండి ‘జగత్తు' అనబడు కల్పిత వ్యవహారమును అనుభవింపజేస్తున్నాయి.
ముక్తిదశలో లింగశరీరమే బాధింపబడుతోంది కాబట్టి... ఆపై ఇక వాసన ఎచట ఏ ప్రకారంగా ఉండగలదు చెప్పు?
ఈ 'సంసారము’ అనేది-భ్రమచేత మాత్రమే అనుభవమౌతోంది. తత్త్వదృష్టి సంపాదించుకున్న వారికి "మృగతృష్ణలో జలం లేనట్లే, ఈ సంసారం అసత్తు"... అని సుస్పష్టంగా తెలియవస్తోంది. అప్పుడిక సంసారబంధం ఏది, ఎవనికి, ఎచ్చట కలదో చెప్పు? అయితే ఒకడు ఆత్మజ్ఞానం నందు ప్రవృత్తుడై ఉంటూనే మరల ఎప్పుడైనా జగత్ విషయాల స్మరణ నిర్వర్తించటం ఆరంభించాడనుకో,
Page:694
అప్పుడు ఏ 'చిత్తము' అనునది కల్పితంగా ఉదయించినదై ప్రవర్తించటం ఆరంభిస్తుందో... అదే ఈ సంసారానికి హేతువై ఇక సకల సంసారభ్రమలు కలిగించటానికి ఉద్యమిస్తోంది.
తస్మాత్ సర్వమ్ అనాశ్రిత్య వ్యోమవత్ సముపాస్యతామ్ | అపునః స్మరణం శ్రేయ ఇహ విస్మరణం పరమ్ ||
కాబట్టి సమస్తము త్యజించి ఆకాశమువలె నిర్మలము - స్వచ్ఛము అయినట్టి ఆత్మనే ఉపాసించాలి. ఈ సంసారము మరల స్మరణమవనంతగా పూర్ణ విస్మరణమే మోక్షమార్గంగా ఆశ్రయించ తగిన ఉపాయం.
వాస్తవానికి ఇక్కడ ద్రష్టగాని, భోక్తగాని, అస్తిత్వముగాని, నాస్తిత్వముగాని లేవు. మరి? సముద్రమంతా సర్వదా జలముచే పరిపూర్ణమై ఉన్నట్లు (తరంగాలనేవి జలమునకు అభేదమే అయినట్లు)... ఇదంతా శాంతము - ఏకము - పూర్ణము అగు ఆత్మయే అయి ఉన్నది.
ఒక తటాకం ఉన్నది. అందలి జలంలో ఆకాశం, నక్షత్రాలు, చెట్లు ప్రతిబింబిస్తున్నాయి. అప్పుడు ఆ జలం ఎండిపోయిందనుకో. అందు ప్రతిబింబించిన దృశ్యాలన్నీ ఏమౌతున్నాయి? ప్రతిబింబమంతా తొలగిపోయి బింబరూపమగు ఆకాశనక్షత్రాదులే శేషిస్తాయి కదా! భ్రమ తొలగి పోతే సమస్త దృశ్య జగత్తు సద్రూపమగు బ్రహ్మమేననే విషయం స్పష్టంగా ఎఱుగబడుతుంది. అనగా దృశ్యం ఇట్లే ఉండి ఇది 'సంసారభ్రమ’గా కాకుండా కేవల శివస్వరూపంగా అనుభూత మౌతోంది. తత్ఫలితంగా ఆ జీవునకు తనయొక్క చిదాభాస-ఉపాధి మొదలైన భ్రమలు తొలగగా, అప్పుడు శివస్వరూపుడై నిత్యోదితంగా ప్రకాశించుచున్నాడు. అంతేకాదు ఈ ఇంద్రియ-త్రిగుణదేహ-విదేహ-జగదాదులకు ఆవల నిత్యోదితమై, నిత్యప్రకాశకమై పరతత్త్వము స్వయంజ్యోతి స్వరూపంగా వెలుగొందుచున్నది. అట్టి పరతత్త్వము నొందినవాడు, మరియు సందర్శియగు జ్ఞానికి “ఇటు సమాధి-అటు వ్యవహారము" - ఈ రెండు కూడా ఒకే రీతిగాను, రాగద్వేష రహితంగాను భాసిల్లుచున్నాయి.
సప్తమభూమికను పొందిన జ్ఞానికి సర్వత్రా కేవలం శాంతత్వమే శేషించుచున్నది. అతడు అంతటా వ్యవహరిస్తూనే వ్యవహరించనివాడుగా ఉంటున్నాడు. సప్తమభూమికయందు విశ్రాంతి లభించనంత వరకు జ్ఞాని ప్రవాహపతితమైన వ్యవహారత్వమును-రాగ ద్వేషవర్జితుడై తనయందు సంసారమును ప్రవేశించనీయ కుండానూ... నిర్వర్తిస్తూనే ఉంటాడు. అజ్ఞానికి ఈ సంసారము, ఇందలి వ్యవహారములు బంధములగు చుండగా... జ్ఞాని ఇదే సంసారమును తన ఆధ్యాత్మికోన్నతికి సాధనద్రవ్యముగా మలచుకోగలుగుచున్నాడు. ఇక సప్తమ భూమికను పొందిన తరువాత ఆ జ్ఞాని మునీశ్వరుడై, రాగ-ద్వేష-భయ-క్రోధ వర్జితుడై, మోక్షరూపుడై, శాంతమనస్కుడై శివ స్వరూపమున ప్రకాశిస్తున్నాడు. శిల వలె నిశ్చలస్వరూపుడై, కేవల చిద్రూపుడై వెలయుచున్నాడు .
శ్రీరాముడు : మహాత్మా! అట్టి కేవల శివస్వరూపియగు సప్తమ భూమికాగ్రహీత ఈ జగత్తును త్యజించి వ్యవహారరహితుడై మౌనం వహించి ఉంటాడా?
Page:695
శ్రీవసిష్ఠ మహర్షి : నీవు చెప్పిన 'జగత్తు' అనబడేది సప్తమభూమికాప్రవేశికి అతని స్వస్వరూపమునకు అభిన్నంగానే అనుభవమౌతోంది. ఒక చింత విత్తనము యొక్క కోశమునందే చింతచెట్టు యొక్క సకల విశేషములు అభిన్నంగా ఉండి ఉన్నాయి కదా! స్వప్నభ్రాంతి వంటి ఈ జగత్తుయొక్క బాహ్యత్వము ఆత్మకు భిన్నంగా లేదు. అందుచేత సర్వము యథాతథమై ఉండగా అతడిక త్యాజ్య గ్రాహ్యముల కంటే అతీతమైన పదవి యందు ప్రకాశిస్తూ ఉంటాడు.
బాహ్యతా భావనాత్ బాహ్యమ్ ఆత్మైవ ఆత్మత్వభావనాత్ | భవతీదం పరే తత్త్వే భావనం తత్తదేవ హి |
ఆత్మయే “బాహ్యత్వము” అను భావనచే బాహ్యరూపముగా అగుచున్నది. ఆ బాహ్యత్వము ఆత్మత్వభావనచే ఆత్మరూపమే అగుచున్నది. కాబట్టి 1) బాహ్యత్వము, (2) అభ్యంతరత్వము అను ఈ రెండూ కూడా ఆత్మయొక్క ఆయా భావనా రూపములు మాత్రమేనని గ్రహించు.
మరొక విషయము. అంతఃకరణమున స్వప్నాది రూపంగా ఏ భ్రాంతి అయితే ముందుగానే ఉన్నదో... అదియే బాహ్యజగత్తు రూపంగా ఉదయించటం జరుగుతోంది.
స్వప్నంలో కనిపించేదంతా జాగ్రత్ సంబంధమైనదే అయినట్లు ఈ జాగ్రత్లో కనిపించేదంతా స్వప్న సంబంధమైనదేసుమా! జాగ్రత్కు-స్వప్నమునకు మా దృష్టిలో భేదమే లేదు. ఎందుకంటే ఆ రెండు కూడా ఆత్మయొక్క భావనను ఆశ్రయించి మాత్రమే ఉన్నాయి. రెండు పాత్రలలో గల పాలలో ఏమాత్రం భేదం లేనట్లు జాగ్రత్కు స్వప్నమునకు భేదమే లేదు. అనగా జీవుడు జగత్తుగా అనుభవించుచున్నదంతా స్వప్నసదృశమేనని గ్రహించు.
శ్రీ రాముడు : అయితే, జాగ్రత్తులో కనబడే పదార్థములు స్థిరంగాను సుస్పష్టంగానూ, స్వప్నంలో కనబడే పదార్థములు అస్థిరంగాను, అస్పష్టంగాను భాసిస్తున్నాయి కదా!
శ్రీవసిష్ఠ మహర్షి :
స్థైర్య - అస్థైర్యై తథైవ అత్ర భ్రాంతిమాత్రమయే తతే | ఆధార - అధేయతే తే ద్వే యథా జలతరంగ తే ॥
ఓ రామా! జగత్తులో అనిపించే స్థిరత్వం, స్వప్నంలో అనిపించే అస్థిరత్వం ఆ రెండింటి అనుభవం కూడా భ్రాంతి మాత్రమే అయి ఉన్నాయి.
స్వస్నంలో కనిపించే శరీరాలకు జాగ్రత్తు ఆధారం, స్వప్నం ఆధేయం. అయితే ఈ ఆధార - ఆధేయములు జల-తరంగముల వలె ఒకదానితో మరొకటి అభేదమైనవి. మనిషికి స్వప్నంలో ఆయా పదార్థములన్నీ ఎందుకు భాసిస్తున్నాయి? అజ్ఞానం చేతనేకదా! తన్ను ఎఱిగిన వెంటనే ఆ స్వప్న ద్రష్ట జాగ్రత్లో ప్రవేశిస్తున్నాడు. వెంటనే అతనికి జాగ్రత్ రూపం అనుభవమవుతుంది. అట్లాగే, శుద్ధాత్మజ్ఞానము యొక్క సముపార్జనచే ఈ జాగ్రత్ పదార్థములు ఇక పదార్థరూపముగా అనిపించక ఆత్మరూపముగా అనుభవమగుచున్నాయి. అనగా, “కల్పనారహితము - - శాంతము” అయినట్టి పరమాత్మ యొక్క రూపమే ఆయా పదార్థముల భావనచే ఆయా రూపములుగా అనుభవ
Page:696
మగుచున్నాయి. ఆయా పదార్థములు భావించకపోతే ఆయా రూపములన్నీ ఆత్మ పొందేదే కాదు. పదార్థ సంబంధమైన బాహ్యత్వపు భావన శమించగా అప్పుడు ఏ ఈశ్వరరూపము శేషిస్తోందో అది దేశ - కాలాదులకు అసంబంధమైనది కాబట్టి - 'అది ఉన్నది' అని అనలేం. ఆత్మయే స్వయంగా “సత్-ఉనికి” కాబట్టి “అది లేదు” అని కూడా అనలేము. అయ్యది వాక్కుకు విషయమే కానిదిగా అగుచున్నది. భ్రమయొక్క సంపూర్ణ వినాశన స్థితిని సమాధియందుండే యోగి మాత్రమే ఎఱుగగలడు. అది అనుభవవైకవేద్యమేగాని, మాటలతో “అది ఇట్టిది"... అని చెప్పలేం, సర్వ భ్రమ “ఆత్మసాక్షాత్కారం” అనేది ఉపదేశమునకు విషయమే కాదు. మరి? అది విజ్ఞుల యొక్క అనుభవమునకు మాత్రమే విషయమగుచున్నది.
శ్రీరాముడు : మరి ఈ గురు శిష్య - ఆత్మబోధ వ్యవహారం?
శ్రీవసిష్ఠ మహర్షి : వాక్కుకు విషయమే కాని సర్వభ్రమనాశరూప ఆత్మసాక్షాత్కారం వైపుగా శిష్యుని బుద్ధిని ప్రవృత్తం చేయటానికే ఈ ఉపదేశక్రమము, గురుశిష్య బోధల ప్రయోజనమై ఉన్నది.
కాబట్టి ఓ సర్వ ప్రియజనులారా! అహంకారమును త్యజించండి. అభిమాన, విషాద, భయ లోభ, మోహములను పారత్రోలండి. దేహ, ఇంద్రియ, మనో, చిత్తాదుల సంబంధమైన జడత్వమును పాము కుబుసమువలె వదిలివేయండి. శాంతస్వరూపులై ప్రకాశించండి. శాంతము - సమస్త భేద శూన్యము-అక్షయము- ఏకము - · అజము అజము - - నిర్వాణరూపము అయిన బ్రహ్మమును సంతరించుకొని సమాధి వహించి ఉండటమే యుక్తం.
14. తత్త్వజ్ఞులతో సాంగత్యం - స్వవిచారణ
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! తనయొక్క చలనముచే వాయువు సుడిగాలి మొదలైన రూపములను దాల్చి అనేక బీభత్సములను కలిగిస్తుంది చూచావా? అట్లాగే అవిద్యచే ఆకృతమైన చైతన్యము విషయములందు వ్యాపించుటకు ఉద్యమించిన మరుక్షణం అసద్రూపములే అయినట్టి అహంకారం మొదలైన వాటితో కూడిన ఈ జగద్భమనంతా ఉదయింపజేస్తోంది. అయితే బ్రహ్మ రూప భావనాబలంచేత ఈ జగద్భమ దుఃఖం కలిగించగలిగే శక్తిని కోల్పోగలదు. అట్లాకాదా... జగత్తు యొక్క శబ్దార్థ భావనచే అది మహానర్థమును కలుగజేయగలదు. ఈ కంటిచూపు ప్రసరించినంత మాత్రంచేత రూపానుభవం ప్రాప్తిస్తోంది చూచావా? చైతన్యము ప్రసరించినంత మాత్రం చేత ఈ జగద్భమరూపమంతా స్థితి పొంది ఉంటోంది.
ఇక వాస్తవానికి వస్తే, కూటస్థచైతన్యమునకు రాకపోకలు ఉన్నాయా? లేవు! విషయముల అభావన చేత 'చాంచల్యము' అనే ప్రసరణ తొలగిపోతే నిర్విషయ చిదానందమే పరమసత్యమై అనుభవం కాగలదు. ఏ చైతన్యము యొక్క వ్యర్థ ప్రసరణమున్నదో... అది అసత్తే సుమా! అదంతా “గొడ్రాలి కుమారుడు ఏమి నృత్యం చేస్తున్నాడో కదా!”... అను అర్థరహిత వాక్యము వంటిదే!
Page:697
చిత్తు యొక్క ప్రసరణం “అనుభవం” అను దాని ద్వారానే సిద్ధిస్తోంది. అయితే ఆ అనుభవం ఆత్మ - విద్యచే అతిక్రమించబడగలదు. బాలునికి పిశాచము యొక్క అనుభవం తొలిగేది ఎట్లా? పిశాచము యొక్క భ్రమ తొలగటంచేతనే కదా! అట్లాగే అసత్పదార్థము యొక్క అనుభవం తొలగాలంటే అసత్పదార్థమును అభావించటమే ఉపాయం. ఈ విధంగా చూస్తే చైతన్యము యొక్క ప్రసరణ అనబడేది మిథ్యయే అయి ఉన్నది సుమా! అదే రీతిగా “అహంభావముయొక్క ప్రసరణ” అనేది కూడా మిథ్యా వాక్యమనియే గ్రహించబడుగాక! లేదా, “అహంభావముయొక్క ప్రసరణ” అనేది కూడా మిథ్యా వాక్యమనియే గ్రహించబడుగాక! లేదా, అహంభావము యొక్క అనుభవము దుఃఖమునే కలిగించుచున్నది. అనహంభావనచే అహంభావన తొలగగా అప్పుడు మోక్షసుఖము జనిస్తోంది. ఈ విధంగా బంధ - మోక్షములు జీవునకు తన అధీనంలోనే ఉన్నాయిగాని, మీరెవరో బయటవారి ఆధీనంలో లేవు. అటువంటప్పుడు మోక్షము కొరకై ఎక్కడో వెతకి ఏం ప్రయోజనం? తద్ధ్యానం స సమాధిర్వా యదవేదనమాసితమ్
అజడానాం జడమివ సమం శాస్తమనామయమ్
అజడములగు మనో-బుద్ధి-అహకారాదులపట్ల నిర్లిప్తమగు శిలామౌనాభ్యాసమే సమాధి. “తెలుసుకుంటున్నది తెలియబడేది”... అనే ఉభయముపట్ల అతీతత్వముతో కూడిన స్థితియే ధ్యానము-నిశ్చలము-సమము-శాంతము-నిర్వికారము-ఏకము అగు చిద్రూపమున నెలకొని ఉండు స్థితియే “ధ్యానము” అని, 'సమాధి' అని కూడా చెప్పబడుతోంది.
వాదోపవాదాలలో సిద్ధాంతపూర్వకంగా ప్రవేశించే ఓ పండితులారా! వాదోపవాదాలు కలహ రూపాలగు వాక్మలకు కారణమే అగుచున్నవి. వ్యర్థమైన కంఠశోష బదులుగా శుద్ధ చిద్రూపంలో స్థితిపొంది ఉండే ఉపాయాలు ఆశ్రయించటమే అత్యావశ్యకమని మా అనుభవసారం!
ఈ జీవుడు అనేక దేహములలో ప్రయాణించి క్రమంగా ఘనీభూతములగు వాసనలతో కూడి ఉంటున్నాడు. సంకల్పరచితములు, స్వప్నతుల్యములు, అసత్తుల్యములు అగు అనేక బాహ్య
అభ్యంతర విషయములను ఆశ్రయించి తద్వారా అనేక విధములైన దుఃఖములకు భోక్తగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. ఎవరిపట్ల వాసనలు సన్నగిల్లుచున్నాయో, అట్టివాడు సంకల్ప రహితుడై ఈ బాహ్య - అభ్యంతర విషయములను మిథ్యగా ఎఱుగుచున్నాడు. గాఢంగా నిద్రించే మనుజుడు దోమ కుట్టినా బాధింపబడనట్లు... వాసనా రహితుడైనవాడు ప్రారబ్ధం చేత ఆయా సుఖ దుఃఖ సంఘటనలను పొందవలసి వస్తున్నప్పటికీ వాటిని ఆతడు అనుభవించడు. దేశకాల-క్రియా యోగం చేత పదార్థభావన ఏర్పడుచున్నట్లే దేశ కాల క్రియా పూర్వకమైన అభ్యాస యోగం చేత సూక్ష్మమగు వాసనలు కూడా ముక్తత్వదశను (తొలగిపోవటం) పొందుతాయి. అతి సూక్ష్మమగు పరమాణువులు అకాశరూపత్వము పొందునట్లే వాసనలు కూడా సాధనలో నిమగ్నమైన యోగి పట్ల తప్పక ముక్తత్వం సంపాదించుకోగలవు. పండితులతో సాంగత్యం కొనసాగిస్తూ రాగా క్రమంగా మూఢత్వం పోయి, పాండిత్యము అలవడుతుంది చూచావా? అట్లాగే బ్రహ్మహంభావన
Page:698
యొక్క అభ్యాసం చేత వాసనలు సూక్ష్మత్వం పొంది క్రమంగా శూన్య రూపం పొందుతాయి. “సర్వ సహజీవులు ఏ మూల పదార్థంచే తయారు కాబడినారో... అట్టి బ్రహ్మమే నేను” అనునదే బ్రహ్మాహంభావన సుమా! "నేను ఇహలోకంలోగాని, పరలోకంలోగాని సర్వదా శుద్ధ బ్రహ్మ రూపుడనే! అంతేగాని 'అహం' శబ్దార్థరూపమగు జీవుడను కాదు" అనే నిశ్చయం ఎప్పుడైతే కలుగుతుందో... అట్టి శాంతరూపుడగు మనుజుడు “దృఢ బోధ కలవాడు” అని చెప్పబడతాడు.
ఈ విధంగా... ఏ జగత్-జీవాదులన్నీ భాసిస్తున్నాయో అవన్నీ కూడా “నేనెవడను? ఈ జగత్తు ఎట్టిది?” అని ఈ ప్రకారంగా విచారణ చేయటం చేత తప్పక ఉపశమిస్తాయి.
"నేను ఈ దేహ- ఇంద్రియ-మనో-బుద్ద్యాది రూపుడను గాను. నిర్వాణరూపమగు ఆత్మయే నేను” -అని ఇంతమాత్రం ఎఱుగటంలో కష్టం, అసాధ్యం మొదలైనవి ఏమున్నాయి చెప్పు? సత్సాంగత్యము-శాస్త్ర విచారణ ఈ రెండిటి సహాయం చేత - ఏజీవుడైనా సరే తన యొక్క స్వస్వరూప అజ్ఞానమును తప్పకుండా అధిగమించగలడు.
"కో_హం? కథమిదమ్ దృశ్యమ్? కో జీవః? కించ జీవనమ్?” ఇతి తత్త్వజ్ఞ సంయోగాత్ యావజ్జీవం విచారయేత్ ॥
నే నెవరు? ఈ దృశ్యం ఎట్టిది? జీవుడు అనగా ఎవరు? అతని ప్రాణాదుల ధారణ ఎట్టిది? ...ఈ మార్గంగా తత్త్వజ్ఞానుల సాంగత్యంలో మోక్షపర్యంతమూ విచారణ చేస్తూనే ఉండాలి. అట్టి తత్త్వజ్ఞుల సాంగత్యం యొక్క ప్రయోజనం. మొట్టమొదట ఈ జగత్తంతా జ్ఞానానందమయమైనట్లు భాసిల్లుతుంది. తరువాత అహంభావం అనే అంధకారం నశిస్తుంది.
ఆ తరువాత ఒక్కసారిగా ఆత్మ ప్రకాశం బోధకమౌతుంది.
అందుచేత ముముక్షువైనవాడు “తత్త్వజ్ఞాని” అనే సూర్యుణ్ణి తప్పక సేవించాలి. ఓ సభికులారా! తత్త్వజ్ఞులైన వారు ఎక్కడెక్కడున్నారో చూడండి, వెతకండి, వారిని అతి జాగరూకులై గుర్తించండి. ఎందుకంటే తత్త్వజ్ఞత కంటే అన్యంగా ఏవో కొన్ని సిద్ధాంతములతో, వాదోపవాదాలతో ఉండే వారి సమూహంలోంచి తత్త్వజ్ఞులను గుర్తించటం ఒక పెద్ద కార్యక్రమమే సుమా! “వాదం” అను పిశాచం ఉదయించగానే అది "అహంరూప ప్రత్యేకతత్త్వమే ముఖ్యము. అనహమ్ రూపసర్వాత్మకత్వము అనూహ్యము, అసంభవము, అసందర్భము, అనవసరము” అని అనిపించే విధంగా తర్క-వితర్క ప్రభావం చేత ఈ జీవుని శ్రుతి విరుద్ధమైన ప్రతిపాదనలచే ముంచెత్తగలదు. “ఇదియే చాలు. ఇంతే నీ పరిధి” అను మూర్ఖత్వముతో కూడిన అనర్థమును పండితులైన వారికి కూడా “వాదోపవాద వ్యవహారం కలిగించగలదు” అందుకే ఆత్మతత్త్వమును 'అతర్క్యమ్' (వాదోపవాదాలచే అలభ్యం, తర్కమునకు విషయం కానిది” అని చెప్పబడింది. బాలురు “ఇంతే! ఇదే కావాలి! ఇంకేం వినను. ఈ పుస్తకంలో ఉన్నది చెప్పండి, ఇంకేం చెప్పొద్దు, మాట్లాడవద్దు"... అని అమాయకత్వంతో కూడిన మొండితనమును వహిస్తున్నట్లుగానే పండితులైన వారిలో కొందరు “ఏదో చెప్పుతారు. ఏం
Page:699
వినకండి. ఇంతే చేయండి, ఇక ఆలోచంచకండి. ఊరుకోండి"... అని తమ అనుయాయిలకు బోధించి 'అంధగోలంగుల న్యాయం'లాగా తమకు కనబడేదానికే తదితరులను పరిమితులను చేయటం లోకంలో చూస్తూ ఉంటాం. కాబట్టి బుద్ధిమంతుడైనవాడు తత్త్వజ్ఞాని అయిన పండితుణ్ణి సమీపించి, తన వినయం, సేవ మొదలైన వాటిచే ప్రసన్నునిగా చేసుకోవాలి. ఏకాంతంగా ప్రశ్నించాలి. వారు చెప్పేది రెండు చెవులతోనూ వినాలి. వారు ఉపదేశించే అర్థములను అన్నిటినీ క్రోడీకరించుకొని స్వబుద్ధితో విచారణ చేసుకోవాలి. అందులోని సార విశేషాన్ని గంభీరంగా గ్రహించాలి. విశేషాల పట్ల మౌనం పెంపొందించుకోవాలి.
ఈ బుద్ధిని - 1.శుద్ధపరచుకోవటం; 2.వృద్ధి పరచుకోవటం, సునిశిత పరచుకోవటం; 3.సువిశాల పరచుకోవటం... ఇది 'గురుబోధ' యొక్క సద్వినియోగోద్దేశం. వారు వచించే శ్రుతియుక్త-స్వానుభవపూర్వక వాక్యాలను వాక్యార్థాలను హృదయంలో పదిలపరచుకోవాలి. “విద్వజ్ఞుల తోటి సంభాషణ” అను సదావకాశంతో సహాయంతో స్వబుద్ధిచేత విచారణ జేస్తూ క్రమక్రమంగా సర్వసందేహాలను నివృత్తింపజేసుకోవాలి. ఇంక ఆ తరువాత “నిధిధ్యాస" ద్వారా సర్వసంకల్ప రహితమైనట్టి, సద్రూప మైనట్టి 'బ్రహ్మము' నందు తన్మయత్వమును సముపార్జించుకోవాలి.
కనుక ఓ రామా! బుద్ధిమంతుడైనవాడు ప్రతిరోజు కూడా తత్త్వజ్ఞుల సాంగత్యంచే బుద్ధిని సుతీక్ష్యం చేసుకోవాలి. 'అజ్ఞానం' అనే జన్మజన్మాంతర సముపార్జితమైన లతను ముక్కలు ముక్కలుగా ఖండించివేయాలి. అట్టి "జ్ఞానప్రాప్తి” అనే ఉత్తమ ప్రయోజనం తత్త్వజ్ఞులలో కలిగే సాంగత్యం చేత మాత్రమే సులభరీతిగా సంభవిస్తుంది. ఈ వాక్యమును నేను స్వానుభవమంతా రంగరించి చెప్పుచున్నాను. మేము అసమంజసమైన వాక్యములు పలికే బాలురంవంటివారం కాదు సుమా!
ఓ సాధక జనులారా! ఈ జగద్వ్యవహారములన్నీ కూడా కొంత 'సానుకూలత' మరికొంత ‘ప్రతికూలత’ కలిగి ఉండే స్వభావం కలిగి ఉన్నాయి. సముద్రం చూచారా! అది తరంగములు విజృంభించటం చేతగాని, ఉపశాంతించటం చేతగాని ఏమైనా అనిష్టప్రాప్తిగాని, ఇష్టనాశనముగాని పొందుతోందా? లేదు. అటు ఆకాశాన్ని చూడండి! మేఘం - మంచు - ఎండ మొదలైనవి విజృంభించటం చేత తాను వృద్ధినిగాని, హానినిగాని పొందదు కదా! అట్లాగే సంకల్పరహితుడైన జ్ఞాని ఈ జగద్వ్యవహారములపట్ల కొంచెంకూడా ఇష్ట నాశనముగాని అయిష్టప్రాప్తినిగాని పొందటం లేదు. పొందవలసిన అవసరమూ లేదు.
ఈ జీవుడు నిర్వికారము-పరిపూర్ణము-శాంతము-సర్వవ్యాపకము అయినట్టి బ్రహ్మము యొక్క జ్ఞానముచే 'బుద్ధుడు' కాగలడు. వాస్తవానికి మృగతృష్ణాజలంలాగా ఈ జగత్తు భ్రమమాత్రమే అయినప్పటికీ, బ్రహ్మజ్ఞానికి ఈ సమస్త జగత్ - జీవాదులు ఆత్మరూపుడగు తనకంటే వేఱుగా భాసించదు.. తన స్వరూపంగానే భాసిస్తుంది. ఇక అట్టి తత్త్వజ్ఞానికి ‘జగత్మననము’ అనే విభ్రమములు ఎట్లు ఎందుకు కలుగుతాయి? కలగవు.
Page:700
15. పరలోకవ్యాధి - ఇహైవ చికిత్స
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అధికార యోగ్యమైన శరీరం పొందిన తరువాత కూడా ఈ మనుజుడు ఆత్మోద్ధరణకై పురుషప్రయత్నమునకు ఉపక్రమించకపోతే ఎట్లా? ఇప్పుడే ఇక్కడే “సత్సాంగత్యము” సహాయంతో తనయొక్క బుద్ధిని వికసింపజేసుకోవాలి. ఇక్కడే స్వబుద్ధి చేత ఆత్మజ్ఞానం సంపాదించుకోవటం తప్పితే వేరే ఉపాయం ఏదీ లేదు. విషం కూడా వైద్యశాస్త్రయుక్తమైన ప్రయోగాదులచే తన మరణహేతుత్వమును వదలి దేహమునకు శ్రేయోదాయకం అవుతోంది చూచావా? అట్లాగే అశాస్త్రీయములు కల్పితములు అగు వాసనాదులు కూడా అధ్యాత్మ శాస్త్రీయమైన ప్రతికల్పనచే అవి తమ బంధహేతుత్వము త్యజించి మోక్ష హేతుత్వమును అవధరించ గలవు. కల్పనలు ప్రతికల్పన (అధ్యాత్మికమైన కాల్పిక సాధనల)చే నశించగలవు. కల్పనలన్నీ పూర్తిగా నశించేవరకు ఆధ్యాత్మిక సాధన పూర్వకమైన ప్రతికల్పనను కొనసాగిస్తూనే ఉండక తప్పదు. సర్వకల్పనారహిత స్థితే ముక్తి. అట్టి ముక్త స్థితి భోగత్యాగానికి ముందే కలుగుట కుదిరేది కాదు. 1. శ్రవణ - మననములచే ఆత్మతత్త్వమును సునిశ్చితం చేసుకోవటం.
2. వాక్కుచేత, మనస్సుచేత లోన పదార్థములను భావించకపోవటం.
3. ప్రతి కల్పన అభ్యసించటం.
... ఇట్టి మార్గంలో వాక్-మననముల నిరోధం చేత మెల్లమెల్లగా కల్పనయొక్క శమనము వృద్ధి పొందగలదు.
ఆ తరువాత అహంభావాన్ని 'అనహమ్' భావన ద్వారా వర్ణించాలి. ఎందుకంటే అహంభావం కంటే వేఱుగా అవిద్య అనేది లేదు. ఆ విధంగా అహంకారం బాధితం కాగా, సర్వభావనా రాహిత్యం చేత తత్త్వసాక్షాత్కారం ఉదయిస్తుంది. అదే మోక్ష స్థితి. అంతకు వేరుగా 'మోక్షం' అనేది ఎక్కడా ఏదీ లేదు. అట్టి సాక్షాత్కారమును పరిరక్షించుకోకుండా ఈ జగత్-జీవాది భావాలలో ప్రీతియుక్తుడై ఈ జీవుడు అట్టి కొంచెం అహంభావమును దేహ పర్యంతరం ఆశ్రయించి ఉన్నా కూడా... ఈతడు మరల సంసారం పొందటం జరుగగలదు. అందుచేత ‘అహంభావాన్ని త్యజించటం' అనే ప్రతికల్పన అభ్యసిస్తూ వస్తే... అప్పుడా జీవుడు శాంతిని పొంది నిరతిశయానందస్థితిని పొందగలడు.
ప్రతికల్పన అనగా - బహిర్ముఖ వృత్తిచే ఈ జగత్తును గాంచకపోవటం, అంతర్ముఖ వృత్తిచే ఈ జగత్తును పరమాత్మతత్త్వంగా గాంచటం. పరమాత్మయే ఈ సర్వజీవాదుల రూపంగా ఉన్నట్లు గమనిస్తూ ఉండటం.
అట్టి ప్రతికల్పనచే ఎవనికి ఈ సమస్త జగత్తు కూడా ఎదురుగా ఉండి కూడా అసత్తుగాను, శిల వలె ప్రశాంతంగాను తోచుచున్నదో అట్టి మహాత్మునకు శిరస్సు వంచి మేము నమస్కరిస్తున్నాం. జేజేలు పలుకుచున్నాం.
పరబ్రహ్మమున లీనమైనట్టి చిత్తం కలవాడు దృశ్య శూన్యుడగుచున్నాడు. అనగా ఆతని చిత్తం బహిర్ముఖరహితమై ఉంటోంది. అతడు అభ్యంతరమున చైతన్యమాత్రభావనతో కూడి
Page:701
ఉంటున్నాడు. అందుచేత ఈ జీవ - - జగదాది సమస్త ప్రపంచము అతని దర్శనముచే శిలవలె ప్రశాంతమై ఉంటోంది.
కల్పన అనగా... “ఇది నాకుండుగాక, ఇది నాకు లేకుండుగాక, వాళ్లు అటువంటి వారు మేం ఇంతటివాళ్లం - వీళ్లంటే ఇష్టం. వాళ్లు నాకు ఇష్టముండదు. ఇత్యాది ద్వంద్వములతో కూడిన” భావనా పరంపరలే సుమా! అట్టి కల్పనయే దుఃఖమును వృద్ధింపజేస్తోంది. బ్రహ్మాకారభావనచే దృశ్యముయొక్క రూప-నామ దర్శనరూపమైన చిత్తము బలహీనమగుచుండగా, అట్టి చిత్త నిరోధముచే ప్రతికల్పిత సుఖము అగు ఆత్మసుఖం లభిస్తోంది.
ద్వౌ వ్యాధీ దేహినౌ ఘెరవయం లోకస్తథా పరః | యాభ్యాం ఫెరాణి దుఃఖాని భుంక్తే సర్వైర్షి పీడితః ॥
ఈ జీవునికి రెండు వ్యాధులున్నాయి - 1. ఇహలోక వ్యాధి, 2. పరలోక వ్యాధి. ఈ రెండు వ్యాధుల వల్లనే ఈతడు ఆధిభౌతిక, ఆధిదైవిక, ఆధ్యాత్మికాది సమస్త దోషములచే పీడితుడై అనేక మహాదుఃఖములన్నీ అనుభవించుచున్నాడు.
ఇహలోక వ్యాధి - ఆకలి, దప్పిక మొదలైనవన్నీ. ఈ వ్యాధి యొక్క శమనము కొరకై అన్న పానాదులు సంపాదించుకుంటున్నారు. మంచిదే. అయితే కొందరు జీవులు ఇహజీవితము కొరకే జీవితమంతా తమకున్న శక్తినంతా ధారపోసుకుంటున్నారు. మరి పరలోక వ్యాధి మాట ఏమిటి? పరలోక వ్యాధి - ఆ వ్యాధి జనన మరణాది రూపాలుగా ఉంటోంది. పరలోక వ్యాధికి ఇక్కడి భోగాదులు ఔషధమే కాదు.
పరలోక మహావ్యాధౌ ప్రయతనే చికిత్సనమ్ |
శమః సత్సంగ భోధాభ్యైః అమృతైః పురుషోత్తమాః ||
మరి? పరలోక వ్యాధికి శమం (ఇంద్రియనిగ్రహం), సత్సాంగత్యం, జ్ఞానం మొదలైనవి ఔషధములు. అట్టి అమృతతుల్యములగు ఔషధముల ప్రాముఖ్యమేమో ఎఱిగిన మహనీయులు అట్టి పరలోకవ్యాధి కొరకై ఔషధములు సేవించుచున్నారు. అవకాశములను సృష్టించుకుంటున్నాడు. ఉపయోగించుకుంటున్నారు.
పరలోక చికిత్సాయాం సావధానా భవన్తి యే | మోక్షమార్గమహేచ్ఛాయాం శమశక్త్యా జయన్తి తే ॥
ఓ జనులారా! ఇహలోక విభాగములైన ఈ రక్తమాంసమయ శరీరము దృష్ట్యా మాత్రమే జీవితమును ఉద్దేశించువారు సంసారముచే అనేకసార్లు మోసగించబడనున్నారు.
1. అపథ్యములైనట్టి ఇక్కడి భోగములను త్యజించి ఉండటం.
2. సంత్సంగము - జ్ఞాన సమాచార సేకరణ వంటి ఔషధ సేవనము.
ఈ రెండూ ఇప్పుడు కావాలి. ఉట్టి “మందు” తీసుకొని “పథ్యం” (తీసుకోవలసినవి, తీసుకోవటం, తీసుకోకూడనివి తీసుకోకపోవటం) విషయంలో అశ్రద్ధగా ఉన్నా, పథ్యం తీసుకొని మందును తీసుకోకపోయినా... వ్యాధికి చికిత్స కుదురదు కదా! పై ఉభయముల పట్ల సావధానులై
Page:702
ఉండండి. అప్పుడు 'శమము' అనే ఔషధము యొక్క శక్తిచే మీ యొక్క మోక్ష 'సాధనము' అనే అభిలషితమార్గంలో విజయం పొందుతారు.
ఇహైవ నరకవ్యాధేః చికిత్సా న కరోతి యః I
గత్వా నిరౌషధం స్థానం స రుజః కిం కరిష్యతి ॥
ఈ మనుష్యజన్మ మహత్తరమైన అవకాశం. ఇక్కడ 'నరకం' అనబడే పరలోకస్థిత వ్యాధికి 'సత్సంగం' మొదలైన ఔషధములు సేవించి, తద్వారా ఆత్మజ్ఞానము సముపార్జించి చికిత్స పొందాలి. ఎవడైతే అట్టి నరకవ్యాధికి చికిత్స ఇక్కడ పొందుటకు సిద్ధపడడో... అట్టివాడు సరి అయిన ఔషధములు లభించని స్థావర జంగమాదులైన జన్మలకు పోయి ఏమి చేయగలడు? శాస్త్రాశ్రయం మొదలైన చికిత్సలు అక్కడ లభించక పోవచ్చు కదా!
ఇహలోక చికిత్సాభిః జీవితం యాతు మా క్షయమ్ | ఆత్మజ్ఞానౌషదైః అజ్ఞాః! పరలోకశ్చికిత్స్యతామ్ ॥
ఓ సహజీవులారా! మీపై గల అవ్యాజమైన ప్రేమచే మేము చెప్పే ఈ జాగరూక వాక్యాలు వినండి. మహత్తరమైన ఈ “మనుష్య జీవితము” అనే దుర్లభమైన అవకాశమును ఇహలోక విషయములైన తినటం-త్రాగటం-భోగములు అనుభవించటం అనే కార్యక్రమాలకు మాత్రమే ఉద్దేశించి, తద్వారా, ఇహలోక చికిత్సాపరిమితులు కాకండి. 'ఆత్మజ్ఞానము' అనే ఔషధమును సేవించి పరలోకవ్యాధికి చికిత్స ఒనర్చుకోండి. "ఆ! ఆత్మజ్ఞానానికి అంతతొందరేం వచ్చిందిలే! తరువాత ఎప్పుడో చూసుకోవచ్చు”... అని కాలాయాపన చేయవద్దని నా మనవి. ఎందుకంటా రేమో? గాలిచే కదల్చబడుచున్న ఆకుపైగల అల్పమైన నీటిబిందువుల వలె ఈ ఆయుష్షు అత్యంత క్షణభంగురమైనది. కనుకనే సత్సంగము స్వచ్ఛాస్త్ర అధ్యయనము మొదలైన యత్నములచే పరలోకవ్యాధికి వెంటనే చికిత్స కావించుకోవటమే ఉచితం సుమా!
పరలోక మహావ్యాధౌ యత్నేనాశు చికిత్సితే,
ఇహలోకమయో వ్యాధి స్వయమాశు ఉపశామ్యతి!
చక్కగా ప్రయత్నించి 'పరలోకము' అనే వ్యాధికి చికిత్స పొందారా... అప్పుడిక ఇహ లోకమునకు చెందిన వ్యాధి తనంతటతానే శీఘ్రంగా శమించిపోగలదు.
ఈ జీవుడు చైతన్యమాత్రుడనియే కదా అధ్యాత్మశాస్త్ర నిర్ణయం అతనియొక్క ప్రసరణా వ్యాసంగమే ఈ జగత్తు. జీవునిలో గల చైతన్యమే ఒక పరమాణువులో కూడా వ్యాపించి ఉండటం చేత, అట్టి ఒక పరమాణువునందు కూడా అనేక భూ-పర్వతాదుల విస్తారముతో కూడిన జగత్తు కలదు. ఆ చైతన్యము యొక్క బహిర్ముఖత్వ ప్రసరణచే బాహ్యపదార్థ రూపముగాను, అంతర్ముఖత్వ ప్రసరణచే కోరికలు మొదలైన మానసిక పదార్థ రూపాలుగాను చిదాకాశమున అనుభూతమగు చున్నాయి. కనుక ఈ జగద్భమ సత్యంకాదు. ఇది స్వయంకల్పిత భ్రాంతి మాత్రమే. మిథ్యయే
Page:703
అయిన ఈ దృశ్య జగత్తు ప్రళయంచే నశించేదీ కాదు, సృష్టులచే జనించేదీ కాదు మరి? భ్రమ ఉన్నప్పుడు జగత్తుగాను, భ్రమ తొలగుటచే కేవలం ఆత్మగాను ఇదంతా అనుభూతమగుచున్నది.
ఏ జీవుడైతే ‘భోగం’ అనే బురదలో చిక్కుకున్న తనయొక్క ఆత్మను ఇప్పుడికక్కడ స్వకీయపురుష ప్రయత్నంచే సముద్ధరించుకోవటానికి ప్రయత్నించడో అట్టివాడు దుఃఖ పరంపరలను అనివార్యంగా పొందవలసియే వస్తోంది. స్వకీయమైన పురుష ప్రయత్నం తప్పితే ఆత్మోద్ధరణకు వేరే ఉపాయం ఎక్కడా ఏదీ లేదు. అడ్డమైన నీళ్ళు వచ్చి సముద్రంలో జేరుచున్నాయి చూచావా? అట్లాగే ఇంద్రియ జయము లేనివాడు కేవలం 'భోగం' అనే బురదలో నిమగ్నమైనవాడు అగు మూఢుడు ప్రపంచంలోని అన్ని ఆపదలకు, అల్పజన్మలకు అర్హుడగుచున్నాడు.
ఏ విధంగా బాల్యావస్థ 'ఆయువు' అనబడుదానికి మొట్టమొదటి దశ అవుతుందో... ఆ విధంగానే నిర్వాణమునకు రాగాదులు శమనపూర్వకమైన భోగత్యాగం మొదటి నియమం అగు చున్నది. జ్ఞానికి కూడా సుఖదుఃఖాదులు ఉంటే ఉండవచ్చుగాక! అయితే ఏం? అవన్నీ కూడా చిత్రపటంలోని సాగరతరంగాలలాగా సౌమ్యం - సంభ్రమరాహిత్యం సంతరించుకొని ఉంటాయి. అజ్ఞానుల జీవితమో అట్టి సుఖ దుఃఖ సంఘటలు ఉన్నా, ఉండక పోయినాకూడా - హోరుగా శబ్దం చేసే నదీ జలతరంగాల వలె - కామాది అనేక వృత్తులతో మనోవ్యవస్థ పరంపరలతో, వ్యాకులత - విక్షోభములతో నిండి ఉంటోంది. మెల్లకన్నువానికి రెండు - మూడు చంద్రబింబాలు అగుపిస్తాయి చూచావా? బాలునికి గాలిలో దయ్యాలు కనబడతాయి! మూర్ఖ బాటసారికి ఎండమావులలో అనేక జలతరంగాలు గోచరమౌతాయ్! అట్లాగే అజ్ఞాని తనయొక్క అవిచారముచే స్వప్న సదృశమైన విమోహం పొందుచున్నాడు.
చైతన్యము యొక్క కించిత్ ప్రసరణరూపమగు ఈ సృష్టి సమూహాములు భ్రమచే దాటుటకు వీలుకాని అర్థమేకాని సుదీర్ఘ దృశ్యపరంపరగా అతనికి అనుభవమౌతోంది. ఈ సృష్టులన్నీ కూడా ‘చైతన్యం' అనే సముద్రం యొక్క తరంగ సమూహాలు మాత్రమే! తత్త్వ విచారణచే ఇవన్నీ అసత్యాలుగా తెలియవస్తున్నాయి. భ్రమానుభవం చేతనో... ఇవి సత్యములైనట్లే గోచరిస్తున్నాయి.
సుప్రసిద్ధమై కనిపించే ఈ భూతాకాశంలో చైతన్యం యొక్క స్వయంకృత చమత్కారమైన “ప్రసరణ” అను భ్రమచే అనేక జగత్తులు సత్యమే అయినట్లు అనుభూతమౌతున్నాయి.
వాస్తవానికి ఈ దృశ్య జగత్తులు సత్యం కాదు. ఈ సృష్టి వాస్తవానికి రూపరహితమైనప్పటికీ అహంభావం మొదలైన పదార్థముల వికారంచే రూపవంతంగా అవబడుచున్న ఈ సృష్టుల భ్రమంతా "చైతన్య ప్రసరణము” అనే జలంలో కనిపించే బుద్బుదములు (బుడగలు) వంటివి.
ప్రవృత్తిచే ఈ జగత్తులు అగుపిస్తున్నాయి. చైతన్యముయొక్క అంతర్ముఖత్వమే ఈ జగత్తులన్నిటి యొక్క నివృత్తి రూపం. అట్టి నివృత్తియే నిర్వాణము. అనగా, చైతన్యము యొక్క బహిర్ముఖత్వమే ఈ జగత్తులకు మూలపదార్థం. వాస్తవానికి చైతన్యం బాహ్యం కాదు, అభ్యంతరం కాదు, సత్యం కాదు, అసత్యం కాదు. (అధిష్ఠాన దృష్టిచే) సమస్తము అదే! బంగారమునకు రూపమెక్కడున్నది? అయితే గాజుకు రూపమున్నది. బంగారం కాకుండా గాజు ఎక్కడున్నది? బ్రహ్మము చిద్రూపమై,
Page:704
జన్మాదులు లేనిదై, అవ్యక్తమై, అద్వితీయమై, నాశరహితమై ఈశ్వర స్వరూపమై మనోబుద్ధి అహంకారాదులకు ఆవల ఉన్నదై, పరమశాంతమై ఆకాశముకంటేకూడా అతి నిర్మలమై ఉన్నది. శ్రీరాముడు : స్వామీ! స్వభావరహితమైన బ్రహ్మం స్వయంగా సృష్టిరూపంగా ఎందుకు స్ఫురిస్తోంది? శ్రీవసిష్ఠ మహర్షి : మెల్లకన్నువానికి కనిపించే మూడు చంద్ర బింబాలలో మొదటి రెండు బింబాల మధ్య గల దూరం కంటే చివరి రెండు బింబాల మధ్య గల దూరం ఎందుకు అధికంగా ఉన్నది? మెల్లకన్ను దోషం చేత భ్రమచే కనిపించే మూడు చంద్రబింబాలకు అర్థమే లేదుకదా! అంతా భ్రమయే కదా!
వాయువు యొక్క చలనమునకు కారణం అంటూ ఏదీ లేనట్లే బ్రహ్మం సృష్టిరూపంగా స్ఫురించటానికి కారణం అంటూ ఏదీ లేదు. స్వప్నంలో ప్రాప్తించే అనుభవమంతా భ్రాంతిరూపమే కదా! స్వప్నంలో “ఆ ఇల్లు ప్రక్కనే ఆ చెట్టు ఎందుకున్నది”... అనే ప్రశ్నకు సమాధానమేమున్నది? ఆ ఇల్లు, ఆ చెట్టు కూడా భ్రాంతియే కదా! సముద్రంలో ఆ తరంగం పెద్దగా, ఆ ప్రక్కనే ఉన్న మరొక తరంగం చిన్నగా ఎందుకున్నది?” అనే దానికి కారణం లేనట్లే, ఒకవేళ కారణమున్నా... అది కూడా భ్రమచేతనే కూడుకొని ఉన్నట్లే... ఈ జగత్తు బ్రహ్మమునందు ప్రదర్శనమౌతోంది. కాబట్టి మనం ‘అకారణం' అని చెప్పుకుంటున్నాం అట్లాగే బ్రహ్మము అను సముద్రంలో అనేక భేదములతో కనిపిస్తున్న 'సృష్టులు' అను తరంగాలకు కారణం లేదు.
బ్రహ్మ రూప స్థితి - మునిసత్తముడు -
ఏకమేవ నిరాభాసమ్ అచిత్తత్త్వమ్, అజడం సమమ్,
న సన్ న అసన్ నసత్ - - అసత్ ఇదమ్ అవ్యయమ్ అద్వయమ్||
“సర్పరజ్జు భ్రాంతి”లో త్రాడుకు పాముగా కనబడే ధర్మం ఉన్నది అని అనగలమా? పరమాత్మ యగు బ్రహ్మము ఏకమై, అభాసరహితమై, చిత్తధర్మములేనిదై, జడత్వరహితమై, సర్వత్రా సమ రూపమై, సత్తు గాని - అసత్తుగాని - సదసత్తుగాని కానిదై, అవ్యయమై ఒప్పుచున్నది. ఎవడైతే అట్టి బ్రహ్మరూపస్థితి కలిగి ఉంటాడో... అతనికి చిత్తము ఉండదు. అనగా ఆతని చిత్తము బాహ్యత్వము కోల్పోతుంది. అంతర్ముఖమౌతోంది. దృశ్యస్ఫురణ లేనిదౌతుంది. ప్రశాంతత్వము స్వభావసిద్ధంగా సంతరించుకుంటుంది. అట్టివాడు “మునిసత్తముడు”... అని చెప్పబడుచున్నాడు.
ముని శ్రేష్ఠుడు - ఎవడైతే అందరిలాగానే దేహధారియై కనిపిస్తూ కూడా ఒక మట్టితో తయారు కాబడిన బొమ్మవలె దృశ్యవేదనారహితుడై ఉంటాడో, ఎవని దృష్టిలో అయితే అహంభావంతో సహా ఈ జగత్తంతా తన స్వస్వరూప భావనయందు విలీలనమై ఉంటుందో... ఆతడు “ముని శ్రేష్ఠుడు.”
దృశ్యవేదన లేకపోతే - జగత్తు లేదు - ఊహ (సంకల్పము) నందు అనుభవించబడే నగరం... ఆ ఊహ శమించగానే (ఆ నగరం కూడా) శమిస్తుంది కదా! అట్లాగే దృశ్యవేదనచే ఉత్పన్నమైన, అహంభావసహితమైన ఈ జగత్తు దృశ్యవేదన లేకపోయినప్పుడు తనంతటతానే శమిస్తోంది.
ముక్తి- ఈ జీవులయందు అనుగతమై జడత్వరూప సంబంధమై “స్వభావము” కలదు. అట్టి 'స్వభావము' యొక్క శబ్ద - అర్థములే “మూలావిద్య". ఆ స్వభావమును ప్రక్కకు పెట్టి చూస్తే, ఆ
Page:705
తరువాతి పదార్థములన్నీ సహేతుకములే! అట్టి స్వభావమునకు హేతువు సాక్షిరూపమగు ఆత్మ. అట్టి ఆత్మయొక్క అనుభవము కలిగి ఉండుటే ‘ముక్తి’.
వాస్తవానికి ఏ పదార్థమునకు (జీవునకు) తనదంటూ ప్రత్యేకమైన ఏ స్వభావమూ లేదు. మరి? సమస్త అనుభవములూ మహాచైతన్యము యొక్క దృశ్యత్వపు చమత్కారమేనని అనవచ్చు. ఈ ‘అనుభవములు' అనబడేవన్నీ కూడా మహాచైతన్యము యొక్క చలనములే అయి ఉన్నాయి. అంతేకాకుండా వీటినన్నిటినీ కూడా 'బ్రహ్మము' అనే ఆకాశము యొక్క శూన్యత్వంగా కూడా మనం చెప్పుకోవచ్చు. వాయువు - వాయుచలనము - - ఈ రెండూ ఒక్కటే కదా! అట్లాగే బ్రహ్మము - సృష్టి అనబడు రెండూ కూడా అభిన్నములే సుమా! ఒకవేళ ఆ రెండింటికీ ఏదైనా భేదమున్నట్లుగా ఎవరికైనా అనిపిస్తే ..., అది “స్వప్నంలో నేను మరణించాను” అని చెప్పుకొనే జీవుని పరిభాషవలె భ్రాంతి రూపము, మిథ్య. ఆత్మతత్త్వము గురించిన విచారము పరిపక్వము పొందనంతవరకు అట్టి భ్రాంతి ఉండియే తీరుతుంది. ఆత్మతత్త్వము సుస్పష్టము - కరతలామలకము అయిందా,... అప్పుడు ఆ భేదసంబంధమైన భ్రాంతి కూడా బ్రహ్మరూపమునే చెందుతుంది.
శ్రీరాముడు : మహాత్మా! భ్రాంతి కూడా బ్రహ్మరూపమునే చెందుతుందా!
శ్రీవసిష్ఠ మహర్షి : అవును. నా ఉద్దేశమేమంటే ఏ సత్తా స్ఫూర్తిరూపమైన అంశముచే భ్రాంతి ఏర్పడి ఉంటుందో, అట్టి సత్తాస్ఫూర్తి బ్రహ్మరూపత్వమే చెందగలదు. ఇక సత్తాస్ఫూర్తికి వేరుగా గల భ్రమ విభాగమంటావా? పరుగులు తీస్తున్న కుందేలును దూరంగా చూసినపుడు ఒకనికి చెవులు కొమ్ములుగా కనిపించినాయనుకో! అతడు కుందేలును దగ్గరగా చూసినపుడు ఇంతకు ముందు కనిపించిన కొమ్ములు ఏమైనాయి? తొలగాయా? ఉంటేగదా, తొలగటానికి? మరి ఎందుకు ఇంతకు ముందు కనిపించాయి? సమన్వయలోపమే కదా! ఆ విధంగా సత్తాస్ఫూర్తికి వేరుగా కనిపించేదంతా తత్త్వవిచారణానంతరం అవస్తువై మచ్చుకకు కూడా లభించదు. అప్పుడు అంతటా, అన్నిటా అతి నిర్మలమగు బ్రహ్మమే శేషించుచున్నది.
కాబట్టి ఓ రామచంద్రా! ఓ ప్రియసభికులారా! మీరంతా కూడా దేహ సంబంధముచే మాత్రమే సంప్రాప్తిస్తున్న సమస్త జర-జన్మ-మోహాది వికారభారరూపమగు భ్రాంతిని విడనాడండి. ఆదిమధ్యాంతరహితము, అనంతము, నిర్మలము, సమము, శాంతము, శివరూపము, శాశ్వతము, ఏకము అయినట్టి బ్రహ్మాకాశభావమును పొందండి.
16. దృష్టియే సృష్టి
జగత్ అదర్శనమే జగత్ నాశనం -
శ్రీవసిష్ఠ మహర్షి : స్వామీ! ఆత్మ అత్యంత సుఖస్వరూపమైనది కదా! ఈ జీవుడు సర్వదా ఆత్మస్వరూపుడే అయినప్పటికీ ఎందుకో సుఖదుఃఖములు ఈ జీవుని ఏదో రూపంగా వెన్నంటియే ఉంటున్నాయి. అసలు ఈ సుఖదుఃఖముల స్వరూపం ఏమిటి?
Page:706
శ్రీరాముడు : రామచంద్రా! సుఖదుఃఖాలు ప్రాప్తిస్తున్నప్పుడు ఏదైతే కాలంచే నాశనమవుతోందో... అదంతా ఇప్పటికే నశించియే ఉన్నదని ఈ జీవుడు గ్రహించుగాక! "తెలుసుకొంటున్నవాడుతెలుసుకోవటం-తెలియబడేది" అనే త్రిపుటి ప్రతిక్షణం మార్పు చెందుతూనే ఉన్నది. ఇవన్నీ నశిస్తున్నప్పటికీ ఏదైతే తాను నశించక కేవల సాక్షి రూపంగా నిత్యోదితమైఉన్నదో... అదియే ఆత్మ, ఏదైతే ఇతఃపూర్వమే (త్రిపుటికి మునుముందుగానే త్రిపుటికంటే వేఱుగా సదా, సర్వదా విద్యమానమై ఉన్నదో... అట్టి ఆత్మయే శాస్త్రసారం. ఇంతకంటే ఎక్కువగా శాస్త్రోపదేశంతో నిజానికి పనిలేదు. ఇక సుఖదుఃఖాదులు ఎందుకుంటున్నాయి?” అనే ప్రశ్నకు వద్దాం.
ఇచ్ఛ - ఎవనికి ఇచ్ఛ ఉదయిస్తుందో... వానికి అవశ్యం సుఖదుఃఖాదులు ఉండనే ఉంటాయి. ఇచ్చా రహితుడైన ఆత్మజ్ఞానికి అవి ఉండవు. కాబట్టి ఎవరైనా సరే “సుఖ దుఃఖములు” అనే రోగమును వదిలించుకోవాలంటే మొట్టమొదటిగా ఇచ్ఛను త్యజించాలి.
శ్రీరాముడు : శుద్ధ పరమపదంపై 'ఇచ్ఛ' - ఏ విధంగా ఏ కారణంగా ఎందుకొరకై ఏర్పడుతోంది? శ్రీవసిష్ఠ మహర్షి : శుద్ధమగు పరమపదమునందు "అహంభావము - జగత్తు - ఇచ్ఛ” మొదలైన భ్రాంతి లేనేలేదు. ఈ సర్వము శుద్ధ పరబ్రహ్మమే అయి ఉన్నది. ఇదంతా కూడా సదా శాంతమై, నిరాధారమై అవ్యయమై, నిర్వాణరూపమైనట్టి చిదాకాశమే అయి ఉన్నది. ఇక “అహం - బ్రహ్మము
జగత్తు" ఇటువంటి శబ్దముల భ్రమను ఎవరో బోధ కొరకో, లేక, మరెందుకో కల్పించారు. సర్వాత్మకమై పరమశాంతమైనట్టి చిదాకాశమున అవన్నీ కల్పనారూపంగా దర్శించబడుచున్నాయి. చిదాకాశరూపమైనట్టి ఆత్మయందు జగత్తు-బ్రహ్మము-అహంకారము మొదలైన శబ్దార్థముల ప్రవృత్తియే లేదు. ఏకము-సర్వాత్మకము-శాంతము అగు ఆత్మకు కర్తృత్వంగాని, భోక్తృత్వంగాని ఎట్లా సంభవిస్తుంది? మరి ఈ కనబడే 'అనేక జీవులు' అనే వ్యవహారమంటావా?
...‘చిద్రూపము’ అనే ఒకానొక మట్టి “అనేక జగత్తులు' అనే పాత్రను తనయందు ధరిస్తుంది. ఆ చిద్రూపము దేనిని ఎట్లా స్మరిస్తే అది అట్లే తనకుతానై అనుభవిస్తోంది. ద్రవరూపమగు సముద్రం తనయందు అనేకతరంగములు ధరించటం లేదా? జలమే తరంగాలుగా భాసిస్తున్నట్లు బ్రహ్మమే తనయొక్క నిర్మలసత్తచే జగద్రూపంగా భాసిస్తోంది. వాస్తవానికి చైతన్యము రూపరహితమైనదే. అయితే అది తనయందు ఈ జగత్తు మొదలైన వస్తువులను స్మరిస్తోంది. అట్లు స్మరించినప్పుడు వానివాని ఆయా రూపములను తనయందే చమత్కారంగా గాంచుచున్నది. అది దేనిని స్మరించకుండా ఉన్నదో... అది గాంచకయే ఉన్నది.
మాయతో కూడుకొని ఉన్న బ్రహ్మము. బ్రహ్మము (లేక, ఈశ్వరుని యొక్క మాయారూప దేహము-చేతనత్వము-అచేతనత్వము. వీటన్నిటి గూర్చిన కథనం కేవలం ఉపదేశం కొఱకు ఉద్దేశించి కల్పించబడ్డాయి యథార్థానికి అట్టి కథనమంతా కూడా శుద్ధాత్మ విషయము గూర్చి కాదుసుమా! అవన్నీ మధ్యేమార్గ వర్ణనలని గ్రహించు. ఆత్మ గురించిన పాఠ్యాంశములకు సంబంధించిన ఉపకరణములు మాత్రమేనని గమనించు.
Page:707
ఈ జగత్తు సత్తు కాదు. అసత్తు కూడా కాదు. ఇదంతా చైతన్యమునందు ఆ చైతన్యముయొక్క విస్తరణచే భాసిస్తోంది. చైతన్యమునందు విస్తరణయే లేకపోతే అప్పుడు ఈ జగత్తు భాసించదు. ఇట్టి మిథ్యాజగత్తునందు మనం విశ్వాసం ఎందుకు ఉంచాలి?
స్వాధీనం - - పరిశ్రమానంతర లభ్యం - ఈ ప్రపంచంలో జీవునికి సంబంధించి విషయాలు రెండు విధాలుగా ఉంటాయి 1.ప్రయత్నిస్తేనే లభించేవి, 2. ఏ ప్రయత్నం లేకుండానే ఇప్పటికే స్వాధీనంలో ఉన్నవి. స్వభావసిద్ధమై ఉన్నవి. ఉదాహరణకు ఒకడు ధనం, పదవులు, గృహాలు సంపాదించాలంటే ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి. ఆలోచించటం మొదలైనవి స్వభావ సిద్ధంగా ఉంటున్నాయి. ఒక స్ఫటికశిలలో ప్రతిబింబించే దృశ్యంలోని జీవుల, వస్తువుల కదలికలు ఆ స్ఫటిక శిలకు స్వభావసిద్ధంగాను స్వాధీనంగాను ఉంటున్నాయి కాని, ఆ శిల యొక్క ప్రయత్న సాధ్యమైనవి కావు. అట్లాగే చైతన్యాత్మకు కూడా తనలో “విస్తరణ, అవిస్తరణలు” స్వాధీనాలే గాని యత్నంచే సాధ్యమగుచున్నవి కావు. అద్దాని విస్తరణయే జగదనుభవం. అద్దాని అవిస్తరణయే జగత్హిత్యం.
శ్రీరాముడు : మహాత్మా! చైతన్యాత్మ 'అహంకారము' విషయమై మేము శాస్త్ర - స్వానుభవ పరస్పర చర్చల సహాయంతో పరిశీలన చేశాం. అట్లు విచారణ చేయగా ఈ “అహంకారము”నకు “సత్తు (ఉనికి)గాని, ఆధారముగాని, కారణముగాని లేవు” అనియే తేలింది.
శ్రీవసిష్ఠ మహర్షి
యస్యేక్షి తస్యనో సత్తా, నా ధారో, న చ కారణమ్ |
సో ‘అహమ్’ ఇత్యేవ యోయక్షో న జానే కుత ఉత్తితః ||
ఏ అహంకారమునకు తనదైన ఉనికి గాని, ఆధారముగాని కారణముగాని ఏకించిత్ కూడా లేదో, అట్టి అహంకార యక్షుడు ఎక్కడినుండి వచ్చాడంటే ఏమి చెప్పగలం? ఓ జనులారా!
యస్యాహమ్ ఇతి యక్షస్య సత్తెవాస్తి న సత్యతః | అహో ను చిత్రం! తేనేమే భవన్తో వివశీకృతాః ||
నాయనలారా! ఏ 'అహంకారము' అనే పిశాచానికి వాస్తవానికి సత్తయే (ఉనికియే) లేదో, అట్టి దానికి మీరు వివశులు కావటం చాలా విచిత్రంగా ఉన్నది సుమా! ఓ రామా! కళ్ళలో ఉండే ఏదో దోషం చేత ఆ కళ్ళకు ఆకాశంలో వెంట్రుకలవంటి ఆకారాలు కనిపిస్తాయి చూచావా? అట్లాగే కాకతాళీయంగా భ్రాంతిచే తనయొక్క రూపమే తనయందు - భ్రమయందు “అహంభావము”గా భాసించుచున్నది. (స్వమేవ రూపం దృక్ బ్రాంన్తె కేశోణ్ణకమివ అంబరే).
అయితే... “అంతా బ్రహ్మమే" అయి ఉండగా ఇక అందులో “ఇది అహంకారము. అది జగత్తు" అనబడు విభాగములు ఎక్కడుంటాయి? అట్టి జగత్తు ఉత్పత్తి పొందటం, నశించటం మొదలైనవి మాత్రం ఎట్లా ఉంటాయి? కాబట్టి ఇక సంతోషించేందుకుగాని, దుఃఖించేందుకు గాని విషయమేమి? ఆశ్రయమేమి?
❖
Page:708
ఓ రామచంద్రా! పరమాత్మ సర్వేశ్వరుడు, సర్వ శక్తిమంతుడు అయి ఉన్నాడు. అందుచేత ఆ పరమాత్మ యొక్క స్మరణమాత్రం చేత ఈ సమస్త విచిత్ర జగత్తు భాసించుచున్నది. స్మరించక పోయినంత మాత్రం చేత ఈ జగత్తు అనబడేది భాసించదు. కాబట్టి అద్దాని విస్మరణయే జగదతీతత్వం. అట్టి జగదతీతత్వం సిద్ధించు గాక! వాస్తవానికి ఈ 'జగత్తు' అనబడేది కూడా చిద్రూపమే కాబట్టి... "చిదాకాశమగు బ్రహ్మమే స్వప్న సంకల్పరచితమైన పురము వలె కాకతాళీయంగా జగద్రూపంగా భాసిస్తోంది”... అని కూడా సిద్ధాంతీకరించబడుచున్నది. కనుక పరమార్థమున బ్రహ్మం నుండి ఈ జగత్తును విడదీయటం ఎట్లా కుదురుతుంది? కుదరదు.
జలమందు తరంగాలున్నాయి. జలమును, తరంగములను విడదీయగలమా? కొయ్యలో (మనిషిదో-జంతువుదో-దేవతదో) విగ్రహం ఉన్నది. కొయ్య నుండి విగ్రహామును వేఱుచేయ గలమా? విగ్రహం నుండి కొయ్యను వేఱుచేయగలమా! మట్టిచే కుండ తయారవుతోంది. మట్టి లోంచి కుండను వేఱు చేయగలమా?
బ్రహ్మము నందు కూడా అట్లే ఈ సృష్టి ఉన్నది. అట్టి ఈ సృష్టిని బ్రహ్మము నుండి వేఱుచేసి చూడలేం. “అవయవరహితం-నిర్మలం" అగు బ్రహ్మం నందు ఏ జగత్తెతే అనుభూతమౌతుందో, అది కూడా బ్రహ్మమే! ఇక అహంకారం మాట వేతే చెప్పాలా? అది కూడా బ్రహ్మమే! బ్రహ్మమునకు వేఱుగా అహంకారమును చూడటానికి ప్రయత్నించామా... అది మిథ్యయేనని అనక తప్పదు. జలం వేఱు చేసి చూస్తే తరంగం మిథ్యే కదా! మట్టిని వేరుచేసి చూస్తే కుండ మిథ్యయే కదా!
వాయువు యొక్క 'సత్త'యే చలన వైచిత్రంగా భాసిస్తోంది కదా! అట్లాగే అవిద్యాస్వభావ రహితమై బ్రహ్మం యొక్క 'సత్త' ఉన్నది. ఆ బ్రహ్మము యొక్క సత్తయే అహంభావము - జగత్తు మొదలైన రూపములుగా భాసించుచున్నది. ఆకాశంలో మేఘాలను ఒక ఆకారం అంటూ ఏదీ లేదు కదా! అయితే ఆ మేఘమే వృక్షము - కొండ - గుఱ్ఱము - ఏనుగు మొదలైన ఆకారాలలో కనబడుతూ ఉంటుంది. చూచావా? అట్లాగే, నిరాకారమగు బ్రహ్మమున అహంకారము -
జగత్తులతో కూడిన ఈ ప్రపంచ రూపం భాసిస్తోంది. సూక్ష్మమగు మఱివిత్తులో మహావృక్షం యొక్క లక్షణములన్నీ దాగి ఉన్నట్లు సూక్ష్మీభూతమగు శివరూపమున ఇదంతా ప్రదర్శితమౌతోంది. పరమాత్మయందు ఈ సృష్టి అంతా కూడా అద్దాని అవయవములవలె వెలయుచున్నది.
ఓ రామచంద్రా! ఈ విధంగా "ఆత్మకంటే భిన్నంగా ఈ జగత్తు సంభవించదు” అని గ్రహించి అంతఃకరణంలో ప్రశాంతుడవై ఉండు. ఉపాధివర్జితుడవై ఆయాసరహితుడవై భ్రమ తొలగినవాడవై ఆకాశమువలె సమత్వము వహించి ఉండు.
న భవన్తో, న చ వయం, న జగన్తి, న ఖాదయః |
సన్తి శాంతం అశేషేణ బ్రహ్మేదం నిర్భరమ్ స్థితిమ్ ||
ఓ సభికులారా! యథార్థానికి మీరు, మేము, జగత్తులు, ఆకాశాదులు ఏవీ లేవు. మరి? సర్వదా శాంతమై పరిపూర్ణమైనట్టి బ్రహ్మం మాత్రమే ఉన్నది. ఇదంతా బ్రహ్మమే అయి ఉన్నది.
Page:709
ఓ రామచంద్రా! ఈ కనబడే పదార్థములన్నిటికీ కూడా చైతన్యం కంటే భిన్నమైన రూపమును ఎవరూ నిరూపించలేరు. ఈ సమస్త పదార్థముల అవిశేషములే అయి ఉన్నాయి. కనుక విశేషత్వము గురించిన సర్వభ్రమలు త్యజించు. ముముక్షువులంతా మోక్షము కొఱకై “సర్వ విశేష రహితము” పరమార్థ సత్యము అయినట్టి ఆ చైతన్యమే నేను” అని భావించెదరు గాక!
-
వేదనం బంధనం విద్ధి, విద్ధి మోక్షమ్ ఆవేదనమ్,
యథాస్థితం యథాచారమ్ భవ శాంతమ్ అవేదనమ్ ॥
"జగత్తు యొక్క స్మరణయే బంధం. జగత్తు యొక్క విస్మరణయే మోక్షం" - అని గ్రహించు. అందుచేత విజ్ఞులు అనుసరించే మార్గం అయినట్టి భూమికలను అభ్యసిస్తూ క్రమంగా జగత్తుయొక్క విస్మరణమును సముపార్జించాలి. ఈ జగత్తును జగత్తుగా కాకుండా శాంతమగు పరబ్రహ్మముగా దర్శించటమే జగత్తును త్యజించటం (జగత్తు విస్మరణ) గాని, మరింకేమీ కాదని కూడా గ్రహించు. శ్రీరాముడు : స్వామీ! “చైతన్యమే జగత్తుగా, జగత్ పదార్థములుగా అగుచున్నది" అను భావనను అనుసరించమంటారా? అట్టి భావనచే శుద్ధ చైతన్యము ప్రకాశమానమవుతుంది కదా! శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ద్రష్టయే తన రూపముగా కలిగినట్టి ఈ జీవుడు దృశ్యములోని వాడా? కాదు. ఈ దేహము దృశ్యంలో ఉన్నప్పటికీ ద్రష్ట దృశ్యరూపము కానేరడు కదా! అట్లాగే చైతన్యము సర్వదా చైతన్యంగానే ఉంటుందికాని... ఎన్నటికీ చైతన్యం జడమగు విషయరూపత్వం పొందజాలదు. కాబట్టి జగద్రహితమైన శుద్ధ చైతన్యమును విషయభావనచే ఎవడూ ప్రకాశింఎ "జేయజాలడు. ఎవడైనా సరే... తనకు తానై విషయాతీతత్వముచే జగదహితశుద్ధ చైతన్యత్వమును స్వానుభవంగా సంతరింపజేసుకోవాలిసిందే.
ఆత్మతోటి స్థితిని పొందియుండుటకు గాను... 1. ద్రష్ట-దృశ్యముల సంబంధము యొక్క అభావముచే జాగ్రత్తునందే సుషుప్తునివలె ఉండగలగటం; 2. శరత్కాలాకాశంలాగా నిర్మలత్వం - విషయశూన్యత్వం సంపాదించుకోగలగటం; 3. సర్వత్రా ప్రసరించియున్న తన ఆత్మతత్త్వమును గమనించగలగటం... అనునవి సముపార్జించు కోవాలి.
వాయువు అనేక వాయుతరంగాలుగా చలిస్తున్నప్పటికీ వాయువు సర్వదా ఏకమేగాని అనేకం కాదు కదా! "తరంగాలు వేఱువేఱు కాబట్టి ఆ వాయువు వేఱు. ఈ వాయువు వేఱు”... అని అనుకోవటం అవిజ్ఞత చేతనే కదా! అట్లాగే ఏకము-చిద్రూపము అగు బ్రహ్మమున అజ్ఞానం చేత భేదమే దర్శించబడుతోంది. తన చిత్స్వరూపమును ఏమరచిన సందర్భంలో “జీవుడు - - జగత్తు” మొదలుగా గల భేదదర్శనమే “సృష్టి”. వాని ఐక్యజ్ఞానమే 'మోక్షము'.
వాయువు అంతటా ఉన్నప్పటికీ అది ఎక్కడ సంచలనము ప్రదర్శిస్తుందో అక్కడ ఆయా క్రియా విశేషాలు ప్రకటితమౌతూ ఉంటాయి. కదా! (ఉదా: వాయు చలనముచే ఆకులు కదలటం, దేహంలో ప్రాణాపానాది క్రియలు మొదలైనవి). అట్లాగే 'బ్రహ్మము' అనే వాయువునందు ఎచ్చట "చిత్ యొక్క జగత్ రూప స్పందము" ఉన్నదో... అచ్చటనే సృష్టి ప్రదర్శితమౌతోంది. అట్టి చిత్
Page:710
స్పందము లేనప్పుడు 'నిర్వాణము' అని చెప్పబడుతోంది. ఒక విత్తు (బీజము) తనయొక్క నిజరూపముననే పల్లవము (కొమ్మలు, ఆకులు, పళ్ళు మొదలైన) రూపంగా దర్శిస్తోంది. అట్లాగే మహాచైతన్యము కూడా తనయొక్క అభ్యంతరమును సృష్టిరూపంగా తనకు తానే ఎఱుగుచున్నది. బీజమే (బీజాంతర్గమైన బీజసత్తుయే) ఆ తదనందరం ఒకానొకచోట “ఆకులు” అను అనుభవంచే “ఆకులు”గా స్థితినొందినట్లు మహాచైతన్యము తనయొక్క “సృష్టి” అనబడు స్వీయకల్పనచే సృష్టిరూపంగా అగుచున్నది. బీజము యొక్క వృక్షరూపమునందు 1. ఉత్పత్తి, 2. స్థితి. 3. వృద్ధి, 4. అపక్షయము, 5.వినాశనము, 6. లయము అనబడే షడ్వికారాలు పొందుచున్నట్లే చైతన్యము యొక్క “వివర్తరూపము” అగు సృష్టియందుకూడా షడ్వికారాలు భాసిస్తున్నాయి. బీజము నందలి చైతన్యమే వృక్షమునందు కూడా ఉన్నట్లు సమస్త సృష్టి కూడా చిద్రూపము, చిన్మయము అయి ఉన్నది.
ఓ రామచంద్రా! ఈ జగత్తంతా కూడా నిర్వికారమైనట్టి పరబ్రహ్మమే అయి ఉన్నదయ్యా! అందుచేత నీవు ఇదంతా నిర్వికారంగాను, ఆద్యంతరహితంగాను, నిరామయంగాను గ్రహించు. అయితే ద్వైతాద్వైత వికారాలతో కూడిన ఈ జగత్తు 'సంకల్పంలో నిర్మించబడిన నగరం’లాగా నిజ సంకల్పం యొక్క “అభావంచే నశిస్తోంది. జగదుత్పత్తి, వినాశాలు అనగా ఇంత మాత్రమే!
ఆకాశం శూన్యమాత్రమై ఉన్నది కదా! అయితే... “ఆకాశమునకు, శూన్యత్వమునకు భేదం ఏదైతే అనిపిస్తోందో... అది మిథ్య మాత్రమే" - అని గ్రహించెదవుగాక! ఈ జగదనుభవమునకు ముందుగానే బ్రహ్మం సర్వదా సిద్ధించి ఉంది. అట్టి పూర్వసిద్ధమగు చిద్రూపం, శాంతం అగు బ్రహ్మ సత్తయే అజ్ఞానం చేత “నేను మనుష్యుడను" అను భావన వలన స్వయంగా అహంకారరూపం గాను, జగత్తు రూపంగాను స్థితినొంది ఉంటోంది. "జలంలో తరంగం జనిస్తోంది" అనే వాక్యం అపరిపూర్ణ వాక్యం. ఎందుకంటే, జలమే తరంగంగా కనిపిస్తూ కూడా జలం జలంగానే ఉంటుంది కదా! అదే విధంగా బ్రహ్మంలో ఈ జగత్తు జనిస్తున్నట్లున్నప్పటికీ జగత్తు అనబడేది జనించుటయే లేదని సుతీక్షణమైనబుద్ధితో గ్రహించు. అనగా జగత్తు జనించుటయూ లేదు, నశించుటయూ లేదు. జగత్తుగా కనిపిస్తున్నదంతా బ్రహ్మమే! బ్రహ్మమును గురించి ఎఱిగినవారికి ఇదంతా జగత్తుగా కనిపిస్తూనే బ్రహ్మంగా అనిపిస్తోంది.
వృక్షమే తన శాఖలు మొదలై అవయవాలలో స్థితిపొంది ఉన్నట్లు; ఆకాశమే ఆకాశమునందు ఉన్నట్లు; జలమే జల తరంగాలలో కూడా ఉన్నట్లు... బ్రహ్మము అటు నిర్వికార నిర్విషయ బ్రహ్మరూపముగాను, ఇటు పదార్థ రూపంగాను కూడా స్ఫురిస్తూ వాస్తవానికి తన స్వరూపమునందు అవికార రూపముగా స్థితి కలిగియున్నది.
శ్రీరాముడు మహాత్మా! బ్రహ్మమే అటు బ్రహ్మసత్తగా, ఇటు జగత్తుగా కూడా అనుభవ మగుచున్నదను వాక్యం యుక్తియుక్తమే! అయితే అనేక భేదములతో కూడిన జగద్దర్శనమునందు అభ్యాసపరులమై ఉన్న మేము బ్రహ్మమును ఉపాసించటం ఎట్లాగో చెప్ప ప్రార్ధన.
Page:711
శ్రీవసిష్ఠ మహర్షి :
నిమేషాత్ అర్ధభాగేన దేశాత్ దేశాన్తర స్థితౌ |
యత్రూపం సంవిదో మధ్యే స స్వభావ ఉపాశ్యతామ్ ||
ఓ రామచంద్రా! నీయొక్క జ్ఞానసత్త ఒక ప్రదేశమున ప్రవేశించి, ఇంతలోనే అర నిమిష కాలంలో ఆ ప్రదేశమును వదలి మరొక ప్రదేశమును ఆశ్రయిస్తోంది కదా! ఆ రెండింటి యొక్క మధ్యలో (ఒక విషయజ్ఞానము మరొక విషయ జ్ఞానముల మధ్యలో) ఏమున్నది? నీ “జ్ఞానసత్త” ఆ ఉభయముల మధ్యలో నిర్విషయజ్ఞాన రూపంగా ఉన్నది కదా!
అట్టి నిర్విషయ జ్ఞానసత్తను ఉపాసించు. నీవు ఒక విషయము గురించి ఆలోచన చేస్తూ, ఇంతలోనే ఆ విషయమును వదలి మరొక విషయమును గురించి ఆలోచన చేయటం జరుగుచున్నది కదా! ఇట్టిదే జీవులందరి అనుభవం కూడా! ఇప్పుడు ఆ రెండు విషయముల మధ్య నిర్విషయమగు ‘ప్రజ్ఞాసత్త' ఉన్నది. అట్టి ఆలోచనరహితమగు నిర్మల, నిర్విషయ ప్రజ్ఞాసత్తను ఆశ్రయించి ఉండు.
నీవు “భూమండలము”ను త్యజించి "సూర్య మండలము”ను ఆశ్రయిస్తున్నప్పుడు ఆ రెండింటి మధ్య (ఒకదానిని వదలిన తరువాత, రెండవ దానిని ఇంకనూ ఆశ్రయించనప్పటి) వేంచేసియున్న నిర్విషయజ్ఞాన సత్తను ఉపాసించు.
సంక్షుబ్ధమ్ అక్షుబ్ధమ్ ఇతి ద్విరూపం సంవిత్స్వరూపం ప్రవదంతి సన్తః | శ్రేయః పరం యేన సమీహసే త్వం తదేకనిష్ణో భవ! మా అమతిర్భూః ॥
ఓ రామచంద్రా! మహనీయులగు ఆత్మజ్ఞులు చైతన్యము గురించి ప్రవచించేటప్పుడు రెండు మార్గాలుగా బోధిస్తున్నారు.
1. వివర్త రూప చైతన్యం : అజ్ఞానులకు అనుభవమగుచున్న ఈ సంక్షుబ్ధ సహిత జగత్తంతా వాస్తవానికి ఏకము, అద్వితీయము అగు చైతన్యమే! కనుక ఈ జగత్తును చైతన్యముగా, బ్రహ్మముగా ఆరాధన చేయటం.
2. నిర్విషయ చైతన్యం : చైతన్యము సర్వదా ఏకరూపమై, వివర్తరహితమై, అక్షుబ్ధమై పూర్ణానందైక రసరూపమై ఉన్నది. అయ్యది జగద్రహితం అనగా...
1. ఈ సంక్షుబ్ధ జగత్తే చైతన్యం; 2. చైతన్యం సర్వదా జగద్రోహితం... ఈ రెండు మార్గాలలో ఏ ఉపాసన నీకు సానుకూలంగా అనిపిస్తే దానిని ఆశ్రయించు.
అయితే! భేదము, ఏకము ...అనబడే రెండింటిలో భేదము భ్రమ ఏకము వాస్తవము. ఇది గ్రహించి ఉపాసన కొనసాగించు. అంతేగాని, గుడ్డి ఎద్దు చేలో పడ్డట్లు ఏ మార్గము ఎటు త్రోవతీస్తుందో గ్రహించకుండా అవివేకివై ఉండకు.
Page:712
17. ప్రపంచసహిత - ప్రపంచరహిత అఖండైక్య దృష్టి
శ్రీరాముడు : స్వామీ! "చైతన్యోపాసన” అనే విషయంలో "నిర్విషయ పరమాత్మను ఉపాసించటం” గురించి మరికొన్ని విషయాలు సాధక జనుల సుస్పష్టత కొరకై ప్రవచించండి.
శ్రీవసిష్ఠ మహర్షి : పరమాత్మ యొక్క ఉపాసన ఉపక్రమించే ముందు పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటో సుస్పష్టం చేసుకోవాలికదా! ఏతద్విషంలో మరల మరికొన్ని దృష్ట్యాంతపూర్వకమైన విశేషాలు
చెబుతాను విను.
దేశద్దేశాన్తరం దూరం ప్రాప్తాయాః సంవిదః క్షణాత్ యద్రూపమమలం మధ్యే పరం తద్రూపమాత్మనః ॥
ఓ రామచంద్రా! నీయొక్క “చూపు” క్షణకాలంలో ఒక వస్తువును చూస్తూ, ఇంతలోనే క్షణ కాలంలో ఆ వస్తువు నుండి మరల్చబడి దూరంగా ఉన్న మరొక వస్తువుపై ప్రసరించినదనుకో! ఆ నేత్రేంద్రియం ద్వారా ప్రయాణించిన నీ చూపుకు సంబంధించిన జ్ఞానం సమీపంలోని ఒక జ్ఞేయాన్ని (చూడబడి-తెలియబడుచున్న వస్తువును) వదలి మరొక జ్ఞేయాన్ని ఆశ్రయించటం జరుగుచున్నది. వదలిన - స్వీకరించబడిన వస్తువుల జ్ఞానమునకు మధ్యగా (దగ్గిర వస్తువును చూడటం మానివేసిన తరువాత దూరవస్తువును ఇంకా నీ చూపు గ్రహించక ముందు)... నిర్విషయ నేత్ర జ్ఞాన సత్త ఉన్నది. అది అత్యంత స్వల్పకాలమే ఉంటోంది. అయితే, అట్టి నిర్విషయ చిద్రూపమునే జ్ఞప్తియందు ఉంచుకుంటూ, అద్దానియందే నిత్యమూ తన్మయుడవై ఉండుము.
ఇక ఆయా వ్యవహారములంటావా? నీ యొక్క వర్తమాన (దేహ సంబంధమైన) స్థితిగతులను అనుసరించి ఆయా స్వకులాచారాలను నిర్వర్తిస్తూనే “ఆ నిరాభాస-నిర్విషయ-చిద్రూపమే నేను” అని మననం చేస్తూ అట్టి వాసనా వర్జితమైనట్టి చిద్రూపమునందు నిశ్చలుడవై ఉండుము. అద్దాని నుండి ఎన్నటికీ చలించనేవద్దు.
విద్య-అవిద్యల భేదమేమిటో గ్రహించు. ఏదైతే విచారణ చేసి చూచినప్పుడు లభించదో అదియే అవిద్య. విచారణ చేసి చూస్తే అంతిమంగా చెక్కు చెదరక లభించేదే పరవిద్య. అవిద్య లభించేదే కాదు. విద్య (ఆత్మ)కు అలభ్యమైన క్షణమే లేదు. ఇక చిత్తు, చేద్యములకు, అనగా... “తెలుసుకునేది, తెలియబడేది” అనబడే రెండింటికి భేదమెక్కడున్నది? ఈ జీవుడు స్వయముగా తనకు తానే స్వతహాగా ప్రకాశరూపమైయున్నాడు. ఆతనిచే ఏది ప్రకాశించబడుచున్నదో అదియే ‘ప్రకాశ్యకము’ అగు జగత్తు. అంతకు మించి జగత్తుకు ఉనికి గాని, నిర్వచనముగాని, వాస్తవానికి లేదు. చైతన్యము దర్శించే భేద - అభేదములన్నీ ఈ చైతన్యము యొక్క ప్రకాశమాత్రములే! కనుక చిత్్కు చేత్యమునకు (లేక, ద్రష్టకు - దృశ్యమునకు) భేదము లేదు. బ్రహ్మము సత్యము. జగత్తు మిథ్య. అట్టి మిథ్యాత్వము తొలగిస్తే శాంతము - నిర్వషయము అయినట్టి చిన్మాత్ర స్థితియే సర్వకాల - సర్వావస్థలయందు శేషించియున్నదగుచున్నది.
Page:713
బ్రహ్మము - జగత్తు ఒక్కటే : బ్రహ్మమయం జగత్ - పరమార్ధమున బ్రహ్మము, జగత్తు ఒక్కటే! కాని అజ్ఞానము చేత.... బ్రహ్మము ఏకమే అయినప్పటికీ, అనేకంగాను; పూర్ణమే అయినప్పటికీ అపూర్ణంగాను; శుద్ధమే అయినప్పటికీ అశుద్ధంగాను; అశూన్యమైనప్పటికీ శూన్యంగాను; పదార్థ రహితమైనప్పటికీ పదార్థసహితంగాను; పరిచ్ఛిన్నరహితమైనప్పటికీ, దేశకాలములచే పరిచ్ఛిన్న మైనట్లు; రూపరహితమైనప్పటికీ దేశ కాలాది రూపసహితమైనట్లు; వికారరహితమైనప్పటికీ వికారవంతంగాను; సమము, శాంతము అయినప్పటికీ అసమము, అశాంతముగాను; 'సత్తు' అయినప్పటికీ దృశ్యముకానందు వలన అసత్తుగాను; నిర్విభాగమైనప్పటికీ భాగసహితంగాను, చిద్రూపమైనప్పటికీ జడంగాను; విషయశూన్యమైనప్పటికీ విషయరూపంగాను; నిరంశమైనప్పటికీ అంశయుక్తంగాను; అహంకార రహితమైనప్పటికీ అహంకార సదృశంగాను; నాశరహితమైనప్పటికీ నాశవంతంగాను; కళంకవర్జితమైనప్పటికీ కళంకయుక్తంగాను; విషయవర్జితమైనప్పటికీ విషయ సహితంగాను; స్వయంప్రకాశమైనప్పటికీ పరప్రకాశభూతములగు అహంకారాదులవలెనూ; పురాతనమైనప్పటికీ నూతనంగాను; పరమాణువు కంటే కూడా సూక్ష్మమైనప్పటికీ తన ఉదరము నందు బ్రహ్మండములు ధరించినదిగాను; సర్వరసమైనప్పటికీ వైరాగ్యాది ఉపాసనలచే దృశ్యమును త్యజించినదిగాను; ప్రపంచరహితమైనప్పటికీ ప్రపంచపూర్ణమైనదానివలెను; అద్వితీయ మైనప్పటికీ అనేక రూపాలతో ఉన్నట్లు గాను; మాయారహితమైనప్పటికీ మాయా కిరణములు బయలుదేరుచున్న సూర్యబింబమువలెను; శుద్ధజ్ఞానమాత్రమైనప్పటికీ అన్నిటినీ ఎఱుగుచూ ఉండేదిగాను; 'జగత్తులు’ అనే రత్నములు గల మహాకోశము (గని) అయినప్పటికీ, 'వివేకము' అనే తక్కెడలో తూచినప్పుడు లవలేశము కంటే కూడా లఘువైనది గాను; దృష్టికి గోచరం కానిదైనప్పటికీ, కిరణ సమూహపు చంద్రునివలె సుస్పష్టంగా కనబడుచున్నట్లే అనిపించేది గాను; దేశకాలములచే అనంతమైనప్పటికీ, ఆయా దేశకాలముల రూపం సంతరించుకొనుచున్నట్లుగానూ; శూన్యస్థానమందు ఉన్నప్పటికీ వన పర్వతాదులను నిర్మించటంలో తత్పరమైయున్నది గాను... (బ్రహ్మము)... అగుచున్నది.
#
బ్రహ్మము సూక్ష్మతరవస్తువుకంటే సూక్ష్మతరమైనది. స్థూలవస్తువులన్నిటికంటే స్థూలమైనది. గురుతర వస్తువులన్నిటికంటే గురుతరమైనది. శ్రేష్ఠ వస్తువులన్నిటికంటే శ్రేష్ఠతమమై వెలయుచున్నది.
అకర్తృ కర్మకరణమ్, అకారణమ్, అకారకమ్
అన్తః శూన్యతయైవై తచ్చిరాయ పరిపూరితమ్ ||
బ్రహ్మము కర్త-కర్మ-కారణరహితమైనది. అది దేనికీ కారకము కాదు. అంతఃశూన్యము అయినప్పటికీ కూడా చిరకాలంగా కర్తృ కర్మాదులచే పూర్ణమైయున్నట్లు తోచుచున్నది. అది ‘జగత్తులు' అనే రత్నములకు పేటిక. కాని ఆకాశమువలె మహాకోమలము, సర్వ పదార్థరహితము. ప్రత్యేక వస్తు-కాలరూపంగా ప్రకాశించేదంతా అదే! పురాతనమై ఉండి కూడా నిత్యనూతనం. స్వప్రకాశరూపమై కూడా అజ్ఞానదృష్టికి అది అంధకారమే! ప్రకాశరూపమై సర్వదా అంతటా వ్యాపించి ఉంటూ కూడా ఈ జగత్తుల తిరోధాన స్థానం అదే!
Page:714
బ్రహ్మము సర్వదా సాక్షిరూపమున ప్రత్యక్షమయ్యే ఉన్నది. కాని నేత్రములకు దుర్లక్ష్యమగు చున్నది. సాక్షిగా పరోక్షమైనా, ప్రత్యక్షంగా ఎదురుగానే ఉన్నది. చిద్రూపమై కూడా జడజగత్తుగా భాసిస్తున్నదంతా అదే!
అది సదా శుద్ధ చిన్మాత్రమే! - అహంభావ రహితంగా ఉండి కూడా అహంభావ రూపంగా భాసించేది అదే! పైగా, అది ద్రష్టకు అన్యమైనదిగా ఒప్పుచున్నట్లు అనిపించినా... ఆత్మరూపమే అది! ద్రష్ట యొక్క రూపమే అది! ఆ పూర్ణ చిద్రూప మహాసముద్రంలో ఈ మూడు లోకములు ద్రవరూప సముద్ర తరంగాలుగా వెలయుచున్నాయి.
మంచు తనయందు తెలుపుదనాన్ని ధరించుచున్నట్లు ఆ చైతన్యం తనలో సృష్టిని ధరిస్తోంది. అయితే మంచువలననే తెలుపుదనం భాసించటం జరుగుతోంది కదా! అట్లాగే చైతన్యము వలననే ఈ ‘సృష్టి’ అనబడేది భాసిస్తోంది. జలమునకు ఆకారం అంటూ ఏదీ లేకపోయినప్పటికీ ఆ జలమే ఆకార సహితమైన తరంగములను విస్తరింపజేస్తోంది. అట్లాగే దేశకాలాది అవయవరహితుడైన ఈ చిద్రూపభగవానుడు దివారాత్రములతోకూడిన ఈ అసలైన జగత్తును విస్తరింపజేస్తూ వెలయు చున్నాడు. 'చిదాకాశము' అనే మహారణ్యంలో పంచభూతములు అనే అనేక రంగుల కలయికతో 'జగత్తులు' అనే పురాతనమైన లతలు వికసిస్తున్నాయి.
చిద్రూపుడగు పరమాత్మ యొక్క స్వప్రతిబింబమే ఈ జీవ-జగద్రూపం. ఆయన తన ప్రతిబింబ మగు ఈ జీవ జగద్రూపములను తనకు అన్యమైన ఆకారంగా దర్శించు ఇచ్ఛయే ఈ దృశ్యాదులు. ఆతడు స్వస్వరూపదర్శనేచ్ఛచే స్వస్వరూపమును, అన్యదర్శనేచ్ఛచే దర్పణ ప్రతిబింబ రూప అహంజగదాదులను పొందుచున్నాడు. బ్రహ్మచైతన్యం సర్వదా అపరిచ్ఛిన్నము. ఆ చైతన్యము ఆకాశంలో వృక్షంలాగా మిథ్యయగు తనయొక్క కల్పనా రూపమే అనతగిన స్వేచ్ఛా కల్పిత బ్రహ్మండాదులను, త్రైలోక్యములను దర్శిస్తున్నది. ఈ సూర్యచంద్రాదులు, నేత్రాలు, మొదలైనవన్నీ అద్దానికి ఉపకరణ మాత్రములై ప్రవర్తిస్తున్నాయి.
పరమాత్మయే... అభ్యంతరమున వాసనామయ ప్రపంచంగాను, బాహ్యమున భువన రూప ప్రపంచంగాను, స్వప్నమున భావరూప ప్రపంచంగాను, సుషుప్తియందు ఏకమైన అవిద్యా రూపంగాను, ఆవిర్భావ, తిరోభావ రూపభావకుడుగానూ... ఉంటున్నాడు.
స్వయంగా అంతర్-బాహ్యములందు ఆయా బహువిధ విశేషములతో ప్రకాశిస్తున్నాడు. ఆతనికి అన్యంగా అణుమాత్రం కూడా ఎక్కడా ఏదీ లేదు.
ముఖం అనే బిలంతో జిహ్వ అనేక చమత్కారాలు నిర్వర్తిస్తోంది చూచావా? అట్లాగే చిదాత్మ యందు చైతన్యం యొక్క ఇచ్ఛచే చిద్రూపాలే అగు ఆయా పదార్థములన్నీ చమత్కారాలు చేస్తున్నాయి. చైతన్యము యొక్క సంవిత్తే (జ్ఞానమే) “అనుభవము” అనే తన యొక్క అంగములచే రూప రసాదులను జగత్తుగా ఆస్వాదిస్తోంది. అట్టి 'లోకములు' అనే 'అనుభవ రూప ఆస్వాదములు' అనే తరంగములచే ఈ ద్రవత్వ జగత్తు ఏర్పడుతోంది.
Page:715
ఓ రామచంద్రా! ఈ సూర్యచంద్రాద్రి ప్రకాశమానములు, తదితర రూపాది పదార్థములు - ఇవన్నీ చిద్రూపమునందే ప్రకాశిస్తున్నాయి. అంతేకాదు. సమస్త ప్రళయములు అట్టి చిద్రూపము నందే లయిస్తున్నాయి. ఈ జాగ్రత్ - స్వప్నాదులన్నీ ఉద్భవించేది - లయించేది ఆ చిద్రూపము నుండే. ఈ జీవుడు చిద్రూపస్వభావుడే కాని దేహాత్మస్వభావుడు కానేకాదు. తెలుపుదనం మంచునందే ఉన్నట్లుగా ఆ చిద్రూప బ్రహ్మమునందే జగత్తంతా కలదు. కాబట్టి ఈ జగత్తు బ్రహ్మమే అయి ఉన్నది. ఎందుకంటే బ్రహ్మము నుండే ఈ సమస్తము వెలువడుచున్నది.
చైతన్యము అవయవరహితము, రంగుచే చిత్రము లిఖించబడునట్లు 'చైతన్యము' అనే రంగుచే ఈ 'జగత్తు' అనే చిత్రము లిఖించబడి ఉన్నది. కాబట్టి ఈ జగత్తును నీవు జన్మాదివికార రహితమైనది గాను, శాంతము - చిన్మయముగాను ఎరుగుము. 'చిద్రూపము' అనే ఒక మహావృక్షము నుండి (కొమ్మలు-ఆకులు వలె) ఈ దృశ్యరూప శాఖలు విస్తరించి ఉన్నాయి. 'బ్రహ్మము' అనే నిశ్చల పర్వతముపై చంచలజలము వంటి ఈ దృశ్య సమూహములన్నీ బయల్వెడలుచున్నాయి.
జగన్నాటకం 'చిదాకాశము' అనే ఒక గొప్ప నాటకరంగంలో 'జగద్రచన' అనే భ్రమాత్మక మైన అభినయమంతా అత్యంత చమత్కారంగా విరాజిల్లుతోంది. 'నియతి' అనే ఒకానొక నర్తకి అనేక కార్యారంభములతో కూడినదై ఆ నాటకరంగముపై నృత్యం చేస్తోంది. కన్నుమూసి తెరిచే లోపల అనేక బ్రహ్మండముల ఉత్పత్తి- వినాశములు జరిగిపోతున్నాయి. 'కాలము' అనే బాలకుడు ‘బ్రహ్మము’ అనే మండపముపై మరల మరల నాట్యం చేస్తూ ఇంతలోనే ఉపసంహరిస్తూ, మరల ఏతెంచుచూ ఉన్నాడు.
అద్దంలో అనేక ప్రతిబింబములు ఉదయించి, ఉపసంహరణమయినంత మాత్రం చేత ఆ అద్దం ఏదైనా వికారం పొందుతోందా? లేనేలేదు. అట్లాగే ఈ అనేక బ్రహ్మాండాలు ఉత్పన్నమగుచు - నశించుచున్నప్పటికీ బ్రహ్మము సర్వదా వికార రహితంగాను, శాంతంగాను ఉంటూనే ఉన్నది.
ఈ కనబడే స్థూలపంచభూతములకు కారణమేమిటి? సూక్ష్మపంచభూతములు కదా! ఘనము-ద్రవము-వాయువు... ఇవన్నీ ఒకే సూక్ష్మ పదార్థము యొక్క వివిధ రూపాలు అని అనక తప్పదు. ఉదాహరణకు ఒకానొక సూక్ష్మపదార్థమే మంచు - జలము - నీటి ఆవిరి అను స్థితులను ఉష్ణోగ్రత యొక్క అల్ప-ఆధిక్యతల ననుసరించి పొందుతోంది. అట్లాగే తాను కారణరహిత మైనప్పటికీ చిన్మాత్రమగు బ్రహ్మము- భూత వర్తమాన భవిష్యత్ సృష్టులన్నిటికీ కారణబీజమై ఒప్పుచున్నది. ఆ బ్రహ్మం యొక్క విస్తరణయే ఈ జగత్తు అట్టి విస్తరణ యొక్క అభావమే ప్రళయం. కానీ ఈ సృష్టి - స్థితి - లయములనబడే - - మూడు విధములైన స్థితులందు బ్రహ్మము సమముగా తన స్వరూపమునందే స్థితినొందియున్నది.
ఓ రామచంద్రా! వాయువు యొక్క చలనములన్నీ వాయురూపములే కదా! సృష్టి ప్రళయ
- జనన మరణ - హాని - వృద్ధి ఆదిగాగల దశలతో కూడిన ఈ మహా మహా బ్రహ్మాండములన్నీ
ఆ అపరిచ్చిన్నములగు చిదాకాశమునందే ఉత్పన్నమవుతున్నాయి. అయినా కూడా చిదాకాశంలో
Page:716
తత్ వ్యతిరేకము, అన్యము అయినదేదీ ఉత్పన్నమగుటయే లేదు. బ్రహ్మమునందు సర్వదా బ్రహ్మమే సర్వతత్వస్వరూపమై ప్రదర్శితమగుచున్నది. ఈ జగత్తులన్నీ చిదాకాశము యొక్క రూపములేనని ఎఱిగి సశాంతుడవై ఉండుము.
18. ఇచ్ఛా జాడ్యం
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అసలీ సంసార చమత్కారమంతా ఎట్లా ఏర్పడుచున్నదో ఎట్లా రూపుదిద్దుకొనుచున్నదో చెపుతాను, వినుతటాకంలోని జలం నిశ్చలంగా, శాంతముగా ఉన్నప్పుడు అంతటా ఒకే జలం ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇంతలోనే అందులో అనేక తరంగములు కనబడగానే పొడవైన, పొట్టి అయిన, చిన్న పెద్ద, ఆదిగా గల అనేక తరంగాలు, ఒక తరంగానికి - - మరొక తరంగానికి భేదాలు మొదలైనవన్నీ అగుపిస్తున్నాయి. ఆ తరువాత కొన్ని తరంగాలు సుందరంగాను, మరికొన్ని వంకర టింకరగా (అస్తవ్యస్తంగాను) కూడా కనిపిస్తున్నాయి.
అట్లాగే అంతా బ్రహ్మమే అయి ఉండగా, అట్టి యథాతథత్వం కొనసాగుచూనే... క్రమంగా అద్దానిలో అనేక పదార్థములతో కూడిన 'జగత్తు' అనబడునది అగుపిస్తోంది. మరికొంత క్రమంచేత అద్దానిలో రాగద్వేషం, సుఖదుఃఖాది అనేక అనర్థాలన్నీ ఘనీభూతమై ప్రాప్తిస్తున్నాయి. తరంగాలన్నీ జలమే అయినట్లు, సర్వజీవ జడాదులన్నీ కూడా యథార్థానికి ఏకమగు బ్రహ్మమే స్వభావంగా కలిగి ఉన్నాయి. ఆ బ్రహ్మసత్త సర్వ పదార్ధాలలో వ్యాపించి ఉన్నదై (కానీ) సర్వ నామరూపాలకు వేరై - -
కేవలం జ్ఞేయమై ఉన్నది. అనగా తెలుసుకొనేది తెలియబడేది అనే రెండూ అదే! అది సన్మాత్రరూపమై, చిదాకాశస్వరూపమై ఉన్నది. ఈ జగత్తు పట్ల ధ్యాస (భేద దర్శనమనే ధ్యాస) తొలగగా అట్టి సమాధి రూపమగు ఉపశమునందే ఈ సమస్త విశ్వం (జలంలో తరంగాలులాగా) ఏర్పడి ఉన్నది. శ్రీరాముడు : ఈ జగత్తంతా ఏకరూపమగు బ్రహ్మమే అయినప్పటికీ... ఎందుకో అనేక భేదములు, తద్ద్వారా ప్రాప్తిస్తున్న ఆయా సుఖ దుఃఖాదులు ఈ జీవుని వెంటబడి బాధిస్తూనే ఉన్నాయనునది కూడా మనం గమనిస్తున్నాం కదా?
శ్రీవసిష్ఠ మహర్షి : చీకట్లో గాలికి కదిలే చెట్లను చూస్తే ఒక బాలుని చింతనలో అనేక పిశాచాది రూపాలన్నీ కనిపించవచ్చు గాక. ఒక ప్రౌఢునికి అక్కడ చెట్లే స్ఫురిస్తాయి కాని, పిశాచాదులు స్ఫురించవు కదా! చిదాకాశంలో కల్పించబడిన ఈ జగత్తు విజ్ఞుల దృష్టికి మాత్రం చిదాకాశానికి అనన్యంగానే కనిపిస్తోంది. అజ్ఞుల చిత్తమునకు సత్యమని తోచే ఈ జగత్తు విజ్ఞులకు (చిదాకాశానికి వేరైనదంతా) స్వకీయకల్పనా మాత్రమని తెలియవస్తోంది. జ్ఞానియొక్క దృష్టియందు ఈ జగత్తు... శిలయందు చెక్కబడిన శిల్ప సంబంధమైన 'సైన్యం' మొదలైన చాతుర్యం వలె మాత్రమే కనిపిస్తోంది. ఈ అనేకంగా కనిపించేదంతా జ్ఞానికి ఏకంగాను, ఆత్మస్వరూపంగాను అనిపిస్తోంది. ఇదంతా
Page:717
కూడా బాహ్యమున ప్రకాశరహితమై, అభ్యంతర సంబంధమైన కుసంకల్పాది మానసిక చేష్టా రహితమై శిల్పకళా రచనవలె అగుపిస్తోంది. ఇది ఇట్లుండగా ఇక జ్ఞాని దృష్టియందు విశ్వత్వం ఎచ్చట? అజ్ఞానికి మాత్రం ఇదంతా సంకల్పాదియుక్తమై భాసిస్తోంది.
కాస్త విచారణ చేసి చూస్తే... ఇక్కడ కనిపించే బాహ్య-అభ్యంతరములైనట్టి రూప ప్రకాశసంకల్పాదులన్నీ కూడా... వాటి సారం చిన్మాత్రమే అయి ఉన్నది. ఎందుకంటే చిన్మాత్రం కంటే భిన్నంగా జీవుడు-మనస్సు మొదలైనవి లభించే వస్తువులు కావు. బంగారానికి భిన్నంగా ఆభరణ మెక్కడ? కాబట్టి ఇక ప్రపంచమనేది ఎక్కడ? సంసారము ఎవరికి? ఓ రామచంద్రా! మరింత క్రోడికరించి ఒక సిద్ధాంతం రూపంగా ప్రతిపాదిస్తున్నాను... విను.
ఇదం జగత్ బ్రహ్మమేవ - - సిద్ధాంతం - జాతకు ఈ జగత్తును జగత్తుగా (అనేక భేదములుగా) పొందటమే “జగత్య్రాంతి" అయి ఉన్నది. అట్లు ఎఱుగకుండుటయే (ఈ జగత్తంతా ఏకరూప బ్రహ్మముగా ఎఱుగుటయే) సర్వభ్రమ ఉపశాంతి.
అనగా, ఈ జగత్తు యొక్క స్మరణం అనేది నీ ఆధీనంలోనే ఉన్నది కదా! ఈ విధంగానే బంధం, మోక్షం నీ ఆధీనంలోనే ఉన్నాయని గ్రహించు. వ్యాపకమగు చిదాకాశం అంతటా ఏర్పడి ఉన్న 'పరమాకాశ రూపమే' అయి ఉండగా, అందులో 'పరివర్తనం' అనేది ఎట్లా సంభవం? సంభవం కాదు. ఆకాశం ఎక్కడున్నా మూర్తివంతం అవుతుందా? కాదు. మూర్తివంతమే కాని దానికి ఉత్పత్తి - వినాశనాలు ఎక్కడుంటాయి? చిన్మయమగు ఈ విశ్వమునకు ఉత్పత్తి-వినాశనము అనబడే స్వభావ వికారత్వమేమీ లేదు. ఇక ఈ కనబడే నామరూపాత్మకమైన వికారమంటావా? విచారణ చేసి చూస్తే ఈ ద్రష్ట దృశ్యములకు ఆకార అనుబంధాలు, నామరూపాదులు లేవని తెలియవస్తోంది. చైతన్యమునందు అవన్నీ ఎట్లా (చైతన్యమునకు వేరై) ఉండగలుగుతాయి?
ఈ కనబడే సమస్త ప్రపంచం చిదాకాశమాత్రమే అయి ఉన్నది. అట్టి 'చిత్' (జ్ఞానస్వరూపం) నందు అహంకారాది ఆయా వికారములు ఎన్నడూ లేవు. జ్ఞానమునకు అన్యంగా ఎక్కడా ఏదీ లభించుటయే లేదు.
సర్వం శాంతం శివం శుద్ధం త్వమ్-అహన్తాది విభ్రమమ్ | న కించిదపి పశ్యామి వ్యోమజం కాననం యథా ॥
ఆకాశాన్ని చూపించి ఎవడైనా 'అయ్యా! చూడండి! ఆకాశంలో గొప్ప కీకారణ్యం కనిపి స్తోంది”... అని అంటాడనుకో, అది నిజమా? కాదు! అట్లాగే త్వమ్, అహమ్ (నీవు, నేను) మొదలగు రూపములన్నీ సమావేశమైనట్లుగా అనిపించే ఈ సమస్త విభ్రమములన్నీ "శాంతము - శివము - శుద్ధము అయినట్టి బ్రహ్మరూపమే” అయి ఉన్నది. చైతన్యముకంటే వేఱుగా ఎక్కడా ఏదీ లేదు. చైతన్యమునందు ‘అహమ్-త్వమ్' అనునవేవీ లేవు. ఓ మిత్రులారా! నాకు బ్రహ్మమే అంతటా కనిపిస్తోంది. అందులో 'నేను-నీవు' అనేవేవీ కించిత్ కూడా కనబడటం లేదు.
Page:718
ఓ రామచంద్రా! నేను, నా వాక్యములు - ఇవన్నీ కూడా శుద్ధము దృశ్యరహితము అగు చిదాకాశంగానే ఎఱుగుము. ఎందుకంటే నీకు అనుభవమయ్యేదంతా నీయొక్క చిదాకాశరూపము నందే సంస్థితమైయున్నది గాని... ఎక్కడో జడస్వరూపమున కాదు.
పరపదము - “ఇచ్ఛ” అనబడే ఒకానొక భ్రమయే. ఈ జీవుని “పరమపదం" అనబడు ఆత్మ యొక్క స్థితిని అనుభవములోనికి రానీకుండా చేస్తోంది. ఒక శిలయందు చెక్కబడిన మనుజుని వలె, ఒక చిత్రమందు చిత్రించబడిన మనుజునివలె ఎప్పుడైతే అంతరంగము ఇచ్చారహిత మౌతుందో... ఆ మరుక్షణం ఈ జీవునికి 'చైతన్యస్థితి' అనబడే పరమపదం స్వయంగా అనుభవ మౌతుంది. ఎవని అవగాహన అయితే ఆయా యథాప్రాప్తములగుచున్న కర్మల పట్ల ఇచ్ఛా, వ్యాకులం అనునవి లేనిదై ఒక కొయ్యబొమ్మవలె ఉండగలుగుతోందో... అట్టి వానిని “విశ్రాంతి చిత్తుడైన జీవన్ముక్తుడు” అని పిలుస్తారు.
జ్ఞాని దృష్టి - జ్ఞానికి ఈ ప్రపంచం, ఇందలి తన తదితరుల జీవనం... ఇదంతా వెదురునాళం వలె బాహ్య అభ్యంతరాలలో శూన్యంగాను, రసహీనంగాను, వాసనారహితంగాను, పిల్లల ఆటవలె అర్థరహితంగాను తోచుచున్నది. ఎవని హృదయంలో దృశ్య ప్రపంచం కించిత్ కూడా రుచించదో, అదృశ్యమగు 'చిన్మాత్ర బ్రహ్మం' మాత్రమే రుచిస్తుందో... అట్టివాడు మాత్రమే బాహ్య అభ్యంత రాలలో “శాంతి”ని దర్శించగలుగుతారు. అతడు మాత్రమే ఈ సంసారాన్ని దాటివేయ గలుగుతాడు.
ప్రియా ఆత్మబంధువులారా! మీరు 'ప్రారబ్దకర్మ'ను నశింపజేయటానికి ఉపయోగించే మాటలు మాత్రమే మాట్లాడండి. అన్యశబ్దములను ఉచ్చరించనే వద్దు. క్రమక్రమంగా ఈ దేహాదుల పట్ల అహంకార, మమకారములను త్యజించండి. వాటితో సంబంధరాహిత్యమును ఒనగూర్చుకోండి. వేణువు తనయందు ఇచ్ఛ-అనిచ్ఛ అనేవేవీ లేకుండానే లోకానికి మధుర గానాన్ని వినిపిస్తుంది చూచారా? అట్లాగే మీరు కూడా వాసనారహితులై (ఆ వేణువు వలె) శబ్దములను ఉచ్చరించండి. దేనినైనా ప్రవాహపతితమైన వ్యవహారానుసారంగా స్పృశించవలసివచ్చిందా... అట్లే స్పృశించండి. అయితే క్షోభవర్జితులై, ఇచ్ఛారహితులై, వాసనలనేవేవీ లేకుండా ఆయా యథాప్రాప్తములైన చందమున-మాలాదులను ఈ త్వక్ ఇంద్రియము స్పృశించుగాక.
స్వాద్యన్తాం రసజాలాని విగతేచ్ఛాభయైషణమ్ అపరాగాభిలషణం యధా ప్రాప్తిని దర్వివత్ ॥
ఒక గరిట ఎటువంటి ఇచ్ఛ భయ-క్రోధాలు లేకుండానే పులుసులో ప్రవేశించి తన విధిని నిర్వర్తిస్తూ ఉంటుంది చూచావా? అట్లాగే ఈ జిహ్వేంద్రియం కూడా ఎటువంటి ఇచ్ఛ- భయక్రోధములు లేకుండానే యథాప్రాప్తములైన పదార్థములను అస్వాదించునుగాక!
ఒక చిత్రంలోని మనుజుని కళ్ళు ఎవరిని చూచినప్పటికీ అభిమానరహితంగానూ, వాసనా రహితంగానూ, అమనస్కంగానూ యథాతథంగా ఉంటుంది కదా! అట్లాగే ఈ కళ్లు కూడా వాసనా రహితంగాను నిరభిమానంగాను, అమనస్కంగాను, రాగత్యాగ రహితంగాను యథాప్రాప్తమగుచున్న
Page:719
ఆయా రూప సమూహములను దర్శించును గాక! అలాగే ఈ ఘ్రాణేంద్రియం ఆయా పుష్పాదుల సుగంధమును ‘వనం’ త్యజించినట్లు త్యజిస్తూనే పొందునుగాక!
ఈ ప్రకారంగా కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ విషయాలలో మనస్సు నిస్సారత్వం సంపాదించు కుని ఉండటమే ముఖ్యమైన ఉపాయం. అట్లా మనస్సుకు పట్టిన 'భోగాలు' అనే రోగాలకు చికిత్స కావించబడకపోతే... ఇక ఈ జీవునికి 'శాంతి' యొక్క వార్త కూడా దరిజేరదు.
ఇచ్ఛాత్యాజ్యం - ఓ సాధక జనులారా! ఈ ఇంద్రియ విషయ భోగములతో కాలం వృథా చేసుకోకండి! 'కాలం' అనే మహత్తరమైన భగవత్ ప్రసాదితమైన ఉత్తమావకాశమును సద్వినియోగ పరచుకోవాలే గాని, దుర్వినియోగపరచుకోవటం ఏమాత్రం ఉచితం కాదు సుమా!
యః స్వాదయన్ భోగ విషం రతిమేతి దినేదినే
సో అగ్నౌ స్వమూర్తిం జ్వలితే కక్షమక్షయముజ్ఞతి ॥
ఎవడైతే ఇక్కడ 'భోగములు' అనే విషమును ఆస్వాదిస్తూ రోజురోజుకు సంతోషిస్తూ కాలం వెళ్ళబుచ్చుతాడో... అట్టివాడు ప్రజ్వలించుచున్న అగ్నిని తన శరీరముపై ధరించి అద్దానిపై ఎండుగడ్డి పరకలను మరల మరల విసరుకొన్నవాడే అవుతాడు.
అందుచే ఎట్లాగైనాసరే “ఇచ్చగించటం” అను మనస్సు యొక్క అలవాటుకు ఇక్కడ చికిత్స చేసుకోవాలి. 'ఇచ్ఛ' అనే అడ్డు తొలగనంతకాలం ఈ జీవుడు సంసారంలో ఉంటూనే ఉంటాడుగాని... ఆనంద స్వరూపుడగు పరమాత్మ యొక్క తత్త్వమును గుర్తించనేలేడు. వేదవేత్తలలో శ్రేష్ఠులైనవారు “ఇచ్ఛారాహిత్యమే సమాధాన స్థితి. అదియే సమాధి. ఈ మనస్సు ఇచ్చారాహిత్యముచే శమించినట్లుగా వేల కొలది ఉపదేశములు విన్నప్పుడు కూడా శమించదు” అని అంటూ ఉంటారు.
ఇచ్ఛోదయే యథాదుఃఖం, ఇచ్ఛాశాంతిమ్ యధాసుఖమ్ |
తథా న నరకేనాపి బ్రహ్మలోకే నానుభూయతే ॥
'ఇచ్ఛ' యొక్క ఉదయముచే కలిగే దుఃఖం నరకంలో కూడా అనుభవం కాదు. ఇచ్ఛ శమించినప్పుడు కలిగే సుఖం బ్రహ్మలోకంలో కూడా అనుభూతం కాదు సుమా! "ఇచ్ఛా మాత్రమే చిత్తం. ఇచ్ఛా రాహిత్యమే మోక్షం” అనేదే శాస్త్రసారం. ఇచ్ఛను జయించివేసినప్పటి (త్యజించినప్పటి, అతీతత్వం సంతరించుకున్నప్పటి) స్థితియే సమస్త శాస్త్రముల యొక్క, తపస్సుల యొక్క యమనియమాదుల యొక్క తాత్పర్యం. ఎంతెంతవరకైతే ఏ ప్రకారాలుగా ఇచ్ఛ ఉదయించకుండా ఉంటుందో, అంత వరకు దుఃఖ సమూహబీజం వృద్ధి పొందదు. వివేకబలంచే జీవునిలో ఇచ్ఛ సన్నగిల్లుచున్న కొద్దీ ‘దుఃఖచింత' అనే మహమ్మారి శమిస్తూ ఉంటుంది. 'రాగం'చే ఇచ్ఛ ప్రవృద్ధ మౌతూ ఉంటుంది. ఇచ్ఛచే దుఃఖము అనే విషయతరంగాలు ప్రవృద్ధమౌతూ ఉంటాయి.
ఈ ‘రాగం - ఇచ్ఛ’ అనే వ్యాధికి "మనస్సును నిగ్రహించటం" అనే పురుష ప్రయత్నరూపమైన ఔషధమే శరణ్యం. పురుష ప్రయత్నంకంటే బలవత్తరమైన ఔషధం వేడొకటేదీ లేదు. ఓ ప్రియ సహజీవులారా! మీరు ఒకే కాలంలో ఇచ్ఛలన్నీ జయించలేకపోతే, కనీసం కొంచెం కొంచెంగానైనా
Page:720
వీటిని త్యజిస్తూ ఉండే ప్రయత్నంలో ఉండండి. మీరు అట్టి సన్మార్గంలో ఉంటే చాలు, ఇక దుః ఖాదులు మిమ్ములను సమీపించే సాహసం చేయలేవు.
యస్తు ఇచ్చాతానవే యత్నం న కరోతి నరాధమః |
సోంధకూపే స్వమాత్మానం దినానుదినం ఉజ్ఝతి ||
ఎవడైతే “తనయందలి ఇచ్ఛను సన్నగిల్లజేయటం” అనే ప్రయత్నంలో తనను నియమించు కుని ఉండడో... అట్టివాడు ప్రతిరోజు తననుతాను చీకటి నూతిలోని లోతులలోకి ప్రతిదినం పడదోసికొనినవాడే అగుచున్నాడని నా హెచ్చరిక. అట్టి నరాధముడు తననుతానే దుఃఖపరంపరలకు అప్పజెప్పుకొన్న వాడగుచున్నాడు. “దుఃఖములు” అనే పుష్పములచే శోభితమై ఉన్న ఈ సంసార లతకు “ఇచ్ఛ” అనేదే బీజం. అట్టి బీజం అంకురించకుండా ఉండాలంటే 'ఆత్మజ్ఞానం' అనే అగ్నిచే అద్దానిని దహించాలి. అప్పుడిక అది మరల మొలకెత్తదు.
రామచంద్రా! మరల మరల గుర్తు చేస్తున్నాను. 'ఇచ్ఛ'యే సంసారం. 'ఇచ్ఛ' యొక్క అభావమే నిర్వాణం. అందుచేత ఇచ్ఛ అనేది ఉత్పన్నమే కాకుండటానికి సమస్త ప్రయత్నాలు ఆచరించు. సకల ఉపాయాలు అనుసరించు. ఇక తక్కిన వ్యర్థ ప్రయత్నముల వలన ప్రయోజనమేమున్నది?
శాస్త్రోపదేశ గురవః ప్రేక్ష్యానే కిమనర్థకమ్ | |
కిమ్ "ఇచ్ఛా న అనుసంధాన సమాధిః" న అధిగమ్యతే?
ఓ ప్రియ సహాత్మజనులారా! మీరు శాస్త్రములు కొఱకు, గురూపదేశముల కొఱకు ఎందుకు ప్రతీక్షించటం? చిత్తశాంతికి ఉపాయమైనట్టి “ఇచ్ఛా రాహిత్యము”ను ఎందుకు అభ్యాసపూర్వకంగా ఆశ్రయించటం లేదు? ఎందుకంటారేమో? ఎవనికైతే “తన యొక్క వివేకాదులచే ఇచ్ఛను సన్నగిల జేయటం”... అనేది “దుస్సాధ్యం!” అని అనిపిస్తూ ఉంటుందో అట్టి వానికి గురూపదేశాలు, శాస్త్ర పఠనాదులు ఎంతగా అందిస్తే ఏం లాభం? అవన్నీ చెవిటివానికి రాగయుక్తంగా శంఖం ఊది వినిపించటంలాగా నిరర్థకమే అవుతాయి. పులులతో నిండిన అరణ్యంలో ఒక జింక అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉంటే, ఇక ఆ జింకకు మరణం నిశ్చయమైనట్లే కదా! "ఇచ్ఛ” అనే వికారముచే అనేక విషయసంబంధమైన వికారములతో కూడి, అనేక దుఃఖములను విస్తరింపజేసే స్వభావం గల ఈ సంసారంలో ప్రవేశించిన ఈ జీవునికి ఆ జింకలాగానే అధఃపతనం నిశ్చితమై ఉన్నది. ఈ జీవుడు సకల తదితర ఆధ్యాత్మిక సాధనలను ఒక్క ప్రక్క ఉంచి, ముందుగా ఈ ఇచ్ఛ' అనే దానిని సన్నగిల చేసుకోవటం ఎట్లాగో యోచించటం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటావా?
న బాలీక్రియతేతి ఈషత్ ఆత్మజ్ఞానాయ చేదసౌ |
ఇచ్ఛోపశాన్తిః క్రియతాం తయాలం తదవ్యాప్యతే ॥
బాలునిలాగా ఇచ్ఛచే చపలుడు కాకపోతే ఈ మానవునకు ఆత్మజ్ఞానం సంపాదించు కోవటానికి కొంచెం ప్రయత్నం సరిపోతుంది. ఓ సభికులారా! కొందరికి ఎంత ప్రయత్నించినా, ఎన్నో సాధనలు చేసినా, ఎంతగానో గురుపదేశములు విన్నా, ఎంతెంతగానో శాస్త్రములు కంఠో
Page:721
పాఠంగా వచ్చినా, వారికి కూడా ఆత్మజ్ఞానం అనుభవానికి రాలేదంటే... దానికి అసలైన కారణం? వారి అంతరంగంలో ఈ దృశ్య విషయాల పట్ల నిర్మించుకొని ఉన్న 'ఇచ్ఛ' యొక్క ప్రభావం చేత ఏర్పడిన మనోచాంచల్యమేనని నా కనిపిస్తుంది. కాబట్టే మనుముందుగా ఇచ్ఛ యొక్క ఉపశాంతికై ఉపాయములు ఆశ్రయించటం ముముక్షువు చేయవలసిన పని - అని నా అభిప్రాయం. ఇచ్చ సన్నగిల్లితే ఆత్మజ్ఞానం అతి సులభంగా మనస్సుకు హత్తుకుంటుంది.
నిరిచ్ఛతై నిర్వాణం, స ఇచ్ఛతైవహి బంధనమ్ యథాశక్తి జయేదిచ్చాం! కిమేతావతి దుష్కరమ్?
ఇచ్ఛ యొక్క అభావమే నిర్వాణం (నిరిచ్ఛ), ఇచ్ఛ యొక్క ప్రవృద్ధమే బంధనం (సఇచ్ఛ)... కాబట్టి యథాశక్తి ఇచ్ఛను జయిస్తూ రావాలి.
ఇంతమాత్రం ప్రయత్నం “అబ్బో! కష్టసాధ్యం!”... అని అంటే ఇక మేము చేయగలిగిన దేమున్నది? (నిర్వాణ స్థితి ప్రాప్తికి) ఈ మాత్రం ప్రయత్నించటంలో దుస్సాధ్యం ఏమున్నది? జరామరణజన్మాది కరన్జ ఖదిరావలేః
బీజమిచ్ఛా సదైవ అంతర్ దహ్యతాం శమవహ్నినా ॥
ఓ రామచంద్రా! ఈ “జరామరణ జన్మాదులు” అనే కంటక వృక్ష సమూహమునకు బీజము ఇచ్ఛయే సుమా! అందుచేత ఆ కంటక వృక్ష బీజమును “శమము (ఇంద్రియ నిగ్రహము)” అనే వివేకాగ్నిచే దహింపజేయాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇచ్ఛ ఉంటే అక్కడక్కడ బంధపాశములన్నీ వచ్చిపడుచున్నాయి. ఇచ్ఛ ఉన్నచోట పుణ్య-పాపరూప దుఃఖ రాసులన్నీ వచ్చి చేరుతున్నాయి. ఇక అట్టి జీవుని యొక్క మహాబాధలకు అంతూ పొంతూ ఉండటం లేదు. సాధువైనవాడు ఇచ్ఛారహితం చేసుకోకుండా కొంచెం సమయం గడిపినా కూడా, ఆ కొద్ది సమయం ఏమఱచి ఉండడంచేత, దొంగలచే సంపదలు అపహరించబడిన గృహయజమానిలాగా, సర్వస్వం కోల్పోయిన బాటసారి లాగా చిరకాలం రోదన, వేదనలు పొందవలసి వస్తుంది. మరి ఈ సంసారమార్గం అటువంటిది! ఎంతెంత వరకైతే ఇచ్ఛ అంతఃకరణంలో శమిస్తూ ఉంటుందో, అంతంత వరకు అతనిపట్ల మోక్షము కొఱకై శుభదాయకమగు సాధన చతుష్టయ సంపత్తి ప్రవృద్ధమౌతూ ఉంటుంది.
సంసారము = వాస్తవానికి ఆత్మ స్వరూపుడే అయిన ఈ జీవుడు, ఆత్మజ్ఞాన వివేకరహితుడై విషయోపభోగముల ద్వారా ఇచ్ఛను పరిపూర్ణం చేసుకోవాలని, ఎండమావుల వైపుగా నీటికొరకై ప్రయాణించే జింకలాగా, ఈ దృశ్య వ్యవహారంలో నిర్వర్తించే జన్మజరామరణములతో కూడిన నిరంతరమైన రాకపోకలు. ఇదే సంసారం! ఇంతకు మించి సంసారముగా ఎక్కడా ఏదీ లేదు. ‘హృదయము' అనే వృక్షం యొక్క అగ్రభాగంలో ఎక్కడో ఈ 'ఇచ్ఛ' అనే నిప్పుకణం పుట్టి ఇక హృదయమును దహించివేస్తోంది.
'జీవుడు' అనే పశువు కాలుచున్న హృదయ గృహంలో చిక్కుకుని అల్లాల్లాడుచున్నాడు. 'పుణ్య పాపాలు' అనే స్వకీయ ఆశ్రయంచే ఎంతో శ్రమపడుతూ దీర్ఘకాలంగా వగరుస్తున్నాడు.
Page:722
‘మోహం’ అనే పొగ అతని కళ్ళు కప్పి అంధునిగా చేసివేస్తోంది. 'రాగము-ద్వేషము' అనే కట్టుత్రాళ్ళచే అతడు బంధించపబడి ఉన్నాడు. 'ఆశ నిరాశలు' అనే ఛటఛట ద్వనులను వింటూ ఈ జీవుడు దిక్కుతోచకుండా ఉన్నాడు.
19. ఇచ్ఛయొక్క ఉపశాంతి
శ్రీవసిష్ఠ మహర్షి : ఇచ్ఛారాహిత్యము, తద్వారా ఏర్పడగల ఆత్మతో సంయోగము గురించి మనం ఇప్పుడు కొన్ని విశేషాలు చెప్పుకున్నాం. అయినా కూడా “ఇచ్ఛ యొక్క సంపూర్ణశాంతి” గురించి ఇంకా మరికొన్ని విశేషాలు ఇప్పుడు చెప్పుకోవటం సందర్భోచితమని నాకు అనిపిస్తోంది. కనుక “ఇచ్ఛ యొక్క ఉపశాంతి" సంబంధితంగా మన సంవాదము కొనసాగిద్దాం.
“అసలు ‘ఇచ్ఛ’ యొక్క ఆవశ్యకత ఏమిటి?” అనే ప్రశ్నకు వద్దాం.
ఆత్మనో వ్యతిరిక్తం చేత్ విద్యతే తదిహ ఇచ్ఛయా!
ఇష్యతామ్ అసత్ ఇత్వేతత్ స్వాత్మాన్యత్వం కిమిష్యతే?
‘ఆత్మ’ కంటే వేరుగా ఎక్కడైనా ఏదైనా ఉంటే, అప్పుడు అద్దానిని కొఱుకోవటం భావ్యమే! అసలు ఆత్మకు వేరుగా ఏది ఎక్కడున్నది? అంతా ఆత్మయే అయి ఉండగా, ఆత్మకు వేఱుగా రెండవ వస్తువు కనిపించటమనేది భ్రాంతియే. అనగా “భ్రాంతి చేతనే ఇచ్ఛ ఉదయిస్తోంది” అనే కదా! ఆత్మ జ్ఞానం యొక్క ప్రవృద్ధి చేత “రెండవ వస్తువే ఉండజాలదు" అని గ్రహించుటచే ఇచ్ఛ సునాయాసంగా జయించబడుతుంది. ఇచ్ఛను అధిగమించాలంటే ఆత్మజ్ఞానమే ఉపాయం. "అవయవరహితం, ఆకాశం కంటే కూడా అత్యంత సూక్ష్మం, దృశ్య శూన్యం" అగు చైతన్యమేది కలదో... అదియే ఇటు అహంకారంగానూ, అటు జగత్తుగాను కనిపిస్తోంది. నీకు కనిపించేదంతా నీ రూపమేనని గ్రహించిన తర్వాత అందులో ఇక నీవు కోరవలసినదేముంటుంది? త్యజించవలసినదేముంటుంది?
ఈ ఆకాశము, ఇక్కడి విషయములు, ఆ విషయములు గ్రహించే జ్ఞాత... ఇవన్నీ కూడా చిదాకాశరూపమగు చైతన్యమే అయి ఉన్నాయి. ఈ జగత్తు యొక్క అభాస కూడా చిదాకాశ రూపమే! ఇకప్పుడు ‘ఇచ్ఛ'కు విషయమెక్కడున్నది?
అజ్ఞాన దృష్టిచే అశాంత దృష్టి ఏర్పడుతోంది. అట్టి అశాంతదృష్టికి 'గ్రహించువాడు-గ్రహించ బడునది”... అనబడే గ్రాహ్య-గ్రాహక సంబంధం ఇక్కడ కనిపిస్తోంది. ప్రశాంత దృష్టికి ఆ సంబంధమే అగుపించదు. ప్రశాంత చిత్తులమగు మనకు ఇక గ్రాహ్యం ఎక్కడ? గ్రాహకం ఎక్కడ? ఎవరియందు ఈ గ్రాహ్య-గ్రాహక సంబంధము కనిపిస్తోందో... వారు కూడా ఆత్మకు వైటైనవారు కాదు కదా! ఆ గ్రాహ్య - గ్రాహక సంబంధము పరిశీలించిచూస్తే అగుపించేదికాదు. ఎందుకంటే స్వతః అసత్తైనది ఎక్కడ ఎట్లా లభిస్తుంది? ఎవరికైనా చంద్రుడు ఆకుపచ్చగా కనిపిస్తాడా?... ఆకుపచ్చ రంగుటద్దంలోంచి చూచే వారికి తప్ప!
Page:723
గ్రహించువాడు, గ్రహించబడునది- అజ్ఞానంచే ఆత్మయందు నిష్ఠ లేకపోవటమే “గ్రాహ్యము - గ్రాహకము”ల యొక్క ‘సత్త' అయి ఉన్నది. అశాస్త్రీయమైన దృష్టి చేతనే ఈ అనేకాలుగా కనిపించే వన్నీ సత్యం వలె అనిపిస్తున్నాయి. శాస్త్రీయమగు తత్త్వ నివారణచే "గ్రహించువాడు గ్రహించ బడునది” అనే విషయ-విశేషములన్నీ ఎచటికో పలాయనం చిత్తగిస్తాయి. ఓ ప్రియజనులారా! అజ్ఞానులగు వారిపై గల అవ్యాజమైన ప్రేమచే సుజ్ఞానులు “శాస్త్రములు” అనే అమృతపు జల్లు కురిపిస్తున్నారు. అట్టి శాస్త్రముల సహాయంతో అసత్యమగు “అహంత్వము”ను అధిగమించెదరు గాక! ఈ అహంత్వము ఆత్మతత్త్వజ్ఞాన ప్రభావంచే ఆత్మయందే విలీనమైపోతోంది. అదియే ద్రష్టదృశ్యాదుల సంపూర్ణ క్షయరూపమైనట్టి 'నిర్వాణము'. అదియే ఆత్మతత్త్వము యొక్క స్వభావము.
దృశ్యము, నిర్వాణము - 'నిర్వాణం' నందు దృశ్యాదులు లేవు. దృశ్యాదులందు శాంతి రూప నిర్వాణం లేదు. 'ఎండ-నీడ' లాగానే ఆ నిర్వాణ దృశ్య వ్యవహారములు రెండూ ఒక్కచోట ఏర్పడి ఉండేవి కావు. ఇక ఆ రెండిటి యొక్క 'సమభావన’ కలుగవచ్చునంటావా? అవి రెండూ పరస్పరం బాధించుకుంటున్నాయి. కాబట్టి రెండూ అసత్యములేనని అనాలి. కానీ 'రెండూ అసత్యములే' అనే మాట విద్వజ్ఞుల అనుభవానికి భిన్నంగా ఉన్నది. ఎందుకంటే అసత్యమైన దానిలో శాంతి లేదు. ఇక నిర్వాణమో... దుఃఖ శూన్యముగాను, పరమశాంతముగాను తత్త్వజ్ఞులకు అనుభవమౌతోంది. ఈ దృశ్యాదులో... సదా దుఃఖదాయకంగాను, భ్రమ రూపములుగాను అయి ఉన్నాయి.
కాబట్టి ప్రియ రామచంద్రా! ఈ దృశ్యాదులను భావించనే వద్దు. సర్వ భావములకు ఆవల సర్వదా వేంచేసి ఉన్న ‘నిర్వాణం’ అనబడు ఆత్మ పదమునందే సదా సంస్థితుడవై ఉండు.
ఒకనికి ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లుగా అనిపించవచ్చు గాక! కాస్త విచారించి చూస్తే ముత్యపుచిప్పలో వెండి ఉన్నదా? అందులో లభించే దానితో మనకేమైనా వెండిరూపమైన ప్రయోజన మున్నదా? లేదు. అట్లాగే దృశ్యాదులలో వాస్తవంగా లభించేదేమీ లేదు. అందుచేత 'ఈ దృశ్యాదులు మిథ్య' అని ఎరుగటంలో హాని ఏమున్నది? 'ఈ దృశ్యం సత్యం' అని తలచటంలోనే మహా దుః ఖాలన్నీ దాగి ఉన్నాయి. ‘ఈ దృశ్యం మొదలంట అసత్యం' అని గ్రహించటంలో మహా సుఖముంది. శ్రీరాముడు : దృశ్యమును అనుక్షణం ఎంతగానో అనుభవిస్తున్న మాకు దృశ్యము అవాస్తవమని ఎరిగి ఉండటం ఏమంత తేలికంటారా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఆత్మ యొక్క మనన సహితమగు 'నిధిధ్యాస’చే అట్టి దృశ్యం యొక్క అభావం తప్పక లభించగలదని నేను చేతులెత్తి ప్రకటన చేస్తున్నాను. (ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష!)
ఆత్మకు బంధం లేదు - - ఆత్మజ్ఞానమును ఏమరచి సంసారంలో సంచరించే బాటసారులారా! ‘ఉత్పత్తి’ మొదలైన వికారాలకు విషయమే కానట్టి ఆత్మ స్పష్టంగా కరతలామలకమై స్ఫురించు చుండగా అద్దానిని మీరు ఎందుచేత దర్శించలేకున్నారు? అట్టి ఆత్మకు బంధహేతురూపంగా ప్రకటనమగుచున్న దృశ్య సమూహాన్ని జ్ఞానాగ్నిచే ఎందుకు దహించివేయటం లేదు?
ఎప్పుడైతే కార్య-కారణ భావాదులు కూడా బ్రహ్మమే అని సునిశ్చితమౌతుందో... అప్పుడే దేహము మొదలుగా గల సర్వ పరిచ్ఛిన్న భావాలు వాటంతట అవే సమసిపోతాయి. అటు తర్వాత
Page:724
మాత్రమే బ్రహ్మత్వము సిద్ధిస్తుంది. అంతేగాని అణుమాత్రం దృశ్యము మీ దృష్టిలో శేషించి ఉన్నప్పటికీ జగదత్వమే సిద్ధిస్తుంది కాని... బ్రహ్మత్వము కాదు.
చిదాకాశరూపం-ఏకం-సర్వవ్యాపకం-పరిపూర్ణం అయినట్టి సర్వాత్మయగు బ్రహ్మము నందు కార్య కారణ సహితమగు దృశ్యాన్ని ముందుగా అంగీకరించి, తరువాత బ్రహ్మ ప్రబోధం కొరకు సాధనలను వెతుకువారు మా ఉద్దేశంలో పసిబాలుర వంటి వారే! అట్టి వారి కల్పితవాక్యములతో మాకు పని లేదు. వారి పరిశ్రమంతా వృథాయాసమేనని మా ఉద్దేశం! ఎందుచేతనంటావా? కార్యకారణ పూర్ణములగు వ్యాక్యములందు అవిద్య తప్ప మరింకేమి క్రమం ఉన్నది?
శ్రీరాముడు : మహాత్మా! నిర్విషయమని చెప్పబడే చిదాత్మయందు సృష్టిత్వము అనే చమత్కారం ఎందుకు ప్రత్యక్షమౌతోంది.
శ్రీవసిష్ఠ మహర్షి : వాయువు యొక్క చలనమునకు హేతువు ఏముంటుంది? జలము యొక్క ద్రవత్వమునకు కారణమేమున్నది? ఆకాశము యొక్క శూన్యత్వమునకు ఎవరు కారణమంటే ఏం చెపుతాం? చిదాత్మ యొక్క సృష్టిత్వమునందు కూడా అదే కారణమున్నది. గాలి, గాలి తరంగాలు ఒక్కటే అయినట్లు కార్య-కారణాదులన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయి. ఎప్పుడైతే అవి రెండూ బ్రహ్మమే అయి ఉన్నాయో... ఇకప్పుడు సృష్టుల యొక్క కారణత్వము 'వెతకటం, ప్రబోధించడం' అనునది సిగ్గులేనిపనే అవుతుంది. (బ్రహ్మణి సర్గాణాం కారణార్థా విలజ్జతా)
న దుఃఖమస్తి న సుఖమ్ శాంతం శివమయం జగత్ ||
కాబట్టి ఈ జగత్తు కేవలం శాంతము, శివమయము అయి ఉన్నది. అంతేగాని, ఇక్కడ సుఖము లేదు, దుఃఖము లేదు.
నాస్తి చిన్మాత్రతా అన్యత్వమ్, అత ఇచ్ఛోదయః కుతః?
మృత్ దేహయోధసేనాయాం న మృణ్మాత్రే ఇతరత్ యధా!
ఒక కళాకారుడు మట్టితో యుద్ధ దృశ్యమును తయారుచేసి ఎదురుగా పెట్టాడనుకో. మనకు ఆ మట్టి బొమ్మల దృశ్యంలో శత్రుసైన్యం, మిత్రసైన్యం, గుఱ్ఱాలు, ఏనుగులు, శూలాలు, గదలు, బల్లేలు మొదలైన సంరంభమంతా చిత్ర విచిత్రంగానూ, రసవత్తరంగాను అగుపించవచ్చు గాక! కానీ ఆ బొమ్మలన్నీ మట్టితోనే తయారయ్యాయి కదా! మట్టిగాక ఆ బొమ్మల సంబంధాలన్నీ (శత్రు సైనికుడు-మిత్ర సైనికుడు-శత్రు-మిత్ర సంబంధాలు మొదలైనవి) ఎక్కడున్నాయి? ఈ జగత్తంతా కూడా శాంతమగు చిన్మాత్రము తప్ప మరింకేమీ కాదు. ఇక ఇచ్ఛ యొక్క ఉదయము ఎవరికి? ఎట్లు సంభవం?
న స జగత్ - - అహంతారౌ దృశ్య బ్రహ్మేతరత్తథా ||
నేను-నేను చూసే జగత్తు మొదలైన వాటితో కూడిన ఈ దృశ్యమునందు బ్రహ్మము కంటే వేరైనది అణుమాత్రం కూడా లేదు. ఉండ జాలదు. ఏదైనా బ్రహ్మము కంటే వేరుగా నవరసాల రూపంలో కనిపిస్తుంటే, అది సత్యము కాదు. కాబట్టి ఇక ఇచ్ఛతో పనేమున్నది?
Page:725
ఇచ్ఛ కూడా బ్రహ్మమేనా? -
శ్రీరాముడు :
ఏవం చేత్ తత్ ఉదేత్ ఇచ్చా మావోదేతు, మునీశ్వర! సా తు బ్రహ్మైవ కో2 ర్థః స్యాదస్యా విధి-నిషేధనే?
హే మునీశ్వరా! మీరు ఇంత వరకు 'ఇచ్ఛయే సంబంధం. ఇచ్చా రాహిత్యమే ముక్తి' అనే భావమును ఆయా కోణాలనుండి నిరూపిస్తూ వస్తున్నారు కదా! 'మట్టి బొమ్మలన్నీ మట్టియే అయినట్లు, సర్వము బ్రహ్మమే' అని ఇప్పుడు సిద్ధాంతీకరించారు. అంతయూ బ్రహ్మరూపమే అయినప్పుడు ‘ఇచ్ఛ’ అనేది కూడా బ్రహ్మమే కదా! అప్పుడిక ఇచ్ఛ ఉదయించినా, ఉదయించకున్నా కూడా ఒక్కటే కదా! ఇచ్ఛ ఉదయిస్తే మాత్రం హాని ఏమున్నది? ఇకప్పుడు 'ఇచ్ఛను త్యజించడం - ఇచ్ఛారాహిత్యాన్ని ఆశ్రయించడం'... అనే రూపంతో కూడిన విధి-నిషేధములతో పని ఏమున్నది? వాటి వల్ల క్రొత్తగా కలిగే ప్రయోజనమేముంటుంది? మరి, శాస్త్రములు గాని గురువులు గాని, మహనీయులగు తమవంటివారు గాని విధి-నిషేధములు చెప్పవలసిన అవసరమేమున్నది? శ్రీవసిష్ఠ మహర్షి : ఆత్మజ్ఞానం ఉదయించిన తర్వాత “ఇచ్ఛ కూడా బ్రహ్మమే! బ్రహ్మమునకు అన్యంగా ఏదీ లేదు” అని నీవు చెప్పే విషయం నగ్న సత్యమే! అందులో అనుమానానికి తావులేదు. అయితే... ఇక్కడ ఒక్క విషయం నీవు గమనించెదవుగాక! ఎప్పుడైతే “ఇదంతా మట్టియే” అని గ్రహించబడుతోందో అప్పుడు ఇచ్ఛ కూడా స్వభావసిద్ధంగా శమిస్తుంది. ఎందుకంటే 'ఇచ్ఛ శమించటం’ అనేది ఆత్మజ్ఞానము యొక్క స్వభావము అయి ఉన్నది. సూర్యుడు ఉదయించగానే చీకటి తొలగటం ఎంతగా స్వభావసిద్ధమో, అంతగా ఆత్మజ్ఞానం ఉదయించగానే ఇచ్ఛ మొదలైనవి అత్యంతస్వాభావికంగా శ్రమిస్తాయి. ఎంతెంతగా జ్ఞానం ఉదయిస్తూ ఉంటుందో అంతంతగా ద్వైతశాంతి, వాసనా విలయము కూడా కలుగుతూ ఉంటాయి. అప్పుడిక ఇచ్ఛ క్రమంగా ఉదయించటమేలేకుండా పోతూ ఉంటుంది. ఎవనికైతే సమస్త దృశ్య పదార్థములందు వైరాగ్యము కలుగుతూ ఉండగా ఇక ఇచ్ఛ ఉదయింపకయే ఉంటుందో... అతనిపట్ల సంసారము గురించిన అవిద్య స్వయంగా నశించి (అతని యందు) నిర్మలమగు ముక్తి ఉదయిస్తూ ఉంటుంది.
అట్టి ఇచ్చా రహితునికి ఈ దృశ్య పదార్థాలను చూస్తూ ఉన్నప్పుడు అటు రాగం గాని, ఇటు ద్వేషంగాని ఉండదు. కేవలం స్వభావసిద్ధంగానే ఈ కనబడే దృశ్య విషయాల పట్ల రుచి కలుగదు. అట్టి జ్ఞాని ఒకవేళ ఆకస్మిక ఘటనచే (లేక) ఇతరుల ప్రేరణచే (కాదా)... శాస్త్ర నియమానుసారంగా ఏవైనా క్రియాదులు (దానం-ధర్మం మొ॥) నిర్వర్తిస్తూ ఉండవచ్చు. లేదా, నిర్వర్తించకనూ పోవచ్చు.
ఇచ్ఛ కూడా ఈ సృష్టిలోని ఒక చమత్కార వస్తువు అని ఎప్పుడు గ్రహించబడుతుందో... అప్పుడు మాత్రమే అట్టి జ్ఞానికి "ఇచ్ఛ-అనిచ్ఛ ఈ రెండూ కూడా బ్రహ్మరూపములే!” అనే అనుభవం కరతలామలకమౌతుంది. ఈ విధంగా ఆ రెండూ వాస్తవానికి బ్రహ్మరూపములేనని అనటంలో ఏమాత్రమూ సందేహములేదు. పైగా జ్ఞానియొక్క పూర్వాభ్యాస వశంచేత అతనికి క్రొత్తగా దేనిపట్లా ‘ఇచ్ఛ, అనిచ్ఛలు’ ఉండవలసిన ఆవశ్యకతయే కనిపించదు. ఈ జీవునికి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం
Page:726
ఉదయిస్తుందో... అప్పుడు ఇచ్ఛ దానంతట అదే శమిస్తుంది. లేదా, ఇచ్ఛను శమింపజేసుకున్న వానికి ఆత్మజ్ఞానం అతిసులభంగా కరతలామలకం అవుతుంది. ఎందుచేతనంటే... చీకటి - -
వెలుగు ఒకచోట ఉండలేవు కదా!
ప్రతిషేధ విధీనాం తు తజ్ఞో న విషయః క్వచిత్ |
శాంత సర్వైషణ - ఇచ్ఛస్య కో స్య కింవక్తి, కిం కృతే?
శాస్త్రాలలో చెప్పబడిన విధినిషేధాలకు జ్ఞాని ఎన్నటికీ విషయమే కానేరడు. ఎందుకంటావా? సమస్త ఈషణలు, వాంఛలు నశించినవానికి నియమాల వల్ల క్రొత్తగా ఏది పొందవలసినదున్నది?
ఇచ్ఛ రహితం అవటమంటే ఎప్పుడైతే ఈ సర్వదృశ్య పదార్థములు నీరసములై రుచించకయే ఉంటాయో, ఇవన్నీ అతిస్వల్ప సమాచార విశేషాలుగా అనిపిస్తాయో.... అప్పుడు అతని ఇచ్ఛ ప్రసరణను త్యజించి ఉన్నట్లైతుంది. అదియే 'ముక్తి' యొక్క ఉదయం కూడా! ఎవడైతే ఆత్మజ్ఞానం చేత ద్వైత - అద్వైత రహితమగు శాంతిరూపమున నెలకొనిన స్థితి కలిగి ఉంటాడో... అట్టి వానికి ఇచ్ఛ - అనిచ్ఛాది సర్వ పదార్థములు బ్రహ్మ రూపములుగానే దర్శనమౌతాయి.
కనుక ఓ ప్రియ సభికులారా! మీరు జ్ఞానులు అయ్యెదరుగాక! ఆత్మజ్ఞానముచే ద్వైత వివర్జితులు, ద్వైత - - అద్వైత రహితులు, నిర్మల స్వభావులు, వ్యాకుల రహితులు, ప్రశాంత చిత్తులు, ఆత్మయందే స్థితి పారాయణము కలిగియున్నవారు అయ్యెదరుగాక! ఆత్మయందే స్థితి కలిగి ఉన్న జ్ఞానికి ఈ ప్రపంచంలో ఏవైనా కార్యములు నిర్వర్తించటం చేతగాని, నిర్వర్తించకుండటం చేతగాని ఏ క్రొత్త ప్రయోజనమూ ఉండదు. అంతే కాకుండా సమస్త తదితర సహజీవులపట్ల అతనికి తన ప్రయోజన నిమిత్తమై ఆశ్రయించవలసిన పదార్థమేదీ కనబడదు.
నానిచ్చయా నేచ్ఛయాథ న సతా నాసతా సదా |
నైవాత్మనా న చ అన్యేన నైతైర్ మరణజీవితైః ||
అట్టి జ్ఞానికి ఇచ్ఛచేగాని, అనిచ్ఛచేగాని, సత్తుచేగాని, అసత్తుచేగాని, ఆత్మచేగాని, లేక మరింక దేనిచే గాని, జీవితంచే గాని, మరణంచే గాని ఎప్పుడునూ ఏ ప్రయోజనమూ అగుపించదు. “నిర్వాణరూపుడు-ప్రబుద్ధుడు” అయిన అట్టి జ్ఞానికి ఇచ్ఛయే ఉదయించదు. ఒకవేళ ఎప్పుడైనా ఉదయించినా అది కూడా అతనికి బ్రహ్మముగానే అనుభవమౌతుంది.
20. ప్రబుద్ధుడు - అప్రబుద్ధుడు
శ్రీవసిష్ఠ మహర్షి :
న దుఃఖమస్తి న సుఖం, శాస్త్రం-శివమ్ అజమ్ జగత్ |
ఇతి యోనః శిలేవ అస్తే తం 'ప్రబుద్ధం' విదుర్ బుధాః ॥
ఓ రామచంద్రా! “సుఖముగాని, దుఃఖముగాని లేదు. ఈ జగత్తు శాంతము-శివమయము అయి ఉన్నది”... అని ఎవడైతే తన అంతఃకరణంలో నిశ్చయం కలిగి ఉంటాడో, శిల యొక్క
Page:727
అంతరము వలె నిశ్చలముగా ఉంటాడో... అట్టివాడే "ప్రబుద్ధుడు”... అని పండితులు మనకు చెప్పుచున్నారు.
దుఃఖం సుఖం భావనయా కుర్వన్ విషమివామృతమ్ | ఇతి నిశ్చత్య ధీరాత్మా ‘ప్రబుద్ధ' ఇతి కథ్యతే ॥
"ఆత్మతత్త్వము ఇట్టిది కదా” అని నిశ్చయించుకొన్నవాడై ఎవడైతే విషయమును అమృతంగా మార్చినట్లు దుఃఖమును కూడా నిరతిశయానందాత్మ భావనచే సుఖమయంగా ఒనర్చి వేస్తాడో అట్టి ధీరచిత్తుడే ప్రబుద్ధుడు.
ప్రబుద్ధుని జ్ఞాన స్థితి - అట్టి జ్ఞానస్థితియందు ఉన్న వానికి... శాంతం చిదాకాశరూపంశివం-దృశ్యరహితం-సద్వస్తువు అయిన బ్రహ్మం నందు; శాంతం- చిదాకాశరూపం-శివం-దృశ్యాది రహితం సద్వస్తువు అయిన జగత్తు ...నెలకొని ఉన్నట్లు, స్థితికలిగి ఉన్నట్లు అత్యంత స్వభావసిద్ధంగా అనుభూతమౌతుంది. ఈ జగత్తు భేదయుక్తమై అనిపించటమే భ్రమ, బంధం, అనుబంధం కూడా!
ఇది భేదరహితం, స్వయంగా నిర్విషయం అని అనిపించటమే జ్ఞానం యొక్క పరాకాష్ఠ! ఈ జగత్తు బ్రహ్మమయమై బ్రహ్మం నందే సదా సర్వదా స్థితి కలిగి ఉన్నది. కనుక బ్రహ్మమునకు వేరుగా ‘జగత్తు’ అనబడేది ఎక్కడా లేదు. జగత్తుగా కనిపించేది, అనిపించేది వ్యాపక బ్రహ్మము తప్పితే మరింకేమీ కాదు. బ్రహ్మము తప్పితే మరింకెక్కడా ఏదీ లేదు.
శ్రీరాముడు : మరి ఈ 'అహంకారము' అనుదాని రూపము?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! మరల రెండు వాక్యములు పునరుద్ఘాటిస్తున్నాను.
1. ఈ జగత్తు బ్రహ్మమయమైయున్నది. ఇక్కడ కనబడే అహంకారాదులతో, ఇచ్ఛాదులతో
సహా సర్వము బ్రహ్మమే!
2. బహ్మం విషయవర్జితం-చిదాకాశం-సర్వవ్యాపకం-సౌమ్యం-సమం-శివం అయి ఉంది. అట్టి బ్రహ్మమునందు అహంకారాదులకు తావెక్కడిది? “అంతయు బ్రహ్మమే" అనునది సుగ్రాహ్యమై అనుభవైకవేద్యమగుచుండగా అహంకారాదుల భ్రమ తనంతటతానే తొలగిపోతోంది. దృశ్యజగత్తు ఒకానొక మనోవ్యాపకం మాత్రమే!
శ్రీరాముడు : మరి ఈ ఎదురుగా కనిపించే స్థావరజంగమాత్మకమగు జగత్తు?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ సూక్ష్మార్థ గ్రాహీ! రామచంద్రా! ఈ స్థావర - - జంగమాత్మక జగత్తు మనోరాజ్యనగరము వంటిదే సుమా! ఊహలో ఒక నగరం కళ్ళు మూసుకొని చూడటం ఎటువంటిదో కళ్ళు తెరచినపుడు కనిపించే స్థావరజంగమాత్మక జగత్తు అటువంటిదే! వాస్తవానికి ఈ జగత్తు శాంతమగు చిదాకాశమే అయి ఉన్నది.
శ్రీరాముడు : "ఈ జగత్తుగా కనిపించేది భ్రమయే! రసవత్తరమగు నాటక ప్రదర్శనమే!" అను ఎఱుక (లేక) జ్ఞానమును సిద్ధించుకొన్న జ్ఞానికి ఈ జగత్తునందు సంచారం, తదితరులతో సహ
Page:728
జీవనం - ఇవన్నీ ఎట్లా (ఏ రూపంగా - అనిపిస్తున్నాయి? అట్టి ప్రబుద్ధుడు తదితర అప్రబుద్ధులతో సహజీవనం చేస్తున్నప్పుడు ఏవైనా గుర్తింపతగిన విశేష లక్షణములు కలిగి ఉంటాడా? శ్రీవసిష్ఠ మహర్షి : ఒకాయన గొప్ప స్వప్నంలో ఉన్నాడనుకో! అతని స్వప్నదర్శనంలో నీ యొక్క రాక-పోకలు నీకు సంబంధం లేకుండానే ఎట్లా సిద్ధిస్తున్నాయో, ఆ విధంగా ఈ జగద్రూపమగు భ్రమయందు తత్త్వజ్ఞుని రాకపోకలు కూడా ఉంటున్నాయి. అతడు అంతా యథాతథంగా (అప్రబుద్ధులవలెనే) పొందుతూ కూడా ఇదంతాకూడా అన్యమనస్కంగా దర్శిస్తూ ఉంటాడు. అన్యమనస్కం -
పరచిన్తా పురోమధ్యై గత విఘ్నం గమ-ఆగమౌ |
యథాన్తస్తవ శూన్యత్వాత్ తథైవ అస్మిన్ జగత్ప్రభ్రమే ॥
ఎవరో ఒకాయన యొక్క మనోరాజ్యం (ఊహారాజ్యం)లో కల్పితమైన నగర మధ్యంలో నీ యొక్క రాక పోకల వలె ఈ జగద్రూపభ్రమయందు ఈ జీవుల రాక పోకలు సిద్ధిస్తున్నాయి సుమా! తత్త్వజ్ఞులు ఈ చమత్కార వ్యవహారం అట్లే గమనిస్తున్నారు. ఇక ఈ ఎదురుగా కనబడే సముద్ర-పృథ్వీ-నది-పర్వతాదులతో కూడిన సృష్టి గురించి అడుగుతావా? బాగా దాహం వేస్తూ ఉన్నవాని కళ్ళకు జల రహిత ఎడారి ప్రదేశంలోని వాయు సంబంధమైన నీడ తరంగాలే జల తరంగాలుగా కనిపించి అతనిని పరుగులు తీయించినట్లుగా... ద్రష్ట యొక్క అంతఃకరణమే ఆయా సముద్రము మొదలైన రూపములుగా విజృంభిస్తోందని జ్ఞానుల నిర్వచనం. స్వప్న నగరంలో అంతా మిథ్యయే అయినట్లు, బాలునికి భూతాలు కనిపించటం భ్రమ మాత్రమే అయినట్లు ఈ జగత్తునందు అసత్యత్వమే తప్ప మరింకేమీ లేదు. సత్యమగు బ్రహ్మమే అసత్యమగు జగత్అహంకారముల రూపమున భాసిస్తోంది. ఏదైతే భ్రాంతికి లభించకయే సర్వదా స్ఫురిస్తోందో అయ్యది మాత్రమే ‘వాస్తవమగు సత్యము' అయి ఉన్నది. ఈ జగత్తు సత్తు కాదు. పోనీ అసత్తా? ఊహూ! అసత్తూ కాదు. సత్-అసత్మయము కూడా కాదు. ఇదంతా కూడా ఇంద్రియములచే నిశ్చయించబడజాలని తత్త్వమై ఉన్నది. ఇది అనిర్వచనీయమై ఆకాశంలో గంధర్వనగరంలాగా భావనచే స్వకల్పితమాత్రమై భాసిస్తోంది.
ఓ రామచంద్రా! తత్త్వ బోధ యొక్క బలం చేత జ్ఞాని పట్ల సర్వ విషయములు శమిస్తున్నాయి. ఇక అతని ఇచ్ఛ-అనిచ్ఛలు సమత్వమును పొందుచున్నాయి. విక్షేపరహితమై జీవన్ముక్త సుఖము కొరకై, శ్రేయము కొరకై 'అనిచ్ఛయే' పరమ ఫలదాయకమగుచున్నది.
శ్రీరాముడు : నిర్వికారమగు ఆత్మయందు సవికారమగు అహంకారము - - జగత్తు అనబడేవి
ఎందుకు స్పురిస్తున్నాయి.
శ్రీవసిష్ఠ మహర్షి : నిర్వికారమగు ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి ద్రవం (జలం), ద్రవం నుండి ఘనం (భూమి) అనే క్రమాల వలెనే నిర్వికారమగు ఆత్మ నుండి సవికారమగు అహంకారము-జగత్తు మొదలైనవన్నీ ప్రభవిస్తున్నాయి. అవి మొట్టమొదట ఆత్మయందు జ్ఞప్తి రూపంలోనే, నిశ్చల వాయువునందు చంచల వాయు తరంగత్వము వలె ఉండి
Page:729
ఎప్పుడో ప్రదర్శితమౌతున్నాయి. నిశ్చల వాయువునందు చంచల వాయు తరంగ ప్రదర్శనమునకు కారణము లేనట్లే... నిర్వికారమగు ఆత్మయందు జ్ఞప్తి రూపంగా స్వయంకల్పిత జగత్తు అనబడేది ప్రదర్శితమౌతున్నది. నిర్వికారమగు ఆత్మయందు ఈ చంచల అహంకార జగదాదుల ప్రదర్శనకు కారణమంటూ ఏదీ లేదు.
చైతన్యము విషయముల వైపుగా అభిముఖమై ఉండటమే చిత్తము. అదియే సంసారము. అదియే ‘ఇచ్ఛ’ కూడా. అట్టి 'ఇచ్ఛ' నుండి ముక్తి అవటమునే 'ముక్తి' అంటున్నారు. కాబట్టి అట్టి ముక్తిని ఎఱిగినవాడై ఇచ్ఛారహితుడవై, శాంతుడవై ఉండెదవు గాక!
అయితే... ఇచ్ఛ ఉండవచ్చు గాక! ఉండకపోవచ్చు గాక! సృష్టి ఉండవచ్చు. లేక ప్రళయం వస్తూనో, లేక వచ్చియే ఉండవచ్చు. ఏది ఎట్లున్నా ఆత్మజ్ఞానికి సందేహాలే ఉండవు. ఎందుకంటే ఈ జగత్తు సత్యము కాదు కాబట్టి! ఆత్మజ్ఞాన రూపకమగు చిదాకాశమునందు “ఇచ్ఛ-అనిచ్ఛసత్తు-అసత్తు-భావము-సుఖము-దుఃఖము” ఇటువంటి కల్పనలేవీ సంభవించజాలవు.
ఇచ్ఛానాం తానవం యస్య దిన - - అనుదినమాగతమ్ వివేక=శమ-తృప్తస్య తమాహుః మోక్షభాగినమ్
ఏ మనుజుడైతే వివేకము చేతను, శమము చేతను ఇచ్ఛలు రోజు రోజుకు తగ్గించుకుంటూ స్వభావ సిద్ధమగు తృప్తిని పెంపొందించుకుంటూ ఉంటాడో... అట్టివాడే 'మోక్ష భాగినుడు' అని చెప్పబడతాడు.
'ఇచ్ఛ' అనే చాకుతో హృదయమును పొడవటం జరిగినప్పుడు మాత్రమే ఆ హృదయంలో శోకము-మోహము మొదలైన వేదన పుడుతోంది. ఆ శోకము-మోహము అను వేదన తొలగాలంటే మణి-మంత్ర-ఔషధముల వలన అయ్యే పని కాదు. బ్రహ్మదేవుని సృష్టిలోని పదార్థములైనట్టి ఈ మణి-మంత్ర-ఔషధములు దేహమునకు చికిత్స చేయగలుగుతాయేమో గాని,... అతని మనస్సుకు చికిత్స చేయలేవు. ఎందుకంటే మనిషి యొక్క దుఃఖ కారణమేమిటో, దానికి నివారణోపాయమేమిటో మేము ఎంతగానో ముందుగానే పరిశీలించి చూచాం. భ్రాంతితో కూడుకొని, మిథ్యారూపమైన ఉపాయములతో ఒకనికి ఒక విషయము పట్ల గల భ్రాంతిని తొలగించవచ్చునేమో గాని... అతని భ్రాంతి స్వభావమును తొలగించగలవా? లేదు. ఒకనియొక్క బహు యోజన విస్తారమైన మనో కల్పనలో మరొకడు ప్రవేశించగలడా? ఆ మరొకడు భ్రమచే దర్శించే స్వప్న సదృశ విషయాలను తొలగించడం మొదటివానికి కుదురుతుందా? కుదరదు. అనగా... నీ మిత్రుడు నిదురిస్తూపీడకలకంటూ దుఃఖ భాజనుడగుచుండగా జాగృత్లో ఉన్న నీవు నీ పొగడ్తల చేతనో, ధనాదులు ఇచ్చో ఆ దుఃఖము తొలగించడం కుదరనిది కదా! లేదు కదా! అందుచేతనే ప్రాపంచిక విషయాలు జీవునికి అనునిత్య శాంతిని ప్రసాదించలేకపోతున్నాయి.
అసత్పదార్థమును తీసుకొని అసత్తుగా ఏర్పడిన సంసార దుఃఖమును మొదలంటా తొలగించటం కుదేరేపని కాదు. పిల్లవాడు వస్తువుల కోసం ఏడుస్తుంటే ఏదో వస్తువు ఇచ్చి అప్పటి వరకు ఏడుపు మానిపించగలం. అంతమాత్రం చేత ఏడ్చే స్వభావం తొలగదు. ఆ వస్తువుపై అపేక్ష
Page:730
తొలగగానే మరల మరొక వస్తువు కోసం దుఃఖిస్తూనే ఉంటాడు. అట్టి దుఃఖం జీవితాంతం ఏదో రూపంలో అనేక జీవులను వెంటనంటి ఉంటూనే ఉంటోంది. 'అసత్ పదార్థములచే దుఃఖం తొలగుతుంది’ అని తలచటం 'కుందేటి కొమ్ములను తీసుకొచ్చి ఆకాశాన్ని కప్పి ఉంచాలనుకోవటం'... వంటిది.
శీతలం అధికం అయినప్పుడు జలం కొద్ది క్షణాలలో గడ్డకడుతుంది చూచావా? అట్లాగే చిదాకాశము కూడా ఈ దేహాదులపట్ల అహంభావ రూపమగు అభిమానమును పొందినప్పుడు మనస్సు ద్వారా దేహాది వ్యవహారాలను పొందుచున్నది. అయితే ఈ జడమగు దేహాదులు పొందిన ప్పటికీ చిదాకాశం యొక్క వాస్తవ తత్త్వమగు చితశక్తి అక్షయమయ్యే ఉంటోంది గాని, చితశ్శక్తి ఏదీ పోగొట్టుకోవటం లేదు. కానీ అది అద్దాని యందే అసత్యములగు ఈ దేహాదులన్నీ అనుభవిస్తోంది. అనగా, ఈ దేహాదులు స్వప్న సదృశంగా పొందుచున్నంత మాత్రం చేత చిదాకాశానికి వచ్చిపడే లోటేమీ వాస్తవానికి ఉండదు. ఆకాశం నీలంగా కనిపించినంత మాత్రంచే అక్కడ నీలిరంగుతో కూడిన ఏదైనా పదార్థం ఉన్నదా? లేదు కదా! నీలం రంగు వాస్తవానికి అసత్యమైనప్పటికీ సత్యమే అయినట్లు కనిపిస్తోంది. అట్లాగే పరమాత్మయందు ఈ సృష్టి సత్యము కాదు. అసత్యము కాదు. అందుకనే దీనిని ‘అనిర్వచనీయం' అని శాస్త్ర నిర్ణయం.
ఆకాశము-శూన్యత్వము అభేదము కదా! వాయువుకు-వాయు తరంగాలకు భేదమే మున్నది? అట్లాగే బ్రహ్మము-సృష్టులు అభేదమగు ఏక రూపములే సుమా!
నేహ సంజాయతే కించిత్ జగదాది! న నశ్యతి, స్వప్నో నిద్రాగతస్యేవ కేవలం ప్రతిభాసతే ॥
యథార్థానికి బ్రహ్మమున 'జగత్తు-అహంకారము' ఆదిగాగల పదార్థాలేవీ ఉత్పన్నం కావటం లేదు. నశించటయూ లేదు. నిద్రించేవాని స్వప్నంలోని పదార్థముల వలె అవన్నీ కేవలం 'ప్రతిభాస మాత్రములు’ అయి ఉన్నాయి. స్వప్నంలో ఏ వస్తువులు పడుతున్నాయ్? ఏవి నశిస్తున్నాయ్? ఈ జగత్ పదార్థములు అట్టివే! ఈ విధంగా ఈ పృథ్వి మొదలైనవేవీ లేనివే! సృష్టి అంతా ప్రతిభాస మాత్రమే సుమా! కేవలం చిన్మాత్రము మాత్రమే తనయందు తానే స్థితి కలిగియున్నది! ద్వైతఏకత్వమూ రెండూ ఇక్కడ అసంభవమే! అందుచేత బుద్ధి మొదలైన వాటన్నిటి యొక్క కరణత్వమంతా అసత్యమే! ఎందుకంటావా? అంతా బ్రహ్మమే అయి ఉండగా 'దీని చేత ఇది నిర్వర్తించబడుతోంది. అది అద్దానిని నిర్వర్తించటం లేదు'... మొదలైన వ్యవహారమంతా అసత్తు కాక మరింకేమిటి? ఇక్కడగాని, మరింకెక్కడైనా గాని... పరమార్థ వస్తువు ఒక్కటే సంభవం. ఇక తదితరమైనదంతా ఆ పరమార్థ సద్రూపమునే పొందినదగుచున్నది. అట్టి నిర్విషయ చైతన్యమున ఈ కల్పములు, మహా కల్పములు, వాటి క్రియాసమూహములు సహేతుకంగాను సక్రమంగాను ఉన్నట్లే ప్రతిభాసించ వచ్చుగాక! ఇవన్నీ స్వప్న సదృశము మాత్రమే! స్వప్నంలో కొద్ది క్షణముల కాలంలో సుదీర్ఘమైన సంఘటనలు, స్వమరణం వంటి అహేతుకమైన క్రమరహితములైన విశేషములు అనుభూతము
Page:731
లగునట్లు ఇదంతా చైతన్యము తనయందే తన స్వరూపమునే సృష్టి రూపంగా అనుభవం పొందుతోంది. కనుక ఈ కనబడే పృథ్వి, పర్వతాలు, ఈ కంటికి కనిపిస్తున్న గోడ మొ॥ తదితర సర్వ వస్తు సముదాయము, ఆయా వస్తువుల సంచలనము ఇవన్నీ చిదాకాశమే అయి ఉన్నాయి. స్వప్నంలో కనిపించే నది, ఆలయం, గుడిసె మొదలైనవన్నీ ఆ స్వప్నద్రష్ట యొక్క చిదాకాశ రూపమే అయినట్లు... ఈ జాగ్రత్ ద్రష్టదర్శనము కూడా జాగ్రత్ ద్రష్ట యొక్క చిదాకాశ రూపమే అయి ఉన్నది. 'చిదాకాశమనే గోడపై ‘చైతన్యము' అను రంగుచే ఈ 'జగత్తు' అనే చిత్రం అంతటా పరిపూర్ణమై వ్యాపించియున్నది. అట్టి ఈ జగత్తు భావనచేతనే అనుభవమౌతోంది, కాబట్టి... అట్టి ఈ జగత్తు ఉదయించటమూ లేదు, అస్తమించటమూ లేదు. శమించటమూ లేదు, గ్లానిని పొందటమూ లేదు. 'చైతన్యం' అను ద్రవ రూపమైన జలమునందు 'జగత్తు' జలంగానే ఉంటోంది.
1. చైతన్యము సర్వదా యథాతథంగా నిర్వికారంగా జగత్ రహితంగా ఉన్నది. 2. అయితే జగత్తుగా కనించేది ఆ నిర్విషయ చైతన్యమే!
... అనే ఉభయ వాక్యములు సమంజసమే అనిపించుకుంటున్నాయి. వాస్తవానికి చైతన్యము నందు 'జగత్తు' అనునదేదీ ఉత్పన్నమవటం లేదు, శమించటమూ లేదు. 'శాంతము-జగత్ రహితము’ అగు చైతన్యమునందు జగత్తు మొదలుగాగల ఈ ఈ విషయములు అత్యంత అసంభవమై ఉండగా, ఇక జగద్రూపముచే చైతన్యము ఉదయించిందని, జగత్ రాహిత్యముచే చైతన్యము అస్తమించిందని చెప్పటం ఎట్లా కుదురుతుంది? అది కుదిరేది కాదు.
ఎప్పుడైతే బ్రహ్మము తన యొక్క మాయచే సృష్టి రూపంగా వివర్తితం అవుచున్నదో, అప్పుడు చైతన్యం యొక్క వాసనానుసారంగా (సంకల్పముల చమత్కారంచే) పర్వతాలు ఆకాశ రూపంగాను, ఆకాశము పర్వతముల రూపంగాను అనుభవములు కాగలవు. ఇది ఇట్లా అయి ఉండగానే కొందరు యోగులైనవారు తాము సంపాదించిన యోగ శక్తి (తపోశక్తి) చేత 'చైతన్యం' అనే సిద్ధ చూర్ణం యొక్క ప్రయోగం చేత ఈ జగత్తును ఆకాశంగాను (శూన్యంగాను), శూన్యమగు ఆకాశమును ముల్లోకములుగాను అర్ధ నిమిషంలో కావించి వేయగలుగుచున్నారు. సిద్ధులచే కల్పితములైన ముల్లోక జగత్తులు ఆకాశంలో ఒకదాని నుండి మరొకటి రహస్యమై (గుప్తమై, తెలియబడనివై) ఏర్పడి ఉంటున్నాయి. మహా సముద్రంలో వేలాది తరంగాలు ఒకదానిలో మరొకటి మిళితం అయి ఉంటూనే తరంగములన్నీ కూడా వేర్వేరుగా కూడా కనిపిస్తాయి కదా! తరంగాలన్నీ వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ అవన్నీ కూడా జలము కంటే వేరుకాదు కదా? అట్లాగే మహా చైతన్యమున అనేకములైన బ్రహ్మాండములు పరస్పరం కూడి ఉన్నప్పటికీ అవన్నీ కూడా చైతన్యము కంటే ఏమాత్రం వేఱు కాదు.
శ్రీరాముడు : హే సర్వజ్ఞా! వసిష్ఠ మహర్షీ! “యోగులు ఒక సృష్టిలోంచి ఇంకొక సృష్టిలోకి ప్రవేశించగలిగే సామర్థ్యము కలిగి ఉంటారు"... అని విజ్ఞులు అంటూ ఉంటారు. వారికది ఎలా సాధ్యమగుచున్నది?
Page:732
శ్రీవసిష్ఠ మహర్షి : ఒక యోగి తన యోగ బలం చేత ఈ ఉపాధిని 'మూల ప్రకృతి’ యందు లయింపజేసి... పరస్పరం రహస్యంగా (ఒకదానిచే మరొకటి) అగ్రాహ్యంగా ఉన్నట్టి ఒక సిద్ధ లోకంలోంచి మరొక సిద్ధ లోకంలోనికి ప్రవేశించటము అనే ప్రక్రియను 'ఒక సృష్టి నుండి మరొక సృష్టిని పొందటం’... అని విజ్ఞులు చెపుతూ ఉంటారు.
ఈ జీవులందరూ ఉన్నదెందులో? - ఓ రామచంద్రా! ఆకాశమునందు శూన్యత్వము ఉంటోంది చూచావా? అట్లాగే నాశనరహితమగు పరబ్రహ్మమునందు ఈ సమస్త భూతములు (జీవులు), వాటికి భోగ్యములగుచున్న సమస్త సృష్టి సమూహములు నిర్విఘ్నంగా స్థితి కలిగి ఉంటున్నాయి. ఈ సృష్టి విభ్రమములన్నీ కూడా పరమార్థమగు చిదాకాశము యొక్క నిజ క్రీడారూపములే! ఇవన్నీ స్వాభావికములే కూడా! స్ఫటిక శిలలో కనిపించే గీతలవలె అవి వాస్తవానికి చిదాకాశమునందు ఉదయించటం లేదు. అస్తమించటం లేదు. పుష్పము సుగంధము వేర్వేరు కానప్పటికీ వేర్వేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది చూచావా? చిదాకాశము - అందలి సృష్టులు వేర్వేరు కానప్పటికీ అవి వేర్వేరుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది.
స్వసంకల్పానుసారమే ఇదంతా! - ఈ ప్రపంచమంతా కూడా స్వసంకల్పానుసారం రూపము కలిగి ఉన్నది. కనుక స్థూల సంకల్పము-స్థూల మోహము గల సామాన్య దృష్టికి ఇదంతా స్థూలంగా కనిపిస్తోంది. సూక్ష్మదృష్టి గల వారికి సూక్ష్మ రూపంగాను, సూక్ష్మతర దృష్టి గల వారికి సూక్ష్మతరం గాను, సూక్ష్మతమ దృష్టిగలవారికి సూక్ష్మతమముగాను స్థితినొంది ఉన్నదగు చున్నది. ఈ విధంగా, వారి వారి అనుభవములను అనుసరించి వారందరి కథనము సత్యమే అయి ఉన్నది. అట్టి వేర్వేరు దృష్టులు కలవారు వేర్వేరు అనుభవాలు కలిగి ఉండి వాదోపవాదములు చేసుకొంటున్నారు గూడా! ఎవరి దృష్టి ఎట్టిదో... వారి వారికి అట్టి దర్శనము ఘనీభూత సత్యంగా అనుభవమౌతోంది. విజ్ఞాన వాదులు : “అభ్యంతర విజ్ఞానం మాత్రమే సత్యము కాని, బాహ్యమున ఏదీ సత్యం కాదు.” వైశేషికులు : "బాహ్యమున గల దృశ్య వస్తువులైనట్టి ద్రవ్య-గుణ-కర్మాదులు సత్యమే! ఎదురుగా కనిపిస్తున్న వాటిని అన్యమని అనటమే మూర్ఖత్వం.”
ఓ వాదోపవాదులారా! మీ మీ సంకల్పానుసారమే ఆయా విశేషములు సత్యమనియో, కాదనియో అనిపిస్తూ అట్లే ఫలీభూతములగుచున్నాయని గుర్తించెదరు గాక! ఈ కనబడేదంతా ఆత్మ స్వరూపమే!
ఏ చైతన్యమైతే ఈ జ్ఞాతృ-జ్ఞాన-జ్ఞేయములు... అనబడే త్రిపుటిని ప్రకాశింపజేసే శక్తి కలిగియున్నదో, ఆ చైతన్యమే ఈ జగత్తు రూపంగా కూడా భాసించుచున్నది. కాబట్టి జలముద్రవత్వములులాగానే చైతన్యమునకు-జగత్తుకు భేదమేమీ లేదు.
ఓ రామచంద్రా! సర్వమునకు ఆధారమైనట్టి కాలము, ఆ కాలమునకు అంతర్గతమైయున్న బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాలలో గల 14 లోకాలు, ఆ లోకాలలో గల అహమ్-త్వమ్ (నేనునీవు) ఇత్యాది భోక్తలు, ఆ భోక్తలు ఉపకరణములై ఉంటున్న ఇంద్రియ సమూహాలు, ఆ ఇంద్రియ
Page:733
సమూహాలకు విషయాలై ఉంటున్న శబ్ద-స్పర్శాది భోగ్య విషయాలు, వాటివాటి విచిత్ర భోగాలు... ఈ సమస్తం కూడా మాయక సర్వజ్ఞ సర్వశక్త్యాదులతో కూడుకొనియున్న ఈశ్వరాత్మయే! పరమార్థమున ఏకం-శాంతం-అజం అయినట్టి చిదాకాశం మాత్రమే ఉన్నది. చిదాకాశమే చిదాకశంలో “ద్రష్ట-దర్శన దృశ్య” చమత్కారరూపంగా, జలంలో ఆకాశంలాగా ప్రతిబింబిస్తోంది.
ఇట్టి నిశ్చయము ఎవరు కలిగి ఉంటారో వారికి ఇక రాగాదులు ఏమాత్రం సంభవించవు. 'ఇచ్ఛ' మొదలైన సర్వదోషములు జయించడానికి ఇదొక్కటే ఉపాయం.
21. జగత్తే పరమాత్మ స్వరూపం
శ్రీవసిష్ఠమహర్షి : ఓ రామచంద్రా! మాంత్రికునిచే మంత్రించబడిన కాటుక కళ్ళకు పూసుకున్నప్పుడు ఆకాశంలో ఉద్యానవనాలు, సుందర స్త్రీలు అగుపిస్తారు చూచావా....? అట్లాగే చైతన్యము తన యొక్క అబ్రహ్మత్వపు భ్రమచే “నేను జీవుడను మాత్రమే కదా”!... అని తలచుచూ చమత్కారంగా విక్షేపము పొంది తత్ఫలితంగా తన స్వరూపమునందే ఈ జగత్తును దర్శిస్తోంది. ఇక్కడ ఈ జగద్దర్శనమును రెండు విశేషాలుగా వివరించుకుందాం1. బ్రహ్మమునందు 'జగత్తు' అనబడేది ఉండటం.
2. జీవుడు 'జగత్తు' (దృశ్యం) అనే దానిని తన చిత్తంలో ఊహాత్మకంగా అనుభవించటం. పరమార్థమున ఈ రెండూ ఏక స్వరూపాలే! బ్రహ్మము-జగత్తు... ఈ రెండూ కూడా సదా చిద్రూపాలే! ఈ రెండూ సర్వదా క్షోభవర్జితాలే అయి ఉన్నాయి. కాబట్టి 1. బ్రహ్మం యొక్క సృష్టి, 2. చిత్తంచే సంకల్పితమైన దృశ్యం... ఈ రెండూ కూడా సమానాలే అయి ఉన్నాయి.
ఓ రాఘవా! ఇదిగో... ఈ గోడ ఉన్నది. శిలచే నిర్మించబడిన గోడపై శిల్పిచే ఆయా విశేషాలతో లిఖించబడిన విశాల చిత్ర లేఖనం ఉన్నది. గోడపై చిత్రించబడిన చిత్రం కూడా గోడయే కదా! గోడకు వేరైనది కాదు కదా! అయితే అత్యంత చమత్కారంగా శిల్పకారునిచే నిర్మించబడిన ఈ చిత్ర కథనంలో లీనమైనవానికి గోడ దృష్టి యందు ఉండదు. గోడయందలి ఆయా స్థలవిభాగములే చిత్రకారుని కల్పనా చాతుర్యం చేత 'నది-పక్షులు-వినీలాకాశం-బాటబాటసారులు’ మొదలైన విశేషములుగా కనిపిస్తోంది. అట్లాగే...
జ్ఞానము (చిత్తు) నందు కల్పించబడిన ఈ జగద్రూప సృష్టి కూడా జ్ఞాన స్వరూపమే! అయితే ఏం? భ్రాంతి చేత ఇదంతా బాహ్యరూపంగా భాసిస్తోంది. జ్ఞానము సర్వదా సత్యమే కదా! కాబట్టి, ‘జ్ఞాన రూపమే’ అయి ఉన్న ఈ బాహ్య పదార్థరూపత్వము కూడా సత్యమే!... అని ఎఱిగెదవు గాక!
విజ్ఞానవాదులు ఈ ‘దృశ్యము సత్యమే! అసత్యం కాదు' అని అంటూ ఉంటారు కదా! అట్లాగే వేదాంతవాదులు 'ఇవన్నీ చిదాత్మ రూపాలే! చిదాత్మ ఎట్లా నిత్య సత్యమో, అట్లా ఇవన్నీ చిదాత్మ రూపంచే సత్యమే! ఆత్మ కంటే (సద్రూపం కంటే) బాహ్య ప్రపంచం వేరుగా స్థితియే కలిగి లేదు -
Page:734
అని ప్రవచిస్తున్నారు. అందుచేత 1. బాహ్య పదార్థ వాదము 2. అభ్యంతర విజ్ఞాన వాదము, 3. మేము ప్రవచించే జీవ-దృశ్య-బ్రహ్మైక్య వాదము... ఈ మూడు సమన్వయమే అగుచున్నాయి గాని పరస్పర వ్యతిరిక్తం కావటంలేదని మా అభిప్రాయం.
ఈ సమస్తము పరమాత్మయే - సమస్త పదార్థములు చిద్రూపములే! అందుచేత, క్షుబ్దముగా (కలత పెట్టబడినదిగా) కనిపించే ఆకాశ వాయు-అగ్ని-జలము-భూమి అను పంచభూతముల యందు అంతటా కూడా క్షోభరహితము-శాంతిమయము, వ్యాపకము, మహాసంరంభ యుక్తము అగు బ్రహ్మసత్తయే ప్రవేశించి ప్రకాశించుచున్నది. ఇట్లు ఆ ఉభయ సత్త (బ్రహ్మము యొక్క సత్తఈ కనిపించే జగత్తు యొక్క సత్త).... ఏకైక సత్తయే గాని వేర్వేరు సత్త కాదు. అంతటా (ఇటు జీవుడుగాను-అటు దృశ్యముగాను) ఉన్నది ఆ బ్రహ్మ సత్తయే!
తస్మై సర్వం, తతఃసర్వం, తత్సర్వం, సర్వతశ్చ తత్ |
తచ్చ సర్వమయం నిత్యం తస్మై సర్వాత్మనే నమః ॥
ఈ సమస్తము ఆ పరమాత్మ కొరకే అయి ఉన్నది. పరమాత్మ నుండే ఈ సమస్తము బహిర్గతమౌతోంది. ఈ సమస్తము పరమాత్మయే. ఇదంతా పరమాత్మచేతనే వ్యాపించబడి ఉన్నది. పరమాత్మయే సర్వమయుడై జాజ్వల్యమానంగా అంతటా ప్రకాశిస్తున్నాడు.
కుండలన్నీ మట్టే! అయితే సామాన్య దృష్టికి అనేక కుండల రకరకాల ఆకారాలే కనిపిస్తాయి. ‘ఇది కుండ! అది కూజ! ఇదేమో మూస (మూత)!... అనే అనిపిస్తుంది గాని, అన్నీ మట్టియే అయి ఉన్నాయి'... అని అనిపించదు. అయితే, ఎప్పుడైతే దృష్టి ఆకారభావనను త్యజిస్తుందో, (ఆకారమునకు పరిమితమవదో) అప్పుడు అన్ని మట్టి పాత్రలలోని మట్టి దర్శనమివ్వగలదు.
అట్లాగే, ఈ సర్వము చిన్మయమే! ఈ బాహ్యమున కనిపించే నామరూపములు ఏ నేత్ర వృత్తికి కనిపిస్తున్నాయో, ఆ నేత్ర వృత్తి 'చైతన్యముతోటి వృత్తి' అను దాని ద్వారా జయించబడినపుడు ఇదంతా 'జగత్తు-జనులు’గా కాక ఏకైక చైతన్యంగా ప్రస్ఫుటం కాగలదు. కదిలే దేహాలలోగల కదిలించే ఏకైక చైతన్యం అనుభవమవగలదు. అటు తర్వాత 'చైతన్యములే!' అని స్పష్టమవగలదు. ఈ విధంగా 'ఈ జగత్తే చైతన్యము' అను ఆత్మానుభవం సిద్ధిస్తోంది.
చూచే వానిలో - చూడబడే దానిలోను గల చైతన్యము ఏకరూపములే! అందుచేత ద్రష్టదర్శనములు సాక్షియగు చైతన్యము సర్వదా ఏకత్వం పొందుచున్నాయి. ద్రష్ట - దృశ్యము కూడా ఏకైక చైతన్య స్వరూపులే
శ్రీరాముడు : అదేమిటి మహర్షీ! 'ద్రష్ట చైతన్య స్వరూపం-దృశ్యం జడం'... అని చెప్పబడుచున్నది కదా! ద్రష్ట-దృశ్యం... ఈ రెండూ ఏక రూపాలే'... అని మీరు ప్రతిపాదిస్తు న్నట్లు నా కనిపిస్తుంది. శ్రీవసిష్ఠ మహర్షి : అవును. ద్రష్ట-దృశ్యము కూడా సాక్షియగు చైతన్యమున ఏక రూపములే. ఒకడు ఒక చెఱకు గడను చూచి భక్షిస్తున్నాడనుకో... చెఱకుగడలోని రసము జడము - అది భక్షించే జీవుడు మాత్రమే ‘చైతన్యం' అయి ఉండి ఉంటే... అప్పుడు రసానుభవమే సిద్ధించేది కాదు.
Page:735
జడమగువాడు రసానుభవం పొందలేడు. కనుక ఆ చెఱకు భక్షించేవాడు చైతన్యమే! జడమగు చెఱకు రసము ‘మధురము' అనే రూపంగా స్ఫురించజాలదు. కాబట్టి అదీ చైతన్యమే!
జలంతో జారవిడువబడిన జల బిందువు ఆ జలముతో ఏకత్వం పొందుతుంది కదా! అట్లాగే విషయం కూడా చిన్మయ రూపమే అవటం చేతనే చైతన్యంతో లీనమై ఏకరూపమగుచున్నది. కాబట్టే 'నేను ఈ రసమును అస్వాదిస్తున్నాను. ఆ రూపమును చూస్తున్నాను'... అనే అనుభవం కలుగుతోంది. చిన్మయమునందు ద్రష్ట-దృశ్యము ఏకరూపత్వం పొందకపోతే ఒక కట్టె మరొక కట్టె యొక్క అనుభవం పొందజాలనట్లు అసలు ‘అనుభవము' అనేదే ఉండేది కాదు.
శ్రీరాముడు : ఒక కట్టె-మరొక కట్టె సజాతీయమైన ఏకత్వము కలిగియే ఉన్నాయి కదా! మరి ఆ రెండూ ఒకదాని యొక్క అనుభవమును మరొకటి ఎందుకు పొందటం లేదు?
శ్రీవసిష్ఠ మహర్షి : ఆ కట్టెలు (కొయ్యముక్కలు) సజాతీయమే అయినప్పటికీ అవి భౌతికంగా మాత్రమే ఏకత్వం కలిగి ఉన్నాయి! ద్రష్టలో అనుభవం స్వీకరించు చైతన్య రూపంగాను, కట్టెలో అనుభవం ప్రసాదించు చైతన్యం - ఈ రెండూ ఒనగూడినప్పుడే 'అనుభవం' అనేది సిద్ధిస్తోంది. ఈ రెండూ ఒనగూడకపోతే అనుభవం ఉండదు. అయితే ఆ ద్రష్ట-దర్శనాలు చైతన్య రూపాలే నని ఇక్కడ నీవు గమనించవలసిన విషయం.
అయితే కాష్ఠము (కట్టె) మొదలైన దృశ్య పదార్థముల స్థితి ఏదైతే కలదో అట్టి ఆచేతన రూపమును మాత్రమే జనులు ఎఱుగుచూ ఉన్నారు. తద్విలక్షణమై సర్వత్రా వ్యాపించి ఉన్నట్టి (అటు ద్రష్టలో ఇటు దృశ్యంలో కూడా ఏకరూపంగా వ్యాపించి ఉన్నట్టి) ఏ చైతన్య రూపస్థితి కలదో... అద్దానిని గమనించలేకపోతున్నారు.
ద్రష్ట-దృశ్యం-ఈ రెండూ కూడా చైతన్య రూపాలే! అదే విధంగా జలం-వాయువు-భూమిశిలలు మొదలైన పదార్థాలన్నీ కూడా చిద్రూపాలే! అయితే వాటిలో 'స్పందం-బుద్ధి-ప్రాణంజీవం' మొదలైనవి లేవు.
ఈ ప్రాణ-బుద్ధి-జీవాదులు భావనావశం చేత (కల్పన చేత) సత్తను పొందుచున్నాయి. భావం ఎక్కడి నుండి బయల్వెడలుతోంది చెప్పు? చైతన్యము నుండే! కనుక చైతన్యం యొక్క చమత్కారమే అవన్నీ కూడా! అట్టి చమత్కారం యథేచ్ఛగా చైతన్యమునందే ఉదయిస్తోంది.
సర్వ దృశ్యముల సారం బ్రహ్మమే! - - అట్టి బ్రహ్మసత్త యగు ఆత్మ... వీర్యమునందు పురుషశక్తి గాను, వట బీజం (మఱి చెట్టు యొక్క విత్తునందు) వృక్షశక్తిగాను, జాగ్రత్స్వప్నములందు విషయానంద శక్తిగాను ప్రకటితమై ఉంటోంది.
బీజమునందు ఏ సారమైన సత్తా పదార్థము కలదో... అదియే పరమాత్మ. ఆ పరమాత్మయే అంకుర రూపంగాను, శాఖాదుల రూపంగాను విస్తరిస్తూ మరల బీజ రూపుడగుచున్నాడు. బ్రహ్మము సర్వదృశ్య వస్తువుల కంటే కూడా అత్యంత సూక్ష్మము, అంతటికీ కారణ రూపము. అందుచేత బీజాదులలో ఏ సూక్ష్మరూప కారణ సత్త కలదో... అది బ్రహ్మమే అయి ఉంటుంది. ఇక స్థూల
Page:736
రూపమైనట్టి బీజము-అంకురము-ఆకులు-కాయలు మొదలైనవి సూక్ష్మ బీజ సత్త యొక్క మాయక రూపములు. అవి మిథ్యయేనని కూడా గ్రహించవచ్చు. ఈ సిద్ధాంతమును అనుసరించి సర్వత్రా (ఈ దేహ-మనో-బుద్ధ్యాదులందంతటా) సారమైన వస్తువు బ్రహ్మమే అయి ఉన్నది.
ఒక కుండ లోపల-బయట-ఆ ప్రక్క-ఈ ప్రక్క.... అంతటా కూడా ఎటువైపు చూచినా కూడా... మట్టియే అయి ఉన్నది కదా! అట్లాగే ఈ జగత్తు యొక్క ఆమూలాగ్రం ఎవరు ఎలా పరీక్షించి చూచినప్పటికీ... ఈ సమస్తము బ్రహ్మముగానే కనిపించగలదు. బంగారు ఆభరణంలో బంగారం తప్ప మరింక ఎక్కడ మాత్రం ఏముంటుంది? ఈ జగ-జ్జీవాది సర్వము బ్రహ్మమే!
ఓ రామచంద్రా! నీ ప్రక్కనే నిదురించు నీ మిత్రుని స్వప్నంలో కనిపించే గర్జిస్తున్న మేఘ సమూహాలు నీకేమియూ కనిపించవు కదా! అట్లాగే... నాకు ఇక్కడ సృష్టి-ప్రళయాది సంరంభాలేవీ కనిపించటమే లేదు. ఆకాశంలో కనిపించే ఊహా సంబంధమైన గంధర్వసైన్యం ఆకాశం మాత్రమే కదా! అట్లాగే ఈ సమస్త జగత్తు చిదాకాశమే అయి ఉన్నది. భూమిపై పడిన ఒక చిన్న మట్టివిత్తు జలముచే తడుపబడినదై మహావృక్షంగా అంకురించి అనేకమందికి నీడను ప్రసాదిస్తోంది. అట్లాగే అంతరంగమున గల ఒకానొక సంకల్ప భ్రమయే బాహ్యమున జగద్రూప ఫలాకారంగా ఆవిర్భవి స్తోంది. ఎప్పుడైతే ఈ జీవుడు అహంభావరహితుడై నిరతిశయానంద స్వరూపమగు బ్రహ్మముతోటి ఏకత్వం పొందుతాడో... అట్టి జ్ఞాని యొక్క దృష్టిలో ఈ జగత్తులోని సర్వ వస్తువులు, యోగాభ్యాసంచే లభించగల అణిమ-గరిమ మహిమ- మొదలైన సిద్ధులు... ఇవన్నీ కూడా బాట ప్రక్కన పడి ఉన్న ఎండుగడ్డి పరకవలె అతిస్వల్ప విషయాలుగా కనిపిస్తాయి. బ్రహ్మంగా అనిపిస్తాయి.
త్రైలోక్యే తన్ న పశ్యామి సదేవ-అసుర-మానుషమ్,
ఏకే రోమాంశ విశ్వస్య యల్లోభాయ మహాత్మనః I
ఏ మహాత్ముడగు జ్ఞానికి ఈ బ్రహ్మాండమంతా ఒక కేశం యొక్క విభాగం వంటిది మాత్రమే (అతి లేశమైనది) అవుతుందో... అట్టి వానిని ప్రలోభపరచగల మానవుడు గాని, దేవతగాని, అసురుడుగాని నా కెక్కడా తారసపడలేదు. జ్ఞాని ఎక్కడకు ఏ రీతిగా వెళ్ళవలసి వచ్చినా కూడా... అక్కడ అతనికి ద్వైతరూపమైనదేదీ ఏమాత్రం కనిపించనే కనిపించదు. ఏ మహాత్ముని దృష్టియందు ఈ ప్రపంచమంతా కూడా ఆకాశం వలె శూన్యమాత్రమై ఉన్నదో... అట్టి వానికి ఈ భ్రమ మాత్రాలగు భోగాదులన్నిటిపట్ల ఇచ్ఛ ఉదయిస్తుందా? లేదు. సమస్త విషయములను మొదలంటా నిర్విషయములుగా గాంచ గల మహానీయుడు ధనాది సర్వ ఈషణలు శమించి ఉన్న వాడై... ఇక, ఇక్కడి విభవ-దారిద్ర్యములు రెండింటినీ సమదృష్టితో చూస్తూ ఉండగలుగుతాడు. అట్టి మహాత్ముని మహిమను వర్ణించటం ఎవరి వల్ల అవుతుంది?
మరణ హేతువులచే ఒకింతగా కూడా మరణించనివాడు, జీవన హేతువులచే ఒకింతగా కూడా జీవించనివాడు, బంధు మిత్రాదుల జనన మరణాలదులచే కించిత్తు కూడా హర్ష విషాదాలు పొందనివాడు, శుద్ధ జ్ఞానమయుడు, స్వ ప్రకాశరూపుడు ఆకాశం వలె నిర్మలం - సర్వ వ్యాపకం
Page:737
అయిన నిత్యానుభవి... అగు మహానీయుని మహిమాతిశయం ఊహించటానికి కూడా అలవి
అయినది కాదు సుమా!
బ్రహ్మరూపానుభవి - భ్రాంతి కలవానికి మృగతృష్ణలో నదీజల తరంగ సమూహం కనిపిస్తు న్నట్లు అజ్ఞానికి తన భ్రాంతి యొక్క ప్రభావం చేత వాస్తవానికి లేనివన్నీ ఘనీభూతమై ఉన్నట్లే అగుపిస్తోంది. మిథ్య అయినవన్నీ సత్యము వలె అనిపిస్తోంది. కాస్త బాగా పరీక్షించి చూచిన వానికి... “భ్రాంతిని పొందేవాడు లేడు. అంతటా ఏకం-కేవలం అవ్యయం అయినట్టి పరమాత్మ ప్రకాశమానుడై ఉన్నాడు”... అని సుస్పష్టంగా తెలియబడుచున్నది. భ్రాంతి యొక్క పరీక్షకుడు కూడా భ్రాంతి వలెనే వాస్తవానికి లేనిదే! ఎవడైతే శాంతుడై ఆత్మారాముడై, సర్వ దృశ్యాదులయెడల అత్యంత విరక్తుడై సంసార సముద్రమును దాటివేసినవాడై ఉంటాడో, అట్టి ఉత్త్వజ్ఞుడగు మహానీయుడు బ్రహ్మరూపానుభవి అవుతాడు. అతడు దేహ-ఇంద్రియాది రూపంచే అభాస మాత్రుడు గాను, ఆత్మపరంగా సర్వ లక్షణ-విలక్షణుడుగాను ఉంటాడు. అతని స్వానుభవం జన్మమరణాది సర్వ సంసార వ్యవహారాలకు అతీతమై, కేవలీమాత్రమై చెన్నొందుచున్నది. అతడు జగద్రహితుడై జగత్తును వీక్షించగలడు. అతని పట్ల మనస్సు యొక్క గతి అస్తమించి ఉంటుంది. అతడు ఆత్మయందే శాంతుడై బ్రహ్మరూపముతో విద్యమానుడై ఉంటాడు. అట్టి మహాత్ముడు నిశ్చల దీపంలాగా నిర్మల నిర్వాణ స్థితిని అవధరించి ఉంటాడు.
ముక్తుడు : ఎవనికైతే బుద్ధి మొదలుకొని జగత్తు వరకు సమస్త దృశ్యము నిర్విషయమై తోచుచున్నదో క్రొత్తగా లాభించవలసినదంటూ ఏదీ ఎక్కడా తోచదో, అట్టి ఆకాశం వలె ప్రశాంతు డగు మహానీయుని 'ముక్తుడు' అని వేదజ్ఞులు పిలుచుచున్నారు.
శ్రీరాముడు : మహాత్మా! అట్టి మహానీయునిపట్ల 'అహంకారము’ అనునది ఉండదు కదా? ఒకవేళ
ఉంటే ఏ రూపంగా ఉంటుంది?
అహంకారము యొక్క రూపమేమిటి? -
శ్రీవసిష్ఠ మహర్షి : అవిచారణ చేత 'అహంకారము' అనునది ఉన్నట్లుగా అనిపిస్తోంది.
‘అహమ్' అస్థి అవిచారేణ, విచారేణ అహమస్తి నో!
అభావత్ ‘అహమ్’ అర్థస్య క్వ జగత్ ? క్వ చ సంస్కృతిః?
విచారణ చేత 'అహమ్' అనబడేదే లేదు - - అని తెలియవస్తోంది సుమా! అహంభావమే లేక
పోతే... ఇక జగత్తు ఎచట? జనన-మరణ రూపకమగు సంసారమెచ్చట? వాస్తవానికి చిదాకాశమే ‘అన్యథా అనే రూపమగు బుద్ధి మొదలైన ఆకారాలుగా ఉంటోంది. చిదాకాశమే 'బుద్ధి' అను ఆకారాన్ని సంతరించుకొన్నదై రూప -ప్రకాశ-సంకల్పాది రూపమగు బాహ్యాభ్యంతర జగత్తును ఎఱుగుచున్నది.
శ్రీరాముడు : అయితే మనందరికీ కనబడుచున్న ఈ జగత్తు యొక్క రూపమేమిటి?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఎప్పుడైతే నీ మనస్సు సర్వాత్మరూపమై, అదే తరుణంలో సర్వ పదార్థరహితమై ఒప్పుతుందో... అప్పుడు ఈ సమస్త జగత్తు, ఇందులో కనిపించే సర్వ క్రియా
Page:738
వ్యవహారాలు బ్రహ్మరూపంగానే భాసించగలవు. ఇప్పుడు జగత్తుగా కనిపించేదే అప్పుడు ‘పరమాత్మ’గా అనుభూతమౌతూ ఉండగలదు.
యత్కరోషి, యదశ్నాసి, యజ్ఞుహోషి, దదాసి యత్,
యత్ తపస్యసి హంస్యేషి తత్సర్వం శివమవ్యయమ్
నీవు ఏమి చేస్తున్నప్పటికీ, ఏది తింటున్నప్పటికీ, దేనిని హోమం చేస్తున్నప్పటికీ, ఏది ఇచ్చుచున్నప్పటికీ, ఏ తపస్సు చేస్తున్నప్పటికీ, దేనిని వధిస్తున్నప్పటికీ... అదంతా కూడా వాస్తవానికి బ్రహ్మమే అయి ఉన్నది. అంతేకాదు! నేను, నీవు, ఈ దిక్కులు, ఆకాశము మొదలైన పంచభూతాలు, ఇచ్ఛ, క్రియ, కాలం, లోక అలోక పర్వతాలు, ఈ రూప-ప్రకాశ-సంకల్పాది రూపమగు బాహ్యఅభ్యంతర జగత్తు యొక్క అనుభవాలు, త్రికాలాలు, సమస్త బ్రహ్మాండాలు, జరా మరణాది దుః ఖాలు - ఇవన్నీకూడా వ్యాపకరూపమైనట్టి మహా చిదాకాశ రూపమగు బ్రహ్మమే సుమా! బ్రహ్మం తప్పించి మరింకెక్కడా ఏదీ లేదు. ఉండ జాలదు. కాబట్టి ప్రియ రాఘవా! నీవు సుఖ-దుఃఖఆవేశ చింతా రహితుడవు గాను, అభాసవర్జితుడవు గాను, (భిన్నాభిప్రాయాలు కలిగి ఉండక పోవటం), ఇచ్ఛారహితుడవు గాను, అమనస్కుడవు గాను, దృశ్యవర్జితుడవు గాను, మౌనివియు (సర్వ విశేషాల పట్ల మౌనం సముపార్జించుకున్నవాడి గాను), నిర్వాణరూపుడవు గాను అగుము. ఇక ఆపై ఏది ఎట్లో అట్లే వ్యవహరిస్తూ వెలయుము.
శ్రీరాముడు : మరి మేము ఆవశ్యం నిర్వర్తించవలసి ఉన్న ఆయా క్రియా-వ్యవహారముల పట్ల? శ్రీవసిష్ఠ మహర్షి : ఓ దశరథరామా! నీ పురుషోచితమైన క్రియలన్నీ కూడా వాసనారహితాలై 'శాస్త్రం' అను యంత్రవాహకునిచే నిర్వహించ బడుచున్నవగు గాక! అవన్నీ కల్పనావరితాలై, శాంత సమన్వి తమై ఒక కొయ్య విగ్రహాన్ని పోలి ఉండుగాక! ఈ బాహ్యంలో మాతాపితృ ఇత్యాది బంధుజనాదుల తోటి నీ యొక్క ఆయా వ్యవహారాలన్నీ అతి స్నేహయుక్తం గానూ ఉండనక్కర్లేదు. లేక, కేవలమూ స్నేహరహితం గానూ ఉండవలసిన పని లేదు. ఇతరులు 'ఇది' అని నిర్దేశించ టానికి గాని, నిర్వచించటానికి గాని కుదరనట్టి నిశ్చల స్వభావుడవై ఉండు. ప్రశాంత మనస్కుడవై ఉండు. చిత్రంలో దేదీప్యమానంగా చిత్రించబడిన దీపం వలె అతి నిశ్చలత వహించి ఉంటూనే ఈ దేహాదుల కారణంగా ప్రవాహపతితంగా సంభవించే ఆయా విధి-నిషేధాలకు, నిర్విషయ-నిర్లిప్తాలకు అతీత స్వభావుడవై నిర్వర్తించు. రామచంద్రా! వాసనారహితుడు, వర్తమాన భోగాలలో విరసత్వం కలవాడు, భావి కాల భోగాలలో ఎట్టి ఆశ-నిరాశ కోర్కెలు లేనివాడు అగు జ్ఞానికి సచ్చాస్త్రాలు ఆత్మసుఖాన్ని, విశ్రాంతిని కలుగజేస్తూ ఉంటాయి. అంతకుమించి అన్యమైన హేతువేదీ అతనికి విశేషరూపమై అగుపించదు. కాబట్టి... నిర్మల చిత్తుడగు తత్త్వజ్ఞానికి కూడా జీవిత వ్యవహారాలలో సచ్ఛాస్త్రాలు, సజ్జనులు, సజ్జనుల అభిమతానుసరణం, ఫలాభిసంధిరాహిత్యం - స్వభావ సిద్ధం గానే రుచిస్తూ ఉంటాయి. అట్లు వర్తించటయే జ్ఞానులు అసాధారణ చిహ్నమని చెప్పవచ్చు. అంతే గాని, యథేచ్చా నుసరణం (తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం) జ్ఞానుల స్వభావమే అయి ఉండుటలేదు.
Page:739
22. సర్వరూపియగు చిదాత్మ
శ్రీరాముడు : మహర్షీ! సంసారబంధం క్షయించగా విశ్రాంతి పొందిన జ్ఞాని తదితరులతో కూడి ఈ సంసారమున పాల్గొనుచున్నప్పుడు ఆతని వ్యవహార సరళి అవగాహన, అనుభవం ఎట్లా ఉంటాయి? శ్రీవసిష్ఠ మహర్షి : సంసార బంధం క్షయించినప్పుడు అట్టివాడు స్వాభావికమగు ఆత్మ సాక్షాత్కారం సంతరించుకొని ఉంటాడు. అతడు శాస్త్రానుసారంగా, లోకమర్యాదానుసారంగా వ్యవహరిస్తూనే మరొకవైపుగా సంకల్పరాహిత్యము వహించి ఉంటాడు.
శ్రీరాముడు : అనగా సంకల్పరహితుడై (సంకల్పములను వదలి) కాష్ఠ మౌనం వహించి ఉంటాడా? శ్రీవసిష్ఠ మహర్షి : ఊఁహూ! కాదు. సర్వ వ్యవహారాలకు హేతువై ఉండే సంకల్పాలను కూడా ‘స్వాత్మ’ గానే గాంచుచూ ఉండడం చేత అతడు సంకల్పం అనబడేదేదీ తన నుండి వేరుగా ఎరుగకయే ఉంటాడు. స్వస్వరూపం నుండి సంకల్పాలను వేరుగా ఎరుగటయను సంకల్పాభాస అని అంటారు. అట్టి సంకల్పాభాస (అళీకమే గాని) అసత్తేగాని, సత్తు కాదు. అద్దముపై ధూళీ కణాలను నోటితో ఊది తొలగిస్తాం చూచావా? అట్లాగే ఏదైనా కారణంచే కించిత్ అహంభావం తత్త్వజ్ఞుని యందు ఎప్పుడైనా ఆవిర్భవించినా అది జ్ఞాన స్వభావంచే తొలగించబడుతుంది. ఆ అహంకారం అద్దంపై తుడిచివేయబడిన ధూళివలె మరల అగుపించదు.
అజ్ఞానావరణం క్షయించినవాడు. సర్వ కోర్కెలు ఉపశమించినవాడు. ఆనందముచే పరిపూరితమైన ఆత్మగా సంతరించుకున్నవాడు... అగు జ్ఞాని నిరతిశయా నందరూపమగు ‘ఆత్మసత్త’ గానే శోభిస్తూ ఉంటాడు.
అతడు సర్వుల ‘సందేహాలు' అనే ధూళిని తొలగించే వాయువు వంటివాడు. నిరావరణమైనట్టి (ఆవరణలు లేనట్టి) ఆత్మ ప్రకాశంతో కూడిన బుద్ధి కలిగినవాడై ఉంటాడు. అట్టి జ్ఞాని ఎక్కడుంటే ఆ ప్రదేశము పూర్ణచంద్రోదయమైన ఆకాశం వలె ప్రకాశిస్తూ ఉంటుంది.
సంసార మోహరహితుడు... సర్వసందేహ వర్జితుడు, ఆత్మప్రకాశ స్వరూపుడు... శరత్కాల ఆకాశం వలె నిర్మలుడు. అగు తత్త్వ జ్ఞానికి - జ్ఞేయస్వరూపమగు ఆత్మకు అభేదమేనని గ్రహించు.
సంకల్పరహితుడు నిరాధారుడు. శాంతుడు అగు జ్ఞాని తన స్పర్శచే జనులను నిస్సందేహులు గాను, పాపరహితులుగాను స్వభావసిద్ధంగానే తీర్చిదిద్దగలుగుతాడు. వారందరి హృదయాలలోను బ్రహ్మలోకం నుండి వేంచేసిన 'వాయువు' వలె అకృత్రికమగు ఆహ్లాదత్వమును స్థాపింపజేయగలడు. అట్టి మహనీయులతో మరల మరల సంభాష కొనసాగించమని జనులకు నా మనవి.
అసద్రూప ఉపలంభానాం ఇయం వస్తు స్వభావతా |
యత్ సర్గ వేదనం స్వప్న, వంధ్యా పుత్రో ఉపలంభవత్ ॥
ఓ సర్వ జనులారా! స్వచ్ఛము, త్రికాల అబాధ్యము అగు నిర్మలాత్మతత్త్వమును సంపాదించు కోవటం మానివేసి ఈ నిస్సార సంసారంలో మూర్ఖుల వలె సంచరించటం ఏం ఉచితం? ఈ
Page:740
అసత్పదార్థ రూపాల ప్రాప్తి యొక్క వస్తు స్వభావం ఎటువంటిదో గమనిస్తున్నారా? ఇదంతా కల లోని స్వర్గానుభవం వంటిది! గొడ్రాలి కుమారులు ఎటు వెళ్ళారో తెలుసుకోవాలనుకోవటం వంటిది! ఇదంతా మొదలంట అవిద్యా మాత్రమైయున్నది. అట్టి ఈ స్వప్న సదృశ జగత్పదార్థముల అనుభవమునకు ప్రాకులాడటమే సంసారం యొక్క రూపం. అసత్పదార్థ ప్రాప్తియే జగత్తు యొక్క స్వభావమై ఉన్నది. అసత్యమగు ఈ సంసారమును పరికిస్తూ ఇందు సృష్టి-మోక్షములను ఎఱుగుట కొరకు ఎంత వెతికి ఏం ప్రయోజనం? ఇదంతా గొడ్రాలి కుమారులను చూడటానికి వెళ్ళటం లాగాను, స్వప్న సదృశంగాను ఉండి ఉండగా ఇక్కడ అర్థసిద్ధి ఎట్లా లభిస్తుంది? ఈ జగత్తు వాస్తవానికి అనిర్మితమైనది. భాషకు విషయమే కాదు. ఎందుకంటే 'ఇది ఇట్లు' అను స్థిరమైన భావనకు అర్హమైనదేదీ ఇక్కడ లేదు. 'ఇది దీనిపై ఆధారపడి ఉన్నది' అని చెప్పుటకు కూడా కుదరనిది. అట్టి ఈ జగత్తు బ్రహ్మరూపముచే మాత్రమే సత్యం. బ్రహ్మరూపమును అంగీకరించక పోతే ఈ జగత్తుకు గల రూపమేమిటో నాకు తెలియదు.
ఆత్మ యందు విశ్రాంతి -
శ్రీరాముడు : 'ఆత్మయందు విశ్రాంతి' అని శాస్త్రములచే చెప్పబడే వస్తు స్వభావము ఎట్టిది? శ్రీవసిష్ఠ మహర్షి : అహంభావాదులుగాని, సృష్ట్యాదులుగాని, సుఖ దుఃఖాదులుగాని పొందక పోవటమే 'ఆత్మయందు విశ్రాంతి' అను వస్తువు యొక్క స్వభావం అయి ఉన్నది.
శ్రీరాముడు : ఆత్మ ఎట్లు ఎక్కడ దర్శనమౌతుంది?
శ్రీవసిష్ఠ మహర్షి : ఒకవ్యక్తి ఒక చోట నిలబడి తన చూపును భూమి పైనుండి మరల్చి లక్షలాది మైళ్ళ దూరంలో గల ఒకానొక ప్రదేశముపై నిలిపి ఉంచాడనుకో! అనగా? అతని సంవిత్తు (ప్రజ్ఞ/ ఎఱుక) భూమిని వదలి దూరమున గల మరొక ప్రదేశంపై నిలిచినట్లు కదా! అయితే, అట్లు సంవిత్తు నేత్రవృత్తి ద్వారా సమీప వస్తువును త్యజించిన తర్వాత, మరియు ఇంకనూ సుదూర స్థానమును (ఉదా: సూర్యుని) చేరకముందు మధ్య నిర్విషయరూపమై ఉంటోంది కదా! అట్టి ఆ రెండు ప్రదేశముల మధ్య ఉండే ఏ నిర్విషయ చైతన్య స్వరూపము కలదో... అదే నిరంజనమగు ఆత్మ యొక్క రూపమై ఉన్నది. (సంవిత్తు 'భూమి' అను విషయమును త్యజించిన తర్వాత... ఆకాశంలోని సుదూర స్థానమును ఇంకను చేరకముందు... మధ్యలో నిర్విషయమై ఉంటుంది కదా! ఇదియే నిర్మల సంవిత్తు లేక ఆత్మరూపం). అట్టి భూతల సూర్య స్థాన (ఆకాశ-ప్రదేశ స్థాన) ముల మధ్యగా గల చైతన్యం స్వరూపం... చలనము లేని వాయువు వంటిది. ఆకాశకోశం వలె అతి నిర్మలమైనది. విషయరహితమైనది (ఒక విషయమును త్యజించి, ఇంకనూ మరొక విషయమును స్వీరించనట్టి స్థితి కదా!) పరమశాంతమైనది. చిన్మయ రూపమైనది. చిన్మాత్రము అని చెప్పబడునది. వికసించిన లత వలె నిత్యోదితమైనది.
'అదే సమస్త జీవ సమూహం యొక్క ప్రసిద్ధమైన స్వభావం'... అని విజ్ఞులు చెప్పుచున్నారు. అట్టి శుద్ధ-అచంచలిత భావాన్ని సంతరించుకొనినట్టి వివేకి దృష్టికి ఈ సృష్టి భాసింపకయే
ఉంటోంది.
Page:741
శ్రీరాముడు : స్వామీ! ఈ జగత్తులో పాల్గొనుచున్న జీవునికి అట్టి నిర్విషయత్వము అనుభవం అవటం సుసాధ్యమేనంటారా?
శ్రీవసిష్ఠ మహర్షి : స్వప్న సమయంలో జాగ్రత్తు లేదు. సుషుప్తిలో స్వప్నం లేదు. స్వప్నంలో సుషుప్తి లేదు. జాగ్రత్తులో స్వప్న సుషుప్తులు లేవు. కానీ చైతన్యము సర్వత్రా సాక్షిరూపముచే ఆ మూడు స్థితులలోనూ ఆక్రమించుకొనియే ఉన్నది. వాస్తవానికి ఈ జీవునకు అనుభవమగుచున్న జాగ్రత్స్వప్న సుషుప్తులు భ్రమ రూపాలే నని గ్రహించు. అంతేకాదు. సృష్టి-ప్రళయాలు కూడా భ్రమ రూపాలే అయి ఉన్నాయి. యథార్థానికి ఆ స్వప్న సుషుప్తి సృష్టి- ప్రళయాలు భ్రాంతియే స్వభావంగా కలిగి ఉన్నాయి. అనగా వాస్తవానికి లేవు. మరి? సత్యం, శాంతం అయినట్టి చిద్రూపమే అంతటా పరిపూర్ణమై ఉన్నది. మనం దేనిని 'భ్రాంతి' అని పిలుస్తాం? ఏదైతే అనుభవమగుచూ, పరిశీలించి చూచినప్పుడు 'మొదలే లేదు' అని తెలియవస్తుందో... అద్దానిని భ్రాంతి అంటాం. ఉదాహరణకు 'ముత్యపు చిప్పలో వెండి కనిపిస్తోంది' అని ఒకనికి అనిపించవచ్చు. అతడు పరిశీల నకు ఉపక్రమించి అసలు విషయం గ్రహించినప్పుడు ముత్యపుచిప్ప ఇతఃపూర్వంలా కనిపిస్తున్న ప్పటికీ 'అందులో వెండి ఉండజాలదు. అది వెండి వంటి రంగు కలిగి ఉన్నది' అని గ్రహిస్తాడు కదా! తన యొక్క ఇతఃపూర్వపు దర్శనం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు 'అది ఆ సమయం లోని నా భ్రాంతి'... అని అంటున్నట్లే ఈ జాగ్రత్-స్వప్న సుషుప్తి-సృష్టి-ప్రళయములు కూడా! ఆత్మ వీటిచే ఆవరించబడినట్లు అనిపించినప్పటికీ, జ్ఞాన దర్శనముచే ఆత్మ వీటన్నిటికంటే విలక్షణమై, వీటికి ఆధారరూపమై, వీటిచే స్పర్శించబడనిదై ఉన్నదని గమనించబడుగాక!
భ్రాంతి అనగా అసత్యరూపం అని అర్థం. ఎందుకంటే, విచారణ చేసి చూస్తే ఏది లభించదో, అద్దానిని ‘భ్రాంతి’ అని పిలుస్తున్నాం. కాబట్టి పరమార్థమున 'భ్రాంతి' అనగా ‘వాస్తవానికి పొంద బడనిది. లభించనిది'... అని కూడా గ్రహించు. భ్రాంతికి అన్యంగా ఉన్నది జ్ఞానరూపమే అవుతుంది. తెలియబడేది అనుదానికి వెనుకగా 'తెలుసుకునేది' ఉన్నది కదా! తెలియబడేదంతా అట్టి కేవల-అనునిత్యసాక్షి రూపమగు 'ప్రజ్ఞ' కంటే వేరు కాదు. కాబట్టి సాక్షియగు 'చిద్రూపము’ కంటే అన్యమైనట్టి సత్య వస్తువు ఎక్కడా లేనే లేదు.
ఓ రామచంద్రా! సర్వదా 'ఏకము' అయినట్టి చిత్స్వభావము అట్లు ఏకమే అయినప్పటికీ, ఈ వివిధ రూపములుగా భాసించుచున్నది. సర్వజీవుల యందును సదా పరమ ప్రేమాస్పదరూపమై స్ఫురిస్తోంది. అట్టి సాక్షియగు చిద్రూపమునే సర్వదా భావన చేస్తూ ఉండు. ఇక వ్యర్థమగు తదితర సర్వ భావనలతో పని ఏముంది? వాటినన్నిటినీ వదలివేసి ఉండు. ఎందుకంటావా?
అస్వభావే మహద్దుఃఖం, స్వభావే కేవలం శమః |
ఇతి బుద్ధ్యా విచార్య అంతర్, యదిష్టం తత్ విధీయతాన్ ||
కైవల్యము - చిత్స్వభావం కంటే వేరుగా అనిపించేదంతా స్వకీయ కల్పన చేతనే అట్లు అనిపి స్తోందని గ్రహించు. అట్టి చిత్స్వభావానికి వేరైన కల్పనయే మహాదుఃఖం. అదియే సంసారం అనగా! అకల్పితమైనట్టి సాక్షి చిత్స్వభావమందలి స్థితియే 'కైవల్యము' అని, కేవల 'పరమశాంత స్థితి’ అని
Page:742
గ్రహించబడుతోంది. ఇట్లు 'కనబడేదంతా కూడా ఈ నేను - నీవు మొదలైన వాటన్నిటితో సహా సర్వదా ఏకమే అయి ఉన్న చిత్స్వభావమే! అస్వభావమైనదంటూ ఏదీ ఉండజాలదు' అను వాక్యార్థ సారాన్ని అంతరంగంలో బుద్ధిచే విచారణ చేయి, అటు తర్వాత నీకు ఏది ఇష్టమో దానినే గ్రహించు. శ్రీరాముడు: హే మహనీయా! వసిష్ఠ మహర్షీ! అత్యంత సూక్ష్మము, నిర్విషయము అగు చిత్స్వభావం ఈ స్థూల-మూర్త జగత్తుగా ఎందుకు రూపం పొందుతోంది?
శ్రీ వసిష్ఠ మహర్షి: సూక్ష్మమగు ఒక బీజాంతర్గత రసమే - తన రస స్వరూపం కొనసాగిస్తూనేస్థూలమగు మహావృక్షంగాను, ఆ వృక్షం యొక్క వివిధ విభాగాలు గాను అగుచున్నది కదా! అట్లాగే 'అమూర్తమగు శివరూప బ్రహ్మం నందే మూర్తివంతమగు ఈ జగత్తు కలదు' - అని వేదాల యొక్క ఉత్తమమైన కథనం అయి ఉన్నది. జలమునందు ద్రవత్వం జలమునకు అభేదమై, స్వభావయుతమై ఉన్నది. అట్లాగే ఈ రూప-సంకల్పాది బాహ్య-అభ్యంత విషయాలన్నీ కూడా పరబ్రహ్మమున చిదాకాశరూపాలే అయి ఉన్నాయి.
మూర్తివంతమైన ప్రాణి తన ఆత్మభూతాలనదగ్గ ఈ కాళ్ళు చేతులు మొదలైన అవయవాలతో ఆయా క్రియాదులు నిర్వర్తిస్తోంది కదా! అట్లాగే అకర్త- సద్రూపం అగు చిదాకాశం తన యొక్క ఆత్మ భూతాలగు పంచభూతములచే జగదుత్పత్తి మొదలైన క్రియాదులన్నీ సలుపుచున్నది. తప్పెట వాయించే వాని ఉద్దేశమును అనుసరించి, అతని అభిప్రాయానుసారమే ఆ తప్పెట యందు వివిధ శబ్దములు ఉత్పన్నములగుచున్నాయి కదా! అంతేగాని తప్పెట తనదైన అభిప్రాయంచేత శబ్దములు పలకటం లేదే! ఈ వసిష్ఠ-రామాది పేర్లచే పిలవబడే ఈ దేహాలు జడత్వం కారణంగా స్వయంగా వ్యవహారములు నిర్వర్తించలేవు. మరి? ఈ వసిష్ఠ రామాది దేహాలు, ఇందులో 'నేను' మొదలైన అభిప్రాయాలు తెలిపే శబ్దాలు... ఇవన్నీ కూడా చిదాత్మ యొక్క అధిష్ఠానత్వము చేతనే ఉనికిని పొంది ప్రవర్తిస్తున్నాయి. చిదాత్మ యొక్క అధిష్ఠానం వలననే ఈ నాలుక మొదలైన కరణాలు విశేషత్వం పొందుచున్నాయి. అనగా చిదాత్మయే ఈ నాలుక మొదలైన కరణాలన్నిటిలో ప్రవేశించి వాటిని ప్రవర్తింపజేస్తోంది. ఏదైతే సర్వదా ఏకమే అయి ఉన్నదో... అదియే అనేకంగా కనిపిస్తోంది. అయితే...
యద్భాతం ప్రేక్షయా నాస్తి, తన్నాస్త్యేవ నిరంతరమ్, జగద్రూపమరూపాత్మ, బ్రహ్మ బ్రహ్మణి సంస్థితమ్ ||
ఏదైనా కళ్ళకు కనబడుతూ, విచారణ చేసినప్పుడు 'అది లేదు' అని తెలియవస్తుందో... అట్టిది సర్వదా లేనిదే అగుచున్నది. కనుక అవిచారణ కారణంగా ఈ జగత్తు సిద్ధించవచ్చు గాక! విచారణచే ‘ఈ జగత్తు యొక్క జడత్వాంశరూపం, ఈ జగత్తు యొక్క స్వరూపంగా కనిపించేది... ఇదంతా వాస్తవానికి శూన్యమే అయి ఉన్నది. కాబట్టి బ్రహ్మం సర్వదా బ్రహ్మస్వరూపం నందే స్థితి కలిగియున్నది. ఇదియే ఈ జగత్తు యొక్క వాస్తవమగు స్థితి.
ఏ అజ్ఞానులకైతే "ఈ జగత్తు ఉన్నది కదా!" - అని అనిపిస్తూ ఉండియే ఉందో... అట్టి జగత్ స్వప్న శీలురకు తమ తమ ఆత్మయందు పరస్పరం లేకయే ఉన్నారు. (ఆకాశపుష్పం అనేది
Page:743
ఉండటమనేది అసంభవం ఎట్లాగో), సర్వదా బ్రహ్మతత్త్వ దర్శకులమగు మా యొక్క దృష్టియందు ఈ జీవుల పరస్పరత్వ వ్యవహారమంతా లేకయే ఉన్నది. మా దృష్టిలో సర్వదా అవిభాజకమగు పరమాత్మ తత్త్వమే స్వభావికంగా ఏర్పడి ఉన్నది.
వాయువు యొక్క అనేక తరంగాలు వాయువుకన్నా వేరా? కాదు కదా! అట్లాగే తమకంటే వేరు కానట్టి తమ యొక్క వ్యవహారాలతో సహా ఈ తదితర జీవులంతా నాయందు ఉండి ఉన్నారు. నేనో, వారియందు ఉండి ఉన్నాను. ఎందుకంటే నేను - ఈ తదితర సర్వజీవులు కూడా ఆకాశ కోశం వలె ప్రశాంతమైనట్టి బ్రహ్మాత్మైక్య స్వరూపులమే అయి ఉన్నాం. వారి యందలి బ్రహ్మమే నా యొక్క ప్రత్యగాత్మ. స్వప్నద్రష్టకు స్వప్నము సత్యము వలె తోచునట్లు, అజ్ఞానుల దృష్టియందు నా యొక్క ఈ వసిష్ఠ రూపమే అగుపిస్తుంది. కాని నాకో... సుషుప్తిలో ఉన్న వానికి స్వప్న పురుషులు లేనివారే అగుచున్నారు కదా! అట్లా నా దృష్టియందు 'ఈ జీవుడు-ఆ జీవుడు’ అనబడునవేవీ లేవు. వారందరు నా యొక్క ఆత్మయే స్వరూపముగా కలవారు (మమాత్మా సర్వ భూతాత్మా).
గురువు, శిష్యుడు ఏకరూపులే! -
శ్రీరాముడు : అయితే స్వామీ! మీరు గురువులై ఆత్మతత్త్వం బోధిస్తున్నారు. మీ యొక్క శిష్యులమై మేం మీరు ప్రసాదించే బోధామృతం గ్రోలుచున్నాం. ఈ వ్యవహార సిద్ధి తిరస్కారమైనది కాదుకదా! (కాదనలేం కదా?)
శ్రీ వసిష్ఠ మహర్షి : శిష్యులతో ఏ ఉపదేశాది వ్యవహారం నిర్వర్తించబడుతోందో అదంతా కూడా ‘గాలిలో గాలి వీచికలు’లాగా 'బ్రహ్మం బ్రహ్మంనందే స్థితి కలిగి ఉండటం'గా నాకు తెలియవస్తోంది. ఇక మరొకరు ఎట్లు దర్శిస్తుంటే ఏం? దాని వల్ల నాకు ప్రయోజనం గాని, సంబంధం గాని లేదు.
నేను వాస్తవానికి ఈ వసిష్ఠ దేహ భాగముచే లేను. మరి? ఒకే వాయువు అన్ని వాయు తరంగాలలోనూ ఏర్పడి ఉన్నది కదా! ఒకే జలం సర్వ తరంగాలలోనూ ఏర్పడి ఉన్నది కదా! బ్రహ్మ సత్తయే ఈ వసిష్ఠాది ఆకారములలో వ్యాపించి ఉన్నది. మీకు లభించే బోధ అంటావా? ఆ బ్రహ్మసత్తయే గురూపదేశముగా కూడా వివర్తమొందినది అగుచున్నది. ఈ వాక్కు బ్రహ్మ సత్త యొక్క వివర్త భావనచే ఉపదేశాదుల రూపమున ఆవిర్భవించినదగుచున్నది.
ఓ రామచంద్రా! ఏ ఆత్మజ్ఞానికైతే విరుద్ధములగు దుఃఖాదులు కూడా అవిరుద్ధమగు శుద్ధ సచ్చిదా నందరూపములుగా భాసిస్తాయో, అట్టివాని హృదయంలో ఇక భోగేచ్ఛ గాని, మోక్షేచ్ఛగాని స్పురించనే స్ఫురించవు.
ఆహా! ఏం ఆశ్చర్యం! తమ తమ బ్రహ్మ స్వభావం ప్రతి వారికి తమ యొక్క ఆధీనంలోనే ఉన్నది కదా! తమ ఆధీనంలోనే ఉన్నట్టి తమయొక్క 'బ్రహ్మ స్వభావమాత్రం’ నందు స్థితి కలిగి ఉన్నంత మాత్రం చేతనే ఈ జనులు బంధం నుండి విడివడి మోక్షస్థితిని సొంతం చేసుకోగలరే! అద్దానిని ఏమరచి అజ్ఞానంచే ఈ జనులు ఎన్నెన్ని బాధలు కొనితెచ్చుకుంటున్నారు! గోష్పాద జలమును చూచి’ ‘అయ్యో! ఇది సంసార సముద్రం! దీనిని దాటటమా? మా వలన అవుతుందా?’ ...అని భ్రమ ఎందుకు పొందుచున్నారో కదా! 'అసత్తే' అయినట్టి దుఃఖమునకు వాస్తవమైన
Page:744
ఉపశమన రూపమగు తన యొక్క 'బ్రహ్మ స్వభావ మాత్రమందలి స్థితి' అనే స్వగృహమును బోలిన మోక్ష స్థితి ఎవరికి వారే నిర్మించుకోవలసిన విషయం కదా! అట్టి మోక్ష సాధన విషయంలో ధనంగాని, మిత్రులు గాని, మరే విధమైన క్రియలు గాని ఉపకరించవు.
నూనెచుక్క నిర్మలమైన నీటిలో పడగానే అనేక చక్రాకారాలుగా అగుచున్నది కదా! విషయం యొక్క సంకల్పమాత్రంచే చైతన్యం అతి శీఘ్రంగా జగద్రూపంగా స్థితి కలిగిన దగుచున్నది. అయితే ఈ జగత్తు తత్ జగద్రూపంగా మిథ్య మాత్రమే! జాగ్రత్ సమయంలో మనుజుని స్వప్న వృత్తాంతమంతా ఏ విధంగా మిథ్యయో, ఆ విధంగా వర్తమాన జాగ్రత్తులో కనిపించేదంతా అనగా, అహంభావ సహితమగు ఈ జగత్సమూహమంతా తత్త్వజ్ఞానికి మిథ్యగానే తెలియవస్తోంది. అజ్ఞానికో... భవిష్యత్తులో వర్తమానము స్వప్నతుల్యంగానే అగుచున్నది.
అంతటికీ మునుముందుగానే నిత్యోదితమై సర్వదా వేంచేసి ఉన్న ‘బ్రహ్మ స్వభావమాత్ర స్థితి’ అనే అభ్యాసం గల వివేకవంతులగు యోగులకు ఈ జగజ్జాలమంతా అత్యంత సూక్ష్మమై పోతుంది. అనగా, అతి స్వల్పమైన విషయంగా కన్పట్టుచున్నది. అట్టి సమయంలో అతనికి అహంకారం గాని, జగత్తు గాని భాసించదు. శాంతమగు బ్రహ్మమే అంతటా సర్వదా శేషించి ఉన్నదగుచున్నది. ఎప్పుడెప్పుడు 'బ్రహ్మ స్వభావము' అనే సూర్యుడు ఉదయిస్తాడో... అప్పుడప్పుడు భోగరూపమైన అంధకారమంతా నశిస్తుంది. అప్పుడు 'ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో భోగాలరూపంగా కనిపించుచున్నవన్నీ కూడా అసత్యములు' అనే అనుభవం కూడా స్వయంసిద్ధమై కలుగుతుంది. ఆ విధంగా భోగరూపాలైన అంధకారం నశిస్తే... అప్పుడు 'నేను ఈ కనబడే ఇంద్రియ పరిమితుడను కాను. ఈ దేహ పరిమితుడను కాను'... అనే రూపంగా ఉండే ఇంద్రియాతీతత్వం సంతరించు కుంటాడు. క్రమంగా ‘ఈ అంతఃకరణములైన మనస్సు-బుద్ది-చిత్తము-అహంకారములచే కూడా నేను పరిమితుడను కాను. ఇవన్నీ పరిమిత వస్తువులు. నా స్వరూపమో... అపరిమితమైనది' అని సుస్పష్టంగా గ్రహిస్తాడు. ఈ విధంగా అతడు ‘బాహ్య-అభ్యంతర కరణాదిరహితుడు' అగుచున్నాడు. సర్వ అజ్ఞానములను త్యజించివేస్తున్నాడు. అట్టి అజ్ఞానరహిత స్థితిలో స్థూల దేహముల అధ్యాసము లేనివాడై ప్రకాశిస్తున్నాడు. ఇకప్పుడు అతడు దీపము నుండి బయలుదేరిన ప్రకాశము వలె తన యొక్క బ్రహ్మ ప్రకాశముచే సర్వత్రా వ్యాపించినవాడై బ్రాహ్మీభూతుడై వెలయుచున్నాడు.
23. జగద్ర్భాంతి
శ్రీరాముడు : స్వామీ! ఈ దేహ మనో బుద్ధి-బహిర్-అంతర్ ఇంద్రియములన్నీ నేను కానప్పుడు వీటన్నిటి యొక్క అసలైన రూపం ఎట్టిది?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ రూపాది బాహ్య విషయాలు, సంకల్పాది అభ్యంతర విషయాలు, బుద్ధి మొదలైన అంతరింద్రియాల అనుభవం... ఈ సమస్త వస్తువుల యొక్క వాస్తవ స్వరూపం నిర్వికారమగు చైతన్యమేనని విజ్ఞులచే సిద్ధాంతీకరించబడింది. ఎట్లా అంటే, భావం
Page:745
భావించువానిరూపమేగాని వేరుగా లేదు కదా! ఎప్పుడైతే 'అవిద్య సన్నగిల్లుతుందో అప్పుడు బ్రహ్మ స్వభావము యొక్క వ్యాప్త స్థితి గోచరిస్తుంది. అనగా "బ్రహ్మమే తనయొక్క వ్యాప్త స్వభావముచే ఈ దృశ్య-బాహ్యాభ్యంతర కరణాదులన్నీ కల్పనచే పొందుచూ తన స్వరూపాన్ని తానే అట్లు అనుభవించుచున్నది”... అని బ్రహ్మజ్ఞానంచే సుస్పష్టమౌతుంది. అప్పుడిక ఈ సృష్టి భ్రమమాత్రంగా గోచరిస్తుంది. అనగా, ఎప్పుడైతే ఆత్మస్వరూపజ్ఞానంచే బ్రహ్మ స్వభావమున (అఖండ-అప్రమేయనిత్యత్వ-సత్యత్వాది విలక్షమైన లక్షణములచే) శాంతి రూపమైన విశ్రాంతి లభిస్తుందో... అప్పుడు సుషుప్తిలో స్వప్నం అదృశ్యమగుచున్నట్లుగా - ఈ జగత్తు అనే దృశ్యం కూడా శమించిపోవుచున్నది.
రామచంద్రా! ఆ రీతిగా ఆత్మలో విశ్రాంతిని సంపాదించుకోవటమే మనుజ జన్మ సార్ధకత. అంతేగాని, ఈ దృశ్యంలో సంచరిస్తూ దేహ-మనో బుద్ధ్యాది ధర్మాలు తన స్వరూపంపై నిష్కారణంగా ఆపాదించుకుంటూ ఆశ-నిరాశల మధ్య కొట్టుమిట్టాడటం సార్థకతయే కాదు.
ఆత్మయందు విశ్రాంతి -
భోగా భవమహారోగా, బంధవో దృఢ బంధనమ్
అనర్థాయా అర్థసంపత్తిరి, ఆత్మన్ ఆత్మని శామ్యతామ్ ||
ఓ జనులారా! భోగములే ఈ సంసారఆ యొక్క మహారోగాలు. బంధువులే ఇక్కడి దృఢ బంధనాలు. ధనాన్ని ప్రోగుచేసి పెట్టుకోవటం అనర్థం కొరకే అగుచున్నది. కాబట్టి ఇవన్నీ చక్కగా పరిశీలించి గమనించి "ఆత్మయందు శాంతంగా స్థితినొంది ఉండటం”... అనేది అభ్యసించండి.
బ్రహ్మస్వరూపమునకు విరుద్ధమైన భావన చేయుటయే సృష్టి. బ్రహ్మ స్వరూపమందు స్థితి కలిగి ఉండటమే 'శివరూప బ్రహ్మము' గా చెప్పబడుతోంది. కాబట్టి ఓ రామచంద్రా! నీవు సర్వదా చిదాకాశరూపుడవై ఉండు. అంతేగాని, ఈ 'సంసారము' అనే గ్లానిని పొందనే వద్దు.
ఓ రఘురామా! నేను ఈ వసిష్ఠ రూపమందలి జీవునిగాని, దృశ్యమును గాని, జగద్భమను గాని ఎఱుగుటయే లేదు. సర్వదా శాంతరూపమగు బ్రహ్మమున, బ్రహ్మముగా, నిత్యోదిత ప్రకాశస్వరూపుడనై ఉంటున్నాను. నిర్వికారమగు బ్రహ్మముగానే ఉన్నాను. తదితరులెవరైనా 'నీవు వసిష్ఠుడవు' అని త్వమ్ బోధచే సంబోధిస్తున్నప్పుడు కూడా “ఈ 'త్వమ్’ అనునది శాంతం-సర్వంశాశ్వతం-అనంతం అగు చిదాకాశమే”... అనే నేను సర్వదా వీక్షిస్తున్నాను. శాంతం, పరం అగు చిదాకాశమే నేనని ఎఱిగియే ఈ వసిష్ఠ నామధేయ దేహ సమన్వితంగా జలంలోనే సంచరించే జల స్వరూపమాత్ర జలతరంగంగా ఈ జగత్తు అనబడే దానిలో సంచరిస్తున్నాను. నాకు అన్యమైన దంటూ జగత్తు అనబడేదేదీ మొదలంటా కూడా నాకు అగుపించటమే లేదు. ఏ తరంగానికైనా, తనకు అన్యమైనది ఏ మరొక తరంగంలో లభిస్తుంది? జలానికి వేరైన ఏ ఉనికి ఏ తరంగానికి ఉన్నది? శ్రీరాముడు : మహర్షీ! సంసార జీవులమగు మా యొక్క అనుభవం మీ వలె లేదే?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామా! నీకుగాని, నాకుగాని, మరొకరికిగాని చిదాకాశమగు బ్రహ్మమున ఈ శబ్ద-అర్థాది బాహ్య, అభ్యంతర విషయముల గూర్చిన భ్రమలన్నీ కూడా పరమార్థమున
Page:746
అసలు జనించినవే కావు. ఈ విషయం సుస్పష్టమవటానికి గాను ఒకటి రెండు దృష్టాంతాలు తీసుకొని చెప్పుతాను.
వాయు - - వాయుతరంగ దృష్టాంతం - 'వాయువు చలిస్తోంది' అంటాం. వాయువు ఏ రూపంగా చలిస్తోంది?...
శ్రీరాముడు : తరంగరూపంగా!
శ్రీవసిష్ఠ మహర్షి : వాయువులోనే వాయు తరంగం చలిస్తోంది. అంతేగాని వాయువు ఎక్కడి నుండి ఎక్కడికో చలించడం లేదు కదా! అట్లాగే ఆత్మయందే ఆత్మభూతములగు సర్వ శబ్దార్థ బాహ్యాంభ్యంతర భ్రమలు ఏర్పడి ఉంటున్నాయి. వాయు తరంగం కూడా వాయువే అయినట్లు... ఆత్మయందు భ్రమచే తోచేవన్నీ కూడా ఆత్మకంటే వేరైనవి కావు.
జలమునందు జల స్వరూపమే అయిన జల తరంగాలున్నట్లు మనోబుద్ధ్యహంకారాదులన్నీ కూడా ఆత్మయందే ఆత్మ స్వరూపమే అయినవై ఉంటున్నాయి.
స్వప్న సుషుప్త న్యాయం - సుషుప్తిలో ఉన్నవారికి స్వప్నం ఉండదు. స్వప్నంలో ఉన్నవాడు సుషుప్తిని ఎఱుగుట లేదు. అట్లాగే... బ్రహ్మ స్వరూపమునందు ఉన్న వానికి సృష్టి కనిపించడం లేదు. అనగా, (తదితరులకు) సృష్టిగా కనిపించేదంతా అతనిచే బ్రహ్మముగానే ఎఱుగబడుచున్నది. సృష్టి స్వరూపమునందు లీనమై ఉన్నవానికి బ్రహ్మము అనుభవమవటం లేదు. ఇంతకు మించి ఇక్కడ మరే విశేషమూ లేదు.
జీవన్ముక్తుడు, ప్రశాంతచిత్తుడు, ప్రబుద్ధుడు అగు జ్ఞాని బ్రహ్మ స్వరూపమును నిత్య జాగ్రత్తుగా ఎఱుగుచున్నాడు. ఇక ఈ జగత్తునో... స్వప్నము వలె గమనించుచున్నాడు. కాబట్టి అతనికి ఇక్కడ వ్యవహారాలన్నీ కూడా స్వప్నతుల్యంగానే సంభవిస్తున్నాయి. ప్రబుద్ధుడు, శుద్ధాత్ముడు అగు జ్ఞాని ఈ సమస్త జగత్తును పరమాత్మ స్వరూపంగా నిర్ద్వంద్వంగానూ, సంశయరహితంగానూ ఎఱుగుచున్నాడు. ఈ జగత్తు యొక్క సత్యరూపమును ఎఱిగి ఉండుటచే, అతడు శరత్కాల మేఘం వలె ప్రశాంతిని పొంది ఉంటున్నాడు. ఒకడు ఒక యుద్ధ సంరంభమును గురించి తనయొక్క స్మృతి యందు గాని (లేక) తన యొక్క కల్పనలో గాని ఎట్లు భావించుచున్నాడో... అట్లే జ్ఞానికి సత్-అసత్తులు (ఉండటం-ఉండకపోవటం మొదలైనవి), ఈ అహంకారాదులతో సహా జగత్ భ్రమలు భవనామాత్రములుగా భాసిస్తున్నాయి.
శ్రీరాముడు : మహర్షీ! ఈ 'జీవుడు' ఆత్మయందున్నట్టివాడా? లేక ఆత్మ జీవునియందు ఉన్నదా? శ్రీవసిష్ఠ మహర్షి :
ఆత్మన్య నాస్తి హి యా ద్రష్టా యస్యా న విద్యతే కశ్చిత్ ॥
న చ శూన్య నా శూన్యం భ్రాంతిరియం భాసతే సేతి ॥
పరమార్థ సత్యమగు ఆత్మయందు ఈ కనిపించే జగన్మాయ లేదు. ఈ 'జగత్తు యొక్క ద్రష్ట’ అయిన 'జీవుడు' అనబడేవాడు వాస్తవానికి ఎవడూ లేడు. నివాసం దృష్టిలో పెట్టుకొని "పల్లెటూరి వాడు, పట్టణం వాడు”... అని విభజన పూర్వకంగా చెప్పుకొన్నంత మాత్రంచేత దేహాదులకు ఆ
Page:747
విభజన ఉందా? ఉండదు కదా! జగత్తు యొక్క ద్రష్ట (జీవుడు) - - తదాధారమగు పరమాత్మతత్వం అట్టివే!... ఆహా! ఈ విధంగా అనిర్వచనీయమైన జగద్ర్భాంతి ఇటు శూన్యము కాక, అటు అశూన్యము కాక... శూన్యాశూన్య విలక్షణమై... అనిర్వచనీయమై భాసించుచున్నది కదా! ఏది ఏమైనా కూడా... ఆత్మ ఒక్కటే ఉన్నది. ఆత్మకంటే వేరైన జగత్తనేది, జీవుడు అనబడేది - ఇదంతా మాకేదీ అగుపించటమే లేదు.
24. వివేకముచే స్వాత్మభూతుడగు పరమాత్మారాధన
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సర్వమునకు మునుముందుగా శాంతమగు 'కూటస్థాత్మయే ఉన్నది. అద్దానియందు నిశ్చల జలంలో ఏర్పడే ఆవృత్తంలాగా ప్రప్రథమంగా చిత్తరూప సమన్విత మైన జగత్ఫురణ ఏర్పడినది. అయితే జలంలో కనిపించే ఆవృత్తము జలమునకు అభిన్నమే కదా! అట్లాగే చిత్తము అనే శబ్దం యొక్క అర్థం ఉద్దేశం అయినటువంటి జగత్ఫురణ కూడా ఆ చిదాత్మకు అభేదం. వాస్తవానికి ఆత్మ అవ్యాకృతం! అందులో సృష్టి మొదలైనవి వేరైన ఆవృత్తం అంటూ ఎక్కడా లేదు. జలంలో జలమునకు అభేదమైన జలతరంగాలు ఉత్పన్నమగుచున్నట్లు, అయినా జలం సర్వదా యథాతథంగానే ఉన్నట్లు... ఆత్మకు బాహ్య-అభ్యంతర (దృశ్యం-దేహం; మనో బుద్ధి-చిత్త-అహంకారాలు) విషయాల యొక్క అనుభవమంతా యాదృచ్ఛికంగా కలుగు తోంది. మృగతృష్ణలో జల భ్రాంతిలాగా అదంతా అనుభవానికి వస్తోంది. అయితే మృగతృష్ణ సూర్య కిరణాల-వాయు వీచికల కలయికచే ఏర్పడే నీడల వంటివే గాని, అందులో కనిపించేదంతా జల తరంగాలు కావటానికే వీలులేదని తెలియవచ్చిన తర్వాత ఎవరికైనా మృగతృష్ణా జల తరంగాల భ్రాంతి ఉంటుందా? ఉండదు. సూర్యుడస్తమించగానే మృగతృష్ణా దృశ్యం అదృశ్యమౌతోంది కదా! అట్లాగే చిత్తం అనే సూర్యుడు అస్తమించగానే జగత్ విషయాల అనుభవం కూడా అదృశ్యమౌతోంది. శ్రీరాముడు : హే మహర్షీ! ఈ జగత్తు పరమాత్మ యొక్క శరీరంలో విభాగంగా భావించవచ్చా? పరమాత్మ దేహములు అవధరించి ఈ దృశ్యమును అంగీకరించి, ఇందు ప్రవేశించుచున్నాడను సిద్ధాంతం యుక్తియుక్తమేనా? దేహ విలక్షణమైన పరమాత్మను దర్శించడమెట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : పరమాత్మయందు ఈ జగత్తు దేహములన్నిటికీ విలక్షణమై, కానీ దేహములన్నీ తానే ప్రకాశింపజేయుచున్నవాడై విస్తరించి ఉంటున్నాడు. ఎటువంటి కారణాలు అపేక్షించకుండానే వాయువు యొక్క చలనం, సూర్యుని యొక్క ప్రకాశం విస్తారాన్ని పొందుచున్నట్లే, పరమాత్మయందు ఈ జగత్తు విస్తారం పొందుతోంది. జలంలో ద్రవత్వం, ఆకాశంలో శూన్యత్వం, వాయువు నందు ప్రతిబింబత్వం స్వభావసిద్ధమై భాసిస్తున్నట్లు 'మహాచిత్' రూపమగు మహాకాశమున 'జగత్తు’ అనునది స్ఫురించుచున్నదగుచున్నది.
జలమందు -ద్రవత్వం, ఆకాశమందు -శూన్యత్వం, వాయువునందు -సంచలనత్వం, మహాచైతన్యమునందు - జగదత్వము... స్వభావ సిద్ధమై అనిర్వచనీయమై ఉంటున్నాయి.
Page:748
వాయువు తనయందు చలనమును ఎఱుగుచున్న విధంగానే చైతన్యము తనయందు ఈ జగత్తును ఎఱుగుచున్నది. కాబట్టి ఇక్కడ ద్వైత-ఏకత్వ భేదాలంటూ ఏవి సంభవించవు.
అవివేకంచే ఈ జగత్తు అనబడేది ప్రకాశశీలమై ఉంటోంది. వివేకం చేతనో, అది వినాశన శీలమై (స్వయంగా లేనేలేదను అనుభవంగా) ఒప్పుచున్నది. కానీ... ఇదంతా సదా 'కేవలంసద్రూపం' అగు బ్రహ్మం మాత్రమే అయి ఉన్నది. ఎందుకంటే, 'ఆదిమధ్యాంత రహితం-కేవల జ్ఞానమాత్రం-శుద్ధం'... అయినట్టి మహాచిన్మాత్రమునకు అన్యంగా ఎక్కడా ఏదీ ఉండజాలదు - అనేది నిర్వివాదాంశమని వివేకులు నిర్ణయించియే ఉన్నారు. అట్టి మహాచైతన్య రూపమగు అప్రమేయ తత్త్వమును... కొందరు 'పరమాత్మ' గాను, మరికొందరు 'శాంతమైనట్టి శివరూపం' గాను, ఇంకొందరు 'నిత్యమైనట్టి బ్రహ్మము' గాను, ఇంకా కొందరు 'శూన్యమాత్రం' గాను, మరికొందరు 'జ్ఞానమాత్రము' గాను, ఉపాసిస్తున్నారు. ఆ మహా చైతన్యము తనయందు జ్ఞేయత్వము (లేక ఆత్మరూపత్వము)ను అట్టేబెట్టుకొనే... తాను అనంతాత్మయగు చిద్రూపము అయి ఉండి కూడా... అయ్యది విషయరూపమును భావించుచున్నదాని వలె ఉన్నదై అజ్ఞాని చందమున అగుచున్నది. ఎవరు ఎట్లు ఉపాసిస్తున్నారో... వారికి అట్లే అనుభూతిని ప్రసాదిస్తోంది.
శూన్యం-కూటస్థం అగు ఆకాశం లేకపోతే వాయువునకు కారణం లేదు. వాయువే లేకపోతే వాయు స్పందానికి (వాయు వీచికలకు) కారణం ఉండదు. అట్లాగే, చైతన్య సత్త లేకపోతే దృశ్య సత్తకు కారణం ఉండజాలదు. దృశ్య సత్త లేకపోతే చిత్తం యొక్క చిత్తత్వం కూడా లేనిదే అగుచున్నది.
కనుక సృష్టి-సృష్టి రూప భ్రాంతులు బ్రహ్మ సత్త యొక్క ఆధీనంలోనే ఉన్నాయి. బ్రహ్మ సత్తకు అన్యమైన కారణాపేక్ష ఏదీ లేదు. ఈ విధంగా బ్రహ్మం ఈ జగత్తుకు అధిష్ఠాన రూపమై ఉంటోంది. ఈ జగత్తు అధిష్ఠాన రూపంచే నిత్యత్వమును, నిజ దృశ్య రూపముచే అనిత్యత్వమును సిద్ధింపజేసుకుంటోంది.
ఈ రూపంగా, ఈ సృష్టి అంతా కూడా భ్రాంతి మాత్రమై చెన్నొందుతోంది. అయితే ఈ సృష్టి భ్రాంతు లందు కనిపించే చిత్, జడములు యొక్కయు; ద్వైత ఏకత్వము యొక్కయు అస్థిత్వమంతా స్వతఃసద్వస్తువు అయినట్టి ఆత్మయొక్క అధీనంలోనే ఉన్నది. ఇదియే శాస్త్ర సార రహస్యం.
కూటస్థం–అద్వయం అగు మహా చిదాకాశంలో ద్వితీయం-ఏకత్వం కల్పించే మరొకరెక్కడు న్నారు? ఎవ్వరూ లేరు. ఇక ద్రష్టత్వం మొదలైనవన్నీ ఆత్మ స్వయంకృత క్రీడ వినోదరూపమైన చిద్విలాసం మాత్రమే! వాయువుకు వాయు తరంగాలకు (అద్దాని స్పందానికి) భేదమేమున్నది? అట్టి భేదం శబ్దమాత్రమే గాని, వాస్తవం కాదు కదా! అట్లాగే అనంతం-ఏకం అగు చిదాకాశానికి ఈ జగత్తుకు భేదం శబ్ద మాత్రమే గాని, వాస్తవమైనది కాదు! అంతే కాదు. 'విశ్వం వేరేవిశ్వేశ్వరుడు వేరు'... అని ఎవరికైనా ఇప్పుడు అనిపించవచ్చు గాక! జ్ఞానంచే అది అసత్యమైనది. 'ద్వైతం' అనేదే అసంభవం కాబట్టి ఈ విశ్వం చిత్స్వరూపమగు మహాచిన్మాత్రమే సుమా!
Page:749
పరమాత్మయే జగత్తు వలె భాసించుచున్నాడు. ఇక ఈ కంటికి కనిపించే ప్రపంచమంటావా? ఇదంతా దేశ-కాలములకు లోబడి ఉంటోంది. పరమాత్మ సర్వదా దేశ కాలములకంటే ప్రత్యేకము - ముఖ్యము-అతీతము అయి ఉన్నాడు.
స్వప్నమునకు ఆధారమై, స్వప్నమునకు ఆదికారణమై, స్వప్నస్వరూపమంతా తానే అయి స్వప్నము కంటే ప్రత్యేకమై స్వప్న ద్రష్ట ఉన్నట్లుగా ద్రష్ట స్వరూపుడగు పరమాత్మ జగత్నందు జగత్తుగా వేంచేసి ఉంటున్నాడు. ఈ దృశ్యమునకు ఆధారమై, ఆదికారణమై, ఇదంతా తానే అయి, దీనికంతటికీ ప్రత్యేకమై ఉన్నాడు.
కాబట్టి ఈ ప్రపంచము ప్రపంచరూపంగా సత్యం కానే కాదు. 'ప్రపంచత్వము' అనేది ఎవరికీ కూడా వాస్తవము కాదు. బంగారు ఆభరణం బంగారమునకు భిన్నమైన సత్యం కాదు కదా!
“విశ్వం సత్యమే-విశ్వేశ్వరుడు సత్యమే” అనే వాక్యం "ఆకారం సత్యమే! బంగారం సత్యం!” అను వాక్యంలాంటిది మాత్రమే! అట్లాగే పరమాత్మ కంటే భిన్నంగా విశ్వమందు సత్యత్వం లేదు. ఈ విధంగా ద్వైత-ఏకత్వాల వ్యవహారమే అసంభవమగుచున్నది. బంగారానికి సత్యత్వం బంగారు అభరణాలకు, జలానికి-జలతరంగాలకు ద్వైత ఏకత్వాల కార్యకారణాలెక్కడివి? అట్లాగే 'అహం భావం'చే కనిపించే ద్వైత - ఏకత్వముల వ్యవహారాల కార్య కారణత్వం మాత్రం పరమాత్మ యందు ఎట్లా ఉంటుంది?
శ్రీరాముడు : మరి ఈ జగత్తు అందరికీ అనుభవమౌతోంది. కదా! ఎందుకు అలా?
శ్రీవసిష్ఠ మహర్షి : ‘కల్పన' అను అజ్ఞాన జనిత చమత్కారం చేత మాత్రమే జగత్తు సత్యం వలె అనుభవమౌతోంది. బంగారపు ఆభరణానికి “నీది నాది-వారికి చెందినది”... అనే కల్పన జగత్తులో ఉంటున్నప్పటికీ... అవన్నీ బంగారం యొక్క ధర్మాలుగా ఆపాదించలేం కదా! అట్లాగే ఈ జగత్తుగా కనబడేది పరమాత్మయే అయినప్పటికీ పరమాత్మలో వాస్తవానికి జగదత్వం లేదు. జగదత్వంగా కనిపించేది కల్పన మాత్రమే! సత్ వస్తువును కల్పనతో ఆపాదించి దర్శించటమే ‘సంకల్పం’ యొక్క అర్థోత్పత్తి అంతటా నిండి ఉన్న ఆకాశం అత్యంత అభేదమైనప్పటికీ 'ఇటు సూర్యుడు ఉదయిస్తున్నాడు. కనుక ఇది తూర్పువైపు ఆకాశం. అటు పడమరవైపు ఆకాశం' అనే విశేష సంభాషణ ఉంటోంది. ఎట్లా? 'సూర్యోదయం' అను ఘటనా వ్యవహారం చేత! స్వయంగా ఆకాశమునకు తూర్పు-పడమరలు లేవు కదా! ఆకాశంలో ఆకాశరేఖ వలె బ్రహ్మము - జగత్తులకు గల భేదం కల్పిత భేదం మాత్రమే! వాస్తవానికి ఆకాశము యొక్క రూపం ఏమిటో, అదే ఆకాశ రేఖ యొక్క రూపం కదా! అట్లాగే, బ్రహ్మము యొక్క రూపం ఏమిటో, అదియే జగత్తు యొక్క రూపం కూడా అయి ఉన్నది. అది అట్లా ఉండగా, ఇక ద్వైతం ఎచ్చట? ఏకత్వం ఎచ్చట?
ఆకాశము-శూన్యత్వము అనునవి ఏకరూపములే కదా! అట్లాగే బ్రహ్మము-జగత్తు ఒకే రూపములు కలిగి ఉన్నాయి. అట్టి బ్రహ్మము ఏకము-ఆత్మ స్వరూపము-సర్వ రూపము అయి ఉన్నది. ఒకానొక శిలచే నిర్మించబడిన సైన్యమంతా ఏకైక శిలాతత్త్వమే కదా! ఇక ఆ శిలా
Page:750
నిర్మితమైన శిల్పకళాఖండంలో శత్రు సైనికులు-మిత్ర సైనికులు (శిల దృష్ట్యా) ఎక్కడున్నారు? జగత్తంతా బ్రహ్మము చేతనే నిర్మించబడి ఉండగా, ఇక ఈ జగత్తుకు 'ఇది కారణం అది కార్యం'... అనే వ్యవహారం ఎట్లా కుదురుతుంది? అట్టి వైచిత్ర్యం సంభవించ టమెట్లా? సంభవించదు. చిదాకాశమునందు రెండవ వస్తువు (జగత్తు) ఎట్లా ఉంటుంది? శిలయందు చెక్కబడిన శిల్పము శిలామయమే. అయితే శిలయందు చెక్కబడిన స్త్రీ విగ్రహమును చూచి "శిలలో ఈ స్త్రీ (స్త్రీ విగ్రహం) ఉన్నది” అనునది శబ్ద మాత్ర సంభవమేగాని... అర్థ మాత్ర సంభవం కాదు కదా! మహా చైతన్యమున ఈ సృష్టి కూడా చిత్రకాశమయమై ఉండటంచేత ఇది బ్రహ్మ రూపమే అయి ఉన్నది. శిల్పంలోని చెవులు, ముక్కు, నోరు, కాళ్లు... అన్నీ కూడా శిలయే కదా! అట్లే ఈ కనబడే 'నేను-నీవు’ మొదలైనవన్నీ బ్రహ్మ రూపమే సుమా! శిల గురించి ఎఱిగిన తర్వాత శిల్పం యొక్క ఆకారాదులు (శిల దృష్ట్యా) పరిగణలోకి రావు చూచావా? వాస్తవమగు బ్రహ్మతత్త్వము ఎఱిగిన తర్వాత ఈ జగత్తు తనంతటతానే అట్టి జ్ఞానదృష్టి యందు లయించిపోయినదగుచున్నది.
శ్రీరాముడు: ఇక్కడ రూప-సంకల్పాదులు ఉండి ఉంటున్నాయి కదా! ఇక ఇక్కడ అద్వితీయ బ్రహ్మము సులభంగా అనుభవమయ్యేది ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ బాహ్య జగత్తు రూపాదులతోను, అభ్యంతర జగత్తు సంకల్పాదులతోను ప్రాప్తిస్తున్నాయి కదా! అట్టి రూప-సంకల్పాది బాహ్య-అభ్యంతర జగత్తు అంతా కూడా భావనారూప మనస్సు యొక్క చలన మాత్రంచే జనించుచున్నది. భావనా మాత్రంచే ప్రాప్తించేదంతా ఆ భావనా త్యాగంచే తొలగుచున్నది. ప్రపంచం నుండి దృష్టిని మరలించుటచే భావనా త్యాగం సముపార్జిత మగుచున్నది. సర్వ భావాలు త్యజించబడగా, అనగా, మానసిక బాహ్య సర్వ చేష్టలు ఉపశమించగా ...అప్పుడు లభించే ఏ ‘కాష్ఠమౌనస్థితి’ స్ఫురిస్తుందో అదియే శేషబ్రహ్మం. ప్రపంచాన్ని ప్రపంచంగా కాకుండా దీనినంతా బ్రహ్మంగానే దర్శించటం అభ్యసించేవారికి దృశ్యానికి అనునిత్యంగా ఆధారభూతమై ఉన్న కాష్ఠమౌన స్వరూపమగు బ్రహ్మం అతి సులభంగా అనుభవమగుచున్నది.
ఇక “ఈ ప్రపంచం ఎదురుగా ఉండగా బ్రహ్మము అనుభవమయ్యేది ఎట్లా?”... అనే ప్రశ్నకు వద్దాం. మనకు పదార్థాలు ఎదురుగా ఉన్నాయి. కనుక అనుభవమౌతున్నాయి. అయితే,... ‘అనుభవం’ అనేది ఉండటానికి పదార్థాలు ఉండవలసిందేనా? పదార్థాలు లేకుండానే, అనుభవం ఉండటం లేదా?
శ్రీరాముడు : పదార్థ సమన్వితమైన ఈ జగత్తు ఎదురుగా ఉంటేనే ఇద్దాని అనుభవం కూడా
ఉంటుంది. లేకుంటే ఉండదు కదా?
దృశ్య వస్తువు లేకపోయినా అనుభూతులు కొనసాగగలవు!
శ్రీవసిష్ఠ మహర్షి కానీ, పదార్థములతో కూడిన ఈ జగత్తు లేకపోయినా కూడా చాలా సందర్భాలలో అనుభవాలు ఉంటున్నాయి. ఉదాహరణకు... స్వప్నంలో ఏ పదార్థాలు లేకపోయిన ప్పటికీ పదార్థాలతో కూడిన స్వప్న జగత్తు అనుభవమౌతోంది కదా! అలాగే జాగ్రత్తులో కూడా
Page:751
సమ్ముఖమున లేని పదార్థములు, వ్యక్తులు, సంఘటనలు, తత్ భావనచేత ఆ భావికునకు అనుభవరూపంగా ప్రాప్తించుచున్నాయి కూడా! ఒకానొక విరహ వేదనతో తపించే ప్రియునికి తన ప్రియురాలి రూపమే నలువైపులా అగుపించటం జరుగుతోంది కదా! కాబట్టి భావనయే అనుభవానికి ముడి పదార్థమగుచున్నది. భావన లేకపోతే ఎదురుగా ఉన్న పదార్థాలు కూడా అనుభవానికి రావు. అనగా, ప్రపంచము వైపుకు దృష్టిని మరలించుటచే తత్ ప్రపంచ దృష్టి భావన ద్వారా ఈ రూప - సంకల్పాది బాహ్య అభ్యంతర విషయరూప జగత్ భ్రమ భాసిస్తోంది. జగద్భమకు భావనయే మూలంగాని, పదార్థములు కాదు. సంఘటనలు కూడా కావు. ఈ విధంగా స్వప్నంలోను, జాగ్రత్తులోను కూడా సమ్ముఖమున ఉండి-లేని పదార్థాలు కూడా తత్ భావనచే ఉన్నట్లుగా తోచుచున్నాయి.
దీని అర్థం...? జగత్భావనను ఉపశమింపజేసి ఆత్మయందు స్వాభావికంగా శిలవలె నిశ్చలంగా ఉండటం అభ్య సించాలి. అదియే సమాధి. అదియే బ్రహ్మానుభవం. అదియే బ్రహ్మ భావన. “నా స్వస్వరూప బ్రహ్మమే ఈ తదితరుల రూపంగా భాసిస్తోంది"... అని అద్వితీయ భావనచే జగత్మ ఉపశమిస్తోంది.
అందుకు మార్గం? - అందుకు పూర్ణ వివేకమే ఉపాహారం. యథా ప్రాప్తములైన పదార్థములను అసంగబుద్ధితో స్వీకరించటమే అందుకొరకై చేసే పూజ. కాబట్టి ఓ ప్రియ శ్రోతలారా! మీరంతా చైతన్య రూపమగు-సచ్చిదానంద ఘనమైనట్టి ఆత్మ స్వభావమును అవలంబించి సర్వము పట్ల సమత్వమును అభ్యసించండి. అట్టి ఆత్మబోధ నిర్మలమైన బుద్ధికే సాధ్యం. స్వబుద్ధిచే వివేకమువైరాగ్యము అనే సాధన పుష్పాలతో ఆ సర్వాత్మకుడగు పరమేశ్వరుని పూజించాలి. అట్లు వివేకముచే పూజితుడైన పరమాత్మ తక్షణమే 'నిరతిశయానందము' అనే వరాన్ని ప్రసాదిస్తాడు.
ఓ రామచంద్రా! అట్టి పరమాత్మ యొక్క పూజను కొన్ని భౌతిక పుష్పాలతో అష్టోత్తర శతనామ పఠనములతో ఒకచోట కూర్చుని కొద్దిసేపు రుద్ర - ఉపేంద్రాదుల ఆకార కల్పనచే నిర్వర్తించటమనేది గౌణము (ప్రారంభస్థితి) అని గమనించు. ఎందుకంటే ఆ సర్వాత్మకుడు స్వాత్మ స్వరూపుడై నీ యందు నా యందు, సర్వమునందు వేంచేసి ఉండగా, అంతటా ఆక్రమించి ఉన్న వానిని ఎక్కడికి ఆహ్వానిస్తావు? అందుచేత 1. విచారణ, 2. శమం, 3. సత్సంగం, 4. సంతోషం - అనే కానుకలతో ఆయన పూజింపబడు గాక! అప్పుడా పరమేశ్వరుడు సంతోషించి 'మోక్షము' అనే ఫలాన్ని ప్రసాదిస్తాడు. సత్యావలోకనము అనే ఆత్మ దర్శనముచే మాత్రమే అతడు నిజమైన పూజితుడు అవుతాడు. తద్వారా సర్వోత్కృష్టమైన ఫలం లభించగలదు.
సత్సంగ-శమ-సంతోష పుష్పములచే ఆత్మను పూర్ణముగా పూజించువానికి అతని ఆత్మగానే వేంచేసియున్న పరమేశ్వరుడు సమస్త ఫలములను ప్రసాదించుచుండగా ఇక అన్యుని ఆశ్రయించే మూఢుడు ఎవడుంటాడు? సర్వ స్వరూపుడగు ఆత్మను పూజించువానికి శాస్త్రములు-విషము-అగ్ని మొదలైనవి కూడా విరిసిన మల్లెపూల వలె అతి కోమలములై ఉంటాయి.
Page:752
ఇక అసంపూర్ణ వివేకులగు సాధకులను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదించబడిన దేహపూజతపస్సు-దానము మొదలైన వాటితో ఆత్మ పూజను జోడించినప్పుడు మహత్తర ఫలమును, అట్లా జోడించకపోతే అల్పప్రయోజనమును ఇచ్చుచున్నాయని గమనించు. 'ఆత్మపూజ’ యొక్క సమక్షంలో అవన్నీ (అల్ప ప్రయోజనములకై ఉద్దేశించే పూజదులు) భస్మమువలె గోచరిస్తున్నాయి. వివేకముతో కూడి నిర్వర్తించబడిన దేవ పూజాదులే సఫలములగుచున్నాయి. మీరప్పుడు 'వాసనాత్యాగరూపము సత్యతత్త్వమగు ఆత్మ యొక్క విజ్ఞానము' అనే వివేకమును అంతఃకరణంలో సాధించటానికి అందరూ ఎందుకు ప్రయత్నించకూడదు? సాధనలు అందుకే మార్గంగా ఉన్నాయని గమనించబడుగాక! లజ్జాం భయం విషాద ఈర్యే సుఖం దుఃఖ జయేత్ సమమ్ |
జగదాది శరీరాది నాస్త్యేవ ఆదౌ! కుతో ద్య తత్ II
ఆత్మ జ్ఞానముచే 'దేహము యొక్క సత్త మిథ్య' అని ఎరుగాలి. అట్టి 'దేహము మిథ్య' అను ఎఱుకనే 'సమత్వము' అను అగ్నిని ప్రజ్వలింపజేయాలి. లజ్జ-భయము-విషాదము-ఈర్ష్యసుఖము-దుఃఖము మొదలైనవాటిని 'సమత్వము' అను అగ్ని ప్రజ్వలనముచే దహించి వేయాలి.
ఇది జీవుని ముఖ్య కార్యక్రమం - ఎందుకంటావా? ఈ దేహాదులు గాని, అట్టి దేహాదుల ఉనికికి కారణభూతం అయిన జగత్తు గాని, అట్టి ఈ జగత్తు మొదలైన వాటికి కారణమైన 'అవిద్య’ గాని మొదలే లేవు. మొదలే లేనప్పుడు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాయి? కాబట్టి జగత్తుగా దర్శించబడుచున్నది. మిథ్యయేనని మా అభిప్రాయం. మాకు అనుభవైకవేద్యం.
పోనీ ఈ ‘జగత్తు’ అనేది 'బ్రహ్మం' అనే కారణం యొక్క కార్యమనే అనుకుందాం! అప్పుడు కూడా ఇదంతా 'ప్రకాశమాత్రం నిర్మలం' అయినట్టి బ్రహ్మం మాత్రమే అవుతుంది. మట్టి కారణ మనుకుంటే, కుండలు కార్యమనుకుంటే, కుండలలో ఉన్నదంతా మట్టియే కదా! కుండలో మట్టికి వేరైన పదార్థ మేమున్నది? ఈ దృశ్యమంతా 'జ్ఞానము' అను దానిలోంచే అనుభవమౌతోంది.
కాబట్టి,... ఇదంతా జ్ఞాన రూపమగు బ్రహ్మము కంటే భిన్నంగా ఏమాత్రం సత్యం కానేరదు. అనగా 'దృశ్య వికల్ప ప్రతిభ చిత్ యొక్క అభాసరూపమే కాబట్టి అదే ఈ జగత్తు అట్టి చిదాభాస రూపజ్ఞానం కూడా ఆత్మతత్త్వం యొక్క విభూతియే! లేక, ఆత్మ యొక్క విన్యాసమే! ఆభరణత్వం అను ఆకారాదులు బంగారం యొక్క విభూతియే కదా! అద్దంలో కనిపించే ముఖం యొక్క శోభ అద్దంలోని విభాగమే కదా! సాక్షి చైతన్యం యొక్క యథార్థ జ్ఞానముచే 'జగత్తుగా కనిపించేది’ అనునది కూడా ఆమూలాగ్రం ఉపశమించగలదు. ఆత్మాంతర్భాగ విభాగమే కాగలదు.
కనుక ఓ సభికులారా! మీరంతా కూడా శిలా ప్రతిమ యొక్క కోశం వలె అంతఃకరణం నందు ప్రశాంతులై ఉండండి. స్వస్థచిత్తులై ఉండండి. ఈ ప్రపంచమున వ్యవహరిస్తున్నప్పుడువ్యవహరించ నప్పుడు కూడా పరమశాంత చిద్రూపమగు ఆత్మగానే ఉండండి. ఇక్కడి జ్ఞాతృజ్ఞాన-జ్ఞేయ రూపమగు త్రిపుటి కంటే అతీతులై ఉండండి. సద్రూపులై, సత్-అసత్లకు సారభూతమన దగ్గ ఆత్మస్వరూపులై ప్రకాశించండి. నిర్మలాకాశం వలె నిర్మల స్వరూపులై సర్వ సంసార భూములకు పరము అయినట్టి బ్రహ్మముననే స్థితి కలిగి ఉండండి.
Page:753
యథా స్థితం చ తిష్ఠన్తి గశ్చన్తశ్చ యథాగతమ్ | యథా ప్రాపైక కర్మాణః సంపదన్యే బుధాః పరమ్ ||
జ్ఞానులు తమ ఇచ్ఛాపూర్వకంగా ఒక చోటనే ఉన్నప్పటికీ, (లేక) అక్కడో ఇక్కడో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ, యథాప్రాప్తములైన ఆయా వ్యవహారములను ఆచరిస్తూనే... మరొకవైపు నిశ్చల పరమాత్మ యందు స్థితి కలిగియే ఉంటున్నారు. లేక సర్వ వ్యవహారములను త్యజించి శాంతమైన అంతఃకరణముతో ఏకాంత స్థలమందు లిఖితమైన చిత్ర పటంలాగా నిశ్చల సమాధిని అవధరించి ఉంటున్నారు. ఆ రెండింటిలో వారికి తేడాయే కనిపించటం లేదు. సమస్త సంకల్పములు శమించినట్టి ఆ మహాత్మునికి (లేక) ఆ ప్రబుద్ధునికి ఈ జగత్తంతా సంకల్పములోని పట్టణంలాగా, లేక స్వప్నంలో కనిపించే అరణ్యంలాగా మొదలే అస్తమించియున్న దానివలె అగుపిస్తోంది. అపరోక్ష ఆత్మజ్ఞానం -
స నేత్ర రూపానుభవం జాతి తో 2 న్థ ఇవ భ్రమైః, నిర్వాణం వర్ణయన్ అజ్ఞస్త ఆప్యతే అంతర్ న శామ్యతి ॥
ఓ రామచంద్రా! ఈ జీవుడు అజ్ఞాన దశ నుండి జ్ఞానిగా తనను తాను తీర్చిదిద్దుకోవాలి. 'ఆత్మ నిర్మలము-సత్యము-అప్రమేయము-ఆద్యంతరహితము-అఖండము'... అను శాస్త్ర వాక్యాలు వింటూ కూడా అజ్ఞాన కారణంగా కొందరు ఆత్మ వర్ణనను పరోక్ష విషయంగా భావిస్తూ వస్తున్నారు. అప్పుడేమౌతోంది? నిర్వాణము గురించి వింటున్నప్పటికీ అపరోక్ష సాక్షాత్కారం (ఆయా వర్ణలకు విషయమగుచున్నది. తమ యొక్క స్వస్వరూపమే - అను సాక్షాత్కారం లభించకయే పోతోంది. అట్టి వారికి ఎంత విన్నా కూడా వారిపట్ల సంసారం కొనసాగుతూనే పోతోందిగాని శమించటమే లేదు! ఒకడు కళ్ళు మూసుకొన్నప్పటికీ సంస్కారవశం చేత అతనికి నేత్ర రూపానుభవం కొనసాగు తూనే ఉంటుంది. చూచావా? అనగా - నేను ఏదీ చూడనే కూడదు అని ఒకడు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పటికీ సంస్కారవశం చేత అతని మనోవీథిలో ఏదో ఒకటి దృశ్యరూప సంబంధమైన అనుభవంగా కొనసాగుతూనే ఉంటుందే! అట్లాగే ఒకడు ఆత్మ యొక్క మాహాత్మ్యం గురించి ఎంత వింటున్నా కూడా... “అదంతా మహాత్ములకే సాధ్యం, నాకెప్పటికి లభిస్తుందో?” అని అనుకుంటూ సంసారాన్ని తనకుతానే కొనసాగించుకొంటున్నాడేగాని 'ఆత్మ అనగా నేనే’ కనుక నేనే! అఖండుడను. నిత్యుడను. అప్రమేయుడను. అనంతుడను'... అను ఆత్మానుభవంలో ప్రవేశించలేకపోతున్నాడు. అందుచేత ఓ సహ ఆత్మస్వరూపులారా! “శాస్త్రములు ప్రసాదించే ‘ఆత్మ జ్ఞానం' అనే ప్రవచనమంతా మీ స్వస్వరూపము గురించే" అనే అపరోక్ష జ్ఞానం నిస్సందేహపూర్వకంగా ప్రవృద్ధపరచుకోండి. ఆత్మ జ్ఞానముచే అంతఃకరణ సంతృప్తిని, శాంతిని సుస్థిరపరచుకొనెదరు గాక!
పరోక్ష ఆత్మజ్ఞాన పరిమితత్వం- అజ్ఞానులు 'అవిద్యామయం-కల్పనారూపం' అగు పరోక్ష జ్ఞాన పరిమితమైన ఉపదేశాన్ని విని అజ్ఞత్వంచే 'మేం ఈ సమాచారం విన్నాం కదా! ఇక కృతార్ధులమే'... అని తలచుచున్నారు. విన్నదంతా అపరోక్షజ్ఞానంగా రూపుదిద్దుకున్నప్పుడే 'కృతార్థత'... అని నేను గుర్తు చేస్తున్నాను. అంతేగాని మూర్ఖత్వం వహించి' 'పరోక్ష జ్ఞానంచే
Page:754
కృతార్థులమైతిమి’ అని తలచుచు పరిమిత ప్రయోజనంతో తృప్తిపడకండి. జ్ఞాని ఎదుట-ప్రశ్నఉత్తరాదుల ద్వారా అట్టి పరోక్ష-పరిమిత జ్ఞానుల అకృతార్థము క్షణాలలో వెల్లడి అవుతుంది.
కల్పనాత్మకమైన జ్ఞానము భావ- అభావ ఇచ్చ-ద్వేషాది భ్రమలచే నిమిషమాత్రంలోనే మహా దుఃఖప్రదమగుచున్నది. అందుచేత ఆత్మజ్ఞాన సంపన్నులు అట్టి కల్పనా రూపమగు ఉపాయఅపాయముల గురించి పెద్దగా వచించనే వచించరు. వారి సంవాదమంతా జీవుని యొక్క వాస్తవనిత్య-సత్యతత్త్వము వైపుగా ఉద్దేశించబడే ఉంటుంది.
కనుక ఓ రామచంద్రా! ఈ జగత్తును, ఇద్దాని భేదాభేదరూపముచే మిథ్యగానే దర్శించు. పురుగు నుండి హిరణ్యగర్భుని వరకు సమస్త విషయముల పట్ల వాసనారాహిత్యపూర్వకంగా విరక్తిని కలిగి ఉండు. ఆ విధంగా “నా అనంతము-అపరిమితము-సర్వాత్మకము అగు ఆత్మ స్వరూపము నందు ఈ దేహ జగత్తులు మొదలైనవి ఒకానొక స్వల్ప విభాగము” అను అనుభూతిచే ఆత్మయందు నెలకొని ఉండటమే 'నిర్వాణము' లేక 'మోక్షము' అని పెద్దలచే చెప్పబడుచున్నది.
కాబట్టి, నేను ఇప్పటిదాకా చెప్పిన ఉపదేశమంతా లౌకిక కథ వలె పరోక్ష రూపంగా ఎఱుగటం సరిపోదు. పరోక్ష రూపంగా ఎఱిగినంత మాత్రం చేత ఎవరూ కృతార్థులు కాలేరు. అపరోక్షంగా ఎఱగాలి. అట్టి అపరోక్ష జ్ఞానముచే పూర్ణము-నిర్మలము-అవేద్యమైనది (తెలుసుకునేదే అది కాబట్టి), భగవత్స్వరూపమైనది అగు ఈ జగత్తును సాక్షాత్తు స్వస్వరూప భావ చమత్కారముగా అనుభవించెదరు గాక! తద్ద్వారా నిర్వాణ సుఖరూప శాంతిని సర్వదా అవధరించెదరు గాక! జాత్యంధరూపానుభవాను రూపం, యదా గమైః బుద్ధమ్-అబోధ రూపమ్,
అధ స్పదీకృత్య తదన్తరే, అస్మిన్ బోధే నిపత్యానుభవో భవాభూః ॥
పైన మనం చెప్పుకున్న కారణాలచేత వేదశాస్త్ర ఉపదేశములచే బహిర్ముఖ భావన కొనసాగిస్తూ పరోక్షజ్ఞానానికి పరిమితం కాకూడదు. వేదశాస్త్ర ఉపదేశముల ఉద్దేశాన్ని పరిమిత బుద్ధితో స్వీకరించటం సరికాదు. అదంతా జన్మాంధుని రూపానుభవ సదృశం. అట్టి పరోక్ష జ్ఞానాన్ని కూడా అణగగొట్టి నిత్య అపరోక్షమైనట్టి ఆత్మ స్వరూపమున నిమగ్నులు కావలసినదిగా నా మనవి. ఇది బోధసారం కూడా! ఇట్లు జన్మాది రహితమగు నిర్వాణరూపులై ప్రకాశించెదరు గాక!
25. ‘అశాంతి' నుండి విశ్రాంతికి
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జీవుని పట్ల అభ్యంతరమున అహంకారాదులు, బాహ్యమున ఈ జగత్తు అను భోక్త-భోగరూపమంతా ప్రవర్తిస్తోంది కదా! అయితే... అభ్యంతరంలోని అహంకారాదులు గాని, బాహ్య జగత్తు గాని... తదనుభవరూపమగు భోగం యొక్క తాదాత్మ్యం... అసత్యంగా భాసించుచున్నాయి. అనగా తత్త్వజ్ఞానం లేనప్పుడు అవి సత్యం వలె అనిపిస్తున్నప్పటికీ, తత్త్వజ్ఞానానంతరం అవన్నీ లేవనియే తెలియవస్తోంది.
ఎందుకంటావా ? అసలు, భోగము అంటే ఏమిటి?
Page:755
విషయముతో
భోక్త సంబంధము భోగ్య
అభ్యంతర భావావేశం వస్తువు
భోక్త కలిగి ఉండే భోగ్య వస్తువుతోటి సంబంధమే భోగము
భోక్త యొక్క భోగ్య వస్తువులతోటి సంబంధం యొక్క అనుభవమే భోగం. ఏదైతే ఆత్మయే అయి ఉన్నదో అదే మూఢులకు అజ్ఞానముచే భోగానుభవసహితంగా 'జీవుడు’ అనబడునదిగా తోచుతోంది. వాస్తవానికి ఆత్మ బోగానుభవరహితమైన అనునిత్య సత్యమగు బ్రహ్మమే అయి ఉన్నది. ‘అజ్ఞానము’ అనే రుగ్మత తొలగినప్పుడు సర్వులు ఆత్మ స్వరూపులేనని, అంతా కూడా ఆత్మ యొక్క విన్యాసమేనని అనుభవసిద్ధి కాగలదు. 'జ్ఞానం' అనే శాంత స్వరూప శీతలత్వం సముపార్జించుకున్న వారికి ఇక ఈ జగత్ భోగములు స్వభావ సిద్దంగానే 'రహదారిలో పడి ఉన్న ఎండుగడ్డి పరక' వలె అల్పంగాను, అరుచికరమైనవిగాను కనిపించగలవు.
ఓ రామచంద్రా! శాస్త్రములచే చెప్పబడే ఆయా పదజాలాలచే (ఆత్మ-పరమాత్మ-జీవుడుబ్రహ్మం-సత్త్వం మొదలైన ఆయా శబ్ద జాలంతో)... పెద్దగా పనిలేదు. 'నిర్వాణం' అను జగదతీత సంస్థితి లభించాలంటే....
1. ఇంద్రియ సంబంధమైన భోగముల పట్ల అనురక్తి తొలగడం (విరక్తి కలగటం)
2. వ్యక్తిగత పరిమితమైన 'అహంభావం' అనునది రహితమవటం.... ఈ రెండూ చాలు! అందుచేత ముముక్షువు ఈ రెండిటి కొరకై నిరంతరమైన ప్రయత్నపూర్వక కార్యక్రమంలో తనను తాను నియమించుకోవాలి. ఎవరికైనా స్వప్నంలో రుచిగా కనిపించిన పదార్థ సమూహముల కొరకు మేల్కొనిన తరువాత వెతికి సంపాదించాలని అనిపిస్తోందా? లేదు. ఎందుచేత అసలు అవి భ్రమయే కదా! మెలుకువ రాగానే అవన్నీ కనబడకుండానే పోతున్నాయి. ఇక ఆ స్వప్నంలోని తినుబండారాల కొరకై ఎవడూ ఏడ్వడు కదా! స్వప్నంలో కనిపించిన ఇళ్ళు-వాకిళ్లు-మనుష్యులు మొదలైనవి... మెలకువ తర్వాత 'అయ్యో! అవి పోయినాయే' అని ఎవరూ దుఃఖించటం లేదు కదా! "అలాగే ఈ జాగ్రత్లో సర్వ విషయాలు కూడా" అని గ్రహించబడు గాక! అజ్ఞానదశలో రుచికరంగా కనిపించే అహంకారము - జగదనుభవములు మొదలైనవన్నీ తత్త్వజ్ఞుడు (ఆత్మజ్ఞాన సహితుడు) అయిన తర్వాత అవన్నీ నిరర్థకంగాను, సార రహితమైనవిగాను, అరుచికరంగాను ఉంటాయి. అతని దృష్టియందు ఈ అహంకారము-జగత్తు మొదలైనవి 'లేనివే’ అగుచున్నాయి. స్వతహాగానే మొదలంట లేని పదార్థముల వలన సంబంధమేమిటి? బంధమేమిటి? మోక్షమేమిటి? అవి బాధించటమేమిటి? ఎట్లా వదిలించుకోవాలి... అను సంఘర్షణ ఎందుకు? అరణ్యంలో ఉన్న యక్షుడు తన యొక్క సంకల్ప బలం చేత మాయాకల్పిత పురమును, అందులో స్వజనులను దర్శించి, అందులో ప్రవేశించి విహారంచేస్తూ ఉంటాడు చూచావా? ఆ యక్షనగరం మొదలే
Page:756
అసత్యం కదా! అదే తీరుగా ఈ జీవుడు కూడా తన యొక్క ‘అవిద్య' అను ప్రమత్తతచే 'మిథ్య మాత్రమే’ అగు ఈ సంసారమును కల్పించుకొని, అందులో ప్రవేశించి అద్దానియందు తన కొఱకు తానే వెతకుకొనుచున్నాడు. తన కల్పనను తానే సంసారంగా గాంచుచున్నాడు. 'యక్షుడు అతని నగరం’ ఈ రెండూ కూడా భ్రమ సిద్దమే అయినప్పటికీ, కల్పితమాత్రమే అయినప్పటికీ, అందులో వ్యవహారాలు మాత్రం అర్థ-క్రియా సమర్థములై వర్తించుచున్నాయి. అట్లాగే అజ్ఞానంచే ఇక్కడ అహంకారం–జగద్భమ సత్యం వలె వర్తిస్తున్నాయి. అరణ్యంలో యక్ష-ప్రేతాదులు భ్రమ రూపమున వర్తిస్తున్నట్లు ఆవరణరహితమగు చైతన్యమున ఈ 14 లోకాలు భ్రమ రూపాలై స్ఫురిస్తున్నాయి. ఆకాశమున స్వతహాగా 'తూర్పు-పడమర లోపల వెలుపల పైన-క్రింద' అను ఆవరణలు లేక పోయినప్పటికీ జగత్ వ్యవహారం దృష్ట్యా అవన్నీ ఒనగూడు చున్నట్లే, ఆత్మలో ఆవరణలు లేకపోయి నప్పటికీ అహంకారము-జగత్ భ్రమ మొదలైన ఆవరణలు సాపేక్షిక మాత్రంగా సిద్ధిస్తున్నాయి.
విచారణ - ఓయీ మానవుడా! ఆత్మ గురించి ముందుగా ఎఱుగవలసినదిగా మా విన్నపం! ‘అహంకారము-జగత్తు' అనేవి మిథ్య మాత్రమే'... అని 'భ్రమ మాత్రమే' అని క్రమంగా గ్రహించు. అట్టి నిశ్చయము యొక్క ప్రభావం చేత చిత్తము అని చెప్పబడేది కూడా చైతన్యము నొందగలదు. కాబట్టి మీరంతా సమస్త సంశయములను విడనాడండి. గ్రహణ-త్యాగములు రెండిటినీ త్యజించినవారై ఉండండి. సర్వ సంశయములను విడనాడండి. కోర్కెలన్నిటినీ పారత్రోలినవారవండి. శాంత స్వరూపమును సంతరించుకొని ఉండండి. స్వతహాగా సత్తయే లేనట్టి ఈ దృశ్యము వాస్తవానికి ద్రష్టయొక్క రూపమే అయి ఉండి, ఇట్లు వ్యాపించి ఉన్నది సుమా! లేదా... (మరో విధంగా) ఇది ద్రష్ట యొక్క రూపం కూడా కాదు!
తరంగమంతా జలమయమే అయినప్పటికీ 'జలం తరంగంగా గుండ్రని పొడవైన ఆకారంగా ధర్మంగా కలిగి ఉన్నది'... అని అనలేం కదా! ఈ దృశ్యమంతా అనిర్వచనీయమగు చిత్స్వరూపమే అయి ఉన్నది. కానీ చిత్స్వరూపంలో ఈ జగత్తులు, దృశ్యాదులు లేవు. ఎందుకంటే...
1.దృశ్యమంతా ద్రష్ట స్వరూపమే! 2. ‘పరమార్థ చిద్రూప సత్తా' అగు ద్రష్ట ‘అసత్తు’ అయినట్టి ఈ దృశ్యరూపంగా ఎట్లు గావించ బడుతుంది?
వసంతకాలపు రస ప్రవాహ రూపాలే ఈ వృక్ష లత-లతా గృహాలు కదా! అట్లాగే ఈ సృష్టి అంతా కూడా ఆత్మ స్వరూపమాత్ర పరిపూర్ణమగు చైతన్యము యొక్క రూపమే అయి ఉన్నది.
జగత్తు యొక్క అభాస అని ఏది దర్శించబడుచున్నదో, అదంతా కూడా శుద్ధ చిన్మాత్రమే అయి ఉన్నది. ఇక ఇక్కడ ద్వైత-ఏకత్వములనబడేవి ఎట్లా ఉంటాయి? కాబట్టి ఓ సహప్రియా సర్వ జీవులారా! మీరంతా కూడా నిర్వాణ రూపమును సంతరించుకొని ఉండండి. చిదాకాశరూపులై ఉండెదరుగాక! నిరతిశయమగు ఆత్మానంద రసమును పానం చేసినవారై పరమశాంత మనస్కులు అవండి. సర్వ సంశయాలను పారద్రోలి 'నిర్వాణం' అనే పరమశాంత స్థానమున సుస్థిరులుకండి.
కిమ్ ఏతా ఆస్వతి శూన్యాసు సంసారారణ్య భూమిషు | మానవా! వాతహరిణా భ్రమథో భ్రాంత బుద్ధయః ॥
Page:757
ఓయీ! మానవుడా! ఈ సంసారం అని పిలువడే అతి శూన్యమైన అరణ్య భూమిలో భ్రాంతి బుద్ధితో ఎందుకు తిరుగాడుచున్నావు? ఓ ప్రియ సహజనులారా! 'ముల్లోకాలు' అనే మృగతృష్ణా జలం చూచి మీరు మోసపోకండి. 'ఆశ' అనే ఆవరణచే ఏర్పడిన చిత్తమును నమ్మి తద్వారా ధైర్యాన్ని కోల్పోయి ఎచ్చటెచ్చటికో పరుగులు తీయటమెందుకు? ఇక్కడి రూపాలు, సంకల్పాలు, బాంధవ్యాలు నమ్ముకొని సంసారంలో సంచరించటమనేది మూర్ఖపు జింక ఎండమావు లలోని నీళ్ళు త్రాగి దాహం తీర్చుకుందామని పరుగులు తీయటం వంటిదే! అందుచేత ఈ సాంసారిక పరిశ్రమలలో మీ ఆయువును వ్యర్థం చేసుకోకండి. జగత్తు అనే గంధర్వ నగరాన్ని (గారడీ కల్పన) చూసుకొని 'మాకు అవి ఉన్నాయి. ఇవి తెలుసు' అనుకుంటూ మురియకండి. ఎక్కడైనా సంసార సుఖం కనిపిస్తున్నా కూడా అది భావి వినాశనరూపాలుగాను, దుఃఖ కారకాలు గాను పరికించండి.
దృష్టి యొక్క భ్రాంతి దోషం చేత ఆకాశంలో వెంట్రుకల వంటి ఆకారాలు కనిపిస్తున్నాయి చూచావా? అట్లాగే బ్రహ్మాకాశంలో 'జగత్తు' అనే ఆకారాలు అగుపిస్తున్నాయి. కాబట్టి రామా! భ్రాంతి రహితం-సత్యం అగు ఆత్మలో సదా విశ్రమించి ఉండు. వాస్తవానికి ఆత్మయే స్వస్వరూపంగా గల జీవునకు 'మానవ శరీరం' అనేది... ఒక మహత్తరమైన అవకాశం అయితే, వృక్షం యొక్క ఊర్ధ్వ భాగమున గల రెపరెపలాడే ఆకు చివరగల జలబిందువు వలె ఈ దేహం అతి చంచలమైనది. అట్టి ఈ దేహం ఏ క్షణమైనా మట్టిలో కలిసిపోవచ్చు. అట్టి మానవ దేహం యొక్క సంసార రూపాలైనట్టి 'అవయవాలు-తత్ సంబంధిత విషయాలు'... అనే గర్భశయ్యలో పరుండకండి. దేహ స్వభావమును ఆశ్రయించి నానా అగచాట్లు ఎందుకు పడాలి? 'ఆద్యంత రహితం-అఖండితం’ అగు ఆత్మ స్వభావంలో శాంతంగా నెలకొని ఉండండి. అంతేగాని, ద్రష్టృ దృశ్య పరంపరలు మొదలుగాగల 'దృశ్య రూపం' అను దోషంతో కూడిన ఆ స్వభావం (అనాత్మ స్వభావం) నందు ప్రవేశించి దుఃఖ పరంపరలను కొనితెచ్చుకోవద్దు. అజ్ఞానికి మాత్రమే ఈ ప్రపంచం సత్యం వలె భాసిస్తోంది. ఆత్మ జ్ఞాని యొక్క దృష్టి నుండి ఈ ప్రపంచం సర్వదా వినాశనశీలమై, స్వప్న సదృశమై ఉండటంచేత అతనికి సత్యమగు శుద్ధాత్మవస్తువే అన్ని వైపులా తాండవిస్తూ అనుభవమౌతోంది. నామ రూపాత్మకంగా కనిపించే ఈ జగత్తు స్థానంలో వారికి నామరూపరహిత పరబ్రహ్మం మాత్రమే అనుభవమౌతోంది. అట్టి పరబ్రహ్మంలో 'జగత్తు' అనేది లేశమైనా కూడా వారికి అగుపించడం లేదు.
త్రోటయిత్వా తు తృష్ణాయః శృంఖలావలితం బలాత్, సంసారపంజరం తిష్ఠ సర్వస్య ఊర్థ్వమ్ మృగేంద్రవత్ ||
ఓ రామచంద్రా! 'తృష్ణ’ అనే గొలుసులతో 'సంసారం' అనే పంజరం చుట్టబడి ఉన్నది. అట్టి పంజరంలో చిక్కుక్కున్న ఈ జీవుడు 'ఆత్మ జ్ఞానం' అనే బలముచే తృష్ణారూప పంజరమును త్రెంచివేయు గాక! సింహం వలె పంజరమును చీల్చివేసి సర్వోత్కృష్టుడై వెలయుగాక!
ఓ రామచంద్రా! 'ముక్తి' అనగా ఏమిటి? 'నేను-నాది' అను రూపమైన అభిమానం శమించటమే ముక్తి. ఒకడు వ్యవహారమునందు ఉన్నప్పటికీ, లేక సమాధియందు ఉన్నప్పటికీ... ‘స్వాత్మ సత్త’ యొక్క అనునిత్య రసాస్వాదనయే ముక్తి యొక్క స్వరూపం. సంసార మార్గంలో ఖిన్నుడై
Page:758
- 1. జగదత్వము, 2. వాసనా సమూహము, 3. త్రివిధ తాపములు, 4. అజ్ఞానము, 5. ఆధి భౌతిక-దైనిక-ఆత్మికములనబడే ... అయిదు దోషములు కలిగి ఉండటం చేతనే జన్మ కర్మాదులు, తదితర భ్రమ అంతా అతని పట్ల ప్రవర్తిస్తోంది.
అందుకు ఉపాయములు, మార్గములు- 1. నిర్వాణత్వము, 2. వాసనారాహిత్యము, 3. త్రివిధ తాప శూన్యత్వము, 4. ఆత్మజ్ఞానము, 5. సర్వాతీతత్వము ... ఈ '5' కూడా ప్రశాంతాలైన విశ్రాంతి రూపాలు. అనగా జీవుడు ఈ అయిదింటినీ క్రమక్రమంగా పెంపొందించుకొనటం చేత మాత్రమే ‘అశాంతి’ నుండి 'విశ్రాంతి' స్థానములకు పయనించగలుగుతాడు.
తత్త్వజ్ఞానులు–అజ్ఞానులు కలిసియే ఈ జగత్తులో (భౌతికంగా) సంచరిస్తూ ఉన్నారు. అయితే .తత్త్వజ్ఞులు ఈ జగత్తును ఏ విధంగా (ఏ అవగాహనతో) ఎఱుగుచున్నారో... అజ్ఞానులు ఆ విధంగా ఎఱుగటం లేదు. అట్లాగే, అజ్ఞానులు ఈ జగత్తును ఏ రీతిగా పొందుచున్నారో, ఆ రీతిగా తత్త్వజ్ఞులు పొందటం లేదు. వారిరువురి అనుభవం పరస్పరం చెప్పుకోవటానికి కూడా అనర్హమై ఉంటోంది. జ్ఞానికి ఈ జగత్తంతా ఆనందమయమై ఉంటోంది. ఇక అజ్ఞానికో... ఇది ఎంతగానో దుఃఖమయమై ప్రాప్తిస్తోంది. అనేక నదీ జలాలు సముద్రంలో ప్రవేశించిన తర్వాత... ఇక ఒడ్డును నిలబడ్డ వానికి ‘ఇది ఈ నదీ జలం, అది ఆ నదీ జలం'... అనే తేడా ఏమాత్రం అగుపించదు కదా! అట్లాగే భ్రమ శమించినట్టి తత్త్వజ్ఞానికి ఈ జగత్తు కనిపిస్తున్నప్పటికీ ఇక్కడ వారికి 'సంసారం' అనే బంధం కనిపించడం లేదు. ఈ జగత్తు యథాతథంగా ఉండి ఉంటున్నప్పటికీ కూడా ప్రబుద్ధుడునిర్వాణ సముపార్జితుడు అగు జ్ఞానికి ఇదంతా లేనిదే అగుచున్నది. గాలి వీస్తూ ఉండగా ఎండు గడ్డి పరక ఎచటికో దొర్లుతూ పోతున్నట్లుగా ఆత్మ స్వభావమున విశ్రాంతిని పొందియున్న సజ్జనునికి ఈ జగత్తు అనునిత్యంగా ఎచటికో పలాయనం చిత్తగిస్తూనే ఉన్నట్లు అగుపిస్తోంది.
శ్రీరాముడు : మహర్షీ! ఈ జగత్తు అనుక్షణం పరిణామశీలమై 6 రకాలైన వికారాలతో (పుట్టుక - పెరగడం-ఏర్పడటం-తరగటం-సన్నగిల్లటం-నశించటం) ప్రవర్తిస్తూ ఉంటోంది కదా! శ్రీవసిష్ఠ మహర్షి : అవును కదా!
శ్రీరాముడు : అయితే బ్రహ్మం సర్వదా యథాతథమై ఉంటున్నది. అవునా? శ్రీవసిష్ఠ మహర్షి : అవును.
శ్రీరాముడు : మరి 'ఈ జగత్తు బ్రహ్మమే' అనే వాక్యం ఎట్లా యుక్తియుక్తం?
శ్రీవసిష్ఠ మహర్షి : పరబ్రహ్మం నుండి భావన ఏర్పడుతోంది. కనుక పరబ్రహ్మం-భావన అభేదమే కదా! భావన నుండి జగదనుభవం బయల్వెడలుతోంది. కనుక అనుభవం-అనుభవజ్ఞుడు అభేదమే అగుటచే జగత్తు బ్రహ్మంగా చెప్పబడింది. అయితే, ఆత్మజ్ఞాన నిత్యత్వము సముపార్జించుకున్నవారికి మాత్రమే ఈ జగత్తు అభేదం - నిరతిశయం అగు బ్రహ్మంగా గోచరిస్తోంది. కాని అజ్ఞానులకు మాత్రం ఇదంతా వివిధ జీవులతో సంఘటనలతో అత్యంత సంక్లిష్టంగా ఉండవచ్చు. భావికుడు (జ్ఞాన-అజ్ఞాన భావన చేయువాడు) ఒక్కడే గదా! అనేక ఆకారాలతో, భంగిమలతో తరంగాలు
Page:759
ఉండవచ్చు గాక! జలం ఒక్కటే కదా! జలం దృష్టిలో పెట్టుకున్న వారికి 'ఇది ఈశాన్యం మూల నుండి వస్తున్న పెద్ద తరంగం! అది నైఋతి వైపుగా సాగుతున్న చిన్న తరంగం'... అన్న విభేదాలన్నీ అర్థరహితంగా ఉంటాయి. త్రిగుణాత్మకమై ఈ జగత్తు 'గుణాలకు మునుముందే గుణాలకు ఆవల సర్వదా ఏర్పడి ఉన్న గుణి' అనబడు ఆత్మతత్త్వం దృష్టిలో గల వారికి ఇక్కడ సర్వం బ్రహ్మమయంగా గోచరిస్తోంది. దృష్టి జ్ఞానమయం అయ్యే వరకు ఇక్కడ షడ్వికారాలతో కూడి పరివర్తన శీలమగు జగత్తు కనిపిస్తోంది. శాస్త్ర గురు పాఠాల ప్రభావం చేత, స్వయంకృషితో నిర్మలమైన సూక్ష్మమైన దృష్టిని సంపాదించుకున్న తత్త్వవేత్తలకు ఇదే జగత్తు నిరతిశయానందమగు బ్రహ్మంగా గోచరిస్తోంది. అట్లు దర్శింపజేయుటమే శాస్త్రముల ముఖ్యోద్దేశం.
శ్రీరాముడు : స్వామీ! సామాన్యులమగు మాకు సహజీవులను దేహాల గుణాల దృష్టితో కాకుండా “వీరు అద్వితీయం-గుణాతీతం - ఏకం అగు ఆత్మ స్వరూపులే” ... అనే దృష్టితో చూడటం సాధ్యమౌ
తుందంటారా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఎందుకు కాదు? దృశ్యాతీత దృష్టి అనేది జీవులందరికీ అభ్యాసంలో ఉన్న విషయమే. ఉదాహరణకు నిన్న నిన్ను కలిసిన ముగ్గురు నలుగురు స్నేహితుల పేర్లు చెప్పమంటే చెప్ప గలవు. కానీ వారు ఏ రంగు చొక్కా ధరించారు?... అంటే చాలా వరకు చెప్పలేవు కదా! ఎందుకని? వారిని వస్త్రాల దృష్టితో కాకుండా స్నేహదృష్టితో చూచి ఉన్నావు కాబట్టి! వస్త్రాలకు అతీతమైన స్నేహ దృష్టి సాధ్యమైనట్లే... గుణములకు అతీతమైన ఆత్మదృష్టి సుసాధ్యమేనని చేతులెత్తి చెప్పుచున్నాను.
ఓ రామచంద్రా! చింతలు మొదలైనవేవీ లేనివాడు, ప్రపంచం గురించి ఏమంతగా తెలియని వాడు అగు ఒక చిన్న పిల్లవానికి ఈ జగత్పదార్థములన్నీ ఆట వస్తువులవలె వికల్ప రహితంగా అగుపిస్తాయి చూచావా? అట్లాగే వాసనలు క్షయించినట్టి ఆత్మజ్ఞానికి ఇవన్నీ కూడా నిర్వికల్పంగా (కల్పన అనే వికారం ఏమాత్రం లేనివై) భగవత్ స్వరూపంగా (ఆత్మ మాత్రంగా భాసిస్తున్నాయి.
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ॥
అజ్ఞానులందరికీ ఏది (ఆత్మ జ్ఞానం) రాత్రి అయి ఉన్నదో (ఏ విషయంలో నిద్రాముద్ర వహించి, పట్టించుకోవటానికి అనర్హంగా అనిపిస్తోందో)... అది (అట్టి ఆత్మ జ్ఞానం) ఆత్మజ్ఞాన శీలుడగు సంయమికి జాగరూకతకు అత్యంత అర్హమైనదిగా అనిపిస్తోంది. ఏది (ప్రాపంచిక విశేషాలు, సంబంధాలు మొదలైనవి) ఆత్మజ్ఞుడగు మునికి అత్యంత నిస్సారము-పట్టించుకోవటానికి అనర్హముగా అనిపిస్తుందో... అది అజ్ఞాన జీవులకు గొప్పగొప్ప విషయాల వలె అనిపిస్తోంది. అట్టి ప్రాపంచిక విషయాల పట్ల ఆత్మజ్ఞానికి దృష్టియే కలగటంలేదు. అంతేకాదు. సంసారిక దృష్టి గల జీవులకు అజ్ఞానాంధకారము ఆవరించి ఉండటంచేత ఆత్మ వస్తువు సుదూరంగా మరెక్కడో ఉన్నట్లు తోచుచున్నది. సుజ్ఞానికో?... ఆత్మ వస్తువు విరామ శూన్యమై సదా జగద్రూపంగా కూడా ప్రదర్శన మగుచున్నట్లు అనుభవమౌతోంది. అజ్ఞానికి జగద్రూపంగా ప్రసిద్ధమై కనిపిస్తున్న శబ్ద-స్పర్శ -
Page:760
రూపాది విషయములు జ్ఞానికి చిత్రంలో లిఖించబడిన అరణ్యములోని వివిధ వృక్షముల ఆకులవలె ఎదుట వాస్తవానికి లేనివిగా అనుభూతమౌతున్నాయి. జన్మాంధునికి రూపానుభవమే ఉండనట్లు జ్ఞానికి అజ్ఞాన ప్రసిద్ధమైన జగత్తు భ్రాంతిప్రాయంగా, అసద్రూపంగా సుషుప్తి సమయంలోని అనుభవరాహిత్య స్థితిలాగా... భాసించకయే ఉంటోంది.
దుఃఖ రూపంగా ప్రసిద్ధమై ఉంటున్న ఈ త్రిజగత్తులు విమూఢులకు మాత్రమే విషయమగు చున్నది. జ్ఞానికి ఇదంతా విషయమగుటయే లేదు. ఎందుకంటే... ఈ జగత్తు సత్తు కాదు. స్వప్నం స్వప్నరూపంగా సుస్పష్టమైన తర్వాత ఆ స్వప్నంలో తారసపడిన రూపాలు, భావాలు, అందలి బాహ్య-అభ్యంతర విషయాలు మేలుకొనిన వానికి అర్థరహితమౌతాయి కదా! అట్లాగే ‘జ్ఞానం’ అనే మెళకువ వచ్చిన తర్వాత ఈ జగత్తులో సాంసారిక దృష్టికి కనిపించే సంబంధాలు, భోగాలు మొదలైనవి మొదలంట సాంసారిక రూపం కోల్పోతాయి. అనగా జ్ఞానికి అవి స్ఫురించనే స్ఫురిం చవు. అతడు సదా విభాగరహితుడై ఉంటాడు. స్వస్థచిత్తుడౌతాడు. సర్వానికి అవిరోధమైన పరమాత్మను అనుభవిస్తూ ఉంటాడు. నిర్వాణ స్వరూపుడై శీతలాంతఃకరణుడై, అత్యంత తృప్తిని పొంది ఉన్నవాడు అగుచున్నాడు.
26. మనస్సు - - పదార్థములు
శ్రీరాముడు : మహాత్మా! మీరు ప్రవచిస్తూ వస్తున్న జ్ఞానస్థితికి కావలసిన 'ధ్యానం' ఎట్టిదో తెలపండి. శ్రీవసిష్ఠ మహర్షి : 'ధ్యానం' అను ప్రక్రియ శాస్త్రములచే భోగవాసనలతో కూడిన చిత్తం గల ముముక్షువుల కొరకై ప్రతిపాదించబడుతోంది. 'ధ్యానం' అనునది చిత్తం యొక్క ప్రవృత్తి స్వభావానికి ఔషధం. అయితే, భోగవాసనలచే ఆకర్షించబడని చిత్తం గల జ్ఞాని యొక్క స్థితి 'నిత్య ధ్యాన స్థితి’ గా వర్ణించబడింది. అనగా, అతడు వేరే ధ్యానాభ్యాసం చేయకున్నప్పటికీ సర్వదా సర్వత్రా స్వభావసిద్ధంగా సమత్వం దర్శించగలుగుతాడు. సర్వత్రా సమదర్శనమే వాస్తవమైన ధ్యానం. ఒక తటాకంలోని జలం క్రింద తూము మొదలైన బహిర్గత మార్గాలు లేనప్పుడు ప్రవాహ స్వభావం లేక నిశ్చలంగా ఉంటుంది చూచావా? అట్లాగే జ్ఞాని యొక్క హృదయంలో పదార్థ సంబంధమైన వాసనలు ఉండవు. కనుక... అతని చిత్తం అటూ ఇటూ వెళ్ళదు. ఎందుకంటే... పదార్థాలే మనస్సు. ఈ మనస్సే పదార్థాలను రంజింప జేసినవిగా చేస్తోంది. అట్టి పదార్థముల పట్ల ఎప్పుడైతే వాసనలు సన్నగిల్లుతాయో అప్పుడు మనో నిరోధము స్వయంగా సంభవిస్తోంది.
ఈ మనస్సే బాహ్య-అభ్యంతర పదార్థాల అభాస. జలం వివిధ తరంగాలుగా స్ఫురిస్తున్నది చూచావా? అట్లాగే ఏ ఏ అర్థ- అనర్ధ రూపాలుగా ఏ ఏ బాహ్య-అభ్యంతర పదార్థాలు భాసిస్తు న్నాయో... అవన్నీ కూడా మనస్సు యొక్క వివిధ రూపాలేనని గ్రహించు. ఈ మనస్సే అనేక చోట్లకు పరుగులెత్తి ఆయా చోట్ల తన యొక్క వివిధ ఆకారాలను ప్రదర్శిస్తోంది. ఏ విధంగా
Page:761
జలానికి, తరంగాలకు భేదమే లేదో... అదేవిధంగా మనస్సుకు-జగత్ పదార్థాలకు భేదమే లేదు. వాయువును తొలగిస్తే వాయు సంచలనం పోతుంది. అట్లాగే వాయు సంచలనం తొలగిస్తే వాయువు తొలగుతుంది. పదార్థాలు తొలగించామా... మనస్సు తొలగుతుంది. మనస్సు తొలగిస్తే పదార్థాలు అనుభవం కావు. కాబట్టి సాధకుడు తత్త్వజ్ఞానంచే పదార్థములు నిస్సారమును గ్రహించాడా, ఇక మనస్సును తొలగించటానికి వేరే ప్రయత్నమేమీ అక్కర్లేదు. మనస్సు-పదార్థములు... ఇవి రెండూ ఒక్కటే! కాబట్టి జ్ఞానం వృద్ధి పొందుతూ ఉంటే అవి రెండూ ఏకకాలంలోనే తొలగిపోతూ వస్తున్నాయి. పదార్థములు అట్లు అనుభవమవటానికి సంకల్పమే కారణం. మనస్సు యొక్క మూల పదార్థం సంకల్పములే! కనుక విజ్ఞుడైన వాడు సంకల్ప రూపములైన పదార్థములను వాంఛించటం తగ్గిస్తూ వస్తాడు. క్రమంగా సమ్యక్ జ్ఞానం యొక్క బలిమి చేత మనస్సు-పదార్థములు ఈ రెండూ శమిస్తూ వస్తాయి. స్వప్నంలో పులి 'ఇది స్వప్నమే' అని ఎఱిగియున్న వానిని భయపెట్టలేదు కదా! జ్ఞానికి ఎదురుగా ఈ ప్రత్యక్ష జగత్తు ఏర్పడి ఉన్నప్పటికీ అది నశించియున్న దానిగానే అతనికి అనుభవమౌతుంది. అతనికి వాటిపట్ల 'కావాలి' అను జాడ్యం స్వయంగా తొలగిపోతోంది.
ఒక కుమ్మరి మట్టితో ‘వీథిలో ఆడుకుంటున్న పిల్లలు దూరంగా కొండలలోంచి లేచి వస్తున్న బ్రహ్మరాక్షసి' అనే రసవత్తరమైన సన్నివేశం తయారుచేశాడు. ఆ తయారు చేసిన మట్టి బొమ్మల కొలువును చూచిన ఒక పసిబాలుడు 'అయ్యా బాబోయ్! ఇది బ్రహ్మరాక్షసి! ఈ కొఱివిదయ్యం జట్టు విఱబోసుకొని మిడిగుడ్లతో నా వైపే చూస్తోంది. ఇక ఇది మీద పడిందా, చచ్చానే!'... అని తలచి భయంతో వణుకుచూ కెవ్వున ఏడుపు లంకించుకున్నాడు. అది చూచిన దాది, “బాబూ! ఇవన్నీ మట్టితో తయారు చేయబడిన ప్రతిమలు (బొమ్మలు) మాత్రమేనయ్యా!" అని తెలియజెప్పిన తర్వాతనో? ఆ మట్టి బొమ్మల పట్ల ఇతఃపూర్వం ఏర్పడిన భయము, భ్రమ, 'శత్రు-మిత్ర సైన్యము' అనే ఆయా భావావేశాలు తమంతట తామే తొలగిపోతాయి. అట్లాగే జ్ఞానికి మనస్సు-పదార్థములు ఈ రెండూ కూడా బ్రహ్మ స్వభావమునందే స్థితి పొంది ఉన్నవగుచున్నాయి. అందుచేత ఈ జగత్తు ఎదురుగా ఉన్నప్పటికీ వాని నామ రూపములు, వాటిచే జనించే ఆసక్తి-భయాదులు ఇవన్నీ జ్ఞాని యొక్క ఆంతరంగిక దృష్టికి సర్వదా నశించియే ఉంటాయి. అతడు సంసారదశ కంటే విలక్షణమైనట్టి పూర్ణానంద స్వరూపమును స్వయంగా సంతరించుకుని ఉంటున్నాడు. అతనికి అద్వితీయమైన పరమార్థ సద్రూపము అనుభవమగుచుండగా ఇక ఆపై ఈ ప్రపంచ దర్శనమంతా సంశుద్ధత పొందుతోంది. అటుపై ఇక్కడి జన్మాది వికారాలు, వాటి భోక్తయగు అజ్ఞానం, ఆ అజ్ఞానానికి విషయాలగుచున్నట్టి ఇక్కడి శబ్ద స్పర్శ- రూపాదులు,... ఇవన్నీ కూడా ప్రక్కన నిద్రించుచున్న బాలుని యొక్క స్వప్నంలోని సంఘటనల వలె, బాలునిచే కల్పించబడిన యక్ష కథల వలె అసత్తుగా గోచరిస్తుంది. ధైర్యముతో కూడిన యువకునికి పిశాచాలకు సంబంధించిన బుద్ధి ఉండనట్లు... జ్ఞానికి విషయపరంపరలతో కూడిన 'జగత్తు' యొక్క బుద్ధియే ఉండదు.
అజ్ఞాని యొక్క బుద్ధికి జ్ఞాని అజ్ఞానివలె అనిపిస్తూ ఉంటాడు. అజ్ఞాని యొక్క అనుభవమునకు వంధ్య (గొడ్రాలు) యొక్క కుమార్తెలు చిరకాలం వర్ధిల్లుచున్నారు. జ్ఞానియో? జ్ఞానమునకు
Page:762
విషయమే కానిది, పదార్థకారణంగా కనిపించనిది, ఆద్యంతరహితమైనది, సర్వ వ్యాపకమైనది, మనస్సు యొక్క శబ్ద-అర్థములకు కూడా సంబంధించనిది, విభాగ రహితమైనది, స్వయంగా జ్ఞాన స్వరూపమైనది అగు బ్రహ్మమే ఈ సృష్టికి వాస్తవ రూపంగా అయి ఉన్నదని గమనిస్తున్నాడు.
‘జలంలో తరంగాలు' అనే శబ్దం అనుచితం కదా! ఎందుకంటే జలమే తరంగాలుగా అగుచున్నప్పుడు ఇక జలంలో తరంగాలు ఉండటమేమిటి? అట్లాగే 'బోధ' అనే చైతన్య జలము నందు మనో-బుద్ధులు నిర్మల తరంగాలు వంటివి. (లేదా) చైతన్యమే మనో-బుద్ధి స్వరూపముగా అగుచు తాను సర్వదా యథాతథంగానే ఉంటోంది. వాస్తవానికి శుద్ధాత్మయందు మనోబుద్ధి తరంగాలు ఎట్లా సంభవిస్తాయి? లేదు.
ఓ రామచంద్రా! ఈ మనస్సు యొక్క భ్రమ, ఈ జగత్ భ్రమ... ఇవన్నీ నిరర్థకమేనని అనక తప్పదు. అందుచేత బ్రహ్మ స్వభావమునందే స్థితి కలిగి ఉండటం సముచితం. ఆకాశంలోని 'సూర్యుడు’ అనే జ్యోతిర్మండలములలో 'చీకటి' అనే ప్రసక్తియే ఉండదు కదా! బ్రహ్మ స్వభావమున నెలకొని ఉన్న విజ్ఞులకు జాగ్రత్-స్వప్న సుషుప్తులు మొదలైన అవస్థలన్నీ నిర్విషయత్వమును సంతరించుకొని ఉంటాయి. అనగా అతని నిత్యోదిత స్వానుభవం వాటికి అతీత్వమును సంతరించు కుని ఉంటుంది. అతనికి ఈ అవస్థలన్నిటిలోనూ సాక్షిరూపంగా ఉన్న నిజాత్మయే సర్వత్రా అనుభూతమౌతూ ఉంటుంది. అట్టి అనుభూతి యొక్క సాంద్రత చేత అనంత రూపాలుగా ఉన్న ఈ జ్ఞేయ దృశ్య (తెలియబడే) పదార్థాలన్నీ మిథ్యగా ఎఱుగుచున్నాయి. త్రాడులో అధ్యస్తమగు సర్పంలాగా వారికి ఇదంతా నిర్వికార చిదన ఆత్మ యొక్క స్వభావం గానే స్థితి నొంది ఉంటోంది.
రామచంద్రా! బీజమే కొమ్మలు-ఆకులు-ఫలాలు రూపం ధరించుచున్నట్లు... బుద్ధి యొక్క వృత్తియే ఈ బాహ్య-అభ్యంతర పదార్థాలన్నీ ధరిస్తోంది. బీజానికి అన్యమైనదేదీ వృక్షంలో ఉండ జాలనట్లుగా, బుద్ధికి వేరుగా దృశ్యం లేదు. మనస్సు గాని, పదార్థాలు గాని బుద్ధి యొక్క ఒకానొక పరిణామం మాత్రమే! ఇట్లు జ్ఞానమునకు వేరుగా జ్ఞేయం ఉండజాలదని గ్రహించటం చేత బుద్ధి యొక్క వృత్తి అనిర్వచనీయమగు ఆత్మత్త్వమును సంతరించుకోగలుగుతుంది. అట్టి బుద్ధి 'సర్వ విశేష రహితము - స్వ ప్రకాశము సద్రూపము'... అగు ఆత్మగా తానే శేషిస్తోంది.
పదార్థములే ...మనస్సు; మనస్సే ... పదార్థాలు. అయితే, ఈ రెండూ కూడా భ్రమాత్మకాలు, అభావ రూపాలు అయి ఉన్నాయి. జన్మాదిరహితమగు బ్రహ్మము సర్వ వస్తువుల యొక్క ఆత్మయే అవటం చేత... మనోరూపమున కూడా అదియే అకారణంగా భాసింస్తున్నదగుచున్నది. బ్రహ్మం అకారణంగా మనస్సుగా భాసిస్తున్నట్లే... మనస్సు అకారణంగా పదార్థములుగా భాసిస్తోంది.
అట్లు మనస్సు, మనఃకారణంగా కనిపిస్తున్న పదార్థాలు వాస్తవానికి మిథ్యయే అయిన ప్పటికీ... భ్రమానుభవం చేత అవన్నీ సత్యాలుగా తోచుచున్నాయి. ఓ రామచంద్రా! మేఘాలలో కనిపించే మెరుపు తీగ వాస్తవమైన తీగయా? కాదు కదా? అట్లాగే ఈ మనస్సు, ఈ మనస్సుకు తోచుచున్న ఈ జగత్తు వాస్తవానికి మెఱుపు తీగ విలాసం లాగానే ఆకారమాత్రాలు, అస్థిరాలు,
Page:763
అత్యంత చంచలములు అయి ఉన్నాయి. అజ్ఞానం ఆశ్రయించావా, నీవు మనోవ్యసన ప్రభావం చేత ఈ సంసారం పొందవలసి వస్తుంది సుమా! అయితే 'ఆత్మ' యొక్క స్వభావమేమిటో ఎఱగటం జరిగిందా... ఇక అజ్ఞుడవయ్యే ప్రసక్తియే ఉండదు. భ్రమ కించిత్ కూడా కలుగదు. ఆత్మ జ్ఞానముచే మాత్రమే అదే మనస్సు ద్వారా ఈ సంసారము శమించిపోగలదు. ముత్యపుచిప్పలో వెండి యొక్క భ్రమ ముత్యపుచిప్ప గురించి తెలియనప్పుడు మాత్రమే ఉంటుంది కదా! ముత్యపుచిప్పలో వెండి ఉండియే ఉంటుందని కొందరు తలచుచున్నట్లే, భ్రాంతి రూప జగత్ భ్రమ యందు మిథ్యగానే ఈ జనులు అనేక దుఃఖ పరంపరలు అనుభవిస్తున్నారు. పరమాత్మ యొక్క 'యథార్థ జ్ఞానం' చేత మాత్రమే ఈ సంసారము యొక్క 'అభావము' సిద్ధించగలదు. 'శాంతమగు ఆత్మ' యే యే నిర్వాణము.
నిర్వాణాత్ ఇతరా సత్తా దుఃఖాయ 'అహమ్' ఇతి భ్రమః
మృగతృష్ణాంబు రూపో ‘అహమ్' అసత్, శూన్య స్వరూపకః ॥
నిర్వాణం (శాంతమగు ఆత్మ) కంటే వేరైన 'నేను (అహం) అనేది భ్రమ మాత్రమే! అట్టి అహంరూప భ్రమ దుఃఖమును మాత్రమే కలిగిస్తోంది. వాస్తవానికి మృగతృష్ణలో కనిపించే జలం లాగా 'అహం' అనేది శూన్యం, అసద్రూపం మాత్రమే! ఈ ప్రకారమైన శుద్దాత్మ జ్ఞానం చేత అహంకారం శమిస్తోంది.
శ్రీరాముడు : అసలు భ్రమమాత్రము-అసత్యము అగు 'అహం' అనేది మొట్టమొదట ఎట్లా ఉత్పన్నమౌతోంది?
శ్రీవసిష్ఠ మహర్షి : నిర్మల-నిశ్చల జలం ఒకప్పుడు తరంగ రూపం పొందుతోంది. అయితే జలం తరంగరూపం పొందుచున్నప్పుడు తన యొక్క జలత్వము త్యజిస్తోందా? ...లేదు కదా!
శ్రీవసిష్ఠ మహర్షి : అట్లాగే బ్రహ్మము మొట్టమొదట అద్వితీయమై నిర్విషయ స్వరూపమై ఉన్నది. అట్టి నిర్లిప్త-అప్రమేయ బ్రహ్మము సృష్టి యొక్క ఆదియందు తన యొక్క 'సర్వజ్ఞత్వము’ అనబడే ఒకానొక ప్రభావం చేత ‘స్వాత్మభూతము' అనతగ్గ 'జ్ఞానమయుడగు హిరణ్యగర్భుడు' అను రూపం దాల్చుతోంది. అట్టి ప్రప్రథమ తరంగ రూపమగు హిరణ్యగర్భుని సంకల్పానుసారంగా స్వయంగా బాహ్య-అభ్యంతర పదార్థ రూపత్వము అవధరిస్తోంది. అట్లు అవధరిస్తూనే తాను యథాతథంగా (తరంగ సమయంలో జలంలాగానే ఉంటోంది. ఒక వృక్షము యొక్క మూలము నుండి శాఖాగ్రము వరకు ఒకే ‘సత్తా’ ఉన్నట్లే... జ్ఞాతృ-జ్ఞాన-జ్ఞేయ... రూపమగు ఈ జగత్తునందు అంతటా నిర్వికార రూపమగు బ్రహ్మసత్త ఒక్కటే భాసిస్తోంది. ఆకాశంలో లక్షల మైళ్ళు వెళ్ళి చూచినప్పటికీ అక్కడ కూడా అంతటా నిర్మలమగు ఆకాశమే వెలయుచున్నట్లుగా... చిద్రూపం అగు బ్రహ్మం ఒక్కటే జ్ఞాతృ-జ్ఞాన-జ్ఞేయ రూపమున ఈ జగత్తునందు అంతటా అఖండ రూపాలతో భాసిస్తోంది. శూన్యమే స్వరూపంగా గల ఆకాశమే అంతటా వ్యాపించి ఉన్నట్లు జ్ఞాన-జ్ఞేయాది అన్ని దశలలోను నిర్మలము ఏకము అగు ఆత్మయే అంతటా వ్యాపించి ఉన్నది.
Page:764
నేయి ఘనీభవించినప్పుడు ఘనరూపము (పొడవు-వెడల్పు మొదలైన రూపములతో) కనబడుతోంది కదా! చైతన్యము కూడా ఆ విధంగానే విషయరూపమై తనను తానే ‘చిత్తము’ అను రూపముగా గావించు కొంటోంది. ఆత్మ దేశ కాలాదులు పొందటానికి మునుముందే తన స్వరూపమును ఏమఱచి చిత్తరూపముగా అగుచూ, పొందుచున్నది. వాస్తవానికి 'ఏకము’ అయినట్టి ఆత్మ తన స్వరూపమునందే సదా స్థితిని పొంది ఉన్నది సుమా! అయితే... అవిద్యచే ‘అజ్ఞానము' అనే స్వయంకృత కల్పితదశను పొందుతోంది. నిజానికి శుద్ధాత్మయందు అట్టి అజ్ఞానము మొదలైనవి సంభవించటానికి వీలేలేదు సుమా! అనగా జలంలో 'తరంగము' అనే ఏ పదార్థము ఎన్నటికీ ఉత్పన్నము కానట్లే (జలం జలంగానే ఉన్నట్లే) పరిశుద్ధమగు ఆత్మయందు 'చిత్తము’ అనునదేదీ ఉత్పన్నమే కాలేదు!
శ్రీరాముడు : మరి శాస్త్రములు చిత్తమును గుర్తిస్తూ, ఆ చిత్తము యొక్క ప్రశమనము గురించి బోధిస్తున్నాయి కదా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఔను. బోధిస్తున్నాయి. అయితే అవిద్యా దశయందు పరస్పర బోధ కొరకై ఈ ‘చిత్తము’ అనబడేది కల్పించబడుతోందని గ్రహించు.
ఓ రామచంద్రా! మహానీయులగు కొందరు జ్ఞానముచే తమ అజ్ఞాన మూలాన్ని శమింప జేసుకొంటున్నారు. నేయి యొక్క ఘనీభూతరూపం (తెలుపు-పొడవు వెడల్పులు మొదలైన లక్షణాలు) నెయ్యిని కరగించినప్పుడు స్వయంగా మటుమాయమౌతున్నాయి కదా! అట్లాగే అభిమాన రహితులగు మహానుభావులు తమ ఆత్మ స్వరూపమునందు లయత్వము సముపార్జించుకొని ఆత్మకు అభేదస్వరూపులుగా అగుచున్నారు. అందుచే వారు అనంతమగు ఆత్మానందముచే పరిపూర్ణుల గుచున్నారు. శాంతులుగాను, విక్షేపరహితులుగాను అగుచున్నారు. నిరంతరము సమాధితత్పరులై మెలగుచున్నారు.
అట్టి వారికి జన్మ - కర్మలు ఆపాదించటానికే వీలుకాదు! వారికి చిత్తము చిత్త ప్రశమనము అను పాఠ్యాంశము అనావశ్యకమగుచున్నది.
Page:765
IV. మనోమృగ విశ్రాంతి
1. సమాధి వృక్షము - చల్లటి నీడ
శ్రీరాముడు : 'సమాధి’ అనే వృక్షం యొక్క చల్లటి నీడలో ఈ జీవునికి చక్కటి విశ్రాంతి కలుగగలదని విజ్ఞానవేత్తలు అంటూ ఉండటం విన్నాను. అట్టి సమాధి వృక్షం గురించి వివరించండి. శ్రీవసిష్ఠ మహర్షి : అవును. సమాధి అనే వృక్షం 'వివేక జనులు’ అనే వనంలో ఉన్నది. వివేకులకు అది సర్వదా జీవన మూలమై ఉన్నది. అతి విశాలమై, పత్ర-పుష్ప సహితమై కనిపిస్తున్న ఆ సమాధి వృక్షం గురించి విజ్ఞులు ప్రవచిస్తున్నదేమిటో చెప్పుతాను విను.
'సంసారం' అనే ఒక మహారణ్యం ఉన్నది. అందులో అనేక జీవులు అనేక సుఖ-దుఃఖాలను పరంపరగా పొందుతూ అతి దీర్ఘకాలంగా సంచరిస్తూ ఉన్నారు. 'ఆశ' అనే పాశంతో ఆయా జీవులు ఆయా చోట్ల బంధింపబడి, దిక్కు తోచక అలమటించటం మేము గమనిస్తూనే ఉన్నాం. అయితే అట్టి సంసారంలో అవిశ్రాంతంగా తిరుగాడుచున్న అసంఖ్యాక జీవులలో కొందరికి మాత్రం ఆ సంసారారణ్యం పట్ల వైరాగ్యం ఉద్భవిస్తోంది. అట్టి వైరాగ్యం ఉదయించటానికి కారణం : 1. స్వజనులచే గావించబడిన అవమానాదులు కావచ్చు... కాక,
2. ధనాదులకు సంబంధించిన వియోగ సంఘటనలు కావచ్చు... లేదా,
3. సౌభాగ్యవశం చేత కావచ్చు, కాదా...
4. మహాత్ముల ఉపదేశ ప్రభావం చేత వచ్చిన గుర్తు కావచ్చు.
కారణం ఏదైతేనేం... ఈ సంసారం కలిగించే అనేక దుఃఖాదులను గమనించిన కొందరు జీవులు ఈ సంసారం పట్ల పరమ వైరాగ్యాన్ని ఆశ్రయిస్తున్నారు. అట్టి వైరాగ్యమే సమాధి వృక్షం యొక్క బీజం. అట్టి బీజమునకు క్షేత్రం ఈ చిత్తమే! అయితే అట్టి చిత్త క్షేత్రం 'శుభకర్మలు' అనే నాగళ్ళతో దున్నబడి 'శాంతి' అనే జలముచే తడుపబడి, 'ప్రాణాయామం' మొదలైన పిల్ల కాలువ లతో నీళ్ళు పొందినదై ఆ సమాధి బీజం మొలకెత్తి సమాధి వృక్షంగా ప్రవృద్ధమౌతోంది. వివేకం చేత శుద్ధం చేయబడిన చిత్త భూమియందు వైరాగ్య సమాధి బీజం తనంతట తానే వచ్చి చేరుతుంది.
ఈ విధంగా స్వచిత్తమునందు వచ్చి చేరిన వైరాగ్య సమాధి బీజమును వృద్ధి నొందింప జేయాలి. దృఢబుద్ధితో సర్వభేద భావములను త్యజిస్తూ... ఆ వైరాగ్య బీజమును సమాధి వృక్షంగా పెంపొందించుకోవటం ఎట్లాగో చెప్పుతాను... విను.
మనోశుద్ధి - మనస్సును ముందుగా శుద్ధంగాను, పవిత్రంగాను, సుందరంగాను, మధురం గాను తయారు చేసుకోవాలి. 'సత్సాంగత్యం' అనే క్షీరంతో ఆ మనస్సును మరల మరల నానపెట్టాలి.
Page:766
ఆ తర్వాత శాస్త్ర వాక్య మననం ప్రారంభించాలి. 'సంసార సాగరం దుఃఖమ్, జీవో బ్రహ్మేతి నాపర', నేతి నేతి... వంటి శాస్త్ర వాక్యముల అర్థసారాన్ని ఆ మనస్సులో నిండుగా ప్రవహింప జేయాలి. గురువాక్యాలు ఆశ్రయించాలి.
గురువు యొక్క ‘హృదయం' అనే బ్రహ్మ సరోవరంలోంచి ప్రవేహించే ఆత్మజ్ఞాన వాక్యాలు వినాలి. ఆత్మతత్త్వ పరిపూర్ణులు, నిర్మలులు అగు సద్గురువులు వాక్యాలు సర్వ ద్వైతమును నిషేధిస్తూ వస్తాయి. అంతఃకరణమున సంసార శూన్యత్వను గురించి బోధిస్తూ ఉంటాయి. అమృత ప్రవాహాన్ని బోలిన ఆ గురువుల నుండి లభించే శాస్త్రార్థములను శ్రవణ మననాదులచే గ్రోలాలి. వాటితో చిత్తములో ప్రవేశించిన వైరాగ్య బీజమును ప్రవృద్ధ పరచాలి.
అట్టి 'సంసార వైరాగ్యం'... అనే సమాధి బీజమును తీక్షణ బుద్ధితో చిత్త భూమిలో పరికించి, కనుగొని, ప్రయత్నపూర్వకంగా పరిరక్షించుకోవాలి. శరీరక-వాచిక-మానసిక తపస్సులు అందుకు దోహదపడతాయి. దాన ధర్మాది గుణాల చేత, అమానిత్వ- అదంభిత్వాది సద్గుణ సంపత్తితో కూడిన క్రియా-ప్రయత్నాదుల చేత, పవిత్ర క్షేత్ర దర్శనాది వృత్తి విస్తార రూపకల్పనలచే ఆ సమాధి బీజమును పరిరక్షించుకోవాలి.
వైరాగ్యము - క్రమంగా ఆ వైరాగ్య బీజం అంకురించటం ప్రారంభిస్తుంది. అట్టి బీజాంకురాన్ని రక్షించుకునే ఉపాయాలను అతి జాగరూకతతో, నిపుణత్వంతో ఆశ్రయించి ఉండాలి. 'సంతోషము' అనే తోటమాలిని అహర్నిశలు బీజాంకురాన్ని కాపాడి ఉంచే ఉద్యోగంలో నియమించాలి.
ఆ వైరాగ్య-సమాధి బీజాన్ని హరిద్దామని కొన్ని పక్షులు కాపుకాస్తూ ఉంటాయి సుమా!ఆ పక్షులే పూర్వ వాసనలతో ఆవిర్భవించే దేహ పుత్ర-మిత్ర కళాత్రాదుల పట్ల కలిగే వ్యామోహాలు, అనురాగాలు మొదలైనవి. కామ క్రోధాది డేగలు దరిచేరకుండా చూచుకోవాలి. హింస - అహంకారం-దంభం-దర్పం-అభిమానం-క్రోధం-పారుష్యం-అభిజాత్యం మొదలైనవి ఆ మొలకెత్తే వృక్షాన్ని పట్టే చీడలాంటివి. వాటిని దరిజేరకుండా చూచుకోవాలి. అందుకుగాను, అహింసా ప్రధానత్వంచే మృదువైన 'యమ నియమాలు' అనే చీపురుతో 'రజోగుణం' అనే ధూళిని చిత్త క్షేత్రం నుండి ఎప్పటికప్పుడు - ఊడ్చివేస్తూ ఉండాలి. ఇంకా, అంచిత్యమైన 'బ్రహ్మ ప్రకాశం' అనే వివేక సూర్యుని కిరణాలు ఆ వైరాగ్య-సమాధి బీజంపై నిరాటంకంగా ప్రసరించేటట్లు చూచుకుంటూ ఉండాలి. ‘అజ్ఞానం' అనే చీకటి ఆవరించకుండా చిత్త క్షేత్రాన్ని కాపాడుకోవాలి. దుష్కృతాలు, క్షణ భంగురాలైన వనిత-సంపద మొదలైన భోగ వాసనలు అనే పిడుగులు ఆ సమాధి అంకురం వైపుగా రానీయకుండా చూచుకోవాలి. అందుకుగాను 'ప్రణవార్థం' అనే త్రిశూలమును ధరించి ‘ధైర్యము-ఔదార్యం' అనే మంత్రాలను జపిస్తూ జప-తప-స్నాన-దానాదులచే భోగ వాసనలను
సుదూరంగా ఉంచుతూ రావాలి.
ధ్యానము : ఈ విధంగా రక్షించబడిన వైరాగ్య బీజం క్రమంగా 'ధ్యానం' అనే మొక్కగా రూపు దాలుస్తోంది. ఆ మొక్కకు 'వివేకం' అనే నూతనమైన కొమ్మలు మొలకెత్తుచున్నాయి. అట్టి
Page:767
వివేకాంకురం చే చిత్తభూమి ప్రకాశవంతంగాను, వికాసవంతంగాను, అతి శోభాయమానంగాను, రమణీయంగాను భాసిల్లగలదు. అప్పుడా వివేకాంకురం నుండి 'సచ్ఛాస్త్రములు-విచారణ-సాధు సంసర్గం’ అనే ఆకులు బయల్వెడలుతాయి. ఆ చెట్టు 'సంతోషం' అనే గట్టి తోలుతో పరివేష్టితమౌతూ వస్తుంది. వైరాగ్యం అనే రసంతో ఆ వృక్షం శోభిస్తూ క్రమంగా బలమైన కాండాన్ని పెంపొందించు కొంటుంది. 'శాస్త్రములు’ అనే వర్షమును పొందుతూ క్రమంగా ఆ సమాధి వృక్షం మహోన్నతిని పొందగలదు. అది ఇంకా ఇంకా శాస్త్ర విచారణ సాధు సంగమము-వైరాగ్యము అను రసములతో మరింత పరిపుష్టమగు గాక!
రాగ-ద్వేష విదూరకం - అట్లు పరిపుష్టమైన ఆ ధ్యాన వృక్షమునకు ఇంకెప్పుడు ‘రాగ ద్వేషాలు’ అనే వానరాలు కొంచెం కూడా క్షోభను కలిగించలేవు. వాటి దూకుళ్లకు అది చలించదు.
సద్గుణముల సముపార్జన - జ్ఞానముచే శోభితమైన ఆ వివేక వృక్షం వైరాగ్య రసంతో విశాలంగా విలాసవంతంగా ఆత్మ ప్రదేశము వరకు విస్తరించినదగుచున్నది. ఆ ధ్యాన వృక్షమును ఆశ్రయించ టానికి ‘ఆత్మతత్త్వం యొక్క స్ఫుటత్వం, సత్యత్వం, ఆత్మస్థితి, ధీరత్వం, నిర్వికల్పత్వం, సమత్వం, శాంతి, మైత్రి, కరుణ, కీర్తి, ఆర్యత్వం' మొదలైన లతలు వచ్చి చేరుతాయి. 'శాంతి' మొదలైన ఆకులతో, పుష్పాలతో శోభించే ఆ సమాధి వృక్షమే యోగులకు విశ్రాంతి స్థానం. ఆ వివేక వృక్షం రోజు రోజుకు ప్రవృద్ధమై, క్రమంగా అజ్ఞానమూలాన్ని నశింపజేస్తుంది.
ఆ యోగికి సప్త భూమికా పర్యంతము విశ్రాంతిదాయకమౌతుంది. 'బ్రహ్మ సాక్షాత్కారము' అనే మహా ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఉదారత్వాది గొప్ప గుణాలతో కూడిన ప్రజ్ఞను చిగురింప జేస్తుంది. శమమును, చిత్తాకాశంలోని దిక్కులన్నిటినీ శాంత పరుస్తుంది. సంసార తాపాన్ని నశింప జేసి ఆ యోగికి పరమ సుఖాన్ని ప్రసాదిస్తుంది. శమమును చిత్త స్థైర్యమును వృద్ధి పరుస్తుంది. ‘ఆత్మజ్ఞానం' అనే పునాదిని గట్టి పరుస్తుంది. కైవల్యం అందిస్తుంది. హృదయవనంలో ఉద్భవించే ఈ సమాధివృక్షం హృదయం యొక్క త్రివిధ తాపాలను హరించి శీతలత్వం ప్రసాదిస్తుంది.
2. మనో మృగము
శ్రీవసిష్ఠ మహర్షి : ఈ మనస్సు అనే ఒకానొక మృగం అనేక జన్మలలో ఎన్నెన్నో దుఃఖాలను అనుభవించి ఉంటోంది. ఒకవేళ దైవయోగం చేత సన్మార్గం లభించినప్పటికీ ఆయా వాదఉపవాదాల కోలాహలంలో పడటం చేత సన్మార్గమున ప్రయాణించటంలో అత్యంత జాప్యం జరుగుతోంది. ఆ మృగం (మనస్సు) అనేక భూములలో తిరిగి, తిరిగి, అలసి సొలసి చివరికి ఎట్లాగో వైరాగ్య వృక్షం క్రిందకు విశ్రాంతి కొరకై వెతుకుతోంది.
అహంకార-కామ-క్రోధ-భయ-ఉద్వేగముల నిరోధం - ఆ మృగ చర్మం సంపాదించాలని కామక్రోధాలు అనే బోయవారు తరుముకు వస్తున్నారు. ఇక ఆ మనో మృగమో, ‘దేహాలు' అనే ముళ్ళ
Page:768
పొదలలో దాగుకొనుచు అక్కడి ముళ్లచే బాధించబడుచూ భయం-ఉద్వేగాలచే శిథిలమై ఉంటోంది. ఇంతలోనే అది 'సంసారం' అనే అరణ్యంలో 'వాసనలు' అనే ఆవేశముచే ప్రేరితమై సంచరిస్తోంది. 'ఏదో పొందాలి’ అనే ఆర్తిని వదలక 'అహంకారం' అనే మృగతృష్ణా జలంవైపు పరుగులు తీస్తూ... విష పీడితమైన అంతఃకరణం కలిగి ఉంటోంది. ఆ అంతఃకరణంలో తృష్ణాదాహం అంతకంతకు అధికమౌతోంది!
విషయ నిరోధం - ఆహా! ఏమని చెప్పాలి. ఈ మనస్సు 'సంపదలు' అనేచోట చిక్కుకుని తత్ఫలితంగా అనేక శోక-మోహాలు పొందుతూ ఎటో తెలియరాని చోట్లకు చేరుకొని దిక్కు తోచక ఉంటోంది. ఏ దేహాలలో తాను దాగుకొన్నదో... ఆ దేహాలు శిథిలమగుచుండగా, ఇక తానే శిథిల మగుచు బహు దుఃఖాలు అనుభవిస్తోంది. శరీర సంబంధితులైన పుత్ర పౌత్రాదులతో ఏర్పడే సంబంధ-బాంధవ్యాలను నమ్ముకొని అనేకసార్లు మోసపోతూ శోకముచే, క్షుత్పిపాసచే అలమటి స్తోంది. జ్ఞానేంద్రియ-కర్మేంద్రియములచే లభించే శబ్దాది విషయాలే పైకి సుముఖంగాను, చివరికి వేటగాండ్ర బాణముల వలె బాధించేవిగాను అగుచున్నాయి. పూర్వకాలిక దుఃఖానుభవములన్నీ ఆ మనస్సు యొక్క అంతరాంతరమున పేరుకొని ఉండగా వర్తమానంలో అప్పటికప్పుడు మాత్రం ప్రక్క ప్రక్కన గల 'విషయములు' అనే గడ్డి పరకలు నలుముచూ రోజులు గడుపుతోంది.
మనోమృగం - ఈ మనస్సే స్వర్గ నరకాది ఉన్నత నీచ ప్రదేశాలలో పైకి-క్రిందికి వెళ్ళు చున్నది. 'ప్రాపంచిక వికారములు' అనే రాళ్ల మీద జారిపడి గాయములు పొందుతోంది.
ఈ మనోమృగమునకు 'తృష్ణ' అనే లతలలోను, 'దేహము' అనే పొదలలోను తిరుగాడటానికి బహు ప్రావీణ్యం పొందినదై ఉంది. స్వబుద్ధిచే అనేక ఆచారములు కల్పించుకొని వాటిలో తానే బంధించబడుతోంది. అంతేగాని స్వయంకల్పితమైన మాయ ఏమిటో గ్రహించటానికి స్వబుద్ధిని ఉపయోగించటం లేదు. ఏమని చెప్పాలి?
ఈ మనోమృగం 'ఇంద్రియములు' అనే గ్రామానికి వచ్చి గ్రామసింహంలాగా (కుక్కవలె) పరుగులెత్తటం ప్రారంభిస్తోంది. అక్కడ 'కామము' అనే దుస్సాధ్యమైన భయంకరమైన పిచ్చి ఎత్తిన ఏనుగు ఎదురుపడగా ఆ ఏనుగు కాళ్ళ క్రిందపడి నుజ్జునుజ్జు అవుతోంది.
ఈ మనోమృగం యొక్క శరీర భాగములు 'క్రోధము' అనే దావాగ్నిచే దహించబడటంచే అనేక బొబ్బలు కలిగి ఉన్నదగుచున్నది. విషయాలలో మరల మరల సంచరించటం చేత 'చింతశోకము' అనే దీర్ఘవ్యాధులు ఆ మనస్సు యొక్క అంతఃకరణమును ఎంతగానో బాధిస్తున్నాయి.
ఈ మనోమృగం తనయందు పేరుకొనియున్న అనేక అభిలాషలచే ఉపద్రవములెన్నిటినో తెచ్చి పెట్టుకొంటోంది. భోగేచ్ఛలతో కాళ్ళు అరిగిపోయేటట్లుగా సంసారమనే ఎడారిలో పచార్లు చేస్తోంది. స్వకర్మచే ఉత్పన్నమైన అనేక దారిద్య్రములచే పీడించబడుతోంది. పుత్ర-మిత్ర కళాత్రాదుల పట్ల వ్యామోహంచే గ్రుడ్డిదిగా అయి 'కపటములు-నీచకృత్యములు' అనే గోతులలో మ్రగ్గుతోంది. 'మానము' అనే భూతమును తనయందు ఉంచుకొని తత్ఫలితంగా అనేకసార్లు అవమానములపాలు
Page:769
అవుతోంది. తాను నమ్ముకొన్నవాటినన్నిటినీ 'మృత్యువు' అనే చోట పోగొట్టుకొని అలమటిస్తూ మరల మరొక చోట ప్రయాణానికి ఉపక్రమిస్తోంది.
'గర్వము' అనే కొండచిలువ ఆ మనస్సును అనేకసార్లు దిగమ్రింగగా అదిపడే పాట్లకు అంతులేదు. అనేక కోరికలు కలిగి ఉన్న కారణంగా దీనత్వమును, యాచకత్వమును పొందుతోంది. కాసేపు ఇంపైన దేహం ధరించి, ఇంద్రియములచే మోసగింపబడినదై... ఇంతలోనే ఆ ఇంద్రియములచే ఎచ్చటనెచ్చటనో నీచ ప్రదేశములలోకి విసరివేయబడుతోంది.
ఓ రామచంద్రా! రాత్రి పూట 'అంధకారం, (మరియు) భయంకరమైన చలిచే' పీడితుడగు చున్న ఓ మనుజుడు తెల్లవారి సూర్యుడు ఉదయించగానే సుఖ శాంతులను పొందుతాడు చూచావా! అనేక దోషములను తన యందు ప్రోగు చేసుకొని ఈ సంసార ముళ్ళ పొదలలో చిక్కుకున్న ఈ మనస్సు అనేక జన్మలలో ఆర్జించుకున్న పుణ్యవశం చేత అధికారి దేహము సంపాదించుకుని ‘శమము-దమము’ మొదలైన సాధనలచేత మనం ఇంతకుముందు చెప్పుకొన్న వైరాగ్య-సమాధి వృక్షం క్రింద చేరిందా... ఇక పరమ విశ్రాంతి పొందగలదు. ఓ ప్రియ సభికులారా! ఈ ప్రపంచంలో కనిపించే ఆయా భోగములలో మీ మనస్సు విశ్రాంతిని పొందింప జేయటమనేది - ఒక మృగం ఎండకు తాళలేక తాటి వృక్షం క్రిందకు వెళ్ళటం వంటిది. తాటి వృక్షపు నీడ వడగాలితో కూడిన ఎండనుండి కాపాడగలదా? లేనే లేదు. 'సమాధి' అనే చోట మాత్రమే మీ మనస్సు నిరతిశయమగు విశ్రాంతి పొందగలదని, సంపాదించుకోగలదని గమనించండి.
అనేక కార్యక్రమములలో ఉంటూ కూడా, 'సమాధి'ని తప్పక అభ్యాసపూర్వకంగా. నిర్వర్తించవచ్చని ఈ సందర్భంలో సకల జనులకు గుర్తు చేస్తున్నాను. అట్టి నిశ్చల ఆత్మదృష్టిని సకల జనులకు గుర్తు చేయడానికే నా తండ్రి, జగత్పిత అయిన బ్రహ్మదేవుడు నన్ను సృష్టించటం, ఈ అవతారమూర్తి రామచంద్రమూర్తి వేంచేయడం... మొదలైనవన్నీ ఉద్దేశింబడినాయి. సుమా!
3. ధ్యానము.... ఉత్తరోత్తర స్థితులు
శ్రీరాముడు : హే మహర్షీ! ఈ మనస్సు 'ధ్యానము' అనే సమాధి వృక్షమును సమీపించిన తర్వాత అప్పుడు ఉత్తరోత్తర స్థితులు ఎట్లా ఉంటాయి?
శ్రీవసిష్ఠ మహర్షి : చెబుతాను విను. 'ధ్యానము' అనే వృక్షపు నీడను జేరిన మనస్సు ఇక ఆ ధ్యానమునందే ప్రీతి కలిగి మరొక వృక్షమును దేనినీ కోరుకోదు. ధ్యానమే సమాధి యొక్క రూపం. మెల్లమెల్లగా ఆ మనస్సు ధ్యాన ప్రభావం చేత 'అన్నమయ-ప్రాణమయ-మనోమయ-విజ్ఞాన మయ-ఆనందమయ’ కోశములకావల ఉన్న 'ఆత్మ స్వరూపము' అనే కైవల్య ఫలముపై ధ్యాస మరలుతోంది. క్రమక్రమంగా ఉత్తరోత్తరభూమికలు పూర్ణముగా ప్రకటన మగుచున్నాయి. ఆ మనస్సు ‘ఆత్మ సాక్షాత్కారం' వైపు దృష్టి సారించగానే ఇక ప్రాపంచిక వస్తువులపై విరక్తి స్వభావ
Page:770
సిద్ధంగా (వేరే ప్రయత్నం ఏదీ లేకుండానే) కలుగుతోంది. మధురఫలం కనబడిన తర్వాత పచ్చికాయల వైపు నుండి దృష్టి మరలటం స్వభావసిద్ధమే కదా! ఇక ఆ మనస్సు వివేక వృక్ష - ఆరోహణం ప్రారంభిస్తోంది.
దేహాదులను అధిగమించటం - అట్టి మనస్సు దేహము-తత్సంబంధమైన ప్రాపంచిక వస్తువుల పట్ల అహంకార మమకారాలు త్యజించటం ప్రారంభిస్తుంది. సంసార పదార్థాల పట్ల ఇష్టవృత్తి తొలగనారంభిస్తుంది. 'నేను-నాది అనేది భ్రమ మాత్రమే' అనే నూతనమైన అవగాహన అంకురించ నారంభిస్తుంది.
సాంసారిక సంస్కార త్యాజ్యం - వివేక వృక్షమును అధిరోహిస్తున్న మనస్సు 'ఆత్మ సాక్షాత్కారము’ అనే మహాశయ ప్రభావం చేత నెమ్మది నెమ్మదిగా పూర్వార్జితమై సంస్కారములను త్యజించటం ప్రారంభిస్తుంది. అంతకుముందటి తన మానసిక స్థితిగతులను, విలువలను గమనించి ఇప్పుడు నవ్వుకోవటం ప్రారంభిస్తుంది.
హసతి ఉఛ్ఛాః పదారూఢమ్ ఆత్మానమవలోకయన్ I
'ఏతావన్తమ్ అహమ్ కాలం కృపణః కో అభవంతి?' ఇతి ॥
ఆత్మయొక్క ఔన్నత్యమేమిటో గ్రహించిన ఆ మనస్సు “అరెరే! ఇంత కాలంగా ఈ 'ఇంద్రియ విషయములు’ అనే స్వల్ప విషయాలే గొప్పవనుకొని అనేక దేహ వృక్షాలలో సంచరిస్తూ... ఈ ధ్యాన వృక్షంపై గల మధురమైన 'ఆత్మావలోకనం' అనే పండును ఎందుకు ఏమరచాను? ఈ ప్రాపంచిక విషయాలు ఎంత స్వల్పమైనవి!”... అని బిగ్గరగా నవ్వటం ప్రారంభిస్తుంది.
మైత్రి-కరుణ :ఇక ఆ మనస్సు తదితర సహజీవులతో వ్యవహరిస్తున్నప్పుడు స్వభావ సిద్ధముఅకారణము-ఆత్యంతికము అగు మైత్రి, కరుణ ప్రదర్శిస్తూ ఉంటుంది. పూర్ణకాముడై లోభమును త్యజించినవాడై ఉంటాడు. దినదినము మనస్సు తృష్ణను జయించి ఉంటుంది.
ఉపేక్ష-అపేక్ష రాహిత్యము:
ఉపేక్షతే న సంప్రాప్తం, న అప్రాప్తం అభివాంఛతి |
సోమ సౌమ్యౌ భవతి అన్తఃశీతలః సర్వవృత్తిషు ॥
ఆ మనస్సు ప్రాప్తించిన పదార్థాలను ఉపేక్షించదు. ప్రాప్తించని పదార్థములను అపేక్షించదు. సర్వ వృత్తులలో చంద్రుని వలె సౌమ్యమైన అంతఃకరణం కలవాడై, శీతల స్వభావుడై అతడు ఉంటాడు.
శాస్త్రముల అర్థ పరిశీలన - అట్టి సమాధి వృక్షముపైనే ఆసీనమై అతడు శాస్త్రార్థములోని అతిసూక్ష్మ తంతువుల శబ్దమును గ్రహిస్తూ ఉంటాడు.
ఇక ఉత్తోరత్తర భూమికలను అధిరోహిస్తూ, మనోహరమైన చిత్తవృత్తి సహితుడౌతాడు. జ్ఞానవంతుడై ఈ పుత్ర-మిత్ర-స్త్రీ-ధనాది సమస్త పదార్థములను స్వప్నములోని విషయాలవలెను, మరొక జన్మకు సంబంధించిన విశేషాలుగాను దర్శిస్తూ ఉంటాడు. అతనికి ఇక్కడ కనబడే రాగద్వేష-భయ-ఉన్మాద-అభిమాన-మోహాల ఆధిక్యత నటులు ప్రదర్శించే (కృత్రిమ) నటనలాగా
Page:771
కనిపిస్తుంది. వారికి ఎదురుగా ఈ సంసారము ఉన్నప్పటికీ ఇదంతా మృగతృష్ణ వలె మిథ్యగాను, నిస్సారంగాను అగుపడుతుంది. తరంగముల వలె క్షణభంగురంగాను, పిచ్చివాని చేష్టల వలె అర్థరహితంగాను కనిపిస్తుంది. ఆతడు అపూర్వము - - నిత్య సంసిద్ధము అగు ఆత్మపదమునందు విశ్రాంతి పొందినవాడై జీవించియున్నను అజ్ఞానివలె లోకైషణ, దారైషణ, ధణైషణ మొదలైనవి లేకుండుటచే సాంసారిక జీవుల దృష్టికి జడునివలె ఉంటాడు.
అట్టి స్థితిలో అతడు కేవలం శుద్ధమైన, కేవలమైన, బోధమయమైన, మహోన్నతమైన ఆత్మ ఫలమునకు అర్హత సంపాదించుకొంటూ ఉంటాడు. పూర్వపు అజ్ఞాన దశల వలన కలిగిన ఆపదలను గుర్తించుకొంటూ జ్ఞాన బలంచే శ్రద్దను వీడక ఉంటాడు. 'సంతోషము' అనే పానీయము త్రాగి భగవన్మత్తుడై ఉంటాడు. అనర్థ రూపములగు ధనాదులు నశించినప్పుడు కూడా అదంతా అతనికి సంతోషమే కలుగజేస్తుంది గాని, దుఃఖం కాదు. అది ఐదవ భూమికాస్థానం అని అంటూ
ఉంటారు.
శ్రీరాముడు : స్వామీ! తదితరులు అతనిని బలవంతంగా భోగదాయకములగు ఆవశ్యకకార్యముల వైపుగా బలవంతంగా మేలుకొలుపుతూ ఉంటారు కదా! అప్పుడు ఆ ఐదవ భూమికలో ఉన్నవారికి ఇబ్బంది కదా!
శ్రీవసిష్ఠ మహర్షి : అవును. ఎవరైనా భోగదాయకములగు ఆశశ్యక కార్యముల వైపుగా అతనిని ప్రోద్బలం చేస్తున్నప్పుడు, అతనికి గాఢనిద్ర నుండి బలవంతంగా మేల్కొలుపబడిన మానవునివలె అప్రసన్నంగానే ఉంటుంది. దీర్ఘమైన ప్రయాణంచేసి ఒకచోట కొంచెం నడుం వాల్చిన వానిని మరల నడకకు ఉపక్రమించడమంటే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! దీర్ఘకాలంగా జననమరణాలతో కూడిన సాంసారిక బాటయందు అజ్ఞానంచేత చరించిన ఆ జీవబాటసారి ఇప్పటి వివేక సమాధియందు ఉదారతతో కూడిన అబాధితమైన ఆత్మ విశ్రాంతి అవిఘాతంగా ఉండాలని కోరుకొంటూ ఉంటాడు. ప్రాణధారణచే అతడు తదితర జనులలాగానే బయటకు కనబడు చున్నప్పటికీ అతడు అంతరమున అహంకార రహితుడై కట్టెలు లేని అగ్నివలె ప్రకాశిస్తూ ఆత్మ యందు శాంతిని చవిచూస్తూ ఉంటాడు. అభ్యాసవశంగా బాహ్యపదార్థముల పట్ల విరక్తి గలిగి ఉంటూనే, యథాప్రాప్తములయ్యే వాటిని నిరాకరించటానికి కూడా చిత్తము కలిగి ఉండడు.
ఈ ప్రకారంగా పరమార్థ ఫలమును కలుగజేసే గొప్పదగు ఆత్మ పదమువైపు ప్రయాణిస్తూ క్రమంగా మాటలకు అందజాలని, అగోచరమైన ఆఱవ భూమికను పొందుచున్నాడు. ఇకప్పుడు బాటసారికి బాటప్రక్కన ఉన్న శ్మశాన భూములపై ఇష్టము కలుగనట్లుగా సర్వ భోగముల పట్ల అతడు విరక్తి కలిగి ఉంటాడు. సంసార వృత్తులన్నిటిపట్ల అతడు నిదురించి ఉంటాడు. ఆత్మానందంచే మదోన్మత్తుడు అవుతాడు. క్రమంగా పరిపూర్ణమైన మనస్సు పొంది ఒకానొక అనిర్వచనీయ స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. అట్టి స్థితి యందు అతడు 'మోక్షము' అనే పరమార్థ ఫలమునకు అత్యంత సమీపంలో ఉంటాడు. ఆ తర్వాత ఏడవ భూమిక పొందుచున్నాడు. అప్పుడిక ఆకాశం వలె
Page:772
విశాలరూపుడై ఉంటాడు. సమస్త వాసనలను, బుద్ధి వృత్తులను త్యజించి ఆవరణ-విక్షేప రహితుడౌతాడు. నిరతిశయానందమగు 'బ్రహ్మభావం' అనే ఫలాన్ని అస్వాదిస్తూ, అద్దానిచే అత్యంత తృప్తుడౌతాడు. ఓ రామచంద్రా! 'పరమార్థ ప్రాప్తి' అనునదే ఈ జీవుని యొక్క పరమావధి సుమా!
సంకల్పార్థ పరిత్యాగాత్ దిన - అనుదినమ్ ఆతతా |
శుద్ధ స్వభావ విశ్రాన్తిః 'పరమార్థాప్తిః' ఉచ్యతే ॥
సంకల్పిత పదార్థాల యొక్క పరిత్యాగపు ప్రభావం చేత ఆరోజుకారోజు సంభవించే విశాల మైన 'శుద్ధాత్మ స్వభావం' నందలి విశ్రాంతియే 'పరమార్థ ప్రాప్తి' అని చెప్పబడుతోంది. శ్రీరాముడు : మహాత్మా! 'బ్రహ్మము' అని దేనిని విజ్ఞులు పిలుస్తున్నారో విశదపరచండి. శ్రీవసిష్ఠ మహర్షి
భేద బుద్ధిః విలీనార్థ అభేదేవ అవశిష్యతే |
శుద్ధమ్ ఏకమ్ అనాద్యంతం “తత్ బ్రహ్మేతి” విదుర్ బుధాః ॥
చూచేవాడు-చూడటం-చూడబడేది, అనుభవించేవాడు-అనుభవించటం-అనుభవించబడేది ...ఇట్టి త్రిపుటిని గూర్చిన భేదబుద్ధి విలీనం కాగా... అప్పుడు అభేదం-శుద్ధం-ఏకం-అనాదిఅనంతం అగు సాక్షిమాత్ర చైతన్యం శేషిస్తోంది. అట్టి శుద్ధ చైతన్యమునే విజ్ఞులగు శాస్త్రకారులు ‘బ్రహ్మం' అనే పేరుతో పిలుస్తున్నారు. అట్టి బ్రహ్మానుభవమే బ్రహ్మపదము.
‘లోకైషణా’ విరక్తేన, త్యక్త ‘దారైషణ’ ఏన చ
‘ధనైషణా’ విముక్తేన తస్మిన్ విశ్రామ్యతే పదే ॥
లోకేషణ, దారైషణ, ధనైషణ... వీటిని ఈషణత్రయం అంటారు. అట్టి త్రివిధములైన ఈషణము లను పరిత్యజించిన మనుజునకు బ్రహ్మపదమున విశ్రాంతి లభిస్తుంది.
సర్వ భేద బుద్ధులు విలీనమైపోవాలి సుమా! అప్పుడే ఈ చిత్తము 'చిత్' ను సందర్శించగలదు. చిత్తశోధన - 'దృశ్యము' యొక్క తత్త్వశోధనచే 'సత్' మాత్రము శేషిస్తోంది. 'ద్రష్ట' యొక్క తత్త్వశోధనచే 'చిత్' మాత్రము (ఎఱుక) శేషిస్తోంది.
అఖండైక్యము వలన నిరతిశయానందరూపంగా ఈ చిత్తము పరిణమిస్తోంది. అప్పుడు చిత్తము యొక్క అంతిమ సాక్షాత్కార వృత్తి చేత 'భేదబుద్ధి' నశించిపోగలదు. కోమలమగు పూల దండను ఏ ఆకారంగా పరచినప్పటికీ మరల చేతితో తీసుకోగానే యథాతథమైన ఆకృతిని పొంద గలదు కదా! అట్లాగే, ఆత్మసాక్షాత్కారము పొందిన చిత్తము ఉన్నా కూడా... ఇతఃపూర్వపు అజ్ఞాన స్థితిని ఏమాత్రం పొందదు. అదిగో! ఆ ఎదురుగా కనబడే శిలను చూడు. ఆ శిలలో ఒక శిల్పి విష్ణుమూర్తి యొక్క నాలుగు చేతులను-పాదములను తన శిల్ప లాఘవంతో చిత్రీకరించగలడు. అనగా, కాబోయే శిల్పము శిలలోనే ఉన్నది కదా! కానీ ఇప్పుడు కనబడుతోందా? లేదు. శిలలో గల అప్రకటితమైన శిల్పము (విగ్రహము) ఉండియు లేకయు (సత్తుగాని-అసత్తుగాని) కూడా
Page:773
ఎట్లున్నదో ... ఆ పరమాత్మ యందు ఈ విశ్వము యొక్క స్థితి ఉన్నదని గ్రహించు. ఆత్మసాక్షాత్కారము పొందిన చిత్తమునకు జగత్తు సత్తుగాను అసత్తుగాను కాకయే ఉన్నది.
శ్రీరాముడు : పరమాత్మను సాకారునిగా కొందరు కొలచుచున్నారు. మరికొందరు అతడు సాకారుడు అవటానికే వీలులేదని వాదనలు చేస్తున్నారు. ఏది యుక్తియుక్తం?
శ్రీవసిష్ఠ మహర్షి : సాధక భక్త జనుల సౌకర్యార్థం నీవు ఇన్ని రోజుల సంవాదానంతరం కూడా ఇట్లు ప్రశ్నిస్తున్నావని నేను గమనిస్తున్నాను. సందేహ నివృత్తి అత్యంతావశ్యకం కాబట్టి సముచితమే!నీ ప్రశ్నకు సూటి అయిన సమాధానం మరల ఒక్కసారి చెప్పుచున్నాను. విను.
ధ్యానం నశక్యతే కర్తుం నచైతత్ ఉపయుజ్యతే | అబోధేన విబుద్ధస్తు స్వయమ్ అతైవ తిష్ఠతి ॥
ఓ రామచంద్రా! చిత్తం ప్రపంచమును నమ్మియున్నప్పటి అజ్ఞాన దశయందు నిష్ప్రపంచక మగు బ్రహ్మమును గూర్చిన ధ్యానం కష్టతరం అవగలదు. అజ్ఞానం యొక్క ప్రభావం చేత ప్రపంచ రహిత బ్రహ్మము ధ్యానించటం శక్యం కాదు... అని చెప్పవచ్చు. అంతేకాదు. అది యుక్తియుక్తం కూడా కాదు. అట్లాగే, ప్రబుద్ధమైన చిత్తమును సముపార్జించుకున్న తర్వాత స్వయంగానే తత్ బ్రహ్మ భావం (నిష్ప్రపంచ బ్రహ్మం) నందు స్థితి కలుగుతుంది. అట్టి స్థితిలో తన ఆరాధ్యమును సాకార పరిమితం చేయటం కూడా కష్టమే అవుతుంది. అయితే 'బ్రహ్మమే ఈ జగత్తు రూపంలో ఉన్నది' అను పూర్ణ గ్రాహ్య స్థితిలో సాకార-నిరాకార ధ్యానాలకు సంబంధించిన విరోధ భావాలన్నీ తమంతట తామే తొలగుతాయని కూడా గ్రహించు. సర్వ దృశ్య పదార్థములపట్ల ఎవనికి సంపూర్ణ వైరాగ్యం ఉంటుందో... అతడే జ్ఞాని. ఎందుకంటే జ్ఞాని మాత్రమే దృశ్యమును త్యజించగల సమర్థత కలిగి ఉంటాడు. అజ్ఞానికి దృశ్యమును త్యజించగలిగే సమర్థత ఉండదు. దృశ్యం యొక్క సాక్షీరూప బోధయే బ్రహ్మం. అట్టి సాక్షి రూప బోధచే మాత్రమే ఈ దృశ్యం యొక్క యథార్థ స్వరూప స్థాపనకు సమాధానం. అదియే సమాధి.
సమ్యక్ ఆధానం = సమాధానం (దృశ్యం యొక్క వాస్తవ రూపాన్ని గ్రహించటమే సమాధానం) అదియే సమాధి. అట్టి బోధచే ఈ దృశ్యము నాశరహితమగు బ్రహ్మమే అగుచున్నది.
ఎప్పుడైతే ద్రష్ట (సాక్షి)- దృశ్యముల యొక్క ఐక్యముతో మనోవృత్తి ఏకమగు అఖండాత్మా కారమున స్థితి కలిగి ఉంటుందో... అదియే సమాధి యందలి విశ్రాంతి. దృశ్య స్వభావ విరుద్ధమైన (‘దృశ్యము తనకు అభేదం' అను అవగాహనతో కూడిన) చిదానంద స్వభావమే బ్రహ్మజ్ఞాని యొక్క నిజ స్వభావం. 'దృశ్యము వైపుగా ఉన్ముఖమవడమే (నేను చూచే వాడిని - ఇది చూడబడేది... అనే -
భేద భావమే) అజ్ఞానము'... అని విజ్ఞులు పలుకుచున్నారు.
ఈ సాంసారిక విషయాలు (ద్వితీయంగా) అజ్ఞానికి మాత్రమే వాటి వాటి భేద రూపాలుగా కొన్ని స్వాదిష్టములుగా తోచుచూ ఉంటాయి. జ్ఞానికి ఇందులో ఇష్ట - అయిష్టములు ఉండవు. అమృతం తాగేవాని దగ్గరకు వెళ్ళి 'ఏవయ్యా! ఆ అమృతం త్రాగటం ఆపి ఈ పాత్రలోని కల్లు తాగకూడదా?'... అంటే అతడు ఇష్టపడతాడా? లేదు.
Page:774
ఓ రామచంద్రా! ఎవడు తన హృదయంలోని 'తృష్ణ' అను మకిలిని తొలగించుకొంటాడో, లోక-స్త్రీ-ధన ఈషణాలను పరిత్యజిస్తాడో, ఆత్మనిష్ఠ అభ్యసించ నారంభిస్తాడో... అట్టివానికి 'ధ్యానం - సమాధి’ అనేవి అప్రయత్నంగానే కలుగుతాయి. తృష్ణ ఉన్న చోట ఆత్మ స్వరూప-అనుసంధాన రూపమగు బోధ చలించిపోతుంది. గురువుల వాక్యములు సత్ఫలితమగు ప్రయోజనం కలిగించ లేవు. ఎవనికి తృష్ణ ఉండదో, అట్టి తత్త్వజ్ఞునకు ద్రష్ట-దర్శన దృశ్యములనే త్రిపుటికి చోటే దొరకదు.
మరొక విధంగా... తృష్ణారహితుడైన జ్ఞాని యొక్క తృష్ణ అనంతత్వము సంతరించుకోగలదని కూడా చెప్పవచ్చు. ఏ విధంగా అంటావా? తృష్ణారాహిత్యం యొక్క ప్రభావం చేత అకృత్రిమమైన సమాధిని అవధరించిన మహానీయుడు స్వయంగా విభాగరహితమైన అనంతాత్మ స్వరూపంగా ఉదయించుచున్నాడు. అనగా, సర్వ ధ్యానములు అతనివే అగుచున్నాయి. అతని యొక్క సర్వత్రా అనురాగమే విరాగమగుచున్నది. అట్టివాని చింతనీయమగు బాహ్య పదార్థ సంబంధమైన బోధ ఎట్లా ఉన్నప్పటికీ,... అతడు తన చిత్తమును సమాధియందు లగ్నము చేసినా (లేక) చేయకపోయినా కూడా... వ్యవహార తత్పరుడు అయినా (లేక) కాకపోయినా కూడా... అతడు సంసార ధ్యాత కాడు. అతని దృష్టియందు అంతా కూడా ఆత్మరూపంగానే ఉంటుంది. కనుక అతడు సమాధిని అవధరించినవాడే అవుతాడు. టెక్కలు లేని పక్షికి స్వయంగా నిశ్చలత్వం సంభవించినట్లుగా... తృష్ణారహితుడగు జ్ఞానికి అనంతాత్మ యొక్క ధ్యానం స్వయంగా (వేటే ప్రయత్నమనేదేదీ లేకుండానే) కలుగుతోంది. అతనికి శుద్ధ బోధ రూపమగు ఆత్మ సాక్షాత్తుగా అనుభూతమౌతూ ఉండగా ఇక జ్ఞాన విరోధమైనదంటూ ఏదీ ఉండదు. ప్రజ్వలిస్తున్న అగ్నిలో నెయ్యి బిందువు ఉండదు కదా!
పరం విషయ వైతృష్ణ్యం సమాధానముదాహృతమ్ |
అహృతం యేన తన్నూనం తస్మై నృబ్రహ్మణే నమః ॥
సంపూర్ణ విషయతృష్ణా రాహిత్యమే 'సమాధి'! విషయం తృష్ణారాహిత్యాన్ని ఎవరు సంపాదించు కుంటారో, అట్టి స్వయంబ్రహ్మ స్వరూపునికి నా నమస్కారాలు సమర్పిస్తున్నాను. ఎవరికి నిజమైన విషయతృష్ణా రాహిత్యం యొక్క ప్రభావం చేత, జ్ఞానం చేత సమస్త భేదాలు నశిస్తాయో, అతనిదే ‘ఉత్తమం-దృఢం’ అయిన ధ్యానం. వాని ఆత్మధ్యానం తొలగించటానికి ఇంద్రాది దేవతలు, అసురులు కూడా చాలరు. ఓ ముముక్షువులారా! మీరంతా కూడా అట్టి దృఢమైన ఉత్తమమైన (తృష్ణారహిత) ధ్యానాన్ని సంపాదించుకొనెదరు గాక! తృణ ప్రాయమైన ఇతర ధ్యానాల వల్ల ఏం ప్రయోజనం?
4. బ్రహ్మమునందు విశ్రాంతి - ఉపాయాలు
శ్రీరాముడు : మహర్షీ! ప్రపంచము-ప్రపంచాధీశుడగు పరమాత్మ... అను ఈ రెండింటినీ సమగ్రంగా అవగాహన చేసుకోవటమెట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : 'ప్రపంచం' అనే శబ్దం, అద్దాని అర్థం ప్రతిపాదించబడేదంతా అజ్ఞాని యొక్క అజ్ఞాన నాశనం కొఱకే గాని, జ్ఞాని కొఱకు కాదు. సర్వ సభికులారా! ఏ నిరతిశయానంద ప్రపంచం,
Page:775
ప్రపంచాధీశుడు - ఇవన్నీ కూడా ఏకరూపమై అభిన్నంగా భాసిస్తాయో అట్టి బ్రహ్మం నందే విశ్రాంతిని పొందండి. ఎందుకంటారా? ఆత్మ తప్పితే ఇక్కడగాని, మరొక చోటగాని మరింకేదీ లేదు. 1.ఆరుక్షువుల యొక్క (సాధనపరుల), 2. ఆరూఢుల యొక్క (యోగాన్ని అధిరోహించినవారి)
సర్వ మననాది ఆయా భూమికలన్నిటిలో ఆత్మకంటే వేరైన సత్త-అసత్తలు గాని, మరింకే ద్వైతాద్వైతములు గాని లేవు. అట్టి తదితరములైన ఏవైనా కార్యక్రమములు శాస్త్రములు ఎక్కడైనా చెప్పటం జరిగితే అవన్నీ అజ్ఞుల కొరకే గాని, విజ్ఞుల కొరకు కాదు.
శ్రీరాముడు : అట్టి బ్రహ్మమునందు విశ్రాంతి పొందటానికి సాధకులమగు మాకు ఏవైనా సుల భోపాయలు చెప్పండి.
శ్రీవసిష్ఠ మహర్షి : అందుకు 3 సులభోపాయలు చెబుతాను, విను.
ఉపాయ ఏకః 'శాస్త్రార్ధో’, ద్వితీయో 'జ్ఞసమాగమః' |
'ధ్యానం' తృతీయం నిర్వాణే శ్రేష్ఠః తత్ర ఉత్తరోత్తరః || ॥
మొదటి ఉపాయం నిరంతర శాస్త్రార్థములను అభ్యసించటం; రెండవ ఉపాయం విజ్ఞులను సమీపించి, శరణువేడి వారితో సంభాషిస్తూ ఉండటం; మూడవ ఉపాయం - - ధ్యానం (శాస్త్రార్థాలను వివేకంతో మననం చేస్తూ ధ్యాసను జగత్మ నుండి పరమాత్మవైపు తరలించడం) .ఈ మూడు పై వరస ప్రకారం ఒక దానికంటే తరువాతది శ్రేష్ఠమైనది.
అపరిచ్ఛిన్నము, నిత్యం అపరోక్షమైనది (ప్రత్యక్షముగాని, పరోక్షముగాని కానిది) అగు బ్రహ్మ చైతన్యమే ఈ 'జీవుడు’ అను రూపము పొందింది. స్వ ప్రతిబింబమే దర్పణంలో అగుపడునట్లు బ్రహ్మమే అంతఃకరణోపాధి వశంచేత పరస్పరం భిన్నం అయినట్టి ఈ జీవుడు అనబడు రూపం గ్రహిస్తోంది సుమా! ఈ జగత్తులో రాగద్వేషముల సంఘటనచే బ్రహ్మ మొదలు స్తంభము వరకు అనేక విశేషాలున్నాయి. అయితే స్వతఃసిద్ధము-శుద్ధము అగు చైతన్యమే ఈ సర్వ విశేషములందు అంతటా వ్యాపించి ఉన్నది. స్వకర్మ వైచిత్రముచే ఈ కనబడే సమ-విషమ శరీర భేదములందు అంతటా ఉదయించి ఉన్నది ఆ చైతన్యమేనయ్యా! ఈ జీవుడు బ్రహ్మమే అయి ఉండి కూడా ఈ నిస్సార జగత్తులో జన్మకర్మాదులన్నీ ఆశ్రయిస్తూ సుదీర్ఘ కాలం వెళ్ళబుచ్చుచున్నాడు.
ఇట్లు సంసార చక్రంలో తిరుగాడుచున్న అసంఖ్యాక జీవులలో ఒకానొకడు సౌభాగ్యవశం చేత మోక్షమునకు అధికార యోగ్యమగు జన్మను పొందుచున్నాడు. అట్లా పొంది, శాస్త్ర జ్ఞానం, సజ్జనులతో సాంగత్యం... ఇటువంటి ఉపాయాలు ఆశ్రయిస్తున్నాడు... అప్పుడు సమస్త 'జననమరణ-భ్రమణ' రూపమగు ఈ 'జగత్తు' అనే ఆట యొక్క పూర్వపరాలేమిటో చక్కగా గ్రహిస్తు న్నాడు. అట్లు బాగుగా ఎఱిగిన మహాత్ముడు 1. జ్ఞానం, 2. తృష్ణారాహిత్యం అనే రెండు దీపాలలో ఒకదానిని వెలిగిస్తున్నాడు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి సిద్ధించినా కూడా రెండవది తనంతట తానే సిద్ధించగలదు. ఇక ఈ జగత్తు విషయమంటావా? అగ్నితో భస్మీభూతమైన దూదిప్రోగులు గాలిచే ఎగురగొట్టబడి ఆకాశంలోకి ఎగసిపోవునట్లు జగద్విషయాలన్నీ కూడా ఏదో అనామక ప్రదేశంలో
Page:776
పడిపోతాయి! అట్లాగే జ్ఞానాగ్నితో భస్మీభూతమైన జగత్భావనలన్నీ ఆత్మ బుద్ధి అనే గాలిచే ఎరుగగొట్టబడి శాంతమగు పరమాత్మ అనే ఆకాశంలో ఎచ్చటనో లయమైపోతాయి.
శబ్దమాత్ర జ్ఞానం -
చిత్రాగ్నినేవ బోధేన తేన జాడ్యం న శామ్యతి ।
నిర్మూలాపి జగత్ భ్రాంతిః ఏనాశు న విలీయతే ॥
ఓ రామచంద్రా! కొందరు వేదాంత జ్ఞానాన్ని మాటలతో పలుకుచున్నారు గాని... అనుభవైక వేద్యం చేసుకొనే ప్రయత్నం చెయ్యటం లేదు. చిత్రపటంలోని అగ్నిచే చలిపోతుందా? పైపై జ్ఞానంచే అజ్ఞాన మూలం నశించదు. అట్టి ఆపాత జ్ఞానంచే జగద్ర్భాంతి త్వరగా తొలగిపోయినట్లే కనిపించి నప్పటికీ కూడా... వాస్తవానికి అజ్ఞానం “నిర్మూలనం కానిదే” అగుచున్నదని గుర్తు చేస్తున్నాను.
ఏ విధంగా అజ్ఞానికి అతని అజ్ఞత్వం కారణం చేత జగద్ర్భాంతి రోజు రోజుకూ అభివృద్ధి చెందుతూ ఉంటుందో... అదే విధంగా జ్ఞానికి తన యొక్క విజ్ఞాన కారణం చేత జగత్ప్రమ రోజు రోజుకూ తరుగుతూ వస్తుంది. అజ్ఞానం కలిగి ఉండకపోవటమే జ్ఞానానికి గుర్తు. అట్లు దహించివేయ బడిన అజ్ఞానం గల జ్ఞాని యొక్క దృష్టికి 'జగత్తు' శబ్దార్థ రహితమైనదిగా కనబడుతుంది. అజ్ఞానికి కనబడే జగత్తు జ్ఞానికి చిత్రపటంలోని స్వర్గ మర్త్య-పాతాళ లోకాలుగానూ, 'శూన్యం' అనే మూల పదార్థంచే తయారుచేయబడిన బొమ్మలకొలువుగాను, నిద్రించిన వానిచే కల్పించబడిన స్వప్నదృశ్యం గాను అనిపిస్తోంది. జ్ఞాని యొక్క అనుభవమునకు ఇక్కడి చిత్తం, ఆ చిత్తం వెంటనంటి ఉండే ఇచ్ఛ, ఆ ఇచ్ఛకు కనిపించే జగత్తు ఇవన్నీ కూడా చిదాకాశముగానే తెలియవస్తున్నాయి. ఎందుకంటే బోధ ఉదయించిన తర్వాత జ్ఞానికి ఇచ్ఛా జగత్తులు రెండూ ఇక మచ్చుకనైనా ఉండజాలవు.
1. అహంకాం = “ఏకం - - అఖండం -సర్వం అయిన చిదాకాశం (లేక, బ్రహ్మం) కంటే నేను వేఱుగా ఉనికి కలిగి ఉన్నాను. 'నేను'తో బాటు 'నాది' అనేది ఉంది...” అనే దర్శనం.
2. జగత్ స్థితి = 'పరమాత్మకు అన్యమై ఈ జగత్తు కలదు' అనే దర్శనం.
... పై ఉభయ దర్శనాలు పరమాత్మ గురించిన అద్వితీయ జ్ఞానం ఉదయించగానే సూర్యోదయా నంతర చీకటి తెరల వలె తొలగిపోతాయి. అట్టి జ్ఞానికి ఈ జగతి స్థితి పరమ ప్రకాశరూపమగు బ్రహ్మముగానే చెన్నొందుచున్నది. అది పూర్ణ ప్రబుద్ధుని స్థితి.
ఇక అర్ధ ప్రబుద్ధుని స్థితో?... అతని చిత్తమునకు ఈ జగత్ స్థితి అనుక్షణికమైన మార్పులతో కూడినదై ఉండటంచేత దీనికి 'ఇది' అని చెప్పగలిగిన రూపమేదీ కనిపించడం లేదు. అయినప్పటికీ అతనికి 1. బ్రహ్మం, 2. జగత్ స్వభావం అనబడే రెండు వేర్వేరైన తత్త్వములు ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ అర్ధ ప్రబుద్ధుడు ఇంకా ఆత్మతత్త్వమును పూర్తిగా పొంది ఉండకపోవటం చేత... ఆత్మ యొక్క ‘బోధాధిక్యత’ చేత... ఒకప్పుడు ఈ జగత్తును 'ఏకం'గా గాంచుచున్నాడు. ఇక మరొకప్పుడు ఏమఱపు చేత దీనినంతటినీ 'అనేకంగా గాంచుచున్నాడు. ఏక రూపం-అనేక రూపాల మధ్య అతడు సంచారం చేస్తున్నాడు. అంటే బోధ యొక్క ప్రభావం చేత ఒక సమయంలో 'మైత్రి-కరుణ’ మొదలైన ఉత్తమ గుణములను ఆశ్రయిస్తున్నాడు. మరొక సమయంలో ఈ జగత్తును నమ్మి
Page:777
ఉండటం చేత, అజ్ఞానవశం చేత ఇక్కడ పరస్పర వివాదాలతో తాదాత్మ్యం పొందుతూ వ్యవహరిస్తు న్నాడు. అనగా ఆ అర్ధప్రబుద్ధుడు 'జ్ఞాన అజ్ఞానాలు' అను రెండింటిలో ఏ భాగం ఎప్పుడు తన యందు ప్రబలంగా ఉంటుందో, ఆ సమయంలో అట్లే తన్మయుడై ఉంటాడు. అతడు తన యొక్క సాధనాక్రమమును కొనసాగిస్తూ ఉండగా పరిపక్వ స్థితిని పొందగలడు. పరిపక్వ స్థితిని పొందిన జ్ఞాని ఇక ఈ జగత్తు యొక్క భావాభావాలు పొందడు. తురీయావస్థలో ఉన్నవాడు జాగ్రత్స్వప్న సుషుప్తులను పొందకయే ఉన్నట్లుగా... జ్ఞాని ఈ జగత్తును చూస్తూ కూడా, దానిని పొందడు. శ్రీరాముడు : హే మహానుభావా! ఈ మనస్సే కదా జగత్తును పొందుచున్నది?
శ్రీవసిష్ఠ మహర్షి : అవును. మనస్సే ఈ జగత్తును పొందుతోంది, త్యజిస్తోంది కూడా! శ్రీరాముడు : ఈ మనస్సు యొక్క రూపం ఏమిటి? అది నశించేది ఎట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి :
వాసనైవ మనః సేయం స్వ విచారేణ నశ్యతి |
అవస్తుత్వాదతో మోక్షో నాత్మనాశే ప్రవర్తతే ॥
మనస్సు యొక్క రూపం వాసనలే! అయితే అట్టి వాసన 'ఆత్మ విచారణ' చే నశించగలదు. కాగా, మనస్సు అవస్తుమయమే (మాయ-అవిద్యామయమే) కదా! కాబట్టి మనస్సు (వాసనలు) అవిద్యమానమై ఉన్నంత వరకు మోక్షము సంభవించదు. వాసనలు నశించాయా, మోక్షం స్వతః సిద్ధంగానే ప్రాప్తించగలదు.
ఓ రామచంద్రా! ఈ విధంగా ముముక్షువు యొక్క మనోమృగం 'ధ్యానం' అనే వృక్షాన్ని సమీపించి అక్కడ 'బోధ' అనే ఫలం సంపాదించుకుంటోంది. పూర్ణపరిపక్వస్థితిని సంపాదించు కుంటోంది. 'పరమాత్మ బోధ స్వరూపము - పరమానంద లక్షణముతో కూడుకున్నది’... అయిన అమృత ఫలమును భుజిస్తోంది. అప్పుడు సంసార బంధనము నుండి విముక్తినొందుచున్నది.
కాబట్టి...‘వివేకం-వైరాగ్యం' మొదలుగా గల సాధనల ద్వారా 'ధ్యానం' సహాయంతో మనస్సును 'జగత్తు' అనే అనేకములతో కూడిన స్థానం నుండి ఉపసంహరించి 'ఆత్మ' అను ఏకస్థానంలో లయింపజేయుటమే మోక్షప్రాప్తి. లేక “ఈ సంసారం’గా కనబడేదంతా సర్వదా పరమాత్మ యొక్క స్వరూప విన్యాసమే” అనే దృఢానుభవమే మోక్షం.
5. అనురక్తి నుండి సమాధికి
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! 'పరమార్థ ఫలప్రాప్తి'కి సోపానములు ఈ విధంగా ఉంటాయి. 1. ప్రాపంచిక భేద విషయాలపట్ల అనురక్తి, తత్ఫలితంగా జన్మ-కర్మలు
2. అనురక్తి నుండి ... 'విరక్తి'
3. విరక్తి నుండి ... ‘వైరాగ్యము'
Page:778
4. వైరాగ్యము నుండి ... 'శాస్త్ర జ్ఞాన సముపార్జన' 5. అట్టి జ్ఞానము నుండి ... ధ్యానము 6. ధ్యానము నుండి ... సమాధి
ధ్యానముచే పరమార్థ ఫలం తిన్నగా అనుభూతం కాగలదు. అప్పుడీ జీవుడు ముక్తి రూపంగా పరిణామం పొందుతాడు. అప్పటి ముక్తి రూప స్థితిలో అజ్ఞానము నశించిన కారణం చేత-అప్పటి దాకా వెంటనంటి ఉన్న చరమ సాక్షాత్కార వృత్తి రూప బోధ కూడా అసత్తుగా పరిణమిస్తుంది. అప్పుడు ఇతఃపూర్వం ఉండి ఉన్న ‘మనస్సు’ కేవలం పరమార్థమగు ఆత్మ స్వరూపమే అగుచున్నది. ఆ మనస్సు యొక్క పూర్వకాలికమైన విషయాన్వేషణ అనే సంస్కారం 'నూనె అయిపోయిన తర్వాత దీపం' లాగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అక్కడ ఇక అనంతమైన ఆత్మ ప్రకాశరూపమగు పరమాత్మదశ మాత్రమే శేషించుచున్నది. అనగా, ధ్యానము యొక్క పరమార్థ ఫలము సంప్రాప్తించటం చేత మనస్సు బోధ రూపత్వం చెందుతోంది. అప్పుడే మనస్సు టెక్కలు తెగిన తర్వాత పడి ఉండే పర్వతం లాగా వజ్రతుల్యమైన దృఢనిశ్చల స్థితిని అవధరిస్తోంది. విషయములు గురించి చింతించుచుండే మనోస్వభావం ఎచ్చటికో పారిపోతుంది. 'బోధ రహితం-విభాగ శూన్యం-సర్వాత్మకం-సద్రూపం' అయినట్టి నిర్మల బోధ (చిన్మాత్రం) మాత్రమే శేషిస్తోంది. మనస్సు సర్వ భేదములను త్యజించినప్పుడు ఇక అద్దానిని ‘బోధ స్వరూపం' అంటారు. అంతేగాని మనస్సు అని అనరు.
పూర్వ కాలంలో ఈ మనస్సు - ఈ జడ దేహాదుల గూర్చిన అవివేకముచే - జడంగానే ఉండేది. ఇప్పుడో, జ్ఞానబలిమిచే సువివేచనచే దేహమును జడమాత్రంగా అది దర్శిస్తోంది. అట్టి దర్శన ప్రభావం చేత బోధ రూపంగా ఉదయిస్తోంది. ఇక ఆ బోధరూప సత్త 'అనాది-అనంతమునిర్మలము’ అగు ఆత్మ ప్రకాశమును కలుగజేయునదిగా అగుచున్నది. సమస్త వాంఛలు త్యజించటం చేత... ‘అనాది’ గాను, అనంతమగు ఆత్మ యొక్క ధ్యానముచే... 'అనంతం' గాను, సంసార దోషం తొలగటంచే ‘నిర్మలం’ గాను, ఆ బోధరూపచిత్కళ స్వయంగా సిద్ధిస్తోంది.
ఎంతవరకైతే ఈ ప్రపంచం పట్ల ధ్యానం ఉంటుందో అంత వరకు ఆత్మధ్యానం కుదిరేది కాదు. ఎంత వరకు జీవుడు ఆత్మధ్యానం చేత బ్రహ్మమును పొందలేదో, అంత వరకు విషయాల మననం కారణంగా పరమపదమున విశ్రాంతి లభించదు. పరమార్థమగు ఆత్మతోటి ఏకత్వం పొందిన మరుక్షణం మనస్సు ఎచటికో తుఱ్ఱుమంటుంది. ఆ మనస్సుతోటే దాని సైనికులైనట్టి ‘వాసన-కర్మ-హర్షం-క్రోధం'... వీటికి సంబంధించిన మనోవృత్తులు కూడా ఎచటికో పరుగులు తీస్తాయి. ఆ స్థితియందు యోగి కేవలం ధ్యాన నిష్ఠుడై కనిపిస్తాడు. అతని ఆత్మ ధ్యాన నిష్ఠ అత్యంత దృఢతరమై ఉంటుంది. సమాధిస్థితి ఎప్పుడు సిద్ధిస్తుంది?
ఓ రామచంద్రా! యోగికి సమాధి స్వయంగా సిద్ధించగలిగేది ఎప్పుడో చెబుతాను విను. 1. సమస్త భోగములందు విరక్తి కలిగినవాడు.
2. ఇంద్రియ వృత్తులన్నీ పూర్ణముగా శమించినవాడు
Page:779
3. ఈ దృశ్యం పదార్థములన్నిటి పట్ల 'అ రుచి' కలిగియున్నవాడు
4. ఆత్మనే దర్శిస్తూ ఆత్మయందే రమించే వాడు. అనగా సహజీవులందరిలోని నిర్మలాత్మను అంతరంగ దృష్టిచే అన్నివేళలా దర్శించే అభ్యాసం కలవాడు.
5. క్రమంగా ప్రాపంచిక వృత్తులన్నీ నశించినవాడు.
6. మనస్సును ప్రపంచం నుండి ఉపశమింపజేసి విశ్రాంతిని పొందింపజేసినవాడు...
.. అట్టి వానికి సమాధి స్వయంగా సిద్ధిస్తుంది. అప్పుడతనికి సమస్తము బ్రహ్మరూపమే అగుచుండగా ఇక దేనిని గురించి ధ్యానించాలి? ఇక అతనికి శాస్త్రములు ధ్యాననిష్ఠ యందు నియమించవలసిన బోధించవలసిన అగత్యమే ఉండదు. ఎందుకంటే ఆతని అనుక్షణిక దర్శనం ఆత్మభావనచే పరితప్తమై, పరిశ్రుతమై ఉంటుంది.
ఎంత వరకైతే భోగములు కనబడుతూ ఉంటాయో, అంత వరకు విషయ వైరాగ్యమును యోగులు సముపార్జిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఆత్మవంతుడగు జ్ఞానికి వాసనల యొక్క అభావ బలం చేత జగత్పదార్థములు కనబడకయే పోతాయో, అప్పుడు ఆ జ్ఞాని సమాధియందున్నట్లే! అట్టివాడు తదితర సహజీవులను ఉద్దేశించి దేహముతో కర్మలు నిర్వర్తిస్తున్నప్పటికీ అతని సమాధి స్థితికి వచ్చే లోటేమీ ఉండదు.
‘గుడ పిపీలికాన్యాయం’ను అనుసరించి (బెల్లమును ఆశ్రయించిన గండుచీమ ఆ బెల్లమును వదల లేకున్నట్లు) ఆత్మానందనమును ఆస్వాదించ ప్రారంభించిన మనుజుడు ఇక తన మనస్సును ఆత్మాస్వాదన నుండి మరలించనే లేడు.
ధ్యాన యుక్తమగు చిత్తమునందు 'జ్ఞానము’ ద్వారా ఏ విషయ విరక్తి అతిస్వభావికమై ఉంటుందో... అదియే 'సమాధి'. తదితరమైనదేదీ నిజమైన సమాధి కాదు. రాగాదులతో కూడిన మనస్సు ఎక్కడున్నదో అక్కడ ఎవనికీ నిజమైన సమాధి జనించదని గ్రహించు. రాగము లేని మనస్సు సమాధి స్వరూపమే అవుతుంది.
శ్రీరాముడు : మహర్షీ! భోగాల పట్ల విరక్తి కలిగిన తర్వాత, ఇక ధ్యానాన్ని, సాధకుడు సంపాదించు కోవటమెట్లా?
శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! భోగాల పట్ల విరక్తి కలిగిన తర్వాత ఇక 'ధ్యానం' అనే కార్య క్రమం, తత్సంబంధమైన బుద్ధి యొక్క అవసరం నాకేమీ కనిపించటం లేదు. భోగాల పట్ల అనురక్తి కలిగి ఉన్నప్పుడంటావా? అట్టి అనురక్తి ఉన్నంత కాలం ధ్యానం వలన ఏం ప్రయోజనం? విషయా నురక్తి ఉన్న చోట విషయధ్యాస స్వయంగానే కలుగుతుంది సుమా! కనుక ఈ సాధకుడు విషయాల పట్ల విరక్తి సంపాదించుకుంటే చాలు, ధ్యానం దానంతట అదే రూపుదిద్దుకుంటుంది. 'ఇదంతా ఆత్మ స్వరూపమే కదా!’ అను దృశ్యం పట్ల ఏర్పడే దృఢమైన అభిప్రాయంతో చేసే మననమే ధ్యానం.
దృశ్యాస్వాదనముక్తస్య, సమ్యక్ జ్ఞానవతో మునేః ॥ నిర్వికల్పం సమాధానం అవిరామం ప్రవర్తతే ॥
Page:780
దృశ్యం యొక్క ఆస్వాదన లేనివాడు, ఉత్తమ జ్ఞానయుక్తుడు... అగు మునికి నిర్వికల్ప సమాధి నిరంతరం స్వయంగానే కలుగుతూ ఉంటుంది. ఎవనికి ఈ దృశ్యం కించిత్ కూడా రుచించకయే ఉంటుందో, అతడే 'ఉత్తమ జ్ఞాని' అని చెప్పబడుచున్నాడు. ఎందుకంటే, భోగాలు ఎప్పుడైతే రుచించవో, మరుక్షణం అతనిలో ఉత్తమ జ్ఞానం తనంతట తానే ఉదయిస్తోంది. ఎవనికైతే ‘బ్రహ్మ స్వభావము' నందు విశ్రాంతి ప్రాప్తించిందో... అతనికి భోగాలలో రుచి ఎట్లా కలుగుతుంది. ఎందుకంటే బ్రహ్మ స్వభావ విరుద్ధమైన అజ్ఞానముచేతనే భోగము పట్ల రుచి ఏర్పడుతోంది. జ్ఞానంచే ఆ అజ్ఞానం తొలగిందా... అప్పుడిక భోగాల పట్ల అరుచి స్వయంగానే ఏర్పడగలదు. శ్రీరాముడు : మహర్షీ! ఈ మనస్సును బోధరూపంగా మలచటానికి వేదాంత శ్రవణాది ఉపాయాలు అవసరం కదా! అట్టి శ్రవణం ఎప్పుడు ముగించవచ్చు? ఎప్పటికి సమాధిలో తత్పరుడై ఉండవచ్చు? శ్రీవసిష్ఠ మహర్షి : (చిరునవ్వుతో) సాధకుడు మొట్టమొదట 1. వేదాంత శ్రవణం, 2. ఉపనిషత్తులు వంటి మోక్ష శాస్త్రాల పఠనం చేయటం, 3. ప్రణవాదుల జపం... మొదలైనవి కొనసాగిస్తూ క్రమంగా మనస్సును సమాధి యందు తత్పరం చేయాలి.
సమాధి నుండి లేచిన వెంటనే శ్రవణ-మనన-పఠన-జపాదులను అందుకోవాలి. ఎట్లాగైనా సరే 'భేద రహితము-సర్వ సంశయ వర్జితము-అతి రమణీయము-సుషుప్తి వలె శాంతం-సమం-శుద్ధం' అగు చిత్తంతో నిర్వాణ రూపమగు సమాధిలో పై (ఉభయ సందర్భాల లోను) అతడు నెలకొని ఉండు గాక! యథా సమయంలో సర్వాత్మత్వానుభవం సిద్ధించిన తర్వాత అభ్యాసావశ్యకత స్వయంగానే ఉపశమించగలదు. అంతటా స్వస్వరూపమగు ఆత్మ విన్యాసమే ప్రత్యక్షమగుచుండగా ఇంక సమయాసమయములు, విధి-నిషేధములు ఎక్కడ మిగులుతాయి?
6. ముముక్షువు - మొట్టమొదటి మెట్లు
శ్రీరాముడు : హే మహాత్మా! వసిష్ఠ మహర్షీ 'సమాధి గురించి మీరు ప్రవచించిన సూక్ష్మార్థం అత్యంత అమోఘమైనది. కేవలం 'మనస్సును సర్వ జగద్విషయ రహితమైన స్థానంలో ప్రతిక్షే పించటం’... అను సర్వజన సర్వస్థితుల సుసాధ్యమైన అభ్యాసం చేత ధ్యాన సమాధులు ఒనగూడుతాయి అనేది సర్వశాస్త్ర అమోదమైన ప్రవచనంగా నేను గమనిస్తున్నాను. అట్టి సులభతర మార్గాన్ని ప్రబోధించిన మీకు ముముక్షువులమగు మేమంతా సర్వదా కృతజ్ఞులం. స్వామీ! సంసార భారాన్ని మోస్తూ మిక్కిలి శ్రమ అనుభవిస్తూ, మరణ మూర్ఛాది అనేక సంకటములలో దొరలుచున్న దేహికి ఆత్మలో విశ్రాంతి కలిగించగల సమాధిని సంపాదించటానికి గల వరుసక్రమమైన సోపానాలను (మెట్లను) మరల ఒకసారి ప్రవచించవలసినదిగా వేడుకొంటున్నాను.
శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! నీవు అడిగినట్లే సోపానరూపమైన విధానం చెప్పుతాను విను. 1. సంసారంముపట్ల వైరాగ్యం - సుదీర్ఘ మార్గంలో ప్రయాణిస్తూ సూర్య తాపముచే ఎంతగానో భేదం పొందిన బాటసారులు విశాలమైన నీడను ప్రసాదించే వృక్షం కనబడగానే ఆ విశాల వృక్షం
Page:781
క్రిందకు పరుగులు తీస్తారు చూచావా? అట్లాగే పూర్వ జన్మలయందు గాని, ఈ జన్మయందు గాని గావించిన జప-తప-సత్కార్యముల ప్రయోజనంగా సంసార మార్గ బాటసారియగు జీవునికి ఎప్పుడో ఈ సంసారం పట్ల అరుచి (లేక) వైరాగ్యం కలుగుతోంది. "అనుక్షణం మార్పు చెందే ఈ సంసారమును నమ్మి ఉన్నందుకు నాకీ అవిశ్రాంతమైన దౌర్భాగ్యం వాటిల్లుతోంది కదా! ఇట్లా అజ్ఞానులతో సహవాసము, సంబంధ బాంధవ్యములు కలిగి ఉన్నందుకు నాకు అనేకసార్లు దుః ఖం-బంధం-మోహం అధికమగుచున్నాయే!”... అనే వివేకం హృదయంలో ఉత్పన్న మౌతోంది. అట్టి వైరాగ్యమయమైన వివేకపు అంకురం మనస్సులో ఉదయించగానే ఇక అతను మెల్లగా కనులు తెరచి ‘సాధుత్వముచే సువిశాలమైన హృదయము గల మహానీయులు ఎక్కడెక్కడున్నారా?’... అని పరికించి చూడటం ప్రారంభిస్తున్నాడు. మునుముందుగా అజ్ఞానులతో సహవాసమును తగ్గిస్తూ త్యజించి వేయటం మొదలెడుతున్నాడు. పవిత్రులగు విద్వజ్ఞుల మార్గంలో స్నాన-దాన-తపోయజ్ఞాదులు ప్రారంభిస్తున్నాడు. తనకు యోగ్యము, కోమలము, తన స్వభావమునకు అనుకూలము, తదితర జనులకు హితము, అందరికీ కూడా ఆనందకరం అగు శ్రేయో విధులను ఆశ్రయిస్తున్నాడు. పెద్దల-విజ్ఞుల అభిప్రాయాలను గౌరవిస్తూ తనయందు దురహంకారములను పారద్రోలుచున్నాడు. సర్వజన ప్రియునిగా, భవ్యశీలునిగా పరోపకారిగా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నాడు. శాస్త్ర సమ్మతాలైన పవిత్ర కార్యక్రమాలకు, భగవత్ స్తోత్ర పఠనాలు సామూహిక పూజలు వంటి భగవత్ కార్యక్రమాలకు ఉత్సాహం చూప ప్రారంభిస్తున్నాడు. అతని మాట, క్రియ, ప్రవర్తన - సౌమ్యత సంతరించుకో నారంభిస్తున్నాయి.
2. సత్సంగం - ఇకప్పుడు దుస్సాంగత్యం త్యజిస్తూ సత్సాంగత్యాన్ని ఆశ్రయిస్తున్నాడు. మహనీయులు, పవిత్రమైన చరిత్ర గలవారు, వివేకవంతులు అగు వారితో సాంగత్యం మహత్తరమైన ప్రభావం కలిగి ఉంటుంది. అట్టి వివేకులతోటి సాంగత్యము వలన కలిగే భయరహితమైన విశ్రాంతి ఈ 14 లోకాలలో మరెక్కడా లభించదు. అది సాధకునికి శుద్ధత్వము ప్రసాదించగలదు. విరక్తులుసంసారాన్ని దాటి వేసినవారు అగు మహనీయులను సర్వాత్మకుడైన పరమాత్మ ముముక్షువులకు తోడుగా ఈ సంసార నామ ఎడారిలో ఒయాసిస్సులుగా ప్రసాదిస్తున్నారని గ్రహించబడుగాక! వివేకశీలురతో కొద్దిసేపు సంభాషణ అనేక జన్మలుగా వెంటనంటి వచ్చే కారుచీకటి పొరలను
పటాపంచలు చేసి వేయగలదు సుమా!
3. నిష్కామకర్మ, శాస్త్రాభ్యాసం - క్రమంగా అభ్యసిస్తూ వస్తున్న 'నిష్కామకర్మ' బుద్ధిని శుద్ధ పరుస్తూ వస్తుంది. అట్టి శుద్ధబుద్ధికి చక్కగా పరిశుభ్రపరుపబడిన అద్దంలోని ప్రతిబింబంలాగా గురు ముఖతఃగా వినినట్టి, స్వయంగా పఠించినట్టి శాస్త్రార్థములు, ఉపనిషత్-యోగవాసిష్ఠాది గ్రంథాలలోని అంతర్లీన గానం సులభంగా హృదయస్తమౌతాయి. వివేకయుక్తమైన హృదయంలో శాస్త్రార్థ రసం ప్రవేశించుచుండగా ఉత్తమ బుద్ధి సుతీక్షణం, విస్తారమగు అవగాహన పెంపొందుతూ వస్తుంది. నిర్మలత్వంచే శోభించే బుద్ధి తనయందు శాస్త్రార్థములను పూర్తిగాను, అతి లాఘవంగాను
ధరించగలుగుతుంది.
Page:782
సాధు జనుల సాంగత్యంచే శుద్ధమైన చిత్తమూ, అధ్యాత్మ శాస్త్రములచే శోధితమైన బుద్ధి, సాత్విక కార్యక్రమాలచే పరిపోషించబడిన మనస్సూ... గలవాడు వేడినీళ్లలో పరిశుభ్రం చేయబడ్డ వస్త్రం వలె ప్రకాశిస్తాడు. అతడు సూర్యుని వలె స్వవివేక తేజంచే భాసిస్తాడు. అట్టి వాడు అభ్యాస వశం చేత తన హృదయంలోని అలోచనలన్ని శాస్త్రార్థాల గురించి, గురు వాక్యాల మహోద్దేశాల గురించి ఎక్కుబెట్టబడి ఉంటాయి. కలలో కూడా వాటినే యోచిస్తూ ఉంటాడు. క్రమంగా శాస్త్రార్థా లలో స్నానం చేస్తు తద్వారా 'రాగ ద్వేషాలు' అనే ధూళిని కడిగి వేసుకుంటూ ఉంటాడు. 'క్రోధం, అసూయ' మొదలైన దుర్గుణాలు సమసిపోతూ ఉండగా, మైత్రి-భోగాల పట్ల ‘వాటిని దాటివేసినట్టి స్వభావం' మొదలైనవి అలవడుచుండగా, ఇక అతడు బోనులోంచి వెలువడిన సింహం వలె గంభీరంగా శోభిస్తాడు. 'భోగానుసరణం' అనే దౌర్భాగ్యాన్ని తన వివేకంచే పరిత్యజిస్తూ ఉండగా ఆతడు, ఆతని వల్ల వంశం, ఆతడు ఉన్న పరిసరాలు, సమాజం - శోభిస్తూ ఉంటాయి.
4. భోగ త్యాజ్యం - ఆతనిలో 'భోగాలు పొందలేదే? పొంది ఉన్న భోగాలు తొలగుతా యేమో?” అనే రూపంలో ఉండే దీనత్వం వివేకాగ్నిచే కాల్చివేయబడుతుంది. కేతువుచే విడువబడిన పూర్ణచంద్రునిలాగా ఆతని ముఖం నూతన కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. ముల్లోకాలలోని సర్వ పదార్థములను ఆతడు తృణప్రాయంగా ఎంచుతూ ఉండటం చేత మహాత్ముల మధ్య కూడా ఆతడు కీర్తనీయుడగుచున్నాడు. ప్రారబ్ధవశం చేత ఆతనిని సమీపించే భోగాలను 'త్యాగం' అనే రసంతో తడిపి ఉంచుతాడు. 'సర్వ ద్వేషములను త్యజించిన నేను ఈ భోగాలను మాత్రం ఎందుకు ద్వేషించటం?'...అని తలచుచూ, వాటి ప్రయోజనాల పట్ల లోలోన సిగ్గును కలిగి ఉంటాడు. భోగాల ప్రాప్తిచే సిగ్గు, భోగాల అప్రాప్తిచే సంతోషం ఆతని అంతరంలో ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడాతడు స్త్రీ సాంగత్యాది క్రియలలోని ఉన్మాదాన్ని గుర్తు చేసుకొని అప్పటి తన అవివేకాన్ని చూచి నవ్వుకుంటూ ఉంటాడు.
5. సిద్ధులు-తత్ అనాదరణ త్యాగ బుద్ధి - అటుపై భూమిపై ఉదయించిన చంద్రుని వంటి ‘వివేకి’ని చూచి ఆనందించాలనే ఉద్దేశంతో మిత్రత్వంతో గూడి సిద్ధులు ఆతనిని సమీపిస్తాయి. నిరంతరం సర్వభోగాలను అనాదరించే ఆ వివేకి ఆ సిద్ధులను కూడా తన ఉదారబుద్ధితో అత్యంత సామాన్యమైన విషయాలుగా దర్శిస్తాడు. చూచావా రామచంద్రా! జడత్వ రహితుడు-గంభీర హృదయుడు అగు వివేకి యందు, మొట్టమొదట సంసారము పట్ల 'విరసత్వం' (లేక) వైరాగ్యం జనిస్తోంది. ఆరోగ్యం కావాలనుకునే రోగి వైద్యుణ్ణి సమీపిస్తాడు చూచావా? అట్లాగే ఆ వివేకి సజ్జనులతో సాంగత్యాన్ని స్వయంగా ఆశ్రయిస్తున్నాడు. ఆ సజ్జనులు చెప్పే వాక్యాలకు ప్రభావితుడై శాస్త్రార్థములను పఠించటంలోను, శ్రవణంలో, ధారణయందు నిమగ్నుడగుచున్నాడు. అతనిలో శాస్త్రార్థముల ప్రభావంచేత త్యాగబుద్ధి వచ్చి చేరుతోంది. అట్టి త్యాగబుద్ధికి, రెండు మహత్తరమైన గుణాలు వెంటనంటి ఉండి బలవత్తరమగుచున్నాయి.
1. ఇతరుల ధనాన్ని ఆశించటంలో అరుచి, 2. తనకున్న దానితో సంతృప్తి... ఆ త్యాగం
Page:783
ఇంకనూ బలవత్తరమగుచుండగా, ఇక అతడు తన దగ్గర గల ధనాదులను కూడా ఇతరుల సుఖసంతోష-ఆనందాల కొరకై వినియోగించటం ఆరంభిస్తున్నాడు. తనను ఎవరైనా యాచించినప్పుడు ఆ త్యాగశీలియగు వివేకి తన దగ్గర ఉన్నదేదైన ఇచ్చివేయటానికి ఉత్సుకుడౌతున్నాడు.
దదాతి కణపిణ్యాకశాకాద్యపి హి యాచతే |
తేనైవ అభ్యాసయోగేన స్వమాంసాని దదాత్య సౌ ॥
తనను ఎవరైనా యాచించినప్పుడు తన దగ్గర మిగిలి ఉన్న నూకలను-కూరలను కూడా ఇచ్చివేయటానికి సంసిద్ధుడగుచున్నాడు. అట్టి త్యాగముయొక్క అభ్యాసంచేత ఇక తనను అర్థించినవారికి తన శరీరంలోని మాంసాన్ని కూడా ఇచ్చివేయటానికి వెనుకాడని స్థితికి వస్తున్నాడు. క్రమంగా ఆతని చిత్తము లయించనారంభిస్తుంది. చిత్తము యొక్క రూపము ప్రాపంచిక పదార్థముల పట్ల ఇష్టమే గాని, మరింకేమీ కాదు కదా! వివేకము వైపుగా పరుగులు తీస్తున్న ఆ మహనీయుని అజ్ఞానం అల్పత్వం పొందసాగుతుంది. పరుగులు తీస్తున్నవాడు అతి సులభంగా చిన్ని చిన్ని గుంటలను దాటివేయగలుగుచున్నట్లు ఆతడు చిత్తములోని ఆయా విషయ పరంపరలను అతిసులభంగా (ఆ స్థితిలో) జయించివేయగలుగుతాడు.
6. ధనాదుల పట్ల ‘అనురక్తి' త్యజించటం - 1. ముముక్షువు మొదట ఇతరుల ధనాదుల పట్ల విరక్తిని అభ్యసించాలి. 2. ఆ తరువాత వివేకం చేత తన దగ్గర ఉన్న ధనాదుల పట్ల కూడా అనపేక్ష, విరక్తులను పెంపొందించుకోవాలి. ...ఇక ఆపై ఆత్మయందలి పరమ విశ్రాంతి కొరకై తన యొక్క ధనాదుల విరక్తితో బాటు విరాగము అను రూపంలో ఉండే భోగత్యాగం సంపాదించుకోవాలి.
న తాదృశం జగత్ యస్మిస్ దుఃఖం నరకకోటిషు |
యాదృశం యావత్ ఆయుష్కం అర్థోపార్జన శాసనమ్ ||
ఈ జీవితమును ధనోపార్జనయే ముఖ్యమైన లక్ష్యంగా వెచ్చించే వారి దుఃఖములు కోట్ల కొలది నరకములు అనుభవించే వారికి కూడా ఉండవు. ఎందుకంటావా?
ఆసనే, శయనే, యానే, గమనే, రమణే జనే
‘ఆధి’ చింతాపరాఏవ', నను మూఢ విదన్తు తామ్ ॥
ధన సముపార్జనలో బుద్ధిని నియమించిన వారు ఇక కూర్చున్నప్పుడు, పరుండినప్పుడు, నడుస్తున్నప్పుడు, క్రీడిస్తున్నప్పుడు, జనుల మధ్య ఉన్నప్పుడు... అన్ని వేళలా ఆలోచనలన్నీ “ధనాన్ని సంపాదించటం, దాచటం, కాపాడుకోవటం”... అనే వ్యవహారాల పట్లనే ధ్యాసంతా కలిగి ఉంటారు. వారు తమ మనసుకి పట్టిన చింతలేమిటో తమకే తెలియకుండానే అనేక చింతలలో
సతమతమౌతూ ఉంటారు.
వారు తమ-తమ చింతల గురించి ఇతరులకు చెప్పుకోలేరు. తాము భరించలేరు! వివేకంతో విచారించి చూస్తే... ధనం మహా అనర్థముల కొరకే అయి ఉన్నది. సంపదలు నిరంతర ఆపదలవైపే ఎక్కుబెట్టబడి ఉన్నాయి. భోగములు సంసార రోగముల వృద్ధి కొరకే అగుచున్నవి. ఎంతెంతవరకైతే
Page:784
ఈ జీవుడు 'ధనము’ అనే అనర్థమును అభిలషించకయే ఉంటాడో, అంతంత వరకు ఈతడు 'విషయ చింతనలు' అనే సెగలచే దహించక ఉంటాడు. ఎవనికైతే 'శాశ్వతము-సర్వోత్తమము’ అగు మోక్షము రుచించుచున్నదో, అంత వరకు ఆతడు ధనమును, విషయ జగత్తును గడ్డిపరక యొక్క చివరి ముక్కలాగా అతితుచ్ఛంగా గాంచగలుగుతాడు. ధనస్పృహాత్యాజ్యం సంపాదించుకొన్న వారికి ఆత్మయందే సుఖమును గాంచటం క్రమక్రమంగా అతిసులభమౌతుంది. అనేక శోక-మోహాది భావ వికారములు, అనేక దుష్కర్మలు, దీనత్వము, దుష్టచేష్టలు ఇవన్నీ కూడా ధనము పట్ల గల దురాశయే మూలముగా కలిగి ఉన్నాయని చెప్పబడుచున్నది.
7. సంతోషాభ్యాసం - ఓ రామచంద్రా! ఈ ప్రపంచంలో జరామరణాది చిత్త రోగములచే పూర్ణులై ఉన్న జీవులు అట్టి జరామరణాదుల నుండి విముక్తి పొందాలంటే 'సంతోషము' అనేదే ఉత్తమ ఔషధం. సంతోషమును అభ్యసించేవాని ఉత్తరోత్తర అనుభవం చక్రవర్తికిగాని, ఇంద్రలోకం పొందిన వారికిగాని లభించటం లేదు. 'సంతోషము' అభ్యసించేవాడే పూర్ణత్వముచే శోభించుచున్నాడు. 'అభిలాష' అనే దోషము గల జీవుడు నిష్కారణంగాను, అనాలోచితంగాను తన సంతోషమును కోల్పోయి, ఇక ఒక దుఃఖము నుండి మరొక దుఃఖమునకు పరుగులు
తీస్తూ ఈ సంసారారణ్యంలో తిరుగాడుచున్నాడు. ఆతని పాట్లు చెప్పు క్రింద పడ్డ పురుగులాగా అతిదీనంగా ఉంటున్నాయి. 'ధనవాంఛ' అనే వికృతరూపము దాల్చిన జీవుడు ఎన్నటికీ శాంత స్థితికి చేరుకోనే లేడు సుమా!
అర్ధోపార్జన-రక్షాణాం జానన్నపి కదర్ధనామ్ । |
యఃకరోతి స్పృహాం మూడో, 'నృపశుం' తం న సంస్కృశేత్ II
ధనము యొక్క 'ఆర్జన రక్షణ' మొదలైన వాటిలో గల దుఃఖమును, కాలయాపనను గమనించి కూడా ఏ మూఢుడు అట్టి ఆశాపాశముల నుండి విడవడటానికి ఇష్టపడడో, అట్టి నరపశువును తాకనే కూడదు సుమా! ఎవడైతే “తృష్ణారాహిత్యము” అనే కొడవలితో మనస్సు యొక్క (1) బాహ్య విషయానుసరణము (2) అభ్యంతర సంకల్ప పరంపరలు అనే రెండు దోషాలనూ ఒకేసారి కోసివేయుచున్నాడో... అట్టి వాని హృదయక్షేత్రంలో 'ఆత్మజ్ఞానం' అత్యల్ప సమయంలో ప్రకాశించగలదు. జ్ఞాని ఈ దృశ్యవిషయ సముదాయమును స్వప్న విషయమువలె అసద్రూపంగా గమనిస్తున్నాడు. కాని అజ్ఞానులకు ఇదంతా సత్యంగా, శాశ్వతంగా, సద్రూపంగానూ అనిపిస్తోంది. అట్లా అనిపించటానికి కారణం సత్యము-నిత్యము అగు దానిపట్ల అభ్యాసరహిత్యమే సుమా!
ఓ రామచంద్రా! ఈ విధంగా - మొట్టమొదట ఈ సంసారం పట్ల వైరాగ్యం, తరువాత సత్సాంగత్యం, అటుపై అధ్యాత్మ శాస్త్రార్థముల యొక్క భావనచే భోగములను పరిత్యజించి ఉండటం, ఆపై తృష్ణారాహిత్యం యొక్క దృఢాభ్యాసం... పై సోపానముల ద్వారా జీవుడు పరమార్థమగు ఆత్మతత్త్వమును ఎఱిగి తనను తాను మోక్షార్హునిగా తీర్చిదిద్దుకుంటున్నాడు.
Page:785
7. ఈశ్వరుడు ఎక్కడున్నాడు?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "ఈ జీవుడు పరమేశ్వరుని చేరేది ఎట్లా?” అనే విషయం మనం సంభాషిస్తున్నాం కదా! అందుకు ఏమేమి ఆవశ్యకమో మరల ఒక్కసారి గుర్తు చేసుకొని ఇక ఆ పై ఆత్మ యందు విశ్రాంతి ఎట్లా సుస్థిరపడుతుందో చెప్పుకుందాం.
ఆవశ్యకతలు
1. సంసారం పట్ల వైరాగ్యం దృఢపడటం; 2. సాధు జనులతో సాంగత్యం సిద్ధింపజేసు కోవటం; 3. నిర్మలబుద్ధితో శాస్త్రార్థములను భావించటం; 4. భోగాల పట్ల తృష్ణను రహితం చేసు కోవటం; 5. విషయాల పట్ల విరసత్వం; 6. సద్గుణాలను అభ్యసించటం, సజ్జనత్వం సంతరించు కోవటం; 7. హృదయంలో జ్ఞాన ప్రకాశాన్ని ఉదయింప జేసుకోవటం...
ఇట్లు జ్ఞానప్రకాశం వైపు ఉన్ముఖమైన వివేకి ఇక ధనాదులను వాంఛించడు. సర్వప్రాపంచిక విషయాలను హృదయం నుండి ఊడ్చివేసి ఉంటాడు. అప్పుడాతనికి స్త్రీ-ధన-బాంధవ్యాదులు కూడా భారంగా అనిపిస్తాయి. యథాశక్తి, యథాకాలం వాటిని మనస్సుచే త్యజించి వేసి ఉంటాడు. ఇక ఈ ఇంద్రియాలు ఇంద్రియార్గములలో ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ వాటియందు ఆతడు తప్పనిసరిగా సంలగ్నం కావలసి వస్తున్నప్పటికీ... అంతరంలో పరమ శాంతచిత్తుడై ఉండటం చేత... వాటినన్నిటిని పొందకయే ఉంటాడు.
ఆతనికి ఇక ఏకాంత దశలలో గాని, సరోవరాలలో గాని, అరణ్యాలలో గాని, వనవాటిక లలో గాని, పవిత్రస్థానాలలో గాని, స్వగృహంలో గాని, మిత్రులతో ఏర్పడే క్రీడావిలాసాలలోగాని, ఉత్తమ ఉద్యానాలలో గాని, భోజనాది క్రియాకలాపాలలో గాని, శాస్త్ర తర్క వితర్కాలలో గాని.... ఆసక్తి ఉండదు. వాటిలో వేటి యందూ దీర్ఘకాలం ఉండడు.
ఆతడు ఎల్లప్పుడూ తనయందే వెలయుచూ ఉంటాడు. ఆతడిక పరమశాంతుడై ఉంటాడు. దాంతుడై (ఇంద్రియాలను జయించినవాడై ఉంటాడు. ఆత్మారాముడుగాను, మునిగాను, విజ్ఞానైక నిరతుడుగాను ఉంటాడు. తన దేహ- ఇంద్రియాలకే సాక్షి అయినట్టి 'ప్రత్యగాత్మ' యొక్క అన్వేషణలో మాత్రమే ఉంటాడు. తాపముచే సంతృప్తుడైన మనుజుడు చల్లటి నీళ్ళతో స్నానం చేసి విశ్రాంతి పొందుతాడు చూచావా? ఆ ప్రకారంగా 'ఆత్మాన్వేషణం' అనే అభ్యాసం చేత 'శాంతుడు' అగుచున్న యోగి పరమపదమగు 'ఆత్మ' యందు విశ్రాంతిని సంపాదించుకుంటున్నాడు.
శ్రీరాముడు : మహాత్మా! ఈ బాహ్య-అభ్యంతర రూపమైన దృశ్య పదార్థమంతా ఎట్లా ఉదయిస్తోంది? ఇదంతా ఏమైయున్నది? ఏమి కానున్నది?
శ్రీ వసిష్ఠ మహర్షి :
స బాహ్య–అభ్యంతరం శాన్తా జ్ఞతైవార్థ తయోదితా | ‘న సంభవతి భిన్నో అర్థ' ఇత్యేవ పరమం పదమ్ ||
Page:786
స్వాత్మ గురించిన అజ్ఞానమే ఈ బాహ్య - అభ్యంతర దృశ్య పదార్థరూపంగా ఉదయిస్తోంది! కాబట్టి అట్టి అజ్ఞానం ఆ పదార్థముల కంటే భిన్నమైనది కాదు. అనగా ఆయా దృశ్య పదార్థముల పట్ల అనుభవరూపమే అజ్ఞానం యొక్క రూపం. పదార్థములకు వేఱుగా అజ్ఞానం ఎచ్చటా సంభవించదు. కనుక ఎప్పుడైతే ఈ దృశ్యం త్యజించబడుతుందో, అట్టి త్యాగము చేత మాత్రమే అజ్ఞానం శమిస్తుంది. అట్టి దృశ్య త్యాగం చేత అద్దాని సాక్షియగు ఆత్మయందు స్థితి కలుగుతుంది. సాక్షియందు స్థితి కలిగిన తరువాత శేషించే శాంతమగు ఆత్మస్థితియే 'పరమ పదం’ అయి ఉన్నది. శ్రీరాముడు : స్వామీ! 'పరమ పదము' అనగా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఎచ్చటయితే కేవల చిత్తు లేక ‘బోధ' తప్ప ఇక తదితరమైన పదార్థం గాని, శూన్యత్వం గానీ మచ్చుకైనా ఉండదో... అట్టి అంతరంగము నందలి నిజానుభవ స్థితియే 'పరమ పదం’ అని చెప్పబడుతోంది. ఓ రామచంద్రా! సమస్త పదార్థములు కూడా ఉపరూపమగు బోధగా పరిణమించటం జరుగగా... ఇక ఎచ్చటైతే పదార్థం గాని, పదార్థత్వం గాని, శూన్యత్వం గాని లేకయే ఉన్నాయో, అట్టి స్థితికి శాస్త్రకారులు 'పరమపదం' అనే పేరుపెట్టారు.
ఓ రాఘవా! కేవలం స్వాత్మామాత్రమున విశ్రాంతి పొందిన మనో అతీత స్వభావులగు మహాత్ములకు విషయాల పట్ల 'కించిత్' కూడా రుచి ఉండదు. బహిర్ముఖత్వ నిరోధ రూపమగు స్వభావమును సంపాదించుకున్నవాడు, మౌని, ఈ శరీరాదులందు 'ఇవి సుస్థిరం’ అను అభిప్రాయం లేనివాడు, ఆత్మజ్ఞుడు అగు మహనీయుడు 'చిత్రం'లో లిఖించబడిన 'నదీజలం' లాగా నిశ్చలంగా ఆత్మ స్వభావమునందే నెలకొని ఉంటాడు.
ఇక ఆత్మజ్ఞాని యొక్క హృదయం ... సర్వ పదార్థములతో కూడుకొని ఉన్నప్పటికీ... పదార్థ రహితంగాను, విస్తారమై ఉన్నప్పటికీ... పరమాణుసదృశంగాను, అశూన్యమైనప్పటికీ... శూన్య సమంగాను ఆత్మజ్ఞాని యొక్క హృదయం భాసిల్లుతోంది. ఈ అహంభావం, జగత్తు, ఈ జగత్తు యొక్క చేష్టలు, దేశ-కాలాదుల కల్పన, జ్ఞాతృ-జ్ఞాన-జ్ఞేయములతో కూడుకున్న త్రిపుటి, శూన్య అశూన్యములు - ఈ మొదలైనవన్నీ ఎదురుగా ఉన్నప్పటికీ ఆత్మజ్ఞాని యొక్క దృష్టిలో ఇవన్నీ “మిథ్యమాత్రం” గాను, స్వతఃగా కించిత్ కూడా 'లేనివి' గాను అగుచున్నాయి.
మానవాకార జ్ఞాన సూర్యుడు దీపం వెలగగానే అంధకారం పటాపంచలైపోతుంది చూచావా?... నిర్మలమగు ఆత్మపదమనే వెలుగును అధిరోహించినట్టి జ్ఞాని యొక్క హృదయంలో దృశ్యం-రాగం -ద్వేషం-భయం అనే అంధకారానికి చోటు ఉండదు.
ఎవని రజోగుణం సంపూర్ణంగా నశించి ఉంటుందో, తన శుద్ధ సత్త్వగుణం చేత ఎవని తమోగుణం మొదలంట అధిగమించబడి ఉంటుందో, ఎవని సమక్షంలో అజ్ఞానాంధకారం ఆతని జ్ఞానప్రకాశంచే మ్రింగివేయబడి ఉంటుందో... అట్టి మానవాకార సూర్యుడు తదితర జనులందరికీ నమస్కరించుటకై అర్హుడగుచున్నాడు. భేదం సంపూర్ణంగా శమించగా అప్పుడు చిత్తం అదృశ్యమవు తోంది. అప్పుడిక అట్టి ఆత్మజ్ఞాని స్థితి ఎట్టిదో... అది వాక్కుచే చెప్పటానికి సాధ్యపడేది కాదు.
Page:787
రాత్రింబవళ్ళు చాలా కాలంగా ఒనర్చిన 'పరమ భక్తి'చే సంతోషించిన ఆ ఈశ్వరుడు నిష్కల్మషనిర్భేద హృదయుడైన వివేకికి 'నిర్వాణం' అనబడే సర్వాత్మ దర్శన స్వరూపమగు ఉత్తమ స్థితిని ప్రసాదిస్తున్నాడు.
సర్వము ఈశ్వరమయం -
శ్రీరాముడు : స్వామీ! ఈశ్వరుడు అనగా?
ఈశ్వరఃకో? మునిశ్రేష్ఠ! కథం భక్త్యా ప్రసాద్యతే | ఏతన్మే తత్త్వతో బ్రూహి, సర్వతత్త్వ విదాంవర ॥
తత్త్వవేత్తలలో శ్రేష్ఠుడగు ఓ మునివరా! మీరు చెప్పిన ఆ 'ఈశ్వరుడు' అనగా ఎవరు? భక్తిచే ఆతడు ఎట్లా ప్రసన్నం అవుతాడు? దయచేసి నాకీ విషయం యథార్థంగా తెలియజేయండి. శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీ ప్రశ్నకు సూటి అయిన సమాధానం విను!
ఈశ్వరో న, మహాబుద్దే! దూరే, న చ దుర్లభః, మహా బోధమయైకాత్మా, 'స్వాత్తైవ పరమేశ్వరః’!
ఓ మహాబుద్దీ! ఆ ఈశ్వరుడు ఎక్కడో దూరంగా లేడు. కొందరు 'ఆతడు అతి దుర్లభుడు. సామాన్యులకు లభించేవాడు కాదు.... అని అంటూ ఉంటారు. అదీ నిజం కాదు. మరి? మహాబోధమయైక స్వరూపమగు స్వాత్మయే ఆ పరమేశ్వరుడు.
మహాబోధమయైక స్వరూపమగు స్వాత్మ అనగా... ఆత్మ యొక్క ప్రపంచాన్ని పొందే మనన విభాగమే మనస్సు (లేదా) మనోచైతన్యం. 'మనస్సు' నుండి ప్రపంచత్వాన్ని ప్రక్కకు పెట్టి నప్పుడు మిగిలి ఉండేదే నిర్మల చైతన్యం. అట్టి ప్రతి ఒక్కరి యొక్క నిర్మల చైతన్యమే పరమేశ్వరుని స్వరూపం.
అంటే, చైతన్యం ఎక్కడ 'దృశ్య సంబంధ తృష్ణ' అనే స్వభావాన్ని ప్రదర్శిస్తోందో, దానిని 'జీవుడు' అని పిలుస్తున్నాం. అద్దానినే 'మనస్సుతో కూడిన చైతన్యం' లేక 'మనో చైతన్యం' అని కూడా అంటున్నాం. చైతన్యం తన మనో స్వభావాన్ని అతిక్రమించి ఉన్నప్పుడు శివుడు “శుద్ధచైతన్యం” అంటున్నాం. అట్టి శుద్ధ చైతన్యమే ఈ జీవుని నిజమైన రూపం.
మనస్సులో 'జగద్దర్శనం' అనే అభ్యాసాన్ని తొలిగించి చూస్తే దానిని 'బోధ స్వరూపం' అంటాం. అట్టి బోధస్వరూపాన్ని దేహ మనో బుద్ధ్యాది పరిధులను త్యజించిస్తే ‘మహాబోధ స్వరూపం' అంటాం. అట్టి మహాబోధ స్వరూపమగు స్వాత్మయే 'పరమేశ్వరుడు' అను శబ్దంచే ఉద్దేశింపబడుతోంది.
ఈ సమస్తమూ ఆ పరమేశ్వరుని కొరకే అయి ఉన్నది! ఆ పరమేశ్వరుని నుండే ఈ సమస్తం ఉత్పన్నమగుచున్నది! ఆ పరమేశ్వరుడే ఈ సమస్తం అయి, అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు! సమస్త జీవుల హృదయంలో వెలుగొందుచున్నది ఆతడే! ఆ పరమాత్మయే సర్వాన్ని ఆక్రమించుకొని సర్వమయుడై ఉన్నాడు. సర్వమునందలి నిత్యుడు అతడు మాత్రమే. సర్వ స్వరూపుడు, సర్వాత్మకుడు అగు ఆ పరమేశ్వరునికి మేము నిత్యం ప్రణమిల్లుచున్నాము.
Page:788
తస్మాదిమాః ప్రసూయన్తో సర్గ ప్రలయ విక్రయాః ॥ అకారణం కారణతో గతయః పవనాదివ II
ఆ పరమేశ్వరుని నుండే ఈ 'సృష్టి-స్థితి -ప్రళయం' అనే చమత్కార విశేషాలన్నీ జనిస్తున్నాయ్! ప్రపంచంలో సర్వము కార్య కారణ ములచే ఏర్పడుచున్నాయి. అయితే ఆ పరమేశ్వరుడో? ఆతడు స్వయంగా కారణ రహితుడు. అయినప్పటికీ ఆతడే సర్వ కారణములందు వ్యాపించి ఉన్నాడు. అంతే కాదయ్యా! సర్వ ప్రాణులలోని ప్రాణాదుల గతులన్నీ ఆతని వలననే సంభవిస్తున్నాయి. ఈ ప్రాణకోట్లంతా తాము కోరుకున్న పదార్థములను ప్రసాదిం టానికి గాను ఆయననే నిరంతరం ఆయా అన్ని చోట్లా అనేక నామ రూపాలతో పూజిస్తున్నారు. ఈ జీవులు తమ యథేష్టమగు రుచి ననుసరించి అనేక జన్మలలో ఆయనను పూజిస్తూ ఉండగా ఆయన వారి పట్ల ప్రసన్నుడగుచున్నాడు. ప్రసన్నః స మహాదేవః, స్వయమాత్మా మహేశ్వరః |
బోధాయ ప్రేరయత్యాశు దూతం పూతం శుభేహితైః ||
మహాదేవుడు, పరమేశ్వరుడు, సర్వాత్మకుడు అగు ఆయన ఈ జీవులు చేసే పూజలకు ప్రసన్నుడై, ‘బోధ’ కొఱకై పవిత్రుడగు తన దూతను ప్రేరేపణ చేయుచున్నాడు.
వివేక మహత్యము -
శ్రీరాముడు : ఆత్మనా పరమేశాన కోదూతః ప్రేత్యతే మునే?
సదూతో బోధనం వాపి కరోతి? వద మే కథమ్?
శ్రీరాముడు : మునీంద్రా! ఆత్మస్వరూపుడగు ఆ పరమేశ్వరుడు ఏ తన దూతను ప్రేరేపిస్తున్నారు? ఆ దూత ఏ రీతిగా బోధ చేస్తున్నారు. వివరించండి.
శ్రీ వసిష్ఠ మహర్షి : ఆత్మ స్వరూపుడగు ఆ పరమేశ్వరునిచే ప్రేరేపించబడే దూత మరెవరో కాదు.ఆయన ఈ జీవులలో గల 'వివేకము'నే ప్రేరేపణ చేస్తున్నారయ్యా! హృదయంలో ప్రవేశించిన ఆ 'వివేకం' అనే దూత ఆకాశంలో ప్రవేశించిన చంద్రుని వలె అత్యంత ఆహ్లాదకారకుడగుచున్నాడు. ఆ ‘వివేకము’ అనే దూత వాసనామయుడగు ఆ జీవునికి క్రమక్రమంగా 'ఉద్బోధ' చేస్తున్నాడు. క్రమంగా ఆ జీవుని ఆ వివేకదూత సంసార సాగరం నుండి తరింపజేస్తున్నాడు.
బోధాత్మై ఏషో అంతరాత్మైవ పరమః పరమేశ్వరః
అస్యైవ వాచకోనామ ప్రణవో వేద సమ్మతః |
బోధస్వరూపుడగు ఆ ‘అంతరాత్మ' యే ఉత్తముడగు పరమేశ్వరుడయ్యా! మరి ఆతని పేరు? నామరూపాలు ఆయనకి ఆపాదించటమెట్లా? అదట్లా ఉండగా, నామ-రూపాదుల సహాయం లేకపోతే ఆయనను మననం చేయటమెట్లా? అందుచేత వేద సమ్మతమైన 'ఓం' (అకార - ఉకార
- - మకారాలు) అనే ప్రణవమే ఆతని వాచకమై ఒప్పుచున్నది. ఈ దేవతలు, మనుజులు, నాగులు, అసురులు మొదలైన వారంతా కూడా వారి వారి బుద్ధి, ఊహ, ప్రమాణం, సంస్కారాలను అనుసరించి నామరూప సహితంగానో, లేక నామరూప రహితంగానో వారి వారి జప-హోమPage:789
తప-దాన-పఠన-యజ్ఞ-యాగాది ఆయా క్రియా క్రమములచే ఆ ఓంకారవాచక పరమేశ్వరునే నిత్యము ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.
స్వర్గం ఆ పరమేశ్వరుని శిరస్సు. భూమి ఆయన పాదాలు. నక్షత్రాలు ఆయన రోమ సమూహాలు. సమస్త ప్రాణికోట్లు ఆయన అస్టులు. ఆకాశం ఆయన హృదయం. చిత్స్వరూపుడైనట్టి ఆ పరమేశ్వరుడు అన్ని చోట్ల ప్రవేశిస్తున్నాడు.
సర్వత్రైష చిదాత్మత్వాత్ యాతి, జాగర్తి, పశ్యతి, తేనైష సర్వతో లక్ష్య కర కర్ణ అక్షి పాదభృత్ ||
అంతటా నిరంకుశంగా ప్రవేశిస్తున్నాడు. సర్వదా ఆయన మేలుకొనియే ఉన్నాడు. సర్వులను గాంచుచునే ఉన్నాడు. సర్వుల లక్ష్య స్వరూపుడు అయి ఉన్నాడు. సర్వత్రా చేతులు-పాదములుచెవులు-నేత్రములు మొదలైన ఇంద్రియములన్నీ ధరించుచున్నది ఆయనే! ఆ పరమాత్మ ఈ జీవుని ప్రార్థనాదులకు సంతోషించి ఆతనియందు వివేకము అనే దూతను ఉద్బోధిస్తున్నారు కదా! ఆ వివేక దూత హృదయంలో ప్రవేశించి 'చిత్తము' అనే పిశాచమును చంపి ఈ జీవునికి తన యొక్క మహత్తరమైన 'ఆత్మ పదము'ను పొందింపజేస్తున్నాడు.
స్వాత్మయగు పరమేశ్వరుని శరణువేడండి! - కాబట్టి ఓ ప్రియ జనులారా! మీరంతా మీ పురుష ప్రయత్నంచే అనర్థయుతాలైన సమస్త వికారాలను, సమస్త వికల్ప సమూహాలను త్యజించండి. సర్వ ప్రయత్నాలచే స్వయంగా ఆత్మ చేతనే ఆత్మ భూతుడగు ఆ సర్వాత్మకుని, పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోండి. ఈ సంసారమనగా ఏమిటో కాస్త గమనించండి. అతి చపలమైనట్టి 'మనస్సు' అనే పిశాచంతో కూడుకొన్నదై, శోక-మోహాదులు అనే మేఘాలచే క్రమ్ముకొన్నదై ఈ సంసారం హృదయంలో వ్యాపించి ఉంది. మరిక స్వాత్మయగు పరమేశ్వరుని శరణు వేడటమే ఉపాయం. ఆయనే వివేక సూర్యుని రూపంలో ఈ సంసారాంధకారాన్ని పటాపంచలు చేయగలడు.
సంసారం ఎట్టిదో వినండి. ఇది ఒక అగాధం వంటిది. ఇందులో “మరణం పునర్జన్మ” మొదలైన దురవస్థలు-ఆవర్తాలు (సుడులు) కలిగి ఉన్నది. అతి వ్యాకులమై ఉంటోంది. 'తృష్ణ' అనే చంచల తరంగాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. మనస్సు అనే సుడిగాలి ఇందులో అవిశ్రాంతిగా వీస్తోంది. ఇందులో 'ఇంద్రియ విషయాపేక్షలు' అనే మొసళ్లు సంచరిస్తున్నాయి. అట్టి ఈ సంసార సముద్రాన్ని దాటటానికి ఉన్నది ఒక్కటే ఉపాయం - అదే 'వివేకం' అనే నావను ఆశ్రయించటం.
ఓ ప్రియ జనులారా! ముందుగా మీకు అభిమతమైన మార్గంలో పూజ-తపస్సు మొదలైన వాటితో ఆ పరమేశ్వరుని సంతోషింపజేయండి. ఆయన 'వివేకం' అనే పవిత్రమైన దూతను మీకు ప్రసాదిస్తున్నాడు. ఇక 'సత్సాంగత్యం, శాస్త్రాభ్యాసం' అనే పరమార్థ బోధను ప్రవృద్ధం చేసుకోండి. మీ వివేకం క్రమక్రమంగా వికసించుగాక! అప్పుడా వివేక దూత 'పరమార్థబోధ' ద్వారా ఈ జీవుని ‘నిర్మలం-ఏకం-అద్వితీయం-ఆద్యం' అయినట్టి ఆత్మపదాన్ని పొందింపజేయగలడు.
Page:790
8. వివేకి యొక్క దర్శనం-మననం-అనుభవం
శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! 'వాసనలు' అనే మలాన్ని తమయందు పూర్తిగా తొలగించు కొన్నట్టి దృఢ వివేకులగు మహనీయులలో లోకోత్తరమైన ఒకానొక మహనీయత్వముతో కూడిన బుద్ధి జనిస్తోంది. వారి బుద్ధి ఔదార్యం-మహనీయత్వం-మహత్వం-గాంభీర్యత్వం-అతి సౌందర్యం సంతరించుకొంటోంది.అట్టి బుద్ధికి అగుపించే తాత్త్వికదర్శనం తదితర సామాన్య జనులకు అర్థం కానిది. అట్టి బుద్ధిని ప్రలోభపరచగలిగేదేది ఈ 14 లోకాలలో ఎక్కడా ఏదీ లేదు. ఉండజాలదు.
“ఈ జగత్తు అనబడేది చిత్తభ్రాంతి మాత్రమే!” అనే విశ్వాసం సజ్జనులలో ఉంటోంది. వారిలో బాహ్యాలైన ఈ శబ్ద-స్పర్శ-రూపాది విషయాలు గాని, అభ్యంతరాలైన సంకల్పాలుమనస్సు-ఇంద్రియార్థాలు గాని, వాటన్నిటి వల్ల జనించే అజ్ఞానం గాని చోటు పొందలేకయే పోతున్నాయి. 'రెండవ చంద్రుడు-మృగతృష్ణ-ఆకాశంలో కేశాలు'... వంటి జగత్ భ్రాంతిని స్ఫురింపజేసే వాసనావృత్తి వారి హృదయం నుండి తొలగి, దీపం వెలిగించిన తరువాతి చీకటిలాగా, ఎచటికో తొలగిపోతున్నది. వాసనావృత్తి హృదయంలో చోటు చేసుకొని ఉండటం చేతనే 'జగత్తు' అనబడే బహువిధ విషయ-విశేషముల సముదాయం ద్యోతకమౌతుంది. వాసనావృత్తి (లేక) దృశ్యవృత్తి నశించినప్పుడు అంతటా చిదాకాశమే ఉన్నట్లు అనుభవం కాగలదు. అయితే అట్టి వాసనాశూన్యావస్థ మనస్సు యొక్క 'అభావ స్థితి' యందు మాత్రమే (అమనస్క స్థితిలో మాత్రమే) సిద్ధించగలదు. వివేకి అయినవాడు అట్టి మనో అభావ స్థితిని ఎందుకు వదలుకోవాలి?
నాలుగవ అవస్థ - తురీయావస్థ -
శ్రీరాముడు : స్వామీ! మనస్సు యొక్క అభావ స్థితి (లేక) అమనస్క స్థితి అంటే ఏమిటి. శ్రీ వసిష్ఠ మహర్షి : సామాన్యంగా జీవులందరికీ 1. జాగ్రదవస్థ, 2.స్వప్నావస్థ, 3. సుషుప్త్యావస్థ అనే మూడు అవస్థలే అనుభవమౌతున్నాయి. జనులందరూ ఈ మూడు అవస్థలను ఒకదాని తర్వాత మరొకదాన్ని ఆటవిడుపు లేకుండా అనుభవిస్తున్నారు కదా! వాస్తవానికి ఈ మూడు కాకుండా మరొక అవస్థ ఉన్నది. అది ఈ మూడు అవస్థలకు సంబంధించక, ఆ మూడిటిచే స్పర్శించబడక, ఆ మూడు సందర్భముల చేత అవిభాజ్యమై-అనిరోధకమై, అనుశ్రుతమై, అవిరామమై, అనునిత్యమై చెన్నొందుతోంది. ఆ అవస్థలకు శాస్త్రకారులు 'తురీయావస్థ' అని పేరు పెట్టారు.
ఉదాహరణకు... ఒకాయన ఇంట్లో ఉండటమో, వీథిలోకి వెళ్ళటమో, ఊరు వెళ్ళటమో జరిగిందనుకో. ఆయన ఇంట్లో ఉంటేనేమో 'ఇంట్లోని మనిషి' అంటాం. వీథిలోకి వెళ్ళినప్పుడు 'వీథి లోని మనిషి’ అంటాం. ఊరు వెళ్ళినప్పుడు 'ఊరు వెళ్ళిన మనిషి' అంటాం. ఆ మూడు సందర్భా లలోను ఆయన ఒక్కడే-ఒకే రీతిగా ఉన్నాడు గాని మరొకటిగా అగుట లేదు కదా! ఆయన ఆయన గానే యథాతథంగా ఉన్నప్పటికీ, ఆయన గురించి చెప్పుకొనేవారి సౌలభ్యం కొరకై 'ఇంట్లోని ఆయన వీథిలోని ఆయన ఊరు వెళ్ళినాయన'... అనేవన్నీ వచ్చాయి. ఆయన వస్తు సంబంధంగా చూస్తే ఈ మూడిటికీ సంబంధించినవాడే కదా!
Page:791
అట్లాగే తురీయావస్థ వాస్తవానికి ఒక అవస్థ కాదు. అది 'అవస్థాత్రయ సాక్షి' అని అనవచ్చు. అట్టి అవస్థాత్రయ సాక్షిత్వము సంపాదించుకొని ఉన్న వివేకియందు అజ్ఞానం నశించి ఉండటంచే వాస్తవానికి ఈ జగత్తును చూచుటయే లేదు. అయినా కూడా ప్రారబ్ద విశేషం చేత అతడు ఈ జగత్తులో దేహాన్ని ధరించి కనబడుచున్నాడు. కాబట్టి, అతడు జగత్తును చూస్తూ ఉన్నట్లే అన్యులకు కనిపిస్తూ ఉంటుంది. అతని దృష్టి మాత్రం ఈ జాగ్రత్-స్వప్న సుషుప్తులను అధిగమించినదై ఉంటోంది. ఆ వివేకి దృష్టి అవస్థాత్రయాన్ని తనలో కలుపుకొని ఉన్నట్టి అప్పటికీ శేషించి ఉన్నట్టి 'పరమావస్థ'ను దర్శిస్తూ ఉంటుంది.
శ్రీరాముడు : అనగా? వారు ప్రారబ్ధానంతరం ఈ దేహాదులు పొందరని అనుకోవచ్చా?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ దేహాలకు - ఆ వివేకులకు అనునిత్యంగా అనుభవమయ్యే తురీయావస్థకు సంబంధమే లేదు. అనగా వారి అసిధారావృతమైన తురీయానుభవం శరీరాలు వచ్చినప్పుడుగాని, లేక అవి తొలగుచున్నప్పుడు గాని ఆటవిడుపు పొందేది కాదు. వారి యొక్క వ్యుత్థాన కాలమందు సమాధి నుండి మరలుటలేదు. వారు ఈ జగత్తును ఘన పదార్థములుగా (భూమి మొదలైన వివిధ వికార రూపాలుగా) చూడరు. రత్నం యొక్క వివిధ కాంతిపుంజాలు వివిధమైన దిక్కులుగా ప్రసరిస్తూ ఉన్నప్పటికీ ఆ వేర్వేరు కాంతిపుంజాలు రత్నమునకు సంబంధించినవే కదా! అట్లాగే వారికి జగత్తులో కనిపించే భేదమంతా అభాసమాత్రంగా, పరమాత్మ యొక్క కిరణపుంజాలుగా కనిపిస్తుంది. వారికి ఈ జగత్తు జగత్తుగానే కనిపిస్తూనే, మరొక ప్రక్క ఇదంతా శూన్యమాత్రంగా సుస్పష్టమౌతూనే ఉంటుంది. స్వస్వరూపచమత్కారంగా అనుభవమౌతుంది.
న ఇహ సత్యాని భూతాని, న జగత్తా, న శూన్యతా, ఇదం బ్రహ్మాఖ్యరత్నేశ ప్రభాజాలం విజృంభితమ్ ॥
వాస్తవానికి ఇక్కడ కనిపించే భూతజాలం (జీవులు, దేహములు మొదలైనవి) సత్యం కాదు. అట్లాగే జగత్తు కూడా! ఆ రీతిగానే 'శూన్యత్వము' అనునది కూడా! అవి లేవు. మరి 'ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి కదా’... అని అంటావా? అవన్నీ కూడా సర్వ శక్తిమంతుడగు 'బ్రహ్మం' అనే రత్నం యొక్క కిరణ సమూహాల విలాసం మాత్రమే! జలం అనేక తరంగాలుగా కనిపిస్తున్నప్పటికీ అన్ని తరంగాలలోనూ కనిపించేది ఒకే జలమే కదా! అనేక బంగారు ఆభరణాలలో కనిపించేదంతా బంగారం ఒక్కటే కదా! అట్లాగే అనేకత్వము వాస్తవానికి లేదు కాబట్టి, ఇక సృష్టియే లేదు. సృష్టియే లేనప్పుడు నాశనరూపమగు ప్రళయం మాత్రం ఎక్కడున్నది? అదీ లేదు.
ఈ కనబడేదంతా స్వకీయకల్పనమే! -
శ్రీరాముడు : జగత్తులో కనిపించే సృష్టి స్థితి-లయాలు, జన్మ-జీవన-మృత్యువుల మాటేమిటి?
శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ జీవుడు దేహం పొందవచ్చు. కోల్పోనూ వచ్చు. వాస్తవానికి ఈ జీవుడు స్వతఃసిద్ధమైన స్థితి దృష్ట్యా జన్మించటమూ లేదు, మరణించటమూ లేదు. ఇక ఇవన్నీ అంటావా? ఇవి ‘కల్పన' అను చమత్కారము యొక్క విన్యాసము మాత్రమే!