⇰
⇰
సంస్కృత మూల గ్రంథము: "యోగవాసిష్ఠం (8 సంపుటములు)" - వాల్మీకి మహర్షి ప్రణీతము, ముద్రణ: శ్రీ వ్యాసాశ్రమం, శ్రీకాళహస్తి
[1] వైరాగ్య, [2] ముముక్షు వ్యవహార, [3] ఉత్పత్తి, [4] స్థితి, [5] ఉపశమన, [6] నిర్వాణ ప్రకరణములు
తెలుగు వచన సరళ వ్యావహారిక స్వేచ్ఛానువాద సమగ్ర గ్రంథము: "శ్రీ వసిష్ఠ - రామ సంవాదము (4 సంపుటములు)" - శ్రీ యేలేశ్వరపు హనుమ రామకృష్ణ (https://yhramakrishna.com), ముద్రణ: రామకృష్ణ మఠం, హైదరాబాదు.
విషయ సూచిక :
Original Sloka | YP Translation | YHRK Liberal Translation |
---|---|---|
వాల్మీకిః ఉవాచ :- సర్గ - 12, శ్లోకమ్ - 1 ఇతి పృష్టో మునీంద్రేణ సమాశ్వస్య చ రాఘవః । ఉవాచ వచనం చారు పరిపూర్ణార్థమంథరమ్ ॥ వాల్మీకి :- ఇట్లు మునీంద్రునిచే బ్రశ్నింపబడి ఓదార్పబడిన రాముడు అర్థయుక్తములును, మధురములును నగు వాక్యములను మెల్లగ నుడువసాగెను. |
|
శ్రీరాముడు పూర్ణార్థయుక్తంగా ఇట్లు సమాధానమిచ్చాడు. |
శ్రీరామ ఉవాచ :- సర్గ - 12, శ్లోకమ్ - 2 భగవన్! భవతా పృష్టో యథావదధునాఽఖిలమ్ । కథయామ్యహమజ్ఞోఽపి కో లంఘయతి సద్వచః ॥ శ్రీరాముడు :- సాధుపురుషుల వాక్యముల నెవరుల్లంఘింపగలరు? అగుటంజేసి, అజ్ఞుడ నైనను ఉన్నదున్నట్లు చెప్పుచున్నాను. |
|
ఉత్తమోత్తములచే అలంకరించబడిన సభకు నమస్కారం. ఇక్కడ వేంచేసియున్న విశ్వామిత్రాది మహర్షుల దర్శనభాగ్యం, సేవాభాగ్యం అనేక జన్మల సుకృతం చేతనే లభిస్తాయి. హే విశ్వామిత్ర మహర్షీ! నా మనస్సులో ఉన్న భావాలన్నీ మీరు ఆజ్ఞాపించినట్లే చెపుతాను. నా ఈ వాక్యములలో దోషమేమైనా ఉంటే క్షమించండి. సత్పురుషులకు మనోగతమైనదంతా తెలియచేయటం శుభప్రదమే అవుతుంది కదా! |
సర్గ - 12, శ్లోకమ్ - 3 అహం తావదయం జాతో నిజేఽస్మిన్ పితృసద్మని । క్రమేణ వృద్ధిం సంప్రాప్తః ప్రాప్తవిద్యశ్చ సంస్థితః ॥ నే నీ పితృగృహమున పుట్టి పెఱిగి, విద్యనార్జించి యుంటిని. |
|
నేను పదహారు సంవత్సరముల క్రితం ఈ దశరథ మహారాజు ఇంట్లో జన్మించాను. క్రమక్రమంగా వృద్ధిచెందుతూ విద్యాభ్యాసం పూర్తి చేశాను. |
సర్గ - 12, శ్లోకమ్ - 4 తతః సదాచారపరో భూత్వాఽహం మునినాయక! విహృతస్తీర్థయాత్రార్థముర్వీమంబుధిమేఖలామ్ ॥ మునీశ్వరా! పిదప సదాచార పరాయణుడనై, తీర్థయాత్రల సముద్ర వలయిత మగు భూమండలము నందంతటను విహరించితిని. |
|
కొంతకాలం క్రితం తీర్థయాత్రలకు వెళ్ళివచ్చాను. |
సర్గ - 12, శ్లోకమ్ - 5 ఏతావతాథ కాలేన సంసారాస్థామిమాన్ హరన్ । సముద్భూతో మనసి మే విచారః సోఽయమీదృశః ॥ |
|
వచ్చినప్పటినుండీ నా మనస్సులో ఒకానొక "విచారణ" ఉత్పన్నమైనది. |
సర్గ - 12, శ్లోకమ్ - 6 వివేకేన పరీతాత్మా తేనాహం తదనుస్వయమ్ । భోగనీరసయా బుద్ధ్యా ప్రవిచారితవానిదమ్ ॥ ఇప్పుడు నాకు సంసార మనిన, ఆసక్తి నశించినది. వివేకయుక్తుడనై, భోగేచ్ఛను బరిత్యజించి ఇట్లు విచారించితిని. |
|
ఆ విచారణ యొక్క స్వరూపమేమిటో చెపుతాను వినండి. |
సర్గ - 12, శ్లోకమ్ - 7 కిం నామేదం బత సుఖం యేయం సంసారసంతతిః । జాయతే మృతయే లోకో మ్రియతే జననాయ చ ॥ ఈ సంసార చక్రమున సుఖ మేమున్నది? చచ్చుటకై పుట్టుచున్నారు. మరల జన్మించుట కొఱకు చచ్చుచున్నారు. |
|
ఈ సంసార వ్యవహారంలో 'సుఖం’ అంటూ ఏదైనా ఉన్నదా? ఇక్కడ ప్రాణి చావటానికే పుట్టుచున్నాడు. పుట్టడానికే చచ్చుచున్నాడు. ఇంతకన్నా ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషమేమున్నది? కొందరు, “అలా ఎందుకనుకోవాలి? ఇందులో ఐశ్వర్యములు, ధనములు, స్వజనులు, స్త్రీలు మొదలైనవి సుఖప్రదములే కదా! అవి సంపాదించుకొన్నవారు సుఖంగానే ఉంటున్నారు కదా!” అని అంటున్నారు. కాని, ఇది వినండి! |
సర్గ - 12, శ్లోకమ్ - 8 అస్థిరాః సర్వ ఏవేమే సచరాచరచేష్టితాః । ఆపదాం పతయః పాపా భావా విభవభూమయః ॥ స్థావర జంగమములగు జీవుల ప్రయత్నమున గలిగిన భోగవిషయములన్నియు అశాశ్వతములు, ఆపదలకు తావు; పాపములకు గారణములు. |
|
ఇందులో స్థావరజంగమ జీవులు పొందుచున్న భోగములు, విభవములు - ఇవన్నీ అస్థిరములు, అసత్యములు, అశాశ్వతములు అయి ఉన్నాయి. ఒకప్పుడు కొంచెం సుఖకరంగా తోచినప్పటికీ, శాశ్వతమైన సుఖం మాత్రం ఖచ్చితంగా ప్రసాదించుటలేదు. ఒక్క క్షణంలో కనిపించి మరొక్క క్షణంలో మాయమైపోతున్న ధన, జన, యౌవనాదులు సుఖ ప్రదాతలని అనటం ఎట్లా? ఉదాహరణకు ఈ సంపదలే తీసుకోండి. వీటిని కూడబెట్టుకోవటంలోను, రక్షించుకోవడంలోను జనులు ఎన్ని ఆపదలు ఎదుర్కొంటున్నారు! ఇవన్నీ ఎన్ని రకాలైన లోభమోహాది పాపపూరిత దుశ్చర్యలకు కారణభూతములౌతున్నాయి! అందుచేతనే సుఖకరములని అనేకమంది అనుకొంటున్న ఈ సంపదలు, ఈ విభవములు, ఈ పదార్థ జాలములు, ఈ మనుష్యుల సంబంధ - బాంధవ్యములు సత్పురుషుల దృష్టిలో తుచ్ఛములు, తిరస్కారములుగానే ఉంటున్నాయి. వీటికై ప్రయత్నిస్తున్న అనేకమంది సంసారజీవుల అనేక చేష్టలు కూడా నాకు అర్థరహితంగానే కనిపిస్తున్నాయి. |
సర్గ - 12, శ్లోకమ్ - 9 అయః శలాకాసదృశాః పరస్పరమసంగినః । శ్లిష్యంతే కేవలం భావా మనఃకల్పనయా స్వయా ॥ విషయములకు పరస్పర సంబంధము లేదు. అవి ఇనుపకమ్ములవలె విడివడినవి. వాటి సంబంధము కేవలము మనస్సుయొక్క కల్పనయే. |
|
ఈ సంసారంలో మనకు కనిపిస్తున్న బంధుత్వాలు, స్నేహాలు, అనుబంధాలు మొదలైనవాటిని పరిశీలనగా చూచినప్పుడు నాకు ఒకటి అనిపిస్తోంది. ఇందలి జనులు ఒకరికొకరు సంబంధించినవారే కారు. వీరందరు ఇనుప చీలలవలె (రింగులవలె) ఒకరికొకరు ముడిపడినట్లు పైకి ఉంటున్నారు. కాని, లక్ష్యాలు, కష్టాలు, ఆవేదనలు, సంస్కారాలు - ఎవరివి వారివే. ఒకరు మరొకరి వంటివారు కానేకాదు. అయితే జీవుడు “ఈ ఈ వ్యక్తులు, ఈ ఈ పదార్థములు నాకు సుఖకరములు” అని సంకల్పించుట జరుగుతోంది. అందుచేతనే అతనికి వాటితో సంబంధములు, బాంధవ్యములు ఏర్పడుచున్నాయి. చూచారా? ఈ ప్రపంచంలో మనకు కనిపిస్తున్న అన్ని రకములైన సంబంధములు కేవలం “సంకల్పించుట” అను ప్రక్రియ కారణం చేతనే ఏర్పడుచున్నాయి. అట్టి సంకల్పమాత్ర సంబంధాలు ఈ జీవుడిని ఎంతగా క్షోభింప చేస్తున్నాయో కదా! |
సర్గ - 12, శ్లోకమ్ - 10 మనః సమాయత్త మిదం జగదాభోగి దృశ్యతే । మనశ్చాసదివాభాతి కేన స్మ పరిమోహితాః ॥ మాయావేషమును దాల్చిన దీ జగత్తు దీనియొక్క సృష్టిస్థితిలయములు కూడ, మనఃకల్పితములే; బాగుగా పరికించి చూచిన మనస్సున కస్తిత్వము లేదు. అగుటచే, మనము మోహబద్ధుల మగుట వృథా. |
|
ఈ జగత్తు, దీనియొక్క సృష్టి స్థితి లయాలు మనస్సుచే కల్పించబడినవి మాత్రమే. అయితే ఏం? ఈ జీవుడు అంతులేకుండా దుఃఖ క్లేశ పరంపరలు పొందుచూనే ఉన్నాడు. మనస్సే అన్నిటికి కారణం. కాని, పరికించి చూస్తే ఈ 'మనస్సు’ అనునది ఎక్కడున్నది? దేనిచే తయారుచేయబడింది? ‘మననము చేయుట’ అనుదానికి వేఱుగా ఈ మనస్సుకు అస్థిత్వమే లేదు. అస్థిత్వం లేని వస్తువు కారణంగా జీవులమగు మేము బద్ధులం అవుతున్నాం. ఎంతటి దురదృష్టం! |
సర్గ - 12, శ్లోకమ్ - 11 అసతైవ వయం కష్టం వికృష్ణా మూఢబుద్ధయః । మృగతృష్ణాంభసా దూరే వనే ముగ్ధమృగా ఇవ ॥ ఎండమావుల నీళ్లు ద్రావ పరుగిడు లేళ్లవలె మూఢుల మగు మేము, సుఖము నొసగలేని ఆళీకవస్తువుల వెంటబడుచున్నాము. NOTE: అళీకవస్తువన అసద్వస్తువు, తుచ్ఛము, శూన్యము, లేనట్టిది అని గ్రహించునది. ఆకాశపుష్పము, కుందేటికొమ్ము, గంధర్వనగరము, వంధ్యాపుత్రుడు ఇత్యాదు లళీకవస్తువులు- అను. |
|
మూఢమృగములు అల్లంత దూరంలో మృగతృష్ణను చూచి "అందలి జలం మా దాహం తీరుస్తుంది” అని అనుకొని ఎంతో శ్రమకు ఓర్చుకొని పరుగెత్తుతాయి చూచారా! మూఢబుద్ధులమగు మేము కూడా 'అసత్తే' అయినట్టి ప్రాపంచిక సుఖములచే ఆకర్షించబడి, పరుగులు తీస్తున్నాం. ఈ విషయ సుఖములు చివరకు మా పట్ల దౌర్భాగ్యరూపములే అవుతున్నాయి. అజ్ఞానం చేతనే వాటియందు సుఖభ్రాంతి పొందటం జరుగుతోంది కాని, పొందుచున్నది మాత్రం సంకటములు మాత్రమే. |
సర్గ - 12, శ్లోకమ్ - 12 న కేనచిచ్చ విక్రీతా విక్రీతా ఇవ సంస్థితాః । బత మూఢా వయం సర్వే జానానా అపి శాంబరమ్ ॥ ఆహా! మాయయని తెలిసికొనియు, మూఢుల మగు మేము అమ్ముడు పోకపోయినను, అమ్ముడుపోయిన వానివలె నుంటిమి. |
|
'అంతామాయ' అని తెలిసికూడా ఈ విషయసుఖములకు మేము అమ్ముడు పోతున్నాం. |
సర్గ - 12, శ్లోకమ్ - 13 కిమేతేషు ప్రపంచేషు భోగా నామ సుదుర్భగాః । ముధైవ హి వయం మోహాత్ సంస్థితా బద్ధభావనాః ॥ ఈ ప్రపంచమున, విషయసుఖము లననేమి? - దృష్టములును, (నష్టస్వభావములును, దుఃఖబీజములును అగుటవలన) దౌర్భాగ్య స్వరూపములు, మోహవశమున, వాంఛలవలన గట్టబడితిమి. |
|
మేము మోహవశం చేత 'ఇంద్రియముల ప్రియాప్రియములు' అనే గోతిలో పడి అనేక వాంఛలచే కట్టుబడి ఉన్నాం. |
సర్గ - 12, శ్లోకమ్ - 14 అజ్ఞాతం బహుకాలేన వ్యర్థమేవ వయం వనే । మోహే నిపతితా ముగ్ధాః శ్వభ్రే ముగ్ధా మృగా ఇవ ॥ ఇప్పటికి దెలిసికొంటిని. మృగములు వనమధ్య గర్తమున గూలునట్లు, మేమును మోహమున బడియున్నార మని. |
|
అరణ్యంలో ఒక లోతైన గోతిలో పడిపోయిన కొన్ని లేళ్ళు అక్కడి ఆకులను భక్షిస్తూ కాలం గడుపుతాయి. కొంతసేపటికి అవి "అయ్యో! మేము ఈ గోతిలో చిక్కుకున్నామే?” అని తెలుసుకొని దుఃఖిస్తాయి. మేము కూడా మోహవశం చేత ఎంతో కాలానికిగాని, "అయ్యో! ఇక్కడ ఈ అజ్ఞానంలో చిక్కుకున్నాం కదా” అనే విషయం తెలుసుకోలేకపోతున్నాం. |
సర్గ - 12, శ్లోకమ్ - 15 కిం మే రాజ్యేన కిం భోగైః కోఽహం కిమిద మాగతమ్ । యన్మిథ్యైవాస్తు తన్మిథ్యా కస్య నామ కిమాగతమ్ ॥ నే నెవ్వడను? ఎందుల కిట కరుదెంచితిని? నాకీ రాజ్యములతోడను, భోగములతోడను బని యేమున్నది? మిథ్య మిథ్యయే యగుగాక! ఐననేమి? |
|
ఇప్పుడు చెప్పండి. ఈ రాజ్యాదులతో నాకేమి పని? ఈ భోగపాశాలలో నేను ఎందుకు చిక్కుకోవాలి? అసలు నేనెవరిని? ఈ దృశ్య ప్రపంచమంతా నాకెక్కడినుండి దాపురించింది? నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నా వాస్తవ స్వరూపమేమిటి? ఈ శరీరాదులు నాకెక్కడి నుండి ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నీ వదలి నన్ను 'రాజ్యభోగాలు' అనే బురదలో చిక్కుకొమ్మంటారా? ఏది ఎక్కడినుండి వచ్చినా రానివ్వండి. ఏది మిథ్యయో అది మిథ్యగానే ఉండుగాక. అసత్యములు, అవాస్తవములు, అశాశ్వతములు అయిన పదార్థములచే నేను భ్రమపొందకుండెదను గాక! |
సర్గ - 12, శ్లోకమ్ - 16 ఏవం విమృశతే బ్రహ్మన్! సర్వేష్వేవ తతో మమ । భావేష్వరతిరాయాతా పథికస్య మరుష్వివ ॥ బ్రహ్మజ్ఞా! ఇట్లు భావించుటవలన, పాంథునకు మరుభూమి యన్న విరక్తి గలుగునట్లు నాకును భోగములన్న విరాగము గలిగినది. |
|
మహాత్మా! విశ్వామిత్రా! ఈ విధంగా అనేక కోణముల నుండి విమర్శన చేస్తూ, అంతా పరిశీలించాను. విచారణ చేయనివానికి రుచికరంగా తోచే ఈ ప్రాపంచిక పదార్థములపట్ల నాకు ఒక విధమైన 'అరుచి' పుట్టింది. ఒక బాటసారి తొందరపనిమీద దూరంగా ఉన్న గ్రామానికి త్వరత్వరగా నడచివెళ్ళుచున్నాడనుకోండి. అప్పుడు బాట ప్రక్కనగల శ్మశానభూములు తుచ్ఛములుగానే కనబడతాయి కదా! నాకు కూడా ఈ సంసార విషయాలు పరిశీలించాలని ఏమాత్రం అనిపించటంలేదు. ఏది ఎట్లా ఉన్నా, నాకు మాత్రం నిర్దుష్టమైన, శాశ్వతమైన సుఖ శాంతులు లభించకయే ఉన్నాయి. |
సర్గ - 12, శ్లోకమ్ - 17 తదేతద్భగవన్! బ్రూహి కిమిదం పరినశ్యతి । కిమిదం జాయతే భూయః కిమిదం పరివర్ధతే ॥ భగవానుడా! ఈపరిదృశ్యమాన ప్రపంచము (లేక ఈశరీరము) నశించు టెందులకు, మరల జన్మించి స్థితినందు టెందులకు- వచింపుడు. NOTE: ఈ ప్రశ్నలకు ప్రత్యుత్తరము, క్రమముగ, ఉత్పత్తి, స్థితి, ఉపశమ, ప్రకరణముల ప్రవచింపబడినది. |
|
స్వామీ! సంసారజీవులమైన మేము అనేకసార్లు పుడుతున్నాం. చస్తున్నాం. ఎందులకు? |
సర్గ - 12, శ్లోకమ్ - 18 జరామరణమాపచ్చ జననం సంపదస్తథా । ఆవిర్భావతిరోభావై ర్వివర్ధంతే పునఃపునః ॥ దుఃఖదాయకములగు జరామరణములు, మృత్యువు, సంపదలు, మరలమరల వచ్చుచు పోవుచున్నవి. |
|
జరా-మరణములు, సంతోష-విషాదాలు, సుఖ-దుఃఖాలు, ఆవేశ-నీరసాలు వస్తున్నాయి. పోతున్నాయి. |
సర్గ - 12, శ్లోకమ్ - 19 భోగైసైరేవ తైరేవ తుచ్ఛైర్వయ మమీ కిల । పశ్య జర్జరతాం నీతా వాతైరివ గిరిద్రుమాః ॥ భోగలంపటుల మగు మేము మాటిమాటికి జన్మల నెత్తి వాయువువలన శిథిల మొనర్పబడిన వృక్షములవలె ఎట్లుంటిమో కాంచుడు! |
|
కటిక దరిద్రునికి అధిక సంతానం లాగా వివేక రహితులమగు మాకు అనేక ఉచ్ఛ - నీచ ఉపాధులు వచ్చిపోతున్నాయి. ఈ సంసారం కల్పిస్తున్న దుఃఖాలను మేము తొలగించుకోలేక పోతున్నాం. “ఈ 'సంసారము' అనే దోషం మమ్ములను ఆక్రమించకుండా ఉండేది ఎట్లా?" అనే ప్రశ్న నన్ను రాత్రింబవళ్ళు దహించివేస్తోంది. |
సర్గ - 12, శ్లోకమ్ - 20 అచేతనా ఇవ జనాః పవనైః ప్రాణనామభిః । ధ్వనంతః సంస్థితా వ్యర్థం యథా కీచకవేణవః ॥ జనులచేతనులవలె, ఏమియు దెలియనట్లు పురుషార్థ విహీనులై యున్నారే! కీచక వేణువట్లు ప్రాణవాయు ప్రేరితులై శబ్దము నొనర్చుచున్నారు. NOTE: వేణువన వెదురు. దీనికి రంధ్రముల నొనర్చి గాలిని పూరించిన ధ్వనించునను విషయము లోకప్రసిద్ధము. వెదుళ్లు గాలికి ఊగులాడ, లోనికి గాలి ప్రవేశించినను, ధ్వనించును. ఇట్లు ధ్వనించు వెదురును కీచకవేణు వందురు. |
|
స్వామీ! మరల మరల మాచే బలవంతంగా అనుభవించబడుచున్న తుచ్ఛ భోగములచే మేము శైథిల్యమే పొందుతున్నాం. వెదురు బొంగులవలె ప్రాణ వాయువులతో కూడినవారమై, శబ్దం మాత్రం చేస్తున్నాం. జడబద్ధులమై ఉంటున్నాం. ఎందుకంటే, దుఃఖనివృత్తి కొరకు శాశ్వతమైన ఉపాయమేదీ ఆశ్రయించని మేము జడపదార్థములకంటే అధికులమా? కాదు. |
సర్గ - 12, శ్లోకమ్ - 21 శామ్యతీదం కథం దుఃఖమితి తప్తోఽస్మి చింతయా । జరద్రుమ ఇవోగ్రేణ కోటరస్థేన వహ్నినా ॥ ఈ దుఃఖ మెట్లుపశమించునా యని, కోటరమందున్న అగ్నివలన తప్తమగు జీర్ణవృక్షమువలె తపించుచున్నాను. |
|
ఒక మహావృక్షపు తొఱ్ఱలో గొప్ప అగ్నికణం ప్రవేశించిందనుకోండి. అప్పుడు ఆ వృక్షం బైటకు తన ఆకులచే పిల్లగాలులు అనుభవిస్తూ ఉన్నా, లోనమాత్రం శిథిలత్వం పొందుతూ మౌనంగా రోదిస్తూ ఉంటుంది చూచారా? మా సంసారజీవుల గతి కూడా అట్లాగే ఉన్నది. |
సర్గ - 12, శ్లోకమ్ - 22 సంసారదుఃఖపాషాణనీరంధ్రహృదయోఽవ్యహమ్ । నిజలోకభయాదేవ గలద్బాష్పం న రోదిమి ॥ నా హృదయము సంసారదుఃఖమను గట్టిరాతివలన కప్పబడినను, తల్లిదండ్రులకు కష్టమును గలిగింతునను భయమున, కన్నీరు గార్చి ఏడ్చుట లేదు. |
|
ఇదంతా చూస్తుంటే నాకు దుఃఖమే కలుగుతోంది. కేవలం తల్లిదండ్రులు, తదితరులు కష్టపడతారేమోనని మాత్రమే పైకి ఏడ్చుట లేదు. |
సర్గ - 12, శ్లోకమ్ - 23 శూన్యా మన్ముఖవృత్తీస్తాః శుష్కరోదననీరసాః । వివేక ఏవ హృత్సంస్థో మమైకాంతేషు పశ్యతి ॥ నా నా హృదయమున నున్న వివేకము తప్ప, ఇతరులు నారోదనమును, గ్రహించుట లేదు. నా ముఖవృత్తు లన్నియు, (హాస్యాదు లన్నియు) నిరశ్రురోదనమున నీరసము లైనవి. నేనొనర్చు వాక్యాలాప హాస్యాదులన్నియు కృత్రిమములు. |
|
మా మనస్సులు పరితాపాగ్నులచే క్షణక్షణం దహించబడుచున్నాయి. బైటకు మాత్రం ఏవేవో స్వల్ప కార్యక్రమములు కల్పించుకొని రోజులు గడుపుచున్నాం. ఈ సంసార భ్రమలకు, ఈ దుఃఖములకు మాకు అంతు కనబడుటలేదు. |
సర్గ - 12, శ్లోకమ్ - 24 భృశం ముహ్యామి సంస్మృత్య భావాభావమయీం స్థితిమ్ । దారిద్ర్యేణేవ సుభగో దూరే సంసారచేష్టయా ॥ దురదృష్టవశమున దరిద్రుడైన ధనికునివలె, సంసార ప్రయత్నములు గుఱించియు, విషయముల వినాశ శీలత్వమును గుఱించియు, మిక్కుటముగ మోహము నందుచున్నాను. |
|
|
సర్గ - 12, శ్లోకమ్ - 25 మోహయంతి మనోవృత్తిం ఖండయంతి గుణావలిమ్ । దుఃఖజాలం ప్రయచ్ఛంతి విప్రలంభపరాశ్ర్శియః ॥ నిలుకడ లేని సిరి మనోవృత్తుల మోహింప జేయుచున్నది. గుణముల బాల ద్రోలుచున్నది, దుఃఖముల నిచ్చుచున్నది. |
|
ఈ తుచ్ఛ ధనాదులు శాశ్వతమైన ఆనందం ఇవ్వలేకపోగా, అవి మమ్ములను క్షణక్షణం ‘లోభము, మోహము, మాత్సర్యము' మొదలైన దుష్టమృగములు నివసిస్తున్న అజ్ఞానారణ్యములోకి త్రోసివేస్తున్నాయి. పోనీ, ఈ ధనములను, ఈ పరివారములను త్యజిద్దామా? - అదీ కుదురునది కాదు! |
సర్గ - 12, శ్లోకమ్ - 26 చింతానిచయచక్రాణి నానందాయ ధనాని మే । సంప్రసూతకలత్రాణి గృహాణ్యుగ్రాపదామివ ॥ దరిద్రునకు, స్వగృహ ముపద్రవకర మైనట్లు, చింతలతో గూడబెట్టబడిన ధనరాసులు నాకానంద దాయకములు కావు. |
|
|
సర్గ - 12, శ్లోకమ్ - 27 వివిధదోషదశా పరిచింతనై ర్వితతభంగురకారణకల్పితైః । మమ న నిర్వృతిమేతి మనో మునే! నిగడితస్య యథా వనదంతినః ॥ ఉపాయ పూర్వకముగ బంధింపబడిన అడవి ఏనుగకు శాంతి లేనట్లు సంసారమునందలి వివిధ దోషముల గతిని చింతించుటవలనను, అశాశ్వతములగు కారణపరంపరల దలపోయుటవలనను, నాకు మనఃశాంతి లేకున్నది. |
|
|
సర్గ - 12, శ్లోకమ్ - 28 ఖలాః కాలేకాలే నిశి నిశితమోహైకమిహికా । గతా లోకే లోకే విషయ శతచౌరాః సుచతురాః ॥ |
|
హే మహర్షీ! ఈ ప్రపంచమంతా అవిచారము, అజ్ఞానము, మూఢత్వము, మూర్ఖత్వము అన్నివైపులా దట్టంగా వ్యాపించి ఉన్నాయి. ఇంద్రియ ప్రియములగు “విషయములు” అనే దొంగలు మా హృదయ గృహములలో ప్రవేశించారు. |
సర్గ - 12, శ్లోకమ్ - 29 ప్రవృత్తాః ప్రోద్యుక్తా దిశిదిశి వివేకైక హరణే । రణే శక్తాస్తేషాం క ఇవ విదుషః ప్రోజ్ఞ్యా సుభటాః ॥ అజ్ఞానమను రాత్రియందు, దట్టమగు మోహజాలములను తుషార ధూమములందు జ్ఞానమను వెలుగు కప్పబడగా చతురులును, పాపులును నగు విషయములను లెక్కకు మించిన చోరులు, వివేకమను రత్నమును దొంగిలింప, అన్నివేళల అన్నిచోట్ల తిరుగుచుందురు. వీరితో యుద్ధ మొనరింప తత్త్వజ్ఞానిగాక మరెవరు సమర్థులు? |
|
మా 'వివేకము' అనే సంపదను దొంగిలించుకుపోతున్నారు. మేము ఆ దొంగలను గుర్తించుటలేదు. “ఇది మాకు చెంది ఉండుగాక. మా పేరు ప్రతిష్ఠల మాట ఏమిటి?” మొదలైన ఏవేవో ఘీంకారములతో ప్రొద్దుపుచ్చుతున్నాం. ఆ విషయదొంగలను నిరోధించుటకు మా ఈ శరీర సామర్థ్యాలు, శస్త్రాస్త్ర విద్యలు ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? బ్రహ్మజ్ఞానులగు విద్వాంసులు మాత్రమే వారిని నిరోధించగలరు. |
Original Sloka | YP Translation | YHRK Liberal Translation |
---|---|---|
శ్రీరామ ఉవాచ :- సర్గ - 13, శ్లోకమ్ - 1 ఇయమస్మిన్ స్థితోదారా సంసారే పరికల్పితా । శ్రీర్మునే! పరిమోహాయ సాఽపి నూనం కదర్థదా ॥ రాముడు :- మునీ! మూఢులగువారు ఈసంసారమున లక్ష్మియే సుఖముల నిచ్చును, ఆమె చాల గొప్పది అని అనుకొందురు. కాని నిజమున కిదియే మోహకారణము, అనర్థదాయకమును నై యున్నది. |
|
ఓ మునిశ్రేష్ఠా! మేమంతా ఈ 'ధనం' అనునది సంసారంలో చాలా సారభూతమైన విషయమని భావిస్తున్నాం. అట్టి భావన మూఢత్వం చేతనే మా వద్దకు చేరుతోంది. దీనివలన నిజమైన సుఖముగాని, శాంతిగాని కలుగుతోందా? లేదు. ఒకడు ఎంతో ప్రయాసతో “నేను ముందు ముందు సుఖపడెదను గాక” అని భావించి తన శక్తియుక్తులను, తెలివితేటలను, కాలమును వినియోగించి అట్టి ప్రయత్నమునందే నిమగ్నుడౌతున్నాడు. అనేక రోజులు గడచిపోతున్నాయి. అట్టి ప్రయత్నములో కొన్ని సఫలం, మరికొన్ని విఫలం అవుతున్నాయి. అయితే ఒక ప్రక్క విలువైన జీవితకాలం వృథా అగుటలేదా? జంతువులు, కీటకముల జన్మలన్నీ ఆహార నిద్రా మైథునాలతో గడచిపోతున్నాయి. మానవ జన్మకూడా అంతమాత్రమేనా? |
సర్గ - 13, శ్లోకమ్ - 2 ఉల్లాసబహుళానంతకల్లోలానలమాకులాన్ । జడాన్ ప్రవహతి స్ఫారాన్ ప్రావృషీవ తరంగిణీ ॥ పైకి లేచి పడుచుండు మలిన తరంగములందు బ్రవహించు వర్షాకాల నది వోలె, ఉత్సాహ పూర్వకమగు బహుళ మనోరథములచే గలతబెట్టబడిన మనస్సు పెక్కురు మూర్ఖుల పరవశ మొనర్చును. |
|
ఈ ధనమును అభివృద్ధి చేసుకోవటంలో ఎన్నో ప్రమాదాలు, భయాలు, దోషావేశాలు తారస పడుచున్నాయి. ఇది మనస్సును మోహమునందు చిక్కించి అనేక విధములుగా కలవరపెట్టుచున్నది. |
సర్గ - 13, శ్లోకమ్ - 3 చింతాదుహితరో బహ్వ్యో భూరిదుర్లలితైధితాః । చంచలాః ప్రభవంత్యస్యాస్తరంగాః సరితో యథా ॥ సరస్సున తరంగములు లేచునట్లు, ఈలక్ష్మికి చెడుచేతలచే పెఱుగు చింతలను అనేక కన్యలున్నారు; వీరు చంచలలు. |
|
ఒక విచిత్రం గమనించారా? ధనము లేనివాడు, "అయ్యో! నాకు ధనము లేదే? అతనికి ఉన్నదే?” అని వాపోవుచున్నాడు. కాని, ధనము కలిగియున్నవాడు మాత్రం, “నేను ఇప్పుడు అవిచ్ఛిన్నమైన తృప్తిని పొందుచున్నాను" అని అనుకోవటం లేదు. ఎంత చమత్కారమైన విషయం! |
సర్గ - 13, శ్లోకమ్ - 4 ఏషా హి పదమేకత్ర న నిబధ్నాతి దుర్భగా । దగ్ధేవానియతాచారమితశ్చేతశ్చ ధావతి ॥ కాలు కాలిన దానివలె ఇది ఒకచోట నుండ లేదు. ఇట నట తిరుగుచుండును. |
|
ఈ ధనము నిప్పు త్రొక్కిన కోతిలాగా ఒకచోటినుండి మరొకచోటికి పరుగులు తీస్తూ ఉంటుంది. |
సర్గ - 13, శ్లోకమ్ - 5 జనయంతీ పరం దాహం పరామృష్టాంగికా సతీ । వినాశమేవ ధత్తేన్తర్దీపలేఖేవ కజ్జలమ్ ॥ దీపమును ముట్టుకొనిన చేయి కాలును, చేతికి మసి యంటుకొనును. అట్లే, లక్ష్మి నొకమారు స్పృశించిన వ్యయాది రూపమగు తాపము గల్గును; మోహరూపమగు వినాశము గల్గును. |
|
|
సర్గ - 13, శ్లోకమ్ - 6 గుణాగుణవిచారేణ వినైవ కిల పార్శ్వగమ్ । రాజప్రకృతివన్మూఢా దురారూఢాఽవలంబతే ॥ దీని ప్రకృతి రాజుస్వభావమువలె మూఢమైనది; తన్ను సమీపింప గలిగినవారి నెవరినైనను గుణదోష విచారము లేకయే ఆశ్రయించును. |
|
ఈ ధనము "నేను ఆశ్రయిస్తున్నట్టి ఈతడు గుణవంతుడా? కాదా?" అనునది చూడదు. రాజుయొక్క స్వభావంలాగానే అది ఒకచోట స్థిరంగా ఉండదు. యుద్ధం, జూదం, వంచన, లోభం వంటి అధర్మ కార్యాలు కూడా ధనమును పెంచగలుగుచున్నాయి. ధనం ఉన్నచోట “ధర్మము” (Function, Duty consciousness) ఉండగలదన్న నమ్మకమేమున్నది? |
సర్గ - 13, శ్లోకమ్ - 7 కర్మణా తేన తేనైషా విస్తారమనుగచ్ఛతి । దోషాశీ విషవేగస్య యత్ క్షీరం విస్తరాయతే ॥ పాలు పామునకు బలము నిచ్చునట్లు హింసావృత దోషములవలననే లక్ష్మి వృద్ధి నందును. |
|
పాలు త్రాగి పాము విషమును క్రక్కునట్లు, ధనమును సంపాదించి ఈ మనుజుడు కూడా కామ, క్రోధ, లోభ, మోహాదులను అధికం చేసుకొంటున్నాడు. |
సర్గ - 13, శ్లోకమ్ - 8 తావచ్ఛీతమృదుస్పర్శః పరేస్వే చ జనే జనః । వాత్యయేవ హిమం యావచ్ఛ్రియా న పరుషీకృతః ॥ సహజముగ మంచుతుంపురులు శీతస్పర్శను, మృదుత్వమును గల్గియుండును; గాలి తగిలిన ఎండిపోవును. అట్లే లక్ష్మీస్పర్శ (ధనము) కలిగి మనుష్యుడు శుష్కించనంతవఱకు మృదుస్వభావమును, శాంతమును గలిగియుండును. |
|
|
సర్గ - 13, శ్లోకమ్ - 9 ప్రాజ్ఞాః శూరాః కృతజ్ఞాశ్చ పేశలా మృదవశ్చ యే । పాంసుముష్ట్యేవ మణయశ్శ్రియా తే మలినీకృతాః ॥ మకిలిచెయ్యి మణులను బాడుచేయునట్లు శూరులును, కృతజ్ఞులును, మెత్తనివారును, మృదుస్వభావులును అగువారు లక్ష్మివలన పాడుచేయబడినారు. |
|
గొప్ప ప్రజ్ఞావంతుడు, శూరుడు, కృతజ్ఞుడు, అందరిపట్లా ప్రీతికలవాడు కూడా సంపదలు పొందినపుడు తన కోమల స్వభావం కోల్పోవుచున్నాడు. క్షణంలో కఠినాత్ముడుగా, అవివేకిగా తయారగుచున్నాడు. ధూళిలోపడిన కారణంగా రత్నముకూడా మలినపడుతుంది కదా! |
సర్గ - 13, శ్లోకమ్ - 10 న శ్రీః సుఖాయ భగవన్! దుఃఖాయైవ హి వర్ధతే । గుప్తా వినాశనం ధత్తే మృతిం విషలతా యథా ॥ భగవానుడా! సంపదల నభివృద్ధిపరుప లభించునది దుఃఖమే, సుఖము కాదు. దానిని రక్షించుట (కూడబెట్టుట) వినాశకారిణి యగు విషలతను బెంచుటవంటిది. |
|
|
సర్గ - 13, శ్లోకమ్ - 11 శ్రీమానజననింద్యశ్చ శూరశ్చాప్యవికత్థనః । సమదృష్టిః ప్రభుశ్చైవ దుర్లభాః పురుషాస్త్రయః ॥ లోకనింద లేని ధనికుడు, పొగడ్త లేని వీరుడు, పక్షపాతము లేని ప్రభువు - ఇట్టి వారు లభింపరు. |
|
విచిత్రమేమిటంటే “జననిందా పాత్రుడు గాని ధనవంతుడు, తనను తానే పొగడుకొనని శూరుడు, సమదృష్టి కలిగివుండే ప్రభువు” - ఈ ముగ్గురు లభించటం లోకంలో దుర్లభమే అవుతోంది. |
సర్గ - 13, శ్లోకమ్ - 12 ఏషా హి విషమా దుఃఖభోగినాం గహనా గుహా । ఘనమోహగజేంద్రాణాం వింధ్యశైలమహాతటీ ॥ ఈలక్ష్మి - ఆపదలను పాములకు పుట్ట, మోహము లను ఏనుగులకు విశాల మగు వింధ్య పర్వతభూమి. (అనగా, పాములు ఇతరులు చొరలేని గుహ నాశ్రయించుకొని యుండునట్లును, ఏనుగులు వింధ్యపర్వతభూమి నాశ్రయించుకొని యుండునట్లును, దుఃఖమోహములు లక్ష్మి నాశ్రయించుకొని యుండునని భావము.) |
|
భయంకర విషసర్పం దాగివున్న పుట్టపైగల పూతీగ ఎట్టిదో, ఈ సంపదలు కూడా అట్టివే. ఎందుకంటారా? అవి ఉన్న కాస్త వివేకాన్ని ఊడ్చి పెడుతున్నాయి. |
సర్గ - 13, శ్లోకమ్ - 13 సత్కార్యపద్మరజనీ దుఃఖకైరవచంద్రికా । సుదృష్టిదీపికా వాత్యా కల్లోలౌఘతరంగిణీ ॥ ఈ లక్ష్మి - సత్కార్యములను పద్మములకు రాత్రి, దుఃఖములను కలువలకు వెన్నెల. పరమార్థదృష్టి యను దీపమునకు పెనుగాలి, కోర్కెలను కల్లోల తరంగములకు తావగు చెఱువు. |
|
సంపదలు కుసంస్కారమును, ఉద్వేగమును, దురభ్యాసములను తెచ్చిపెడుతున్నాయి. సత్యదృష్టిని మరచేటట్లు చేస్తున్నాయి. |
సర్గ - 13, శ్లోకమ్ - 14 సంభ్రమాభ్రాదిపదవీ విషాదవిషవర్ధినీ । కేదారికా వికల్పానాం ఖేదాయ భయభోగినీ ॥ ఈలక్ష్మి - భయభ్రాంతులను మేఘములకు మొదలి బాట; విషాదమును బెంపొంద జేయును. వికల్పముల కాటపట్టు, దుఃఖమును కల్పించు పేనుబాము. |
|
|
సర్గ - 13, శ్లోకమ్ - 15 హిమం వైరాగ్యవల్లీనాం వికారోలూకయామినీ । రాహుదంష్ట్రా వివేకేందోః సౌజన్యాంభోజచంద్రికా ॥ ఈ లక్ష్మి - వైరాగ్యలతకు మంచు, కామాది వికారములను గ్రుడ్లగూబలకు రాత్రి. వివేకమను చంద్రునకు రాహువు. మంచి యను తామరకు వెన్నెల. |
|
|
సర్గ - 13, శ్లోకమ్ - 16 ఇంద్రాయుధవదాలోలనానారాగమనోహరా! లోలా తడిదివోత్పన్నధ్వంసినీ చ జడాశ్రయా ॥ ఈ లక్ష్మి - ఇంద్రధనుస్సువలె చలించు రంగులతో (రాగాది వికారములతో) మనోహరముగ కన్పట్టును. మెఱపుతీగవలె చంచలము. "ఇట్టెవచ్చి, అట్టెపోవును." మూర్ఖుల నాశ్రయించుకొని యుండును. (ధనికులందరు సామాన్యముగ మూర్ఖులే గదా!) |
|
వీటి పటాటోపం ఎంతగా జీవుడిని ఆకర్షిస్తోంది! ధనమొక్కటే జీవిత లక్ష్యంగా కలవారు నీచులతో, దుర్మార్గులతో, లోభులతో స్నేహం చేయవలసి వస్తోంది. గుణవంతులు దూరంగా ఉండిపోతారు. |
సర్గ - 13, శ్లోకమ్ - 17 చాపలావజితారణ్యనకులీ న కులీనజా । విప్రలంభనతాత్పర్యజితోగ్రమృగతృష్ణికా ॥ 17 ఈ లక్ష్మి - చాపల్యమున అడవిముంగిని జయించును, సత్కులమున జనించిన వారికడ నుండదు. మోసగించుటలో నెండమావిని మించినది. |
|
ఇక వీటియొక్క అంతిమ ఫలితం గమనిస్తే, అది అతి చంచలంగానే ఉంటోంది. |
సర్గ - 13, శ్లోకమ్ - 18 లహరీవైకరూపేణ పదం క్షణమకుర్వతీ । చలా దీపశిఖేవాతి దుర్ జ్ఞేయ గతిగోచరా ॥ ఈ లక్ష్మి - విరిగిపడిపోవు తరంగములవలె నొకచోటు వంటిపెట్టుకొని యుండదు. దీపశిఖవలె చంచలము. దీని ఉనికి మనుకులను దెలియజాలము. |
|
|
సర్గ - 13, శ్లోకమ్ - 19 సింహీవ విగ్రహవ్యగ్రకరీంద్రకులపోథినీ । ఖడ్గధారేవ శిశిరా తీక్ష్ణతీక్ష్ణాశయాశ్రయా ॥ ఈ లక్ష్మి - ఆడుసింహమువలె, యుద్ధ మొనర్ప నిచ్చించు ఏనుగులను శత్రువుల నాశ మొనర్పును. ఖడ్గధారవలె శీతలమైనను క్రూరాశయములు గలవారి నాశ్రయించుకొని యుండును. |
|
|
సర్గ - 13, శ్లోకమ్ - 20 నానయాపహృతార్థిన్యా దురాధిపరిలీనయా । పశ్యామ్యభవ్యయా లక్ష్మ్యా కించిద్దుఃఖాదృతే సుఖమ్ ॥ మహర్షీ! పరవంచన ఇత్యాదులకు పాపములం బ్రోగుజేయున దీ లక్ష్మి. ఇది దుఃఖములను వెంటబెట్టుకొని వచ్చును. నేను గ్రహించిన దేమన, దీనిచే దుఃఖమే గాక, ఆవంతైన సుఖము లేదు. |
|
ఎవరికోసం ఇంతగా శ్రమించి ఈ జీవుడు ధనాదులను సంపాదించాడో వారే ఆతనిని ద్వేషిస్తున్నారు. తిరస్కరిస్తున్నారు. ఇంతా సంపాదించి లెక్కించి చూచుకొంటూ ఉండగా మరొకవైపు ఈ శరీరమే శిథిలమౌతోంది. |
సర్గ - 13, శ్లోకమ్ - 21 దూరేణోత్సారితాఽలక్ష్మా పునరేవ తమాదరాత్ । అహోబతాశ్లిష్యతీవ నిర్లజ్జా దుర్జనా సదా ॥ సపత్ని యగు దారిద్ర్యమువలన ఒకానొక పురుషుని నుండి తఱుమ బడియు, ఈలక్ష్మి సిగ్గులేని దానివలె మరల ఆపురుషునే ఛీ! ఆలింగ మొనర్చుకొనును. |
|
అతడు తాను సంపాదించినదంతా ప్రియంగా, మమకారంగా, నిస్సహాయంగా చూస్తూ "అయ్యో! ఇదంతా విడచి వెళ్ళవలసిందేనా? నేను పోయిన తరువాత ఏమౌతుందో, ఏమో?” అని అంతరంగమున తలచుచూ దుఃఖమునే పొందుచున్నాడు. |
సర్గ - 13, శ్లోకమ్ - 22 మనోరమా కర్షతి చిత్తవృత్తిం కదర్థసాధ్యా క్షణభంగురా చ । వ్యాలావలీ గాత్రవివృత్త దేహా శ్వభ్రోత్థితా పుష్పలతేవ లక్ష్మీః ॥ ఈలక్ష్మి హత్యాదులగు దుస్సాహస కార్యములవలన లభించును; క్షణభంగురము ; పాములున్న పాడునూతినుండి బయలువెడలిన పుష్పలతవలె మనోహరమై కన్పట్టి మనస్సులను హరించును. |
|
బాహ్యవిషయములు మాత్రమే అయివున్నట్టి ఈ ధనాదులు ఇంతగా చిత్తమును ఆకర్షించటం నాకు చిత్రమని అనిపిస్తోంది. |
Original Sloka | YP Translation | YHRK Liberal Translation |
---|---|---|
శ్రీరామ ఉవాచ :- సర్గ - 14, శ్లోకమ్ - 1 ఆయుః పల్లవకోణాగ్ర లంబాంబుకణభంగురమ్ । ఉన్మత్తమివ సంత్యజ్య యాత్యకాండే శరీరకమ్ ॥ శ్రీరాముడు :- ఆయువు చివురుటాకు కొననున్న నీటిబొట్టువలె క్షణభంగురము. ఉన్మత్తునివలె చటుక్కున ఈ శరీరము వదలిపోవును. |
|
ఈ ఆయుష్షును చూచారా స్వామీ! ఇది చిగురాకు కొనయందున్న జలబిందువులాగా చంచలమై ఉన్నది. చిల్లికుండలోని జలంలాగా నశించుటయే దీని స్వభావం. ఈ శరీరం ఉన్నట్లుండి ఏ క్షణంలోనో అకాలంగా రోగాల పాలు అవుతోంది. ఒక 'నియమము' అంటూ లేకుండా ఏ క్షణంలోనో నేలకూలుతోంది. |
సర్గ - 14, శ్లోకమ్ - 2 విషయాశీ విషాసంగ పరిజర్జర చేతసామ్ । అప్రౌఢాత్మ వివేకానామాయురాయాస కారణమ్ ॥ విషయములను విషసర్పములవలన చితికిన మనస్సు గలవారును, వివేకము లేనివారును నగు వారికి ఆయువు దుఃఖహేతువు. |
|
మునీశ్వరా! “ఇంద్రియ విషయములు” అనే సర్పములకు ఆలవాలమైన చిత్తము గలవారికి ఆయుష్షు శ్రమనే కలుగజేస్తోందని నాకు అనిపిస్తోంది. |
సర్గ - 14, శ్లోకమ్ - 3 యే తు విజ్ఞాతవిజ్ఞేయా విశ్రాంతా వితతే పదే । భావాభావసమాశ్వాసమాయుస్తేషాం సుఖాయతే ॥ తత్త్వజ్ఞాన బలమున బ్రహ్మపదమునుండి శాంతి నందిన వారికిని, లాభాలాభముల సమదృష్టితో బరికించు వారికిని, ఆయువు (జీవితము) సుఖదాయకము. |
|
ఆత్మజ్ఞానం పొందినవారికి మాత్రమే అది ప్రయోజనకరం. ఎందుకంటారా? ఒకవైపు ఇంద్రియ శక్తులను ఇంద్రియ విషయములే బలహీనపరుస్తుంటే బ్రతుకు త్వరత్వరగా ఆయాసకరం అవటంలో ఆశ్చర్యమేమున్నది! మేము ఇంద్రియదృష్టిని మాత్రమే కలిగి ఉంటున్నాం. అందుకే మా ఆయుషు నిష్ప్రయోజనం అయిపోతోంది. ఈ జగత్తులో కొందరు స్వస్వరూపమగు 'ఆత్మ' గురించి ఎఱుగుచున్నవారై అట్టి ఆత్మపదమునందు విశ్రమించుచున్నారు. అందుచేత, లాభాలాభములందు సమబుద్ధి కలిగివుంటున్నారు. అట్టివారిపట్ల మాత్రమే ఈ ఆయుష్షు సౌఖ్యప్రదం అవుతోంది. |
సర్గ - 14, శ్లోకమ్ - 4 వయం పరిమితాకారపరినిష్ఠితనిశ్చయాః । సంసారాభ్రతడిత్పుంజే మునే నాయుషి నిర్వృతాః ॥ మునీ! మాకు ఆత్మబుద్ధి పరిమితాకార మగు ఈశరీరమునే (ఆత్మ అపరిమితుడు, అఖండుడు, అని ఇచ్చట ధ్వని) అందువలన, మా కీ సంసార మేఘముల మెఱుపగు జీవితమున సుఖము లేదు. |
|
ఇక మేము ఈ పరిమిత శరీరాదులందు “ఈ శరీరమే మేము” అనునట్టి దేహాత్మబుద్ధి కలిగి ఉంటున్నాం. అందుచేతనే కాబోలు, అనేక చింతలు మమ్ములను హింసించివేస్తున్నాయి. |
సర్గ - 14, శ్లోకమ్ - 5 యుజ్యతే వేష్టనం వాయోరాకాశస్య చ ఖండనమ్ । గ్రథనం చ తరంగాణా మాస్థా నాయుషి యుజ్యతే ॥ గాలిని ప్రోగుచేయుట, ఆకాశమును తునుకలు గావించుట, తరంగముల దూచుట - సంభవములైన నగుగాక! అయినను, ఆయువును నమ్మజాలము. |
|
అయినా ఈ ఆయుష్షును నమ్మి ఉండటం ఎట్లా చెప్పండి? ఏ క్షణంలో ఏదైనా కావచ్చును కదా! వాయువుయొక్క ప్రసరణమును, అలలను నిరోధించవచ్చునేమో కాని, నీటి బుడగవంటి ఆయుష్షును నిలపగలమని నమ్మి ఉండటం ఉచితమేనా? ఇది అతి చంచలమైనది కదా! |
సర్గ - 14, శ్లోకమ్ - 6 పేలవం శరదీవాభ్ర మస్నేహ ఇవ దీపకః । తరంగక ఇవాలోలం గతమేవోపలక్ష్యతే ॥ జీవితము శరత్కాల మేఘములవలెను, చమురు లేని దీపమువలెను, సారశూన్యము; తరంగ చంచలము; దీనిని పోయిన దానిగనే తలంచుట మంచిది. |
|
అందుకే జ్ఞానులు ఆయుష్షును తరంగమువలె, చమురు లేని దీపంవలె త్వరలో నశించిపోయేదానిలాగానే చూస్తారు. |
సర్గ - 14, శ్లోకమ్ - 7 తరంగం ప్రతిబింబేందుం తడిత్ పుంజం నభో అంబుజమ్ । గ్రహీతు మాస్థాం బధ్నామి న త్వాయుషి హతస్థితౌ ॥ తరంగమును, చంద్రుని ప్రతిబింబమును, మెఱపు సమూహమును, ఆకాశకమలమును గైకొనుటను నమ్మవచ్చును కాని, అస్థిరమగు జీవితమును నమ్మలేము. |
|
|
సర్గ - 14, శ్లోకమ్ - 8 అవిశ్రాంతమనాః శూన్యమాయురాతతమిహతే । దుఃఖాయైవ విమూఢో అంతర్గర్భమశ్వతరీ యథా ॥ వ్యాకులచిత్తముతో మూఢుల వ్యర్థమగు జీవితమును పొడిగింప జూతురు; ఇది అశ్వతరి గర్భమును గోరుటవంటిది. NOTE: అశ్వగర్దభములకు గలిగినది అశ్వతరి: దీని గర్భనిర్గమనము ఉదరవిదారణము వలననే యను సంగతి లోకప్రసిద్ధము. |
|
కొందరు జనులు, "అయ్యా! మేము భగవంతుని గురించి ముసలితనంలో చూచుకొంటాం. ఇప్పుడు తొందర ఏమి వచ్చింది?" అంటూ ఉంటారు. వారికి ఆయుష్షుపై ఎంత నమ్మకం! అట్లు వారు నమ్మి మోసపోవుటలేదా? తండ్రీ! మహర్షీ! మన పెద్దలు 'అశ్వతరి' అనే మృగం గురించి చెపుతూ ఉంటారు. అది ప్రసవించగానే మరణిస్తుంది. అయినప్పటికీ గర్భహేతువు అయినట్టి 'సంగమము' ను కోరుకొంటూనే ఉంటుంది. అట్లాగే లోకులుకూడా "మాకు ఎంతో ఆయుష్షు ఉండుగాక” అని కోరుకొంటున్నారు. కాని మూఢత్వం ఆశ్రయించి చిత్త ప్రశాంతతను కోల్పోయిన తరువాత దీర్ఘాయుష్షు ఉండి మాత్రం ప్రయోజనమేమున్నది? |
సర్గ - 14, శ్లోకమ్ - 9 సంసార సంసృతావస్యాం ఫేనోఽస్మిన్ సర్గసాగరే । కాయవల్ల్యాంభసో బ్రహ్మన్! జీవితం మే న రోచతే ॥ బ్రహ్మజ్ఞుడా! ఈ సంసారమున పరిభ్రమించుట కనుకూలమైన శరీరలత, సృష్టి సముద్రము నందలి నుఱుగువంటిది; ఇట్టి అశాశ్వత వస్తువునందు నాకు రుచి లేదు. |
|
|
సర్గ - 14, శ్లోకమ్ - 10 ప్రాప్యం సంప్రాప్యతే యేన భూయో యేన న శోచ్యతే । పరాయా నిర్వృతేః స్థానం యత్తజ్జీవిత ముచ్యతే ॥ ఎద్దానివలన పరమపురుషార్థమగు మోక్షము లభించునో, పునర్జన్మ, దుఃఖము నశించునో, పరమ సుఖమగు జీవన్ముక్తి సుఖమున కెయ్యది స్థానమో, అయ్యదియే యథార్థ జీవితము. |
|
జీవించి ఉన్నందుకు ప్రయోజనంగా సర్వ విధ దుఃఖరహితమగు పరమానంద రూపమైనట్టి బ్రహ్మవస్తువు సాధించాలి. అఖండానందము, పరమశాంతి నిలయము అయిన ఆత్మను పొందినప్పుడే జీవితం సార్థకమౌతుంది. |
సర్గ - 14, శ్లోకమ్ - 11 తరవోఽపి హి జీవంతి జీవంతి మృగపక్షిణః । స జీవతి మనో యస్య మననేన న జీవతి ॥ చెట్టచేమలును జీవించుచున్నవి. పశుపక్షులును జీవించుచున్నవి. (కాని వాని బ్రతుకు బ్రతుకు కాదు) తత్వచింతనవలనగాని, వాసనాక్షయము వలనగాని, లయమైన మనస్సు గలవాని జీవితమే జీవితము. |
|
వృక్షాలు, మృగాలు, పక్షులు కూడా జీవిస్తున్నాయి. కాని ఏం లాభం? ఎవనికైతే, ఈ దృశ్య సంకల్పము యొక్క మననము క్షీణిస్తుందో, అట్టి మనస్సు కలవాడే వాస్తవమైన జీవితమును అనుభవిస్తున్నాడని నా అభిప్రాయం. |
సర్గ - 14, శ్లోకమ్ - 12 జాతాస్త ఏవ జగతి జంతవః సాధుజీవితాః । యే పునర్నేహ జాయంతే శేషా జరఠగర్దభాః ॥ మరల పుట్టుక లేని సాధువుల జీవితమే జీవితము. అశుద్ధమగు దేహాత్మబుద్ధి గల తక్కిన జీవులందరు ముసలి ఎద్దులు. (ముసలియెద్దువలె, దీర్ఘాయుర్దాయ మున్నను వారిజీవిత మప్రశస్తమని భావము). |
|
ఈ జీవితము పట్ల, ఈ కనబడే దృశ్య వ్యవహారము పట్ల సరైన అవగాహన కలిగివుండాలి. సత్యదృష్టిని అవలంబించి వాసనలను త్యజించివేయాలి. తత్త్వబోధ పొంది ధన్యులు కావాలి. అట్టివారి విషయంలో మాత్రమే ఆయుష్షు ధన్యత చెందుతుంది. ఇక తక్కినవారి విషయం ఏమి చెప్పమంటారు? వారు ముసలి గాడిదల వంటివారు. |
సర్గ - 14, శ్లోకమ్ - 13 భారోఽవివేకినః శాస్త్రం భారో జ్ఞానం చ రాగిణః । అశాంతస్య మనో భారో భారోఽనాత్మవిదో వపుః ॥ అవివేకులకు శాస్త్రజ్ఞానము పెనుబరువు: అనర్థక శ్రమ హేతువు. కోర్కెలు గలవారికి సర్వ దుఃఖములను దూరీకరించు జ్ఞానముకూడ బరువే! చింత గలవారికి మనస్సు బరువు. అనాత్మవిదునకు శరీరమే బరువు. |
|
వారు ముసలి గాడిదల వలె ధన, దార, శాస్త్రాది విషయములను మూలుగుతూ మోస్తున్నారు. (శాస్త్రజ్ఞానం కూడా 'కామము' మొదలైన రోగములచే పీడింపబడేవారికి, దృశ్య విషయములపట్ల అనురాగం పెంచుకొన్నవారికి భారముగానే పరిణమిస్తోంది). |
సర్గ - 14, శ్లోకమ్ - 14 రూప మాయుర్మనోబుద్ధిరహంకార స్తథేహితమ్ । భారో భారధరస్యేవ సర్వం దుఃఖాయ దుర్ధియః ॥ బరువు మోయువారికి దుఃఖమును లేక కష్టమును గలిగించునట్లు, దుర్మతులకు రూపము, ఆయువు, మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రయత్నము - ఇత్యాదు లన్నియు దుఃఖమును గలిగించును. |
|
కనుక, “జ్ఞానం సంపాదించుకోవాలి" - అని అనుకొనేవారు ముందు కామాదులను జయించాలి. పెద్దబరువు మోసేవాడు ఆ బరువును దించుకొంటేనే సుఖిస్తాడు కదా! |
సర్గ - 14, శ్లోకమ్ - 15 అవిశ్రాంతమనాః పూర్ణమాపదాం పరమాస్పదమ్ । నీడం రోగవిహంగానామాయురాయాసనం దృఢమ్ ॥ |
|
చిత్తశాంతి లేనివారికి ఆ చిత్తమే పెనుభారము అవుతోంది. ఈ చిత్తము అనుక్షణం అనేక సంకల్పములను ఆహ్వానించి కలత చెందుతోంది. అయితే, కొందరు మాత్రం, “ఇది ఆత్మ, ఇది అనాత్మ" అని ఎరిగినవారై శరీరాభిమానం త్యజించివేస్తున్నారు. ఈ శరీరమును కూడా ఇతర దృశ్య పదార్థముల వలె ఒకానొక బాహ్యమైన వస్తువువలె చూస్తున్నారు. వారి బుద్ధి నిర్మలం కాగా మనస్సుకు స్వస్థత చేకూరుతోంది. |
సర్గ - 14, శ్లోకమ్ - 16 ప్రత్యహం ఖేద ముత్సృజ్య శనైరలమనారతమ్ । ఆఖునేవ జరచ్ఛ్వభ్రం కాలేన వినిహన్యతే ॥ ఆయువే అశాంతి, అతృప్తి, పరిశ్రమలకు కారణము, రోగములను పక్షులకు గూడు. ఎలుకలు కష్టములకు భయపడక, ప్రతిదినము కలుగును ద్రవ్వునట్లు, కాలముగూడ ఆయువు నుత్తరించుచున్నది. |
|
మనో స్వస్థత లేనిచోట అందమైన రూపం, శరీర పుష్టి, లౌకికమైన తెలివితేటలు, దీర్ఘాయుష్షు, శాస్త్రజ్ఞానం, సంకల్ప సామర్థ్యం, గొప్పజ్ఞానశక్తి -- ఇవన్నీ నిష్ప్రయోజనమే అవుతున్నాయి. పెనుభారముగా పరిణమించి అనేక దుఃఖములను ప్రోగుచేసి పెడుతున్నాయి. అయితే మేము యౌవన గర్వాతిరేకం చేత ఇదంతా గుర్తించలేకున్నాము. ఏవేవైతే చూచుకొని “మేము ఇంతటి వారముకదా” అని అనుకొంటున్నామో, అవన్నీ మా వెంటే ఉంటున్నాయా? లేదు. కొద్దికాలంలో మా మానగర్వాలన్నీ నేలరాచి మమ్ములను విడచిపోతున్నాయి. ఈ ఆయుష్షు స్థిరమైన సుఖంగాని, సారభూతమైన అంశముగాని కలిగి ఉండనప్పుడు ఇది గుణహీనమై వ్యర్థమే అవుతుంది కదా! |
సర్గ - 14, శ్లోకమ్ - 17 శరీరబిలవిశ్రాంతైర్విషదాహప్రదాయిభిః । రోగైరాపీయతే రౌద్రైర్వ్యాలైరివ వనానిలః ॥ అరణ్యవాయువును సర్పములు క్రోలునట్లు, శరీర బిలమున నున్న రోగము లాయువును బీల్చుచున్నవి; వీటి స్వభావము క్రూరము. ఇవి విషమును బోలు లేపము నిచ్చును. |
|
రోగాలు శరీరాన్ని డొల్లచేస్తున్నాయి. |
సర్గ - 14, శ్లోకమ్ - 18 ప్రస్ను వానైరవిచ్ఛేదం తుచ్ఛైరంతరవాసిభిః । దుఃఖైరావృశ్చ్యతే క్రూరైర్ఘణైరివ జరద్ద్రుమః ॥ ఘుణమను పురుగు ఎండువారిన మ్రాను మొదలనుండి, పొట్టును జిమ్ముచు దాని నుత్తరించునట్లు రోగాది దుఃఖములు శరీరమందుండి మలరక్తములను వెలువరించుచు, ఆయువును నశింపజేయుచున్నవి. |
|
|
సర్గ - 14, శ్లోకమ్ - 19 నూనం నిగరణాయాశు ఘనగర్ధమనారతమ్ । ఆఖుర్మార్జారకేణేవ మరణేనావలోక్యతే ॥ ఎలుకను మ్రింగ పిల్లి వేచియుండునట్లు, మృత్యువు జీవితమును గబళింప వేచియున్నది. |
|
పిల్లి ఎలుకను ప్రియంగా చూచునట్లు ఒక ప్రక్క మృత్యువు ప్రాణిని మ్రింగి వేయడానికి మహాభిలాషతో నిరంతరం చూచుచున్నది. ఈ విషయం జీవులు ఎట్లా మరచుచున్నారో నాకు అర్థం కావటం లేదు. |
సర్గ - 14, శ్లోకమ్ - 20 గంధాదిగుణ గర్భిణ్యా శూన్యయాఽశక్తివేశ్యయా । అన్నం మహాశనేనేవ జరయా పరిజీర్యతే ॥ రూపాది కృత్రిమగుణములు గల్గి శక్తిహీన యగు వేశ్యనుబోలి జర, ఆహార పుష్టి గల మనుజుడెక్కుడుగ భోజన మొనర్చి హరించుకొనునట్లు, బలక్షయముతో బాటు ఆయువును జీర్ణమొనరించుకొనును. |
|
|
సర్గ - 14, శ్లోకమ్ - 21 దినైః కతిపయైరేవ పరిజ్ఞాయ గతాదరమ్ । దుర్జనః సుజనేనేవ యౌవనేనావముచ్యతే ॥ సుజనుడు దుష్టుని అల్పసమయముననే గుర్తించి నిరాదరణ పూర్వకముగ వానిని వదలునట్లు, యౌవనముగూడ పురుషార్థప్రాప్తికై యత్న మొనరింపని పురుషుని నిరాదరణను దెలిసికొని, వానిని వెంటనే వదలిపెట్టును. (అనగా యౌవన మనిత్య మనియు, బలశక్తులు కలిగియున్న సమయముననే మోక్షము కొఱకు ప్రయత్నము సల్పవలె ననియు భావము.) |
|
|
సర్గ - 14, శ్లోకమ్ - 22 వినాశ సుహృదా నిత్యం జరామరణ బంధునా । రూపం లింగవరేణేవ కృతాంతేనాభిలష్యతే ॥ విటుడు సౌందర్యము నభిలషించునట్లు వినాశమునకును, జరామరణములకును మిత్రుడగు యముడు ఆయువు నభిలషించును. |
|
వార్ధక్యం నక్కలాగా కాచుకు కూర్చున్నది. జరామరణాలు ప్రియమిత్రులవలె కరచాలనం చేసుకోవటానికి ఉత్సాహపడుచున్నాయి. |
సర్గ - 14, శ్లోకమ్ - 23 స్థిరతయా సుఖభాసితయా తయా సతత ముజ్ఝిత ముత్తమ ఫల్గు చ । జగతి నాస్తి తథా గుణవర్జితం మరణభాజన మాయురిదం యథా ॥ ఆయువు సుఖవిహీనము, చంచలము, అతితుచ్ఛము, గుణవిహీనము, మరణభాజనము; జగత్తున ఇట్టి వస్తువు మరొకటి లేదు. |
|
ఇదంతా ఇట్లుండగా అనేకులు ఇదంతా గమనించకుండా తీరికగా కూర్చుని వర్తమానం వ్యర్థం చేసుకొంటున్నారు. |
Original Sloka | YP Translation | YHRK Liberal Translation |
---|---|---|
శ్రీరామ ఉవాచ :- సర్గ - 15, శ్లోకమ్ - 1 ముథై వాభ్యుత్థుతో మోహాత్ ముథైవ పరివర్ధతే । మిథ్యామయేన భీతోఽస్మి దురహంకారశత్రుణా ॥ శ్రీరాముడు :- మోహమే (అనగా అజ్ఞానమే) అహంకారమునకు మూలము. దీని ఉత్పత్తి స్థితులు వ్యర్థములు. మిథ్యారూపమగు ఈ శత్రువనిన నాకు మిక్కుటమగు భయము. |
అన్నిటికన్నా ప్రబల శత్రువు ఈ 'అహంకారం'. ఇతడు కారణం లేకుండానే పుట్టుచున్నాడు. రూపం లేకుండానే వ్యవహరిస్తున్నాడు. సంసారారణ్యంలో విచ్చలవిడిగా సంచరించుచున్నాడు. పరీక్షించి చూస్తే “అహం” అనే అభిమానమే ఇతని రూపం. ఓ మహర్షీ! భూమ్యాకాశాలమధ్య మరే శత్రువును చూచి నేను భయపడుటలేదు. కాని, ఈ అహంకార శత్రువు గుర్తుకు వచ్చినపుడు మాత్రం గజగజ వణుకుచున్నాను. |
|
సర్గ - 15, శ్లోకమ్ - 2 అహంకారవశాదేవ దోషకోశకదర్థతామ్ । దదాతి దీనదీనానాం సంసారో వివిధాకృతిః ॥ కర్మఫలపూర మగు సంసారమున జ్ఞానధనము లేని హీనులను రాగద్వేషములున్న కోశమున కధిపతుల జేయున దీయహంకారమే. |
|
“ఈ అహంకారం ఉత్పత్తికి కారణమేమి?” అని పరిశీలిస్తే 'అజ్ఞానమే' అని సమాధానం లభిస్తోంది. అట్టి అభిమానం వలననే రాగద్వేషాది సర్వదోషాలు వచ్చిపడుతున్నాయి. ఆకారాదులు లేకపోయినప్పటికీ, ఇది అందరిని బాధిస్తోంది. |
సర్గ - 15, శ్లోకమ్ - 3 అహంకారవశాదావదహంకారాద్దురాధయః । అహంకార వశాదీహా త్వహంకారో మమామయః ॥ వ్యాధులు, చింతలు, కోర్కెలు, అహంకార వశముననే కలుగుచున్నవి; ఈ అహంకారమే నా రోగము. |
|
దీనినుండి సర్వ ఆపదలు, మనోవ్యధలు, వికారాలు జీవునకు ప్రాప్తిస్తున్నాయి. క్షణంలో శాంతి, సమత, సద్గుణములను పీల్చి పిప్పి చేస్తున్నాడు. |
సర్గ - 15, శ్లోకమ్ - 4 తమహంకారమాశ్రిత్య పరమం చిరవైరిణమ్ । న భుంజే న పిబామ్యంభః కిము భోగాన్ భుజే మునే ॥ మునీంద్రా! ఇట్టి పరమ శత్రువగు అహంకారము నాశ్రయించి అన్నపానములను వదలి వైచితిని. ఇంక భోగముల మాట యేమి? |
|
ఇంతటి శత్రువు ఎదురుగా ఉండగా భోజనమే తీసుకోలేక పోతున్నాను. ఇక భోగముల మాట చెప్పేదేమున్నది? |
సర్గ - 15, శ్లోకమ్ - 5 సంసారరజనీ దీర్ఘా మాయా మనసి మోహినీ । తతాహంకారదోషేణ కిరాతేనేవ వాగురా ॥ కిరాతుడు వలను పన్నునట్లు, ఈ సంసారమను రాత్రియందు అహంకారముకూడ జీవుని మనస్సున దీర్ఘమును, మోహరూపమును నగు వలను పన్నుచున్నది. |
|
'అహంకారము' అనే కిరాతకుడు 'మాయ' అనే వల పన్నుచున్నాడు. ఈ జీవులు అజ్ఞాన మృగములవలె అందులో చిక్కుకొంటున్నారు. ఇతడు, ఎందుకో, నా పాలపడ్డాడు. నన్ను బంధించ యత్నిస్తున్నాడు. |
సర్గ - 15, శ్లోకమ్ - 6 యాని దుఃఖాని దీర్ఘాణి విషమాణి మహాంతి చ । అహంకారాత్ ప్రసూతాని తాన్యగాత్ ఖదిరా ఇవ ॥ ఖదిరవృక్షములు పర్వతమునుండి పుట్టునట్లు, బహుకాల ముండు నవియు, నానావిధములును, ప్రబలములును నగు దుఃఖములు అహంకారమునుండియే కలుగుచున్నవి. |
|
|
సర్గ - 15, శ్లోకమ్ - 7 శమేందుసైంహికే యాస్యం గుణసద్మ హిమాశనిమ్ । సామ్యమేఘశరత్కాలమహంకారం త్యజామ్యహమ్ ॥ ఈ అహంకారము శమమను చంద్రునకు రాహువు, సుగుణములను పద్మములకు హిమరూపకమగు వజ్రము, సర్వభూతదయ యను మేఘములకు శరత్కాలము; ఇద్దానిని విడుచుచున్నాను. |
|
అహంకారముపై నమ్మకమున్నంత కాలం ఆశ, తృష్ణలు ఉంటాయి. అందుచేత నేను అహంకారమును తిరస్కరిస్తున్నాను.
|
సర్గ - 15, శ్లోకమ్ - 8 నాహం రామో న మే వాంఛా భావేషు న చ మే మనః । శాంత ఆసితు మిచ్ఛామి స్వాత్మనీవ జితో యథా ॥ నేను రాముడను గాను, నాకు కోర్కెలు లేవు. నాకు మనస్సు లేదు, నేను బుద్దునివలె శాంతభావమున సర్వభూతములను నావలె గాంచగోరెదను. |
|
“నేను రాముడనే కాదు. నాకే కోరికలూ లేవు. నాకు చెందినదంటూ ఎక్కడా ఏదీలేదు. నేను దీనికి చెందినవాడను కాను” అనే నిశ్చయం చేసుకొంటున్నాను. |
సర్గ - 15, శ్లోకమ్ - 9 అహంకారవశాద్యద్యన్మయా భుక్తం హుతం కృతమ్ । సర్వం తత్తదవస్త్వేన వస్త్యహంకారరిక్తతా ॥ అహంకారవశుడనై నేను తినినది, వ్రేల్చినది, ఒనర్చినది, అన్నియు తుచ్ఛములు. అహంకారత్యాగమే సారవస్తువు. |
|
మొదలే అసత్యమై ఉన్న ఈ అహంకారాన్ని ఆశ్రయించి ఏదేది చేస్తామో, గ్రహిస్తామో, వాంఛిస్తామో అవన్నీ కూడా అసత్యములే అవుతాయి కదా!
|
సర్గ - 15, శ్లోకమ్ - 10 అహమిత్యస్తిచేద్ బ్రహ్మన్నహమాపది దుఃఖితః । నాస్తిచేత్ సుఖితస్తస్మాదనహంకారితా వరమ్ ॥ 'అహం' భావమున్న, ఆపదలందు 'అహం' పదవాచ్యుడ నగు నేను దుఃఖము ననుభవింపవలసి యుండును; అహంకారము లేనిచో, మఱి దుఃఖము ననుభవించున దెవరు? దుఃఖము లేకపోవుటయే సుఖము. అందువలన అహంభావము లేకపోవుటయే మంచిది. |
|
|
సర్గ - 15, శ్లోకమ్ - 11 అహంకారం పరిత్యజ్య మునే! శాన్తమనస్తయా । అవతిష్టే గతోద్వేగో భోగౌఘో భంగురాస్పదః ॥ మునీ! నేనహంకారమును ద్యజించి మనశ్శాంతిని బడసి, ఉద్వేగ విహీనుడనైతిని. భోగ పదార్థములు క్షణభంగురములు, ఇంద్రియాధీనములు; (వీటివలన నిట్టి స్థితి కలుగదు.) |
|
|
సర్గ - 15, శ్లోకమ్ - 12 బ్రహ్మన్! యావదహంకారవాదః పరిజృంభతే । తావద్ వికాసమాయాతి తృష్ణాకుటజమంజరీ ॥ మహాత్మా! అహంకార మేఘములు విస్తరించుచున్నంతవఱకు తృష్ణ యను కుటజమంజరులు వికసించుచునే యుండును. |
|
|
సర్గ - 15, శ్లోకమ్ - 13 అహంకారఘనే శాంతే తృష్ణా నవతడిల్లతా । శాంతదీపశిఖావృత్యా క్వాఽపి యాత్యతిసత్వరమ్ ॥ అహంకార మేఘములు తేలిపోయిన, తృష్ణయను మెఱుపుతీగె ఆరిపోవు దీపమువలె ఎచ్చటికో మాయమైపోవును. |
|
|
సర్గ - 15, శ్లోకమ్ - 14 అహంకారమహావింధ్యే మనోమత్తమహాగజః । విస్ఫూర్జతి ఘనాస్ఫోటైః స్తనితైరివ వారిదః ॥ మేఘము ఉఱుములతో నాడంబర మొనర్చునట్లు, మనస్సను మదపుటేనుగ అహంకారమను వింధ్యపర్వత గుహలలో ఉత్సాహముతో విజృంభించుచుండును. |
|
|
సర్గ - 15, శ్లోకమ్ - 15 ఇహ దేహమహారణ్యే ఘనాహంకార కేసరీ । యోఽయముల్లసతి స్ఫారస్తేనేదం జగదాతతమ్ ॥ శరీరారణ్యమున నున్న, ఈ అహంకార సింహము నుండియే (సుకృత దుష్కృతఫలభోగ రూపమగు) ఈ జగత్తు విస్తరిల్లుచున్నది. |
|
|
సర్గ - 15, శ్లోకమ్ - 16 తృష్ణాతంతులవప్రోతా బహుజన్మపరంపరా । అహంకారోగ్రఖింగేన కంఠే ముక్తావలీ కృతా ॥ ఈ జన్మపరంపరలు తృష్ణయను దారమున గ్రుచ్చబడియున్నవి; దీనిని అహంకారమను విటుడు ముత్యాలమాలవలె కంఠమున దాల్చినాడు. |
|
‘దేహము’ అనే కీకారణ్యంలో 'అహంకారము' అనే పిశాచం అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. అతడు ఇట్టివే అగు అనేక పంచభూతాత్మకమైన దేహములను దండగా వేసుకొని ధరిస్తున్నాడు. ఈ జగత్తే అతని 'మెడ'వలె ఉన్నది. |
సర్గ - 15, శ్లోకమ్ - 17 పుత్రమిత్రకళత్రాదితంత్రమంత్రవివర్జితమ్ । ప్రసారితమనేనేహ మునేఽహంకారవైరిణా ॥ మునీ! పుత్రమిత్రకళత్రాది రూపకమగు వలను ఈ అహంకార శత్రువు మంత్రతంత్రముల సాయము నపేక్షింపకయే పన్నినాడు. (లేక, అహంకారవైరిచే గూర్పబడిన ఈ పుత్రమిత్ర కళత్రాదులు, మంత్రతంత్రముల అవసర ముపేక్షింపకయే, మనుష్యుని నేడ్పింతురు లేక మంత్రతంత్రముల వలనగూడ, ఈవలనుండి యీవల బడజాలము - అను.) |
|
|
సర్గ - 15, శ్లోకమ్ - 18 ప్రమార్జితేఽహమిత్యస్మిన్ పదే స్వయమపి ద్రుతమ్ । ప్రమార్జితా భవంత్యేతే సర్వఏవ దురాధయః ॥ అహంకారమును మొదలంట నరికి వైచిన తక్కిన బాధ లన్నియు తమంతట దామే తొలగిపోవును. |
|
|
సర్గ - 15, శ్లోకమ్ - 19 అహమిత్యంబుదే శాంతే శనైశ్చ శమశాతనీ । మనోగహనసమ్మోహమిహికా క్వాఽపి గచ్ఛతి ॥ మనో గగనమున నున్న శాంతినాశిని యగు మోహమను మంచుబొట్టు, అహంకారమను పొగమంచు తొలగినచో మాయమైపోవును. |
|
మనస్సులో పేరుకొన్న ‘మహామోహము' అనే మంచు మీ ఉపదేశ ఉష్ణకిరణ ప్రభావంచేత కరిగిపోవాలనే కోరుకొంటున్నాను. |
సర్గ - 15, శ్లోకమ్ - 20 నిరహంకారవృత్తేర్మే మౌర్ఖ్యాచ్ఛోకేన సీదతః । యత్కించిదుచితం బ్రహ్మంస్తదాఖ్యాతుమిహార్హసి ॥ బ్రహ్మజ్ఞా! నే నహంకారమును విడిచిపెట్టితిని. కాని అజ్ఞానవశమున దుఃఖము నందుచున్నాను. నా మంచి కవసరమగు దానిని వచింపుడు! |
|
“నా మనస్సు ఎటూ ప్రసరించకుండుగాక!” అని శాసిస్తున్నాను. కాని, ఏం లాభం? అజ్ఞానం ఉండి ఉండుటచేతనే కాబోలు నాకు ఏమీ తెలియకయే ఉన్నది. |
సర్గ - 15, శ్లోకమ్ - 21 సర్వాపదాం నిలయమధ్రువ మంతరస్థ మున్ముక్త ముత్తమగుణేన న సంశ్రయామి । యత్నాదహం కృతిపదం పరితోఽతిదుఃఖమ్ శేషేణ మాం సమనుశాధి మహానుభావ ॥ మహానుభావా! సర్వాపదలకు నిలయమును, హృదయమునందలి సద్గుణము లన్నిటివలనను ఖండింపబడి నదియు, దుఃఖప్రదమును నగు అహంకారమును ప్రయత్నముతో వివర్జించితిని. ఇక కర్తవ్య మేమియో వచించి, నాకాత్మతత్యము నుపదేశింపుడు. |
|
అసలు ఈ 'అహంకారము’ యొక్క నివాస స్థానము ఎక్కడ? అంతఃకరణమే కదా! ఎప్పుడైతే అంతఃకరణము అమిత చంచలమై దుర్వాసనలతో కూడినదై, సద్గుణములు లేనిదై ఉంటోందో, అప్పుడు దానిలో అహంకారము వచ్చి తిష్టవేస్తోంది. సర్వ ఆపదలను వెంటబెట్టుకొని సంచరించే, ఈ అహంకారమును ఆశ్రయించి రాజ్యాదులు ఏలమని నన్ను మీరు ఆజ్ఞాపించకుండెదరు గాక! దానికి బదులు, ఈ అహంకారమును జయించివేయగల ఉపాయాలేమైనా ఉంటే నాకు ఉపదేశించి నన్ను కృతార్థుణ్ణి చేయండి. |
[NOTE: ఒక పదార్థమును మనం ప్రీతిపూర్వకంగా ఆశ్రయించినప్పుడు మన మనోచిత్తములు ప్రవర్తిస్తున్నాయి.
ప్రీతి కలిగియుండు స్వభావం = చిత్తము.
మననము చేయు స్వభావము = మనస్సు.]
Original Sloka | YP Translation | YHRK Liberal Translation |
---|---|---|
శ్రీరామ ఉవాచ :- సర్గ - 16, శ్లోకమ్ - 1 దోషైర్జర్జరతాం యాతి సత్కార్యాదార్యసేవనాత్ । వాతాన్తః పిచ్ఛలవవచ్చేతశ్చలతి చంచలమ్ ॥ శ్రీరాముడు :- మనస్సు ముముక్షువుల కత్యంతావసరమగు సాధుసేవను విడిచి కామాది దోషముల నాశ్రయించి శక్తిని గోల్పోవును; నెమిలిపింఛపు తుదికొన గాలిలో నూగులాడునటుల చంచలమై చలించుచుండును. |
|
సర్వ కార్యములు సాధించటంలో దిట్ట అయిన ఈ 'మనస్సు' గురించి చెపుతాను. వినండి. ఇది అనేక కామక్రోధాలతో నిండి అతి శిథిలమై ప్రవర్తిస్తోంది. అన్ని వేళలందు దోషదుర్గంధములతో కూడుకొన్న విషయానుభవములకొరకే పరుగులు తీస్తోంది. పెద్దలు చెప్పే మార్గమును, సత్కార్యములను స్వీకరించమన్నప్పుడల్లా మొరాయిస్తోంది. దీని కదలికలు నెమలి పింఛపు తుదికొనలాగా అతి చంచలం. |
సర్గ - 16, శ్లోకమ్ - 2 ఇతశ్చేతశ్చ సువ్యగ్రం వ్యర్థమేవాభిధావతి । దూరాద్దూరతరం దీనం గ్రామే కౌలేయకో యథా ॥ గ్రామమున కుక్క అటునిటు తిరుగులాడునట్లు, కారణము లేకుండగనే వ్యాకులమై దీనభావమున దూరప్రదేశములు దిరుగులాడుచుండును. |
|
తండ్రీ! మీరు వీధి కుక్కను చూచారు కదా! అది ఏ పనీ లేకపోయినప్పటికీ వీథులలో అటూ-ఇటూ తిరుగుచు ఆయాసపడుతూ ఉంటుంది కదా! అట్లాగే ఈ మనస్సు కూడా నిరర్థకంగా, నిష్కారణంగా, నిష్ప్రయోజనకరంగా అన్నివేళలలో అటూ ఇటూ తిరుగుతోంది. నిద్రకు ఉపక్రమించినప్పుడు కూడా దీని వేగం ఆగటం లేదు. పోనీ, పొందేది ఏమైనా ఉన్నదా? లేదు. |
సర్గ - 16, శ్లోకమ్ - 3 న ప్రాప్నోతి క్వచిత్ కించిత్ ప్రాప్తైరపి మహాధనైః । నాంతః సంపూర్ణతామేతి కరణ్డక ఇవాంబుభిః ॥ దీని కెచ్చటను, ఏమియు దొఱకదు. గొప్ప ధనరాశి దొఱకినను దీని కడుపు *ఓటికుండవలె నిండదు. NOTE: ఓటికుండ అనగా మూలమున కరగుక మను శబ్దము ప్రయోగింపబడినది. కరగుకమన వెదుళ్లతోనల్లిన బుట్ట, దీనియందు నీళ్లు నిలువవు కదా! - అను. |
|
ఓటికుండలాగా మనస్సు ఏమాత్రం నిండటం లేదు. ఎప్పుడైనా ఏదైనా లభించినా అంతటితో తృప్తిపడదు. మనస్సు తన సంకల్ప పరంపరలను త్యజించే శక్తిలేక అనేకసార్లు దీనత్వం, వ్యాకులత్వం పొందుతోంది. దురాశల వలలో చిక్కుకొన్న దానికి 'తృప్తి' అన్నమాట ఎక్కడిది? జల్లెడలో నీరు పోస్తుంటే నిండేదెప్పటికి చెప్పండి! |
సర్గ - 16, శ్లోకమ్ - 4 నిత్యమేవ మునే! శూన్యం కదాశా వాగురావృతమ్ । న మనో నిర్వృతిం యాతి మృగో యూథాదివచ్యుతః ॥ మునీ! దురాశ యను వలలో బడిన శూన్యచిత్తము, మందను వీడి వలలో బడిన లేడివలె శాంతిని బొందజాలదు. |
|
ఈ మనస్సు గుంపులోంచి చెదరిన కోతిలాగా అవిశ్రాంతంగా ఎక్కడి నుండి ఎక్కడికో పరుగులు తీస్తోంది. హే బ్రహ్మవేత్తా! “స్తంభజాడ్యము" (అవయవములు బిగతీసుకుపోయే ఒక వ్యాధి)చే అవయవములు అస్వాధీనమగుటచే ఒకడు ఒకచోట పడి ఉన్నాడనుకోండి.... అతడు ఒక ప్రక్క కాళ్ళు చేతులు కదల్చలేక బిక్కచూపులు చూస్తూ ఉంటే, ఎక్కడి నుండో ఒక ఊరకుక్క అతనిని పీక్కుతినాలని "భౌ భౌ” మంటూ సమీపిస్తుంటే అతని మానసికస్థితి ఎలా ఉంటుంది? ఈ మనస్సు నాకు అలా కనబడుతోంది. |
సర్గ - 16, శ్లోకమ్ - 5 తరంగతరలాం వృత్తిం దధదాలూనశీర్ణతామ్ । పరిత్యజ్య క్షణమపి హృదయే యాతి న స్థితమ్ ॥ తరంగములవలె చంచల మగు మనస్సు, స్థూలసూక్ష్మావయవముల చింతను వీడి, హృదయమున నొక్క నిమిషమైన స్థిరముగ నుండనేరదు. |
|
సుడిగాలిలో చిక్కుకొన్న ఎండుటాకువలె దీనిచే నేను చాలా దూరం తీసుకుపోబడ్డాను. అది నన్ను ఎక్కడ నేలకూలుస్తుందో ఏమో? |
సర్గ - 16, శ్లోకమ్ - 6 మనో మననవిక్షుబ్ధం దిశో దశ విధావతి । మందరాహననోద్ధూతం క్షీరార్ణవపయో యథా ॥ మందర పర్వతమువలన మథింపబడిన క్షీరసముద్రమందలి నీటివలె, విషయానుచింతనమున భిన్నమైన యీ మనస్సు దశ దిశలకు పరుగులిడుచున్నది. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 7 కల్లోలకలితావర్తం మాయామకరమాలితమ్ । న నిరోద్ధుం సమర్థోఽస్మి మనోమయమహార్ణవమ్ ॥ వివిధములగు చిత్తవృత్తులవలన గల్పింపబడిన సుడిగుండములును, పరపంచన, క్రూరత్వములను మొసళ్లును, ఈ మనసను మహాసముద్రమున నున్నవి; దీని నరికట్టలేకుంటిని. |
|
ఈ మనస్సులో ‘చిత్తవృత్తులు' అనే సుడిగుండాలు ఉన్నాయి. క్రూరత్వము, పరవంచన, దురభ్యాసము మొదలైనవి ఇందులో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. |
సర్గ - 16, శ్లోకమ్ - 8 భోగదూర్వాంకురాకాంక్షీ శ్వభ్రపాతమచింతయన్ । మనోహరిణకో బ్రహ్మన్! దూరం విపరిధావతి ॥ మహాత్మా! మనస్సను లేడి కోర్కెలను పచ్చిగడ్డికై లోభముతో నరకమను గుంటలో పడుటనుగూర్చి చింతింపక దూరముగ పరువు లిడుచున్నది. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 9 న కదాచన మే చేతః స్వామాలూనవిశీర్ణతామ్ । త్యజత్యాకులయా వృత్త్యా చంచలత్వమివార్ణవః ॥ ఆకులములగు వృత్తులతో గూడుకొనియున్న నామనస్సు, సముద్రము చంచలత్వమును వీడలేనట్లు, దేహచింతను వీడలేకున్నది. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 10 చేతశ్చంచలయా వృత్త్యా చింతానిచయచంచురమ్ । ధృతిం బధ్నాతి నైకత్ర పంజరే కేసరీ యథా ॥ మనస్సు స్వభావతః చంచలము; అన్యచింతలతో మరింత చంచల మైనది. శక్తి నంతయు వినియోగించి నిరోధించినను, బోనులో నుంచబడిన సింహమువలె నొకచోట కుదురుకొని యుండజాలదు. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 11 మనో మోహరథారూఢం శరీరాత్ సమతాసుఖమ్ । హరత్యపహతోద్వేగం హంసః క్షీర మివాంభసః ॥ మోహరథము నెక్కిన మనస్సు, హంస పాలను నీటినుండి వేఱుపరచి గైకొనునట్లు, ఉద్వేగ నాశకరమగు సమరసత్వరూపక మగు ఆత్మజ్ఞానమును శరీరమునుండి వేఱుపరచి హరించుచున్నది. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 12 అనల్పకల్పనాతల్పే విలీనాశ్చిత్తవృత్తయః । మునీంద్ర! న ప్రబుధ్యంతే తేన తప్యేఽహ మాకులః ॥ మునీంద్రా! ద్వైతభావనా రూపకమగు వివిధకల్పనలను శయ్యయందు పరుండిన చిత్తవృత్తులు, ఆచార్యోపదేశము నందినను మేల్కొనవు; అందువలననే నేను మిక్కుటముగ విచారించుచున్నాను. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 13 క్రోడీకృత దృఢగ్రంథి తృష్ణాసూత్రే స్థితాత్మనా । విహగో జాలకేనేవ బ్రహ్మన్! బద్ధోఽస్మి చేతసా ॥ మహాత్మా! వేటకాడు వాగురులను పన్ని, దారమును చేతనుంచుకొని, దూరమున పొంచియుండి, పక్షు లందుబడినప్పుడు దారమును లాగి ముడిపడునట్లొనర్చి, వాటిని బంధించునట్లు; చిత్తము తృష్ణయను సూత్రమును మమతయను క్రోడమున నుంచుకొని నన్ను బంధించుచున్నది. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 14 సంతతామర్షధూమేన చింతజ్వాలాకులేన చ । వహ్నినేవ తృణం శుష్కం మునే! దగ్ధోఽస్మి చేతసా ॥ మునివరా! ప్రబలమగు రోషమను ధూమముచే నావృతమై, చింతలను జ్వాలలతో గూడిన అగ్నింబోలు నా చిత్తము, ఎండుగడ్డినిబోలు నన్ను దహించుచున్నది. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 15 క్రూరేణ జడతాం యాతస్తృష్ణాభార్యానుగామినా । శవం కౌలేయకేనేవ బ్రహ్మన్! భుక్తోఽస్మి చేతసా ॥ బ్రహ్మజ్ఞా! క్రూరమగు చిత్తము తృష్ణయను భార్య అనుసరించుచు జ్ఞానవిహీనుడనగు నన్ను కుక్క అచేతనశవమును భక్షించునట్లు భక్షించుచున్నది. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 16 తరంగతరలాస్ఫాలవృత్తినా జడరూపిణా । తటవృక్ష ఇవౌఘేన బ్రహ్మన్! నీతోఽస్మిచేతసా ॥ బ్రాహ్మణుడా! గట్లుగొట్టుకొను నదీతరంగములు గట్టున నున్న చెట్టును బడగొట్టునట్లు అలలవలె చంచలమును, కోరిన విషయములు లభింపకపోవుటవలన ఘాతప్రతిఘాతముల నందినదియు నగు చిత్తము నన్ను పడగొట్టుచున్నది. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 17 అవాంతరనిపాతాయ శూన్యే వా భ్రమణాయ చ । తృణం చండానిలేనేవ దూరే నీతోఽస్మి చేతసా ॥ సుడిగాలి దూరమున పడవేయుటకు గాని, లేక ఆకాశమధ్యమున ద్రిప్పుటకు గాని, గడ్డిపరకను దీసికొనిపోవునట్లు; చిత్తము నన్ను మధ్యపదములగు స్వర్గాదిభోగముల ననుభవింపజేయుటకో లేక శూన్యస్వరూపమగు ఈ పృథివి యందు కీటక పతంగాది నానారూపముల భ్రమింపజేయుటకో తీసికొని పోవుచున్నది. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 18 సంసారజలధేరస్మాన్నిత్య ముక్తరణోన్ముఖః । సేతునేవ పయఃపూరో రోధితోఽస్మి కుచేతసా ॥ జలప్రవాహము అడ్డుకట్టిన నాగిపోవునట్లు, సంసార సాగరమునుండి బయటపడుటకు యత్నించుచున్న నేను, దుష్టచిత్తమువలన నవరోధింపబడుచున్నాను. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 19 పాతాలాద్గచ్ఛతా పృథ్వీం పృథ్వ్యాః పాతాలగామినా । కూపకాష్ఠం కుదామ్నేవ వేష్టితోఽస్మి కుచేతసా ॥ కట్టబడిన త్రాటివలన ఏతము క్రిందకు మీదకు బోవునట్లు, నేను మంచిచెడ్డలగు తలంపులతో స్వర్గనరకముల కఱుగుచు వచ్చుచున్న మనస్సువలన బంధింపబడి యున్నాను. |
|
మహాత్మా! నూతిలోకి దింపబడిన ఏతామును ఏతాము త్రాడు క్రిందికి పైకి త్రిప్పుతూనే ఉంటుంది చూచారా? మేము కూడా భోగవాంఛలతో, కామక్రోధములతో కూడుకొన్న వారమై మూడు లోకములలో మనస్సుచే త్రిప్పబడుచున్నాం. |
సర్గ - 16, శ్లోకమ్ - 20 మిథ్యైవ స్ఫారరూపేణ విచారాద్విశరారుణా । బాలో వేతాళకేనేవ గృహీతోఽస్మి కుచేతసా ॥ బాలకుడు భూతగ్రస్తు డగునట్లు కల్పితమును, మిథ్యయు నగు చిత్తమువలన నేను గ్రహింపబడియున్నాను. |
|
ఈ మనస్సును పట్టుకొని నియమిద్దామా అంటే, ....... దీనికి ఒక రూపమే లేదాయె! తమవంటి జ్ఞానులు “మనస్సు అనబడు ఒకానొక వస్తువు లేదు. దానికి అస్థిత్వమే లేదు” అని చెప్పుతూ ఉంటారు. అజ్ఞాన బాలుడు కథలోని భూతమును చీకట్లో ఎదురుగా ఉన్నట్లు ఊహించుకొని బాధపడునట్లు “లేదు” అని చెప్పబడుతున్న మనస్సు మాకు ప్రాప్తిస్తోంది. |
సర్గ - 16, శ్లోకమ్ - 21 వహ్నే రుష్టతరః శైలాదపి కష్టతరక్రమః । వజ్రాదపి దృఢో బ్రహ్మన్! దుర్నిగ్రహమనోగ్రహః ॥ బ్రాహ్మణుడా! మనస్సను ఈ భూతమును నిగ్రహించుట చాల కష్టము. ఇది అగ్నికంటె నెక్కుడుగ తాపము నిచ్చును. దీని నతిక్రమించుట పర్వతమును దాటుటకంటె కష్టతరము. ఇది వజ్రముకంటె కఠినమైనది. |
|
ఈ చిత్తము క్రోధాగ్నిజ్వాలలతో నన్ను ఒక ఎండుగడ్డి పరకవలె కాల్చి వేస్తోంది. ఇది అగ్నికంటె వేడి. కొండకంటే కఠినం. దీనిని మేము అసలు జయించగలమంటారా? |
సర్గ - 16, శ్లోకమ్ - 22 చేతః పతతి కార్యేషు విహగః స్వామిషేష్వివ । క్షణేన విరతిం యాతి బాలః క్రీడనకాదివ ॥ పక్షులు మాంసమును జూచిన ఆకాశమునుండి దిగి దానిమీద బడునట్లు, చిత్తము సతతము విషయములమీద వ్రాలుచున్నది. మఱియు బాలుడు ఆటలు దొఱకినచో చదువును విడిచిపెట్టునట్లు, చిరాభ్యస్తములగు ధ్యానాది సత్ వ్యాపారములను క్షణములో విడిచి పెట్టుచున్నది. |
|
స్వల్ప వస్తువులకోసం పరుగెత్తుతూ, స్వల్పత్వమునే పొందుచూ, నరకాదుల రుచి ఏమిటో మరల మరల చూపించే ఈ చిత్తము యొక్క గమనం నిరోధించటమెట్లా చెప్పండి? |
సర్గ - 16, శ్లోకమ్ - 23 జడప్రకృతిరాలోలో వితతావర్త వృత్తిమాన్ । మనోఽబ్ధిరహితవ్యాలో దూరం నయతి తాత! మామ్ ॥ వృత్తులను పెద్ద సుడిగుండములు గలదియు, కామాది రిపుషట్కములను సర్పములతో గూడినదియునగు, కల్లోల మనోసముద్రము నన్ను దూరమునకు దీసికొని పోవుచున్నది. |
|
|
సర్గ - 16, శ్లోకమ్ - 24 అప్యబ్ధిపానాన్మహతః సుమేరూన్మూలనాదపి । అపి వహ్న్యశనాత్ సాధో విషమ శ్చిత్తనిగ్రహః ॥ సాధువర్యా! మనస్సును వశపరచుకొనుట, సముద్రపానముకంటెను, మేరుపర్వతమును పెకలించుటకంటెను, అగ్నిని భక్షించుటకంటెను కష్టతరము. |
|
ఒక సింహమును ఉత్తచేతులతో బంధించవచ్చునేమో! సముద్రజలమునైనా పానం చెయ్యవచ్చునేమో! హిమాలయ పర్వతాన్ని కూడా పెకిలించవచ్చునేమో! అగ్నినైనా భక్షించవచ్చునేమో! ఈ చిత్తమును నిరోధించటం మాత్రం అంతతేలికైన విషయం కాదు. |
సర్గ - 16, శ్లోకమ్ - 25 చిత్తం కారణమర్థానాం తస్మిన్ సతి జగత్త్రయమ్ । తస్మిన్ క్షీణే జగత్ క్షీణం తచ్చికిత్స్యం ప్రయత్నతః ॥ విషయములకు గారణము చిత్తమే. చిత్తమున్న మూడులోకములకును అస్తిత్వ మున్నది. చిత్తము అనగా వాంఛలు నశించిన జగత్తున్ను క్షీణమగును. అందువలన, రోగచికిత్స నొనర్చునట్లు ప్రయత్నముతో, మనశ్చికిత్స నొనర్పదగును. |
|
ఈ చిత్తము అవివేకమును ఆశ్రయించి ఉండుటచే, అన్ని ఉపాధులందు ఏకస్థమైయున్న ‘ఆత్మ’ దీనికి ఏమాత్రం కనిపించటం లేదు. ఏమి తెలుసుకొన్నా, ఎంత బోధింపబడినా, ఎల్లప్పుడూ భేద భావమునే పొందుతోంది. సామ్య - సమతా భావములను హరించివేసి దుఃఖములను కలుగచేయుటలో బహుప్రావీణ్యత చూపుతోంది. అనేక విషయాలలో అంతులేని ఆసక్తిని కల్పించుకొని అందులో జడత్వం వహించి నిదురపోతోంది. ఎంతలేపినా నిదురలేవదు. సమరసపూర్వకమగు ఆత్మజ్ఞానము కొరకు ఏమాత్రం ప్రయత్నం చేయదు. ఇప్పుడు నేను ఏమి చేయాలో నాకు అర్థమగుటలేదు! |
సర్గ - 16, శ్లోకమ్ - 26 చిత్తాదిమాని సుఖదుఃఖశతాని నూన మభ్యాగతానప్యగవరాదివ కాననాని । తస్మిన్ వివేకవశతస్తనుతాం ప్రయాతే మన్యే మునే! నిపుణమేవ గలంతి తాని ॥ మునీంద్రా! శతశతములగు ఈ సుఖదుఃఖము లన్నియు, పెద్ద పెద్ద పర్వతములనుండి అరణ్యములు వెలువడునట్లు, మనస్సునుండియే నిశ్చయముగ జనించుచున్నవి. వివేకము వలన మనోలయమైన ఈ సుఖదుఃఖము లన్నియు నశించునని తలపోయుచున్నాను. |
|
ఈ మనస్సే అంతటికీ కారణం. ఇది క్షీణిస్తే లోకాలు క్షీణిస్తాయి. విజృంభిస్తే లోకాలు కూడా విజృంభిస్తాయి. కొండపై అడవులు పెరుగుచున్నట్లు, సర్వ సుఖదుఃఖాలు ఈ మనస్సు నుండే బయలుదేరుచున్నాయి. ఆచార్యులు ఎంత బోధించినా ఇది తన జాడ్యమును త్యజించుటలేదు. క్రూరుడగు పోకిరి బాలుడు మరొక పసిబాలుని బెత్తము చూపి బెదిరిస్తున్నట్లు ఇది నన్ను బెదిరిస్తోంది. ఈ ‘మనస్సు’ అనే వ్యాధికి ఉత్తమమైన ఔషధం వివేకమే కదా! అట్టి ఔషధంతో ఇది క్షీణిస్తే సుఖదుఃఖ వికారాలు కూడా క్షీణిస్తాయి. |
సర్గ - 16, శ్లోకమ్ - 27 సకలగుణజయాశా యత్ర బద్ధా మహద్భి స్తమరిమిహ విజేతుం చిత్తమభ్యుత్థితోఽహమ్ । విగతరతితయాన్తర్నాభినందామి లక్ష్మీం జడమలినవిలాసాం మేఘలేఖామివేందుః ॥ ముముక్షువు లెద్దానిని జయించి, అవిద్యాకామ కర్మముల బారినుండి బయటపడి; శాంత్యాది సద్గుణముల కధిపతు లగుదురో, అట్టి చిత్తమును ఇప్పుడే జయింప గోరుచున్నాను. జలభారమున నీలిరంగును దాల్చిన మేఘమును చంద్రుడు గోరనట్లు, అజ్ఞాన కళంకితులగు జనులను సంతోషపెట్టు లక్ష్మిని నేను గోరను -- నాకు రుచింపదు. |
|
తమవంటి మహాత్ములు చిత్తమును జయించుటచే సర్వము జయించివేశారు. అట్టి ఈ మనస్సును నశింపచేయ నిశ్చయించుకొన్నాను. ఇక నాకీ రాజ్యాదులతో పనేమున్నది చెప్పండి? |
Original Sloka | YP Translation | YHRK Liberal Translation |
---|---|---|
శ్రీరామ ఉవాచ :- సర్గ - 17, శ్లోకమ్ - 1 హార్దాంధకారశర్వర్యా తృష్ణయేహ దురంతయా । స్ఫురంతి చేతనాకాశే దోషాః కౌశిక పంక్తయః ॥ శ్రీరాముడు :- తృష్ణను ఖండించుట చాలకష్టము; ఇది ఆత్మతత్త్వమును మరగుపరచు రాత్రి. ఈ రాత్రియందు రాగద్వేషాదులను గ్రుడ్లగూబలు జీవుడను ఆకాశమున విహరించుచుండును. |
|
ఎప్పటినుండో తెలియదుకాని, ఈ హృదయంలో “ఆశ” అనే అజ్ఞానాంధకారం వ్యాపించియున్నది. కామ, క్రోధ, లోభాది గుడ్లగూబలు ఆ చీకట్లో గూళ్ళు కట్టుకొని కాపురం చేస్తున్నాయి. |
సర్గ - 17, శ్లోకమ్ - 2 అంతర్దాహప్రదాయిన్యా సమూఢరసమార్దవః । పంక ఆదిత్యదీప్త్యేవ శోషం నీతోఽస్మి చింతయా ॥ సూర్యకిరణములు బురదను ఎండజేయునట్లు, హృదయతాపమును గలిగించు చింత దయా వినయాది గుణములను శుష్కింపజేసి నా హృదయమును శూన్య మొనర్చుచున్నది. |
|
నేను ఏమైనా సద్గుణాలను ఆశ్రయించాలని అనుకొంటూ ఉండగానే, ఇంతలో ఎక్కడినుండో తృష్ణ (Desire) వచ్చిపడుతోంది. |
సర్గ - 17, శ్లోకమ్ - 3 మమ చిత్తమహారణ్యే వ్యామోహతిమిరాకులే । శూన్యతాండవినీ జాతా భృశమాశాపిశాచికా ॥ అజ్ఞానావృతమై విచారహీనమగు నా మానసమను శూన్యారణ్య ప్రదేశమున ఆశయను పిశాచిని తాండవము సల్పుచున్నది. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 4 వచోరచితనీహారా కాంచనోపవనోజ్జ్వలా । నూనం వికాసమాయాతి చింతాచణకమంజరీ ॥ చింతలను * చణకమంజరులు విలాపవాక్యములను హిమకణములవలన వికసించుచున్నవి. బంగారమను ఉపవనము దీనికి శోభను గూర్చుచున్నది. NOTE: చణక శబ్దార్థము సెనగ, మంజరులన మొగ్గలు, -- అను. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 5 అలమంతర్భ్రమాయైవ తృష్ణా తరలితాశయా । ఆయాతా విషమోల్లాసమూర్మిరంబునిధావివ ॥ తరంగములు సముద్రమును గలచుచు లేచుచు సుడిగుండములను గల్పించుటకే; అట్లే తృష్ణయు మాయారూప మగు మనఃక్షోభమును లేవదీసి, ధనార్జనాది భ్రమలను గల్పించుటకే సంచరించుచుండును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 6 ఉద్దామకల్లోలరవా దేహాద్రౌ వహతీహ మే । తరంగతరలాకారా తరత్తృష్ణాతరంగిణీ ॥ తృష్ణ నానావిధ విషయముల సంచరించుచుండును; దీని తరంగములు నా శరీరమను పర్వతమున బ్రవహించుచున్నవి-ప్రవృత్తియే దీని తరంగములు. అసత్యవచనములు, పరనిందాది కుత్సిత భాషణములే ఈ తరంగముల ధ్వనులు. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 7 వేగం సంరోద్ధుముదితో వాత్యయేవ జరత్తృణమ్ । నీతః కలుషయా క్వాఽపి తృష్ణయా చిత్తచాతకః ॥ ఎండుగడ్డి గాలిచే నెగురకొట్టబడి ఎక్కడకోపోయి పడునట్లు, నామనస్సను చాతక పక్షి తృష్ణావేగమును వారింప యత్నించియు, విఫలమై అనిర్దిష్టస్థలముల వ్రాలుచున్నది. (NOTE: చాతకము మేఘజలములను దక్క నితరముల ద్రావదను సంగతి లోక ప్రసిద్ధము. దాహమైనప్పు డటునిటు తిరుగుచు చెట్లకొమ్మలందు వ్రాలి మేఘముల నాశించును. కాని దాహమెక్కు డగుటచే నక్కడ నిలువ జాలక మరొకచోట కెగిరిపోవును. అట్లే మనస్సుగూడ ధర్మమేఘసమాధి రూపకమగు పరమపురుషార్థము నాశించి, ప్రయత్నించుచు, తృష్ణచే నీడ్వబడి యత్నములచే నిలుకడ లేనిదని భావము.) |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 8 యాం యామహమతీవాస్థాం సంశ్రయామి గుణశ్రియమ్ । తాం తాం కృంతతి మే తృష్ణా తంత్రీమివ కుమూషికా ॥ మూషికము వీణతీగలను కొఱికివేయునట్లు, తృష్ణయు నేనాశ్రయించు వివేక వైరాగ్యాది గుణముల నాశన మొనర్చుచున్నది. |
|
ఎలుక ఇంట్లో ప్రవేశించి నూతన వస్త్రములను కొరికి పాడుచేయునట్లు, ఇది మా ఉత్తమ ప్రయత్నములను, సత్ప్రవర్తనలను పాడుచేస్తోంది. ఇక మేము వివేకము పొందేది ఎన్నటికి? ఆత్మ దర్శనం చేసేదెప్పటికి? |
సర్గ - 17, శ్లోకమ్ - 9 పయసీవ జరత్పర్ణం వాయావివ జరత్తృణమ్ । నభసీవ శరన్మేఘశ్చింతాచక్రే భ్రమామ్యహమ్ ॥ సుడిగుండమునందలి ఎండుటాకువలెను, సుడిగాలిలోని ఎండుగడ్డి పరకవలెను, ఆకాశము నందలి శరన్మేఘములవలెను, చింతాచక్రమునబడి నేను పరిభ్రమించుచున్నాడను. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 10 గంతుమాస్పదమాత్మీయమసమర్థధియో వయమ్ । చింతాజాలే విముహ్యామో జాలే శకునయో యథా ॥ బుద్ధియోగమున స్వస్వరూప ప్రాప్తి నందలేక, పక్షులు మోసపోయి వలలో పడునట్లు చింతాజాలముల బడి, మోహితుల మగుచున్నాము. |
|
వలలో చిక్కుకొని ఆక్రోశించే పిట్టలాగా మేము ఆశాపాశక్లేశ దుర్వాసనలలో పీకల దాకా చిక్కుకొన్నాం. |
సర్గ - 17, శ్లోకమ్ - 11 తృష్ణాభిధానయా తాత! దగ్ధోఽస్మి జ్వాలయా తథా । యథా దాహోపశమనమాశంకే నామృతైరపి ॥ మునీంద్రా! తృష్ణాజ్వాలలబడి దగ్ధుడ నైతిని. అమృతమువలననైన నీతాపము తీరునా అని యనుకొనుచున్నాను. |
|
అనేక తృష్ణలచే దగ్ధులమగుచున్న మేము అమృతంలో స్నానంచేస్తే మాత్రం సేద తీరుతుందా? ఊరట కలుగుతుందా? అనుమానమే! |
సర్గ - 17, శ్లోకమ్ - 12 దూరం దూరమితో గత్వా సమేత్య చ పునఃపునః । భ్రమత్యాశు దిగంతేషు తృష్ణోన్మత్తా తురంగమీ ॥ తృష్ణయను గుఱ్ఱము మాటిమాటికి స్వస్థానము నుండి దూరప్రదేశమున కఱిగి, మరల వెనుకకు తిరిగి వచ్చుచు, దిగంతముల సంచరించుచున్నది. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 13 జడసంసర్గిణీ తృష్ణా కృతోర్ధ్వాధోగమాగమా । క్షుబ్ధా గ్రంథిమతీ నిత్యమారఘట్టాగ్ర రజ్జువత్ ॥ అజ్ఞాన సంబంధము కలదియు, సంచలనము కలదియు, భోక్తృ, భోగ్య, తాదాత్మ్య, సంసర్గ, అధ్యాసలను గ్రంథులు గలదియు, ధర్మాధర్మ విషయముల ననుసరించుటవలన స్వర్గనరకములకు బోవుచు వచ్చుచున్నదియు నగు తృష్ణ ఘటీయంత్రమువలె నున్నది. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 14 అంతర్గ్రథితయా దేహే సర్వదుశ్ఛేదయాఽనయా । రజ్జ్వేనాశు బలీవర్దస్తృష్ణయా వాహ్యతే జనః ॥ ముక్కుకు త్రాడు కుట్టుబడిన యెద్దువలె, త్రెంపనలవికాని తృష్ణా సూత్రముచే బంధింపబడిన మనుజుడు, ఐహికాముష్మిక ఫలరూప మగు భారమును వ్యర్థముగ మోయుచున్నాడు. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 15 పుత్రమిత్రకళత్రాదితృష్ణయా నిత్యకృష్ణయా । ఖగేష్వివ కిరాత్యేదం జాలం లోకేషు రచ్యతే ॥ కిరాతుని భార్య పక్షులను బట్ట వలను పన్నునట్లు, తృష్ణ లోకులను బడద్రోయుటకుగాను పుత్రమిత్రకలత్రాది రూపకమగు వలను పన్నుచున్నది. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 16 భీషయత్యపి ధీరం మామంధయత్యపి సేక్షణమ్ । ఖేదయత్యపి సానందం తృష్ణా కృష్ణేవ శర్వరీ ॥ తృష్ణ చీకటి రాత్రివంటిది - నేను ధీరుడ నైనను అది నాకు భయమును గలిగించుచున్నది. కళ్లున్నను గ్రుడ్డిగ నొనర్చినది. ఆనందస్వరూపుడ నగు నాకు దుఃఖమును గలిగించుచున్నది. |
|
బురదలోని తడిని సూర్యకిరణాలు పీల్చివేయునట్లు, మా అంతఃకరణములోని కొద్దిపాటి దయాదాక్షిణ్యములను తృష్ణ వచ్చి పీల్చివేస్తుంటే మేము నిస్సహాయులమై చూస్తున్నాం. చూస్తూ ఉండగానే అది వచ్చి మా కళ్ళు కప్పివేస్తోంది. కన్నులు ఉండి కూడా గ్రుడ్డివారము అవుచున్నాము. మామూలుగా అతిశాంతచిత్తుడైనవాడు కూడా, తృష్ణచేత కలవర పెట్టబడుచున్నాడు. ఎక్కడన్నా ధన, కనక, నారీజనమును చూస్తేచాలు, ఈ తృష్ణ ఎక్కడినుండో బొట్టుపెట్టి పిలిచినట్లు వచ్చిపడుతోంది. |
సర్గ - 17, శ్లోకమ్ - 17 కుటిలా కోమలస్పర్శా విషవైషమ్యశంసినీ । దశత్యపి మనాక్ స్పృష్ణా తృష్ణా కృష్ణేవ భోగినీ ॥ వక్రగమనము, కోమల స్పర్శ గలదియు, విషమును గుఱిపించునదియు నగు తృష్ణయను నీ నల్ల త్రాచును ఒకింత స్పృశించినను కఱచును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 18 భిందతీ హృదయం పుంసాం మాయామయవిధాయినీ । దౌర్భాగ్యదాయినీ దీనా తృష్ణా కృష్ణేవ రాక్షసీ ॥ నల్లరక్కసింబోలు తృష్ణ, దురదృష్టమునకు గారణము - మాయామయ ప్రపంచమును గల్పించుచున్నది; మానవ హృదయములను భేదించుచున్నది. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 19 తంద్రీతంత్రీగణైః కోశం దధానా పరివేష్టితమ్ । నానందే రాజతే బ్రహ్మంస్తృష్ణా జర్జరవల్లకీ ॥ బ్రహ్మజ్ఞా! ! పాడువడిన బుఱ్ఱకల వీణ ఆనందోత్సవములందు నుపయోగ పడనట్లు; నిద్రతోడను, నాడీసమూహములతోడను గూడిన శరీరకోశమున నున్న తృష్ణ ఆనందతత్త్వమును బ్రకాశింపజేయజాలదు. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 20 నిత్యమేవాతిమలినా కటుకోన్మాదదాయినీ । దీర్ఘతంత్రీ ఘనస్నేహా తృష్ణా గహ్వరవల్లరీ ॥ హృదయమను పర్వతగుహయందు పుట్టిన తృష్ణయను లత అతి మలినమును నీచమునునై యున్నది. (నీచప్రకృతి యగుటవలన నికృష్టమును, సూర్యకిరణములు సోకకపోవుటవలన మలినము అని గ్రహించవలెను) కోర్కెలు ఫలింపనందువలన పిచ్చిని గలిగించును; దీని పరిణామము దుఃఖము. దీని తీగెలు పొడవైనవి; మోహదాయకములు. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 21 అనానందకరీ శూన్యా నిష్ఫలా వ్యర్థమున్నతా । అమంగలకరీ క్రూరా తృష్ణా క్షీణేన మంజరీ ॥ వాడిపోయిన మొగ్గల గుత్తివలె తృష్ణాపుష్ప విహీనయును, ఫలశూన్యయును, వ్యర్థమును నైయున్నది. క్రూరకంటకము (ముట్లు) వలె కష్టమును గూర్చును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 22 అనావర్జితచిత్తాఽపి సర్వమేవానుధావతి । న చాప్నోతి ఫలం కించిత్ తృష్ణా జీర్ణేవ కామినీ ॥ వృద్ధవేశ్యవలె, మనస్సును లోబరచుకొనలేక పోయినను, అది అందరివెంట పరుగిడును; దీనివలన ఫలము ఒకించుకైనను లభింపదు. |
|
తృష్ణ "తాను తలచినది సాధ్యమా? అసాధ్యమా?” అని కూడా పరీక్షించుకోకుండా ఆతురపడుతోంది. కాని, ఏం లాభం? వయస్సు చెల్లిన కామాతురత వలె ఏమీ పొందకయే పోవుచున్నది. |
సర్గ - 17, శ్లోకమ్ - 23 సంసారబృందే మహతి నానారససమాకులే । భువనాభోగరంగేషు తృష్ణా జరఠనర్తకీ ॥ సంసారము శోకమోహాది రసములతో గూడిన భోగనాట్యరంగము; తృష్ణ ఇందలి పరిపక్వ నర్తకి. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 24 జరా కుసుమితారూఢా పాతోత్పాతఫలావలిః । సంసారజంగలే దీర్ఘే తృష్ణావిషలతా తతా ॥ విశాలమగు సంసారారణ్యమున తృష్ణయను విషలత దీర్ఘముగ వ్యాపించి యున్నది; జరయే దీని పుష్పములు. హెచ్చుతగ్గులే దీని ఫలములు. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 25 యన్న శక్నోతి తత్రాపి ధత్తే తాండవితాం గతిమ్ । నృత్యత్యానందరహితం తృష్ణా జీర్ణేవ నర్తకీ ॥ వృద్ద నర్తకివలె తృష్ణ సాధింప వీలులేని తావులకు గూడ తాండవ మొనర్పబోవును; అఱిగి, నిరుత్సాహముతోడ నృత్యము నొనర్చును. |
|
ఓ మహాశయా! విశ్వామిత్రా! ముసలి నర్తకి ఏమాత్రం ఆనందకరం కాకపోయినా తన నృత్యం మానలేకపోయినట్లు, ఈ 'ఆశ' అనేది పొందే తృప్తి అంటూ ఏదీ లేకపోయినా, ఈ సంసారారణ్యంలో తన చపల సంచలనం మాత్రం మానలేకపోతోంది. |
సర్గ - 17, శ్లోకమ్ - 26 భృశం స్ఫురతి నీహారే శామ్యత్యాలోక ఆగతే । దుర్లంఘ్యేషు పదం ధత్తే చింతా చపలబర్హిణీ ॥ చంచలమగు నెమలి వర్షాగమమును సూచించు మేఘావరణమును గాంచి నృత్యము సల్పునట్లును; చొరరానిచోట్ల కఱిగి గూటిని గట్టుకొనునట్లును, చపలచిత్తముతో మోహావరణమున నృత్యము సల్పును; అప్రాప్య విషయముల నాసక్తి గొనును; శరత్కాలము రాగా సూర్యుడు ప్రకాశించినచో నెమళ్ళ నాట్య మాగిపోవును; అట్లే, వివేక మను వెలుగు పొడసూపిన మోహము మాసిపోవును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 27 జడకల్లోలబహులా చిరం శూన్యాంతరాంతరా । క్షణముల్లాసమాయాతి తృష్ణా ప్రావృట్తరంగిణీ ॥ వర్షాకాలమందలి ఏఱువలె, తృష్ణ అజ్ఞాన తరంగములతోడను, జ్ఞానోదయ మైన పిదప శూన్యతను పొందుచు క్షణకాలముమాత్రమే ఉల్లసిల్లుచున్నది. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 28 నష్టముత్సృజ్య తిష్ఠన్తం తృష్ణా వృక్షమివాపరమ్ । పురుషాత్ పురుషం యాతి తృష్ణా లోలేవ పక్షిణీ ॥ ఆకలిదప్పుల వలన బాధపడుచు పండ్లు లేని చెట్టును వీడి మరొకచెట్టు నాశ్రయించు చంచలపక్షివలె, తృష్ణ ఒకానొక పురుషుని వీడి, మరొకనిని ఆశ్రయించుచుండును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 29 పదం కరోత్యలంఘ్యేఽపి తృప్తాపి ఫలమీహతే । చిరం తిష్ఠతి నైకత్ర తృష్ణా చపలమర్కటీ ॥ తృష్ణయను చపలమర్కట మొకచోట నుండదు. పొందవీలులేని వస్తువులను బడయుటకు దుముకులిడును. తృప్తి నందినను, ఇతర విషయములను వాంఛించును. |
|
ఆశ చేత నిండియున్న మనస్సు “నేను ఆశ్రయించబోయే వారు నాకు అనుకూలురా? కాదా? ఆయా వస్తుజాలం వాస్తవానికి శ్రేయోదాయకమా, ప్రమాదకరమా?" అని కూడా పరిశీలించుట లేదు. దీనంగా వారిని, వీరిని తుచ్ఛ పదార్థముల కొరకు అర్థిస్తోంది. |
సర్గ - 17, శ్లోకమ్ - 30 ఇదం కృత్వేదమాయాతి సర్వమేవాసమంజసమ్ । అనారతం చ యతతే తృష్ణా చేష్టేవ దైవికీ ॥ 'ఇది మంచిపని' అని ఒకదానిని ఆరంభించి అది ముగియక మునుపే అద్దానిని అశుభకార్యముగ నెంచి మరొకకార్యము నారంభించుచు, 'విసుగు విరామము' లేకుండ శుభాశుభ ఫలములకొఱకు తృష్ణ యత్నించుచునే యుండును. అందువలన ప్రాణుల కర్మల ననుసరించి ఫలముల నొసగు బ్రహ్మదేవుని యత్నముతో నిద్దానిని బోల్ఫనగును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 31 క్షణమాయాతి పాతాలం క్షణం యాతి నభఃస్థలమ్ । క్షణం భ్రమతి దిక్కుంజే తృష్ణా హృత్పద్మషట్పదీ ॥ హృత్కమల భ్రమర మగు తృష్ణ ఒక క్షణమున పాతాళమునను, మతొక క్షణమున ఆకాశమునను, ఇంకొక క్షణమున దిక్కుంజము (దిక్కులను పొద) లందును విహరించుచుండును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 32 సర్వసంసారదోషాణాం తృష్ణైకా దీర్ఘదుఃఖదా । అంతఃపురస్థమనపి యా యోజయత్యతిసంకటే ॥ సంసారమందున్న దోషము లన్నిటిలో, తృష్ణయే దీర్ఘదుఃఖమును గల్పించుచున్నది. అంతఃపురమున నున్నవానిని గూడ (ధనాది ఆశలను జూపెట్టి) అతిసంకట ప్రదేశముల కాకర్షించును. |
|
సంసారములోని దోషములన్నిటిలో ఇది అతితుచ్ఛమైనది. ఇది ఉన్నంతవరకు మాకు మోహపూరితమైన పాట్లు తప్పవు. పుత్ర, మిత్ర కళత్రాదులు అనే వలలను మాపై విసిరి మహా మభ్యపెడుతోంది. అంతఃపురంలో సుఖశయ్యపై శయనించిన వానిని కూడా క్షోభింపజేసి, అడవిపాలు చేస్తోంది. |
సర్గ - 17, శ్లోకమ్ - 33 ప్రయచ్ఛతి పరం జాడ్యం పరమాలోకరోధినీ । మోహం నీహారగహనా తృష్ణా జలదమాలికా ॥ మంచుతో గూడిన మేఘముల గుంపు చలిని గలిగించి, సూర్యుని గప్పివేయునట్లు, మోహముతో గూడిన తృష్ణ అజ్ఞానమును గలిగించి, ఆత్మజ్ఞానమును గప్పివేయుచున్నది. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 34 సర్వేషాం జంతుజాతానాం సంసారవ్యవహారిణామ్ । పరిప్రోతమనోమాలా తృష్ణా బంధనరజ్జువత్ ॥ బహుపశువుల మెడలకు గట్టబడిన త్రాడు, మరొక పెద్ద త్రాటికి గట్టబడునట్లు, ఈ సంసారమున చరించు జీవుల మనస్సు తృష్ణయను త్రాటికి గట్టబడియున్నది. |
|
దున్నపోతు ముక్కుకు త్రాడుకట్టి లాగబడునట్లు అది మమ్ములను దిక్కులన్నీ త్రిప్పుతోంది. ఆహా? నిర్దయుడగు ఆ భగవంతుడు ప్రపంచములోని జీవులందరిని 'తృష్ణ' అనే త్రాటితో 'సంసారము’ అనే స్తంభమునకు కట్టి పారేస్తున్నాడు. |
సర్గ - 17, శ్లోకమ్ - 35 విచిత్రవర్ణా విగుణా దీర్ఘా మలినసంస్థితిః । శూన్యా శూన్యపదా తృష్ణా శక్రకార్ముకధర్మిణీ ॥ తృష్ణకును ఇంద్రధనుస్సునకును సామాన్య ధర్మము లున్నవి; ఇంద్రధనుస్సు విచిత్రములగు వర్ణములతో గూడియున్నది. విగుణ అనగా అల్లెత్రాడు లేనిది. పొడుగైనది. మలినములగు మేఘములపై శూన్యమగు ఆకాశమున గల్పింపబడినది; అట్లే, తృష్ణయు విచిత్రములగు వివిధ విషయములతో గూడిన సమ్మోహ రూపమును దాల్చి, అసద్గుణములతో వెలయుచున్నది. మరియు నిది, మలిన పురుషుని మనస్సున గల్పింపబడిన అవస్తువు. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 36 ఆశానిర్గుణసస్యానాం ఫలితా శరదాపదామ్ । హిమం సంవిత్ సరోజానం తమసాం దీర్ఘయామినీ ॥ ఈతృష్ణ - వివేకాది సుగుణములను పైరులకు పిడుగు; ఆపదలపంట కనువగు శరత్కాలము; జ్ఞానకమలములకు మంచు; అజ్ఞానమునకు హేమంతరాత్రి. |
|
ఉన్న కాస్త వివేకాన్ని ఊరేగిస్తోంది. లేని జాడ్యాలన్నీ తెచ్చిపెడుతోంది. |
సర్గ - 17, శ్లోకమ్ - 37 సంసారనాటకనటీ కార్యాలయవిహంగమీ । మానసారణ్యహరిణీ స్మరసంగీతవల్లకీ ॥ ఈ తృష్ణ - సంసారమను నాటకరంగ మందలి నటి. ప్రవృత్తి యను గూటియందుండు పక్షి. మనస్సను అరణ్యమున తిరుగు చంచలహరిణము. కోర్కెలను సంగీతమును ధ్వనించు వీణ. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 38 వ్యవహారాబ్ధిలహరీ మోహమాతంగశృంఖలా । సర్గన్యగ్రోధసులతా దుఃఖకైరవచంద్రికా ॥ తృష్ణయే వ్యవహార ప్రపంచమందలి అలలను గల్పించుచున్నది. తృష్ణయే మోహమను ఏనుగును బంధించుచున్నది. దీని వలననే, సంసార వటవృక్షముయొక్క ఊడలు దిగుచున్నవి. ఇదియే దుఃఖములను కలువల వికసింపజేయు వెన్నెల. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 39 జరామరణదుఃఖానామేకా రత్నసముద్గికా । ఆధివ్యాధివిలాసానాం నిత్యం మత్తా విలాసినీ ॥ జరామరణ దుఃఖములను రత్నపేటికయే, తృష్ణయను విలాసిని కడనున్నది. ఆధివ్యాధులె దాని సంతోష సామగ్రి. |
|
ఇక తప్పించుకోవటానికి అవకాశమెక్కడిది చెప్పండి? దాని వేగం ఎంతటిదంటే, ... [ఆధి = మానసిక రుగ్మత; వ్యాధి = శారీరక రుగ్మత] ఆధివ్యాధులు గాని, శరీరశిథిలత్వం గాని దాని ప్రబలత్వాన్ని శమింపచేయలేక పోతున్నాయి. |
సర్గ - 17, శ్లోకమ్ - 40 క్షణమాలోకవిమలా సాంధకారలవా క్షణమ్ । వ్యోమవీథ్యుపమా తృష్ణా నీహారగహనా క్షణమ్ ॥ తృష్ణయను ఆకాశమున - అప్పుడప్పుడు వివేకమను వెలుగు వెలుగుచుండును. అప్పుడప్పుడు అవివేకమును అంధకారము క్రమ్ముచుండును; అప్పుడప్పుడు అజ్ఞానమను మంచు ఆవరించుచుండును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 41 గచ్ఛత్యుపశమం తృష్ణా కాయవ్యాయామశాంతయే । తమీ ఘనతమః కృష్ణా యథా రక్షోనివృత్తయే ॥ మేఘములతో క్రమ్మువడిన రాత్రి ముగిసినపుడు రాక్షసులు పలాయన మొనరించునట్లు, తృష్ణ ఉపశమించిన దేహపరిశ్రమకూడ నాశన మగును - ముక్తి లభించును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 42 తావన్ముహ్యత్యయం మూకో లోకో విలులితాశయః । యావదేవానుసంధత్తే తృష్ణా విషవిషూచికా ॥ విషూచి (కలరా) వ్యాధిచే బాధపడు మనుజుడు, అది తగ్గనంతవఱకు మాటలాడు శక్తిని గోల్పోయి, మూర్ఛితుడై పడియుండునట్లు; సంసారియు తృష్ణోపశమనము కానంతవఱకు, వేదాంతశాస్త్రమున మూగయై, వ్యాకులచిత్తుడై, మోహగ్రస్తుడై పడియుండును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 43 లోకోఽయ మఖిలం దుఃఖం చింతయోజ్ఝితయోజ్ఝితి । తృష్ణావిషూచికామంత్రశ్చింతాత్యాగో హి కథ్యతే ॥ చింతావర్ణనమే తృష్ణయను విషూచివ్యాధికి మహౌషధము అని చెప్పబడుచున్నది. చింతలను దృజించిన లోకులు దుఃఖమును తప్పించుకొందురు. |
|
ఈ లోకంలో జీవునకు దుఃఖమంతా నశించాలంటే ఒక్కటే ఉపాయం ఉన్నది. అది “విషయ చింతన లేకపోవటమే!”. ఆశయొక్క రూపాంతరమే విషయ చింతన అయివున్నది. కనుక ఆశను త్యజిస్తే జీవుడు ఒడ్డుకు చేరినట్లే.
|
సర్గ - 17, శ్లోకమ్ - 44 తృణపాషాణకాష్ఠాది సర్వమామిషశంకయా । ఆదదానా స్ఫురత్యంతే తృష్ణా మత్స్యీహ్రదే యథా ॥ చెఱువునీటనుండి మాంసమను భ్రమతో తృణపాషాణ కాష్ఠాదులను కఱచికఱచి, తుదకు ఎరకాశించి, చంపబడు చేపవంటిదీ తృష్ణ. |
|
చేప ఎఱకోసం తాపత్రయ పడునట్లు, అది ఎదురుగా కనిపించినదంతా 'తనదే' అని అనుకొంటుంది. వృద్ధ మాంత్రికురాలివలె ఎంతో క్రూరమైనది కూడా. అచేతనుణ్ణి కీటకములు బాధిస్తున్నట్లు మేము ఆశచే బాధింపబడుచున్నాం. |
సర్గ - 17, శ్లోకమ్ - 45 రోగార్తిరంగనా తృష్ణా గంభీరమపి మానవమ్ । ఉత్తానతాం నయత్యాశు సూర్యాంశవ ఇవాంబుజమ్ ॥ సూర్యకిరణములు పద్మమును ఊర్ధ్వవికసిత మొనర్చునట్లు; రోగపీడయు, స్త్రీ వాంఛయు ధీరుడగు మనుజునిగూడ అధీరు నొనర్చి వైచును. |
|
అయ్యో! ఆశ, స్త్రీ, రోగబాధ - ఈ మూడు ఎంతటి గంభీర పురుషుడినైనా తమ వైపు అభిముఖం చేసుకొంటున్నాయి కదా! |
సర్గ - 17, శ్లోకమ్ - 46 అంతఃశూన్యా గ్రంథిమత్యో దీర్ఘస్వాంకురకంటకాః । ముక్తామణిప్రియా నిత్యం తృష్ణా వేణులతా ఇవ ॥ తృష్ణయను వెదురు సారహీనమైనది. జడపదార్థముల చేతనబుద్ధి యను కణుపులు దీనికున్నవి. చింతాద్వేషములు దీని కంటకాంకురములు. విషయము లను ప్రీతిం గొల్పు ముత్యముల నిది గోరును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 47 అహోబత మహచ్చిత్రం తృష్ణామపి మహాధియః । దుశ్ఛేదామవి కృంతంతి వివేకేనామలాసినా ॥ ఆహా! ఏమి ఆశ్చర్యము! అచ్ఛేద్యమైన యీ తృష్ణను బుద్ధిమంతులు వివేకమను నిశిత ఖడ్గముతో కరుకుచున్నారు. |
|
అయినా సరే, కొందరు మహామహులు దానిని “వివేకము” అనే కత్తితో నరికి వేస్తున్నారు. అవిద్యాపూర్వకమైన కామ్యకర్మల నుండి బైటపడి పరమశాంతిని పొందగలుగుచున్నారు. |
సర్గ - 17, శ్లోకమ్ - 48 నాసిధారా న వజ్రార్చిర్నతప్తాయః కణార్చిషః । తథా తీక్ష్ణా యథా బ్రహ్మంస్తృష్ణేయం హృది సంస్థితా ॥ బ్రహ్మజ్ఞుడా! హృదయమున మెలంగు ఈ తృష్ణ ఖడ్గపు కొనకంటేను, వజ్రముకంటెను. కాలుచున్న ఇనుపగుండ్ల మంటలకంటెను తీక్ష్ణమైనది. |
|
ఈ తృష్ణ అంత నీచంగా ఘోరంగా పదునైన కత్తివేటుగాని, వజ్రాయుధ ఘాతంగాని అగ్నిహోత్రంగాని బాధింపజాలదనే నా అభిప్రాయం. ఎందుకంటారా? ఇది హృదయంలోనే ఉండి జీవుణ్ణి దహించివేస్తోంది కదా! |
సర్గ - 17, శ్లోకమ్ - 49 ఉజ్జ్వలాసితతీక్ష్ణాగ్రా స్నేహదీర్ఘదశా పరా । ప్రకాశాదాహదుఃస్పర్శా తృష్ణా దీపశిఖా ఇవ ॥ తృష్ణ దీపజ్వాలవలె నుజ్జ్వలమై పొడుగాటి వత్తిని గలిగి, మలినమగు కొనతో ముట్టుకొనిన కష్టమును కలిగించుచు, దీర్ఘకాలము వెలయునదై యున్నది. (అనగా, తృష్ణ బాల్యయౌవనములందు అత్యంతాసక్తిని కల్పించుచు, చాలకాల ముండును. భోగాంతమున దీపపు కొడివలె కష్టము నిచ్చును. ఇట్టి తృష్ణపొంతకు బోయిన వంతకాక మరేమి? హృదయతాపము -- నిచ్చును. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 50 అపి మేరుసమం ప్రాజ్ఞమపి శూరమపి స్థిరమ్ । తృణీకరోతి తృష్ణైకా నిమేషేణ నరోత్తమమ్ ॥ మేరుపర్వతమువలె ధీరుడును, బుద్ధిమంతుడును, పౌరుషయుక్తుడును, అపరిగ్రహ వ్రతమున స్థిరుడును నగు పురుషునిగూడ తృష్ణ ఒక్క నిముసములో గడ్డిపరకవలె నొనర్చుచున్నది. (తృష్ణతో యాచింప బూనినవాడు ఇతరుల దృష్టిలో గడ్డిపరకయే కదా!) |
|
మేరువుతో సమానమైన ధీరుడైనా, మహాప్రాజ్ఞుడైనా, నరోత్తముడైనా - తృష్ణచేత క్షణంలో జయింపబడుచున్నాడు. |
సర్గ - 17, శ్లోకమ్ - 51 సంస్తీర్ణగహనా భీమా ఘనజాలరజోమయీ । సాంధకారోగ్రనీహారా తృష్ణా వింధ్యమహాతటీ ॥ సాహస కార్యములను చొరరాని విశాలారణ్యములతోడను, ఆశాపాశ రూపకమగు రజోగుణమను లతాధూళితోడను, అంధకార రూపకమగు తమోగుణమును అజ్ఞానహిమముతోడను గూడుకొనిన భయంకర వింధ్యపర్వత భూమి యీ తృష్ణ. |
|
|
సర్గ - 17, శ్లోకమ్ - 52 ఏకైవ సర్వభువనాంతరలబ్ధలక్ష్యా దుర్లక్ష్యతాముపగతైవ వపుః స్థితైవ । తృష్ణా స్థితా జగతి చంచలవీచిమాలే క్షీరోదకాంబుతరలే మధురేవ శక్తిః ॥ ఒకే మాధుర్యశక్తి జలము లన్నిటియందును నున్నను, ఒకే మాదిరిగ గన్పడదు. జలభేదము ననుసరించి రుచి మారును. అట్లే యీ శరీరమందున్న తృష్ణయే, జగత్తున నున్న సమస్త భోగ్యవస్తువులతో గలసియున్నను, శరీర తృష్ణ యట్లగుపించదు: ఆశ, కామము ఇత్యాదులగు వివిధ భేదములతో నగుపించును. |
|
ఈ ప్రపంచమంతా ఎందులో అయితే నిబిడీకృతమై ప్రవర్తిస్తోందో, - అట్టి ఆశను నేను విజ్ఞాన వివేకాదులచే జయించి వేయ నిశ్చయించుకొన్నాను. ఈ ధన, జన, సామ్రాజ్యాదులు ఆశను అధికమే చేస్తాయి కదా! అందుచేత ఇవి నాకు అక్కర్లేదు. సర్వ వాంఛలు నశిస్తే మనస్సుకు ఉత్తమ చికిత్స ప్రాప్తించినట్లే కదా! |