Page:192

ముందు మాత్రమే వివేక ప్రవచనములు చేస్తారు. సమీప ప్రాంతంలో సాధువు, ఆత్మజ్ఞాని ఉన్నాడని తెలియగానే వారిని ఆశ్రయించే యత్నంలో ఉండాలి. సాధు పురుషుల సమీపంలో ఉన్నంత మాత్రం చేత వారి సద్గుణ పుష్ప రేణువుల స్పర్శ తదితరులకు కూడా లభించగలదు.

4. పక్షి-క్రిమి-కీటక జీవుల అనుభవం ఎటువంటిది?

శ్రీరాముడు : స్వామీ ! వసిష్ఠ మహర్షీ! పక్షి-క్రిమి కీటక దేహములను పొంది కొందరు దేహధారులు ఈ జగత్తులో సంచరించటం జరుగుతోంది కదా! అట్టి జీవుల విషయమై ‘వారి దుః ఖముల విషయమేమిటి?' అనే ప్రశ్న నా హృదయంలో ఏర్పడుతోంది. ఎందుకుంటారా?

సన్తి దుఃఖక్షయే అస్మాకం శాస్త్ర-సత్సంగ యుక్తయః

మంత్ర-ఔషధి-తపో-దాన-తీర్థ -పుణ్య అశ్రమాశ్రయాః ॥

మహాత్మా! మా మనుజుల వంటి వారికైతే ఈ సంసారం కలిగించ గల దుఃఖాలను తొలగించు కొనుటకై తమవంటి మహామహితాత్ములచే చెప్పబడిన శాస్త్రాదులు ఉన్నాయి. శాస్త్రాభ్యాసం, సత్సంగం, మంత్రం, ఔషధం, తపస్సు, దానం, తీర్థం, పుణ్యాశ్రమ సేవ మొదలైన ఉపాయాలు మా అజ్ఞాన దుఃఖాన్ని తొలగించుకోవటానికై ఉన్నాయి. తమ వంటి సద్గురువులు ఉన్నారు.

మరి క్రిమి కీటకాల మాట ఏమిటి? ఈ క్రిమి కీటక-పతంగ-తిర్యక్-స్థావరాది జాతులలో దేహాలు పొందిన జీవులు ఎటువంటి మోక్షోపాయములు ఎఱుగకయే ఉన్నాయి కదా! మఱప్పుడు అవి ఎట్లా జీవిస్తున్నాయి? ఏఏ కార్యములు ఒనర్చుచున్నాయి? వాటికి దుఃఖం క్షయించేది ఎట్లా? శ్రీవసిష్ఠ మహర్షి : (లోకో రమయతేతి రామా!) సర్వ జీవుల పట్ల అవ్యాజమైన ప్రేమను కురిపించే ఓ రఘుకుల తిలకమా! రామచంద్రా! ఇప్పుడు పక్షి-క్రిమి కీటక-తిర్యక్-స్థావర జీవుల అనుభవ విశేషాలేమిటో చెప్పుతాను. విను.

సమస్త స్థావర-జంగమ ప్రాణులు కూడా వాటి వాటికి యోగ్యములైనట్టి భోగముల ‘సుఖసత్త’ యందు స్థితిని కలిగి ఉన్నాయి. కొన్నిటిని 'ఇవి పొంది మేము సుఖిస్తాం' అనుకొని వాటిని అట్లే పొంది సుఖిస్తున్నాయి. అంతే కాకుండా ఏదేది ఏ జన్మయందున్నదో... అది ఆ జన్మకు తగినట్టి విషయముల యొక్క ప్రాప్తియే మహాపురుషార్థం అని ఎంచుచున్నది. అట్టి అల్ప ప్రాణులకు కూడా మనకు లాగానే జన్మోచితమైన 'సుఖభోగేచ్ఛ' కలదు.

అయితే, వాటికి ఏవి గొప్ప భోగములుగా కనిపిస్తున్నాయో మానవులకు అట్టి భోగముల పట్ల అల్పమైన విశ్వాసం ఉంటుంది. అందుచేత మనకు కొద్ది విఘ్నములే ఉంటున్నాయి. వాటికో? కామ-క్రోధాదుల ప్రాబల్యం చేతనూ, వివేకము లేనందుచేతనూ ఆయా అల్ప భోగములపై అధిక విశ్వాసం ఉంటోంది. అందుచేత పర్వతం వలె గొప్పవి అయిన అనేక విఘ్నములు కలుగు చున్నాయి. ఉదాహరణకు "ఆ పండును నేను ఆరగించాలి" అని నీవు అనుకుంటావనుకో. అది

Page:193

లభించకపోతే? అది పెద్ద విషయంగా చూడవు కాబట్టి నీకు అది అల్పమైన విఘ్నమే అయి ఉంటుంది. అదే ఒక కీటకమైతే, ఆ పండును భక్షించాలని తలచి, అది లభించనందుకు తీవ్రమైన విఘ్నత్వం అనుభవిస్తుంది. ఈమాత్రం తేడా తప్పించి సుఖ దుఃఖములు క్రిమి కీటకాదిజాతులకు, మానవులకు ఒక్క తీరైనవే!

బ్రహ్మాండ శరీరుడగు విరాట్ పురుషుడు (విరించి, బ్రహ్మదేవుడు, సమష్టి జీవుడు) ఏ విధంగా అయితే స్వభోగము కొఱకై ప్రయత్నించుచున్నాడో... ఆ విధంగానే వెంట్రుక చివర సంచరించు చున్న పేను’ కూడా “ఈ స్థానమే నా గృహం" అనుకుంటూ అక్కడయే ఆయా భోగానుభవముల కొరకై ప్రయత్నము సలుపుచున్నది.

ఆహా! అహంకారము యొక్క ప్రతాపం ఎంతటిదో చూచావా? ఈ జీవులందరూ శాంతమగు ఆత్మ స్వరూపులే అయివుండికూడా శాంతి కొఱకై ఎక్కడెక్కడో బాహ్యమున వెతుకుచున్నారు కదా!

జాయనేచ మ్రియంతేచ నిరాధారే అంబరే ఖగా :

శూన్యైక విషయాస్తేషాం ! స్వాస్థ్యం న భవతి క్షణమ్ !

పక్షులు కేవలం శూన్య విషయాలలో అభిలాష కలిగి ఉన్నవై నిరాధారమగు ఆకాశంలో జన్మించి, మరణిస్తున్నాయి. వాటికి క్షణమైనా శాంతి లభించటమే లేదు. ఇక చీమలు మొదలైనవి ధాన్యము మొదలైన పదార్థకణములను సంపాదించుకోవడంలోను, కుటుంబము యొక్క పోషణపాలనకు సంబంధించిన క్రియలలోను సుదీర్ఘమైన రోజును క్షణంలాగా గడిపివేస్తున్నాయి. గరుత్మంతుని గమనమునందు ఏ వ్యగ్రత్వం కనిపిస్తోందో.... త్రసరేణువుల వలె (సూర్య కిరణాలలో కనిపించే సూక్ష్మరేణువువలె) అతి సూక్ష్మమగు ఆకారం గల 'తిమి' అను అతిసూక్ష్మమైన జీవి యొక్క గమనంలో కూడా అంతటి వ్యగ్రత్వం కనిపిస్తోంది. మానవులలో ఏ విధంగా వీడువాడు-నేను-నీది-నాది -నా ఇల్లు-నా ధనం ఇత్యాది కల్పనా పరంపరలు, భావావేశాలు, గుణాతిశయాలు వృద్ధిపొంది ఉన్నాయో, అట్లాగే క్రిమికీటకాలలో అవన్నీ ప్రసిద్ధిపొంది ఉన్నాయి.

దేశ కాల క్రియా ద్రవ్య వ్యగ్రయా జర్జరీకృతమ్, క్షీయతే వ్రణకీటానామ్ అస్మాకమివ జీవితమ్ |

దేశ-కాల-క్రియా-ద్రవ్యాది విషయములు గూర్చిన చింతనచే మన జీవితం ఏ విధంగా క్షీణిస్తుందో.... అట్లాగే “వ్రణం (పుండు) నందలి కీటకం యొక్క జీవితమూ క్షీణిస్తోంది. శిలలు ఘోరనిద్రయందున్నాయి. వృక్షములు కొంచెము జాగరూకములై ఉన్నాయి. క్రిమి-కీటకాదులు మన మనుజుల వలెనే కొంత జాగరూకముగాను, కొంత నిద్రాశీలముగాను ఉన్నాయి.

శరీరనాశ ఏవైషాం సుఖం సంప్రతి దుఃఖ కృత్ అస్మాకమివ తేషాం తజ్జీవితం తు సుఖాయతే ॥

ఏ విధంగా మనకు జీవించడం సుఖంగాను, మరణించడం దుఃఖంగాను ఉన్నదో... అట్లాగే క్రిమి-కీటకాలకు కూడా 'జీవించడం' అనేది సుఖప్రదంగాను, 'మరణించడం' అనేది దుఃఖ

Page:194

ప్రదంగాను అనిపిస్తూ ఉంటోంది. క్రొత్త చోటికి వెళ్ళిన మనుజునకు అక్కడ గల పదార్థాలన్నీ క్రొత్తక్రొత్తవిగా అనిపిస్తున్నట్లే పశు-మృగాదులు కూడా ఈ పదార్థ సమూహములను కొన్నిటిని ఉద్వేగంతోను, మరికొన్నింటిని ఉదాసీనంగాను గాంచుచున్నాయి. మనకు వలెనే తిర్యక్ జీవులకు కూడా (పశు-పక్షి మొదలైనవాటికి కూడా ఈ ప్రపంచం సుఖ-దుఃఖప్రదమై గోచరిస్తోంది. అయితే మానవులేమో గుణ-క్రియలను బుద్ధితో విశ్లేషించి పదార్థముల సంయోగ-విశ్లేషణాదులచే మరి కొంత విశ్లేషించి మరీ విషయాలను పొందుతూ వస్తున్నారు. తిర్యజాతి జీవులేమో ప్రకృతిలో లభించేదానిని యథాతథంగా అనుభవిస్తున్నాయి. ఇంతకుమించి తేడా ఏమీ లేదు. అజ్ఞానులకు పామరజనులు 'ఆత్మజ్ఞానము' నకు సంబంధించిన యోచన-ప్రయత్నము లేకుండా ఆయా ఇచ్ఛా- - ద్వేషములనే త్రాళ్ళచే బద్ధులై ఒక సమయంలో సానుకూల్యమును, మరొక సమయంలో ప్రాతికూల్యమును పొందుచూ జీవితములను గడిపివేస్తున్నారు. ఇక పశువులు మొదలైనవి ముక్కు త్రాళ్ళచే బంధించబడి.... ఆహారాదులచే సంతోషిస్తూ, అవి లభించనప్పుడు దుఃఖిస్తూ జీవిస్తు న్నాయి. ఇటు మానవులు - అటు పశువులు కూడా అంతఃకరణంలో అనేక వేదనలు, సుఖదుఃఖ అనుభూతులు కలిగియే చరిస్తున్నారు. కనుక ఉభయుల జీవితంలో భేదమేమున్నది? మానవులుజంతువులు-కీటకాలు ఈ అందరు దేహులు కూడా ఒకప్పుడు ఈ దేహాలు పొందుచున్నారు. బాల్య-యౌవన-వార్ధక్యములు అనుభవిస్తున్నారు. కాలక్రమేణా ఆయా దేహాలను మరణంలో కోల్పోవుచున్నారు. ఇందులో విశేషమైన భేదం ఏమున్నది?

సుకుమారమైన చర్మం కలిగిన మానవులకు సుఖనిద్రా సమయంలో శీతోష్ణముల వల్ల దోమలు మొదలైన వాటి వలన దుఃఖం కలుగుచున్నట్లే, వృక్షాదులకు కూడా క్రిమికీటకాదులచే గావించబడే 'దంశం (కాటు వల్ల దుఃఖ వేదనలు కలుగుచూనే ఉన్నాయి. కనుక ఉభయుల సుఖ-నిద్ర-దుఃఖ-వేదనలలో మాకు భేదమేమీ కనిపించడం లేదు. దేశక్షోభ ఏర్పడగా మనం పరుగులు తీస్తున్నప్పుడు ఏ విధంగా మార్గంలోని రాళ్ళు ముళ్ళు తగిలి మరింత క్షోభను కలుగ జేస్తాయో, అట్లాగే పక్షులకు, సర్పములకు, తదితర తిర్యక్ జంతువులకు శత్రువుల వలన ప్రకృతి యొక్క వైపరీత్యము వలన క్షోభ-దుఃఖము కలుగుతూ ఉంటాయి. విక్షేపానుభవం తొలగినప్పుడు మనుష్యులకు ఆనందం కలుగుచున్నట్లే జంతువులకు కూడా విక్షోభం తొలగగానే ఆనందం కలుగుతోంది. ఆహార-నిద్ర-మైథున-విశ్రాంతి సమయాలలో ఇంద్రునికి కలిగే ప్రసన్నత ఎట్టిదో, ఒక దోమకు ఈగకు-పేనుకు కలిగే ప్రసన్నత కూడా అట్టిదే! ఆ ఇరువురు కూడా విక్షేపమును ఒక్కొక్కసారి అధిగమించలేక నిస్సహాయతను అనుభవిస్తూ ఉండడం కూడా సమానమైనదే! రాగద్వేష-భయ-ఆహార-నిద్ర మైధున జనితములైన సుఖదుఃఖాలు, జనన-మరణ సమయాలలో ఏర్పడే భేదాల విషయంలో ఇంద్రునికి, కీటకానికి కూడా భేదమేమీ లేదు. ఇక భేదమేమిటంటావా?

మానవులకు శాస్త్రములు, అవి నిర్దేశించే పుణ్య-పాప - బ్రహ్మతత్త్వాదుల సంబంధమైన జ్ఞానం, భూత భవిష్యత్ పదార్థముల జ్ఞానమూ ఉంటున్నాయి. ముంగిస-నక్క-పాము-ఏనుగుఆవు మొదలైన జంతువులకు అవి అంతగా ఉండడం లేదు. ఇక మిగతా అన్ని విషయాలలో (చావు

Page:195

- బ్రతుకు - సుఖం - దుఃఖం - - ఇష్టం - - అయిష్టం - ఆకలి - - దప్పిక - ఇష్టజీవులు - - అయిష్ట

జీవులు - నిద్ర - స్వప్నం -అపోహఆశ నిరాశ దురాశ - ప్రేమ - - క్రోధం వంటి విషయాలన్నిటిలో మానవులకు, ఆ జంతువులకు భేదమేమీ లేదు. ఇక వృక్షాదులు నిద్రాగ్రస్తములై గాఢమైన అజ్ఞానముతో కూడి ఉంటున్నాయి. పర్వతములు-కొండలు కూడా అదే స్థితిని అనుభవిస్తున్నాయి. కాని హిమాలయము, మేరు పర్వతము మొదలైన కొన్ని పర్వతములు మాత్రం తత్వజ్ఞ సంబంధమైన అఖండ చిదాకాశమును అనుభవిస్తున్నాయి. వృక్షాదులేమో గాఢనిద్రను అనుభవిస్తున్నాయి. పర్వతాదులు అజ్ఞానయుక్తమగు స్వసత్త యందు ఉంటున్నాయని అనుకున్నాం కదా! జంగమజాతులలో అనేక జీవులు స్వప్న స్థితిలో అర్ధవికాసముతోను, జగత్తునందు పూర్ణవికాసముతోను ఉంటున్నారు. కొందరు జంగమ జీవులు మాత్రం చిదాకాశమాత్ర స్వరూపానుభవులై ఉంటున్నారు. ఏ జీవునికి ఎట్లు అనుభవమైవుంటున్నా కూడా అది 'ఎరుక' అను మూలతత్త్వమును ఆశ్రయించే ఉంటోంది. అద్దానిని ఎవరు ఏ రీతిగా ఎఱుగుచున్నారో, వారికి ఆ రీతిగా అప్పుడే అనుభవమగుచున్నది.

కనుక జ్ఞానికైనా అజ్ఞానికైనా చిడాకాశమే ఆయా రీతులుగా అనుభవమగుచున్నదని విజ్ఞుల అభిప్రాయం. 1.హిమాలయాది పర్వతాదుల అఖండ సత్త; 2.వృక్షాదుల నిద్రాసత్త ఈ రెండింటిలోను ద్వైతానుభవం (రెండవది అనే అనుభవం) ఉండడం లేదు. కాబట్టి ఆ రెండింటి యొక్క దృష్టికి ఈ జగత్తంతా కూడా ఏకమే అయినట్టి అజ్ఞానోపహిత చిదాకాశమే ఆయా రీతులుగా

కనబడుతోంది.

ఓ రామచంద్రా! ఆత్మజ్ఞానం కలుగనంతవరకూ ఈ జీవుని దృష్టిలో జగత్తు ఉంటూనే ఉంటుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడో... ఇక ఆ ఆ పై ఈ జగత్తుగాని, నీవు-నేను మొదలైనవిగాని, భూత-భవిష్యత్-వర్త మానములు గాని సర్వదా లేనివే అయివుంటాయి. వాస్తవానికి ఏ చిదాకాశ మైతే “అనాది-అనంతము-అపరిచ్ఛిన్నము-అజ్ఞాన నిద్రారహితము-మౌనసదృశము-శిలవలె చిదనము-సర్వదా యథాస్థతము అయివున్నదో అట్టి చిదాకాశమే ఈ జగత్తు యొక్క వాస్తవరూపం. స్వప్నద్రష్టకు స్వకల్పితంగా స్వప్నం అగుపిస్తున్నట్లు, అజ్ఞాని యొక్క దృష్టికి నిజస్వరూపము చేతనే ఈ జగత్ వైచిత్ర్యమంతా కల్పించబడినదై అనుభవమగుచున్నది. పరమార్థంగా చూస్తే ఈ సృష్టి పూర్వం ఎట్లా ఉన్నదో... ఇప్పుడూ అట్లాగే సమముగానూ, ఏకరూపముగానూ ఉన్నది. ఇక ముందు కూడా అనంతకాలం ఇట్లే ఉండబోతోంది. ఎటొచ్చీ... అజ్ఞానికి అది నేను-నీవు మొదలైన వాటితో కూడిన అనేక రూపాలుగా అగుపిస్తోంది.

జ్ఞాని ఇదంతా ఏకం అఖండం అగు ఆత్మతత్త్వంగా సుస్పష్టంగా చూస్తున్నాడు. అట్టి శుద్ధ చిన్మాత్రమునకు ఆకాశం-పర్వతం-ప్రపంచత్వం-శూన్యత్వం-మౌనత్వం-మౌనిత్వం మొదలైన శబ్దార్థాలు ఆపాదించడానికి కుదరనే కుదరదు సుమా!

ఓ రామచంద్రా! నీవు-నేను ఈ సమస్తము కూడా యథాస్థితమగు బ్రహ్మమే అయివున్నాం. బ్రహ్మమునకు వేఱుగా నేను-నీవు తదితరులు అనునవేవీ లేవు.

Page:196

స్వప్ననగరంలో స్వప్న కల్పనారూపమగు పరమాకాశము తప్ప మరింకేమున్నది చెప్పు? అట్లాగే ఏదైతే కలదో... అది శాంతం-నిర్మలం-నిర్వికారం అగు చిదాకాశమే అయివున్నది. అంతటా చిదాకాశమే ఉండి ఉండగా... అందులో సుఖ దుఃఖాదులు ఎక్కడుంటాయి చెప్పు? స్వప్నంలో వస్తువులు మెలకువ వచ్చేవరకే కనిపిస్తాయి కదా! ఆ తరువాత స్వప్నంలో వస్తువులు ఏమవు తున్నాయి? ఆ ప్రశ్నే ఉచితం కాదు. ఎందుకంటే, స్వప్నంలో వాస్తవానికి వస్తువులు ఉంటే కదా... అవి పోవడం అనేమాట? అట్లాగే జ్ఞానము కలిగిన తరువాత “నీవు-నేను జగత్తు-అహంకారము” మొదలైనవి మొదలే కనిపించవు. అట్లా ఎప్పుడైనా నాకు కనిపించి ఉంటే, అది అజ్ఞానము చేతనే”... అని జ్ఞాని గమనిస్తున్నాడు. 'జగత్తు' అనే స్వప్నం 'జ్ఞానము’ అనే మెలకువచే ఎఱుగబడినదై అంతయూ బ్రహ్మమే” అనునది కరతలామలకమైపోతోంది. అట్టి ఈ జగత్తు అజ్ఞానపూర్వకమైన స్వప్నం వంటిది... అని ఎఱుగబడిన తరువాత ఇక ఇందులో ఆసక్తి ఉండ వలసిన పనేముం టుంది? "గొడ్రాలి రెండవ కుమారుని రూపు రేఖలేమిటి?...అనే విషయంలో ఆసక్తి ఎవరికీ ఉండదు కదా! ప్రతి పరమాణువునందునూ అసంఖ్యాక జగత్తులు స్వప్నమాత్రంగా ప్రాప్తించ గలుగుచుండగా ఇక అట్టి ఈ భ్రమ ఎందుకు? "గొడ్రాలి రెండవ కుమారుని ముక్కు ఎంత వెడల్పు? ఎందుచేత? అనే అల్పచర్చలు త్యజించి ఆత్మజ్ఞానము కొఱకై సర్వ అవకాశములను

ఎందుకు వినియోగించరాదు?

ఏది అప్రబోధకాలంలో ఉన్నట్లు అగుపిస్తున్నప్పటికీ ప్రబోధకాలంలో ఉండదో... అది ఉన్నది ఎట్లా అవుతుంది? భ్రమచే ఎండమావులలో జలతరంగాలు కనిపిస్తూ ఉంటే, (భ్రమ తొలగగానే అక్కడ జలమేలేదని తెలియవస్తూవుండగా... ఇక ఉన్నట్లైతుందా? ఈ జగత్తు మొదలైనవి అట్టివే సుమా! ఈ భూత భవిష్యత్ కాలములు, జ్ఞాన-అజ్ఞానములు మొదలైనవి కూడా యథార్థానికి లేనివే! అంతాకూడా శివరూపము పరమశాంతము అగు పరమాత్మ చేతనే ఆవరించబడివున్నది. ఇక ఈ 'చచ్చుట-చంపుట' అనబడు విశేషాల గురించి అంటావా?...

యథా ఊర్మిణో ఊర్మౌనిహతే న కాచిత్ పయసాం క్షతిః

తథా దేహేన నిహతే దేహే, నాస్తి చితేః క్షతిః ||

ఒక తరంగం వెళ్ళి మరొక తరంగమును ఢీకొని ఖండములుగా చేసిందనుకో!... అప్పుడు జలానికి వచ్చే నష్టమేమున్నది? అట్లాగే ఒక దేహముచే మరొక దేహము నశింపజేయబడినప్పటికీ కూడా ఆత్మకు ఏ హానీ లేదు. ఆకాశరూపమగు చైతన్యమునందే నేను దేహమును అనే భ్రాంతిజ్ఞానం ఉత్పన్నం అవుతోంది. కాబట్టి అట్టి భ్రాంతిజ్ఞానరూపమగు దేహము నశించనంత మాత్రంచేత చైతన్యము నశిస్తుందా! లేదు. చైతన్యమునకు (ఆత్మకు) వచ్చే నష్టమేమి లేదు.

జగత్తు ప్రబుద్ధమగు చిదాకాశము యొక్క "స్వప్నం' -

ప్రబుద్ధస్యైవ చిద్వ్యోమ్నః స్వప్నో జగత్ ఇతి స్థితమ్ | పృథ్వ్యాది రహితం యస్మాత్, తస్మాత్ స్వప్నాత్మకం జగత్

Page:197

అట్టి ప్రబుద్ధ చిదాకాశము యొక్క స్వప్నమే జగత్తుగా స్థితినొంది ఉన్నది. అనగా జగత్తు అనబడేది దానిలో 'పృథ్వి - నీవు-నేను' అనేవేవీ వాస్తవానికి లేవు. ఉన్నట్లుగా ఏది కనబడుచున్నదో... అది స్వప్నాంతర్గత విశేషములు వంటివి మాత్రమే! ఎందుకంటే ఏది ఎట్లు భావించబడుచున్నదో... అది అట్లే అనుభూతమ గుచున్నదని ఇక్కడ గ్రహించబడుగాక! పూర్వపూర్వ సంస్కారములచే 'సృష్ట్యాది' యందు పృథ్వి మొదలైనవాటియందు వస్తు బుద్ధి ఏర్పడి ఉంటోంది. స్వప్న సమయంలో స్వప్న వస్తువులు 'ఇవి వాస్తవమే' అని అనుభవించవచ్చుగాక! అయినా కూడా స్వప్న పదార్థము లందలి సత్యత్వమును గూర్చిన భ్రాంతి కల్పనా మాత్రమే కదా! జగదనుభవం కూడా కల్పనా మాత్రమే!

ఈ ప్రకారంగా జగత్తు అనునది అనాది ప్రవాహరూపమగు స్వప్నం యొక్క అవయవ రూపము అగుచున్నది. ఇట్లు అసత్యమైనట్టి "జగతిస్థితి" యందు ఈ పృథ్వి మొదలైనవి సత్యములే అయినట్లు ఈ మూఢబుద్ధి ఒకానొక కల్పనను ఆశ్రయించుకొని ఉంటోంది. చీకట్లో 'మోడువారిన చెట్టు బేతాళము' అనేది అసత్యమే అయినప్పటికీ భ్రాంతిచే బాలుని దృష్టికి దృఢపడి ఉంటోంది చూచావా? అట్లాగే అభ్యాసవశంచే భ్రాంతి సత్యమువలె దృఢపడి కనబడుతోంది. అయితే దేనియందైతే ఇదంతా కల్పించబడి ఉన్నదో... అట్టి పరమార్థ సత్యమగు బ్రహ్మతత్త్వము మాత్రము సర్వదా అత్యంత నిర్మలమై వెలయుచున్నది. వాస్తవానికి ఈ పృథ్వి మొదలైనవి ఇతఃపూర్వం కూడా స్థితినొంది ఉండలేదు. యథారీతిగా "చిద్రూపమగు బ్రహ్మమే అంతటా వ్యాపించిఉన్నది. మరిక పృథ్వి మొదలైనవి "స్మరించువాడు-విస్మరించువాడు.... అనునవి మాత్రం ఎట్లా ఉంటాయి?

చిన్మాత్రము యొక్క అజ్ఞానమే జగత్తు యొక్క సత్యత్వముగా భ్రమింపజేయుచున్నది. చిన్మాత్రము యొక్క అపరిజ్ఞానమే జగత్ భ్రాంతి రూప కవాటమును తెరచుచున్నది. కార్యసహితమగు అజ్ఞానం అధిగమించబడిన మరుక్షణం ఇక శేషించునదేదియో... అదియే చిన్మాత్రము. అట్లు పరిశేషించుదానిలో పృథ్వి మొదలైనవి సంభవించవు. ఈ విధంగా... ఏది ద్రష్టయో, ఏది దృశ్యమో ఈ రెండూ కూడా శివస్వరూపమగు చిన్మాత్రమే అయి ఉన్నాయి.

అద్దములో ప్రతిబింబము వలె చిన్మాత్రమునందు ఈ జగత్తు భాసిస్తోంది. అయితే అద్దము చిన్మాత్రములో ఒక భేదమున్నది. అద్దములో బాహ్య బింబము ప్రతిబింబముగా భాసిస్తోంది. చిదాకాశమునందు బాహ్యబింబము లేకుండానే జగత్తు స్వయంగా చిదాకాశమునకు అద్వితీయమై బాసిస్తోంది. అద్దంలో వస్తుజాలమంటూ (కనబడుచున్నప్పటికీ) ఏదీ లేదు కదా! అట్లాగే చిదాకాశమునందు 'జగత్తు' అనబడునదేదీ ఎప్పుడూ ఎక్కడా లేనేలేదు.

ఏ పదార్థమైతే ప్రమాణసహితమై ఉన్నచో, అది మాత్రమే విచారణచే లభించగలుగుతుంది. విచారణచే లభించేది మాత్రమే 'పరమార్థ సత్యం' అవుతుంది. ఇక ప్రమాణ రహితమైనది కేవలం సాపేక్ష స్థితిలో ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ అదంతా ప్రతిభాసమాత్రం అవుతుంది. అటువంటిది త్రికాలలోనూ సత్యమే కాదు. ఒక భావనచే ఉన్నట్లు కనిపిస్తూ మరొక భావన-అభిప్రాయములచే

Page:198

లేదు అని తెలియవస్తూ ఉండగా... అది ఉన్నది ఎట్లా అవుతుంది?... అయితే ఎవరైనా “ఈ జగత్తు మా దృష్టికి ప్రాప్తిస్తూ ఉండగా ఇది లేదనే సిద్ధాంతం మేము ఎట్లా అంగీకరిస్తాం? అని అంటారేమో?

భవేత్ భ్రమాత్మకమపి కించిత్ అర్థ - క్రియాకరమ్ |

స్వప్నాంగనాపి కురుతే సత్యామర్ధక్రియాం నృణామ్ ॥

స్వప్నంలో కనిపించిన 'సుందర స్త్రీ' భ్రమయే అయినప్పటికీ జనులకు వీర్యపాతము జరుగుచుండడం ఉంటోంది కదా! అట్లాగే భ్రమమయమే అయినప్పటికీ ఈ జగత్ క్రియా పదార్థములు అర్థ క్రియా సామర్థ్యములు అగుచున్నాయి. ఈ జగత్తు యొక్క 'భావన' అను ప్రకాశము-సత్తయే చిదాకాశము యొక్క ప్రకాశము అయి ఉన్నది. కాబట్టి ఇక నేనెచట? నీవెచట? దృశ్య దృష్టి ఎచట? మహా సముద్రంలో జలమే ఉన్నదిగాని... అనేక తరంగాలు లేనట్లు చిదానందసాగరంలో ఈ నేను-నీవు అనునవన్నీ భ్రమ మాత్రమే! ఒకవేళ ఉండి ఉంటే అవన్నీ కూడా (సముద్ర తరంగాలన్నీ జలమే అయినట్లు) చిదాకాశ స్వరూపమే గాని మరింకేమీ కాదు. మృత్వా పునర్భవనమస్తి కిం అంగనష్టం? మృత్వానచేత్ భవనమస్తి తథాపి శాన్తిః |

విజ్ఞాన దృష్టి వశతో అస్త్యథచేద్విమోక్షః తన్నేహ కించిదపి దుఃఖమ్, ఉదారబుద్ధేః || ప్రియ రామచంద్రా! విజ్ఞాన దృష్టిని అనుసరించి ఆత్మ ఉత్పత్తి నాశరహితమైనదని ఉదార బుద్ధివగు నీకు సుస్పష్టమే అయి ఉన్నది కదా! ఇక "పునర్జన్మ ఉన్నదా? లేదా?" అనే మీమాంసతో పనేమున్నది చెప్పు? ఎందుకంటావా? విను. మరణానంతరం మరల దేహం ఉత్పన్నమౌతోంది కదా! కనుక పునర్జన్మ ఉన్నది" అంటారా! ఈ దేహం పోవడం వలన గాని, మరొక దేహం రావడం వలన గాని ఆత్మకు హాని ఏమున్నది? మార్పు చేర్పు లేమున్నాయి?

"ఒకవేళ మరణానంతరం మరొక దేహం లేదు అనదలచుకుంటే అది జగత్హితమగు మోక్ష-శాంత స్థితియే కదా! సర్వ ప్రపంచ లయానంతర శాంత స్థితియే అది కాబట్టి ఇక ఆత్మకు హాని ఏమున్నది?

కాబట్టి ఏ విధంగా చూచినాసరే... ఇక్కడ ఒకింత కూడా దుఃఖం లేకయే ఉన్నది. మూర్ఖునకు ఏ జనన-మరణములు అనుభవములగుచున్నాయో.... అది ఆత్మజ్ఞునకు తెలియడంలేదు. "ఈ మృగతృష్ణా జలంలో నేను చేపనై ఈదుచున్నాను అనేది మృగతృష్ణ జలభ్రమ లేని వాడికి

అంగీకారం అవదు కదా!

ఓ రామచంద్రా! మనోరాజ్యమున ద్రష్ట స్వరూపమగు ఆత్మయే అనేక రూపములుగా ప్రదర్శితమౌతోంది. అట్లాగే తత్త్వజ్ఞాని యొక్క దృష్టిలో చిదాకాశ స్ఫూర్తియే బాహ్యఅభ్యంతరములలో 'నీవు-నేను' ఇత్యాది సర్వజగద్రూపంగా తనయందు తానే స్వప్న సదృశంగా పొందుతోంది అనేది సుస్పష్టమౌతూనే ఉన్నది.

Page:199

5. వివిధ సిద్ధాంతములు - వాదోపవాదములు

శ్రీరాముడు : మహాత్మా! ఒకే జలం అనేక తరంగాలుగా కన్పిస్తున్నది! ఇదంతా చిదాత్మ తప్పితే మరింకేమీ కాదు. తదితరమైనదంతా భ్రమయే! భ్రమ తొలగితే అంతా చిదాత్మగానే అగుపించ గలదు... అని మీరు సిద్ధాంతీకరిస్తూండగా అద్దానిలో సందేహం నాకేమీ అగుపించడంలేదు. అయితే ఇక్కడ వేర్వేరు గురువులు వేర్వేరు సిద్ధాంతాలు ప్రతిపాదించడం, వారి అనుయాయులు ఆ సిద్ధాంతములను ప్రచారం చేస్తూ వాటిని పూర్తిగా నమ్మి ఉండడం ప్రపంచంలో చూస్తున్నాం. కొందరి సిద్ధాంతం ఈ విధంగా ఉంటుంది.

యావజ్జీవం సుఖం జీవేత్ నాస్తి మృత్యురగోచరః భస్మీభూతస్య శాస్తస్య పునరాగమనం కుతః? I

ఎంత వరకు జీవితం ఉంటుందో... అంతవరకు సుఖంగా ఉండడమే మన పని. ఒక రోజు చావు రానేవస్తుంది కదా! ఈ దేహం భస్మీభూతమైన తర్వాత మరల రాక ఎచట?" స్వామీ! ఇటువంటి సిద్ధాంతమును నమ్మి అనేక దుఃఖములపాలగుచున్న వారి దుఃఖం శమించేది ఎట్లా? శ్రీవసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సంవిత్తు (లేక, ఈ జీవుని ప్రప్రథమ స్వరూపమగు ఆత్మ) తనయందు ఏ నిశ్చయమును ఎట్లు పూర్ణంగా ధరిస్తోందో... ఆయా స్వయం నిర్మిత నిశ్చయమును అట్లే అనుభవించడం జరుగుతోంది. ఏది ఏ భావనచే దర్శిస్తూ ఉంటే అది ప్రాప్తించడం (యత్ భావమ్ తత్ భవతి) అనునది లోకవిదితమైన విషయమే కదా! చిదాకాశము ఆకాశమువలె సర్వవ్యాపకమై శాంతమై ఉన్నది.

1. జీవుడు వేరు-దేవుడు వేరు, జీవుడూ-జీవుడూ వేరు, మానవజాతి-తదితర జాతులు వేర్వేరు... ఇటువంటి ద్వైతమూ

2. "జీవుడు దేహంతో పుడతాడు-దేహంతో ఉంటాడు-దేహంతో అంతం. అంతకుముందూ ఏమీలేదు. ఆ తర్వాత ఏమీ లేదు" అనే (చార్వాకుల మత) అభిప్రాయం.

3. వేదాంతవాదుల యొక్క అనుభవమునకు సుస్పష్టమగుచున్న అద్వైతానుభూతి.

... ఇదంతా కూడా చిదాకాశమే అయివున్నది. చిదాకాశ జగన్నాటక చమత్కారమే!

సృష్టికి పూర్వం మహాప్రళయ స్థితిలో బ్రహ్మమునకు వేరుగా ఏదీ ఎక్కడా లేదు. అట్టి బ్రహ్మమునకు మరొక కారణమూ లేదు. కాబట్టి అకారణమగు బ్రహ్మమే అన్ని రూపాలుగాను, అన్ని భావనలుగాను వ్యాపించి ఉన్నది. 'మహా ప్రళయం' అనగా 'సమస్త భావనలు లయించి ఉన్నప్పటి స్వస్వరూప స్థితి”... అని గ్రహించు. అట్టి ఆదిశేష్యమగు స్వస్వరూపాన్ని తిరస్కరించువారు తమ స్వస్వరూపమును తామే ఖండించుకొనువారు అగుచున్నారు.

సమస్తవేద శాస్త్రార్థం యే మహాప్రలయాది చ |

న ఇచ్ఛన్తి తే మహామూఢాః నిఃశాస్త్రా నో మృతా ఇవ ||

Page:200

సమస్త వేద-శాస్త్రముల యొక్క తాత్పర్యమైనట్టి బ్రహ్మమును, సర్వ ఆలోచనలకు ముందే సర్వదా ఏర్పడివున్న మహా ప్రళయానంతర స్వస్వరూప ఆత్మ' ను, సర్వజగత్ వ్యవహారానుభవాలకు ఆత్యంతికమైన 'మోక్షము' అను స్థితిని తిరస్కరిస్తూ, తత్సాధనములను మొదలే పెడచెవిన పెట్టేవారు తత్త్వోపదేశానికి అర్హులే కాదు. అట్టి శాస్త్ర శూన్యులగు మూఢులు యోగిదృష్టిలో జీవన్మృతులే సుమా! ఈ జనులను 3 రకాలుగా విభజించవచ్చు

1. మూర్ఖులు: వీరు జగత్తునే (దృశ్యమనే) నమ్మి ఉంటున్నారు. ఈ దేహాదుల పతనానంతరం నా స్థితి-స్వరూపము ఏమిటి?'... అను ప్రశ్నకే రావడం లేదు.

2. భోగవాదులు :ఇదిగో! ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి! ఆ తర్వాత ఏమైతేనేం? అప్పుడు చూచుకుందాంలే! అని తాత్సారం చేస్తూ వీరు ఆత్మ జ్ఞానమునకు సిద్ధమే కావడంలేదు. ఇట్టివారిలో కొందరు “ఆ తర్వాత ఏమీ ఉండదు. శరీరంలో అణువుల కలయిక వలన నేను అనునది కనిపి స్తోంది. ఆ అణువులు విడిపోతే 'నేను' అనేది ఎక్కడా ఏదీ ఉండదు. ఇంతకు మించి ఏమీ లేదు... అని (చార్వాకులు) నమ్మి ఉంటున్నారు. ఇక మరికొందరు దేహం ఉంది కనుక అనుభవిద్దాం. ఆ తర్వాత అంటారా?... అది తెలియదు. తెలుసుకోలేం. కనుక ఎవరూ ఆ ఊసు ఎత్తకండి... అని నిర్ణయిస్తున్నారు. అట్టి వారిని శాస్త్రములు 'దేహాత్మ బుద్ధి పరిమితులు' అని అంటున్నాయి. వారు అట్లు నమ్మి ఉండగా వారికి దేహమేమిటి? నెనెవరు? అనే ప్రశ్నయే ఉదయించుట లేదు. కనుక వారికి ఉపదేశించటం కుదరదు. శాస్త్రోపదేశములు అట్టివారి కొరకు కాదు.

3. జ్ఞాన సిద్ధులు : వీరు నిత్య సత్యమగు ఆత్మను అనుభూతపరచుకొని ఉంటున్నారు! 'ఈ దేహమును, ఇంద్రియములను ప్రవర్తింపజేసే ప్రత్యగాత్మ చైతన్యము, మనస్సు మొదలైనవన్నీ 'బ్రహ్మమే' అనునదే శాస్త్రముల ముఖ్యోద్దేశం'... అని గ్రహించి ఉంటున్నారు. నేను ఈ కనబడే వారు అంతా బ్రహ్మమే అను అనుభూతి కలిగి ఉంటున్నారు. ఉపదేశ క్రమము పై ఇరువురికి ఉద్దేశించబడలేదని గ్రహించు. ఎందుకంటే... మొదటివారు జగత్తును నమ్మి ఉంటున్నారు. రెండవ వారు సర్వము ఎఱిగి ఉంటున్నారు.

మరి ఉపదేశ క్రమము ఎవరికి? ఎవరైతే నేనెవరు? ఈ దేహమేమిటి? ఈ జగత్తు ఎట్టిది? సత్యమేమిటి? 'నేను... అనుభవము... అనుభవించబడేది' ఈ మూడు దేనిపై ఆధారపడి వర్తిస్తు న్నాయి? ఈ రూపమైన అనుమానములు ఉదయించి యున్నాయో అట్టి సత్యాన్వేషకుల కొరకే శాస్త్ర బోధితమైన ఉపదేశ క్రమమంతా ఉద్దేశించబడి ఉంటోంది.

శ్రీరాముడు : వసిష్ఠ మహర్షీ! సర్వులూ సంవిత్ స్వరూపులే కదా! అయితే ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క తీరైన నమ్మిక-భావన-అనుభవముతో ఉంటున్నాడు. ఇదంతా ఎట్లా ఎందుకు జరుగుతోంది? శ్రీ వసిష్ఠ మహర్షి :

నిత్యా నిరన్తరోదేతి యాదృశీ సంవిత్ ఆశయే |

భూయతే తన్మయేనైవ పుంసా దేహో-స్తు, మా అధవా ॥

Page:201

'నిత్యము నిరంజనము' అయిన సంవిత్తు అంతఃకరణమున ఏ విధంగా (ఏ భావన కలిగి) ఉదయిస్తుందో... అది ఆ విధంగానే అక్కడ అనుభవిస్తోంది. అట్టి అనుభవము ఈ దేహము ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అట్లే అంతఃకరణానుసారమే ఉంటోంది. ప్రతి జీవుడు మూడు స్వరూపాలు సర్వదా కలిగియే ఉన్నాడు.

1.ఈ దేహ స్వరూపం; 2. అంతఃకరణ స్వరూపం; 3. ఆత్మ స్వరూపము... ఈ మూడు స్వరూపాలలో మొదటి రెండూ కూడా అపాదితము, భ్రమాత్మకము, అసత్యము, ఏ ఇద్దరి జీవులలో అయినా మనకు కనిపించే భేదమంతా దేహ (మరియు) అంతఃకర సంబంధమైనది, అపాదితం, ఆత్మకు అసంబంధితమైనది కూడా! ఈ బంగారు గొలుసు ఎవరిది - అనే ప్రశ్నకు ఆ సమాధానము నకు బంగారంతో ఏమి సంబంధం? ఇక ఆత్మ స్వరూపమో...

అందరి జీవులలోనూ ఏకరూపమైనది కాబట్టి 'ఏకము'. సర్వదా ఏర్పడి ఉండేది కనుక... 'నిత్యము'. ప్రత్యక్షం-పరోక్షం కాదు కాబట్టి 'అపరోక్షం'. దేహం-అంతఃకరణాల ఉనికి లేములచే మార్పు - చేర్పులు పొందదు కాబట్టి 'అప్రమేయం'. పరిమితులు లేవు కాబట్టి... 'అనంతం'. తన సంకల్పముచే ఏది ఎట్లు సత్యమని భావిస్తే అది అట్లే పొందుచున్నది కాబట్టి... 'సత్య సంకల్పి'. దేహమనో బుద్ధులకు సంబంధించిన సర్వ విషయములచే సర్వదా స్పృశించబడకయే ఉంటుంది. కనుక అద్దానికి సుఖ-దుఃఖ ప్రభావం ఉండదు. కనుక 'నిరతిశయమైన ఆనందము'.

ఈ విధంగా ప్రతి జీవుడు దేహ-మనో-ఆత్మరూపుడై ఉన్నాడు. దేహ-మనోరూపములు గౌణమైనవి. అది సందర్భోచితమైన కాలబద్ధమైన సత్యమేగాని, నిత్యసత్యం కాదు. లోహమునకు నామరూపముల వంటివి. బంగారు అభరణంలో ఆభరణరూపము-ఆభరణ నామము ఆపాదితములే కదా! అందలి బంగారు లోహత్వము మాత్రం నిత్యమైనది. అట్లాగే ప్రతి ఒక్కనిలోనూ ఆత్మత్వము అనునిత్యమై ఉండగా... ఇక దేహ-అంతఃకరణాదులు అపాదితములైనవి.

ఏ జీవుడైతే ఆనందస్వరూపమగు ఆత్మకు విరుద్ధంగా అంతఃకరణ వృత్తిచే “నేను దుఃఖిని” అని ధృఢముగా నిశ్చయించుకొని ఉంటాడో... అతడు అట్టి భావముతోటే తన్మయుడై, ఆవశ్యం దుఃఖము మొదలైనవి అనుభవించుచూ, ఆత్మయొక్క ప్రతిభను ఏమరచుచున్నాడు.

"ఈ జగత్తు చిదాకాశము యొక్క స్ఫురణము మాత్రమే" అని గ్రహించి, నిశ్చయించుకొన్న వారికి కూటస్థము-అద్వయము అగు అట్టి చిదాకాశము వలన దుఃఖానుభవం ఎట్లా కలుగుతుంది చెప్పు? ధూళి ఆకాశమును అంటుతుందా? స్వప్నాంతర్గత విశేషాలు స్వప్నద్రష్టను స్పృశించగలవా? అట్లాగే జాగ్రత్ అంతర్గత విశేషాలు జ్ఞానిని స్పృశించలేవు. సత్తు-అసత్తు" అనబడే సత్పదార్థఅసత్ పదార్థములు ఆబాలగోపాలం విదితమైనదే!

సంవిత్తు సత్యమా? అసత్యమా?... అని కొందరు మీమాంస చేసుకొంటున్నారు. కొందరు (దేహాత్మవాదులు) దేహమే సత్యం. ఆ తర్వాత అంతకు ముందు ఇంక ఏ సత్యమూ లేదు అని బోధిస్తున్నారు.

Page:202

మరికొందరు (సాంఖ్యులు) :పురుషుడే (పరమాత్మయే) సత్యం. జీవుడు (జీవాత్మ) సత్యం కాదు" - అంటున్నారు.

ఇంకొందరు (మీమాంసకులు): ఈ జీవుడే సత్యం మరింకేమీ ఎక్కడా లేదు అంటున్నారు. ఎవరు ఎల్లా ప్రతిపాదించినా... అందరి వాదుల యొక్క అభీష్టము నిర్మల స్వరూపమగు ఆత్మయేనని మాచే గమనించబడుచున్నది. ఆ సంవిత్తు ఎట్లు ఎఱుగుచున్నదో... అట్లే సంవిత్స్వరూపుడగు జీవుడు జగత్తు యొక్క అనుభవము పొందుచున్నాడు. సంవిత్తు సత్యమని అనినా, అసత్యమని అనినా... మొత్తం మీద సంవిత్ యొక్క స్వకల్పనామాత్రం చేతనే ఈ భూ-పాతాళ-స్వర్గ-నరకాది దేహాదులన్నీ అనుభవానికి వస్తున్నాయి. ఆత్మ దేనిని ఎట్లు నిశ్చయిస్తే అది అట్లే అనుభవానికి సత్యమై ప్రాప్తిస్తోంది. స్వప్నంలో కనిపించేదంతా స్వప్న ద్రష్ట యొక్క నిశ్చయము నుండి బయల్వెడలిన అనుభవపరంపరయే అవటమే ఇక్కడ మనకు దృష్టాంతము. అయినా ఆ స్వప్నద్రష్ట ఆ స్వప్న దృశ్యము ఎక్కడి నుండో వచ్చి అక్కడ కనిపిస్తోందని అనుకుంటున్నాడే గాని ఈ స్వప్న దృశ్యము నా అంతఃకరణ కల్పనా విభాగంలోనుంచి వచ్చిన స్పురణ మాత్రమే" అని అనుకోవడం లేదు కదా! అట్లాగే జాగ్రత్గా పొందబడేదేంతా జాగ్రత్ ద్రష్ట తన అంతఃకరణము యొక్క జాగ్రత్ కల్పనా విభాగంలోనుంచే బయల్వెడలిన స్ఫురణ మాత్రమే అని గమనించడం లేదు. జ్ఞానదృష్టిచే అది సుస్పష్టమై ఉంటోంది. జ్ఞాన అజ్ఞానములు ఇంత మాత్రమే!

6. ఆత్మజ్ఞాన ఔషధం

శ్రీవసిష్ఠ మహర్షి : ఈ ప్రపంచంలో (ద్వైతం అద్వైతం-విశిష్టాద్వైతం-నాస్తికత్వం దేహాత్మవాదం మొదలైన) అనేక సిద్ధాంతాలు, అవి ప్రబోధించే గురువులు ఉన్నారు కదా! అయితే ఆ వివిధ శాస్త్రముల ప్రామాణ్యాలన్నీ సంవిత్తు వలననే ప్రతిష్ఠితం అగుచున్నాయి. సంవిత్తే సర్వులకు పురుషార్థ హేతువు అయివున్నదని గమనించబడుతోంది. అందుచేత సంవిత్తే సర్వవాదుల సిద్ధాంతములను ఉపజీవింపజేస్తోంది. అట్టి సంవిత్తు యొక్క అద్వైత వాద సిద్ధాంతమే సర్వ సిద్ధాంతముల యొక్క 'శిరోమణి అని మా ఉద్దేశం. (సంవిత్తు = జీవుడు, అతని అభిరుచి; సత్=ఉనికి; విత్=ఎరుక )

ఇక తదితర సిద్ధాంతములంటావా? ఏ అవిద్య స్వస్వరూపాన్ని ఏమఱింపజేస్తోందో, ఆ అవిద్యయే సర్వ వాదుల సంకల్పాలకు అనుకూలంగా పరిణామం పొందినదగుచున్నది. క్రమంగా వారివారి అనుభవం వారివారి నిశ్చయానుసారం 'అర్థక్రియ' యందు ప్రవృత్తమగుచున్నది. అదియే మరొకప్పుడు బోధితమై నిష్కళంకమైన చిదాకాశమును సంతరించుకొని 'మోక్షభాగిని' అగుచున్నది.

వేదములు ప్రతిపాదిస్తున్న (తత్త్వమ్ - సో హమ్ - జీవోబ్రహ్మేతినాపరః - శివోహమ్ ఇత్యాది) మహావాక్యములే ఈ మన ఇన్ని రోజుల సంవాదమునకు ప్రమాణం. శ్రీరాముడు : ఈ అవిద్య ఎట్లా పరిణమిస్తోంది? అద్దానికి అంతు ఉండదా?

Page:203

శ్రీవసిష్ఠ మహర్షి : అవిద్య గాని, అద్దాని ప్రయుక్తం (Appointer) అయినట్టి విక్షేప సంవిత్తుగాని తనంతట తానుగా తొలిగేదేమీ కాదు. అది స్వర్గ-పశు-పుత్రాదులకు సంబంధించిన ఇచ్ఛలు నెరవేరినంత మాత్రంచేత తరిగేది కాదు. రసాయన-మంత్ర- ఔషధాలు మొదలైన ద్రవ్యముల సముపార్జనచే ఉపశమించదు. పవిత్ర దేశ- కాలాదులందలి స్నానాదులచే గాని, ఆయా తదితర తీర్థయాత్రాది కార్యక్రమములచే కూడా తొలగదు. మరి? ఆత్మజ్ఞానం చేత మాత్రమే అ విద్య తొలగగలదు. ఆత్మ జ్ఞానముచే అ విద్య సంపూర్ణంగా నశించగలదు. ఇక ఆపై ఇది మరెన్నడూ ఉదయించదు. ఒకవేళ అది ఉదయించినా, మరల అది తొలగడానికి జ్ఞానమే శరణ్యమైయున్నది.

సంవిత్తే ఈ సర్వ దేహులలోని జీవుడు అయి ఉన్నది. అట్టి ఈ జీవుడు ఏ ప్రకారంగా దృఢంగా భావిస్తున్నాడో... ఆ ప్రకారంగా సుఖవంతుడుగా గాని, దుఃఖవంతుడుగా గాని అగుచు న్నాడు. అట్టి జీవుని రూపంగా కనిపిస్తున్న సంవిత్తు యొక్క యథార్థమగు ప్రత్యగాత్మ స్వరూపం ఎఱుగబడటం చేత మాత్రమే సంసారబంధనం మొదలంట ఛేదించబడగలదు. కాబట్టి అట్టి ప్రత్యగాత్మయే ముముక్షువులందరికీ శరణ్యం. అదియే లేకపోతే ఈ జగత్తునందు శిల వలె మూకత్వం, అంధకారం (జడత్వం) మాత్రమే శేషిస్తుంది. మనుజుడు గాఢ నిద్ర వలన జడత్వం పొందుచున్నాడు చూచావా? అట్లే స్వభావసిద్ధం-స్వప్రకాశం అయివుండి కూడా జ్ఞప్తి రూపమగు ప్రత్యగాత్మ సంవిత్తు స్వకీయ-అజ్ఞానం చేతనే ఈ దృశ్య ప్రపంచాన్ని పొందుచున్నది. అందుచేత సంవిత్తే లేకపోతే అనుభవం పొందునది అనునది ఉండదు కాబట్టి 'జగత్తు' అనబడేది ఎవరికి? శ్రీరాముడు : మహాత్మా! కొందరు ఇటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు. ఈ ప్రపంచం దశ దిశలలోనూ అంతం లేదు. ప్రారంభం లేదు. ముగింపు లేదు. కాబట్టి ఈ జగత్తు నాశరహిత మైనది. దీనికి ముందు ఎట్టి భావన మొదలైనవి ఏవీ లేవు. ఈ జగత్తుకు ముందు ఏమి లేదు. ఆ తర్వాత ఏమీ ఉండదు.

దీని తర్వాత ఎటువంటి భావనా ఉండదు. ఈ జగత్తు యొక్క అత్యంత-అభావన అనబడు మోక్షము మొదలైనవేవీ లేవు. ఈ జగత్తు వేరుగా ఎక్కడా ఏదీ మరొక సత్యము లేదు. "జీవుడు జగత్తులో జలబుద్భదము వలె జనించి నశిస్తున్నాడు. జగత్తుకు ఆవల జీవునికి ఉనికి లేదు?”

అటువంటి నమ్మిక కలిగివున్న మనుజుని సంసారరోగము శమించడానికి ఎటువంటి యుక్తి అవసరమో అద్దానిని మా జ్ఞానాభివృద్ధి కొరకై ప్రవచించండి.

శ్రీవసిష్ఠ మహర్షి : నీ ఈ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇంతకుముందే చెప్పియున్నాను. వేదము” తెలియబడుదాని గురించి చెప్పేది! వేదాంత విభాగం? తెలుసుకునేవాని గురించి తెలిపేది.

ప్రతి దేహంలోనూ దేహిగా ఉంటున్నట్టి "తెలుసుకొనుచున్నవాడు గురించి చెప్పేదే వేదాంత శాస్త్రం కదా! అదియే 'అధ్యాత్మ శాస్త్రం' అని, 'భౌమా విద్య' అని, 'ఆత్మ విద్య' అని శాస్త్ర ప్రతీతి కలదు. శాస్త్రంపై విశ్వాసముంటేనే ఏ శాస్త్రమైనా ఎవరికైనా బోధించగలం. శాస్త్రంపైగాని, తనపై గాని విశ్వాసం లేనివారికి శాస్త్రం బోధించలేదు. అట్లాగే ఆత్మవిద్య (లేక) 'వేదాంతశాస్త్రం'పై విశ్వాసం లేకుంటే బోధించడం కుదిరేది కాదు.

Page:204

నీవు అడిగినట్లు ఆయావాదుల దుఃఖోపశమనం గురించి ఇక్కడ చెప్పుకుందాం. నీవు చెప్పిన వివిధ భావములు గలవారి గురించి కొంత విభజనచేసి కొన్ని విషయాలు చెప్పుకుందాం. వివిధ భావికులు -

1. దేహాత్ అతిరిక్త చేతనాత్మవాది: కదిలించేది చైతన్యం, కదిలించబడేది దేహం - ఈ

దేహం జడం - - దీనికి వేరైన చైతన్యం ఉన్నది. అట్టి చైతన్యం అనుభవించబడానికి, గ్రహించడానికి ఈ దేహమే అడ్డు అగుచున్నది.

2. నిత్య సూక్ష్మ దేహాత్మవాది : ఈ జీవుని దేహరూపం వాస్తవం కాదు. ఈతనికి మరొక దేహం ఉన్నది. అదియే సూక్ష్మదేహం'. సూక్ష్మదేహం నిత్యమైనది. ఈ భౌతిక దేహం అనిత్యమైనది. అనిత్యమైన భౌతికదేహం (స్థూల దేహ భావనను) అధిగమించి నిత్యమైన సూక్ష్మదేహ భావన’నను సంతరించుకోవడమే జీవిత లక్ష్యం.

3. స్థూల దేహాత్మవాది : కనబడే 'స్థూలదేహం వదలి ('లేదు' అని చెప్పి) ఎవరికీ కనబడని సూక్ష్మ దేహమేదో ఉందని అనడం తప్పు. 'జీవుడు' అనగా దేహమే! దేహం తర్వాత దేహీ లేడు, ఇంకేమీ లేదు”.

4. శుద్ధ సంవిదాత్మవాది: ప్రతిజీవుడు శుద్ధ సంవిత్ ఆత్మస్వరూపుడే”... అను నిశ్చయమును పెంపొందించుకోవడమే జన్మాదుల సార్థక్యం. (సత్ = ఉనికి - - నేను ఉన్నాను కదా!అనే అనుభూతి, విత్ = ఎఱుక, ఆత్మ : = స్వస్వరూపము - దేహి) 5. అజ్ఞానావృత సంవిదాత్మవాది : శాస్త్రములు చెప్పే విధి-విధానములు, సద్గుణాశ్రయము మొదలైనవి జీవుని తన యొక్క శుద్ధ సంవిత్ ఆత్మ స్వరూపాన్ని సుస్పష్టపరచుకోవడానికి ఉపకరించే సహకారిక ఉపాయములు అని ఈ సాధకుడు ఉద్దేశించి ఉండాలి. "అజ్ఞానం తొలగాలి. అది తొలగితేనే జీవునికి తన శుద్ధ సంవిత్ ఆత్మ స్వరూపం సుస్పష్ట మౌతుంది... అను ప్రయత్నంలో ఈతడు సంశుద్ధి పొంది అజ్ఞానం తొలగించుకుంటున్నాడు.

6. సంవిత్ అపలాపి : "సంవిత్ అనేదేదీ లేదు. అటువంటిది ఒకటి ఉన్నది -

తలచడమే భ్రమ.”

ఇట్లా ఆయా వాదములు చేయువారు ఉన్నారు. దేహాత్ అతిరిక్త చేతనాత్మవాది క్రమంగా మరికొంత విచారణాదులచే ఆత్మతత్త్వమును తప్పక అనుభూతపరచుకోగలడు. ఎందుకంటే ఈ దేహాది ఆకారరూపమగు ఉపాధి యొక్క భావనావిలయముచే క్రమక్రమంగా అతడు పరమాత్మతోటి ఏకీభవమును పొందుతాడు. ఇందులో సంశయం లేదు.

ఇక నిత్య సూక్ష్మ దేహవాది అంటావా? నాశనవంతమగు స్థూల దేహమును (అన్నమయ దేహమును) నమ్మి ఇదియే నేను అని అనుకొంటే దుఃఖంగాని నాశన రహితమగు సూక్ష్మదేహమే నేను” అని తలచుచున్నప్పుడు ఇక దుఃఖ మేమున్నది? కాబట్టి క్రమక్రమంగా అతడు కూడా మరికొంత ప్రబోధితుడై వాస్తవమగు ఆత్మతత్త్వమును అతిత్వరగా పుణికిపుచ్చుకోగలడు. ఇక "స్థూల

Page:205

దేహాత్మవాది అంటావా? ఆయన అవయవ సహితమగు పదార్థం నశిస్తుంది" అనే న్యాయమును ఇంకా విచారణ చేయలేదు. అవయవముల కంటే ముందే ఉండి ఉండి, అవయవములను నియామకం చేసే తన యొక్క స్వరూప విభాగమును ఇంకనూ తగినంతగా పరిశీలించలేదు. కానీ కాలక్రమంగా అతడు కూడా ఎప్పుడో అవయవి-అవయవములు-అవయవవినాశనం-అవయవ ఉత్పన్నం అనే విశేషాలు విచారణ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా సత్యము సర్వమునూ జయిస్తుంది కదా! 'దేహ వినాశనము' అనే మార్గంలో విచారణ కావించుచూ ఉండగా... అతనికి కూడా దేహమునకు భిన్నంగా 'దేహి' అనే ఆత్మ ఉన్నది" అనే చైతన్యాత్మ బుద్ధి జనించగలదు. కాబట్టి "అతడు చెడిపోవుచున్నాడే!”... అనే నిరుత్సాహంగాని, అతని పట్ల అయిష్టతగాని ఉండవలసిన అవసరమేదీ జ్ఞానికి అగుపించదు.

శుద్ధ సంవిదాత్మవాది విషయానికి వస్తే "ఈ కనబడే ప్రతిజీవుడు వాస్తవానికి శుద్ధ సంవిత్స్వరూపుడే - అనే విషయం ఎఱిగియున్న వాడు జ్ఞాని. ఇంకనూ నిర్మల బుద్ధి సంపాదించి ఉండకపోవడం చేత అట్లు ఎఱుగనివాడు అజ్ఞాని.

జ్ఞాని-అజ్ఞాని కూడా సర్వదా నిర్మలాత్మ స్వరూపులేగాని మరింకేమీ కాదు”... అని నిర్ణయించుకొని ఉన్నవాడు. సర్వదా సర్వత్రా ఈ జగత్తును ఒక 'లీల’గా గాంచుచూ ఉంటాడు. ఆ తర్వాత క్రమంగా మమాత్మా సర్వభూతాత్మా... నా స్వరూపమే తదితర సర్వజగత్ జీవాదులు”... అను సర్వాత్మత్వం సంతరించుకొని అనిర్వచనీయాత్మానందం అనుభవించగలడు.

ఇక “అజ్ఞానావృత సంవిదాత్మ" అంటావా? అతని సంవిత్తు (ప్రజ్ఞ) ఇంకా “తత్త్వజ్ఞానం” చే తగినంతగా శుద్ధము చేయబడలేదు. ఇంకనూ కలుషితమయ్యే ఉన్నది. అందుచేత దేహం ఉన్న ప్పుడు, లేనప్పుడు కూడా అతని పట్ల సంసారము ఆవశ్యము కొనసాగుచునూ ఉంటోంది. అయినా ఫరవాలేదు. ఒక్కొక్క జన్మలో ఆయా సాధనల ద్వారా సంవిత్తు శుద్ధమగుచుండగా క్రమ క్రమంగానో, కాకతాళీయంగానో అత్యున్నతమైన పరమార్థజ్ఞానం వికసించగలదు. కనుక అతడు ఒకప్పుడు శ్రేయమును గాంచుచున్నాడు. బుఱ్ఱ పదును పెడుచున్న కొలదీ అందరిదీ సద్గతియే కానున్నది. శ్రీరాముడు : మమాత్మా! "మరణానంతరం ఇక ఏమీ ఉండదు. 'ఆత్మ' అనిగాని 'సంవిత్తు' అనబడునది గానీ ఏమీ ఉండదు. “ఈ జీవుడు మరణం తర్వాత ఏ రూపంగానూ ఉండడు" - అను నిశ్చయము కలిగి ఉన్నవాడు మరణానంతరం ఎట్టి స్థితిని పొందనున్నాడు.

శ్రీ వసిష్ఠ మహర్షి :ఏది ఎట్లు భావన చేస్తే అది అట్లే సిద్ధిస్తుంది. (యత్ భావమ్ తత్ భవతి)” అనునది ఈ మనస్సు యొక్క స్వభావము అయివున్నది. కనుక "మరణానంతరం ఆత్మగాని, ఏమీగానీ ఉండదు. తదనంతరమైన 'సంవిత్తు' అనే ఉనికిగాని, స్థితిగాని ఉండదు అనే దృఢాభిప్రాయం పెంపొందించుకొన్న జీవుడు అట్టి బోధ యొక్క ప్రభావం చేత దేహపతనానంతరం చిరకాలం విషయజ్ఞానరహితుడై, జడప్రాయుడై ఉండడం జరుగుతోంది. జీవిత పర్యంతం దృఢపడినట్టి అట్టి "నేను లేను అను ఆత్మ తిరస్కారపూర్వకమైన జడాత్మకజ్ఞానంచే “గాఢసుషుప్తి

Page:206

సదృశమైన ఆ మృత్యుస్థితినే మోక్షముగా గాంచుచూ ఉంటాడు. కొందరి సిద్ధాంతము ప్రకారం (నైయాయికులు) 'ముక్తి' అనగా అట్టి విషయరహితమగు గాఢ సుషుప్తావస్థ మాత్రమే! అయితే నిరతిశయానందానుభవరూపమగు శ్రేయమును వారు గమనించటంలేదని మేం భావిస్తున్నాం. మరికొందరు శుద్ధ సంవిత్ రూపమగు ఆత్మ అనేది అసంభవం అటువంటి దేదీ లేదు. ఉండ జాలదు... అనే శూన్యవాదులు కూడా దేహపతనానంతరం జడ స్వరూపులై మహా తపస్సుచే ఆవరించబడినవారై దుర్భేద్యమైన అంధకార బంధురత్వం పొందుచున్నారు. అయితే సత్యమే అంతటా జయించనున్నది. కాబట్టి (సత్యమేవ జయతే) సత్యానుభూతి పర్యంతము పునఃపరిశీలన వారికి అనివార్యమగుచున్నది.

క్షణికవాదులు :ఈ జగత్తు క్షణికం, స్వప్నపురం వంటిది అని నమ్ముతూ, అంతకుమించి ఏమీ లేదని, ఏమీ ఆలోచించవద్దని బోధిస్తున్నారు. అట్టి పరిమిత దృష్టిని నమ్మువారి సమస్త వ్యవహారాలు సుఖ దుఃఖ మిశ్రితంగా కొనసాగుచూనే ఉంటున్నాయి. క్షణికమైనవాటికి ఆధారంగా సర్వదా వేంచేసి ఉన్నట్టి అనుక్షణికమగు "స్వస్వరూపాత్మ కు సంబంధించిన సమాచారం పరిశీలించి, అప్పుడు నిర్ణయించుకోవలసినదిగా వారికి మా మనవి.

స్థైర్యవాదులు : ఈ జగత్తు శాశ్వతం-మనం అశాశ్వతం" అని బోధిస్తున్నారు. క్షణికవాదుల యొక్క స్థైర్యవాదుల యొక్క, సుఖదుఃఖములు సమానంగానే ఉంటున్నాయి. ఎందుకంటే... ఉభయులకు జగత్ వ్యవహారబుద్ధి ఉన్నంతవరకూ పదార్థములు స్థిరం అనుకొంటే ఏమున్నది? అస్థిరం అనుకుంటే ఏమున్నది? రెండూ ఒక్కటే అగుచున్నది. స్వస్వరూపం యొక్క స్థిరత్వం గమనించండి”... అని వారికి గుర్తు చేస్తున్నాం.

శ్రీరాముడు : మహర్షీ! జ్ఞానుల దృష్టిలో ఈ పృథ్వి మొదలైన పంచభూతాత్మకమైన స్థూల పదార్థములు, సూక్ష్మ పంచమహాభూతములు స్థిరములైనవా? క్షణికములైనవా?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ పృథ్వి మొదలైన స్థూల పదార్థములుగాని, సూక్ష్మ పంచభూతములు గాని స్థిరములైనా, అస్థిరములైనా జ్ఞానులకు ఆ విషయంలో విశేషమైన పట్టుదల ఉండదు. ఎందుకంటే, అజ్ఞానం ఎంతవరకు ఉంటుందో... అంత వరకు ముత్యపు చిప్పలో వెండి కనబడునట్లు ఈ అధ్యస్తమయిన జగత్తు కనబడుచూనే ఉంటుంది. "ఈ ముత్యపు చిప్పలో వెండి ఎప్పుడు బయలుదేరింది? ఏ మార్గంలో వచ్చి ఇక్కడున్నది... అనే వాగ్వివాదాలన్నీ ముత్యపు చిప్పలో వెండి ఏదో ఉన్నదని నమ్మువారికే ఉంటాయి. ముత్యపు చిప్పలో వెండి ఉండజాలదు. వెండి వలె కనిపించేది వెండి కాదు... అని గ్రహించిన తర్వాత ఇక, ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకొచ్చింది? ఎప్పుడొచ్చింది? అనే వాదోపవాదాలు ఏమి ఉంటాయి? జ్ఞానులకు ఈ సమస్తం కూడా అధిష్ఠానమగు చైతన్యం యొక్క ప్రకాశమే అయివున్నది.

సంవిత్తు ఏ క్షణంలోనూ క్షణికం కాదు. ఈ కాల రూప అసత్తుయగు 'క్షణికం' అనబడేది, దేశరూప అసత్తుయగు 'జడత్వం' అనబడేది సంవిత్తు (ఆత్మ) యొక్క అనుభవములోని ఒకానొక

Page:207

విభాగము మాత్రమే! అందుచేత కాలమును దేశమును అంగీకరించి "అవి క్షణికమా? అనుక్షణి కమా? అని వాదోపవాదములు చేసే వారితో ఆత్మజ్ఞులకు సంభాషణ కుదిరేది కాదు.

వేదాంత ప్రవచనం :చైతన్యము యథాతథంగా ఉంటూ ఉండగా, అద్దాని యొక్క వివర్త రూపమే ఈ జగత్తు" అని ఎంచువారు పురుషులలో ఉత్తములు, వందనీయులు కూడా! అట్లా కాకుండా శరీరాదుల నుండి అట్టి శరీరాదులు వికారంచే చైతన్యం ఏర్పడుతోంది అని తలచువారి (చార్వాకుల)తో వాదోపవాదములు చేసి కాలం వృథా చేసుకోవడం వల్ల ఏం ప్రయోజనం? చిద్రూపో జీవబీజౌఘ ఆకాశ కృమిజాలవత్ |

ఊర్థ్వమ్ తిర్యక్ అధో యాతి పూర్యమాణఇవ స్వయమ్ II

చిద్రూపుడు, సర్వజీవుల బీజభూతుడు అయిన హిరణగర్భుడు 'జీవుల గుంపుల' వలె ఒప్పు చున్న ఈ సర్వజీవరాశుల రూపమును స్వయంగా ధరిస్తున్నాడు. నీళ్ళతో నిండుగా ఉన్న పాత్రలో గల క్రిమి జీవులు అటూ ఇటూ పరిభ్రమిస్తాయి చూచావా? అట్లాగే ఆ చిద్రూపుడగు హిరణ్య గర్భుడు సృష్టి’ అనే పాత్రజలంలో అనేకరూపాలు ధరించి పైకి-క్రింది -ప్రక్కలకు పరిభ్రమిస్తున్నాడు.

అనగా... హిరణ్యగర్భుడు అనబడే చిదాభానునిచే ఈ 'వివిధ జీవుల సమష్టి రూప కర్తృత్వం’ అనబడేదంతా తనలో ఈ 'సృష్టి' రూపంగా ఎఱుగబడుచున్నది. ఈ ఈ వివిధ కర్తృత్వ రూపాలన్నీ అతడు తనలో స్వయంగా అనుభవించుచూ ఈ విధంగా సంసారమున తిరుగాడుచున్నాడు.

ఈ జీవుడు చిద్రూపుడే! హిరణ్యగర్భుడూ చిద్రూపుడే!

“ఎవడు ఏ విధంగా దేనిని ఎఱుగుచున్నాడో... అతడు అద్దానిని ఆ విధంగానే పొందుచు న్నాడు అనేది ఆబాలగోపాలానికి విదితమే కదా! ఉదాహరణకు "ఈ క్రియా వ్యవహారములన్నీ నేను నిర్వర్తించిరావడం నేను చేసిన పాపం... అనుకుంటే అట్లే అది శిక్షానుభవంగా అనిపిస్తూ, పరిణమిస్తుంది. ఈ నిర్వర్తించే క్రియలన్నీ పరమాత్మ సేవయే... అనుకుంటేనో? సాధనరూప సేవ అగుచున్నది. ఇది పీడ అనుకొంటే అట్లే పీడగానే అనుభవం అగుచున్నది. క్రీడ అనుకుంటే క్రీడయే అగుచున్నది.

అట్లాగే... చిద్రూపుడగు ఈ జీవుడు దేనిని ఏ విధంగా ఎఱుగుచున్నాడో... అది ఆ విధం గానే శీఘ్రంగా పొందబడుచున్నది. 'ఇట్లు ప్రాప్తించడం' అనబడేది ఈ జీవునికి, ఆ హిరణ్యగర్భునికి ఒక్క తీరుగానే అగుచున్నదని గ్రహించు. ఆకాశంలో పొగ రకరకాల ఆకారాలుగా, రూపాలుగా అగుచూ కనిపిస్తుంది చూచావా? మహా సముద్రంలోని జలం అనేక రూపాలైన తరంగాలుగా, ఆవర్తవృత్తులుగా అగుపిస్తోంది కదా! అదే విధంగా చిదాకాశమునందు సంసారం యొక్క వివిధ వైచిత్రమంతా సంభవిస్తోంది. స్వప్నమున సంవిత్తే (చిదాకాశమే) స్వప్న ద్రష్టకు మహానగరంగా కనిపిస్తోందే! అట్లాగే చిదాకాశమే సృష్ట్యాది నుండి ఇప్పటివరకూ జగద్రూపంగా స్థితినొంది ఉంటోంది. ఇక ఈ సృష్టికి సహకారి కారణాలు ఏమిటంటావా? స్వప్నంలో ఎటువంటి సహకారి కారణాలు లేకుండానే స్వప్న జగత్తంతా సంభవిస్తోంది కదా! అట్లాగే, సృష్ట్యాది యందలి జగతిస్థితిలో

Page:208

ఈ పృథ్వి మొదలైన పంచభూతాలన్నీ ఎటువంటి సహకారి కారణాలు లేకుండానే సంభవిస్తు న్నాయి. స్వప్నంలో ఇల్లు, వాకిలి, సంఘటనలు మొదలైనవన్నీ అనుభవమగుచున్నట్లే ఈ 'జగత్తు' అనే స్వప్న నగరంలో ఇవన్నీ పరిపుష్టమై పొందబడుచున్నాయి.

వాస్తవానికి నీవు నేను, ఈ తదితర సర్వజనులు అందరూ కూడా ద్వైత ఏకత్వ వర్ణితమైన చిదాకాశ రూపములే అయివున్నాయి. అట్టి చిదాకాశమునకు మరొక దోషము, దోషాపహరణము మొదలైనవి ఎక్క డుంటాయి? ఏదేది భావిస్తోందో, భావించబడుతుందో... అదంతా చిదాకాశమే అయివున్నది. మనమంతా ఏది అయివున్నామో అట్టి చిదాకాశము త్రివిధతాప రహితమై, ఆహ్లాదభరితమై, అంతటా నలువైపులా పూరించి ఉన్నది. అట్టి చిదాకాశ ప్రకాశము యొక్క ఒకానొక స్పురణయే ఈ జగత్తు.

సృష్టికి పూర్వం చిదాకాశమే ఉన్నది. ప్రళయానంతరం కూడా చిదాకాశమే ఉండటం జరుగుతోంది. మధ్యలో కనిపించే ఈ సృష్టి చిదాకాశమే అయివున్నది. బ్రహ్మమే ఇట్లు నిజచైతన్యము యొక్క 'పరిచ్ఛిన్న-అపరిచ్ఛిన్న' రూపములచే, వికాస సంకోచముల ద్వారా స్వయముగా స్వప్నమువలె ఈ జగద్రూపంగా ఉదయించడం, అస్తమించడం నిర్వర్తిస్తోంది.

అందుచేత... బ్రహ్మపదమును పొందిన మహాత్ములు 'శరత్కాలాకాశం' లాగా నిర్మల చైతన్య రూపమును సంత రించుకొనియే వర్తిస్తూ ఉంటారు. అందుకు భిన్నమైన దృశ్యరూపమును పొందకయే క్రీడిస్తూ ఉంటారు.

నిర్ మానమోహా, జిత సంగ దోషాః, ప్రవాహ సంప్రాప్త నిజార్థభాజః |

తిష్ఠన్తి కార్య వ్యవహార దృష్టా, నిరామయ యస్త్రమయా ఇవైతే

ఓ రామచంద్రా! ఎవరైతే అభిమాన మోహాదులను, సంగదోషములను జయించివేసి ప్రవాహ పతితమైన ఆయా కార్య-వ్యవహారాలను వ్యథారహితులై నిర్వర్తిస్తూ ఉంటారో... అట్టి మహానీయులు క్రమక్రమంగా జీవన్ముక్తత్వము సంతరించుకొనగలరు. ఇక వారు ఇతరుల కార్యవ్యవహార దృష్టియందు పురుష ప్రతిమ (పురుషాకారశిల్పం) వలె నిర్వికారులై వెలయుచూ ఉంటారు. అట్టి మహానీయుల దర్శనమే మహాద్భాగ్య ప్రదమైనది.

7. సర్వత్రా సమదర్శన ప్రయోజనం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! సర్వత్రా చిన్మాత్రమే ఆవరించి ఉన్నది”... అని మనం ఇప్పటికే అనేకసార్లు సిద్ధాంతీకరించుకొనివున్నాం కదా! ఈ పురుషుడు స్వయంగా చిన్మాత్రమే అయి ఉన్నాడు. అట్టి చిన్మాత్రమే నానా విధ కల్పితములగు సుదీర్ఘ-క్షణిక రూపముగాను, భయశోకాది రూపాలుగా కూడా స్థితి నొందివుంటోంది. చిన్మాత్రము తప్ప అన్యంగా ఎక్కడా ఏదీ లేదు, ఉండజాలదు. సర్వ భావ- అభావాలు శుద్ధ చిన్మాత్రం యొక్క విభూతులే సుమా!

Page:209

అట్టి చిన్మాత్ర చైతన్యము ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమైనది. ఇక 'ద్రష్టదృశ్యము' మొదలైనవన్నీ అద్దానిని యొక్క వివర్తరూపములు మాత్రమే! మరిక "గ్రహణముతాజ్యము ...అనే బుద్ధి వ్యవహారమంతా ఎక్కడున్నది?

వేర్వేరు సిద్ధాంతములు - “అసంగము”

క్షణిక జ్ఞానవాదులు : వీరి సిద్ధాంతం ప్రకారం, ఈ జగత్తు క్షణక్షణం ఏదో మార్పు చెందుతూనే ఉన్నది. కనుక అనుక్షణిక పరిణామ స్వరూపి అయిన ఈ జగత్తును ఎవరూ ఇది ఇట్టిది మాత్రమే అని చెప్పటానికి వీలే లేదు.”

వీరి సిద్ధాంతము ప్రకారం మనం చూచినా కూడా, ఈ జగత్తు సర్వదా క్షణక్షణం నిర్విషయమే అయి వున్నది కదా! కాబట్టి ఇక రాగద్వేషములకు తావు ఎక్కడిది? వారు సంవిత్తు (ఆత్మ) నిత్యము" అని ఒప్పుకోవడం లేదు. కనుక (బృహస్పతి మతాచార్యుల సిద్ధాంతమైన) క్షణికవాదం ప్రకారం కూడా అసంగమే ప్రబోధించబడుతోంది కదా!

జగత్ స్వప్న సిద్ధాంతము - 'స్వప్నము' అనేది ఆ స్వప్న ద్రష్ట యొక్క వివర్త రూపమే కదా! అట్లాగే చిదాకాశము యొక్క వివర్తరూపమే ఈ జగత్తు" అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ విధంగా చిదాకాశ స్వప్న సదృశజగత్తు" అనే అభిప్రాయం అనుసరించి కూడా ఈ జగత్తులో ఇష్టా ఇష్టములు ఉండవలసిన పనేమి? స్వప్నంలో కనిపించే వస్తువులు స్వప్నాంతంలో మటుమాయ మవుతాయి కదా! తప్పకుండా మటు మాయమయ్యే వస్తువుల గురించి దుఃఖించి ఏం ప్రయోజనం? కనుక ఈ సిద్ధాంతమును అనుసరించి కూడా ఈ జగత్తుపట్ల అసంగమే ఉచితం.

అణు సంయోగ వియోగమాత్ర జగత్ ఇదే విధంగా జగత్తు అణువుల కలయిక మాత్రమే అని నమ్మేవారు కూడా, అణువుల సంయోగ, వియోగమగు ఈ జగత్తు యొక్క ఉనికి లేములపట్ల 'అసంగమే ఉచితం' అని ఉద్దేశిస్తున్నట్లు మాకు కనిపిస్తోంది.

ఏ విధంగా చూచినా ఈ జగత్తు పట్ల అసంగమే ఉచితం 'ఇది త్యజించ తగినది. ఇది గ్రహించవలసినది" అనే రూపంగాగల ఏ వికల్పధ్యాస కనిపిస్తోందో, అది కూడా "చిదాకాశమును చిదాకాశమే ఆ విధంగా గాంచుచున్నది.... అనునదే మా ఉద్దేశం. అవగాహన కూడా!

అనగా... నిర్మలమగు చిదాకాశమునందు ఈ జగత్తు నిర్మల చిదాకాశముగానే భాసిస్తోంది. కాబట్టి ఇక “ఇది మాకు ఇష్టం అది మాత్రం మాకు ఇష్టం కాదు”అను దృష్టి ఎక్కడ? ఎందుకు? ఈ మనుష్యులు, ఈ దేవతలు, ఈ నాగులు, ఈ స్థావర జంగమములు-ఇవన్నీ కూడా “పరమాత్మ” అనబడు సంవిత్ మహా సముద్ర జలంలోని తరంగరూపాలే అయి ఉన్నాయి. ఆ సంవిద్రూప మహాసముద్ర తరంగాల యొక్క ఆవర్త వృత్తులే ఇక్కడి జనన-మరణాలు కూడా! ఓ రామచంద్రా! నేను, నీవు, సమస్తజీవులు సంవిదాకాశ రూపులమే అయి ఉన్నాం. మనం ఎవరం కూడా ఎప్పటికీ మరణించని వారమే అయివున్నాము. చిదాత్మకు మరణమెక్కడ ఉంటుంది. చెప్పు?

అంతేకాదు... సర్వము సంవితమయమే కాబట్టి సంవిత్తు దేనికీ జ్ఞేయం (తెలియబడునది)... అవదు. అది 'తెలియుట' అనే సంవేద్యత్వం ప్రదర్శిస్తున్నప్పటికీ అద్దానిలో ద్విత్వ - ఏకత్వములు

Page:210

ఎట్లా ఉండగలవు? ఓ రామచంద్రా! సంవిత్తు (లేక) చిదాత్మకు వేరుగా మరి ఏ సద్వస్తువు ఉన్నదో చెప్పు? ఒకవేళ సంవిత్తే మరణిస్తుందని అనుకుంటే మరి నీవు-నేను ఎలా జీవిస్తున్నాం?

సౌగతవాదులు :పరమాత్మ ఎక్కడో ఉన్నారు" అని చెప్పువారు.

లోకాయతవాదులు ఈ లోకమే ఉన్నది ఇందుకు వేరైన పరమాత్మ ఎక్కడా లేడు అని

చెప్పేవారు.

ఇటువంటి సర్వుల అభిప్రాయము సంవిత్ గురించే! అంతకుమించి వారు దేనిని నమ్ము చున్నారు? చిదాకాశమే వారి వారి అభిమతానుసారంగా ఆయా విధాలుగా అనుభవగతమౌతోందని

గమనించు.

అట్టి సంవిద్రూపాకాశమునే కొందరు 'బ్రహ్మం' అంటున్నారు. మరికొందరు 'విజ్ఞానము' అని పిలుస్తున్నారు. ఇంకొందరు 'శూన్యము' అని, ఇంకా కొందరు 'కల్పన లేక మత్తు శక్తి వలె సృష్టిలోని అంతర్లీన శక్తి" అని, పరిణతి చెందిన పంచభూతముల ధర్మము అని, ఇంకా... పురుషుడు అని, 'చిదాకాశము' అని, 'శివుడు' అని 'ఆత్మ' అని చెప్పుచున్నారు. ఈ విధంగా ఆయా వాదులచే అనేక ప్రకారములైన వికల్పములు చెప్పబడినప్పటికీ... ఆ చిన్మాత్రము మరొక రూపమేదీ పొందకయే ఉంటోంది. ఆ సర్వ వికల్పములకు, తన ఆయా కల్పిత రూపములకు తానే సాక్షి అయి, స్వయంగా తానే వాటి నన్నిటినీ ఆయారీతులుగా ఎఱుగుచున్నది. తాను సర్వదా నిర్వికల్పమే అయివున్నది. ఓ రామచంద్రా! ఈ నా అవయవాలు చూర్ణమై పోవుగాక! లేదా... మేఱుపర్వతము వలె సువిశాలముగా అగుగాక! చిన్మాత్రమే శరీరముగా గల నాకు హానిగాని, వృద్ధిగాని లేదు. మన తాతలు, ముత్తాతలు, తండ్రులు మొదలైనవారు మరణించి ఉండవచ్చుగాక! కానీ, వారి ఆత్మ రూపమగు చైతన్యము మాత్రం మరణించడం లేదు. చైతన్యమునకే మరణం ఉంటే అది మరల పునఃజన్మ పొందేదికాదు. మన ఈ దేహములు మరణించిన తర్వాత కూడా మన ఆత్మ చైతన్య

రూపం నశించదు.

"దేహం రావడం, దేహం పోవడం" ఇవి దేహ ధర్మాలు గాని, ఆత్మ ధర్మాలు కాదు. ఎక్కడన్నా “ఆకాశం నశిస్తుంది అనేది కుదురుతుందా? కుదరదు. ఇక ఆకాశము కంటే కూడా అత్యంత సూక్ష్మమైనట్టి ఆత్మ చైతన్యానికి మరణం ఎక్కడిది?

న జాయతే, న మ్రియతే సంవిదాకాశమక్షయమ్

భవేత్ కథం కథయ కిం కిలాకాశస్య సంక్షయః?

ఆకాశం ఎప్పుడూ నాశరహితమే! దానికి జన్మమేమిటి? మరణమేమిటి? అట్లే చిదాకాశము సర్వదా నాశరహితమే! దానికి జన్మించడం, మరణించడం ఉండదు. ఈ విధంగా చైతన్యమునకు నాశనం అనేది అసంభవం. ఈ జగత్తు అంటావా? ఈ జగద్రూపస్పురణ కూడా చిదాకాశమే! ఉదయాస్తమయ రహితమై, నాశనరహితమై చిదాకాశమే తనయందు తాను ఈ జగద్రూపమున స్థితి నొందియున్నది. ఆదిమధ్యాంత రహితమైన చిదాకాశము స్ఫటికంలో పర్వతంలాగా ఈ

Page:211

జగత్తును తనయందు ఒకప్పుడు ధరించి ఉంటోంది. మరల మరొకప్పుడు నిజతత్త్వ సాక్షాత్కారంచే దగ్ధం చేసి, నిర్మలమగు తన స్వరూపమందు తానే వెలయుచున్నది. రాత్రియందు ఏర్పడిన అంధకారం సూర్యోదయం కాగానే క్రమంగా నశిస్తుంది చూచావా? "నేను జీవుడను, బద్ధుడను అనబడే అజ్ఞానాంధకారం ఆత్మజ్ఞాన ప్రకాశము యొక్క ప్రవృద్ధిచే క్రమక్రమంగా తొలగిపోతూ వస్తుంది.

సముద్రం స్వయంగా తనయందు "ప్రవాహం-తరంగం-ఫేనము (నుఱుగు) - బుద్బుదము(బుడగ) -ఆవర్తము" కలిగివుంటుంది చూచావా! అలాగే చిదాకాశము తనయందు జగత్ భావన అనే అవయవమును ధరించి ఉంటోంది. ఈ పురుషుడు (లేక జీవుడు) చిన్మాత్రమే అయివున్నాడు. అతడు ఆకాశమువలె సదా, సర్వదా నశించకయే ఉన్నాడు. కాబట్టి "నేను నశించుచున్నాను” అని తలచి దుఃఖించటమనేది వ్యర్థమైన పని మాత్రమే!

శ్రీరాముడు : ఈ జనులకు మరి శోకము ఉండకుండేది ఎట్లా? మృత్యుభీతి తొలిగేది ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ జనులారా! ఈ నా మాటలు శ్రద్ధగా వినండి.

దేహాత్ దేహాంతర ప్రాప్తో నవయేవ మహోత్సవః మరణాత్మని కిం మూఢా, హర్షస్థానే విషీదథ?

నాయనలారా! 'మరణము' అనేది శిథిల దేహం త్యజించడానికి, నూతన దేహం ధరించడానికి కారణభూతం అవుతోంది కదా! అందుచేత మరణము నూతనమైన ఉత్సవమే అవుతుంది. మరింక మూఢత్వం చేత కాకపోతే... శిథిల దేహం తొలగుచున్నప్పుడు సంతోషించాలిగాని, ఈ జనులు దుఃఖిస్తున్నారేమిటి?

మృత శ్చేత్ న భవేత్ భూయః, సో అత్రాపి ఉపచయో మహాన్,

భావ - అభావ గ్రహోత్ సర్గః జ్వరః ప్రశమమ్ ఆగతః!

"ఈ దేహం పోతే మరల దేహం రాదేమో? అందుకని దుఃఖిస్తున్నాం... అని ఎవరైనా అంటారా? ఒకవేళ మరణానంతరం మరల జన్మయే లేదంటే, అది ఇంకా మంచిది. అప్పుడు మహత్తరమైన పురుషార్థం చేకూరినట్లే అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఈ ఉత్పత్తి నాశనభావ-అభావ-గ్రహణ-త్యాగ మొదలైన రూపములుగా ఉండే 'సంసారము' అనే రోగము ఉపశమించినట్లే కదా! కాబట్టి "మరణానంతరం దేహం వస్తుంది" అన్నా, లేక ఇక దేహమే సంభవించదు అని తలచినా... ఉభయత్రా దుఃఖమునకు కారణమే లేదు.

మరణం జీవితం తస్మాత్, న దుఃఖ న సుఖం యతః

నాస్త్యేవై తత్ చిదాకాశః కిలేత్థమభిజృంభతే I

ఈ విధంగా "ఈ జనన మరణములు సత్యమే.... అనుకున్నప్పుడు కూడా అది దుః ఖించడానికి విషయమే కాకుండా ఉంటోంది. ఎందుకంటే నూతన దేహం రావడం మంచిదే! లేక అసలు దేహమే ఉండకపోవడమూ మంచిదే. ఇక ఈ దేహ సంబంధమైన అల్పార్థమును ప్రక్కకు

Page:212

పెట్టి పరమార్ధమునకు వస్తే... ఈ జీవుడు దేహి గా జీవితము పొందడం లేదు. మరణము పొందడం లేదు. దేహం వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు కూడా అతడు దేహిగా యథాతథంగానే ఉంటున్నాడు. కనుక పరమార్థమున చూస్తే సుఖమూ లేదు. దుఃఖమూ లేదు. చిదాకాశమే ఈ అన్నిటి రూపంగానూ విజృంభిస్తోంది సుమా!

ఓ రామచంద్రా! ఇప్పుడు మనం జీవన్-మరణముల గురించి చెప్పుకున్నది మరొకసారి సమీక్షించి చెప్పుతాను... విను.

మృతస్య దేహలాభ శ్చేత్,... నవేఏవ తత్ ఉత్సవః మృతిః నాశోహి దేహస్య, సామృతిః పరమం సుఖమ్ ॥

మరణించిన తర్వాత మళ్ళీ దేహం లభిస్తుందని అనుకుంటే అది నూతనోత్సాహమే అవుతుంది. ఎందుకంటే శిథిలమైన దేహము నశించడమే మరణం కాబట్టి అది పరమసుఖమే కదా!

మృతిః అత్యంత నాశశ్చేత్ - తత్ భవామయ సంక్షయః

భూయః శరీరలాభశ్చేత్ నవేవ తత్ ఉత్సవః

"అత్యంత నాశనమే మరణము. ఆ తర్వాత దేహం లేదు. (పునర్జన్మ లేదు అని అనుకుంటే అప్పుడు ఎటువంటి పరిశ్రమ లేకుండానే సంసారరోగము ఉపశమించినదే అగుచున్నది. శరీరం నశిస్తే మరల శరీరం కలగకపోతే సంసారమే తొలగినదగుచున్నది. కాబట్టి ఎంతో సంతోషించ వలసిన విషయమే!

"కాదండీ! మాకు మరల శరీరం వస్తుందేమో?... అని అనుకుంటే... అది నూతన దేహం కాబట్టి అదికూడా ఉత్సవంతో సమానమే! ఏ రకంగా చూచినా మరణము దుఃఖార్హం కాదు. శ్రీరాముడు : హే మహర్షీ! మీరు చెప్పింది యుక్తియుక్తమే! అయితే, మేము ఏవేవో పొరపాట్లు చేశాం. అందుచేత మాకు నరకం ప్రాప్తిస్తుందేమో? అని కొందరు జనులు మృత్యువు పట్ల భయం కలిగి ఉంటున్నారు.

శ్రీ వసిష్ఠ మహర్షి : (చిరునవ్వుతో) ఓహో! అట్లాగా? దుష్కర్మలచే మరణానంతరం నరకాదులు ప్రాప్తిస్తాయనే ఏ భయం కలదో... అటువంటి భయం జీవించి ఉన్నప్పుడు కూడా రాజదండన మొదలైన వాటి వల్ల ప్రాప్తిస్తూనే ఉన్నది కదా! అందుచేత ఓ జనులారా! ఇహ - పర శ్రేయస్సును సిద్ధింప జేసుకోవాలనుకుంటే, దుష్కర్మలను ఆచరించకుండా ఉండండి. దుష్కర్మల ఫలితం జీవించి ఉన్నా, మరణించినా అద్దాని అనుభవం అనివార్యం. జీవించివున్నందుకు ప్రయోజనంగా ఉత్తమ కర్మలు ఆచరించండి. అంతేగాని మరణం గురించి భయపడవలసినదేమున్నది?

మరిష్యామి! మరిష్యామి! మరిష్యామీతి భాషసే?

భవిష్యామి! భవిష్యామి! భవిష్యామితి నేక్షసే?

ఓయి! జీవుడా! నేను చస్తాను, చచ్చిపోతాను, ఇక చావు తప్పదు”.... అని పలుకుతావేమయ్యా? "చిదాకాశస్వరూపుడగు నేను ఈ దేహ పతనానంతరం కూడా ఉండియే

Page:213

ఉంటాను, ఉండియే తీరుతాను. ఎల్లప్పటికీ ఉంటాను.... అని ఎందుకు అనుకోవయ్యా? పరమార్ధమున నీకు జనన మరణాలు కాని, ఉత్పత్తి - నాశనములుగాని స్వస్వరూపం దృష్ట్యా లేనేలేవు. అంతా కూడా సర్వదా చిదాకాశమే అయివున్నది. ఆ చిదాకాశము తనయందు తానే జగత్తు రూపంగానూ, జన్మ-జీవన -మృత్యు పునఃజన్మల రూపంగానూ వివర్తభావమును ఇక్కడ క్రీడవలె పొందడం జరుగుతోంది.

సంవిదాకాశమాత్రాత్మా పిబ భుంక్ష్వాస్వ నిర్మమః ఆకాశకోశకాన్తస్య కుత ఇచ్ఛోదయస్తవ?

ఓ రామచంద్రా! నీవు చిదాకాశమాత్రుడవే గాని ఈ దేహమూ కాదు! మరొక దేహమూ కాదు! అట్లే తదితర సర్వజీవులూ కూడా! ఇదియే ఆత్మజ్ఞానము. ఆ విధంగా ఆత్మజ్ఞానం సంపాదించుకొని ఇక అటుపై మమకారరహితుడవై తిను, త్రాగు, ప్రపంచ వ్యవహారాలేవైతే ఉన్నాయో... అవి నీవు అనుకున్నట్లే నిర్వర్తించు.

ఆకాశ కోశము వలె నిర్మలమైన చిదాత్మయే స్వరూపముగా గల నీయందు ఇచ్ఛాదులకు చోటు ఎక్కడిదయ్యా? వాస్తవానికి భవ్యుడు - నిర్భయుడు అగు ఆత్మజ్ఞాని కాకతాళీయంగా వాటంతట అవిగా వచ్చిపడే దేశకాలానుగతమైన ఆయా శబ్ద స్పర్శాది లోకవ్యవహారములను నిర్లిప్తంగా ప్రశాంతంగా నిర్వికారంగా ఉంటూ అనుభవిస్తున్నాడు. మధ్యమధ్యలో దేశ కాలానుగతంగా వచ్చే దుర్భిక్షము-క్షోభ మొదలైన ఈ ప్రాపంచిక దోషములను క్రీడలో సానుకూల - ప్రతికూల సందర్భములవలె దర్శిస్తున్నాడు. వికల్పములు లేనట్టి సమాధిని అవధరించిన బుద్ధికలవాడై, ఈ జగద్విషయములన్నిటినీ అంతరంగమున అధిగమించియున్నవాడై ఉత్తమ బుద్ధితో నిశ్చితంగా ఈ లోకంలో సంచరిస్తున్నాడు.

న దుఃఖమేతి మరణాత్, సుఖమేతి న జీవితాత్, నాభివాంఛతి నద్వేష్టి స తదా అస్తే వివాసనః II

అట్టి తత్త్వజ్ఞుడు మరణముచే దుఃఖము పొందడు. జీవితముచే సుఖమును పొందడు. దేనినీ వాంఛించడు. ద్వేషించడు. సర్వదా వాసనారహితుడై ఉంటున్నాడు.

ఓ రామచంద్రా! జీవన్ముక్తుడు ఇదే ప్రపంచంలో ఇచ్ఛారహితుడై ఉంటున్నాడు. వాసనావర్జితుడై ఉంటున్నాడు. ఇక్కడి జనన-మరణాది సర్వ సంఘటనలను శిథిలమైన గడ్డిపరకతో సమానంగా చూస్తున్నాడు.

విదిత వేద్యుడు (తెలుసుకొనవలసినది తెలుసుకొనివున్నవాడు) భయరహితుడై ఒక పర్వతం లాగా ఈ ప్రపంచమున నిశ్చలంగా వసిస్తున్నాడు.

Page:214

VII. విపశ్చిత్ ఉపాఖ్యానం - పరిచయం

1. జ్ఞాని లక్షణములు

శ్రీరాముడు : మహాత్మా ! ఈ భూమిపై "ఆద్యంతరహితం, పరతత్త్వసారం అయినట్టి బ్రహ్మవస్తువును ఎఱిగి, గుర్తించి ఆస్వాదిస్తూ ఉండే మహనీయులు కొందరు జీవన్ముక్తులై ఉన్నారు కదా! వారు ఏ ఏ లక్షణములు, స్వభావము, ఆచరణ కలిగివుండి జీవితము గడుపుచూ ఉంటారో... ఆ విశేషాలు చెప్పండి. ఈ సంసార మహారణ్యంలో వారు ఆత్మ సుఖమును ప్రసాదించగల గంధపు వృక్షము వంటివారు కదా! వారెక్కడెక్కడ ఉంటారో, ఎట్లా గుర్తించాలో తెలియజేయ ప్రార్థన.

శ్రీ వసిష్ఠ మహర్షి : అవిచ్ఛిన్నమగు ఆత్మానుభూతితో సంచరించే మహనీయులు ఈ భూమిపై ఉన్నారు. అట్టి జీవన్ముక్తులకు శిలలు కూడా స్నేహితులే! వృక్షములు కూడా బంధువులే! జంతువులు కూడా స్వజనులే! వారు సర్వజీవులందును సమదృష్టి కలిగి ఉంటారు. ఇక వారి సర్వమానవ సమదర్శనము గురించి వేరే చెప్పేదేమున్నది? ఇంకా...

అనేకమంది జనులు సమావేశమై రణగొణ ధ్వనులు చేస్తున్న ప్రదేశం వారికి ప్రశాంత - శూన్య ప్రదేశంగా ఉంటుంది. ఆపదలు కూడా వారికి సంపదలుగానే కనిపిస్తాయి. దుఃఖం కూడా మహా సుఖంగానే ఉంటుంది. అనేక వ్యవహారముల మధ్య ప్రాప్తించే అసమాధి వారికి సమాధితో సమానంగానే ఉంటుంది. వారు వ్యవహారములలో మౌనం దర్శించగలరు. అనేక కర్మలు నిర్వర్తిస్తూ అకర్మిష్ఠులై ఉండగలుగుచున్నారు.

వారికి ఈ జాగ్రత్తు కూడా సుషుప్తితో సమానంగానే అనిపిస్తుంది. సుషుప్తితో పోల్చతగిన నిర్వికల్ప స్వరూపమగు ఆత్మను సదా ఆశ్రయించి, ఆస్వాదిస్తూ ఉంటారు కదా! వారు జీవించి ఉన్నప్పటికీ శరీర భావరహితులై మృతుని మాదిరిగానే ఉంటారు. ఈ శరీరము నేను కాదు, నాది కాదు. ఈ శరీరము నాకు సంబంధించినది కాదు. నేను దేహమునకు సంబంధించిన వాడను కాను ...అని గ్రహించి, అట్టి అనుభవంతో ఉంటారు.

అన్ని ఆచారములు ఆచరిస్తూ కూడా ఏదీ నిర్వర్తించనివారుగా ఉంటారు. ఇవన్నీ దేహమనో-బుద్ధి సంబంధిత ధర్మములు మాత్రమే! ఆత్మ స్వరూపుడనగు నా ధర్మములు కావు అని అవగాహన కలిగి ఉంటారు. విషయముల పట్ల విషయదృష్టి కాకుండా ఆత్మ సంబంధమైన దృష్టి కలిగి ఉంటారు. వారికి బంధువుల పట్ల బంధు బుద్ధిచే కాక, ఆత్మబుద్ధిచే వాత్సల్యం ఉప్పొంగుతూ ఉంటుంది. వారిది అలౌకిక బుద్ధి కాబట్టి వారు స్నేహరహితులు కూడా! వారికి రెండవ వస్తువే కనిపించదు కాబట్టి నిర్దయులు. కానీ తదితర శరీరములను తమ శరీరము వలె సుఖ-దుఃఖాలను వీక్షిస్తారు కాబట్టి అత్యంత దయామయులు కూడా!

Page:215

వారి ఆచరణ సర్వులు సంతోషించేట్లుగా ఉంటుంది. కానీ... లౌకికాచారాల దృష్ట్యా చూస్తే సర్వ ఆచారాలు బహిష్కరించారా? అని అనిపిస్తుంది కూడా! వారికి "శోకం - భయం - ఆయాసం - ఆశ” అనేవి కలుగటానికి ఎక్కడా తగిన కారణమేదీ అగుపించదు. కానీ అజ్ఞానుల దుఃఖం చూచినప్పుడు “ఇది తొలగేది ఎట్లా అనునది వారికి దుఃఖకారణం అవుతుంది.

వారికి ఈ లోకం చూస్తే భీతి ఉండదు. ఈ లోకానికి వారి వలన భీతి కలుగదు. వారు ఈ ప్రాపంచిక విశేషముల పట్ల రసికులవలె అగుపించినప్పటికీ... ఆంతరంగమున పరమ వైరాగ్యము

పొంది ఉంటారు.

నాభినందతి సంప్రాప్తం, న అప్రాప్తమ్ అభివాంఛతి |

అస్తే అనుభూయమానే అర్ధ, నచ హర్ష-విషాదయోః ||

జీవన్ముక్తుడు ప్రాప్తించినదాని గురించి సంతోషించడు. అది కాలంచే వచ్చి పోయేదేనని బాగా తెలుసు. ప్రాప్తించని వాటి గురించి అఱ్ఱులు చాచడు. వాటిలోని దోష-మోహాలు ఉండకుండా పోవని గమనించియే ఉంటాడు.

సర్వదా ప్రాప్తించియే ఉన్న ఆత్మకు వేరుగా ఉండవలసినది, పొందవలసినది అతనికి క్రొత్తగా ఏమీ ఉండదు. హర్షము-విషాదము కలిగించగలిగే ఆయా వస్తువులు సంఘటనలు వచ్చి పోతున్నప్పుడు అతడు హర్ష-విషాదములు పొందడు. దుఃఖితులతో దుఃఖ ప్రసంగం, సుఖితులతో సుఖ ప్రసంగం చేస్తున్నప్పటికీ అతని హృదయం సర్వ అవస్థలను సమంగా దర్శిస్తూనే అతీతమై, అస్పృశ్యమై, ప్రశాంతమై ఉంటుంది.

అతనికి పుణ్యకర్మలు తప్ప మరింకే కర్మలు రుచించవు. శాస్త్ర నిషిద్ధ కర్మలుగాని, పరులను వేధించే కర్మలు గాని నిర్వర్తించకపోవటం ఆతనికి స్వభావసిద్ధమై ఉంటుంది. ఆతనికి దేనిపట్ల కూడా ఆసక్తిగాని, విరక్తి గాని ఉండదు. ధనాదుల కొరకై యాచించడు. అతని యాచన ఇతరుల క్షేమము కొరకు మాత్రమే!

రాగము కలిగి కనిపిస్తూనే వీతరాగుడై ఉంటాడు. లోక వ్యవహారం కొఱకై దుఃఖ సంఘటనల పట్ల దుఃఖము, సుఖ సంఘటనల పట్ల సుఖము ప్రదర్శిస్తూ కూడా ఆయా సుఖదుఃఖాదులచే తాను స్పృశించబడకయే ఉంటాడు. ఈ సంసార నాట్యమండలిలో నటునివలె నవరసములచే స్పృశించబడకయే నవరసములు ప్రదర్శిస్తూ ఉంటాడు.

ఆతనికి తన యొక్క తదితరుల యొక్క ధనాదులందు గాని, దారాపుత్రాదులందుగాని ఇవి క్షణికములే కదా ... అని గ్రహించి ఉండుటచే వాటివాటి పట్ల స్నేహము - ఆసక్తి లేకయే ... సందర్భోచితంగా విధులు మాత్రం నిర్వర్తిస్తూ ఉంటాడు. అంతరాంతరంలో స్నేహబంధం లేనప్పటికీ ప్రపంచము పట్ల ఘనీభూతమైన స్నేహంచే ఆర్ద్రత - వాత్సల్యము - ప్రేమ మొదలైన వృత్తులను స్వభావసిద్ధంగా ప్రదర్శించుచు యథాతథంగా ఉంటాడు.

p

Page:216

మూఢులగు జనులు "ఈ దేహమే నేను అని తలచుచు అట్టి దేహాత్మబుద్ధిచే కామము - - తాపము పొందుతూ, వాటిని శాంతింపజేయటానికి అత్యాశతో అనేక విషయ పరంపరలయందు లీనమై కాలయాపన చేస్తున్నారు. విషయములను పొందుచున్నప్పుడు కూడా ఏదో పైపై స్పృశించు చున్నారేగాని, వారు పూర్ణానుభవులు అగుటలేదు సుమా! అనాసక్తి చేతనే విషయానుభవం వాస్తవానికి సాధ్యం. ఆసక్తి ఉన్నచోట విశ్రాంతి ఎక్కడిది?

శ్రీరాముడు : స్వామీ! జ్ఞాని రాగాదులను ప్రకటిస్తాడు గాని, కలిగి ఉండడని మీరు చెప్పే గుర్తులు తప్పక అనుసరణీయములే! అయితే అజ్ఞాని కూడా దంభముగా మీరు చెప్పిన విశేషములు ప్రదర్శిస్తూ ఉండవచ్చు కదా! ఎవరు జ్ఞానియో, ఎవరు దంభముతో కూడి ఆయా గుణములు ప్రదర్శిస్తూ... వాస్తవానికి అజ్ఞానియో మేము వారిని గుర్తించటమెట్లా? ఈ లోకంలో కొందరు గుఱ్ఱములవలె బ్రహ్మచర్యము ఆచరిస్తూ కపట హృదయులై జ్ఞానులవలె నటించేవారు ఉంటారేమో కదా! ఖ్యాతి కొరకై ఉత్తమ గుణములు దాంభికంగా ప్రదర్శించేవారు ఉండవచ్చాయె! మరి మేము జ్ఞానిని గుర్తించటం, ఆశ్రయించటం ఎట్లాగో చెప్పండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : సత్యమో, అసత్యమో... పైన చెప్పిన లక్షణాలతో కూడిన వ్యక్తిత్వము శ్రేష్ఠమైనది. అవి ఎవరికి వారే అలవరచుకునే ప్రయత్నంలో ఉండటం ఉచితం కదా! వేదవేత్తలగు తత్త్వజ్ఞులకు అట్టి లక్షణాలు స్వభావసిద్ధంగానే ఒనగూడుతూ ఉంటాయి. వారికి దంభము - హఠములతో ప్రదర్శించవలసిన పని లేదు.

అయితే, రామచంద్రా! ప్రపంచంలో మరెవరిలోనో వాటిని వెతకటం అటుంచి, ముందుగా ఎవరికి వారే అవి తమ కొరకై తాము అభ్యసించటం ముఖ్యమని గ్రహించాలి సుమా!

ఇంకా జ్ఞానుల గురించి చెప్పుతాను విను. జ్ఞానికి దేనిపట్లా రాగముకాని, ద్వేషముగాని ఉండదు. వారికి ఆయా క్రియా ఫలములందు ఆసక్తి ఉండదు. కాని, వారి విధి నిర్వహణలో రాగము లోపించదు. వారికి ఈ అజ్ఞానుల ఆశ - నిరాశ - దురాశలు హాస్యపూరితంగా ఉన్నప్పటికీ, మరొకవైపు వారి వారి దీనస్థితులపట్ల కరుణ కలిగి ఉంటారు. వారు ఈ దృశ్యమంతా “చిత్తము అనే అద్దంలో ప్రతిబింబించే దృశ్యలాగానూ, రాత్రి కలలో చేతులతో స్పృశించిన బంగారు పాత్రలులాగాను అసత్తుగా వీక్షిస్తూ ఉంటారు.

జంతువులు దూరంగా ఉన్న చందనపు వృక్షాన్ని గుర్తిస్తాయా? లేదు కదా! అట్లాగే జ్ఞానుల అంతఃకరణంలోని శీతలత్వాన్ని అజ్ఞాని గమనించలేడు, గుర్తించలేడు. పాము అడుగుజాడలు పామే గుర్తిస్తుంది చూశావా? అట్లాగే జ్ఞేయము ను ఎఱిగినట్టి పవిత్ర హృదయులగు జ్ఞానులు మాత్రమే జ్ఞానులను గుర్తించగలుగుతారు. ఎందుకంటే సర్వోత్తములగు జ్ఞానులు తమ ఉత్తమ గుణాలను దాచి ఉంచుతారు తప్పితే... ప్రచారం చేసుకోరు. గ్రామాలు గ్రామాలనే కొనగలిగే చింతామణి కలవాడు దానిని రహదారిలో అందరి ముందూ ప్రదర్శిస్తాడా? ఇది కూడా అట్టిదే? తత్త్వజ్ఞులు తమ ఉత్తమ గుణములను తమయందలి గుణదోషములను తొలగించుకోవటానికే

Page:217

ఉద్దేశిస్తారు గాని... పది మంది చెప్పుకోవటానికి కాదు! ఎందుకంటే ఆత్మజ్ఞులకు ఖ్యాతిపై రాగము ఉండదు. వారు వాసనాశూన్యులై, ద్వైతవర్జితులై ఉంటారు కదా!

జ్ఞానులగు మహాత్ములకు ఏకాంతం సుఖంగా ఉంటుంది. ప్రతిష్ఠ, పూజాదుల పట్ల అభావ నయే ఉంటుంది “ఇవన్నీ నా ఆధ్యాత్మిక యానంలో ప్రతిష్ఠంభనకు దారితీయవచ్చునేమో కదా అనే శంకయే వారికుంటుంది. దారిద్ర్యం, తదితరుల వలన కలిగే అవమానం మొదలైనవి వారికి సుఖకరాలుగా తోస్తాయి. ఎందుకంటే ఆత్మానుభవ సుఖానికి పూజాగౌరవాలు విక్షేపం కలుగజేసేవి గాను, దారిద్య్ర, అవమానాదులు ఆత్మానుభవ సుఖానికి దోహదం చేసేవిగాను ఉంటాయి కదా!

ఇక ఆత్మజ్ఞుడు తన ఆత్మానుభవ సుఖము ఎట్టిదో అది ఇతరులకు చూపగలిగేది కాదు. “అది ఇట్టిది అని అతడే నిర్వచించలేడు. ఆతడు "ఈ ప్రాపంచిక విషయములు ఆశకు, దుఃఖానికి అర్హమైనవి కావు ...అని మాత్రం తదితర జనులకు గుర్తు చేయగలడు.

గుణం మమ ఇమం జానాతు జనః పూజాం కరోతు మే ఇత్యహంకారిణామీహ, న తు తత్ ముక్తచేతసామ్ I

నా ఈ గుణములు జనులు ఎఱిగెదరుగాక! నేను పూజింపబడెదనుగాక... అనే ఇట్టి భావం అహంకారులే కలిగి ఉంటారు. ముక్త చిత్తులకు ఇతరుల పూజా - - ప్రశంసలతో పని లేదు.

ఓ రామచంద్రా! ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విద్యలు ప్రదర్శించి పూజింపబడాలని, జనులను ఆకర్షించాలని తమ అజ్ఞానం చేత ప్రయత్నించేవారు కొందరు ఉంటారు.

అయితే... “మంత్రము - ఔషధము మొదలైన వాటి బలంచేత ఆకాశ గమనము, సుదూర దర్శనం మొదలైన విద్యలు అజ్ఞానులకైనా సిద్ధించవచ్చు. ఎవడు దేని కొఱకై క్లేశాదులను సహించి ప్రయత్నిస్తాడో... అతడు ఆయా విశేషాలు కాలక్రమంగా తప్పక పొందుతాడు. అట్టి విశేషాలు జ్ఞానికైనా, అజ్ఞానికైనా సిద్ధిస్తాయి. కాబట్టి అట్టి భౌతిక విద్యలను చూచి ఒకడు జ్ఞాని అని గాని, అజ్ఞాని అని గాని మనం నిర్ణయించలేము. గంధపు చెక్కలో చందన సుగంధం అంతర్గతంగా ఉన్నట్లే ...సర్వుల హృదయాలలో వారు నిర్వర్తించియున్న విహిత - నిషిద్ధ కర్మఫలములు ఉండనే ఉంటాయి. అవి ఆయా కాలానుగతంగా ఆవిర్భవించి ఆ కర్తను ఆశ్రయిస్తాయి. కర్మల గతి అట్టిది. లోకంలో ధనాదుల వంటివే సిద్ధులు కూడా! ఎవనికైతే దృశ్యరూపాలే అయినట్టి సిద్ధులు మొదలుగా గల ఆయా వస్తు వ్యవహారముల పట్ల ఇవి నేను కూడా పొందాలి" అనే ఆకాంక్ష - ఆవేశము -

అభినివేశము పెంపొందుచున్నదో... అది సంసార రూపమే సుమా! "ఈ ఆకాశగమనాది సిద్ధి సమూహమంతా కేవలం మనస్సును భ్రమింపజేసేవి, అల్ప విషయములు మాత్రమే అవి ఎఱిగి ఎవడు చిదాకాశమునందే లక్ష్య శుద్ధి కలిగి ఉంటాడో... అట్టి వాసనారహితుడగు తత్త్వజ్ఞునకు వాటి పట్ల అభినివేశముగాని, దంభముగాని ఎందుకు ఉంటుంది?

నైవ తస్య కృతేనా2ర్ధో, న అకృతేన ఇహ కశ్చన

న చ అస్య సర్వభూతేషు కశ్చిత్ అర్ధ వ్యపాశ్రయః ॥

Page:218

ఆత్మజ్ఞానము సంతరించుకొన్న మహనీయునికి ఈ ప్రపంచంలో వేనినైనా కలిగి ఉండటం చేతగాని, కలిగి ఉండకపోవటం చేతగాని కర్మలు నిర్వర్తించటంచేత గాని, నిర్వర్తించకపోవటం చేత గాని క్రొత్తగా ప్రాప్తించవలసిన ఏ ప్రయోజనమూ కనబడదు. తదితరులైన సర్వుల పట్ల ఆతడు ఏదైనా ఆశించి నిర్వర్తించ వలసినదేదీ అగుపించదు. ఎందుకంటే ఉదారమనోవృత్త చిత్తుడగు ఆ మహనీయుని ప్రలోభపరచ గలిగే వస్తువులుగాని, స్థితి గతులుగాని ఈ భూలోకంలో (లేక) స్వర్గపాతాళాది లోకాలలో ఏదీ ఉండజాలదు. ఎవనికైతే ఈ దృశ్య జగత్తంతా ఆత్మానుభూతి ముందు తృణప్రాయంగా అనిపిస్తుందో, ఎవనియందు రజోగుణమునకు కించిత్తు చోటు కూడా లేదో... అట్టి ధీరుడగు జ్ఞానికి ఆత్మకు అన్యంగా ఏది కనిపిస్తుంది? అయినా కూడా అతడు లోకం యొక్క సానుకూల్యతను దృష్టియందుంచుకుని ఆయా జగద్వ్యవహారములను పరిపూర్ణ చిత్తంతో ప్రేమాస్పదంగా నిర్వర్తిస్తూ శిష్టాచారి అయివుంటాడు. ఆతని అంతఃకరణం సర్వదా ప్రశాంతంగా ఉంటుంది. ఆతడు తదితర ధర్మానుకూలంగాని జగద్విషయాల పట్ల మౌనం వహించినవాడై ఉంటాడు. తదితర సర్వజీవులకు తన ప్రేమ సామ్రాజ్యంలో స్థానం ప్రసాదించినవాడై గంభీరము లైన, ఉత్తమములైన ఆశయాలు కలవాడై తనకు ప్రాప్తించిన ఆయుష్షును ఈ భూతలంపై గడిపివేస్తూ ఉంటాడు. అమృతంతో నిండియున్న సరస్సువలె తనయందు అనిర్వచనీయము, ఈ ప్రపంచమునకు అతీతము అగు ఆనందమును ధరించి ఉంటాడు. వాళ్ళు అట్టి వారు, వీరు మంచివారు కాదు, వీళ్ళని నమ్మొద్దు, వారితో మాట్లాడకూడదు... ఇటువంటి వాక్యాలు అల్పజ్ఞుల ముందర నాట్యం చేస్తాయేమోగాని, ఆత్మజ్ఞుల యెదుట అటువంటి వాక్యముల ఊసుకూడా ఉండజాలదు. ఆతడు ఎక్కడుంటే అక్కడ ఆతని సమక్షంలో ఆ పరిసరాలలో అకారణ ఆనందం తాండవమాడుతూ ఉంటుంది. అట్టి జ్ఞానుల సంభాషణచే... ఈ జనుల మనస్సు - బుద్ధి ఎట్లా విప్పారుతుందో, అట్లా విప్పారడం దేవలోకంలోని నందన వనంలో కూడా సాధ్యపడేది కాదు.

వివేకి అయినవాడు తత్త్వవేత్తల ఆశయములలోని సారము గ్రహించి తన జీవితమును సార్థకం చేసుకొంటాడేగాని, వారి భావ - అభిప్రాయాలను ఎగతాళి చేసి సంసారాగ్నులకు తనను తాను ఆహుతి చేసుకోడు. అట్టి ఆత్మజ్ఞులగు మహనీయుల వాక్యములు విన్నప్పుడు మాత్రమే తదితరులకు "ఈ సంసారము అపారమైనది. ఈ ప్రపంచం భ్రాంతిపూర్వకము అసన్మయము” ...అనే విషయాలు తెలియవస్తాయి. వారి వాక్యములు విన్న వివేకి తప్పక క్రమక్రమంగా తన ప్రాపంచిక కోర్కెలను సన్నగిల్లజేసి శాశ్వతానందం వైపుగా మరలే ప్రయత్నమును తన ఈ మనస్సుకు నేర్పుచున్నాడు. అవివేకి సారాసారము లేమిటో తెలియక, ఆ వాక్యములు విననైనా వినకుండా తనను తాను 'సంసారం' అనే నూతి అడుగుభాగము వైపుగా త్రోసుకొనిపోవుచున్నాడు సుమా!

ఇంకా విను... 'చలి-ఉక్క' ఇటువంటి శారీరక బాధలు పొందుచున్నప్పుడు జ్ఞాని వాటిని ఎవరిదో దేహంలో ఇవన్నీ ఏర్పడుచున్నాయి అన్నట్లుగా ఉంటాడు. ఎందుకంటే ఆతని దృష్టిలో ఈ దేహం తానుగాని, తనదిగాని కాదు. పూలత ఇతరుల కొరకై ఫల-పుష్పాలను ధరిస్తుంది. చూచావా? అట్లాగే జ్ఞాని సర్వక్రియలు తదితరులు సంతోష, సానుకూల్యతలకొఱకై సర్వదా ఉద్దేశిస్తూ

Page:219

ఉంటాడు. తాను ఏదో పొందటం తనకు ముఖ్యం కాదని, తదితర జీవుల సుఖ-శాంతి-ఆనందాలే తనకు కలిగే సంపద అని ఆతడు జ్ఞాన దృష్టిచే నిర్దిష్టమైన అవగాహన కలిగి ఉంటాడు.

వ్యవహారం యథాప్రాప్తం లోక సామాన్యమాచరన్ చరాచరాణాం భూతానామ్ ఉపర్యేవ అవతిష్ఠతే ॥

ఆయా యథాప్రాప్తములైన లోక సామాన్యమైన ఆయా పనులను నిర్వహిస్తూనే... మరొకవైపు ఈ చరాచర సర్వభూతజాలమును అధిగమించిన స్థానంలో వెల్లివిరిసి ఉంటాడు. 'ప్రజ్ఞ' అనే మేడను ఎక్కి సర్వలోక వ్యవహారములను వీథిలో ప్రయాణించే వాహనములను చూచునట్లు ఉంటూకూడా, తదితర జనుల కష్టాలు చూచి దుఃఖసహితుడైనట్లు కనిపిస్తాడు. ఎత్తైన కొండ ఎక్కి క్రింద జనసమూహములను చూస్తున్న విధంగా ఇక్కడి సర్వ సంబంధ - - బాంధవ్యాలను సందర్శిస్తూ ఉంటాడు. అతడు ఇతఃపూర్వం 'భ్రమ' అనే సముద్రంలో కామ క్రోధములు అనే తరంగములలో పయనించి ఉండవచ్చు గాక! ఆత్మజ్ఞాని అగుచుండగా, తీరమును పొందిన తరంగమువలె, ప్రశాంత మనస్కుడై ఉంటాడు. పూర్ణచంద్ర కిరణములను బోలిన ప్రేమమయ వాక్కులతో ఈ జగత్తులో సంచరిస్తూ ఉంటాడు. అందరినీ ఆత్మ స్వరూపులుగా ఎరిగినవాడై పరమ విశ్రాంతిని అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడాతను తన యొక్క పూర్వకాలికమైన సంసార పరిస్థితులను, వృత్తులను జ్ఞాపకం చేసుకొని తన ఇతఃపూర్వపు అజ్ఞానం చూచి తానే నవ్వుకొంటూ ఉంటాడు. అట్లాగే తదితర అజ్ఞాన జీవులు అల్ప విషయముల కొఱకై భ్రమ, ఆవేశం, రాగం కలిగి ఉండటం చూచి "అయ్యో! వీరు తెలియక ఇట్లు భేదం చెందుచున్నారే!”... అనే కరుణను, విషయాల అల్పత్వము, పరిమితత్వమును, దోషత్వమును వీళ్ళు గమనించటం లేదు కదా?... అనే హాస్యమును ఒకే సమయంలో కలిగి ఉంటాడు. "ఆహాఁ! ఇంతకాలం అడవిలో దారి తప్పిన గ్రుడ్డివానిలా ఈ సంసారంలో ఎలా చరించాను? నన్ను ఈ తుచ్ఛ అల్ప విషయాలు ఎందుకు ఆకర్షించాయి? ఈ భోగ-మోహ -క్రోధాలలో ఎట్లా సంచరించాను? పోనీలే! ఇప్పటికైనా నాకు ఆత్మదృష్టి అలవడి ఈ జగత్తంతా ఆత్మ స్వరూపంగా తెలియవస్తోంది" అని జ్ఞాని విస్మయ ఆశ్చర్య వర్తమానానందాలతో చమత్కారంగా నవ్వుకుంటూ ఉంటాడు. ఏఏ ధనాదులు గొప్ప విషయాలని ఇంతకాలం నేను భ్రమించానో అవన్నీ తృణప్రాయములని, అల్ప కాలికములని, ఆత్మజ్ఞానం ముందర 'సూర్యుని ముందటి దివిటీ' వంటివని ఇప్పటికి గమనించాను కదా! ... అని లోలో పరమానందభరితుడై ఉంటాడు.

కానీ ఆతనికి గర్వం ఏమాత్రం ఉండదు. తనతో సహా సర్వ చరాచర జగత్తు ఆత్మ స్వరూప మని దర్శిస్తూవుండగా ఇక గర్వము యొక్క ఊసు ఎక్కడిది? తన ఆత్మస్వరూపం సర్వదా తనదే అయివుండగా, ఇప్పుడు క్రొత్తగా గర్వించవలసిన దేముంటుంది? ...ఇంత కాలం ఏమరచినందుకు కించిత్ సిగ్గు పడవలసిందిపోయి?

ఓ రామచంద్రా ! ఇక “జ్ఞానులు ఎక్కడెక్కడ ఉంటారు? ...అనే నీ ప్రశ్నకు వద్దాం.

Page:220

“జ్ఞాని ఇక్కడ ఉంటాడు. అక్కడ ఉండడు" అని నిర్ధారించటం ఏమాత్రం కుదిరే విషయం కాదు. మంచివాడు ఈ గ్రామంలో ఉంటాడు. ఆ జాతిలో ఉండడు" ... అని ఎవరైనా సిద్ధాంతీ కరించగలరా? జాతి, వస్త్రధారణల వంటి విషయాలు మంచితనమును నిర్వచించలేవు కదా! జ్ఞానం కూడా అట్టిదే ! అయితే ఈ జగత్తులో జ్ఞానులు తప్పక ఉన్నారు. అట్టి ఆత్మ స్థితి అనుభవించే జ్ఞానులలో... ఒకడు పర్వత గుహలలో ఉండవచ్చు. ఒకడు పుణ్యస్థల - పుణ్యాశ్రమములలో నివసించవచ్చు. ఇంకొకడు గృహస్థాశ్రమంలో తారసపడవచ్చు. మరొకడు సంచారము సల్పుతూనో, భిక్షాటనం చేస్తూనో ఉండవచ్చు.

లేదా, ఏకాంతవాసుడుగానో, తాపసిగానో, ఉపన్యసిస్తూనో, మౌనం దాల్చియో, వ్యవహార పారాయణుడుగానో, ధ్యాన పరాయణుడుగానో, విఖ్యాత పండితుడుగానో, నిరక్షరకుక్షిగానో, వేద వేదాంగాలు ఎఱిగి పఠించు వాడుగానో, శ్రుతి-స్మృతులను శ్రవణం చేస్తూనో, బ్రాహ్మణ-క్షత్రియ -వైశ్య-శూద్రులలో ఒకడుగానో, కళాపోషకుడుగానో, పామర రూపంతోనో, రాజఠీవితోనో, ఆచారాలను శ్రద్ధగా అనుసరిస్తూనో, ఆచారాలన్నిటినీ విడచివైచినవాడు గానో, వేదవేత్తలలో అగ్రగణ్యుడుగానో, ఒక పిచ్చివాడులాగానో, సన్యాసిగానో, మరింకే రూపంగానో ఉండవచ్చు. కాబట్టి జ్ఞాని ఇక్కడ - - ఇట్లా - ఈ రీతిగా మాత్రమే ఉంటాడని మనమెవరం చెప్పలేం.

'ఆత్మ' లేక 'పురుషుడు ఈ శరీరాదులుగా అవటమే లేదు సుమా! అది ఈ మనస్సు, చిత్తము మొదలైనవి కూడా కాదు. ఈ దేహమును - చిత్తమును కదిలించే చేతనా తత్వమే ఆత్మ. అది ఎప్పుడూ జనించటంలేదు, నశించటమూ లేదు.

అచ్ఛేద్యో 9 సావదాహ్యో సావకేద్యో శోష్యఏవచ |

నిత్యః సర్వగతః స్థాణుః అచలో అసౌ సనాతనః ॥

అట్టి చైతన్యము దేనిచేతా ఛేదింపబడదు, దహించబడదు, తడుపబడదు, ఎండించబడదు. అది నిత్యము, సర్వవ్యాపి, స్థాణువువలె నిశ్చలము, సనాతనము. అట్టి సర్వమును కదిలించే చైతన్యమే ఈ జీవుని వాస్తవరూపం. అట్టి చైతన్య పురుషుని ఎఱిగిన జ్ఞాని 'పురుషోత్తముడు' అవుతాడు. అట్టి జ్ఞాని ఎప్పుడెక్కడ ఎట్లు ఉంటాడో... అట్లే ఉండుగాక! ఈ ఈ వర్ణాశ్రమ ధర్మాలు, స్థానాలు, నియమములు ఆతనికి కలిగించే ప్రయోజన -నిష్ప్రయోజనములు ఏమున్నాయి? ఆతడు సర్వ ప్రయోజన - - నిష్ప్రయోజనములకు అతీతుడై ఉంటున్నాడు.

ఓ రామచంద్రా! నిర్మలాత్ముడగు జ్ఞాని పాతాళంలో ప్రవేశించవచ్చు గాక! ఆకాశంలో ఎగురుచుండవచ్చు గాక! దిక్కులలో పరిభ్రమిస్తూ ఉండవచ్చుగాక! ఎక్కడో లోకాలోక పర్వతాలలో చూర్ణమగుచుండవచ్చుగాక! దేహము కలిగి ఉండవచ్చు! ఇప్పుడే దేహంపోతూ ఉండవచ్చుగాక! దేహరహితుడై ఉండవచ్చుగాక! ఆ చిన్మాత్రుని స్వరూపము నశించదు, మార్పు చెందదు, సర్వదా యథాతథంగానే ఉంటుంది. ఆతడు సర్వదా, సర్వ స్థితిగతులతోనూ నిరతిశయమగు చిన్మయానంద

Page:221

శివపదము అధిరోహించియే ఉంటాడు. తన యథాతథ స్వస్వరూపమును సందర్శిస్తూ తెంపులేకుండా ఆనందభరితుడై ఉంటున్నాడు.

2. చైతన్యము యొక్క నిత్యత్వము - ఏకత్వము - - స్వాతంత్ర్యము శ్రీరాముడు : మహర్షీ ! ఒకడు ఏది తెలుసుకొనిన తరువాత జ్ఞానిగా అగుచున్నాడు?

శ్రీ వసిష్ఠ మహర్షి : శాంతము, అఖండము, నిత్యము, ఏకము, సర్వము, నిత్య నిర్మలము, అప్రమేయము 'అగు నిజచైతన్య స్వరూపమును ఎఱిగినప్పుడే ఈ జీవుడు 'జ్ఞాని' అగుచున్నాడు. ఆ నిజ చైతన్యమునే "చిన్మాత్ర పురుషుడు అని కూడా అంటున్నారు. ఓయీ జీవుడా నీ వాస్తవ స్వరూపము ఎట్టిదో గ్రహించు ! సంసార సాగరము దాటి వేయటానికి, అజ్ఞానము తొలగటానికి అదొక్కటే మార్గము, ఉపాయము, ఆత్యంతికము కూడా! నీవు చిన్మాత్ర పురుషుడవే గాని ఈ దేహాదులు కానే కాదు సుమా!

చిన్మాత్ర పురుషుడు -

శ్రీరాముడు : అట్టి చిన్మాత్ర పురుషుడు అని చెప్పబడే ఈ జీవుని నిజ చైతన్య స్వరూపము ఎప్పుడు ఎందులోంచి ఉదయించింది? అట్టి ఉత్పత్తి స్థానం గుర్తించటం, గమనించటం ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! సర్వజీవులు ఈ జాగ్రత్లో ఈ జగత్తును అనుభవిస్తున్నారు కదా! సర్వ ఆశలు, భోగాలు, మమత్వాలు (నావి, నీవి అను భావోద్రేకాలు), నిరాశలు మొదలైన అనేక భావాభావములు అనుభవిస్తున్న ఈ జాగ్రత్ అనేది జీవునియొక్క త్రివిధావస్థలలో ఒకటి మాత్రమే!

ఇక ఈతని రెండవ అవస్థ 'స్వప్నము - ఈతడు ఈ దేహము ఈ పాంచభౌతిక ప్రపంచంలో ఉండి ఉండగానే... దీనిని నిరసించి, కేవలం మనస్సుతో జగత్ కల్పనను మనస్సులోనే నిర్వర్తించుకుని అనుభవం పొందుచున్నాడు. జాగ్రత్ సమయంలో స్వప్నం లేనిది, అవాస్తవమైనది, కల్పిత మాత్రము అగుచున్నది. ఆయా సమయాలలో మాత్రం ఆ యొక్క జాగ్రత్, ఆ యొక్క స్వప్నము కూడా - 'సత్యం' అను ఉద్దేశం, భావన, అనుభవాలతో కూడి జీవునిచే పొందబడుతోంది.

ఆపై మూడవ అవస్థ 'సుషుప్తి’. అందులో భావంగాని, అభావంగాని ఉండటం లేదు. ఆ జీవుడు ‘ఊహ - - లేక భావన' కట్టిపెట్టి తన ఒకానొక మౌన స్థితిని తానే పొందుచూ కాలము, స్థానము, ఆలోచనాదులకు అతీతమైన స్థితిని అనుభవించుచున్నాడు.

ఒకే జీవునికి ఈ మూడు అవస్థలు కలుగుచున్నాయి కదా! అనగా, ఈ జీవుని ఒకానొక తత్త్వం ఈ మూడు అవస్థలలో ప్రవేశము, నిష్క్రమణము సల్పుతున్నదన్నమాటేగా! అట్టి మూడు అవస్థలకు కేవలం సాక్షి అయి ఉంటూ, తాను మాత్రం ఆ మూడు అవస్థలకు వేరై ఉన్నట్టిదే ఈ జీవుని చిన్మాత్ర స్వరూపము.

Page:222

అట్టి చిన్మాత్రము త్రివిధ అవస్థలయందు సాక్షిగానే కాకుండా, కేవలం ప్రకాశ మాత్రము. (ఆయా విషయములను ప్రకాశింపజేయుచు, తాను మాత్రం స్వయం ప్రకాశకము). అది అనాది, అనంతము, జన్మ-మృత్యు రహితము అయి ఉన్నది.

అట్టి చిన్మాత్ర స్వరూపమే ఈ పురుషుడు (జీవుడు). కాబట్టి ఈ పురుషుడు నాశరహితుడు. చిన్మాత్రమే నశిస్తే ఇక అది ఎట్లా ఉత్పన్నమౌతుంది? సాక్షియే లేకపోతే ఉత్పత్తి / సృష్టి ఎక్కడి నుండి వస్తుంది?

శ్రీరాముడు : అట్టి స్వస్వరూప - త్రివిధావస్థల సాక్షి చైతన్యమును ఉద్దీపించే మరొక చైతన్యమేది? శ్రీ వసిష్ఠ మహర్షి : అట్టి నిజరూప చైతన్యము స్వయం ప్రకాశకం అని చెప్పుకున్నాం కదా! దానిని ప్రకాశింపజేసే (వెలిగింపజేసే) మరొక చైతన్యమేదీ ఎవరికీ ఎక్కడా సంభవింపజాలదు సుమా! ఎందుకంటావా? ఆ చిన్మాత్ర చైతన్యం అగ్ని-దీపం వంటిది కాదు... మరొకరు వెలిగించటానికి! అట్టి చైతన్యం అనుభవమాత్రం అయివున్నది. అది భూత-వర్తమాన-భవిష్యత్తులను ప్రకాశింపజేస్తూ ఆ మూడు సమయములందు తాను యథాతథంగా స్వయంప్రకాశమానమై ఉన్నదని గ్రహించు. సర్వ అంశాలపట్ల అనుభవముల పట్ల సమానత్వముచే వర్తించే ఆ స్వస్వరూప చైతన్యము' నకు భిన్నమైనదేదీ ఎక్కడా లేనే లేదని గ్రహించు.

ఇక ఆ చైతన్యమునకు “ఈ జీవుడు - ఆ జీవుడు అనే జీవాజీవ భేదం లేదు. ఏకైక చిన్మాత్ర చైతన్యమే సర్వ జీవులలోనూ సర్వజీవులుగానూ ఉన్నది. అనగా, ఒక జీవుని నిజ చైతన్యమే మరొక జీవుని నిజ చైతన్యముగా కూడా అయి ఉన్నది. ఒకనికి మంచు చల్లగాను, అగ్ని ఉష్ణముగాను, పాలు తీయగాను అనిపించినట్లే మరొకనికి కూడా అనిపించటం జరుగుతోందికదా! "చైతన్యము అందరిలోనూ ఒక్కటే... అని అట్లే సూక్ష్మదృష్టితో గ్రహించు.

చైతన్యమునకు రూపం లేకపోయినప్పటికీ ఈ కనపడే రూపములన్నీ ఆ చిత్ చైతన్యమే! కనుక సర్వదా త్రివిధావస్థల యందే కాక సర్వజీవుల యందు 'సాక్షి' యగు చైతన్యమే తానై ఉండగా ఇక ఈ జీవుడు దుఃఖం పొందవలసిన పని ఏమున్నదో నాకు చెప్పు?

శ్రీరాముడు : మహాత్మా! కానీ ఈ జీవుడు ఎందుకో "ఈ దేహమే నేను! ఇది నశించిందా, నేనే నశిస్తాను... అని మృత్యువును తలచుకొన్నప్పుడల్లా దుఃఖితుడగుచున్నాడు! "శరీరము నశిస్తే జగత్తు కోల్పోబడుతుంది"... అని భ్రమిస్తున్నాడు.

శ్రీ వసిష్ఠ మహర్షి :

శరీరనాశే నాశశ్చేత్ చిన్మాత్రస్య తదుచ్యతామ్

హర్షస్థానే విషాదః కిం? మరణే సంస్కృతి క్షయే ||

ఈ శరీరము నశించినపుడు ఒకవేళ తన చిన్మాత్ర దేహమే నశిస్తుందనుకొంటే (చార్వాకమతం), అప్పుడు మరణము సంసార క్షయమే కాబట్టి ఇక హర్షించవలసిన చోట ఆతడు దుఃఖించవలసిన పనేమున్నది?

Page:223

అది అలా ఉంచి... ఒక భవనం నేలకూలినంత మాత్రం చేత అక్కడి ఆకాశం నశిస్తుందా? లేదు. అలాగే దేహం నశించినా దేహిచైతన్యం నశించదు, నశించేది కాదు. ఇందుకు దృష్టాంత మంటావా?... తమ బంధువు నశించినప్పుడు కొందరు (మ్లేచ్ఛులు) ఆ బంధువు యొక్క పిశాచ రూపము గాంచుచున్నారు కదా! మరికొందరు ["సోది - మంత్రద్రష్టల సాయంతో ఆ బంధువులు మరణించిన వానితో - (పిశాచదేహంతో) సంభాషణ మొదలైనవి నిర్వర్తిస్తున్నారు కదా!] శ్రీరాముడు : మహనీయా! "శరీరం ఉన్నంత వరకే చైతన్యం ఉంటుంది. శరీరం నశిస్తే చైతన్యం నశిస్తుంది అనేది లోకంలోని ఒక అభిప్రాయం కొందరు (చార్వాకులు) కలిగి ఉంటున్నారు కదా! శ్రీ వసిష్ఠ మహర్షి :శరీరం ఉన్నంత వరకు చైతన్యం ఉంటుంది" అనేదే వాస్తవమైతే శవం కదలటంలేదేమి? అక్కడ శరీరం ఉన్నది కదా? కనుక “శరీరం ఉంటే చైతన్యం ఉంటుంది. శరీరం నశిస్తే చైతన్యం కూడా నశిస్తుంది" అనునది యుక్తియుక్తం కాదు. ఎందుకంటే శరీరం కదిలేది. ఇక చైతన్యమో "కదిలించేది. తాను కదలక సర్వమును (శరీర-మనో బుద్ధి-అహంకార -ఆలోచన-భావనాదులను కదిలించేదే 'చైతన్యము' అను శబ్దముతో ఉద్దేశింపబడుచున్నది సుమా! శ్రీరాముడు : స్వామీ! "మరణించిన పిశాచజీవునితో ఆతని బంధువులు సంభాషించటం - అనేది వారి స్వభావ సంబంధము. వారికి ఆ మరణించిన వానితో ఉన్న అనుబంధమునుండే అటువంటి సంభాషణ మొదలైనవి భ్రమ రూపంగా జరుగుతూ వుంటాయి ...అని కొందరి అభిప్రాయం. శ్రీ వసిష్ఠ మహర్షి : ఓహో! బంధువుతో గల సంబంధమే అట్లు మరణానంతర పిశాచ జీవునితో సంభాషణకు కారణమగుచున్నదనా వారి అభిప్రాయం? అట్లా అయితే మంత్రద్రష్టలకు మరణించిన బంధువులతోనే సంభాషణ కుదురుతుంది గాని, బ్రతికియే ఉన్న దూరదేశంలో ఉన్న బంధువుతో అటువంటి సంభాషణ కుదరటంలేదే? ఓ రామచంద్రా! దేహం నశించినంత మాత్రం చేత దేహి చైతన్యం నశించేది కాదు. చైతన్యము యొక్క భేదము (మరొక రీతిగా ఉండటం) గాని, అద్దాని వినాశనము గాని సంభవించేవి కావు.

వాస్తవానికి ఈ దేహిచైతన్యం నిత్యమైనది. అంతేకాకుండా సర్వాత్మకమైనది కూడా సుమా! అది వస్తుకృతమైన పరిచ్ఛేదముచే నియమింపబడేది కాదు. ఇక ఈ జగత్తు ఏమిటంటావా?...

ఆ చిత్ చైతన్యము దేని దేనిని ఎట్లెట్లు ఏఏ దేశ కాల అనుభూతులుగా నిర్వచించుకుంటూ ఎఱుగుచున్నదో అచ్చటచ్చట అయ్యది స్వస్వరూపమునే అట్లట్లు దర్శించటం జరుగుతోంది. ఆ దర్శనమే 'జగత్తు' అను పేరుకు గల నామ - - రూప - - అర్థాదులు సుమా!

శ్రీరాముడు : నిర్మలము, శుద్ధము, అప్రమేయము, అఖండము, అనంతము - అగు స్వస్వరూప సంవిత్తు - ఈ ఈ జగత్తులను పొందవలసిన అవసరమేమున్నది?

శ్రీ వసిష్ఠ మహర్షి : చిల్డ్రనమగు సంవిత్తు (స్వస్వరూప ఘనీభూత సంవిత్తు) సత్య సంకల్పి. అనగా తాను దేనిని 'సత్యం’ అని భావిస్తుందో అది అట్లే సత్యంగా పొందుతూ ఉంటుంది. అయినా కూడా ఈ జగత్తు అనబడు “స్వయంభావిత ప్రాప్తము” చే అది సర్వదా అబాధితమే సుమా! అట్టి స్వయం

Page:224

ప్రకాశక సంవిత్తు సృష్ట్యాది యందు ఏ రీతిగా అయితే స్వసంకల్పముచే అగుచున్నదో, ఆయా రీతి గానే నేటికీ అనుభూతమౌతూ ఉన్నది. ఎందుచేతనంటావా? అది అద్దాని స్వభావమే అయి ఉన్నది. బంగారమునకు ఏదో ఒక ఆకారం అనేది ఉండటం స్వభావ సిద్ధమే కదా! అట్లాగే ఇది కూడా!

ఇక ... సత్య సంకల్పయుక్తమగు బ్రహ్మ సంవిత్తునందు సృష్ట్యాదియందు ఆ బ్రహ్మ సంవిత్తు కంటే వేరుగా జగత్తుగాని, మరొకటి గాని ఉత్పన్నమవటానికి అన్యమైన కారణమేదీ సంభవించ జాలదు బ్రహ్మానికి అన్యంగా సృష్ట్యాదిలో సృష్టి కొఱకై ఏ కారణమూ లేదు. కాబట్టి బ్రహ్మం బ్రహ్మం గానే ఉన్నది. కారణరహితకార్యం ఎక్కడా ఉండదు కదా! కాబట్టి ఈ సృష్టి బ్రహ్మమే అయి ఉన్నది.

ఈ విధంగా అకారణమగు జగత్తు మొదలే ఉత్పన్నం కాలేదు. అనగా బ్రహ్మము అప్పటి సృష్ట్యాదిలో వలెనే నేడూ ఉన్నది. చిన్నది - పెద్దది అగు వికల్పత్వమేదీ సృష్ట్యాదిలో ఉత్పన్నం కాలేదు. ఉత్పన్నమయినట్లుగా కనిపించేదంతా బ్రహ్మమే! అనగా బ్రహ్మమే అట్లు స్వసంకల్పము యొక్క కల్పనా విశేషముచే రూపనామాదుల కల్పనా విశేషంగా తనకుతానై ఈ విధంగా దర్శిస్తోంది. అట్టి దర్శనమే సంసారము.

ఓ రామచంద్రా! ఏదైతే దృశ్యంగా ఎఱుగబడుచున్నదో... అదంతా కూడా చైతన్యం యొక్క వివర్తరూపమేనయ్యా! అయితే ... ముత్యపు చిప్పలో వెండి ఉన్నదా? మృగతృష్ణలో జలం ఉన్నదా? లేదు. అయినా ఉన్నట్లే వెండి జలం అజ్ఞాన-అపరిశీలనాత్మక దృష్టికి అగుపిస్తాయి కదా! అట్లాగే చైతన్యంలో జగత్తు అనబడునది లేకపోయిన్పటికీ... ఉన్నట్లే అజ్ఞాన దృష్టికి అనిపిస్తోంది. పాముగా కనిపించేదంతా 'త్రాడు యే అయినట్లు ఇక్కడ జగత్తుగా కనిపించేదంతా నిర్వికారమగు నిర్మల పరబ్రహ్మమేనయ్యా! ఉత్తమమగు చిదాకాశము యొక్క చమత్కార రూప చాతుర్యమే ... ఈ దృశ్యం.

అట్టి “జగత్తు” అనబడేది జాగ్రత్-స్వప్నముల బోధకు దృశ్యమానమగుచున్నది. ఇక సుషుప్తి యందో? బోధ (ఎఱుక) ఉండదు కాబట్టి ఎఱుగబడటంలేదు. ఓ రామచంద్రా! బోధ, అబోధ - ఈ రెండూ కూడా నిరామయమగు చైతన్యం యొక్క రూపాలేనయ్యా! బంగారపు ఆభరణం లో బంగారం-ఆభరణం... ఈ రెండూ అభేదమే కదా! అట్లాగే చైతన్యం, దృశ్యం, ఈ రెండూ అభేదా లైనవే! వాస్తవానికి దృశ్యం లేదు. చైతన్యమే ఉన్నది. "మరి పదార్థముల దృశ్యత్వం ప్రాప్తిస్తోంది కదా! మాకు దృశ్యం కనిపిస్తోంది... మీరు లేదంటారేం"?... అని ఎవరైనా అంటారేమో?... ఓ ప్రియమిత్రమా! ఏ (పాదార్థిక) దృశ్య వ్యవహారం కనిపిస్తోందో... అదంతా కూడా చిత్ తత్త్వమును గూర్చిన అవిచారణచేతనే అట్లు అగుపిస్తోంది సుమా! మరి అట్టి అవిచారణచే ఏదేది అనుభవానికి వచ్చి కూర్చుంటుందో, అదంతా కూడా విచారణచే తప్పక నశించగలదు. ఆపై ఇక్కడ చైతన్యమే తాండవిస్తూ కనిపించగలదు గాని, ఇక దృశ్యం కాదు.

కాబట్టి ఓ జనులారా! మీ మీ బుద్ధి "ఆత్మజ్ఞాన విచారణ అనుదానియందే తీవ్ర యత్నముచే నియమించబడుగాక! సర్వ ప్రయత్నములచే గావించబడే విచారణ... అనే అభ్యాసం ఇహ పరలోకాలలో సిద్ధిదాయకం అగుచున్నది.

Page:225

3. అభ్యాసము యొక్క ఆవశ్యకత

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా!

అవిద్య ఉపశమస్తి ఏష జాతో పి భవతామిహ అభ్యాసేన వినా, సాధో! న సిద్ధిమ్ ఉపగచ్ఛతి |

సాధుపుంగవుడవగు ఓ రామచంద్రా! సర్వసభికులారా! మీరంతా ఈ వినే ఉపదేశ వాక్యములచే అవిద్య ఉపశమించవచ్చుగాక! అంతమాత్రానికి సరిపోతుందనుకుంటున్నారా? లేదు. జీవన్ముక్తి యందు ప్రతిష్ఠ" ...అనే సిద్ది అభ్యాసము లేకపోతే సంభవించేది కాదు.

శ్రీరాముడు : హే ప్రభూ ! 'అభ్యాసము' అనునది మరికొంత వివరంగా ఆజ్ఞాపించండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ముముక్షువు "శమము (ఇంద్రియాలను అదుపులో ఉంచటం)"...అనేది అభ్యసించాలి. క్రమంగా భయమును, సోమరితనమును లోకచింతనలను విడనాడాలి. విచారణ చేయాలి. గురువాక్యములపై, శాస్త్ర వాక్యములపై ఏకాగ్రతతో ధ్యానం చేయాలి. ఆత్మజ్ఞానం ప్రబోధించే ఈ మహా రామాయణ శాస్త్రమును ప్రతి రోజు కొంతసేపు విచారణ చేయండి.

అధ్యాత్మ శాస్త్ర ప్రశంస - సందర్భోచితం కనుక ఈ వసిష్ఠ - రామ సంవాద రూపమైన అధ్యాత్మ శాస్త్ర ప్రశంసను ఈ అయోధ్యా రాజ్య సభామధ్యంలో ఇప్పుడు సభికులందరికీ విన్నవిస్తాను.

ఓ సభికులారా! ఆత్మజ్ఞానము మీలో కొందరికి తెలిసి ఉండవచ్చుగాక! అయినా కూడా దృశ్య జగత్తులోని ఈ జీవితం అసంభావన మొదలైన ఆయా దోషములతో కూడుకొని ఉండటం జరుగుతోంది. అందుచేత ఆత్మజ్ఞానము గురించిన నిరంతర చింతనాభ్యాసం, పరస్పరబోధకథనము మొదలైనవి సర్వదా ఆవశ్యకం! అట్టి అభ్యాసం లేకపోతే దైనందిన సంసారాభ్యాసంచేత ఆత్మజ్ఞాన విద్య మఱువబడుతూ, మఱుగునపడటం జరుగుచున్నది. అందుచేత ఈ మన సంభాషణ గ్రంథస్థమై భావికాలంలో కూడా శ్రవణానందము, శ్రవణాభ్యాసము కలిగించునుగాక!

ఒకడు ఏ వస్తువును అభిలషిస్తాడో, ఆ వస్తువు కొఱకే ఆతని ప్రయత్నము - అభ్యర్థన భావన కొనసాగుతూ ఉండటం సహజం. అయితే శ్రమకు సిద్ధపడి ప్రయత్నమును కొనసాగించకపోయాడా ...అభిలషిత వస్తువు లభించదు కదా! అట్లాగే ఆత్మజ్ఞానం సముపార్జించా లనుకొనేవాడు ఇట్టి ఆధ్యాత్మ శాస్త్ర గ్రంథములను నిరంతరం పరిశీలిస్తూనే ఉండాలిగాని, “ఈ ఈ విషయములు తెలిశాయి కదా! ఇంకెందుకు చదవటం, పరిశీలించటం, మననం చేయటం, యోచించటం? ...ఇటువంటి అభిప్రాయములతో 'పరిశీలన-అవగాహన' అనే ప్రయత్నములను విడచివుండటం ఉచితం కాదు. మనస్సును ఆక్రమించటానికి పూర్వాభ్యాసరూపమైన సంసార భ్రమ సర్వదా వేచి ఉంటుందని గ్రహించి ఆత్మజ్ఞానాభ్యాసమును నిరంతరం కొనసాగించటమే ఉచితమని మా అభిప్రాయం.

Page:226

కాబట్టి ఓ జనులారా! క్రమక్రమంగా మీరంతా అనాత్మశాస్త్ర అభ్యాసమును త్యజించుచూ ఆత్మతత్త్వ ప్రతిపాదకాలగు సచ్ఛాస్త్రములను పఠించి విచారణ కొనసాగిస్తూనే ఉండండి. ఒకవైపుగా బద్ధకము, క్రోధము, ఆవేశము, తప్పులుచూడటం ఇత్యాది దుర్గుణములను త్యజిస్తూ మరొకవైపు సచ్ఛాస్త్ర పఠనం కొనసాగిస్తూ రాగా, అనతికాలంలో యుద్ధం చేసి జయించి విజయలక్ష్మిని చేపట్టినట్లుగా... అజ్ఞానాభిప్రాయములను శమింపజేసి శాంతిని తప్పక సొంతం చేసుకోగలరు. వివేకే చ అవివేకే చ వహతి ఏషా మనోనదీ,

యత్రైవ వాహ్యతే యత్నాత్, తత్రైన స్థితిమృచ్ఛతి ॥ ||

ఈ ‘మనస్సు’ అనే నది వివేకము-అవివేకము అను రెండు వైపులా ప్రవహిస్తోంది. అందు ఒక వైపు ప్రవహించటాన్ని ప్రయత్నపూర్వకంగా నిరోధించామా, అప్పుడు ఈ మనో నదీజలం రెండవ వైపుగా వేగంగా తనంతటతానే ప్రవహించగలదు. మానవుడు వివేకము కొఱకై శ్రద్ధాసక్తులతో ప్రయత్నిస్తూ ఉంటే అవివేకము తనంతట తానే తొలగిపోగలదు. అట్టి వివేక సాధనలలో ఆధ్యాత్మ గ్రంథ పఠనం, పరిశీలన, మనోగతం చేసుకోవటం అనేది ఒకానొక ఉత్తమమైన సాధన.

అస్మాత్ శాస్త్రాదృతే శ్రేయో న భూతం, న భవిష్యతి

తతః పరమబోదార్ధమ్ ఇదమేవ విచార్యతామ్ II

మహా రామాయణము' అని పిలువబడబోయే మన 'సంవాదమును పఠించటం ఒకానొక ఉత్తమ సాధన కాగలదు. కనుక పరమబోధ కొరకై దీనిని జనులు చక్కగా విచారణ చేయుదురుగాక! ఇద్దాని విచారణ కలుగజేయగల శ్రేయస్సు అనిర్వచనీయం, అనన్య సామాన్యం. ఇట్టి శాస్త్రవిచారణను మించినదేదీ భూత-భవిష్యత్తులలో ఎక్కడా లేదు. ఈ శాస్త్రాన్ని విచారణ చేస్తూ రాగా, ఇక ఇద్దాని ప్రభావం చేత సంసార మార్గంలోని శ్రమ అంతా తొలగిపోగలదు. ఈ శాస్త్ర పరిశీలనా సమయంలోనే ఆత్మతత్త్వబోధ సుబోధకం కాగలదు. అంతేగాని ఇది వరశాపాదులులాగా మరింకెప్పటికో ప్రభావం కలుగజేసేది కాదు. ఓ ప్రియ జనులారా! ఏ శ్రేయస్సు అయితే తల్లిగాని, తండ్రిగాని, ఆయా కర్మ వ్యవహారాలు గాని కలిగించలేవో అట్టిది ఈ శాస్త్రము యొక్క విచారణచే ఇప్పటికిప్పుడే కలుగగలదు.

ఓ రామచంద్రా! ఈ సంసార బంధం (దృశ్యమునకు సంబంధించిన అజ్ఞాన దర్శనం) ఉంది చూచావూ? ఇది విషం వలె, విషజ్వరంవలె అతి భయంకరమైనది. అనేక జన్మల దురభ్యాసవశం చేత ఘనీభూతమై ఉన్నది. అజ్ఞానంచే రూపుదిద్దుకున్న సంసార మహమ్మారి ఆత్మజ్ఞానం పొందనంత వరకూ ఎన్నటికీ తొలుగగలిగేది కాదు సుమా! ఓ ప్రియజనులారా! అట్టి ఈ సంసారం

అంతరంగం నందే అహంకారం' అనే ఒకానొక దీర్ఘరోగం రూపంలో తిష్ఠ వేసుకొని ఉన్నది. అట్టి అహంకార రూప మహామోహం అనే మహమ్మారి ఆత్మజ్ఞానం వినా ఎన్నటికీ నశించేది కాదు. ఆకలి గొని ఉన్న సర్పం వృథాగా గాలిని నాకి, తన ఆకలి తీరకపోగా, అత్యంత శ్రమను తెచ్చిపెట్టు కొంటుంది చూచావా? శాస్త్రార్థములను భావన చేయకుండటం చేత, విచారించని కారణం చేత ఈ జీవుడు మహాదుఃఖాలన్నీ మోస్తూ జీవిస్తున్నాడు. ఓ జనులారా! శూన్య విషయ సమూహములతో

Page:227

కూడిన ఈ దుర్భర - - సంసారమునకు తగల్కొని జీవితమును వృథా చేసుకొనవద్దని నా మనవి. ఎందుకంటే ఈ సంసారమునకు అంతులేదని గ్రహించండి. ఆహా! ఏమి కష్టం! వృథా సంభాషణలతో, ముందు ముందు “భేదము కలిగించగల వృథా చేష్టలతో రోజులు వ్యర్థంగా గడిచిపోవుచుండగా, ఈ జీవులు అది గమనించటమేలేదే! ఆయుస్సును ఎవరైనా నమ్మి ఉండవచ్చునా? మృత్యువు ఎదురుగా కాచుకొని ఉండి ఈ ఈ దేహమును ఎప్పుడు చేపట్టుకొని - నోట కరచుకొని పోనున్నదో ఎవరం చెప్పగలం?

కాబట్టి ఈ దేహం పడిపోకముందే ఆత్మజ్ఞాన ప్రదమగు శాస్త్రాలను పరిశీలించి ఆత్మతత్త్వమును అతి శీఘ్రంగా సముపార్జించుకొని ఉండటం మంచిది కదా! సమయం అతి స్వల్పమనే ప్రతి జీవుడు అనుకొని ఉండటం మంచిది. మృత్యువు సమీపించక ముందే ఆత్మజ్ఞాన శాస్త్రమును హృదయంలో పదిలపరచుకోవటం అత్యవసరం. మృత్యువు ఆసన్నమైనపుడు ఇక చేసేదేమున్నది? ఈ కాళ్ళు చేతులు కదిలించలేని స్థితిలో శాస్త్ర పరిశీలన కుదురుతుందా? లేదు, కుదురదు. ఆహా! ఏం ఆశ్చర్యం! ఈ జనులు ఘనీభూతమైన భ్రమతో కూడుకొన్నవారై ధన-జన-అభిమానముల కొరకై యుద్ధాదులలో ఈ దేహాన్ని- ప్రాణాలను కోల్పోవటానికి కూడా సిద్ధపడుచున్నారే గాని... శాస్త్రములు ప్రబోధించే శ్రవణ మనన-వివేక- వైరాగ్యాదులను అభ్యసించి తత్త్వబుద్ధిని సంపాదించ టానికి ఉపక్రమించుటయే లేదే! జన్మ-జరా- దుఃఖ వర్జితమగు 'మోక్షము' అనే పరమశాంత స్థానము సంపాదించుకోవటానికి ఏమాత్రం సిద్ధపడటం లేదే?

ఇక్కడ వివేకులు అన్ని శక్తియుక్తులను ఉపయోగించి స్వతత్త్వ జ్ఞానమును అవధరించినవారై చిదాకాశమున సంస్థితిని సంపాదించుకుని ఉంటున్నారు. ఇక అజ్ఞానుల విషయానికి వస్తే వారు యుద్ధంలో మహావీరులై ఉండి కూడా (లేక ఆయా ప్రాపంచిక విషయములలో ప్రావీణ్యము కలిగి ఉండి కూడా) సర్వోత్కృష్టమగు ఆత్మతత్త్వశాస్త్రమును ఉపేక్షించి తమ శిరముపై అజ్ఞాన శత్రువు పాదములు మోపునట్లుగా చేసుకుంటున్నారే? యుద్ధము - కార్యనిర్వహణల యందు దక్షులై ఉండి ఈ అజ్ఞాన శత్రువు యొక్క పాదఘట్టములను పొందుతూ బాధలు పొందుచున్నారేగాని "అజ్ఞాన శత్రువును జయించటం ఎట్లా? ...అని యోచించరాయే!

నిర్మాన-మోహమ్-ఆపన్నా గతిం గచ్ఛత మా ధమామ్ క్రియతే స్వాత్మ బోధేన మూలకాషో మహాపదామ్ ||

ఓ సభికులారా! మీరంతా మానమోహములనే దుష్ట మార్గంలో పయనిస్తూ అధమము దుఃఖమయము అగు సంసారభూములను బడయకండి. తత్త్వమును గ్రహించి 'మోక్షము' అనే పవిత్ర స్థానమును జేరటమే జీవితాశయంగా కలిగివుండండి. 'ఆత్మజ్ఞానము' అనే మహత్తర ఔషధం సర్వ మానసిక రుగ్మతల నుండి, ఆపదల నుండి మిమ్ములను కాపాడగలదు.

ప్రలపన్తమ్ అహోరాత్రమ్ యుష్మదర్ధన మామిమమ్ | యం ప్రదృశ్యేదమ్ ఆకర్ష్య స్వాత్మనైవ ఆత్మతార్ప్యతామ్ ॥

Page:228

అందుకనే 'కంఠశోష' అనే గొప్ప శ్రమకు ఓర్చి అవతారమూర్తి అగు ఈ "రామచంద్రునికి జ్ఞాన బోధ అనేది మిషగా పెట్టుకొని మీ కొఱకై ఆత్మజ్ఞానమును ఎలుగెత్తి గానం చేస్తున్నాను. అఱచుచు బోధిస్తున్న నన్నవలోకించి నా ఈ వచనములు శ్రద్ధగా ఆదరముతో విని, స్వయముగా ఈ దేహాదులందు ఆత్మబుద్ధిని తొలగించుకోండి.

అద్యైవ న చికిత్సాం యః కరోతి 'మరణ ఆపదః'

సంప్రాప్తాయాం మృతౌ మూఢః కరిష్యతి కిం ఆతురః?

ఎవడైతే 'మరణము' అనే అతి సమీపంలో ఉన్న ఆపదకు ఇప్పుడే 'ఆత్మజ్ఞానము' అనే ఔషధం సేవించటం ద్వారా చికిత్స పొందడో... అట్టి మూఢుడు, అనివార్యము - అకాలనిర్ణయము

అనిర్దేశ్యము అగు మృత్యువు శరీరమును ఆక్రమిస్తూ ఉండగా ఇక చేయగలిగినదేముంటుంది? అట్టి ఆత్మజ్ఞానము ప్రసాదించగల శాస్త్రములలో ఈ వసిష్ఠ రామాయణము తలమానికము వంటిదని మా మనవి. కొబ్బరినూనెను కోరేవారు కొబ్బరిని, నువ్వులనూనె కోరేవారు నువ్వులను ఆశ్రయించాలి కదా! అట్లాగే మోక్షము కోరేవారు ఈ మహారామాయణ మోక్ష శాస్త్రమును పరిశీలించటం సముచితం. ఈ గ్రంథం చీకట్లో వెలిగే దీపంలాగా మీయందు జ్ఞానజ్యోతిని వెలిగించగలదు. తండ్రి వలె బోధించగలదు. స్త్రీ వలె ఆనందింపజేయగలదు. మీలో ప్రతి ఒక్కరిపట్లా నిత్యప్రాప్తమే అయివున్న ఆత్మ గురించిన జ్ఞానం బోధించటమనేది దుర్బోధకం (బోధించటానికి కష్టముతో కూడుకొన్నది) అయివున్నది. అయినా కూడా, అట్టి ఆత్మజ్ఞానాన్ని సులభంగా తెలుసుకోవటానికి వీలుగా ఆత్యంతిక విషయాన్ని ఏమీ దాచకుండా సుస్పష్టంగా, నిర్దుష్టంగా మీ ముందు ఉంచటానికి ప్రయత్నిస్తున్నాను. శాస్త్రముల ఉద్దేశం-లక్ష్యం" అయిన ఆత్మజ్ఞానాన్ని సుబోధకంగా విశదీకరిస్తూ వస్తున్నాను. అనాది నుంచి వస్తున్న తత్త్వవేత్తల ప్రవచనములను, అనుభవాలను, సంప్రదాయములను అనుసరించి అందుకు విరుద్ధమైనదంటూ ఏదీ లేకుండా ఈ శాస్త్ర పాఠ్యాంశమును తీర్చిదిద్దుతున్నాను. ఆత్మజ్ఞానం బోధించటమనేది కష్టతరమే అయినప్పటికీ ఈ ఆఖ్యాయికను మనోరంజకంగా ప్రతిపాదించటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ శాస్త్రమును చక్కగా విచారణ చేశారా... తప్పనిసరిగా మీరు 'ఆత్మబోధ’ ను పొందగలరు. ఇందులో అనుమానం లేదు. ఏ ఆత్మజ్ఞానమైతే శాస్త్రపాండిత్యము కూడా ప్రసాదించ జాలకున్నదో అట్టి ఆత్మ విద్య - బంగారుగని నుండి బంగారము లభించినట్లుగా - ఈ యోగ వాసిష్ఠ మహా గ్రంథమునందు లభించగలదు. శాస్త్రకర్తలో సంశయం ఉండనప్పుడే ఉత్తమ శాస్త్రం ఆవిర్భవిస్తుంది. యుక్తియుక్తము, స్వానుభవపూర్వకము అగు ఈ శాస్త్రం పాఠకులకు ఉపాయ పూర్వకంగా "ఆత్మానుభవం అనే మధుర పరిమళమును ప్రసాదించగలదు. ఈ సభకు వేంచేసి శ్రోతలై పాల్గొనుచున్న ఈ విశ్వామిత్ర - - నారదాది అనేక మంది మహనీయుల స్వయమాత్మానుభవం” ఈ మన సంవాదంలో ప్రకాశిస్తూ, వారి జ్ఞానదీపం ఇద్దానిని ఎంతగానో ప్రకాశింపజేస్తోంది సుమా!

ఎవరైనా అజ్ఞానము చేతనో, మాత్సర్యము చేతనో, మోహము చేతనో ఇందలి శాస్త్రార్థసారాన్ని తిరస్కరించ పూనుకొంటే, అట్టివారు విచారణహీనులగు ఆత్మహంతకులని మా అభిప్రాయం. వారితో మైత్రి కలిగి ఉండకపోవటమే మంచిదేమో! వారి శ్రేయోభిలాషులమగు మేము వారిని

Page:229

స్వాంతన - ప్రశాంతతలతో కూడిన సునిశిత చిత్తముతో ఇదంతా పరిశీలించి, అటుతరువాత స్వనిర్ణయం చేయవలసినదిగా మేము అభ్యర్థన చేస్తున్నాం.

రామచంద్రా! శ్రోతలగు ఈ సభికులు, నీవు, భావిపాఠకులు ఎటువంటి అధికార విశేషణాలు కలిగి ఉన్నారో, మీ బుద్ధులు ఎంతవరకు శ్రవణ - ధారణ - అభ్యాసములకు సమర్థమై ఉన్నాయో గ్రహించియే, నేను ఈ ఆత్మజ్ఞాన శాస్త్రమును ఆయా కథన చర్చలను ఏర్చి కూర్చి ఇక్కడ మీ ముందర వివిధ రీతులుగా ప్రతిపాదిస్తున్నాను. నేను ఆత్మ శాస్త్రమును ప్రబోధించటానికై నా తండ్రిగారైన బ్రహ్మదేవునిచే నియమించబడినవాడను. జనుల భాగ్యోదయం చేతనే ఆ సర్వాంతర్యామిచే ప్రేరితుడనై ఈ ఆత్మజ్ఞాన శాస్త్రమును ఈ అయోధ్యా సభామధ్యంలో బోధించటానికి ప్రవృత్తుడనవటం జరుగుతోంది. ఇక్కడి సభికుల - భవిష్యత్ పాఠకులపై గల అవ్యాజమైన ప్రేమయే నా ఈ ఆత్మజ్ఞాన శాస్త్ర విశేషాలు పలకటానికి నా పట్ల ప్రేరేపణ అయివున్నది. మోక్ష శాస్త్రం గ్రహించాలి. జీవిత పరమావధిని తెలుసుకోవాలి ... అని ఎవరెవరు ఆశ్రయిస్తారో... వారి పట్ల కరుణ దయాళుత్వం - ప్రేమ అనేది మా స్వభావం అయి ఉన్నది. లేక, మరొక విధంగా... మీ యొక్క శుద్ధము-సూక్ష్మము అగు ఆత్మయే మీ పుణ్యవశంచేత ఈ ప్రకారంగా ఈ మీ శ్రీ వసిష్ఠ రూపందాల్చి, మీతో మిత్రత్వం వహించి ఈ బోధకు కారణమగుచున్నదని కూడా గ్రహించి ఉండండి. అంతేగాని, వాస్తవానికి నేను ఒక మనిషినో, దేవతనో, గంధర్వుడనో, రాక్షసుడనో మరొక వ్యక్తియో కాదు.

ఓ సర్వజనులారా! నేను ఆత్మ స్వరూపుడను. నావలెనే మీరందరూ కూడా ఆత్మయే స్వరూపముగా కలిగివున్నవారే! మీ యొక్క నిర్మలమగు ఆత్మయే రూపముగా గల నేను మీ యొక్క పుణ్య విశేషం చేత ఈ అవతారమూర్తి రామచంద్రునితో సంవాద రూపంగా ఈ ఆత్మజ్ఞాన శాస్త్రాన్ని విడమర్చి విశదీకరించటం జరుగుతోంది. ఓ ప్రియ మమాత్మ స్వరూపులారా? మీయొక్క ఆత్మకంటే కించిత్ కూడా నేను వేరైనవాడిని కాదు.

మీ ఆత్మయే నేను. నా ఆత్మయే మీరంతా! కాబట్టి, అంధకారమయములగు ఆధి-వ్యాధులు, మరణ దినములు సమీపించక పూర్వమే నన్ను ఆప్తునిగా ఎఱిగినవారై నా ఈ వాక్యమును వినండి. సర్వ పదార్థముల పట్ల - దృశ్య వ్యవహారముల పట్ల వైరాగ్యం సంపాదిస్తూ ఆత్మ జ్ఞానమునకు అర్హులై అట్టి జ్ఞానం సముపార్జించండి.

4. నరక వ్యాధికి చికిత్స

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ సంసార జీవుని 'వస్తు దృష్టి' అనే ఒకానొక మానసిక వ్యాధి అనేక జన్మలుగా పట్టి పీడిస్తోంది.

ఇహైవ నరకవ్యాధేః చికిత్సాం న కరోతియః

గత్వా నిరౌషధం స్థానం స రుజః కిం కరిష్యతి ||

Page:230

ఎవడైతే "జగత్తుపట్ల భౌతిక దృష్టి" అనే మానసిక రుగ్మతారూపమైన నరకవ్యాధికి తగిన చికిత్సను ఇక్కడ, ఇప్పుడు ఆశ్రయించడో, అట్టివాడు 'జ్ఞానము' అనే పాఠ్యాంశ ఔషధం లభించని స్థానాలకు పోయి, నరక రోగ బాధితుడై ఇక ఏం చేద్దామనుకొంటున్నాడు?

శ్రీరాముడు : మమాత్మా! అట్టి భౌతిక దృష్టి అనే నరకమార్గ రుగ్మత జీవునకు తొలిగేది ఎట్లా? శ్రీ వసిష్ఠ మహర్షి : భౌతికమైన మనోదృష్టికి పదార్థముల పట్ల గల వాసనలే మూలం. ఎంతవరకైతే సర్వ పదార్థములపట్ల వైరాగ్యం పొందబడదో... అంతవరకు ఆయా పదార్థములకు సంబంధించిన వాసన అంతరంగంలో సన్నగిల్లదు. ఓ రామచంద్రా! ఆయా వస్తు సంబంధమైన వాసనలను సన్నగిల్ల చేయటం తప్పించి ఆత్మోద్ధరణకు వేరే ఉపాయమేదీ లేదు!

ఆసక్తియే అనర్థం - పదార్థములు సత్యమే అయితే వాటిపట్ల ఆసక్తి, వాసనలు యుక్తమే! కాని అవి కుందేటి కొమ్ములు’ వలె భ్రమచే దర్శించబడుచున్నాయి. ఇక వాటి పట్ల ఆసక్తి ఎందుకు? ప్రపంచంలోని పదార్థాలన్నీ కూడా పరమాణువుల సమాగమమే కాబట్టి వాటి యందు నిత్యమైన సత్యమంటూ ఏదీ లేదు. అయితే, విచారణ చేయని కారణంగా మాత్రమే అవి రమణీయంగా అనిపిస్తున్నాయి. విచారించి చూస్తే అవన్నీ కాలక్రమేణా మరొక రీతిగా ఉండబోవుచున్నాయి. కాబట్టి వర్తమానంలో కనిపించే రామణీయకత మనోభ్రమ మాత్రమే! అందుచేత ఇక్కడి సర్వ విశేషముల పట్ల "ఇతఃపూర్వం వీటి రూపు ఏమిటి? ఇక ముందు ఏమికానున్నాయి? ...అని పూర్వాపరములను విచారణ సల్పి వీటిలోని అనిత్యత్వం గమనించి ఉండటం మంచిది. విచారణ చేస్తే అప్పుడు రమణీయంగా భాసించేవన్నీ నీళ్ళలో ప్రతిబింబించే చందమామలాగా అసద్రూపములుగా తెలియవస్తాయి. ప్రామాణిక విచారణ చేయబడినప్పుడు ఏదైతే సత్వహాగా లేనిదే అని తెలియవచ్చుచున్నదో... అట్టి భ్రమాత్మక వస్తుజాలం - ఏ స్వరూపం గలిగి ఉన్నాయి? అవి ఏకవస్తు రూపములా? అనేక వస్తు రూపములా? - ఇటువంటి ప్రశ్నలు తమంతట తామే తోక ముడుస్తాయి. సృష్ట్యాదిలో 'జగత్తు' అనబడేది ఉదయించటానికి కారణమే ఉండజాలకున్నది. ఏదైతే జగత్తుగా భాసించుచున్నదో ... అది నిర్విషయమగు బ్రహ్మమే అయివున్నది.

ఈ కనబడే జగత్తు అనబడేది మనస్సుతో కూడిన ఇంద్రియములకు విషయము. ఇక బ్రహ్మమో సర్వేంద్రియములకు మనస్సుకు అతీతమైనది. ఆధారం అయినది.

తెలియబడే విషయాలన్నిటికీ కారణం మనస్సుతో కూడిన పంచేంద్రియములు కాజాలవు. ఎందుకంటే అవి స్వతఃగా చేతనములు కావు కదా! ఆత్మ నిర్వికారము, కాబట్టి ఈ విషయాదులకు కారణము కాదు. ఈ విధంగా ఈ జగత్తు అకారణము. ఇంద్రియములకు అతీతమైన చిన్మాత్రమగు బ్రహ్మమున ఇంద్రియములుగాని, ఇంద్రియ విషయములుగాని ఉండజాలవు.

చూచావా! రామచంద్రా! నామరూప సహితమగు ఈ అనుభవమగుచున్న జగత్తుకు కారణము నామరూప రహితమగు బ్రహ్మము కాజాలదు. ఎందుకంటే వస్తువునందు అవస్తుత్వము ఉండనట్లే, బ్రహ్మమునందు పదార్థములకు చోటులేదు. సాకారమగు ఒక మట్టి విత్తనము నుండి సాకారమగు

Page:231

మఱి వృక్షం బయల్వెడలవచ్చు. నిరాకారమగు బ్రహ్మము నుండి సాకారమగు వస్తుజాలం (జగత్ వ్యవహారం) ఎట్లా ఉద్భవిస్తుంది చెప్పు? సర్వోత్కృష్ట పదమగు బ్రహ్మమునందు కార్య - కారణ భావాదులు ఏమీ ఉండజాలవు. "కాదు. ఉన్నాయి? అని అనిపించటమనేది అభ్యాసవశం చేత బ్రహ్మము పట్ల ఏర్పడియున్న దోషదృష్టియేనని సిద్ధాంతీకరించబడుతోంది. అట్టిది కుందేటికి కొమ్ములు ఉన్నాయి. బంగారంలో ఆభరణత్వమున్నది. స్వప్నభవనానికి పునాదులు ఉన్నాయి... వంటి వాక్యముల వలె వాచాలత్వం వంటిదే! మూర్ఖ బుద్ధికి వారు, వీరు, నావారు, నీవారు, నాది, నీది, సంబంధాలు, బాంధవ్యాలు ఉన్నాయి అని అనిపించవచ్చు గాక! అయితే అవి ఎందుచేత లేవో సుస్పష్టమయ్యే ఉంటోంది.

నిరాకార బ్రహ్మము సాకార జగత్తుకు కారణం కాజాలదు. బ్రహ్మము తప్పితే జగత్తుకు మరింకే కారణం ఉండజాలదు. దృష్టాంతంగా... మట్టిలో తయారుచేయబడిన సైనికుని బొమ్మలో మట్టి సైనికుని ఆకారంలా అవటంలేదు. మట్టి సర్వదా మట్టిగానే ఉన్నది. సైనికునిగా కనిపించేదంతా మట్టే! మట్టిని సైనికునిగా చూచుచున్నది మనో అభ్యాసమే!

ఈ విధంగా సహకారి కారణం లేకుండా కారణము నుండి కార్యము ఎన్నటికీ కలుగజాలదు. బ్రహ్మము నుండి జగత్తు ఆవిర్భవించటానికి సహకారి కారణం లేదు. కనుక బ్రహ్మము బ్రహ్మముగానే ఉండి విజ్ఞత’ కొఱవడిన ద్రష్టలకు బ్రహ్మముగా కాకుండా... జగత్తు అనబడు అనేక వస్తు-వ్యక్తి -సంఘటన విశేషములతో కూడి ఉన్నట్లు కనిపించటం మాత్రం జరుగుతోంది. సూర్యరశ్మి యందు ఛాయ ఉండగలదా? అట్లాగే నిరాకార బ్రహ్మమునందు సాకార జగత్తు ఉండజాలదు. అందుచేత జగత్తుగా కనిపించే దానిని బ్రహ్మముగా దర్శించటం అభ్యసించటమే సముచితం. అదియే "బ్రహ్మీ దృష్టి. అదియే “ఆత్మజ్ఞానం”.

శ్రీరాముడు : స్వామీ! "ఈ జగత్తుకు కారణమే లేదు" అని అనే బదులు, "పరమాణువుల సమూహమే ఈ జగత్పదార్థములన్నీ, కాబట్టి, జగత్తుకు పరమాణువులు కారణం

అనుకోవచ్చును కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! పదార్థములన్నీ పరమాణువుల వివిధ సమావేశములే అయినప్పటికీ "ప్రియము, అప్రియము, మనది, వారిది, కోరదగినది, తొలగతగినది ... అనే హావభావాల కల్పనను సమకూర్చుకొని కదా, జనులు ఈ జగత్తును దర్శిస్తున్నారు! హావభావాలు లేకుండా 'జగత్తు' అనబడేది ఎవరూ పొందటం లేదు. అట్టి హావభావాలకు పరమాణువులు కారణమా? కాదు కదా! కాబట్టి "పరమాణువుల సమూహమే మాచే అనుభవించబడే జగత్తు ...అని ఎవరైనా అనుకుంటే పదార్థంలో గల రుచి - నాలుక యందు గల ఆ రుచిని ప్రియ - అప్రియములుగా నిర్ణయించి ఆస్వాదించే నాలుక”... అనునది సోదాహరణగా తీసుకుంటే పదార్థ పరమాణువుల - నాలుక పరమాణువులు ప్రియా ప్రియములకు సంబంధించిన సానుకూల్య - ప్రాతికూల్యాలు ఎట్లా ఒనగూడుతున్నాయి? ఈ శరీరముల ఉత్పత్తి, ఉనికి, ప్రవృద్ధి, శిథిలం,

Page:232

వినాశనాది - ధర్మాలకు కారణం కేవలం పరమాణువులే ఎట్లా కాగలుగుతాయి? కాబట్టి పరమాణువులే ఈ జగత్తుకు కారణం" - అనే మాట "కుందేటి కొమ్ములు ఎక్కుపెట్టిన విల్లువలె ఉంటాయి అనే వాక్యంలాగా అజ్ఞానముచే చెప్పబడేదే అవుతుంది.

పరమాణు సమూహశ్చేత్ సంభూయ కురుతే జగత్ | యదృచ్ఛయైవ తమసి శీర్యతే చ యదృచ్ఛయా ॥

పరమాణువులే గనుక, "తమకు ఇష్టం వచ్చినట్లుగా ఈ జగత్తును నిర్మిస్తున్నాయి అని,

అవి తమ ఇష్టం వచ్చినట్లే ఆకాశంలో నశిస్తున్నాయి అని అనదలచుకొంటే, అప్పుడు నీవు - నేను

- - వస్తుధర్మాలు మొదలైన వాటిని నిర్వచించటమెట్లా? ఒక వేళ ఈ జగత్తు యొక్క అవయవములైన పరమాణువులు ఆకాశంలో పడుతూ లేస్తూ సంచరిస్తున్నాయని అనదలిస్తే ప్రతిరోజు ఉదయం లేచి చూచేటప్పుడు ఇల్లు ఇల్లుగాను, దేశం దేశంగాను, పర్వత శిఖరం పర్వత శిఖరంగాను, దేహం దేహంగాను మాత్రమే ఎట్లా ఉంటున్నాయి?

పైగా పరమాణువుల అవయవాలు ఎవరికీ కనబడటంలేదు, కిటికీగుండా ప్రసరించే సూర్య కిరణాలలోని త్రసరేణువులు - వాటి యొక్క సమావేశ రూపమైన అవయవాలకు పోలిక ఎక్కడ?

అవయవ రూపమగు ఈ రూపముల సూక్ష్మరూపము నిరవయవమగు పరమాణు తత్త్వమే” అని అనుమానించబడుతోంది. నిరవయవమగు దాని ఇష్టంచే అవయవ రూపమగు వస్తుజాలం నిర్మించబడుతోంది అని అనటానికి కారణముగాని, వ్యవహార క్రమముగాని ఎవరికీ కనపించటం లేదు కదా! అది ఆకాశపుష్పం అనే శబ్దం వంటిది. శూన్యాకాశంలో పుష్పం ఎక్కడిది? అతీంద్రియా లగు పరమాణు సంయోగంచే జగద్రచన కావించబడటమనేది ఎవరి కర్మ? అట్టి కర్తృత్వము

సంసారిదా? అసంసారిదా?

సంసారియగు ఏ జీవుడో అది చేస్తున్నాడనటానికి అట్టి సామర్థ్యం ఏ ఒక్క జీవునికో లేదనటం సుస్పష్టమే కదా!... పోనీ 'అసంసారిది' అని అనుకుందామా? అప్పుడు అసంసారియగు పరమాత్మ జడపదార్థములను నిర్మించే మరొక జడపదార్థము వంటివాడే అగుచున్నాడు. ఈ సంసారి - అసంసారులలో అసంసారియగు పరమాత్మ నిత్యముక్తుడు కదా! అట్టి నిత్యముక్తునికి ఈ జగన్నిర్మాణం చేయటం వలన ప్రయోజనం ఏముంటుంది?

నిష్ప్రయోజన శీలుడగు పరమాత్మకు జగత్తును నిర్మించటంలో ప్రయోజనము లేదు. కనుక ఇట్టి కర్తృత్వము ఆయనకు ఆపాదించలేం. ఇక జడములగు పరమాణువులే స్వయంగా ఈ అనేక వస్తు ధర్మములతో కూడిన జగత్తును నిర్మిస్తున్నాయా? అది యుక్తియుక్తమెట్లా?

న అబుద్ధిపూర్వకం తత్కర్మ సంభవతి అంగకస్యచిత్ బుద్ధిపూర్వం తు యత్ వ్యర్థం కుర్యాత్ ఉన్మత్తకో హి కః ||

మనస్సుచే ఊహించటం కూడా కుదరనట్టి అచింత్యమైన - అత్యద్భుతమైన రచనలతో కూడిన

ఈ జగత్తు ఎవడో అబుద్ధిపూర్వకంగా రచించాడనటానికి వీలులేదు.

Page:233

ఇక బుద్ధిపూర్వకంగానే ఎవడో రచించాడందామా, అంతటి బుద్ధి గలవాడు వ్యర్థంగా - ఏ ప్రయోజనమూ ఉద్దేశించకుండా ఈ చిత్ర విచిత్ర జగత్తు రచించాడంటే, ఏ పిచ్చివాడు ఇంత చిత్ర విచిత్ర జగత్తును నిష్కారణంగా రచిస్తాడు?

శ్రీరాముడు : స్వామీ! ఈ జగత్తు తనంతటతానే 'ప్రకృతి సిద్ధంగా జనించినదని, దీనికి ఎవరూ కర్త కాదని కొందరు మీమాంసకులు (నాస్తిక మతస్థులు) అభిప్రాయపడుచున్నారు.

శ్రీవసిష్ఠ మహర్షి : జడమగు వాయువుకు తనకు తానే బుద్ధిపూర్వకంగా 'చేష్ట సంభవించదు కదా! వాయువుల చేష్ట లేకపోతే వాయు పరమాణువుల సంచయం జరుగదు. కాబట్టి పరమాణువులను దగ్గరగా ఉంచి, తద్వారా జగత్తును ప్రదర్శించబడటానికి కారణభూతమయ్యేది పరమాణువులు కాదు. ఈ విధంగా... జడములగు వాయువు పరమాణువులు మొదలైనవి జగత్తుకు కారణం కాదు. నిర్వికల్పుడు, అప్రమేయుడు, నిత్యముక్తుడు, ప్రాప్తాపాప్త ఉద్దేశములకు అతీతుడు - అగు పరమాత్మ జగత్తుకు కారణం కాదు. ఇక ప్రళయకాలంలో జీవసమూహమంతా దేహరహిత మైపోతోంది కాబట్టి సృష్ట్యాది యందు జగత్తుకు కర్తయే లేడని తెలియవస్తోంది.

ఈ విధంగా ఈ జగత్తుకు కర్తయే లేడు కాబట్టి ఈ జగత్తు సృష్టించబడనిదే అగుచున్నది. అనగా 'జగత్తు' అనబడేది ఏ ఒక్క సమయమునందు సృష్టించబడలేదని గ్రహించబడుగాక! శ్రీరాముడు : హే మహర్షీ! ఈ జగత్తుకు కర్తయే లేడు. కనుక జగత్తు అనునది ఉత్పన్నమే అయివుండలేదు” అనేదే మనం గమనించవలసియున్నప్పుడు... ఇక, సప్తర్షి మండలములో సప్తర్షులలో ఒకరుగా విరాజిల్లే మీరెవరు? అయోధ్యా నగర చక్రవర్తి కుమారుడనగు నేనెవడను? ఈ నా సోదరులెవరు? మనమంతా ఎవరిమైయున్నాము? మనమంతా ఈ జగత్తులో ఉన్నామా? లేమా? లేని జగత్తులో ఉన్న మనమంతా ఎవరం?

5. మనమంతా చిదాకాశ స్వరూపులమే!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు - నేను - తదితరులు - మనమంతా కూడా చిదాకాశ స్వరూపులమే! ఎఱుకయే మన రూపం. ఇక చిదాకాశ రూపులమగు మనం ఈ పాంచభౌతిక జగత్తులో ఉండటమంటావా? నీ స్వప్నంలో కనిపించే మనుష్యులు, ఇళ్ళు, కొండలు ఆ స్వప్నచిత్ యొక్క రూపములే అయినట్లు మనమందరమూ చిదాకాశము యొక్క స్వరూపులమే అయివున్నాం. తస్మాత్ న జాయతే కించిత్ విశ్వం నాపి చ విద్యతే |

ఇత్థం చిన్నభేవాచ్ఛం ప్రకచ్ఛతి ఆత్మనాత్మని II

కనుక ఓ రాఘవా! ఈ ప్రపంచమేదీ ఉత్పన్నం అవటంలేదు. విద్యమానమై (తెలియబడుచున్నదై) ఉండుటయులేదు. మరి? నిర్మల చిదాకాశమే ఈ సమస్త రూపముగా తనయందు తానే స్ఫురించుచున్నది.

Page:234

దృష్టాంతం... స్వపద్రష్ట యొక్క చిత్-రూపమే స్వప్న విశేషములుగా స్వప్న ద్రష్టకు అగుపించునట్లు! వాయువులో స్పందం (చలనం) అభిన్నంగా ఉన్నట్లు ...జలంలో ద్రవత్వం, అభిన్నంగా ఉన్నట్లు ... ఆకాశంలో శూన్యత్వం అభిన్నంగా ఉన్నట్లు చిదాకాశమున

జగదాకాశం, నీయందు నీకు దర్శనమయ్యే జగత్ దృశ్యం" - ఉభయమూ చిదాకాశమునకు అభిన్నరూపంగా మహా విశ్రాంతితో ఉన్నది.

శ్రీరాముడు : మహాత్మా! మనమంతా చిదాకాశరూపులమే - - అనునది ఆత్యంతిక పరమ సత్యం గాను, యుక్తియుక్తంగాను ఉన్నది. అయితే, మనందరి వాస్తవ స్వరూపం అయిన చిదాకాశము” యొక్క స్వరూపం ఎట్టిది?

శ్రీ వసిష్ఠ మహర్షి : చిదాకాశం 'అనుభవం' అనే దానికి మునుముందే, అద్దానికి ఉత్పత్తి స్థానమై ఉన్నది. ఈ జీవుల జాగ్రత్ - స్వప్న - సుషుప్తుల అనుభవమంతా జలంలోని తరంగంలాగా అద్దానియొక్క చమత్కార రూపమే. ఆకారంలేని జలానికి తరంగాకారం అగుపిస్తున్నట్లు, అనుభవానికి ఆవల నిరవయవి - నిరనుభవశీలియగు చిదాకాశమే అనుభవ రూపానికి అకారణంగా కారణం అగుచున్నది. ఇక అద్దాని స్వరూపమంటావా?

దేశాత్ దేశాంతర ప్రాప్తో నిమేషేణ అతిదూరతః

సంవిదో యత్ వపుర్ మధ్యే చిత్త్వ్యోమ్నో విధి తత్ వపుః II

ఓ రామచంద్రా! ఒక ప్రదేశంలో నిలబడి ఉండగా దూరంగా ఉన్న మరొక ప్రదేశం వైపుగా మన దృష్టి క్షణకాలంలో వెళ్ళుచున్నదనుకో... ఆ రెండు ప్రదేశాల మధ్య ఉన్నట్టి నిర్విషయ సంవిత్ జ్ఞాన స్వరూపమేది కలదో ... అదియే చిదాకాశము యొక్క స్వరూపమని గ్రహించు.

నిర్విషయ సంవిత్

ఒక శుద్ధజ్ఞానం మరొక

విషయం చిదాకాశం విషయం

క్షణకాలంలో మరుక్షణం మరొక

ఆ విషయాన్ని దృక్ - స్వస్వరూపం విషయాన్ని త్యజించిన దృష్టి ఆశ్రయించబోయే దృష్టి

అట్టి నిర్విషయ సంవిజ్ఞాన రూపమగు చిదాకాశమే సమస్త పదార్థముల యొక్క పరమార్థ స్వరూపమై ఉన్నదని గ్రహించు. కాబట్టి, జగత్తు యొక్క పరమార్థ రూపం చిదాకాశమే!

ఈ జగత్తు చిదాకాశ రూపమే గాని శూన్యాకాశరూపం కాదు. ఆ చిదాకాశము యొక్క తనకంటే ఏమాత్రం భిన్నంకానట్టి (తనకు అన్యము, అద్వితీయం అయిన) కించిత్ భావనా స్రవంతి

Page:235

యొక్క శీఘ్ర పరివర్తనా రూపమే ఈ జగత్తు యొక్క రూపం. అనగా, చిదాకాశ రూపుడవగు నీ యొక్క అభిన్న భావనా సంబంధిత వివర్తరూపమే నీకు అనుభవమయ్యే ఈ జగత్తు సుమా! ఏ జీవుడు ఏ జగత్తులను అనుభవిస్తున్నాడో అదంతా కూడా ఆతని చిదాకాశరూపపు అభిన్న భావనా స్రవంతి యొక్క వివర్తరూపమే ఈ భౌతిక జగత్ ప్రాప్తి రూపంగా వివర్తం పొందుతోంది. అట్టి వివర్తత్వమనేది కూడా త్రాడును చూచి 'పాము' అనుకొని భ్రాంతి పొందటం వంటిది (సర్ప -రజ్జు భ్రాంతి). వాస్తవానికి చిదాకాశం యథాతథమేగాని, 'జీవుడు' గా వివర్తం పొందుటయే లేదు.

ఈ విధంగా వాయువు, అద్దాని స్పందముల వలె - జగత్తుకు, చిదాకాశమునకు భేదమనేది ఎన్నడూ లేదు. అట్టి చిదాకాశము రెండు విషయముల మధ్యగల దృష్టి యొక్క నిజస్వరూపమై ఉన్నది. నిర్విషయమగు "ఆ చిత్ స్వరూపమే సర్వ భూతముల యొక్క స్వభావరూపం” అని

గ్రహించి జ్ఞానులు సర్వత్రా ఆ నిర్విషయ జ్ఞాన స్వరూపాన్నే దర్శిస్తూ ఉంటారు. హరి హరుడు వంటి మహనీయులకు కూడా! అట్టి నిర్విషయ చిదాకాశమే నిత్య ధ్యానరూపమై ఉండగా, అద్దాని నుంచి వారు చలించటంలేదు.

ఈ కనబడే ప్రపంచమంతా కూడా చైతన్యం యొక్క అభాసరూపాకాశమే అయివున్నది. ఈ ప్రపంచం ప్రకాశించటం అనేది చిత్ యొక్క ప్రభావం మాత్రమే! కాబట్టి ఈ జగత్తు చిత్స్వభావముచే వాస్తవానికి ఆకార రహితము, అవ్యయము అని కూడా చెప్పవచ్చు. పరమార్థంగా చూస్తే ఈ జగత్తు అనేది ఎన్నడూ ఉద్భవించనూ లేదు. ఇప్పటికీ లేదు. ఇక ముందు ఉద్భవించబోదు. ఆకాశము కంటే శూన్యత్వం వేఱుకానట్లు, - ఈ జగత్తు చిదాకాశము కంటే వేరైనది కాదు.

ఏ ప్రపంచమైతే (ప్ర+పంచము = పంచభూతముల గొప్ప కలయికచే కనిపించేది) అజ్ఞాన దృష్టికి అత్యంత ఘనీభూతమై అనుభవసిద్ధమై ఉంటోందో ... అట్టి ఈ దృశ్య ప్రపంచము ఇతః పూర్వం ఉండివుండలేదు... ఇప్పుడు ఉండుటయు లేదు, ఇకముందు ఉండనూబోదు. శాంతరూఎ *మైనట్టి చిదాకాశమే తనయందు ఇట్లు జగత్తు రూపంగా ప్రసిద్ధమై బుద్ధికి మాత్రమే భాసిస్తోంది. స్వప్నంలో చిన్మాత్రమే జాగ్రత్లో చిన్మాత్రమే స్వయముగా జగత్ చైతన్యంగా స్ఫురిస్తోంది.

ఎందుకంటావా?... స్పష్ట్యాదిలో సృష్టియేలేదు కదా! అనగా పంచభూతాలు లేనప్పుడు సమస్త పదార్థముల యొక్క ఆయా భావనలే లేవు కదా! పదార్థ భావనయే లేనప్పుడు ఇక ఈ దేహం ఎక్కడున్నది? లేదు కదా!

శ్రీరాముడు : ఈ దేహాల సంరంభమంతా ఎక్కడి నుండి వచ్చి ఆత్మ సమక్షంలో ప్రదర్శితమౌతున్నది? శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ శరీరములుగా భాసించేదంతా చిదాకాశము యొక్క జగత్ స్వప్న భ్రమ చమత్కారమే! స్వస్వరూప చైతన్యము యొక్క స్వయంకల్పనా చమత్కారమే!

మహాచైతన్యము యొక్క మొట్టమొదటి స్వప్నము 'సృష్టికర్త' అని చెప్పబడే బ్రహ్మదేవుని శరీరం. ఇక మనమంటావా? ఆ బ్రహ్మదేవుని మనో శరీరం నుండి ఆవిర్భవించిన వారం. అనగా ఆయన ప్రథమ స్వప్నంలోని అంతర్గత స్వప్న - స్వప్నాంతరములే మన ఈ శరీరాలు.

Page:236

శ్రీరాముడు : స్వామీ! మీరంటున్నట్లు మనమంతా బ్రహ్మము యొక్క స్వప్నాంతర్గత పాత్రధారులం అయినప్పుడు బ్రహ్మముతో మనకున్న సంబంధ - అనుబంధాలు ప్రతిదినము అనుభూతంకావాలి కదా? మరి అట్లా మనకు అనిపించటం లేదు కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి :

గండస్య ఉపరిజాతానాం స్ఫోటానామత ఏవ సః పరమేణ ప్రయత్నేన న మనో నామ యాస్యతి ||

కంఠంపై లేచిన కురుపు కంఠంతోబాటుగా కనిపిస్తున్నప్పటికీ కంఠంతో సాక్షాత్ సంబంధం లేదుకదా! అనగా, కురుపు కంఠంయొక్క విభాగం కాదు కదా! లేక కురుపు కంఠం వంటిది కాదు కదా! అట్లాగే మనమంతా బ్రహ్మము యొక్క స్వపాంతర్గత రూపులం అయివున్నప్పటికీ బ్రహ్మముతో అనుభూతపూర్వక సంబంధం లేకుండా ఉండటం జరుగుతోంది. భ్రాంతి యొక్క దార్ద్యం చేత ఈ మన మనస్సు ప్రయత్నించినప్పటికీ ఆత్మ యందు ప్రవేశించలేకపోతోంది. స్వప్నంలోని వస్తువులు జీవులు స్వప్న దృష్టి యొక్క కల్పనయే అయినప్పటికీ స్వప్న ద్రష్ట స్వరూపంతో (స్వప్నం కొనసాగుచున్నంతవరకూ) ఏకత్వం పొందకయే ఉంటోంది కదా! స్వప్నం కంటున్నవాడు, ఈ స్వప్నానికి వేరైన స్వప్న ద్రష్ట స్వరూపుడను" అని గుర్తుంచుకుంటున్నాడా? లేదు. స్వప్నంలో తనూ ఒకరైనట్లు, తదితర స్వప్నాంతర్గత జనులు వేరు వేరైనట్లు ఆస్వాదిస్తున్నాడా, అయితే స్వప్నాంతర్గత విషయాలు వాస్తవమా? కాదు. కానీ భ్రమచే స్వప్న ద్రష్టకంటే స్వప్నములో వివిధ రూపములుగా కనిపించుచున్నట్లు బ్రహ్మమే హిరణ్యగర్భుడు (సమష్టి సంకల్పము) - వ్యష్టి జీవుడు మొదలైన రూపాలుగా అసత్య - కల్పితమాత్ర రూపమున అగుపిస్తోంది. బ్రహ్మము హిరణ్యగర్భుని రూపం ఆశ్రయించిన మరుక్షణం బ్రహ్మమే మిథ్యారూపమగు ఈ జగత్తుగా కనిపిస్తున్నదై ఉంటోంది.

ఆబ్రహ్మ స్తంభ పర్యంతం అలీకం జాయతే జగత్

యథాస్వప్నే తథా అలీకమేవమాశు వినశ్యతి ||

స్వప్నంలో ఏ విధంగా అనేకమంది జనం కనిపించి మరల ఇంతలోనే మటుమాయ మగుచున్నారో... బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక గడ్డిపరక వరకు ఈ జగత్ దృశ్యములు మిథ్యగా ఉత్పన్నమై మిథ్యగానే నశిస్తున్నాయి. అట్టి వినాశనము కూడా మిథ్యయేనని గ్రహించు. స్వప్నంలో చిదాకాశమే స్వప్న జగత్తు రూపంగా ధరించి అగుపిస్తోంది. అట్లాగే చిదాకాశమే జన్మాది వ్యవహార రహితమై ఉండికూడా, జగద్రూపంగా అనిపిస్తోంది.

స్వప్నద్రష్ట నిదురలేవగానే స్వప్నం నశిస్తోంది. జగత్తుగా అనుభవించేదంతా జ్ఞాన ప్రాప్తిచే రహితత్వము సంతరించుకుంటోంది.

ఈ జగత్తు అనుభూతం అవవచ్చుగాక! సత్యం వలె అనిపించవచ్చుగాక ! వాస్తవానికి ఇది మిథ్యయే! చైతన్యం తాను నిరాకారమై ఉండి స్వప్నంలో సాకారమగు స్వప్న జగత్తుగా స్థితి నొంది ఉన్నది. ఒక అణువు మేరుపర్వతం కంటే ఎట్లా అతి సూక్ష్మమో, ఈ భౌతికాకాశం కంటే చిదాకాశం

Page:237

అంతకంటే వేలాదిరెట్లు సూక్ష్మం. అయితే చిదాకాశం ఈ భౌతికాకాశం వంటిదే కాదు. అది జగత్తు వంటి స్థూలాకారం కాదు ...అని చెప్పటానికి మాత్రమే ఇక్కడ ఆకాశాన్ని ఉపమానంగా తీసుకున్నాం.

శ్రీరాముడు : ఈ జగత్తు ఎప్పుడు ఎందుకు చిదాకాశంలో ఉత్పన్నమౌతుంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : సృష్ట్యాదియందు జగత్తులేదు. చిదాకాశమే ఉన్నది. ఇక ఇప్పుడో... ఇప్పుడు కూడా (చిదాకాశం సర్వదా యథాతథం కాబట్టి) చిదాకాశంలో జగత్తు జనించటానికి కారణమూ లేదు. కారణం లేదు కాబట్టి జగత్తూ లేదు. స్వప్నంలో కనబడిన నగరానికి ఉత్పత్తి ఏముంది? వినాశనం ఏమున్నది? స్వప్నంలో కనబడే స్వప్న నగరం వంటిదే ఈ జాగ్రత్ నగరం కూడా! మాకు ఈ జాగ్రత్క, స్వప్నమునకు, దృశ్యమానమై కనిపిస్తున్న ఈ అయోధ్యా నగరానికి తేడా ఏమీ కనిపించటం లేదు.

మరొక విషయం... వాయువు - - అద్దాని స్పందనము, అగ్ని - అద్దాని ఉష్ణము, ఆకాశము - అద్దాని శూన్యత్వము, చైత్యము - అద్దాని జాగ్రత్ స్వప్న నగరం ... ఇవన్నీ ఒక్కటే. చిదాకాశము, జగత్ చిదాకాశము ఒక్కటే ! ఎందుచేతనంటే చిదాకాశమే ఇట్లు జగత్తుగా కనిపిస్తోంది. చిన్మాత్ర సూర్యుని ప్రకాశ విశేషమే ఈ జగత్తు.

"బంగారపు ఆభరణం" అనుదానిలో ఏది ఆభరణమో అది బంగారము, ఏది బంగారమో అదియే ఆభరణం కూడా కదా! "వాయు స్పందము అనుదానిలో ఏది స్పందమో, అదియే వాయువు. ఏది వాయువో అదే స్పందము కదా!

అట్లాగే... “చిదాకాశ జగత్తు అనుదానిలో ఏది జగత్తో అది చిదాకాశమే! ఏది చిదాకాశమో అదియే జగత్తు కూడా!

అనగా... చిదాకాశమే ఇట్లు 'జగత్' అను ఆకృతిగా కనిపిస్తోంది. ఇదంతా కూడా - -

ఉదయ, అస్తమయములు లేనట్టిది, అఖండ ప్రకాశరూపము, నిర్మలము, శిలవలె మౌన స్వరూపము, నిర్వికారము, శాంతము " - అగు బ్రహ్మమే గాని మరింకొకటేదీ కాదు. అంతయు బ్రహ్మమే అయివుండగా... ఇక పదార్థములెచట? భావ - అభావములకు సంబంధించిన బుద్ధి ఎచట? ఏకత్వమెచట? మనమెచట? మనయొక్క పదార్థభావన ఎచట?

ఓ రామచంద్రా! నీవు నిర్వికారమగు ఆత్మజ్ఞానముచే 'అంతయు ఆత్మయే’ అను ఏకత్వం వహించి ఉండు. నిత్యోదిత రూపుడవై ఉండెదవుగాక! ఈ భౌతిక దేహంతో వ్యవహరిస్తూ కూడా, తత్ సంబంధమైన వ్యవహారములతో తాదాత్మ్యము చెందవలసిన పనేమున్నది? సర్వదా అంతః కరణమున పరమ ప్రశాంతశీలుడవై, నిర్వాణరూపుడవై, నిరతిశయానంద రూపముతో ఈ జగత్తునందు సంచరించు. ఏ ఏ పదార్థముల వలన విక్షేపములు కలుగుచున్నట్లు అనిపిస్తోందో, ...అట్టి వాటి గురించి అవి వాస్తవానికి లేవు" అని గ్రహించివుండు.

Page:238

6. ప్రతి జీవుడు మోక్ష స్వరూపుడే!

శ్రీరాముడు : హే మహాత్మా! నిరాకారము - నిరంజనము అగు బ్రహ్మము నుండి ఈ ఈ సాకారమగు జగత్తు ఎట్లా ఉద్భవించి పరిఢవిల్లుతోంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : 'జగత్తు' అని చెప్పబడుచున్న నామరూపాత్మకమగు వ్యవహారమంతా వాస్తవానికి ఏ విధంగా స్వప్నతుల్యము - భ్రమాత్మకము అయి ఉన్నదో వివరిస్తాను విను.

ఈ ప్రపంచాన్ని మొత్తం 5 విషయములుగా విభజించవచ్చు- 1. శబ్దము, 2. స్వర్మ, 3.రూపము, 4.రసము, 5. గంధము. ప్రపంచంలో గల ఈ ఐదు విషయముల అనుభవం పొందటానికి తయారు చేయబడిన వివిధ విభాగ - ఉపవిభాగములు కలిగియున్న యంత్రము వంటిదే ఈ శరీరం. ఏ శరీరముననైనా జాగ్రత్ - స్వప్నములలో అనుభవమయ్యేది ఈ ఐదే! ఈ 5 విషయములనే 5 తన్మాత్రలు అంటారు.

ఆకాశః శబ్దతన్మాత్రం - ఆకాశము "శబ్దతన్మాత్ర అయివున్నది. ఆకాశానికి రూపాదులు లేవు. శబ్దతన్మాత్ర యొక్క ప్రాపంచక రూపం ఆకాశం. ఆకాశాత్ వాయుః - ఆకాశము నుండి వాయువు జనిస్తోంది.

స్పర్శ తన్మాత్రకో అనిలః - వాయువు "స్పర్శతన్మాత్ర" అయివున్నది. వాయువు స్పర్శచే గ్రహించబడుతోంది. స్పర్శజ్ఞానం వాయువుచే జనించబడుతోంది.

తత్సంగో ఉత్కర్షజం తేజః - ఆకాశ - వాయువుల సంగమము (సంఘర్షణ) చే రూపతన్మాత్ర అయినట్టి తేజము (అగ్ని) ఉదయిస్తోంది.

తచ్ఛ అనిశ్చేత్య అపాం స్థితిః - తేజస్సునందలి ఉష్ణత్వము శాంతించుటచే రసతన్మాత్ర” అగు జలము రూపుదిద్దుకుంటోంది.

ఏష సంఘః భూ - - శబ్ద, స్పర్శ, రూప, రసముల కలయిక చేతనూ, ఉష్ణత్వము మరి కొంత శాంతించుట చేతను భూమి జనిస్తోంది.

ఈ విధంగా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రల చమత్కారమైనట్టి ఆకాశ, వాయు, తేజస్సు, జలము, భూమి (పంచభూతాల) వీటి - రకరకాల కలయికయే ఈ కనబడే జగత్ వస్తుజాలమంతా! మనకు కనబడే ప్రతి వస్తువు వర్తమానరూపముగా కాలక్రమేణా ఉండదు. ప్రవహించే జలం యొక్క ఆకారంలా ఈ జగత్తులో వస్తువు ఇతఃపూర్వం ఒక రకంగా, ఇప్పుడు ఈ రకంగా, ఇకముందు ఇంకొక రకంగా ఉంటున్నాయి. ఈ వస్తు సమూహమంతా నిరాకారమగు ఆకాశంలోనే జనిస్తున్నాయని మనకు సుస్పష్టమౌతుంది. కాబట్టి ఆ కనబడేది స్వప్నతుల్యమేనని చెప్పబడుతోంది.

అయితే ఇక్కడ, నిరాకారమగు ఆకాశం నుండి సాకారమగు తక్కిన భూతములు ఎట్లా జనిస్తున్నాయి?" - అనే ప్రశ్న మన ముందు ఉదయిస్తోంది.

Page:239

నిష్క్రియమగు ఆకాశం నుండి - చలన రూపమగు వాయువు; రూపరహితమగు వాయువు

నుండి - రూపయుక్తమగు తేజము (అగ్ని); రసవర్జితమైన తేజము నుండి - గంధ సహితమగు పృథివి... ఈ విధంగా ఐదు అనుభవములు ఏర్పడుచున్నాయి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన ప్రశ్న. అనుభవము అనేది ఎక్కడి నుండి ఏర్పడుతోంది?

ఒకానొక సిద్ధాంతము యొక్క ఉద్దేశమును అనుసరించి "ఇతఃపూర్వపు జ్ఞప్తి నుండి ఇప్పటి అనుభవము, ఇప్పటి అనుభవము నుండి ముందు ముందు జ్ఞప్తి ఏర్పడుతోంది" అని సిద్ధాంతీకరించబడుచున్నది. అయితే, ఇంతా అయిన తరువాత ఈ సిద్ధాంతం ప్రకారం మనం ‘జ్ఞప్తి’ అను దానిపై ఆధారపడవలసి వస్తోంది. సరే ఈ 'జ్ఞప్తి ని కొంతసేపు ఒప్పుకొంటే, జ్ఞప్తి నుండే జాగ్రత్ స్వప్నములు అనుభవమౌతున్నాయి కదా! మరి జ్ఞప్తి ఎక్కడి నుండి జనిస్తోంది?

జ్ఞాపము” అనేది ఉదయించేది జ్ఞాపకం కలవాని నుండే కదా! ఆ జ్ఞాపకం ఎవరిదై ఉన్నదో, ఆతడే / అదే బ్రహ్మం. బ్రహ్మమే స్వరూపంగా గల స్వస్వరూపం నుండే (స్వప్న ద్రష్ట నుండి స్వప్న వస్తుజాలం వలె) ఈ సర్వజగత్ రూపం వివర్తభావనచే ధరించబడుతోంది. కనుక "బ్రహ్మమే సర్వ పదార్థ స్వరూపము అయి ఉన్నది" - అనే సిద్ధాంతం అంగీకరించటంలో లోటేమున్నది?

జ్ఞప్తిరేవ అతివిమలా స్వరూపాత్మని భాతి యత్ తదేవ జగత్' ఇత్యుక్తం సత్యమిత్యేవ సత్యతః ॥

అతినిర్మలమగు 'జ్ఞప్తి' తన స్వరూపమున భాసిస్తోంది. ఆ జ్ఞప్తి అనే చైతన్యమే జగత్తుగా భాసిస్తోంది అని వేదములు సుస్పష్టపరుస్తున్నాయి. స్వస్వరూపమున భాసించే జ్ఞప్తి చైతన్యమే ఈ జగత్తుయొక్క అసలైన రూపం - అనే వేదవాక్కు పరమసత్యమై ఉన్నది కనుక ...

న క్వచిత్ సన్తి భూతాని పంచ కుట్యాదయో న వా

అసన్తి అపి అనుభూతాని, నను స్వప్నదశాస్వివ

ఈ పంచ భూతములు ఎక్కడా లేవు. అయితే అసత్యములే అయినప్పటికీ అనుభూతం అవుతున్నాయి. ఉదాహరణకు స్థూలంగా ఆకారంతో కనిపించే మంచుగడ్డ ఉష్ణ ప్రభావం చేత కరిగి ఆకారం కోల్పోతోంది. మరల ఆ నీటి ఆవిరే మంచుగడ్డగా కూడా అగుచున్నది. ఏ రూపం అద్దానికి సత్యం? అనుభవమే అన్నిటికీ మూలం. ఈ విధంగా స్వప్నంలో లాగానే ఈ జాగ్రత్లో కూడా అసత్యములైన పంచభూతములు సత్యమువలె అనుభూతమగుచున్నాయి.

ఒక సిద్ధాంత వాక్యం విను. నేను చిదాకాశ స్వరూపుడనే! (చేతనాకాశ ఏవా. హమ్). అట్టి చిదాకాశమే ఈ జగద్రూపంగా స్థితినొంది ఉన్నది! (తదేవ ఇదం జగత్ స్థితమ్). కాబట్టి నేను, ఈ జగత్తు ఒక్కటే ! నేను, ఈ జగత్తు కూడా ఏకమైనట్టి, విజ్ఞాన ఘనమైనట్టి చిదాకాశమే అయివున్నాం.

ఇక్కడి నేను, నీవు, జన్మ, మృత్యువు, సృష్టి, స్థితి, ప్రళయము, వివర్తము, అనువర్తము, లోకములు, లోకాంతరములు, గతి ... ఇవన్నీ కూడా నికారామగు చిదాకాశమే అయివున్నాయి.

ఓ రామచంద్రా! ఆత్మయొక్క స్వభావం ఎఱుగబడిందా,.... ఇక దేహము ఉండటం - ఉండకపోవడం ఒక విషయమే కాదు. తద్వారా ఈ పంచభూతముల కలయికతో కూడిన జగత్తు

Page:240

కూడా నిర్విషయమై కన్పట్టుచున్నది. అప్పుడు ఏర్పడి ఉండే దుఃఖరహితము - అక్షయము అగు భూమానంద స్వరూప స్థితినే 'మోక్షము' అని పిలుస్తున్నారు. ప్రతి జీవుడు అట్టి భూమానంద మోక్ష స్వరూపుడేనని గుర్తు చేయడానికే శాస్త్రములు ఎలుగెత్తి గానం చేస్తూ ఉద్బోధిస్తున్నాయి. అట్టి స్థితి ఈ దేహం ఉన్నప్పుడు ప్రాప్తించినా, లేక దేహం లేనప్పుడు ప్రాప్తించినా ఒక్కటే!

అట్టి నిర్మలమగు మోక్ష స్వరూపమునందు మాత్రమే ఈ జీవునకు విశ్రాంతి లభిస్తోంది.

7. జాగ్రత్ - స్వపముల సారూప్యం

శ్రీరాముడు : మహర్షీ! ఈ జగత్తు కల్పితమాత్రమే గాని వాస్తవం కాదు అని స్వప్నమును దృష్టాంతంగా తీసుకొని మీరు అనేక సందర్భాలలో ప్రవచిస్తూ వస్తున్నారు. అయితే ఘనీభూతమై ఎదురుగా కనిపిస్తున్న జగత్తు స్వప్నతుల్యము మాత్రమేనని గ్రహించటం కుదిరేదెట్లా? స్వప్నమేమో ఊహ, భ్రమల విన్యాసం. మరి ఈ జాగ్రత్ జగత్తేమో పాంచభౌతిక ఘనీభూతరూపంగా రోజు తరువాత రోజుగా ప్రాప్తిస్తోందాయె!

శ్రీ వసిష్ఠ మహర్షి : స్వప్న-జాగ్రత్ల స్వభావమేమిటో కొంచెం ఇక్కడ విచారిద్దాం.

జాగ్రత్ : జాగ్రత్ ద్రష్ట తన స్వభావాన్నే (స్వప్నంలో లాగానే) జగదాకారంగా

పొందుచున్నాడు. ఈ జాగ్రత్... ప్రపంచం దృష్ట్యా సర్వదా జీవునకు ఉండియే ఉంటోంది. సుషుప్తి ఎంతటి అజ్ఞాన సమన్వితమో, అది (ఆత్మజ్ఞాన రహితులకు) అంతటి అజ్ఞాన సమన్వితము. శిలవలె, ఘనీభూతమైన చిదాకాశము వలె ఇది ఘనీభూతమై ప్రాప్తిస్తోంది. దృశ్యమును పరిశీలనగా చూస్తే అది శూన్యాకాశము వంటిదే!

ఈ జగత్తు నిజదృష్టిని బట్టి అనుభవమునకు విషయమై చెన్నొందుతోంది. దృష్టి స్వకీయమైన కల్పన నుండి బయల్వెడలుతోంది.

ఆ స్వకీయకల్పన నిజ జాగ్రత్ దృష్టి జాగ్రత్ జగదనుభవం

స్వయకల్పన నిజస్వప్న దృష్టి స్వప్త జగదనుభవం

స్వప్నంలో కనిపించే నగరం ఎక్కడి నుండి వచ్చింది? ఎట్లా అనుభవమౌతోంది?... వాస్తవా నికి స్వప్నంలో నగరం వంటిది ఏదీ లేదు. ఎవరూ అక్కడ నిర్మించనూ లేదు. మరి? స్వప్నద్రష్ట స్వరూపమగు సత్చిత్ ఆత్మ యొక్క ప్రకాశమే స్వప్నంలో స్వప్న నగరంగా భాసిస్తోంది. ఏ విధంగా ద్రష్టయొక్క స్వప్నచిత్ స్వరూపం స్వప్నంలో స్వర్గ-మర్త్య-పాతాళ లోకాలు (స్వప్నంగా) భాసిస్తు న్నాయో, అదే రీతిగా జాగ్రత్ నందు కూడా సత్చిత్ ఆత్మ యొక్క జ్ఞాన ప్రకాశమే జాగ్రత్ స్వర్గ -మర్త్య-పాతాళ లోకములతో కూడిన జగత్తుగా భాసిస్తోందని విజ్ఞులు సుస్పష్టంగా గమనిస్తున్నారు. కనుక జాగ్రత్ - స్వప్నములకు భేదమేమీ లేదు.

Page:241

ఇంకొక అతి ముఖ్య విషయం...! వాస్తవానికి 'జగత్తు' అనబడే శబ్దముగాని, అర్థముగాని అటు స్వప్నంలోగాని, ఇటు జాగ్రత్లో గాని ఏమీ సంభవించటమే లేదు. బ్రహ్మదేవుడు 'నిర్మలచిత్ స్వరూపుడు’ అయి ఉండి కూడా... అజ్ఞాన కృతమగు ఆకాశమున, తన యొక్క చిత్ ప్రకాశ రూపముచే... ఈ పర్వతము, భూమి మొదలైన రూపములను ధరిస్తున్నాడు.

కాబట్టి ఓ మిత్రులారా! స్వచమత్కారము అయినట్టి అజ్ఞానమే జాగ్రత్ - స్వప్నములలోని జగత్తుగా ప్రాప్తించుచున్నదని మీరు గ్రహించండి. గమనించండి!

జగత్ న కించిదేవేదమ్ చిద్రూపం చ న కించన

ఏతే కించిత్ ఇవాభాతో నభశ్చిజ్జగతీ ముధా ॥

ఈ జగత్తుగాని, అట్టి ఈ జగత్తును ఎఱుగుచున్న చిద్రూపంగాని (వ్యష్టిచిత్ గాని) ఒకింత కూడా లేవు. అవి రెండూ అత్యంత శూన్యరూపములే అయి ఉండి కూడా... ఈ విధంగా బ్రహ్మము నందు అవి రెండు (జగత్తు - చిద్రూపం దృశ్యము - ద్రష్ట ) మిథ్యగానే భాసిస్తున్నాయి.

స్వప్నమంతా 'అసత్తే' అయినప్పటికీ స్వప్నంలో దృశ్యాలు భాసిస్తున్నాయి కదా! అట్లాగే జాగ్రత్ అసత్తే అయినప్పటికీ జాగ్రత్ నందు ఈ దృశ్యము భాసిస్తూ భావనా సమన్వితమై పొందబడు తోంది. వివిధ రచనలతో కూడి శోభించే స్వప్నంలో అక్రియలే క్రియలుగాను, అసత్తు సత్తుగాను శోభిస్తూ, పొందబడుచున్నాయి.

అనగా ... ఆకాశవర్జితమైన బ్రహ్మమే అతివిశాలం, అతి శూన్యం అయినట్టి ఈ ఆకాశముగా అగుచున్నది. అట్టి విషయరహితమైన శూన్యాకాశంలోంచి శబ్దతన్మాత్ర ఉదయిస్తోంది. అట్టి స్పర్శరహితమైన శబ్దతన్మాత్రలోంచి స్పర్శ తన్మాత్ర రూపమైన వాయువు జనిస్తోంది. రూపరహితమైన వాయువు నుండి రూపసహితమైన అగ్ని ఉద్భవిస్తోంది. రసరహితమైన అగ్ని నుండి రససహితమైన జలం ఉద్భవిస్తోంది. గంధరహితమైన జలంలోనుంచి గంధ సహితమైన పృథివి ఏర్పడి ఉంటోంది.

ఈ విధంగా శూన్యంలోనుంచి జనించే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు శూన్యరూపమే అయి ఉండి జాగ్రత్ - స్వప్న జగత్తులుగా పరిఢవిల్లుచున్నాయి. అందుకే ఈ జాగ్రత్తు శూన్యరూపమే” అని సిద్ధాంతీకరించబడుతోంది.

నిర్విషయమగు ఆత్మ శూన్యవిషయమగు ఆకాశంగా అగుచుండగా, శూన్యవిషయాకాశంలో నుంచి అనేక విశేషములు - విషయములతో కూడిన పర్వత, భూమి, అరణ్యాదులుగా శూన్యాకాశమే అవతరిస్తోంది.

స్వప్నంలో కనిపించిన ఒక మనిషి వాస్తవానికి జనించినప్పటికీ “గొడ్రాలి ముద్దుల కొడుకు” వలె జనించినట్లే అనిపిస్తున్నాడు కదా! జీవుడు ఎక్కడో మరణించి మరెక్కడో జనించినప్పటికీ మరణము యొక్క విస్మృతిచే తాను జనించినట్లే అనుకోవటం లేదు కదా! స్వరూపతః ఆతనికి జనన మరణాలు లేవు కాబట్టే కదా!... ఈ జాగ్రత్ కూడా జనించనప్పటికీ జనించినట్లే కనిపిస్తోంది.

Page:242

శ్రీరాముడు : "సత్తు అసత్తుగా అవడం - అసత్తు సత్తుగా అవడం" అంటే ఏమిటో దృష్టాంత పూర్వకంగా వివరించ ప్రార్ధన స్వామీ!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఒకడు గదిలో మంచంపై పరుండి కలగంటున్నాడనుకో. ఆతడు తాను శయనించిన గదిని, మంచమును ఏమరుస్తూ, మరెక్కడో ఏదో దృశ్యమును చూస్తూ అద్దానితో తన్మయం చెందుచున్నాడు కదా! ఆతనికి రాత్రియందు స్వప్నంలో అంతా విరుద్ధమైన అనుభవంగా సంభవిస్తోంది. స్వప్నంలో కనిపించేది భ్రమయే అయినప్పటికీ అదంతా 'సత్యము'వలె (సత్తుగా) అనుభవించబడుతోంది. స్వప్న ద్రష్ట వాస్తవానికి యథాతథంగా ఉండి కూడా స్వప్నంలో తాను మరణించినట్లు కలగంటున్నాడు. ఆకాశము జగత్తుగా కనిపిస్తోంది. చీకటిలో మహాప్రళయాలు అగుపిస్తున్నాయి. క్రిందపడుతూ ఆకాశంలో ఎగురుచున్నట్లు అనుభూతి పొందుచున్నాడు.

ఈ విధంగా స్వప్నంలో అసత్యరూపమైన జగత్తు ఎట్లా భాసిస్తుందో ... అట్లాగే జాగ్రత్నందు ఈ జగత్తు భాసిస్తోంది సుమా! అదంతా స్వప్నతుల్య జగత్తు" ...అని భూతకాల విశేషాలను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు అందరికీ అనిపించే విషయమే కదా! అయితే వర్తమానంలో ఆత్మజ్ఞానదృష్టి తగినంతగా రూపుదిద్దుకోకపోవటం చేత వర్తమాన దృశ్యం స్వప్న సదృశంగా కాకుండా వాస్తవము - ఘనీభూత సత్యము వలె అనిపిస్తోంది. ఈ విధంగా "స్వప్న - జాగ్రత్తులకు కొంచెం కూడా భేదం లేదు అనే సిద్ధాంతం ధ్రువీకరించబడుతోంది.

నిన్న చూచిన సూర్యుడు, ఈ రోజు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినట్లుగా... నిన్న కనిపించిన స్నేహితుడు, ఆతడే ఈ రోజు తారసపడినప్పుడు ఈ రోజు కనిపించిన ఆ స్నేహితుడు ఒక్కడే అయినట్లుగా ...జాగ్రత్, స్వప్నములు రెండూ ఒక్కటే! అయితే రెండూ అసత్యమే! లేదా, రెండూ సత్యమే!

శ్రీరాముడు : స్వామీ! సద్గురూ! వసిష్ఠ మహర్షీ! నన్ను శిష్యవాత్సల్యం చేత క్షమించెదరు గాక! జాగ్రత్, స్వప్నములు ఒక్క తీరైనవే అని మీరు చెప్పే వాక్యం నాకు ఎందుకో ఇంకా కూడా యుక్తి యుక్తం అనిపించటంలేదు. ఎందుకంటారా...?

స్వప్నంలో ప్రవేశించినవానికి అతని జాగ్రత్ అంతా క్షణంలో తొలగిపోయి ఆతడు ఇక స్వప్నం అనుభవిస్తున్నాడు. జాగ్రత్తు యొక్క దర్శనముచే స్వప్నము క్షణంలో అంతఃకరణంలో అసత్తుగా భాసిస్తోంది.

ఇంతవరకు సరే! అయితే, జాగ్రత్లోని బంధువులు స్వప్నంలో కనిపించకపోయినప్పటికీ, ...స్వప్నానంతరం మరల సంబంధం బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. పైగా, జాగ్రత్లో అంతా దినదినం కొనసాగుచుండగా స్వప్నం భ్రమయే అని మెలకువ రాగానే తెలిసిపోతోంది. అంతేగాని నిన్నటి జాగ్రత్ భ్రమయే అని ఎవరికీ అనిపించటం లేదుకదా! కనుక జాగ్రత్ - స్వప్నములు ఒక్కతీరైనవి ఎట్లా అవుతాయి చెప్పండి?

Page:243

శ్రీ వసిష్ఠ మహర్షి : సరే! అయితే, మరికొన్ని వివరాలు మనం సంభాషించుకుందాం.

ఒకడు స్వప్నం పొందుచున్నప్పుడు స్వప్నంలో కనబడిన బంధువులతో విహరిస్తున్నాడు. ఆ స్వప్నం ముగుస్తోందనుకో, అప్పుడేం జరుగుతోంది? ఏ స్వప్నదేహంతో స్వప్న బంధువుల మధ్య విహరిస్తున్నాడో... ఆ స్వప్న దేహం కాస్తా కనుమరుగౌతోంది. స్వప్నములో దేహనాశనం పొందిన వాడై, స్వప్న బంధువులతో వియోగం పొందినవాడై, ఆ నిద్ర నుండి విముక్తుడై ఇప్పుడు తిరిగి జాగ్రత్ దేహం ఆశ్రయిస్తున్నాడు. (లేక) జాగ్రత్ దేహంలో ప్రవేశిస్తున్నాడు. అనగా సామాన్య పరిభాషలో "ఆతడు నిద్రలేచాడు" అని మనం చెప్పుకుంటున్నాం.

అట్లాగే ఇప్పుడు దేహ - దేహాంతర ప్రాప్తి విషయాలకు వద్దాం. ఒకడు దేహమును త్యజించుచున్నప్పుడు ఏమౌతోంది? ఏఏ బంధువులతో కూడినవాడై అనేక హావ - భావాలతో సంబంధ - అనుబంధ - బాంధవ్యాలతో ఈ భూమిపై సంచరించాడో, వారందరితోటి సంబంధమును త్యజించినవాడై, మరొక దేహమును ఆశ్రయించి ఇప్పుడు వేరైన బంధువులతో కూడిన అనుబంధ - సంబంధ - బాంధవ్యాలను కొనసాగిస్తున్నాడు.

అనగా... స్వప్నంలోని బంధువులను స్వప్నంలోనే త్యజించి జాగ్రత్తుకు వస్తున్నట్లే, ఒక దేహమునకు సంబంధించిన బాంధవ్య - తదితర వ్యవహార పరంపరలను దేహముతోటే త్యజించి మరొకచోట మరొక దేహంతో మరొక రీతిగా ఈ జీవుడు బంధు సమాగమాదులు పొందుచున్నాడు కదా! స్వప్నంలోనుంచి ముక్తి పొందినంత మాత్రంచేత, స్వప్న సంబంధాలు లేనివి” అని అనుకోదలిస్తే, జాగ్రత్కు సంబంధించిన ఇక్కడి వర్తమాన సంబంధాలు మృత్యువుతో ముగుస్తున్నాయి కాబట్టి ఇవి కూడా లేనట్లే కదా!

వర్తమానంలో బంధు సంబంధం ఉండి ఉండటం - కాలానంతరం అవి లేకుండపోవటం” -

- అనే విషయాలను దృష్టిలో ఉంచుకుంటే "జాగ్రత్, స్వప్నాలు ఒక్క తీరైనవే”... అని సిద్ధాంతీ కరించటంలో తప్పేమున్నది? మరల చెప్పుచున్నాను ...విను.

స్వప్నద్రష్ట స్వప్నదశలో ఉన్నప్పుడు అనేక సుఖ దుఃఖ దశలను, లెక్కలేనన్ని మోహములను, రాత్రింబవళ్ళను, అనేక విపర్యయములను, శత్రు మిత్ర సంబంధములను పొందుచున్నాడు కదా! ఆ తరువాత ఆతడు స్వప్న దేహమును త్యజించి జాగ్రత్ దేహమును ఆశ్రయిస్తున్నాడు. ఇప్పుడు స్వప్న దేహ సంబంధ బాంధవ్యములకు ఏమౌతుంది? "అవన్నీ మొదలంట భ్రమ మాత్రమే... అని జాగ్రత్ దేహంతో భావన చేస్తున్నాడు. అట్లాగే ఆతడు జాగ్రత్ దేహం త్యజించి స్వప్నదేహంతో స్వప్నలోకంలో ప్రవేశించినప్పుడు కూడా "జాగ్రత్ దేహ వ్యవహారాలన్నీ భ్రమయే అని భావించి ఆ జాగ్రత్ వ్యవహారాలతో సంబంధం లేని స్వప్న లోకంలో క్షణంలో తన్మయమై ఆయా స్వప్నదృశ్య సంఘటనలలో విలీనమైపోతున్నాడు. స్వప్న సంఘటనలు 'సత్యమే' అనే బుద్ధితో అనుభవం పొందుచున్నాడు. స్వప్న సమయంలో జాగ్రత్ అసత్యంగా అనిపిస్తోంది. జాగ్రత్ సమయంలో స్వప్నం అసత్యంగా అనిపిస్తోంది.

Page:244

స్వప్నద్రష్టా యథా స్వప్న - - సంసారే మృతిమ్ ఆప్తవాన్

అన్యం జాగ్రత్మయం స్వప్నం ద్రష్టుం భూయః ప్రజాయతే ॥ జాగత్ ద్రష్టా తథా జాగ్రత్ సంసారే మృతిమ్ ఆప్తవాన్

అన్యం జాగ్రత్మయం స్వప్నం ద్రష్టుం భూయః న జాయతే ॥ జాగ్రత్ ద్రష్ట, ఈ జాగ్రత్ ప్రపంచంలో మరణించినప్పుడు ఇక్కడి సహజీవులతో - వస్తు ప్రపంచంతో సంబంధం త్యజించి మరల మరొకచోట జన్మించినప్పుడు అక్కడి నూతన సహజీవుల

వస్తు జాలములతో నూతన సంబంధములను పొందుచున్నాడు. అనగా... ఒకచోట మరణించి అంతా వదలిపోవటం - మరోచోట జన్మించి నూతన జాగ్రత్ ప్రపంచం పొందటం" అనే వ్యవహార మంతా ఒక స్వప్నంలోనుంచి బాహ్యగతుడై మరొక స్వప్నంలోకి అంతర్గతుడు అవటం వంటిదేకదా! కనుక “జాగ్రత్ - స్వప్నములు ఒక్క తీరైనవే అనే వాక్యం ఈ విధంగా యుక్తియుక్తమే అవుతుంది.

ఇంకా కూడా... ఇక్కడ మరొక విషయం గమనిద్దాం. ఒకడు ఒక జాగ్రత్ ప్రపంచంలో మరణించి మరొక జాగ్రత్ ప్రపంచంలో జన్మ పొందినపుడు క్రొత్త విషయాలు - సంబంధాలు జ్ఞాపకం ఉంటున్నాయి. క్రితం జన్మ జ్ఞాపకాలు ఏమీ గుర్తుకురావటం లేదు. ఎందుచేత?

దీనికి స్వప్నానంతరం మరొక స్వప్నమే దృష్టాంతం. ఎట్లా అంటావా?...

ఒకడు నిన్నటి రాత్రి ప్రాప్తించిన స్వప్నం జాగ్రత్తుకు రాగానే ఏమరుస్తున్నాడు. మరల ఈ రోజు రాత్రి వచ్చిన స్వప్నంలో క్రిందటి రోజు స్వప్నము యొక్క విశేషాలు ఏమాత్రం రావటం లేదు. ఎందుకట్లా జరుగుతోందంటే... స్వప్నంలోంచి మేల్కాంచగానే, ఆ స్వప్న ద్రష్ట రాత్రి కలలో కనిపించినవన్నీ నాయొక్క ఊహ - భ్రమలచే కల్పనగా పొందబడినదే గాని అదంతా ఏమాత్రం వాస్తవం కాదు... అని అసత్యత్వ బుద్ధి ఉండటం చేతనే అందులోని బంధువులను, వస్తు వాహనాది ఆయా విశేషములను, సంఘటనలను నిదురలేవగానే త్యజించివేసినవాడై ఉంటున్నాడు. మరల ఈ రోజు మరొక స్వప్నం ! ఆ నూతన స్వప్న సందర్భంలో క్రిందటి రోజు రాత్రి స్వప్న విషయాలు ఈ క్రొత్త స్వప్నానికి సంబంధించినంత వరకు విషయమే కాదు.

అట్లాగే... క్రితం జన్మ విశేషాలు వర్తమానానికి 'అసత్యము - - భ్రమ మాత్రము' అను బుద్ధి ఉండటంచేతనే అవన్నీ జ్ఞప్తికి విషయం కావటం లేదు. ఇట్లా ప్రతి జీవుడు జీవించినంత కాలం పొందిన అనేక సంఘటనలు, సంబంధ బాంధవ్యములను మృతిపొందగానే ఇక్కడే వదలి మరల మరొకచోట ఉపాధి పొందటం, నూతనమైన అనుభూతి పరంపరలను ఆస్వాదించటం చేస్తున్నాడు.

ఒక స్వప్నం సందర్భంలో ఇతఃపూర్వపు స్వప్నం అవిషయము, అసందర్భోచితము, అనవసరము, అర్థరహితము - ఎట్లా అవుతుందో... అట్లాగే, వర్తమాన ఉపాధి సందర్భంలో ఇతఃపూర్వపు జాగ్రత్ దేహవ్యవహారాలన్నీ అవిషయం, అసందర్భోచితం, అనవసరం, అర్థహితం అగుచున్నాయి.

ఒకవేళ పూర్వస్వప్నము గురించిగాని, పూర్వజాగ్రత్ గురించిగాని, విశేషంగాను, తీవ్రంగాను, మనఃస్తాప యుక్తంగాను ఎవరైనా యోచిస్తూ ఉంటే... ఆ యోచించటమనేది మూర్ఖత్వమే అవుతుంది కదా!

Page:245

ఈ విధంగా... ఈ జీవుడు ప్రతిరోజు స్వప్నంలో ఉదయించి మరల వైదొలగుచున్నాడు. అట్లాగే ఒక ఉపాధిలో ఉదయించి మరల ఎప్పుడో వైదొలగుచున్నాడు.

వాస్తవానికి... ఈ జీవుడు జాగ్రత్ - స్వప్నములనబడే రెండు అవస్థలలోనూ జన్మించటమూ లేదు - మరణించటమూ లేదు. కానీ, ఆయా దేహములందలి అభిమానము దృష్ట్యా ...

జాగ్రత్లో మరణించి స్వప్నంలో జన్మిస్తున్నాడు.

స్వప్నంలో మరణించి జాగ్రత్లో జన్మిస్తున్నాడు.

అని సాంకేతికపరంగా అనవచ్చు కూడా! ఈ విధంగా ఈ రెండూ సమానస్వరూపమే కలిగి ఉంటున్నాయి. ఎట్లా అంటావా?... ఒక స్వప్నంలోనుంచి రెండవ స్వప్నంలో ప్రవేశించినప్పుడు రెండవ స్వప్నం విశేషంగా కనిపిస్తుంది కాబట్టి మొదటి స్వప్నం 'అనుభూతి' అనే తెరపై నుండి క్రమంగానో (లేక) ఒక్కసారిగానో తొలగిపోతోంది. అట్లాగే, వర్తమాన జన్మ (లేక వర్తమాన సందర్భము) విశేషంగానూ, బలవత్తరంగాను కనిపించటంచేత ఇతఃపూర్వపు భౌతిక సంబంధమైన జ్ఞాపకాలన్నీ బలహీనపడి క్రమంగా కప్పివేయబడుచున్నాయి. ప్రతిజీవునికి కూడా వర్తమాన జాగ్రత్తు దృష్ట్యా పూర్వ జాగ్రత్ స్వప్న సదృశ్యంగానే ఉంటోంది. కాబట్టి జాగ్రత్ - స్వప్నములు రెండు కూడా పూర్వ వృత్తాంత కథార్థములవలె పరస్పర ఉపమాన ఉపమేయత్వములు సంతరించుకొనే ఉంటున్నాయి.

వర్తమాన స్వప్నం జాగ్రత్వలె భాసిస్తోంది. పూర్వకాలిక జాగ్రత్ స్వప్నంవలె భాసిస్తోంది. శ్రీరాముడు : స్వామీ! జాగ్రత్ - స్వప్నములలో దేనిని 'సత్యం' అనవచ్చు? ఏది అసత్యం? శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ మాటకు వస్తే .... రెండూ సత్యమే అనే అనుభూతిని ఆయా సందర్భములలో ద్రష్టకు కలిగిస్తూనేవున్నాయి. ఇక ఏది సత్యమంటావా?

ఆ ఉభయ సందర్భములలోను ద్రష్ట ఒక్కడే కదా! ఆ ద్రష్ట మాత్రమే సత్యం. జాగ్రత్ స్వప్నములు రెండూ ద్రష్ట యొక్క సమ్ముఖంలో అసత్యమే! ఎందుకంటే అవి రెండూ ద్రష్ట అను రాజు యొక్క సంకల్పరూప చమత్కారములే అయివున్నాయి కదా!

ఓ రామచంద్రా! కేవలం చిదాకాశమే ఇలా జాగ్రత్ - స్వప్నముల రూపంలో స్ఫురిస్తోంది. కనుక జాగ్రత్ - స్వప్నములలో కనిపించేదంతా చిదాకాశమేగాని అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. మట్టికుండ యందు అంతటా మట్టియే కదా ఉన్నది!

స్వప్నంలో ఒక పెద్ద కొండ కనిపించిందనుకో! ఆ కొండ స్వప్నచిత్ చమత్కారమే కదా! అట్లాగే జాగ్రత్లో నీకు కనిపించేదంతా, అనుభూతమగుచున్నదంతా నీయొక్క జాగ్రత్ చిత్ స్వరూపమే సుమా! ప్రాజ్ఞుడవగు రామచంద్రా! “నాకు అనుభూతమగుచున్నదంతా నాయొక్క ఆత్మ (లేక) చిత్ స్వరూపమే .... అనే విషయం నీవు ఆత్మజ్ఞులగు ప్రాజ్ఞులతో సంభాషించి, తద్వారా సుస్పష్టం చేసుకో. విజ్ఞులతో సంభాషించి, తద్వారా ఉత్పన్నమగుచున్న వివేకదృష్టి (లేక) “తత్త్వజ్ఞాన దృష్టి చే ఈ దృశ్యమును సందర్శిస్తే, అప్పుడు “నేను చిత్స్వరూపడను. నాచే దర్శించబడుచున్నదంతా నా స్వరూపమే ...అని నీకు తప్పక సునిశ్చితం కాగలదు.

Page:246

ఈ విధంగా... స్వప్నంలో దర్శించబడేదంతా స్వప్న ద్రష్ట యొక్క స్వస్వరూపమే అయినట్లు ...జాగ్రత్లో దర్శించబడేదంతా జాగ్రత్ ద్రష్ట స్వస్వరూపమే అయివున్నది.

ఆరోపదృష్టిచే - ఆత్మయే ఆరోపిత ద్రష్ట యొక్క దృష్టికి జగత్తుగా అగుపిస్తోంది. అపవాద దృష్టిచే - - ఈ జగత్తు యొక్క అసలైన రూపము ఆత్మయే అయివున్నది. ఓ రామచంద్రా! మరల మరొక్కసారి ఉపమాన పూర్వకంగా చెప్పుచున్నాను. యథా... మృన్మయం తు యథా భాండం మృచ్ఛూన్యం న లభ్యతే, శైలాత్మకం యథా భాండం శైలశూన్యం న లభ్యతే,

ద్రవరూపం యథా వారి ద్రవరిక్తం న లభ్యతే, ఊష్మరూషో యథా వహ్నిః నిర్దేష్మా నోపలభ్యతే! యథా స్పందమయో వాయుః అస్పన్తో నోపలభ్యతే! చిన్మయం తు తథా చేత్యం చిచ్ఛూన్యం నోపలభ్యతే....!

స్వప్నంలో లాగానే జాగ్రత్లో కూడా తెలియబడుచున్నదంతా - తెలుసుకునేవాని రూపమే అయి ఉన్నది. మట్టికుండలో మట్టిని తీసేస్తే కుండ ఎక్కడుంటుంది? శిలాపాత్రలో శిలను తొలగించి పాత్రను చూడగలమా? ద్రవ్యత్వం లేని జలం ఉంటుందా? ఉష్ణరూపమగు అగ్నిలో ఉష్ణత్వం తొలగిస్తే అగ్ని ఎక్కడ? స్పంద రూపమగు వాయువు స్పందరహితంగా ఉంటుందా? అట్లాగే ... చైతన్య రహితంగా జగత్తు ఉండజాలదు. చైతన్యమున్న చోట జగత్తు (దృశ్యము) ఉండనే ఉంటుంది?

ఒక పదార్థం దేనిచే మయమైవున్నదో, ఆ మయమైన దానిని తొలగిస్తే పదార్థం ఉంటుందా? బంగారపు గొలుసులో బంగారం తొలగిస్తే గొలుసు ఉంటుందా? చైతన్యము లేకుండా జీవుడు లేడు, జగత్తు లేదు. ద్రష్టాలేడు. దృశ్యమూ లేదు.

స్వప్న ద్రష్ట లేకుండా స్వప్నం ఉంటుందా? అట్లాగే, జాగ్రత్ ద్రష్ట లేకుండా జాగ్రత్ ఉండదు. స్వప్నంలో కనిపించేవన్నీ చిదాకాశమయములే అయినవున్నట్లు జాగ్రత్లో కనిపించేవన్నీ చిదాకాశము యొక్క ఆభాసరూపములు మాత్రమే!

స్వప్నమూ - - జాగ్రత్తూ కూడా చిదాకాశరూపములే! ఆ రెండింటినీ శోధిస్తే చిన్మాత్రమే శేషిస్తోంది. ఈ విషయంలో తదితరమైన వాదోపవాదముల వివాదమంతా వ్యర్థమే గాని మరింకేమీ కాదని మా అభిప్రాయం.

8. చిదాకాశ స్వరూపం

శ్రీరాముడు : హే మహర్షీ! జాగ్రత్, స్వప్నముల కంటే భిన్నమై, ఆ రెండింటికి అప్రమేయమై, విలక్షణమైన మనందరి ఆత్యంతిక కేవలసాక్షీరూపమగు చిదాత్మ గురించి మీరు చెప్పుచున్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తోంది. పరబ్రహ్మమగు చిదాకాశం ఎట్టిదో మరల మరికొంత బోధింప వలసిందిగా నా విన్నపం.

Page:247

శ్రీ వసిష్ఠ మహర్షి :

సమయోః యమయోః భ్రాతోః వ్యవహారాయ నామనీ

యద్వత్ క్రియతే ద్వే తద్వత్ జాగ్రత్ - - స్వప్న శిలామయే ॥

ఓ రామచంద్రా! ఒకే సమయంలో జనించిన కవల పిల్లలకు రెండు వ్యవహార నామములు ఇచ్చి పిలుచుకుంటాం చూచావా? అట్లాగే చైతన్య స్ఫటిక శిలామయము, చైతన్యము యొక్క ప్రతిబింబరూపము వంటివి, ఉభయములు ఒకదానితో మరొకటి అయిన రెండు ఏకసమయజనిత ప్రపంచములకు ... 1. జాగ్రత్ ప్రపంచం, 2. స్వప్న ప్రపంచం అని రెండు వ్యవహార నామములు పెట్టుకుని పిలుస్తున్నాం ...అని మనం ఇప్పటిదాకా నిరూపించుకున్నాం.

ఆ తరువాత... “జాగ్రత్ - స్వప్నములు రెండూ చిదాకాశ విన్యాసములు” అని, “ఈ జీవుని వాస్తవ స్వరూపం చిదాకాశమే అని, “తెలియబడేదంతా తెలుసుకున్న వాని యొక్క చిత్కళా ప్రతిబింబ రూపం అని కూడా మనం మన ఈ వర్తమాన సంవాద సందర్భంలో సుస్పష్టం చేసుకుంటున్నాం.

రెండు పాత్రలలో గల ఒకే నీరు వలె, రెండు పాత్రలలో ఉంచబడిన క్షీరంలాగా జాగ్రత్ స్వప్నాల రెండింటికీ భేదమేమీ లేదని మరొకసారి నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాను. ఆ రెండు కూడా నిర్మలమగు చిదాకాశమే అయివున్నాయి. ఈ మన సిద్ధాంతంలో సందేహమేమైనా ఉన్నదా చెప్పు? శ్రీరాముడు : "జాగ్రత్ - స్వప్నములు ఏకరూపమైనవే! ఆ ఆ రెండు కూడా చిదాకాశ రూపములే” అని మీ బోధామృతసార ప్రభావం చేత నా కిప్పుడు సుస్పష్టం అయింది. "అత్యంత యుక్తియుక్తం కూడా ...అని నేను అనుభూతిపూర్వకంగా అంగీకరిస్తున్నాను. అయితే జాగ్రత్ - స్వప్నముల వాస్తవ రూపమైనట్టి చిదాకాశము యొక్క రూపమేమిటో, అద్దాని యొక్క దర్శన - గ్రహణాదులు ఎట్టివో ఇంకా నేను మరికొంత నిర్దుష్టంగా గమనించవలసి ఉన్నది. కనుక అట్టి 'చిదాకాశము' గురించి ప్రవచించండి.

చిదాకాశము -

శ్రీ వసిష్ఠ మహర్షి : చిదాకాశము యొక్క స్వరూపము వాక్కు - - మనస్సులకు కూడా అందనిది. (అవాఙ్మనసగోచరం). మన ఈ సంవాదమేమో వాక్యపరంపరలకు పరిమితమైనది. అయినప్పటికీ కూడా అనుభూతిని వాక్కుతో మనం ఒకరికొకరం కొంతవరకు చెప్పుకుంటున్నట్లుగానే, చిదాకాశము యొక్క రూపం ఉపమానపూర్వకంగా వీలైనంతవరకూ చెప్పటానికి ప్రయత్నిస్తాను.

నిర్మల చిదాకాశ స్వరూపం, నిర్విషయ జ్ఞాన స్వరూపం - ఈ దృష్టి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళుచున్నప్పుడు (ఒక విషయమును త్యజించి మరొక విషయాన్ని ఆశ్రయిస్తున్నప్పుడు) ...ఆ రెండు ప్రదేశాలకు, విషయాలకు మధ్య గల నిర్విషయ జ్ఞాన స్వరూపమే నిర్మల చిదాకాశం యొక్క స్థాన-స్వరూపాలు. నిర్మల(విషయరహిత) జ్ఞానస్వరూపమే 'చిదాకాశం' అని చెప్పబడుతోంది.

నిర్మలాహ్లాద స్వరూపం - భూమియందలి రసమును వృక్షము తన వ్రేళ్ళు-మూలము ద్వారా ఆకర్షిస్తున్నప్పుడు ఏ ఆహ్లాదమును ఆస్వాదిస్తోందో, అట్టి ఆహ్లాదము వృద్ధి - - క్షయములు

Page:248

పొందనప్పటి స్వరూపమే చిదాకాశ స్వరూపమని వ్యాఖ్యానించబడుతోంది. అంటే విషయ స్వీకారం జరుగుచున్నప్పటి జీవుడు పొందే ఆహ్లాదమే విషయరహితమై వృద్ధి - క్షయ రహితమై ఉంటే .... అట్టి ఆహ్లాదము యొక్క రూపం చైతన్యము యొక్క (చిదాకాశము యొక్క) రూపం అయివున్నది.

ఇచ్ఛారహితమైన మనస్సు యొక్క సుఖశాంతి స్వరూపం కోర్కెలన్నీ శమించినట్టి శాంతచిత్తుడున్నాడనుకో! ఆయన యొక్క సర్వవైషమ్య రహితమైనట్టి ఏ స్వాభావిక సుఖస్వరూప అనుభవం ఉన్నదో... అట్టి వస్తు - సంఘటనాదులకతీతమైన సుఖానుభవముతో కూడిన మనః స్వరూపమే చిదాకాశము యొక్క స్వరూపం.

స్వస్థతతో కూడిన నిర్మల చిత్త స్వరూపం - నిద్ర యొక్క ప్రారంభ సమయంలో ఈ మనస్సు సమస్త జగత్ విషయములు త్యజించివేయగా, అప్పటి ఆ మనస్సు యొక్క ఆనందానుభవమేదైతే ఉన్నదో, అదియే చిదాకాశము యొక్క స్వరూపమని వర్ణించబడుతోంది.

మమత్వరహిత రసభావానందం - అట్లాగే వర్షఋతువులో చెట్లు చిగిర్చుచున్నప్పటి మమత్వరహితమైన రసానుభవానందమే చిదాకాశము యొక్క స్వరూపం.

సంకల్పాతీతం - ఎప్పుడైతే ఈ జీవుడు రూప - లోక - సంకల్పాదులన్నీ విడిచిపెడతాడో, వాటి నుండి అతీతత్వమును సముపార్జించుకుంటాడో, అప్పటి ఆ జీవుని యొక్క శరత్కాలముతో పోల్చతగిన స్వభావ సిద్ధమైన ఆనంద స్వరూపమే చిదాకాశముగా చెప్పబడుతోంది.

స్వసత్తా సంస్థితి - బ్రహ్మదేవుడు ఒక శిలకు ప్రసాదించివున్న చేష్టారహిత స్థితి వంటి మనోలయ రూపమైన 'సత్తాత్మస్థితి' ని ఏ జీవుడు సముపార్జించుకుంటాడో, అట్టి జీవుని అనిర్వచనీయ నిశ్చల - ఆత్మ స్వరూపానుభవమే ఆ చిదాకాశముగా ప్రవచించబడుతోంది.

జాగ్రత్ - - స్వప్న - సుషుప్తులకు సాక్షి - ఎందులోనుంచి అయితే జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు బయల్వెడలి మరల తిరిగి మరొకప్పుడు లయం చెందుచున్నాయో, అట్టి నిర్వికారమగు స్వస్వరూపమే 'చిదాకాశము' అను పేరుతో ఉద్దేశించబడుతోంది.

లయ స్వరూపం - - ఏ కేవల సాక్షి స్వరూపమునుండి సర్వ పదార్థ విషయ వాసనలన్నీ ఉద్భవమయి, ఎద్దానియందైతే అవన్నీ ఎప్పటికో అప్పటికి లయం అగుచున్నాయో, అట్టి విషయరహిత కేవల సాక్షిస్వరూపమే చిదాకాశ స్వరూపంగా నిర్వచించబడుతోంది.

యస్మిన్ సర్వం, యతః సర్వం, యః సర్వం, సర్వతశ్చ యః

యస్య సర్వమయో నిత్యం స చిదాకాశ ఉచ్యతే ॥

దేనియందైతే ఈ సమస్తం ఉన్నదో, దేనియందైతే సమస్తం ఉద్భవించిందో, ఈ సమస్తము ఏది అయివున్నదో, ఏది అంతటా వ్యాపించి ఉన్నదో, ఏది సర్వమయమై వెలుగుచున్నదో... అదియే ‘చిదాకాశము' అని పిలువబడుతోంది.

ప్రకాశ రూపం - ఈ భూమిపైన, అంతరిక్షంలోను, స్వర్గంలోను, సర్వ బాహ్య - అభ్యంతరము లందు, ఇతర సర్వ నామ, రూపములందును ఏదైతే సర్వదా సర్వత్రా ప్రకాశమానమై వెలుగొందుచున్నదో అదియే 'చిదాకాశము' అని చెప్పబడుచున్నది.

Page:249

దృశమంతా ఎద్దని ఆభరణమో! దేనికైతే ఈ జగత్తంతా కూడా ఒకానొక అవయవంగా -

అయివుంటుందో, దేనియందైతే ఈ సాకార - నిరాకార రూప ప్రపంచమంతా ఆవిర్భవించి, ఆ ఆ తదనంతరం పుష్పమాలగా ధరించబడుచున్నదో... అట్టి నిర్మల సర్వాభరణ భూషిత స్వరూపమే చిదాకాశముగా సంభాషించబడుతోంది.

సృష్టి-స్థితి-లయాలకు స్థానం - దేనినుండైతే జలతరంగాలవలె ఈ సృష్టి - స్థితి - లయాలు అనే వికారాలు ఉద్భవిస్తున్నాయో, దేనిలో అయితే సర్వము విలీనం కానున్నదో... దేనిచే ఈ సర్వము పూర్ణమై ఉన్నదో అదియే చిదాకాశముగా గానం చేయబడుతోంది.

అది కేవల సాక్షి - సుషుప్తి తొలగగా ఏ కేవల సాక్షి స్వరూపము నుండి జాగ్రత్ స్వప్నరూపమగు ప్రపంచము ఆవిర్భవించి, మరల ఆ విక్షేప శక్తి తొలగటంచే ఎద్దానియందైతే నివృత్తి అగుచున్నదో అట్టి 'సాక్షి - అది' అయిన దానినే చిదాకాశముగా శాస్త్రకారులు ఎలుగెత్తి చాటుచున్నారు.

స్వానుభవం - ఎద్దాని యొక్క కనులు తెరవటం 'జగదావిర్భావం' గాను, కనులు మూయటం 'జగత్ తిరోభావం' గాను అగుచున్నదో, ఏదైతే సర్వదా ప్రతి జీవునికి అనుక్షణం స్వానుభవమే అయివున్నదో, అదియే ‘చిదాకాశము' అని గమనించు.

ఆది శేష్యము -

నేదం నేదం తదిత్యేవం సర్వం నిర్ణీయ సర్వథా యన్నకించిత్ సదా సర్వం తత్ చిత్వ్యోమేతి కథ్యతే ॥

"నేతి - నేతి ... ఇది కాదు - ఇది కాదు" అని ఈ ప్రకారంగా సమస్తమును - సర్వత్రా ఉన్నప్పటికీ వాస్తవానికి దృశ్యంగాగాని, ద్రష్టగాగాని అగుచుండుటయే లేదో ...అదే చిదాకాశంగా సంభాషించుకొనబడుచున్నది.

ఓ రామచంద్రా! బాహ్యమున రూపనామాదులతో, అభ్యంతరమున సంకల్పాదులతో నిర్మించ బడిన ఈ ప్రపంచమంతా తత్ చిదాకాశమే సుమా! నిర్మలమగు చిదాకాశముకంటే ఈ ప్రపంచము వేరుగా కనబడుచున్నప్పటికీ జలంలో బుడగలు లేచి లయిస్తున్నట్లుగా ఆ చిదాకాశ మహాసముద్రంలో ఈ జగత్ బుద్బుదాలు ఉద్భవిస్తున్నాయి - - లయిస్తున్నాయి. బుద్బుదాలు (బుడగలు) జలస్వరూపమే అయినట్లు ఈ జగత్తులన్నీ చిదాకాశ స్వరూపమే! జలమునకు వేరుగా బుద్బుదములు దృశ్యమానమైనట్లు, అజ్ఞాన దృష్టికి చిదాకాశంలో జగత్తులు అజ్ఞాన దృష్టికి ఒకింత అగుపిస్తున్నాయి.

9. ద్రష్ట - దృశ్యము

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ దశరథరామా! ఈ ఇంద్రియాలు ఆయా పదార్థములను అనుభవించ వచ్చుగాక!

పశ్యన్నైవ ఇంద్రియార్దాన్ నూనం నిర్వాసనాశయః | ప్రబుద్ధఏవైక ఘనః సుషుప్తావస్థితో భవ ॥

Page:250

ఈ కళ్ళు చూస్తే చూడనీ! ఈ చెవులు వింటే విననీ! ఈ ఇంద్రియాలన్నీ ఈ ప్రపంచంలో తమకు నియమించబడిన ఆయా పనులను చేసుకుపోతూ ఉండనీ. నీవు మాత్రం వాసనా రహితుడవై ఉండు. నిరతిశయానందఘనైక రూపమైనట్టి ఆత్మయొక్క జ్ఞానమును సుస్పష్టము - - నిర్దుష్టము -

అనుక్షణికము చేసుకున్నవాడవై ఉండు. సుషుప్తిలో ఉన్నవాడు ఎట్టి మనోచలనములేక, సుషుప్తి (గాఢ నిద్ర) ని మాత్రమే పొందుచూ ఉంటాడు చూచావా? అట్లా నీవు ఎల్లప్పుడు కేవల చిదాత్మనే దర్శిస్తూ స్వాత్మయందు నెలకొని ఉండు. వాసనా రహితుడవై, శాంతచిత్తుడవై ఉండు. జీవిస్తూవుంటూనే ఒక శిలవలె సర్వ సందర్భములలోను అంతరంగంలో మహామౌనము వహించి ఉండు. క్షీరంతో శివలింగాభిషేకం చేస్తున్నప్పుడు తెంపులేని ధారగా అభిషేకిస్తాము చూచావా? అట్లా నీవు తెంపులేని ధారగా ఆత్మానందం ఆస్వాదిస్తూనే ఈ ఇంద్రియములతో తిను, త్రాగు, మాట్లాడు, సంచరించు, తదితర వ్యవహారములన్నీ నిర్వర్తించు.

ఇదం న సంభవత్యేవ దృశ్యం పశ్యసి యత్సురః మృగతృష్ణా జలమివ ద్వైతమిన్దావినోదితమ్ ||

ఈ పురము మొదలైన ఏ దృశ్యమైతే నీకు ఎదురుగా, కనబడుతోందో... ఇది వాస్తవానికి సంభవించనే లేదు. సూర్యకిరణాలే మృగతృష్ణా జలంగా కనిపిస్తోంది చూచావా? ఒక్క చంద్రబింబమే మెల్లకన్ను వానికి రెండు చంద్ర బింబములుగా కనిపిస్తోంది కదా! చిదాకాశము కంటే భిన్నంగా ఈ జగత్తు మిథ్యగా ఉదయించినట్లు కనబడుతోంది. ఎందుకంటే సృష్ట్యాది యందు చిదాకాశము నందు దృశ్యము ఉదయించటానికి కారణమే లేదు. కారణరహితమైన అద్వయ బ్రహ్మము నుండి కార్యరూపంగా కనిపించే దృశ్యం ఎట్లా ఉదయిస్తుంది చెప్పు? చిదాకాశం సర్వదా (సృష్టి యొక్క ఉదయ, ఉనికి, అస్తమయాలలో) యథాతథంగానే ఉండి ఉండగా ఇక అద్దానిలో జగత్తు ఉత్పన్న మవటమేమిటి? నశించటమేమిటి? ఇక బీజము, అద్దాని అంకురము - ఇవన్నీ కూడా నిష్క్రియము, నిరవయవము అగు చిదాకాశ రూపములే అయివున్నాయి. ఈ విధంగా ఈ ప్రపంచము, ఇందులో కనిపించే ద్రష్ట, దృశ్యములు - ఇవన్నీ చిదాకాశానికి అభిన్నములై, చిదాకాశ రూపాలే అయివున్నాయి.

చంద్రబింబం ఒక్కటే అయి ఉన్నప్పటికీ రెండవ చంద్రబింబం ఎందుకు కనిపిస్తోంది? కంటి దోషం చేత! (లేక) భ్రాంతి చేత. అంతేకదా?

అట్లాగే బ్రహ్మం (లేక) చిదాకాశం సర్వదా పూర్వపు అద్వయరూపంలోనే ఉన్నప్పటికీ ఇక్కడ 'నీవు - నేను' ఇత్యాది భ్రాంతి రూపాలన్నీ అగుపిస్తున్నాయి. కారణం? - ద్రష్ట యొక్క దృష్టిదోషంచేత! అద్వైత బ్రహ్మంలో ఏఏ జీవునికైతే ఈ జగత్తు దృథానుభవరూపంగా కనిపిస్తోందో... అది అనాదికాలం నుండి వచ్చుచున్న భ్రాంతి రూపమగు అజ్ఞానంచేతనే అట్లు (ఆ దృష్టి) ఏర్పడి ఉంటోంది. కనుక అట్టి దృష్టికి (భ్రమచే) కనిపించే దృశ్యమంతా స్వప్నతుల్యము మాత్రమేనని చెప్పబడుతోంది.

తస్మాత్ దృశ్యమ్ న చ ఉత్పన్నం, నైవాస్తి, న భవిష్యతి | న చ నశ్యతి! యన్నాస్తి తస్య కిం నామ నశ్యతి ॥

Page:251

అందుచేత ఈ అజ్ఞాన కారణంగా కనిపించే భ్రాంతిరూప భ్రమ అని చెప్పదగ్గ దృశ్యము అనేది మొదలే ఉత్పన్నం కాలేదు. అసలు ఉండియే ఉండలేదు. ఇక ముందు ఏర్పడనూబోదు. ఏది లేకయే ఉన్నదో... దానికి నాశనమేమున్నది? దృశ్యమును దృశ్యముగా కాకుండా... "బ్రహ్మము గా చూడటమే బ్రాహ్మీస్థితి. అదియే వాస్తవమైన సమాధి.

కాబట్టి రామచంద్రా! పరమశాంతమగు చిదాకాశము తన పరమశాంత, అప్రమేయ, అఖండ రూపము నుండి ఏమాత్రం చ్యుతిని పొందటమేలేదు. అట్లా స్వస్థముగాను, శాంతముగాను ఎప్పటి యట్లు ఉంటూనే ఈ విధంగా తనయందు జగద్రూపంగా ఆవిర్భవించినదగుచున్నది. అయితే, ఏది సృష్టికి ముందు లేదో,... అట్టి దృశ్యము సత్యమెట్లా అవుతుంది? కనుక చిదాకాశమే ఉన్నది. దృశ్యము లేదు. దృశ్యము లేనిదే అగుచున్నది కాబట్టి ద్రష్టయు లేనివాడే అగుచున్నాడు. ఎందుకంటే దృశ్యము లేకుండా ద్రష్టత్వమా? ద్రష్టత్వం మాత్రం (చిదాకాశంలో) ఎక్కడి నుండి వస్తుంది? శ్రీరాముడు :

ఏవం చేత్ తద్వద బ్రహ్మన్ ! ద్రష్టృ - దృశ్యా అవభాసనమ్ కిమిదం కథమ్ ఆభాతి? భూయో పి వదతాం వర ||

వక్తలలో మహాశ్రేష్ఠుడవగు హే మహాత్మా! వసిష్ఠ మునీంద్రా! మొదలే లేనటువంటి ఈ ద్రష్ట, దృశ్యము ఎట్లా భాసిస్తున్నాయి? మరొకసారి ఈ విషయం వివరించ ప్రార్ధన. శ్రీ వసిష్ఠ మహర్షి : నిర్మల చిదాకాశమునందు 'దృశ్యము' అనేది భాసించటానికి కారణమే లేదు. కారణమే లేదు కాబట్టి దృశ్యము భాసించటం ఎప్పుడూ సంభవించనే లేదు.

దృశ్యమే ఉత్పన్నమై ఉండలేదు కాబట్టి, తత్ సంబంధిత మాత్రమైన దృశ్యత్వము సంభవించలేదని వేరుగా చెప్పనక్కర్లేదు కదా! ఇట్టి ప్రౌఢవాదమును అనుసరించి ఈ జగత్తు యొక్క దృశ్యత్వము లేనిదే అగుచున్నది. సద్రూపమగు పరబ్రహ్మమే మాయచే ఇట్లు ద్రష్టత్వము - దృశ్యత్వము - దృశ్యములుగా భాసించుచున్నదని చెప్పబడుతోంది.

యదిదం భాసతే కించిత్ ద్రష్ట - - దృశ్య భ్రమాత్మకమ్ |

జగదాది పరం రూపం తద్విద్ధి పరమాత్మనః ॥

ఓ రాఘవా! బ్రహ్మాత్మకమై, ద్రష్ట - దృశ్యముల రూపంగా భాసించుచున్న ఈ జగత్తును, ఇందలి పదార్థాదులను పరమాత్మ యొక్క రూపంగా దర్శించు. స్వప్నంలో కనిపించే ఆకాశము - భూమి గ్రామాదులు - జనులు అన్నీ కూడా చిన్మాత్రమగు ఆత్మయే స్వయముగా తనయందు ఇట్లు జగద్రూపంగా భాసిస్తోంది కదా! ఇక్కడ ఆదిసృష్టి మొదలుకొని దేనికీ ఎచ్చటా కూడా ఆత్మకు వేరైనట్టి ఉపాదాన కారణమేదీ లేదు. కాబట్టి ఏదైతే భాసిస్తోందో, అది కేవలము బ్రహ్మమే అయి ఉన్నది. చిదాకాశమునందు చిదాకాశ రూపమే అయిన ఏ 'స్ఫురణ' విజృంభిస్తోందో జగదాకారంగా ఉదయించినదై భాసిస్తోంది.

భావమునకు – భావత్వమునకు, శూన్యమునకు-శూన్యత్వమునకు, ఆకార పదార్థమునకు ఆకారమునకు... ఎటువంటి అవినాభావ సంబంధమున్నదో.... అట్టి అవినాభావ సంబంధమే

Page:252

చిదాకాశమునకు - జత్తునకు ఉన్నది. ఉప్పు పొడి - ఉప్పు గడ్డకు గల సంబంధంలాగా ఈ

జగత్తు చిద్రూపరసమేనయ్యా! చైతన్యమే మాయయందు ప్రతిభాసించినదై ఇట్లు 'ద్రష్ట - దృశ్య - దర్శనము’ అనే త్రిపుటీ రూపంగా స్వయంగా భాసిస్తోంది. మాయను తొలగిస్తే ద్వైతం తొలగుతుంది. ద్వైతం అభావత్వం సంతరించుకోగానే... ఇక భాస్వము (ప్రకాశించేది) ఉండదు. భాస్వకము (ప్రకాశింపజేసేది) ఉండదు. అప్పుడు ఈ జగత్తు సత్తు కాదు, అసత్తు కాదు. ఇది అనిర్వచనీయమే అవుతుంది. కుమారుని "ఇతడు నా కుమారుడు అనే దృష్టితో దర్శించే వాని దృష్టితో పోలిస్తే ఇక “ఇతడు మమాత్మయే” అనే దృష్టి అనిర్వచీనయమై ఉంటుంది కదా!

శ్రీరాముడు : మహాత్మా! ఈ జగత్తు ద్రష్ట - దృశ్య శూన్యము (అవి లేనివి) అయినప్పుడు మరి 1.ఈ జగత్తులో కార్య - కారణత్వాది భేదం ఎక్కడిది? ఎక్కడి నుండి వచ్చి ఉన్నది? 2.ఈ కార్యకారణ భేదం సత్యమై ఎట్లా భాసిస్తోంది?

10. కార్య - - కారణ జగద్యవహారం

శ్రీ వసిష్ఠ మహర్షి : సరే! ఈ స్వప్న సదృశ జగత్తులో కనబడే కార్యకారణముల వాస్తవ రూపమేమిటో

చెబుతాను. విను.

నీవు, నేను, ఈ సర్వ సహజీవులు మనమంతా స్వాత్మయగు చిత్ప్రకాశ రూపులమే! అయితే అట్టి స్వస్వరూపం యొక్క చిత్ ప్రకాశము ఎప్పుడు ఏ తీరుగా ప్రకాశిస్తుందో ఆ తీరుగానే అనుభూతి పొందుతోంది. అయ్యది కామ - కర్మ వాసనలను అనుసరించి దేనిని 'ఇది సత్యము’ అని భావిస్తుందో... అది అద్దానికి సత్యంగానే భాసిస్తుంది. అంటే, ఈ జీవుడు దేనిని ఎట్లు 'సత్యం' అని తలచుచున్నాడో... అద్దానిని అట్లే 'సత్యం' గానే పొందుచున్నాడు. దాని అర్థం? సత్య అసత్యములు ప్రతి జీవునికి స్వయం కల్పితానుసారమే వెలయుచున్నాయి. అట్టి స్వయంభావిత సత్యానుసంధానాన్ని అనుసరించి ద్రష్ట-దృశ్య భావములు ఈ జీవుని పట్ల రూపుదిద్దుకుంటున్నాయి. చిదాకాశ రూపుడగు జీవేశ్వరుడే కార్య కారణ భావములను ధరించి దర్శిస్తున్నాడు. “ఇది స్వప్నము” - అని ఎఱుగబడిన తరువాత ఇదంతా నాయొక్క కల్పన మాత్రమే" అని క్షణంలో సుస్పష్టంగా గమనించబడగలదు కదా? అట్లాగే ఇదంతా నాయొక్క చిదాకాశ స్వరూపము నందే పొందబడు చున్నది అని ఎవరు గ్రహిస్తారో... వారిక దేనికీ మోహం చెందరు. అట్లా గ్రహించకపోతే మోహం చెందుచున్నారు.

శ్రీరాముడు : మహర్షీ ! ఈ జీవుడు స్వాత్మబోధ సమర్థుడగు ఈశ్వర స్వరూపుడేకదా! శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ! అందులో సందేహమే లేదు.

శ్రీరాముడు : అట్టి స్వాత్మబోధ సమర్థతతో కూడిన ఈశ్వర స్వరూపుడగు ఈ జీవుడు మరి 'మోహం' ఎందుకు పొందుచున్నాడు?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ జీవుడు స్వాత్మ బోధ సమర్థుడగు ఈశ్వరుడే! అందులో ఏ మాత్రం సందేహం లేదు. అట్టి ఈశ్వరుడు ఈ జీవమోహం ఎందుకు పొందుచున్నాడో నేనేమీ

Page:253

చెప్పజాలను. అందుకే “ఇదంతా ఈశ్వర లీల” అని మాత్రం సిద్ధాంతీకరించబడింది. 'నేను ఉపాధికి సంబంధించిన అల్పజీవుడను' అని ఆతడు తన గురించి, ఈ దేహ దృశ్యాదుల గురించి భావించటం ఎందుచేత? అనేది అనిర్వచనీయం. మేము సత్యమేమిటో- ఈ జీవుడు శివ స్వరూపుడేనని నిరూపిస్తూ - చెప్పుచున్నాం కదా! అయితే, అసత్యం ఎందుకు పరిఢవిల్లుతుందో ఏం చెప్పగలం? అందుచేత అది మాయ (యమా= ఏది లేకయే ఉన్నదో) అని, అవాచ్యమని విజ్ఞుల వాక్యం. అయితే ఈ జీవుడు సంవిత్ స్వరూపమగు ఆత్మయే స్వస్వరూపంగా కలిగి ఉన్నాడని జ్ఞాన బలంచే గ్రహించి మేము గమనిస్తున్నాం. అట్టి స్వస్వరూప ఏమఱుపుయే జగద్విన్యాసమై ఉన్నది. శ్రీరాముడు : చిదాకాశము - జీవుడు - జగత్తు అను వాటికి గల సంబంధము ఎట్టిది? శ్రీ వసిష్ఠ మహర్షి :

భావాత్ భావాంతర ప్రాప్తా మధ్యే యత్ సంవిదో వపుః

తత్ చిత్ వ్యోమ, తదేవ ఇదమ్ సర్వం చ స్థితి ! నే2 తరమ్ !

భావము, భావముల మధ్య ఏ భావరహిత చిత్ చైతన్యం ఉన్నదో... అదియే 'సంవిత్' అను శబ్దముచే చెప్పబడినది. అనగా ఒక భావము త్యజించిన తరువాత - తదనంతర భావం ఇంకా పొందక ముందు గల భావరహిత - భావాతీత స్వరూపమే సంవిత్తుగా చెప్పబడుతోంది.

అదియే చిదాకాశము అయివున్నది. అదియే ఈ జీవుని నిజ స్వరూపం. అట్టి చిదాకాశమునందే ఈ జీవుడు - జగత్తు అనునవన్నీ ఇమిడివున్నాయి. చిదాకాశమునకు భిన్నమైనదంతా ఎక్కడా ఏదీ లేదు. కనుక జీవుడు జగత్తుగా చిదాకాశమే (లేక) సంవిత్ చైతన్యమే అజ్ఞానదృష్టికి అగుపించటం జరుగుతోంది. ఇక ఆయా దృశ్య భావాల, కార్య - కారణ భావాల మాటేమిటంటావా?... అట్టి దృష్టులన్నీ కూడా అవిద్యచే (లేక మాయచే) కల్పించబడినవి మాత్రమే!

శ్రీరాముడు : అట్టి అవిద్యను కల్పించుచున్నదెవరు?

శ్రీ వసిష్ఠ మహర్షి : జీవునిపట్ల అవిద్య ఎవరో మరొకరు కల్పిస్తున్నారనే ఆక్షేపణ యుక్తియుక్తం కాదు. ఈశ్వర స్వరూపుడే అయిన జీవునిపట్ల ఎవరో అవిద్య - మాయ - సంసారమును ఎందుకు ఏ -

ప్రయోజనం ఆశించి కల్పిస్తారు చెప్పు? ఆతనికి జాగ్రత్ - స్వప్న - సుషుప్త్యవస్థలు కల్పించి వినోదించవలసిన పని ఎవరికున్నది?

శ్రీరాముడు : మరి ఈ మాయ (లేక) అవిద్య (లేక) సంసారము అనబడేది ఈశ్వర స్వరూపుడగు ఈ జీవునిపట్ల ఎట్లా ఎందుకు ఏ కారణంగా పరిఢవిల్లుతోంది?

శ్రీ వసిష్ఠ మహర్షి : నీవు చెప్పే అవిద్య లేక మాయ స్వయంకల్పితమేగాని అన్యకల్పితం కాదని గ్రహించు. ఓ జనులారా! మీరు స్వయంగా - మీకు మీరై కల్పనను ఆశ్రయించి, తద్వారా ద్రష్ట - దృశ్య రూప పరంపరలను, జాగ్రత్ - స్వప్న సుషుప్తి అవస్థాత్రయ పరంపరలను పుంఖానుపుంఖాలుగా స్వయం కల్పిత 'కల్పన' యందు పొందుచూ ఎవరినో ఆక్షేపించి, ఎవరికో ఆపాదించి ఏం లాభం?

Page:254

ద్రష్టా భోక్తా అథ కర్తా వా కశ్చిత్ స్యాత్ ఇతరో యది, తత్ కథం? కిమిదం దృశ్యం? ఇతి యుజ్యేత నాన్యథా ||

ద్రష్టగాని, భోక్తగాని, కర్తగాని కల్పించువాడు గాని తనకంటే వేతే ఎవరో అయివుంటే... అప్పుడు ఈ ద్రష్ట-దృశ్య కల్పన ఏమిటి? ఎందుకు వచ్చి పడిందిరా బాబు? ఎటు నుంచి వచ్చింది? - అనే ప్రశ్న కలిగివుండవచ్చు. ఇవన్నీ స్వకీయ కల్పనలోనుంచే వచ్చినప్పుడు ఇక ఎవరిని ఆక్షేపించగలం? స్వప్నంలో కనబడిన దుస్సంఘటనలకు ఎవరిని దూషిస్తావు? ఎవరినీ ఏమీ అనలేవు కదా? ఎందుకని? అది నీ కల్పనే కాబట్టి. అట్లాగే ఈ జాగ్రత్ అవిద్య ఎవరికి వారు కల్పించుకున్నదేగాని, అది మరెవరో ఎక్కడి నుండో ఇక్కడ ఇదంతా కల్పించటం లేదు సుమా! కనుక మాయ’ అనబడేది “స్వయం కల్పితమే” అని జీవుడు గమనించినప్పుడే అద్దానిని దాటివేయగల సామర్థ్యం సముపార్జించుకోగలడని విజ్ఞుల అభిప్రాయం. స్వప్నంలో అన్యులగు ఎవరి ప్రమేయం లేకుండానే చిదాకాశమే (చిదాకాశ స్వరూపమగు జీవచైతన్యమే) అనేక పదార్థముల - బంధువుల రూపంగా విరాజిల్లుతోంది కదా! “నా స్వప్నం ఎవరో కల్పించి అందులోకి మనుష్యులను, కొండలను, గృహములను పంపారు - అని అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? లేదు! అట్లాగే ఈ జాగ్రత్ ప్రపంచము కూడా చిదాకాశమే (చిదాకాశ రూపమగు జీవ చైతన్యమే) జాగ్రత్ ప్రపంచములోని సర్వ పదార్థముల - జీవుల రూపంలో విరాజిల్లుతున్నదని గ్రహించు.

దృష్టియే సృష్టి! దృష్టియే జగత్తు. దృష్టి లేనిచోట 'సృష్టి' శబ్దముగాని, అర్థముగాని ఉండవు. దృష్టియే భ్రమ. అదియే సంసారము. అట్టి దృష్టి జీవునకు స్వయంకల్పితమై ఉండగా, “నా పట్ల ఎవరో ఈ సంసారమును (ఈ మాయను కల్పించుచున్నారు అని ఆక్షేపించటం ఎంతవరకు సమంజసం? దోషం దృష్టిలో పెట్టుకొని - ఊళ్ళు - లోకములు వెతికి వేసారితే ఏం ప్రయోజనం? శ్రీరాముడు : అట్టి భ్రాంతిదృష్టి ఈ జీవునికి తొలిగేది ఎట్లా? అది స్వయం కల్పితమే అయినప్పటికీ అది తొలగటం ఆవశ్యకం కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఔను, దృష్టి యొక్క దోషం తొలగటం ఆనంద స్వరూపుడగు ఈ జీవునికి అత్యావశ్యకమే. అయితే...

అ స్వయంభువ ఏవేయం చిన్మాత్రే భాతి సర్గభాః | పరిజ్ఞాతా సతీ సా తు బ్రహ్మైవ భవతి క్షణాత్ ||

బ్రహ్మదేవుడు మొదలుకొని సమస్త జీవులందు 'దృష్టి భ్రాంతి' అనేది భాసిస్తూనే ఉన్నది. ఇక అట్టి భ్రాంతి తొలగటమెట్లా అంటావా? ఎప్పుడైతే అట్టి దృశ్యభ్రాంతి "భ్రాంతియే కదా, అసత్తే కదా”...అని తెలియబడుచున్నదో... మరుక్షణం సర్వము బ్రహ్మమే అగుచున్నది.

ఏషైవ త్వపరిజ్ఞాతా భ్రాంతిః మాయేతి కథ్యతే |

జగత్ ఇత్యుచ్యతే అవిద్యా, దృశ్యమ్ ఇతి ఉపవర్ణ్యతే ॥

అట్టి సృష్టి భ్రాంతి (లేక) దృష్టి భ్రాంతియే!... భ్రాంతి అని ఎఱుగబడుచుండగా... 'మాయ'

Page:255

అని పౌరాణికులచే పిలువబడుతుంది. 'జగత్తు' అని లోకరీతిగా చెప్పబడుతున్నది. 'అవిద్య' అని శాస్త్రములచే వర్ణించబడుతోంది. 'దృశ్యము' అని (సాంఖ్యులచే) దర్శించబడుతోంది.

చిదాకాశము యొక్క జ్ఞానముచే సమస్త భ్రాంతి తొలగిపోగలదు. అందుకు వేరే ఉపాయమేదీ లేదు. “నాతో సహా ఈ సహజీవులందరు సర్వదా చిదాకాశ స్వరూపులే ... అనునదే చిదాకాశ జ్ఞానమైయున్నది. ఈ 'దృశ్యము' అనబడేది వాస్తవానికి నిజచిత్ స్వభావము” అనుదాని కంటే వేఱుగా లేదు. ఎవరికి ఏది ఎట్లు తెలియబడుచున్నదో ... అది వారు తమ అంతరంగోద్దేశపూర్వకంగా అట్లా దర్శించటం చేతనే ఆ రీతిగా తెలియబడుతోందని విజ్ఞులు గమనిస్తూనే ఉన్నారు. చిన్న పిల్లవాడికి చీకటిలో గాలికి కదిలే వృక్షం 'దయ్యం' లాగా అనిపించినట్లుగా, ఇక్కడ దృశ్యముగా (అజ్ఞాన ద్రష్టచే) ఎరుగబడుతోంది. అట్టి దృశ్య పిశాచానికి సరి అయిన మందు ఆత్మదృష్టి మాత్రమే! అనగా "సర్వ జీవరాసులను ఆత్మ స్వరూపులుగా దర్శించటం అందుకు ఔషధం. "సర్వము ఆత్మలో ఆత్మయే సర్వముగా దర్శించటం అభ్యసించటమే ఉపాయం!

స్వప్నంలో నిరాకార స్వప్నాకాశంలో సాకారమగు ఇళ్లు - కొండలు కనిపిస్తున్నాయి చూచావా? అట్లాగే, నిరాకారమగు చిదాకాశమున చిదాకాశ చైతన్యము చేత నేను జీవుడను, నేను రుద్రుడను నేను పర్వతమును, నేను సముద్రమును, నేను విరాట్ పురుషుడను" ... అని నామరూప విన్యాసమంతా అనుభవించబడుతోంది. మహా ప్రళయ రూపమగు చిదాకాశమున సాకార రూపమగు జగత్తును కల్పించేవారెవరు? ఒకవేళ ఎవరైనా కల్పించేవారు ఉంటే, చిదాకాశమునకు అన్యమైనది ఉన్నది”

- - అని అనవలసి వస్తుంది. అట్లా అనటం వేదవాక్కుకే విరుద్ధం. కనుక -

1. చిదాకాశమునందు జగత్తు కల్పించటానికి కారణమే లేదు.

2. కారణమే లేనిచోట కార్యమూ లేదు.

3. కనుక చిదాకాశమే జగత్తుగా (అజ్ఞాన దృష్టికి) అనిపిస్తోంది.

చిదాకాశంలో జగత్తు ఉండటానికి కారణమే లేదు అని ఎందుకంటున్నామంటే... చిదాకాశం నిరాకారం. నిరాకార చిదాకాశంలో సాకార జగత్తును ఎవరు కల్పిస్తారు?... అట్లు కల్పించేవారు నిరాకారులా? సాకారులా?... సాకారులైతే వారికి సాకారాన్ని ప్రసాదించిందెవరు? చిదాకాశానికి అన్యమైనదే లేదు కనుక మరొకరెవరో సాకారులు వచ్చి జగత్తు అనే సాకారం కల్పించారనటం యుక్తియుక్తం కాదు.

కాబట్టి... నిరాకార - - నిర్వికార చిదాకాశం అంతటా యథాతథంగానే ఉన్నది - అద్దానికి మార్పు చేర్పులు ఉండజాలవు కనుక! అట్టి నిరాకార చిదాకాశమే సాకారమువలె (జగత్తువలె) అజ్ఞానదృష్టికి అగుపిస్తోంది. సాకారానుభవానికి జగత్ దృష్టి (లేక) సాకారదృష్టియే కారణంగాని,

మరొక సాకారమో నిరాకారమో కాదు.

సృష్టిగా - దృశ్యముగా కనిపించేదంతా వాస్తవానికి సర్వదా నిర్వికార చిదాకాశమే! చిదాకాశము కారణరహితము, అవయవశూన్యము అయివున్నది. అద్దాని యందు (అజ్ఞాన దృష్టిచే) కనిపించే జగత్తు కూడా వాస్తవానికి కారణరహితము, అవయవ శూన్యము అయిన చిదాకాశమే!

Page:256

ఉదాహరణకు... త్రాడులో చీకటి కారణంగా పాము కనిపిస్తోందనుకో (సర్ప రజ్జు భ్రాంతి) ఇక ఆ పామును చూచేవానికి పాము, పాము యొక్క క్రూరమైన పడగ, పాము చారలు, బుసబుసలు, అది కాటువేసినప్పుడు నోటి నుండి వచ్చే నుఱుగు, కాటు చేత గిలగిల తన్నుకొని విషము యొక్క వేదనను అనుభవించటం ఇవన్నీ ఒకదాని వెనుక మరొకటి బాహ్యంలోను మనస్సులోను స్ఫురించి ఆ పామును దర్శించే వ్యక్తికి వణుకు పుట్టుకొస్తుంది.

వాస్తవానికి... ఆ పాముగా కనబడేది సలక్షణంగా త్రాడే కదా! అది జడంగా పడివుండేదే గాని బుసకొట్టి కాటువేసేది కాదుకదా! "సవికారంగా పాముగా కనిపించేది నిర్వికారమగు త్రాడే అని గ్రహించేవరకు పాము లక్షణాలు పొందబడతాయి, అనిపిస్తాయి. త్రాడుగా గమనించిన తరువాత అంతకుముందు పాముగా కనిపించినదే ఈ త్రాడు. అంతేగాని, "పాము త్రాడుగా రూపుదిద్దుకొన్నది అని అనలేం కదా!

అట్లాగే - వాస్తవానికి సర్వము చిదాకాశమే అయివున్నది. అట్టి నిర్వికార చైతన్య రజ్జువులో నీవు, నేను, దేహము, జన్మ, జీవనము, మరణము, నాది, నీది, రాక, పోక మొదలైన వాటితో కూడిన జగత్తు' అనే సర్పము కనిపిస్తోంది.

ఎందుకు కనిపిస్తోంది? 'అజ్ఞానము' అనే చీకటిలో జన్మజన్మలుగా నడచిరావటం చేత! ఈ మనస్సు అనేక ఊహ - - అపోహలను ప్రోగుచేసుకుంటూ రావటంచేత! అంతరంగంలో ఎప్పటి నుంచో అభ్యాసవశం చేత రూపుదిద్దుకుని ఉన్న - పరిపోషించుకుంటూ వస్తున్న పాముకు సంబంధిం చిన భావములు చీకటిలో చూచిన త్రాడుపై ఆపాదించబడుతోంది... అంతరంగంలో జన్మజన్మలుగా ఘనీభూతమై ఉన్న “భేదదృష్టి" సంస్కార బలంచేత ఇప్పుడు కనబడుచున్న దృశ్యముపట్ల భ్రాంతిని కలుగజేస్తోంది. అందుకే 'శాస్త్రము' అనే ఉపకరణం చేత 'వివేక జ్ఞానము' అనే దీపం వెలిగించి, జగత్-స్వరూపాన్ని గమనిస్తే ఇది నిర్వికార చిదాకాశమే కదా - అనే రజ్ఞువు సుస్పష్టమై, తద్వారా సర్వ భయములు తొలగి, 'శాంతి' అనే చిదాకాశరసాస్వాదన సిద్ధించుటయే ఈ “జగత్తును జయించటం అంటే!

చూచావా రామచంద్రా! చిదాకాశ స్వరూపుడే అగు ఈ జీవుడు జడునివలె వ్యర్థంగా ఈ సంసారంలో అనేక ఉపాధులతో సంచరిస్తూ నిష్కారణంగా నానావిధ క్లేశాలను కొనితెచ్చుకుంటున్నాడు. శ్రీరాముడు : ఎందుచేత?

శ్రీ వసిష్ఠ మహర్షి : అద్దంలో ప్రతిబింబ రూపంగా అనేక వస్తువులు కనబడునట్లు ఈ జీవుడు తన మనోదర్పణంలో స్వకీయ భావావేశములను జతజేర్చి 'జగత్తు'ను పొందుచున్నాడు. తనయందు తన చేతనే పరికల్పించబడిన జగద్భేదములకు మూలకారణం తన అజ్ఞాన దృష్టియేనని గమనించలేకపోవుచున్నాడు. విచారణ లేకుండా ఉపాధిదృష్టిని కొనసాగించటం చేతనే తన వాస్తవ స్వరూపమేమిటో గాంచుటకు సమర్థుడు కాలేకపోవుచున్నాడు. ఎవరైతే తత్త్వ విచారణ గావించుచూ వస్తారో... అట్టి ధీరుని సమీపమునకు ఆత్మానుభూతి "పరమ పురుషార్థమగు నిజాత్మ జ్ఞానరూపం”

గా తనంతట తానే సమీపించగలదు.

Page:257

ఓ ప్రియ సభికులారా! మీరంతా, విచారణచే జగత్తు నందలి సమస్త పదార్దముల నామరూపములను త్యజించినవారై, అప్పటికీ శేషించి ఉండునట్టి చిన్మాత్ర ప్రకాశమును అవధరించి, అట్టి చిన్మాత్ర ప్రకాశమే ఈ జగత్తు యొక్క వాస్తవరూపమని ఎఱిగినవారై, చైతన్య ఘన స్వరూపులై నిశ్చలంగా ఉండండి.

ఓ ప్రియ స్నేహితులారా! చైతన్యము కంటే భిన్నంగా కనిపించే మాయకములగు ఈ దేహాదులందు ఆసక్తి కలిగి ఉండటం ఏమాత్రం సముచితం కాదని నా మనవి. జలం తన రూపమునే ఆవర్తములుగా (కెరటములాగా) చమత్కారంగా ప్రదర్శించుచున్నట్లు, చైతన్యమే వ్యవహారరూపములను ఆశ్రయించి ఈ జగత్తులను పొందటం జరుగుతోంది.

ఓ రామచంద్రా! కల్పవృక్షం, చింతామణి ఏది చింతనచేస్తే అది ప్రసాదిస్తాయి చూచావా? అట్లాగే చైతన్య రూపుడగు జీవుడు తాను ఏది భావిస్తే అదియే సిద్ధించుకోవటం జరుగుతోంది. ఆతని అభిలషితమును అనుసరించే జగత్తు (లేక దృశ్యము) ఆతనికి ప్రాప్తిస్తోంది. ఈ విధంగా దృష్టి ఒక విషయం నుండి మరల మరొక విషయం వైపు విరామం లేకుండా పొందటమే జగత్

ప్రాప్తి. అయితే విషయము - - విషయముల మధ్య ఏ నిర్వికార - - నిర్విషయ స్థితి ఉన్నదో, నీలంగా అదియే చిదాకాశము యొక్క సామీప్య రూపము. అట్టి నిర్విషయ చిదాకాశమునందు ఈ జగత్తు

ఉన్నది. ఇక ఈ జగత్తు ఏకమా, అనేకమా, నిర్విషయమా, సవిషయమా, ద్వైతమా, అద్వైతమా

- అనే ప్రశ్నలకు తావెక్కడిది? శూన్యమగు ఆకాశము నీలంగా అగుపిస్తున్నట్లు... అవయవ వర్జితము, దృశ్యరహితము, అనంతము, ప్రకాశపూర్ణము అగు చైతన్యము యొక్క నిర్మలకాంతియే జగత్తు రూపంగా స్ఫురిస్తోంది.

కాబట్టి రామచంద్రా! చిదాకాశంలో 'సృష్టి' అనేది ఉత్పన్నమవటానికి మరొక కారణమంటూ ఏదీ లేదు. కనుక స్వప్నంలో కనిపించే దృశ్యంలాగానే ఈ జాగ్రత్ నందలి దృశ్యము కూడా ఆద్యస్వరూపమగు చైతన్యమే అయివున్నది. నిర్మల చైతన్యమునకు అన్యంగా జగత్తు అనబడేది అణుమాత్రంగా కూడా లేదు.

11. దృశ్యమును నమ్మి ఉండటం వ్యర్థమే!

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ ప్రియ రామచంద్రా | విషయ వర్జితము, చిన్మయము అగు నీ స్వరూపమే ఈ ప్రపంచమున నలుమూలలా భాసించుచున్నదయ్యా! జీవుని స్వస్వరూపమే ఆతనిచే గ్రహించబడే జగత్తు. కనుక ఇక్కడ కనిపించే ...

చేతనము” చేత్యము” (ప్రకాశింపజేసేది(ప్రకాశనము - (ప్రకాశ్యముతెలుసుకొనేది) తెలుసుకోవటం) తెలియబడేది)

Page:258

ఈ మూడు కూడా (త్రిపుటి) శుద్ధ చిదాత్మరూపమే అయి ఉన్నాయి. చిదాత్మరూపము మార్పు చేర్పులు చెందేది కాదు. కనుక జీవన - మరణములు, ఆ రెండింటి మధ్య కనిపించే జాగ్రత్ - స్వప్న - సుషుప్తులు, వాటి వాటి యందు కనిపించే అనేక విషయ పరంపరలు - ఇవన్నీ కూడా ఎప్పుడో గతించిపోయిన వాటివలె స్వప్న తుల్యములు మాత్రమే.

అతో జీవన్నపి మృత ఇవ సర్వో పతిష్ఠతే

అసావహం చ త్వం చేతి జీవన్తో _ పి మృతా ఇవ ! ఈ దృశ్యము నిశ్చల-నిర్వికల్ప చైతన్యము యొక్క రూపమే కాబట్టి ఇదంతా శాంతైశ్వర్య మయమే! నేను, నీవు, ఈ సభికులు - అందరూ కూడా - జీవించి ఉన్నప్పటికీ ఈ సర్వ వ్యవహారములకు అతీత స్వరూపులమే, (లేక) మరణించిన వారమే అగుదుము. ఎందుకంటే జీవమునకు సంబంధించినవారమైనట్టి మన స్వస్వరూపము కాలమునకే సాక్షి అయివున్నది. మనం స్థితి పొంది ఉన్నప్పటికీ, మన స్వస్వరూపం స్థితి - గతుల సాక్షి స్వరూపమే కాబట్టి, (సర్వ సంబంధముల దృష్ట్యా మన స్వరూపం సర్వదా అతీతమైనదే కాబట్టి) మనమంతా "జీవించుచూ మరణించినవారమే అగుచున్నాము ...అని ఇక్కడ చమత్కారంగా చెప్పుచున్నాను. ఓ రామచంద్రా! ఈ సమస్త పదార్థములు, స్థావర జంగమ జీవ రూపధారులు, కాష్ఠమగు మౌనరూపాత్మ స్వరూపులే. ఎవరమూ జగత్ పరిమిత రూపులం కానేకాదు. బాల్యం వార్ధక్య సమయానికి స్వప్నసదృశం అయినట్లే జ్ఞానదృష్టి సంతరించుకున్న వానికి వర్తమానము కూడా స్వప్న మాత్రంగా ఎఱుగబడుచున్నది. చూచావా! రామచంద్రా! ఈ కనబడే స్థావర జంగమాత్మకమగు సమస్త పదార్థములు పైకి వ్యవహారయుక్తమై కనిపిస్తున్నప్పటికీ - అంతయూ నిర్లిప్త చిదాకాశరూపమే అయివుండటం చేత, - ఇవన్నీ కూడా మృతుని దేహము వలె, కట్టెపుల్లవలె (కాష్ఠమువలె) అత్యంత మౌనము వహించియే ఉన్నాయి. ఇవన్నీ ఆకాశమువలె సర్వదా నిరాకారములే అయివుండి సాకారమువలె కనిపిస్తున్నాయి. ఆకాశము వాస్తవానికి శూన్యరూపమే అయివుండి నీలత్వంగా కనిపిస్తోంది కదా! అట్టి నీలత్వము మిథ్యయే కదా! ఆకాశమున నీలత్వమనేది అసలు ఎట్లా ఉండగలదు చెప్పు? అక్కడ నీలపు రంగుగల పదార్థమేదీ లేదు కదా! అట్లాగే ఈ జీవులయందు, పదార్థాదులయందు, బాహ్యమందు కనిపించే వ్యవహారత్వము, గుణాదుల సంరంభము, కర్మఫలానుభవ వ్యవహారములు - ఇవన్నీ జీవుని పట్ల కనిపించటమనేది శూన్యాకాశంలో కనిపించే నీలత్వమువలె భ్రమ మాత్రమే! వాస్తవానికి ప్రతి జీవుడు "పరమశాంతము, కాష్ఠమౌనము, శవ నిశ్చలము, ఆకాశమువలె నిరాకారము” ఇవన్నీ తన స్వభావమే అయివున్న చిదాకాశ రూపుడే అయివున్నట్లు ఆత్మీదృష్టికి సుస్పష్టమే! అట్టి శాంతి, మౌన, నిశ్చల, నిరాకార స్వరూపమును సర్వజీవులపట్ల దర్శిస్తూ ఆస్వాదిస్తూ ఉండు. అంతేగాని మిథ్యయగు ఈ గుణాదులు, వ్యవహారాదులు చూచి భ్రమ చెందవద్దు.

శ్రీరాముడు : స్వామీ! దృశ్య జగత్తులో సుఖ-దుఃఖాలు, మాన-అవమానాలు, జన్మ-మృత్యువులు, మంచి-చెడులు, కార్య సంరంభములు కలిగివుండి జీవులంతా సంచారాలు చేస్తున్నారు కదా! అట్టి

Page:259

ఈ జగత్తు - - ఇందలి జీవులంతా కూడా, (మరియు) సర్వ పదార్థములతో సహా - శాంత - - మౌన

. నిశ్చల - నిరాకార స్వరూపమని ఎట్లా సిద్ధాంతీకరిస్తున్నారు?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఈ రెండు సిద్ధాంత వాక్యములను గమనించు.

1. చిదాకాశము సర్వదా మార్పు - - చేర్పులు లేనిదై, నిర్వికారమై, పరమశాంతమై, కాష్ఠ (కొయ్యవలె) మౌనము వహించియున్నదై, పరమ నిశ్చల స్వరూపమై, గుణాదులచేత గాని -

వ్యవహారాదులచేతగాని - కార్యక్రమ సంరంభములచేతగాని స్పృశించబడనిదై ఉన్నది.

2. ఈ జగత్తంతా కూడా ఇందలి సర్వజీవుల - పదార్థములతో సహా సర్వదా చిదాకాశ స్వరూపమే అయివున్నది.

నేను నిర్వికల్ప చిదాకాశ స్వరూపుడనే" - అని గ్రహించినవానికి జగత్తు యొక్క పరమశాంత - చిదాకాశ స్వరూపం అత్యంత సుస్పష్టంగా అనుభూతమౌతుంది. (లేదా) ఈ జగత్తు వస్తుతః సర్వదా నిశ్చల చిదాకాశ స్వరూపమే" - - అని అనుభూత మొనర్చుకొనిన వానికి స్వకీయ నిర్లిప్త మహామౌన చిదాకాశ స్వరూపము అనుభవ సిద్దమౌతుంది. ఈ రెండూ ఒకదానిచే మరొకటి, ఒకదాని వెనుక మరొకటి స్వయంగా దృష్టియొక్క పవిత్రతచే ఒనగూడుచున్నాయి.

ఇక ఈ జగత్తులో దృష్టికి కనిపించే చంచలత్వము, ద్వంద్వత్వము, వ్యవహారత్వము సుఖదుః ఖాలు, సంచిత ఆగాములు మొదలైన దృశ్య సంరంభమంతా ఎటువంటిదంటే... నిరాకారము, శూన్యము అగు ఆకాశము కేశాకారములు (వెంట్రుకల వలె గీత లేవో ఉన్నట్లు, ముత్యపు మెరుపులు) ఉన్నట్లు అగుపించటం వంటిది.

సర్వదా నిశ్చల - నిరాకార స్వరూపమే అయిన జలంలో తరంగాది ఆకార - సంరంభములు కనిపించటం వంటిది. కాబట్టి రామచంద్రా! బాహ్యమున జీవులలో కనిపించే వ్యవహార సంరంభమంతా "ఇది మిథ్యయే కదా!... అని ఒకానొక గుణాతీత - వ్యవహారాతీతమైన దృష్టిని పెంపొందించుకున్నవాడవై ఈ జనులు, ఈ జగత్తు పరమశాంతమగు చిదాకాశమే... అను దర్శనమును ప్రవృద్ధపరచుకో.

తథైవ అస్మిన్ జగత్ నామ్ని చిత్వ్యోమ్ని కచనే చితే అనుభూతేపి నిఃశూన్యే కాస్థా? అస్థాభావ కశ్చ కః ॥

ఈ దృశ్య జగత్తు కంటికి కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇందులో వస్తుత్వము లేదు. ఆకాశంలో భ్రమచే ముత్యములు కనిపించవచ్చుగాక! అది నిజమా? కాదు. ఈ కనబడేదంతా చిదాకాశం యొక్క స్ఫురణరూపం మాత్రమే! అనగా చిదాకాశ స్వరూపుడగు జీవుని యొక్క స్వకీయ స్ఫురణచేత ఇది ఇట్లు స్ఫురిస్తోంది. స్ఫురణ మాత్ర రూపమై, వాస్తవానికి సర్వదా శూన్యరూపమే అయి ఉన్న ఈ జగత్తులో ఏ ఒక్కదానియందైనా భోగాసక్తి ఎందుకు? ఉండవలసిన పని ఏమున్నది? భోగాసక్తిని కలుగజేసే పదార్థాలేమి ఉన్నాయి?

ఓ చిదాకాశామృత స్వరూపులగు సహోదర జనులారా! నా ఈ వాక్యాలు జాగరూకులై వినండి. చిద్రూపం (స్ఫురణ రూపం) అనే బాలుని యొక్క... కల్పనా జాలమే - - ఈ జగత్తు!

Page:260

ఇందులో కనిపించే పదార్థజాలమంతా, ఈ పృథ్వి మొదలైన వాటితో సహా శూన్యరూపము, నిరర్థకము, మిథ్యాభూతము, భ్రాంతి మాత్రము అయివున్నదని మహాశయులగు మహనీయులు మనకు గుర్తు చేస్తున్నారు సుమా! అట్టి స్వప్న తుల్య - భ్రాంతి రూప జగత్తులో "ఇది నాది ! అది నేను! .... ఇత్యాది రూపంలో ఆసక్తి ఎందుకో చెప్పండి? అజ్ఞానియొక్క కల్పన అజ్ఞానికే రుచిస్తుంది. కాబట్టి అజ్ఞానమే అట్టి ఆసక్తికి మూలమగుచున్నదని గమనించండి.

ఎవరైనా “నాకు బంగారం కావాలి .... అని అనుకుంటే సువర్ణ ఖనిజ ఖండాన్ని తెచ్చి అద్దానిని ప్రక్షాళనం చేస్తే (పుటం వేయటం మొదలైనవి చేస్తే) ధగధగా మెరిసే బంగారం లభిస్తుంది. అలాకాకుండా బొగ్గు ముక్కను తెచ్చి పుటం వేస్తే బంగారం లభిస్తుందా? లభించదుకదా! ఆ ప్రయత్నమంతా వ్యర్థమే కదా! అట్లాగే, స్వభావ సిద్ధమైన ఆనందమును కోరుకొనేవాడు ‘వైరాగ్యము' మొదలైన సాధనలతో దృష్టిని పవిత్రం చేసుకోవాలి. అప్పుడు ఆత్మానందరూపమైన అవిచ్ఛిన్నానందం లభిస్తుంది. అట్టి సాధనలను వదలి నాకు అవి కావాలి, ఇవి కావాలి"... అని అసత్ పదార్థ లాభం గురించి విచారించి జీవితమంతా అసత్ పదార్థములను ప్రోగుచేసి వాటినన్నిటినీ ఒకచోట పెట్టడం కొరకై జీవితమును వెచ్చించి, తద్వారా అవిచ్చిన్నమైన ఆనందం సంపాదించాలంటే అది లభిస్తుందా? వాస్తవమైన ఆనందం లభించకపోగా... 'జీవితము' అనే మహత్తర అవకాశం వ్యర్థమైపోవటం లేదా? ఏ జగత్తెతే చిదాకాశంలో స్ఫురింపజేయటానికి చిదాకాశము కంటే అన్యమైన కారణమే లభించటం లేదో... అట్టి అకారణమాత్రమగు జగత్తు ఎప్పుడు ఉత్పన్నమైనట్లు? ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు? ఎక్కడా లేదు... దృష్టిలో తప్పించి!

అజాతేన, అసతార్థేన భేన వ్యవహరన్తియే |

మూఢా మృతమజాతం వా తనయం పాలయన్తి తే ||

ఒకామెకు పిల్లలంటే ఇష్టం. ఎంతోకాలంగా ఆమెకు సంతానమే కలుగక ఒకప్పుడు మతి స్తిమితం తప్పింది. ఆమె ఒక కొయ్యబొమ్మను తీసుకొని ఇది నా పాపాయి. దీనికి లాలిపోస్తాను. పాలు త్రాగిస్తాను, బజ్జో పెడతాను ...అని బొమ్మను చంకన పెట్టుకొని ఇంటింటికి తిరుగుతూ “ఇది నా బిడ్డ అని చూపుతూ మురిసిపోతుందనుకో! అప్పుడు ఏం అంటాం? "అయ్యో! ఈమె పిచ్చిది" అంటాం కదా!

మరొకామెకు లేకలేక కలిగిన ఏకైక కుమారుడు మరణించినప్పుడు ఒక కొయ్యచెక్కను ధరించి “ఈతడే నా కుమారుడు. ఈతనికి మధుర పానీయాలు తాగిద్దాం రండి ... అని అందరినీ పిలుస్తుంటే ఏమంటారు? అట్లాగే,

మొదలే ఉత్పన్నము కానట్టి - - అసద్రూపములైనట్టి - శూన్యరూపములైనట్టి" - ఈ జగత్ పదార్థముల వెంటబడి దుఃఖ - శోకాది శ్రమలు కొనితెచ్చుకొనే వారిని చూచి విజ్ఞులు ఈతడు మరణించిన శిశువు కొరకై వీథిలో తినుబండారములను వెతికే పిచ్చి తల్లి వంటివాడు ...అని భావిస్తున్నారు.

Page:261

ఎక్కడ పృథివి? ఎక్కడ పదార్థము? ఏది నాది? ఏది నేను? ఇవన్నీ ఎక్కడ పుట్టాయి? ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చాయి? ఎటు పోనున్నాయి? ఈ ఇల్లు - వాకిలి - దేహము ఎవరివి? ఓ ప్రియ జనులారా! ఇదంతా కూడా - చిదాకాశమే తనయందు ఈ జగత్ వస్తుజాలం రూపంలో స్పురిస్తోంది - - అని గమనించ ప్రార్థన!

ఎవరి చిత్తమైతే కార్యము - కారణము అను వ్యాకులత్వము పొందియున్నదో, - అట్టి చిత్తము గలవారి దృష్టికి మాత్రమే ఇక్కడి పదార్థజాలం సత్యమైనట్లు, నిత్యమైనట్లు 'భ్రమ’ కారణంగా అనిపిస్తోంది. అట్టి పసిబిడ్డలు చెప్పే మాటలకు ప్రయోజనమేమున్నది చెప్పు?

స్వప్నంలో పృథివి - ఆకాశం మొదలైనవి లేకుండానే కనిపించే (అనుభూతమగుచున్న) జగత్తూ, ఈ జాగ్రత్లో పృథివి - ఆకాశం మొదలైన వాటితో కూడుకొని కనిపిస్తున్న జగత్తూ... ఈ రెండూ కూడా చిదాకాశ రూపములే అయివున్నాయి. స్వప్నంలో కనిపించే 'చిత్' అనే మణియే ఈ జాగ్రత్లో కూడా అట్టివేయగు అనుభవములు' అనే కిరణ పుంజములతో ప్రకాశిస్తోంది.

కనుక రామచంద్రా! స్వానుభవమే రూపంగా గల చిదాకాశము యొక్క నిరాకార రూపమే ఈ జగత్తు (లేక) ఈ దృశ్యము.

అట్టి నిరాకార దృశ్యము 'భూమి - ఆకాశం' మొదలైన కల్పితమైన నామములతో ఇక్కడ భాసిస్తోంది. 'నిరాకార చిదాకాశ స్వరూపుడగు ఓ రామచంద్రా! నీ చిత్ వైభవము యొక్క ఒకానొక కిరణ పుంజమే ఈ నిరాకార దృశ్యము. నీవే ఇద్దాని స్థానము. ప్రాభవము, మొదలు, మధ్య, అంతము - అంతా కూడా! ప్రతి జీవుని స్వస్వరూప వైభవం ఇట్టిదేనని నీ ద్వారా అందరికీ గుర్తుచేస్తున్నాను.

Page:262

VIII. అవిద్య - అనంత జగత్తు విపశ్చిత్ ఉపాఖ్యానం

1. విపశ్చిత్ రాజ్యం - శత్రు రాజుల దండయాత్ర శ్రీరాముడు : హే మహర్షీ! ఈ దృశ్య రూపమగు జగత్తు ద్రష్ట యొక్క దృష్టిలోనే 'అవిద్య' అను రూపంగా పరిఢవిల్లుతోందని శ్రీ వసిష్ఠవాక్య సారాంశంగా నేను గమనిస్తున్నాను. ఈ విధంగా స్వప్న నగరంలాగా విద్యమానమై ఉంటూ, వాస్తవానికి చిదాకాశ రూపమే అయివున్న ఈ అవిద్య ఎటువంటిదో దృష్టాంతపూర్వకంగా మరికొంత బోధించవలసినదిగా నా విన్నపం.

ఈ దృశ్యరూప జగత్తు ఎప్పటికి నశిస్తుంది. ఇది అజ్ఞానానికి ఎంతకాలం విషయమై కొనసాగుతూ పోతుంది? ఇది ఏ రూపంగా వర్తిస్తోంది? ఈ అవిద్యా దృశ్య జగత్తు యొక్క విస్తారం ఎంతవరకు? పరిమితి ఏమిటి? అంతు ఎక్కడ?... ఈ విషయాలు తెలియజేయండి.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అవిద్య ఉన్నంత వరకు ఈ ఆకాశము - భూమి మొదలైన వాటితో కూడుకొని కనిపించే దృశ్యరూప ప్రాప్తి కొనసాగుతూనే ఉంటుంది. ఇక దేశతః - కాలతః చూస్తే బ్రహ్మము వలెనే ఈ దృశ్యము కూడా అనాది, అనంతము కూడా! ఈ 'దృశ్యము అనంతము’ అని వేదాంత వాఙ్మయం ప్రకటిస్తోంది. ఇది నిరూపిస్తూ ఇప్పుడు నేను చెప్పబోయే విపశ్చిత్ మహారాజు చరిత్రను శ్రద్ధగా ఆలకించు.

అనంత చిదాకాశము యొక్క ఒకానొక కోణంలో ఎక్కడో ఒదిగివున్న ఒకానొక వస్తువులో గల ఒక ప్రదేశంలో స్వర్గ-భూ-పాతాళాలతో కూడిన ఒక బ్రహ్మాండ జగత్తు ఉంది. మన త్రైలోక్యం లాగానే ఆ త్రైలోక్యంలో అనేక రాజ్యాలు, వ్యవస్థలు పరిఢవిల్లుతున్నాయి. ఆ జగత్తులో ఒకచోట గల ఒక భూప్రదేశంలో 'తతమితి' అనే ఒక సుప్రసిద్ధ నగరం విరాజిల్లుతోంది. ఆ నగరాన్ని, అది ఉన్న రాజ్యాన్ని 'విపశ్చిత్' అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆ విపశ్చిత్తు మహారాజు రాజులలో గొప్ప ఖ్యాతి పొంది ఉన్నాడు. అనేక శాస్త్రములలో పారంగతుడు. ఆయన సభలో గొప్ప పండితులు, కళాకారులు, విజ్ఞులు ఉన్నారని లోకవిఖ్యాతి. సరోవరంలో రాజహంస వలె ఆతడు స్వయంగా సాహిత్య, గానాదుల యందు ప్రావీణ్యుడై ఆ సభాసదనానకే ఒక మణిభూషణమై ఉంటాడని అక్కడి ప్రజలు ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు. అనేక మంది కవులు ఆయన గుణసంపత్తిని గ్రంథాల రూపంగా రచించారు. తనను ఆశ్రయించిన వారిని ఆనందింపజేసి పంపించటం ఆయనకు దైనందిన అలవాటు. ఆ విపశ్చిత్ మహారాజు యొక్క సంపద ఆతని ప్రతాపసామర్థ్యముల ప్రాభవంచే ఎప్పుడూ ప్రవృద్ధి పొందుతూ ఉండేది.

Page:263

ఆతనికి బ్రాహ్మణుల పట్ల భక్తి - - ప్రపత్తులు ఉండేవి. బ్రాహ్మణ రూపుడగు అగ్నిదేవుడు ఆయనకు ఇష్టదైవం. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆయన అగ్నిదేవుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉండేవాడు. అగ్నిదేవుడు తప్ప ఆతనికి మరొక దైవం తెలియదు.

ఆతని రాజ్యపు నాలుగువైపులా నలుగురు మంత్రులు సముద్రం వంటి సేనా సమూహంతో విపశ్చిత్ రాజ్యమును కాపాడుతూ ఉండేవారు. ఆ రాజు ఎంతో నిశ్చింతంగా ప్రజలకు సర్వవిధాలా సానుకూల్యంగా రాజ్యపాలన కొనసాగిస్తూ ఉండగా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి.

ఒకానొకరోజు రాజమందిరంలో దేవేంద్రుని వలె ప్రకాశిస్తూ ఆ విపశ్చిత్తు పరమశాంతంగా పరిపాలనా వ్యవహారం నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇంతలో ఉత్తరదిక్కు నుండి వచ్చిన ఒక సైనికుడు రాజ మందిరంలో ప్రవేశించి రాజుగారికి ప్రణామంచేసి రాజాజ్ఞ తీసుకొని ఇట్లు చెప్ప ప్రారంభించాడు: ఉత్తరదిక్కు నుండి వచ్చిన దూత : హే మహారాజా! మీకు సర్వదా దిగ్విజయమగు గాక! ఉత్తర దిక్కు సైనిక సమూహమునకు వార్తాహరుడిగా సేవలందించే నేను మీ సంతోషమును అనుకూలం కానట్టి వార్తలను మీ సమక్షంలో చెప్పటానికి అనుజ్ఞ ఇవ్వండి.

1. మీచే నియమితులై సర్వదా రాజభక్తితో మిమ్ములను సేవిస్తూ మీచే మెప్పుపొందుచూ, మిమ్ములను దైవసమానంగా ఆరాధించే మన రాజ్య ఉత్తర దిక్కు సేన యొక్క సేనానాయకుడు, మాకు ప్రియతమ నాయకుడు అయిన సామంతులవారికి అకస్మాత్తుగా విషజ్వరం సోకింది.

2. ఉత్తర దిక్కు రాజవైద్యులు వైద్యం అందించినా ప్రయోజనం లేకపోయింది. విషజ్వరం తాకిన కొద్ది గంటలలో "రాజుగారి ఆజ్ఞానుసారం యమపురిపై దండయాత్రకు వెళ్ళారా!"... అన్నట్లు దేహ రాజ్యాన్ని త్యజించారు.

3. ఉత్తర దిక్కుకు పెట్టనికోటగా తన పరాక్రమ - యుక్తులతో మనదేశపు ఉత్తర దిక్కును రక్షిస్తున్న సామంతులవారు మరణించారని తెలియగానే దీర్ఘకాలంగా సమయం కోసం వేచియున్న ఉత్తర సరిహద్దు శత్రు రాజ్యసేన అతికొద్ది సమయంలో యుద్ధ సన్నిద్ధమై దండయాత్రకు వచ్చింది.

4. అసలే నాయకుని హఠాన్మరణ సంఘటనను జీర్ణించుకోలేక విషాదగ్రస్తులై ఉన్న సైనిక పటాలాలకు అకస్మాత్తుగా యుద్ధ భేరీ నినాదాలు వినిపించాయి. ఈ వార్త మీకు జేరవేర్చే సమయం కూడా లేకుండాపోయింది. ఊహించటానికి కొంచెం ముందుగా సూచన కూడా ఇవ్వని శత్రు సైనికుల యుద్ధ సంరంభాన్ని మన సైనికులు ఎదుర్కోలేకపోయారు. ఎందరో సైనికులు మరణించారు.

5. ఇదంతా దక్షిణ దిక్కు సామంత రాజుకు తెలియవచ్చే సరికి కొంచెం కాలయాపన జరిగి పోయింది. ఆతడు యుద్ధ సన్నద్ధుడై వచ్చే ప్రయత్నంలో ఉండగా, దక్షిణ దిక్కు శత్రు రాజ్యసైన్యం హఠాత్తుగా దండయాత్ర చేయటం జరిగింది. అప్పుడు మన దక్షిణ దిక్కు సైన్యానికి అక్కడి శత్రు సైన్యానికి జరిగిన యుద్ధంలో అక్కడి మన సామంతరాజు వీరస్వర్గం పొందాడు.

6. పశ్చిమ దిక్కు సేనానాయకుడు ఇది తెలిసి బయలుదేరుతూ ఉండగా మార్గ మధ్యంలో దక్షిణ దిక్కు శత్రురాజుల సేనను ఎదుర్కొనవలసి వచ్చింది. అప్పుడు జరిగిన యుద్ధంలో పశ్చిమ దిక్కును రక్షించే మన సేనానాయకుడు కూడా వీరమరణం పొందారు.

Page:264

ఇట్లు పలికి ఆ వార్తాహరుడు మౌనం వహించాడు. ఇంతలో అంతఃపుర దూత రాజు సమక్షానికి వచ్చి ఇట్ల పలికాడు.

అంతఃపుర దూత : మహారాజులకు విజయమగుగాక! తూర్పు దిక్కున గల మన సైన్యం శత్రువులచే బాధింపబడినవారై తెగిన ఆనకట్ట నుండి వచ్చే జల ప్రవాహంలాగా ఇటువైపుకే వస్తున్నారు.

ఆ మాటలు వినగానే విపశ్చిత్ మహారాజు సింహాసనం నుండి గబుక్కున లేచి నిలుచున్నాడు. ఇక ఒక్కక్షణం కూడా వృథా చేయటం కుదరదని గమనించాడు. అప్పటికప్పుడు ఇట్లా ఆజ్ఞలిచ్చాడు. విపశ్చిత్ మహారాజు : ఓ మంత్రివర్యులారా! ఈ వార్తాహరుల మాటలు విన్నారు కదా! వెంటనే యుద్ధమునకు సన్నద్ధులుకండి. సైన్యాగారం తెరచి సైనికులకు ఆయుధాలు, కవచాలు ఇవ్వండి. పదాతి సైనికులను ఎక్కడెక్కడ నియమించాలో వెంటనే నియమించండి.

ఇంతలో తూర్పు దిక్కు ఉపసేనానాయకుడు ద్వారము వద్ద వేచివున్నట్లు వార్త వచ్చింది. తీసుకొని ఆతడు రాజుగారి మందిరంలో ప్రవేశించాడు. ఆతడి అంగాంగాలు గాయములతో నెత్తురోడుచున్నాయి. బలహీనంగా శ్వాస తీసుకొంటూ ఇట్లా పలికాడు.

తూర్పుదిక్కు ఉపసేనానాయకుడు: మహారాజా! దక్షిణ-పశ్చిమ-తూర్పుదిక్కు సైనికాధికారులు తమ దేహాలను యుద్ధయజ్ఞంలో సమర్పించి మీ సేవలో ధన్యులయ్యారు. ఇప్పుడు మన రాజ్యానికి అన్ని వైపులా శత్రు రాజ్యముల నుండి అకస్మాత్తుగా యుద్ధ విపత్తు వచ్చిపడింది. ఈ శత్రురాజు లందరినీ మీరు ఇతఃపూర్వం జయించి పాదాక్రాంతం చేసుకొన్నవారే కదా! తమకు దుర్జయమైనదేది ఉంటుంది? ఇంతలో ఇంకొక రాజసేవకుడు మందిరంలో ప్రవేశించి వగరుస్తూ ఇట్లా అన్నాడు.

రాజ సేవకుడు : మహారాజా! అనేక మంది శత్రు సైనికులు నగరంలో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. నగర రక్షణకు మీచే నియమించబడిన మహాసేనామాత్యులవారు వారిని నిరోధించటానికి అతికుశలురైన అనేక సైనికులతో వెళ్ళుచూ తమకు ఆ వార్త అందించమని నన్ను ఆజ్ఞాపించారు.

ఇంతలో మంత్రులు, రాజాంతఃపురవాసులు అంతఃపుర సేవక జనులు, తదితర నగర వాసులు అక్కడికి వచ్చారు. అట్లే ఆయుధములు ధరించిన అనేక మంది సైనికులు కూడా అంతఃపురం సమీపించి రాజుగారి ఆజ్ఞానువర్తులు కాసాగారు. జనుల ప్రవాహంచే ఆ రాజాంతఃపురం ప్రాంతమంతా కప్పివేయబడినట్లు అయింది.

2. దేహ సమర్పణ హోమం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఇంతలో మంత్రులందరు మహారాజు సమక్షంలో సమావేశమైనారు. మంత్రులు : మహారాజా! ఇక ఉపేక్షించి లాభం లేదు. ఈ సరిహద్దు రాజులందరు ఆరు నెలల క్రితమే మీ పరాక్రమమును చవిచూచి వెన్నుచూపిన విషయం మరచి ఉంటారు. వారు మీకు

Page:265

శరణాగతులైనప్పుడు మీరు వారిపై సోదర వాత్సల్యం కురిపిస్తూ... "వీరందరు శరణువేడారు కాబట్టి నాకు మిత్రరాజులే అని సభలో ప్రకటించి వారితో కరచాలనం చేసి వారికి వారివారి రాజ్యములను తిరిగి ప్రసాదించిన విషయం మరచి ఈ రోజు మనపైనే దండయాత్ర చేయటం వారి కృతఘ్నతకు తార్కాణం. అట్టి వారిని ఇక ఉపేక్షించి లాభంలేదు. వారికి వారే మీ తపోశక్తి తెలియక మనపై దండయాత్ర చేశారు. అందుచేత వారిని అంతమొందించటం ఇప్పటి మన ధర్మబద్ధమైన ప్రతిక్రియ. అందుచేత యుద్ధ సన్నాహాలకు అనుజ్ఞ ఇవ్వండి.

వీరులకు ఆజ్ఞ ఇవ్వబడునుగాక! సామంతులందరికీ కబుర్లు పంపుదాం. మీ ధనుష్టంకారాలు విని చెవులు చిల్లులు పడుతూంటేగాని వారు చేసిన తప్పేమిటో వారికి తెలిసిరాదు. అందుచేత మేము యుద్ధంలో ముందుగా ప్రవేశించటానికి అనుజ్ఞ ఇవ్వండి. ఆ సరిహద్దు శత్రురాజుల తలకాయలు తెచ్చి మీ పాదాల ముందు ఉంచటమే ఇప్పటి మా తక్షణ కర్తవ్యం.

విపశ్చిత్ మహారాజు : ఓ మంత్రులారా! మీ ధైర్య సాహసాలు ఎంతటివో మాకు తెలుసు. మీరు యుద్ధ భూమిలో ప్రవేశించి వారిని కొద్ది సమయం నిరోధించండి. కొంతసేపటిలో నేను నలువైపులా యుద్ధంలో ప్రవేశిస్తాను. శత్రురాజుల శిరస్సులను మన సింహద్వారానికి తోరణాలుగా తగిలిద్దాం. ముందుగా నేను స్నానం చేసి అగ్నిదేవుని పూజించి నలుదిక్కులా యుద్ధరంగంలో ప్రవేశిస్తాను.

మంత్రులు వెంటనే ఆయుధాలు ధరించి అక్కడి నుండి బయలుదేరారు. సైన్యమును నలు దిక్కులకు విభాగించి యుద్ధానికి ఉపక్రమించారు. మహారాజు అక్కడి నుండి అభ్యంతర మందిరంలో ప్రవేశించి అగ్నిగుండం రగిలించి మంత్రముగ్ధంగా అగ్నిదేవుని ఆహ్వానించి సశాస్త్రీయంగా ఆదరం గాను, శక్తిశ్రద్ధలతోను పూజించాడు. అగ్ని భగవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేసి పూజా క్రమం పూర్తి చేశాడు. ఆ తరువాత మోకాళ్ళపై యోగాసనపూర్వకంగా నిలబడి అగ్ని భగవానుని ఇట్లు ప్రార్థించాడు.

విపశ్చిత్ మహారాజు : హే అగ్నిదేవా! త్రికరణ శుద్ధిగా నా ఇష్టదైవమైనట్టి మీకు అనేక ప్రణామాలు. స్వామీ! మీకు భక్తుడనైనంతమాత్రం చేతనే నా జన్మ తరించింది. మీ కరుణా కటాక్ష వీక్షణముల ప్రభావం చేత నేను అనాయాసంగా అనేక విలాస వైభవములు అనుభవిస్తూ ఇప్పటిదాకా మీచే ప్రసాదించబడిన జీవితంతో ఆయుస్సు గడిపాను. మీరు ప్రసాదించిన బల - ఐశ్వర్యములచే అనేక మంది రాజులను పాదాక్రాంతం చేసుకొని పది దిక్కులలోను ఈ రాజ్యమును విస్తరింపజేశాను. అనేక యుద్ధయాత్రలు ప్రారంభించి మీ పూజా ప్రభావం చేత దిగ్విజయుడనయ్యాను. ఈ భూమండలం అంతా ఈ రాజ్య పతాకాన్ని ఎగురవేశాను. సుదీర్ఘకాలం ఈ రాజ్యం ప్రజారంజకంగా పాలించి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాను. భూనభోంతరాలలో కీర్తి ప్రసరించింది. యుద్ధంలో విజయుడనై సంపాదించిన అపార ధనరాసులతో పూజ్యులగు బ్రాహ్మణుల, మిత్రుల, సుహృతనుల, రాజ్య ప్రజల ఇళ్ళు నింపివేశాను. "ఆ రాజ్యంపై దండయాత్ర చేయాలి... అని సభలో నిర్ణయించిన కొద్దిసేపటికే ఆ వార్త విన్న అనేకమంది రాజులు తమను తాము మా రాజ్య

Page:266

సింహాసనమునకు సామంతులుగా ప్రకటించుకొని వచ్చి కప్పం కట్టిన సందర్భాలు అనేకం. అదంతా మీ చలవేగాని నా గొప్పతనం కాదు. మీ దయచే ఇంతకాలం ధర్మ-అర్థ-కామములను ఒకదానితో మరొకటి విరుద్ధం కాకుండా సంపాదించి అనుభవించాను. ఆశ్రితులకు పంచిపెట్టాను. బాల్య - యౌవనాలు తీయటి కలలుగా గడిచిపోయాయి. ఇప్పుడు ఆకు చివర వ్రేలాడే ఒక మంచుబిందువు వలె ఎప్పుడు నేల రాలుదామా! అను భావనచే పూత వేయబడే వార్ధక్యం ఈ దేహమునకు రానే వచ్చింది. ఈ వృద్ధాప్యంలో ఈ మనస్సు విశ్రాంతిని పొందుతూ అంతఃపురంలో ప్రశాంతంగా గడపవలసిన సమయంలో యుద్ధ నినాదాలు ఎదుర్కొనవలసి వస్తోంది. ఇంతకాలం నా బల పరాక్రమాలను చవిచూచి మా రాజ్య పతాకానికి తలవంచి, నా సుహృత్ భావంచే దేహాలు దక్కించుకున్న నలువైపుల గల సరిహద్దు రాజులు ఒక్కసారిగా కూడబలుక్కుని మా రాజ్యంపై అకస్మాత్తుగా యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. మేము ప్రమత్తులుగా ఉన్న సమయం ఎన్నుకొని అన్ని వైపుల నుండి దండయాత్ర సాగిస్తున్నారు. ఆ నలుగురు రాజులు నాలుగు దిక్కుల నుండి ఒక్కటై వచ్చారంటే ఇకవారు మాకంటే బలవంతులు, భయంకరులు, క్రూరమైన ఉద్దేశము కలవారు అయివుంటారు కదా! కనుక మాకు మాకున్న బలంతో విజయం సాధించటమనేది దుర్లభం, అసాధ్యం అని మాకు అనిపిస్తోంది. మా రాజ్యమును ఆక్రమించి మా ప్రజలపై వారికి గల పగ తీర్చుకోవటం ప్రారంభించారంటే, ఇక మా ప్రజల కష్టాలు ఎట్లా ఉంటాయో మాటలతో చెప్పలేం, ఊహాతీతం కూడా!

ఒకవేళ ఈ యుద్ధంచేసి మేము గెలిచినా కూడా ఎంతో జననష్టం ఇటు మాకు అట సరిహద్దు రాజ్యాలకు అనివార్యం. అతికొద్ది కాలంలో ప్రకృతి సిద్ధంగా ఈ వార్ధక్యం ముగిసి, దేహపతనం జరుగక తప్పని ఈ తరుణంలో నేను రాజుగా కొనసాగే ఏకైక ఉద్దేశము కొరకు ఇంతటి జననష్టం, ఆ తరువాతి దుర్భర పరిణామాలు నా రాజ్య ప్రజలు పొందటమెందుకు?

అందుచేత సర్వాత్మకుడవు, పవిత్రమూర్తివి, నిత్య నిర్మలుడవు, నా ఆరాధ్య దైవమగు ఓ అగ్ని దేవా! ఇటువంటి సందిగ్ధమైన పరిస్థితులలో నాకొక గొప్ప ఉపాయం తోచుచున్నది. ఈ మనుష్యులకు - దేవతలకే కాకుండా అందరికీ విజయ ప్రదాతవు, లోకాల ఉనికికి ఆధారభూతుడవు అయి అందరికీ అన్నీ ప్రసాదించే పరదైవమైన నీకు భక్తి ప్రేమపూర్వకంగా నా ఈ శిరస్సును సమర్పిస్తాను.

పూర్వం యజ్ఞంలో పురోడాశం (మేక తలకాయ మొదలైనవి) సమర్పించినట్లు ఈ రోజు ఈ నా శిరస్సును మీకు సమర్పిస్తాను. హే మహాత్మా! మీరు గనుక నా స్వశిర సమర్పణ అనే భక్తి పూర్వక కర్మచే సంతుష్టులైనారా... అప్పుడు మీ ప్రసాదముచే ఈ నా రెండు కోర్కెలు నెఱవేరుగాక!

1. నా శిరస్సును స్వీకరించబోయే ఈ అగ్నికుండం నుండి నాకు నాలుగు శరీరాలు ప్రాప్తించును గాక! అట్లా ప్రసాదితమయ్యే నాలుగు శరీరాలు శోభచే ప్రకాశించేవి, అతి బల సమన్వితాలు, శత్రువులకు దుర్భేద్యాలు అయివుండుగాక! ఆ నాలుగు శరీరాలతో నలు దిక్కుల నుండి దండయాత్ర చేస్తున్న శత్రు సైన్యమును ఎదుర్కొని అగస్త్య మహాముని సముద్రపానం చేసినట్లు నేను నలుదిక్కుల ఒకేసారి శత్రుసైన్య సముద్రములను పానం చేసివేస్తాను.

Page:267

2. మీ దర్శనం చేసుకొనే కోర్కెతో మిమ్ములను అనునిత్యంగా ఆరాధిస్తూ ఉన్నాను కదా! కనుక పరమ పవిత్రమైన మీ తోడు, మీ దర్శనం నాకు సర్వదా లభించునుగాక !

అలా కాదా ...ఈ శిరస్సును స్వీకరించి నన్ను, నా ఉత్తర జన్మలను పునీతం చేయండి.

ఓ అగ్నిదేవా! ఇదిగో! నా శిరస్సు ప్రీతి పూర్వకంగా ఇవ్వబడుతోంది. స్వీకరించి కరుణించండి. ఇట్లా పలికి ఆ విపశ్చిత్ మహారాజు తటాలున లేచి నిలబడ్డాడు. అగ్నికుండం సమీపించి ఒక్కసారి గాలిలోకి ఎగిరాడు. దేహము గాలిలో ఉండగానే చేత ధరించిన ఖడ్గంతో శిరస్సును - బాలుడు కమలమును త్రుంచినట్లు - త్రుంచివేసి తెగిన శిరస్సుతో సహా దేహమును అగ్ని గుండంలోనికి సమర్పించివేశాడు. అప్పుడు అగ్నిదేవుడు శిరస్సును - మొండెమును హవిస్సువలె స్వీకరించినవాడై సంతుష్టుడైనాడు. మహాత్ములకు సమర్పించినదేదైనా ఒకటికి నాలుగింతలు అవటంలో ఆశ్చర్యమే ముంటుంది? కొద్ది క్షణాలలో ఆ అగ్నిగుండంలోనుంచి చతుర్భుజములు, శస్త్రాస్త్రధారణతో కూడినవి, మహత్తరమైన తేజస్సు పుణికి పుచ్చుకున్నవి అయినట్టి నాలుగు శరీరాలు బయల్వెడలాయి. ఆ నాలుగు శరీరాలు సమానమైన రూపముతో ప్రకాశిస్తున్నాయి. ఆ నాలుగు దేహాలు ఒకే విధమైన కవచ-కుండలాలతో, భూషణములతో ప్రకాశిస్తూ ఒకే ఆశయము కలిగినవై ఉన్నాయి. గొప్ప తెలివితేటలు, సమాన గుణములు కలిగి ఒకే రూపముగల నాలుగు ధనుస్సులతో ఆ నాలుగు శరీరాలు విరాజిల్లుతున్నాయి. ఆ శరీరాలు నాలుగూ శత్రువుల గద శస్త్ర-అస్త్రాదులచే ఏమాత్రం స్పృశింపబడజాలనంత ప్రభావీచికలతో ప్రకాశిస్తున్నాయి.

ఆ విధంగా నాలుగు వేదములవలె నాలుగు శరీరములు ఒకే జీవుడైన విపశ్చిత్ మహారాజు సంపాదించుకున్నాడు. దేహాలు నాలుగు అయినప్పటికీ వాటిని నడిపే జీవుడు ఒక్కడే ... అయ్యాడు.

3. శత్రుసేనల తిరోగమనం

శ్రీ వసిష్ఠ మహర్షి : ఆ విధంగా అగ్నికుండం నుండి అగ్నిదేవుని కరుణచే సంపాదించిన నాలుగు దేహములతోటీ ఆ విపశ్చిత్ మహారాజు అగ్ని భగవానునికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి తన్నో అగ్నిః ప్రచోదయాత్" ... అని గానం చేస్తూ అక్కడి నుండి బయల్వెడలాడు. ఒక్కొక్క దిక్కు వైపుగా నడిపాడు. ప్రతి దిక్కులోని సైనికులంతా, ఆహా! మహారాజే స్వయంగా మన దిక్కుకు నాయకత్వం వహిస్తూ ఉంటే ఇక లోటేమిటి?... అని తలచుచూ యుద్ధ మహోత్సాహులై శత్రుసైన్యంపై విఱుచుకుపడటం ప్రారంభించారు. నాలుగు దిక్కులలోను భీకరయుద్ధం ఆరంభ మైనది. జన్మార్జితంగా ఆర్జించిన తమ తమ శక్తియుక్తులన్నీ పణంగా పెట్టి అనేక మంది వీరులు తమ రాజభక్తికి, దేశభక్తికి చిహ్నంగా యుద్ధం చేసి దేహాలు తృణ ప్రాయంగా సమర్పించారు. ఆ నలు దిక్కులలో సైనికుల మస్తకాలు మందార పూబంతులవలె గాలిలోకి ఎగిశాయి. యుద్ధంకంటే జీవితమే ప్రియంగా తలచిన కొందరు సైనికులు ఆ ఘోరయుద్ధాన్ని చూడటానికి కూడా జంకుచూ వెనకడుగువేస్తూ వెనుకకు పరుగులు తీయటం ఇరు సైన్యముల వైపు కనబడనారంభించింది.

Page:268

విపశ్చిత్ మహారాజు తమ సైన్యం బలహీనపడుచుండటం, ఉత్సాహం కోల్పోవటం గమనించి ఇక తాత్సారం చేయకుండా అగ్నిదేవునిచే ప్రసాదించిన నాలుగు ధనుస్సులను ఉపయోగించి నాలుగు వైపుల నాలుగు ఉపాధులతో శత్రుసైన్యంపై బాణవర్షం కురిపించి శత్రు సైనికులను చీల్చి చండాడటం ప్రారంభించాడు.

విపశ్చిత యొక్క ధనుస్సుల నుండి వెలువడిన మహాక్రేంకార చతుష్టయమువలన ఆకాశంలోని మేఘాలలో ఘీంకారనినాదాలు, దీర్ఘంగా మెఱుపులు ఉద్భవించాయి. శత్రురాజుల గుండెలు 'ఝల్' అనసాగాయి. మహారాజు ధనుస్సుల నుండి బాణవర్షం కురిసింది. చేది దేశపు శత్రు సైన్యం ఆ బాణ వర్షానికి తాళలేక ఛిన్నాభిన్నమై పోయింది. మంత్రించి వదలిన మోహనాస్త్ర ప్రభావం చేత పారశీకదేశపు యుద్ధవీరులు కళ్ళు కనిపించక తమలోతామే ఒకరినొకరు ఖండించుకోసాగారు. దరద దేశపు సైనికులు ఆ శస్త్రాస్త్ర ప్రహారానికి తట్టుకోలేక దుర్దర పర్వత శ్రేణులలోగల గుహలలోకి పరుగులు తీసి దాక్కున్నారు. వారి రక్షణాకవచములు చూర్ణమైనాయి. విపశ్చిత్ రాజు అప్పుడు ప్రయోగించిన వాయువ్యాస్త్ర ప్రభావంచే జనించిన వాయు వీచికలకు శత్రు సైనికులు దూదిపింజాల వలె గాలిలోకి ఎగిరి నేలకూలసాగారు. దశార్ణ దేశ భటుల శిరస్సులు బంతులవలె ఆకాశంలో ఎగిశాయి. శకదేశపు యోధులు రాజు ధనుస్సు నుండి వెలువడిన నల్లని ఇనుప బాణ ప్రవాహం చేత క్రూరంగా హింసించబడి యుద్ధభూమి నుండి పారిపోసాగారు. రమఠ దేశీయులు దిక్కుతోచక దిక్కుదిక్కులకు పరిగెత్తసాగారు. తంగణ దేశసైన్యం శవముల గుట్టలుగా పరిణమించసాగింది. గాంధార, హోది, చీన, కిరాత, కుమారీగణ సైనికులు విపశ్చిత్ రాజుచే విడువబడిన చక్రాయుధ వర్షముచే విచ్ఛిన్నులై తలకో త్రోవగా వెనుతిరిగి పరుగులు తీయనారంభించారు. మహావీరులని పేరుగాంచిన నిలీపదేశపు భిండాజాతి వీరులు అప్పటి శస్త్ర ప్రయోగానికి తాళలేక ఒకరినొకరు త్రోసుకుంటూ వెనుకకు పరుగులు తీయసాగారు. ఈ విధంగా విపశ్చిత్తు యొక్క దాడులచే హూణ, శక, దశార్ణవ, అంగ, తంగణ, సాల్వ దేశ యుద్ధ భటులు శస్త్రాస్త్ర ఘాతాలకు పిచ్చివారివలె గంతులు వేస్తూ వెనుకకు పరుగులు తీయసాగారు.

ఓ రామచంద్రా! ఆ విధంగా ఆ నాలుగు విపశ్చిత్తులు శత్రుసైన్యము వెంటబడి తరుముతూ చాలాదూరం ప్రయాణించారు. ఆ నాలుగు దేహాలు కూడా సమానమైన రూపాలు, అభిప్రాయాలు కలిగి ఉన్నారు. సర్వశక్తియుతుడు, నాలుగు దేహములందు సమానమైన రూపం వహించి ఉన్నవాడు, చైతన్య స్వరూపుడు అగు విపశ్చిత్ జీవుని 'ప్రేరణ' పొంది నలుగురు యుద్ధంలో నలుదిక్కుల శత్రుసైన్యంపై విజయం సాధించారు.

అట్లు జీవాత్మ ఒక్కడే అయివుండి, ఆ విపశ్చిత్ మహారాజు నాలుగు దేహాలు చేతివ్రేళ్ళవలె నడుపుతూ పరాజితులై పారిపోవుచున్న శత్రురాజుల సైనిక పటాలాలను వెంబడించాడు. ఆతని వెంట మంత్రులు కొందరు, మరికొందరు సైనికులు పరుగుతీస్తూ శత్రు సైనికులను వెంబడించసాగారు. అట్లా చాలాదూరం వెంబడించగా ఇంతలో విపశ్చిత్తు నాలుగు దేహాలతోను, మంత్రులతోను,

Page:269

సైనికులతోను నాలుగు దిక్కుల చివరిగా గల నాలుగు మహాసముద్రములను సమీపించారు. అనేకులు మరణించగా కొద్దిమంది శత్రు సైనికులు విపశ్చిత్తు దేహములచే సంధించబడిన విల్లంబులకు భయపడి ఎక్కడెక్కడో దాగుకొన్నారు. ఇట్లా విపశ్చిత్తు నాలుగు దేహములు నాలుగు సముద్రపు తీరాలను చేరుకోగానే ఆతడు యుద్ధంలో దిగ్విజయుడైనట్లయినది. అగ్నిదేవుని ఆజ్ఞానుసారం తమ విధిని నిర్వర్తించి విపశ్చిత్తు మహారాజుకు విజయము చేకూర్చటం పూర్తి అయింది కనుక ఆతని శస్త్రాస్త్రములు ఉపసంహారము పొందినవై శమించినవై అంతర్థానమైనాయి. అగ్నిదేవ ప్రసాదితమైన రథ-అశ్వ గజ బలగమంతా అగ్నిదేవుని సంకల్పానుసారం నిజస్థానమగు ప్రకృతిలో లీనమైపోయాయి. మరికొన్ని చేష్టారహితమైపోయాయి. అయితే నాలుగు దేహాలు మాత్రం నాలుగు సముద్రముల తీరాల విజయానందముతో నిలబడివున్నాయి.

అప్పుడు ఆ నలుగురు విపశ్చిత్తులు నాలుగు సముద్రాల తీరాలను ఉన్నవారై ఎదురుగా నలుదిక్కులా విస్తరించివున్న మహాసముద్రాలను చూచారు. ఆ మహాసముద్ర తరంగాలు ఆకాశాన్ని అంటుతూ భీకర ఓంకార నినాదాలు చెయ్యటం వారు గాంచారు. అక్కడ కనిపించే వనములను, పర్వత ప్రదేశములను, ప్రకృతి సౌందర్యమును చూపుచూ మంత్రులు, సామంతులు మహారాజుకు అనేక విశేషములు వర్ణించి చెప్పసాగారు.



తూర్పు దిక్కు మంత్రులు చూడండి మహారాజా! ఈ మహాసముద్రపు ఉన్నత తరంగాలు ఎంత వేగంగా ఆ పర్వతప్రదేశాలను తాకుతూ ఝంకార శబ్దాలు చేస్తున్నాయో! ఆ చంద్రబింబం సముద్ర దేవత ధరించిన చూడామణిలా ప్రకాశిస్తోంది. అక్కడి ద్వీపములో సముద్ర జీవులు చంద్రకిరణాలు ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా నేలపై దొర్లుచున్నాయి. ఈ కనబడే దృశ్యం - దృష్టికంటే వేరుగా లేకున్నప్పటికీ ఉన్నట్లే ప్రవర్తించునట్లు - సముద్ర జలంకంటే వేరుగాని సముద్ర కెరటాలు సముద్ర జలమును ఎంతగా సంక్షోభింపజేస్తున్నాయి.

గుహా గులుగులు ఆవర్త నిరోషాశనిభీషణాన్ |

భృశం భావయతో గ్రస్తాన్ అగస్త్యార్వా అనిలానివ ॥

కొండ గుహలలోకి ప్రవేశించే సముద్ర జల ఘోష, సముద్రజలాన్ని అగస్త్య మహర్షి ఆపోశన పట్టే సమయంలో జనించిన తరంగ ఘోషను తలపిస్తోంది కదా!

అత్రోప శైలవన వీథిషు పుష్పశయ్యా విద్యాధరీ విరచితాః పరివర్ణయన్తి పార్శ్వద్వయస్థ పరివృత్త పదాత్ సముద్రాత్ వ్యావృత్త ముగ్ధ వనితా పురుషాయితాని || అదిగో, అటుచూడండి. అక్కడ పుష్పశయ్యలను విద్యాధరులు తమ 'రతి క్రీడ కొరకై నిర్మించారు కాబోలు. గండశిలలపై కనిపించే ఆ పుష్పశయ్యలు, అక్కడి మిలమిల మెరిసే విద్యాధరుల పాద చిహ్నములు చూస్తుంటే రతిలో పురుషుడు శ్రమ పొంది ఉండగా, అది గమనించిన ముగ్ధవనిత అధో ప్రదేశం నుండి ఊర్ధ్వపు ప్రదేశానికి వచ్చి రతిక్రీడను కొనసాగిస్తున్నట్లు కనబడటం లేదూ!

Page:270

మరొక సామంతుడు (పడమర సముద్రపు ఒడ్డుజేరిన విపశ్చిత్తుతో) : మహారాజా! అటు చూడండి. శృంగార క్రీడలందు ఆసక్తులైన కిన్నెరులు శృంగారరస ప్రభావంచే పరిసరాలు మరచి మధురగీతాలు ఆలాపిస్తున్నారు. ఆహా! ఈ సముద్రం ఎంత విస్తారమైనది! ఒకవైపు మహావిష్ణువు, మరొకవైపు పక్షుల సమూహం, ఇంకొక వైపు పుష్కరావర్త మేఘాలు ఆక్రమించుకున్నాయి కదా!

ఇంకొక దిక్కు సామంతుడు (ఉత్తర దిక్కు సముద్రం సమీపించిన విపశ్చిత్తుతో) : అదిగో! ఆ కనబడే మేరు పర్వత శిఖరాలలో దేవతాలోకాలున్నాయి. మనుష్యులు అటు వెళ్ళజాలరు కదా! కనుక ఉత్తర దిక్కుగా భూమి ఉన్నంత వరకు మీరు జయించినవారయ్యారు.

వేరొక సామంతుడు (దక్షిణ దిక్కు సముద్రం సమీపించిన విపశ్చిత్తుతో) : మహారాజా! మనం భూమి యొక్క దక్షిణ దిక్కు అంచువరకు శత్రురాజులను దునిమి మరల మన రాజ్య స్థాపన చేశాం. వెన్నముద్దవలె శరీరం కలిగిన చంద్రుడు నక్షత్ర కాంతలతో క్షీర సముద్రంలో జలకాలాడుచున్నట్లు న్నాడు. ఇక్కడి మలయమారుతం అనేక పుష్ప సుగంధాన్ని వెంట నిడుకుని మన ముక్కు పుటాలను సుఖశ్వాసమయం చేస్తూ మనకు అతిథి మర్యాద చేస్తున్నదికదా! అటు చూడండి. ఆ శబరి స్త్రీ మంచేಲಜ್ విహీన అయి ఆ పురుషుని పదే పదే ఆలింగనం చేసుకొను చున్నది. మనను ఎంత గానో అలరించే మలయమారుతం ఆ విరహిణికి వేడిగాలుల వలె అగుచుండటం చేత ఆమె బుగ్గల నుండి నునువెచ్చని శ్వేద బిందువులు జాలువ్రాలుచున్నాయి. ఇక్కడి జనుల అనాగరకత గమనిస్తే నాగరకత ఉన్నంత వరకూ మన రాజ్యం మీ బలపరాక్రమాల ప్రభావంచే విస్తరిల్లినది అగుచున్నది. అయ్యో! తెల్లవారబోవుచున్నదే! ఈ నా ప్రియునితో సంభోగానికి విఘాతం కలుగనున్నదే” ... అనే ఆక్రోశం, ఆతురత ఆ శబర స్త్రీలలో కనపట్టుచున్నదే! వారికి జాతిరీత్యా ప్రియునితో సంభోగం నాగరకుల వలె రహస్యమైన విషయమే కాదు కాబోలు! ఈ పర్వత గుహలు బ్రహ్మదేవుని విశ్రాంతి కొరకై నిర్మించబడిన అమృత పూర్ణములగు మండపములవలె విరాజిల్లుచున్నాయి కదా! అటు ఆకాశంలోకి చూడండి. యుద్ధంలో వీరమరణం పొందిన మన యొక్క - మన శత్రురాజుల యొక్క యుద్ధ వీరులను అప్సరసలు ఆకాశమార్గంలో వీరస్వర్గానికి గొనిపోవుచున్నట్లుగా ఉన్నది.

ఇంకా ఆ నలుగురు విపశ్చిత్తులతోను తూర్పు పడమర-దక్షిణ-ఉత్తర దిక్కుల అంచులకు వేరువేరుగా అనుసరించిన ఉపనాయకులు, సామంతులు ఇట్లా సంభాషించుచున్నారు.

విజిగీషోః పునఃప్రాప్తే సంకటే ప్రకటే రణే॥

ధర్మ్యం విరాజతే యుద్ధం యౌవనే సురతే యథా ॥

హే చక్రవర్తీ! విపశ్చిత్తు మహారాజా ! మాకిప్పుడు ఎంతగానో సంతోషంగా ఉన్నది. మన మహారాజ్యానికి అకస్మాత్తుగా ఒక్కసారిగా నాలుగువైపులా సరిహద్దు దేశముల నుండి యుద్ధ ఉపద్రవం ముంచుకొచ్చింది. అయినా కూడా మీ తపోశక్తి ప్రభావం చేత, బల పరాక్రమముల ప్రాభవం చేత మనం ధర్మయుద్ధం చేశాం. యౌవనంలో రతి ఎంతగా శోభిస్తుందో... ధర్మయుక్తంగా ఇటువంటి పరిస్థితులలో యుద్ధం చేసి విజయం సాధించటం అంతటి శోభాయమానంగా ఉంటుంది.

Page:271

లోకైః అనిందితా లక్ష్మీః ఆరోగ్యం శ్రీసమన్వితమ్ | ధర్మ్యం యుద్ధం పరార్థేన జీవితస్య ఉత్తమమ్ ఫలమ్ II

1. లోకులచే అనిందితమైన సంపద, 2. సంపదతో కూడిన ఆరోగ్యం, 3.ప్రజల కొరకు ధర్మపూర్వకమైన యుద్ధం ...ఈ మూడు లభిస్తే, జీవితాలు సాఫల్యం పొందుతాయి. ఇప్పుడు మన ప్రజలకు మీ ప్రభావం చేత ఈ మూడు లభిస్తున్నాయి. ధర్మవిరుద్ధంగాని యుద్ధంలో శత్రువులకు ఎదురుగా నిలిచి పోరాడి తమ ప్రాణములను తృణప్రాయంగా సమర్పించిన మన యుద్ధ వీరులే వీరస్వర్గమును పొందటానికి అర్హులౌతారుగాని, తదితరులు కాదు కదా!

వ్యోమాద్యపి ప్రకృతి - వికృతిం నామ నాయాత్య సంభ్యైః | అన్తః సారాశయ గుణవతాం లక్ష్యతే నో మహిమ్నః ॥

మేఘ సమూహాలు, ప్రళయాగ్నులు, పర్వతాల రెక్కల విన్యాసాలు, నక్షత్ర గణాల సంఘర్షణలు, సురాసురుల యుద్ధ భేరీలు ... ఇటువంటి అనేక సంక్షుబ్ధములు జరుగుచున్నా ఆకాశం సర్వదా ప్రశాంతంగానే ఉన్నది కదా! ఉత్తమ గుణశీలురగు మహాత్ముల మహిమ ఈ సంసార సంరంభమును పొందుచున్నప్పుడు కూడా అంతటి ప్రశాంత శీలత్వం వహించి ఉంటుందని మన శాస్త్రములు అభివర్ణిస్తూ ఉంటాయి కదా! లోన మాలిన్యం లేనప్పుడు బయట మాలిన్యం ఏమీ చేయజాలదనటానికి ఈ ఆకాశమే దృష్టాంతం. జ్ఞాని సర్వదా సుఖవంతుడే అయివుంటాడు. ఈ సంసార పటాటోపం ఆతని అంతరాన్ని స్పృశించనైనా లేదు. ఓ ఆకాశమా! పగలు ప్రకాశమానంగాను, సాయంకాలం ఎఱుపుగాను, రాత్రియందు నల్లగానూ కనబడే నీవు ఏ సద్వస్తువు ధరించిన దానివి అయివున్నావు? నీ యొక్క రంగు, తత్త్వజ్ఞాని యొక్క చేష్ట ఎవరు అర్థం చేసుకోగలరు? హే సూర్యభగవాన్!

న తృణ సలిలం నైవగ్రామో న నామచ పత్తనం న చ దలభర స్నిగ్ధ ఛాయాతరుః న చ సత్ప్రపా తదపి గగనా ధ్వానం సూర్యః ప్రయాతి దినేదినే విషమమపి యత్రారబ్ధం తత్ త్యజంతి న సాత్వికాః ॥

త్రోవలో విశ్రాంతి కొరకై పచ్చగడ్డి గల ప్రదేశంగాని, జలంగాని, గ్రామంగాని, నగరంగాని, ఫలవృక్షాలుగాని, చలివేంద్రాలుగాని, పానీయశాలలుగాని లేకపోయినప్పటికీ ఆ సూర్యుడు తన అనుదిన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు కదా! సత్త్వశీలురగు మహనీయులు ఇతరులకు కష్టమైన పనీ అని తెలిసి కూడా - తమకు ఇవ్వబడిన కార్యక్రమాన్ని 'అవి లేవు, ఇవి లేవు' అని ఎవరినీ, దేనినీ నిందించకుండా కొనసాగిస్తూనే ఉంటారు.

ఆహా! కాలం - - క్రియ' అనే దంపతులు ఈ త్రిలోకాలను పరిపాలిస్తూ ఉండగా ... ఇక్కడ అనుక్షణం ప్రతిది మార్పు చేర్పు పొందుచూనే ఉన్నప్పటికీ జగత్తుగా ఎల్లప్పటికీ ఉండియే ఉంటోంది.

లక్షల కొలది బ్రహ్మాండములను ధరించుచున్న ఈ ఆకాశం శూన్యమని ఎవరంటారో, ఆ పండితులు ఏమీ గమనించనివారే అవుతారు. ఈ ఆకాశంలోనే సర్వజగత్తులు ఉదయించి, ప్రవర్తించి

Page:272

లయిస్తున్నాయి కదా! ఈ విధంగా ఈశ్వరుని మహదాదిలక్షణాలు గమనించాలంటే ఈ ఆకాశమునే

గమనించాలి.

ఈశ్వరుడు నిర్లిప్తుడు కదా! ఆతనిలోనుంచి బ్రహ్మాండాలు ఎట్లా వస్తున్నాయి? కాదు చిదాకాశ రూపుడనగు నానుండే భూతాకాశం జనిస్తోంది. అట్టి భూతాకాశము నుండి నిప్పురవ్వల వలె ... బ్రహ్మాండాలు ఉద్భవించి లయిస్తున్నాయి. చిదాకాశంలో ఎన్నెన్ని చమత్కారాలు సంభవిస్తున్నాయి! ఆశ్చర్యమే! నేనే చిదాకాశ స్వరూపుడను!

ఆధార మాయతతరం త్రిజగత్ మణీనామ్ అంగే విభర్త్యమితమ్ అన్తర శేషవస్తు వ్యోమైన చిద్వపురహమ్ పరమేవ మన్యే

యత్ర ఉదయ - అస్తమయమేతి జగత్ప్రమో_యమ్ ||

ఏది అనంతరూపమై, త్రైలోక్యమణులకు ఆధారమై, జగద్రూప పరంపరలకు ఉత్పత్తి లయస్థానమైవున్నదో... అట్టి చిదాకాశరూపమగు పరబ్రహ్మమే నేను... అని ఈ విస్తీర్ణాకాశాన్ని చూస్తున్న మనకు సుస్పష్టం - నిర్దుష్టం అగుచున్నది.

మహారాజా! ఆ శునకములను గమనించారా!

నైరృణ్యమ్ అస్థైర్యమ్ అథా అశుచిత్వమ్ రథ్యాచరత్వం పరికుత్సితత్వమ్ శ్వభ్యో గృహీతం కిము నామ మూర్ఖః మూరేభ్య ఏవ అథ శునకా న జానే ॥ నిర్దయత్వం, చంచలత్వం, అపవిత్రత్వం, నిష్కారణంగా రహదారులలో అటూ ఇటూ తిరగటం, నీచమైన అలవాట్లు, నికృష్టమైన గుణములు - - వీటిని మూర్ఖుల నుండి కుక్కలు నేర్చుకున్నాయో, కుక్కల నుండి మూర్ఖులు నేర్చుకున్నారో మనం చెప్పలేం కదా!... అయితే కుక్కలలో ఉండే శౌర్యత్వం, అల్ప సంతోషం, విశ్వాసం మనిషి చూచి నేర్చుకోవలసిందే!

ఆ తుచ్ఛమైన గడ్డిపరకను చూడండి. ఓ అల్పతృణ (గడ్డి) విభాగమా! ఆహా! లోకంలో 'స్వల్ప మైనది' అని చెప్పటానికి నిన్నే కదా... దృష్టాంతంగా కవులు తీసుకుంటారు! అయితే, దృష్టాంతంగా ఎంతగానో సారస్వతంగా ఉపయోగపడుచుండగా నీవు ఇక తుచ్ఛం ఎట్లా అవుతావు? భోగ పరంపరలందు ఎంతో ఆసక్తి, నమ్మకం కలిగి ఉండి విషయలంపటులై, ప్రమత్తులై, ఉన్మత్తులై, పరులను పరుషంగా నిందించు స్వభావులై - సంసారారణ్యంలో పచార్లు చేసే కొందరు మాయాతన్మయ సోదరులారా! తత్త్వజ్ఞానముచే “దేహా హమ్ స్వభావమును అధిగమించి నేను బ్రహ్మమును” అను సర్వోత్కృష్ణానుభవమును సంతరించుకొని, ఇచ్ఛారహితులై సాంసారిక ఆశయములను అధిగమించిన మహనీయులు మీకు తృణప్రాయులు (ఈ గడ్డిపరకతో సమానంగా)గా కనిపిస్తున్నారా? మీరు ఎంతటి మూర్ఖులు! విషయలంపటముతో కూడిన ఇచ్ఛ సత్యమా? గొప్పయా? ప్రాపంచిక సుఖలను సత్యమని అనుకుంటే మీరు కుక్క కంటే ఏం గొప్ప? గొప్ప అని అనుకుంటే అట్టి విషయ లంపట దోషాధిక్యతచే మహనీయులగు ఆత్మానుభవుల సమక్షంలో మీరే తృణప్రాయులు కదా!

Page:273

ఇంకా అటు చూడండి చక్రవర్తీ! ఆ పూపొదకు ఆవల ఒక సింహం గంభీరంగా - - ప్రశాంతంగా కూర్చుని ఉన్నది. ఇటువైపు ఈ కుక్కలు మేఘ గర్జనలు విని 'భౌభౌ' అని అరుస్తున్నాయి. సింహము - కుక్క - ఈ రెండూ తిర్యక్ జంతువులే. మేఘాల నుండి వచ్చే కోలాహల శబ్దాలు ఆ రెండింటికీ

సమానమే! కానీ ....

కోలాహలః సమానే_పి తిర్యక్వే క్షుబ్దమానసైః

అన్యథా సహ్యతే సింహైః, మీలితైరన్యథా శ్వభిః ||

మేఘ గర్జనలు వింటూ కూడా సింహం వాటిని సహిస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉండగా, ఆ కుక్క క్షోభపొంది భయంతో ఎగిరెగిరి పడుతోంది. జ్ఞాని ఈ సంసార సంరంభమును ప్రశాంత - మౌన చిత్తముతో చిద్విలాసంగా చూస్తూ ఉంటే, ఆశాదులచే కలుషితమైన బుద్ధిగల సంసార జీవులు ఎంతో క్షోభ చెందటం ఇటువంటిదే కదా! ఈ కుక్కకు ఈ క్షోభను పొందటం ఏ మూర్ఖ సంసార జీవుడు నేర్పాడో మరి !

హే విపశ్చిత్తు మహారాజా! ఆ ఊరకుక్కను చూచారా? అది నోరుతెరచి - మూస్తూ .... ఓ యీ మానవుడా! నీకంటే అధముడెవడయ్యా? ...అని మూర్ఖులను చూచి నవ్వుకుంటున్నట్లున్నది. “త్వత్తః కో ధమ? ఇతి ఉదీరితవతే, శ్వోవాచ హాసాన్వితం,

మత్తో · - మౌర్యమ్ - అమేధ్యమ్ - మాంద్యమ్ - అశుభం యః సేవతే సోధికః?

--

శౌర్యం - - భక్తిః అకృత్రిమా ధృతిః - ఇతి శ్రీమాన్ గుణోయో అస్తి మే

మూర్ఖదేశ గుణః ప్రయత్న నిచయైరన్విష్య నో లభ్యతే ॥

ఆ ఊరకుక్క నవ్వుతూ ఏమంటోందో చూచారా? "ఓ మానవులారా! 'సరమయి’ అనే దేవతా స్త్రీ శునక సంతతియగు మమ్ములను చూచి నవ్వుచున్నారా? ఇక ఆపండి. మీ మానవులలో కొందరు అజ్ఞానం, అపవిత్రత, దేహాభిమానం - - విచారణారాహిత్యం అశుభ ఉద్దేశములు కలిగివుండి ఈ భూమిపై సంచరిస్తున్నారు కదా! వారికంటే అధములెవరు? శౌర్యము - సహజమగు స్వామిభక్తి - అల్ప సంతోషము మొదలైన మా ఉత్తమ గుణములు ఎందరు మానవులకు ఉన్నాయి చెప్పండి?

మహారాజా! ఆ మహావృక్షము మొదలులోగల శివలింగముపై వ్రాలి ఆ కాకి పూజాక్షతలను ఏరుకుతింటూ కావు కావ్" ... అని అరుస్తూ ఉండటం గమనిస్తున్నారా?

లింగస్య ఊర్థ్యం రటత్ కాక, ఆత్మానం దర్శయత్యయమ్ సర్వాధః పాతక ఉత్తుంగ గతిం పశ్యతి మామ్ ఇతి ||

ఓ మానవులారా! ఇదిగో నన్ను చూస్తున్నారా! ఈ "శివనిర్మాల్య భక్షణం అనే అధోగతికి నేనెందుకు పాలయ్యాను? క్రితం జన్మలలో పుణ్యకార్యాలు మానివేసి పాపకార్యాలకు ఉపక్రమించటం చేతనే కదా! మరి మీరు పాపకార్యములు కొనసాగించి నావలె తుచ్ఛజన్మ పొందటానికి ఉపక్రమిస్తు న్నారా? సిగ్గు సిగ్గు! జాగరూకులై పాపకార్యములను విరమించి పుణ్యకార్యముల కొరకై సంసిద్ధులు కండి ...అని “కావ్ - కావ్" (కాకండి - - కాకండి) అనే ఉద్దేశంగా మా మా కనిపిస్తోంది. Page:274

ఓ కాకమా ! ఆ ప్రక్కనే మృదుమధురంగా ఉండే లేత నూతన తామర తూడులను వదిలివేసి క్రుళ్ళిపోయిన ఈ నిర్మాల్యం భుజిస్తున్నావేం? ఓహో! మేము జ్ఞాన విశేషాదులను - భక్తి ప్రపత్తులను వదలి కామ-క్రోధములను ఆశ్రయించటం ఇట్టిది - అని మాకు గుర్తు చేస్తున్నావా? శహభాష్!

తెల్లటి పూసజ్జలో నుంచి వస్తుంటే ఆ తెల్లపక్షిని చూచి ఇది రాజహంస కాబోలు” అని అనుకున్నాం. తీరా అది కాస్తా వచ్చి నేలపై పురుగులను ముక్కుతో భక్షిస్తూవుంటే ఇది రాజహంస కాదు. తెల్లకాకి ...అని మేము గుర్తించాం. మానవులలో కొందరు పైకి పవిత్ర భావాలు కలుగజేసే వస్త్రాలు ధరించి, లోన దుష్ట సంస్కారాలు కలిగివుండటం ఇట్టిదే కాబోలు!

కోయిల సమూహంతో కలిసి కాకి కోయిలలా అనిపిస్తుంది. అది గొంతువిప్పి 'కావ్-కావ్' అని అరవటం ప్రారంభించగానే ఇది కోయిల కాదురా బాబూ! కాకి! ...అని తెలిసిపోతుంది. మహనీయుల సమావేశంలో మూర్ఖుడు ఇట్లా బయటపడిపోతాడు.

స్వామీ! ఆ చిటారుకొమ్మపై కాకి నిలబడి అరవటం దేవాలయ ప్రాంగణంలోగల మహావృక్షాన్ని అధిరోహించిన దొంగ ఊరంతా కలియజూస్తున్నట్లు లేదూ!

ఓ కాకమా! "ఇది కాకుల విభాగం. కాకులే తినాలి" అని మిగతా కాకులను కావ్ కావ్” అని పిలుస్తున్నావా? మా మానవుల జాత్యహంకారం ఇటువంటిదే కదా! నీకటు శబ్దరూపమైన అరుపులు ఈ వనంలోని సుశబ్దములను వినిపించకుండా చేస్తున్నాయి! అవునులే! వాడు అటువంటి వాడు, వీడి సంగతి చూద్దాం ... అనే మాటలు తత్త్వమసి వంటి ఉపనిషత్ సంభాషణలను (మా అజ్ఞానం చేత) మాకు వినపడకుండా చేస్తుంటే మేము ఊరకొని ఉండటంలేదా? ఇదీ అట్టిదే రాజా! ఆ కోకిలను చూడండి. దంపతుల రతికలహమునకు సంధి కుదిర్చే ఆ ఆ కోయిల గీతం విననీయకుండా ఈ కాకుల క్రూరమైన కావ్ కావ్ నినాదం ఎంతబిగ్గరగా వినబడుచున్నదో!

ఓ మధురగాయని అగు కోకిలా! చూచావా! ఇక్కడ నీ మధురగానం వినే శ్రోత ఏడీ! ఇక్కడి వారికి కాకుల శబ్దాలే ప్రియంగా ఉన్నాయి. "ఈ కోయిలను మేమే పెంచాం! లేకపోతే బ్రతికేదే కాదు ...అని నీ శ్రోతలకు ఈ కాకులు తమ గొప్పతనం చెప్పుకుంటూ నీ గానాన్ని విననీయకుండా చేస్తుంటే, ఈ కాకుల గుంపుగల ప్రదేశంలో నీ గీతం వినిపించి ఏం ప్రయోజనం?

ఓ కోకిలా! "తవ కుహూ - తవ కుహూ” అనే శబ్దం పలుకుచూ... “ఓ జనులారా! మీ సంసారం మీరే కల్పించుకొని ఉంటున్నారు. అట్టి మీ కల్పనా పరంపరలు ఇక ఆపండి. లోక వ్యవహారములు అనే కాకి కూతలు వినటం మాని మహనీయులగు ఆత్మానంద తత్పరులు వినిపించే ఆత్మానంద గానం వినండి" ...అని మాకందరికీ గుర్తు చేస్తున్నావా? భేష్! మూర్ఖజనుల మధ్య ఉన్నప్పటికీ బ్రహ్మజ్ఞాని వేరుగానే కనిపించునట్లు కాకుల మధ్య కాకి రంగు రూపుతో ఉన్న కోయిల కాకులకంటే వేరుగా ప్రకాశమానంగా కనిపిస్తోంది. ఆహా!

కోకిల శిశువును వదలి తల్లి కోకిల ఎటో పోవటం, తల్లి కాకి కోకిల శిశువును తెచ్చి పిల్లకాకి అనుకొని పెంచటం, కొంతకాలం జరిగిపోయిన తరువాత ఇది కోకిలగాని కాకి కాదు”

Page:275

అని గుర్తించి తల్లికాకి కౌమార కోకిలను పొడిచి హింసించటం... ఇంత జరిగినా కోకిల తన గాన మాధుర్యాన్ని కించిత్ కూడా కోల్పోనేలేదు. మహనీయులు ఈ సంసార జీవుల మధ్య ఉండి అనేక హింసలపాలైనా కూడా తమ మహనీయత్వము కోల్పోరు కదా!

ఆ హంస సరోవరంలోని తామర తూడులను ముక్కున కరచుకొని తన బిడ్డల కొరకై తీసుకొనిపోవుచూ కూడా ఎంత గంభీరంగా కదలివెళ్ళుచున్నది! మహనీయులగు పరమహంసలు జగత్ కార్యక్రమము నిర్వర్తిస్తూ కూడా అంతరంగమున ఆత్మజ్ఞానగాంభీర్యులై ఉంటారనటానికి ఇదే దృష్టాంతం. ఇటు చూడండి. ఈ సరస్సు బ్రహ్మ సాక్షాత్కారముతో గూడిన మహాత్ముల మనస్సువలె ఎంత నిర్మలంగా శోభిస్తోంది. అయితే సరోవరజలం, నదీజలం, కూప జలం (నూతి నీరు) మనం దేనిని ఏ పేరుతో పెట్టి పిలిచినా జలమంతా ఒక్కటే కదా! అట్లాగే స్త్రీ - పురుషాది భేదములతో శరీరాలు వేరువేరుగా కనిపించినా ఆత్మ సర్వదా ఒక్కటే కదా!

ఈ సరస్సులో ఎన్నెన్ని కమలములున్నాయో కదా! అనేక జన్మలలో అనేక సంస్కారముల పరంపరలను నింపుకొనివున్న ఈ సంసారజీవుని భోగోత్సాహ మనస్సువలె ఈ సరస్సులోని కమలములను లెక్కించటం ఎవరి తరం?

అటువైపుగా చూస్తే పైకి ముళ్ళపొదలను, అంతరమున పుష్పములను ఆ సరోవర విభాగం కలిగివున్నది. అంతరమున ఆత్మ అనే మధుర పానీయమును దాచుకొని పైకి దృశ్య సంసారము వహిస్తున్న జీవుని మనోఫలకమువలె అది కనిపించుచున్నది కదా! ఓ మానవులారా! "అస్థిరం, జడం, ఛిద్ర సహిత, నిస్సారం అగు పైపై ప్రయోజనములను వదలి ...సారయుక్తమగు ఆత్మనే గ్రహించండి, దర్శించండి... మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి అని మనకు శాస్త్రములు బోధిస్తున్న రీతిగా ఉన్నది. ఏ కమలమైతే లక్ష్మీదేవి హస్తమును అలంకరించి విష్ణు భగవానుని హృదయంలో స్థానం పొందిందో అట్టి ఈ కమలము యొక్క సౌకుమార్యం, ఔన్నత్యం ఏ కవి సంపూర్తిగా వర్ణించగలడు?

ఆ తెల్లటి కమలం, నీలి కమలం చూడండి. ఆకారం చేత ఒక్కటే అయినప్పటికీ సాత్వికుని మనస్సు - మూర్ఖుని మనస్సులాగా అవి ఎంతటి భేదం కలిగి ఉన్నాయి! ఈ మామిడి వృక్షమునకు విరగకాచి పసుపుపచ్చగా పండివున్న మామిడి పళ్ళరసమును గ్రోలుచు తుమ్మెదలు - కోయిలలు ఆనందపడుచున్నప్పుడు ఈ ప్రకృతి రచయిత అగు బ్రహ్మదేవుడు తన రచనను చూచుకొని తానే ఎంత ఆనందపడుచున్నాడో?

ఓ తుమ్మెదా! నీవు ఎన్నో స్థానములలో రసమును గ్రోలికూడా ఇంకా సంతుష్టి పడకపోవట మనేది సంసారజీవుల నిత్య అసంతృప్తికి సోదాహరణమే అగుచున్నది.

ఓ రాజహంసా! నీవు చేసే మధుర హ- హు-హూ నాదం కొంగకు వెయ్యి జన్మలకైనా వస్తుందా? రాదు. అయితే నీవు హంసి (ఆడు హంస) వెంట పరుగులు తీసి ప్రాణాలు పోగొట్టుకోవటం మాలోని కొందరు స్త్రీ వ్యసనంచే జీవితం సర్వనాశనం చేసుకోవటం గుర్తుచేస్తోంది. నీవు కొంగలు

- - నీటి కాకులు మొదలైన హింసక పక్షులు నివసించే ఈ సరస్సుల్లో ఉంటున్నావెందుకు చెప్పు?

Page:276

ఓ నీటి కాకీ! నీవు కూడా మా జనులలో కొందరివలె పరాన్నభుక్కువై పరులను ఇతరులను బాధించటమే వృత్తిగా కలిగి ఉన్నావే!

ఏవం విహన్యతే లోకః స్వార్టేనేతి ప్రదర్శయన్

మద్గురుం మద్గురుతాం యాత ఇత్యేవం స్తోతి దుర్జనః ||

"ఈ నీటికాకివలె మేమూ ఇతరులను బాధించటం, ఇతరుల ఆర్జనములను దొగిలించటం కొనసాగిస్తూ ఉంటాం! ఇందుకు ఈ నీటికాకియే మా గురువు! ... అని దుర్జనులు నీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. అంతేగా మరి!

అయితే, కొంగలు, నీటికాకులు, రాబందులు, రాజహంసలు ఒకే సరస్సులో, ఒకేచోట ఉండి జీవిస్తున్నప్పటికీ ఒకరి లక్షణాలు మరొకరికి అబ్బుతున్నాయా? లేదు. అట్లాగే మూర్ఖులు, నీచబుద్ధి కలవారు, హింసయే స్వభావముగా గలవారు - సర్వం పట్ల సమత్వ బుద్ధి సముపార్జించుకొన్న మహనీయులు ఒకే ఆశ్రమంలో కలిసివుండవచ్చుగాక! ఒకరి బుద్ధి మరొకరికి అలవడేది కాదు.

అదిగో, ఆ కొంగను చూస్తున్నారా? ఒక చేపను ముక్కున కరచుకొన్నది. ఆ చేప ఒక్కసారి తన బలమంతా ఉపయోగించి ఆ కొంగ ముక్కు నుంచి విడివడి నీళ్ళలోకి దుమికింది. కాని భయం చేత గుండె ఆగి ప్రాణాలు పోగొట్టుకొని నీటిలో తేలియాడుతోంది. అవునుకదా! ప్రపంచంలో మహావిపత్తు సంభవించినప్పుడు ప్రాణాలు పోగొట్టుకోవటమే అధిక సౌఖ్యప్రదం అని కొందరు భ్రమిస్తు న్నారు మరి! అదిగో, అదిగో...! అటుచూడండి. ఆ బాటసారి లేళ్ళ కళ్ళను చూచి తన ప్రేయసినేత్రాలు గుర్తుకు వచ్చి కాబోలు, నిశ్చేష్టుడై నిలుచున్నాడు. అటు ఆ నెమలిని చూస్తున్నారా! అది నేలపై నీళ్ళను ముట్టకుండా ఇంద్రుని ప్రార్థించి, ఇంద్ర ప్రసాదితమైన మేఘజలం ఆస్వాదిస్తోంది. ఇంకా దాని పోకడ చూడండి. అది నేలపై నీటిని ముట్టటం లేదు. బాగుంది కానీ, నేలపై గల పాములను మాత్రం భక్షిస్తోంది. ఔన్నత్యం సంపాదించుకుని కూడా నీచత్వం వదలలేని వారికి ఇదే తార్కాణం!

ఆ వెదుళ్ళు చేసే శబ్దం ఎంత సంగీతభరితంగా ఉన్నదో చూచారా? అవి ఏ విద్వాంసులు సేవచే అంతటి గానకౌశలాన్ని నేర్చుకున్నాయో కదా!

రాజా! ఈ ఎత్తైన తాటిచెట్టును చూస్తున్నారా? అది చాలా ఎత్తుగా ఉండటం చేత వాటిని ఎవరూ కోరరూ, కోసుకోరు. మూర్ఖుల లోభగుణం ఇట్టిదే కాబోలు.

దీయన్తాం మణలానాం దిశిదిశి చ యథా శాస్త్రమస్త్రాణ్య వన్యా రక్షాయై క్షాన్తిపూర్వం చిరమ్ అతులబలం శాన్తయా శాసనాని ॥

మీ యొక్క నాలుగు ఉపాధుల బలపరాక్రమాల ప్రభావంచేత మనం దశదిశలలో సుదీర్ఘ ప్రదేశాలన్నీ జయించాం. ఇక రాజనీతిని అనుసరించి శాంతబుద్ధితో సమాధానపూర్వకంగా చిరకాల రక్షణ కొరకై రాజశాసనాలు, కప్పములు నియమిస్తూ అధికారము యొక్క గుర్తులను స్థాపించండి.

Page:277

4. అవిద్య - దృశ్య జిజ్ఞాస్

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! అప్పుడు ఆ నలుగురు విపశ్చిత్ రాజులు నాలుగు సముద్ర తీరాలలో గల నాలుగు వేరైన ప్రదేశాలలో సమావేశమైనారు. మంత్రులు ఆయా రాజ్యాంగ విశేషాలు నివేదిస్తూ ఉండగా ఆయా సామంతరాజ్య చట్టాలను, ప్రణాళికలను అప్పటికప్పుడు తయారు చేసి తుదిమెరుగులు దిద్దారు. ఇంతలో సాయంకాలం అయింది. సూర్య భగవానుడు అస్తమాద్రి చేరాడు. ఆ నలుగురు తమ సాయం సంధ్యలను ముగించుకొని నాలుగు సముద్రముల తీరాన తమతమ శయనములపై విశ్రాంతి తీసుకోనారంభించారు. ఆ నలుగురు నాలుగు వేరువేరైన సుదూర స్థానములలో శయనములపై పరుండి ఆశ్చర్యముతో కూడిన చిత్తము కలవారై తమ తమ మనస్సులలో ఇట్లు చింతించనారంభించారు.

నలుగురు విపశ్చిత్తులు (తమ మనస్సులో) : ఆహా! శత్రు రాజ్య సైన్యమును పారద్రోలుతూ అతి దూరంగా ప్రయాణించి ఇప్పుడు సముద్రల తీరాలకు చేరాం. దేవదేవుడగు అగ్నిదేవుని ప్రభావం చేత ఆయన మనకు ప్రసాదించిన దివ్య వాహనముల ప్రభావంచేత కదా, ఇంతదూరం రాగలిగాం! ఇప్పటిదాకా బాగానే ఉన్నది! ఈ సువిశాల దృశ్యము ఎంతవరకు వ్యాపించి ఉన్నది?...

ఈ జంబూద్వీపానికి ఆవల లవణ సముద్రం ఉన్నది. లవణ సముద్రానికి ఆవల రెండింతలు ఇక్షు సముద్రం (తీపి నీరు) ఉన్నది. దాని కావలి కుశద్వీపం ఉన్నది. దానికి ఇంకా ఆవల సురోద సముద్రం ఉన్నది. ఇట్లా శాస్త్రాలలో మనం చదివాం. అయితే సప్తద్వీప - సముద్రములకు ఆవల ఇంకా ఏం ఉంది? ఈ చేత్య (దృశ్య) రూపిణి యొక్క 'మాయ' ఎంతవరకు విస్తరించి ఉన్నది. ఈ వస్తు వైచిత్ర్యము యొక్క అసలైన రూపమెట్టిది?

ఈ విషయాలు తెలియాలంటే మన వల్ల కాదు. అయితే మన ఇష్టదైవమైనట్టి అగ్నిదేవుని కరుణచే మాత్రమే సాధ్యం. అందుచేత ఆయనను ప్రార్థించి ప్రసన్నుణ్ణి చేసుకొని నాలుగు దిక్కులలో ఈ సప్తసముద్రములకు ఆవల గల విశేషములను దుఃఖరహితులమై సందర్శించి వద్దాం.”

ఇట్లా నాలుగు సముద్ర తీరాలలో కూర్చుని ఆ నలుగురు విపశ్చిత్తులు ఏకకాలమున అగ్ని దేవునికి ప్రార్థనలు సమర్పించారు. ఆ నలుగురికి అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇట్లు పలికాడు. అగ్నిదేవుడు : పుత్రులారా! మీ ప్రార్థనకు మెచ్చాను. ప్రసాదించటానికి సిద్ధంగా ఉన్నాను. మీ అభిలాష ఏమిటో చెప్పండి? పసిపిల్లల కోరిక తీర్చటమే తండ్రికి ఆనందం కదా!

నలుగురు విపశ్చిత్తులు :

పంచభూతాత్మకస్యాస్య దృశ్యస్య అంతం, సురేశ్వర! దేహేన, మంత్ర దేహేన, తదనే మనసాపి చ, యావత్ సంవేదనం, యావత్ సంభవం, యావదాత్మకమ్ పశ్యేమ ఇతి నో దేవ! దీయతామ్ ఉత్తమో వరః

Page:278

ఓ దేవేశ్వరా! మీ దర్శనంచే పునీతులమై సాష్టాంగ దండప్రణామములు సమర్పిస్తున్నాం. మా కోరిక ఏమిటో వివరిస్తాం. వినండి1. పంచభూతమయమగు ఈ దృశ్యం యొక్క అంతం ఎక్కడో... అక్కడి వరకు ఈ దేహంతో

చూచెదము గాక!

2. ఆ తరువాత వైదిక మంత్ర ప్రభావంచే ఏర్పడే సంస్కార దేహంతో ఎంతవరకు పయనించ గలమో అంతవరకు వెళ్లెదము గాక!

3. ఇక ఆపై మనస్సుతో ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు వెళ్ళి చూడగలిగినంత చూచి వస్తాము గాక!

ఇట్లు... 1.ప్రత్యక్షం, 2. అనుమానం, 3. శుతి... మొదలైన అన్ని విధాలా ఈ దృశ్య జగత్తు ఎంతవరకు విస్తరించి ఉన్నదో అంతవరకు చూచిరాగల వరం ప్రసాదించండి. అనగా...

1. యోగుల యోగ ప్రభావం చేత పొందబడే మార్గం, 2. మనస్సు గాంచగలిగి నంత వరకు మేము చూచిరాగలిగే అవకాశం మాకు మీ దయచే లభించును గాక! మరణించిన తరువాత (లేక) సూక్ష్మదేహంతో మాత్రమే పోగలిగే ఉత్తరాయన, దక్షిణాయన మార్గాలలో మేము పోయివస్తాం! అగ్నిదేవుడు : వత్సలారా! మీరు కోరినట్లే అగుగాక ! మీ అభీష్టానుసారమే అగుగాక !

ఆ విధంగా అగ్నిదేవుడు అంతర్థానమైన తరువాత ఆ రాత్రి గడిచింది. ఆ మరునాడు ఉదయమే ఆ నలుగురు విపశ్చిత్తులు నాలుగు సముద్రాలను దాటి ఆవల ఉన్న ప్రదేశాలు, విశేషాలు సందర్శించి రావటానికి ఉద్యుక్తులయ్యారు.

మంత్రులు, మహారాజా! మీరు రాజ్య సంరక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు అత్యంత ముఖ్యులు. యుద్ధం ఇప్పుడే కదా ముగిసింది! అనేక విషయాలు అస్తవ్యస్తంగా ఉండి ఉంటాయి. అతి ముఖ్యమైన వ్యవహారాలు రాజనిర్ణయాలకై వేచి ఉన్నాయి. ఇప్పుడు మీరు లేకపోతే మన రాజ్యానికి అది తీరని లోటు. అందుచేత సముద్రంలో ప్రవేశించవద్దని మా మనవి ... అని సవినయంగా ప్రార్థించసాగారు.

అయితే ఆ విపశ్చిత్తులు ఆ మాటలన్నీ వినిపించుకోనేలేదు. అప్పటికప్పుడే తమ తమ మనస్సులలో గల పుత్ర, మిత్ర, కళత్ర, జాతి, రాజ్య, రాజాంతఃపురములపై గల అభిమానము, యుద్ధము, అధికారము మొదలైన వాటి వలన రూపుదిద్దుకుని ఉన్న మాత్సర్యం, కిరీటం, రాజ సింహాసనం, అంతఃపుర శయనాభిలాష, సేవకజనం, రాజవస్త్రములు, వస్తు వాహనాలకు సంబంధిం చిన లోభం, శత్రు పరాభవం, రాజ్యపాలన, ఆజ్ఞలు పురమాయించటం, ఆయా అధికారులను గదమాయించటం... మొదలైన వాటికి సంబంధించిన అభిలాష మొదలుగా గల కర్మ - దృశ్య సంబంధమైన దోషములను ఒక్కటొక్కటిగా త్యజించారు. ఇక, సుదీర్ఘ ప్రయాణమునకు ఉద్యుక్తులై, ...నాలుగు సముద్రముల ఒడ్డు వరకు తమను అనుసరించి వచ్చిన ఆయా మంత్రులను పేరుపేరునా ఇట్లా సంబోధించారు.

Page:279

ఓ రాజాజ్ఞ పరాయణులు, దేశభక్తులు అగు మంత్రులారా! సైనికాధ్యక్షా! ప్రియ సైనికులారా! మేము ఈ సముద్రమును దాటి ఆవలగల సృష్టి విభాగమును కలియచూచి, అక్కడి విశేషాలన్నీ గమనించి తిరిగివస్తాము. మీరు త్రోవలలో గల మన సామంత రాజ్యములు సందర్శిస్తూ, అక్కడ మన రాజ్య చట్టములు, కప్పములు, దేశాభివృద్ధి ప్రణాళికలను నిర్దేశిస్తూ, అమలుపరుస్తూ, మన రాజధాని అగు తతమితి నగరం జేరండి. ప్రధాన మంత్రులవారు రాజ్యసభ యథారీతిగా నిర్వహిం చెదరు గాక! రాజధాని చేరగానే విజయోత్సవాలు నిర్వహించండి. మన సైనికులకు, మరణించిన సైనికుల కుటుంబాలకు కానుకలు, నష్టపరిహారాలు గాయపడిన మన సైనికుల - మనపై దండెత్తిన సరిహద్దు దేశాల సైనికులకు అవసరమైన వైద్యచికిత్సలు ప్రేమతో అందించగల వైద్యులను నియమించి, అవసరమైన ధనాది సదుపాయములను అందించండి. చెల్లించండి. మేము త్వరలో తిరిగివస్తామని ప్రజలకు విన్నవించండి. ఇక సెలవు."

ఈ విధంగా పలికి ఆ నలుగురు విపశ్చిత్తులు నాలుగు దిక్కుల చివరన గల సముద్రపు ఒడ్డున పరివారాన్ని వదలి నాలుగు దిక్కులుగా దృఢ నిశ్చయంతో పాదచారులై ప్రయాణించసాగారు. తమ యొక్క మంత్రశక్తిచే జయము అను సిద్ధిని పొంది ఉన్న ఆ నలుగురు సముద్రజల తరంగాలపై నేలపై నడిచినట్లే అడుగులు వేసుకొంటూ నడక సాగించారు. మావటివాడు ప్రేరేపిస్తూ ఉండగా త్రాళ్ళకు కట్టిన దుంగలను లాగుచూ వెళ్ళే ఏనుగు వలె వారు ముందుకు అధిరోహిస్తూ, దిగుతూ, మరికొన్ని చిన్నతరంగములపై నాచు-జలవృక్షముల మధ్యగా అడుగులు వేస్తూ, చాలాకాలం అటు-ఇటు తిరుగుతూనే ఉన్నారు. మంత్ర విద్యాబలప్రభావం చేత అతితేజో సంపన్నులైన వారు దుర్జయులై సంచరించసాగారు. ఒక్కొక్కచోట మదించిన మొసళ్ళచే మ్రింగబడి అక్కడ అగ్నిదేవుని ప్రభావం చేత జీర్ణం అవక మరల ఉదరంలో నుంచి బయల్వెడలారు. ఒక్కొక్కసారి జలతరంగాలపై విశ్రమించి ఆ జల తరంగాలచేత వేలాది యోజనాలు నిదురలో ఉండగానే తీసుకొని పోబడేవారు. తమ రాజధానిలో ఏనుగులను అధిరోహించినట్లు వాళ్ళు నలుగురు నాలుగు సముద్ర తరంగాలను అధిరోహించి సుదూరం ప్రయాణించేవారు. ఆ తరంగాలు సముద్ర మధ్యంలో గండ శిలలను సమీపిస్తున్నప్పుడు దెబ్బ తగలకుండా లాఘవంగా తప్పించుకునేవారు. క్షణంలో సముద్రపు అడుగు భాగం జేరేవారు. ఆ సముద్రపు అంతరమున కూడా సంచరిస్తూ మొసళ్ళతోను, ఎండ్రకాయలతోను, తదితర సముద్ర జీవులతోను పరిహాసపూర్వకంగా అంగవిన్యాసములతో సంభాషిస్తూ సహవాసం చేస్తూ సంచరించసాగారు.

ఓ రామచంద్రా! ఆ ప్రకారంగా ఆ నలుగురు సముద్రమును, ద్వీపములను దాటివేయుచు ఈ పాంచభౌతిక అవిద్యా జగత్తు ఎంత దాకా విస్తరించి ఉన్నది? అవిద్య యొక్క చివర ఎక్కడ? అనే విచారణ యందు ప్రవృత్తులై ప్రవర్తించసాగారు. మధ్య మధ్యలో వనములు, పర్వతములు ఏవేవో జనరహిత ప్రదేశములు తారసపడసాగాయి. ఇంతలోనే అనేకానేక సంఘటనలను ఆ నలుగురు విపశ్చిత్తులు చవిచూశారు.

Page:280

పశ్చిమ దిక్కు విపశ్చిత్తు మత్స్యావతారుడగు విష్ణు భగవానుని కులంలో జన్మించిన ఒక పెద్ద చేప చేత మ్రిగబడ్డాడు. అది క్షీర సముద్రంలో ప్రవేశించి "ఈ దేహమును నేను జీర్ణం చేసుకోలేను” ...అని గ్రహించినదై క్షీరసాగర మధ్యంలో క్రక్కివేసింది. అప్పుడు లేచి నడకసాగిస్తూ ఆ పశ్చిమ దిక్కు విపశ్చిత్తు క్షీర సాగరంలో అతిదూరం వెళ్ళటం జరిగింది.

దక్షిణ దిక్కు విపశ్చిత్తు ఇక్షు సముద్రంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇంతలో సముద్ర మధ్యలోగల ఒకానొక యక్ష నగరంలో అనుకోకుండా ప్రవేశించాడు. అక్కడ ఒక యక్షిణి ఆతనిని చూచి తన వశీకరణ విద్య చేత కాముకుడగు భర్తగా తన వశం చేసివేసుకొన్నది.

తూర్పు దిక్కు విపశ్చిత్తు ఒక చోట సముద్రంలో గంగానదీ ప్రవేశమును గమనిస్తూ ఉండగా ఒక పెద్ద తిమింగలం మ్రింగబోవగా, దానిని గంగానదీ ప్రవాహంలోకి ఊడ్చుకు వచ్చి శస్త్రాస్త్రాలను ప్రయోగించి చీల్చి వేశాడు. ఆ ప్రయత్నంలో తీవ్ర వేగంతో ప్రవహించే గంగానదీ ప్రవాహం ఆతనిని 'కన్యాకుబ్జ' అని పిలవబడే ఒక ప్రాంతానికి త్రోసుకుపోయింది.

ఉత్తర దిగంతము చూడటానికి వెళ్ళిన విపశ్చిత్తు 'ఉత్తరకురు' అనే దేశంలో ప్రవేశించి అక్కడ దేవీసహితుడైన శివభగవానుని ఆరాధించి అణిమ - గరిమ మొదలైన ఆయా సిద్ధులు/ఐశ్వర్యములు సముపార్జించాడు. ఆ సిద్దుల ప్రభావం చేత అతనికి 'గాయము మరణము' లకు సంబంధించిన భయం లేకుండాపోయింది. ఆతడు ఆయా త్రోవలలో జలచరాల చేత మ్రింగబడి కూడా అణిమాది సిద్ధులచే క్షేమంగా బయల్వెడలి, క్రమంగా ద్వీపాంతరాలు దాటి, కుల పర్వతాలు కూడా దాటివేశాడు.

పశ్చిమ దిక్కు విపశ్చిత్తు హేమచూడ పక్షి (గరుడపక్షి) యొక్క వీపును అధిరోహించి గరుత్మంతుని ఆరాధిస్తూ క్రమంగా అనేక ద్వీప - ద్వీపాంతరాలు దాటి వెళ్ళాడు.

తూర్పు దిక్కుగా వెళ్ళిన విపశ్చిత్తు క్రౌంచద్వీపం ప్రవేశించాడు. అక్కడ గల వర్షసీమా పర్వతాన్ని అధిరోహిస్తూవుండగా ఒక రాక్షసి ఆతనిని మ్రిగింవేసింది. కాని కొద్దిసేపట్లో ఆతడు ఆ రాక్షసి ప్రేగులు చీల్చి హృదయమును భేదనం చేసి బయల్వెడలాడు.

దక్షిణ దిక్కుగా వెళ్ళిన విపశ్చిత్తు దక్ష ప్రజాపతి నగరం ప్రవేశించాడు. అనుమతి, విన్నపము లేకుండా ప్రవేశించినట్లు తెలిసి ఆ దక్ష ప్రజాపతి "నీవు యక్షుడుగా అయ్యెదవు గాక అని శపించాడు. అట్లు యక్షుడుగా (సూక్ష్మదేహ మాత్రమైన సత్త కలవానిగా) రూపొందిన ఆ విపశ్చిత్తు శాకద్వీపం ప్రవేశించాడు. అక్కడ ఒక ఏకాంత స్థానం చేరి నూరు సంవత్సరాలు తపస్సు చేసి శాప

విమోచనం పొందాడు.

ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తున్న విపశ్చిత్తు, తాను సంపాదించిన సిద్ధులను వెంట నిడుకొని వేగం గలవి - చిన్నవి అగు అనేక సముద్రాలు దాటివేశాడు. ఒక సువర్ణమయ ద్వీపంలో ప్రవేశించాడు. అక్కడ గల ఒకానొక సిద్ధునకు కొంత చికాకు కలిగించాడు. ఆ సిద్ధుడు కోపగించి “నీవు శిలవైపోయెదవు గాక!... అని శాపం ఇవ్వటం జరిగింది. ఆతడు ఆ ప్రదేశంలో ఒక శిలగా మారి నూరు సంవత్సరాలు గడిపాడు. అప్పుడు అగ్నిదేవుడు అనుగ్రహించటం చేత శపించిన ఆ

Page:281

సిద్ధుడే ఆ ఉత్తర దిక్కు విపశ్చిత్తుకు శాప విమోచనం ప్రసాదించాడు. మనఃప్రీతిని పొందిన ఉత్తర దిక్కు విపశ్చిత్తు ఇంక అక్కడి నుండి బయల్వెడలాడు.

తూర్పు దిక్కుగా వెళ్ళిన విపశ్చిత్తు 'కన్యాకుబ్జ' అనే పేరు గల నగరంలో ప్రవేశించి అద్దానికి ఉత్తరంగా అనేక వందల యోజనాలు ప్రయాణించాడు. 'నాలికేరం' అనే దేశంలో ప్రవేశించి అక్కడ కొంతకాలం నివసించసాగాడు. తన పూర్వ వృత్తాంతం మరిచాడు. క్రమంగా అక్కడి రాజ్యానికి రాజయి ప్రజారంజకంగా ఎనిమిదేళ్ళు రాజ్యపాలన చేశాడు. అతిధర్మాత్ముడై ఎన్నో ప్రజారంజకమైన కార్యక్రమాలు చేపట్టాడు. ఇంతలో ఏదో సందర్భంలో ఎందుకో తన పూర్వవృత్తాంతం గుర్తుకు వచ్చింది. అయ్యో! నేను ఇక్కడ ఉండిపోతే ఎట్లా? ఆపదలచే స్పృశించబడని నేను ఈ సృష్టి అంతు ఏమిటో-ఎక్కడో చూచి రావాలి కదా!" ... అని తలచి ఇక అక్కడి నుండి అక్కడివారికి చెప్పాపెట్టకుండా బయలుదేరాడు.

ఉత్తర దిక్కున వెళ్ళిన విపశ్చిత్తు ఒక ద్వీపాన్ని చేరాడు. అక్కడ ఎక్కడబడితే అక్కడ కొబ్బరిచెట్లు మాత్రమే ఉన్నాయి. అతనికి ఆకలి వేసినప్పుడల్లా కొబ్బరి, కొబ్బరినీరు త్రాగుతూ ఆ ప్రదేశమును సందర్శిస్తూ కొంతకాలం గడిపాడు. అట్లా సంచరిస్తూ మేరు పర్వతమును సమీపించాడు. అక్కడ గల ఒక కల్పవృక్షం క్రింద విశ్రమించి "ఆహా! ఇప్పుడు నాకు ఒక అప్సరస సేవలు లభిస్తే ఎంత బాగు?" అని తలచాడు. అంతే! కళ్ళు జిగేలుమనిపిస్తూ ప్రపంచంలోని సౌందర్యమునంతటినీ పుణికిపుచ్చుకున్న ఒక అందాలరాశి అయిన అస్పరస అక్కడ ప్రత్యక్షమైంది. క్రమంగా ఆమెతో మాటలు కలిపి ఆమె సాంగత్యం పొందాడు. ఆమెతో సరస సల్లాపాలు, వన విహారాలు చేయ నారంభించాడు. క్రమంగా ఆమె సాంగత్యంలో పది సంవత్సరాలు గడిపిన తరువాత గాని, తానెందుకు బయలుదేరాడో ...(ఈ భౌతిక సృష్టి ఎంతవరకు విస్తరించి ఉన్నదో చూచి తిరిగి తతమితి నగరం తిరిగి వెళ్ళాలనే ప్రణాళిక), అది గుర్తుకు వచ్చి ఇక అక్కడి నుండి ఏదో సాకుతో బయల్వెడలాడు.

పశ్చిమ దిక్కుగా సంచరిస్తున్న విపశ్చిత్తు 'శాల్మలి' అనే ద్వీపం చేరాడు. ఆతడు తన “పక్షుల వశీకరణ విద్య" ప్రదర్శిస్తూ రకరకాల పక్షులను ఆకర్షించి వినోదిస్తూ ఉండేవాడు. ఇంతలో ఒక సుందరమైన ఆడు నెమలి యొక్క కులుకులకు ఆకర్షితుడై పురుషనెమలిగా దేహం ధరించి పది సంవత్సరాలు గడిపాడు. మరల ఒక రోజు ఆడు నెమలిని అక్కడే వదలి, ఇక అక్కడి నుండి బయలుదేరి మంధరపర్వతం జేరి అక్కడ గల ఒక కిన్నెర స్త్రీతో మరికొంత కాలం గడిపాడు.

తూర్పు వైపు వెళ్ళిన విపశ్చిత్తు నారికేళవనంలో నుంచి క్షీరసాగరం ప్రవేశించాడు. ఆ క్షీర సాగరంలో గల కల్పవృక్ష సమూహంలో నందనవన దేవతలతో అనేక కామములచే వ్యాకులుడై డెబ్భై సంవత్సరాలు గడిపాడు.

Page:282

5. ఒకే జీవాత్మ భిన్న దేహముల చమత్కారం

శ్రీరాముడు : మహాత్మా! వసిష్ఠ మహర్షీ ! ఆ విపశ్చిత్తు ఒకే జీవాత్మ కదా! మరి నాలుగు దేహములతో వేరువేరైన ప్రదేశములలో, వేరువేరైన కోరికలు, పరిచయములు, అనుబంధములు మొదలైనవి ఒకే సమయంలో ఎలా నిర్వర్తించాడు? విపశ్చిత్తు మొట్టమొదట... ఒకే సాక్షి చూతన్యముచే పరిపూర్ణుడై, ఒక జీవుడై, ఒక దేహము కలవాడై, ఒక విధమైన ధ్యాన - ప్రియ - -

వ్యవహారాది క్రియలు కలిగి ఉండేవాడు కదా! ఇప్పుడు నాలుగు దేహములు...! నాలుగు విధాలైన దృష్టులు...! నాలుగు చోట్ల నాలుగు విధాలైన అనుబంధ - బాంధవ్య - వ్యవహారాదులు కలిగి ఉండట మనేది ఎట్లా యుక్తియుక్తం?

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! ఈ మనస్సు చిరకాలంగా ఏది ఎట్లు 'సత్యమే' అని భావించి అభ్యసిస్తూ ఉంటుందో... అది అట్లే మనస్సుకు ఘనీభూతమై అనుభవమౌతుందని మనం ఇప్పటివరకు అనేక చరిత్రలలో చెప్పుకున్నాం కదా! అట్లాగే ఈ వ్యష్టిజీవుల మనస్సు,

“ఈ ఒకేఒక దేహమే నేను. ఇదియే నా ఉనికి. ఇది భౌతికంగా ఎక్కడ ఉంటే నా పరిమితి అంతవరకే ...అని అనేక దేహపరంపరలుగా చిరకాలాభ్యాసం నిర్వర్తించినదై ఉంటోంది. అందుచేతనే, ఈ జీవుడు ఇదే నా రూపం, నామం, పరిమితి, ఆశయం, వ్యవహారం, చలనం ...అని భావిస్తూ ఉన్నాడు.

ఒకే జీవుడు అనేక దేహములలో ఉండి, ఒక దేహంతో మరొక దేహానికి సంబంధంలేనట్టి - అనుభూతులు, సంబంధ బాంధవ్యములు, వ్యవహారములు, భావనలు, నమ్మికలు కలిగి వ్యవహరించటమనే చమత్కారం శ్రోతలకు యుక్తియుక్తంగా గ్రహించటానికి గాను, ఇప్పుడు స్వప్నమును దృష్టాంతంగా తీసుకొని విశదీకరిస్తున్నాను. విను.

ఒకానొక జీవుడు స్వప్నంలో అనేకమంది తదితర జీవులతో వ్యవహరించటమనేది ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన అనుభవమే కదా!

ఇప్పుడు... నీకు నీ స్వప్నంలో కనిపించే వివిధ అభిలాషలు, ఆశయాలు, అనుభవాలు గల తదితర జీవుల అసలు రూపం ఏమిటి? నీ స్వప్న సత్తయే వారి రూపాలు గాను, ఆయా వివిధాలైన వివిధ వ్యక్తిత్వములుగాను ప్రదర్శిస్తోంది కదా! అంతేగాని ఆ స్వప్నంలో మరొకరెవరో ప్రవేశించి వ్యవహరించటం లేదే! అనగా... నీకు కనిపించిన మిత్రులు, పురప్రజలు, బంధువులు, శత్రువులు, పిచ్చి పిచ్చి ప్రవర్తన కలిగి ఉన్నవారు మొదలైన వారంతా స్వప్న ద్రష్టయగు నీయొక్క స్వప్న సత్తా రూపులే కదా! అనగా నీవు దాల్చిన వేఱువేఱు రూపములే కదా! ఎందుకంటే నీవు సత్తా స్వరూపుడివే గాని, దేహరూపుడవు కాదు సుమా!

స్వప్నానుభవంలో జరుగుచున్నదేమిటి?... స్వప్న ద్రష్ట స్వప్నంలో వేరువేరైన స్వభావాలు, ఆశయాలు, గుణాలు వ్యక్తిత్వము గల రూపాలను తనకు తెలియకుండానే తాను దాల్చి,

Page:283

రూపాలన్నీ నాకు వేరైనవే! ...అను అనుభవముతో వ్యవహరిస్తున్నాడు. అవిద్యచే వివిధ దేహాదుల కల్పన, ఆ తదితర దేహములలోని వారంతా తనకు శత్రు మిత్రులుగా వ్యవహరించటం జరగుచు న్నట్లే ఈ జాగ్రత్ జగత్తులో మాత్రం ఎందుకు జరుగకూడదు? జాగ్రత్ సత్త జాగ్రత్లో, వీరు బంధువులు, వీరు శత్రువులు, వీరు పురజనులు" ...అని పొందబడుచుండుటయే ఈ సంసారం యొక్క చమత్కారం! వాస్తవానికి... చిద్ధనాకాశమై, అవిభక్తమై, ఏకమై, సర్వ వ్యాపకమైనట్టి బ్రహ్మం మాత్రమే ఉన్నది. ఇక తదితరంగా కనిపించేదంతా కూడా అట్టి అఖండ బ్రహ్మమే ఆరోపిత దృష్టికి ఆ విధంగా కనిపిస్తోంది ...అనునది అధ్యాత్మ శాస్త్రము యొక్క మొట్టమొదటి పాఠ్యాంశమే కదా! అవిద్యా ప్రభావం చేత ద్రష్టచే తన 'జాగ్రత్ సత్త'యే ఈ దృశ్యము యొక్క కల్పిత రూపాలుగా గాంచబడుతోంది. బ్రాహ్మీ దృష్టి సంతరించుకున్నప్పుడు “ఈ ఉన్నవన్నీ, కదలేవన్నీ నా యొక్క వివిధ ఆరోపిత రూపాలే అని గమనించబడగలదు. (మమాత్మా సర్వభూతాత్మా' మొదలైన) వేద ప్రతిపాదిత మహావాక్యములు ఈ అనునిత్య సత్యమును నిర్ద్వంద్వంగా ప్రకటిస్తున్నాయి కదా!

నిర్మల దర్పణంలో గృహ, ఆకాశ, పర్వతాదులు ప్రతిబింబిస్తున్నాయి. అట్లాగే నిర్మల చైతన్య ఘనము" అనే దర్పణంలో ఈ నేను, నీవు, దృశ్యము మొదలైనవన్నీ ప్రతిబింబిస్తున్నాయి. ఏదేది దర్పణంలో ప్రతిబింబించినా కూడా, దర్పణానికి వాటితో సంబంధం ఉన్నదా? లేదుకదా! దర్పణం సర్వదా యథాతథమై ఉంటున్నట్లే ...మన స్వస్వరూపమగు చిదాకాశ ఘనంలో ప్రతిబింబించే దృశ్యాదులకు, ఘనచిదాకాశ స్వరూపానికి సంబంధం లేదు. అనగా దృశ్యం యొక్క ఉనికిచే గాని, లేమిచే గాని మన చిదాకాశ ఘన స్వరూపం మార్పు చేర్పులు పొందేదికాదు. అయితే ఇది జనులు గమనించటం లేదు. అంతే !

శ్రీరాముడు : హే మహర్షీ! మనందరి స్వరూపమూ చిదాకాశ ఘనమే కదా!

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును. సర్వదేహుల వాస్తవ - ఆత్యంతిక స్వస్వరూపము చిదాకాశ ఘనమే గాని మరి ఇంకొకటేదీ కాదు.

శ్రీరాముడు : అటువంటప్పుడు మనమంతా ఒకరికొకరం వివిధ రీతులుగా (నేను - నీవు - నీవారు, నా వారు, జ్ఞానులు, అజ్ఞానులు, సుజ్ఞానులు, దురజ్ఞానులు, ఈ విధంగా జ్ఞానభేదాలతోను, గుణభేదాలతోను ఒకరికొకరం ఎందుకు అగుపిస్తున్నాం?

శ్రీ వసిష్ఠ మహర్షి : రామచంద్రా! కొన్ని దర్పణములు తెచ్చి ఇక్కడ చతురస్రంగా అమర్చామనుకో, ఆ దర్పణాలన్నీ ఒకే లోహంతో తయారయినప్పటికీ, అవన్నీ ఒకదానియందు మరొకటి ఆయా వివిధ ఆకారములతోటి ప్రతిబింబిస్తున్నాయి కదా! మనమందరము సర్వకాలములందునూ చిద్రూపములమే! అయినప్పటికీ ఈ సమస్త పదార్థములు మాయాశక్తిచే వివిధ రూపములవలె మన చిత్తంలో ప్రతిబింబిస్తున్నా. ఒకరికొకరు మాయతోకూడి అనుభూతులమగుచున్నాం.

మనయందు మన స్వస్వరూపంగా అధ్యస్థమైయున్న చిదనబ్రహ్మమే ఈ భోగ్య జగదాకారంగా వివర్తితమై, ఇంద్రియ సామీప్యము పొందిన ఆయా వస్తువులను భోగార్థంగా పొందుచున్నది.

Page:284

ఇత్యనేనైవ నానేదం నానానానా చ వస్తుతః |

నచ నానా నచా నానా నానానానాత్మకం తతః ||

ఈ విధంగా... బ్రహ్మము ఒక్కటే! ఒక్కటే అయివుండి అనేక రూపములుగా భాసిస్తోంది.

వాస్తవానికి బ్రహ్మమునందు 'ఏక - - అనేకములు' అనే రెండూ లేవు. మాయా ప్రభావం చేతనే ఈ విధంగా ఈ ఈ ఏక - అనేక రూపములుగా భాసిస్తోంది. ఏకైక స్వప్నద్రష్టా చైతన్యమే స్వప్నంలో ఏక - అనేకములుగా భాసించుటయే అందుకు దృష్టాంతము.

ఇప్పుడు మనం విపశ్చిత్తు విషయానికి వస్తే... విపశ్చిత్తు అగ్నిదేవుని వరం చేత నాలుగు దేహాలు పొంది ఒకే జీవాత్మ అయివుండి నాలుగు చోట్ల నాలుగు విధాలైన కర్మ పరిపాక విశేషాలు పొందుచున్నాడు. ఇది ఒకే వ్యక్తి నలుగురితో నాలుగు రీతులుగా (ఒక మిత్రునితో, ఒక శిష్యునితో, ఒక ఆస్తి సంబంధిత వ్యవహారంతో, ఒక కుటుంబ సభ్యునితో ఒకే సమయంలో నాలుగు రకాలైన స్వభావాలు ప్రదర్శిస్తూ సంభాసించునట్లు) ... వ్యవహరించు రీతిగా కొనసాగుచున్నది. ఆ విపశ్చిత్తు ఎక్కడ ఏ వస్తువు ప్రాప్తిస్తుంటే అక్కడ ఆ వస్తువుతో తన్మయుడై, వివశుడై ఆ చోట అట్లు వ్యవహరిస్తు న్నాడు. ప్రతి జీవుడు దృశ్య పదార్థముల పట్ల అట్లే ఎదురుగా ఏది వుంటే అద్దాని అననుసరించి ప్రవర్తనను సంతరించుకోవటం చూస్తున్నాం కదా! ఇదీ అట్టిదే.

ఇక ... “నాలుగు దేహాలతో నాలుగు చోట్ల ఆ ఎదురుగాగల విషయాలలో తన్మయానుభవం ఎట్లా పొందుచున్నాడు?” అనే విషయానికి వస్తే ... యోగులు ఒకే కాలంలో వివిధ ప్రదేశములలోను, త్రికాలములలోను ప్రత్యక్షమై వివిధ కార్యములు నిర్వర్తించటం గురించి నీకు అనేక విశేషాలు ఆశ్రమ విద్యా సమయంలో చెప్పియే ఉన్నాను కదా! యోగబలంచేత అనేక రూపములతో వివిధ ప్రదేశములలో వేరువేరు కార్యములు యోగులు నిర్వర్తిస్తూ ఉండగా... ఇక మన విపశ్చిత్తు వేరు వేరు చోట్ల వేరు వేరు దేహములతో వ్యవహరించటంలో ఆశ్చర్యమేమున్నది? అటు ఆకాశంలో మేఘాలను చూడు. అవి ఉష్ణముచే తపించే జనులను ఆహ్లాద పరుస్తున్నాయి కదా! అయితే, మేఘములన్నీ ఒక్కటే అయినప్పటికీ అవి అనేక ప్రదేశాలలో వ్యాపించి... ఒక చోట క్షాళనం (Cleaning) చేస్తున్నాయి; మరొకచోట భేదనం (Dividing) చేస్తున్నాయి; ఇంకొకచోట తటాకాలను నింపుతున్నాయి; వేరొకచోట సస్యపోషణం చేస్తున్నాయి.

ఆ మేఘాభిమానియగు జీవుడు (ఈ మేఘాలే నా శరీరం అని భావన చేస్తున్న జీవుడు) నేను వేరు వేరుచోట్ల ప్రవేశించి వేరు వేరు వ్యవహారాలు నిర్వర్తిస్తున్నాను కదా!... అనే అనుభవాన్ని పొందుచున్నాడు. అట్లాగే విపశ్చిత్తు కూడా నేను వేరు వేరు చోట్ల వేరు వేరైన అనుభవాలు పొందుచున్నాను”... అను రూపంగా అవన్నీ అనుభవిస్తున్నాడు.

ఇంకా ఈ సృష్టిలో అనేక వింతవింతలైన చమత్కారములు జరుగుచున్నాయి. దేహాభిమాని అయిన సంసారబద్ధ జీవుడు, “నా పరిమితి ఈ దేహమే”... అనుకొని దేహ పరిమితత్వాన్ని అనుభవించటం కొనసాగిస్తున్నాడు.

Page:285

అయితే... అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ, ప్రాకామ్య, ఇచ్ఛా, వసిత్వ -

అనబడే అష్ట సిద్ధులను యోగాభ్యాసంచే సముపార్జించుకొన్న ఈశ్వర సదృశులగు యోగులు ఏక కాలంలో వివిధ దేహాలతో అసంఖ్యాకములగు కర్మ పరంపరా వ్యవహారములను, తత్ సంబంధిత జగత్ రచనా వ్యవహారములను రచించుచూ ఏకకాలంలో అవన్నీ అనుభవిస్తూపోతున్నారు.

ఒకే విష్ణు భగవానుడు నాలుగు భుజాల చేతను, వివిధ మాయా దేహాల చేతనూ... ఒక చోట యోగనిద్రలో ఉంటున్నాడు. (నిర్విషయుడై కేవలం చిద్విలాసానుభవంలో తన్మయుడై ఉంటున్నాడు). మరొక చోట గొప్ప తపస్సు కొనసాగిస్తున్నాడు. ఇంకొక చోట ఇంద్రుని సోదరుడై ఆతని కార్యక్రమములకు సహకారాలు అందిస్తున్నాడు. వైకుంఠంలో భోగములు అనుభవిస్తున్నాడు. అవతార మూర్తియై ముల్లోకములలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుపుచున్నాడు. వైకుంఠాంతః పురంలో లక్ష్మీదేవితో సరససల్లాపములతో క్రీడిస్తున్నాడు. భక్తులకు తోడు నీడ అయి వారి లౌకిక - పారలౌకిక వ్యవహారములలో పాల్గొనుచున్నాడు. అనేక మంది భక్తుల హృదయాలలో రమిస్తు న్నాడు. అనేక బాహువులు గల విష్ణువు రెండు ప్రయోజనములు తటస్థించినప్పుడు రెండు బాహువులతో ఆ రెండు కార్యములు నిర్వర్తిస్తున్నాడు. అనేక వ్యవహారములు తటస్థించినపుడు - అనేక బాహువులతో అనేక కార్యములు నిర్వర్తిస్తూ ఈ లోకములన్నీ పరిపాలిస్తున్నాడు.

అట్లాగే మన విపశ్చిత్తు ఒకే సంవిత్తుచే విపశ్చిత్తుగా' పరిపూర్ణుడై ఉండి ఇప్పుడు (ఈ కథా సమయంలో) నాలుగు దిక్కులలో నాలుగు దేహములతో అక్కడక్కడ ప్రాప్తములగుచున్న దృశ్య వ్యవహారములలో పాల్గొనుచూ, అక్కడక్కడి సుఖ దుఃఖములన్నీ తనవిగా అనుభూతి పొందుచున్నాడు.

ఆ నలుగురు విపశ్చిత్తులు వేరువేరు దేహములలో వేరువేరు చోట్ల భూమిపై శయనించుచున్నారు. వేరువేరు ద్వీపములలో లభించిన వస్తువులను అనుభవించుచున్నారు. వన పంక్తులలో వ్యవహరి స్తున్నారు. పర్వత పంక్తుల మధ్యగా వ్యవహరిస్తున్నారు. సముద్రములలో పరిభ్రమిస్తున్నారు. ద్వీప సమూహములలో విశ్రమిస్తున్నారు. సముద్ర తీరములలోను, నగరములలోను క్రీడించుచున్నారు. పర్వత శిఖరములలో దాగుకొంటున్నారు. కొన్నిచోట్ల కొన్ని సంవత్సరముల కాలం గృహసంబంధము లైన - భార్యపిల్లలు, బంధువులు, తదితరులు - ఇత్యాది భావోద్రేకములు కలిగి ఉంటున్నారు. బంధువులతో వినోదిస్తున్నారు... ఇట్లా ఉన్నది, ఆ నలుగురు విపశ్చిత్తుల వ్యవహారమంతా!

తూర్పు దిక్కుగా వెళ్ళి సంచారం చేస్తున్న విపశ్చిత్తు శాకద్వీపంలో ప్రవేశించాడు. ఆ ద్వీపంలో ప్రసిద్ధి అయిన ఉదయాచల పర్వతంపై ఒకానొక చోట స్నుహీ (జముడు) వృక్షములతో కూడిన ఒక భయంకరారణ్యంలో సంచరించ నారంభించాడు. అక్కడ ఆ కీకారణ్యంలోగల ఒక యక్షుడు తన మాయతో తూర్పు దిక్కు విపశ్చిత్తును తన అనేక మాయారచనలతో సమ్మోహంలో ముంచివేశాడు. అట్టి సమ్మోహంలో ఏడు సంవత్సరాలు ఆతడు నిదురించాడు. అక్కడి నుండి ఎట్లాగో బయలుదేరి ఒక విచిత్రమైన జలాశయం జేరాడు. ఆ విచిత్ర జలాశయంలో నీరు త్రాగినవారు ఏడు

Page:286

సంవత్సరములు శిలారూపంగా ఎటూ కదలలేక ఉండిపోతారు. మన తూర్పు దిక్కు విపశ్చిత్తు తెలియక ఆ నీరు త్రాగి ఏడు సంవత్సరాలు ఆ తటాక సమీపంలో శిలారూపంలో ఉండిపోయాడు.

పశ్చిమ దిక్కు విపశ్చిత్తు కూడా శాకాద్వీపంలోని గల అస్తాచల పర్వతముపై గల పిశాచముల మాయకు లోబడి నెలరోజులు ఆ కామపిశాచముల మాయలో నానా అగచాట్లు అనుభవించాడు.

ఒకసారి తూర్పు దిక్కు విపశ్చిత్తు శాకాద్వీపంలో సంచరిస్తూ ఒక ముని యొక్క శిష్యులను తన యోగశక్తుల గర్వంతో బాధించనారంభించారు. అక్కడి ముని ఆశ్రమ జనాన్ని బాధిస్తున్న తూర్పు దిక్కు విపశ్చిత్తును గమనించిన ఆ ముని ఆతనిని చూచి, "ఓయీ! అగ్నిదేవుడు నీపై దయతో నీకు ప్రసాదించిన యోగశక్తులను సౌమ్యులగు ముని జనమును బాధించటానికి ఉపయోగిస్తు న్నావా? సాత్వికులను బాధించిన దోషం నిన్ను కట్టికుడుపక మానదు కదా! కనుక నీవు ఈ అరణ్యంలో ముళ్ళ చెట్టువై ఉండెదవు గాక అని శపించాడు. ఇక ఆ తూర్పు దిక్కు విపశ్చిత్తు అక్కడే ముళ్ళపొదగా మారిపోయి నేలలోని జలం ఆహారంగా స్వీకరిస్తూ చలనం కోల్పోయి అనేక వేదనలు అనుభవిస్తూ ఉండిపోయాడు. తూర్పుదిక్కు విపశ్చిత్తుకు వచ్చిన ఆపద, ఆతని వేదన పశ్చిమదిక్కు విపశ్చిత్తుకు తెలియవచ్చింది. ఆతడు శాకద్వీపంలోనే సంచరిస్తున్నాడు కదా! విషయం తెలియగానే ఆతడు ముని ఆశ్రమాన్ని సమీపించి ఆ మునిని స్తోత్ర-సేవాదులచే సంతోషింపజేశాడు.

ముని : ఓ పశ్చిమ విపశ్చిత్తూ! అనేక రోజులుగా నీవు ప్రదర్శిస్తున్న సేవానిరతికి నేను ఎంతగానో సంతోషించాను. ఈ ఆశ్రమ వాసులు నీ సాత్విక భావాలను ఎంతగానో అభినందిస్తున్నారు. నీకు ఏ వరం కావాలో కోరుకో?

పశ్చిమ విపశ్చిత్తు : స్వామీ! మునీంద్రా! నా ఆత్మీయుడగు తూర్పుదిక్కు విపశ్చిత్తు మీ ఆశ్రమ జనాన్ని బాధించి మీకు కోపం కలిగించి మీ శాపంచే కంటక వృక్షంగా (ముళ్ళ చెట్టుగా) అయి అనేక మానసిక వేదనలచే దుఃఖితుడై ఉన్నాడు. ఆతనిని క్షమించి ఆతనికి శాప విమోచనం ప్రసాదించండి. ముని : అట్లే అగుగాక! ఇప్పుడు నీకొక దోష నివారణ మంత్రం ఉపదేశిస్తాను. మంత్ర దేవతను ఉపాసించి మంత్రోచ్చారణ చేస్తూ ఆ కంటక వృక్షాన్ని ఈ అంపంతో ఖండించు. అప్పుడు నీ మిత్రునకు శుభం కలుగుతుంది.

ఆ విధంగా ముని వాక్యాలు విన్నాడు. ముని వద్ద మంత్రోపదేశం పొందాడు. మంత్రోచ్చారణ చేస్తూ తూర్పుదిక్కు విపశ్చిత్తుకు శాపవిమోచనం కలిగించి ఆపై తన సంచారం తన మార్గంలో

కొనసాగించసాగాడు.

పశ్చిమ విపశ్చిత్తు మరొక సమయంలో 'శిశిరం' అనే ప్రదేశంలో ప్రవేశించి అక్కడి మధుర మైన ఫలాలను ఆస్వాదిస్తూ అక్కడి పూసజ్జలను ఖండించి గృహంగా నిర్మించి, అక్కడ నివసిస్తూ అక్కడి వన వృక్షాలను ఖండించసాగాడు. ఇది అక్కడి పిశాచ రాజుకు చాలా కోపం తెప్పించింది. అప్పుడు ఆ పిశాచపతి "ఓ ఈ మానవుడా! ఇక్కడ మా పిశాచ రాజ్యంలో ప్రవేశించి మా పిశాచ జనుల గృహములైన వృక్షములను ఖండిస్తున్నావే! ఇందుకు శిక్షగా నీవు శిలగా అయ్యెదవుగాక”

Page:287

.. అని శపించాడు. అంతే! ఆ పశ్చిమదిక్కు విపశ్చిత్తు అక్కడే శిలగా మారిపోయాడు. “అయ్యో!” అని మౌనంగా శోకించసాగాడు. ఆతని శోకం దక్షిణ దిక్కు విపశ్చిత్తుకు స్ఫురించింది. వెంటనే ఆతడు ఆ పిశాచ రాజ్యారణ్యంలో ప్రవేశించి గోమాంసాదులు సమర్పించి ఆ పిశాచపతిని సంతోష పరచి పశ్చిమదిక్కు విపశ్చిత్తుకు శాపం నుండి విమోచనం కలిగించాడు.

అట్లాగే మరొకసారి అస్తాచల సమీపంలోగల ఒక గోరూపధారియగు పిశాచి పశ్చిమదిక్కు విపశ్చిత్తును ఎద్దుగా మార్చి ఒక సంవత్సరం తన వెంట త్రిప్పుతుండగా దక్షిణదిక్కు విపశ్చిత్తు ఆ గోరూప పిశాచి చర్యను గమనించి తన ప్రతిమంత్రశక్తిచే పశ్చిమదిక్కు విపశ్చిత్తుకు ఎద్దు రూపం నుండి విముక్తి కలిగించాడు.

మరొక సందర్భంలో పశ్చిమదిక్కు విపశ్చిత్తు క్షేమకము అని పిలువబడే ప్రదేశంలో సంచరిస్తూ అక్కడ గల అంబికేయము అనే పర్వత శ్రేణులలో ప్రవేశించి అక్కడి పిశాచాలతో తానూ ఒక్కడిగా రూపం సంతరించుకున్నాడు. కొంత కాలానికి దక్షిణ దిక్కు విపశ్చిత్తు ఆ ప్రదేశంలో ప్రవేశించటం జరిగింది. అప్పుడు అక్కడ ఒక మఱిచెట్టుపై దక్షిణ దిక్కు విపశ్చిత్తు మంత్రముగ్ధంగా ఆ పిశాచపతిని ఆహ్వానించి ప్రసన్నుణ్ణి చేసుకొని పశ్చిమ విపశ్చిత్తుకు పిశాచత్వం నుండి విడుదల గావింపచేశాడు.

6. యోగి ఒక ప్రదేశంలో ఉండి త్రికాలాలలో మరొకచోట అనుగ్రహించటం

శ్రీరాముడు :

ఏక దేశగతా విష్వక్ వ్యాప్య కర్మాణి కుర్వతే

యోగినౌ త్రిషుకాలేషు సర్వాణి, భగవన్ ! కథమ్ ?

హే భగవాన్! వశిష్ఠ మహర్షీ! యోగులు భౌతికంగా ఒక ప్రదేశంలో ఉండికూడా, సర్వత్రా వ్యాపించి ఆయా వేఱువేఱు ప్రదేశములలో గల శిష్యుల ప్రార్థన, విన్నపములను స్వీకరించి త్రికాలాల లోను “అనుగ్రహించటం, రక్షించటం, మార్గం చూపటం ...వంటి వివిధ కార్యములను ఎట్లా నిర్విర్తిస్తున్నారో ప్రవచించమని నా విన్నపం.

శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! నీవు అడిగిన విశేషం గురించి :

1.మా గురువు (దైవం) గొప్ప మహిమాన్వితుడు. అది ఆయనకే సాధ్యం. మరెవరూ అట్లా అనేక చోట్ల ఉండి అనుగ్రహించలేరు.”; 2.ఆ! అదంతా నిజం కాదు.”

...ఇట్లా అసంపూర్ణ జ్ఞానులు - అజ్ఞానులు పరిపరి అభిప్రాయాలు కలిగివుంటున్నారు. మనం అజ్ఞానుల అభిప్రాయమును ప్రమాణంగా తీసుకోము కదా! కనుక వారివారి వేరు వేరు అభిప్రాయముల గురించి మనం ఇక్కడ చర్చించుకోవటంలేదు.

Page:288

ఇక తత్త్వవేత్తల దృష్టిని ప్రమాణంగా తీసుకొని చెప్పుకుందాం. సత్తా సామాన్యమగు చిన్మాత్రము కంటే వేరైన రూపమేదీ ఈ జగత్తుకు లేదు. ఎందుకంటే...

1. నిర్మలమైన ఆత్మజ్ఞానం కర్మ-భక్తి యోగాలు సమాశ్రయంచే క్రమక్రమంగా ప్రవృద్ధమౌతోంది. 2. అట్లు ఆత్మజ్ఞానంచే పరితప్తమైన నిర్మల బుద్ధి కలవారికి క్రమ క్రమంగా ఈ దృశ్యం యొక్క అత్యంత అభావము" అను బోధ ఉద్భవిస్తోంది. అనగా, దృశ్యం వారి దృష్టిలో అదృశ్యమై ఇద్దానికి ఏది ఆధారమో ... అది దర్శించబడుతోంది. స్వప్నంలో స్వప్న ద్రష్టచైతన్యముచే దర్శించబడే సర్వవిషయములకు రూపము, ఆధారము స్వప్నద్రష్టాచైతన్యమే కదా! అట్లాగే ఈ దృశ్యం ఎద్దాని రూపమైయున్నదో, ఏది ఈ దృశ్యమునకు ఆధారమైయున్నదో, ఎద్దానియందు ఈ దృశ్యం అంతర్గతమై ఉన్నదో ...అట్టి స్వస్వరూపాత్మ" అనబడే బోధ రూపము గోచరిస్తోంది.

3. క్రమక్రమంగా ఈ సృష్టియొక్క - అద్దాని భావాభావముల యొక్క దృష్టి శమించి, “ఇదంతా అస్మత్ ఆత్మరూపమే ...అనబడే, దివ్యదృష్టి రూపుదిద్దుకుంటోంది.

4. అప్పుడిక క్రమంగా సర్వ ఆధిభౌతిక దృష్టులు మొదలంట శమించుచుండగా, ఆ మహనీయుడు చిన్మాత్రమగు సత్తా సామాన్యమున విశ్రమించే సర్వేశ్వర స్వరూపుడు అగుచున్నాడు.



5. అట్టి పూర్ణజ్ఞానికి ఈ ప్రపంచమంతాకూడా చిద్రూపమగు ఆత్మయే అయి వెలయుచున్నది. ఆత్మకు వేరుగా ఇక దృశ్యము యొక్క ఉనికి - ఊసులు ఉండజాలవు.

అట్టి స్థితిలో సర్వము ఆత్మమయయై ఉండగా ఇక ఆపై ఏది దేనిచే నిరోధించబడగలదో చెప్పు?... (బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి) ఇంతవరకు 'సాధన'లో ఉన్న ఆ మహనీయునికి బ్రహ్మము’ అనబడే శాస్త్ర ప్రతిపాదిత ఆత్యంతిక పరమసత్యమునకు ...ఇక భేదమే ఉండదు.

భావించటం, భాసించటం - సర్వ వ్యాపకము, సర్వరూపము అయినట్టి ఆత్మ ఏది ఎచ్చట ఎట్లు భావిస్తుందో... అది అట్లాగే భాసిస్తూ ఉంటుంది. సర్వస్వరూపుడు, ఆత్మానుభవి అగు ఆ చిద్రూపుడు ఇక ఆపై భూత-వర్తమాన భవిష్యత్తులలో ఏదీ తాను కాకయే ఉంటాడు. అంతేకాదు. అంతా తానే అయి ఉంటాడు కూడా! అట్టి నిర్మలమైన భావనను సంతరించుకున్నట్టి చిద్రూపమగు ఆత్మ తనయొక్క వాస్తవ స్వరూపమును త్యజించకుండానే... ఈ దూర, సమీప, నిమేష, కల్ప, భూత, భవిష్యత్, వర్తమాన, స్థూల, సూక్ష్మ - రూపములన్నీ తన సత్తా సామాన్య రూపమును సర్వవేళలా అవధరిస్తోంది.

సర్వాత్మని స్థితాన్యేవ పశ్యమాయా విజృంభితమ్ అజాతమ్ అనిరుద్ధం చ యథాస్థితమ్ అవస్థితమ్

ఆహా! రామచంద్రా! ఈ మాయ ఎంతటి చిత్రమైనదో గమనించావా! సర్వరూపమగు ఆత్మయందే భూత - భవిష్యత్ - వర్తమానములకు సంబంధించిన సర్వ స్థూల రూపములు - సూక్ష్మతత్త్వములు అన్నీ కూడా స్థితి కలిగివున్నాయి. ఈ జగత్తులన్నీ కూడా ఉత్పన్నము అవకుండానే, నాశనమనేది లేకుండానే ఆత్మయందు ఆత్మకు అభిన్నంగా యథాస్థితిగా నెలకొని ఉన్నాయి. కాబట్టి :

Page:289

1.ఈ మూడు లోకాలలో కనిపించేదంతా కూడ విజ్ఞానఘన మగు ఆత్మరూపమే!

2. చిదాకాశం తన చిదాకాశత్వాన్ని త్యజించకుండానే ఈ రీతిగా జగద్రూపంగా కూడా స్థితినొంది ఉన్నది.

మాయతో కూడుకొనివున్న పరమాత్మ తనయొక్క ద్రష్ట - దృశ్యత్వముల కించిత్ అభ్యాసమే ఈ జగత్తు. అనగా, ఈ 'జగత్తు' అనేది స్వకీయాభ్యాసవశంగా ఉదయించుచున్నది మాత్రమే! అట్టి జగదాత్మయగు పరమేశ్వరుని యొక్క దృక్ రూపము” నకు మార్పుచేర్పులు ఎక్కడున్నాయి? అది దేనిచేత ఎట్లు మార్పు చెందించబడగలదు? లేనేలేదు!

"దృకూపశుద్ధచిత్యే నేను అని జగదతీతత్వం అవధరించి, సర్వరూపములు తానే అయి, సాధ్యాసాధ్యముల రెండింటినీ కూడా ధరించుచున్న మాయకు కూడా “ఆది” అయిన పరమాత్మకు అసాధ్యమేమి ఉంటుంది? ఆ శుద్ధ జగదాత్మయే అన్ని రూపములుగా తానే అయి వ్యవహరిస్తోంది కదా! అందుచేతనే ఆత్మసాక్షాత్కారం సంతరించుకున్న జగద్గురువులు శిష్యుల ఆరాధనకు ప్రతిస్పందించగలుగుచున్నారు.

ఇక విపశ్చితంవిత్తు కూడా శుద్ధ చిత్- దృక్ రూపమే కదా! కనుక 'విపశ్చిత్' అను పేరుతో పిలువబడే సంవిత్తు ఒక్కటే అయివుండి నాలుగు ఉపాధుల ద్వారా నాలుగు చోట్ల నాలుగు విధములైన దృశ్య వ్యవహారములను అనుభవించటం జరుగుతోంది.

ఓ రామచంద్రా! 'విపశ్చిత్' అనబడే చైతన్యాంశము యొక్క వర్తమాన ధర్మ-జ్ఞాన స్థితిని ఇక్కడ వివరిస్తున్నాను. విను.

1. చైతన్యాంశయే నేను విపశ్చిత్తును" అను జీవాహంకారమును పొందియున్నది.

2. క్రమంగా పరిమితాహంకారము నుండి ప్రబోధం పొందుతోంది.

3. అయితే ఇంకా కూడా, విపశ్చిత్తు యొక్క మనోరూప చైతన్యము పరమసత్యమగు పరమాత్మ పదమును (సర్వ జగత్తులు నా యందే ఉన్నాయి... అను జగదహంకారమునకు కూడా సాక్షి అయిన స్థానమును) పొంది ఉండలేదు.

4. ఆ విపశ్చిత్ రాజయొక్క సంవిత్తు అగ్నిదేవుని ఆరాధించి ఆయన అనుగ్రహంచేత నాలుగు ఉపాధులను ధరించి వ్యవహరింపజేసే యోగశక్తిని మాత్రం ఇప్పటికి సంపాదించుకొనియున్నది. ఈ విధంగా విపశ్చిత్తు నాలుగు దేహములతో వ్యవహరిస్తూ ఉండటం యుక్తియుక్తమే అవుతుంది.

బోధరూపమగు ఈశ్వర మాయతో కూడికొనియున్న పరమాత్మయందు అసాధ్యమేముంటుంది? పరమాత్మార్థ బోధ పొందనంతవరకు పదార్థత్వము ఉచితమే కదా! ఒక్క దేహమైనా నాలుగు దేహములైనా - అది పదార్థత్వమే కదా!

ఈ విధంగా, కొంచెము బోధను సముపార్జించియున్న ఆ విపశ్చిత్తు నాలుగు దేహములు సిద్ధింపజేసుకోవటం ఉచితమే (యుక్తమే) అవుతోంది.

Page:290

ఓ రామచంద్రా! ఈ రీతిగా నాలుగు దిక్కులందు ఉన్నట్టి ఆ విపశ్చిత్తులు పరస్పరము ఒకరికొకరు చూచుకోవటం, ఒకరితో మరొకరు సంభాషించుకోవటం, సహకరించుకోవటం, ఒకరి కష్టాలలో మరొకరు తోడుకావటం నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అచ్యుతమగు చిదాకాశము తన అప్రమేయ - అఖండ స్వరూపము నుండి చ్యుతి నొందకయే కించిత్ చ్యుతి పొందినదానివలె అయి నిజస్వరూపమునకు అభిన్నమైన మనస్సును, ఆ మనస్సుచేత తనకు వేరుగా కానట్టి (కాని, అనిపించే) జగత్తును దర్శించటం వంటిదే! ఆ విపశ్చిత్తు యొక్క నాలుగు దేహముల ఏక సమయ వ్యవహారం కూడా చైతన్యము యొక్క ఒకానొక మాయా విశేషమే!

ఒక జీవుడు తన వ్యష్టిచైతన్యమును ప్రేరేపించి అనేక దేహముల ద్వారా అనేక వ్యవహారసరళులను అనేకచోట్ల నిర్వర్తించటం అనేది యోగశాస్త్రవేత్తల పాఠ్యాంశములలో నిర్వచించబడి - విశదీకరించబడిన విషయమే! అంతేగాని, ఇప్పుడు నేను క్రొత్తగా లోకమునకు ప్రతిపాదిస్తున్న విషయమేమీ కాదు!

7. సిద్ధులు వేరు - జ్ఞానము వేరు

శ్రీరాముడు : ఆ విపశ్చిత్తు జ్ఞాని అయివుండి కూడా నాలుగు దిక్కులలోను సింహం, శిల, వృక్షం మొదలైన ఆయా ఉపాధులు ఎందుకు పొందవలసి వచ్చింది? ఈ విషయం విశదీకరించండి. శ్రీ వసిష్ఠ మహర్షి : ఓ రామచంద్రా! "ప్రబుద్ధులగు యోగులు ఒక ప్రదేశంలో ఉండియే అనేకచోట్ల అర్హులైన శిష్యులకు బోధించటం, ఆశ్రితులగు దీనజనుల కష్టాలు పోగొట్టటానికి ఆయా కార్యములు నిర్వర్తించటం, ఆర్తితో కూడిన పిలుపుకు బదులు పలకటం నిర్వర్తిస్తున్నారు కదా! ...అని నేను ప్రసంగవశం చేత చెప్పానేగాని ఆ ఒకానొక జీవుడగు విపశ్చిత్తుగాని, ఆ నలుగురు ఉపాధి విపశ్చిత్తులుగాని పరిపూర్ణజ్ఞానులు అయినారని నేను అనలేదు.

ఆ విపశ్చిత్తులలో నలుగురు జ్ఞాన అజ్ఞాన రూపములైనట్టి 1.మోక్ష చిహ్నము, 2. బంధ చిహ్నము - రెండు కనిపిస్తున్నాయి. వారు అగ్నిదేవుని కృపచే ధారణమాత్రం చేత నాలుగు దేహాలతో సంచరించ గలుగుచున్న ధారణాయోగులు మాత్రమే. అంతేగాని ఆత్మజ్ఞానులు కాదు.

ధారణా యోగినస్తే హి, ధారణా ప్రాప్త సిద్ధయుః

యే పరంబోధమ్ ఆయాతా యేషు అవిద్యా న విద్యతే॥

హృదయంలో అగ్నిదేవుని యందు చిత్తమును నిలిపి ఆ అగ్నిదేవుని అనుగ్రహం చేతనే కదా, వారు సిద్దులు పొందారు? వారు 'ధారుణా యోగులు' అనిపించుకుంటారుగాని, 'పూర్ణజ్ఞానులు' అనిపించుకోరు. ఎందుకంటే పరమబోధను పొందినవారిలో దృశ్యము విషయమై ఇది కావాలి ...అని గాని అది వద్దు" ...అనిగాని ఈ జగద్విషయమై ఎట్టి పట్టుదల ఉండదు. విపశ్చిత్ విషయం అట్లా లేదు కదా!

Page:291

కిమ్ అవిద్యామ్ అవేక్షన్తో తే, తామరసలోచనా! ధారణా యోగినో హి ఏతే వరేణ ప్రాప్త సిద్ధయః అవిద్యా విద్యతే తేషాం తేన తేలి తద్విచారిణః?

"మేము అవిద్యను పరికించి చూడాలి ... అనే అభిలాష గలవారు అవిద్యాదృష్టి కలవారే అవుతారు. పూర్ణజ్ఞానులకు అవిద్యపట్ల ఎట్టి పరిశోధనాభావం ఉండదు. భ్రమచే కనిపించేదని తెలిసిన తరువాత పరిశీలన ఆవశ్యకం ఏముంటుంది? స్వప్నంలో కనిపించిన ఇల్లు స్వప్నకల్పనా భావ చమత్కారమే! ...అని తెలిసిన తరువాత ఆ కలలో అటువంటి గృహాలు ఇంకా ఎన్ని ఉన్నాయి?” ...అని పరిశీలించాలని ఎందుకనిపిస్తుంది? ఆ విపశ్చిత్తునందు నాలుగు దేహాలతో ఈ సృష్టి ఎంతవరకు ఏఏ రూపములుగా విస్తరించివున్నదో... పరిశీలిస్తాను ... అను రూపంగా అవిద్య ఉండనే ఉన్నది. అవిద్య పరిపాకమై ఉండగా ఆత్మజ్ఞానము పరిపుష్టి పొందదు.

ఓ రామచంద్రా! జీవన్ముక్తులు తమయొక్క జగత్విభాగంచే జగత్తులో సంచరిస్తూనే సమా విభాగమును యథాతథంగా పరిపోషించుకుంటూ ఉంటారు. అంతేగాని, జగత్తు యొక్క వ్యవహారము ఒక మామూలు విషయం అగుచుండగా, ఈ జగత్తు ఏమిటి? అవిద్య ఎంతటిది? ...అని పరిశీలనకు బయలుదేరవలసిన అగత్యం వారికుండదు.

శ్రీరాముడు : మహర్షీ! దేహమున్నంత వరకు బంధం తప్పదు. దేహము దేహికి ఐహిక మొహము. ముక్తికి దేహమే అడ్డుగా కూడా ఉంటోంది" ... అని కొందరు గురువులు దేహతత్త్వాన్ని పాఠ్యాంశంగా బోధిస్తున్నారు. ఇట్టి దేహమును దాటివేస్తేనే ముక్తి ... అనే సిద్ధాంతం విషయంలో మీ అభిప్రాయం సోదాహరణపూర్వకంగా, సవివరంగా ప్రసంగించవలసినదిగా నా విన్నపం.

శ్రీ వసిష్ఠ మహర్షి :ఆలోచన" అనగా... "ఇష్టము, అయిష్టము, గౌరవభావం, అగౌరవ భావం, భయం, ఆశ్చర్యం, అనురక్తి, విరక్తి" ...ఇవన్నీ కూడా దేహధర్మాలా? మనోధర్మాలా?

శ్రీరాముడు : స్వామీ! అవన్నీ మనోధర్మాలుగాని దేహధర్మాలు కాదని, మనోధర్మాలు ప్రకటించటానికి ఈ దేహము ఉపకరించే ఉపకరణం మాత్రమేనని మీరు బోధించియే ఉన్నారు. మీరు బోధించినది పరమసత్యమే.

శ్రీ వసిష్ఠ మహర్షి : అవును కదా! అట్లాగే 'మోక్షం' అనేది చిత్తం యొక్క ధర్మమేగాని దేహం యొక్క ధర్మం కాదు. చొక్కా ధరించేవారు జ్ఞానులు కాలేరు. చొక్కా లేనప్పుడే జ్ఞాని అని ఎవరమైనా అన గలమా? జ్ఞానులు ఈ రంగు చొక్కాని ధరించి ఉండగలరని ఎవరు సిద్ధాంతీకరించగలరు చెప్పు?

మోక్షోపి చేతసోధర్మః, చేతస్యేవ స తిష్ఠతి

న దేహే దేహధర్మస్తు, న దేహాత్ వినివర్తతే ॥

మోక్షము చిత్తము యొక్క ధర్మము మాత్రమేనని మరల ప్రకటిస్తున్నాను. 'మోక్షము' అనేది ఏకాగ్రమైన చిత్తమునందు మాత్రమే నెలకొని ఉంటోంది. కనుక బంధింపడేది చిత్తమేగాని ఆత్మ కాదు. కనుక జీవన్ముక్తునకు ఏవేవో ప్రత్యేకమైన దేహధర్మాలు ఆపాదించటానికి వీలవదు.